thugs
-
దొంగలొస్తే.. దొరకబుచ్చుకుని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు.. మాస్్క, హెల్మెట్ పెట్టుకుని.. బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో పనిచేసిన వ్యక్తే.. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
మున్నూరు రవిపై దాడి చేసిన దుండగులు
-
మైత్రి మూవీస్ చేతికి కోనసీమ థగ్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. కాగా ‘థగ్స్’ తెలుగు వెర్షన్ ‘కోనసీమ థగ్స్’ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ పంపిణీ చేయనుంది. -
మహంకాళి వస్తోందయ్యా...
ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా గోపాల్ డైరెక్షన్లో రూపొం దినపాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో స్టూడియోస్‌తో కలిసి శిబు నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో విడుదలకానుంది. శామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా...’ అంటూ సాగే ఈపాటని విడుదల చేశారు. వనమాలి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని కాలభైరవపాడారు. -
దుమ్మురేపుతున్న ఇంటెన్స్ రా యాక్షన్ కోనసీమ థగ్స్ ట్రైలర్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈమధ్యే విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తిసురేష్‌లో గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
ఆకట్టుకుంటున్న'థగ్స్' క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘థగ్స్'. పులి, ఇంకొకడు, సామి 2 తో పాటు పలు హిందీ చిత్రాలను నిర్మించిన షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ అంతోనీ ఎడిటర్ గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్ గా థగ్స్ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ను చెన్నై లో ఆర్య, భగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళా మాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో భారీ వేడుకలో విడుదల చేశారు. అందరూ థగ్స్ భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్యారక్టర్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్ గా విడుదల అయిన ఈ వీడియో లో సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. 'మాస్టర్ మైండ్' సేతు గా హృదు, 'రోగ్' దురై గా సింహ, 'బ్రూట్' ఆరాకియా దాస్ గా ఆర్ కె సురేష్, 'క్రుకెడ్' మరుదు గా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. వీడియో ఆద్యంతం శామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి వీడియో బైట్ లో హీరో హృదు కి, దర్శకురాలు బృంద కి తన బెస్ట్ విషెస్ చెబుతూ థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నవంబర్ లో థియోటర్స్ లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
‘ఆమె కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్’
ప్రముఖ నృత్య దర్శకురాలుగా రాణిస్తున్న బృంద మాస్టర్ ఇటీవలే మెగాఫోన్ పట్టి హే సినామికా అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, నటి ఇలా, అతిథి రావ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంతో బృందా మాస్టర్ దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈమె కుమరి మావట్టత్తిన్ దగ్స్ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆమె తొలి చిత్రానికి పూర్తిగా భిన్నమైన కథ, కథనాలతో ఉండటం విశేషం. కమర్షియల్ అంశాలతో కూడిన పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్రాన్ని బృందా మాస్టర్ తెరకెక్కించారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హ్రిదు హారన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందే బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాగా నటి అన స్వరాజన్, సింహ, ఆర్కే సురేష్, మునీశ్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సేమ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్‌తో పాటు నటి కుష్భు, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌతమ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి కుష్బు మాట్లాడుతూ బృంద తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆమె చూడ్డానికి కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్‌గా ఉంటారని పేర్కొన్నారు. అలాంటి ఆమె యాక్షన్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని చేయడంలో ఆశ్చర్య పడాల్సిన పని లేదన్నారు. ఈ చిత్రాన్ని తాను చశానని కచ్చితంగా ఇది సంచలన విజయం సాధిస్తుందని అన్నారు. త్వరలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి నవంబర్ నెలలో చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ
సాక్షి ముంబై: పుణే జిల్లాలో ఓ ఏటీఎంను కొందరు దుండగులు పేల్చేశారు. అందులోని సుమారు రూ.28 లక్షలు చోరీ చేశారు. స్థానికంగా తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన వివరాలిలాఉన్నాయి.. పుణే జిల్లా చాకణ్ మహాలుంగే భాంబోలి ప్రధాన కుడలిలో హిటాచి కంపెనీ ఏటీఎం ఉంది. ప్రధాన పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ ఏటీఎంను బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కొందరు దుండగులు పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వసం చేశారు. అందులోని సుమారు 28 లక్షల రూపాయలు దొంగిలించి పరారయ్యారు. ఈ తరహాలో ఏటీఎం చోరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు కోసం వినియోగించిన పదార్థాలను నక్సలైటులు ఎక్కువగా వినియోగిస్తుంటారని ప్రాథమికం గా భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. -
28 రోజుల తర్వాత.. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి
సంతబొమ్మాళి: పొట్టకూటి కోసం లిబియా దేశానికి వెళ్లి అదృశ్యమైపోయిన శ్రీకాకుళం యువకులు ఎట్టకేలకు 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి బయటపడ్డారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో వారు క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియాకు వెళ్లారు. కొంతకాలం పాటు అక్కడి ఓ కంపెనీలో పనిచేశారు. గత నెలలో తిరిగి ఇండియా వచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. 14వ తేదీన తమ కంపెనీ ఏర్పాటు చేసిన వాహనంలో త్రిపాలి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. మార్గం మధ్యలో కొందరు దుండగులు వీరి వాహనాన్ని ఆపి కిడ్నాప్ చేశారు. మూడు రోజుల తర్వాత దుండగులు వీరిని మరో గ్యాంగ్‌కు అప్పగించారు. ఆ గ్యాంగ్ సభ్యులు తాము కిడ్నాప్ చేసిన వారిని విడిచిపెట్టాలంటే 20 వేల డాలర్లు చెల్లించాలని కంపెనీ ప్రతినిధుల్ని డిమాండ్ చేశారు. అయితే వారు తర్జనభర్జనల్లో మునిగిపోయారు. ఈ సమాచారం తెలిసిన బాధితుల కుటుంబసభ్యులు డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి సీదిరి అప్పలరాజు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇండియన్ ఎంబసీని సంప్రదించి త్వరగా బాధితులను కిడ్నాపర్ల నుంచి విడిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ ఆ సొమ్మును చెల్లించడంతో సీతానగరం యువకులతో పాటు యూపీకి చెందిన ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. ప్రస్తుతం లిబియాలోని భారత దౌత్య కార్యాలయంలో ఉన్న వారంతా త్వరలో స్వదేశానికి రానున్నారు. శ్రీకాకుళం యువకుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సత్వరం స్పందించి తమ పిల్లల గురించి వాకబు చేసి, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
పగలు ప్లాన్.. రాత్రి దోపిడీ
సాక్షి, నిజామాబాద్: మళ్లీ దుండగుల అలజడి పెరిగింది. వరుసగా చోరీలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏదో ఒక చో ట చోరీలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో దుండగులు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే పదిలోపు చోరీలు జరిగాయంటే పరిస్థి తి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నా రు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకా శం ఉండడంతో అవగాహన, ప్రచారం కల్పించాల్సిన పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండ డంతో చోరీల నియంత్రణ ఇబ్బందిగా మారింది. ప్రణాళికతోనే చోరీలు... నాలుగు రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఓ పైనాన్స్‌లో దుండగులు పడి లాకర్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ పుటేజీలను సైతం తీసుకెళ్లారు. షెట్టర్ పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ ప్రధాన రహదారిపైనే ఈ చోరీ జరిగింది. మరో మూడు రోజుల్లోనే ఇదే ప్రధాన రహదారిపై ఉన్న ఓ గ్లాస్ ఎంపోరియం షెట్టర్ పగులగొట్టి చోరీ చేశారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్టలో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. 6వ పోలీసుస్టేషన్ పరిధిలో మరో చోరీ జరిగింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలోనే ఈ చోరీలు అవుతున్నాయి. మహారాష్ట్ర ముఠాకు చెందిన దుండగులు ఈ అలజడి సృష్టిస్తున్నట్లు పోలీసులు విచారిస్తున్నారు. గతంలో అపార్ట్మెంట్లతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మూటలు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గత వారం రోజుల కింద బాల్కొండ, ముప్కాల్ కేంద్రాల్లో షెట్టర్ పగులగొట్టి చోరీలు జరుగగా ఇటీవలే అరెస్టు చేశారు. అయినా చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆర్మూర్‌లో మహారాష్ట్రకు చెందిన దుండగుల ముఠా వరుసగా రెండు రోజులపాటు దోపిడీ చేసింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఇరిగేషన్ కార్యాలయంలో ఒక కారును అపహరించారు. మహారాష్ట్రకు చెందిన ఈ దుండగులు జిల్లాలో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెక్కి నిర్వహిస్తున్నారు. రాత్రివేళ అనుకూలమైన ప్రాంతాల్లో దోపిడీలు చేసేస్తున్నారు. నవీపేట, బోధన్ ప్రాంతాల్లో ఇటీవల చోరీలు పెరిగాయి. జిల్లా కేంద్రంలో చోరీ చేసి పారిపోతూ నవీపేట, బోధన్ ప్రాంతాల్లో అందిన కాడికి దోచుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఫైనాన్స్ దుండగులు .. వారం రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఫైనాన్స్‌లో చోరీ చేసిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన సాగర్సింగ్ను పోలీసులు విచారించగా ఇతడి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించగా అక్కడ ఈ ముఠాకు సంబం«ధించి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వారికోసం అక్కడి పోలీసులు వేట సాగిస్తున్నారు. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో పగటిపూట జరిగిన గత మూడేళ్లలో పరిశీలిస్తే 2015లో 27, 2016లో 33, 2017లో 34, 2018లో 42 నమోదయ్యాయి. రాత్రిపూట జరిగిన చోరీలను పరిశీలిస్తే 2015లో 221, 2016–218, 2017–192, 2018లో 206 చోరీలు జరిగాయి. ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో పెట్రోలింగ్ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోతున్నారు. త్వరలోనే పట్టుకుంటాం.. ఇటీవల జిల్లా కేంద్రంలో చోరీలకు పాల్పడిన ముఠాలను గుర్తిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. కఠిన చర్యలు తప్పవు. చోరీల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. మహారాష్ట్రకు చెందిన ముఠాలు జిల్లా కేంద్రానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ. -
ఒంటిపై ఉన్న బంగారం కోసం హత్యలు..
సాక్షి, నెల్లూరు : మహిళల ఒంటిపై ఉన్న బంగారం కోసం దుండగులు దారుణానికి పాల్పడుతున్నారు. జిల్లాలోని రెండు వేరు వేరు చోట్ల ఓకే తరహాలో ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. సోమవారం కుసుమూరులో దుండగులు గుంజి రమణమ్మ(45)అనే మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో శేషమ్మ(45) అనే మహిళను ఆత్మకూరు సమీపంలోని ఆనంతరాయని వద్ద కత్తులతో పొడిచి ఒంటిపై ఉన్న బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఒంటిపై ఉన్న బంగారం కోసం మహిళలపై దారుణాలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
ప్రేమజంటను చితకబాదిన దుండగుల ముఠా
-
మహిళని హత్యచేసి తగలబెట్టిన దుండగులు
-
ప్రేమ జంటపై దుండగులు దాడి
-
గుప్త నిధుల కోసం శివాలయం ధ్వంసం
కర్నూలు, బూడిదపాడు(గూడూరు): మండలం పరిధిలోని పాత బూడిదపాడులో ఉన్న పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం గురువారం రాత్రి దుండగలు విఫలయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. కొంతమంది దుండగులు పాత బూడిదపాడులోని శివాలయం గర్భగుడి తలుపులు తొలగించి లోపల శివలింగాన్ని, పాశాన్ని గడ్డపారలతో పెకిలించారు. అనంతరం తవ్వకాలకు వీలుపడకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం పూజారి తిమ్మరాజు ఆలయానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి నిధులు చోరీకి గురికాలేదని వివరించారు. -
హత్య చేసి, చెట్టుకు వేలాడదీశారు..
సాక్షి, ప్రకాశం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాలివి.. జిల్లాలోని పొన్నలురు చెరువులో దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అడ్రస్ అడిగే నెపంతో చైన్‌స్నాచింగ్
బనశంకరి: అడ్రస్ అడిగే నెపంతో దుండగులు ఓ మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... మరియప్పనపాళ్య నివాసి హంసవేణి శుక్రవారం ఉదయం తన ఇంటిలోని చెత్తను బీబీఎంపీకి చెందిన వాహనంలో వేసి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ చీటీ చూపి చిరునామా అడుగుతూ ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు చైన్ లాక్కెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
డ్రైవర్‌ను కొట్టి.. రూ. 4 కోట్ల సిగరేట్లు దోపిడీ
హైదరాబాద్: నగర శివారులో బారీ దోపిడీ జరిగింది. రూ. 4 కోట్ల విలువైన సిగరెట్లతో వెళ్తున్న కంటైనర్‌ను కొందరు దుండగులు అడ్డుకున్నారు. డ్రైవర్‌ను చితకబాది తమతో పాటు తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను నింపుకొని పరారయ్యారు. వివరాలీవి.. ముషీరాబాద్ నుంచి తిరుపతికి సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను పెద్ద అంబర్పేట్ వద్దకు రాగానే దుండగులు రెండు సుమోలతో అడ్డగించారు. మల్కాపూర్ శివారులో డ్రైవర్‌ను కిందకు దించి ఓ సుమోలో ఎక్కించుకొని వెళ్లి అడవిలో వదిలేసి వచ్చారు. అనంతరం తమతో తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను లోడ్ చేసుకుని పరారయ్యారు. ఈ దోపిడీలో సుమారు 20 మంది దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ చొట్టుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. -
కనిపించని నాలుగో సింహం
♦ రాజధానిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం ♦ దుండగులు, ఉగ్రవాదులను అడ్డుకునే నైపుణ్యం కరువు ♦ కొరవడిన ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ దర్జాగా రావొచ్చు... ఆయుధాలతో విధ్వంసం సృష్టించొచ్చు... కావాల్సినంత దోచుకోవచ్చు... ఎంచక్కా నగరం నుంచి జారుకోవచ్చు... పోలీసులు అడ్డుకోలేరు... సమాచారం ఇచ్చినా పట్టకోలేరు. కళ్లముందే పారిపోతున్నా కట్డడి చేయనూలేరు. ఇదీ అమరావతిలో ఖాకీల దుస్థితి. బెజవాడలో బంగారు ఆభరణాల కార్ఖానాపై దాడి ఉదంతం భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధానిలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా భారీ దోపిడీ జరిగితే వెంటనే స్పందించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా లేదు. ఇందుకు మంగళవారం రాత్రి విజయవాడ గోపాలరెడ్డి రోడ్డులో జరిగిన భారీ దోపిడీ నిదర్శనమనే వాదన వినిపిస్తోంది. పోలీసులు కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసుల నమోదుకు మాత్రమే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా కనీసం నాకాబందీ కూడా నిర్వహించడంలేదు. దీంతో నేరస్తులు నిర్భయంగా తమ పని పూర్తి చేసుకుని సులభంగా నగరం దాటి వెళ్లిపోతున్నారు. నలువైపుల నుంచి నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మార్గాలు ఉండటం, ఎక్కడా పెద్దగా నిఘా లేకపోవడం నేరస్తులకు కలిసివస్తోంది. మన పోలీసుల వైఫల్యం ఇలా... ♦ మంగళవారం రాత్రి 9.50గంటలు : అంతర్రాష్ట దొంగల ముఠా విజయవాడలో నగల కార్ఖానాపై దోపిడీ చేసి అక్కడి నుంచి జారుకుంది. ♦ రాత్రి 10గంటలు : ఓ వ్యక్తి నేరుగా పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం చేరింది. ఆయన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారు. కానీ, నగర సరిహద్దులను వెంటనే దిగ్బంధించలేకపోయారు. ♦ రాత్రి 10.10గంటలు : దోపిడీ ముఠా ఎంచక్కా వారధి దాటింది. అక్కడికి కొద్దిదూరంలోనే డీజీపీ కార్యాలయం, మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కేంద్రంలో పోలీసు బలగాలు ఉన్నాయి. వారూ దోపిడీ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ♦ రాత్రి 10.24 గంటలు : దోపిడీ ముఠా జాతీయ రహదారి మీద ఉన్న కాజా టోల్‌గేట్‌ను దాటింది. అక్కడ కూడా ఆ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించనే లేదు. ♦ రాత్రి 10.40 గంటలు : దోపిడీ ముఠా గుంటూరు నగరంలోని కింగ్ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఎస్ఐ, నలుగురైదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. కానీ దోపిడీ దొంగలు తమ వాహనాన్ని ఆపకుండా అతి వేగంగా దూసుకుపోయారు. పోలీసులు అడ్డుకోలేకపోయారు. ♦ రాత్రి 10.50గంటలు : గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఒక ఎస్ఐ, ఐదారుగురు పోలీసులు మాత్రమే కాపు కాశారు. ముఠా జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్లు గుర్తించి అర్బన్ ఎస్పీకి సమాచారం అందించారు. ♦ రాత్రి 11.10 గంటలు : చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్దకు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో చేరుకున్నారు. జాతీ య రహదారిని దిగ్బంధించి వాహనాలను తనిఖీ చేయసాగారు. ఇలా తప్పించుకున్నారు.. చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్ద ఎక్కడ రోడ్డు బ్లాక్ చేశారో పోలీసులు అంతా అక్కడే ఉండిపోయారు. దీంతో వాహనాలు తనిఖీ చేస్తున్నారని అక్కడికి అర కిలోమీటరు దూరం నుంచే దొంగలు గుర్తించారు. తమ వాహనాన్ని అక్కడే వదిలేసి బంగారం, నగదు తీసుకుని పొలాల్లోకి పరుగుపెట్టారు. అదే పోలీసు అధికారులు కేవలం రోడ్డు బ్లాక్ చేసిన చోట మాత్రమే కాకుండా ఒక కిలో మీటరు ముందు వరకు కూడా సాయుధులైన పోలీసులను మోహరించి ఉంటే దొంగలకు ఆ అవకాశం ఉండేది కాదు. నిద్దరోతున్న భద్రతా వ్యవస్థ రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ–గుంటూరులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రాత్రివేళల్లో గస్తీ అన్నదే లేకుండాపోయింది. అందుకు తగిన వాహనాలు కావాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను పూర్తిగా ఏర్పాటు చేయలేదు. నాకా బందీ సక్రమంగా చేయడం లేదు. నిఘా వ్యవస్థ లేకుండాపోయింది. ఇదీ పోలీసుల పరిస్థితి... రాజధాని అవసరాలకు 4వేల మంది పోలీసులు అవసరమని నిర్ధారించారు. ప్రస్తుతం 1,800మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా కేటాయించిన 800మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు, వీఐపీల భద్రతకే పరిమితమయ్యారు. ఏదైనా దాడి, విపత్తులు సంభవిస్తే రంగంలోకి దిగే మెరుపు బలగాలు లేనే లేవు. ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ ఎక్కడ ? ఏదైనా దోపిడీ, దాడి జరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ని అమలు చేయాలి. అందుకు ముందుగానే ప్రత్యేక బలగాలను నియమించాలి. దాడి సమాచారం తెలిసిన వెంటనే నగరాన్ని శాస్త్రీయ పద్ధతులతో దిగ్బంధించాలి. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే సాయుధులైన పోలీసులు అడ్డుకోవాలి. అవసరమైతే కాల్పులకు కూడా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగులు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. -
బైక్‌పై వెళుతున్నారా.. అయితే జాగ్రత్త !
అన్నానగర్: భార్య, భర్తలు ఇద్దరు ఓ బైక్‌లో వెళుతున్నారు. అంతలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు దుండగలు ఆ దంపంతులపై దాడి చేసి 28 సవర్ల నగలను చోరి చేసుకొని పరారయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభువ్వ ఆస్పత్రి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నైలోని పాత వన్నారపేటకు చెందిన వ్యక్తి కణ్ణిరధమ్, తర భార్య విజయరాణితో కలిసి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పుదుచ్చేరికి బయలుదేరారు. బైక్‌లో చెన్నై ఎగ్మూర్‌కు వచ్చి, అక్కడి నుంచి రైల్లో పుదుచ్చేరికి వెళ్లటానికి సిద్ధమయ్యారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో వెనుక బైక్‌లో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. విజయరాణిపై దాడి చేసి నెట్టడంతో భార్యభర్తలు కింద పడ్డారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని విజయరాణి మెడలో ఉన్న 28 సవర్ల నగలను బైక్‌లో వచ్చిన దుండగులు దోచుకున్నారు. వెంటనే వారు కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దుండగుల వెంటనే బైక్‌లో పరారయ్యారు. గాయపడిన విజయరాణి, భర్త ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతలో కలకలం రేపింది. -
బస్సును తగల పెట్టిన దుండగులు
-
‘ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది’
హన్మకొండ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దళిత యువకుని మర్మాంగాలు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ దుండగులను, వారికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పుట్టమధును వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితరత్న బొమ్మల కట్టయ్య, మంద కుమార్‌మాదిగ లు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని వారు ఆరోపించారు. దళిత యువకున్ని దారుణంగా హత్య చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని వారు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హత్యలో పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్త్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నేత చుంచు రాజేందర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
చంపేసి.. కాల్చేశారు
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య పరిగి: ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపేశారు. అతడి వివరాలు తెలియకుండా మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించి కాల్చే శారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధి లోని మల్లెమోనిగూడ శివారులో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లెమోనిగూడ శివారు ప్రాంత రైతులకు ఓ పొలంలో తగలబడిన మృతదేహం కనిపించింది. సమాచారం అందు కున్న పరిగి ఎస్ఐ నగేశ్, ఐడీ పార్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతుడికి సుమారు 35 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ డీజిల్ డబ్బా, మద్యం సీసా, సిగరెట్ పెట్టె, దాదాపు 200 రూపాయలు లభ్యమయ్యాయి. పోలీసు జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. హతుడికి బాగా తెలిసిన వ్యక్తులే అతడిని ఇక్కడికి తీసుకొని వచ్చి మద్యం తాగించి పథకం ప్రకారం చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. -
దొంగ పెళ్లికి బడా దొంగలు.. పోలీసులు షాక్!
థానే: అతడొక చైన్ స్నాచర్.. అయితేనేం కళ్లు చెదిరేలా పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే కన్నుకుట్టేలా టాప్ గజదొంగలంతా అతడి వివాహానికి హాజరయ్యారు. ఈ తంతు మొత్తాన్ని పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయలేకపోయారు. తాము వెతుకుతున్న దొంగలు, పాత కేసులు ఉన్న దొంగలు, పలు నేరాలు చేసినవారు స్పష్టంగా దొరికి తప్పించుకున్నవాళ్లు ఈ పెళ్లికి హాజరవుతున్నారని తెలిసి వారిని పరిశీలించిన పోలీసులు చివరకు ఎలాంటి చర్యకు దిగకుండానే చూస్తూ ఉండిపోయారు. మొత్తం 1000 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకాగా అరెస్టులువంటి చర్యలకు దిగితే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని వారంతా వెనుకడుగు తౌఫిక్ అనే వ్యక్తి ఆంబ్విలి ప్రాంతంలో పేరు మోసిన దొంగ, చైన్‌స్నాచర్. అతడికి సోహ్రా అనే యువతికి ఆదివారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన వారు మాములు వాళ్లు కాదు.. అంతా భారత్‌లోని టాప్ చైన్ స్నాచర్లు, సీజన్ వారిగా దొంగతనాలకు పాల్పడే వారు, మాస్టర్ దొంగలు. దాదాపు 20 మంది పోలీసులు ఈ వివాహంపై నిఘా వ్యవహరించారు. తౌఫిక్‌పై దాదాపు 25 కేసులు ఉన్నాయంట. అతడు తన అత్త కూతురు సోహ్రా(15)ను వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా చేతికి దొరక్కుండా తిరుగుతున్న తౌఫిక్‌ను ఎందుకు అరెస్టు చేయలేదనే విషయంపై తాజాగా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, కర్ణాటక, ముంబయి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే వారంతా ఈ వివాహానికి హాజరయ్యారు.