Tirupati Stampede
-
తిరుపతి తొక్కిసలాటపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాం
సాక్షి, అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు స్పష్టం చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.తొక్కిసలాటపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిషన్ నివేదికను గర్నవర్‌కు సమర్పించకపోతే ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని చెప్పారు. కమిషన్ గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకమవుతుందని తెలిపింది. తాను కమిషన్ ఏర్పాటును మాత్రమే అడగటంలేదని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఏం చేయాలో 30 రోజుల్లో శాస్త్రీయ ఆడిట్ చేసేలా ఆదేశాలివ్వాలని కూడా కోరానని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
తిరుపతి తొక్కిసలాటపై విచారణకు కమిషన్
సాక్షి, విజయవాడ: తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జ్‌తో విచారణ సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలల పాటు విచారణ కమిషన్‌కు గడువు ఇచ్చింది. కాలయాపనకే 6 నెలలు సమయం ఇచ్చారని భక్తుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం అమాయక భక్తుల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చెలగాటమాడింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. -
ప్రజల భద్రతకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల భద్రతకు భరోసానిస్తూ జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) నిరుపమాన సేవలు అందిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, దక్షిణ క్యాంపస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మూడింతల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమిత్ షా(Amit Shah) మనిషిలా కాకుండా మెషిన్లా పని చేస్తున్నారని, ఆయన పనితీరు చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. పీపీపీ విధానంలో ‘గోదావరి – బనకచర్ల’ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా(Amit Shah) గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. తొక్కిసలాట ఘటనపై దృష్టి తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సైతం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి అమిత్‌షా వీహెచ్‌పీ నేతల భేటీలో వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనతో ఆదివారం ఉదయం వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు నేతృత్వంలో సంఘ ప్రముఖ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం సభ గురించి వారు అమిత్‌షాకు వివరించారు. దేశవ్యాప్తంగా ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి పూర్తిగా తప్పించి, స్వయం ప్రతిపత్తి క ల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి వీహెచ్‌పీ నేతలకు వివరించారని తెలిసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారని అమిత్ షా(Amit Shah).. రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మ, రాష్ట్ర పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్‌లతో కొద్దిసేపు సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశనం చేశారు. నామినేటెడ్ పదవులు పంపకం సహా కూటమి పారీ్టల మధ్య సమన్వయం ఎలా ఉందన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. -
‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. రాత్రికిరాత్రే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan) చెప్పారు. అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకొక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది. వరుస ఘటనలపై నిగ్గు తేల్చేందుకు అధికారిని కేంద్రం పంపుతామంది. కానీ, విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు, పవన్ బతిమిలాడారు. రాత్రికి రాత్రే నిర్ణయాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. హడావుడిగా ఇచ్చిన జీవోలో అధికారుల సంతకాలు లేవు’’ అని భూమన ఆరోపించారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం ఏదో ఒకటి జరుగుతోంది. అధికారుల అలసత్వంతో.. అవినీతితో విచ్చలవిడితనం కనిపిస్తోంది. బ్రహ్మాండనాయకుడి కొండపై మద్యం, బిర్యానీలు లభ్యమవుతున్నాయి. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోంది. తిరుమలలో ఈ మధ్యకాలంలో నాలుగుసార్లు ఎర్రచందనం దొరికింది. మిమ్మల్ని చూసుకుని సప్లై చేస్తున్న దొంగలు ఎవరు? అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ఏం చేస్తున్నారు?. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై కొండపై అరాచకాలు పెరిగిపోయాయి. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన(Jana Sena) నాయకులు టికెట్లు అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారు. ఇది దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు. సర్వ సాక్షి అయిన వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదు. ఆరుగురి మరణానికి కారకులెవరూ?‘‘క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయానికి పంపిన ఘనత మాది. మీ పాలనలో టీటీడీ పరువు తీశారు. వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తులను పశువుల దొడ్డిలో పడేశారు. తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం. ఆ మరణాలకు బాధ్యులు ఎవరు?. ప్రమాదానికి కారకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా.. తూతూమంత్రంగా ఎస్పీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశి కు సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు 70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారు. అక్షర మాయకు ఆ దేవుడే బదులిస్తాడుచంద్రబాబు పాపలపుట్ట కొండగా మారుతోంది. ఒక న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)కు చైర్మన్ పదవి ఒక్కటే ప్రామాణికం కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీపై బురద జల్లాలని ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంలో సిట్ ఏం తేల్చింది?. ఇప్పుడు నెపాన్ని మా మీద నెట్టేసే పరిస్థితులు కూడా దాటిపోయాయి. ఈ అపచారాలకు భగవంతుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చంద్రబాబు ఎల్లో మీడియా అక్షర మాయతో మాపై బురద చల్లితే.. విష్ణు మాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదు’’ అని భూమన అన్నారు. -
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
-
తిరుమలలో వరుస ఘటనలు: కేంద్ర హోంశాఖ సీరియస్
తిరుపతి: తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs) సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈనెల 8 వ తేదీన తిరుమలలో జరిగిన తొక్కిసలాట, 13వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలపై ఇప్పటికే కేంద్రం నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అదనపు కార్శిదర్శి సంజీవ్ కుమార్ తిరుమలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధానంగా తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై సోమవారం సమీక్షనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ భేటీ కానున్నారు. వరుసగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై టీటీడీ అధికారుల నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది. తిరుమలలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పర్యటనపై ఆసక్తి నెలకొంది.పాలకుల వైఫల్యం.. భక్తులకు శాపంఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ(TTD) పాలకుల మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం -
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే. 👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే. పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా? ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?. ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?. గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Tirupati Stampede: మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది..
వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.తిరుపతి టాస్క్‌ఫోర్స్: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారువైజాగ్కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి. తల్లిని కోల్పోయా.. మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళఅమ్మ జ్ఞాపకాలతో..ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్‌లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం. – మహేష్, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది మాది వైజాగ్ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా.. వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం -
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: తిరుమల తొక్కిసలాట (Tirupati stampede) దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున కోర్టుకెళ్తామని హెచ్చరించారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన చంద్రబాబు, పవన్ ఎందుకు సెలైంట్‌గా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.పల్లెల్లో సంక్రాంతి కళ కనిపించడం లేదు. రైతుల మొఖాల్లో ఆనందం లేదు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏడు నెలలైనా పింఛన్ తప్ప ఏం సంక్షేమ పథకం అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. హామీలు అమలు చేసి మాపై ఆరోపణలు చేయండి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం
తిరుపతి: తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్రోడ్లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం -
YSRCP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయపోరాటం
గుంటూరు, సాక్షి: తిరుపతిలో పాలనాపరమైన వైఫల్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణిస్తే.. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు. పైగా నిర్లక్ష్యంగా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఎస్పీ సుబ్బరాయుడును కేవలం ట్రాన్స్‌ఫర్‌తోనే సరిపెట్టింది ప్రభుత్వం. దీంతో.. ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఈ పోరాటంపై పార్టీ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అవి పచ్చి అబద్ధాలు: భూమనహైందవ భక్తులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాపై ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు అన్ని పచ్చి అబద్ధాలు అని గుర్తించాలి. భక్తులు ప్రాణాలు కోల్పోతే లెక్కలేనితంగా ఈరోజు టీటీడీ వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా నామ మాత్రంగా బదిలీ చేసి. ప్రభుత్వం జాప్యం చేస్తోంది. టీటీడీ ఈవ, అడిషనల్ ఈవో, తిరుపతి జిల్లా ఎస్పీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan reddy) ఆదివారం మండిపడ్డారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి.. వారిని జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని విడిచిపెట్టిందంటే దానర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి.. కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవునిపట్ల మీ భక్తిని చాటుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..తొక్కిసలాటను సీరియస్‌గా తీసుకోలేదు..చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ ఆరో తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవడం మొదలు.. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ సహా, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలింది. ఈ నేపథ్యంలో.. విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు? ఈ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం.. వెంటనే టీటీడీ చైర్మన్‌ను, ఈఓను, ఏఈఓను, ఎస్పీ, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం.. ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా!డిప్యూటీ సీఎం డిమాండ్లు హాస్యాస్పదం..ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలన్నట్లుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, డిప్యూటీ సీఎంగారేమో, లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు.ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా? టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీలేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. -
కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట(tirupati stampede) జరిగి ఆరుగురు మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించిన బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan reddy) ధ్వజమెత్తారు ఈ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మొత్తం పోలీసుల బలగం అంతా చంద్రబాబు చుట్టూనే..‘‘చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలమీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?’ అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తీరు ఇంకా హాస్యాస్పదంప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట(tirupati stampede Incident) జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని హెచ్చరించారు వైఎస్ జగన్.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో @ncbn గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025 -
తిరుపతి తొక్కిసలాట ఘటన : ‘దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం’
సాక్షి,విశాఖ : తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారిపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టమని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడిన జ్యోతిల నెహ్రూ.. టీటీడీ చేతగానితనాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వెంకటేశ్వర చూస్తున్నావా..?
తిరుపతి,సాక్షి: తిరుపతి తొక్కిసలాటలో (tirupati stampede) మరణించిన బాధితుల కుటుంబాల పట్ల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (br naidu) అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి అందించే నష్టపరిహారంలో ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారు. తిరుమల తొక్కిస లాట బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ డబ్బులతో నష్టపరిహారం చెల్లిస్తోంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు బీఆర్ నాయుడు ఏ ఒక్క బాధిత కుటుంబానికి వెళ్లలేదు. వారిని పరామర్శించడం లేదు. టీటీడీ సభ్యులు, టీడీపీ నేతల ద్వారా పరిహారం పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.తిరుపతి మహా విషాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టీటీడీ పాలక మండలి స్వయంగా క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీఆర్ నాయుడు లెక్క చేయడం లేదు. విశాఖలో హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా పరిహారం అందించి మమ అనిపిస్తున్నారు. పైగా, ప్రభుత్వం తరుఫు నుంచి కాకుండా టీటీడీ డబ్బులతోనే మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎక్స్ గ్రేషియా చెల్లిస్తోంది. పరిహారం విషయంలో చంద్రబాబు, బీఆర్ నాయుడిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదన్నారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.👉చదవండి : చింతించడం తప్ప చేసేదేమీ లేదు -
తొక్కిసలాట ఎఫెక్ట్: వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా తగ్గిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తగ్గారు. దశాబ్ద కాలంలో అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. తిరుపతి తొక్కిసలాట(Tirupati stampede)తో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను టీటీడీ(TTD) భయబ్రాంతులకు గురిచేయడంతో కూటమి ప్రభుత్వంపై భక్తుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. 70 వేలు టోకెన్లు విడుదల చేయగా కేవలం 53 వేల మంది భక్తులే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ వైఫల్యంతో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు దక్కలేదు. పోలీసులు దురుసు ప్రవర్తనశ్రీనివాసం గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారు. భక్తుల పట్ల సంయమనం పాటించాలని చెప్పున్నా పోలీసులు వినడం లేదు. దర్శనం టికెట్లకు క్యూలైన్లోకి వెళ్లేవారిని అడ్డగించడంపై భక్తుడు నిలదీశాడు.శనివారం రాత్రి నుంచి రెండో విడత టోకెన్ల జారీ ప్రారంభమైంది. భయంభయంగానే.. మొదటి విడత వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం నుంచి రెండో విడత టోకెన్ల జారీ చేస్తుండడంతో పలువురు క్యూలైన్లోకి వెళ్దామా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. తిరుపతి నగరంలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు నాటి చేదు ఘటన గురించే చర్చించుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో ప్రభు త్వం, టీటీడీ తీసుకున్న చర్యలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు చేపల కథ! -
నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్
సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.‘నిజానికి జగన్ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు. -
చంద్రబాబు అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం: ఎమ్మెల్సీ తలశిల
సాక్షి, విజయవాడ: తిరుమలలో భక్తుల మృతికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం (Talasila Raghuram) అన్నారు. ఈ ఘటనకు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను బాధ్యులను చేయడం దారుణమంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అధికారులకు ప్రజల కోసం పని చేసే స్వేచ్ఛలేదని దుయ్యబట్టారు.చంద్రబాబు అధికారులను కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు. అందుకే తిరుమల లాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కులాల ఆధారంగా అధికారులను టార్గెట్ చేయడం దారుణం. తిరుమల తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో కులం ఆధారంగా అధికారులను టార్గెట్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్, జేఈవో దీనికి బాధ్యులు కాదా.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పై కనీసం టీటీడీ బోర్డు సమావేశం కూడా చైర్మన్ నిర్వహించలేదు. చంద్రబాబు ఎదుట టీటీడీ చైర్మన్, ఈవో పొట్లాడుకున్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం. క్షమాపణలు చెప్పించడం కాదు.. ఆరుగురు మృతికి కారకులను శిక్షించాలి’’ అని తలశిల రఘురాం డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!ఇది ప్రభుత్వ వైఫల్యమే: ఎంపీ మిథున్రెడ్డిచిత్తూరు జిల్లా: వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట చాలా బాధాకరమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ దారుణానికి కారణమని.. ఇది కేవలం క్షమాపణలు చెప్పి సర్దుకునేంత చిన్న విషయం కాదన్నారు. కచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధం లేని అధికారులపై కంటితుడుపు చర్యలు తీసుకున్నారు...అసలు ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పవన్ కల్యాణ్ కనీసం తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు ఆ పని కూడా చేయకుండా ఘటన వెనుక కుట్రకోణం అని మళ్లీ రాజకీయం చేయాలని చూశారు. ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా
చిత్తూరు, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే.. 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది. అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, ఎస్పీ.. కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి. .. తొక్కిసలాట ఘటన(Stampede Incident) వల్ల భక్తులు తిరుమలకు రావడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇంకా కాపాడాలనే చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తోంది. అయినా టోకెన్ సిస్టమ్ ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారామె. పవన్‌కు సూటి ప్రశ్న‘‘సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మరి గేమ్ ఛంజర్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా?. లడ్డూ వ్యవహారంలో చేయని తప్పునకు కాషాయం కప్పేసుకుని మాట్లాడారు. మరి తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడేం మాట్లాడరే?. తప్పు చేసిన వాళ్లు ఫలానా వాళ్లే అని మీరే చెబుతున్నారు. మరి వాళ్ల తాట ఎందుకు తీయడం లేదు’’ అని రోజా ప్రశ్నించారు. -
బాబు డ్రామాలో పవన్ బకరా!
తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
బయటకు వచ్చేద్దామనుకున్నాం.. అంతలోనే దుర్ఘటన
మద్దిలపాలెం: ‘అప్పటి వరకు ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా ఉన్నాం. రద్దీగా ఉండటంతో లైనులో నుంచి బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో రద్దీ అధికమవడంతో గేట్లు తెరిచారని చెప్పారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు కదలడంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో నా భార్య రజనీ ప్రాణాలు కోల్పోయింది..’ అని గుడ్ల లక్ష్మారెడ్డి విలపించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖపట్నంలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల లక్ష్మారెడ్డి భార్య రజనీ మరణించిన విషయం తెలిసిందే. మద్దిలపాలెంలోని వారి ఇంటి వద్ద రజనీ మృతదేహానికి శుక్రవారం పలువురు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తిరుపతి క్యూలైనులో జరిగిన ఘోరం గురించి వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘క్యూలో ఉన్న ప్రతి ఒక్కరు 10వ తేదీన దర్శనం టికెట్ల కోసమే ఆరాటపడ్డారు. ఆ ఆరాటమే తొక్కిసలాటకు కారణమై భక్తుల ప్రాణాల మీదకు తీసుకొచి్చంది. మేం ఇద్దరం కలిసి జాగ్రత్తగా లైనులో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో విడిపోయాం. ఇంతలో రజనీ కోసం చూసే సరికి కనిపించలేదు. ఆ క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. తేరుకుని చూసేసరికి రజనీ కనిపించకుండాపోయింది. తొక్కిసలాటలో తప్పిపోయిన రజనీ కోసం తీవ్రంగా వెతికా. ఎక్కడా జాడలేదు. నా ఫోన్ కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు... రెండు గంటల తర్వాత రజనీని ఆస్పత్రిలో చేరి్పంచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియదు. చివరకు ఆటోలో అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి నా భార్య విగతజీవిగా పడి ఉంది. రజనీ ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిందనుకుంటున్నా...’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మా... వద్దన్నా వినలేదు... ‘అమ్మా ఇప్పుడు వద్దు.. మరోసారి వెళ్లొద్దాం..’ అని కొడుకు హర్షవర్థన్ ఫోన్లో చెప్పినా రజనీ వినలేదని లక్ష్మారెడ్డి చెప్పారు. ‘చుట్టుపక్కలవారికి సుమారు పదిసార్లు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లిన అనుభవం ఉండడంతో వారితో కలిసి మేం తొలిసారి వెళ్లాం. పది మంది గ్రూపుగా వెళ్లగా, ఆదిలక్ష్మి అనే మహిళకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..’ అని ఆయన తెలిపారు. అమెరికా నుంచి వచ్చి.. అమ్మ వద్ద సొమ్మసిల్లి..అమెరికా నుంచి హుటాహుటిన వచి్చన రజనీ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి... తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. బంధువులు సపర్యలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత తేరున్నాడు. తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ హర్షవర్ధన్ కూర్చున్న తీరు అందరినీ కలచివేసింది. కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక తదితరులు రజనీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రజనీ తమ్ముడు అమెరికా నుంచి శనివారం విశాఖ వస్తారని, అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఊహించుకుంటేనే భయమేస్తోంది» మాకు పీడకలను మిగిల్చింది »మా ప్రాణాలను మేమే కాపాడుకోవాల్సి వచ్చిoది » తొక్కిసలాటలో క్షతగాత్రుల మనోగతంతిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వేచి ఉండగా జరిగిన తొక్కిసలాటను ఊహించుకుంటేనే భయమేస్తోందని క్షతగాత్రులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మాట్లాడుతూ.. తొక్కిసలాట సందర్భంగా భక్తుల అరుపులు, కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. అక్కడ తొక్కిసలాటకు గల కారణం, సహాయక చర్యలు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై వారు ఏమన్నారంటే.. – తిరుపతి తుడా/తిరుపతి కల్చరల్తొక్కిసలాటకు ఆ తాడే కారణంవైకుంఠ ద్వారదర్శనం కోసం మా ఊరి నుంచి 450మంది ఇంటిల్లిపాది బుధవారం తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నాం. క్యూలైన్లలోనికి భక్తులను వదలకుండా పద్మావతి పార్క్‌లోకి పంపించేశారు. భక్తులతో పార్క్ నిండిపోయింది. రాత్రి 8గంటల సమయంలో టోకెన్లను జారీ చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. పార్క్ గేట్లను ఒక్కసారిగా తీయడంతో వేలాది మంది పరుగులు పెడుతూ గేటు వద్దకు దూసుకొచ్చారు. అయితే గేటుకు రెండువైపులా రెండడుగుల ఎత్తులో కట్టి ఉన్న తాడును తొలగించకుండానే గేటును తెరిచారు. దీంతో ముందు వరుసలో ఉన్న మహిళలు తాడుకు తగులుకుని బోర్లా పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాడు లేకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. – వెంకటేశ్, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్య జిల్లా మా వాళ్లను మేమే కాపాడుకున్నాం క్యూలైన్లలోకి వెళ్లేందుకు పార్క్ గేటు తెరవడంతో భక్తులు గుంపులుగా పరుగులు పెడుతూ దూసుకొచ్చారు. ముందుగా విశాఖ ప్రాంతానికి చెందిన భక్తులు తాడుకు తగులుకుని కింద పడిపోయారు. ఆ వెనుకే∙ఉన్న మాపైకి వందలాది మంది దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కిందపడ్డ మా వాళ్లను కాపాడుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. సకాలంలో 108 రాకపోవడంతో ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాం. – చిన్నరాజు, క్షతగాత్రురాలి భర్త, నరసాపురం, అన్నమయ్య జిల్లానా జీవితంలో అదో పీడకల కళ్ల ముందే భక్తులు కుప్పకూలిపోయారు. ముందు వరుసలో ఉన్న మహిళా భక్తులు కిందపడిపోయారు. వారిపై పదుల సంఖ్యలో భక్తులు పడ్డారు. కిందపడిన వారిలో నేనూ ఒకడిని. నా పై సుమారు 20మంది పడిపోయారు.వారిని పట్టించుకోకుండా వెనక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో 50మందికిపైగా గాయాలయ్యాయి. ఆరుగురు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్వయంగా అనుభవించిన ఈఘటన పీడకలగా మిగిలిపోతుంది. – చిన్న అబ్బయ్య, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్యజిల్లాభక్తులను నమ్మించి దగా చేశారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని టీటీడీ యాజమాన్యం నమ్మించి వారిని మోసం చేసింది. టికెట్ ఉన్నవారికే తిరుమలకు ప్రవేశం, స్వామిదర్శనం అంటూ నమ్మపలికారు. ఫలితంగా భక్తులు స్వామి దర్శన భాగ్యం కోసం అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచారానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. – ఎ.మధు, జై హిందూస్థాన్ పార్టీ,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు.వైకుంఠానికే పంపారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిoచాలని కోరిన భక్తులను టీటీడీ వారిని నేరుగా వైకుంఠానికి పంపింది. టీటీడీలో ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తున్నా అదే అనుభవంతో ఏర్పాట్లు, పర్యవేక్షణ కొరవడడంతో భక్తులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే భక్తులు మరణించారు. –ఎం.నీలకంఠ, హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు. నేరుగా దేవుని దగ్గరకే పంపిన టీటీడీ శ్రీవారిని చూపాలని కోరిన భక్తులకు టీటీడీ నేరుగా దేవుని దగ్గరకు పంపడం అమానుషం. వైకుంఠ దర్శన టోకన్ల జారీలో భక్తుల పట్ల టీటీడీ, పోలీసులు చులకనగా మాట్లాడడం విడ్డూరం. తొక్కిసలాట సందర్భంగా భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడమేకాక ఎవరు రమ్మన్నారంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గం. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తులు మృతి చెందారు. భక్తులు తిరుమలకు రావాలంటే భయపడే పరిస్థితిని టీటీడీ యాజమాన్యం తీసుకొచ్చిoది. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – దిలీప్‌కుమార్, తిరుమల, తిరుపతి సంరక్షణ సంఘం అధ్యక్షుడు -
స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌కు టీటీడీ ఛైర్మన్ కౌంటర్
సాక్షి, తిరుపతి: క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) కౌంటర్ ఇచ్చారు.తొక్కిసలాట ఘటనకు టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదన్నారు.కాగా, తొక్కిసలాట ఘటనపై ఇవాళ పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు.. ఈవో, ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అంటూ వ్యాఖ్యానించారు.మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.ఇదీ చదవండి: పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్సవైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమాచారం పాలకమండలికి టీటీడీ అధికారులు ఇవ్వలేదని.. సమన్వయ లోపం కారణంగానే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదంటు ఈవోని సభ్యులు నిలదీశారు. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 2 నుండి 5 లక్షలు టీటీడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు కేటాయింపుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వైకుంఠ త్రయోదశి తర్వాత టోకెన్ లేకుండా సర్వదర్శనానికి అనుమతించాలని పాలకమండలిలో చర్చ జరిగింది. -
పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ((Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు, డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ కోరారు.బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..:ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్లో ఆరుగురు చనిపోయిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగానే తొక్కిసలాట జరిగి ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 40 మంది క్షతగాత్రులయ్యారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ.. ఈ దుర్ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన తీరు మరింత బాధ కలిగించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు ఇచ్చే కార్యక్రమం విషయంలో ప్రభుత్వం, టీటీడీ అధికారులు కనీసం రివ్యూ మీటింగ్ నిర్వహించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్న సీఎం చంద్రబాబు కానీ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా టికెట్ల పంపిణీపై కార్యక్రమంపై సమీక్ష చేసి ఉండాల్సింది.హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి:ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరిగినట్టు కాదు. ఏపీ హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత రెండు రోజులుగా పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ జరపాలి. తిరుమల దేవస్థానం విశిష్టతను కాపాడాలన్నా, భక్తుల్లో ఉన్న అభద్రతను పోగొట్టాలన్నా పటిష్టమైన విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పవన్‌కళ్యాణ్ క్షమించమని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తున్నారో చెప్పాలి.ఆ ఇద్దరిపై ఏ చర్యలుండవా?:టీటీడీ ఛైర్మన్, ఈవోల మధ్య సమన్వయం లేదని, క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి ఎదుటే వారిద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారని టీడీపీ అనుకూల పత్రిక బ్యానర్ వార్త ప్రచురించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయం చెప్పారు. కానీ వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?. తొమ్మిది కేంద్రాల్లో దర్శనం టికెట్ల పంపిణీ చేపడితే మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక సంఘటనలోనే డీఎస్పీని బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో 40 మంది వరకు క్షతగాత్రులయ్యారు. మరో కౌంటర్లో ఒకరు చనిపోయారు. వాటి విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. ఎవరిది బాధ్యత?:పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తప్పు అన్నట్టు నిన్న చంద్రబాబు చెప్పడం, తమ ప్రభుత్వ చేతకానితనాన్ని ఒప్పుకోవడమే. వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తులు ప్రశాంతంగా దేవదేవుణ్ని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడెందుకు క్షమాపణలు చెప్పేసి ఊరుకున్నారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని ఆయన చెబుతున్నాడు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వారు చేసిన పాపం కరిగిపోతుందా, పోయిన భక్తుల ప్రాణాలు తిరిగొస్తాయా?. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవోలలో ఎవరు బాధ్యత వహిస్తారు?.పరామర్శకు వెళితే క్షుద్ర రాజకీయాలు:తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆ కుటుంబాలకు అండగా నిలవాలని మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ బయలుదేరితే అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. నడిరోడ్డుపై కాన్వాయ్ నిలిపి వేయడంతో, ఆయన కొంత దూరం నడిచి వెళ్లారు. ఆయన ఆస్పత్రికి రాకముందే తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని బలవంతంగా డిశ్చార్జ్ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ, వారు ప్రతిఘటించడంతో ఏమీ చేయలేకపోయారు.ఇదీ చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు హైడ్రామా: అంబటివైఎస్ జగన్ తొక్కిసలాట బాధితులతో అన్ని వివరాలు ఆరా తీసి, పరామర్శిస్తే.. దానిపైనా విషం చిమ్ముతున్నారు. జగన్ పరామర్శకు వెళితే క్షతగాత్రులకు కవర్లు ఇచ్చి మాట్లాడించారని కూటమి పార్టీలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా? పవిత్ర స్థలంలో అపశృతి జరిగినప్పుడు చింతించాల్సింది పోయి ఇంతలా దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించరు. ప్రమాదం జరిగినప్పుడల్లా అధికారులను బాధ్యులను చేస్తూ వారు వైయస్సార్సీపీ అనుకూలురంటూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాషనైంది. వారు మీరు నియమించుకున్న అధికారులన్న విషమం మర్చిపోవద్దు. -
తిరుపతి ఘటనపై పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు..ఈవో,ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అని వ్యాఖ్యానించారు.కాగా, రెండు రోజుల క్రితం వైకుంఠ ద్వార దర్శన(Vaikunta Dwara Darshan) టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా బుధవారం రాత్రి టికెట్ కౌంటర్ల ఒక్కసారిగా తోపులాట జరిగింది. అధికారులు ఉన్నపళంగా గేట్లు తీయడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుని ఆరుగురు మృతిచెందారు.ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడ్డారు.అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.ఈ ఘటనలో సర్కారు నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడింది. సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేశారు.ఇక్కడ టీటీడీకి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఘోరం చోటు చేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్లు క్యూలైన్లోకి వదలకుండా, జనం గుమిగూడిన తర్వాత వదిలిపెట్టడమే ఇందుకు సాక్ష్యం. బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్తప్పు ఒప్పుకోకుంటే పాపం తగలదా?