Trade agreements
-
నేను డిఫరెంట్
ఆజంగఢ్: తాను భిన్నమైన వ్యక్తినని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సాధారణంగా రాజకీయ నాయకులు హామీలిచి్చ, వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు’’ అని స్పష్టం చేశారు. ‘మోదీ భిన్నమైన (డిఫరెంట్) మట్టితో రూపొందాడు’ అన్నారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చాయని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పథకాలను ప్రకటించి, వాటిని అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టాయన్నారు. 30–35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను తాను సమీక్షించానని, అవి పెద్దగా అమల్లోకి రాలేదని తేలిందని వెల్లడించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల తర్వాత హామీలిచి్చన నాయకులు, ఆ శిలాఫలకాలు కనిపించకుండాపోవడం గతంలో ఒక తంతుగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను విభిన్నమైన వ్యక్తినని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో పర్యటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి రూ.42,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, కడప, హుబ్బళ్లి, బెలగావి, కొల్హాపూర్ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెరి్మనల్ భవనాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో యూపీ కొత్త శిఖరాలకు చేరుకుంటోందని, దాంతో విషం లాంటి బుజ్జగింపు రాజకీయాలు బలహీనపడుతున్నాయని చెప్పారు. బుజ్జగింపు, బంధుప్రీతి రాజకీయాల్లో చాలా ప్రమాదకరమన్నారు. ప్రాజెక్టులకు ఎన్నికలతో సంబంధం లేదు తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రానున్న లోక్‌సభ ఎన్నికలతో సంబంధముందని ఎవరూ భావించొద్దని మోదీ అన్నారు. 2019 ఎన్నికల వేళ తానెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, అవి చాలావరకు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అవినీతిని పరమావధిగా భావించే కుటుంబ పారీ్టలు అధికారంలో ఉంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు. ఈఎఫ్టీఏ ఒప్పందంపై హర్షం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్‌లో సభ్యదేశాలైన ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టీన్ నార్వే, స్విట్జర్లాండ్‌తో భారత్ కలిసి పని చేస్తుందని ప్రధాని అన్నారు. లోక్‌పాల్ ప్రమాణస్వీకారం లోక్‌పాల్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖని్వల్కర్ (66) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కింద ఆటోమొబైల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్‌టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్‌టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్‌పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్‌కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్‌టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్‌లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సొంత కరెన్సీలోనే చెల్లింపులు
అబుధాబి: భారత్–యూఏఈ సంబంధాలు మరో కీలక మైలురాయికి చేరుకున్నాయి. వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్సులో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో శనివారం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆగారు. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరిన ఏడాదిలోనే రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 శాతం మేరకు పెరగడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 భేటీ సమయానికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఆకాక్షించారు. వాణిజ్య చెల్లింపులను సొంత కరెన్సీలోనే చేపట్టాలని, ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్స్ వ్యవస్థ(యూపీఐ)ను యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం(ఐపీపీ)తో అనుసంధానం చేయాలని అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల పేమెంట్స్ మెసేజింగ్ సిస్టమ్స్‌ను లింక్ చేసే విషయం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ను యూఏఈలో ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల విద్యాశాఖాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. పరస్పర వాణిజ్య చెల్లింపులను భారత్ కరెన్సీ రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హంలో చేసేందుకు ఉద్దేశించిన ఎంవోయూపై రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేశారని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సహకారం, పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్28 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న యూఏఈకి భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మరింత సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాప్28 అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్ అల్ సబేర్తో చర్చించానన్నారు. కాప్28 వార్షిక సమావేశాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీని సబేర్ ఆహా్వనించారు. పర్యావరణ మార్పులకు గురైన దేశాలకు వాగ్దానం ప్రకారం 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని సంపన్న మోదీ, అల్ నహ్యాన్ సంయుక్త ప్రకటనలో కోరారు. ‘‘యూఏఈ అధ్యక్షునితో భేటీ సంతోషం కలిగించింది. అభివృద్ధిపై ఆయన దార్శనికత ప్రశంసనీయం. భారత్–యూఏఈ సంబంధాలపై సమగ్రంగా చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అబుధాబి అధ్యక్ష భవనం వద్ద నహ్యాన్ మోదీకి ఎదురేగి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మోదీ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీకి నహ్యాన్ విందు ఇచ్చారు. రాత్రికి ప్రధాని భారత్ చేరుకున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందం అన్ని లావాదేవీలకూ వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ‘‘పెట్టుబడులు, రెమిటెన్స్‌లకు దీనితో ఊతం లభిస్తుంది. యూఏఈలోని భారతీయులకు లావాదేవీల చార్జీలు తగ్గడమే గాక సమయం కూడా కలిసొస్తుంది’’ అని తెలిపింది. -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్‌పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
12 దేశాల భాగస్వామ్యంతో... ఐపీఈఎఫ్
టోక్యో: కరోనా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి బయట పడి ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) పేరిట సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ పీఎం ఫుమియో కిషిడాతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు. భావి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఐపీఈఎఫ్ దోహదపడుతుందంటూ ఈ 12 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, ‘‘21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను శాసించేది ఇండో పసిఫిక్ ప్రాంతమే. సగానికి పైగా ప్రపంచ జనాభాకు, 60 శాతానికి పైగా ప్రపంచ జీడీపీకి ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే తాజా ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యముంది’’ అని అన్నారు. ఐపీఈఎఫ్‌లో మున్ముందు మరిన్ని దేశాలు భాగస్వాములు అవుతాయన్నారు. సరఫరా వ్యవస్థ, డిజిటల్ వర్తకం, స్వచ్ఛ ఇంధనం, ఉద్యోగుల భద్రత, అవినీతి నిరోధం తదితర రంగాల్లో సభ్య దేశాలన్నీ మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఐపీఈఎఫ్ వీలు కల్పిస్తుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని స్వరూప స్వభావాలపై అక్టోబర్‌కల్లా స్పష్టత వస్తుందని తెలిపింది. చైనాను రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతానికి తైవాన్ను ఐపీఈఎఫ్‌లో భాగస్వామిగా చేసుకోకపోయినా ఆ దేశంతో సన్నిహిత ద్వైపాక్షిక ఆర్థిక బంధం కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది. మూడు ‘టి’లే మూలస్తంభాలు: మోదీ ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో–పసిఫిక్‌ను ప్రధాన చోదక శక్తిగా మార్చేందుకు ఐపీఈఎఫ్ భాగస్వామిగా భారత్ కృషి చేస్తుందని మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలన్న సభ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు, ఆర్థిక సవాళ్లను అధిగమించాలన్న సమిష్టి సంకల్పానికి ఐపీఈఎఫ్ ప్రతిరూపమన్నారు. ఇలాంటి భాగస్వామ్యానికి రూపమిచ్చినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నిర్మాణ, ఆర్థిక కార్యకలాపాలకు, అంతర్జాతీయ వర్తక, పెట్టుబడులకు ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో వర్తక కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రం. ఇందుకు చరిత్రే సాక్షి’’ అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతన వాణిజ్య నౌకాశ్రయం గుజరాత్‌లోని లోథాల్లో ఉందని గుర్తు చేశారు. ఒప్పందంలో భాగంగా సభ్య దేశాల మధ్య నెలకొనబోయే కీలక సరఫరా వ్యవస్థలకు ట్రస్ట్ (నమ్మకం), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), టైమ్లీనెస్ (సమయపాలన) అనే మూడు ‘టి’లు మూల స్తంభాలుగా నిలవాలని పిలుపునిచ్చారు. విఫల యత్నమే: చైనా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై చైనా మరోసారి అక్కసు వెలిగక్కింది. 12 ఇండో పసిఫిక్ దేశాల భాగస్వామ్యంతో తాజాగా తెరపైకి వచ్చిన ఐపీఈఎఫ్ విఫలయత్నంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పింది. వీటి ముసుగులో ఇండో పసిఫిక్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. వాటిని అడ్డుకోవాలని ఇండో పసిఫిక్ దేశాలకు పిలుపునిచ్చింది. భారత్ చలో.. భారత్ సే జుడో జపాన్ ఎన్నారైలకు మోదీ పిలుపు భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ అన్నారు. భారత అభివృద్ధి యాత్రలో జపాన్ పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్, ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల వంటివి ఇరు దేశాల పరస్పర సహకారానికి నిదర్శనాలని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌లోని ఎన్నారైలతో టోక్యోలో ఆయన భేటీ అయ్యారు. ‘భారత్ చలో, భారత్ సే జుడో’ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుని బాటే ఆదర్శమన్నారు. ప్రతి భారతీయుడూ జీవితంలో ఒక్కసారైనా జపాన్ సందర్శించాలని అప్పట్లో స్వామి వివేకానంద అన్నారు. ప్రతి జపాన్ పౌరుడూ ఒక్కసారైనా భారత్ సందర్శించాలని నేనంటున్నా’’ అని చెప్పారు. మంగళవారం ఆయన క్వాడ్ శిఖరాగ్రంలో పాల్గొనడంతో క్వాడ్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
తోకముడిచిన చైనా.. భారత్ పైచేయి
China Suspends Energy Projects In Sri Lanka: డ్రాగన్ కంట్రీ మరోసారి భారత్‌పై తన అక్కసును ప్రదర్శించింది. భారత్ పేరును ప్రస్తావించకుండా.. అంతర్జాతీయ సమాజంలో బద్నాం చేసే కుట్రకు తెర తీసింది. ఈ మేరకు శ్రీలంక తీరం వెంట నిర్మించతలబెట్టిన భారీ ప్రాజెక్టునొకదానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. భారత్ తీరుపై ఆగ్రహం ప్రదర్శించింది చైనా. అయితే ఈ వ్యవహారంలో అంతిమంగా పైచేయి మాత్రం భారత్‌దే కావడం విశేషం. చైనాకు చెందిన సినో సోర్ హైబ్రిడ్ టెక్నాలజీ కంపెనీ, శ్రీలంక జాఫ్నా తీరం వెంబడి డెల్ఫ్ట్, నాగాదీప, అనల్‌థివు దీవుల్లో హైబ్రిడ్ రెనెవబుల్ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బయటి దేశం నుంచి భద్రతా పరమైన సమస్యలు ఎదురుకావొచ్చనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టను రద్దు చేస్తున్నట్లు గురువారం సినో సోర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ అభ్యంతరం మేరకే.. వాస్తవానికి చైనా ఏర్పాటు చేయాలనుకుంటున్న దీవుల సముదాయ ప్రాంతం తమిళనాడుకు దగ్గర్లో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సమయంలోనే భారత్ నిరసన గళం గట్టిగానే వినిపించింది. కొసమెరుపు ఏంటంటే.. లంక ప్రభుత్వం కూడా తొలుత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించినా.. సెయిలోన్ బోర్డు(CEB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు కావడంతో సైలెంట్ అయ్యింది. కానీ, భారత్ మాత్రం ఏడాదిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి చైనాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. అయితే ఇంత జరిగినా భారత్‌ను బద్నాం చేయాలనే కుట్రను మాత్రం చైనా ఆపలేదు. లంకతో ఒప్పందాల విషయంలో బయటి దేశం జోక్యం ఎక్కువైందని, పైగా ఆ దేశం వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందంటూ పరోక్షంగా భారత్‌ను తెరపైకి తెచ్చింది. ఇదే ప్రాజెక్టును మాల్దీవుల సముదాయంలో నిర్మించబోతున్నట్లు సినో సోర్ హైబ్రిడ్ టెక్నాలజీ కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో భారీ ప్రాజెక్టుల కోసం చైనా అంతేభారీగా పెట్టుబడులు పెట్టింది. 2017లో హంబాన్‌టోటా పోర్ట్‌ను అప్పుల నుంచి బయటపడేందుకు 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లకు 99 ఏళ్లపాటు చైనాకు లీజ్‌కు ఇచ్చింది లంక. ఇక గతంలో కొలంబో పోర్ట్ కంటెయినర్ టెర్మినల్ అభివృద్ధి కోసం భారత్-జపాన్‌లతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న శ్రీలంక.. కారణాలేంటో చెప్పకుండా ఒప్పందం రద్దు చేసుకుని చైనాతో తిరిగి ఒప్పందం చేసుకుంది. ఇవేగాక వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (BRI)లో ప్రాజెక్టులు చేపడుతుండడంపై ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వంకతో లంకను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చైనా ప్రొత్సహిస్తోందంటూ అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది కూడా. క్లిక్ చేయండి: చైనా ఉత్పత్తులపై చర్యలు తీసుకోకుంటే.. మనకు కష్టమే ! -
ఘర్షణ సరే... వాణిజ్యం తప్పదు!
సరిహద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరక్కపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పక తప్పదు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం పాత రికార్డులను బద్దలు గొట్టి 9 వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. సరిహద్దు ఘర్షణల తర్వాత దేశవ్యాప్తంగా ప్రబలిన, ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అనే నినాదాలు ఆశించిన ఫలితాలను సాధించలేదని దీంతో స్పష్టమైంది. ముఖ్యంగా మందుల పరిశ్రమ, ఎలక్ట్రానిక్ గూడ్స్, భారీయంత్రాల వంటి వాటిపై మనం చైనాపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఒకవైపు మనం ఇలాంటి ఉత్పత్తుల్లో స్వావలంబన సాధిస్తూనే, చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకునే మార్గంలో సంబంధాలు కొనసాగించాలి. దేశాల మధ్య ఘర్షణ తాత్కాలికం, వాణిజ్య తదితర బంధాలు శాశ్వతం అనే సత్యాన్ని రెండు దేశాలూ గ్రహించాలి. సంక్లిష్టమైన సరిహద్దు వివాదాలకు పరి ష్కారం కనుగొనలేకపోతున్నప్పటికీ భారత్, చైనా మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలు చెక్కుచెదరకుండా కొనసాగుతుండటం విశేషం. దీనికోసం రెండు దేశాలు అప్రకటిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనబడుతోంది. తూర్పు లద్దాక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల మధ్య 13వ కార్ప్స్ కమాండర్స్‌కి చెందిన విభాగం ఇటీవలే చర్చలు జరిపింది. ఈ సమావేశంలో ఏ పురోగతీ సాధ్యం కాకపోయినప్పటికీ భారత ప్రతి నిధి బృందం వివాదాస్పద ప్రాంతంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యపై నిర్మాణాత్మకమైన సూచనలు చేసింది. ఈ చర్చలు కొనసాగనున్నాయని చెబుతున్నారు. ఇటీవలే, భారత్–చైనా మధ్య పరస్పర వాణిజ్యం పాత రికార్డులను బద్దలు గొట్టి 9 వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలోనే ఇది సాధ్యపడటం మరీ విశేషం. గత సంవత్సరం ఇదే కాలంతో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే ఇది 40 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అందుచేత, సరి హద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరకకపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికైతే, ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అనే నినాదాలు ఆశించిన ఫలితాలను సాధించలేదని స్పష్టమైంది. లద్దాక్ సరిహద్దు ప్రాంతంలో చైనా ఆక్రమణలు, హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత, చైనా సరకులను జాతీయవ్యాప్తంగా బహిష్కరించాలనే డిమాండ్ తారస్థాయికి చేరిన విషయం గుర్తుంచుకోవాలి. మరోవైపున చైనా నుంచి భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను, మొబైల్ ఫోన్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇక చైనాపై మన ఫార్మసీ కంపెనీలు చాలా ఎక్కువగా ఆధారపడుతున్నదీ వాస్తవమే. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ఈ పరాధీనతను నినాదాలు గుప్పించడం ద్వారా కొద్ది నెలల్లోపే ముగించలేం. మనం స్వావలంబన సాధించనిదే, చైనా నుంచి వివిధ ఉత్పత్తుల దిగుమతిని కొనసాగించడం తప్ప మరొక ప్రత్యామ్నాయం భారత్‌కు లేదన్నది గ్రహించాలి. కోవిడ్–19 మహమ్మారి, భారత పార్మాసూటికల్ రంగానికి స్వావలంబన సాధించేవైపుగా గొప్ప అవకాశాన్ని అందించింది. దేశ విదేశాల్లో మందులను అమ్మడం ద్వారా ప్రతి ఏటా వందలాది కోట్ల రూపాయలను భారత ఫార్మా రంగం ఆర్జిస్తున్నప్పటికీ దేశంలో రూపొందిస్తున్న జెనరిక్ మందుల ఉత్పత్తిలో ఉపయోగిస్తున్న క్రియాశీలక మందుల దినుసు (ఏపీఐ)ల్లో 85 శాతం దాకా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే అనేది వాస్తవం. ఏపీఐ అంటే మందుల తయారీలో ఉపయోగించే ముడి సరకు అన్నమాట. భారత్‌లో ఈ మందుల ముడిసరకుల ఉత్పత్తి చాలా తక్కువే అని చెప్పాలి. తుది ఉత్పత్తిని కూర్చడానికి భారత్‌లోనే తయారు చేసిన మందుల ముడిసరుకుల్లో కూడా కొన్ని చైనానుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోందని మర్చిపోవద్దు. అంతకుమించి, దేశంలో క్రియాశీల మందుల దినుసుల తయారీ కోసం కూడా ఎల్లప్పుడూ చైనా వైపే భారత మందుల కంపెనీలు చూస్తున్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. ఏ మందుల కంపెనీ గుర్తింపు అయినా సరే, ప్రజానీకానికి అవసరమైన ఎన్ని ప్రాణాధార మందులను అది కనుగొంటోంది, విజయవంతంగా ఉత్పత్తి చేస్తోంది అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ చేయాలన్న కుతూహలం కానీ, ఆకాంక్షను కానీ మన మందుల కంపెనీలు ఎన్నడూ ప్రదర్శించలేదన్నది ఎంతో చింతించాల్సిన విషయం. ధన సంపాదన, లాభార్జన ఒక్కటే వీటి ప్రాథమిక లక్ష్యమైపోయింది. కొత్త మందులను అభివృద్ధి చేయడంపై మన కంపెనీలకు విశ్వాసం లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్–19 వ్యాక్సిన్లను వృద్ధి చేయడం ద్వారా భారతీయ మందుల కంపెనీలు బహుళ ప్రజాదరణ పొందాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, జైదుస్ కాడిలా, బయొలాజికల్స్ ఇ, జెనోవా బయో ఫార్మా, పనేసియా బయోటెక్ వంటి కంపెనీలకు జాతి మొత్తం కృతజ్ఞత చూపుతోంది. 1970లలో ఇండియన్ డ్రగ్ అండ్ పార్మాసూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)ని భారత ప్రభుత్వం నెలకొల్పింది. క్రియాశీలకమైన మందుల ముడిసరకులను తయారు చేయడమే దీని లక్ష్యం. కానీ పాలనారాహిత్యం, అవినీతి కారణంగా ఈ సంస్థ రిషీకేష్, ముజఫర్‌పూర్ వంటి చోట్ల నెలకొల్పిన ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. పైగా, భారత్, చైనాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు అసాధారణ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అయితే వీటి నుంచి భారతదేశం పెద్దగా లాభపడుతున్నదేమీ లేదు. చైనా నుంచి మనం కొనుగోలు చేస్తున్న సరకుల కంటే మనం చైనాకు అమ్మగలుగుతున్న సరకుల పరిమాణం చాలా చాలా తక్కువ. ఇదే మనకు నష్టదాయకం. చైనాతో మన వాణిజ్య లోటు కొన్ని సంవత్సరాల క్రితం వరకు 29 బిలియన్ డాలర్ల వరకు ఉండేది. ఈ వాణిజ్యపరమైన లోటును తక్షణం సమతుల్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‡్ష వర్ధన్ ష్రింగ్లా పదేపదే చెబుతున్నారు. భారతదేశం తనకు సాధ్యమైన ప్రతిదీ ఎగుమతి చేయడానికి ప్రయత్నించాలి. మన ఎగుమతులను అత్యంత లాభదాయకంగా, గరిష్టంగా ఉత్తమమైన ధరకు అమ్మవలసి ఉంది. అదే సమయంలో అత్యంత చౌకగా లభిస్తాయనుకున్న దేశాల నుంచి మనం సరకులను దిగుమతి చేసుకోవలసి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్ట్రికల్ అలంకరణ వస్తువుల నుంచి, దుస్తులు, శిల్పాలనుంచి వేటిని కూడా భారత్ దిగుమతి చేసుకోకూడదు. ఎందుకంటే వీటన్నింటినీ మన కుటీర పరిశ్రమలు సులభంగా ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం, దీపావళి సంబరాలలో దేశం మునిగితేలుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు మన మార్కెట్లు చైనానుంచి దీపావళి కోసం పటాసులను కుప్పతెప్పలుగా దిగుమతి చేసుకునేవని మనం గుర్తుంచాలి. తర్వాత విదేశీ పటాసులను ప్రత్యేకించి చైనా పటాసులను స్థానిక మార్కెట్లలో అమ్మడం చట్టవిరుద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది శివకాశిలోని సాంప్రదాయిక బాణసంచా తయారీ పరిశ్రమకు ప్రాణం పోసిందనే చెప్పాలి. అనేక చైనా తయారీ సరకులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రత్యేకించి యంత్రాలు, టెలికాం పరికరాలు, ఎలక్ట్రికల్ గూడ్స్, బొమ్మలు, ఎలక్ట్రికల్ మెషనరీ, సామగ్రి, మెకానికల్ యంత్రసామగ్రి, ప్రాజెక్టు గూడ్స్, సేంద్రియ ఎరువులు, ఇనుము–ఉక్కు వంటి ఎన్నో రంగాలకు చెందిన సరకులు చైనానుంచే వస్తుంటాయి. దీనికి భిన్నంగా చైనాకు భారత ఉత్పత్తులు ప్రధానంగా ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలకు సంబంధించినవే ఎగుమతి అవుతుం టాయి. అంటే మనం స్వావలంబనను సాధించేంతవరకు భారత్, చైనా వాణిజ్యం కొనసాగుతూనే ఉంటుంది. దీంతోపాటు ఇరుదేశాలూ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవలసి ఉంది. అన్నిటికంటే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే రెండు దేశాలు కనీసం పరస్పరం చర్చించుకుంటున్నాయి. ఒక ముఖ్యమైన అంశాన్ని మనం మనసులో ఉంచుకోవలసి ఉంది. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో, భారత్‌లో ఉంటున్న చైనా పౌరుల పట్ల ఎలాంటి దౌర్జన్యాలకు, అన్యాయానికి తావులేకుండా చూడాలి. గత వందేళ్లుగా చైనీయులు భారత్‌లో నివసిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో వేలాదిమంది చైనా పౌరులు నివసిస్తూ ఉన్నారు. వీరిలో దంతవైద్యులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు కూడా ఉండవచ్చు. వీరిలో కొందరు బాగా పేరు పొందారు కూడా. కాబట్టి మన రెండు దేశాలు చర్చలు జరుపుతూనే పరస్పర వాణిజ్యాన్ని కొనసాగించాల్సి ఉంది. వ్యాసకర్త: ఆర్. కె. సిన్హా సీనియర్ ఎడిటర్, రాజ్యసభ మాజీ ఎంపీ -
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన ఖరారు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్ చివరి వారంలో భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తరువాత బోరిస్ చేస్తోన్న మొదటి అంతర్జాతీయ పర్యటన ఇది. యూకే అవసరాలను మెరుగుపర్చడం కోసం ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో ముఖ్య అతిథిగా బోరిస్ పాల్గొనాల్సి ఉండగా, బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదుకావడంతో తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. దాంతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుత పర్యటనతో ఈ చర్చలు కొలిక్కిరానున్నాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది. బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందంలో (సిపిటిపిపి) చేరాలని ఇండియాకు అధికారికంగా అభ్యర్థన చేసింది.(చదవండి: రష్యాను అధిగమించిన భారత్..!) -
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు. -
ఈయూ, బ్రిటన్లతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలు!
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ తదనంతర వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, భారత్ కూడా ఆ రెండు ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్నది ఇప్పుడే పూర్తి స్థాయిలో మదింపుచేయడం కష్టమని విశ్లేషిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), నిర్మాణం, పరిశోధనా–అభివృద్ధి, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి సేవల విషయంలో ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉంటుందని వారి విశ్లేషిస్తున్నారు. ఈయూ–బ్రిటన్ ఒప్పందం సేవల రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ అంచనాకు ప్రధాన కారణం. జనవరి 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ పూర్తిగా వైదొలగనుంది (బ్రెగ్జిట్). ఈ పరిస్థితుల్లో రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంపై అవరోధాలను తొలగించుకోవడానికి గురువారం జరిగిన చర్చలు కొంతవరకూ సఫలీకృతం అయ్యాయి. సేవల రంగానికి ప్రయోజనం... భారత్ వస్తువులకు ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటు బ్రిటన్ ఇటు ఈయూ మార్కెట్లలో సేవల రంగానికి సంబంధించి మనం చక్కటి అవకాశాలను సొంతం చేసు కోవచ్చు. దీనికి తగిన వ్యూహముండాలి. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డీజీ కేంద్రానికి సిఫారసు చేశాం... యూరోపియన్ యూనియన్, బ్రిటన్లతో ఎఫ్టీఏలకు ఇప్పటికే ప్రారంభమైన చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. వచ్చే నెల్లో భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తున్న సందర్భంగా దీనిపై చర్చలు జరగాలని ప్రభుత్వాన్ని కోరాం. – శరద్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ బ్రిటన్‌తో వాణిజ్య అవకాశాలు... ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలను ముందుకు తీసుకుని వెళ్లడానికి భారత్‌కు ఎన్నో క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని భావించవచ్చు. – బిశ్వజిత్ ధర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ -
‘ఆర్సీఈపీ’పై సంతకాలు
సింగపూర్: ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందంపై చైనా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్– ఆర్సీఈపీ)’లో భారత్ భాగస్వామిగా లేదు. ఆర్సీఈపీపై సభ్య దేశాల మధ్య గత ఎనిమిదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక సదస్సు కోవిడ్–19 ముప్పు కారణంగా ఈ సంవత్సరం వర్చువల్‌గా జరిగింది. సంతకాలు జరిగిన రెండేళ్లలోపు సభ్య దేశాలన్నీ ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు అత్యధిక రంగాల్లో వాణిజ్య పన్నులను క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. చైనా ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల నుంచి భారత్ గత సంవత్సరం వైదొలగింది. వాణిజ్య పన్నుల తగ్గింపు వల్ల భారతీయ మార్కెట్ దిగుమతులతో పోటెత్తుతుందని, అది దేశీయ ఉత్పత్తులకు హానికరమవుతుందన్న ఆందోళనలతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ ఈ ఒప్పందంలో చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఆర్సీఈపీకి ప్రతిపాదన మొదట 2012లో వచ్చింది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కోవిడ్ కారణంగా ఆర్సీఈపీ సభ్య దేశాలే కాకుండా దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ప్రస్తుత వర్చువల్ సదస్సు ఆతిథ్య దేశం వియత్నాం ప్రధానమంత్రి గ్యుయెన్ జువాన్ పేర్కొన్నారు. బహుముఖ వాణిజ్య విధానానికి ‘ఆసియాన్’ నాయకత్వం వహిస్తోందన్న సందేశాన్ని ఈ ఒప్పందం ఇస్తోందన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామిగా చేరుతుందన్న విశ్వాసం ఉందని సింగపూర్ పీఎం లీ సీన్ లూంగ్ అన్నారు. భారత్ చేరికతో ఆసియాలో ప్రాంతీయ సహకారం, సమగ్రతకు సంపూర్ణ రూపం చేకూరుతుందన్నారు. ఆర్సీఈపీ ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకుని, ఈ ఒప్పందాన్ని వారు ప్రోత్సహించేలా చూడాలని సభ్యదేశాలను ఆయన కోరారు. ఎనిమిదేళ్ల కఠోర కృషి అనంతరం ఈ ఒప్పందానికి తుది రూపు వచ్చిందని మలేసియా వాణిజ్య మంత్రి మొహ్మద్ అజ్మీన్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఆసియాన్ వర్చువల్ సదస్సు నాలుగు రోజుల పాటు జరిగింది. సౌత్ చైనా సీపై చైనా ఆధిపత్యాన్ని ఆసియాన్‌లోని అత్యధిక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. -
భారత్‌కు తగ్గనున్న చెల్లింపుల ఖాతా భారం
న్యూఢిల్లీ: చెల్లింపుల సమతౌల్యత (బీఓపీ) ఈ ఏడాది భారత్‌కు అనుకూలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తెలిపారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య లావాదేవీలకు ఒక దేశం... ఇతర దేశాలకు చెల్లించాల్సి వచ్చే మొత్తం వ్యవహారాలకు ఉద్దేశించిన అంశాన్నే చెల్లింపుల సమతౌల్యతగా పేర్కొంటారు. ఒకవైపు ఎగుమతులు మెరుగుపడుతుండడం, మరోవైపు తగ్గుతున్న దిగుమతులు భారత్‌కు చెల్లింపుల సమతౌల్యత సానుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఫిక్కీ వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, చక్కటి రికవరీ జాడలు ఉన్నాయి. ► ఎగుమతులు క్షీణతలోనే ఉన్నా... ఆ క్షీణ రేటు తగ్గుతూ వస్తుండడం కొంత ఆశాజనకమైన అంశం. ఏప్రిల్‌లో ఎగుమతులు భారీగా మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మేలో ఈ రేటు మైనస్ 36.47 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల జూన్‌లో ఈ క్షీణ రేటు మరింతగా మైనస్ 12.41 శాతానికి తగ్గడం గమనార్హం. ► 2019 ఎగుమతుల గణాంకాల పరిమాణంలో 91 శాతానికి 2020 జూలై ఎగుమతుల గణాంకాలు చేరాయి. దిగుమతుల విషయంలో ఈ మొత్తం దాదాపు 70 నుంచి 71 శాతంగా ఉంది. వెరసి ఈ ఏడాది భారత్ చెల్లింపుల సమతౌల్యం భారత్‌కు అనుకూలంగా ఉండనుంది. ► భారత్ పారిశ్రామిక రంగానికి చక్కటి వృద్ధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నా. దేశీయ తయారీ, పారిశ్రామిక రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. -
సెన్సెక్స్ కీలకశ్రేణి 31,160–32,365
ఒకవైపు కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో మే నెల తొలిరోజుల్లో ప్రపంచ మార్కెట్లన్నీ పతనానికి గురైనప్పటికీ, వెనువెంటనే నష్టాల నుంచి కోలుకున్నాయి. కానీ ఇండియా మార్కెట్ మాత్రం గతవారం 6.5 శాతం వరకూ నష్టపోయింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్జోన్లు అయినందున ఆర్థిక వ్యవస్థ నిస్తేజంకావడం. రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో జాప్యం వంటి స్థానిక అంశాలు ఇక్కడి మార్కెట్లను కోలుకోనీయలేదు. ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత భారీ ద్రవ్యలోటుకు దారితీసే అతిపెద్ద ప్రభుత్వ రుణ సమీకరణ ప్రకటన వెలువడింది. ఇది సమీప భవిష్యత్తులో మార్కెట్‌కు ప్రతికూలాంశమే. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి. సెన్సెక్స్ సాంకేతికాంశాలు మే 8తో ముగిసినవారంలో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 31,160 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 2,075 పాయింట్ల భారీ నష్టంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 31,160–32,365 పాయింట్ల శ్రేణి కీలకం. ఈ శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే...అటు ప్రయాణించే అవకాశం వుంటుంది. 32,365 పాయింట్ల తొలి అవరోధస్థాయిని దాటితే వేగంగా 32,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 33,350 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ వారం 31,160 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 30,750 వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 30,350 వరకూ పడిపోవొచ్చు. నిఫ్టీ కీలకశ్రేణి 9,115–9,450 పాయింట్లు గత సోమవారం భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ, ఏ దశలోనూ రికవరీకాలేక, 9,116 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 608 పాయింట్ల నష్టంతో 9,252 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 9,115–9,450 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి కీలకం. ఈ శ్రేణిని ఎటు అధిగమిస్తే, అటువైపు నిఫ్టీ కదలవచ్చు. ఈ వారం 9,450 పాయింట్ల నిరోధాన్ని నిఫ్టీ దాటితే 9,530 పాయింట్ల స్థాయిని వెనువెంటనే అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే 9,730 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ వారం 9,115 పాయింట్ల మద్దతును కోల్పోతే, వేగంగా 8,960 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 8,810 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
భారత్‌తో బలపడిన బంధం
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనాతో కంగారు లేదు: ట్రంప్ అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు! న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. -
త్వరలో భారీ ట్రేడ్ డీల్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాలను 21వ శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భద్రత, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందడం ఇరుదేశాల వ్యూహాత్మక మైత్రిలో కీలకమైన అంశమన్నారు. ఇరుదేశాల మధ్య త్వరలో ఒక భారీ, పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని సంకేతాలిచ్చారు. భారత్, అమెరికాల మధ్య మంగళవారం జరిగిన సమగ్ర ద్వైపాక్షిక ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ట్రంప్‌తో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం.. తదితర కీలక అంశాలు మోదీ, ట్రంప్‌ల నేతృత్వంలో జరిగిన ఆ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదాస్పద అంశమైన ద్వైపాక్షిక వాణిజ్యంపై మోదీ విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇరు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య ఈ విషయంపై సానుకూల ధోరణిలో చర్చలు జరిగాయని ప్రధాని వెల్లడించారు. ‘మా వాణిజ్య మంత్రులు అంగీకారానికి వచ్చిన విషయాలకు ఒక చట్టబద్ధ రూపం తీసుకువచ్చేందుకు ఇరుదేశాల అధికారుల బృందం కృషి చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్, నేను నిర్ణయించాం.ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని కూడా నిర్ణయించాం. ఆ ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకర ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నాం ’ అని మోదీ వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆమోదించబడిన నిబంధనలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి అందించే నిధుల విషయంలో పారదర్శకత అవసరమని తాను, ట్రంప్ భావిస్తున్నామన్నారు. పరస్పర ప్రయోజనాలే కాకుండా, ప్రపంచ ప్రయోజనాలు లక్ష్యంగా తమ ఆలోచనలు కొనసాగాయని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలను అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను, నార్కో టెర్రరిజాన్ని, ఇతర వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు నూతన విధానాన్ని రూపొందించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. ట్రంప్‌కు కేంద్ర మంత్రులను పరిచయం చేస్తున్న ప్రధాని ఆతిథ్యం అద్భుతం ట్రంప్‌కు భారత్‌లో లభించిన స్వాగతం చిరకాలం గుర్తుండిపోతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యే ముందు ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ.. భారత్, అమెరికాల సంబంధాలు ఈ స్థాయికి పెరగడానికి ట్రంప్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. భారత్‌లో ఈ రెండు రోజులు అద్భుతంగా సాగాయన్నారు. ముఖ్యంగా, మొతెరా స్టేడియంలో కార్యక్రమం గొప్పగా జరిగిందన్నారు. ‘అది నాకు లభించిన గొప్ప గౌరవం. నిజానికి ఆ స్టేడియానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నా కోసం కాదు.. మీ(మోదీ) కోసమే వచ్చారనిపించింది. స్టేడియం లోపల దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. మీ పేరును నేను పలికిన ప్రతీసారి చప్పట్ల వర్షం కురిసింది. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు’ అని ట్రంప్ మీడియా ముందే మోదీపై ప్రశంసలు గుప్పించారు. -
అద్భుతమైన వాణిజ్య ఒప్పందం
అహ్మదాబాద్: ఓ అద్భుతమైన, ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్దది అయిన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా చర్చలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత పర్యటనలో తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం నుంచి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు అవరోధాలను తగ్గించే దిశగా అద్భుతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని ప్రకటించారు. ‘‘నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ, నేను ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విస్తృతికి చర్చించనున్నాం. ప్రధాని మోదీతో కలసి ఇరు దేశాలకూ మంచి చేసే గొప్ప అద్భుతమైన ఒప్పందానికి వస్తామన్న విశ్వాసం నాకుంది’’ అని ట్రంప్ వివరించారు. అమెరికా బూమింగ్ ప్రపంచానికి ప్రయోజనం అమెరికా అభివృద్ధి చెందితే అది భారత్‌కు, ప్రపంచానికి మంచిదన్నారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతోందని చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగాలను ఆకర్షించడం, వ్యాపారాల్లో సమస్యలను తగ్గించడం, నూతన పెట్టుబడులకు అవరోధాల్లేకుండా చేయడం, అనవసర బ్యూరోక్రసీ, నియంత్రణలను తొలగించినట్టు ట్రంప్ వివరించారు. వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలి.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే గణనీయమైన సంస్కరణలను చేపట్టారన్న ట్రంప్.. భారత్‌లో వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలని ప్రపంచం కోరుకుంటోందన్నారు. ఆయన (మోదీ) దీన్ని రికార్డు వేగంతో చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన వ్యవసాయం, పాడి, డేటా పరిరక్షణ, డేటా స్థానికంగా నిల్వ చేయడం, ఈ కామర్స్ తదితర రంగాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరాల్సి ఉంది. ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుందని, భారత ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని ఓ అధికారి తెలిపారు. వాణిజ్య చర్చలు పురోగతి చెందితే అమెరికా మరిన్ని డిమాండ్లను ముందుకు తీసుకురావచ్చని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు భారత్‌తో 17 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పించాలన్నది అమెరికా డిమాండ్. భారత్ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశం హోదా తిరిగి కల్పించాలని మన దేశం కోరుతోంది. -
భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం కష్టమే..!
వాషింగ్టన్: వాణిజ్యం విషయంలో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. భారత్ మాతో సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌ను మొదటి నుంచి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. ‘‘భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. ఇది మాకు అవసరం. అయితే, ఎన్నికల ముందు ఇది జరుగుతుందా అన్నది నాకు తెలియదు. కానీ, భారత్‌తో మాకు భారీ వాణిజ్య ఒప్పందం అయితే ఉంటుంది’’ అంటూ కర్ర విరగకుండా, పాము చావకుండా రీతిలో ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ట్రంప్ పర్యటనలో భాగంగా డీల్ కుదురొచ్చన్న అంచనాలు ఇప్పటికే వ్యక్తమవుతుండడం గమనార్హం. భారత్‌తో వాణిజ్య చర్యలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జర్ ట్రంప్‌తో కలసి భారత పర్యటనకు రాకపోవచ్చని తెలుస్తోంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, లైట్జర్ మధ్య ఇప్పటికే పలు విడతలుగా వాణిజ్య చర్చలు జరిగాయి. తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. మోదీ అంటే ఎంతో ఇష్టం..: ప్రధానమంత్రి మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు ట్రంప్. భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియంలో ఇరు దేశాధి నేతలతో భారీ సభ జరగనుంది. దీని గురించి ట్రంప్ మాట్లాడుతూ..‘‘విమానాశ్రయం, కార్యక్రమం జరిగే ప్రాంతానికి మధ్య ఏడు మిలియన్ల ప్రజలు ఉంటారని ఆయన (మోదీ) నాకు చెప్పారు. ఆ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవతరించనుంది. ఇది ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. మీరు కూడా దీన్ని ఆనందిస్తారు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. -
అధ్యక్షుడికి అదిరిపోయే ఆహ్వానం
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చిరస్మరణీయ ఆహ్వానం పలుకుతామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ట్రంప్ భారత పర్యటన చాలా ప్రత్యేకమైనదని, ఇది అమెరికా–భారత్‌ల మధ్య స్నేహం బలపడేందుకు ఉపకరిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ‘భారత్, అమెరికాలకు ప్రజాస్వామ్యం పట్లా, భిన్న భావాలకూ అవకాశం ఇచ్చే విషయంలో ఒకేరకమైన నిబద్దత ఉన్నది. ఈ ఇరుదేశాల మధ్య స్నేహం, ఈ ఇరుదేశాల పౌరులకే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా రానున్నారు. భారత్ పర్యటన కోసం వేచి చూస్తున్నా: ట్రంప్ భారత్ పర్యటనకోసం తాను వేచి ఉన్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. మోదీ తనకు మంచి స్నేహితుడనీ అతను చాలా గొప్ప వ్యక్తి అని అమెరికా అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు. సరైన ఒప్పందం కావాలి... భారత్‌తో వాణిజ్య ఒప్పందం సాధ్యమేననీ అయితే అది సరైన ఒప్పందం కావాలని ట్రంప్ అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ రెండు దేశాలు అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదని చెప్పారు. అహ్మదాబాద్‌లో భారీ రోడ్ షో.. డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటనలో భాగంగా ఈసారి ఢిల్లీలో కాకుండా నేరుగా అహ్మదాబాద్‌కి చేరుకుంటారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 10 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేయబోయే రోడ్‌షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఆ తరువాత అహ్మదాబాద్‌లోని మొటేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంను ట్రంప్–మోదీలు ఇద్దరూ ఆవిష్కరిస్తారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంకన్నా ఈ స్టేడియం పెద్దదని అధికారులు వెల్లడించారు. ఈ స్టేడియంలో 1.10 లక్షల మంది కూర్చునే అవకాశం ఉంది. గుజరాత్ బడ్జెట్ సమావేశాలు వాయిదా... ట్రంప్ పర్యటన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ని ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ట్రంప్ పర్యటనలో భాగంగా ఏర్పాటుచేయబోయే రోడ్ షో, బహిరంగ సభలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హౌడీ ట్రంప్.. గత యేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై నుంచి మోదీ, ట్రంప్ ఉపన్యసించారు. ఈ సభకు అమెరికాలో ఉంటోన్న దాదాపు 50,000 మంది భారతీయులు హాజరయ్యారు. అదే తరహాలో ట్రంప్రాక దృష్ట్యా అహ్మదాబాద్‌లో ‘హౌడీ ట్రంప్’పేరిట భారీ సభను ఏర్పాటు చేయాలని భారత్ భావిస్తోంది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న ఈ సభకు దాదాపు లక్షమంది జనం హాజరుకానున్నారు. ఈ సభను ఉద్దేశించి మోదీ, ట్రంప్‌లు ప్రసంగించనున్నారు. -
ఫిబ్రవరి 21న భారత్‌కు రానున్న ట్రంప్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ రానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్ సూట్‌ను బుక్ చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ పర్యటనలో ట్రంప్ రెండు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్, అప్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాలలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదంపై చర్చించనున్నారు. దీంతో పాటు చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప భారత్‌తోనూ ఆ తరహా విధానాన్ని అమలు చేసేందుకు చర్చ జరపనున్నట్లు సమాచారం అందింది. దీంతో పాటు యుఎస్ నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై వీరిద్దరి భేటీలో చర్చకు రానుంది. జీఎస్పీ ఉపసంహరణ తర్వాత భారతదేశం తన సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ 6 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటుండగా, ఈ ఒప్పందాన్ని అధిగమించడానికి చమురు లేదా షేల్ గ్యాస్‌పై హామీలు పొందాలని భారత్ భావిస్తుంది. కాగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలో ఐరాస మానవహక్కుల మండలిలో(యూఎన్హెచ్ఆర్సీ) సెషన్లో భారత్‌పై మాటల యుద్దం చేసేందుకు పాక్ సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ భారత్ పర్యటన ఆసక్తికరంగా మారింది. మోదీ పాలనలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక), ఎన్పీఆర్ వంటి నిర్ణయాల వల్ల భారతీయ ముస్లింలు ముప్పులో ఉన్నారన్న అంశాన్ని పాక్ మండలిలో లేవనెత్తనుందన్న సమాచారం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
వాణిజ్య యుద్ధానికి విరామం!!
వాషింగ్టన్: దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న వాణిజ్య యుద్ధానికి విరామమిచ్చే దిశగా అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ముందడుగు వేశాయి. తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షుడు లియు హి దీనిపై సంతకం చేశారు. మేథోహక్కుల పరిరక్షణ, బలవంతపు టెక్నాలజీ బదిలీకి ముగింపు, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సమతౌల్యం పాటించడం, వివాదాల పరిష్కారానికి సమర్థమంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. దీనితో అమెరికా నుంచి చైనాకు మరింతగా వ్యవసాయోత్పత్తులు, ఆర్థిక సేవల ఎగుమతికి అవకాశం లభించనుంది. ‘ఇది చారిత్రక ఒప్పందం. భవిష్యత్‌లో సముచిత రీతిలో ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించే దిశగా ముందడుగు. గతంలో జరిగిన తప్పులను రెండు దేశాలు దీనితో సరిదిద్దుకుంటున్నాయి‘ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ డీల్‌తో ఇరు దేశాలకు గణనీయంగా ప్రయోజనాలు చేకూరతాయని, ఇది ప్రపంచశాంతికి దోహదపడగలదని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా మేథోహక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు చైనా చెప్పుకోతగ్గ ప్రయత్నాలే చేస్తోందని ట్రంప్ తెలిపారు. అయితే, రెండో దశ ట్రేడ్ డీల్ కుదిరే దాకా చైనాపై టారిఫ్‌లు యథాప్రకారం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ డీల్ తోడ్పడగలదని లియు హి ఈ సందర్భంగా చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్థిక, వాణిజ్య రంగాల్లో రెండు దేశాలు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చర్చల ప్రక్రియలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా చిట్టచివరికి ఒప్పందం కుదుర్చుకోగలిగామని పేర్కొన్నారు. మరోవైపు, ఇరు పక్షాలు డీల్‌ను సజావుగా అమలు చేయగలవని ఆశిస్తున్నట్లు ట్రంప్‌కు రాసిన లేఖలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. టెలికం సంస్థ హువావేపై అగ్రరాజ్యం ఆంక్షలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. చైనా కంపెనీలతో అమెరికా సముచిత రీతిలో వ్యవహరించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు ఊరట.. అగ్రరాజ్యాల మధ్య కుదిరిన తొలి దశ డీల్‌తో ప్రపంచ దేశాలకు ఊరట లభించగలదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. డీల్‌లోని అంశాల కన్నా .. ఒక ఒప్పందమంటూ కుదరడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. అమెరికా నుంచి మరిన్ని దిగుమతులకు చైనా అంగీకరించడం, దశలవారీగా చైనా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు కట్టుబడి ఉన్నామంటూ అమెరికా ప్రకటించడం.. ఈ డీల్‌లోని ముఖ్యాంశాలుగా వారు తెలిపారు. డీల్ ప్రకారం.. వచ్చే రెండేళ్లలో అమెరికా నుంచి 200 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. అయితే, ఇది సంధిలాంటిది మాత్రమేనని, అమెరికా నుంచి చైనా మరిన్ని ఉత్పత్తులు కొనుగోలు చేసేలా చేర్చిన నిబంధన కచ్చితంగా అమలు చేయడం కష్టమేనని చైనా విశ్లేషకుడు ఐనార్ తాంగ్జెన్ వ్యాఖ్యానించారు. పోటాపోటీగా సుంకాల పోరు.. చైనాతో భారీ వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు 2018లో ట్రంప్.. వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సుంకాలపరమైన పోరు కొనసాగుతోంది. అమెరికా ఇప్పటిదాకా సుమారు 360 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలు విధించింది. చైనా కూడా దానికి తగ్గట్లుగా దాదాపు 110 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించింది. వాణిజ్య పోరు ప్రభావం.. ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా మిగతా ప్రపంచ దేశాలపై కూడా పడింది. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ
అమెరికా–చైనాల మధ్య తొలి దశ ఒప్పందంపై సంతకాలు ఈ వారమే జరుగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా సోమవారం లాభపడింది. గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 1.8 శాతం వృద్ధి సాధించడం, ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు అంచనాలను మించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 70.82కు చేరడం(ఇంట్రాడేలో), సానుకూల ప్రభావం చూపించాయి. టెక్నాలజీ, బ్యాంక్, లోహ, రియల్టీ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్లను సృష్టించాయి. ఇంట్రాడేలో 41,900 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల లాభంతో 41,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,330 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో 12,338 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నికర లాభాలు పెరుగుతాయ్....! ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు బాగా ఉండటంతో ఇతర కంపెనీల ఫలితాలు కూడా బాగానే ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల కారణంగా కంపెనీల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో నికర లాభాలు మాత్రం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ► నికర లాభం 24 శాతం పెరగడంతో ఇన్ఫోసిస్ షేర్ 4.7 శాతం లాభంతో రూ.773 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 260 పాయింట్ల లాభంలో సగం పాయింట్లు (125 పాయింట్లు) ఇన్ఫోసిస్ షేర్వి కావడం విశేషం. ► ఇన్వెస్టర్ల సంపద ఒక్క సోమవారం రోజే రూ. లక్ష కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1 లక్ష కోట్లు పెరిగి రూ.158.74 లక్షల కోట్లకు ఎగసింది. ► లిస్టింగ్ నిబంధనలను పాటించనందున వచ్చే నెల 3 నుంచి కాఫీ డే ఎంటర్ప్రైజెస్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ల ట్రేడింగ్ నిలిచిపోనున్నది. దీంతో ఈ రెండు షేర్లు చెరో 5 శాతం మేర నష్టపోయాయి. కాఫీ డే షేర్ రూ.39.65కు, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ 4.9 శాతం నష్టంతో రూ.10.80కు చేరాయి. ► జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, ఫీనిక్స్ మిల్స్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్ఆర్ఎఫ్, టాటాగ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు ఆల్‌టైం హైని తాకాయి. ► ఎర్విన్ సింగ్బ్రెయిచ్ పెట్టుబడుల ప్రణాళికను యస్ బ్యాంక్ తిరస్కరించింది. ఈ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒకరు రాజీనామా చేశారు. అంతే కాకుండా నిధుల సమీకరణను రూ.10,000 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలని డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ 6 శాతం నష్టంతో రూ.42 వద్ద ముగిసింది. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో డీఎల్ఎఫ్ షేర్ జోరుగా పెరిగింది. 3.5 శాతం లాభంతో రూ. 253కు చేరింది. -
సెన్సెక్స్ 41,700–41,810 శ్రేణిని అధిగమిస్తేనే...
అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, చైనా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున 115 బిలియన్ డాలర్ల నిధుల్ని వ్యవస్థలోకి విడుదల చేయడం వంటి పాజిటివ్ వార్తల నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పినా, భారత్ స్టాక్ సూచీలు...కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోయాయి. ఈ లోపున అమెరికా డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో సృష్టించిన సంక్షోభ ఫలితంగా కొత్త ఏడాది తొలివారంలో మన మార్కెట్ నష్టాలతో ముగిసింది. మధ్యప్రాచ్య సంక్షోభ ప్రభావంతో క్రూడ్, బంగారం ధర అమాంతం పెరిగాయి. దీంతో మన వాణిజ్యలోటు పెరగడం, రూపాయి క్షీణించడం వంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. పరిస్థితి తీవ్రతరమైతే ఆ దేశాల నుంచి భారతీయులు పంపించే రెమిటెన్సులు తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రిస్క్‌లను స్టాక్ మార్కెట్ ఎంతవరకు తట్టుకుంటుందో..ఇప్పుడే అంచనా వేయలేము. ఇక స్టాక్ సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 3తో ముగిసిన ఈ ఏడాది తొలివారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 110 పాయింట్ల స్వల్పనష్టంతో 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,260 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,130 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 41,000–40,730 పాయింట్ల శ్రేణి మధ్యలో మద్దతు పొందవచ్చు. ఇక మార్కెట్ పెరిగితే 41,700–41,810 ్రÔó ణి వద్ద మరోదఫా గట్టి అవరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిని దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,200 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 12,150... గత కాలమ్‌లో ప్రస్తావించిన రీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ క్రితం వారం మరో రెండు దఫాలు 12,290 సమీపంలో గట్టి అవరోధాన్ని చవిచూసి ముందడుగు వేయలేకపోయింది. అంతక్రితం వారంతో పోలిస్తే 19 పాయింట్ల స్వల్పనష్టాన్ని చవిచూసింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు ఐదు దఫాలు 12,290 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి అవరోధం కలిగింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని దాటేంతవరకూ కన్సాలిడేషన్ లేదా కరెక్షన్ బాటలో నిఫ్టీ కదులుతుంది. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,150 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వెనువెంటనే 12,115 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,070–11,980 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే, మరోదఫా 12,290 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని దాటితే 12,360 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 12,425 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ గతవారం వరుస రికార్డులతో దూసుకెళ్లింది. మొత్తం ఐదు ట్రేడింగ్ రోజుల్లో.. ఏకంగా నాలుగు రోజులు సూచీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. జీఎస్టీలో వడ్డనలు లేకపోవడం, అమెరికా–చైనాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ ఒప్పందానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకారం తెలపడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో గడిచిన వారంలో సెన్సెక్స్ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. శుక్రవారం 12,294 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 12,272 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 41,810 పాయింట్లకు చేరుకుని.. చివరకు 41,682 వద్ద నిలిచింది. ఈ స్థాయి రికార్డులతో జోరుమీదున్న మన మార్కెట్.. ఈవారంలో ఏ విధంగా ఉండనుందనే అంశానికి, ప్రధానంగా అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్‌కు చాన్స్..! వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీ మార్కెట్ ఈ వారంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. వాల్యుయేషన్స్ ప్రియంగా మారడమే ఇందుకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫండమెంటల్‌గా బలంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే ఈ వారంలో కొనుగోలు చేయడం వివేకవంతమైన విధానమని, మార్కెట్ బాగా పెరిగినందున కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వీపీ అజిత్ మిశ్రా అన్నారు. బాగా పెరిగిన షేర్ల నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగి వ్యాల్యూ పిక్స్ వైపునకు పెట్టుబడులు మారే అవకాశం ఉన్నందున తాను కూడా కన్సాలిడేషన్ జరగవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ నాయర్ చెప్పా రు. ఏడాది చివరి రోజులు కావడంతో స్టాక్ స్పెసి ఫిక్ ర్యాలీకి మాత్రమే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు. సెన్సెక్స్ 30 సూచీ నుంచి యస్ బ్యాంక్ అవుట్ బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ) బెంచ్‌మార్క్ సూచీ (సెన్సెక్స్)లోని 30 షేర్ల జాబితాలో ఈ వారంలోనే భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్ఈ చేర్చనుంది. ఇదే విధంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ వంటి పలు సూచీల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ఫండ్ మేనేజర్లు వారి పోర్ట్‌ఫోలియోలో భారీ మార్పులను చేయనున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్ సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఉండడం వల్ల రికార్డుల ర్యాలీ కొనసాగేందుకు అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. క్రిస్మస్ సందర్భంగా బుధవారం (25న) దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (26న) ఉదయం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుంది. -
సెన్సెక్స్ 41,164 స్థాయిని అధిగమిస్తే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఫైనాన్షియల్ మార్కెట్లను నెలల తరబడి ఆందోళన పరుస్తున్న రెండు అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికా–చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడటం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ సజావుగా వైదొలగడానికి (సాఫ్ట్ బ్రెగ్జిట్) అవసరమైన మెజారిటీని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ, ప్రధాని బోరిస్ జాన్సన్ సాధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశాలు. మన దేశ జీడీపి బాగా పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రతికూలాంశాల్ని సైతం తలదన్ని... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మరోదఫా రికార్డుస్థాయిని సమీపించింది. గత ఆరునెలల్లో ఎన్నోదఫాలు రికార్డుస్థాయి వద్ద జరిగిన బ్రేకవుట్లు విఫలమయ్యాయి. ట్రేడ్ డీల్, బ్రెగ్జిట్ సమస్యలకు పరిష్కారం లభించబోతున్నందున, ఈ వారం మన మార్కెట్ వ్యవహరించే శైలి... దీర్ఘ, మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకం కానున్నది. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... డిసెంబర్ 13తో ముగిసినవారంలో మూడోరోజైన బుధవారం 40,135 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్... అదేరోజున రికవరీ ప్రారంభించి, చివరిరోజైన శుక్రవారం 41,056 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 565 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 28 నాటి 41,164 పాయింట్ల రికార్డుస్థాయి సెన్సెక్స్‌కు ఈ వారం కీలకం కానుంది. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే వేగంగా 41,400 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ర్యాలీ కొనసాగితే 41,650 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో రికార్డుస్థాయిపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 40,850–40,710 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 40,590 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 40,330 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీకి 12,160 కీలకస్థాయి నిఫ్టీ గతవారం 11,832 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత వేగంగా 12,098 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 165 పాయింట్ల లాభంతో 12,087 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి నవంబర్ 28 నాటి 12,158 పాయింట్ల రికార్డుస్థాయే కీలకం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే 12,220 పాయింట్ల స్థాయిని అందు కోవొచ్చు. అటుపైన క్రమేపీ 12,250–1300 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలకస్థాయిని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 12,035–12,005 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,950 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 11,880 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.