Umran Malik
-
కలిసిరాని కాలం.. టీమిండియా స్టార్ బౌలర్‌కు గాయం
టీమిండియా యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు కాలం కలిసి రావడం లేదు. భారత జట్టులో పునరాగమనం చేయాలని ఆశపడుతున్న అతడిని గాయాల బెడద వెంటాడుతోంది. ముఖ్యంగా రెడ్‌బాల్ టోర్నీలో ఆడి తనను తాను నిరూపించుకోవాలన్న ఈ జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌కు వరసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.ఉమ్రాన్ స్థానంలో ఎవరు?ఇప్పటికే దులిప్ ట్రోఫీ-2024కు దూరమైన ఉమ్రాన్ మాలిక్.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తుంటినొప్పితో అతడు బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... అక్టోబరు 11 నుంచి మొదలుకానున్న ఈ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఆడబోయే కశ్మీర్ జట్టులో ఉమ్రాన్ స్థానాన్ని ఇతర బౌలర్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వసీం బషీర్ లేదంటే.. ఉమర్ నజీర్‌కు ఆ అదృష్టం దక్కనున్నట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో 2022 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు కూల్చాడు.వరుస గాయాలుగతేడాది వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్.. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్-2024లోనూ నిరాశపరిచాడు. దేశవాళీ క్రికెట్లోనైనా రాణించాలనుకుంటే ఇలా వరుసగా గాయాలపాలవుతున్నాడు.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 ఆడిన ఇండియా-సి జట్టుకు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యాడు. అయితే, డెంగ్యూ జ్వరం కారణంగా.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టుకు దూరమయ్యాడు. రంజీలతోనైనా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ రైటార్మ్ పేసర్‌ను తాజాగా తుంటినొప్పి వేధిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి వరకు 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్ శర్మ -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్‌తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్‌మెంట్‌ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!
టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్మెంట్ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ పారస్ మాంబ్రే ఉమ్రాన్ మాలిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్ ఎక్స్‌ప్రెస్ పేస్ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్‌లోని పేస్ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్ చేసేటపుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్ మాంబ్రే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. -
IPL 2024: తొలి ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. First the catch and now an excellent direct-hit! 🎯#RCB lose both their openers courtesy of DDP 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG | @devdpd07 pic.twitter.com/oXoYWi5PC8 — IndianPremierLeague (@IPL) April 2, 2024 తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్‌లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడుసార్లు 155 KMPH స్పీడ్‌తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్ ఎక్స్‌ప్రెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు 1. షాన్ టైట్- 157.7 KMPH 2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH 3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH 4. మయాంక్ యాదవ్- 156.7 KMPH 5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓపెనర్‌గా ఉమ్రాన్ మాలిక్.. డకౌట్! ఎందుకీ దుస్థితి?
Ranji Trophy 2023-24- Puducherry vs Jammu and Kashmir: టీమిండియాలో స్థానం కోల్పోయిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. రంజీ ట్రోఫీ-2024 బరిలో దిగాడు ఈ 24 ఏళ్ల పేసర్. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడి వైఫల్యం కొనసాగుతోంది. కాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా చేరి.. జట్టులో కీలక సభ్యుడి స్థాయికి ఎదిగాడు. టీమిండియాలో చోటు కరువు అయితే, గత రెండు సీజన్లుగా ఉమ్రాన్ మాలిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో తుదిజట్టులోనూ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. లీగ్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే.. టీమిండియాలోనూ అతడికి చోటు కరువైంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్ మాలిక్.. ఇప్పటి వరకు 8 టీ20లు, 10 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ ఫాస్ట్ బౌలర్ వరుసగా 11, 13 వికెట్లు తీశాడు. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఉమ్రాన్‌ను పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో గతేడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ కశ్మీరీ బౌలర్ టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో పరిమిత ఓవర్లలో సత్తా చాటలేకపోయిన ఉమ్రాన్.. రంజీ బరిలో దిగి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రంజీల్లోనూ వరుస వైఫల్యాలు తాజా రంజీ సీజన్లో ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వర్షం కారణంగా ఆయా మ్యాచ్‌లకు ఆటంకం కలిగినప్పటికీ తనకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినపుడు కూడా ఉమ్రాన్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తాజాగా పుదుచ్చేరితో మ్యాచ్‌లోనూ తన వైఫల్యం కొనసాగించాడు. పుదుచ్చేరి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ చేసి.. 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 172 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 66 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కాగా పుదుచ్చేరి మొదటి ఇన్నింగ్స్‌లో కశ్మీర్ బౌలర్లు అబిద్ ముస్తాక్, వన్షజ్ శర్మ ఐదేసి వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా.. డకౌట్ ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉమ్రాన్ డకౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఫాజిల్ రషీద్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కశ్మీర్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఈ క్రమంలో 86 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి శనివారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 35 రన్స్ చేసింది. విజయానికి పుదుచ్చేరి 52 పరుగుల దూరంలో నిలవగా.. జమ్మూ కశ్మీర్ ఇంకో మూడు వికెట్లు పడగొడితే గెలుపొందుతుంది. అయితే, పుదుచ్చేరి రెండో ఇన్నింగ్స్‌లో ఉమ్రాన్‌కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. అబిద్ ముస్తాక్ మరోసారి 5 వికెట్లు తీయగా.. వన్షజ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి రంజీల్లోనైనా ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. టీమిండియా భవిష్యత్ స్పీడ్గన్గా నీరాజనాలు అందుకున్న ఉమ్రాన్ మాలిక్ ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ వాపోతున్నారు. -
వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్‌కు ఎంపికైన ఆ ప్లేయర్‌కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్‌బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్‌బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్‌లు ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్‌కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్‌లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఆ జట్టులో మాత్రం ఛాన్స్!
లోన్ నాసిర్.. జమ్మూ కశ్మీర్ నయా పేస్ సంచలనం. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గే సత్తా అతడిది. ఐపీఎల్-2024 వేలంలో అందరి కళ్లు అతడిపైనే ఉండేవి. ఈ యువ పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ భావించారు. కానీ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన నాసిర్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని లోన్ నాసిర్‌కు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ లభించింది. రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జమ్మూ కశ్మీర్ జట్టులో లోన్ నాసిర్‌కు చోటుదక్కింది. రంజీ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును జమ్మూ కశ్మీర్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు శుభమ్ ఖజురియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్న ఉమ్రాన్ మాలిక్ కూడా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024కు జమ్మూ కాశ్మీర్ జట్టు: శుభమ్ ఖజురియా(కెప్టెన్), కమ్రాన్ ఇక్బాల్, అభినవ్ పూరి, వివ్రాంత్ శర్మ, అబ్దుల్ సమద్, శుభమ్ సింగ్ పుండిర్, ఫాజిల్ రషీద్ (వికెట్ కీపర్), ముసైఫ్ ఐజాజ్, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా,ఉమ్రాన్ మలీర్క్, లోన్ మలీక్ ఉమర్ నజీర్, ఔకిబ్ నబీ, రోహిత్ శర్మ. చదవండి:సచిన్ వేరొక గ్రహం నుంచి వచ్చాడనుకుంటా.. గొప్ప వ్యక్తి! లారా కంటే బెటర్ -
టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
Asian Games 2023- Umran Malik: ఆసియా క్రీడలు- 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు వెళ్లనన్ను భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో భాగమైన పేసర్ శివం మావి మెగా ఈవెంట్‌కు దూరం కానున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం గాయపడిన మావి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. భారత జట్టుకు గాయాల బెడద ఈ క్రమంలో శివం మావి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్రాన్‌తో పాటు అతడి పేరు పరిశీలనలో అయితే, ఈ విదర్భ పేసర్ సైతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నందున అతడిని కూడా పక్కనపెట్టిన సెలక్టర్లు.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తొలిసారి భారత క్రికెట్ జట్లు చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లను తొలిసారిగా ఈ టోర్నీకి పంపేందుకు అంగీకరించిన బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. శిక్షణా శిబిరం అక్టోబరు 5 నుంచి మెన్స్ వన్డే వరల్డ్‌కప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా గేమ్స్ విలేజ్‌కు వెళ్లే ముందు భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొనున్నారు. ఇక భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సాయిరాజ్ బహుతులే బౌలింగ్, మునీశ్ బాలి ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జట్లు పోటీపడనున్నాయి. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్. చదవండి: Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? -
వెస్టిండీస్‌తో ఐదో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! స్పీడ్ స్టార్‌కు ఛాన్స్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు వరుస విజయాలతో ఊపుందుకున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫోరిడా వేదికగా శనివారం జరిగిన నాలుగో టీ20లో విండీస్‌ను భారత్ చిత్తు చేయడంతో సిరీస్ 2-2 సమమైంది. ఈ క్రమంలో ఇదే వేదికలో ఆదివారం జరగనున్న సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో భారత్-విండీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు కరేబియన్లు ఈ మ్యాచ్‌లో గెలిచి కనీసం టీ20 సిరీస్‌నైనా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. చాహల్‌పై వేటు.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అదే విధంగా ఫ్లోరిడా పిచ్ పేసర్లకు కాస్త అనుకూస్తుంది కాబట్టి ఉమ్రాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విండీస్ కూడా ఒకే ఒక మార్పుతో ఆడనున్నట్లు సమాచారం. నాలుగో టీ20లో విఫలమైన ఓడియన్ స్మిత్ స్ధానంలో అల్జారీ జోసఫ్‌ను తిరిగి తీసుకురావాలని విండీస్ జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్ భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ చదవండి: ఇదే నేను ఆశించా.. చాలా సంతోషంగా ఉంది! వారిద్దరూ అద్భుతం: హార్దిక్ -
'అతడొక సంచలనం.. కచ్చితంగా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు'
టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ప్రపంచక్రికెట్‌ను ఉమ్రాన్ మాలిక్ శాసిస్తాడని లారా కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గత రెండు సీజన్లగా ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాప్‌లో లారా కూడా భాగంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్కిల్స్‌ను లారా దగ్గర నుంచి చూశాడు. మాలిక్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కూడా చోటు దక్కలేదు. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లారా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "ఉమ్రాన్ ఒక పేస్ బౌలింగ్ సంచలనం. కానీ పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని మాలిక్ వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు బంతితో అద్బుతాలు చేసే విధంగా ఉండాలి. అతడు ఇంకా తన బౌలింగ్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. అయితే ఉమ్రాన్‌కు ఇప్పుడు కేవలం 23 ఏళ్ల మాత్రమే. ఇంకా అతడికి చాలా భవిష్యత్తు ఉంది. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్‌తో పాటు కొన్ని ట్రిక్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో డేల్ స్టెయిన్‌తో కలిసి పనిచేశాడు. కాబట్టి అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఉమ్రాన్ వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని" జోస్యం చెప్పాడు. చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్ -
WC 2023: అదొక్కటే ఉంటే సరిపోదు.. కాస్త ఆటపై దృష్టి పెట్టు ఉమ్రాన్! అప్పుడే..
Ex-India Pacer Reminder For Umran Malik: ‘‘అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలంటే వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎవరికైనా గేమ్ ప్లాన్ ముఖ్యం. ఈ విషయంలో అతడు ఇంకా వెనుబడే ఉన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా, ప్రపంచకప్ రేసులో తన పేరు వినిపించడానికి కారణం అతడి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యమైన పేస్ ఒక్కటే. కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. అంతేగానీ ఒక మ్యాచ్ ఆడించి మరో మ్యాచ్‌లో పక్కన పెట్టడం చేయకూడదు. ఒకవేళ ఉమ్రాన్ నుంచి గనుక సుదీర్ఘకాలం పాటు కీలక పేసర్‌గా సేవలు అందించాలని కోరుకుంటే.. తప్పకుండా అందుకు అనుగుణంగా అతడు తన నైపుణ్యాలకు పదునుపెట్టేలా శిక్షణ ఇవ్వాలి. అదే బలం.. కానీ నిజానికి వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఎక్కువే మ్యాచ్‌లే ఆడబోతోంది. కాబట్టి ఆసియా వన్డే కప్-2023లో 5-6, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఉమ్రాన్‌ను మరికొన్ని మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఉంటుంది. అతడికి ఉన్న బలం పేస్. కానీ బౌలింగ్‌లో అంతగా పసలేదు. కాబట్టి ఉమ్రాన్ తన స్కిల్స్ మెరుగుపరచుకునే అంశంపై దృష్టి సారించాలి. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. నెట్‌బౌలర్‌గా వచ్చి.. ఏకంగా భారత యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో నెట్‌బౌలర్‌గా ప్రవేశించిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. అనతికాలంలోనే జట్టు కీలక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అసాధారణ వేగంతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా తరఫున.. ఇక గతేడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అతడు జూన్, 2022లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. విండీస్ పర్యటనలో.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్రాన్ అవకాశాల గురించి ఆర్పీ సింగ్ కామెంట్ చేశాడు. రేసులో ఉండాలంటే ఈ యువ పేసర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక.. -
అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్
India tour of West Indies, 2023: కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చిరుతలాంటి వేగంతో బంతులు సంధిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2023లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అయినప్పటికీ వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం విశేషం. అయితే, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ దళంలో భాగమైన ఈ కశ్మీరీ స్పీడ్‌స్టర్‌కు తుదిజట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి!! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న ఉమ్రాన్‌ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌తో పోల్చిన మంజ్రేకర్.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని జోస్యం చెప్పాడు. ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు ఈ మేరకు.. ‘‘టెస్టు క్రికెట్ జట్టుకు ఉమ్రాన్‌ను తప్పకుండా ఎంపిక చేయాలి. మార్క్‌వుడ్ గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సమర్థుడు. టెయిలెండర్లను ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వడు. అదే అతడి స్పెషాలిటీ. ఉమ్రాన్ మాలిక్ విషయంలో పునరాలోచన చేయాలి. మార్క్‌వుడ్ మాదిరే వేగంతో బౌలింగ్ చేయగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది. అయితే, టెస్టుల్లోనూ ఆడిస్తే వైవిధ్యమైన పేస్‌తో టీమిండియా బౌలింగ్ విభాగంలో అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. తొలి మ్యాచ్ తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఆగష్టు 13నాటి ఐదో టీ20తో ఈ టూర్ ముగియనుంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే -
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. అతడిని పట్టించుకోలేదు ‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్‌కప్ జట్టులో ఉమ్రాన్‌కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు. ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు. అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్‌గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్‌గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
టీమిండియా భవిష్యత్తు స్పీడ్ గన్ అతడే..!
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు స్టార్ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు మున్ముందు టీమిండియా టెస్ట్ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్ కుమార్‌పై మరింత ఫోకస్ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ముకేశ్ కుమార్‌కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్.. తన ఢిల్లీ క్యాపటిల్స్ సహచర బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు. ఉమ్రాన్, అర్షదీప్‌ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తే భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్ రణ్వీర్ అలహాబాదియా యూట్యూబ్ పోడ్కాస్ట్లో విశ్లేషించాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్ కుమార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మరీ ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. విండీస్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ ఆధ్వర్యంలో జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీలతో కూడిన టెస్ట్ జట్టులో ముకేశ్ సభ్యుడిగా ఉన్నాడు. -
IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్
IPL 2023- SRH- Umran Malik: ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెదవి విరిచాడు. గత సీజన్లో చేసిన తప్పులనే ఈసారి కూడా పునరావృతం చేశాడని విమర్శించాడు. డేల్ స్టెయిన్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ మార్గదర్శనం చేసేందుకు అందుబాటులో ఉన్నప్పటికీ ఉమ్రాన్ ఏం నేర్చుకున్నాడో అర్థం కావడం లేదని వాపోయాడు. అంచనాలు అందుకోలేక కాగా నెట్ బౌలర్‌గా సన్‌రైజర్స్‌లో ఎంట్రీ ఇచ్చిన కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. అద్భుత ప్రదర్శనతో జట్టులో ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. గత సీజన్లో 22 వికెట్లు తీసిన అతడు.. భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. అయితే, ఐపీఎల్ పదహారో ఎడిషన్ మాత్రం ఉమ్రాన్‌కు అస్సలు కలిసి రాలేదు. కెప్టెన్‌కే తెలియదట అంచనాలకు అనుగుణంగా రాణించలేక చతికిలపడ్డ ఉమ్రాన్.. తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. సీజన్ మొత్తంలో 8 మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ ఏకంగా 217 పరుగులు సమర్పించుకుని(ఎకానమీ 10.85) కేవలం ఐదు వికెట్లు తీశాడు. ఇక పలు కీలక మ్యాచ్‌లలో ఉమ్రాన్‌ను తప్పించడంపై తనకు కూడా అవగాహన లేదంటూ రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ వ్యాఖ్యానించడం సందేహాలకు తావిచ్చింది. మళ్లీ మళ్లీ అవే తప్పులు ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కచ్చితత్వం లేకుండా పోయింది. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికీ తను యువకుడే. బౌలర్‌గా పూర్తి స్థాయి అనుభవం లేదు. డేల్ స్టెయిన్‌తో కలిసి పని చేశాడు. అయినా, అతడి ఆట తీరులో మార్పు రాలేదు. స్టెయిన్ దగ్గర అతడు చాలా నేర్చుకోవచ్చు. కానీ అలా ఏమీ కనిపించడం లేదు. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో గత సీజన్లో మాదిరే ఈసారి కూడా కొన్ని తప్పులు చేశాడు’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక ఉమ్రాన్‌కు ఛాన్స్‌లు తక్కువగా ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ఈసారి ఉమ్రాన్‌కు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఏకంగా కెప్టెన్‌కే తన సెలక్షన్ గురించి అవగాహన లేదంటే జట్టులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు కచ్చితంగా ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఏదేమైనా ఉమ్రాన్ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈసారి కూడా సన్‌రైజర్స్ దారుణ ప్రదర్శన కారణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్’కు ముందెవరు? IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్ షెడ్యూల్, వివరాలు ఇవే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్‌కు ‘లాస్ట్’ ఛాన్స్!
IPL 2023 MI vs SRH: ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో తొమ్మిదింట ఓడిన రైజర్స్.. ఈ మ్యాచ్‌లో గెలిచినా పెద్దగా ఒరిగేమీ లేదు. అలా అయితే ముంబైకి చేదు అనుభవం తప్పదు మహా అయితే, ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కినెట్టి పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంటుంది. గెలుపుతో సీజన్‌ను ముగించామనే సంతృప్తితో నిష్క్రమిస్తుంది. అయితే, ఇప్పటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న రైజర్స్ ఈ మ్యాచ్‌లో గనుక రైజ్ అయితే, ముంబైకి చేదు అనుభవం తప్పదు. కానీ.. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన ముంబైని ఓడించడం రైజర్స్‌కు అంత సులువేమీ కాదు. ముఖ్యంగా సొంతమైదానంలో ఈ మ్యాచ్ జరగడం ముంబైకి అత్యంత సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులోనూ సన్‌రైజర్స్‌పై ముంబైదే పైచేయి. ముంబైదే పైచేయి ఇప్పటి వరకు ఇరు జట్లు 20సార్లు తలపడగా రోహిత్ సేన 11 సార్లు.. ఎస్ఆర్హెచ్ 9 సార్లు గెలిచింది. గత ఆరు మ్యాచ్‌లలో నాలుగింట ముంబైనే విజయం వరించింది. దీంతో ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. గత మూడు మ్యాచ్‌లలో ఓడిన రైజర్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని ఆరాటపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపొందితే రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరనుంది. ఒకవేళ ఓడితే ఆర్సీబీకి మార్గం సుగమమవుతుంది. కాగా ఆదివారం మధ్యాహ్నం (3:30) ముంబై- రైజర్స్ మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి 7. 30 గంటలకు ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడనుంది. పోటీలో ముంబై, ఆర్సీబీ.. ఆశల పల్లకిలో రాజస్తాన్ ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. నాలుగో స్థానం కోసం ముంబై,ఆర్సీబీ రేసులో ఉన్నాయి. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లలో ఈ రెండూ గనుక ఓడితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇదిలా ఉంటే.. రైజర్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు.. బెంచ్ మీద ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇస్తామంటూ రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ చెప్పిన నేపథ్యంలో బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం దక్కొచ్చు. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్లు(అంచనా) ముంబై: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా/తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ సన్‌రైజర్స్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి. చదవండి: సంచలన ఇన్నింగ్స్.. రింకూతో గంభీర్ ముచ్చట..! ట్వీట్ వైరల్ -
అతడి సేవలను సన్‌రైజర్స్ సరిగ్గా వాడుకోవడం లేదు! కనీస మద్దతు లేకుండా..
IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సేవలను సన్‌రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్ బౌలర్‌గా సన్‌రైజర్స్ జట్టులో చేరిన ఉమ్రాన్.. తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. Photo Credit : IPL Website నెట్ బౌలర్‌గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్ ద్వారా రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్‌లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 29 నాటి మ్యాచ్ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్‌కే తెలియదట ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఉమ్రాన్ విషయంలో సన్‌రైజర్స్ ఎందుకిలా?! ‘‘సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఉమ్రాన్ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్‌లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరు సూపర్ ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, హైదరాబాదీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్‌లను కొనియాడాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక సిరాజ్ 13 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! -
'కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ విషయం తెలియదంటావ్!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో జట్టుగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచే మెరుగైన ఆటతీరును కనబరచని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఎస్ఆర్హెచ్ ఆటతీరులో పెద్దగా మార్పు లేదు. క్లాసెన్ మినహా జట్టులో స్థిరమైన బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఒక్కడు కనిపించలేదు. బౌలింగ్ విభాగం కూడా అంతంతమాత్రమే. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా.. టాస్ సమయంలో ఉమ్రాన్ మాలిక్ విషయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. మొన్నటికి మొన్న తప్పుడు షీట్ సమర్పించి ఒక ఆటగాడి డెబ్యూ చేయకపోవడానికి కారణమయ్యాడు. ఇక టాస్ సమయంలో తుది జట్టు విషయంపై స్పందించాడు. ''హ్యారీ బ్రూక్ తుది జట్టులోకి వచ్చాడు. కార్తిక్ త్యాగి, నితీశ్‌లు అరంగేట్రం చేశారు అని తెలిపాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఎందుకు ఆడడం లేదని ప్రశ్న వేయగా.. దీనిపై మార్క్రమ్.. 150 కిమీ వేగంతో బంతులు విసరగల నైపుణ్యం ఉమ్రాన్ మాలిక్ సొంతం. కానీ అతను ఆడకపోవడం వెనుక ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అతని బౌలింగ్‌లో వేగం ఉంది. చాలా ఆట ఆడాల్సి ఉంది.'' అంటూ తన మాటలతో చిన్నపాటి కన్ఫూజన్ క్రియేట్ చేశాడు. మార్క్రమ్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా స్పందించారు. ''ఏందయ్యా మార్క్రమ్.. కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ మాలిక్ విషయం తెలియదంటావా.. జట్టులో ఏం జరుగుతుంది'' అంటూ కామెంట్ చేశారు. అయితే ఇటీవలే ఎస్ఆర్హెచ్ కోచ్ బ్రియాన్ లారా బర్త్‌డే వేడుకల్లోనూ ఉమ్రన్ మాలిక్ ఎక్కడా కనిపించలేదు. దీంతో కచ్చితంగా ఉమ్రాన్ విషయంలో ఏదో జరిగిందంటూ అభిమానులు పేర్కొన్నారు. Working with @DaleSteyn62 😎 IPL journey with @SunRisers 🧡 Message for young fans 🤗 His answers are as quick & rapid as his spells 🔥 Presenting 𝙁𝙖𝙨𝙩 𝙏𝙖𝙠𝙚𝙨 with @umran_malik_01⚡️⚡️ - By @ameyatilak #TATAIPL | #SRHvRCB pic.twitter.com/qAUSpHuMLD — IndianPremierLeague (@IPL) May 18, 2023 How does Markram not know what's up with Umran Malik behind the scenes? Been a weird season, with weird vibes from SRH. — Nikhil 🏏 (@CricCrazyNIKS) May 18, 2023 SRH is out of IPL 2023 but still they are not giving chances to Umran Malik 🤦♂️ SRH management surely doesn't believe in team building for the future and this explains their bad performance for last 3 seasons. pic.twitter.com/Zv9sZ70BAu — Utsav 💔 (@utsav045) May 18, 2023 చదవండి: క్లాసెన్ విధ్వంసం.. సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున రెండో శతకం -
చుక్కలు చూపించారు.. ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్ కథ ముగిసింది!
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయ కేతనం ఎగరవేసింది. దీంతో ఢిల్లీ చేతిలో గత ఓటమికి ఎస్ఆర్హెచ్ బదులు తీర్చుకోంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ.. అనంతరం బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఢిల్లీ బ్యాటర్లు మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్ చుక్కలు చూపించారు. ఢిల్లీ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన మాలిక్.. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. మార్ష్ రెండు సిక్స్‌లు బాదగా.. సాల్ట్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే దెబ్బకు ఉమ్రాన్‌కు మరో ఓవర్ ఇచ్చే సహాసం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ చేయలేదు. కేవలం ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్ కథ ముగిసింది. అతడి బౌలింగ్ కోటాను అభిషేక్ శర్మతో మార్క్రమ్ పూర్తి చేశాడు. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్ Firebolts from Heiny 🔥😍pic.twitter.com/Y7rNqJtqHM — SunRisers Hyderabad (@SunRisers) April 29, 2023 -
ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్లో తమను ఓడించడం అంత సులువు కాదని సీఎస్కే మరోసారి నిరూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ సీఎస్కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. డెవన్ కాన్వే 77 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు., ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనిని ఎస్ఆర్హెచ్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్దగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంతసేపే ధోని అవతలి జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసిదంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. గతంలోనూ ధోని ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం చూశాం. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ధోని సలహాలతోనైనా ఎస్ఆర్హెచ్లో మార్పు వస్తుందేమో.. కనీసం ఇప్పటికైనా ఆటగాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందేమో చూడాలి.'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన ఎస్ఆర్హెచ్కు ఇది హ్యాట్రిక్ పరాజయం. MS Dhoni having a discussion with Umran Malik and all other youngsters listening carefully. What a lovely picture! pic.twitter.com/hFZA4RtX2s — Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2023 చదవండి: Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
చెన్నైతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సీఎస్కే రూపంలో మరో గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 21) పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే గత మ్యాచ్‌లో తప్పిదాలను రిపీట్ చేయకుండా.. సీఎస్కే గట్టి పోటీ ఇవ్వాలని మార్క్రమ్ సేన భావిస్తోంది. ఇక చెన్నైతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన స్టార్ పేసర్ టి నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో నటరాజన్ ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అయితే నటరాజన్ ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో నటరాజన్‌ను కాదని ఉమ్రాన్ వైపే ఎస్ఆర్హెచ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చివరగా ఆర్సీబీ మీద గెలిచి మంచి జోష్ మీద ఉన్న సీఎస్కేను ఆరెంజ్ ఆర్మీ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జానెసన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. Aiden Markram is all of us after checking the Chennai weather 🥵🌡️ pic.twitter.com/qUUgEhPdZL — SunRisers Hyderabad (@SunRisers) April 19, 2023 -
నితీష్ రాణా దెబ్బకు ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు
-
కోల్‌కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ నితీష్ రాణా మాత్ర తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరినీ అకట్టుకున్నాడు. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు,సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు చూపించాడు. 6 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రాణా వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. అందులో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఓవర్ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రాణా.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. అద్భుతంగా ఆడిన రాణా 17 ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా Nitish Rana - Knight in shining armor 💪#IPL2023 #TATAIPL #KKRvSRH | @KKRiders @NitishRana_27 pic.twitter.com/6VSKV3Y9Bc — JioCinema (@JioCinema) April 14, 2023 -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్‌ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్‌కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్‌లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్‌కు గత రెండు మ్యాచ్‌లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్‌లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్‌తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్‌నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో సైతం కోల్‌కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్‌రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్‌లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్‌తో చివరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్‌రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్‌బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్‌కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాను నిలువరించడం సన్‌రైజర్స్‌కు సాధ్యమవుతుంది. కేకేఆర్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. రాజస్తాన్ బౌలర్ చహల్ నాలుగు వికెట్లతో ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడు. ఇక బుధవారం రాజస్తాన్ పంజాబ్ కింగ్స్‌తో తర్వతి మ్యాచ్ ఆడనుంది. కాగా పంజాబ్‌కు వెళ్లే సమయంలో విమానంలో చహల్‌ను రాజస్తాన్ ప్రెజంటేటర్ ఫన్నీ ఇంటర్య్వూ చేశాడు. చహల్.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశావు.. ఉమ్రాన్ బాయ్ ఢిపెన్స్ చేయకపోయుంటే నీకు ఐదో వికెట్ లభించేది.. ఇప్పుడు నువ్వు ఉమ్రాన్‌కు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని అడిగాడు. ''చెప్పడానికి ఏం లేదు.. నేను ఉమ్రాన్‌ను కలిసినప్పుడు నాకు బాగా గుర్తు అతను నా బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొడుతా అని చెప్పాడు.. కానీ ఉమ్రాన్ మాట తప్పాడు.. ఇది చాలా బ్యాడ్‌గా అనిపించింది. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గంటకు 145 కిమీ వేగంతో బంతులేసిన ఉమ్రాన్ మాలిక్.. దేవదత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన బంతి మాత్రం 150 కిమీ స్పీడుతో వచ్చినట్లు తెలుస్తోంది. 🎥Lesson learnt: You cannot escape Taran 😂😂 pic.twitter.com/5XW5CCXqno — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 చదవండి: చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం