Warm up match
-
‘సాధన’ సరిపోయింది.. వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
న్యూయార్క్: బ్యాటింగ్‌లో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో దూకుడుగా ఆడారు...సూర్యకుమార్, రోహిత్ శర్మ కూడా కీలక పరుగులు సాధించారు. దూబే, సామ్సన్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు...బౌలింగ్‌లో కూడా ప్రధాన బౌలర్లంతా బరిలోకి దిగి ఆకట్టుకున్నారు...ఓవరాల్‌గా టి20 వరల్డ్ కప్‌లో ప్రధాన టోర్నీకి ముందు ఏకైక వామప్ మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీని ద్వారా టీమ్ తుది జట్టుపై ఒక అంచనా కూడా వచ్చింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆడలేదు. యశస్వికి మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రధాన జట్టులో అతను ఉండే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో పాటు రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగవచ్చు. ఇక్కడ విఫలమైనా...టాపార్డర్‌లో సామ్సన్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తుండగా, దూబే బౌలింగ్ చేయడాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా జట్టుకు మంచి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నట్లే. మరో వైపు కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్ మాత్రం వరల్డ్ కప్ స్థాయికి తగినట్లుగా కనిపించలేదు. అవుట్‌ఫీల్డ్ బంతి పడ్డ ప్రతి చోటా దుమ్ము రేగడం చూస్తే ఈ స్టేడియంను సిద్ధం చేయడంలో ఐసీసీ తొందరపడినట్లు అనిపించింది. ఇదే వేదికపై భారత్ లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మ్యాచ్ ఫలితంతో సంతృప్తి చెందినట్లు, తాము అనుకున్న రీతిలో ప్రాక్టీస్ లభించినట్లు విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగిన వామప్ పోరులో భారత్ 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (32 బంతుల్లో 53 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించగా, రోహిత్ శర్మ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... శివమ్ దూబే (14), సంజు సామ్సన్ (1) విఫలమయ్యారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. మహ్మదుల్లా (28 బంతుల్లో 40 రిటైర్డ్ అవుట్; 4 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (34 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ సింగ్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టగా...అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. -
Ind vs Ban: దుమ్ములేపిన పంత్.. దంచికొట్టిన హార్దిక్ పాండ్యా
టీమిండియా తరఫున ‘రీ ఎంట్రీ’లో రిషభ్ పంత్ దుమ్ములేపాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్లూ జెర్సీ ధరించిన పంత్ పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపాడు. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు. అర్ధ శతకంతో మెరిసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.కాగా న్యూయార్క్ వేదికగా నసావూ కౌంటీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడు.రోహిత్ 19 బంతుల్లో 23 పరుగులు చేసి నిష్క్రమించగా.. సంజూ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్ పంత్ 53 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక శివం దూబే మాత్రం 16 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం 23 బంతుల్లో 40 పరుగులతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా(4)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం ఒక్కో వికెట్ పడగొట్టారు. -
T20 WC: బంగ్లాతో మ్యాచ్.. కోహ్లి లేకుండానే! ఓపెనర్‌గా సంజూ విఫలం
టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య శనివారం నాటి వార్మప్ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదికైంది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.విరాట్ కోహ్లి మినహా మిగిలిన పద్నాలుగు మంది ఆటగాళ్లు బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో భాగమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు.అయితే, రెండో ఓవర్లోనే అవుటై పూర్తిగా నిరాశపరిచాడు. బంగ్లాదేశ్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న సంజూ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఇక వన్‌డౌన్‌లో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 33 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 19, పంత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పదమూడు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ నజ్ముల్ షాంటో వెల్లడించాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం. -
Ind vs Ban: ఇలాంటి పిచ్‌లకు అలవాటు పడాలి: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 ఫీవర్ తారస్థాయికి చేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 1(యూఎస్ కాలమానం ప్రకారం)న మొదలుకానుంది. ఆతిథ్య అమెరికా- కెనడా మధ్య డలాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది.కాగా వరల్డ్‌కప్ లీగ్ దశలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, అంతకంటే ముందు ఇక్కడ రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ ఇక్కడ ఆడలేదు కాబట్టి ముందుగా మేం పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.జూన్ 5న ఇక్కడ తొలి మ్యాచ్ ఆడే సమయానికి ఏదీ కొత్తగా అనిపించకుండా ఉండటం ముఖ్యం. డ్రాప్ ఇన్ పిచ్‌కు అలవాటు పడటం కూడా కీలకం. ఒక్కసారి లయ అందుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. కొత్త వేదిక చాలా బాగుంది. మైదానమంతా ఓపెన్‌గా ఉండటంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.న్యూయార్క్ వాసులు ఇక్కడ తొలిసారి జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల తరహాలోనే మేం కూడా మ్యాచ్‌ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. టోర్నీ బాగా జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ఇక అసలైన పోరు మొదలుకావడానికి ముందు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ కోసం కూడా అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవీ:టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్సమయం: భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంవేదిక: నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్ప్రత్యక్ష ప్రసారం: టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.జట్లుటీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుT20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 -
పసికూనలపై ప్రతాపం.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సునాయాస విజయాలు
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లు పసికూనలపై ప్రతాపం చూపుతున్నాయి. శ్రీలంకపై నెదర్లాండ్స్ విజయం మినహా ఇప్పటివరకు జరిగిన అన్ని వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లే విజయం సాధించాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫ్లోరిడా, ట్రినిడాడ్ వేదికలుగా నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమకంటే చిన్న జట్లైన ఐర్లాండ్, స్కాట్లాండ్లపై విజయాలు సాధించాయి.ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో గెలుపొందగా.. స్కాట్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.శ్రీలంక-ఐర్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ.. ప్రతి ఒక్క ఆటగాడు తలో చేయి వేశారు. ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. దసున్ షనక (3.2-0-23-4) ఐర్లాండ్ పతనాన్ని శాశించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘనిస్తాన్-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ నైబ్ (69), అజ్మతుల్లా (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్టఫర్ సోల్ (4-0-35-3), బ్రైడన్ కార్స్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ బౌలర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 56 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. ముజీబ్, కరీం జనత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వాట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌తో బంగ్లాదేశ్ 'ఢీ'వార్మప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (జూన్ 1) చివరి మ్యాచ్ జరుగనుంది. న్యూయార్క్‌లో ఇవాళ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఇవాల్టి నుంచే వరల్డ్‌కప్ రెగ్యులర్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి మొదలవుతాయి. -
T20 World Cup 2024: రేపు (జూన్ 1) బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా రేపు (జూన్ 1) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వార్మప్ మ్యాచే అయినప్పటికీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరుగబోతున్న తొలి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇదే మైదానంలో టీమిండియా జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదితో ఆడబోయే మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. భారతకాలమానం ప్రకారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం లేనప్పటికీ.. ఆన్లైన్లో స్కోర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. టీమిండియా తరఫున కోహ్లి మినహా మిగతా జట్టంతా అందుబాటులో ఉంది. కోహ్లి నిన్ననే ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరాడు. ప్రయాణ బడలికల కారణంగా రేపటి మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ.కాగా, ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్‌లు సైతం రేపటి నుంచే ప్రారంభంకానున్నాయి. ఆతిథ్య యూఎస్ఏ-కెనడా మధ్య మ్యాచ్‌తో పోట్టి ప్రపంచకప్ 2024 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. డల్లాస్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ వేదికపై ఇదివరకు పలు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరిగాయి. యూఎస్ఏ-కెనడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. డల్లాస్‌లో జరగాల్సిన గత మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరుబోయే మ్యాచ్‌తో మొదలవుతుంది. జూన్ 9న టీమిండియా.. దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్.. పాక్, ఐర్లాండ్‌లతో పాటు యూఎస్ఏ, కెనడా జట్లతో తలపడుతుంది. -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్‌వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్‌లో సెసె బౌ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. -
T20 World Cup 2024: లంకేయులకు షాక్.. పసికూన చేతిలో పరాభవం
శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్‌తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్ తుషార, దునిత్ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హసరంగ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్ షనక (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్ క్లెయిన్ 2, లొగాన్ వాన్ బీక్ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను మే 30న ఆడనుంది. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్‌లో లంకేయులు ఐర్లాండ్‌తో తలపడతారు. ప్రపంచకప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు గ్రూప్-డిలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనుంది. -
T20 World Cup 2024: ఫీల్డర్‌గా మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్‌లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్‌వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్, వార్నర్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్‌వుడ్‌తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లు షురూ
టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లు నిన్నటి (మే 27) నుంచి ప్రారంభమయ్యాయి. పసికూనల మధ్య పోటీలతో మహాసంగ్రామం రిహార్సల్స్ మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో కెనడా-నేపాల్.. రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియా-ఒమన్.. మూడో పోటీలో ఉగాండ-నమీబియా జట్లు తలపడ్డాయి.నేపాల్‌కు షాకిచ్చిన కెనడానేపాల్తో జరిగిన మ్యాచ్‌లో కెనడా 63 పరుగుల తేడాతో గెలుపొందింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నికోలస్ కిర్టన్ (52), రవీందర్‌పాల్ సింగ్ (41 నాటౌట్) రాణించారు. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. డిల్లన్ హెలిగర్ (4/20) ధాటికి 19.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మల్లా (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.పపువా న్యూ గినియాపై విజయం సాధించిన ఒమన్పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గినియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఒమన్ మరో 5 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జీషన్ మక్సూద్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (45) ఆడి ఒమన్‌ను గెలిపించాడు.ఉగాండను చిత్తు చేసిన నమీబియానిన్న జరిగిన మూడో వార్మప్ మ్యాచ్‌లో ఉగాండను నమీబియా 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా..నమీబియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నికోలాస్ డేవిన్ మెరుపు అర్దసెంచరీ (54) చేసి నమిబీయాను గెలిపించాడు.ఇవాళ (మే 28) జరుగబోయే వార్మప్ మ్యాచ్‌ల వివరాలు..శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- ఫ్లోరిడా వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.బంగ్లాదేశ్ వర్సెస్ యూఎస్ఏ- డల్లాస్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మే 29 తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలవుతుంది.టీమిండియా తమ తొలి వార్మప్ మ్యాచ్‌ను జూన్ 1న ఆడుతుంది. న్యూయార్క్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. -
జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్‌లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్‌లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. -
ఆసీస్‌దే విజయం.. వరుసగా రెండో మ్యాచ్‌లో పాక్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన వేదికపై పాకిస్తాన్ తమ రెండు ‘వామప్’ మ్యాచ్‌లనూ కోల్పోయింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గత శుక్రవారం కివీస్ చేతిలో ఓడిన పాక్ మంగళవారం ఆసీస్ చేతిలోనూ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లకూ మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. తొలి ‘వామప్’లాగే ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (71 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇన్‌గ్లిస్ (48), వార్నర్ (48), లబుషేన్ (40), మిచెల్ మార్ష్ (31) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం పాకిస్తాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 90 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్ (85 బంతుల్లో 83; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొహమ్మద్ నవాజ్ (42 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. పాక్ ఇన్నింగ్స్ చాలా చాలా ముందుగా ముగిసేదే కానీ ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్లకు కూడా ‘వామప్’ అవకాశం కల్పించింది. లబుషేన్, స్మిత్, వార్నర్ కలిపి 14.4 ఓవర్లు వేసి ఏకంగా 159 పరుగులిచ్చారు. పాక్ తమ తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌లోనే శుక్రవారం నెదర్లాండ్స్‌తో, ఆ్రస్టేలియా తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం భారత్‌తో చెన్నైలో ఆడుతుంది. చదవండి: Sanju Samson: ‘టీమిండియా’తో సంజూ శాంసన్.. కొంచెం బాధగా ఉంది... కానీ పర్లేదు! -
AUS vs PAK: ఉప్పల్ స్టేడియంలో ఆసీస్ , పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
Pak Vs Aus: మాకిది అలవాటే! పాక్‌పై ధావన్ సెటైర్లు.. వీడియో వైరల్
ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్- ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో బాబర్ ఆజం బృందం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సన్నాహక మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (77), కామెరాన్ గ్రీన్(50- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు. మిస్‌ఫీల్డింగ్.. వీడియో వైరల్ ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు మహ్మద్ వాసిం జూనియర్, మహ్మద్ నవాజ్ సమన్వయలోపంతో ఎక్స్ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది. పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్‌స్టోరీ ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్‌స్టోరీ’’ అంటూ ధావన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. గబ్బర్ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్ టీమ్‌కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్‌ఫీల్డింగ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత జట్టులో శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్ ఓపెనర్ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే! Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM — Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023 -
పాక్ బౌలింగ్‌ను తుత్తినియలు చేసిన ఆసీస్ బ్యాటర్లు.. భారీ స్కోర్ నమోదు
వరల్డ్‌కప్‌కు ముందు ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ బౌలర్లను ప్రత్యర్ధి బ్యాటర్లు చీల్చిచెండాడారు. ప్రపంచ శ్రేణి బౌలర్లమని విర్రవీగే పాక్ బౌలింగ్‌ను ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్దులు తుత్తినియలు చేశారు. తొలి వార్మప్ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు పాక్ బౌలర్లను ఓ రేంజ్లో ఆటాడుకుని నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేయగా.. ఇవాళ జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి, నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు పిండుకున్నారు. ఆసీస్ బ్యాటర్లు ప్రధానంగా పాక్ పేస్ గన్ హరీస్ రౌఫ్‌ను టార్గెట్ చేసి 9 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు రాబట్టారు. ఆసీస్ బ్యాటర్ల ధాటికి రౌఫ్‌తో పాటు మొహమ్మద్ వసీం జూనియర్ (8-0-63-1), షాదాబ్ ఖాన్ (10-0-69-1) బలయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (6-1-25-0), హసన్ అలీ (6-0-23-0), మొహమ్మద్ నవాజ్ (6-0-34-1) పర్వాలేదనిపించగా.. ఉసామా మిర్ 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు సమర్పించుకన్నాడు. ఇరగదీసిన ఆసీస్ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లంతా మెరుపు ఇన్నింగ్స్‌లతో ఇరగదీశారు. ఆరంభంలో డేవిడ్ వార్నర్ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లబూషేన్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (71 బంతుల్లో 77; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కెమరూన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), జోష్ ఇంగ్లిస్ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఫలితంగా ఆసీస్ భారీ స్కోర్ చేసింది. -
World Cup 2023: టీమిండియా అభిమానులకు నిరాశ
టీమిండియా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు ఆడాల్సిన రెండు వార్మప్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ టాస్ అనంతరం రద్దు కాగా.. ఇవాళ (అక్టోబర్ 3) తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా తిరువనంతపురంలో జరగాల్సిన నాలుగు గేమ్స్‌లో మూడు వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసాయి. ఈ వేదికపై నిన్న జరిగిన న్యూజిలాండ్-సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక్కటే ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మరోవైపు ఇవాళ జరగాల్సిన మిగతా రెండు వార్మప్ మ్యాచ్‌లు సజావుగా సాగుతున్నాయి. గౌహతి వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఇరగీస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగా.. పాక్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 37 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 59 బంతుల్లోనే శతక్కొట్టిన కుశాల్.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్ కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ తగ్గకుండా ఆడాడు. 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. సమరవిక్రమ (32), అసలంక క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, అబ్దుల్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు. బ్యాట్ ఝులిపిస్తున్న మ్యాక్సీ.. పాక్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మ్యాక్సీ 55 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు గ్రీన్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన శ్రీలంక ప్లేయర్
వరల్డ్‌కప్ వార్మప్ గేమ్స్ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందిస్తున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఖంగుతిన్న శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇరగదీస్తుంది. ఈ మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు మోస్తున్న కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ ఏమాత్రం తగ్గకుండా చెలరేగిపోతుండటంతో శ్రీలంక భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 25 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 197/2గా ఉంది. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (76 బంతుల్లో 135; 18 ఫోర్లు, 7 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (23 బంతుల్లో 12; ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ఇవాళ ఈ మ్యాచ్‌తో పాటు మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. తిరువనంతపురంలో జరగాల్సిన భారత్-నెదార్లండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 31 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్ (20), గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్
వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ టీమ్ అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వరుసగా రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి తమతో జాగ్రత అనే సందేశాన్ని పంపింది. వరుసగా రెండు పర్యాయాలు దెబ్బతిన్నాం.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ ఆశావాధులకు హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 346 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఊదేసిన కివీస్ బ్యాటర్లు ప్రత్యర్ధి జట్లకు దడ పుట్టిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 2) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయిన కివీస్ బ్యాటర్లు ప్రత్యర్ధి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ కివీస్ 321 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు ఇంత అలవోకగా పరుగులు చేస్తుంటే భారత్ సహా అన్ని జట్లు కలవరపడుతున్నాయి. ఈసారి కివీస్ నుంచి ముప్పుతప్పేలా లేదని నిర్ధారణకు వచ్చాయి. కివీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు అన్ని జట్లు అస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేన్ మామపై అన్ని జట్లు ప్రత్యేక నిఘా పెట్టాయి. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో కివీస్‌కు మొదటినుంచి పటిష్టంగా ఉంది. ఆ జట్టులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అవి బ్యాటింగ్‌లోనే. ఇప్పుడు అదే బ్యాటింగ్‌లో కివీస్ ఇరగదీస్తుంటే ప్రత్యర్ధి జట్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. భీకర ఫామ్‌లో ఉన్న బౌల్ట్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లతో కివీస్ పేస్ విభాగం బలంగా ఉంది. మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, రచిన్ రవీంద్రతో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇక వీరి ఫీల్డింగ్ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్ క్లాస్ ఫీల్డర్లంతా ఈ జట్టులోనే ఉన్నారు. అన్ని విభాగాల్లో ఇంత పటిష్టంగా ఉన్న ఈ జట్టును ప్రపంచకప్‌లో అన్ని జట్లు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. కాన్వే (78), టామ్ లాథమ్ (52) అర్ధసెంచరీలతో రాణించగా... విలియమ్సన్ (37), గ్లెన్ ఫిలిప్స్ (43), డారిల్ మిచెల్ (25), మార్క్ చాప్మన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. రీజా హెండ్రిక్స్ తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. -
WC 2023: కేరళలో టీమిండియా.. ముంబైకి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే!
ICC World Cup 2023- India vs Netherlands Warm Up Match: వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కేరళకు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్నాహక మ్యాచ్ ఆడేందుకు తిరువనంతరపురంలో అడుగుపెట్టింది. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం భారత జట్టుతో లేకపోవడం గమనార్హం. గువాహటిలో తొలి వార్మప్ మ్యాచ్ వర్షార్పణమైన అనంతరం అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లంతా ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరారు. పర్సనల్ ఎమర్జెన్సీ కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి ముంబైకి వెళ్లినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ధ్రువీకరించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. అయితే, సోమవారం నాటికి అతడు తిరిగి జట్టుతో చేరతాడని వెల్లడించింది. భార్య అనుష్కను చూడటానికే.. విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మను కలిసేందుకే గువాహటి నుంచి నేరుగా ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సెలబ్రిటీ జంట త్వరలోనే తమ రెండో సంతానానికి జన్మనివ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హఠాత్తుగా ఇలా కోహ్లి ఇంటికి వెళ్లడం చూస్తుంటే విరుష్క శుభవార్త చెప్పడం ఖాయమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి 2017లో ఆమెను పెళ్లాడాడు. డచ్ జట్టుతో మ్యాచ్ కూడానా? ఈ జంటకు 2021 , జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మరోసారి అనుష్క గర్భం దాల్చిందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. ఇక తిరునవంతరపురంలోనూ ఇదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..! #WATCH | Thiruvananthapuram: Indian Cricket team arrive at Trivandrum Domestic Airport ahead of the World Cup scheduled to be held between October 5 to November 19. pic.twitter.com/LH1Ra5FhpW — ANI (@ANI) October 1, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
World Cup 2023: పాక్‌తో మ్యాచ్.. రీఎంట్రీలో సత్తా చాటిన కేన్ మామ
ఐపీఎల్ 2023 సందర్భంగా గాయపడి, ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీలో సత్తా చాటాడు. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కేన్ మామ అదిరిపోయే అర్ధసెంచరీతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. ఫలితంగా పాక్ నిర్ధేశించిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా న్యూజిలాండ్ ముందుకు సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రచిన్ 66 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (కాన్వే (0)) ఏమాత్రం తడబడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 21 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 159/1గా ఉంది. రచిన్‌కు జతగా డారిల్ మిచెల్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. -
World Cup 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. పాక్ భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ ఓవర్లో పాక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ కోల్పోయింది. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
World Cup 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్
పాక్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. వరల్డ్‌కప్ 2023 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. రిజ్వాన్‌తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా రాణించాడు. బాబర్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్‌లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 257/4గా ఉంది. సౌద్ షకీల్ (36), అఘా సల్మాన్ (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది.