West Indies vs india
-
'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ 39, సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపే ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత పాండ్యా(19 పరుగులు) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లు ఉన్నప్పటికి రాణించడంలో విఫలమయ్యారు. ఇక భారత ఇన్నింగ్స్ చివర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యజ్వేంద్ర చహల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. వాస్తవానికి 10వ నెంబర్లో ముకేశ్ కుమార్.. చహల్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. కుల్దీప్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో టీమిండియా విజయానికి ఐదు బంతుల్లో 10 పరుగులు కావాలి. ముకేశ్ పొడగరి కాబట్టి విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని పదో నెంబర్లో బ్యాటింగ్‌కు పంపాలని భావించింది. కానీ సమన్వయ లోపంతో చహల్ అప్పటికే 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేశాడు. క్రీజులోకి వచ్చేసిన చహల్ స్ట్రైకింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి చహల్‌ను వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. దీంతో చహల్ మళ్లీ పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్దమయ్యాడు. కానీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఒక బ్యాటర్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయం పాండ్యా, ద్రవిడ్‌లకు లేటుగా తెలియడంతో ఏం చేయలేకపోయారు. కెప్టెన్ పిలుపుతో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చిన చహల్‌ను అంపైర్ వెనక్కి పిలవడంతో మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో ముకేశ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి చహల్ చర్య మనకు నవ్వు తెప్పిస్తే.. మేనేజ్మెంట్ను మాత్రం గందరగోళానికి గురి చేసింది. ఇక చివరి ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్‌ను విండీస్‌కు అప్పగించింది. Yuzvendra Chahal walked out at No.10, but the Indian team wanted Mukesh Kumar. Chahal walked off and entered again as he took the field already#Yuzvendrachahal😂😂#INDvWI pic.twitter.com/8rWxh30ahh — Md Nayab 786 🇮🇳 (@mdNayabsk45) August 3, 2023 చదవండి: ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా! -
ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనికి తోడు సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్ రనౌట్ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్ కవర్స్ దిశగా ఆడాడు. అక్షర్ పటేల్ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్ మేయర్స్ నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్ రనౌట్‌ను ఎంఎస్ ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ధోని రనౌట్ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో షాట్ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్‌తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్ గప్టిల్ అద్బుతమైన డైరెక్ట్ హిట్‌కు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ధోని రనౌట్ కావడంతో అభిమానులు గుండె బరువెక్కిపోయింది. ఈ మ్యాచే ధోనికి అంతర్జాతీయంగా ఆఖరి మ్యాచ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా సంజూ శాంసన్ రనౌట్‌ను ధోని రనౌట్‌తో పోల్చడంతో అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసినట్లేనా''.. మీ లాజిక్‌లు తగలయ్యా.. బోలెడు కెరీర్ ఉన్న శాంసన్ ఔట్‌ను ధోని రనౌట్‌తో పోల్చకండి.. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/cAl95iDMV7 — No-No-Crix (@Hanji_CricDekho) August 3, 2023 WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 చదవండి: Deodhar Trophy: రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్ -
స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన తిలక్ వర్మ
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టి20లో తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. అయితే బంతి చాలాసేపు గాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ 10 నుంచి 15 మీటర్ల దూరం ఎడమవైపుగా పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్లోనే వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిది. నికోలస్ పూరన్ 7, రోవ్‌మెన్ పావెల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఇటీవలే మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) ఫైనల్లో సెంచరీతో మెరిసిన పూరన్ వచ్చీ రాగానే సిక్సర్ల వర్షం కురిపించాడు. Tilak Varma, A flying debut 🔥 What a catch...!!!pic.twitter.com/ZPmSrJ9mTd — Johns. (@CricCrazyJohns) August 3, 2023 చదవండి: 'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్ కిషన్ అదిరిపోయే రిప్లై -
'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్ కిషన్ అదిరిపోయే రిప్లై
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో అర్థసెంచరీలు బాదిన ఇషాన్ అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు వన్డేలు కలిపి 184 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. ఇషాన్ కిషన్ కీపింగ్‌ను ఎంఎస్ ధోనితో పోల్చాడు. "స్టంపింగ్, రనౌట్ లను రివ్యూ చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకైతే అతని పాదం గ్రౌండ్ పైనే ఉంది. ఇషాన్ నువ్వు కూడా రాంచీ నుంచే వచ్చి ఉండొచ్చు కానీ.. నీ పేరు ఎమ్మెస్ ధోనీ కాదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆ వెంటనే స్పందించిన ఇషాన్.. హా, ఫిర్ ఠీక్ హై (హా సరే అయితే) అని అనడం'' స్టంప్ మైక్ లో వినిపించింది. అది విని పక్కనే ఉన్న మరో ఇద్దరు కామెంటేటర్లు నవ్వారు. ఆకాశ్ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత "ఇషాన్ ఆన్సర్ కూడా ఇచ్చేశాడు.. హౌ స్వీట్ ఇషాన్. వీ లవ్ యూ" అని ఆకాశ్ అన్నాడు. దానికి కూడా ఇషాన్ స్పందిస్తూ.. హా సరే అయితే అని మళ్లీ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. We love you, Ishan 🤗 @JioCinema #WIvsIND #CricketTwitter pic.twitter.com/UnzHz1pth1 — Aakash Chopra (@cricketaakash) August 1, 2023 చదవండి: Australian Open 2023: క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!, శ్రీకాంత్, ప్రణయ్ కూడా Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు -
వన్డే ర్యాంకింగ్స్.. అదరగొట్టిన ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ 43వ ర్యాంక్, బౌలర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. విధ్వంసక ఓపెనర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్ మూడు వన్డేలు కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే వన్డే సిరీస్‌లో రెండు, మూడు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి, రోహిత్‌లు ఒక్కో స్థానం కోల్పోయారు. ఇంతకుముందు టాప్ 10లో హిట్‌మ్యాన్ 11వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్‌కి పడిపోయారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో గాయంతో వన్డే సిరీస్‌కు దూరమైన మహ్మద్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 886 పాయింట్లతో బాబర్ ఆజం తొలి స్థానంలో ఉండగా.. వాండర్ డుసెన్ 777 పాయింట్లతో రెండు, 755 పాయింట్లతో ఫఖర్ జమాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి శుబ్‌మన్ గిల్ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 705 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. 686 పాయింట్లతో మిచెల్ స్టార్క్, 682 పాయింట్లతో రషీద్ ఖాన్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
హ్యాట్రిక్ అర్థసెంచరీలు.. ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ అర్థసెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 64 బంతుల్లో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో గిల్‌ను ఒక ఎండ్‌లో నిల్చోబెట్టి వేగంగా ఆడిన ఇషాన్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కారియా బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. ద్వైపాక్షిక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ అర్థసెంచరీలు బాదిన ఆరో టీమిండియా క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ కంటే ముందు క్రిష్ణమాచారి శ్రీకాంత్ వర్సెస్ శ్రీలంక(1982), దిలీప్ వెంగ్‌సర్కార్ వర్సెస్ శ్రీలంక(1985), మహ్మద్ అజారుద్దీన్ వర్సెస్ శ్రీలంక(1993), ఎంఎస్ ధోని వర్సెస్ ఆస్ట్రేలియా(2019), శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ న్యూజిలాండ్(2020) ఉన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గిల్ 61, సంజూ శాంసన్ 18 పరుగులతో ఆడుతున్నారు. क्या किशन का यह फ़ॉर्म उन्हें विश्व कप की भारतीय प्लेइंग-XI में शामिल करवा पाएगा?#WIvIND #ishankishan pic.twitter.com/VmrLVqKrR5 — ESPNcricinfo हिंदी (@CricinfoHindi) August 1, 2023 చదవండి: WTC 2023-25: చివరి టెస్టులో విజయం.. ఆసీస్‌తో సమానంగా ఇంగ్లండ్ -
టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్‌ల మధ్య ట్రినిడాడ్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా ప్రయోగాలను కొనసాగించింది. రెండో వన్డేకు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లిలకు జట్టు మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌కు కూడా విశ్రాంతినిచ్చింది. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కీలకమైన మూడో వన్డేలో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియా ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో జైదేవ్ ఉనాద్కట్.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. ఇక విండీస్ మాత్రం సేమ్ జట్టుతోనే బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేల్లో చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్న విండీస్, టీమిండియాల్లో మూడో వన్డే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో వన్డేలో ఓడినా ప్రయోగాలు ఆపని టీమిండియా మూడో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంటుందా అన్నది చూడాలి. భారత్(ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ చదవండి: హెచ్‌సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! -
'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే తొలగించండి'
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో ఓడిపోయి రోహిత్ సేన పరువు పోగొట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకుంటుంది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినివ్వడం ఏంటని తప్పబట్టారు. పనిలో పనిగా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా అభిమానులు ఒక రౌండ్ వేసుకున్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు ఏది కలిసి రావడం లేదని.. ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని పేర్కొన్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అదే ప్రొటిస్ జట్టుకు వన్డే సిరీస్‌ను కూడా అప్పగించింది. అటుపై ఆసియా కప్‌ను నెగ్గడంలో విఫలమైన టీమిండియా టి20 వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లోనే చేతులెత్తేసింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను నెగ్గినా వన్డే సిరీస్‌ను.. ఆ తర్వాత జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ ఫైనల్ 2023)లో ఆసీస్ చేతిలో దారుణ పరాజయం చవిచూసింది. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం ఆసక్తి కలిగించింది. ఈ లెక్కన టీమిండియా ద్రవిడ్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా ఓడిన సిరీస్‌లు ► బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ► సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ► ఆసియా కప్‌లో ఓటమి ► టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి ► స్వదేశంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి ► డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయం దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ద్రవిడ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ద్రవిడ్ పిచ్చి ప్రయోగాలు వల్ల టీమిండియాకు లాభాల కంటే నష్టమే ఎక్కువని ఆరోపణలు చేస్తున్నారు. #SackDravid.. అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ''సచిన్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కోహ్లి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి ఇస్తున్నారు. అనేక సమస్యలు.. ఒకటే పరిష్కారం.. ద్రవిడ్‌ను తొలగించండి'' అని ఓ నెటిజన్ కోరారు. అయితే ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఆసియా కప్, ఆ తర్వాత వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు వెస్టిండీస్ సిరీస్ తమకు ఈ ప్రయోగాలను చేయడానికి చివరి అవకాశంగా ఉపయోగపడిందని వివరించాడు. గాయపడిన ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి రావడం గురించి అనిశ్చితి కారణంగా.. వారిని వారు మ్యాచ్ సిద్ధంగా ఉంచుకోవడానికి బ్యాకప్ ఎంపికలకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని సమర్థించుకోవడం ఆసక్తి రేపింది. declared innings when sachin was batting on 194 now resting kohli in every other series when he's in red hot form many problems , one solution#SackDravid pic.twitter.com/ptfyTCTECb — flick (@onlykohly) July 29, 2023 Now ive become death, the destroyer of Indian Cricket team with my politics.#sackdravid💔 pic.twitter.com/oaNSKfy83q — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨𝐂𝐒𝐊 (@SergioCSKK) July 29, 2023 Rahul Dravid as a coach : - lost odi series against ban - lost test series against sa - lost odi series aginst sa - lost asia cup - lost 2022 T20 wc - lost ODI series against aus - lost WTC final - lost ODI Agaisnt WI who didn't qualify for Wc Dravid Destroyed ICT #SackDravid pic.twitter.com/T6Zx8a6KMk — Laksh Sharma (@im_laksh_18) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: వరల్డ్‌కప్ జరిగేది మన దగ్గర.. విండీస్‌లో కాదుగా; ఈ ప్రయోగాలేంది? Carlos Alcaraz: సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా -
వరల్డ్‌కప్ జరిగేది మన దగ్గర.. విండీస్‌లో కాదుగా; ఈ ప్రయోగాలేంది?
మరో మూడు నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ మొదలుకానుంది. ఒక ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఏ జట్టు ప్రయోగాలు చేయాలనుకోదు. ఎందుకంటే వరల్డ్‌కప్ సమయానికి ఆయా జట్లు తమ బలం, బలహీనతలు ఏంటనేది తెలుసుకోవాలనుకుంటాయి. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఏ జట్టైనా ప్రయోగాలకు పోకుండా ప్రధాన జట్టుతోనే బరిలోకి దిగి సిరీస్‌లు ఆడడం చూస్తుంటాం. కానీ పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో అనవసర ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటుంది. ప్రయోగాలు చేయడం మంచిదే కానీ ఈ సమయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వరల్డ్‌కప్ జరిగేది మన దేశంలో.. విండీస్‌లో కాదు కదా. ఈ ఒక్క లాజిక్‌ను టీమిండియా మేనేజ్మెంట్ ఎలా మరిచిపోయిందన్నది ఆసక్తికరంగా మారింది. విండీస్ చిన్న జట్టే కావొచ్చు.. కానీ ముందున్న మెగా సమరానికి సన్నద్ధమవ్వాలంటే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగడం మంచిది. తొలి వన్డేలో వెస్టిండీస్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయినా.. టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగి విజయాన్ని అందుకుంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్, కోహ్లిలు తమ తమ స్థానాల్లో రాలేదు. లక్ష్యం చిన్నదే కావొచ్చు.. కానీ రోహిత్ ఓపెనర్‌గా.. కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చి బ్యాటింగ్ చేసి ఉంటేనే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనికి తోడు స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళన కలిగించింది. చివరికి మళ్లీ రోహిత్ వచ్చి పనిని పూర్తి చేశాడు. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఎన్ని మ్యాచ్‌లు ఆడితే అంత మంచిది. బ్యాటర్లకు అంతే ప్రాక్టీస్ దొరుకుతుంది. అది వదిలేసి విండీస్‌తో రెండో వన్డేకు ఏకంగా రోహిత్, కోహ్లిని పక్కన కూర్చోబెట్టి పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పజెప్పి పెద్ద తప్పు చేశారు. కోహ్లి, రోహిత్‌లకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కావొచ్చు. ఈ సమయంలో వారికి ఎక్కువ అవకాశాలివ్వాలి. ఎలాగూ వారిద్దరు రిటైర్ అయితే అప్పుడు కొత్త జట్టు తయారు కావాల్సిందే. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడమేంటి? కానీ వరల్డ్‌కప్ ముందు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనిపిస్తుంది. రోహిత్, కోహ్లిలను పక్కనబెట్టి తప్పు చేశారంటే.. మళ్లీ రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేయడం సగటు అభిమానికి నచ్చలేదు. సూర్యకుమార్ తాను రెగ్యులర్‌గా రావాల్సిన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రాకుండా ఆరో స్థానంలో రావడం జట్టును దెబ్బతీసింది. సూర్యకు నాలుగో స్థానం కంఫర్ట్‌గా ఉంటుందని అందరికి తెలుసు. అతన్ని కాదని ఆ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపించి పాండ్యా తప్పు చేశాడనిపించింది. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు.. తీరా అవకాశమిస్తే అతను విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా పాండ్యా కూడా ఫెయిలయ్యాడు. సూర్య స్థానాన్ని మార్చడంతో అతని బ్యాటింగ్ లయ దెబ్బతినే అవకాశముంది. ప్రతీసారి జడేజా ఆడాలంటే కుదరదు. రెండో వన్డే ఓటమితోనైనా టీమిండియా పాఠం నేర్చుకుందని భావిద్దాం. కనీసం మూడో వన్డేలోనైనా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగి.. ఎవరు స్థానాల్లో వారు బ్యాటింగ్‌కు రావడం మంచిది. రెండో వన్డేలో దారుణ బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మూడో వన్డేలో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించాలని కోరుకుందాం. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా మూడు నెలలే మిగిలి ఉండడంతో అనవసర ప్రయోగాల జోలికి పోకుండా సిరీస్‌ను ముగించడం ఉత్తమం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా ఆసియా కప్‌లో ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం నేరుగా వన్డే వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టనుంది. చదవండి: పిచ్చి ప్రయోగాలు ఎందుకు? తల పట్టుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్ Carlos Alcaraz: సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా -
రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. వన్డే, టెస్టులు, టి20లు ఇలా ఏదైనా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సెహ్వాగ్ తర్వాత ఓపెనింగ్‌లో విధ్వంసం సృష్టించగల బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రోహిత్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఓపెనింగ్ చేయకుండా ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్లను ఓపెనింగ్ పంపించారు. ఇక మూడో స్థానంలో రావాల్సిన కోహ్లి కూడా బ్యాటింగ్‌కు రాలేదు. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలమెంత అనేది తెలుసుకోవడంతో పాటు వన్డే స్పెషలిస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఇలా ప్లాన్ చేసినట్లు రోహిత్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఇప్పుడంటే ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తున్న రోహిత్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. చివరిసారి 2011 జనవరిలో సౌతాఫ్రికాతో వన్డేలో ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. కొస మెరుపు ఏంటంటే అదే ఏడాది ఏప్రిల్‌లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. కానీ రోహిత్ ఆ వరల్డ్‌కప్‌కు ఎంపిక కాలేదు. "టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పుడు ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. తాజాగా విండీస్‌తో తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ద్వారా మళ్లీ నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. 2011 నాకు అసలు కలిసి రాలేదు. వరల్డ్ కప్ జట్టులో నేను లేను.దానికి నన్ను నేనే నిందించుకోవాలి. నేను నా ఆటపై దృష్టి సారించాను. యోగా, మెడిటేషన్, ఒంటరిగా ఉండటం నాకు చాలా సాయం చేశాయి. నేను మారాల్సిన అవసరం ఉందని ఒకవేళ నేను మెరుగవ్వకపోతే మళ్లీ క్రికెట్ ఆడలేను అన్న విషయం అర్థమైంది. 2014-15 మధ్య నేను చాలా మారాను. లేదంటే నేను కొనసాగలేనన్న విషయం నాకు అర్థమైంది" అని రోహిత్ అన్నాడు. ఇక తొలి వన్డేలో ఇండియా 5 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 29న(శనివారం) బార్బడోస్ వేదికగా జరగనుంది. చదవండి: Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి -
కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్.. షాక్ తిన్న హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 76వ శతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-0తో చేజక్కించుకుంది. అలా టెస్టు సిరీస్ ముగియగానే వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. గురువారం తొలి వన్డే ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి చేసిన పని నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాధన చేసిన కోహ్లి ఒక బంతికి చక్కటి షాట్ ఆడి తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. 'మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి..?'' అన్నట్లు పాండ్యా చూస్తూంటే.. కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండ్రీ దాటడం పక్కా అన్నట్లు డ్యాన్స్ చేశాడు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు.. తనదైన డ్యాన్సింగ్ స్టెల్లో చేతులు ఊపుతూ విచిత్ర హావభావాలు పలికించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2023 చదవండి: కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్ -
కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్
ఇటీవలే టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న వెస్టిండీస్ వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. ఈ సిరీస్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకున్నా విండీస్ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20 మ్యాచ్ అన్న అనుమానం కలిగింది. విషయంలోకి వెళితే.. గురువారం బార్బడోస్ వేదికగా తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కనీసం పోరాడే ప్రయత్నం చేయని విండీస్ బ్యాటర్లలో షెయ్ హోప్ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. మూడు ఓవర్లలో రెండు మెయిడెన్లు సహా కేవలం ఆరు పరుగలిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, శార్దూల్, ముకేశ్ కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: WI Vs IND 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు
వెస్టిండీస్‌తో మొదలైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ వన్డే సిరీస్‌ని ఉపయోగించుకోనుంది. కాగా తుది జట్టు ఎలా ఉండబోతుందో ముందే అంచనాకు వచ్చినప్పటికి వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్‌వైపే మొగ్గుచూపాడు. ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ ఫిఫ్టీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఇషాన్‌కు అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. రెండో టెస్టులో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేయనుండగా.. ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్లు పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ హార్దిక్ ఉన్నాడు. ఇక స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకోగా జడేజా మరో స్పిన్నర్‌గా ఉన్నాడు. టెస్టు సిరీస్ ఓడినప్పటికి వెస్టిండీస్ వన్డే జట్టు మాత్రం కాస్త సీనియర్లతో నిండిఉంది. ఇటీవలే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో రాణించిన కెప్టెన్ షెయ్ హోప్ సహా కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, డొమినిక్ డ్రేక్స్ , షిమ్రోన్ హెట్‌మైర్, రోవ్‌మెన్ పావెల్‌లు జట్టులో ఉన్నారు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ India vs West Indies, 1st ODI: India Opt To Field vs West Indies, Mukesh Kumar To Debut#INDvsWI #ODIs #BCCI #Cricket #debu pic.twitter.com/pTx9hbPji4 — Smart Locus (@SmartLocusIN) July 27, 2023 చదవండి: కోహ్లి గురించి ప్రశ్న.. విసుగెత్తిపోయిన రోహిత్! ఘాటు రిప్లైతో నోరు మూయించాడు! Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి -
తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు చోటు, ఇషాన్‌కు మొండిచెయ్యేనా!
వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాకు రెండో టెస్టులో విజయం రాకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. మొత్తానికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కోహ్లి సెంచరీతో మెరిసి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. డ్రా అయినప్పటికి కోహ్లితో పాటు రోహిత్, ఇషాన్ కిషన్‌లు మంచి టచ్‌లో కనిపించడం టీమిండియాకు సానుకూలాంశం. టెస్టులు ముగియడంతో తాజాగా టీమిండియా వన్డేలపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారనుంది. వరల్డ్‌కప్‌కు సంబంధించి టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లకు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశముంది. ఇక గురువారం(జూలై 27న) నుంచి విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్న జెర్సీని రివీల్ చేసింది. డ్రీమ్ ఎలెవెన్(Dream 11) స్పాన్సర్‌గా ఉండడంతో జెర్సీ సెంటర్లో డ్రీమ్ 11 లోగో దానికింద ఇండియా అని రాసి ఉంది. కుడి పక్కన బీసీసీఐ లోగో ఉంది. సూర్యకుమార్, యజ్వేంద్ర చహల్, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, జంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, శుబ్‌మన్ గిల్ ఇలా యంగ్ క్రికెటర్లంతా ఒకరి తర్వాత ఒకరు వన్డే జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ బుధవారం ట్విటర్లో షేర్ చేసింది. మీరు ఒక లుక్కేయండి. ఇక వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టులో సీనియర్లకే ఎక్కువ అవకాశముంది. విండీస్‌తో తొలి వన్డేకు తుది జట్టు అంచనాను ఒకసారి పరిశీలిస్తే.. ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్.. వన్‌డౌన్‌లో కోహ్లి, సూర్యకుమార్, సంజూ శాంసన్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో.. హార్దిక్ పాండ్యా, జడేజాలు ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్‌లు ఉండే అవకాశం ఉంది. కాగా వికెట్‌కీపర్‌గా సంజూ శాంసన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. విండీస్‌తో తొలి వన్డే టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ Test Cricket ✅ On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw — BCCI (@BCCI) July 26, 2023 చదవండి: 'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది' Prabath Jayasuriya: లంక బౌలర్ సంచలనం.. బాబర్ ఆజం వీక్నెస్ తెలిసినోడు -
'అమ్మ.. నీ ప్రార్థనలు ఫలించాయి; చల్లగా ఉండు బిడ్డా'
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్‌కుమార్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌కాల్‌లో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. 2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు. No Dream Too Small! 🫡 Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2 — BCCI (@BCCI) July 21, 2023 Mukesh Kumar's maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF — FanCode (@FanCode) July 22, 2023 చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
#Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది మరో బంతిని
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు టీమిండియా ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 86 పరుగులతో ప్రతిఘటిస్తుంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీతో మెరిస్తే.. అశ్విన్, జడేజా, యశస్వి జైశ్వాల్‌లు అర్థసెంచరీలతో రాణించారు. ఇక కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా ఔటైన తీరు సక్రమమే అయినప్పటికి డీఆర్ఎస్లో ఎంత లోపం మరోసారి బయటపడింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 104వ ఓవర్లో కీమర్ రోచ్ వేసిన ఆఖరి బంతిని జడేజా డ్రైవ్షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ జోషువా దసిల్వా చేతిలో పడింది. కీపర్ వెంటనే ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో విండీస్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. కాగా రివ్యూను పరిశీలించిన టీవీ అంపైర్ మైకెల్ గాఫ్ తొలుత అన్ని యాంగిల్స్‌లోనూ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అని చూశారు. కాని బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లింది కానీ తాకిందా లేదా అన్నది క్లారిటీ రాలేదు. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్కు రిక్వెస్ట్ చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ జడేజాను ఔట్ అని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. తొలుత అల్ట్రాఎడ్జ్‌లో జడ్డూ ఔటైన బంతికి బదులుగా.. జడ్డూ ఆడిన మరో బంతిని డిస్ప్లే చేయడం వైరల్‌గా మారింది. అయితే యాదృశ్చికంగా రెండింటిలోనూ జడ్డూ బ్యాట్‌కు బంతి తగిలివెళ్లినట్లుగా స్పైక్ కనిపించింది. ఇక్కడ విండీస్ ఆటగాళ్లను.. అటు థర్డ్ అంపైర్‌ను తప్పుబట్టలేం. ఎందుకంటే జడేజా ఔట్లో ఎలాంటి పొరపాటు లేదు. కేవలం సాంకేతిక లోపంతో జడ్డూ ఔటైన బంతిని కాకుండా తప్పుడు బంతిని చూపించడండలో తప్పు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. DRS scam 2023. Jadeja's wicket was robbed. @ICC @BCCI @imjadeja @imVkohli pic.twitter.com/FAbXKihW0S — Human_Insaan🇮🇳 (@Alishan_53) July 21, 2023 చదవండి: 352 పరుగుల వెనుకంజలో విండీస్.. భారత్ పట్టు బిగిస్తుందా? -
సెంచరీ దిశగా కోహ్లి.. టీమిండియా 288/4
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 84 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కోహ్లి(161 బంతుల్లో 87 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(84 బంతుల్లో 36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు ఇప్పటివరకు 106 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, షానన్ గాబ్రియెల్, జోమెల్ వారికన్, జాసన్ హోల్డర్లు తలా ఒక వికెట్ తీశారు. అదరగొట్టిన ఓపెనింగ్ జోడి.. అంతకముందు భారత ఓపెనింగ్ జోడీ అదరగొట్టింది. కానీ తొలి సెషన్ వరకే ఈ శుభారంభం పరిమితమైంది. సెషన్ మారగానే వెస్టిండీస్ బౌలింగ్ ప్రతాపం మొదలైంది. ‘టాప్’ లేపింది. ఇరు జట్లు చెరిసగం ఆధిపత్యాన్ని పంచుకోవడంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా మొదలైంది. టాస్ నెగ్గిన వెస్టిండీస్ బౌలింగ్‌కే మొగ్గుచూపగా, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఉదయం సెషన్ అంతా వీళ్లిద్దరు ఆడుతూపాడుతూ పరుగులు సాధించారు. చెత్త బంతుల్ని సిక్సర్లుగా మలిచారు. ఈ క్రమంలో ముందుగా ‘హిట్‌మ్యాన్’ రోహిత్ 74 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 21వ ఓవర్లోనే జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే ధాటిగా ఆడుతున్న జైస్వాల్ కూడా 49 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 121/0 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. భోజన విరామం తర్వాత 30 నుంచి 40 ఓవర్ల మధ్యలో... కేవలం 8 ఓవర్ల వ్యవధిలో కీలకమైన టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ముందుగా యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్)కు హోల్డర్ చెక్ పెట్టగా, రోచ్ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌కు శుబ్‌మన్ గిల్ (10; 2 ఫోర్లు) నిష్క్రమించాడు. కోహ్లితో కలిసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మ (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను వారికన్ బోల్తా కొట్టించాడు. అనుభవజ్ఞుడైన రహానే (8) క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 139/0 స్కోరు కాస్తా 182/4గా మారిపోయింది. భారత్ 50.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. గాయపడిన శార్దుల్ ఠాకూర్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. విండీస్ తరఫున కిర్క్ మెకెంజి కెరీర్ మొదలు పెట్టాడు. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత ఆటగాడిగా! -
కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగితే.. జడ్డూ మూడు వికెట్లతో విండీస్ బ్యాటర్ల నడ్డి విరిచారు. అలిక్ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. కాగా మ్యాచ్ సమయంలో కీపర్ ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లిని టీజ్ చేయడం ఆసక్తిగా మారింది. అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఇది జరిగింది. బంతి వేసిన తర్వాత ఇషాన్ కిషన్ కోహ్లిని ఉద్దేశించి.. ''Virat Bhai Thoda Sa Sidha konasi jGH Dhund Li Bhai'' అంటూ పేర్కొన్నాడు. కాగా ఇషాన్ కిషన్ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. Ishan Kishan Stump Mic Recording 😂😂😂🤣🤣🤣#indiavswestindies #IshanKishan #YashasviJaiswal #ViratKohli𓃵 #1STTEST pic.twitter.com/XuVZC8sQKK — THE BSA NEWS (@BsaNewsOfficial) July 12, 2023 చదవండి: #MohammedSiraj: 'సూపర్‌మ్యాన్' సిరాజ్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు -
'సూపర్‌మ్యాన్' సిరాజ్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు
వెస్టిండీస్ తో ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ లో చురుకుగా కనిపించింది. పేసర్ మొహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తూ కుడివైపునకు పరుగెత్తుకుంటూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టేశాడు. విండీస్ ఇన్నింగ్స్ లో 28వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. జడేజా వేసిన ఆ ఓవర్ ఆఖరి బంతికి బ్లాక్ వుడ్.. భారీ షాట్ అడే ప్రయత్నం చేశాడు. అయితే సరిగ్గా టైమ్ అవ్వకపోవడంతో గాల్లోకి లేచిన బంతి మిడాఫ్ కు కుడివైపు దిశలోకి వెళ్లింది. షాట్ ను సరిగ్గా ఆడకపోయినా ఫోర్ వెళ్తుందని అంతా అనుకున్నారు. అయితే మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్.. తన కుడివైపునకు పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. క్యాచ్ అనంతరం మైదానంలో కాసేపు అలానే పడిపోయాడు. అతడి కుడి మోచేతికి గాయం అయినట్లు అంతా అనుకున్నారు. అయితే వెంటనే లేవడంతో గాయం భయాలు తొలిగిపోయాయి. క్యాచ్‌కు సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఈ వీడియో చూసిన అభిమానులు.. రిస్క్ అయినా పర్లేదు స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు.. సూపర్‌మ్యాన్ అవతారంలో సిరాజ్.. వావ్ అనకుండా ఉండలేరు అంటూ కామెంట్ చేశారు. ఇక టీమిండియాతో తొలి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగితే.. జడ్డూ మూడు వికెట్లతో విండీస్ బ్యాటర్ల నడ్డి విరిచారు. అలిక్ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr — FanCode (@FanCode) July 12, 2023 చదవండి: R Ashwin: తండ్రీ కొడుకులిద్దరిని ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా రోహిత్, కోహ్లి కాదు.. విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసింది ఇతడే! -
Ind Vs WI: అశ్విన్ పాంచ్ పటాకా.. ఆకట్టుకున్న జైశ్వాల్, తొలిరోజు టీమిండియాదే
వెస్టిండీస్‌తో మొదలైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట తొలిరోజు విండీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు మొత్తం బ్యాటింగ్ చేసే అవకాశం ఉన్న టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసేపోయేలా కనిపిస్తోంది. అంతకముందు టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండానే విండీస్ బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. జడేజా మూడు వికెట్లు, సిరాజ్, శార్దూల్‌లు చెరొక వికెట్ తీశారు. చదవండి: విండీస్ బ్యాటర్లకు చుక్కలు.. చెలరేగిన అశ్విన్.. కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు -
విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్, టీమిండియా మధ్య ఇవాళ్టి(జూలై 12) నుంచి విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. పేలవ ఫామ్‌తో టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా టీమిండియాలో చోటు కోల్పోయాడు. దేశవాలీ క్రికెట్ సహా ఐపీఎల్లో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది.అయితే అతను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా వస్తాడని కొంతమంది అంటే.. లేదు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నారు. ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ''బ్యాటింగ్ పొజిషన్లో శుబ్‌మన్ గిల్ మూడో నెంబర్లో రానున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడిన గిల్.. తన కెరీర్లో ఎక్కువగా మూడు, నాలుగు స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వచ్చానని.. అందుకే విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది మాకు మంచిదే. ఇక నాతో కలిసి యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. నిజానికి ఓపెనింగ్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. వెస్టిండీస్ గడ్డపై విండీస్‌తో భారత్ 51 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో నెగ్గి, 16 టెస్టుల్లో ఓడింది. 26 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఓవరాల్‌గా రెండు జట్ల మధ్య 98 టెస్టులు జరిగాయి. భారత్ 22 టెస్టుల్లో నెగ్గి, 30 టెస్టుల్లో ఓడింది. 46 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. చదవండి: Asia Cup 2023: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ -
'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!'
దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోపీలో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అతనికి మరోసారి మొండిచేయి ఎదురైంది. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. టెస్టు క్రికెట్లోకి తీసుకునేది రంజీల్లో చేసే ప్రదర్శనతోనే కానీ ఐపీఎల్‌తో కాదు కదా అంటూ చురకలు అంటించాడు. అలాంటప్పుడు పనిగట్టుకొని ప్రతీ ఏడాది రంజీ ట్రోపీ ఆడించడం ఎందుకు.. ఐపీఎల్ ప్రదర్శనతోనే జట్టులోకి ఎంపిక చేస్తామంటే అలానే కానియ్యండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ''సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అదరగొడుతున్నాడు. మూడు సీజన్లలో అతని పర్ఫామెన్స్ రికార్డు లెవెల్లో ఉంది. దాదాపు 100 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి చోటు దక్కడం లేదు. టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని ఎంపిక చేస్తే, రంజీల్లో ఆడుతున్నదానికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇస్తున్నారు. రెడ్ బాల్ క్రికెట్‌కి కూడా ఐపీఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ పెట్టడం ఎందుకు? దాన్ని ఆపేయండి. రంజీల్లో ఏ ప్లేయర్ కూడా ఆడకండి. ఫలితం లేనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీకి అంత ఖర్చు పెట్టి దండగే'' అంటూ కామెంట్ చేశాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ ఖాన్ రంజీ క్రికెట్లో ఇప్పటివరకు 37 మ్యాచులు ఆడి 79.65 సగటుతో 13 సెంచరీలతో 3505 పరుగులు చేశాడు. ఇక 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచుల్లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. అంతకుముందు 2021-22 సీజన్లో 4 సెంచరీలతో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. చదవండి: యార్కర్ల కింగ్ అన్నారు.. ఇప్పుడు జట్టు నుంచి ఏకంగా పక్కన పెట్టేశారు! -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న రాహుల్.. వీడియో వైరల్..!
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తెగ కష్టపడుతున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20సిరీస్‌కు అఖరి నిమిషంలో రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. అనంతరం గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న రాహుల్ తిరిగి విండీస్ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే ఈ సిరీస్‌కు భారత తుది జట్టులో చోటు దక్కాలంటే రాహుల్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఫిట్నెస్ సాధించేందుకు జిమ్‌లో చేస్తున్న వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు,5 టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్ ప్రారభం కానుంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 24- రెండో వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 27- మూడో వన్డే-క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: NZ vs IRE 2nd T20: ఐర్లాండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కైవసం..! View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
'కోహ్లి నుంచి తొలి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల'
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో దీపక్ హుడా భారత జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన అరంగేట్రంపై దీపక్ హుడా స్పందించాడు. విరాట్ కోహ్లి లేదా ఎంస్ ధోని చేతుల మీదగా తొలి వన్డే క్యాప్‌ను పొందాలనేది తన కల అని హుడా వెల్లడించాడు. 'నేను వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ తరుపున అరంగేట్రం చేశాను, అది నాకు అద్భుతమైన అనుభూతి. నా శక్తికి మించి జట్టు కోసం పనిచేస్తాను. మ్యాచ్‌కు ముందు ఇదే విషయం నేను సూర్యకుమార్ యాదవ్‌కి చెప్పాను. భారత తరుపున ఆడాలి అనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎంఎస్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల. ఈ మ్యాచ్‌లో కోహ్లి నుంచి క్యాప్ అందుకోవడం మధుర అనుభూతిని కలిగించింది. నా కల ఇప్పుడు నేరవేరింది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రయాణంలో నన్ను వెనుకుండి నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని దీపక్ హుడా ట్వీట్ చేశారు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 26 పరుగులు చేశాడు. అదే విధంగా రెండో వన్డేలో కూడా 29 పరుగులతో హుడా రాణించాడు. చదవండి: IND vs WI: "అతడు అద్భుతమైన బౌలర్.. ఇప్పటి వరకు ఇలాంటి బౌలింగ్ స్పెల్ చూడలేదు" -
కోహ్లితో సంభాషణ.. ఆటతీరు మొత్తం మారిపోయింది
జమైకా: గతేడాది జూన్ 2020లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా టెస్టు సిరీస్ తర్వాత పర్యటన రద్దైంది. అయితే మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ సిరీస్‌లో మొదటి టెస్టును విండీస్ జట్టు గెలిచి అప్పట్లో సంచలనానికి తెరదీసింది. దీనికి ప్రధాన కారణం.. విండీస్ వైస్ కెప్టెన్ జెర్మైన్ బ్లాక్‌వుడ్. మొదటి టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను బ్లాక్‌వుడ్ తన బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో 154 బంతుల్లో 95 పరుగులు చేసిన బ్లాక్‌వుడ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్ క్రికెటర్లలో దాదాపు అందరూ పొడుగ్గా ఉంటే .. బ్లాక్‌వుడ్ మాత్రం చాలా పొట్టిగా ఉంటాడు. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు గెలిచిన తర్వాత బ్లాక్‌వుడ్‌ను అందరూ పొట్టోడు చాలా గట్టోడు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన బ్లాక్‌వుడ్ మొత్తం రెండు హాఫ్ సెంచరీల సాయంతో 211 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించడంపై ఒక వ్యక్తి కారణమంటూ జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇన్నాళ్ల తర్వాత స్పందించాడు. ఇంతకీ బ్లాక్‌వుడ్‌ను ఇన్స్పైర్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇంగ్లండ్ పర్యటనకు ముందు 2019లో టీమిండియా విండీస్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడింది. అయితే బ్లాక్‌వుడ్ ఒక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లితో కాసేపు మాట్లాడాడు. సుధీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా బంతులను ఎదుర్కోవాలని కోహ్లి సూచించినట్లు బ్లాక్‌వుడ్ తెలిపాడు.చదవండి: బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు? '2019లో టీమిండియా మా దేశంలో పర్యటించినప్పుడు కోహ్లితో మాట్లాడేందుకు ప్రయతించా. అంతకముందు సోషల్ మీడియా వేదికగా కోహ్లితో పలుసార్లు చాట్ చేశాను. జమైకాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాను. ఆట ముగిసిన తర్వాత కోహ్లితో చిన్న సంభాషణ జరిగింది. నేను సెంచరీలు, అర్థసెంచరీలు చేయాలంటే ఎలా ఆడాలో చెప్పాలంటూ కోహ్లిని అడిగాను.. దానికి టెస్టులో సెంచరీ చేయాలంటే ఎన్ని బంతులు ఎదుర్కోవాలో చెప్పగలవా.. అంటూ నన్ను ప్రశ్నించాడు. నేను సుమారు 212 బంతులు ఎదుర్కొంటే సెంచరీ చేసే అవకాశం ఉంటుంది అని సమాధానమిచ్చాను. నువ్వు చెప్పిన జవాబులో అర్థం ఉంది.. అంటే ఎన్ని బంతులు సమర్థంగా ఆడగలిగితే అన్ని సెంచరీలు చేయొచ్చు అని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లితో సంభాషణ తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. టెస్టు మ్యాచ్‌లో ఆడితే కనీసం 200- 300 బంతులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా... దాని ఫలితమే నాకు ఇంగ్లండ్ పర్యటనలో కనిపించింది.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ తరపున బ్లాక్‌వుడ్ ఇప్పటివరకు 33 టెస్టులాడి 1789 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు.. 13 అర్థసెంచరీలు ఉన్నాయి.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి'