Tamil Nadu
-
సంగ్రామానికి సంసిద్ధం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ప్రచార భేరి మోగించాలని కేడర్‌కు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం డీఎంకే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో 7వ సారిగా తమిళనాడు డీఎంకే పాలనను తీసుకొచ్చేందుకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రజా క్షేత్రంలోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను దరిచేర్చే విధంగా, ప్రాజెక్టుల తీరు తెన్నులను సమీక్షించి వేగవంతం చేసే విధంగా సమీక్షలలో ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే డీఎంకేలో సమన్వయ కమిటీని రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా కేడర్, నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రభుత్వ పరంగా ఓ వైపు, పార్టీ పరంగా మరో వైపు కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్నత స్థాయి కమిటీతో బుధవారం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ సమావేశమయ్యారు. పార్టీ సీనియర్లు దురై మురుగన్, టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరు సెల్వం, కనిమొళి, ఉదయనిఽధి స్టాలిన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టడం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సారి 200 స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే తమిళనాడులో తమకు ఆరుసార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలు, 7వ సారి సైతం కట్టబెట్టే విధంగా, వారి మన్ననలు పొందే కార్యక్రమాల మీద దృష్టి పెట్టే విధంగా తీర్మానాలు చేశారు. తీర్మానాలలో కొన్ని .. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతూ, ఇప్పటి నుంచే ప్రచార భేరి మోగించాలని నిర్ణయించారు. జిల్లా, నగర, యూనియన్, పురపాలక స్థాయిలో కార్యక్రమాలను పార్టీ పరంగా విస్తృతం చేయడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను ప్రజలలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రచార భేరి మోగించాలని ఆదేశించారు. వజ్రోత్సవాల వేళ డీఎంకే కార్యక్రమాలు విస్తృతం కావాలని సూచించారు. అంకిత భావంతో సీఎం స్టాలిన్ ప్రజల కోసం చేస్తున్న మంచి పనులు, సంక్షేమాలను వివరించే విధంగా సభలు, సమావేశాలు విస్తృతం కావాలని, ఇంటింటా ప్రభుత్వ ప్రగతి గురించి సమగ్ర సమాచారం చేరవేసే రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులోని ప్రతి డీఎంకే సోదరుడు ఓ సైన్యం అని చాటే విధంగా ప్రచార కార్యక్రమాలలో దూసుకెళ్లాలని తీర్మానించారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకు తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. హిందీని బలవంతంగా రుద్దే విధంగా సాగుతున్న ప్రయత్నాలను ఖండించారు. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించాలని పట్టుబడుతూ తీర్మానం చేశారు. మణిపూర్ మండుతోండటంపై విచారం వ్యక్తం చేస్తూ, ఇప్పటికై నా ప్రధాని నరేంద్ర మోదీ ఆరాష్ట్రంలో పర్యటించాలని , అన్ని వర్గాల ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నువాటాలో రాష్ట్రానికి కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని నినాదిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. ప్రచార భేరి మోగించండి ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు కేంద్రం విధానాలపై ఫైర్ -
‘వేళచ్చేరి’చెరువు పునరుద్ధరణకు రెడీ
● 203 గృహాల కూల్చి వేతకు నిర్ణయం సాక్షి, చైన్నె: వేళచ్చేరి చెరువు పునరుద్ధ్దరణకు అధికారులు రెడీ అయ్యారు. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించిన 203 గృహాలను తొలి విడతగా కూల్చి వేయడానికి చర్యలు చేపట్టారు. వివరాలు.. చైన్నెనగరం పరిధిలోని వేళచ్చేరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటా ఈశాన్య రుతు పవనాల రూపంలో ఈ పరిసరాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ వాహనాలను పరిరక్షించుకునేందుకు వంతెనల మీద పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ పరిసరాలు నీట మునిగేందుకు ప్రధాన కారణం వేళచ్చేరి చెరువు ఆక్రమణలకు గురై, ఆ నీరు నివాస ప్రాంతాలలోకి చొరబడటమే అని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ చెరువు గతంలో 265 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఈ చెరువుకు గిండి, ఆదంబాక్కం, పరిసరాల నుంచి కాలువల ద్వారా నీళ్లు వస్తాయి. అయితే ఈమార్గాలన్నీ అన్యాక్రాంతమయ్యాయి. పెద్దపెద్ద భవనాలు, గృహాలు పుట్టుకొచ్చాయి. దీంతో వర్షం వస్తే చాలు ఇక్కడి ప్రజల గుండెలలో రైళ్లు పరుగెడుతుంటాయి. ఆ మేరకు ఏటా ఇక్కడి ప్రజలు కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో వేళచ్చేరి చెరువును పునరుద్ధరించే పనులపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం 55 ఎకరాలతో ఈ చెరువు ఉంది. పుర్వ వైభవం దిశగా దశల వారీగా ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధ్దరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి విడతగా 25 నుంచి 30 ఎకరాల స్థలంలో ఉన్న 203 గృహాలను కూల్చి వేయడానికి సిద్ధమయ్యారు. ఈ గృహాల యజమానులకు ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా స్థలాలను అందించేందుకు నిర్ణయించారు. అలాగే ఈ చెరువు ఉబరి నీరు ప్రవహించేందుకు 2.14 కి.మీ దూరం ఉన్న కాలువను సైతం విస్తరించే దిశగా ఆక్రమణల దారులపై కొరడా ఝుళిపించే విధంగా అధికారులు దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. వర్షం వస్తే చాలు నీట మునిగి అంబత్తూరు పారిశ్రామిక వాడను రక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా బైపాస్ రోడ్డు మీదుగా కూవం వరకు అతి పెద్ద కాలు వ నిర్మాణానికి నిర్ణయించారు. అంబత్తూరు, పారిశ్రామిక వాడ, కొరట్టూరు పరిసరాలు చిన్న పాటి వర్షానికి వరద ముంపునకు గురవుతున్నాయి. పారిశ్రామిక వాడలో కోట్లలో నష్టం అన్నది తప్పడం లేదు. దీనిని గుర్తెరిగిన ప్రభుత్వం ఇక్కడకు ఆ పరిసరాలలలోని చెరువుల నుంచి వచ్చే వరదల కట్టడి మీద దృష్టి పెట్టారు. ఇందుకోసం రూ. 130 కోట్లతో అంబత్తూరు నుంచి బైపాస్ రోడ్డు వెంబడి భారీ కాలువను తవ్వి కూవం నదిలో కలిపే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అలాగే వేళచ్చేరి సమీపంలోని పళ్లికరణై పరిసరాలు వరద ముంపునకు గురి కాకుండా 18 కిలోమీటర్ల దూరం ముట్టుకాడు వరకు పయనించే బకింగ్ హాం కాలువ మీద సైతం దృష్టి పెట్టారు. సముద్రంలో ఈ కాలువ కలిసే ప్రాంతం నుంచి 2 కి.మీ దూరం 3.81 కోట్లతో పూడిక తీత పునరుద్ధరణ పనులకు నిర్ణయించారు. -
సేలం జైలులో ఖైదీల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం
సేలం: సేలం జైలులో చైన్నె ఖైదీల నుంచి రెండు సెల్ఫోన్లను జైలు వార్డెన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువుల విజిటింగ్ను రద్దు చేశారు. వివరాలు..సేలం సెంట్రల్ జైలులో 1200 మంది ఖైదీలు ఉన్నారు. సేలం జైలులో 17వ బ్లాక్ ప్రాంతంలో చైన్నెకి చెందిన ఖైదీలు ఉన్నారు. ఆ గది వైపు వార్డెన్లు వెళితే, అప్పుడప్పుడు వచ్చి తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఖైదీలు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో వారి వద్ద ఏదైనా వస్తువు అక్రమంగా ఉండవచ్చనే సందేహంతో వార్డెన్లు భావించారు. ఆ మేరకు పథకం వేసి ప్రతి మంగళవారం ఖైదీల అవసరాలను తెలుసుకునే కార్యక్రమం జరపుతున్నట్టు తెలిపి మంగళవారం అకస్మాత్తుగా చైన్నె ఖైదీలు ఉన్న గదికి వెళ్లారు. అక్కడ గదిలో చుట్టు పక్కల గోడలను పరిశీలించారు. అక్కడ గదికి ఎదురుగా ఉన్న రాగి చెట్టు పై ఉన్న రెండు సెల్ఫోన్లను, మరుగుదొడ్డిలో ఉన్న సెల్‌ఫోన్ ఛార్జర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థితిలో సెల్ఫోన్లను అక్రమంగా ఉపయోగించినట్టు చైన్నె వడపళనికి చెందిన యుగేంద్రన్ (26), అరుంబాక్కం సెబాస్టియన్ జయప్రకాశ్ (27), మహాలింగ్ (39) అనే ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువులను కలుసుకోవడానికి నిషేధం విధించారు. -
చైన్నెలో మెథాంఫెటమైన్ అక్రమ రవాణా
● ఎస్ఐ భర్త, కాంగ్రెస్ నాయకుడి సహా ఐదుగురు అరెస్టు అన్నానగర్: చైన్నె నుంచి మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసిన ఎస్ఐ భర్తతో సహా ఐదుగురిని బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పాడి బ్రిడ్జి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నట్లు చైన్నె వెస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక దళానికి చెందిన పోలీసు అధికారి పాడి మెంబలం దగ్గర మారువేషంలో పర్యవేక్షిస్తూ బైకుపై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరిని పట్టుకుని విచారణ చేపట్టారు. అప్పుడు వారు బైకులో మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి పుళల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా కుమారవేల్ అని తేలింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ప్రధాన వ్యక్తి, ప్రణాళికల అమలులో ప్రధాన వ్యక్తి. ఇతను మద్రాసు హైకోర్టులో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న వన్నారపేట పోలీస్‌స్టేషన్ స్పెషల్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ విశాలాక్షి భర్త అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తిరువేర్కాడు ఆర్. ఎస్. పురం ప్రాంతానికి చెందిన సుభాష్, పుళల్ భక్తికి చెందిన గ్యాంగ్ నాయకుడు పార్థిబన్, ఓట్టేరి ప్రాంతానికి చెందిన అమీర్ పాషా, కావాంగరై ప్రాంతానికి చెందిన దీపక్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వృద్ధుల కోసం ఇంటి వద్దకే వైద్యం.. సాక్షి, చైన్నె: వృద్ధుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఇంటి వద్దకే హెల్త్ చెకప్ సేవలకు కావేరి ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. బుధవారం ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక బృందం ద్వారా ఈసీజీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలిసస్, లిపిడ్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్, హెచ్‌బీఏ1సీ తదితర వైద్య పరీక్షలను, ఇంటి వద్దకు వచ్చే వృద్ధులకు చేసే రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ వీఎస్ నటరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో వృద్యాప్య నిపుణులు, ఫిజియోథెరఫిస్ట్, సైకియాట్రిస్ట్, డైట్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ స్పెషలిస్టు, మల్టీ డిసిప్లినరీ బృందం సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, వృద్ధుల జనాభా పెరుగుతుండటాన్ని గుర్తు చేస్తూ, వారి అవసరాలకు అను గుణంగా సంరక్షణ, వైద్య పరంగాసేవల మీద దృష్టి పెట్టామని వివరించారు. -
12 విమానాలు రద్దు
● చైన్నె విమానాశ్రయంలో ప్రయాణికుల ఇక్కట్లు సేలం : చైన్నె విమానాశ్రయంలో ఇటీవల కొన్ని ప్రైవేటు విమాన సంస్థలు నిర్వాహక కారణాలతో విమాన సేవలను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్థితి లో బుధవారం ఒకే రోజు చైన్నె విమానాశ్రయంలో భువనేశ్వర్, కోల్కత్తా, బెంగళూరు, తిరువనంతపురానికి ఏకంగా 12 విమానాలను బుధవారం ఎయిర్ ఇండియా సంస్థ రద్దు చేయడం గమనార్హం. దీంతో కొందరు ప్రయాణికులు అవస్థలు పడుతూ ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు వెళ్లా రు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. ప్రయాణికుని వద్ద జీపీఎస్ మిషన్ స్వాధీనం చైన్నె విమానాశ్రయ అంతర్జాతీయ టెర్మినల్ వద్ద మంగళవారం రాత్రి దుబాయ్‌కి వెళ్లే ప్రయాణికులను అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో సందేహాస్పదంగా తచ్చాడుతున్న శీనివాసన్ (25) వద్ద అధికారులు విచారణ చేపట్టారు. పొంతన లేని సమాధానాలు రావడంతో అతని వద్ద గా లించగా నిబంధనలను ఉల్లగించి జీపీఎస్ యంత్రాన్ని అక్రమంగా దుబాయ్‌కి తీసుకు వెళ్లడానికి శీనివాసన్ ప్రయత్నించినట్టు తెలిసింది. దీంతో అ ధికారులు శీనివాసన్ నుంచి జీపీఎస్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. హోసూర్ కోర్టు వద్ద న్యాయవాదికి కత్తిపోట్లు ● కోర్టులో లొంగిపోయిన నిందితుడు సేలం : తాలూకా కార్యాలయం, న్యాయస్థానం ఉన్న ప్రాంతంలో ప్రజల రద్దీ అధికంగా ఉన్న చోట న్యాయవాదిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం హోసూర్‌లో కలకలం రేపింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో పలు కేసులు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సత్యనారాయణన్ వద్ద 30 ఏళ్ల వయస్సున్న న్యాయవాది కన్నన్ శిక్షణ పొందుతూ వచ్చాడు. ఈ స్థితిలో కన్నన్ బుధవారం సాయంత్రం కోర్టులో కేసు విచారణకు హాజరై బయటకు వస్తుండగా ఆనందన్ అనే వ్యక్తి అడ్డగించి కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కన్నన్ రక్తపు మడుగులో రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలకు పోరాడాడు. ఆ తర్వాత ఆనందన్ జేఎం 2 కోర్టులో లొంగిపోయాడు. కన్నన్ను స్థానికులు హోసూర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అనంతరం న్యాయవాదుల భద్రతా చట్టాన్ని అమలు చేయాలని న్యాయవాదులు హోసూర్ కోర్టు ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. వారికి ఏఎస్పీ అక్షయ్ అనిల్ వగారే సర్ది చెప్పి పంపించి వేశారు. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ● ముగ్గురు యువకుల అరెస్ట్ వేలూరు: వేలూరు జిల్లా పల్లిగొండ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారి. ఈమె గత శనివారం సాయంత్రం కాలకృత్యాల కోసం ఇంటి సమీపంలోని ఓ పొదలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన వీరప్పన్, ఇళమదన్, చిన్నరాజ్ కలిసి చిన్నారి నోటిలో గుడ్డలు కుక్కి సమీపంలోని రాళ్ల క్వారీకి తీసుకెళ్లారు. అనంతరం ముగ్గురు యువకులు కలిసి చిన్నారిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారి రాత్రి 10 గంటల వరకు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్న విషయం తెలుసుకున్న ముగ్గురు యువకులు చిన్నారిని రాళ్ల క్వారీ వద్దనే వదిలి పెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీటిపై చిన్నారి తండ్రి పల్లిగొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ సారథి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే పరారీలో ఉన్న ముగ్గురు యువకులు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరులో దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు చిత్తూరుకు చేరుకొని వీరప్పన్, ఇళమదన్, చిన్నరాజ్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. నగరంలో అంతర్జాతీయ బాస్కెట్ బాల్ అర్హత పోటీలు ● 24 దేశాల నుంచి పాల్గొననున్న క్రీడాకారులు కొరుక్కుపేట: నగరంలో ఈనెల 22 తేదీ నుంచి అంతర్జాతీయ బాస్కెట్ బాల్ అర్హత పోటీలు ప్రారంభం కానున్నాయి. వివరాలు.. 2025 సంవత్సరం ఆసియా కప్ బాస్కెట్ బాల్ పోటీలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనే జట్లను అర్హతను బట్టి ఎంపిక చేస్తున్నారు. ఆ నేపథ్యంలో రెండో విడత అర్హత పోటీలు చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో ఆసియా ఖండంలోని 24 దేశాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఇండియా బాస్కెట్ బాల్ సమ్మేళనం అధ్యక్షులు ఆదవ్ అర్జున మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో బాస్కెట్ బాల్ దిగ్గజాలు పాల్గొని తమ సత్తా చాటనున్నారని వివరించారు. -
కారు ఢీకొని తెలుగు జర్నలిస్టు మృతి
సాక్షి, చైన్నె : మదుర వాయిల్ బైపాస్ రోడ్డులో అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న తెలుగు జర్నలిస్టు ప్రదీప్‌కుమార్ మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని లక్ష్మి నరసింహరాజు వారి పాళెంకు చెందిన ప్రదీప్‌కుమార్(39) చైన్నె అంబత్తూరులో భార్య, కుమార్తెతో నివాసం ఉన్నాడు. గతంలో పలు తెలుగు ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం యూట్యూబ్ చానల్ నడుపుతూ జర్నలిస్టుగా జీవితాన్ని సాగిస్తున్నారు. అలాగే పార్ట్ టైమ్‌గా బైక్ ట్యాక్సీని నడుపుకుంటూ కుటుంబాన్ని చైన్నెలో ప్రదీప్‌కుమార్ పోషిస్తూ వచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో బైక్ ట్యాక్సీ బుకింగ్ ను ముగించుకుని మదుర వాయిల్ బైపాస్ మీదుగా అంబత్తూరుకు వెళ్తుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఢీకొంది. కారు ఢీ కొన్న వేగానికి బైపాస్ రోడ్డు అవతలకు 100 అడుగుల దూరంలో ఎగిరి పొదళ్లలో ప్రదీప్ పడ్డాడు. శరీరం చిద్రం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. తప్పించుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ కారు నడిపిన వ్యక్తికి అందులోని సెన్సార్ డిస్ కనెక్ట్ కావడంతో కిలో మీటరు దూరంలో కారు ఆగి పోయింది. దీంతో కారును వదలి పెట్టి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమైన ఆ కారు వేలప్పన్ చావడికి చెందినదిగా గుర్తించారు. బుధవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న తెలుగు, తమిళ పాత్రికేయులు, కెమెరామెన్లు కేఎంసీ మార్చురీకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ప్రదీప్ కుటుంబ సభ్యులు చైన్నెకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా, ప్రదీప్‌కుమార్ కుటుంబానికి తెలుగు పాత్రికేయుల సంఘం ( తేజస్) తరపున రూ. 50 వేలు సాయం అందించనున్నట్టు ప్రధాన కార్యదర్శి గోటేటి వెంకటేశ్వరరావు, కోశాధికారి పి. నరసింహ తెలిపారు. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేయడమే కాకుండా ఇతర పాత్రికేయులు అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేయనున్నట్లు చెప్పారు. -
ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
తిరువళ్లూరు: గుమ్మిడిపూండి సమీపం ఈగువారిపాళ్యం కొండమేదర కులాలకు చెందిన కుటుంబాలకు ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని పొన్నేరి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తిరువల్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఈగువారిపాళ్యం పంచాయతీలోని కొంగల్మేడు గ్రామంలో 30 సంవత్సరాల నుంచి మలైకురవన్(కొండమేదర) కులాలకు చెందిన కుటుంబాలు నివాసం వుంటున్నాయి. వెదురు బుట్టలు అల్లి వాటిని విక్రయించడమే వీరి ప్రధాన జీవనాధారం. వీరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అయితే ఉన్నత చదువులకు వెళ్లాడానికి కులధ్రువీకరణ సర్టిఫికెట్లు అవసరం వుంది. అయితే కులధ్రువీకరణ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. కాగా ఇదే కులానికి చెందిన ఆత్తుపాక్కం గ్రామస్తులకు ఇటీవల ఎస్టీ సర్టిఫికెట్లను సబ్‌కలెక్టర్ వాఘేసంఘత్ బల్వంత్ మంజూరు చేశారు. అయితే ఈగువారిపాళ్యం పంచాయతీలోని వారికి మాత్రం మంజూరు చేయలేదు. దీంతో బుధవారం ఉదయం పొన్నేరి ఆర్డీఓ కార్యాలయం వద్ద బుట్టలి అల్లి బాధితులు తమ కుటుంబసభ్యులతో కలసి ఆందోళనకు దిగారు. విషయం తెలిసి పొన్నేరి సబ్‌కలెక్టర్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సర్టిఫికెట్ల కోసం ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారని వారి నుంచి నివేదిక రాగానే సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంఘం నేతలు తమిళరసు, ఏవీ షణ్ముగం, గంగాదురై, విజయన్, శేకర్, మదన్ పాల్గొన్నారు. -
అగస్తీశ్వరర్ విగ్రహం సమర్పణ
కొరుక్కుపేట: పూందమల్లి సమీపంలోని చెంబేడులోని అరుళ్మెగు మంగళాంబికై సమేత అగస్తీశ్వరాలయంలో ప్రతిష్టించేందుకు అందమైన అగస్తీశ్వరర్, లోపాముద్ర విగ్రహాలను చైన్నెకి చెందిన జగన్మోహనరావు అనే భక్తుడు కానుకగా సమర్పించారు. ఆ ఆలయం వద్ద బుధవారం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పూందమల్లి శాసనసభ్యుడు ఎ.కృష్ణస్వామి ఆ విగ్రహాల ను స్వీకరించి ఆలయ నిర్వాహకులకు అందజేశా రు. ఈ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 28న జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాదవూరు అడిగళార్, జనకళ్యాణ్ సుబ్రమణియన్, సూర్య ప్రకాష్, మారి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అత్తగారింటిలో 60 సవర్ల బంగారం చోరీ
● అల్లుడు అరెస్టు వేలూరు: వేలూరు బాగాయం మేట్టు ఇడయంబట్టుకు చెందిన రిటైర్డ్ బీడిఓ సాలుమోన్. ఇతని భార్య మేరీ సెలీన్ దంపతుల కుమారుడు అలెక్స్ దేవప్రసాద్, కుమార్తె రాధికలున్నారు. రాధికకు తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ స్వామ్ అలియాస్ జబదురైకి కొన్నేళ్ల కిత్రం ఇచ్చి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో గత మాసంలో సాలుమోన్ భార్య మేరీ సెలీన్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దహన క్రియలకు కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈనెల 14న స్వామ్, అతని భార్య రాధిక తిరువళ్లూరు వెళ్లారు. సాలుమోన్ చైన్నెలో పనిచేస్తున్న తన కుమారుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అత్తగారింటిలో ఉన్న బంగారం చోరీ చేసేందుకు జబదురై పన్నాగం పన్నాడు. దీంతో తిరువళ్లూరుకు చెందిన తన స్నేహితుడు హుస్సేన్‌తో కలిసి ఆటోలో మేట్టు ఇడయంబట్టుకు వచ్చారు. అనంతరం ముందుగా తయారు చేసి ఉంచిన నకిలీ తాళాలు వేసి ఇద్దరూ ఇంటిలోనికి వెళ్లారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 60 సవరాల బంగారాన్ని చోరీ చేసి అక్కడ నుంచి తిరువళ్లూరుకు వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన సాలుమోన్ ఇంటి తాలాలతో పాటు బీరువాను ధ్వంసం చేసి బంగారం చోరీ చేసిన విషయాన్ని గుర్తించారు. వెంటనే బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో సాలుమోన్ అల్లుడు జబదురై ఇంటికి ఆటోలో వచ్చి వెళ్లినట్లు నమోదు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా బంగారం చోరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. దీంతో అతని వద్ద ఉన్న 60 సవరాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని జబదురై, హుస్సీన్ను అరెస్ట్ చేశారు. అత్తగారింటిలో అల్లుడే చోరీ చేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. -
● ఐదు రోజులుగా ఉన్న కుమారుడు ● పోలీసుల విచారణ
తండ్రి మృతదేహంతో.. వేలూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని సన్ముగం వీధికి చెందిన గోవిందస్వామి(75), మేగలారాణి దంపతుల కుమారుడు అరవిందన్. ఇతను ఓ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం మేగలారాణి మృతి చెందారు. దీంతో మనో వేదనతో ఉన్న అరవిందన్ విధులకు సక్రమంగా వెళ్లకుండా ఇంటిలోనే ఉంటూ ఏడాది క్రితం వాలంటీర్ రిటైర్డ్మెంట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఐదు రోజుల క్రితం తన తండ్రి గోవిందస్వామి ఇంటిలోనే మృతి చెందినప్పటికీ ఈ విషయాన్ని ఎవరికీ తెలపకుండా ఇంటికి తాళం వేసుకొని ఇంటిలోనే ఉండిపోయినట్లు సమాచారం. చుట్టుపక్కల వారు గమనించి ఇంటిలో తరచూ ఏసీ ఆన్‌లోనే ఉందని ఇంటి నుంచి దుర్వాసన వస్తోదని, ఇంటికి లోపల తాళం వేసి ఉందని వందవాసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి ఇంటిలోకి వెల్లి చూడగా ఇంటిలో గోవిందస్వామి మృతి చెంది ఐదు రోజులు అవుతున్నట్లు ఈ కారణంగానే దుర్వాసన వస్తోందని గుర్తించారు. అరవిందన్ మతి స్థిమితం లేక పోవడంతోనే తండ్రి మృతి చెందిన విషయం కూడా తెలియకుండా అతనితో పాటు ఐదు రోజులు జీవించాడని తెలియవచ్చింది. వీటిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బంగారు కడ్డీల స్వాధీనం
అన్నానగర్: దుండగులు ముళ్లపొదలో దాచి ఉంచిన రూ.49 లక్షల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. మదురై జిల్లా కరుప్పయూరాణి గురువమ్మాళ్కు చెందిన మురుగన్ కుమారుడు మూర్తి (30), పెరియకులంకు చెందిన మారిముత్తు కుమారుడు అంశరాజన్ చోరీ కేసుల్లో కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. తేని జిల్లాలోని పళనిశెట్టిపట్టి ప్రాంతాల్లో వీరు చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. పళనిశెట్టిపట్టి పోలీసులు ఇద్దరిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గత వారం తేని జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. అనంతరం కోయంబత్తూరు జైలు నుంచి మూర్తి, అంశరాజన్లను పోలీసులు తీసుకెళ్లి పళని చెట్టిపట్టి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. పళనిశెట్టిపట్టి ప్రాంతంలోనే తొమ్మిది దొంగతనాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. దోచుకెళ్లిన బంగారు ఆభరణాలను కరిగించి, వెండి వస్తువులు విక్రయించి, దోచుకున్న సొమ్మును తమ వద్దే ఉంచుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు వెల్లడైంది. పళనిశెట్టిపట్టి ప్రాంతంలో దోచుకున్న 88 తులాల ఆభరణాలను కరిగించి 6 బంగారు కడ్డీలుగా మార్చి మారియమ్మన్ కోవిల్పట్టి సమీపంలోని ముళ్లపొదలో మట్టిలో పాతిపెట్టినట్లు కూడా వెల్లడైంది. ఆ తర్వాత పోలీసులు వారిని మంగళవారం సాయంత్రం ఆ పొదల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పాలిథిన్‌లో కప్పి మట్టిలో పాతిపెట్టిన 88 తులాల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.49 లక్షలు. 7 రోజుల పోలీసు కస్టడీ తర్వాత, పోలీసులు వారిద్దరిని తేని జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. -
ఘనంగా సింధు నాగరికత పరిశోధన శత వార్షికోత్సవం
కొరుక్కుపేట: చైన్నె సైదాపేటలోని యూనివర్సిటీలో సింధు నాగరికత పరిశోధన శాతవార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. తమిళ అభివద్ధి సంస్థ చై ర్మన్ వీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ ప్రొఫెసర్ జి. విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన తమిళ సంస్కృతి విభా గం కార్యదర్శి వనంగాముడి ఆహుతులను ఆహ్వానించారు. ఎస్ఆర్ముగం ప్రారంభ ఉపన్యాసం చేశారు. త మిళనాడు ఓపెన్ యూనివర్సిటీ తమిళ విభాగం డైరెక్ట ర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం సింధు నాగరికత విశిష్టతను వివరించారు. అదేవిధంగా ద్రావిడ సంస్కృతి అంశంపై సూర్య జేవియర్ మాట్లాడారు. ఈ వేడుకల్లో అమర్నాథ్ రామకృష్ణ ఎ.కరుణానందన్ ప్రొఫెసర్ ఎ.పద్మా వతి సింధు నాగరికత పురావస్తు పరిశోధన అంశంపై ప్రసంగించారు. ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ ప్రొఫెసర్ ప దుమానార్, తమిళ విభాగం ఉపాధ్యక్షులు జె. మోహన్, కార్యదర్శి ఎం. చిదంబర భారతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సింధు నాగరికత త వ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులతో కూడిన ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వైయాపురి పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న బైక్
– ముగ్గురు విద్యార్థుల దుర్మరణం సేలం: కీల్పెన్నాత్తూర్ సమీపంలో చెట్టును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. తిరువన్నామలై జిల్లా వేట్టవలం గ్రామానికి చెందిన వన్నియన్ కుమారుడు ముత్తులింగం (16), చిన్నఓలైపట్టి గ్రామానికి చెందిన రాజా కుమారుడు రామన్ (17), ఇసుక్కలికాట్టేరి గ్రామానికి చెందిన జగదీష్ (17). ఈ ముగ్గురు వేట్టవలం ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నారు. వీరు మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బైక్‌లో వేల్లవలం నుంచి తలవాయ్కుళం వైపు వెళ్లారు. ఆవూర్ మురుగన్ ఆలయం వద్ద వెళుతుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముత్తులింగం సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. రామన్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వేట్టవలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ రామన్, జగదీష్‌లను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రామన్ మృతిచెందాడు. వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగదీశ్ బుధవారం మృతిచెందాడు. వేట్టవలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోలాహలంగా కేక్ మిక్సింగ్ వేడుక
సాక్షి, చైన్నె : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించే విధంగా రుచికరమైన వంటకాలతో పాటు కేక్‌ను అందిం చేందుకు మహాబలిపురంలోని వెల్కమ్ హోటల్ కెన్సెస్ పాం బీచ్ అధినేత కె.నరసారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు లోని ప్రముఖ ప్రాంతమైన మహాబలిపురంలోని ఈ హోటల్ ప్రాంగణంలోని సముద్రతీరంలో నూతనంగా ప్రారంభించిన శ్రీనమ్మ షాక్ బీచ్శ్రీ రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం కెన్సెస్ సీఈఓ ఎం. కృష్ణ సారథ్యంలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సందడిగా సాగింది. ఎగ్జిక్యూటివ్ చెఫ్ సబూజ్ పాల్ సహా 30 మంది చెఫ్‌లు, సెలబ్రెటీలు, విదేశీ పర్యాటకులు కలసి పలు రకాల డ్రైఫ్రూట్స్, 35 లీటర్ల వివిధ రకాల ద్రవ్యాలతో ఉత్సాహంగా కేక్ మిక్సింగ్ చేశారు. ఈ మిశ్రమాన్ని 30 రోజులు నానబెట్టి క్రిస్మస్ ముందు విదేశీ స్టాయిలో రుచికరమైన కేక్ ను తయారుచేసి వినియోగ దారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వీరేంద్ర తాపా, హోటల్ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొని శాంతా క్లాజ్ వేషధారణలో సందడి చేశారు.ఈ సందర్భంగా సీఈఓ ఎం.కృష్ణ మాట్లాడుతూ క్రిస్మస్, 2025 నూతన సంవత్సర వేడుకలను కోలాహలంగా జరుపుకొనేందుకు, కస్టమర్లను ఆకర్షించే రీతిలో సదుపాయాలను భారీస్థాయిలో స్థాయిలో సమకూర్చుతున్నట్లు తెలిపారు. -
ఆహారం పంపిణీ చేసే ముసుగులో..
● బైకులో తీసుకొచ్చిన రూ.21 లక్షలు స్వాధీనం అన్నానగర్: పారిమునై, మన్నడి తదితర ప్రాంతాల్లో హవాలా నగదు మార్పిడి జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్త్ కోస్ట్ పోలీసులు పారిమునై రాజాజీ రోడ్డులో మంగళవారం రాత్రి వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో బైకుపై అటుగా వచ్చిన యువకుడిని సోదా చేశారు. అతని వద్ద ఉన్న ఫుడ్ డెలివరీ బ్యాగ్‌లో నగదు నింపినట్లు గుర్తించారు. విచారణలో అతను గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న ఎలవూరుకు చెందిన అమానుల్లా (34)గా గుర్తించారు. ఈ డబ్బు యజమాని మలేషియాలో ఉన్నాడని, అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలో చెల్లించేందుకు తీసుకున్నానని చెప్పాడు. కానీ సరైన పత్రాలు లేని కారణంగా రూ.21 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. అదే విధంగా మన్నడి ప్రకాశం రోడ్డులోని తన ఇంటి నుంచి సెల్ఫోన్లు విక్రయిస్తూ చైన్నె ముత్తునాయకన్ వీధికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) సరైన పత్రాలు లేకుండా బైకులో తీసుకొచ్చిన రూ.11 లక్షలను ముత్యాల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని కూడా ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు హవాలా డబ్బు కావచ్చునని తెలుస్తోంది. -
తమిళనాడులో దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని..
చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. తంజావూర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై ఓ ప్రేమోన్మాదా దాడికి తెగబడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో క్లాస్‌రూమ్‌లో ఆమెను కత్తితో పొడిచి చంపాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.వివరాలు..మల్లిపట్టణం ప్రభుత్వ పాఠశాలలో రమణి అనే యువతి(26) టీచర్‌గా చేస్తోంది. కొంతకాలంగా మధన్ అనే వ్యక్తి రమణిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. ఇటీవల రమణి, మధన్ కుటుంబాలు వారి వివాహం గురించి చర్చలు జరిపారు. కానీ రమణి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన మధన్.. యువతి పనిచేస్తున్నపాఠశాలకు వెళ్లిన పదునైన ఆయుధంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షతోనే హత్యకు పాల్పడిట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
నాలుగున్నర కిలోల బంగారం సీజ్
– ఇద్దరు అరెస్టు అన్నానగర్: మండపం సమీపంలో కారులో తీసుకువచ్చిన నాలుగున్నర కిలోల స్మగ్లింగ్ బంగారు కడ్డీలను సెంట్రల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాలు.. శ్రీలంక నుంచి బంగారు కడ్డీలు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సోమవారం రాత్రి రహస్య సమాచారం అందింది. దీంతో మండపం–ఉచిపుల్లి మధ్య కుంజ్ చర్వలసాయి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో నాలుగున్నర కిలోల బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కారులో వచ్చిన రామనాథపురానికి చెందిన సేతు ఇబ్రహీం, మండపానికి చెందిన నాజర్‌ను అరెస్టు చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల విలువ సుమారు రూ.మూడున్నర కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. -
మోతపై.. వాత!
● బస్సుల్లో ఇకపై లగేజీ చార్జీ తప్పనిసరి ● నగర రవాణా సంస్థ నిర్ణయం ● ట్రాలీ, సూట్ కేస్, పెద్ద బ్యాగ్‌లకు టికెట్లుసాక్షి, చైన్నె: చైన్నె నగర రవాణా సంస్థ బస్సులలో ఇకపై లగేజీ చార్జీ తప్పనిసరి కానుంది. పెద్ద ట్రాలీ, సూట్ కేసు, బ్యాగ్‌లతో ప్రయాణించే వారికి లగేజీ చార్జీగా ఆ వ్యక్తి ప్రయాణానికి అయ్యే టికెట్టు ధరను నిర్ణయించి వసూలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు మార్గ దర్శకాలను నగర రవాణా సంస్థ(ఎంటీసీ) ప్రకటించింది. వివరాలు.. చైన్నె నగరంలో 625 మార్గాలలో 3 వేల మేరకు ఎంటీసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి. రోజుకు ఈ బస్సులలో 30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గాలలో బస్సుల సేవలు, ప్రయాణికులకు ఎదురు అవుతున్న సమస్యలు, బస్సులలో లగేజీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు వంటి అంశాలపై అధికారులు అభిప్రాయాలు సేకరించారు. ఇందులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా లగేజీ చార్జీ వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంటీసీ బస్సులలో 20 కేజీలలోపు బరువు కలిగిన వస్తువులను తీసుకెళ్లేవారికి ఎలాంటి లగేజీ చార్జీ వసూలు చేయడం లేదు. అయితే, పార్శిల్ పెద్దదిగా ఉంటే చాలు కండెక్లర్లు లగేజీ చార్జ్ అంటూ టికెట్లు కొట్టే స్తున్నారు. దీంతో ప్రయాణికుడికి, కండెక్టర్‌కు మధ్య అనేక సందర్భాలలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. వీటన్నింటికీ ముగింపు పలికే విధంగా చార్జీల వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించారు. పెద్ద వాటికే.. నగర రవాణా సంస్థ బస్సులో ప్రయాణికులు 65 సెం.మీ పైగా ఉన్న ట్రాలీ, సూట్ కేసులు, బ్యాగ్‌లను లేదా, 20 కేజీలకు పైగా బరువు కలిగిన పార్సిళ్లను తీసుకెళ్లే వ్యక్తి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారో, ఆ దూరం ఆధారంగా అతడి టికెట్టు చార్జీ మేరకు అదనంగా మరో టికెట్టు తీసుకునే విధంగా ఎంటీసీ బస్సులలోని కండెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నగర రవాణా సంస్థలోని సాధారణ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులలో ఈ అదనపు టికెట్టు చార్జీని లగేజీ చార్జీగా నిర్ణయిస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు సొంత ఉపయోగం కోసం భుజాన తగిలించుకునే బ్యాగ్, లేదా బట్టల సంచి ,హ్యాండ్ డ్యాగ్, చిన్న సూట్‌కేసు, కెమెరా బ్యాగ్, ల్యాప్ టాప్, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల బ్యాగ్, దివ్యాంగుల వీల్ చైర్లను ఎలాంటి లగేజీ చెల్లించుకుండా బస్సులలో తీసుకెళ్లే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కళాకారులు తమ వాయిద్యాలను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం చైన్నె కోయంబేడు నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే బస్సులను కిలాంబాక్కం బస్టాండ్‌కు మార్చేశారు. దీంతో నగర వాసులు చైన్నె శివారులో ఉన్న కిలాంబాక్కంకు తమ బ్యాగులు, ట్రాలీలలో ప్రయాణించేందుకు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ పెద్ద ట్రాలీ, బ్యాగ్‌లు, సూట్ కేసులకు లగేజీ నిర్ణయించడం గమనార్హం. అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది ఎదురయ్యే విధంగా ఉండే వస్తువులు, పార్సిళ్లను బస్సులలో అనుమతించ వద్దని స్పష్టం చేశారు. తపాల్, పత్రికల పార్సిళ్ల తరలింపునకు ముందస్తు అనుమతిని ఆయా సంస్థలు పొందే విధంగా సూచించారు. -
చైన్నె విమానంలో మహిళ మృతి
కొరుక్కుపేట: మలేషియా నుంచి చైన్నె వచ్చిన విమానంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు..మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం చైన్నెకి చేరుకుంది. ఇందులో కళ్లకురిచికి చెందిన మహిళ రాసత్తి మాయవన్ (37) సహా 167 మంది ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులంతా విమానం నుంచి దిగిపోయారు. కానీ రాసత్తి మాత్రం సీట్లో కూర్చోనే ఉన్నారు. అనుమానం వచ్చిన విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు వైద్య బృందానికి సమాచారం అందించారు. వెంటనే వైద్య బృందం విమానం ఎక్కి రాసత్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. గుండెపోటుతో చనిపోయిందా? లేక మరేదైనా కారణమా? ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. -
కస్తూరిపై మరిన్ని కేసులు
సాక్షి, చైన్నె : తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై మరికొన్ని పోలీసు స్టేషన్లలో కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన కస్తూరి పుళల్ జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఖైదీ నెంబర్ 644798 కేటాయించినట్టు సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమైపె చైన్నెలో నాలుగు, మదురైలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆమైపె కోయంబత్తూరు, కుంభకోణం, కోయంబేడు పోలీసు స్టేషన్లలో సైతం ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. ఆమైపె మరికొన్ని కేసులు నమోదు చేసి, ఆ కేసులలో అరెస్టు చేసే విధంగా పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
నా పరువుకు భంగం కలిగిస్తున్నారు
● కోర్టులో పళణి వాదన ● విచారణకు హాజరు సాక్షి, చైన్నె: తన పరువుకు భంగం కలిగించే విధంగా ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని కోర్టులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తన తరపున వాదనను ఉంచారు. అరప్పోర్ ఇయక్కంపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టుకు పళణి హాజరయ్యారు. వివరాలు.. 2016–21 కాలంలో రహదారుల శాఖలో రూ. 692 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. శివగంగై, కోయంబత్తూరులలో రహదారుల పనులలో ఈ అక్రమాలు జరిగినట్టు ఆ శాఖను తన పరిధిలో ఉంచుకున్న అప్పటి సీఎం, ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై ఆ ఇయక్కం ఆరోపణలు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. తనపై ఆధార రహిత ఆరోపణలు చేసిన అరప్పోర్ ఇయక్కం కన్వీనర్ జయరాం వెంకటేషన్, కో కన్వీనర్ జాకీర్ హుస్సేన్‌పై పళణి స్వామి పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై రూ.1.10 కోట్లకు ఈ దావా వేశారు. ఈ పిటిషన్ మద్రాసు హైకోర్టు ఆవరణలోని మాస్టర్ కోర్టులో విచారణలో ఉంది. ఈ విచారణ నిమిత్తం ఉదయం స్వయంగా కోర్టుకు పళణి స్వామి హాజరయ్యారు. ఆయన తరపున న్యాయవాది ఇన్బదురై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మహాలక్ష్మి ఎదుట తన తరపు వాదనను పళణిస్వామి ఉంచారు. ఆధార రహిత ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అరప్పోర్ ఇయక్కంం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదన అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
బీజేపీలో సంస్థాగత సమరం
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. వార్డు కమిటీలకు తొలుత ఎన్నికలను నిర్వహించేందుకు మంగళవారం చర్యలు తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరిగిన విషయం తెలిసిందే. ఆశించిన మేరకు సభ్యత్వ నమోదు ముందుకు సాగలేదు. కోటి సభ్యులను చేరుస్తామని నేతలు ప్రకటించినా, ఆచరణలో విఫలమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముగించిన రాష్ట్ర నేతలు సంస్థాగత ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. పార్టీ సీనియర్ నేత చక్రవర్తి నేతృత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలుత పార్టీ పరంగా ఉన్న 68,144 వార్డు శాఖలకు 30వ తేదిలోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు నిర్ణయించారు. ఒక్కో శాఖలో ఓ అధ్యక్షుడు, 11 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు తప్పనిసరిగా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి చక్రవర్తి పేర్కొంటూ, రాష్ట్రంలో 68 వేల వార్డు కమిటీ శాఖలు ఉన్నాయని, వీటికి తొలుత సంస్థాగత ఎన్నికలను ముగించి తర్వాత 1231 మండలాలు, పార్టీ పరంగా ఉన్న 66 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యుల సంఖ్య 40 లక్షలకు చేరినట్టు ప్రకటించారు. సభ్యత్వ నమోదులో ఉన్న కొన్ని చిక్కులను తొలగించే విధంగా పార్టీ అధిష్టానం ఈనెల 22వ తేదీన నిర్వహించనున్న సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నామన్నారు.