Tamil Nadu
-
పల్లికరనైలో పక్షుల సందడి
– పదివేలకు పైగా పక్షుల రాక కొరుక్కుపేట: పల్లికరణై సరస్సు పక్షులతో నిండిపోయింది. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి పక్షులు, కొంగలు, పిచ్చుకలు, గద్దలతో పల్లికరనై సరస్సు కనువిందు చేస్తోంది. పక్షి ప్రేమికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వివరాలు.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చైన్నెతోపాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నీటి వనరులలో జలకళ కనిపిస్తోంది. ముఖ్యంగా పల్లికరనై చిత్తడి ప్రాంతం కూడా నీరు నిలిచి అత్యంత సుందరంగా కనువిందు చేస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పల్లికరనై ప్రాంతానికి వచ్చే పక్షుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రకాల బాతులు, పసుపు ముక్కు కొంగలు, రంగు రంగుల పిట్టలు, పిచ్చుకలు, గద్దలు సహా 10 వేలకు పైగా పక్షులు రావడంతో సరస్సు కళకళలాడుతోంది. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. -
తిరుత్తణి బస్టాండ్‌కు కరుణానిధి పేరు
తిరుత్తణి: తిరుత్తణిలో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి పేరు నామకరణం చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానించారు. తిరుత్తణి మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం వైస్ చైర్మన్ సామిరాజ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఆదాయ, ఖర్చుల పట్టికను అదికారులు ప్రవేశపెట్టారు. అనంతరం 21వ వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా అరక్కోణం రోడ్డులో రూ.15.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి శతజయంతి బస్టాండుగా, మపోసీ రోడ్డు మార్గంలో నిర్మాణంలోని నూతన డైలీ మార్కెట్‌కు కరుణానిధి శతజయంతి కూరగాయల మార్కెట్‌గా నామకరణం చేయడానికి సభలో ఆమోదించి తీర్మానం ఆమోదించారు. అలాగే తిరుత్తణి కొండకు రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి వీలుగా మున్సిపల్‌కు సొంతమైన భూములను హిందూ దేవదాయ శాఖ పేరిట రిజిస్ట్రేషన్‌కు సభ ఆమోదం తెలిపింది. -
రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఆమేనా?
తమిళసినిమా(చైన్నె): దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. రెండు ఆస్కార్ అవార్డులను ఒకేసారి గెలుచుకుని ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు. అలాంటి ఏఆర్ రెహమాన్ సైరాభాను దంపతులు విడిపోతున్నట్లు ప్రకటన రావడంతో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అది కూడా ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాభాను ఎంతో బాధతో వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీరు విడిపోవడానికి గాయని మోహిని డే కారణమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కారణం ఈమె ఏఆర్ రెహమాన్ సంగీత బృందంతో కలిసి దేశ విదేశాల్లో 40 సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సైరాభాను భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్ది సమయంలోనే గాయని మోహినిడే కూడా తన భర్త మార్క్ పెచ్చు నుంచి విడిపోతున్నట్లు తన ఇన్స్ట్రాలో ప్రకటించడం కూడా రకరకాల చర్చకు దారితీస్తోంది. ఇమె గిటారిస్టు కూడా. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ సంగీత బృందంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ సంగీత బృందంలో ఆయనకు నచ్చిన సంగీత కళాకారుల్లో ఈమె కూడా ఒకరు. ఏఆర్ రెహమాన్ నుంచి సైరాభాను విడిపోవాలని తీసుకున్న నిర్ణయానికి మోహినీ డే కారణమా అన్న సైరా భాను తరుపు న్యాయవాది వందన షా బదులిస్తూ అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. అసలు ఏ ఆర్ రెహమాన్ సైరాభాను విడిపోవడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు అలాంటిదే ఏదైనా ఉన్నా, తనకు తెలిసినా తాను చెప్పకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా సైరాభాను ఏఆర్ రెహమాన్ నుంచి జీవనభరణం కోరతారా? అన్న ప్రశ్నకు కేసు అక్కడి వరకు రాలేదని, అయితే ఆమె జీవన భరణం కోరే అవకాశం ఉందని చెప్పారు. -
నూతన గుర్తింపు కార్డులు
తిరుత్తణి: అన్నాడీఎంకే శ్రేణులకు నూతన గుర్తింపు కా ర్డులను మాజీమంత్రి రమణ అందజేశారు. అన్నాడీఎంకే కార్యదర్శిగా మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీని పటిష్టం చేసి కార్యకర్తల్లో విశ్వాసం పెంచే విధంగా నూతన గుర్తింపు కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరువలంగాడు యూనియన్‌లో ఎన్ఎన్కండ్రిగ, నల్లాట్టూరు, తాళవేడు, పూనిమాంగాడు, చివ్వాడ, పొన్పాడి సహా పది గ్రామాల్లో పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి న్యాయవాది శక్తివేల్ అధ్యక్షత వహించారు. ఆ పార్టీ తిరువళ్లూరు వెస్టు జిల్లా కార్యదర్శి, మాజీమంత్రి బీవీ రమణ, మాజీ ఎంపీ హరి, నియోజకవర్గ ఇన్చార్జ్ విజయకుమార్ తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు నూతన గుర్తింపు కార్డులు అందజేశారు. -
ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ ముట్టడి
తిరువళ్లూరు: 24 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరుతూ ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు 183 మందికి మూడు సెంట్లు చొప్పున 2000 సంవత్సరంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇందు కోసం సమీపంలోని ప్రభుత్వ భూమిని చూపించారు. అయితే ఇంత వరకు భూమిని సర్వే చేసి లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇదే అంశంపై పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోడీఆర్ఓ రాజ్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. తమ ఇంటి స్థలాలను వెంటనే సర్వే చేయాలని కోరారు. -
నకిలీ పత్రాల ద్వారా భూమి విక్రయం
– రూ.4.75 కోట్ల మోసం చేసిన బీజేపీ నాయకుడు, భార్య అరెస్ట్ అన్నానగర్: తిరుచ్చిలో నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించి రూ.4.75 కోట్లు మోసం చేసిన బీజేపీ నాయకుడు, అతడి భార్యను గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చిలోని శ్రీరంగానికి చెందిన కె.వి. రంగసామి వ్యాపారవేత్త. ఇతనికి ఆ ప్రాంతంలో 17 ఎకరాల తోట ఉంది. చైన్నెలో నివాసం ఉండడంతో తోట నిర్వహణ బాధ్యతను శ్రీరంగానికి చెందిన గోవిందన్ (57)కు అప్పగించాడు. ఇలా గత కొన్నేళ్లుగా గోవిందన్ తోటను నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో శ్రీరంగానికి చెందిన దేవరాజన్ (50) రెండేళ్ల క్రితం గోవిందన్‌ను కలిశాడు. వారు తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. అప్పుడు గోవిందన్ ఈ ఆస్తి తనదేనని, అమ్మబోతున్నానని, మంచి వ్యక్తి ఉంటే తీసుకురావాలని చెప్పాడు. దీంతో దేవరాజాన్ ఎస్టేట్‌ను తానే కొనుగోలు చేస్తానని చెప్పడంతో గోవిందన్ బేరం కుదుర్చుకుని నకిలీ పత్రాలు ఇచ్చాడు. ఇది నమ్మి దేవరాజన్ రూ.4.75 కోట్లను గోవిందన్‌కు పలు విడతలుగా అందించారు. చివరికి నకిలీ పత్రాలు అని తేలడంతో దేవరాజన్ బుధవారం తిరుచ్చి మున్సిపల్ క్రైం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఈ మోసానికి పాల్పడిన గోవిందన్‌ను, అతని భార్యను గురువారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన గోవిందన్ బీజేపీ స్థానిక విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడని, అతడు భూమి యజమాని పేరుతో నకిలీ పత్రాలు సిద్ధం చేశాడని, ఇందుకు తోడుగా ఉన్న అతని భార్య గీతా(30) ఉన్నట్లు తెలిసింది. అనంతరం భార్యాభర్త లిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -

ఏడుగురు రౌడీషీటర్ల అరెస్టు
కొరుక్కుపేట: హత్యాయత్నంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని మళ్లీ చంపేందుకు ప్లాన్ చేసిన జేజే నగర్‌కు చెందిన ఏడుగురు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని యనగౌని ప్రాంతానికి చెందిన నె డుంజేలియన్ అనే వ్యక్తి ఆ ప్రాంతం వీధిలో తాగునీరు కోసం జరిగిన ఘర్షణలో చనిపోయాడు. నెడుంజేలియన్ తమ్ముడు కందన్, అతని సహచరులు కలసి ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం నెడుంజేలియన్ హత్యలో ప్రమేయం ఉన్నవారిని హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో గత ఏడాది కందన్ అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈ నేపథ్యంలో నెడుంజెలియన్ హత్యకేసు లో భాగమైన అన్నానగర్ పశ్చిమ తిరుమంగళం ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్(45)ను జూన్ 14న అన్నానగర్‌లోని తంగం కాలనీ చర్చి సమీపంలో ఏడుగురితో కూడిన ముఠా నరికేసి పరారైంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడంతో శ్రీనివాసన్ బతి కాడు. ఈ ప్రతీకార ఘటనలో ప్రత్యర్థి శ్రీనివాసన్ ప్రా ణాలతో బయటపడడంతో రౌడీలు మళ్లీ రెచ్చిపోయా రు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉందని నిఘా విభాగం పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత జేజే నగర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ ఖన్నా నేతృత్వంలోని పోలీసు లు ఏడుగురు రౌడీలను జైలుకు తరలించారు. -
చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి సహకార చక్కెర కర్మాగారంలో చెరుకు క్రషింగ్‌ను గురువారం మంత్రి నాజర్ ప్రారంభించారు. తిరువలంగాడులోని తిరుత్తణి సహకార చక్కెర కర్మాగారంలో ఐదువేల మంది చెరుకు రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు సాగు చేసిన చెరుకు పంటను సహకార చక్కెర ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో క్రషింగ్ కోసం రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో గురువారం క్రషింగ్ ప్రారంభించారు. కార్యక్రమానికి తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షత వహించారు. సహకార చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ నర్మద స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి నాజర్ పాల్గొని, క్రషింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుత్తణి సహకార సంఘంలోని 7 డివిజన్లకు చెందిన చెరుకు రైతులు సహకార సంఘం నుంచి చెరుకు కట్టింగ్ అనుమతి పొంది సహకార ఫ్యాక్టరీకి తరలించి, లబ్ధి పొందాలన్నారు. క్రషింగ్ మధ్యలో ఆగకుండా యంత్రాలకు మరమ్మతులు పూర్తిచేసి ఉన్నత ప్రమాణాలతో క్రషింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు చంద్రన్, రాజేంద్రన్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
దక్షిణ తమిళనాడుకు రెడ్ అలర్ట్
– ఆరు గంటలలో 24 సెం.మీ వర్షం సాక్షి, చైన్నె: దక్షిణ తమిళనాడుకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. వర్షాలు కొనసాగుతుండటంతో రైతులలో ఆందోళన తప్పడం లేదు. రామనాధపురంలో ఆరు గంటలలో 24 సె.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు విస్తరించిన విషయం తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా డెల్టా జిల్లాలైన నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం అనేక ప్రాంతాలలో కుండ పోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రామనాథపురంలో అయితే, మేఘం ఒక్కసారిగా ఉరిమినట్టుగా ఆరు గంటలలో 24 సెం.మీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలలోకి వర్షపు నీరు పోటెత్తింది. డెల్టా జిల్లాలో వర్షాలు కొనసాగుతుండడంతో రైతులలో ఆందోళన పెరిగింది. చేతికి అంది వస్తున్న వరి పంటను వర్షం రూపంలో ఎక్కడ వరదలు ముంచెత్తుతాయో అనే ఆందోళన తప్పడం లేదు. అదే సమయంలో గురువారం దక్షిణ తమిళనాడులోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తలో ప్రజలకు ఏదేని నష్టాలు, కష్టాలు ఎదురైనా ఆదుకునే విధంగా చర్యలు ముమ్మరం చేశారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
● టీచర్‌ను పొడిచి చంపేసి పైశాచికత్వం ● పాఠశాలలో ఘటన ● విద్యాశాఖ సీరియస్ ● పోలీసుల అదుపులో నిందితుడు సాక్షి, చైన్నె: తన ప్రేమను నిరాకరించిన టీచర్‌ను ఓ ప్రేమోన్మాది మట్టుబెట్టాడు. బడిలోనే ఈ కిరాతకానికి ఒడి గట్టాడు. తంజావూరు జిల్లా పట్టుకోట్టై సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లా పట్టుకోట్టై సమీపంలోని మల్లి పట్టినం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. పరిసరాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నారు. మల్లి పట్టినం సమీపంలోని చిన్నమనై గ్రామానికి చెందిన రమణి (26) ఈ పాఠశాలలో తమిళ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈమెను అదే గ్రామానికి చెందిన మదన్‌కుమార్ గత కొంత కాలంగా ప్రేమ పేరిట వేది స్తూ వచ్చాడు. అయితే అతడి ప్రేమను ఆమె అంగీకరించ లేదు. పదేపదే ఒన్ సైడ్ ప్రేమను మదన్‌కుమార్ వ్యక్తం చేసినా, ఆమె నిరాకరిస్తూ వచ్చింది. ఉన్మాదిగా మారి.. బుధవారం ఉదయం యథాప్రకారం రమణి పాఠశాలకు వచ్చింది. తొలి పీరియడ్ ముగియగానే ఉపాధ్యాయులకు కేటాయించిన గదిలోకి వెళ్లింది. తన సీటులో కూర్చుని ఉండగా హఠాత్తుగా లోనికి మదన్ కుమార్ చొరబడి ఆమెను ప్రేమ పేరిట వేధించాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఉన్మాది అవతారం ఎత్తాడు. తన వెన్నంటి తెచ్చుకున్న కత్తితో గొంతు, కడుపు భాగాలలో విచక్షణా రహితంగా పొడిచేశాడు. గది నుంచి వస్తున్న కేకలను విన్న సహచర ఉపాధ్యాయులు అటు వైపుగా పరుగులు తీశారు. వారిని చూడగానే ఉడాయించే ప్రయత్నం చేశాడు. రక్తగాయాలతో రమణి పడి ఉండటంతో కొందరు ఉపాధ్యాయులు అతడ్ని వెంటాడి మరీ పట్టుకుని చితక్కొట్టి కట్టి పడేశారు. అంబులెన్స్ ద్వారా రమణిని పట్టుకోట్టై ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందింది. గొంతు భాగంలో లోతుగా కత్తి దిగడంతో నరాలు తెగి ఆమె ప్రాణాలను కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పాఠశాలలో కలకలం బయలు దేరింది. విద్యార్థులలో ఆందోళన నెలకొంది. విద్యార్థులను ఉపాధ్యాయులు సముదాయించారు. పిల్లలను జాగ్రత్తగా ఇంటికి పంపించేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సేతు బావా సముద్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మదన్‌కుమార్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా రమణిని మదన్‌కుమార్ వన్ సైడెడ్‌గా లవ్ చేయడమే కాకుండా, ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది. రమణి ఇంటికి వెళ్లి మరీ ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని గొడవ సైతం పడ్డట్టు, ప్రస్తుతం ఉన్మాదిగామారి హతమార్చినట్టు తేలింది. కాగా, ఈ ఘటనపై విద్యా శాఖ సీరియస్ అయింది. నిందితుడి నికఠినంగా శిక్షించే విధంగా చట్టాలను నమోదు చేయాలని పోలీసులను విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన రమణి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. -
క్రియాశీల సభ్యత్వంపై బీజేపీ ఉన్నత స్థాయి కమిటీలో చర్చ
సాక్షి, చైన్నె: చైన్నెలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాల యం కమలాలయంలో తమిళనాడు బీజేపీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. తమిళనాడు, కర్ణాటక బీజేపీ జాతీయ కో–ఇంఛార్జి డాక్టర్ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో జాతీయ కార్యవర్గ సభ్యు డు, తమిళనాడు బీజేపీ సమన్వయ కమిటీ కన్వీనర్ హెచ్. రాజా అధ్యక్షత ఈ సమావేశం జరిగింది. జాతీ య కార్యదర్శి తమిళనాడు ఇన్చార్జ్ ముఖ్య అతిథిగా అరవింద్ మీనన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరారజన్, వానతీ శ్రీనివాసన్, కేశవ వి నాయగం, తదితర నేతలు ఈ సమావేశంలో పలు అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ క్రియాశీల సభ్యత్వ నమోదు పురోగ తిని ఇందులో సమీక్షించారు. తమిళంలోని అన్ని బూత్‌లలో పార్టీ సంస్థాగత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. డీఎంకే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా పోరాటాలు, ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు. -
సాగర తీరంలో నిఘా
– సీ విజిల్ పేరిట మాక్ డ్రిల్ సాక్షి, చైన్నె: చైన్నె నుంచి కన్యాకుమారి వరకు బుధవారం ఉదయం నుంచి సీ విజిల్ పేరిట సాగర తీరంలో నిఘాను పటిష్టం చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కోస్టుగార్డు, నావికాదళం, మైరెన్ పోలీసులు, సముద్ర తీర భద్రతా విభాగం తదితర భద్రతా బలగాలు ఉదాయాన్నే రంగంలోకి దిగాయి. ముంబైలో గతంలో జరిగిన దాడిలో నిందితులు సముద్ర మార్గం గుండా ప్రవేశించినట్టుగా వెలుగు చూసిన నేపథ్యంలో తరచూ సాగరం మీద నిఘా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కవచ్, ఆపరేషన్ ఆమ్లా, ఆపరేషన్ సురక్ష పేరిట భద్రతా పరంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీ విజిల్పేరిట తీరం వెంబడి భద్రత మీద దృష్టి పెట్టారు. గురువారం కూడాఈ మాక్‌డ్రిల్ కొనసాగనుంది. సిబ్బంది ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు కొందరు మప్టీలో చక్కర్లు కొడుతూ భద్రతను పర్యవేక్షించారు. రాష్ట్రంలోని 51 ప్రాంతాలలో సీ విజిల్ 24 మాక్ డ్రిల్ జరుగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. -
ఇంటిలోపల తల్లి, కుమారుడి మృతదేహాలు
● నాలుగు రోజుల తర్వాత స్వాధీనం ● కంటతడిపెట్టించిన లేఖ లభ్యం సేలం : తంజావూరు సమీపంలో ఇంటిలోపల తల్లి, కుమారుడి మృతదేహాలను నాలుగు రోజుల తర్వాత పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. తంజావూరులో మునిసిపల్ కాలనీకి చెందిన మధనగోపాల్. ఇతని భార్య ఈశ్వరి (59). వీరి కుమారుడు రాహుల్ (29). ఇంజినీరింగ్ చదువుకున్న రాహుల్ ఇంటిలో సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. గత 15 సంవత్సరాల క్రితం మదన్‌గోపాల్ మృతి చెందడంతో ఇంటిలో ఈశ్వరి, రాహుల్ నివసిస్తూ వచ్చారు. ఈ స్థితిలో గత నాలుగు రోజులుగా ఇల్లు మూసి ఉండడంతో ఈశ్వరి, రాహుల్ వేరే ఊరికి వెళ్లి ఉంటారని స్థానికులు భావించారు. ఈ స్థితిలో మంగళవారం ఉదయం ఈశ్వరి ఇంటికి వచ్చిన పూలు అమ్మే యువతి ఆ ఇంటిలో నుంచి దుర్వాసన వీస్తుండడాన్ని గుర్తించింది. సందేహించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల పోలీసు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇక్కడ ఈశ్వరి మంచంపైన, రాహుల్ ఉరికి వేలాడుతూ మృతదేహాలుగా కనిపించారు. కుల్లిన స్థితిలో ఉన్న వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆ ఇంటిలోపల పరిశోధనలు చేపట్టగా, అక్కడ కంటతడిపెట్టించే విధమైన రాహుల్ రాసిన ఒక లేఖ లభ్యమైంది. అందులో ఉన్న ప్రకారం గుండె పోటుతో తల్లి మృతి చెందడంతో, తల్లి, తండ్రి లేక అనాథగా మారిన రాహుల్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
సీబీఐకి సారా రక్కసి కేసు
● హైకోర్టు తీర్పు ● అప్పీల్‌పై నిర్ణయం సీఎం స్టాలిన్ తీసుకుంటారన్న మంత్రి సాక్షి, చైన్నె: కళ్లకురిచ్చిలో కోరలు చాచిన కల్తీ సారా రక్కసి కేసును సీబీఐ విచారించనుంది. ఈ మేరకు బుధవారం మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐ విచారించడం ద్వారానే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని న్యాయమూర్తుల బెంచ్ అభిప్రాయ పడింది. వివరాలు.. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం, శంకరాపురం , శేష సముద్రం, కచ్చరాయ పాలయం, మాధవచ్చేరిలో జూన్ రెండో వారంలో కల్తీ సారా కోరలు చాచిన విషయం తెలిసిందే. ఇందులో 229 మంది విల్లుపురం, కళ్లకురిచ్చి,సేలం, పుదుచ్చేరి ఆస్పత్రిలలో చేరారు. వీరిలో 69 మంది మరణించారు. 161 మంది తీవ్ర చికిత్సతో ఆరోగ్యవంతులయ్యారు. ఈ సారా రక్కసి కారణంగా ఎందరో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. రాష్ట్రాన్ని కుదిపి వేసిన ఈ ఘటన డీఎంకే ప్రభుత్వానికి ఓ మచ్చగా మారింది. ఈ కేసును సీబీసీఐడీ తీవ్రంగా విచారిస్తూ వస్తోంది. సారా వ్యాపారులతో పాటు సుమారు 25 మందిని అరెస్టు చేసి కట్ట కటాలలోకి నెట్టారు. ఈ కేసు సమగ్ర విచారణ, సారా, కల్తీ సారా కట్టడి దిశగా విస్తృతం చేయాల్సిన కార్యాచరణ మీద నివేదిక సమర్పణకు ఏక సభ్య కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోకుల్ దాస్ సైతం విచారణ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో అరెస్టయిన నిందితులలో పలువురిపై గుండాయాక్ట్ను ప్రయోగించారు.అయితే, ఈ కేసు విచారణ సరైన మార్గంలో సాగడం లేదని, సారా వ్యాపారులకు పోలీసులు, స్థానిక రాజకీయ నాయకుల అండదండాలు ఉన్నాయన్న ఆరోపణలు విస్తమయ్యాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేసును సీబీఐకు అప్పగించాలన్న నినాదం తెర మీదకు వచ్చింది. సీబీఐకు కేసు.. అన్నాడీఎంకే న్యాయవాద విభాగం నేత ఇన్బదురై, పీఎంకే అధికార ప్రతినిధి కే బాలు, బీజేపీ నేత మోహన్ దాసుతో పాటు పలువురు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు బెంచ్ ముగించింది. బుధవారం తీర్పు వెలువరించింది. కేసు వెనుక ఉన్న ఆరోపణలను గుర్తు చేస్తూ, కళ్లకురిచ్చి కల్తీ సారా రక్కసికి కారణమైన నేరగాళ్లపై కఠిన చర్య తీసుకున్నట్టు కనిపించడం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నిజాయితీగా విచారణ సాగే విధంగా కేసును సీబీఐకు అప్పగిస్తున్నామని ప్రకటించారు. సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదని వ్యాఖ్యలు చేస్తూ, సారా మరణాలు సమాజానికి హెచ్చరిక అని వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు తెలియకుండా సారా విక్రయాలు జరిగిన వాదనను తాము అంగీకరించడం లేదని తిరస్కరించారు. పోలీసు అధికారులపై తీసుకున్న చర్యలకు సరైన కారణాలను వివరించ లేదని గుర్తు చేస్తూ, ఈ ఘటన అనుమానాలకు తావిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే సీబీఐ విచారణ సమంజసం అన్న నిర్ణయానికి వచ్చినట్టు బెంచ్ ప్రకటించింది. సీబీఐ అధికారులు సారా విక్రయం, విక్రయదారుల మీద మాత్రమే విచారణలో దృష్టి పెట్ట కుండా, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారుల గురించి సైతం సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. -
సేలం జైలులో ఖైదీల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం
సేలం: సేలం జైలులో చైన్నె ఖైదీల నుంచి రెండు సెల్ఫోన్లను జైలు వార్డెన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువుల విజిటింగ్ను రద్దు చేశారు. వివరాలు..సేలం సెంట్రల్ జైలులో 1200 మంది ఖైదీలు ఉన్నారు. సేలం జైలులో 17వ బ్లాక్ ప్రాంతంలో చైన్నెకి చెందిన ఖైదీలు ఉన్నారు. ఆ గది వైపు వార్డెన్లు వెళితే, అప్పుడప్పుడు వచ్చి తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఖైదీలు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో వారి వద్ద ఏదైనా వస్తువు అక్రమంగా ఉండవచ్చనే సందేహంతో వార్డెన్లు భావించారు. ఆ మేరకు పథకం వేసి ప్రతి మంగళవారం ఖైదీల అవసరాలను తెలుసుకునే కార్యక్రమం జరపుతున్నట్టు తెలిపి మంగళవారం అకస్మాత్తుగా చైన్నె ఖైదీలు ఉన్న గదికి వెళ్లారు. అక్కడ గదిలో చుట్టు పక్కల గోడలను పరిశీలించారు. అక్కడ గదికి ఎదురుగా ఉన్న రాగి చెట్టు పై ఉన్న రెండు సెల్ఫోన్లను, మరుగుదొడ్డిలో ఉన్న సెల్‌ఫోన్ ఛార్జర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థితిలో సెల్ఫోన్లను అక్రమంగా ఉపయోగించినట్టు చైన్నె వడపళనికి చెందిన యుగేంద్రన్ (26), అరుంబాక్కం సెబాస్టియన్ జయప్రకాశ్ (27), మహాలింగ్ (39) అనే ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువులను కలుసుకోవడానికి నిషేధం విధించారు. -
సంగ్రామానికి సంసిద్ధం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ప్రచార భేరి మోగించాలని కేడర్‌కు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం డీఎంకే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో 7వ సారిగా తమిళనాడు డీఎంకే పాలనను తీసుకొచ్చేందుకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రజా క్షేత్రంలోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను దరిచేర్చే విధంగా, ప్రాజెక్టుల తీరు తెన్నులను సమీక్షించి వేగవంతం చేసే విధంగా సమీక్షలలో ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే డీఎంకేలో సమన్వయ కమిటీని రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా కేడర్, నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రభుత్వ పరంగా ఓ వైపు, పార్టీ పరంగా మరో వైపు కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్నత స్థాయి కమిటీతో బుధవారం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ సమావేశమయ్యారు. పార్టీ సీనియర్లు దురై మురుగన్, టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరు సెల్వం, కనిమొళి, ఉదయనిఽధి స్టాలిన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టడం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సారి 200 స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే తమిళనాడులో తమకు ఆరుసార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలు, 7వ సారి సైతం కట్టబెట్టే విధంగా, వారి మన్ననలు పొందే కార్యక్రమాల మీద దృష్టి పెట్టే విధంగా తీర్మానాలు చేశారు. తీర్మానాలలో కొన్ని .. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతూ, ఇప్పటి నుంచే ప్రచార భేరి మోగించాలని నిర్ణయించారు. జిల్లా, నగర, యూనియన్, పురపాలక స్థాయిలో కార్యక్రమాలను పార్టీ పరంగా విస్తృతం చేయడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను ప్రజలలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రచార భేరి మోగించాలని ఆదేశించారు. వజ్రోత్సవాల వేళ డీఎంకే కార్యక్రమాలు విస్తృతం కావాలని సూచించారు. అంకిత భావంతో సీఎం స్టాలిన్ ప్రజల కోసం చేస్తున్న మంచి పనులు, సంక్షేమాలను వివరించే విధంగా సభలు, సమావేశాలు విస్తృతం కావాలని, ఇంటింటా ప్రభుత్వ ప్రగతి గురించి సమగ్ర సమాచారం చేరవేసే రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులోని ప్రతి డీఎంకే సోదరుడు ఓ సైన్యం అని చాటే విధంగా ప్రచార కార్యక్రమాలలో దూసుకెళ్లాలని తీర్మానించారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకు తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. హిందీని బలవంతంగా రుద్దే విధంగా సాగుతున్న ప్రయత్నాలను ఖండించారు. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించాలని పట్టుబడుతూ తీర్మానం చేశారు. మణిపూర్ మండుతోండటంపై విచారం వ్యక్తం చేస్తూ, ఇప్పటికై నా ప్రధాని నరేంద్ర మోదీ ఆరాష్ట్రంలో పర్యటించాలని , అన్ని వర్గాల ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నువాటాలో రాష్ట్రానికి కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని నినాదిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. ప్రచార భేరి మోగించండి ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు కేంద్రం విధానాలపై ఫైర్ -
క్లుప్తంగా
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి ● పెళ్లి బ్యానర్ కట్టే సమయంలో ఘటన సేలం : విరుదునగర్ జిల్లా రాజపాళయం సమీపంలో సేత్తూర్లో ఉన్న మేట్టుపట్టి వీధికి చెందిన మురుగన్ (40), ముత్తురాజన్ (50) శుభకార్యాలకు పందిళ్లు వేసే పని చేస్తున్నారు. వీరు సేత్తూర్ ఐందుకడై బజార్ ప్రాంతంలో వివాహ వేడుక కోసం మంగళవారం సాయంత్రం బ్యానర్ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిద్దరిని హుటాహుటిన రాజపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మురుగన్ మృతి చెందినట్టు తెలిపారు. విషమ స్థితిలో ముత్తురాజన్ చికిత్స పొందుతున్నాడు. సేత్తూర్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. రోడ్డుపై పడిన నగలు పోలీసులకు అందజేత అన్నానగర్: చైన్నెలోని నోలంపూర్ ప్రాంతంలోని ఐశ్వర్యం క్వార్టర్స్‌కు చెందిన భాస్కర్ (42) ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఈనెల 16న భాస్కర్ తన బైకుపై నోలంపూర్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా కిందపడి ఉన్న బంగారు నగలను గుర్తించాడు. అనంతరం ఆ నగలను నోలంపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం నోలంపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శేఖరన్ నేతృత్వంలో పోలీసులు ఆ ప్రాంతంలోని 125 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నగలు తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నగలు వదిలేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ వ్యక్తిని పిలిపించి విచారించగా.. ముగప్పర్ డీడీ రోడ్డులో నివసించే మహేశ్వరన్ (41) కోడంబాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు నెక్లెస్‌ను మహేశ్వరన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భాస్కరన్‌ను పోలీసులు అభినందించారు. 8 నెలల గర్భవతిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థిని సేలం: కోవై సమీపంలో ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాలకు వచ్చి ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థిని ఒకరు ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి గురించి టీచర్లకు తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులను రప్పించి బెదిరించి గత 12వ తేది టీసీ ఇచ్చి పంపించారు. ఈ విషయం గురించి మహిళా పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా ఎనిమిది నెలలు గర్భవతి అయిన విషయం టీచర్లకు ఎలా తెలియకుండా పోయిందని, అకస్మాత్తుగా టీసీ ఇచ్చి పంపించడం ఏమిటి, ఆమె గర్భానికి కారణం ఎవరు వంటి కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉద్యోగం పేరుతో మోసం ● ఎస్పీ కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు వేలూరు: ఆర్మీలో ఉద్యోగం తీసిస్తామని పలువురి వద్ద నగదు తీసుకుని మోసం చేస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మదివానన్ అధ్యక్షతన గ్రీవెన్స్‌సెల్ జరిగింది. సిందులో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు వేర్వేరు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించుకున్నారు. ఇందులో పల్లిగొండ సమీపంలోని కుచ్చిపాల్యంకు చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైన్నె తాంబరంలో తన కుమారుడు చదువుతున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి తన కుమారుడికి పరిచయం అయ్యాడని, ఆ సమయంలో ఆర్మీలో చేర్పించేందుకు తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని ఒకరికి రూ.2 లక్షలు కడితే చాలని వెంటనే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నమ్మి తన కుమారుడితో పాటు మరో ఇద్దరు రూ.5 లక్షల నగదును అతనికి ఇచ్చారన్నారు. అనంతరం నకిలీ ఆర్టర్ కాపీని ఒకటి తమకు పంపాడని వీటిని తనకు తెలిసిన ఆర్మీ అధికారి వద్దకు తీసుకెళ్లి చూపించగా నకిలీవని తెలిసిందన్నారు. విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అర్ధరాత్రి పూజలపై ఆగ్రహం.. ● భార్యపై పెట్రోల్ పోసిన భర్త.. ● నిప్పు అంటుకుని నలుగురు ఆంధ్రులకు గాయాలు సేలం : తిరువెరుంబూర్ సమీపంలో ఉన్న పూలాంగుడి పలంకానంగుడి సాలైలోని హ్యాపి నగర్‌కు చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ (56).. ఇతని భార్య హేమా బిందు (50). వీరికి గుణశేఖర్ (20), గురుసామి (20) అనే ఇద్దరు కుమారులు, హర్షిణి, ఉమాశంకరి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దురు కుమారులు ఇంజినీరింగ్ చదువుతుండగా హర్షిణి ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా ఉంది. ఉమాశంకరి డాక్టర్‌కు చదువుతోంది. వీరితో పాటు రాజేంద్ర ప్రసాద్ తల్లి కూడా ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. కాగా హేమా బిందుకు ఆధ్యాత్మికంలో అధిక ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ హేమా పూజ గదిలో కూర్చుని పూజలు చేస్తూ ఉంటారని, ఇది రాజేంద్ర ప్రసాద్‌కు అసలు నచ్చేది కాదని తెలుస్తోంది. ఈ స్థితిలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హేమా బిందు పూజలు చేస్తూ ఉన్నట్టు తెలిసింది. దీంతో తీవ్ర కోపానికి గురైన రాజేంద్రప్రసాద్ ఇంట్లో అర్ధరాత్రి పూజలు ఏంటి అని ప్రశ్నిస్తూ వాహనాల కోసం ఉంచిన పెట్రోల్‌ను ఆమైపె పోసి ఉన్నాడు. అప్పుడు పూజ గదిలో వెలుగుతున్న దీపాలపై పెట్రోల్ పడి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు హేమా బిందుకు అంటుకుంది. దీన్ని గమనించిన కుమారులు గుణశేఖర్, గురుసామి తల్లిని రక్షించడానికి ముందుకు రావడంతో వారికి కూడా నిప్పు అంటుకుంది. పెట్రోల్ పోసిన రాజేంద్రప్రసాద్‌కు కూడా నిప్పు అంటుకుంది. వారి అరుపులు విన్న స్థానికులు నిప్పు గాయాలతో ఉన్న నలుగురిని రక్షించి చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నావల్పట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
చైన్నెలో మెథాంఫెటమైన్ అక్రమ రవాణా
● ఎస్ఐ భర్త, కాంగ్రెస్ నాయకుడి సహా ఐదుగురు అరెస్టు అన్నానగర్: చైన్నె నుంచి మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసిన ఎస్ఐ భర్తతో సహా ఐదుగురిని బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పాడి బ్రిడ్జి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నట్లు చైన్నె వెస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక దళానికి చెందిన పోలీసు అధికారి పాడి మెంబలం దగ్గర మారువేషంలో పర్యవేక్షిస్తూ బైకుపై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరిని పట్టుకుని విచారణ చేపట్టారు. అప్పుడు వారు బైకులో మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి పుళల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా కుమారవేల్ అని తేలింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ప్రధాన వ్యక్తి, ప్రణాళికల అమలులో ప్రధాన వ్యక్తి. ఇతను మద్రాసు హైకోర్టులో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న వన్నారపేట పోలీస్‌స్టేషన్ స్పెషల్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ విశాలాక్షి భర్త అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తిరువేర్కాడు ఆర్. ఎస్. పురం ప్రాంతానికి చెందిన సుభాష్, పుళల్ భక్తికి చెందిన గ్యాంగ్ నాయకుడు పార్థిబన్, ఓట్టేరి ప్రాంతానికి చెందిన అమీర్ పాషా, కావాంగరై ప్రాంతానికి చెందిన దీపక్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వృద్ధుల కోసం ఇంటి వద్దకే వైద్యం.. సాక్షి, చైన్నె: వృద్ధుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఇంటి వద్దకే హెల్త్ చెకప్ సేవలకు కావేరి ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. బుధవారం ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక బృందం ద్వారా ఈసీజీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలిసస్, లిపిడ్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్, హెచ్‌బీఏ1సీ తదితర వైద్య పరీక్షలను, ఇంటి వద్దకు వచ్చే వృద్ధులకు చేసే రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ వీఎస్ నటరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో వృద్యాప్య నిపుణులు, ఫిజియోథెరఫిస్ట్, సైకియాట్రిస్ట్, డైట్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ స్పెషలిస్టు, మల్టీ డిసిప్లినరీ బృందం సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, వృద్ధుల జనాభా పెరుగుతుండటాన్ని గుర్తు చేస్తూ, వారి అవసరాలకు అను గుణంగా సంరక్షణ, వైద్య పరంగాసేవల మీద దృష్టి పెట్టామని వివరించారు. -

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన
తిరువళ్లూరు: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని హిందూ ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్సంపత్ ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా పూంగానగర్లో హిందూ ప్రజాపార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం, పార్టీ జెండాను ఎగురవేసే కార్యక్రమం బుధవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అర్జున్సంపత్ మాట్లాడారు. రాష్ట్రంలో మోజారిటీగా వున్న హిందువులు మైనారిటీలకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్లు అయిన ఉదయనిధి, సినీనటుడు జోసెఫ్ విజయ్ ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం డీఎంకే–తమిళగ వెట్రి కళగం మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగిందని ఆరోపించారు. అవినీతి రహిత పాలనను అందించాలని తాము ప్రయత్నం చేస్తుంటే అధికార దాహం కోసం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ఒప్పందాలను తెరపైకి తెస్తున్నారని వాపోయారు. 2026లో బీజేపీ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆయన, హిందువుల పరిరక్షణకు తమ వైపు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశం అనంతరం ఇటీవల పుల్లరంబాక్కం గ్రామంలో కూల్చివేసిన కృష్ణుడి ఆలయాన్ని సందర్శిఽంచడానికి ఆయన బయలుదేరారు. అయితే ఇందుకు పోలీసులు ససేమిరా అంటూ అడ్డుకున్నారు. దీంతో అర్జున్సంపత్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన మహిళలు, కృష్ణుడి వేషధారణలో వున్న చిన్నారులు అర్జున్సంపత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలోని ఆలయాన్ని కూల్చకుండా కాపాడాలని వారు కోరారు. -
సేలం జైలులో ఖైదీల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం
సేలం: సేలం జైలులో చైన్నె ఖైదీల నుంచి రెండు సెల్ఫోన్లను జైలు వార్డెన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువుల విజిటింగ్ను రద్దు చేశారు. వివరాలు..సేలం సెంట్రల్ జైలులో 1200 మంది ఖైదీలు ఉన్నారు. సేలం జైలులో 17వ బ్లాక్ ప్రాంతంలో చైన్నెకి చెందిన ఖైదీలు ఉన్నారు. ఆ గది వైపు వార్డెన్లు వెళితే, అప్పుడప్పుడు వచ్చి తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఖైదీలు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో వారి వద్ద ఏదైనా వస్తువు అక్రమంగా ఉండవచ్చనే సందేహంతో వార్డెన్లు భావించారు. ఆ మేరకు పథకం వేసి ప్రతి మంగళవారం ఖైదీల అవసరాలను తెలుసుకునే కార్యక్రమం జరపుతున్నట్టు తెలిపి మంగళవారం అకస్మాత్తుగా చైన్నె ఖైదీలు ఉన్న గదికి వెళ్లారు. అక్కడ గదిలో చుట్టు పక్కల గోడలను పరిశీలించారు. అక్కడ గదికి ఎదురుగా ఉన్న రాగి చెట్టు పై ఉన్న రెండు సెల్ఫోన్లను, మరుగుదొడ్డిలో ఉన్న సెల్‌ఫోన్ ఛార్జర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థితిలో సెల్ఫోన్లను అక్రమంగా ఉపయోగించినట్టు చైన్నె వడపళనికి చెందిన యుగేంద్రన్ (26), అరుంబాక్కం సెబాస్టియన్ జయప్రకాశ్ (27), మహాలింగ్ (39) అనే ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువులను కలుసుకోవడానికి నిషేధం విధించారు. -
చైన్నెలో మెథాంఫెటమైన్ అక్రమ రవాణా
● ఎస్ఐ భర్త, కాంగ్రెస్ నాయకుడి సహా ఐదుగురు అరెస్టు అన్నానగర్: చైన్నె నుంచి మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసిన ఎస్ఐ భర్తతో సహా ఐదుగురిని బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పాడి బ్రిడ్జి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నట్లు చైన్నె వెస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక దళానికి చెందిన పోలీసు అధికారి పాడి మెంబలం దగ్గర మారువేషంలో పర్యవేక్షిస్తూ బైకుపై అనుమానాస్పదంగా వచ్చిన ఇద్దరిని పట్టుకుని విచారణ చేపట్టారు. అప్పుడు వారు బైకులో మెథాంఫెటమైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి పుళల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా కుమారవేల్ అని తేలింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ప్రధాన వ్యక్తి, ప్రణాళికల అమలులో ప్రధాన వ్యక్తి. ఇతను మద్రాసు హైకోర్టులో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న వన్నారపేట పోలీస్‌స్టేషన్ స్పెషల్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ విశాలాక్షి భర్త అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో తిరువేర్కాడు ఆర్. ఎస్. పురం ప్రాంతానికి చెందిన సుభాష్, పుళల్ భక్తికి చెందిన గ్యాంగ్ నాయకుడు పార్థిబన్, ఓట్టేరి ప్రాంతానికి చెందిన అమీర్ పాషా, కావాంగరై ప్రాంతానికి చెందిన దీపక్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వృద్ధుల కోసం ఇంటి వద్దకే వైద్యం.. సాక్షి, చైన్నె: వృద్ధుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఇంటి వద్దకే హెల్త్ చెకప్ సేవలకు కావేరి ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. బుధవారం ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక బృందం ద్వారా ఈసీజీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలిసస్, లిపిడ్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్, హెచ్‌బీఏ1సీ తదితర వైద్య పరీక్షలను, ఇంటి వద్దకు వచ్చే వృద్ధులకు చేసే రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ వీఎస్ నటరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో వృద్యాప్య నిపుణులు, ఫిజియోథెరఫిస్ట్, సైకియాట్రిస్ట్, డైట్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ స్పెషలిస్టు, మల్టీ డిసిప్లినరీ బృందం సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, వృద్ధుల జనాభా పెరుగుతుండటాన్ని గుర్తు చేస్తూ, వారి అవసరాలకు అను గుణంగా సంరక్షణ, వైద్య పరంగాసేవల మీద దృష్టి పెట్టామని వివరించారు. -
‘వేళచ్చేరి’చెరువు పునరుద్ధరణకు రెడీ
● 203 గృహాల కూల్చి వేతకు నిర్ణయం సాక్షి, చైన్నె: వేళచ్చేరి చెరువు పునరుద్ధ్దరణకు అధికారులు రెడీ అయ్యారు. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించిన 203 గృహాలను తొలి విడతగా కూల్చి వేయడానికి చర్యలు చేపట్టారు. వివరాలు.. చైన్నెనగరం పరిధిలోని వేళచ్చేరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటా ఈశాన్య రుతు పవనాల రూపంలో ఈ పరిసరాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ వాహనాలను పరిరక్షించుకునేందుకు వంతెనల మీద పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ పరిసరాలు నీట మునిగేందుకు ప్రధాన కారణం వేళచ్చేరి చెరువు ఆక్రమణలకు గురై, ఆ నీరు నివాస ప్రాంతాలలోకి చొరబడటమే అని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ చెరువు గతంలో 265 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఈ చెరువుకు గిండి, ఆదంబాక్కం, పరిసరాల నుంచి కాలువల ద్వారా నీళ్లు వస్తాయి. అయితే ఈమార్గాలన్నీ అన్యాక్రాంతమయ్యాయి. పెద్దపెద్ద భవనాలు, గృహాలు పుట్టుకొచ్చాయి. దీంతో వర్షం వస్తే చాలు ఇక్కడి ప్రజల గుండెలలో రైళ్లు పరుగెడుతుంటాయి. ఆ మేరకు ఏటా ఇక్కడి ప్రజలు కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో వేళచ్చేరి చెరువును పునరుద్ధరించే పనులపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం 55 ఎకరాలతో ఈ చెరువు ఉంది. పుర్వ వైభవం దిశగా దశల వారీగా ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధ్దరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి విడతగా 25 నుంచి 30 ఎకరాల స్థలంలో ఉన్న 203 గృహాలను కూల్చి వేయడానికి సిద్ధమయ్యారు. ఈ గృహాల యజమానులకు ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా స్థలాలను అందించేందుకు నిర్ణయించారు. అలాగే ఈ చెరువు ఉబరి నీరు ప్రవహించేందుకు 2.14 కి.మీ దూరం ఉన్న కాలువను సైతం విస్తరించే దిశగా ఆక్రమణల దారులపై కొరడా ఝుళిపించే విధంగా అధికారులు దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. వర్షం వస్తే చాలు నీట మునిగి అంబత్తూరు పారిశ్రామిక వాడను రక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా బైపాస్ రోడ్డు మీదుగా కూవం వరకు అతి పెద్ద కాలు వ నిర్మాణానికి నిర్ణయించారు. అంబత్తూరు, పారిశ్రామిక వాడ, కొరట్టూరు పరిసరాలు చిన్న పాటి వర్షానికి వరద ముంపునకు గురవుతున్నాయి. పారిశ్రామిక వాడలో కోట్లలో నష్టం అన్నది తప్పడం లేదు. దీనిని గుర్తెరిగిన ప్రభుత్వం ఇక్కడకు ఆ పరిసరాలలలోని చెరువుల నుంచి వచ్చే వరదల కట్టడి మీద దృష్టి పెట్టారు. ఇందుకోసం రూ. 130 కోట్లతో అంబత్తూరు నుంచి బైపాస్ రోడ్డు వెంబడి భారీ కాలువను తవ్వి కూవం నదిలో కలిపే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అలాగే వేళచ్చేరి సమీపంలోని పళ్లికరణై పరిసరాలు వరద ముంపునకు గురి కాకుండా 18 కిలోమీటర్ల దూరం ముట్టుకాడు వరకు పయనించే బకింగ్ హాం కాలువ మీద సైతం దృష్టి పెట్టారు. సముద్రంలో ఈ కాలువ కలిసే ప్రాంతం నుంచి 2 కి.మీ దూరం 3.81 కోట్లతో పూడిక తీత పునరుద్ధరణ పనులకు నిర్ణయించారు. -
కారు ఢీకొని తెలుగు జర్నలిస్టు మృతి
సాక్షి, చైన్నె : మదుర వాయిల్ బైపాస్ రోడ్డులో అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న తెలుగు జర్నలిస్టు ప్రదీప్‌కుమార్ మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని లక్ష్మి నరసింహరాజు వారి పాళెంకు చెందిన ప్రదీప్‌కుమార్(39) చైన్నె అంబత్తూరులో భార్య, కుమార్తెతో నివాసం ఉన్నాడు. గతంలో పలు తెలుగు ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం యూట్యూబ్ చానల్ నడుపుతూ జర్నలిస్టుగా జీవితాన్ని సాగిస్తున్నారు. అలాగే పార్ట్ టైమ్‌గా బైక్ ట్యాక్సీని నడుపుకుంటూ కుటుంబాన్ని చైన్నెలో ప్రదీప్‌కుమార్ పోషిస్తూ వచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో బైక్ ట్యాక్సీ బుకింగ్ ను ముగించుకుని మదుర వాయిల్ బైపాస్ మీదుగా అంబత్తూరుకు వెళ్తుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఢీకొంది. కారు ఢీ కొన్న వేగానికి బైపాస్ రోడ్డు అవతలకు 100 అడుగుల దూరంలో ఎగిరి పొదళ్లలో ప్రదీప్ పడ్డాడు. శరీరం చిద్రం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. తప్పించుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ కారు నడిపిన వ్యక్తికి అందులోని సెన్సార్ డిస్ కనెక్ట్ కావడంతో కిలో మీటరు దూరంలో కారు ఆగి పోయింది. దీంతో కారును వదలి పెట్టి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమైన ఆ కారు వేలప్పన్ చావడికి చెందినదిగా గుర్తించారు. బుధవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న తెలుగు, తమిళ పాత్రికేయులు, కెమెరామెన్లు కేఎంసీ మార్చురీకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ప్రదీప్ కుటుంబ సభ్యులు చైన్నెకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా, ప్రదీప్‌కుమార్ కుటుంబానికి తెలుగు పాత్రికేయుల సంఘం ( తేజస్) తరపున రూ. 50 వేలు సాయం అందించనున్నట్టు ప్రధాన కార్యదర్శి గోటేటి వెంకటేశ్వరరావు, కోశాధికారి పి. నరసింహ తెలిపారు. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేయడమే కాకుండా ఇతర పాత్రికేయులు అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేయనున్నట్లు చెప్పారు.