Tamil Nadu
-
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన
తిరువళ్లూరు: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని హిందూ ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్సంపత్ ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా పూంగానగర్లో హిందూ ప్రజాపార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం, పార్టీ జెండాను ఎగురవేసే కార్యక్రమం బుధవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అర్జున్సంపత్ మాట్లాడారు. రాష్ట్రంలో మోజారిటీగా వున్న హిందువులు మైనారిటీలకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్లు అయిన ఉదయనిధి, సినీనటుడు జోసెఫ్ విజయ్ ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం డీఎంకే–తమిళగ వెట్రి కళగం మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగిందని ఆరోపించారు. అవినీతి రహిత పాలనను అందించాలని తాము ప్రయత్నం చేస్తుంటే అధికార దాహం కోసం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ఒప్పందాలను తెరపైకి తెస్తున్నారని వాపోయారు. 2026లో బీజేపీ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆయన, హిందువుల పరిరక్షణకు తమ వైపు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశం అనంతరం ఇటీవల పుల్లరంబాక్కం గ్రామంలో కూల్చివేసిన కృష్ణుడి ఆలయాన్ని సందర్శిఽంచడానికి ఆయన బయలుదేరారు. అయితే ఇందుకు పోలీసులు ససేమిరా అంటూ అడ్డుకున్నారు. దీంతో అర్జున్సంపత్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన మహిళలు, కృష్ణుడి వేషధారణలో వున్న చిన్నారులు అర్జున్సంపత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలోని ఆలయాన్ని కూల్చకుండా కాపాడాలని వారు కోరారు. -
ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
తిరువళ్లూరు: గుమ్మిడిపూండి సమీపం ఈగువారిపాళ్యం కొండమేదర కులాలకు చెందిన కుటుంబాలకు ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని పొన్నేరి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తిరువల్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఈగువారిపాళ్యం పంచాయతీలోని కొంగల్మేడు గ్రామంలో 30 సంవత్సరాల నుంచి మలైకురవన్(కొండమేదర) కులాలకు చెందిన కుటుంబాలు నివాసం వుంటున్నాయి. వెదురు బుట్టలు అల్లి వాటిని విక్రయించడమే వీరి ప్రధాన జీవనాధారం. వీరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అయితే ఉన్నత చదువులకు వెళ్లాడానికి కులధ్రువీకరణ సర్టిఫికెట్లు అవసరం వుంది. అయితే కులధ్రువీకరణ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. కాగా ఇదే కులానికి చెందిన ఆత్తుపాక్కం గ్రామస్తులకు ఇటీవల ఎస్టీ సర్టిఫికెట్లను సబ్‌కలెక్టర్ వాఘేసంఘత్ బల్వంత్ మంజూరు చేశారు. అయితే ఈగువారిపాళ్యం పంచాయతీలోని వారికి మాత్రం మంజూరు చేయలేదు. దీంతో బుధవారం ఉదయం పొన్నేరి ఆర్డీఓ కార్యాలయం వద్ద బుట్టలి అల్లి బాధితులు తమ కుటుంబసభ్యులతో కలసి ఆందోళనకు దిగారు. విషయం తెలిసి పొన్నేరి సబ్‌కలెక్టర్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సర్టిఫికెట్ల కోసం ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారని వారి నుంచి నివేదిక రాగానే సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంఘం నేతలు తమిళరసు, ఏవీ షణ్ముగం, గంగాదురై, విజయన్, శేకర్, మదన్ పాల్గొన్నారు. -
సంగ్రామానికి సంసిద్ధం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ప్రచార భేరి మోగించాలని కేడర్‌కు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం డీఎంకే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో 7వ సారిగా తమిళనాడు డీఎంకే పాలనను తీసుకొచ్చేందుకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రజా క్షేత్రంలోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలను దరిచేర్చే విధంగా, ప్రాజెక్టుల తీరు తెన్నులను సమీక్షించి వేగవంతం చేసే విధంగా సమీక్షలలో ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే డీఎంకేలో సమన్వయ కమిటీని రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా కేడర్, నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ప్రభుత్వ పరంగా ఓ వైపు, పార్టీ పరంగా మరో వైపు కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్నత స్థాయి కమిటీతో బుధవారం డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ సమావేశమయ్యారు. పార్టీ సీనియర్లు దురై మురుగన్, టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరు సెల్వం, కనిమొళి, ఉదయనిఽధి స్టాలిన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టడం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సారి 200 స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే తమిళనాడులో తమకు ఆరుసార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలు, 7వ సారి సైతం కట్టబెట్టే విధంగా, వారి మన్ననలు పొందే కార్యక్రమాల మీద దృష్టి పెట్టే విధంగా తీర్మానాలు చేశారు. తీర్మానాలలో కొన్ని .. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతూ, ఇప్పటి నుంచే ప్రచార భేరి మోగించాలని నిర్ణయించారు. జిల్లా, నగర, యూనియన్, పురపాలక స్థాయిలో కార్యక్రమాలను పార్టీ పరంగా విస్తృతం చేయడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను ప్రజలలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రచార భేరి మోగించాలని ఆదేశించారు. వజ్రోత్సవాల వేళ డీఎంకే కార్యక్రమాలు విస్తృతం కావాలని సూచించారు. అంకిత భావంతో సీఎం స్టాలిన్ ప్రజల కోసం చేస్తున్న మంచి పనులు, సంక్షేమాలను వివరించే విధంగా సభలు, సమావేశాలు విస్తృతం కావాలని, ఇంటింటా ప్రభుత్వ ప్రగతి గురించి సమగ్ర సమాచారం చేరవేసే రీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులోని ప్రతి డీఎంకే సోదరుడు ఓ సైన్యం అని చాటే విధంగా ప్రచార కార్యక్రమాలలో దూసుకెళ్లాలని తీర్మానించారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకు తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. హిందీని బలవంతంగా రుద్దే విధంగా సాగుతున్న ప్రయత్నాలను ఖండించారు. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించాలని పట్టుబడుతూ తీర్మానం చేశారు. మణిపూర్ మండుతోండటంపై విచారం వ్యక్తం చేస్తూ, ఇప్పటికై నా ప్రధాని నరేంద్ర మోదీ ఆరాష్ట్రంలో పర్యటించాలని , అన్ని వర్గాల ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నువాటాలో రాష్ట్రానికి కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని నినాదిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. ప్రచార భేరి మోగించండి ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు కేంద్రం విధానాలపై ఫైర్ -
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన
తిరువళ్లూరు: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని హిందూ ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్సంపత్ ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా పూంగానగర్లో హిందూ ప్రజాపార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం, పార్టీ జెండాను ఎగురవేసే కార్యక్రమం బుధవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అర్జున్సంపత్ మాట్లాడారు. రాష్ట్రంలో మోజారిటీగా వున్న హిందువులు మైనారిటీలకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్లు అయిన ఉదయనిధి, సినీనటుడు జోసెఫ్ విజయ్ ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం డీఎంకే–తమిళగ వెట్రి కళగం మధ్య రహస్య ఒప్పందం కూడా జరిగిందని ఆరోపించారు. అవినీతి రహిత పాలనను అందించాలని తాము ప్రయత్నం చేస్తుంటే అధికార దాహం కోసం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ఒప్పందాలను తెరపైకి తెస్తున్నారని వాపోయారు. 2026లో బీజేపీ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆయన, హిందువుల పరిరక్షణకు తమ వైపు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశం అనంతరం ఇటీవల పుల్లరంబాక్కం గ్రామంలో కూల్చివేసిన కృష్ణుడి ఆలయాన్ని సందర్శిఽంచడానికి ఆయన బయలుదేరారు. అయితే ఇందుకు పోలీసులు ససేమిరా అంటూ అడ్డుకున్నారు. దీంతో అర్జున్సంపత్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన మహిళలు, కృష్ణుడి వేషధారణలో వున్న చిన్నారులు అర్జున్సంపత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలోని ఆలయాన్ని కూల్చకుండా కాపాడాలని వారు కోరారు. -
ఆహారం పంపిణీ చేసే ముసుగులో..
● బైకులో తీసుకొచ్చిన రూ.21 లక్షలు స్వాధీనం అన్నానగర్: పారిమునై, మన్నడి తదితర ప్రాంతాల్లో హవాలా నగదు మార్పిడి జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్త్ కోస్ట్ పోలీసులు పారిమునై రాజాజీ రోడ్డులో మంగళవారం రాత్రి వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో బైకుపై అటుగా వచ్చిన యువకుడిని సోదా చేశారు. అతని వద్ద ఉన్న ఫుడ్ డెలివరీ బ్యాగ్‌లో నగదు నింపినట్లు గుర్తించారు. విచారణలో అతను గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న ఎలవూరుకు చెందిన అమానుల్లా (34)గా గుర్తించారు. ఈ డబ్బు యజమాని మలేషియాలో ఉన్నాడని, అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలో చెల్లించేందుకు తీసుకున్నానని చెప్పాడు. కానీ సరైన పత్రాలు లేని కారణంగా రూ.21 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. అదే విధంగా మన్నడి ప్రకాశం రోడ్డులోని తన ఇంటి నుంచి సెల్ఫోన్లు విక్రయిస్తూ చైన్నె ముత్తునాయకన్ వీధికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) సరైన పత్రాలు లేకుండా బైకులో తీసుకొచ్చిన రూ.11 లక్షలను ముత్యాల్ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని కూడా ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు హవాలా డబ్బు కావచ్చునని తెలుస్తోంది. -
బంగారు కడ్డీల స్వాధీనం
అన్నానగర్: దుండగులు ముళ్లపొదలో దాచి ఉంచిన రూ.49 లక్షల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. మదురై జిల్లా కరుప్పయూరాణి గురువమ్మాళ్కు చెందిన మురుగన్ కుమారుడు మూర్తి (30), పెరియకులంకు చెందిన మారిముత్తు కుమారుడు అంశరాజన్ చోరీ కేసుల్లో కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. తేని జిల్లాలోని పళనిశెట్టిపట్టి ప్రాంతాల్లో వీరు చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. పళనిశెట్టిపట్టి పోలీసులు ఇద్దరిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గత వారం తేని జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. అనంతరం కోయంబత్తూరు జైలు నుంచి మూర్తి, అంశరాజన్లను పోలీసులు తీసుకెళ్లి పళని చెట్టిపట్టి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. పళనిశెట్టిపట్టి ప్రాంతంలోనే తొమ్మిది దొంగతనాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. దోచుకెళ్లిన బంగారు ఆభరణాలను కరిగించి, వెండి వస్తువులు విక్రయించి, దోచుకున్న సొమ్మును తమ వద్దే ఉంచుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు వెల్లడైంది. పళనిశెట్టిపట్టి ప్రాంతంలో దోచుకున్న 88 తులాల ఆభరణాలను కరిగించి 6 బంగారు కడ్డీలుగా మార్చి మారియమ్మన్ కోవిల్పట్టి సమీపంలోని ముళ్లపొదలో మట్టిలో పాతిపెట్టినట్లు కూడా వెల్లడైంది. ఆ తర్వాత పోలీసులు వారిని మంగళవారం సాయంత్రం ఆ పొదల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పాలిథిన్‌లో కప్పి మట్టిలో పాతిపెట్టిన 88 తులాల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.49 లక్షలు. 7 రోజుల పోలీసు కస్టడీ తర్వాత, పోలీసులు వారిద్దరిని తేని జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. -
కోలాహలంగా కేక్ మిక్సింగ్ వేడుక
సాక్షి, చైన్నె : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించే విధంగా రుచికరమైన వంటకాలతో పాటు కేక్‌ను అందిం చేందుకు మహాబలిపురంలోని వెల్కమ్ హోటల్ కెన్సెస్ పాం బీచ్ అధినేత కె.నరసారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు లోని ప్రముఖ ప్రాంతమైన మహాబలిపురంలోని ఈ హోటల్ ప్రాంగణంలోని సముద్రతీరంలో నూతనంగా ప్రారంభించిన శ్రీనమ్మ షాక్ బీచ్శ్రీ రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం కెన్సెస్ సీఈఓ ఎం. కృష్ణ సారథ్యంలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సందడిగా సాగింది. ఎగ్జిక్యూటివ్ చెఫ్ సబూజ్ పాల్ సహా 30 మంది చెఫ్‌లు, సెలబ్రెటీలు, విదేశీ పర్యాటకులు కలసి పలు రకాల డ్రైఫ్రూట్స్, 35 లీటర్ల వివిధ రకాల ద్రవ్యాలతో ఉత్సాహంగా కేక్ మిక్సింగ్ చేశారు. ఈ మిశ్రమాన్ని 30 రోజులు నానబెట్టి క్రిస్మస్ ముందు విదేశీ స్టాయిలో రుచికరమైన కేక్ ను తయారుచేసి వినియోగ దారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వీరేంద్ర తాపా, హోటల్ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొని శాంతా క్లాజ్ వేషధారణలో సందడి చేశారు.ఈ సందర్భంగా సీఈఓ ఎం.కృష్ణ మాట్లాడుతూ క్రిస్మస్, 2025 నూతన సంవత్సర వేడుకలను కోలాహలంగా జరుపుకొనేందుకు, కస్టమర్లను ఆకర్షించే రీతిలో సదుపాయాలను భారీస్థాయిలో స్థాయిలో సమకూర్చుతున్నట్లు తెలిపారు. -
● ఐదు రోజులుగా ఉన్న కుమారుడు ● పోలీసుల విచారణ
తండ్రి మృతదేహంతో.. వేలూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని సన్ముగం వీధికి చెందిన గోవిందస్వామి(75), మేగలారాణి దంపతుల కుమారుడు అరవిందన్. ఇతను ఓ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం మేగలారాణి మృతి చెందారు. దీంతో మనో వేదనతో ఉన్న అరవిందన్ విధులకు సక్రమంగా వెళ్లకుండా ఇంటిలోనే ఉంటూ ఏడాది క్రితం వాలంటీర్ రిటైర్డ్మెంట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఐదు రోజుల క్రితం తన తండ్రి గోవిందస్వామి ఇంటిలోనే మృతి చెందినప్పటికీ ఈ విషయాన్ని ఎవరికీ తెలపకుండా ఇంటికి తాళం వేసుకొని ఇంటిలోనే ఉండిపోయినట్లు సమాచారం. చుట్టుపక్కల వారు గమనించి ఇంటిలో తరచూ ఏసీ ఆన్‌లోనే ఉందని ఇంటి నుంచి దుర్వాసన వస్తోదని, ఇంటికి లోపల తాళం వేసి ఉందని వందవాసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి ఇంటిలోకి వెల్లి చూడగా ఇంటిలో గోవిందస్వామి మృతి చెంది ఐదు రోజులు అవుతున్నట్లు ఈ కారణంగానే దుర్వాసన వస్తోందని గుర్తించారు. అరవిందన్ మతి స్థిమితం లేక పోవడంతోనే తండ్రి మృతి చెందిన విషయం కూడా తెలియకుండా అతనితో పాటు ఐదు రోజులు జీవించాడని తెలియవచ్చింది. వీటిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అగస్తీశ్వరర్ విగ్రహం సమర్పణ
కొరుక్కుపేట: పూందమల్లి సమీపంలోని చెంబేడులోని అరుళ్మెగు మంగళాంబికై సమేత అగస్తీశ్వరాలయంలో ప్రతిష్టించేందుకు అందమైన అగస్తీశ్వరర్, లోపాముద్ర విగ్రహాలను చైన్నెకి చెందిన జగన్మోహనరావు అనే భక్తుడు కానుకగా సమర్పించారు. ఆ ఆలయం వద్ద బుధవారం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పూందమల్లి శాసనసభ్యుడు ఎ.కృష్ణస్వామి ఆ విగ్రహాల ను స్వీకరించి ఆలయ నిర్వాహకులకు అందజేశా రు. ఈ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 28న జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాదవూరు అడిగళార్, జనకళ్యాణ్ సుబ్రమణియన్, సూర్య ప్రకాష్, మారి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అత్తగారింటిలో 60 సవర్ల బంగారం చోరీ
● అల్లుడు అరెస్టు వేలూరు: వేలూరు బాగాయం మేట్టు ఇడయంబట్టుకు చెందిన రిటైర్డ్ బీడిఓ సాలుమోన్. ఇతని భార్య మేరీ సెలీన్ దంపతుల కుమారుడు అలెక్స్ దేవప్రసాద్, కుమార్తె రాధికలున్నారు. రాధికకు తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ స్వామ్ అలియాస్ జబదురైకి కొన్నేళ్ల కిత్రం ఇచ్చి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో గత మాసంలో సాలుమోన్ భార్య మేరీ సెలీన్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దహన క్రియలకు కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈనెల 14న స్వామ్, అతని భార్య రాధిక తిరువళ్లూరు వెళ్లారు. సాలుమోన్ చైన్నెలో పనిచేస్తున్న తన కుమారుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అత్తగారింటిలో ఉన్న బంగారం చోరీ చేసేందుకు జబదురై పన్నాగం పన్నాడు. దీంతో తిరువళ్లూరుకు చెందిన తన స్నేహితుడు హుస్సేన్‌తో కలిసి ఆటోలో మేట్టు ఇడయంబట్టుకు వచ్చారు. అనంతరం ముందుగా తయారు చేసి ఉంచిన నకిలీ తాళాలు వేసి ఇద్దరూ ఇంటిలోనికి వెళ్లారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 60 సవరాల బంగారాన్ని చోరీ చేసి అక్కడ నుంచి తిరువళ్లూరుకు వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన సాలుమోన్ ఇంటి తాలాలతో పాటు బీరువాను ధ్వంసం చేసి బంగారం చోరీ చేసిన విషయాన్ని గుర్తించారు. వెంటనే బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో సాలుమోన్ అల్లుడు జబదురై ఇంటికి ఆటోలో వచ్చి వెళ్లినట్లు నమోదు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా బంగారం చోరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. దీంతో అతని వద్ద ఉన్న 60 సవరాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని జబదురై, హుస్సీన్ను అరెస్ట్ చేశారు. అత్తగారింటిలో అల్లుడే చోరీ చేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. -
చెట్టును ఢీకొన్న బైక్
– ముగ్గురు విద్యార్థుల దుర్మరణం సేలం: కీల్పెన్నాత్తూర్ సమీపంలో చెట్టును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. తిరువన్నామలై జిల్లా వేట్టవలం గ్రామానికి చెందిన వన్నియన్ కుమారుడు ముత్తులింగం (16), చిన్నఓలైపట్టి గ్రామానికి చెందిన రాజా కుమారుడు రామన్ (17), ఇసుక్కలికాట్టేరి గ్రామానికి చెందిన జగదీష్ (17). ఈ ముగ్గురు వేట్టవలం ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నారు. వీరు మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బైక్‌లో వేల్లవలం నుంచి తలవాయ్కుళం వైపు వెళ్లారు. ఆవూర్ మురుగన్ ఆలయం వద్ద వెళుతుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముత్తులింగం సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. రామన్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వేట్టవలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ రామన్, జగదీష్‌లను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రామన్ మృతిచెందాడు. వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగదీశ్ బుధవారం మృతిచెందాడు. వేట్టవలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా సింధు నాగరికత పరిశోధన శత వార్షికోత్సవం
కొరుక్కుపేట: చైన్నె సైదాపేటలోని యూనివర్సిటీలో సింధు నాగరికత పరిశోధన శాతవార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. తమిళ అభివద్ధి సంస్థ చై ర్మన్ వీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ ప్రొఫెసర్ జి. విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన తమిళ సంస్కృతి విభా గం కార్యదర్శి వనంగాముడి ఆహుతులను ఆహ్వానించారు. ఎస్ఆర్ముగం ప్రారంభ ఉపన్యాసం చేశారు. త మిళనాడు ఓపెన్ యూనివర్సిటీ తమిళ విభాగం డైరెక్ట ర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం సింధు నాగరికత విశిష్టతను వివరించారు. అదేవిధంగా ద్రావిడ సంస్కృతి అంశంపై సూర్య జేవియర్ మాట్లాడారు. ఈ వేడుకల్లో అమర్నాథ్ రామకృష్ణ ఎ.కరుణానందన్ ప్రొఫెసర్ ఎ.పద్మా వతి సింధు నాగరికత పురావస్తు పరిశోధన అంశంపై ప్రసంగించారు. ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ ప్రొఫెసర్ ప దుమానార్, తమిళ విభాగం ఉపాధ్యక్షులు జె. మోహన్, కార్యదర్శి ఎం. చిదంబర భారతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సింధు నాగరికత త వ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులతో కూడిన ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వైయాపురి పాల్గొన్నారు. -
తమిళనాడులో దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని..
చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. తంజావూర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌పై ఓ ప్రేమోన్మాదా దాడికి తెగబడ్డాడు.తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో క్లాస్‌రూమ్‌లో ఆమెను కత్తితో పొడిచి చంపాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.వివరాలు..మల్లిపట్టణం ప్రభుత్వ పాఠశాలలో రమణి అనే యువతి(26) టీచర్‌గా చేస్తోంది. కొంతకాలంగా మధన్ అనే వ్యక్తి రమణిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. ఇటీవల రమణి, మధన్ కుటుంబాలు వారి వివాహం గురించి చర్చలు జరిపారు. కానీ రమణి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన మధన్.. యువతి పనిచేస్తున్నపాఠశాలకు వెళ్లిన పదునైన ఆయుధంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షతోనే హత్యకు పాల్పడిట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
నాలుగున్నర కిలోల బంగారం సీజ్
– ఇద్దరు అరెస్టు అన్నానగర్: మండపం సమీపంలో కారులో తీసుకువచ్చిన నాలుగున్నర కిలోల స్మగ్లింగ్ బంగారు కడ్డీలను సెంట్రల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాలు.. శ్రీలంక నుంచి బంగారు కడ్డీలు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సోమవారం రాత్రి రహస్య సమాచారం అందింది. దీంతో మండపం–ఉచిపుల్లి మధ్య కుంజ్ చర్వలసాయి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో నాలుగున్నర కిలోల బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కారులో వచ్చిన రామనాథపురానికి చెందిన సేతు ఇబ్రహీం, మండపానికి చెందిన నాజర్‌ను అరెస్టు చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల విలువ సుమారు రూ.మూడున్నర కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. -
బీజేపీలో సంస్థాగత సమరం
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. వార్డు కమిటీలకు తొలుత ఎన్నికలను నిర్వహించేందుకు మంగళవారం చర్యలు తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరిగిన విషయం తెలిసిందే. ఆశించిన మేరకు సభ్యత్వ నమోదు ముందుకు సాగలేదు. కోటి సభ్యులను చేరుస్తామని నేతలు ప్రకటించినా, ఆచరణలో విఫలమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముగించిన రాష్ట్ర నేతలు సంస్థాగత ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. పార్టీ సీనియర్ నేత చక్రవర్తి నేతృత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలుత పార్టీ పరంగా ఉన్న 68,144 వార్డు శాఖలకు 30వ తేదిలోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు నిర్ణయించారు. ఒక్కో శాఖలో ఓ అధ్యక్షుడు, 11 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు తప్పనిసరిగా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి చక్రవర్తి పేర్కొంటూ, రాష్ట్రంలో 68 వేల వార్డు కమిటీ శాఖలు ఉన్నాయని, వీటికి తొలుత సంస్థాగత ఎన్నికలను ముగించి తర్వాత 1231 మండలాలు, పార్టీ పరంగా ఉన్న 66 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యుల సంఖ్య 40 లక్షలకు చేరినట్టు ప్రకటించారు. సభ్యత్వ నమోదులో ఉన్న కొన్ని చిక్కులను తొలగించే విధంగా పార్టీ అధిష్టానం ఈనెల 22వ తేదీన నిర్వహించనున్న సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నామన్నారు. -
మోతపై.. వాత!
● బస్సుల్లో ఇకపై లగేజీ చార్జీ తప్పనిసరి ● నగర రవాణా సంస్థ నిర్ణయం ● ట్రాలీ, సూట్ కేస్, పెద్ద బ్యాగ్‌లకు టికెట్లుసాక్షి, చైన్నె: చైన్నె నగర రవాణా సంస్థ బస్సులలో ఇకపై లగేజీ చార్జీ తప్పనిసరి కానుంది. పెద్ద ట్రాలీ, సూట్ కేసు, బ్యాగ్‌లతో ప్రయాణించే వారికి లగేజీ చార్జీగా ఆ వ్యక్తి ప్రయాణానికి అయ్యే టికెట్టు ధరను నిర్ణయించి వసూలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు మార్గ దర్శకాలను నగర రవాణా సంస్థ(ఎంటీసీ) ప్రకటించింది. వివరాలు.. చైన్నె నగరంలో 625 మార్గాలలో 3 వేల మేరకు ఎంటీసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి. రోజుకు ఈ బస్సులలో 30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గాలలో బస్సుల సేవలు, ప్రయాణికులకు ఎదురు అవుతున్న సమస్యలు, బస్సులలో లగేజీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు వంటి అంశాలపై అధికారులు అభిప్రాయాలు సేకరించారు. ఇందులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా లగేజీ చార్జీ వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంటీసీ బస్సులలో 20 కేజీలలోపు బరువు కలిగిన వస్తువులను తీసుకెళ్లేవారికి ఎలాంటి లగేజీ చార్జీ వసూలు చేయడం లేదు. అయితే, పార్శిల్ పెద్దదిగా ఉంటే చాలు కండెక్లర్లు లగేజీ చార్జ్ అంటూ టికెట్లు కొట్టే స్తున్నారు. దీంతో ప్రయాణికుడికి, కండెక్టర్‌కు మధ్య అనేక సందర్భాలలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. వీటన్నింటికీ ముగింపు పలికే విధంగా చార్జీల వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించారు. పెద్ద వాటికే.. నగర రవాణా సంస్థ బస్సులో ప్రయాణికులు 65 సెం.మీ పైగా ఉన్న ట్రాలీ, సూట్ కేసులు, బ్యాగ్‌లను లేదా, 20 కేజీలకు పైగా బరువు కలిగిన పార్సిళ్లను తీసుకెళ్లే వ్యక్తి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారో, ఆ దూరం ఆధారంగా అతడి టికెట్టు చార్జీ మేరకు అదనంగా మరో టికెట్టు తీసుకునే విధంగా ఎంటీసీ బస్సులలోని కండెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నగర రవాణా సంస్థలోని సాధారణ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులలో ఈ అదనపు టికెట్టు చార్జీని లగేజీ చార్జీగా నిర్ణయిస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు సొంత ఉపయోగం కోసం భుజాన తగిలించుకునే బ్యాగ్, లేదా బట్టల సంచి ,హ్యాండ్ డ్యాగ్, చిన్న సూట్‌కేసు, కెమెరా బ్యాగ్, ల్యాప్ టాప్, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల బ్యాగ్, దివ్యాంగుల వీల్ చైర్లను ఎలాంటి లగేజీ చెల్లించుకుండా బస్సులలో తీసుకెళ్లే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కళాకారులు తమ వాయిద్యాలను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం చైన్నె కోయంబేడు నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే బస్సులను కిలాంబాక్కం బస్టాండ్‌కు మార్చేశారు. దీంతో నగర వాసులు చైన్నె శివారులో ఉన్న కిలాంబాక్కంకు తమ బ్యాగులు, ట్రాలీలలో ప్రయాణించేందుకు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ పెద్ద ట్రాలీ, బ్యాగ్‌లు, సూట్ కేసులకు లగేజీ నిర్ణయించడం గమనార్హం. అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది ఎదురయ్యే విధంగా ఉండే వస్తువులు, పార్సిళ్లను బస్సులలో అనుమతించ వద్దని స్పష్టం చేశారు. తపాల్, పత్రికల పార్సిళ్ల తరలింపునకు ముందస్తు అనుమతిని ఆయా సంస్థలు పొందే విధంగా సూచించారు. -
నా పరువుకు భంగం కలిగిస్తున్నారు
● కోర్టులో పళణి వాదన ● విచారణకు హాజరు సాక్షి, చైన్నె: తన పరువుకు భంగం కలిగించే విధంగా ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని కోర్టులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తన తరపున వాదనను ఉంచారు. అరప్పోర్ ఇయక్కంపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టుకు పళణి హాజరయ్యారు. వివరాలు.. 2016–21 కాలంలో రహదారుల శాఖలో రూ. 692 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. శివగంగై, కోయంబత్తూరులలో రహదారుల పనులలో ఈ అక్రమాలు జరిగినట్టు ఆ శాఖను తన పరిధిలో ఉంచుకున్న అప్పటి సీఎం, ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై ఆ ఇయక్కం ఆరోపణలు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. తనపై ఆధార రహిత ఆరోపణలు చేసిన అరప్పోర్ ఇయక్కం కన్వీనర్ జయరాం వెంకటేషన్, కో కన్వీనర్ జాకీర్ హుస్సేన్‌పై పళణి స్వామి పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై రూ.1.10 కోట్లకు ఈ దావా వేశారు. ఈ పిటిషన్ మద్రాసు హైకోర్టు ఆవరణలోని మాస్టర్ కోర్టులో విచారణలో ఉంది. ఈ విచారణ నిమిత్తం ఉదయం స్వయంగా కోర్టుకు పళణి స్వామి హాజరయ్యారు. ఆయన తరపున న్యాయవాది ఇన్బదురై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మహాలక్ష్మి ఎదుట తన తరపు వాదనను పళణిస్వామి ఉంచారు. ఆధార రహిత ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అరప్పోర్ ఇయక్కంం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదన అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
కస్తూరిపై మరిన్ని కేసులు
సాక్షి, చైన్నె : తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై మరికొన్ని పోలీసు స్టేషన్లలో కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన కస్తూరి పుళల్ జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఖైదీ నెంబర్ 644798 కేటాయించినట్టు సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమైపె చైన్నెలో నాలుగు, మదురైలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆమైపె కోయంబత్తూరు, కుంభకోణం, కోయంబేడు పోలీసు స్టేషన్లలో సైతం ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. ఆమైపె మరికొన్ని కేసులు నమోదు చేసి, ఆ కేసులలో అరెస్టు చేసే విధంగా పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
చైన్నె విమానంలో మహిళ మృతి
కొరుక్కుపేట: మలేషియా నుంచి చైన్నె వచ్చిన విమానంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు..మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం చైన్నెకి చేరుకుంది. ఇందులో కళ్లకురిచికి చెందిన మహిళ రాసత్తి మాయవన్ (37) సహా 167 మంది ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులంతా విమానం నుంచి దిగిపోయారు. కానీ రాసత్తి మాత్రం సీట్లో కూర్చోనే ఉన్నారు. అనుమానం వచ్చిన విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు వైద్య బృందానికి సమాచారం అందించారు. వెంటనే వైద్య బృందం విమానం ఎక్కి రాసత్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. గుండెపోటుతో చనిపోయిందా? లేక మరేదైనా కారణమా? ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. -
మాజీ మంత్రి అల్లుడి హత్య కేసులో తీర్పు
సాక్షి, చైన్నె : కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, న్యాయవాది కామరాజ్ హత్య కేసులో మదురై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో పురట్చి భారతం పార్టీ మహిళా విభాగం నేత కల్పనకు యావజ్జీవ శిక్ష విధించారు. కేంద్ర మాజీమంత్రి దళిత్ ఏలుమలై అల్లుడు, ప్రముఖ న్యాయవాది కామరాజ్ 2014లో చైన్నె ఓట్టేరిలోని నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో పురట్చి భారతం మహిళా విభాగం నాయకురాలు కల్పన, ఆమె ఇంట్లో పనిచేసే ఆనందన్, కార్తిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తొలుత తిరువళ్లూరు కోర్టులో ఆతర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మదురై జిల్లా మేజిస్ట్రేట్ కోర్టుకు మారింది. 2015 నుంచి ఈ కేసు విచారణ మదురై కోర్టులో జరుగుతూ వస్తోంది. విచారణలో జాప్యంపై 2021లో కామరాజ్ సహోదరి తేన్ మొళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను త్వరితగతిన ముగించాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. కేసు విచారణను మూడు నెలలలో ముగిసి తీర్పు వెలువరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచారణ వేగం పెరిగింది. మదురై జిల్లా కోర్టున్యాయమూర్తి శివ కటాక్షం కేసు విచారణను ముగించారు. మంగళవారం తీర్పు వెలువరించారు. కల్పనకు యావజ్జీవ శిక్షతోపాటు 5 వేలు జరిమానా విధించారు. మిగిలిన ఇద్దరిని విడుదల చేశారు. -
● ప్రమాదాలకు నిలయంగా చైన్నెలో 10 రోడ్లు ● కొన్ని కూడళ్లలోనూ మరణమృదంగం ● పెరిగిన ప్రమాదాలతో నగరవాసుల్లో కలవరం
మహానగరం చైన్నెలో కొన్ని మార్గాలు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఇందులో ముఖ్యంగా పది మార్గాలు, కొన్ని వంతెనలపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక కొన్ని కూడళ్లలో నిర్లక్ష్యంగా రోడ్డు దాటే వారిని మృత్యువు కబలిస్తోంది. సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో ఏటా రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీందో ప్రమాదాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం రోడ్డు భద్రతా, అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఇటీవల నెల రోజులుగా జీరో యాక్సిడెంట్ డే పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ప్రమాదాలు తప్పడం లేదు. ద్విచక్ర వాహనాలలో హెల్మెట్ ధరించకుండా వెళ్లే వారు, సీట్‌బెల్ట్ ధరించకుండా కార్లను వేగంగా నడిపే వారు, నిర్లక్ష్యంగా రోడ్డుదాటే పాదచారులు అంటూ ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించే వారు ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో క్షతగ్రాతులుగా మారి కుటుంబ సభ్యులకు క్షోభను మిగుల్చుతున్నారు. ఎక్కడెక్కడ ప్రమాదాలు మరీ ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, ఆయా మార్గాల్లో ప్రమాదాల కట్టడికి చర్యలు విస్తృతంగా చేపట్టినా, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా, హెచ్చరికలు ఇస్తూ ప్రత్యేక ఏర్పాట్ల మీద దృష్టి పెట్టినా, ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. పది మార్గాలు.. చైన్నె ట్రాఫిక్ పోలీసు పరిశీలన మేరకు మూడేళ్లలో చైన్నె నగరంలో అత్యఽధికంగా ప్రమాదాలు జరిగిన మార్గాలపై అధ్యయనం చేశారు. ఇందులో టాప్ 10లో ఉన్న మార్గాలను ఎంపిక చేశారు. వంతెన మీద నుంచి కిందకు దిగే సమయంలో, చిన్న చిన్న ఇరుకు రోడ్లలో మృత్యువు పంజా విసురుతున్నట్టు వెలుగు చూసింది. 2021 నుంచి ఈ ఏడాది జూలై 24వ తేదీ వరకు ఉన్న గణాంకాల మేరకు నగరంలో 10 మార్గాలు మృత్యు నిలయాలుగా గుర్తించారు. ఇందులో చైన్నె నగరానికి ఐకానిక్ వంతెనగా ఉన్న కత్తి పారా వంతెన తొలిస్థానంలో ఉంది. కత్తి పారా వంతెన నుంచి జీఎస్టీ రోడ్డులోకి వాహనాలు వచ్చే క్రమంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ 223 ప్రమాదాలు జరగ్గా 177 మంది గాయపడ్డారు. 37 మంది మరణించారు. తదుపరి మదుర వాయిల్లో బైపాస్ రోడ్డును అనుసంధానించే ప్రదేశంలోని వంతెన మార్గం ఉంది. ఇక్కడ 143 ప్రమాదాలు జరగ్గా 105 మంది గాయపడ్డారు. 33 మంది మరణించారు. చైన్నె కోయంబేడులో కొత్తగా ఇటీవల నిర్మించిన వంతెనతో పాటు పాత వంతెన మీదుగా సైతం ప్రమాదాలు అధికంగానే ఉన్నాయి. ఇక్కడ 104 ప్రమాదాలు, గిండి నుంచి ప్యారీస్ వరకు ఉన్న సుమారు 14 కి.మీ దూరం ఉన్న అన్నాసాలైలలోనూ ప్రమాదాలు ఎక్కువే. ఇక్కడ 190 ప్రమాదాలు జరగ్గా 151 మంది గాయపడ్డారు. 26 మంది మృత్యువొడిలోకి చేరారు. అలాగే చైన్నె మెరీనా తీరంలోని నేప్పియర్ వంతెన మార్గం కూడా మృత్యుకుహరంగా మారింది. ఇక్కడ 155 ప్రమాదాలు జరగ్గా 107 మంది గాయాల పాలయ్యారు. 26 మంది మరణించారు. వానగరంలో 147 ప్రమాదాలలో 106 మంది గాయాలయ్యారు. 35 మంది మృతి చెందారు. ఈ పది మార్గాలు ప్రస్తుతం చైన్నెలో ప్రమాదాలకు నిలయాలుగా మారి ఉండటంతో కట్టడి దిశగా విస్తృత చర్యలకు చైన్నె పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అలాగే చైన్నె నగరంలో కొన్ని కూడళ్లలో నిర్లక్ష్యంగా రోడ్లు దాటడం, సిగ్నల్స్‌ను అనుసరించక పోవడం వంటి కారణాలతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్టు గుర్తించారు. సబ్ వేలను, పుట్ ఓవర్ బ్రిడ్జిలలో వెళ్లకుండా రోడ్డును నిర్లక్ష్యంగా దాటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న వాళ్లు ఎక్కవగా ఉన్నారు. ఇందులో చైన్నె మెట్రో, బ్రాడ్ వే బస్టాండ్, నెహ్రు పార్కు మెట్రో స్టేషన్లలో నిత్యం ప్రమాదాలు జరగడమే కాకుండా ఈ ప్రాంతాలలో 50 మంది మృత్యువాత పడటం గమనార్హం.కత్తి పారా వంతెనవంతెనల రూపంలో.. చైన్నె నగరం, శివారు ప్రాంతాలు అభివృద్ధి పథంగా దూసుకెళ్తున్నాయి. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. రద్దీని కట్టడి చేయడం కోసం చైన్నె వ్యాప్తంగా వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. అలాగే మెట్రో రైలు సేవల కార ణంగా అనేక మార్గాలు వన్ వేలుగా మారా యి. మరికొన్ని మార్గాలు ఇరుకు రోడ్లుగా మారాయి. ఈ ప్రాంతాలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. అదే సమయంలో వాహన దారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వంతెన మార్గాలలో అ యితే, అతి వేగంగా దూసుకెళ్లి, లింక్రోడ్డులలోకి ప్రవేశించే క్రమంలో ప్రమాదాల బారిన పడే వారు మరీ ఎక్కువగా ఉన్నట్టు చైన్నె ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో వెలుగు చూ సింది. నగరంలో అనేక వంతెనలు ప్రస్తుతం మృత్యు మార్గాలుగా మారి ఉన్నాయి. వంతెనల మీద నుంచి అతి వేగంగా వచ్చే ద్విచక్ర వాహన దారులు అదుపు తప్పి ప్రమాదానికి గురై మృత్యువాత పడటం లేదా క్షతగాత్రులుగా ఆస్పత్రిలో చేరడం క్రమంగా పెరుగుతోంది. ఈ వంతెన మార్గాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండటంతో వాహనాల వేగాన్ని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ వంతెనలలో నిర్ణీత స్పీడ్‌లోనే వాహనాలను నడపాలన్న ఆదేశాలు, బోర్డులు ఉన్నా, అనుసరించే వారు కరువయ్యారు. దీంతో ప్రమాదాలు పెరిగాయి. -
‘దైవానై’ కన్నీటి పర్యంతం
● మేత తినకుండా శోకంలో మునిగిన తిరుచందూరు ఆలయ ఏనుగు సేలం: మావటితో సహా ఇద్దరిని తొక్కి చంపిన తిరుచెందూరు ఆలయ ఏనుగు దైవానై మంగళవారం కన్నీటి పర్యంతమైంది. మేత తినకుండా శోకంలో మునిగిపోయింది. తిరుచెందూరు ఆలయంలో దైవానై(25) అనే పేరుతో ఆడ ఏనుగు ఉంది. ఈ ఏనుగును భక్తులు అత్యంత గౌరవంతో పూజిస్తుంటారు. ఉత్సవాల సమయంలో, ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే పూజల్లో ఈ ఏనుగు పాల్గొంటుంది. ఆలయం సమీపంలోనే ఈ ఏనుగు సంరక్షణ శిబిరం ఉంది. సోమవారం మధ్యాహ్నం దైవానై సంరక్షణ శిబిరంలో అరుపులు వినబడడంతో పోలీసులు పరుగులు తీశారు. అక్కడ దైవానై కాళ్ల కింద నలిగిన స్థితిలో ఓ యువకుడు మరణించి ఉండడాన్ని గుర్తించారు. సమీపంలోనే ఆ ఏనుగు సంరక్షకుడు మావటి ఉదయకుమార్ తీవ్రగాయాలతో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతడు మరణించారు. మరో మృతుడిని మావటి ఉదయకుమార్ బంధువు శిశుకుమార్గా గుర్తించారు. జిల్లా అటవీ అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకుని దైవానై ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగు మంగళవారం కన్నీటి పర్యంతమైంది. మావటి చనిపోవడంతో ఆహారం తినకుండా దిగాలుగా శోకంతో ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.