Medchal
-
మేడ్చల్‌లో డ్రగ్స్ కలకలం.. ముఠా నాయకుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కిలో మెపిడ్రైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠా నాయకుడు అల్లు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. మేడ్చలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ పోలీసులతో నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఒక విలో మెపిడ్రైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేస్తున్న అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సత్యనారాయణ యాదగిరిగుట్టలోని ఒక మూతపడిన ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, డ్రగ్స్ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి నిల్వ చేసిన గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయ్నతం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్ కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
నాకెలాంటి ఈడీ నోటీసులు రాలేదు: మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్ : మెడికల్ కళాశాల పీజీ సీట్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు అందాయంటూ వస్తున్న మీడియా కథనాలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టత ఇచ్చారాయననాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు నా కొడుక్కి ఇచ్చారు. గతంలో ఈడీ రైడ్స్ జరిగాయి. విచారణకు రమ్మంటారు.. అది రెగ్యులర్ ప్రాసెస్ అని అన్నారాయన. కాగా, మెడికల్ పీజీ సీట్ల స్కాం కేసులో.. ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇక నోటీసుల్లో.. అక్రమంగా సీట్లను బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో కిందటి ఏడాది మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు జరిపింది. అంతేకాదు మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేందర్‌రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కూడా. -
అమ్మో.. అమోయ్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: అమోయ్‌కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే కాదు అటవీ, రక్షణశాఖ, కాందిశీకుల భూములనూ తన అధికారాన్ని ఉపయోగించి ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలంలో భూదాన్భూములపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టడంతో ఆయన బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు ఈడీ విచారణ చేస్తుండగానే.. మరోవైపు హైకోర్టు, అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని పైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని మంగళవారం కొట్టేయడం చూస్తుంటే.. కలెక్టర్‌గా ఆయన ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించారో తెలుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత అమోయ్‌కుమార్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. – ఆదిబట్లలోని సర్వే నంబరు 44లోని సీలింగ్ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడం పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. – శామీర్‌పేట మండలంలోని తూముకుంటలోని అటవీ భూములకు సంబంధించి సర్వే నంబరు 164లో మొత్తం 26 ఎకరాలను కూడా అన్యాయంగా కొంతమంది వ్యక్తులు, పరిశ్రమల పేరిట పెద్దవారికి ధారాదత్తం చేశారని రాఘవేందర్‌గౌడ్ డాక్యుమెంట్లతో సహా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. – సర్వే నంబరు 165/1, సర్వేనంబరు 1266లోని భూములను కూడా ఒకసారి పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. 26 ఎకరాలను మరొకరి పేరిట చేయడమేకాక, మ్యుటేషన్ కూడా చేశారని, ఆ స్థలం అటవీశాఖ ఆ«దీనంలోనే ఉన్నా.. ఇలా మ్యుటేషన్ చేయడంతో వారు ఆ కాగితాలను వినియోగించుకొని రుణాలు కూడా తెచ్చుకున్నారని చెబుతున్నారు. 1953లోనే ఆ సర్వే నంబరులోని భూములు రిజర్వ్ ఫారెస్ట్ కోసం కేటాయించినట్టు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నా, వారసులం అంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ధారాదత్తం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ భూమి తమదంటూ దరఖాస్తు చేసుకున్న వారసుల తండ్రి 1976లో చనిపోతే.. వారు 2017లో వచ్చి తమ భూమి అంటూ దరఖాస్తు చేసుకోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం వారసులకు భూములు అప్పగించే ముందు ఆ భూమిలో వారి ఆ«దీనంలో ఉందా.. వారు ఆ భూమిని సాగు చేస్తున్నారా.? రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం, దానిపై అభ్యంతరాలను ఆహా్వనించడం, సక్సెషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను కోరడం, యుఎల్‌సీ, తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఆ భూములు ఎవరి ఆ«దీనంలో ఉన్నాయో తెలుసుకోకుండా మ్యుటేషన్ చేశారని ఈడీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. – 261, 273 తదితర సర్వే నంబర్లలోని భూములను కూడా అదే విధంగా అప్పగించారని పేర్కొన్నారు. కూకట్పల్లి సమీపంలోని హైదర్‌నగర్ దగ్గర మూడు ఎకరాల భూమిని కూడా అమోయ్‌కుమార్ ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారన్నారు. – శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఆ జాబితా నుంచి తొలగించి కొందరికి అప్పగించారని పేర్కొన్నారు. మరో పిటిషన్.. అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్‌లో 5 ఎకరాలు, హఫీజ్‌పేటలో 20 ఎకరాలు, మోకిలలో 115 ఎకరాలు, వట్టినాగుల పల్లిలో 20 ఎకరాలు, గండిపేట ఖానాపూర్‌లో 150 ఎకరాలు, మియాపూర్‌లో 27 ఎకరాలు అన్యాక్రాంతం చేశారని బక్క జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ఆయనతోపాటు మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత రెవెన్యూ ముఖ్యకార్యదర్శిల పాత్ర ఉన్నట్టు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. ఈ ఘటన గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగింది.వివరాల ప్రకారం.. రైల్వే లైన్మెన్గా పనిచేస్తున్న కృష్ణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ట్రాక్ వద్ద పనులు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తన కుమార్తెలను ట్రాక్‌పై కూర్చోబెట్టి కృష్ణ పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో సడెన్‌గా రైలు రావడంతో ట్రాక్‌పై ఉన్న తన పిల్లలను కాపాడేందుకు కృష్ణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిని కాపాడబోయి రైలు తగిలి ముగ్గరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను రాఘవేంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణిగా స్థానికులు చెప్తున్నారు. -
జీడిమెట్లలో కారు బీభత్సం.. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. కారును డ్రైవ్ చేస్తోన్న మహేష్ గౌడ్ అతివేగం, మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డును ఢీకొట్టాడు.కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులే కాగా, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన ఐదుగురు యువకులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన గోపి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జీడిమెట్లలో రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. -
బిడ్డా.. ఎంత తల్లడిల్లినవో
మిరుదొడ్డి/జవహర్‌నగర్: గోరంత ముల్లు గుచ్చు కుంటేనే తల్లడిల్లే ప్రాణంరా నీది.. గుంపులుగా వచ్చిన కుక్కలు గాట్లు పడేలా కొరుకుతూ, ఈడ్చుకెళుతుంటే ఎంత తల్లడిల్లినవో కొడుకా అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడిపెట్టించాయి. మల్కాజిగిరి– మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో కుక్కల దాడిలో విహాన్ మృతి చెందడం యావత్ రాష్ట్రాన్నే కుది పేసింది. విహాన్ మృతదేహం బుధవారం ఉదయం స్వగ్రా మమైన మిరుదొడ్డికి చేరుకుంది. నిలువెల్లా గాయాలతో నిండిపోయిన చిన్నారి మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం తర్వాత విహాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బతుకుదెరువుకు వలసొచ్చి.. కొడుకును కోల్పోయి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన పుల్లూరి భరత్‌కుమార్–వెంకటలక్ష్మి దంపతులకు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు సాహితి, శృతి, కుమారుడు విహాన్ ఉన్నారు. గ్రామంలో కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నెలరోజుక్రితం బతుకుదెరువుకు జవహర్‌నగర్‌కు వలసవచ్చారు. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విహాన్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఆరు బయటకు వెళ్లాడు. అక్కడే వేచి ఉన్న వీధికుక్కలు విహాన్ వెంటపడి విచక్షణారహితంగా దాడిచేసి కొరికాయి. కుక్కలదాడిలో విహాన్ బలికావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అఖిలపక్ష నేతల నిరసన జవహర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శ్రీకాంత్ యాదవ్, మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌లు అన్నారు. తక్షణ సహాయంగా రూ. 50వేలు అందిస్తున్నా మన్నారు. బాలుడి కుటుంబానికి మున్సిపల్ కార్యాల యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం అందించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. కదిలిన మున్సిపల్ యంత్రాంగం వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారుల్లో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని వ్యాన్‌లో ఎక్కించి బయటకు తీసుకెళ్లారు. విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎంపీ ఈటల విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మేడ్చల్ కలెక్టర్‌తోపాటు జవహర్‌నగర్ మున్సి పల్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పారు. కలెక్టర్‌కు నివేదించాం: కమిషనర్ తాజ్మోహన్రెడ్డివీధికుక్కల దాడి ఘటనపై పూర్తి వివరాలతో మేడ్చల్ కలెక్టర్‌కు నివేదిక అందించామని జవహర్‌నగర్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.50 వేలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్‌ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్‌ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్‌రెడ్డి బృందం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్‌కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్‌లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. షాపు యాజమానిని కత్తితో పొడిచి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ఆ రోజు ఏం జరిగిందంటే?ఒకరు బుర్ఖా.. మరొకరు హెల్మెట్ ధరించిన దుండగులు పట్టపగలే జ్యువెలరీ షాపులో దోపిడీకి యత్నించారు. దుకాణ యజమానిపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పలాయనం చిత్తగించిన ఘటన గురువారం మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, జ్యువెలరీ షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు (20 అడుగుల) దూరంలో జగదాంబ జ్యువెలరీ దుకాణం ఉంది.గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు (వెనుక కూర్చున్న వ్యక్తి బుర్ఖా.. మరొకరు ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారు) వచ్చారు. షాపులోకి వచ్చి యజమాని శేషురాం చౌదరిపై బుర్ఖా ధరించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆభరణాలు, నగదును తన వద్ద ఉన్న కవర్లో వేయాలని బెదిరించాడు. అరవవద్దని హిందీలో బెదిరించాడు. దీంతో పక్కనే ఉన్న శేషురాం చౌదరి కుమారుడు సురేశ్ షాపు వెనుక గదిలోకి పరుగులు తీశాడు.హెల్మెట్ ధరించిన దుండగుడు షాపులోని వెండి ఆభరణాలు తీసుకుని బుర్ఖా ధరించిన వ్యక్తికి కవర్ పట్టుకో అందులో వేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని శేషురాం చౌదరి చాకచాక్యంగా వ్యవహరించి.. హెల్మెట్ ధరించిన వ్యక్తిని తోసి బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరవసాగాడు. దీంతో దుండగులు పరారయ్యేందుకు బయటికి వస్తుండగా కొంత మేర దోచుకున్న ఆభరణాల కవర్ కిందపడింది. దానిని అక్కడే వదిలిపెట్టి బైక్ ఎక్కారు. అప్పటికే గది లోపలి నుంచి బయటికి వచ్చిన సురేశ్ షాపులోని కుర్చీని దుండగులపై విసిరి వారిని నిలువరించేందుకు యత్నించడంతో పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన శేషురాం చౌదరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దుండగులు దోపిడికి యత్నించిన జగదాంబ జ్యువెలరీ షాపులో, షాపు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో దుండగుల దోపిడీ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బైక్‌పై వచ్చి లోపలికి ప్రవేశం. షాపు యజమానిపై దాడి, బెదిరింపులకు దిగిన తీరు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దర్యాప్తు చేపట్టి పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. బైక్ నంబర్, ఇతర ఆధారాలు సేకరించి నిందితులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. -
భర్తకు ఫోన్ చేసి...!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ /అల్వాల్ /గాం«దీఆస్పత్రి/మేడ్చల్: రూపాదేవి(40) తన భర్త ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఉండగానే రూపాదేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రూపాదేవి తల్లి భూలక్ష్మమ్మ డోర్ తీయడానికి ప్రయత్నించినా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తీయగా, అప్పటికే రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తల్లి భూలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.చనిపోవడానికి ముందు తన కూతురు భర్తతో మాట్లాడిందని భూలక్ష్మమ్మ చెప్పింది. విషయంగా తెలియగానే నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే సత్యం హుటాహుటిన తనే కారు నడుపుకుంటూ సిటీకి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యంను మార్యమధ్యలో ఆపి, ఆస్పత్రికి తన కారులో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు.దీంతో ఆయనకు ఆదే ఆస్పత్రిలో చికిత్స అందించారు. రూపాదేవి అంత్యక్రియలు శుక్రవారం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గధామంలో జరిగాయి. గురువారం రాత్రి నుంచి రూపాదేవి అంత్యక్రియలు అయ్యే వరకు పొన్నం ప్రభాకర్ సత్యం వెంటే ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సుద్దాల దేవయ్య తదితరులు మేడిపల్లి సత్యంను పరామర్శించారు.పీజీ చదువుతుండగా ప్రేమలో... రంగారెడ్డి జిల్లాకు చెందిన రూపాదేవి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన మేడిపల్లి సత్యంలది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న సత్యం దంపతుల కాపురం అన్యోన్యంగా సాగింది. వీరికి కుమారుడు యోజిత్ (11), కుమార్తె రిషిక (9)లు ఉన్నారు. వృత్తిరీత్యా రూపాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వికారాబాద్ నుంచి మేడ్చల్ మండలంలోని రావల్కోల్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. రెండు నెలల క్రితం అల్వాల్ పంచశీల కాలనీకి నివాసం మార్చారు. గురువారమే బయల్దేరిన సత్యం.. చొప్పదండిలో ఎమ్మెల్యేగా గెలవాలని చాలాకాలంగా ప్రయతి్నంచిన సత్యం 2014, 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2023లో ఎట్టకేలకు విజయం సాధించారు. సత్యం కరీంనగర్‌లోని వీపార్క్ సమీపంలో నివాసముంటున్నారు. భార్య టీచర్ కావడంతో పిల్లలతో కలిసి అల్వాల్‌లోనే నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే అల్వాల్ నుంచి సత్యం చొప్పదండి చేరుకున్నారు. రోజంతా నియోజకవర్గ పరిధిలోని మల్యాల మండలంలో షాదీముబారక్ చెక్కుల పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకటి రెండుసార్లు మినహా.. సత్యం ఎమ్మెల్యే అయ్యాక రూపాదేవి నియోజకవర్గంలో చాలా తక్కువగా కనిపించేవారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సమయంలో, కొండగట్టు సమీపంలోని నల్లగొండ ఆలయంలో మొక్కులు అప్పజెప్పిన సమయంలో సత్యం సతీసమేతంగా కనిపించారు. ఫిబ్రవరి 23న కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు నరేశ్ దంపతుల నాలుగు నెలల చిన్నారికి గుండె చికిత్సకు రూ.లక్ష అందజేసిన సమయంలో రూపాదేవి సత్యంతో కలిసి వచ్చారు. ఇటీవల సత్యం దంపతులు, కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. రూపాదేవి సోదరుడు తోట అనిల్ కూడా ఎమ్మెల్యే సత్యం వద్దనే వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు ఆమె అనారోగ్యమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. రావల్‌కోల్‌లో విషాదఛాయలు మేడ్చల్ మండలం రావల్కోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూపాదేవి రెండేళ్లుగా సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మరణవార్తతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూల్లో ఏనాడు రూపాదేవి వ్యక్తిగత విషయాలు మాట్లాడేవారు కాదని, పేద పిల్లలు బాగా చదవాలని ఆరాటపడేవారని, తోటి ఉపాధ్యాయులు చెప్పారు. రావల్‌కోల్‌కు చెందిన ఓ విద్యారి్థని చదువుకు కూడా ఆమె ఆర్థికసాయం చేశారు. మూడురోజుల క్రితమే సెలవు పెట్టారని, అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారుతున్నానని తనతో చెప్పారని హెచ్ఎం తెలిపారు. గాంధీలో పోస్టుమార్టం రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించింది. చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ భద్రత ఏర్పాట్లు పర్య వేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు గాం«దీమార్చురీకి చేరుకుని రూపాదేవి మృతదేహం వద్ద నివాళులరి్పంచి మేడిపల్లి సత్యం, కుటుంబసభ్యులను పరామర్శించారు. -
మేడ్చల్‌లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్‌లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తొలుత ఫెయిల్.. రీవాల్యుయేషన్లో 90% మార్కులు
దుండిగల్: పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురతున్నారు. వా ల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాం«దీనగర్‌లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్డపడ్డానని, 9.5 గ్రేడ్ సా«ధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యా న్ని నింపారు.తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్ట్‌కు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్టెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రీవాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కు లు వచ్చాయి.9.3 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఎగ్జామినర్లదే తప్పు..పదవ తరగతి జవాబు పత్రాలను ముగ్గురు అధికారులు దిద్దుతారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అస్టిసెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలకు మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచి్చన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపరును దిద్దిన ముగ్గురు అధికారులూ అజాగ్రత్తగా వ్యవహరించారు.రీ వ్యాలుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిచారు. రీ కరెక్షన్లో మీ అమ్మాయి పాసైందని, ఎస్ఎస్íసీ సరి్టఫికెట్ తీసుకెళ్లండని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆ ఈవీఎంల వినియోగానికి హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి, కాంగ్రెస్ తరఫున వజ్రేష్‌యాదవ్ పోటీ చేశారు. 33 వేల మెజారిటీతో మల్లారెడ్డి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో మల్లారెడ్డి తప్పుడు సమాచా రం ఇచ్చారని.. నిర్ణీత ఫార్మాట్లో వివరాలన్నీ ఇవ్వలేదని ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వజ్రేష్ యాదవ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సమీప అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఎన్నికల కమిష న్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వజ్రేష్ తరఫున న్యాయవాది సిర్థ పోగుల దాఖలు చేసిన పిటిష న్పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. ఎన్నికల కమిషన్, మేడ్చేల్ ఆర్డీవో, అసెంబ్లీ కార్యదర్శి, మల్లారెడ్డితో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు కారణంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నోటీసులుజనగామ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్ఎస్) ఎన్నికను సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాపరెడ్డి(కాంగ్రెస్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమీప ప్రత్యర్థినైన తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై కూడా న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. వాదన తర్వాత.. రాజేశ్వర్‌రెడ్డి సహా ఇతర ప్రతివా దులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. -
ఈసారి ఎవరు ?
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంతో పాటు మినీ భారత్‌గా పేరొందిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్యనే పోటీ కొనసాగుతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పట్నం సునీత జెడ్పీ చైర్‌పర్సన్‌గా మూడు పర్యాయాలు పనిచేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన రాగిడి ఈసారి ఆ పార్టీ అభ్యగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముగ్గురు నేతలు కింది స్థాయి కార్యకర్తల పనితీరును సమన్వయం చేసుకుంటూ విజయమే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ మార్పును ఆహా్వనించే మల్కాజిగిరి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది.రేవంత్‌కు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ గెలుపుమల్కాజిగిరి సిట్టింగ్ స్థానం కావటంతో పాటు ఇక్కడ ఎంపీగా పని చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవానికి చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన సునీతా మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజిగిరి టికెట్ కట్టబెట్టింది. మహిళ కావటం, పార్టీ అధికారంలో ఉండటం, ఇటీవల బీఆర్ఎస్ సహా ఇతర పా ర్టీ లకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరటం ఆమెకు కలిసొచ్చే అంశాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పైగా నియోజకవర్గంలోని నేతలందర్నీ సమన్వయం చేసే బాధ్యతను స్వయంగా రేవంత్‌రెడ్డి తీసుకోవటంతో సునీత విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయగా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కనుసన్నల్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గెలుపు భారం అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధి లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థు లు గెలుపొందారు. కంట్మోనెంట్ ఎమ్మెల్యే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. పా ర్టీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాగిడి గెలుపు కోసం అంత చురుగ్గా వ్యవహరించటం లేదని పార్టీ వర్గాల్లోనే విమర్శలు విన్పిస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవటంలో విజయం సాధించిన రాగిడి లక్ష్మారెడ్డి పా ర్టీ లో నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తేనే విజయం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పార్టీ బలంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో పలు సమావేశాలకు హాజరవుతూ కేడర్ ప్రచారంలో పాల్గొనేలా ఉత్సాహపరుస్తున్నారు. రాగిడి కూడా భారీ ర్యాలీలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం బీజేపీ టికెట్ ఈటలను వరించటం ఓ అనూహ్య పరిణామమని చెప్పవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఈటల ఓటమి పాలయ్యారు. అయితే పార్లమెంటు ఎన్నికలనేవి అనేక అంశాలపై ఆధారపడి జరిగేవి కావడం, ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండదండలు కలిసివచ్చే అంశాలుగా భావించవచ్చు. పా ర్టీ లోని క్రియాశీలకమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించటం, పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్‌ను ఉత్తేజితులను చేయటం గెలుపునకు అనుకూలతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈటల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని వేడేక్కిస్తున్నారు. కార్మికుల ఓట్లూ కీలకం! ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కంట్మోనెంట్ మినహాయించి ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్ పరిధిలోని జీడిమెట్ల, బాలానగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, నాచారం, మల్లాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేటులో ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్ ఫరి్నచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. కోకాకోలా కంపెనీల్లో కూడా కార్మికులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు తదితర కంపెనీలు ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్పల్లి, సీఐఈ గాంధీనగర్ ఒకే చోట ఉన్నాయి. శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో అపరెల్ టెక్స్టైల్ పార్కు ఉంది. తుర్కపల్లిలో ఐసీఐసీఐ నాలెడ్జి కంపెనీ పేరుతో పరిశ్రమల హబ్ ఏర్పడ్డాయి. ఘట్కేసర్, కీసరలలో కూడా చిన్న కంపెనీలు, వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల ఓట్లపై కూడా ప్రధాన పా ర్టీ ల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఇక్కడ గెలిస్తే మంచి భవిష్యత్తు!మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పలువురు రాజకీయ నాయకులకు పునర్జన్మనిచ్చిందనటంలో అతియోశక్తి లేదు. ఇక్కడ ఎంపీగా గెలుపొందిన నేతలకు తమ పార్టీలో అత్యున్నత పదవులు దక్కడమే కాకుండా పాలనా పరంగా ముఖ్యమంత్రిగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసే అవకాశం లభించింది. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందనే అభిప్రాం కూడా ఉండటం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సర్వే సత్యనారాయణకు కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన చామకూర మల్లారెడ్డి తన పదవీ కాలం పూర్తి చేసుకోక ముందే మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తదనంతరం టీపీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి కూడా మంత్రిగా పని చేయని రేవంత్‌రెడ్డి ఏకంగా సీఎం కావటానికి మల్కాజిగిరి నియోజకవర్గ సెంటిమెంటే కారణమని స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందడాన్ని కూడా స్థానికులు ప్రస్తావిస్తూ ఉంటారు. -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. -
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, మేడ్చల్ జిల్లా/చార్మినార్: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. మంగళవారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలన్నారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని, దానిపై జవాబు చెప్పిన తర్వాతనే బీజేపీపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.10వేల కోట్లు సాయం చేసిందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్‌షా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వారియర్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే అది దుర్వినియోగం అవుతుందని చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, మోదీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సోషల్ మీడియా కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈసారి హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల తప్పుడు ప్రచారాలను ఖండించాలని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, మహేశ్వర్‌రెడ్డి, ఎంవీఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అమిత్ షా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. -
ఫాంహౌస్ ఇటుకలు కూడా మిగలవు!
సాక్షి, మేడ్చల్ జిల్లా/ సాక్షి హైదరాబాద్: సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని.. తమ కార్యకర్తలు తలచుకుంటే కేసీఆర్ ఫాంహౌజ్ గోడలే కాదు ఇటుకలు కూడా మిగలవని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రం అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, మెట్రో విస్తరణకు అడ్డుపడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ వద్ద రూ.194 కోట్లతో నిర్మించిన రెండో లెవెల్ ఫ్లైఓవర్‌ను.. ఉప్పల్ నల్ల చెరువు, నాచారం పెద్ద చెరువుల వద్ద నిర్మించిన మురుగు నీటిశుద్ధి కేంద్రాల (ఎస్టీపీల)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీఫాం రోడ్ వరకు రూ.1,580 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు కండ్లకోయలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. మేం అల్లాటప్పాగా అడుక్కుని, అయ్య పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు. రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్లు మండుతున్నాయా? అసలు మా ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా?ప్రభుత్వాన్ని, నన్ను టచ్ చేస్తే మా కార్యకర్తలు మీ కళ్లలో కారం కొడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. మేం మంచివాళ్లం. రాజ్యాంగ విలువలను కాపాడేవాళ్లం. కాబట్టే మీరు మాట్లాడగలుగుతున్నారు. అసెంబ్లీకి రమ్మను.. అన్నీ చెప్తాం.. ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై మాట్లాడకుండా, ధర్నాలు చేయకుండా కేసీఆర్ ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. అలాంటిది నేడు ఆయన బిడ్డ కవిత ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తూ మహిళల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. మా 90 రోజుల పాలనలో 28వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అందులో 43శాతం మహిళలకు ఇచ్చాం. మీ అయ్యను అసెంబ్లీకి పంపిస్తే.. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో పేర్లతో సహా చెప్తాం. బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వనినాడు తండ్రిని అడగని కవిత ఇప్పుడు మహిళల గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మేడిగడ్డ పాపం మాకు అంటగడతారా? లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు మూడేళ్లకే కూలిపోయే పరిస్థితికి చేరాయి. దీనిపై నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. కానీ బీఆర్ఎస్ నేతలు వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆ పాపాన్నంతా మాకు అంటగట్టాలని చూస్తున్నారు. హరీశ్‌రావు మేడిగడ్డకు రమ్మంటే రారు. అసెంబ్లీలో మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడరు. కానీ బయట ప్రభుత్వాన్ని బదనాం చేసే మాటలు మాట్లాడుతారు. బీజేపీకి పొత్తులు ఎందుకు? లోక్‌సభ ఎన్నికల్లో 400సీట్లు గెలుస్తామని పదే పదే చెప్తున్న ప్రధాని మోదీ.. ఎన్డీయే కూటమిలోకి కొత్త భాగస్వాములను ఎందుకు చేర్చుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌తో, బిహార్‌లో నితిశ్‌తో, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో, ఇతర రాష్ట్రాలతో మరికొందరితో పొత్తులు పెట్టుకోవడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు? బీజేపీ కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని వారికి అర్థమైంది. ఎంపీలు ఉంటే అభివృద్ధి సాధ్యం అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి. అప్పుడే అభివృద్ధి పూర్తిగా సాధ్యమవుతుంది. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్ర, రాష్ట్ర నిధులతో మరింతగా అభివృద్ధి జరుగుతుంది..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ తెలంగాణ–2050 పేరిట రాష్ట్ర అభివృద్ధి కోసం త్వరలోనే మెగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తాం. దాన్ని ప్రజల ముందుంచి.. అభ్యంతరాలు స్వీకరిస్తాం. మొత్తం తెలంగాణ, హైదరాబాద్‌లను 360 డిగ్రీలలో అన్నివైపులా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను దేశానికే ఆదర్శంగా నిలిపేలా చర్యలు చేపడతాం. హైదరాబాద్ పరిసరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు అన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెచ్చి అన్నివైపులా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మెట్రో రైల్‌ను మరింతగా విస్తరిస్తాం. మురికికూపంగా మారిన మూసీ ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండటమేగాక నల్లగొండ జిల్లాలో 50–60 వేల ఎకరాల్లో పంటలను కూడా బలి తీసుకుంటోంది. దీన్ని ప్రక్షాళన చేయడంతోపాటు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్‌ఫ్రంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం. ఇందుకు దాదాపు రూ.50వేల కోట్లు అవసరం. కేంద్రం నిధులు ఇచ్చి సహకరించాలి. కాంగ్రెస్ పనులతోనే నగరానికి గుర్తింపు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్‌రింగ్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయాల వల్లే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌కు గుర్తింపు, ఐటీ–ఫార్మా రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70శాతం వాటివల్లే సమకూరుతోంది. కబ్జాలపై ఉక్కుపాదమే రాష్ట్రంలో కబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతాం. ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్వీకరించి చర్యలు చేపట్టాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించాం. పాతబస్తీ మెట్రోను ఆపాలట! నిన్న మెట్రో విస్తరణకు అసదుద్దీన్ ఒవైసీ తో కలిసి పునాది రాయి వేయగానే దాన్ని ఆపాల్సిందిగా ఒకాయన ఢిల్లీకి చెప్పిండట. వాళ్లు ఇప్పుడు దాన్ని ఆపాలని అంటున్నారు. మీకు చేయడం చేతకాకపోతే.. మేం చేసేటప్పుడు అ యినా కాళ్లలో కట్టెలు పెట్టొద్దని కోరుతున్నా. కేంద్రాన్ని ఉసిగొల్పుతూ అడ్డుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నా.. అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరించాల్సి వస్తుంది. -
కబ్జా భూములను సరెండర్ చెయ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. అలాంటి భూకబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. అలాంటి వారు చేరేందుకు వస్తే.. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా ఎదుర్కొంటుంది..’’అని మైనంపల్లి పేర్కొన్నారు. చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఇకమీద తాము దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాలను బయటపెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లకోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్‌కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్‌గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
TS: భారమైన క్రెడిట్ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్: జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి.. కిస్వా జువెల్లరీ దోపిడీ కేసు కొలిక్కి