Rajanna
-
వ్యర్థాల శాంపిళ్లు సేకరణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని రైస్‌మిల్లులు కాలుష్య కారకాలుగా మారడంతో వాటి నుంచి వస్తున్న వ్యర్థాలతో రైతులు పంటల దిగుబడి కోల్పోతుండగా, పర్యావరణ శాఖ అధికారులు బుధవారం రంగంలోకి దిగి వ్యర్థాల నమూనాలను సేకరించారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ‘మిల్లులు.. రైతులకు కన్నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అనేక రైస్‌మిల్లులను పంటపొలాల మధ్య ఏర్పాటు చేశారు. రైస్‌మిల్లుల తనిఖీల పేరుతో మిల్లర్ల వద్ద స్థానిక అధికారులు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మిల్లర్లు అధికారుల అండతో మిల్లుల పక్కనే బావులు తవ్వి వాటిలోకి వ్యర్థాలను వదులుతున్నారు. ఆ వ్యర్థాల నీరు పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతింటున్నాయి. రైతుల సమక్షంలో వ్యర్థాల శాంపిళ్లు సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని పర్యావరణ ఇంజినీర్ బిక్షపతి తెలిపారు. రిపోర్ట్ ఆధారంగా రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట సిబ్బంది కనకాజ్యోతి, వీరేశ్ ఉన్నారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారంసిరిసిల్లటౌన్: పోరాటాలతోనే కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్లలో పార్టీ మూడవ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు, మహిళకు రూ.2,500 పెన్షన్ వంటి ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పేదలను దోచి బడా కార్పొరేట్లకు పెడుతుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల వర్కర్ టు ఓనర్ పథకం అమలు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర సమస్యలపై విస్తృత పోరాటాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, నాయకులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, గన్నారపు నర్సయ్య, జువ్వాజి విమల, మల్లారపు అరుణ్‌కుమార్, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులు.. మిన్నంటిన నిరసనలు సిరిసిల్లటౌన్: ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం వేములవాడకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో మంగళవారం రాత్రి నుంచే ప్రతిపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం వేకువజామునే బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి ఠాణాకు తరలించారు. ఈసందర్భంగా వారు పోలీస్టేషన్లోనే ధర్నాకు దిగారు. ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, అన్నారం శ్రీనివాస్, గుండ్లపెల్లి పూర్ణచందర్, సుంకపాక మనోజ్, సబ్బని హరీశ్ తదితరులున్నారు. సభకు పాస్‌లిచ్చి.. అరెస్టులు సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు అవకాశమివ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను ముందస్తుగానే కోరగా ఆయన సమ్మతించారని, సభకు వచ్చేందుకు తమకు పాస్‌లు కూడా ఇచ్చారని, కానీ పొద్దున్నే పోలీసులు అరెస్టు చేశారని తాజా మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా మాజీ సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి కరుణాకర్‌తో పాటు పలువురిని అరెస్టులు చేయడంతో జిల్లా అంతటా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు ఆడెపు రవీందర్, గౌడ వాసుతో పాటు పలువురు వస్త్ర పరిశ్రమకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. -
నేతన్నల దరి చేరిన నూలు డిపో
సిరిసిల్ల: నేతన్నల చిరకాల వాంఛ నెరవేరింది. వ స్త్రోత్పత్తికి అవసరమైన నూలును అరువు (క్రెడిట్) పై అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రే వంత్‌రెడ్డి బుధవారం వేములవాడలో నూలు డిపో ను ప్రారంభించారు. నేషనల్ టెక్స్టైల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా నూలు కొనుగోలు చేసి వస్త్రోత్పత్తిదారులకు అందిస్తారు. డిపో ప్రారంభానికి ముందు టెస్కో జీఎం వి.అశోక్‌రావు, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు సందర్శించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన నూలు వైరెటీలను పరిశీలించారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నూలు డిపో పని చేస్తుందని, ఆర్వీఎం వస్త్రాల తయారీకి అవసరమైన నూలు అందిస్తామని టెస్కో అధికారులు వెల్లడించారు. -
కోడె మొక్కు.. ప్రత్యేక పూజలు
వేములవాడ: ఎములాడ రాజన్నను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్న సీఎంకు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సీఎం సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకోగా, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోడె మొక్కు చెల్లించుకుని, ప్రత్యేక పూజల అనంతరం మహామంటపంలో వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ప్రసాదం, నంది విగ్రహాలను బహూకరించారు. సీఎం తోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను విప్ ఆది, అర్చకులు శరత్‌శర్మ, రాజు వివరించారు. సీఎంను సన్మానించిన ఆలయ ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్నను దర్శించుకుని ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేసిన సందర్భంగా ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు సన్మానించారు. -
జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభం
సిరిసిల్లక్రైం: జిల్లాలో నూతనంగా నిర్మించిన పోలీస్ కార్యాలయాన్ని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మంత్రులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పూజలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన కార్యాలయంలో ఆసీనులు కాగా మంత్రులు, డీజీపీ పుష్పగుచ్ఛం అందించి శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. అనంతరం డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విశాలమైన వాతావరణంలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించిందని వెల్లడించారు. త్వరలోనే ఎస్పీ నివాస భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్, మల్టీజోన్– 1 ఐజీ పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, జీవన్‌రెడ్డి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, మురలీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పూర్తి చేస్తాం
● ఈనెల 30న ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష చేస్తారు ● కాళేశ్వరంతో పనిలేకుండా అత్యధిక వరి ఉత్పత్తి ● పాదయాత్ర సమయంలో వాగ్దానాలు పూర్తి చేస్తున్నామన్న సీఎం ● కేసీఆర్ పాలనపై మంత్రుల విమర్శలు ● ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం, అభివృద్ధని స్పష్టీకరణ ● రూ.679 కోట్ల పనులకు శంకుస్థాపనపెండింగ్ ప్రాజెక్టులుమాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సీఎం రేవంత్ పర్యటన ఇలా..● ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ ద్వారా వేములవాడ గుడి చెరువు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఆలయ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. ● మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ దంపతులు ఒకేచోట కలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న క్రమంలో అన్నా, వదిన ఒకేచోట అంటూ సీఎం మాట్లాడారు. ● గెస్ట్‌హౌస్ నుంచి సీఎం లుంగీ–కండువా ధరించి రాజన్న దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్/వేములవాడ/వేములవాడఅర్బన్: అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఈ నెల 30 లోపు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి, ఎన్ని నిధులు కావాలి అనేది సమీక్షలో మాట్లాడుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ఆలయ గుడి చెరువు ఖాళీ స్థలంలో రూ.679 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. కరీంనగర్ జిల్లా నుంచి పీవీ నరసింహారావు దేశానికి దిశ దశ చూపి, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ బిడ్డ పరిపాలన అంటే ఎంటో చూపించారన్నారు. అలాగే పెద్దలు చొక్కారావు, ఎం.సత్యనారాయణరావు లాంటి వారు కరీంనగర్ నుంచి నాయకత్వం అందించారని గుర్తు చేశారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ అభివృద్ధికి అన్ని శాఖల మంత్రులు సంపూర్ణ సహకారం అందించారన్నారు. రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరిపీఠాధిపతుల సూచనల మేరకు నిర్వహిస్తున్నామని వివరించారు. వేములవాడలో రూ.35 కోట్లతో నిత్య అన్నదానసత్రానికి సీఎం సభకు వచ్చే ముందు ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో నిర్లక్ష్యానికి గురైన వేములవాడ పట్టణ పునర్నిర్మాణం పనులను 10 నెలల కాలంలో ప్రారంభించుకున్నామని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులు మరణిస్తే దేశంలోనే రాష్ట్రంలో రూ.5 లక్షల పరహారం అందిస్తున్న ఏకై క ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎగవేసిన బకాయిలు చెల్లిస్తూనే 30 ఏళ్ల చిరకాల కోరిక యారన్ డిపో ఏర్పాటు చేశామని వెల్లడించారు. 365 రోజులు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుందన్నారు. రాజన్న దయతో దేశంలోనే అత్యధికంగా వరిపంట దిగుబడి వచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు, కులాలకతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చిరకాల ఆకాంక్ష నిత్యాన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ ఆలయానికి నేడు అభివృద్ధి బాటలు వేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల ఉపాధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి విప్ ఆది శ్రీనివాస్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఎకరం సాగయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. రుద్రంగి ఇవతల మర్రిపల్లి అమ్మమ్మ ఊరు, అవతల నాన్నమ్మ ఊరని తెలిపారు. పది నెలల కాలంలోనే 50 వేల ఉద్యోగాలు అందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెడుతామన్నారు. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్– 2, ఫేజ్– 1 పనులు పూర్తి చేసి లక్షా 51 వేల 400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజీ– 2లో పెండింగ్ పనులకు రూ.170 కోట్లు ఖర్చు చేసి వేములవాడ నియోజకవర్గంలో 40,500 ఎకరాలు, కోరుట్లలో 2,500 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. సిరిసిల్లలో కాళేశ్వరం ప్యాకేజీ 9,10,11 పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్, విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు. ఆదిపై ప్రశంసల జల్లు.. వేములవాడకు బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.679 కోట్ల నిధులు, ఆలయ విస్తరణ పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌పై ప్రశంసల జల్లు కురిసింది. సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మని వెళ్లాల్సి వచ్చేదని కానీ, ఈ ప్రభుత్వంలో ఆది వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల వద్దకు స్వయంగా వెళ్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ సమావేశాలు మినహా ఏనాడు హైదరాబాద్ రాడని, నియోజకవర్గ అభివృద్ధి తప్ప పైరవీలు చేయడని స్పష్టం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నా రు. అలాగే వేములవాడలో ఆలయ విస్తరణ, సాగునీటి పనుల పూర్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చొర వ ఆది శ్రీనివాస్ కృషి అని మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు అభినందించారు. సీఎంకు విప్ ఆది శ్రీనివాస్, ఆయన కుమారుడు కార్తీక్ తలపాగా ధరింపజేసి స్వామివారి చిత్రపటం, త్రిశూలం బహూకరించారు. 2.55 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించి 3.30 గంటలకు ముగించారు. సభా వేదికపైనుంచి కిందకు దిగిన సీఎంతో పోలీసు ఉన్నతాధికారులు ఫొటో దిగారు. 3.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. – వేములవాడ 11.41 గంటలకు ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. మంత్రులందరికీ ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కొబ్బరికాయలు అందజేశారు. కార్యక్రమానికి శృంగేరి అర్చకులు హాజరయ్యారు. 11.45 గంటలకు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. 11.55 గంటలకు ఆలయంలోకి ప్రవేశించి మంత్రులతో కలిసి 12.20 వరకు దర్శనాలు పూర్తిచేసుకున్నారు. 12.25 గంటలకు స్వామివారి అద్దాల మంటపంలో సీఎం, మంత్రులకు దేవాదాయశాఖ అధికారులు, ప్రభుత్వవిప్ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చుకులు ఆశీర్వచనం గావించారు. అనంతరం సీఎంతో ఫొటో దిగారు. 12.45 గంటలకు దర్శనాలు పూర్తిచేసుకుని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభోత్సవాలు పూర్తి చేసి, 1.25 గంటలకు సీఎం వేదికపైకి చేరుకున్నారు. 1.35 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ గీతం ఆలపించారు. 1.40 గంటలకు యార్నడిప్ వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. 1.45 గంటలకు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ స్వాగత వచనాలు చేశారు. -
ముహూర్తం కుదిరేనా?
సిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసి 2024లో పూర్తి చేశారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రారంభోత్సవానికి పలుమార్లు సన్నాహాలు జరిగినా వివిధ కారణాలతో వాయిదా పడింది. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించాలని జిల్లా పోలీసు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే వర్చువల్ విధానంలో వేములవాడ సభా ప్రాంగణం నుంచి ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నూలు డిపోను ప్రారంభించనున్న సీఎంవేములవాడరూరల్: నేత కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నూలు డిపో బుధవారం ప్రారంభంకానుంది. వేములవాడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నూలు డిపోను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. -
నేతన్నలకు అండగా నిలిచింది ఎర్రజెండానే
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు, కార్మికులకు అండగా నిలిచింది, నిలిచేది ఎర్రజెండానేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన మూడవ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో 15 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి హక్కులు సాధించుకోవాలని కోరారు. నాయకులు పాలడుగు భాస్కర్, స్కైలాబ్‌బాబు, కూరపాటి రమేశ్, మూషం రమేశ్, కోడం రమణ వస్త్రపరిశ్రమ సమస్యలు, కార్మికుల ఇబ్బందులపై మాట్లాడారు. కార్మిక నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్దాస్ గణేశ్, శ్రీరాం సదానందం, ప్రశాంత్, నాగరాజు, నర్సన్న, విమల, పద్మ, అరుణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీపీఎం నాయకులను వస్త్రోత్పత్తిదారుల జేఏసీ నాయకులు తాటిపాముల దామోదర్, ఏనుగుల ఎల్లయ్య, మండల సత్యం సన్మానించారు. మహాసభల సందర్భంగా సిరిసిల్ల వీధుల్లో ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీవో ఆఫీస్ నుంచి బీవైనగర్ షాదీఖానా వరకు ప్రదర్శన సాగింది. పవర్లూమ్, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
సీఎం సారూ.. స్పందించాలి మీరు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత పురాతన, చారిత్రక ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్ సంస్థానంలోనూ నిజాంరాజులు పెద్దపీట వేసిన ఏకై క ఆలయం. 1830 లోనే దక్షిణ భారతదేశంలో రోజుకు రూ.4 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు రెండే. ఒకటి తిరుపతి, రెండోది వేములవాడ. అంతటి ఘనచరిత్ర కలిగిన ఆలయంలో బుధవారం కోడెమొక్కులు చెల్లించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ, యాదాద్రి(ప్రతిపాదన దశ) తరహాలో స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అటానమస్ హోదాకు ప్రయత్నాలు రాజన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులకు రాజరాజేశ్వర స్వామివారు ఇలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా అనాదిగా పూజిస్తున్నారు. ఒకప్పుడు భక్తుల రద్దీని గమనించిన నాగిరెడ్డి అనే ధర్మకర్త వేములవాడలో మరో కోనేరు నిర్మించారు. ఇది నిజామాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉండేది. క్రమంగా ఇది పాడవుతోంది. ప్రధాన ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాలు కూడా పురాతనమైనవే. దేవస్థానానికి ఉప ఆలయాలుగా ఉన్న నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి తదితర ఆలయాలను కలిపి క్లస్టర్‌గా అటానమస్ బోర్డును ఏర్పాటు చేసి(వీటీడీఏ కాకుండా), అభివృద్ధి చేయాలని రాజన్న ఆలయ ఉద్యోగులు, భక్తులు కోరుతున్నారు. యాదాద్రికి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సమయంలో వేములవాడలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. వెంటనే అప్పటి సీఎం కేసీఆర్ ఇక్కడ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యాదాద్రికి అటానమస్ హోదా కల్పించేందుకు ప్రయత్నాలు మొదలైన దరిమిలా.. వేములవాడకూ కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయం జీతాలు, పింఛన్లకే.. ఆలయానికి ప్రధానంగా కోడె మొక్కులు, హుండీ ద్వారా ఆదాయం వస్తుంది. ఆలయ నిర్వహణ ఖ ర్చు ఏటా రూ.200 కోట్ల పైమాటే. ఇందులో అధికశాతం దాదాపు రూ.30 కోట్ల వరకు జీతాలు, పింఛన్లకే వెచ్చిస్తుండటం వల్ల ఆలయ అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదు. ఇవిగాక కరెంటు బిల్లులు, ప్రసాదాలు, శివరాత్రి, ఇతర ఉత్సవాలు కలిపితే వచ్చే ఆదాయం కంటే ఖర్చయ్యేదే ఎక్కువ. అందు కే, ప్రత్యేక అటానమస్ బోర్డు ఉంటే తప్ప అభివృద్ధి ఊపందుకోదని పలువురు భక్తులు అంటున్నారు. తాజా నిర్ణయాలపై హర్షం.. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు విడుదల చేయడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. ఇందులో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను విస్తరించేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేసింది. అలాగే, మూలవాగులో బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు రూ.3.8 కోట్లతో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే, వీటీడీఏ పరిధిని మొత్తం జిల్లాకు విస్తరించడం, పట్టణీకరణకు పెద్దపీట వేయడంపై రాజన్నసిరిసిల్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంపై చర్చ.. వరంగల్‌లో మామునూరు విమానాశ్రయ నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బసంత్‌నగర్ విమానాశ్రయంపై మరోసారి చర్చ మొదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ విషయమై సానుకూలత వ్యక్తం చేయడంతో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక సమర్పించినా పురోగతి లేదు. వరంగల్ ఎయిర్‌పోర్టు సాకారమవుతున్న వేళ.. బసంత్‌నగర్ విమానాశ్రయంపైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు కోరుతున్నారు. నిజాం షుగర్స్‌పై గంపెడాశలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాల్సి ఉంది. వాస్తవానికి రూ.210 కోట్ల బ్యాంకు బకాయిలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే రూ.192 కోట్లు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లింపు, ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల సర్దుబాటుకు పరిష్కార మార్గాలు వెదుకుతోంది. ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే ఉపాధితోపాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని జగిత్యాల జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. దుష్ప్రచారానికి తెర ఒకప్పుడు రాజన్న ఆలయానికి వస్తే పదవీ గండం అన్న దుష్ప్రచారం ఉండేది. కానీ, అదంతా వట్టిదే అని తేలిపోయింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ల విజయాలే ఇందుకు నిదర్శనం. పాత ప్రచారం పోయి, ఇప్పుడు రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తే విజయం తథ్యమన్న మాట విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.‘రాజన్న’కు స్వయం ప్రతిపత్తి కావాలి టీటీడీ తరహాలో అటానమస్ హోదా కల్పించాలంటున్న భక్తులు హైదరాబాద్ సంస్థానంలో అత్యంత ప్రాచీన ఆలయంగా ఎములాడ వేములవాడ రాజరాజేశ్వరునికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి కోడె మొక్కులు బసంత్‌నగర్ విమానాశ్రయం, నిజాం షుగర్స్ హామీలపై చర్చరాజన్న ఆలయం వద్దనే అన్నీ.. ఇదీ వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ సిరిసిల్ల/వేములవాడఅర్బన్: : వేములవాడ రాజన్న ఆలయం వద్దనే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ఉదయం 9గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.45కు వేములవాడ చేరుకుంటారు. ఉదయం 9.55గంటలకు పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 10గంటల నుంచి 10.15 వరకు ఆలయ అతిథిగృహంలో రెస్ట్ తీసుకుంటారు. 11గంటలకు రాజన్న ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.15గంటలు అతిథి గృహానికి చేరుకుంటారు. 12.30నుంచి 1.40 వరకు రాజన్న ఆలయం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.45 గుడిచెరువు గ్రౌండ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో బయల్దేరి 2.30 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పకడ్బందీ ఏర్పాట్లువేములవాడలో బుధవారం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్, ఇతరశాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు ఉదయం చేరుకుంటారని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభ అనంతరం అతిథిగృహం వద్ద లంచ్‌చేసి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందిస్తామని, అవి ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తారని తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో పూర్తి సిబ్బందితో కూడిన అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగసభ వద్ద మెడికల్‌క్యాంపు పెట్టాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినిరెడ్డి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ పాల్గొన్నారు. ధార్మిక.. కార్మిక క్షేత్రంలో సమస్యలు ఇవీ..రాజన్నసిరిసిల్ల జిల్లా ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 261 గ్రామాలతో విస్తరించి ఉంది. చిన్నజిల్లాగా పేరున్న ఈ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ప్రజలకు ప్రతిబంధంకంగా మారాయి. ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ఇక్కడికి అనేక పర్యాయాలు వచ్చినా.. సీఎం హోదాలో వేములవాడకు తొలిసారి బుధవారం వస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సీఎం రేవంత్‌రెడ్డిపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రెండు పాయలుగా అటు మానేరు.. ఇటు మూలవాగు పారుతుంది. ధార్మిక క్షేత్రమైన వేములవాడ, కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, కర్షకుల నిలయాలైన పల్లెల్లో నెలకొన్న ప్రధాన ప్రధాన సమస్యలు ఇవీ.. – సిరిసిల్ల8లోu -
ఇందిరాగాంధీ ఆశయ సాధనకు పాటుపడుదాం
వేములవాడఅర్బన్: ఇందిరాగాంధీ ఆశయ సాధనకు పాటుపడుదామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడలో మహంకాళి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతోత్సవాలకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఇందిరాగాంధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, చిలుక రమేశ్, కూరగాయల కొమురయ్య, సాగరం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి సిరిసిల్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలను అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో కళాయాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ప్రజా విజయోత్సవాలను ఈ నెల19 నుంచి డిసెంబరు 7 వరకు జిల్లాలోని సిరిసిల్ల, వే ములవాడ మున్సిపాలిటీలు, 13 మండలా ల్లోని ఆయా గ్రామాల్లో వివరించాలన్నారు. అ దనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీపీఆర్వో వి.శ్రీధర్, కళాకారులు పాల్గొన్నారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలివేములవాడఅర్బన్: సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. బందోబస్తులో వివిధ జిల్లాల నుంచి సుమారు 1,100 మంది పోలీసులు పాల్గొంటారని తెలిపారు. సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించి తమకు కేటాయించిన విధులను అప్రమత్తతో నిర్వహించాలన్నారు. హెలిప్యాడ్ వద్ద విధులు నిర్వహించేవారు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. డ్యూటీ పరంగా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాగా గుడి చెరువు పార్కింగ్ స్థలంలో సీఎం సభ ప్రాంగణాన్ని మల్టీజోన్– 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మంగళవారం రాత్రి పరిశీలించారు. దరఖాస్తుల ఆహ్వానం సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని విద్యార్హతల జిరాక్స్ ప్రతులు జత చేసి ఈ నెల 25లోపు కళాశాలలో సమర్పించాలన్నారు. http://gmcrajannasircilla.org వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తెరవాలిసిరిసిల్లటౌన్: టీచర్, ఆయాలను కేటాయించకుండా చిన్నబోనాలలో మూసేసిన అంగన్వాడీ సెంటర్‌ను వెంటనే తెరిపించాలని బీజేపీ ఫ్లోర్‌లీడర్, కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అంగన్వాడీ సెంటర్ ఎదుట గ్రామస్తులతో కలిసి ధర్నా చేశారు. గర్భిణులు, పిల్లలు, కిశోర బాలికలకు ప్రభుత్వ పరంగా పౌష్టికాహారం అందించేందుకు వెంటనే అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించాలని చేశారు. -
జలుబు.. దగ్గు..జ్వరం!
● అకస్మాత్తుగా అనారోగ్యం ● బాధితుల్లో అధికశాతం చిన్నారులే ● వాతావరణ మార్పులే కారణమంటున్న డాక్టర్లు ● ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ ● కిక్కిరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు1,52911సాక్షిప్రతినిధి,కరీంనగర్: మొన్నటి వరకు ఎండ.. ఇప్పుడు చలి.. అదికూడా పొద్దంతా ఎండ.. రాత్రిపూట చలి.. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు 35డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఒక్కసారిగా 24 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజుల క్రితం రాత్రి ఉష్ణోగ్రతలు 20డిగ్రీలు ఉండగా, ప్రస్తుతం 18 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. పలువురు చిన్నారులు, వృద్ధులు జ్వరం, జలుబు, వాంతులతో బాధ పడుతున్నారు. ప్రతీ ఇంటా జ్వర పీడితులు ఉంటున్నారు. వాతావరణ మార్పులు, అపరిశుభ్రతతో జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరమే కదా అని కొందరు సొంత వైద్యం చేసుకోవడం.. ఆర్ఎంపీల వద్ద చికిత్సలు చేయించుకోవడం.. పరిస్థితి విషమించిన తర్వాత పెద్దాసుపత్రులకు వెళ్లడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జబ్బులు వచ్చాక ఇబ్బంది పడే బదులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా లబ్ధిపొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోగులతో కిటకిట... ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. వారం క్రితం వరకు జిల్లా ప్రధానాసుపత్రులతో 700–800 ఓపీ నమోదు కాగా ప్రస్తుతం వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొన్ని రోజులుగా 1,500 మందికిపైగా ఓపీలో వైద్యం చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా రోగుల సంఖ్య పెరగడంతో వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో అంతంత మాత్రంగానే వచ్చిన రోగులు గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నారు. ఈనెల 11 నుంచి 18 వరకు పది రోజుల వ్యవధిలోనే కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఔట్‌పేషెంట్ విభాగంలో ప్రతీరోజు 1200–1500 మంది వరకు వైద్యం పొందారు. ఇందులో చాలా మంది వైరల్ జ్వరాలతోనే వచ్చిన వారుండగా.. మిగిలిన వారు దగ్గు, జలుబు, జ్వరం బాధితులున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో ఓపీలు 15వ తేదీన 708, 16న 1,096, 18న 1,267గా నమోదైంది. జగిత్యాలలో సగటు ఓపీ 700 మంది, సిరిసిల్ల 600 ఓపీ కొనసాగుతోంది.1,41112131,140141,12615161,383514935పేషెంట్లుఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా వీర్నపల్లి(సిరిసిల్ల) 12డిగ్రీలు జూలపల్లి(పెద్దపల్లి) 13.7 డిగ్రీలు గోవిందారం(జగిత్యాల) 13.1 డిగ్రీలు ఆసిఫ్‌నగర్ కొత్తపల్లి (కరీంనగర్) 13 డిగ్రీలువాతావరణ మార్పులే వాతావరణంగా చోటుచేసుకున్న మార్పులతోనే ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, వాంతులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేయడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా తయారవుతున్నాయి. మూడు రోజుల కన్నా ఎక్కువ జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు ఉంటే ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స పొందాలి. – సాయిని నరేందర్, పల్మనాలజిస్టు, జీజీహెచ్, కరీంనగర్వారంరోజుల్లో కరీంనగర్ జీజీహెచ్‌లో ఓపీ ఇలాతేదీ18 -
రాజన్న దర్శనం.. అభివృద్ధి పనులు
● అనంతరం బహిరంగ సభ ● వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు ● పరిశీలించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్సిరిసిల్ల/వేములవాడఅర్బన్: వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వేములవాడకు బుధవారం ఉదయం 9.15 గంటలకు చేరుకుని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోనే అల్పహారం చేసి, జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. గుడి చెరువు పార్కింగ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.40గంటల వరకు వేములవాడలో సీఎం పర్యటన ఉంటుందని తాత్కాలిక షెడ్యూల్‌ను నిర్ధారించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష జిల్లాలో తొలిసారి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా అధికారులతో సోమవారం ఏర్పాట్లపై సమీక్షించారు. వేములవాడ రాజన్న ఆలయంలోని పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శానిటేషన్ బాగుండాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్లు సమకూర్చాలని, ఒక్కో గ్యాలరీలో మాని టరింగ్ చేసేందుకు ఒక మండలస్థాయి అధికారి ఏర్పాటు చేయాలన్నారు. పాస్‌లు సిద్ధం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవోలు రాజేశ్వర్, ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, ‘సెస్’ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో రమేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
రాజన్నను దర్శించుకున్న కృష్ణభాస్కర్
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్నను తెలంగాణ జెన్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం రాత్రి దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వినోద్‌రెడ్డి స్వామి వారి ప్రసాదం అందించి సత్కరించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి వేములవాడఅర్బన్: గ్రామాల్లోని సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసు మార్చాలని కోరుతూ సోమవారం జిల్లా మాజీ సర్పంచుల సంఘం నాయకులు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించారు. శివుడి విగ్రహానికి వినతిపత్రం అందించారు. మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు అక్కనపెల్లి కరుణాకర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి సర్పంచుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తరువాత 11నెలలుగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన గ్రామాలను జీపీలుగా మార్చాలి సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామపంచాయతీలను మళ్లీ జీపీలుగా మార్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్ల కార్మిక భవన్లో సోమవారం మాట్లాడారు. సిరిసిల్లలో ఏడు, వేములవాడలో ఐదు గ్రామాలను కలిపి ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు లేకుండా చేశారని ఆరోపించారు. పట్టణాల్లో కలిపిన పల్లెలను వేరు చేసి గ్రామపంచాయతీలుగా మార్చాలన్నారు. దీనిపై వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని విలీనమైన సర్దాపూర్ పెద్దూర్ ముష్టిపల్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, చంద్రంపేట, రగుడులను వేరు చేయాలని వేణు కోరారు. వేములవాడకు రూ.127.65 కోట్లు మంజూరు వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణ, ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు సోమవారం మంజూరు చేసింది. రాజన్న ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు రూ.76 కోట్లు, రాజ న్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు, మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైపులైన్, డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్ల పనులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–3 పరీక్ష ప్రశాంతంసిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని 25కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన గ్రూప్–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్సీవో వేణుగోపాల్ తెలిపారు. మొత్తం 7,062 మందికి అభ్యర్థులకు గానూ 3,757 మంది హాజరు అయ్యారని తెలిపారు. 3,305మంది గైర్హాజరు అయినట్లు వివరించారు. మిడ్‌మానేరు నిర్వాసితులను మోసం చేయొద్దు సిరిసిల్ల: మిడ్‌మానేరు నిర్వాసితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు వేలఇండ్లు ఇస్తామని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. మధ్యమానేరులోని 10,683 కుటుంబాలకు ఒకేసారి రూ.5.04లక్షల చొప్పున ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయాలని కోరారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ పర్యటించి మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించారని గుర్తు చేశారు. -
సర్కారు భరోసా
గల్ఫ్ గోస..● వలస బాట.. ఉపాధి వేట ● పది నెలల్లో 17 మంది మృతి ● వలస జీవుల కుటుంబాల్లో తీరని విషాదం ● ఆర్థిక సాయంతో సర్కారు చేయూత ● రేపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రొిసీడింగ్స్ఈమె పేరు విక్కుర్తి రేణుక. కోనరావుపేట మండలం నిమ్మపల్లి. రేణుక భర్త విక్కుర్తి ఎల్లయ్య(47) ఈ ఏడాది జనవరిలో బతుకుదెరువు కోసం దుబాయ్‌కి జిన్కో కంపెనీ వీసాపై వెళ్లాడు. ఊరిలో పెద్దగా భూమి లేదు. ఇల్లు శిథిలమైంది. దుబాయ్‌లో జీతం సరిగా రాలేదు. ఊరిలో చేసిన రూ.9లక్షల అప్పులున్నాయి. మానసిక వేదనకు గురైన ఎల్లయ్య దుబా య్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్మపల్లిలో నాలుగేళ్ల కొడుకు రెహాన్‌తో రేణుక కన్నీటి పర్యంతమవుతోంది. చందుర్తి మండలం బండపల్లికి చెందిన పోతుగంటి భూమయ్య(45) కుటుంబం ఇదీ. పదేళ్లుగా భూమయ్య మస్కట్, సౌదీ అరేబియా దేశాలకు ఉపాధి కోసం వెళ్లాడు. గతేడాది సౌదీఅరేబియా వెళ్లాడు. అక్కడ సరైన పని లేక గుండెపోటుతో ఫిబ్రవరి 2న మరణించాడు. భూమయ్యకు తల్లి మల్లవ్వ, భార్య లక్ష్మీ, కూతురు కల్యాణి, కుమారుడు మారుతి ఉన్నారు. కూతురు పెళ్లికి చేసిన అప్పుల భారం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది.బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన గంగిపల్లి తిరుపతి కుటుంబం. తిరుపతి ఉపాధి కోసం 18ఏళ్లుగా దుబాయ్ వెళ్లివస్తున్నాడు. జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి మృతిచెందాడు. విషయాన్ని కంపెనీ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆలస్యంగా తెలిసింది. ఆయన మరణంతో కొడుకు నవదీప్, కూతురు అక్షితలను పోషించే భారం భార్య లావణ్యపై పడింది. అప్పటికే ఇల్లు కట్టుకున్న అప్పుల భారం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. -
సీఎం సభకు తరలిరండి
● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడఅర్బన్: ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగసభకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్‌లో సోమవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్, మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల 20న బుధవారం వేములవాడకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తున్నారని తెలిపారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్న ట్లు వివరించారు. 2023– 24 బడ్జెట్లో ఆలయానికి రూ.50కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 2018లో మిడ్‌మానేరు ముంపుగ్రామాల ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్బెడ్రూం ఇళ్లు కింద రూ.5లక్షలు ఇస్తానని మోసం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో అనాడు రేవంత్‌రెడ్డి సంకెపల్లిలో పల్లెనిద్ర చేసి ముంపు ప్రజలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఆ మాట ప్రకారం 4,696ఇళ్లకు రూ.230 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. యారన్ డిపో తీసుకొచ్చామని, మూలవాగు వంతెనకు భూ సేకరణకు రూ.6కోట్లు మంజూరు చేశామన్నారు. మల్కపేట పనులకు రూ.9కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం రాజన్న గుడి చెరువు పార్కింగ్స్థలంలోని సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యసిరిసిల్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్న సాక్షిగా అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో సోమవారం మాట్లాడుతూ.. జిల్లాలోని మధ్యమానేరు నిర్వాసితులకు ప్రతిపక్ష నేతగా గతంలో ఇచ్చిన హామీలను సీఎం హోదాలో నెరవేర్చాలని, నిర్వాసితులకు రూ.5.04 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. 4696 మందికి మాత్రమే ఇస్తున్నట్లు జీవో జారీచేయడం సరికాదన్నారు. పదివేలకు పైగా ఉన్న నిర్వాసితుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. వేములవాడకు వస్తున్న సందర్భంగా సిరిసిల్ల నేతన్నల ఉపాధికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వస్త్రపరిశ్రమను ఆదుకోవాలని, నేతన్నలకు పని కల్పించాలన్నారు. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరితో సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు, ఆకలి చావులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సిరిసిల్లకు ప్రత్యేకంగా రూ.50లక్షల నిధిని అందించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాకు తొలిసారిగా సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. వేములవాడకు ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఎస్పీ అఖిల్‌మహాజన్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడలో హెలీప్యాడ్ సిద్ధం చేయాలని ఆర్అండ్ బీ అధికారులకు సూచించారు. సభ ప్రాంగణంలో షామియానా, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బహిరంగ సభ కోసం బస్సులు సమకూర్చాలన్నారు. గెస్ట్‌హౌస్‌లో వసతులు, శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీస్‌శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవోలు రాజేశ్వర్, వెంకట ఉపేందర్‌రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ బాపురెడ్డి, డీఎంహెచ్‌వో వసంతరావు, సీపీవో శ్రీనివాసాచారి, కమిషనర్లు లావణ్య, అన్వేశ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంరెడ్డి పాల్గొన్నారు. -
మూడు పార్టీల్లో పోటీ..
కాంగ్రెస్‌లో బహుముఖ పోటీ నెలకొంది. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, ఎంపీ కంటెస్టెంట్ వెలిచాల రాజేందర్ రావు మధ్య గట్టిపోటీ నడుస్తోంది. వీరిద్దరూ తమకు టికెట్ కేటాయించాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. ఇటీవల నరేందర్‌రెడ్డికి ఒకసారి ఢిల్లీ నుంచి మరోసారి పీసీసీ చీఫ్ నుంచి ఆహ్వానాలు రావడం గమనార్హం. 1,50,000 మందితో ఆయన ఓటర్ ఎన్రోల్మెంట్, 42నియోజకవర్గాల్లో పర్యటనలు, 71 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక యాప్ తదితరాలతో ప్రచారంలో అందరి కన్నా ముందున్నారు. వెలిచాల రాజేందర్రావు కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన రాజకీయ నేపథ్యం, యువత, నిరుద్యోగుల విషయంలో తనకున్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా వీరిద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తాజాగా మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ● బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ముందు నుంచి తానే గులాబీ పార్టీ అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్రోల్మెంట్ ముగిసిన దరిమిలా.. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. బీఎన్.రావు ఉమ్మడి నాలుగు జిల్లాల్లో వరుసగా పర్యటిస్తున్నారు. రావుఫౌండేషన్, ఐఎంఏలో తాను చేసిన సేవలు గెలిపిస్తాయని నమ్ముతున్నారు. యాదగిరి శేఖర్‌రావు కూడా గులాబీ పార్టీటికెట్ ఆశిస్తున్నారు. పార్టీతో పనిలేకుండా తన ప్రచారం తాను చేసుకుపోతున్నారు. టికెట్ వచ్చినా రాకున్నా.. ఈ ముగ్గురు స్వతంత్రులుగానైనా బరిలో నిలవనున్నారు. ● బీజేపీ నుంచి పొల్సాని సుగుణాకర్‌రావు, మంచిర్యాలకు చెందిన రఘుపతి, రాణీరుద్రమ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. ఇండిపెండెంట్లు సైతం భారీగానే బరిలో ఉన్నారు. మాజీ డీఎస్పీ గంగాధర్, లక్ష్య్ విద్యాసంస్థల అధినేత ఎండీ.ముస్తాఖ్అలీ, డాక్టర్ హరికృష్ణారెడ్డి తదితరులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. తమ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆయా అభ్యర్థుల బలబలాలు, సామర్థ్యాలను క్షేత్రస్థాయిలో రహస్య సర్వేల ద్వారా అంచనావేసి త్వరలోనే ప్రధాన పార్టీలు ఓ నిర్ణయానికి రానున్నాయి. -
ఇళ్ల నిధుల మంజూరుపై హర్షం
వేములవాడఅర్బన్: మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.234.80కోట్లు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నాయకులు నందికమాన్ వద్ద ఆదివారం సంబ రాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాడు మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇంది రమ్మ ఇళ్లకు రూ.5లక్షలు చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇళ్లకు రూ.230కోట్లు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడలోని బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు పిల్లి కనక య్య, చింతపల్లి శ్రీనివాసరావు, ఎర్రం రాజు, పండుగ ప్రదీప్, గాలిపెల్లి స్వామి, ఎర్రం సత్తయ్య, ప్రభాకర్‌రెడ్డి, దేవరాజు ఉన్నారు. 4,696 ఇళ్లకు రూ.230 కోట్లు మంజూరు చేశాం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ఆడిపాడి నవ్వుకున్నారు
సిరిసిల్ల: జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వేకువజామున 5.30 గంటలకే.. సిద్ధిసమాధి యోగ శిబిరం మొదలైంది. చలిని సైతం లెక్కచేయకుండా.. 120 మంది యోగా శిక్షణలో భాగంగా ఫన్ క్లబ్లో పాల్గొన్నారు. ఆడి, పాడి మనసారా నవ్వుకున్నారు. దీని వల్ల శరీరం, మనసు తేలికవుతుందని యోగా శిక్షకులు తెలిపారు. యోగా గురువులు రాజరత్నాకర్, ఆచార్య లింగమూర్తి, రవీంద్ర ఆచార్య, యాద రమేశ్, ఉప్పల శ్రీనివాస్, బత్తుల భూమేశ్, గడ్డం దేవన్న, సందీప్, రణధీర్, పోలుక ఆనంద్, కల్పన, శ్రీదేవి, సుమ తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని నేడు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదివారం తెలిపారు. జిల్లాలో 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉంటారని, మరోవైపు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లా స్థాయి అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమైనందున సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కిక్కిరిసిన బస్టాండ్ వేములవాడఅర్బన్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం రాత్రి వచ్చిన భక్తులు ఆదివారం సాయంత్రం స్వస్థలాలకు తిరిగివెళ్లారు. ఈక్రమంలో తిప్పాపూర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీని బట్టి బస్సులు నడిపిస్తున్నట్లు వేములవాడ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల కూలీలెవరు ? ● వివరాలు సేకరిస్తున్న పోలీసులు ముస్తాబాద్(సిరిసిల్ల): పొరుగు రాష్ట్రాల నుంచి ఎంత మంది కూలీలు వచ్చారు.. ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పలు గ్రామాల్లో చోటుచేసుకుంటున్న వరుస చోరీలు, ఇతర అవాంఛనీయ సంఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు ఈ ప్రాంతానికి వచ్చారని పోలీసులు పేర్కొంటున్నారు. జిల్లాలో వరుస చోరీలపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు ఇటుకబట్టీలు, గృహ నిర్మాణం, డెయిరీ, రైస్‌మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనులు చేసేందుకు నార్త్ ఇండియాకు చెందిన కూలీలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి వారు ఏదైనా నేరచరిత్ర కలిగి ఉన్నారనే అనుమానంతో కూలీల వేలిముద్రలు, కంటిపాపల బయోమెట్రిక్‌ను నమోదు చేస్తున్నారు. వారిలో ఎవరైన నేరస్తులు ఉన్నారా.. అని కూపీ లాగుతున్నట్లు తెలిసింది. ‘నేరెళ్ల ఘటనతో కేటీఆర్‌కు సంబంధం లేదు’ సిరిసిల్ల: నేరెళ్ల ఘటనతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సంబంధం లేదని, అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన తప్ప మ రోటి కాదని జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అ ధ్యక్షుడు మాట్ల మధు పేర్కొన్నారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. నేరెళ్ల బాధితులను మంత్రి హోదాలో కేటీఆర్ వేములవాడకు వెళ్లి పరా మర్శించారని గుర్తు చేశారు. మానత్వంతో నేరెళ్ల బాధితులను ఆదుకున్నారని స్పష్టం చేశారు. నేరెళ్ల ఘటనను, లగచర్ల ఘటనలతో పోల్చుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు పొందేందుకు కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి పాకులాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయి పది నెలలైనా నేరెళ్ల బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. మరోసారి కేటీఆర్‌పై మాట్లాడితే.. ఉకునేది లేదన్నారు. సబ్బని హరీశ్, మెంగని మనోహర్, కంచర్ల రవిగౌడ్, ప్రేమ్ కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన అంగన్వాడీ నేతలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లబొప్పాపూర్ అంగన్వాడీ టీచర్ నీరటి భవానిని వేధింపులకు గురిచేసిన బెస్త నరేశ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని అంగన్వాడీ యూనియన్ నేతలు ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు ఆదివారం విన్నవించారు. కోడిగుడ్డు నెపంతో అంగన్వాడీ కేంద్రానికి వెళ్తూ భవానిని లైంగికంగా వేధించాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మహిళా టీచర్లు ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు పురుషులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు కోరారు. -
‘వర్కర్ టు ఓనర్’ ప్రకటించాలి
● 19, 20 తేదీల్లో సిరిసిల్లలో జిల్లా మహాసభలు ● సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్సిరిసిల్ల: సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు వస్తున్న సందర్భంగా సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులను య జమానులను చేసే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేసేలా ప్రకటన చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్ అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. సీఎం వేములవాడకు వస్తున్న సందర్భంగా సిరిసిల్లలో నేతకార్మికులు, ఆసాముల ఆత్మహత్యల నివారణకు ఉపాధి చూపించేలా కార్యాచరణ ప్రకటించాలని కోరారు. 2023లో బతుకమ్మ చీరలు నేసిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని, కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. డబుల్ ఇళ్ల కోసంఅర్హతలున్నా లక్కీడ్రాలో పేర్లు రాని వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయాలని కోరారు. మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం అందించాలని కోరారు. జిల్లా మహాసభలు విజయవంతం చేయండి సిరిసిల్లలో నవంబర్ 19, 20 తేదీల్లో సీపీఎం జిల్లా మూడో మహాసభలు విజయవంతం చేయాలని మూశం రమేశ్ కోరారు. సీపీఎం జిల్లా కమిటీ స భ్యులు కోడం రమణ, సూరం పద్మ, సీపీఎం పట్టణ కార్యదర్శి గణేశ్, రమేశ్చంద్ర పాల్గొన్నారు. -
కంగ్రాట్స్.. శ్రీవల్లి
కరీంనగర్‌స్పోర్ట్స్: క్రికెట్ క్రేజ్ ఉన్న ఆట. దేశప్రజలకు ఎంతో ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆస్వాదిస్తారు. యువత, చిన్నారులు బంతి, బ్యాటుతో మైదానంలో సందడి చేస్తుంటారు. గల్లీలో మొదలైన ఆట ఆసక్తిఉన్నవారిని అంతర్జాతీయ మైదానం వరకు చేరుస్తుంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రజనీ వేణుగోపాల్, కౌశిక్‌రెడ్డి రాష్ట్రజట్టులో ఆడగా ఇప్పుడు కట్ట శ్రీవల్లి హైదరాబాద్ మహిళల జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఫాస్ట్‌బౌలర్‌గా రాణిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. డిసెంబర్ 4న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బీసీసీఐ సీనియర్ మహిళల వన్డేజట్టుతో తలపడనున్న హైదరాబాద్ టీం తరఫున ఆడనుంది. ఆదివా రం హెచ్‌సీఏ విడుదల చేసిన హైదరాబాద్ ఉమెన్స్టీంలో శ్రీవల్లి పేరు ఉండడం విశేషం.కరీంనగర్‌లోని సవరన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కట్ట లక్ష్మారెడ్డి చిన్న కూతురు శ్రీవల్లి. సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడ్పుల కాగా.. 1985నుంచి కరీంనగర్‌లోని శ్రీపురంకాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి ఉమారాణి బ్యూటీపార్లర్ నడిపిస్తోంది. అక్క జిగిషా ఇంగ్లాండ్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తోంది. శ్రీవల్లి 1 నుంచి 10వ తరగతి వరకు కరీంనగర్‌లోని ప్రయివేటుపాఠశాలల్లో చదివింది. ప్రస్తుతం ఓపెన్ ఇంటర్లో హెచ్ఈసీ చేస్తోంది. కరీంనగర్లో 5వ తరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌పై శ్రీవల్లికి ఉన్న ఆసక్తిని పీఈటీ రహీం గ్రహించాడు. గొప్ప ప్లేయర్ అవుతుందని గుర్తించి, ఆటలో ఓనమాలు నేర్పించాడు. బౌలింగ్‌పై ఆసక్తి ఉండడంతో ఫాస్ట్‌బౌలర్‌గా తీర్చిదిదాడు. 6వ తరగతి చదువుతున్న సమయంలో జాతీయస్థాయి పాఠశాలల పోటీలకు ఎంపికై ంది. మధ్యప్రదేశ్‌లోని కందువాలో జరిగిన జాతీయస్థాయి పాఠశాలల అండర్–14 పోటీల్లో సత్తాచాటింది. 2022లో పూణెలో జరిగిన అండర్–19 పోటీల్లో రాణించింది. 10వ తరగతి పూర్తయిన తరువాత హైదరాబాద్‌లో క్రికెట్ శిక్షణ తీసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహిళల క్రికెట్ క్యాంప్‌లో పాల్గొని బెస్ట్ ఫాస్ట్‌బౌలర్‌గా తయారైంది. హైదరాబాద్ తరఫున ఫాస్ట్ బౌలర్‌గా డిసెంబర్ 4న అహ్మదాబాద్‌లో బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే జట్టుతో తలపడనున్న హైదరాబాద్ టీం తరఫున ఫాస్ట్‌బౌలర్‌గా కట్ట శ్రీవల్లిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. హెచ్‌సీఏ నిర్వహించిన శిక్షణ శిబిరంలో రాణించి ఫాస్ట్‌బౌలర్ కేట గిరిలో తొలిస్థానం సాధించింది. భవిష్యత్‌లో ఇండియన్ ఉమెన్ టీంకు ఆడాలన్నదే తన కోరికని చెబుతోంది. శ్రీవల్లి ఎంపిక కావడంపై జిల్లా క్రికె ట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ జట్టులో చోటు బీసీసీఐ సీనియర్ మహిళల జట్టుతో మ్యాచ్‌కు ఎంపిక డిసెంబర్ 4న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఫాస్ట్‌బౌలర్‌గా రాణిస్తున్న కరీంనగర్ బాలిక -
72.62 శాతం సర్వే పూర్తి
సిరిసిల్ల: జిల్లాలో 72.62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,531 ఎన్యుమరేషన్ బ్లాక్‌ల పరిధిలో 1,92,432 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా నవంబర్ 17 నాటికి 1,39,743 ఇళ్ల సర్వే పూర్తి చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,154 ఎన్యుమరేషన్ బ్లాక్‌ల పరిధిలో 1,44, 972 ఇళ్లకు 1,02,521 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 377 ఎన్యుమరేషన్ బ్లాక్‌ల పరిధిలో 47,460 ఇళ్లకు 37,222 ఇళ్ల సర్వే చేసినట్లు వివరించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 70.72 శాతం, పట్టణ ప్రాంతాల్లో 78.43 శాతం, జిల్లా వ్యాప్తంగా 72.62 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. మిగిలిన ఇళ్లలో సైతం ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
కానిస్టేబుళ్లకు గ్రూప్–4 ఉద్యోగాలు
● శిక్షణలో ఉన్న పలువురు ఉమ్మడి జివ్లావాసులు ● తాజాగా జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపిక ప్రభుత్వ ఉద్యోగం కోసం తపన పడ్డారు.. నిత్యం గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టారు.. చివరకు అనుకున్నది సాధించారు.. పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.. ఈ వార్త వారితోపాటు వారి కుటుంబాల్లో ఎంతో సంతోషం తీసుకువచ్చింది.. కానీ, ఈ ఉద్యోగంతోనే ఆ కానిస్టేబుళ్లు ఆగిపోలేదు.. శిక్షణలో ఉన్నా గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలు రాస్తున్నారు.. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చాలామంది గ్రూప్–4 ద్వారా జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారు.. పలువురు గ్రూప్–1 మెయిన్స్ రాశారు.. గ్రూప్–2 కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వారిపై ప్రత్యేక కథనం. -
ఎవరి బలం ఎంత?
రాజన్న సిరిసిల్లసోమవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2024‘ఎమ్మెల్సీ’ కోసం పార్టీల సర్వే ● అభ్యర్థుల బలాబలాలపై రహస్యంగా సమాచార సేకరణ ● ఇప్పటికే పూర్తయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ● ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న అభ్యర్థులు ● ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్లలో పెరుగుతున్న పోటీ7సాక్షిప్రతినిధి,కరీంనగర్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చితో ముగియనుండటంతో రాజకీయపార్టీలు కూడా అభ్యర్థుల బలా బలాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సొంతపార్టీ నేతలతోపాటు పలు ప్రైవేటు ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. తొలుత అభ్యర్థుల అంగబలం, అర్ధబలం ప్రామాణికంగా తీసుకుంటున్న పార్టీలు, తరువాత నాయకుడి చరిష్మా, రాజకీయ నేపథ్యం, గతంలో నిర్వహించిన పదవులు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు రహస్యంగా నియమించుకున్న పలు బృందాలు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్థానంలోని పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయి. కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల్లో బహుముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్– బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని హస్తంపార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఉద్యమఖిల్లాగా పేరొందిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని సొంతం చేసుకుంటే తమ పార్టీకి ఇక్కడ తిరిగి పట్టు చిక్కుతుందన్న పట్టుదలతో బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అదే సమయంలో పట్టభద్రుల స్థానంలో ఈ సారి సత్తా చాటాలని బీజేపీ సైతం అదే స్థాయిలో ఆశలు పెట్టుకుంది.న్యూస్‌రీల్