బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు లోనయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు శుక్రవారం (మార్చి 15) నాడు ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్‌బీ ఎక్స్ (ట్విటర్)లో ఎప్పటికీ కృతజ్ఙతగా ఉంటాను అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి అభిమానులు స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
కాగా అమితాబ్‌ను గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్‌తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది.
ఆ సినిమాతో కెరీర్ మొదలు
కాగా అమితాబ్ ప్రస్తుత వయసు 81. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 55 ఏళ్లు పూర్తయింది. 1969లో అమితాబ్ ‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నాడు. వందలాది చిత్రాలతో భారతీయులను అలరించిన అతడు ప్రస్తుతం వేట్టయాన్, కల్కి 2898 ఏడీ అనే సినిమాలు చేస్తున్నాడు.
T 4950 - in gratitude ever ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024
చదవండి: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సిరీస్ ఎలా ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment