అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ

Published Fri, Dec 6 2024 1:31 AM | Last Updated on Fri, Dec 6 2024 1:30 AM

అంతర్

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ

వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, సివిల్‌ సప్లయీస్‌ డీఎం రాంపతి గురువారం తనిఖీ చేశారు. పక్క రాష్ట్రం నుంచి ఎలాంటి లారీలు వచ్చినా తనిఖీ చేయాలని సూచించారు. అంతకు ముందు మండల పరిధిలోని ప్రగళ్లపల్లి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో కోతలు లేకుండా చూడాలని ఆయనను రైతులు కోరారు. మొరుమూరు గ్రామం నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు వరకు వెళ్లే రహదారి నిర్మాణానికి భూమి అవసరం కాగా ఆ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడారు. వారి వెంట తహసీల్దార్‌ వీరభద్ర ప్రసాద్‌, డిటి రాహుల్‌ చంద్రవర్మ, ఆర్‌ఐ కుమారస్వామి, ఏఈఓ జాపర్‌ తదితరులు ఉన్నారు.

స్విమ్మింగ్‌ పోటీలకు ఏర్పాట్లు

భూపాలపల్లి అర్బన్‌: ఈనెల 7, 8 తేదీల్లో జిల్లాకేంద్రంలో జరగనున్న ఇంటర్‌ డిస్టిక్ర్ట్‌ సిమ్మింగ్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్విమ్మింగ్‌పూల్‌ను పరిశీలించి పోటీల ఏర్పాట్లపై ఏరియా అధికారులతో జీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు ఈ స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలకు సుమారు 500 మంది స్విమ్మర్లు, సహాయక సిబ్బంది, కోచ్‌లు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనే సభ్యులకు వసతులు కల్పించడానికి నిర్వాహకులు వసతి, ఇతర అవసరమైన ఏర్పాట్లు అందించడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు బాలరాజు, స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌

పోటీలకు ఎంపిక

కాటారం: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల హ్యాండ్‌బాల్‌ అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. నవంబర్‌ 8నుంచి 10వరకు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌–19 విభాగంలో ఉమ్మడి వరంగల్‌ జట్టు తరఫున గురుకులం హ్యాండ్‌బాల్‌ అకాడమీ విద్యార్థులు చందర్‌, నరేశ్‌ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వరంగల్‌ జట్టు తరఫున గోల్డ్‌మెడల్‌ సైతం సాధించారు. దీంతో చందర్‌, నరేస్‌ను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి రమేశ్‌ తెలిపారు. ఈ నెల 11నుంచి 17వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ప్రిన్సిపాల్‌ బి.లాలు, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేందర్‌, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ మాధవి, పీడీ మహేందర్‌, పీఈటీ శ్రీనివాస్‌, కోచ్‌ వెంకటేష్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందించారు.

హామీలను నెరవేరుస్తున్నాం..

భూపాలపల్లి రూరల్‌: ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం భూపాలపల్లి బస్‌ డిపో మేనేజర్‌ ఇందూ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 మార్చిలో ప్రభుత్వం సుమారు వెయ్యి బస్సులు ప్రారంభించనుందన్నారు. కొత్త బస్సులను భూపాలపల్లి డిపోకు తీసుకువచ్చి తిరుపతి, బెంగళూరు వంటి దూరపు ప్రాంతాలను నడిపిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేను పలువురు అధికారులు, ఆర్టీసీ సిబ్బంది సన్మానించారు. అనంతరం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డీఎంతోపాటు కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులతో పాటు మెకానిక్‌లు, సిబ్బంది, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, దాట్ల శ్రీనివాస్‌, శిరుప అనిల్‌, ముంజాల రవీందర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ
1
1/1

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement