అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
కాటారం: అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కాటారం మండలం దామెరకుంట, గుండ్రాత్‌పల్లి, మల్లారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లాంటేషన్లను గురువారం డీఎఫ్‌ఓ పరిశీలించారు. ఫ్లాంటేషన్ విస్తీర్ణం, ఏఏ రకాల మొక్కలు నాటారు, మొక్కల పెంపకం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఫ్లాంటేషన్ల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకం, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అడవుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అడవుల రక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. డీఎఫ్‌ఓ వెంట కాటారం రేంజ్ అధికారిణి స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్‌నాయక్, ఎఫ్‌బీఓలు రాజ్‌కుమార్, జయలక్ష్మి ఉన్నారు.
జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment