ఏటూరునాగారం: ఈ నెల 1వ తేదీన చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడిన మావోయిస్టు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు భార్య మీనా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే మల్ల య్య మృతదేహాన్ని ఏటూరునాగారం పోస్టుమార్టం గదిలోనే భద్రపర్చాలని సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళ, గురువారాల్లో రెండు దఫాలుగా కోర్టులో కేసుపై వాదోపవాదనలు జరిగాయి. దాంతో మృతదేహాన్ని భద్ర పర్చారు. అయితే మల్లయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, అతడిని చిత్ర హింసలు పెట్టి హత్య చేశారని బాధితురాలి న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించారు. అయితే నిజనిర్ధారణ కోసం హైకోర్టుకు చెందిన న్యాయవాదులు మల్లయ్య మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు నేడు(శుక్రవారం) ఏటూరునాగారం చేరుకునే అవకాశం ఉంది. అలాగే మృతుడి శరీరంలో కేవలం ఒకే బుల్లెట్ ఉందని, శరీరంపై 11చోట్ల గాయాలున్నట్లు గుర్తించినట్లు బాధితురాలి న్యాయవాది తెలిపారు. అందరి సమక్షంలో మావోయిస్టు మల్లయ్య మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు సైతం తీసి బాధితురాలికి అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
పాలనను గాలికొదిలేసిన ప్రభుత్వం
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం భూపాలపల్లి మండలం కొంపెల్లి, గొర్లవీడు, కాసీంపల్లి, జంగేడు మీదుగా భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నిశిధర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని ఎమ్మెల్యే కేవలం శిలాఫలకాల వరకే పరిమితం చేశాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment