యాసంగి పంటలకు
మంగళవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
సాక్షిప్రతినిధి, వరంగల్ :
యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదలశాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుతడి, తరి కలిపి సుమారు 5.77 లక్షల ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్(వారబందీ) పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాళేశ్వరం, ఎస్సారెస్పీ స్టేజ్–1, ఎస్సారెస్పీ స్టేజ్–2, దేవాదుల ఎత్తిపోతల పథకాల ద్వారా ఇరిగేషన్ అధికారులు ఈ ఆయకట్టును ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక, యాజమాన్య కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆయకట్టుకు నీరందించడంతో పాటు అవసరమున్న చెరువులు, రిజర్వాయర్లు నింపేందుకు సుమారు 26.20 టీఎంసీలు అవసరం ఉంటుంది. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఇప్పటికే నారు పోసి వరినాట్లకు సన్నద్ధమవుతుండగా.. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు యాసంగి పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
జనవరి 1 నుంచి విడుదల..
ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాలానికి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టు రెండో దశకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది వర్షాల మధ్య విరామం తక్కువగా ఉండటంతో నేలలో తేమ ఉన్నందువల్ల తక్కువ నీటి తడులు అవసరమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇందుకు తోడు శ్రీరామసాగర్ ఎగువ నుంచి గోదావరిలోకి నీటి ప్రవాహం వస్తుండగా.. దిగువన కూడా వినియోగించిన నీరు(రీ–జనరేషన్) వచ్చి కలుస్తున్నందున యాసంగిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రాజెక్టుల్లో నీటిలభ్యతకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌లో సుమారు 5.77 లక్షల ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన యాసంగి సాగునీరు సరఫరా కానుందని అంచనా వేశారు. 2025 జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు వారం రోజులు నీటి విడుదల చేస్తే.. మరో వారం రోజులు సరఫరా నిలిపి వేస్తారు. ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనల ప్రకారం ఎస్సారెస్సీ స్టేజ్–1(ఎల్‌ఎండీ) కింద 2,21,947 ఎకరాలు, కాళేశ్వరం ద్వారా 93,070 ఎకరాల ఆయకట్టు ఉంది. అదే విధంగా ఎస్సారెస్పీ–2 కింద 90,611 ఎకరాలు, దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 1,71,528 ఎకరాల ఆయకట్టుకు ఈ యాసంగిలో నీటి సరఫరా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఆరుతడి, తరి పంటలకు
సాగునీరు
యాసంగిలో స్థిరీకరించిన ఆరుతడి, తరి పంటలకు సాగునీరు అందించేందుకు నిర్ణయం జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ మేరకు వచ్చే జనవరి 1 నుంచి మార్చి 31 వరకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
– రాజు, డీఈఈ, నీటిపారుదలశాఖ
న్యూస్‌రీల్
లక్ష్యం 5.77 లక్షల ఎకరాలు
ఇరిగేషన్ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం
2025 జనవరి 1 నుంచి
మార్చి 31 వరకు..
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన సాగునీరు విడుదల
ఉమ్మడి వరంగల్ ఆయకట్టుదారులకు శుభవార్త
Comments
Please login to add a commentAdd a comment