నేడు ఏకసభ్య కమిషన్ రాక
కర్నూలు(అర్బన్): షెడ్యూల్డు కులాల్లోని ఉప – వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నియమించిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నేడు (గురువారం) జిల్లాకు రానుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కే తులసీదేవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించి జిల్లా అధికారులు, వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాలతో వినతి పత్రాలను స్వీకరిస్తుందన్నారు. స్వీకరించిన వినతి పత్రాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థల్లో ఎస్‌సీ ఉప వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించిన వినతులను పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే ఎస్సీ కులాల్లోని వివిధ ఉప వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా పరంగా ఉన్న వెనుకబాటును పరిశీలిస్తుందన్నారు. కమిషన్‌కు వినతులు అందించే వారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారై ఉండాలని, తమ వినతి పత్రాలపై రెండు అంశాలకు సంబంధించిన వాస్తవాలకు తగు ధ్రువీకరణ ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలని డీడీ కోరారు.
కృష్ణాజలాల్లో కనిపిస్తున్న
సంగమేశ్వరం శిఖర భాగం
● ముందుగా డబ్బులు చెల్లిస్తేనే
విద్యుత్ సరఫరా ●
● ఈ మేరకు స్మార్ట్ మీటర్లు బిగించి
భారం మోపేందుకు సర్కారు కుట్ర
● గత ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు
పగలగొట్టాలని బాబు పిలుపు
● అధికారంలోకి వచ్చాక
మారిన విధానం
● జిల్లాలో 6 లక్షల గృహ
వినియోగదారులపై
పడనున్న ప్రభావం
వాడిన విద్యుత్‌కు తర్వాత నెలలో వినియోగదారులు బిల్లు చెల్లిస్తారు. ఈ చెల్లింపులో కాస్త ఆలస్యమైనా స్వల్పంగా జరిమానా పడుతుందే తప్ప వెంటనే సరఫరా నిలిచిపోదు. ఇక మీదట అలా కుదరదు. విద్యుత్ కావాలంటే ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. అది ఖర్చయ్యేలోగా మళ్లీ డబ్బు కడితేనే సరఫరా కొనసాగుతుంది. లేదంటే క్షణాల్లో నిలిచిపోతుంది. స్మార్ట్ మీటర్ల పేరుతో వాడుకునే కరెంటుకు ముందుగానే ప్రీపెయిడ్ విధానంలో డబ్బు వసూలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల కనెక్షన్లను వీటి పరిధిలోకి తెచ్చిన సర్కారు మరికొద్ది రోజుల్లో అన్ని కేటగిరీల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించనుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment