నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
జయపురం: కొరాపుట్ జిల్లా బ్రాహ్మణ సమాజ్ జయపురం వారు నూతన క్యాలెండర్‌ను మంగళవారం స్థానిక శ్రీజగన్నాథ్ మందిరంలో ఆవిష్కరించారు. ముందుగా ఉత్కళుల ఆరాధ్య దైవం శ్రీజగన్నాథునికి పూజలు చేశారు. ఆలయాల సముదాయ కూడలి వద్ద 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ప్రదర్శించారు. కార్యక్రమాల్లో కొరాపుట్ బ్రాహ్మణ సమాజ్ సభ్యులు నరశింహ ప్రసాద్ మిశ్ర, శరత్ చంధ్ర బినోద్ మహాపాత్రో, రమేష్ త్రిపాఠీ, కిశోర్ పండ, బిజయ భట్,భవాణి ఆచార్య, సన చౌధురి,ముధి హొత్త,నవకృష్ణ రథ్, లతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment