Dec 26th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Dec 26th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Dec 26th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Tue, Dec 26 2023 7:15 AM | Last Updated on Tue, Dec 26 2023 6:30 PM

AP Elections Political News Updates Headlines Dec 26th Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

5:44 PM, Dec 26, 2023
లోకేష్‌ ఉద్యోగాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు : ఎమ్మెల్సీ పోతుల సునీత

  • లక్షల ఉద్యోగాలు సీఎం జగన్ ఇస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదని యువగళం సభలో లోకేష్ మాట్లాడటం సిగ్గు చేటు..
  • అభివృద్ధి జరగలేదని ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తున్నారు..
  • పరిశ్రమల స్థాపన.. ఫిషింగ్ హార్భర్లు ఏర్పాటు.. టీడీపీ కి కళ్ళకి కనిపించడం లేదు..
  • 2019లో వచ్చిన ఫలితాలే.. 2024లో కూడా రిపీట్ అవుతాయి..
  • పవన్, చంద్రబాబు, లోకేష్ లు టూరిస్ట్ రాజకీయాలు చేసే టూరిస్ట్ నాయకులు

5:35 PM, Dec 26, 2023
నాడు తండ్రి.. నేడు తనయుడు : సినీ నటుడు, మీడియా సలహాదారు అలీ

  • నెల్లూరులో చేపల పులుసు.. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఫేమస్
  • పేదల కష్టాలను సీఎం జగన్ దగ్గర నుంచి చూసారు
  • వారి కడుపు నింపేందుకు సంక్షేమ పథకాలకు రూప కల్పన చేశారు
  • తండ్రి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ వంటి పథకాలను సీఎం  జగన్ కొనసాగిస్తున్నారు
  • ప్రతి నిరుపేదకి సొంత ఇళ్ళు ఉండాలని సీఎం జగన్ చేసిన ఆలోచన గొప్పది

5:22 PM, Dec 26, 2023
వాలంటీర్లపై టిడిపి విషప్రచారం : అనిల్‌

  • SC, ST, BC, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం YS జగన్..
  • వాలంటీర్లను తీసేస్తామని టీడీపీ చెబుతుంది.. అదే జరిగితే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందవు..
  • జగన్ గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు.. గుండెల్లో పెట్టుకుని కాపాడునే వ్యక్తి జగన్..
  • పవన్, చంద్రబాబు కట్టకట్టుకుని వచ్చినా సీఎం జగన్‌ను ఏం చేయలేరు
  • YSRCP నుంచి బయటకు వెళ్లిన వాళ్లను తమ పార్టీలోకి తీసుకున్న పనికిమాలిన పార్టీ టీడీపీ

5:11 PM, Dec 26, 2023
ప్రశాంత్‌ కిషోర్‌ ఒక ఈవెంట్‌ మేనేజర్‌: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

  • ఈరోజు ఓ పెళ్లి చేయొచ్చు.. మరో రోజు మరో పెళ్లి నిర్వహించవచ్చు
  • 175 మంది ఎమ్మెల్యేల కంటే 5 కోట్ల మంది ప్రజల సంక్షేమమే సీఎం జగన్‌కు ముఖ్యం
  • నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు
  • బీఫామ్‌ ఇచేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరేనేది నిర్థారణ కాదు
  • అవసరం అనుకుంటే ఎవరినైనా మార్చవచ్చు
  • సీటు ఇవ్వలేదని ఇంట్లో కూర్చోం.. పార్టీ జెండా మోస్తాం

3:29 PM, Dec 26, 2023
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి

  • టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అసత్య ప్రచారం
  • రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారు
  • టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు
  • మంత్రిగా పనిచేసినా రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు
  • నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫోటోలు పెడతా
  • సాగు, తాగు నీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెబుతున్నారు
  • సీఎం జగన్‌ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి
  • 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించా
  • 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు 

01:46 PM, Dec 26, 2023
చంద్రబాబుకు ఓటమి భయం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
  • వైఎస్సార్‌సీపీలో  టిక్కెట్లు రావని తెలిసినవారిని చేరదీస్తూ సంబరపడుతున్నాడు
  • చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
  • 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయి
  • సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు
  • ప్రశాంత్ కిషోర్ పేకాటలో డిస్‌కార్డు లాంటి వ్యక్తి
  • ప్రశాంత్ కిషోర్‌ను మేము వదిలేశాక చంద్రబాబు అక్కున చేర్చుకున్నాడు
  • చంద్రబాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉంది

11.05am, డిసెంబర్‌ 26, 2023

టీడీపీ నారాయణపై ఎమ్మెల్యే అనిల్‌ ఫైర్‌

  • మాజీ మంత్రి నారాయణపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌
  • నారాయణ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలపై నారాయణ ఎందుకు స్పందించడం లేదు?
  • లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుని స్టూడెంట్స్ చావుకు నారాయణ కారణం అవుతున్నారు.
  • టీడీపీ హయాంలోనే అరాచకాలు ఎక్కువగా జరిగాయి.. 
  • నా కార్యకర్తలను టీడీపీ నేతలు చంపేశారు.

11.00am, డిసెంబర్‌ 26, 2023
ఏపీలో ఎన్నికల వేడి

  • కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనతో పెరిగిన ఎన్నికల హీట్
  • రెండు రోజుల పాటు విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం
  • ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టిన ఈసీ
  • సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై దృష్టి
  • కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో తెలంగాణ నుంచి ఎందరు?
  • తెలంగాణ ఎన్నికల్లో ఓటేసి మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారా?
  • 2019లో ఏపీలో ఓటేసి మళ్లీ 2023 కల్లా తెలంగాణలో ఓటర్లుగా చేరారా?
  • ఏపీలో, తెలంగాణలో ఎంత మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి?
  • అక్కడా, ఇక్కడా ఓటర్లుగా ఉన్నవారిని సులభంగా గుర్తించే ప్రక్రియ ఏంటీ?
  • ఓటర్‌ కార్డుకు ఆధార్‌ కార్డును ఎలా అనుసంధానం చేద్దాం?
  • గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే డబుల్‌ ఓటర్ల అసలు సంగతి తేల్చలేమా?
  • పకడ్బందీ వ్యూహాన్ని తయారు చేస్తోన్న ఎన్నికల సంఘం

11.00am, డిసెంబర్‌ 26, 2023
కిం కర్తవ్యం.? నమ్మి మోసపోతున్నామా?

  • ఈనెల 28,29,30 తేదిలలో కాకినాడలో పవన్ కళ్యాణ్ బస
  • గోదావరి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా బలబలాలపై సమీక్ష
  • చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు చెప్పనున్న పవన్‌
  • ఇప్పటికే జనసేనలో గోల గోల, ఇన్నాళ్లు కష్టపడితే 20 సీట్లేనా అని ఆవేదన
  • ముందు గొయ్యి, వెనకు నుయ్యి.. అన్నట్టుగా పవన్‌ పరిస్థితి
  • పార్టీ పరిస్థితి చూస్తే.. అంతంత మాత్రం..
  • చంద్రబాబు ఆఫర్‌ చూస్తే.. మరీ దారుణం
  • ఏం చేయాలి? బాబును ఎలా ఒప్పించాలి? పార్టీని ఎలా అంగీకరింపజేయాలి?

10.50am, డిసెంబర్‌ 26, 2023
చంద్రబాబా? మజాకా? నమ్మితే నట్టేరే

  • 60  సీట్లు , 2.5 ఏళ్ళు సీఎం పదవి ఇవ్వకపోతే కాపులు ఓట్లు వేయరు
  • అదే విషయం ఇప్పటివరకు చంద్రబాబుకు చెబుతోన్న పవన్‌ కళ్యాణ్‌
  • ప్యాకేజీ తీసుకో.. తాకట్టు పెట్టుకో.. ఇదే సిద్ధాంతం వల్లిస్తోన్న  చంద్రబాబు
  • గ్రౌండ్‌లో పరిస్థితేంటీ? రెండు పార్టీల నేతలకు స్పష్టంగా తెలుసు
  • జనసేన అవసరం టీడీపీకి ఉంది కానీ టీడీపీ అవసరం జనసేనకు లేదు
  • 2019 ఎన్నికల్లో 10  వేల ఓట్లు పైన  వచ్చిన 60  సీట్లు జనసేనకు ఇవ్వాలి : కాపుల డిమాండ్‌
  • 60 సీట్లు ఇస్తే.. వారంలో  చంద్రబాబుకు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానంటున్న పవన్
  • వివిధ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న జనసేన అనుకూల విశ్లేషకుడు చంద్రు శ్రీనివాస్ (కాపు)

10.45am, డిసెంబర్‌ 26, 2023
పీకే - పీకే = చంద్రబాబు

  • పవన్ కళ్యాణ్‌ తీవ్ర అసంతృప్తిలో  ఉన్నాడా?
  • ఆ PK (ప్రశాంత్ కిషోర్) గురించి ఈ PK (పవన్ కళ్యాణ్) కు అసలు చెప్పలేదని పవన్ సన్నిహితులు మదనపడుతున్నారెందుకు?
  • (Pawan kept in the dark about hiring PK  - జాతీయ మీడియా, Dec 26 , 2023 )
  • బీజేపీని కాదని జైలు కు వెళ్లి మద్దతిచ్చినా కూడా కూరలో కరివేపాకేనా?
  • బాబు వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?
  • ముందు ముందు మరిన్ని వెన్నుపోట్లు ఉంటాయి.. కాస్తా కాచుకుని ఉండండి
  • ఆక్ పాక్ కరివేపాక్ ..!!!
  • Note: ఒకవేళ అధికారం లోకి వస్తే డిప్యూటీ  సీఎం పదవి  కూడా ఇవ్వాలా వద్దా అనేది బాబు పొలిట్ బ్యూరో డిసైడ్ చేస్తాడు అని లోకేష్ చెప్పాడు , ఇచ్చేది కూడా 20  సీట్లే .!

పాల్‌ దెబ్బకి బిత్తరపోయిన టీడీపీ 

  • మైలేజీ కోసం కే ఏ పాల్ ను తగరపువలస తీసుకువచ్చిన టీడీపీ నేత బీవీ రామ్
  • మీడియాతో మాట్లాడుతూ టిడిపి, పవన్ పై విమర్శలు గుప్పించిన పాల్
  • పాల్ విమర్శలతో తెల్లమొఖాలేసిన తెలుగు తమ్ముళ్లు

వంగవీటికి వైఎస్సార్‌సీపీ నేతల నివాళులు

  • అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగా 35 వర్ధంతి 
  • రంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జెడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ
  • ఉయ్యూరులో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
  • ఏలూరు నూజివీడు పట్టణం పెద్దగాంధీ బొమ్మ సెంటర్ లో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు
  • కృష్ణాజిల్లా పామర్రు వైసీపీ కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

కోవూరులో ఇవాళ సామాజిక సాధికార బస్సు యాత్ర

  • సీఎం జగన్‌ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం
  • అది చాటి చెప్పేందుకే వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర
  • నిర్విఘ్నంగా సాగుతున్న యాత్ర.. అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మరథం పడుతున్న ఏపీ ప్రజానీకం
  • మధ్యాహ్నం 3 గంటలకు కోవూరు టపా తోపు నుంచి రాజుపాలెం సెంటర్ వరకు ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొననున్న రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, మంత్రి మెరుగు నాగార్జున, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్రావు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు అలీ, ఇతర ప్రజా ప్రతినిధులు..
  • రాజుపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించి.. 4:10 నుంచి 5:30 దాక బహిరంగ సభ నిర్వహణ..
  • భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..
  • సభకు సుమారు 20 వేల మంది హాజరు కావొచ్చని అంచనా




పచ్చ బ్యాచ్‌ గూండాయిజం..

ఆర్జీవీ ఆఫీసు వద్ద పచ్చ బ్యాచ్‌ ఓవరాక్షన్‌

  • ఆర్టీవీ ఆఫీస్‌ వద్ద టీడీపీ కార్యకర్తల ఓవర్‌ యాక్షన్‌
  • వ్యూహం సినిమాపై టీడీపీ నేతల కడుపు మంట
  • వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ నేతల దాష్టీకం
  • వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు
  • టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

6:40 AM, Dec 26, 2023
విషయం వీక్ అయినప్పుడు..
ప్రచారం పీక్‌లో ఉండాలని నమ్మేవాడు బాబు !!

ఒక పీకే సరిపోడు, ఇద్దరు పీకేలు కావాలంటున్న బాబు 
ఒక వైపు పవన్  కళ్యాణ్,ఇంకో వైపు ప్రశాంత్ కిషోర్ 
ఇద్దరూ జాకీలు పెట్టి లేపితే కానీ కనీస పోటీ ఇవ్వలేమని బాబు ఫీలింగ్

ప్రశాంత్ కిషోర్‌ను బీహార్  డెకాయిట్ అని రకరకాలుగా అనరాని  మాటలు అన్న బాబు, లోకేష్‌లు
ఇదే ప్రశాంత్ కిషోర్  కోసం "పాహిమాం" అంటున్నారంటే జగన్ ఎంత బలంగా ఉన్నాడో తెలియడం లేదా? 

ప్రశాంత్  కిషోర్ టీంలో  ఒకరయిన రాబిన్ శర్మ  బాబు కోసం పని చేస్తుంటే ఇంకొకరు  రిషి రాజ్ సింగ్ జగన్ కోసం పని చేస్తున్నాడు
కాబట్టి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు
కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకొని  ఇద్దరు పీకేలతో కలసి జగన్ మీదకి యుద్దానికి వెళ్లాలని వెన్నుపోటు నాయుడు ప్లాన్

అంతే కాకుండా టీడీపీ గెలుస్తుంది అని రోజూ పేక్ సర్వేలు వాట్సాప్ ప్రచారాలు
3,500 మందితో  మౌత్ క్యాంపెయిన్‌ చేయిస్తున్నాడు బాబు 
కులం కోసం బట్టలు చింపుకొనే ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎలానూ ఉన్నాయి

తాజా సర్వేల ప్రకారం
కోస్తా లో వైసీపీకి 50  శాతం, టీడీపీకి 35-36 శాతం, జనసేనకు 10 శాతం, ఇతర పార్టీలకు మిగిలిన 3 -4 శాతం  మద్దతు ఉంది 

పవన్‌కు 20  సీట్లకు ముంచి ఇవ్వలేం అని తేల్చి చెప్పాడు బాబు 
దీంతో పవన్ మింగలేక కక్కలేక ఉన్నాడని మొన్న విజయనగరం యువగళం సభలో పవన్ బాడీ లాంగేజ్‌ను చూస్తే  తెలుస్తుంది సీఎం పదవి షేరింగ్  లేకుండా, 60  సీట్లు లేకుండా పోటీ చేస్తే ఒప్పుకునేది లేదంటున్న కాపు సంఘాలు, భగ్గుమంటున్న కాపు యువత 

ఇంకో వైపు సైలెంట్‌గా పని చేసుకొని పోతున్న జగన్ 
ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ బాబూ...!!!

6:30 AM, Dec 26, 2023
బ్రో’...ఇదేం పద్ధతి.. వాపోతున్న జనసేన కార్యకర్తలు

  • సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్‌కళ్యాణ్‌ మొగ్గు
  • కానీ.. గెలిస్తే చంద్రబాబే సీఎం అని... పవన్‌ కూడా అంగీకరించారని చెప్పిన లోకేశ్‌
  • ఇందులో సందేహాలకు తావు లేదని, 150 సీట్లకు అభ్యర్థులూ రెడీ అని చెప్పిన చినబాబు
  • ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు
  • మూడో సారి కూడా మోసమేనా.. అంటూ మండి పడుతున్న జనసేన నేతలు
  • పవన్‌! సీఎం పదవిపై ఆశలు వదిలేశావా?.. అంటూ హరిరామజోగయ్య లేఖ  
  • జనసైనికుల కలలు ఏమవ్వాలంటూ నిలదీత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement