328 మంది అభ్యర్థుల హాజరు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు పోలీస్ కవాతు మైదానంలో నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో మూడోరోజైన గురువారం కొనసాగింది. తెల్లవారుజామున ఐదు గంటలకే అభ్యర్థులు మైదానానికి చేరుకున్నారు. వారి ఎత్తు, ఛాతి కొలతలు నమోదు చేశారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు నిర్వహించారు. నిర్దిష్ట సమయంలో పరుగు పూర్తి చేసిన వారికి 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ పోటీలు పెట్టారు. రాణించిన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణపత్రాలు ఇచ్చారు. గురువారం 600 మందికి గానూ 328 మంది పరీక్షకు హాజరుకాగా 272 మంది గైర్హాజరయ్యారు.
నేడు మహిళా అభ్యర్థులకు..
కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా శుక్ర, శనివారాల్లో 835 మంది మహిళా అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రోజుకు 400 మందికిపైగా పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment