నెల్లూరులో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నేడు
నెల్లూరు(టౌన్): జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు గురువారం పరిశీలించారు. వ్యక్తిగత, గ్రూపు, ఉపాధ్యాయ విభాగాల్లో 114 నమూనాలను ప్రదర్శించనున్నారు. ఒక్కో విభాగంలో 38 నమూనాలుంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం నారాయణరెడ్డి, ఇంకా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథులుగా కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ కె.కార్తీక్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బారావులు విచ్చేస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఉదయం రిజిస్ట్రేషన్
విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు హాజరయ్యే విద్యార్థులు ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్లో ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ప్రదర్శనను ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డిప్యూటీ డీఈఓ జానకిరామ్, జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్‌రెడ్డి, డీసీఈబీ సెక్రటరి రామ్‌కుమార్, ఎంఈఓలతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇంకా జ్యూరీ, టెక్నికల్, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్, డిస్‌ప్లే, ఫుడ్ తదితర కమిటీలను నియమించారు. సభ్యులు విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక్కడ ఎంపికై న ప్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపనున్నారు.
ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్లో ఏర్పాట్లు
114 నమూనాల ప్రదర్శన
ఏర్పాట్లను పరిశీలించిన డీఈఓ
హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment