సాక్షి, హైదరాబాద్: దేశంలోనే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, ప్రవాస భారతీయులు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గత 9 ఏళ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణ వాసు ల నివాసాల్లో బోనాలను అలంకరించుకొని భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత స్థానిక దేవాలయానికి వెళ్లారు. అక్కడ బోనాలను సమర్పిం చిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకుపైగా ఉన్నాయన్నారు.
దేశంలో రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే
దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని కవిత పేర్కొన్నారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమోదు చేసిందని చెప్పారు. ఆ్రస్టేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమన్నారు.
బోనాల ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి ఆ్రస్టేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, బీటీఏ ప్రెసిడెంట్ కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment