బొంరాస్‌పేట పీఎస్‌లో నరేందర్‌రెడ్డి విచారణ
బొంరాస్‌పేట: ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ, కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్‌పై జరిగిన దాడిలో నిందితు డిగా నమోదైన మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి గురువారం విచారణకు హాజరయ్యారు. నేరం నంబరు 145/2024 కేసులో మొదటిసారి బొంరాస్‌పేట పీఎస్ కు వచ్చారు. ఉదయం 11నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు విచారణ కొనసాగింది. 3 గంటల పాటు విచారణ అధికారి అడిగిన సుమారు 70 రకాల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. విచారణకు నరేందర్‌రెడ్డి సహకరించారని ఎంక్వైరీ అధికారి తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్, కొ డంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు. మరో వారం రోజుల్లో రెండోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని ఎస్‌ఐ రవూఫ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment