AP Special
-
నిరంతరాయంగా ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను యథావిధిగా ప్రజలకు అందిస్తామని, సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంతో తమకు ఏ సంబంధం లేదని ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తమ అసోసియేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,150 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని వాటిల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని చెప్పారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రొసీజర్లను భారీగా పెంచడమే కాకుండా, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
వైఎస్సార్ కుటుంబంపై విభజించు–పాలించు ప్రయోగం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తన సంక్షేమాభివృద్ధి పాలనే గీటురాయిగా వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేయడమే కాకుండా.. ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఆమోదం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామ/వార్డు సచివాలయ, వలంటీర్ వ్యవస్థతో ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అర్హతే ప్రామాణికంగా, అవినీతికి తావులేకుండా రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతలో విప్లవాత్మక మార్పులతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని చెప్పారు. 56 నెలల పాలనలో తన శాయశక్తులా, చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేశానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ మళ్లీ నీచ రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. విభజించు.. పాలించు విధానాన్ని రాష్ట్రంలోనే కాకుండా వైఎస్సార్ కుటుంబంలోనూ అమలు చేస్తోందన్నారు. తిరుపతిలో రెండో రోజు బుధవారం జరిగిన ‘ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్’లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. రాజ్‌దీప్: వచ్చే ఎన్నికల్లో మీ ఐదేళ్ల పాలన చూపి ఓట్లు అడగడం సులభంగా ఉంటుందా? లేక 2019కి ముందు ప్రతిపక్షంలో యాత్ర చేసి ఓట్లు అడిగారు.. గెల్చారు. రెండింటిలో ఏది బాగుందని అనుకుంటున్నారు? సీఎం జగన్: వాస్తవం కంటే విశ్వాసం అనేది ఎప్పటికైనా బలమైంది. నా విషయంలో నేను ఏం చెప్పాను? ఏ హామీలు ఇచ్చాను? ఏం చేశాను? అన్న దే ముఖ్యం. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం అమలు చేశాం. అంతటితో ఆగకుండా ఆ మేని ఫెస్టోను తీసుకెళ్లి ప్రజలకు చూపించి వారి ఆమోదం పొందుతున్నాం. ప్రజల్లో ఇదే మా ప్రభుత్వంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను ఇంటికే అందజేస్తున్నాం. మా పాలనలో ఎక్కడా వివక్ష చూపడం లేదు. అర్హతే ప్రామాణికంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాం. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా సాయం అందిస్తున్నాం. రాజ్‌దీప్: మేనిఫెస్టో అమలు, అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా పథకాల పంపిణీ.. ఇవే మీ ప్రచార అంశాలా? సీఎం జగన్: మొత్తం మార్పులో డీబీటీ ఒక భాగం మాత్రమే. నిజం చెప్పాలంటే.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు మారింది. మహిళా సాధికారత పెరిగింది. వీటన్నింటికీ తోడుగా డీబీటీ పేదల జీవన పరిస్థితులను మెరుగు పర్చింది. ఇందులో ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా చేశాం. ఇవన్నీ మా ప్రభుత్వాన్ని నిలబెడతాయనే దృఢమైన విశ్వాసం మాకుంది. రాజ్‌దీప్: మీరు చేసిన మంచే మిమ్మల్ని గెలుపిస్తుందని అంటున్నారు. కానీ, విపక్షాలు మాత్రం మీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని, అవినీతి పెరిగిందని ఆరోపిస్తున్నాయి.. దీనికి మీ సమాధానం? సీఎం జగన్: ఏ పార్టీ కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పలేదు. ఏ ఒక్క నాయకుడు కూడా మేము అవినీతి చేశామని చూపలేరు. ఎందుకంటే ఈ 56 నెలల్లో వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో పూర్తి పారదర్శకంగా రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ విధానంలో జమ చేశాం. ఇలా గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. రాజ్‌దీప్: 2024లో మీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఎవరని భావిస్తున్నారు? సీఎం జగన్: రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమే. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదు. కాబట్టి సహజంగానే ఇక్కడ మా వైఎస్సార్ సీపీకి, తెలుగుదేశం–జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే పోటీ ఉంటుంది. రాజ్‌దీప్: చంద్రబాబు బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు కాబట్టే రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లారనిపిస్తుంది? మీరు ఇష్యూ ఆధారంగా బీజేపీకి సపోర్టు చేస్తూ వచ్చారు? ఆంధ్రా పార్టీలను బీజేపీ, మోదీల విషయంలో ఎలా చూడాలి? సీఎం జగన్: మాకు తొలి నుంచి ఒక స్పష్టమైన విధానం ఉంది. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తున్నాం. రాజ్‌దీప్: 2009లో ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు.. ఇప్పటి సీఎం జగన్‌కు మధ్య మార్పు ఏమిటి? సీఎం జగన్: రాజకీయాల్లో నా ప్రస్థానం, నాలో మార్పులను నా కంటే మీరే (రాజ్‌దీప్) ఇంకా బాగా చెప్పగలరు. ఈ 56 నెలల పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా, చిత్తశుద్ధితో పని చేశా. దాన్ని ఆత్మ విశ్వాసంతో చెప్పగలను. కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు తాకాను. అది నాకెంతో తృప్తినిస్తోంది. అన్ని బహిరంగ సభల్లో నేను ఒకటే చెబుతున్నాను. నేను మీకు మంచి చేశానని అనుకుంటే, మీకు మేలు జరిగిందని భావిస్తే.. నాకు తోడుగా నిలవమని ప్రజలను కోరుతున్నాను. రాజ్‌దీప్: మీ చెల్లెలు షర్మిలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది? ఇది వైఎస్సార్ లెగస్సీలో చీలకతేవడం కాదా? వైఎస్సార్ వల్లే కదా 2004, 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చింది.. కానీ, కాంగ్రెస్ మీ విషయంలో చేస్తున్నదానికి కోపం లేదా? సీఎం జగన్: రాష్ట్రంలో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. వారి స్వార్థం కోసం ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు. విభజించు– పాలించు అన్నది రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, మా కుటుంబంలో కూడా చేశారు. నేను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నా సొంత బాబాయిని మంత్రిగా చేశారు. తర్వాత మా పార్టీ అభ్యర్థిపైనే పోటీకి నిలబెట్టారు. ఆ విధంగా కాంగ్రెస్ ఎప్పుడూ విభజించు–పాలించు అన్న రాజకీయాలే చేసింది. ఇప్పుడు కూడా అదే చేశారు. నా కుటుంబాన్ని విడగొట్టారు. మా చెల్లిని తీసుకొచ్చి, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని చేశారు. కానీ, వారొక విషయాన్ని మర్చిపోతున్నారు. పైన దేవుడనే వాడు న్నాడు. ఎవరికి ఎప్పుడు, ఎలా గుణపాఠం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. రాజ్‌దీప్: మాజీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లాడు. దీనిని ప్రతీకార రాజకీయంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి? సీఐడీని దుర్వినియోగం చేశారనడం నిజమేనా? సీఎం జగన్: చంద్రబాబు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. కోర్టు జైలుకు పంపింది. అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయమని ఎలా అంటారు? ఎవరైనా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేరు. ఎందుకంటే, ఏం చేసినా కోర్టుల్లో లిట్మస్ టెస్ట్ ఉంటుంది కదా? ఆధారాలు లేకపోతే, ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే, కేసులు కోర్టుల్లో నిలబడవు కదా? ఆధారాలు ఉన్నాయని కోర్టులు కన్విన్స్ అయితే తప్ప, నిర్ణయాలు తీసుకోవు కదా? పైగా ఇక్కడ హైప్రొఫైల్ కేసు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ సీఎం కూడా, అలాంటి చర్యలకు దిగరు. కచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప.. కేసు బలంగా ఉంటే తప్ప.. అలాంటివి జరగవు కదా! రాజ్‌దీప్: మీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు. కొందరు బయటకు వెళ్తున్నారు. ఇది వ్యతిరేకతను పెంచదా? సీఎం జగన్: ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ స్వయంగా సర్వే నిర్వహిస్తుంది. దాని ప్రకారం వ్యూహ రచన ఉంటుంది. మేము ప్రజలకు మనస్ఫూర్తిగా చాలా మేలు చేశాం. ఇదే మా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని పదిలం చేసింది. కానీ స్థానికంగా కొందరు నాయకుల తీరు, ప్రజలతో మమేకం కాకపోవడం, వారిపై వ్యతిరేకత కారణాలతో మార్పులు, చేర్పులు అనివార్యం అయ్యింది. మాకు సంబంధించి.. ఎన్నికలు మరో 70, 80 రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆఖరి క్షణం వరకు ఆగి అప్పుడు మార్పులు చేస్తే లేనిపోని గందరగోళం సృష్టించినట్టు అవుతుంది. దానికి బదులు ముందుగా చేస్తే అందరికీ క్లారిటీ ఉంటుంది. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. ఇప్పుడే అప్పులు తక్కువ. ఇక్కడ మారిందల్లా సీఎం మాత్రమే. ఈ ప్రభుత్వం ఇన్ని చేయగలిగినప్పుడు.. గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఇదే నాంది. – సీఎం వైఎస్ జగన్ -
ఇక పక్కాగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందుకోసం వాహనాల ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించే దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో వాహనాలు తగిన ఫిట్నెస్తో లేకపోవడం ఒకటని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు రవాణా శాఖ అధికారులు వాహనాలను స్వయంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 26 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీసీ)లు ఏర్పాటుకు ఉపక్రమించింది. పుణెలోని ఆటో మోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ప్రమాణాల మేరకు ఈ ఏటీసీలను డిజైన్ చేశారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్: రాష్ట్రంలో మొదటి ఏటీసీని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. రూ. 18.50 కోట్లతో అక్కడ ఏటీసీ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి రవాణా శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటి దశలో 15 ఏటీసీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. వాటిలో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఏటీసీల నిర్మాణానికి త్వరలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి ఫిబ్రవరి మొదటివారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఏటీసీల టెండర్లు ఖరారు అయిన తరువాత ఏడాదిలోగా వాటిని ప్రారంభించాలన్నది రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఏటీసీలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. తద్వారా వాహనాల ఫిట్నెస్ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఏడాదిలోగా ఈ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. – ఎంకే సిన్హా, రవాణా శాఖ కమిషనర్ ఏటీసీల స్వరూపం ఇలా.. జిల్లా కేంద్రానికి గరిష్టంగా 30 కి.మీ. దూరంలో ఏటీసీలను నెలకొల్పుతారు. కనీసం 3 వేల చ.గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. అధునాతన సెన్సార్లు, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ ట్రాకులను ని ర్మిస్తారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఏటీసీలో నాలుగు లేన్లతో కూడిన డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు రెండు ట్రాక్‌లు, లైట్ వెహికిల్స్‌ను రెండు డ్రైవింగ్ ట్రాక్‌లను కేటాయించారు. కాగా మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఏటీసీలలో రెండేసి చొప్పున డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. హెవీ వెహికిల్స్‌కు ఒక ట్రాక్, లైట్ వెహికిల్స్‌కు ఒక ట్రాక్‌ను కేటాయిస్తారు. ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలు ఆ డ్రైవింగ్ ట్రాక్‌లలో ప్రయాణిస్తే... సెన్సార్ల ద్వారా వాటి ఫిట్నెస్ను పరీక్షిస్తారు. బ్రేకుల పనితీరు, ఇంజిన్ కండిషన్, ఇతర ప్రమాణాలను ఆటోమేటెడ్ విధానంలో నిర్ధారిస్తారు. దాంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ విధానాన్ని అమలులోకి తీసుకువస్తారు. -
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్లెట్ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలకు చేరువలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై షకిన్ కూమార్ రూపాందించిన సమగ్ర సమాచార బుక్‌లెట్‌ను బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. గత సెప్టెంబర్‌లో పది మంది పేద విద్యార్థులను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడంపై షకిన్ కుమార్‌ను సీఎం జగన్ అభినందించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని షకిన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అర్హతలు, దరఖాస్తు విధానం, అందించే కోర్సులు, డాక్యుమెంట్స్ చెక్‌లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ చెకింగ్, అక్రిడేషన్, యూనివర్సిటీల జాబితా వంటి సమస్త సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వివరించారు. ఈ పథకం పేద, ప్రతిభావంతమైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.కోటిన్నరకు పైగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. -
‘ఆసరా’.. నవ్వే మనసారా
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు బుధవారం అంబరాన్నంటాయి. అక్కచెల్లెళ్ల మోముల్లో నవ్వుల సిరులు కురిశాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెక్కులను అట్టహాసంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సంక్షేమ రేడుకు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. – సాక్షి, నెట్వర్క్ అంచెలంచెలుగా ఎదిగారు ఈ చిత్రంలో ఉన్న ఈమె పేరు వమరవల్లి దుర్గ. ఊరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి గ్రామం. స్వయం శక్తి సంఘం గ్రూపు లీడర్‌గా ఉన్నారు. ఈమె గ్రూపునకు ఆసరా ద్వారా రూ.4.80 లక్షలు మాఫీ వర్తించింది. ఒక్కో సభ్యురాలికి ఒక్కో విడతలో రూ.12 వేలు మాఫీ నిధులు వచ్చాయి. ఏటా వచ్చే ఈ నిధులను వ్యాపారానికి వెచ్చించి దుర్గ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో టీ షాపు పెట్టారు. రెండోసారి నిధులతో బడ్డీకొట్టు పెట్టారు. మూడో సారి నిధులతో ఫినాయిల్ తయారు చేయడం నేర్చుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే రూ.12 వేలతో జిరాక్స్ మిషన్ కొని వ్యాపారం అభివృద్ధి చేసుకుందామని భావిస్తున్నారు. ఆసరా ‘భాగ్య’మయ్యే ఈమె పేరు బట్టా భాగ్యలక్ష్మి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులకు వెళ్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకుంటున్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకు రూ.2,46,507 వచ్చింది. దీంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించి కూలి పనులకు వెళ్లే బాధల నుంచి విముక్తి పొందారు. కా‘పాడి’న జగనన్న ఈమె పేరు పి.ముత్తులక్ష్మి. సూళ్లూరుపేట పట్టణంలోని వట్రపాళెం సమాఖ్య గ్రూపులో సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.3,15,128 ఇప్పటివరకు వచ్చాయి. ఈ డబ్బులతో మూడు గేదెలను కొనుక్కుని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతంలో కూలి పనులకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ తిప్పలు తప్పాయి. ఇదంతా సీఎం జగన్ చలువ వల్లే సాధ్యమైందని ఆమె తెలిపారు. పాన్ షాపు పెట్టుకున్నా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించారు. నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.30 వేలు వచ్చింది. సున్నా వడ్డీ ద్వారా మరో రూ.50 వేలు రుణం మంజూరైంది. ఈ సొమ్ముతో ఊరిలో పాన్‌షాపు పెట్టుకున్నా. జీవనానికి ఇబ్బంది లేదు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. – జనని, డ్వాక్రా మహిళ, బుడతనాపల్లి గ్రామం, విజయనగరం జిల్లా మా గ్రూపునకు రూ.8 లక్షలు మాఫీ అయింది వైఎస్సార్ ఆసరా ద్వారా మా సంఘానికి ఉన్న రూ.8 లక్షల అప్పు మొత్తం తీరిపోయింది. ఒక్కో సభ్యురాలికి రూ.80 వేల వరకు లబ్ధి కలిగింది. రుణమాఫీ, సున్నా వడ్డీ, స్త్రీనిధి, ఉన్నతి తదితర పథకాలతో మహిళలకు ఎంతో మేలు చేశారు. జగనన్నకే మా మద్దతు ఉంటుంది. – వెంకటరమణమ్మ, ప్రశాంతి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా జగనన్నకు రుణపడి ఉంటాం మాది పూజిత పొదుపు సంఘం. మా సంఘంలో 13 మంది సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఒక్కొక్క సభ్యురాలికి రూ.18 వేలు వచ్చింది. ఇప్పటికే గతంలో ప్రభుత్వం జమచేసిన రూ.80 వేల నగదుతో ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్నా. ఇప్పుడు జమచేసిన నగదుతో మరిన్ని సరుకులు తెచ్చుకుని విక్రయించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుంది. సీఎం వైఎస్ జగనన్నకు, ఈ ప్రభుత్వానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. – మాధవి, వికృతమాల, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా -
10న విశాఖలో ఏఐ, క్లౌడ్ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కీలక వేదికగా నిలిచిన విశాఖ మరో ముఖ్యమైన సదస్సుకు ముస్తాబవుతోంది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన విప్లవాత్మక మార్పులపై ఫిబ్రవరి 10న ఏఐ క్లౌడ్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డీప్‌టెక్ సమ్మిట్స్ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సదస్సు జరుగనుంది. పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, ఐటీ నిపుణులు, ప్రొఫెసర్లు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, ఇంక్యుబేటర్స్, కృత్రిమ మేధ, క్లౌడ్ టెండర్ నిపుణులు పాల్గొననున్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
ఫిష్ ఆంధ్ర సూపర్
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని చేపల ప్రియులు ఆస్వాదించే వార్త..కష్టపడి వేటాడిన మత్స్యసంపదకు చక్కని మార్కెట్ లభించడంతో గంగపుత్రులు ఆనందించే సందర్భం..జిల్లాలో ఇప్పటికే 85 ఫిష్ ఆంధ్ర మినీ ఔట్లెట్లను ప్రారంభించిన మత్స్యశాఖ.. త్వరలో నాలుగు సూపర్ షాప్‌లకు శ్రీకారం చుట్టనుంది. మరో రెండు లాంజ్‌లను ఏర్పాటు చేయనుంది. మినీ ఔట్లెట్లలో చేపలు విక్రయించగా.. కొత్తగా ప్రారంభించనున్న సూపర్ షాప్‌లలో లైవ్ ఫిష్‌తోపాటు చేపలతో తయారు చేసే వంటకాలను విక్రయిస్తారు. లాంజ్‌లు రెస్టారెంట్లుగా భోజన ప్రియులకు ఆతిథ్యమివ్వనున్నాయి. అచ్యుతాపురం: మత్స్యకారులకు అండగా ఉంటూ.. మత్స్య సంపదను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వేలాదిమంది మత్స్యకారుల తలరాత మారుతోంది. అంతేకాకుండా ఆహారంలో కీలక పోషకాలు ఉన్న చేపల ఉత్పత్తి, అమ్మకాలకు మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఫిష్ ఆంధ్ర నినాదంతో ఇప్పటికే మినీ ఔట్లెట్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉండగా.. అదనపు హంగులతో చేపల షాపులను ఏర్పాటు చేసే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలో 31 మత్స్యకార గ్రామాలు, 12 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 11 వేల 116 మందికి పైగా మత్స్యకారులు జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో చేపల వేటపై ఆధారపడిన వారికి మేలు చేకూరనుంది. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్న మత్స్యసంపద మార్కెటింగ్‌కు సంబంధించి మరిన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో నాలుగు సూపర్ షాపులు అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపల విక్రయానికి ఏర్పాటు చేస్తున్న ఫిష్ మినీ ఆంధ్ర షాపులు జిల్లాలో 85 ఉన్నాయి. దీంతో సముద్ర తీరప్రాంతాల్లోనూ, రిజర్వాయర్, నదులు, సరస్సులు, చెరువుల్లో లభించే వివిధ రకాల చేపలకు చక్కని మార్కెటింగ్ సదుపాయం దక్కింది. ఈ క్రమంలోనే జిల్లాలో సూపర్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో షాపును నెలకొల్పేందుకు రూ.20 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని భరిస్తుంది. ముందుగా అచ్యుతాపురంలో ఒక షాపును, చోడవరంలో మరో షాపును ఏర్పాటు చేయనున్నారు. ఇక సూపర్ షాపులకు దీటుగా లాంజ్‌లను సైతం రూ.50 లక్షలతో జిల్లాలో రెండు ఏర్పాటు చేయనున్నారు. వీటిని అనకాపల్లి హైవేలో ఏర్పాటు చేయనున్నారు. వేల్యూ యాడ్ చేసి హైజనిక్‌గా చేపల విక్రయం చేపట్టనున్నారు. దిగువ స్థాయి ప్రజల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వారికి అవసరమైన 10 రకాల చేపలు సూపర్, లాంజ్లలో దొరకనున్నాయి. ‘సూపర్’ ప్రత్యేకతలివే... సముద్ర, చెరువు చేపలకు సంబంధించిన శీలావతి, పచ్చబోసు, సముద్ర రకాలు చందువ, కోనాలు, వంజరం వంటి చేపలను లైవ్‌లో అమ్ముతారు. ఇక్కడే ఐస్ తయారీ వ్యవస్థ ఉన్నందున చేపలు ఫ్రెష్‌గా ఉంటాయి. అవసరమైతే ప్యాక్ చేసిన చేపలను అమ్ముతారు. చేపల కట్లెట్లు, ఫ్రైలు విక్రయిస్తారు. రెస్టారెంట్‌గా లాంజ్‌లు... లాంజ్‌లు దాదాపు రెస్టారెంట్ తరహాలో ఉంటాయి. చేపలకు సంబంధించిన అన్ని వంటకాలు ఇక్కడ విక్రయిస్తారు. చేపల స్టార్టర్లు, పులుసులు, చేపల బిర్యానీ, చేపల అన్నం, చేపలతో కూడిన అన్ని రకాల ఆహార పదార్థాలను ఇక్కడ రెస్టారెంట్ తరహాలో వినియోగదారునికి అందిస్తారు. అందుబాటులో విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు జిల్లాలో ఫిష్ మినీ ఆంధ్రాలకు తోడు మరో నాలుగు సూపర్ షాపులను ఏర్పాటు చేయనున్నాం. అచ్యుతాపురంలో ఒకటి, చోడవరంలో మరొకటి నెలకొల్పుతున్నాం. రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సూపర్ షాప్‌లతో ఫిషింగ్ వేల్యూ యాడ్ చేస్తాం. షాపు ఏర్పాటులో మత్స్యకారునికి 40 శాతం సబ్సిడీ ఇస్తాం. –ప్రసాదరావు, జిల్లా మత్స్య శాఖ ఏడీ -
మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాం: సీఎం జగన్
అనంతపురం, సాక్షి: మహిళా సాధికారత సాధన.. సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారాయన. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం. నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం. దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. .. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 56 నెల్లలో ప్రతి అడుగూ మీ బిడ్డ ప్రభుత్వం వేసింది. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. అర్హత కేవలం అదే.. ఈరోజు రూ.6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ ఒక్క పథకానికి(వైఎస్సార్ ఆసరా) సంబంధించి 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పోతోంది. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద 4968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. వాళ్ల కాళ్ల మీద నిలబెట్టడం కోసం వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే 31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ. 6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు. ఎక్కడా ఎవరూ ఎవరికి ఇస్తున్నాం అనేది వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు. ఈరోజు 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి పోతోంది. ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికిచ్చిన సొమ్ము రూ.26.67 వేల కోట్లు. వైయస్సార్ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు. 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5-20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2-3 లక్షల కోట్లు. అవ్వా.. బాగున్నావా? అంటూ.. అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇచ్చినది రూ.4,968 కోట్లు. 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275 కోట్లు ఇచ్చాం. కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2.28 వేల కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. పేదల పెన్షన్ అందుకుంటున్న వారు 66.34 లక్షల మంది. ఇందులో 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా అని అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారంటే ఇది జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశాం. జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, పట్టించుకున్నదిగానీ ఎప్పుడైనా చూశామా?. గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే.అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నా. కారణం ఒక్కటే.గతంలో దోచుకో, పంచుకో, తినుకో. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. దేశం మొత్తం వినిపించాలి.. వచ్చే 14 రోజులపాటు ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6,400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. చంద్రబాబు చేసిన మోసం గుర్తుంది కదా? 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపెడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25500 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో 19 శాతానికి పడిపోయాయి. కానీ, ఇవాళ.. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో సంఘాలు ఉన్నాయి.ఔట్ స్టాండింగ్ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలు ఎన్పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే. సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. నామినేషన్ పనుల్లో ఇచ్చే కాంట్రాక్ట్ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. భద్రత విషయంలోనూ.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ నియమితులయ్యారు. దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే అని సీఎం జగన్ ప్రసంగించారు. ఇదీ చదవండి: రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. బాబుకు ప్రచారం: సీఎం జగన్ ఫైర్ -
CM Jagan: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.16,927 కోట్లు
31 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు స్వగృహయోగం రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీలు.. 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు.. వారు ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు సాయం.. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలు ఇది. – సాక్షి, అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కావాల్సిన భూమి కొనుగోలుకు భారీ ఎత్తున ప్రభుత్వం వ్యయం చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాక 2019 నుంచి ఇప్పటివరకు వారి ఇళ్ల నిర్మాణానికి ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేసింది. ఈ వ్యయాలు కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరింత ఖర్చు పెట్టనుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పేదింటి అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తూ కనిష్టంగా 1.50 లక్షల కోట్ల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల సంపదను వారి చేతుల్లో ప్రభుత్వం పెడుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు పేదలకు ఇంత పెద్ద ఎత్తున స్థలాలు, ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆర్థిక సాయంతోపాటు నిర్మాణ సామగ్రిపై సబ్సిడీ 2019లో అధికారంలోకి వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణాల కోసమే ఇప్పటివరకు ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో లబ్దిదారులకు చకచకా ఇంటి బిల్లులను చెల్లించారు. అంతేకాకుండా 4.70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సిమెంట్, 33 వేల టన్నులకుపైగా స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేశారు. ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాన్ని సమకూరుస్తోంది. బ్యాంక్‌లు 9 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా లబ్దిదారులు పావలా వడ్డీనే కడుతున్నారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా రూ.15 వేల విలువ చేసే ఇసుకను ఉచితంగా అందిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది. రూ.20 లక్షల విలువైన ఆస్తి ఇంటి స్థలం, ఇల్లు రూపంలో రూ.20 లక్షలు, అంతకంటే విలువైన స్థిరాస్తిని అక్కచెల్లెమ్మల పేరిట ప్రభుత్వం అందిస్తోంది. తద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా మారుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన స్థలాల విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మార్కెట్లో పలుకుతోంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తయితే ఆ ఆస్తి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు, అంతకు పైమాటే. -
తిరుమలలో నేడు రామాయణ పారాయణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న ఆదివారం 77,334 మంది స్వామివారిని దర్శించుకోగా 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమలలో నేడు రామాయణ పారాయణం తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సోమవారం సంపూర్ణ రామాయణ పారాయణం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. అయోధ్యలో సోమవారం రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎస్వీబీసీ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లతో పాటు యూట్యూబ్ తెలుగు ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు ఛానల్లో తిరుమలలోని కళ్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
Fact Check: అప్పులపై అబద్ధాల డప్పు..
సాక్షి, అమరావతి : చెప్పిందే చెప్పరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ తీరు. తన ఆత్మబంధువు చంద్రబాబు మీద ఎక్కడలేని పిచ్చి ప్రేమ.. సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని అక్కసు, అసూయ, ద్వేషంతో ఆయన నిత్యం అసత్యాల వ్రతం చేస్తూ తన విషపుత్రిక ఈనాడులో అశుద్ధ కథనాలు వండివార్చడమే పనిగా పెట్టుకున్నారు. చెప్పిందే చెప్పి.. రాసిందే రాస్తూ జగన్‌పై తన కడుపుమంటను చాటుకుంటున్నారు. ఇందులో భాగమే తాజాగా ఆదివారం ఈనాడులో రామోజీ తన విలువల వలువలన్నీ విడిచేసి సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో ‘వారం వారం రుణ పురాణం’.. పేరుతో జగన్ సర్కారుపై మళ్లీమళ్లీ పిచ్చి ప్రేలాపనలు పేలారు. అనధికార అప్పులుండవని తెలిసినా.. నిజానికి.. ప్రభుత్వాలకు అనధికార అప్పులుండవని తెలిసినా సరే అనధికార అప్పులంటూ తన పాఠకులను రామోజీ ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే ప్రజలు నమ్ముతారనుకునే చంద్రబాబు సిద్ధాంతాన్ని రామోజీ తూచా తప్పకుండా పాటిస్తూ అబద్ధాలను అచ్చేస్తున్నారు. చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి పేరుతో అనధికారికంగా డిపాజిట్లు సేకరించడం ఈనాడు రామోజీకి చెల్లుతుంది తప్ప ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అనధికార అప్పులనేవి ఉండనే ఉండవు. ఈ విషయం తెలిసినా సరే రామోజీ పదేపదే జగన్ సర్కారుపై విషప్రచారానికి తెగబడుతూనే ఉన్నారు. ఆయన తాజా కథనంలో అక్కసు, కక్ష, అసూయ తప్ప ఒక్క వాస్తవం కూడా లేదు. గత చంద్రబాబు హయాం నుంచి రాష్ట్రాల అప్పులకు ఏ నెలలో ఏ తేదీన సెక్యురిటీల విక్రయం చేయాలనేది ఆర్బీఐ నిర్ణయిస్తోంది. అందుకనుగుణంగా గత చంద్రబాబు ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీనెలా ఆయా తేదీల్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వారం వారం జగన్ సర్కారు ఒక్కటే అప్పులు చేయడంలేదు. ఇక మంగళవారం ఏపీతో సహా మొత్తం 13 రాష్ట్రాలు రూ.24,280 కోట్ల మేర అప్పులు చేయనున్నాయి. దాన్ని వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మంగళవారం రూ.1,100 కోట్లు అప్పు చేస్తోందంటూ ఈనాడు రామోజీ చేతికొచ్చింది ఇష్టారాజ్యంగా రాసిపారేశారు. తప్పుడు రాతలు.. దొంగ లెక్కలు.. నిజానికి.. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఏప్రిల్ 5న, ఏప్రిల్ 30న ఏకంగా రూ.5,500 కోట్లు అప్పుచేశారు. ఆ అప్పు కూడా 16 నుంచి 20 ఏళ్లలో తీర్చేలా చేశారు. ఇది ఈనాడు రామోజీకి తప్పుగా కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే రామోజీకి ఎక్కడలేని ప్రేమ. ఇప్పుడు జగన్ అంటే నచ్చదు కాబట్టి నిబంధనల మేరకు అప్పులు చేస్తున్నా తప్పుగా కనిపిస్తాయి. రాష్ట్ర రుణాల మొత్తం, వడ్డీలు కలిపి చెల్లింపు భారం రూ.10 లక్షల కోట్లకు చేరిందంటూ పచ్చి అబద్ధాలను రామోజీ గుడ్డిగా అచ్చేశారు. దానికి కార్పొరేషన్ అప్పులను కూడా కలిపితే ఇలా ఉండవచ్చు అంటూ సొంత పైత్యాన్ని జోడించారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి భవిష్యత్తు చెల్లింపుల భారం గురించి కాగ్ నివేదికలో వాస్తవాలున్నా సరే అనధికారం, అంచనాల పేరుతో రామోజీ ఊహాగాన అంకెలతో నిస్సిగ్గుగా అచ్చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను కూడా ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుస్తోంది. ఇదే విషయాన్ని కాగ్ చెప్పినా ఆయనకు కనిపించదు. ఎందుకంటే అది చంద్రబాబుకు ఇబ్బంది కాబట్టి. 2019 మార్చి 31 నాటికి చేసిన అప్పుల్లో వచ్చే ఏడేళ్లలో రూ,1,03,550 కోట్లు అంటే 53.51 శాతం చెల్లించాల్సి వస్తుందని కాగ్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఇంత మొత్తంలో చెల్లింపుల భారం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికతో అదనపు రెవెన్యూ వనరులను సమీకరించుకోవాల్సి ఉందని, లేదంటే అభివృద్ధికి నిధులుండవని కాగ్ పేర్కొంది. వాస్తవాలిలా ఉంటే.. ఈనాడు రామోజీ జగన్ సర్కారుపై ఈర‡్ష్యతో అవాస్తవ గణాంకాలతో విషప్రచారానికి తెగబడుతున్నారు. 2022 మార్చి వరకు కాగ్ ఇచ్చిన నివేదికలో కూడా వచ్చే పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అసలు అప్పులు, వడ్డీ కలిపి రూ.3.36 లక్షల కోట్లు మాత్రమే ఉందని కాగ్ స్పష్టంచేసినా, చెల్లింపుల భారం రూ.పది లక్షల కోట్లకు పెరిగిదంటూ రామోజీ పచ్చి అబద్ధాలతో పేట్రేగిపోయారు. వడ్డీ శాతంపైనా వంకర రాతలు.. ఇక 2017–18 చంద్రబాబు హయాంలో రాష్ట్ర అప్పులపై సగటు వడ్డీ 6.52 శాతం ఉందని, అదే 2021–22లో అప్పులపై సగటు వడ్డీ 6.15 శాతమేనని కాగ్ నివేదిక స్పష్టంచేసింది. అయినా సరే.. రామోజీ ఈ వాస్తవాలను పట్టించుకోకుండా సొంత గణాంకాలతో జగన్ సర్కారుపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. మూలధన వ్యయం కూడా గత చంద్రబాబు ఐదేళ్లలో కన్నా ఇప్పటి జగన్ సర్కారులో ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పుడు గణాంకాలను ఈనాడు రాసింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు మూలధన వ్యయం రూ.15,227.80 కోట్లు ఉండగా.. వైఎస్ జగన్ సర్కారులో అది రూ.17,991.21 కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ రాబడులు కూడా పెరగడం లేదంటూ రామోజీ మరో అబద్ధాన్ని రంగరించారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. కోవిడ్ సంక్షోభం లేకున్నా బాబు హయాంలో రాబడి పెరగకపోయినా పెన్నెత్తని రామోజీ.. ఇప్పుడు కోవిడ్ సంక్షోభంలోనూ రాబడి పెరిగినా సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు.. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం బాండ్లు, బ్యాంకులు నుంచి 10.32 నుంచి 10.45 శాతం వరకు అధిక వడ్డీలతో అప్పులుచేసి రాష్ట్రంపై భారం మోపినా రామోజీ కిమ్మనలేదు. ఇప్పుడు జగన్ సర్కారు తక్కువ వడ్డీలకే అప్పులు పుడుతున్నా ఆయనకు తప్పుగా కనిపిస్తోంది. టీడీపీ అప్పులకు ఈ ఏడాది కట్టాల్సిన వడ్డీ రూ.17వేల కోట్లు.. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వడ్డీల చెల్లింపులకు కేటాయించిన రూ.28,6p73.71 కోట్లలో టీడీపీ హయాంలో చేసిన అప్పులకే రూ.17,142.71 కోట్లు కట్టాల్సి వస్తోంది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులు రూ.11,531 కోట్లే. వాస్తవాలిలా ఉంటే.. మొత్తం రూ.28,673.71 కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం తీసుకున్న అప్పులపైనే చెల్లిస్తున్నట్లు ఈనాడు వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించింది. నిజానికి.. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైన గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాస్తవాలేమీ చెప్పకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులకే అసలు, వడ్డీలు రూ.10 లక్షల కోట్లు చెల్లించాలంటూ రామోజీ ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. ఇవేవీ రామోజీకి కనిపించవా? రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ గగ్గోలు పెడుతున్న రామోజీకి వైఎస్ జగన్ సర్కారు కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, రెండు విమానాశ్రయాలు, అలాగే.. గ్రామాల్లో 15 వేల సచివాలయాలు, 10,778 రైతుభరోసా కేంద్రాలు, 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపించడంలేదా. వైద్య రంగంలో నాడు–నేడు పేరుతో 16 వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, మనబడి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో 16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కనిపించడంలేదా? చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీగానీ, ఒక్క ప్రభుత్వ ఆస్పత్రిగానీ కట్టకపోయినా రామోజీ కళ్లకు అప్పుడంతా లేని అభివృద్ధి కలర్ఫుల్గా కనిపించింది. ఎందుకంటే బాబు అంటే ఇష్టం.. జగన్ అంటే కోపం. -
చంద్రబాబు ద‘మనీ’యం
సాక్షి అమలాపురం: లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దమన నీతికి బలైపోతున్నారు. అమలాపురం నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉన్న హరీష్‌కు డబ్బు లేదనే ఉద్దేశంతో మొండిచేయి చూపేందుకు టీడీపీ అధిష్టానం యత్నిస్తోంది. ఈ విషయంపై అలిగిన హరీష్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హరీష్ ప్రస్తుతం టీడీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ త్రిమెన్ కమిటీలోనూ సభ్యునిగా కొనసాగుతున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని తొలి నుంచీ ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో హరీష్‌ను ఎంపీగా బరిలోకి దింపారు. 39,996 ఓట్ల తేడాతో హరీష్ ఓడిపోయారు. పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా హరీష్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం డబ్బు లేదనే ఉద్దేశంతో హరీష్‌ను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. హరీష్‌కు క్యాడర్లో పట్టు లేదని సాకుగా చూపుతోంది. హరీష్ మరీ పట్టుబడితే పి.గన్నవరం, లేదా అమలాపురం అసెంబ్లీకి పంపించాలని పార్టీ అదినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయాన్ని హరీష్‌కు చెప్పేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో అలిగిన హరీష్ వారం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా అధిష్టానం చలించలేదు. డబ్బు లేనందున హరీష్‌కు ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. పాము‘కొనేనా’! హరీష్ స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ ఏజేవీబీ మõßæశ్వరరావు కుమార్తె, పాము సత్యశ్రీని పార్లమెంట్‌కు పంపితే ఎలా ఉంటుంది అనేదానిపై టీడీపీ ఆలోచన చేస్తోంది. ఆమె పార్టీలో కొత్తగా చేరినా.. ఆర్థికంగా స్థితిమంతురాలు కావడంతో అధినేత మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా అమలాపురం ఎంపీ టికెట్‌పై ఆశతో త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్నీ బాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బాలయోగి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఆనంద’రావుకు దుఃఖమేనా! హరీష్ అసెంబ్లీకి వెళ్లేందుకు అంగీకరిస్తే అమలాపురం, పి. గన్నవరంలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది. ఆయనను అమలాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా యత్నిస్తున్నట్టు సమాచారం. రాజప్పతోపాటు ఆయన వర్గం హరీష్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ బరిలో నిలపడం ద్వారా ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు చెక్ పెట్టాలని రాజప్ప యోచిస్తున్నారు. ఒకప్పుడు తన శిషు్యడైన ఆనందరావు ఎదురు తిరగడంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా రాజప్ప చివరి వరకు విఫలయత్నం చేశారు. ఈసారి ఆనందరావుకు ఎలాగైనా సీటు రాకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. -
శిఖరాలూ.. సలాం కొట్టాయ్!
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్‌లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే.. సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు. కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్‌లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది. నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి.. అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్‌లో కరాటే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వెళ్లి పతకం సాధించాను. ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్‌కు కోచ్‌గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. బతికిరావడమూ కష్టమే.. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను. అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్‌లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను. -
తాడేపల్లిగూడెంలో ఏడీజే కోర్టు ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదుల చిరకాల కోరిక అయిన ఏడీజే కోర్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, కోర్టును గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. నూతనంగా మంజూరైన 11వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (ఏడీజే) కోర్టును తాడేపల్లిగూడెం కోర్టు సముదాయం భవనాల్లోని ఒక బిల్డింగ్‌లో ఆదివారం ఉదయం జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ నైనాల జైసూర్య, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సి.పురుషోత్తం కుమార్, ఏడీజే కోర్టు ఇన్చార్జి జడ్జి బి.సత్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం న్యాయవాదుల చిరకాల వాంఛ అయిన ఏడీజే కోర్టు కల నెరవేరిందన్నారు. జూనియర్ న్యాయవాదులకు ఇది చక్కని అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు పరిధిలోని ప్రజలకు ఏడీజే కోర్టు రావడం వల్ల వ్యయప్రయాసలు తగ్గుతాయన్నారు. బార్ అసోసియేషన్‌కు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి మాట్లాడుతూ ఇది రెండు దశాబ్దాల కల సాకారమైన రోజని అన్నారు. జస్టిస్ నైనాల జైసూర్య మాట్లాడుతూ యువ న్యాయవాదులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఏడీజే కోర్టు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏడీజే కోర్టు కల సాకరమైనందుకు తాడేపల్లిగూడెం వాసిగా గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
టీడీపీలో సెల్ఫ్‘షో’లు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏమాత్రం నమ్మకం లేని ఆ పార్టీ సీనియర్ నేతలు ‘సెల్ఫ్ షో’లకు దిగుతున్నారు. ఏదో సాకుతో తీవ్రస్థాయిలో హడావుడి చేస్తేగాని తమకు టికెట్ దక్కేట్టు లేదన్న అనుమానాలతో భావోద్వేగాల ముసుగేస్తున్నారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామంటూ నానా హంగామాతో రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ప్రధానంగా బాబు సామాజిక వర్గానికే చెందిన వివిధ జిల్లాల సీనియర్ నేతలు ఉండటం గమనార్హం. వైఎస్సార్సీపీపై ఒంటరిగా పోటీచేసి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేమనే నిర్ధారణకు వచ్చిన బాబు జనసేనతో సహా కలిసొచ్చే ఏ పార్టీనైనా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికొచ్చి పావులు కదుపుతున్నది బహిరంగ రహస్యమే. మరోవైపు బాబు, లోకేశ్ పలు నియోజకవర్గాలలో వేర్వేరుగా మద్దతిస్తూ నేతల మధ్య పోటీ పెంచుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో తమకు సీటు నిరాకరిస్తారేమోననే అనుమానాలతో ఎవరికివారు వ్యక్తిగత వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పులివర్తి నాని, యరç³తినేని శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. ఆలపాటి అలక.. గుంటూరు జిల్లా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారని, సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారనే ప్రచారం విస్తతంగా జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. తెనాలిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలపాటికే టికెట్ ఇవ్వాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటామని ఆయన అనుయాయులు వేదికనెక్కి గందరగోళం చేశారు. ఆరేడు శాతం ఓట్లు కూడా లేని మనోహర్‌కు సీటివ్వాలని కోరడమేంటని నిలదీశారు. మీటింగ్ హాల్ బుక్ చేసింది, సమావేశానికి వెళ్లమని పురమాయించింది, పెట్రోల్ డ్రామాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరనేది టీడీపీ అధిష్ఠానం గుర్తించి సెల్ఫ్షోలు చాలించాలని తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో ఆలపాటి వర్గం మౌనం దాల్చక తప్పలేదని స్వపక్షీయులు అంటున్నారు. పులివర్తి ఆందోళన చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి టీడీపీ ఇన్చార్జిగా పులివర్తి నాని వ్యవహరిస్తున్నారు. నానికి టికెట్ ఇవ్వవద్దని అదే నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణకుమారి కుటుంబం అడ్డుకుంటోంది. మరో సామాజికవర్గానికి చెందిన రియల్టర్ పేరు బాబు పరిశీలనలో ఉందని తెలియడంతో టికెట్ దక్కించుకునే ఎత్తుగడలో పులివర్తి తనదైన శైలిలో డ్రామాకు తెరతీశారని పరిశీలకులు అంటున్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఈనెల 8న తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన నాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ నానా హంగామా చేశారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు నానిని పరామర్శించారు కూడా. యరపతినేని ఎత్తుగడ పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎత్తుగడ మరోవిధంగా ఉందని ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ జరగుతోంది. సీటు దక్కుతుందో.. లేదోనన్న అనుమానంతో యరపతినేని పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. వైఎస్సాఆర్సీపీ వారే ఇలా చేయించారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవంగా తప్పుడు ట్రోల్ చేయించింది ఎవరనేది అధిష్ఠానానికి బాగా తెలుసని టీడీపీలోని నాయకులే అంటున్నారు. బాబును నమ్మిబాగుపడినోడు లేడు విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత సోదరుల మధ్య రాజకీయ వివాదం రేపింది, సీటు అంశంలో వారివురిని తగాదా వరకు తీసుకెళ్లింది, పార్టీలోని ఇతర నాయకుల చేత ఎంపీని తిట్టించింది ఎవరనేది అందరికీ తెలిసిందేనని పరిశీలకులు అంటున్నారు. బాబును నమ్మి బాగుపడినోడు లేడనేది స్వపక్షీయుల మాట. ఈ విషయం ముఖ్యంగా ఆయన సామాజికవర్గానికి చెందిన సన్నిహిత సీనియర్లకు బాగా తెలుసని గుర్తుచేస్తున్నారు. -
అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ బాబే
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు కొంచెం కూడా మేలు చేయలేదని.. అలాంటి వ్యక్తిని గిరిజనులు ఎప్పటికీ నమ్మరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. చంద్రబాబు అరకులో సభ పెట్టి వైఎస్సార్సీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చాడా? అసత్య ప్రచారానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు గిరిజన ద్రోహి అయితే సీఎం జగన్ గిరిజన బంధువు. బాబు తన హయాంలో గిరిజన శాఖకు మంత్రిని కూడా పెట్టలేదు. అలాంటి బాబు అరకులో గిరిజనులపై ప్రేమ నటిస్తున్నారు. గిరిజనులకు పోడు భూములను పంచిపెట్టిన ఘనత సీఎం జగన్‌దే. చంద్రబాబూ ఎందుకు సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయారో చెప్పాలి. గిరిజనులకు బుద్ధిలేదు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఈ రాష్ట్రంలోని ఏడు గిరిజన అసెంబ్లీ, ఒక పార్లమెంటును వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇదే గతిపడుతుంది. బాబుకు ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు? రాష్ట్రంలో 38 లక్షల మంది గిరిజనులు తమకు ప్రత్యేకమైన గిరిజన కమిషన్ కావాలని అడిగితే, చంద్రబాబు ఆ ఆలోచన కూడా చేయలేదు. అదే జగన్ సీఎం అయిన వెంటనే గిరిజన కమిషన్ ఏర్పాటుచేసి మా హక్కులకు భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఏ సీఎంకి రాని అద్భుతమైన ఆలోచనతో గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలనిపించలేదు? చంద్రబాబు ఇప్పుడొచ్చి ఎన్నెన్నో మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటే. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానంటే దాన్ని కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి సాగును విపరీతంగా ప్రోత్సహించారు. అదే సీఎం జగన్ ఆ సాగును అరికట్టడమే కాక వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. -
‘ప్రభంజన’పేట
సాక్షి తిరుపతి: నాయుడుపేట జనసంద్రమైంది. సూళ్లూరుపేట నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో పట్టణం కిక్కిరిసిపోయింది. సామాజిక సాధికార యాత్రకు జన నీరాజనం లభించింది. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రభంజనంలా సాగింది. స్థానికులతో పాటు ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తొలుత పాదయాత్ర జరిగింది. బైక్ ర్యాలీతో పాటు సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమై ంది. అనంతరం అంబేడ్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు. అంతకు ముందు డాక్టర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ కాంగ్రెస్‌తో షర్మిల ప్రయాణాన్ని తప్పు పట్టారు. ఎవరి లబ్ధికోసం ఈ ప్రయత్నమని వారు నిలదీశారు. వైఎస్ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మరణించాక ఆ మహానేత పేరును ఛార్జిషిట్లో చేర్చిన పార్టీకి కొమ్ముకాయడమేంటని ప్రశ్నిచారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్య, నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాలనలో సామాజిక సాధికారత కోసం చేసిన విప్లవాత్మక మార్పులను వివరించారు. కుటుంబాల్ని చీల్చగల సమర్థుడు చంద్రబాబు తాను గద్దెనెక్కడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టగల నాయకుడు చంద్రబాబని... కుటుంబాల్ని సైతం ఆయన విడగొట్టి సొంత అన్నపై చెల్లెల్ని ఉసిగొల్పే నీచసంస్కృతి ఆయనదని వారు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం నిరంతరం తపిస్తున్న జగన్మోహన్రెడ్డిని గద్దె దింపడానికి కాంగ్రెస్, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారనీ... అందులో భాగస్వామి కావడం సరికాదని షర్మిలకు వారు హితవుపలికారు. అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిరోడ్డున సీఎం జగన్ నెలకొల్పారని, అదే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేవలం హడావుడి చేసి మోసగించారని విమర్శించారు. స్వాతం్రత్యానంతరం ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, వారెవ్వరి హయాంలో అమలు కాని సామాజిక సాధికారత జగన్ మాత్రమే చేసి చూపించారన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకు రూ. 45 వేల కోట్లు, వివిధ పథకాల రూపంలో పేదల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2.34 లక్షల కోట్లు జమచేశారని తెలిపారు. ఎమ్మెల్యే భావోద్వేగం నాడు ఆలయాల్లోకి ప్రవేశం లేని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సీఎం వైఎస్ జగన్ ఏకంగా టీటీడీ బోర్డు సభ్యునిగా చేశారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానంటే.. సీఎం జగన్ బీసీలు బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నింటా ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు ఎక్కడ? ప్రతి దాంట్లో బీసీలకు సింహభాగం ఉండాలని 50శాతం హక్కులు కల్పించిన సీఎం జగన్ ఎక్కడ అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఈ తరానికి సీఎం వైఎస్ జగనే మహనీయుడుని, ఎంతమంది ఏకమైనా వైఎస్ జగన్ కాలిగోటిని కూడా కదపలేరని హెచ్చరించారు. ఐక్యంగా పనిచేయండి సూళ్లూరుపేటకు కిలివేటి సంజీవయ్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సాక్షి, తిరుపతి: పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి మెలసి పనిచేయాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నాయుడుపేటలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట అభ్యర్థి విషయంలో రకరకాలుగా ప్రచారం సాగుతోందని, ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యే ఇక్కడి అభ్యర్థనీ ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు చెప్పారన్నారు. క్రమశిక్షణరాహిత్యంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సూళ్లూరుపేటకు చెందిన కట్టా సుధాకర్‌రెడ్డి, శ్రీమంతురెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రిఫీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. మార్పులున్న స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తారని, అన్ని స్థానాల్లో మార్పులు ఉండవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
మా బతుకులు మారాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు మారాయి మాది వ్యవసాయ కుటుంబం. కర్నూలు జిల్లా ఆలూరులో మాకున్న మూడెకరాల భూమిలో మా ఆయన జ్ఞాన చంద్రబాబు రాజ్ వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారం కావడంతో కరువు వస్తే ఆదాయం రాకపోగా పెట్టుబడులు కూడా కోల్పోవాల్సి వచ్చేది. దానివల్ల చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడేవాళ్లం. మా అబ్బాయి హర్షవర్ధన్ 8వ తరగతి, సాయిసుప్రజ ఇంటర్ చదువుతోంది. మేం పడే బాధలు పిల్లల పడకూడదని చాలీచాలని ఆదాయంతోనైనా ఇద్దరినీ కష్టపడి చదివిస్తున్నాం. నేను గృహిణిగా ఉంటూ, తీరిక సమయాల్లో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటాను. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలిచాను. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇప్పటివరకూ రూ. 12,500లు వచ్చిది. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున నా ఖాతాలో జమయ్యాయి. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ. 13,500 వస్తోంది. వీటిద్వారా మా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి. టైలరింగ్‌లో మరో మెట్టు ఎదిగేందుకు రూ. 1.50లక్షల డ్వాక్రా రుణం, రూ. 6.50లక్షల బ్యాంకు రుణం తీసుకుని మగ్గం, ఎంబ్రాయిడర్ మెషిన్ కొనుగోలు చేశాను. సరికొత్త డిజైన్లతో గౌన్లు, డ్రస్సులు, జాకెట్లు, చీరలకు ఫాల్స్ వంటివి చేస్తున్నా. బంధువులు, స్నేహితులు నా పనికి మెచ్చుకుని, ప్రోత్సహిస్తున్నారు. మా అత్తగారు రామలక్ష్మి సహకారం అందిస్తున్నారు. నా ఆదాయం నెలకు 6 నుంచి 7 వేల రూపాయలకు పెరిగింది. నెల నెలా వస్తున్న ఆదాయంతో బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. ఇప్పుడు మేము హాయిగా జీవిస్తున్నాం. – కుమ్మర రమాదేవి, ఆలూరు, కర్నూలు జిల్లా (ఉలువ చంద్రబాబు, విలేకరి, ఆలూరు) నిరుపేదకు ప్రాణభిక్ష పెట్టారు నేను పేద రైతును. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకు బండి లాగుతున్నాను. నాలుగు నెలల క్రితం నాకు గుండె బరువుగా ఉండడం, తిమ్మిర్లు, నొప్పిగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించగా ఆయన గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అసలే పేద కుటుంబం కావడంతో అంత మొత్తం భరించలేమని చెప్పాం. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మాకు శ్రీరామరక్షగా నిలిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేసి వైద్యులు నాకు పునర్జన్మ ప్రసాదించారు. ఆరోగ్యశ్రీ నన్ను బతికించింది. ఆపరేషన్ అనంతరం ఆరోగ్య ఆసరాగా రూ. 5 వేలు నా ఖాతాలో వేశారు. వృద్ధాప్య పింఛను కూడా మా వలంటీర్ క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటోతేదీ వేకువజామునే ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారు. రైతు భరోసా సొమ్ము కూడా అందుతుండడంతో సాగుకు అప్పు చేయాల్సిన దుస్థితి తప్పింది. నా మనవరాలికి కూడా మూడేళ్లుగా అమ్మ ఒడి వస్తుండడంతో వారి చదువులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతోంది. నాలాంటి పేదవారికి ప్రభుత్వ పథకాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. – కంచర్ల హరిబాబు, కొప్పరపాలెం, బల్లికురవ (గుంటుపల్లి ఆంజనేయులు, విలేకరి, బల్లికురవ) కాళ్లు కదపకుండా ఇంటివద్దే వ్యాపారం మా కుటుంబమంతా పూర్వకాలం నుంచి సైకిల్‌పై బట్టల మూటలు పెట్టుకుని గ్రామాల్లో విక్రయిస్తూ జీవనం సాగించేది. మా ఆయన కూడా ఆ వృత్తినే కొనసాగించారు. నాలుగేళ్లుగా మా ఆయన వయసు రీత్యా గ్రామాల్లో తిరిగేందుకు ఆరోగ్యం సహకరించక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మాకు బట్టల వ్యాపారం తప్ప మరే పనీ చేత కాకపోవడంతో ఎలా బతకాలా అని మదనపడ్డాం. ఇంతలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక వైఎస్సార్ ఆసరా (డ్వాక్రా రుణమాఫీ) కింద రూ. 13వేల వంతున మూడేళ్లకు రూ. 39వేలు, వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 18,750లు వంతున మూడేళ్లకు రూ. 56,250లు అందింది. ఆ మొత్తంతో ఇంటివద్దే రెండేళ్లక్రితం బట్టల దుకాణం పెట్టుకున్నాం. జగనన్నతోడు పథకంలో ఏడాదికి పదివేల చొప్పన రూ.30 వేలు వచ్చిది. దానిని కూడా వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకున్నాం. ఇప్పుడు మా వ్యాపారం బాగుంది. నా ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి పంపించాను. మేము నిలదొక్కుకునేందుకు సాయపడిన ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. – పొన్నగంటి నాగమణి, వరహాపురం, చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా (బోడాల శ్రీనివాసరావు, విలేకరి, చీడికాడ) -
మత్స్యరంగం కొత్త పుంతలు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా’గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మూడోదిగా ఏర్పాటైన ఈ వర్సిటీకి ఓ వైపు నూతన భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే.. మరోవైపు దీనికి అనుబంధంగా కొత్త మత్స్య కళాశాల కొలువు దీరింది. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు..నిష్ణాతులైన అధ్యాపక బృందంతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 1200కు మించి పట్టభద్రుల్లేని పరిస్థితి రాష్ట్రంలో 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం..1.10 లక్షల హెక్టార్ల మంచినీటి సాగు..80 వేల హెక్టార్లలో ఉప్పునీటి సాగు విస్తీర్ణం ఉంది. 1.75 లక్షల మంది ఆక్వా రైతులు..8.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. ఈ రంగంపై ఆధారపడి 16.50 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 51.06 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే నం.1 స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో చేపల ఉత్పత్తిలో 25.60 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 78 శాతం ఏపీ నుంచే జరుగుతోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి 11,901 డిప్లమో హోల్డర్లు, 6118 బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్ఎస్సీ), 2541 మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) చదివిన వారు అవసరం. 2030 నాటికి కనీసం 50 వేల మందికి పైగా అవసరమవుతారని అంచనా. కానీ ప్రస్తుతం కేవలం 450 మంది డిప్లమో, 700 మంది బీఎఫ్ఎస్సీ, 50–60 మంది ఎంఎఫ్ఎస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2005 వరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, ఆ తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉన్న మత్స్య యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్టు–2020ను తీసుకురావడమే కాదు..2022 ఫిబ్రవరి 19 నుంచి వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా ముతుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్‌తో పాటు అవనిగడ్డ మండలం బావదేవర పల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, కాకినాడలో ఉప్పునీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభధ్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రం, ఉండి వద్ద మంచి నీటి చేపలు, రొయ్యల పరిశోధన కేంద్రంతో పాటు 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను మత్స్య వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తొలి ఏడాదిలోనే గుర్తింపు వర్సిటీకి అనుబంధంగా 60 బీఎఫ్ఎస్సీ సీట్లతో కొత్తగా నర్సాపురం మత్స్య కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచింది. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సాపురం కళాశాలకు నిష్ణాతులైన అధ్యాపక బృందాన్ని నియమించి 2022–23 విద్యా సంవత్సరం నుంచే నర్సాపురంలోని తుఫాన్ భవనం (తాత్కాలికంగా)లో తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదిలోనే కేటాయించిన 60 సీట్లు భర్తీ కావడమే కాదు యూజీసీ, ఐసీఏఆర్ గుర్తింపు కూడా లభించడం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఫిషరీస్ కళాశాలలతో పాటు కొత్తగా నాలుగు మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ తాడిగడపలో వర్సిటీ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యకలాపాలకు శ్రీకారంచుట్టారు. శరవేగంగా నిర్మాణ పనులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో లఖితపూడి– సరిపల్లి గ్రామాల మధ్య 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో యూనివర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 40 ఎకరాలను గుర్తించగా, దాంట్లో రూ.100 కోట్లతో పరిపాలనా భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతుల శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. పిల్లర్ల దశకు చేరుకున్నాయి. మరొక పక్క వర్సిటీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన మత్స్యకళాశాల కోసం 48 టీచింగ్, 52 నాన్ టీచింగ్, 40 అవుట్సోర్సింగ్ కలిపి 140 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనామోదం కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తను కావాలని.. మాది నెల్లూరు. మా నాన్న ఆర్టీసీ కండక్టర్.గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఎంసెట్‌తో పాటు నీట్లో కూడా క్వాలిఫై అయ్యాను. చిన్నప్పటి నుంచి మత్స్యశాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతో బ్యాచురల్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో చేరాను. నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో సీటు వచ్చింది. ఫ్యాకల్టీ చాలా బాగుంది. నర్సాపురం సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, హేచరీలు, మత్స్య పరిశ్రమలుండడం మాకెంతో ఉపయోగంగా ఉంది. –పి.హరిబాబు, బీఎఫ్ఎస్సీ విద్యార్థి అపార అవకాశాలు మాది గుంటూరు. నాన్న బ్యాంక్ మేనేజర్. ఎంబీబీఎస్ చేయాలని నీట్ రాశాను. క్వాలీఫై కాలేకపోయాను. అపారమైన ఉపాధి అవకాశాలున్న మత్స్య రంగంలో అడుగు పెట్టాలన్న సంకల్పంతో నర్సాపురం కళాశాలలో బీఎఫ్ఎస్సీలో సీటు సాధించా. మత్స్య శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. –ఎస్డీ షరీఫాతేజ్, బీఎఫ్ఎస్సీ విద్యార్థిని త్వరలో నూతన ప్రాంగణంలోకి.. అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న మత్స్యరంగం బలోపేతం కావాలంటే ప్రత్యేకంగా మత్స్య యూనివర్సిటీ అవసరం. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మూడో మత్స్య వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలిదశలో రూ.100 కోట్లతో వర్సిటీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వర్సిటీ భవనాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రాంగణంలో వర్సిటీ కార్యకలాపాలతో పాటు మరిన్ని కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. –డాక్టర్ ఓగిరాల సుధాకర్, రిజిస్ట్రార్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం -
Fact Check: దెబ్బ కాదు.. విషపురాతల దిబ్బ
సాక్షి, అమరావతి: ఈ రామోజీరావు పిచ్చి పతాకస్థాయికి చేరిపోయింది. దానికి తగ్గట్టే ‘ఈనాడు’ రాతలు కొత్త లోతులను తాకుతున్నాయి. అసలు 6 లక్షల మిలియన్ టన్నులంటే అర్థం తెలుసా రామోజీరావ్? అసలు ఇండియాలోని పోర్టులన్నీ కలిపినా ఆ స్థాయిలో సరకు రవాణా జరుగుతుందా? అసలు 6 లక్షల మిలియన్ టన్నులంటే ఎంత?... అక్షరాలా ఆరు లక్షల కోట్ల టన్నులు!!. పైపెచ్చు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక అదేమో లక్ష మిలియన్ టన్నులకు.. అంటే లక్ష కోట్ల టన్నులకు పడిపోయిందట!!. మతిపోయిందా రామోజీరావ్? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషంతో అసలు నీ పత్రికలో ఏం రాస్తున్నావో తెలుస్తోందా? నీ రాతలతో పోతున్నది ఈ రాష్ట్ర ప్రతిష్ఠ కాదు... నీ పత్రిక పరువే!!. కృష్ణపట్నం పోర్టులో ప్రస్తుతం జరుగుతున్న మొత్తం సరకు రవాణా 57.8 మిలియన్ టన్నులు. అసలు దేశంలోని మొత్తం మేజర్ పోర్టులన్నీ కలిపి గతేడాది చేసిన సరకు రవాణా 795 మిలియన్ టన్నులు. కానీ రామోజీరావు మాత్రం ఒక్క కృష్ణపట్నంలోనే సరకు రవాణా 6 లక్షల మిలియన్ టన్నుల నుంచి లక్ష మిలియన్ టన్నులకు పడిపోయిందని చేతికొచ్చిన దౌర్భాగ్యపు రాతలు రాసి పడేశారు. నిజానికి మూడేళ్ల కిందట కృష్ణపట్నం పోర్టులో 3.81 కోట్ల టన్నులుగా ఉన్న వార్షిక సరకు రవాణా ఇపుడు 5.78 కోట్ల టన్నులకు పెరిగింది. గతేడాదితో చూసినా... 4.82 కోట్ల టన్నుల నుంచి 5.78 కోట్ల టన్నులకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఎగుమతులు క్షీణిస్తే... ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 2.77 శాతం వృద్ధి నమోదయింది. అదీ.. ఆంధ్రప్రదేశ్ ఘనత. ఎల్లో వైరస్‌తో కళ్లు మూసుకుపోయిన రామోజీరావుకు ఇవేమీ కనిపించవు మరి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉంటే కృష్ణపట్నం పోర్టును నిర్వహిస్తున్న అదానీ గ్రూపు గంగవరం పోర్టులో కొత్తగా రెండు కార్గో టెర్మినళ్లను ఎందుకు నిర్మిస్తుంది? సరుకు రవాణాలో కృష్ణపట్నం పోర్టు అంతకంతకూ పురోగమిస్తోందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లేదా ఏపీ మారిటైమ్ బోర్డు గణాంకాలే చెబుతున్నాయి కదా? కృష్ణపట్నంలో సరకు రవాణా ఏటేటా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తుంటే... సరుకు రవాణా పడిపోయిందంటూ అబద్ధాలాడటం బహుశా... రామోజీకి మినహా ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదేమో. నిజానికి సరుకు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్న రాయల్టీనైనా చూడాలి కదా? 2020–21లో రాయల్టీగా రూ.46.06 కోట్లు వస్తే 2023–24లో అది రూ.88.91 కోట్లకు చేరుతోంది. మరి ఇవన్నీ ఏం చెబుతున్నాయో దిగజారుడు రామోజీరావే అర్థం చేసుకోవాలి. రూ.54,539 కోట్ల మేర పెరిగిన ఎగుమతులు రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం దెబ్బతింటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడేళ్ల నుంచి మొదటి స్థానంలో ఎలా ఉంటుంది? పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతే ఏపీ పోర్టుల నుంచి సరుకు రవాణా నాలుగేళ్లలో రూ.54,539 కోట్లు అదనంగా ఎలా పెరుగుతుంది? 2019–20లో రూ.1,04,829.00 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు విలువ 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్లకు పెరగటం నిజం కాదా? ఇవన్నీ కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా చెబుతున్న లెక్కలే కదా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎగుమతులు తిరోగమనంలో ఉండగా తొలి ఆర్నెల్లలో రాష్ట్ర ఎగుమతులు మాత్రమే 2.77 శాతం వృద్ధితో రూ.85,021.74 కోట్లకు చేరాయి. కర్ణాటక ఎగుమతులు –9.06 శాతం, మహారాష్ట్రలో –7.04 శాతం, గుజరాత్లో –7.91 శాతం మేర క్షీణించాయి. కొత్తగా రెండు కార్గో టెర్మినళ్లు కృష్ణపట్నం పోర్టులో మా వ్యాపారం ప్రతి నెలా పెరుగుతోంది. అక్కడ మేం కంటైనర్ టెర్మినల్‌ను తొలగిస్తున్నామనటం అబద్ధం. మార్కెట్ ట్రెండ్ ఆధారంగా సరుకు రవాణాపై భిన్న వ్యూహాలు అనుసరిస్తూ ఉంటాం. మా పోర్టు నుంచి ఒక్కరిని కూడా తొలగించలేదు. గంగవరంలో కంటైనర్ టెర్మినల్ నిర్మించటం వల్ల మా వ్యాపారం మరింత పెరుగుతోంది. ప్రభుత్వానికి మేం చెల్లిస్తున్న రాయల్టీ గణాంకాలే రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతోందో స్పష్టం చేస్తున్నాయి. ‘ఈనాడు’ పత్రికలో వెలువడ్డ కథనాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. – అదానీ పోర్ట్ అండ్ సెజ్ ఉద్యోగాలు పెరిగాయ్.. కృష్ణపట్నం పోర్టులో వ్యాపారం తగ్గడం వల్ల 10,000 మంది ఉపాధి కోల్పోయారనేది పచ్చి అబద్ధం. నిజానికి అక్కడ ఉద్యోగాలు పెరిగాయి. ఉత్తరాదిలో భూమి విస్తీర్ణం ఎక్కువ, తీర ప్రాంతం తక్కువ. దక్షిణాదిలో తీర ప్రాంతం అధికం. అందుకని పోర్టులు ఎక్కువ. కంటైనర్ల వ్యాపారానికి పోటీ ఎక్కువగా ఉంటుంది. గంగవరం పోర్టులో కొత్తగా రెండు కార్గో టెర్మినళ్లతో పాటు మూలపేట పోర్టులో కార్గో టెర్మినల్స్ అభివృద్ధి చేస్తున్నాం. – రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
రైలుపల్లె.. రెడ్డిపల్లి
వైఎస్సార్: చైన్నె–ముంబై రైలు మార్గంలో తొలుత ఏర్పడిన స్టేషన్ రెడ్డిపల్లి. రైలు రావడానికి కారణమైన పల్లె గనుక ఇప్పటికీ రైలు పల్లెగా ప్రసిద్ధి కెక్కింది. అయితే రైల్వేశాఖ ఈ రైల్వేస్టేషన్ ఆనవాళ్లు లేకుండా చేసిందనే విమర్శలను మూటకట్టుకుంది. దక్షిణ భారతదేశంలో తొలి రైల్వేస్టేషన్‌గా రెడ్డిపల్లిను చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడి నుంచి నందలూరు వరకు రైలు మార్గం వేశారు. చెయ్యేరు నీరు శ్రేష్టమని భావించి రైలు ఇంజిన్ల నిర్వహణ కోసం లోకోషెడ్ నిర్మించేందుకు బ్రిటీషు రైల్వేపాలకులు ముందుకొచ్చారు. ► రెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో విక్టోరియా రాణి.... రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైల్వేట్రాక్ వేశారు. విక్టోరియా రాణి ఇక్కడికి వచ్చి దీనిని ప్రారంభించారు. రైల్వేమార్గం పురోగతిపై నాటి రైల్వేపాలకులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేకు ఎకరాల్లో స్థలం ఉంది. నిన్న మొన్నటివరకు బ్రిటీష్ రైల్వేపాలకుల చిహ్నాలు ఉండేవి. రాయపురం నుంచి..... మద్రాసు, సందరన్ మరాఠా రైల్వేస్ పరిధిలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తమిళనాడులోని రాయపురం వరకు 153 కిలోమీటర్లు రైల్వేట్రాక్ నిర్మించారు. ఇదంతా 1857 ప్రాంతంలో జరిగింది. దేశంలో తొలి రైలుమార్గం ముంబై–థానా మధ్య నిర్మితమైన క్రమంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు ట్రాక్ నిర్మితమైందని సమాచారం. రైల్వేస్టేషన్‌ను పూర్తి బర్మా టేకుతో నిర్మించారు. మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు..... మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. బొగ్గుతో నడిచే రైలింజన్లతో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. ఈ స్టేషన్లో మద్రాసు–రాయచూరు–రేణిగుంట–గుంతకళ్లు ప్యాసింజర్ రైళ్లు ఆగేవి. అరక్కోణం , కడప ప్యాసింజర్ రైళ్లు కూడా నిలిచేవి. 2003–2004 మధ్యలో రైల్వేస్టేషన్ మూసివేత ఇండియా రైల్వేలో మీటర్గేజ్లను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చడం.. సింగల్ లైన్ ఉన్న రైల్వేస్టేషన్‌ను డబుల్ లైన్ చేశారు. ఈ క్రమంలో 2003–2004లో స్టేషన్‌ను మూసివేశారు. స్టేషన్ మాస్టర్లను, పాయింట్మెన్లను అందరినీ బదిలీ చేశారు. తర్వాత కాంట్రాక్టు పద్దతిలో రైల్వే టికెట్లు ఇచ్చేందుకు బుకింగ్ రూమ్ నిర్మించారు. లెవెల్ క్రాసింగ్ గేటు బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. ► స్టేషన్ మూసివేతకు ప్రధానంగా రెడ్డిపల్లికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో పుల్లంపేట రైల్వేస్టేషన్, ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఓబులవారిపల్లె స్టేషన్లు ఉన్నాయి. రైళ్లవేగం పెరిగిన క్రమంలో నాలుగు, ఐదు నిమిషాల్లో రైలు రెడ్డిపల్లి స్టేషన్ దాటి పోతుంది. ఆ స్టేషన్ ఉండటం వల్ల రైల్వేకు ఎలాంటి లాభదాయకం కాదని అప్పటి డీఆర్ఎం నివేదిక సమర్పించారు. దీంతో రైల్వేబోర్డు స్టేషన్‌ను మూసివేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్‌ను మూసి వేయవద్దని కార్మికసంఘాలు చేసిన విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టారు. ► బ్రిటీషు రైల్వేపాలకుల హయాంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకొని ముంబై–చైన్నె రైలు మార్గం నిర్మించారు. ఈ స్టేషన్లో రెండు లైన్లు, ఒక ప్లాట్‌ఫామ్ ఉండేది. గూడ్స్ సైడింగ్‌ను కూడా బ్రిటీషర్లు ఏర్పాటు చేసుకున్నారు. 1980లో ఈ సైడింగ్‌ను మూసివేశారు. ఇక్కడి నుంచి గూడ్స్ వ్యాగన్లో కర్రబొగ్గు, ఎర్రగడ్డలు, తమలపాకు, నిమ్మకాయలు మద్రాస్ హార్బర్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి గోధుమలు, బార్లీ దిగుమతి అయ్యేవి. భావితరాలకు తెలియాలి బ్రిటీషు కాలం నుంచి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్లు గురించి, ఆనాటి పరిజ్ఞానం, రైళ్ల గురించి భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు రైల్వే లాభాలు చూసుకుంటోంది. చరిత్ర కల్గిన స్టేషన్లు కాలగర్భంలో కలిసిపో యాయి. ఇందులో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ఒకటి. – తల్లెం భరత్ కుమార్ రెడ్డి, గుంతకల్ రైల్వే బోర్డు మెంబర్ సరుకుల రవాణాకు అనుకూలం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి.దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇక్కడి నుంచి ఇంగ్లాడుకు సరుకుల రవాణ జరిగింది. బ్రిటీషు రైల్వేపాలకులు రెడ్డిపల్లికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్ లేకుండా పోవడం విచారకరం. – ముస్తాక్, మండల కనీ్వనర్ పునరుద్ధరించాలి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి జిల్లాలో ఉండడం గర్వకారణం. మా పూర్వీకుల నుంచి స్టేషన్ రాకపోకలకు అనుకూలంగా ఉండేది. నేడు దీనిని ఆనవాళ్లు లేకుండా చేయడం బాధాకరం. ఈ స్టేషన్‌ను పునరుద్ధరిస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. – జనార్దన్, రెడ్డిపల్లి, పుల్లంపేట మండలం -
ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతం
చంద్రగిరి(తిరుపతి జిల్లా): ‘దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే... అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తాం..’ అని వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. ‘హెల్తీ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు, ప్రజాప్రతినిధులు 3 బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రగిరి మండలంలోని తొండవాడ పంచాయతీలో ఛండీగఢ్, జమ్ము–కశ్మీర్, పంజాబ్, హరియాణ, రాజస్థాన్, కేరళకు చెందిన 49 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. వారికి స్థానిక సర్పంచ్ మల్లం దీపిక, సింగల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు 47మంది, చెర్లోపల్లి గ్రామంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , తెలంగాణకు చెందిన 48మంది ప్రతిని«దులు పర్యటించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, వెల్నెస్ సెంటర్ ఎస్‌డబ్ల్యూపీసీ, ప్రభుత్వ పాఠశాలలు వంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలతోపాటు డిజిటల్ క్లాసులు, ట్యాబుల ద్వారా విద్యాబోధన ఒక అద్భుతమని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాది నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీలు, పాఠశాలలు ఆరోగ్య కేంద్రాల పనితీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు. తొలుత నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొండవాడ పంచాయతీలో పర్యటించిన బృందం వెంట ఎంపీపీ హేమేంద్రకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. -
జగనన్న దీవెన వల్లే ఉద్యోగం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. జగనన్న దీవెన వల్లే ఉద్యోగం ఈ రోజు నేను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నానంటే ఈ ప్రభుత్వం దయే. మా నాన్న ఇప్పిలి అప్పారావు ఆటో డ్రైవర్. అమ్మ గృహిణి. తమ్ముడు మురళీకృష్ణ ఐటీఐ చదువుతున్నాడు. నాన్న విశాఖ జిల్లా పెందుర్తిలో ఆటో నడుపుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా చదువులు, ఇతరత్రా అవసరాలకు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నా డిప్లమో పూర్తయింది. ఈ–సెట్లో 600వ ర్యాంక్ సాధించాను. రెండో కౌన్సెలింగ్‌లో సీటు వచ్చింది. అయితే ఫీజు ఎక్కువ కట్టాల్సి రావడం.. చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్ల రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామనడంతో ఇక చదువు మానేద్దామని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించడంతో 2019లో బీటెక్‌లో చేరాను. అనుకున్నట్లుగానే సమయానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా దాదాపు రూ.2.50 లక్షలు అందించారు. సొంత అన్నయ్యే నా చేయి పట్టుకుని చదివించిన అనుభూతి కలుగుతోంది. ఇప్పుడు ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. రానున్న రోజుల్లో గ్రూప్స్/సివిల్స్‌కి ప్రిపేర్ అవుతాను. వైఎస్ జగన్ సీఎంగా దీర్ఘకాలం కొనసాగితే మాలాంటి వారు ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకోగలమన్న నమ్మకాన్ని కలిగించారు. మా అమ్మకు ఆసరా, నాన్నకు వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి కలిగింది. – ఇప్పిలి అప్పలరాజు, ఇప్పిలివానిపాలెం, పెందుర్తి (సమ్మంగి భాస్కర్, విలేకరి, పెందుర్తి) మేకల పెంపకంతో చక్కని ఉపాధి ఒకప్పుడు మా లాంటి గిరిజన మహిళలు వ్యవసాయ పనులతో పాటు కొండలపై నుంచి తెచ్చుకునే కర్రలను అమ్ముకొని కుటుంబానికి ఆసరాగా నిలిచేవాళ్లం. భర్త సంపాదన చాలక కుటుంబం పోషణ ఎంతో భారంగా ఉండేది. ఇంటిల్లిపాదీ కష్టపడినా ఆదాయం మాత్రం కష్టానికి తగినట్లుగా ఉండేది కాదు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 వస్తోంది. ఈ పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. మూడేళ్లుగా వస్తున్న సాయంతో మేకలు కొనుగోలు చేసి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సవరగోపాలపురంలో వాటిని పెంచుతున్నా. దీనికి తోడు వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.36 వేలు వచ్చింది. ఈ సొమ్ము కూడా పెట్టుబడికి ఉపయోగపడింది. మేకల పెంపకం వల్ల ఆదాయం బాగుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది. దీనిని వ్యవసాయానికి పెట్టుబడిగా వాడుకుంటున్నాం. నాకో కుమారుడు. వాడు వ్యవసాయ కూలి. వాడి కుమార్తె టెక్కలి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ. 15 వేల వంతున మా కోడలు ఖాతాలో జమవుతోంది. నా భర్తకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. నా కోడలి పేరున జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇల్లు నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవనం సాగిస్తోంది. – చింతపల్లి పెంటమ్మ, సవరగోపాలపురం (ఎల్.వి.రమణ, విలేకరి, టెక్కలి) ప్రభుత్వ పథకాలే మా జీవనాధారం దివ్యాంగురాలినైన నాతో పాటు 70 ఏళ్ల వయస్సున్న మా అమ్మ ఉంటోంది. ఏలూరు జిల్లా నూజివీడులో చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ మా అమ్మను కంటికి రెప్పలా చూసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నా. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మాలాంటి పేదలను ఆదుకుంటోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందిస్తోంది. దీంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నాం. జీవనానికి ఈ పథకం ద్వారా వస్తున్న డబ్బు ఎంతో తోడ్పడుతోంది. దీనికి తోడు ప్రభుత్వం నాకు దివ్యాంగ పింఛన్ కింద రూ.3 వేలు ఇస్తుండగా, మా అమ్మకు వద్ధాప్య పింఛను వస్తోంది. రేషన్‌కార్డు ద్వారా ఇద్దరికీ అవసరమైన బియ్యం, ఇతర సరుకులు అందుతున్నాయి. మా అమ్మకు అవసరమైన బీపీ, సుగర్ మందులతో పాటు బీ కాంప్లెక్స్, మోకాళ్ల నొప్పులకు సంబంధించిన మందులు ప్రతి నెలా విలేజ్ క్లినిక్‌లో ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైనప్పుడు రక్త పరీక్షలను సైతం చేస్తున్నారు. ఇప్పుడు మా జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. – జె.రమాప్రభ, నూజివీడు, ఏలూరు జిల్లా (ఉమ్మా రవీంద్రరెడ్డి, విలేకరి, నూజివీడు)