AP Special
-
కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించగా మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శిరీష, సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో .మల్లిఖార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. తోటి కళాకారులందరికీ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. కళాకారుల వినతిపత్రాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని స్పష్టం చేశారు. సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల డేటా సేకరణ ద్వారా నిజమైన కళాకారులను గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కళాకారులు దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ప్రతిష్ఠాత్మక జీఐఎస్, జీ20 కార్యక్రమాల్లో మన కళాకారుల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర చరిత్రలో 99 శాతం హామీలను నాలుగున్నరేళ్లలో అమలు చేయడమే గాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. ఇలా సంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంలో కళాకరులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఎమ్మార్వో, ఆర్డీవోల ద్వారా పారదర్శకంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. స్వతహాగా కళాకారుడైన తనకు క్రియేటివ్ హెడ్ గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్క్షతలు తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆర్.కె.రోజా ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత మరింత వన్నె తెచ్చారన్నారు. కరోనా తర్వాత కళలు, క్రీడలు పునర్ వైభవాన్ని కోల్పోగా.. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరుత్తేజం వచ్చిందన్నారు. సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మనదేశాన్ని సాంప్రదాయ కళలు, సంస్కృతులే అత్యున్నత స్థాయిలో ఉంచాయన్నారు. కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తోందని.. అందుకే అన్ని అకాడమీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ లను నియమించిందన్నారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కళ కల కోసం కాదని ప్రజల కోసమని తెలిపారు. గుర్తింపు కార్డులు అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో కళాకారులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, రాయితీలు అందించేందుకు మంత్రి రోజా అహర్నిశలు కృషి చేశారన్నారు. సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి మాట్లాడుతూ.. స్వతహాగా వైద్యురాలు అయిన తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి, ప్రేమ, తగ్గింపు స్వభావం వంటి సుగుణాలు కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ.. చిత్ర కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని ఆకాంక్షించారు. కళాకారుల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులంతా అండగా నిలబడాలన్నారు. కార్యక్రమ అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన 4వేల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే.రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు. అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ,జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: ‘ఎల్లో’ ఏడుపులకు సీఎం జగన్ దిమ్మదిరిగే సమాధానం -
జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ను బొందపెట్టి తీరతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటోళ్లను చాలామందిని చూశామని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ క్రమంలో తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అలాగే జనవరి నెల కరెంట్బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రవేంత్‌రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని.. రెండున్నర దశాబ్దాలు నిలబడి రేవంత్ లాంటోళ్లను మట్టి కరిపించిందని అన్నారాయన. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా?.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?’’ కేటీఆర్ నిలదీశారు. ఇదీ చదవండి: లండన్‌లో సీఎం రేవంత్ ఏమన్నారంటే.. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ ఉండబోదని శనివారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పునరుద్ఘాటించారు. ‘‘రేవంత్ రక్తం అంతా బీజెపీదే. అందుకే ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండు. రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేగా మారతాడు’’ అంటూ కేటీఆర్ పంచ్‌లు వేశారు. కరెంట్ బిల్లుల్ని సోనియాకు పంపించండి అలాగే.. ఈ జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని.. ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. ‘‘ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పిండు. అందుకే కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలి’’ అని కేటీఆర్ అన్నారు. అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని.. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
రోత రాతల రామోజీ.. మంచి జరిగితే నచ్చదా?: మంత్రి వేణు
సాక్షి, విజయవాడ: ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రామోజీకి మంచి జరిగితే నచ్చదని, చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలేనని మత్రి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిందని, ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ.. అంటూ పశ్నించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా.. 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది. లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా? బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్. ఈనాడు వార్తలు అంబేద్కర్‌ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం. ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలి’’ అని మంత్రి వేణు మండిపడ్డారు. -
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?
హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి పెడుతున్న కితకితలు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. కాలమే సరైన సమాధానమే చెబుతుంది. ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు? పరిశీలిస్తే.. కాలిఫోర్నియా నుంచి ఓ ప్రవాసాంధ్రుడు పంపిన కథనం యధాతథంగా.. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు. కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించారు. ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది. అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను.. ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ,కదిరి సిద్ధారెడ్డి ,ఎమ్మిగనూరు చెన్న కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్సీపీ జాబితా ఎస్సీలు- 21 ఎస్టీలు -3 బీసీలు- 17 మైనార్టీలు- 4 ఓసి - 13 10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు -6 ఎస్సీలు -2 ఎస్టీ -1 ఓసీ -1 ఏపీ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17 (కేబినెట్లో 70 శాతం) బీసీ మంత్రులు : బాబు పాలనలో-8 జగన్ పాలనలో-11 ఎస్సీ మంత్రులు : బాబు పాలనలో-2 జగన్ పాలనలో-5 జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం) తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు స్పీకర్ బాబు పాలనలో-కోడెల (కమ్మ) జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ) బీసీలకు రాజ్యసభ స్థానాలు బాబు పాలనలో-0 జగన్ పాలనలో -4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు : ఎమ్మెల్సీలు లు బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం ) జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం) జగన్ హయాంలో మిగతావి.. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో - 9 (69 శాతం) 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో -12 (86 శాతం) గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో -58 (69 శాతం ) 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులలో - 79 (58 శాతం) నామినేటెడ్ డైరెక్టర్ పదవులు-280 (58 శాతం) 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం) 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం ) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఓసీల స్థానాలను.. బీసీ, మైనారిటీలకు ఇచ్చారు సీఎం జగన్. అయినా.. దళితుల స్థానాల్ని మళ్లీ దళితులకే కదా కేటాయించాల్సింది!. ఇందులో దళితులకు అన్యాయం ఎక్కడుంది సాంబా?.. జగనన్న ప్రభుత్వంలో ఎంత సామాజిక న్యాయం జరిగిందో.. అలాగే మీ బాస్ టైంలో ఎంత సామాజిక (అ)న్యాయం జరిగిందో క్రాస్ చెక్ చేస్కో. ::చిరు, కాలిఫోర్నియా -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) స్వామివారిని 69,874 భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా లెక్క తేలింది. వచ్చే 22న అయోధ్య రామా మందిరం ప్రారంభం.. నేడు ప్రత్యేక ప్లైట్‌లో అయోధ్య చేరనున్న టీటీడీ శ్రీవారి లడ్డులు. దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లక్ష లడ్డూలు తయారి. నిన్న రాత్రి తిరుమల నుండి బయలుదేరిన లడ్డులు. -
AP: 25 నుంచి 31 వరకు ఈ–ఆఫీస్‌లు పనిచేయవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌లను ప్రస్తుత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. అందువల్ల ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆరు రోజుల్లో కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. -
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధలయ్యాయి. ప్రభుత్వ భూములూ గల్లంతయ్యాయి. చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతమయ్యాయి. ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్ భూములు.. రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు.. వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలైంది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ.5వేల కోట్ల భూదోపిడీ.. ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో రూ.760.25 కోట్ల భూసమీకరణ ప్యాకేజీ పొందారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్ల భూములు కొల్లగొట్టారు. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం రాజధాని భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా కథ నడిపారు. అనంతరం.. అసైన్డ్ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా కోర్టును కూడా మోసంచేసి తమ పన్నాగాన్ని అమలుచేశారు. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే ఆ జీఓను జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములూ హాంఫట్.. ఇక రాజధాని కోసం అమరావతి పరిధిలోని ప్రభుత్వ భూములను కూడా చంద్రబాబు, నారాయణ ముఠా కొల్లగొట్టింది. ఎవరి ఆ«దీనంలోనూ లేని ప్రభుత్వ భూములను గుర్తుతెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. మొత్తం 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆ«దీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా రూ.760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) రావెల కిశోర్‌బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు (రియల్టర్) మండల రాజేంద్ర (రియల్టర్) టకేవీపీ అంజనీకుమార్ (రియల్టర్) దేవినేని రమేశ్ (రియల్టర్) టబొబ్బా హరిచంద్రప్రసాద్ (రియల్టర్) హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) దోనేపూడి దుర్గాప్రసాద్ (రియల్టర్) అసైన్డ్ భూదోపిడీలో నిందితులు ఏ1 : నారా చంద్రబాబు ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్‌విత్ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్ఐఆర్ నమోదు. -
fact check: పింఛన్లపై వంచన రాతలెందుకు?
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, దివ్యాంగులు సహా ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరికీ రామరాజ్యమంటే ఏంటో.. సంక్షేమ శకం తీపిగుర్తులు ఎలా ఉంటాయో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వారికి తెలిసేలా చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నరోజుల్లో వాళ్లు పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు పటాపంచలై వాళ్లు వాటిని దాదాపు మరిచిపోయేలా కూడా చేశారు. కానీ.. ఆ జన్మభూమి కమిటీల ఆగడాలతో అప్పట్లో ఐదేళ్లపాటు అవ్వాతాతలు, దివ్యాంగులు సహా ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరూ అనుభవించిన అష్టకష్టాలే ఇంకా ఇంకా అనుభవిస్తూ ఉండాలని రామోజీరావు కోరుకుంటున్నట్లు ఉంది ఈనాడు రాతలు చూస్తే. ఎందుకంటే.. ‘జగన్ వచ్చే.. పింఛను తుంచె..’ అంటూ ఆ పత్రిక పెట్టిన పెడ»ొబ్బలు అంతాఇంతా కాదు. నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే ఇంటికే వెళ్లి ఇస్తున్నా.. చెప్పినట్లుగా ఏటా పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లినా.. సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నా నిలువెల్లా విషం నింపుకున్న రామోజీ తనను తాను వంచన చేసుకుంటూ ఏడుపుగొట్టు రాతలు రాస్తున్నారంటే ఆయన్ను ఏమనాలి? ఈనాడు వండివార్చిన విషపూరిత కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’.. ఇదేనా స్వర్ణయుగమంటే.. ఈనాడు: గత తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక భద్రత పింఛను లబ్ధిదారులకు స్వర్ణయుగమే.. వాస్తవం: 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సమయానికి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 43.11 లక్షల పెన్షన్ లబ్ధిదారులుండేవారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కూడా రాష్ట్రంలో కేవలం 39 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే ప్రతినెలా పెన్షన్ తీసుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 55 నెలల్లో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. ఈనాడు: టీడీపీ ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా కేటగిరీ పింఛన్లూ ఒకే ఇంటిలో రెండు ఉన్నా.. అందరికీ ఇచ్చారు.. వాస్తవం: 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు..’ అంటూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 2014 సెప్టెంబరు 18న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీచేసిన ఆర్సీ నెంబరు 1053 ఆదేశాలే సాక్ష్యం. వీటి ప్రకారం.. కేవలం 80 శాతానికి పైగా అంగవైకల్యం ఉండే వారికి మాత్రమే రెండో పెన్షన్ మంజూరు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందే అందరికీ, రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించడంతో పాటు కొత్తగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా కలి్పంచిన వెసులుబాట్లతో రాష్ట్రంలో 3,53,645 మంది ఒకే ఇంట్లో రెండో పెన్షన్ కూడా పొందుతున్నారు. ‘జన్మభూమి’ పేరు వింటేనే హడల్ చంద్రబాబు పాలనలో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికీ జన్మభూమి కమిటీ పేరు గుర్తుకొస్తేనే వణికిపోయే పరిస్థితి. అప్పట్లో నెలనెలా తమ పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే నడవలేని, నిలబడలేని స్థితిలో కూడా చాంతాడంత క్యూలలో ఎర్రటి ఎండలో గంటల తరబడి నిరీక్షించిన రోజులను ఊహించుకుంటేనే వారు బెంబేలెత్తిపోతున్నారు. పైగా.. బాబు పాలనలో అన్నీ అర్హతలున్న వాళ్లు పెన్షన్ కావాలంటే ఏడాదికో, లేదంటే రెండేళ్లకోసారో మొక్కుబడిగా ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఆ దరఖాస్తులు మండలాఫీసుల్లో కుప్పలపాలయ్యేవి. పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎవరైనా మరణిస్తేనో లేదా ఇతర కారణాలతో తగ్గితేనే కొత్త పెన్షన్లు మంజూరయ్యేవి. ఆ దరఖాస్తుల దుమ్ము దులిపిన దాఖలాల్లేవు. ఎమ్మెల్యేని అడిగినా దిక్కూమొక్కూలేని పరిస్థితి. సీఎం జగన్ పాలనలో.. సంతృప్త స్థాయిలో.. అదే ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మొదటి నుంచీ (గత నాలుగున్నర ఏళ్లకు పైగా) సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వలంటీరే స్వయంగా వెళ్లి పింఛను దరఖాస్తు తీసుకుని మంజూరు కాగానే తిరిగి లబ్ధిదారుడు ఇంటికే వచ్చి మంజూరు పత్రం అందజేస్తున్నారు. ఎక్కడన్నా ఏదైనా కారణంతో అర్హత ఉండీ పెన్షన్ మంజూరు కాకపోతే.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వారికి పెన్షన్లు మంజూరు చేసే విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలుచేస్తోంది. కానీ, చంద్రబాబు హయాంలో పెన్షన్ లబ్ధిదారులు ఎన్ని ఇబ్బందులుపడ్డా ‘ఈనాడు’ మాత్రం చంద్రబాబు జమానాను స్వర్ణయుగం అని కీర్తిస్తోంది. అలాగే, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర చేతి వృత్తిదారులపట్ల పూర్తి మానవత్వంతో పెన్షన్ల మంజూరు నుంచి ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటివద్దే పంపిణీకి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ‘ఈనాడు’కు బూటకపు విధానాలుగా కనిపిస్తుంటే దానిని ‘కళ్లుండీ చూడలేని కబోదీ’ అనే అనుకోవాలి. -
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్‌ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్‌ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ విగ్రహం స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్ ముందున్నారని చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్‌కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. -
అద్భుత శిల్పం.. జాతికి అంకితం
సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకోగా, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏర్పాటుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కీర్తిని మూటగట్టుకుంది. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని జాతికి అంకితం చేసే మహత్తర కార్యక్రమం దిగ్విజయం అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు. మధ్యాహ్నానికి అశేష ప్రజావాహినితో స్వరాజ్ మైదానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణం జనంతో నిండిపోవడంతో స్వరాజ్ మైదానానికి ఆనుకుని ఉన్న మహాత్మా గాంధీ రోడ్డు, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ల వద్ద జనం భారీగా గుమిగూడి ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో జై భీమ్, జై జగన్ నినాదాలు మిన్నంటాయి. సాక్షి, అమరావతి: విజయవాడ నగరం నడిబొడ్డున భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం బౌద్ధ వాస్తు శిల్పకళతో నిర్మించిన కాలచక్ర మహా మండపాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం వద్ద ఆ మహనీయుని పాదాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవిత విశేషాలను ప్రదర్శించే విహార యాంఫీ థియేటర్‌ను ప్రారంభించారు. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం అంతా కలియతిరిగారు. జీవ కళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు, అంబేడ్కర్ జీవిత విశేషాలు తెలియజేసే ఎక్స్పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చొనేలా తీర్చిదిద్దిన కన్వెన్షన్ సెంటర్, 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, వాటర్, మ్యూజికల్ ఫౌంటెన్లు, ఉదయం, సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ మార్గాలను పరిశీలించారు. దేశానికే తలమానికంగా 81 అడుగుల పీఠంతో కలిపి 206 అడుగుల పొడవుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని ఆశయాలు స్ఫూర్తిగా జగనన్న పాలన సాగుతోందంటూ వందల సంఖ్యలో డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్ చిత్రం, నవరత్న పథకాలు, పీపుల్స్ లీడర్ సీఎం వైఎస్ జగన్, భారత పార్లమెంట్, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, కర్నూలు కొండారెడ్డి బురుజు, ప్రకాశం బ్యారేజ్, చిలుక, కూచిపూడి నృత్యం వంటి ఆకృతులతో డ్రోన్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. 14 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల జాతీయ పక్షి నెమలి ఆకృతి విశేషంగా ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే లేజర్ షో, బాణా సంచా వెలుగులు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. అనంతరం అంబేడ్కర్ మహాశిల్పం ముందు సీఎం జగన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారు. ఈ మహోత్సవంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు, ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, అంజద్ బాషా, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, ఆర్కె రోజా, విడదల రజని, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, గురుమూర్తి, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుప్పాల హారిక, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్, ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు, సీఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబరం అంటిన సంబరం అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడిలా ఆకాశమంత ఎత్తున రూపొందిన డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ మహోత్సవం స్వరాజ్ మైదానంలో అంబరాన్ని తాకింది. నభూతో నభవిష్యత్ అనేలా సాగిన ఆ సంబరాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదనడం అతిశయోక్తి కాదు. ఈ అపురూప కార్యక్రమానికి హాజరు కావడం తమ అదృష్టమని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్‌కు ఇంతగా గౌరవం కల్పించడం పట్ల సీఎం వైఎస్ జగన్‌ను ప్రశంసించారు. మహిళలు, యువత ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంబేడ్కర్, సీఎం జగన్ చిత్రాలతో కూడిన ఫ్లకార్డులు, జెండాలను చేతపట్టి వారంతా సందడి చేశారు. అంబేడ్కర్ గేయాలు, నవరత్న పథకాలపై పాటలు, కళా రూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే కార్యక్రమం మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమం ఇది. దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న గొప్ప కార్యక్రమం, ఒకప్పుడు చంద్రబాబు మమ్మల్ని అవమానించారు, మా దేవుడ్ని అవమానించారు, మాపై దాడులు, అమానుషాలు చేయించారు, అంబేడ్కర్ విగ్రహం పెడతామని అవమానించారు, కానీ సీఎం జగన్ పాలనలో దళితులు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా బతుకుతున్నారు, అంబేడ్కర్ కోరుకున్న రాజ్యాంగ వ్యవస్ధ తెచ్చారు, మా కులాల స్ధితిగతులు మార్చారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా అంబేడ్కర్‌ను మీ గుండెల్లో, మీ కుటుంబంలో ఒకరిగా చేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయాలు అమలు చేస్తున్న సీఎం జగన్ తానేటి వనిత, హోంశాఖా మంత్రి సామాజిక న్యాయ మహాశిల్పం(స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఆవిష్కరణ ఒక గొప్ప రికార్డు. ప్రపంచంలోనే అతి ఎత్తైన మహా శిల్పాన్ని రూపొందించి ప్రారంభించే సభలో నాకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. అంబేడ్కర్ ఆశయాలు, పోరాటాల గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదివాం. కానీ అవి అమలు చేసిన చరిత్ర సృష్టించింది మన సీఎం జగన్. అంబేడ్కర్ సిద్దాంతాలు, ఆశయాలు, ఆలోచనలు, సంస్కరణలు, పోరాటాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు. మన కోసం పుట్టిన బాహుబలి జగన్ పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి ఊరి చివర దళితవాడల వద్ద అంబేడ్కర్ విగ్రహాలు ఉండేవి. గొప్ప మహనీయుడైన అంబేడ్కర్ స్పూర్తిని భావితరాలకు అందించే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడ నగర నడిబొడ్డున నిర్మించారు. అట్టడుగు వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన అంబేడ్కర్ బాహుబలి–1 అయితే మన కోసం పుట్టిన బాహుబలి–2 జగన్. పేదలను చేయి పట్టి నడిపిస్తున్న జగన్ అంజాద్‌బాషా, ఉపముఖ్యమంత్రి అంబేడ్కర్ విగ్రహ ప్రారంభోత్సవం కులాలు, మతాలకు అతీతమైన పండుగ రోజు. అంబేడ్కర్ స్పూర్తితో రాష్ట్రంలో పేద వర్గాలను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్న గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. బాబు అవమానం... జగన్ గౌరవం టీడీపీ హయాంలో చంద్రబాబు దళితులను అవమానించాడు. సీఎం జగన్ దళితులను గౌరవిస్తున్నారు. వైఎస్ జగన్ దళితులకు ప్రత్యేకంగా సంక్షేమాన్ని అందించడమే కాకుండా విజయవాడ నడి»ొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దళితులపై ఆయనకు ఉన్న ప్రేమ తెలుస్తోంది. – బి.డేవిడ్, సత్తివేడు దళితులకు పెద్దపీట సీఎం జగన్ అన్ని రంగాల్లో దళితులకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీలు,బీసీలందరూ జగన్‌కు అండగా ఉంటాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో విగ్రహాన్ని ఆవిష్కరించారు. – వి.మహేష్, శ్రీకాళహస్తి జనం గుండెల్లో నిలిచిపోతారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. విజయవాడలో 206 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణం – వి.అరుణ్‌కుమార్, తిరుపతి జగన్, అంబేడ్కర్‌ను చూడ్డానికొచ్చా విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని, సీఎం జగన్‌బాబును చూడటానికి వచ్చా. నేను ఒక్కదానిని రావడానికి తెలియదు. అందుకే పక్కింటి అమ్మాయిని తోడు తెచ్చుకున్నా.. దళితుల పట్ల సీఎంకు ఉన్న శ్రద్ధ ఏ రాజకీయ నాయకుడికి లేదు. వెయ్యేళ్లు జగన్ బాబు వర్థిల్లాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. – మెరుగుమాల సుగుణమ్మ, చిలువూరు, గుంటూరు జిల్లా అంబేడ్కర్ ఖ్యాతిని మరోసారి చాటారు సామాజిక సమానత్వం సీఎం జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. టీడీపీ హయాంలో ఇదే విధంగా అంబేడ్కర్ విగ్రహాన్ని కడతామని కల్ల»ొల్లి మాటలతోనే కాలం గడిపేశారు. రాష్ట్రం నడిబొడ్డున ప్రపంచం గర్వపడేలా అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆయన ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి సీఎం జగన్ చాటారు. – తలారి శివకుమార్, గంగాధర్‌నెల్లూరు, చిత్తూరు జిల్లా ఆత్మ గౌరవం తీసుకొచ్చారు అంబేడ్కర్ ఆశయాలను సీఎం జగన్ తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన అమలు చేస్తోన్న ప్రతి పథకం ఎస్సీ,ఎస్టీ,బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసి బడుగు,బలహీన వర్గాల వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. – నెనావత్ భాస్కర్‌నాయక్, పత్తికొండ, కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో మేలు అంబేడ్కర్ నిలువెత్తు భారీ విగ్రహాన్ని విజయవాడలో ని ర్మించిన సీఎం జగన్ మాకు దేవుడే. జగనన్న పాలనలో అమలైన పథకాల ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాల వారు చాలా మంది అభివృద్ధి చెందారు. – గొండిపల్లి సురేంద్రబాబు, శాగలేరు గ్రామం, పులివెందుల, కడప విగ్రహం ఏర్పాటు హర్షణీయం అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆనాడు దళితుడని, అంటరానివాడని అంబేడ్కర్‌ను పాఠశాల బయట కూర్చోబెడితే నేడు నగరం నడి»ొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – గొర్రెపాటి సాంబశివరావు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు దళితుల ఆరాధ్యదైవం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల మీద ఉన్న ప్రేమను సీఎం జగన్ చాటుకున్నారు. ప్రపంచంలో కెల్లా ఎక్కడా లేనటువంటి 206 అడుగుల విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో అంబేడ్కర్ స్మృతివనం పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది. – పీజే సైమన్, రిటైర్డ్ హెచ్ఎం, సంతరావూరు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డున నిర్మించి ప్రారంభించటం సంతోషంగా ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. విజయవాడ నగరానికి తలమానికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. – మెడబలిమి భాస్కరరావు, వీబీ పాలెం, గుంటూరు జిల్లా మా హృదయాల్లో జగనన్న నిలుస్తారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు జగనన్న ప్రతీ ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. – బుంగా జయరాజు, చెట్టునపాడు, ఏలూరు జిల్లా దళితులకు సముచిత స్థానం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. విజయవాడ నగరం నడి»ొడ్డున దళితుల ఖ్యాతి ఇనుమడింపచేసేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో దళితులకు సముచిత స్థానాన్ని సీఎం జగన్ కల్పించారు. – జక్కుల ఆనందరావు, రాచర్ల, తాడేపల్లిగూడెం రాష్ట్రానికే ఐకాన్ డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం రాష్ట్రానికే ఐకాన్‌గా నిలుస్తుంది. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేడ్కర్ స్మృతివనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సీఎం జగన్ ప్రతీ ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. – ఎస్ వినయ్, మంగినపూడి, కృష్ణా జిల్లా యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది సీఎం జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ నగరం నడి»ొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా కలను సాకారం చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – సాగర్, గుంటూరు జిల్లా -
శతాబ్ది స్వప్నం సాకారం
సాక్షి, అమరావతి : ఇది పెన్నా డెల్టా రైతుల శతాబ్ది స్వప్నం. సంగం బ్యారేజ్‌ను సీఎం వైఎస్ జగన్ రికార్డు సమయంలో పూర్తిచేసి, జాతికి అంకితం చేయడంతో కల సాకారమైంది. దీంతో.. జీవ నదులైన గోదావరి, కృష్ణా బేసిన్లలోని రైతులతో పెన్నా డెల్టా రైతులు పంటల సాగు, దిగుబడులలో పోటీపడే స్థాయికి చేరుకున్నారు. అలాగే, పెన్నా వరదల ముప్పు పూర్తిగా తప్పడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు.. భూగర్భ జలమట్టం పెరగడంతో తాగు, సాగునీటి కొరత తీరింది. ఇక సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణాకు అడ్డంకులు తీరిపోయాయి. ‘సంగం’ కథాకమామిషు.. నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆ తర్వాత ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వచేసినా నీళ్లందించడం కష్టంగా మారింది. దీని స్థానంలో బ్యారేజ్ నిర్మిస్తే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందుతాయని.. ఆ బ్యారేజ్‌ను నిరి్మంచాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. వందేళ్ల కలను సాకారం చేస్తూ.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను నిజం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006, మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008, మే 21న చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. అప్పట్లో రూ.30.78 కోట్లు వ్యయం చేశారు. ఆయన హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే బాబు ప్రాధాన్యం.. సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ, అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం)ను నిర్మించాలని 2014లో నిపుణుల నివేదిక ఇచ్చింది. దీనిని ఆమోదించడంలో రెండేళ్లపాటు జాప్యంచేసిన టీడీపీ సర్కార్.. 2016, జనవరి 21న ఆ సూచన మేరకు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తిచేస్తామని ఒకసారి.. 2018కి పూర్తిచేస్తామని మరోసారి.. 2019కి పూర్తిచేస్తామని ఇంకోసారి మాటమారుస్తూ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు (ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.88.41 కోట్లను ఖర్చుచేసినా కమీషన్ల కక్కుర్తితో బ్యారేజ్ పనులను కొలిక్కి తేలేకపోయింది. కరోనా తీవ్రత.. వరద ఉధృతితో పోటీపడుతూ పనులు ఈ నేపథ్యంలో.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శరవేగంగా సంగం బ్యారేజ్‌ను పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో.. ♦ గతంలో ఎన్నడూలేని రీతిలో 2019–20లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీలు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసాయంటే పెన్నా నదికి ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ♦ ఓ వైపు కరోనా తీవ్రత.. మరోవైపు పెన్నా వరద ఉధృతితో పోటీపడుతూ బ్యారేజ్ పనులను సీఎం జగన్ పరుగులు పెట్టించారు. ♦ బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిమీల, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిమీల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. ♦ సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తిచేశారు. ♦ కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తిచేశారు. ♦ ఈ పనులను రూ.128.88 కోట్లతో పూర్తిచేసి.. బ్యారేజ్‌ను 2022, సెపె్టంబరు 6న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తద్వారా నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం.. ఇక సంగం బ్యారేజ్ పూర్తవడంతో 2022 నుంచి ఏటా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. దీంతో రైతులు విస్తారంగా పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా రైతులతో పోటీపడుతూ గరిష్టంగా దిగుబడులు సాధిస్తున్నారు. పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దక్కుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీలను నిల్వచేయడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు లభ్యమవుతున్నాయి. అలాగే, సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తిచేయడంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. ఇప్పుడు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి.. పెన్నా డెల్టాలో నాకు 16 ఎకరాల పొలం ఉంది. బ్యారేజ్ పూర్తికాక ముందు నీళ్లందక సాగుచేయడానికి ఇబ్బందిపడేవాణ్ణి. సీఎం జగన్ బ్యారేజ్‌ను పూర్తిచేయడంతో సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. సొంత పొలంతోపాటు కౌలుకు 40 ఎకరాలు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వరి సిరులు కురిపించిన ఘనత సీఎం జగన్‌దే. – మల్లవరం రామకృష్ణారెడ్డి, రైతు, కోవూరు రికార్డు సమయంలో పూర్తిచేశాం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంగం బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తిచేశాం. 3.85 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీళ్లందించడానికి బ్యారేజ్ దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వచేయడంవల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలకు ఇబ్బంది ఉండదు. సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జి పూర్తవడంవల్ల సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ స్వరూపం నిర్మాణం : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై.. (సోమశిల రిజర్వాయర్‌కు 40 కిమీల దిగువన) పరివాహక ప్రాంతం : 50,122 చ.కి.మీ. బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు (12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధంచేసిన స్టాప్‌లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటినిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : 335.80 కోట్లు మహానేత వైఎస్ హయాంలో వ్యయం : రూ.30.78 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.128.88 కోట్లు -
పెత్తందారీ పోకడలూ అంటరానితనమే
ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేడ్కర్‌ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి– అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పని చేస్తుంటే రాష్ట్రంలో పెత్తందార్ల పార్టీలకు, పెత్తందార్ల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పేందుకు గర్విస్తున్నా – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ‘అంటరానితనంపైతిరుగుబాటు, విప్లవం, స్వాతంత్య్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబా సాహెబ్ అంబేడ్కర్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాల్టికీ ఉన్నాయని, పెత్తందారీ పోకడలతో అంటరానితనం, వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికే తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల ఎత్తైన ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాలవాడగా కనిపిస్తోందన్నారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక సమతా సంకల్ప సభ’లో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి అని తెలిపారు. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్త అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం విన్నాం. ఇక మీదట స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహాశిల్పం) అంటే ఇండియాలోని విజయవాడ అని మార్మోగుతుంది. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి ఈ విగ్రహం నిలువెత్తు నిదర్శనం. అంబేడ్కర్ జన్మించిన 133 ఏళ్ల తర్వాత, ఆయన మరణించిన 68 ఏళ్ల తర్వాత సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది వేల సంవత్సరాల భారత సామాజిక, ఆర్థిక, మహిళా చరిత్రలను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం. బాబా సాహెబ్ మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, బతుకుల్లో, భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు ఆ మహా మనిషి. 75వ గణతంత్ర దినోత్సవానికి ముందు.. విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర కలిగిన మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకి సరిగ్గా వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేడ్కర్ మహా విగ్రహం స్ఫూర్తిదాయకం. అది చూసినప్పుడల్లా పేదలు, మహిళలు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, సమానత్వ ఉద్యమాలు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. పుణె ఒప్పందం.. అండనిచ్చే మహాశక్తి ఆయన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై ఓ తిరుగుబాటుగా మనకు కనిపిస్తుంటారు. సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా మనందరికీ గుర్తుకొస్తారు. రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహా శక్తిగా మనందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారు. గొంతు విప్పలేని దళిత వర్గాలు, అల్ప సంఖ్యాకులు, వాయిస్ లెస్ పీపుల్, అట్టడుగు వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పుణె ఒప్పందానికి కారకులు అంబేడ్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా, రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం జరిగిందంటే అంబేడ్కరే స్ఫూర్తి. ప్రతివాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహాశక్తిగా తోడుగా నిలబడుతుంది. ఆకాశమంతటి వ్యక్తిత్వం రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న యుద్ధానికి నిదర్శనం సామాజిక న్యాయం. మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేడ్కర్ విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇది దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నా. 81 అడుగుల వేదిక మీద 125 అడుగుల మహా విగ్రహం.. మొత్తం 206 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఆకాశమంతటి ఆ మహానుభావుడి వ్యక్తిత్వాన్ని అంతా గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి – అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. ఇలాంటి భావజాలం పెత్తందార్లకు నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. ఆయన చదివింది ఇంగ్లీషు మీడియంలో.. ఈరోజు కూడా ఈ దురహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. అంబేడ్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్లు అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తుంటే బాధేస్తోంది. అంబేడ్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో. ఆయన 4వ తరగతి పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారు. ఈనాడు చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ రాతలు రాస్తోందంటే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేస్తోంది. ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులు, బహుజనులకు వ్యతిరేకులు. అంటరానితనం.. మరో రూపంలోస్వాతంత్య్రం వర్థిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం, వివక్ష సమసిపోలేదు. పెత్తందార్ల పోకడలతో రూపం మార్చుకుంది. అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తుల్ని భౌతికంగా ముట్టుకోకూడదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మనుషులు చనిపోతున్నాకరుణించని పాలకులు.. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. తమ అవసరాలు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో, అటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేదలు బస్సు ఎక్కే ఆర్టీసీని కూడా ప్రైవేట్‌కు అమ్మేయాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వాతాతలు పెన్షన్ కోసం, రైతన్నలు ఎరువుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, మనుషులు చనిపోతున్నా పాలకుల గుండె కరగకపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలని కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వటానికి వీల్లేదని కుట్ర కథనాలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పెత్తందార్లకు ఏనాడైనా తోచిందా? దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమి అయినా ఇచ్చింది లేదు. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతకగలుగుతాయనే కనీస ఆలోచన చేయలేదు. బీసీలను తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఆ వ్యక్తికి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, ట్యాబ్‌లు, ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, గవర్నమెంట్ బడుల్లో డిజిటలైజేషన్, ఐఎఫ్‌పీలు, నాడు–నేడుతో చదువులు మార్చాలని అలాంటి òపెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థను తేవాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? పేదలకు ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా, 104, 108 సేవలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, వైద్య ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ఆ పెత్తందారు చంద్రబాబుకు ఎందుకు అనిపిస్తుంది? గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు తెచ్చి ప్రతి పేదవాడికీ అందుబాటులో ఉండాలని పెత్తందారు పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే దక్కేలా ఏకంగా చట్టం చేయాలని పెత్తందార్లకు ఎందుకు అనిపిస్తుంది? విప్లవాత్మక వ్యవస్థలు పెత్తందారీ పార్టీలు, పెత్తందారీ నాయకులకు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం నవరత్నాల పాలన అందించాలని ఏ రోజైనా అనిపించిందా? కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని పెత్తందారీ పార్టీ నాయకులకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ 56 నెలల పాలనలో నేరుగా బటన్ నొక్కి రూ.2.47 లక్షల కోట్లు పారదర్శకంగా అందించాడు. లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తున్నారు. 2 వేల జనాభాకు సచివాలయం. 50 ఇళ్లకు వలంటీర్ ఉన్నారు. ప్రతి పేదవాడు, రైతన్న, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఇదీ అంబేడ్కర్ కలలుగన్న రాజ్యం అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. ఈ స్థాయిలో మరెక్కడైనా ఉందా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు మేలు చేయడంలో దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 56 నెలల పాలనలో అడుగులు పడ్డాయి. మంత్రి మండలిలో ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మంత్రి మండలిలో 68 శాతం పదవులూ వారికే ఇచ్చాం. ఇది సామాజికపరంగా దేశ చరిత్రలో రికార్డు. శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డదే. రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మన పార్టీకి మండలిలో 43 మంది సభ్యులుంటే వారిలో 29 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 13 జెడ్పీ చైర్మన్లలో 9 పదవులు, 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 మేయర్లు, 87 మున్సిపాలిటీలుంటే 84 మీ బిడ్డ గెలుచుకోగా వాటిలో ఏకంగా 58 మున్సిపాలిటీల్లో, 196 మార్కెట్ కమిటీల్లో 117 చైర్మన్లు, 137 కార్పొరేషన్లలో 79 చైర్మన్లు ఇలా అన్నింటా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే అవకాశం కల్పించాం. మన ప్రభుత్వం అధికారంలోకి వర్థిన తర్వాత 56 నెలల కాలంలో 2.10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ప్యూన్ రాకపోతే మంచినీళ్లూ పుట్టవు! చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేతకు గురైన వర్గంలో జన్మించినా, చదువుకొనేందుకు తమకు మాత్రమే హక్కుందని భావించిన వారికంటే గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేడ్కర్. ఆయన చదువుకుంటున్న రోజుల్లో దళితుడు కాబట్టి స్కూల్లో కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీళ్లు తాగేందుకు కూడా అనుమతించలేదు. ఆయన తెచ్చుకున్న గ్లాసులో ప్యూన్ పైనుంచి నీళ్లు పోసేవాడట. ఏ రోజైనా బడికి ప్యూన్ రాకపోతే ఆ రోజు తాగడానికి మంచినీళ్లు లేనట్లే అన్న మాటలు ఎంతో బాధ కలిగిస్తాయి. ప్రతి గ్రామంలో మార్పు మీ కష్టం తెలిసిన మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలోనూ మార్పు తీసుకొచ్చింది. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ప్రతి గ్రామంలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం, పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నడూ ఊహించని రీతిలో గ్రామ స్థాయిలో సాకారమైన మరో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. -
AP: రికార్డు స్థాయిలో పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. ముఖ్యంగా విశాఖ రీజనల్ పాస్‌పోర్ట్ కేంద్రంలో గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ.. ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ.. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకీ దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా.. విశాఖ ఆర్పీవో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,290 అపాయింట్మెంట్స్ అందిస్తున్నారు. 2023లో ఏకంగా 1,98,577 పాస్‌పోర్టులు రికార్డు స్థాయిలో జారీ చేయడం విశేషం. ఇక్కడ నుంచి 13 జిల్లాలకు పాస్‌పోర్టు సేవలందుతున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే.. దరఖాస్తుదారుల చేతికి సులువుగా పాస్‌పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో.. పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ.. క్లియరెన్స్ సర్టిఫికెట్స్(పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా.. విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. 2023లో 1,98,577 పాస్‌పోర్టుల జారీ పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం, పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుతో పాటు నాలుగు పత్రాలుంటే వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కచ్చితంగా ఉండాలి). ఎల్రక్టానిక్ ఫొటో ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు ఉండాలి. వీటితో పాటుగా స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామాతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండేలా లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు ఇస్తున్నారు. విశాఖ ప్రాంతీయ కేంద్రంలో పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికేట్స్ కోసం రోజుకు సగటున 1,290 వరకూ అపాయింట్మెంట్స్ ఇచ్చి దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. 2023 జనవరి సమయంలో దరఖాస్తు చేసుకుంటే అపాయింట్మెంట్ 25 పనిదినాల్లోపు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం ఒక్క రోజులో ఇస్తున్నారు. పీవో పీఎస్కేల పరిధిలో విస్తృతంగా సేవలు.. ఏడాదిన్నర కిందట తపాలా కార్యాలయాల్లోనూ పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకొచ్చాయి. విశాఖ ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు ఏడు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్కే) ఉన్నాయి. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికెట్స్(పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభంగా మారింది. విశాఖ ఆర్పీవో పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, యానాం జిల్లాలున్నాయి. పారదర్శకంగా సేవలు దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకూ ఆలస్యం చేస్తుండటం సరికాదు. ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది. ఏదైనా విచారణ కోసం ఆర్పీవోకి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 లోపు ఎలాంటి అపాయింట్మెంట్ లేకపోయినా హాజరుకావచ్చు. – విశ్వంజలి గైక్వాడ్ విశాఖ ఆర్పీవో అధికారి -
వ్యాపారం చేస్తూ బతుకుతున్నాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. వ్యాపారం చేస్తూ బతుకుతున్నాం నేను, నా భర్త మానుకొండ రామారావుతో కలసి గతంలో కూలిపనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లం. మాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె నిషికి ఐదు నెలల క్రితం వివాహం చేశాం. కుమారుడు ప్రసన్న కుమార్ ఐటీఐ చదువుతున్నాడు. చిన్న కుమార్తె రూప ఇంటర్ పూర్తి చేసింది. ముగ్గురికీ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించిన ఆర్థికసాయంతోనే చదివించగలిగాం. కూలి పనులకు వెళ్లలేక మూడేళ్ల క్రితం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెంలో ఇంటి వద్దే ఒక చిన్న పచారీ కొట్టు పెట్టాను. అప్పు చేసి, పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అతి కష్టం మీద నడిపేదాన్ని. చేతిలో చిల్లిగవ్వ లేక, వ్యాపారం సజావుగా సాగక, కుటుంబ పోషణ భారమైన సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం నా కుటుంబాన్ని ఆదుకుంది. ఏడాదికి 15,357 చొప్పున మూడు దఫాలుగా ఇప్పటి వరకు నా పొదుపు ఖాతాలో రూ.46,071 జమ అయ్యింది. దీనికి తోడు జగనన్న తోడు పథకం కింద రూ.10 వేలు చొప్పున రెండు దఫాలుగా రూ.20 వేలు సాయం అందింది. ఈ నగదు వ్యాపార అవసరాలకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ దుకాణానికి అద్దె, కరెంటు బిల్లు పోను నెలకు సుమారు రూ.12 వేలు ఆదాయం వస్తోంది. – మానుకొండ శ్రీలత, సత్తెన్నగూడెం, ద్వారకాతిరుమల మండలం (యండమూరి నాగవెంకట శ్రీనివాస్, విలేకరి, ద్వారకాతిరుమల) కూలి పనులు మాని వస్త్రాలు నేస్తున్నాం మేం చేనేత కార్మికులం. మగ్గంపై వస్త్రాలు నేసి, ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గత ప్రభుత్వాలు నేత కార్మికులను పట్టించుకోకపోవడం నూలు కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం చేయకపోవడంతో వారంతా కులవృత్తికి దూరమయ్యారు. అప్పు చేసి ముడి సరుకు కొనుగోలు చేసి నేను నా భార్య కష్టపడి మగ్గం నేస్తే పెట్టుబడి, వడ్డీలు పోను రోజుకు రూ.500లు మిగలడం కష్టమయ్యేది. లాభం లేక పొట్టకూటి కోసం వ్యవసాయ కూలి పనులకు, సిమెంట్ కాంక్రీటు పనులకు, కంపెనీల్లో పనుల కోసం వలస పోవాల్సి వచ్చింది. భార్యభర్తలం ఎండలో కష్టపడితే రోజుకు రూ.700లు వచ్చేది. అలవాటు లేకపోయినా పొట్టపోషణకోసం ఆ పనులు చేయాల్సి వచ్చేది. దేవుడు జగనన్న రూపంలో వచ్చాడు. తాను అధికారంలోకి వస్తే చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ప్రకటించారు. పాదయాత్రలో నేతన్నల కష్టాలు స్వయంగా చూశారు. నేతన్నలకు నెలకు రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. సీఎం అయిన వెంటనే మూడు మాసాలు తిరక్కుండానే నేతన్న నేస్తం పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి సరిపడా రూ.24 వేలు ఒకే విడతలో మా ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్లనుంచి నిరాటంకంగా ఈ సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.20 లక్షలు నా ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పుడు మేము ఎంచక్కా కుల వృత్తికి దగ్గరయి, అప్పు చేయకుండా ముడిసరుకు కొనుగోలుచేసి వస్త్రాలు తయారు చేసి విక్రయించుకుంటున్నాం. రోజుకు సుమారు వెయ్యి రూపాయల ఆదాయం వస్తోంది. ఇంటివద్దే ఉంటూ ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేం. – మాడెం రాజు, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా (ఆచంట రామకృష్ణ, విలేకరి, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా) వ్యవసాయానికి ఇప్పుడు చింత లేదు మాది వ్యవసాయ కుటుంబం. కొల్లేరు తీరంలోని కాళింగగూడెంలో నాకు ఎకరంన్నర సొంత భూమి ఉండగా మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయం కత్తిమీద సాములా ఉండేది. ముంపునకు ముందు.. సాగుకు వెనుక అన్న చందంగా ఉండేది. కొల్లేరు ముంపుతో ఖరీఫ్ సాగు నష్టపోతుండగా, తుఫాన్ల వల్ల రబీ సాగు కోల్పోయేవాళ్లం. కౌలు కూడా చెల్లించలేని దుస్థితిలో తినడానికి ఒక్క గింజైనా మిగిలేది కాదు. ప్రతి ఏటా అధిక వడ్డీలకు సొమ్ము తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగు చేసినా చేతికి చిల్లిగవ్వ దక్కేది కాదు. అప్పుల ఊబిలో కూరుకుపోయేవాళ్లం. పిల్లల్ని చదివించలేక, పండగలు ఆనందంతో జరుపుకోలేక నానా అవస్థలూ పడేవాళ్లం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కష్టాలు చాలావరకూ తొలగిపోయాయి. సొంత భూమికి రైతు భరోసా సొమ్ము ఏటా రూ. 13,500లు వంతున వస్తోంది. పంట నష్టపరిహారం, బీమా సొమ్ములు ఏటా అందుతున్నాయి. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తోంది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మిన రెండు, మూడు రోజులకే సొమ్ము బ్యాంకు అకౌంట్లో పడిపోతోంది. నాకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక పాపకు అమ్మ ఒడి సొమ్ము ఏటా రూ. 15వేలు వంతున నా భార్య అకౌంట్లో జమవుతోంది. మరో పాపకు విద్యాదీవెన, వసతి దీవెన వర్తిస్తోంది. ఇద్దరు పిల్లల చదువుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు సంతోషంగా జీవనం గడుపుతున్నాం. మా లాంటివారిని ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – తమ్మినేని రంగారావు, కాళింగగూడెం, ఆకివీడు మండలం (బి.ఆర్.కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) -
Fact Check: కమీషన్లు కాజేశాక చేతులెత్తేసింది మీ బాబే
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో కమీషన్లు కాజేసి, పంచుకుతిన్నాక.. దానిని పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేందుకు ‘ఈనాడు’లో పచ్చి అబద్ధాలను పాడిందే పాడుతున్నారు రామోజీరావు. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపిస్తే.. ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు తాజాగా ఆ బాగోతాన్ని రట్టు చేశారు. సోమవారం పోలవారం పేరుతో ఎంతలా వసూళ్లు చేసిందీ బట్టబయలు చేశారు. అక్రమార్జన కోసం జీవనాడి పోలవరం జీవం తీస్తూ చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున స్పిల్ వే మీదుగా మళ్లించి రికార్డు సృష్టించారు. పోలవరంను కేంద్రం తరఫున రాష్ట్రం నిర్మిస్తోంది. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ఆ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించి.. ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌ను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించి పోలవరం ఫలాలను రైతులకు అందించేలా అడుగులు వేస్తున్న సీఎం జగన్‌పై ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కర్షకుల్లో ఆదరణ మరింతగా పెరుగుతోంది. ఇది టీడీపీ ఉనికినే దెబ్బతీస్తుందనే ఆందోళనతో రామోజీరావు విషం చిమ్ముతూ తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. ఆ క్రమంలోనే ‘చేయలేక చేతులెత్తేశారు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న అక్కసు, అసూయ వ్యక్తం చేశారే తప్ప వీసమెత్తు నిజం లేదు. ఇవీ వాస్తవాలు.. ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టు డీపీఆర్–2కు ఇంతవరకూ సీఎం జగన్ పెట్టుబడి అనుమతి సాధించలేదు. వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. చంద్రబాబు సీఎంగా ఉండగా కమీషన్ల కక్కుర్తితో దానిని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016 సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014 ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతాది అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.15,146.27 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మిగిలింది రూ.521.63 కోట్లు మాత్రమే. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీతో సమావేశమైన ప్రతిసారీ కోరుతున్నారు. ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసేందుకు సమ్మతి తెలిపింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. దీన్ని ఖరారు చేసేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటుచేసిన ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) దాన్ని ఆమోదించింది. నివేదిక ఇవ్వడం లాంఛనమే. ఆ నివేదికను చూసి కేంద్ర కేబినెట్‌కు జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ఈనాడు ఆరోపణ: 2020 వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపలేదు. వాస్తవం: గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలి. కానీ.. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌వాల్ పనులను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలకు నామినేషన్‌పై సబ్ కాంట్రాక్టుకు అప్పగించారు. పనులు చేసిన ఆ సంస్థలకు రూ.400 కోట్లు బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత రూ.2,917 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్‌పై కట్టబెట్టారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీలు పెట్టి, ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకమే. 2019, 2020లలో గోదావరి వరద కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలగుండా అధిక ఒత్తిడితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. దీనికి చంద్రబాబు తప్పిదమే కారణమని హైదరాబాద్ ఐఐటీ నివేదిక ఇచ్చింది. డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను అనేక సార్లు సీఎం జగన్ కోరారు. వాటికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి షెకావత్.. డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తొందరగా తేల్చాలని ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌పై ముందుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈనాడు ఆరోపణ: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం ఆలస్యమైంది. సీపేజీ అధికమైంది. ఫలితంగా వాటిని నిర్మించిన ఉద్దేశమే దెబ్బతింది. వాస్తవం: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబే కారణం. 2018లో ఈ డ్యామ్‌ల పనులు ప్రారంభించి.. 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. సీఎం జగన్ 2019 మే 30న అధికారం చేపట్టారు. 2019 జూన్‌లో గోదావరికి వరదలు వచ్చాయి. నవంబర్ వరకూ గోదావరి వరదెత్తింది. వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. కాఫర్ డ్యామ్‌లలో సీపేజీ సాధారణమే. సీపేజీ నీటిని దిగువకు తరలిస్తూ ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో దెబ్బతిన్న ఇసుక నేలను యధాస్థితికి తెచ్చే పనులను ప్రభుత్వం చేపట్టింది. డయాఫ్రమ్‌వాల్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగానే.. దాని ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఈనాడు ఆరోపణ: అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ కోసం ఇప్పటిదాకా టెండర్లే పిలవలేదు. ఆ నిపుణులు వచ్చి నిర్ణయాలు తీసుకుంటే తప్ప పనులు ముందుకు సాగవు. వాస్తవం: పోలవరం పనుల్లో సమస్యలు పరిష్కరించాలంటే అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ సహకారం అవసరమని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఆ ఏజెన్సీ కోసం టెండర్లు పిలుస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ డిసెంబర్ 5న నిర్వహించిన సమావేశంలో పేర్కొంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఏజెన్సీ అందుబాటులోకి వస్తుంది. ఆ ఏజెన్సీ నిర్ణయాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. -
మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు మాది చాలా పేద కుటుంబం. నా వయసు 66 సంవత్సరాలు. విశాఖపట్నం మురళీనగర్‌లోని ఎన్జీవోస్ కాలనీలో ఉంటున్నాము. నేను గతంలో రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించే వాడిని. నాకు ఐదారేళ్ల కిందట కీళ్ల సమస్య రావడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. మంచాన పడ్డ నన్ను ఎవరైనా లేవదీసి కూర్చోబెట్టినా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక నా దీనస్థితిని తెలుసుకున్న వలంటీర్ ఇంటికి వచ్చి మరీ పింఛన్‌కు దరఖాస్తు చేయించారు. వెంటనే మంజూరైంది. ప్రస్తుతం నాకు ప్రతి నెలా ఒకటో తారీఖునే పింఛను వస్తోంది. ఈ నెల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. ఈ సొమ్ము మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది. నా భార్య నారాయణమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ కుంటుంబానికి చేదోడుగా ఉంటోంది. పెళ్లీడుకు వచ్చిన కూతురు మంగమ్మ ఉంది. మాకు ఆర్థిక స్తోమత లేక, ఆమె మానసిక పరిస్థితి బాగోలేక పెళ్లి చేయలేకపోయాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చింది. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకోగలుగుతున్నాం. రేషన్ కార్డుపై ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. మా లాంటి వారి కోసం శ్రద్ధ తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – గుమ్మిడి కనకం, విశాఖపట్నం (కసిరెడ్డి సూర్యకుమారి వెంకట్, విలేకరి, మురళీనగర్) పేదల ప్రాణానికి పెద్ద దన్ను ఆటోయే మా జీవనాధారం. మన్యం జిల్లా పార్వతీపురంలో నేను ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు నా భార్య టైలరింగ్ చేయడం ద్వారా కొంత సంపాదిస్తోంది. దాంతో కుటుంబాన్ని గుట్టుగా పోషించుకుంటున్నాం. వచ్చిన ఆదాయంలోనే ఒకవైపు ఇన్సూరెన్స్, వివిధ మరమ్మతు పనులు వంటివి కూడా చేసుకోవాలి. మిగిలిన దాంతో జీవించాలి. ఇంతలో పులిమీద పుట్రలా 2019లో ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాను. గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ సర్జరీ తప్పనిసరిగా చేయాలని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న నాకు సర్జరీ అంటే భయం వేసింది. ఇక బతకనేమోనన్న భయం పట్టుకుంది. నా కుటుంబం గురించి ఆలోచించే సరికి ప్రాణం విలవిలలాడింది. ఆ సమయంలో స్నేహితుల సలహాతో విశాఖ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లగా.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ఏడాదికి సరిపడా మందులు ఇచ్చి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆ సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం రెండు నెలలకు రూ.10,000 అందజేశారు. నెమ్మదిగా కోలుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఆటో నడుపుకోగలుగుతున్నా. ఏటా నాకు వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు అందుతోంది. నా కుమార్తె హిమబిందు నాలుగో తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం వర్తించింది. ఏటా రూ.15 వేలు వంతున నా భార్య ఖాతాలో నగదు జమవుతోంది. టైలరింగ్ చేస్తుండటం వల్ల ఆమెకు చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. మాకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. నిర్మాణం పురోగతిలో ఉంది. మాలాంటి పేద బతుకులకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. – పొందూరు విజయ్‌కుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్) అప్పు చేయకుండా చేపల వ్యాపారం మేం మత్స్యకారులం. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో చేపలతోపాటు ఎండు చేపలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. జగన్ వచ్చిన తర్వాత నాకు ఏటా క్రమం తప్పకుండా చేయూత పథకం ద్వారా డబ్బులొస్తున్నాయి. ఏడాదికి రూ.18,750 చొప్పున ఇంత వరకు రూ.56,250 వచ్చింది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నా. రేవు వద్ద చేపలుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నా. పెట్టుబడికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని చేపలు కొనుక్కుని, అమ్ముకునే వాళ్లం. లాభం చాలా వరకు వడ్డీలకే వెళ్లిపోయేది. ఇప్పుడు వడ్డీ బాధ లేదు. పేదల కోసం ఆలోచించే వ్యక్తి జగన్. అందుకే మాలాంటి వాళ్లం సంతోషంగా ఉంటున్నాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.60 వేలు వచ్చింది. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. దీంతో మా కుటుంబం హాయిగా జీవిస్తోంది. – ఓలేటి మంగాయమ్మ, పశువుల్లంక (డీవీవీ సుబ్బారావు, విలేకరి, ఐ పోలవరం -
కుటుంబానికి కొండంత ‘ఆసరా’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కుటుంబానికి కొండంత ‘ఆసరా’ ‘వై ఎస్సార్ ఆసరా కింద రుణ మాఫీ చేయడం మా కుటుంబానికి కొండంత ఆసరాగా నిలిచింది. ఈ డబ్బులతో ఫ్యాన్సీ స్టోర్ నడుపుతూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాది వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె. నేను మైథిలి మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద మూడు విడతలుగా రుణ మాఫీ చేశారు. మా సంఘంలో మొత్తం 10 మంది సభ్యులున్నారు. బ్యాంకు ద్వారా మొత్తం రూ.8 లక్షలు రుణంగా పొందాం. అందులో నాకు రూ.80 వేలు వచ్చింది. ఆసరా కింద మా గ్రూపునకు రూ.2,31,171 మాఫీ అయింది. అందులో నాకు రూ.30,822 వచ్చింది. ఈ డబ్బులతో ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభించి నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను. కూతురికి పెళ్లి చేశాను. కుమారుడిని డిగ్రీ వరకు చదివించాను. అతను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మాకు కొంత పొలం ఉంది. నాలుగేళ్లుగా రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయి. నా భర్త వ్యవసాయ పనులు చూసుకుంటాడు. ఫ్యాన్సీ స్టోర్ నిర్వహణలో కూడా సహాయ పడుతుంటాడు. భవిష్యత్తు గురించి ఏ దిగులూ లేదు. – పోరెడ్డి మాధవి, నెమళ్లదిన్నె (ఎస్.విశ్వప్రసాద్, విలేకరి, కడప రూరల్) ఆయుష్షు పెంచిన దేవుడు రోజూ పనులకు వెళ్తే గాని ఇల్లు గడవని పరిస్థితి మాది. బేల్దారి మేస్త్రీగా చేసే నాకు ఒకసారి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్లాను. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. డయాలసిస్ చేయాలన్నారు. పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రభుత్వం డయాలసిస్ పెన్షన్ మంజూరు చేయడంతో క్రమం తప్పకుండా చేయించుకుంటున్నా. మాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం కంచరగుంట. పేద కుటుంబం. బేల్దారి మే్రస్తిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇప్పటి వరకు నాకు రూ.1.50 లక్షలు పెన్షన్ రూపంలో అందింది. 108 ద్వారా నెలకు 12 సార్లు 30 కి.మీల దూరంలోని మాచర్ల డయాలసిస్ సెంటర్‌కు వెళ్లి వస్తున్నా. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం వల్ల నా జీవన కాలం పెరిగింది. నా ఆయుష్షు పెంచిన దేవుడు జగన్మోహన్రెడ్డి. నాకు పునర్జన్మ ప్రసాదించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి చదువు పూర్తి కావడంతో పెళ్లి చేశాము. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇద్దరికీ విద్యా దీవెన పథకం ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో ఈ ప్రభుత్వం వెలుగులు నింపింది. – బండి శ్రీహరి, కంచరగుంట (ఎం.వెంకటనారాయణ, విలేకరి, దుర్గి) ఇంటిల్లిపాదికీ లబ్ధి మాది పేద కుటుంబం. గతంలో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కష్టాలు తీరాయి. మా ఇంట్లో ఉన్న నలుగురికీ ఏదో రూపంలో లబ్ధి చేకూరింది. మేము విశాఖపట్నం నగరంలోని తాటిచెట్లపాలెం సంతోషిమాత కాలనీలో నివాసం ఉ«ంటున్నాము. నేను మొదట్లో బుట్టలో పండ్లు అమ్ముకుని జీవనం సాగించేదాన్ని. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 వస్తోంది. ఈ డబ్బుతో విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ మెయిన్‌రోడ్డులో తోపుడు బండి ఏర్పాటు చేసుకొని పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. దీని ద్వారా ఒకరిపై ఆధారపడకుండా, ఎవరి వద్దా అప్పు చేయకుండా సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని నడిపిస్తున్నా. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా క్రమం తప్పకుండా ఈ చేయూత పథకం మమ్మల్ని మాదుకుంది. నా భర్త ఆటో నడుపుతున్నారు. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.పది వేలు ఈ ప్రభుత్వం అందిస్తోంది. దీనివల్ల ఆటో నిర్వహణకు అవసరమైన ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. మా చిన్న పాప సాయి లావణ్య ఇంటర్మిడియట్ వరకు చదువుకుంది. వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది.మా పెద్ద పాప ధనలక్ష్మి మానసిక స్థితి బాగోదు. ఆమె దివ్యాంగురాలు కూడా. ఆమెకు దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి నెలా రూ.3 వేల పింఛను ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇలా మా ఇంట్లో ప్రతి ఒక్కరం జగనన్న ద్వారా లబ్ధి పొందాము. – బాదా జయమ్మ, విశాఖపట్నం (పి.విజయ్‌కుమార్, విలేకరి, తాటిచెట్లపాలెం, విశాఖపట్నం) -
పండగ వేళ.. స్వగృహానందం
సంక్రాంతి పండగవేళ పేదల్లో స్వగృహానందం నెలకొంది. సొంతిళ్లులేని వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17,111 ఇళ్లను మంజూరు చేయగా వీటిలో 986 మంది నిర్మాణాలు పూర్తి చేశారు. నూతన గృహాల్లో సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకుంటున్నారు. మిగతా లబి్ధదారులు కూడా సొంతింటి కళను సాకారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, పాడేరు: జిల్లాలో ఇళ్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం వరంలా మారింది. గతేడాది జిల్లాలోని 22 మండలాల్లో ప్రభుత్వం 17,111 పక్కా గృహాలను మంజూరు చేసింది. వీరిలో 1328 మంది గిరిజనులు వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. మిగతా 15,783 మందిలో 986 మంది పూర్తి చేశారు. మిగతా 14,791 మంది చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ఈ ఏడాది మార్చి లోగా పూర్తి చేసే లక్ష్యంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఉన్నారు. ఈ బాధ్యతలను గ్రామసచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు. ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్షలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వాలు రూ.1.80 లక్షలు మంజూరు చేశాయి. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్లో కూలీ పనుల రూపంలో రూ.12 వేలు, బాత్రూం నిర్మాణానికి రూ.18 వేలు చెల్లిస్తున్నాయి. ఇంటి నిర్మాణం స్థాయినిబట్టి బిల్లుల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నారు. పనులు మరింత వేగవంతానికి కలెక్టర్ సుమిత్‌కుమార్ తరచూ గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు అదనంగా మరికొంత జోడించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశాం. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకల్లా ఎలాగైనా నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. బిల్లులు కూడా నిర్మాణ స్థాయిని బట్టి సకాలంలో మంజూరు చేస్తున్నాం. – బాబునాయక్, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణశాఖ, పాడేరు -
తొలిరోజే పుంజుకున్నాయ్
సాక్షి, అమరావతి/భీమవరం/అమలాపురం: భోగి రోజైన ఆదివారం పందెం కోళ్లు జూలు విదిల్చాయి. బరిలోకి దూకి కత్తులు దూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో భారీఎత్తున పందేలు జరిగాయి. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నిడమర్రు, దెందులూరు మండలాలు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు సందడిగా సాగాయి. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగాయి. కొన్నిచోట్ల బరులకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ కూడా వేశారు. పెద్దాపురం, కరప తదితర మండలాల్లో కోడిపందేలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కడియం, మండపేట తదితర ప్రాంతాలతోపాటు నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. వరి చేలు, కొబ్బరి తోటలు, మైదాన ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ స్థాయిని బట్టి బరులు ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారికి వీవీఐపీ, వీఐపీ, సామాన్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు నెలకొల్పారు. బరులను ఆనుకుని ప్రత్యేకంగా సిట్టింగ్ (బెంచీలు, కుర్చిలు) ఏర్పాటు చేశారు. బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు పెట్టారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు మోస్తరుగా కొనసాగాయి. అన్నిచోట్లా పందేల బరులకు ఆనుకుని గుండాట, పేకాట, కోసు ఆటలు నిర్వహించారు. పందేలకు వచి్చన వారి కోసం బిర్యానీ, మాంసం పకోడి, కూల్‌డ్రింక్స్, సిగరెట్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందేలను తిలకించేందుకు, పందేలు వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు పయనమవడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కని్పంచింది. పందేలకు వచి్చన వారితో గోదావరి జిల్లాల్లోని లాడ్జిలు, అతిథి గృహాలు సైతం నిండిపోయాయి. ట్యాగ్లు ఉంటేనే అనుమతి పశి్చమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని పెదఅమిరం, సీసలి గ్రామాల్లో కోడి పందేలు వీక్షించడానికి ఎల్ఈడీ డిస్ప్లేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించడానికి వచ్చే వారి చేతులకు ట్యాగ్లు వేశారు. బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసి ట్యాగ్లు ఉన్నవారిని మాత్రమే బరుల్లోకి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కలగంపూడి, కాపవరం, పూలపల్లి, పాలకొల్లు మండలం, నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం, ఆచంట నియోజకవర్గంలోని కవిటం, తణుకు నియోజకవర్గం అత్తిలి, వేల్పూరు, తేతలి గ్రామాల్లోనూ భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోనూ భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ పారీ్టల నేతలు బరులకు వెళ్లి నిర్వాహకులను, పందేల రాయుళ్లను పలకరించారు. అక్కడే కొంత సమయం గడిపి స్థానికులతో మమేకమై ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి హైదరాబాద్ నుంచి రాజకీయ నేతల రాక పెద్దగా కనిపించలేదు. బుసకొట్టిన ‘కట్టల’ పాములు కోడి పందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలు కూడా భారీగానే వెలిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించగా సుమారు రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు అంచనా. కోనసీమ జిల్లాలోనూ నోట్ల కట్టలు బుసలు కొట్టినట్టుగా చేతులు మారాయి. కోడి పందేలు నిర్వహించే పెద్ద బరుల వద్ద సొమ్ములు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం విశేషం. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం మిలట్రీపేట, మండవల్లి మండలం భైరవపట్నం శిబిరాల వద్ద ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లను బహుమతిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూదాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ కూడా రూ.కోట్లు చేతులు మారాయి. -
కష్టాలనుంచి గట్టెక్కించిన సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టాలనుంచి గట్టెక్కించిన సర్కారు నా భర్త శ్రీనివాసులు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ నెలకు సుమారు పది వేల రూపాయలు సంపాదించేవారు. నేనూ కూలికి వెళ్లేదాన్ని. నా భర్త ఆదాయానికి నా కూలి డబ్బులు తోడయ్యేవి. ఇలా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జీ.ఎర్రగుడిలో ఎలాగోలా జీవిస్తున్నాం. హఠాత్తుగా మా బతుకులో పెద్ద ఆపదొచ్చి పడింది. అయిదేళ్ల క్రితం నా భర్త ప్రమాదానికి గురయ్యారు. వెన్నెముక దెబ్బతిని ఏ పని చేయలేకపోతున్నారు. దీంతో కుటుంబ భారమంతా నాపై పడింది. మాకు ఎకరంన్నర పొలం ఉంది. కంది, వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తుంటాం. వర్షాలు కురిస్తేనే పంట చేతికి వస్తుంది. ఏడాదికి సుమారు పది నుంచి 15 వేల రూపాయలు ఆదాయం ఉంటుంది. లేదంటే లేదు. పెద్దకొడుకు కార్తీక్ 10వ తరగతి, చిన్న కొడుకు నవీన్ 8వ తరగతి జొన్నగిరి జెడ్పీ స్కూల్లో చదువుతున్నారు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో పిల్లల చదువులు సాగవని బెంగ పెట్టుకున్నాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పథకాలు మాకు ఎంతగానో ఆదుకున్నాయి. పొదుపు సంఘంలో లింకేజీ కింద రూ.80వేలు, పొదుపు సంఘం నుంచి రూ.50వేలు రుణం తీసుకొని పొట్టేళ్లు కొనుగోలు చేశాను. వైఎస్సార్ ఆసరా కింద రూ.20,400 మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అయింది. నాకొడుకు చదువుకు అమ్మ ఒడి పథకం ఆధారమైంది. రైతు భరోసా సొమ్ము కూడా అందుతోంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మంజూరైన రూ.18,750తో మరో నాలుగు పొట్టేళ్లు కొనుగోలు చేసి మేపుతున్నా. వీటి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – వడ్డే రాజేశ్వరి, జి.ఎర్రగుడి, తుగ్గలి మండలం (కె.రామచంద్రారెడ్డి, విలేకరి, తుగ్గలి) పెద్ద కొడుకులా ఆదుకున్నారు మాది కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నేను నా భార్య పనులకు వెళ్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. మాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శివశంకరమ్మ 20ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. కుమారుడు గురుశంకర్ బతుకుతెరువు కోసం కువైట్‌కు వెళ్లి, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మాకున్న ఇల్లు వర్షానికి తడుస్తుండటంతో టార్పాన్లు వేసుకుని కాలం గడుపుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా బతుకులకు భరోసా దక్కింది. నాకు పింఛన్‌తోపాటు చౌటపల్లె గ్రామం కొత్తపల్లెలో సెంటు భూమిలో పక్కా గృహం మంజూరైంది. నా భార్య లక్ష్మీదేవికి వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు వంతున ఇప్పటికి మూడు విడతల్లో రూ.56,250లు అందింది. దీంతో గొర్రెలు, మేకలు కొని కొంత ఉపాధి పొందుతున్నాం. పింఛన్ ఈ నెల నుంచి రూ.3 వేలు చేశారు. జగన్‌బాబు ఇచ్చిన సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం చివరి దశకు వచి్చంది. దీన్ని పూర్తిచేసుకుని, మిగిలిన జీవితం ఆనందంగా గడిపేస్తామన్న నమ్మకం పెరిగింది. రోగం వస్తే టౌన్‌కు పోవాల్సిన పనిలేదు. ఊళ్లోకే డాక్టర్ వస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో నాకు, నా భార్యకు పరీక్షలు చేసి, మందులు ఉచితంగానే ఇచ్చారు. పెద్ద కొడుకులా సీఎం జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నాడు. మళ్లీ జగన్‌బాబే సీఎం కావాలి. – ఉప్పుతోళ్ల గంగయ్య, కొత్తపల్లె, చౌటపల్లె గ్రామం, లక్కిరెడ్డిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా (ముప్పాల నరసింహరాజు, విలేకరి, లక్కిరెడ్డిపల్లె) జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో నేను నా భర్త కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో విధి వక్రించి మా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. సుమారు 20 ఏళ్ల కిందట నేను నాల్గో నెల గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త చనిపోయారు. తరువాత నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. కూలిపని చేసుకుంటూ, ఆ పిల్లను కంటికి రెప్పలా పెంచుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తూ వచ్చాను. ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. ఒంటరిగా మిగిలిన నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వితంతు పింఛను మంజూరైంది. ఈ ప్రభుత్వం వచ్చాక పింఛను రూ. 3000కు పెరిగింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ 16 వేలు వంతున ఇప్పటివరకూ అందింది. జగనన్న కాలనీ పథకంలో భాగంగా ఎంతో ఖరీదైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం కూడా త్వరలో ప్రారంభిస్తామని మా వూరి సర్పంచ్ చెప్పారు. ఏ ఆసరా లేని మాలాంటివారిని ఆదుకుంటున్న జగనన్నకు ఎప్పుడూ రుణపడిఉంటాం. – దాసరి పళ్లాలమ్మ, అవిడ గ్రామం(జగత శ్రీరామచంద్రమూర్తి, విలేకరి, కొత్తపేట) -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
కిరాణా దుకాణంతో బతుకు మారింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కిరాణా దుకాణంతో బతుకు మారింది ఉ న్న ఊళ్లో ఉపాధి లేక మా ఆయన వెంకటరావు విశాఖలో వివిధ పనులు చేసేవారు. రోజూ మేముండే భీమిలి మండలం నగరంపాలెం నుంచి అక్కడికి వెళ్లి వచ్చేందుకు ఇబ్బందిగా ఉండేది. అత్తా, మామ ఇద్దరు ఆడ పిల్లలు కలిపి ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులం ఉండేవాళ్లం. పిల్లల ఫీజులు, రవాణా చార్జీలు కాకుండా ఇంటి ఖర్చు నెలకు కనీసం రూ.15 వేలయ్యేది. ఇద్దరు పిల్లలను తగరపువలసలోని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. ఈ ఖర్చులు మాకు భారంగా అనిపించేవి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత నా భర్తకు మా పంచాయతీలోనే వలంటీర్‌గా అవకాశం వచ్చింది. 3వ తరగతి చదువుతున్న పెద్దమ్మాయి తపస్వికి మూడేళ్లుగా అమ్మ ఒడి కింద రూ.15 వేల వంతున వస్తోంది. చిన్న పాప తేజ ఒకటో తరగతి చదువుతోంది. మా మామ పల్లా రాముకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తగారు రాములమ్మకు నాలుగేళ్లుగా వైఎస్సార్ చేయూత కింద రూ.18,750లు వంతున, వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు రూ.25వేలు వచ్చింది. నాలుగేళ్లలో వచి్చన ఈ లబి్ధతో రూ.1.50 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఇంటి ముందు కిరాణా దుకాణం తెరిచాను. ఖాళీ సమయంలో టైలరింగ్ చేస్తాను. రోజుకు ఖర్చులన్నీ పోను ఇంటి వద్దే రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూరుతోంది. నా భర్త ఖాళీ సమయంలో తగరపువలస నుంచి సామాన్లు తీసుకువచ్చి షాపులో వేస్తారు. ఒకరి వద్ద పనిచేయకుండానే హాయిగా గడచిపోతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదు. – పల్లా కృష్ణవేణి, టి.నగరపాలెం, భీమిలి మండలం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) ఇప్పుడు సొంతిల్లు సమకూర్చుకున్నాం మాది చిన్నపాటి కిరాణా దుకాణం. నెలకు అయిదు నుంచి ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుంది. నా భర్త విజయకృష్ణ కుమార్, నేనూ ఈ దుకాణంలో ఉంటాం. రెండెకరాల భూమి ఉంది. ఇందులో రేగుపంట వేస్తాం. వర్షాలు పడితేనే పంట పండుతుంది. బాగా పండితే ఏడాదికి సుమారు 20వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ఈ మొత్తం మా కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. ఇద్దరు ఆడపిల్లలు ఉషశ్రీ, కావ్యశ్రీలను చదివించాలి. ఈ పరిస్థితుల్లో మాకు సొంతిల్లు అనేది కలలో కూడా ఊహించుకోలేకపోయాం. కానీ అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం రావడంతో వారి సహకారంతో ఆ కోరిక తీర్చుకోగలిగాం. అంతేనా... మా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చదివించుకోగలిగాం. పెద్దమ్మాయికి ఫైనల్ ఇయర్‌కు, చిన్నమ్మాయికి నాలుగేళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించడంతో ఇద్దరి చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరారు. జగనన్న కాలనీలో మాకు స్థలం మంజూరు కావడంతోపాటు, ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80లక్షలు మంజూరు చేశారు. సబ్సిడీ ధరలకే ఇంటి నిర్మాణ సామగ్రి అందివ్వడంతో మేము కొంత డబ్బు జతచేసి పక్కా ఇంటిని నిర్మించుకోగలిగాం. ఇన్నాళ్లకు సొంతింటికల నెరవేరడంతో మేము ఆనందంగా ఉన్నాం. మాకున్న పంట పొలంపై వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500లు లభిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ కింద సుమారు రూ. 50వేలు నా ఖాతాలో జమయ్యింది. మా అత్త గారు వరలచ్చమ్మకు ప్రతి నెల పింఛన్ అందుతోంది. ఇప్పుడు మేము ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవనం సాగిస్తున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం చలువే. – జక్కా రాధాదేవి, ఇల్లూరు కొత్తపేట, బనగానపల్లె మండలం (జి.సర్వేశ్వర్ రెడ్డి, విలేకరి, బనగానపల్లె) ఒంటరి జీవితానికి కొండంత భరోసా మాది పేద కుటుంబం. నేను, మా ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో కష్టపడి పనిచేస్తేనే జీవితం సాగేది. దురదృష్టవశాత్తూ నా భర్త గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. దాంతో నేను ఒంటరిదానిగా మారాను. రోజువారి కూలీ నాకు ఏమాత్రం సరిపోయేది కాదు. జీవనం కష్టంగా మారింది. ఇటీవల వితంతు పెన్షన్ మంజూరైంది. ప్రతి నెలా ఆ మొత్తం నన్నెంతగానో ఆదుకుంటోంది. అంతేగాకుండా మూడేళ్ల నుంచి కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సాయంతో బతుకు సాఫీగా సాగుతోంది. రేషన్ కార్డు ఉండటంతో బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు నా ఒంటరి జీవితానికి ఇంక భయం లేకుండా పోయింది. – పేరాబత్తుల రామలక్ష్మి, పెదపట్నం లంక, మామిడికుదురు మండలం (యేడిద బాలకృష్ణారావు, విలేకరి, మామిడికుదురు) -
‘స్మార్ట్ ఫోన్ మా అబ్బాయిని అంతర్జాతీయ క్రికెటర్‌గా మార్చేసింది’
అతనికి పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. ఏ భాష సరిగా చదవడం రాదు... రాయడమూ పూర్తిగా రాదు. సైగలతోనే తన భావాలను వ్యక్తంచేస్తాడు. సాధారణ పాఠశాలలోనే చదివాడు. కష్టపడి డిప్లొమా పూర్తిచేశాడు. పదో తరగతి పాసైన తర్వాత తల్లి కొనిచ్చిన స్మార్ట్ ఫోన్లో చూసి తనకు ఇష్టమైన క్రికెట్ నేర్చుకున్నాడు. అంతర్జాతీయ బధిరుల క్రికెట్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు ఒక చాలెంజ్‌గా మారాడు. ఇదీ.. ఎనీ్టఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బధిరుల అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ నాయుడు విజయగాథ. సాక్షి, అమరావతి: కొండపల్లికి చెందిన రావూరి యశ్వంత్‌నాయుడు స్మార్ట్ ఫోన్లో చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాడు. మంచి బౌలర్‌గా ఎదిగాడు. ఫోన్లో క్రికెట్ పాఠాలు నేర్చుకుంటూ ఉండగా, ఆన్లైన్లో వచి్చన చిన్న మెసేజ్ చూసి 2015లో ఢిల్లీలో సెలక్షన్స్‌కు వెళ్లాడు. అప్పుడే తొలిసారిగా బధిరుల జాతీయ జట్టు ఏర్పడటంతోపాటు యశ్వంత్‌కు చోటు దక్కింది. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అంతకుముందు ఏపీ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. అప్పులు చేసి అండగా నిలిచిన తల్లి గత ఏడాది బధిరుల క్రికెట్‌ను బీసీసీఐ దత్తత తీసుకుంది. అప్పటివరకు మ్యాచ్‌లకు వెళితే ఖర్చంతా క్రీడాకారులదే. యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు 2015లో అనారోగ్యంతో చనిపోయారు. నాటి నుంచి అతనిని తల్లి బేబి అన్ని విధాలా ప్రోత్సహించారు. కుమారుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లడానికి అప్పులు చేసి డబ్బులిచ్చారు. యశ్వంత్ 20ఏళ్ల వయసులో ఢిల్లీలో జరిగిన తొలి బధిరుల వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ టోరీ్నలో మనదేశం విజేతగా నిలిచింది. సాధారణ అంతర్జాతీయ పేసర్లతో సమానంగా బౌలింగ్ చేయగలిగిన యశ్వంత్ 135 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు తీశాడు. అయినా యశ్వంత్‌కు మ్యాచ్ ఫీజు ఉండదు. ఒక సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే రూ.1,100 ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు మొత్తానికి రూ.లక్ష ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచి్చన విందులో పాల్గొన్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆహా్వనం ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయారు. గతంలో యశ్వంత్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని శాప్‌ను ప్రభుత్వం ఆదేశిస్తూ లెటర్ ఇచ్చినా డబ్బులు లేవన్నారు. మెక్‌గ్రాత్ నుంచి మెళకువలు.. గోకరాజు గంగరాజు సహకారంతో 2016లో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో యశ్వంత్‌కు కోచింగ్ తీసుకునే అవకాశం దక్కింది. అప్పుడే ఆ్రస్టేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ వచ్చారు. ఆయన యశ్వంత్ బౌలింగ్‌ని మెచ్చుకుని ఎన్నో మెళకువలు నేరి్పంచారు. స్టెయిన్ నా ఫేవరెట్.. ‘నాకు అమ్మంటే ఎంతో ఇష్టం. మా అక్క సుమ నా విజయంలో వెన్నంటే ఉంటుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ నా ఫేవరెట్. బ్యాటింగ్, కోచింగ్‌లో ద్రావిడ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నా. ఈ ఏడాది ఖతార్‌లో జరగాల్సిన బధిర టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. దాని సెలక్షన్స్‌కు వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంటే కుడి మోకాలు వద్ద గాయమైంది. నాలుగు నెలలు రెస్ట్. త్వరలో బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, కేరళలో సౌత్ జోన్, జమ్మూ–కశ్మీర్ డెఫ్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నా.’ – సైగల ద్వారా వెల్లడించిన రావూరి యశ్వంత్ స్మార్ట్ ఫోన్ మా అబ్బాయి జీవితాన్ని మార్చింది ‘స్మార్ట్‌ఫోన్ పిల్లలను చెడగొడుతుందంటారు. మా అబ్బాయిని మాత్రం అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దింది. మావాడికి పుట్టకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. వాడు 10వ తరగతి పాసైన తర్వాత ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ కొనిచ్చా. దానిలో వీడియోలు చూస్తూ అంతర్జాతీయ బధిర క్రికెట్ బౌలర్లలో నంబర్ వన్‌గా ఎదిగాడు. ఇప్పుడు నా కొడుకు ఆటను నేను స్మార్ట్ ఫోన్లో చూస్తున్నాను.’ – బేబి, అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ తల్లి -
ఆధ్యాత్మిక నగరం... అభివృద్ధికి ప్రతిరూపం
(తిరుమల రవిరెడ్డి, సాక్షి, తిరుపతి): ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతున్న తిరుపతి నగరం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలుగునేల ఖ్యాతి విశ్వాంతరాలకు విస్తరించడానికి దోహద పడింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యమిస్తున్న ఈ నగరం ఒకప్పుడు గుంతల మయంగా... అస్తవ్యస్త డ్రైనేజీలతో దుర్గంధం వెదజల్లుతూ... ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులను తీసుకొచ్చే వాహనాలను కదలనీయని ట్రాఫిక్ కష్టాలతో నరక ప్రాయంగా మారగా... గడచిన ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో నగరవాసులతోపాటు... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులనుంచి ఉపశమనం కలిగించింది. అత్యంత పొడవైన శ్రీనివాస సేతు నగరానికే ప్రత్యేక శోభను తీసుకొచి్చంది. రోడ్లు విశాలమయ్యాయి. కూడళ్లన్నీ ఆకర్షణీయంగా మారాయి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు నెలకొల్పడంతో విద్యారంగం మరింత పురోగమిస్తోంది. నగర వివరాలు: ► విస్తీర్ణం: 30.01చ.కి.మీ. ► గృహాలు: 92 వేలు ► జనాభా: 4.01లక్షలు ►డివిజన్లు: 50 ►రోజూ తిరుపతికి వచ్చి వెళ్లే వారి సంఖ్య సుమారు 1.50 లక్షల మంది ఐదేళ్ల కాలంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు పర్యాటకులను ఆకర్షిస్తున్న తిరుపతి విశాలమైన రహదారులు... అందంగా తీర్చిద్ధిన కూడళ్లు... మాస్టర్ ప్లాన్, సీసీ రోడ్ల నిర్మాణంతో కొత్తరూపు అసంపూర్తి భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం నరకం నుంచి బయటపడిన నగర జనం ఐఐటీ, ఐసర్ విద్యా సంస్థలకు ఆతిథ్యం ఆధునిక వసతులు సమకూర్చుకున్న చిన్నపిల్లల, క్యాన్సర్ ఆస్పత్రులు రూ.650.50 కోట్లతో శ్రీనివాస సేతు నిర్మాణం పూర్తి ఫ్లై ఓవర్ నిర్మాణంతో తీరిన ట్రాఫిక్ కష్టాలు నాడు నరకం ► తిరుపతి పేరుకు ఆధ్యాత్మిక నగరమైనా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. వీధులన్నీ ఇరుగ్గా, రహదారులన్నీ గతుకులమయంగా ఉండేవి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్డుపై ప్రవహించే మురికి నీరు వెదజల్లే దుర్వాసనతో భక్తులు సతమతమయ్యేవారు. ► ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు పచ్చదనం కరువై వెలవెలబోయేవి. ఆర్టీసీ బస్టాండ్, రైల్యేస్టేషన్‌లో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయమైనా అభివృద్ధి కోలేదు. నేడు అభివృద్ధికి చిహ్నం ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక నగరాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసి చూపించింది. తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్ధింది. ► రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా స్థానికులు, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ సమకూరుస్తున్నాయి. ► గడచిన నాలుగేళ్ల కాలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్డును అభివృద్ధి చేశారు. మూడవ విడత అభివృద్ధి ప్రణాళికల్లో రూ.132కోట్ల వ్యయంతో 150కి.మీల సీసీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మరో రూ.30కోట్లతో సుమారు 65కి.మీ మేర బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. ► 2012కు ముందు తిరుపతి నగరం కేవలం 16.27చ.కి.మీ. విస్తీర్ణం కలిగివుండేది. ఇప్పుడు నగర విస్తీర్ణం 30.1చ.కి.వీు.కు చేరుకుంది. ► మాటలకే పరిమితమైన తిరుపతి మాస్టర్‌ప్లాన్ ఈ ప్రభుత్వ హయాంలో అమలుకు నోచుకుంది. ► రోడ్లతో పాటు అందమైన డివైడర్లు, విద్యుత్ వెలుగులు, ఆహ్లాదాన్ని పంచే పచ్చని మొక్కలు, జీబ్రా లైన్లతో నూతన రహదారులు అభివృద్ధి చేశారు. ఆధునిక వసతులతో హృదయాలయం.. ► నిరుపేదలకు అత్యంత ఖరీదైన గుండె వైద్యం అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించి, టీటీడీ నిధులతో దానిని పూర్తిచేశారు. ఇక్కడ కొద్ది కాలంలోనే 2,160 శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ► టీటీడీ కార్డియాక్ కేర్ సెంటర్‌కు శ్రీకారం చుట్టిన సీఎం 2021 సెప్టెంబర్ 11న ప్రారంభించారు. ► అలిపిరి సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో 350 పడకలతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. సుందరంగా వినాయక సాగర్ ► మురికి కూపంగా ఉన్న వినాయక సాగర్‌ను రూ.42 కోట్లతో అభివృద్ధి. ► శుద్ధిచేసిన నీటిని విడుదల చేసేందుకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు. ► బోటింగ్ పాయింట్, కిడ్స్ పార్క్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్టు, ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు. ► రూ.1.63 కోట్లతో ప్రకాశం, బైరాగిపట్టెడలోని శ్రీపద్మావతి పార్కుల ఆధునికీకరణ. మణిహారం శ్రీనివాస సేతు ► రూ. 650 కోట్లతో నగరానికి మణిహారమైన శ్రీనివాస సేతు వంతెనను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి్డ ప్రారంభించారు. ► వంతెనపై గరుడ పక్షి ఆకారంతో విద్యుత్ స్తంభాలు, పిల్లర్లపై ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలతో కూడిన చిత్రాలను దిద్దారు. పిల్లర్లకు ఇరువైపులా తిరునామాలను ఏర్పాటు చేశారు. నగరంలో అభివృద్ధి పనులు ఇలా.. ► మహతి ఆడిటోరియం, ‘కచ్చపి’ ఆడిటోరియం నిర్మాణం: రూ.45 కోట్లు ► అలిపిరి డిపో నుంచి నడుపుతున్న విద్యుత్ బస్సులు: 100 ► తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం: రూ.11.75 కోట్లు ► నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు:రూ.21.97 కోట్లు ► శ్రీవారి వైభవం చాటిచెప్పేలా రైల్వే స్టేషన్లో ఆధునిక డిజైన్లు: రూ. 310 కోట్లు నాలుగున్నరేళ్లలో వెచ్చించిన నిధులు ► శ్రీనివాస సేతు నిర్మాణం: రూ.650.50 కోట్లు ► విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ కేబుల్:రూ.147 కోట్లు ► తాగునీటి సరఫరా: రూ.28.17 కోట్లు ► శ్రీనివాస స్పోర్ట్స్, ఇందిరా మైదానం స్పోర్ట్స్ ప్రాంగణం అభివృద్ధి:రూ.12.23 కోట్లు ► ఇండోర్ సబ్ స్టేషన్:రూ.20 కోట్లు ► స్మార్ట్ సిటీ మిషన్ అమలు: రూ.180 కోట్లు ► వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్: రూ.41.80 కోట్లు ► ట్రాన్స్ఫర్ స్టేషన్లు: రూ.17.50 కోట్లు ► సోలార్ వ్యవస్థ: రూ.21.97 కోట్లు ► మల్టీలెవల్ కార్ పార్కింగ్ భవన నిర్మాణం: రూ.50 కోట్లు ► సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం: రూ.90 కోట్లు ► డంపింగ్ బయోమైనింగ్: రూ.20 కోట్లు ► కమ్యూనిటీ, ఈ–టాయ్‌లెట్స్, స్కూల్ టాయ్‌లెట్స్: రూ.13 కోట్లు కలియుగ వైకుంఠం తిరుమలలో.. ► రూ.4.90 కోట్లతో శ్రీవారి పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు. ► మూడో విడత రింగ్ రోడ్డు పనులు. ► రూ.79 కోట్లతో 2,500 మందికి సరిపడేలా పీఏసీ–5 పనులు. ► యాత్రికుల వసతి సముదాయం–3, పద్మనాభ నిలయం అందుబాటులోకి.. ► ఇక్కడ దాదాపు 2,400 లాకర్లు అందుబాటులోకి.. ► రూ.42.86 కోట్లతో 1400 మందికి వసతి కల్పించే వకుళాదేవిమాత విశ్రాంతి గృహం ► నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.39.41 కోట్లతో క్యూలైన్లు, మరుగుదొడ్లు ► తిరుమల–తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో రూ.18 కోట్లతో ఆర్సీసీ క్రాష్ బారియర్లు తిరునగరి అభివృద్ధికి ‘మాస్టర్’ ప్లాన్ ► రహదారుల నిర్మాణానికి ఖర్చుచేస్తున్న మొత్తం: రూ.70.92 కోట్లు ► మొత్తం రహదారుల విస్తీర్ణం (మీటర్లలో):18,344 (18.34 కిలోవీుటర్లు) మొత్తం మాస్టర్ ప్లాన్ రహదారులు: 18 ► వంద అడుగుల రోడ్లు: 1 ► 80 అడుగుల రోడ్లు: 8 ► 60 అడుగుల రోడ్లు: 6 ► 40 అడుగల రోడ్లు: 3 ► అభివృద్ధి చేస్తున్నవి: 3 ► అందుబాటులోకి వచ్చినవి: 15 స్మార్ట్ సిటీ పథకం కింద: రూ.1,610 కోట్లు ► కేంద్ర నిధులు: రూ.500 కోట్లు ► రాష్ట్ర ప్రభుత్వ నిధులు: రూ.500 కోట్లు ► పీపీపీ భాగస్వామ్యం కింద: ► రూ.610 కోట్లు (టీటీడీ, ఏపీఎస్పీడీసీఎల్) ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు కేంద్రం ► తిరుపతికి కేటాయించిన ఐఐటీ, ఐజర్ విద్యా సంస్థలకు 2014, 2015లో శంకుస్థాపనలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ► 546 ఎకరాల్లో రూ.1,074 కోట్లతో ఐఐటీ విద్యా సంస్థను నెలకొల్పారు. పలు రాష్ట్రాల నుంచి 2500 మంది విద్యార్థులు, 250 మంది అధ్యాపకులు, 275 మంది సిబ్బందితో 2021లో ప్రారంభమైంది. ► 250 ఎకరాల్లో రూ.137.30 కోట్లతో ఐజర్ విద్యా సంస్థను నెలకొల్పారు. ఇందులో బీఎస్, ఎంయస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులతో పాటు పీహెచ్డీ కోర్సులను నడుపుతున్నారు.