Corporate
-
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
డబ్ల్యూఈఎఫ్‌లో చేరిన 'ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్'
ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)కు చెందిన ''ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్''లో చేరింది. CO2e ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఏఎం గ్రీన్ డబ్ల్యూఈఎఫ్‌లో చేరింది.మూడు బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో.. సుమారు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఏఎం గ్రీన్ సన్నద్ధమైంది. దీని ద్వారా స్థానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా.. నిర్మాణం, పరికరాల తయారీ, గృహ నిర్మాణం వంటి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.ఏఎం గ్రీన్ ఛైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా మేము అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్‌లో చేరే అవకాశం లభించింది. డబ్ల్యుఈఎఫ్ చొరవతో పాలుపంచుకోవడానికి.. క్లస్టర్ ట్రాన్సిషన్ లక్ష్యాలను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు.ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్‌లో సభ్యునిగా.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ డీకార్బనైజేషన్ క్లస్టర్లపై ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇవ్వడం.. ఫోరమ్‌తో అభివృద్ధి పనులను పంచుకోవడం వంటి వాటితో పాటు ఇతర ఫోరమ్ క్లస్టర్ల నుంచి ఉత్తమ అభ్యాసాలను పొందడం లక్ష్యంగా పెట్టుకుందని చలమల శెట్టి పేర్కొన్నారు.25 పారిశ్రామిక సమూహాలతో కూడిన మా గ్లోబల్ నెట్‌వర్క్‌కు.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వనరులతో.. కాకినాడ క్లస్టర్ గ్రీన్ అమ్మోనియా & హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రాంతీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కమ్యూనిటీలో భాగంగా, ఏఎం గ్రీన్ కాకినాడకు అంతర్దృష్టులను పంచుకోవడానికి.. పారిశ్రామిక డీకార్బనైజేషన్‌లో సామూహిక పురోగతికి దోహదపడే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు 'రాబర్టో బొక్కా' అన్నారు. -
ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) తన నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఎస్బీఐ తన ముంబైలోని ప్రధాన కేంద్రం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.ముంబైలో జరిగిన ఎస్బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' మాట్లాడుతూ.. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని గుర్తు చేశారు.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,500 శాఖలను కలిగి ఉంది. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేరుతుందని సీతారామన్ పేర్కొన్నారు. అంటే మరో 500 ఎస్బీఐ కొత్త శాఖలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు. 1921లో ఎస్బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 65,000 ఏటీఎంలను కలిగి ఉంది. ఎస్బీఐకు 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్బీఐ వాటా 22.4 శాతంగా ఉంది. అంతే కాకుండా రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను ఎస్బీఐ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.SBI today has 22,500 branches and is expected to add another 500 in this financial year. SBI has 65,000 ATMs which is 29% of all ATMs in the country, has 85,000 banking correspondents, share of its deposits are 22.4 per cent of total deposits, has 50 crore plus customers,… pic.twitter.com/lPF3FShDua— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) November 18, 2024 -
30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్
టెక్ బిలియనీర్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్‌షిప్ రాకెట్ రూపొందించారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.నవంబర్ 6న ఎక్స్ యూజర్ అలెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయాణించడం చూడవచ్చు. ఇందులో భూమిపైనా ఎక్కడికైనా కేవలం గంటలోపే.. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇది సాధ్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అయితే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని వీడియోలో వెల్లడైంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే రోజుల్లో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది.ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓస్పేస్ఎక్స్ రూపొందిస్తున్న స్టార్‌షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా.. రాకెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒక్కసారికి 1,000 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాయి. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారై ఉంటుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది.This is now possible— Elon Musk (@elonmusk) November 6, 2024 -
మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసింది
మెర్సిడెస్ బెంజ్.. ప్రపంచ మార్కెట్లో పరిచయం అవసరంలేని బ్రాండ్. ఈ రోజు లగ్జరీ కార్ల విభాగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు, బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయమే కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం 'బెర్తా బెంజ్' అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య.కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్.. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, ఇంజన్ డిజైనర్ కూడా. ఈయన 1885లో బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ను సృష్టించారు. ఇదే అతని మొదటి ఆటోమొబైల్. అయితే ఇది రోడ్డుపై ఎలా పనిచేస్తుందనే విషయం మీద కొంత అనుమానం మాత్రం కార్ల్ బెంజ్ మనసులో ఉండేది. కానీ బెర్తా బెంజ్ మాత్రం ఆ వాహనం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ కారణంగానే భర్తకు తెలియకుండానే ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు.నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..బెంజ్ పేటెంట్ మోటర్వాగన్ అమ్మకాలు మొదలైన తరువాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. బెర్తా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే.. బెంజ్ కారును ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. నేడు ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో.. ఎంతలా ఎదిగిందో అందరికీ తెలుసు. -
అడుగు పెడితే ఫస్టో.. సెకెండో.. అంతే!
న్యూఢిల్లీ: ‘చేస్తున్న, ప్రవేశించే ప్రతి వ్యాపారంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి సామర్థ్యం పెంపు ఏకైక మార్గం. అలా కాని పక్షంలో ఈ రోజు మనుగడ సాగించడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. లేదంటే అధిక మార్జిన్లను అందించే చాలా ప్రత్యేక, ఉన్నత సాంకేతికత ఉండాలి’ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కేఎం బిర్లా అన్నారు.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేసింది. ప్రధానంగా తయారీ రంగంలో పెట్టుబడి పెట్టాం. కంపెనీ నిర్వహించే అన్ని విభాగాలలో మొదటి రెండు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా చేసుకున్నాం. గ్రూప్ పెట్టుబడులు చాలా వరకు రాబోయే 15–20 ఏళ్లలో వ్యాపార దృక్పథం దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా ఉంటాయి. విలువలు, వ్యక్తులు, సామర్థ్యం పెంపు, దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యాపారాల నిర్వహణ అనేది సంస్థ వ్యాపార విధానాన్ని నిర్వచించే కీలక వ్యూహాలు’ అని వెల్లడించారు.కఠినమైన నిర్ణయాలు..గ్రూప్ సంస్థ హిందాల్కో ద్వారా నోవెలిస్ను కొనుగోలు చేయడంతో సహా అనేక కఠినమైన నిర్ణయాలను తీసుకున్నామని బిర్లా తెలిపారు. నోవెలిస్ను దక్కించుకోవడానికి 6 బిలియన్ డాలర్లు వెచ్చించినట్టు చెప్పారు. ‘నేను ఒక కంపెనీని (నోవెలిస్) కొనుగోలు చేశాను. అది చాలా పెద్దది. షేరు దెబ్బతింది. ముఖ్యమైనది కాదని పెట్టుబడిదారులు స్పష్టం చేశారు. తిరిగి పుంజుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ నిర్ణయం తీసుకున్న ఏ ప్రొఫెషనల్ సీఈవో అయినా తొలగించబడతారు. ఎందుకంటే ఆ సమయంలో అది తప్పుగా అనిపించింది’ అని అన్నారు.దీర్ఘకాలానికి వ్యాపారాలు నిర్వహించడం అనేది మనలో ఒక సంస్కృతి అని వివరించారు. కంపెనీ 36 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని నిర్మించింది. వచ్చే 5 ఏళ్లలో దీనిని 150 మిలియన్ టన్నులకు, 10 ఏళ్లలో 200 మిలియన్ టన్నులకు పెంచుతామని ఆయన తెలిపారు. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
పాకిస్తాన్ చాయ్‌వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా..
పాకిస్తాన్ చాయ్‌వాలా 'అర్షద్ ఖాన్' షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ తాజా ఎపిసోడ్లో తన కేఫ్ బ్రాండ్ చాయ్‌వాలా & కో కోసం కోటి రూపాయలు (పాకిస్తాన్ కరెన్సీ) పెట్టుబడిన పొందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చాలా సంవత్సరాలు కేఫ్ నడుపుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న.. అర్షద్ ఖాన్ ఇటీవల షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ ఎపిసోడ్లో పాల్గొని, అక్కడి వ్యాపారవేత్తలను తన వ్యాపారం గురించి వివరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వారు ఈ భారీ పెట్టుబడిన ఆఫర్ చేశారు. దీంతో అర్షద్.. చాయ్‌వాలా & కో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.వ్యాపార వేత్తల నుంచి కోటి రూపాయల ఆఫర్ అందుకున్న తరువాత.. ఈ విషయాన్ని అర్షద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఒప్పందం తన జీవితంలోనే కీలక మైలురాయి అని పేర్కొన్నాడు.అర్షద్ ఖాన్ చాయ్ కేఫ్ ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు అక్కడ బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కేవలం చాయ్ మాత్రమే కాకుండా.. స్నాక్స్, బర్గర్స్, పాస్తా, శాండ్విచ్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఫండింగ్ గెలుచుకున్న అర్షద్ తన వ్యాపారాన్ని పెంచడానికి సన్నద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Arshad Khan (@arshadchaiwala1) -
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శీతాకాల షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌తో హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది. -
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లోన్ కావాలా? అయితే..
చెన్నై: వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో అడుగు ముందుకేసింది. పెళ్లి వేడుకకు రుణం సమకూర్చేందుకు వెడ్డింగ్‌లోన్స్ డాట్ కామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్‌తో చేతులు కలిపింది.వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్టు మ్యాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు. ఈ సంస్థ పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నుండి రూ.1 కోటి వరకూ రుణాలను అందజేస్తుంది. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.2024లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. -
క్విక్ కామర్స్ ఈఎంఐ రూట్!
చెంగు చెంగున మార్కెట్లో దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ కంపెనీలు... కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ సంస్థల రూట్లోనే కొంగొత్త పేమెంట్ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా మార్కెట్‌ను మరింత ‘క్విక్’గా కొల్లగొట్టాలనేది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, జొమాటో బ్లింకిట్ తదితర దిగ్గజాల ప్లాన్!! పదే పది నిమిషాల్లో పక్కా డెలివరీ అంటూ దుమ్మురేపుతున్న క్విక్ కామ్ సంస్థలు.. ఈ–కామర్స్ దిగ్గజాలకు పక్కలో బల్లెంలా మారుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ల విషయంలోనూ ‘నీవు నేర్పిన విద్యే..’ అన్న చందంగా తయారైంది వాటి వ్యూహం. రూ. 2,999 పైబడిన కొనుగోళ్లకు బ్లింకిట్ గత నెలలో నెలవారీ వాయిదా (ఈఎంఐ) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తొలిసారి 2016లోనే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టగా... అమెజాన్ కూడా 2018లో దీన్ని అనుసరించింది. పలు డెబిట్ కార్డులతో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కూడా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమలు చేస్తున్నాయి. ‘ఈఎంఐ అవకాశం కలి్పంచడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు.ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి! మరోపక్క, దాదాపు దిగ్గజ క్విక్ కామర్స్ కంపెనీలన్నీ ఈఎంఐ ఆప్షన్‌తో పాటు తర్వాత చెల్లించే (బై నౌ, పే లేటర్) పేమెంట్ విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం సింపుల్, పేయూకి చెందిన లేజీ పే వంటి కంపెనీలతో జట్టుకట్టాయి. ఫ్లిప్‌కార్ట్ 2017లో ఈ పే లేటర్ ఫీచర్ ద్వారా యూజర్లకు రూ. లక్ష వరకు ఇన్స్టంట్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నయా పైసా చెల్లించకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసి, తర్వాత నెలలో పూర్తిగా చెల్లించడం, లేదంటే ఈఎంఐగా మార్చుకునే అవకాశాన్ని ఇది కలి్పస్తోంది. ఇక 2020లో ప్రవేశపెట్టిన ‘అమెజాన్ పే లేటర్’ కూడా బాగానే ‘‘క్లిక్’ అయింది. కాగా, ఈ పేమెంట్ ఆప్షన్లతో క్యూ–కామ్ సంస్థల సగటు ఆర్డర్ విలువ పెరగడంతో పాటు ఎక్కువ రేటు గల ఉత్పత్తి విభాగాల్లోకి కూడా విస్తరించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీలు గనుక కస్టమర్ల విశ్వాసాన్ని పొందగలిగితే, ఈకామర్స్ దిగ్గజాలకు సవాలుగా నిలవడం ఖాయమని కూడా వారు విశ్లేషిస్తున్నారు.40 బిలియన్ డాలర్లుభారత్ క్విక్ కామార్స్ మార్కెట్‌ను ప్రధానంగా మూడు కంపెనీలు (జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో) శాసిస్తున్నాయి. ప్రస్తుతం 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా.75% స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు వాయిదాల్లోనే... ‘పే లేటర్, ఈఎంఐ ఫార్మాట్ల వల్ల క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. సంప్రదాయ ఈకామర్స్ దిగ్గజాలతో మరింతగా పోటీపడేందుకు వీలవుతుంది. ముఖ్యంగా పే లేటర్ సదుపాయం వల్ల యూజర్ల మెరుగైన షాపింగ్ అనుభూతికి తోడ్పడుతుంది. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, గృహోపకారణాల వంటి అధిక ధర కేటగిరీ కొనుగోళ్లలో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఈకామర్స్ మాదిరిగానే పోటాపోటీ ధరలతో పాటు అనువైన పేమెంట్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేయడం ద్వారా క్యూకామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోగలుగుతాయి’ అని డేటమ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు సతీష్ మీనా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో 75 శాతం పైగా స్మార్ట్ ఫోన్లు ఈఎంఐ రూట్లోనే అమ్ముడవుతుండటం విశేషం! అయితే, ప్రస్తుతం క్విక్ కామ్ ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మేర కిరాణా, నిత్యావసర ఉత్పత్తులేనని, ఈ పేమెంట్ ఆప్షన్లు తక్షణం వాటికి పెద్దగా ఉపయోగకరం కాదనేది మరో టాప్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుడి అభిప్రాయం. ‘రానురాను ప్రీమియం విభాగాల్లోకి విస్తరించే కొద్దీ పే లేటర్, ఈఎంఐ వంటి ఆప్షన్లు క్విక్ కామ్ డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడతాయి. ఇది ఈకామర్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే అవి మరిన్ని వినూత్న విధానాలను అనుసరించక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.ఈఎంఐ అవకాశం కల్పించడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది. – అల్బిందర్ ధిండ్సా, బ్లింకిట్ సీఈఓ -
ఇషా అంబానీ సారథ్యంలోని ఏడు కంపెనీలు ఇవే..
ముకేశ్ అంబానీ గారాల తనయ 'ఇషా అంబానీ' రిలయన్స్ గ్రూపుకు చెందిన వివిధ రంగాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే.. ఇతర సంస్థలను కూడా పర్యవేక్షిస్తోంది. ఈ కథనంలో ఇషా సారథ్యంలో ముందుకు సాగుతున్న సంస్థల గురించి తెలుసుకుందాం.తీరా బ్యూటీ (Tira Beauty)ఇషా అంబానీ సారథ్యంలోని ప్రముఖ వెంచర్లలో తీరా బ్యూటీ ఒకటి. ఇది ఏప్రిల్ 2023లో ప్రారంభమైన ఓమ్ని ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా వెర్సేస్, మోస్చినో, డోల్స్ & గబ్బానా వంటి లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు అందించడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం.హామ్లేస్ (Hamleys)రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో సుమారు రూ. 620 కోట్లతో టాయ్ రిటైలర్ హామ్లేస్ను కొనుగోలు చేసింది. ఇది కూడా ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉంది. హామ్లేస్ అనేది ప్రపంచ మార్కెట్లోని పురాతనమైన, అతిపెద్ద బొమ్మల రిటైలర్లలో ఒకటి. ఇషా అంబానీ ఈ సంస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.అజియో (Ajio)ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉన్న మరో సంస్థ అజియో. లాక్మే ఫ్యాషన్ వీక్ ఎస్ఎస్16 సందర్భంగా ప్రారంభమైన అజియో.. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అధిక లాభాలను గడిస్తూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది.కవర్ స్టోరీ (Cover Story)ఇషా దర్శకత్వంలో మరో కీలకమైన బ్రాండ్ 'కవర్ స్టోరీ'. ఇది భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ కాస్మొటిక్స్ అందించే మొట్టమొదటి ఫ్యాషన్ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఇతర దేశాల సౌందర్య ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారభించారు.ఫ్రెష్‌పిక్ (Freshpik)2021లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో.. ఫ్రెష్‌పిక్ పేరుతో ఇషా అంబానీ ఫుడ్ రిటైల్ కంపెనీని ప్రారంభించింది. ఇందులో అంతర్జాతీయ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది కూడా ఇషా అంబానీ సారథ్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది.నెట్‌మెడ్స్ (Netmeds)ఇషా అంబానీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ కస్టమర్ అవసరాలను తీర్చే లక్ష్యంతో.. చెన్నైలో ఈ-ఫార్మసీ నెట్‌మెడ్స్‌ను కూడా పర్యవేక్షిస్తుంది. 2020లో నెట్‌మెడ్స్‌ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేయడం ద్వారా ఔషధ రంగంలోకి ప్రవేశించింది. ఇది కూడా మంచి లాభాలను ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!7-ఎలెవెన్ (7-Eleven)రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ కన్వీనియన్స్ స్టోర్ చైన్ 7-ఎలెవెన్‌ను భారతదేశానికి తీసుకురావడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించింది. భారతీయ వినియోగదారులకు ఐకానిక్ 24/7 కన్వీనియన్స్ స్టోర్ పరిచయం చేసి.. మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. -
60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లిచేసుకోనున్నట్లు తెలుస్తోంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం 2019లో బయటకు వచ్చింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 54 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈమెకు సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పాట్రిక్ వైట్సెల్, మాజీ ఎన్ఎఫ్ఎల్ క్రీడాకారుడు టోనీ గోంజలెజ్‌తోనూ పెళ్లైంది. ఈ ఇద్దరి ద్వారా ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.జెఫ్ బెజోస్ నికర విలువప్రపంచలోనే అత్యంత ధనవంతులైన.. టాప్ 10 కుబేరుల జాబితాలో ఒకరుగా నిలిచిన జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఈయన నికర విలువ 2024 నవంబర్ 13 నాటికి 230 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1,94,17,68,88,43,000. -
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్!.. కేంద్రమంత్రి
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్లైన్లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్‌వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్‌కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా. -
రైల్వేశాఖ సరికొత్త కార్యక్రమం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం కల్పిస్తోంది. ఖాళీ బెర్త్‌ల గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందిస్తోంది.హాజీపూర్ రైల్వే జోన్లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలోనూ ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్)లో ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంట్లో కూర్చొనే రైలులో ఖాళీగా ఉన్న సీట్ల గురించి నాలుగు గంటల ముందుగానే తెలుసుకుంటారు. ఏ రైలులో ఏ తరగతిలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే వీలుంది.రిజర్వేషన్ ఇలా.. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, ఖాళీగా ఉన్న సీట్లను కేటాయించే కరెంట్ రిజర్వేషన్ ఆన్లైన్లో జరగదు. ఇందుకోసం స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. దానాపూర్ రైల్వే డివిజన్ నుంచి బయలుదేరే రైళ్ల ప్రస్తుత స్థితిని తెలిపే వ్యవస్థను ప్రారంభించారు. రైలు ఎక్కడ నుండి బయలుదేరుతుందో అదే స్టేషన్ నుండి కరెంట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే రైలు ఆలస్యమైతే ఆ రైలు ఏ స్టేషన్ గుండా వెళుతుందో తెలిసిపోతుంది. అంతే కాదు ఏ ప్రత్యేక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ రోజు నడుస్తుందనే సమాచారాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నారు.మొబైల్లో మొత్తం సమాచారం రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, అన్ని తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల పూర్తి సమాచారం ‘ఎక్స్’, ఫేస్బుక్ ద్వారా ప్రయాణికుల మొబైల్ ఫోన్ స్క్రీన్‌పైకి వస్తుంది. దీని ఆధారంగా ఖాళీ సీట్లకు అప్పటికప్పుడు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్‌కు రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్ మధ్య వ్యత్యాసం ఉంది. రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు బుక్ చేసుకునేది తత్కాల్ టికెట్. అదే కరెంట్ రిజర్వేషన్ కోసం ఆ రైలు చార్ట్ సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. చార్ట్ తయారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల స్థితని కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తెలియజేస్తారు. -
అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ!
ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి.. అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి.. నష్టాలు పోయి లాభాలు కూడా పలకరించాయి. ఇక అంతా ఆనందమే అనుకుంటున్న సమయంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారంటూ రిలయన్స్ పవర్‌కి, దాని అనుబంధ సంస్థకు భారత క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది. సంస్థలపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సంజాయిషి కోరింది.రిలయన్స్ పవర్‌కు చెందిన ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై రిలయన్స్ పవర్‌ను, దాని యూనిట్‌ను మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) గత వారం నిషేధించింది.రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్యూ బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్ఈసీఐ తన నవంబర్ 13 నాటి నోటీసులో పేర్కొంది. ఈ చర్య తర్వాత, గురువారం బీఎస్ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 వద్ద స్థిరపడ్డాయి.కాగా ఆరోపణలపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "మోసం, ఫోర్జరీ, కుట్రలో బాధితులం" అని పేర్కొంది. “దీనికి సంబంధించి ఇప్పటికే థర్డ్ పార్టీపై అక్టోబర్ 16న ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశాం. దాని ఆధారంగా నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదైంది. విషయం దర్యాప్తు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది” అని రిలయన్స్ పవర్ తెలిపింది.