Personal Finance
-
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్‌లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్‌మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
పాలసీ సరెండర్ చేస్తే.. ఇక ఊరట!
ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.సరెండర్ వేల్యూ? జీవిత బీమాలో సరెండర్ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి. ఇది అసమంజసమని భావించిన ఐఆర్డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ (జీఎస్వీ), స్పెషల్ సరెండర్ వ్యాల్యూ (ఎస్ఎస్వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లను కలపరు. అదే స్పెషల్ సరెండర్ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్ సరెండర్ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.ఎంతొస్తుంది..? పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ, స్పెషల్ సరెండర్ వేల్యూ, చెల్లింపుల సరెండర్ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీని సరెండర్ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్ అతడికి జమ అయింది. గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్‌లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్‌కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్ సరెండర్ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలు, సింగిల్ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్ సరెండర్ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది. ఎప్పటి నుంచి..? స్పెషల్ సరెండర్ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్ పాలసీలకే వర్తిస్తాయని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్డీఏఐ తీసుకొచి్చన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.ప్రత్యామ్నాయాలు... ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కాదు. ఆ పాలసీని పెయిడప్‌గా మార్చుకోవచ్చు. పెయిడప్‌గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్‌గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. మరో మార్గంగా పెయిడప్‌గా మార్చి, సమ్ అష్యూర్డ్ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్ సమ్ అష్యూర్డ్ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రయోజనాలునూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్ పెట్టడం కూడా సరెండర్ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పాలసీలు / టర్మ్ ప్లాన్లుఎండోమెంట్ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్) పాలసీదారు మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్ ప్లాన్‌తో సొంతం చేసుకోవచ్చు. -
మరో ఐదు బ్యాంకులకు 'ఆర్బీఐ' జరిమానా!.. కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో సహా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్బీఐ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానాలు విధించడం జరిగిందని సమాచారం.ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా.. గుజరాత్ రాజ్య కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్), నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ (పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ ఏకంగా రూ. 1.31 కోట్ల జరిమానా విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్స్ అండ్ అడ్వాన్సులు వంటి వాటికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించిన కారణంగా 2024 జులై 4న రూ. 1,31,80,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని పలు నిబంధనలను పీఎన్బీ బ్యాంక్ ఉల్లంఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరికొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించడం జరిగింది. కాగా ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన బ్యాంకుల జాబితాలో తాజాగా మరో ఐదు బ్యాంకులు చేరాయి. -
మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. కారణం ఇదే!
గత కొన్ని రోజులుగా ఆర్బీఐ, నియమాలను అతిక్రమించే బ్యాంకుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధించడమే కాకుండా.. లైసెన్సులు సైతం రద్దు చేస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాని లైసెన్స్‌ను రద్దు చేసింది. లైసెన్స్ రద్దు చేసిన తరువాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోఆపరేటివ్ కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్‌ను మూసివేయడానికి, లిక్విడేటర్‌ను నియమించడానికి ఉత్తర్వు జారీ చేయాలని ఆర్బీఐ కోరింది.బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిపాజిటర్లు తమ డిపాజిట్ మొత్తాలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసిజీసి) నుంచి పొందుతారు. లిక్విడేషన్ తర్వాత, ప్రతి డిపాజిటర్ DICGC నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. -
ఈపీఎఫ్‌లో ఉన్న ఈ అదనపు బెనిఫిట్ గురించి తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు భవిష్యత్తు కోసం తమ కొంత మొత్తాన్ని ఇందులో జమ చేస్తుంటారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. అయితే దీంతోపాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అందించే అద్భుతమైన అదనపు ప్రయోజనం ఒకటుంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకాన్ని ఈపీఎఫ్ఓ 1976లో ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ సభ్యుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌కు కంపెనీ కంట్రిబ్యూషన్ ఇస్తుంది.బీమా మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..బీమా మొత్తం గత 12 నెలల బేసిక్ జీతం, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ క్లెయిమ్ చివరి మూల వేతనం + డీఏకు 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా, రూ .1,75,000 వరకు బోనస్ మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.ఈపీఎఫ్ఓ సభ్యుడు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే ఈడీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తరువాత, అతని కుటుంబం, వారసులు, నామినీలు దానిని క్లెయిమ్ చేయలేరు. ఈపీఎఫ్ఓ సభ్యుడు 12 నెలలు నిరంతరాయంగా పనిచేస్తుంటే, ఉద్యోగి మరణించిన తర్వాత, నామినీకి కనీసం రూ .2.5 లక్షల ప్రయోజనం లభిస్తుంది.ఉద్యోగి పనిచేసేటప్పుడు అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవిస్తే ఈడీఎల్ఐ క్లెయిమ్ చేయవచ్చు. ఈడీఎల్ఐ పథకం కింద నామినీలుగా ఎవరినీ పేర్కొనకపోతే మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తెలు, మైనర్ కొడుకులు, కుమారులను కవరేజీని లబ్ధిదారులుగా పరిగణిస్తారు.ఎలా క్లెయిమ్ చేయాలంటే..ఈపీఎఫ్ చందాదారు అకాల మరణం చెందితే, వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు బీమా కవరేజీ కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం నామినీ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు వారి తరఫున క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మైనర్ సంరక్షకుడి తరఫున క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్ షిప్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 14 గంటలు అంతరాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలకు జూలై 13న అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా అత్యధిక మంది కస్టర్లున్న అతిపెద్ద ప్రవేట్ బ్యాంక్ తమ కస్టమర్ బేస్ కోసం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫామ్‌కు బదిలీ చేస్తోంది. దీంతో 14 గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.పనితీరు వేగాన్ని మెరుగుపరచడం, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, రిలియబులిటీ, స్కేలబిలిటీని పెంచడం ఈ మార్పు లక్ష్యం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా జూలై 13న తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 13.50 గంటల పాటు పలు సర్వీసులు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.ప్రభావితమయ్యే సేవలు ఇవే..నెట్ & మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు జూలై 13న తెల్లవారు జామున 3:00 గంటల నుంచి 3:45 గంటల వరకు, మళ్లీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అందుబాటులో ఉండవు. బిల్లు చెల్లింపులు, డీమ్యాట్, కార్డులు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ఏటీఎం లావాదేవీల్లోనూ అంతరాయం ఉంటుంది. -
రూ.35లకే పేటీఎం ప్రత్యేక హెల్త్ ప్లాన్.. ప్రయోజనాలు ఇవే..
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం తమ మర్చంట్ పార్టనర్స్ కోసం ప్రత్యేక హెల్త్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 'పేటీఎం ఫర్ బిజినెస్' యాప్‌లో 'పేటీఎం హెల్త్ సాథీ' అనే ప్రత్యేక హెల్త్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది.తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం ద్వారా తమ విస్తారమైన వ్యాపార భాగస్వాముల నెట్‌వర్క్‌కు తోడ్పాటు అందించడానికి పేటీఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చొరవ ఒక భాగం. వ్యాపార భాగస్వాముల శ్రేయస్సును పరిరక్షించడం, వారి ఆరోగ్యం, వ్యాపార కొనసాగింపును నిర్ధారించడం 'పేటీఎం హెల్త్ సాథీ' లక్ష్యం.పేటీఎం హెల్త్ సాథీ ప్రయోజనాలునెలవారీ సబ్ స్క్రిప్షన్ పై నెలకు కేవలం రూ.35తో ప్రారంభమయ్యే పేటీఎం హెల్త్ సాథీ తన భాగస్వామ్య నెట్ వర్క్ పరిధిలో అపరిమిత డాక్టర్ టెలీ కన్సల్టేషన్, ఇన్ పర్సనల్ డాక్టర్ విజిట్స్ (ఓపీడీ) వంటి సేవలను అందిస్తోంది.వరదలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, సమ్మెలు వంటి వాటి కారణంగా వ్యాపార అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆదాయ రక్షణ కవరేజీని కూడా ఇది అందిస్తుంది.డాక్టర్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్‌తోపాటు ప్రముఖ ఫార్మసీలలో డిస్కౌంట్లు, రోగనిర్ధారణ పరీక్షలలో తగ్గింపులు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా సులభతరం చేసింది. యాప్‌లోనే దీన్ని పూర్తి చేయవచ్చు.'పేటీఎం హెల్త్ సాథీ' పైలట్ సర్వీస్ మే నెలలోనే ప్రారంభమైంది. ఇప్పటికే 3000 మందికి పైగా మర్చంట్ భాగస్వాములు ఉపయోగించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో కంపెనీ ఈనెల ప్రారంభంలో తన వ్యాపారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఐటీఆర్ ఫైలింగ్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారా..?
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. రిటర్ను దరఖాస్తులు దాఖలు చేసేపుడు చాలామంది పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి అనువుగా వచ్చే ఆదాయాన్ని సర్దుబాటు చేస్తే కొంతమేర పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పన్ను చెల్లింపుల్లో ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇండెక్సేషన్పన్నుదారుల్లో చాలామంది స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దానికి అనువుగా ఆదాయాన్ని సర్దుబాటు చేసే పద్ధతినే ఇండెక్సేషన్ అంటారు. పన్ను రిటర్నులు దాఖలు చేసేపుడు చాలావరకు గతంలో చేసిన పెట్టుబడులను ప్రస్తుత విలువగానే పరిగణిస్తున్నారు. కానీ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. దాన్ని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ) గణాంకాల ఆధారంగా ఇండెక్సేషన్‌ను అంచనా వేస్తారు. మూలధన లాభాలను కచ్చితంగా నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది.ఏదైనా ఒక వస్తువును రూ.10కు కొనుగోలు చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం కారణంగా ఏడాదిలో దాని ధర రూ.12కు చేరినట్లు భావించండి. ఆ వస్తువుపై రూ.1 లాభం రావాలంటే మీరు దాన్ని ప్రస్తుత విలువ ప్రకారం రూ.13కు అమ్ముతారు. కానీ మీరు కొన్నది రూ.10కే. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ మీరు అమ్మే సమయానికి రూ.2 పెరిగింది. కాబట్టి మీకు వచ్చిన లాభంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయాలి. దానికోసం ఇండెక్సేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. -
రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా
బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది. 'అదితి' పేరుతో తీసుకొచ్చిన ఈ బీమా శస్త్రచికిత్సలకు రూ. 1 కోటి, వైద్య నిర్వహణ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు హామీతో కుటుంబానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది.తక్కువ ప్రీమియంకే సమగ్ర కవరేజీని అందించడం ద్వారా దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ ప్లాన్ లక్ష్యం అని డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్‌కేర్ మేజర్ పేర్కొంది. ఈ కొత్త బీమాను సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియంతో పొందవచ్చు. సాధారణంగా ఇలాంటి బీమాకు ప్రీమియం అధికంగా ఉంటుంది. గరిష్టంగా నలుగురు సభ్యులున్న కుటుంబం ఈ బీమా ప్లాన్ తీసుకునేందుకు అవకాశం ఉంది.నారాయణ హెల్త్ దేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి హాస్పిటల్ చైన్‌గా నిలిచింది. దేశం అంతటా దాదాపు 21 హాస్పిటల్ నెట్‌వర్క్‌లు, అనేక క్లినిక్‌లను కలిగి ఉంది. బెంగళూరులో ఇది దాదాపు 7 ఆసుపత్రులు, 3 క్లినిక్‌లను కలిగి ఉంది. ఎన్హెచ్ఐ వెంచర్ కింద ‘అదితి’ పైలట్ ప్లాన్ మొదట మైసూరు, బెంగళూరులో తర్వాత కోల్‌కతా, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడితో సహా శస్త్ర చికిత్సలకు కోటి రూపాయల వరకు, వైద్య చికిత్సల కోసం రూ. 5 లక్షల వరకు అదితి కవరేజీని అందజేస్తుంది.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి కార్డియాక్ సర్జన్. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
పెరుగుదల బాటలో స్వర్ణం.. వెండి
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరుగుదల బాటలో పయనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి రేట్లు నేడు (జూలై 2) స్వల్పంగా పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ.100 పెరిగి రూ. 72,380 వద్దకు, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 ఎగిసి రూ.66,350 వద్దకు చేరాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,500లకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 ఎగిసి రూ.72,530 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 పెరిగి రూ.66,350, 24 క్యారెట్ల పసిడి రూ. 100 పెరిగి రూ. 72,380 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర అత్యంత స్వల్పంగా రూ.50 పెరిగి రూ.66,850 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.50 పెరిగి రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,350, 24 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ. 72,280 వద్ద కొనసాగుతున్నాయి.భారీగా వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కాస్త భారీగానే ఎగిశాయి. హైదరాబాద్‌లో నేడు వెండి ధర కేజీకి రూ.800 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.95,500 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. రూ.7581 కోట్ల నోట్లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది మే 19న రూ. 2000నోట్ల ఉపసంహరణను ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండువేల రూపాయల నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి. కానీ ఇంకా సుమారు రూ. 7581 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నట్లు సమాచారం.ఆర్బీఐ ప్రకారం.. ఇప్పటికి 97.87 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలుస్తోంది. 2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఇది 2024 జూన్ 28 నాటికి రూ. 7581 కోట్లకు తగ్గింది. అంటే మిగిలిన మొత్తం నోట్లు మళ్ళీ బ్యాంకులకు చేరాయి.2024 జూన్ 28 నాటికి వెనక్కు వచ్చిన పెద్ద నోట్లు 97.87 శాతం. నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తరువాత కూడా.. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. దీనికోసం దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలు తమ నోట్ల మార్పిడి కోసం డబ్బును ఏదైనా ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చు.Withdrawal of ₹2000 Denomination Banknotes – Statushttps://t.co/L2SXdYpCTR— ReserveBankOfIndia (@RBI) July 1, 2024 -
పసిడి ప్రియులకు ఊరట.. వెండి ధరల్లో కదలిక
పసిడి ప్రియులకు ఊరట కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జూలై 1) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులేదు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 72,280 వద్ద అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,250, కొనసాగుతన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.పెరిగిన వెండి ధరలుదేశవ్యాప్తంగా చాలా రోజుల తర్వాత వెండి ధరల్లో కదలిక వచ్చింది. ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు వెండి ధర కేజీకి రూ.200 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,700 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
చమురు కంపెనీలు ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను సవరిస్తాయి. అందులో భాగంగా కొత్త ధరలు నేడు విడుదలయ్యాయి.జూలైలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ .30 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా మూడో నెల. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.వాణిజ్య సిలిండర్ల తాజా రేట్లుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా నేటి నుంచి రూ.1646కు చేరింది. కోల్‌కతాలో రూ.1756, ముంబైలో రూ.1598, చెన్నైలో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1809.50లకు ఎగిసింది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803లుగా ఉంది. -
శబరిమల యాత్రికులకు బీమా.. కంపెనీల ఆసక్తి
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్ పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు.శబరిమల కొండపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె ఆగిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటి ప్రమాదం కాని కారణాల వల్ల సంభవించినవేనని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లోనే దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని ప్రశాంత్ చెప్పారు.గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు.గరిష్ట ప్రయోజనాలుశబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు రూ.10 వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్‌లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్‌లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్‌లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్‌లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్‌లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్‌లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్‌కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్‌కు సైతం డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్‌తో బ్యాండ్ బాజా బారాత్, షాన్‌దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్‌తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
ఐటీ రిటర్న్.. చలో ఆన్లైన్!
ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జూలై 31 తుది గడువు. చివరి రోజు వరకు ఆగకుండా ముందుగా రిటర్నులు దాఖలు చేయడం సూచనీయం. చాలా మందికి రిటర్నుల విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వేరొకరి సాయం తీసుకుంటుంటారు. కానీ, ఎవరికివారే ఆదాయపన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులను ఎల్రక్టానిక్ రూపంలో సమరి్పంచొచ్చు. ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను యూజర్లకు అనుకూలంగా మార్చేందుకు ఆదాయపన్ను శాఖ ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఐటీఆర్ దాఖలు ప్రక్రియ అర్థం కాని వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఉన్నమెరుగైన ప్రత్యామ్నాయ మార్గం.. మధ్యవర్తిత్వ సంస్థల సాయం తీసుకోవడం. వీటి ద్వారా చాలా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఈ విషయంలో ఇవి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వీటి గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.ఈఆర్ఐలుఈ–రిటర్న్ ఇంటర్మీడియరీలు (ఈఆర్ఐలు) ఎలక్గ్రానిక్ రూపంలో పన్ను రిటర్నులు వేసేవారికి కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సాఫ్ట్వేర్ ఆధారితంగా నడిచే ప్లాట్‌ఫామ్‌లు. వీటి ద్వారా ఎవరైనా రిటర్నులు సమరి్పంచొచ్చు. పన్ను చెల్లింపుదారుల తరఫున పన్ను రిటర్నుల దాఖలుకు ఐటీ శాఖ నుంచి వీటికి అనుమతి ఉంది. క్లియర్‌ట్యాక్స్, క్వికో, ట్యాక్స్‌బడ్డీ, మైఐటీ రిటర్న్, ఈజెడ్‌ట్యాక్స్, ట్యాక్స్2విన్ ఇవన్నీ ఈఆర్ఐలే. రిటర్నుల ఆటోఫిల్, రివ్యూ, ఈ–ఫైల్.. ఇలా మూడంచెల్లోనే రిటర్నులను సమరి్పంచొచ్చు. పన్ను రిటర్నులు వేయడం ఇంత సులువా? అనేలా ఇవి సేవలు అందిస్తున్నాయి.సౌకర్యం..ఇవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు కావడంతో పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి నుంచే ఖాళీ సమయంలో సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. వీటి యూజర్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకునేందుకు సులభంగా, సమకాలీనంగా ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. మొబైల్ యాప్‌ల నుంచి రిటర్నులు వేసే సౌకర్యాన్ని సైతం అందిస్తున్నాయి. క్వికో అయితే యూపీఐ ద్వారా పన్ను చెల్లించే సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫామ్ 16 పత్రాల కాపీలను దగ్గర ఉంచుకుంటే, రిటర్నులు వేగంగా సమరి్పంచొచ్చు. ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై మూలధన లాభాలు ఉన్న వారూ ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిటర్నులు సులభంగానే దాఖలు చేసుకోవచ్చు. ప్రముఖ స్టాక్ బ్రోకర్లతో వీటికి ఒప్పందం ఉంది. కనుక పన్ను చెల్లింపుదారుల సమ్మతితో వారికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వివరాలను బ్రోకర్ల సర్వర్ల నుంచి సెకన్ల వ్యవధిలో తీసుకుని రిటర్నుల పత్రంలో నమోదు చేస్తాయి. కనుక వీటిని విడిగా నమోదు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే తమ స్టాక్ బ్రోకర్‌తో టైఅప్ ఉన్న ఈఆర్ఐని ఎంపిక చేసుకోవాలి. లేదంటే విడిగా ప్రతీ పెట్టుబడికి సంబంధించిన కొనుగోలు తేదీ, ధర, విక్రయం తేదీ, ధర తదితర వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది.అన్ని విధాలా సహకారం పన్ను అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలం? వ్యక్తి ఆదాయ వనరుల ఆధారంగా దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రాన్ని ఈఆర్ఐ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. కేవలం వేతనమే కాదు, ఈక్విటీలు, ఎఫ్‌అండ్‌వో ఆదాయం, విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం ఇలా భిన్న రూపాల్లో ఆదాయ వనరులు ఉన్న వారికి ఐటీఆర్ పత్రం ఎంపికను ఇవి సులభతరం చేస్తాయి. రిటర్నులు దాఖలు చేయడమే కాదు, ఈ వెరిఫికేషన్‌ను కూడా అక్కడే పూర్తి చేయవచ్చు. ట్యాక్స్‌బడ్డీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిటర్నులు వేసినట్టయితే.. ఒకవేళ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం, నోటీసుకు ఇవ్వాల్సిన సమాధానం విషయంలోనూ సహకారం లభిస్తుంది. ఈఆర్ఐ ప్లాట్‌ఫామ్‌లపై రిటర్నుల దాఖలుకు సంబంధించి రెండు స్కీమ్‌లు ఉంటాయి. ఒకటి సొంతంగా దాఖలు చేసుకోవడం. రెండోది నిపుణుల సహకారంతో దాఖలు చేసుకోవడం. కొంత చార్జీ చెల్లించి పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారాన్ని రిటర్నుల విషయంలో తీసుకోవచ్చు. వర్చువల్‌గా నిపుణులతో సమావేశమై సందేహాలు తీర్చుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్యాక్స్ విషయంలోనూ ఈ ప్లాట్‌ఫామ్‌లు సాయం అందిస్తున్నాయి.. అంతేకాదు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందడానికి వీలుగా పెట్టుబడుల విషయంలోనూ సలహాలు తీసుకోవచ్చు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా డిపాజిట్లలో పెట్టుబడులపై సహకారం లభిస్తుంది. సేవలకు చార్జీలు... ఈ ప్లాట్‌ఫామ్‌లు రిటర్నుల దాఖలుకు కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. నిపుణుల సహకారం లేకుండా సొంతంగా రిటర్నుల ఫైలింగ్‌కు చార్జీ రూ.200 నుంచి రూ.1,600 వరకు ఉంది. ఆదాయస్థాయికి అనుగుణంగా ఈ చార్జీ మారుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు పన్ను చెల్లింపుదారులు సొంతంగా రిటర్నులు దాఖలు చేసుకుంటే ఎలాంటి చార్జీ తీసుకోవడం లేదు. నిపుణుల సాయం తీసుకుని, రిటర్నులు వేయాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఆర్ఐ సంస్థలకు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. వ్యక్తిగత ఆరి్థక అంశాలపై సమాచారం అందించే వీడియోలు సైతం అక్కడ లభిస్తాయి. డేటా భద్రత సంగతి?ఈఆర్ఐలు అన్నీ కూడా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత డేటాను పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. కనుక ఆయా ప్లాట్‌ఫామ్‌ల భద్రత ఎంతన్నది ముందే విచారించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మరొకరితో పంచుకోవడం లేదా విక్రయించడం చేయబోమని ఈ వేదికలు హామీ ఇస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు టెక్నాలజీ, భద్రత కోసం తగినంత ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి విషయంలో రాజీకి అవకాశం లేదు.రిటర్నులు ఎవరు వేయాలి? వార్షిక ఆదాయం రూ.2,50,000 వరకు ఉన్న వారు పన్ను పరిధిలోకి రారు. పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు ఆదాయ పరిమితి రూ.2,50,000. అదే కొత్త పన్ను విధానంలో అయితే వార్షికాదాయం రూ.3,00,000 మించని వారు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. ఇంతకు మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ రిటర్నులు విధిగా దాఖలు చేయాల్సిందే. అయితే పన్ను చెల్లించే ఆదాయం లేకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేయాలని చట్టంలోని సెక్షన్ 139 స్పష్టం చేస్తోంది.ఏ సందర్భాల్లో రిటర్నులు వేయాలి..? (సెక్షన్ 139)→ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు (షేర్లు) కలిగి ఉన్న వారు రిటర్నులు దాఖలు చేసి, అందులో ఆ వివరాలు పేర్కొనాలి. విదేశీ కంపెనీల్లోని వాటాల ద్వారా వచ్చే డివిడెండ్ వివరాలను సైతం వెల్లడించాలి. విదేశీ కంపెనీల బాండ్లు, విదేశాల్లో ఇల్లు, ఆ ఇంటి నుంచి అద్దె ఆదాయం వస్తున్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాలని సెక్షన్ 139(1) చెబుతోంది. భారత్‌కు వెలుపల ఏ దేశంలో అయినా అకౌంట్‌కు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు కూడా రిటర్నులు వేయాలి. తన పేరు మీద ఇన్వెస్ట్ చేసినా లేదా తల్లిదండ్రుల పేరు మీద విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా సరే.. రిటర్నుల దాఖలు తప్పదు. → ఒక వ్యక్తి తాను, తన జీవిత భాగస్వామి, లేదా ఇతరుల (తల్లిదండ్రులు తదితర) విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేసినట్టయితే రిటర్నులు వేయాల్సి ఉంటుంది. → ఒక ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ బిల్లుల మొత్తం రూ.లక్ష దాటినా సరే రిటర్నుల దాఖలు తప్పనిసరి. → మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కోరుకునే వారు రిటర్నులు దాఖలు చేయాలి. → మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూళ్లు (టీసీఎస్) ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.25,000, అంతకుమించి ఉంటే రిటర్నులు వేయాలని ఆదాయపన్ను శాఖ 2022 ఏప్రిల్ నాటి నోఫికేషన్ స్పష్టం చేస్తోంది. ఇదే నోటిఫికేషన్ ప్రకారం.. ఒక ఆరి్థక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రూ.50లక్షలు అంతకుమించి డిపాజిట్ చేసిన సందర్భాల్లో, వ్యాపార టర్నోవర్ లేదా వ్యాపారం నుంచి రావాల్సిన మొత్తం రూ.60లక్షలు మించి ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. → స్వయం ఉపాధిలోని వారు కరెంట్ ఖాతా కలిగి, అందులో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.కోటి డిపాజిట్ చేసిన సందర్భంలోనూ రిటర్నులు వేయాలి. → వడ్డీ ఆదాయం, డివిడెండ్లపై టీడీఎస్ అమలు చేస్తుంటారు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు, ఇలా టీడీఎస్ రూపంలో మినహాయించినది తిరిగి పొందాలంటే (రిఫండ్), ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువులోపు రిటర్నులు వేయకపోతే?జూలై 31 తర్వాత రిటర్నులు దాఖలు చేసే వారు సెక్షన్ 234ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారికి రూ.1,000, రూ.5 లక్షలు మించి ఆదాయం ఉంటే రూ.5,000 పెనాల్టీ కింద చెల్లించాలి. -
నేడు తులం బంగారం కొనాలంటే ఎంత కావాలంటే..
పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు రెండురోజులుగా పెరుగుతుండగా ఈరోజు (జూన్ 30) ధరల్లో ఎలాంటి మార్పులేదు.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతోపాటు అంతర్జాతీయ బంగారం రేట్లపైనా దేశంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.66,250, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద కొనసాగుతన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రెండు సార్లు ‘మరణం’!! రూ.1.1 కోట్ల కోసం మహిళ మోసం
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.ముంబై ప్రాంతంలోని భయాందర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.కంచన్ పాయ్ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. -
ఎస్బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి!.. కేంద్రానికి తెలుగువ్యక్తి పేరు సిఫారసు
ఎస్బీఐ కొత్త ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫారసు చేసింది. ఈ పదవి కోసం ప్యానల్ ముగ్గురుని ఇంటర్వ్యూ చేసి చల్లాను ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. పనితీరును దృష్టిలో ఉంచుకుని ఈయన పెరుగు ప్రతిపాదించినట్లు ఎఫ్ఎస్ఐబీ పేర్కొంది.ఎస్బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ప్రతిపాదించినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత ఛైర్మన్‌గా ఎవరనేది అధికారికంగా వెలువడుతుంది.Recommendation for the position of Chairman in State Bank of India. Official Announcement onhttps://t.co/AEcyakCCQ9 pic.twitter.com/29NdHpGjAL— Financial Services Institutions Bureau (@FSI_Bureau) June 29, 2024ప్రస్తుతం ఎస్బీఐ ఛైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2020 అక్టోబర్ 7న ఎస్బీఐ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అయితే ఈయన పదవీకాలం గత ఏడాది అక్టోబర్‌లోనే ముగిసింది. కానీ కేంద్రం మళ్ళీ మళ్ళీ పొడిగించింది. కాగా ఈయన ఆగష్టు 28వరకు ఎస్బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తరువాత ఈ స్థానంలోకి కొత్త ఛైర్మన్ వస్తారు.ఇక చల్లా శ్రీనివాసులు శెట్టి విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుత గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. అక్కడే ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత హైస్కూల్, ఇంటర్మీడియట్ గద్వాల్లో పూర్తి చేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఈయన 1988లో ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా తన వృత్తి ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో ఈయనకు సుమారు 36 సంవత్సరాలు అనుభవం ఉంది. -
బంగారం ఆగదా? మళ్లీ ఎంత పెరిగిందంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. క్రితం రోజున ప్రారంభమైన పెరుగుదల కొనసాగింది. ఈరోజు (జూన్ 29) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరుగుతున్న ధరలు బంగారం కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర స్వల్పంగా రూ.100 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 జంప్ అయి రూ.66,400 లను, 24 క్యారెట్ల బంగారం రూ.120 ఎగిసి రూ.72,420 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 లకు చేరింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.190 పెరిగి రూ.66,850 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.210 ఎగిసి రూ.72,930 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 లకు ఎగిసింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు మూడో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా మూడు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లు పెంపు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్‌లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.మొదటగా జియో టారిఫ్‌లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్‌లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.ప్లాన్ల కొత్త ధరలు ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్‌కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. -
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తున్నారా.. కొత్త చార్జీలు తెలుసుకోండి!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్డీఎఫ్సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్లను అందించడం ఆపివేసాయి.2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్డీఎఫ్సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. -
ఒక్కసారిగా ఎగిసిన బంగారం.. తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (జూన్ 28) ఒక్కసారిగా ఎగిశాయి. వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగించింది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం ఉన్నంటుండి భారీగా పెరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.400 ఎగిసిరూ.66,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.400 జంప్ అయి రూ.65,900 లను, 24 క్యారెట్ల బంగారం రూ.450 ఎగిసి రూ.72,330 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు చేరింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.440 ఎగిసి రూ.72,720 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.స్థిరంగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)