Personal Finance
-
విదేశీ విద్యా రుణాలు.. కీలకమైన 7 అంశాలు..
ఇటీవలి కాలంలో విదేశీ విద్యను కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో విద్యా రుణాలకు కూడా డిమాండ్ నెలకొంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన విద్యా రుణాలను అందించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన 7 కీలకాంశాలపై అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ⇒ మొత్తం ఖర్చులపై అవగాహన ఉండాలి: విద్యార్థులు విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ట్యూషన్‌తో పాటు వసతి, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులు, బీమా, ఇతరత్రా అనుకోకుండా తలెత్తే ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా ఎంత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనేది తెలుస్తుంది. అవసరానికి మించి తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ లెక్కలు వేసుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ కాల్క్యులేటర్, కాలేజ్ కోర్స్ ఎక్స్పెన్సెస్ కాల్క్యులేటర్ వంటి టూల్స్ ఉపయోగపడతాయి. ⇒ సమగ్ర పరిశోధన అవసరం: ఈ దశ పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న వివిధ రుణాల ఆప్షన్లు, అర్హతలు, వడ్డీ రేట్లు, మంజూరు విధానాలు, తిరిగి చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు, సహ–రుణగ్రహీత అవసరాలు, హామీలు, ప్రాసెసింగ్ ఫీజులపై పరిశోధన⇒ ఖర్చులన్నింటికీ సరిపోయేలా ఉండాలి: కొత్త తరం ఎన్బీఎఫ్సీలు సమగ్ర విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంటే ట్యూషన్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, లెరి్నంగ్ డివైజెస్ కొనుగోలు, జీవన వ్యయాలు మొదలైన అన్నింటికీ ఉపయోగపడే విధంగా లోన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చదువు, కెరియర్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ⇒ డాక్యుమెంటేషన్ ప్రధానం: విద్యార్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ సరిగ్గా సమరి్పస్తే సకాలంలో రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు మెరుగుపడతాయి. ⇒ వేల్యుయేషన్‌పై అవగాహన ఉండాలి: రుణ ప్రొఫైల్స్‌ను మదింపు చేసేందుకు విద్యారి్థ–కేంద్రీకృత విధానాన్ని కొత్త తరం ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. సహ–రుణగ్రహీత ఆర్థిక నేపథ్యంపైనే ఆధారపడకుండా విద్యార్థి అకడమిక్ పనితీరు, ప్రవేశ పరీక్ష స్కోర్లు, ఎంచుకున్న కోర్సు .. యూనివర్సిటీ, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ⇒ వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలి: ముందస్తు అప్రూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి, పత్రాలు తనిఖీ చేయడానికి, రుణాన్ని ఖరారు చేయడానికి ఆర్థిక సంస్థకు కొంత సమయం అవసరవుతుంది. సంస్థను బట్టి అప్రూవల్ ప్రక్రియ వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే నిరీ్ణత సమయానికి రుణం మంజూరయ్యేలా చూసుకోవడానికి వీలవుతుంది. ⇒ స్మార్ట్ రీపేమెంట్ వ్యూహం ప్లాన్ చేసుకోవాలి: లోన్ తీసుకున్న తర్వాత నుంచి వడ్డీని కొంత కొంతగా కట్టుకుంటూ వెళ్లడం మంచిది. ఎందుకంటే గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఆ వ్యవధిలో వడ్డీ పడకుండా ఉండదు. ముందు నుంచి చెల్లించడం ప్రారంభిస్తే విద్యార్థులు ఆర్థికంగా మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. -
మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్‌ను దీర్ఘకాలానికి ఎంపిక చేసుకునే సమయంలో గత పనితీరుపై ఆధారపకుండా.. చూడాల్సిన ఇతర అంశాలు ఏవి? – వినుత్ రాయ్ కేవలం గత పనితీరుపైనే ఆధారపడడం తప్పుదోవలో పయనించడమే అవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచి్చందంటే, అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి కారణం అంతర్గతంగా అవి పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీలే. కనుక ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ చేసి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఉత్థాన పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు రుణాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా రూ.40,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను తీర్చివేసే మార్గాన్ని చూపగలరు? – ప్రేమ్ నాయక్ రుణాలు భవిష్యత్ ఆదాయాన్ని హరించివేస్తాయి. కనుక వీలైనంత వెంటనే వాటిని వదిలించుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఆర్థిక భారంగా మారిన రుణాన్ని మొదట తీర్చివేయాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణంతో మొదలు పెట్టండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణం ఇది. అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని ఉపసంహరించుకుని క్రెడిట్‌కార్డు రుణం తీర్చివేయాలి. లేదంటే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అయినా దీన్నుంచి బయటపడే మార్గాన్ని చూడండి. క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించిన అనంతరం కారు రుణాన్ని తీర్చివేయడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వాహనాల విలువ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. కనుక వీలైనంత ముందుగా ఈ రుణాన్ని కూడా తీర్చివేయాలి. గృహ రుణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో విలువ పెరిగే ఆస్తి ఇది. పైగా గృహ రుణాలపై అన్నింటికంటే తక్కువ వడ్డీ రేటుతోపాటు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. -
పిల్లల బీమా.. ఇవ్వదు ధీమా..!
తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల విద్య ఒకటి. విద్యా వ్యయాలు ఏటేటా 10 శాతానికి మించి పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం 5.5 శాతంతో పోల్చితే రెట్టింపు స్థాయి ద్రవ్యోల్బణం విద్యారంగంలో చూడొచ్చు. దీని కారణంగా నేడు ఒక కోర్స్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుంటే.. 13 ఏళ్ల తర్వాత (ఉన్నత విద్యకు వచ్చే సరికి) రూ.1.09 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యయాలను అధిగమించడం సులభమవుతుంది.పాఠశాల ప్రవేశం నాటి నుంచే పిల్లల విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. భవిష్యత్‌లో ఎంత అవసరమో, ఆ మేరకు సమకూర్చుకునే విధంగా ప్రతి నెలా పొదుపు, మదుపు చేస్తూ వెళ్లాలి. ఇందుకు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలకంగా మారతాయి. ఇక్కడ తప్పటడుగులు వేస్తే పిల్లల ఉన్నత విద్య కోసం రేపు అప్పు చేయాల్సి రావచ్చు. కేవలం చైల్ట్ ఇన్సూరెన్స్ పాలసీలతో విద్యా వ్యయాలను తట్టుకోవడం కష్టమే. ఈ దిశగా అవగాహన కల్పించే కథనమిది... తల్లిదండ్రుల్లో ఎంత మంది తమ పిల్లల భవిష్యత్ విద్యకు సన్నద్ధంగా ఉన్నారు? ఇదే తెలుసుకుందామని హెచ్ఎస్బీసీ సంస్థ ఓ సర్వే చేసింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిపోర్ట్ 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 53 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పిల్లలే విద్యా రుణం తీసుకుంటారని 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కొందరు ఆస్తులు అమ్మి చదివిస్తామని చెప్పగా, స్కాలర్íÙప్ మార్గాలు చూస్తామని కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ, పిల్లల పేరిట పెట్టుబడులు చేస్తున్న వారిలో ఎంత మంది మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకున్నారన్నది ఈ సర్వే తేల్చలేదు. మొత్తానికి సగం మందికి ఆర్థిక ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులకు ఏదైనా జరగరానిది జరిగితే... పిల్లల విద్యకు ఆరి్థక తోడ్పాటు అందించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మార్కెట్లో క్రేజ్ ఉంది. బీమా ఏజెంట్లు వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి వీటిలో చార్జీలు ఎక్కువ. దాంతో రాబడులు కొంత తక్కువ. పిల్లల పేరిట మార్కెటింగ్ చేసే ఉత్పత్తుల వలలో పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా బీమా, పెట్టుబడులను కలపడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఈ రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.చైల్డ్ ప్లాన్లలో ఏముంది?పిల్లల పేరిట రెండు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. యూనిట్ లింక్డ్ చి్రల్డన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్‌లు) ఇందులో ఒక రకం. చెల్లించిన ప్రీమియంలో బీమా రిస్క్, నిర్వహణ, ఇతరత్రా వ్యయాలు పోను మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లింక్డ్ (ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత) సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీదారుల ఎంపిక మేరకు డెట్‌లోనూ పెట్టుబడులు పెడతాయి. వచ్చిన రాబడులను పాలసీదారులకు అందిస్తాయి. ఎండోమెంట్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ రెండో రకం. ఇందులోనూ బీమా రిస్క్, ఇతర వ్యయాలు పోను మిగిలిన ప్రీమియాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.పాలసీదారులకు హామీ మేరకు రాబడులు అందిస్తాయి. కానీ, వీటిలో రాబడులు 5–6 శాతం మించవు. ఈక్విటీ ఆధారిత యులిప్ ప్లాన్లలో రాబడులు కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే గ్యారంటీడ్ కావు. మార్కెట్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాల ప్లాన్లలోనూ, పాలసీ కాల వ్యవధి ముగియక ముందే పాలసీదారు (తల్లి లేదా తండ్రి) మరణించినా లేక కాల వ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారు మరణించినట్టయితే, అప్పుడు బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి పెట్టుబడులను కొనసాగించి, యథాప్రకారం పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది. దాంతో పిల్లల ఉన్నత విద్యకు ఆ నిధిని ఉపయోగించుకోవచ్చు. ‘‘దురదృష్టవశాత్తూ తల్లి లేదా తండ్రి మరణించినట్టయితే పరిహారం చెల్లించే ఈ పథకాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ప్రీమియం వేవర్ ముఖ్యమైన సదుపాయం. పాలసీదారు మరణించినట్టయితే ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యాక్టివ్‌గా కొనసాగుతుంది. పిల్లల విద్యా లక్ష్యాలకు కావాల్సినంత మేర సమకూరుతుంది’’ అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువరీ ఆదిత్య మాల్ వివరించారు. పాలసీదారు మరణించినప్పటికీ గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధుపం కృష్ట సైతం తెలిపారు. సమ్ అష్యూర్డ్ (బీమా) వెంటనే చెల్లించి, మిగిలిన ప్రయోజనాలను పాలసీ గడువు ముగిసిన తర్వాత చెల్లించేవి ఉన్నాయి.లాకిన్ పిరియడ్... ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. సాధారణంగా ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే మొదటి ఐదేళ్లు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఈ కాలంలో పాలసీని సరెండర్ చేసినా వచ్చేదేమీ ఉండదు. లాకిన్ పీరియడ్ తర్వాత పాక్షికంగా ఉపసహరించుకోవచ్చు. నిర్బంధంగా పెట్టుబడిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ ప్లాన్లలో లాకిన్ ఉంటుంది. వీటిలో ఏజెంట్లకు కమీషన్ మెరుగ్గా ఉంటుంది. ఎంత అధిక ప్రీమియానికి పాలసీలో చేరి్పస్తే ఏజెంట్‌కు అంత అధికంగా కమిషన్ ముడుతుంది. ‘‘టర్మ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్య. టర్మ్ ప్లాన్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కనుక వీటిని ఏజెంట్లు విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు’’అని కృష్ణ వివరించారు.ఆరి్థక ప్రణాళికలో చేసే తప్పుల్లో బీమా, పెట్టుబడి కలపడం ఒకటని ఆనంద్‌రాఠి వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని తెలిపారు. ‘‘ఇన్సూరెన్స్, పెట్టుబడి పూర్తి భిన్నమైన ఆరి్థక ఉత్పత్తులు. ఇన్వెస్టర్లు వీటిని కలపకూడదు. ఊహించని నష్టం నుంచి రక్షణ కల్పించడమే బీమా ఉద్దేశం. పెట్టుబడి సాధనం ఉద్దేశం సంపద సమకూర్చుకోవడం’’ అని వివరించారు. ‘‘సంప్రదాయ ఎండోమెంట్ పాన్లలో రాబడులు 4–5 శాతం మేర ఉంటాయి. విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే సంప్రదాయ బీమా ప్లాన్లలో పెట్టుబడితో మిగిలేదేమీ ఉండదు.చైల్డ్ యులిప్ ప్లాన్లలో 9–11 శాతం మేర రాబడులు వస్తాయి. కాకపోతే ఆరి్థక సైకిల్, మార్కెట్ సైకిల్‌పైనే ఈ రాబడులు ఆధారపడి ఉంటాయి’’ అని కృష్ట తెలిపారు. కనుక సంప్రదాయ ఎండోమెంట్ ఆధారిత చైల్డ్ ప్లాన్లు పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వమని స్పష్టమవుతోంది. ఇక యులిప్ ప్లాన్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఎంపిక అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. చార్జీలు చాలా తక్కువ. యులిప్ ప్లాన్లలో చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. ప్రీమియం అలోకేషన్ చార్జీ, అడ్మిని్రస్టేటివ్ చార్జీ, మోర్టాలిటీ చార్జీ, సరెండర్ చార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ ఇన్నేసి చార్జీలు యులిప్‌లలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ పారదర్శకత ఎక్కువ.మెరుగైన ప్రత్యామ్నాయాలు..చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెరుగైన ప్రయోజనాన్ని ఇవ్వనప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఊహించనది జరిగితే వారసుల విద్య ఆగిపోకూడదు. కుటుంబ జీవనం ఇబ్బందుల పాలు కాకూడదు. అందుకని జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవడం మంచి మార్గం అవుతుంది. ‘‘టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీని ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైల్డ్ ప్లాన్ల కంటే మెరుగైన రాబడులు వస్తాయి.చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ తగినంత ఉండదు. అప్పుడే కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టిన వారికి, తాజాగా రుణం తీసుకున్న వారికి మరింత కవరేజీ అవసరం ఏర్పడుతుంది’’ అని కృష్ట తెలిపారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోలే పథకాలను ఎంపిక చేసుకోవచ్చని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ రేణు మహేశ్వరి సూచించారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ రూ.10–15 వేల ప్రీమియంకే వస్తుంది. కనుక చైల్డ్ ప్లాన్ల కోసం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి బదులు.. టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసు కోవాలి.విభిన్న ఫండ్స్...టర్మ్ప్లాన్లోనూ మరణం లేదా అంగవైకల్యం పాలైనప్పుడు చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మేర తక్షణమే చెల్లించి, మిగిలినది ప్రతి నెలా 10 ఏళ్ల పాటు చెల్లింపుల సదుపాయాలతో టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఏటా 12 శాతం, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అయితే సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంది. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్ (సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్)ను ఎంపిక చేసుకోవాలి.ఇందులో చార్జీలు చాలా తక్కువ. సూచీల మాదిరే రాబడులు వీటిల్లో వస్తాయి. మరీ ముఖ్యంగా 7 ఏళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తుంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్స్ పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీక్యాప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, రిస్క్ తక్కువ కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్, రిస్క్ ఇంకా తక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణుల సూచన. పన్ను ప్రయోజనంచైల్డ్ యులిప్ ప్లాన్లలో రాబడులపై పన్ను భారం లేకపోవడాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీనికి బదులు టర్మ్‌ప్లాన్ విడిగా తీసుకుని, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఈక్విటీ లాభాలపై స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కదపకుండా, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్చకుండా.. స్థిరంగా ఒకే పథకంలో కొనసాగించడం వల్ల అనవసర పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. అయినా సరే ఈక్విటీ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు అది ఏడాది మించిన కాలం అయితే మొదటి రూ.లక్షకు మించిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఏడాదిలోపు పెట్టుబడులపై వచ్చే లాభం నుంచి 20 శాతం మేర పన్ను కింద చెల్లించాలి. నిపుణుల పెట్టుబడి ప్రణాళికను అనుసరించినట్టయితే అప్పుడు మెరుగైన జీవిత బీమా రక్షణ, ఈక్విటీలపై అద్భుత రాబడులు అందుకోవడానికి అవకాశాలుంటాయి. పన్ను చెల్లింపులు పోను నికర రాబడులు చైల్డ్ ప్లాన్లతో పోల్చితే.. అధికంగానే ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ పన్ను ప్రయోజనం కోసమని యులిప్ పాలసీకే మొగ్గు చూపేట్టు అయితే విడిగా టర్మ్‌ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్‌ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్‌లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
బంగారాన్ని మించి.. ‘స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం’
న్యూఢిల్లీ: ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ.. మరోవైపు మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఏంజెల్ వన్‌కు చెందిన ‘ఫిన్‌వన్’ అధ్యయనంలో వెల్లడైంది.58 శాతం మంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే, 39 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌ను అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 పట్టణాలకు చెందిన 1,600 మంది యువతీ, యువకుల పెట్టుబడుల ప్రాధాన్యతలు, ఆర్థిక అక్షరాస్యత, టెక్నాలజీ, ఫైనాన్షియల్ టూల్స్ వినియోగాన్ని విశ్లేషించిన అనంతరం ఫిన్‌వన్ నివేదికను విడుదల చేసింది. » పొదుపునకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 93 శాతం మంది తమ ఆదాయంలో ఎంతో కొంత ఆదా చేస్తుండగా, కొంత మంది 20–30 శాతం వరకు పొదుపు చేస్తున్నారు. » ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బంగారం కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే 45 శాతం మంది ప్రాధాన్యం చూపుతున్నారు. » పెట్టుబడికి అధిక భద్రత ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు 22 శాతం మంది, రికరింగ్ డిపాజిట్ల వైపు 26 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. » అధిక రాబడులతోపాటు స్థిరమైన రాబడులకూ యువత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. » యువతరం టెక్ సాయాన్ని తీసుకుంటోంది. 68 శాతం మంది ఆటోమేటెడ్ సేవింగ్ టూల్స్ వాడుతున్నారు. » 85 శాతం మంది పెరిగిపోయిన జీవన వ్యయం.. ముఖ్యంగా ఆహారం, యుటిలిటీలు, రవాణా వ్యయాలను ప్రస్తావించారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
దివ్యాంగులకు ఆరోగ్య బీమా.. ఈ 5 తప్పిదాలు చేయొద్దు
సరైన ఆరోగ్య బీమా పథకమనేది దివ్యాంగులకు ఒక రక్షణ కవచంలాంటిది. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన పథకాన్ని తీసుకోగలిగితే ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే, సరైన బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. అర్థం కాని పరిభాష, పైకి కనిపించని నిబంధనలు, అనేకానేక ఆప్షన్లు మొదలైన వాటితో ఇదో గందరగోళ వ్యవహారంగా ఉంటుంది.ఒక్క చిన్న తప్పటడుగు వేసినా సరైన కవరేజీ లేకుండా పోవడమో, ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావడమో లేక అత్యవసర పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురుకావడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దివ్యాంగులు ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు నివారించతగిన తప్పిదాలపై అవగాహన కల్పించడం ఈ కథనం ఉద్దేశం. అవేమిటంటే..కీలక వివరాలను పట్టించుకోకపోవడం: ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు స్పష్టంగా కనిపించే కీలక విషయాలను కూడా అంతగా పట్టించుకోకపోవడమనేది సాధారణంగా చేసే తప్పిదాల్లో ఒకటిగా ఉంటుంది. దివ్యాంగుల విషయానికొస్తే, పాలసీలోని ప్రతి చిన్న అంశమూ ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుంది. కాబట్టి అన్ని నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, పరిమితులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి.నిర్దిష్ట అనారోగ్యాలు, చికిత్సలకు బీమా వర్తించకుండా మినహాయింపుల్లాంటివేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటి వివరాలను పట్టించుకోకపోతే ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావచ్చు లేదా క్లెయిమ్ పూర్తి మొత్తం చేతికి రాకపోవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.కేవలం ప్రీమియంనే ప్రాతిపదికగా ఎంచుకోవడం:ప్రీమియం అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే ఆలోచనతో పథకాన్ని ఎంచుకుంటే చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. సాధారణంగా ప్రీమియంలు తక్కువగా ఉంటే మన జేబు నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు.కవరేజీ పరిమితంగానే ఉండొచ్చు లేదా దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలకు బీమా ఉపయోగపడని విధంగా పరిమితుల్లాంటివి ఉండొచ్చు. ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ గణనీయంగా మెరుగైన కవరేజీని ఇచ్చే పథకాన్ని ఎంచుకుంటే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది.కో–పే, సబ్–లిమిట్స్ తెలుసుకోకపోవడం: క్లెయిమ్ చేసేటప్పుడు చేతికి వచ్చే మొత్తంపై కో–పే, సబ్–లిమిట్స్ అనే కీలకాంశాలు చాలా ప్రభావం చూపుతాయి. కో–పే అనేది క్లెయిమ్ సమయంలో పాలసీదారు తాను భరించేందుకు అంగీకరించే నిర్దిష్ట శాతాన్ని తెలియజేస్తుంది. కో–పే పరిమితులు ఎంత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ పేఅవుట్ అంత తక్కువవుతుంది.అలాగే, సబ్–లిమిట్స్ అనేవి నిర్దిష్ట అనారోగ్యాలు లేక చికిత్సలు, అంటే ఉదాహరణకు క్యాటరాక్ట్, మోకాలి మార్పిడి మొదలైన వాటికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒక స్థాయికి పరిమితం చేస్తాయి. ఈ పరిమితులను చూసుకోకపోతే జేబుకు గణనీయంగా చిల్లు పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం: కాలం గడిచే కొద్దీ ఆరోగ్య అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్‌ను ఎంచుకోవడం కీలకం. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి అదనపు సంరక్షణ లేక విభిన్నమైన చికిత్సలు అవసరమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు, ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో తలెత్తే అవకాశము న్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.వివిధ ఆప్షన్లను పరిశీలించకపోవడం: ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు కనిపించిన మొదటి పథకాన్ని తీసేసుకోకుండా వివిధ ప్లాన్లను పరిశీలించి చూసుకోవాలి. కవరేజీ, ఖర్చులు, ప్రొవైడర్ నెట్‌వర్క్‌లు, అదనపు ప్రయోజనాలపరంగా వివిధ పథకాల్లో మార్పులు ఉంటాయి. పలు ప్లాన్లను పోల్చి చూసుకునేందుకు కాస్త సమయం వెచ్చించాలి. దివ్యాంగులకు సంబంధించి ఒక్కో ప్లాన్‌లో కవరేజీ ఏ విధంగా ఉందనేది పరిశీలించి చూసుకోవాలి.ఇందుకోసం కంపారిజన్ వెబ్సైట్ల వంటి సాధనాలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే బీమా అడ్వైజర్ల సలహా తీసుకోవాలి. ప్లాన్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి విధానాన్ని పాటిస్తే అవసరాలకు తగినట్లుగా ఉండే సమగ్రమైన, చౌకైన పథకాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రీమియం మాత్రమే చూసుకోవద్దు. కవరేజీ పరిమితులను పరిశీలించుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవాలి. వివిధ ఆప్షన్లను పోల్చి చూసుకోవాలి. -
టాటా ఇన్నోవేషన్ ఫండ్.. రూ. 5000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
హైదరాబాద్: వినూత్న వ్యూహాలు, థీమ్‌లతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇది నవంబర్ 11 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది.కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ మార్కెట్ క్యాప్‌లు, రంగాలవ్యాప్తంగా ఇన్నోవేషన్ థీమ్ ద్వారా లబ్ధి పొందే సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి ఈ ఫండ్ తోడ్పడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాహుల్ సింగ్ తెలిపారు.యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఇండెక్స్ ఫండ్.. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ క్రిసిల్–ఐబిఎక్స్ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్–సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్–సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నవంబర్ 21 వరకు ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
పన్ను ఎగవేత.. పలు రకాలు..
పన్ను ఎగవేత చట్టరీత్యా నేరం. అనైతికం. ఆర్థికంగా సంక్షోభం తయారవుతుంది. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ‘విలన్’ మనకు ఆది నుంచి చివరి వరకు కనిపిస్తాడు. నిజజీవితంలో ‘విలన్’ విలన్‌లాగా కనిపించడు. ఓ పరోపకారి పాపయ్యలాగా, ఓ మర్యాద రామన్నలాగా అనిపిస్తాడు. వినిపిస్తాడు. కనిపిస్తాడు. ఎంతో మోసం చేస్తాడు. మనం తెలుసుకునే లోపల తెరమరుగవుతాడు.‘‘మీరు ఇప్పుడే మోసపోయారు’’ పుస్తకంలో రచయిత.. మనం ప్రతి రోజూ వైట్‌కాలర్ క్రైమ్ ద్వారా ఎలా మోసపోతున్నామో కళ్ళకి కట్టినట్లు తెలియజేశారు. ‘‘డబ్బుని ఎలా సంపాదించాలి’’ అనే పుస్తకంలో రచయిత ’అంకుర్ వారికూ’ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవాలని మొదలైన విషయాల మీద ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. అలాగే తెలుగు రచయతలు వీరేంద్రనాథ్‌గారు, బీవీ పట్టాభిరాం గారు తమ పుస్తకాల ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంత మంది చెప్పినా, ఇన్ని విషయాలు తెలిసినా, షరా మామూలే!ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!ఒకరిని చూసి ఒకరు. ఆశతో, ప్రేరేపణతో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు మోసం చేస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలున్నట్లు..అకౌంట్స్ బుక్స్ నిర్వహించపోవడం, నిర్వహణలో అవకతవకలు, ఆదాయాన్ని తక్కువగా చూపించడం, ఖర్చులను పెంచేయడందురాలోచనలతో బంగారాన్ని .. అంటే ఆభరణాలు, రత్నాలు, డైమండ్లు, వెండి విషయాల్లో సెంటిమెంటు పేరు మీద, పసుపు–కుంకాల పేరు మీద, పెళ్లిళ్ల పేరు మీద కొంటున్నారు. అమ్ముతున్నారు. మళ్లీ కొంటున్నారు. పెట్టుబడికి సోర్స్ చెప్పరు. లాభాన్ని లెక్కించరు. ఆస్తిగా చూపించరు. ‘‘భర్తకే చెప్పం’’ అంటారు కొందరు మహిళలు. మీకు గుర్తుండే ఉంటుంది. రైళ్లలో బోగీ ఎక్కే ముందు ఇదివరకు ప్రయాణికుల జాబితా ఉండేది. పేరు, వయస్సు, లింగం, పాన్ నంబరు, మొదలైనవి అందులో ఉంటాయి. బంగారం షాపులవాళ్లు వారి సిబ్బందిని పంపించి ఆ వివరాలను సంగ్రహించేవారు. ఆ జాబితాను తీసుకుని, షాపునకు వచ్చి, అందులోని పేర్ల మీద ఇతరులకు అమ్మేవారు.వ్యవసాయ భూమి అంటే ఏమిటో ఆదాయపు పన్ను నిర్వచించినా, గ్రామాల పేరు మార్చి, సరిహద్దులు మార్చి అమ్మకాల్లో మోసం. అలాగే ఆదాయం విషయంలో ఎన్నో మతలబులు.. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం, భూమి అమ్మకాల మీద పన్ను లేదు.ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పనక్కర్లేదు. నేతి బీరకాయలో నేయి లేదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ‘‘రియల్’’ గానే పన్ను ఎగవేత ఉంది.అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు, స్టాక్స్, క్రయవిక్రయాల్లో ఎన్నో అక్రమమార్గాలు అవలంబిస్తున్నారు.పబ్లిక్ కంపెనీల్లో షేరు ప్రీమియం పేరుతో మోసాలు.. అలాగే షేర్స్ అలాట్మెంట్కి ముందుగా అప్లికేషన్‌తో పాటు వసూలు చేసే మనీతో మోసాలు.వ్యాపారంలో సర్దుబాటు హుండీలు సహజం... వీటి మార్పిడి... ఇదొక సరిహద్దుల్లేని వ్యాపారం అయిపోయింది.డమ్మీ సంస్థలు.. ఉనికిలో లేనివి.. ఉలుకు లేని..పలుకు లేని.. కాగితం సంస్థలు. కేవలం ఎగవేతకే ఎగబాకే సంస్థలు. దొంగ కంపెనీలు. డొల్ల కంపెనీలు. బోగస్ వ్యవహారాలు. బోగస్ కంపెనీలు.క్రిప్టోకరెన్సీల్లో గోల్మాల్..ఇలా ఎన్నో.. ముఖ్యంగా సోర్స్ చెప్పకపోవడం, పెట్టుబడికి కానీ.. రాబడికి కానీ వివరణ ఇవ్వకపోవడం, పన్ను ఎగవేతకు పన్నాగం చేయడం. వీటి జోలికి పోకండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
రూ.1.5 కోట్లు వచ్చాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఒక ప్రాపర్టీ అమ్మగా రూ.1.5 కోట్లు వచ్చాయి. వచ్చే 12 ఏళ్ల వరకు వీటితో నాకు అవసరం లేదు. కనుక వీటిని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నేను సహేతుక స్థాయిలో రిస్క్ తీసుకోగలను. ఏ తరహా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎంపిక చేసుకోవాలి? రూ.1.5 కోట్లను మొత్తం ఎన్ని నెలల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లించాలి? నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ మాదిరి ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక చేసుకోవచ్చా? – రాజన్ప్రాపర్టీ అమ్మగా వచ్చిన రూ.1.5 కోట్లు.. మీ మొత్తం సంపద విలువలో 50–60 శాతంగా ఉంటే కనుక, ఇక్కడి నుంచి మూడేళ్ల కాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే మార్కెట్ ఓ పది శాతం మేర పడిపోతే అప్పుడు భావోద్వేగ పరమైన రిస్క్ సులభంగా అధిగమించేందుకు ఇలా చేయాలి. ఒకవేళ మీరు చెప్పిన రూ.1.5 కోట్లు మీ మొత్తం సంపదలో కేవలం 10–15 శాతంగానే ఉంటే అప్పుడు ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో పలు వాయిదాలుగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.12 ఏళ్ల కాలం ఈక్విటీ పెట్టుబడులకు అనుకూలమైనది. కనుక మీ పెట్టుబడుల్లో 20–50 శాతం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మైక్రోకాŠయ్ప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు ఎక్కువ మొత్తం కేటాయించుకోవడం వల్ల అనిశ్చిత సమయాల్లో పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం ఉంటుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ మంచి ఆప్షన్. ఇది ప్యాసివ్ పథకం.కనుక నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్‌లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. యాక్టివ్‌గా పనిచేసే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవచ్చు. యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ మిశ్రమంగా ఉండడం పోర్ట్‌ఫోలియోకి మంచిది. సరైన యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, అప్పుడు ప్యాసివ్ ఫండ్స్‌కు పరిమితం కావొచ్చు. ఒకే సూచీని అనుసరించి పనిచేసే వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – వేణుగోపాల్ఒకే సూచీని అనుసరించి ఇన్వెస్ట్ చేసే వివిధ ఇండెక్స్ ఫండ్స్ అన్ని ఒకేసారి కాకుండా వివిధ సమయాల్లో ప్రారంభమవుతుంటాయి. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవీ.. 2022లో ప్రారంభమైన ఇండెక్స్ ఫండ్‌తో పోల్చితే 22 ఏళ్ల కాలం పాటు వృద్ధి చెందుతూ వచ్చింది. కనుక దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ఎన్ఏవీ రూ.10 అయినా లేక రూ.100 అయినా ఇండెక్స్ పనితీరు ఆధారంగానే రాబడులు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇండెక్స్‌లో ఎంత శాతం మేర మార్పు వచ్చిందన్నదే ముఖ్యంగా చూడాలి కానీ, ఎన్ఏవీ కాదు. సెన్సెక్స్ 10 శాతం పెరిగితే అప్పుడు సెన్సెక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వివిధ ఫండ్స్ ఎన్ఏవీ రూ.10, రూ.100గా ఉన్నప్పటికీ అవి కూడా 10 శాతమే పెరిగి ఉంటాయ్. కనుక ఎన్ఏవీతో సంబంధం లేకుండా ఇండెక్స్ ఆధారితంగా పథకం ఎన్ఏవీలో వృద్ధి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి! -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం.ఆధార్ కార్డ్‌లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.ఆధార్ అప్డేట్ ఆవశ్యకతప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.డిసెంబర్ 14 ఆఖరి గడువు?పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు.ఆధార్ కార్డును అప్డేట్ చేయండిలా..⇒ 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.⇒ అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్లోడ్ చేయండి.⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి.ఆధార్ కార్డ్ అప్డేట్కు అవసరమైన పత్రాలురేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. -
సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్డీఎఫ్సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..ఓవర్ నైట్: 9.15 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!
పన్నుల ఎగవేతకు, ప్రణాళికబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి గల తేడాలకు సంబంధించి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీషులో Tax Evasion అంటే ఎగవేత.. ఇంగ్లీషులో Tax Planning అంటే ప్లాన్ చేయడం. ప్లాన్ చేయడం వల్ల Tax Avoidance చేయవచ్చు. ఎగవేత నేరపూరితం. ప్లానింగ్ చట్టబద్ధమైనది. వివరాల్లోకి వెళితే..పన్నుల ప్రణాళిక లక్ష్యాలుచట్టంలో ఉన్న అంశాలకు లోబడి ప్లాన్ చేయడం.అన్ని వ్యవహారాలు, బాధ్యతలు చట్టప్రకారం ఉంటాయి.చట్టప్రకారం అవకాశం ఉన్నంతవరకు పన్ను భారాన్ని తగ్గించుకోవడం.ఇదొక హక్కులాంటిది .. శాస్త్ర సమ్మతమైనది.పన్ను ఎగవేత: ఉద్దేశాలుచట్టంలో అంశాలను ఉల్లంఘించడం.జరిగే వ్యవహారాలు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి.ఉద్దేశపూర్వకంగా పన్ను తప్పించుకునే మార్గాల అమలు.ఇది నేరం. చట్టవిరుద్ధం.పన్నుల ఎగవేతలో కావాలని పన్నులు కట్టకుండా ఎగవేయడం ఉంటుంది. అది చట్టవిరుద్ధం. అనైతికం. అబద్ధాలు చెప్పి, తప్పులు చేసి, ఎన్నో కుతంత్రాల ద్వారా ఆదాయాన్ని దాచి, దోచి.. పన్నులను కట్టకపోవడం కిందకు వస్తుంది. ఎన్నో మార్గాలను వెతుక్కుని, అమలుపర్చి తద్వారా పన్నులు ఎగవేస్తారు. మోసపూరితమైన వ్యవహారాలు, మోసపూరితమైన సమాచారం, లెక్కలు.. ఇవన్నీ అభ్యంతరకరం. చట్టరీత్యా నేరం. ఎండమావుల్లాగా ప్రయోజనం అనిపిస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు. ఎన్నెన్నో ఉదాహరణలు. ఎన్నో మార్గాలు. అడ్డదార్లు. ఎందరో మనకు తారసపడతారు. మెరిసిపోతుంటారు. మురిసిపోతుంటారు. వెలిగిపోతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. ఇలాంటి వారిపై చట్టపరంగా శిక్షలు తీవ్రంగానే ఉంటాయి. వడ్డీలు వడ్డిస్తారు. పెనాల్టీలు వేస్తారు. కటకటాల పాలు కావచ్చు. ఎన్నో చట్టాలు వారిని పట్టుకుంటాయి.ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?పన్నుల ప్లానింగ్ఇక పన్నుల ప్లానింగ్‌లో ఓ పద్ధతి ఉంటుంది. ఇది చట్టానికి లోబడి ఉంది. నైతికంగా ఉంటుంది. అబద్ధం ఉండదు. తప్పు ఉండదు. కుతంత్రం ఉండదు. ఆదాయాన్ని దోచడం ఉండదు. దాచడం ఉండదు. పన్నులు పడకుండా జాగ్రత్త పడటం.. పన్నుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మోసపూరితం కాదు. లెక్కలు గానీ, సమాచారం గానీ మోసపూరితమైనదిగా ఉండదు. అతిక్రమణ ఉండదు. ప్రయోజనం ఉంటుంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నెన్నో సక్రమమైన మార్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరం 10 కోట్ల 41 లక్షల మంది రిటర్నులు వేశారు. లక్ష మంది వారి ఆదాయం కోటి రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. వీరే మనకు ఆదర్శవంతులు. మనకు కట్టాల్సిన పన్నుల వివరాలు వెల్లడించడం ద్వారా చట్టప్రకారం అన్ని ప్రయోజనాలు దొరుకుతాయి. ఎటువంటి శిక్షలు ఉండదు. మనం ఈ మార్గాన్నే అనుసరిద్దాం.-కె.సీ.హెచ్ ఏ.వీ.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
అడ్వయిజర్లతో ఆర్థిక ప్రణాళిక ఈజీ!
ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక అవసరం. వివిధ దశల్లో లక్ష్యాలను సాకారం చేసుకుంటూ విజయవంతంగా సాగిపోవడానికి మెరుగైన మార్గాన్ని చూపిస్తుంది. జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అందుకు అనుగుణంగా పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పన, వాటి ఆచరణ ఇవన్నీ ఆర్థిక విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, మనలో ఎక్కువ మందికి ఆర్థిక అంశాలపై కావాల్సినంత అవగాహన ఉండదు. ఇలాంటప్పుడే నిపుణుల సేవలు అవసరం పడతాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత కాలం పాటు, ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలి? ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి.. వీటిని తేల్చడం నిపుణులకే సాధ్యపడుతుంది. అంతేకాదు పెట్టుబడి పెట్టడంతోనే పని ముగిసినట్టు కాదు. తమ లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. ఈ పనిని సులభతరం చేసే వారే ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు లేదా ఫైనాన్షియల్ ప్లానర్లు. వీరిని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎవరు ఎంపిక చేసుకోవాలి? వీరి సేవలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై అవగాహన కలి్పంచే కథనమిది... తమకు అనుకూలమైన ఆర్థిక సలహాదారును ఎంపిక చేసుకోవడం విజయంలో కీలకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మంచి ట్రాక్ రికార్డు అని కాకుండా.. తమ లక్ష్యాల ప్రాధాన్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే నిపుణులను ఎంపిక చేసుకోవడం అవసరం. ‘‘ఆర్థిక ప్రణాళిక ఆరంభించడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు. ఎంత ముందుగా ఆరంభిస్తే అంత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు’’ అనేది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మైంట్ అడ్వయిజర్ల, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ అభిప్రాయం. అందుకని కెరీర్ ఆరంభంలోనే ఆర్థిక నిపుణుల సాయంతో మెరుగైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, ఆ దిశగా అడుగులు వేయడం ద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకున్నట్టు అవుతుంది.నిజంగా అవసరమా? మన విద్యా వ్యవస్థ చాలా విషయాలను నేర్పుతుంది. కానీ ఆర్థిక విషయాలు, ప్రణాళికల గురించి ఎక్కడా కనిపించదు. వివాహం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కనీసం రూ.కోటి ఉంటేనే కానీ సొంతింటి కల సాకారం కాదు. పిల్లల విద్య కోసం ఏటా రూ.లక్షలు వెచి్చంచాలి. ఖరీదైన వైద్యం, రిటైర్మెంట్ తర్వాత జీవన అవసరాలు వీటన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. భారీ ఆదాయం ఆర్జించే వారికి తప్పించి, ప్రణాళిక లేకుండా వీటిని విజయవంతంగా అధిగమించడం సామాన్య, మధ్యతరగతి వారికి అంత సులభం కాదు. అర్హత కలిగిన, సెబీ రిజిస్టర్డ్ నిపుణుల సాయంతో వీటిని అధిగమించేందుకు తేలికైన మార్గాలను గుర్తించొచ్చు. ‘‘తమ జీవితంలో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వయిజర్ లేదా ప్లానర్ అవసరం తెలిసొస్తుంది. ఇందుకు నిదర్శనం ఇటీవల చూసిన కరోనా విపత్తు. ఆ సమయంలో అత్యవసర నిధి సాయం ప్రాధాన్యాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు’’ అని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్‌పీఎస్‌బీ) ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పేర్కొన్నారు. ఒకటికి మించి లక్ష్యాలు కలిగి, పొదుపు, మదుపు పట్ల ఆసక్తి కలిగిన వారు నిపుణుల సాయంతో అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఆర్థిక అంశాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వారు సైతం.. పొదుపు, పెట్టుబడుల పట్ల తగినంత సమయం వెచి్చంచలేనట్టయితే నిపుణుల సాయానికి వెనుకాడొద్దు. అనుకోని అవసరాలు ఏర్పడితే కొందరు రుణాలతో అధిగమిస్తుంటారు. ఆ రుణం తర్వాత మళ్లీ రుణం ఇలా రుణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఎంత సంపాదించినా చివరికి మిగిలేదేమీ ఉండదు. స్వీయ తప్పిదాలు, అవగాహనలేమితో ఆర్థిక సంక్షోభాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక నిపుణులను కలవడం వల్ల లక్ష్యాల పట్ల స్పష్టత వస్తుంది. ఆర్థిక సవాళ్లను అధిగమించడం ఎలాగన్న స్పష్టత వస్తుంది. మెరుగైన బాట తెలుస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత సాధ్యపడుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక ఉన్న కుటుంబాల్లో మానసిక ప్రశాంతత పాళ్లు ఎక్కువని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి.అందుబాటులో ఉన్న ఆప్షన్లు.. ఆర్ఐఏలు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు వీరు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనాన్స్ డిగ్రీ, కనీసం ఆయా విభాగంలో ఐదేళ్ల పాటు సేవలు అందించిన/పనిచేసిన అనుభవంతోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్ఎం) నుంచి ఎక్స్ఏ, ఎక్స్‌బీ సర్టిఫికెట్ కలిగి ఉంటారు. వీరు తమ క్లయింట్ల ప్రయోజనాల కోసమే కృషి చేయాలి. ఎవరి నుంచి ఏ రూపంలోనూ కమీషన్లు స్వీకరించరాదని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.సీఏలుఅకౌంటింగ్, పన్ను, ఆడిట్ అంశాల్లో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) ఎంతో శిక్షణ పొంది ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాలు సీఏలకు ఉండాలని లేదు. అయినా కానీ, పన్ను కోణంలో తమ క్లయింట్లకు పెట్టుబడుల సూచనలు చేయవచ్చు.సీఎఫ్‌పీలు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు తగిన కోర్సులు, పరీక్షలు పూర్తి చేసి ఎఫ్‌పీఎస్‌బీ నుంచి సర్టిఫికేషన్ పొందిన వారు. వ్యక్తుల ఆర్థిక ప్రణాళిక, పన్నులు, బీమా, రియల్ ఎస్టేట్ ప్లానింగ్ తదితర సేవలు అందిస్తారు.క్యూపీఎఫ్పీలు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ (క్యూపీఎఫ్‌పీ) ఆరు నెలల కఠోర శిక్షణ అనంతరం నెట్వర్క్ ఎఫ్పీ నుంచి క్యూపీఎఫ్‌పీ సర్టిఫికేషన్ పొందుతారు. పర్సనల్ ఫైనాన్స్ అంశాలు, నైపుణ్యాల గురించి వీరు పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటారు. తమ క్లయింట్ల ఆర్థిక శ్రేయస్సు దిశగా వీరు.. పొదుపు, పెట్టుబడులు, బీమా, పన్నులు, రుణాలు తదితర అన్ని రకాల వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో సేవలు అందిస్తారు.ఎవరిని ఎంపిక చేసుకోవాలి? సెబీ–ఆర్ఐఏలు లేదా సీఎఫ్‌పీలు, క్యూపీఎఫ్పీలలో ఎవరిని అయినా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, పెట్టుబడుల సలహాలు అందించాలంటే ముందుగా సెబీ నుంచి రిజి్రస్టేషన్ తీసుకోవాల్సిందే. అందుకే ఆర్ఐఏలకు అదనంగా సీఎఫ్‌పీ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) లేదా క్యూపీఎఫ్‌పీ అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం మెరుగైనదని నిపుణుల సూచన. సీఎఫ్‌పీ, సీఎఫ్ఏ, క్యూపీఎఫ్‌పీ, సీఏ అన్నవి అదనపు అర్హతలుగానే చూడాలి. ‘‘ఫైనాన్షియల్ ప్లానర్‌ను ఎంపిక చేసుకునే ముందు వారికున్న అర్హతలను నిర్ధారించుకోవాలి. వివిధ రకాల అర్హతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా వివిధ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి. క్లయింట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దిశగా కొందరు అడ్వయిజర్లు మార్గదర్శనం చేస్తారు. అదే సీఎఫ్‌పీలు అయితే సమగ్రమైన ఆర్థిక ప్రణాళికా పరిష్కారాలు సూచిస్తారు. రిటైర్మెంట్ కోసం ప్రణాళిక, ఎస్టేట్ ప్లానింగ్ (తదనంతరం వారసులకు బదిలీ), పన్ను ప్రణాళిక, వ్యక్తిగత ఆర్థిక అంశాలకు వీరు పరిష్కారాలు సూచిస్తారు. పెట్టుబడి సలహాదారుల మాదిరిగా కాకుండా సీఎఫ్‌పీలు ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా సమర్థవంతమైన పరిష్కార మార్గాలను చూపిస్తారు’’ అని ఎఫ్‌పీఎస్‌బీ సీఈవో క్రిషన్ మిశ్రా సూచించారు. సీఏలు తమ కోర్సులో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా అధ్యయనం చేస్తారు. అయినప్పటికీ ప్రాక్టీసింగ్‌కు వచ్చే సరికి ఎక్కువ మంది సీఏలు ప్రధానంగా పన్ను అంశాల్లో పరిష్కారాలు, సేవలకు పరిమితం అవుతుంటారు. కాకపోతే తమకున్న అర్హతలు, అనుభవం ఆధారంగా కొందరు ఇతర సూచనలు కూడా చేస్తుంటారు. సీఎఫ్‌పీ సర్టిఫికేషన్ కలిగిన సెబీ ఆర్ఐఏ మంచి ఎంపిక అవుతారని, ఆర్థిక ప్రణాళికపై వీరికి సమగ్రమైన అవగాహన ఉంటుందని గుడ్ మనీ వెల్త్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు మణికరణ్ సింఘాల్ సూచించారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎంపిక విషయంలో తమ స్నేహితులు, బంధువుల సాయాన్ని తీసుకోవచ్చు.ఫీజుకు తగ్గ ప్రతిఫలం! ఆర్థిక నిపుణుల సేవల గురించి తెలిసినా.. వారికి భారీగా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు వెనకడుగు వేస్తుంటారు. నిజానికి నిపుణుల సేవలతో లాభపడే దాని కంటే వారికి చెల్లించే ఫీజు చాలా చాలా తక్కువ. కొంచెం మొత్తానికి వెనుకాడితే.. ఒక్క తప్పటడుగుతో భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అందుకే కొంత ఖర్చయినా నిపుణులను ఆశ్రయించడమే మంచిది. సెబీ 2013లో ‘ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిబంధనలు’ తీసుకొచి్చంది. అప్పటి వరకు కమీషన్ ఆధారితంగా వీరు సేవలు అందించే వారు. దీంతో ఎక్కువ కమీషన్ కోసం కొందరు తమ ప్రయోజన కోణంలో సలహాలు ఇచ్చే వారు. దీన్ని నివారించేందుకు.. ఫీజుల ఆధారిత నమూనాను సెబీ తీసుకొచి్చంది. సెబీ ఆర్ఐఏ చట్టం 2013 కింద.. స్థిరమైన ఫీజు లేదా, క్లయింట్ తరఫున తాము నిర్వహించే పెట్టుబడుల విలువలో నిర్ణీత శాతం (ఏయూఎం ఆధారిత) మేర ఫీజు కింద తీసుకోవచ్చు. ‘‘ఫీజు ఆధారిత సేవల నమూనాలో ఇన్వెస్టర్ విజయంపైనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మెరుగైన సూచనలు అందించకపోతే, క్లయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. కమీషన్లకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి పక్షపాతం లేని సూచనలు అందించడానికి వీలుంటుంది’’ అని మిశ్రా వివరించారు. ఆర్ఐఏలకు ఫీజులను డిజిటల్ విధానంలో, వారి ఖాతాకే చెల్లించాలి. నగదు రూపంలో, లేదా వేరెవరి ఖాతాకో బదిలీ చేయొద్దు.ఫీజు పరిమితులుఆర్ఐఏలకు సంబంధించి చార్జీల విషయంలో సెబీ పరిమితులు విధించింది. ఫిక్స్డ్ ఫీజు అయితే ఏడాదికి రూ.1.25 లక్షలు మించకూడదు. లేదా, ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువలో ఏటా 2.5 శాతం మించి ఫీజు వసూలు చేయరాదు.ఈ అంశాలపై స్పష్టత అవసరం... ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు పూర్తి వివరాలు అందించినప్పుడే వారి నుంచి సరైన సూచనలు, సలహాలు పొందడానికి వీలుంటుంది. ముఖ్యంగా తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రుణాలు, ఆస్తులు, పిల్లలు, వారికి సంబంధించి విద్య, వివాహ లక్ష్యాలు, భవిష్యత్తులో ఏవేవి సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇత్యాది వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కోర్టు వివాదాలు, ఇతరత్రా కోరిన సమాచారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాల ఆధారంగా మెరుగైన ప్రణాళిక, సూచనలు, పరిష్కారాలు సూచించేందుకు ఆస్కారం ఉంటుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ.. ఈ రెండు రోజుల్లో పనిచేయదు
యూపీఐ సేవలకు సంబంధించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్‌లో రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవ అందుబాటులో ఉండదని ప్రకటించింది.కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 5, 23 తేదీలలో అవసరమైన సిస్టమ్ నిర్వహణ పనులు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.ఈ సేవలు అందుబాటులో ఉండవు» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని వినియోగించే హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పేలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.» హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ని వినియోగించే మర్చంట్ల వద్ద కూడా యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు -
వచ్చే వారం ఏమౌతుందో.. పసిడి ప్రియుల్లో టెన్షన్!
దేశంలో బంగారం ధరలు గత సంవత్ సంవత్సరంలో విశేషమైన వృద్ధిని సాధించాయి. గత దీపావళి నుండి దాదాపు 32 శాతం పెరిగాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, స్థిరమైన డాలర్ ఇండెక్స్, ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు, సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.వచ్చే వారం బంగారం ధర అంచనావచ్చే వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే రెండు కీలక పరిణామాలు ఉన్నాయి. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగనుండగా నవంబర్ 6న ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. వీటి ప్రభావంతో బంగారం ధరలు వచ్చే వారం అధిక అస్థిరతను చూపవచ్చని మార్కెట్ పరిశీలకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులుప్రస్తుతం ఇలా..అంతే లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పండుగ తర్వాత కాస్త శాంతించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం (నవంబర్ 2) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 80,550 వద్ద ఉంది. వచ్చే వారం బంగారం ధరల్లో భారీ అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి. -
ఉచితంగా రూ.5 లక్షల బీమా.. 70 ఏళ్లు దాటినవారికి వరం!
కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వారికి పేద, ధనిక అనే తేడాలేకుండా వైద్యం కోసం ప్రత్యేక బీమా కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజెఎవై) కింద అక్టోబర్ 30 నుంచి ఆరోగ్య బీమా అవకాశం కల్పిస్తోంది.అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్ జారీచేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా... ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రం తెలిపింది.దరఖాస్తు చేసే విధానం...ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంజేఏవై పోర్టల్ పీఎంజేఏవైజీవోవీ.ఇన్ లాగిన్ అయి 70 ప్లస్ ట్యాబ్ఫై క్లిక్ చేయాలి. దాంతో www.beneficiary.nha.gov.in అనే వెబ్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత ఆధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇవీ ఉపయోగాలు..● అర్హులైన సీనియర్ సిటిజన్లందరికీ ఈ పథకం కింద ఏబీ–పీఎంజేఎవై రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానెల్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 1,835 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు పొందవచ్చు.● లబ్ధిదారులు నమోదు చేసుకున్న మొదటి రోజు నుంచి చికిత్సను యాక్సెస్ చేయడం ప్రారంభించవచ్చు. ఏదైనా వ్యాధి లేదా చికిత్స కోసం వేచి ఉండే కాలం ఉండదు, కాబట్టి కవరేజ్ వెంటనే ప్రారంభమవుతుంది. -
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్‌ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
మారిన రూల్స్: ఈ రోజు నుంచే అమల్లోకి..
ఈ రోజు (నవంబర్ 1) నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్, అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్, సిలిండర్ ధరలలో మార్పు మొదలైనవి వాటిలో కీలకమైన మార్పులను జరగనున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలుప్రతి నెల మాదిరిగానే.. పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడే వ్యాపారులు ఈ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి సిలిండర్ ధరలలో మార్పు జరుగుతుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్డేట్స్యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇన్ సెక్యూర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా బిల్లింగ్ వ్యవధిలో యుటిలిటీ చెల్లింపులు మొత్తం రూ. 50వేలు కంటే ఎక్కువ ఉంటే.. 1 శాతం ఛార్జి విధిస్తారు. ఇది డిసెంబర్ 2024 ప్రారంభం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీజుఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్ వంటి వాటిని నవీనీకరిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌తో సహా వివిధ సేవలపై ప్రభావం చూపుతుంది. ఈ నియమాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది.ఆర్బీఐ కొత్త డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ ఫ్రేమ్వర్క్డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్స్ (DMT) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఈ చొరవ దేశీయ నగదు బదిలీలలో భద్రతను మెరుగుపరచడం, నవీకరించబడిన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. 24 జులై 2024 సర్క్యులర్‌లో బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత, కేవైసీ అవసరాలను సులభంగా నెరవేర్చడంలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు. -
ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డ్ రూల్స్ మార్పు
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డ్ కొత్త నిబంధనలలో మార్పులను ప్రకటించాయి.మీరు కూడా ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులుఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే, దానిపై కొన్ని అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలు మొదలైన వాటిపై ఛార్జీలు వర్తించవచ్చు.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులుఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. కొన్ని కార్డ్‌లలో ఈ సదుపాయం పూర్తిగా తొలగించగా కొన్ని కార్డ్‌లలో ఇది పరిమితి ఆధారంగా అందుబాటులో ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది. నిర్దిష్ట కేటగిరీలలో రివార్డ్ పాయింట్ల రీడెంప్షన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. దానిలో పరిమితులు ఉండవచ్చు. ఇక ఈఎంఐలో చేసిన కొనుగోళ్లకు వడ్డీ రేట్లు మారాయి. కార్డ్ రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు మారవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.