Delhi
-
రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే.. స్వల్ప తేడాతో బీజేపీపై విజయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యలు వాకౌట్ చేయడంతో ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. బీజేపీకి 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. మరో 10 ఓట్లు సాధించగలిగింది. దీంతో ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేకి చెందిన కిషన్‌లాల్‌పై ఆప్ కౌన్సిలర్ మహేష్ ఖించి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. అయితే ఖించి కేవలం 5 నెలల మాత్రమే మేయర్ పీఠంపై కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆప్, బీజేపీ మధ్య పోరుతో పదే పదే వాయిదా పడటమే ఇందుకు కారణం. -
ఊపిరాడని రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ: అత్యల్ప ఉష్ణోగ్రతలకు దట్టంగా కమ్ముకున్న వాయుకాలుష్యం తోడవడంతో న్యూఢిల్లీలో గాలి గరళంగా మారుతోంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. కేంద్ర వాతావరణ కాలుష్యనియంత్రణ మండలి గణాంకాల ప్రకారం విపరీతమైన వాయుకాలుష్యాన్ని సూచించే వాయునాణ్యతా సూచీ(ఏక్యూఐ) ఢిల్లీలో ఏకంగా 500 దాటింది. గురువారం ఢిల్లీలో 32 ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గురువారం ఢిల్లీవ్యాప్తంగా సగటున ఏక్యూఐ 428 కాగా జహంగీర్‌పురీలో 567, ఆనంద్‌విహార్, పంజాబీ బాగ్‌ల్లో 465గా నమోదైంది. ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రత కేవలం 16.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. శీతాకాలం కావడంతో జనాలకు రోడ్లపై వెళ్తుంటే ముందు ఏముందో కనిపించనంతగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 300లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 10 విమానాలను దారిమళ్లించారు. రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్యగోచరత(విజిబిలిటీ) తగ్గిపోయింది. దీనికారణంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ చాలా కష్టంగా మారింది. దీంతో మీరు ప్రయాణించబోయే విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రయాణికులకు సూచించింది. పలు రైళ్ల రాకపోకలపైనా పొగమంచు, వాయుకాలుష్యం ప్రభావం పడింది. వాయునాణ్యత దారుణంగా పడిపోవడంతో ఢిల్లీవ్యాప్తంగా ఏక్యూఐను ఇంకా మూడో ‘తీవ్రం’ కేటగిరీలోనూ కొనసాగిస్తున్నారు. గ్రాప్–3 నిబంధనలు అమల్లోకి వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమల్లోకి తెచి్చంది. శుక్రవారం నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో వీటిని కఠినంగా అమలుచేస్తామని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) గురువారం తెలిపింది. విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు.చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీసహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతోపాటు తరగతులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి చెప్పారు. -
ఒకే షిఫ్టులో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష
ప్రయాగ్‌రాజ్: ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్(పీసీఎస్) ప్రిలిమినరీ పరీక్ష–2024 వ్యవహారం తీవ్ర అలజడి సృష్టించింది. ఈ పరీక్షను ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీపీఎస్సీ) నిర్ణయించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరీక్షను పాత విధానంలోనే ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలంటూ యూపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. దీంతో యూపీపీఎస్సీ వెనక్కి తగ్గింది. పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ), అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఏఆర్ఓ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది. -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. రెండు రోజులుగా తీవ్రమైన కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 473గా నమోదైంది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.దేశ రాజధానిలో కాలుష్యం పెరిగి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గింది. ఇది విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. వీటిలో 115 విమానాలు ఢిల్లీకి వచ్చేవి ఉండగా.. రాజధాని నుంచి బయలు దేరాల్సిన 226 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొంది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. -
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
ఉత్తరాదిపై పొగమంచు దుప్పటి.. గ్యాస్ ఛాంబర్‌గా రాజధాని!
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా ఢిల్లీతో పాటు, పలు ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. గాలి విషపూరితంగా మారింది. వాయు నాణ్యత కనిష్టానికి చేరింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలోని జనం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణశాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన తెల్లటి పొగమంచు కమ్మేసినట్లు కనిపిస్తోంది. మహారాష్టలోనూ ఇదే స్థితి కనిపిస్తోంది. మొన్నటి దీపావళికి స్వల్పంగా కనిపించిన ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు ఇదే స్పష్టమవుతోంది. కొరియన్ జియో కాంప్శాట్ 2ఎ ఉపగ్రహం పంపిన రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు ఇది తేలింది. తాజా చిత్రాలను చూస్తే ఢిల్లీపై పొగమంచు దట్టంగా అలముకున్నట్లు కనిపిస్తోంది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ వర్గానికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది. Today, Delhi’s daily average AQI clocked 418 as per the 4 PM AQI Bulletin by CPCB. The CAQM Sub-Committee on GRAP accordingly took stock of the air quality scenario and the AQI forecast, including for the meteorological conditions as made by IMD/ IITM.Cont. (1/5)— Commission for Air Quality Management (@CAQM_Official) November 13, 2024గ్యాస్ ఛాంబర్‌గా రాజధానిదేశరాజధాని ఢిల్లీలోని ప్రజలు ఇప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(కేంద్ర కాలుష్య నియంత్ర మండలి). పంట వ్యర్ధాల దహనం, వాహన కాలుష్యం, గాలి వేగం మందగించడంతో కాలుష్యం పెరగడానికి కారణంగా గుర్తించారు.సీపీసీబీ తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ)432కి చేరుకుంది. అంటే ఢిల్లీలో గాలి ‘వెరీ సీరియస్ కేటగిరీ’లో ఉంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల వాయు నాణ్యత సూచికను సీపీసీబీ విడుదల చేసింది. దీని ప్రకారం నజఫ్గఢ్లోని గాలి అత్యంత కలుషితంగా మారింది. ఏక్యూఐ 482గా నమోదయ్యింది. ఇదేవిధంగా ఏక్యూఐ 480తో నెహ్రూ నగర్ రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఆనంద్ విహార్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాప్ - 3 నియంత్రణల అమలుపై నేడు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ -
కారుణ్య నియామకాలు హక్కు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వోద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఈ మేరకు వెలువరించింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దన్నది మాత్రమే కారుణ్య నియామకాల వెనక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదరు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను విధిగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. -
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ పాలన.. భారత్‌లో కీలక పరిణామం
ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా భారత్‌లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆప్ఘనిస్థాన్ దౌత్యవేత్త కార్యాలయం (కాన్సులేట్) తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ నియమితులయ్యారు. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తాలిబన్ పాలనను కేంద్రం వ్యతిరేకించింది. భారత్‌లో ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారుల్ని వెనక్కి పంపింది. మూడేళ్ల తర్వాత తాజాగా భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంది. -
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ‘తీవ్రమైన’ కేటగిరిలో గాలి నాణ్యత సూచీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను అధిగమించి ‘తీవ్రమైన కేటగిరి’లోకి చేరింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. బుధవారం ఢిల్లీలో గాలి నాణ్యత 429గా నమోదైంది. అయితే మంగళవారం సాయంత్రం AQI 334 వద్ద ఉండగా కేవలం 24 గంటల్లోనే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం ఢిల్లీలోని 36 మానిటరింగ్ స్టేషన్లలో బుధవారం 30 'తీవ్రమైన' కేటగిరీలో ఉన్నాయి.మంగళవారం సాయంత్రం వరకు వరుసగా 14 రోజుల పాటు నగరం యొక్క గాలి నాణ్యత 'చాలా పేలవంగా' ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యానికి అతిపెద్ద కారణంగా( 15.4 శాతం) మారింది. దీనికితోడు పంజాబ్, హర్యానా వంటి చుట్టుపక్కల రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలబెట్టడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది, నగరాన్నికాలుష్యపు పొగమంచులో కప్పేసింది.కాగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 450 వరకు ఉంటే తీవ్రమైనదని.. ఇక 450 కంటే ఎక్కువఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. -
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు (CCPA) అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటివరకు సీసీపీఏ 54 నోటీసులు జారీ చేయగా.. రూ. 54.60 లక్షల జరిమానాలు విధించింది.‘విద్యార్థుల నుంచి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా కొంత సమాచారాన్ని దాచడం తాము గమనించాం. అందుకే కోచింగ్ సెంటర్ల నిర్వహకుల కోసం కొత్తమార్గదర్శకాలను రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అయితే ప్రకటనల నాణ్యత వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు.కొత్త మార్గదర్శకాల ప్రకారం..కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఉదా: ఫీజు విధానం, వాపస్ పాలసీ, ఎగ్జామ్ ర్యాంకింగ్, జాబ్ గ్యారంటీ, జీతం పెరుగుదల వంటివిఅభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉపయోగించకూడదు. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి.చాలా మంది యూపీఎస్సీ విద్యార్థులు తమ స్వంతంగా చదవుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు. కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకాలను మాత్రమే తీసుకుంటారు. ఈ విషయంలో విద్యార్ధులకు ముందే స్పష్టత ఇవ్వాలిఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి.చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.కోచింగ్ సెంటర్లు తమ అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలి.నిబంధనలు ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద జరిమానాలు విధించనున్నారు. -
ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై సుప్రీంకోర్టు మండిపడింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు అజిత్ పవార్ ఫోటోలను, వీడియోలను.. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఉపయోగించకూడదని హెచ్చరించింది.‘మీ సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోండి’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం బుధవారం చీవాట్లు పెట్టింది. శరద్ పవార్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉపయోగించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సర్క్యులర్ జారీ చేయాలని అజిత్ పవార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. కాగా అజిత్ పవార్ వర్గానికి పార్టీ చిహ్నమైన గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ సందర్భంగా శరద్ పవార్‌కు చెందిన వీడియోలను అజిత్ పవార్ వర్గం ప్రచారం చేస్తోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. అయితే అజిత్ పవార్ వర్గం తరపు నసీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. అదిపాత వీడియో అని తెలిపారు. కానీ కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది.‘ఈ వీడియో పాతది అయినా కాకపోయినా, శరద్ పవార్‌తో మీకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీరు మీ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రత్యేకమైన, భిన్నమైన రాజకీయ పార్టీగా మీ సొంత గుర్తింపును కనుగొనండి అని తెలిపారు. -
బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం
తలదాచుకోవడానికి ఒక సొంత గూడు సమకూర్చుకోవాలని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కలలు కంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఇల్లు అంటే ఒక కుటుంబమంతటి ఆశల కలబోత. ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. మనుషులకు సంతృప్తి, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితానికి రక్షణ)లో పౌరులు ఒక గూడు కలిగి ఉండే హక్కు కూడా ఒక భాగమే. ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదా దోషి అయితే.. అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేయవచ్చా? వారికి నిలువ నీడ లేకుండా చేయొచ్చా? ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా? అనేది చాలా ముఖ్యమైన విషయం. న్యాయ వ్యవస్థ అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. బుల్డోజర్ న్యాయం ఎంతమాత్రం సరైంది కాదు. ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయడం చట్టబద్ధ పాలనా సూత్రాలకు వ్యతిరేకం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనధికారికంగా అమలవుతున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ చర్యలు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, ఒక వ్యక్తి నేరాన్ని నిర్ధారించే బాధ్యత న్యాయవ్యవస్థపైనే ఉందని వెల్లడించింది. ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే జరిమానా తప్పదని, దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం వదిలిపెట్టబోదని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకించడంతోపాటు ఇలాంటి కూల్చివేతల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. బుల్డోజర్ న్యాయం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ అక్టోబర్ 1న తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై బుధవారం జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 95 పేజీల తీర్పు వెలువరించింది. ఒకరు నేరానికి పాల్పడితే అతడి కుటుంబాన్ని శిక్షించడాన్ని రాజ్యాంగం గానీ, నేర న్యాయ వ్యవస్థ గానీ అనుమతించబోవని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని కేసుల్లో స్థానిక మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారని, అయితే, కొన్ని సందర్భాల్లో అవి నిందితులవి అయి ఉంటున్నాయని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే అదే చివరి మార్గం తప్ప మరో మార్గం లేదని నిరూపించాలని పేర్కొంది. అనివార్యంగా నేలమట్టం చేయాల్సిన ఇళ్ల విషయంలోనూ ‘రూల్ ఆఫ్ లా’ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అది ప్రభుత్వ అధికారుల విధి కాదు నిందితుడి నేరం రుజువు కాక ముందే అతడిని శిక్షించే విధానాన్ని న్యాయవ్యవస్థ హర్షించదని, రాత్రిపూట మహిళలను, పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్ఘాటించింది. ఏదైనా కేసులో ఒక వ్యక్తిని దోషిగా తేల్చడం, జరిమానా లేదా శిక్ష కింద అతడికి ఇంటిని కూల్చడం ప్రభుత్వ అధికా రుల విధి కాదని వెల్లడించింది. ముందస్తుగా షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి దేశం మొత్తానికి వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. రహదారులు, నదీ తీరాల్లోని నిర్మాణాలు, అక్రమ భవనాలు లేదా నిర్మాణాలపై తీసుకునే చర్యలకు ఈ మార్గదర్శకాలు వర్తించబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. ఒక్కరు చేసే నేరానికి కుటుంబమంతటికీ శిక్షా? → నిందితుడి నేరం రుజువు కాకముందే అతడిని శిక్షించవద్దు → మహిళలు, పిల్లలను రాత్రిపూట రోడ్డున పడేయొద్దు → ముందస్తు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదు. → నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇచ్చి తీరాలి→ మార్గదర్శకాలు పాటించకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవు→ సుప్రీంకోర్టు కీలక తీర్పు → కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు → ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న వ్యక్తి వివరణ ఇవ్వాలి. → ఇంటి సొంతదారు/అందులో ఉంటున్న వ్యక్తికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటీసు పంపించాలి. అదనంగా నోటీసు కాపీని ఇంటి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి. భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులో వివరించాలి. కూల్చివేత చర్యను నిరోధించడానికి ఏం చేయవచ్చో కూడా అదే నోటీసులో చెప్పాలి. → నోటీసు జారీ చేయడానికి, రిజిస్టర్డ్ పోస్టులో పంపడానికి, ప్రతిస్పందనను స్వీకరించడానికి, షోకాజ్ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు మూడు నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి. → ప్రజల వినతులు తెలుసుకోవడానికి, తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. → అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదా పూర్తిగా కూల్చివేయడానికి 15 రోజుల సమయం ఇవ్వాలి. → ఇళ్ల కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి. వీడియో రికార్డ్‌ను భద్రపర్చాలి. → సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే జరిమానా లేదా చట్ట ప్రకారం శిక్ష తప్పదు. → కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్లు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి. ఆ ఇంటిని వారి సొంత ఖర్చులతోనే మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అదనంగా డ్యామేజీ ఖర్చులు చెల్లించాలి. → ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు, వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆస్తి యజమానికి అవకాశం కలి్పంచాలి. అంతేకాదు.. ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి. → బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది జిల్లా మేజి్రస్టేట్(డీఎం) చూడాలి. నిబంధనలు పాటించకుండా ఇళ్లు, భవనాలను కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి. → చట్టం ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి. ఇంటిని కూల్చడమనేది ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటే నిందితుడి నేపథ్యాన్ని, అతని సామాజికవర్గాన్ని పట్టించుకోవద్దు. → సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేస్తూ జిల్లా మేజి్రస్టేట్లు, స్థానిక అధికారులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సర్క్యులర్లు జారీ చేయాలి. Supreme Court says it has dealt with the separation of powers as well as how executive and judicial wings work in their respective spheres. Adjudicatory functions are entrusted to the judiciary and the executive cannot replace the judiciary in performing its core function, says…— ANI (@ANI) November 13, 2024 -
అజహరుద్దీన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు మాగంటి గోపీనాథ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక అంశం కోర్టుకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అజారుద్దీన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరో తేదీ వరకు రిజయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
పెద్దపల్లి గూడ్స్ ప్రమాదం: వందేభారత్ సహా రద్దైన రైళ్ల వివరాలివే..
పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్ వద్దకు ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.రద్దు.. డైవర్షన్.. రీషెడ్యూల్ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.దారి మళ్లించిన రైల్వే వివరాలు జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్ SCR PR No.610 dt.13.11.2024 on "Railway Helpline Numbers provided in View of Accident Of Goods Train" @drmsecunderabad pic.twitter.com/M7pjbq4GXP— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 Bulletin No.2 SCR PR No.611 dt.13.11.2024 on "Cancellation/Diversion of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/cMrk7XTS9d— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 "Cancellation/PartialCancellation/Diversion/Reschedule of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/vfOqjCyLvR— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024ఏం జరిగిందంటే..మంగళవారం నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం రాహుల్ గాందీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తెలంగాణ నుంచే డబ్బు మూటలు వెళ్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని, ఆన్లైన్ లావాదేవీలపై మరింత నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. పలు సందర్భాల్లో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలంటూ వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి మోదీ.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు.అమృత్ స్కీంలో జరిగిన స్కాంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ స్కాంపై చర్యలు తీసుకోకపోతే తాము రాజ్యసభలో ఈ అంశాన్ని లెవనెత్తి దేశమంతా ఆలోచించేలా చేస్తామని కేంద్రమంత్రిని హెచ్చరించినట్లు చెప్పారు. మంగళవారం వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, మాజీ ఎంపీ బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొడంగల్ వాసులకు విషం సొంత బావమరిది సృజన్‌రెడ్డికి అమృతం ఇచి్చన సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వాసులకు మాత్రం విషం ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. బావమరిది కంపెనీని అందలమెక్కించేందుకు రేవంత్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, పింఛన్లు, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇచ్చేందుకు డబ్బు లేదు కానీ.. మహారాష్ట్రలో మాత్రం రూ.300 కోట్లతో పేపర్ యాడ్స్ ఇచ్చారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతిపై వివరాలిచి్చనా కేంద్రం ఇప్పటివరకూ విచారణ జరపలేదని మండిపడ్డారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించారా అని నిలదీశారు. సీఎం హైదరాబాద్‌ను నాలుగు ముక్కలుగా చేసే కుట్రలో బీజేపీ ఎంపీలు మద్దతు పలుకుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి పెట్టుబడులు బీజేపీపాలిత రాష్ట్రాలకు తరలించాలన్నదే రేవంత్ ఎజెండా అని వ్యాఖ్యానించారు. రేవంత్ 26 సార్లు ఢిల్లీ వచ్చారు... 11 నెలల్లో 26 సార్లు ఢిల్లీకి వచి్చన సీఎం రేవంత్ తెలంగాణకు రూ.26 పైసలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేను ఢిల్లీకి వస్తే మీకేం పని అని మంత్రి పొంగులేటి అంటున్నాడు. మీ కుంభకోణాలు, మీ చేతగాని పాలనను దేశ ప్రజల ముందుకు తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాను. పౌరసరఫరాల శాఖలో అవినీతి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీల లీలలు కూడా బయటపెట్టేందుకు మళ్లీ మళ్లీ ఢిల్లీకి వస్తాను. నేను ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌కు వస్తా.. మీకు (కాంగ్రెస్ ప్రభుత్వానికి) దమ్ముంటే ఏదైనా చేయండి. ఎన్ని ఏజెన్సీలనైనా రప్పించుకోండి’అని కేటీఆర్ అన్నారు. 2–3 వారాల క్రితం కోహినూర్ హోటల్లో పొంగులేటి అదానీని రహస్యంగా కలిసి కాళ్లు పట్టుకున్నారా లేదా అని వ్యాఖ్యానించారు. కులగణన పేరుతో 75 ప్రశ్నలు కేసీఆర్ పేరు తలవనిదే ఒక్కరోజు కూడా సీఎం రేవంత్‌కు నిద్రపట్టదని కేటీఆర్ విమర్శించారు. ప్ర జలు కేసీఆర్ పేరు మర్చిపోతే సీఎంకు వచి్చన బా ధ ఏంటని ప్రశ్నించారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో 75 ప్రశ్నలు వేయడమేంటని నిలదీశారు. ఎవరైనా కులం, మతం వివరాలు అడుగుతారని, కానీ.. మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా అనే ప్రశ్నలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. అవి లేకపోతే నువ్వేమైనా కొనిస్తావా అంటూ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలను మేకలను కొన్నట్లు కొంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కూడా ఇలాగే కొన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు.పనికిరాని పాలనలో ఆగంపసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ తల్లడిల్లుతూ తిరగబడుతోంది. కుటుంబ దాహం కోసం జరుగుతున్న కుట్రలపై లగచర్ల పోరాడుతోంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతోంది. కుట్రలు, కుతంత్రపు పాలనలో జనం కోపం కట్టలు తెంచుకుంటోంది. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, హైడ్రా దౌర్జన్యాలు, మూసీలో ఇళ్ల కూల్చివేతలు ఇలా పలు అంశాలపై అనేక మంది ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల మహా ధర్నా, పెండింగ్ బకాయిల కోసం మాజీ సర్పంచ్ల నిరసన, పరీక్షల నిర్వహణపై విద్యార్థుల ఆగ్రహం, ఫార్మా పరిశ్రమలకు భూములు ఇవ్వమంటూ అన్నదాత కన్నెర్ర వంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతీరోజు కనిపిస్తున్నాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు
రెడ్డి పేరు మీద ఉన్నవారంతా నా బంధువులు కాదు. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే రూ. వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి. ఈ–రేస్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వచ్చారు. అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్... ఇప్పుడు బీజేపీ నేతలను ఎలా కలుస్తున్నారు? –సీఎం రేవంత్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లు పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా రెండు పార్టీలూ సహకరించుకుంటున్నాయని చెప్పారు. ‘అవినీతికి సంబంధించిన ఓ కేసులో కేటీఆర్‌ను 17 (ఎ) కింద విచారించేందుకు రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం.. గవర్నర్ అనుమతి కోరింది. కానీ గత 15 రోజులుగా గవర్నర్ కార్యాలయం దీన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో కేటీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలిశారు. దీన్నెలా చూడాలి? ఏసీబీ విచారణ భయంతోనే ఆయన ఢిల్లీ వచ్చారు. కేంద్రం కూడా గవర్నర్‌ను పిలిపించిందని అంటున్నారు. అదెంతవరకు నిజమో తెలియదు. మరోపక్క మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి, అభ్యర్థులను బరిలో నిలుపుతామన్న కేసీఆర్ ఎందుకు నిలపలేదు? మహారాష్ట్ర వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? మోదీకి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన ఎందుకు చేయలేదు? తెలంగాణకు మద్దతుగా నిలిచిన శరద్ పవార్ పార్టీకి మద్దతుగా అయినా ఒక్కపని ఎందుకు చేయలేదు?..’సీఎం నిలదీశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభా ఆధారంగా నిధుల పంపకాలా? ‘దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుస్తున్నా.. ఆ రాష్ట్రాలను మాత్రం చిన్నచూపు చూస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వస్తున్న నిధుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సంకుచిత దృష్టి దేశానికి మంచిది కాదు. తెలంగాణ నుంచి ఒక రూపాయి దేశానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 40 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. అదే సమయంలో బిహార్ రూపాయి ఇస్తే రూ.7.06, ఉత్తర్‌ప్రదేశ్ రూపాయి ఇస్తే రూ.2.73 పొందుతున్నాయి.మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు మోదీ మద్దతు ఇస్తే ప్రతి రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేయగలదు. కుటుంబ నియంత్రణ చేయాలని ఒత్తిడి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు జనాభా ఆధారంగా నిధుల పంపకాలు ఎలా చేస్తుంది? మరోవైపు ప్రస్తుత జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల 1971 జనగణన ఆధారంగానే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. నియోజకవర్గాల పునరి్వభజనకు అవసరమైన టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (సూచన నిబంధనలు) కోసం కేంద్రం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ గుజరాత్‌కు ప్రధానిలా వ్యవహరిస్తున్నారు ‘మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉండి గుజరాత్ మోడల్‌కు చేసిన ప్రచారానికి కేంద్రం ఎలాంటి ఆటంకం కలిగించలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. ఆ రాష్ట్రాలను ఖతం చేసేందుకు ఆయన స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారు ప్రయత్నిస్తే గుజరాత్ వెళ్లమని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోంది. ఆయన దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్‌కు ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు. ఇందిరమ్మ మనవడు ఉండేందుకు ఒక్క గది లేదు ‘తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం ఏటీఎంగా మార్చుకుందని మోదీ ఆరోపిస్తున్నారు. పదేపదే గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆ రాష్ట్రం ఏటీఎం..ఈ రాష్ట్రం ఏటీఎం అని ప్రధానమంత్రి హోదాలో ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. ఎవరో కార్యకర్త, చిన్నాచితకా నేతలు వ్యాఖ్యలు చేస్తే వదిలేయవచ్చు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు. సోనియాగాం«దీ, రాహుల్ గాం«దీలకు ప్రధానమంత్రి పదవి స్వీకరించే అవకాశం వచి్చనా వదులుకున్నారు. ప్రాణాలను, పదవులను, ఇళ్లను త్యాగాలు చేసినవాళ్లకి డబ్బులెందుకు? మారుమూలన ఉన్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి. కానీ అదే ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మోదీ రాజకీయాలకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది రహస్య ఎజెండాను బయటపెట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రతి ఎన్నికల్లో మోదీ భావోద్వేగంతో కూడిన, విభజన రాజకీయాలు చేస్తున్నారు. వాటికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం రాజకీయ ఫార్మాట్ మార్చుకోవాలి. టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం మానేసి, 20–20 ఫార్మాట్ ఆడాలి..’అని రేవంత్ అన్నారు.నాయుడు, నితీశ్ లాంటి వారితో కేంద్రం నడుస్తోంది ‘గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ముమ్మాటికీ ఓటమి పాలయ్యారు. బీజేపీ ఈ దఫా 400 సీట్లు అని నినదించినా, 240 సీట్లే సాధించారు. కానీ కాంగ్రెస్ 40 నుంచి వందకు చేరింది. నంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. ఇప్పుడు నాయుడు, నితీశ్ లాంటి కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది.. ఇది మోదీ ఓటమే.సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు..‘తెలంగాణ రైజింగ్ అంటే ప్రతి ఒక్కరికీ సమా న అవకాశాలు కలి్పంచడం. ఇదే తెలంగాణ మోడల్. సుపరిపాలన తెలంగాణ మోడల్. దాని అర్థం సంక్షేమం, అభివృద్ధి. కేవలం సంక్షేమం చేపడితే అభివృద్ధి ఉండదు. కేవలం అభివృద్ధిపై దృష్టి పెడితే పేదలకు ఏం దక్కదు. ఈ రెండింటినీ సమతుల్యం చేయడమే సుపరిపాలన. దానిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ పదిసార్లు సచివాలయానికి రాలేదు. నేను పది నెలలుగా ప్రతిరోజూ సచివాలయానికి వెళుతున్నా. ప్రతిపక్షంలో ఉండి ఆయన శాసనసభకు రావడం లేదు. వాళ్లు ధర్నా చౌక్‌ను మూసివేశారు.నేను అదే ధర్నా చౌక్‌ను ఓపెన్ చేశా. ఇప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా వారానికి రెండుసార్లు వచ్చి ధర్నా చౌక్‌కు వచ్చి కూర్చుంటున్నారు. మేం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామో చూడండి. తెలంగాణ అప్రోచ్‌నే కాంగ్రెస్ అప్రోచ్. తెలంగాణ రైజింగ్ కాంగ్రెస్ అప్రోచ్..’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను గతంలో కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశానని.. టీఆర్ఎస్లో ఎన్నడూ పని చేయలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడితో కలిసి పని చేశానని అన్నారు. అమెరికా ఎలక్ట్రోరల్ సిస్టమ్‌లో తెలుగు ప్రజలు ఉన్నారని, వారు ఇప్పుడు అక్కడి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని రేవంత్ చెప్పారు. లగచర్ల ఘటనలో ఎవర్నీ వదిలిపెట్టం⇒ ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే ⇒ గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలుకొడంగల్ నియోజకవర్గం లగచర్లలో సోమవారం కలెక్టర్, ఇ తర అధికారులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం అన్నా రు. దాడులకు ప్రోత్సహించేవారిని, అండగా ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమని చెప్పారు. అలాంటివారు ఎంతటి వారై నా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించా రు. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని, సృజన్‌రెడ్డికి బీ ఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయ ని చెప్పారు. ఈ–రేస్ స్కామ్ నుంచి తప్పించుకు నేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారని.. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని అన్నారు. అవినీతి పార్టీ అయిన బీజేపీ ని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బీజేపీ నేతలను కలుస్తున్నారని నిలదీశారు. -
రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధ్ రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు మంగళవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయ భారతిని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎవరెవర్ని అరెస్టు చేశారు, మోపిన కేసుల వివరాలని్నంటినీ ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ అరెస్టులపై తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు.కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు..అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం బీఎన్ఎస్ సెక్షన్ 111 పెట్టడం ఘోరమని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులయిన 57 మందిపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసుల వేధింపుల కారణంగా 12 మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. హింసించి, భయపెట్టి వారికి అనుకూలమైన స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. శాంతియుతంగా ఉన్న తమ కార్యకర్తలు తిరగబడితే ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎక్కడకి వెళతాయో తెలియదని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు. తాము ఇప్పటివరకు డిఫెన్స్ ఆడామని, ఇక అఫెన్స్ మొదలు పెడితే తట్టుకోలేరని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయలేకే ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాధ్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు తాము అండగా ఉంటామని, వారిపై జరుగుతున్న వేధింపులను అరికడతామని ఎంపీ డాక్టర్ తనూజరాణి భరోసా ఇచ్చారు. -
మిస్ టీన్ యూనివర్స్‌గా తృష్ణా రే
ఒడిషా యువతి తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్–2024’ కిరీటం గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో ఈ నెల 1 నుంచి 9వ తేదీ దాకా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి 10 మంది ఫైనల్‌కు చేరుకోగా, ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల తృష్ణా రే వారందరినీ వెనక్కి నెట్టి అందాల సుందరి కిరీటం సొంతం చేసుకుంది.పెరూ దేశానికి చెందిన అన్నే థార్సెన్ మొదటి రన్నరప్‌గా, నమీబియాకు చెందిన ఆండ్రి రెండో రన్నరప్‌గా నిలిచారు. కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రే దంపతుల కుమార్తె అయిన తృష్ణా రే ప్రస్తుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. – న్యూఢిల్లీ -
‘డీజీపీ పట్టించుకోవట్లేదు’.. NHRCలో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంగళవారం ఉదయం NHRC యాక్టింగ్ చైర్ పర్సన్ విజయభారతిని కలిసి ఫిర్యాదు లేఖ అందజేసింది.ప్రస్తుతం.. ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని మానవ హక్కుల సంఘం దృష్టికి వైఎస్సార్సీపీ ఎంపీలు తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారు. పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డినీ నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న డీజీపీ పట్టించుకోవడం లేదు. వెంటనే జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరపాలి. మానవహక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఎంపీలు కోరారు. .. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని విజయభారతికి తెలియజేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఆమె.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ను కలిసిన బృందంలో వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ , మేడ రఘునాథ్ రెడ్డి , డాక్టర్ తనూజా రాణి, బాబురావు ఉన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డివైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, ప్రతి కార్యకర్తకు తాము అండగా నిలబడతామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.‘ప్రతి కార్యకర్తకు మేము అండగా నిలబడతాం.57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదు.హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు.మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాం.మా కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు.తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం’అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఏపీలో శాంతిభద్రతలు లేవు: ఎంపీ గొల్లబాబురావుచంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగ నడుపుతోందిరెడ్ బుక్ లో ఉన్న వారిని హింసిస్తున్నారుఇది రాక్షస రాజ్యం, నియంత రాజ్యం ఏపీలో శాంతిభద్రతలు లేవుడీజీపీ హోమ్ మినిస్టర్ పనిచేయడం లేదుఏపీ హోమ్ మినిస్టర్ కక్ష కట్టినట్టు మాట్లాడుతున్నారుప్రజలలోకి వెళ్లి అరాచకాలను ఎండగడతాంకార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఏంటి..? ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఇప్పటిదాకా మా కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నారుఇక మా కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఎక్కడికెళ్తుందో తెలియదుఇప్పటివరకు డిఫెన్స్ ఆడాం , ఇక ఆఫెన్స్ మొదలు పెడతే ఎలా ఉంటుందోతక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘాన్ని కోరాఅక్రమ అరెస్టులను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లాపీఎం, సీఎం జోక్యం చేసుకొని ఎరాచకాన్ని ఆపాలిసూపర్సిక్స్ అమలు చేయలేకే దాడులు: ఎంపీ మేడ రఘునాథ్రెడ్డిసూపర్ సిక్స్ అమలు చేయలేక దాడులకు పాల్పడుతున్నారుఏపీలో అరాచక పాలనను ఆపాలని ఎన్ హెచ్ ఆర్ సినీ కోరాంమా హయాంలో రెండు లక్షల 75 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలు అందించాంప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలిప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రయత్నాలను మానుకోవాలికార్యకర్తలకు అండగా ఉంటాం: ఎంపీ తనూజారాణిసోషల్ మీడియా కార్యకర్తలకు మేము అండగా నిలబడతాంవారిపై జరుగుతున్న వేధింపులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాం -
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్.. మోదీ ఏం చేస్తున్నారు?: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని.. అర్హత లేకపోయిన సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు కేటాయించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను ఢిల్లీలో ఏ బాంబులు పేల్చడం లేదు. దీపావళి ఎప్పుడో అయిపోయింది. తెలంగాణలో బాంబు అన్నారు. ఏం జరగలేదు. తెలంగాణ కేటాయించిన రూ. 8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలి. అమృత్ టెండర్లో సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అమృతం పంచి.. కొండగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం ఢిల్లీకి వస్తాం.. దేశ ప్రజల దృష్టికి మీ మోసాలను తీసుకొస్తాం. మీ ఆరోపణల మీద మీకు నమ్మకం ఉంటే విచారణ జరిపించండి. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగతా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్’’ అంటే కేటీఆర్ చురకలు అంటించారు. -
‘పాగల్ పాలనలో తిరగబడ్డ తెలంగాణ’.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, సాక్షి: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన విమర్శలు చేశారు. ఇందుకోసం.. వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా కంపెనీ అభిప్రాయసేకరణ సందర్భంగా అధికారులపై గ్రామస్తులు జరిపిన దాడి సంగతిని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు.‘‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. ‘మా భూములు మాకేనని’.. కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.... ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు, హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు, మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్ల నిరసన, ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం, ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం, ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర, కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు’’.. అంటూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోందికుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందిమా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుందిపసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందికుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ… pic.twitter.com/liaE7n0Jvb— KTR (@KTRBRS) November 12, 2024ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. అమృత్ పథకంలో అవినీతి జరిగిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ పై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి కేటీఆర్ కోరారు.ఇదీ చదవండి: తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా? -
Supreme Court: కాలుష్యాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని సృష్టించే ఏ రకమైన కార్యకలాపాలనూ ఏ మతమూ ప్రోత్సహించబోదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏడాదంతా బాణసంచాను ఢిల్లీ పరిధిలో నిషేధించాలా వద్దా అనే అంశంపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్నాసరే దీపావళి వేళ ఢిల్లీ వ్యాప్తంగా విపరీతంగా బాణసంచా కాల్చడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత కేసును సోమవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం విచారించింది. ‘‘కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కు. దీనిని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ రక్షణ కల్పిస్తోంది. కాలుష్యకారక ఏ పనినీ ఏ మతమూ ప్రోత్సహించదు. సరదాగా బాణసంచా కాల్చినాసరే తోటి పౌరుల ఆరోగ్యకర జీవన హక్కుకు భంగం వాటిల్లినట్లే’’ అని వ్యాఖ్యానించింది. సంవత్సరం పొడవునా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం అంశంపై ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ‘‘ సంబంధిత అన్ని వర్గాలతో సంప్రతింపులు జరపండి. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేయండి’’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించడంపై స్పందన తెలియజేయాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలనూ కోర్టు కోరింది. ఢిల్లీ పోలీసులకు చీవాట్లునిషేధం ఉన్నాసరే ఊపిరాడనంతగా బాణసంచా కాల్చుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఢిల్లీ పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ నిషేధించాలంటూ గతంలో మేం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పోలీసులు బేఖాతరు చేశారని స్పష్టమైంది. గతంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం అనుమతులు తీసుకున్న సంస్థలకు మా ఉత్తర్వుల కాపీలు అందినట్లు కనపించట్లేదు. మొదట ఢిల్లీ పోలీసులు చేయాల్సిన పని లైసెన్స్ దారులు టపాకాయలు విక్రయించకుండా అడ్డుకో వాలి. అమ్మకాలను ఆపేశారని, నిషేధం అమల్లోకి వచ్చిందని, ఆన్లైన్ వేదికలపై విక్రయాలు, డెలివరీ సౌకర్యాలను స్తంభింపజేసేలా సంబంధిత వర్గాల కు ఢిల్లీ పోలీసు కమిషనర్ తక్షణం సమా చారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. క్షేత్రస్థాయిలో నిషేధాన్ని అమలు చేయా ల్సిన బాధ్యత స్థానిక పోలీస్స్టేషన్లదే. అక్టోబర్ 14వ తేదీదాకా మా ఉత్తర్వులు ఎవరికీ అందకుండా ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆలస్యం చూస్తుంటే మాకే ఆశ్చర్యంవేస్తోంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.సాకులు చెప్పిన పోలీసులుదీనిపై ఢిల్లీ పోలీసులు తప్పును ఆప్ సర్కార్‌పై నెట్టే ప్రయత్నంచేశారు. ఢిల్లీపోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదించారు. ‘‘ మాకు ఉత్తర్వులు రాలేదు. దసరా అయి పోయిన రెండ్రోజుల తర్వాత ఆప్ సర్కార్ ఆదేశా లు జారీచేసింది. ఆదేశాలు వచ్చాకే మేం నిషేధం అమలుకు ప్రయత్నించాం’’ అని భాటీ అన్నారు. దీపావళి, ఆ తర్వాతి రోజు ఢిల్లీలో వా యునాణ్యత దారుణంగా పడిపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలుకా కపోవడంపై కోర్టు ధిక్కరణగా భావించింది. -
అమృత్ టెండర్లలో సీఎం భారీ అవినీతి!: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ పథకం టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ.1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారన్నారు. కేవలం సీఎం బావమరిది అనే ఒకే ఒక్క అర్హతతో ఇంత పెద్దఎత్తున పనులను కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని విమర్శలు సంధించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి కేటీఆర్ కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసి అమృత్ టెండర్లలో జరిగిన స్కాంపై ఫిర్యాదు చేశారు. అనుభవం, అర్హత లేని కంపెనీకి.. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ ‘శోధా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’రూ.1,137 కోట్ల పనులను దక్కించుకుందని కేటీఆర్ ఆరోపించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 2.20 కోట్ల లాభాన్ని చూపించిన కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు ఎలా కట్టబెడతారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటే తెర వెనుక భారీ అవినీతి బాగోతం నడిచిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ఈ వ్యవహారంలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ మొత్తం ప్రాజెక్ట్‌లో 80 శాతం పనులను శోధా సంస్థకు అప్పగించిందన్నారు. ఈ టెండర్లలో సీఎం బావమరిది ప్రధాన భాగస్వామి అని తెలిపారు. ఆ నిబంధన కింద వేటువేయొచ్చు.. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. వారిపై వేటు వేయొచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా ఆయన ఉదహరించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, 1983లో బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, 2005లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు, 2001లో జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2003లో దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా కేసులను కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. 2014లో హరియాణాలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులనూ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. టెండర్లలో చట్టవిరుద్ధంగా జరిగిన కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడే వణికితే ఎలా? కేంద్ర మంత్రి ఖట్టర్‌తో భేటీ నిమిత్తం కేటీఆర్ ఢిల్లీకి రాగా.. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీకి వెళ్లారంటూ రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి కేటీఆర్ తన ‘ఎక్స్’ఖాతా ద్వారా స్పందించారు. ‘జస్ట్ ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నాను. అప్పుడు వణికిపోతే ఎలా?’అంటూ పోస్ట్ చేశారు.