Food
-
ఉడకని మాంసం తింటే ఏం జరుగుతుందో తెలుసా..!
ఆ మాంసం సరిగి ఉడికించకుండా తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయో వివరించాడు అమెరికా వైద్యుడు. సీటీ స్కాన్ తీసి మరీ వెల్లడించారు. మాంసం సరిగ్గా ఉడక్కపోతే దానిలో ఉండే పరాన్నజీవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందో తెలిపారు. ఇంతకీ ఏ మాంసం గురించి అంటే..కొందరూ పంది మాంసం ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా పందిమాంసం తింటుంటారు. అయితే ఈ మాంసాన్ని గనుక సరిగా ఉడికించపోతే అంతే సంగతులని చెబుతున్నారు వైద్యులు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తింటే ఎలాంటి రోగాలు వస్తాయో..?.. సిటీస్కాన్ చేసి మరి వివరించాడు అమెరికా వైద్యుడు డాక్టర్ సామ్ ఘాలి. సరిగా ఉడికించిన పంది మాంసం తిన్న రోగి కాళ్లలో పరాన్న జీవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుందో సీటీస్కాన్ తీసి మరి వెల్లడించారు. అతడికి సిస్టోసెర్కోసిస్ ఉన్నట్లు నిర్థారించారు. దీన్ని వైద్య పరిభాషలో టేప్‌వార్మ్ ముట్టడి అని అంటారని చెప్పారు. అలాంటి ఇన్ఫెక్షన్ని నివారించాలంటే.. పంది మాంసాన్ని సరిగా ఉడికించి తినాలని అన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టైనియా సోలియం లార్వా తిత్తుల వల్ల వస్తుందని అన్నారు. దీన్ని టేప్ వార్మ్(బద్దెపురుగులు) అని పిలుస్తారని చెప్పారు. అంటే పంది శరీరం పర్నాజీవిలా బద్దె పురుగులకు ఆశ్రయం ఇస్తుంది. అందువల్ల ఈ మాంసాన్ని తీసుకునేవాళ్లు బాగా ఉడికించి తీసుకోవాలి. లేదంటే ఈ బద్దెపురుగులు తిత్తులుగా మారి పలు రకాల ఇన్ఫెక్షన్ల బారినపడేలా చేస్తుంది. ఈ తిత్తులు జీర్ణశయాంతర ప్రేగులలో పరిపక్వ వయోజన టేప్‌వార్మ్‌లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితిని ఇంటెస్టినల్ టైనియాసిస్ అంటారు" అని డాక్టర్ ఘాలి వివరించారు. అంతేగాదు ఈ వయోజన టేప్‌వార్మ్‌లు గుడ్లను తొలగిస్తాయి, అవి మానవ మలంలోకి విసర్జించబడతాయని తెలిపారు. అందువల్లే రోగులు సిస్టిసెర్కోసిస్ సిండ్రోమ్ బారిన పడతారని చెప్పారు. (చదవండి: మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!) -
ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!?
పొటాటో–లెమెన్ పోహా..కావలసినవి:బంగాళదుంపలు– 2 (ఉడికించి, చల్లారాక తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి),జీలకర్ర, ఆవాలు– పావు టీ స్పూన్ చొప్పున,కరివేపాకు,ఎండుమిర్చి– కొద్దికొద్దిగావేరుశనగలు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)అల్లం తరుగు– కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు– పావు టీ స్పూన్నూనె– సరిపడా,ఉప్పు– రుచికి తగ్గట్టుగాపసుపు, కారం– అర టీ స్పూన్ చొప్పుననిమ్మరసం– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)కొత్తిమీర తురుము– 4 టేబుల్ స్పూన్లు, అటుకులు– ఒకటిన్నర కప్పులుతయారీ..– ముందుగా అటుకులను జల్లెడ తొట్టెలో వేసుకుని మంచినీళ్లు పోసి, 2 సార్లు కడిగి పెట్టుకోవాలి.– ఆపై ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.– అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసుకుని, 2 నిమిషాలు మూత పెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.– అనంతరం కొత్తిమీర తురుము, అటుకులు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి, మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పోహా.డ్రైఫ్రూట్స్ చాక్లెట్స్..కావలసినవి:కోకో పౌడర్,పంచదార పొడి,కొబ్బరి నూనె (స్వచ్ఛమైనది) – ముప్పావు కప్పు చొప్పున,మిల్క్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు,పిస్తా, బాదం, జీడిపప్పు, వేరుశనగలు(దోరగా వేయించి, తొక్క తీసేసినవి) – 2 టేబుల్ స్పూన్ల చొప్పునతయారీ:– ముందుగా పిస్తా, జీడిపప్పు, బాదం, వేరుశనగలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అనంతరం అదే మిక్సీ బౌల్‌ని కాసిన్ని నీళ్లతో క్లీన్ చేసుకుని, దానిలో కోకో పౌడర్, పంచదార పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మిల్క్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసుకుని క్రీమీగా మారేలా మిక్సీ పట్టుకోవాలి.– అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, దానిలో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం నచ్చిన షేప్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రేని తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, కొద్దికొద్దిగా ఈ మిశ్రమం వేసుకుని, మూడు నుంచి 5 గంటల పాటు ఆ ట్రేను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం వాటిని ట్రే నుంచి వేరు చేసుకోవచ్చు.ఎల్లో ఎగ్ – కీమా లాలీపాప్స్..కావలసినవి:గుడ్లు– 6 లేదా 7 (పసుపు సొన మాత్రమే, ఉడికించి చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)మటన్ కీమా– పావుకిలో (మసాలా, ఉప్పు, కారం వేసుకుని కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)బ్రెడ్ పౌడర్– అర కప్పుఓట్స్ పౌడర్– పావు కప్పు,అల్లం–వెల్లుల్లి పేస్ట్– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– ఒకటిన్నర టీ స్పూన్లు,మిరియాల పొడి, జీలకర్ర పొడి– పావు టీ స్పూన్ చొప్పున,ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లుఉప్పు– తగినంత,గడ్డ పెరుగు– తగినంతనీళ్లు– కొన్ని (అభిరుచిని బట్టి),టమాటో సాస్,కొత్తిమీర తురుము– గార్నిష్‌కి సరిపడా,నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ:– ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల పసుపు సొన, ఉడికిన మటన్ కీమా, ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గడ్డ పెరుగు వేసుకుని ముద్దగా చేసుకోవాలి.– ముద్దలా చేసుకోవడానికి పెరుగు చాలకుంటే నీళ్లు కూడా వాడుకోవచ్చు. – ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా లేదా చిత్రంలో చూపిన విధంగా చేసుకుని, ప్రతి లాలీపాప్‌కు ఒక పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి.– అనంతరం వాటిని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.– వెంటనే టమాటో సాస్‌లో వాటిని ముంచి, కొత్తిమీర తురుము జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి.. ఏం తినాలో తెలుసా!?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆహార సమస్యకు పరిష్కారంగా హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం ఫలితంగా ఆహార పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత గ్రామీణ భారత స్వయంసమృద్ధి లక్ష్యంతో శ్వేత విప్లవం వచ్చింది. శ్వేత విప్లవం వల్ల దేశంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా, ఎందరికో స్వయం ఉపాధి లభించింది. ఈ రెండు విప్లవాలు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా, నేటికీ మన దేశంలో ఎందరో శిశువులు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.దేశవ్యాప్తంగా 2019–21 మధ్య చేపట్టిన ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఎదుగుదల లోపించిన చిన్నారులు 36.5 శాతం, బక్కచిక్కిపోయిన చిన్నారులు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు 32.1 శాతం మంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తున్నా, చిన్నారుల్లో పోషకాహార లోపం ఈ స్థాయిలో ఉండటం ఆందోళనకరం. ఇదిలా ఉంటే, మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 2.4 శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ‘జాతీయ పోషకాహార వారోత్సవం’ సందర్భంగా మీ కోసం...నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవితవ్యానికి చిన్నారుల ఆరోగ్యమే కీలకం. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలి. వారు ఏపుగా ఎదగాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, మన దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపానికి గల కారణాలను, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల తలెత్తే పరిణామాలను కూలంకషంగా అర్థం చేసుకుని, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో, వారిలోని ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే, ప్రపంచవ్యాప్త పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలను చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 14.9 కోట్ల మంది పోషకాహార లోపం కారణంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. మరో 4.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహారం అందక బక్కచిక్కి ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న బాలల మరణాల్లో 45 శాతం మరణాలు పోషకాహార లోపం వల్ల సంభవిస్తున్నవే! చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు, 3.7 కోట్ల మంది చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నారు.పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే, రోజువారీ ఆహారంలో వీలైనంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, గింజధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఐరన్, జింక్, అయోడిన్ తదితర ఖనిజ లవణాలు, విటమిన్–ఎ, విటిమన్–బి, విటమిన్–సి తదితర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.చక్కని పోషకాహారం తీసుకోవడమే కాకుండా, ఆహారం సరిగా జీర్ణమవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో భోజనం చేయడం వల్ల ఆహార జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం వల్ల తినడంలో ఆరోగ్యకరమైన పద్ధతులు అలవడటమే కాకుండా, సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఆకలి వేసినప్పుడు తినే పదార్థాల మీద పూర్తిగా దృష్టిపెట్టి తృప్తిగా భోజనం చేయాలి. తినే సమయంలో టీవీ చూడటం సహా ఇతరత్రా దృష్టి మళ్లించే పనులు చేయకుండా ఉండటం మంచిది.పోషకాహార లోపానికి కారణాలు..చిన్నారుల్లో పోషకాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. శిశువులకు తల్లిపాలు అందకపోవడం మొదలుకొని ఆహార భద్రతలేమి వరకు గల పలు కారణాలు చిన్నారులకు తీరని శాపంగా మారుతున్నాయి. భారత్ సహా పలు దేశాల్లోని పిల్లలకు పేదరికం వల్ల ఎదిగే వయసులో ఉన్నప్పుడు తగినంత పోషకాహారం అందడంలేదు. కడుపు నింపుకోవడమే సమస్యగా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు పోషకాహారం దొరకడం గగనంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరునెలల లోపు వయసు ఉన్న శిశువుల్లో 44 శాతం మందికి మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. మన దేశంలో ఇదే వయసులో ఉన్న శిశువుల్లో దాదాపు 55 శాతం మందికి తల్లిపాలు అందుతున్నట్లు ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ గణాంకాలు చెబుతున్నాయి. బాల్యంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అవి:– కండరాలు పెరగక బాగా బక్కచిక్కిపోతారు.– ఎదుగుదల లోపించి, వయసుకు తగినంతగా పెరగరు.– పెద్దయిన తర్వాత డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, ఎముకల బలహీనత, రకరకాల క్యాన్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతారు.డైటరీ సప్లిమెంట్ల ఉపయోగాలు..మూడు పూటలా క్రమం తప్పకుండా భోజనం చేసినా, మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు తగినంత మోతాదులో అందే అవకాశాలు తక్కువ. అందువల్ల వైద్య నిపుణులను సంప్రదించి, వయసుకు తగిన మోతాదుల్లో సూక్ష్మపోషకాలను అందించే డైటరీ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు విటమిన్–ఎ, ఐరన్ సప్లిమెంట్లు ఎక్కువగా అవసరమవుతాయి. విటమిన్–ఎ సప్లిమెంట్‌ను చిన్నప్పటి నుంచి తగిన మోతాదులో ఇస్తున్నట్లయితే, కళ్ల సమస్యలు, దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి.ఐరన్ సప్లిమెంట్లు ఇచ్చినట్లయితే, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్ని పోషకాలు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోవడం, అవసరం మేరకు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం రోజువారీ భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వీటికి తోడు కొద్ది పరిమాణంలో నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలు, ఉప్పు అవసరమైన మేరకే తప్ప ఎక్కువగా వాడకుండా ఉండాలి.పిల్లల ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి..ఎదిగే వయసులో ఉన్న చిన్నారులు పుష్టిగా ఎదగాలంటే, వారి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. వారు తినే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా కూడా ఉండాలి. పిల్లలకు అందించే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థాలు ఇవి:– పిల్లల భోజనంలో పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, కాలానికి తగిన పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు తప్పనిసరిగా ఉండాలి.– పిల్లలు చురుకుగా ఉండటానికి, ఆరోగ్యకరంగా ఎదగడానికి వారిని ఆరుబయట ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరక వ్యాయామం చేసేలా, ఆటలాడేలా, ఇంటి పనుల్లో పాలు పంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.– పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. వారు వ్యక్తిగత శుభ్రత పాటించేలా అలవాటు చేయాలి.– అతిగా తినడం, వేళాపాళా లేకుండా తినడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే మాన్పించాలి. ఈ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది.– ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు మితిమీరి ఉండే జంక్‌ఫుడ్‌కు పిల్లలు దూరంగా ఉండేలా చూడాలి.కుకింగ్ క్లాసెస్‌తో.. "విద్యార్థులకు ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు, ఇతర ఆహారపదార్థాల్లోని పోషకవిలువల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని విద్యారణ్య, ఓక్రిజ్ స్కూళ్లలో కుకింగ్ క్లాసెస్నూ నిర్వహిస్తున్నారు." – అడ్డు కిరణ్మయి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ కన్సల్టంట్ -
గ్లోబల్ ఫేవరెట్.. మొరాకో
న్యూయార్క్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మొరాకన్ రెస్టారెంట్ నగరంలోని జూబ్లీహిల్స్ వేదికగా ప్రారంభమైంది. అరుదైన వంటకాలతో వినూత్నమైన, పసందైన రుచులను అందించడం మొరాకన్ ప్రత్యేకత. భారతీయులకు ఈ మొరాకన్ రుచులను అందించడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో రెస్టారెంట్ ప్రారంభించడం విశేషం. అయితే ఈ మొరాకన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చెఫ్ అనీసా వహీద్ హైదరాబాదీ కావడం మరో విశేషం. లగ్జరీ వంటకాలుగా ఆదరణ పొందిన మొరాకో డిషెస్ సుగంధ ద్రవ్యాలతో పాటు భారతీయ వంటకాల్లో వినియోగించే కొన్ని ఫ్లెవర్స్ తో తయారు చేస్తారు. ఉత్తర ఆఫ్రికన్, మెడిటరేనియన్, అరబ్, పెర్షియన్ పాకశాస్త్ర మూలాల ప్రపంచ–ప్రసిద్ధ సమ్మేళనంతో సువాసనగల మొరాకో రుచులు భారత్ లోని మధ్యధరా/మధ్యప్రాచ్య ప్రాంతాల్లో విస్తరణకు పూనుకున్నారు. తారా కిచెన్ లోకి ప్రవేశించగానే ఎడారి–పర్వత–సముద్ర సెట్టింగులు దేశ వైభవాన్ని ప్రదర్శిస్తాయి. సహారా–ప్రేరేపిత డైనింగ్ రూమ్‌లో అతిథులకు వెండి టీ కుండల నుంచి అందించే మొరాకో పుదీనా టీతో స్వాగతం పలుకుతుంది. మొరాకో ప్రసిద్ధ బ్రైజ్డ్ డిష్, వినూత్నమైన మటన్–చికెన్, సీఫుడ్, ముఖ్యంగా టాగిన్ అని పిలువబడే కూరగాయలు.. వీటిని సంప్రదాయ శంఖు ఆకారపు కుండలో టేబుల్ పైన వడ్డించే విధానం అద్భుతం. ముఖ్యంగా సువాసనతో కూడిన మసాలా మిశ్రమాలు, గులాబీ సువాసనగల బక్లావా వంటి డెజర్ట్స్ నోరూరిస్తాయి. వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్లు, డిప్లు వంటకాల అద్భుతమైన రుచులను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ కోసం సమతుల్య పోషకాలతో వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అతి తక్కువ నూనెలు, పాల ఉత్పత్తులతో.. బాదం, దానిమ్మ మొలాసిస్తో ఫిగ్ సలాడ్, కాలి్చన వంకాయ, జాలోక్ కూరగాయల కౌస్కాస్, ఆలివ్ ఫిష్ ట్యాగిన్ ఇలా వినూత్న వంటకాలు వాహ్ అనిపిస్తాయి. ఈ వంటలలో గ్లూటెన్ ఇతర అలెర్జీ కారకాలు ఉండవని చెఫ్ లు తెలిపారు. -
నిగనిగలాడే జుట్టునుంచి గుండె దాకా, నల్ల ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో !
చూడటానికి చిన్నగా ఉన్నా నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లగా నిగనిగలాడుతూ తీయని రుచితో నోరూరిస్తూ ఉంటాయి నల్ల ద్రాక్ష పండ్లు. నల్ల ద్రాక్షలో సీ, ఏ విటమిన్లు, బీ6, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇంకా గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషక గుణాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే తెల్ల ద్రాక్ష మంచిదా? నల్ల ద్రాక్ష మంచిదా అని ఆలోచిస్తే రెండింటిలోనూ కాస్త రుచిలో తప్ప ప్రయోజనాల్లో పెద్దగా లేదనే చెప్పాలి. నల్ల ద్రాక్షతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ‘రెస్వెరాట్రాల్’ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. గుండె జబ్బులు కేన్సర్‌తో సహా అన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచికాపాడుతుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.గుండె ఆరోగ్యానికి : నల్ల ద్రాక్ష అద్భుతమైన ప్రయోజనాల్లో ఒకటి గుండె ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డకట్టడాన్నినివారిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే పాలీఫెనాల్స్‌లో అభిజ్ఞా సామర్థ్యాలు , జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి నరాల కణాలు లేదా న్యూరాన్లను రక్షించడంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నరాల సంబంధిత అనారోగ్యాల సంభావ్యతను తగ్గిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే విటమిన్ సీ, కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది : బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ద్రాక్ష మంచి ఎంపిక. అతితక్కువ క్యాలరీలు ,ఫైబర్ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. భోజనం మధ్య చిరు తిండిగా తినవచ్చు. ఇంకా, నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల షుగర్ వ్యాధి పీడితులకు మంచి పండుగా చెప్పవచ్చు.జీర్ణ ఆరోగ్యానికి: నల్ల ద్రాక్ష జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని తొలగించడంలో,గట్ బ్యాక్టీరియా అభివృద్ధికి తోడ్పడుతుంది. మెరిసే చర్మం కోసం : నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. మొటిమలు, వివిధ చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది : నల్ల ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలకు బలాన్నిస్తాయి. బోలు ఎముకల వ్యాధి , పగుళ్లు వంటి ఇతర ఎముక సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో లభించే అధిక శాతం నీరు బాడీని హైడ్రేడెటెడ్గా ఉంచుతుంది. అన్ని వయసుల వారికీ మంచిది.బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది : మధుమేహ నిర్వహణలో ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఇందులోని ఫైబర్, రక్తప్రవాహంలోకి సుగర్ స్థాయిలను త్వరగా వెళ్లకుండా నిరోధిస్తుంది.యాంటీఆక్సిడెంట్ ఫినాల్స్ సమ్మేళనాలు ఇన్సులిన్ నియంత్రణలో సహాయపడతాయి.వాపులను తగ్గిస్తుంది : దీర్ఘకాలం వాపు వల్ల ఆర్థరైటిస్ , గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు వస్తాయి. నల్ల ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మానవ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్ష మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మెరిసే జుట్టు: ఇందులోని విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.చుండ్రు, జుట్టు రాలడం లేదా తెల్లగా మారడం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. పండురూపంలో తీసుకుంటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. జ్యూస్‌లా తీసుకున్నా కూడా మంచిదే. -
Tasty Sweet Corn: గింజ గింజలో.. రుచి!
మార్కెట్లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్‌బాక్స్‌ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.చీజ్ బాల్స్..కావలసినవి:బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;చీజ్ – 50 గ్రాములు;మిరియాల పొడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;నూనె – 3 టేబుల్ స్పూన్లు;తయారీ..– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్‌ను తురమాలి.– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్నీ తిరగేయాలి.– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్‌ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.ఫ్రైడ్ రైస్..కావలసినవి:బాసుమతి బియ్యం – 200 గ్రాములు;నూనె – అర టీ స్పూన్;నీరు – 3 కప్పులు;మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు;సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు;క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;మిరియాల పొడి– టీ స్పూన్;సోయాసాస్– టేబుల్ స్పూన్;ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు.తయారీ..– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి. -
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..
కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ఈ పర్వదినం రోజున చిన్ని కృష్ణయ్యకు సమర్పించే నైవేద్యాలు ఏంటీ..? ఎలాంటి పదార్థాలు నివేదిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దాం..!.ఈ పర్వదినం పురస్కరించుకుని వీధుల్లో జరిగే ఉట్టికొట్టే వేడుకు కోసం వేలాదిగా ప్రజలు గుమిగూడతారు. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. మరీ ఈ వేళ చిన్ని కన్నయ్యకి సమర్పించే సంప్రదాయ వంటకాలేంటంటే..చప్పన్ భోగ్ విందు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రజలంతా భక్తితో సమర్పించే గొప్ప విందు. ఈ చప్పన భోగ్ విందు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..చప్పన్ భోగ్ వెనుక స్టోరీ..ఉత్తర ప్రదేశ్‌లో మధుర శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఉందని తెలుస. అక్కడ బృందావనంలో కృష్ణుడి పెరిగినట్లుగా మనం పురాణల్లో విన్నాం. అక్కడ బృందావన్‌లో ప్రజలు అంతా ముద్దుల కృష్ణయ్య, కన్నయ్య అనే పిలుచుకునేవారు. యశోదమ్మ కృష్ణుడికి చేసిన గారాభం కారణంగా అందరిని ఆటపట్టిస్తూ తుంటరిగా ఉండేవాడు. అంతా.. అమ్మ యశోదమ్మ నీ కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నాం అని ఫిర్యాదులు చేస్తే తిరిగి వాళ్లదే తప్పు అన్నట్లు మందలించే యశోదమ్మ కృష్ణ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒకరోజు బృందావనంలోని ప్రజలంతా ఇంద్రుడిని ఆరాధించే నిమత్తం చప్పన్ భోగ్ కార్యక్రమానికి సన్నహాం చేస్తున్నారు. దీన్ని చూసిన చిన్ని కృష్ణుడు తన తండ్రి నందుడుని ఏంటీ వేడుక? ఎందుకు చేస్తున్నాం అని అడగగా..వర్షాలు బాగా పడేలా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పూజ అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా పండ్లు, కూరగాయాలు, జంతువులకు మేత అందించే గోవర్థన గిరిని పూజించాలని అంటారు. అందుకు గ్రామస్తులు అంగీకరించి గోవర్థన గిరికి పూజ చేస్తారు. దీంతో ఇంద్రుడు కోపంతో ఏకథాటిగా ఎనిమిది రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు బృందావన ప్రజలను గోవర్థన గిరి వద్దకు వచ్చి తలదాచుకోవాల్సిందిగా చెప్పి ఆ పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఉంచి రక్షించాడు. ఆయన వారందర్నీ రక్షించేందుకు ఎనిమిది రోజులగా నిరాహారంగా ఉండిపోతాడు. అన్ని రోజుల తమ కోసం తినకుండా సంరక్షించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞతగా ఈ చప్పన్ భోగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు బృందావన ప్రజలు. అప్పటి నుంచి కృష్ణుడికి ఇష్టమైన ఆహారాలతో భారీ విందు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే యశోదమ్మను కృష్ణుడు ఇష్టంగా ఏం తింటాడని అడిగిమరీ వండి నివేదించడం జరిగిందని పురాణ వచనం. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ చప్పన భోగ్లో మొత్తం 56 రకాల ఆహారాలను సిద్ధం చేస్తారు. ఇందులో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చేదు, ఘాటు, పులుపుతో కూడిన వంటకాల నుంచి మొదలై, తీపి వంటకాలతో ముగుస్తుంది. ఇందులో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, మీగడ, పెరుగుకి సంబంధించిన వివిధ తీపి వంటకాలు కూడా ఉంటాయి. (చదవండి: కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!) -
17వ శతాబ్దం నుంచీ అదే రుచి.. అదే లడ్డు ఇది!!
తీపి వంటకాల్లో లడ్డూ.. తీపి వంటకాల్లో లడ్డూ మొదటి వరుసలో ఉంటుంది. ఏ శుభకార్యమైనా, ఏ శుభ సందర్భమైనా లడ్డూతోనే పరిపూర్ణమవుతుంది. స్వీట్స్ అన్నిట్లోకి అంతటి ప్రత్యేకత పొందింది లడ్డూ! అందులో బందురు తొక్కుడు లడ్డూకున్న రుచే వేరు! నాణ్యమైన నెయ్యి, బెల్లంతో తయారుచేసిన బందరు తొక్కుడు లడ్డూ పేరు చెబితే చాలు చవులూరుతాయి. ఈ తియ్యటి ఖ్యాతి బందరు దాటి ప్రపంచానికీ పాకింది. ఆ కమ్మదనంపై ప్రత్యేక కథనం...ఈ లడ్డూ.. క్రీస్తుశకం 17వ శతాబ్దం చివరలో పాకానికి వచ్చినట్టు చెబుతారు. బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి బందరు (మచిలీపట్నం)కు వలస వచ్చిన మిఠాయి వ్యాపారులు బొందిలి రామ్‌సింగ్ సోదరులు బెల్లపు తొక్కుడు లడ్డూ, నల్ల హల్వాను ఈ ప్రాంతవాసులకు పరిచయం చేశారని చరిత్రకారుల మాట. వారి నుంచి ఈ మిఠాయి తయారీ విధానాన్ని అందిపుచ్చుకున్న బందరు వాసులు కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, శిర్విశెట్టి రామకృష్ణారావు (రాము), శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య తదితరులు లడ్డూ, హల్వాల ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చారు. మచిలీపట్నానికి ఉన్న మరో పేరు బందరు. ఆ లడ్డూ రుచి లోకమంతటికి తెలిసినా రెసిపీ బందురుకు మాత్రమే సొంతమవడంతో అది ‘బందరు లడ్డూ’గా పేరుపొందింది. దీన్ని రోకలితో బాగా దంచి, పొడిచేసి తయారు చేస్తుండటంతో ‘బందరు తొక్కుడు లడ్డూ’గా స్థిరపడింది.ప్రత్యేకమైందీ తయారీ విధానం..ఈ లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి, పటిక బెల్లం, బాదం పప్పు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పును వినియోగిస్తారు. ముందుగా శనగ పిండిని నీటితో కలిపి నేతి బాండీలో బూంది మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడిచేస్తారు. ఆ పొడిని బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి, మళ్లీ రోకలితో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, పటిక బెల్లం ముక్కలు, ఏలకుల పొడి కలుపుతారు. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు ఆరబెట్టి, చెక్క బల్లపై ఒత్తుతూ తగినంత సైజులో లడ్డూలు కడతారు. ఇవి 15 రోజులకు పైగా నిల్వ ఉంటాయి.జీఐ గుర్తింపు.. విదేశాలకు ఎగుమతులు..మొన్నటి వరకు దేశానికే పరిమితమైన ఈ టేస్టీ వంటకం ఇప్పుడు భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ, ఆహార విభాగంలో 2017లో బందరు బెల్లపు తొక్కుడు లడ్డూ పరిశ్రమకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) ఇచ్చింది. ఈ స్వీట్‌కు పేటెంట్ హక్కు (పార్ట్–బి) లభించింది. దీంతో ప్రపంచ దేశాలకు బందరు లడ్డూ ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు సహా దుబాయ్, ఇరాక్, కువైట్లకూ ఏటా వేల కిలోల లడ్డూ ఎగుమతి అవుతోందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఈ లడ్డూ తయారీదారులు, వ్యాపారస్థుల సంఖ్యా పెరుగుతోంది. మచిలీపట్నంలోని బృందావన మిఠాయి వర్తక సంఘంలో సభ్యత్వం కలిగిన 50 మందికి పైగా వ్యాపారులు బందరు తొక్కుడు లడ్డూ, హల్వాలను విక్రయిస్తున్నారు. వీరి వద్ద వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా, వారిలో 250 మందికి పైగా మహిళలు ఉన్నారు.నోట్లో వేసుకోగానే కరిగే నేతి హల్వా..బందరులో తయారయ్యే మరో తీపి వంటకం ‘నేతి హల్వా’కూ మంచి డిమాండ్ ఉంది. రాత్రంతా గోధుమలను నానబెట్టి, మరుసటి రోజు పిండిగా రుబ్బి, దాన్నుంచి పాలు తీస్తారు. ఆ పాలను బెల్లం పాకంలో పోస్తూ కలియ తిప్పుతారు. ఆ పాకాన్ని పొయ్యి మీద నుంచి దించే అరగంట ముందు అందులో తగినంత నెయ్యి వేస్తారు. ఆ తర్వాత సరిపడా జీడిపప్పును దట్టించి, ప్రత్యేక ట్రేలలో పోస్తారు. అలా 24 గంటల పాటు ఆరబెడతారు. ఈ హల్వా సుమారు నెల వరకు నిల్వ ఉంటుంది. నలుపు వన్నెతో ఉండే ఈ హల్వా కూడా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతోంది. – ఎస్.పి. యూసుఫ్, ఫొటోలు: కందుల చక్రపాణి, సాక్షి, విజయవాడ. -
ఇవి.. పొరుగింటి దోసెలు!
వారం మెనూలో దోసె ఉండాల్సిందే... దోసె కూడా బోర్ కొట్టేస్తుంటే ఏం చేద్దాం? పక్క రాష్ట్రాల వాళ్ల వంటింట్లోకి తొంగిచూద్దాం. కేరళ వాళ్లు మనదోనెనే కొద్దిగా మార్చి ఆపం చేస్తారు. కన్నడిగులు చిరుతీయటి నీర్‌దోసె వేస్తారు.కన్నడ నీర్ దోసె.. కావలసినవి..బియ్యం – 2 కప్పులు;కొబ్బరి తురుము – కప్పు;ఉప్పు – చిటికెడు;నూనె – టేబుల్ స్పూన్;తయారీ..– బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టాలి.– బియ్యం, కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మిక్సీలో మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం గరుకుగా గ్రైండ్ చేయాలి.– పిండిలో తగినంత నీటిని కలిపి గరిటె జారుడుగా ఉండాలి.– పెనం వేడి చేసి దోసె వేసి కొద్దిగా నూనె వేయాలి. రెండువైపులా కాల్చి వేడిగా వడ్డించాలి.గమనిక: కన్నడ నీర్ దోసెకు పిండిని పులియబెట్టాలిన అవసరం లేదు. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి వెంటనే దోసెలు వేసుకోవచ్చు. దీనికి సాంబార్, ఆవకాయ– పెరుగు కలిపిన రైతా మంచి కాంబినేషన్.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా – చిటికెడు.తయారీ..– బియ్యాన్ని కడిగి మంచినీటిలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.– మిక్సీలో బియ్యం, కొబ్బరి తురుము వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.– బాణలిలో నీటిని ΄ోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.– మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.– ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి.– ఉదయం ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో కలపాలి.– మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి.– ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పెనం అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.– మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.– అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.– అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.– ఇందులో నూనె వేయాల్సిన పని లేదు.– ఆపం పెనం లేక΄ోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు. -
ఈ బర్మా ఫుడ్.. క్రేజీ టేస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్‌లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్‌కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్‌కు క్రేజీ స్పాట్‌గా మారింది.బర్మా సంస్కృతికి ప్రతీకగా.. ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్‌తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్‌కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్‌తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్‌గా నిలుస్తుంది.సంస్కృతుల సమ్మేళనం..వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్‌స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్‌లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, అహ్మదాబాద్‌లో విస్తరించింది.ముఖ్యంగా కోల్‌కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్‌లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు. -
మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!
మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్వర్బిన్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ భారతీయ మలయ్ వంటకాల తోపాటు మిల్లెట్లను హైలెట్ చేసేలా గ్రాండ్ లంచ్‌ను ఏర్పాటు చేశారు. మెనూలో ఏం ఉన్నాయంటే..మెనూలో భారతీయ, ఆగ్నేయాసియా రుచులను అందంగా మిళితం చేసేలా విభిన్న వంటకాలను అందించింది. ఇందులో నూడుల్స్, కూరగాయలు, స్పైసి వంటకాలు, కొబ్బరితో చేసినవి ఉన్నాయి. ఇక తీపి, కారంతో మిళితం చేసే పెర్ల్ మఖానీ వొంటన్, పెర్ల్ మిల్లెట్, కాటేజ్ చీజ్ తదితరాలు ఉన్నాయి. అలాగే మిక్స్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌తో తయారు చేసినన సలాడ్, రుచికరమైన కబాబ్‌లకు రిఫ్రెష్ బ్యాలెన్స్‌లో ఉల్లిపాయలు, బెంగాలీ పంచ్ ఫోరాన్ మసాలాలు, జీలకర్రతో వండిన బ్రెజ్డ్, బటన్ మష్రూమ్‌లు ఉన్నాయి. ఇవికాక మిల్లెట్కి సంబంధించి రాగి, బచ్చలి, జీడిపప్పతో చేసిన కుడుములు, బంగాళదుంప జీడిపప్పుతో చేసిన మిల్లెట్ కుడుము విత్ బచ్చలి కూర గ్రేవీ, గుజరాతీ ఖట్టి మీథీ దాల్, పులిహోర తదితరాలతో మలేషియా ప్రధానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు మోదీ. కాగా, 2023 అధికారికంగా మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించినప్పటి నుంచి అంతర్జాతీయ ఆదరణ లభించేలా మెల్లెట్స్తో ఎలాంటి వైవిధ్యమైన వంటకాలు చేయొచ్చు తెలిపేలా భారతీయ వంటకాలతో చాటి చెబుతోంది. (చదవండి: బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!) -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. -
ఖైదీలు వండే కమ్మని బిర్యానీ
ఉత్తర కేరళ రాష్ట్రంలోని కన్నూర్ బిర్యానీ వంటకానికి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక్కడ ప్రసిద్ధ వయనాదన్ కైమా లేదా జీరకసాల అన్నం, మలబారి బిర్యానీని వివిద కాంబినేషన్లో వండుతారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా కేవలం రెండు గంటల ప్రయాణంలో కన్నూర్‌కి చేరుకోవచ్చు. ఇది కేరళలోని అత్యంత మనోహరమైన పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది. 2010లో కేరళ ప్రభుత్వం చొరవతో తిరువనంతపురం జైలులో ఖైదీలతో వంటకాలు చేయించడం \ప్రారంభమయ్యింది. ఆ ఖైదీలు చేసిన వంటకాలను ఫ్రీడం కోసం ఆహారంగా అభివర్ణించారు. జైళ్లను దిద్దుబాటు కేంద్రాలుగా మర్చాలనే ఆలోచనకు అంకురారప్పణ చేసి, వారికి వండటంలో శిక్షణ ఇచ్చారు అదికారులు. అలాగే వాళ్లు తయారు చేసిన వంటకాలన్నీ సాధారణ ప్రజలకు విక్రయిస్తారు. అందుకు గానూ ఖైదీలకు పరిహారం కూడా చెల్లిస్తారు. అంతేగాదు జైలుని ఆధునికరించి, ఖైదీలకు చపాతీ, వెజిటబుల్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్‌కర్రి తదితర వంటకాలను కూడా నేర్పించారు. సరిగ్గా చెప్పాలంటే ఈ వినూత్న కార్యక్రమం 2012లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ కిచెన్ జస్ట్ ఐదేళ్లలోనే రూ. 8.5 కోట్లకు పైగా ఆర్జించిందని ప్రభుత్వం ప్రకటించింది. ఖైదీలు చేసిన ప్రధాన వంటకాల్లో ఈ బిర్యానీ కూడా ఒకటి.(చదవండి: ప్రేమంటే ఇదేరా: సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!) -
'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!
తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని పలుచోట్ల వివిధ రకాల పేర్లుతో పిలవడం గురించి విన్నాం. కానీ మరీ ఇలా ఓ ప్రముఖ నటి పేరుమీదుగా బ్రేక్‌ఫాస్ట్‌ని పిలవడం గురించి విని ఉండరు. ఈ ఇడ్లీ తమిళనాట బాగా ఫేమస్. కోలివుడ్ చెందిన ప్రముఖ నటి ఖుష్బు పేరు మీదుగా అక్కడ ఇడ్లీ వంటకం ఉంది. అసలు ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక దాగున్న స్టోరీ ఏంటంటే..?.భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి ఇడ్లీలు. ఇవి అత్యంత మృదువుగా మెత్తటి ఇడ్లీలా ఉంటాయి. సింపుల్‌గా చేసే ఈ అల్పాహారాన్ని దక్షిణ భారతదేశంలో ఓ గిన్నె సాంబార్, చట్టితో సర్వ్ చేస్తారు. దక్షిణ భారత సాంప్రదాయ వంటకమే ఈ ఇడ్లీ. అయితే తమిళనాట పేరుగాంచిన 'ఖుష్బూ ఇడ్లీ' తయారీ మాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇది మిగతా ఇడ్లీల కంటే పువ్వులా కోమలంగా తెల్లటి మల్లెమొగ్గల్లా అందంగా ఉంటాయి. నోట్లే వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. అంతలా సుకుమారంగా ఉంటాయి ఈ ఇడ్లీలు. అదీగాక తమిళనాడులో ఒకప్పుడూ అత్యంత అందమైన హీరోయిన్గా ఖుష్బు ఓ వెలుగు వెలిగింది. ఆమె కూడా బొద్దుగా అందంగా ఉంటుంది. ఈ ఇడ్లీలు కూడా చక్కగా ప్లవ్వీగా మల్లెపువ్వులా ఆకర్షణీయంగా ఉండటంతో ఆ నటి పేరు మీదగా వాళ్లంతా ఈ ఇడ్లీని పిల్చుకుంటున్నారు. దీన్ని వాళ్లు మల్లిగే ఇడ్లీ లేదా మల్లిగై పూ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. తమిళంలో మల్లిగె, మల్లిగై అంటే 'మల్లెపువ్వు' అని అర్థం. మల్లె పువ్వులా చాలా కోమలంగా ఈ ఇడ్లీలు ఉంటాయి. ఐతే ఈ ఇడ్లీ 'ఖుష్బూ ఇడ్లీ' పేరు మీదగానే ఎక్కువ ప్రజాధరణ పొందింది. ఎవరు తయారు చేశారంటే..?నాలుగు దశాబ్దాల క్రితం, ధనభాగ్యం అమ్మ ప్రస్తుత కరుంకలపాళయం ఈ ఖుష్బు ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఈ అసాధారణమైన మృదువైన ఇడ్లీలు రాను రాను ఆహార ప్రియులకు ప్రీతికరమైనవిగా మారిపోయాయి. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన రెసిపీ తయారీ గురించి 20 కుటుంబాలకు తెలియజేసింది. వాళ్లంతా ఆమెకు సహాయం చేయడానికి వీలుకల్పించారు. అలా లగ్జరీ హోటళ్ల నుంచి చెఫ్‌లు కూడా ధనభాగ్యం అమ్మ చేసిన ప్రత్యేక ఇడ్లీల తయారీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నేడు రోజుకు దాదాపు 10 వేలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఖుష్బు ఇడ్లీ విలక్షణమైన ఆకృతి దాని పదార్థాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సబుదానా, బియ్యం, మినప్పులతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని పులియబెట్టడం వల్ల మృదువుగా స్పాంజ్‌లా వస్తాయి.(చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) -
Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!
వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.పూర్ణాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – అర కేజీ,బెల్లం – అరకేజీ,యాలక్కాయలు – పది,బియ్యం – రెండు కప్పులు,పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.తయారీ..– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి.– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.భక్ష్యాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,బెల్లం తురుము – రెండు కప్పులు,యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు,మైదా – రెండు కప్పులు,గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు,నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,ఉప్పు – చిటికెడు.తయారీ..– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. – నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.– మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. -
విభజన టైంలో వీళ్ల ‘చేదు’ అనుభవాలు వింటారా?
1947లో భారతదేశ విభజన చాలా మందికి తమ పూర్వీకులను కోల్పోయేలా చేసింది. వారు పెరిగిన వాతావరణంలోని ఆహారపు అలవాట్లను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాలంటే.. ఈ విభజన చాలామందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒక్క రాత్రితో తమ జీవితాలనే మార్చేసిన విభజన అది. అలాంటి భాధనే ఎదుర్కొన్న నలుగురు వృద్ధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ టైంలో ఈ విభజన ఎలా తమ ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేసిందో వివరించారు. విభజన కారణంగా చెలరేగిన ఘర్షణలు, అల్లకల్లోలంతో రాత్రికి రాత్రే తమ పూర్వీకులను వదిలిపెట్టి భారత్‌లోకి లేదంటే పాక్‌లో వెళ్లిపోవాల్సి వచ్చింది. కొందరికి అది తీరని విషాదాన్ని కలిగించి, చేదు జ్ఞాపకాలుగా మిగిలింది. అది వారికి కేవలం తమ వాళ్లను మాత్రమే దూరం చేయలేదు, ఆఖరికి వారి ఆహారపు అలవాట్లను సంస్కృతిని ప్రభావితం చేసింది. అదెలాగో ఆ వృద్ధుల మాటల్లోనే చూద్దాం..!రషేదా సిద్ధిఖీ, 24 ఆగస్టు 1947"ఇది మాకు ఇష్టమైన వారిని వదులుకునేలా చేసింది. అలాగే సాంప్రదాయ వంటకాలకు, వివిధ పదార్థాలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. కొత్త పరిసరాలకు అందుబాటులో ఉన్న వనరులకు పరిమితం కావడం ఓ సవాలుగా మారింది. ఉన్న వాటితో మా వంటకాలను సవరించుకోవాల్సి వచ్చింది. అందుబాటులోని వనరులతోనే వంటలను చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. పాత ఢిల్లీ ఇప్పుడది లక్నో. తాము తినే తినుబండరాల దుకాణాలు, కేఫ్‌లు ఇప్పుడూ అక్కడ లేవు అని చెప్పుకొచ్చారు రషేదా. అయితే ఇప్పుడు మరెన్నో అంతర్జాతీయ వంటకాలు, ఫాస్ట్ పుడ్స్ వంటివి చేరడం విశేషం." అన్నారు. శీలావంతి, 10 ఆగస్టు 1935కరాచీలో మాకు పొలాల నుంచి తాజా కూరగాయలు వచ్చేవి. కావాల్సినవి ఇష్టంగా తినేవాళ్లం. అలాగే నా తోబుట్టువులతో చిన్న చిన్న దుకాణాలకు వెళ్లేవాళ్లం. సింధీ రోటీ వంటివి తినేవాళ్లం. తాజాగా తినే ఫ్రూట్ సలాడ్స్ మిస్ అవుతున్నాం. మళ్లీ కరాచీ వెళ్లి పూర్వీకులను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు శీలావంతి. శిఖా రాయ్ చౌదరి, ఆగస్టు 14, 1939సరిగ్గా నాకు ఏడేల్లు వయసులో ఫరీద్పూర్(బంగ్లాదేశ్)లోని ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయాం. అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్‌ని, సంస్కృతిని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ కాలంలో గ్రామఫోన్‌లో పాటలు వినేవాళ్లం. బంగ్లాదేశ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో రుచికరమైన అల్పాహారం అంటే మహా ఇష్టం. అవన్నీ మిస్సయ్యానంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు శిఖా రాయ్గౌరీ రే, ఆగస్ట్ 9, 1944"విభజన మమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే మా తాతల టైంలోనే బంగ్లాదేశ్‌ని విడిచి వచ్చేశాం. మాకు దుబ్రిలో వెదరుతో చేసిన ఇల్లు ఉండేది. అదీగాక నేనే కోల్‌కతా, డిళ్లీ రెండు నగరాల్లో పెరిగాను. స్కూల్ చదవంతా కోలకతాలో సాగగా, కాలేజ్ చదవంతా ఢిల్లీలో చదివాను. అలాగే మా కుటుంబం పార్క్ స్ట్రీట్ రెస్టారెంట్‌కి వెళ్లేది. అయితే అప్పట్లో థాయ్, కొరియన్, జపనీస్ వంటి బహుళ వంటకాల రెస్టారెంట్లు లేవు." అని చెప్పుకొచ్చారు గౌరీ రే.ఉమా సేన్, 1939"విభజన కారణంగా మేము భూమిని, ఇంటిని కోల్పోయాం. అలాగే మాకు ఇష్టమైన వంటకాలను, రుచులను మార్చుకోవాల్సి వచ్చింది. స్నేహితులను, పూర్వీకులు కోల్పోయాం. ఇప్పుడు మేమున్న ప్రదేశం రద్దీగా మారిపోయింది. అలాగే కొత్తకొత్త వంటకాలకు సంబంధించిన రెస్టారెంట్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు". ఉమాసేన్.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
హెల్దీ డైట్: సగ్గుబియ్యం పొంగనాలు..
పోషకాలు, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం వంటి విటమిన్స్ ఆరోగ్యానికి పుష్కలంగా దొరికే వంటకం ఇది. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం..కావలసినవి..సగ్గుబియ్యం – అర కప్పు (గంట సేపు నానబెట్టాలి);పనీర్ తురుము – 75 గ్రాములు;వేరుశనగపప్పుల పొడి– 3 టేబుల్ స్పూన్లు;క్యారట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు;బంగాళదుంప – 1 (ఉడికించి తొక్క తీసి చిదమాలి);జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి– టీ స్పూన్;మిప్రో్పడి– టీ స్పూన్;ఉప్పు– అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;క్యాబేజ్ తరుగు – ము΄్పావు కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు (రెడ్, గ్రీన్ క్యాప్సికమ్);చీజ్ తురుము – 50 గ్రాములు (12 భాగాలు చేసుకోవాలి);నూనె – టీ స్పూన్.తయారీ..– ఒక పాత్రలో క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.– ఆ తర్వాత ఇందులో నూనె, చీజ్ మినహా మిగిలినవన్నీ వేసి బాగా కలిపి పన్నెండు భాగాలుగా చేయాలి.– ఒక్కో భాగంలో చీజ్ స్టఫ్ చేస్తూ గోళీలాగా చేయాలి.– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో ఒక్కో చుక్క నూనె రుద్ది పొంగనాన్ని పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.– ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు కాల్చాలి.పోషకాలు (ఒక్కో పొంగనంలో)..– కేలరీలు 63;– ప్రోటీన్ – 2.5 – 3 గ్రాములు;– కార్బోహైడ్రేట్లు – 8–9 గ్రాములు;– ఫ్యాట్ – 2–3 గ్రాములు;– ఫైబర్– గ్రాము;– క్యాల్షియం – 40–50 గ్రాములు.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ -
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!
ప్రముఖ సంగీత విద్యాంసుడు, గాయకుడు అద్నాని ఇంట మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, అతని భార్య సఫా మీర్జాకి భారీగా విందు ఇచ్చారు. ఆ విందులోని వంటకాల జాబితా వింటే వామ్మో అనాల్సిందే!. అంతలా విందు ఏర్పాటు చేశారు గాయకుడు అద్నాని, ఆయన భార్య రోయా సమీఖాన్. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ విందులో డజనుకు పైగా రకరకాల రెసిపీలు ఉన్నాయంటూ వాటి వివరాలను కూడా వెల్లడించాడు. పాయా నుంచి మసాలాలు, క్రీము కొల్లాజెన్‌తో తయారు చేసిన మటన్ సూప్, సీక్ కబాబ్‌లు తోపాటు తమ కుటుంబ మూలాలను ప్రతిబింబించే మాంసాహారాలకు రెసిపీలు ఆ కూడా ఉన్నాయి. అలాగే ఉత్తర భారతీయ వంటకాలకు సంబంధించిన నాన్లు, కడాయి మటన్, బటర్ చికెన్, చనా, లసూని పాలక్‌లు తదితర రెసీపీలు కూడా ఉన్నాయి. తాను ఇలాంటి భారీ విందు కోసం అని ముందు రోజు ఏమి తినకుండా ఉంటానని చెబుతున్నాడు ఇర్ఫాన్. ఈ చక్కటి డిన్నర్లో మనసుకి హత్తుకునే సంభాషణలు, నోటికి రుచికరమైన ఆహారంతో చక్కగా సాగిపోతుంది కాలం అంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఇర్ఫాన్. గతంలో అద్నాన్ సమీ కూడా తనకు వండటం అంటే ఎంతో ఇష్టం చెప్పారు. ముఖ్యంగా పాయా, బిర్యానీ, పపఉలు వంటి వంటకాలు చేయడం ఇష్టమని చెప్పారు కూడా. ఈ ఇద్దరు స్నేహితులు వీడియోలో ఈ రుచికరమైన వంటకాలు ఎలా చేతితో తయారు చేశారో వివరిస్తూ జోక్‌లు వేసుకుంటూ కనిపించారుడ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!) -
ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!
భారతదేశం అనేక వినూత్నమైన అల్పాహార వంటకాలకు నిలయంగా ఉంది. అన్ని పోషకమైన, ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి. దక్షిణ భారతదేశంల ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని సాధారణంగా మినపప్పుతో తయారు చేస్తారు. అయితే ఆరోగ్యకరంగా మార్చేలా మిల్లెట్‌తో జోడించి శక్తిమంతమైన పోషకాలు కలిగిన దానిగా, ఆరోగ్యప్రదాయినిగా ఉపయోగిస్తున్నారు. ఈ రాగి దిబ్బరొట్టు ఆ ప్రాంతం వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీన్ని 'ఫింగర్ మిల్లెట్'గా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రధానమైన ధాన్యం, అధిక పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాకు పేరుగాంచింది. ఈ ఆరోగ్యకరమైన పదార్థం మిల్లెట్ కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్‌తో నిండి ఉంది. సమతుల్య ఆహారాన్ని కొనసాగించాలనుకునే వారికి ఇది ప్రీతికరమైన పదార్థంగా ఉంటుంది. ఇక్కడ "దిబ్బరొట్టు అంటే మందపాటి రొట్టు అని అర్ధం. సాంప్రదాయంగా బియ్యం మినప్పులతో తయారు చేస్తారు. ఈ ఆంధ్రా శైలి వంటకానికి రాగి పిండిని జోడించడంతో ప్రత్యేకమైన రుచి తోపాటు పోషకాహార ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. ఈ రాగిదిబ్బ రొట్టుని తయారు చేయడం సులభం అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆకృతిలో సంతృప్తినిచ్చే మృదువైన మెత్తటి వంటకంగా తయారు చేస్తారు. ఈ వంటక కేవలం పాక ఆనందం, రుచినే గాక సమాయనుకూల ఆరోగ్యకర వంకంగా పేరుగాంచింది. దీన్ని అక్కడ ప్రజలు ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం అల్పాహారంగా తీసుకుంటుంటారు. ఈ రాగిదిబ్బ రొట్టుకి కావాల్సిన పదార్థాలు:రాగి పిండి ( మిల్లెట్ పిండి) 1 కప్పుబియ్యం 1/2 కప్పుఉరద్ పప్పు (నలుపు) 1/4 కప్పుజీలకర్ర గింజలు 1/2 టీస్పూన్2 పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి1 చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగిన (ఐచ్ఛికం)కొన్ని కరివేపాకు, తరిగినవిరుచికి ఉప్పువంట కోసం నూనెతయారుచేయు విధానం..బియ్యం,పప్పును నీటిలో 4 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత, నీటిని తీసివేసి, కొద్దిపాటి నీటిని ఉపయోగించి మెత్తటి పిండిలా అయ్యే వరకు రుబ్బాలి. ఒక పెద్ద గిన్నెలో, రుబ్బిన బియ్యం, మినపప్పు పిండిలో రాగి పిండిని కలపండి. మందపాటి, మృదువైన పిండిని రూపొందించడానికి బాగా కలపండి.ఇప్పుడు పిండిలో ఉప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు కరివేపాకు వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి పరిసర ఉష్ణోగ్రతను బట్టి పిండిని 6-8 గంటలు లేదా రాత్రిపూట పులియనివ్వండి. కిణ్వన ప్రక్రియ పిండికి కొంచెం లూజ్‌నెస్ తెస్తుంది.మీడియం వేడి మీద భారీ అడుగు ఉన్న పాన్ లేదా కడాయిని వేడి చేయండి. ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసి, చుట్టూ తిప్పండి. ఆ తర్వాత దానిలో గరిటెల పోసి పిండిని పోసి, మందపాటి గుండ్రని ఆకారంలో వేయండి. 4-5 నిమిషాల దిగువన బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. రోటీని జాగ్రత్తగా తిప్పి, మరొక వైపు కూడా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. ఇక్కడ దిబ్బరొట్టి రుచిగా వచ్చేలా అంచుల చుట్టూత కొద్దిగా నూనె జోడించాలి. దీన్ని చట్నీ, సాంబార్‌తో కలిపి తింటే ఆ రుచే వేరేలెవెల్..!(చదవండి: నీరజ్ చోప్రా ఫిట్నెస్ రహస్యం ఇదే..!) -
వెజ్ మెమరి ఫుల్..
సాక్షి, సిటీబ్యూరో: శాకాహారంతో ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.. అయితే మానసిక ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు తేలి్చచెప్పారు. శాకాహారంతో మెదడు పనితీరు మెరుగు పడుతుందని, డిప్రెషన్ తగ్గుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని గుర్తించారు. వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి మంచన నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం వివరాలు యురోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 40 ఏళ్లు దాటిన 304 మందిపై 6 నెలల పాటు వర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. శాకాహారులు, మాంసాహారులు మధ్య మానసిక, జ్ఞాపకశక్తి అంశాలలో ఉన్న తేడాలను పరిశోధించారు. శాకాహారం తిన్నవారిలో ప్రొటీన్, కాల్షియం, ఫోలేట్, విటమిన్ సీ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాకపోతే వీరిలో విటమిన్ బీ–12 స్థాయి చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ఇక, మాంసాహారం తిన్నవారిలో కార్బొహైడ్రేట్స్, సోడియం, రైబోఫ్లావిన్, ఇనుము, విటమిన్ బీ ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.విరివిగా యాంటీ ఆక్సిడెంట్లు..శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషించే యాంటీ ఆక్సిడెంట్లు.. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవారిలో విరివిగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా మానసిక ఒత్తిడి భారీగా తగ్గిందని, వీరిలో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. మెదడు పనితీరులో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా తీసుకోవడంతో మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడిందని వెల్లడించారు. లాభాలు ఎన్నో శాకాహారం తీసుకోవడం వల్ల మానసికపరమైన లాభాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి లాభాలు చేకూరుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులను మన ఆహారంలో భాగం చేస్తే డిప్రెషన్, యాంగ్జయిటీ దరిచేరవని చెప్పొచ్చు. – డాక్టర్ వరలక్ష్మి మంచన, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ వర్సిటీ -
బిర్యానీ తిన్నామంటే గోలీ సోడా పడాల్సిందే..
హే బాబూ.. ఓ గోలీ సోడా కొట్టవోయ్.. ఈ మాట విని ఎన్నేళ్లవుతుందో కదా..! ఒకప్పుడు ప్రతి ఊర్లో.. ప్రతి వీధిలో బండిపై గోలీ సోడా అమ్ముతుండేవారు. ఎండాకాలం వచి్చందంటే చాలు అలా గోలీ సోడా ఒకటి కడుపులో పడిందంటే ఎంతో హాయిగా ఉండేది. కాలక్రమేణా గోలీ సోడా స్థానంలోకి శీతల పానీయాలు వచ్చి చేరాయి. మళ్లీ ఇప్పుడు పాత రోజులు గుర్తు చేసేందుకు గోలీ సోడాలు మార్కెట్లోకి వచ్చేశాయి. అప్పట్లో వీటి టేస్ట్ చూసిన వారు.. ఆ టేస్ట్ తెలుసుకొని నేటి యువత వాహ్.. అంటున్నారు. గోలీ సోడా తాగితే చాలు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు హైదరాబాద్ యువత. నగరంలో గోలీ సోడాకు పెరుగుతున్న క్రేజ్డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో కలర్ఫుల్గా ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యూత్ ఒకప్పుడు తోపుడు బండ్లపై నిమ్మకాయ సోడా, సాదా సోడాలు అమ్ముతుండే వారు. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చాయి. అలా హైదరాబాదీ బిర్యానీ తిన్నామంటే.. ఓ గోలీ సోడా పడాల్సిందే.. అన్నట్టు ట్రెండ్ సెట్ చేస్తున్నారు సిటీ యూత్. డిఫరెంట్ ఫ్లేవర్స్తోనే కాకుండా క్రేజీ కలర్స్‌లో దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లలో గోలీసోడాల సీసాలను ఇప్పుడు అమ్ముతున్నారు. బ్లూబెర్రీ, వర్జిన్ మొజిటో, లెమనేడ్, నింబూమసాలా, యాపిల్ మొజిటో, ఆరెంజ్, రోజ్‌ఎసెన్స్ ఇలా వేర్వేరు ఫ్లేవర్స్‌లో కంపెనీలు తయారు చేస్తున్నాయి. లెమన్ ట్రీ, పర్పుల్ హేజ్, బెడ్ ఆఫ్ రోజెస్ం అంటూ పాపులర్ ఇంగ్లిష్ పాటల పేర్లు పెట్టి మరీ యువతను ఆకర్షిస్తున్నారు. దుకాణాలతో పాటు కొన్ని హోటళ్లూ, క్లబ్బులూ కాలేజీలకు కూడా ఈ సోడాలను సరఫరా చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి మళ్లీ.. సోడావైపు మళ్లింది.ఆ టేస్టే వేరు.. గోలీ సోడా సీసా స్టైల్, కలర్, గోలీ కొడుతుంటే వచ్చే శబ్దం.. అందులోని సోడా అన్నీ ప్రత్యేకమే.. చిన్నప్పుడు ఊర్లలో ఒకటి, రెండు రూపాయలకు దొరికే సోడా తాగేందుకు ఎంతో ఎదురు చూసేవాళ్లం. సోడా తాగిన తర్వాత వచ్చే అనుభూతి వేరేలా ఉండేది. ఇప్పుడు కూడా ఎక్కడైనా సోడా బాటిల్ కని్పస్తే వేరే కూల్‌డ్రింక్స్ ఉన్నా కూడా గోలీ సోడా తాగుతుంటే వచ్చే మజానే వేరు. – సాయికిరణ్ మెగావత్, హిమాయత్నగర్ఆ శబ్దం వింటే.. అదో ఆనందం..పిల్లలకు గోలీ సోడా సరదా ఓ పట్టాన తీరేది కాదు. రబ్బరు కార్కుతో సోడా కొట్టగానే గోలీ లోపలికి వెళ్లినప్పుడు వచ్చే ఆ శబ్దానికి కళ్లనిండా ఆశ్చర్యమే. ఆ శబ్దం వింటే మనసుకు అదో తృప్తి. గోలీసోడాలో ఉండేది కార్బొనేటెడ్ నీళ్లే. మొదటగా 1767లో జోసెఫ్ ప్రిస్ట్లే అనే శాస్త్రవేత్త, కార్బన్‌డయాక్సైడ్‌ను నీటిలోకి పంపి, స్నేహితులకిస్తే, ఆ రుచి నచ్చడంతో అందులో పండ్ల ఫ్లేవర్లూ, చక్కెరలూ కలిపి సాఫ్ట్‌డ్రింక్స్ తయారు చేయడం ప్రారంభించారు. అందుకే సోడా కూడా ఓ సాఫ్ట్ డ్రింకే.. మొదట్లో సోడా నీళ్లని సాదా బాటిల్స్‌లోనే నింపేవారు. అయితే మూత బిగించేటప్పుడూ తీసేటప్పుడూ గ్యాస్ పోయేది. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చూస్తున్న కాడ్నెక్ బాటిల్‌ను రూపొందించారు. 1872లో హిరమ్ కాడ్ అనే బ్రిటిష్ ఇంజినీర్ దీన్ని తయారు చేశాడు. ఈ బాటిల్ మందంగా ఉంటుంది. -
వర్షాకాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ : చిట్కాలు
కూరల్లో రుచి కావాలంటే దానికి కావాలసిన అన్ని పదార్థాలు సమపాళ్లలో పడాలి. ముఖ్యంగా ఉప్పు,కారం, నూనె, అల్లం వెల్లుల్లి, మసాలా. అయితే వంట తొందరగా అయిపోతుందనో, సమయాభావం వల్లనో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. మరి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? తెలుసుకుందామా?మార్కెట్లో ఇన్స్టెంట్గా చాలా రకాల మసాలాలు, పొడులు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కాలంలో వాటిని ఎంతవరకు నమ్మాలి అనేది ప్రధాన సమస్య. ముఖ్యంగా అల్లం , వెల్లుల్లి పేస్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుళ్లిపోయిన బంగాళాదుంపలు, పేపర్ ముక్కలు తదితర వస్తువులతో అనారోగ్య వాతావరణంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారవుతుందున్న వార్తల మధ్య అల్లం, వెల్లుల్లి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెండూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పొట్టు తీసిన శుభ్రంగా కడిగిన అల్లం, పొట్టువలిచిన వెల్లుల్లికలిపి మెత్తగా మిక్సీలో నూరుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు కలుపుకుంటే పాడు గాకుండా ఉంటుంది. ఈ పేస్ట్‌ను గాలి చొరబడని గాజు సీసాలో పుంచి, ఫ్రిజ్‌లో భద్రపరచాలి.ఒకరోజు వాడిన స్పూను మరో రోజు వాడకుండా, తడి తగలకుండా జాగ్రత్త పడాలి. ఉప్పు లేదా నూనె, లేదా పసుపు కలపడం వల్ల కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది. అలాగే వెనిగర్‌ను కూడా కలుపుతారు.ఇలాంటి చిట్కాలు పాటిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోదు. పైగా కలర్ మారకుండా, మంచివాసనతో ఉంటుంది. -
బోడకాకర ఉంటే, మటన్, చికెన్ దండగ, ఒక్కసారి రుచి చూస్తే
ఏ సీజన్లో లభించే కూరగాయలు, పళ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంటే ఆయా కాలంలో వచ్చే వైరస్లు, రోగాల నుంచి కాపాడతాయని దీని అర్థం. వర్షాకాలం పచ్చగా నిగ నిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకర కాయ. వీటినే బొంత కాకర కాయలు అని కూడా పిలుస్తారు. ఇంకా అడవి కాకర, ఆ-కాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడకాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి. కండరాలను బలోపేతం చేస్తుందని, సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు నిపుణులు.శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందిస్తుంది. విటమిన్ డీ12, విటమిన్ డీ, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివి లభిస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి. బోడ కాకరకాయలో ఉండే ఫోలేట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. దీన్ని ఫ్రై లేదా, ఉల్లిపాయలు, మసాలతో కూర చేసుకుంటారు. పోషకాలతో పోలిస్తే, చికెన్, మటన్ కంటే ఇది చాలా బెటర్ అంటారు. బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలుబోడకాకరతో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకుమంచిది. రోగనిరోధక శక్తిని బలపడుతుంది తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.రక్తపోటు, కేన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలోసాయపడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని ఫ్లావనాయిడ్లు వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది