Health
-
టెకీ.. ఆరోగ్యం రిస్కీ..
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పరిశోధకులు మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్లో ఇటీవల వర్క్‌ప్లేస్ వెల్నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అంతర్గత అధ్యయనాల్లోనూ.. ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్ఓఐ హెల్త్‌కేర్ అనే ఒక వెల్నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్‌కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్ఫంక్షన్తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది. ఫలితం అంతంతే.. గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్.. నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది. ఆ అలవాట్లతో చేటు.. రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్‌లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.వాటిలో కొన్ని.. 👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్‌ప్లేస్‌ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్‌ను పరిచయం చేస్తున్నాయి. 👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. 👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది. 👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్‌ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది. 👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది. -
అలాంటి వాళ్లు నెయ్యి లేదా వెన్న తినొచ్చా..?
నెయ్యి లేదా వెన్న ఏదైన డెజర్ట్ లేదా రెసిపీ రుచిని అమాంతం పెంచేస్తుంది. అయినా నెయ్యిని జోడించగానే ఏ స్వీట్ అయినా కమ్మగా మారిపోతుంది. ఎవ్వరికైనా..నెయ్యి లేదా వెన్నని తినే అలవాటు ఉంటే అంత ఈజీగా మానుకోలేరు. ఆ రుచి అలా కట్టిపడేస్తుంది. అయితే లాక్టోస్ పడని వారు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తే బెటర్? నెయ్యికి ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.లాక్టోస్ అసహనం అంటే..లాక్టోస్ అసహనం అనేది జీర్ణక్రియ పరిస్థితి. ఇది పాలల్లో ఉండే చక్కెర అయిన లాక్టోస్‌ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లాక్టోస్ సరిపడని కారణంగా ఆయ వ్యక్తులు ఈ కింది సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అవేంటంటే..కడుపు నొప్పివాంతులువిరేచనాలునిరంతర కడుపు ఉబ్బరంగ్యాస్ సమస్య అలాంటి వారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాచినప్పుడు లాక్టోస్ కోల్పోయి కొవ్వులు మాత్రమే ఉంటాయి. అదే వెన్నలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అందువల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది అంత సురక్షితం కాదు. ప్రత్యామ్నాయాలు..సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు మంచివి. అలాగే కొబ్బరి లేదా బఠానీ పాలను కూడా ఉపయోగించొచ్చు. ఇవన్నీ పోషకమైనవి సాధారణ ఆవు పాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు. నోట్: ఈ కథనం కేవలం అవగాహన కొరకు మాత్రమే! View this post on Instagram A post shared by Amita Gadre | Nutritionist (@amitagadre) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కియారా అద్వానీ నుంచి నీతా అంబానీ వంటి ప్రముఖులందిరికీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ మాత్రం కురుల అందం కోసం హెయిర్ బోటాక్స్, కెరాటిన్ వంటి ట్రీట్మెంట్లు అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. తాను తన క్లయింట్లకు కూడా అస్సలు సూచించని అన్నారు. అసలు ఇవెందుకు మంచివి కావు అనేది అమిత్ మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.ఈ రోజుల్లో జుట్టుకి సంబంధించిన హెయిర్ ట్రీట్మెంట్లు సర్వసాధారణం. అయినప్పటికీ అందమైన శిరోజాల కోసం ఈ ట్రీట్మెంట్లు మాత్రం తీసుకోవద్దని హెయిర్ స్టైలిస్ట్ అమిత్ అంటున్నారు. తన క్లయింట్లకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్లను సూచించని అన్నారు. ఈ రోజుల్లో కురుల కోసం అందరూ చేయించుకునే హెయిర్ బోటాక్స్ లేదా కెరాటిన్ వంటి వాటికి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు. తాను బాలీవుడ్ హీరోయిన్లకు, ప్రముఖులకు ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్లు అస్సలు సిఫార్సు చేయనని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రీట్మెంట్లు సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇవి మంచివి కావని వాటి గురించి వివరించారు అమిత్. ఎందుకు మంచివి కావంటే..హెయిర్ బోటాక్స్ అనేది ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్. ఇది తాత్కాలిక చికిత్స. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు నెలలు పడుతుంది. ఇక కెరాటిన్ చికిత్స అంటే.. ఇది జుట్టులో సహజంగా ఉండే ప్రోటీన్. ఈ చికిత్సలో ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వాస్తవానికి దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇది కేన్సర్ కారకమైనదని అన్నారు అమిత్. ఈ రెండు చికిత్సల ప్రాథమిక స్వభావమే తాను ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు అమిత్. హెయిర్ బోటాక్స్ జుట్టుని మంచిగా ఉంచినప్పటికీ..జుట్టులోని సహజ పోషకాలను కోల్పోయేలా చేస్తాయి. పైగా ఇది అధిక వేడిని కలుగజేస్తుంది. దీని వల్ల జుట్టులో ఉండే సహజ ప్రోటీన్ల నిర్మాణం ప్రాథమికంగా మారిపోతుంది. ఇవి స్వల్పకాలిక చికిత్సలే తప్ప ఏ మాత్రం సత్ఫలితాలనివ్వదు. పైగా దీర్ఘకాలంలో జుట్టుకి ఎక్కువ హానిని చేకూరుస్తాయి. పదేపదే ఈ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల పలు దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అదీగాక తాను సహజమైన జుట్టు ఆకృతికే ప్రాధాన్యత ఇస్తానని, అలాగే దీర్ఘకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాట్లకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు అమిత్. ఆ దిశగానే తన కస్టమర్లను కూడా ప్రోత్సహిస్తానని అన్నారు. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!) -
శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!
బాలీవుడ్ స్టార్ క్వీన్ శ్రద్ధా కపూర్ స్త్రీ 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ విజయోత్సాహంలో మునిగితేలుతుంది. శ్రద్ధా తన విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంటుంది. అంతేగాదు శ్రద్ధా నటనకు, గ్లామర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పాపులారిటీ పరంగా భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అలాంటి శ్రద్ధాకి ఆరోగ్య స్ప్రుహ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఎలాంటి ఆహారం తింటే మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉంటామో తన అభిమానులతో షర్ చేసుకుంటుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా..ఇప్పటికి అలానే వన్నె తరగని అందంతో కట్టిపడేస్తుంది. అందుకు కారణం శ్రద్ధా పాటించే ఆహార నియమాలే. అవేంటో చూద్దామా..!2010లో తీన్ పట్టితో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రద్ధా ఇప్పటికీ అలానే అంతే అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే యంగ్‌గా ఫిట్నెస్తో ఉండేందుకు మంచి జీవనశైలిని పాటిస్తుంది. అలాగే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది. అంతేగాదు ఇటీవల ఇంటర్యూలో శ్రద్ధా కపూర్ తాను కొన్నేళ్లక్రితం శాకాహారిగా మారానని చెప్పుకొచ్చింది. తన భోజనంలో పూర్తిగా స్వచ్ఛమైన శాకాహారమే ఉంటుందని తెలిపింది. ఇక ఆమె ఫిట్నెస్ ట్రైనర్ మాహెక్ నాయర్ కూడా శ్రద్ధా పోహా, ఉప్మా, దలియా, ఇడ్లీ లేదా దోస వంటి ఆరోగ్యకరమైన ఇంటి భోజనంతో ప్రారంభిస్తుందని చెబుతున్నారు. కక్డీ చి భక్రి వంటి సాధారణ మహారాష్ట్ర వంటకం, దాల్ చావల్, ఊరగాయలంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇలా వైవిధ్య భరితమైన వంటకాలని ఇష్టపడే ఆమెకు ఈ డైట్‌ప్లాన్‌ని అనుసరించాలని చెప్పడం కాస్త కష్టమని చెప్పారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) అందువల్లే ఆమె రోజులో మూడు సార్లు విభిన్నంగా తినేందుకే ఇష్టపడుతుందట. కూరగాయల్లో బెండకాలయంటే ఇష్టమని, పండ్లలో మామిడి పండు అంటే మహా ఇష్టమని పేర్కొంది శ్రద్ధా. తన సినిమాల పరంగా ఎక్కువ డ్యాన్స్‌తో కూడిన వాటికి గానూ మితమైన కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్ డైట్లు తీసుకుంటుందని శ్రద్ధా ట్రైనర్ చెబుతున్నారు. అలాగే బికినీ పాత్రలకు అనుగుణంగా మంచి టోన్ స్కిన్ కోసం అధిక ఫైబర్‌తో కూడిన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుతో కూడిన లీన్ డైట్‌ని తీసుకుంటుంది. ఆమె భోజనంలో తప్పనిసరిగా స్ప్రౌట్ సలాడ్లు, ఓట్స్ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ సమయాల్లో మాత్రం డైట్‌ని పక్కన పెట్టేసి మరీ తనకిష్టమైన మోదకాలు, స్వీట్లు లాగించేస్తుంది. అయితే లిమిట్ దాటకుండా తీసుకుంటుదట. అంతేగాదు ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్, వడ పావ్, పానీ పూరీ వంటివి కూడా చాలా ఇష్టమని చెబుతోంది శ్రద్ధా. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) (చదవండి: యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!) -
యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!
యాపిల్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరికి తెలిసిన సాధారణ యాపిల్స్ గాక అందులో చాలా వెరైటీలు ఉంటాయననే విషయం తెలుసా. వీటిని ఎప్పుడైన తిని చూశారా..!. తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా త్వరగా తెలుసుకుని ట్రై చేసి చూడండి. యాపిల్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఒక యాపిల్ ఎన్నో రోగాలు బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి యాపిల్స్‌లో మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయి. అవేంటంటే..అంబ్రి యాపిల్జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబ్రి రకం యాపిల్. ఒకప్పుడూ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాపిల్ రకంలో ఇది ఒకటి. దీనిని కాశ్మీర్ రాజు అనిపిలుస్తారు. ఇది చక్కటి ఆకృతి, తీపి వాసనతో మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పాడవ్వకుండా ఉండటంలో ప్రసిద్ధి చెందినవి. వీటటిని డెజర్ట్లోల ఉపయోగిస్తారు. చౌబత్తియా అనుపమ్ ఇది ఎరుపురంగులో పండిన యాపిల్‌లా ఉంటుంది. మద్యస్థ పరిమాణంఓ ఉంటుంది. ఇది హైబ్రిడ్ యాపిల్ రం. వీటిని ఎర్లీషాన్బరీ, రెడ్ డెలిషియన్ మధ్య క్రాస్ చేసి పడించిన యాపిల్స్. దీన్ని ఉత్తరాఖండ్‌లో విస్తారంగా సాగు చేస్తారు. గోల్డెన్ ఆపిల్దీన్ని గోల్డెన్ డెలిషియస్ అని కూడా పిలుస్తారు. పసుపు పచ్చని రంగుతో మృదువైన ఆకృతిలో ఉంటాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇప్పుడు వీటిని హిమచల్ ప్రదేశ్‌లో కూడా పండిస్తున్నారు. తేలికపాటి రుచితో మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎక్కువగా యాపిల్ సాస్, యాపిల్ బటర్, జామ్‌ల తయారీకి అనువైనది. గ్రానీ స్మిత్యాపిల్కి పర్యాయపదంలా ఉంటాయి ఈ గ్రానీ స్మిత్ యాపిల్స్. వీటిని హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే భారతదేశంలో పెరిగే ఈ రకం యాపిల్స్ మమ్రాతం ఇక్కడ ప్రత్యేక వాతావరణానికి కాస్త తీపిని కలిగి ఉండటం విశేషం. వీటిని ఎక్కువగా సలాడ్లు, జ్యూస్‌లు, బేకింగ్ పదార్థాల్లో ఉపయోగిస్తారు. సునేహరి యాపిల్ఇది కూడా హైబ్రిడ్ యాపిల్‌కి సంబంధించిన మరో రకం. అంబ్రి యాపిల్స్ క్రాసింగ్ నుంచి వస్తుంది. యాపిల్ క్రిమ్సన్ స్ట్రీక్స్లా పసుపు తొక్కను కలిగి ఉంటుంది. ఆకృతి క్రంచీగా ఉంటుంది. తీపితో కూడిన టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. పార్లిన్ బ్యూటీ ఈ యాపిల్స్ భారతదేశంలోని తమిళనాడుకి చెందింది. ఈ రకానికి చెందిన యాపిల్స్ కొడైకెనాల్ కొండల్లో ఉండే వెచ్చని శీతాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ రకం యాపిల్స్ వస్తుంటాయి. ఇవి మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణం వరకు వివిధ ఆకృతుల్లో లభిస్తాయి.ఐరిష్ పీచ్అత్యంత చిన్న యాపిల్స్. ఇవి లేత పసుపు గోధుమ ఎరుపు రంగులతో ఉంటుంది. పరిమాణంలో చిన్నది. విలక్షణమైన తీపి టార్ట్ రుచిని కలిగి ఉంటుంది. వీటిని పచ్చిగానే తీసుకుంటారు. అధిక పీచుతో కూడిన యాపిల్స్ ఇవి. స్టార్కింగ్ ఈ యాపిల్స్ తేనె లాంటి సువాసనతో అత్యంత తియ్యగా ఉటాయి. వీటని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్‌లో పండిస్తారు. వీటిని తాజాగా తింటారు. అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. ఎక్కువగా జ్యూస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఎనిమిది రకకాల యాపిల్స్ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతి రకం యాపిల్ రుచి, ఆకృతి పరంగా మంచి పోషకవిలువలు కలిగినవి. ఏ యాపిల్స్‌లో ఏదో ఒకటి తీసుకునేందుకు ప్రయత్నించినా.. మంచి ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు. -
కంటిపై సోరియాసిస్ ప్రభావం!
ఒళ్లంతా పొడిబారిపోయి చర్మంపైనుండే కణాలు పొట్టులా రాలిపోయే చర్మవ్యాధి సోరియాసిస్ గురించి తెలియనివారుండరు. తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్) వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. చర్మవ్యాధిగానే చూసే దీని ప్రతికూల ప్రభావాలు కొంతవరకు కంటిపైనా ఉంటాయి. అదెలాగో చూద్దాం.ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు). కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్). కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి. కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు.జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్‌కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్‌ను వీలైనంతగా అదుపులో పెట్టడం సాధ్యమవుతోంది. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్‌కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించడం చాలా అవసరం. -
బ్యాడ్ ఎయిర్ ర్యాడ్స్ ఫైర్...
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాతావరణపు నాణ్యతను ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్’ అనే సూచికతో నిర్ణయిస్తారు. సంక్షిప్తంగా ‘ఏక్యూఐ’ అంటూ పిలిచే వాతావరణ నాణ్యత బాగుంటే మన ఆరోగ్యాలూ బాగుంటాయి. వాతావరణ కాలుష్యం పెరుగుతున్న కొద్దీ... అంటే ఏక్యూఐ తగ్గుతున్న కొద్దీ ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా వాతావరణపు నాణ్యత తగ్గడం వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది ‘రియాక్టివ్ ఎయిర్వేస్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ (ర్యాడ్స్). ఈ ర్యాడ్స్ గురించి తెలుసుకుందాం.వాయుకాలుష్యం లేదా వాతావరణంలో సరిపడని పదార్థాలతో ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయన్న విషయం తెలసిందే. కానీ అందరికీ అంతగా తేలియని, ఆస్తమాలాగే అనిపించే మరో జబ్బే ‘రియాక్టివ్ ఎయిర్వేస్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్’ (ర్యాడ్స్). ఇందులోనూ ఆస్తమాలోలాగే దగ్గు ఆయాసం వస్తుంటాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలలో ప్రధానంగా పొడిదగ్గు కనిపిస్తుంటుంది.ర్యాడ్స్ ముప్పు ఎక్కడెక్కడంటే... గతంతో ప్రోలిస్తే ఇటీవల ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే పారిశ్రామిక వాడలతో పాటు కాలుష్యం ముప్పు పెరుగుతున్న కొద్దీ నివాస్ర పాంతాల్లోనూ ఇది కనిపిస్తోంది. పారిశ్రామికప్రాంతాల్లో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడల్లా ర్యాడ్స్ తన ప్రతాపం చూపుతుంటుంది. ఉదాహరణకు... చాలా ఏళ్ల కిందట భోపాల్‌లో మిథైల్ ఐసో సయనేట్ విషవాయువుల లీకేజీ జరిగినప్పుడు ఆ ప్రమాదం దాదాపు రెండువేల మందిప్రాణాలను తీసుకుంది. నేరుగా విషవాయువులు పీల్చడం మాట అటుంచి... ఆ వాయువుల ప్రభావంతో పల్మునరీ కణజాలంలో వాపు (పల్మునరీ ఎడిమా)తో పాటు ‘ర్యాడ్స్’ వ్యాధి కూడా అక్కడి మరణాలకు ఓ ప్రధాన కారణం. కేవలం పారిశ్రామిక ప్రమాదాలే కాకుండా రైతులు వేసే మంటలు కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే... కొన్నాళ్ల కిందట పంజాబ్, హర్యానాప్రాంతాల్లో గోధుమ పంట కోతల తర్వాత మిగిలిప్రోయిన గడ్డిని కాల్చినప్పుడు ఢిల్లీలోని వాతావరణం భారీగా కలుషితమైప్రోయి, పట్టపగలు సైతం వీధులూ, రోడ్లూ కనిపించనంతటి దట్టమైన కాలుష్యం పేరుకుప్రోయిన సంగతి చాలామందికి తెలిసిందే. ఇలాంటి కాలుష్య వ్యాప్తి సందర్భాల్లోనూ ర్యాడ్స్ విజృంభించింది. అలాగే కొన్ని మిల్లుల నుంచి క్లోరిన్ గ్యాస్ విడుదలైనప్పుడూ ర్యాడ్స్ తన ప్రతాపం చూపింది. అనేక అధ్యయనాల ప్రకారం అలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న అనేకప్రాంతాల్లో ర్యాడ్స్ విజృంభించింది. కేవలం పారిశ్రామిక ప్రమాదాలప్పుడే కాకుండా వాతావరణం బాగా కలుషితమైనప్పుడు కూడా ఇది కనిపిస్తుండటం మామూలే. మరి వాతావరణం కలుషితమైనట్లు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం.కాలుష్య తీవ్రత తెలుసుకోవడం ఇలా... వాతావరణపు నాణ్యాతను ఈ కింద పేర్కొన్న ఐదు అంశాలు నిర్ణయిస్తాయి. అవి... 1) కింది వాతావరణంలో ఉండే ఓజోన్ (గ్రౌండ్ లెవల్ ఓజోన్)2) గాలిలో ఉండే రేణువులు (పార్టిక్యులేట్ మ్యాటర్ – పీఎం). (గాలిలో ఓ మోస్తరు సన్నటివి మొదలుకొని, అతి సన్నగా ఉండే రేణువులు ఉంటాయి. ఉదాహరణకు 10 మైక్రాన్ల సైజు మొదలుకొని 2.5 మైక్రాన్ల సైజు వరకు). 3) కార్బన్ మోనాక్సైడ్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్ 5) నైట్రోజన్ డై ఆక్సైడ్ గాలి/వాతావరణ నాణ్యత తాలూకుప్రామాణికతను నిర్ణయించేందుకు... ఏఐక్యూ స్కేల్ మీద 0 – 500 వరకు కొలత ఉంటుంది. ఉదాహరణకు ఆ కొలత 0 – 50 వరకు ఉంటే అక్కడి గాలి నాణ్యత ‘చాలా బాగుంద’ని చెప్పుకోవచ్చు. అదే 51 – 100 ఉంటే ‘ఓ మోస్తరు’గా ఉందని చెబుతారు. ఇక ఆ కొలత 100కు పైగా ఉంటే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పవచ్చు. గాలి కాలుష్యాల తీవ్రత 100కు మించి ఉన్నప్పుడు... వాతావరణంలోని చిన్నపాటి తేడాలకే స్పందించేవారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఆ కొలతగానీ 300కి మించితే అది ఎవరికైనా ప్రమాదకరం అని చెప్పవచ్చు. గాలిలోని కాలుష్యం తీవ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి యుక్తవయస్కులు (అడల్ట్స్) మొదలుకొని అందరిలోనూ శ్వాస, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఉదాహరణకు 2012లో జరిగిన కొన్ని సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం... కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి కాలుష్యాల వల్ల గుండెప్రోటు వచ్చే ముప్పు 4.5% అధికంగా ఉంటుందని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో వెలువరించిన ఓ నివేదిక ప్రకారం ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మరణాలు కేవలం వాయుకాలుష్యం కారణంగానే జరిగాయంటూ పేర్కొంది. పిల్లలకూ తప్పని కాలుష్య కాటు... చిన్నారుల్లో దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్లలో నివసించే పిల్లల్లో లంగ్స్, మెదడు ప్రభావితమైనందున శిశుమరణాల రేటూ పెరుగుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు... చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా కారణంగా ఆ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది అని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూనిసెఫ్ నివేదికల ప్రకారం... దాదాపు 30 కోట్ల మంది పిల్లల వాతావరణ పరంగా అత్యంత ప్రమాదకరమైన కాలుష్యప్రాంతాల్లో నివసిస్తున్నారు. దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం ఏమిటంటే... ఇందువల్ల ఏటా ఆరు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడుతున్నారని అంచనా. ర్యాడ్స్ నిర్ధారణ ఇలా : ఛాతీ ఎక్స్–రే, స్పైరోమెట్రీ, రక్త పరీక్షలతో ‘ర్యాడ్స్’ను నిర్ధారణ చేస్తారు. చికిత్స : కాలుష్యానికి గురికాకుండా ఉండటమే ‘ర్యాడ్స్’కు ప్రధాన చికిత్స. ఒకవేళ కాలుష్యానికి గురైతే గ్లూకోకార్టికాయిడ్స్, బ్రాంకోడయలేటర్స్ వాడుతూ ఆస్తమా తరహాలోనే దీనికి చికిత్స అందించాల్సి ఉంటుంది. -
మెడ పట్టేసిందా..? ఇలా చేస్తే నొప్పి మాయం..
చాలామందికి నిద్రలోగాని, లేదా ప్రయాణంలో గానీ లేదా సుదూర ప్రయాణాల తర్వాత గాని మెడ పట్టుకుంటుంది. ఇలా మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ (wry neck) అంటారు. ఇలా మెడ పట్టేస్తే, నిద్రలో దానంతట అదే వదిలేస్తుందని, లేదా తలదిండు తీసేసి పడుకోవడం వల్ల త్వరగా తగ్గుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా సర్దుకునేందుకు పాటించాల్సిన సూచనలివి...మెత్తటి టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా చుట్టి (రోల్ చేసుకుని) మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి. అంటే తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా... భుజాలకు కూడా సపోర్ట్ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది. వ్యాయామాలు చేసేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. పైగా మెడ పరిస్థితి సర్దుకునేందుకు ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా గబుక్కున ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు. కొందరు సెలూన్ షాప్‌లో మెడను రెండుపైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇలాంటి మొరటు పద్ధతుల్ని ఏమాత్రం అనుసరించకూడదు. దీనివల్ల పరిస్థితి మరింతగా ప్రమాదకరంగా మారవచ్చు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ లేదా ప్రమాదం లేని నొప్పినివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యతో అప్పటికీ ఉపశమనం కలగకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. (చదవండి: డార్క్ చాక్లెట్స్‌తో గుడ్ మూడ్స్... గుడ్ హెల్త్!) -
Heart stent surgery: స్టెంటేశాక రెస్టెంత? బెస్టెంత?
ఇటీవలగుండె జబ్బుల తర్వాత చాలామందికి స్టెంట్ వేయడం, ఇక కొందరిలోనైతే బైపాస్ అని పిలిచే సీఏబీజీ సర్జరీ చేయాల్సి రావడం మామూలే. గుండెకు నిర్వహించే ఇలాంటి ప్రోసిజర్ తర్వాత, ఆ బాధితుల్ని ఎప్పట్నుంచి నార్మల్‌గా పరిగణించ వచ్చు, లేదా ఎప్నట్నుంచి వారు తమ రోజువారీ పనులు చేసుకోవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం...నిజానికి ఓ ప్రోసిజర్ తర్వాత నార్మల్ కావడం అన్నది వారివారి శరీర ధర్మం, ఫిట్నెస్, గాయం పూర్తిగా తగ్గేందుకు పట్టే సమయం... ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సగటు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... తమ ఫిట్నెస్, తమ పనులు ఇక తాము చేసుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఈ సమయం కాస్త అటు ఇటుగా ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సర్జరీ జరిగినప్పుడు వీలైనంత తర్వాత సాధారణ స్థితికి రావాలని బాధితులందరికీ ఉంటుంది. అంతేకాదు... గాయమంతా పూర్తిగా మానేవరకు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండరు. అంతకంటే చాలా ముందుగానే... అంటే 80 శాతం తగ్గేనాటికే తమతమ మామూలు పనులు మొదలుపెట్టేస్తుంటారు. బాధితులు తమ ్రపోసీజర్ అయిన ఆరు వారాల తర్వాత నుంచి నిరభ్యంతరంగా పనులు మొదలు పెట్టవచ్చు. అయితే అప్పటికి తగ్గింది కేవలం 80శాతం మాత్రమే కావడం వల్ల కొన్ని బరువైన పనులు చేయడం మాత్రం అంత మంచిది కాకపోవచ్చు.డిశ్చార్జీ అయిన ఆరువారాల తర్వాతి నుంచి... చేయదగిన పనులు : 🔸తేలికపాటి నడక / (వాకింగ్) బట్టలు ఉతకడం (మెషిన్ ఉపయోగించి మాత్రమే) 🔸శ్రమలేనంతవరకు అంట్లు తోముకోవడం / పాత్రలు శుభ్రం చేసుకోవడం 🔸శ్రమలేనంతవరకు వంట చేసుకోవడం 🔸శ్రమ లేనంతవరకు / తేలికపాటి శారీరక శ్రమతో ఇల్లు శుభ్రం చేసుకోవడం ▶️శ్రమ లేనంతవరకు మెట్లు ఎక్కడం (ఈ ప్రక్రియలో శ్రమగా అనిపించినా / ఆయాసం వచ్చినా మళ్లీ ఈ పని చేయకూడదు. ఆమాటకొస్తే... శ్రమ అనిపించిన లేదా ఆయాసంగా అనిపించిన ఏ పనినైనా బలవంతంగా చేయకూడదని గుర్తుంచుకోవాలి).చేయకూడని పనులు : 🔸బరువైనవి ఎత్తడం (ప్రధానంగా 5 కిలోలకు మించినవేవీ ఎత్తడం సరికాదు) 🔸బరువైన వాటిని అటు ఇటు లాగడం లేదా తోయడం 🔸వాహనం నడపడం.ఎనిమిది వారాల తర్వాత :🔸మనకు జరిగిన ప్రోసిజర్‌లో... శస్త్రచికిత్సలో భాగంగా ఎదుర్రొమ్ము ఎముకకు గాటు పెట్టి విడదీసి ఉంటే... అది ఆరు నుంచి ఎనిమిది వారాల నాటికి 80 శాతం తగ్గుతుంది. ఆరు / ఎనిమిది వారాలు దాటాక వాహనాన్ని నడపడం (డ్రైవింగ్) మొదలుపెట్టవచ్చు. మనం చేసే పని భౌతికమైన శ్రమతో కూడుకున్నది కాకపోతే మన వృత్తులకు / కార్యాలయానికి వెళ్లవచ్చు. ఆరు వారాలు దాటాక మళ్లీ యథాతథ స్థితిలోకి వచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలు చేయడానికి (కార్డియాక్ రీహ్యాబిలిటీషన్కు) ఇది అనువైన సమయమని తెలుసుకోవాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండానే... దాని పనితీరు / సామర్థ్యం (ఎండ్యూరెన్స్) పెంచుకునే వ్యాయామాలు మొదలుపెట్టాలి. అలా తేలిగ్గా మొదలుపెట్టి శ్రమతెలియనంత వరకు ఆ వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవచ్చు. శ్రమ అనిపించగానే మళ్లీ తగ్గిస్తూ... అలా క్రమంగా మీ యథాపూర్వక స్థితిలోకి వెళ్లడం మంచిది. ఇది చేస్తున్న క్రమంలో మనకు ఏ శ్రమ తెలియకపోతే... మనం అన్ని పనులూ ఎప్పుడెప్పుడు చేయవచ్చో మనకే క్రమంగా అర్థమవుతూ ఉంటుంది.పది, పన్నెండు వారాల తర్వాత అది శస్త్రచికిత్సా / మరో ప్రక్రియా... అది ఏదైనప్పటికీ... పది, పన్నెండు వారాలు గడిచాక... అంతకు మునుపు చేసిన పనులన్నీ ఎలాంటి శ్రమ లేకుండా చేయగలుగుతుంటే... ఆపై ఇక నిర్భయంగా... తేలికపాటి పరుగు (జాగింగ్), టెన్నిస్‌లాంటి ఇతరత్రా ఆటలు ఆడుకోవచ్చు. (అయితే ఆడే సమయంలో శ్రమ ఫీల్ అవ్వకుండా తేలిగ్గా చేయగలిగితేనే ఆ పనులు కొనసాగించాలి). రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం వారంలో ఐదు రోజులు వ్యాయామాలు చేయాలి. దాని గుండెకు తగినంత బలం చేకూరి... దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.మానడానికి టైమ్ ఇవ్వండి : ఏదైనా గాయం మానడానికి పట్టే సమయం... ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందుకే ఏ కొద్దిపాటి శ్రమ అనిపించినా మళ్లీ తేలికపనులకు వచ్చేసి మళ్లీ శ్రమ కలిగించే పనులవైపునకు మెల్లగా క్రమక్రమంగా వెళ్తుండాలి. బాధితులకు డయాబెటిస్ లేదా ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గాయం మానడం మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఆరువారాల సమయాన్ని ఒక సాధారణ ్రపామాణిక సమయంగా మాత్రమే పరిగణించాలి. ఎవరిలోనైనా ఏదైనా గాయం పూర్తిగా అంటే 100 శాతం మానడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే ఏదైనా పనిని చేయడచ్చా లేదా అన్న విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోడానికి ఉన్న ఒకే ఒక మార్గం... ‘ఆ పనిని తేలిగ్గానే చేయడానికి సాధ్యమవుతోందా, లేదా’ అనే విషయాన్ని చూసుకోవాలి. అలా ఏదైనా పని చేస్తునప్పుడు నొప్పి అనిపించినా, ఆయానం వచ్చినా లేదా గాయం వద్ద అసౌకర్యంగా ఉన్నా ఆ పనిని వెంటనే ఆపేయాలి.ఏదైనా పని సరికాదని గుర్తుపట్టడం ఎలా? ▶️అసాధారణమైన / తట్టుకోలేనంతగా నొప్పి వచ్చినప్పుడు ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్మొమ్ము వద్ద ‘కలుక్కు’మని అనిపించినా లేదా అలాంటి శబ్దం వచ్చినా ▶️ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎదుర్రొమ్ము గాయం ఎర్రబారినా లేదా ఆ గాయం నుంచి స్వల్పంగానైనా రక్తం / చీము లాంటి స్రావాలు వస్తున్నా ▶️దగ్గినప్పుడు ‘కలుక్కు’మన్నా ▶️సుదీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ‘కలుక్కు’మన్నా. (ఇలా జరిగినప్పుడు ఎదుర్రొమ్ముకు వేసిన కుట్లు తెగాయేమోనని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షింపజేసుకోవాలి). ఈ విషయాలన్నింటినీ ఎవరికి వారు గమనించుకుంటూ స్వీయ పరిశీలన ద్వారా రొటీన్ పనుల్లోకి క్రమక్రమంగా ప్రవేశించాలి. -
డార్క్ చాక్లెట్స్‌తో గుడ్ మూడ్స్... గుడ్ హెల్త్!
డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనేది ఇప్పటికే పలు పరిశోధనల్లో తెలింది. అదే విషయం దక్షిణ–కొరియన్ పరిశోధనల్లో మరోసారి వెల్లడైంది. చాక్లెట్స్లోని కొన్ని పోషకాలు గట్ బ్యాక్టీరియా / గట్ మైక్రోబియమ్ పెంచడం వల్ల మంచి వ్యాధి నిరోధకత పెరుగుతుందనీ, అలాగే... తక్కువ మోతాదులో చక్కెర ఉండే డార్క్ చాక్లెట్స్ తినేవారిలో వాటిలో ఉండే ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ వల్ల కొన్ని రకాల కేన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక ఆరోగ్య సమస్యల నివారణ జరుగుతుందంటూ దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... డార్క్ చాక్లెట్లు మూడ్స్‌ను బాగుపరచి తినేవారు ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంచేందుకు సహయపడతాయని తేలింది. ఇక డార్క్చాక్లెట్స్ తినేవారి మల పరీక్షల్లో తేలిన విషయం ఏమిటంటే... వాళ్ల పేగుల్లో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్ బాక్టీరియా కారణంగానే కడుపు ఆరోగ్యం బాగుండటంతో పాటు వాళ్ల మూడ్స్ మరింత మెరుగయ్యాయని తేలింది. ఈ ఫలితాలన్నీ ‘‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. (చదవండి: అలియా లాంటి ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం..!) -
మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..
'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది. డీప్ రిలాక్సేషన్..ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి. దృష్టి స్పష్టత మెరుగవుతుందిఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందిఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందిఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని బ్యాలెన్స్‌గా.. ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.డిప్రెషన్ లక్షణాలు..ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది. మైండ్-బాడీ కనెక్షన్..ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్‌గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..) -
ఈ సీజన్లో స్పెషల్ లడ్డూ : రోజుకొకటి తింటే లాభాలెన్నో!
పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం. నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.నువ్వుల లడ్డూ తయారీకావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. తయారీముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.నువ్వులను ఇలా పలురకాలుగా నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. -
మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..
టాలీవుడ్ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్నెస్ అనేది రోజు బ్రెష్ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్ చేస్తుందంటే..తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్ తింటుందంటే..బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి అవి..గ్లూటెన్ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్ ప్రారంభిస్తుంది. ప్రోటీన్ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్లు తీసుకుంటుందట. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) లంచ్ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన ప్రోటీన్ రిచ్ డిన్నర్‌కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది. (చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!) -
కేన్సర్‌ను జయించా.. సినీనటి సోనాలి బింద్రే
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ పేషంట్లకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీతార సోనాలి బింద్రే తెలిపారు. స్వయంగా తనకే కేన్సర్ ఉందని తెలిసిన సమయంలో ఇక తన జీవితం ముగిసిపోయిందని, ఆవేదనతో కృంగిపోయానని, కానీ తన భర్త అందించిన మానసిక స్థైర్యం, తక్షణ ఆరోగ్య సంరక్షణతో కేన్సర్ నుంచి బయటపడ్డానని ఆమె అన్నారు. అక్టోబర్.. బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మంత్ నేపథ్యంలో జీవీకే హెల్త్‌హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించగా, ఇందులో సోనాలితో పాటు ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, జీవీకే హెల్త్‌హబ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని, దీనికి తానే ఒక నిదర్శనమని అన్నారు. కానీ ఈ ప్రయాణం ఎంతో వేధనతో కూడుకున్నది, ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసేలా చేసిందని చెప్పారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులతో డబ్బులు వృథా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.. చిన్న మొత్తాలకు చూసుకుంటే, ప్రమాదవశాత్తు కేన్సర్ భారిన పడితే అంతకు మించిన డబ్బులను కోల్పోవడమే కాకుండా విలువైన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టినవారవుతారని ఆమె సూచించింది. వంశపారపర్యంగా 5 నుంచి 10 శాతమే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచి్చతంగా కేన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని పింకీరెడ్డి సూచించారు. ఒక మహిళ దీర్ఘకాలిక రోగాలబారిన పడితే ఆ కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తుగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించగలిగే కొన్ని చిట్కాలను, సంరక్షణ పద్దతులను గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహ సాగర్ వివరించారు. రొమ్ము కేన్సర్ మహిళలకే కాదు కొంత మంది పురుషులకు కూడా వచ్చే అవకాశముందని ఆమె తెలిపారు. ప్రముఖ సినీతార నమ్రతా శిరోద్కర్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు..
ప్రపంచవ్యాప్తంగా... ఆమాటకొస్తే భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ విస్తృతియే చాలా ఎక్కువ. మొత్తం అన్ని రకాల క్యాన్సర్లను పరిగణనలోకి తీసుకుంటే రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యేవారు 28 శాతం ఉంటారని అంచనా. తాజా ‘గ్లోబకాన్’ లెక్కల ప్రకారం మన దేశంలో రొమ్ముక్యాన్సర్ల కేసుల సంఖ్య 1,78,361 కాగా దురదృష్టవశాత్తు దాని వల్ల 90,408 మరణాలు సంభవించాయి. అయితే కేవలం రొమ్ముక్యాన్సర్‌పై సరైన అవగాహన లేని కారణం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. సాధారణంగా మహిళల్లో 40 – 50 ఏళ్ల వయసప్పుడు వచ్చే ఈ రొమ్ముక్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తిస్తే దీని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం కోసమే ఈ కథనం. మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్)తో ΄ాటు మరికొన్ని అంశాలూ కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... రిస్క్ఫ్యాక్టరు...సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌కు కారణమయ్యే రిస్క్‌లో పెరిగే వయసు, దాంతోపాటు కుటుంబంలో రొమ్ముక్యాన్సర్లు ఉండటం, మొదటి నెలసరి చాలా త్వరగా రావడం, మెనోపాజ్ చాలా ఆలస్యం కావడం, జీవితకాలంలో పిల్లలు లేకపోవడం వంటివి. ∙చిన్నవయసులోనే రొమ్ముక్యాన్సర్‌కు గురి అయ్యే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలే ప్రధాన కారణం. ఐదు నుంచి పది శాతం కేసుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారిలోనే వస్తుండటం గమనార్హం. బీఆర్సీఏ1, బీఆర్సీఏ 2 వంటి జెనెటిక్ మ్యూటేషన్లు ఉంటే ఆ కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. ఇందులో బీఆర్సీఏ 1 జెనెటివ్ మ్యూటేషన్ వల్ల ముప్పు శాతం 72 % కాగా బీఆర్సీఏ 2 వల్ల 69% ముప్పు ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇక నివారించగలిగే రిస్క్‌ఫ్యాక్టర్లలో స్థూలకాయం ∙ఆధునిక జీవౖనశెలిలో భాగంగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు ∙ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం ∙తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైన బిడ్డకు రొమ్ము పాలు పట్టించడం మేలు. లక్షణాలు...మహిళలు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి లేదా స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవి హానికలిగించని (బినైన్) గడ్డలా, లేక హానికరమైనవా (మేలిగ్నెంట్) అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం ∙రొమ్ము చర్మం మందంగా మారడం ∙రొమ్ములో సొట్ట పడినట్లుగా ఉండటం రొమ్ము ఆకృతిలో మార్పులు ∙సమస్య ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్. నిపుల్కు సంబంధించినవి: రొమ్ముపై దద్దుర్ల వంటివి రావడం నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటివి స్రవించడం రొమ్ము పరిమాణంలో మార్పులు రావడం, వాటిలో గమనించగలిగే తేడా రావడం బాహుమూలాల్లో :గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం చేతివాపు (లింఫ్ ఎడిమా)ఇమ్యూనో థెరపీ, టార్గెట్ థెరపీ : శస్త్రచికిత్సతోపాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాధితులకు సరిపడే చికిత్సను డాక్టర్లు అందిస్తారు. వ్యాధి తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడం తోపాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ విషయంలో గతంలోలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేన్సర్ ఎక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు ‘నియో అడ్జువెంట్ థెరపీ’ అని ఇస్తారు. తర్వాతి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండటం కోసం డాక్టర్లు ఈ చికిత్స ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా ఆపరేషన్ చేయాలా, లేక కీమోథెరపీ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే కనుగొంటే 90% పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం ఉంది. చికిత్స... ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉండే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అ΄ోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.నిర్ధారణ పరీక్ష... తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం ద్వారా మామోగ్రాఫీ అనే స్కాన్ ద్వారా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష పూర్తి నిర్ధారణ కోసం వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ పెట్ స్కాన్. (చదవండి: కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!) -
కిడ్నీలను కిడ్స్‌లా కాపాడుకుందాం..!
కిడ్నీలు ప్రతిరోజూ దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ... రక్తంలోని మాలిన్యాలనూ, వ్యర్థాలనూ ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాయి. అవి దేహానికి హాని చేసే యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోసి మూత్రం ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తాయి. అయితే కిడ్నీల పనితీరు దాదాపు 70 – 80 శాతానికి పడిపోయేవరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. అది ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. అయితే ఈ ముప్పు రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాత్కాలికమైనది. రెండోది శాశ్వతమైనది. కిడ్నీ ఫెయిల్యూర్‌ను తెలుసుకోవడం ఎలా? బాధితుల దేహంలో కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ‘క్రియాటినిన్’ అనే వ్యర్థ రసాయనం రక్తంలో పేరుకు΄ోతుంది. సీరమ్ క్రియాటినిన్ అనే ఓ చిన్న రక్తపరీక్ష ద్వారా కిడ్నీలు బాగున్నాయా లేదా అన్నది తేలిగ్గా తెలుసుకోవచ్చు. కిడ్నీ జబ్బులను అత్యంత తొలిదశల్లో గుర్తించడానికి ఉపయోగపడే పరీక్ష స్పాట్ యూరిన్ అల్బుమిన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష. ఇదొక సరళమైన మూత్రపరీక్ష. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో చాలా త్వరగా ఇది రాబోయే కిడ్నీ జబ్బులను పసిగడుతుంది.కిడ్నీ సమస్య తాత్కాలికమా, శాశ్వతమా అన్నది తెలుసుకోవడం ‘అల్ట్రాసౌండ్ స్కానింగ్’తో సాధ్యమవుతుంది. కిడ్నీల సైజు మామూలుగానే ఉండి, క్రియాటినిన్ పెరుగుతూ΄ోతే అది తాత్కాలిక సమస్య. మందులతో, జీవనశైలి పద్ధతులతో దాన్ని చక్కదిద్దవచ్చు. ఒకవేళ వాటి సైజు బాగా చిన్నగా మారితే అప్పుడది శాశ్వత సమస్య అయ్యే అవకాశాలు ఎక్కువ. తాత్కాలిక కిడ్నీ సమస్యను ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ అనీ, కిడ్నీ పనితీరు వేగంగా తగ్గుతూపోతుంటే దాన్ని ‘ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్’ (ఆర్పీఆర్ఎఫ్) అనీ, అదే పూర్తిగా శాశ్వతంగా దెబ్బతింటే దాన్ని ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) అని అంటారు. శాశ్వత డయాలసిస్ నివారణ కోసం ఇవీ జాగ్రత్తలు... డయాబెటిస్ పూర్తి అదుపు అవసరం : జీవితంలో డయాలసిస్ వద్దు అనుకునేవారు డయాబెటిస్‌ను పూర్తి అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, తగినంత వ్యాయామం చేయాలి. బీపీ నియంత్రణ తప్పనిసరి: రక్తపోటు క్రమంగా శాశ్వతంగా కిడ్నీలు దెబ్బతినే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వైపునకు తీసుకెళ్లే ప్రమాదముంది. అందుకే హైబీపీ ఉన్నవారు తమ రక్త΄ోటును అదుపులో ఉంచుకోవాలి.అనవసరంగా పెయిన్కిల్లర్లు / యాంటిబయాటిక్స్ వద్దుచాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీ బయాటిక్స్ వాడుతుంటారు. చిన్న΄ాటి నొప్పి కూడా తట్టుకోలేక నెలల తరబడి పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటారు. డాక్టర్ల సూచన లేకుండా పెయిన్కిల్లర్లూ, యాంటీబయాటిక్స్ వంటి ‘ఓవర్ ద కౌంటర్’ మందులు ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. చిన్నా చితకా నొప్పులకు పారాసెటమాల్ మాత్ర వాడితే సరిపోతుంది. ఎట్టిపరిస్థితుల్లో నాటు మందులు వద్దు... కొందరు శాస్త్రీయత లేని వైద్యప్రక్రియలకు / నాటుమందులకు వెళ్తుంటారు. నాటుమందుల్లోని విషాలను వడపోసే క్రమంలో కిడ్నీలు మరింతగా పాడైపోయి, బాధితులను డయాలసిస్ వైపునకు తీసుకెళ్తాయి. కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ నాటు మందులు వాడకూడదు. ఈ జాగ్రత్తలతో శాశ్వత డయాలసిస్‌కు వెళ్లకుండా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: స్మోకింగ్స్ .. ఆ గర్భ శత్రువులే..! ) -
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్‌ని కలవాలి. ఇంటర్నల్‌గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్‌కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్‌తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్‌లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్‌తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
స్మోకింగ్స్ .. ఆ గర్భ శత్రువులే..!
చివరకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే ప్యాసివ్ స్మోకింగ్ దుష్ప్రభావాలతో ఆ పొగ తాలూకు దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిందే. అయితే భర్త ఇంటి బయటెక్కడో సిగరెట్ తాగి ఇంటికి వచ్చినా ఆ పొగ దుష్ప్రభావం దంపతులిద్దరితోపాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుందంటున్నారు పరిశోధకులు. భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్నరైన భార్యకు గర్భధారణ బాగా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ వల్ల భార్యలోని హార్మోన్ సైకిళ్లలోని జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. ఫలితంగా ఆమెలో అండాల సంఖ్య బాగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు.మామూలు ఆరోగ్యవంతులైన దంపతులతో పోలిస్తే భర్తకు పొగతాగే అలవాటు ఉంటే... అతడి భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాదు... గర్భస్రావమయ్యే అవకాశాలూ పెరుగుతాయి. ఒకవేళ గర్భధారణ జరిగాక కూడా బిడ్డ నెలలు నిండకముందే పుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే పిల్లల బరువు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశముంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక నేరుగా పొగతాగే పురుషుల విషయానికే వస్తే... ఆ దురలవాటు వల్ల వాళ్ల వీర్యంలోని శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా వారి సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటుకు దూరంగా ఉండటమే మంచిది. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటమన్నది కేవలం సంతాన సాఫల్యం అనే ఒక్క విషయంలోనే కాకుండా పురుషుల సంపూర్ణ ఆరోగ్యంతో ΄ాటు, భవిష్యత్తులో వారి పిల్లల పూర్తి ఆరోగ్యానికీ అది మేలు చేస్తుంది. (చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!) -
మునగాకును రోజూ ఇలా తింటే అద్భుతాలు : ఒక్కసారి తింటే!
మునగాకులో ఏ, బీ, సీ విటమిన్లుంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్... మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. తరచూ తింటే చాలా మంచిది. రోజూ కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది. నొప్పిని నయం చేయడంలో,కండరాలను బలోపేతం చేయడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మానికి జుట్టు సంరక్షణలో బాగా పనిచేస్తుంది. మునగాకు – పెసరపప్పుకావలసినవి: మునగాకు – 4 కప్పులు; పెసరపప్పు– కప్పు; ఎండు మిర్చి – 1;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు– 5;ఆవాలు – టీ స్పూన్; ఇంగువ –పావు టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్;మిరపపొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;తయారీ: మునగాకులో ఈనెలు లేకుండా ఏరి వేసి ఆకును మంచి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. పెసరపప్పును కూడా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ వేసి వేగిన తర్వాత పెసర పప్పు వేయాలి. ఇప్పుడు మునగాకు, పసుపు, మిరపపొడి వేసి కలిపి నీరు పోసి మూత పెట్టాలి. ఉడకడం మొదలైన తర్వాత మూత తీసి మరోసారి కలిపి మంట తగ్గించి ఉడికించాలి. నీరు తగ్గి పోయిన తర్వాత కొబ్బరి పొడి, ఉప్పు కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఇది అన్నం, రోటీల్లోకి బాగుంటుంది. మొరింగా టీమునగాకులో ఈనెలు, చిల్లు పడిన ఆకులు, పండిపోయిన ఆకులను ఏరివేసి శుభ్రంగా కడిగి చిల్లుల ΄ పాత్రలో వేసి నీరు పోయే వరకు ఉంచాలి. తర్వాత ఆకును ఒక పేపర్ మీద కానీ నూలు వస్త్రం మీద కాని వేసి తేమ పూర్తిగా ఆరి పోయే వరకు ఉంచాలి. మునగాకును ఎండ బెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి. వాతావరణాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఆరి పోతాయి.ఆకులను చేత్తో కదిలించినప్పుడు తేమలేకుండా గలగలలాడాలి. ఆకులను మిక్సీ జార్లో మెత్తగా పొడి చేయాలి. పొడిని జల్లించి తేమ లేని సీసాలో నిల్వ చేసుకోవాలి. టీ తయారీ: పావు లీటరు నీటిని మరిగించి అందులో టీ స్పూన్ మొరింగా ΄పౌడర్ వేసి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి. రోజూ ఉదయం ఈ మొరింగా టీ తాగితే అధిక బరువు తగ్గుతుంది.గమనిక: ఇలా తయారు చేసుకున్న ΄ పొడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. కూరల్లో, పప్పులోకి తాజా మునగాకు దొరకని రోజుల్లో ఈ పొడిని వేసుకోవచ్చు. -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్‌గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!
బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్‌కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్‌డీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?అలియా ఏడీహెచ్‌డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియాఏడీహెచ్డీ అంటే..చాలా సాధారణమైన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్‌వర్క్‌లు, న్యూరోట్రాన్స్మిటర్లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..అజాగ్రత్తఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బందిఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడంఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.మానసిక శ్రమతో కూడిన పనులకు రోజువారీ పనుల్లో మతిమరుపుఎందువల్ల వస్తుందంటే..ఏడీహెచ్‌డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట. వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్‌లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
చిట్టివేగానీ. పోషకాల్లో మహాగట్టివి : ఏంటవి!
చూడ్డానికి చిట్టివే కానీ పోషకాల్లో గట్టివి! ముట్టుకుంటేనే జర్రు జారిపోయేలా ఉన్నా శరీరానికి మంచి పట్టునిస్తాయి. అవే ఆవాలు. ఆవాలు రుచికి మంచి పోషక, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.పురాతన కాలంనుంచి వీటికి ప్రాధాన్యత ఎక్కువే. ఆవాలు లేని పోపును అస్సలు ఊహించలేం. ఇక పచ్చళ్లలో, ఆవకాయల్లో ఆవాలు పాత్ర ఇంతా అంతాకాదు. చాలా రకాల కూరలు ఆవపిండితో కలిపి వండుతారు. ఆవాలు-లాభాలుఆవాల్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉబ్బరం , అజీర్ణంతో బాధపడేవారు భోజనంలో ఆవపిండిని చేర్చుకోవచ్చు. పొటాషియం, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దగ్గు, జలుబు వంటి సమస్యలుకు ఉపశమనం లభిస్తుంది.ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి కొవ్వులు పెరుగుతాయి. ఆవపిండిలో సెలీనియం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలకు, శ్వాసకోశంలో మంట నివారణకు ఉపయోగపడుతుంది. ఆవాల్లోని రిచ్ న్యూట్రియెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.ఆవపిండిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. అలాగే ఇందులోని సల్ఫర్ మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచిది. సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి కేన్సర్‌కు చెక్ చెప్పే గుణాలు కూడా ఆవాల్లో ఉన్నాయి. ఆవనూనె కూడా చాలా రకాల ఔషధ ప్రయోజనాలకోసం వాడతారు. ఆవాల నూనెను పూయడం వల్ల గాయాలు వేగంగా నయం అవుతాయి.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనెను కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు. -
కోహ్లి-అనుష్క తాగే నీరు ఎక్కడ నుంచి దిగుమతి అవుతుందో తెలుసా..!
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట. అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.(చదవండి: వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!)