Sagubadi
-
ప్రకృతి సేద్యం..ఉపాధికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు!
అనారోగ్యం వల్ల కోల్పోయే పనిదినాలు మూడో వంతు తగ్గాయి.ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడులను పెరిగే జనానికి సరిపోయేంత సాధ్యమేనా? వంటి ప్రాధమిక ప్రశ్నలకు, అనుమానాలకు ఇప్పుడు పూర్తిగా కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 లక్షల మందికి పైగా రైతులు ఇటువంటి ప్రశ్నలన్నిటినీ తమ అనుభవాల ద్వారా పటాపంచలు చేశారు. దిగుబడులు సరే, ప్రకృతి సేద్యంలో శాస్త్రీయత ఎంత? అనే ప్రశ్నకు కూడా ఇటీవల విడుదలైన అంతర్జాతీయ స్థాయి అధ్యయన నివేదిక దీటుగా బదులిచ్చింది. జిస్ట్ ఇంపాక్ట్, గ్లోబల్ అలియన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఏపీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 2020 నుంచి మూడేళ్లు లోతుగా అధ్యయనం చేసి, ‘నాచురల్ ఫార్మింగ్ త్రో ఎ వైడ్ యాంగిల్ లెన్స్’ పేరిట నివేదికను వెలువరించాయి. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)కి కూడా సమర్పించాయి. హరిత విప్లవానికి ప్రతీకైన డెల్టా ప్రాంతంలోని పశ్చిమగోదావరి, నీటి ఎద్దడి ప్రాంతాలకు ప్రతీకైన అనంతపురం, కొండ ప్రాంత గిరిజన వ్యవసాయానికి ప్రతీకైన విజయనగరం జిల్లాల్లో 12 గ్రావలను ఎంపిక చేసుకొని, ఆయా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాల్లో లోతుగా అధ్యయనం చేశాయి. ఖరీఫ్, రబీ పంటలు, దీర్ఘకాలిక పంటలతో పాటు పశువుల పెంపకానికి సంబంధింన విషయాలను అధ్యయనం చేశాయి. దిగుడులు, ఖర్చులు, నికరాదాయంతో పాటు.. రసాయనిక పురుగుమందులు, ఎరువుల ప్రభావం రైతులు, గ్రామీణుల ఆరోగ్యంపై ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించి తొలి అధ్యయనం కావటం మరో విశేషం. ప్రకృతికి సంబంధించిన అంశాలపై నోబెల్ ప్రైజ్‌గా భావించే టేలర్ పురస్కారం(2020) అందుకున్న ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్త పవన్ సుఖదేవ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ నివేదికలో ఏముందంటే..? ప్రకృతి సేద్యంతో 49% పెరిగిన నికరాదాయం రసాయనిక సేద్యం జరిగే పొలాల్లో ఒకటో రెండో పంటలు పండిస్త ఉంటే.. ప్రకృతి వ్యవసాయంలో సగటున 4 పంటలు పండిస్తున్నారు. వరి, మొక్కజొన్న, మినుము, రాగులు, కంది వంటి ప్రధాన పంటల దిగుబడి రసాయనిక వ్యవసాయంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయంలో సగటున 11% పెరిగింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శ్రమ అవసరం రసాయనిక సేద్యంతో పోల్చితే సగటున 21% పెరిగింది. రైతు కుటుంబం, కలీల శ్రమ మొత్తాన్నీ లెక్కగట్టారు. గోదావరి డెల్టాలో రసాయన వ్యవసాయంలో ఏడాదికి 313 గంటలు పని చేస్తే, ప్రకృతి సేద్యంలో ఇది 377 గంటలకు పెరిగింది. రాయలసీమలో 258 నుంచి 322 గంటలకు పెరిగింది. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో 234 నుంచి 268 గంటలకు పెరిగింది. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం మానెయ్యటంతో ఖర్చు సగటున 44% తగ్గింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రకృతి వ్యవసాయదారుల సగటు నికరాదాయం 49% పెరిగింది. చిన్న రైతులే ‘సామాజిక మూలధనం’ ప్రకృతి సేద్య అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకోవటం వల్ల మీకు తోడుగా మేం ఉన్నాం అన్న భావం విస్తరించింది. పరస్పర విశ్వాసం, మద్దతు, సాంఘిక సమన్వయం పెరిగాయి. అన్యోన్యతకు దారితీసింది. ∙ఈ విధంగా రసాయనాల్లేని సాగు అనుభవాలను పంచుకోవడం ద్వారా సామాజిక మూలధనం గణనీయంగా పెరగడానికి మహిళా స్వయం సహాయక బృందాలు ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయానికి మళ్లటంలో, ఈ క్రమంలో ఒకరికి మరొకరు తోడుగా నిలబడటంలో పెద్ద రైతుల కంటే చిన్న కమతాల రైతులు ముందంజలో ఉన్నారు. సావజిక మూలధనాన్ని పెంపొందిచటంలో చిన్న రైతుల పాత్ర చాలా ప్రధానమైనదని తేటతెల్లమైంది. మన రైతుల్లో 83% మంది చిన్న, సన్నకారు రైతులే. మెరుగైన ఆరోగ్యం... రసాయనిక వ్యవసాయం చేసే రైతులు, ఆ పొలాల్లో పనిచేసే కూలీలు అనారోగ్యాల పాలవుతూ చాలా పని దినాలు కోల్పోతూ ఉంటారు. వీరితో పోల్చితే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కూలీలు, రైతులు అనారోగ్యం వల్ల పనికి వెళ్లటం మానుకోవాల్సిన రోజులు మూడింట ఒక వంతు (33%) తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక పురుగుమందులు, ఎరువుల వాడే రైతులకు ఆరోగ్య ఖర్చులు ఎక్కువ. వారి జీవన నాణ్యత, పని సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సాధారణంగా ఇటువంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగించే నష్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. ∙ప్రకృతి సేద్యం చేసే రైతుల ఆస్పత్రి ఖర్చులు 26% తక్కువ. ప్రకృతి వ్యవసాయదారులు ఎక్కువ రకాల పంటలు పండించడమే కాదు ఎక్కువ రకాల ఆహారాన్ని తినగలుగుతున్నారు. పోషకాలతో కూడిన అనేక రకాల ఆహారం తినటం వల్ల వీరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!
చారిత్రాత్మక డబ్లిన్ నగరంలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు కలసి అర్బన్ అగ్రికల్చర్ రంగంలో చేపట్టిన సేవా కార్యక్రమం ఇటీవల వార్తల్లోకెక్కింది. పౌష్టికాహార భద్రతను కల్పించే ట్టి మొక్కల్ని స్వయంగా తామే పెంచి ఇతరులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ మంచి పనికి ఇప్పుడు డబ్లిన్ నగరపాలకుల మద్దతు లభించటం విశేషం. ఐర్లండ్ రాజధాని డబ్లిన్. మొదటి ముప్పై ప్రపంచ స్థాయి నగరాల్లో ఇదొకటి. సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఈ చారిత్రక నగరం బ్రిటిష్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లింది. 1922లో దేశ విభజన తర్వాత ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లండ్గా మార్చారు. అర్జున్ కరర్–పరేఖ్, మరో నలుగురు డబ్లిన్ హైస్కూల్ విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్లల పౌష్టికాహార భద్రత గురించి పరితపిస్తుంటారు. ఆ పిల్లలకు మంచి ఆహారాన్ని కొని లేదా విరాళంగా సేకరించి పంపిణీ చేయకుండా పోషకాల గనులైన మైక్రోగ్రీన్స్ (ట్టి మొక్కలు)ను స్వయంగా పండిం ఇస్తుండటం విశేషం. ఐదారు అంగుళాల ఎత్తులోనే ఆకుకూరలను కత్తిరించి పచ్చగానే సలాడ్‌గా మైక్రోగ్రీన్స్‌ను తింటే పౌష్టికాహార లోపం తీరుతుంది. సాధారణ ఆకుకూరల్లో కన్నా ఇందులో పోషకాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సాధారణ ఆహారంతో పాటు కొద్ది గ్రాముల మైక్రోగ్రీన్స్ తీసుకుంటే పౌష్టికాహార లోపం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం అర్జున్ తన 16వ ఏట లైసెన్స్ తీసుకొని మరీ తమ గ్యారేజ్‌లో వర్టికల్ గార్డెన్ ట్రేలను ఏర్పాటు చేసి మైక్రోగ్రీన్స్ పెంపకాన్ని ప్రారంభించాడు. ‘గార్డెనర్స్ ఆఫ్ గెలాక్సీ (జీజీ)’ పేరిట తొలుత వ్యాణిజ్య సంస్థగా ప్రారంభింనప్పటికీ తదనంతరం లాభాపేక్ష లేని సంస్థగా మార్చాడు. జీజీ బృందంలో అతనితో పాటు నీల్ కరర్–పరేఖ్, ప్రెస్టన్ చియు, నికో సింగ్ ఉన్నారు. ఈ బృందానికి అర్జున్, నీల్ల తల్లి వీణ దేవరకొండ అండగా ఉన్నారు. డీయూఎస్‌డీ న్యట్రిషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాము పెంచిన మైక్రోగ్రీన్స్‌ను డబ్లిన్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (డీయూఎస్‌డీ) పరిధిలోని స్కూల్ పిల్లలకు, ఆకలితో బాధపడే పేదలు తలదాచుకునే స్థానిక షెల్టర్లకు విరాళంగా అందిస్తున్నారు. ‘మైక్రోగ్రీన్స్ పెంపకానికి అలమెడా కౌంటీ నుంచి హోమ్ గ్రోయర్స్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. కోతకు సిద్ధమైన మైక్రో గ్రీన్స్ నానబెట్టిన విత్తనాలను ట్రేలలో కొబ్బరిపొట్టు ఎరువులో చల్లి, 9–12 రోజుల తర్వాత ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన బఠాణీ తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను శుభ్రమైన కత్తెర్లతో కత్తిరించి, పేపర్ బ్యాగ్స్‌లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ పనులను మొదటి రెండేళ్లు నేనే చేసేవాడిని. తర్వాత మిగతా వారిని చేర్చుకున్నాను’ అంటున్నాడు అర్జున్. డబ్లిన్ నగరపాలకులు మినీ గ్రాంట్ల పేరిట 1,500 డాలర్లను అందజేసి ప్రోత్సహిస్తుండటం విశేషం. ‘డబ్లిన్ హైస్కల్లో సలాడ్లకు మైక్రోగ్రీన్స్‌ను జోడించడం అద్భుతంగా ఉందని న్యట్రిషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో అన్నారు. ‘మా చొరవ ప్రత్యేకమైనదని మేం నమ్ముతున్నాం. సమాజంలో మార్పు తెస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రజలకు సహాయం చేయడం మంచి అనుభతినిస్తుంది. నేను ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయం చేయాలనుకున్నాను. ఒంటరిగా చేయలేకపోయిన పనిని మేం కలసి చేస్తున్నాం’ అన్నారు జీజీ వైస్ ప్రెసిడెంట్ హరి గణేష్ (16). పై చదువులకు వెళ్లాక కూడా ఈ పని కొనసాగించాలని, మరింత మందికి మైక్రోగ్రీన్స్ అందించాలని ఈ యువ అర్బన్ ఫార్మర్స్ ఆశిస్తున్నారు. ఈ విద్యార్థుల పని స్ఫూర్తిదాయకం ‘గార్డెనర్స్ ఆఫ్ ది గెలాక్సీ సభ్యులైన ఈ విద్యార్థులు ఎంతో మంచి పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తీర్చాలని వీరు కంకణం కట్టుకోవడం చాలా స్ఫర్తిదాయకంగా ఉంది. ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్‌ను పండించడం కొనసాగించడానికి డబ్లిన్ సిటీ యూత్ అడ్వైజరీ కమిటీ మంచి గ్రాంట్ ఇవ్వటం చసి చాలా సంతోషిస్తున్నాను. – మెలీసా హెర్నాండెజ్, డబ్లిన్ నగర మేయర్ పతంగి రాంబాబు (చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ') -
జగిత్యాల: వరి స్థానంలో కూరగాయల సాగు
జగిత్యాల అగ్రికల్చర్: రైతులు ప్రతీ ఏడాది రెండు సీజన్లలో వరిసాగు చేస్తున్నప్పటికీ పెద్దగా ఆదాయం సమకూరడం లేదు. దీంతో అభ్యుదయ రైతులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. వరిసాగు చేసే భూమిలో, రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. దీనికి తోడు, ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో, కూరగాయల నాణ్యత చెడిపోకుండా స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీరిని చూసి ఆ గ్రామంలోని మరి కొంతమంది రైతులు సైతం కూరగాయల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఆ రైతులే రాయికల్ మండలంలోని అలూర్ గ్రామానికి చెందిన మెక్కొండ రాంరెడ్డి, నల్లాల తిరుపతి, నల్లాల గంగారెడ్డి. జూన్ మొదటి వారంలోనే... ఈ రైతులు ముందుగా జూన్ మొదటి వారంలో సమావేశమై, ఎలాంటి కూరగాయల సాగుచేయాలో నిర్ణయించుకున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్న బీరకాయ, సోరకాయ, కాకరకాయ, టమాట, అలిసెంత వంటి కూరగాయలు సాగుచేయాలనుకున్నారు. దీంతో నాణ్యమైన విత్తనాలను వివిధ కంపెనీల నుంచి కరీంనగర్లో కొనుగోలు చేశారు. విత్తనం, కంపెనీని బట్టి 50 గ్రాముల విత్తనాన్నే, రూ. 900కు కొనుగోలు చేశారు. విత్తనం నాటే భూమిలో పశువుల ఎరువువేసి, ట్రాక్టర్‌తో రెండు, మూడుసార్లు బాగా దున్నించారు. తర్వాత, మట్టి బెడ్లు తయారుచేసి, వాటిపై సాగునీరందేలా డ్రిప్ పైపులు వేశారు. కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్ షీట్ సైతం వేశారు. అనంతరం, మల్చింగ్ షీట్‌కు రంధ్రాలు చేసి, అందులో కరీంనగర్ నుంచి తెచ్చిన విత్తనాలు నాటారు. నాణ్యత దెబ్బతినకుండా స్టేకింగ్ కూరగాయల నాణ్యత దెబ్బతినకుండా కంక బొంగులతో స్టేకింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం, తీగజాతీ కూరగాయలైన సోరకాయ, కాకరకాయ, బీరకాయలు నేలపై పారితే ముడుచుకుపోయి, మార్కెట్లో రేటు ఉండదు. దీంతో మొక్కలకు తీగపారగానే, తీగకు సుతిల్తో కట్టి, కంక బొంగులకు పాకించడం చేస్తున్నారు. దీంతో మొక్కకు సరైన గాలి, సూర్యరశ్మీ తగిలి మొక్క ఏపుగా పెరుగుతుంది. మొక్కకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉండదు. పురుగు మందులు కొట్టకుండా... సోలార్ ట్రాప్‌లు.. సాధారణంగా కూరగాయల పంటలను పూత, పిందె దశలో పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. దీంతో, రైతులు రకరకాల పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. కానీ, ఈ రైతులు సమాజ శ్రేయస్సేకోసం పురుగుమందులు వాడకుండా పురుగులను ఆశించే సోలార్ ట్రాప్‌లు, పండు ఈగ ఆకర్షక బుట్టలు పెడుతున్నారు. మొక్కలు బలంగా పెరిగేందుకు యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులు వేయకుండా, మజ్జిగ, బెల్లంతో కూడిన పుల్లటి పదార్థాన్ని మొక్కలకు అందిస్తున్నారు. మార్కెట్‌కు కూరగాయలు... తమ పొలంలో పండించిన కూరగాయలను జగిత్యాలతో పాటు రాయికల్‌కు తరలిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడిప్పుడే పంట చేతికి అందుతుంది. కాబట్టి రైతుల పొలాల్లో కూరగాయల పంట దిగుబడులు సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో, తమకు కలిసి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కూరగాయలు సాగుచేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు డ్రిప్, మల్చింగ్ పరికరాలు అందించాలని రైతులు కోరుతున్నారు. -
ఉద్యాన సాగుకు ఊతం
నెల్లూరు(సెంట్రల్) : ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. వీటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉద్యాన పంటలను వేసిన రైతులతో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులు ఉద్యాన పంటలను సాగుచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. మొదటిసారిగా సంఘాల ఏర్పాటు ఉద్యాన పంటలకు మంచి గిట్టుబాటు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘం పేరుతో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసింది. ఒక్కో సంఘంలో 300 నుంచి 700 మందికి పైగా రైతులు ఉంటారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి ఆయా పరిధిని బట్టి సంఘాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే 20 సంఘాలను ఏర్పాటు చేయగా వారితో ఉద్యానశాఖ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో విక్రయాలు జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు పంటలను కొనుగోలు చేస్తారు. వీటిని ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసి సుదూర ప్రాంతాల్లో విక్రయాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. పంటలను నిల్వ చేసుకునేందుకు సేకరణ కేంద్రాలు, కోల్ట్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 20 సేకరణ కేంద్రాలు, 9 కోల్డ్రూములను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పటికే 14 సేకరణ కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురాగా, మిగిలిన నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. నాలుగు కోల్డ్ రూముల నిర్మాణం పూర్తి కాగా మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ రూమ్ 70 శాతం సబ్సిడీతో ఏర్పాటు ఉద్యాన పంటల కోసం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఒక్కో సేకరణ కేంద్రం ఏర్పాటుకు రూ.15 లక్షలు ఖర్చు కానుండగా అందులో రూ.11.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అదే విధంగా ఒక్కో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు రూ.12.50 లక్షల ఖర్చు కానుండగా అందులో రూ.9.37 లక్షలకు ప్రభుత్వం రాయితీని ఇస్తోంది. వీటిని ఆయా సంఘాలు నడిపే విధంగా అటు రైతులకు మద్దతు ధరతో పాటు, ఇటు సంఘంలోని రైతులకు ఆదాయం వచ్చేలా సహాయ సహకారాలు అందిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలు వేసే రైతులు పంట సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. -
Palnadu : పల్నాడు మిర్చిమిట్లు
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పెరగనుందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ధర బాగుండటంతో రైతాంగం మిరప సాగుపై ఎక్కువ దృష్టిపెడుతోంది. గతేడాది దిగుబడి బాగా రావడం, సరాసరి ధర రూ.20 వేల వరకు పలకడంతో రైతులు బాగా లాభపడ్డారు. అదే ఉత్సాహంతో ఈ ఏడాది రైతులు, కౌలు రైతులు పత్తికి బదులు మిర్చి సాగుకు ముందుకు వస్తున్నారు. గతేడాది పల్నాడు జిల్లాలో 57,525 హెక్టార్లలో మిర్చి సాగు జరిగింది. ప్రారంభంలో అధిక వర్షాలు, నల్లతామర పురుగు బెడదతో పంట దెబ్బతింది. పెట్టుబడులు పెరిగినా పంటను కాపాడుకున్న రైతులకు కొంత మెరుగైన దిగుబడులు రావడంతోపాటు ధర కూడా బాగా పలికి మేలుచేసింది. ఈ ఏడాది 77,644 హెక్టార్లలో మిర్చి సాగు ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారలు అంచనావేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొదలవ్వడంతో రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, పిడుగరాళ్ల వంటి చోట్ల మిరప సాగు మొదలైంది. ఆర్బీకేలలో విత్తనాలు మిర్చి రైతులకు విత్తనాల కొరత, నకిలీల బాధ లేకుండా ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు ప్రైవేట్ మార్కెట్లోనూ గిరాకీకి అనుగుణంగా మిర్చి విత్తనాలు అందేలా ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాకు 20 కంపెనీలకు చెందిన 2,647 కిలోల విత్తనాలు అవసరమని ఉద్యానవనశాఖ వ్యవసాయశాఖకు ఇండెంట్ పంపింది. జిల్లాలో ఆర్మూర్, జీనీ 2626, తేజా సిగ్మెంట్స్ రకాల విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది. కౌలుకు గిరాకీ.. ఈ ఏడాది రైతులు అధిక సంఖ్యలో మిరపసాగుకు సన్నద్ధమవుతుండడంతో కౌలు భూములకు గిరాకీ పెరిగింది. దేవుడి మాన్యాలు, స్థానికేతురుల భూములను సాగుచేయడానికి కౌలు రైతులు పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారు. గతేడాది పిడుగురాళ్ల మండలంలో రూ.15 వేల నుంచి 18 వేలు ఉన్న కౌలు, ఈఏడాది రూ.25 వేల 30 వేల వరకు పలకడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలురైతులకు సీసీఆర్ కార్డులు విరివిగా జారీ చేసి, రుణసదుపాయం కల్పించడంతో వారు సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈఏడాది జిల్లాలో 55 వేల సీసీఆర్ కార్డుల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటికే 25,828 కార్డులను అధికారుల జారీ చేశారు. అందుబాటులో విత్తనాలు మిర్చికి మంచి ధర పలకడం, పత్తి పంటకు వస్తున్న తెగుళ్ల నేపథ్యంలో ఈ ఏడాది మిరప సాగు అధికంగా ఉంటుందని అంచనా వేశాం. ఖరీఫ్‌లో 77,644 హెక్టార్లలో సాగు జరుగుతుందని అంచనా. అందుకు అనుగుణంగా జిల్లాకు 2,647.10 కిలోల మిర్చి విత్తనాలు అవసరమని ఇండెంట్ పంపాం. ఆర్బీకేల ద్వారా కూడా రైతులకు మిరప విత్తనాలు అందుబాటులో ఉంచాం. బయట మార్కెట్లోనూ డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాల లభ్యత ఉంది. – బీజే బెన్నీ, పల్నాడు జిల్లా ఉద్యానవనశాఖ అధికారి పది ఎకరాల్లో సాగుకు సిద్ధం మిర్చి ధర ఆశాజనకంగా ఉండటంతో గతేడాది ఆరు ఎకరాలు సాగు చేసి లాభాలు పొందా. ఆ ఉత్సాహంతో ఈ ఏడాది పది ఎకరాల్లో సాగు చేసేందుకు సన్నద్ధమయ్యా. విత్తనాలకు బాగా గిరాకీ ఉంది. – నంద్యాల శివారెడ్డి, కామేపల్లి, పిడుగురాళ్ల మండలం ధర బాగుంది నాకు 20 ఎకరాల పొలం, ఐదు బోరుబావులు ఉన్నాయి. పత్తి పంటను రెండు నెలల కింద సాగు చేయగా దానికి తెగులు సోకి పంటను తీసేయాల్సి వచ్చింది. మరోవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది మిరపసాగు ఎక్కువ చేయాలని నిర్ణయించుకున్నా. నర్సరీ నుంచి మిరప నారు తీసుకువచ్చి నాటుకోవడానికి భూమిని సిద్ధం చేశాను. – చింతా రామయ్య, రైతు, రాచమళ్లపాడు గ్రామం, వెల్దుర్తి మండలం భారీగా పెరగనున్న సేద్యం పల్నాడులో జిల్లాలో రైతుల అమితాసక్తి మార్కెట్లో విత్తనాలకు గిరాకీ ఆర్బీకేల్లోనూ విక్రయిస్తున్న ప్రభుత్వం పత్తిలో నష్టాలతో మిరప వైపు రైతుల మొగ్గు పల్నాడు జిల్లాలో మిర్చి సాగు ఇలా(హెక్టార్లలో).. గతేడాది : 57,525 ఈ ఏడాది అంచనా : 77,644 విత్తనాలు అవసరం (కిలోల్లో) : 2,647 -
పంటలకు రక్ష.. భూసార పరీక్ష
నేలను నమ్ముకుని బతికే రైతుకు నేల స్వభావం, భూసారం తెలుసుకోవడం కీలకం. గతంలో ఆ సౌకర్యాల్లేవు. సీఎం జగన్ నేతృత్వంలోని రైతు ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే భూసార పరీక్షలకు నమూనాలు సేకరిస్తున్నారు. అసంబద్ధ రసాయన ఎరువుల ద్వారా క్షీణించిన భూసారాన్ని ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలకు ఆర్బీకే సిబ్బంది సాయపడుతున్నారు. భూసార పరీక్షలతో అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: సాగు భూమిలో సారం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. పంటలో వాడే రసాయనాలు, ఎరువులతో భూమిలో చాలా మార్పులు జరుగుతాయి. వాటిని ముందుగానే గుర్తించి, సారం పెంచే చర్యలతోపాటు, ఏ పంటకు అనుకూలమో.. నిర్ణయించేందుకు భూసార పరీక్షలు కీలకం. భూసార పరీక్షకు అవసరమైన మట్టినమూనా సేకరణకు ఆలస్యం చేయవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతోపాటు జిల్లాలో కనీసం 10 వేల భూసార పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో వ్యవసాయ సిబ్బంది సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా జిల్లాలో 4,380 మట్టి నమూనాలను సేకరించారు. వాటిని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో గల సాయిల్ టెస్ట్ ల్యాబ్‌కు చేర్చారు. నమూనా తీసే విధానం నమూనా తీసేచోట నేలపై ఆకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేలపై నాగలి చోలు లోతున మట్టిని తీసుకోవాలి. నేలపై ఆంగ్ల అక్షరం ‘వి’ఆకారంలో 6–9 అంగుళాల లోతున గుంత తవ్వి, పై నుంచి కింది వరకు మట్టిని తీసుకోవాలి. ఇలా 10 నుంచి 12 చోట్ల మట్టిని సేకరించి గోనైపె వేసి కలిపాలి. దాన్ని నాలుగు సమ భాగాలుగా చేసి అందులో ఒకటి, నాలుగు భాగాలలో సుమారు అర కిలో మట్టిని సేకరించాలి. నమూనా సేకరించేప్పుడు మట్టి రంగు, నేల రకం, మెరక పల్లాలను అనుసరించి నమూనాలు తీసుకోవాలి. ఐదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున సేకరిస్తారు. చేను దున్నిన తరువాత, ఎరువు వేయక ముందు మట్టిని సేకరించాలి. అదే మాగాణి భూముల్లో అయితే నీరు పెట్టక ముందే నమూనా తీయాలి. సూక్ష్మ పోషకాల లభ్యత ఖరీఫ్ సమయంలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల ఆధారంగా భూ యాజమాన్య చర్యలు తీసుకోవాలి. దీంతో ఎరువులు సమర్ధంగా, పొదుపుగా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవచ్చు. రైతుల పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. మట్టి పీహెచ్(ఉదజని సూచిక), లవణ సూచిక (ఈసీ), సేంద్రియ కర్బనం(ఓసీ), స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, ఐరన్, జింక్, మాంగనీస్, కాపర్, బొరాన్, సల్ఫర్ పరీక్షలు చేస్తారు. ఇవన్నీ సమతుల్యతలో ఉంటేనే అధిక దిగుబడులు వస్తాయి. భూమిలో చౌడు, సున్నం గుణాలు, విష పదార్థాల కలయికను గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ల్యాబ్ సూచనలు పాటించాలి భూసార ఫలితాల్లో మట్టికి ఉదజని సూచిక 6.5–7.5 మధ్య ఉండి, అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటే వాటిని తటస్త భూములుగా పరిగణించి విరుగుడుగా సున్నం వేస్తే సరిపోతుంది. పీహెచ్ 8 కంటే ఎక్కువగా ఉంటే క్షార భూములుగా పరిగణించి, జిప్సం వంటి పోషకాల్ని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. 6.5 కంటే తక్కువ ఉంటే అమ్ల ఎరువులు వేసుకోవాలి. నేలలో భాస్వరం స్థాయి కూడా కీలకం. భాస్వరం ఎక్కువ ఉంటే మొక్కకు జింక్, ఇనుము అందకుండా చేస్తాయి. పంట పండక ముందే ఎరగ్రా కనిపిస్తుంది. మట్టి నమూనా ఫలితాలాధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తలిచ్చే సూచనల మేరకు ఎరువులు ఉపయోగించాలి. ఆర్బీకేల వారీగా భూసార పరీక్షలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల చెంతనే అన్ని సేవలు అందుతున్నాయి. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా శాఖాపరంగా ప్రతి గ్రామంలో అవగాహన కార్య క్రమాలు నిర్వహించాం. భూసార పరీక్షలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు తీసి భూసార పరీక్షలు చేయించుకోవాలి. ప్రయోగశాల నుంచి ఫలితాలను బట్టి నేలకు అవసరమైన స్థూల పోషకాలను అందిస్తే నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంది. – బి. మోహనరావు, జిల్లా వ్యవసాయాధికారి మట్టి నమూనాలకు 13 రకాల పరీక్షలు అధిక దిగుబడి, ఎరువులు, పెట్టుబడి ఆదా జిల్లాలో 10 వేల భూసార పరీక్షలు లక్ష్యం -
రైతులకు వరం.. ‘ఆటోమేటిక్’ వాతావరణ కేంద్రం
జగిత్యాల అగ్రికల్చర్: భూమిని దున్నినప్పటి నుంచి పంట పండి, మార్కెట్లో విక్రయించేవరకు ఎప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక అగ్ని పరీక్షగా మారాయి. రుతుపవనాలు రావడం ఆలస్యమవడం, పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు, వరదలు, తుపాన్లు, అకాల వర్షాలు, అకస్మాత్తుగా వడగళ్లు పడటం, వేడిగాలులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వంటివి పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతూ రైతులకు నష్టాలను మిగుల్చుతున్నాయి. అధునాతన టెక్నాలజీ.. భారత వాతావరణ శాస్త్ర విభాగం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వాతావరణ విభాగం ఏర్పాటు చేశాయి. దీని ద్వారా వాతావరణ పరిస్థితులను ఐదు రోజుల ముందుగానే తెలుసుకునే వెసులుబాటు ఉంది. మరింత కచ్చితమైన సమాచారం కోసం అధునాతన టెక్నాలజితో రూపొందించిన నాలుగైదు పరికరాలను బిగించారు. ఇందుకోసం ప్రతిరోజు ఉదయం 7.16 గంటలకు, మధ్యాహ్నం 2.16 గంటలకు వాతావరణ కేంద్రం పరిధిలోని సూర్యరశ్మి, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, గాలివేగం, ఏ దిశలో గాలి వీస్తుందన్న అంశాలను సేకరించి, వాతావరణ కేంద్రం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీనికితోడు పూర్తిగా కంప్యూటరీకరించిన కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు మరికొంత డాటా సైతం ఆటోమేటిక్‌గా భారత వాతావరణ కేంద్రానికి వెళ్తుంది. సెలవులంటూ లేకుండా 365 రోజులు ఈ కేంద్రం పని చేస్తుంది. ఇందులో వర్షం, గాలి వేగం, ఉష్ణోగ్రతలకు సంబంధించిన పరికరాలన్నీ ఒకేదాంట్లో ఇమిడి ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్లిన సమాచారాన్ని బట్టి వాతావరణాన్ని అంచనా వేసి, వెంటనే సంబంధిత వాతావరణ కేంద్రానికి పంపిస్తారు. ముందస్తు సమాచారంతో రైతులు అప్రమత్తం రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయాలు ఈ ఆటోమేటిక్ కేంద్రం వల్ల తెలుస్తాయి. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్‌ను పత్రికలు, మీడియాకు, వ్యవసాయ శాఖ అధికారులకు విడుదల చేస్తారు. దీంతోపాటు అప్పటి వాతావరణాన్ని బట్టి రైతులు పంటల సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తారు. ముందస్తు వాతావరణ సమాచారం తెలియడం వల్ల అన్నదాతలు అప్రమత్తమై, పంట నష్టాన్ని, సాగు ఖర్చులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి వాతావరణానికి సంబంధించిన ముందస్తు సమాచారం మాకు చాలా ఉపయోగపడుతుంది. వర్షం వస్తుందని తెలిస్తే ఎరువులు వేయడం ఆపేస్తాం. ధాన్యం ఆరబెడితే వెంటనే కవర్లు కప్పుకుంటున్నాం. పంటలకు సాగు నీరందివ్వడం బంద్ చేస్తాం. ఈ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి. – కాటిపెల్లి గంగారెడ్డి, రాయికల్ -
టమాట.. రైతన్నకు కాసుల పంట
హుబ్లీ: టమాటా అంటేనే భయపడే రోజులు వచ్చాయి. కారణంగా విపరీతంగా పెరిగిన టమాటా ధరలే. ఈ పంట వల్ల రైతులు చేతినిండా ఆదాయం పొందుతున్నారు. ధార్వాడలో కూడా ఒక ఎకరా పొలంలో టమాటా సాగు చేసి లక్షల రూపాయల ఆదాయం గడించారు. రాష్ట్రంలో ఖరీఫ్ వానలు నిరాశ పరచినా కొన్ని ప్రాంతాల్లోని రైతులు వివిధ పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో ధార్వాడ తాలూకా గోవనకొప్ప గ్రామ రైతు ఈరప్ప సిద్దప్ప చిక్కన్నవర్ తనకున్న ఒక ఎకరా పొలంలో టమాటా పండించాడు. తమ పొలంలో బోరుబావి లేకపోయినా వాగులో ఉన్న నీటితోనే మొక్కలను రక్షించి మంచి దిగుబడిని సాధించారు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆయన సుమారు రూ.3 లక్షలకు పైగా ఆదాయం గడించారు. జిల్లాలో కేవలం కొందరు రైతులు మాత్రమే టమాటా సాగు చేశారు. టమాటాకు విపరీతంగా ధర రావడంతో మార్కెట్లో ఒక్క ట్రే టమాటా రూ.1800 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతోంది. ఈ రైతు ఇప్పటి వరకు 15 సార్లు టమాటా కోత వేసి మార్కెట్‌కు పంపారు. రెండు, మూడు కోతలకు సుమారు 20 నుంచి 25 ట్రేల టమాటా లభిస్తోంది. వీటిని హుబ్లీ, ధార్వాడ మార్కెట్లలో విక్రయించారు. రైతు ఈరప్ప మాట్లాడుతూ ఎకరంలో టమాటాను పండించాను. ఈ సారి వానలు లేకపోవడంతో వాగు నీరు పెట్టాను. మంచి దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 30 ట్రేలు టమాటాలను మార్కెట్‌కు పంపించి రూ.3 లక్షలకు పైగా లాభం గడించానన్నారు. మరో రైతు కరియప్ప మాట్లాడుతూ తాను కూడా ఒక ఎకరంలో టమాటా పండించి మంచి దిగుబడి సాధించానన్నారు. రాత్రింబగళ్లు నీరు పెట్టాం. వాగు నీటితోనే సాగు చేశాం. తనకు కూడా రూ.3 లక్షలకు పైగా ఆదాయం లభించిందన్నారు. అలా మూడు రోజులకు ఒక్కసారి మార్కెట్లో విక్రయిస్తున్నామన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది మంచి లాభాలు వచ్చాయన్నారు. గత ఏడాది కేవలం 1 ఎకరాకు రూ.50 వేల లాభం వచ్చిందన్నారు. ఈ సారి రూ.3 లక్షలకు పైగా ఆదాయం దక్కిందన్నారు. కాగా వర్షాభావ పరిస్థితులతోనే ఈసారి టమాటా రైతన్న పంట పండటం విధివైచిత్రి అని చెప్పవచ్చు. ఒక ఎకరాలో రూ.3 లక్షలకు పైగా ఆదాయం గడించిన ధార్వాడ రైతన్నలు -
అచ్చం తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలు..ప్రత్యేకతలివే
కొన్ని రకాల పంటలు, పండ్ల తోటల్లో పరపరాగ సంపర్యానికి అత్యవసరమైన తేనెటీగల సంఖ్య ప్రకతిలో అంతకంతకూ తగ్గిపోతుండంతో అగ్రిటెక్ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి.ఇజ్రాయెల్‌కి చెందిన ‘బ్లమ్‌ఎక్స్’ కంపెనీ తేనెటీగల్లా పనిచేసే రోబో యంత్రాలను రూపొందించింది. పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలను పూర్తిచేసుకున్న రోబో తేనెటీగ యంత్రాలు (రోబో–బీలు/రోబీలు) మెక్సికో, పెరూ తదితర దేశాల్లోని బ్లూబెర్రీ, అవకాడో(వెన్నపండు) పండ్ల తోటల్లో హల్చల్ చేస్తున్నాయి. పంటల అవసరాలను బట్టి ప్రత్యేక రోబీలను రూపొందిస్తుండటం విశేషం. రసాయనిక సాంద్ర వ్యవసాయ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) గణాంకాల ప్రకారం.. సాగు భమి విస్తీర్ణం 1961 తర్వాత 600% పెరిగితే, ఇదే కాలంలో పెట్టెల్లో తేనెటీగల పెంపకం 83% మాత్రమే పెరిగింది. కాలిఫోర్నియా(అమెరికా)లో విస్తారంగా సాగవుతున్న బాదం తోటల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరిపించేందుకు విదేశాల నుంచి ఏకంగా ఏడాదికి 4,800 కోట్ల తేనెటీగలను దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ పని పూర్తయ్యాక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, ప్రయాణంనే కోట్లాది తేనెటీగలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశ సరిహద్దులు దాటి తేనెటీగల దిగుమతిలో పర్యావరణ సమస్యలున్నాయి. ఈ సమస్యలను అధిగమిస్త.. తేనెటీగల కొరతను రోబో తేనెటీగలతో ‘బ్లూమ్‌ఎక్స్’ తీర్చే ప్రయత్నం చేస్తోంది. బ్లూబెర్రీ తోటల్లో ‘రోబీ’ రొద ఇజ్రాయెల్‌లోని ఓ చిన్న వ్యవసాయ గ్రామం రిష్పన్లో బ్లమ్‌ఎక్స్ 2019లో ఏర్పాటైంది. సీఈఓ థాయ్ సదెది అదే ఊరు. ఇప్పటికైతే బ్లబెర్రీ, అవకాడో పంటల కోసం వేర్వేరుగా ప్రత్యేక ‘రోబో–బీ’ యంత్రాలను రూపొందించింది. ఈ రెండంది. ఈ రెండూ దిగుబడి పెంచితే రైతుల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉన్న ఖరీదైన పంటలు. అందుకే వీటిని ఎంపికచేసుకున్నామన్నారు బ్లూమ్‌ఎక్స్ ప్రతినిధి ఎమిలీ స్పీసర్. బ్లబెర్రీ చెట్ల పూలల్లోనే ఆడ, మగ భాగాలుంటాయి. అయితే, పుప్పొడి ఆడ భాగాలకు చేరాలంటే తేనెటీగలు మగ భాగాలను స్పృశించి మంద్రంగా కదపాల్సి ఉంటుంది. ఈ పని అనేక దఫాలు జరిగితేనే చక్కటి దిగుబడి వస్తుంది. సరిగ్గా జరగకపోతే పండ్ల సంఖ్యతోపాటు సైజు కూడా తగ్గిపోతుంది. కాబట్టి, బ్లబెర్రీ చెట్ల వరుసల మధ్య నుంచి రోబోను మనిషి నడుపుతూ తీసుకెళ్తుంటే.. రోబో తన చేతులు చాచి పూలను తగుమాత్రంగా చురుగ్గా కదుపుతూ పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది. దీన్ని ‘రోబీ’ అంటున్నారు. కృత్రిమ మేధ సాయం ఏయే తోటల్లో పొలినేషన్ సేవలు ఎప్పుడు అవసరమో తెలుసుకోవటం కోసం డేటాబేస్లను కృత్రిమ మేధతో మేళవించే మొబైల్ అప్లికేషన్‌ను రైతులకు కంపెనీ అందిస్తోంది. అవకాడోలు, బ్లబెర్రీలు ఎక్కువగా సాగయ్యే మెక్సికో, పెర, కొలంబియా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో రైతులు ఈ ‘రోబీ’లను వాడుతున్నారు. దిగుబడి బ్లబెర్రీలో 30%, అవకాడోలో 40% పెరిగిందట. అవకాడో తోటలో ‘క్రాస్బీ’అవకాడో ఎత్తు పెరిగే చెట్లు. ఈ చెట్లకు ఆడ, మగ పూలు పూస్తాయి. అయితే, మగ పూలు విచ్చుకున్న కొద్ది గంటల తర్వాత గానీ ఆడ పూలు విచ్చుకోవు. మగ పూలను తాకిన తేనెటీగలకు పుప్పొడి రేణువులు అంటుకుంటాయి. కొన్ని గంటల తర్వాత ఆడ పూలను తేనెటీగలు తాకినప్పుడు ఆ పుప్పొడి ఈ పూలకు అంటడం వల్ల పరపరాగ సంపర్కం సజావుగా సాగుతుంది. ఈ అవసరాలకు అనుగుణంగా పరపరాగ సంపర్కం జరిపేందుకు ‘క్రాస్బీ’ పేరుతో బ్యాడ్మింటన్ బ్యాట్ మాదిరి చేతి రోబో పరికరాన్ని బ్లమ్‌ఎక్స్ రపొందింంది. దీనితో పువ్వులపై సున్నితంగా రుద్దితే పుప్పొడి దానికి అంటుతుంది. ఆ పుప్పొడిని సేకరిం భద్రపరుస్తారు. కొన్ని గంటల తర్వాత ఆడ పూలు విచ్చుకున్నప్పుడు రోబో చేతితో ఈ పుప్పొడిని ఆ పూలకు సున్నితంగా రుద్దుతారు. ఈ విధంగా విజయవంతంగా పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు రుజువైందని సంస్థ తెలిపింది. వేర్వేరు రకాల అవకాడో చెట్లను పక్కపక్కనే నాటితే.. అప్పటికప్పుడే పరపరాగ సంపర్కం జరిగిపోతుంది. పుప్పొడిని భద్రపర, తర్వాత వినియోగించాల్సిన అవసరం ఉండదని సంస్థ వివరింంది. -
సంకర జాతి మేకల బిజినెస్.. లాభాలు ఆర్జిస్తున్న ఎన్నారై రైతు
ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్‌లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికా బోయర్ రకం ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్‌కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది. 8 నెలల్లోనే 40 కిలోలు.. తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్‌లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్‌గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్‌ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్‌ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి. – కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది. – విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ, అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. -
ఖర్చు లేకుండా.. మిద్దె తోటతో ఆరోగ్యం
ప్రజల అవసరాల దృష్ట రోజు రోజుకు కాంక్రీట్ మయంగా మారుతున్నాయి పట్టణాలు. పట్టణ ప్రజలకు సరిపడా కూరగాయలు లభించడం లేదు అని చెప్పవచ్చు. దింతో ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టడంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం... సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సిద్దిపేటలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దింతో పట్టణంలో బహుళ అంతస్తుల బిల్డింగుల నిర్మాణం కావడంతో, పట్టణం కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పచ్చదనం వైపు అడుగులు వేస్తూ, తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో రోజురోజుకు మిద్దె తోటల పెంపకం కల్చర్ పెరిగిపోతుంది. కరోనా మానవుని జీవితంలో పెను మార్పులకు కారణమయ్యింది. పట్టణ ప్రజలలో తమ ఆరోగ్యాల పై శ్రద్ధ పెరగటంతో, ఫ్రెష్ గా దొరికే కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో కాముని అశోక్, రాజేశ్వరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు , మిద్దె తోటను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అశోక్ ఇల్లు పచ్చని చెట్లతో ఒక పొదరిల్లుగా దర్శనమిస్తుంది. కరోనా సమయంలో యూట్యూబ్ లో చూసి మిద్దె తోటను పెంచడం జరిగిందని కాముని అశోక్ తెలిపారు. ఇండ్లలో పాడైన, పనికిరాని వస్తువుల తో తక్కువ ఖర్చులోనే మిద్దే తోటను ఏర్పాటు చేయడం జరిగిందని అశోక్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్, నూనె క్యాన్లు,పాడైన వస్తువులలో మట్టిని నింపి కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని అశోక్ తెలిపారు. మిద్దె తోటలో పాలకూర, కొత్తిమీర, మెంతం, పుదీనా, చుక్కకూర, తోటకూర, ఎర్ర బచ్చలి, టమాట, వంకాయ, బెండకాయ, మిర్చి, క్యాబేజీ, క్వాలి ఫ్లవర్, వంటి అన్ని రకాల కూరగాయలు పండించడం తో పాటు మునిగే చెట్టు, కరివేపాకు చెట్టు, నిమ్మచెట్టు పెంచడం జరుగుతుందని అశోక్ దంపతులు తెలిపారు. శ్రీనివాస్ అనే మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిద్దె తోటను పెంచుతున్నారు. తమ మిద్దే తోటలో అన్ని రకాల కూరగాయలు పండించడంతో, తమ ఇంటి అవసరాలకు సరిపోవుగా, ఇరుగుపొరుగు వారి కూడా కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ బడి పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్చ్ బడిలో తయారైన, వర్మి కంపోస్టు ఎరువును కూరగాయల మొక్కలకు వేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, మిద్దె తోటల పెంపకం పై కూడా స్వచ్ఛ బడిలో అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మేమంతా ప్రభుత్వ ఉపాధ్యాయులం కావడంతో, సాయంకాలం వేళ మిద్దె తోటలో ఒక గంటసేపు గడపడంతో స్వచ్ఛమైన గాలితో పాటు ప్రకృతి వనంలో ఉన్నట్టు అనిపిస్తుందని ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. వర్మి కంపోస్ట్ తో పండించిన కూరగాయలు ఫ్రెష్‌గా, ఎంతో రుచికరంగా ఉంటాయని ఆమె అన్నారు. స్వచ్ఛమైన కూరగాయలు తినడంతో తాను 6 నెలలకు ఒక్కసారి కూడా టాబ్లెట్ వాడడం చాలా తక్కువ అని రాజేశ్వరి తెలిపారు. మనసుంటే మార్గం ఉన్నట్లు,పట్టణ ప్రజలు తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కూరగాయ మొక్కలు పెంచుకోవాలని రాజేశ్వరి సూచించారు. -
ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ'
ఆమె చదువుకోలేదు. కానీ నేల గొప్పతనం తెలుసు. విత్తనం విలువ తెలుసు. ప్రకృతిని కాపాడాలంటే ఏ పద్ధతిలో సాగు చెయ్యాలో తెలుసు. ఆమె మారుమూల పల్లెకు చెందిన సామాన్యురాలు. కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా.... 30 రకాల చిరుధాన్యాల పంటలు పండించి 'విత్తన సంరక్షణ' నిధిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందిన ఆమె మన తెలుగు మహిళ....నడిమిదొడ్డి అంజమ్మ. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విత్తనాల విప్లవంలో ఆమె చేసిన కృషిపై సాక్షి ప్రత్యేక కథనం. అంజమ్మ సొంత ఊరు సంగారెడ్డి జిల్లా గంగ్వార్, అది తెలంగాణ , కర్ణాటకలోని ఒక సరిహద్దు ప్రాంతం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె బడి ముఖమైనా చూడలేదు. పదేళ్ళ వయసులోనే.. సమీపంలోని గంగ్వార్ కు చెందిన సంగప్పతో వివాహం జరిగింది. ''అప్పట్లో మాకు రెండు పూటలా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ కూలీగా. జీవితాన్ని మొదలుపెట్టాను" అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటు, క్రమ క్రమంగా ఒక అర ఎకరం భూమిని ఆ దంపతులు సమకూర్చుకున్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు. అదే సమయంలో... ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) కార్యక్రమాలు చేపట్టింది. అ సొసైటీలో అంజమ్మ సభ్యురాలుగా చేరింది. డీడీఎస్ సహకారంతో తన పొలంలో చిరుదాన్యాలు సాగు చేసింది. అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి.. కొత్త మెళకువలను తెలుసుకుంటూ, వివిధ రకాల పంటలు వేసింది. ఆమె శ్రమ మంచి ఫలితాలను ఇచ్చింది. ముప్పై ఏళ్ళ కాలంలో అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి యజమానురాలుగా చేరుకున్నారు. వాయిస్ ఓవర్ : నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు. తదితర చిరుధాన్యాలు పండించారు. ఇప్పటి వరకూ 80 రకాల చిరుధాన్యాలతో విత్తన సంపదను సృష్టించారు. ఈ విత్తన సంరక్షణ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికి విక్రయించరు. అవసరమయ్యే రైతులకు ఉచితంగా ఇస్తారు, వారికి దిగుబడి వచ్చాక రెట్టింపు విత్తనాలు తీసుకొని మళ్ళీ భద్రపరుస్తారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాలను పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవ వైవిధ్యం. పరిరక్షకురాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డు తో సత్కరించింది. ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. విత్తన సంరక్షకురాలుగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అసోంతో సహా 22 రాష్ట్రాల్లో పర్యటిం చారు. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువులు తయారీ, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాల్లో తన అనుభవాలను అక్కడివారితో పంచుకున్నారు. అంజమ్మ విత్తన సంరక్షకురాలు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచస్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి, ప్రశంసలు అందించింది. ఒక సాధారణ మహిళ అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఈ గుర్తింపు జాయిరాబాద్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. డీడీఎస్ డైరెక్టర్‌గా ఈ మధ్య వరకూ పనిచేసిన.. దివంగతులైన సతీష్ గారి సలహాలు, సూచనలు నన్ను ముందుకు నడిపించాయి. చిరుదాన్యాలను పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పశువులకు, పక్షులకూ కూడా ఇవి మేలు చేస్తాయి అని చెబుతోంది 63 ఏళ్ళ అంజమ్మ . ఇక అంజమ్మ అటు విత్తన సంరక్షణ చేస్తూనే .. రాజకీయాల్లో కూడా రాణిస్తోంది . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొంది, ప్రస్తుతం న్యాలకల్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!) -
సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!
కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది. కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది. కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V— Devika Fernando (@Author_Devika) June 28, 2023 60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం) -
దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం'
ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఏడు నగరాల్లోకెల్లా అత్యధిక జనసాంద్రత గల నగరం దుబాయ్. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి ఇది మారుపేరు. దుబాయ్ అంటే చప్పున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా (భమ్మీద అత్యంత ఎత్తయిన 830 మీటర్ల భవనం) వంటి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవనశైలే తప్ప.. వ్యవసాయం అసలు కాదు. అయితే, అది పాత సంగతి. ఇప్పుడు దుబాయ్ సిగలో ‘రూఫ్‌టాప్ సేద్యం’ తళుక్కుమంటోంది. పచ్చదనం, పర్యావరణ హితమైన జీవనం వైపు ఈ ప్రత్యేక ఉద్యమం దుబాయ్ పట్టణ వాతావరణాన్ని క్రమంగా పునర్నిర్మిస్తోంది. కాంక్రీటు అరణ్యానికి ఆకుపచ్చని సొబగులు అద్దుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను భవనాల పైకప్పులపైనే నగరవాసులు పండించుకుంటున్నారు. అర్బన్ అగ్రికల్చర్ భావన అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆకుపచ్చని పంటలతో నిండిన సుస్థిరమైన జీవనాకాంక్షను నెరవేర్చటం, వీలైనంత వరకు ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు.. నగరపు రొద మధ్యలో మనోల్లాస వాతావరణాన్ని కల్పిస్తోంది. రఫ్‌టాప్ కిచెన్ గార్డెనింగ్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఇంటిపైన ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసమే వెతుకుతున్నారంటే ఆశ్చర్యం లేదు! తీవ్రమైన ఎడారి వాతావరణం కారణంగా యూఏఈ.. ఆహారం మొత్తాన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తామరతంపరగా విస్తరిస్తున్న మిద్దె తోటల వల్ల ఆహార దిగుమతి కొంతమేరకైనా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ ట్రెండ్ వెనుక.. పర్యావరణానికి మేలు చేసే పనులను ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్త విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. 2050 నాటికి సుస్థిర జీవనం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో యూఏఈ ముందడుగేస్తోంది. ఆహారాన్ని స్థానికంగా పండించుకోవటం, కాంక్రీటు భవనాల ద్వారా విడుదలయ్యే వేడిని తగ్గించుకోవడం వంటి పనులకు లభిస్తున్న ప్రభుత్వ తోడ్పాటుతో దుబాయ్ వాసుల్లో మిద్దె తోటలపై అవగాహన, ఆసక్తి నానాటికీ ఇనుమడిస్తోంది. రఫ్‌టాప్ సేద్యం అంటే కేవలం పరిసరాలను పచ్చగా వర్చడం లేదా పంటలు పండించడం మాత్రమే కాదు. నలుగురూ కలసికట్టుగా పనిచేసే సంస్కృతికి నారు పొయ్యటం కూడా. నగరవాసులు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని దుబాయ్ వాసులు సంతోషపడుతున్నారు. ఎడారిలో సాధ్యమేనా? ఎడారి పరిస్థితులు ఉన్నప్పటికీ మిద్దెపైన ప్రత్యేక నిర్మాణాల ద్వారా కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేసుకునేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ వంటి అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు.. పాలకూర, చార్డ్, లెట్యూస్ వంటి పంటలను సులభంగా పండిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో పోల్చితే అతి తక్కువ నీరే ఖర్చవుతోంది. నీటి కొరత పెద్ద సమస్యగా ఉన్న దుబాయ్ వంటి ప్రాంతంలో ఈ సాగు పద్ధతులు ఉపయోగకరం. నివాస భవనాలపై ప్రత్యేక శ్రద్ధతో రఫ్గార్డెన్లు నిర్మిస్తున్నందు వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ను తగ్గించడంలో తోడ్పడుతోంది. శీతలీకరణ అవసరాలు తగ్గుతున్నాయని భవన నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. సొంత రఫ్‌టాప్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారికి వర్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘రియల్’ ఆకర్షణ... నూతన సాంకేతిక ఆవిష్కరణలు, భవన నిర్మాణంలో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ మద్దతు, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర జీవనశైలిపై పెరుగుతున్న సామాజిక అవగాహన.. దుబాయ్‌లో రఫ్‌టాప్ ఫార్మింగ్ విస్తరణకు దోహదపడుతున్నాయి. దీని వల్ల పట్టణ జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతోంది. రఫ్‌టాప్ ఫార్మింగ్ సదుపాయాన్ని జోడించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పర్యావరణ స్పృహతో ఉన్న కొనుగోలుదారులను, ఆరోగ్యకరమైన జీవనానికి విలువనిచ్చే అద్దెదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం రెసిడెన్షియల్ భవనాలకే పరిమితం కాలేదు. వాణిజ్య భవనాలపై కప్పులపై కూడా పంటల సాగు ఏర్పాట్లు నిర్మించటం సామాజిక బాధ్యతగా బిల్డర్లు భావిస్తున్నారు. ఇది సానుకల ప్రభావాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఇరిగేషన్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ ద్వారా రఫ్‌టాప్ ఫార్మింగ్ మెరుగైన ఫలితాలను ఇవ్వడమే కాక, నేర్చుకునే వారికి ఆకర్షణీయంగా వరింది. విలాసాలను త్యాగం చేయకుండా నగరాలు ఆహార స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎలా స్వీకరించవచ్చో చెప్పడానికి దుబాయ్‌లో పెరుగుతున్న మిద్దె తోటల ధోరణి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. (చదవండి: 14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం) -
వర్షాకాలమే కదా.. మొక్కలకు నీళ్లు పోయాలా?
వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మొక్కలకు నీళ్లు పోయనవసరంలేదని కొంతమంది అనుకుంటారు. కానీ వర్షాల్లో కూడా కొన్నిరకాల మొక్కలకు నీళ్లు పోస్తేనే గార్డెన్ పచ్చగా కళకళలాడుతుంది. అందుకు ఇవే కారణాలు... ♦సాధారణంగా మొక్కలకు వర్షాకాలంలో సహజసిద్ధంగా నీళ్లు అందుతాయి. కానీ, కుండీల్లో ఉన్న మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచలేకపోతే, మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తేమను చూసుకుని మొక్కలకు నీళ్లు పోయాలి. ♦కుండీల్లో పెరుగుతోన్న కొన్ని రకాల మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దట్టంగా ఉన్న ఆకులు, కొమ్మలు కూడా వెడల్పుగా విస్తరించి చినుకులను అడ్డుకుంటాయి. ♦ వర్షం చినుకులు కొమ్మలపై పడి పక్కకు జారిపోతాయి. దీనివల్ల వేర్లకు సరిగా నీరు అందదు. అందువల్ల గుబురుగా ఉన్న కుండీ మొక్కలకు తప్పని సరిగా నీళ్లుపోయాలి. -
14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం
తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు. మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు. ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు! సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. – రాచెల్లి అనూష, యువ రైతు 75 రోజుల్లో 20 కేజీలు కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873). – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్ (చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం) -
సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం
సాక్షి, షోలాపూర్ : మన రాష్ట్రం కాదు, మన భాష కాదు.. అయినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అంటే వారికి ఎంతో ఇష్టం. సీఎం జగన్ ను ముద్దుగా దాదా అని పిలుచుకునే షోలాపూర్ వాసులు.. ఈ వర్షాకాలం పురస్కరించుకుని భారీ ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు. ఏకలవ్య అభిమాని కాకా సాహెబ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీడియాలో చదివి అభిమానిగా మారిపోయారు షోలాపూర్ రైతు కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే. ఈ ఏడాది ఏప్రిల్ లో మండుటెండలు లెక్క చేయకుండా.. షోలాపూర్ నుంచి విజయవాడ, తాడేపల్లి వరకు సైకిల్ పై వచ్చి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అదే అభిమానంతో ఇప్పుడు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో చేపట్టారు. (చదవండి : ఇది కదా అభిమానం అంటే.. మహారాష్ట్ర నుంచి విజయవాడకు సైకిల్ పై) సీఎం జగన్ .. యువతరానికి స్పూర్తి ఒక మంచి కార్యక్రమానికి పరిధి ఏముంటుంది? సమాజానికి హితం చేసే పనులు ఎవరు చేపట్టినా సంతోషమే... ఇది కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే ఆలోచన. తన అభిమాన నాయకుడు సీఎం జగన్ కోసం.. అలాగే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సమాజానికి తన వంతుగా మేలు చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షోలాపూర్ జిల్లాలో దాదాపు 4800 పాఠశాలలున్నాయి. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం లక్షా 11 వేల 111 మొక్కలు నాటనున్నారు. ఉద్యమంలా మొక్కల పెంపకం ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి బాలాజీ మంజులే ప్రారంభించారు. కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే నేతృత్వంలోని సీఎం జగన్ దాదాశ్రీ ఫౌండేషన్ అభినందనీయమని, మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా సాగాలని, దీని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని బాలాజీ మంజులే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి కర్మల తహసీల్దార్ విజయ్ జాదవ్ సాహెబ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బిభీషన్ అవతే, వ్యవసాయోత్పత్తి కమిటీ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ధేరే సహా పలువురు పాల్గొన్నారు. -
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్‌కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
సేంద్రియ సాగుతో లాభాలు
ఆసిఫాబాద్‌రూరల్: వానాకాలం సాగుకు వర్షాలు అనుకూలంగా లేవని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వర్షం కురిసి 15నుంచి 20 ఇంచుల మేరకు నేల తడిసిన తర్వాత విత్తుకుంటేనే సాగు సవ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 20 దాకా పత్తి సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రకృతి సహకరించకుంటే కంది, జొన్న సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని వివరించారు. లోటు వర్షపాతం కారణంగా జిల్లా రైతాంగం ఇబ్బందులు పడుతుండగా జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. సాక్షి: వానాకాలం సాగుపై లోటు వర్షపాతం ఎలాంటి ప్రభావం చూపుతుంది? డీఏవో: జిల్లాలో జూన్‌లో సగం వానలే కురిశా యి. లోటు వర్షపాతంతో విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. రైతులు మరోసారి విత్తుతున్నారు. దీంతో పెట్టుబడి పెరగడమే కాకుండా దిగుబడిపై ప్రభావం పడనుంది. సాక్షి: వరినార్లు ఎప్పటివరకు పోసుకోవచ్చు? డీఏవో: నీటి వసతి ఉన్నవారు ఇప్పటికే వరినా ర్లు పోసుకున్నారు. లోటు వర్షపాతంతో చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరిలో స్వల్పకాలిక విత్తనాలను ఎంచుకుని ఆగస్టు వరకు నార్లు పోసుకోవచ్చు. సాక్షి: రైతులకు సబ్సిడీపై ఏయే విత్తనాలు ఇస్తున్నారు? డీఏవో: 100శాతం సబ్సిడీపై జిల్లా రైతులకు ఇప్పటికే కంది, సోయాబీన్ విత్తనాలు అందించాం. సాక్షి: చిరుధాన్యాలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారా? డీఏవో: గతేడాది కలెక్టర్ చొరవతో రూ.15 లక్షల వరకు ఖర్చు చేసి జొన్న, కొర్రలు, సామలు తదితర రకాల చిరుధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశాం. కానీ.. అధిక వర్షపాతం పంటలపై ప్రభావం చూపి సాగు చేసిన రైతులు నష్టపోయారు. దీంతో ఈసారి చిరుధాన్యాల సాగుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకు అనుకూలమైన నేలలు కూడా మన జిల్లాలో లేవు. సాక్షి: వానాకాలం సాగుపై రైతులకు మీరిచ్చే సలహాలు, సూచనలు..? డీఏవో: అవసరానికి మించి రసాయన ఎరువులు వాడొద్దు. పత్తి సాగుకు ముందు దుక్కిలో గాని, విత్తిన నాలుగురోజుల్లోపు గాని ఎకరాకు 30నుంచి 40 కేజీల డీఏపీ మాత్ర మే వాడాలి. విత్తనం మొలకెత్తాక డీఏపీ వేయొద్దు. పత్తి మొలకెత్తిన 20రోజులకు నేలలో మంచి తేమశాతం ఉన్నప్పుడు ఎకరాకు 20 నుంచి 30 కేజీల యూరియాలో 15 నుంచి 20 కేజీల పొటాష్ కలిపి సాగు కాలం పూర్తయ్యే దాకా మూడు లేదా నా లుగుసార్లు (25నుంచి 30రోజుల వ్యవధి లో) వేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ ఎరువులతో భూసారం కూడా పెరుగుతుంది. సాక్షి: నోవా ద్రవరూప యూరియా సాగుకు అనుకూలమేనా? డీఏవో: ఈ సంవత్సరం నోవా ద్రవరూప యూ రియా వచ్చింది. ఎకరాకు లీటర్ చొప్పున వాడుకోవచ్చు. దీంతో రైతుకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. ఈ సంవత్సరం వాడితే గాని దాని ప్రయోజనం తెలియదు. ద్రవరూప యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాక్షి: జిల్లాలో వానాకాలంలో సాగయ్యే పంటలు.. సాగు విస్తీర్ణం? డీఏవో: జిల్లాలో 4.51లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అత్యధికంగా 3,35,178 ఎకరాలో పత్తి, 54,611 ఎకరాల్లో వరి, 46,096 ఎకరాల్లో కంది, 3,017 ఎకరాల్లో పెసర, 1,524 ఎకరాల్లో సోయా సాగవుతోంది. వీటితోపాటు కూరగాయలు, పండ్ల్ల తోటలు కూడా సాగు చేస్తున్నారు. సాక్షి: భూసారం పెంపునకు ఏం చేయాలి? డీఏవో: భూసారం పెంచుకునేందుకు సాధ్యమైంత వరకు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి. జిల్లాలో అ త్యధికంగా సాగు చేసే పత్తిలో అంతరపంటగా కంది, బబ్బెర, మినుము, మొక్కజొ న్న సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. పంటల సాగులో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత ఏఈవోలను సంప్రదించాలి. -
Sagubadi: నిధులు దండి.. సిరులు పండి
రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం...రైతు వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తోంది. విత్తనం వేసింది మొదలు...పంట విక్రయించే దాకా అన్ని విషయాల్లో అండగా ఉంటోంది. పంట పండితే గిట్టుబాటుధర...పంట నష్టపోతే పరిహారం ఇస్తోంది. అలాగే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తోంది. పుట్టపర్తి అర్బన్: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తరచూ చెప్పే సీఎం జగన్ అన్నింటా రైతన్నకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి పథకాన్నీ వర్తింపజేస్తూ అన్నదాత ఇంట సంతోషాలు నింపుతున్నారు. జిల్లాలోని రైతుల ఖాతాల్లో ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జగన్ సర్కార్ ఏకంగా రూ.892 కోట్లు జమ జేసింది. దీంతో పాటు బ్యాంకుల ద్వారా మరో రూ.2,559 కోట్లు రుణాలు అందించింది. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, పశు సంవర్ధక, మత్స్య శాఖలతో పాటు ఏపీఎంఐపీ సహకారంతో ఎన్నో పథకాలను రైతులకు అందిస్తున్నారు. ముంగిళ్లలో సేవలు.. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సేవలన్నీ ముంగిళ్లలోనే అందిస్తోంది. రైతుకు నాణ్యమైన సబ్సిడీ విత్తనం, కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు, సాగులో మెలకువలతో పాటు పంట పండితే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరతో సేకరిస్తోంది. ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం జరిగితే పరిహారం ఇస్తోంది. అలాగే మట్టి పరీక్షలు, యంత్రసేవ ద్వారా రైతులకు అవసరమైన ఆధునిక యంత్రాలు, పరికరాలు, పాడి రైతుల కోసం సంచార పశువైద్య శాలలు, పశువులు చనిపోతే పశు నష్ట పరిహారం, ఉద్యాన రైతులకు స్పింక్లర్లు, డ్రిప్, కోల్డ్ స్టోరేజీలు, పట్టు పురుగుల పెంపకం కేంద్రాలు, నేత్రికలు, ఫారంపాండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఉద్యాన రైతుకూ ఊతం ఉద్యాన శాఖ ద్వారా సమగ్ర ఉద్యాన పథకం, పండ్ల తోటల నిర్వహణ, నీటి వనరుల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, యాంత్రీకరణ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద సేకరణ యంత్రాలు, కోల్డ్ స్టోరేజీలు, హైబ్రిడ్ కూరగాయల ఉత్పత్తి కింద సుమారు 12,505 మంది రైతులకు రూ.6.06 కోట్లు అందజేశారు. దీంతో పాటు పండ్ల తోటల పెంపకానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఎంఐపీ ద్వారా ఈ ఏడాది రెండు విడతల్లో డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. 90 శాతం సబ్సిడీతో 19,198 మంది రైతులకు చెందిన 25,402 హెక్టార్లలో సూక్ష్మ పరికరాలను బిగించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.58.29 కోట్లు వ్యయం చేసింది. ‘పట్టు’ రైతుకు ప్రోత్సాహం పట్టు రైతులకూ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తోంది. మల్బరీ మొక్కలు నాటడం, పట్టు పురుగుల పెంపకం గదుల నిర్మాణం, కూలింగ్ పరికరాలు, సోలార్ సిస్టం, చాకింగ్ గదులు, ఫారం మెకనైజేషన కింద సిల్క్ సమగ్ర పథకం తదితర వాటి కింద 2,899 మంది రైతులకు రూ.10.98 కోట్లు వ్యయం చేసింది. పాడిరైతుకూ సాయం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు నష్ట పరిహారం కింద ఈ ఏడాది రూ.2.50 కోట్లు పాడి రైతులకు అందజేసింది. దీంతో పాటు ఒక్కో వాకింగ్ ప్రిజ్ కోసం రూ.16 లక్షలతో 8 ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసింది. ఉచితంగా లక్షల విలువైన గాలికుంటు వ్యాధి నివారణ మందులు అందజేస్తోంది. అన్నదాతకు తోడుగా.. జిల్లాలో 3,65,875 మంది రైతులుండగా, సాధారణ సాగు విస్తీర్ణం 3,23,763 హెక్టార్లు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి విత్తన పంపిణీ చేపడతున్నారు. వేరుశనగతో పాటు కంది, పెసర, కొర్ర, సామలు, జీలుగ, రాగితో పాటు చిరుధాన్యాలను సైతం అందజేస్తున్నారు. గత ఏడాదిలో రెండు సార్లు రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు, కోత మిషన్లు సబ్సిడీపై అందజేశారు. ఇందుకు గాను రూ.10.78 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున ఏడాదిలో రూ.371.69 కోట్లు అందజేశారు. ఖరీఫ్‌లో విత్తన సబ్సిడీ కింద రూ.18 కోట్లు, 2022లో ఉచిత పంటల బీమా కింద 1.72 లక్షల మందికి రూ.255.78 కోట్లు అందజేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.31 లక్షలు, 416 సీహెచ్‌సీ గ్రూపులకు 1,165 యంత్ర పరికరాలు అందజేశారు. ప్రస్తుతం వాతావరణ బీమా కింద జిల్లా రైతులకు రూ.157.598 కోట్లు అందజేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వ తేదీ కళ్యాణదుర్గం విచ్చేస్తున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. రైతులను వెన్నంటి ఉండే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. నాకు రైతు భరోసా, పంటల బీమా, విత్తన సబ్సిడీ, యంత్రసేవ ద్వారా లబ్ధి కలిగింది. సీఎం వైఎస్ జగన్ రుణం ఎన్నటికీ తీర్చు కోలేనిది. ఎన్నటికీ ఆయన వెన్నంటే ఉంటా. – భాస్కర్‌రెడ్డి, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి రూ.1.50 లక్షలకే కోరిన ట్రాక్టర్ యంత్ర సేవ పథకంలో భాగంగా రూ.15 లక్షల విలువైన ట్రాక్టర్‌ను నేను రూ.1.50 లక్షలకే పొందగలిగాను. నా పొలాన్ని దున్నుకోవడంతో పాటు తోటి రైతులకు తక్కువ బాడుగకే ట్రాక్టర్‌తో పనులు చేస్తున్నా. అలాగే వివిధ పథకాలతో నా కుటుంబానికి మరో రూ.3.5 లక్షల లబ్ధి కలిగింది. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పథకాన్ని చూడలేదు. – శ్రీరాములు, ఓబుళరెడ్డిపల్లి, తలుపుల మండలం -
Sagubadi: ఏ బోర్లు అనుకూలం? ఎండిపోతున్న బోర్ని నిర్థారించడం ఎలా?
బోర్ల నుంచి ఎప్పుడంటే అప్పుడు నీటిని తోడుకోవాలంటే వానాకాలంలో వాటికి నీటిని తాపాలన్న అవసరాన్ని ఇప్పుడు చాలా మంది బోర్ల యజమానులు గుర్తిస్తున్నారు. సాధారణంగా వాన నీరు 10–15% మాత్రమే భూమిలోకి ఇంకుతుంది. బోరు చుట్టూ గుంత నిర్మిస్తే అక్కడ కురిసిన వర్షంలో 50%ని ఇంకింపజేసుకొని భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. అయితే, ఎండిపోయిన, ఎండిపోబోతున్న బోర్లన్నిటికీ నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యాన్ని నిర్ధారించడం కోసం నీరు తాపే పరీక్ష చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు. వాటర్ ట్యాంకర్ ద్వారా 5 వేల లీటర్ల నీటిని తీసుకువచ్చి బోరులో పోసి, నీరు లోపలికి ఎంతమేరకు వెళ్తున్నదీ పరీక్షిస్తారు. 200 మీటర్ల పరిధిలో పరిసరాల్లో ఏ బోరు నుంచీ నీటిని తోడకుండా ఉన్నప్పుడు ఈ నీటి పరీక్ష చేయాలి. నీటి పరీక్షకు సాఫ్ట్వేర్ సాధనం బోరు లోపలికి నీరు పోస్తున్నప్పుడు నీరు ఎక్కువగా బయటికి వచ్చేస్తే.. ఆ బోరుకు నీటిని ఇంకించుకునే సామర్థ్యం లేదని.. అది రీఛార్జ్ గుంత నిర్మాణానికి తగినది కాదని నిర్ధారించవచ్చు. ఒకవేళ నీరు చాలా వరకు లోపలికి ఇంకిపోతే ఆ బోరు చుట్టూ రీఛార్జ్ గుంత నిర్మాణానికి అనువుగా ఉందనుకోవచ్చు. ఈ నీటి పరీక్ష చేసేటప్పుడు ఉపయోగించే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ సాధనాన్ని సికింద్రాబాద్‌కు చెందిన ‘వాటర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు రామ్మోహన్ రూపొందించారు. పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ఈ సాధనం ద్వారా బోరు వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవాలో వద్దో ఖచ్చితంగా నిర్థారించుకోవచ్చని రామ్మోహన్(94401 94866) తెలిపారు.అన్ని బోర్లూ పనికిరావు నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట ప్రాంతంలోని ఐనోల్, రామాజిపల్లి గ్రామాల్లో ప్రాంతంలో వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 బోరు బావుల చుట్టూ వాన నీటి రీచార్జి గుంతల నిర్మాణం కోసం ట్యాంకర్లతో నీటి పరీక్ష చేశారు. 5 బోర్లు అనుకూలమని తేలింది. 2 బోర్లు అనుకూలం కాదని తేలింది. మరో 3 బోర్లకు రీచార్జి సామర్ధ్యం తక్కువగా ఉంది. కాబట్టి, రీచార్జ్ గుంతకు బదులు ఫారం పాండ్‌ను ఏర్పాటు చేసుకోవటం మేలని నిపుణులు తేల్చారు. ఏ బోర్లు అనుకూలం? బోరు బావి చుట్టూ భూమి లోపల విడి మట్టి పొరలు ఉంటే.. ఆ బోరు బావికి వాన నీటిని లోపలి పీల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.బోరు బావి చుట్టూ గట్టి మట్టి పొరలు భూమికి నీటిని పీల్చుకునే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. భూమి లోపల మొరం లేదా బంక మట్టి పొరలు ఉంటే నీరు ఇంకదు. గుట్టలు, ఎత్తయిన ప్రదేశాల్లోని బోర్లు, భూమిలో దట్టమైన సున్నపు రాయి ఉన్న బోర్లు రీచార్జ్ గుంత నిర్మాణానికి అనువు కాదు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ఈ నెల 7(శుక్రవారం)న నూజివీడులో మామిడి రైతుల సదస్సు జరుగుతుంది. నూజివీడులోని ప్రభుత్వాసుపత్రి రోడ్డులో బ్రహ్మకుమారి మఠం పక్కన ఛత్రపతి సదనంలో ఉ. 9 గం. నుంచి భారతీయ కిసాన్ సంఘ్, నోఫాల ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. పలువురు శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, మామిడి ఎగుమతిదారులు పాల్గొని అనేక అంశాలపై చర్చిస్తారని నోఫా కార్యదర్శి బి. రాజేశ్ తెలిపారు. అందరూ ఆహ్వానితులే. -
స్మార్ట్ సేద్యం! అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతులు. ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ను ఏర్పాటు చేసుకుని చీడపీడలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంట నష్టాన్ని నివారించుకుంటున్నారు. పనిలో పనిగా సస్యరక్షణ ఖర్చు సగానికి తగ్గినట్టే. నాణ్యత పెరగడమే కాదు.. ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సూత్రాలను ‘స్మార్ట్’గా పాటిస్తూ పండ్ల తోటల్లో ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ ద్వారా చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు అనంతపురం రైతులు. దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల తోటలు సాగు చేసే పెద్ద రైతులకు వెదర్ స్టేషన్లు ఉపయుక్తంగా ఉన్నాయి. తోటల యాజమాన్యాన్ని ‘స్మార్ట్’ సాధనాలతో సులభతరం చేసుకోవడమే కాక ఖర్చును తగ్గించుకుంటూ అధికాదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆటోమేటిక్ స్మార్ట్ వెదర్ స్టేషన్ సోలార్ సిస్టమ్‌తో నడుస్తుంది. భూమి రకాన్ని బట్టి 3 ఎకరాలకు ఒకటి సిఫారసు చేస్తున్నారు.. ఒకే పంటను సాగు చేసే రైతులు ఒక పరికరంతోనే సత్ఫలితాలను పొందుతున్నారు. రూ.50 వేల వ్యయంతో దీన్ని తోట మధ్యలో అమర్చుకోవాలి. భూమి లోపల కనీసం 2–3 మొక్కలను కలుపుతూ ఒక అడుగు లేదా 15 అంగుళాల లోతులో సెన్సార్‌ను పెడతారు. అలాగే, రాబోయే 14 రోజుల్లో ఉండే ఉష్ణోగ్రతలను అంచనా వేసేందుకు టవర్‌కు మధ్యలో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. గాలివేగం, తేమశాతం తెలుసుకునేందుకు టవర్‌కు రెండో వైపు 2.5–3 అడుగుల ఎత్తులో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. భూమిలో ఉండే సెన్సార్ మొక్కల వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతోంది? వేర్ల దగ్గర తేమ శాతం, ఒత్తిడి ఎలా ఉందో చెబుతుంది. అలాగే రెండో సెన్సార్ ఉష్ణోగ్రతలను, మూడో సెన్సార్ ద్వారా గాలిలో తేమ శాతం, గాలి వేగం గురించి చెబుతుంది. రెయిన్ గేజ్ ద్వారా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. 3 సెన్సార్ల ద్వారా వచ్చే సమాచారాన్ని తనే విశ్లేషించుకొని రైతులకు తగిన సూచనలు, సలహాలతో మెస్సేజ్‌లు పంపుతుంది. మంచి ఫలితాలొస్తున్నాయి నేను 25 ఎకరాల్లో దానిమ్మ, 10 ఎకరాల్లో ద్రాక్ష పండ్లు సాగు చేస్తున్నా. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ బాబాసాహెబ్ ఘోరే శిక్షణా కార్యక్రమంలో వీటి ప్రయోజనాల కోసం తెలుసుకున్నా. రెండేళ్ల క్రితం వీటిని మా తోటల్లో ఏర్పాటు చేశాం. చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే సిఫార్సులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏర్పాటు చేసిన ఫసల్ కంపెనీ ఏడాది పాటు ఉచితంగా సేవలందించింది. మా జిల్లాలో 10 మంది రైతులు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాకు 5 టన్నులు దిగుబడి రాగా, పెట్టుబడులు పోను రూ.2–3 లక్షల వరకు నికరాదాయం వస్తో్తంది. – గౌని పాతిరెడ్డి, కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా (9440752434) ఇంట్లో నుంచే తోట యాజమాన్యం నేను 64 ఎకరాల్లో దానిమ్మ, బత్తాయి, బొప్పాయి తోటలు సాగు చేస్తున్నా. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నా. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేయొచ్చు. పంట ఏ తెగులు బారినపడుతుందో అన్న దిగులు లేదు. ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌కి మెస్సేజ్లొస్తాయి. సమాచారం చాలా పక్కాగా ఉంటుంది. అనుగుణంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే చాలు. గతంతో పోలిస్తే∙నీరు 50% ఆదా అవుతుంది. 25% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. దిగుబడి పెరిగింది. పండ్ల నాణ్యత 50% పెరిగి మంచి రేటు కూడా వస్తోంది. – సుగాలి చిన్న నాగరాజు, యలగలవంక తండా, బేలుగుప్ప మం., అనంతపురం జిల్లా (7702828062) చీడపీడలను ఇట్టే పసిగడుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది.. ఫలానా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.. ఫలానా తెగులు సోకే ప్రమాదం ఉంది.. మరో గంటలో వర్షం పడే అవకాశం ఉంది వంటి హెచ్చరికలు పంపిస్తుంది. భూమిలో ఉండే సెన్సార్ ఆధారంగా ఏ సమయంలో ఎంత మేరకు నీరు పెట్టాలో చెబుతుంది. పోషక లోపాలు ఏమేరకు ఉన్నాయో గుర్తించి తగిన సిఫారసులు చేస్తుంది. చీడపీడలకు పిచికారీ చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందో లేదో కూడా తెలియజేస్తుంది. ఎంత మోతాదులో ఎటు నుంచి పిచికారీ చేయాలో కూడా చెబుతుంది. టవర్‌కు ఉండే రెయిన్ గేజ్ ఆధారంగా పంటపొలం వద్ద ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడింది? ఆ ప్రభావం పంటలపై ఏ మేరకు ఉంటుందో కూడా రైతులకు తెలియజేస్తుంది. టవర్ లోపల సిమ్ కార్డు నిక్షిప్తం చేసి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు టెక్ట్స్ మెసేజ్ రూపంలో రైతుకు సమాచారం వస్తుంది. రైతు తోటలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే ప్రత్యేక యాప్ ద్వారా మెసేజ్ రూపంలో అన్ని విషయాలు ఎప్పటికప్పుడూ తెలిసిపోతాయి. ఏమైనా తెగుళ్లు సోకినట్టు గుర్తిస్తే తప్ప అనవసరంగా మందులు కొట్టే అవసరం ఉండదు. సిఫారసు చేసిన పురుగుమందులను సిఫార్సు చేసిన మోతాదులో స్ప్రే చేయడం వలన అదనపు ఖర్చు తగ్గుతుంది. సరైన సమయంలో సరైన మందు స్ప్రే చేయడం వలన దిగుబడి కూడా పెరుగుతుంది. తెగుళ్లు, చీడపీడలు సోకకుండా ముందస్తుగా గుర్తించడం వలన పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. పురుగుమందుల వినియోగం తగ్గడంతో ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పొలంలో వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత పెట్టుబడి ఖర్చు 20% తగ్గడంతోపాటు, నాణ్యత 50%, దిగుబడి 25% వరకు పెరుగుతుంది. 20% పైగా అదనపు ఆదాయం వస్తున్నదని రైతులు చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి (చదవండి: ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం! స్మెదిక్‌లో సిక్కు జాతీయుల ఫార్మింగ్ సిటీ) -
ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం!
ఇంగ్లండ్.. వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ చారిత్రక పారిశ్రామిక పట్టణం స్మెదిక్. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న వందలాది పంజాబీ సిక్కు కుటుంబీకులు అర్బన్ ఫార్మర్స్‌గా మారారు. వ్యవసాయంతో, భూమితో వారికి అనువంశికంగా ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాన్ని స్మెదిక్‌లోని తమ పెరటి తోటల ద్వారా పునరుజ్జీవింపజేసుకున్నారు. స్మెదిక్ పట్టణానికున్నట్టే సర్దార్జీల వలస గాథకూ సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ∙∙ 1779వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పురాతన ఆవిరి యంత్రాన్ని స్మెదిక్‌లో నెలకొల్పటం పారిశ్రామిక చరిత్రలోనే ఒక మైలురాయి. అందుకే ఆ యంత్రానికి ‘స్మెదిక్ ఇంజిన్’గా పేరు. పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన ఈ పట్టణంలో 5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 90 స్టీల్ ఫౌండ్రీలు ఉండేవట. ఆ పరిశ్రమల చిమ్నీల నుంచి నిరంతరం వెలువడే దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది కాబట్టి.. ఈ పట్టణానికి ‘బ్లాక్ కంట్రీ’ అని పేరొచ్చిందట. శ్వేత జాతీయులతో పాటు అనేక కామన్వెల్త్ దేశాల నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల ప్రజలు ఈ శ్రమజీవుల పట్టణంలో జీవిస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వలస జీవులు స్మెదిక్‌లో జీవిక కోసం వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీరిలో పంజాబీల సంఖ్య ఎక్కువ. 1917లో తొలిగా 50కి పైగా సిక్కు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత (1945 నుంచి) మరింత మంది సిక్కులు భారత దేశం నుంచి ఇక్కడకు చేరారు. 1961లో ఓ పాత చర్చ్‌ను కొనుగోలు చేసి గురుద్వారాగా మార్చుకున్నారు. స్మెదిక్ జనజీవనంతో సామాజికంగా, భావోద్వేగపరంగా సిక్కు సామాజిక వర్గం మమేకమయ్యే ప్రక్రియ అంతటితో పూర్తయ్యిందని చెప్పొచ్చు. ∙∙ పారిశ్రామిక కాలుష్యం వల్ల సహజ వనరులన్నీ కలుషితమైపోవటం వల్ల కాలక్రమంలో అక్కడి ప్రజల ఆయర్దాయం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి 11 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం ‘గార్డెన్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి పనిగట్టుకొని సుమారు 45 వేల కొత్త ఇళ్లను నిర్మించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పని యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. ఈ క్రమంలో సర్దార్జీల ఇంటిపంటల నైపుణ్యం గురించి స్థానిక పత్రికలు కథనాలు రాయటం ప్రారంభించాయి. పంజాబ్ నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగానో మిత్రులతోపాటో పారిశ్రామిక కార్మికులుగా వలస వచ్చిన తొలినాటి సర్దాజీలు.. అప్పట్లోనే తమ కోసం కూరగాయలు పండించుకోవటం ప్రారంభించారు. ఆ విధంగా వలస జీవులను ఇంటిపంటలు కనెక్ట్ చేస్తూ ఉత్తేజితపరుస్తూ వచ్చాయి. ‘వ్యవసాయంతో, భూమితో ఈ అనుబంధం మా సంస్కృతికి మూలం. ఏ సీజన్లో ఏమి తింటామో అవి పండించుకుంటాం’ అంటున్నారు స్మెదిక్ సర్దార్జీలు సంతోషంగా! (చదవండి: వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?) -
పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?
పత్తి అయినా, మరో పంటైనా.. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా? వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. పత్తి, కూరగాయలు, సోయా, వేరుశనగ.. పంట ఏదైనా సరే.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు(రెయిజ్డ్ బెడ్స్) చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎత్తుమడులపై పత్తిని సాగు చేయటంపై ప్రయోగాలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. దుక్కి చేసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలి దుక్కి దున్ని, ట్రాక్టర్‌కు అమర్చిన బెడ్ మేకర్ ద్వారా బోదెలు తోలాలి. తగుమాత్రంగా వర్షం పడిన తర్వాత ఆ బెడ్‌పై ఒకే వరుసలో విత్తుకోవాలి. చదునుగా ఉండే పొలంలో సాగు చేసిన పత్తి పంట కంటే బోదెలు తోలి సాగు చేసిన పత్తి పంట మంచి దిగుబడినిచ్చింది. వర్షం పడిన తర్వాత ఒక వరుసలో పత్తి విత్తనం వేసుకోవాలి వర్షాలకు అధిక నీరు పొలంలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోవటం వల్ల పత్తి పంట ఉరకెత్త లేదు. గాలి, వెలుతురు మొక్కల మొదళ్లకు బాగా తగలటం వల్ల, ఎత్తు మడిలో మట్టి గుల్లగా ఉండటంతో వేరు వ్యవస్థ బాగా విస్తరించటం వల్ల పంట ఆరోగ్యంగా ఎదిగింది. ఎత్తు మడులపై ఆరోగ్యంగా పెరుగుతున్న పత్తి పైరు ఫ్లాట్ బెడ్‌పై విత్తనాలు నాటిన దానితో పోల్చితే అధిక పత్తి దిగుబడులు రావటానికి ఎత్తు మడుల పద్ధతి బాగు ఉపయోగపడిందని డా. ప్రవీణ్ కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఒక వేళ వర్షాలు తక్కువ పడితే, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఎత్తుమడిపై ఉన్న పంట వేరు వ్యవస్థలో తేమ త్వరగా ఆరిపోదు. అందువల్ల బెట్టను తట్టుకునే శక్తి కూడా బోదెలపై నాటిన పంటకు చేకూరుతుంది. ఎత్తు మడులు / బోదెలపై పత్తి పంటను విత్తుకోవటం గురించి తాజా వీడియోను ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. రైతులు ఆ వీడియోను చూసి అవగాహన పెంచుకోవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: జీవన ఎరువుల ప్రయోగశాల) -
జీవన ఎరువుల ప్రయోగశాల
సాక్షి, నెల్లూరు డెస్క్ : భూ మండలంలో సంచరించే జీవుల మనుగడ వాటి శరీరంలో ఉండే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్) పైనే ఆధారపడి ఉంటుందనేది శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైన వాస్తవం. మైక్రోబ్స్ ఆయా జీవుల్లో వాటి శరీర పరిమాణాన్ని బట్టి లక్షలు/కోట్లలో ఉంటాయి. ఒక నిర్ధిష్టమైన రేషియోలో వాటి సంఖ్య పెరుగుతుంటే.. అదే సమయంలో ఆ స్థాయి నిష్పత్తిలో మరికొన్ని అంతరించిపోతుంటాయి. ఈ మైక్రోబ్స్ ప్రాణి బతకడానికి అవసరమైన న్యూట్రియంట్స్‌ను అందిస్తాయి. ఇవి ప్రాణులకు ఎంత ముఖ్యమో మొక్కలకూ అంతే అవసరం. మొక్కల ఎదుగుదలకు సాధారణంగా రైతులు పొలంలోని పైరు ఎదుగుదల కోసం రసాయన ఎరువులను వాడుతుంటారు. అందులో నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి పదార్థాలుంటాయి. వాటిని అవసరమైన మేరకే మొక్కలకు వాడాలి. మోతాదు మించితే పైరుకు నష్టం కలుగుతుంది. మరోవైపు ఈ రసాయన ఎరువులు విపరీతంగా వాడటంతో భూమి నిస్సారం అవుతోంది. మ్యూకస్ తగ్గిపోయి జీవం కోల్పోతోంది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు జీవన ఎరువులపై దృష్టి సారించారు. ధరణికి హాని చేయని జీవన ఎరువుల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఏమిటీ జీవన ఎరువులు? జీవన ఎరువు అంటే మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందించే ఒక రకమైన మంచి బ్యాక్టీరియాతో కూడిన ద్రవ లేదా మొత్తని పదార్థం. ప్రస్తుతం ఈ జీవన ఎరువులను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. అయితే వాటిలో నిర్ణీత మోతాదులో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటున్నాయా? మైకోరిజాల్ ఫంగీ, బ్లూ–గ్రీన్ అల్గే, బ్యాక్టీరియా తగినంతగా ఉంటున్నాయా? తదితర అంశాలపై రైతులకు కలిగే ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ జీవన ఎరువుల బారి నుంచి రైతన్నలను కాపాడేందుకు చర్యలు తీసుకుంది. జీవన ఎరువుల ప్రయోగశాల దుకాణాల్లో రైతులకు విక్రయించే జీవన ఎరువులు నాణ్యమైనవో కాదో నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో జీవన, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. రూ.1.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలలో అధునాతన పరికరాలు సమకూర్చారు. మండల స్థాయిలో అధికారులు సేకరిస్తున్న శాంపిళ్లను రీజినల్ సెంటర్ల (అమరావతి, తిరుపతి, విశాఖ, తాడేపల్లిగూడెం)కు మొదటగా పంపుతారు. అక్కడి నుంచి వాటిని డీకోడ్ చేసి నెల్లూరులోని ప్రయోగశాలకు పంపుతున్నారు. ఇక్కడి ల్యాబ్‌లలో ఆ శాంపిళ్లను వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి అవి నాణ్యమైనవో కాదో తెలియజేస్తున్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా ఒకవేళ అవి సరిగా లేకుంటే వాటిని విక్రయించే లేదా తయారీదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులు పండించే పంటకు ఎరువుల వాడకం ఎంతో కీలకం. వాటిలో జీవన ఎరువులపై రైతులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. వాటిని వివిధ కంపెనీలు అనేక విధాలుగా తయారు చేస్తాయి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి.. వాటిని ఎన్ని అంశాల్లో పరీక్షిస్తారు.. ఉండాల్సిన లక్షణాలు ఏమిటి.. ఎక్కడ తయారు చేస్తారో తదితర వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ పరీక్షలు చేస్తారంటే? నెల్లూరులోని ప్రయోగశాలలో జీవన ఎరువులైన రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పెరిల్లమ్, మైకోరైజా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా వంటి వాటిలో నాణ్యతా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్టు, ఆర్గానిక్ మెన్యూర్, డీ ఆయిల్డ్ కేక్స్ అయిన వేపచెక్క, ఆముదం చెక్కల నాణ్యతను కూడా నిర్ధారిస్తారు. వివిధ శాంపిళ్లు ఈ ప్రయోగశాలకు రాగానే వాటిని స్టెరిలైజేషన్ చేసిన వస్తువుల్లో ఉంచి వాటిని యంత్రాల్లో 24 గంటల పాటు పరీక్షిస్తారు. బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) ఎంత మేరకు ఉందో తెలుసుకుంటారు. అనంతరం వాటిలో పీహెచ్ (ఉదజన సూచిక), ఈసీ (ఎలక్ట్రికల్ కండెక్టవిటీ), సేంద్రియ కర్బనం, నత్రజని, పొటాషియం, భాస్వరం, హెవీ మెటల్స్ ఎంతెంత స్థాయిలో ఉన్నాయో ల్యాబ్‌ల్లో పరీక్షించి తెలుసుకుంటారు. ఎన్ని శాంపిళ్లను పరీక్షించారంటే.. ఇక్కడ ప్రయోగశాలను ఏర్పాటు చేశాక ఇప్పటి వరకు 307 జీవన ఎరువులు, 330 సేంద్రియ ఎరువులు, 10 డీ ఆయిల్డ్ కేక్స్ల నాణ్యతను పరీక్షించారు. క్వాలిటీ ఉన్నవి, లేనివి సర్టిఫై చేసి వాటిని ఆయా రీజినల్ సెంటర్లకు పంపుతున్నారు. నాణ్యత లేదని నిర్ధారణ అయితే.. వాటిని విక్రయించిన దుకాణాలు, తయారీదారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఇలా జీవన ఎరువుల్లో నాణ్యత నిర్ధారణ చేపట్టి రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముదావహం. నాణ్యతను పక్కాగా నిర్ధారిస్తాం ప్రయోగశాలకు రీజినల్ సెంటర్ల నుంచి డీకోడింగ్ చేసి శాంపిళ్లు పంపుతారు. అవి ఎక్కడి నుంచి తీసినవో మాకు తెలియదు. మాకు అందిన వాటిని వివిధ విభాగాల యంత్రాల్లో పరీక్షలకు పెడతాం. 24 గంటలపాటు వాటిని పరీక్షించి ఏఏ మోతాదుల్లో బీఓడీ ఉందో (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) తెలుసుకుంటాం. అనంతరం వాటి పీహెచ్, ఈసీ తదితరాలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకుని రిపోర్టు తయారు చేసి పంపిస్తాం. – టి.శివరంజని, ఏఓ