bengal
-
హైదరాబాద్ X బెంగాల్
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్, ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్ తూఫాన్స్ 3–1 గోల్స్ తేడాతో సూర్మా హాకీ క్లబ్‌పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ షూటౌట్లో తమిళనాడు డ్రాగన్స్‌పై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు తరఫున అమన్‌దీప్ లక్రా (25వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. సూర్మ హాకీ క్లబ్ తరఫున మ్యాచ్ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్ (60వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ తూఫాన్స్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. బెంగాల్ టైగర్స్ తరఫున ప్రదీప్ సింగ్ సంధు (30వ నిమిషంలో), స్యామ్ లేన్ (53వ ని.లో) చెరో గోల్ చేయగా... డ్రాగన్స్ తరఫున నాథన్ ఎప్రామ్స్ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా... బెంగాల్ టైగర్స్ జట్టు ‘సడెన్ డెత్’లో 6–5 గోల్స్ తేడాతో తమిళనాడు డ్రాగన్స్ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్ టైగర్స్‌తో హైదరాబాద్ తూఫాన్స్ టైటిల్ కోసం పోటీ పడనుంది. -
గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన పదో తరగతి కుర్రాడు
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్నటి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజా (ఐదు వికెట్లు) మినహా టీమిండియా ఆటగాళ్లంతా తేలిపోయారు. పలువురు దేశీయ ఆటగాళ్లు (గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ తొమ్మిది వికెట్ల ప్రదర్శన) సత్తా చాటారు. నిన్న మొదలైన మ్యాచ్‌ల్లో పదో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు.15 ఏళ్ల అంకిత్ ఛటర్జీ హర్యానాతో నిన్న మొదలైన మ్యాచ్‌లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేపి, బెంగాల్ తరఫున రంజీ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ 17 ఏళ్ల వయసులో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంకిత్ ప్రస్తుతం పదో క్లాస్ చదువుతున్నాడు. క్లబ్ లెవెల్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన అంకిత్‌కు రంజీ జట్టులో చోటు దక్కేలా చేసింది.నిన్న హర్యానాతో మొదలైన మ్యాచ్‌లో అంకిత్ 20 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అంకిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగాల్ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్ యువ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్ ఆరు వికెట్లు తీసి హర్యానాను దెబ్బేశాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ముకేశ్ కుమార్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ తలో రెండు వికెట్లు తీశారు. హర్యానా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అంకిత్ కుమార్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీఅంకిత్ ఛటర్జీ బెంగాల్ తరఫున రంజీ అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడైతే.. ఓవరాల్‌గా రంజీల్లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడి రికార్డు వైభవ్ సూర్యవంశీ పేరిట ఉంది. వైభవ్ 12 ఏళ్ల వయసులో బీహార్ తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. వైభవ్ ముంబైతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వైభవ్ భారత్ తరఫున అండర్ 19 లెవెల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు. వైభవ్.. యూత్ టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. -
Ind vs Eng: నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్ ఇచ్చిన భారత పేసర్!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బంతితో రాణించాడు.వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లుఅయితే, మిడిలార్డర్లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్‌లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీఇలా ఓవరాల్‌గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనపడిన ప్రతి రికార్డ్‌ను రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంతలోనే పుష్ప రీలోడ్ వర్షన్ పేరుతో జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి రానున్నాడు. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule ) ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా(Rashmika Mandanna) జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. (ఇదీ చదవండి: నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?)అయితే, 22నిమిషాల నిడివిని అదనంగా ఈ చిత్రానికి కలపనున్నారు. వాస్తవంగా పుష్ప2 రీలోడ్ వర్షన్ జనవరి 10వ తేదీనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వస్తుండటంతో కలెక్షన్స్ పరంగా వాటిపై ప్రభావం చూపించవచ్చని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడం విశేషం.బెంగాల్లో పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్బెంగాల్లో పుష్ప ఓ రికార్డ్ సాధించింది. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నదని తెలిసిందే. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు. -
విజయ్ హజారే టోర్నీ బరిలో ప్రసిధ్ కృష్ణ, పడిక్కల్, సుందర్
బెంగళూరు: ‘అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుంటే ప్రతి ఒక్కరూ దేశవాళీల్లో ఆడాల్సిందే’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న మాటలను భారత ఆటగాళ్లు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరాజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లలో పలువురు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరుగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌తో తమిళనాడు, హరియాణాతో బెంగాల్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇక మీద జరగనున్న మ్యాచ్‌ల్లో పలువురు భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన ప్రసిధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సుందర్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడిన కేఎల్ రాహుల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే ఆ తర్వాత ఈ నెలాఖరున తిరిగి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల్లో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాళ్లు రేపటి నుంచి వారివారి రాష్ట్రాల జట్లతో కలవనున్నారు. తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరితే స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌లాడిన సుందర్ 114 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ వేదికగా కంగారూలతో జరిగిన చివరి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణ కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.రంజీ ట్రోఫీలో నితీశ్ రెడ్డి...‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో అద్వితీయ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోవడంతో అతడికి వన్డే టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ రెండో దశలో పోటీల్లో ఆంధ్ర జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య చక్కటి సెంచరీతో సత్తా చాటిన నితీశ్ రెడ్డి... ఈ నెల 23 నుంచి పుదుచ్చేరితో, 30 నుంచి రాజస్తాన్‌తో ఆంధ్ర జట్టు ఆడే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్ర జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) శ్రాచి బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగాల్ టైగర్స్ 4–1 తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌ను మట్టికరిపించింది. బెంగాల్ టైగర్స్ తరఫున జుగ్రాజ్ సింగ్ (17వ, 38వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తాచాటగా... సుఖ్జీత్ సింగ్ (1వ నిమిషంలో), అభిషేక్ (47వ ని.లో) చెరో గోల్ సాధించారు. ఢిల్లీ పైపర్స్ తరఫున ఫర్లాంగ్ గారెత్ (53వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగాల్ టైగర్స్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో గోనాసిక జట్టు 3–1 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్‌పై గెలుపొందింది. గోనాసిక జట్టు తరఫున సునీల్ విఠలాచార్య (2వ ని.లో), చార్లెట్ విక్టర్ (33వ ని.లో), నీలమ్ సంజీప్ (60వ ని.లో) తలా ఒక గోల్ సాధించగా... హైదరాబాద్ తూఫాన్స్ తరఫున డానియల్ టిమోతీ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం 2 పరాజయాలు మూటగట్టుకున్న గోనాసిక జట్టు 4 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా... హైదరాబాద్ తూఫాన్స్ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో వేదాంత కళింగ లాన్సర్స్‌తో సూర్మా హాకీ క్లబ్, తమిళనాడు డ్రాగన్స్‌తో యూపీ రుద్రాస్ తలపడుతుంది. -
బెంగాల్లో తగ్గేదే లే!
‘తగ్గేదే లే’ అన్నది హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లోని డైలాగ్. సుకుమార్ దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ చిత్రం ఆ డైలాగ్‌కి తగ్గట్టే ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే హిందీలో ఏ స్ట్రయిట్ చిత్రం వసూలు చేయనంత అంటూ... దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్‌ని వసూలు చేయడం విశేషం. ఇక బెంగాల్లో ఈ చిత్రం ఓ రికార్డ్ సాధించింది.మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. తక్కువ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు... మరి... ‘పుష్ప’ అంటే వైల్డ్ ఫైర్.... లోకల్ కాదు... ఇంటర్నేషనల్. -
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
BGT: మహ్మద్ షమీకి బైబై!
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేలా కనిపించడం లేదు. ఆసీస్‌తో మూడో టెస్టు నుంచే ఈ బెంగాల్ బౌలర్ భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇటీవల... వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాయి.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే‘‘షమీ టీమిండియా కిట్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే అతడు కూడా కంగారూ గడ్డపై అడుగుపెట్టనున్నాడు’’ అని పేర్కొన్నాయి. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైపోయింది.బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం ఈ మ్యాచ్ ఆరంభమైంది. మరోవైపు.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో షమీ పేరును చేర్చారు సెలక్టర్లు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది.షమీతో పాటు ముకేశ్ కుమార్ ఎంపికఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోయే తమ జట్టులో ఇరవై మంది ఆటగాళ్లకు చోటిచ్చింది. సుదీప్ కుమార్ ఘరామీ కెప్టెన్సీలో ఆడబోయే ఈ టీమ్‌కు టీమిండియా స్టార్లలో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్‌ను కూడా ఎంపిక చేసింది. అదే విధంగా షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా 34 ఏళ్ల షమీ చివరగా వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో షమీ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.దేశీ టీ20 టోర్నీలో షమీ అదుర్స్ఈ నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందిన షమీ.. దాదాపు ఏడాది తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 7.85 ఎకానమీతో పదకొండు వికెట్లు తీశాడు.టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయి.. కానీతద్వారా టీ20 క్రికెట్లో 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షమీ. ఈ క్రమంలో షమీ ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి అనుకున్న తరుణంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ కోసం టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయని.. అయితే, అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నాడు.షమీకి బైబై చెప్పేశారా?కాగా షమీ ఫిట్‌గానే ఉన్నప్పటికీ ఐదు రోజుల క్రికెట్(టెస్టు) ఆడేందుకు అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ అతడిని ఆసీస్ పర్యటన నుంచి పూర్తిగా పక్కనపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు షమీ సిద్ధం కావడం విశేషం.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. బ్రిస్బేన్(డిసెంబరు 14-18), మెల్బోర్న్(డిసెంబరు 26-30), సిడ్నీ(జనవరి 3-7)లో మిగిలిన మూడు టెస్టులు ఆడనుంది. మరోవైపు.. షమీ భాగమైన బెంగాల్ జట్టు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 21న ఢిల్లీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు బెంగాల్ జట్టుసుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, కరణ్ లాల్, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), సుమంత గుప్తా, శుభమ్ ఛటర్జీ, రంజోత్ సింగ్ ఖైరా, ప్రదీప్తా ప్రామాణిక్, కౌశిక్ మైటీ, వికాస్ సింగ్, ముకేశ్ కుమార్, సక్షీమ్ చౌదరి, రోహిత్ కుమార్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయాన్ ఘోష్, కనిష్క్ సేథ్.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
బ్యాట్‌తో రాణించిన షమీ.. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్‌పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్ను దెబ్బకొట్టాడు. కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో రాజ్ బవా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. -
ఆంధ్రప్రదేశ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 6–1 గోల్స్ తేడాతో బెంగాల్ జట్టును ఓడించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున మునిపల్లి నాగ నందిని (22వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... పరికి లక్ష్మి (15వ నిమిషంలో), చిల్లూరు నాగతేజ (38వ నిమిషంలో), కెపె్టన్ కుప్పా తులసీ (46వ నిమిషంలో), రాగుల నాగమణి (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెంగాల్ జట్టుకు శ్రేష్ట ఛటర్జీ (43వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది.గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో గత ఏడాది రన్నరప్ జార్ఖండ్ 5–0తో ఛత్తీస్‌గఢ్ జట్టుపై, ఉత్తరాఖండ్ 3–1తో రాజస్తాన్ జట్టుపై, కర్ణాటక 5–0తో జమ్మూ కశ్మీర్ జట్టుపై, ఒడిశా 5–0తో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై గెలిచాయి. గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. -
7 వికెట్లతో సత్తా చాటిన షమీ.. రీఎంట్రీ అదుర్స్..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీలో అదరగొట్టాడు. 360 రోజుల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ.. వచ్చీ రాగానే రంజీ మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు. రంజీల్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించే షమీ మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమీ బ్యాట్‌తోనూ రాణించాడు. 36 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది.MOHAMMAD SHAMI PICKED 7 WICKETS IN HIS FIRST COMPETITIVE MATCH IN 360 DAYS. ❤️pic.twitter.com/e231mVfTDM— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. షమీ (4/54) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 276 పరుగులకు ఆలౌటైంది. విృత్తిక్ ఛటర్జీ (52) అర్ద సెంచరీతో రాణించగా.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. షమీ (3/102), షాబాజ్ అహ్మద్ (4/48), రోహిత్ కుమార్ (2/47), మొహమ్మద్ కైఫ్ (షమీ తమ్ముడు) (1/50) ధాటికి 326 పరుగులకు ఆలౌటైంది. సేనాపతి (50), శుభమ్ శర్మ (61), వెంకటేశ్ అయ్యర్ (53) మధ్యప్రదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. -
బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ
360 రోజుల తర్వాత యాక్టివ్ క్రికెట్లోని అడుగుపెట్టిన టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ వచ్చీ రాగానే రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ తొలుత బౌలింగ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం షమీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమీ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో బెంగాల్ తమ లీడ్‌ను భారీగా పెంచుకోగలిగింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), కెప్టెన్ అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. షమీ 2 పరుగులకే ఔటయ్యాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. షమీ (4/54), సూరజ్ సింధు జైస్వాల్ (2/35), మొహమ్మద్ కైఫ్ (2/41), రోహిత్ కుమార్ (1/27) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాంన్షు సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.61 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వ్రిత్తిక్ ఛటర్జీ (52), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 276 పరుగులకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ పాండే, సరాన్ష్ జైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు టీ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 279 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు సుభ్రాన్షు సేనాపతి (27), హిమాన్షు మంత్రి (29) క్రీజ్‌లో ఉన్నారు. -
బొగ్గు గనిలో పేలుడు..ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలోని ఓ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. సోమవారం(అక్టోబర్7) జరిగిన ఈ పేలుడులో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన గనిలో బొగ్గు వెలికితీసేందుకుగాను బాంబులు పెడుతుండగా పేలుడు సంభవించింది.పేలుడు తర్వాత గని ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. గని వద్ద నిలిపి ఉంచిన వాహనాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: పండుగల వేళ ఢిల్లీలో హై అలర్ట్ -
తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు
కోల్‌కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు దాదాపు 24 గంటల తరువాత తెరుచుకుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం కోసం ట్రక్కుల తరలింపును ఉద్దేశిస్తూ సరిహద్దును తిరిగి తెరిచారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు జార్ఖండ్‌లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ దరిమిలా పశ్చిమ బెంగాల్- జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేయాలంటూ మమత అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం సాయంత్రం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దును మూసివేశారు.జార్ఖండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దు తెరుచుకుందని, ఎన్‌హెచ్ -2, ఎన్‌హెచ్-5 వేలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరాయని తెలిపారు. అయితే అయితే సరిహద్దు వద్ద 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవైన క్యూలో ట్రక్కులు ఉన్నాయని, ఇవి ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుందన్నారు.జార్ఖండ్‌ను సురక్షితంగా ఉంచేందుకు డీవీసీ తన డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడం వల్లే తమ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. కాగా న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుపీ) సూచనల మేరకు నీటిని విడుదల చేశామని, అయితే ఇప్పుడు దానిని నిలిపివేసినట్లు డీవీసీ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు -
పాత ‘కలకత్తా’ మిగిలే ఉంది!
బెంగాలీ రాజధానిలో బ్రిటన్ రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ‘కలకత్తా’ నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాల ఉంది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఈ ప్రదేశం ధిక్కారంగా నేటికీ అలానే ఉండిపోయింది. ఇటీవల ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం,ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవిష్యత్తు... వీటన్నిటిపై చర్చలు, వాదనలు ఇక్కడ కూడా జరగకుండా లేవు. కానీ ఇక్కడి నుండి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందిన అంశాలుగా అనిపిస్తాయి.తొలి పరిచయంలోనే ఏర్పరచుకునే అభి ప్రాయాలు తప్పుదారి పట్టించేవిగా ఉండ వచ్చునని నేను అంగీకరిస్తాను. కానీ అవి చెరగని ముద్రలుగా కూడా నిలిచిపోగలవు. గత వారాంతపు నా ‘కలకత్తా’ పర్యటన విషయంలో ఇది నిశ్చయంగా వాస్తవం. నాకు ఆ నగరం గురించి ఏమంత తెలి యదు. కనీసం ఐదేళ్లుగా నేను ఆ నగరాన్ని సందర్శించిందే లేదు. అయితే, ఆ బెంగాలీ రాజధానిలో రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్న ఒక కాదనలేని భావనకు నేను లోనయ్యాను. నేనక్కడ కలిసిన స్థానికులు కూడా ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అనుకోను. అందువల్లనే నేను ఆ నగరానికి ఉన్న ‘కలకత్తా’ అనే వలసరాజ్య నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన, అనాకమైనదిగా తప్ప మీరు గుర్తించని ఒక భవంతి... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాలను తనలో పొదవుకుని ఉంటుంది. ఒకసారి మీరు ఆ అసహ్యకరమైన పరిసరాలను, జీర్ణావస్థలో ఉన్న ప్రవేశ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లారా... 7, 8 అంతస్థులలోని గతకాలపు విస్మృత ప్రపంచంలోకి అడుగు పెడతారు. గ్లెన్బర్న్లోని తొమ్మిది గదులలో రేఖాగణితం నమూనాలో డిజైన్ చేసిన చెక్క పలకల ఫ్లోరింగ్, షాండ్లియర్లు, కలపను మలిచి తీర్చిన సోఫాలు, వార్నిష్ పట్టిన ఒంపుకాళ్ల బల్లలు, వర్ణాలంకరణలను అచ్చు గుద్దిన పత్తి వస్త్రాల పరుపులు, ఇత్తడితో పటం కట్టిన పురాతన పూల కళాకృతులు ఉన్నాయి. అక్కడి విశాలమైన స్నానపు గదులు పాతకాలపు నాటి ఆధునిక శైలిలో రూపొందిన గాజు లోహపు తొట్టెలను కలిగి ఉన్నాయి. వాటిల్లో మీరు మునిగిపోవచ్చు. దేహాన్ని సాధ్యమైనంతగా సాగదీసుకోనూవచ్చు. సూర్యోదయపు తొలి కిరణాలు తొంగి చూసే అక్కడి ఒక గదిలో నేను మూడు రోజుల పాతదైన లండన్ టైమ్స్ దిన పత్రికను చదు వుతూ అల్పాహారం తీసుకున్నాను. అది మన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సమకాలీన సంచిక కన్నా మరింత సందర్భోచితంగా ఉన్నట్లు అనిపించింది. ‘లండన్ టైమ్స్’లోని కోర్ట్ సర్క్యులర్ శీర్షికలో ఆనాటి రాచ కార్యాల వివరాలు ప్రచురించి ఉన్నాయి. రాజు గారు బల్మోరల్ విహారంలో ఉన్నారు, బహుశా గ్రౌస్ పక్షుల్ని వేటాడటం కోసం. పేపర్ నుంచి తలెత్తి చూసినప్పుడు బయట విక్టోరియా మెమోరియల్ నా వైపు తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. (దాని నిర్మాణ స్ఫూర్తి సారథి) లార్డ్ కర్జన్ తన ప్రాతఃకాల కాఫీ సేవిస్తూ, ఇంతకంటే మెరుగైన దృశ్యాన్ని ఆశించివుండరు!ఇంకో వైపు నుంచి కలకత్తా మైదానం కనిపిస్తోంది. గత ఆదివారం అది హరితపత్రంలా, ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. దూరంగా వర్షాకాలపు శీతల ఉషోదయంలో కొంతమంది పురుషులు ఉల్లాసంగా గుర్రాలను దౌడు తీయించటం గమనించాను. గొడుగులు పట్టుకొని ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వారి పెంపుడు కుక్కపిల్లలు అక్కడి పచ్చికలో ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు టిఫిన్ చేయటం కోసం గ్లెన్బర్న్కు వస్తారా? వస్తే కనుక వారి విహార యాత్రను ముగించటానికి పింక్ జిన్లు కచ్చితంగా ఒక అత్యంత సముచితమైన మార్గంగా ఉంటాయి. బెంగాల్ క్లబ్బు సభ్యులతో మాట్లాడటానికి నాకు ఆహ్వానం లభించింది. పంజాబీ ధాబాలా మారిపోయిన ఢిల్లీ జింఖానా క్లబ్‌కు భిన్నమైన ప్రపంచం అది. ఇక్కడి బ్రిటిష్ వాసనల్లోని గొప్ప ఆపేక్ష, అమితమైన శ్రద్ధ... ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయి.క్లబ్బుకు వచ్చిన వారిలో షిఫాన్ చీరలు, ముత్యాల కంఠ హారాలు ధరించిన స్త్రీలు; చక్కగా ఇస్త్రీ చేసిన ప్యాంట్లు, హుందాగా ఉండే చొక్కాలు ధరించిన పురుషులు ఉన్నారు. ఎక్కడా కుర్తా–పైజమా కానీ, భద్రలోక్ ధోతీ కానీ కనిపించలేదు. వారికి బెంగాలీ భాష తెలుస నటంలో సందేహం లేదు కానీ, నాకు ఇంగ్లిష్ మాత్రమే విని పించింది... అచ్చంగా నైట్స్‌బ్రిడ్జ్ (లండన్)లో మాట్లాడిన విధంగా. మేము జనరల్ అవుట్రామ్ నిలువెత్తు తైలవర్ణ చిత్తరు వులోని ఆయన చురుకైన చూపుల కింద భోజనం చేశాం. క్లబ్బు పూర్వపు అధ్యక్షుడు ఆయన. ఇప్పుడైతే నిస్సందేహంగా కొత్త సభ్యత్వంపై ఒక కన్నేసి ఉంచేవారు. మెనూలోని ఆహార పదార్థాలు తప్పక ఆయన సమ్మతిని కలిగి ఉండేవి. అది రెండు వైన్లతో కూడిన నాలుగు వంటకాల భోజనం. తళతళ మెరుస్తున్న తెల్లటి చైనా ప్లేట్లకు రెండు వైపులా వెండితో చేసిన స్పూన్లు, ఫోర్కులు అందంగా అమర్చి ఉన్నాయి. క్యారెట్, సెలెరీ కాడల చారు, రాతి పీతలు, క్రాన్బెర్రీ జెల్లీలో మిగుల వేయించిన మాంసం ముక్కలు, చుట్టూతా పుదీనా సాస్ పోసి ఉన్న మృదువైన బ్రాందీ స్నాప్ గొట్టాలు భోజనం బల్లపై ఉన్నాయి. గాజు స్ఫటికాల లోటాలలో వచ్చిన జివ్వనిపించే చల్లని మద్యం, దానికి జతగా ఉన్న సన్నని ఆకుకూరల కాండాలతో మా సాయంత్రం ముగిసింది. ‘‘నేను వారానికి ఒకసారి బ్లెన్హైమ్(బ్రిటన్ రాజప్రాసాదం)లో భోజనం చేస్తాను’’ అని కర్జన్ గొప్పగా చెప్పుకున్న మాటను ఇది నాకు గుర్తు చేసింది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఒక భాగం ధిక్కారంగా అలానే ఉండిపోయింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం, ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవి ష్యత్తు... వీట న్నిటిపై చర్చలు, వాదాలు జరగటం అన్నది నిస్సందే హమే! అయినా, ఈ పరమ పావన గ్లెన్‌బర్న్, బెంగాల్ క్లబ్బు ఆవర ణల నుంచి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందినవిగా అనిపిస్తాయి. కాబట్టి, మీరు కనుక పొగలు కక్కుతున్న ఉడుకుడుకు తృణధాన్య ఆహారం, ఆ తర్వాత గిలకొట్టి వేయించిన గుడ్లు, ఊరబెట్టిన పంది మాంసంతో ఆదివారాలను ప్రారంభించేందుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయుండి, ‘అమృత్ కాల్’తో నాకొచ్చేదేమిటని అనుకుంటూ ఉంటే నేను మీకు గ్లెన్బర్న్ను, బెంగాల్ క్లబ్బును సిఫారసు చేస్తాను. అక్కడ ఎల్లప్పుడూ సమయం నిశ్చలంగా ఉంటుందని మీరు దృఢంగా విశ్వసించవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
షమీ రీ ఎంట్రీ ఖరారు!.. కానీ...
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది బెంగాల్ తరఫున అతడు రంజీ బరిలో దిగే అవకాశం ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించిన ప్రాబబుల్స్ జట్టులో షమీకి కూడా చోటు దక్కింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పేస్ బౌలర్ రీ ఎంట్రీ చూడబోతున్నామంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చీలమండ గాయం.. సర్జరీవన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 19 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కోలుకున్నాడు కానీ..బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న షమీ.. ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా.. ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో షమీ ఆడతాడని భావించినా.. బీసీసీఐ మాత్రం అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత అతడిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.బెంగాల్ తరఫున రంజీలోఈ క్రమంలో స్వదేశంలో సెప్టెంబరులో బంగ్లాదేశ్, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడే టెస్టు సిరీస్‌లకు కూడా షమీ దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ తర్వాత జరుగనున్న రంజీ ట్రోఫీలో మాత్రం షమీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెంగాల్ అసోసియేషన్ ప్రకటన ద్వారా తాజాగా వెల్లడైంది. ఆసీస్‌తో సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం!బెంగాల్ తరఫున రంజీ 2024- 25 సీజన్లో ఆడేందుకు అవకాశం ఉన్న 31 మంది ఆటగాళ్ల జాబితాలో షమీ పేరు కూడా ఉండటంతో.. అతడు ఆస్ట్రేలియాతో సిరీస్ దాకా టీమిండియాకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆసీస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. అందుకే అప్పటి వరకు షమీకి కావాల్సినంత రెస్టు ఇచ్చి.. రంజీ బరిలో దింపడం ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించి.. ఆపై ఈ సిరీస్‌లో ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ -
కోల్‌కతా లో టెన్షన్ టెన్షన్..
-
మనిషితనం మాయమైందా?
సమాజం సహించలేని కొన్ని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. ఆగ్రహం రప్పిస్తాయి. చట్టాలెన్ని ఉన్నా ఆగకుండా సాగుతున్న అకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. కోల్‌కతా వైద్యశిక్షణార్థి ‘అభయ’ ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో పసిపిల్లల పాఠశాలలో నాలుగేళ్ళ వయసు చిన్నారులు ఇద్దరిపై పాఠశాల పనివాడి అమానుష కృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాలు వింటుంటేనే మనసు వికలమవుతుంది. ప్రజా నిరసనల రీత్యా మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది సరే, పిల్లలకు బడిలోనే భద్రత లేకపోతే ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు గురించి చర్చిస్తే ఏమి లాభమన్న బొంబాయి హైకోర్ట్ తాజా వ్యాఖ్యలు నిష్ఠురమైనా నిజమే. ఇప్పుడిక ప్రతి స్కూలులో నెలరోజుల్లోగా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి, వారంలో మూడుసార్లైనా ఆ ఫుటేజ్‌ను పరిశీలించాలి లాంటి సర్కారీ ఆదేశాలు షరా మామూలే. కానీ, కోల్‌కతా నుంచి బద్లాపూర్ దాకా అన్నిచోట్లా రాజ్యవ్యవస్థ చేతిలో ప్రజావిశ్వాసం కుప్పకూలడం సమకాలీన భారత విషాదం. పసిపిల్లలపై అకృత్యం జరిగితే, ఆ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించడానికి బదులు సదరు ‘ఆదర్శ విద్యాలయం’ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం విషాదం. విద్యాబుద్ధుల కోసం బడికి పిల్లల్ని పంపి, వారు అక్కడ భద్రంగా ఉంటారని భావించే కన్నవారికి ఇది భరించలేని కష్టం. పైగా, ఫిర్యాదు దాఖలుకు వారిని 11 గంటల పైగా వేచి ఉండేలా చేయడం దేనికి సంకేతం? ఇలాంటి ఘటనల్లో పాఠశాల వారినీ బాధ్యుల్ని చేస్తూ, ‘పోక్సో’ చట్టం కింద కేసు కట్టాలి. ఆ కనీస బాధ్యతను సైతం పోలీసులు విస్మరించడం క్షమించరాని దుర్మార్గం. చివరకు బొంబాయి హైకోర్ట్ ఆ లోపాన్ని ఎత్తిచూపాల్సి వచ్చింది. ‘అభయ’ ఘటనలోనూ అచ్చంగా ఇలాంటివే జరిగాయి. ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడ జరిగినా జెండాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సి ఉండగా, స్వీయ రాజకీయలబ్ధికై ప్రయత్నించడం సిగ్గుచేటు. కోల్‌కతా ఘటనపై రచ్చ చేసే పార్టీ బద్లాపూర్పై నోరు మెదపదు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని బద్లాపూర్పై హంగామా చేసేవారు కోల్‌కతా ఘటనపై కంటితుడుపుకే పరిమితమవుతారు. రాజ్యాంగబద్ధ హోదాలోని బెంగాల్ గవర్నర్ టీవీ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర సర్కార్‌ను దూషిస్తూ ఇంటర్వ్యూలిస్తుంటే ఏమనుకోవాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలపైనా నిజాయతీ వదిలేసి నీచ రాజకీయాలు చేస్తే దేశం ఏటు పోతుంది?ఉవ్వెత్తున ఎగసిపడ్డ భారీ నిరసనల నేపథ్యంలో కోల్‌కతా అంశంపై సుప్రీమ్ కోర్ట్, బద్లాపూర్ ఘటనపై బొంబాయి హైకోర్ట్ తమకు తాము స్వచ్ఛందంగా విచారణ చేపట్టడమే ఒకింత ఊరట. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో మినుకు మినుకుమంటున్న ఆశాదీపానికి కోర్టు చొరవ ఒక చిన్న కాపుదల. ఇవాళ దేశంలో రోజూ 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనక హత్య చేసి, అడ్డు తొల గించడాలూ పెరిగిపోతున్నాయి. నోరు విప్పి చెప్పుకోలేని వారి పట్ల నీచప్రవర్తనలూ పెచ్చరిల్లుతున్నాయి. మన మధ్యే మామూలు వ్యక్తుల్లా తిరుగుతున్న మానవ మృగాలను నిరోధించడం కఠిన సమస్యే. అయితే, మనసుంటే మార్గాలుంటాయి. మహిళలు, పిల్లల కోసం ‘మినీ – పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం లాంటివి సిఫార్సు చేస్తున్నాయి. సుప్రీమ్ కోర్ట్ గురువారం బెంగాల్ సర్కార్‌కు ముక్కచీవాట్లు పెట్టిన నేపథ్యంలో సీఎం మమత సైతం తీవ్రతను అంగీకరించారు. అత్యాచార నేరాలపై అత్యంత కఠిన చట్టాలు చేయాలనీ, ఇలాంటి కేసుల్ని 15 రోజుల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలనీ ప్రధానిని కోరారు. అంతకన్నా ముందు సమాజంగా మనం ఆత్మశోధన చేసుకోవాలి. 2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి, చివరకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది. ఇప్పటికీ ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే సామాజిక వైఖరి, మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఆధిపత్య భావజాలం లాంటి అనేక అంశాల్లో మనం మారాల్సి ఉంది. కోర్టుల చొరవ, ఆదేశాలతో రానున్న రోజుల్లో కోల్‌కతా కేసు, బద్లాపూర్ కేసులు త్వరితగతినే తేలితే తేలవచ్చు. నిందితులకు కఠిన శిక్షలూ ఖాయం కావచ్చు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఒకటి రెండు కేసుల్లోనే కాదు... వెలుగులోకి రాని వందల ఘటనలకు మూలకారణమైన మౌలిక అంశాలపై మనం ఎప్పటికి కళ్ళు తెరుస్తాం? సాక్షాత్తూ శిష్యులపై రేప్‌తో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం. గత నాలుగేళ్ళలో 234 రోజులు ఆయన జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక రేప్ కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ శాపాలు కాక మరేమవుతాయి? జనం మూడోకన్ను తెరవాల్సిన సమయం వచ్చింది. -
తిరిగి బెంగాల్ గూటికి చేరిన సాహా
వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా దేశవాలీ క్రికెట్లో తిరిగి బెంగాల్ గూటికి చేరాడు. సాహా రెండేళ్ల కింద బెంగాల్ నుంచి త్రిపురకు వలస వెళ్లాడు. తాజాగా మనసు మార్చుకున్న సాహా తిరిగి బెంగాల్ జట్టుతో జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు ఫార్మాట్లలో బెంగాల్ టీమ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. సుదీర్ఘ అనుబంధం ఉన్న బెంగాల్ జట్టులో తిరిగి చేరడం ఆనందంగా ఉందని, తదుపరి దేశవాలీ సీజన్లో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని సాహా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి సాహా ఈ విషయాలను వెల్లడించాడు. సాహా రీఎంట్రీపై స్నేహశిష్ సైతం హర్షం వ్యక్తం చేశాడు. సాహాను బెంగాల్ జట్టులోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు స్నేహశిష్ తెలిపాడు. గతంలో సాహా బెంగాల్ జట్టుకు ఎంతో చేశాడని, అతని చేరిక బెంగాల్ జట్టును మరింత పటిష్ట పరుస్తుందని స్నేహశిష్ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడటంతోపై సాహా స్పందిస్తే.. అది కేవలం అంకెలకు మాత్రమే పరిమితం అని, తనలో క్రికెట్ ఆడే ఓపిక ఇంకా ఉందని అన్నాడు. ప్రస్తుత బెంగాల్ జట్టు యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉందని.. జట్టుకు అవసరమైన ఏ సేవలైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సాహా తెలిపాడు.39 ఏళ్ల సాహా టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లేటు వయసులోనూ సాహా ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. -
అరుణాశయ బుద్ధమూర్తి
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి ప్రగతిశీల రాజకీయాలు, ప్రజా స్వామిక విలువలు కోరుకునేవారందరికీ విచారం కలిగించింది. రాజకీయ విభేదా లకు అతీతంగా ఆయనకు నేతలు నివాళు లర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత్వం, నిష్కపటత్వం వంటి విశిష్టతలను వారు గుర్తు చేసు కుంటున్నారు. దేశంలో కీలకమైన బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సాదాసీదా అపార్ట్మెంట్లోనే ఆఖరి దాకా జీవితం గడిపిన ఆదర్శం ఆయనది. కమ్యూ నిస్టు ఉద్యమం సృష్టించిన త్యాగధనులలో మూడవ తరానికి చెందిన బుద్ధదేవ్ ప్రెసిడెన్సీ కాలేజీలో సాహిత్యం చదువుకుని విద్యార్థి సంఘాల ద్వారా 1966లో వామపక్ష ఉద్యమంలో ప్రవే శించారు. 1977లో తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార, సాంస్కృతిక మంత్రిగా చేరిన ఆయన 1982లో ఓడిపోయినా 1987లో మళ్లీ గెలిచి బాధ్యతలు చేపట్టారు. 1996లో జ్యోతిబాసు అనా రోగ్యం తర్వాత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి దేశంలోనే కొత్తరికార్డు నెలకొల్పిన మహానాయకుడు జ్యోతిబాసు తర్వాత వామపక్ష కూటమి భవిష్యత్తు ఏమవుతుందనే సవాళ్లకు సమర్థమైన సమాధానంగా బుద్ధదేవ్ నిలిచారు. 2000 నుంచి పదకొండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి కేంద్ర కమిటీ, తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడుగా సీపీఎంలో ముఖ్యపాత్ర పోషించారు. యువమంత్రిగా, డివైఎఫ్ఐ నాయకుడుగా 1979లో ఆయన వరంగల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి మహాసభలకు రావడం ఈ రచయితకు గుర్తుంది. పాతికేళ్ల తర్వాత 2005లో అదే వరంగల్‌లో సీపీఎం మహాసభలలో బుద్ధదేవ్ చేసిన కీలక ప్రసంగంలో అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ మత తత్వ రాజకీయాలపై నిశిత విమర్శలు అనువదించాను కూడా! ‘‘గుజరాత్లో జరిగిన దారుణాలకు సాటి ముఖ్యమంత్రిగా నేను సిగ్గుపడుతున్నాను’’ అని అప్పుడాయన అన్నారు. మృదుభాషిగా పేరొందిన బుద్ధదేవ్ రాజకీయ విషయాల్లో అంత నిక్కచ్చిగా ఉండేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తొలి రెండు ఎన్నికల్లోనూ ఫ్రంట్ విజయాలు కొత్త చరిత్ర సృష్టించాయి. 2006 ఎన్నికలలో వామపక్షాలకు 294కు 235 స్థానాలు వచ్చాయి. దానికన్నా ముందు 2004 లోక్‌సభ ఎన్నికలలోనూ 35 స్థానాలు వచ్చాయి. పార్లమెంటులో మొత్తం 60 స్థానాలతో వామపక్షాలు, అందులో 42 సీట్లతో సీపీఎం పాత్ర, ప్రభావాలు శిఖరాగ్రానికి చేరాయి. ఆ మద్దతే లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఉండేది కాదు. కాంగ్రెస్ ఆ రాజకీయ సందేశాన్ని సవ్యంగా అర్థం చేసుకుని ఉంటే... అణు ఒప్పందం చిచ్చు పెట్టకపోతే చరిత్ర మరోలా ఉండేది. బుద్ధదేవ్ సైద్ధాంతికంగా కొత్తపుంతలు తొక్కుతున్నారనీ, దార్శనికతతో పిడివాదాన్ని వదిలేశారనీ ఒక వైపున లేనిపోని పొగడ్తలు... మరోవైపున భూములు లాక్కొంటున్నారనే ప్రచారా లకు బడా మీడియా వేదికైంది. సరళీకరణ విధానాలను, భూ దోపిడీని వ్యతిరేకించినవే వామపక్షాలు కాగా ఆ ముద్రతో వాటిపైనే దాడి చేయడం బూర్జువా వర్గాల వ్యూహమైంది. వామపక్ష ఫ్రంట్ టార్గెట్‌గా సింగూరు, నందిగ్రావ్ు ఘటనలపై అదేపనిగా ప్రచారాలు జరిగాయి. సింగూర్‌లో టాటా కార్ల ఫ్యాక్టరీ దాదాపు పూర్తవుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఆ రోజుల్లో మమతా బెనర్జీ చేసిన హడావిడి మర్చిపోరానిది. కాంగ్రెస్, మమతా బెనర్జీ బుద్ధదేవ్ ప్రభుత్వాన్ని ఓడించడమే పరమార్థంగా వ్యవహరించాయి. మావోయిస్టు పార్టీ కూడా గొంతు కలిపింది. వాటిలో కొన్ని తప్పొప్పులు లేవని కాదు గాని ప్రజలకు ఉపాధి పెంచాలన్నదే బుద్ధదేవ్ సంకల్పంగా ఉండేది. ఆ పరిణామాలపై చాలా సమీక్షలే జరిగాయి. అనేక అధికారిక నివేదికలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని సాకల్యంగా చూస్తే ఎవరికైనా పూర్తి నిజాలు తెలుస్తాయి. ‘‘టాటాలే బెంగాల్ నుంచి తరలిపోవడం వల్ల రాష్ట్రానికి చెప్ప లేని నష్టం జరిగింది. నేను ఎక్కడ తప్పు చేశానా అని కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. భూ సేకరణే తప్పా లేక భూ సేకరణ జరిగిన విధానమా? నేను ప్రతిపక్షాలపై మరీ మెతగ్గా వ్యవహరించానా? ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు తీసు కోవాలి’’ అని ఆయన చెప్పారు. బుద్ధదేవ్, జ్యోతిబాసు వంటివారు భద్రలోక్ అనీ, మమతా దీదీ ప్రజల మనిషని ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఆమె నిరంకుశ పోకడలపై విరుచుకుపడుతున్నారు. మోదీ ఏకపక్షపాలన ముదిరాక ఆమె కూడా అనేక రాజకీయ విన్యాసాలతో ఉనికి కాపాడుకుంటున్నారు. బుద్ధదేవ్ మాత్రం ‘మోదీ హఠావో, మమతా హఠావో’ నినాదంతోనే రాజకీయ జీవితం ముగించారు. 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్ష ప్రభుత్వం 2011లో ఓడి పోయాక నిర్బంధాలు తట్టుకుని బుద్ధదేవ్ గట్టిగా నిలబడ్డారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ సమావేశాలలో, సభలలో పాల్గొంటూ, ఉద్యమాన్ని నిలబ్టెడంలో తన పాత్ర నిర్వహిసూ వచ్చారు. 2011లో ఓడిపోయిన తన నియోజకవర్గమైన జాదవ్ పూర్లో 2017లో పెద్ద మెజార్టీతో సీపీఎం అభ్యర్థినే గెలిపించు కోగలిగారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కుమారుడు సుచేతన్ కూడా ఆశయాల బాటలో తోడుగా నిలిచారు. ఎవరు ఎంత చెప్పినా పావ్‌ు అవెన్యూలోని తన నిరాడంబర ‘టు బెడ్ రూవ్‌ు ఫ్లాట్‘ నివాసాన్ని మార్చుకోవడానికి బుద్ధదేవ్ ఒప్పు కోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పాత అంబాసిడర్ కారునే ఆఖరు వరకూ ఆయన వాడారు.2023లో మోదీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆనారోగ్యంలో పరా మర్శించే పేరిట మమతా బెనర్జీ లేదా అప్పటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ వంటివారు రాజకీయాలు చేయబోతే సాగనివ్వలేదు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ ఒరవడికి అద్దం పడతాయి. ఆయన మరణానంతరం అధికారిక గన్ సెల్యూట్‌ను కూడా కుటుంబ సభ్యులు నిరాకరించారు.కళా, సాహిత్య రంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రచయిత, కవి, నాటకకర్త కూడా! ఇన్ని రాజకీయాల సిద్ధాంత ఘర్షణల మధ్యనా టాగోర్ కవితలను 500 దాకా కంఠోపాఠంగా చెప్పేవారట! సంక్లిష్టమైన ఆధునిక రచయితలు కాఫ్కా, మార్క్వెజ్ వంటి వారి రచనలను ఆయన బెంగాలీలోకి అనువదించారు. సమాంతర చిత్రాలకు పేరెన్నికగన్న కొల్కతాలో నందన్ కానన్ కళాభవన్ పేరిట ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిగా చొరవ తీసుకున్నారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత సుకాంత భట్టాచార్య ఆయన బాబాయి. తన ఆత్మకథను రెండు భాగాలుగా వెలువరించారు బుద్ధదేవ్. ‘ఫిర్దేఖా’, ‘ఫిర్దేఖా 2’ అనే ఆ రెండు సంపుటాల్లో జీవితాన్ని రాజకీయ పాలనానుభవాలను నెమరు వేసుకున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా బెంగాలీలు ఆయనను ఎంత ప్రేమించారు, దేశం ఎంత గౌరవించింది అనడానికి అంతిమఘట్టంలో ప్రదర్శితమైన గౌరవాభిమా నాలే నిదర్శనం. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు -
Bangladesh: నీటిలో నిలుచుని.. భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు
బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా బంగ్లాదేశ్‌లో ఉంటున్న వెయ్యిమంది హిందూ కుటుంబాలకు చెందినవారు బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని రిజర్వాయర్‌లో నిలబడి తమను భారతదేశంలోకి అనుమతించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)ను అభ్యర్థిస్తున్నారు. వారిలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సరిహద్దులోని జీరో పాయింట్‌కు 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.బారత్ - బంగ్లదేశ్ సరిహద్దుపై నిఘా సారించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. దీనికిముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం నిఘాను మరింతగా పెంచింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
కుర్సియాంగ్ ప్రకృతిలో.. ఏదో తెలియని వికృతి దాగుందట..
ప్రకృతి, వికృతి.. ఇవి ఏనాటికీ ఒకటి కాలేవు. ఎక్కడా ఒకటిగా కానరావు. కానీ కుర్సియాంగ్ ప్రకృతిలో ఏదో తెలియని వికృతి దాగుందట. చిత్రవిచిత్రమైన రూపాల్లో వణికిస్తోందట. ఏంటా మిస్టరీ.?పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్.. పర్యాటకానికి పెట్టింది పేరు. అందులో ‘డౌ హీల్’ మాత్రం.. అతీంద్రియశక్తులపై ఆసక్తి చూపేవాళ్లకు ఇస్తుంది మాంచి జోరు. డార్జిలింగ్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్సియాంగ్కి సరిగ్గా 10 నిమిషాలే డౌ పర్వతాలు. దీన్ని చాలామంది ‘మోస్ట్ హాంటెడ్ హిల్ స్టేష¯Œ ’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో హారర్ స్టోరీస్ వినిపిస్తారు.ఒక పక్క తేయాకు తోటలు.. మరో పక్క ఆర్కిడ్ పూల తోటలు.. చుట్టూ కొండలు, పెద్దపెద్ద చెట్లతో దట్టమైన అడవిని తలపిస్తుందీ ప్రాంతం. అయితే సాయంత్రం ఐదు దాటితే.. డౌ హిల్ రోడ్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ మధ్య ఎవ్వరూ తిరగరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏవో శక్తులు తిరుగుతూ ఉంటాయని అక్కడివారి నమ్మకం. పైగా ఆ రోడ్ని.. ‘డెత్ రోడ్’ అనీ పిలుస్తుంటారు. అక్కడ ఒక ఆడ దయ్యాన్ని చూశామని కొందరు.. ఏవో అరుపులు, ఆర్తనాదాలు విన్నామని ఇంకొందరు.. గగుర్పాటును కలిగించే వింత రూపాలను చూశామని మరికొందరు.. చెబుతుంటారు.విక్టోరియా బాయ్స్ హై స్కూల్ఇక ఆ సమీపంలోనే ఉన్న ‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’కి కూడా ఈ గాలి సోకిందని వారందరి నమ్మకం. ‘ఒక తల లేని బాలుడు ఆ స్కూల్ నుంచి అడవిలోకి నడిచి వెళ్లడం కళ్లారా చూశాం’ అని.. అడవిలో కట్టెలు కొట్టుకునే బృందం సాక్ష్యం చెప్పింది. అడవికి వనమూలికల కోసం వచ్చే మరో బృందమైతే.. చింతనిప్పుల్లాంటి ఎర్రటి కళ్లు తమని వెంబడించాయని, తరిమేశాయని కొత్తకథను వినిపించింది. అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వెళితే తప్పకుండా వారు ఆశించినవి ఎదురవుతాయని కొందరి పర్యాటకులు నమ్మకంగా చెబుతుంటారు.‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’ శీతకాలపు సెలవుల్లో.. సాయంత్రం అయితే చాలు.. మూసి ఉన్న స్కూల్ నుంచి పెద్ద పెద్ద గుసగుసలు, అడుగుల చప్పుళ్లు ప్రతిధ్వనిస్తుంటాయట. సూర్యాస్తమయం కాగానే.. పెద్ద హోరుగాలి చుట్టుముడుతుందని.. భవనం కారిడార్లలో అబ్బాయిల నవ్వులు, పరుగెత్తడం స్పష్టంగా వినిపిస్తాయని స్థానికులు పెద్దపెద్ద కళ్లు చేసుకుని వివరిస్తుంటారు. అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థులు కానీ.. చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ ఏనాడూ దయ్యాల కథలు చెప్పలేదు. ఎటువంటి అనుమానస్పద స్థితి గురించి నిర్ధారించలేదు. అయితే స్థానికులే కాకుండా ఇక్కడికి వెళ్లిన పర్యాటకులకూ వింత అనుభవాలు ఎదురవ్వడంతో ఈ కొండమలుపుల్లో, చెట్టు చేమల్లో ఏదో శక్తి ఉందనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. దాంతో ఈ ప్రాంతం మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
బెంగాల్లో రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతులు
న్యూఢిల్లీ/కోల్‌కతా/ సిలిగురి: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో, మృతుల సంఖ్య 9 నుంచి 10కి చేరుకుందన్నారు. సీల్డాకు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం రంగపాణి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెల్సిందే.ఘటనలో మృతి చెందిన, గాయాలపాలైన వారిని వదిలేసి ప్రమాదానికి గురవని బోగీలతో 850 మంది ప్రయా ణికులతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరిన కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ మంగళవారం వేకువజామున సీల్డాకు చేరుకున్నట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీల్డా నుంచి ప్రయాణికులను వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లను ఏర్పాటు చేశామన్నారు.కుమార్తె బర్త్‌డే కోసం వస్తూ...సోమవారం జరిగిన రైలు ప్రమాదం కోల్‌కతాకు చెందిన సృష్టి అనే 11 ఏళ్ల చిన్నారికి తీరని వేదన మిగిల్చింది. ఈమె తండ్రి శుభొజిత్ మాలి(31) ఆఫీసు పని మీద శుక్రవారం సిలిగురి వెళ్లారు. మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉండిపోవాల్సి ఉంది. కానీ, సృష్టి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు ముందుగానే సోమవారం బయలుదేరారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ముందు సృష్టికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎలాగోలా సమయానికి వచ్చేస్తా.బర్త్‌డే ఘనంగా చేసుకుందామని, కేకు తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చారు. కానీ, విధి మరోలా ఉంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో శుభొజిత్ కూడా ఉన్నారు. అదే రైలులో ప్రయాణించిన ఆయన స్నేహితుడు ఈ విషాద వార్తను కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, శుభొజిత్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. ఎప్పుడూ బస్సులోనే ప్రయాణించే శుభొజిత్.. ఈసారి మాత్రం కుమార్తె పుట్టిన రోజు వేడుక జరపాలనే తొందరలో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారని, ఇదే ఆయన ప్రాణాలు తీసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ఖర్గేదేశంలో రైల్వే వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మోటారు సైకిల్‌పై కూర్చుని ప్రమాద స్థలికి మంత్రి చేరుకోవడంపై స్పందిస్తూ. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రినా లేక రీల్ మంత్రినా అంటూ ఎద్దేవా చేశారు. -
బెంగాల్లో దీదీ మేజిక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మేజిక్ మరోసారి పనిచేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో 42 స్థానాలకుగాను 29 చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు, సందేశ్ఖాలీసహా రాష్ట్రంలో పలు చోట్ల అంతర్గత సమస్యలు తలెత్తినా అవేమీ దీదీ నేతృత్వంలో టీఎంసీ విజయయాత్రను ఆపలేకపోయాయి. పశ్చిమబెంగాల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు ఒడిసిపట్టాలని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కాళ్లకు బలపం కట్టుకుని మరీ తెగ ప్రచారంచేశారు.ఎగ్జిట్ పోల్స్ సైతం ఈసారి బెంగాల్లో కమలవికాసం ఖాయమని అంచనాలు వెలువరిచాయి. ఈసారి మోదీ మేనియా ఉండొచ్చన్న రాజకీయ పండితుల లెక్కలూ తప్పు అని మమత మరోసారి నిరూపించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కొనసాగబోనంటూ వేరుబడి కూడా సార్వత్రిక ఎన్నికల్లో మమత జయకేతనం ఎగరేయడం విశేషం. ‘ బెంగాల్లో బీజేపీ అంతర్గత కలహాలు, వ్యవస్థాగతంగా బలహీనంగా ఉండటం, బలమైన లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో తృణమూల్ వ్యతిరేక ఓటును బీజేపీ తనవైపునకు తిప్పుకోలేకపోయింది’ అని రాజకీయ విశ్లేషకుడు మైదుల్ ఇస్లామ్ చెప్పారు. అందుకే 2019తో పోలిస్తే తృణమూల్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగి 47 శాతానికి చేరుకుంది. బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లాగే సీపీఐ(ఎం) పార్టీ ఈసారి కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. జట్టు కట్టకపోవడంతో పుంజుకుందికాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు ఒప్పందం నుంచి మమత జనవరిలోనే వైదొలగడం టీఎంసీకి బాగా కలిసి వచ్చింది. దీంతో త్రిముఖపోరులో మైనారిటీలు, బీజేపీ వ్యతిరేకులు మరోమార్గంలేక టీఎంసీకే ఓటేశారు. గతంలో బీజేపీ సైతం ఇలాగే టీఎంసీ వ్యతిరేక ఓట్లను ఒడిసిపట్టి 2014లో 17 శాతంగా ఉన్న ఓటు షేరును 2019లో 40 శాతానికి పెంచుకుంది. స్థానిక సమస్యలు, ఎస్ఎస్సీ ఉద్యోగాల రద్దు, సీఏఏ అమలు అంశాలు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి. మైనారిటీ ఓటుతో పైపైకిమైనారిటీల బలం దీదీ పార్టీకి ఎంతో దోహపడింది. సీఏఏ అమలు, రామకృష్ణమిషన్, భారత్ సేవాశ్రమం సంఘ్‌లను వ్యతిరేకిస్తూ మమత వ్యాఖ్యలు, 77 ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదా రద్దుచేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పుతో మమత మాత్రమే తమను పట్టించుకుంటారని భావించి మైనారిటీలు టీఎంసీ వెంట నడిచి పార్టీ విజయాన్ని సులభం చేశారు. లక్ష్మీర్ భండార్, కన్యశ్రీ పథకాల లబ్ధిపొందిన మహిళలూ మమతకు మద్దతు పలికారు.మోదీ తక్షణమే రాజీనామా చేయాలి: మమతలోక్సభ ఎన్నికల్లో నైతిక ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి వైదొలగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లు సాధిస్తుందంటూ ప్రచారం చేసుకున్న మోదీ వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని సైతం సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. మోదీ విశ్వసనీయత కోల్పో యారు. ఇండియా గెలిచింది. మోదీ ఓడిపోయారు. ఎన్నో రాజకీయ పారీ్టలను ఆయన ముక్కలుచెక్కలుగా చేశారు. ప్రజలే ఆయన్ను నైతికంగా దెబ్బకొట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మోదీ టీడీపీ, నితీశ్ కుమార్ల వద్ద కాళ్లబేరానికి వచ్చారు’అని మండిపడ్డారు. -
కోల్‌కతా మే సవాల్
పోలింగ్ జరిగే లోక్‌సభ స్థానాలు డమ్ డమ్, బారాసత్, బసీర్హాట్, జయనగర్, మథురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్ పశ్చిమ బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. ఆరు విడతల్లో 33 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా 9 స్థానాల్లో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో చాలా సీట్లు కోల్‌కతా నగర పరిధిలో ఉన్నవే. ఇవన్నీ అధికార తృణమూల్ ఖాతాలోని స్థానాలే. ఈసారి వాటిపై కమలనాథులు కన్నేశారు. దాంతో బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ సాగుతోంది. బెంగాల్లో ఇండియా కూటమికి మమత దూరంగా ఉండటంతో కాంగ్రెస్–సీపీఎం కలిసి పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సీట్లపై ఫోకస్... – సాక్షి, నేషనల్ డెస్క్డైమండ్ హార్బర్... అభిషేక్ హ్యాట్రిక్ గురి బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన డైమండ్ హార్బర్ పోర్టు యూరప్‌కు ముడి సరుకుల రవాణా హబ్‌గా వెలుగు వెలిగింది. ఈ నియోజవర్గంలో 2009లో తృణమూల్ జెండా పాతింది. గత రెండు ఎన్నికల్లోనూ మమత మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఇక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానలో నిలిచినా పోయినసారి 4.7 లక్షల పైగా ఓట్లు దక్కించుకుంది. ఈసారి అభిజిత్ దాస్ (బాబీ)ను రంగంలోకి దించింది. సీపీఎం నుంచి ప్రతీకుర్ రెహా్మన్ పోటీలో ఉన్నారు.కోల్‌కతా ఉత్తర్.. తృణమూల్ వర్సెస్ మాజీ తృణమూల్‌కు మరో కంచుకోట. 2009లో ఉనికిలోకి వచి్చంది. తృణమూల్ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ హ్యాట్రిక్ కొట్టారు. ఈసారీ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి తృణమూల్ మాజీ నేత తపస్ రాయ్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా ఉన్న ఆయన ఇటీవల తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన కొద్ది రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం! లెఫ్ట్ మద్దతుతో కాంగ్రెస్ తరఫున ప్రదీప్ భట్టాచార్య బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. 20 శాతం పైగా ఉన్న ముస్లిం ఓటర్లు ఇక్కడ కీలకం.జాదవ్‌పూర్... బరిలో బెంగాలీ నటి ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. కోల్‌కతా పరిధిలోని ఈ స్థానంలో 2009 నుంచీ తృణమూల్ వరుస విజయాలు సాధిస్తోంది. సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ నటి మిమి చక్రవర్తి ఇటీవలే తృణమూల్‌కు, లోక్‌సభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు. దాంతో ఈసారి మరో బెంగాలీ నటి, తృణమూల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సయానీ ఘోష్‌కు దీదీ టికెటిచ్చారు. బీజేపీ నుంచి అనిర్బన్ గంగూలీ, సీపీఎం నుంచి శ్రీజన్ భట్టాచార్య బరిలో ఉన్నారు.కోల్‌కతా దక్షిణ్... దీదీ అడ్డా ఇది మమత కంచుకోట. 1991, 1996ల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆమె తర్వాత 2009 దాకా సొంత పార్టీ తృణమూల్ తరఫున నెగ్గారు. ఆమె సీఎం అయ్యాక కూడా ఇక్కడ తృణమూల్ జెండాయే ఎగురుతోంది. ఈసారి కూడా సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి దేబశ్రీ చౌదరి, సీపీఎం అభ్యరి్థగా సైరా షా హలీం రేసులో ఉన్నారు. పోటీ ప్రధానంగా తృణమూల్, బీజేపీ మధ్యే నెలకొంది.జయనగర్... టఫ్ ఫైట్ అపార అటవీ సంపదకు నెలవైన ఎస్సీ రిజర్వుడ్ స్థానం. సజ్నేఖాలీ పక్షుల సంరక్షణ కేంద్రం, సుందర్బన్ మాగ్రూవ్ నేషనల్ పార్క్ దీని పరిధిలోవే. 2004 దాకా ఆరెస్పీ కంచుకోట. 2014 నుంచి తృణమూల్ పాగా వేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ప్రతిమా మండల్ హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచి్చన అశోక్ కందారీయే మళ్లీ బరిలో ఉన్నారు. 2019లో ఆయనకు 4.5 లక్షల ఓట్లు వచ్చాయి! కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సమేంద్రనాథ్ మండల్‌ను పోటీలో నిలిపింది.మథురాపూర్.. హోరాహోరీ ఈ కూడా ఎస్పీ రిజర్వుడ్ స్థానంలో కమ్యూనిస్టులదే ఆధిపత్యం. 94 శాతం మంది గ్రామీణ ప్రజలే. 30 శాతం మంది ఎస్సీ ఓటర్లు. 2009 తర్వాత ఇక్కడ తృణమూల్ జెండా పాతింది. ఆ పార్టీ నుంచి బపీ హల్దార్ పోటీలో ఉన్నారు. బీజేపీ అశోక్ పురకాయిత్ను బరిలోకి దించింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం శరత్ చంద్ర హల్దర్‌ను పోటీలో నిలిపింది. దీంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. -
బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాను బీభత్సం
-
కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుపై ఈసీ కొరడా ఝులిపించింది. ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల మార్పు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఈసీ తొలిసారి చర్యలు తీసుకుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం కార్యదర్శులు మారుస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మిజోరం జీఏడి కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ కార్యదర్శులు ఎన్నికల సంఘం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను ఎన్నికల సంఘం మార్చింది. ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఈసీ తొలగించినట్లు తెలిపింది. -
తెలంగాణ, ఆంధ్ర జట్లు చిత్తు
జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 11–0 గోల్స్ తేడాతో తెలంగాణపై ఘన విజయం సాధించింది. బెంగాల్ ప్లేయర్ సంజన ‘హ్యాట్రిక్’ సహా ఐదు గోల్స్ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సుస్మిత పన్నా కూడా ‘హ్యాట్రిక్’ సాధించగా... మోనికా నాగ్ 2, అంజన డుంగ్‌డుంగ్ ఒక గోల్ చేశారు. ఈ గెలుపుతో బెంగాల్ జాతీయ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో వైపు పూల్ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 11–2 గోల్స్‌తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. భారత సీనియర్ జట్టు ప్లేయర్ వందనా కటారియా ‘హ్యాట్రిక్’ సాధించగా... ముంతాజ్ ఖాన్, ఉపాసన సింగ్ చెరో 2 గోల్స్ కొటారు. యూపీ తరఫున శశికళ, రీతూ సింగ్, స్వర్ణిక రావత్, సిమ్రన్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లలో కళ్యాణి స్వర్ణపూడి, గార్లంక వరహాలమ్మ ఒక్కో గోల్ కొట్టారు. అయితే ఈ విజయం తర్వాత కూడా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవడంతో యూపీ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. -
మహ్మద్ షమీ సంచలన నిర్ణయం.. క్రికెట్ గుడ్‌బై!? రాజకీయాల్లోకి ఎంట్రీ?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. షమీ భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగాల్‌లోని బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే షమీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే బెంగాల్ మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, అశోక్ దిండా రాజకీయాల్లో ఉన్నారు. తివారీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా.. దిండా బీజేపీ శాసన సభ్యునిగా ఉన్నాడు. కాగా షమీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇటీవలే తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవాలని ప్రధాని మోదీ సైతం షమీకి విషెస్ కూడా చెప్పారు. దీంతో షమీ రాజీకీయాల్లోకి రావడం ఫిక్స్ అయిపోయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే షమీ ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్‌గా లేరు. షమీగా లోక్‌సభ ఎన్నికలో పోటీచేయాలని భావిస్తే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. షమీ ప్రస్తుతం భారత క్రికెట్లో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 24 వికెట్లతో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమీ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. చదవండి: IND vs ENG: ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్ -
కాంగ్రెస్‌కు భారీ ఝలక్
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తాము సొంతంగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పునరుద్ఘాటించడంతో ఇండియా కూటిమి ఆనందం ఆవిరయ్యింది. టీఎంసీ ప్రకటనతో కాంగ్రెస్‌కు మరోమారు చుక్కెదురయ్యింది. దీనికిముందు ఇండియా కూటమి, టీఎంసీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై సీట్ల భాగస్వామ్య చర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ వర్గాలు తమ పార్టీకి మూడవ వంతు సీట్లు కూడా దక్కలేదని మీడియాకు తెలిపాయి. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్.. ఢిల్లీ, గుజరాత్, గోవాలలో ‘ఆప్’తో సీట్ల కేటాయింపుపై రాజీ కుదుర్చుకుంది. అయితే పశ్చిమబెంగాల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో ఉంది. కాగా అసోంలో తృణమూల్‌కు రెండు, మేఘాలయలో ఒక సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదని, అందుకే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రెయిన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేలు లేరని, అయినా వారికి రెండు ఎంపీ సీట్లను ఇచ్చి, గెలిపించేందుకు సిద్ధమయ్యామని, దానికి వారు నిరాకరించారని ఆయన తెలిపారు. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. -
సందేశ్‌ఖాలీలో మళ్లీ ఉద్రిక్తత.. అప్రమత్తమైన పోలీసులు!
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని బసిర్హాట్ సబ్ డివిజన్లో ఉన్న సందేశ్‌ఖాలీలో బుధవారం అర్ధరాత్రి మరోమారు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. సందేశ్‌ఖలీలో రైతులు, పేదల భూములను టీఎంసీ నాయకులు ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయి. టీఎంసీ నేతల వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ నిరసనల్లోకి దిగింది. టీఎంసీ నేత షాజహాన్తో సహా నిందితులందరినీ అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా సందేశ్‌ఖాలీలో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కి నోటీసు పంపింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలోని సందేశ్‌ఖాలీలో ఒక రాజకీయ నేత మద్దతుదారులు పేద మహిళలను హింసించారని ఆరోపిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన నివేదికలను ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. సందేశ్‌ఖాలీలో ఇటీవల జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేసేలా మానవ హక్కుల ఉల్లంఘనలను సూచిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనల్లో పాలుపంచుకున్నవారిపై చేపట్టిన చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. -
అంపైర్లపై సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారి.. తాగొచ్చేవారంటూ కామెంట్స్..!
టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి దేశవాలీ అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆటగాళ్లు డోప్ పరీక్షలకు వెళ్లవలసి వస్తే, దానిని దేశీయ అంపైర్లకు కూడా విస్తరించాలి. నేను చాలాసార్లు అంపైర్లు నిద్రపోతున్నట్లు చూశాను. అలా అంపైర్లను చూసిన సందర్భాల్లో.. సార్ నిన్న రాత్రి మీరు ఏమి తాగారని వారిని అడిగేవాడిని. అందుకు వాళ్లు నవ్వుతూ.. నేను విస్కీని ఇష్టపడతానంటూ సమాధానం ఇచ్చేవారు. అలా జరగకుండా దేశీయ అంపైర్లలో సీరియస్‌నెస్ రావాలంటే బీసీసీఐ తగిన చర్యలు తీసుకుని, వారికి కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని తివారి అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేయకముందు తివారి దేశవాలీ క్రికెట్‌పై, ముఖ్యంగా రంజీలపై, టీమిండియాలో తన కెరీర్ అర్దంతరంగా ముగియడంపై, ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాగా రాణిస్తున్నా టీమిండియాలో తనను తొక్కేశారంటూ ధోనిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెటర్ల మాదిరి తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని అన్నాడు. కాగా, రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తివారి తన 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 183 టీ20ల్లో 3436 పరుగులు సాధించిన తివారి.. 2008-2015 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడి 287, 15 పరుగులు చేశాడు. వన్డేల్లో తివారి అత్యధిక స్కోరు 104 నాటౌట్‌గా ఉంది. -
సెంచరీ చేసినా.. ధోని నన్ను ఎందుకు తప్పించాడో?
'I Had The Potential To Be A Hero': టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని బెంగాల్ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వాపోయాడు. అందరు క్రికెటర్ల మాదిరిగానే తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే కచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని పేర్కొన్నాడు. మెరుగ్గా ఆడినప్పటికీ తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్థంకాలేదని మనోజ్ తివారి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ బ్యాటర్, దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మనోజ్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ తర్వాత... 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడిన మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొక్కేశారు! ‘‘2011లో నేను సెంచరీ బాదాను. అయితే, తర్వాతి మ్యాచ్‌లోనే నన్ను తుదిజట్టు నుంచి తప్పించారు. నాపై ఎందుకు వేటు వేశారని ధోనిని అడగాలనుకున్నా! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా రాణించగల సత్తా నాకుంది. కానీ వాళ్లలా నాకు అవకాశాలు రాలేదు. కానీ.. ఈరోజుల్లో యువ ఆటగాళ్లకు ఎన్నో ఛాన్సులు ఇస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు నా గురించి తలచుకుంటే బాధగా అనిపిస్తుంది’’ అని తివారి ఉద్వేగానికి లోనయ్యాడు. కోల్‌కతా స్పోర్ట్స్' జర్నలిస్టు క్లబ్లో తనకు సన్మానం జరిగిన సమయంలో మనోజ్ తివారి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. యువ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అతడు.. రంజీ ట్రోఫీ ఆడాల్సిన ఆవశ్యకతను వారు అర్థం చేసుకోవాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 148 మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 183 టీ20లలో 3436 పరుగులు సాధించిన మనోజ్ తివారి.. 2008- 2015 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 12 వనేడ్లు, 3 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 287, 15 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మనోజ్ తివారి అత్యధిక స్కోరు 104*. చెన్నైలో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ తదుపరి మ్యాచ్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక 38 ఏళ్ల మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్ర క్రీడామంత్రి కూడా! చదవండి: IPL All Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా ధోని.. రోహిత్‌కు చోటే లేదు! Few moments bring tears to your eyes, few moments make you emotional... 🙌#GoodByeCricket pic.twitter.com/d4Pd8nSXbZ — MANOJ TIWARY (@tiwarymanoj) February 19, 2024 -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్రీడా మంత్రి.. 19 ఏళ్ల కెరీర్‌కు?
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన తివారీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ఆదివారం ఘనంగా సన్మినించింది. అతడిని గోల్డెన్ బ్యాట్‌తో బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్‌లో రిటైర్మెంట్ అవ్వడం చాలా సంంతోషంగా ఉంది. కానీ నా కెరీర్లో బెంగాల్‌కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్లో 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 5,581, టీ20ల్లో 3,436 పరుగులు మనోజ్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున 12 వన్డేలు ఆడిన తివారీ 287 పరుగులు చేశాడు. 2011లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో తివారీ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌లకు ఆడాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభానికి ముందే అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ ప్రకటించాడు. కానీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకే ఒక్కే సీజన్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత రంజీ సీజన్లో తివారీ భాగమయ్యాడు. ఇక 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్ చూశారా? -
శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అసోం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ 405 పరుగులకు ఆలౌట్ అయింది. అనుస్తుప్ మజుందార్(125), కెప్టెన్, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్ ఆర్డర్లో కరణ్ లాల్(52), సూరజ్ సింధు జైస్వాల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్ దాస్(50), సాహిల్ జైన్(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ ఆబ్సెంట్ హర్ట్(0)గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(మహ్మద్ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, అంకిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ అసోంను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్ సింధు జైస్వాల్ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్ ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్‌లో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన సూరజ్ సింధు జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు కాకుండా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం. చదవండి: శివమ్ దూబే మెరుపు శతకం -
బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన షమీ తమ్ముడు.. టాప్ స్కోరర్‌గా..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ రంజీ ట్రోఫీ 2024లో ఇరగదీస్తున్నాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కైఫ్.. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కైఫ్.. బెంగాల్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కైఫ్ యూపీతో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కైఫ్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 45 పరుగులు చేసి, తన జట్టుకు అతి మూల్యమైన పరుగులను అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. కైఫ్ (4/14), సూరజ్ సింధు (3/20), ఇషాన్ పోరెల్ (2/24) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ (8/41) విజృంభించడంతో బెంగాల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (188) పరిమితమైంది. ఆఖర్లో కైఫ్ (45 నాటౌట్) రాణించకపోయి ఉంటే, యూపీకి పట్టిన గతే బెంగాల్‌కు కూడా పట్టి ఉండేది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో కైఫ్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అనంతరం కైఫ్ యూపీ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతితో (3/72) చెలరేగాడు. కైఫ్‌తో పాటు సూరజ్ సింధు ఓ వికెట్ తీయడంతో యూపీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే..
Ranji Trophy 2023-24: టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ-2024 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఈ రైటార్మ్ పేసర్ తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బెంగాల్‌తో మొదలైన టెస్టులో భువీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అరవై పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్న యూపీ జట్టుకు కాస్త ఊరట చేకూరేలా తన బౌలింగ్ నైపుణ్యాలతో బెంగాల్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మహ్మద్ కైఫ్‌నకు నాలుగు వికెట్లు కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మనోజ్ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి దెబ్బకు యూపీ కేవలం 20.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 60 పరుగుల వద్దే చాపచుట్టేసింది. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తమ్ముడు) అత్యధికంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, ఇషాన్ పోరెల్ రెండు వికెట్లు పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్ సమర్థ్ సింగ్ 13 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. భువీ కూడా తగ్గేదేలే ప్రత్యర్థిని అల్ప స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్‌కు భువీ వరుస షాకులు ఇచ్చాడు. ఈ యూపీ బౌలర్ దెబ్బకు ఓపెనర్ సౌరవ్ పాల్ 13, సుదీప్ కుమార్ ఘరామి 0, అనుస్తుప్ మజుందార్ 12, మనోజ్ తివారి 3, అభిషేక్ పోరెల్ 12 పరుగులకే పరిమితమయ్యారు. ఇలా మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్ బ్యాటర్లు శ్రేయాన్ష్ ఘోష్ 37, కరణ్ లాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అన్న షమీ బాటలో తమ్ముడు కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీకి దేశవాళీ క్రికెట్లో సొంత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. టీమిండియా స్టార్ పేసర్ స్థాయికి ఎదిగాడు. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు మహ్మద్ కైఫ్ సైతం ప్రస్తుతం బెంగాల్‌కే ఆడుతున్నాడు. ఇలా ఈరోజు అతడు అత్యుత్తమ ప్రదర్శనతో తన సొంత రాష్ట్రానికి చెందిన యూపీ జట్టును 60 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు.. చాలా కాలంగా టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ కుమార్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కానీ.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో షమీ, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు.. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి జూనియర్లు జట్టులో పాతుకుపోవడంతో భువీకి మొండిచేయే ఎదురవుతోంది. అయితే, తాజా రంజీ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. చదవండి: IND Vs AFG: రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్ .@BhuviOfficial on fire 🔥 A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0 — BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 -
ODI: ప్రణవి అద్భుత ఇన్నింగ్స్.. బెంగాల్‌పై హైదరాబాద్ గెలుపు
BCCI Women's Senior One Day Trophy 2024- న్యూఢిల్లీ: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజయంతో బోణీ చేసింది. బెంగాల్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు సాధించింది. ప్రణవి చంద్ర (88 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. రాణించిన త్రిష అదే విధంగా గొంగడి త్రిష 31 పరుగులతో రాణించింది. ఎం.మమత 21, వీఎమ్ కావ్య 29 పరుగులు సాధించారు. వీరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ జట్టు 225 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 201 పరుగులకు బెంగాల్ ఆలౌట్ ఇక బెంగాల్ బౌలర్లలో ధరా గుజ్జార్ ఐదు వికెట్లు(5/27) దక్కించుకోగా.. సస్తి మొండల్ రెండు (2/25) వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో.. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 49.3 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ధరా గుజ్జర్ 21, సస్తి మొండల్ 23 పరుగులు చేయగా.. కశిష్ అగర్వాల్ 62 పరుగులతో బెంగాల్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో గౌహర్ సుల్తానా, బి. శ్రావణి చెరో రెండు వికెట్లు తీసి చెప్పుకోగదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కాగా తొలి మ్యాచ్‌లోనే బెంగాల్ వంటి పటిష్ట జట్టుపై గెలుపొందడం హైదరాబాద్ మహిళా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు
పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ జంట. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె జీవితం పూర్తి నిరాసక్తతతో కూడిన చీకటి ఆవరించింది. కనీసం పిల్లలైన కలిగిన వారిలో తన భర్తను చూసుకునేదాన్ని కదా! అన్న బాధ ఆమెను తొలిచేసింది. మరోవైపు భర్త దూరమయ్యాక అత్తింటి వారెవ్వరూ ఆమెను చేరదీయలేదు. ఒంటరి జీవితం వెళ్లదీస్తున్న ఆమెకు తన భర్త ఉండగా పిల్లల కోసం తాము ఎంచుకున్న ఐవీఎఫ్ పద్ధతి గుర్తుకొచ్చింది. దీంతో తామప్పుడూ సంప్రదించి వైద్యులను సంప్రదించి తల్లి అయ్యి తన కోరికను నెరవేర్చుకుంది. పైగా ఆమె కారణంగా వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. బెంగాల్‌లోని బీర్భూమ్‌కి చెందిన సంగీతా కేశారి, ఆమె భర్త అరుణ్ ప్రసాద్ కేశారి రెండేళ్లుగా గర్భం దాల్చడంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. చివరిగా వారు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా 2021లో భర్త స్పెర్మ్‌ను కోల్‌కతాకు చెందిన ప్రయోగశాలలో నిల్వ చేయడం జరిగింది. అయితే అంతలోనే ఆమె భర్త కరోనా మహమ్మారికి బలైయ్యాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. అయినప్పటికీ ఎలాగైన పిల్లలను కనాలి తన భర్త లేని లోటుని భర్తీ చేసుకుని వారి ఆలనపాలనలో గడపాలని గట్టిగా కోరుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పిల్లల్లో తన భర్తను చూసుకోవాలని ఆరాటపడింది. ఎందుకంటే..? ఆమె భర్త దూరమయ్యాక కనీసం అత్తింటి వారు ఆమెను చేరదీయలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటిరిగానే జీవితం కొనసాగిస్తోంది. తన భర్త నడిపే కిరాణ దుకాణాన్ని ఆమె నడుపుతూ జీవిస్తోంది. సరిగ్గా అప్పడే తన భర్త ఉండగా సంప్రదించిన ఆస్పత్రి గుర్తుకొచ్చింది. అక్కడ భర్త స్పెర్మ్ దాచిన సంగతి జ్ఞప్తికి వచ్చి పిల్లలను కనడం సాధ్యమవుతుందా? తన కోరిక నెరవేర్చుకోగలనా లేదా? అని ఆ ఆస్పత్రి వర్గాలను సంప్రదించి సవివరంగా తెలుసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మహిళకు 48 ఏళ్లు పిల్లలను కనగలిగే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆమెకు ఈ పద్ధతి కాస్త రిస్క్ అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆమె సంకల్పానికి తగ్గట్టుగానే ఆ పద్ధతి విజయవంతమై పూర్తి ఆరోగ్యంతో ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు వైద్యుడు పలాష్ దాస్ మాట్లాడుతూ..ఆ మహిళ క్లిష్ట పరిస్థితుల్లో తల్లి అయ్యిందని అన్నారు. ఆమె పిల్లలను కనే వయసు ముగిసే సమయానికి ఆమె శుక్రకణాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. ఇక్కడ ఆమె తల్లి కావాలనే తాప్రత్రయంతో కనడం అనేది ఆమెకు రిస్క్ అయినా లెక్కచేయకుండా డేర్ చేసిన తీరు ప్రశంసంచదగ్గ విషయమని అన్నారు. నిజంగా ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిదేనని అన్నారు. (చదవండి: మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!) -
షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీని వీడితేనే బాగుపడతారంటున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా హర్యానాతో ఇవాళ (డిసెంబర్ 11) జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా షాబాజ్ ఒంటరిపోరాటం చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Shahbaz Ahmed - 100 (118).Next best - 24 (41).One of the best innings in the Quarter Final of Vijay Hazare Trophy by Shahbaz...!!!pic.twitter.com/pO2bILZvhf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2023 షాబాజ్ ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. షాజాబ్ తర్వాత బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ చేసిన 24 పరుగులే అత్యధికం. కెప్టెన్ సుదీప్ ఘరామీ (21), ప్రదిప్త ప్రమానిక్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ (4/37), సుమిత్ కుమార్ (2/27), రాహుల్ తెవాటియా (2/32) బెంగాల్ పతనాన్ని శాశించారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన హర్యానా 30 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. అంకిత్ కుమార్ (82 నాటౌట్) హర్యానాను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. "Shahbaz Ahmed's sensational 💯 under immense pressure in the Vijay Hazare Trophy Knockout game is cricket brilliance at its finest! Single-handedly steering Bengal with a stunning innings, while others faltered. 🏏🔥 #ShahbazAhmed #VijayHazareTrophy" pic.twitter.com/2PJVktLXCH — Hemant ( Sports Active ) (@hemantbhavsar86) December 11, 2023 ఈ మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్ బాధ్యతాయుతమై సెంచరీతో రాణించడంతో బెంగాల్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో షాబాజ్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టినందుకు గాను ఆర్సీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు. షాబాజ్‌ను ఆర్సీబీ వదిలిపెట్టడమే మంచిదైందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీని వీడితేనే ఆటగాళ్లు బాగుపడతారంటూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. you leave rcb and you become successful. https://t.co/1UhwUzIdkB — munka in kalimpong (@messymunka) December 11, 2023 కాగా, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ మయాంక్ డాగర్ కోసం ఆర్సీబీ షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ పద్దతిలో షాబాజ్‌ను వదిలేసిన ఆర్సీబీ.. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లను కూడా వేలానికి వదిలిపెట్టింది. ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. -
రైలే కళ్యాణ వేదిక!
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు...అంటారు. కళ్యాణ ఘడియ ముంచుకొచ్చింది...అనుకున్నారేమో ఒక ప్రేమ జంట బెంగాల్–జార్ఖండ్ మూవింగ్ ట్రైన్లోనే దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వధువు భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ ‘రైలు పెళ్లి’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోగీలో ఉన్న ప్రయాణికులు ఈ పెళ్లి తంతు చూసి మొదట షాక్ తిన్నా ఆ తరువాత మాత్రం ఆశీర్వదించారు. ‘మల్టీ పర్సస్ ఇండియన్ రైల్వేస్’ ‘విమానంలో జరిగే పెళ్లి కంటే ఇది నయం. తక్కువ ఖర్చు కదా’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. ఇక మరో పెళ్లి విషయానికి వస్తే... దిల్లీకి చెందిన 27 సంవత్సరాల అవినాష్ కుమార్ డెంగ్యూ బారిన పడ్డాడు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. ఈలోపు పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో హాస్పిటల్లోనే వధువు మెడలో తాళి కట్టించి పెళ్లి చేశారు. -
వరల్డ్ కప్ రాలేదని యువకుడి ఆత్మహత్య
కోల్‌కతా : ఇండియా వరల్డ్ కప్ గెలవలేదన్న బాధను జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చీరలు అమ్మే దుకాణంలో పనిచేసే రాహుల్ లోహర్(23) టీమ్ ఇండియాకు వీరాభిమాని. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓటమిని రాహుల్ తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు రాహుల్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బావ ఉత్తమ్ సుర్ తెలిపారు. ఆదివారం రాహుల్ షాప్‌కు వెళ్లలేదని,ప్రొజెక్టర్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశాడని ఉత్తమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే తాను వెళ్లి రాహుల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. ఇదీచదవండి..వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్ -
పొట్టి క్రికెట్లో కొనసాగుతున్న రియాన్ పరాగ్ విధ్వంసకాండ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్) డ్రీమ్ రన్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో అతను వరుసగా ఏడో హాఫ్ సెంచరీ బాదాడు. గత మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు (టీ20ల్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా వార్నర్, సెహ్వాగ్, బట్లర్‌ల పేరిట ఉన్న రికార్డు బద్దలు) నెలకొల్పిన రియాన్.. తాజాగా హాఫ్ సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. బెంగాల్‌తో నిన్న (అక్టోబర్ 31) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-2లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన రియాన్.. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో అస్సాం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో రియాన్ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 50 పరుగులు చేశాడు. Riyan Parag celebration myan 😭😭😭.He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭Proper Chad pic.twitter.com/Gd8fbECfM7— HS27 (@Royal_HaRRa) October 31, 2023 టీమిండియాలో చోటు దక్కేనా..? ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాది జోరుమీదున్న రియాన్.. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటుపై కన్నేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు నుంచే భీకరమైన ఫామ్‌లో ఉన్న రియాన్.. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తూ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లు ఆకాశ్ సేన్‌గుప్తా 3, రియాన్ పరాగ్ 2, మ్రిన్మోయ్ దత్తా, శివ్‌శంకర్ రాయ్, సౌరవ్ డే తలో వికెట్ పడగొట్టారు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు కరణ్ లాల్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం.. రిశవ్ దాస్ (31), బిషల్ రాయ్ (45 నాటౌట్), రియాన్ పరాగ్ (50 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్ననే జరిగిన మరో ప్రీక్వార్టర్ ఫైనల్లో గుజరాత్‌పై ఉత్తర్‌ప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో రియాన్ పరాగ్ గణాంకాలు.. 45(19) & 0/53(4) 61(34) & 2/25(4) 76(37) & 3/6(4) 53(29) & 1/17(4) 76(39) & 1/37(4) 72(37) & 1/35(3) 57(33) & 1/17(4) 50(31) & 2/23(4) -
గ్లోబల్ టీచర్ ప్రైజ్ జాబితాలో ఏపీ టీచర్
లండన్: గ్లోబల్ టీచర్ ప్రైజ్–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లున్నాయి. టాప్–50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న పి.హరికృష్ణతోపాటు బెంగాల్ లోని ఆసన్సోల్ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ దీప్ నారాయణ్ నాయక్ ఉన్నారు. 130 దేశాల నుంచి అందిన 7 వేలకు పైగా నామినేషన్ల నుంచి ఈ 50 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో ఉన్న 10 మంది నుంచి విజేతను ఈ ఏడాది చివర్లో గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమీ ప్రకటించనుంది. వర్కీ ఫౌండేషన్, యునెస్కో, యూఏఈకి చెందిన దుబాయ్ కేర్స్ కలిసి ఏ టా విజేతకు ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్ డాలర్లను అందజేస్తాయి. -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
'ఓటింగ్‌కు భయపడ్డారు.. సభ మధ్యలోనే వెళ్లిపోయారు..'
కోల్‌కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ రోజు బెంగాల్లో నిర్వహించిన పశ్చిమ బెంగాల్ క్షేత్రీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. #WATCH | PM Modi addressing BJP's Kshetriya Panchayati Raj Parishad in West Bengal, via video conferencing "We defeated the opposition's no-confidence motion in Parliament and gave a befitting reply to those spreading negativity in the entire nation. The members of the… pic.twitter.com/tZSgBjehkH — ANI (@ANI) August 12, 2023 అవిశ్వాస తీర్మాణంతో దేశంలో బీజేపీపై దుష్ప్రాచారం లేయాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. విపక్ష సభ్యులు సభ మధ్యలోనే వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఓటింగ్ వేయడానికి భయపడ్డారని ఆరోపించారు. అవిశ్వాసంలో ప్రతిపక్షాలను ఓడించామని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగారు. రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టనున్న పంచాయత్ కాన్ఫరెన్స్‌లో నడ్డా పాల్గొంటారు. బెంగాల్ బీజేపీ కోర్ కమిటీ, ఎంపీల మీటింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji was warmly greeted by @BJP4Bengal State President @DrSukantaBJP Ji alongwith other party leaders and karyakartas upon his arrival in Kolkata, West Bengal. pic.twitter.com/uuu8G8ojWK — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 బెంగాల్లో ఆగష్టు 12న తూర్పు పంచాయతీ రాజ్ పరిషత్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్లతో సహా తూర్పు ప్రాంతానికి చెందిన దాదాపు 134 వర్కర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్లతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వర్చుల్‌గా పాల్గొననున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji's Public Programs in West Bengal on 12th August 2023. Watch Live- . https://t.co/YU8s4nWcrF . https://t.co/qpljG4G7Jz . https://t.co/NPs3aOvCXh pic.twitter.com/uxx2XD3byf — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..
కలకత్తా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై ఉన్నారు. 'ప్రస్తుతం ఆయన కండీషన్ విషమంగా ఉంది. ఆక్సిజన్ స్థాయిలు 70కి పడిపోయాయి. దీంతో ఆయన సృహలో లేరు. అనంతరం ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స కొనసాగిస్తున్నాం.' అని వైద్యులు తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య.. గత కొంతకాలంగా ఆనారోగ్యం బారిన పడ్డారు. సీఓపీడీ సమస్యతో పాటు పలు వయస్సు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సీపీఐఎమ్ పాలిటీబ్యూరోతో పాటు సెంట్రల్ కమిటీ నుంచి కూడా ఆయన 2015లో తప్పుకున్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి 2018లో తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కూతురు సుచేతన భట్టాటార్య ఆస్పత్రికి వచ్చారు. ఇదీ చదవండి: Lalu Prasad Yadav: అనారోగ్యం నుంచి కోలుకున్న లాలూ.. బ్యాడ్మింటన్ ఆడుతూ.. -
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి..
కలకత్తా: బెంగాల్లో నేడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు కాగా.. ఒకరు చొప్పున బీజేపీ, మరో ఇద్దరు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలే ఈ ఘటనలకు కారణమని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఉదయాన్నే 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో అల్లర్లకు కేంద్ర స్థానమైన ముషీరాబాద్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీని దుండగులు హత్య చేశారు. అదే జిల్లాలోని రేజినగర్ ప్రాంతంలో టీఎంసీకి చెందిన మరో కార్యకర్త బాంబు దాడిలో మరణించగా.. ఖార్గ్రామ్ ఏరియాలో మరో కార్యకర్త మృతి చెందాడు. కూచ్ బిహార్ జిల్లాలో బీజేపీకి చెందిన మాదవ్ బిశ్వాస్ అనే కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. తూర్పు బర్దమాన్ జిల్లాలో సీపీఐఎమ్కు చెందిన మరో కార్యకర్త రజిబుల్ హోక్ తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ఘటనలపై అధికార టీఎంసీ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులతో కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టింది. అధికార పార్టీయే దాడులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అధికార బలంతో టీఎంసీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు అన్నారు. 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. బ్యాలెట్ పేపర్లకు నిప్పంటించిన దుండగులు.. -
పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యున్ని దుండగులు హత్య చేశారు. ఇది అధికార టీఎంసీ పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు. కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతా ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి బామ్మర్థి శంభు దాస్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శంభు దాస్ కోడలు విసాఖా దాస్ కిస్మాత్ దాస్‌గ్రామ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. శంభుదాస్‌ను రాత్రి సమయంలో దుండగులు ఇంటి నుంచి బయటకు పిలిచి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాల్డా జిల్లాలో టీఎంసీ కార్యకర్తను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు కారకులు కాంగ్రెస్ కార్యకర్తలేనని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతున్ని ముస్తఫా షేక్‌గా గుర్తించారు. ఈ ఘటన మరవక ముందే దిన్హంతా ప్రాంతంలో తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య జరగడం గమనార్హం. కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతాలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు టీఎంసీ మద్దతుదారులు చించేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితీష్ ప్రమాణిక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. టీఎంసీ గుండాలు బీజేపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ప్రమాణిక్ ఆరోపించారు. నామినేషన్‌కు వచ్చిన అభ్యర్థులపైన రాళ్లు రువ్వారని, బాంబులు వేశారని చెప్పారు. నామినేషన్ వేళ అల్లర్లు.. జులై 8న బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్‌కు గురువారం చివరి తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. నామినేషన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే అల్లర్లలో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులు బాంబులు విసురుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
బెంగాల్లో ఉన్నామా? రష్యా ఉక్రెయిన్‌లో ఉన్నామా?
కోల్‌కతా: బెంగాల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా వేడెక్కింది. తాజాగా బంకూర్లో నామినేషన్ దాఖలు చేస్తుండగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడే ఉన్న కేంద్ర బలగాలు వారిని కట్టడి చేసి అక్కడి నుండి తరిమేస్తున్న దృశ్యాలను ఓ మీడియా ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా మేము బెంగాల్లో ఉన్నామా? లేక రష్యా, ఉక్రెయిన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు బీజేపీ నేత అగ్నిహోత్రి పాల్. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడక్కడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించమని ఆదేశాలను జారీ చేసింది కోల్‌కతా హైకోర్టు. అందులో భాగంగా మిడ్నపూర్, జల్పైగురి, బిర్భుమ్, ఉత్తర 24 పరాగణాస్, దక్షిణ 24 పరాగణాస్, హుగ్లీ, ముర్షిదాబాద్ జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. బీజేపీ నేతలు సువెందు అధికారి, అధిర్ రంజన్ చౌదరిల అభ్యర్ధన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చమని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. బంకూర్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సందర్బంగా భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ గుమికూడారు. నామినేషన్ దాఖలు చేస్తుండగానే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతలో కేంద్ర బలగాలు అప్రమత్తమై వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఓ మీడియా సంస్థ ఈ ఘర్షణల వీడియోని ట్విట్టర్ ద్వారా అందరికీ చూపించింది.. ఇందులో కేంద్ర బలగాలు ఘర్షణ జరుగుతున్నా చోటికి పరుగులు తీసి బీజేపీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలను చెదరగొడుతూ ఉన్నారు. ఈ సందర్బంగా బీజేపీ నేత అగ్నిహోత్రి పాల్ మాట్లాడుతూ మా కార్యకర్తలపై బాంబులు వేసిన తీరు చూస్తే మేము రష్యాలోనో ఉక్రెయిన్లోనో ఉన్నట్టనిపిస్తోందని అన్నారు. VIDEO | A violent clash broke out between TMC and BJP workers in Bankura during nomination filing for West Bengal panchayat polls earlier today. “The way bombs are being hurled at BJP workers, it seems that we are in Russia or Ukraine,” said BJP leader Agnimitra Paul. pic.twitter.com/JBtq1IsONh — Press Trust of India (@PTI_News) June 14, 2023 ఇది కూడా చదవండి: లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం! -
టైటానిక్ ఇల్లు కట్టుకున్న రైతు
-
బీసీసీఐని ఒప్పించాడు.. సౌ'స్వ'రాష్ట్రను గెలిపించాడు
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు అవతరించింది. గత 3 సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2019-20 సీజన్లో సైతం ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర తొలిసారి 1935-37 సీజన్లో.. ఆతర్వాత 1943-44 సీజన్లో రంజీ టైటిల్‌ను సాధించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్ట్‌ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా రెండు మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ మధ్యలో తన సొంత జట్టు సౌరాష్ట్ర రంజీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మూడో థాట్ పెట్టుకోని ఉనద్కత్.. తనను టీమిండియా నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బీసీసీఐ పెద్దలను అభ్యర్ధించాడు. తనను రిలీవ్ చేస్తే, తన సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొంటానని కోరాడు. ఉనద్కత్ విన్నపాన్ని మన్నించిన బీసీసీఐ.. అతను కోరిన విధంగానే టీమిండియా నుంచి రిలీవ్ చేసింది. దీంతో సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు ఉనద్కత్. తన సారధ్యంలో సౌరాష్ట్రను రెండోసారి ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతను.. అనుకున్న విధంగానే అన్నీ తానై సౌరాష్ట్రను గెలిపించుకున్నాడు. ఫైనల్లో ఏకంగా 9 వికెట్లు (3/44, 6/85) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం గెలిచాడు. ఉనద్కత్‌కు తన జట్టును గెలిపించుకోవాలన్న తపన, ఆకాంక్షను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోతేనేం, తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జట్టుకు ఆడాలన్న అతని కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉనద్కత్.. 13.88 సగటున 26 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. బెంగాల్: 174 & 241 సౌరాష్ట్ర: 404 & 14/1 9 వికెట్ తేడాతో సౌరాష్ట్ర విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జయదేవ్ ఉనద్కత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: అర్పిత్ వసవద (ఉనద్కత్ గైర్హాజరీలో సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఈ సీజన్లో రెండో లీడింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, 10 మ్యాచ్‌ల్లో 75.58 సగటున 3 సెంచరీల సాయంతో 907 పరుగులు చేశాడు, ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు, మయాంక్ 9 మ్యాచ్‌ల్లో 82.50 సగటున 3 సెంచరీల సాయంతో 990 పరుగులు చేశాడు) -
ఉనద్కత్ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. లోకల్ టీమ్ బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్ హీరో, బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG — BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023 ఉనద్కత్ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్ టీమ్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌కు జతగా చేతన్ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్ (0) వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్‌ను ఆకాశ్‌దీప్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. -
రంజీ ఫైనల్.. బెంగాల్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్‌సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
సమిష్టిగా చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ 174 ఆలౌట్
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర, వెస్ట్ బెంగాల్ మధ్య ప్రారంభమైన ఫైనల్ తొలిరోజే ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో బెంగాల్ జట్టు తక్కువస్కోరుకే పరిమితమైంది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైనప్పటికి.. లోయర్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ 69, అభిషేక్ పొరెల్ 50 పరుగులు చేయడంతో బెంగాల్ స్కోరు 170 అయినా దాటింది. ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, డీఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ 38, చేతన్ సకారియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్
బెంగళూరు: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మాజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బెంగళూరులో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును... ఇండోర్‌లో జరిగిన మరో సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌పై గెలుపొందాయి. ఈనెల 16 నుంచి కోల్‌కతాలో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ తలపడతాయి. ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 234 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌరాష్ట్ర 115 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు బెంగాల్ నిర్దేశించిన 548 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది. -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో బెంగాల్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 547 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 241 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటిదార్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ప్రదీప్తా ప్రమానిక్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ముఖేష్ కుమార్ రెండు వికెట్లు, షాబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్ చెరొక వికెట్ తీశారు. కాగా రంజీల్లో బెంగాల్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి. ఇంతకముందు 14సార్లు ఫైనల్ చేరినప్పటికి రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచిన బెంగాల్.. మిగతా 12సార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. మజుందార్ 120 పరుగులు, సుదీప్ ఘరామి 112 పరుగులు సెంచరీలతో చెలరేగారు. అభిషేక్ పొరెల్ 51 పరుగులతో రాణించాడు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు 170 పరుగులకు కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 279 పరుగులకు ఆలౌటై మధ్యప్రదేశ్ ముందు 547 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక కర్ణాటక, సౌరాష్ట్రల మధ్య జరుగుతన్న మరో సెమీఫైనల్ విజేతతో బెంగాల్ జట్టు ఫైనల్లో తలపడనుంది. 𝙄𝙣𝙩𝙤 𝙩𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 👏🏻👏🏻 Bengal register a 306-run victory over Madhya Pradesh in #SF1 of the @mastercardindia #RanjiTrophy and seal their position in the finals! Scorecard ▶️ https://t.co/ZaeuZQqC3Y #MPvBEN pic.twitter.com/pOWkc1gD41 — BCCI Domestic (@BCCIdomestic) February 12, 2023 -
సూపర్ ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసినా..!
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి కేవలం 3 పరుగుల ఆధిక్యంలో ఉంది. నికిన్ జోస్ (54) అజేయమైన హాఫ్‌సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మ్యాచ్ చివరి రోజు కర్ణాటక వేగంగా ఆడి కనీసం 250 పరుగుల టార్గెట్ సౌరాష్ట్రకు నిర్ధేశిస్తే కానీ గెలిచే అవకాశాలు లేవు. ఇలా జరగక మ్యాచ్ డ్రాగా ముగిస్తే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరుతుంది. మయాంక్ డబుల్ సెంచరీ, శ్రీనివాస్ శరత్ (66) హాఫ్ సెంచరీతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే ఆలౌట్ కాగా.. కెప్టెన్ వసవద (202) డబుల్ హండ్రెడ్, షెల్డన్ జాక్సన్ (160) భారీ శతకంతో చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులకు ఆలౌటైంది. తొలి సెమీస్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 547 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 279/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 438 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 170 పరుగులకే చేతులెత్తేసింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో సుదీప్ ఘర్మానీ (112), మజుందార్ (120) సెంచరీలతో చెలరేగగా.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సరాన్ష్ జైన్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుతుంది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీస్‌లో బెంగాల్.. మధ్యప్రదేశ్‌ను ఢీకొంటుంటే, రెండో సెమీస్‌లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. -
రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. రాణించిన మయాంక్ అగర్వాల్
Ranji Trophy 2022-23 1st Quarter Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు
సుమన్ కల్యాణ్‌పూర్, లత ఒక విధంగా ఒకే మెట్టు మీద ఉండాలి. లత అభిమానులు కూడా సుమన్ కల్యాణ్‌పూర్ గొంతు లతాతో సమానం అంటారు. కాని సుమన్‌కు చాలా కొద్ది పాటలు లభించాయి. ఆమెను కొందరు ఎదగనివ్వలేదని అంటారు. బిడియం, హుందాతనం ఉన్న సుమన్ కల్యాణ్‌పూర్ అవకాశాల కోసం కలబడకుండా తప్పుకుని నిలబడింది. కాని ఆమె పాటలు నిలబడే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఆమె ఉండే అపార్ట్మెంట్ భవంతిలో అగ్నిప్రమాదం. అదే రోజు పద్మభూషణ్ ప్రకటన.జనవరి 28 ఆమె 87వ పుట్టినరోజు. ఇన్ని సందర్భాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లకైనా తమ అభిమాన గాయనికి గౌరవం దక్కినందుకు అభిమానులు యూ ట్యూబ్‌లో ఆమె పాటల ప్లే బటన్ నొక్కుతున్నారు. నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే న తుమ్ హమే జానో – న హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్గయా... 1962. ‘బాత్ ఏక్ రాత్ కీ’ సినిమాలో దేవ్ ఆనంద్– వహీదా రెహమాన్ మీద చిత్రించిన ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత రేడియోలో శ్రోతలు తెగ ఫర్మాయిష్ చేయసాగారు... ఈ పాట ప్లే చేయమని. గాయకుడు హేమంత్ కుమార్ అందరికీ తెలుసు. గాయని లతా మంగేష్కర్... అని అందరూ అనుకున్నారు. కాదు. ఆ గొంతు సుమన్ కల్యాణ్‌పూర్‌ది. చెప్తే తప్ప తెలియదు. అదే మాధుర్యం. అదే తీపి. అదే పూలరెక్క సౌకుమార్యం. అదే అగరుపొగ ధూపం. అవునా... అని అందరూ నోరు తెరిచారు. లతాలా పాడుతున్న గాయని, లతా అంత బాగా పాడుతున్న గాయని సుమన్ కల్యాణ్‌పూర్ తెర మీదకు వచ్చిన సందర్భం అది. దానికి కారణం లతానే. అవును. ‘బాత్ ఏక్ రాత్‌కీ’కి సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు లతాకీ, బర్మన్కూ మాటలు లేవు. లతా లేకపోతే సినీ సంగీతమే లేదు అనుకుంటున్న రోజులు అవి. కాని బర్మన్కు పట్టుదల జాస్తి. సుమన్‌ను వెతికాడు. పాట చేశాడు. హిట్ కొట్టాడు. కాని లతా ఉండగా ఇతర గాయనులకు సంగీతమే ఉండదు అని మెల్లగా ఆ తర్వాత అర్థమైంది. సుమన్ పాట మీద ఎంత ప్రేమ ఉన్నా అది వినిపించక పోతే ఏమిటి చేయడం? నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే (జబ్ జబ్ ఫూల్ ఖిలే) సుమన్ కల్యాణ్‌పూర్‌ది బెంగాల్. వాళ్ల కుటుంబం ఆమె తండ్రి కాలంలో ఢాకా మీదుగా ముంబైకి చేరుకుంది. తండ్రి బ్యాంక్ ఉద్యోగి. ఐదుమంది అమ్మాయిల్లో సుమన్ పెద్దది. ఆ రోజుల్లో అమ్మాయిలను ఆ నాటి తల్లిదండ్రులు ఎలా పెంచారో అలానే సుమన్‌ను పెంచారు. దానికి సుమన్ స్వభావసిద్ధ సిగ్గు, బిడియం తోడైంది. అది ప్రవర్తనలోనే. కాని గొంతు విప్పితే పక్షి రెక్క విప్పినట్టు ఆమె పాట హాయిగా తరంగాలు సృష్టించేది. ఠెహరియే హోష్‌మే ఆలూ తొ చలే జాయియేగా... ఆప్కో దిల్ మే బిఠావూ తో చలే జాయియేగా... (మొహబ్బత్ ఇస్కో కెహెతే హై) ముంబైలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీ వేదిక మీద ఒక పాట పాడితే ఆ వేడుకకు గెస్ట్‌గా హాజరైన తలత్ మెహమూద్ ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు సుమన్ వయసు 16. అయినా సరే సుమన్‌ను హెచ్.ఎం.వి.కి రికమండ్ చేశాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడు షఫీ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. 1954లో వచ్చిన ‘దర్వాజా’ సుమన్ మొదటి సినిమా. కాని 1962లో ‘న తుమ్ హమే జానో’ పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది స్టార్ అయ్యింది. కాని అప్పటికే లతా ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఆశా భోంస్లే కూడా కూడదీసుకుంది. వీరిద్దరి కారణాన గీతా దత్, షంషాద్ బేగం... వంటి గాయనులే అవకాశాలు లేని స్థితికి చేరుకున్నారు. సుమన్ గొంతు లతా గొంతులా ఉండటంతో లతా దృష్టి ఈమె మీద ఎక్కువగా పడిందని అంటారు. సుమన్‌తో పాడిస్తే ఆ సంగీత దర్శకులకు లతా పాడటం కష్టం అయ్యేది. ఆ భయంతో సుమన్‌కు అవకాశాలు రాలేదు. కాని లతా మంగేష్కర్, రఫీలు రాయల్టీ విషయంలో భేదాభిప్రాయాలతో ఒకరికి మరొకరు పాడటం మానుకున్నారు. పాట ఒకసారి పాడి డబ్బు తీసుకున్నాక ఇక రాయల్టీ అవసరం లేదని రఫీ అభిప్రాయం. ఒక పాట తాలూకు రికార్డులు అమ్ముడయినంత కాలం గాయనీ గాయకులకు రాయల్టీ ఇవ్వాల్సిందేనని లతా అభిప్రాయం. ఈ తగాదా సుమన్‌కు కొద్దిగా లాభించింది. లతా పాడకపోవడం వల్ల రఫీ, సుమన్ కలిసి చాలా డ్యూయెట్లు పాడారు. షమ్మీ కపూర్ కోసం చేసిన ఈ పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆజ్ కల్ తేరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ సబ్కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి (బ్రహ్మచారి) తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే దిల్ హతేలీ మే లే ఆయేరే (రాజ్ కుమార్) అదొక్కటే కాదు... సుమన్‌కు చొరవ లేకపోవడం వల్ల తన సామర్థ్యానికి తగ్గ డిమాండ్ చేయలేకపోవడం వల్ల ఆమె ‘పేదవాడి లత’గా మారింది. అంటే లతా మంగేష్కర్‌కు ఇచ్చేంత డబ్బు లేనివారు సుమన్ చేత పాడించేవారు. దాంతో చిన్న సినిమాలకు సుమన్ పాడాల్సి వచ్చేది. వాటిలో పాటలు ఎంత బాగా ఉన్నా ప్రచారం పొందేవి కావు. సుమన్‌కు 1958లో పెళ్లి అయ్యింది. ఆమె నేరుగా సంగీత దర్శకులతో, నిర్మాతలతో మాట్లాడేది కాదు. భర్త అవన్నీ చూసేవాడు. దాని వల్ల కూడా ఆమెకు సంగీత ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియలేదు. కొన్నిసార్లు ఆమె బాగా పాడిన పాటలు సినిమాల్లో తొలగించబడేవి. లేదా అవే పాటలు మరొకరి గొంతులో వినిపించేవి. చాలా సున్నిత స్వభావం ఉన్న సుమన్ ఇదంతా నాకు అవసరమా అనుకుంది. కాని అభిమానులు మాత్రం ఆమె గొంతు అవసరమే అనుకున్నారు. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్సూరత్ న హోతా... (నూర్ జహాన్) సుమన్‌కు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు డాక్టరు. అందరూ ముంబై లోఖండ్ వాలాలోని ఒకే అపార్ట్మెంట్లో వేరు వేరు ఫ్లాట్లలో ఉంటారు. మొన్న బుధవారం ఆ బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ అయితే అందరినీ తీసుకుని ఆమె రోడ్డు మీద గడపాల్సి వచ్చింది. కాని అదే రోజు ఆమెకు పద్మభూషణ్ ప్రకటన అందింది. జనవరి 28 ఆమె పుట్టినరోజు. ఇది ఒక అందమైన పుట్టినరోజు కానుక. సుమన్ ఎంతో ప్రతిభావంతురాలు. ఎన్ని వందల పాటలో పాడి ఉండాలి. కాని ఆమె గొంతు మీద నీడ కదలాడుతూనే ఉండిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా వెలుతురు. కాని తీరం చేరిపోయాక పడవకు దొరికిన ఓదార్పు. ‘మమత’ (1966)లో ఈ పాటను లతా పాడింది. చాలా ఫేమస్. కాని ఇదే పాటను రఫీతో (లతా పాడదు కనుక) సుమన్ కల్యాణ్‌పూర్ డ్యూయెట్గా పాడింది. లతా ఎంత మార్దవంగా పాడిందో సుమన్ కూడా. వినండి. ఈ పాట ఆ సిగ్గరి గొంతుకు బంగారు తొడుగు. రహేనా రహే హమ్ మెహ్కా కరేంగే బన్కే కలి బన్ కే సబా బాగ్ ఏ వఫా మే.... చదవండి: శెభాష్.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు -
నటి ఆండ్రిలా శర్మ మరణం.. ప్రియుడు తీవ్ర భావోద్వేగం..!
24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా చివరికి మరణాన్ని జయించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడు ఆమె తోడుగా నిలిచిన బాయ్ ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి.. ఆండ్రిలా శర్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సబ్యసాచి చౌదరి. ఆండ్రిలా పార్థివదేహం వద్ద కాళ్లు పట్టుకుని మరీ ఏడ్చారు. ఆమె పాదాలను ముద్దాడి ప్రియురాలి చివరి వీడ్కోలు పలికారు. అంతే కాకుండా సబ్యాసాచి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశాడు. ఆండ్రిలా ఆస్పత్రిలో ఉండగా ఆమె ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులకు కోరిన సబ్యసాచికి అదే తన చివరిపోస్ట్గా నిలిచింది. -
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యువనటి మృతి
ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. 24 ఏళ్ల నటి ఇప్పటికే చాలాసార్లు గుండెపోటుకు గురయ్యారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఇప్పటికే ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆమె సర్జరీ చేయాల్సి వచ్చింది. నవంబర్ 14న పలుమార్లు ఆమె గుండెపోటు రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఒకరోజు ముందే అండ్రిలా శర్మ బాయ్‌ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి ఆమె బతకాలని ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో ఆండ్రిలా పుట్టి పెరిగారు. ఆమె జుమూర్‌తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహాపీఠ్ తారాపీఠ్, జిబోన్ జ్యోతి, జియోన్ కతి వంటి షోలలో నటించింది. ఆండ్రిలా అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో కూడా భాగమైంది. -
'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన
ప్రభుత్వాధికారులతో పనిపడినా లేక ఏదైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్న ఒక పట్టాన పని అవ్వదు. మన పనులన్ని పక్కన పెట్టుకుని వారి చుట్టు కాళ్లు అరిగేలా తిరిగితే గానీ పనవ్వదు అందరికి తెలిసిందే. అందువల్లే ప్రజలు ప్రభుత్వాధికారులంటేనే చాలా భయపడతారు. అచ్చం అలానే ఒక వ్యక్తి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా పని అవ్వకపోయేసరికీ విచిత్రమైన రీతిలో నిరసనలో అధికారుల వెంట తిరిగి అనుకున్నది సాధించాడు. వివరాల్లోకెళ్తే....బెంగాల్‌లోని శ్రీకాంత్ కుమార్ దత్తా అనే వ్యక్తికి తన రేషన్ కార్డులో పేరు తప్పుగా పడింది. దీంతో దూరే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులు శ్రీకాంత్ మెండల్ అనే పడింది. దీంతో సదరు వ్యక్తి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంతో దత్తా అని మార్చారు. దీంతో అతను మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఈసారి ఏకంగా శ్రీకాంతి కుమార్ కుత్తాగా మార్చారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో సదరు వ్యక్తి వినూత్నంగా కుక్కలా మొరుగుతూ...దురే సర్కార్ ప్రభుత్వా కార్యాలయంలోని అధికారుల చుట్టు ఆ రేషన్ కాగితాలతో తిరుగుతూ వివరిస్తాడు. అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధికారుని చూసి అతన్ని వెంబడించి....తన కాగితాలను కారు విండోలోంచి ఇచ్చి తన సమస్యను కుక్కలా అరుస్తూ వివరించాడు. సదరు అధికారి రెండు రోజుల్లో పేరు సరిచేస్తామని తనకు హామి ఇచ్చారని తెలిపాడు శ్రీకాంత్. తన పేరు రేషన్ కార్డులో పదేపదే తప్పుగా ప్రింట్ అవుతుండటంతో తో విసిగిపోయి ఇలా విచిత్రమైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ తన సమస్యను వివరించినట్లు చెప్పాడు. అంతకుముందు ఒక అధికారికి తన మొర వినిపించానని, అతను భయపడి పారిపోయాడని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు.. పేషంట్స్ సంగతేంటి?) -
టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్?
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. కాగా ఈ జట్టులో ముఖేష్ కుమార్, రజత్ పాటిదార్ వంటి కొత్త ముఖాలకు చోటు దక్కింది. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో వీరిద్దరినీ సెలక్టర్లు ప్రోటీస్‌తో సిరీస్‌కు అవకాశం ఇచ్చారు.ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ధావన్‌కు డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక తొలి సారి భారత జట్టులో చోటు సంపాదించుకున్న పేసర్ ముఖేష్ కుమార్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ ముఖేష్ కుమార్? ►28 ఏళ్ల ముఖేష్ కుమార్ కోల్‌కతాలో జన్మించాడు. ►అతడు దేశీవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ► ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముఖేష్ 2015లో హర్యానా పై అరంగేట్రం చేశాడు. ►అదే విధంగా టీ20 క్రికెట్లో 2016లో గుజరాత్ డెబ్యూ చేశాడు. ►లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ► ఇక టీ20 క్రికెట్లో ముఖేష్ 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు. ►ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు. ►స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ముఖేష్ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ►అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్.. బెంగాల్ జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ► ముఖేష్ ప్రస్తుతం ఇరానీ కప్-2022లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడుతున్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్‌గా ధావన్ -
... గేమ్‌లో భాగంగానే అలా చేశాడట సార్!
... గేమ్‌లో భాగంగానే అలా చేశాడట సార్! -
సమర కవి: సుబ్రహ్మణ్య భారతి/ 1882-1921
అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ ఇందుకు సాక్ష్యం పలుకుతుంది. ఆయన నిరంతరం స్వేచ్ఛ కోసం పరితపించేవారు. చదువుల కోసం వారణాసి వెళ్లారు. అదే ఆయన జీవితంలో పెద్ద మలుపు అయింది. భారతీయ ఆధ్యాత్మిక చింతన, జాతీయ భావాలు ఆ గంగాతీరంలోనే ఆయనను ముంచెత్తాయి, ఆలోచనలను మలిచాయి. ఆయన జీవితం మీదే కాదు, కవిత్వం మీద కూడా అవే ప్రతిబింబించాయి. బ్రిటిష్ వారి బెంగాల్ విభజనతో వేలాది మంది తొలిసారి స్వరాజ్య సమరంలోకి అడుగుపెట్టారు. వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు భారతి హాజరయ్యారు. మళ్లీ కలకత్తా సభలకు కూడా వెళ్లారు. 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సమావేశాలను కూడా భారతి చూశారు. జాతీయ కాంగ్రెస్‌కే చెందిన తిరుమలాచారి 1906 లో ‘ఇండియా’ అనే తమిళ పత్రికను నెలకొల్పారు. ఆయనే ‘బాల భారతి’ పేరుతో ఆంగ్ల పత్రిక కూడా స్థాపించారు. ఈ రెండింటికీ సంపాదకునిగా సుబ్రహ్మణ్య భారతినే తిరుమలాచారి ఎంపిక చేశారు. ఎడిటర్‌గా ఆయన ఆయన రాసిన రాతలకు అరెస్టు వారంట్లు జారీ అవడంతో భారతి కొందరు మిత్రుల సలహాతో మద్రాసు విడిచిపెట్టి పుదుచ్చేరి వెళ్లిపోయారు. తిరిగి ఆయన పుదుచ్చేరి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోని కడలూరుకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల పాటు తమ నిర్బంధంలోనే ఉంచారు. ఆ సమయంలో అనీబిసెంట్, సీపీ రామస్వామి అయ్యర్ జోక్యం చేసుకుని ఆయనను విడిపించారు. అప్పటి నుంచి రాజకీయ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సంఘ సంస్కరణోద్యమానికి ఆయన దగ్గరయ్యారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మీద ఆయన పోరాటం చేశారు. మహిళలను గౌరవించాలన్న ఆశయాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ప్రధాన కారణం సిస్టర్ నివేదిత. ఆధునిక తమిళ సాహిత్యానికి ఆయన సేవలు నిరుపమానమైనవి. పుదుచ్చేరిలో ఉండగా లభించిన వెసులుబాటుతో భగవద్గీతకు, పతంజలి యోగ సూత్రాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. భారతి పేరును తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపిన ‘కణ్ణన్ పట్టు’, కూయిల్ పట్టు’ కావ్యాలు కూడా పుదుచ్చేరిలో ఉండగానే రాశారు. 1921 సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచేనాటికి సుబ్రహ్మణ్య భారతి వయసు 39 సంవత్సరాలు. అందులో పదేళ్లు అజ్ఞాతంలోనే గడిచాయి. కానీ ఆయన కవిత్వానికి ఒక వెలుగునిచ్చిన ఘనత భారతి సహధర్మ చారిణి చెల్లమ్మాళ్‌దే. తన సోదరుడు, మరొక దగ్గర బంధువు సాయంతో ఆమె మద్రాసులో ఒక ఆశ్రమం స్థాపించి, భారతి రచనలను సంకలనాలుగా వెలువరించారు. -
పొలిటికల్ రీఎంట్రీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. దీంతో విపక్షాల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పొలిటికల్ రీఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజాసేవలో ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపైనా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు సిన్హా. ‘నేను స్వతంత్రంగానే ఉంటాను. ఏ ఇతర పార్టీలో చేరను. నాతో ఎవరూ మాట్లాడలేదు. నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే.. వ్యక్తిగత కారణాలతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేతతో మాట్లాడాను. ప్రజా సేవలో ఏ పాత్ర పోషించాలనేది తేల్చాల్సి ఉంది. ఇప్పుడు నాకు 84 ఏళ్లు. దాని వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఎన్నిరోజులు ప్రజా జీవితంలో కొనసాగుతోనో చూడాలి.’ అని పేర్కొన్నారు యశ్వంత్ సిన్హా. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం 2021, మార్చిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటే చేసే క్రమంలో టీఎంసీకి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు -
కంఠెవరం బాంబు కేసు: రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య
1905లో బెంగాల్ విభజన సందర్భంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ దేశవ్యాప్తంగా పర్యటించి బ్రిటిష్‌వారి చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాజకీయ స్పృహను కలిగించారు. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేసినా ఆ విప్లవ జ్వాల దేశమంతా పాకింది. సర్కారు జిల్లాల నుంచి ఎందరో స్వాతంత్య్ర పోరాటం దిశగా ఆలోచన ఆరంభించారు. అందులో తెనాలి ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ జాతీయోద్యమం ఊపందుకోకముందే గ్రామీణుల్లో రగులుతున్న విప్లవాగ్నిని సూచించే కొన్ని సంఘటనలు జరిగాయి. 1909లో సంచలనం కలిగించిన కఠెవరం బాంబు కేసు అందులో ఒకటి. విజృంభణకు ప్రేరణ ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఉద్యమం విజృంభించిన రోజులవి. కొన్ని దేశాల్లో ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకుల హత్యలు సర్వసాధారణమయ్యాయి. రష్యా, ఇటలీ చక్రవర్తుల్ని హతమార్చారు. ఆస్ట్రియా మహారాణి దారుణహత్యకు గురైంది. అలాగే స్పెయిన్ ప్రధాని, ఫిన్లాండ్ గవర్నర్ జనరల్ కూడా హంతకుల చేతుల్లో బలయ్యారు. ఉత్తరాదిన ఉగ్రవాదం విజృంభణకు ఇదే ప్రేరణ. స్థానిక యువకులు అప్పట్లో తెనాలికి సమీపంలోని కంచర్లపాలెం, కఠెవరం గ్రామాలకు చెందిన సాహస యువకులు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య తమ మిత్రులను కొందరిని కలుపుకుని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఉగ్రవాదుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద నాయకులు అత్యంత రహస్యంగా కొందరు అనుచరులను ఇక్కడకు పంపి ఈ ముగ్గురికి బాంబుల తయారీలో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తయ్యాక చెన్నై– న్యూఢిల్లీ రైలు మార్గాన్ని కఠెవరం వద్ద పేల్చివేసేందుకు వీరు పథకం పన్నారు. కొబ్బరికాయ (టెంకాయ)లో పేలుడు పదార్థాలు కూర్చి 1909 ఏప్రిల్ 2న బాంబుల్ని సిద్ధం చేశారు. చెన్నైకు వెళుతున్న వైస్రాయ్ రైలును పేల్చివేయాలని, రైలు మార్గం ధ్వంసం చేయాలని నిర్ణయించారు. దీనికి ముందుగా బాంబులు పనిచేస్తున్నాయో? లేదో? పరీక్షించాలని భావించారు. ఏప్రిల్ 3న కఠెవరం–కంచర్లపాలెం మధ్యగల కట్టపై ఒక కొబ్బరికాయ బాంబును వుంచి వెళ్లారు. అనూహ్యంగా అక్కడ వున్న కొబ్బరికాయ(బాంబు) ను చెన్ను అనే పశువుల కాపరి చూశాడు. దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించడంతో బాంబుపేలింది. చెన్ను ఖండఖండాలు 70గజాల దూరంలో పడ్డాయి. ద్వీపాంతరవాస జీవిత ఖైదు తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును బ్రిటిష్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య, చుక్కపల్లి రామయ్యలను కుట్రదార్లుగా నిర్ధారించింది. ఏప్రిల్ 6న ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోర్టులో నిందితులు బసవయ్య, బ్రహ్మయ్య తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, పి.వి.శ్రీనివాస రావు, ఎ.లక్ష్మీ నరసింహం కేసు వాదించారు. చుక్కపల్లి రామయ్య న్యాయవాదిని తిరస్కరించారు. న్యాయస్థానం రామయ్యకు ద్వీపాంతరవాస జీవితఖైదు విధించింది. బసవయ్య, బ్రహ్మయ్యలకు పదేళ్ల వంతున శిక్ష విధించారు. ఈ ముగ్గురినీ అండమాన్ జైలులో వుంచారు. వీరు అక్కడే జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి (చదవండి: సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్) -
'ముఖ్యమంత్రిని ఆహ్వానించేది ఇలాగేనా?'.. బీజేపీపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేశారు. ప్రారంభానికి ఒక రోజు ముందుగా బెంగాల్ ముఖ్యమంత్రి, గవర్నర్, మేయర్లకు ఆహ్వానాలు పంపారు. అయితే.. మెట్రో స్టేషన్ ఆహ్వానంపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ).. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించింది. "ఆదివారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో ఆహ్వానం పడేసి వెళ్లారు. ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇలాగేనా?. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఈ మెట్రో ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. అలాంటి వ్యక్తిని మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్. మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవటంపై కోల్‌కతా రైల్ కార్పోరేషన్లో వివాదం చెలరేగింది. అది జరిగిన రెండో రోజు ఆహ్వానాన్ని సీఎం ఇంటికి పంపించినట్లు తెలిసింది. జులై 11న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తారని కోల్‌కతా రైల్ కార్పోరేషన్ గత శనివారం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మమతా బెనర్జీని ఆహ్వానించకుండా కేంద్రం రాజకీయలు చేస్తోందని ఆరోపించింది టీఎంసీ. సీల్దా మెట్రో స్టేషన్ ఎదుట సోమవారం నిరసనలు చేపట్టాలని ముందుగా నిర్ణయించినా.. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది టీఎంసీ. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
మహోజ్వల భారతి: చర్చిలో నామకరణం మసీదులో అక్షరాభ్యాసం బ్రిటిష్ వేషం, భాష అతడే..
మైఖేల్ మధుసూదన్ దత్ 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత. 1824లో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని జెస్సోర్ సమీపములోని సాగర్దారి గ్రామంలో జన్మించారు. బెంగాలీ నాటకరంగ ఆద్యులలో ఒకరు. ఈయన ప్రసిద్ధ కృతి ‘మేఘ్‌నాథ్ బద్ద్ కావ్య’.. విషాదభరిత కావ్యం బెంగాలీ సాహిత్యంలో అద్వితీయమైనది. జీవితంలోని బాధలు, ప్రేమల గురించి ఈయన స్త్రీ గొంతుకతో కూడా అనేక కవితలు రాశారు. బాల్యంనుండే మధుసూదన్ ఆచార వ్యవహారాలలో ఆంగ్లేయుల్లా ఉండాలని ఉవ్విళ్లూరేవారు. హిందూ జమిందారీ కుటుంబంలో పుట్టిన మధుసూదన్, తన కుటుంబం అభీష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించి మైఖేల్ అనే పేరు పెట్టుకున్నారు. అనంతరకాలంలో తన ఆంగ్లేయ, పాశ్చాత్య మోజుకు పశ్చాత్తాపపడి తన మాతృభూమి ఉద్యమాలకు మద్దతునిచ్చారు. ఆ దశలో ఈయన రాసిన కవితలు, గేయాలలో ఆ పశ్చాత్తాపం ప్రతిఫలించింది. మధుసూదన్ దత్‌ను బెంగాలీ సాహిత్యపు గొప్ప కవులలో ఒకరిగా మాత్రమే కాక, బెంగాలీ సానెట్ పితగా కూడా పరిగణిస్తారు. మధుసూదన్ దత్ విద్యాభ్యాసం షేక్పూరా గ్రామంలోని పాతమసీదులో పర్షియన్ నేర్చుకోవడంతో ప్రారంభమైంది. అసమానమైన ప్రతిభ, బుద్ధి కలిగిన విద్యార్థిగా చిన్నతనం నుండే ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించారు. బాల్యంలో ఇంటి దగ్గర, కలకత్తాలో ఆంగ్ల విద్య, ఐరోపా సాహిత్యంతో పరిచయమేర్పడటం వల్ల దత్‌ను ఆంగ్లేయుల అలవాట్లు, ఆచార వ్యవహరాలు, పద్ధతులు, ఆలోచనా ధోరణి ఆ దారిలో నడిచేలా చేశాయి. దత్ జీవితంలో అలాంటి తొలి ప్రభావానికి హిందూ కళాశాలలో ఆయన గురువు కెప్టేన్ డి.ఎల్.రిచర్డ్సన్ కూడా ఒక కారణం. మేఘ్‌నాథ్ బద్ధ్ కావ్యంతో పాటు, ఆయన ఇతర రచనల్లోని తిలోత్తమ, రత్నావళి కూడా ప్రఖ్యాతిగాంచాయి. నేడు దత్ వర్ధంతి. 1873 జూన్ 29న ఆయన కలకత్తాలో మరణించారు. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ఈయన సంతతి వారే అని చెబుతారు. (చదవండి: మహోజ్వల భారతి: చాణక్య నరసింహ) -
సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. నాది వరల్డ్ రికార్డు!
న్యూఢిల్లీ: ‘‘ప్రస్తుత బీసీసీఐ యాజమాన్యం ఆటగాళ్లకు అండగా నిలబడుతోంది. 4-5 మ్యాచ్‌లలో విఫలమైనా మరో అవకాశం కల్పిస్తోంది’’ అని బెంగాల్ క్రీడా శాఖా మంత్రి, వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి అన్నారు. తాను టీమిండియాకు ఆడుతున్న సమయంలో గనుక ఇలాంటి మేనేజ్మెంట్ ఉండి ఉంటే తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కేదని అభిప్రాయపడ్డారు. ఏళ్లపాటు ఎదురుచూసి కాగా బెంగాల్‌కు చెందిన మనోజ్ తివారి మనోజ్ తివారి.. భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2011 డిసెంబరులో తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసిన మనోజ్ తివారి.. ఆ తర్వాతి ఛాన్స్ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అజేయ శతకంతో రాణించినా దురదృష్ట వెంటాడంతో జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్‌తో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మకు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మనోజ్.. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ విషయంలో నాది ప్రపంచ రికార్డు ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న మనోజ్ తివారి తాజాగా స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడారు. ‘‘వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాను. కానీ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించారు. 14 మ్యాచ్‌ల పాటు జట్టు దూరమయ్యాను. బాగా ఆడినా సరే నన్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ. ఒకవేళ నాకు అవకాశం వస్తే అప్పుడు సెలక్టర్లుగా ఉన్నవాళ్లను కచ్చితంగా నిలదీస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్ల వల్లే ఇదంతా అదే విధంగా.. ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తర్వాత 14 మ్యాచ్‌లకు దూరమైన ఏకైక ప్లేయర్‌గా నేను ప్రపంచ రికార్డు నెలకొల్పాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాను. రీఎంట్రీలో 65 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాను. అయినా, కూడా నా కెరీర్ సాఫీగా సాగలేదు. సరైన అవకాశాలు రాలేదు’’ అని మనోజ్ తివారి సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే, వచ్చిన కొన్ని ఛాన్స్‌ల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నానన్న ఆయన.. తన జీవితంలో జరిగిన ఏ విషయానికి చింతించడం లేదని పేర్కొన్నారు. కాగా రంజీ ట్రోఫీ సీజన్ 2021-2022లో బెంగాల్ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు మనోజ్ తివారి. సెమీస్ మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. చదవండి: Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని
బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి ఈ ఏడాది రంజీ ట్రోపీలో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో.. ఆపై మధ్య ప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తివారి సెంచరీలతో కథం తొక్కాడు. అయితే బెంగాల్ ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.మనోజ్ తివారి టీమిండియా తరపున 12 వన్డేల్లో 287 పరుగులు, 3 టి20ల్లో 15 పరుగులు చేశాడు. ఇక 23 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన మధ్య ప్రదేశ్.. ముంబైతో అమితుమీ తేల్చుకోనుంది. రంజీల్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవలే మనోజ్ తివారిని ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. మంత్రిగా ఉంటూనే ఆటను ఎలా బ్యాలెన్స్ చేశారని ప్రశ్నించగా.. తన డ్యుయల్ రోల్‌పై మనోజ్ తివారి ఆసక్తికరంగా స్పందించాడు. ''ఒక రాష్ట్రానికి మంత్రిని కావొచ్చు.. కానీ టైంను మేనేజ్ చేసుకుంటే రెండు పనులు ఒకసారి చేయొచ్చనేది నా మాట. రంజీలో అడుగుపెట్టడానికి ముందే నా నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నా. వారితో నా ప్రజల సమస్యలకు సంబంధించిన పేపర్ వర్క్‌ను నేను ఉంటున్న హోటల్ రూంకు తెప్పించుకునేవాడిని. ఇలా పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గ పనులు పూర్తి చేసి తిరిగి పేపర్ వర్క్‌ను కొరియర్ ద్వారా పంపించేవాడిని. ఇక క్రీడాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నాకు అదనంగా మరొక మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రంజీ క్రికెట్ ఆడినన్ని రోజులు ఆయన.. నేను చేయాల్సిన పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక బెంగాల్ క్రికెట్ కూడా నాకు అండగా నిలబడింది. జట్టు ఆటగాళ్లు కూడా ఒక మంత్రిగా కాకుండా తమలో ఒక ఆటగాడిగా చూస్తూ చక్కగా సహకరించారు. కొన్నిసార్లు రాత్రిళ్లు ఎమర్జెన్సీ ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న తోటి క్రికెటర్లు పరిస్థితిని అర్థం చేసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంది. నాలుగేళ్ల నా బిడ్డను.. ఇంటికి సంబంధించిన పనులను స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె చేసేది చిన్న పనే కావొచ్చు.. కానీ నా దృష్టిలో అది చాలా గొప్పది. ఇక బెంగాల్‌కు రంజీ ట్రోపీ అందించాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగాను. సెమీ ఫైనల్ వరకు ఈసారి కప్ మాదే అనే ధీమా కలిగింది. కానీ అనూహ్యంగా మా ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా? -
బెంగాల్‌పై ఘన విజయం.. 23 ఏళ్ల తర్వాత ఫైనల్లో మధ్యప్రదేశ్
బెంగళూరు: రంజీ ట్రోఫీలో 23 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం ముగిసిన సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ 174 పరుగులతో బెంగాల్‌పై ఘన విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 96/4 స్కోరుతో బరిలోకి దిగిన బెంగాల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైనా... ఆ తర్వాత బెంగాల్ 28.2 ఓవర్లలోనే మరో 79 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్ (157 బంతుల్లో 78; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (5/67) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. 1998–99 సీజన్లో ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ తుది పోరులో కర్ణాటక చేతిలో 96 పరుగుల తేడాతో ఓడింది. నాటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడా సాధించి, ‘డ్రా’గా ముగిస్తే చాలనే స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ ఆఖరి రోజు చివరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలి ఆట ముగియడానికి ఐదు ఓవర్ల ముందు ఆలౌటైంది. -
బిహార్ దుర్భిక్షం (1873–74)
చరిత్రలో ఇది బెంగాల్ కరవుగా కూడా ప్రసిద్ధి. బిహార్ ప్రావిన్స్‌లో మొదలైన దుర్భిక్ష పరిస్థితులు కరవు కాటకాలకు దారి తీసి.. పొరుగున్న ఉన్న బెంగాల్, వాయవ్య, ఔద్ ప్రావిన్స్‌లకు కూడా ప్రబలాయి. లక్షా నలభై వేల చదరపు కిలోమీటర్ల మేర, 2 కోట్లకు పైగా జనాభా దుర్భిక్ష ప్రభావాలకు గురైంది. ఎటు చూసినా ఆకలి అలమటింపులు, సహాయం కోసం ఆక్రందనలు. ఆ సమయంలో బెంగాల్‌కు కొత్తగా వచ్చిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సర్ రిచర్డ్ టెంపుల్ శాయశక్తులా సహాయక చర్యలకు కృషి చేసి భారతీయుల అభిమాన పాత్రుడు అయ్యారు. మరణాలు తక్కువే కానీ, కరువు పెట్టిన మరణయాతన తక్కువేం కాదు. చట్టాలు ఇండియన్ ఓత్స్ యాక్ట్, గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్, గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంక్ యాక్ట్, ఈస్ట్ ఇండియా స్టాక్ డివిడెండ్ రిడెంప్షన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఇండియన్ రైల్వే కంపెనీస్ యాక్ట్, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్, స్లేవ్ ట్రేడ్ యాక్ట్. జననాలు ఉపేంద్ర బ్రహ్మచారి : సైంటిస్టు, మెడికల్ ప్రాక్టీషనర్ (బెంగాల్ ప్రెసిడెన్సీ), ఎ.కె.ఫజ్నుల్ హక్ : బ్రిటిష్ ఇండియన్. పాకిస్తానీ లాయర్. గ్రంథకర్త. షేర్–ఎ–బంగ్లా గా ప్రసిద్ధి (బంగ్లాదేశ్), మార్ థామస్ కురియలఛెరి : కేరళ క్యాథలిక్ బిషప్. చంగనస్సెరి ఆర్చ్డయోసిస్ తొలి బిషప్. -
క్రీడా మంత్రి పోరాటం వృధా.. భారీ ఆధిక్యం దిశగా మధ్యప్రదేశ్
Bengal Vs Madhya Pradesh 1st Semi Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్లో బెంగాల్ పోరాటం ముగిసేలా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్ధికి 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (211 బంతుల్లో 12 ఫోర్లతో 102), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (209 బంతుల్లో 12 ఫోర్లతో 116) శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో బెంగాల్ లీడ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను.. రజత్ పాటిదార్ (63 నాటౌట్), కెప్టెన్ ఆధిత్య శ్రీవత్సవ (34 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి 231 పరుగుల ఓవరాల్ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటలో మధ్యప్రదేశ్ మరో 150, 200 పరుగులు చేసినా, తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. స్కోర్ వివరాలు: మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 341 ఆలౌట్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 273 ఆలౌట్ మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ 163/2 చదవండి: న్యూజిలాండ్ జట్టులో కల్లోలం.. మరో స్టార్ క్రికెటర్‌కు కరోనా -
మరో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. గట్టెక్కడం కష్టమే
రంజీ ట్రోపీ 2022 సీజన్లో బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి మరో సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో మనోజ్ తివారి కీలక సమయంలో శతకం సాధించాడు. 12 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించిన మనోజ్ తివారి.. శతకం అందుకున్న వెంటనే 102 పరుగుల వద్ద శరన్ష్ జైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మనోజ్ తివారీకి సహకరించిన షాబాజ్ అహ్మద్ కూడా సెంచరీతో మెరవడం విశేషం. 209 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 116 పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్ ఔట్ కాగానే బెంగాల్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మధ్యప్రదేశ్‌కు 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ ఒక వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. చదవండి: '14 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించి.. అరంగేట్రంలోనే సెంచరీతో -
మరో శతకం దిశగా దూసుకెళ్తున్న క్రీడా మంత్రి
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (84 నాటౌట్), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (72 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌ను అబేధ్యమైన 143 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్, బ్యాటర్ హిమాన్షు మంత్రి (165) మధ్యప్రదేశ్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ ఇంకా 144 పరుగులు వెనుక పడి ఉంది. మధ్యప్రదేశ్ బౌలర్లు కుమార్ కార్తీకేయ (2/43), పూనీత్ దాటే (2/34) బెంగాల్‌ను దారుణంగా దెబ్బ తీశారు. మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్ క్రీడా మంత్రి ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మైదానంలోనూ సత్తా చాటుతున్నాడు బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి. జార్ఖండ్‌తో జరిగిన తొలి క్వారర్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (73), రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (136) బాదిన తివారి.. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లోనూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. అతనికి మరో ఎండ్‌లో షాబాజ్ అహ్మద్ సహకరిస్తున్నాడు. వీరిద్దరు మూడో రోజు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించి మధ్యప్రదేశ్‌పై ఆధిక్యం సాధించగలిగితే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ముంబై-ఉత్తర్ ప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా -
బుల్డోజర్లు, కూల్చివేతలు
లక్నో/కోల్‌కతా/రాంచీ: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రోజులుగా అల్లర్లు చెలరేగిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రశాంతత నెలకొంటోంది. చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఎత్తేసి, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నారు. బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత సువేందును అధికారులు అడ్డుకున్నారు. యూపీలో అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అరెస్టులు, అనుమానితుల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాంచీలో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌కు మహారాష్ట్రలోని భివాండీ పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం పలు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లను బీజేపీ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఖండించింది. వాటిలో పాల్గొన్న వారిని ఇస్లాం నుంచి వెలి వేయాలని మంచ్ వ్యవస్థాపకుడు, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు, ఇస్లాం విద్వేష ఘటనలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ నేత శిశిథరూర్ అన్నారు. యూపీలో బుల్డోజర్లు యూపీలో శుక్రవారం నాటి అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న వారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సహరన్‌పూర్‌లో రాళ్లు రువ్వి న ఘటనలకు సూత్రధారిగా అనుమానిస్తూ ఇద్దరి ఇళ్లను అధికారులు శనివారం నేలమట్టం చేయడం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లో రాళ్లు రువ్విన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జావెద్ అహ్మద్ అనుమతుల్లేకుండా కట్టిన ఇంటిని ఆదివారం బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ‘శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది. చట్ట వ్యతిరేక చర్యలకు దిగేవారు దీన్ని గుర్తుంచుకోవాలి’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. అల్లర్లకు సంబంధించి మొత్తం 316 మందిని అరెస్ట్ చేశారు. బెంగాల్లో హైడ్రామా శుక్రవారం అల్లర్లకు సంబంధించి బెంగాల్‌లోని ముర్షిదాబాద్, హౌరా జిల్లాలకు చెందిన 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్బ మేదినీపూర్ జిల్లాలోని తామ్లుక్‌లో ఆదివారం ఉదయం హైడ్రామా నడిచింది. హౌరాలోని అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటల అనంతరం నేరుగా కోల్‌కతాకు వెళ్లాలన్న షరతుతో ఆయన్ను వదిలేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. హింసకు పాల్పడినట్లు గుర్తించిన 22 మందితోపాటు, గుర్తు తెలియని వేలాది మందిపై 25 కేసులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ ఎత్తివేశారు. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. కశ్మీర్‌లోని పలు పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. -
రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్‌లు జరిగేది అక్కడే!
Ranji Trophy 2022- ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికను ప్రకటించారు. జూన్ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. జూన్ 4 నుంచి 8 వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్‌తో జార్ఖండ్... ముంబైతో ఉత్తరాఖండ్... కర్ణాటకతో ఉత్తరప్రదేశ్... పంజాబ్‌తో మధ్యప్రదేశ్ తలపడతాయి. అనంతరం జూన్ 12 నుంచి 16 వరకు రెండు సెమీఫైనల్స్‌ను నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 24 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందే రంజీ ట్రోఫీ లీగ్ దశ ముగిసిన విషయం తెలిసిందే. చదవండి👉🏾 IPL 2022: కోల్‌కతా... అదే కథ -
నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!
ఇటీవలకాలంలో భార్యలే భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. వాళ్లు వ్యక్తి గత కారణాల రీత్యానో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. కానీ భర్తలు మాత్రం తమ భార్యల తిరిగి వస్తే చాలు పాతవాటిని గురించి పట్టించుకోం మాతో ఉంటే చాలు అంటూ ఆవేదనగా వాపోతున్న సంఘటనలు ఎక్కువగా చూశాం. అచ్చం అలాంటి సంఘటన బెంగాల్‌లోని పింగ్లా గ్రామంలో చోటుచేసుకుంది. (చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి) అసలు విషయంలోకెళ్లితే....బెంగాల్‌లోని పింగ్లా గ్రామం నివాసి అయిన ఒక వ్యక్తి వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను డిసెంబర్ 9న పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య, బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయిందని అతనికి ఇంట్లో సభ్యులు తెలిపారు. దీంతో అతను మరుసటి రోజే ఇంటికి వచ్చి తన భార్య ఆచూకి కోసం గాలించడం మొదలు పెట్టాడు. అయితే అతని ప్రయత్నం ఫలించ లేదు. చివరి ప్రయత్నంగా సోషలో మీడియాలో తన బాధనంతా పోస్ట్ చేశాడు. ఈ మేరకు అతను సోషల్ మీడియాలో" నేను పని నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నా భార్య చిన్నారితో సహా కిటికి గుండా పారిపోయింది. ఆమెను ఎవరైన వెతికి తీసుకు వస్తే రూ 5000 పారితోషకం ఇస్తాను" అని ప్రకటించాడు. అంతేకాదు తన ఇంట్లో మొబైల్ ఫోన్ లేదని అందువల్లే తన భార్య మొబైల్ ఫోన్ తీసుకువచ్చే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అతను చెప్పగా, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా తన భార్య ఒక్కత్తే కిటికి పగలకొట్టి పారిపోలేదని అతని సహాకారంతోనే ఈ ఘటనకు పాల్పడిందని వాపోయాడు. ఇంట్లోంచి వెళ్లే ముందు డబ్బు, నగలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు కూడా తీసుకుపోయిందని అన్నాడు. పైగా ఆ రోజు రాత్రి తమ ఇంటి ముందు నెంబర్ ప్లేట్ లేని నానో కారు ఆగిందని కూడా చెబుతున్నాడు. ఈ మేరకు సదరు వ్యక్తి తన భార్య బంగారు వస్తువులకు ప్రలోభ పడి అతనితో వెళ్లిపోయిందంటూ ఆరోపించాడు. పైగా పెద్దగా చదువుకోలేదు కాబట్టి సులభంగా ఆ వ్యక్తి మాయమాటలకు పడిపోయి వెళ్లిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె పారిపోయిన దాని గురించి తానేం ఆలోచించటం లేదని పైగా తాను తన కుటుంబసభ్యులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) -
జనరల్నాలెడ్జ్ ఉంటే చాలు!... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోవచ్చు!!
Bengal E-Rickshaw Driver Gives Free Rides: కొన్ని కొన్ని విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అనిపించక మానదు. అచ్చం అలానే ఇక్కడొక ఆటోవాలా తన వింతైన తీరుతో అందరి మనసులు దోచుకున్నాడు. (చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్) అసలు విషయంలోకెళ్లితే...బెంగాల్‌లోని లిలుహ్ (హౌరా జిల్లా)లోని ఈ రిక్షా డ్రైవర్ సురంజన్ కర్మాకర్ ప్రయాణికులను తాను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే ఉచితంగా డ్రాప్ చేస్తానంటూ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఒక జంట సంకలన్ సర్కార్ అతని భార్య ఇద్దరూ సురంజన్ ఆటో ఎక్కుతారు. సురంజన్ వెంటనే తానడిగే 15 జీకే ప్రశ్నలకు జవాబు చెబితే మిమ్మల్ని ఉచితంగా తీసుకువెళ్తానంటాడు. దీంతో ఆ జంట ఆ డ్రైవర్ సురంజన్ తీరు చూసి ఒక్కసారిగా షాక్‌కి గురువుతారు. అయితే ఆ జంట అతని ప్రశ్నలేంటో తెలుసుకుందామనే ఆసక్తితో అతని ఆటో ఎక్కుతారు. ఆ తర్వాత సురంజన్ ప్రశ్నల పరంపర చాలా రసవత్తరంగా సాగుతుంటుంది. అతను జీకేలో అన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ప్రయాణికుడు సంకలన్ మొదటగా ఈ డ్రైవర్ తన సంపాదనతో సంతృప్తి చెందక ఇలా ప్రయాణికులను ప్రశ్నలడిగి ఒకవేళ వాళ్లు సరైన సమాధానం చెప్పకపోతే అధిక చార్జీలు వసూలు చేద్దాం అని ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. అయితే ఈ క్విజ్ అయిపోయిన వెంటనే డ్రైవర్ సురంజన్ మాట్లాడుతూ... "ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను ఆరవ తరగతి వరకు చదువుకున్నాను. అయితే నాకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉంది. అంతేకాదు లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా ఉన్నాను. మీరు నన్ను గూగుల్‌లో 'అద్భుత్ తోటివాలా'గా కూడా చూడవచ్చు" అని అన్నాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..) -
ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు
Karnataka Beats Bengal In Super Over Enter Semis.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా కర్ణాటక, బెంగాల్ మధ్య గురువారం క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్‌దాకా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించిన కర్ణాటక సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరగులు చేసింది. కరుణ్ నాయర్ 55 పరుగులు నాటౌట్.. టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ రోహన్ కడమ్ 30, కెప్టెన్ మనీష్ పాండే 29 పరుగులు చేశారు. చదవండి: Ind Vs Nz 1st T20: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్! అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బెంగాల్ విజయానికి 20 పరుగులు కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను విద్యాదర్ పాటిల్ వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న రిత్విక్ చౌదరీ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో.. నాలుగు బంతుల్లో 8 పరుగులుగా సమీకరణాలు మారాయి. మూడో బంతికి ఒక పరుగు రాగా.. నాలుగో బంతికి ఆకాశ్ దీప్ బౌండరీ బాదడంతో రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి ఆకాశ్ దీప్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే బెంగాల్ విజయం సాధిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పాటిల్ వేసిన బంతిని ఆకాశ్ దీప్ డీప్‌మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న కెప్టెన్ మనీష్ పాండే డైరెక్ట్ హిట్ చేయడంతో ఆకాశ్ దీప్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నాలుగు బంతుల్లో 5 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.ఇక 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకను మనీష్ పాండే రెండు బంతుల్లోనే 8 పరుగులు కొట్టి విజయం అందించి జట్టును సెమీఫైనల్ చేర్చాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో మిగిలిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌ల్లో కేరళపై తమిళనాడు, గుజరాత్‌పై హైదరాబాద్, రాజస్తాన్‌పై విదర్భలు విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో తమిళనాడుతో హైదరాబాద్.. కర్ణాటకతో విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Ricky Ponting: హెడ్‌కోచ్‌గా ఆఫర్.. ద్రవిడ్‌ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది 🎯 #KARvBEN pic.twitter.com/pFdOtIkB5Y — Rohan (@itzz_Rohan) November 18, 2021 Manish pandey hits the winning six in the super over helped Karnataka to qualify for semis.#SyedMushtaqAliTrophy#SyedMushtaqAliT20pic.twitter.com/cjPAigDFLC — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 18, 2021 -
బెంగాల్లో కరోనా కేసుల పెరుగుదల
-
బెంగాల్ లో ఉపఎన్ని కల వేడి..
-
రాజకీయాలకు బ్యూరోక్రసీ బలి..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన విభేదాలు, రిటైర్మెంట్కు దగ్గరైన పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఇరకాటంలో పడేయటం మన దేశ పాలనా తీరును పట్టి చూపిస్తోంది. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల డెప్యుటేషన్‌లో పాటించాల్సిన విధానాలు ఆయన విషయంలో అమలు కాలేదు. మోదీ హయాంలో ఉన్నతోద్యోగుల స్థాయి దిగజారిపోయిందన్న భావన పెరుగుతోంది. బ్యూరోక్రసీ నియామకం ప్రక్రియలో చేపట్టే స్పల్ప మార్పులు సైతం దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో దోహదపడతాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆలాపన్ బందోపాధ్యాయ్‌ని అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ద్వారా తలెత్తిన వివాదం కారణంగా దేశ ఉన్నతాధికార వర్గం రాజకీయాల ముందు మరోసారి తలవంచినట్లయింది. అలాపన్ మే 31న రాజీనామా చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. గత వారం బెంగాల్లో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై సర్వేలో భాగంగా ప్రధాని బెంగాల్‌ని సందర్శించడానికి కొద్ది రోజుల ముందు ఈ నిర్ణయం జరిగింది. కానీ మే 31న ఆలాపన్ బందోపాధ్యాయను వెంటనే ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలంటూ సివిల్ సర్వీసుల వ్యవహారాలను చూసే సిబ్బంది, శిక్షణా విభాగం ఉన్నట్లుండి తాఖీదు పంపింది కానీ ఈ ముందస్తు, ఆకస్మిక ఆదేశానికి కారణం కూడా చెప్పలేకపోయింది. ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని కేంద్రానికి బదిలీ చేసే ప్రక్రియను పర్సనల్, ట్రెయినింగ్ విభాగం పాటించలేదు. ఏ అధికారినైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి డెప్యుటేషన్‌పై తీసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లాంఛనప్రాయంగా అభ్యర్థన పంపాలి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం తోసిపుచ్చవచ్చు కూడా. ఆ తర్వాత మాత్రమే తన అభ్యర్థనను అమలు చేసి తీరాలని కేంద్రం తన అధికారాన్ని ప్రయోగించే వీలుంది. అయితే ఎంతో సీనియర్ అయి ఉండి కూడా ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారిపోవడం గమనార్హం. ప్రధాని మోదీ హయాంలో ప్రభుత్వ ఉన్నతోద్యోగి పాత్ర, ప్రతి పత్తి పూర్తిగా దిగజారిపోయాయన్న భావన పెరుగుతోంది. గత కొన్నే ళ్లుగా రాష్ట్ర కేడర్‌లోని ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో పదోన్నతిని కోరుకోకుండా తమ తమ రాష్ట్ర స్థాయిలో సర్వీసును పూర్తి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో కేంద్రంలో పనిచేయడం గొప్ప అవకాశంగా సివిల్ సర్వీసు అధికారులు భావించేవారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలో పనిచేయాలంటేనే ఉన్నతాధికారులు జడుసుకుంటున్నారు. భారత గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రారంభ దినాలనుంచే దేశంలో సివిల్ సర్వీసు పాత్ర వివాదాస్పదంగా ఉంటూ వచ్చింది. 1969లో ఇందిరాగాంధీ నిబద్ధత కలిగిన సివిల్ సర్వీసు కావాలంటూ పిలుపిచ్చారు. కానీ భారత రాజ్యాంగం, సర్వీసు నిబంధనలు మాత్రం ప్రతిభ ప్రాతిపదికన పనిచేసే సివిల్ సర్వీసు కావాలని పేర్కొన్నాయి. దీనికోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షల ద్వారా ఉన్నతోద్యోగులను నియమించాలని, సంబంధిత విభాగంలో వృత్తిపరమైన శిక్షణను అందిస్తూ వారి పనితీరును అంచనా వేసే ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సి ఉందని నిబంధనలు సూచించాయి. ఉద్యోగి పనితీరు మదింపు ప్రక్రియలో రాజకీయ ప్రభువులకు ఏ పాత్రా ఉండేది కాదు. 2016లో అఖిల భారత సర్వీసుల్లో తీసుకొచ్చిన కొత్త మదింపు ప్రక్రియలోనూ రాజకీయ పాత్రకు చోటివ్వలేదు. అంటే ఒక ఉన్నతాధికారి నాణ్యతను మదింపు చేసే అధికారం మంత్రికి కూడా ఉండదన్నమాట. రాజ్యాంగ విలువలను ఎత్తిపెట్టడమే తమ లక్ష్యమైనందున అఖిల భారత సర్వీసు, ఇతర కేంద్ర సర్వీసుల్లో పనిచేసేవారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండేది. అయితే ఈ రాజ్యాంగ రక్షణ సైతం ఉన్నతాధికారుల పనితీరులో రాజకీయ జోక్యాన్ని నివారించేది కాదు. రాజకీయ నాయకులతో అధికారవర్గం కుమ్మక్కు కావడం ఉండేది కానీ దీనికి చాలా మినహాయింపులు మాత్రమే ఉండేవి. కానీ క్రమేణా రాజకీయ ప్రభువులు ఉన్నతాధికారుల నియామకం, బదిలీపై అధికారాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికార వర్గం రాజకీయ పార్టీల ఇచ్ఛకు, అధికారంలో ఉన్న నాయకుల సంకల్పానికి లోబడుతూ వచ్చేవారు. ఉన్నతాధికారుల్లో వృత్తిగత నైపుణ్యాలు, అనుభవం కంటే వారి విశ్వాçÜం, భావజాల పరమైన సారూప్యతలే విలువైనవిగా రాజకీయ నేతలు భావించడం కొనసాగేకొద్దీ బ్యూరోక్రసీలో రాజకీయాలు చోటుచేసుకోవడం పెరుగుతూ వచ్చింది. విజ్ఞానం, అనుభవం ప్రాతిపదికన ఉత్తమమైన సలహాలను అందించే ధోరణి తగ్గిపోయి రాజకీయ ప్రాధాన్యతలకు విలువ ఇచ్చేదిగా ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగుల పాత్ర కుదించుకుపోయిందని నేను గతంలోనే సూచించాను. ఈ దురదృష్టకరమైన పక్షపాతం, ముందస్తు ఇష్టాల కారణంగానే కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్‌తో సరిగా వ్యవహరించడంలో మన పాలనాయంత్రాంగంలో లొసుగులు చోటుచేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. మన ఉన్నతాధికారవర్గ పనితీరుపై రాజకీయ నాయకుల్లో కానీ సాధారణ ప్రజానీకంలోకానీ అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ ఆధునిక రాజ్యంలో పరిపాలనా యంత్రాంగం పాత్ర అనివార్యమైందని అందరూ ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ప్రతిభ, బాధ్యత, సమర్థత ప్రాతిపదికన సివిల్ సర్వీసును మెరుగుపర్చడానికి మనముందున్న మార్గాలేవీ అని ప్రశ్నించుకోవాలి. ఒకటి. ఉన్నతాధికారుల నియామకం వయోపరిమితిని 21–24 సంవత్సరాల వయస్సుకే కుదించాలి. ఈ వయసులో ఉన్న వారు పరీ క్షలు రాసి ఉత్తీర్ణులయ్యేందుకు పలు ప్రయత్నాలు కల్పించాలి. ఇప్పుడు జనరల్ కేటగిరీలో 32 సంవత్సరాలు, రిజర్వుడ్ కేటగిరీలో 35 సంవత్సరాల వరకు గరిష్టంగా వయో పరిమితిని పెంచారు. ప్రభుత్వోద్యోగికి తగిన శిక్షణ ఇచ్చి, ప్రస్తుత కాలానికి తగిన పాలన అవసరాలకు అనుగుణంగా వారి నైపుణ్యాలను, వైఖరులను తీర్చిదిద్దాలంటే యుక్తవయసులోనే నియమించుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉంది. రెండు. ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేశాక, ప్రభుత్వ విచక్షణతో కూడిన నిర్ణయాలు, రాజకీయ జోక్యం ద్వారా వారికి కొత్త బాధ్యతలు ఇచ్చే పరిస్థితిని తొలగించాలి. ఉదాహరణకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో రిటైరైన వారిని చట్టబద్ధమైన కమిషన్లు, రెగ్యులేటరీ అధికారులు లేక తత్సమానమైన విభాగాలు మాత్రమే నియమించే స్థితి రావాలి. అర్హులైన వారి అప్లికేషన్లను స్వాగతించడం, బహిరంగ నియామకం ప్రక్రియ వంటి దశలను ప్రభుత్వేతర విభాగాల్లోని నిపుణుల విభాగం మాత్రమే చేపట్టాలి. అత్యంత సమర్థత, నిపుణతతో ఇతరులతో పోటీ పడగలిగే స్థాయి ఉన్న రిటైరైన ప్రభుత్వోద్యోగులను ఈ నియామకాల నుంచి మినహాయించాల్సిన పనిలేదు. ఇది జరిగినప్పుడు ప్రభుత్వ రాజకీయ ప్రాధాన్యతలకు లొంగకుండా ఉన్నతాధికార వర్గం ప్రజాప్రయోజనమే ప్రాతిపదికగా తన సేవలను అందించగలదు. మూడు. పని తీరుకు సంబంధించిన రివార్డులు, దండనల వ్యవస్థను మార్చాల్సి ఉంది. ఎంత చిన్న స్థాయిలోనైనా సరే కమీషన్లకు అలవాటు పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేలా ప్రస్తుత వ్యవస్థ ఉంది. కానీ ఉద్యోగుల కర్తవ్య ఉపేక్ష అనేది ప్రభుత్వ ఖజానాకు గణనీయంగా నష్టం కలిగిస్తుంది. ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఇప్పుడు దండనల నుంచి దాదాపుగా తప్పించుకుంటున్నారు. ఎంతో నమ్మకంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం వల్ల తప్పిదాలు జరిగిన సందర్భంలో అలాంటి వారిపై ప్రస్తుత నిబంధనలు చర్యలు తీసుకోవడం లేదు. ఎవరూ తప్పులనుంచి బయటపడకూడదు. శిక్షణా ప్రక్రియ కాలంలోనే ఉద్యోగులు దీన్ని గుర్తించి, అంగీకరించాల్సి ఉంది. తేలికపాటి సంస్కరణల ద్వారానే పాలనలో మార్పులు చేసుకోవచ్చు. కానీ దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో ఇవి తప్పకుండా దోహదపడతాయి. మన వద్ద ఉన్న అపరిమిత ప్రతిభా సంపన్నులు, అనుభవజ్ఞులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఎంతో అవసరం. వ్యాసకర్త: శ్యామ్ శరణ్ మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
బెంగాల్ మేలు కోసం ప్రధాని కాళ్లు పట్టుకుంటా: మమత బెనర్జీ
కోల్‌కత: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బెంగాల్లో ఎన్నికలు ముగిసినా ఇంకా రాజకీయ వేడి తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. యాస్ తుపానుపై జరిగిన పీఎం, సీఎంల సమావేశం వీరి మధ్య పోరుకు మరోసారి వేదికైంది. కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం బెంగాల్‌కి మేలు చేస్తానంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకునేందుకు తాను సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం మమత బెనర్జీ. చిల్లర రాజకీయాలు చేస్తూ బెంగాల్ ప్రజలను అవమానపరచొద్దంటూ బీజేపీకి, ప్రధాని మోదీలకు తేల్చి చెప్పారామే. బెంగాల్ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న చీఫ్ సెక్రటరీ బదిలీని రద్దు చేయాలని కేంద్రాన్ని మమత బెనర్జీ డిమాండ్ చేశారు. మేము వేచి చూశాం యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టు మమత తెలిపారు. ఇంతలో ప్రధాని పర్యటన ఉందని తెలియడంతో... ఆయన హెలికాప్టర్ దిగే స్థలానికి చేరుకుని ఎదురు చూశామని... ఆ తర్వాత ఆయన్ని కలిసేందుకు వెళితే మీటింగ్‌లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పడంతో అక్కడ మరో 20 నిమిషాల పాటు ఎదురు చూశామన్నారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్హాల్లో ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. అయితే అక్కడ ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని మమత తెలిపారు. దీంతో వెంటనే ప్రధానికి తమ రిపోర్టును సమర్పించి... ఆయన అనుమతి తోనే అక్కడి నుంచి బయటకు వచ్చామన్నారు. ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వెళ్లినట్టు మమత వివరించారు. ఎందుకీ అవమానం ఇటీవల వచ్చిన తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు గుజరాత్, ఒడిషాలలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ రాష్ట్ర సీఎంలతో సమావేశమయ్యారు, కానీ ఎక్కడా ప్రతిపక్ష నేతలను ఆ సమావేశాలకు ఆహ్వనించలేదని మమత చెప్పారు. కేవలం బెంగాల్లోనే ఎందుకు ప్రతిపక్ష పార్టీలను మీటింగ్‌కు పిలిచారని ఆమె అడిగారు. ఇటీవల బెంగాల్లో ఎదురైన ఘోర ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని, అందుకే ఆ ఓటమికి ప్రతీకారంగా బెంగాల్ ప్రజలను అవమానించాలని చూస్తున్నారంటూ మమత ఆరోపించారు. ప్రధాని ఎప్పుడు బెంగాల్‌కి వచ్చినా ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారంటూ ఆమె విమర్శించారు. ఇబ్బంది పెట్టాలనే ప్రధాని, సీఎంల మీటింగ్‌కు సంబంధించి తనకు అనుకూలంగా ఉన్న వెర్షన్‌నే బీజేపీ ప్రచారంలోకి తెచ్చి, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోందని మమత అన్నారు. అందుకే ఆ మీటింగ్ సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తున్నానంటూ మమత చెప్పారు. -
Andhra Pradesh: 'ఆక్సిజన్' రైలొచ్చింది..
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు శనివారం సాయంత్రం ఆక్సిజన్ రైలు వచ్చింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఉన్న రెండు ట్యాంకర్లు పోర్టుకు చేరుకొన్నాయి. ఈ ప్రత్యేక రైలుకు అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో అవినాష్‌చంద్ రాయ్, నెల్లూరు జేసీ హరేందిరప్రసాద్, జేసీ (ఆసరా) బాబిరెడ్డి, చిత్తూరు జేసీ మార్కండేయులు, పోర్టు సెక్యూరిటీ జీఎం రాకేష్ కృష్ణన్, స్థానిక తహసీల్దార్ సోమ్లానాయక్‌లు స్వాగతం పలికారు. ఇప్పటికే రైల్లో వచ్చిన ట్యాంకర్ల నుంచి ఆక్సిజన్‌ను స్థానిక ట్యాంకర్లలోకి నింపుకొనే ప్రక్రియ చేపట్టారు. వీటిని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తరలించనున్నారు. -
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి
-
బెంగాల్ దంగల్
-
టార్గెట్ బెంగాల్..?
-
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
-
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) కాగా శుక్రవారం నాడు కశ్మీర్‌లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు. -
బెంగాల్లో ‘చీరలు కొందాం’ కార్యక్రమం
పస్తులలో ఉన్న బడుగు చేనేత కార్మికులను లాక్డౌన్ నష్టాల నుంచి కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం వారి నుంచి తానే చీరలు కొంటోంది. చీరలు కొనమని ప్రజలకూ పిలుపునిస్తోంది. లాక్డౌన్ వల్ల బెంగాల్లో చీరలు నేసే దాదాపు అరు లక్షల మంది కార్మికులు కష్టాల్లో, పస్తుల్లో పడ్డారు. లాక్డౌన్ తర్వాత కూడా ప్రజలకు బట్టలు కొనే మూడ్ లేకపోవడం వల్ల, ఇతర ఆర్థిక కారణాల వల్ల తగిన స్థాయిలో కొనుగోళ్లు సాగడం లేదు. సొసైటీల మద్దతు ఉన్న పైస్థాయి కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సొంత రెక్కల మీద ఆధారపడిన బడుగు కార్మికులు పూర్తిగా కష్టాల్లో ఉన్నారు. వీరిని కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం ‘చీరలు కొందాం’ కార్యక్రమానికి నడుం బిగించింది. ముఖ్యంగా బడుగు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న తూర్పు బుద్వాన్, నాడియా జిల్లాల్లో నేరుగా కార్మికుల నుంచే చీరలు కొన్ని వెంటనే డబ్బు చెల్లిస్తోంది. దీని వల్ల దాదాపు 10 వేల మంది కార్మికులు ఊపిరి పీల్చుకోనున్నారు. బెంగాల్ చేనేత సహకార సంస్థకు ‘తనూజా’ పేరుతో ఔట్లెట్ బ్రాంచీలు ఉన్నాయి. రాష్ట్రంలో 70, దేశంలో మరో ముప్పై ఇవి ఉన్నాయి. కార్మికుల నుంచి నేరుగా కొన్న చీరలు వీటి ద్వారా అమ్ముతారు. బెంగాల్లో అనే ఏముంది దేశంలో అన్ని చోట్లా చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. వీరి కోసమైనా ఈ సీజన్లో సురక్షితమైన జాగ్రత్తలు పాటిస్తూ చీరలు కొనాల్సిన అవసరం ఉంది. లేదా ఆన్లైన్లో అయినా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అందంగా ముస్తబవ్వాల్సిన రోజులు ముందు ముందు తప్పక ఉన్నాయి. రేపటి ముస్తాబు కోసం ఇవాళ చీర కొని సాయపడటం మంచిదే కదా. -
బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
-
జూన్ 1 నుంచి 200 రైళ్లు
న్యూఢిల్లీ: జూన్ 30వ తేదీ వరకు రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది. నాన్ ఏసీ, సెకండ్ క్లాస్ బోగీలుండే ఈ రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని తెలిపింది. శ్రామిక్ రైళ్లు, రాజధాని రూట్లలో నడిచే ఏసీ స్పెషల్ రైళ్లకు ఇవి అదనమని వివరించింది. అన్ని కేటగిరీల ప్రయాణికులు వీటికి టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇవి ఏఏ మార్గాల్లో నడుస్తాయో త్వరలోనే ప్రకటిస్తామంది. శ్రామిక్ రైళ్లలో అవకాశం దొరకని వలస కార్మికులు వీటిని ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఒకటీరెండు రోజుల్లో శ్రామిక్ రైళ్ల సంఖ్యను రోజుకు 400కు పెంచుతామని, కాలినడకన రోడ్ల వెంట వెళ్లే వారిని గుర్తించి, దగ్గర్లోని ప్రధాన రైల్వే స్టేషన్‌కు తరలించాలని రాష్ట్రాలను కోరింది. వారి జాబితాను రైల్వే శాఖ అధికారులకు అందజేస్తే సొంతూళ్లకు శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శ్రామిక్ రైళ్లకు అనుమతి అక్కర్లేదు దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్ రైళ్లకు సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీనిపై హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది. బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లను రానివ్వడం లేదంటూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈనెల ఒకటి నుంచి 1,565 శ్రామిక్ రైళ్ల ద్వారా 20 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారంది. -
మమత పెద్ద మనసు వారి కోసం ప్రత్యేకంగా...
కోల్కత్తా: కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పనుల కోసం సొంత ఊరిని వదిలి ఉపాధిని వెతుకుంటూ వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగం లేక ఏం చేయాలో తోచక చాలా కష్టాలు పడ్డాయి. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ అయిపోతుందా ఇంటికి వెళ్లి అయిన వారిని చూసుకుందాం అని ఆశపడిన వారికి లాక్‌డౌన్‌ను మూడు సార్లు సడలించడంతో నిరాశే మిగిలింది. అందుకే చాలా మంది వలస కార్మికులు కాలినడకనే వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇంటిని చేరకుండానే ప్రాణాలు కూడా కోల్పొయారు. అయితే వలస కార్మికులను ఇంటికి చేర్చడం కోసం కేంద్రప్రభుత్వం శ్రామిక్‌రైళ్ల పేరిట ప్రత్యేక రైళ్లను మే1 వతేదీ నుంచి అందుబాటులోనికి తెచ్చింది. అయితే వీటితో పాటు వలస కార్మికుల కోసం 105 ప్రత్యేక రైళ్లను కూడా నడిపించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేక ట్రైన్లు వివిధ ప్రాంతాల నుంచి త్వరలో ప్రారంభం కానున్నాయి అని మమత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్ బెంగాల్ ప్రభుత్వం వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించబోము అని పేర్కొంది అని ఆరోపించిన ఒక్కరోజు తరువాతే మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. Towards our commitment to helping all our people stuck in different parts of the country and who want to return back to Bengal, I am pleased to announce that we have arranged 105 additional special trains. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) May 14, 2020 ఇదేవిషయం కేంద్రహోం మంత్రి అమిషా కూడా మమతకు చాలా సార్లు లేఖ రాశారు. వలస కార్మికులు కూడా మీ ప్రజలే. వారిని ఇంటికి తిరిగి రానివ్వండి. ఆర్ధిక వ్యవస్థ బాగుపడి వారికి ఉద్యోగాలు దొరుకుతాయి దీనిని రాజకీయం చేయ్యొద్దు అంటూ కూడా అమిత్ షా చాలా సార్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వానికి, కేంద్ర సర్కార్‌కి మధ్య యుద్దమే నడిచింది. అయితే కరోనా కట్టడి విషయంలో కేంద్రం చేపడుతున్న అనేక చర్యలను దీదీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు
రాజ్‌కోట్: సౌరాష్ట్ర రంజీ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. రంజీ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుని నయా రికార్డును లిఖించింది. తుది పోరులో బెంగాల్‌తో తలపడిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా సౌరాష్టను టైటిల్ వరించింది. శుక్రవారం చివరి రోజు ఆటలో బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు డ్రా అయిన పక్షంలో విజేతను తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ప్రకటించే సంగతి తెలిసిందే. నిన్నటి వరకూ రసపట్టులోనే తాజా రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది నిన్నటి వరకూ ఆసక్తికరంగా ఉంది. గురువారం ఆట ముగిసే సమయానికి బెంగాల్ ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. దాంతో ఈ రోజు ఆటలో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోరును బెంగాల్ అధిగమిస్తుందని అంతా భావించారు. కానీ సౌరాష్ట్ర బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 27 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది బెంగాల్. ఓవర్‌నైట్ ఆటగాడు మజుందార్(63) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్ నంది(40 నాటౌట్) అజేయంగా నిలిచినా మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టేయడంతో బెంగాల్‌కు ఆధిక్యం దక్కలేదు. దాంతో అక్కడే సౌరాష్ట్రకు టైటిల్ ఖాయమైంది. ఇక మ్యాచ్ డ్రాగా ముగియడంతో సౌరాష్ట్ర ట్రోఫీని ముద్దాడింది. -
బెంగాల్‌కు 72 పరుగులు... సౌరాష్ట్రకు 4 వికెట్లు!
రాజ్‌కోట్: సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇప్పటికే నాలుగు రోజులు గడవడంతో మ్యాచ్‌లో విజేత తేలే పరిస్థితి లేదు... అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనుండటంతో ఇరు జట్లు కూడా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో బెంగాల్‌కు 72 పరుగుల కావాల్సి ఉండగా... సౌరాష్ట్రకు 4 వికెట్లు అవసరం. నేడు ఆటకు చివరి రోజు. 291 పరుగులు వెనుకబడి... 134/3 స్కోరుతో గురువారం ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ ఆట ముగిసే సమయానికి 147 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. ప్రస్తుతం అనుస్తుప్ మజుందార్ (58 బ్యాటింగ్; 8 ఫోర్లు), అర్నబ్ నంది (28 బ్యాటింగ్; 3 ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నారు. ఆదుకున్న సుదీప్, సాహా అంతకుముందు నాలుగో రోజు ఆటను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సుదీప్ చటర్జీ (81; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (64; 10 ఫోర్లు, సిక్స్) నిలకడగా ఆరంభించారు. ఈ రంజీ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సాహాకు గురువారం ఆటలో అదృష్టం బాగా కలిసొచ్చింది. రెండు సార్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి తప్పించుకున్న అతడికి... సౌరాష్ట్ర ఫీల్డర్ల నుంచి రనౌట్, క్యాచ్ రూపాల్లో రెండు లైఫ్‌లు లభించాయి. దీనిని ఆసరాగా చేసుకున్న సాహా... సుదీప్తో కలిసి నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో పాటు షహబాజ్ అహ్మద్ (16; 2 ఫోర్లు) అవుట్ అవడంతో... మ్యాచ్ మరోసారి సౌరాష్ట్ర వైపుకు మళ్లింది. ఈ దశలో జతకట్టిన అనుస్తుప్, అర్నబ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో ఉన్న హార్విక్ దేశాయ్ నేలపాలు చేయడంతో బతికి బయటపడ్డ అనుస్తుప్... ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అర్నబ్‌తో కలిసి ఏడో వికెట్‌కు అభేద్యంగా 91 పరుగులు జోడించాడు. నేడు జరిగే ఆఖరి రోజు ఆటలో బెంగాల్ 72 పరుగులు సాధిస్తే... 30 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలుస్తుంది. చివరిసారిగా 1989–90 సీజన్లో బెంగాల్ టైటిల్ సాధించింది. అయితే పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటం... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటం బెంగాల్ చారిత్రక విజయానికి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. -
అర్పిత్ సెంచరీ: సౌరాష్ట్ర 384/8
రాజ్‌కోట్: అర్పిత్ వసవాడా (287 బంతుల్లో 106; 11 ఫోర్లు) అద్భుత సెంచరీ... చతేశ్వర్ పుజారా (237 బంతుల్లో 66; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్... వెరసి బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 206/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 160 ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. తొలి రోజు అస్వస్థత కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుజారా రెండో రోజు మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అర్పిత్‌తో కలిసి పుజారా సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ రెండు సెషన్లపాటు ఆడటంతోపాటు ఆరో వికెట్‌కు 380 బంతుల్లో 142 పరుగులు జోడించారు. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన అర్పిత్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాడు. ఓవరాల్‌గా రెండో రోజు సౌరాష్ట్ర 79.1 ఓవర్లు ఆడి మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. చివరి సెషన్లో అర్పిత్, పుజారా అవుటైనా అప్పటికే బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం చిరాగ్ జానీ (44 బంతుల్లో 13 బ్యాటింగ్), ధర్మేంద్ర సింగ్ జడేజా (22 బంతుల్లో 13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఫీల్డర్ విసిరిన బంతి తగిలి అంపైర్ విలవిల
రాజ్‌కోట్: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ షంషుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తొలి రోజు ఆటలో స్వ్కేర్ లెగ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సమయంలో బెంగాల్ ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి షంషుద్దీన్ ఉదర భాగంలో బలంగా తాకింది. దాంతో విల్లవిల్లాడిపోయిన అంపైర్ ఫీల్డ్‌లోనే కుప్పకూలిపోయాడు. సౌరాష్ట్ర వికెట్ కోల్పోయిన తర్వాత బెంగాల్ ఆటగాళ్లు సంబరాలు చేసుకునే క్రమంలో ఓ ఫీల్డర్ బంతిని అంపైర్ వైపు గట్టిగా త్రో విసిరాడు.(జడేజాకు బీసీసీఐ నో పర్మిషన్..!) అది కాస్తా వెళ్లి అంపైర్‌కు తగిలింది. ఆ ఊహించని పరిణామంతో గాయపడ్డ అంపైర్ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. దాంతో అతను ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అతని స్థానంలో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తున్న ఎస్ రవి..తొలి రోజు ఆట ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, అదే సమయంలో షంషుద్దీన్ టీవీ అంపైర్‌గా చేశాడు. కాగా, ఈ రోజు ఆటలో స్థానిక అంపైర్ పీయూష్ కక్కర్ స్వ్కేర్ లెగ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే బుధవారం మూడో రోజు ఆటలో షంషుద్దీన్ స్థానంలో యశ్వంత్ బద్రి ఫీల్డ్ అంపైర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అంపైర్ షంషుద్దీన్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దాంతో రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచి షంషుద్దీన్ వైదొలిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 8 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది.అర్పిత్ వసవాడా(106) సెంచరీ చేయగా, చతేశ్వర్ పుజారా(66), బరోత్(54), విశ్వరాజ్ జడేజా(54)లు హాఫ్ సెంచరీలు సాధించారు.(21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు..) -
సౌరాష్ట్ర 206/5
రాజ్‌కోట్: తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తున్న సౌరాష్ట్ర జట్టు శుభారంభాన్ని అనుకూలంగా మల్చుకోలేకపోయింది. మాజీ చాంపియన్ బెంగాల్‌తో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. భారత స్టార్ క్రికెటర్, సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా జ్వరంతో బాధపడుతుండటంతో... ఆరో నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 24 బంతులు ఆడి ఐదు పరుగులు చేశాక అస్వస్థతతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో రోజు పుజారా బ్యాటింగ్‌కు వస్తాడని సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ తెలిపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్రకు ఓపెనర్లు హార్విక్ దేశాయ్ (111 బంతుల్లో 38; 5 ఫోర్లు), అవీ బారోట్ (142 బంతుల్లో 54; 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. బెంగాల్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంట తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించింది. హార్విక్‌ను అవుట్ చేసి స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అవీ బారోట్‌ను ఆకాశ్‌దీప్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత విశ్వరాజ్‌సింగ్ జడేజా (92 బంతుల్లో 54; 7 ఫోర్లు), అర్పిత్ (94 బంతుల్లో 29 బ్యాటింగ్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో సౌరాష్ట్ర స్కోరు 150 దాటింది. చివరి సెషన్లో బెంగాల్ పేస్ బౌలర్ ఆకాశ్‌దీప్ విజృంభించడంతో సౌరాష్ట్ర మూడు వికెట్లను కోల్పోయింది. సంక్షిప్త స్కోర్లు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 206/5 (80.5 ఓవర్లలో) (హార్విక్ దేశాయ్ 38, అవీ బారోట్ 54, విశ్వరాజ్‌సింగ్ జడేజా 54, అర్పిత్ 29 బ్యాటింగ్, షెల్డన్ జాక్సన్ 14, చేతన్ సకారియా 4, ఆకాశ్‌దీప్ 3/41); బెంగాల్‌తో మ్యాచ్. -
13 ఏళ్ల తర్వాత... రంజీ ఫైనల్లో బెంగాల్
కోల్‌కతా: 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... బెంగాల్ క్రికెట్ జట్టు దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కర్ణాటకతో మంగళవారం ముగిసిన సెమీఫైనల్లో ఆతిథ్య బెంగాల్ జట్టు 174 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2007 తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ తుది పోరుకు అర్హత సాధించింది. 352 పరుగుల విజయలక్ష్యంతో... ఓవర్‌నైట్ స్కోరు 98/3తో నాలుగో రోజు ఛేదన కొనసాగించిన కర్ణాటక 55.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ బౌలర్ ముకేశ్ కుమార్ (6/61) కర్ణాటక బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. చివరి రోజు కర్ణాటక కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు ముకేశ్ దక్కించుకోవడం విశేషం. రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్రతో జరుగుతోన్న మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌కు 327 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. ఓవర్‌నైట్ స్కోరు 66/5తో ఆటను కొనసాగించిన సౌరాష్ట్రను అర్పిత్ (139; 16 ఫోర్లు, సిక్స్) సెంచరీతో ఆదుకోవడంతో... తమ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. ఆట ముగిసే సమయానికి గుజరాత్ వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. -
కర్ణాటక లక్ష్యం 352
కోల్‌కతా: రంజీ ట్రోఫీలో కర్ణాటక తుదిపోరుకు చేరాలంటే 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. బెంగాల్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా... చేతిలో 7 వికెట్లున్న కర్ణాటక 254 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు 72/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ 161 పరుగుల వద్దే ఆలౌటైంది. రాజ్‌కోట్‌లో జరుగుతున్న మరో సెమీస్‌లో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు 52 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట నిలిచే సమయానికి 29 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 66 పరుగులే చేసింది. -
మనోజ్ తివారీ 303 నాటౌట్
కోల్‌కతా: హైదరాబాద్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటాడు. మనోజ్ తివారీ (414 బంతుల్లో 303 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌ను బెంగాల్ 7 వికెట్లకు 635 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇది 27వ సెంచరీ కాగా, తొలి ‘ట్రిపుల్’ కావడం విశేషం. బెంగాల్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
బెంగాల్లో బంద్ హింసాత్మకం
కోల్‌కతా: ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు బుధవారం జరిగిన భారత్ బంద్ బెంగాల్లో పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఆందోళనకారులు బలవంతంగా బంద్ చేయించారు. పలు ప్రాంతాల్లో బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే లైన్లపై ఆందోళనలు జరగడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మాల్డాలోని సుజాపూర్, బుర్ద్వాన్ జిల్లాలో ఆందోళనకారులు ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడం, టైర్లు కాల్చేయడంతోపాటు ప్రభుత్వ బస్సులతోపాటు ఒక పోలీస్ వ్యాన్సహా పలు ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు వారిపై నాటుబాంబులతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్నిచోట్ల లాఠీచార్జ్‌కు పాల్పడగా, మరికొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బారాసాత్, నార్త్ 24 పరగణ ప్రాంతాల్లోని కొన్ని రైల్వే ట్రాక్‌లపై పోలీసులు కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించడంతో సామాన్య జనం నానా ఇబ్బందులు పడ్డారు. -
బెంగాల్ 289 ఆలౌట్
కోల్‌కతా: ఆంధ్ర బౌలర్లు చీపురుపల్లి స్టీఫెన్ (4/78), శశికాంత్ (4/64) తమ పేస్ బౌలింగ్‌తో హడలెత్తించడంతో బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 241/4తో గురువారం ఆట కొనసాగించిన బెంగాల్ మరో 48 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. వెలుతురు లేమి కారణంగా రెండో రోజు ఆట 21 ఓవర్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆంధ్ర ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. గాందీకి ప్రవేశం లేదు! ఆంధ్ర, బెంగాల్ రంజీ మ్యాచ్ సందర్భంగా వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ మాజీ క్రికెటర్, ప్రస్తుత సీనియర్ జట్టు సెలక్టర్ దేవాంగ్ గాంధీని బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌నుంచి అనూహ్యంగా బయటకు పంపించారు. సీనియర్ క్రికెటర్ మనోజ్ తివారి ఇందుకు కారణమని తెలుస్తోంది. టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మాత్రమే ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రాకూడదనేది నిబంధన. గాంధీ అనుమతి లేకుండా వచ్చారని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే వారు అతడిని బయటకు పంపినట్లు సమాచారం. అయితే తాను ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని గాంధీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో గాందీకి మద్దతుగా నిలిచిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తివారీపై చర్య తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్‌ను బహిరంగంగా తిట్టడం వల్లే ఈ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్ అశోక్ దిండాను తప్పించినట్లు తెలిసింది. అతనిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగానే చివరి నిమిషంలో జట్టునుంచి దూరంగా ఉంచారు. -
‘నన్ను వెళ్లమని ఎవరూ ప్రశ్నించలేదు’
కోల్‌కతా: ఆంధ్రాతో రంజీ మ్యాచ్‌లో బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. జాతీయ క్రికెట్ జట్టుకు సెలక్టర్‌గా ఉండి ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి నిబంధనల్ని ఉల్లంఘించాడనే వాదన తెరపైకి వచ్చింది. తమ డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ రావడాన్ని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారీ ప్రశ్నించడంతోనే అతను అక్కడ్నుంచి వెళ్లాడని వార్తలు వచ్చాయి. దీనికి ముగింపు పలికాడు దేవాంగ్ గాంధీ. ‘ నేను నిబంధనల్ని ఏమీ ఉల్లంఘించలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి మ్యాచ్ రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. గత మూడేళ్ల కాలంలో నేను ఏ విధమైన ప్రొటోకాల్‌ను అతిక్రమించలేదు. నేను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళితే ఎవరూ ఒక క్రికెటర్ నన్ను ప్రశ్నించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నన్ను ఎవరూ అక్కడ్నుంచి పొమ్మనలేదు. చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి మ్యాచ్‌లకు దూరం కావడంతో ఫిజియోనే డ్రెస్సింగ్ రూమ్‌కు రమ్మన్నాడు. అప్పుడు రిఫరీ అనుమతి తీసుకునే వెళ్లా. నేను నిబంధనల్ని అతిక్రమిస్తే మూడేళ్లుగా సెలక్టర్‌గా ఉండలేను కదా. నన్ను అక్కడ్నుంచి వెళ్లమని ఒక క్రికెటర్ డిమాండ్ చేశాడనడం అది కేవలం కల్పితమే’ అని దేవాంగ్ తెలిపాడు. -
డ్రెస్సింగ్ రూమ్‌లోకి సెలక్టర్.. సరికొత్త వివాదం
కోల్‌కతా: జాతీయ క్రికెట్ జట్టు సెలక్టరైన దేవాంగ్ గాంధీ రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడంతో సరికొత్త వివాదానికి తెరలేపింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో ఆంధ్రాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంగాల్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి దేవాంగ్ గాంధీ వెళ్లి నిబంధనలను అతిక్రమించాడు. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా దేవాంగ్ గాంధీ.. బెంగాల్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. దీనిపై బెంగాల్ ఆటగాడైన మనోజ్ తివారీ దీన్ని ఖండించాడు. జాతీయ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ ఇలా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటూ నిలదీశాడు. ఈ వివాదంపై ఫిర్యాదు చేయడంతో దేవాంగ్ గాంధీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి పంపించేశారు. ‘ మేము అవినీతి నిరోధక కోడ్‌ను ఫాలో కావాలి. ఒక జాతీయ సెలక్టర్ అయిన దేవాంగ్ గాంధీ ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకూడదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. మరి దీన్ని దేవాంగ్ ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించాడు. దాంతో దేవాంగ్ గాంధీని ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు పంపించేశారు. తొలి రోజు ఆటలో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ 281/7 వద్ద ఉండగా మ్యాచ్‌కు బ్యాడ్‌లైట్ అంతరాయం కల్గించింది. కాగా, రెండో రోజు ఆటలో బెంగాల్ 289 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఆటగాడు అభిషేక్ రామన్(112) శతకంతో మెరిశాడు. -
కూతురిని చంపి గంగలో పడేశారు!
సాక్షి, పశ్చిమ బెంగాల్: పరువు కోసం కన్న కూతురిని చంపిన కిరాతక తల్లిదండ్రులను పశ్చిమ బెంగాల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 16 ఏళ్ల కుతురి ప్రేమ వ్యవహారం తెలియడంతో సొంత తల్లిదండ్రులే పరువు పోతుందని ఈ దారుణానికి ఒడిగట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక, పొరుగూరికి చెందిన అచింత్య మొండల్ అనే యువకుడిని ప్రేమించింది. దీంతో కుతురి ప్రేమ విషయం తెలిసి ఆమెను తల్లిదండ్రులు వారించారు. అతనితో కలిసి తిరగవద్దని హెచ్చరించారు. అయినా వారు మాట వినకపోవడంతో తల్లిదండ్రులు ఈ మేరకు పరువు హత్యకు ఒడిగట్టారు. కూతురిని చంపి మృతదేహాన్ని బ్యాగ్‌లో కుక్కి గంగానదిలో పడేశారని పోలీసులు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసినట్లు సూపరిండెంట్ ఇఫ్ పోలీస్ అలోక్ రాజోరియా పేర్కొన్నారు. -
బెంగాల్ పోలీస్ కస్టడీలో సీరియల్ కిల్లర్
-
బెంగాల్ దంగల్
-
బీజేపీకి ఎన్ఆర్సీ ఎదురుదెబ్బ!
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలోకి వచ్చిన వలసదారులను తన్ని తరిమేయాలా, లేదా? వారు మన దేశ వనరులను చెదల్లా తినేస్తున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) కార్యక్రమాన్ని చేపడతామని, సరైన డాక్యుమెంట్లులేని అక్రమ వలసదారులను దేశం నుంచి పంపిస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొంది. దీన్ని సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నా సరే, మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రయాణించినప్పుడల్లా చెబుతున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ఎన్ఆర్సీ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ ముస్లిం వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించడం, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం కల్పించడం ఉద్దేశం. తద్వారా హిందువులందరి మద్దతు కూడగట్టడం బీజేపీ లక్ష్యం. ఈ ప్రచారం ద్వారానే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులను సమీకరించడం ద్వారా బీజేపీ కాస్త బలపడింది. ఈలోగా అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ కసరత్తు పార్టీకి ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ఒక్క ముస్లింలే కాకుండా వేల సంఖ్యలో హిందువులు, ఆదివాసీలకు ఎన్ఆర్సీలో చోటు లభించకుండా పోయింది. ఈ విషయమై అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అలాంటి భయమే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా బెంగాల్‌కు వలసవచ్చిన హిందువులకు పట్టుకుంది. సరైన పత్రాలు లేని కారణంగా తమను కూడా దేశం నుంచి పంపించి వేస్తారని వారు భయపడుతున్నారు. ఆ భయాన్ని మమతా బెనర్జీ తనకు సానుకూలంగా మలచుకుంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అక్రమవసలదారుల్లో హిందువులు కూడా దేశం నుంచి తరిమేస్తారని ఆమె హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎన్ఆర్సీ వల్ల ఒక్క ముస్లింలే దేశం నుంచి విడిచి వెళ్లి పోవాల్సి వస్తోందని, హిందువులకు అలాంటి భయం అవసరం లేదని అమిత్ షా చెప్పలేక పోతున్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం మతాలను ప్రస్థావిస్తు మాట్లాడరాదు. ఈ కారణంగా బీజేపీకి ఇంతకుముందు ఆశించినన్ని సీట్లు బెంగాల్లో రాకపోవచ్చని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు. -
బెంగాల్: లేడీస్ దంగల్
సాక్షి, కోల్‌కతా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 60 మంది మహిళా సభ్యులు గెలుపొందగా, అందులో 12 మంది అంటే 20 శాతం మంది పశ్చిమ బెంగాల్ నుంచే కావడం గమనార్హం. దేశంలో బెంగాలీల జనాభా శాతానికి ఇది రెట్టింపు కన్నా అధికం. తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థుల్లో 30 శాతానికి పైగా మంది గెలుపొందారు. తృణమూల్‌కు చెందిన ఉమా సోరెన్ అత్యంత పేద సభ్యురాలు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.5 లక్షల కన్నా తక్కువే. గతంలో కన్నా 2014లోనే అత్యధిక సంఖ్యలో మహిళా సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ 41 శాతం సీట్లను మహిళలకే కేటాయించిన సంగతి తెలిసిందే. -
బంతి తగిలి విలవిల్లాడిన దిండా
కోల్‌కతా: ప్రాక్టీస్ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ అశోక్ దిండా తీవ్రంగా గాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా బెంగాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి బౌలింగ్ చేస్తున్న దిండా తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దిండాకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బెంగాల్ జట్టు ఈడెన్ గార్డెన్లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దిండా వేసిన ఒక ఓవర్లో బెంగాల్ ఆటగాడు బిరిందర్ వివేక్ సింగ్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఆ బంతిని తప్పించుకునే ప్రయత్నంలో దిండా తలకు బలంగా తగిలింది. దాంతో దిండా తల పట్టుకుని మైదానంలోనే కూలిపోయాడు. అతనికి అక్కడే చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన తర్వాత అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఊపిరిపీల్చుకుంది. అతనికి రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. -
బెంగాల్ పేసర్ అశోక్ దిండాకు తీవ్రంగా గాయాలు
-
‘మోదీకి కాదు.. దేశానికి వ్యతిరేకులు’
గాంధీనగర్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వారంతా మోదీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. గుజరాత్‌లోని సిల్వసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతల్లో ఒకరినొకరు కలిసి మాట్లాడుకోలేని నాయకులు అప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని మోదీ ఆరోపించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. -
‘ఇప్పుడే అసలు యుద్ధం మొదలైంది’
‘మూడో కీమోథెరపీ పూర్తయింది. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైంది. తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలంటూ ఇంతమంది కోరుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ మాటలే నాకు ధైర్యాన్ని, బతుకతాననే ఆశను బలంగా రేకెత్తిస్తాయి’ అంటూ బెంగాల్ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నఫీసా అలీ(61) ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఆమె అభిమానులను ఉద్వేగానికి గురిచేస్తోంది. తాను ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నానే విషయాన్ని నఫీసా అలీ గతేడాది నవంబరులో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె... ‘ నా విలువైన స్నేహితురాలిని కలుసుకున్నాను. స్టేజ్ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను త్వరగా కోలుకోవాలని ఆమె ఆశించారు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. View this post on Instagram Done my 3rd Chemotherapy 10th January ‘19 and now the battle begins ... I am praying to get well .I am so deeply touched by all your wishes and feel blessed reading messages from around the world. Gives me hope and courage.💕🥰 A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Jan 10, 2019 at 11:12am PST View this post on Instagram A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Nov 17, 2018 at 4:53am PST -
ఫైనల్లో ఆంధ్ర ఓటమి
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించిన ఆంధ్ర జట్టు తుది పోరులో 11 పరుగుల తేడాతో బెంగాల్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆంధ్ర జట్టులో నలుగురు రనౌట్ కావడం గమనార్హం. టాస్ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు సాధించింది. మందిర మహాపాత్ర (39 నాటౌట్), దీప్తి (34; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సీహెచ్ ఝాన్సీ లక్ష్మి మూడు వికెట్లు తీయగా... పుష్పలత, శరణ్యలకు ఒక్కో వికెట్ లభించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 49.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అనూష (61; 5 ఫోర్లు), పద్మజ (38; 4 ఫోర్లు) ఆకట్టుకున్నా... కీలకదశలో ఔటవ్వడం ఆంధ్ర విజయావకాశాలపై ప్రభావం చూపింది. -
బెంగాల్ 194/6
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆంధ్ర జట్టు సొంతగడ్డపై బెంగాల్‌తో ప్రారంభమైన మ్యాచ్‌ను సానుకూలంగా ప్రారంభించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారి (90; 14 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఆంధ్ర బౌలర్లు చెలరేగడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను తివారి ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు అగ్నివ్ పాన్ (39; 6 ఫోర్లు)తో కలిసి 113 పరుగులు జతచేశాడు. ప్రస్తుతం వృత్తిక్ చటర్జీ (27 బ్యాటింగ్), ప్రదీప్తా ప్రమాణిక్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, యర్ర పృథ్వీరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్, షోయబ్ ఖాన్లకు చెరో వికెట్ దక్కింది. హైదరాబాద్ వేదికగా పంజాబ్‌తో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 240/7తో నిలిచింది. 46 ఏళ్ల వయసులో... శనివారం మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన ప్లేట్ గ్రూప్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్ తరఫున టోక్‌చోమ్ ఇబోయైమా సింగ్ రంజీల్లో అరంగేట్రం చేశాడు. బరిలోకి దిగే సమయానికి టోక్‌చోమ్ వయసు 45 ఏళ్ల 296 రోజులు కావడం విశేషం. ఫలితంగా అతి పెద్ద వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఆటగాళ్ల జాబితాలో అతనూ చేరాడు. 1973 మార్చి 1న టోక్‌చోమ్ పుట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 16 పరుగులకే 5 వికెట్లు తీసి అరుణాచల్‌ను 66 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. -
ఏపీ, ఓడిషా, బెంగాల్, ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
-
హైదరాబాద్‌కు నాలుగో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు నాలుగో ‘డ్రా’ను నమోదు చేసింది. ఉప్పల్‌లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్ రాణించలేకపోవడంతో ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయి కేవలం ఒకే పాయింట్‌తో సరిపెట్టుకుంది. 24 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న బెంగాల్ ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. ఓవర్‌నైట్ స్కోరు 204/4తో సోమవారం తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 123.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ రాయుడు (261 బంతుల్లో 93; 10 ఫోర్లు) సెంచరీని చేజార్చుకోగా... సాకేత్ సాయిరామ్ (39; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అశోక్ దిండా, ముకేశ్ కుమార్ చెరో 4 వికెట్లతో హైదరాబాద్‌ను కట్టడి చేశారు. షాబాజ్, ఇషాన్ పోరెల్ చెరో వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఆటముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (2) వెంటనే ఔటయ్యాడు. అభిషేక్ కుమార్ (15 నాటౌట్), సుదీప్ చటర్జీ (30 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. సీవీ మిలింద్కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 336 పరుగులు చేసింది. ఈనెల 22 నుంచి జరిగే తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్ ఆడుతుంది. విఫలమైన లోయరార్డర్... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రోహిత్ రాయుడు క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగు మాత్రమే జోడించి ఆట ప్రారంభంలోనే ఔటయ్యాడు. దీంతో 203 పరుగులకు హైదరాబాద్ 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను సాకేత్ తీసుకున్నాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కేఎస్కే చైతన్య (60 బంతుల్లో 22; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 27 పరుగులు... సీవీ మిలింద్‌తో కలిసి ఏడో వికెట్‌కు 29 పరుగులు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. సాకేత్ ఓపికగా ఆడుతుండటంతో ఒక దశలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకుంటుందేమో అనిపించింది. తనయ్ త్యాగరాజన్ (6) క్రీజులో నిలవలేకపోయినా... తర్వాత వచ్చిన సిరాజ్ (22; 3 ఫోర్లు) సాకేత్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 42 పరుగుల్ని జోడించారు. కానీ రెండు పరుగుల వ్యవధిలో సిరాజ్, సాకేత్ వికెట్లను పడగొట్టి ముకేశ్ కుమార్ హైదరాబాద్ ఆధిక్యానికి గండికొట్టడంతో ఆతిథ్యజట్టు 312 పరుగులకే పరిమితమైంది. స్కోరు వివరాలు బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 336; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూ (బి) షాబాజ్ 18; అక్షత్ రెడ్డి (సి) అగ్నివ్ పాన్ (బి) అశోక్ దిండా 1; రోహిత్ రాయుడు (బి) ముకేశ్ కుమార్ 93; హిమాలయ్ అగర్వాల్ (సి) అనుస్తుప్ (బి) అశోక్ దిండా 65; సందీప్ (సి) అగ్నివ్ (బి) అశోక్ దిండా 13; చైతన్య ఎల్బీడబ్ల్యూ (బి) ముకేశ్ 22; సాకేత్ ఎల్బీడబ్ల్యూ (బి) ఇషాన్ 39; మిలింద్ (సి) అనుస్తుప్ (బి) ముకేశ్ 13; తనయ్ ఎల్బీడబ్ల్యూ (బి) అశోక్ దిండా 6; సిరాజ్ (సి) మనోజ్ తివారీ (బి) ముకేశ్ 22; రవికిరణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (123.1 ఓవర్లలో ఆలౌట్) 312. వికెట్ల పతనం: 1–11, 2–38, 3–187, 4–203, 5–205, 6–231, 7–260, 8–268, 9–310, 10–312. బౌలింగ్: అశోక్ దిండా 31–5–88–4, ముకేశ్ 27–8–54–4, ఆమిర్ 18–4–38–0, షాబాజ్ 20–6–43–1, ఇషాన్ 25.1–6–68–1, అనుస్తుప్ 1–0–4–0, మనోజ్ తివారీ 1–0–3–0. బెంగాల్ రెండో ఇన్నింగ్స్: అభిషేక్ (నాటౌట్) 15; ఈశ్వరన్ (సి) చైతన్య (బి) మిలింద్ 2; సుదీప్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 49. వికెట్ల పతనం: 1–2. బౌలింగ్: సిరాజ్ 5–2–15–0, మిలింద్ 5–1–14–1, రవికిరణ్ 2–0–13–0, తనయ్ 2–0–6–0. -
విస్తారా ‘24–గంటల’ ఆఫర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా మరోసారి పండుగల ఆఫర్‌ను ప్రకటించింది. ‘24–అవర్స్ ఓన్లీ’ పేరుతో అన్ని పన్నులతో కలిపి రూ.999కే విమాన ప్రయాణమని తెలిపింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌లకు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ప్రారంభ టికెట్ ధర ఆఫర్ పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుంచి గువాహటి మార్గానికి మాత్రమే పరిమితమని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 12:01 సమయానికి బుకింగ్స్ ప్రారంభం కాగా, డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుంది. ఇతర మార్గాలలో రూ.1,199 నుంచి రూ.2,599 టికెట్ ధరను ఆఫర్ చేసింది. -
ఓ మల్లెపువ్వు రక్త చరిత్ర
‘దారోగర్ దప్తార్’. 1880లలో కలకత్తాలో జరిగిన వరుస హత్యలు ఈ పేరుతో ఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చాయి. ఇప్పుడు అదే పుస్తకం రెండు వాల్యూములుగా పునర్ముద్రణ అయింది. కొన్ని నేరాలను పరిశోధించిన ప్రియానాథ్ ముఖోపాధ్యాయ్ పుస్తకంలోని కథలను ఉత్కఠతో చదివించేలా రచించారు. మొదటి వాల్యూమ్‌లోని 78 వ కథలో పేరుమోసిన నేరస్తురాలు త్రైలోక్య నేర చరిత్రను చదివితే ఆమె జీవితం ఈ పుస్తకంలో ఉండాల్సిన కథ కాదు అనిపిస్తుంది. కానీ నేరం నేరమే. బెంగాల్‌లోని చిన్న గ్రామంలో త్రైలోక్య కథ ప్రారంభమవుతుంది. త్రైలోక్య బ్రాహ్మల అమ్మాయి. పెళ్లి అయ్యేనాటికి చిన్న పిల్ల. పెళ్లికొడుకు పెద్ద వయసువాడు. త్రైలోక్య రజస్వల అయ్యేవరకు పుట్టింట్లోనే ఉంది. భర్త మరణించే లోపు ఒక్కసారి మాత్రమే అతడిని చూసింది. ఆ తరవాత త్రైలోక్యను ఒక వైష్ణవ మహిళ చేరదీసింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. కలకత్తా వేశ్యా గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ఆ మహిళ.. త్రైలోక్యను ఒక యువకుడికి అప్పచెప్పింది. అతడు త్రైలోక్యను మోసం చేసి, కలకత్తా సోనాగచ్చిలో ఉండే రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యాగృహానికి అమ్మేశాడు. ఇది 1880లో జరిగింది. ఒక సాధారణ పల్లెటూరి పిల్లలా మొదలైన ఆమె జీవితం, ఇక్కడ నుంచే కలకత్తా నేర ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసింది. వ్యభిచారం నుంచి మోసగత్తెగా.. యవ్వనంతో అందంగా ఉన్న త్రైలోక్యకు డబ్బు కోసం వెతక్కోవలసిన అవసరం కలగలేదు. చేతికి వస్తున్న ఆదాయంతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అందం ఎంతోకాలం నిలబడదుగా, క్రమేపీ ఆదాయం కూడా తగ్గసాగడంతో, భవిష్యత్తు గురించి భయం మొదలైంది. ఈ సమయంలోనే కాళి బాబు అనే ఒక వివాహితుడిని ప్రేమించింది. అతడి భార్య మరణించగానే, హరి అనే పేరు గల వారి కొడుకుని దత్తత తీసుకుంది. కాళిబాబు నిత్యం అక్కడే ఉండటం వల్ల, త్రైలోక్య దగ్గరకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోయింది. దానికి తోడు హరి చదువు ఖర్చు కూడా పెరగటంతో, త్రైలోక్య పరిస్థితి దీనంగా మారిపోయింది. వ్యభిచార వృత్తి నుంచి నేర ప్రవృత్తిలోకి మారవలసి వచ్చింది. కలకత్తాకు చెందిన ఇద్దరు సంపన్నులు త్రైలోక్య ఇంట్లో ఉంటూ, అక్కడకు వచ్చే విటులకు అమ్మాయిలను సరఫరా చేయడంతో పాటు, వారు మత్తులో ఉన్నప్పుడు వారిని లూటీ చేసి, వీధిలోకి తోసేయడం త్రైలోక్య లక్ష్యం. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని చూసి వాడు తాగి పడిపోయాడనుకునే పోలీసులు ఆ రాత్రికి వారిని లాకప్‌లో ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేదాకా వారికి ప్రతిఘటించే శక్తి ఉండదు. ఫిర్యాదు చేయడం వలన అక్కర్లేని ప్రచారం జరుగుతుంది కాబట్టి, వారు మౌనంగా వెళ్లిపోతారు. ఇదీ త్రైలోక్య కుటిల ఆలోచన. ఆనోటా ఈనోటా త్రైలోక్య విషయం నలుగురికీ తెలిసిపోవడంతో మరో కొత్త నేరానికి దారి వెతుక్కుంది. వరుల కోసం వల బెంగాల్‌లోని శోత్రియ బ్రాహ్మణ కుటుంబాలలో వరకట్నం కాకుండా, కన్యాశుల్కం ఆచారంగా ఉండేది. అందువల్ల ఆడపిల్లల తండ్రులు ఎవరు ఎక్కువ కన్యాశుల్కం ఇస్తే వారితోనే సంబంధం కలుపుకునేవారు. ఇది అదనుగా చేసుకుంది త్రైలోక్య. అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా ఉన్న వారి గురించి సన్నిహితుల ద్వారా కాళిబాబు తెలుసుకున్నాక కలకత్తా నగరంలోని రెడ్ లైట్ ఏరియాకి దూరంగా త్రైలోక్యం, కాళిబాబు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అబద్ధపు చుట్టాలను తెచ్చుకున్నారు. ఒక సుముహూర్తాన అబ్బాయి కుటుంబానికి కబురు చేశారు. అందంగా ఉండే ఒక వ్యభిచారిని పెళ్లికూతురుగా పరిచయం చేశారు. అమ్మాయిని చూడగానే అబ్బాయి తన అంగీకారం తెలిపాడు. అడిగినంత కన్యాశుల్కం, పెళ్లి ఖర్చులు ఇచ్చారు. నెల తిరిగేలోపు వివాహం అయిపోయింది. అమ్మాయి అత్తవారింటికి వెళ్లింది. ఒంటి నిండా నగలతో దర్జాగా ఉంది. తన కన్నతల్లి పరిచారిక వేషంలో వచ్చింది. మరొక వ్యక్తి మేనమామలా నటించాడు. వివాహం జరిగిన నెల రోజులకు, పెళ్లికూతురు తన తల్లిదండ్రులను చూసి వస్తానని అత్తగారి అనుమతి తీసుకుని భర్తతో కలిసి బయలుదేరింది. ఒంటి నిండా నగలతో, పరిచారికలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలిసి మొత్తం నలుగురు కలకత్తా ౖరైలు ఎక్కారు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా, భర్తను వదిలి ముగ్గురూ త్రైలోక్య దగ్గరకు పారిపోయారు. నగలన్నీ అమ్మేశారు. వారు ముగ్గురికీ త్రైలోక్య కొద్ది మొత్తం మాత్రమే ఇచ్చింది. మిగిలినదంతా తాను తీసేసుకుంది. ఇదే మోసాన్ని పదేపదే చేసి డబ్బు సంపాదించింది త్రైలోక్య. కొంతకాలం తరవాతఅమ్మాయిలను కిడ్నాప్ చేసి, అమ్మేయడం మొదలుపెట్టింది త్రైలోక్య. మాయమైన అమ్మాయిలు కనిపించకపోవడంతో, ఆ వార్త సంచలనమైంది. విషయం గ్రహించిన పోలీసులు, త్రైలోక్య, కాళిబాబులకు.. ఇటువంటి పనులు మానుకోమని హెచ్చరించారు. అక్కడ నుంచి మరో దారిలోకి వెళ్లింది త్రైలోక్య. హత్యలు మొదలు ఉత్తరప్రదేశ్‌లో ఒక రాజుగారికి మధ్యవర్తినని చెప్పుకునేవాడు కాళిబాబు. బారాబజార్ నుంచి నగలను తక్కువ ధరకు తీసుకువస్తానని చెప్పి, షాపు వారికి కబురు చేసి, వారి దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా నగలను తెప్పించి, నగలు తీసుకు వచ్చిన వ్యక్తిని చంపేసి, నగలన్నీ తీసుకుని, ఆ వ్యక్తిని వారు అద్దెకు ఉన్న ఇంటి గదిలో పాతేసేవారు. కాళిబాబు ఆ నగలను స్వయంగా రాజావారి దగ్గరకు తీసుకువెళ్లి, డబ్బులు తీసుకుని, తన జేబులో వేసుకునేవాడని అంటారు. ఈ కేసును పరిశీలించమని నేర పరిశోధకుడైన ముఖోపాధ్యాయకు అప్పచెప్పారు అధికారులు. అద్దెకు ఉన్న ఇంటిని గుర్తించి, శవాన్ని బయటకు తీశాడు ముఖోపాధ్యాయ. కాళిబాబును ఉరి తీశారు. కోర్టులో త్రైలోక్య నేరం నిరూపణ కాలేదు. ఆమె స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయింది. నిస్పృహలో ఉన్న త్రైలోక్య తన ఇంటిని, నగలను బలవంతంగా అమ్మవలసి వచ్చింది. సోనాగచ్చిలో గతంలో తనతో ఉన్న వారిని కలిసింది. వారంతా ఈసడించుకున్నారు. కాని, ఆమెలాగే, చాలామంది వయసు మీద పడటంతో భవిష్యత్తు గురించి భయపడసాగారు. వారందరి అభద్రతతో సైతం చెలగాటమాడింది త్రైలోక్య. ఒక మహానుభావుడు వారందరి కష్టాలను గట్టెక్కిస్తాడని వారిని నమ్మించింది. వారంతా ఒంటి నిండా నగలతో వస్తే, వారిని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడని నమ్మపలికింది. మూడేళ్ల కాలంలో త్రైలోక్య అలా ఐదుగురు మహిళలను చేరదీసింది. వారిని కలకత్తాలో తన ఇంటి దగ్గరలో ఉన్న మాణిక్‌తాలా చెరువు దగ్గరకు ఒక్కొక్కరిగా తీసుకువెళ్లి, వారిని అందులో స్నానం చేయమంది. వారంతా వారి ఒంటి మీద నగలను తీసి, ఒడ్డున పెట్టారు. స్నానం చేస్తుండగా, తలను నీటిలో ముంచి వారు మునిగిపోయేవరకు అలానే పట్టుకునేది. ఇలా చేస్తుండగా ఒకసారి దూరం నుంచి ఎవరో గమనించారు. త్రైలోక్యను పోలీసు స్టేషనుకి ఈడ్చుకెళ్లారు. త్రైలోక్య తప్పించుకోవాలని చూసింది. ఆమెను ముఖోపాధ్యాయకు అప్పగించారు. అప్పటికే త్రైలోక్య మీద అనుమానాలున్న ముఖోపాధ్యాయ ఆమెను విచారణకు పంపారు. ఈసారీ అదృష్టం ఆమె వైపే ఉంది. ఆమె మరోసారి స్వేచ్ఛగా ప్రపంచంలోకి వచ్చింది. అప్పటికే అనుమానాలు అప్పటికే త్రైలోక్య గురించి దుష్ప్రచారం జరుగుతోంది. త్రైలోక్య ఈసారి చిత్పూర్లోని పంచు ధోబానీ లేన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంది. గతంలో చేసిన నేరాల తాలూకు ధనం ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త నేరం చేయడం కోసం ఎదురు చూస్తోంది. అదే ఇంట్లో నివసిస్తున్న రాజకుమారి అనే మరొక వ్యభిచారి దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కోవాలనుకుంది. రెండుమూడు సార్లు గట్టిగానే ప్రయత్నించింది. విఫలం కావడంతో, కోపంతో ఊగిపోయి, ఆమెను చంపి మరీ నగలు తెచ్చుకుంది. ఈ హత్య జరిగిన కొంత కాలానికి ముఖోపాధ్యాయకు ఈ కేసును అప్పగించారు. త్రైలోక్య ఆ ఇంట్లో ఉంటోందని తెలిసిన మరుక్షణం, ఆమే ఈ హత్య చేసిందని అర్థం చేసుకున్నాడు. పుస్తకంలోని శేష్ లీలా (ద లాస్ట్ యాక్ట్)లో ముఖోపాధ్యాయ త్రైలోక్యను తాను ఏ విధంగా పట్టుకున్నాడో వివరించాడు. పెంపుడు కొడుకు హరిని హత్యానేరంలో ఇరికించినట్లు నటించాడు ముఖోపాధ్యాయ. సంకెళ్లతో ఉన్న హరిని చూసిన త్రైలోక్య మనసు కరిగింది. తాను దాచి ఉంచుకున్న బంగారమంతా పోలీసుల స్వాధీనం చేసింది. ఆ తరవాత తనను మోసం చేశారని తెలియగానే, మళ్లీ తన గత జీవితానికి వెళ్లిపోవాలనుకుంది. ఈలోగా కేసు హైకోర్టుకి వెళ్లింది. బెంగాల్ గవర్నర్ అయిన సర్ అగస్టస్ రివర్స్ థాంప్సన్‌కి క్షమాభిక్ష అప్పీలు చేసింది. ఆమె అదృష్టం శరవేగంతో దూరానికి పరుగులు తీసింది. ఆమెకు ఉరిశిక్ష వేశారు. ఆ రోజు ముఖోపాధ్యాయ ఆమెను జైలు గదిలో చూశాడు. ఒకపక్కన భయంకరమైన హత్యలు చేసింది, మరోపక్క, ఒక మహిళ మరణానికి కారణం అయ్యింది. త్రైలోక్యతో చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆమె తాను చేసిన నేరాలన్నీ ఒకటొక్కటిగా స్వయంగా బయటపెట్టింది. ముఖోపాధ్యాయతో ఆమె పలికిన చివరి మాటలు, ‘హరి బాధ్యతను మీకు అప్పచెబుతున్నాను. అతడిని జాగ్రత్తగా చూడండి. లేదంటే అతడు కష్టాలపాలవుతాడు’ అని. 1884లో త్రైలోక్యను ఉరి తీశారు. – జయంతి -
15 ఓవర్లకు మించి వేయవద్దు!
కోల్‌కతా: భారత్ తరఫున టెస్టుల్లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మొహమ్మద్ షమీ. 9 టెస్టుల్లో అతను 27.60 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన షమీ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో అతను మరింత కీలకం కానున్నాడు. అయితే అనేక సార్లు గాయాలపాలైన షమీ ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి సందేహాలున్నాయి. దాంతో అతని విషయంలో బోర్డు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఆసీస్ టూర్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రంజీ ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్న షమీకి బౌలింగ్ విషయంలో పరిమితులు విధించింది. ఈ నెల 20నుంచి కేరళతో తలపడే బెంగాల్ జట్టు తరఫున షమీ బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా 15 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలని, మరీ తప్పనిసరి అయితే మరో రెండు ఓవర్ల వరకు అదనంగా వేయవచ్చని సూచించింది. పైగా షమీపై అదనపు భారం పడకుండా చూడాలని, ప్రతీ రోజు అతని ఆటను పర్యవేక్షించి బీసీసీఐ ఫిజియో నివేదిక పంపించాలని కూడా ఆదేశాలిచ్చింది. బోర్డు సూచనను తాము పరిగణలోకి తీసుకుంటామని, అయితే షమీ రంజీ మ్యాచ్ ఆడటం అతనికే కాకుండా భారత జట్టుకు కూడా ఉపయోగపడుతుందని బెంగాల్ జట్టు మెంటర్ అరుణ్ లాల్ అభిప్రాయ పడ్డారు. -
మమతా బెనర్జీ (ప.బెంగాల్ సీఎం) రాయని డైరీ
మంత్రులింకా వస్తూనే ఉన్నారు. అత్యవసర సమావేశం అని చెబితేనే ఇంత తాపీగా వస్తున్నారు.. ‘అత్యవసర సమావేశం’ అని కాకుండా, ‘అవసర సమావేశం’ అని చెబితే ‘ఇంకో రోజెప్పుడైనా పెట్టండి మమతాజీ’ అని రిక్వెస్ట్ చేస్తారేమో! ఇంద్రనీల్ హడావుడిగా వచ్చాడు. ‘‘సారీ మేడమ్, మీటింగ్‌కి వస్తూంటే మధ్యలో మీడియా వాళ్లు దారి కాచి, ‘వేడిగా ఒక కప్పు టీ తాగి వెళ్లండి’ అన్నారు. అందుకే ఆలస్యం అయింది’’ అన్నాడు. ‘‘జనరల్‌గా వాళ్లకు మనం టీ తాగిస్తాం. వాళ్లు మనకు టీ తాగిస్తున్నారంటే.. టీ తాగించి మన చేత ఏదో చెప్పించాలని ట్రై చేస్తున్నారన్న మాట. మీరేమైనా వాళ్లతో అన్నారా ఇంద్రనీల్?’’ అని అడిగాను. ‘స్..’ అని ఇంద్రనీల్ చెయ్యి విదిలిస్తూ చూపుడు వేలు కొట్టుకున్నాడు. ‘‘ఎందుకలా చూపుడు వేలు కొట్టుకున్నారు?’’ అని అడిగాను. ‘‘చెప్పకూడని విషయం మీడియావాళ్లకు చెప్పేశానేమోనని..’’ అన్నాడు. ఇంద్రనీల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్. ‘‘అత్యవసర సమావేశం అన్నప్పుడు అది అత్యంత రహస్య సమావేశం అని మీకై మీరే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఉదయాన్నే లేవాలి’’ అన్నాను. ‘‘నేను ఉదయాన్నే లేచాను మేడమ్. మీడియా వాళ్లు నాకంటే ముందు లేచినట్లున్నారు’’ అని మళ్లీ వేలు కొట్టుకున్నాడు ఇంద్రనీల్.. పైకి లేచి నిలబడి. ‘‘మీడియావాళ్లు అలారం పెట్టుకుని లేచేదేం ఉండదు. వాళ్లెప్పుడూ లేచే ఉంటారు. నువ్వు కూర్చో’’ అన్నాడు అమిత్ మిత్రా. ఆయన సీనియర్ మినిస్టర్. ఇంద్రనీల్ అంటే ఆయనకు పడదు. ‘‘మేడమ్.. మీడియా వాళ్లకు నేనేం చెప్పలేదు. మీటింగ్ అని మాత్రమే చెప్పాను’’ అన్నాడు ఇంద్రనీల్.. అమిత్ వైపు ఉక్రోషంగా చూస్తూ. ‘‘గుడ్ ఇంద్రనీల్’’ అన్నాను. అప్పటికి గానీ అతను మాట్లాడ్డం ఆపలేదు. అంతా మళ్లీ అటెన్షన్లోకి వచ్చారు. ‘‘పందొమ్మిదిన మీటింగ్. బీజేపీకి యాంటీగా అందరం కలుస్తున్నాం’’ అన్నాను. ‘‘ఇరవై రెండున కదా మేడమ్ మీటింగ్’’ అన్నాడు ఇంద్రనీల్. అతడి వైపు కోపంగా చూశాడు అమిత్. ‘‘అది చంద్రబాబు నాయుడు పెడుతున్న యాంటీ బీజేపీ మీటింగ్. ఇది మనం పెడుతున్న యాంటీ బీజేపీ మీటింగ్. చంద్రబాబు యాంటీ బీజేపీ మీటింగ్ నవంబర్ ఇరవై రెండున ఢిల్లీలో. మన యాంటీ బీజేపీ మీటింగ్ జనవరి పందొమ్మిదిన కోల్‌కతాలో’’ అన్నాడు. ‘అంత ఇన్ఫర్మేషన్ అవసరమా..’ అన్నట్లు చూశాడు ఆయన వైపు ఇంద్రనీల్. ‘‘బీజేపీకి యాంటీగా ఎవరెన్ని మీటింగులు పెట్టినా, మన మీటింగ్ మనదే. చెడ్డవాళ్లకు వ్యతిరేకంగా మంచివాళ్లు పెట్టుకుంటున్న మీటింగ్ మనది. అందుకే బీజేపీలోని మంచివాళ్లను కూడా మన మీటింగ్‌కి పిలవాలనుకుంటున్నాను. ఏమంటారు?’’ అని అడిగాను. ‘‘అప్పుడు బీజేపీ వాళ్లు మన పార్టీలోని చెడ్డవాళ్లను చేరదీసి బీజేపీకి వ్యతిరేకంగా మనం పెట్టుకునే మంచివాళ్ల మీటింగ్‌కి రాకుండా చేస్తే?’’ అని అడిగాడు ఇంద్రనీల్.. అమిత్ వైపు అదోలా చూస్తూ. ‘‘గుడ్ పాయింట్’’ అన్నాను. అలాగంటేనైనా అతడు మాట్లాడకుండా ఉంటాడని. కానీ మాట్లాడాడు! ‘‘ఢిల్లీలో చంద్రబాబు మీటింగ్ అయ్యాక, మన అత్యవసర సమావేశం అప్పుడు పెట్టుకుని మాట్లాడదాం మేడమ్.. ఆ మీటింగ్‌కి రాని మంచివాళ్లెవరో, ఆ మీటింగ్‌కి వచ్చిన చెడ్డవాళ్లెవరో చూసుకుని’’ అన్నాడు ఇంద్రనీల్. నిజంగా గుడ్ పాయింట్ అనిపించింది! మాధవ్ శింగరాజు -
మోదీ ఆటోగ్రాఫ్.. మ్యారేజ్ ప్రపోజల్స్ వెల్లువ
రాణిబంద్, పశ్చిమబెంగాల్ : ఇటీవల మిద్నాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభలో టెంట్ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో రీటా మూడి అనే 19 ఏళ్ల యువతి కూడా గాయాలపాలైంది. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు మోదీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో రీటా మూడి.. మోదీని ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరింది. ‘దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాడు’.. మీరంతా త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తూ మోదీ రీటాకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విటర్లో పోస్ట్ చేయడంతో.. చుట్టు పక్కల గ్రామాల్లో రీటా సెలబ్రిటీగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి రీటా, ఆమె కుటుంబంతో సెల్ఫీలు దిగేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఇప్పటికిప్పుడే రీటాను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామంటూ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకు వస్తున్నారు. రీటాతో పాటుగా.. ఆమె చెల్లి అనితకు కూడా పెళ్లి సంబంధాలు వెల్లువెత్తడంతో చదువు పూర్తైన తర్వాతే ఆ విషయం గురించి ఆలోచిస్తామంటూ సమాధానమిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఆస్పత్రిలో రీటాకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఎనిమిది సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు కానీ...
డార్జిలింగ్ : ఆయన ఎనిమిది సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.. కానీ ప్రమాదవశాత్తు ఓ హిమనీనదిలో పడి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన పెంబా శెర్పా (47) పర్వతారోహకులలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతాన్ని 8 సార్లు అధిరోహించాడు. మకాలు, కాంచనగంగ వంటి పర్వతాలను కూడా ఎక్కాడు. కొన్ని రోజుల క్రితం పర్వత శిఖరం మీద నుంచి కిందకు దిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ససెర్ కంగ్రి అనే హిమనీనదిలో పడిపోయాడు. అప్పటినుంచి అతని జాడలేకుండా పోయింది. ఐటీబీపీ జవాన్లు, సెర్పాస్ ప్రజలు పెంబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెంబా భార్య మాట్లాడుతూ.. ‘‘ఆయన జూన్ 19న మనాలికి వెళ్తునట్లు తెల్సింది. పెంబా లోయలో పడిపోయినట్లు అతని చిన్న తమ్ముడికి శనివారం ఫోన్ వచ్చింద’’ని ఆమె తెలిపింది. -
సెల్ఫీల కోసం పోటీ.. కొండచిలువ మృతి
కోల్‌కతా : సెల్ఫీల కోసం ఓ కొండచిలువ మృతికి గ్రామస్థులు కారణమయ్యారు. ఈ దారుణ సంఘటన బెంగాల్‌లోని బిర్భమ్ జిల్లా బాబీజోర్ గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు ఆరడుగుల పొడవున్న కొండచిలువ హింగ్లో నది పరివాహక ప్రాంతంలో కొందరు వ్యక్తుల కంటపడింది. కొద్ది నిమిషాల్లోనే ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది. పెద్ద ఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్న గ్రామస్థులు కొండచిలువను పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం దానితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో ప్రజల పోటీ మధ్య కొండచిలువ నలిగిపోయింది. ఎటూ కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా అయినా కూడా కనికరం లేకుండా గ్రామస్థులు దాన్ని హింసించడంతో ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై మాట్లాడిన అటవీ శాఖ అధికారులు కొండచిలువ మృతికి కారణమైన వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల క్రితం బెంగాల్లోనే సెల్ఫీల కోసం యత్నించి జాతీయ పక్షి నెమలి మృతికి కొందరు కారణమైన విషయం తెలిసిందే. అంతలోనే ఈ ఘటన జరగడం జంతువులు, పక్షుల రక్షణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
‘మానవజాతిని అవమానించింది’
కోల్కత్తా : బెంగాల్లో మరో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముర్షిదాబాద్‌కు సమీపంలో మంగళవారం ధోర్మ హజరా అనే బీజేపీ కార్యకర్త అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన హజరా చెరువులో మృతదేహమై కనిపించాడు. హజరాను తృణమూల్ నేతలే హత్యచేశారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు వరస హత్యలకు గురైతున్న నేపథ్యంలో అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘తృణమూల్ కాంగ్రెస్ మరోసారి మానవ జాతిని అవమానపరిచింది. అత్యంత అనాగరికంగా మరో బీజేపీ కార్యకర్తను హత్య చేసింది. బెంగాల్ మరోసారి హింసాత్మకంగా, క్రూరంగా మారింది. హజరాకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే బెంగాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు, బీజేపీ నేత ముఖుల్ రాయ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఢిల్లీలో భేటి అయ్యారు. ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు టీఎంసీ హత్యా రాజకీయలు చేస్తోందని హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీఎంసీ జిల్లా పరిషత్ చైర్మన్ షహనాజ్ భేగం అన్నారు. బీజేపీ కార్యకర్త హత్యతో తమ పార్టీకి ఏలాంటి సంబంధం లేదని, అనవసరపు ఆరోపణలు చేస్తే పరవు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటి వరకూ ఒక్కరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదని బీజేపీ నేతలు తెలిపారు. -
కాంగ్రెస్‌తో దోస్తీకి సై?
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని ఢీకొట్టాలంటే విభేదాలు పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్, తృణమూల్ పొత్తుపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రాజన్ చౌదరి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం ప్రచురించింది. తృణమూల్‌తో పొత్తుకు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు సానూకూలంగా ఉన్నట్లు, టీఎంసీతో కలిసి పోటీ చేస్తే పార్టీ ఓటింగ్ శాతంకూడా పెరిగే అవకాశం ఉందని రాజన్ చౌదరి అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. ఇదే అంశపై టీఎంసీతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మొనీహుల్ హక్, అబూ హసిమ్ ఖాన్లు టీఎంసీ ప్రధాన కార్యదర్శి మంత్రి పార్థ ఛటర్జీతో గురువారం సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తృణమూల్‌తో పొత్తుకు అధిష్ఠానం అంగీకరించే అవకాశం ఉన్నట్లు సదరు వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. కాగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-తృణమూల్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్‌తో విభేదించిన మమత 2012లో యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకువచ్చారు. 2016లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌తో వామపక్షాల కూటమి?
కోల్‌కతా: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై వామపక్ష పార్టీలు సీరియస్‌గా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను ఎదుర్కొనేందుకు తప్పని పరిస్థితుల్లో పొత్తుగా పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నట్లు బోగట్టా. అయిష్టంగానే... 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కంచుకోట పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో ఒప్పందం ప్రకారం లెఫ్ట్ ఫ్రంట్ మరియు సీపీఎంలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశాయి. కానీ, ఎన్నికల్లో కూటమి కన్నా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ లాభపడింది(ఎక్కువ ఓట్లు పోలయ్యాయి). దీంతో మరోసారి పొత్తు తెరపైకి రాగా.. పునరాలోచన చేసుకోవాలని వామపక్ష ఫ్రంట్(ఫార్వర్డ్ బ్లాక్.. ఆర్పీఎస్.. మరికొన్ని చిన్న పార్టీలు) సీపీఎంకు సూచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారంపై సీపీఎంలో భేదాభిప్రాయాలు వ్యక్తం కావటం చూశాం. అయితే బీజేపీ, టీఎంసీలను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గమని ఓ వర్గం నేతలు బలంగా వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై బెంగాల్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి స్వపన్ బెనర్జీ మాట్లాడుతూ..‘పొత్తులో భాగంగా వామపక్షా పార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు పడుతున్నాయి. కానీ కాంగ్రెస్ వైపు నుంచి మాకు ఓట్లు పడటం లేదు. పొత్తు వల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే లబ్ధిచేకూరుతోంది’ అని అన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ పెద్దలదేనని ఆయన స్పష్టం చేశారు. -
వివాదంగా మారిన యోగా డే లేఖ
కోల్‌కతా : బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రాసిన లేఖ అధికార పార్టీ, గవర్నర్ మధ్య వివాదానికి దారి తీసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను జరుపుకోవడానికి సన్నాహకాలు ముమ్మరం చేయాలని, ఈ ఏడాది యోగా డేను విజయవంతంగా జరపాలని గవర్నర్ త్రిపాఠి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లకు లేఖ రాశారు. గవర్నర్ తీరును అధికార తృణమూల్ తప్పుబట్టింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ..‘ యూనివర్సిటీలకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలను రావాలి. లేఖలు రాసే అధికారం వారికే ఉంటుంది. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలపై గవర్నర్ జోక్యం తగదు. అలా చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడట్లే. యోగా డేను నిర్వహించాడానికి సీఎం మమత బెనర్జీ అన్ని ఏర్పాట్లు చేశారు’ అని అన్నారు. గవర్నర్ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నాని టీఎంసీ ఆరోపిస్తోంది. కాగా యోగా డే నిర్వహణపై గతంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. -
బెంగాల్లో రాజకీయ హత్య?
కోల్‌కతా : బెంగాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్త రాజకీయ హత్య సంచలనం రేపుతోంది. పురులియా జిల్లాలోని దాభా గ్రామంలో శనివారం దులాల్ అనే వ్యక్తి విద్యుత్ స్తంభానికి ఉరి వేసి వేలాడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో త్రిలోంచల్ అనే బీజేపీ కార్యకర్త చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, దులాల్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేతల హస్తం ఉందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఎంసీ నేతలే ఇరువురు కార్యకర్తలను హతమార్చి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై వెంటనే సీబీఐపై దర్యాప్తుకు ఆదేశించాలని స్థానిక బీజేపీ నేత రాహుల్ సిన్హా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యకర్తల మృతిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని షా మండిపడ్డారు. కాగా, బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు. బీజేపీ కార్యకర్తల మరణాలతో తృణమూల్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల విచారణలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వరుస అనుమానాస్పద మృతి సంఘటనలపై వెంటనే దర్యాప్తు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ను ఆదేశించారు. వరుస ఘటనలపై దర్యాప్తును ప్రారంభించిన ఎస్పీ జాయ్ బిశ్వాస్.. మొదటి ఘటనపై హత్య అనుమానాలు(వ్యక్తిగత కక్ష కారణంతో హత్య) ఉన్నాయని, రెండో ఘటన ఆత్మహత్యలా ఉందని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం విచారణను ముమ్మరం చేస్తామని వెల్లడించారు. Distressed to know about yet another killing of BJP karyakarta Dulal Kumar in Balrampur, West Bengal. This continued brutality and violence in the land of West Bengal is shameful and inhuman. Mamata Banerjee’s govt has completely failed to maintain law and order in the state. pic.twitter.com/jrA1prcs91 — Amit Shah (@AmitShah) June 2, 2018 -
ఎన్నికలకు ముందే మమత విజయం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బెనర్జీ మరోసారి తన సత్తా చూపించారు. మే 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నామినేషన్ గడువు శనివారంతో ముగియడంతో ఎన్నికల కమిషన్ నామినేషన్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. మొత్తం 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాష్ట్రంలో టీఎంసీ కార్యకర్తలు విపక్ష అభ్యర్థులను నామినేషన్ వేయకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీఎంసీ కార్యకర్తల చర్యలకు భయపడి అభ్యర్థులు నామినేషన్ వేయడానికి భయపడ్డారని, తృణమూల్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ ఆధీర్ రాజన్ చౌదరీ విమర్శించారు. టీఎంసీ నేతలు సామాన్యుల రాజకీయ హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల బీర్బూమ్‌లో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయలైన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 58,693 స్థానాలకుగాను అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి 72,000, బీజేపీ నుంచి 35,000, వామపక్ష పార్టీల నుంచి 22,000, కాంగ్రెస్ నుంచి 10,000 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. నామినేషన్ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఎన్నికల కమిషన్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని లోకసభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ విమర్శించారు. -
బెంగాల్లో ఓ మహిళపై అమానుష దాడి
-
13 ఏళ్ల తర్వాత...
కోల్‌కతా: జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో కేరళ 4–2తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్‌పై నెగ్గి ఆరోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కేరళ తరఫున 19వ నిమిషంలో ఎస్. జితిన్ గోల్ సాధించడంతో తొలి అర్ధభాగంలో కేరళ ఆధిపత్యం సాగింది. రెండో అర్ధభాగంలో బెంగాల్ తరఫున 68వ నిమిషంలో జితెన్ ముర్మూ గోల్ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. అదనపు సమయంలో బెంగాల్ తరఫున రాజన్ బర్మన్ (112వ ని.లో), కేరళ తరఫున విబిన్ థామస్ (117వ ని.లో) చెరో గోల్ సాధించడంతో మ్యాచ్ 2–2తో మళ్లీ సమమైంది. దీంతో షూటౌట్ ద్వారా విజేతను తేల్చారు. షూటౌట్లో కేరళ తరఫున రాహుల్ వి రాజ్, జితిన్ గోపాలన్, జెస్టిన్ జార్జ్, ఎస్. సిసాన్ గోల్స్ సాధించగా... బెంగాల్ తరఫున తీర్థాంకర్, సాంచయన్ సమద్దర్లు మాత్రమే గోల్ చేయడంలో సఫలమయ్యారు. దీంతో 4–2తో కేరళ విజయం ఖాయమైంది. -
బిజీ సీరియల్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
కోల్‌కతా : బెంగాలీ బిజీ సీరియల్ ఆర్టిస్ట్ మౌమితా సాహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం కోల్‌కతాలోని రీజెంట్ పార్క్‌లో ఉన్న అపార్ట్మెంట్లో ఆమె ఉరి వేసుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మౌమితా(23) ఆ అపార్ట్మెంట్లో గత కొద్ది నెలలుగా ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె అరడజనుకు పైగా సీరియళ్లలో నటిస్తున్నారు. బిజీ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. తన సోషల్ మీడియాలో వైరాగ్యపు పోస్టులు చేసినట్లు తెలుస్తోంది. అనుమానాదాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు కాల్ లిస్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. -
షాక్ తిన్న అనుష్క
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి అనుష్క ఓ బెంగాలీ న్యూస్ పత్రికపై మండిపడ్డారు. తాను ఇవ్వకపోయినప్పటికీ.. ఇచ్చినట్లు ఫేక్ ఇంటర్వ్యూ ను ప్రచురించినందుకు అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తాజాగా ఇండియా టైమ్స్ కు చెందిన ఇఐ సమయ్ అనే బెంగాలీ పత్రిక అనుష్క ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూ ప్రచురించింది. దీనిపై స్పందించిన అనుష్క తాను అసలు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘ఆ కథనం చూసి షాక్ తిన్నా. నా వ్యక్తిగత విషయాలు నేను ఎవరితోనూ పంచుకోలేదు. అదంతా అబద్ధం’ అంటూ ఆమె తెలిపారు. కోహ్లితో అనుష్క ప్రేమ వ్యవహారం.. వైవాహిక జీవితం... ముఖ్యంగా ఆ మధ్య ఇద్దరు వీరవిహారం చేస్తున్న ఛుంబనంతో దిగిన ఫోటోపై కూడా ఆమె ప్రస్తావించిందంటూ ఆ కథనం పేర్కొంది. అయితే వారిపై లీగల్ చర్యలు తీసుకునే ఉద్దేశ్యంపై మాత్రం ఆమె స్పందించలేదు. ప్రస్తుతం ఆమె దర్శకుడు శరత్ కఠారియా రూపొందిస్తున్న సూయి ధాగా చిత్రంలో వరణ్ ధావన్ సరసన నటిస్తోంది. It is SHOCKING to see a completely fabricated interview of mine in a reputed publication like @Ei_Samay. This is to clarify that I have NEVER done an interview on my personal life with them or with anyone else. Just shows how carelessly your personal freedom is looked at by them. pic.twitter.com/ncmcuuJvVs — Anushka Sharma (@AnushkaSharma) March 9, 2018 -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
కోల్కత్తా : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో నలుగురు మహిళలకు, ఇద్దరు మైనర్ బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరి చేత కోల్‌కత్తాలోని డండం ప్రాంతంలో వ్యభిచారం చేయించేందుకు నిర్వాహకులు తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసి బెంగాల్ సీఐడీ ఆఫీసర్లు దాడులు నిర్వహించడంతో విషయం బయటపడింది. 12 మంది నిర్వాహకుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నిర్వాహకులంతా బెంగాల్‌లోని వివిధ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఒక్క చోట చేరి తేలికగా డబ్బులు సంపాదిద్దామని ఈ వ్యాపారంలోకి దిగినట్లు చెప్పారు. వ్యభిచార నిర్వాహకుల నుంచి రూ.2.28 లక్షల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకుని వ్యభిచారం జరిగిన హోటల్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యకు కడుపు నొప్పి .. కిడ్నీ కొట్టేసిన భర్త
కోల్‌కతా : అడిగినంత కట్నం ఇవ్వలేదని భార్య కిడ్నీనే దొంగిలించాడు కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రీటా సర్కార్ (28), బిస్వజిత్లకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రీటా తల్లిదండ్రులు రూ. 2 లక్షల కట్నం డబ్బు ఇవ్వలేదని అత్తింటివారు తరచూ వేధించేవారు. రెండేళ్ల కిందట రీటాకు కడుపునొప్పి రావడంతో బిస్వజిత్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే కడుపు నొప్పికి అపండిసైటిస్ ఆపరేషన్ అని చెప్పి కిడ్నీ అమ్ముకుని కట్నం డబ్బుల కింద జమ చేసుకున్నాడు. 'అపండిసైటిస్ ఆపరేషన్ తర్వాత నొప్పి తీవ్రత మరింత పెరిగింది. సర్జరీకి సంబంధించిన విషయాన్ని ఎవరితోనూ చెప్పొదని నా భర్త తరచూ హెచ్చరించేవాడు. నొప్పి భరించలేకపోతున్నానని మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లమని ఎంత ప్రాధేయపడినా ఒప్పుకునే వాడు కాదు' అని రీటా పేర్కొన్నారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో రీటాని బంధువులు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కిడ్నీ ఒకటి మిస్సయిందని డాక్టర్లు చెప్పడంతో రీటా షాక్‌కు గురైంది. కట్టుకున్న భర్తే మోసం చేశాడని తెలియడంతో తట్టుకోలేకపోయింది. ఈ ఘటనపై ఫరక్కా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రీటా భర్త బిస్వజిత్తోపాటూ అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రీటాకి సర్జరీ చేసిన ఆసుపత్రిపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిస్వజిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ నేరం వెనక కిడ్నీలను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ హస్తం ఉందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. బాధితురాలు రీటా సర్కార్ -
బెంగాల్‌పై తెలంగాణ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్‌నగర్‌లో శనివారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తెలంగాణ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండింటిలో పరాజయం పాలైంది. పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 11–9తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో 4–13తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది. మహిళల విభాగంలోనూ మహారాష్ట్ర 10–6తో తెలంగాణ జట్టుపై విజయం సాధించింది. ఇతర మహిళల మ్యాచ్‌ల్లో కర్ణాటక 12–2తో పశ్చిమ బెంగాల్‌పై, పశ్చిమ బెంగాల్ 22–3తో ఢిల్లీపై, కర్ణాటక 19–4తో విదర్భపై, పశ్చిమ బెంగాల్ 4–0తో విదర్భపై, విదర్భ 8–7తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందాయి. -
పట్నా పైరేట్స్‌కు షాక్
చివరి నిమిషంలో బెంగాల్ అనూహ్య విజయం ∙ప్రొ కబడ్డీ లీగ్ కోల్‌కతా: మ్యాచ్ ముగిసేందుకు ఇక 90 క్షణాలే మిగిలున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ 38–35 స్కోరుతో గెలుపు ఖాయం చేసుకుంది. కానీ అనూహ్యంగా విజయానికి చేరువైన పైరేట్స్ సెకన్ల వ్యవధిలో దూరమైంది. బెంగాల్ వారియర్స్ 41–38 స్కోరుతో పైరేట్స్‌కు షాకిచ్చింది. రైడర్ మణిందర్ సింగ్ చివర్లో మెరుపు వేగంతో తెచ్చిపెట్టిన పాయింట్లు వారియర్స్‌ను గెలిపించాయి. మ్యాచ్ మొత్తం మీద 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన మణిందర్ 13 పాయింట్లు సాధించాడు. జాంగ్ కున్ లీ (6), వినోద్ కుమార్ (5), రాన్ సింగ్ (4) రాణించారు. పట్నా జట్టులో పర్దీప్ నర్వాల్ (11) రైడింగ్‌లో అదరగొట్టాడు. మోను గోయత్ 5, జైదీప్ 3, విశాల్ మనే 2 పాయింట్లు చేశారు. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
మొహర్రం నాడు నిమజ్జనానికి నో!
ఒకేరోజున దుర్గామాత నిమజ్జనం, మొహర్రం రావడంతో.. మమత సర్కారు నిర్ణయం.. మండిపడుతున్న బీజేపీ కోల్‌కతా: హిందువులు ఘనంగా నిర్వహించే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ముస్లింలు భక్తిపూర్వకంగా సంతాపం పాటించే మొహర్రం ఒకేరోజున రావడం పశ్చిమ బెంగాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజున రావడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం దుర్గాపూజ నిర్వాహకులు, ముస్లిం మతపెద్దలు, ఇతర మతాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు వేడుకలు ఒకేరోజున ఉన్న నేపథ్యంలో మతసామరస్యాన్ని పాటించే దిశగా వ్యవహరించాలని ఆమె కోరారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభం అవుతుందని, అయితే, అక్టోబర్ 1న మొహర్రం దృష్ట్యా ఆ రోజు విగ్రహాల నిమజ్జనానికి అనుమతించబోమని, అక్టోబర్ 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యథాతథంగా నిమజ్జనం సాగుతుందని ఆమె ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మత ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 1న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం, మొహర్రం ఊరేగింపులు ఎదురుపడితే.. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, మమత నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా హిందు, ముస్లింలను విడగొట్టడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మమత సర్కారు ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. -
'ప్రాణాలైనా ఇస్తా, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను'
చోప్రా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభజనకు తాను ఎన్నడూ మద్దతునివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం పోరాడుతున్న డార్జిలింగ్ కొండప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో కొనసాగుతున్న నిరవధిక బంద్ 48వ రోజుకు చేరుకోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఏదిఏమైనా కానివ్వండి.. నా ప్రాణాలైనా ఇస్తాను కానీ, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు మద్దుతునివ్వను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జిల్లా మన ఆస్తి. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. భారతదేశం అంటే ఇదే. దీనిని కాపాడుకోవాలి కానీ విడగొట్టకూడదు. బెంగాల్‌లోని ఇతర జిల్లాల మాదిరిగానే కొండప్రాంతాన్ని ప్రేమిస్తాను. డార్జిలింగ్ హిల్స్ పశ్చిమ బెంగాల్లో భాగం. భవిష్యత్తులోనూ అదే కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి' అని దినాజ్‌పూర్ జిల్లా చోప్రా ప్రాంతంలో జరిగిన సభలో మమత అన్నారు. డార్జిలింగ్ అభివృద్ధి కోసం తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు. -
ఫేక్ పోస్ట్ ఫలితం: బీజేపీ నేత అరెస్టు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోసేందుకు ఫేస్బుక్లో ఫేక్ వార్తలను పోస్ట్చేసిన వారి అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్లో తప్పుడు వార్తను పోస్ట్చేసిన భారతీయ జనతా పార్టీ సమాచార, సాంకేతిక (ఐటీ) విభాగం కార్యదర్శి తరుణ్ సేన్ గుప్తాను బుధవారం బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లాలో ఓ మహిళపై నడివీధిలో కీచకపర్వం కొనసాగుతోందంటూ భోజ్‌పురి సినిమాలోని ఓ దశ్యాన్ని పోస్ట్ చేసిన 38 ఏళ్ల యువకుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆ పోస్ట్‌ను ఫేస్బుక్లో తీవ్రంగా షేర్ చేసిన హర్యానా బీజేపీ నాయకుడు విజేత మాలిక్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్లు తెల్సింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్ నేడు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ 2002 గుజరాత్ అల్లర్ల ఫొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై మంగళవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెల్సిందే. మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద చిత్రంవేసి రాష్ట్రంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులకు ఎంత దారుణంగా హింసించారో చూడండంటూ తప్పుడు ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్చేసిన యువకుడిని కూడా మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన యువకుడికి అసలు తల్లేలేదని తెల్సింది.