caste
-
దళిత విద్యార్థి వేళ్లు నరికేశారు
తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్‌ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్‌పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్ కుటుంబం ఆరోపించింది. -
ఒకే కులం పెళ్లిళ్లతోనూ వ్యాధులు
సాక్షి, హైదరాబాద్: ‘బంధువుల అమ్మాయే. అన్నీ కుదిరాయి. అందుకే చేసుకుంటున్నాం.. మా కులపువాళ్లే. అమ్మాయి బాగుంటుంది. సంబంధం ఖాయం చేశాం.. పెళ్లిళ్ల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.ఒకే కులం (Same Caste)లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం (కులాలతో పాటు చిన్నచిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది) వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నాలుగు వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చ తెలిపారు.కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు/మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్‌కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA& B27:04 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక సామాజికవర్గం వాళ్లలో ఈ స్పాండిలైటిస్ (spondylitis) ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పని చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ పేర్కొన్నారు. చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైంది -
కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ: Revanth Reddy
-
తెలంగాణ కులగణన.. ఆ లెక్కలు వాళ్లే చెప్పాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కులగణన.. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాలకు రిఫరెన్స్‌గా మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టి.. చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.ఈరోజు దేశం చరిత్రలో నిలిచిపోతుంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు న్యాయం జరగనుంది. ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుంది. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుంది. భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలి.2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశాం. 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలి. కోర్టు ఇచ్చిన క్లిమిలేయర్ ను తిరస్కరించాం బీసీ రిజర్వేషన్ల పై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేశాం. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ కి రాని వాళ్లు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే వాళ్ల గతి ఏంటో? అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్‌గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్‌ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్‌కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు. శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు ‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే. పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ పేదరికం 5 శాతమే ‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
సమగ్ర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఇళ్లకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు సర్వే పనుల్లో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో కూడా స్టిక్కర్లు వేసే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్‌లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబాలను నమోదు చేసి, వారి ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో కూడిన జాబితాను తయారు చేయనున్నారు. ఈ జాబితా పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు. ఆ తర్వాత రెండోదశలో ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో లభించిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లను గుర్తించగా, జీహెచ్ఎంసీలో 19,328, ఇతర ప్రాంతాల్లో 67,764 ఉన్నాయి. ఈ బ్లాక్‌ల వారీగా సర్వే చేసేందుకు 94,750 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. 24,488 మందిని జీహెచ్ఎంసీలో నియమించగా, ఇతర ప్రాంతాల్లో 70,262 మందిని నియమించారు. వీరి సహకారంతో రాష్ట్రంలోని 1,17,44,954 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. -
కులగణనకు ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు. నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన.. రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్‌ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరికొన్ని నిర్ణయాలు.. ⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. ⇒ మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు. ⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు. ⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. -
జైళ్లా... కులతత్వ కూపాలా!
కులతత్వం బందీఖానాలో మగ్గుతున్న మన జైళ్లకు ఎట్టకేలకు ‘విముక్తి’ లభించినట్టే! రాజ్యాంగం అమల్లోకొచ్చి 74 యేళ్లవుతున్నా మనుస్మృతిని మించి ఆలోచించని మన కారాగారాల దివాంధ త్వాన్ని ఎండగడుతూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఖైదీల పుట్టుక ఆధారంగా వారిపై వివక్ష ప్రదర్శించటం, పనులు అప్పజెప్పటం రాజ్యాంగ విరుద్ధమనీ, ఈ దురాచా రాన్ని మూడు నెలల్లో కట్టిపెట్టి ఆ సంగతి తెలియజేస్తూ నివేదికలు దాఖలు చేయాలనీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ ఆదేశించటం హర్షించదగ్గ పరిణామం. జైళ్లు సంస్కరణాలయాలంటారు. నేరాలకు పాల్పడుతూ సమాజానికి తలనొప్పిగా మారిన వ్యక్తులను సంస్కరించటం ధ్యేయంగా కారాగారాలు ఏర్పడ్డాయి. కానీ అక్కడా బయటి సమాజంలాగే కులం కుళ్లు నిండివుందనీ, దాని ఆధారంగా భయంకరమైన వివక్ష కొనసాగుతున్నదనీ... రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘిస్తూ జైళ్లలో అంట రానితనం, వెట్టిచాకిరీ రాజ్యమేలుతున్నాయనీ ఆంగ్ల వెబ్సైట్ ‘ది వైర్’లో పనిచేస్తున్న పాత్రికేయు రాలు సుకన్యా శాంత నాలుగేళ్ల క్రితం పరిశోధనాత్మక కథనం రాశారు. దాని ఆధారంగా నిరుడు సుప్రీంకోర్టులో ఆమె ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పర్యవసానంగానే తాజా తీర్పు వెలువడింది. వలస పాలకుల హయాంలో ఎప్పుడో 1894లో రూపొందిన కారా గారాల చట్టం ఆధారంగా తయారైన మాన్యువల్‌లోని అంశాలే అన్ని జైళ్లలో అమలవుతున్నాయి. వాటిని పాలకులెవరూ పట్టించుకోలేదని కాదు. 2016లో కేంద్రం నమూనా మాన్యువల్‌ను తీసు కొచ్చింది. నిరుడు నమూనా జైళ్ల చట్టం కూడా రూపొందింది. కానీ జైళ్లు, మాన్యువల్స్ ఏమాత్రం మారలేదు. కానీ అడిగేదెవరు?నిర్బంధానికీ పుట్టకకూ, నిర్బంధానికీ నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ నిస్సహాయతకూ మధ్య అవినాభావ సంబంధం ఉన్నదని మన దేశంలో పదే పదే రుజువవుతోంది. జైలు శిక్షలు అనుభవిస్తు న్నవారు మాత్రమే కాదు, విచారణలో ఉన్న ఖైదీల్లో సైతం అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అట్టడుగు కులాలవారూ, ఆదివాసీలూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈ వర్గాలవారు దాదాపు 65 శాతం వరకూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఈ వర్గాల సగటు 32 శాతానికి మించదని అనేక నివేదికలు చెబుతున్నాయి. యూపీఏ ఏలుబడిలో చేయని నేరానికి అరెస్టయి తొమ్మిదేళ్లపాటు ఢిల్లీ, మహారాష్ట్ర జైళ్లలో మగ్గిన పౌరహక్కుల నాయకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాక మీడియా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించింది జైళ్లలోని కుల వివక్ష గురించే. జైళ్లలో కుల వ్యవస్థ అమలవుతోందనీ, ఖైదీలకు కులాన్నిబట్టి పనులు ఇవ్వాలని మాన్యువల్‌లో సైతం ఉన్నదనీ ఆయన చెప్పినప్పుడు అందరూ నివ్వెరపోయారు. స్వాతంత్య్రం వచ్చి 77 యేళ్లవుతున్నా ఈ దురాచారాలు అమలవుతున్నాయంటే బయటి సమాజంలో ఉండేవారు నమ్మలేరు. ఇవే దురాచారాలు సాధారణ పౌరులు పాటిస్తే వాటి పర్యవ సానాలు తీవ్రంగా ఉంటాయి. కఠిన శిక్షలు పడతాయి. కానీ ఎంతో నాగరికంగా కనబడే రాజ్యమే కారాగారాల్లో ఈ దారుణాలు అమలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు దారి దోపిడీలు, ఇతరేతర నేరాలు చేస్తున్నవారు ఫలానా జాతులవారు గనుక వారిపై ‘నేరస్త జాతులు’ అనే ముద్రవేశారు వలసపాలకులు. రాజ్యాంగం అమల్లోకొచ్చాక అలాంటి దురాచారం రద్దయింది. కానీ ఇప్పటికీ జైళ్లలో సంచార, నేరస్త జాతులకు చెందినవారిగా కొందరిని వర్గీకరించి వారిని విడిగా ఉంచుతున్నారనీ, వారితో అమానవీయమైన పనులు చేయిస్తున్నారనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. అలాగే జైలు రిజిస్టర్లో కులం గురించిన కాలమ్ ఉండటం, ఖైదీలను కులాలవారీగా విభజించటం, అట్టడుగు కులాలవారితో మరుగుదొడ్లు శుభ్రం చేయించటం, ఇతర పారిశుద్ధ్య పనులు అప్పగించటం యధేచ్ఛగా కొనసాగుతున్నదని ధర్మాసనం గుర్తించింది. పుట్టుక ఆధారంగా వివక్ష ప్రదర్శించరాదని రాజ్యాంగంలోని 15(1) అధికరణ చెబుతోంది. 17వ అధికరణ అంటరానితనం నేరమంటున్నది. వెట్టి చాకిరీ చేయించరాదని 23వ అధికరణ అంటున్నది. ఇంకా 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని, 21వ అధికరణ జీవించే, స్వేచ్ఛగా మసలే హక్కు కల్పించాలని నిర్దేశిస్తోంది. ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ఈ హక్కులను రాజ్యమే ఉల్లంఘించటం ఎంత అపచారం! మహారాష్ట్ర మాన్యువల్ ‘నేరస్త మహిళలు, వ్యభిచార మహిళలు, తార్పుడుగత్తెలు, యువ మహిళా ఖైదీలు’ అంటూ విభజించిందట.‘సాధారణ జైలుశిక్ష పడిన ఖైదీలు కిందికులాల వారైతే తప్ప తక్కువ స్థాయి పనులు అప్పగించరాదని ఉత్తరప్రదేశ్ మాన్యువల్ చెప్తోంది. ఫలానా కులస్తు లను మాత్రమే పారిశుద్ధ్య పనికి వినియోగించాలనీ, కిందిస్థాయి కులాలవారు వండిన ఆహారాన్ని ఆధిపత్య కులాల ఖైదీలు నిరాకరించవచ్చనీ మరో మాన్యువల్ ప్రవచిస్తోంది. వివక్ష వెనక కుల,మత విశ్వాసాలుంటే పట్టించుకోరాదని బెంగాల్ మాన్యువల్ సుద్దులు చెబుతోంది. ఇవన్నీ చూస్తే జైళ్లలో మనకు తెలియని, మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మరో సమాంతర వ్యవస్థ అమల వుతున్నదని అర్థమవుతుంది. ఒక సమాజ నాగరికత స్థాయిని అక్కడి జైలుని చూసి చెప్పవచ్చని విఖ్యాత రచయిత దాస్తోవిస్కీ అన్నాడు. ఇన్ని దశాబ్దాలుగా మన మధ్యే కొనసాగుతూ వచ్చిన ఈ అధమస్థాయి వ్యవస్థ మూడు నెలల్లోపు కాదు, తక్షణం రద్దు కావాలని మానవీయతగల ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
జైళ్లలో కుల వివక్ష వద్దు
న్యూఢిల్లీ: కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది. కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది. పని విషయంలో సమాన హక్కు ఉండాలి ‘‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్ అవసరం లేదు. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుంది. ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి. కులం ఆధారంగా ఖైదీలను వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగించడం తగదు. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కేవలం ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం. కింది కులాల ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15ను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది. -
సమానతే కులానికి ప్రత్యామ్నాయం
కులానికీ, వర్ణానికీ ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్ర పునాదిగా చర్చిస్తే గానీ కులానికి ఉన్న పట్టు మనకు అవగతం కాదు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం, ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. సమానత్వపు విలువలను బోధించే భారత రాజ్యాంగమే కులనిర్మూలనా జీవన విధానానికి దిక్సూచి.భారతదేశంలో కులం మూలాల గురించి చాలా చర్చ జరిగింది. కులం పునాదుల గురించి రాసిన వారిలో వి.ఎ.స్మిత్, జె.హెచ్.హట్టన్, హెచ్.హెచ్.రిజ్లీ, ఎస్.వి. కేత్కర్, జి.ఎస్.ఘుర్యే, జ్యోతిబా ఫూలే, బి.ఆర్.అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా లాంటి ఎందరో ఉన్నారు. హట్టన్ కులాన్ని ఇలా విశ్లేషించారు: ‘‘క్యాస్టు అనే మాట, కాస్టా అనే పోర్చుగీసు శబ్దం నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెన్ డీబోవ కాస్టియ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబంలోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’. 1563లో గార్సియా డి ఓర్టా ‘తన తండ్రి వృత్తి నుండి ఎవడూ మారడు. చెప్పులు కుట్టు ఒకే కులం వారంతా ఒకటే’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిపుడు గ్రహించు పరిమితమైన ‘కులం (కాస్టు)’ అనే అర్థములో వాడుతున్నట్లు కనిపిస్తున్నది. హట్టన్ ‘కాస్ట్ ఇన్ ఇండియా’ అనే గొప్ప గ్రంథం రాశారు. అది ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీసింది. అలాగే రిజ్లీ కులం గురించి ఇలా రాశారు: ‘‘కులం కొన్ని కుటుంబాల సముదాయంగా లేదా కుటుంబ సమూహాల సముదాయంగా ఉండి సామాన్య (ఒకే) నామాన్ని కలిగి ఉంటున్నది. ఒకే మానవుని నుండి లేదా దైవాంశ గల పురాణ పూర్వీకుని నుండి వంశక్రమాన్ని చెప్పుకుంటున్నది. వారస త్వంగా వచ్చిన ఒకే వృత్తిని అనుసరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించుకుంటున్నది.’’. కులం అనేది వర్ణ వ్యవస్థ నుండి రూపొందించబడిందని ఘుర్యే విశ్లేషించారు: ‘రంగు అను అర్థం గల ‘వర్ణం’ సమాజంలోని వర్గాలను వివరించుటకు వాడబడింది. తరువాత ‘జాతి’ పదం పుట్టుకతో వచ్చిన సమూహ సభ్యత్వమును ‘కులము’గా తెలుపుటకు ప్రత్యేక ముగా ఉపయోగించబడింది’. ‘ఒకడు దేనిలో పుడతాడో అది’ అని ‘జాతి’ శబ్దానికి వ్యుత్పత్తి అర్థం. దీనిని ‘వర్ణా’నికి సమానార్థంలో యోగ్యులైన ప్రాచీన సాధికారులు అడపా దడపా వాడారు.ఈ కులం మూలాల మీద జరిగిన చర్చ తరువాత కులం మూలాలు వర్ణ వ్యవస్థలో ఉన్నాయనేది స్పష్టమైంది. ఒంటి రంగును బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ప్రత్యేకింపబడినట్లు తెలుస్తుంది. ‘కపిల వర్ణం బ్రాహ్మణుడు, అరుణ వర్ణం క్షత్రియుడు, గోధుమ వర్ణం వైశ్యుడు, కృష్ణ వర్ణం శూద్రుడు’ అని నామలింగాను శాసనం చెబుతుంది. ఈ సందర్భంగా సామాజిక శాస్త్రవేత్తలు పంచమ వర్ణం ఎలా పుట్టిందో చర్చించారు. వర్ణశబ్దం ఋగ్వేదంలో ప్రార్థ, మలాని ఆర్యులకూ, దస్యులకూ తేడాని తేల్చేదిగా వాడారు. ఋగ్వేదం పదవ మండలం రచనా కాలానికి 4 వర్ణాలు పేర్కొన బడ్డాయి. నాలుగు వర్ణాలలో మూడు ఆర్య వర్ణాలు కాగా నాల్గవది ఆర్యేతర వర్గం. అందుకే ఈ నాల్గవ వర్ణం వారు బ్రహ్మ పాదాల నుండి జనించారని చెప్పబడింది. వీరు ఆర్య సమాజంలో కలిసి నాల్గవ మెట్టులో జీవించే సామాజిక చారిత్రక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వర్ణ సమాజానికి దూరంగా జీవించిన చండాలురు, పిపీలకాదులు, నిషాదులు పంచములుగా పిలవబడి ఆ తరువాత కాలంలో అస్పృశ్యులు అయి నారు. వీరిని ఋగ్వేద కాలంలో వైదికార్యులు అస్పృశ్యులుగా పరిగణించలేదు, పంచజనులుగా మాత్రమే పరిగణించారు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అవి శాఖలుగా ఉపశాఖలుగా వంశపారంపర్య తత్వంతో అంతశ్శాఖ వివాహ సంబంధాలు మాత్రమే కలిగి కుంచించుకు పోయాయి. ఆర్యులు వర్ణతత్వాన్ని భారతదేశానికి మోసుకు రాకముందు ఈ విధమైన విభజన భారతదేశంలో లేదు. అంబేడ్కర్ భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఈ సంద ర్భంగా ఆయన అప్పటికి ప్రసిద్ధంగా ఉన్న అన్ని పార్టీల సిద్ధాంతాల తోనూ, నాయకులతోనూ పోరాడారు. మహత్మాగాంధీకి సమాధాన మిస్తూ తన కులనిర్మూలనా వాదనను లేఖ ద్వారా తెలియజేశారు:‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయినప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకొనే శక్తినీ, సామర్థ్యాన్నీ సంతరించుకోగలదు. ఆంతరంగికమైన బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా, అది మళ్ళీ దాస్యం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యడమే కావచ్చు. బాగా ఆలోచించండి’ అని గాంధీకి విన్నవించారు. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. కులం చేత పీడింపబడుతున్న వారిలో అస్పృశ్యులుగా చెప్పబడుతున్న పంచమ వర్ణులు ప్రధానంగా ఉన్నారని గుర్తించారు. అస్పృశ్యతను పాటించడం వల్ల భారతదేశంలో సోషలిజం రాదని కూడా చెప్పారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. బుద్ధుడు, మహత్మా ఫూలే స్ఫూర్తితో అంబేడ్కర్ తన సిద్ధాంతాలు రూపొందించు కున్నారు. భూములను జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి, స్త్రీలకు సమాన హక్కులు కలుVýæజేయండి, బహుజనులు రాజ్యాధికారానికి సొంతంగా ఉద్యుక్తులు కండి అని ప్రబో ధిస్తూ వెళ్ళారు. రామ్ మనోహర్ లోహియా తన ‘కులాల సమస్య’ గ్రంథంలో భారత రాజకీయాలు కులాల గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నా యని రాశారు. ప్రజా సోషలిస్టు, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు కూడా కులీనులు, ధనవంతుల గుప్పిళ్లలోనే ఉన్నాయి. ఒకప్పుడు పండిత నెహ్రూ కూడా దేశంలో విప్లవ నాయకుడుగానే ఉండేవారు. కాంగ్రెసులోని ఈ నాయకులే సమానత్వం గురించి మాట్లాడుతూ ఉండేవారు. కాని ఇప్పుడు వారు ఎలా మారిపోయారు? వర్గ స్వభావం, వర్గ పక్షపాతం ఎప్పుడూ అంతరించవు. రామ్ మనోహర్ లోహియా రాజకీయాల్లో కులాధిపత్యాన్ని నిర్మూలించి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పారు. పెరియార్ రామ స్వామి నాయకర్ 1924 మార్చిలో కేరళలో అస్పృశ్యత నివారణ కోసం ‘వైకోమ్’ ఉద్యమం నడుపుతూ, ఆత్మగౌరవ పోరాటానికి పిలుపు నిచ్చారు. ‘‘ఆత్మగౌరవం పట్ల అవగాహన ఉంటేనే స్వతంత్రం గురించి మాట్లాడగలుగుతాం. అయితే ఇప్పుడు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నవాళ్ళు ఆత్మగౌరవాన్ని విస్మరిస్తున్నారు. ఆత్మగౌరవం లేని స్వతంత్రానికి అర్థమే లేదు’’ అని ఆయన ఆనాటి కాంగ్రెస్ నాయకులకు చురకలు వేశారు. తన ఇరవై యేళ్ళ వయస్సులోనే కాంగ్రెస్ సభలో రామాయణం, మహాభారతం, పురాణాలు, శాస్త్రా లను తీవ్రంగా విమర్శించేవారు.నిజానికి భారతదేశంలో కుల నిర్మూలనా ఉద్యమాలుగా నడిచిన బౌద్ధం, జైనం, సాంఖ్యం ప్రేరణతో... ఫూలే, పెరియార్, లోహియా భావజాలంతో అంబేడ్కర్ మార్గంలో నడిస్తే ప్రత్యామ్నాయ సంస్కృతి రూపొందుతుంది. బహుజన రాజ్యాధికారాన్ని అనతి కాలంలో సాధించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో, సామాజిక వ్యవస్థల్లో, అన్ని మతాల్లో, పార్టీల్లో కులతత్వం చొచ్చుకుపోవడానికి కారణం అంబే డ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోకపోవడమే. అందుకే కులం పునా దుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని అంబేడ్కర్ చెప్పారు. కులానికి ప్రత్యామ్నాయంగానే ఆయన లక్ష పేజీల వాఙ్మయాన్ని రచించారు. కులనిర్మూలనా సిద్ధాంతకర్తగా పేరు పొందారు. అంబేడ్కర్ రచించిన రాజకీయ ప్రణాళికల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. ఆయన బౌద్ధ సూత్రాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. భారత రాజ్యాంగమే కుల నిర్మూ లనా జీవన విధానానికి దిక్సూచి. ఆ మార్గంలో నడుద్దాం!డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
కులగణన కోసం 14న సత్యాగ్రహం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 14న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి ఎన్.సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, అభినేష్»ొమ్మ ప్రవీణ్ కుమార్ తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్స్‌పై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్లను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల గణన చేయాలని కోరారు. -
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’ – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్క్లాస్లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.తొలుత దీనిపై (పంజాబ్ వర్సెస్ దేవీందర్‌సింగ్ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్‌లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.నెహ్రూ వ్యాఖ్యలను కోట్ చేస్తూ..‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ‘‘షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రారిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలిఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్‌గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్ పంకజ్ మిత్తల్క్రీమీలేయర్ వర్తింపజేయాలివెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్ బీఆర్ గవాయిఉప వర్గీకరణకు అనుకూలంషెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది. – జస్టిస్ విక్రమ్నాథ్తగిన డేటా సేకరించి అమలు చేయాలిరిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి. – జస్టిస్ సతీశ్చంద్రరాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదుఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్ బేలా ఎం త్రివేది -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. కేసు ఏంటంటే..వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఫిబ్రవరిలో..ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై మూడురోజులపాటు వాదనలు జరగ్గా.. ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది.కేంద్రం వాదనలుఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది. -
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ క్యాంపెయినర్లకు ఒక నోట్ జారీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున్ ఖర్గే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘నవనీత్ కౌర్’ నామినేషన్.. సినిమా రేంజ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
ముంబై : మహరాష్ట్ర అమరావతి లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి ‘నవనీత్ కౌర్’ నామినేషన్ ప్రక్రియ ఓ సినిమాను తలపించింది. ఆమె నామినేషన్ చివరి నిమిషం వరకు ఎదురు చూపులు, ఉత్కంఠత కొనసాగింది. కుల ధృవీకరణ అంశంలో సుప్రీం కోర్టు కౌర్‌కు అనుకూలంగా తీర్పివ్వడంతో విజయ గర్వంతో నామినేషన్ వేశారు. నవనీత్ కౌర్ అమరావతి లోక్‌సభ అభ్యర్ధిగా గురువారం నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్ ముందు ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు సుప్రీం కోర్టులో కుల ధృవీకరణపై విచారణ, మరోవైపు లోక్‌సభ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు చివరి రోజు (ఏప్రిల్4). ఈ తరుణంలో కౌర్ నామినేషన్ వేసేందుకు ఉదయం బయలు దేరారు. ఆమె అభ్యర్ధిత్వం సుప్రీం కోర్టు కీలకం కావడంతో స్థానిక దసరా గ్రౌండ్లో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు తన మంది మార్బలంతో మధ్యాహ్నాం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 2021 జూన్ 8న నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రవీకరణ పత్రాలు ఉపయోగించారంటూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. మోసపూరితంగా వ్యవహరించారంటూ రూ.2లక్షల జరిమానా విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ కౌర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 11.58 గంటలకు విచారణ ప్రారంభం ఈ కేసు విచారణ గురువారం జరిగింది. సరిగ్గా 11:58 గంటలకు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పును ప్రారంభించింది. కౌర్ కుల ధృవీకరణ పత్రంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టి వేసింది. నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. నవనీత్ కౌర్దే విజయం దీంతో 1100 కిలోమీటర్ల దూరంలో జరిగే సుప్రీం కోర్టు విచారణతో.. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న నవనీత్ కౌర్, ఆమె అనుచరులు ఆనందం వెల్లివిరిసింది. చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ సాగిన కౌర్‌కు అనుకూలంగా సుప్రీం ప్రకటించింది. ఐదు నిమిషాల వ్యవధిలో దసరా గ్రౌండ్ వేదికపై కెక్కిన ఫడ్నవీస్ కౌర్ విజయం సాధించారంటూ ప్రకటించారు. దీంతో రాణా తన మద్దతుదారులు, బీజేపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం 1:42గంటలకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. 2011లో రాజకీయ రంగ ప్రవేశం 2011లో నవనీత్ కౌర్ బీజేపీ నేత రవి రాణాతో వివాహం అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. తొలిసారి కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్న ఆమె 2014లో అమరావతి నుంచి తొలి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే 2019లో అమరావతి లోక్‌సభ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కాంగ్రెస్,ఎన్సీపీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. అమరావతి లోకసభ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. -
2009 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
2009 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ కు బొటాబొటీ మజార్టీనే వచ్చింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 156 సీట్లు కాంగ్రెస్ కు రాగా, 91 స్థానాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈ ఎన్నికలలో విభజిత ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పక్షాన 106 మంది గెలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున ఏభై మూడు, మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున పదహారు మంది ఎన్నికయ్యారు. 2009లో రెడ్డి, కమ్మ, కాపుల మధ్య పోటీ ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే స్వతంత్ర కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై 31 మంది రెడ్లు, ఇరవై మూడు మంది బిసిలు, ఇరవై రెండు మంది ఎస్.సిలు, ఏడుగురు కాపులు, నలుగురు కమ్మ, ఆరుగురు ఎస్టి.లు,నలుగురు క్షత్రియ ముస్లింలు ముగ్గురు, వైశ్యులు ముగ్గురు, బ్రాహ్నణులు ఇద్దరు గెలిచారు. కాగా తెలుగుదేశం పక్షాన 19 మంది కమ్మ, ఎనిమిది మంది రెడ్లు, పది మంది బిసిలు, ఏడుగురు ఎస్సిలు, ఒక ఎస్టి, ఇద్దరు కాపు, ముగ్గురు క్షత్రియ, ఒక ముస్లిం, ఇద్దరు వైశ్యులు గెలపొందారు. ప్రజారాజ్యం పక్షాన పది మంది కాపులు, ముగ్గురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వైశ్యులు ఎన్నికయ్యారు. బిసిలలో కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు, శెట్టి బలిజ ఇద్దరు,పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ కురుమ లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. 42 మంది రెడ్డి ఎమ్మెల్యేల గెలుపు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎన్నిక కాగా వారిలో ముప్పై ఒక్క మంది కాంగ్రెస్ వారే. వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాలకు చెందినవారైతే, మిగిలిన పదిహేడు మంది రాయలసీమకు చెందినవారు. తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది ఎన్నిక కాగా, వారిలో ఇద్దరు కోస్తావారు, మిగిలినవారు రాయలసీమ నుంచి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరుకోస్తా, ఇద్దరు రాయలసీమ వారు. మొత్తం మీద రాయలసీమ నుంచి ఇరవైఐదు మంది రెడ్లు గెలుపొందగా, ఆంద్ర జిల్లాల నుంచి పదిహేడు మంది గెలిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత ఆయన సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా గెలుపొందారు. తిరిగి కడప ఎమ్.పిగా ఉన్న వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి, తిరిగి పోటీచేసినప్పుడు విజయమ్మ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీచేశారు.ఉప ఎన్నికలలో వీరిద్దరూ ఘన విజయం సాదించారు. 2009 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలలో డి.చంద్ర శేఖరరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, శివప్రసాదరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఎ. అమరనాద్ రెడ్డి, గడికోట శ్రీకాంతరెడ్డి, చెన్నకేశవరెడ్డి, గురునాదరెడ్డి, వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చి పదవులు వదులుకొని తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచారు. అనర్హతకు గురైనవారిలో పెద్దిరెడ్డి రామచంద్రరరెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి వీరు అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి నుంచి గెలిచినవారిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు టిడిపి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రసన్నకుమార్‌రెడ్డి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. కాగా మిగిలిన ఇద్దరు అనర్హత వేటుకు గురైయ్యారు. ప్రజారాజ్యం నుంచి గెలిచినవారిలో శోభానాగిరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు. ప్రజారాజ్యం మరో ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. రెడ్డి సామాజికవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు-31 ఎన్.శేషారెడ్డి- అనపర్తి డి.చంద్రశేఖర రెడ్డి - కాకినాడ సిటి గాదె వెంకటరెడ్డి- బాపట్ల కాసు వెంకట కృష్ణారెడ్డి- నరసరావుపేట వై. వెంకటేశ్వ రరరెడ్డి - సత్తెనపల్లి పి.రామకృష్నారెడ్డి - మాచర్ల శివప్రసాదరెడ్డి- దర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి- ఒంగోలు ఎమ్.మహీదర్ రెడ్డి-కందుకూరు ఉగ్ర నరసింహారెడ్డి-కనిగిరి, ఆనం రామనారాయణరెడ్డి- ఆత్మకూరు, ఆనం వివేకా నందరెడ్డి- నెల్లూరు రూరల్, ఆదాల ప్రభాకరరెడ్డి- సర్వేపల్లి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి, ఎ. అమరనాదరెడ్డి-రాజంపేట, గడికోట శ్రీకాంత రెడ్డి - రాయచోటి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి - పులివెందుల, జి.వీరశివారెడ్డి-కమ లాపురం, సి.ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు, డిఎల్. రవీంద్రరెడ్డి - మైదుకూరు, ఇ.ప్రతాపరెడ్డి - శ్రీశైలం, కె.రాంభూపాల్ రెడ్డి - పాణ్యం, శిల్పా మోహన్ రెడ్డి - నంద్యాల, చెన్నకేశవరెడ్డి - ఎమ్మిగనూరు, నీరజారెడ్డి - ఆలూరు, జె.సి.దివాకరరెడ్డి - తాడిపత్రి, గురునాదరెడ్డి - అనంతపురం, కె.వెంకట రామిరెడ్డి - ధర్మవరం, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి - పీలేరు, పి.రామచంద్రారెడ్డి - పుంగనూరు, కె.జయచంద్రారెడ్డి - చిత్తూరు. ఉప ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలిచినవారు పి.రామకృష్ణారెడ్డి-మాచర్ల బాలినేని శ్రీనివాసరెడ్డి-ఒంగోలు మేకపాటి చంద్ర శేఖరరెడ్డి-ఉదయగిరి ఎ.అమరనాదరెడ్డి-రాజంపేట గడికోట శ్రీకాంతరెడ్డి-రాయ చోటి వైఎస్ విజయమ్మ-పులివెందుల చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు గురు నాదరెడ్డి-అనంతపురం. తిరుపతి - భూమన కరుణాకరరెడ్డి (చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది) అనర్హత వేటుకు గురైన వారు డి.చంద్రశేఖరరెడ్డి-కాకినాడ శివప్రసాదరెడ్డి-దర్శి కె.వెంకటరామిరెడ్డి-ధర్మవరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పుంగనూరు. తెలుగుదేశం రెడ్డి ఎమ్మెల్యేలు-8 కె.నారాయణరెడ్డి- మార్కాపురం ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు ఎమ్.లింగారెడ్డి-ప్రొద్దుటూరు వై.బాలనాగిరెడ్డి- మంత్రాలయం పి.రఘునాదరెడ్డి-పుట్టపర్తి ఎ.ప్రవీణ్ రెడ్డి-తంబళ్లపల్లె బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి పి.అమరనాదరెడ్డి- పలమనేరు ఉప ఎన్నికలు.. ప్రసన్నకుమార్ రెడ్డి-కోవూరు అనర్హత వేటుకు గురైనవారు వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం ఎ.ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంభళ్లపల్లి ప్రజారాజ్యం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు-3 ఎ.శ్రీధర్ కృష్ణారెడ్డి- నెల్లూరు సిటీ-పిఆర్పి భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ-పిఆర్పి కె.రామిరెడ్డి- బనగానపల్లె- పిఆర్పి ఉప ఎన్నిక - భూమా శోభ నాగిరెడ్డి- ఆళ్లగడ్డ కమ్మ ఎమ్మెల్యేలు-24 2004 లో కాంగ్రెస్ పక్షాన 19 మందిఎమ్మెల్యేలు కమ్మ సామాజికవర్గం నుంచి గెలుపొందినా, 2009లో మాత్రం కాంగ్రెస్ లో ఆ వర్గం ఎమ్మెల్యేలు బాగా తగ్గిపోయారు.కేవలం నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందగా, ఒకరు ప్రజారాజ్యం పక్షాన గెలిచారు. మిగిలిన 19 మంది కమ్మ ఎమ్మెల్యేలు టిడిపి తరపున గెలిచారు.వీరిలో పద్నాలుగు మంది కోస్తా జిల్లాల నుంచి గెలుపొందగా, రాయలసీమలో ఐదుగురుగెలిచారు. టిడిపి ఎమ్మెల్యేలలో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లారు.ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానం లో టిడిపి విప్ కు విరుద్దంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.ప్రజారాజ్యం తరుపున గెలిచిన యలమంచిలి రవి ఆ పార్టీ విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2009 కమ్మ సామాజికవర్గ టిడిపి ఎమ్మెల్యేలు-19 వి.రామకృష్ణబాబు- విశాఖ తూర్పు వి.జోగేశ్వరరావు- మండపేట పి.వెంకటేష్- రాజానగరం- రాజానగరం బి.శేషారావు- నిడదవోలు చింతమనేని ప్రభాకర్- దెందులూరు డి.బాలవర్ధనరావు- గన్నవరం కొడాలి నాని-గుడివాడ దేవినేని ఉమామహేశ్వరరావు-మైలవరం కొమ్మాలపాటి శ్రీదర్-పెదకూరపాడు ధూళిపాళ్ల నరేంద్ర-పొన్నూరు ప్రత్తిపాటి పుల్లారావు-చిలకలూరిపేట జి.ఆంజనేయులు- వినుకొండ వై.శ్రీనివాసరావు- గురజాల కె.రామకృష్ణ - వెంకటగిరి కె. మీనాక్షి నాయుడు- ఆదోని పి.కేశవ్- ఉరవకొండ పరిటాల సునీత- రాప్తాడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు- నగరి నారా చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-4 దగ్గుబాటి వెంకటేశ్వరరావు - పర్చూరు-కాంగ్రెస్ గొట్టిపాటి రవికుమార్-అద్దంకి - కాంగ్రెస్ నాదెండ్ల మనోహర్ - తెనాలి-కాంగ్రెస్ గల్లా అరుణకుమారి - చంద్రగిరి - కాంగ్రెస్ 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ,తెలంగాణ ప్రకటన వంటి అంశాల నేపద్యంలో గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన అనర్హత వేటుకు గురయ్యారు. ప్రజారాజ్యం యలమంచిలి రవి - విజయవాడ తూర్పు - పిఆర్పి( ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు) 2009 కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు-19 ప్రజారాజ్యం స్థాపనతో కాపు సామాజికవర్గం ఆ పార్టీ వైపు మొగ్గు చూపింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ఈ పార్టీకి ఓట్ల పరంగా గణనీయంగా ఓట్లు లభించినా, సీట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. కేవలం పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉమ్మడి రాష్ట్రంలో గెలుపొందగా, పదహారు సీట్లను ఎపి, రాయలసీమలలో గెలిచింది. అందులో పది సీట్లు కాపు నేతలే గెలుచుకున్నారు. 2004 లో కాపు సామాజికవర్గం వారు కాంగ్రెస్ నుంచి పదహారు మంది గెలవగా, 2009 లో ఏడుగురే గెలిచారు.ఇక తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయం అయింది. కేవలం ఇద్దరే గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ పక్షాన పది మంది విజయం సాదించారు. చిరంజీవి రెండు చోట్ల పోటీచేసి సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓడిపోవడం విశేషం. తిరుపతిలో ఆయన గెలిచారు. ఆ తర్వాత పరిణామాలలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. దాంతో వీరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యారు.చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన భూమన కరుణాకరరెడ్డి గెలుపొందారు. అవనతి గడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య అస్వస్థతతో మరణించగా, ఆయన కుమారుడు హరి ప్రసాద్ గెలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆయనకు పోటీ పెట్టలేదు. ప్రజారాజ్యం పక్షాన గెలిచిన కాపు నేతలు ఎమ్. శ్రీనివాసరావు- భీమిలి సిహెచ్. వెంకటరామయ్య - గాజువాక గంటా శ్రీనివాసరావు - అనకాపల్లి పి.రమేష్ బాబు-పెందుర్తి ఈలి మధు సూదనరావు - టి.పిగూడెం వి.గీత-పిఠాపురం కె.కన్నబాబు - కాకినాడ రూరల్ పి.గాంధీ మోహన్-పెద్దాపురం బి. సత్యానాందరావు- కొత్తపేట కొణిదెల చిరంజీవి- తిరుపతి. కాంగ్రెస్‌కు చెందిన కాపు ఎమ్మెల్యేలు.. 7 తోట నరసింహం- జగ్గంపేట పి.రామాంజనేయులు-భీమవరం వట్టి వసంతకుమార్-ఉంగుటూరు- కాంగ్రెస్ ఎ.కె.శ్రీనివాస్- ఏలూరు పేర్ని వెంకట్రామయ్య(నాని) -బందరు కన్నా లక్ష్మీనారాయణ- గుంటూరు పశ్చిమ - కాంగ్రెస్ ఎ. కృష్ణమోహన్ -చీరాల కాంగ్రెస్ రాజకీయ పరిణామాలలో ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అనర్హత వేటుకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ కాపు ఎమ్మెల్యేలు-2 పి.సత్యనారాయణమూర్తి- ప్రత్తిపాడు అంబటి బ్రాహ్మణయ్య- అవనిగడ్డ. ఉప ఎన్నిక అవనిగడ్డ- అంబటి హరి ప్రసాద్-టిడిపి ఉప ఎన్నికలు రామచంద్రపురం-తోట త్రిమూర్తులు-కాంగ్రెస్ నరసాపురం- కొత్తపల్లి సుబ్బరాయుడు-కాంగ్రెస్ 2009లో ఎన్నికైన బిసి ఎమ్మెల్యేలు-33 ఈ ఎన్నికలలో ముప్పై మూడు మంది బిసి వర్గాలకు చెందిన వారు శాసనసభకు ఎన్నిక కాగా వారిలో పది మంది టిడిపికి చెందినవారు. మిగిలిన ఇరవై మూడు మంది కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఇచ్చాపురం, ఎస్.కోట, మాడ్గుల, కావలి, డోన్ , ప్రత్తికొండ, రాజమండ్రి రూరల్, కైకలూరు, పెనుకొండ, కదిరిలలో మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందగా, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, బీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విశాఖ-ఉత్తరం, విశాఖ-పశ్చిమ, నర్సీపట్నం, రాజమండ్రిసిటి, రామచంద్రాపురం, ముమ్మడివరం, ఆచంట, తణుకు, పెడన, పెనమలూరు, మంగళగిరి, రేపల్లె, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గంలలో కాంగ్రెస్ గెలిచింది. కాళింగ వర్గం నుంచి ముగ్గురు, పోలినాటి వెలమ ఇద్దరు, కొప్పుల వెలమ ముగ్గురు, తూర్పుకాపు ఐదుగురు, మత్సకార ముగ్గురు, యాదవ నలుగురు, గౌడ ముగ్గురు,శెట్టి బలిజ ఇద్దరు, పద్మశాలి ముగ్గురు, గవర, వడ్డీ, కురుమ, లింగాయత్‌లకు చెందిన వారు ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు దర్మాన కృష్ణప్రసాద్, పిల్లి సుభాష్ చంద్రబోస్, కాపు రామచంద్రరెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి తిరిగి పోటీ చేశారు.అయితే ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి తిరిగి గెలుపొందగా, సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. కాగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టెక్కలి ఎమ్మెల్యే కె.రేవతిపతి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు.టిడిపి ఎమ్మెల్యేలలో ఇచ్చాపురం ఎమ్మెల్యే పి.సాయిరాజ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి అనర్హత వేటుకు గురయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన బిసి ఎమ్మెల్యేలు.. 23 కె.రేవంతిపతి - టెక్కలి-కాళంగ బి.సత్యవతి - ఆముదాలవలస - కాళంగ ధర్మాన ప్రసాదరావు - శ్రీకాకుళం-పొలినాటి వెలమ ధర్మాన కృష్ణదాస్ - నరసన్నపేట పొలినాటి వెలమ ముత్యాలపాప - నర్సీపట్నం - కాంగ్రెస్ - కొప్పుల వెలమ, విజయకుమార్ - విశాఖ ఉత్తర - కొప్పుల వెలమ, ఎమ్. నీలకంఠం - ఎచ్చెర్ల - తూర్పు కాపు బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి - తూర్పుకాపు బి.అప్పలనరసయ్య-గజపతినగరం-తూర్పుకాపు బి.అప్పలనాయుడు- నెల్లిమర్ల- కాంగ్రెస్- తూర్పుకాపు, ఆర్. సూర్యప్రకాశరావు-రాజమండ్రి-కాంగ్రెస్- తూర్పుకాపు ఎమ్.విజయప్రసాద్-విశాఖ పశ్చిమ-కాంగ్రెస్-గవర జె.జగన్నాయకులు-పలాస-కాంగ్రెస్- మత్సకార సతీష్ కుమార్- ముమ్మడివరం-కాంగ్రెస్- మత్సకార ఎమ్.వి.రమణరావు- రేపల్లె- కాంగ్రెస్-మత్సకార కె.వి.నాగేశ్వరరావు- తణుకు- కాంగ్రెస్-యాదవ, కె.పార్దసారది- పెనమలూరు- కాంగ్రెస్-యాదవ ఎన్.రఘువీరారెడ్డి- కళ్యాణదుర్గం- కాంగ్రెస్- యాదవ జోగి రమేష్- పెడన- కాంగ్రెస్-గౌడ పి.సుభాష్ చంద్రబోస్- రామచంద్రాపురం-కాంగ్రెస్- శెట్టి బలిజ పి.సత్యనారాయణ- ఆచంట-కాంగ్రెస్- శెట్టి బలిజ కోండ్రు కమల-మంగళగిరి-కాంగ్రెస్-పద్మశాలి కాపు రామచంధ్రారెడ్డి రాయదుర్గం. ఉప ఎన్నికలు టెక్కలి- కె.భారతి`కాంగ్రెస్, నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్`వైఎస్ఆర్ కాంగ్రెస్ రాయదుర్గం`కాపు రామచంధ్రారెడ్డి`వైఎస్ఆర్ కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్నికైన బిసి నేతలు-10 పి.సాయిరాజ్- ఇచ్చాపురం- కాళింగ కె.లలితకుమారి- ఎస్.కోట- కొప్పుల వెలమ జి. రామానాయుడు మాడ్గుల కొప్పుల వెలమ జె.వెంకటరమణ-కైకలూరు-వడ్డి బి.మస్తాన్ రావు - కావలి- యాదవ కె.ఇ.కృష్ణమూర్తి-డోన్ - గౌడ కె.ఇ.ప్రభాకర్- పత్తికొండ- గౌడ బి.కె.పార్దసారది-పెనుకొండ - కురుమ చందన రమేష్- రాజమండ్రి రూరల్ -దేవాంగ వెంకట ప్రసాద్-కదిరి-పద్మశాలి. 2009 ఎస్.సి సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం 29 ఎస్.రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో కాంగ్రెస్ కు ఇరవై రెండు స్థానాలు, తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు దక్కాయి. వారి వివరాలు.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు(వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లో చేరి తిరిగి ఉప ఎన్నికలలో గెలుపొందారు కాగా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. టిడిపి ఎమ్మెల్యేలలో గోపాలపురం ఎమ్మెల్యే వనిత కూడా అనర్హత వేటుకు గురయ్యారు). కాంగ్రెస్ ఎస్.సి ఎమ్మెల్యేలు-22 కె.మురళీమోహన్ - రాజాం ఎస్.జయమణి - పార్వతిపురం జి.బాబూరావు - పాయకరావుపేట పి.విశ్వరూప్- అమలాపురం ఆర్.వరప్రసాదరావు-రాజోలు పి.రాజేశ్వరీదేవీ-పి.గన్నవరం, రాజేష్ కుమార్-చింతలపూడి డి.పద్మజ్యోతి- తిరువూరు డి.వై.దాస్-పామర్రు డి.ఎమ్.వరప్రసాద్- తాడికొండ ఎమ్.సుచరిత-ప్రత్తిపాడు ఎ.సురేష్-ఎర్రగొండపాలెం బి.ఎస్. విజయకుమార్ -సంతనూతలపాడు జి.వి.శేషు- కొండపి కమలమ్మ-బద్వేల్ కె.శ్రీనివాసులు-ర్వేల్వే కోడూరు ఎల్.వెంకటస్వామి-నందికోట్కూరు, మురళీకృష్ణ-కొడుమూరు ఎస్.శైలజానాధ్-శింగనమల కె.సుధాకర్- మడకశిర జి.కుతూహలమ్మ- గంగాధర నెల్లూరు పి.రవి-పూతల్ పట్టు. ఉప ఎన్నికలు.. పాయకరావుపేట-జి.బాబూరావు ఎమ్.సుచరిత-ప్రత్తిపాడు శ్రీనివాసులు-రైల్వే కోడూరు – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
2004 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. విబజిత ఏపీలో కాంగ్రెస్ కు 139 స్థానాలలో విజయం సిద్దించగా, తెలుగుదేశంపార్టీకి ముప్పైఏడు స్థానాలే దక్కాయి. బిజెపికి ఒకటి, సీపీఐకి రెండు, సీపీఎం కు మూడు, నలుగురు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు.అప్పట్లో ఏపీలోని ఆంద్ర, రాయలసీమలలో కలిపి 187 నియోజకవర్గాలు ఉండేవి. సామా జికవర్గాల వారీగా చూస్తే రెడ్లు 49 మంది, కమ్మ 32 మంది, కాపు, తెలగ, బలిజ వర్గాలకు చెందినవారు 23 మంది, బీసీలు ముప్పై నాలుగు మంది ఎస్సీ లు 22 మంది, ఎస్టీలు ఎనిమిది మంది గెలిచారు. క్షత్రియలు ఏడుగురు, ముస్లింలు నలుగురు, వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణ ఒకరు, క్రిస్టియన్ ఒకరు, అగర్వాల్ ఒకరు గెలుపొందారు. బీసీ వర్గాల విశ్లేషణ తూర్పు కాపు-7 యాదవ- 5 కొప్పుల వెలమ-4 శెట్టి బలిజ-4, పొలినాటి వెలమ-3,పద్మశాలి-3, కాళింగ-2,గవర-1,రెడ్డిక-1,మత్సకార-1, వడ్డీ-1, బోయ-1, గౌడ-1(మొత్తం పదమూడు బీసీ కులాల నుంచి ముప్పైనాలుగు మంది ఎన్నికయ్యారు) 2004-రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ కు అదికారంలోకి రాగా,అత్యధిక సంఖ్యలో 49 మంది రెడ్డినేతలు శాసనసభకు ఎన్నికయ్యారు.వీరిలో కాంగ్రెస్ పక్షాన నలభై నాలుగు మంది,టీడీపీ తరుపున నలుగురు, ఇండిపెండెంటు ఒకరు ఎన్నిక య్యారు. వీరిలో ఇరవై మంది కోస్తా జిల్లాల నుంచి ఇరవై మంది ఎన్నిక కాగా, మిగిలిన ఇరవైనాలుగు మంది రాయలసీమ నుంచి గెలుపొందారు.టీడీపీ తరపున కేవలం నలుగురే గెలుపొందారు.గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మంది రెడ్లు టీడీపీ తరపున గెలవలేదు. కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు.. 44 టి.రామారెడ్డి-అనపర్తి చిర్ల జగ్గారెడ్డి-కొత్తపేట బుల్లబ్బాయిరెడ్డి-సంపర గాదె వెంకటరెడ్డి-బాపట్ల గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల కాసు కృష్ణారెడ్డి-నరసరావుపేట వై.వెంకటేశ్వరరెడ్డి-సత్తెనపల్లి పీ.లక్ష్మారెడ్డి-మాచర్ల వి.శ్రీనివాసులురెడ్డి-కంభం బి.శ్రీనివాసరెడ్డి-ఒంగోలు, బి.మహీధర్ రెడ్డి-కందుకూరు, కే.పెదకొండారెడ్డి-మార్కాపురం, మాగుంట పార్వతమ్మ-కావలి, పీ.శ్రీనివాసులురెడ్డి-కోవూరు, ఎ.వివేకానందరెడ్డి-నెల్లూరు, ఎ.రామ నారాయణరెడ్డి-రాపూర, ఎ.ప్రభాకరరెడ్డి-సర్వేపల్లి, కే.విష్ణువర్ధనరెడ్డి-అల్లూరు, ఎన్.రాజ్యలక్ష్మి-వెంకటగిరి, ఎమ్.చంద్రశేఖరరెడ్డి-ఉదయగిరి, డి.సి. గోవిందరెడ్డి-బద్వేల్, కే.ప్రభావతమ్మ-రాజంపేట, జి.మోహన్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి-పులివెందుల, సి.ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు, ఎన్.వరదరాజులరెడ్డి-ప్రొద్దుటూరు, డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి-మైదుకూరు, జి.ప్రతాపరెడ్డి-ఆళ్లగడ్డ, ఇ.ప్రతాపరెడ్డి-ఆత్మకూరు, గౌరు చరిత-నందికోట్కూరు, కే.రాంభూపాల్ రెడ్డి-పాణ్యం, ఎస్.మోహన్ రెడ్డి-నంద్యాల, చల్లా రామకృష్ణారెడ్డి-కోయిలకుంట్ల, కోట్ల సుజాత-డోన్, కే.చెన్నకేశవరెడ్డి-ఎమ్మిగనూరు, వై.సాయి ప్రసాదరెడ్డి-ఆదోని, బి.నారాయణరెడ్డి-అనంతపురం, డాక్టర్ కే.మోహన్ రెడ్డి-నల్లమడ, జెసి దివాకరరెడ్డి-తాడిపత్రి, పీ.రవీంద్రరెడ్డి-గోరంట్ల, కే.ప్రభాకరరెడ్డి-తంబళ్లపల్లె, పీ.రామచంద్రారెడ్డి-పీలేరు, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి-వాయల్పాడు 44.ఆర్.చెంగారెడ్డి-నగరి. రెడ్డి ఎమ్మెల్యేలు- తెలుగుదేశం-4 జి.వీరశివారెడ్డి-కమలాపురం ఎస్.వి.సుబ్బారెడ్డి-పత్తికొండ బి.గోవిందరెడ్డి-రాయదుర్గం ఎన్.అమరనాధ్ రెడ్డి-పుంగనూరు ఇండిపెండెంట్ రెడ్డి ఎమ్మెల్యే -1 బి.సుబ్బారెడ్డి-దర్శి కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు- 2004 2004లో కాంగ్రెస్ తరపున కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికవడం విశేషం. మొత్తం 32 మంది ఎన్నిక కాగా, వారిలో కాంగ్రెస్ తరపున 21 మంది, టీడీపీ పక్షాన పది మంది ఉండగా, ఒక కమ్మ నేత ఇండిపెండెంటుగా కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేల వివరాలు-21 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కు కమ్మ సామాజికవర్గం నుంచి ఇంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం ఇదే అని చెప్పాలి.మొత్తం 32 మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందగా,వారిలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ నుంచి పది మంది టీడీపీ నుంచి గెలవగా, ఒకరు ఇండిపెండెంటుగా గెలిచారు.వీరిలో పద్దెనిమిది మంది కోస్తా జిల్లాల నుంచి కాగా, ముగ్గురు రాయలసీమ నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన పది మంది లోఐదుగురు కోస్తా జిల్లాల నుంచి , ఐదుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు బి.కృస్ణార్జున చౌదరి-ఆలమూరు సిహెచ్ రవీంద్ర-బూరుగుపూడి చిట్టూరి బాపినీడు-తణుకు మాగంటి వెంకటేశ్వరరావు-దెందులూరు, ఘంటా మురళరామకృష్ణ-చింతలపూడి, వై.రాజారామచందర్- కైకలూరు, పిన్నమనేని వెంకటేశ్వరరావు- ముదినేపల్లి, దేవినేని రాజశేఖర్-కంకిపాడు, చనుమోలు వెంకటరావు-మైలవరం, డి.మల్లిఖార్జునరావు-రేపల్లె, నాదెండ్ల మనోహర్-తెనాలి, రావి వెంకటరమణ-పత్తిపాడు, మర్రి రాజశేఖర్- (కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్), ఎమ్.మల్లిఖార్జునరావు-వినుకొండ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు, గొట్టిపాటి రవికుమార్-మార్టూరు, పోతుల రామారావు-కండపి, ఐ.తిరుపతి నాయుడు-కనిగిరి, గల్లా అరుణకుమారి-చంద్రగిరి, ఎస్.సి.వి.నాయుడు-శ్రీకాళహస్తి, జి.ముద్దుకృష్ణమనాయుడు- పుత్తూరు. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు..10 పీ.వి.కృష్ణారావు-కొవ్వూరు కొడాలి వెంకటేశ్వరరావు-గుడివాడ డి. ఉమా మహేశ్వరరావు-నందిగామ డి.నరేంద్ర కుమార్-పొన్నూరు కరణం బలరాం-అద్దంకి పీ.కేశవ్-ఉరవకొండ పరిటాల రవీంద్ర-పెనుకొండ జి.జయలక్ష్మమ్య-ధర్మవరం డి.రమేష్-మదనపల్లె చంద్రబాబు నాయుడు -కుప్పం. ఇండిపెండెంట్-1 కే.లక్ష్మయ్య నాయుడు-ఆత్మకూరు కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలు.. 23 కాపు సామాజకవర్గం ఎమ్మెల్యేలు 2004 లో ఇరవై మూడు మంది ఎన్నికైతే వారిలో పదహారు మంది కాంగ్రెస్ నుంచి, ఆరుగురు టీడీపీ నుంచి, ఒకరు బిజెపి పక్షాన ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పక్షాన గెలిచినవారిలో కోస్తా జిల్లాల నుంచి పదహేను మంది , రాయలసీమ నుంచి ఒకరు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురిలో నలుగురు కోస్తా జిల్లాల వారు కాగా, ఇద్దరు రాయలసీమ వారు. కాంగ్రెస్ కాపు,బలిజ ఎమ్మెల్యేలు-16 కరణం ధర్మశ్రీ-మాడుగుల తోట గోపాలకృష్ణ-పెద్దాపురం జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం తోట నరసింహం-జగ్గంపేట గ్రంది శ్రీనివాస-భీమవరం కే.సత్యనారాయణ-తాడేపల్లిగూడెం వట్టి వసంతకుమార్-ఉంగుటూరు ఎ.కే.శ్రీనివాస్-ఏలూరు బి.వేదవ్యాస్-మల్లేశ్వరం పేర్ని నాని-మచిలీపట్నం మండలి బుద్ద ప్రసాద్-అవనిగడ్డ వంగవీటి రాదాకృష్ణ-విజయవాడ సామినేని ఉదయభాను-జగ్గయ్యపేట కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు పగడాల రామయ్య-గిద్దలూరు (బలిజ) ఎమ్.వెంకటరమణ-తిరుపతి.(బలిజ) తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-6 గంటా శ్రీనివాసరావు-చోడవరం పర్వత సత్యనారాయణమూర్తి-ప్రత్తిపాడు సి.హెచ్. సత్యనారాయణమూర్తి-పాలకొల్లు కే.సుబ్బారాయుడు-నరసాపురం ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి ఎ.ఎస్.మనోహర్-చిత్తూరు (బలిజ). బారతీయ జనతా పార్టీ 1. పీ.దొరబాబు-పిఠాపురం వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్యేలు(బీసీ)-34 ఏపీలో 2004 లో ముప్పై నాలుగు మంది బీసీ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో కాంగ్రెస్ పక్షాన గెలిచినవారు ఇరవై రెండు మంది కాగా, టీడీపీ తరపున పది మంది నెగ్గారు. ఇద్దరు ఇండిపెండెంట్లుగా విజయం సాదించారు. ఆయా కులాల వారీగా పరిశీలిస్తే కాళింగ ఇద్దరు( కాంగ్రెస్) పొలినాటి వెలమ ముగ్గురు, కొప్పుల వెలమ నలుగురు కలిపి ఏడుగురు( నలుగురు కాంగ్రెస్ ,ముగ్గురు టీడీపీ), తూర్పుకాపులు ఏడుగురు( ముగ్గురు కాంగ్రెస్ ,నలుగురు టీడీపీ), గవర ఒకరు (కాంగ్రెస్), రెడ్డిక ఒకరు (కాంగ్రెస్), శెట్టిబలిజలు నలుగురు (ముగ్గురు కాంగ్రెస్, ఒకరు ఇండిపెండెంట్), యాదవ ఐదుగురు( ముగ్గురు కాంగ్రెస్, ఒకరు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్), బోయ ఇద్దరు( ఒకరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ), పద్మశాలి ముగ్గురు( ఇద్దరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ), మత్స్యకార, వడ్డీ ఒక్కొక్కరు(కాంగ్రెస్) గౌడ ఒకరు(టీడీపీ) ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు.. 22 అప్పయ్యదొర-టెక్కలి-కాళింగ డి.ఫ్రసాదరావు-శ్రీకాకుళం-పొలినాటి వెలమ బోడ్డేపల్లి సత్యవతి-ఆముదాలవలస-కాళింగ డి.కృష్ణదాస్-నరసన్నపేట-పొలినాటి వెలమ బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి-తూర్పు కాపు పీ.మంగపతిరావు-ఉత్తరాపల్లి- కొప్పుల వెలమ, కే.సీతారామ్-భీమిలి-తూర్పుకాపు, గండి బాబ్జి-కొప్పుల వెలమ, కొణతాల రామకృష్ణ-గవర, పీ. గురుమూర్తి రెడ్డి-పెందుర్తి-రెడ్డి, డి.వెంకటేశ్వర్లు-తాళ్లరేవు-శెట్టి బలిజ, పిల్లి సుభాష్ చంద్రబోస్-రామచంద్రపురం-శెట్టి బలిజ, రౌతు సూర్యప్రకాష్ రావు-రాజమండ్రి-తూర్పుకాపు, పితాని సత్యనారాయణ-ఆచంట-శెట్టి బలిజ, కే.పార్దసారధి- ఉయ్యూరు-యాదవ, ఎమ్.హనుమంతరావు-మంగళగిరి-పద్మశాలి, మోపిదేవి వెంకటరమణ-కూచినపూడి-మత్స్యకార, టి.వెంకట్రావు-గుంటూరు-2-వడ్డీ, జె.కృష్ణమూర్తి-గురజాల-యాదవ, ఎన్.నీలావతి-గుత్తి-బోయ, ఎన్.రఘువీరారెడ్డి -మడకశిర-యాదవ, జొన్నా రామయ్య-కదిరి-పద్మశాలి. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 10 గౌతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కే.మోహన్ రావు-పాతపట్నం-తూర్పుకాపు కే.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పొలినాటి వెలమ కే.కళావెంకట్రావు- ఉణుకూరు-తూర్పుకాపు తెంటు జయప్రకాష్-తెర్లాం-కొప్పుల వెలమ పడాల అరుణ- గజపతినగరం-తూర్పుకాపు పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పుకాపు సి.హెచ్. అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కొప్పుల వెలమ యనమల రామకృష్ణుడు-తుని-యాదవ పీ.రంగనాయకులు -హిందూపూర్-పద్మశాలి. ఇండిపెండెంట్లు.. 2 కుడిపూడి చిట్టబ్బాయి-అమలాపురం-శెట్టిబలిజ ఎమ్.వెంకటేశ్వరరావు-గన్నవరం-యాదవ. 2004 ఎస్.సి ఎమ్మెల్యేల వివరాలు ఈ ఎన్నికలలో పదహారు మంది కాంగ్రెస్ తరపున,ఐదుమంది టీడీపీ పక్షాన, ఒకరు సీపీఎం తరపున గెలిచారు.వారి వివరాలు.. కాంగ్రెస్ ఎస్.సి ఎమ్మెల్యేలు.. 16 కే. మురళీమోహన్-ఎచ్చెర్ల పీ. విశ్వరూప్-అమలాపురం పీ. రాజేశ్వరదేవి-నగరం జి.సూర్యారావు-అల్లవరం, మద్దాల సునీత-గోపాలపురం, కోనేరు రంగారావు -తిరువూరు, డి.మాణిక్ వర ప్రసాద్-తాడికొండ, దారా సాంబయ్య-సంతనూతలపాడు, పీ.ప్రకాశ్ రావు-గూడూరు, ఎన్.సుబ్రహ్మణ్యం-సూళ్లూరుపేట, జి.వెంకటేశ్వర ప్రసాద్-కోడూరు, పీ.మురళికృష్ణ-కొడుమూరు, ఎమ్.మారెప్ప-ఆలూరు, ఎస్.శైలజానాద్-శింగనమల, కే.నారాయణస్వామి-సత్యవేడు, జి.కుతూహలమ్మ-వేపంజేరి. టీడీపీ ఎస్.సి. ఎమ్మెల్యేలు-5 కే.జోగులు-పాలకొండ చెంగల వెంకట్రావు-పాయకరావుపేట పీ.సుజాత-ఆచంట ఎల్.లలిత కుమారి-పలమనేరు బీసీ గోవిందప్ప-కళ్యాణదుర్గం సీపీఎం..1 పాటూరు రామయ్య-నిడుమోలు 2004 - షెడ్యూల్ జాతుల ఎమ్మెల్యేలు-8 ఎస్టీవర్గాలకు చెందినవారు కాంగ్రెస్ పక్షాన నలుగురు, టీడీపీ తరపున ఇద్దరు, ఒకరు సీపీఐ,ఒకరు సీపీఎం పక్షాన గెలిచారు. వారి వివరాలు. కాంగ్రెస్ జన్నిమినతి గోమాంగో-కొత్తూరు కుంభా రవి-ఎస్.కోట పీ.బాలరాజు-పాడేరు టి.బాలరాజు- పోలవరం. రాజన్నదొర-సాలూరు (2007 లో కోర్టు ద్వారా ఎన్నికయ్యారు) తెలుగుదేశం ఆర్.భంజ్ దేవ్-సాలూరు (2007లో ఈయన గిరిజనుడు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది). సి.రమేష్-ఎల్లవరం ఇతరులు.. కే.లక్ష్మణమూర్తి- నాగూరు-సీపీఎం సి.దేముడు-చింతపల్లి-సీపీఐ క్షత్రియ ఎమ్మెల్యేలు-7 క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు ఏడుగురు ఎన్నిక కాగా, అంతా కాంగ్రెస్ కు చెందినవారే కావడం విశేషం. వారి వివరాలు.. ఎస్.విజయరామరాజు-పార్వతీపురం పీ.సాంబశివరాజు-సతివాడ ఎస్. రంగరాజు-విశాఖ-రెండు యువి రమణమూర్తి రాజు-యలమంచిలి ఎ. కృష్ణంరాజు-రాజోలు సి.రంగనాదరాజు-అత్తిలి పీ.సర్రాజు-ఉండి. ముస్లింలు-4 నలుగురు ముస్లింలు ఎన్నిక కాగా, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు సీపీఐ, ఒకరు సీపీఎం పక్షాన గెలుపొందారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు కూటమిగా పోటీచేశాయి. షేక్ నాజర్ వలి-విజయవాడ-ఒన్-సీపీఐ షేక్ సుబాని-గుంటూరు -ఒన్-కాంగ్రెస్ అహ్మదుల్లా-కడప-కాంగ్రెస్ ఎమ్.ఎ.గపూర్- కర్నూలు- సీపీఎం ఇతర సామాజికవర్గాలలో వైశ్యులు ముగ్గురు, వెలమ ఇద్దరు, బ్రాహ్మణులు ఒకరు, అగర్వాల ఒకరు ఉన్నారు.ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు. వారి వివరాలు. ఒక్కరు తప్ప వీరందరూ కాంగ్రెస్ పక్షానే ఎన్నికయ్యారు. ఒకరు మాత్రం ఇండిపెండెంట్ గా నెగ్గారు. ద్రోణం రాజు సత్యనారాయణ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్దిగా ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ గెలిచారు. వైశ్య-3 (ఇద్దరు కాంగ్రెస్ -ఒకరు ఇండి) వీరభద్రస్వామి- విజయనగరం-వైశ్య- ఇండి ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ-వైశ్య-కాంగ్రెస్ కొణిజేటి రోశయ్య-చీరాల- వైశ్య-కాంగ్రెస్. వెలమ-2(ఇద్దరు కాంగ్రెస్) సుజయ కృష్ణ రంగారావు- బొబ్బిలి-వెలమ-కాంగ్రెస్ ఎమ్.వి. ప్రతాప అప్పారావు- నూజివీడు- వెలమ- కాంగ్రెస్ బ్రాహ్మణ-1(కాంగ్రెస్) ద్రోణంరాజు సత్యనారాయణ-విశాఖ-1-బ్రాహ్మణ-కాంగ్రెస్, ఉప ఎన్నిక విశాఖ-1- ద్రోణం రాజు శ్రీనివాస్ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
1999 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ
1999 శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తిరిగి అదికారంలోకి వచ్చింది. బీజేపీ పొత్తుతో ఎన్నికలలో పోటీచేసిన తెలుగుదేశం పార్టీ ఆంద్ర ప్రాంతంలో 130 నియోజకవర్గాలలో గెలుపు సాధించింది.ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు నలభై తొమ్మిది సీట్లు రాగా, బీజేపీ కి నాలుగు దక్కాయి. ఇండిపెండెంట్లు నలుగురు నెగ్గారు. సామాజికవర్గాల విశ్లేషణ చూస్తే రెడ్డి సామాజికవర్గం వారు 44 మంది గెలవగా,వారిలో తెలుగుదేశం పక్షాన 21 మంది, కాంగ్రెస్ పార్టీ తరపున 23 మంది నెగ్గారు. కమ్మ సామాజికవర్గం వారు నలభై మంది గెలవగా, టీడీపీ నుంచి 34 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. కాపు సామాజికవర్గం వారు 22 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో టీడీపీపద్నాలుగు మంది, ఆరుగురు కాంగ్రెస్ వారు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీసీలు ముప్పై నాలుగు మందికిగాను టీడీపీ24, కాంగ్రెస్ నుంచి పది మంది గెలిచారు. ఎస్.సిలు ఇరవై రెండు మందికి గాను పదహారు మంది టీడీపీ, నలుగురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ,ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు.క్షత్రియలు ఎనిమిది మంది గెలిస్తే, ఏడుగురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ వారు ఉన్నారు.ఎస్.టిలు ఎనిమిది మందికిగాను ఏగుగురు తెలుగుదేశం వారే. ఒకరు కాంగ్రెస్ నుంచి నెగ్గారు. కాగా ముస్లింలు ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ నుంచి నెగ్గారు. ఇతరులు నలుగురు టీడీపీవారే. బీసీ వర్గాల విశ్లేషణ- కొప్పుల వెలమ-7 యాదవ- 5 తూర్పు కాపు-4 గౌడ-4 మత్సకార-3 పొలినాటి వెలమ-3 కాళింగ- 2 గవర- 2 పద్మశాలి-2 శెట్టి బలిజ-1 రెడ్డి ఎమ్మెల్యేల విశ్లేషణ-44 1999లో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చినా , రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున కొద్దిగా ఎక్కువగా గెలవడం విశేషం.టీడీపీపక్షాన 21 మంది రెడ్లు గెలిస్తే, 23 మంది రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. కోస్తాలో ఎనిమిది మంది కాంగ్రెస్ పక్షాన, ఎనిమిది మంది టీడీపీనుంచి గెలిచారు. రాయలసీమ నుంచి పదిహేను మంది కాంగ్రెస్ పక్షాన రెడ్లు ఎన్నిక కాగా, టీడీపీతరపున పదమూడు మంది గెలిచారు. తెలుగుదేశం పార్టీ రెడ్డి ఎమ్మెల్యేలు.. 21 ఎన్. మూలారెడ్డి - అనపర్తి, జె. దుర్గాంబ-మాచర్ల పి. విజయ్ కుమార్ రెడ్డి-గిద్దలూరు వి. వేణుగోపాలరెడ్డి-కావలి, ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి- కోవూరు, ఎస్.చంద్రమోహన్ రెడ్డి-సర్వేపల్లి, ఎ.ప్రభాకరరెడ్డి-అల్లూరు, కె.విజయరామిరెడ్డి- ఉదయగిరి, కె.వీరారెడ్డి- బద్వేల్, ఆర్ రమేష్ కుమార్ రెడ్డి-లక్కిరెడ్డిపల్లి, పి.రామసుబ్బారెడ్డి-జమ్మలమడుగు,ఎస్.రఘురామిరెడ్డి- మైదుకూరు, బి.శోబా నాగిరెడ్డి- ఆళ్లగడ్డ, బి.సీతారామిరెడ్డి-ఆత్మకూరు, బి.రాజశేఖరరెడ్డి-నందికోట్కూరు, బి.పార్ధసారధిరెడ్డి- పాణ్యం, ఎస్.వి.సుబ్బారెడ్డి- ప్రత్తికొండ, బివి మోహన్ రెడ్డి- ఎమ్మిగనూరు, పి.రఘునాదరెడ్డి-నల్లమడ, బి.గోపాలకృష్ణారెడ్డి- శ్రీకాళహస్తి, ఆర్.రాజశేఖరరెడ్డి- పుత్తూరు. ఉప ఎన్నిక.. గిద్దలూరు - సాయికల్పన రెడ్డి - టీడీపీ కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు- 23 గుదిబండి వెంకటరెడ్డి-దుగ్గిరాల కె. నాగార్జునరెడ్డి-కంభం ఎస్. పిచ్చిరెడ్డి-దర్శి బి. శ్రీనివాసరెడ్డి- ఒంగోలు, కె.పి. కొండారెడ్డి- మార్కాపురం, ఆనం వివేకానందరెడ్డి- నెల్లూరు, ఆనం రామనారాయణరెడ్డి- రాపూరు, ఎన్.రాజ్యలక్ష్మి- వెంకటగిరి, వైఎస్ రాజశేఖరరెడ్డి-పులివెందుల, ఎమ్.వి. మైసూరారెడ్డి- కమలాపురం, ఎన్.వరదరాజులు రెడ్డి -ప్రొద్దుటూరు, చల్లా రామకృష్ణారెడ్డి- కోయిలకుంట్ల, వి.వేణుగోపాలరెడ్డి- రాయదుర్గం, వై.శివరామిరెడ్డి- ఉరవకొండ, జెసి దివాకరరెడ్డి- తాడిపత్రి, బి.నారాయణరెడ్డి- అనంతపురం, కె.సూర్యప్రతాపరెడ్డి- ధర్మవరం, కె.ప్రభాకరరెడ్డి- తంబళ్లపల్లె, పి.రామచం్షరెడ్డి-పీలేరు, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి- వాయల్పాడు, ఎన్.శ్రీధర్ రెడ్డి-పుంగనూరు, ఆర.చెంగారెడ్డి-నగరి, సి.కె.జయచంద్రారెడ్డి-చిత్తూరు. కమ్మ సామాజికవర్గం విశ్లేషణ- 40 కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మొత్తం నలభై మంది ఎన్నిక కాగా, వారిలో ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి విజయం సాదించారు. ఒకరు బీజేపీ నుంచి గెలవగా ,మరొకరు ఇండిపెండెంటుగా నెగ్గారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారిలో ఇరవై తొమ్మిది మంది కోస్తా జిల్లాల నుంచి గెలవగా, ఐదుగురు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచివనారిలో ముగ్గురు కోస్తా నుంచి ఒకరు రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ, ఇండిపెండెట్లు కూడా కోస్తా జిల్లాలవారే. తెలుగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు-34 ఎమ్.వి. కృష్ణారావు-ఇచ్చాపురం గద్దె బాబూరావు-చీపురుపల్లి బి. భాస్కర రామారావు-పెద్దాపురం వివిఎస్ చౌదరి-ఆలమూరు, కె.అచ్చమాంబ-బూరు గుపూడి, జి.బుచ్చయ్యచౌదరి-రాజమండ్రి, వై.టి .రాజా- తణుకు, కె.విశ్వనాధం-ఉంగుటూరు, జి.సాంబశివరావు-దెందులూరు, డి.బాలవర్దనరావు- గన్నవరం, రావి హరగోపాల్-గుడివాడ, అన్నె బాబూరావు- ఉయ్యూరు, వై. నాగేశ్వరరావు- కంకిపాడు, వడ్డే శోభ నాద్రీశ్వరరావు-మైలవరం, డి.ఉమా మహేశ్వరరావు-నందిగామ, డి.నరేంద్ర-పొన్నూరు, ఎ.రాజేంద్ర ప్రసాద్- వేమూరు, ఎమ్.వెంక టసుబ్బయ్య- రేపల్లె, గోగినేని ఉమ- తెనాలి, ఎమ్.పెద రత్తయ్య- ప్రత్తి పాడు, పి. పుల్లారావు-చిలకలూరిపేట, కె.శివ ప్రసాదరావు-నరసరావుపేట, వై.వీరాంజనేయులు- సత్తెనపల్లి, వి.యల్లమందారావు-వినుకొండ, జె.లక్ష్మీ పద్మావతి -పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, జి.నరసయ్య-మా ర్టూరు, దివి శివరామ్-కందు కూరు, డి.ఆంజనేయులు-కొండపి, కె.మీనాక్షి నాయుడు- ఆదోని, సిసి వెంకట్రా ముడు-హిందూపూర్, పి.రవీంద్ర-పెనుకొండ, ఆర్.శోభ-మదన పల్లె, చంద్రబాబు నాయుడు-కుప్పం. కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-4 పి. వెంకటేశ్వరరావు-ముదినేపల్లి ఇ. తిరుపతి నాయుడు-కనిగిరి బి. కృష్ణయ్య- ఆత్మకూరు(నెల్లూరు జిల్లా) జి. అరుణకుమారి- చంద్రగిరి. ఇతర కమ్మ ఎమ్మెల్యేలు.. కె.హరిబాబు- విశాఖపట్నం ఒకటి -బీజేపీ వై.రాజా రామచందర్- కైకలూరు- ఇండి కాపు ఎమ్మల్యేలు-22 1999లో ఇరవై రెండు మంది కాపు నేతలు ఎమ్మెల్యేలుగా గెలవగా, వారిలో టీడీపీనుంచి పద్నాలుగు, ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. టీడీపీనుంచి గెలిచినవారిలో ముగ్గురు తప్ప మిగిలినవారంతా కోస్తాజిల్లాలవారే. కాంగ్రెస్ లో గెలిచినవారంతా కోస్తావారే. టీడీపీకాపు ఎమ్మెల్యేలు.. 14 పి. చలపతిరావు-యలమంచిలి పర్వత బాపనమ్మ-ప్రత్తిపాడు సి. రామచంద్రరావు-తాళ్లరేవు తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం, మెట్ల సత్యనారాయణ-అమలాపురం, బి.సత్యానందరావు-కొత్తపేట, జెవి అప్పారావు(నెహ్రూ)- జగ్గంపేట, ఎవి సత్యనారాయణ-పాలకొల్లు, కె.సుబ్బరాయుడు-నర్సాపురం, ఎర్రా నారాయణ స్వామి- తాడేపల్లిగూడెం, ఎస్.అరుణ-గుంటూరు-2, పి.బ్రహ్మయ్య-రాజంపేట, (బలిజ) ఎస్.పాలకొండ్రాయుడు-రాయచోటి,(బలిజ) చదలవాడ కృష్ణమూర్తి-తిరుపతి(బలిజ) కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు-6 బలిరెడ్డి సత్యారావు-చోడవరం జక్కంపూడి రామ్మోహన్ రావు-కడియం జి.ఎస్.రావు -కొవ్వూరు మండలి బుద్దప్రసాద్-అవనిగడ్డ ఎస్.ఉదయభాను-జగ్గయ్యపేట కన్నా లక్ష్మీనారాయణ-పెదకూరపాడు ఇండిపెండెంట్ కాపు ఎమ్మెల్యేలు.. 2 ఎస్.వీరభద్రరావు-పిఠాపురం-ఇండి కె.వి.రాఘవేంద్రరావు-పెనుగొండ-ఇండి బీసీ ఎమ్మెల్యేలు- 33 1999 ఎన్నికలలో బీసీ ఎమ్మెల్యేలు మొత్తం ముప్పైనాలుగు మంది ఎన్నిక కాగా వారిలో టీడీపీవారు ఇరవైనాలుగు మంది, కాంగ్రెస్ వారు పది మంది. టీడీపీ బీసీ ఎమ్మెల్యేలలో పదిహను మంది ఉత్తరాంద్ర నుంచి గెలుపొందడం విశేషం.ఐదుగురు మిగిలిన కోస్తా జిల్లాలవారు కాగా,నలుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పక్షాన గెలిచినవారిలో తొమ్మిది మంది కోస్తా జిల్లాల వారు(ఆరుగురు ఉత్తరాంద్ర నుంచి ),ఒకరు రాయలసీమకు చెందినవారు. బీసీలలో ఒక్కో కులం వారీగా చూస్తే ఏడుగురు కొప్పుల వెలమ,ఐదుగురు యాదవ, నలుగురు గౌడ, తూర్పు కాపు నలుగురు,పొలినాటి వెలమ ముగ్గురు, మత్సకార ముగ్గురు, గవర ఇద్దరు, కాళింగ ఇద్దరు, పద్మశాలి ఇద్దరు , శెట్టి బలిజ ఒకరుగెలుపొందారు. తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు.. 24 గైతు శ్యామసుందర శివాజి-సోంపేట-గౌడ కె. రేవతిపతి-టెక్కలి-కాళింగ కె. మోహన్‌రావు- పాతపట్నం-తూర్పుకాపు,జి.ఎ.సూర్యనారాయణ-శ్రీకాకుళం- పి.వెలమ, తమ్మినేని సీతారామ్ -ఆముదాల వలస-కాళింగ, కె.అచ్చెన్నాయుడు-హరిశ్చంద్రపురం-పి.వెలమ, కె.గణపతిరావు- ఉణుకూరు- తూర్పుకాపు, కె.అప్పల నాయుడు-ఉత్తరాపల్లి-కొప్పుల వెలమ, పి.నారాయణస్వామి నాయుడు- భోగాపురం- తూర్పుకాపు, పిన్నింటి వరలక్ష్మి-విశాఖ2, -యాదవ, బి.సత్య నారాయ ణమూర్తి-పరవాడ, -కె.వెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కొప్పుల వెలమ, దాడి వరభధ్రరావు -అనకాపల్లి-గవర, పి.గణబాబు-పెందుర్తి-గవర, అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కె.వెలమ, యనమల రామకృష్ణుడు- తుని-యాదవ, వి.వెంకటేశ్వరరావు -కాకినాడ-మత్సకార, పి.అనంతలక్ష్మి- తాళ్లరేవు-శెట్టిబలిజ, కాగిత వెంకటరావు-మల్లేశ్వరం- గౌడ, ఎన్.నరసింహరావు-మచిలీ పట్నం-మత్స కార, పి.రామారావు-చీరాల-యాదవ,కె.ఇ.ప్రభాకర్-ఢోన్-గౌడ, ఆర్.సాయినాద్ గౌడ్-గుత్తి, -గౌడ, నిమ్మల కిష్టప్ప-గోరంట్ల-పద్మశాలి కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు-9 ధర్మాన ప్రసాదరావు-నరసన్నపేట-పి.వెలమ ఎమ్. శివున్నాయుడు-పార్వతి పురం-కె.వెలమ పి.జగన్మోహన్ రావు-బొబ్బిలి-కె.వెలమ వాసిరెడ్డి వరద రామారావు-తెర్లాం -కె.వెలమ టిఎస్ఎ నాయుడు- గజపతినగరం-తూర్పుకాపు ఎమ్. హను మంతరావు-మంగళగిరి-పద్మశాలి ఎమ్.వెంకటరమణ-కూచినపూడి-మత్యకార జె.కృష్ణమూర్తి- గురజాల-యాదవ ఎన్.రఘువీరారెడ్డి-మడకశిర-యాదవ. టీడీపీక్షత్రియ ఎమ్మెల్యేలు..7 పి.అశోక్ గజపతిరాజు-విజయనగరం ఆర్ఎస్ డిపి నరసింహరాజు-భీమిలి ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు డి. శివరామరాజు-అత్తిలి పివి. నరసింహరాజు-భీమవరం కె.రామచంద్రరాజు-ఉండి మంతెన అనంతవర్మ-బాపట్ల కాంగ్రెస్ క్షత్రియ ఎమ్మెల్యే-1 పి.సాంబశివరాజు- సతివాడ ముస్లిం ఎమ్మెల్యేలు.. నలుగురు ఎన్నిక కాగా వారిలో ముగ్గురు టీడీపీ, ఒకరు కాంగ్రెస్ కు చెందినవారు. టీడీపీ..3 ఎస్.జియావుద్దీన్-గుంటూరు-1, ఖలీల్ భాషా-కడప, ఎన్.ఎమ్.డి ఫరూక్-నంద్యాల కాంగ్రెస్-1 జలీల్ ఖాన్-విజయవాడ 1 ఇతర సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు..6 (నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ) వైశ్యులు ముగ్గురు, ఇద్దరు వెలమ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందనవారు గెలిచారు. వైశ్య-3 అంబికా కృష్ణ-ఏలూరు-టీడీపీ టిజి వెంకటేష్- కర్నూలు-టీడీపీ ఎమ్.ఎస్. పార్ధసారది-కదిరి-బీజేపీ వెలమ-2 కె. విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ కె. హనుమతరావు-నూజివీడు-టీడీపీ. బ్రాహ్మణ కోట శ్రీనివాసరావు-విజయవాడ తూర్పు-బీజేపీ – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
కుల రహిత భారతం సాధ్యమే
భారతదేశానికి ‘కులం’ అనేది ఓ శాపం లాంటిది. కుల వ్యవస్థ... తద్వారా వచ్చిన సామాజిక అంతరాల వల్ల ఉత్పత్తి శక్తుల ప్రతిభ నిర్వీర్యమైంది. మని షిని మనిషిగా చూడ లేని దుర్మార్గ వ్యవస్థ వేల ఏండ్లుగా కొనసాగు తోంది. అంబేడ్కర్ లాంటి ప్రపంచ మేధా వియే కుల వ్యవస్థ దుర్మార్గం వల్ల విపరీత మైన వేదనకు గురయ్యారు. ఈ కులవ్యవస్థ పొడగింపు ప్రజాస్వామ్య ప్రభుత్వాల కాలంలోనూ కొనసాగడం గమనార్హం. కులవ్యవస్థ భారత జాతిని నిర్వీర్యం చేసింది. దేశంలోని 85 శాతం ప్రజలను సేవ కులుగా మార్చింది. అందుకే కుల రహిత భారతాన్ని కోరుకున్నారు అంబేడ్కర్. భారత దేశం కుల రహితంగా మారేంత వరకూ, ఆ వ్యవస్థ వల్ల వచ్చిన సామాజిక అంతరాలు పోయే వరకూ శూద్రులకు, అతిశూద్రులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచారు. కుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందించారు. కులరహిత భార తాన్నీ, సెక్యులర్ భారతాన్నీ అంబేడ్కర్ కోరు కున్నారు. కానీ, రాజ్యాధికారంలో ఉంటు న్నదీ, రాజ్యాంగాన్ని అమలుపరిచే స్థానంలో ఉంటున్నదీ కుల వ్యవస్థ వల్ల లాభపడుతున్న వారే కావడం వల్ల కుల నిర్మూలన జరుగడంలేదు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు కూడా అమలు కావడం లేదు. ఏది ఏమైనా దేశాన్ని అంధకార యుగంలోకి తీసుకు వెళ్ళే కులవ్యవస్థ అంతరించాల్సిందే. కులవ్యవస్థ అంతరించడమంటే వృత్తి పనులు అంతరించడం కాదు. అన్ని దేశా ల్లోనూ వివిధ వృత్తులకు సంబంధించిన పనులున్నాయి, కానీకులాలు లేవు. కులవృత్తులు లేవు. అయితే కులవ్యవస్థ లేనిచోట అన్ని సమస్యలూ పరిష్కారమైనాయా అంటే కాక పోయి ఉండవచ్చుగాక. కాని, కులవ్యవస్థ వల్ల వచ్చే పుట్టుకతోనే దఖలుపడే అధి కారాలు, ఆస్తులు, వివక్ష, పేదరికం, సామా జిక అంతరాలు అక్కడ లేవు. దేశంలోని కోట్లాది మందిని అస్పృశ్యులుగా ముద్ర వేయడం ఏ దేశంలోనూ లేదు. ఒక్క భారత్‌లో తప్ప. కుల రహిత భారతం ఏర్పడితే భారత జాతి అంతా ఒక్క టవుతుంది. సామాజికఅంతరాలు దూరమవుతాయి. ఎ వరికిష్టమైన పనిని, వృత్తిని వారు స్వీకరిస్తారు. ఇది తక్కువ పని, అది ఎక్కువ పని అనే భేద భావాలు తొలగిపోతాయి. విదేశాల్లోలా కులాల బట్టి కాకుండా ఎవరికి ఏ పనిలో నైపుణ్యముంటుందో ఏ పని చేయడానికి ఇష్ట పడుతారో ఆ పని చేస్తారు. అందరూ అన్ని పనులూ చేస్తుంటే సామాజిక అంతరాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. కులాలను కాపాడుతున్నవారు కులాలతో సామాజిక గౌరవం, ఆస్తులు, రాజ్యధికారం అనుభవిస్తున్నారు. వీళ్ళు కులనిర్మూలనకు సహకరించకపోగా కులాలను పెంచి పోషిస్తు న్నారు. వీరి స్థానంలో కుల బాధితులూ,కులంలో అత్యంత హీనస్థితిలో ఉన్నవారూ, మూలజాతుల వారూ రాజ్యాధికారంలోకి వస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు కనీసం యాభై ఏళ్లు పరిపాలన చేస్తే కుల నిర్మూలన జరుగుతుంది. నిచ్చెన మెట్ల కుల సమాజంలో అట్ట డుగున ఉన్నవారు రాజ్యాధిరారంలోకి వస్తే పై మెట్టుపై ఉన్న వారు మాకీ కులాలు వద్దని మొత్తుకుంటారు. కుల నిర్మూలనకు సహక రిస్తారు. ఎలాగూ వేల ఏండ్లుగా బాధితులైన మూలజాతుల వారు తాము పాలకులై తమను ఇన్నేండ్లుగా బాధలో ఉంచిన కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఇలా అటు ఆగ్రకులాల వారూ, ఇటు శూద్ర, అతిశూద్ర కులాలవారూ కులనిర్మూలనకు సహకరిస్తే ఓ యాభై అరవై ఏళ్లల్లో దేశం లోంచి కులం మాయమైపోతుంది. - వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567 - డా‘‘ కాలువ మల్లయ్య -
కులమతాల చిచ్చు పెడుతున్నారు
ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్‌ముఖ్‌లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది. జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్‌లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది -
కులం పేరిట బాబు విష రాజకీయం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి. కులం.. ఓ అస్త్రం ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. పవన్‌తో పొత్తు.. దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్‌లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్ కళ్యాణ్ అనే చాప్టర్‌ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్‌కళ్యాణ్‌ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్‌తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్ రూపం మాత్రమే. పవన్ వెనక ఉన్న వారెవరు? పవన్ కళ్యాణ్‌ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్‌కళ్యాణ్. నిజంగా పవన్ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు, బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు. మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాస్‌ను, అగ్రోస్ ఛైర్మన్‌గా నవీన్ నిశ్చల్‌ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు. నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఫారెస్ట్ బోర్డు మెంబర్‌గా నయనార్ శ్రీనివాసులును నియమించారు. పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్. బలిజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : రత్నాకర్ వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. పవన్‌తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు. -
ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భోపాల్: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. "భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు
ముహమ్మద్ ఫసియొద్దీన్: కుల మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించవచ్చా? గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థన స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం... ‘లేదు’. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే. మీ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సజావుగా అమలు అవుతోందా? పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ప్రవర్తన, చర్యలు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలను ప్రజలు కూడా పరిశీలించవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు లేదా ‘సీ–విజిల్’ యాప్ ద్వారా ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపొచ్చు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘంజారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తాజాగా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. విద్వేషాలు రెచ్చగొట్టరాదు... భిన్న కుల, మత, భాష, వర్గాల ప్రజల మధ్య విభేదాలను పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర, చేసిన పనులకు పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, ఓటర్ల స్థానంలో ఇతరులతో ఓటేయించడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు జరపడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించడం వంటివి చేయరాదు. ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు ప్రతి పౌరుడి హక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్ల ముందు ఏ పరిస్థితుల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు. యజమానుల సమ్మతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం వినియోగించరాదు. గోడలపై ఎలాంటి రాతలు రాయకూడదు. ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం చేయకుండా చూసుకోవాలి. ఏదైనా ఓ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒక పార్టీ అతికించిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు. ఊరేగింపులు... ఊరేగింపుల రూట్ మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఊరేగింపులు చేసుకోవాలి. భారీ ర్యాలీ అయితే తగిన నిడివికి తగ్గించుకోవాలి. ఇద్దరు లేదా అంతకుమించిఅభ్యర్థులు/పార్టీలు ఏక కాలంలో ఒకే రూట్లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరిపి ఘర్షణ జరగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీలు, అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. ఆ వస్తువులు అసాంఘిక శక్తుల చేతిలో దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టి బొమ్మలను ఊరేగించడం, వాటిని బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు. పోలింగ్ బూత్‌ల వద్ద.. ఓటర్లు మినహా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం పాస్ కలిగిన వారికి మినహాయింపు. పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీలు, అభ్యర్థులకు ఫిర్యాదులుంటే వాటిని పరిశీలకుల దృష్టికి తేవాలి. సభలకు ముందస్తు అనుమతి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలి. సభ వేదిక ఉన్న ప్రాంతంలో ఏవైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగా దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందస్తుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి. స్వేచ్ఛగా ఓటు వేసేలా.. అభ్యర్థులు/పార్టీలు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులకు సహకరించాలి. తమ అనధికార కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బ్యాడ్జీలను ఇవ్వాలి. ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం సరఫరా జరపరాదు. పోలింగ్‌బూత్‌ల వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద ప్రజలను గుమికూడనీయొద్దు. అభ్యర్థుల క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలను సరఫరా చేయరాదు. పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలుంటాయి. పర్మిట్లు పొంది వాటికి స్లిక్కర్ బాగా కనిపించేలా వాహనంపై అతికించాలి. -
చెప్తాలే! ఇంతకీ మనదే కులం?!
-
‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం
సాక్షి, అమరావతి: కులగణన అంశానికి సంబంధించిన నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్ ఉన్నారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు మాకు మీరు.. మీకు మేం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేవి. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ సిర్పూర్ - కోనేరు కోనప్ప ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్ మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు (రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు) తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్ ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా.. పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. (టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల) కమ్మ @ కిం కర్తవ్యం ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. అర్జంట్‌గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను మాత్రం కలవలేదు. (బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు) చాలా స్ట్రాంగ్ తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్ఎస్ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. -
సత్తుపల్లి మట్టా దయానంద్‌కి గట్టి దెబ్బ
సాక్షి, ఖమ్మం: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్‌కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏకంగా ఆయన పోటీ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణపై కొడారి వినాయక రావు అనే నేత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటీపడ్డారు. ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై, వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిగింది. వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించిన వలసినది జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee(DLSC) ఆదేశించింది కూడా. అయితే.. మట్టా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక రూపొందించారు. దీంతో.. ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాదంటూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లాలోని ఆయా శాఖ అధికారులకు సమాచారం పంపించారు కూడా. ఈ వ్యవహారంపై ముప్పై రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దయానంద్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ప్లాన్ బీ కూడా? 2014లో ఎస్సీ ధ్రువీకరణతో దయానంద్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. 2,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) టిక్కెట్ అశించి భంగపాటుకు గురయ్యారు. అయితే మే నెలలో రేవంత్‌రెడ్డి సమక్షంలో భార్య రాగమయితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సత్తుపల్లి ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు. కుల ధ్రువీకరణ అభ్యంతరాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ.. ధ్రువీకరణ పత్రం గనుక రద్దు అయితే.. తన భార్య రాగమయిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ,కొండూరు సుధాకర్‌లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి మానవతారాయ్ కావడం గమనార్హం. -
నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పంపిణీ పథకం ఆశావహులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించి ప్రతి నెలా 15వ తేదీన విడతల వారీగా సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలివిడత కింద ఈనెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సాయానికి ఎంపికైన వారికి చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసిన యంత్రాంగం చివరకు అరకొరగా.. కేవలం పదుల సంఖ్యలోనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పంపిణీ ఊసే లేకపోగా.. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చోట్ల పరిమితంగా లబ్ధిదారులకు చెక్కులు అందించడంతో ఎంతో ఆశగా సాయంకోసం ఎదురు చూసిన దరఖాస్తుదారులు నిరాశకు గురయ్యారు. ఎంతమందికి అందాయి..? బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండల స్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించాలని ప్రభుత్వం సంబంధిత అధికారు లను ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు వీలైనన్ని దరఖాస్తులను పరిశీలించి జాబితాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. తొలివిడత కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.400 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు సగటున 335 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున సాయం ఆదించవచ్చని అంచనా వేశారు. కానీ శనివారం మెజార్టీ సెగ్మెంట్లలో ఈ కార్యక్రమమే నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే శాసనసభ్యులకు సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినట్లు క్షేత్రస్థా యి అధికారులు అధికారులు చెబుతున్నారు. దీంతో 15వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఎంత మందికి చెక్కులు పంపిణీ చేశారనే దానిపై అస్పష్టత నెలకొంది. దీంతో మండలాల వారీగా సమాచా రాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలివిడతలో చేపట్టిన కార్యక్రమంలో పంపిణీ చేసిన చెక్కుల వివరాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని చెపుతున్నారు. అత్యధికం అనర్హులే...! వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులపై ఆధారపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. దరఖాస్తుల ప్రక్రియకు తక్కువ సమయం ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అనూహ్య స్పందన వచ్చింది. అధికారులు వాటి పరిశీలనకు ప్రత్యేక విధానాన్ని అమలు చేసినట్లు తెలిసింది. ప్రతి దరఖాస్తుపై పూర్తిస్థాయి పరిశీలన (360 డిగ్రీలు) విధానంలో ఆరా తీసినట్లు చెపుతున్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖా స్తుల్లో మూడోవంతు వాటిని తొలివిడత కింద పరిశీలన చేశారు. ఇందులో మెజార్టీ అర్జీ దారులు కులవృత్తులపైనే ఆధారపడకుండా ఇతరత్రా వ్యాపకాలు నిర్వహిస్తున్నట్లు వెలుగు చూసింది. అంతేకాకుండా ఆర్థికంగా బాగా ఉన్న వాళ్లు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. చాలా మందికి సొంతంగా నాలుగు చక్రాల వాహనాలు, ఇళ్లు, పొలాలు.. తదితరాలున్నా యని తేలింది. ఆదాయపన్ను చెల్లిస్తున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో మెజార్టీ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాల ఆధారంగా పరిశీలించిన దరఖాస్తుల్లోనూ ఇదే తరహాలో పలువురు అనర్హతకు గురైనట్లు తెలిసింది. దీంతో తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేనందున చెక్కుల పంపిణీ విషయంలో వారు ఆసక్తి చూపించలేదని తెలిసింది. -
కుల ప్రాతిపదికన భూములా?
సాక్షి, హైదరాబాద్: కులరహిత సమాజం కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం అవి మరింత బలంగా మారే పనులు చేయడం దారుణమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుల ప్రాతిపదికన భూములు ఎలా కేటాయిస్తారు.. వారు కట్టుకొనే కమ్యూనిటీ భవన్లలోకి ఇతర కులాలను అనుమతిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం అలా ఎలా భూములు కేటాయిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? ఈ రకమైన వివాహాలకు ఏదైనా సాయం అందిస్తోందా? కుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేయాలి. 21వ శతాబ్దంలో కూడా కులాల ఆధారిత విభజన ఉందంటే.. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇలాంటి ఆలోచ నలు చాలా సంకుచితమైనవి.. అసంబద్ధమైనవి’ కకులాల మధ్య మరింత అంతరాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్లు అనిపిస్తుంది. అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. కర్ణాటకలోనూ లింగాయత్ కమ్యూనిటీ విద్యాసంస్థలు, చారిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మార్కెట్ విలువకే ప్రభుత్వం నుంచి భూములు తీసుకుందని.. ఇలా కుల ప్రాతిపదికన భూములు కేటాయించడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ప్రభుత్వాలు ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కమ్మ, వెలమ కులాలకు 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలోని అత్యంత విలువైన భూములను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎకరం విలువ రూ. 50 కోట్లకుపైనే... పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘ఖానామెట్ విలేజ్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) రహదారికి ఆనుకొని హైటెక్ సిటీ రోడ్డుకు పక్కన ఉన్న 5 ఎకరాల భూమిని ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు, అయ్యప్ప సొసైటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న మరో 5 ఎకరాల భూమిని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండూ రాష్ట్రంలో అత్యంత ధనిక కులాలు. కేటాయించిన భూములు కూడా అత్యంత విలువైనవి. ఎకరం రూ. 50 కోట్లకుపైనే ఉంటుంది’అని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వం ఈ రెండు కులాలకు మాత్రమే భూములు ఇవ్వలేదు.. అనేక ఇతర కులాలకు కూడా కమ్యూనిటీ భవన్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించింది. జీవో నంబర్ 571 ఆధారంగా మార్కెట్ విలువ మేరకు భూములు కేటాయించింది. ఇతర కులాల్లో పేదలు ఎక్కువ శాతం ఉన్నందున వారికి మార్కెట్ విలువలోనూ తగ్గింపు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కులాలకు భూకేటాయింపులపై అసంతృప్తి వ్యకం చేసింది. ఈ పిటిషన్లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. వెలమ అసోసియేషన్‌కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామని పేర్కొంటూ విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. మరికొన్ని సంస్థలకు భూ కేటాయింపులపైనా... రాజబహదూర్ వెంట్రామిరెడ్డి విద్యాసంస్థలు(రెడ్డి హాస్టల్), శారదా పీఠం, జీయర్ ట్రస్టు, దర్శకుడు ఎన్.శంకర్‌కు భూ కేటాయింపులపై దాఖలైన పిల్ కూడా సీజే ధర్మాసనం వద్ద విచారణకు వచ్చింది. రెడ్డి హాస్టల్ కేటాయింపు పిటిషన్లో పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే 2018లో భూమి కేటాయిస్తే ఇప్పుడు ఎందుకు పిల్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 23కు వాయిదా వేసింది. -
కాబోయే మెగా కోడలు.. ఆ విషయంపై తెగ వెతికేస్తున్నారు!
టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. ఓ వైపు సినిమాల్లో మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ ఏడాదిలో తను ప్రేమించిన మెగాహీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడనుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 9న నిశ్చితార్థం కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అందువల్ల ఆమె పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సందర్భంలో కొందరు నెటిజన్లు మాత్రం లావణ్య క్యాస్ట్ కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. సెలబ్రిటీల బయోడేటాను తెలుసుకునేందేకు చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఈ బ్యూటీ వచ్చి చేరింది. లావణ్య క్యాస్ట్ ఏంటి? అని నెటిజన్లు వెతకడంతో ఆమె పేరు గూగుల్‌లో టాప్ ట్రెండింగ్ అయిపోయింది. (ఇదీ చదవండి: అతనొక స్టార్ కమెడియన్.. అలా చేస్తారనుకోలేదు: ప్రగతి) ఉత్తర ప్రదేశ్, ఫైజాబాద్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించిన ఈ అమ్మడు.. డెహ్రడూన్‌లో పెరిగింది. తండ్రి హైకోర్టులో న్యాయవాది కాగా, తల్లి రిటైర్డ్ టీచర్. తనకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. తమ కుటుంబంలో క్యాస్ట్‌కు అంత ప్రాధాన్యత ఉండదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది లావణ్య. 'మనం చేసే పనుల వల్ల మాత్రమే గొప్ప వాళ్లం అవుతాం. అంతేకాని కులం వల్ల ఎవరూ గొప్పవారు కాలేరు' అని గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇవే మాటలను మెగా ఫ్యాన్స్ నెటిజన్లకు గుర్తు చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చెబుతూ.. మెగా కుటుంబంలో కూడా క్యాస్ట్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వరు అని వారు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం ఈ క్యాస్ట్ గోల ఏంటి? అని తప్పుబడుతున్నారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో బన్నీ సందడి.. సోషల్ మీడియాలో వైరల్!) -
కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీకి షాకిస్తూ ఘన విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే హస్తం పార్టీ గెలుపుకు పలు అంశాలు కలిసొచ్చినప్పటికీ ప్రధానంగా మాత్రం మూడు సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడమనే చెప్పాలి. అవేంటో చూస్తే.. లింగాయత్‌లు దెబ్బ బీజేపీకి భారీగానే నష్టాన్ని మిగిల్చింది. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను పక్కన పెట్టడం, రాజకీయ విశ్లేషకుల ప్రకారం కాషాయ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని అంటున్నారు. బీజేపీ తప్పు కాంగ్రెస్ కలిసొచ్చిందా! లింగాయత్‌ల ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం పడిపోయింది(2018లో 41.8 శాతం నుంచి 2023లో 39.5 శాతానికి). అయితే ఓట్ల శాతం తక్కువే అయినప్పటికీ ఈ తేడా కారణంగా బీజేపీ ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం దాదాపు సగం సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. (2018లో 41 నుంచి 2023లో 21 చేరుకుంది). మరోవైపు, జేడీ(ఎస్)కు స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకును కాస్త కోల్పోయింది. ఈసారి లింగాయత్ ఓట్లలో ఐదు శాతంతో పాటు కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న మూడు స్థానాలను కోల్పోయింది. సాధారణంగా జనతాదళ్ (సెక్యులర్) వైపు మొగ్గు చూపే బీజేపీయేతర లింగాయత్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు ఇది సూచిస్తుంది. జగదీష్ శెట్టర్, లక్ష్మణ్ సవాది వంటి లింగాయత్ నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించడం ఆ పార్టీకి దోహదపడి ఉండవచ్చు. అథని సీటులో సవాది గెలుపొందగా, హుబ్లీ-ధార్వాడ్ (సెంట్రల్) సీటులో షెట్టర్ ఓడిపోవడం గమనార్హం. లింగాయత్‌ల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా ఇతర ప్రధాన సామాజిక వర్గాలు ఈసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. లింగాయత్ తర్వాత వారీ ఓట్లు కీలకంగా మారాయి లింగాయత్‌ల సామాజిక వర్గం తర్వాత వొక్కలిగలు, దళితులు ఆధిపత్య వర్గాలుగా ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ బాగానే సాధించింది. మరోవైపు, వొక్కలిగ స్థానాల్లో కాంగ్రెస్ దాదాపు నాలుగు శాతం ఓట్ల లాభంతో 2018లో 14 నుంచి 2023లో 27 సీట్లకు రెట్టింపు అయింది. దీనికి మరో ప్రముఖ వొక్కలిగ నేత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. కనకపుర నియోజక వర్గంలో 1.2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన శివకుమార్ గౌడ గడ్డపై వొక్కలిగ ఓట్లను దూరం చేసి ఉండవచ్చు." జేడీ(ఎస్)కు కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్ పార్టీ 36 గ్రామీణ స్థానాల్లో విజయం సాధించడం ఓటర్లు మార్పునగా సూచనగా కనిపిస్తోంది. షెడ్యూల్డ్ కులాల ఓట్లతో కాంగ్రెస్‌కు మరో భారీ విజయం దక్కినట్లయింది. కాంగ్రెస్ పది సీట్లు, ఎస్సీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 5.5 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ, జేడీ(ఎస్) వరుసగా ఐదు, మూడు స్థానాలు కోల్పోయాయి. ఇవి నేరుగా కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలస్తోంది. రాష్ట్రంలో దళితుల ఓట్లు సాధారణంగా చీలిపోతాయి. అయితే, ఈసారి, ఎస్సీ-ఆధిపత్య ప్రాంతాలు కాంగ్రెస్‌కు అత్యధికంగా ఓటేశారు. రాష్ట్రంలోని 37 ఎస్సీ-ఆధిపత్య స్థానాల్లో కాంగ్రెస్ 22 గెలుచుకుంది, గత ఎన్నికల్లో సాధించిన దానికంటే దాదాపు రెట్టింపుగా ఉంది. చదవండి: 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి -
ఓటు హక్కును వినియోగించుకున్న హెచ్ డీ కుమార స్వామి
-
మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు
సాక్షి, తూర్పుగోదావరి: రాజకీయాల్లో కులపిచ్చికి బాబు బ్రాండ్ అంబాసిడర్.. ఆయన కులపిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి గోదావరి జిల్లాల పర్యటనలో బయటపెట్టుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పరామర్శ పేరుతో వెళ్లిన చంద్రబాబు.. సిల్లీ రాజకీయాలకు తెరతీశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాట కోటేశ్వరంలో చంద్రబాబు కులపిచ్చి బయటపడింది. కష్టాన్ని చెప్పుకునేందుకు వచ్చిన రైతును కులం పేరుతో చంద్రబాబు అవమానించారు. కులం ఏంటని రైతును అడిగిన చంద్రబాబు.. మళ్లీ కులపిచ్చి తన బయటపెట్టుకున్నారు. చంద్రబాబు తీరుపై జనం మండిపడుతున్నారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! -
Bihar: నితీష్ కుమార్‌కు షాకిచ్చిన పాట్నా హైకోర్టు..
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేపై హైకోర్టు స్టే విధించింది. కుల గణనపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ మధురేష్ ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కుల, ఆర్థిక సర్వేలు నిర్వహిస్తోందని పిటిషనర్లలో ఒకరైన దిను కుమార్ కోర్టుకు తెలిపారు. సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం జరుగుతున్న సర్వేపై తక్షణమే స్టే విధించాలని, ఇప్పటివరకు సేకరించిన సర్వే డేటాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. కాగా మహాఘట్బంధన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కులాల లెక్కింపు జరిగింది. రెండో సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమవ్వగా మే 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో.. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక, సామాజిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. వాస్తవానికి కులగణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం కుల గణన చేపట్టాలని నితీష్ కుమార్ పలుమార్లు కోరారు. కానీ కేంద్రం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో బిహార్ సీఎం స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టింది. అవసరమైన వారికి సేవలు అందించడంలో సర్వే ఉపయోగపడుతుందని సీఎం నితీశ్ తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై వస్తున్న వ్యతిరేకతపై నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకే ప్రభుత్వం లక్ష్య సాయాన్ని సులువగా చేర్చేందుకు దోహదపడుతందన్నారు. చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా? #WATCH | Bihar Deputy CM Tejashwi Yadav speaks after Patna HC puts a stay on Caste-based census, says, "Caste-based census is for welfare of the people, we want to eradicate poverty, backwardness. One thing is clear, it is bound to happen" pic.twitter.com/GZG7V5m7de — ANI (@ANI) May 4, 2023 -
వాళ్లే నిజమైన యాంటీ నేషనల్స్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పరస్కరించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రస్తత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమబద్దమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆమె పేర్కొన్నారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ది టెలిగ్రాఫ్‌లో వ్యాసం రాశారు సోనియా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయులను మతం, భాష, కులం, లింగం ఆధారంగా విభజిస్తున్న వారే నిజమైన జ్యాతి వ్యతిరేకులు(యాంటీ నేషనల్స్) అని సోనియా బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు మనం బాబా సాహెబ్ వారసత్వాన్ని గౌరవిస్తున్నప్పుడు, రాజ్యాంగం విజయం.. దాన్ని అమలు చేసే పాలకులను ఎంచుకునే ప్రజలపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి.' అని సోనియా అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి దాని పునాలుదైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయాన్ని బలహీనపరుస్తోందని సోనియా ఫైర్ అయ్యారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగ సంస్థలతో దాడులు చేస్తున్నారని, కొంతమంది స్నేహితులకే ప్రయోజనం చేకూర్చుతున్నారని ఆరోపించారు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు: హీరోయిన్
తమిళసినిమా: మలయాళం, తమిళం, తెలుగులో నటిస్తున్న నటి సంయుక్త మీనన్. ప్రస్తుతం ధనుష్‌తో చేసిన వాత్తీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనను అందరూ సంయుక్త మీనన్ అని పిలుస్తున్నారని.. అయితే తనకు కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదని, సంయుక్త అని పిలవడమే తనకు ఇష్టమని పేర్కొంది. తాను నటిగా మలయాళంలో పరిచయమైనా తమిళ చిత్రాలు అంటే చాలా ఇష్టమని పేర్కొంది. తమిళ భాష, తమిళ సినిమా పాటలు అంటే ఇంకా ఇష్టమని చెప్పింది. చిన్న తనంలోనే ముస్తఫా అనే పాటను పలుమార్లు ఇష్టంగా వినేదాన్నని తెలిపింది. తాను ఇంతకు ముందు తమిళంలో కొన్ని చిత్రాలను అనుభవరాహిత్యంతో అంగీకరించి నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని చెప్పింది. అలా ఒప్పుకుని నటించిన చిత్రమే వాత్తీ అని చెప్పింది. ఇందులో ధనుష్ వంటి అనుభవమైన నటుడి సరసన నటించడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, ధనుష్ సింగిల్ టేక్ ఆరి్టస్ట్ అని, అందు వల్ల తాను ఎక్కువగా తీసుకోరాదని ముందుగానే డైలాగ్స్ చెప్పడం నుంచి నటించడం వరకు ప్రిపేర్ అయ్యేదాన్ని అని తెలిపింది. అయినా టేక్‌లు తీసుకునేదాన్ని, అందుకు ధనుష్ ఎంతగానో సహకరించారని పేర్కొంది. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా సంయుక్త పేర్కొంది. -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
కులాలకు గాలం.. ఏమడిగినా తగ్గేదేలా అంటున్న పార్టీలు
సాక్షి, నల్లగొండ: చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఓ సామాజిక వర్గం ఓట్లకు ముఖ్యనాయకుడు ఒకరు బేరం పెట్టారు. మీ కులం ఓట్లన్నీ మాకే కావాలి.. మీకేం కావాలో చెప్పండి.. అని అడిగితే ఆ కులం వారు రూ.12 లక్షలు అడిగారు. అంతే.. వెంటనే రూ.2 లక్షలు ఇచ్చేశారు. మిగతా రూ.10 లక్షలు మంత్రి కోటాలో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మొత్తంతో గుడికి ప్రహరీ గోడ, లేదంటే కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని భావిస్తున్నారు. ►మునుగోడు మండలం కొరటికల్‌లో కంఠమహేశ్వరస్వామి గుడికి రూ.5 లక్షలు ఇస్తామని టీఆర్ఎస్ నాయకుడు ఒప్పుకున్నారు. అందులో రూ.లక్ష మూడు రోజుల కిందట సోమవారమే ఇచ్చారు. మిగతా మొత్తాన్ని మరో వారంలో ఇస్తామని ఒప్పుకున్నారు. ►విరాళాల సంగతి అలా ఉంటే ఇక కులాల వారీగా కూడా సమ్మేళనాలను షురూ చేశాయి. గిరిజనులు అధికంగా ఉన్న సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని బొర్లగడ్డతండాకు ఇన్చార్జ్గా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను టీఆర్ఎస్ నియమించింది. ఆమె అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నారు. ►మునుగోడులో మంగళవారం నాయీబ్రాహ్మణుల సమ్మేళనానికి బీజేపీ ఈటల రాజేందర్ హాజరై హామీలిచ్చారు. రజక కులస్తులతో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ సమావేశం అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో ముఖ్య నేతలు, ఇన్‌చార్జీలంతా ఇప్పుడు కులాల ఓట్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ సామాజికవర్గం వారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి... ఆయా వర్గాలకు అక్కడ సంఘాలు ఏమైనా ఉన్నాయా? వాటికి నేతృత్వం వహిస్తున్నదెవరు? అన్న వివరాలను సేకరించాయి. టీఆర్ఎస్, బీజేపీలు ప్రతి వంద ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించాయి. ఆ వంద మంది ఓటర్లలో ఎంత మంది ఏ కులం వారు ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో ఏ కులం ఓట్లు ఎక్కువగా ఉంటే ఆ కులం వారినే అక్కడ ఇన్‌చార్జీలుగా నియమించారు. వారు రంగంలోకి దిగి మనం మనం ఒకటి అంటూ సంబంధాలు కలుపుకుంటూ మా పార్టీకి ఓటేయండి. మీకు అండగా ఉంటామంటూ అభయం ఇస్తుండగా, వీలుకాని చోట కుల సంఘాలకు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల అభివృద్ధికి డబ్బులు ఇవ్వడం షురూ చేశారు. చౌటుప్పల్ మండలం డి.నాగారంలో రూ.5లక్షలతో పెద్దమ్మ గుడి కట్టించేందుకు బీజేపీ నేతలు కొబ్బరికాయ కొట్టగా అదే మొత్తంతో తాము కట్టిస్తామని టీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయ కొట్టారంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వివిధ పార్టీలు సేకరించిన కొన్ని కులాల వారీగా ఓటర్లు గౌడ్ – 37,891, మాదిగ – 26,896, మాల – 9,967, రెడ్డి – 24,950, యాదవ (గొల్ల, కురుమ)– 25,856, పద్మశాలి – 18,615, లంబాడి – 10,334, ముస్లిం – 7,490, రజక – 6,752, మున్నూరుకాపు – 4,129, ముదిరాజ్ – 20,691, వడ్డెర – 3,850, కుమ్మరి – 5,205, కమ్మ – 4,880, నాయీబ్రాహ్మణ – 5,178, ఎరుకలి – 4064, బ్రాహ్మణ – 2076, విశ్వబ్రాహ్మణ – 4813, వైశ్య – 6841, వెలమ – 1360, క్రిస్టియన్ – 1027. -
‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
పాట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ఎంపీ లలన్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతికి(బీసీ) చెందిన వ్యక్తి అని అన్నారు. అయితే గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని ఈబీసీలో విలీనం చేశారని ఆరోపించారు. ఆయన డూప్లికేట్ వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రధాని ఏనాడూ నోరువిప్పలేదని ధ్వజమెత్తారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని లలన్ సింగ్ ఆరోపించారు. అందుకే కుల ఆధారిత జనగణనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అలా జరిగితే వాళ్ల నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. జేడీయూ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు లలన్ సింగ్ మాట్లాడారు. బీజేపీ కౌంటర్ అయితే లలన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. లలన్ సింగ్, నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని, మోదీ ఫోటోతోనే గెలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నేత రవి శంకర్ ప్రసాద్ అన్నారు. రాజకీయ ప్రమాణాలు దిగజారవద్దని హితవు పలికారు. చిన్న చితకా నాయకులు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
చెప్పుకోవడానికే గొప్ప మాటలు..
కులం గురించి మాట్లాడినవారికి చెప్పు చూపాలని చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం సూచించారు. కులం పునాదుల మీద రాజకీయాలలోకి వచ్చి, కులం గోడలను అడ్డు పెట్టుకుని రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రబాబు ఇలా మాట్లాడటం ఆసక్తికరమైన అంశమే. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కూడా! కాకపోతే ఇందులో ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎంతన్నదే చర్చనీయాంశం. ఒకవైపు కులం, మతం గురించి మాట్లాడవద్దని అంటారు. మరోవైపు తానే ఆ విషయాలను ప్రస్తావిస్తుంటారు. ఆయన లెక్కలో తాను మాట్లాడితే అది దేశం, సమాజం హితవు గురించి అని జనం అనుకోవాలి! ఇతరులు మాట్లాడినా, మాట్లాడకపోయినా వీలైనంత బురద రాయాలి. ఇదే ఆయన థియరీ. అధికారంలో ఉంటే సుద్దులు, అధికారంలో లేకపోతే శాపనార్థాలు. ఈ రకంగా విజయ వంతంగా రాజకీయం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు గత మూడేళ్లుగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయన మాట్లాడే మాటలలోని వైరుధ్యాలను, గతంలో ఆయన అవే అంశాలపై భిన్నంగా మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వచ్చేస్తున్నాయి. విశేషం ఏమిటంటే, ఏ సభలో అయితే కులం గురించి మాట్లాడితే చెప్పు చూపాలని చంద్రబాబు అన్నారో, అదే సభలో వైసీపీని విమర్శిస్తూ, ఆయనే కుల ప్రస్తావనను పదే పదే తేవడం! తన కులం వారితోనే తనను తిట్టిస్తున్నారని చెప్పడం! అక్కడితో ఆగలేదు. పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన కులంవారితో తిట్టిస్తున్నారట. తన గురించి చెప్పుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. పవన్‌ను వైసీపీ వారు ఎవరో విమర్శిస్తే, అది కూడా కులం కోణంలోనే చంద్రబాబు చూడడం, తన పార్టీవారు కాకపోయినా, ఆయనతో ఇంకా పొత్తు లేకపోయినా, ఇప్పటినుంచే కాకా పడుతున్నట్లుగా మాట్లాడటం దేనికి సంకేతం? అసలు కులం గురించి, మతం గురించి ఈ మూడేళ్లలో చంద్రబాబు గానీ, ఆయన దత్తపుత్రుడని వైసీపీ విమర్శించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ మాట్లాడినంతగా మరొకరు మాట్లాడలేదని చెప్పవచ్చు. పవన్ ఒకసారి అచ్చంగా కులభావన ఉండాలనీ, మరోసారి వద్దనీ, ఇంకోసారి ఫలానా ఫలానా కులాలవారు తనకు మద్దతు ఇవ్వాలనీ అంటుంటారు. మరి ఆయనకు చంద్రబాబు చెప్పు చూపిస్తారా? లేక, ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అన్నందుకు... తాను కమ్మ కాబట్టే ప్రభుత్వం ఇలా చేస్తోంది, అలా చేస్తోందని అన్నం దుకు తనకు తాను చెప్పు చూపించుకుంటారో తెలియదు. నిజానికి చంద్రబాబు రాజకీయ జీవితం ఆరంభం అయిందే కులం పునాదుల మీద. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే కమ్మ కులం తరఫున వకాల్తా పుచ్చుకుని ఆ వర్గం నాయ కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే కోటాలో ఆయన కాంగ్రెస్(ఐ) తరపున 1978లో టికెట్ పొందారు. అప్పటి ప్రముఖ నేత రాజ గోపాలనాయుడు ఆశీస్సులతో టికెట్ పొందగలిగారు. సీపీఐ నేత నారాయణ కూడా యూనివర్సిటీలో చంద్రబాబు కుల రాజకీయాలు చేశారని చెప్పారా, లేదా? చంద్రబాబు 1983లో చంద్రగిరిలో ఓడి పోయిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి ఎందుకు మారారు? అప్ప టికే అక్కడ ఉన్న కమ్మ వర్గానికి చెందిన రంగస్వామి నాయుడును తప్పించి తను ఎందుకు పోటీ చేశారు? అక్కడ బీసీ వర్గాలవారికి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని తాను క్యాష్ చేసుకోవడానికి కాదా? ఒకవేళ నిజంగానే చంద్రబాబుకు బీసీ వర్గాలవారిపై అంత ప్రేమ ఉండి ఉన్నట్లయితే ఆ సీటును వారికి వదిలిపెట్టి, చంద్రగిరి కాకపోతే, తాను చదువుకున్న తిరుపతిలోనో, చిత్తూరు, శ్రీకాళహస్తి వంటి చోటో ఎందుకు పోటీ చేయలేదు? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కులాలకు అతీతంగా గుడివాడతో పాటు తిరుపతి, నల్లగొండ, టెక్కలి, హిందుపూర్, కల్వ కుర్తిలలో పోటీచేశారు. కల్వకుర్తిలో మాత్రం ఓడిపోయారు. హిందుపూర్ నుంచే ఆయన మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన మరణం తర్వాత ఆ గుడ్ విల్‌ను ఆయన కుమారులు హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ వాడుకోగలుగుతున్నారు. ఎన్టీఆర్ ఏ కులం వారు ఎక్కడ ఉన్నారో చూసి పోటీ చేయ లేదు. ధైర్యంగా ఎక్కడైనా తనకు ఆదరణ లభిస్తుందని నమ్మి రాజకీయం చేశారు. మరి చంద్రబాబు అలా ఎన్నడైనా చేయగలిగారా? ఒకే చోటు నుంచి పోటీచేయడం తప్పని అనడం లేదు. కానీ కులం సుద్దులు చెబు తున్నారు కనుక ఇవన్నీ ప్రస్తావించవలసి వస్తోంది. బహుశా ఇప్పుడు కుప్పంలో ఏర్పడిన గడ్డు పరిస్థితి నేప థ్యంలో నియోజకవర్గం మారతారేమో చూడాలి. మరికొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. వంగవీటి రంగా హత్య తర్వాత కమ్మవర్గం వారిపై ఎందుకు దాడులు జరిగాయి? చంద్రబాబుకు కులతత్వం లేకపోతే రంగా హత్యకు ఎందుకు కమ్మ వర్గం నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణకు గురయ్యారు? ఈ విషయాన్ని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్వయంగా తన పుస్తకంలో రాసుకున్నారు కదా! హైదరాబాద్, అనంతపురంలలో తాను చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ భవనం నిర్మించారు, నిజమే. కానీ ఆ చుట్టు పక్కల భూములన్నీ ముందుగానే ఎక్కువ మంది తన వర్గానికి చెందినవారు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక పరిశోధకురాలు తన వ్యాసంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా ఫ్యాక్టరీ రావడానికి ముందు టీడీపీ నేతలు, ముఖ్యంగా కమ్మ వర్గం నేతలే భూములు కొనుగోలు చేశారనీ, ఆ దందా వల్లే పెను గొండలో టీడీపీ ఓడిపోయిందన్న విమర్శ వాస్తవమో, కాదో చంద్ర బాబే చెప్పాలి. తాను కమ్మ కులం కాబట్టే అమరావతిలోని రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పింది చంద్రబాబు కాదా? అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ కింద భూములు కొనుగోలు చేసిన వారిలో అధికులు ఆ వర్గం వారే ఎందుకు ఉన్నారు? ముఖ్యమంత్రి జగన్‌కు రెడ్డి వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలు అత్యధిక సంఖ్యలో ఎందుకు సపోర్టు చేస్తున్నాయి? జగన్ కుటుంబంలో వివిధ కులాలకు చెందినవారు ఉన్న విషయం మర్చిపోకూడదు. జగన్‌ను క్రిస్టియన్ అని ఎన్నోసార్లు మతపరంగా ప్రస్తావించి దూషిం చిన బాబు ఇప్పుడు కులం, మతం అంటూ నీతులు చెబుతున్నారు. కొన్ని ఆలయాలపై దుండగులు దాష్టీకాలకు పాల్పడితే జగన్ ప్రభుత్వంపై ఎన్ని మతపరమైన ఆరోపణలు చేశారు? మరో సంగతి చెప్పాలి. బాబుకు తన కులానికి చెందిన మీడియా సంస్థలే ఎందుకు అంత ప్రముఖంగా మద్దతు ఇస్తు న్నాయి? రామోజీరావు, రాధా కృష్ణ, బీఆర్ నాయుడు వంటివారు కులంతో కాకుండా మెరిట్ ప్రకారం చంద్రబాబుకు మద్దతు ఇస్తు న్నారా? కడుపు చించుకుంటే కాళ్లమీద పడు తుందన్న చందంగా చంద్రబాబు అనవసర విషయాలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో గురించి మాట్లాడుతూ, బట్టలిప్పితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అని అంటు న్నారు. పోలీసుల వివరణ తర్వాత కూడా చంద్రబాబు ఈ విషయం పదే పదే మాట్లాడడం సరైనదేనా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో ఒరిజినల్ కాదని ఏ పోలీసు వ్యవస్థ అయినా నిర్ధారిం చిందా? కనీసం తాను అయినా అది తన వీడియో కాదని చెప్ప గలిగారా? తన ఫోన్ టాప్ చేస్తారా అని అన్నారే తప్ప తాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం చేయలేదని చెప్పలేకపోయారే! మరి తన బావమరిది నందమూరి బాలకృష్ణ ఏకంగా ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలని సలహా ఇచ్చారు కదా? అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి హిందుపూర్ ఎమ్మెల్యేను చేశారు కదా. తన కుమారుడు లోకేశ్ అరడజను మంది విదేశీ యువతులతో చిందులు వేసిన ఫొటోలను సభ్య సమాజం ఆమోదిం చిందని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏ రాజ కీయ పార్టీ అయినా బాధ్యతగా ఉండాలి. ఏ నేత అయినా జవాబుదారీగా ఉండాలి. సుదీర్ఘకాలం రాజకీయాలలో ముఖ్యమైన పదవు లలో ఉన్న చంద్రబాబు వంటివారు హద్దులు మీరి మాట్లాడితే పోయేది వారి పరువే. జగన్ ప్రభుత్వంపై విధాన పరమైన విమర్శలు చేయలేక, ఇలాంటి దిక్కుమాలిన విషయాలపై చంద్ర బాబు ఆధార పడే దీన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అనుకుంటే అందులో తప్పేం ఉంటుంది! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘‘కొందరు దేశాన్ని కులం మతం పేరిట విడదీస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చైనా, సింగపూర్, కొరియా దేశాల్లోలాగా కుల మత రహిత దేశంగా ముందుకు సాగాలి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో నిర్మించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: దేశంలో అనేక నదులు, ఎంతో సంపద ఉండి కూడా అభివృద్ధి చెందలేకపోయింది. దేశాన్ని ఏలుతున్న పాలకుల వైఫల్యాలే దీనికి కారణం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసం ఉంది. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే పార్టీల పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పార్టీల మాటలకు మోసపోతే గోస పడతాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో గత పాలకుల చేతకానితనం, అసమర్థత వల్ల అభివృద్ధికి దూరమయ్యాం. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నేటికీ తీవ్రంగా కరెంట్ కోతలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, కోతల్లేని 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను చూసి నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులను చూసి తమ రాష్ట్రంలోనూ ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండేదని ఇతర రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. తలసరి ఆదాయం పెరిగింది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2014లో దాదాపు రూ.లక్ష తలసరి ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.2,78,500కు పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని నేను ఉద్యమకాలంలోనే చెప్పిన. అదిప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఇవాళ రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లకు పెరిగి దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది ఆషామాషీగా ఏమీ జరగలేదు. కడుపు కట్టుకొని పనిచేయడం, అవినీతి రహిత పాలన అందించడం వల్లే సాధ్యమైంది. రాష్ట్రంలో 2,601 రైతు వేదికలను 6 నెలల వ్యవధిలోనే నిర్మించుకోవడం, 11 వేల క్రీడా ప్రాంగణాలనూ అనతి కాలంలోనే ఏర్పాటు చేసుకోవడం సుపరిపాలనతోనే సాధ్యమైంది. పరిపాలన ప్రజలకు ఎంత చేరువగా ఉంటే అంత చక్కగా పనులు జరుగుతాయి. అందుకే 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని, నూతన కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నాం. సంక్షేమంలో నంబర్ వన్‌గా ఉన్నాం దేశంలో సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న 36 లక్షల పింఛన్లకు అదనంగా మరో 10 లక్షలు కలిపి మొత్తం 46 లక్షల పింఛన్లు అందిస్తున్నాం. ఇవి ఎప్పుడో అందించాల్సింది. కానీ కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. త్వరలోనే వారందరికీ డిజిటల్ కార్డులు జారీ చేస్తాం. గతంలో వృద్ధులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పరిస్థితి కనిపించేది. కానీ ఆసరా పింఛన్ల పుణ్యామా అని అత్త, అమ్మలకు డిమాండ్ పెరిగింది. ఇవాళ రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వారి సంచిలో ఉంటుండటంతో ఎవరికీ భారం కాకుండా బతుకున్నారు. అందుకు కారణం తమ పెద్ద కొడుకు కేసీఆరేనని భావిస్తున్నారు. త్వరలో డయాలసిస్ రోగులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల విద్యాలయాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటిలో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. కరోనా కారణంగా మరికొన్నింటిని ప్రారంభించలేకపోయాం. గతంలో తెలంగాణ జనం పస్తులు ఉండలేక దుబాయ్, బొంబాయిలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 13 లక్షల మందికిపైగా తెలంగాణకు వలస వచ్చి జీవిస్తున్నారు.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో పరిణామాలను గమనించాలి 60ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. అందుకే 58ఏళ్ల పాటు ఎన్నో గోసలు పడ్డాం. ఇప్పుడు పూర్తి జాగ్రత్తతో ఉండాలి. దేశంలో జరిగే పరిణామాలను గమనించాలి. పత్రికల్లో వచ్చే వార్తలను చూసి వదిలేయకుండా వాటిపై గ్రామాల్లో, బస్తీల్లో సైతం చర్చ జరగాలి. అప్పుడే చైతన్యవంతమైన సమాజ పురోగతి సాధ్యమవుతుంది. మేడ్చల్ అభివృద్ధికి రూ.70 కోట్లు హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా చాలా భాగం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నా.. మిగతా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ నిధులు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు తనకు విన్నవించారని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనితో అదనంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 7 నియోజకవర్గాలకు రూ.70 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై గురువారమే జీవో జారీ చేస్తామన్నారు. కాగా.. సభకు ముందు కొత్త కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద, కృష్ణారావు, భేతి సుభాష్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
కులరహిత సమాజం కోసం...
ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు. ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది. రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్‌ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్) దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్‌గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
Ambedkar Jayanti 2022: మలి అంబేడ్కరిజమే మేలు!
అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే ఆయన కృషి కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన కృషిని ‘తొలి అంబేడ్కరిజం’గా పరిగణించాలి. రాజ్యాంగ రచనా సమయంలో– అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా, విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. మొత్తం సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఈ బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి. తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాల్సిన తరుణమిది. అంబేడ్కర్ ఆలోచనలు, కృషిని గతం లో కంటే భిన్నంగా ప్రజాపోరాట శక్తులూ, పాలక శక్తులూ గుర్తిస్తుండటం చూస్తున్నాం. గతంలో చాలాకాలం పాటు అంబేడ్కర్‌ను ఏ మాత్రమూ గుర్తించని సామాజిక శక్తులు 1980 ల నుంచి హఠాత్తుగా ఆయనను ఆరాధించడంలోని ఔచిత్యం ఏమిటి? ప్రపంచ వ్యాప్త సామాజిక ఆర్థిక సంక్షోభం ప్రారంభం; సోషలిజం సహా సకల సైద్ధాంతిక భావజాలాల్లో సంక్షోభం; సామాజిక చైతన్య కేంద్రాల విస్ఫోటనం జరిగి... అస్తిత్వ ఉద్యమాలు, అస్తిత్వ సిద్ధాంతాలు అనే సరికొత్త కేంద్రాల చుట్టూ సమీకృతమయ్యేందుకు శకలాలుగా మారడం వంటి పరిణామాలు సంభవించాయి. ఈ సామాజిక నేపథ్యంలో ప్రబలంగా ముందుకొచ్చిన కుల అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా అంబేడ్కర్, ఆయన సిద్ధాంతాలు నిలిచాయి. ఈ నూతన ఒరవడి నుంచి లబ్ధి పొందేందుకు పాలక వర్గాలు సైతం అంబేడ్కర్‌ను తలకెత్తుకుంటున్నాయి. అయితే సమకాలీన సమాజంలోని ప్రగతిశీల శక్తులూ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ మూల తాత్వికతను గ్రహించడంలో విఫలమై... తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంబేడ్కర్ అనగానే దళిత సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ నాయకుడుగా పలువురు భావిస్తారు. ఆయనలో ఈ రెండు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటిష్ వలస పాలన కాలంలో ప్రధానంగా ఆయన అణగారిన దళిత, అçస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత, వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతోనూ; ఇటు స్వాతంత్రోద్యమకారులు, దేశీయ అగ్రకుల పెత్తందార్ల తోనూ సైద్ధాంతిక భావజాల పరంగా, భౌతికంగా ద్విముఖ పోరాటాలు చేయవలసి వచ్చింది. సమకాలీన సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ఆయన వ్యవహరించారు. అందులో భాగంగా కమ్యూనిస్టు/కార్మికోద్యమాల్లో కులం పాత్ర, వర్గపోరాటంలో (ప్రత్యామ్నాయంగా కాదు) కుల నిర్మూలన పోరాటానికున్న విశిష్ట స్థానం వగైరా అంశాలపై కమ్యూనిస్టులతోనూ తనదైన శైలిలో ఆయన ఘర్షణ పడటం సరైనదే. దాంతో ఆ కాలమంతా ఆయన కృషి దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన సైద్ధాంతిక, రాజకీయ కృషిని తొలి అంబేడ్కరిజంగా పరిగణించాలి. అంబేద్కర్ సుదీర్ఘకాలంగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో; రాజ్యాంగ రచన ప్రభావంతో ఆయన అణగారిన అస్తిత్వాల దృక్పథం పునాదిగా సమగ్ర మానవ విముక్తి మార్గం వైపు అడుగులు వేశారు. 1955లో ఆయన ‘భారతీయ బుద్ధ మహాసభ’ను స్థాపించారు. 1956 ఆక్టోబర్ 14న 22 ప్రమాణాలతో రూపొందిన ‘ధర్మ చక్ర ప్రవర్తన’ సమావేశంలో లక్షలాది ప్రజల సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ‘నవయాన’ బౌద్ధాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేడ్కర్‌ను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’ సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూడా కుల అణిచివేత పునాదిగా శుద్ధ అగ్రకుల వ్యతిరేకతను, ధిక్కారాన్ని మాత్రమే సూచించేదిగా లేకపోవడమనేది ఆయన దృక్పథంలో వచ్చిన విస్తృతిని తెలియజేస్తుంది. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ధ దృక్పథమే భారత విముక్తి మార్గంగా అంబేడ్కర్ బోధించారు. భారతీయ సమాజంలో అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా... విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. దళితులు, బహుజనులు, శ్రామికులు, మహిళలు తదితర అణగారిన ప్రజల దక్పథం పునాదిగా... మొత్తం భారత సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఆయన బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి.సామాజిక, వైయక్తిక బాధల నుంచి మానవ విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది. ఈ అవగాహనతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన స్వప్నించారు. 1956 సెప్టెంబర్ 30వ తేదీన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఆర్పీఐ)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన జీవితపు చరమదశలో ‘ఆర్పీఐ’ ద్వారా కమ్యూనిస్టేతర ప్రగతిశీల శక్తులను సమీకరించే పనికి శ్రీకారం చుట్టారు. బౌద్ధం ప్రభావంతో... సామాజిక సమానత్వం, వర్గపోరాటం అనే ద్విముఖ కార్యాచరణ పునాదిగా రాజకీయ పార్టీని నడపాలని ఆయన భావించారు. ఇంతలో ఆయన 1956 డిసెంబర్ 6వ తేదిన మరణించారు. ఆయన మరణానంతరం 1957లో ఆర్పీఐ ఏర్పడింది. అంబేడ్కర్ దార్శనిక పరిణామాన్ని సక్రమంగా ఆకళింపు చేసుకోలేని అంబేడ్కర్‌వాదులు చీలిపోయారు. అమెరికాలో ‘బ్లాక్ పాంథర్స్’ తరహాలో మహారాష్ట్రలో కూడా ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం కుల అత్యాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరింది. అయితే అస్తిత్వాన్ని మించి, అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులేనని ఈ ఉద్యమం నిర్వచించింది. ఆ తర్వాత 1980–90లలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ తరం సాంకేతిక విప్లవ కాలంలో ముందుకొచ్చిన... ఆధునికానంతర వాద దార్శనికత ప్రభావంతో ఏర్పడిన అస్తిత్వ ఉద్యమాల ఒరవడిలో అంబేడ్కరిజం దేశ రాజకీయ యవనికపై ప్రబలంగా ముందుకొచ్చింది. ఆ కాలంలో వివిధ సంస్థలూ, వ్యక్తులూ అంబేడ్కర్‌వాద లేబుల్‌ను విస్తృతంగా వినియోగిస్తూ ఆయన దార్శనికతను కుల అస్తిత్వానికి సంబంధించినదిగానే (తొలి అంబేడ్కరిజం) కుదించి చూసేవారు. మలి అంబేడ్కరిజంలోని బౌద్ధ భావజాలం, సమతా వాదం వంటి అంశాలను ఇప్పటికీ వారు అస్సలు పట్టించుకోనేలేదు. బ్రాహ్మణిజం, కేపిటలిజం అనే రెండు రకాల సామాజిక శత్రువులను అంబేడ్కర్ గుర్తించారు. పెట్టుబదారీ సామ్రాజ్యవాదం కంటే అగ్రకుల నియంతృత్వానికి (బ్రాహ్మణిజం) మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉండటం వల్ల... హిందూ సామ్రాజ్యవాదాన్ని ముందుగా నిర్మూలించాలన్నది అంబేడ్కర్ లక్ష్యం. అందుకే ఆయన పోరాటాలన్నీ అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యతిరేక పోరాటాలే. అయితే మలి అంబేడ్కరిజంను ఆయన ప్రతిపాదించిన అనంతరం అతి కొద్ది కాలంలోనే మరణించడం వల్ల... ఆయనలోని పరిణామం వారి తర్వాత తరాలకు ఆచరణాత్మక పద్ధతుల్లో నేర్చుకునేందుకు అవకాశం కలగకపోవడం దురదృష్టకరం. అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. వివిధ దార్శనికతల కలనేత. పాలకవర్గాలే కాకుండా, అంబేడ్కర్ వాదులు, వామపక్షవాదులు సైతం అంబేడ్కర్ దార్శనికతను విమర్శనాత్మక, విప్లవాత్మక దార్శనికుడుగా చూడకుండా ఒక దేవునిగా, విగ్రహమాతృనిగా పూజిస్తున్న వైనం దురదృష్టకరం. మలి అంబేడ్కరిజంలోని సమతావాద స్వభావాన్ని ఆకళింపు చేసుకోకుండా, తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని మేధావులు, సామాజిక ఉద్యమశక్తులు సత్వరం గ్రహించాల్సిన తరుణమిది.కొందరు అస్తిత్వ వాద నాయకులు శకల మతవాదమైన కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరిమితం కాకుండా సామాజిక సమానత్వం, వర్గ పోరాటం అనే భావనల పునాదిగా రూపొందిన మలి అంబేడ్కరిజాన్ని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే మలి అంబేడ్కరిజం వైఖరిని కుల అస్తిత్వ/వామపక్ష ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. (నేడు అంబేడ్కర్ జయంతి) వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు సీనియర్ పాత్రికేయుడు ∙95503 67536 -
పెళ్లి భోజనం పెట్టలేదని.. కుల బహిష్కరణ
రామారెడ్డి: కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మద్దికుంటకు చెందిన యెల్ది పోశయ్య కూతురు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసు కుంది. విషయం తెలుసుకున్న కులపెద్దలు కులానికి పెళ్లి భోజనం పెట్టాలని పోశయ్యను అడిగారు. కులాచారం ప్రకారం పెళ్లి వరుడి ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాహన ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలన్నారు. కూతురు తమకు చెప్పకుండా వెళ్లిపోయిందని, పెళ్లి భోజనం ఎలా పెట్టాలని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన కులపెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కరించారని పోశయ్య వాపోయారు. కులపెద్దల తీరును నిరసిస్తూ ఆదివారం బాధిత కుటుంబం ఇంటికి తాళంవేసి ఇంటి ముందు సాయంత్రం వరకు దీక్షచేసింది. -
చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కుల, మతాలతో తాము రాజకీయం చేయబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తమకు కులం, మతం పిచ్చి లేదని పరోక్షంగా బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. శాంతియుత వాతావరణంలో అన్నదమ్ముల్లా ఉంటున్న తాము ఇదే ఒరవడి కొనసాగిస్తామని, ఎన్నికల సమయంలో తప్ప రాజకీయాలు మాట్లాడమని పేర్కొన్నారు. 2 పార్టీలకు చెందిన ఒకరిద్దరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాని, చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కోరారు. ఉప్పల్ వైపు కూడా ఐటీ పరిశ్రమలు రావడానికి చేపట్టిన లుక్ ఈస్ట్పాలసీ సత్ఫలితాలిస్తోందన్నారు. -
Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..!
Uttar Pradesh Assembly Election 2022: గడిచిన దశాబ్దం కాలంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన ఓటు బలం అగ్రవర్ణాల్లోని వైశ్యులు, బాహ్మణులు, రాజ్‌పుత్‌లు. మొత్తం యూపీ జనాభాపరంగా చూస్తే వైశ్యులు తక్కువే అయినప్పటికీ 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజికవర్గంలో బీజేపీకి మద్దతు తగ్గింది. అలాగే బ్రాహ్మణులు మొత్తం యూపీ జనాభాలో గణనీయంగా 8 నుంచి 9 శాతం ఉంటారు. వీరిలోనూ బీజేపీకి పడే ఓట్లలో 6 శాతం తగ్గాయి. దానికి తోడు బీజేపీలో రాజ్‌పుత్‌లకు పెద్దపీట వేస్తున్నారని, బాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఏడాదికాలంగా ఆ సామాజికవర్గంలో బలమైన భావన ప్రబలుతోంది. నష్టనివారణకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది. బ్రాహ్మణుల్లో ప్రముఖుడు, యువ నాయకుడు, రాహుల్ గాంధీ కోటరీ సభ్యుడైన జితిన్ ప్రసాదనలు లాగేసింది. అలాగే లఖీంపూరి హింసాకాండ ఘటనలో ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలి... అతను జైల్లో ఉన్నందువల్ల దీనికి అసలు కుట్రదారైన అతని తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు ఎంత గట్టిగా డిమాండ్ చేసినా... బ్రాహ్మణ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని, వారికి కోసం తెప్పించకూడదనే ఉద్దేశంతో కమలదళం అజయ్ మిశ్రాను కాచింది. ఇక కుర్మీల విషయానికి వస్తే అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్ (ఎస్) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలోకి మారారు. ఇలా ప్రధాన బలమైన సామాజిక వర్గాల లెక్కల్లో తేడా కొడుతుండటం బీజేపీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది.! – నేషనల్ డెస్క్, సాక్షి. -
దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా
సాక్షి, పెద్దపల్లి: సాంకేతికకాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేసిన సంఘటన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు దివ్యాంగులు కావడం విశేషం. బాధితుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు. సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. సదరు స్థలాన్ని అబ్దుల్ అలీతో 2008లో రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లక్రితం అబ్దుల్‌అలీ చనిపోయాడు. ఈనేపథ్యంలో సదరు భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉంది. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తాము తప్పు చేయలేదని ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు. ఈ విషయమై కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. చదవండి: (సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. వీరంతా కేరళ ఆయుర్వేదిక్ సిబ్బంది) సమస్య పరిష్కారం చూపే వరకూ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు. ఈనెల ఒకటో తేదీన బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్తే కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, కుల సభ్యులు ఎవరూ కనీసం పాలు పోయడం లేదని, సుల్తానాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా న్యాయం కోసం స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసుల వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, కుల సంఘానికి విక్రయించిన భూమి ప్రస్తుతం లేదని కుల సంఘం పెద్దలు, ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. -
ఢిల్లీ జంతర్‌మంతర్: బీసీ సంఘాల ఆందోళన.. వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: కులాలవారీగా జనగణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయి. కాగా ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ధర్నాలో ఎంపీలు మార్గాని భరత్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య హాజరయ్యారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ కాగా అనేక చిన్నచిన్న కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా గుర్తింపు తెచ్చారన్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే కానీ బలహీనులు కాదని.. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవట్లేదని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సామాజిక వెనుకబాటు ఉన్నవారికి రిజర్వేషన్లు అందాలన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నామని బోస్ పేర్కొన్నారు. -
Huzurabad Bypoll: కుల సమీకరణాలు.. ఓట్ల లెక్కలు..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహానికి మరింత పదును పెడుతోంది. తొలుత పార్టీ కేడర్‌తో, ఆ తర్వాత గ్రామాలు, మండలాల వారీగా వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయ సభలు నిర్వహిస్తూ వచ్చిన గులాబీ దళం.. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మరోమారు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు భారీ సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పొరుగునే ఉన్న హనుమకొండ జిల్లా పెంచికల్‌పేటను ఎంచుకుంది. సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహానికి మరింత పదునుపెడుతోంది. తొలుత పార్టీ కేడర్‌తో, ఆ తర్వాత గ్రామాలు, మండలాల వారీగా వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయసభలు నిర్వహిస్తూ వచ్చిన గులాబీ దళం.. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మరోమారు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు భారీ సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పొరుగునే ఉన్న హనుమకొండ జిల్లా పెంచికల్‌పేటను ఎంచుకుంది. పెంచికల్పేటలోని బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి కులాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోంది. మూడు రోజుల క్రితం ఆరె కటికల సభ ఏర్పాటు చేయగా, సోమవారం మున్నూరుకాపు ప్రతినిధులతో భేటీ నిర్వహించింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్దన్‌కు సన్మానం పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి మున్నూరుకాపు ప్రతినిధులు హాజరయ్యారు. పక్షం రోజులపాటు మరిన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సభలు కొనసాగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పెంచికల్‌పేట కేంద్రంగా దసరా తర్వాత నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. జాబితాల వడపోత కులాలు, పథకాల లబ్ధిదారులైన్ల ఓటర్ల లెక్కలను ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా వర్గీకరించి ఉపఎన్నికలో మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు అందజేశారు. వీరితోపాటు మంత్రులు ఈ జాబితాలను వడపోసి ఓటర్ల మద్దతు కూడగట్టడంలో తలమునకలై ఉన్నారు. బయటకు సభలు, సమావేశాలు, ధూంధాంల పేరిట ప్రచార ఆర్భాటం జరుగుతున్నా, అంతర్గ తంగా మాత్రం సామాజికవర్గాలు, పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రధాన సామాజికవర్గాలైన రెడ్డి, మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, మాల, మాదిగ, ఎస్టీల ఓట్ల కోసం అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో ఓటర్లు కలిగిన కుమ్మరి, పెరిక కులస్తులపైనా అదే కులా లకు చెందిన ఇన్చార్జి నేతలు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతోపాటు కిరాణా, ఆయిల్, క్లాత్ మర్చంట్స్, సీడ్స్ ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్లు, లయన్స్ క్లబ్, రోటరీక్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల మద్దతు కోసం కూడా గులాబీదళం ప్రయత్నా లు సాగిస్తోంది. నిర్మాణ కార్మికులు, హమాలీ సంఘాలు, పారిశుధ్య కార్మికులు, అసంఘటిత రంగాల వారిని సైతం వదిలిపెట్టలేదు. అంతా తానై..! మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి నిష్క్రమించిన తర్వాత హుజూరాబాద్‌లో పార్టీ కేడర్ చేజారకుండా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కూడిన యాక్షన్ టీమ్‌కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడకముందు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలను టీఆర్ఎస్లోకి రప్పించడం, నామినేటెడ్ పదవులు ఇవ్వడం వంటివి కేసీఆర్ కనుసన్నల్లో జరిగింది. అయితే నియోజకవర్గస్థాయిలో టీఆర్ఎస్ కేడర్ సమన్వయం, ఇతర పార్టీల నుంచి కొద్దిపాటి పేరున్న నాయకులు, కార్యకర్తలను కూడా టీఆర్ఎస్ గూటికి చేర్చడంలో హరీశ్‌రావు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ప్రచారం పూర్తయ్యేందుకు మరో పక్షం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున సామాజికవర్గాలవారీగా మరింత పట్టు బిగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
AP Special: దొమ్మరివారి నేల.. నేడు దొమ్మర నంద్యాల
జమ్మలమడుగు(వైస్సార్ కడప జిల్లా): పూర్వం ఒక దొమ్మర కుటుంబం గండికోటలోని పేటలో నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబికులు దొమ్మరాటల ప్రదర్శనలు ఇస్తూ గండికోటలోని రాజులకు అతఃపుర స్త్రీలకు వినోదం కలిగించేవారు. ఆ కుటుంబాల జీవనాధారం అదే కావడంతో వాళ్లు విచిత్రమైన విన్యాసాలు, అనేక సాహస కృత్యాలను ప్రదర్శలుచేస్తూ జీవనం సాగించేవారు. (చదవండి: వేగంగా కోలుకుంటున్న ఆర్థిక రంగం) ఎతైన గడను భూమిలోనికి పాతి దానొపై నుంచిని కాసేపు పొట్టకు ఆనించి తన రెండు చేతులకు చాపి పక్షివలె ఆకాశంలో కొంత సేపే విహరించి మళ్లి నేలపై వాలేవారు. అయితే అలా ఒక రోజు దొమ్మర కుటుంబంలోని ఒక వ్యక్తి అలాంటి విన్యాసం చేస్తూండగా గండికోటలోనితూర్పు వైపు ఉన్న ఒక పల్లెలో వాలబోతు ప్రమాదవశాత్తు మరణించాడు. అతని గొప్ప విన్యాసానికీ ముగ్దుడైన రాజు ఈపల్లెను దొమ్మరలకు జాగీర్థారుగా ఇచ్చాడు. దీంతో ఆ పల్లె కాస్త దొమ్మరివారి నేలగా పిలిచేవారు. తదనంతరం కాలక్రమేణా దొమ్మర నంద్యాలగా మారిపోయింది. దొమ్మరనంద్యాల గ్రామం గండికోటకు ఈశాన్య దిశగా జమ్మలమడుగుకు సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో గ్రామ తోగట వీర క్షత్రియులు, సాలెలు, తదితర కులాల వాళ్లు ఉన్నారు. అంతేకాదు వారు చేనేతనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ప్రతి ఏడాది గ్రామ తోగట వీర క్షత్రియుల కులదైవ మైన చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను జరుపుతుంటారు. (చదవండి: ఏపీ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు) -
లెక్కలు... చిక్కులు...
ముందు నుయ్యి, వెనుక గొయ్యి. అధికారంలో ఉన్న అధినేతల పరిస్థితి ఇప్పుడు అదే. దేశంలో కులాల వారీ జనాభా లెక్క చేపడతామని ఒప్పుకుంటే ఒక తంటా, ఒప్పుకోకపోతే మరో తంటా. బిహార్ సహా వివిధ రాష్ట్రాలు పట్టుబడుతున్న కుల జనగణనపై ఏం చెబితే, అది రాజకీయంగా ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో ఢిల్లీ వచ్చిన పది పార్టీల అఖిలపక్షం చేసిన కులగణన డిమాండ్‌ను ప్రధాని మోదీ సోమవారం సావధానంగా విన్నారే తప్ప, అవుననలేదు. కాదనీ చెప్పలేదు. ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు) సహా ఏ కులం వాళ్ళెంత ఉన్నారో తెలుసుకోవడానికి ఈ లెక్క ఉపకరిస్తుందనేది నితీశ్ బృందం మాట. నిజానికి, భారత రాజకీయాల గతిని మార్చే లెక్క అది. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ప్రణాళిక, చివరకి నేతల తలరాతను సైతం మార్చే అంశమది. కాబట్టే పాలకులు మల్లగుల్లాలు పడుతున్నారు. పదేళ్ళకోసారి దేశజనాభా లెక్కలు జరిగినప్పుడల్లా కులాల వారీ లెక్కల కోసం వెనుకబడిన వర్గాల్లో బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు అడుగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాల్లో గణనీయమైన బలం ఉన్న పార్టీలు, రాజకీయ నేతలు ఆ ఆలోచనను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. 2011 తర్వాతి జనగణన కరోనా వల్ల ఆలస్యమైంది. బ్రిటీషు పాలనాకాలంలో 1931లో దేశంలో కులాల వారీగానే జనగణన జరిగింది. ఆపైన 1941లో రెండో ప్రపంచ యుద్ధవేళ ఈ భారీ ఖర్చు వ్యవహారానికి బ్రేకు పడింది. స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 2011 దాకా జరిగిన జనగణనల్లో ఎస్సీ, ఎస్టీల జనసంఖ్యే తప్ప, మిగతా కులాల లెక్క తీయలేదు. దాంతో ఇప్పటికీ ఓబీసీల సంఖ్య ఎంతన్నది సరైన అంచనా లేదు. 2011లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు సామాజిక – ఆర్థిక కుల జనగణన చేసినా, ఆ సమాచారాన్ని విడుదల చేయలేదు. తాజా డేటా లేకపోవడంతో– ఇప్పటికీ 1931 నాటి అంకెలు, జాతీయ శాంపిల్ సర్వే సమాచారం ఆధారంగా లెక్కలు కట్టి, పార్టీలు, ప్రభుత్వ సంస్థలు విధాన రూపకల్పన చేస్తూ వస్తున్నాయి. కులాల వారీ లెక్క తేలితే సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు సవరించుకోవచ్చు. సామాజిక ప్రతిఫలాలు అందించనూ వచ్చు. కానీ, కాంగ్రెస్, బీజేపీ సహా అనేక జాతీయ పార్టీలు మళ్ళీ ఇలా కులాల వారీ జనగణన చేయడాన్ని గతంలో వ్యతిరేకించాయి. సమాజంలో కులాల ఉనికి, కుమ్ములాటలు శాశ్వతమయ్యే ముప్పుందని వాదించాయి. వర్తమాన సామాజిక పోరాటాలు, రాజకీయ అనివార్యతలతో ఇప్పుడా అభిప్రాయం మార్చుకోక తప్పదు. అవకాశాల్లో, అధికారంలో దామాషా పద్ధతిన తమదైన వాటా కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్న వర్గాల ఓట్లను దూరం చేసుకోవడం ఏ పార్టీకైనా ఎందుకు ఇష్టం ఉంటుంది! రాజకీయంగా వెనుకబడకుండా బిహార్ బీజేపీ నేతలూ అఖిలపక్షంతో కలసి రాక తప్పలేదు. ఇక, మమతా బెనర్జీ మొదలు మజ్లిస్ ఒవైసీ దాకా అందరూ కులాల లెక్కకు ఓటేస్తున్నారు. దేశంలో 50 శాతం ఉన్న ఓబీసీలకు 27 శాతం రిజర్వేషనే దక్కుతుంటే, జనాభాలో 20 శాతమే ఉన్నవారు 50 శాతం కోటా అనుభవిస్తున్నారని వారి వాదన. మరోపక్క కనీసం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్‌పై సుప్రీమ్ కోర్టు పెట్టిన 50 శాతం పరిమితిని ఇప్పటికే దాటేశాయి. సామాజిక, ఆర్థిక వాస్తవాల రీత్యా ఎక్కడికక్కడ ఈ పరిమితిపై వెసులుబాటు తీసుకోక తప్పదు. మన సమాజంలో శతాబ్దాలుగా వెంటాడుతున్న సామాజిక వాస్తవం కులవ్యవస్థ. రాజకీయాల్లోనూ దాన్ని విస్మరించలేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిది– హిందుత్వ నినాదంతో సంఘటిత ఓటుబ్యాంకు సంపాదించుకొని, ఓబీసీలను పునాదిగా మార్చుకున్న సమకాలీన చరిత్ర. ఓబీసీల ఉపవర్గీకరణతో ఆ బలాన్ని పటిష్ఠం చేసుకోవాలని ఆ పార్టీ యోచన. అయితే, ఆ ఉప వర్గీకరణ కోసం ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక ద్వారా న్యాయం జరగాలన్నా... కులాల వారీ లెక్క తెలియాల్సిందే. తీరా ఆ లెక్కల తర్వాత 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని కేంద్రమే దాటాల్సి వస్తుంది. అప్పుడది బీజేపీ సామాజిక సమీకరణాల్ని దెబ్బతీయవచ్చు. అది ఆ పార్టీకి ఉన్న ఒక భయం. మరోపక్క ఆ పార్టీకి సైద్ధాంతిక భూమికగా నిలిచే ఆరెస్సెస్ సైతం కుల జనగణనకు సానుకూలమేమీ కాదు. అందుకే, 2018 ప్రాంతంలో కులాల లెక్కలకు ఓకే అన్న భావన వ్యక్తం చేసిన బీజేపీ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో తూచ్ అనేసింది. పైగా, కులగణనను రాజకీయ లబ్ధికి వాడుకోవచ్చన్న వివిధ పార్టీల రాజకీయ వ్యూహం అటూ ఇటూ అయితే, మొదటికే మోసం వస్తుంది. 2022లో యూపీ, 2024లో సార్వత్రిక ఎన్నికలూ ఉన్నాయి కాబట్టి బీజేపీ తొందరపడక పోవచ్చు. ఎన్నికలలో తాము చెప్పుకోదలుచుకున్న జాతీయవాదం, రామమందిర నిర్మాణం, 370వ అధికరణం రద్దు లాంటి ఘనతలు పక్కకు పోయి, ఈ కులాల కుంపటి ఎన్నికల అజెండా అయిపోతుందేమోనన్న భయం ఉంది. మండల్ కమిషన్ రిజర్వేషన్ల నాటి వీపీ సింగ్ ప్రభుత్వంలా చిక్కుల్లో పడతామేమో అన్న అనుమానమూ ఉంది. ఇక, కులాతీత సమసమాజాన్ని కోరుకున్న భారత రాజ్యాంగ కర్తల అభీష్టానికి ఇలాంటి లెక్కలు హాని చేస్తాయని కొందరి వాదన. కానీ, స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండినా సామాజిక న్యాయం దక్కని బతుకుల్లో వెలుగు కోసం ఈ లెక్కలు అనివార్యమే. వాటిని పూర్తి రాజకీయ లబ్ధికి వాడుకొంటేనే అది సామాజిక అశాంతికి దారి తీస్తుంది. రాజకీయ నేతల ఆ దౌర్బల్యాన్ని కనిపెట్టి, జాగ్రత్తపడాల్సింది మాత్రం కులాలతో పని లేకుండా ప్రజలే! ఆ చిన్న లెక్క మర్చిపోతేనే అసలు చిక్కు!! -
కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగికి అవమానం
-
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ అని విచారణ కమిటీ తేల్చింది. ఆమె ఎస్టీ కొండదొర కులానికి చెందినవారని నిర్థారించింది. పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్ఎస్సీ ప్రకటించింది. కాగా, ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి కులంపై లాయర్ రేగు మహేష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు విచారణ జరపాలని ప.గో.జిల్లా డీఎల్‌ఎస్‌సీకి సూచించింది. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు సూచనతో డీఎల్ఎస్సీ ఛైర్మన్ పుష్ప శ్రీవాణి కులంపై జిల్లా స్థాయి నిర్థారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. శ్రీవాణి నిజమైన ఎస్టీ కొండదొర కులస్తురాలని విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆధార్ అడగొద్దు.. కులం వివరాలు కోరొద్దు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్ నంబర్లు, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా, సాక్షుల ఆధార్ నంబర్లను కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోవడంతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామని, అయితే ప్రభుత్వం తెలివిగా స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ తదితర వివరాలు కోరుతోందని మండిపడింది. ఈ సమాచారాన్ని అడగబోమని హామీ ఇచ్చి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తంచేసింది. న్యాయస్థానం పట్ల ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలని హితవు పలికింది. స్లాట్ బుకింగ్ మాన్యువల్‌లో ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా తదితర వివరాలు కోరుతూ ఉన్న కాలమ్స్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అప్పటి వరకు స్లాట్ బుకింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటీఐఎన్) ఇచ్చే ప్రక్రియను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. పీటీఐఎన్ జారీకి కూడా ఆధార్ తదితర వివరాలు అడగానికి వీల్లేదని, అయితే ఏదైనా ఇతర గుర్తింపు కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎటువంటి చట్టం లేకుండా ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల నమోదు చేసుకోవాలని.. అందుకు ఆధార్, కులం వివరాలు ఇవ్వాలని కోరడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్‌శర్మ, సాకేత్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. స్లాట్ బుకింగ్ కోసం 29 పేజీలను నింపాల్సి ఉందని, అందులో ఆస్తులు అమ్మే, కొనే వారి ఆధార్ తదితర వివరాలను కోరుతున్నారని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాది కృతి కలగ వాదనలు వినిపించారు. ఎంతమంది ఆధార్ అడుగుతారు? ‘‘ప్రజల సౌకర్యం కోసం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందు స్లాట్ విధానం అమలుకు అనుమతి తీసుకొని.. తప్పుడు విధానాల్లో ఆధార్, కులం వివరాలు కోరడమేంటి? రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే 29 పేజీలు నింపాల్సి వస్తోంది. ఇందులో ఆస్తులు అమ్మేవారి, కొనేవారి ఆధార్ నెంబర్లు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, కులం వివరాలు, చివరికి సాక్షుల ఆధార్ వివరాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎంతమంది ఆధార్ నెంబర్లు కోరతారు? వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్, కులం వివరాలు అడగబోమని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మాన్యువల్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు 14 మంది సోదరులు ఉన్నారనుకుందాం. అందులో ఒక సోదరుడు ఆస్తి అమ్ముకోవాలంటే మిగిలిన 13 మంది ఆధార్ వివరాలు అడిగితే ఎలా? అందులో కొందరు ఇక్కడుంటారు.. ఇంకొందరు ఎక్కడో ఉంటారు. వారి వివరాలు ఇవ్వాలంటే ఎలా’’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇవ్వడం ఇష్టం లేనివారి కోసం ప్రత్యామ్నాయ విధానం ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. అసలు ఆధార్, కులం వివరాలు సేకరించడానికే వీల్లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఉందని చెప్పడం ఏంటంటూ ధర్మాసనం మండిపడింది. ఈ వివరాలు తొలగిస్తూ మాన్యువల్‌ను సవరిస్తామని ఏజీ హామీ ఇవ్వగా.. మీ హామీని నమ్మలేమని, సవరించిన మాన్యువల్‌ను సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ధరణి వెబ్‌పోర్టల్ నిబంధనలు ఏజెన్సీ ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు వర్తించవంటూ దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌పై పిటిషనర్ తరఫు న్యాయవాది రిప్లై దాఖలు చేసేందుకు గడువునిస్తూ తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. -
నల్లజాతి కళ్లలోంచి మన కులవ్యవస్థ
అమెరికన్ ఓటర్లను 2020 ఎన్నికల్లో ప్రభావితం చేసిన ఇసాబెల్ విల్కర్సన్ రచన ‘క్యాస్ట్: ది ఆరిజన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ (కులం: మన అసంతృప్తుల మూలాలు) పుస్తకాన్ని పూర్తిగా చదవకముందే నేనొక విషయాన్ని గుర్తించాను. అదేమిటంటే, ఒక నల్ల సోదరి 400 సంవత్సరాల పాత గృహం నుంచి 3,500 సంవత్సరాల మన పాత గృహానికి వచ్చేసింది. ఆమె మన పాత ఇంటిని పూర్తిగా కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మించుకోవాలని చెప్పింది. వాస్తవానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా కులం జన్మించిన అతి పాత ఇంటి కథను ఆమె మనకు చెప్పింది (ఆర్యుల మూల స్థానం జర్మనీ). ఆర్యుల తొలి స్థలం రెండో ప్రపంచయుద్ధంలో కూల్చివేతకు గురై తిరిగి దాన్ని కొత్తగా నిర్మించారని నాకు గుర్తొచ్చింది. అమెరికాలో కూడా వారు తమ పాత ఇంటిని కూల్చివేసే మార్గంలో ఉన్నారు. అమెరికాలో తమదైన కులాన్ని పాటించే తెల్లవాళ్లు ఇప్పుడు ఒక సర్దుబాటు క్రమంలో ఉన్నారు. ఇసాబెల్ విల్కర్సన్ గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. మానవుల చర్మాల్లో జాతి భావన ఎలా ఇమిడిపోయి ఉందో, అలాగే భారతీయుల, అమెరికన్ల మూలగల్లో కులం ఘనీభవించింది. ఆర్యులే కుల వైరస్ సృష్టికర్తలు. భూమ్మీద ఉన్న మానవులందరిలో ఎక్కువగా భారతీయుల మూలగలను ఈ వైరస్ కబళించేస్తోంది. భారతీయుల్లో కులం నరనరానా ఎంతగా జీర్ణించుకుని పోయిం దంటే అమెరికాలో లేక యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో ఉంటున్న ఇంగ్లిష్ విద్యావంతురాలైన బ్రాహ్మణ సోదరి తన చేతిలో ఉన్న సాధనాన్ని తనిఖీ చేయాలని కానీ, లేదా కనీసం ఈ ఇంటిలో ఉన్న పరిస్థితిపై చర్చ జరగాలని కానీ భావించడం లేదు. వెయ్యి సంవత్సరాలుగా సంస్కృతంలో, పర్షియన్ భాషలో విద్య పొందిన, ఇప్పుడు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్శిటీల్లో అత్యున్నత ఇంగ్లిష్ విద్య పొందుతున్న మన ఆధిపత్యకుల సోదరులు ఎన్నడూ మన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించాలని కోరుకోలేదు. మరోవైపున బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని మన ఆధిపత్యకుల సోదరీమణులు ఈ పాత ఇంటిలోనే అనేక విషయాలను సాధించారు. కమలా హ్యారిస్, నిక్కీ హేలీ, ఇంద్రా నూయి మరెందరో ఈ పాత ఇంటిలోనే చాలా చక్కగా పనిచేశారు. కానీ తమకు చెందిన ఈ పాత ఇంటిలో కుళ్లిపోతున్న మూలగలను అమెరికన్లు తెలుసుకోవాలని వీరు ఎన్నడూ కోరుకోలేదు. అమెరికాలో ఉంటున్న అనేకమంది బ్రాహ్మణ మహిళలు చాలా పుస్తకాలను రాసి అనేక అవార్డులు పొందారు. కానీ వీరెవ్వరూ తన పాత ఇంటిని గురించి రాయలేదు. మన చర్మాన్నే కాదు, మన మూలగలను కూడా తినేస్తున్న వ్యాధి గురించి వీరిలో ఎవరూ రాయలేదు. పైగా 3,500 ఏళ్లుగా ఆ వైరస్ మనల్ని దుర్గంధంలోకి నెట్టేస్తోంది. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలు నేర్చుకుని, ఐఐటీలు, ఐఐఎమ్‌లను నిర్వహించడానికి మళ్లీ పాత ఇంటికి తిరిగొచ్చిన పండిట్లు మన పాత ఇంటిలోని ఘనమైన ప్రజాస్వామ్యంలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి డాలర్ల సంపాదన కోసం కథలురాసి అమ్మేసుకుంటున్నారు. ఏమైతేనేం, పాత ఇంటిలో వ్యవస్థ కంటే ఇది మెరుగ్గా ఉందని వీరు చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే హిట్లర్ జన్మించి, ప్రపంచాన్ని కొత్తగా సృష్టించడానికి స్వస్తిక్ సింబల్‌ని ఉపయోగించి నియంతగా ఎదుగుతూ, జాతితత్వం, కులతత్వంతో నిండిన పాత వ్యవస్థను ప్రపంచమంతటా వ్యాపింపచేయాలని కోరుకున్నాడు. అదృష్టవశాత్తూ రష్యన్ల చేతిలో అతడు పరాజయం పొందాడు. రాజ్యాంగ ప్రజాస్వామ్యం ముసుగులో అనేక మంది నియంతలు పుట్టుకొస్తున్నారు కానీ వారితో ఎలా పోరాడాలో వీరికి తెలియదు. సొంత ఇంటికి తిరిగి వచ్చాక మన ఆధిపత్యకుల సోదర, సోదరీ మణులు (ది నేమ్‌సేక్ లేదా లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్ వంటి నవలలు రాయడం ద్వారా) తమ పేర్లు, లేక వైవాహిక జీవితానికి సంబంధించి తాము అక్కడా ఇక్కడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి కథలు చెబుతూ వస్తున్నారు. పాత ఇంటిలో నివసిస్తున్న ఏ రచయిత కంటే జంపా లహరి, అనితా దేశాయ్ వంటి రచయిత్రులు భారతీయ బుక్ మార్కెట్లో చాలా బాగానే సంపాదిస్తున్నారు. తమ ఆర్యన్ ఇళ్లలో తమ పెళ్లిళ్ల గురించి, పాత ఇంటి ఆచారాల గురించి మన ద్విజ పురుషులు మాట్లాడుతూ వచ్చారు. వారు ఎ సూటబుల్ బాయ్, ది గ్లాస్ ప్యాలెస్ తదితర రచనల ద్వారా పాత ఇంటి సమస్యల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇకపోతే విక్రమ్ సేత్, అమితవ్ ఘోష్ వంటి రచయితలు అయితే దాదాపు అన్ని సాహిత్య ఉత్సవాలలో అత్యున్నత గౌరవాలు పొందుతూ, అవార్డులు గెల్చుకుంటూ వస్తున్నారు. కానీ తమ పాత ఇంటిలో క్రీస్తు పూర్వం 3,500 ఏళ్లకు ముందునాటి ఆర్యజాతి నుంచి పుట్టుకొచ్చిన కులం అనే వ్యాధి గురించి వీరెన్నడూ రాసి ఉండలేదు. టోనీ జోసెఫ్ తన ఎర్లీ ఇండియన్స్ (తొలి భారతీయులు) పుస్తకంలో, సింధుస్థాన్కు ఆర్యన్లు మూడో పెనువలస వచ్చిన క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కాలం లోనే భారతీయ మూలగలను కబళించేస్తున్న కులం అనే వ్యాధి కూడా వచ్చి చేరిందని చెబుతున్నారు. కానీ హరప్పా గ్రామీణ, నగర నాగరికత నిర్మించడానికి వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి రంగుజాతి ప్రజల (ఆండో–ఆఫ్రికన్స్) మూలాలు కలిగిన మన సొంత సోదరి మాత్రం జాతితత్వం, కులతత్వానికి సంబంధించిన సమస్య లేకుండానే భారతదేశానికి వచ్చి మన బాధలు గమనించి ఎంకే గాంధీ ప్రపచించిన సత్యానికి భిన్నమైన వాస్తవాన్ని మనకు తెలియజేస్తోంది. హరప్పన్ నాగరికతా కాలంలో మనం కూడా ఇసాబెల్ లాగే నల్లగానూ, అందంగానూ ఉండేవారం. కానీ ఆర్యన్ వలస మొదలైన తర్వాత మాత్రమే మనం సంకరవర్ణంలో కలిసిపోయాం. మన ఆధిపత్యకుల సోదరీమణులు మూల ఆర్యన్లు అని మనం కచ్చితంగా చెప్పలేం. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వాయు, తదితరులు (రుగ్వేదకాలం నాటి దేవతలు, జొరాస్ట్రియన్ లిపి కలిగిన రాక్షసులు) అతి పురాతన స్థలం నుంచి వలస వచ్చినట్లుగా కనిపిస్తారు. కానీ వీరిలో ఎవరూ తమతో పాటు మహిళలను తీసుకొచ్చినట్లు కనిపించరు. ఇకపోతే సతి, బాల్యవివాహాలు, శాశ్వత వైధవ్యం వంటి సమస్యలతో సతమవుతూ వచ్చిన మన అగ్రకుల మహిళలు బహుశా జర్మనీ నుంచి మొదట వలస వచ్చిన వారు తీసుకొచ్చిన మన ఆండో–ఆఫ్రికన్ సోదరీమణులు అయివుండొచ్చు. ఈ జర్మనీనే ఇసాబెల్ పురాతన గృహం అంటూ పిలుస్తున్నారు. వెయ్యి సంవత్సరాల క్రమంలో వీరు తమ ప్రస్తుత రంగు, వర్చస్సు, ఆకారాలను పొందారు. కానీ ఇలా రూపొందిన వీరు ఇప్పుడు ఆ పాత ఇంటికి చెందిన నల్లవారిని పెళ్లాడటానికి ఇష్టపడటం లేదు. కమలా హ్యారిస్ తల్లి శ్యామల మాత్రం ఒక మినహాయింపు అని చెప్పాలి. 1970లు, 80లలో పాత ఇంటిలో స్త్రీవాద ఉద్యమం ఉండేది. బ్రాహ్మణ, బనియా మహిళలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. కానీ మరింత మెరుగైన విద్యావకాశాలు పొందడానికేగానీ తమ 3,500 సంవత్సరాల వ్యథలను పట్టించుకోవడానికి వారు ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. వారిలో కమ్యూని స్టులు, ఉదారవాదులు, లౌకికవాదులు ఉండేవారు. వీరంతా బయటకి కనిపించే మన దారిద్య్రాన్ని తప్ప, మన మూలగల్లో పేరుకుపోయిన వ్యాధిని చూడలేదు. వీరి చర్మం మనకంటే కాస్త కాంతివంతగా ఉంటూ వచ్చినందున, బాలీవుడ్ మొత్తంలో వీరి సౌందర్యమే కనిపిస్తూ వచ్చేది. అయితే అదే సమయంలో హాలీవుడ్ పాత ఇంట్లో అనేకమంది నల్లజాతి సోదరులకు, సోదరీమణులకు స్థానం దక్కింది. కానీ మన స్త్రీపురుషులు తమ చర్మం వల్ల కాక, తమ మూలగల్లో ఉండిపోయిన కులం అనే సమస్య వల్ల దురదృష్టవంతులుగా మిగిలిపోయారు. మన యూరో అమెరికన్ ద్విజ స్త్రీపురుష పండిట్లు పాశ్చాత్య ప్రపంచ అవకాశాల దన్నుతో తమ పాత ఇంటిలో విరిగిపడుతున్న దూలాలు, కారుతున్న పైకప్పులు, మసకబారుతున్న గోడలు వంటి వాటిని దాచి ఉంచాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మన నల్ల సోదరి పాత ఇంటిలో వాస్తవంగా నివసిస్తున్న వారి తలుపులను తెరుస్తూ కొత్త కాంతిని వెదజల్లుతోంది. ఆమె అమెరికా పాత ఇల్లు లేదా వ్యవస్థను పరారుణ కాంతిని కలిగినదిగా వర్ణిస్తోంది. అదే సమయంలో ఆమె జర్మనీని జాతితత్వానికి, కులతత్వానికి మూలమైన పురాతన ఇల్లుగా అభివర్ణిస్తూ విశ్లేషణకు కొత్త ఆధారాన్ని అందజేస్తోంది. ఇక భారతదేశం విషయానికి వస్తే బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అన్నీ ఉండి కూడా తీవ్రంగా దెబ్బతింటూనే పై రెండు పాత వ్యవస్థల మధ్య నలుగుతోంది. స్వస్తిక్, త్రిశూల్ ఇప్పుడు నాగ్‌పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి పాలన సాగిస్తున్నాయి. కానీ మన సోదరులను పక్కన పెట్టండి.. మన సోదరీమణులు కూడా వారి పాత ఇంటిపై ఎలాంటి కాంతీ ప్రసరించాలని కోరుకోవడంలేదు. కాబట్టి అక్కడ మునుపటిలాగే గాఢాంధకారం రాజ్యమేలాలని, అలాగైతేనే బయటి నుంచి వచ్చిన ఎవరూ ఆ ఇంటిలోపల ఏముందని టార్చ్ వెలిగించలేరని వీరు భావిస్తున్నారు. ఈస్ట్ ఇండియా సామ్రాజ్య కాలం నుంచి అనేకమంది తెల్లవారు ఇక్కడికి వచ్చారు. వాళ్లంతా ఆర్య బ్రాహ్మణులు తమకు చెప్పిందే నమ్ముతూ వచ్చారు. ప్రియమైన ఇసాబెల్లా సోదరీ, మా పాత ఇంటిని నీవు సందర్శించినందుకు నీకు కృతజ్ఞతలు. క్షుణ్ణంగా శోధించే విమానాశ్రయాలలోంచి కూడా నీవు ఎంతగానో ప్రేమించే మా డాక్టర్ అంబేడ్కర్ చిత్రాన్ని నీ దుస్తుల్లో పొదవుకుని తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెబుతున్నాం తల్లీ. నల్ల సోదర అధికారులు ఆ చిత్రపటంలో ఉన్నది ఎవరో తెలుసుకోలేనప్పుడు, అతడు భారత దేశపు మార్టిన్ లూథర్ అని నీవు వారికి తెలియజెప్పినప్పుడు, మా ఆధిపత్యకుల సోదర సోదరీమణులు తమ కులాన్ని తమ చర్మంలోని కులాన్ని ఇకపై దాచి ఉంచలేరని మేం ఎంతో ఉద్వేగం చెందుతున్నాం. వారి కులం వారి మూలగల్లోకి కూడా చేరుతుంది. ప్రొ.కంచ ఐలయ్య, షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కులం వివరాలడిగితే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా కులం వివరాలు అడిగితే తప్పేంటని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. ‘గత 60 ఏళ్లుగా మనం పాఠశాల స్థాయి నుంచి కులం వివరాలు సమర్పిస్తూనే ఉన్నాం కదా, అలాంటప్పుడు కులం వివరాలు ఇవ్వడానికి ఇబ్బందేంట’ని పేర్కొంది. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సమర్పించాలని, అందులో కులం, ఆధార్ వివరాలు నమోదు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం కులం, ఆధార్ వివరాలను అడుగుతోందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కులం, ఆధార్ వివరాలను ఏ చట్టం కింద అడుగుతున్నారో చెప్పకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పుట్టుస్వామి తీర్పు ప్రకారం ఆధార్ వివరాలను అడగడానికి వీల్లేదన్నారు. ఈ నెల 25లోగా ఈ వివరాలు సమర్పించాలంటున్నారని వివరించారు. ధరణి కోసం వివరాలు సమర్పించేందుకు డెడ్‌లైన్ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. కేంద్రం సూచనల మేరకు ఈ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటూ ధర్మాసనం విచారణను కొద్దిసేపు వాయిదా వేసింది. ‘‘కులం చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది. కులం చెప్పుకోవడాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలి. వ్యక్తులను గుర్తించేందుకు ఇది తప్పనిసరి. ఆధార్ వివరాలను ఎవరికీ వెల్లడించకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆధార్ వివరాలు వెల్లడించడం వల్ల ఏం నష్టం’’అని ధర్మాసనం ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించింది. ఈ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ప్రకాశ్‌రెడ్డి కోరగా ధర్మాసనం నిరాకరించింది. పూర్తి వివరాలతో ఈ నెల 31లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. -
బాలీవుడ్ గమ్యం ఎటువైపు?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, శివసేన ప్రభుత్వంపై కంగనా తిరుగుబాటు, బాలీవుడ్లో పేరుకుపోయిన డ్రగ్ సంస్కృతి అనేవి లోతైన కులస్వభావాన్ని ప్రతిఫలిస్తున్నాయి. భారతీయ మీడియా.. ప్రత్యేకించి ఇంగ్లిష్ మీడియా ఈ కీలకమైన అంశాన్ని దాచేయాలని ప్రయత్నిస్తోంది. సుశాంత్, కంగనా ఇద్దరూ క్షత్రియ కులం నుంచి బాలీవుడ్ నటులుగా ఆవిర్భవించారు. జాతీయ పరిశ్రమగా గుర్తింపుపొందిన బాలీవుడ్ బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలతోపాటు, ముల్లాల సాంప్రదాయిక నియంత్రణలను దాటుకుని వచ్చిన కొద్దిమంది ముస్లింల అజమాయిషీలో నడుస్తోంది. క్షత్రియులు చారిత్రకంగా పాలకవర్ణంగా ఉండేవారు. స్వాతంత్య్రానంతరం వీరు ఇంగ్లిష్, పాశ్చాత్య విద్యా సంపర్కం కలిగిన ఆధునిక కులంగా ఆవిర్భవించలేదు. ఇటీవలి వరకు ఈ కులం సాంప్రదాయ చట్రంలోనే ఉండిపోయింది. బాలీవుడ్ క్రమంగా ఇంగ్లిష్ హిందీ భాషలు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకున్న విద్యావంతులతో కూడిన ఆధునిక పరిశ్రమగా మారింది. బాలీవుడ్ అనేకరూపాల్లో హాలీవుడ్‌ని అనుకరిస్తుంటుంది. తిరోగామి స్వభావంతో ఉంటున్నప్పటికీ, తన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బాలీవుడ్ ఆధునిక పోకడలను అనుకరిస్తూ ఉంటుంది. పలువురు బాలీవుడ్ నటులు, దర్శకులు పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి గురయ్యారు. విదేశాలకు చెందినవారు కూడా బాలీవుడ్‌కి వచ్చి నటన, దర్శకత్వం, చిత్రనిర్మాణ బాధ్యతలను చేపట్టారు. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలు ఈ తరహా జీవి తానికి బాగా అలవాటుపడిపోయారు. జాతీయోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత కూడా వీరిలో వచ్చిన మార్పే దీనికి కారణం. అయితే 2014లో ఆరెస్సెస్/బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చిత్రపరిశ్రమలో సాంస్కృతిక ఘర్షణ మొదలైంది. వీరిలో కొందరు హిందుత్వకు బలమైన అనుకూలురుగా మారిపోయారు. ప్రజాభిప్రాయం ఏ వైపు మొగ్గుచూపుతోందో వీరికి స్పష్టంగా తెలిసిపోయింది మరి. బాలీవుడ్లో ఇప్పటికీ చాలామంది మతపరమైన ఛాందసవాదం, సాంస్కృతిక పోలీసింగ్‌తో అసౌకర్యంగా భావిస్తున్నారన్నది వాస్తవం. భూస్వామ్య హిందూ సంస్కృతికి కట్టుబడిపోయినందున, బాలీ వుడ్‌కి క్షత్రియులు దూరంగానే ఉంటూవచ్చారు. ఏ ఇతర ద్విజ కులాలకు చెందిన మహిళలతో పోల్చినా సరే, క్షత్రియ మహిళలు ఇప్పటికీ పురషాధిపత్యం నీడలోనే ఉంటున్నారు. బ్రాహ్మణ, బనియా, కాయస్థ, ఖాత్రీ వంటి ఇతర ద్విజ కులాల మాదిరికాకుండా ఇంగ్లిష్ మీడియం విద్యను గ్రహించడానికి అయిష్టత ప్రదర్శించిన కారణంగా క్షత్రియులు వారి సామాజిక ఔన్నత్యాన్ని కోల్పోయారు. రాజారామ్మోహన్రాయ్ నుంచి జవహర్లాల్ నెహ్రూ–అటల్ బిహారీ వాజ్‌పేయి వరకు (ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మొరార్జీ దేశాయ్, పీవీ నరసింహారావులు కూడా బ్రాహ్మణ ప్రధానమంత్రులే) ఢిల్లీలో బ్రాహ్మణాధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఇక గాంధీ, రామ్ మనోహర్ లోహియా నుంచి నరేంద్రమోదీ వరకు బనియాలనుంచి నాయకులు ఆవిర్భవించారు. వీరికి కూడా ఇంగ్లిష్ విద్యా పునాదులతోపాటు పారి శ్రామిక పెట్టుబడి సంచయనం అందుబాటులోకి వచ్చింది. మోదీ ఇంగ్లిష్ విద్యావంత కుటుంబంనుంచి రాకపోయినా, గుత్తాధిపత్యం కలిగిన బనియా పెట్టుబడి ఆయనకు పూర్తి మద్దతునిస్తోంది. ఇక ఖాత్రి నేపథ్యం కలిగిన ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ప్రత్యేకమైన రాజకీయ పరిణామాలతో దేశ ప్రధానులు కాగలిగారు. ఇక క్షత్రియులనుంచి ప్రధానులుగా కాగలిగినవారు వీపీ సింగ్, చంద్రశేఖర్. కానీ వీరిని మీడియా ఇష్టపడలేదు. చౌదరి చరణ్‌సింగ్, దేవీగౌడలు శూద్ర ప్రధానమంత్రులు. వీరికి కూడా తగినంత స్థాయిలో ఇంగ్లిష్ విద్య అలవడని నేపథ్యంలో వీరు గ్రామీణ రైతాంగ ఆర్థికవ్యవస్థ, సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేవారు. ఇక చిత్రపరిశ్రమలోని ఆత్యున్నత స్థానాల్లో శూద్రులకు, దళితులకు పెద్దగా స్థానం లభించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీపీ సింగ్, చంద్రశేఖర్ ఇద్దరూ పేదల అనుకూలురు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వీపీ సింగ్ అనుకూల వైఖరి తెలిసిందే. అయితే రామమందిర సమస్య దన్నుతో క్షత్రియ కులం నుంచి యోగి ఆదిత్యనాథ్ రాజకీయాల్లో ఆవిర్భవించేంత వరకు భారత రాజకీయాల్లో క్షత్రియుల నుంచి బలమైన నాయకుడు తయారు కాలేదు. సన్యాసిగా జీవిస్తూ హిందుత్వను పాటిస్తూ వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాలంలో హిందుత్వ శక్తుల కమాం డర్‌గా అవతరించారు. ఇటీవల వికాస్ దుబే అనే గ్యాంగ్ లీడర్ని ఎన్ కౌంటర్ చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో క్షత్రియులు, బ్రాహ్మణుల మధ్య ఘర్షణను స్పష్టంగా చూడగలం. అయితే ఒక కమ్యూనిటీగా క్షత్రియులు బాధిత స్థానంలోంచే ఎక్కువగా సంఘటితమవుతూ వచ్చారు. వీరు రాజ్‌పుత్ కర్ణి సేనగా ఏర్పడ్డారు. సారస్వత్ బ్రాహ్మణ కులానికి చెందిన దీపికా పదుకొనే నటించిన పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా వీరు జనాల్ని కూడగట్టారు. ఇప్పుడు ఇదే కర్ణిసేన కంగనా రనౌత్‌కు రక్షణగా ముంబైవరకు వచ్చింది. శివసేనను ఎదుర్కోవాలంటే బీజేపీ అనుకూల వైఖరి ఉపయోగకరమని కంగనాకు అర్థమైంది. ఉద్ధవ్ థాక్రే కుటుంబం కాయస్తులే అయినప్పటికీ వారి పార్టీ పాలక పార్టీగా మారి మరాఠాలకు, ఓబీసీలకు మద్దతునిస్తోంది. తాను చిన్న పట్టణం నుంచి రావడం, ఇంగ్లిష్‌లో పెద్దగా ప్రావీ ణ్యత లేకపోవడం కారణంగా బాలీవుడ్లో తాను మనలేనని బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలి సంవత్సరాల్లో భావించినట్లు కంగన తెలిపింది. కానీ ఇప్పుడామె బెంగాలీ బ్రాహ్మిన్ అయిన రియా చక్రవర్తి, జయాబచ్చన్ బాధురి (ఈమె కూడా బ్రాహ్మినే కానీ కాయస్తుడైన బచ్చన్‌ను పెళ్లాడారు) వంటివారితో పోట్లాడే స్థాయికి చేరుకుంది. బలమైన జాతీయవాద హిందుత్వ ముద్రతో కంగనా పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని అవలంబించింది. శివసేనను సోనియా సేనగా కూడా ఆమె వర్ణించింది. కాంగ్రెస్ సభ్యురాలైన ఊర్మిళా మటోంద్కర్పై కూడా సాఫ్ట్ పోర్న్ అంటూ దాడిచేసింది కంగనా. కంగనా 2019లో నటించిన మణికర్ణిక చిత్రంలో ఝాన్షీ లక్ష్మీ బాయి పాత్రను పోషించింది. సహదర్శకురాలిగా పునరుద్ధరణ వాద, క్షత్రియ మహిళలకు చెందిన స్త్రీవాద భావనలతో కలిపి, చారిత్రక వ్యక్తి అయిన లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని వక్రీకరించింది. బ్రాహ్మణురాలైనప్పటికీ లక్ష్మీబాయ్ వివాహం ద్వారా క్షత్రియురాలు అయింది. కంగన క్షత్రియ లక్ష్మీబాయి పాత్రను పోషించింది. ఇప్పుడు ఆమె జయలలిత పాత్రను పోషిస్తోంది. జీవితంలో ఏ రంగంలోకైనా సరే ధైర్యంగా అడుగుపెట్టాలంటూ కుటుంబం ప్రోత్సాహం ఉన్న దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా (ఖాత్రి) లాగా కాకుండా కంగనా.. తన కుటుంబం వ్యతిరేకిస్తున్నా సరే స్వయంగా మోడలింగ్, సినిమా రంగాల్లోకి వెళ్లింది. దీపికా, చోప్రా, ఐశ్వర్యారాయ్, శిల్పాశెట్టి లాగా కంగనా కుటుంబం పాశ్చాత్య జీవన ధోరణులకు గురికాలేదు. కానీ ఆధునికత ఎలాంటిదైనా సరే వ్యతిరేకించే పాలకుల చరిత్ర కలిగిన కులం నుంచి కంగనా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇతర ద్విజ, ముస్లిం హీరోల్లాగా క్షత్రియులకు బాలీవుడ్లో బడా పెట్టుబడి దన్ను లేదు. తన ప్రస్తుత రాజకీయ స్థానం నుంచి ఆమెకు దేంతోనైనా సరే తలపడే సాహసం వచ్చింది. ముంబై ప్రాధాన్యతను తగ్గించే లక్ష్యంతో యోగి ఆదిత్య నాథ్ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద పిల్మ్ సిటీని నిర్మించ తలపెడుతున్నారు. ఇప్పుడు జాతీయ చిత్రపరిశ్రమగా బాలీవుడ్‌కి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగించాలని కంగనా కోరుతోంది. హిందుత్వ జాతీయవాద భావనతో కూడిన చిత్ర పరిశ్రమ కోసం కొత్త బాటను ఏర్పర్చకపోతే ఇదంతా జరిగేది కాదు. ఇది వారి ఒకే సాంస్కృతిక జాతీయవాద ప్రాజెక్టులో భాగమే. దీనిలో కంగనా సరిగ్గా ఇమిడిపోతుంది. గనా ఇప్పుడొక ఆవిర్భవిస్తున్న హీరోయిన్, నిర్మాత. పైగా కులం దన్ను కూడా ఉంది. సుశాంత్ రాజ్‌పుత్ ఘటనతో క్షత్రియ కులం మొత్తంగా రగిలిపోతోంది. అందుకే రియాచక్రవర్తితో ముడిపడిన సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కేంద్రప్రభుతంపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పార్లమెంటులోనే రియాకు మద్దతుగా నిలిచి బ్రాహ్మణురాలు కాబట్టే ఆమెను వేధిస్తున్నారని ఆరోపించారు. బాలీవుడ్‌ను అన్నం పెట్టే తల్లిగా వర్ణించిన జయాబచ్చన్పై కంగనా దాడి చేయడంతో బాలీవుడ్ మరింత మకిలిపట్టడం ఖాయం. క్షత్రియులు ఆరెస్సెస్‌కు బలమైన మద్దతుదారులు. ఎందుకంటే ఏకైక బ్రాహ్మణేతర సర్సంఘ్చాలక్ రాజేంద్రసింగ్ (రాజు భయ్యా) క్షత్రియుడు. ఆరెస్సెస్ అధినేతగా ఆయన పదవీకాలంలోనే రామమందిర సమస్య ముందుపీఠికొచ్చింది. సంస్థాగతంగా గానీ, వారి కుల వారసత్వపరంగా కానీ ఆరెస్సెస్ క్షత్రియులను నిర్లక్ష్యం చేయలేదు. వారు ఇప్పుడు తమ ఉనికిని ప్రదర్శిస్తున్నారు. అందుకే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కంగనా వారికి ఎంతో అవసరమైన వ్యక్తి. ఇప్పుడంటే ఇంగ్లిష్ మీడియం విద్యకు, ఆధునికతకు లోబడే విషయంలో ద్విజ సామాజిక శక్తుల్లోనే క్షత్రియులు బలహీనమైన లింకుగా ఉండవచ్చు. చారిత్రకంగా మాంసాహారమంటే చెవి కోసుకునే వీరు ఆరెస్సెస్ ఆహార సంస్కృతికి అలవడేందుకు శాకాహారులుగా మారుతున్నారు. బ్రాహ్మణులు, బని యాలు భౌతికవాదాన్ని స్వీకరిస్తున్న చిత్రసీమ సంస్కృతిలో కంగనా పూర్తి శాకాహారిగా మారిపోయింది. సుశాంత్ అకాల ఆత్మహత్య, అతడి తరపున కంగనా రనౌత్ పోరాటం కారణంగా ఆమె కులం ఇప్పుడు మితవాద మీడియా ఆసక్తిని ఆకర్షిస్తోంది. వికాస్ దుబే ఎన్కౌంటర్ తర్వాత ఎస్పీ, బీఎస్పీ పార్టీల దన్నుతో ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు పరుశురాముడిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కంగనా యూపీ రాజకీయాల్లో అసలైన ట్రంప్ కార్డు అన్నమాట. యోగి ఆదిత్యనాథ్ సరిగ్గా దీన్ని గుర్తించే గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా క్షత్రియ కులాన్ని సంఘటితపరుస్తున్నారు. కంగనా దూసుకురావడం బాలీవుడ్ చిత్రపరిశ్రమకు సవాలే అవుతుంది. అలాగే ఇతర రంగాల్లోని ద్విజ క్యాంపులోని ఆధిపత్య కులాలకు కూడా ఆమె సవాలుగానే నిలుస్తుంది. ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు
భిన్నభిన్న ప్రాంతాల్లో, వివిధ కాలాల్లో ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు, మత ప్రవక్తలు వచ్చి అప్పటి పరిస్థితుల్లో మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పారు. అయితే ఆత్మజ్ఞానం పొందినవారు, భగవం తుడిని తెలుసుకున్న వారు లేదా భగ వంతుని లీలల అనుభవాన్ని పొంది నవారు అందరిలో ప్రాణ స్వరూ పంగా ఉన్న భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని కూడా నొక్కి చెప్పారు. అందుకే మహాత్ములెవ్వరూ కులమత భేదాలను పాటించలేదు. రామకృష్ణ పరమహింస షిరిడీ సాయిబాబా, కబీర్, బ్రహ్మంగారు, వివేకానందుడు ఇలా ఏ మహాత్ముడు కులమతభేదాలను పాటించలేదు. రామకృష్ణ పరమహింస ఎన్నో సాధనలు చేశారు. ఎన్నో అనుభూతులు పొందారు. అలాంటి మహాత్ముడు మహమ్మద్ ప్రవక్తను ధ్యానించి ఇస్లాంలో చూపిన సాధనలు చేసి మహమ్మద్ ప్రవక్తతో అను భూతిని పొందాడు. అదేవిధంగా క్రైస్తవమతాన్ని సాధన చేసి జీసెస్ క్రైస్తుతో అనుభవం పొందాడు. ఇప్పుడు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొంతమంది అనవసరమైన, అసంగతమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే ఇదంతా చెప్పాల్సి వస్తోంది. శైవులకు, వైష్ణవులకు విభేదాలు ఉన్నప్పుడే పోతనామా త్యుడు శివకేశవులకు భేదం లేదని చెప్పాడు. కబీర్ రాం రహీం ఒక్కరేనని చెప్పాడు. కబీర్ హిందువా, ముస్లిం మతస్తుడా ఎవ్వరికీ తెలీదు. అలాగే షిరిడీ సాయి హిందువా, ముస్లింనా ఎవ్వరికీ తెలీదు. సాయిబాబా ఫకీర్ వేషంలో కన్పించారు. షిరిడీలోని దేవాలయాలను పునరుద్ధరించాడు. ఎంతోమంది ప్రముఖులు బాబాను దేవుడిగా పూజించారు. బాబానుంచి ఎన్నో అనుభవాలు పొందారు. అలాంటి బాబా ఏ మతసంప్రదాయాలను, ఆచారాలను పాటించలేదు. అతను ఏ మతస్తుడో చెప్పలేదు. అయితే మతమార్పిడు లనూ అంగీకరించలేదు. ఎవ్వరి విశ్వాసాలకు అనుగుణంగా వారు దైవాన్ని కొలవాలని చెప్పారు. ఎవ్వరు ఏ మతాన్ని విమ ర్శించినా ఒప్పుకునే వారు కాదు. ఒక సందర్భంలో వివిధ మతాల గురించి మాట్లాడుతూ అక్కడికి వెళ్లడానికి ఎన్నో దారులున్నాయి, శిరిడీ నుంచి కూడా ఒక దారి ఉంది అని చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం విశ్వబ్రాహ్మణుడైనప్పటికీ, దూదేకుల సిద్ధయ్యకు జ్ఞానబోధ చేశాడు. దళితుడైన కక్క య్యకు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చాడు. రమణ మహర్షి ఆత్మవిచారణకే ప్రాధాన్యమిచ్చాడు. గౌతమ బుద్ధుడు ధ్యాన సాధనకే ప్రాధాన్యమిచ్చాడు. వీరందరూ ఏ రోజూ మతాచా రాలను, సాంప్రదాయాలను పాటించలేదు. ఆరోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం గురువు ఉపదేశించిన మంత్రాన్ని బహిరంగ పర్చకూడదు. కానీ శ్రీరామానుచార్యులు ఆ మంత్రం వల్ల అందరికీ లాభం చేకూరాలని గుడి గోపురం ఎక్కి ఆ మంత్రాన్ని అందరికీ వినిపిస్తాడు. గురువాజ్ఞను ధిక్కరించా వని అలా చేసినందుకు నరకానికి వెళ్తావంటే నల్గురికీ లాభం కల్గితే నరకానికి వెళ్లడానికి సిద్ధమే నంటాడు. మన ధర్మం ప్రకారం క్షత్రియులే పరిపాలన చేయాలి. బ్రాహ్మణులు పూజలు, యజ్ఞయాగాలు చేయాలి. అలాంట ప్పుడు జవహర్లాల్ నెహ్రూ, అటల్‌బిహారీ వాజ్‌పేయ్, పీవీ నరసింహారావు నేటి నరేంద్ర మోదీ లాంటి వారికి ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఆ నియమాలు ఇప్పుడు మనం పాటిస్తున్నామా? పరిస్థితులనుబట్టి నియమాలు మారు తాయి. చట్టాలు, రాజ్యాంగం, నియమాలు అన్నీ కాలానుగు ణంగా మారకతప్పదు. ఇదివరకు మడికట్టుకొని వంట చేయడం మన ఆచారం. నేడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, విమా నాల్లో, పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి మడికట్టు కొని వంట చేయడం సాధ్యం అవుతుందా? ఇక నిజమైన, పరిపూర్ణమైన భక్తి, జ్ఞానం కలవారు ప్రపంచంలోని అందరూ భగవంతుని రూపాలేనని భావి స్తారు. ప్రతీ ప్రాణిలో ఆత్మ రూపంలో ఉన్నదే ఒక్క విశ్వాత్మ భాగమేనని భావిస్తారు. ఏ పేరుతో పిలిచినా పలుకుతానని భగవంతుడు ఎందరికో అనుభవాలనిచ్చాడు. భగవంతుణ్ణి తనకిష్టమైన రూపంలో పూజిస్తాడు సాధకుడు. కానీ, సాధన ఉన్నత దశకు చేరాక భగవంతుణ్ణి నిరాకారరూపంగా ధ్యాని స్తాడు సాధకుడు. అప్పుడు ధ్యానం, ధ్యానించే సాధకుడు, ధ్యానించే రూపం ఒక్కటిగా అవుతుందని, ఆ స్థితినే సమాధి స్థితి అని మహాత్ములు చెబుతారు. ఆ స్థితికి చేరుకున్న వారు పూజలు, పునస్కారాలు, ఆచారాలు పాటించే స్థితిలో ఉండ రని రామకృష్ణ పరమహంస చెప్పారు. ‘ఉన్నది ఒక్కటే’ కానీ వివిధ పేర్లతో వ్యవహరిస్తారని వేదం చెప్పింది. శివుడన్నా, అల్లా అన్నా, యెహోవా అన్నా మరే పేరుతో పిలిచినా ఆ పిలిచేది ఒక్కరినే. ఆ పిలుపు చేరిది అక్కడికే. ఒక వ్యక్తిని చూసి అతని కులమేమిటో, మతమే మిటో చెప్పలేము. ప్రకృతికి కులమతాలు లేవు. గాలికి, నీటికి, భూమికి, ఆకాశానికి మతమేది? వీటికి లేని మతం దేవునికి ఎక్కడిది? దేవుళ్ల కులమతాల ముసుగులో చూడటం అజ్ఞానం. ఆత్మకు, పరమాత్మకు కులం లేదు. మతం లేదు. వేదాలన్నీ ‘ఓ మానవుడా’ అని సంబోధిస్తాయి. ఉపనిష త్తులు ఏ మతానికి చెందినవీ కావు. సమస్త మానవాళికి చెంది నవి. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా çహథీరాంతో పాచికలాడాడని కథ. అంతేగాదు బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడనీ కూడా చెబుతాడు. బీబీ నాంచారమ్మ ఒక ముస్లిం స్త్రీ. ఆమెకు స్వామివారి మీద అనన్యమైన భక్తి. ఆ స్వామి ఆమెను స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్నాడని స్వామి వారి కథలో చెబుతారు. అంటే ఒక ముస్లిం స్త్రీని తనలో ఐక్యం చేసుకున్న స్వామికి కులమతాలు అంటగట్ట వద్దు. హిందువులైనా, ముస్లింలైనా, ఏ మతంవారైనా, ఏ కులం, ఏ జాతివారైనా భక్తితో స్వామిని దర్శించుకుంటే, స్వామిని వేడుకుంటే స్వామి కరుణించడా? ఆ భక్తుని కులమేమిటని, మతమేమిటని ప్రశ్నిస్తాడా? భారత రాజ్యాంగానికి వస్తే మన రాజ్యాంగం ఏ వ్యక్తిపట్ల కులమత జాతి, లింగ, ప్రాంతీయ వివక్షత చూపవద్దని చెప్తున్నది. ఏకులం వారైనా, ఏ మతంవారైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావచ్చునని రాజ్యాంగం స్పష్టం చేసింది. దేశానికి ప్రధానమంత్రి అంటే దేశప్రజలం దరికీ ప్రధాని. అంతే కానీ కేవలం హిందువులకో, మహ మ్మదీయులకో ప్రధాని కాదు కదా. అలానే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్య మంత్రి. ఆ రాష్ట్రంలోని హిందువులకు, ముస్లింలకు, క్రైస్త వులకు, జైనులకు, బౌద్ధులకు అందరికీ ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి కూడా నేను నా మతం వారికే, నా పార్టీవారికే ముఖ్యమంత్రి అని చెప్పకూడదు. అలా ప్రవర్తించకూడదు. ప్రజలు అతడిని ఒక మతానికి, ఒక కులానికి చెందిన వ్యక్తిగా గుర్తించవద్దు. వ్యాసకర్త: జస్టిస్ బి. చంద్రకుమార్ , రిటైర్డ్ న్యాయమూర్తి 79974 84866 -
న్యాయమడిగితే కుల బహిష్కరణ
సాక్షి, మోపాల్: న్యాయం చేయాలని కులపెద్దలను అడిగితే ఏకంగా కులబహిష్కరణ చేశారని నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన రెడ్డిసునీత ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీవో, ఏసీపీలకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తమకు ఉన్న వ్యవసాయ భూమిని బావ మల్లారెడ్డి కబ్జా చేస్తున్నాడని గతంలో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయం ఆయనపై కేసు నమోదైందన్నారు. అయినప్పటికీ మళ్లీ గొడవ చేయడంతో మండల సర్వేయర్‌తో సర్వే చేయించి హద్దుల ప్రకారం కంచె వేసుకున్నామన్నారు. తాజాగా తిరిగి అదే హద్దుల విషయంలో ప్రత్యర్థులు కులపెద్దలను ఆశ్రయించి మా కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. దేవాలయానికి సంబంధించిన భూమిని మాకు కట్టబెట్టి మా పట్టాభూమిని వారికి ఇవ్వాలని ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని దీనికి ఒప్పుకోకపోవడంతో కులపెద్దలకు చెప్పి తమను బహిష్కరించారని తెలిపారు. అంతేకాకుండా కులపెద్దలు మా కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారన్నారు. తమతో ఎవరైన మాట్లాడితే రూ.5వేలు జరిమానా విధిస్తామని సంఘంలో తీర్మానం చేశారని ఆరోపించారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించాలని మా భూమిని మాకు అందించి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. -
రెండు రోజుల్లో కొడుకు పెళ్లి.. కులబహిష్కరణ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెలో కుల బహిష్కరణ కలకలం రేపింది. గ్రామంలోని ఒక స్థల వివాదంలో నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి తలదూర్చుతున్నాడనే కారణంతో గ్రామస్తులు అతనిపై బహిష్కరణ ప్రకటన చేశారు. దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన ఆయన కొడుకు పెళ్లికి కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది. కరోనా కాలంలో బయటి వ్యక్తులు గ్రామంలోకి గ్రామంలోని వ్యక్తులు బయటికి వెళ్లవద్దని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. బ్రహ్మయ్య కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రామంలో చాటింపు వేశారు. దీంతో గ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. -
కుల బహిష్కరణ కలకలం
-
కుల నిర్మూలనపై మాట్లాడరేం?
అరబ్ వసంతం పేరిట చెలరేగిన ప్రజా తిరుగుబాట్లు దశాబ్దం క్రితం ఇస్లామిక్ ప్రపంచాన్ని కదిలించివేశాయి. జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్య నేపథ్యంలో ప్రస్తుతం చెలరేగుతున్న జాతి వివక్షా వ్యతిరేక ఉద్యమాలు పాశ్చాత్య ప్రపంచ మూలాలను కదిలిస్తున్నాయి. మరి మానవుల మధ్య సానుకూల సంబంధాలను, మెరుగైన ఉత్పత్తి సంబంధాలను విధ్వంసం చేస్తున్న భారతీయ కులవ్యవస్థ, వివక్షపై మన మేధావులు గళం విప్పాల్సిన అవసరం లేదా? భారత గడ్డ మీది నుంచి కులాన్ని, అస్పృశ్యతను కలిసికట్టుగా పెకిలించివేయాల్సిందేనంటూ, ఓబీసీల నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాల్సిన నైతిక బాధ్యత మన మేధావులకు లేదా? ఒక దృఢమైన కులనిర్మూలనా చట్టం ఉనికిలో లేని నేపథ్యంలో.. ఘనీభవించిపోయిన కుల వ్యవస్థపై భారతీయ న్యాయ వ్యవస్థ సైతం దృఢవైఖరిని చేపట్టలేకపోతోంది. ముస్లిం ప్రపంచాన్ని 2010–11 మధ్యకాలంలో అరబ్ వసంతం పేరిట ప్రజా తిరుగుబాట్లు చుట్టుముట్టిన చందాన 2020లో పాశ్చాత్య ప్రపంచాన్ని జాతివివక్షా వ్యతిరేక ఉద్యమాలు చుట్టుముడుతున్నాయి. భారతదేశంలోనూ, అమెరికా–యూరప్ ఖండాల్లోనూ నివసిస్తున్న భారత సంతతి పాశ్చాత్య విద్యావంత మేధావులు, పండితులు, క్రియాశీల కార్యకర్తలు, కళాకారులు తాము కూడా నల్లజాతి ప్రజల్లాగే క్రియాశీలకంగా మారారు. వీరిలో చాలామంది బ్రాహ్మణ, బనియా, క్షత్రియులతోపాటు కాయస్థ, ఖాత్రి అనే ఉత్తర భారత కులాలకు చెందిన కుల నేపథ్యం ఉన్నవాళ్లే. అతికొద్దిమంది మాత్రం శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ నేపథ్యంనుంచి వచ్చినవారు. వీరు పాలకవర్గాలను ప్రభావితం చేయగలిగిన కలం బలం ఉన్నవారు. జాత్యహం కారం, వివక్ష, అసమానత్వంపై నైతిక చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ మేధావులు తమ కులపరమైన మూలాలను కూడా కులంలాగే, జాతిలాగే తిరస్కరిస్తారని ఎవరూ భావించలేరు. కుల సమస్యలను వ్యతిరేకిస్తున్న సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు కొందరిని డర్బన్‌లో 2001లో జాతి, జాతి వివక్షత, జాతి దమనకాండపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ సదస్సులో దీపాంకర్ గుప్తా, రామచంద్ర గుహ వంటివారు నల్లజాతి ప్రజలు సాగిస్తున్న జాతి వివక్షా వ్యతిరేక విప్లవాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అమెరికాలో నివసిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ వంటి ప్రముఖ పత్రికల్లో రాసే భారతీయ కాలమిస్టులు అనేకమంది కూడా తాజాగా జాతివివక్ష సమాజంలోంచి తొలగిపోవాలని చెప్పారు. తాము కూడా నల్లవారిమే అనే విధంగా వీరు ‘నల్లజాతి ప్రాణాలు విలువైనవే’ (బ్లాక్ లైవ్స్ మ్యాటర్) అనే బ్యానర్లను సైతం సాహసోపేతంగా పట్టుకుని ముందుపీటిన నడిచారు. అలాంటప్పుడు భారత గడ్డ మీదినుంచి కులం, అస్పృశ్యత కలిసికట్టుగా అంతరించిపోవలసిందేనంటూ, ఓబీసీల నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాల్సిన నైతిక బాధ్యత మన మేధావులకు లేదా? అమెరికా, బ్రిటన్లలో జాతివ్యతిరేక పౌర హక్కుల చట్టాలు అనేకం ఉనికిలో ఉంటున్నాయి కానీ జాతిపరమైన అత్యాచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమాలకు అర్థం మరిన్ని చట్టాలు రావాలని, పౌర సమాజ మనస్తత్వాన్ని మార్చాలనే తప్ప మరేమీ కాదు. నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్‌ని తెల్లజాతి పోలీసు అధికారి క్రూరంగా హత్య చేసిన సందర్భంలో తెల్లజాతి పోలీసుల ప్రవర్తనను మార్చడానికి సాగుతున్న ఉద్యమాలు కావివి. కాకపోగా పాశ్చాత్య ప్రపంచంలో ప్రాథమిక మానవ సంబంధాలనే మార్చడానికి సాగుతున్న ఉద్యమాలవి. మరి మనదేశంలో మనం కులపరంగా బ్రాహ్మణ, బనియా లేక శూద్ర–దళిత నేపథ్యం దేనికైనా చెంది ఉండవచ్చు కానీ.. ఒక సమగ్రమైన కులనిర్మూలన చట్టాన్ని ఆమోదించాలని మనందరం ఎందుకు ప్రశ్నించకూడదు? అమెరికాలో జాతి సమస్యకు పరిష్కారం లిండన్ బి.జాన్సనే అంటూ దీపాంకర్ గుప్తా తన రచనల్లో ఒకదానిలో సూచించారు. అంటే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ శ్వేత జాతి శాసన కర్తలనుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ 1964 పౌరహక్కుల చట్టాన్ని ఆమోదించుకునే విషయంలో చివరివరకూ పట్టుబట్టి సాధించుకున్నారు. మరి మనదేశంలో కులసమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ప్రధాని మోదీ జనాదరణ కల నేత. పార్లమెంటులో మెజారిటీ సభ్యుల మద్దతు పొందారు. పైగా తన సొంత పార్టీ సభ్యులే చెబుతున్నట్లుగా ఓబీసీ నేపథ్యంలో భారతదేశం ఇదివరకెన్నడూ సృష్టించలేకపోయిన సాహసనేత కదా ఆయన. మరి మోదీ ప్రభుత్వాన్ని కుల నిర్మూలనా చట్టం రూపొందించాల్సిందిగా మన భారత మేధావులు ఎందుకు డిమాండ్ చేయరు? అంటరానితనానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనలు కానీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు వంటివి కానీ, ఆర్థికపరమైన మెరుగుదలకు సంబంధించినవే కానీ అవి వ్యవస్థాగతమైన మార్పులను తీసుకురాలేవు. పాశ్చాత్య ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం నల్లజాతి ప్రజలకు కొన్ని ఆర్థికపరమైన, విద్యాపరమైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో మాత్రమే సాగడం లేదు. వివిధ వర్ణాల మధ్య, జాతుల మధ్య ప్రాథమిక సంబంధాలనే మార్చే లక్ష్యంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. మనం కూడా దక్షిణాసియాలో ప్రాథమికమైన కుల సంబంధాలనే మార్చిపడేసే విస్తృతి కలిగిన చట్టం రూపకల్పన కోసం పాలకులను అడగాల్సి ఉంది. ఈ సందర్భంలో భారతదేశం చేపట్టే చర్యలు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఈ దేశాల్లో కూడా కుల వ్యవస్థ ఒకటి లేదా పలురూపాల్లో అమలవుతూ వస్తోంది. మన దేశంలో కులవ్యవస్థ.. అసమానతలకు సంబంధించిన దొంతర్లను, వివక్షకు చెందిన కార్యాచరణలను సృష్టించిపెట్టిందని ప్రతి మేధావికీ తెలుసు. భారతజాతి అభివృద్ధిని సాగిస్తూ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న దశలో పలురకాల కులాచారాలు, అలవాట్లు ఉనికిలోకి వస్తున్నాయి. ఈ కుల వ్యవస్థ కారణంగానే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనేకమంది ప్రతిభాపాటవాలు ప్రతి రోజూ తొక్కివేయబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. శూద్రులను, దళితులను, ఆదివాసీలను హిందువులుగా నిర్వచిస్తూనే మన ఆలయాల్లో ఆగమశాస్త్రం ప్రాతిపదికన వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు వంశపారంపర్య రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ వంశపారంపర్యం ప్రాతిపదికన సాగుతున్న ప్రమోషన్లను కూడా తప్పకుండా వ్యతిరేంచాల్సి ఉంది. జీవితంలోని అన్ని రంగాల్లోనూ సమానత్వంకోసం పాటుపడతానని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సమగ్రమైన కుల నిర్మూలనా చట్టం తీసుకురావడంపై ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ మేధావులు అనేక విషయాలపై రచనలు చేశారు కానీ కుల నిర్మూలనా చట్టం గురించి నోరెత్తలేదు. భారతీయ వైవాహిక వ్యవస్థలో కులం ఒక పాశవికమైన ఉనికిని ప్రదర్శిస్తోంది. పాశ్చాత్య ప్రపంచంలోని పరస్పర ఎంపిక ద్వారా వివాహ సంబంధాలు ఏర్పర్చుకోవడం, అలాంటి తరహాలోని వివాహాలతో ప్రభావితమవుతున్న మన దేశ యువతీయువకులను కులం ప్రాతిపదికన సాగుతున్న పరువు ప్రతిష్టల భావజాలంతో చంపిపడేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న దంపతులను వివక్షకు, సామాజిక బహిష్కరణకు గురిచేస్తూ వేధిస్తున్నారు. వీరి పిల్లలు అటు పాఠశాలల్లో, ఇటు పౌర సమాజంలోనూ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కులాంతర వివాహం చేసుకున్న కుటుంబాలకు చెందిన కుమార్తెలు, కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదు. తమ తప్పేమీ లేకపోయినా ఇలాంటివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో అమృత–ప్రణయ్, తమిళనాడులో కౌశల్య–శంకర్లకు చెందిన ప్రముఖ ఉదంతాలు.. మన దేశంలో అంటరానితనం మాత్రమే కాదు, కుల వ్యవస్థ సైతం యువతీయువకుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని చాటిచెబుతున్నాయి. చివరకు ఒక దృఢమైన కులనిర్మూలనా చట్టం ఉనికిలో లేని నేపథ్యంలో ఘనీభవించిపోయిన కుల వ్యవస్థపై భారతీయ న్యాయ వ్యవస్థ సైతం దృఢవైఖరిని చేపట్టలేకపోతోంది. శాసన సంపుటిలో బలమైన కులనిర్మూలనా చట్టం భాగమైనప్పుడు మాత్రమే కులాచారాలను, కులపరమైన నిందాత్మక భాషను తీవ్రనేరంగా ప్రకటించే పరిస్థితి ఏర్పడుతుంది. కులం అనేది మానవులను నిర్మూలించే వ్యవస్థ. చారిత్రకంగా చూస్తే కూడా కులం మానవుల్లో సానుకూలమైన, ఉత్పత్తి సంబంధాలను తోసిపుచ్చింది. సకల ఉత్పత్తి రంగాల్లో కులం అనేది అంతరించిపోయినప్పుడు మాత్రమే భారతదేశం ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతుంది. కులవివక్షత తరుణ వయస్కులలో ప్రతిభను, నైతిక విశ్వాసాన్ని చంపేస్తుంది. కుల నిర్మూలనా చట్టం రూపకల్పన గురించి చర్చ దేశంలోని దళిత, ఓబీసీ మేధావులు, హక్కుల కార్యకర్తలు మాత్రమే మాట్లాడితే సరిపోదు. కులం, జాతి ప్రపంచంలో మానవ సంబంధాలను, విలువలను విధ్వంసం చేస్తున్నాయని తలుస్తున్న వారందరూ దీనిపై తమ అభిప్రాయాలను చెప్పి తీరాలి. అందుకు ఇదే తగిన సమయం. వ్యాసకర్త: ప్రొఫేసర్ కంచ ఐలయ్యషెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
మీ అమ్మాయి అలాంటి అమ్మాయి..
అమ్మాయికి 29 ఏళ్లు వచ్చాయి.ఉద్యోగం చేస్తోంది.చాలా సంబంధాలు వస్తున్నాయి.కాని చేసుకోను అంటోంది?ఎందుకు అని అడిగితేమూడు కారణాలు చెబుతోంది.ఏమిటి ఆ కారణాలు?అసలు కారణం ఎక్కడ దాగుంది? ప్యాంట్ వేసుకుంటే ప్రవల్లిక చక్కగా కనిపిస్తుందని ఆమె ఆఫీస్‌లో ఫిమేల్ కలీగ్స్ అంటారు. ప్రవల్లిక కొంచెం పొడగరి. జుట్టు కూడా పొడవుగా ఉంటుంది. నడుస్తూ ఉంటే చూడబుద్ధేసేలా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు షిఫ్ట్‌లలో డ్యూటీ ఉంటుంది. ఏ షిఫ్ట్ డ్యూటీలో అయినా ప్రవల్లిక అలసట కనపడనివ్వక తాజాగా ఉంటుంది. అలాంటి ప్రవల్లికను పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు? కాని ఆ అమ్మాయి మాత్రం పెళ్లికి దూరం.పెళ్లా? నాకా? అని నవ్వేస్తుంది. ప్రవల్లిక వాళ్ల ఇల్లు గచ్చిబౌలిలో ఉంటుంది. ప్రవల్లిక తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పి.జి. చేస్తోంది. ఒక అమ్మాయి బి.టెక్ చేస్తోంది. ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో కళకళలాడుతూ ఉంటారు. తండ్రి లెక్చరర్. తల్లి గృహిణి. ముగ్గురి పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ చేసి ఉన్నారు. కాని ప్రవల్లిక వైఖరి వాళ్లకు అర్థం కాకుండా ఉంది. ‘పెళ్లి చేసుకోవే’ అని తల్లి అడిగితే–‘అదేంటమ్మా.. అలా అంటావ్. ఇంటికి పెద్ద కూతురిని. నిన్నూ నాన్నను చూసుకోవాల్సిన దాన్ని. నాకు పెళ్లి వద్దు... ఏమీ వద్దు’ అని అంటుంది.మరోసారి నాన్న అడుగుతాడు– ‘ఏమ్మా.. పెళ్లి చేసుకోవా? మా కొలిగ్ వాళ్ల అబ్బాయి ఉన్నాడు’ అనంటే ‘ఏం పెళ్లిలే నాన్నా... ఎన్ని చూడటం లేదు. ఏవీ సజావుగా సాగడం లేదు. అన్నీ ఏవో ఒక కంప్లయింట్లలో నడుస్తున్నాయి. ఆ కంప్లయింట్లలో నన్నూ పడమంటావా?’ అంటుంది. ఇంకోసారి ఇద్దరు చెల్లెళ్లు అడుగుతారు ‘పెళ్లి చేసుకో అక్కా’ అని.అప్పుడేమో ‘మగాళ్లు సరిగ్గా ఉంటే కదా చేసుకోవడానికి. వాళ్లు శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప మనసుకు కాదు. స్త్రీ మనసుకు విలువ ఇచ్చే రోజులు వచ్చినప్పుడు చేసుకుంటాను’ అంటుంది.తల్లిదండ్రులకు ఇదంతా వొత్తిడిగా ఉంది. ఇంట్లో పెద్దమ్మాయికి పెళ్లయితేనే తర్వాతి ఇద్దరూ కదులుతారు. కాని ఈ అమ్మాయి ఇలా అంటోంది. ఇప్పుడెలా? రోజులు గడిచే కొద్దీ ప్రవల్లికలో హుషారు పోతోంది. ఆ మెరుపు పోతోంది. నవ్వు పోతోంది. మూడీగా మారిపోతోంది. ఏమిటో.. ఏమయ్యిందో... ఇంట్లో వాళ్లకు అర్థం కావడం లేదు. పెళ్లి గురించి వొత్తిడి తెస్తున్నందుకు ఇలా చేస్తున్నదా? అని వారికి సందేహం వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరూ సంప్రదించుకుని ఆమెతో ‘సరేలేమ్మా... నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మానెయ్’ అన్నారు.‘అంటే నేను పెళ్లే లేకుండా బతకమంటారా?’ అని భోరున ఏడ్వడం మొదలుపెట్టింది.దాంతో ఇంకా తికమకపడిపోయారు తల్లిదండ్రులు.ప్రవల్లిక ఏదో సమస్యతో బాధపడుతోంది. ఏంటా సమస్య అని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ముందు ప్రవల్లిక సైకియాట్రిస్ట్ దగ్గర ఏమీ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత మెల్లగా తన గురించి చెప్పడం మొదలెట్టింది. ‘సార్. మాకు అన్నం నీళ్లు లేకపోయినా పర్వాలేదు.. కులం ఉండాలి. మా నాన్న, అమ్మ ఎప్పుడూ కులం గురించే మాట్లాడుతుంటారు. చిన్నప్పటి నుంచి కులం గొప్పతనం చెబుతుంటారు. ఆ కులంలో పుట్టినప్పుడు ఆ కులాన్ని గౌరవించకుండా ఎలా ఉంటాం. అంతమాత్రాన ఇతర కులాలతో మనకు స్నేహం అక్కర్లేదా? అదొక్కటే కాదు.. ప్రేమలు, వేరెవరో ప్రేమించి చేసుకోవడం ఇవి చాలా తప్పు అని, ప్రమాదం అని పదే పదే చెబుతూ పెంచారు. మా బంధువుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా చూశాను. అందరూ సఫర్ అవుతున్నారు. అలాగని ప్రేమ పెళ్లిళ్లు గొప్పవని కాదు. కాని కనీసం ఎంతో కొంత మన ఎంపిక ఉంటే బాగుంటుంది కదా. మా ఆఫీస్‌లో ఒకతను చాలా మంచివాడు. కష్టపడి పైకి వచ్చాడు. నేనంటే ఇష్టం ప్రదర్శిస్తుంటాడు. కాని ఆ సంగతి తెలియనట్టే నేనుంటాను. ఎందుకంటే అతడిది వేరే కులం. వేరే కులం కుర్రాడితో పెళ్లి మా ఇంట్లో సాధ్యం కాదు. కాని అతడు ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు. ఆ మాట నాతో చెప్పనంత వరకూ నేను బాగానే ఉన్నాను. కాని మొన్న చెప్పి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అప్పటి నుంచి నాకు డిప్రెషన్ మొదలైంది. నేను నో చెప్తే అతడు వేరొకరిని పెళ్లి చేసుకుంటాడు. ఎస్ చెప్తే ఇంట్లో ఇబ్బందులొస్తాయి. అందుకే నాకు డిప్రెషన్ వచ్చేసింది’ అంది ప్రవల్లిక. సైకియాట్రిస్ట్‌కు సమస్య అర్థమైంది.‘నీకు అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉందా?’ అని అడిగాడు.‘ఉంది’ అందా అమ్మాయి.‘చేసుకుంటావా?’‘కాని మా అమ్మా నాన్నలను వొదులుకోలేను’‘నేను వాళ్లతో మాట్లాడతాను’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘మీ అమ్మాయి అంటే మీకు ఎక్కువ ఇష్టమా... మీ కులం అంటే మీకు ఎక్కువ ఇష్టమా?’ అడిగాడు సైకియాట్రిస్ట్ ప్రవల్లిక తల్లిదండ్రులను.వాళ్లిద్దరూ ముఖం ముఖం చూసుకున్నారు.‘మా అమ్మాయే ఇష్టం’ అన్నారు. ‘కాని మీ అమ్మాయికి మీకు మీ కులమే ఇష్టం అనే భావన ఉంది. చూడండి... ప్రతి కులానికి మన సొసైటీలో ఒక స్థానం ఉంది. సంస్కృతి ఉంది. ఎవరి కులాలను వారు గౌరవించుకుంటారు. కాని మన కులాన్ని, కుటుంబ సంప్రదాయాన్ని గౌరవించే ఎదుటి కులాలు కూడా ఉంటాయి. ఎదుటి కులాల మనుషులు మనతో, మనం ఎదుటి కులాల మనుషులతో పరస్పర అంగీకారంతో సంబంధాలు కలుపుకోకపోతే సమాజం నడుస్తుందా? మీ అమ్మాయి వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. కాని మీరేమనుకుంటారోనని లోలోపల కుమిలిపోతోంది. చాలామంది అమ్మాయిలు తల్లిదండ్రులు ఎవరిని తెస్తే వారిని చేసుకోవచ్చు. కాని కొందరు అంత సులువుగా స్పందించరు. మీ అమ్మాయి అలాంటి అమ్మాయి. ఎంతో నచ్చితే తప్ప పెళ్లి దాకా రాదు. ఆ అబ్బాయి యోగ్యుడు. 29 ఏళ్ల అమ్మాయి అతనితో వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. కాని మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉండటం వల్లే మీ అంగీకారంతో చేసుకోవాలనుకుంటోంది’ అని ఆగాడు సైకియాట్రిస్ట్. ప్రవల్లిక తల్లిదండ్రులకు తమ తప్పు అర్థమైంది. ‘సార్... ఏదో అందరిలాగా ఆలోచించాముగాని అమ్మాయి జీవితమే నాశనమవుతుందంటే కులాన్ని పట్టుకు ఊగులాడతామా? మా అమ్మాయి కోరిన అబ్బాయికే ఇచ్చి చేస్తాము సార్’ అన్నారు. ఆ తర్వాత ప్రవల్లిక పెళ్లయిపోయింది.వారిది పెద్దలు కూడా ఆనందించే ప్రేమ వివాహం అయ్యింది. – కథనం: సాక్షి ఫ్యామిలీఇన్‌పుట్స్ డాక్టర్ కల్యాణచక్రవర్తి సైకియాట్రిస్ట్ -
సమానత్వానికి ఆమడ దూరంలో!
కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుంటారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలూ పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. 21వ శతాబ్దిలోనూ భారత్‌లో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. నా బాల్యంలోనూ, ప్రస్తుతం కూడా మా గ్రామంలో ఓ సాధారణ ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ప్రతి వృత్తినీ ఒక్కో సామాజిక బృందం మాత్రమే నిర్వహిస్తూంటుంది. ప్రతి కమ్యూనిటీకీ ఒక్కో పేరు ఉంటుంది. పొలాలను దున్నడం, గొర్రెలు కాయడం లేదా పశువుల పెంపకం, చేపలుపట్టడం, కల్లుగీత, కుండల తయారీ, బట్టలు ఉతకడం, నేతపని, క్షురక వృత్తి, చెప్పుల తయారీ, జంతువులు లేక మనుషుల మృతదేహాలకు అంతిమసంస్కారం నిర్వహించడం వంటి ఒక్కో పనిని ఒక్కో కులం ప్రత్యేకంగా చేసేది. గ్రామంలో ఏదైనా వృత్తి చేతులు మారుతూ ఉంటుందంటే అది పొలం దున్నడం మాత్రమే. ఇతర వృత్తులన్నీ వేర్వేరు కులాల చేతుల్లోనే ఉంటాయి. నా బాల్యంలో అన్ని కులాలూ కలిసి భోజనం చేసే పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని కులాలు కలిసి భోంచేయడం సాధ్యపడుతోంది కానీ, కులాంతర వివాహం ఇప్పటికీ కష్టసాధ్యమే. మార్పు ఏదైనా జరిగిందంటే అది పైపైన మాత్రమే జరుగుతోంది తప్ప వ్యవస్థాగతంగా కాదు. అంతరాల పరమైన అసమానత్వం ఇప్పటికీ అలాగే ఉంది. బ్రాహ్మణ, వైశ్య కులాలు ఇప్పటికీ ప్రత్యేకంగా ఉంటూ మిగతా కులాలకంటే అగ్రస్థానంలో ఉంటున్నాయి. కులపరమైన సమానత్వం గ్రామంలోనూ లేదు. నగరంలోనూ లేదు. 72 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజాజీవితంలో సమానత్వం లేనేలేదు. 20వ శతాబ్ది మధ్య నుంచి, 21వ శతాబ్ది ప్రారంభం వరకు భారతదేశంలో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. స్త్రీపురుషులతో సహా మనుషులందరినీ సమానంగా సృష్టించాడని చెబుతున్న దేవుడు నేటికీ మా సామాజిక చట్రంలోకి ప్రవేశించలేకున్నాడు. ప్రతి గ్రామంలోనూ పశువుల, మనుషుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించే వారిని అంటరానివారిగా గుర్తిస్తుం టారు. ఇక రజకులు, క్షురకులను కూడా హీనంగా చూస్తుంటారు. దాదాపుగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాదిన ఇది కఠినంగా అమలవుతుంటే దక్షిణాదిలో కాస్త తక్కువ స్థాయిలో అమలవుతోంది. ఆర్ఎస్ఎస్/బీజేపీ ఉత్తరాదిన బలంగానూ, దక్షిణాదిలో బలహీనంగానూ ఉండటానికి ఇదే కారణం. గ్రామాల్లో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ ఉనికిలోకి రాకముందు చారిత్రకంగా చూస్తే, అన్ని వృత్తులను ఐక్యం చేసేది ఒక్క ఆలయం మాత్రమే. దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడన్న భావంతో గ్రామంలోని ఆలయం అన్ని కులవృత్తుల వారికి ఉమ్మడి స్థలంగా ఉండేది. భారతీయ గ్రామాలు చాలా విభిన్నమైనటువంటివి. ఆలయ పూజారి వారికి ఏం చెబుతాడన్నది ఊహించుకోండి మరి. మీ వృత్తిపరంగా ఉండే మీ విధులను నిర్వహించండి, అన్ని వృత్తులూ మన మనుగడ కోసం అవసరమైనట్టివే, మీరూ మీ వృత్తిపరమైన విధులూ దేవుడి రా>జ్యంలో సమానమైనవే. కానీ దీనికి భిన్నంగా గ్రామీణ పూజారి గ్రామస్థులకు ఏం చెబుతూ వచ్చాడో తెలుసా? అసమానత్వాన్ని, అంటరానితనాన్ని పాటించడం మీ పవిత్ర ధర్మం. ఎందుకంటే దేవుడు లేక దేవుళ్లు మిమ్మల్ని అసమానంగానే సృష్టించారు అనే. దేవుడి ప్రతినిధిగా భావించే వ్యక్తే గ్రామీణులకు ఇలా చెబుతూ వస్తే దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వం ఎలా వస్తుంది? ఉమ్మడి బోధనా స్థలంగా పాఠశాల గ్రామాల్లో ప్రవేశించడానికి ముందు ఆలయం ఒక ఉమ్మడి సామాజిక స్థలంగా ఉండాలి. గ్రామ దేవాలయానికి సమానత్వమే సూత్రమైతే, ఆ సమానత్వం గ్రామీణ జీవితంలో భాగమై ఉండాలి. అన్ని కులవృత్తుల ప్రజలూ పక్కపక్కనే కూర్చుని ఆహారాన్ని ఆరగించాలని గ్రామ దేవాలయం మొదటినుంచి ప్రబోధించి ఉంటే, గ్రామాల్లో అసమానత్వం అసలు ఉండేది కాదు. కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుం టారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలతో పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. అలాంటి వాతావరణంలో ఆర్టికల్ 15 వంటి సినిమా ఏదీ మనకు అవసరమై ఉండేది కాదు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్లో దొరుకుతుందని వెతుకుతున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఆలయం గురించి పేర్కొనలేదు. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. మన వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అర్చక కులం సిద్ధపడనంతవరకు కులాంతర వివాహాలు మన దేశంలో విజయవంతం కావు. అర్చకత్వం అనేది కుల వృత్తిగా కాకుండా వ్యక్తులు చేసే వృత్తిగా మారనంతవరకు మన వివాహ వ్యవస్థ మారదు. కుల సంబంధాలు మారవు. అప్పుడు మాత్రమే శ్రమను గౌరవించడం మన కుటుంబ సంస్కృతిలో సాధ్యపడుతుంది. ఈ ప్రాథమిక అంశాలను మనం సాధించి ఉంటే, ఇస్లామిక్ మసీదు మన గడ్డపైకి అడుగుపెట్టగలిగేదే కాదు. అలాగే క్రిస్టియన్ చర్చి కూడా భారతదేశంలోకి వచ్చేది కాదు. ముస్లిం ఆక్రమణదారులు కానీ, క్రిస్టియన్ వలసపాలకులు కానీ వచ్చి ఉన్నా, వారు భారత్‌లో ఇంతటి విజయాలు సాధించి ఉండేవారు కాదు. మరోమాటలో చెప్పాలంటే, ఆధునిక కాలంలో మన సమాజాలన్నింటిలోనూ మానవ సమానత్వానికి ఆధ్యాత్మికపరమైన ప్రజాస్వామ్య వ్యవస్థే నిజమైన పునాదిగా ఉంటోంది. మన దేశంలో అలాంటి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణ పండితులే ప్రతిపాదించి ఉండాలి. ఆధ్యాత్మిక సమానత్వ సూత్రాన్ని దేవుడు ప్రసాదించిన సూత్రంగా ఆలయం ఆచరించి ఉంటే మన దేశం మరో విభిన్న దశలో సాగి ఉండేది. సాధారణంగా మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాజకీయ సమానత్వం పట్లే చర్చలు సాగుతుంటాయి. కానీ గ్రామ స్థాయినుంచి మానవ సంబంధాలన్నింటినీ ఆధ్యాత్మిక సమాజమే పూర్తిగా నియంత్రిస్తున్నప్పుడు మన పౌర సమాజ పొరల్లోకి రాజకీయ సమానత్వాన్ని తీసుకురావడం ఎలా సాధ్యం? మానవ సమానతా సమాజాన్ని నిర్మించాలంటే ఇక్కడే ఆలయం, చర్చి, మసీదు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. పరిశుద్ధమైన శాకాహార తత్వమే జాతీయ ఆహా రంగా హిందుత్వ శక్తులు చాలాకాలంగా పేర్కొంటూ వస్తున్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం మాంసాహారులు ఎవ్వరు భారతీయులు కారు. అందుకే ఇప్పుడు శాకాహారులైన బ్రాహ్మణులు, వైశ్యులు, ఆరెస్సెస్ కంటే శూద్ర, దళిత, ఆదివాసీ మాంసాహారులను తక్కువజాతికింద పరిగణిస్తున్నారు. ఇప్పుడు అసమానత్వాన్ని నిర్మూలించడానికి బదులుగా అసమానత్వాన్ని పెంచి పోషించే అత్యంత శక్తివంతమైన నూతన శాకాహార కులంగా ఆరెస్సెస్ అవతరించింది. జాతీయవాదాన్ని ప్రజల ఆహార ఆర్థికవ్యవస్థకు అనుసంధానించడం తగదంటూ.. ఆరెస్సెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఏ శూద్రకులానికి చెందిన కార్యకర్త కూడా నొక్కి చెప్పలేరు. ఎందుకంటే రుగ్వేద కాలం నుంచి శూద్రులను బౌద్ధికంగా తక్కువస్థాయి కలిగినవారిగా గుర్తిస్తూ వస్తున్నారు. శాకాహారమే తమ ఆహారంగా ఉండినట్లయితే 5 వేల సంవత్సరాల క్రితమే హరప్పా వాసులు మన గొప్ప నాగరికతను నిర్మించి ఉండేవారు కాదని ఆరెస్సెస్‌కు అర్థం కావడం లేదు. వెయ్యి సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో శాకాహార ఉత్పత్తి జరిగి ఉండలేదు. ఆహారంతో సహా అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని రద్దు చేసిపడేశారు. హిందూ కుల అంతరాల వ్యవస్థకే కాదు. భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియానిటీకి కూడా ఇది పెద్ద సమస్యగానే ఉంటోంది. మన గ్రామాల్లో నేటికీ గుణాత్మకమైన మార్పు జరగలేదు. ఆలయం అదే కులధర్మంతో నడుస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీయువకులను చంపేయడాన్ని, గర్భగుడిలోకి ప్రవేశించిన దళితులపై దాడి చేయడాన్ని అది ఆమోదిస్తోంది. హిందూ దేవుళ్ల కంటే ఓటుహక్కే దళితులను కాపాడుతోంది. పూజారి వైఖరి మాత్రం కులధర్మాన్ని ఆచరిస్తూనే సాగుతోంది. ఇదే అన్ని అసమానతలకు తల్లివంటిది. మనం ఆలయాన్ని మార్చలేనట్లయితే, ప్రతి పాఠశాలలో ఉదయం ఇలా ప్రార్థన చేయవలసిందిగా మన విద్యార్థులను కోరదాం. ఆలయ దేవుడు సమానత్వం తేనట్లయితే, పాఠశాల దేవుడు దేశంలో సమానత్వాన్ని తెచ్చేలా చేద్దాం. దేవుడా మమ్మల్ని సమానులుగా సృష్టించావు దేవుడా స్త్రీపురుషులను సమానులుగా సృష్టించావు దేవుడా మాలో కులాలు లేకుండా సృష్టించావు దేవుడా మామధ్య అంటరానితనం లేకుండా చేశావు దేవుడా పనిచేసి జీవించమని మా అందరికీ చెప్పావు దేవుడా మా తల్లిదండ్రులను గౌరవించమని చెప్పావు దేవుడా గర్విస్తున్న భారతీయులుగా మేం నిన్ను ప్రార్థిస్తున్నాం దేవుడా భారతీయులందరినీ సమానులుగా సృష్టించావు వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
2047లో ఊపిరి ఆడదా?
స్వాతంత్య్రం వచ్చిన వందేళ్లకు..ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా .మానవహక్కుల పరిరక్షణలో నంబర్‌వన్‌గా..భావప్రకటనకు తలమానికంగా.. స్త్రీ, పురుష సమానత్వంలోముందంజగా ఉంటుందని మన విశ్వాసం! కాని ఒక సమాజంగా మనం వెనకబడిపోతున్నామని.. శీలమనే గోడల మధ్య బందీ అవుతామని.. స్వేచ్ఛకు ఊపిరాడదనీ.. ఇలాంటి భావవ్యక్తీకరణల్లో ఈ కథనం ముందంజలో ఉంది. 2047... ఆర్యావర్త ప్రాంతం... మిలిటరీ తరహా ప్రభుత్వ పాలన.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న దేశం. అలాంటి సహజ వనరులను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా హిందూ దేశంగా.. ఆర్యావర్తగా మార్చే ప్రయత్నం మొదలై.. అది కొంత సఫలమై అప్పటికి మూడేళ్లు. హిందువుల్లో కూడా మళ్లీ కుల విభజన, వర్గ విభజన ఆ పాలన నైజం. అందుకే ఎటు చూసినా సెక్టార్లు.. హద్దులుగా పెద్ద పెద్ద గోడలు. అగ్ర కులాలు.. అందునా ఉన్నత ఉద్యోగులకు.. ఒక సెక్టార్.. నిమ్న కులాలు.. వర్కింగ్ క్లాస్‌కు ఇంకో సెక్టార్.. దళితులకు ఆ హద్దులన్నిటికీ ఆవల.. స్లమ్స్‌లో నివాసం. ఈ ఆర్యావర్త ప్రభుత్వం వాళ్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూంటుంది. చాలా పరిమితంగా. ఒకరకంగా చెప్పాలంటే వెలివాడలవి. ... అందునా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న మహిళలైతే బానిసలు. అలా పెళ్లిళ్లు చేసుకున్న, తమ హక్కుల కోసం గొంతెత్తిన ఆడవాళ్లను వెదికి మరీ పట్టుకొచ్చి ‘‘వనితా విముక్తి కేంద్రం’’లో పెడ్తారు. ఆ ఆడవాళ్లు తమ పవిత్రతను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ జవాన్ల బూట్లు తుడవాలి. ఉన్నతులైన పురుషులు తిన్న ఎంగిలి విస్తళ్లల్లో పొర్లుదండాలు పెట్టాలి. తొట్టిలోని మురికి నీటిలో స్నానం చేయాలి. ఆ మానసిక హింస గాయపెట్టకుండా పూట పూటకు స్టెరాయిడ్స్లాంటి మాత్రలు వేసుకోవాలి. ఇవన్నీ మౌనంగా సహిస్తూ.. క్రమశిక్షణ పాటిస్తున్న వాళ్లను పవిత్రతను నిరూపించుకునే పరీక్షకు ఎంపిక చేస్తారు. అలా నిరూపించుకున్న వాళ్లను విముక్తులను చేసి బయటకు అంటే వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు పంపిచేస్తారు. ఫెయిలైన వాళ్లను లేబర్ క్యాంప్‌కు తరలిస్తారు. పిల్లలు.. ఆర్యావర్త సంస్కృతీ, సంప్రదాయాలకు సార«థులు.. వారధులు. కులాంతర, మతాంతర వివాహాల వల్ల పుట్టిన పిల్లలను సంకరజాతిగా పరిగణించి.. ‘‘ప్రాజెక్ట్ బలీ’’ అనే ఆర్యావర్త ప్రభుత్వ కార్యక్రమం కోసం ఉపయోగిస్తుంటారు. తిరోగమనమా? పురోగమనమా? అనిపిస్తోంది కదా! ఇప్పటి కొన్ని పరిస్థితులకూ అద్దం పడ్తోందన్న మాటా వినిపిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘లేలా’ అనే వెబ్‌సిరీస్ కథ. ప్రయాగ్ అక్బర్ (బీజేపీ మాజీ మంత్రి, లైంగిక వేధింపుల ఆరోపణలున్న ఎమ్జె అక్బర్ కొడుకు) రాసిన నవలను అదే పేరుతో తెరకెక్కించారు ప్రముఖ సినీ దర్శకురాలు దీపా మెహతా. లేలా... షాలిని (హుమా ఖురేషి)... బాగా చదువుకున్న, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న ఒక హిందూ స్త్రీ. రిజ్వాన్ చౌదురి(రాహుల్ ఖన్నా) అనే ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. వాళ్లకు పుట్టిన బిడ్డే లేలా. ఆ బిడ్డ కోసం షాలినీ అన్వేషణే ఈ సిరీస్. మంచి ఉద్యోగాలు చేస్తూ.. ఏ లోటూ లేకుండా ప్రశాంతంగా... కూతురే లోకంగా బతుకుతూంటారు షాలినీ, రిజ్వాన్‌లు. అప్పటికే ఆర్యావర్త ప్రభుత్వం ఏర్పడి యేడాది అవుతుంది. ఒకరోజు.. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో షాలిని, రిజ్వాన్‌లు తమ కూతురు లేలాకు ఈత నేర్పిస్తుంటే దుండగులు జొరబడి రిజ్వాన్ తల బాది.. షాలినీని ఎత్తుకుపోతారు. ఈ హఠాత్పరిణామానికి బిక్కచచ్చిపోతుంది నాలుగేళ్ల లేలా. స్విమ్మింగ్ పూల్‌లో రిజ్వాన్ అచేతనమైపోతాడు. రెండేళ్లు.. షాలినీని వనితా విముక్తి కేంద్రంలో పెడ్తారు. అన్నీ సహిస్తూనే అక్కడి నుంచి పారిపోవడానికి దారి వెదుకుతూంటుంది ఆమె. అంతలోకే కులాంత వివాహం చేసుకుందని ఇంకో అమ్మాయినీ తీసుకొస్తారు అక్కడికి. వీళ్లతోపాటు ఒక లేడీ డాక్టర్, ఆస్తి హక్కు కోసం తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన మహిళ.. కులాంతర వివాహం చేసుకొని చంటిబిడ్డలతో సహా పట్టుకొచ్చిన తల్లులూ ఉంటారు ఆ కేంద్రంలో. వీలైనంత త్వరగా ప్యూరిటీ టెస్ట్ పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న ఒక మహిళ.. ఆ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న గురు మా (పురుషుడే)కు ఇన్ఫార్మర్గా మారుతుంది. ఈ క్రమంలో ఆ కేంద్రంలోని చంటి పిల్లల ప్యూరిటీ టెస్ట్ కోసం ఓ వైద్యబృందం వస్తుంది. ఒక బిడ్డ రక్తనమూనాల్లో తల్లితోపాటు తక్కువ కులంలోని తండ్రి రక్తమూ ఉందని ఆ పసికందును తీసుకెళ్లిపోతారు. ఆ పాప ప్రక్షాళన కోసం ఆమెకు కుక్కతో పెళ్లి జరిపిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది సద్దుమణిగేలోపే కులాంతర వివాహం చేసుకున్న ఆ కొత్త బందీ ప్రెగ్నెంట్ అని తేలుతుంది. గురుమాకు తెలిసి అబార్షన్ చేయమని లేడీ డాక్టర్‌కు ఆర్డర్ వేస్తాడు. చేశానని చెప్తుంది కాని డాక్టర్.. అబార్షన్ చేయదు. దీన్ని ఆ ఇన్ఫార్మర్ పసిగట్టి.. గురుమాకు చెప్పబోతుంటే ఆమెను బాత్రూమ్లో బంధించి ఆ అవకాశాన్ని తాను ఉపయోగించుకుని ప్యూరిటీ టెస్ట్‌తో బయట పడాలనుకుంటుంది షాలిని. వెళ్లి గురుమాకు చెప్తుంది ఆ కొత్తమ్మాయికి అబార్షన్ జరగలేదు అని. నిజం చెప్పి షాలిని.. ఆర్యావర్తకు అభిమాన పాత్రురాలైందని.. తెల్లవారే ఆమె ప్యూరిటీ టెస్ట్‌కు ఏర్పాట్లు చేస్తాడు గురుమా. ఆ టెస్ట్‌లో లేడీ డాక్టర్‌ను, ఆ కొత్త బందీని రెండు వేర్వేరు సెల్స్‌లో పెడ్తారు. షాలినికి ఒక డివైజ్ ఇచ్చి... బటన్ నొక్కమని చెప్తాడు గురుమా. ఆ బటన్ నొక్కితే ఆ ఇద్దరూ ఉన్న సెల్స్‌లోకి గ్యాస్ విడుదలై వాళ్ల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. షాలిని విముక్తురాలై బయటకు వెళ్లిపోతుంది. షాలిని.. ఆ పని చేయదు. దాంతో ఆ ఇన్ఫార్మర్ను పిలిపిస్తాడు గురుమా. ఈ చాన్స్ కోసమే ఎదురు చూస్తున్న ఆ మహిళ.. వెంటనే బటన్ నొక్కుతుంది. గ్యాస్ విడుదలై ఆ ఇద్దరూ చచ్చిపోతారు. రెండేళ్లు అందులో మగ్గిన షాలినీని.. ప్యూరిటీ టెస్ట్ ఫెయిలయిందని లేబర్ క్యాంప్‌కు పంపిస్తారు. ప్యూరిటీ టెస్ట్ పాసైనా ఆ ఇన్ఫార్మర్ను వనితా విముక్తి కేంద్రంలోనే ఉంచుతారు. ఆమెను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు రాలేదని. బయటకు వెళితే స్త్రీకి రక్షణ ఉండదని. లేబర్ క్యాంప్ విముక్తి కేంద్రం నుంచి లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్తున్నప్పుడే తప్పించుకుని తన కూతురి కోసం రిజ్వాన్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది షాలిని. కూతురు అక్కడ ఉండకపోగా షాలిని మరిది.. ఆమె మీద విరుచుకుపడ్తాడు. ‘‘నువ్వు మా అన్నను పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది’’ అంటూ. విస్తుపోతుంది అతని ప్రవర్తనకు. ఈలోపు లేబర్ క్యాంప్ గార్డ్ భాను (సిద్దార్థ) ఈ ఇంటికి వచ్చి షాలినీని తీసుకొని వెళ్లిపోతాడు. లేబర్ క్యాంప్ ద్వారా ఆమెకు ఒక ఇంజనీర్ ఇంట్లో సర్వెంట్ ఉద్యోగం దొరుకుతుంది. నగరానికి ఎయిర్ కండిషన్ డోమ్స్‌ను ఏర్పాటు చేయడానికి ఆ ఎన్ఆర్ఐ ఇంజనీర్‌ను అమెరికా నుంచి రప్పిస్తుంది ప్రభుత్వం. ఆ ఏసీ డోమ్స్ వల్ల విపరీతమైన వేడి పుట్టి.. రేడియేషన్‌కు చుట్టుపక్కల ఉన్న స్లమ్స్ అన్నీ మాడి మసైపోతాయని.. ఇది ఒకరకమైన మారణహోమం అని.. దాన్ని ఎలాగైనా ఆపాలని.. ఆర్యావర్త సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న విప్లవకారులను కోరుతాడు ఆ ఇంజనీర్. వాళ్లతో రహస్య సంబంధాలు పెట్టుకుంటాడు. వాళ్లలో ఒకడే భాను. ఆర్యావర్త ప్రణాళికలను తెలుసుకోవడానికి లేబర్ క్యాంప్ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఆ నిజం షాలినీకి తెలుస్తుంది. సహకరిస్తే.. ఆమె కూతురును వెదకడంలో సహాయం చేస్తానంటాడు భాను. అసలామె వనితా విముక్తి కేంద్రానికి రావడానికి.. ఆ సిబ్బందికి ఉప్పందించింది ఆమె మరిదేననే సీక్రెట్ కూడా చెప్తాడు. హతాశురాలవుతుంది షాలిని. ఇంకోవైపు ఎయిర్‌కండిషన్ డోమ్స్‌ను తయారు చేస్తున్న ఇంజనీర్ మీద అనుమానం వచ్చి అతని కుటుంబాన్నీ చంపేయిస్తుంది ఆర్యావర్త ప్రభుత్వం. ఎలాగైనా ఆ మారణహోమాన్ని ఆపాలని.. ఆ ప్లాన్ వివరాలు ఆర్యావర్త ప్రభుత్వాధినేత జోషి తర్వాత వ్యక్తి అయిన రావు ఆఫీస్‌లో ఉంటాయని.. అది తమకు అందివ్వాలని చెప్తాడు భాను. అందుకు ఆమెను రావు ఇంట్లో సర్వెంట్‌గా చేరుస్తాడు. రావుగారింట్లో.. ఆర్యావర్త ప్రభుత్వం బ్యాన్చేసిన పాకిస్తానీ కవి, రచయిత.. ఫైజ్ అహ్మద్ఫైజ్కు వీరాభిమాని.. రావు. రహస్యంగా ఫైజ్ పాటలను వింటూంటాడు. ఈ బలహీనతను అడ్డం పెట్టుకుని భాను అడిగిన వివరాలను లాగొచ్చని అనుకుంటుంది షాలినీ. శ్రద్ధగా పనిచేస్తూ.. అతని అనుంగు సేవకులలో ఒకరిగా చేరుతుంది. చాటుగా ఫైజ్ పాటలను తెచ్చిస్తూ అతని నమ్మకాన్ని సంపాదిస్తుంది. ఆ చనువుతో ఆమె గతాన్ని తెలుసుకుంటాడు అతను. కూతురు లేలీ గురించీ చెప్పేస్తుంది. జాలిపడ్తాడు రావు. ఆర్యావర్త పట్ల తనకున్న అసమ్మతినీ వెళ్లగక్కుతాడు. ఈ చాన్స్‌ను ఉపయోగించుకుందామని షాలినీ ప్లాన్ చేసుకునే లోపే.. షాలినీకున్న కూతురి బలహీనతను తన రాజకీయ ఎత్తుగడకు వాడుకుందామనుకుంటాడు. కూతురి ఆచూకీ పట్ల ఉన్న తన ఆరాటాన్ని, తపనను.. అటు విప్లవకారులు.. ఇటు రాజకీయ నేతలు పావుగా మలచుకుంటున్న తీరుకు కుమిలిపోతుంది షాలిని. కాని తప్పదు.. బిడ్డ ముఖ్యం అని మనసును స్థిరం చేసుకుంటుంది. ఈ వేటలో లేలా ఎక్కడో కాదు.. ఇంతకు ముందు తనకు సర్వెంట్‌గా పనిచేసిన అమ్మాయి ఇంట్లోనే ఉందని తెలుస్తుంది. ఆ సర్వెంట్ కుటుంబం ఇప్పుడు బాగా సంపన్న కుటుంబంగా మారిపోతుంది. తన కూతురి పేరు విజయా యాదవ్‌గా మార్చేస్తుందా సర్వెంట్. ఆమె భర్త జోషీకి పీఏగా ఉంటూంటాడు. రావు ఇంట్లోని ఆఫీస్‌కు వస్తూంటాడు. ఒకసారి రాత్రి పూట.. రావు ఆఫీస్‌లో ఎయిర్ కండీషన్స్ డోమ్స్ ఆపరేషన్ ఫైల్స్‌ను ఫోటో తీస్తుంటే చూస్తాడు. కూతురిని మరచిపోతే కాపాడ్తానని, లేదంటే జైలే అని బెదిరిస్తాడు. సరే అన్నట్టుగా తలూపుతుంది షాలినీ. భానుకి అన్నీ చెప్తుంది. త్వరలోనే షాలిని కూతురు చదువుతున్న స్కూల్లో ఫంక్షన్ ఉంటుంది. అక్కడ గ్యాస్ బాంబ్‌ను ప్రయోగించమని ఆ బాంబ్‌ను షాలినీకిస్తాడు భాను. తను క్రిమినల్‌ను కాదని.. అలాంటివి చేయలేనంటుంది. కూతురు కావాలంటే తప్పదు అని హెచ్చరిస్తాడు. బాంబ్ తీసుకొని ఫంక్షన్‌కు వెళ్తుంది. దానికి ఆర్యావర్త అధినేత జోషీ వస్తాడు. అతనిని సన్మానించే వాళ్ల జాబితాలో ఆమె పేరూ పెడ్తాడు రావు. సన్మానం పేరుతో జోషీ దగ్గరకు వెళ్లిన షాలినీ తన చేతిలోని బాంబును చూపించి అతణ్ణి బెదిరిస్తుంది. పోలీసులు వస్తారు. అక్కడితో ఫస్ట్ సీజన్ ఎండ్! -
ప్రేమ బంధానికి కులం కాటు
వారిద్దరి కులాలు వేరు.. ఒకరినొకరు మనసుపడ్డారు..కొన్నాళ్లపాటు కలిసి తిరిగారు.. నీకు నేను..నువ్వు నాకు.. ఒకరికిఒకరం ఇద్దరం.. కడదాకా కలిసే బతుకుదామంటూ బాసలు చేసుకున్నారు. పెళ్లితో ఒక్కటవుదాతామని పెద్దల నిర్ణయం కోరారు. కులాంతర వివాహమని అందుకు అబ్బాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. వీడిపోయి ఉండలేం..తమనెవరూ వేరుచేయలేరు..కలిసే చివరిదాకా ఉంటాం..పెళ్లితో ఒక్కటవుదాం అంటూ మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ఓ వైపు కాపురం సాఫీగా సాగిపోతుంటే.. మరో వైపు కులచిచ్చు రగిలిపోయింది. ఇద్దరి మధ్య కలహాలు రానే వచ్చాయి.. అమ్మాయిని అడ్డు తొలగించుకుని తల్లిదండ్రుల చెంతకు చేరాలని అబ్బాయితలిచాడు. అనుకున్నదే తడవు అవకాశం కోసం ఎదురుచూస్తుంటే యాదృచ్ఛికంగా రోడ్డు ప్రమాదాన్ని అవకాశంగా మలుచుకొని భార్యను కడతేర్చిన ఘటన కూడేరు మండలం కమ్మూరు వద్ద చోటుచేసుకుంది. అనంతపురం, కూడేరు: కుల రక్కసి కాటుకు వివాహిత బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కులంపై పట్టింపునకు పోయిన భర్తే భార్య పాలిట కాలయముడిగా మారాడు. మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన గంగరత్నమ్మ, శివారెడ్డి దంపతుల కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి, అనంతపురం నగరంలోని సుశీల్‌రెడ్డి కాలనీకి చెందిన ప్రభుదాస్ కుమార్తె సరోజ (25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సరోజది ఎస్సీ సామాజిక వర్గం కావడంతో జగదీశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు దగ్గరకు తీసుకోలేదు. సరోజ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఆమోదం తెలపడంతో వారి ఇంటికి రాకపోకలు కొనసాగించేవారు. జగదీశ్వర్‌రెడ్డి ఓ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో తమ సంసార జీవితానికి భార్య కులం అడ్డు వచ్చింది. నెమ్మదిగా కలహాలు మొదలయ్యాయి. మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ నబిరసూల్ హత్యకు కుట్ర పన్నిందిలా.. సరోజకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో కూడేరులో నాటు వైద్యం కోసం శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనంలో దంపతులిద్దరూ బయల్దేరారు. కమ్మూరు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా లారీ వెళ్లడంతో బిత్తరపోయి బైక్‌ను పక్కకు తిప్పే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన కిందపడ్డారు. అప్పుడే జగదీశ్వర్‌రెడ్డిలో ఆలోచన వచ్చింది. తక్కువ కులం అమ్మాయిని చేసుకున్నానన్న మానసిక క్షోభ నుంచి బయటపడాలంటే భార్యను కడతేర్చాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సమీపంలోని బండరాయిని తీసుకొని భార్య తలపై మోది హతమార్చాడు. అనంతరం తను అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరాడు. రోడ్డు ప్రమాదంలో సరోజ మృతి చెందినట్లు స్నేహితులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది ప్రమాదం కాదని, అల్లుడే హతమార్చాడని సరోజ తండ్రి ప్రభుదాస్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నబీరసూల్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురానికి తరలించారు. ఎస్ఐ తనదైన శైలిలో జగదీశ్వర్‌రెడ్డిని విచారించగా కుటుంబ కలహాల నేపథ్యంలో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. -
కులం పేరెత్తితే తంతాను : కేంద్ర మంత్రి
ముంబై : సంచలన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కేంద్ర మంత్రి నితిన్ గడ్కిరి మరోసారి వార్తల్లో నిలిచారు. తన ముందు ఎవరైన కులం పేరెత్తితే తంతానంటున్నారు నితిన్ గడ్కరి. ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరైన నితిన్ గడ్కరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘మేము కులాన్ని పట్టించుకోం. మీ ప్రాంతంలో ఎన్ని కులాలున్నాయో నాకు తెలీదు. కానీ మా దగ్గర మాత్రం కులాల ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవరైనా కులం గురించి మాట్లాడితే నా చేతిలో చావు దెబ్బలు తింటార’ని చెప్పుకొచ్చారు. అంతేకాక కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నితిన్ గడ్కరి పిలుపునిచ్చారు. సమాజంలో పేద, ధనిక తారతమ్యాలను తొలగించాలని తెలిపారు. ఒకరిది ఎక్కువ కులం.. మరొకరిది తక్కువ కులం అనే భేదం తొలగిపోవాలని కోరుకున్నారు. పేదలు, అణకువతో ఉండేవారు దేవునితో సమానమన్నారు. పేదలకు సేవ చేయడం అంటే దైవాన్ని పూజిండమేనని చెప్పుకొచ్చారు. పేదలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ కల్పించడం అందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. -
ఓటేయలేదు కాబట్టి.. కాళ్లు పట్టుకోవాలని హుకుం
గొల్లపల్లి (ధర్మపురి): తనకు ఓటేయలేదని పంచాయితీ పెట్టించి.. చివరకు ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించిన సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం ప్రకారం.. లొత్తునూర్ గ్రామం ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. మూడో విడత నిర్వహించిన ఎన్నికల్లో ఆ గ్రామం నుంచి ఏడుగురు బరిలో నిలిచారు. వీరిలో ఇద్దరు ఎస్సీ మాదిగవర్గానికి చెందినవారు కాగా.. మరో ఐదుగురు మాలవర్గానికి చెందినవారు. ఈ ఎన్నికల్లో మాల కులానికి చెందిన మహేశ్వరి విజయం సాధించింది. గ్రామానికి చెందిన దొనకొండ తిరుపతి (మాదిగ) కుటుంబం తనకు ఓటేయలేదని ఓడిపోయిన అభ్యర్థి ఓరుగంటి శాంత (మాదిగ) కక్ష పెంచుకుంది. తమ కులాన్ని కాదని.. ఇతర కులానికి చెందిన వ్యక్తికి ఓటేశారని ఆమె భర్త పోశయ్య.. తిరుపతిని వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఈనెల 4న కులసంఘంలో పంచాయితీ పెట్టించాడు. అందులో సంఘంలో తిరుపతి పొదుపు చేసుకున్న రూ.3 వేలు తిరిగి ఇచ్చి తెగదెంపులు చేయించాడు. కులంతోపాటు.. కులసంఘంతోనూ సంబంధంలేదని, ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడొద్దంటూ సంఘం నుంచి బహిష్కరించారు. చేసిన తప్పు ఒప్పుకుని కులంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. కాళ్లు మొక్కి క్షమాపణ అడిగితేనే తిరిగి చేర్చుకుంటామని హెచ్చరించారు. ఐదు రోజులుగా తిరుపతి కుటుంబంతో ఎవరూ మాట్లాడకపోవడంతో అతడి భార్య లక్ష్మీ, కుమారుడు రాజమల్లు, కూతురు అఖిల కుమిలిపోతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించాలో తెలియక సతమతమవుతున్నాడు. అడ్డు చెప్పని పంచాయతీ పెద్దలు గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 150 కుటుంబాలు ఉన్నాయి. ఓటు వేయనందుకు తన కుటుంబాన్ని వెలి వేయడమేమిటని ప్రశ్నించిన తిరుపతికి అండగా నిలవాల్సిన కులపెద్దలెవరూ పట్టించుకోలేదు. పైగా పంచాయితీ పెట్టించిన శాంత భర్త పోశయ్యకే మద్దతు పలకడంపై తిరుపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి ఓటు నచ్చిన వ్యక్తికి వేసుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ.. బెదిరించి మరీ.. తనకు ఓటు వేయలేదంటూ పంచాయితీ పెట్టించి తన పరువు తీసిన శాంత భర్త పోశయ్యపై చర్యలు తీసుకోవాలని తిరుపతి వేడుకుంటున్నాడు. -
‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం’
జైపూర్ : రాజస్తాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా పూర్తికాలేదు. కానీ ఈ లోపే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు ప్రారంభించారు మంత్రులు. రాజస్తాన్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తోన్న మమతా భూపేష్ ‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం.. మిగతావన్ని తర్వత’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్వార్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నా సామాజిక వర్గ ప్రజల అభివృద్ధే నా ప్రథమ బాధ్యత. ముందు నా కులం ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తా.. ఆ తరువాతే మిగతా వారి గురించి పని చేస్తా’ అంటూ ప్రసంగించారు. మమతా చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. -
హనుమాన్ జాట్ కులస్తుడే: యూపీ మంత్రి
లక్నో: ఆంజనేయుడు తమ జాట్ కులస్తుడేనని ఉత్తరప్రదేశ్ మత వ్యవహారాల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘శ్రీరాముడి అర్ధాంగి సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లాడు. హనుమంతుడు వెళ్లి లంకాదహనం చేశాడు. శ్రీరాముడికి అపకారం తలపెట్టింది రావణుడు. అసలు సీతారాములు ఎవరో, రావణుడు ఎవరో హనుమంతుడికి తెలియదు. కానీ, ఆయన అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాడు. ఇదే జాట్ల వ్యక్తిత్వం. అన్యాయం ఎక్కడ, ఎవరికి జరిగినా జాట్లు సహించలేరు’ అంటూ తన వాదనను సమర్థించుకున్నారు. -
కులానికో సెక్షన్!
లాల్గంజ్: దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు.. పాఠశాల గది గోడల మధ్య నిర్ణయించబడుతుందంటారు. రేపటి మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటామో.. అందుకు అనుగుణంగా ఈ రోజే పాఠశాలలను తీర్చిదిద్దుకోవాలి. కులం, మతం, జాతి, ప్రాంతం.. ఈ భేదాలేవీ లేకుండా తరగతి గదిలో అందరూ సమానులేననే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఇది పాఠశాల బాధ్యత. కానీ ఇందుకు విరుద్ధంగా బిహార్‌లోని ఓ పాఠశాల మాత్రం ఇప్పటి నుంచే విద్యార్థుల్లో కులం, మతం, జాతి భేదాలను పెంపొందిస్తోంది. తరగతి గదిలోని విద్యార్థులను కులాల వారీగా, మతాల వారీగా విభజించి కూర్చోబెడుతోంది. ఒక్కో మతానికి ఒక్కో సెక్షన్ ఏర్పాటు చేసి, పాఠశాలను నిర్వహిస్తోంది. ఇదంతా చేస్తోంది ఏదో ఓ ప్రైవేటు పాఠశాల అనుకుంటే పొరపాటే. వైశాలి జిల్లా, లాల్గంజ్లోని ప్రభుత్వ పాఠశాల. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యామంత్రి కృపానందన్ ప్రసాద్‌వర్మ కూడా అంగీకరించారు. ‘నిజమే.. ఆ పాఠశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులకు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయ’న్నారు. ఆ పాఠాశాలపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ఇక తరగతిలోనూ బీసీలు, ఎస్సీలను వేర్వేరుగా కూర్చోబెడుతున్నారని, రిజిస్టర్లు కూడా వేర్వేరుగా పెట్టినట్లు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని లాల్గంజ్ విద్యాధికారి అరవింద్‌కుమార్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దురదృష్టకరం, తప్పుడు విధానమని అన్నారు. -
కులగోత్రాలు వెల్లడించిన రాహుల్
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్‌లోని పుష్కర్ బ్రహ్మ ఆలయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుడిగా చెబుతున్న రాహుల్ గాంధీ తన గోత్రం ఏమిటో వెల్లడించాలని బీజేపీ కోరుతున్న క్రమంలో కాంగ్రెస్ చీఫ్ నుంచి ఆ వివరాలు వెల్లడయ్యాయి. బ్రహ్మ ఆలయంలో పూజల సందర్భంగా గోత్రం గురించి పూజారి అడిగిన మీదట తన గోత్రం దత్తాత్రేయ అని, తాను కౌల్ బ్రాహ్మణుడినని రాహుల్ బదులిచ్చారు. పూజలో భాగంగా గాంధీ కుటుంబానికి చెందిన తన పూర్వీకుల వివరాలనూ ఆయన వెల్లడించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో రాహుల్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించిన సందర్భంలో రాహుల్ కులగోత్రాలపై బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా ప్రశ్నించారు. రాహుల్ జంధ్యం ధరిస్తే అది ఎలాంటిదో చెప్పాలని, ఆయన గోత్రం ఏంటో వెల్లడించాలని కోరారు. ఇక బ్రహ్మ ఆలయంను సందర్శించే ముందు రాహుల్ సోమవారం ఉదయం అజ్మేర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో జియారత్ నిర్వహించారు. రాహుల్ వెంట రాజస్ధాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
సం‘కుల’ సమరం.. ఎవరిదో విజయం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రతిపాదికన ఓట్ల సమరం సాగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కులం కార్డును బలంగా వాడుకుంటున్నాయి. ఒక కులానికి చెందిన వారిపై అదే కులానికి చెందిన వారికి పోటీ దించాయి ప్రధాన పార్టీలు. దాదాపు 31 నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 7న ఎన్నికలకు జాట్ సామాజిక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ 33 సీట్ల చొప్పున కేటాయించాయి. బీజేపీ 26, కాంగ్రెస్15 స్థానాల్లో రాజ్‌పుత్‌లను పోటీకి దించాయి. ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం 60 సీట్లుపైగా దక్కాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వెనుక బడిన కులాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, అధికార బీజేపీ కేవలం ఒఏ ఒక్క టికెట్ కేటాయించింది. 15 నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన వారినే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోటీకి నిలిపాయి. బ్రాహ్మణులు ఏడు చోట్ల, రాజ్‌పుత్‌లు నాలుగు స్థానాల్లో, గుజ్జర్లు, యాదవులు రెండు చోట్ల ముఖాముఖి తలపడుతున్నారు. రాజస్థాన్‌లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించేప్పుడు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కులాన్ని దృష్టిలో పెట్టుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రాజ్‌పుత్‌ల మద్దతుతో బీజేపీ ముందుకు సాగుతోందని, ఈసారి పరిస్థితి మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు లాభించనుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.05 శాతం, కాంగ్రెస్‌కు 33.7 శాతం ఓట్లు వచ్చాయి. 2008 శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ 34.27 శాతం, హస్తం పార్టీ 36.82 శాతం ఓట్లు దక్కించుకున్నాట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి సం‘కుల’ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో డిసెంబర్ 11న తేలనుంది. -
పగలు నైటీ ధరిస్తే ఫైన్!
నిడమర్రు: కొల్లేటి గ్రామాల్లో న్యాయ పరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన వారంతా వారి తీర్పునకు కట్టుబడి ఉంటారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారం ఇది.. అయితే మహిళలు నైటీలు వేసుకునే విషయంలోనూ వారు ఆంక్షలు పెట్టడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలోని పెద్దలు.. మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వస్తే రూ.2 వేలు జరిమానా అంటూ దండోరా వేయించారు. రాత్రి పూట మాత్రమే వాటిని ధరించాలని షరతు పెట్టారు. పగటి పూట నైటీలు ధరించిన మహిళలను చూపినవారికి రూ.1,000 నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. గ్రామ బహిష్కరణకు సైతం వెనుకాడేదిలేదని కుల పెద్దలు హెచ్చరించారు. గడిచిన ఆరు నెలలుగా గ్రామంలోని సామాజిక భవనం మైక్ ద్వారా దండోరా వేయిస్తున్నట్లు గ్రామస్తులు చెపుతున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయం మంచిదే.., ఇదేం నిర్ణయం! మహిళలు నైటీలతోనే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు, మార్కెట్లకు వచ్చేస్తున్నారని.. పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని కొందరు సమర్థిస్తున్నారు. మహిళల దుస్తుల విషయంలో గ్రామ పెద్దల ఆంక్షలేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పగటిపూట నైటీ వేసుకుని పొరపాటున బయటికొస్తే.. పెద్దల మాటను ధిక్కరించినట్లా? దానికే గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారా? అని మండిపడుతున్నారు.. వారి మనోభావాలను బయటపెడితే గ్రామ పెద్దలను ఎదిరించినట్లవుతుందని సర్దుకుపోతున్నట్లు తెలుస్తోంది. కుల పెద్దల నిర్ణయమే ఫైనల్ తోకలపల్లి గ్రామంలో న్యాయవ్యవస్థ గ్రామ కమ్యునిటీహాల్ వద్దే ఉంటుంది. గ్రామంలో వడ్డీల కులపెద్దల నిర్ణయమే ఫైనల్. వారే న్యాయమూర్తులు. వడ్డీలంతా ఏకమై ఏటా 9 మంది కులపెద్దలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఒక్కసారి పెద్దగా ఎన్నికయ్యాక తిరిగి పదేళ్ల వరకూ తీర్పులిచ్చే పీఠం ఎక్కే అవకాశం ఉండదు. ఎన్నికైన నాటి నుంచి ఏడాది వరకూ వారు ఆ పదవిలో ఉంటారు. గ్రామంలో ఏదైనా సమస్య వస్తే.. దానిపై కుల పెద్దలు ఇచ్చిన తీర్పును ఆచరించాల్సిందే. నచ్చినా.. నచ్చకపోయినా.. తీర్పును శిరసావహించాల్సిందే. మహిళల నైటీ విషయంలో గ్రామ పెద్దలు తీసుకున్న ఆంక్షలు మింగుడుపడని పలువురు మహిళలు.. పెద్దల ఆంక్షలను తొలగించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణ మహిళలు నైటీలు ధరించడంపై ఆరు నెలలుగా బహిరంగంగా మైక్‌లో ప్రచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామ కట్టుబాట్ల విషయంలో వారిని కాదని ఎవ్వరూ ఏ విధమైన ఫిర్యాదు చెయ్యకపోవడం వల్లే తమకు తెలియదని అధికారులంటున్నారు. గురువారం నైటీలపై ఆంక్షల సమాచారం అందుకున్న తాహసీల్దార్ ఎం.సుందర్రాజు, ఎస్ఐ ఎం.విజయ్‌కుమార్ గ్రామంలో ఇంటింటికీ తిరిగి విచారణ జరిపి వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. గ్రామ కట్టుబాటును గౌరవిస్తాం.. గ్రామ పెద్దల మాటకు కట్టుబడి ఉంటాం. పగటి పూట మహిళలు నైటీలు ధరించి తిరడం వల్ల మిగిలిన మహిళలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆరు నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నైటీ వేసుకుంటే గ్రామ బహిష్కరణ అనేది అబద్ధం. – గణసల మహాలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ మైక్‌లో దండోరా వేయించారు పగటిపూట గ్రామంలోని మహిళలు నైటీలు ధరించవద్దని.. జరిమానా విధిస్తామని గ్రామ పెద్దల నిర్ణయంగా మైక్‌లో దండోరా వేయించి హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారు గ్రామ పెద్దల నిర్ణయానికి మద్దతిస్తున్నారు. – జి.జ్యోతి, తోకలపల్లి మా కులం కట్టుబాట్లు గౌరవించాలి మహిళలు పగటిపూట నైటీలు ధరించొద్దని కుల పెద్దలు తీర్మానించడం వాస్తవమే. నా చిన్నప్పటి నుంచి మా కుల పెద్దల నిర్ణయం మేరకు నడుచుకుంటున్నాం. గ్రామానికి సంబంధించి సమస్యలుంటే.. గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటాం. లేని పక్షంలో న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తాం. – గణసల ఆదినారాయణ, గ్రామపెద్ద, తోకలపల్లి మహిళల కోరిక మేరకే నైటీలు రాత్రి వేళలోనే ధరించేలా గ్రామంలోని అందరూ కట్టుబడి ఉండేలా నిర్ణయం తీసుకోవాలని పలువురు మహిళలు కోరారు. వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలనే జరిమానా అని హెచ్చరిస్తున్నాం తప్ప.. నేటికీ ఏ ఒక్కరికీ జరిమానా విధించలేదు. గ్రామ బహిష్కరణ అనేది మేము ఎక్కడా అనలేదు. – బలే సీతారాముడు, కుల పెద్ద -
ఏ కులము నీదంటే?
దేశానికి ఇంకా స్వతంత్రం రాని రోజులవి. తనతో పాటు రైల్లో ప్రయాణిస్తున్న ఒక ఖద్దరు దుస్తుల వ్యక్తిని ఎగాదిగా చూస్తూ, ‘‘మనదే కులం బాబూ?’’ అని అడిగాడో పెద్దమనిషి. ‘‘గాంధీగారు నడయాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలూ, మతాలూ ఏమిటండీ?’’ అని నవ్వేశాడాయన. కానీ పెద్దమనిషి వదిలే రకంలా కనపడలేదు. ‘‘తమ తండ్రిగారు కులం తక్కువ పిల్లని కానీ మనువాడినారా నాయనా, చెప్పుకోటానికి సంకోచిస్తున్నావు?’’ అని ఎద్దేవా చేశాడు. ఖద్దరు మనిషి నొచ్చుకోలేదు సరికదా, చాదస్తపు పెద్దాయనకు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు: ‘‘నా కులం ఏదో నాకే అర్థం కాక చెప్పటానికి తటపటాయిస్తున్నాను. ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో నేను పాకీమనిషిని. గడ్డం గీసుకునే సమయంలో క్షురకుడిని. స్నానం చేయబోయే ముందు రజకునిలా రూపాంతరం చెంది విడిచిన బట్టలను ఉతుక్కుంటాను. ఆఫీసులో ఆవర్జా పుస్తకాలను వైశ్యుడిలా తయారు చేస్తాను. సాయంకాలం వేళల్లో నాపిల్లలకీ, వారి తోటి మిత్రులకీ పాఠాలు చెప్పేటప్పుడు పంతులుగా మారతాను. ఇప్పటికైనా తెలిసిందా నాకులం ఏదో’’ అని చెబుతుండగా రైలు స్టేషన్లో ఆగటం, కాంగ్రెస్ కార్యకర్తలు ‘జె.బి.కృపలానీకి జై’ అంటూ బిలబిలా బోగీ వైపు రావటం జరిగిపోయాయి. (మన్నవ గిరిధర రావు ‘పనికొచ్చే కథలు’ చదివాక.) పి.వి.ఎస్.సత్యనారాయణ -
బీసీల్లో కొత్తగా కులాల చేర్పు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లో మరిన్ని కులాల చేర్పు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న కులాల చేర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటివరకు ఎలాంటి కేటగిరీలో లేని సంచార జాతులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఉంది. ఏడాది క్రితం బీసీ కమిషన్‌కు 25 కులాల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వాటి చేరికపై బీసీ కమిషన్ పలు సూచనలు సైతం చేసింది. బీసీల్లో ఆ కులాల చేర్పుపై కేంద్రంసలహా తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగం భావించి లేఖ రాసింది. బీసీల్లో ఆయా కులాల చేర్పు నిర్ణయాధికారం రాష్ట్రానికే ఉందంటూ సూచించడంతో ఫైలు కాస్త సీఎం వద్దకు చేరింది. అసెంబ్లీ రద్దు కావడంతో సీఎం కొత్తగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి రావడంతో సీఎం కార్యాలయం బీసీ కులాల చేర్పునకు సంబంధించిన ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. దీనిపై కొత్త ప్రభుత్వంలోనే స్పష్టత వస్తుందని ఓ అధికారి చెప్పారు. -
రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేసిన పోస్టర్
పాట్నా : బిహార్ రాజధానిలో వెలసిన ఒక పోస్టర్ రాజకీయ దుమారం రేపుతుంది. ఈ పోస్టర్లో రాహుల్ గాంధీతో పాటు పలువురు బిహార్ కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు మాత్రం ఉంటే సమస్య లేదు. కానీ ఆ ఫోటోల మీద సదరు నేతల పేర్లు కాక వారి సామాజిక వర్గాల(కులం) పేర్లు దర్శనమివ్వడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇరకాటంలో పడ్డారు. ఈ పోస్టర్ చూసిన బీజేపీ నాయకులు ‘రాహుల్ గాంధీ కుల రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారం’టూ దుమ్మెత్తిపోస్తున్నారు. వివరాలు బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్‌కు నూతన కార్యవర్గాన్ని నియమించినందుకు కృతజ్ఞతలు తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ పోస్టర్‌ను తయారు చేయించారు. ఈ పోస్టర్లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ జాతో పాటు మరి కొందరు సీనియర్ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే పోస్టర్లో నాయకుల పేర్లకు బదులు వారి సామాజిక వర్గాల పేర్లు ప్రింట్ చేయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, మదన్ మోహన్‌లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వారి ఫోటోల మీద ‘బ్రాహ్మణ్ సముదాయ్’ అని ప్రింట్ చేశారు. ఇలానే మిగతా నేతల ఫోటోల మీద వారి సామాజిక వర్గాల పేర్లను ప్రింట్ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ చర్యలు కుల రాజకీయాలను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాక ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే ఈ పోస్టర్ల గురించి కానీ.. బీజేపీ నాయకుల ఆరోపణల గురించి కానీ కాంగ్రెస్ నాయకులు స్పందిచకపోవడం గమనార్హం. -
సమరయోధులకు కుల, మతాల రంగు పులమొద్దు
ఖిలావరంగల్: స్వాతంత్య్ర, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అసువులు బాసిన పోరాట యోధులకు కులం, మతం రంగు పులమొద్దని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఓరుగల్లు ఉద్యమ కెరటం బత్తిని మొగిలయ్యగౌడ్ 72వ వర్ధంతి, శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఖిలావరంగల్ తూర్పుకోట హనుమాన్ జంక్షన్లో జరిగిన మొగిలయ్య కాంస్య విగ్రహం భూమి పూజకు ఆయన హాజరయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం సమరయోధులను విస్మరించడం బాధాకరమన్నారు. యోధుల కుటుం బాలను ప్రభుత్వం గుర్తించి వారికి సుముచిత స్థానం కల్పించాలన్నారు. మొగిలయ్య జ్ఞాపకార్థం ప్రభుత్వమే కమ్యూనిటీ హాల్ నిర్మించి దానికి మొగిలయ్య పేరు పెట్టాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ బత్తిని మొగిలయ్య కుటుంబంతో 32 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఆయన పేదలు, బడుగుల దాస్య విముక్తి కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. -
మేధావుల నిలయం.. బుర్రలు కలుషితం
నన్ను ఉన్నతాధికారిగా నియమించండి. మన సామాజిక వర్గానికి అండగా నిలుస్తా. మనోళ్ల ఎదుగుదలకు దోహదపడతా. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీకాలం ముగుస్తోంది. ఆయన్నే కొనసాగిస్తే మన పనులేవీ కావు. కొత్త వాళ్లు వస్తే మన సామాజిక వర్గం ఉద్యోగులకు మేలు జరగదు. ‘అన్న’కు చెప్పండి.– ఎస్కేయూ ఉన్నతోద్యోగి మెయిళ్ల సారాంశం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. మేధావులకు నిలయమైన ఈ ఆలయం కుల పిచ్చితో కలుషితమవుతోంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసే అధ్యాపకులే తప్పుదారి ఎంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. నేను.. మనం.. వర్గం.. దిశగా సాగుతున్న వర్సిటీ రాజకీయాలతో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కులం ప్రాతిపదికన సాగుతున్న అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్న యూనివర్సిటీ వాతావరణంఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా ఓ ఉన్నతోద్యోగి సాగించిన ‘మెయిల్’ రాయబేరాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉన్నత స్థాయి పోస్టును దక్కించుకోవడంలో భాగంగా సాగిన ఈ బాగోతం కాస్తా ఇప్పుడు రచ్చకెక్కింది. యూనివర్సిటీలకు షాడో చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న ‘అన్న’ను రంగంలోకి దింపి.. తద్వారా ఆ ఉన్నతోద్యోగి లబ్ధి పొందడంతో పాటు ఆ సామాజిక వర్గం ఉద్యోగులకు అండగా నిలుస్తున్న తీరు యూనివర్సిటీని కుదిపేస్తోంది. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లోని రహస్య అంశాలను మెయిల్ చేయడం.. పాలకమండలి మినిట్స్‌ను సైతం చేరవేస్తున్న ఉన్నతోద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది. మేధావులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో వెలుగులోకి వచ్చిన ఆశ్రిత పక్షపాతం అందరినీ నివ్వెరపరుస్తోంది. ♦ మెయిళ్ల సారాంశం గతంలో ఎస్కేయూ ప్రశ్నపత్రాలను చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేసేవాళ్లు. అయితే ఎస్కేయూ యాజమాన్యం ఉన్నట్లుండి ఆ బాధ్యతలను హైదరాబాద్‌లోని ఓ ప్రెస్‌కు కట్టబెట్టారు. ఇందులో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాలకమండలిలో జరిగిన చర్చా వివరాలను మీకు మెయిల్ ద్వారా పంపుతున్నాను. పరిశీలించగలరు. హైదరాబాద్ కంపెనీ ఎక్కువ మొత్తం కోట్ చేయడంతో నిధుల దుర్వినియోగం జరిగింది. కానీ ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదని తెలిపింది. అదంతా వాస్తవం కాదు. కంపెనీని మార్చడంతో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉంది. ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను మెయిల్‌కు జతపరిచాను.. చూడగలరు. ♦ మొదటి దఫా మెయిల్. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీ కాలం ముగిసంది. అలాగే కొనసాగిస్తే వర్సిటీ పాలన గాడి తప్పుతుంది. మన సామాజిక వర్గానికి చెందిన వారికి ఉన్నతాధికారి పదవిని అప్పగిస్తే మొత్తం పాలనంతా మన చేతుల్లోకి వస్తుంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని ఉన్నతాధికారిగా నియమించేందుకు వీసీకి ఎలాంటి అవకాశం కల్పించకూడదు. నా ఆశ.. నా శ్వాస పార్టీని, మన సామాజిక వర్గానికి అండగా నిలిచేందుకే కృషి చేస్తాను. ♦ రెండో మెయిల్ చట్టవిరుద్ధంగా నియమింపబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైకోర్టును తప్పుదోవ పట్టించే విధానాలను అవలంబిస్తున్నారు. తరువాత నియామకాలకు ఇవి పెద్ద అవరోధంగా మారాయి. వీళ్ల పద్ధతుల్ని అడ్డుకోవాలి. మన సామాజిక వర్గం, మన పార్టీ బలోపేతం అయ్యేలా తమరు చొరవ చూపించాలి. అందుకు నన్ను ఉన్నతాధికారిగా నియమించేలా సిఫార్సు చేయండి. ♦ ఇదీ మూడో మెయిల్ : రూ.7లక్షల నిధులకు రెక్కలు యూనివర్సిటీలో అసోసియేట్, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూల నిర్వహణ, ఇంటర్వ్యూ చేసే నిపుణులకు సంబంధించి టీఏ, డీఏ ఖర్చులకు రూ.7 లక్షలను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్‌కు అందచేశారు. వాస్తవానికి సెక్షన్ హెడ్ అయిన డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ఖర్చు చేసే అధికారాన్ని అప్పగించాలి. కానీ అతను రెండు రోజులు సెలవులో ఉన్న కారణంగా సూపరింటెండెంట్‌కు రూ.7 లక్షల చెక్‌ను అందచేశారు. పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో ఈ మొత్తం చెల్లించాలి. కానీ 8 నెలలు గడుస్తున్నప్పటికీ రూ.7 లక్షలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. యూనివర్సిటీలో చక్రం తిప్పుతున్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. -
కమల్‌కు ట్విట్టర్లో చురకలు
చెన్నై: కులానికి వ్యతిరేకంగా ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్లో దుమారం రేగుతోంది. కులంపై తన కూతురు శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. సంస్కరణలను ముందుగా కమల్ ఆయన ఇంటి నుంచి ప్రారంభించాలని సూచించారు. తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ అడ్మిషన్ దరఖాస్తులో కులం, మతానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా వదిలేశానని కమల్ ఇటీవల ట్వీట్‌చేశారు. వచ్చే తరానికి కులం, మతం గురించి తెలియకుండా చేయాలంటే ఇదే సరైన మార్గమన్నారు. అయితే, కమల్ ట్వీట్‌పై ట్విట్టర్లో విమర్శల దాడి మొదలైంది. కొన్నేళ్లక్రితం శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. తాను ‘అయ్యంగర్’ (బ్రాహ్మణ) అని పేర్కొన్న వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు పోస్ట్ చేశాడు. ‘పిల్లలకు వారి కులం తెలియకుండా పెంచాలి’ అని వ్యాఖ్యానించాడు. ‘జంధ్యం తీసి, కుల ధ్రువీకరణ పత్రాన్ని చించినంత మాత్రాన కులం పోదు’ అని ట్వీట్‌చేశారు. -
సామాజిక డ్రామాకు తెర తీసిన టీడీపీ
-
మరో సామాజిక డ్రామాకు తెరతీసిన టీడీపీ
-
రారండోయ్
కాలువ మల్లయ్య ‘కులరహిత భారతం’, ‘ద జర్నీ టువర్డ్స్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం 5 గంటలకు హిమాయత్ నగర్‌లోని బీసీ భవన్లో జరగనుంది. నిర్వహణ: సమాంతర పబ్లికేషన్స్ ఎన్.గోపి ‘జలగీతం’కు ఎం.నారాయణశర్మ సంస్కృత అనువాదం ‘జలగీతమ్’; ‘జలగీతం– కావ్యసమాలోచనమ్’ ఆవిష్కరణ నేడు సాయంత్రం ఆరింటికి రవీంద్ర భారతిలో జరగనుంది. ఆవిష్కర్తలు: రమణాచారి, జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి. నిర్వహణ: దక్కన్ సాహిత్య సభ. ‘సినారె సాహితీ వైజయంతి’లో భాగంగా జూన్ 12న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ‘సినారె యాత్రా సాహిత్య విశిష్టత’పై ఆర్.అనంత పద్మనాభరావు ప్రసంగిస్తారు. నిర్వహణ: ఆచంట కళాంజలితో పాటు భావ సారూప్య సాహిత్య సాంస్కృతిక సంస్థలు. శ్రీశ్రీ 35వ వర్ధంతి సభ, శ్రీశ్రీ నూతన లభ్య రచనల పరిచయ సభ జూన్ 14న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ ఆవిష్కరణ జూన్ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: సుంకిరెడ్డి నారాయణరెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. సురేంద్రదేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో’ ఆవిష్కరణ జూన్ 16న సాయంత్రం 6 గంటలకు యానాంలో జరగనుంది. ఆవిష్కర్త: మల్లాడి కృష్ణారావు. నిర్వహణ: కవిసంధ్య, స్ఫూర్తి సాహితి బాలాంత్రపు రజనీకాంతరావు సంస్మరణ సభ జూన్ 17న సాయంత్రం 5:30కు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరగనుంది. నిర్వహణ: ఛాయ. మల్లెతీగ పురస్కారాల ప్రదానం జూన్ 17న సాయంత్రం 6 గంటలకు మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడలో జరగనుంది. ప్రధాన పురస్కార గ్రహీత: ర్యాలి రైతు కష్టాలు వస్తువుగా వచ్చిన కవిత్వంతో తేనున్న సంకలనానికి తమ కవితలు పంపాల్సిందిగా కవులను కోరుతున్నారు బన్న అయిలయ్య. చిరునామా: 2–7–1261/1, విజయపాల్ కాలనీ, హన్మకొండ–506370. ఫోన్: 9949106968 -
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల ఛాతీపై కులం పేరు
-
కానిస్టేబుల్ నియామక పరీక్ష... ఛాతిపై కులం పేరు
భోపాల్: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై వారి కులం పేరును స్కెచ్‌తో రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్ పెన్‌తో రాశారు. ఈ విషయమై ధార్ ఎస్పీ వీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు. -
కేరళ విద్యార్థుల సంచలన నిర్ణయం
తిరువనంతపురం : రోజు ఏదో ఒక చోట కులం, మతం పేరిట గొడవ పడే రోజుల్లో కేరళ విద్యార్థులు కుల, మత, రహిత సమాజం వైపు తొలి అడుగు వేశారు. బుధవారం ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఈ విషయాలను బహిర్గతం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో మంత్రి సి రవీంద్రనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఇప్పటి వరకూ కేరళ వ్యాప్తంగా 1.24 లక్షల మంది విద్యార్థులు తాము ఏ కులానికి, మతానికి చెందమని పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9వేల పాఠశాలల్లో సేకరించిన సమాచారం ప్రకారం పాఠశాల అడ్మిషన్లలో 1,23,630 మంది కులం, మతం పేరును నింపలేదని మంత్రి తెలియచేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో మొదటి సంవత్సరంలో 278 మంది, ద్వితీయ సంవత్సరంలో 239 మంది తాము ఏకులానికి మతానికి చెందిన వారిమి కాదంటూ తమ అడ్మిషన్లలో పేర్కొన్నారు. -
రెండు తరాలుగా వారికి కులంలేదు!
‘నమస్తే అండీ.. నా పేరు క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని ఆయన చెప్పగానే.. ప్రజలు ఆయన వైపు అయోమయంగా చూస్తారు. ఏమిటీ వింత పేరు అన్నట్టుగా ఉండే వారి అయోమయం చూపులను చూసి.. క్యాస్ట్‌లెస్ జూనియర్ లోలోపల నవ్వుకుంటారు. కానీ, అత్యంత అరుదైన ఆయన నామం వెనుక పెద్ద కథే ఉంది. ఆయనే కాదు.. ఆయన తోబుట్టువుల పేర్లు విన్నప్పుడు కూడా జనం ఇలాగే విస్తుపోతుంటారు. ఆయన సోదరుడి పేరు క్యాస్ట్‌లెస్ (కులం లేదు). సోదరి పేరు షైన్ క్యాస్ట్‌లెస్. కేరళ రాజధాని కొచ్చి నుంచి 67 కిలోమీటర్లు ప్రయాణించి.. కొల్లాం జిల్లాలోని పునలూరుకు వెళితే.. అక్కడ ఓ ఉన్న ఇంటి నేమ్‌ప్లేట్‌పై ఇలాంటి ఓ అరుదైన పేరు దర్శనమిస్తుంది. ‘కులంలేని ఇల్లు’ అని మలయాళంలో రాసి ఉంటుంది. ఆ ఇంటి పెద్ద ఫసులుద్దీన్ అలికుంజ్. పుట్టుకతో ముస్లిం. ఆయన సహచరి ఏజ్నెస్ గాబ్రియెల్.. క్రైస్తవ మతస్తురాలు. ఇద్దరూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. ఫసులుద్దీన్ను ఏజ్నెస్ ప్రేమిస్తుందని తెలిసి.. కుటుంబసభ్యులు ఆమెను ‘హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఫసులుద్దీన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి మరీ ఆమెను విడిపించారు. 1973లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారు ఒకటయ్యారు. కానీ పెళ్లి చేసుకోలేదు. కనీసం మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకోకుండా 19 సంవత్సరాలు సహజీవనం చేశారు. వారు ఏ మతాన్ని పాటించలేదు. అయితే, తమ ఆచరణ వల్ల పిల్లలకు ఇబ్బంది ఎదురుకాకూడదని 1992లో వారు తమ కలయికను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించారు. తమ ఆస్తులు వారసత్వంగా తమ పిల్లలకు దక్కడంలో ఇబ్బంది ఎదురుకాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో తాను పదో తరగతిలో ఉన్నట్టు గుర్తుచేసుకుంటారు వారి రెండోకొడుకు క్యాస్ట్‌లెస్ జూనియర్. అయితే, ఆ సమయంలో ఇటు ఫసులుద్దీన్, అటు ఏజ్నెస్ కుటుంబాలు.. వారికి పుట్టబోయే పిల్లలు తమ మతాన్నే అనుసరించాలని ఒత్తిడి తెచ్చారు. వారి పిల్లలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఫసులుద్దీన్కానీ, ఏజ్నెస్కానీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదు. ‘మా తల్లిదండ్రులిద్దరూ హేతువాదులు. వారు లౌకికవాదాన్ని ఆచరించేవారు. తమ కుటుంబసభ్యుల ఒత్తిడిని లెక్కచేయక వారు జీవనాన్ని సాగించారు’ అని అంటారు క్యాస్ట్‌లెస్ జూనియర్. సహజంగా తండ్రి మతమే పుట్టబోయే పిల్లలకు వస్తుందనే చాలామంది నమ్ముతారు. ‘కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. 1974లో మా అన్నయ్య పుట్టినప్పుడు.. అమ్మనాన్నలు అతనికి ‘క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు’ అని నవ్వుతారు క్యాస్ట్‌లెస్ జూనియర్. ఆ తర్వాత 1975లో తమకు పుట్టిన రెండో బాబుకు ‘క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని, 1983లో పుట్టిన చిన్నకూతురికి ‘షైన్ క్యాస్ట్‌లెస్’ అని నామకరణం చేశారు ఫసులుద్దీన్ దంపతులు. కులాన్ని, మతాన్ని అనుసరించకపోవడం వల్ల తమ పిల్లలు ఎలాంటి హక్కులు కోల్పోలేదని, స్కూల్ రికార్డ్స్ల్లోగానీ, ఇతర ప్రతాల్లోగానీ కులం, మతం అని ఉన్న చోట ‘నిల్’ అని రాసేవారని ఫసులుద్దీన్ గుర్తుచేసుకుంటారు. కాన్వెంట్ స్కూల్వాళ్లు తమ ఇంటికి వచ్చి పిల్లలు పేర్లు మార్చాలని అడిగేవారని, కానీ 18 ఏళ్లు వచ్చిన తర్వాత తమ పేర్లపై పిల్లలే నిర్ణయం తీసుకుంటారని స్కూల్వాళ్లకు చెప్పి పంపేవాళ్లమని ఆయన చెప్తారు. క్యాస్ట్‌లెస్, క్యాస్ట్‌లెస్ జూనియర్, షైన్ క్యాస్ట్లెస్లకు పెళ్లిళ్లు జరిగినప్పుడు ఎవరూ మతపరమైన ఆచారాలు పాటించలేదు. కట్నంగానీ, పూజారిగానీ లేకుండా కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారు తమ వివాహాలను రిజిస్టర్ చేయించుకున్నారు. ‘పెళ్లికి చాలాముందే మా భాగస్వాములకు మా దృక్పథం ఏమిటో చెప్పాం. వాళ్లు అంగీకరించారు’ అంటారు క్యాస్ట్‌లెస్. మీ పిల్లలకు పెళ్లిళ్లు కావని, వారికి మంచి సంబంధాలు రావని ఫసులుద్దీన్, ఏజ్నెస్ను వాళ్ల కుటుంబాలు బెదిరించేవి. ఆ బెదిరింపులు ఉత్తవేనని వీరి పెళ్లిళ్లు నిరూపించాయి. సమాజం కూడా తమ కుటుంబ జీవనవిధానాన్ని అంగీకరించిందని క్యాస్ట్‌లెస్ అంటారు. కులం నేపథ్యం చూడకుండా ఒక్క ఓటు కూడా వేయని మన సమాజంలో పునలూరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తాను గెలుపొంది.. 2005-10 మధ్యకాలంలో వైస్ చైర్మన్‌గా సేవలు అందించానని ఆయన గుర్తుచేసుకుంటారు. క్యాస్ట్‌లెస్ ఆయన తోబుట్టువులు కూడా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఎంబీఏ చేసిన క్యాస్ట్‌లెస్ భార్య పేరు సబిత, దుబాయ్‌లో నివాసముంటారు. వీరు తమ పిల్లలకు ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్’, ‘ఇండియన్ క్యాస్ట్‌లెస్’ అని పేరు పెట్టారు. న్యాయవాది అయిన క్యాస్ట్‌లెస్ జూనియర్.. పునలూరు బార్ అసోసియేషన్ సభ్యుడు. హిందు మహిళ అయిన రాజలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. ‘అగ్నా క్యాస్ట్‌లెస్ జూనియర్’, ‘ఆల్ఫా క్యాస్ట్‌లెస్ జూనియర్’ అని పేరు పెట్టారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పీహెచ్డీ చేస్తున్న షైన్ క్యాస్ట్‌లెస్ వ్యాపారవేత్త చెగువరెను పెళ్లాడారు. వీరికి అలైదా చెగువరె అనే కూతురు ఉంది. క్యాస్ట్‌లెస్ అనే పేరును కొనసాగించడం అన్నది తమ వ్యక్తిగత అభీష్టమని, దీనిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని ఫసులుద్దీన్ కుటుంబం అంటుంది. అయినా, మీరు చనిపోతే.. మీ మృతదేహాలను ఖననం చేస్తారా? లేక పూడ్చిపెడతారా? అంటూ బంధువులు కొత్త కొత్త సందేహాలతో తమ వద్దకు వస్తారని, తమ మృతదేహాలను సైంటిఫిక్ కమ్యూనిటీకి అందజేసి.. వారికి ఉపయోగిపడితే చాలు అని తాము భావిస్తున్నామని, ఇది అప్పుడు బతికి ఉన్న కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకుంటారని క్యాస్ట్‌లెస్ జూనియర్ ‘ద న్యూస్ మినిట్’ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ అన్నారు. కులానికి అతీతంగా సమాజంలో హుందాగా బతకగలమని చాటిన ‘క్యాస్ట్‌లెస్’ కుటుంబం అందరికీ ఆదర్శప్రాయం.. కాదంటారా? ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో పంచుకోండి. -
ప్రేమ జంట ఆత్మహత్య
ఆ ప్రేమికుల పెళ్లికి కులాలు అడ్డువచ్చాయి. తల్లిదండ్రులను ఎదిరించి గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్నారు. ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ.. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అయ్యవారి గుట్ట(కొండ)లో ఆ ప్రేమజంట ఆత్మహత్యచేసుకుంది. అనంతపురం , కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం అయ్యగార్లపల్లికి చెందిన కమ్మ పాలాక్షప్ప, మల్లక్క దంపతుల కుమార్తె చిట్టెమ్మ (18) అదే గ్రామానికి చెందిన బోయ మల్లప్ప, మాదేవి దంపతుల కుమారుడు భరత్(21)లు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి వీరికి కులాలు అడ్డొచ్చాయి. అమ్మాయి కులం వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. ఒకానొక దశలో భరత్‌ను అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రేమ విషయంలో మందలించారు. ఇద్దరూ దూరం కావడానికి మనసులు అంగీకరించలేదు. ఫిబ్రవరి 20న తెల్లవారుజామున చిట్టెమ్మ తన పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, ఆధార్ కార్డులు, భరత్ తన ఆధార్ కార్డుతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. బెంగుళూరుకు వెళ్లి అక్కడి నుంచి యశ్వంతపూర్ నుంచి రైలులో తిరుపతికి వెళ్లారు. స్నేహితుల సమక్షంలో అక్కడ వివాహం చేసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చిట్టెమ్మ తండ్రి కమ్మ పాలాక్షప్ప తన కుమార్తె కనిపించడం లేదని, గ్రామానికి చెందిన మల్లప్ప కుమారుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్‌పై అనుమానం ఉందని ఫిబ్రవరి 20వ తేదీన శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 21వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి జంట ఆచూకీ కోసం స్నేహితులను పోలీసులు పిలిపించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ చేస్తూ విచారణ చేపట్టారు. భయపడి.. బలవన్మరణం తమ స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రేమజంట స్వగ్రామానికి వెళితే ఏం జరుగుతుందోనని భయపడి కళ్యాణదుర్గానికి చేరుకున్నారు. పట్టణ సమీపంలోని అయ్యవారు గుట్ట కొండలోకి వెళ్లి గుండ్ల మధ్య గుహలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మేకల కాపరులు సాయంత్రం గమనించి సరోజా కాంపౌండ్ సమీపంలోని ప్రజలకు తెలియజేశారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐలు జమాల్ బాషా, నబీరసూల్, ఏఎస్ఐ తులశన్నలు మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మహిళల ఉసురు తీస్తున్న 'కులం'
పురుషాధిపత్య సమాజంలో మహిళలు సామాజిక అణచివేతకు, లింగ వివక్షకు గురి అవుతున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) విడుదల చేసిన నివేదిక మరింత ఆందోళనకు గురిచేసింది. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులు, వివక్షకు తోడు వారిని కులం కూడా కాటేస్తోందని యూఎన్ అధ్యయనం వెల్లడించింది. వారు నివసించే మురికివాడల్లోని పారిశుధ్యలేమి, అనారోగ్య పరిస్థితులు, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు దళిత మహిళల ఆయుర్దాయాన్ని మింగేస్తున్నాయని తెలిపింది. ఆధిపత్యకులాలలోని మహిళలతో పోలిస్తే దళిత మహిళ కనీసం 15ఏళ్లు (14.6)ముందుగానే కన్నుమూస్తోందని ఐరాస నివేదిక తేల్చింది. దళిత మహిళ సగటున 39.5 ఏళ్లకే చనిపోతోంటే.. ఇతర కులాల మహిళల్లో ఇది 54.1 గా ఉంది. అంతేకాదు సామాజిక హోదా, ఇతర అంశాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాప్ 11 సంవత్సరాలుగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2015 లో '2030 నాటికి జెండర్ ఈక్వాలిటీ' సాధించాలనే ఎజెండాను ఆమోదించిన రెండు సంవత్సరాల అనంతరం ఈ నివేదికను వెల్లడించింది. పేదరిక నిర్మూలన, ఆహారం, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, భూమి, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం లాంటి 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) అమలులో సవాళ్లను ఈ అధ్యయనం పరిశీలించింది. దాదాపు 89 దేశాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ పేరుతో నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను ప్రకటించింది. సమాజంలో వెనుకబడి ఉన్న మహిళలు, బాలికలు తరచూ లింగ అసమానతలతోపాటు ఇంకా పలురకాల కష్టాలు అనుభవిస్తున్నారు. నిరుపేద కుటుంబాలలో నివసించే స్త్రీలు తమ పని సమయములో 24శాతం వంట చెఱకు, నీరు, ఆహారం, గృహ అవసరాలకోసం వినియోగిస్తుండగా, ధనిక కుటుంబాలలోని మహిళలు దీంట్లో సగ భాగాన్ని అంటే 12శాతం సమయాన్ని అలాంటి పనులకు కేటాయిస్తున్నారట. భారతదేశంలో 20-24 ఏళ్ల వయస్సులో ధనిక వర్గాలనుంచి వచ్చిన యువతులతో పోలిస్తే గ్రామీణ పేద యువతుల్లో పాఠశాలకు వెడుతున్నవారి సంఖ్య 21.8 రెట్లు తక్కువగా ఉంది. అలాగే 18 ఏళ్ళలోపు పెళ్లిళ్లు గ్రామీణ ఐదు రెట్లు ఎక్కువ. కౌమార దశలోనే తల్లులుగా మారుతున్న వారి సంఖ్య 5.8రెట్లు ఎక్కువ. సాంఘిక సోపానక్రమంలో తక్కువ విద్య, తక్కువ హోదా ఉన్న మహిళ మరింత శ్రమదోపిడీకి గురవుతుందనీ, భూమిలేని, షెడ్యూల్డ్ కులాలు, తెగల నుంచి వచ్చి ఉంటే ఈ దోపిడీ ఇంకా తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 1990ల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం అక్షరాస్యత రేటు, పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, లింగ, సామాజిక అసమానతలు ఇప్పటికీ ఉన్నాయని నివేదించింది. ఇందుకు జనాభాలో 16.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ తెగలు 8.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు భారతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉండటాన్ని నిదర్శనంగా పేర్కొంది. ఎస్.టి. మహిళల అక్షరాస్యత రేటు ఇప్పటికీ 50శాతం కంటే తక్కువగా, ఎస్సీ మహిళల్లో 57శాతం కంటే తక్కువగా ఉందని చెప్పింది. అందరికీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలంటే మహిళల ముందస్తు పురోగతి ప్రాధాన్యతను యూఎన్ నివేదిక నొక్కి చెప్పింది. -
శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు
రోజూలానే ఆరోజు కూడా రామానుజుడు మహాపూర్ణుల ఇంటికి వెళ్లారు. కాని ఇంట్లో ఎవరూ లేరు. ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల వారిని అడిగితే గురువు గారు హఠాత్తుగా ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. ఎందుకు? ఇంటికి చేరుకున్న రామానుజుడికి.. జరిగిన గొడవ గురించి, గురువుగారు హఠాత్తుగా ఎందుకు కంచి వదిలి వెళ్లిపోయారో తెలిసిపోయింది. గురువుగారి భార్యను అన్నమాటలు కూడా తెలుసుకున్న తరువాత చాలా బాధపడ్డారు. హృదయం భారమైంది. కన్నీళ్లు ఆగడం లేదు. ఆమె కనిపించింది. సాధ్యమైనంత వరకు కోపం, బాధ ఆపుకుంటూ ‘‘మూడు తప్పులు చేశావు రక్షమాంబ, క్షమించరాని తప్పులు. రెండు సార్లు నీకు హెచ్చరిక చేశాను. నాకు ఉపదేశం చేసిన గురువుగారిని కూడా నీవు గౌరవించకపోతే మనం ఏం చేస్తున్నట్టు? మొదటి సారి కాంచీపూర్ణుని సాపాటుకు పిలిచి కులభేదాలు లేవంటూ గౌరవించాలన్న నా ప్రయత్నాన్ని ఫలించనీయలేదు. అది మొదటి తప్పు. మరోసారి ఆకలితో ఉన్న వైష్ణవుడికి భోజనం పెట్టమని కోరితే నిరాకరించావు. ఇంట్లో భోజన పదార్థాలు ఉన్నా లేవన్నావు. ఇక ఇప్పుడు నా ఆచార్యుడిని వెడలగొట్టిన పాపాన్ని నాకు కట్టబెట్టావు. నాకు దివ్యోపదేశం చేసిన గురువే నా జీవితంకన్నా, నీకన్నా చాలా ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ. ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా. నీకు ఇదివరకు ఎన్నో సార్లు చెప్పాను కూడా! హెచ్చరించినా వినడం లేదు. నా స్థాయికి మించిన సతీమణివి నువ్వు. నీవల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడం నా వల్ల కావడం లేదు. ఇక ప్రయోజనం లేదు. నీవు నీ పుట్టింటికి వెళ్లవచ్చు. నీతో వచ్చినవి, నీవు తెచ్చినవి, నీ పుట్టింటివారు నీకు ఇచ్చినవి తీసుకుని వెళ్లవచ్చు.’’ అని తీక్షణంగా మాట్లాడి, రామానుజుడు వెళ్లిపోయాడు. తంజ వణికిపోయింది. ఏనాడూ కోపంగా లేని రామానుజుడు అంతగా ఆగ్రహించడం తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి ఆమెను పంపించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు రామానుజులు. అంతలో ఒకరోజు ఆమె పుట్టింటినుంచి ఎవరో వచ్చి తమ్ముడి పెళ్లికి అక్కా బావలను నాన్న రమ్మంటున్నారని చెప్పారు. తండ్రి పంపిన కొన్ని కానుకలు ఇచ్చాడు. ఉత్తరం కూడా రాసి పంపాడు. తను వెళ్తానంది. రామనుజుడు సరేనన్నాడు. తాను రాలేనని చెప్పాడు. కొన్ని వస్తువులు తీసుకువెళ్తానంది. నీకు ఇష్టం వచ్చినవన్నీ తీసుకుపోవచ్చని చెప్పాడు. ఎప్పుడు వస్తానో తాను చెప్పలేదు. రామానుజుడూ అడగలేదు. పుట్టింటి ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఇంకా తాను వాడుకుంటున్న వస్తువులు కూడా సర్దుకుంది. ఆమె ముఖంలో పుట్టింటికి వెళ్లే సంతోషం కనిపించింది. ఏ తప్పు చేయని వారిని వైవాహిక బంధంనుంచి తెంచడం ధర్మం కాదు. మూడుతప్పులు చేసిన భార్యను వదిలివేయడం అధర్మం కాదు. స్వచ్ఛందంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంటే... ఇదీ ఒకందుకు మంచిదే అన్నట్టు రామానుజుడు మౌనం వహించాడు. వెళ్లిపోయింది. తనకు సహధర్మచరిగా ఉండవలసిన భార్య దొరకలేదు. ఇక సంసారమూ ఆ సంసార భారాలూ తనకు సాధ్యం కాదని తన దారి వేరని అర్థమైపోయింది. మళ్లీ ఇక ఆమె గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఆయన జీవితంలోకి ఆమె వచ్చిన దాఖలా లేదు. సన్యాసాశ్రమం రామానుజుడు ఇక సన్యాసాశ్రమం తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమనే నిశ్చయానికి వచ్చాడు. భిక్షువైన సన్యాసి ద్వారాగానీ లేదా భగవంతుడి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలి. రామానుజుడు వరదరాజ స్వామి ద్వారా సన్యాసాన్ని స్వీకరించాలని సంకల్పించాడు. అనంత సరస్సులో స్నానం చేసి పునీతుడైనాడు. ‘ఈ సంసార బంధంనుంచి నన్ను విముక్తుడిని చేయి వరదరాజా.. నీ దివ్య ఆదేశాలను స్వీకరించడానికి నేను సిద్ధం. నన్ను నీ చరణాలను ఆశ్రయించనీయి, త్రిదండం ఇప్పించు. కాషాయ వస్త్రాలు దాల్చనీ, స్వామీ’ అని ప్రార్థించాడు. కాంచీపూర్ణుడి ద్వారా అతనికి అనుజ్ఞ లభించింది. త్రిదండము, కాషాయ వస్త్రాలు, ఉపవీతము, కౌపీనము, వేష్టి, శిక్యము మొదలైనవి ఇచ్చి ఇకనుంచి అతను రామానుజ ముని అని పిలువబడతాడన్నారు. రామానుజ మునికి సన్యాసాశ్రమ ధర్మపద్ధతి ప్రకారం మఠం ఏర్పాటుచేసి పీఠాన్ని అందులో ఆయన్ను ప్రతిష్ట చేయండి అని ఆదేశించారు వరదరాజస్వామి. కొన్నాళ్లు కంచి రామానుజ మఠంలో ఆయన సన్యాసిగా జీవనం సాగించారు. సన్యాసాశ్రమంలో కఠిన నియమాలు సవివరంగా పాటించారు. యామునాచార్యులను తలచుకున్నారు. ఇదంతా నాయందు వారి అపారమైన దయ, లీల. తన మార్గంలో కంటకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు. చివరకు ఈ దారికి మళ్లించారు. ఇక వారి ఆశయాలను నెరవేర్చే బృహత్ కార్యాన్ని చేపట్టాలి. కాని నేను ఒక్కడినే ఉన్నాను. నాకొక తోడు ఉండాలి. గోవిందుడు గుర్తుకు వచ్చాడు. ఆ«ధ్మాత్మిక వాజ్ఞ్మయం తెలిసిన వాడు, శాస్త్రాలు చదువుకున్నవాడు. భౌతిక లంపటాలమీద ఆసక్తి లేని వాడు. సమ్యక్ దృష్టి కలిగిన వాడు. నేనంటే అభిమానం ఉన్నవాడు. మనసు తెలిసిన ఆత్మబంధువు. గోవిందుడికన్నానాకెవరు దొరకుతారు? కాని అతను కాళహస్తిలో ఉంటూ శైవమతాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరు అతన్ని మనదారికి మళ్లించగలరు? కంచి వరదుడికి కాంచీపూర్ణుడి వలె, తిరుమల వేంకటేశ్వరస్వామికి శ్రీశైలపూర్ణుడు అంతటి సన్నిహితుడు. శ్రీశైలపూర్ణుడి సాయం దొరికితే చాలు అనుకున్నాడు. అతనికి వెలుగు దారి చూపమని కాంచీ వరదుడినే మళ్లీ వేడుకున్నాడు. దాశరథి కురేశులు రామానుజుడికి ఇద్దరు చెల్లెళ్లు. భూమి, కమల. పురుష మంగళలోని అనంత దీక్షితతో భూమి వివాహం అయింది. వారికి దాశరథి జన్మించాడు. దాశరథిని ముదలి ఆండన్ అని కూడా పిలుస్తారు. కమలకు పుట్టిన వాడు వరద విష్ణు ఆచార్య. ఆండన్ 105 సంవత్సరాలు జీవించారు. రహస్యత్రయమనే గ్రం«థాన్ని రచించారు. రామానుజుని ప్రధాన శిష్యుల్లో ఒకరు. దాశరథి తనను శిష్యుడిగా స్వీకరించాలని అర్థిస్తాడు. దాశరథితోపాటు శ్రీవత్సాంక కూడా శిష్యుడైనాడు. శ్రీ వత్సాంకుడు కుర్ అనే అగ్రహారానికి అధిపతి, ధనవంతుడు. కనుక ఆయనను కురేశుడు అని ఆళ్వన్ అని కూడా అంటారు. కురేశుడు తన భార్య ఆండాళ్‌తో కలిసి వచ్చి శిష్యులై ఉండేందుకు అనుమతించాలని కోరారు. రామానుజుడికి సన్నిహిత శిష్యులుగా దాశరథి, కురేశుడు రాణించారు. (వీరి పుత్రులే పరాశర, వేదవ్యాసభట్టర్) పంచసంస్కారాలు గావించారు. అంతకు ముందు గురువైన యాదవప్రకాశుడు కూడా శైవం నుంచి విశిష్టాద్వైతం స్వీకరించి రామానుజుడి శిష్యుడైనాడు. శ్రీరంగం వైపు పయనం శ్రీరంగం వైష్ణవ పీఠంలో రామానుజుని ఆచార్యుడుగా ప్రతిష్టించాలని యామునాచార్యుల శిష్యగణం మాట్లాడుకుంటున్నారు. తమ పరిధిలో ఉన్న కంచి వరదుడి అనుగ్రహంతోనే రామానుజుడు కంచినుంచి కదలడం సాధ్యమవుతుందని వారు గమనించారు. శ్రీరంగనాథుని స్తుతించి ఒక కోరిక కోరారు. ‘‘మీరు ఏ విధంగానైనా వరదరాజస్వామిని ఒప్పించి రామానుజుని శ్రీరంగానికి రప్పించాలి’’ అని విన్నవించారు. శ్రీరంగనాథుడు కంచిలో వరద రాజుకు సందేశం పంపుతూ రామానుజుడిని పంపాలని కోరతాడట. ఆ సందేశానికి వరదరాజు ‘‘మమ్మల్ని మేము కోల్పోవడానికి సిద్ధపడినప్పుడే మా రామానుజుని వదులుకునేది’’ అని తిరుగు సందేశం పంపారట. అధికారికంగా వరదుడిని ఒప్పించడం కష్టమని తేలిపోయింది. ఆయనను మెప్పించడానికి మార్గాలు వెదకాలనుకున్నారు. వరదుడు సంగీతప్రియుడు, మధురగానానికి లొంగుతాడని తెలిసి సంగీత విశారదుడు భక్త అగ్రగణ్యుడైన వర రంగముని (మరోపేరు తిరువరంగ పెరుమాళ్ అఱైయార్)ను వరదరాజపెరుమాళ్ సన్నిధికి వెళ్లమని వేడుకుంటారు. ఆయన కాంచీపురం చేరుకుని, దివ్యప్రబంధంలోని పాశురాలను మధురంగా గానం చేశారు. వరదరాజస్వామి ఆయన గానానికి ముగ్ధుడై ఆలయమర్యాదలతో సత్కరించాలని ఆదేశిస్తాడు. ‘‘ఈ సత్కారాలు నాకెందుకు స్వామీ. ఇవన్నీ నాకు అక్కర లేదు. మీరు కాదనకుండా నాకు ఒక వరం ఇవ్వండి స్వామీ’’ అని వర రంగడు కోరుతాడు. ‘‘సరే నన్ను నా భార్యలను కాకుండా మరేదయినా కోరుకోవా’’ అంటాడు వరదరాజపెరుమాళ్. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వరరంగడు రామానుజుడిని అడుగుతాడు. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. వెంటనే రామానుజుని చేయిపట్టుకుని శ్రీరంగానికి బయలుదేరతాడాయన. యమునాచార్యుల కల ఫలించబోతున్నదని శిష్యులు రామానుజుడికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కావేరీ తీరానికి రాగానే రామానుజుడిని వేదమంత్రోచ్చారణలతో పూర్ణకుంభంతో ఎదురేగి, దివ్యప్రబంధ పాశుర గానంతో సకల వైదిక లాంఛనాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఊరేగింపుగా రామానుజుడు తూర్పుద్వారంనుంచి శ్రీరంగాలయ ప్రవేశం చేసారు. తరువాత దక్షిణానికి తిరిగి అక్కడనుంచి పడమరవైపు ప్రదక్షిణగా మళ్లి అక్కడినుంచే శ్రీరంగనాథునికి సాష్టాంగ నమస్కారము సమర్పించి, అమ్మవారు శ్రీరంగనాయకి సన్నిధికి వెళ్లి ప్రణామం చేసి, చంద్ర పుష్కరిణిని దర్శించి ప్రణమిల్లి, పుష్కరిణీజలాన్ని తీసుకుని త్రాగి, జయవిజయుల రక్షణలో ఉన్న ద్వారంలో ప్రవేశించి, దివ్యశూరులైన అక్కడి ఆళ్వారులను దర్శించి చుట్టూ ఉన్న ఉపాలయాలను సందర్శించి ప్రణవ విమానానికి ప్రణమిల్లి, విష్ణు సేనాని విష్వక్సేనుల వారి సన్నిధికి చేరి సాష్టాంగ నమస్కారం చేసి, రంగమంటపంలో ప్రవేశించినారు. సరిగ్గా అదే సమయానికి రామానుజునికి స్వాగతం చెప్పినట్టు ఉత్సవరులు నంబెరుమాళ్ రామానుజుని చూడాలని స్వయంగా బయటకు వచ్చారు. నంబెరుమాళ్ కనిపించగానే రామానుజులు పలుమార్లు సాష్టాంగపడిపోయారు. మహానంద పరవశులైనారు. ఇక మూలవిరాట్టు, అనంత శయనుడు, శేషశాయి, ప్రణవవిమానాంతర్గత శయనమూర్తి, శ్రీరంగనాథుని దర్శించారు. ఆ దివ్యమంగళ విగ్రహుని పరాత్పరునిచూడగానే కళ్లు వర్షించాయి. మనసు పులకించింది తనువు వణికింది. ఉచ్ఛస్వరం ఉబికి వచ్చింది. సంస్కృత శ్లోకాలు ఆశువుగా వెలువడ్డాయి. నమో నమో వాజ్ఞ్మనసాతి భూమయే నమో నమో వాజ్ఞ్మనసైక భూమయే నమో నమో అనంతమహావిభూతయే నమో నమో అనంతదయైక సింధవే అని స్తుతించారు. వాక్కుకు మనసుకు అందని వాడా వందనం వందనం, వాక్కు మనస్సుకు మాత్రమే అందే వాడా వందనం వందనం, అనంతమహా వైభవుడా వందనం వందనం, అనంత దయా సముద్రుడా వందనం వందనం అని స్వామిని చూస్తూ ఉండిపోయాడు.మరో శ్లోకం కూడా రామానుజుని మనో వాక్కులనుంచి ప్రవహించింది. నధర్మనిష్ఠోస్మిన చాత్మవేది నభక్తిమాన్ త్వచ్ఛరణారవిన్దే అకించనోన్యగతిఃశరణ్యః త్వత్పాదమూలం శరణం ప్రపద్యే (నాకు ధర్మమంటే ఏమిటో తెలియదు. నిçష్ఠ అర్థం కాదు. ఆత్మతత్వం బోధపడదు. నీ పాదపద్మాల మీదైనా భక్తి ఉందా అంటే అదీ లేదు. అకించనుడను. గమ్యమేమిటో తెలియదు (అగమ్యగోచరుడిని), ఇంకో గతి లేదు. నీ పాదములనే శరణు వేడుతున్నాను). కరుణాసముద్రుడైన భగవంతునికి తానేమీ కానని తెలుపుకుని నిరహంకారుడై పూర్తిగా శరణువేడే నిజవైష్ణవ నిరాడంబర, నిజభక్తి సూత్రాలుగా ఈ శ్లోకాలు ప్రతి వైష్ణవ తిరువారాధనలో పలికే మంత్రాలై ఈనాటికీ వెలుగుతున్నాయి. శ్రీవారి పాదాలను (శఠగోపము) రామానుజుని పాదాలపై ఉంచారు. బద్ధులైన ఆత్మలను విముక్తులను చేయడానికి నిత్యవిభూతిని, లీలా విభూతిని వినియోగించమని ఆదేశిస్తూ ఆ రెండింటినీ రామానుజులకు అప్పగించారు శ్రీరంగనాథుడు. పెరియనంబి ద్వారా శెంగోలు కిరీటాన్ని ఇచ్చి రామానుజుడికి ఉడయవరు అనే నామాన్ని ఇచ్చారు. పెరియనంబి వైపు తిరిగి, రామానుజుడు, ఆచార్యవర్యా మిమ్మల్ని ఆశ్రయించడం వల్ల మీ దయతో నాకు ఈ శ్రీరంగనాథుని అనుగ్రహం కలిగిందని నమస్కరించారు. పెరియనంబి ‘‘నాయనా...అదిగో అటు చూడు అని నమ్మాళ్వార్లను చూపి, ఆయనే భవిష్యత్తులో ఒక ఆచార్యులు వచ్చునని చెప్పినారు. అది నీవేనని యామునులు చెప్పినారు. కలి ధర్మాలను నశింపచేసి భగవత్తత్త్వాన్ని జనులకు విశదం చేసే మహత్తర కార్యక్రమ బాధ్యతను స్వీకరించు’’ అని దీవించారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను, వ్యవహారాలను, జరగవలసిన కార్యక్రమాలను నిర్ధారించి, నిర్దేశించి, దగ్గరుండి నిర్వహింపజేసి, ఆచరణ ద్వారా అందరికీ నేర్పి, ఈనాటికీ ఏనాటికీ మరిచిపోకుండా నిలబెట్టిన ఘనుడు ఆచార్య రామానుజుడు. ఆ కార్యక్రమం కలియుగ వైకుంఠ ధామమైన శ్రీరంగంలో శ్రీమద్రామానుజులు ఆరంభించారు. పెరియ తిరుమండపం (పెద్ద శ్రీ మండపం)లో ప్రవేశించారు, అన్నీ పరిశీలించారు. శ్రీ భాండాగారంలోకి వెళ్లారు. అక్కడి తూకాలు చూశారు, కొలతల ప్రమాణాలను సరిచూచారు. తిరువారై అంటే పూలమాలల సేవ, సాట్టువడి అంటే శ్రీ గంధపు సేవ, అముడుపడి అంటే అన్న ప్రసాద సేవ, తిరువిళక్కు అంటే జ్యోతి సేవ తదితర సేవలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించారు. సేవల అంతరార్థాలను వివరించారు. పద్ధతులను నిర్దేశించారు. ప్రక్రియలు ప్రబోధించారు. దేవాలయానికి ఉన్న ఆస్తులు, భూములు, పూలవనాలు, పనిచేసేవారు, వారి బాగోగుల గురించి అడిగారు. పలకరించారు. లోపతాపాలను విచారించి సరిదిద్ది నిర్దిష్ట కార్యప్రణాళికను రూపొందించారు. శ్రీ రంగనికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల విధి విధానాలను సంకలనం చేసి క్రమబద్ధీకరించారు. సరైన వ్యక్తులను సరైన స్థానాలలో నియమించారు శ్రీరంగ రామానుజులు. ∙ఆచార్య మాడభూషి శ్రీధర్ -
ఆలోచింపజేస్తున్న సెహ్వాగ్ ట్వీట్
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో పోస్టులు ఎంత సరదాగా ఉంటాయో.. ఒక్కోసారి అంత ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. తోటి ఆటగాళ్లపై సెటైర్లు వేయటమే కాదు.. సామాజిక అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో కుల, మతాలపై వీరూ చేసిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్‌లో గాడ్ (దేవుడు) పేరిట వరల్డ్(ప్రపంచం) అనే గ్రూప్‌ను సృష్టించి.. దానికి మనుషులు, ప్రేమ, మానవత్వాన్ని యాడ్ చేశారు. ఆపై మనుషులు దానికి కులం, మతాల్ని జత చేర్చగా... భరించలేని దేవుడు గ్రూప్ నుంచే ఎగ్జిట్ అయిపోయాడు. దీనిని వీరూ సరిగ్గా సరిపోయేది అంటూ తన ట్విట్టర్లో గురువారం పోస్టు చేశాడు. పాతదే అయినప్పటికీ వీరూ అకౌంట్లో ఇది దర్శనమివ్వటం.. ఆలోచింపజేసేలా ఉండటంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కూడా మళ్లీ దానిని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. Very apt ! pic.twitter.com/bDBVy2T1YX — Virender Sehwag (@virendersehwag) January 4, 2018 -
మొండి కులస్తులను ఆదుకోవాలి
నల్లగొండ ,నకిరేకల్ : సంచార జాతుల్లో భాగమైన మొండివారి కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వండూరి ఇమానియేల్‌లు పిలుపునిచ్చారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన మొండివారి కుల హక్కుల సాధన సమితి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. సమాజంలో వివక్షకు గురవుతూ దుర్భరమైన జీవనం గడుపుతున్న తమ కులస్తులను ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేసి జీవనోభృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక అనంతరం సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎడ్ల చిన్నవెంకయ్య, జిల్లా అధ్యక్షుడిగా ఆవుల కృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎడ్ల కవిత, ఆవుల రాములు, జవ్వాది మధు, శ్రీను, గోపగాని సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా నండూరి ఇమానియేల్, సహాయ కార్యదర్శులుగా నాగిల్ల బక్కయ్య, ఆవుల రాములు, ప్రచారకార్యదర్శిగా ఎడ్ల మల్లయ్య, గోపగాని వెంకన్న, ఆవుల ముత్యాలు, కోశాధికారిగా ఎడ్ల లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులుగా ఆవుల వెంకన్న, నండూరి గోపాల్, ఎడ్ల సురేష్, రాజ, పెద్దులు, బాలరాజు, మల్లయ్య, శంకర్ సోములు ఎన్నికయ్యారు. -
ఇదే బంగారు తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘‘బంగారు తెలంగాణ అంటే ఏమిటో కాదు.. మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవడమే. మూడున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కులవృత్తులపై ఆధారపడ్డ వారికి ఆర్థిక సహకారమిస్తూ సంపదను సృష్టిస్తున్నాం. ఆర్నెల్లలో రాష్ట్రవ్యాప్తంగా 1.6 లక్షల మందికి 33 లక్షల గొర్రెలు పంపిణీ చేశాం. వాటికి 13 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయి. కదిలే ఆస్తిని సృష్టించాం. వాటిని విక్రయిస్తే ఆర్థిక అభివృద్ధి జరిగినట్లే. అభివృద్ధి, బంగారు తెలంగాణ అంటే ఇదే. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీ గొర్రెలు ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నాయి. వాటిని నేను అస్సలు పట్టించుకోను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని విధాలా పురోగతి బాట పట్టించడమే నా లక్ష్యం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట్ సమీపంలో యాదవ, కురుమ సంక్షేమ భవన నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. పదెకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘యాదవ, కురుమ భవనాలు దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు వసతి, విద్య, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా ఉండాలి. పేద కురుమ, యాదవ పిల్లలకు పెళ్లిళ్లు సైతం ఇక్కడే జరిగేలా చూడాలి. యాదవులు, కురుమల సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోండి. ఐక్యంగా ఉంటే సాధ్యం కానిదేదీ ఉండదు. సంక్షేమ నిధి భారీగా ఉండాలి. మూలధన నిధి కింద నేను బీసీ సంక్షేమ శాఖ ద్వారా రూ.కోటి ఇస్తున్నా. యాదవ, కురుమ వ్యాపారులు, నేతలు, విదేశాల్లో స్థిరపడిన వారు విరాళాలు ఇవ్వండి. వందల కోట్లలో నిధి జమ చేయండి. మీ సామాజిక వర్గాల అభివృద్ధికి వినియోగించుకోండి’’అని పిలుపునిచ్చారు. దీంతో సభికులు ఒక్కసారిగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో మాంసం, చేపలకు భారీ డిమాండ్ ఉంది. ప్రతిరోజు 650 లారీల గొర్రెలు, 25 లారీల చేపల్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాదవ, కురుమ, ముదిరాజ్‌లు 70 లక్షల మంది ఉన్నారు. అంటే సుమారు 1.4 కోట్ల చేతులున్నాయి. వీళ్లకు పనిచెప్తే పరిస్థితి మరోలా ఉంటుందని భావించా. ఇందులో భాగంగానే గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టా. రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ, చేప విత్తనాల పంపిణీ చేశాం. దేశంలో అత్యంత ఎక్కువ గొర్రెల సంపదç ఉన్నది మన రాష్ట్రంలోనే. ఈ ఏడాది 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలనుకున్నాం. ఇప్పటివరకు 33 లక్షలు పంపిణీ చేశాం. అర్హులైన ప్రతి కుటుంబానికీ వీటిని ఇచ్చి తీరుతాం. అవసరమైతే మరో రూ.5 వేల కోట్లు కేటాయిస్తాం’’అని సీఎం స్పష్టం చేశారు. కొన్నిచోట్ల గొర్రెలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, మీడియాలో వార్తలు సైతం వస్తున్నట్లు పేర్కొన్నారు. అలా విక్రయించవద్దని, అలాంటివారిని యాదవ, కురుమ సంఘ సభ్యులు కట్టడి చేయాలని, సంపదను మధ్యలో విక్రయిస్తే లాభం ఉండదని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లపై అధ్యయనం లక్షల సంఖ్యలో ఉన్న గొర్రెలను నేరుగా కాకుం డా మాంసాన్ని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో మటన్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు కురుమ, యాదవ యువత నడుం బిగించాలన్నారు. ‘‘ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. మంత్రి తల సాని నేతృత్వంలో జర్మన్‌లాంటి దేశాల్లో పర్యటించాలని సూచిస్తున్నా. పూర్తిస్థాయి అధ్యయనం చేశాక ఇక్కడి యువతకు అవగాహన కల్పించాలి. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా’’అని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవ, కురుమలే కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తోం దన్నారు. ‘‘బీసీల్లో వెనుకబడ్డ వారిని అభివృద్ధి చేసేందుకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. రజకు లు, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు ఇచ్చాం. రజకులకు అత్యాధునిక సదుపాయాలతో ధోబీ ఘాట్లు, వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయిస్తాం. నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడల్ సెలూన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. విశ్వబ్రాహ్మణులకు పనిముట్లు, చేనేతలకు 50% రాయితీపై రసాయనాలు, రంగులు ఇస్తున్నాం. సంచార జాతులకు మరిన్ని పథకాలు తెస్తాం’’ అని సీఎం తెలిపారు. మా మంత్రులు సమర్థులు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు అత్యంత సమర్థవంతులని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. పశువులు, గొర్రెలు రోగాల బారిన పడకుండా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంచార వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చిందని, అది ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆలోచనే అని పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్.. వసతిగృహాల్లో పిల్లలకు సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందించాలని చెప్పినట్లు గుర్తుచేశారు. కేబినెట్లో సమర్థ నాయకులు ఉన్నందునే రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో రాష్ట్రం దేశంలోనే టాప్ స్థానంలో ఉందన్నారు. అలాగే అత్యంత ఎక్కువ సంఖ్యలో గురుకులాలు స్థాపించి ఆదర్శంగా నిలిచిందని, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి మరో మెట్టు ఎక్కిందని అన్నారు. రాజ్‌నాథ్ షాక్ తిన్నారు వచ్చే ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8 వేలు అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘రూ.8 వేల ఆర్థిక సాయంపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నన్ను అడిగారు. రైతులకు ఇంతమొత్తంలో డబ్బులు ఇస్తున్నావు. వాటిని తిరిగి ఎలా చెల్లిస్తారని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను స్పందిస్తూ అవి రైతులు తిరి గి ఇవ్వాలని కాదు. ప్రభుత్వం తరఫున సాయం మాత్రమే అని చెప్పా. వెంటనే ఆయన షాక్ తిని కుర్చీలో కూలబడ్డారు. ఆ తర్వాత స్పందిస్తూ ‘కేంద్ర రాజకీయా ల్లోకి వస్తున్నావా..?’అని ప్రశ్నించారు. నేను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లను. రాష్ట్రం లోనే ఉంటా. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా’’అని వివరించారు. ఎగ్గె మల్లేశాన్ని ఎమ్మెల్సీ చేస్తానని, యాదవుల నుంచి ఒకరికి రాజ్యసభలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా కర్ణాటక మంత్రి రెవన్న హాజరై రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశా నికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఇక్కడి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం సభికుల్లో ఆసక్తి కలిగించింది. సమావేశంలో మంత్రులు జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, ఈటల, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దలు అంగీకరించలేదని..
వేలూరు: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుడియాత్తం సమీపంలో శనివారం జరిగింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కనవాయిమోటూరుకు చెందిన వెంకటేషన్ కుమారుడు రామలింగం(25) వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పిచ్చాండి కుమార్తె తిలగ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇద్దరూ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గ్రామం సమీపంలోని ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు తెలిపారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారంతో గ్రామ పరిపాలన అధికారి శంకర్ ఫిర్యాదు మేరకు పరదరామి పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. -
నేరంపై కులం ముద్రా!?
జాతిహితం దిగువ కులాలు, ముస్లింలలో అవినీతి, నేరగ్రస్తత సాధారణమని భావించడం సహేతుకమేనా? లేక పోలీసులు, న్యాయమూర్తుల నుంచి మీడియా, ప్రజాభిప్రాయం వరకు ఈ వ్యవస్థ అణగారినవారి పట్ల చాలా అన్యాయంగా ఉంటున్నదా? ఒకే కేసులో నిర్దోషిగా తేలిన రాజాను ఇంకా దొంగగానే చూస్తుంటే, శిక్షపడ్డ సుఖరామ్‌కు జైలుకు వెళ్లకుండానే గడిచిపోతోంది. అంటే, బంగారు లక్షణ్‌ను జైల్లో మగ్గుతూ చావమని వదిలేసినా, జాదవ్‌కు రాజకీయ పునరావాసం కల్పించడం సాధ్యమేనని అర్థం. అవినీతి, నేరగ్రస్తతలకూ, కులానికి లేదా మతానికి ఏదైనా సంబంధం ఉన్నదా? లేకపోతే, కులాల నిచ్చెన మెట్లపై కిందకు దిగే కొద్దీ మీరు అవినీతికి పాల్పడి (పట్టుబడి) కేసులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ అవుతాయా? వాస్తవాలేమిటో చూద్దాం. 2–జీ కుంభకోణం కేసులో దోషిగా పదిహేను నెలలు విచారణలో ఉన్న ఖైదీగా జైల్లో గడిపి, ఆరేళ్లు విచారణను ఎదుర్కొన్న ఎ. రాజాను నేడు నిర్దోషిగా తేల్చారు. ఆయన దళితుడు. పార్టీలో ఆయన సహ నేత, కేసులో సహ నిందితురాలైన కనిమొళిని కూడా అలాగే నిర్దోషి అని తేల్చారు. ఆమె కూడా వెనుకబడిన కులాలకు చెందినవారే. మధు కోడా (బొగ్గు కుంభకోణంలో ఇటీవలే శిక్ష పడింది), శిబూ సోరెన్ (లంచం తీసుకోవడం, హత్య కేసులను చివరకు కొట్టివేశారు) ఇద్దరూ ఆదివాసులు. ఇక మాయావతి దళిత మహిళ. లాలూప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్ ఓబీసీలు. వీరు ముగ్గురు అవినీతి లేదా లెక్కకు మించిన ఆస్తుల కేసుల్లో దొరికినవారు. ఎప్పటికప్పుడు అప్పటి రాజకీయాలను బట్టి ఈ కేసులు ముందుకు వస్తూ, మరుగున పడిపోతూ ఉంటాయి. అధికారంలో ఉన్న పెద్దలు ఎప్పుడు వారు నోళ్లు మూయాలని లేదా వారి ఆమోదం కావాలని అనుకుంటే అప్పుడు ఆ కేసులను పతాక శీర్షికలకు ఎక్కించే కొత్త సినిమా తయారవుతుంది. ఆ రాజకీయ లక్ష్యం ఏదో నెరవేరిన వెంటనే ఊహించినట్టుగానే అది మరుగున పడిపోతుంది. అతి సుదీర్ఘ కాలపు శిక్షను (పదేళ్లు) అనుభవిస్తున్న హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా జాట్ కులస్తుడు, వెనుకబడిన కులాలకు చెందినవారు కారు. అయినప్పటికీ, కులాల అంత స్తులలో ఆయన కులం సవర్ణుల కంటే దిగువన ఉండేదే. పట్టుబడేవారంతా దిగువ కులాల నేతలే 2008 నాటి పార్లమెంటులో ఓటుకు నోట్లు కుంభకోణాన్ని ఒకసారి వెనక్కు తిరిగి చూడండి. రాజ్‌దీప్ సర్దేశాయ్, సుధీంద్ర కులకర్ణి (అప్పట్లో అద్వానీకి సన్నిహితుడు) ఒకప్పుడు సీఎన్ఎన్–ఐబీఎన్ కోసం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఫలితమది. ఫగ్గన్‌సింగ్ కులాస్తే, అశోక్ అర్గాల్, మహవీర్‌సింగ్ భరోగాలు అందులో ఇరుక్కున్నవారు. వారంతా ఎస్సీ/ఎస్టీలే. అంతకు ముందటి స్టింగ్ ఆపరేషన్‌లో నోటుకు ప్రశ్న కుంభకోణం వెలుగు చూసింది. అందులో ఇరుక్కున్న 11 మంది ఎంపీలు 2005లో పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దాదాపు వారంతా ఎస్సీ/ఎస్టీలే. వారిలో ఆరుగురు బీజేపీకి, ముగ్గురు బీఎస్పీకి, ఒకరు కాంగ్రెస్‌కు, ఒకరు ఆర్జేడీకి చెందిన వారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అగ్ర కులాలకు చెందిన సుప్రసిద్ధ ప్రజా ప్రతినిధులు కూడా లేకపోలేదు. సుఖ్రాం, జయలలిత, సురేష్ కల్మాడీలను చెప్పుకోవచ్చు. అయితే వాళ్లు చాలా కొద్ది మందే. వారికి కేసుల నుంచి తప్పిం చుకునే అవకాశాలూ ఎక్కువే. లేకపోతే వారి కేసులు ఎంతకాలమైనా సాగుతూ పోతూనే ఉంటాయి. వాస్తవం ఏమిటో చూడండి: సుఖ్రామ్ పరుపు కింద డబ్బు దొరికినా, శిక్షపడ్డా ఆయన ఎన్నడూ జైలు శిక్ష అనుభవించాల్సి రాలేదు. ఇప్పుడు 90ల వయసులో ఉన్న ఆయన సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌వాది. బీజే పీని కౌగలించుకుని నేడు ఆ పార్టీలో పునరావాసాన్ని పొందారు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీ ఫిరాయించారు. ఆయన కుమారుడు అనిల్ బీజేపీ ఎంఎల్ఏ. బహుశా హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావచ్చు. బీజేపీలో చేరితే రాజాకుగానీ, ఆయన పిల్లలకు గానీ ఆలాంటి భాగ్యం కలుగుతుందని మీరు ఆశించగలరా? అవినీతి పట్ల నా ‘‘కులతత్వవాద’’ దృష్టిపై విరుచుకు పడటానికి ముందు మీరు దయచేసి నాలుగు వాస్తవాలను చూడండి. ఒకటి, సుఖ్రామ్, రాజా ఇద్దరూ వారు టెలికాం మంత్రులుగా ఉండగానే వారిపైన అవినీతి ఆరోపణలను మోపారు. రెండు, సుఖ్‌రాంకు శిక్షపడగా, రాజాను వదిలిపెట్టారు. మూడు, ఒకరి వద్ద ఆయన పరుపు కిందనే డబ్బు దొరికింది. మరొకరివద్ద విచారణ సాగించిన న్యాయమూర్తి వెటకారంగా ప్రశ్నించినట్టుగా డబ్బు ఎక్కడుందీ? డబ్బు దొరకలేదూ అంటే ఇక అవినీతి ఎక్కడిది? కాబట్టి, నిర్దోషిగా ప్రకటించారు. ఇక నాలుగో వాస్తవం అత్యంత ముఖ్యమైనది. సుఖ్రామ్ బ్రాహ్మణుడు. ఆయన ఏదో ఒకసారి దారి తప్పి ఉంటారంతే. అలాంటివాళ్లు సాధార ణంగా అవినీతికి పాల్పడరు. ఇక రాజా అంటే దళితుడు. అలాంటి వాళ్ల నుంచి అంత కన్నా ఎక్కువ ఏం ఆశించగలరు? అధికారాన్ని, బాధ్యతలను వాళ్లు సక్రమంగా నిర్వహించలేరు అంతే. సాధారణంగా అనుమానించాల్సినవారు వారే. కులాన్ని బట్టే కటకటాలు లెక్కించాలా? ఇక ఇప్పుడు బీజేపీకి చెందిన ఒక ఆసక్తికరమైన ఓ కేసును పరిశీలిద్దాం. రెండు భిన్న సందర్భాల్లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు లంచం పుచ్చుకుంటూ కెమెరాకు దొరికిపోయారు. ఒకరు, దిలీప్‌సింగ్ జాదవ్. 2003లో రూ. 9 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఆయన అగ్ర కులస్తుడు. బీజేపీ సంతోషంగా ఆయనకు పునరావాసం కల్పించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టింది. ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించారు. పైగా ‘‘డబ్బే దేవుడు కాదు, ఆ దేవుని సాక్షిగా చెబుతున్నా డబ్బు దేవుని కంటే తక్కువదేం కాదు’’ అంటూ కెమెరాకు చిక్కారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పుడు జూనియర్ మంత్రిగా ఉన్న ఆయన లంచం ఇచ్చే వ్యక్తితో కలసి బ్లాక్ లేబుల్ సీసాను ఖాళీ చేస్తూ చెప్పారీ మాట. మరొకరు తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో (2001) కేవలం రూ. 1 లక్ష తీసు కుంటూ పట్టుబడ్డ బంగారు లక్ష్మణ్. జాదవ్ కేవలం జూనియర్ మంత్రే. కానీ బంగారు లక్ష్మణ్ నాటి బీజేపీ జాతీయ అధ్యక్షులు. అయితేనేం, ఆయన ముందుగా ఒక దళితుడు. నేటికి కూడా బీజేపీలో అంత ఉన్నత స్థాయికి చేరిన ఒకే ఒక్క దళితుడు ఆయనే. ఆ పార్టీ ఆయనతో తమకు సంబంధం లేదంది, ఖండించింది, పార్టీ నుంచి వెళ్లగొట్టింది, ఏకాకిని చేసింది. ఆయన జైలుకు వెళ్లారు. ఆ తెహెల్కా కేసుల్లో తనంత తాను ఒంటరిగా పోరాడుతూనే మర ణించారు. ఆ స్టింగ్ ఆపరేషన్‌లో జైలుకు వెళ్లిన ఏకైక నేత ఆయనే. జాదన్ను ఇంకా కాపాడుకుంటూనే వస్తున్న ఆ పార్టీ లక్ష్మణ్‌ను అంటరానివాడన్నట్టు గానే చూసింది. ఇది దురదృష్టకరమైన అభివర్ణనే అయినా అలా చెప్పక తప్పడం లేదు. ఈ వాదనను మీరు న్యాయవ్యవస్థకు విస్తరింపజేయాలం టారా? మన ప్రధాన న్యాయమూర్తులలో ఎక్కువ మంది అవినీతిపరులని చాలా మందే పరోక్షంగా సూచించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆ ఉద్యమంలోని పలువురు ప్రము ఖులు సైతం అలా అన్నారు. కానీ పేరు పెట్టి దాడిని ఎక్కుపెట్టింది ఎవరి పైన? జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఒక్కరిపైనే. ఆయన దళితుడు. దశాబ్ది దాటినా నేటికీ ఆయనకు వ్యతిరేకంగా కనిపెట్టింది ఏదీ లేదు. వ్యవస్థలోనే ఉన్న పక్షపాతం ఈ విషయాన్ని మరింతగా శోధిద్దాం. వృత్తిపరమైన ఓ చిన్నపాటి పొరపాటు చేసినందుకు... ఉన్నత న్యాయస్థానంపట్ల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డందుకు జైలుకు వెళ్లిన ఏకైక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కన్నన్. ఆయన దళితుడు. గణనీయులైన ముగ్గురు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినా వారు ఏ మచ్చా అంటకుండా బయటపడ్డారు. ఈ మూడు కేసులనూ సమాధి చేసేశారు. ఒక కేసులోనైతే, ఆ ఆరోపణల గురించి మాట్లాడటానికే వీల్లేదని మీడియాపై నిషేధం విధించేంత వరకూ కూడా ఒక హైకోర్టు వెళ్లింది. ముగ్గురిలో ఇద్దరు సుప్రీం కోర్టు చేరగా, ఒకరు పదవీ విరమణానంతరం చేపట్టగల ఒక ఉన్నత పదవిని అలంకరిం చారు. చివరగా ఒక్క మాట చెప్పాలి. వీరిలో ఏ ఒక్కరూ కింది కులాలకు చెందిన వారు కారు. కాబట్టి సాధారణ అనుమానితులు కారు. ఇది, సామాజిక వ్యవస్థ అనే గోపురంలోని శిఖరాగ్ర భాగం ఒక నియ మంగానే ‘‘ఎక్కువ పరిశుద్ధమైనది’’గా ఉండటం ఫలితం కావచ్చా, లేక దిగువ సగ భాగం పట్ల ఈ వ్యవస్థ బాగా అన్యాయంగా ఉండటం ఫలితం కావచ్చా? మన దేశంలో పదవులు ఉద్యోగాల వంటి స్థానాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ముస్లింల సంఖ్య వారి జనాభాతో ఏమా త్రం పొంతన లేకుడా అతి తక్కువ సంఖ్యలో ఉన్నది. ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసిన సచార్ కమిటీ నివేదిక సైతం అదే విషయాన్ని తెలిపింది. జనాభాతో పొంతన లేకుండా ముస్లింలు ఎక్కువగా ఉన్నది ఒక్క జైళ్లలోనే. కాబట్టి హిందువుల కంటే ముస్లింలలో నేరగ్రస్తులయ్యే ధోరణి ఎక్కువగా ఉంటుందా, లేక వ్యవస్థ వారి పట్ల బాగా అన్యాయంగా ఉన్నదా? ‘ఐసీ తైసీ డెమోక్రసీ’ (పరిహాసాస్పద ప్రజాస్వామ్యం) అనేది బాగా ప్రాచుర్యం పొందిన రంగస్థల ప్రదర్శనల్లో ఒకటి. మన దేశంలో హత్య నేరానికి ఉరిశిక్షను అనుభవించేవారిలో అత్యధికులు మైనారిటీలు లేదా దిగువ కులాల వారేనని ఆ రాజకీయ వ్యంగ్య ప్రదర్శన మనకు గుర్తుచేస్తుం టుంది. ఒక బ్రాహ్మణున్ని ఉరితీస్తామంటే వారు కత్తులు నూరుతారు, అతగాడు ఎవరినో కాదు మహాత్మా గాంధీనే హత్య చేసినా సరే. కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. అవినీతి, నేరగ్రస్తతల విషయంలో జన్యు పరమైన అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? లేకపోతే ఈ వ్యవస్థ... పోలీసులు, న్యాయమూర్తుల నుంచి మీడియా, ప్రజాభిప్రాయం వరకు బడు గులకు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారినవారి పట్ల బాగా అన్యా యంగా ఉంటున్నదా? పోలీసు కాల్పులకు గురయ్యే లేదా జైళ్లలో జనాభాతో పొంతన లేకుండా ఎక్కువ సంఖ్యలో ఉండే ఆఫ్రికన్–అమెరికన్ల సంఖ్యను చూడండి. కొన్ని చోట్ల జాతి అనేది మన దేశంలోని కులం స్థానంలో నిలు స్తోంది. కొన్ని మైనారిటీలు, ఆదివాసులు కూడా మన దేశంలో అదే కోవకు చెందుతుండటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. ఈ పక్షపాతం కొనసాగుతూనే ఉంటుంది. నిర్దోషిగా తేలిన రాజాను ఇంకా దొంగగానే చూస్తుండగా, శిక్షపడ్డ సుఖరామ్ జైలుకు వెళ్లకుండా ఈ వ్యవస్థ కాపాడు తుంది. అంటే, బంగారు లక్షణ్‌ను ఒంటరిగా జైల్లో మగ్గుతూ చావమని వదిలేసినా, జాదవ్‌కు రాజకీయ పునరావాసం కల్పించగలుగుతుందని కూడా అర్థం. ఇలాంటి చేదు ఆలోచనలతో మీ క్రిస్మస్ వారాంతాన్ని పాడు చేస్తు న్నందుకు మన్నించండి. వాస్తవం ఏమిటో సరిచూసుకోవడానికి మంచి సమయం అంటూ ఏదీ ఉండదు. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
వారిని ఫోన్లో దూషించడం నేరమే!
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించడం నేరమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి ఓ కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నజీర్‌ల బెంచ్ నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం నిమ్నవర్గాల వారిని బహిరంగ ప్రదేశాల్లో కులం పేరుతో దూషించడం నేరం. ఇందుకు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి గతంలో నిమ్న వర్గానికి చెందిన ఓ మహిళను కులం పేరుతో దూషించాడు. అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఊళ్లలో ఉన్నపుడు ఫోన్లో మాట్లాడుకున్నారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం ఫోన్ సంభాషణ ‘బహిరంగ ప్రదేశం’ నిర్వచనం కిందకు రాదనీ, కాబట్టి కేసును కొట్టేసి, విచారణను నిలిపివేయాలని నిందితుడు కోర్టును కోరారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి నిందితుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడిపై విచారణ జరపాల్సిందేనని హైకోర్టు గత ఆగస్టు 17న స్పష్టం చేసింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ ఫోన్ సంభాషణను బహిరంగ ప్రదేశంలో మాట్లాడినట్లుగా పరిగణించకూడదనీ, కేసును కొట్టేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరిస్తూ, ఫోన్లో మాట్లాడిన సమయంలో నిందితుడు బహిరంగ ప్రదేశంలో లేడని నిరూపించుకోవాలంది. -
ఒకే గ్రామం.. ఒకే కులం
బొబ్బిలి రూరల్: ఏ గ్రామంలోనైనా వ్యాపారులు, వడ్రంగులు, రజకులు, క్షురకులు, బ్రాహ్మణులు తదితర కులాల ప్రజలు నివసిస్తుంటారు. కానీ ఒకే కులస్తులున్న గ్రామంగా బొబ్బిలి మండలం పిరిడి పంచాయతీ కొల్లివలస పేరొందింది. ఈ గ్రామంలో అందరూ శ్రీ శయన (సెగిడీలు) కులస్తులే. బొబ్బిలికి 8 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామానికి పిరిడి వరకు బస్సులో వెళ్లి 2కిలోమీటర్ల దూరం నడిస్తే చేరుకోవచ్చు. గ్రామంలో 47 కుటుంబాలు, 161మంది జనాభా నివసిస్తోంది. వీరితో పాటు ఇతర ప్రాంతాల్లో వీరి బంధువులు దాదాపు 37మంది వరకు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా పండగల సమయంలో కుటుంబాలతో సహా వస్తుంటారు. గ్రామంలో అనేక మంది వ్యవసాయం, ఉపాధి, ఇతర పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వీరికి ఏ వస్తువులు కావలసి వచ్చినా పిరిడి గ్రామానికి వెళ్లి తెచ్చుకుంటారు. రజకులు, నాయీ బ్రాహ్మణులు పిరిడి నుంచి వస్తుంటారు. భోగి జరుపుకోని గ్రామం వీరు భోగి పండగ నిర్వహించరు. పూర్వం గ్రామంలో భోగి రోజు ఒకాయన మరణించడంతో ఆ పండగను జరుపుకోవడం మానేశారు. సంక్రాంతి పండగను మాత్రం కుటుంబాలతో కలిసి నిర్వహిస్తారు. మొత్తం 40, 50మంది కలిసి పండగలను జరుపుతారు. ఇలా కోలా వెంకయ్య కుటుంబానికి చెందిన 41 మంది సభ్యులు గత ఏడాది సంక్రాంతి జరిపారు. ఎవరికీ అడ్డు పెట్టలేదు గ్రామంలో అందరం ఒకే కులస్తులం ఉంటున్నాం. మేం ఎవరినీ రావొద్దని అడ్డుపెట్టలేదు. అయినా ఎవరూ రాలేదు. ఈ గ్రామంలో నివాసం ఉండటం లేదు. – భోగాది సత్యవతి, కొల్లివలస అభివృద్ధి లేని గ్రామం మాకు తెలిసినప్పటి నుంచి గ్రామంలో అందరూ శ్రీశయన కులస్తులే ఉంటున్నారు. అందరూ వెనుకబడిన వారే. గ్రామ రహదారి బాగాలేదు. రవాణా సదుపాయం లేదు. ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి – కోల బలరాం, అధ్యక్షుడు, జిల్లా శ్రీ శయన సంఘం -
వేరే కులమని ఇల్లాలిని గెంటేశారు
తుమకూరు: ప్రేమవివాహం చేసుకున్న ఏడేళ్ల అనంతరం కులం పేరుతో దూషిస్తూ భర్త, కుటుంబ సభ్యులు మహిళను ఇంట్లోంచి గెంటేసిన ఘటన పట్టణంలోని సిద్దేమణ్ణినపాళ్యలో శుక్రవారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన వేర్వేరు కులాలకు చెందిన రాధా, ఉమేశ్‌లు ఏడేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వేరే కులానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని ఉమేశ్ కుటుంబ సభ్యులు ఉమేశ్‌ను కూడా తమవైపు తిప్పుకొని గత కొద్ది కాలంగా రాధాను వేధించసాగారు. అయితే వీటిన్నింటిని రాధా లెక్కచేయకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఉమేశ్ అతడి కుటుంబ సభ్యులు రాధను ఇంట్లోంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తమకు న్యాయం చేయాలంటూ ఉమేశ్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. -
"కుల"కలం
ఒకప్పుడు వారు గిరిజనులు. ఇప్పుడు కారు. ఒకప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు గుర్తించం పొమ్మంటోంది. అర్హత ఉన్నా గిరిజనులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గిరిజనులుగా గుర్తించమని ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకూ గిరిజనులుగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ససేమిరా అంటోంది. ఏనేటికోండ్రు కులం గిరిజనుల గోడును నిర్లక్ష్యం చేస్తోంది. విజయనగరం, బలిజిపేట (పార్వతీపురం): నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న ఏనేటి కోండ్రు కులస్తులను ప్రభుత్వం గిరిజనులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గ్రామంలో 15 కుటుం బాలు వందేళ్లకు పైగా నివసిస్తున్నాయి. ఎస్టీలైన వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వీరిని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలసలోనూ గుర్తిస్తుండటం విశేషం. 1990 వరకు తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువపత్రాలు ఇచ్చారని.. ఆ తర్వాతే నిలిపివేశారని కుల పెద్దలు నాగభూషణరావు, నీలకంఠం తెలిపారు. తమ కులస్తులు కొందరు చదువుకునేటప్పుడు ఎస్టీలుగానే గుర్తించి కులధ్రువీకరణ మంజూరు చేశారని, పాఠశాల టీసీల్లో కూడా ఎస్టీలుగా ధ్రువీకరించి ప్రస్తుతం కాదనడం సమంజసంగా లేదని తెలిపారు. ఎందుకు గుర్తించరు? నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న తమ కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోని తమ కులస్తులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నాయని ఎం.వెంకటరమణ, ఆర్.ఫకీరు, ఎం.గణపతి, మురళి తెలిపారు. కులపరంగా ఆచార సంప్రదాయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఎస్టీలం ఎలా కాకుండా పోతామని ప్రశ్నిస్తున్నారు. అంధకారంలో పిల్లల భవిత కుల ధ్రువపత్రాలకు నిరాకరిస్తుండటంతో 1990 అనంతరం పిల్లల చదువుల కోసం ఓసీలుగానే బడిలో చేర్పించి చదివిస్తున్నామని తెలిపారు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామన్నారు. నిరుపేదలమైన తమకు జీవనాధారం కష్టమై పిల్లలను చదివించడం భారంగా ఉందని తెలిపారు. వేలకు వేలు చెల్లించలేక తక్కువ చదువులతో మాన్పించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోయా నాకు 2005లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం లేనందున వచ్చిన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి నిరుత్సాహానికి గురయ్యాను. నేటికీ మేము ఏ కులస్తులమో అర్థం కావటం లేదు. – ఎం.గణపతి, నారాయణపురం పదోన్నతి రాలేదు అంగన్వాడీ కార్యకర్తగా చేస్తున్న నాకు 2011లో సూపర్వైజర్గా పదోన్నతి లభించింది. కానీ కుల ధ్రువపత్రం లేనందున పదోన్నతి నిలిచిపోయింది. మా పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. – ఎం.సరోజిని, నారాయణపురం పరిశీలిస్తా మీసేవలో కుల ధ్రువీకరణ నిమిత్తం దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అవకాశం ఉంటే సహకరిస్తాం. అన్నీ పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తాం.– బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లా.?
జస్టిస్ ఈశ్వరయ్య భావాలు ఆమోద యోగ్యం కాదు ఏపీ బీసీ సంఘం నాయకుల ఖండన డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం) : కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు బీసీలకు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు, ఉత్తరాంద్ర బీసీ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు తెలిపారు. నగరంలోని ఓ హాటల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. నాయకులు మాట్లాడుతూ కేవలం వృత్తి ప్రాతిపదికగానే వెనుకబాటుతనాన్ని గుర్తించాలనడం.. రాజ్యాంగంలో పొందుపరచిన సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని విస్మరించడమే అవుతుందన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల పేదరికంతో రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇతర రంగాల్లో వేతన కూలీలుగా మారుతున్న వారికి మెరుగైన ఉపాధి కల్పించేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలే గానీ.. సాంఘిక వెనుకబాటుతనం నెపంతో అర్హత లేని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలనడం.. రిజర్వేషన్ల మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కులాన్ని, వృత్తిని వేరు చేస్తే ఎలా.? జస్టిస్ ఈశ్వరయ్య కులాన్ని, వృత్తిని విడదీసి.. కుల వృత్తులు ఏర్పడిన చారిత్రక నేపథ్యాన్ని నిరాకరిస్తున్నారన్నారు. కులంతో సంబంధంలేని ఇతర వృత్తులకి సాంఘిక న్యూనత లేదని, అలాంటప్పుడు నిరుద్యోగం, పేదరికం కారణంగా చేస్తున్న కూలీ పనులకి మధ్య ఉన్న సాంఘిక తేడాని ఈశ్వరయ్య వంటి న్యాయమూర్తి గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అర్హత లేని కులాలను బీసీల్లో చేర్చే అవకాశం లేకుండా కట్టుదిట్టంగా చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడంతో పాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంట్లో ఏకకాలంలో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొలగాని కిషోర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ని శ్రీనివాసరావు, విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బుగత నరసింగరావు, గొర్లె శ్రీనివాసనాయుడు, వాసుపల్లి రాజశేఖర్, కోలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం
-
అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం
గోరఖ్‌పూర్: కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారి సొంత పట్టణం గోరఖ్‌పూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ... ఎవరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల గెలుపు సంబరాల్లో అత్యుత్సాహం వద్దని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు. అలా చేస్తే శాంతి భద్రతలకు అరాచక శక్తులు విఘాతం కలిగించే అవకాశముందన్నారు. అమ్మాయిలతో అబ్బాయిలు కలిసి కనిపిస్తే యాంటీ రోమియో స్క్వాడ్లు ఇబ్బంది పెడుతు న్నాయన్న విమర్శలపై స్పందిస్తూ.. అమా యకుల్ని వేధించవచ్చని పోలీసుల్ని ఆదేశిం చామని చెప్పారు. ఈవ్టీజర్ల వల్ల స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేకపోతున్నామంటూ ఎందరో అమ్మాయిలు తనకు ఫోన్ చేశారని, అందుకే స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. -
ఇక చకచక ధ్రువీకరణ పత్రాలు
ఏలూరు సిటీ : విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు జేసీ పి.కోటేశ్వరరావు తెలిపారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఎ) అనిల్ చంద్రపునీత బుధవారం విజయవాడ నుంచి జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత మాట్లాడుతూ ఏప్రిల్ 15లోగా విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలి్సందిగా సూచించగా జేసీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల చెంతకే మీ సేవ కేంద్రాలను తరలించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అక్కడికక్కడే జారీ చేసే ప్రక్రియ పటిష్టవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కే.హైమావతి, సూపరింటెండెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. -
నందనపల్లె సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు
కర్నూలు: కర్నూలు మండలం నందనపల్లె గ్రామ సర్పంచ్ సుజాత, ఆమె భర్త సురేష్గౌడ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గ్రామ పాలనలో భాగంగా తనపై కొన్ని విషయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి చేయడమే కాకుండా, కులం పేరుతో సర్పంచు ధూషించినట్లు గ్రామ కార్యదర్శి గోవిందు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పంచుపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. అయితే కార్యదర్శి గోవిందు పరిపాలన విషయంలో తమకు సహకరించడం లేదంటూ సర్పంచ్ సుజాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కౌంటర్ కేసు నమోదైంది. 506, 509 సెక్షన్ల కింద కార్యదర్శి గోవిందుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
కులాల కుమ్ముడు
భీమవరం :తెలుగుదేశం పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆశావహులు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తమకు ఆదినుంచీ అన్యాయమే జరుగుతోందని.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపడమే కాకుండా కులాల కోణాన్ని సైతం ప్రయోగిస్తున్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరంతా సామాజిక వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలను వేడెక్కించారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వీరవల్లి చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అప్పట్లో చంద్రశేఖర్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించినా చివరకు అదే సామాజిక వర్గానికి చెందిన అంగర రామ్మోహనరావుకు ఎమ్మెల్సీ పీఠం కట్టబెట్టింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తనయుడు జగదీష్ భీమవరం అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు టీడీపీలో చేరిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సీటు దక్కించుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. వీరంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ విషయంలోనూ వర్గాలవారీగా విడిపోయి ఆ పదవి దక్కించుకునేందుకు యత్నిం చి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని సీనియర్ నాయకుడైన మెంటే పార్థసారథికి కట్టబెట్టేలా అంతా కలిసి ప్రయత్నిద్దామని ఎమ్మెల్యే పులపర్తి అంజి» êబు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ప్రకటించడంతో కులం కోణం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడతారా అంటూ కొందరు నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెంటే పార్థసారథితోపాటు గాదిరాజు బాబు, వీరవల్లి చంద్రశేఖర్ తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామ్మోహనరావు ఇదే పదవి కోసం తిరిగి ప్రయత్నిస్తుండగా.. ఏలూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈ పదవిపై కన్నేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినందున ఈ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో అంబికా ఉన్నారు. ఇక్కడా సామాజిక కోణమే నడుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన టీజీ వెంకటేష్‌కు ఇచ్చినందున ఎమ్మెల్సీ పదవి ఈయనకు ఇవ్వకపోవచ్చని టీడీపీలో చర్చ సాగుతోంది. మరోవైపు బీసీ కోటాలో ఏలూరు నుంచి సైదు సత్యనారాయణ, తణుకు నుంచి డాక్టర్ దొమ్మేటి సుధాకర్, వావిరాల సరళాదేవి, తాడేపల్లిగూడెం నుంచి కిల్లాడి ప్రసాద్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సామాజిక చిచ్చు రగులుస్తున్న పదవుల వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియక తెలుగు తమ్ముళ్లు తికమక పడుతున్నారు. -
కులాల కురుక్షేత్రం యూపీ
త్రికాలమ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్యా(ఓ)టింగ్ మొదలయింది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ జరిగిన శనివారంనాడే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ మీరట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న ప్రథమ ఘట్టం ఓటింగ్ జరగబోయే పశ్చిమోత్తరప్రదేశ్లో బీజేపీ బలమైన శక్తి. ఆగ్రా నుంచి మథుర వరకూ, ఘజియాబాద్ నుంచి మీరట్, ముజఫర్‌నగర్ వరకూ ఆ పార్టీకి జనాదరణ విశేషంగా ఉంది. చరణ్‌సింగ్ కుమారుడు అజిత్‌సింగ్ నాయ కత్వంలోని రాష్ట్రీయలోక్‌దళ్ (ఆరెల్డీ) అభ్యర్థులు లేకపోతే జాట్, క్షత్రియ ఓట్లలో అధికభాగం బీజేపీకే పడేవి. 2014లో ఆరెల్డీని వదిలి వెళ్ళిన జాట్లు ఆ పార్టీకి తిరిగి వస్తున్నారు. వడ్డీ సహితంగా రైతుల రుణాలు సంపూర్ణంగా మాఫ్ చేస్తామని పరివర్తన సభలో నరేంద్రమోదీ ప్రకటించారు. తమ పార్టీ స్కాంకు వ్యతిరేకంగా పోరాటం నిరవధికంగా సాగిస్తుందని చెబుతూ, ఇంగ్లీషు మాట స్కాంలోని అక్షరాలలో ‘ఎస్’ అంటే సమాజ్‌వాదీ అనీ, ‘సి’ అంటే కాంగ్రెస్ అనీ, ‘ఏ’ అంటే అఖిలేశ్ అనీ ‘ఎం’ అంటే మాయావతి అనీ అభివర్ణించారు. పశ్చిమంలోనే కాదు మొత్తం ఉత్తరప్రదేశ్‌లో మోదీకి జనాకర్షణశక్తి ఏ మాత్రం తగ్గలేదు. 2014లో మొత్తం 80 స్థానాలలో 71 స్థానాలు గెలుచుకున్నప్పటి ప్రాబల్యం చెక్కుచెదరలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత ఉన్నప్పటికీ మోదీకి ప్రతికూలంగా మారలేదు. ప్రస్తుతానికి అత్యంత జనప్రియనేత మోదీనే. ఈ విశ్వాసం మితిమీరితే అల సత్వం పెరిగి బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. యూపీలో సాగుతున్న సం‘కుల’ సమరంలో ప్రధాన పార్టీలన్నీ కులాల లెక్కల ప్రకారమే అభ్యర్థులను నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోనూ జరుగుతున్న తంతు ఇదే. ముఖ్యంగా యూపీలో ఎన్నికలంటే కులాలు, మతాల మధ్య కుమ్ములాటే. ఏ రెండు ప్రధాన కులాలు లేక వర్గాలు ఒక్కటైనా గెలుపు ఖాయం. రాష్ట్ర జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింలు, 20.5 శాతం ఉన్న దళితులూ, 40 శాతానికి పైగా ఉన్న ఓబీసీలూ, 12 శాతం ఉన్న బ్రాహ్మణులూ పార్టీల జయాపజయాలను నిర్ణయించే కీలక స్థితిలో ఉన్నారు. 2012లో యాదవులూ, ముస్లింలూ ఒక్క తాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ పార్టీకి మొత్తం 403 స్థానాలలో 224 స్థానాలు సాధించిపెట్టారు. తిరిగి అదే సమీకరణ సాధించడం కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భుజం కలిపారు. ముస్లిం ఓట్లు చీలకుండా ఉండాలంటే సమా జ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అత్యవసరమని భావించి అందుకు అనుగుణంగా పావులు కదిపిన రణకౌశలం యువ ముఖ్యమంత్రిది. ఇందుకోసం తండ్రి ములాయంసింగ్ యాదవ్‌నీ, బాబాయ్ శివపాల్ యాద వ్నూ ఎదిరించి పోరాడిన రాజకీయ చతురుడు. వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియదు కానీ అఖిలేశ్ చేసింది మంచి ప్రయత్నం. రెండోసారి గెలిచి యూపీలో చరిత్ర సృష్టించాలంటే ఇది ఒక్కటే మార్గం. కాంగ్రెస్‌తో పొత్తు వద్దేవద్దంటున్న నేతాజీ ములాయం మాటకు అఖిలేశ్ కట్టుబడి ఉన్నట్లయితే నిస్సందేహంగా మాయావతికి విజయం చేకూరేది. కాంగ్రెస్–ఎస్పీ కూటమి బీజేపీని నిలువ రించే అవకాశం ఉన్నదని ముస్లింలు భావిస్తున్నారు కనుక ఎస్పీతోనే వారు కొన సాగుతున్నట్టు కనిపిస్తున్నారు. మాయావతి వ్యూహం దళిత ఓట్లకు ముస్లిం ఓట్లు తోడయితే అయిదోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని లెక్కలేసుకున్న మాయావతి ముస్లిం అభ్యర్థులను 97 నియోజక వర్గా లలో నిలబెట్టారు. ముస్లింలు ఎటువైపు మొగ్గు చూపితే విజయం అటువైపే. ముస్లింలు మూకుమ్మడిగా ఓట్లు వేయరనీ, బీజేపీ అభ్యర్థిని ఏ పార్టీ అభ్యర్థి ఓడించగలరని స్థానిక ముస్లింలు భావిస్తారో ఆ అభ్యర్థికే వారు ఓటు వేస్తారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ముజఫర్‌నగర్, సహ్రాన్‌పూర్ మత కల హాలు ముస్లింలపై ప్రభావం చూపించాయి. ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ముస్లిం అభ్యర్థులు కాకపోయినా బీజేపీని ఓడించే శక్తి కలిగిన వారికి ఓటు వేస్తారు పార్టీతో నిమిత్తం లేకుండా. ఉదాహరణకు మీరట్ జిల్లా సర్దానా నియోజకవర్గంలో నేను గతవారం పర్యటించినప్పుడు బీఎస్పీ అభ్యర్థి ఇమ్రాన్ ఖురేషీతో మాట్లాడాను. అక్కడ బీజేపీ అభ్యర్థి సందీప్ సోమ్. ముజఫర్‌నగర్ మతకలహాల కేసులో నిందితుడు. ఎస్పీ, ఆరెల్డీ అభ్యర్థులు ఉన్నప్పటికీ ఒకే ఒక ముస్లిం అభ్యర్థి ఇమ్రాన్. ముస్లింలూ, దళితులూ కలిసి ఆయనను గెలిపించే అవకాశం ఉంది. అలీగఢ్‌లో ముస్లింలూ, యాదవులూ కలిసి ఎస్పీ అభ్యర్థిని విజయపథంలో నడిపిస్తారు. తమ పార్టీ విభిన్నమైనదనీ, విలక్షణమైనదనీ బీజేపీ నాయకులు చెప్పుకుం టారు. కాంగ్రెస్ నెహ్రూ–గాంధీ కుటుంబానికి విధేయమైన పార్టీ. ఎస్పీ ములా యంసింగ్ పరివారానికి పెద్దపీట వేస్తుంది. మాయావతి నియంతలాగా బీఎస్ పీని నడుపుతారు. కానీ తమది కార్యకర్తల ప్రతిభాపాటవాలను గుర్తించి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే పార్టీ అని ఇంతవరకూ బీజేపీ నేతలు చెప్పు కొచ్చారు. కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ అవలక్షణాలు బీజేపీకి అంటుకున్నాయి. సోదరీసోదరులకూ, పిల్లలకూ టిక్కట్లు ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టవద్దని నరేంద్రమోదీ ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సహచరులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రధాని మనోగతానికి భిన్నంగా చాలా మంది వరిష్ఠ నేతల బంధుమిత్రులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. బాబ్రీని కూల్చిన ప్పుడు యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్‌సింగ్ ఇప్పుడు స్వయంగా గవర్నర్. ఆయన కుమారుడు పార్లమెంటు సభ్యుడు. కల్యాణ్‌సింగ్ మనవడికి పార్టీ టిక్కెట్టు ఇచ్చారు. దేశీయాంగమంత్రి రాజనాథ్సింగ్ కొడుకు పంకజ్‌కు పార్టీ టిక్కెట్టు ఇవ్వడం కోసం నాయిడాలో ప్రస్తుతం ఎంఎల్ఏగా ఉన్న విమలా బాతమ్కు మొండిచేయి చూపించారు. రాజనాథ్సింగ్ బంధువు నారాయణ్ సింగ్ రాణేకు ఉత్తరాఖండ్‌లో పార్టీ టిక్కెట్టు లభించింది. లలిత్ టాండన్ కుమా రుడు గోపాల్ టాండన్, బ్రహ్మదత్ ద్వివేదీ తనయుడు సునీల్‌దత్ ద్వివేదీ, బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ కుమారుడు ప్రతీక్శరణ్ సింగ్ తదితరులు మోదీ అభి మతానికి విరుద్ధంగా టిక్కెట్లు సంపాదించుకున్నారు. పక్కనే ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ కుమారుడు సౌరభ్, మరో మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ కుమార్తె రీటా పార్టీ అభ్యర్థులు. ఇది ఒక్కటే కాదు. సోషలిస్టు విధానాలను తూర్పారబట్టే బీజేపీ ఎన్నికలు లేని సమయంలో సబ్సి డీలకూ, రుణాల రద్దుకు వ్యతిరేకం అంటూ చాటుకుంటుంది. ఎన్నికల ప్రణాళి కలలో మాత్రం రైతు రుణాలు మాఫ్ చేస్తామంటూ గెలుపు మంత్రం వల్లిస్తుంది. ఆర్థిక విధానాలలో సైతం బీజేపీ విశిష్టత మిగలలేదు. అమిత్‌షా కసరత్తు అమిత్ షా అమితమైన తెలివితేటల వల్ల పార్టీ రెండిందాల చెడిన రేవడి చందంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కులాల చిత్రికబట్టి చక్రం తిప్పాలని ఆయన ఆకాంక్ష. ఆర్ఎస్ఎస్, బీజేపీలలో మొదట అగ్రవర్ణాల ఆధిక్యం ఉండేది. అడ్వాణీ రథయాత్ర సాగినప్పుడు యాదవేతర బీసీలు ఆ పార్టీని ఆదరించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తదితర అగ్రకులాలవారు జనాభాలో దాదాపు 25 శాతం. బాబ్రీమసీదు పతనం తర్వాత బీజేపీ క్రమంగా అగ్రవర్ణాలకు దూర మైంది. బీసీలు కూడా పునరాలోచనలో పడ్డారు. అగ్రవర్ణాలు తమను అంటి పెట్టుకునే ఉంటాయన్న భరోసాతో అమిత్ షా యాదవేతర బీసీలనూ, జాతవే తర దళితులనూ దువ్వసాగారు. ఓబీసీలవైపు మొగ్గు పెరిగి అగ్రవర్ణాలు ఆగ్ర హించే పరిస్థితి వచ్చింది. ఓబీసీల మనసులను గెలుచుకునే లక్ష్యంతోనే ఆ వర్గానికి చెందిన ఫుల్పూర్ లోక్‌సభ సభ్యుడు కేశవ్ ప్రసాద్ మౌర్యను పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. తూర్పు యూపీలో అగ్రవర్ణాలకు జెల్లకొట్టి బీసీలకు జైకొట్టడంతో అగ్రవర్ణ నాయకులు కొందరు పార్టీ నుంచి వైదొలిగారు. అస్సాంలో అరువు తెచ్చుకున్న నాయకులతో ఎన్నికలలో గెలిచినట్టే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అదే వ్యూహంతో విజయం సాధించాలని ప్రయత్నం. గత ఐదేళ్ళలో బీజేపీలో చేరినవారికి పెద్దపీట వెయ్యడం పార్టీ విధే యులకు మనస్తాపం కలిగించింది. దాదాపు 140 స్థానాలు ఫిరాయింపుదారు లకే కేటాయించడం విశేషం. ఇక బీజేపీ ప్రత్యేకత ఎక్కడ మిగిలింది? ఓబీసీల మద్దతు లభిస్తుందో లేదో తెలియదు కానీ అగ్రవర్ణాల అండదండలు మాత్రం బీజేపీకి మునపటివలె ఉండకపోవచ్చునని పరిశీలకులు అంటున్నారు. తేలని బీజేపీ సీఎం అభ్యర్థి ఎస్పీ, బీఎస్పీలలో ఏ పార్టీ విజయం సాధించినా ముఖ్యమంత్రి ఎవరో తెలుసు. బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మౌర్య ముఖ్య మంత్రి అవుతారని ఇప్పుడు ప్రకటిస్తే అగ్రవర్ణాలకు చెందిన నాయకులూ, కార్యకర్తలూ చురుగ్గా పనిచేయరని భయం. మోదీని చూసి ఓటు వేయాలని బీజేపీ ప్రజలను కోరుతోంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదనే ఆగ్రహంతో గోరఖ్‌పూర్ పార్లమెంట్ సభ్యుడు మహంత్ యోగి ఆదిత్యనాథ్ తిరుగుబాటు చేసి పశ్చిమోత్తరప్రదేశ్లో పోటీ అభ్యర్థులను నిలిపారు. బీజేపీకి తిరుగుబాట్ల బెడద ఉంది. ఎస్పీకి ములాయం, శివపాల్ యాదవ్‌ల అలక వల్ల ఎంతోకొంత నష్టం జరుగుతుంది. మాయావతికి అసమ్మతి సెగ లేదు. ఆమె ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. బూత్ స్థాయి వరకూ కమిటీలను నియమించి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకొని ఉంటే గెలుపు ఆ కూటమిదే. 2019లో ఉపప్రధాని పదవి ఇస్తామనీ, పొత్తుకు అంగీకరించాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కబురు పెడితే మాయావతి ససేమిరా అన్నట్టు భోగట్టా. లక్నోలోనూ, ఆగ్రాలోనూ అఖిలేశ్, రాహుల్ ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మంచి స్పందన కనిపించింది. ‘ఖాట్ పే చర్చా’, రైతులను పలకరించే యాత్ర విఫలమైన తర్వాత యూపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయరాదని రాహుల్‌గాంధీ తీసుకున్న సముచితమైన నిర్ణయం కారణంగా ఎస్పీతో పొత్తు సాధ్యమైంది. అఖిలేశ్‌తో మైత్రి ఫలితంగానేlఅతనికోసం వచ్చిన పెద్ద జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రాహుల్‌కి దక్కింది. ఒంటరి పోరాటమైతే 2012లో వచ్చిన 28 సీట్లను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్‌కు కష్టమయ్యేది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కూడా 47 స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ 2014 సార్వ త్రిక ఎన్నికలలో మోదీ ప్రభంజనం కారణంగా బీజేపీ స్థాయి అమాంతంగా పెరిగింది. అయిదేళ్ళ కిందట బీఎస్పీ 80 స్థానాలు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత రెండేళ్ళలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాదనీ, అప్పుడు యూపీ నుంచి 50 స్థానాలైనా గెలుచుకుంటే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావచ్చుననే ఉద్దేశంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ కుమారుడు అఖిలేశ్‌ను గద్దె మీద కూర్చోబెట్టారు. ఏకులా వచ్చిన కొడుకు మేకు అవుతాడని ములాయం ఊహించి ఉండరు. 2014లో మోదీ పిడుగులాగా వచ్చి నెత్తిమీద పడతారని మాత్రం ఎవరు ఊహించారు? యూపీలో జరుగుతున్నది త్రిముఖ పోటీ. ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడే చెప్పడం ఎవ్వరి తరం కాదు. ఎవరికి ఓటేసేదీ చెప్పమని అడిగితే గ్రామీణులు సైతం గుంభనంగా న వ్వుతారే కానీ మనసూ, నోరూ విప్పరు. అతిపెద్ద పక్షంగా ఏదో ఒక పార్టీ లేదా కూటమి వస్తుందన్న ఊహాగానాలు సైతం పూర్వపక్షం కావచ్చు. దేశప్రజలు ఎన్నికలలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం అలవాటు చేసు కున్నారు. అదే ఆనవాయితీ పంజాబ్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్‌లలోనూ కొన సాగుతుందని అంచనా. - కె. రామచంద్రమూర్తి -
కులాధిపత్య భాషను సహించాలా?
కొత్త కోణం ఛండాల జాతికి చెందినవారైన నేటి షెడ్యూల్డ్ కులాల వారు తమ పూర్వ చరిత్రను అర్థం చేసుకోవాలి. ఆధిపత్య కులాహంకారంతో పదే పదే ఛండాల పద ప్రయోగానికి పూనుకోవడాన్ని ఎంత మాత్రం సహించ రాదు. సంప్రదాయాల ద్వారా తెలియకుండానే భాషలో వ్యక్తమయ్యే కుల వివక్షను అంతం చేయాలి. మారుతున్న సామాజిక పరిస్థితులకు అను గుణంగా ఎప్పటికప్పుడు తప్పొప్పులను బేరీజు వేసుకొని భాషను సరిదిద్దుకోవడం ఒక నిరంతర ప్రక్రియ. లేకుంటే భాషాభివృద్ధే ఉండదు. తప్పులు అక్షరాల్లో కాదు, భాషలో ఉంటాయి. మనం నివసిస్తున్న సమాజంలోనూ, అది ఆధార పడిన భావజాలంలోనూ ఉంటాయి. ఒక మని షిని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని కించపరిచే అభి వ్యక్తి సమాజ గౌరవానికే భంగకరం. ఇటీవల హిందూ మత ప్రచారకులు చాగంటి కోటేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు యాదవులకు మనస్తాపం కలిగించాయి. ఇలాగే గతంలో పలువురు రాజ కీయ నేతల వ్యాఖ్యలు, సామెతలు పలు కులాలకు బాధ కలిగించాయి. చాగంటి వ్యాఖ్యలపై నేనిక్కడ చర్చ చేయబోవడం లేదు. కాకపోతే ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి అన్నది వాస్తవం. కులాన్ని కించపరిచే మాటలు ఎందుకు? కులాల సమ్మేళనంతో కూడిన హిందూ మత నిర్మాణంలోనే కులాధిపత్య భాషా సమస్య ఇమిడి ఉన్నది. ఒక కులం, ఇంకొక కులం వారిని సాటి మనుషులుగా భావించదు. కొందరు తాము అధి కుల మనుకుంటే, ఇంకొందరు తమను తాము తక్కువవారమని భావించడం కుల సమాజ లక్షణం. అయితే అణచివేతకు గురౌతున్న వృత్తి కులాలు, సేవా రంగంలోని కులాలు, అంటరాని కులాలు ఇటీవలి కాలంలో చైతన్యవంతం అయ్యాయి. దీంతో వారు ఆధిపత్య కులాలు తమను కించపరిచే భాషా ప్రయోగాన్ని, పద ప్రయోగాలను సహించడానికి సిద్ధపడటం లేదు. అయినా ఆధిపత్య కులాలు నేటికీ కొన్ని సామా జిక వర్గాలను కించపరిచేలా అలవోకగా మాట్లా డుతుండడం విచారకరం. ఛండాల అంటే? తరచుగా చాలా మంది నోట వినిపించే మాట ‘ఛండాల’. అది ఒక కులాన్ని అవమాన పరచేది, ఒక వ్యక్తి నీచుడైతే ఛండాలుడు అనేయడం చాలా మందికి అలవాటు. ఏది నచ్చకపోయినా ఛండా లంగా ఉందంటారు. విజ్ఞానులు, పండితులు, మేధావులు సైతం తడబాటే లేకుండా ఇలా మాట్లాడేస్తుంటారు. అది తప్పేం కాదనుకుం టారు. ఆ కులస్తుల సంఖ్య చాలా తక్కువ, కొన్ని ప్రాంతాలకే పరిమితం. కాబట్టి అందుకు నిరసనా తక్కువే. కానీ ఎవరైనా ‘ఛండాల’ అనే పదాన్ని హీనమైన అర్థంలో వాడితే, వారి మీద ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చు. అయితే మన దేశంలో చట్టాలకన్నా, సంప్ర దాయాలు బలమైనవి. అవి మనకు తెలియకుండానే తప్పులు చేయిస్తుం టాయి. పైగా అంటరాని కులాల ఉద్యమాలు ‘ఛండాల’ పద ప్రయోగంపై దృష్టి పెట్టలేదు. ఛండాల పద ప్రయోగంతో అంటరాని కులాలకున్న సంబంధం ఏమిటో తెలియకపోవడమే ఇందుకు కారణం. కులాధిపత్య ధిక్కార సంకేతం... ఆది శంకరుడు అతి చిన్న వయస్సులోనే దేశాన్ని చుట్టివచ్చి, హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడని ప్రతీతి. ఆయన ఒకనాడు శిష్యులతో కలసి స్నానానికి నదికి వెళుతుండగా... ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కలతో ఎదురు పడతాడు. ఆ వ్యక్తిని పక్కకు తప్పుకోమని కోరగా అతడు గుక్క తిప్పుకోకుండా ఇలా ప్రశ్నిస్తాడు: ‘‘వేద వేదాంగాలు తెలిసిన నువ్వేనా నన్ను తప్పుకోమంటున్నది? సరే ఒకవేళ తప్పుకోవాల్సి వస్తే నా శరీరం తప్పుకోవాలా? లేదా ఆత్మ తప్పుకోవాలా? ఆత్మకు రూపం లేదు కదా? నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. ఏమిటి తేడా? సూర్యుడు ఆకాశం నుంచి ప్రసరిస్తుంటే కిరణాలు నీ మీదా పడుతున్నాయి, నా మీదా పడుతున్నాయి. ఎందుకో చెప్పగలవా? ఇక్కడ వీస్తున్న గాలి, నన్ను తాకుతున్నది. నిన్ను తాకుతున్నది ఏమిటి తేడా? మనుషులంతా ఒక్కటే అందరి శరీరాలలో ఉన్న చీము, నెత్తురులు ఒక్కటే అని చెప్పే నువ్వు ఎందుకు నన్ను తప్పుకోమంటున్నావు’’. దీంతో శంకరుడు తాను ప్రవ చిస్తున్న సిద్ధాంతానికి ఆచరణ పూర్వకమైన సమాధానం దొరికినందుకు ఆ వ్యక్తి కాళ్లకు నమస్కరిస్తాడు. ఆ వ్యక్తే ఛండాలుడు. ఆది శంకరుడు ఛండా లుని కాళ్లకు మొక్కాడంటే ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుంటుందని శివుడే ఛండాలుని రూపంలో వచ్చాడని కథలు అల్లారు. ఛండాలుని తిరుగు బాటును శివుని హితబోధగా చిత్రించారు. బౌద్ధం సమానతా సందేశం అయితే ఛండాల జాతి గురించిన ప్రస్తావనలు చరిత్రలో, ప్రత్యేకించి బౌద్ధ సాహిత్యంలో చాలా ఉన్నాయి. అంటరానివారిగా పరిగణించే ఛండాల కుల స్తుడైన మాతంగుడు పలు అవమానాలకు గురవుతాడు. వాటికి వ్యతి రేకంగా పోరాడి, చివరకు విజేతగా నిలుస్తాడు. జైన సాహిత్యంలోని ‘అచ రంగ నిరుక్త’ గ్రం«థంలో కూడా ఈ ప్రస్తావన ఉన్నది. ఆనాటికి ఛండాల జాతి ఒక స్వతంత్ర తెగగా ఉండడం మాత్రమే కాదు. వైదిక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో బౌద్ధం అనుచరులుగా మారారు. బౌద్ధ సాహి త్యంలో ఛండాలిక బాలిక ప్రస్తావన ఉంది. దాని ఆధారంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఛండాలిక’ నాటికకు సృజించాడు. బావి నుంచి నీళ్లు తోడు తున్న ఒక ఛండాల బాలికను... బుద్ధుని ప్రథమ శిష్యుడు ఆనందుడు నీళ్లు పోయమని అడుగు తాడు. అంటరానిదానినంటూ ఆ బాలిక నిరా కరిస్తుంది. అందరూ సమానమేనని, నీవు నీళ్లు పోయాల్సిందేనని ఆనందుడు పట్టుపడతాడు. దానితో ఎంతో చలించిపోయిన ఛండాలిక ఆనం దునికి నీళ్లు పోస్తుంది. తర్వాత బౌద్ధ భిక్కునిగా మారుతుంది. వైదిక, బ్రాహ్మణ, హిందూ సంప్ర దాయాలను వ్యతిరేకించిన చరిత్ర ఛండాల జాతిదేనని చెప్పక తప్పదు. పూర్వ చరిత్రను గుర్తుంచుకోవాలి ఆర్యుల రాకకు పూర్వమే ఛండాల జాతి ఉన్నట్టు చారిత్రక పరిశోధనల వల్ల తెలుస్తున్నది. ఆర్యు లకు ముందు స్త్రీ దేవతారాధన అధికంగా ఉండేది. చండీగఢ్‌కు మధ్యలో చండీ దేవి ఆలయం ఉన్నది. ఆ చండీదేవి పేరిటనే చంఢీగఢ్ను నిర్మించారు. కశ్మీర్‌లోని పూంచ్‌కు సమీపంలో చండీ గ్రామం ఉన్నది. జార్ఖండ్‌లో ఛండేలియా ప్రాంతం ఉన్నది. నేడు మన దేశంలో ఉన్న వందలాది అంటరాని కులాల ప్రాచీన నామం ఛండాల అనే అనుకోవాల్సి ఉంటుంది. కాలక్రమేణా అంటరాని కులాలకు వేరు వేరు పేర్లు ఏర్పడ్డట్టు భావించాలి. ఒకప్పుడు దేశమంతా విస్తరించి ఉన్న ఛండాల కులం కొన్నివేల మందికి పరిమితమైంది. పశ్చిమ బెంగాల్‌లోని నామ శూద్రులను ఒకప్పుడు ఛండాలురనే వారు. ఈ ప్రాంతంలోని సాంఘిక సంస్కరణ ఉద్యమం ఛండాల అనే పేరును మార్చిందని బెంగాల్ దళిత ఉద్యమ చరిత్ర చెబుతున్నది. అలాంటి మార్పులు దేశవ్యాప్తంగానే జరిగినట్టు తెలుస్తున్నది. ఛండాల జాతికి చెంది నవారైన నేటి షెడ్యూల్డ్ కులాలవారు తమ పూర్వ చరిత్రను అర్థం చేసు కోవాలి. ఆధిపత్య కులాహంకారంతో పదే పదే ఛండాల పద ప్రయోగానికి పూనుకోవడాన్ని ఎంత మాత్రం సహించరాదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 97055 66213 -
ఎస్టీ జాబితాలోకి ఇతరులను చేర్చితే ఊరుకోం
– 48 గంటల దీక్షను విరమించిన గిరిజన నేతలు – సంక్రాంతికి దూరమైన గిరిజన సంఘాలు – సంఘీభావం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు కర్నూలు(అర్బన్): ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే తాము ఊరుకోమని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఐక్య గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో ఐక్య గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేది ఉదయం 10 గంటల నుంచి చేపట్టిన 48 గంటల దీక్షలు 15వ తేది ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. దీక్షల విరమణ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్‌నాయక్, ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటరమణనాయక్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. గోవింద్, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప, వైహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాజు మాట్లాడుతు రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకుంటుంటే తమ సామాజిక వర్గాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 48 గంటల దీక్ష చేపట్టామన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, గిరిజనులు మాత్రం విద్య, ఉపాధి తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఇక తమ బతుకులు అడవుల పాలు కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షల్లో పాల్గొన్న వారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి. తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం కార్యదర్శి డాక్టర్ బి. రమేష్ , మార్కెట్‌యార్డు డైరక్టర్ కరివేపాకు నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. దీక్షల్లో పాల్గొన్న నేతలు.. ఎం వెంకటరమణనాయక్, కైలాస్‌నాయక్, పీ గోవింద్, రాగుల రాముడు, శ్రీరాములు, ఆర్ చంద్రప్ప, వై రాజు, రాజారామ్నాయక్, యోగేష్‌నాయక్, ఎం రాముడు, పీ వెంకటేష్, శంకర్‌నాయక్, పరశురాముడు, గిడ్డయ్య, రమేష్, నాగరాజు, వెంకటరాముడు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం వ్యక్తం చేసిన సంఘాలు, నేతలు .... ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వై. నారాయణ, బద్దునాయక్, జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, కార్యదర్శి రాముడు నాయక్, దళిత సమాఖ్య కన్వీనర్ కొమ్ముపాలెం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమసుందరం, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసుందరం, ఏపీ ఎస్సీ,ఎస్టీ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌బాబు, సఫాయి కర్మచారి సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, వివిధ సంఘాలకు చెందిన నాయకులు వెంకటస్వామినాయక్, అంజనప్ప, ఈశ్వరప్ప తదితరులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. -
కుల కురు క్షేత్రం
యూపీలో సం‘కుల’ సమరం.. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పార్టీల వ్యూహాలు ప్రత్యర్థుల ఓటు బ్యాంకు కొల్లగొట్టే ప్రయత్నం దాదాపు 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో సం‘కుల’ సమరానికి తెరలేచింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో.. ప్రత్యర్థుల సంప్రదాయ ఓటు బ్యాంకులోకి చొచ్చుకెళ్లే వ్యూహాలకు అన్ని పార్టీలు మెరుగులు దిద్దుతున్నాయి. 44 శాతం ఓబీసీలు, 21 శాతం దళితులున్న యూపీలో కులాల వారీగా ఓటర్ల విభజన తీవ్రంగానే ఉంది. 2007లో బీఎస్పీ 30.4 శాతం ఓట్లతో (206 సీట్లు) అధికారంలోకి రాగా, 2012లో సమాజ్‌వాదీ పార్టీ 29.15 శాతం ఓట్లు సాధించి (224 సీట్లు ) అధికారంలోకి వచ్చింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15 శాతం ఓట్లతో 47 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ రెండేళ్లు తిరిగే సరికి... మోదీ హవా కారణంగా 2014లో ఏకంగా 42.3 శాతం ఓట్లు సాధించింది (80 ఎంపీ స్థానాల్లో 71 గెలుచుకుంది). అసెంబ్లీకి త్రిముఖ పోరులో సాధారణంగా 30 నుంచి 35 శాతం ఓట్లు సాధిస్తే యూపీలో అధికారంలోకి రావొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వివిధ పార్టీల సామాజిక సమీకరణాలపై విశ్లేషణ..! –సాక్షి నాలెడ్జ్ సెంటర్ బీజేపీ (అగ్రవర్ణాలు+ యాదవేతర ఓబీసీలు) ఎన్నికల్లో ప్రభావం చూపగల అన్ని కులాలను కూడగట్టుకువెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగానే ఆ పార్టీ చీఫ్ అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో బీజేపీ వైపు మొగ్గు ఉంటుంది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఠాకూర్లలోనూ బీజేపీకి పట్టుంది. మరోవైపు, ఓబీసీల్లో యాదవేతర కులాల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర జనాభాలో 9 శాతం యాదవులు ఉన్నారు. యాదవుల ఆధిపత్య ధోరణి గిట్టని ఇతర బీసీలు, ఎంబీసీలను బీజేపీ చేరదీస్తోంది. తూర్పు యూపీలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కుర్మీలు, కోయిరీలు.. బీసీల్లో యాదవుల తర్వాత ఆర్థికంగా, సామాజికంగా శక్తిమంతులు. ఓబీసీల్లో యాదవులు 19.4 శాతం ఉండగా, ఎంబీసీలు 61.69 శాతం ఉన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడినవర్గాల (ఎంబీసీ)ల మద్దతు కోసం బీజేపీ చాలాకాలం నుంచే పావులు కదుపుతోంది. నిషాద్, మల్లాహ్, కేవత్, లోనియా, నోనియా, గోలే ఠాకూర్, కుమ్హర్, కశ్యప్, లోద్... లాంటి ఎంబీసీ కులాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎంబీసీల్లో ఏకంగా 60 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. ఎంబీసీ అయిన కేశవ్ ప్రసాద్ మౌర్య(కుష్వాహ సామాజిక వర్గం)కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ప్రధాని మోదీ కూడా బీసీనే కావడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళుతుండటం కూడా బీజేపీకి లాభించే అంశమని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు, యూపీ దళిత జనాభా(21%)లో జాటవ్(చమర్)ల వాటా 12%. వీరు తమ సామాజిక వర్గ నేత అయిన మాయావతికే మద్దతిస్తారు. మిగిలిన తొమ్మిది శాతం జాటవేతరులపై బీజేపీ దృష్టి సారించింది. అతి దళితులుగా పిలిచే... పాసీ, ఖాతిక్, కోరి, వాల్మీకి, దోభీ కులాలకు జాటవ్లపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని దళిత ఓట్ల శాతాన్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని చూస్తోంది. బీఎస్పీ (దళిత్ + ముస్లిం) బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసారి కొత్త సమీకరణాలకు తెరతీశారు. దళిత (21%), ముస్లిం (19%) కలయికతో బీజేపీని అడ్డుకోవాలన్నది బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యూహం. అలాగే, ముజఫర్‌నగర్, దాద్రీ అల్లర్ల సమయంలో అఖిలేశ్ ప్రభుత్వ స్పందనపై అసంతృప్తితో ఉన్న ముస్లింలు ఈ ఎన్నికల్లో తమవైపు వస్తారని ఆమె ఆశిస్తున్నారు. పశ్చిమ యూపీలో 73 సీట్లలో ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 19 శాతమున్న ముస్లింలకు 24 శాతం సీట్లు (97) కేటాయించారు. అలాగే, కేంద్రంలో, రాష్ట్రంలో... రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలే ఉండే పరిస్థితిని ముస్లింలు కోరుకోరని ఆమె అంచనా. ముస్లిం ఓట్లలో చీలిక బీజేపీకే లాభం చేకూరుస్తుందని, అందువల్ల ఎస్పీ, కాంగ్రెస్‌లకు ఓటేయొద్దని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. 2007లో బ్రాహ్మణ– దళిత కాంబినేషన్‌తో అధికారంలోకి వచ్చిన మాయావతి ఈసారి పైకి ముస్లిం– దళిత మంత్రాన్ని పఠిస్తున్నా... బ్రాహ్మణులను వదిలేయలేదు. జనాభాలో 10 శాతం దాకా ఉండే బ్రాహ్మణులకు 16.5 శాతం సీట్లు (66) కేటాయించారు. మొత్తమ్మీద అగ్రవర్ణాలకు 113 సీట్లు కేటాయించారు. అగ్రవర్ణాల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పోకుండా చూడాలనేది బీఎస్పీ వ్యూహం. దళితుల్లో విభజనకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దళితులంతా ఐక్యంగా ఉండాలని రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ముస్లిం + యాదవ్) ఎంవై (ముస్లిం– యాదవ్) ఫార్ములాతో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల వేళ... ఇంటిపోరులో తలమునకలై ఉంది. పరి‘వార్’ సద్దుమణిగి... సైకిల్‌పై స్పష్టత వచ్చాకే సీరియస్‌గా ఎన్నికలపై దృస్టి సారించగలదు. ఇప్పుడు కూడా... ఇదే ఫార్ములా. అయితే దీనికి అఖిలేశ్ అభివృద్ధి మంత్రం, క్లీన్ ఇమేజ్ తొడవుతాయని ఆశిస్తోంది. ములాయంతో ముస్లింలకు అనుబంధం ఎక్కువ. సెక్యులర్ పార్టీగా, ముస్లింల ప్రయోజనాలను సంరక్షించే పార్టీగా సమాజ్‌వాదీని నిలబెట్టారు ములాయం. 2012లో ఎస్పీ తొలిసారిగా సొంతబలంతో అధికారం లోనికి వచ్చినపుడు కూడా ముస్లింలలో 39 శాతమే ఎస్పీకి ఓటేశారు. కానీ అదే 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ, మోదీ వ్యతిరేకతతో ఏకంగా 58 శాతం ముస్లిం ఓటర్లు ఎస్పీకి అండగా నిలిచారు. కాంగ్రెస్ (అస్తిత్వ పోరాటం) 2012లో కాంగ్రెస్ 11.65 శాతం ఓట్లతో 28 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్ ఓటుశాతం 7.5కు పడిపోయింది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉన్న బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు... కాలక్రమంలో ఇతర పార్టీలకు మారిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అస్తిత్వ పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేశ్ ఆసక్తితో ఉన్నారు. ఆర్ఎల్డీని కూడా కలుపుకొని... ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలనేది అఖిలేశ్ ఆలోచన. -
పది కుటుంబాల వెలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన సాక్షి, సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: పంచాయితీలో తమ మాట వినకుండా కోర్టుకు వెళ్లారనే అక్కసుతో పదికుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ ‘పెద్దలు’తీర్పు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటాపూర్‌కి చెందిన చీకోటి లింగయ్య, చీకోటి పర్శయ్య, చీకోటి మల్లయ్య తమ భూములను అదే గ్రామానికి చెందిన మారుపాక రాజు, మారుపాక బాలయ్య, ఆశయ్య, చిన్న ఆశయ్య, పర్శయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, పరశు రాములు, వెంకటయ్య, రాములు సాగు చేసుకుంటున్నారని రెండు నెలల క్రితం పంచాయితీ పెట్టారు. తమ తాతలకాలం నుంచి 4.05 ఎకరాలు తమ ఆధీనంలోనే ఉందని బాధితులు చెప్పారు. ఈ క్రమంలో కుల పెద్దలు 4.05 ఎకరాల నుంచి 1.15 ఎకరాలను చీకోటి లింగయ్య, పర్శయ్య, మల్లయ్యకు చెందుతుందని తీర్పు చెప్పారు. వారి తీర్పు నచ్చని మారుపాక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పది కుటుంబాలను కుల బహిష్కరణ చేశా రు. బహిష్కరణకు గురైన వారితో ఎవరైనా మాట్లాడితే రూ. 500 జరిమానా నిబంధన విధించారు. చీకోటి కుటుంబం బావి నుం చి మారుపాక ఆశయ్య పొలానికి సాగునీరు బంద్ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాయి. క్రమంలోనే గత శనివారం కోర్టు నుంచి ఈ భూమి మారుపాక కుటుం బ సభ్యులకే చెందుతుందని తీర్పు కూడా వచ్చింది. అయినా బహిష్కరణ కొనసాగు తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ‘పెద్దల’తోపాటు అందుకు కారణ మైన వారిపై సోమ వారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. -
కులం గోడ బద్దలు కొట్టండి
• పూర్తి మెజారిటీతో ఆశీర్వదించండి • యూపీ ప్రజలను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ • నల్లధనం జమలో, కుటుంబ రాజకీయాల్లో ప్రత్యర్థులు బిజీ • అవినీతిని తొలగించమంటే.. విపక్షాలు నన్ను తొలగించాలంటున్నాయి మీరెప్పుడైనా ఎస్పీ, బీఎస్పీలు కలిసుండటం చూశారా? ఎస్పీ అవునంటే.. బీఎస్పీ కాదంటుంది. కానీ చాన్నాళ్ల తర్వాత వారిద్దరూ ఏకమయ్యారు. మోదీని మార్చేయాలి, మోదీని తొలగించాలంటున్నారు. కానీ మోదీ మాత్రం మీ నోట్లు మార్చుకోండి, నల్లధనాన్ని తొలగించాలంటున్నాడు. – లక్నో సభలో మోదీ లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రజలు కుల రాజకీయాల చట్రం నుంచి బయటకొచ్చి ఆలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సోమవారం లక్నోలో జరిగిన మహాపరివర్తన్ ర్యాలీలో మాట్లాడుతూ.. విపక్షాలు నల్లధనాన్ని సర్దుకోవటంలో బిజీగా ఉన్నాయని, వారి కుటుంబ రాజకీయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేవని విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఒక అంశంపై ఎప్పుడూ కలసి పనిచేయలేదని.. అలాంటిది తను నల్లదనం తొలగించేందుకు పోరాటం చేస్తుంటే ఈ రెండు పార్టీలు తనను తొలగించాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘మీరెప్పుడైనా ఎస్పీ, బీఎస్పీలు కలిసుండటం చూశారా? ఎస్పీ అవునంటే.. బీఎస్పీ కాదంటుంది. కానీ చాన్నాళ్ల తర్వాత వారిద్దరూ ఏకమయ్యారు. మోదీని మార్చేయాలి, మోదీని తొలగించాలంటున్నారు. కానీ మోదీ మాత్రం మీ నోట్లు మార్చుకోండి, నల్లధనాన్ని తొలగించాలంటున్నాడు’ అని అన్నారు. ఓ పార్టీ (కాంగ్రెస్) కుమారుడిని గొప్ప నాయకుడిగా చూపేందుకు 15 ఏళ్లుగా కష్టపడుతోందని.. విమర్శలు ఎక్కుపెట్టారు. మరోపార్టీ (బీఎస్పీ) సంపాదించింది ఎక్కడ దాచుకోవాలో ఆందోళన చెందుతోంది. ఇంకోపార్టీ (ఎస్పీ) కుటుంబ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోందన్నారు. కుటుంబ రాజకీయాలు చేసే పార్టీ, నల్లధనాన్ని దాచుకునేందుకు ప్రయత్నించే పార్టీలు యూపీని అభివృద్ధి చేస్తాయా? లేదా అనేది యూపీ ప్రజలు ఆలోచించాలన్నారు. ఎస్పీకి అభివృద్ధి పట్టదు కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ రైతులకు మద్దతు ధర ఇచ్చే అంశంపై దృష్టి సారించేందుకు కూడా సీఎం అఖిలేశ్‌కు సమయం దొరకలేదన్నారు. 14 ఏళ్లుగా వెనకబడ్డ యూపీలో పరిస్థితులు త్వరలో మారతాయన్నారు. ప్రజలు చాన్నాళ్లుగా కుటుంబ రాజకీయాలు చూస్తున్నారని.. యూపీలో అభివృద్ధి జరిగిందా లేదా వారికే తెలియాలన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (లక్నోకు ప్రాతినిధ్యం వహించేవారు) మాటలను గుర్తుచేస్తూ.. ఇక్కడి ప్రజల స్పందనపట్ల ఆయన సంతృప్తిగా ఉండేవారన్నారు. ‘మేం భీమ్ యాప్‌ను విడుదల చేశాం. దీనికి రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక వేత్త డాక్టర్ అంబేడ్కర్ పేరుపెట్టాం. భవిష్యత్ లావాదేవీలు అంబేడ్కర్ పేరుతో జరిగితే కొందరికి ఇబ్బంది కలుగుతోంది. మనం గ్రామాలకు వెళ్లాలి ప్రజలకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాలి. ప్రతిచోటా భీమ్పేరు మార్మోగేలా చేయాలి. అదే అంబేడ్కర్‌కు అసలైన నివాళి’ అని ప్రధాని తెలిపారు. ఆశీర్వదించండి ‘మోదీ అవినీతిపరుల డబ్బును తీసుకుని పేదోళ్లకిస్తానంటే కొందరి సీట్లు కదులుతున్నా’యన్నారు. అందుకే కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిని పూర్తిగా తొలగించేంతవరకు ఈ యుద్ధం ఆగదని, అందుకు యూపీ ప్రజల ఆశీస్సులుండాలన్నారు. ‘కేంద్రం ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది. 30 ఏళ్లలో ఇది తొలిసారి. దేశానికి ఓ ప్రధాని ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి హైకమాండ్ 125 కోట్ల ప్రజలే’ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీకి ఏడాదికి లక్షకోట్లు ఇస్తున్నామన్న మోదీ.. అవి సంక్షేమానికి ఉపయోగపడుంటే పరిస్థితి వేరోలా ఉండేదన్నారు. యూపీలో అభివృద్ధి జరిగేందుకు బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని మోదీ కోరారు. కాగా, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
నీ కులమేంది?..టీడీపీ సభ్యత్వనమోదులో ఆరా
సాక్షి, అమరావతి: తెలుగుదేశంలో క్రియాశీలక సభ్యులుగా చేరే వారి కులమేంటని ఆ పార్టీ ఆరా తీస్తోంది. సభ్యత్వ నమోదు సమయంలో కులం (సామాజికవర్గం) ఏంటో చెప్పాలని గట్టిగా కోరుతోంది. ప్రతి ఒక్కరి సామాజికవర్గం ఏమిటో చెప్పిన తరువాతనే వారిని సభ్యులుగా చేర్పించుకొంటోంది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. వంద రూపాయలు ఇచ్చిన వారిని క్రియాశీలక కార్యకర్తలుగా చేర్చుకోవటంతో పాటు పాత సభ్యత్వాలను పునరుద్ధస్తోంది. సామాజికవర్గం నమోదుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ పొందుపరిచిన యంత్రాలను ఉపయోగిస్తోంది. -
మతం పేరుతో ఓట్లడగటం నేరమా?
కులం, మతం కీలక రాజకీయాంశాలుగా మారాయని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో మతం, కులం కీలకాంశాలుగా మారాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశాన్ని ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యగా భావించవచ్చా? అని బుధవారం ప్రశ్నించింది. ఒక అభ్యర్థి కులం, మతం, జాతి పేరుతో ఓట్లు అడగటాన్ని నేరంగా పరిగణించటం సాధ్యమేనా అని అడిగింది. ఎన్నికల చట్టంలో అక్రమ కార్యకలాపాలపై చర్యలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 (3) సెక్షన్ పరిధిపై చర్చ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవ్యక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. నన్ను గెలిపిస్తే మీ అభ్యున్నతికి పాటుపడతాను. నాకు ఓటేయండని అడిగితే తప్పేంటి?’ అని కూడా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజంతా జరిగిన చర్చలో మంగళవారం నాటి ‘హిందుత్వం మతం కాదు, జీవన విధానం’ అనే విషయాన్ని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అయితే ‘హిందుత్వ’ అంశాన్ని సుప్రీంకోర్టు తర్వాతైనా మరోసారి చర్చించాల్సిన పరిస్థితి వస్తుందని కక్షిదారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. భారతీయ శిక్ష్మా స్మృతిలోని 153 (ఏ)ను ఉదహరిస్తూ.. మతంపేరుతో ఓట్లు అడగటం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల మధ్య గొడవలు పెట్టేలా వ్యవహరించే వ్యక్తి నేర విచారణకు అర్హుడని సిబల్ కోర్టుకు తెలిపారు. కులం, మతం పేరుతో ఓట్లను రాబట్టుకోవటంలో రాజకీయనేతలు ముదిరిపోయారని.. ఈ పద్ధతికి బ్రేక్ వేయటం తక్షణ అవసరమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలువురి వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
నేటి భారతం
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది. తెల్లావు కడుపులో నల్లావు పుట్టదా? నల్లావు ఇచ్చే పాలు తెల్లగా ఉండవా? మనిషి ప్రకృతిలో భాగం. ప్రకృతి దేవుడిలో భాగం. సమానంలోనే సమ్మానం ఉంది. సన్మార్గంలోనే సన్మానం ఉంది. కులానికి కొమ్ములు వద్దు.. వద్దు.. వద్దు. కులమే వద్దు.. వద్దు.. వద్దు!! - రామ్, ఫీచర్స్ ఎడిటర్ నా పేరు భారతమ్మ. ముత్తారం ఫస్ట్ లేడీ సర్పంచ్‌ని. ఆ సంతోషం కన్నా ఇప్పుడు ఇన్సల్టే ఎక్వగ అనుభవిస్తున్న. పెద్ద కులస్తుల అహంకారానికి బలైన. గా విషయం చెప్పేకంటే ముందు నేనెవర్నో సర్పంచ్గ ఎట్ల గెలిచిన్నో చెప్తా! నేపథ్యం: నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం వరంగల్ జిల్లా) భీమదేవరపల్లి మండలం, చాపగానితండా పక్కనున్న రాజు తండా. మావోల్లు అంటే మా అమ్మ, బాపు యెవసాయం చేసేటోళ్లు. నేను అయిదో తరగతి దాకా సదువుకున్న. 19 ఏళ్ల కిందట ముత్తారం తండాలో ఉంటున్న కొర్ర దేవ్‌సింగ్‌తో పెండ్లయింది. నా మొగడు ఐటిఐ చేసిండు. మా అత్తగారోల్లకు రెండెకరాల భూమి ఉంది. నేను, ఆయన ఇద్దరం గూడా యెవుసమే చేసుకొనేటోల్లం. కాలం లేక పంటల్లేవు. ఉన్నా యెవుసంలో అంతా తుట్టే (నష్టమే). పైసలకు మస్తు కష్టం అయితుండే. గందుకనే పదేండ్ల కిందట్నే రెండు ఆవులను కొన్నం. పాలు అమ్మి బతుకుడు మొదలువెట్టినం. మాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ సంగీత. ఇంటర్ సదువుతుంది. చిన్న బిడ్డ సింధు. పాలిటెక్నిక్ జేస్తుంది. కాలం మంచిగ జేస్తే మక్కలు, వరి పండిస్తం. ఆ పంట పైసలు, పాల పైసలతో ఇల్లు ఎల్లదీస్తం. ఎస్టీ రిజర్వేషన్: మా ఊరి సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది. మస్తుమంది మా ఇంటికొచ్చి ‘ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది కదా.. సర్పంచ్‌గా నువ్వు పోటీ చెయ్.. మేం గెలిపిస్తం’ అని అన్నరు. మా ఆయన కూడా అవ్ చెయ్ అని బలమిచ్చిండు. గందుకనే సర్పంచ్‌గా నిలవడ్డ. అన్నట్టుగనే అందరు కలిసి నన్ను గెలిపించిండ్లు. నేను సర్పంచ్ అయితనని ఎన్నడనుకోలే. గెలిచినంక సంతోషమైంది. మస్తు పనులు చేయించిన. మా తండాల, ఉర్లే.. లైట్లు వెట్టిచ్చిన. నీళ్లకు మస్తు బాధయితుండే. గందుకనే ట్యాంక్‌లు కట్టించి నీళ్లకు ఏ బాధ లేకుండా జేసిన. నా ప్రతి కష్టంల మా ఆయన తోడున్నడు. వివక్ష...: సర్పంచ్ అయినంక గూడా బాయికాడికి పోయి పొలం పనులు చేసిన. పాలు పిండిన. అసలెన్నడూ నేను సర్పంచ్‌ననే ఫీలింగలనే లేను. కాని మా ఊర్లె కొంతమంది పెద్దకులపోళ్లు మొదటిసందీ నన్ను సర్పంచ్ తీర్గ లెక్కగట్టనేలేదు. ఆ గౌరవం ఇయ్యలేదు. ఏందే.. గీందే.. అనే పిలిశేటోల్లు. మస్తు బాధయితుండే. నా భర్తను కూడా ఒరేయ్, తొరేయ్ అని అనేటోళ్లు. అయినా ఆల్లను మేం ఒక్కమాట అన్లే. మా ఊర్లె ఎస్సీ, ఎస్టీలు తప్ప పెద్ద కులపోల్ల సపోర్టే ఉండకపోతుండె. ఎస్సీ, ఎస్టీల సపోర్ట్‌తోనే ఊరికి, తండాకు గావల్సినయి చేసుకొత్తాన్న. అరే లంబాడోడా...: ప్రతి దసరాకు మా ఊర్లె గ్రామదేవతల దగ్గర పూజలు జరుగుతయి. ఆ పూజను ఊరి సర్పంచే చేస్తడు. గా లెక్కన ఆ వంతు నాకొచ్చింది సర్పంచ్ అయినంక. ఆ రోజు పొద్దుగల నేను, మా ఆయన మోటర్‌సైకిల్ మీద మా అమ్మోల్లింటికి పోయి సాయంత్రం నాలుగ్గంటలకు మల్లా ముత్తారం వచ్చినం. రాంగానే టైమైతుందని ఇంటిక్కూడా పోకుండా సక్కగా గ్రామపంచాయితీ ఆఫీస్‌కే పోయినం. అప్పటికే అక్కడ మంది ఉన్నరు. అప్పటికే పటేండ్లు పూజ కార్యక్రమం చేసిండ్లు. మేం ఇంకా ఆఫీస్కాడికి చేరుకోనన్నా లేదు.. ఆ పటేండ్లు మా మోటర్‌సైకిల్‌కి ఎదురొచ్చి ‘అరే లంబాడోడా.. ఇంకా ఎప్పుడొత్తవురా?’ అంటూ బండ బూతులు తిట్టుకుంట నన్ను, మా ఆయనను చెప్పుతో కొట్టిండ్లు. పిడిగుద్దులు గుద్దిండ్లు. అసలేమైతాందో మాకు అర్థంగాలే. వాల్లు మమ్ముల్నెందుకు కొట్టిండ్లో తెల్వలే. గింతట్లనే ఆ కొట్టుడు సప్పుడు విని అన్నికులాలోల్లు ఆడికి వచ్చిండ్లు. ‘గాల్లనట్ల ఎందుకు కొడుతుండ్లు?’ అని నిలదీసేసరికి ఆడికెంచి పటేండ్లు ఎల్లిపోయిండ్లు. యెంటనే మేం పోలీసోల్లకు ఫోన్ జేసినం. ఫోన్ జేసిన ఎంటనే పోలీసులు వచ్చిండ్లు. జరిగిన సంగతంతా ఎస్సైకి చెప్పినం. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ముల్కనూర్ పోలీస్‌స్టేషన్‌కు పోయి కంప్లయింట్ కూడా ఇచ్చినం. కాని పోలీసోల్లు పట్టించుకోలే. ఎందుకైనా మంచిదని మమ్ముల్ని కొట్టిన మాజీ సర్పంచ్ ఏనుగు ఈశ్వర్‌రెడ్డి, ఏనుగు సత్తిరెడ్డి, ఏనుగు మధు, రాజేంద్రప్రసాద్‌లను గ్రామపంచాయితీ ఆఫీస్కాడికి పిలిపించినం. ఆల్లు రాలే. పోలీసోల్లు కేస్ వెట్టలే. ఎట్లరా దేవుడా.. అనుకుంట మేం మా కులం పెద్దలకు, ఎమ్మార్పీయస్ నాయకులకూ చెప్పుకున్నం. పదమూడో తారీఖున పోలీసులు మా ఊర్లెకొచ్చిండ్లు. మమ్ముల్ని చెప్పుతో కొట్టంగ చూసిన ఊరోళ్లంతా గా పోలీసోళ్లకు సాక్ష్యం సూత చెప్పిండ్లు. అయినా ఆల్ల మీద కేసు వెట్టలేదు. పద్నాలుగో తేదీనాడు జాతీయ మహిళా అధ్యయన కమిటీ సభ్యురాలు, ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మేడంతోపాటు ఎమ్మార్పీయస్ నాయకులు సుత పోలీస్‌స్టేషన్‌కొచ్చి ఎస్సైని గట్టిగా అడిగిండ్లు. అప్పుడు ఎస్సై సంతోష్‌కుమార్ మా దగ్గర మల్ల కంప్లయింట్ తీసుకొని పద్నాలుగో తారీఖునే కంప్లయింట్ ఇచ్చినట్లు చేసి... సాయంత్రం మమ్ముల్ని గొట్టిన ఆ నలుగురిపై కేసు పెట్టిండు. కాని వాల్లను అరెస్ట్ అయితే చెయ్యలే. కడుపు మండుతాంది: మాకు జరిగిన ఆ అవమానం తల్సుకుంటే కడుపు మండుతాంది. గిసుంటి ఇన్సల్ట్ పగోల్లకు కూడా రావద్దు దేవుడా.. (కళ్లనిండా నీళ్లతో). లంబాడోల్ల కులంల పుట్టుడే మేం చేసుకున్న పాపమా? అదే పెద్ద తప్పయినట్టుంది. తక్కువ కులంలో పుట్టుడే మాకు శాపమైనట్టుంది. లేకపోతే గింత అవమానమా? రెండు అవమానాలు నాకు. నాది లంబాడి కులమైనందుకు.. నేను ఆడదాన్ని అయినందుకు. పొయ్యి మా అవమానం గురించి చెప్తే కూడా పోలీసోల్లు పట్టించుకోక పోవడం ఇంకెంత తప్పు? అదే పెద్ద కులపోల్లకైతే గిట్లనే చేస్తరా? అరే.. ఊరికి నేను సర్పంచ్‌ని.. అంటే ప్రథమ పౌరురాలిని.. నాకే గిట్లాంటివి ఎదురైతే.. మిగిలిన సామాన్య దళితులు. సామాన్య మహిళల సంగతేంగాను? మనం ఏడున్నం? సదువు సంస్కారం నేర్పతదంటర.. గిదేనా గాల్ల సంస్కారం? చిన్న కులమని మమ్మల్ని నీచంగా చూస్తాండ్రు.. మరి పెద్ద కులం ఆల్లకు నేర్పిన సంస్కారం గింతేనా? ’... భారతమ్మ ఆవేదన కళ్ల నీళ్లుగా ప్రవహిస్తూనే ఉంది. - తల్లపల్లి సురేందర్ రిపోర్టర్, భీమరదేవరపల్లి, వరంగల్ జిల్లా శిక్షపడాలె: కేవలం లంబాడోల్లు దసరా చేస్తున్నరనే కుల వివక్షతో పటేండ్లు నా మీద, నా భార్య మీద చెప్పుతో దాడి చేసి, బూతులు తిట్టిండ్లు. ఈ కాలంలో కూడా ఊర్లల్ల కుల వివక్ష పోలేదు. మా మీద దాడి చేసినోల్లను పోలీసులు అరెస్ట్ చేయలేదు. మస్తు బాధయితాంది. వాల్లకు తగిన శిక్షపడాలే. - కొర్ర దేవ్‌సింగ్ (భారతమ్మ భర్త) వెంటనే అరెస్ట్ చేయాలి..: కులంపేరుతో దూషిస్తూ ఓ మహిళా సర్పంచ్‌ను, ఆమె భర్తను చెప్పుతో కొట్టిన పెద్ద కులస్తులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అన్యాయం. దారుణం. వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. - పచ్చునూరి కరుణాకర్ అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళలకు రక్షణ లేదు మన దగ్గర మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గిరిజన మహిళా సర్పంచ్ కొర్రా భారతి మీదా, ఆమె భర్త మీదా పెద్ద కులస్థులు దాడి చేయడం సభ్యసమాజానికే సిగ్గుచేటు. ఇది ఒక్క భారతి పైన జరిగిన దాడి కాదు. యావత్ దళిత జాతి మీద జరిగిన సంఘటనగా మేం భావిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళా సర్పంచ్‌లకు పోలీస్ రక్షణ కల్పించాలి. ఈ దాడి కారకులను కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఇలాంటి దారుణాలు మరిన్ని జరిగే ప్రమాదం ఉంది. - ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, జాతీయ మహిళా అధ్యయన కమిటీ సభ్యురాలు. కేసు నమోదు చేశాం...: భారతి మీద, ఆమె భర్త మీద దాడిచేసిన వాళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కాజీపేట ఏసీపీగారు విచారణ చేయాల్సి ఉంది. - సంతోష్‌కుమార్, ఎస్సై, ముల్కనూర్ -
రోహిత్ వేముల వీడియో బహిర్గతం
-
రోహిత్ వేముల వీడియో బహిర్గతం
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని అతడి స్నేహితులు స్పష్టం చేశారు. తాను దళితుడినని రోహిత్ స్వయంగా చెప్పుకున్న వీడియోను సోమవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించిన నేపథ్యంలో ఈ వీడియో బయటపెట్టారు. వీడియోలో ఏముందంటే... 'నా పేరు రోహిత్ వేముల. నేను గుంటూరుకు చెందిన దళితుడిని. అందరికీ జై భీమ్. 2010 నుంచి హెచ్‌సీయూలో విద్యార్థిగా ఉన్నాను. సోషల్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నాను. సోషల్ సైన్స్, సామాజిక అంశాలపై ఉన్న ఆసక్తితో నా సబ్జెక్ట్ ను బయోటెక్నాలజీ నుంచి సోషియాలజీకి మార్చుకున్నాను. నేను జూనియర్ రీసెర్చ ఫెలోషిప్ సాధించాను. సోషల్ సైన్స్ స్ స్కూల్ లో జనరల్ కేటగిరిలో సీటు తెచ్చుకున్నాను. నాతో పాటు ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. మమ్మల్ని హాస్టల్ నుంచి బయటకు గెంటివేశారు. క్యాంపస్ లోని బహిరంగ ప్రదేశాలు, హాస్టల్ పరిసరాలు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద మేము కనబడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మాకు పంపిన నోటీసుల్లో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. నేను రోజుకూలీ చేసుకునే కార్మికుడి కొడుకును. మా అమ్మ నన్ను పెంచింది' రోహత్ దళితుడు అనేందుకు ఈ వీడియో సాక్షమని అతడి స్నేహితుడు, అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు మున్నా సాన్నాకీ అన్నారు. గతవారం ఈ వీడియోను కనుగొన్నామని చెప్పారు. రోహిత్ కులంపై తలెత్తున్న పశ్నలకు సమాధానంగా ఈ వీడియోకు బయటకు విడుదల చేశామన్నారు. -
ఉద్యమ వరద
స్వాతీ నఖేత్ 18 జూలై 2016. అపోజిషన్ అరుపులు, కేకలతో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిధ్వనిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ పాటిల్, పృథ్వీరాజ్ చవాన్ సభలో చర్చకు పట్టుపట్టారు. మరో ప్రతిపక్ష నేత (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అజిత్ పవార్.. ‘‘ఇది నిర్భయ ఘటన కంటే కూడా హేయమైన నేరం’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి అంతా కలసి... ఫడ్నవీస్ నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ వర్షాకాల సమావేశాలలో వాళ్లను అంతగా తరుముకొచ్చిన ఉద్యమ వరద... స్వాతీ నఖేత్ పాటిల్! - మాధవ్ శింగరాజు కోటు దర్పాన్ని ఇస్తుంది. చిరుగుల్నీ దాస్తుంది. అగ్రవర్ణాలకు కులం ఒక కోటు. ఉన్నవాళ్లు ఉన్నదర్పాన్ని కనబరిస్తే, లేనివాళ్లు లేనిదర్పాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్లూ ఇలాగే నడిచింది, గడిచింది. ఇప్పుడు అలా లేదు. కోటులో గుద్దులాటలు అనవసరం అనుకుంటున్నారు. ‘మాకూ రిజర్వేషన్లు కావాలి. మాకూ రక్షణ కావాలి’ అని ఉద్యమిస్తున్నారు. వాళ్లు డిమాండ్ చేస్తున్నది ఉద్యోగాలలో రిజర్వేషన్. వాళ్లు అడుగుతున్నది కొన్ని ‘రక్షణ చట్టాల’ నుంచి రక్షణ! అందుకే ఉద్యమానికి ఆసరాగా చిన్న కొమ్మ దొరికినా దాన్ని పట్టుకుంటున్నారు. ఉద్యమ ఆవేశాన్ని రగిల్చే చిన్న నాయకత్వం దొరికినా అనుసరిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ర్టలో ‘మరాఠా’లు చేస్తున్నది అదే. మొన్నటి వరకు గుజరాత్లో ‘పటేల్ ’లు చేసిందీ అదే. అక్కడి నాయకుడు హార్దిక్ పటేల్. ఇక్కడి నాయకురాలు స్వాతీ నఖేత్. ఇద్దరూ పాతికేళ్ల లోపు వారు. ఇద్దరూ రూలింగ్ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్నవారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం హార్దిక్ పటేల్‌ని విజయవంతంగా అణచివేసింది. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీనే కానీ, స్వాతీ నఖేత్‌ని ఏమీ చేయలేకపోతోంది. అక్కడ ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంది. అంతకన్నా స్ట్రాంగ్ స్వాతీ నఖేత్! అందుకే మహారాష్ట్రలో రెండు పెద్ద అపోజిషన్ పార్టీలు ఇప్పుడు స్వాతి వెనుక నడుస్తున్నాయి. అమ్మాయి కాదు... ఆదిపరాశక్తి! గుజరాత్లో పటేళ్లు 24 శాతం. మహారాష్ట్రలో మరాఠాలు 32 శాతం. వీళ్లని కాదని గేమ్స్ ఆడితే బ్యాలెట్ బద్దలౌతుంది. ఆ సంగతి అక్కడి ప్రభుత్వాలకు తెలుసు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కి ఇంకాస్త ఎక్కువ తెలుసు. ‘ఆ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అన్నాడు. ‘అమ్మాయి కాదు, ఆదిపరాశక్తి’ అన్నారు ఎవరో. ‘అయితే మనమూ ఆ శక్తిని ఫాలో అయిపోదాం’ అన్నారు ఫడ్నవీస్! రూలింగ్ పార్టీ ఎప్పుడూ ఫాలో అవదు. ఫాలో అయినట్లు కనిపిస్తుందంతే. ఫడ్నవిస్ వ్యూహం వేరు. మరాఠా ఉద్యమాన్ని ‘ఓన్’ చేసుకుని, స్వాతీ నఖేత్‌ని ఉద్యమానికి ‘డిసోన్’ చేయాలని అతడి ఆలోచన. ప్రతిపక్షాల ఆలోచన వేరు. స్వాతి గానీ, మరాఠాలు గానీ వాళ్ల సమస్య కాదు. ఫడ్నవీస్‌కు క్రెడిట్ గానీ, మరోసారి పవర్‌గానీ దక్కకూడదు! ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరి భయాలు వారికి ఉన్నాయి. అందుకే అంతా స్వాతి చెంత చేరారు. స్వాతి అజెండాకు తమ జెండాలను కలిపి కుట్టేశారు. మరాఠాల ‘స్వాభిమాన’ నాయిక మరాఠా రిజర్వేషన్ పాత ఇష్యూ. స్వాతి వచ్చాక మళ్లీ ఫ్రెష్‌గా మొదలైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్.సి.పి. ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకు చదువుల్లో, కొలువుల్లో, అసెంబ్లీ హాల్లో 16 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాణె కమిటీ రికమండ్ చేసింది. అన్ని పార్టీలూ చచ్చినట్టు మద్దతు ఇచ్చాయి. కానీ కోర్టులో కమిటీ సిఫారసులు తేలిపోయాయి. కాంగ్రెస్, ఎన్.సి.పి. బి.జె.పి.. మూడు గవర్నమెంట్లు మారాయి. రిజర్వేషన్ల తుట్టె అలా ఉండిపోయింది. దాన్నిప్పుడు స్వాతి కదిలించారు. ముందు చిన్న చిన్న ర్యాలీలతో మెల్లిగా పొగబెట్టారు. తర్వాత.. ఇటీవలి ఒక రేప్ కేసును దుప్పటిగా కప్పుకుని తుట్టె వైపు కదిలారు. అలాగని రేప్ కేసు ముసుగులో స్వాతి చేస్తున్న రిజర్వేషన్ ఉద్యమం కాదు ఇది. తనకొక ఆయుధం దొరికింది. ఆ ఆయుధాన్ని ఈ మరాఠా యువతి మరాఠాల కోసం తిప్పుతున్నారు. యూత్ కదా! వాట్స్‌యాప్, సోషల్ మీడియా గ్రూప్ ఆయుధాలు ఎలాగూ ఉంటాయి. మొత్తం మూడు ఆయుధాలతో స్వాతీ నఖేత్ మరాఠాలను ఇప్పుడు సంఘటితం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మునివేళ్లపై పరుగులెత్తిస్తున్నారు. పవార్‌కీ లేనంత ఫాలోయింగ్! రిజర్వేషన్లు ఒక్కటే మరాఠాల సమస్య కాదు. దళిత చట్టాల నుంచి వాళ్లకు రక్షణ కావాలి! వాళ్లపై వీళ్లు కంప్లైంట్ చెయ్యడానికి వెళ్లినప్పుడు చట్టాన్ని అడ్డుపెట్టుకుని దళితులు రివర్స్ కేసులు వేస్తున్నారని వీరి ఆరోపణ. దళిత సంరక్షణ చట్టంలో సవరణలు చేయాలని వీళ్ల డిమాండ్. అదీ జరగడం లేదు. పెపైచ్చు రాజకీయ నాయకులు దళితుల్ని బుజ్జగించడానికి నానా పాట్లూ పడడం మరాఠాలకు నచ్చడం లేదు. శరద్ పవార్ అంతటి నాయకుడు కూడా దళితుల ముందు కుప్పిగంతులు వేయడం వారికి నచ్చలేదు. పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరాఠాల అభీష్టానికి వ్యతిరేకంగా మరాఠ్వాడా యూనివర్శిటీ పేరును డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీగా మార్చారు. అది మరాఠాలకు ఆగ్రహం తెప్పించింది. తర్వాతి ఎన్నికల్లో అంతకంతా తీర్చుకున్నారు మరాఠ్వాడా ప్రాంత ఓటర్లు. పవార్ పార్టీని కోలుకోని విధంగా దెబ్బతీశారు. ఒక విషయం వాళ్లకు స్పష్టం అయింది. ఈ రాజకీయ నాయకులంతా ఒకటేనని. స్వాతీ నఖేత్ రాజకీయాల నుంచి రాలేదు. రాజకీయాల కోసం రాలేదు. అందుకే మహారాష్ట్రలోని మూడు ప్రధాన మరాఠా ప్రాంతాలు... పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట, మరాఠ్వాడా.. స్వాతి వెంట నడుస్తున్నాయి. ఉద్యమానికి ముందువైపు స్వాతి ఉంది కాబట్టే గుజరాత్లో పటేళ్ల ఉద్యమంలా, హర్యానాలో జాట్ల ఉద్యమంలా మరాఠా ఉద్యమం రక్తసిక్తం కాలేదు. పద్ధతిగా కదం తొక్కుతోంది. అవును. స్వాతీ నఖేత్ పద్ధతైన అమ్మాయి. ‘లా’ చదువుకుంది. మరాఠాల మనోభావాలను లోతుగా అధ్యయనం చేసింది. అంతే లోతుగా మహారాష్ట్ర రాజకీయ నాయకుల్ని! విమర్శలకు జడవని వ్యక్తిత్వం మరాఠా బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని అడ్డుపెట్టుకుని మరాఠా ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారనే ఆరోపణను ప్రస్తుతం స్వాతీ నఖేత్ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, ఈ ఉద్యమం కారణంగా మరాఠాలు, దళితుల మధ్య తలెత్తబోయే విభేదాలకు, వాటి పర్యవసానాలకు కూడా నఖేత్ బాధ్యత వహించాలని ప్రత్యర్థులు ఆమెను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ స్వాతీ నఖేత్ జడవడం లేదు. ‘‘దళితుల అభివృద్ధి జరగందే మహారాష్ట్ర అభివృద్ధి జరగదు. ఒక్క దళితులు అనే కాదు... వంజరులు, ముస్లింలు, మరాఠాలు అందరూ పురోగమిస్తేనే రాష్ట్ర పురోగతి. సరైన రోడ్లు లేక, విద్యుత్ సౌకర్యం లేక అందరం ఇక్కట్లు పడుతున్నవాళ్లమే. మేము దళితులతో కలిసి ఉంటామనే అంటున్నాం. అయితే మమ్మల్ని కలవనివ్వకుండా, మాలో మాకు విభేదాలు సృష్టించడానికి రాజకీయనాయకులు కుల రాజకీయాలను రాజేస్తున్నారు’’అని నఖేత్ ఆరోపిస్తున్నారు. బెస్ట్ లాయర్... ది బెస్ట్ లీడర్ మరాఠా క్రాంతి మోర్చా! పెద్ద పార్టీ కాదు. పొలిటి కల్ పార్టీ కాదు. కానీ ఇప్పుడది మహారాష్ట్రలోని పెద్దపార్టీలను, పొలిటికల్ పార్టీలను వెనక్కు నెట్టేస్తోంది. స్వాతి నఖేత్.. మోర్చా నాయకురాలు! ముంబై హైకోర్టు (ఔరంగాబాద్ బెంచ్) న్యాయవాది. బెస్ట్ క్రిమినల్ లాయర్ అవాలని స్వాతి కల. మరాఠీ మ్యూజిక్ అంటే ఇష్టం. గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ఆమె అభిరుచులు. జిజియా మాత హైస్కూల్లో చదువుకున్నారు. మాణిక్‌చంద్ పహాడే లా కాలేజ్‌లో పట్టభద్రురాలయ్యారు. ఎం.పి. లా కాలేజ్, డాక్టర్ బాము కాలేజీలలో న్యాయవాద విద్యలో అప్‌గ్రేడ్ అయ్యారు. తను చదువుకున్న న్యాయశాస్త్రాన్ని మరాఠాలు అడుగుతున్న సామాజిక న్యాయం కోసం ఒక అస్త్రంలా ఉపయోగిస్తున్నారు స్వాతీ నఖేత్. స్వాతి చేతుల్లోకి వచ్చేసింది క్రాంతి మోర్చా ప్రధానంగా ఇప్పుడు నాలుగు అంశాలపై ఉద్యమిస్తోంది. ఒకటి: మరాఠాలకు రిజర్వేషన్లు. రెండు: అఘాయిత్యాలనుంచి ఎస్సీ, ఎస్టీలకు రక్షణకల్పించే చట్టం దుర్వినియోగం కాకుండా ఆ చట్టానికి సవరణలు చేయడం. మూడు: అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ స్మారక చిహ్నాన్ని స్థాపించడం. నాలుగు: తమ మరాఠాల అమ్మాయిపై పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన దళిత నేరస్థులకు ఉరిశిక్ష విధించడం. ఇప్పుడీ ఉమ్మడి అంశాల ఉద్యమం స్వాతీ నఖేత్ చేతుల్లోకి వచ్చేసింది. రేప్ ఘటన ఆ ఉద్యమానికి ఇప్పుడు ప్రధాన చోదకశక్తి అయింది. 13 జూలై 2016 మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకంపనలకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా డిమాండ్‌కు దారితీసిన ‘ఆ’ హేయమైన ఘటన జరిగిన రోజు! అహ్మద్‌నగర్ జిల్లా కొపర్డి గ్రామంలో పదిహేనేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి, అతి కిరాతకంగా చంపేశారు! పోపుగింజల కోసం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న అమ్మమ్మగారింటికి సైకిలుపై వెళ్లింది ఆ బాలిక. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చూసి రమ్మని తల్లి కొడుకును పంపింది. చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్లాడా అబ్బాయి. చెల్లెలు కనిపించలేదు. చెల్లెలి సైకిల్ కనిపించింది. సైకిల్ నిలబెట్టి లేదు. పక్కకు పడి ఉంది! అతడి మనసు కీడును శంకించింది. ఆ చుట్టుపక్కలే వెతికాడు. ఓ ఫామ్‌హౌస్ దగ్గరలో చెల్లెలి మృతదేహం కనిపించింది. నగ్నంగా! ఆమె ఒంటినిండా దెబ్బలు. ప్రతిఘటించడంతో చిత్రహింసలు పెట్టి చంపేశారు. -
సమయపాలన పాటించాలి
తెయూ(డిచ్పల్లి) : తాను అందరివాడినని, కులం, వర్గం పేరుతో ఎవరూ తన వద్దకు రావొద్దని తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య పేర్కొన్నారు. అందరూ సమయ పాలన పాటించాలన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్సిటీలోని వీసీ చాంబర్లో హెచ్‌వోడీల సమావేశం నిర్వహించారు. అయితే పది మంది హెచ్వోడీలు కూడా సమయానికి రాలేదు. పది, ఇరవై నిమిషాల ఆలస్యంగా వచ్చారు. దీనిపై వీసీ అసహనం వ్యక్తం చేశారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, ఇందులో ఎవరికీ మినహాయింపులూ ఉండవని పేర్కొన్నారు. మెస్‌లో రూ. రెండున్నర కోట్ల బకాయిలు పేరుకుపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇది మన అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇలా అయితే హాస్టల్స్ నిర్వహించడం కష్టమని, బకాయిలు కచ్చితంగా వసూలు చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీ విషయంలో తనకు అందరూ సమానమేనని వీసీ పేర్కొన్నారు. కులం, వర్గం పేరు చెప్పుకుని ఎలాంటి భజనపరులు తన వద్దకు రావద్దని మోహం మీదే చెప్పారు. తనకు కోటరీ అవసరం లేదన్నారు. పని ఉంటేనే తన చాంబర్లోకి రావాలని, పని ముగిసిన తర్వాత ఒక్క నిమిషం కూడా వర్సిటీలో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో పలువురు అధ్యాపకులు నిర్ఘాంతపోయారు. సమావేశంలో రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు, హెచ్వోడీలు పాల్గొన్నారు. -
మన్య సీమలో కులాల మాయాజాలం
మన్యసీమలో గిరిజనుల ప్రయోజనాలను తాము దక్కించుకునేవిధంగా తెలుగు తమ్ముళ్లు తమ కుటుంబ సభ్యుల కుల ధ్రువపత్రాలను అడ్డగోలుగా మార్చేస్తున్నారు. దీనికి మోకాలడ్డుతున్న అధికారులను అధికార మదంతో సాగనంపేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇటువంటి తప్పుడు వ్యవహారాలను అడ్డుకుంటూ.. నిక్కచ్చిగా పని చేసే అధికారులకు భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారులు.. మంత్రుల సిఫారసులకే తలొగ్గుతున్నారు. తల్లిదండ్రులు బీసీ.. కుమారులు ఎస్టీ సర్టిఫికెట్ కోసం ‘తెలుగు తమ్ముళ్ల’ ఒత్తిళ్లు అడ్డగోలు యత్నాలకు తహసీల్దార్ అడ్డుకట్ట సెలవుపై పంపేందుకు యత్నాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి కుటుంబ సభ్యుల కులధ్రువీకరణ మార్పు వ్యవహారం ఏజెన్సీలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘సాక్షి’ పరిశీలనలో ఇందుకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏజెన్సీ గంగవరం మండలం మొల్లేరుకు చెందిన పాము అర్జున్ టీడీపీ మండలాధ్యక్షుడు. అతడి భార్య పాము సూర్యాకాంతం. బీసీలకు రిజర్వ్ అయిన ఏజెన్సీ గంగవరం జెడ్పీటీసీ స్థానం నుంచి 2014లో ఆమె పోటీ చేశారు. తూర్పు కాపు (బీసీ–డి) కులానికి చెందిన సూర్యాకాంతం.. వైఎస్సార్ సీపీ బీసీ అభ్యర్థిlకొటెకలపూడి రామతులసిపై విజయం సాధించారు. అంతకుముందు 2006లో మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా అర్జున్ ఎన్నికయ్యారు. అర్జున్, సూర్యాకాంతం దంపతుల కుమారులు భూపతిపాలెం స్కూల్లో ఎస్టీలుగా చదువుకుంటున్నారు. వారి కులంపై అనుమానం వచ్చిన మొల్లేరు ఉప సర్పంచ్ పంచదార్ల మరిడియ్య సమాచార హక్కు చట్టం ద్వారా ఎంపీడీఓకు దరఖాస్తు చేశారు. దీనికి గంగవరం ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకుడు కె.రంగ డిసెంబరు 18న బదులిచ్చారు. కో ఆప్షన్ సభ్యుడిగా దరఖాస్తు చేసేటప్పుడు అర్జున్ తన కులం తూర్పుకాపు (బీసీ–డి) అని ధ్రువపత్రం ఇచ్చారని, ఆర్సీ నంబర్ ఎ/01/2015 ద్వారా అర్జున్ కులం బీసీ–డి అని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ తూర్పుకాపు (బీసీ–డి) అని నిర్ధారణ అయింది. మారిపోయిన కుమారుల కులం ఇదిలా ఉండగా అర్జున్, సూర్యాకాంతం దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పెద్ద కుమారుడు పాము శివ విజయ్ కొండకాపు (ఎస్టీ) రిజర్వేష¯Œæతో గోకవరం మండలం భూపతిపాలెం డీఎస్ రాజు ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో చదువుకోవడం విచిత్రం. అతడు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశాడు. అతడి తమ్ముడు పాము నాగ చంద్రకిశోర్ ప్రస్తుతం అదే స్కూల్లో ఎస్టీ రిజర్వేష¯Œæతో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు 2010లో గోకవరం మండలం మల్లవరం శ్రీ మెహర్ విద్యాసదన్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువుకున్నాడు. ఆ స్కూల్ సర్టిఫికెట్లో అతడి కులం తూర్పుకాపు(బీసీ–డి)గానే ఉంది. ఇతడి తండ్రి అర్జున్ మెహర్ విద్యాసదన్ హెడ్మాస్టర్కు 2011 ఏప్రిల్ 19న ఒక లేఖ రాశారు. దాని ప్రకారం, తమ కుమార్డు నాగచంద్రకిశోర్ను మెహర్ విద్యా సదన్‌లో చేర్పించినప్పుడు తూర్పు కాపు(బీసీ–డి)గా నమోదు చేయించామని, ప్రస్తుతం తమ కులం కొండకాపు(ఎస్టీ)గా మారిందని, స్కూల్ రిజిస్టర్లో ఆ మేరకు మార్పు చేసి ఇప్పించాలని కోరారు. రెవెన్యూ అధికారి ఎంఏ బేగ్ 2007లో అందజేసిన ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని జత చేస్తున్నట్టు పేర్కొన్నారు. కులం మార్చనన్న అధికారి మార్పునకు యత్నాలు గతంలో మేన్యువల్‌గా ఇచ్చిన ఎస్టీ కుల ధ్రువపత్రాల్లో మెజార్టీవి బోగస్‌గా ఉన్నాయనే ఉద్ధేశంతో ప్రస్తుతం మీసేవ సర్టిఫికెట్లనే అనుమతిస్తున్నారు. ఉద్యోగం, ఉన్నత చదువులు.. ఇలా దేనికైనా ఆన్లైన్లో అందజేసిన సర్టిఫికెట్‌నే ఆమోదిస్తున్నారు. 2007లో పొందిన సర్టిఫికెట్ మేన్యువల్ది కావడంతో, దానిని తిరిగి ఇచ్చేసి మీ–సేవలో కంప్యూటరైజ్డ్ సర్టిఫికెట్ పొందాలని అర్జున్ భావించారు. ఈ మేరకు గంగవరం తహసీల్దార్ పినిపే సత్యనారాయణకు ఇటీవల దరఖాస్తు చేసుకోగా ఆయన తిరస్కరించారని తెలుస్తోంది. 2007లో ఇచ్చిన ఎస్టీ కుల ధ్రువపత్రం ఆధారాలు రికార్డుల్లో లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. గతంలో ఇటువంటి బోగస్ సర్టిఫికెట్లను రిటైరయ్యాక కూడా తహసీల్దార్లు రౌండ్సీల్ వేసి వెనుకటి తేదీతో సంతకాలు చేసి ఇచ్చినవెన్నో ఉన్నాయని గిరిజన సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఒక్క గంగవరం మండలంలోనే ఇటువంటివి 20 వరకూ ఉన్నాయని చెబుతున్నారు. ఈ బోగస్ సర్టిఫికెట్ల కారణంగా>నే ఆన్లైన్లో మీ సేవ ద్వారా వచ్చిన కులధ్రువ పత్రాలనే అనుమతిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత తహసీల్దార్ ఎస్టీ సర్టిఫికెట్ తిరస్కరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ నేత ఒక మంత్రి ద్వారా జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎస్టీ కులధ్రువపత్రం కోసం పట్టుబడుతున్నారని తెలియవచ్చింది. ఇందుకు ససేమిరా అంటున్న తహసీల్దార్‌ను సెలవు పెట్టి వెళ్లిపోవాలని రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారుల నుంచి వర్తమానం వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా మంత్రి, టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినంత మాత్రాన ఒక దళిత తహసీల్దార్‌ను లేనిపోని సాకులతో సాగనంపేందుకు ప్రయత్నిస్తారా అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
‘కుల వ్యవస్థను రద్దు చేయాలి’
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా నాటుకుపోయిన కులవ్యస్థను తక్షణమే రద్దుచేయాలని జిల్లా మాజీ సైనిక, కుటుంబ సంక్షేమ సంఘ అధ్యక్షుడు డి.సింహాచలం, ఉపాధ్యాక్షుడు పి.మురళీధరరావు, కార్యదర్శి ఎస్వీ నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో కులవ్యవస్థ రోజురోజుకూ పెచ్చుమీరిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ప్రజలు వారి జీవనోపాధి కోసం చేపట్టిన వృత్తులనుబట్టి వారి కులాలను వేరు చేశారని, దేశం అభివృద్ధి చెందిన తర్వాత ఏ ఒక్కరు తమ కులవృత్తులను చేపట్టడంలేదని గుర్తుచేశారు. కులప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించినందుకు కులవ్యవస్థ నిర్మూలన సాధ్యపడడం లేదని తెలిపారు. దయనీయ కుటుంబ తలసరి ఆదాయం, దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాల్సింది పోయి కులాలను పెంచిపోషిస్తుండడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. -
కుల, నివాస సర్టిఫికెట్లకు ఆధార్ లింక్
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులకు కుల, నివాస ధ్రువపత్రాలను ఇచ్చేముందు వాటిని వారి ఆధార్ కార్డులతో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం ...రాష్ట్రాలను కోరింది. ఐదు, ఎనిమిదో తరగతులు చదువుతున్న విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 60 రోజుల్లోగా ఈ ధ్రువపత్రాలు అందేలా చూడాలని కోరింది. ఎస్సీ, ఎస్టీలకు విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్ షిప్ లలో ప్రతి ఏడాది జాప్యం జరుగుతోందని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కుల, నివాస పత్రాలను ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు తమ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ పాస్ లో ఉన్న విద్యార్థుల జాబితాలతో ఆధార్ ను లింక్ చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరింది. -
కులం హజంపై ఎలుగెత్తిన గళం
కొత్త కోణం మనుషులందరూ సమానమేననే భావన ఫూలే సంస్కరణ మార్గానికి ప్రాతిపదిక. కుల ఆధిపత్యం నిరాకరించిన విద్యను శూద్రులకు, మహిళలకు, అంటరాని కులాలకు అందించడం ద్వారానే వారిని చీకటి బతుకుల నుంచి బయటపడేయగలమని ఆయన విశ్వసించారు. శూద్రులను బానిసలుగా దిగజార్చిన మన కుల వ్యవస్థ, అమెరికాలో అమలైన బానిసత్వానికి తీసిపోదని విశ్లేషించారు. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య లేని దళారులు... భగవంతునికి, భక్తులకు మధ్య ఎందుకు? అంటూ ఫూలే ప్రశ్నించారు. పెళ్ళి భజంత్రీలు మోగుతున్నాయి. పెళ్ళి కొడుకుని ఊరేగిస్తున్నారు. అంతలో ఎవరిదోగానీ ‘నువ్వెవరివి?’ అనే ప్రశ్న దూసుకొచ్చింది. ‘నేను పెళ్ళి కొడుకు స్నేహితుడిని’ అన్నాడతను. ‘నీదేకులం?’ మళ్ళీ ప్రశ్న. అవహేళనని దిగమింగుకుంటూ ‘మాలి’ అని సమాధానమిచ్చాడా యువకుడు. బ్రాహ్మణ పెళ్ళి ఊరేగింపులో మాలివాడా? అంతా అతన్ని నానా మాటలూ అన్నారు. ఊరేగింపు ముందుకు పోయింది. ఆ యువకుని పాదాలు విముక్తిబాట పట్టాయి. ఇలాంటి అవమానాలు అతనికి కొత్త కాదు, కానీ వందలాది మందిలో జరిగిన ఈ అవమానం తన జాతిజనులకు జరిగిన అవమానంగా అతడు భావించాడు. శూద్ర, అతిశూద్రుల పట్ల సమాజానికున్న తప్పుడు భావజాలాన్ని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. సమానత్వ భావనలేని సమాజం ప్రగతివిరోధంగా భావించాడు. ఆనాడు ఆయన మదిలో మొలకెత్తిన ఈ భావన కులవ్యవస్థపై పోరాటానికి పునాది వేసింది. అతడా మహత్తర పోరాటానికే జీవిత సర్వస్వం ధారపోశాడు. కుల వ్యతిరేక పోరాటానికి ఒక సైద్ధాంతిక భూమికను అందించాడు. ఆయనే మహాత్మాజ్యోతిబా ఫూలే. బాబా సాహెబ్ అంబేడ్కర్, తన ముగ్గురు గురువుల్లో ఒకరిగా పేర్కొన్న దార్శనికుడాయన (మిగతా ఇద్దరు గౌతమ బుద్ధుడు, కబీర్). మహారాష్ట్రకే చెందిన ఫూలే మరణించిన ఏడాదికి అంబేడ్కర్ జన్మించారు. ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. జ్యోతిబా ఫూలే తండ్రి గోవిందరావు అక్కడ కాయగూరల వర్తకం చేసేవారు. సతారా జిల్లాకు చెందిన ఫూలే పూర్వీకులు పూనాకు బతుకుదెరువుకోసం వచ్చారు. ఫూలే వారి ఇంటి పేరుగా మారడానికి కారణం వారు పూలవర్తకం కూడా చేయడమేనని భావిస్తున్నారు. అంతకు ముందు వారి ఇంటిపేరు గొర్హాయి. ప్రాథమిక విద్యతో చదువుకు స్వస్తి పలికి ఫూలే తండ్రికి తోటపనిలో సహాయ పడటం మొదలు పెట్టారు. అయితే ఫూలేకు చదువు పట్ల ఉన్న తపనను చూసిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు, ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆ పిల్లాడిని చదివించేలా తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. . దానితో 1841లో జ్యోతిబా ఫూలే పూనాలోని స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చదువు కొనసాగించాడు. అక్కడే సదాశివ్ బల్లాల్ గొవాండే ఆయనకు మిత్రుడయ్యాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైనా సదాశివ్, ఫూలే కుల వ్యతిరేక పోరాటానికి చివరి దాకా అండదండలు అందించాడు. సంస్కరణాస్త్రంగా విద్య విద్యార్థి దశలోనే ఫూలే ఒక తాత్విక దృక్పథం ఏర్పర్చుకోవడానికి ప్రముఖ సామాజికవేత్త థామస్ పెయిన్ రాసిన ‘ద రైట్స్ ఆఫ్ మ్యాన్’ ఉపయోగపడింది. అది, యూరప్, అమెరికా హక్కుల ఉద్యమాలకు గొప్ప దిశానిర్దేశం చేసింది. భూమి పైన పుట్టిన మనుషులందరూ సమానమేననే భావనను ఫూలే ఒంటబట్టించుకున్నాడు. కుల అసమానతలను అధిగమించాలంటే కుల ఆధిపత్యం నిరాకరించిన విద్యను శూద్రులకు, మహిళలకు, అంటరాని కులాలకు అందించాలనీ, అదొక్కటే వారిని చీకటి బతుకుల నుంచి బయటపడవేయగలదనీ ఫూలే దృఢ విశ్వాసం. అందుకే ముందుగా తన జీవిత భాగస్వామి సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేశారు. ఆయన నేర్పిన ఆ అక్షరాలే ఆమెకు ఫూలే పోరాటంలో జీవితాంతం తోడునీడగా నిలవగలిగే చైతన్యాన్ని అందించాయి. సావిత్రీబాయి నేర్చుకున్న విద్యాబుద్ధులు ఆమెను భారత దేశంలోనే తొట్టతొలి మహిళా ఉపాధ్యాయిని చేశాయి. సావిత్రీబాయితో కలిసి జ్యోతిబా ఫూలే తన ఇంటిలోనే 1851లో ప్రత్యేకించి బాలికలకోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఫూలే చేసిన ఈ సాహసాన్ని ఆధిపత్య కులాలు, ప్రత్యేకించి బ్రాహ్మణులు తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేశారు, ఇతరులెవ్వరూ అందులో పనిచేయకుండా అడ్డుకున్నారు. అయినా పాఠశాలను నడపడానికి నిర్ణయించుకొన్న ఫూలే దంపతులపై భౌతిక దాడులకు కూడా తెగబడ్డారు. అయినా ఫూలే దంపతులు తమ విద్యా ఉద్యమాన్ని ఆపలేదు. ‘‘అవిద్య వల్ల అవివేకం, అవివేకం వల్ల అనైతికత, అనైతికత వల్ల వెనుకబాటుతనం, వెనుకబాటుతనం వల్ల పేదరికం, పేదరికం వల్ల నిమ్న కులాలు వివక్షకు, అణచివేతకు గురికావడం జరుగుతోంది. అందుకే అన్ని రుగ్మతలకు అవిద్యే కారణమని ఫూలే బలంగా విశ్వసించారు. అందువల్లనే కింది కులాలకు, అన్ని కులాల మహిళలకు విద్యను అందించాలనే దృఢ నిశ్చయంతో ఫూలే ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 1851-52 మధ్య కాలంలో మరో రెండు బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో అంటరానికులాలైన మహర్, మాంగ్ బాలికలకు ఒక పాఠశాలను ప్రత్యేకించారు. 1882లో, విద్యా విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ ముందు ఇచ్చిన ఉపన్యాసంలో ఫూలే తన విద్యాపోరాటాన్ని వివరించారు. అంటరాని కులాల కోసం, ప్రత్యేకించి బాలికల కోసం పాఠశాలను నడిపిన మొట్టమొదటి సంఘసంస్కర్త జ్యోతిబా ఫూలే. శూద్రులు, అంటరాని కులాల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు అవసరమని మొట్టమొదటగా చెప్పింది కూడా ఆయనే. మన కులం ఆధునిక అమెరికన్ బానిసత్వం ఫూలే కుల వ్యవస్థపై, ముఖ్యంగా బ్రాహ్మణ పురోహిత వర్గం ఆధిపత్యం పై రెండు సిద్ధాంత గ్రంథాలను కూడా రాశారు. 1873లో‘గులాంగిరి’, 1881లో రైతుల అవస్థలపై ‘సేద్యగాని చర్నాకోల’ (షేఠ్ కార్యాంచా అసూడ్) అనే పుస్తకాలను రాసి... పురోహిత వర్గం ఇతర కులాలపై సాగిస్తున్న ఆధిపత్యాన్ని, దాని ప్రభావాలను వివరించారు. ‘గులాంగిరి’ పుస్తక ం భారత ఇతిహాసాలను, పురాణాలను మరొక కోణంలో చూపెట్టింది. భారత దేశంలోని ఆదివాసులను, స్థానిక ప్రజలను జయించడానికి ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులు జరిపిన దాడులే మహా విష్ణువు దశావతారని ఫూలే ఆధారసహితంగా వివరించారు. బౌద్ధ మతాన్ని ధ్వంసం చేసే కుట్రలో భాగంగానే పరుశురాముడు ఆనాటి క్షేత్రియులను (స్థానికులను) వేలాదిగా హతమార్చాడని ఫూలే ధ్రువీకరించాడు. దీనినే బ్రాహ్మణ, క్షత్రియ వైరంగా కూడా చరిత్ర కారులు విశ్లేషించారు. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ‘‘బ్రాహ్మణులు శూద్రులను బానిసలుగా దిగజార్చిన వ్యవస్థ, కొన్నేళ్ల క్రితం వరకు అమెరికాలో అమలులో ఉన్న బానిసత్వ విధానానికి ఏ మాత్రం తీసిపోదు. కఠినాతి కఠినమైన బ్రాహ్మణ ఆధిపత్యంతో ఉన్న పీష్వాల కాలం వరకు నా శూద్ర సహోదరులు అమెరికాలో నీగ్రో బానిసలు అనుభవించిన వాటిని మించిన ఎన్నో కష్టాలను అనుభవించారు’’ అని ఆయన అన్నారు. భారత కుల వ్యవస్థను, కుల వివక్షను అమెరికాలోని బానిస వ్యవస్థతో పోల్చిన ఫూలే... ఈ పుస్తకాన్ని అమెరికన్ నీగ్రోల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులకు అంకితమిచ్చారు. అంతర్జాతీయంగా సాగుతున్న మానవ హక్కుల ఉద్యమాలను ఫూలే సన్నిహితంగా పరిశీలించారని ఇది స్పష్టం చేస్తోంది. దైవానికి పూజారులనే దళారులు అవసరమా? రైతుల దీన స్థితి, పేదరికం, వెనుకబాటుతనానికి కారణమైన పురోహిత వర్గ దోపిడీ, అణచివేతలను వివరిస్తూ, ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చెండాడుతూ రాసిన ‘‘ సేద్యగాని చెర్నాకోల’’ నాడు సంచలనాన్ని సృష్టించింది. ఆ పుస్తకం మొదటి అధ్యాయంలోనే పూజారి వర్గం నిలువుదోపిడీని రకరకాల పూజలు, కర్మకాండల పేరుతో రైతులను పీల్చి పిప్పి చేయడాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నుల వసూళ్ళ మీద ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమం మీద లేదని కూడా ఫూలే ఆ పుస్తకంలో తెలిపారు. ఫూలే మూడవ కార్యాచరణ, ప్రత్యక్ష ఉద్యమం-యుద్ధం. అందు కోసం ఆయన 1873న సత్యశోధక్ అనే సంస్థను స్థాపించారు.‘‘మానవులంతా ఒకే తండ్రి బిడ్డలు. ఆ తండ్రి దేవుడు మాత్రమే. అందరికీ ఆయనే తండ్రి. తల్లి దండ్రులకూ పిల్లలకూ మధ్య సంభాషణ జరగడానికి బ్రోకర్లుగానీ, అనువాదకులుగానీ అవసరం లేనట్టే, దేవుడికీ మనుషులకూ మధ్య పూజారుల అడ్డు అక్కర్లేదు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించినవాడే సత్యశోధకుడు’’ అని సత్యశోధక్ సమాజ్ చాటింది. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, అనాథలను సంరక్షించడం వంటి కార్యక్రమాలను ఫూలే దంపతులు అంకితభావంతో నిర్వహించారు. సార్వజనిక్ ధర్మ్ అనే సంస్థను స్థాపించి చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. 1827లో జన్మించి 1890లో మరణించిన జ్యోతిబా ఫూలే సాగించిన ఉద్యమం మహారాష్ట్రలోనేగాక దేశమంతటా ప్రభావాన్ని కలుగజేసింది. ముఖ్యంగా కొల్లాపూర్ సంస్థానాధీశుడైన సాహు మహరాజ్ పైన ఫూలే ప్రభావం చాలా ఎక్కువగా కన్పిస్తున్నది. ఫూలే ఆశయాలకనుగుణంగా సాహు మహరాజ్ బ్రాహ్మణేతర ఉద్యమం కొనసాగించారు. 1902లో సాహు మహారాజ్ ప్రకటించిన రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. అంతేకాదు అంబేడ్కర్ చదువుకు, ఆయన నడిపిన పత్రికకు ఆర్థిక సహకారం సైతం ఆయన అందించారు. ‘‘తాము అనుభవిస్తున్న బానిసత్వానికి వ్యతిరేకంగా శూద్రులను మేల్కొల్పిన మహాత్మా ఫూలే ఆధునిక భారత దేశ చరిత్రలో మరపురాని సామాజిక ఉద్యమ నాయకుడు. పరాయి పాలకుల నుంచి విముక్తికన్నా, భారత సామాజిక ప్రజాస్వామ్యం చాలా గొప్పదని చాటిచెప్పిన దార్శనికుడు మహాత్మా ఫూలే’’ అంటూ అంబేడ్కర్ మహాత్మా ఫూలే నిర్వహించిన గురుతర చారిత్రక, సామాజిక పాత్రను సరిగ్గా అంచనా కట్టారు. మల్లెపల్లి లక్ష్మయ్య ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిబా ఫూలే 189వ జయంతి సందర్భంగా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
కామాటి దుశ్చర్య
♦ పాలమాకులలో హాస్టల్ విద్యార్థులపై దాడి ♦ తలకు గాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ♦ కులం పేరుతో దూషించాడని విద్యార్థుల ఆరోపణ నంగునూరు: ఓ హాస్టల్ విద్యార్థులపై కామాటి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పాలమాకులలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించడమే కాకుండా పలువురిపై గరిట, కర్రతో దాడి చేయడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం... నారాయణఖేడ్ మండలానికి చెందిన విద్యార్థులు పాలమాకుల ఎస్సీ హాస్టల్లో ఉండి స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థులు కొందరు ఒకచోట చేరి మాట్లాడుకుంటుండగా కామాటి లక్ష్మణ్ వారిని దూషించాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించగా కులం పేరుతోపాటు తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో కామాటికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరింత ఆగ్రహానికి లోనైన కామాటి పదోతరగతి విద్యార్థి వి.శ్రీనును గరిటతో కొట్టడంతో తలకు గాయమైంది. అక్కడే ఉన్న ఆర్.బాలజీ షర్ట్ చిరగడంతోపాటు జయపాల్, శ్రీకాంత్, ప్రకాశ్లపై కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధిత విద్యార్థులు రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ కొమురయ్య హాస్టల్‌కు వెళ్లి విచారించగా కామాటి లక్ష్మణ్ విద్యార్థులపై దాడి చేసినట్టు తోటి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పదోతరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి కులం పేరుతో దూషించిన కామాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్
సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడానికైనా, బరువు పెరగడానికైనా సిద్ధపడిపోతారు కొంతమంది హీరోలు. అలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకునే హీరోల్లో మనోజ్ ఒకరు. దశరథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘శౌర్య’ నేడు విడుదలవుతోంది. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం కోసం మనోజ్ బొద్దుగా తయారయ్యారు. ఇక... మనోజ్ ముచ్చట్లు తెలుసుకుందాం... ♦ ‘శ్రీ’ నుంచి నాకు దశరథ్ గారు తెలుసు. ఆయన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. ఒకరోజు ఫోన్ చేసి, కథ చెబుతానంటే ఇంటికి రమ్మన్నాను. 30 నిముషాల్లో కథ చెప్పారాయన. ఆ కథ నచ్చింది. ఆ తర్వాత గెటప్ ఎలా ఉండాలనే విషయం గురించి చర్చించుకున్నాం. మామూలుగా నా సినిమాలంటే ఫైట్లు, డ్యాన్సులు కామన్‌గా ఉంటాయనుకుంటారు. అలాగే నేను కొంచెం రఫ్ లుక్‌లో కనిపిస్తాను. కానీ, తనకలా వద్దనీ, కొంచెం బొద్దుగా, క్యూట్‌గా ఉండాలనీ దశరథ్ చెప్పారు. దాంతో బాగా తినడం మొదలుపెట్టాను. కానీ, నా మజిల్ పవర్ మాత్రం తగ్గలేదు. అందుకని పప్పు-ఆవకాయ్-నెయ్యి బాగా తినడం మొదలుపెడితే, అప్పుడు బుగ్గలు వచ్చాయి. ప్యాంటు, షర్ట్ టక్ చేసుకుని, పక్క పాపిడి తీసి, నున్నగా దువ్వుకుని, ప్లెయిన్ షర్ట్స్ వేసుకుని లుక్‌ని సెట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం మొత్తం ఎనిమిది కిలోలు బరువు పెరిగాను. ♦ ఈ చిత్రకథ విషయానికొస్తే.. మొదటి పది నిమిషాల్లో ఇది ఎలాంటి సినిమా? అనేది తెలిసిపోతుంది. అక్కణ్ణుంచి ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు దశరథ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దశరథ్ తనను తాను ఊహించుకుని క్రియేట్ చేసిన పాత్రలో నేను నటించాను. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఇది పక్కా దర్శకుడి సినిమా. మొన్ననే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. సంగీత దర్శకుడు వేదాకి ఇది తొలి సినిమా అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు. ♦ నేనే సినిమా ఒప్పుకున్నా మా ఇంట్లోవాళ్లతో, ఇతరులతో షేర్ చేసుకోను. నాకు కథ, పాత్ర నచ్చితే ఒప్పేసుకుంటాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపిస్తాను. జయాపజయాల గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే, మా నాన్నగారు కెరీర్లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడూ చూశాను. డౌన్లో ఉన్నప్పుడూ చూశాను. అందుకే మాకు జయాపజయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. మా నాన్నగారు ఈ సినిమా చూసి, ‘చాలా సటిల్‌గా చేశావ్’ అని అభినందించారు. ♦ పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఒక్కటే. ఐదు సంవత్సరాల క్రితం నుంచే మాకు పరిచయం ఏర్పడింది. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐదేళ్లు ఎవరి కంటా పడకుండా తిరిగి, మ్యానేజ్ చేశాం. పెళ్లి తర్వాత అందరి కంటా పడేలా తిరుగుతున్నాం. అదే తేడా (నవ్వుతూ)! ♦ ‘కులం, డ్రగ్స్... ఈ రెండూ చాలా ప్రమాదకరం. దయచేసి ఈ రెండింటినీ దగ్గరకు చేరనివ్వద్దు’ అని ఈ మధ్య యూత్‌కి చెబుతున్నాను. నా సినిమాను ఫలానా కులం వాళ్లే చూస్తారు... వేరే హీరోల సినిమాలు వాళ్ల కులం వాళ్లు చూస్తారు.. అనే పిచ్చి ఫిలాసఫీని నేను నమ్మను. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. ♦ ఈరోజు మూడు సినిమాలు విడుదలవుతున్నాయ్. నాకు పోటీల్లాంటివి ఉండవు. ‘మనం ముగ్గురం పార్టీ చేసుకుందాం’ అని ఆ మిగతా రెండు సినిమాల వాళ్లతో నేను అన్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతానికి చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్‌గా ప్రేక్షకులను నేను కోరుకునేది ఒక్కటే. అందరూ కలిసి నా సినిమాను థియేటర్లో చూడండి. పైరసీ చేయొద్దు. -
కులాన్ని దోచుకునే కుట్రా?
కొత్త కోణం కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ఎస్సీ, ఎస్టీలపై అత్యా చారాల నిరోధక చట్టం కింద కేంద్ర మంత్రులపై కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరలేదు. రోహిత్ కులంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ‘పరిశోధించింది’. రోహిత్‌ను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనే ఈ ఆరాటం తగదు. ప్రభుత్వం ఇప్పటికైనా రాధిక కులం ‘ఆరాలు’ ఆపి, దోషులను కాపాడే యత్నం మానాలి. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలవాల్సి వస్తుంది. రోహిత్... మూడక్షరాలు భారత పాలకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఇవే మూడక్షరాలు ఏమార్పుగా ఉన్న విద్యార్థి యువజనోద్యమానికి మార్గ నిర్దేశనం చేశాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రాజుకున్న విద్యార్థి ఉద్యమ జ్వాలలు ఢిల్లీని చుట్టుముట్టాయి. కులం నాగు కోరలు పెరికే విద్యార్థి శక్తిని అడ్డుకోలేని శక్తులు అదే కులాన్ని పావుగా మలుచుకొని రోహిత్ తల్లి రాధిక పోరాట పటిమను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఓ దళిత స్త్రీ... అందులోనూ కడుపున పుట్టిన మహా మేధావిని పోగొట్టుకున్న తల్లి కుప్పకూలిపోకుండా. దృఢంగా నిలిచి, పోరాడింది. గుండెను చిక్కబట్టుకొని, ఎన్ని అడ్డంకులెదురైనా తన దారి పోరు దారేనని విద్యార్థి ఉద్యమంలో భాగమైంది. ఇదే ప్రత్యర్థులకు మింగుడు పడనిది. నయానా భయానా లొంగదీసుకోవాలని, ఉద్యమాన్ని అణచెయ్యాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. ఏదీ సాధ్యం కాకపోగా, అమాత్యుల మెడలకే ఉచ్చు బిగుస్తుం డటంతో పాత పాచికలు మరోసారి బయటకు తీశారు. రాధిక దళితురాలు కాదని నిరూపించి, సత్యాన్ని మరుగుపర్చే యత్నం మొదలెట్టారు. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ చేసిన కుట్ర పూరిత ప్రసంగం అభాసుపాలైంది. ఆగ్రహావేశాలతో ఉపన్యసించిన స్మృతీ ఇరానీ ‘‘నేను ఇచ్చిన వివరణతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే నా తల తీసి ఇస్తాన’’ని సవాలు విసిరారు. ‘‘నేను మీ వివరణతో సంతృప్తి చెందలేదు, మీ తల తీసివ్వండి’’ అంటూ బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి నిలదీయడంతో నిజంగానే స్మృతీ ఇరానీ తల తీసేసినంత పనయ్యింది. రోహిత్ కులాన్ని వివాదాస్పదం చేసి పాలకులు తమ తలలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నారనిపిస్తోంది. తిమ్మిని బమ్మిచేస్తే తప్పు ఒప్పయ్యేనా? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, చైతన్యవంతమైన విద్యార్థి ఉద్యమంపై కుల దురహంకారులు ద్వేషం వెళ్లగక్కారు. పథకం ప్రకారం రాజకీయ అండదండలతో రోహిత్ సహా ఐదుగురు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి వెలివేశారు. తదనంతర పరిణామాలను జీర్ణించుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకొని దేశాన్ని, ప్రత్యేకించి దళిత ఉద్యమకారులను నిద్రలేపాడు. అంతేకాదు, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వైస్ చాన్స్‌లర్ అప్పారావు తదితరుల మీద రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పిన అభియోగంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది. దీంతో వారు తొలుత రోహిత్ అసలు ఎస్సీ కాదని నిరూపించాలని శతవిధాలా యత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం తన మిత్రపక్షమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాలని రకరకాల ప్రచారాలు, తప్పుడు వాదనలు ప్రచారంలోకి రావడానికి ఆస్కారం కల్పించింది. ఈ వివాదం పథకం ప్రకారం పన్నిన కుట్ర. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన వెంటనే రోహిత్ వేముల తండ్రిని తెరపైకి తెచ్చి, అతని చేత రోహిత్ వడ్డెర కులస్తుడని చెప్పించి నమ్మించాలని ప్రయత్నిం చారు. ఎన్నడో తల్లిని పిల్లలను వీడి, ఎన్నడూ పిల్లల ఆలనా పాలనా చూడని ఆ తండ్రి కులాన్ని రోహిత్‌కి అంటగట్టాలని చూశారు. రోహిత్ తల్లి రాధిక ఎస్సీ ‘మాల’ కనుక రోహిత్ ఆమె కులస్తుడే అవుతాడని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పుడు రాధికే ఎస్సీ కాదనే కొత్త వాదన మొదలు పెట్టి, రకరకాల రుజువులు చూపడం ప్రారంభించారు. తిరుగులేని వాస్తవాలనూ కాదంటారా? రోహిత్ తల్లి రాధిక జీవితాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే వాస్తవాలు తేటతెల్లమవుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు జిల్లా అధికారులు రాధిక పెంపుడుతల్లి అంజనీదేవి స్టేట్మెంట్ను నమోదు చేశారు. దాని ప్రకారం రాధిక, కూలి పని చేసుకునే ఓ వలస కూలీల జంటకు పుట్టిన బిడ్డ. అప్పటికే ఒక పాపను కోల్పోయిన అంజనీదేవి చక్కగా ఉన్న ఈ పాప(రాధిక)ను తనకివ్వమని కోరగా, పేదరికంలో ఉన్న ఆ జంట ఆ పసిపాపను ఆమెకు అప్పగించి వెళ్లిపోయారు. రాధిక మాల కులస్తురాలనే విషయాన్ని కావాలనే తాము దాచిపెట్టి, తమ కులస్తురాలనే చెప్పామని అంజనీదేవి తెలిపారు. 14వ ఏటనే రాధికను తమ వడ్డెర కులస్తుడైన మణి కుమార్‌కిచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళిలో కూడా రాధిక ఎస్సీ అని బయట పడనివ్వ లేదని ఆమె మీడియాకు చెప్పారు. రాధిక ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఆమె మాల అని భర్తకు తెలిసింది. దీంతో మణికుమార్ రాధికను హింసించడంతో పాటూ, అంజనీదేవితో సైతం గొడవపడేవాడట. ఈ హింస తట్టుకోలేకే రాధిక విడాకులు తీసుకుందని మణికుమార్ తాత చెప్పారు. రాధిక తన ముగ్గురు పిల్లలతో వచ్చి కొంత కాలం అంజనీదేవి వద్దే ఉన్నా, తర్వాత గుంటూరుకు...అది కూడా తన కులంవారు నివసించే మాలవాడకు చేరింది. రాధికను పెంచుకోవడం మొదలు పెట్టాక అంజనీదేవికి నలుగురు పిల్లలు పుట్టారు. వారంతా మంచి చదువులు చదివి, మంచి వృత్తులలో బాగా బతుకుతున్నవారే. అంజనీదేవి సైతం ఎంఏ, ఎంఈడీ చదివి, మున్సిపల్ హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేశారు. ఆమె భర్త ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ విషయాలను ప్రస్తావించడానికి బలమైన కారణమే ఉంది. పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న ఆ జంట సొంత పిల్లలను చదివించి వృద్ధిలోకి తెచ్చినా, రాధికను మాత్రం చదివించకుండా బాల్య వివాహం చేసి పంపేసింది. భర్తతో విడాకులు తీసుకుని వచ్చిన రాధికను, ఆమె పిల్లలను అంజనీదేవి దంపతులే గాక, ఇంట్లో వారంతా పనివాళ్లకంటే హీనంగా చూసేవారని ప్రత్యక్ష సాక్షి అయిన రోహిత్ ప్రాణమిత్రుడు రియాజ్ చెప్పారు. రాధిక గుంటూరుకు చేరాక వారు తమకు ఎలాంటి సాయం చేయలేదని, రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి తెలిపారు. అనాథ అయినా రాధిక వడ్డెర కులస్తురాలై ఉంటే అంజనీదేవి కుటుంబం నుంచి తగు సాయం అందేది. అందరితో సమానంగా చూసేవారు. రాధిక వడ్డెర కులంలో పుట్టలేదనడానికి రెండు రుజువులున్నాయి. ఒకటి అంజనీదేవి స్టేట్మెంట్, రెండవది రాధిక విడాకుల గురించి ఆమె భర్త మణికుమార్ బంధువు చెప్పిన విషయాలు. రాధిక మాలవాడలో నివసిం చాలని నిర్ణయించుకోవడం కూడా కీలకమైనది. దళితేతరులెవ్వరూ మాల, మాదిగలుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. రాధిక మాల కులస్తురాలు కాకపోతే ఏరికోరి దళిత కాలనీకి వెళ్ళే అవకాశమే లేదు. ‘‘మాల మాదిగలుగా ఎవ్వరూ పుట్టాలనుకోరు. అది యాదృచ్ఛికం. రాజులుగానో, మహారాజులు గానో ఉండాలనుకుంటారు’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారు! రాధిక తమది వడ్డెర కులమని చెప్పుకుని ఉంటే, కుల వివక్ష కూడా అంతగా ఉండేది కాదు. తన కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ముగ్గురు కేంద్ర మంత్రులపై ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరుకోలేదు. రోహిత్ కులమేమిటని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో శ్రద్ధగా ‘పరిశోధించింది’. ఎలాగైనా వాస్తవాలను మసిపూసి మారేడు కాయగా మార్చాలనీ చూస్తున్నది. ఓ ఒంటరి దళిత స్త్రీ కులంపై ఇంతటి ‘పరిశోధనా’? ఒక ఒంటరి దళిత స్త్రీ రాధిక కులం నేడు దేశవ్యాప్త చర్చనీయాంశం ఎందుకయ్యింది? గత కొన్నేళ్ళుగా నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని పలు ఆరోపణలు ప్రభుత్వాలకు అందాయి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ విషయంపై విచారణలు, క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నివేదికలను అందించింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన పరిశీలనలో హైదరాబాద్‌లోని ఆదాయం పన్ను శాఖలో 31 మంది, టెలికమ్యూనికేషన్స్‌లో 8 మంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 10 మంది, విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో 13 మంది, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో 7 మంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో 33 మంది, మొత్తం 102 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు కమిషన్ తేల్చింది. కానీ ఇంతవరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో సైతం నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది, ఉన్నత పదవులు అనుభవించి రిటైరైన వారున్నారని ఫిర్యాదులున్నాయి. అయినా చర్యలు శూన్యం. కానీ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, ఆత్మబలిదానం చేసుకున్న రోహిత్ కులం గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ఆతృత, ఆసక్తి, ప్రత్యేక శ్రద్ధ చూపి ఏం తేల్చదల్చుకున్నారు? విచారణ ద్వారా ఏ వాస్తవాలను అవాస్తవాలని చలామణి చేయాలనుకుంటున్నారు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ దళిత స్త్రీ కుల హక్కుని సైతం దోచుకోవాలని ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? రోహిత్ బలిదానం ఎలుగెత్తి చాటిన ఉన్నత విద్యాలయాల్లోని కుల వివక్షను కాదా? ఒక్క హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఇప్పటి వరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రస్తావిస్తే... కేంద్ర మంత్రి స్మృతీఇరానీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగాయని ఆవేశంగా మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో వివక్ష జరిగింది కాంగ్రెస్ హయాంలోనా, బీజేపీ హయాంలోనా? అనేది ప్రశ్నే కాదు. కేంద్రానికే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ, ఇతర అణగారిన వర్గాల పిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష మీద విచారణ జరపాలి, నివారణకు పరిష్కార మార్గాలను ఆలోచించాలి. అంతేకానీ, రోహిత్ ప్రాణాలను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనుకుంటే ఒక తప్పుని కప్పిపెట్టడానికి మరో తప్పు చేయడమే అవుతుంది. దుష్పర్యవసానాలూ తదనుగుణంగానే ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వివేచనతో వ్యవహరించి, రోహిత్ తల్లి రాధిక కులంపై ఆరాను ఆపి, దోషులను కాపాడే ప్రయత్నం మానుకోవాలి. రోహిత్ సమస్యను మరింత జటిలం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్నది వాస్తవం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య ) మొబైల్: 97055 66213 -
కుతంత్రాలలో గణతంత్రం
రెండో మాట రాజ్యాంగం చేసిన సమానత్వ, సామాజిక శాంతి రక్షణ శపథాలన్నింటినీ పాలకవర్గాలు సముద్రంలో నిమజ్జనం చేస్తూ వచ్చిన ఫలితమే నేటి ఈ అశాంతి. నేడు బహుజనుల పట్ల కొనసాగుతున్న వివక్షకు ‘హైందవ సమాజం’ ముసుగులో కొన్ని రాజకీయ పక్షాలూ, వాటి కుల మత సంస్థలూ నెరపుతున్న కార్యకలాపాలే కారణం. ఎందుకో మరి, తొలి ప్రధాని నెహ్రూ, ‘కాంగ్రెస్‌లో ఆది నుంచీ ఆరెస్సెస్ వర్గీయులు తిష్ట వేశారు’ అన్నారొకసారి. ‘ప్రజలను వేల కులాలుగా విభజిస్తే, అది ఒక దేశంగా లేదా జాతిగా ఎలా మనగలుగుతుంది? సాంఘికంగా చూసినా, వైజ్ఞానికంగా చూసినా మనమింకా ఒక దేశ పౌరులుగా, సమగ్ర జాతిగా రూపొందలేదన్న సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.’ -డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇది గణతంత్ర వ్యవస్థకు పునాదులు వేసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్ చర్చల సందర్భంగా వెలిబుచ్చిన అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అంబేడ్కర్ వెల్లడించిన ఈ అభిప్రాయానికి ఎంతో విలువ ఉంది. శతాబ్దాల తరబడి దేశంలో రాచరికాలు, కులమత, సంపన్న వర్గాలు ‘హైందవం’ పేరుతో పెంచి పోషిస్తూ వచ్చిన వ్యవస్థ రానురాను ఏ విపరిణామాలకు బాటలు వేయ బోతున్నదో; దాని ఫలితం ఎలా ఉండబోతున్నదో రాజ్యాంగ ముసాయి దాను ప్రవేశపెడుతూ అదే సభలో అంబేడ్కర్ ఆనాడే హెచ్చరించారు- ‘భారతదేశం రాజకీయంగా సమతను సాధించవచ్చు గాక; కానీ సామాజిక, ఆర్థిక రంగాలలో అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ అసమా నతల వల్ల ప్రజాజీవనంలో పొడసూపుతున్న వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలి. ఆ లక్ష్యం నెరవేరకపోతే, అసమానతల వల్ల బాధలకు గురవుతున్న ప్రజా బాహుళ్యం ఈ సభ వారం ఎంతో శ్రమించి నిర్మించుకున్న ఈ రాజకీయ ప్రజాస్వామ్య భవంతిని కూల్చివేస్తారు.’ (కానిస్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్, 3/5 సంపుటాలు) ఇంత తీవ్రమైన, పరుషమైన భావనకూ, పదజాలం వైపునకూ అంబేడ్కర్‌ను నెట్టిన పరిస్థితులు ఏమిటి? అప్పటిదాకా అస్వతంత్రులమే అసమ సామాజిక వ్యవస్థలో దశాబ్దాల స్వాతంత్య్ర సిద్ధి తరువాత కూడా ఆఖరి నిరుపేద లేదా దళితుడు కూడా విముక్తి పొంది, స్వేచ్ఛాజీవిగా ఊపిరి పీల్చుకునే దాకా మనం అస్వతంత్రులమేనని చాటారు గాంధీజీ. 2006 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఈ అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక కేసులో (యూపీ వర్సెస్ సంత్రాజ్ సింగ్) తీర్పు చెబుతూ, ‘చట్ట విరుద్ధమైన చర్యలో పౌరులకు సమానత్వాన్ని ఎవరూ ఆశించలేరు’ అని వ్యాఖ్యానించింది. ఈ జీవన సత్యాన్ని తన కుటుంబం అనుభవించిన కటిక పేదరికం నేపథ్యం నుంచే అంబేడ్కర్ తెలుసుకున్నారు. కనుకనే స్వతంత్ర భారతదేశంలో కుల వ్యవస్థ నీడన అధికారంలోకి వచ్చే సంపన్నవర్గ ప్రభుత్వాల మధ్య; ఏ బ్రాండ్‌కు చెందినప్పటికీ ఆయా పాలకుల మధ్య దళిత బహుజన వర్గాల ప్రయోజనాలకు కలుగనున్న నష్టాలను ముందుగానే ఊహించారాయన. నిన్నగాక మొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాలనా పరమైన వివక్ష ఫలితంగా దళిత వర్గ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంబేడ్కర్ ఊహలోని వాస్తవికతను మరోసారి చాటింది. స్వాతం త్య్రం వచ్చిన తరువాత వివిధ రాష్ట్రాలలో; కాంగ్రెస్, బీజేపీల పాలనలో, లేదా యూపీఏ, ఎన్డీఏ కూటముల ఏలుబడిలో దళిత బహుజనులపై సాగిన, ఇంకా సాగుతున్న విపరిణామాలు కూడా ఆయన ఊహకు తగ్గట్టే ఉన్నాయి. ‘భారత ప్రజలమైన మేము...’ అంటూ వివక్ష లేని ఒక సమాజానికి రాజ్యాంగం పూచీ పడుతున్నది. అలాంటి సంకల్పబలంతో ప్రకటించుకున్న రాజ్యాంగం ఉన్నప్పటికీ సంపన్నవర్గాల ప్రభుత్వాలే షెడ్యూల్డ్ కులాల, తెగల మధ్య చిచ్చు రేపుతూ వచ్చాయి. రాజ్యాంగం చేసిన సమానత్వ, సామాజిక శాంతి రక్షణ శపథాలన్నింటినీ పాలక వర్గాలు సముద్రంలో నిమజ్జనం చేస్తూ వచ్చిన ఫలితమే నేటి ఈ అశాంతి. నేడు బహుజనుల పట్ల కొనసాగుతున్న వివక్షకు ‘హైందవ సమాజం’ ముసుగులో కొన్ని రాజకీయ పక్షాలూ, వాటి కుల మత సంస్థలూ నెరపుతున్న కార్యకలాపాలే కారణం. ఎందుకో మరి, తొలి ప్రధాని నెహ్రూ, ‘కాంగ్రెస్‌లో ఆది నుంచీ ఆరెస్సెస్ వర్గీయులు తిష్ట వేశారు’ అన్నారొకసారి. అందుకే అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ రెండు ప్రధాన పార్టీలు కులమత వ్యవస్థా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం పూచీ పడిన సెక్యులర్, మతాతీత వ్యవస్థలను ఆచరణలో పటిష్టం చేయడం దగ్గర విఫలమవుతున్నాయి. దీని వెనుక కారణాన్నీ, బీజాన్నీ అంబేడ్కర్ ఆనాడు శాస్త్రీయంగా నిర్ధారణ చేయగలిగారు. ‘హైందవ సమాజ నిర్మాణానికి పునాది కులం’ అని చాటారాయన. ఏ కులమూ నీదంటే.... కులానికి సూత్రాలేమిటి? జన్మను బట్టి మానవుల మధ్య అసమానతలు, వృత్తులలో అసమానతలు. నాలుగు ప్రధాన కులాల మధ్య సమాజ విభజన, అందులో మళ్లీ ఉపకులాలు ఉన్నాయని స్వార్థపరులు తీర్మానించారనీ, ఈ విభజనను శాసించినది బ్రాహ్మణ్య సిద్ధాంతమని అంబేడ్కర్ చెప్పారు. ముస్లింల దండయాత్రకు ప్రధాన కారణం బ్రాహ్మణ్యానికీ, బౌద్ధానికీ మధ్య జరిగిన నైతిక పరమైన సంఘర్షణేనని కూడా ఆయన విశ్లేషించారు. భారతీయ సంస్కృతిలో చారిత్రకంగా మూడు రకాల ఇండియాలు ఉన్నాయనీ, అవి బ్రాహ్మనిక్ ఇండియా, బుద్ధిస్టిక్ ఇండియా, హిందూ ఇండియా అని వర్గీకరించారు అంబేడ్కర్. ఇందులో బౌద్ధ భారతం కులాల ప్రాతిపదికగా కాకుండా, వృత్తులపైన ఆధారపడినదని చెప్పారాయన. ఈ అవగాహనే ఆయనను బౌద్ధం వైపు మళ్లించింది. హైందవంలోని చిక్కుముడుల మీద ధ్వజమెత్తేటట్టు చేసినది శాస్త్రీయమైన ఆ అవగాహనే. ఈ ఆవిష్కరణే రాజ్యాంగ రచనలో సాధ్యమైనంత మేర మానవీయ కోణాలను చొప్పించేం దుకు కృషి చేయించింది. కానీ ఆరున్నర దశాబ్దాల తరువాత దేశం ఏ స్థితికి చేరుకుంది? కులాన్ని కులంతోనే ఎదుర్కొనాలన్న భావనతో స్వార్థ రాజకీయ వర్గాలు కుట్ర పన్నే స్థితికి వచ్చింది. అక్కడితోనే ఆగిపోకుండా, కులంలో ఉప కులాలను వెతకడం ఆరంభమైంది కూడా. వర్ణాంతర వివాహాలను చెడగొట్టే వరకూ, రోహిత్ ఆత్మహత్యలో కుల వివక్షను వెతికే వరకూ పాలక వర్గం కుల కండూతి కొనసాగింది. అతడి ఆత్మహత్యకు దారి తీసిన అసలు కారణాన్ని మభ్య పరిచేందుకు తల్లీబిడ్డల పుట్టుకకు తబిశీళ్లు తీసేదాకా ఈ ధోరణి పాకింది. ఆపై, తాజాగా అమెరికా అందుబాటులోకి తెచ్చిన ఉగ్రవాద రాజ కీయాలతో, లేదా రాడికల్ రాజకీయాలతో రోహిత్‌కూ, అతడి మిత్రులకూ సంబంధం కలిపే వరకూ కూడా వెళ్లింది. దీనితో పాటు ఈ ఆత్మహత్య మూల కారణాన్ని ట్రాష్‌లోకి తోయడానికి కమిటీలు, విచారణలతో ప్రయత్నం జరుగుతోంది. కానీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ కేబినెట్ మంత్రులు (మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సహా) అంతా నదురూ బెదురూ లేకుండా పదవులను కాపాడుకుంటున్నారు. రోహిత్‌ది ఏ కులం, అతడి తల్లిది ఏ కులం అని కొందరు దుర్భిణీ వేసి మరీ వెతకడం దారుణం. అతడిది మాల కులం కాదు, వడ్డెర కులమని నిరూపించే ప్రయత్నం జరిగింది. ఈ రెండూ కాదు, కుమ్మరి కులమని కొందరు తీర్మా నించారు. ఈ స్థితిలో తాను ఏ పరిస్థితులలో భర్తకు విడాకులు ఇచ్చినది చెప్పుకోవలసి రావడమే కాకుండా, తాను షెడ్యూల్డ్ కులాలకు చెందినదాన నేనని ప్రకటించుకోవలసి వచ్చిందంటే ఎంతటి అనాగరిక ధోరణో అర్థమవు తుంది. రోహిత్ కమ్మరి, కుమ్మరి అయినా అతని కుటుంబానిది మరే కుల మైనా, శరీర కష్టాన్ని స్ఫురింపచేసే కొలిమి, చక్రం, మగ్గం, పలుగూ పార, బౌద్ధం తలదాల్చిన వృత్తి సమాజపు చిహ్నలేగానీ కుల చిహ్నాలు కావు. టీ అమ్ముకుని జీవనం సాగించానని మనకు తెలియని ఒక రహస్యాన్ని ఎన్నికల సమయంలో ప్రకటించుకున్న ప్రధాని మోదీకి, అంతకన్నా దారుణమైన పరిస్థితులలో పెరిగి చివరికి రోహిత్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. అయినా దొంగలు పడిన ఆరుమాసాల తరువాత ఏదో స్పందించాలన్నట్టు రోహిత్ ఆత్మహత్యతో భారతమాత ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని నివాళి అర్పించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతం అయినారని వార్తా కథనాలు వచ్చాయి. ఆ కథనం మాటెలా ఉన్నా ప్రసిద్ధ మీడియా న్యూస్ ఏజెన్సీ ‘ఫాక్స్‌న్యూస్’ దీనికి సమాంతరమైన కథనం ఒకటి ఇచ్చింది. అమెరికన్ పాఠశాలల్లో తుపాకీ వాడకం మితిమీరిపోవడంతో తోటి పిల్లలను కొందరు పిట్టల్లా కాల్చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్ల పర్యంతమైనట్టు పత్రికలు రాస్తే, అతడు ఉపన్యసించిన పోడియం దగ్గరకు వెళ్లి చూస్తే, కన్నీళ్లు తెప్పించగల ఓ ఉల్లిపాయ కిందపడి ఉందట. చివరకు ఈ జబ్బు కుల వ్యవస్థకూ పాకిపోయింది. 1967/1969 లగాయితు ఈ ‘కులంగాడి’ గారడీలు, దౌర్జన్యాలు, హత్యలు, వేర్పాటు వాదాలు సాగుతూనే ఉన్నాయి- రోహిత్ ఆత్మహత్య వరకు. నమ్మకం పెంచాలి స్వాతంత్య్రానంతరం షెడ్యూల్డ్ కులాల పట్ల వివక్ష మరీ పెట్రేగి పోయిందని ఎలా పెరుమాళ్ కమిటీ, షెడ్యూల్డ్ కులాల, తెగల జాతీయ కమిషన్ కూడా తెలిపాయి. ఈ పరిణామాలను చైతన్య వంతులైన దళిత యువకులు, మేధావులు గమనిస్తూనే ఉన్నారు. ప్రసిద్ధ రచయిత డబ్ల్యు. ఎన్. కుబేర్ ‘దళిత బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలు నడుపుతున్నా వాటినీ దారుణంగా అణచివేయడాన్ని నేటి యువత గమనిస్తున్నారు. ఈ దమనకాండను దళిత బహుజనులు ఇక సహించరు. జాతీయ చిహ్నాలలో వీరు విశ్వాసం కోల్పోకూడదు’ అన్నారు. ఇంటిగుట్టు గురించి జాషువ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి. ‘దేవుడొకడు మాకు దేవళంబులు రెండు... మాటవరుస కొక్క మతమందురే గాని/ కుల సమస్య వద్ద కుమ్ముదుమ్ము. ’ ఆ దుమ్మును అణచలేకే అంబేడ్కర్ బౌద్ధాన్ని ఆశ్రయించారు. ఇప్పటికైనా ఐకమత్య పాఠంతో దళిత బహుజనులు ముందుకు సాగి, మహోద్యమ నిర్మాతలు కావాలి. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
పుట్టగానే కుల ధ్రువీకరణ
ఎస్సీ, ఎస్టీ చిన్నారులకు వర్తింపు * కేంద్ర ప్రభుత్వ నిర్ణయం * పాఠశాలల్లోనూ కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ న్యూఢిల్లీ: ఇకపై బిడ్డపుట్టినపుడే జనన ధ్రువీకరణతోపాటు కుల ధ్రువీకరణ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ చిన్నారులకు బర్త్ సర్టిఫికెట్‌లోనే కులం పేరును పేర్కొనేలా చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు 8వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ (కుల ధ్రువీకరణ) పత్రాలతోపాటు నివాస ధ్రువీకరణ పత్రాలను పాఠశాలల ద్వారానే అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కుల, ప్రాంత ధ్రువీకరణ (రెసిడెన్స్) పత్రాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. వీటిపై చర్చించిన ప్రభుత్వం.. పుట్టినప్పటి నుంచే కుల ధ్రువీకరణ ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో జనన ధృవీకరణ పత్రాల్లోనే దళిత ముద్ర కనిపించేలా చర్యలు తీసుకోనుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వ్యక్తిగత శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు వివరాలతో దరఖాస్తులు నింపి ఉన్నతాధికారులకు పంపిచాలి. పైస్థాయిలో దీన్ని పరిశీలించిన తర్వాత ప్రధానోపాధ్యాయుడి ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఒకవేళ ఎవరి దరఖాస్తు అయినా తిరస్కరిస్తే ఆ వివరాలను కూడా విద్యార్థికి తెలిపే విధానాన్ని అమలు చేయనున్నారు. -
మాలి కులస్తుల ఆందోళన
ఆదిలాబాద్: తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మాలి కులస్తులు ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు పిలుపిచ్చారు. ప్రస్తుతం మాలి కులస్తులు బీసీ జాబితాలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 10 వేల మందితో జిల్లాలో ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో ఈ రోజు బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రధాన కూడళ్ల వద్ద జిల్లా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. -
ఉరికంబానికీ ఉంది వివక్ష
కొత్త కోణం కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరిస్తోంది. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల తలుపులు తట్టడమంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలుగుతున్నారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవం తెలియజేస్తున్నది అదే. ‘‘మరణశిక్షను ఖరారు చేయడం రాష్ట్రపతిగా నేను ఎదుర్కొన్న అతి కఠిన మైన సమస్య. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేసులే ఎక్కు వగా పెండింగ్‌లో ఉన్నాయి.’’ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న మాటలివి. మరణశిక్ష విధింపులో ధన, కుల పక్షపాతం కనిపిస్తున్నదని ఆయన సుస్పష్టంగా తెలిపారు. కలాంను వేనోళ్ల కొనియాడుతున్న వాళ్ళు ఆయనలోని ఆ మానవత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతవరకు ఆచరణలో పెట్టగలరనేది అనుమానమే. కనీసం ఆలోచించడం మొదలు పెట్టినా అది ఆయనకు ఘన నివాళే. కులం, ధనం కలవారిదే ‘ఉన్నత’ న్యాయం కలాం అభిప్రాయం అక్షర సత్యమని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యా లయం విద్యార్థులు, అధ్యాపకుల అధ్యయనం రుజువు చేసింది. మరణశిక్ష పడ్డ ఖైదీలలో నాలుగింట మూడువంతులు వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలేనని తేల్చింది (93% దళితులు, మైనారిటీలు). 23% నిరక్షరా స్యులు కాగా, మిగతావారిలో చాలా మంది హైస్కూల్ విద్యకు నోచుకోని వారు. వీరిలో చాలా మందిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనూ లేదు, న్యాయవాదులతో తమ కేసును చర్చించే అవకాశమూ ఇవ్వలేదు. మరీ దుర్మార్గంగా మరణ శిక్షకు గురైనవారిలో చాలా మందిని ప్రత్యేక గదుల్లో బంధించి, ఎవరితో కలవకుండా చేశారు. కులంతో పాటు పేదరికం కూడా చాలా మందికి ఉన్నత న్యాయస్థానాల్లో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నిరాకరించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపులు తట్టడ మంటే లక్షల రూపాయలతో పని. ధన బలం ఉన్నవారే ఆ పని చేయగలరు. అలాంటి వారే తమ శిక్షలను తగ్గించుకోగలిగారు. దేశంలో గత 15 ఏళ్లలో 1,600 మందికి మరణశిక్ష విధించగా, అందులో 5%కు ఆ శిక్ష ఖరారైంది. వారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలేనన్న కఠోర వాస్తవాన్ని ఈ అధ్య యనం బయటపెట్టింది. భారత న్యాయవ్యవస్థ... బొమ్మా బొరుసు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపున ఇంకో కథ ఉంది. దళితులు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఖరారై ఉరికంబం ఎక్కితే, దళితులు ఊచ కోతకు గురైన కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇది, నిగ్గు తేలిన నిజాలు చెబుతున్న కథ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో దళితులపై జరి గిన రెండు ఘోర దురాగతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చర్చను రేకెత్తించాయి. అయినా ఆ రెండు కేసుల్లోనూ నిందితులు నిర్దోషులుగానో, లేదా తక్కువ శిక్షలతోనో బయటపడ్డారు. ఒకటి ‘చుండూరు’. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడే శారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు. ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావ జ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్ర తను తగ్గించేసింది. ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు... అంతా నివ్వెరపోయేలా ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఉన్నత న్యాయస్థానాల్లో నిరుపేదలకు, దళితులకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం సన్నగిల్లింది. చుండూరు కేసు అరుదైనది కాకపోతే, అరుదైనవిగా పేర్కొన్న చాలా కేసులు కూడా అరుదైనవి కాకపోయే ఉండాలి. జరిగిన ఘోర దురంతం కాదనలేనిదై నప్పుడు... ప్రాసిక్యూషన్ విఫలమైతే, ఆ కేసును తిరిగి పరిశోధించాలని, అవసరమైతే అందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హైకోర్టు ఆదేశించాల్సింది. కానీ అలా చేయలేదు. దీంతో న్యాయస్థానం తన బాధ్యతను విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సరిగ్గా విరుద్ధమైన పరిస్థితి విజయవాడ శ్రీలక్ష్మి హత్య కేసు. ఆ విద్యార్థినిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపినందుకు మనోహర్ అనే యువకుడికి మరణ శిక్ష విధించాలని పలు మహిళా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేశాయి. నిందితుడి తరఫున వాదించరాదని న్యాయవాదులు ఏకగ్రీ వంగా తీర్మానించారు. న్యాయస్థానం సైతం మనోహర్‌కు మరణ శిక్ష విధిం చింది. మంచిదే అలాంటి దుర్మార్గుడికి ఆ శిక్ష పడాల్సిందే. కానీ ఈ హత్యతో పోలిస్తే, చుండూరు మారణకాండ కొన్ని వేల రెట్లు అమానుషమైనది. మనో హర్ కేసులో ఏడాదిలోగానే విచారణ పూర్తయింది, శిక్ష పడింది. కానీ చుం డూరు కేసు విచారణకు 16 ఏళ్లు పట్టింది, నలుగురు జడ్జీలు మారారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికే తొమ్మిదేళ్ళు పట్టింది! సాక్షులు సైతం చాలా మంది చనిపోయారు. ఈ రెండు కేసుల్లో ఎందుకింత వ్యత్యాసం? ఢిల్లీ అధ్యయనం పేర్కొన్నట్టు న్యాయ ప్రక్రియలో, శిక్షల విధింపులో కులం, ధనం ప్రాబల్యం వహిస్తున్నాయనేది సులభంగానే అర్థమవుతుంది. దళితులపై దురాగతాలు ‘అరుదైనవి’ కాలేవు ఇక మహారాష్ట్రకు వస్తే, నాగపూర్ సమీపంలోని భండార జిల్లా ఖైర్లాంజిలో ఒక భూవివాదం సాకుతో ఆధిపత్య కులాల వారు భూత్ మాంగే అనే ఒక దళితుని కుటుంబంలోని నలుగురిని కిరాతకంగా చంపేశారు. దాదాపు 40 మంది మారణాయుధాలతో చుట్టుముట్టి మాంగే గుడిసెను తగులబెట్టి, ఆయన భార్యను, ఇద్దరు కొడుకులను, కూతురిని చిత్రహింసలకు గురిచేసి, తల్లీ కూతుళ్ళిద్దరిపై నడిబజారులో అత్యాచారం జరిపి అతి అమానుషంగా చం పారు. ఈ ఘోరాన్ని ఆధిపత్య కులాల మహిళలు ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా పొదల మాటున దాగి చూసిన భూత్ మాంగే స్వయంగా కేసుపెట్టారు. 2008లో ఆరుగురు నిందితులకు ప్రత్యేక న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది. కానీ తర్వాత బొంబాయి హైకోర్టు దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది! ఇక ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఐదుగురు దళిత యువకులు, ఒక జాట్ అమ్మాయిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పెట్టిన కేసులో నిందితులకు మరణశిక్ష విధించారు. కాగా, 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని ఒక హోటల్లో పనిచేస్తున్న లక్ష్మి (పేరు మార్చాం) అనే దళిత యువతి అత్యాచారానికి గురైంది. ఆమె నిందితులను గుర్తుపట్టి, జరిగిన దురాగతాన్ని కోర్టులో పూసగుచ్చినట్టు వివ రించింది. అయినా ఆ కేసులోని నిందితులంతా నిర్దోషులుగా బయట పడ్డారు! దీన్ని బట్టి మన దేశంలో అమలవుతున్న నేరము-శిక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. మనుస్మృతి ఆధారంగానే నేరము-శిక్ష ఇలా ఒక్కొక్కటొక్కటిగా చూస్తుంటే న్యాయం త్రాసులో బలిపశువులుగా మారుతున్న వారంతా దళితులు, పేదలేనని రుజువవుతుంది. నేరం చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకోడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, విధిస్తున్న శిక్షల్లోని అంతరాలను గమనిస్తే నేరం తీవ్రతేగాక కులం, ధనం వంటి ఇతర అంశాల ప్రభావం తీర్పులపై అధికంగా ఉంటున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ అధ్యయనం దీన్ని మరోమారు రుజువు చేసింది. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం కేవ లం రాతలకే పరిమితమైంది. వాస్తవంగా అమలవుతున్నది భారత రాజ్యాం గం కాదు. రెండు వేళ ఏళ్ల నాటి మనుస్మృతి. దానిలో 8, 9, 11 అధ్యాయాల లోని నేరము-శిక్షకు సంబంధించిన అంశాలన్నీ పుట్టుకను బట్టి, వర్ణాన్ని బట్టి శిక్షలని నిర్దేశించాయి. చాతుర్వర్ణ వ్యవస్థలోని ప్రజలకు వారి వారి వర్ణ నేప థ్యాన్ని బట్టి మనువు శిక్షలను ఖరారు చేశాడు. ఆ మనుధర్మాన్ని మెదళ్ల నిండా నింపుకొని మనం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాం. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత న్యాయ చరిత్ర దాన్నే రుజువు చేస్తోంది. ఈ తీరు మారాలి, తీర్పులూ మారాలి. అప్పుడే న్యాయానికి ధనిక, పేద, కుల, మత, ప్రాంతీయ భేదాలుండకూడదన్న అబ్దుల్ కలాం కల నిజమవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 -
కుల వివక్ష వీడిన ఎల్గోయి.. వెలుగోయి
కులం చెదిరింది.. స్నేహం కుదిరింది నాడు కత్తులు దూసిండ్రు.. నేడు మిత్రులవుతుండ్రు ‘సాక్షి’ చిరు ప్రయత్నం.. నేడు గ్రామంలో వివాహం అందరికీ అందిన శుభలేఖలు సంగారెడ్డి: నిండు వేసవిలోనూ నిగనిగలాడే హరిత వనాల్లాంటి చెరుకు తోటలు.. వాటి నడుమ చుట్టూ ఏడూళ్ల శివార్లతో సరిహద్దు.. తెలగ, దళిత, లింగాయత్, బీసీ సబ్బండ జాతులు కలగలిసిన జీవనం.. వ్యవసాయమే జీవితం. రెక్కల కష్టమే జీవనాధారం. బాంధవ్యం, బంధుత్వమే వాళ్ల బలం. అలాంటి పల్లెలో కులం చిచ్చు రేగింది. దళితులు ‘ఆత్మగౌరవం’ కావాలంటే మరో సామాజిక వర్గం ‘అవమానం’గా భావించింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న వాళ్లు వైరి వర్గాలయ్యారు. కుల కట్టుబాట్లు పుట్టుకొచ్చాయి. కుల సంఘాలు చొచ్చుకొచ్చాయి. ఠాణా వరకు వెళ్లారు. పచ్చగా బతికిన పల్లె జనం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కులం కొలిమిలో మాడుతున్న ఆ పల్లె పేరు ఎల్గోయి. కత్తులు దూసుకున్న ఆ పల్లెలో ఇప్పుడిప్పుడే మళ్లీ పాత స్నేహం చిగురేస్తోంది. మునుపటి ఆప్యాయతను, అనురాగాన్ని పంచుకునేందుకు తొలి అడుగు వేస్తోంది. ఊరి జనం కుల బంధనాల్లోంచి బయటికి రాబోతున్నారు. వైరి వర్గాలను కలపడం కోసం ‘సాక్షి’ ఓ చిరు ప్రయత్నం చేసింది. శనివారం గ్రామంలోని ముఖ్యులను ఒకచోట కలిపింది. పెద్దలంతా కలిసి మనుసు విప్పి మాట్లాడుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ గొప్పతనాన్ని గుర్తించారు.. దళితుల నిర్ణయాన్ని స్వాగతించారు. ఆదివారం జరిగే తన కొడుకు పెళ్లికి రమ్మని కొత్తదొడ్డి రామన్న ఊరు ఊరంతా ‘శుభలేఖ’లు ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కూడా వీరి మైత్రికి తోడ్పడిందనే చెప్పాలి.. ఇదీ నేపధ్యం.. ఎల్గోయి గ్రామానికి చెందిన దళితులు.. సమాధుల కోసం బొందలు తీయడం ఆత్మగౌరవ సమస్యగా మారిందని, ఇకపై శవాలను ఖననం చేయడానికి బొందలు తీయకూడదని తీర్మానించుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన కొన్ని సామాజిక వర్గాలు వ్యవసాయ పనుల్లో దళితులను తీసుకోకూడదని, వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రతి తీర్మానం చేశాయి. 15 రోజుల పాటు కట్టుబా ట్లు రాజ్యమేలాయి. అది గొడవలకు దారి తీసింది. క్రమంగా విషయం బయటికి పొక్కడంతో మీడి యా, కుల సంఘాలు దళితులకు అండగా నిలబడ్డా యి. పోలీసులు రంగంలోకి దిగారు. దళితులు తమను వ్యతిరేకించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారు. కేసు విచారణ దశలో ఉంది. ఎంతో కోల్పోయారు.. పల్లెలో కులం చిచ్చు రేగి నెల గడిచింది. వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టుబాట్లతో చెరకు తోటల్లో కలుపుతీత పనులు నిలిచిపోవడంతో కలుపు మొక్కలు పెరిగాయి. ఇక పోలీసుస్టేషన్లు, నేతల రాకపోకలతో ఖర్చేగానీ రూపాయి కూడా ఆదాయం లేకుండా పోయింది. అన్నింటికి మించి పొద్దున లేచింది మొదలు ఇప్పటి దాకా ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ పనుల్లో ఇచ్చిపుచ్చుకుంటూ ఒకే కుటుంబంగా కలసి బతికిన ప్రజలు.. ఇప్పుడు ఎడ ముఖం పెడముఖంగా బతికారు. మనసు మారిందిలా.. నిజానికి ఒక గ్రామ ప్రముఖుని ఇంట్లో నెల కిందట జరిగిన వివాహ మహోత్సవంలో దళితులకు అవమానం జరిగింది. దళితులు వాయించే బాజాభజంత్రీలను తప్పని పరిస్థితుల్లో వెనక్కి పంపించారు. కాలం గడిస్తున్న కొద్ది మిగిలిన సామాజిక వర్గాలు కూడా తమ తప్పును తెలుసుకున్నాయి. దళితుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనని, మునుపటిలాగా కలసిమెలిసి ఉండాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఇక్కడ ఎస్పీ సుమతి, డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంతోనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తదొడ్డి రామన్న తన కొడుకు వివాహానికి ఊరునంతా ఆహ్వానించారు. కుల గొడవలు పక్కనపెట్టి ఇంటింటికి పెళ్లి శుభలేఖలు ఇచ్చారు. సుమారు 2 వేల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెళ్లికి తామంతా వెళ్తామని, కులమతాలకు అతీతంగా కొత్త దంపతులను ఆశీర్వదిస్తామని ఎంపీటీసీ మల్లికార్జున్ పటేల్, సర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచులు బాబూమియా, నర్సింహులు ‘సాక్షి’ ప్రతినిధితో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అంతరమే పంచాయితీకి ఓ కారణం గ్రామంలో మొత్తం 120 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 22 కుటుంబాలకు అసలు భూమి లేదు. ఒక ఎకరా...అర్ధ ఎకరా భూమి కలిగి ఉన్న వాళ్లు 32 కుటుంబాలు ఉన్నాయి. మరి కొన్ని కుటుంబాలకు ఊరుకు తూర్పు భాగంలో ఉన్న సర్వే నెంబర్ 125, 54 ల్లో దాదాపు 75 మందికి భూములు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు. పైగా నీళ్లు లేక భూమి సాగుకు అనుకూలంగా లేకపోవడంతో దళితులు వాటిని సాగుచేయడం లేదు. మరో వైపు ఊరు ఉత్తరం దిక్కున ఎక్కువగా ఇతర సామాజిక వర్గానికి చెందిన భూములున్నాయి.ఈ భూముల్లో నీటి సౌకర్యం ఉండటంతో మూడు కాలాల్లో కూడా పంటలు పండుతాయి. వీళ్ల భూముల్లోనే దళితులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. ఉన్నఫలంగా దళితులను వ్యవసాయ పనుల్లోకి రాకుండా అడ్డుకోవడంతో వారు ఇందోళన చెంది తిరుగుబాటు చేశారు. ‘దళితులకు ప్రభుత్వం చెప్పినట్టుగా భూ పంపిణీ చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మా పిల్లలకు ప్రభుత్వం ఇతరులతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇచ్చి నీటి వసతి కల్పించాలి’ అని దళిత నాయకుడు తలారి వీరన్న చెప్పడం వారి ఆకాంక్షకు అద్దం పడుతోంది. అభివృద్ధి లేని పల్లె.... పల్లెలో స్వయం జీవన విధానమే కనిపించింది. దాదాపు 2,400 ఓట్లు ఉన్న గ్రామంలో కనీస వసతులు మాత్రం ఏమీ లేవు. 3,500 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ సేద్యానికి పనికి వస్తున్నది కేవలం 2వేల ఎకరాలకు మించదు. దళిత, బీసీ కాలనీలు మట్టి రోడ్లతోనే ఉన్నాయి. కొద్దిపాటి చినుకులు రాలినా బజార్లు అన్ని గుంతలు పడి నడవటానికి వీలులేకుండా మారుతాయి. ఎస్సీ కాలనీలో 7,300 మీటర్ల పొడవైన సీసీ రోడ్డు, బీసీ కాలనీలో కనీసం 6వేల మీటర్ల సీసీ రోడ్డు అవసరం ఉన్నాయి. సీసీ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయా ప్రతిపాదనలకు అనుమతి రాలేదు. గ్రామంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. ఆర్ఓఆర్ వాట ర్ ఫిల్టర్ యంత్రాలను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అనుకోకుండా జరిగిపోయింది తాము అంతా కలసి మెలిసి ఉన్న వాళ్లమే. గ్రామంలో ఎక్కువతక్కువ కులం అనే అభిప్రాయభేదాలు లేవు. మొన్న జరిగిన సంఘటన ఒక పీడకల. అందరం కలసి పోవాలే. ఎప్పటిలాగే అన్ని శుభకార్యాలు కలసే చేసుకోవాలే. - బాబూమియా, మాజీ సర్పంచ్ ఈ నెల రోజులు చాలా కోల్పోయాం ఈ గొడవలతో చాలా కోల్పోయాం. వాళ్లు మేము ఎప్పుడూ ఎదురుపడి గొడవపడింది లేదు. పొలంలో కలుపు పెరిగిపోయింది. ఎన్ఆర్జీఎస్ పనులు ఆగిపోయాయి. ఒక రకంగా గ్రామం అభివృద్ధి ఆగిపోయింది. - జగన్నాథరెడ్డి రైతు నూతన జంటను ఆశీర్వదిస్తాం రామన్న ఇంటి పెళ్లికి మేం అంతా వెళ్తాం. నవ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వస్తాం. గతంలో మేం అంతా కలిసి ఉన్న వాళ్లమే. అనుకోకుండా జరిగిన సంఘటన మమ్ములను ఇబ్బంది పెడుతోంది. - మల్లికార్జున్ పటేల్, ఎంపీటీసీ -
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని..
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని.. వేధిస్తున్న కుల పెద్దలు పట్టించుకోని పోలీసులు.. ఎస్పీకి ఫిర్యాదు కరీంనగర్: కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కుల పెద్దలు ఆ కుటుంబానికి కుల బహిష్కరణ శిక్ష విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అడుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ కుటుంబం బుధవారం ఎస్పీ శివకుమార్‌ను కలిసి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అనంతరం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యురాలు ఏనుగుల లచ్చవ్వ చెప్పిన కథనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఏనుగుల లచ్చవ్వ కూతురు మమత రామన్నపేటకు చెందిన కొల్లూరు సురేందర్‌రెడ్డిని ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో దంపతులిద్దరు కలిసి మెలిసి కాపురం చేసుకుంటున్నారు. మమత కులానికి చెందిన పెద్దలు మాత్రం వీరి పెళ్లిని అంగీకరించలేదు. మమతను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానించారు. ఇటీవల మమతకు కొడుకు పుట్టడంతో లచ్చవ్వ ఇంటికొచ్చారు. కులం నుంచి బహిష్కరించాక మమతను ఎట్లా రానిచ్చావంటూ కుల పెద్దలు రూ.10 వేల ధరావత్ తీసుకుని పంచాయితీ నిర్వహించి రూ.4,250 జరిమానా విధించారు. మమతను మళ్లీ ఇంటికి రానిస్తే... లచ్చవ్వ కుటుంబాన్ని కూడా కులం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా.. కుల పెద్దల్లో ఒకరు లచ్చవ్వకు చెందిన ఎనిమిది గుంటల భూమిలో తనకు వాటా ఇవ్వాలని నిత్యం గొడవ పడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం లచ్చవ్వ కొడుకు మోహన్‌కు ప్రమాదం జరిగితే పరామర్శించేందుకు వెళ్లిన లచ్చవ్వ తల్లి గుండవ్వకు కూడా కుల పెద్దలు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా కుల పెద్దల వేధింపులు ఆగలేదని, దీంతో ఎస్పీని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నట్లు లచ్చవ్వ తెలిపింది. ఈ విషయమై వేములవాడ రూరల్ సీఐ మాధవిని సంపద్రించగా, లచ్చవ్వ ఫిర్యాదుపై ఎస్ఐ విచారణ జరుపుతున్నారని చెప్పారు. కుల పెద్దలు జరిమానా విధించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కుల పెద్దలను పిలిచి కూడా మాట్లాడామని, ఫిర్యాదు చేసిన లచ్చవ్వ ఆ తరువాత మళ్లీ తన దగ్గరకు రాలేదన్నారు. -
ప్రోత్సాహకం ఏదీ!
‘ఆదర్శ దంపతుల’కు మొండిచెయ్యి ⇒ నిధుల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం ⇒ ఏళ్ల తరబడి 90 జంటల ఎదురు చూపులు ⇒ బీసీ సంక్షేమ శాఖలో పెరిగిపోయిన దరఖాస్తులు ⇒ ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదు ఇందూరు : శ్రావణ్, సౌమ్య పెద్దలను ఎదిరిం చి, కట్టుబాట్లను వదులుకుని కులాం తర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమ తి కోసం 2009లో బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నా రు. ప్రస్తుతం ఆ దంపతులకు సంతానం కలిగి అమ్మా, నాన్నలయ్యారు. పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. నేడో రేపో స్కూల్‌కు కూడా వెళ్లే వయస్సు కూడా వచ్చేస్తోంది. నే టి వరకూ ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేయలేదు. వచ్చే రూ. పదివేలు ఆసరాగా ఉం టాయనుకున్న ఆ దంపతులు నిధుల కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ చుట్టూ తిరిగిన సంద ర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని ఈ ఒక్క జంటే కాదు. ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్న 90 జంటలూ ఎదుర్కొంటున్నాయి. అరకొర విదిలింపులు కులాంతర వివాహాలు చేసుకున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుల, మత భేదాలు లేకుండా ఆదర్శ వివాహా లు చేసుకున్న దంపతులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా బీసీల పరిస్థితి దారుణంగా ఉంది. ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులు ప్రభుత్వం అందిం చే పోత్సాహక బహుమతి కోసం 2009లో జిల్లా బీసీ సంక్షేమ శాఖలో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేందటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. నిధులు ఇస్తున్నాం అన్నట్లుగా సంవత్సరానికి రూ.20 వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ నిధులు కేవలం రెండు జంటలకు మాత్రమే సరిపోతారుు. మిగతా జంటలకు నిరాశే మిగులుతోంది. ఏటా పెరుగుతున్న అర్జీలు ఏటా బీసీ సంక్షేమ శాఖకు 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయి. సంవత్సరానికి రెండు జంటలకు సరిపోయే నిధులివ్వడంతో తదుపరి దంపతులు సంవత్స రాల తరబడి వేచి చూడటం తప్పడం లేదు. జిల్లాలో 2009 నుంచి నేటి వరకూ కలిపి మొత్తం 90 జంటలు దరఖాస్తులు చేసుకున్నాయి. నిధులు వస్తే దేనికైనా ఉపయో గపడుతాయనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమాధానాలు చెప్పలేని అధికారులు నిధులు వస్తే సమాచారం ఇస్తాం అని విసుక్కుం టున్నారు. 2012-13 సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.40 వేలను జిల్లాకు మంజూరు చేయగా, వాటిని సీనియార్టీ ప్రకారం ఉన్న నాలుగు జంటలకు అందజేశారు. ప్రస్తుతం రూ.80 లక్షలు అవసరం. ఈ నిధులను విడుదల చేయాలని గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను లేఖల ద్వా రా కోరినా ఫలితం కనబడలేదు. గత నెలలో జిల్లా పరిషత్ స్థాయి సంఘా సమావేశాలలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. బీసీ సంక్షేమ శాఖల దరఖాస్తులు కుప్పలుగా పడి ఉంటున్నాయే తప్పా పరిష్కారం లభించడం లేదు. పెళ్లి చేసుకున్న ఇద్దరు కాస్త సంతానంతో ముగ్గురు, నలుగురిగా మారినా ప్రభుత్వం నుంచి పా రితోషకం అందకపోవడం శోచనీయకరమైన విషయమని బాధిత జంటలు వాపోతున్నారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలోనైనా తమకు అందాల్సిన ప్రోత్సహకం అందిస్తే సంతోసిస్తామంటున్నారు. నిధుల కోసం వేచి చూస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకున్న బీసీ జంటలకు చాలా సంవత్సరాలు గా ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకం అందటం లేదు. ప్రభుత్వం ఏ టా రూ.20వేలు మాత్ర మే మంజూరు చేస్తోంది. అవి ఇద్దరికి మాత్ర మే సరిపోతున్నాయి. మిగతా వారికి అన్యాయం జరగుతోంది. దరఖాస్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అ యితే, 90 జంట లకు రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, జి ల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చాలాసార్లు విన్నవించాం. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాం. చివరికి ప్రతీ నెలా హైదరాబాద్‌లో జరుగుతున్న ఉన్నతాధికారులు సమీక్షలో కూడా విషయాన్ని తెలుపుతున్నాం. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి -
సంకెళ్లను తెంచుకొని..
కుల, మతాలను తోసిరాజని ఒక్కటైన దంపతులు మీకు అండగా ఉంటాం.. ధైర్యంగా అడుగేయండి {పముఖుల పిలుపు సిటీబ్యూరో: కట్టుబాట్లు.. ఆచార, సంప్రదాయాలు.. మూఢ విశ్వాసాలు లేని మానవతా పరిమళాల అన్వేషణకు.. కులాలు...మతాలకు అతీతంగా ఒక్కటైన జంటలవి. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలకు అర్థంగా నిలిచే జనవరి 26వ తేదీ అంటే ఆ జంటలకు ఎంతో మక్కువ. ఆ స్ఫూర్తితోనే వారంతా సోమవారం ఇందిరా పార్కులో కలుసుకున్నారు. ‘కులాంతర,మతాంతర వివాహితుల వేదిక’ 43వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ యతిరాజులు, జస్టిస్ పి.ఎస్.నారాయణ, అరుణోదయ విమల, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ తదితర ప్రముఖులంతా హాజరయ్యారు. వేదిక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది సీఎల్ఎన్ గాంధీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పాలకుల బాధ్యతలు, ప్రభుత్వాల కర్తవ్యనిర్వహణ, చట్టపరమైన భరోసా, సామాజిక భద్రత, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యత వంటి అనేక అంశాలను సభికులు ప్రస్తావించారు. వారు ఏమన్నారంటే... రూ.లక్ష ప్రోత్సాహకానికి కృషి: మంత్రి ఈటెల సమాజ ఒరవడికి, పోకడకు భిన్నంగా కులాలకు, మతాలకు అతీతంగా ఒక్కటి కావడం గొప్ప విషయం. ప్రగతిశీల భావజాలంతో, ఆలోచనా విధానంతో కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన మా ప్రభుత్వంకచ్చితంగా మీకు అండగా నిలుస్తుంది. కుల,మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న దంపతులకు రూ.లక్ష నగదును ప్రోత్సాహకంగా అందించేందుకు కృషి చేస్తా. కులాల పేరిట వివక్ష, అణచివేతలను అంతమొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి: జస్టిస్ చంద్రకుమార్ కుల, మతాలకు అతీతమైన మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అందరినీ ఎదురించి పెళ్లి చేసుకోవడం ఆషామాషీ కాదు. ఎన్నో ఇబ్బందులను, బాధలను, కష్టనష్టాలను అధిగమించి వచ్చారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాల్లో సైతం కుల, మతాలకు అతీతమైన వివాహాల ప్రస్తావన ఉంది. ఇప్పటికే కులాంతర,మతాంతర వివాహం చేసుకొన్న వాళ్లు, భవిష్యత్తులో అలాంటి పెళ్లిళ్లు చేసుకోబోయేవాళ్లు భయం, ఆందోళన లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఉచిత న్యాయ సహాయాన్ని, నైతిక బలాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సమాజ అభివృద్ధి కోసమే చట్టాలు: జస్టిస్ చంద్రయ్య నలభై ఏళ్లకు పైగా ఒక యజ్ఞంలాగా సాగుతున్న కృషి ఇది. చాలా సంతోషం. సమాజం ఒక్కో దశను అధిగమిస్తున్న కొద్దీ అనేక నూతన చట్టాలు ఉనికిలోకి వచ్చాయి. కులం, మతం కంటే ముందే వృత్తులు ఏర్పడ్డాయి. ఆ వృత్తుల ఆధారంగానే కులాలు, కట్టుబాట్లు, ఆచారాలు వచ్చాయి. కుల,మతాలకు అతీతంగా జీవించడం అనేది సమాజ అభివృద్ధిలో భాగమే. డీజీ రామరాజు స్మారక అవార్డు ప్రదానం.. . కుల నిర్మూలన కోసం కృషి చేస్తోన్న ఏపీ కుల నిర్మూలన సంఘం సభ్యులు టి.వి.దేవదత్, లక్ష్మీ దంపతులకు ఏటా ఇచ్చే డీజీ రామరాజు స్మార క అవార్డును అందజేశారు. ఈ అవార్డు కింద రూ.10 వేల నగదు, జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది కుల,మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న వెంకటేశ్వర్లు-సంతోష, రవి-రాధ, మురళి-కృష్ణవేణి, రాజేష్-హర్షియా, మల్లేష్-మంగ దంపతులను వేదికకు పరిచయం చేశారు. -
కుల చైతన్యంతోనే ఈ స్థాయికి వచ్చా...
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాపుగర్జన నిర్వహించాలని సూచన మున్నూరు కాపు భవన నిర్మాణానికి భూమి పూజ హాజరైన కొండా దంపతులు, ఎమ్మెల్సీ పూలరవీందర్ హన్మకొండ చౌరస్తా : ‘నా చిన్న తనంలో మానాన్న వ్యవసాయ జీతగాడిగా పనిచేసే వాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కుల చైతన్యమే’ అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని నూతనంగా నిర్మించనున్న కాపు సంఘం భవనానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీతో వివిధ ప్రాంతాల్లోని కులబాంధవులను ఐక్యం చేసేందుకు ప్రతి ఒక్క కాపు సోదరుడు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే కులబంధం గుర్తుకొచ్చిందన్నారు. సంఘం భవన నిర్మాణానికి తన వంతు ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. అందరిని ఒక్కతాటి పైకి తెచ్చేందుకు నేటి తరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీలను నిర్వహించాలని సూచించారు. కాపు భవన్లో ప్రత్యేక లైబ్రరినీ ఏర్పాటు చేయాలన్నారు. ఐకమత్యంతో ముందుకు పోయి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన నాయకత్వం కులానికి అవసరమన్నారు. వ్యాపార, రాజకీయ, స్నేహబంధాలలో ఆలోచనలు, వైఖరి మారవచ్చు కానీ, కుల బంధంలో ఆలోచనలు మారవన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి కులం ఐక్యత కోసం పనిచేయాలని సూచించారు. కాపు భవనానికి సీఎం కేసీఆర్ రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆయనకు కుల బంధువుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ తనకు రాజకీయంగా ఈ అవకాశం వచ్చిందంటే కాపు సోదరుల ప్రోత్సాహమేనని అన్నారు. అన్ని జిల్లాల్లోని కాపు వర్గాల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కాపు భవన నిర్మాణానికి తన వంతు సాయమందిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ కుల అభ్యున్నతి కోసం ప్రతి పనిలో ముందుంటానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొండా సురేఖ విజయానికి కులబాంధవుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, తోట తిరుపతయ్య, డాక్టర్ కాళీప్రసాద్, ఈవీ శ్రీనివాసరావు, ఆశం కళ్యాణ్, వద్దిరాజు రవిచంద్ర, గుజ్జుల నర్సయ్య, కనుకుంట్ల రవికుమార్, కోలా జనార్దన్, కేడల ప్రసాద్, తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాడి వదిలేసిన చోటినుంచే దున్నాలి
సందర్భం తెలంగాణలో కులం కొంద రికి యావజ్జీవశిక్ష. మరికొం దరికి కులం సాధనం. వృత్తి విభజన మాత్రమే కులం కాదు. పునాదులను పెకిలిస్తే తప్ప కులం అసలు మూలాలు అర్థం కావు. కులం మర కలు మలపడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. దానికి అకుంఠిత దీక్ష అవసరం. తెలంగాణ ఊరి నిర్మాణంలోనే కులం ఉంది. ఊరి మధ్యలో పాలనా యంత్రాంగ కేంద్రమైన గడీ, దాని తర్వాత పాలనా యంత్రాంగానికి దగ్గరగా ఉండే వర్గం, దాని చుట్టూ కుల వృత్తి చేసుకునే వర్గం ఉంటాయి. వారి ఇళ్లు దాటిన తర్వాత రైతులుం టారు. వీటిలో ఏ వర్గానికీ చెందని వర్గం కూడా ఉంది. అదే దళిత వర్గం. ఊరికి ఒక మూల మాలలు, మరో మూల మాదిగలు ఉంటారు. వీటిలో ఒక కులాన్ని వ్యవ సాయానికి, మరో కులాన్ని వెట్టికి ఉపయోగించుకుం టారు. ఆంధ్ర మహాసభతో కలసి పనిచేసేటప్పుడు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలంటే, వెనుకబడిన వర్గాల భాగస్వామ్యంతోనే అది సాధ్యం అని భావించాం. ఉద్యమ కార్యకర్తను అయినప్పటికీ కులానికి బ్రాహ్మణుడిని కావడంతో దళితులు నన్ను తమ ఇళ్లలోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. వారిళ్లలోకి బలవంతంగా చొచ్చుకుపోవల్సి వచ్చినప్పుడు వారిలోని బానిసత్వం, దుర్భర దారిద్య్రం మరింతగా అర్థమైంది. చివరికి వారి అసలు పేరును కూడా కుల దురహంకారం మింగివేసి మల్లయ్యను మల్లిగాడు, మల్లమ్మను మల్లి అని పిలుస్తూ పుట్టుకతోనే బానిసలుగా భావించే వారు. ఆ బానిస త్వాన్ని అడుగడుగునా గుర్తుచేయడానికి భూస్వాములు మల్లిగా అని పిలిచిన ప్రతిసారీ ‘బాంచెన్ దొర, నీ కాల్మొ క్కుతా’ అని పలకడం అలవాటు చేశారు. ఆ అణచివేతే, ఈ వెలివేతే తిరుగుబాటుకు కారణమైంది. అదే సాయు ధపోరుకు దారితీసింది. ఇది 1940-47 నాటి సంగతి. ఆ కాలంలోనే కొలనుపాక లాంటి చోట్ల జాగీర్దారు ముస్లిం. దీంతో ఆ ప్రాంతంలో అస్పృశ్యత నుంచి విముక్తి కోసం దళితులు జాగీర్దారు మతంలోకి చేరిపోయారు. దీన్ని అడ్డుకోవడానికి భూస్వాములు ఆర్యసమాజ్ వారిని తీసుకొచ్చారు. వారు దళితుల ఇళ్లలోకి వచ్చి హిందూ మతం నుంచి ఎందుకు మారుతున్నారని అడిగితే దళి తులు ఒకే సమాధానమిచ్చారు. మతం మార్చుకుంటేనే మా వెట్టిచాకిరీ పోయింది. హిందూమతంలో ఉంటే వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగిస్తామని, వెట్టి చేయిం చమని చెప్పండి. అప్పుడు మేం హిందూ మతం వీడం అని చెప్పారు. ఇది రెండో దశ. స్వాతంత్య్రానంతరం అంటే 1947 తర్వాత పైకి అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమాలు వచ్చినా వారి పట్ల జాలి పెరిగింది తప్పితే వారి జీవితాల్లో మార్పులేదు. అస్పృశ్యతా మూలాలు కదల్లేదు. దళితులకు ఇళ్లు కట్టిం చారు కానీ అవి ఊరి చివరే ఉండేవి. ఆస్పృశ్యత, అణచి వేతకు వ్యతిరేకంగా సాగిన కమ్యూనిస్టుల ఉద్యమం భూపోరాటానికి దారితీసింది. దీని ప్రభావంతోటే నక్స ల్బరీ ఉద్యమం వచ్చింది. 1980ల నాటికి దళిత ఉద్య మం స్వయంగా అస్తిత్వ ఉద్యమంగా రూపొందింది. కమ్యూనిస్టు ఉద్యమంతో కులం అంతరిస్తుందని భావిం చినా అదీ జరగలేదు. గుడిసెల స్థానంలో బిల్డింగులు కట్టించినా వివక్ష పోలేదు. బాంచెన్ దొర అనే భాష పోయింది కానీ బానిసత్వం కొనసాగుతూనే ఉంది. దళి తులను ఓటు బ్యాంకు స్థాయిలోనే ఉంచారు. వారిని అలాగే ఉపయోగించుకున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే దళితులు అందరితో సమానం. మిగిలిన సందర్భాల్లో దళితులు అస్పృశ్యులే. భూ సంస్కరణలు అమలు జరగకుండా, భూమిపైన హక్కు రాకుండా దళి తుల జీవితాల్లో మార్పు రాదు. వృత్తి మారలేదు. వెట్టిచా కిరీ మారలేదు. సమాజంలో భాగం కాలేకపోయారు. అందుకే ఇప్పుడు కావలసింది మతమార్పిడీ నిరోధకచట్టం కాదు. ఆనాడు వెట్టిచాకిరీ పోవడానికి ముస్లింలుగా మారిన వారే తర్వాత వైద్య సాయం కోసం క్రిస్టియన్లుగా మారారు. అందుకే కులంతో సంబంధం లేని వృత్తి నైపుణ్యం కావాలి. అప్పుడే అన్ని కులాలు సమాజంలో భాగం అవుతాయి. లేదంటే కొన్ని కులాలు శాశ్వతంగా అస్పృశ్యులుగానే ఉంటాయి. అందుకే వామ పక్షాలు ఎక్కడ కాడిని వదిలేశాయో అక్కడినుంచి తిరిగి దున్నడం ప్రారంభించాలి. ఆర్థికసమస్యతోపాటు, సా మాజిక సమస్యని సైతం తీవ్రంగా పరిగణించాలి. వారి తోపాటు ప్రజాస్వామికశక్తులు, దళిత సంఘాలు, సం స్థలు సమష్టిగా ఆశయసాధనలో భాగం కావాలి. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
మత మార్పిళ్ళపై పార్లమెంట్లో మంటలు Part 2
-
మత మార్పిళ్ళపై పార్లమెంట్లో మంటలు Part 1
-
‘ఆధార్’ అవస్థలు.. ‘ఫాస్ట్’ కష్టాలు
జనగామ : ఆదాయం, కులం, ఆహార భద్రత, పింఛన్ల దరఖాస్తులకు ఆధార్ సంఖ్య తప్పనిసరి చేయడంతో జనం మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 90 శాతం జనాభా ఆధార్ ఫొటోలు దిగినట్లు ఉన్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంకా చాలామందికి ఆధార్ సంఖ్య లేకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణణాతీతంగా మారారుు. మీ సేవ కేంద్రాల్లో ఒక రోజు 60 మందికి ఫొటోలు దించడమేగా గగనంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఒక్కసారిగా వందలాది మంది ఆధార్ ఫొటో దిగేందుకు ఎగబడడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. వసూళ్లే వసూళ్లు.. గత మూడేళ్లుగా ఆధార్ కేంద్ర నిర్వాహకులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ సొమ్ము విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వారు తమదైన శైలిలో వాడుకుంటున్నారు. ఒక్కొక్కరి ఫొటో దింపేందుకు రూ.100 నుంచిరూ.200 పైనే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫొటోలు దిగేందుకు వచ్చే ప్రజలతో జనగామ మునిసిపల్ కార్యాలయం సమీపంలోని ఆధార్ సెంటర్ కిక్కిరిసిపోతుండడంతో ఇద్దరు పోలీసులతోపాటు వీఆర్ఓ రాజయ్య మీ సేవా కేంద్రం వద్దే ఉండి ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో జనగామ పట్టణ వాసులను మాత్రమే ఆధార్ కార్డుల ఫొటోలు దింపుతామని నిర్వాహకులు బోర్డు తగిలించడంతో గ్రామీణ ప్రజ లు ఆందోళనకు గురవుతున్నారు. అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సదరు నిర్వాహకులు మంగళవారం సాయంత్రం ఏకంగా కేంద్రాన్ని మూసివేయడంతో జనం ఆందోళనకు దిగారు. విద్యార్థులకు నోటరీ ఇబ్బందులు ఫాస్ట్ పథకానికి దరఖాస్తు చేసే విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈధ్రువీకరణ పత్రం పొందడానికి నోటరీ అఫిడవిట్ సమర్పించాలన్నా నిబంధన ఉంది. సాధారణ సమయాల్లో రూ.50లోపు తీసుకుని నోటరీ ఇచ్చేవారని, ఇప్పుడు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక జిరాక్స్ సెంటర్ల తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ కోత లు కూడా వీరికి కలిసొస్తున్నాయి. జనరేటర్, ఇన్వర్టర్ల పేరు చెప్పి ఏకంగా ఒక్కో పేజీ రూ.5 నుంచి 10 వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. -
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ కిషన్ సుబేదారి : ఆహార భద్రత (రేషన్) కార్డుతో పాటు సామాజిక పింఛన్లు, ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఈనెల 15వ తేదీలోగా దరఖా స్తు చేసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించా రు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు, సామాజిక పింఛన్లు పొందుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఫారాలు ఉండవని, తెల్లకాగితంపై పూర్తి వివరాలు, ఏ పథకం కింద ఇస్తున్నారో రాస్తే సరిపోతుందని తెలిపారు. సెలవు దినాల్లోనూ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారని వివరించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్లకు గ్రామాల్లోనే.. ఆహార భద్రత (రేషన్) కార్డుతోపాటు సామాజిక పింఛన్ల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కిషన్ సూచించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్ల కోసం గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని, వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తారని తెలిపారు. ఇక విద్యార్థులు ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం, కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, ఆహార భద్రత కార్డు, సామాజిక పింఛన్ల కోసం వరంగల్ నగర ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఆర్వో వీఎల్.సురేంద్రకరణ్, సమాచార పౌర సం బంధాల శాఖ ఏడీ డీఎస్.జగన్, డీడీ బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
కులం అడిగినందుకు దర్శకుడి ఆగ్రహం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన సమగ్ర సర్వేలో పలువురు సినీ ప్రముఖులు సమగ్రంగా తమ వివరాలు అందిస్తే, మరికొందరు కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సర్వే సందర్భంగా కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఎన్యుమరేటర్లు ఆయనను కమ్యూనిటీ వివరాలు అడగగా.... ఆ వివరాలు ఇచ్చేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదంతా ముఖ్యం కాదని, ఆ కాలమ్‌ను వదిలేయాలని దాసరి ఎన్యుమరేటర్లను సూచించినట్లు సమాచారం. ఇక సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి....ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించారు. అలాగే నటుడు శ్రీకాంత్ కూడా సమగ్రంగా వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించారు. షూటింగ్ నిమిత్తం స్విజ్జర్లాండ్‌లో ఉన్న హీరో మహేష్ బాబు కూడా కుటుంబ వివరాలను తన సహాయకుల ద్వారా ఎన్యుమరేట్లకు అందచేశారు. అల్లు అరవింద్ కుటుంబంతో పాటు దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కూడా ఈ సర్వేలో పాల్గొని వివరాలు ఇచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ సర్వేలో పాల్గొనలేదు. అతను ప్రస్తుతం హాలిడే నిమిత్తం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ, తనికెళ్ళ భరణి తదితరులు తమ వివరాలు అందించి సర్వేకు సహకరించారు. -
కొత్తపల్లి గీత ఎస్టీయే కాదు!
-
'కొత్తపల్లి గీత తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారు'
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈశ్వరి మాట్లాడారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈశ్వరి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లి గీత నామినేషన్ అఫిడవిట్లో ఫోర్జరీ సంతకాలు చేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆమె నామినేషన్ పత్రాలు తీసుకున్నామని ఈశ్వరి వెల్లడించారు. ఆమె ఎస్టీ కాదని గతంలోనే జాయింట్ కలెక్టర్ మంగపతిరావు రిపోర్టు ఇచ్చారని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్తపల్లి గీతకు దమ్ముంటే రాజీ నామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధపడాలని ఈశ్వరి సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గీత ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
ఖాకీల్లో కులకలం
వరంగల్ క్రైం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీసు శాఖలో ‘కుల’కలం రేగుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల్లోని కుల సంఘాల మాదిరిగానే పోలీసు శాఖలో కుల చిచ్చు మొదలైంది. ఇటీవలి కాలంలో పోలీసు శాఖలో ఒక కులానికి సంబంధించి సంఘం ఏర్పడడం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు పోలీసు శాఖను నివ్వెరపరుస్తున్నాయి. ఒక వ్యక్తితో మొదలైన సదరు సంఘ కార్యకలాపాలు మెల్లగా విస్తరిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం పోలీసు శాఖకు ఇబ్బందికరంగా మారింది. కుల సంఘం పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై కొందరు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీపీ ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. తరచూ సమావేశాలు తమను పోలీసు శాఖలో అణగదొక్కుతున్నారంటూ కొద్ది నెలల క్రితం ఒక సంఘం పేరుతో కార్యకలాపాలు మొదలయ్యాయి. సభ్యత్వ నమోదు, రెగ్యులర్‌గా మీటింగులు జరుగుతున్నారుు. జిల్లాలో ఎక్కడ సమావేశం జరిగినా అందరూ రావల్సిందేనంటూ సదరు సంఘం నాయకులు హుకూం జారీ చేస్తున్నారు. సమావేశానికి అనుమతి లేదంటూ వారి పైస్థాయి అధికారులు చెబితే తమను అవమానిస్తున్నారని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పలువురు అధికారులు వాపోతున్నారు. ఇటీవల హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన క్రైం మీటింగ్‌లో తమను అణగదొక్కుతున్నారంటూ ఉన్నతాధికారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. క్రమశిక్షణ కలిగిన పోలీసు శాఖలో ఉన్నతాధికారులను ప్రశ్నించండం అంటే మామూలు విషయం ఏమీ కాదని ఖాకీల్లో చర్చ జరుగుతోంది. శాఖలో మరిన్ని సంఘాలు.. కులం పేరుతో సంఘాలు ఏర్పాటు చేయడంపై పోలీసు సిబ్బంది, అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఓ కార్యాలయూన్ని వారి ఆఫీస్‌గా మార్చుకోవడం.. అక్కడే సభ్యత్వ నమోదుతో సంఘానికి సంబందించిన అన్ని కార్యకలాపాలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సంఘం పేరుతో డామినేట్ చేయడంపై మండిపడుతున్న కొందరు పోటీగా సంఘాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హెడ్‌క్వార్టర్స్‌లో కుల సంఘాలకు చెందిన అనేక బ్యానర్లు త్వరలో వెలిసే అవకాశం ఉంది. పరిస్థితి అంతవరకు వస్తే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. -
కరెంటు వాడాలంటే ‘కులం’ తేలాలి
విజయవాడ : ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు 50 యూనిట్ల విద్యుత్ పథకం కష్టాల్లో పడింది. సబ్సిడీ విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వినియోగదారులు తాము ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారమంటూ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని సర్కారు మెలిక పెట్టింది. దీంతో వివిధ జిల్లాల్లోని విద్యుత్ అధికారులు ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే పనిలో పడ్డారు. కృష్ణా జిల్లా అధికారులు 30 వేల మందివి, ప్రకాశం జిల్లా అధికారులు 15 వేల మంది, గుంటూరు, నెల్లూరు జిల్లాల అధికారులు మరో 30 వేల మంది నుంచి సర్టిఫికెట్లు తీసుకుని బిల్లులతో జత చేసి సర్కారుకు పంపారు. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయినా ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాల్సిన జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదు. దీంతో సహనం కోల్పోతున్న విద్యుత్ డిస్కంలు దశలవారీగా సరఫరాను నిలిపివేస్తున్నారు. ఫలితంగా దళితవాడల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులు నెలకు 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను వినియోగించుకునే వె సులుబాటు కల్పిస్తూ 2013 ఏప్రిల్ ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని ప్రకటించారు. 22 జిల్లాల్లోని 17.6 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండేలా నెలకు 50 యూనిట్లకు విద్యుత్ బిల్లుల చెల్లింపును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ ఈ విధంగా విద్యుత్‌ను వాడుకుంటున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సుమారు 8.5 లక్షల మందికి పైగానే ఉన్నారు. గడచిన 14 నెలలుగా వీరికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం నుంచి విద్యుత్ డిస్కంలకు విడుదల కావడంలేదు. మూడు నెలల కిందటే బిల్లులు సిద్ధం చేసిన ట్రాన్స్‌కో అధికారులు బకాయిల్ని జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతలోగానే ఎన్నికలు, రాష్ట్ర విభజన జరిగాయి. దీంతో నిధులు విడుదలలో జాప్యం జరిగింది. కృష్ణా జిల్లాలో మొత్తం 1.42 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఈ సదుపాయాన్ని పొందుతుండగా, వీరు వినియోగించుకున్న విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి రూ. 6 కోట్లకు పైగానే విడుదల కావాల్సి ఉంది. అలాగే ప్రకాశం జిల్లాకు రూ.6.40 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ. 7.20 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.13 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మిగతా జిల్లాల్లోనూ సగటున 5 నుంచి రూ. 8 కోట్ల వరకూ బకాయిలు జమ కావాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలు సుమారు రూ. 80 కోట్లకు పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిలో ఎంతో కొంత జమ చేస్తేనే నష్టాల నుంచి గట్టెక్కుతామని విద్యుత్ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం కనిపించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరా నిలిపివేయడం తప్ప తమకు మరో మార్గాంతరం లేదని విద్యుత్ సంస్థలు తేల్చిచెప్తున్నాయి. -
మీసేవల్లో అపకీర్తి..!
ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు వేలల్లో వసూళ్లు - కులం, నివాస సర్టిఫికెట్ల జారీలోనూ... - మీసేవ నిర్వాహకులతో రెవెన్యూ సిబ్బంది మిలాఖత్ - సామాన్య ప్రజలకు తప్పని తిప్పలు కలెక్టరేట్ : విద్యార్థులు, తలిదండ్రుల అవసరాలను ఆసరాగా తీసుకుని కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల పత్రాలు జత చేసి దరఖాస్తు చేసినా... కొర్రీలు పెట్టి మరీ తోసిపుచ్చుతున్నారు. ప్రస్తు తం కళాశాలలు ప్రారంభం కావడం, కౌన్సిలిం గ్ తేదీలు వెల్లడైన నేపథ్యంలో విద్యార్థులకు కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అవసరంగా మారాయి. ఇదే అదనుగా భావించిన ఒకరిద్దరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ సిబ్బంది చేతివాటం జిల్లాలో ఎక్కువగా ధ్రువీకరణ పత్రాల తాకిడి ఉన్నది హన్మకొండ మండలానికే. దీంతో నగరంలోని కొన్ని మీ సేవ కేంద్రాల సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మిలాఖత్ అయి దర ఖాస్తుదారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.30 చెల్లించాల్సి ఉండగా... అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. అదనంగా చెల్లించిన వారికి 24 గంటల్లో పత్రాలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా వసూలు చేసిన డబ్బుల్లో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందని కలెక్టరేట్ సమీపంలోని పలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులకూ ఆదాయ పత్రాలు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుల నిమిత్తం ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిన ఆసరాగా చేసుకున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే విధంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ప్రభుత్వం నుంచి ఫీజులు పొందుతున్నారు. గతంలో అధికారులు చేపట్టిన విచారణలో ఈ తతంగం బహిర్గతమైంది. ఈ దందాలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నారుు. ఇక అన్ని సక్రమంగా ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా తోసిపుచ్చుతున్న దరఖాస్తుల విషయంలో బాధితుల గోడు వర్ణనాతీతం. తమ బాధను అధికారులు సైతం వినే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం రెవెన్యూ కార్యాలయంలో ఒకరిద్దరు చేస్తున్న అక్రమ వ్యవహారం వల్ల అందరికీ అపకీర్తి వస్తోంది. ఇదే విషయంపై ఇటీవల సిబ్బం దితో సమావేశమైన తహసీల్దార్ డాక్టర్ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పరోక్షంగా సదరు సిబ్బందిని హెచ్చరిం చినట్లు సమాచారం. కాగా, అనర్హులకు జారీ చేస్తున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సంతకం ఉంటోందా...లేక ఇష్టారాజ్యంగా చేస్తున్నారా.. అన్న విషయంలో అధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
మీ సేవ’ కేంద్రాల నిలువు దోపిడీ
అధిక వసూళ్లతో విద్యార్థుల అవస్థలు కలిగిరి, న్యూస్‌లైన్:కలిగిరిలోని ‘మీ సేవ’ కేంద్రాలలో ప్రతిపనికీ విద్యార్థుల నుంచి నిర్ణీత ధరలకంటే అధిక మొత్తంలో రుసుం వసూలు చేస్తున్నారు. కలిగిరి మోడల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ‘మీ సేవ’ కేంద్రాలకు వెళుతున్నారు. ఇదే అదనుగా కేంద్రం నిర్వాహకులు ఒక్కొక్క ధ్రువీకరణ పత్రానికి రూ. 35 తీసుకోవలసి ఉండగా రూ.40 వసూలు చేస్తున్నారు. అంతేకాక దరఖాస్తు కోసం మరో రూ.15 వసూలు చేస్తున్నారు. ‘మీ సేవ’ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా అదనపు రుసుం వసూలు చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లే కాకుండా ఇతర సేవలపై కూడా అదనంగా రూ.5 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం సర్టిఫికెట్‌కు ఎంత వసూలు చేయాలో నిర్ణయించే బోర్డు కాకుండా, పాత చార్జీలు ఉన్న బోర్డు ఉం చటం విశేషం. దీనిపై తహశీల్దార్ ఆర్. సీతారామయ్యను వివరణ కోరగా నిర్ణీత రుసుం కంటే ఎక్కువ చెల్లించనవసరం లేదన్నారు. అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘మీ సేవ’ కేంద్రాలల్లో అధిక వసూళ్లకు పాల్పడుతుంటే 99895 20262కు సమాచారం అందించాలని కోరారు.