IT jobs
-
ఇన్ఫోసిస్‌లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరికొంత మందిని తొలగించింది. అంతర్గత మదింపులో ఉత్తీర్ణలు కాలేదంటూ ఇన్ఫోసిస్ మార్చి 26న తమ మైసూరు క్యాంపస్ నుండి 30-45 మంది ట్రైనీలను తొలగించినట్లు వార్తా సంస్థ మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. అయితే తొలగింపునకు గురైన ట్రైనీలకు మరో ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన ట్రైనీలకు ప్రత్యామ్నాయ కెరీర్ మార్గంగా ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) లో ఉద్యోగాల కోసం 12 వారాల శిక్షణను అందించేందుకు ముందకు వచ్చింది. ఇదే మైసూరు క్యాంపస్‌కు చెందిన సుమారు 350 మంది ట్రైనీలను తొలగించిన రెండు నెలల తర్వాత ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీపీఎం కోర్సును ఎంచుకున్న వారికి ఈ శిక్షణను స్పాన్సర్ చేస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది."మీ ఫైనల్ అసెస్మెంట్ ఫలితాలను వెల్లడిస్తున్నాం. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహ నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్మెంట్ అవకాశాలు ఇచ్చినప్పటికీ మీరు 'ఫౌండేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'లో అర్హత ప్రమాణాలను చేరుకోలేకపోయారు" అని ట్రైనీలకు పంపిన మెయిల్స్‌లో కంపెనీ పేర్కొంది.ఎక్స్‌గ్రేషియాగా నెల జీతంతొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక నెల జీతాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తోంది. దీంతో పాటు రిలీవింగ్ లెటర్లను అందిస్తోంది. ఇక బీపీఎం మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడని వారికి మైసూరు నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యం కల్పించి, వారి స్వగ్రామానికి ప్రామాణిక ప్రయాణ భత్యం అందిస్తుంది. అవసరమైతే, ట్రైనీలు బయలుదేరే తేదీ వరకు మైసూరులోని ఎంప్లాయీ కేర్ సెంటర్లో ఉండవచ్చు. క్యాంపస్ నుంచి వెళ్లాలనుకునే ట్రైనీలు మార్చి 27లోగా తమ ప్రయాణ, వసతి ప్రాధాన్యతలను సమర్పించాలని ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్‌కు క్లీన్ చిట్మరోవైపు ట్రైనీల తొలగింపునకు సంబంధించి ఇన్ఫోసిస్ ఎలాంటి కార్మిక చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని కర్ణాటక కార్మిక శాఖ డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చింది. ‘వారంతా కేవలం ట్రైనీలు మాత్రమే. కొందరు మూడు నెలల శిక్షణ మాత్రమే తీసుకున్నారు. దీనిని లేఆఫ్ అనలేం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ కార్మిక చట్టాలు వర్తించవు. రెగ్యులర్ ఉద్యోగాలకు మాత్రమే లేఆఫ్ వర్తిస్తుంది. ఇక్కడ యజమాన్యం-ఉద్యోగి సంబంధం అస్సలు ఉండదు. వారంతా ఉద్యోగులు కాదు, అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు' అని అధికారుల నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీపికబురు!
టెక్ నిపుణులకు ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్(Infosys) తీపికబురు చెప్పింది. 40కి పైగా స్కిల్ సెట్లలో పని చేసేందుకు టెక్ వర్కర్ల కోసం చూస్తున్నట్లు పేర్కొంది. లేటరల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా, పైథాన్, డాట్నెట్, ఆండ్రాయిడ్/ఐఓఎస్ డెవలప్మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ వంటి వివిధ రంగాల్లో నైపుణ్యాలున్న నిపుణుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పిస్తుంది.గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కంపెనీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోని డెవలప్మెంట్ సెంటర్లలో వాక్ఇన్ రిక్రూట్మెంట్ల ద్వారా నిపుణులను భర్తీ చేసింది. గత తొమ్మిది నెలలుగా ఇన్ఫోసిస్ భారీగా నియామకాలు చేపట్టలేదు. దాంతో కొన్ని విభాగాల్లో ఖాళీలు మిగిపోయాయి. తాజా నియామక ప్రక్రియ ఈ సమస్యను తీరుస్తుందని కంపెనీ భావిస్తోంది. నియామకాలకు సంబంధించి కంపెనీ అంతర్గతంగా ఉద్యోగులకు వివరాలు వెల్లడించింది.వచ్చే ఏడాదిలో 20,000 మంది ఫ్రెషర్స్‌కు..కంపెనీ ఏటా నిర్వహించే లేటరల్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగానే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్రెషర్స్, లేటరల్ నియామకాల మధ్య వ్యత్యాసాలు తలెత్తకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ఇదివరకే ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సాఫ్ట్వేర్ సంస్థలో మొత్తంగా 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: నటి మెడికల్ వేవర్ అభ్యర్థన తిరస్కరణచిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఉద్యోగుల అవసరంఅట్రిషన్ల(కంపెనీ మారడం వల్ల ఏర్పడే ఖాళీలు) వల్ల ఏర్పడిన పోస్టులతో పాటు కొనసాగుతున్న కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. సంస్థ కొన్ని చిన్న ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోందని, వీటికి మానవ వనరులు అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఉద్యోగ సంక్షోభం.. రియల్టీ మార్కెట్‌పై భారం
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది. 2024లో 50,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులను తొలగించడం నగర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. వ్యయ నియంత్రణ చర్యలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ను వేగంగా అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంపై ప్రభావం చూపడమే కాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు ఇన్‌షార్ట్స్ నివేదిక తెలిపింది.సంక్షోభంలో ఐటీ రంగంబెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఐటీ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎంట్రీ లెవల్ ప్రోగ్రామర్లు, స్టాఫ్ట్వేర్ టెస్టింగ్‌లో భాగంగా ఉన్న కోడింగ్, డీబగ్గింగ్ వంటి పనుల కోసం ఉన్న సాఫ్ట్వేర్ టెస్టర్ల స్థానంలో కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పు వల్ల అనేక ఉద్యోగాలు తొలగింపునకు కారణమవుతుంది. దాంతో వేలాది మంది వృత్తి నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి అందిస్తున్న వారు స్థానికంగా ఉద్యోగులు ఖాళీ చేస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.రియల్ ఎస్టేట్‌పై ప్రభావంఉద్యోగులు తొలగింపులు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. బడ్జెట్ హౌసింగ్‌కు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో భూయజమానులు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు జూనియర్ ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే పీజీ సౌకర్యాలు ఇప్పుడు తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో సతమతమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వంటి టెక్నాలజీ హబ్‌ల సమీపంలో అద్దె ప్రాపర్టీల్లోకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ఇన్వెస్టర్లు ప్రాపర్టీ విలువలు పడిపోవడం, యూనిట్లు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: యూఎస్ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?విస్తృత ఆర్థిక ప్రభావాలుఉద్యోగ సంక్షోభం ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలతోపాటు ఇతర విభాగాలకు విస్తరించింది. నగరంలోని ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిటైల్ స్టోర్లు వంటి ఐటీ నిపుణులకు సేవలందించే స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొత్త కొలువు కోసం ఎదురుచేసే తొలగించిన ఉద్యోగుల వ్యయ శక్తి తగ్గడం బెంగళూరులోని వివిధ పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. -
ఇన్ఫీ వర్క్ ఫ్రమ్ హోమ్: కొత్త రూల్‌పై క్లారిటీ
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్(work from home ).. ఆఫీస్ హాజరుకు (Return to office) సంబంధించిన కొత్త రూల్ జారీ చేసింది. తమ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు అవసరమయ్యే ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ స్పష్టత ఇచ్చింది.ఉద్యోగుల్లో గందరగోళంఒక ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయకపోతే "సిస్టమ్ ఇంటర్వెన్షన్"కు దారితీస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ పదం వాడకం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదైనా అత్యవసర కారణం లేదా ఉన్నతాధికారుల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే, అది యాప్‌లో నమోదు కాకపోతే తమ సెలవు కోతకు గురవుతుందని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీ యాప్ పై స్పష్టత వచ్చింది.మేనేజర్ అప్రూవల్ తప్పనిసరి ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ హాజరును యాప్‌లో నమోదు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) రిక్వెస్ట్‌లను ఈ యాప్ ఇకపై నేరుగా ఆమోదించదు. ఉద్యోగులు తప్పనిసరిగా తమ కార్యాలయంలో నెలకు 10 రోజులు హాజరు పంచ్ చేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది.ఒక నెలలో అందుబాటులో ఉన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుల సంఖ్య, ఇప్పటికే ఉపయోగించిన రోజులు, అందుబాటులో ఉన్న రోజులను యాప్ చూపిస్తుంది. అదనపు డబ్ల్యూఎఫ్‌హెచ్ రోజులను మినహాయింపుగా చూపిస్తామని, వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్యోగి తన మేనేజర్‌కు అప్రూవల్ రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని యాప్‌లో అప్డేట్ చెబుతోంది.దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో సుమారు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్‌ను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణను మేనేజర్లకు ఇవ్వడంపైనా ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.అమల్లోకి కొత్త హైబ్రిడ్ విధానంఇన్ఫోసిస్ కొత్త హైబ్రిడ్ విధానం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకునే రోజుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు, నెలలో కనీసం 10 రోజులు లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుండి పనిచేయాలని కంపెనీ ఫంక్షనల్ హెడ్స్ గత వారం ఒక ఇ-మెయిల్లో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కమ్యూనికేషన్ జాబ్ లెవల్ 5 (JL5) అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తుంది. -
ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులకు బ్యాడ్ న్యూసే చెప్పింది.వేతన పెంపు వాయిదాఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.వేతన ప్రణాళికలుబోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.విస్తృత ఆర్థిక నేపథ్యంఅనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.ఉద్యోగుల ప్రతిస్పందనవేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక సర్దుకోవాల్సిందే..!
ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.వారికి ఉద్యోగాలు ఉండవుఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.ఇన్మోబి సీఈవో నవీన్ తివారీమిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపుఇన్మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్మోబి యాడ్స్. ఇది అడ్వర్టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. -
ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వేతన పెంపులు (Salary Hikes) క్లిష్టంగా మారుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో నిబంధనను తెస్తున్నాయి. తాజాగా ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) సంస్థ కొత్త సామర్థ్య ఆధారిత మదింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్ చేసింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఈ చొరవ లక్ష్యం మేనేజర్లు తమ పాత్రలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయడమే.కాంపిటెన్సీ టెస్ట్మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లో కోడింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. బృందాలకు నాయకత్వం వహించడానికి, సంస్థ ఎదుగుదలను నడిపించడానికి అవసరమైన సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించారు. నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న టీమ్ లీడ్ లు, లీడ్ ఆర్కిటెక్ట్ లను కలిగి ఉన్న పీ3, పీ4, పీ5 బ్యాండ్ ల్లోని మేనేజర్ లు వేతన పెంపునకు అర్హత పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.చొరవ వెనుక హేతుబద్ధతశరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమలో పోటీతత్వంతో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామర్థ్య ఆధారిత అప్రైజల్ వ్యవస్థను అమలు చేయాలని ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను వేతన పెంపునకు అనుసంధానించడం ద్వారా, కంపెనీ తన మేనేజర్లకు తాజా నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉందని నిర్ధారించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం శ్రామిక శక్తి మొత్తం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నిరంతర అభ్యాసం, అభివృద్ధికి కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.పరిశ్రమ ప్రభావంఎల్టీఐమైండ్ట్రీ తీసుకున్న ఈ నిర్ణయం బహుశా భారత ఐటీ పరిశ్రమలో ఇదే మొదటిది కావచ్చు. పనితీరు మదింపులలో నైపుణ్యాల ఆధారిత మదింపుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఇతర కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణను ఏర్పరుస్తుంది. వేతన పెంపునకు సామర్థ్య పరీక్షను తీసుకురావడం మెరిటోక్రసీపై కంపెనీ దృష్టిని, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించే వైఖరిని తెలియజేస్తోంది.ఇది చదివారా? ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..ఉద్యోగుల రియాక్షన్ఎల్టీఐమైండ్ట్రీ తీసుకొచ్చిన కొత్త అప్రైజల్ వ్యవస్థపై ఉద్యోగుల నుంచి మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంక, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడాన్ని కొంత మంది ఉద్యోగులు అభినందిస్తున్నారు. అదనపు ఒత్తిడి, వేతనాల పెంపుపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా రూపొందించామని, అందుకు వారు సిద్ధం కావడానికి తగిన సహకారం, వనరులను అందిస్తామని ఎల్‌టీఐమైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. -
ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) లేఆఫ్‌లలో మరో పరిణామం చోటుచేసుకుంది. బలవంతపు తొలగింపులపై ఇన్ఫోసిస్ ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తలుపులు తట్టారు. ఇన్ఫోసిస్ తమను అన్యాయంగా తొలగించిందని (Layoffs), తిరిగి విధుల్లోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు పీఎంవోకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ లో సామూహిక తొలగింపులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరుతూ కర్ణాటక లేబర్ కమిషనర్ కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండో నోటీసు పంపింది. పీఎంవోకు పలు ఫిర్యాదులు అందాయని, కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర కార్మిక అధికారులను కోరింది. అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్)కు సమాచారం అందించింది.700 మంది తొలగింపుగత రెండున్నరేళ్లలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియమించుకున్న సుమారు 700 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న తొలగించింది. వీరు 2023 అక్టోబర్‌లోనే విధుల్లోకి చేరారు. అంతర్గత మదింపు కార్యక్రమంలో బాధిత ఉద్యోగులు విఫలమయ్యారని పేర్కొంటూ ఇన్ఫోసిస్ తొలగింపులను సమర్థించుకుంది. వీరిలో పనితీరు సంబంధిత సమస్యల కారణంగా 350 మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులు అంతర్గత మదింపుల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా పరీక్షల్లో క్లిష్టత స్థాయిని పెంచారని, దీంతో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.ఇన్ఫోసిస్ స్పందనఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్ఫోసిస్ తన వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ టెస్టింగ్ ప్రక్రియలను మూల్యాంకన విధాన పత్రంలో పొందుపరిచామని, ట్రైనీలందరికీ ముందస్తుగా తెలియజేశామని తెలిపింది. ఇన్ఫోసిస్ లో చేరే ప్రతి ట్రైనీ కంపెనీలో తమ అప్రెంటిస్ షిప్ ను అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపుతారని గుర్తు చేసింది. శిక్షణ ఖర్చును పూర్తిగా ఇన్ఫోసిస్ భరిస్తోందని పేర్కొంది. -
ఇన్ఫోసిస్ యూటర్న్..
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఈసారి ఎలా ఉంటాయంటే..
దేశంలో ఐటీ ఉద్యోగాలకు ( IT Jobs ) ఎనలేని క్రేజ్ ఉంది. అత్యధిక జీతాలే ఇందుకు కారణం. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.లక్షల్లో ప్యాకేజీ లభించడమే కాదు.. ఏటా వేతనాల పెంపు (Salary hikes) కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏటా తూతూ మంత్రంగా సింగిల్ డిజిట్‌లోనే జీతాలను పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు.2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమలో వేతన ఇంక్రిమెంట్లు మధ్యస్థంగా ఉంటాయని అంచనా. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సగటు వేతన పెంపు 4-8.5 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వేతన ఇంక్రిమెంట్లను ప్రభావితం చేసే అంశాలుగ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్: ఐటీ సేవల పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో సతమతమవుతోంది. ఇది విచక్షణ వ్యయం తగ్గడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. కంపెనీలు వేతన బడ్జెట్ల విషయంలో సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నాయి. కొన్ని సాంప్రదాయ ఏప్రిల్-జూన్ కాలానికి మించి అప్రైజల్ సైకిల్‌ను ఆలస్యం చేస్తున్నాయి.పెరుగుతున్న నైపుణ్య అవసరాలు: పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, నైపుణ్యాల ఆధారిత వేతనానికి ప్రాధాన్యత పెరుగుతోంది. సంస్థలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు టైర్ 2 నియామకాలను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ప్రతిభావంతులను నిలుపునేందుకు నిలుపుదల బోనస్‌లు, ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్లు (ESOP), ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!ఏఐ స్వీకరణ: పెరుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్వీకరణ శ్రామిక శక్తి నిర్మాణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. వేతన బడ్జెట్లను ప్రభావితం చేస్తోంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు, పెరుగుతున్న క్లయింట్ అవసరాలు మరింత జాగ్రత్తగా వనరులను కేటాయించడానికి కంపెనీలను ప్రేరేపిస్తున్నాయి.పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ఏడాది వేతనాల పెంపు చాలా జాగ్రత్తగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. ‘4-8.5 శాతం రేంజ్లో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలు ఈ మందగమనానికి ప్రధాన కారణం’ అని వివరించారు.మరోవైపు 5-8.5 శాతం వేతన పెంపు ఉంటుందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోటియానీ అంచనా వేశారు. రెండంకెల పెరుగుదల రోజులు పోయినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ మరింత ఆచరణాత్మక ధోరణి అవలంభిస్తున్నందున సగటు పెరుగుదల 5-8.5 శాతం మధ్య ఉంటుందని ఆమె భావిస్తున్నారు. -
టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానంలో మార్పులు ప్రకటించింది. నోయల్ టాటా నేతృత్వంలోని ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిర్మాణాత్మక ఇన్-ఆఫీస్ వర్క్ మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొన్ని కంపెనీ నుండి టీసీఎస్‌ను భిన్నంగా చేస్తుంది.డబ్ల్యూఎఫ్‌హెచ్ పాలసీలో కీలక మార్పులు ఇవే..ఉద్యోగులు ఇప్పుడు త్రైమాసికానికి ఆరు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. ఒక వేళ వీటిని ఉపయోగించని పక్షంలో తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోవచ్చు.స్థల పరిమితుల కారణంగా ఉద్యోగులు ఒకే ఎంట్రీలో 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్ వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు లాగిన్ చేయవచ్చు. 10 రోజుల్లోగా సబ్మిట్ చేయని అభ్యర్థనలు స్వయంచాలకంగా తిరస్కరణరకు గురవుతాయి.చివరి రెండు పనిదినాల్లో మాత్రమే బ్యాక్ డేటెడ్ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత నెలకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంట్రీలను వచ్చే నెల 5వ తేదీ వరకు పెంచుకోవచ్చు.రెండు, మూడు రోజులు ఆఫీసు హాజరును అనుమతించే ఇతర ఐటీ సంస్థల మాదిరిగా కాకుండా టీసీఎస్ ఐదు రోజుల అటెండెన్స్ విధానాన్ని అమలు చేసింది.ఉద్యోగులపై ప్రభావం..సవరించిన విధానం టీసీఎస్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన హాజరు నిబంధనలు, మరింత నిర్మాణాత్మక పని వాతావరణానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగుల హాజరుపై మెరుగైన పర్యవేక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సహాయక, సానుకూల వర్క్ ప్లేస్ సంస్కృతిని సృష్టించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి.ఉద్యోగులు ప్రేరణ, నిమగ్నతతో కూడిన సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ నొక్కి చెప్పారు. సహకార, మద్దతు సంస్కృతిని ప్రోత్సహించాలని, ఉద్యోగులు కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపేలా చూడాలని మేనేజర్లకు పంపిన కమ్యూనికేషన్ లో లక్కడ్ కోరారు. -
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్‌లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
5 ఐటీ కంపెనీలు.. 3 నెలలు.. 2587 మంది టెకీలు..
దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.మార్చి త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్ఇలాంటి ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్‌ఫోర్స్ జోడింపులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వరుసగా రెండవ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ఐటీ పరిశ్రమ దూకుడుగా నియామకాలు చేపట్టిందని, ఫలితంగా వర్క్‌ఫోర్స్ అధికంగా పోగుపడిందని ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్-శామ్యూల్ చెబుతున్నారు. కంపెనీలు నియామకాలను తగ్గించడం, రీబ్యాలెన్స్ కోసం అట్రిషన్‌ను అనుమతించడం వలన ఉత్పాదకత లాభాలు కొంత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రాబడి వృద్ధి ఇకపై కేవలం హెడ్‌కౌంట్‌ను పెంచడంపై ఆధారపడి ఉండదని, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో అధిక బిల్లింగ్ రేట్లను పెంచుతుందని హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో పేర్కొన్నారు.అమెరికా ఐటీలో అనిశ్చితిఅమెరికాలో వచ్చిన కొత్త పరిపాలనలో హెచ్ వన్ బీ (H1B) వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలతో సహా ఇమ్మిగ్రేషన్ విధానాలు మారవచ్చు కాబట్టి యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నిపుణులు యూరప్ వంటి దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. అనిశ్చితి ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. -
ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని (WFH) పూర్తిగా తొలగించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్ అందులోనూ కీలక మార్పులు చేసింది.ఆఫీస్ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) విధానాన్ని టీసీఎస్ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.ఎంట్రీల్లోనూ పరిమితులుఇక ఒక ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపులను సమర్పించడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలైతే ఒకేసారికి ఐదు ఎంట్రీలు నివేదించవచ్చు. 10 రోజులలోపు పూర్తి చేయని మినహాయింపు అభ్యర్థనలు వాటంతటవే రిజెక్ట్ అవుతాయి. ఆలస్యంగా చేసే సమర్పణలకు సంబంధించి ప్రస్తుత తేదీ నుండి మునుపటి రెండు తేదీల వరకు మాత్రమే బ్యాక్‌డేటెడ్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ప్రస్తుత నెలలో డబ్ల్యూఎఫ్‌వో ఎంట్రీ కేటగిరీ లేకపోతే తదుపరి నెల 5వ తేదీ వరకు దాన్ని నివేదించవచ్చని కంపెనీ నోట్ పేర్కొంది.కార్యాలయ హాజరు ఆదేశం నుండి మినహాయింపులను అభ్యర్థించడానికి లార్జ్ స్కేల్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ఎంట్రీలను టీసీఎస్ నిషేధించింది. ఐదు రోజుల వర్క్‌వీక్ హాజరు విధానాన్ని అవలంబించడంలో కొన్ని ఇతర భారతీయ ఐటీ సంస్థలతో పాటు టీసీఎస్ ముందంజ వేసింది. ఇతర సంస్థలు వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు కార్యాలయంలో హాజరును తప్పనిసరి చేశాయి. హాజరు సమ్మతితో వేరియబుల్ పేని ముడిపెట్టాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..ఉద్యోగులు స్థిరత్వం సాధించిన తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసే అవకాశం ఉందని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత లక్కడ్ మాట్లాడుతూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు పూర్తి వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు అర్హులని, మిడ్, సీనియర్ లెవల్ సిబ్బంది వేరియబుల్ వేతనం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరించారు.40,000 మంది నియామకంటీసీఎస్ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగా అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని లక్కడ్ వెల్లడించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్ 2 కంపెనీ ఝలక్
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారిసాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్లను దాటవేశాయి.క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు.లాభం మెరుగురెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.వేతనాల్లో భారీ వ్యత్యాసంసాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే. -
ఐటీ ఉద్యోగాలు.. ఇంకొన్నాళ్లు ఇంతే!
భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో 2025–26 రెండవ అర్ధ భాగం నాటికి వృద్ధి ఊపందుకునేంత వరకు నియామకాలు సమీప కాలంలో తక్కువ స్థాయిలోనే ఉంటాయని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇక్రా నివేదిక ప్రకారం.. యుఎస్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల తక్షణ కాలంలో కొంత విధానపర అనిశ్చితి ఏర్పడవచ్చు.అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం మధ్య యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో కస్టమర్లు సాంకేతికతపై తక్కువ వ్యయం చేయడంతో 6–8 త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల కంపెనీలకు డిమాండ్ తగ్గింది. తక్కువ అట్రిషన్, ఉద్యోగుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు కూడా నియామకాల్లో మందగమనానికి కారణం అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కొంత రికవరీ ఉన్నప్పటికీ.. 2025–26 అక్టోబర్–మార్చి నాటికి వృద్ధి ఊపందుకుంటున్నంత వరకు సమీప కాలంలో నియామకాలు తక్కువగానే ఉంటాయి. నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.. 2021–22, 2022–23 కాలంలో జోడించిన ఉద్యోగుల వినియోగం పెరుగుదల 2023–24, 2024–25 క్యూ1లో ఐటీ సేవల కంపెనీల నియామకాలపై ఒత్తిడి తెచ్చింది. అట్రిషన్ స్థాయిల పెరుగుదలతో పాటు, ఇక్రా ఎంచుకున్న కంపెనీలకు 2024–25 క్యూ1 వరకు ఏడు త్రైమాసికాల్లో నికర ఉద్యోగుల చేరిక ప్రతికూలతకు దారితీసింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్ ఉన్నాయి.జనరేటివ్ (జెన్) ఏఐ వేగంగా ప్రవేశిస్తున్నందున ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యాపార అవకాశాలను అన్వేషించడం ద్వారా అన్ని ప్రముఖ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ఇది తాజా నియామకంలో మొత్తం నియంత్రణకు దారితీసే అవకాశం ఉందని అంచనా. ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం జనరేటివ్ ఏఐ విస్తృత స్వీకరణ ప్రభావం రాబోయే కొన్ని సంవత్సరాలలో కనిపిస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. డిమాండ్ నియంత్రణతో.. నివేదిక రూపకల్పనకు ఇక్రా ఎంచుకున్న కంపెనీల్లో ఒక్కో ఉద్యోగికి సగటు ఆదాయం 2019–20 నుంచి 2023–24లో దాదాపు 50,000 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. 12 నెలల అట్రిషన్ రేటు 2021–22 క్యూ4, 2022–23 క్యూ1 సమయంలో దాదాపు 23 శాతానికి చేరుకుంది. నియామకాలు పెద్ద ఎత్తున జరగడం, ఆ తరువాత డిమాండ్–సరఫరా అసమతుల్యత ఇందుకు కారణం.యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో డిమాండ్ నియంత్రణ కారణంగా ఐటీ సేవల కంపెనీల ద్వారా తక్కువ నియామకాలతో అట్రిషన్ క్రమంగా క్షీణించింది. ఇక్రా నమూనా కంపెనీల అట్రిషన్ రేటు 2023–24 క్యూ3 నుండి దాదాపు 13 శాతం వద్ద స్థిరీకరించడం ప్రారంభించింది. కోవిడ్ ముందస్తు 2019–20 క్యూ1లో ఇది 18 శాతం నమోదైంది అని ఇక్రా వివరించింది. -
ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్‌పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది. -
ఐటీ జాబ్స్.. వచ్చే ఆరు నెలలూ అదుర్స్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న నేపథ్యంలో దేశీయంగా ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలు 10–12 శాతం వరకు పెరగనున్నాయి. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.బిజినెస్ సర్వీసుల సంస్థ క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. టెక్ నియామకాలకు నెలకొన్న డిమాండ్, మార్కెట్లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించే విధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్‌సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్‌సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. పుష్కలంగా టెక్ నిపుణుల లభ్యత, వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యాలతో డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్ 10–12 శాతం పెరగవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. టాప్ 5 నైపుణ్యాలు.. నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.క్యూ2లో టెక్ హైరింగ్‌కి సంబంధించి జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ఆప్స్ నిపుణులకు డిమాండ్ కనిపించింది. ప్రాంతాలవారీగా చూస్తే మొత్తం ఉద్యోగావకాశాలకు సంబంధించి 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 43.5 శాతంతో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా జీసీసీలు విస్తరిస్తుండటంతో వివిధ నగరాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో సుశిక్షితులైన నిపుణులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!
దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.కార్యాలయ హాజరు కీలకంఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు. -
ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ప్రజలు పట్టంకట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. దాంతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత నిరాశ చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత హయాంలో మాదిరిగానే ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు సహజంగా వ్యక్తమవుతున్నాయి. 80 శాతం పైగా భారత్ ఐటీ సర్వీసుల ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. హెచ్1బీ/ఎల్1 వీసాలపై(యూఎస్ కంపెనీలు విదేశీయులకు అందించే వీసాలు) ట్రంప్ తొలిసారి అధికారం వచ్చిన వెంటనే నిబంధనలను కఠినతరం చేయడం తెలిసిందే.వీసా పరిమితులు?గతంలో ట్రంప్ హయాంలో విదేశీ ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో పాటు వీసాల జారీపైనా పరిమితులు విధించారు. దీంతో అప్పట్లో ఐటీ కంపెనీలు వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విదేశీ సెంటర్లలో స్థానిక నిపుణులకే పెద్దపీట వేశాయి. 2016–17లో అమెరికాలో భారతీయ ఐటీ సంస్థల ఉద్యోగుల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ/ఎల్1 వీసాల ద్వారానే నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..ఐటీ అగ్ర త్రయం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్1బీ వీసాలు గత పదేళ్లలో 50–80% తగ్గిపోయినట్లు అంచనా. ట్రంప్ నియంత్రణల తర్వాత ఇది జోరందుకుంది. 2019–20లో ఇన్ఫీ గ్లోబల్ సిబ్బంది 65 శాతానికి, విప్రోలో 69 శాతానికి ఎగబాకినట్లు బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 హయాంలో మళ్లీ వీసా పరిమితులు, కఠిన నిబంధనలు విధించినప్పటికీ.. పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు దేశీయ కార్యకలాపాలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 21% నుంచి 15%కి తగ్గిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలు కూడా భారత్ ఐటీ కంపెనీలకు సానుకూలాంశమని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా నియంత్రణలు ఉన్నప్పటికీ ట్రంప్ తొలి విడతలో దేశీ ఐటీ షేర్లు పుంజుకోవడం విశేషం. టీసీఎస్ 185 శాతం, ఇన్ఫోసిస్ 174 శాతం, విప్రో 140 శాతం చొప్పున ఎగబాకాయి. -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు
దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్‌కౌంట్ ట్రెండ్ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా? గూగుల్ టెకీ వింత అనుభవంరెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించింది. పెండింగ్‌లో ఉన్న కాలేజీ రిక్రూట్లను కూడా ఆన్‌బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఆఫర్ లెటర్ జారీలో మార్పులు
దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది."ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.భారతీయ సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. -
మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం.. మకాం మార్చాలా?: టెకీ ప్రశ్న
ఉద్యోగం చేస్తున్న చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వస్తే.. దాన్ని ఎంచుకుని ముందుకు సాగిపోతారు. అయితే ఇటీవల ఒక ఉద్యోగికి లక్షల జీతం లభించే ఉద్యోగం లభించినప్పటికీ.. ఓ సందేహం వచ్చింది. తన సందేహానికి సమాధానం కోరుతూ.. రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.నేను బెంగుళూరులో మెకానికల్ ఇంజనీర్, వయసు 31, పెళ్లయింది, ఇంకా పిల్లలు లేరు. నెలకు రూ.1.30 లక్షలు సంపాదిస్తున్నాను. ఇంటి అద్దె, తల్లితండ్రులకు డబ్బు పంపించిన తరువాత కూడా నాకు రూ. 50వేలు నుంచి రూ. 60వేలు మిగులుతుంది. అయితే ఇది ఈఎంఐ చెల్లించడానికి సరిపోతుంది. ఈఎంఐ ఇంకా సంవత్సరం పాటు చెప్పించాల్సి ఉంది.ఉద్యోగ జీవితం బాగానే ఉంది, ఆరోగ్య భీమాకు సంబంధించినవన్నీ కంపెనీ చూసుకుంటుంది. అయితే ఇటీవల నాకు స్వీడన్‌లోని హెల్సింగ్బోర్గ్లో నెలకు రూ.3.90 లక్షల జీతం పొందే ఆఫర్ వచ్చింది. నా స్వగ్రామంలో నా మీదనే ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేను ఒక్కడినే సంతానం. కాబట్టి నేను ఇప్పుడు స్వీడన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడాలా? లేదా ఇక్కడే ఉండి.. ఉన్న ఉద్యోగం చేసుకోవాలా? ఆర్థిక పరంగా ఎదగటానికి 4-5 సంవత్సరాలు స్వీడన్‌కు వెళ్లడం నా పరిస్థితికి సహాయపడుతుందా?.. దయచేసి ఎవరైనా సలహా ఇవ్వగలరా? అని రెడ్డిట్‌లో సలహా కోరారు.స్వీడన్ వెళ్లాలనుకుంటే.. మీరు ఒక్కరే కాకుండా, మీ భార్యను కూడా పని చేయడానికి ప్రేరేపించండి. లేకుంటే అక్కడ ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించేలా చేయండి. అక్కడ కొన్ని భాషా తరగతులకు హాజరయ్యేలా చూడండి అని ఒకరి రాశారు.స్వీడన్ మీరు అధిక సంపాదన కోసం వెళ్లే దేశం కాదు. మీరు ఒంటరిగా ఉండి, పొదుపుగా జీవిస్తే మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చని మరొకరు అన్నారు. మీరు సన్యాసిలా జీవిస్తే మీ జీతంలో సగం వరకు ఆదా చేయవచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి, అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఉద్యోగం మారితే మరింత ఎక్కువ సంపాదించవచ్చని మరికొందరు సలహా ఇచ్చారు. -
ఏడాదిలో 61,600 మంది ఉద్యోగులు రాక! కారణం..
తెలంగాణ రాష్ట్రంలో నికరంగా వైట్‌కాలర్(ప్రొఫెషనల్) ఉద్యోగులు పెరుగుతున్నారని ఎక్స్‌ఫెనో సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల నుంచి 61,600 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారని, వివిధ కారణాలతో 41,400 మంది రాష్ట్రాన్ని వీడారని సంస్థ పేర్కొంది. ఈమేరకు సంస్థ సహవ్యవస్థాపకులు కమల్ కరంత్ ‘టాలెంట్ పాజిటివ్ తెలంగాణ 2024’(రెండో ఎడిషన్) పేరుతో నివేదిక విడుదల చేశారు.నివేదికలోని వివరాల ప్రకారం..తెలంగాణలో వైట్‌కాలర్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 12 నెలల కాలంలో 61,600 వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వివిధ కారణాలతో 41,400 మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. నికరంగా తెలంగాణ 20,200 మంది వైట్‌కాలర్ ఉద్యోగులను సంపాదించింది.రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ వైట్‌కాలర్ ఉద్యోగులు 41.8 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ఏటా 12 శాతం పెరుగుతోంది. అందులో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగిన వారు 50% మంది ఉన్నారు.కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 18.7 లక్షల మంది అనుభవజ్ఞులైన వైట్ కాలర్ ఉద్యోగులున్నారు.హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, హనుమకొండలో అధికంగా ఈ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు.2023 లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో పురుషులు 68 శాతం, మహిళలు 32 శాతం ఉన్నారు. 2023తో పోలిస్తే 2024లో మహిళా ఉద్యోగులు సంఖ్య ఒక శాతం పెరిగింది.టెక్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, హెచ్ఆర్ విభాగాలను ఎంచుకుంటున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే వారి సంఖ్య 12.3 లక్షలు, మాస్టర్స్ డిగ్రీ 4.61 లక్షలు, ఎంబీఏ 3.35 లక్షలు, పీహెచ్డీ 41 వేలు, అసోసియేట్ డిగ్రీ 20 వేలుగా ఉంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీదేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హరియాణా, గుజరాత్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయా మినహా అన్ని రాష్టాల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది.తెలంగాణకు వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారున్నారు. గడిచిన ఏడాది కాలంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 55,400గా ఉంది.తెలంగాణ నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు ఎక్కువ మంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 38,700గా ఉంది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపించడం ద్వారా ఇతర దేశాల్లోని వారు తెలంగాణకు వస్తున్నారు. యూఎస్, యూకే, యూఏఈ, కెనడా నుంచి అధికంగా వలసలున్నాయి. ఏడాదిలో వీరి సంఖ్య 20,400గా ఉంది.ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 50,700గా ఉంది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!నివేదిక విడుదల సందర్భంగా ఎక్స్‌ఫెనో సహవ్యవస్థపకులు కమల్ కరంత్ మాట్లాడుతూ..‘తెలంగాణ వివిధ రంగాల్లోని వైట్‌కాలర్ ఉద్యోగులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మౌలికసదుపాయాలు పెరిగాయి. వ్యూహాత్మక పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ప్రగతిశీల విధానాలు రూపొందించడం, వ్యాపార ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలతో ఇది సాధ్యమవుతోంది. అయితే రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో మెరుగైన వసతులు, వేతనాలు ఉండడం ఇందుకు కారణం. ఉద్యోగులు ప్రమోషన్ కోసం, ఇతర రంగాలను ఎంచుకోవడానికి, తమ అభివృద్ధికి అనువైన నాయకత్వం..వంటి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
యాక్సెంచర్‌లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్‌ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్లో గణనీయమైన మార్పును ప్రకటించింది. పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలలు ఆలస్యం చేసింది.యాక్సెంచర్‌లో ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్లో చేపడతారు. కానీ బ్లూమ్‌బెర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్లు ఇప్పుడు వచ్చే జూన్‌లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్ షెడ్యూల్ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.కన్సల్టెన్సీ పరిశ్రమను ప్రభావితం చేసే విస్తృత ఆందోళనలకు ఇన్వెస్టర్లు ప్రతిస్పందించారు. ప్రమోషన్లను ఆలస్యం చేయాలనే యాక్సెంచర్ నిర్ణయం కన్సల్టెన్సీ పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. మెకిన్సే, ఎర్నెస్ట్ & యంగ్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ వంటి కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా సిబ్బంది సర్దుబాట్లు చేశాయి. -
ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్‌లో హాజరుకు ఉద్యోగుల లీవ్‌లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్‌లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్‌కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్‌లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్‌లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్ను ఎంచుకుంటున్నారు. యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
లేఆఫ్ దడ.. కలవరపెడుతున్న డెల్ ప్రకటన
లేఆఫ్‌ల దడ టెకీలను పీడిస్తూనే ఉంది. తొలగింపులు కొనసాగుతాయని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ తెలియజేసింది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గడం, విక్రయాలు మందగించడంతో వ్యయాలను నియంత్రణకు కంపెనీ కష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీ ఇవి ఇంకా కొనసాగుతాయని వెల్లడించడం ఉద్యోగులను కలవరపెడుతోంది.ఇప్పటికే గత నెలలో ప్రకటించిన లేఆఫ్‌లలో దాదాపు 12,500 మందికి ఉద్వాసన పలికింది డెల్. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పుంజుకోకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతాయని ప్రకటించింది.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. డెల్ కంపెనీ ఉద్యోగులను తొలగింపులను కొనసాగించడంతోపాటు నియామకాలను సైతం తగ్గించనుంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతర చర్యలు 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్రకటించిన లేఆఫ్‌లతో చాలా మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇందులో సేల్స్ ఉద్యోగులే ఎక్కువ మంది. ప్రభావితమైన ఉద్యోగులు 12,500 మందికి పైనే ఉంటారని అంచనా వేసినా దాన్ని కంపెనీ ధ్రువీకరించలేదు. తొలగించినవారికి సీవెరెన్స్ కింద 328 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. -
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
టెకీల పాలిట దారుణంగా ఆగస్ట్ నెల..
గడిచిన ఆగస్ట్ నెల టెకీల పాలిట దారుణంగా పరిణమించింది. ఈ ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే-ఆఫ్‌లను ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకొంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీలలో లేఆఫ్‌లు 136,000 లకు పెరిగాయి.ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రగామిగా ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ఉద్యోగులలో 15%. సీపీయూ చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ అధిక వ్యయాలు, తక్కువ మార్జిన్ల కారణంగా ఖర్చుల తగ్గింపు ప్రణాళికకు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది.ఇక టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 6,000 మంది లేదా 7 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. జాబితాలో మరొక పెద్ద పేరు ఐబీఎం. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగింపునకు దారితీసింది.మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి, మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో 15% లేదా దాదాపు 140 మంది తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టనున్నట్లు వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన రేషామండి అనే అగ్రిటెక్ సంస్థ మొత్తం సిబ్బందిని తొలగించి మూతపడింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్ తన ఉద్యోగులలో 5% మందిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది. -
ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్‌న్యూస్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్‌బోర్డ్ చేశామని పేర్కొంది.టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్‌జీఏలను (ఫ్రెషర్స్) ఆన్‌బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్‌జీఏలను ఆన్‌బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది. -
ఐటీ కంపెనీల కంటే 20 శాతం అధిక వేతనం
దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లుఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్‌లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు. -
ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షలు వేతనం!
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే ఇన్ఫోసిస్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఈ ఏడాది ‘పవర్ ప్రోగ్రామ్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల వరకు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా రిక్రూట్ అయ్యే అభ్యర్థులు ‘పవర్ ప్రోగ్రామ్’ కిందకు వస్తారు. ఈ కేటగిరీలోని వారికి ఏటా రూ.9 లక్షల వరకు వేతనం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలని చెప్పింది.ఇదీ చదవండి: రోబోల దండు వచ్చేస్తోంది..!ఇదిలాఉండగా, టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తామన్నారు. -
కాలగర్భంలో కలల ఉద్యోగం..!
చిన్నపుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?’ అని అడిగితే చాలామంది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీరో లేదా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు. అదే డ్రీమ్ జాబ్‌గా ఊహించుకుని కష్టపడి చదివి ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీలో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ‘జెన్ జీ’(1997-2005 మధ్య జన్మించిన వారు) యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జీతాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంతో కరోనా కాలంలో అదే అదనుగా లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్లేటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు.సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువసేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్’కు స్వస్తి పలుకుతున్నారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలుఇప్పటికే టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 51 శాతం ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు, పిల్లల చదువుల కోసం, వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా 19 శాతం జెన్ జీ ఉద్యోగులు తన ‘డ్రీమ్‌జాబ్’ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఏదేమైనా సరైన నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలోనైనా కొలువు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు నెర్చుకుని అందులో అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం. వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పాటించాలి. -
‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది ‘ప్రైమ్ రిక్రూట్మెంట్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య వేతనం ఉంటుందని పేర్కొంది.టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నాం. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తాం. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. కొంతమంది అభ్యర్థులు ‘డ్రీమ్ కేటగిరీ’(ఇష్టమైన జాజ్) ఉద్యోగాలు వస్తే టీసీఎస్ నుంచి సదరు కొలువును ఎంచుకుంటున్నారు. దాంతో కంపెనీకి టాలెంట్ ఉన్న ఇంజినీర్ల కొరత ఎదురవుతుంది. దాన్ని తగ్గించేందుకే ఈ ‘ప్రైమ్’ కేటగిరీను ప్రవేశపెట్టాం. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈ కేటగిరీ కింద ఉద్యోగం పొందిన విద్యార్థులు మరొక కంపెనీ నియామక ప్రక్రియకు వెళ్లకుండా కళాశాలలు నిర్ధారిస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలి. టీసీఎస్‌లో ఐటీ సేవల రంగాన్ని మార్చే వేగవంతమైన సాంకేతిక పురోగతి ఉంది. వ్యూహాత్మక వృద్ధి వ్యాపారాలు, పరిశోధనా విభాగాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లుజూన్ 30, 2024 నాటికి టీసీఎస్‌లో మొత్తం 6,06,998 మంది ఉద్యోగులున్నారు. 2024-25లో టీసీఎస్ క్యాంపస్‌ల నుంచి 40,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నారు. డిజిటల్ కేటగిరీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.3.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్, ప్రైమ్ కేటగిరీలో రిక్రూట్ అయిన వారికి శిక్షణ తక్కువగా అవసరం అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?
ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.జూలైలో ప్రధాన తొలగింపులు ఇవేమసాచుసెట్స్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్టెక్ దిగ్గజం అన్కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్ఎఫ్ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. -
ఐటీ నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే..!!
గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్‌కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్‌కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్‌ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్‌సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్‌కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్‌లో విప్రోను వీడి కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్‌కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
కంపెనీలు వెళ్లిపోతాయ్..!
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తెచ్చిన బిల్లుపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీని వల్ల కంపెనీలు రాష్ట్రాన్ని విడిచివెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.నాస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎంతో వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతంగా ఉంది. భారతదేశ డిజిటల్ టాలెంట్‌లో నాలుగింట ఒక వంతు ఇక్కడి నుంచే సమకూరుతుంది. 1,100 స్టార్టప్‌లు స్థానికంగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. మొత్తం గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)లో 30 శాతం కర్ణాటకలోనే కొలువు తీరాయి. ప్రభుత్వం తాజాగా స్థానికులకే ఉద్యోగాలు కేటాయించేలా బిల్లు తీసుకొచ్చింది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వేరే దేశాలకు చెందినవారు కర్ణాటకలో పనిచేసే పరిస్థితులుండవు. టెక్ కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. భారీగా టెక్నాలజీ ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంలో ఈ బిల్లు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విస్తృతంగా సమీక్ష జరిపే విరమించుకోవాలి.కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024 ప్రకారం..రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు యాజమాన్య స్థాయిలో 50 శాతం, ఇతర పొజిషన్లలో 75 శాతం రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూల వాతావరణంపై, ప్రతికూల ప్రభావం ఉంటుందని, పరిశ్రమ తిరోగమన బాట పడుతుందన్న పలువురు నిపుణుల హెచ్చరికలకు నాస్కామ్ కూడా గొంతు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఉందని పలు నివేదికలు వెలువడుతున్న తరుణంలో ఇలాంటి బిల్లు విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?ప్రైవేట్ టెక్ కంపెనీల్లో గ్రేడ్ సీ, డీ ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వ్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. -
జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టు
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఐటీ కంపెనీ సీఈవోను అపహరించిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.వెంకటగిరి తెలిపారు. నిందితుల నుంచి 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రవిచంద్రరెడ్డి గిగ్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ అయిన దాదాపు 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాడు. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, మరో ఐదుగురు ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే జులై 10 అర్ధరాత్రి వీరు రవి నివాసంలోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.కిడ్నాప్ అయిన వెంటనే రవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగే సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 84 ల్యాప్‌టాప్‌లను అపహరించినట్ల పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు బృందం రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్లో గుర్తించి రక్షించారు. నిందితులు దొంగలించిన 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, మూడు పాస్పోర్ట్లతోపాటు వారికి చెందిన రెండు కార్లు, ఒక మోటర్‌బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ పి.వెంకటగిరి వివరించారు.ఇదీ చదవండి: ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!ఇదిలాఉండగా, ఉద్యోగం కోసం నైపుణ్యాలు పెంచుకుని నేరుగా కంపెనీలను ఆశ్రయించి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
ఐటీ కష్టాలు తీరినట్టేనా? నియామకాల పునరుద్ధరణ సంకేతాలు
దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల పునరుద్ధరణకు టీసీఎస్‌లో పరిణామాలు సంకేతంగా నిలుస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11,000 మంది ట్రైనీలను చేర్చుకున్నామని, మార్చి 2025తో ముగిసే సంవత్సరానికి 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.దేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హెడ్‌కౌంట్ (ఉద్యోగుల సంఖ్య) మొదటి త్రైమాసికంలో 5,452 పెరిగి 6,06,998కి చేరుకుందని కంపెనీ తెలిపింది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో దీని హెడ్‌కౌంట్ 13,249 తగ్గింది. క్రితం త్రైమాసికంలో ఉన్న 12.5%తో పోలిస్తే క్యూ1లో అట్రిషన్ 12%కి తగ్గింది.రెండో త్రైమాసికంలో అట్రిషన్ స్థిరపడుతుందని క్యూ1 ఎర్నింగ్స్ కాల్లో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. "ప్రతిభను పెంపొందించడానికి టీసీఎస్‌కు ట్రైనీలు కీలకమైన వ్యూహం. అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు.40 వేల జాబ్స్2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నామని టీసీఎస్ తెలిపింది. అయితే ఇది బాహ్య కారకాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. కంపెనీ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌ని కూడా ముగించి క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రాసెస్ చేస్తోంది. టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది అభ్యర్థి సామర్థ్యాలు, నైపుణ్యాలను అంచనా వేసే సామర్థ్య పరీక్ష. కంపెనీ నైపుణ్య అంతరాలను అంచనా వేస్తుందని, అవసరాల ఆధారంగా నియామకాలు చేపడుతోందని లక్కాడ్ చెప్పారు. -
వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణ అందించాలి. ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది. 2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: అసౌకర్యంగా ఉండేందుకు ఎవరూ లగ్జరీ కార్లు కొనరుదేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి. -
యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 2,200 మంది తొలగింపు
యూఎస్‌కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘యూకేజీ’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన తాజా రౌండ్లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 14% మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లతో 2,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచానా వేస్తున్నారు.జూలై 4న సెలవు రోజు కావడంతో జూలై 3వ తేదీనే తొలగింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. యూకేజీ లేఆఫ్‌ల గురించి బిజినెస్ జర్నల్ నివేదించింది. ఫ్లోరిడాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ భారీ లేఆఫ్‌లతో తన శ్రామిక శక్తిని ఎలా తగ్గించుకుందో వివరించింది. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ ఈమెయిల్ ప్రకారం కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తగ్గించిందని నివేదిక పేర్కొంది.అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉన్న అతిపెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్లలో ఒకటైన యూకేజీ మొత్తం 15,882 మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. కీలకమైన వృద్ధి రంగాలపై దృష్టి సారించడం, దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యంగా చేస్తున్న సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగింపులను ప్రారంభించినట్లు యూకేజీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ తొలగింపులను వచ్చే వారం ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంతలోపే వార్తలు బయటకు రావడంతో కంపెనీ తన చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుత ఉద్యోగాల కోతలు యునైటెడ్ స్టేట్స్కే పరిమితం అవుతాయని క్రిస్ టాడ్ ధ్రువీకరించారు. -
ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
ప్రముఖ ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ 2024లో సుమారు 6000 నుంచి 8000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని భావిస్తున్నాం. ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించడానికి కంపెనీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ఇండియా, యూఎస్, కెనడా, మెక్సికో, యూకేతో సహా వివిధ దేశాలలో 2024లో 6,000 నుంచి 8,000 మంది ఉద్యోగులను నియమిస్తాం. భారత్‌లో హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, దెహ్రాదూన్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమించాలని నిర్ణయించాం. టెక్ లీడ్స్, ఆటోమేషన్ టెస్టింగ్ స్పెషలిస్ట్‌లు, ఏఈఎం ఆర్కిటెక్ట్‌లు, బిగ్ డేటా లీడ్స్, వర్క్‌డే ఫైనాన్షియల్ కన్సల్టెంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు.‘నగరాల వారీగా నిర్దిష్ట నియామకాలు ఉంటాయి. హైదరాబాద్, నోయిడా కార్యాలయాల్లో ఐసీఎస్ఎం, హెచ్ఆర్ఎస్డీ, ఫ్రంట్‌ఎండ్, ఎంఎస్డీ, జావా ఎఫ్ఎస్డీ, డాట్నెట్ ఎఫ్ఎస్డీ విభాగాల్లో ఉద్యోగులను నియమిస్తాం. కోయంబత్తూర్, బెంగళూరులో అజూర్ డేటాబ్రిక్స్, పైథాన్ ఏడీఎఫ్ వంటి టెక్నాలజీ నిపుణులకు ప్రాధాన్యం ఇస్తాం. యూఎస్‌లో ఆటోమేషన్ నైపుణ్యం కలిగిన క్లౌడ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్‌లు అవసరం. జావా ఫుల్-స్టాక్ ఇంజినీర్లు, టెస్ట్ అనలిస్ట్‌లు (ఎస్‌డీఈటీ), సీనియర్ జావా ఫుల్-స్టాక్ డెవలపర్లను నియమించాలని యోచిస్తున్నాం. యూకేలో టెస్ట్ మేనేజర్లను (మాన్యువల్, ఆటోమేషన్), డెవొప్స్(అజూర్), సర్వీస్ డెస్క్ ప్రొఫెషనల్స్, ఫుల్-స్టాక్ డెవలపర్లకు (జావా, డాట్నెట్) అవకాశం ఇస్తాం’ అని బాలసుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదుఅంతర్జాతీయంగా ప్రముఖ ఐటీ సంస్థలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పిస్తుండడం మంచి పరిణామమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రానున్న సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఐటీ రంగం ఊపందుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. -
సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్ కంపెనీ..
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్‌గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.ట్రూకాలర్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
టీసీఎస్‌లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్ ఉన్నాయి.. కానీ..
ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్ గ్యాప్ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది. -
ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..
అసలే ఉద్యోగాలు దొరక్క యువత అల్లాడిపోతుంటే.. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలు సైతం ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన వ్యాపార అనిశ్చితి కారణంగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలను బట్టి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుందని, ఉద్యోగంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ముందుగానే సమాచారం తెలియాజేస్తామని ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్లను ఆన్‌బోర్డ్ చేయలేదు. గత సంవత్సరం ముందు, మేము క్యాంపస్‌కి వెళ్లి చాలా ఆఫర్లు చేసాము. వారందరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్న తరువాత కొత్త ఫ్రెషర్లను తీసుకుంటామని విప్రో సిహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.తగ్గిన ఐటీ ఉద్యోగుల సంఖ్యభారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఐటీ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా ప్రభావం తగ్గినా తరువాత కూడా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే వచ్చాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. 20236-24 ఆర్ధిక సంవత్సరంలో 63759 మంది ఉద్యోగులు తగ్గిపోయారని తెలిసింది. -
అరుదైన స్థానం దక్కించుకున్న హైదరాబాద్ కంపెనీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.నెక్ట్స్‌వేవ్..ఏదో ఒకకోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరగానే సరిపోదు. నిత్యం కొత్త అంశాలు నేర్చుకుంటేనే ఉద్యోగంలో నిలదొక్కుకోగలం. ఆ దిశగా పని చేస్తోంది ‘నెక్ట్స్‌వేవ్’. ఐఐటీల్లో చదివిన హైదరాబాదీ యువకులు శశాంక్ రెడ్డి, రాహుల్, అనుపమ్ కొవిడ్ లాక్డౌన్ సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ సంస్థను స్థాపించారు. కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రాం(సీసీబీపీ) పేరిట కాలేజీల నుంచి గ్యాడ్యుయేట్లుగా బయటకు వచ్చే విద్యార్థులకు కంపెనీల్లో అవసరమయ్యే ఐఓటీ, ఏఐ, ఫుల్‌స్టాక్ తదితర స్కిల్స్ నేర్పించడం దీని ఉద్దేశం.దేశంలో డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉంటున్న దాదాపు 60 శాతం మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనేది సంస్థ లక్ష్యం. ఇక్కడ శిక్షణ పొందిన వారు ప్రముఖ సంస్థల్లో కొలువు దక్కించుకొని, నైపుణ్యాలకు సానబట్టే వేదిక దొరికితే దూసుకెళ్తామని నిరూపించారు కూడా. దేశవ్యాప్తంగా మూడు వేల కాలేజీలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులు ఈ స్టార్టప్ కమ్యూనిటీలో భాగస్వాములయ్యారు. ఫ్రెషర్స్‌తో పాటు వివిధ కారణాల వల్ల కెరియర్లో గ్యాప్ వచ్చిన, వేరే రంగంలో పనిచేసిన వారికీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తమదేనని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. పనితీరుతో ఇన్వెస్టర్లనూ మెప్పించి.. గతంలో రూ.21 కోట్ల క్యాపిటల్‌ను సాధించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉద్యోగాల కల్పనకు సహాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాదికి పది లక్షల మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలుపుతున్నారు.ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్.. ఇప్పుడేం చేయాలంటే..ఐటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో కొంతకాలంగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలోని సాఫ్ట్వేర్ల అప్డేషన్ అగిపోయింది. బ్యాంకింగ్ వెబ్సైట్లు, యాప్‌ల్లో కొత్త ఫీచర్లు అందించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఇవిచాలవన్నట్లు అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు నెలకొంటున్నాయి. దాంతో ఐటీ కంపెనీల లాభాలు భారీగా తగ్గుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించి..తిరిగి పరిస్థితులు గాడినపడితే ఐటీ రంగం పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలోపు కొత్తగా ఉద్యోగాలు కోసం చూస్తున్నవారు నిరాసక్తి చెందకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.ఐటీ సంస్థల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి. -
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త
కాస్ట్‌కటింగ్ పేరిట, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గత కొంతకాలంగా ఐటీ కంపెనీలు ఆశించినమేర నియామకాలు చేపట్టలేదు. అయితే క్రమంగా ఈ పరిస్థితులు మారుతున్నాయని యూఎస్‌లోని కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపై యూఎస్‌లో టెక్ కంపెనీల నియామకాలు పుంజుకోనున్నాయని ఈ డేటా నివేదించింది. సమీప భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగబోతున్నట్లు డేటా విశ్లేషించింది. అమెరికాలో కార్యాకలాపాలు సాగిస్తున్న భారత టెక్ కంపెనీలకు ఇది శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల్లో త్వరలో నియామకాలు ఊపందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని టెక్ కంపెనీలు గత నెలలో 6,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నాయని డేటా ద్వారా తెలిసింది. యూఎస్‌లోని భారత కంపెనీల్లో ప్రధానంగా టీసీఎస్‌లో 50,000 మంది, ఇన్ఫోసిస్‌లో 35,000, హెచ్‌సీఎల్ టెక్‌లో 24,000, విప్రోలో 20,000, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరుగబోతున్నట్లు తెలిసింది. ఐటీ కంపెనీల్లో ప్రధానంగా సాంకేతిక సేవలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో భారీ నియామకాలు ఉండబోతాయని సమాచారం. యూఎస్‌లో వివిధ పోజిషన్‌ల్లో పనిచేయడానికి మార్చిలో తమకు దాదాపు 1,91,000 కొత్త టెక్ ఉద్యోగులు అవసరమని కంపెనీలు పోస్ట్ చేశాయి. అంతకుముందు నెల కంటే ఈ సంఖ్య 8,000 అధికంగా ఉండడం గమనార్హం. మొత్తంగా మార్చిలో 4,38,000 యాక్టివ్ టెక్ జాబ్స్ ఉన్నాయని అంచనా. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌ల నియామకాల్లో ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో పెరుగుదల కనిపించింది. న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, చికాగో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీలు మార్చిలో అత్యధిక నియామకాలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం యూఎస్‌లోని భారత కంపెనీల ఉద్యోగులకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం.. యుఎస్ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మొత్తం శ్రామికశక్తిలో భారత కంపెనీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2023లో యుఎస్‌లో టెక్ ఉద్యోగుల ఉపాధి 1.2% పెరిగింది. 2023 వరకు టెక్ కంపెనీలు దాదాపు 5 లక్షల ఉద్యోగులను తొలగించాయని అంచనా. అప్పటి నుంచి తొలగింపుల పర్వం కాస్త నెమ్మదించిందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం కంపనీలు నియామకాల ప్రక్రియ ప్రారంభించడంతో ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడి కంపెనీల రాబడి సైతం పెరుగబోతుందని తెలిసింది. రాబోయే క్యూ4 ఫలితాల్లో కంపెనీలు మెరుగైన ఫలితాలు పోస్ట్ చేస్తాయని, ఇక నుంచి కంపెనీల్లో వృద్ధి కనిపిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. -
ఉద్యోగులకు భారీగా వేతనపెంపు.. ఎంతంటే..
కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగులకు 2024-25 ఏడాదికిగాను భారీగా వేతనాలు పెంపు ఉండనుందని మైఖేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024 నివేదిక ద్వారా తెలిసింది. సగటున దాదాపు 20 శాతం మేర వార్షిక వేతనాలు పెరుగుతాయని నివేదికలో తెలిపారు. ఫైనాన్స్-అకౌంటింగ్, ఆరోగ్య సంరక్షణ లైఫ్‌సైన్సెస్, బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్ తయారీ, మానవ వనరులు, లీగల్, టెక్నాలజీ తదితర రంగాల్లోని కంపెనీలు, ఉద్యోగులపై చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదికలో ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. తయారీ రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత డిమాండ్ పెరిగింది. టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత ఉద్యోగాలు అందుతున్నాయి. డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎం వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు మరింత డిమాండ్ ఉండనుంది. ఆర్బీఐతోపాటు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు భారత వృద్ధిరేటుపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగా భారత జీడీపీ వృద్ధి స్థిరంగా 6 శాతంపైనే నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులను తట్టుకుని భారత్ వృద్ధిబాట పడుతుందని నివేదికలో తెలిపారు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల శాలరీ పెంపు విషయాన్ని సమీక్షిస్తున్నాయి. టెకీలకు సరాసరి 8-10 శాతం వేతనపెంపు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐటీ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, వారిపై ఉద్యోగులకు 30-40 శాతం, మేనేజ్మెంట్ స్థాయిలోని సీనియర్లకు 20-30 శాతం వేతన పెంపు ఉండొచ్చని నివేదిక ద్వారా తెలిసింది. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఇలా అయితే టెకీలకు పెళ్లిళ్లు కష్టమే! షాకవుతున్న నెటిజన్లు..
కాలం మారుతోంది.. ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగం ఉన్నవారి పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరువాత టెకీల పరిస్థితులు వర్ణాతీతం అయిపోయింది. ఇన్నో రోజులూ జాబ్ ఎప్పుడు పోతుందో అనే భయంలో బిక్కుబిక్కుమంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మరో కొత్త సమస్య ఎదురైంది. లక్షల జీతం ఉన్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారిలో భారీ ప్యాకేజ్ ఉంటేనే కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన వెలుగుయూలోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ పెళ్లి చూపులకు వెళ్లాడని, అక్కడ అమ్మాయి తన శాలరీ గురించి అడిగిందని వెల్లడించాడు. అమ్మాయి శాలరీ గురించి అడిగినప్పుడు, అబ్బాయి వార్షిక వేతనం సంవత్సరానికి రూ. 8 లక్షలని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆ సంబంధం రిజెక్ట్ చేసింది. కారణం ఏంటనే అడిగితే.. తనకి ఉద్యోగం లేదని.. ఆ అబ్బాయికి కనీసం ఏడాది రూ. 25 లక్షల ప్యాకేజి ఉండాలని, లేకుండా భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పింది. వధువు సమాధానం విని వరుని తరపు బంధువులు షాకయ్యారు. ఏడాది రూ.8 లక్షలు వచ్చినా అమ్మాయి రిజెక్ట్ చేయడం గురించి ఆతని స్నేహితుని చెప్పుకున్నాడు. దీంతో ఆ స్నేహితుడు ఈ సమాచారం మొత్తం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి ఆ మాత్రం అంచనాలు పెట్టుకోవడంలో తప్పులేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏడాదికి రూ. 25 లక్షలు పెంచుకునే పనిలో ఉండు అంటూ కామెంట్ చేశారు. మరికొందరు నీ ప్యాకేజీకి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేసాడు. ఇలా తమదైన రీతిలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. One of my engineer friend who is earning 8LPA and it's been only two years of his job and belongs to a well to do baniya family got rejected for arranged marriage by a girl who left her job last year because she felt exhausted and not she's not doing anything now...reason for — IMG🩺 (@peacehipeace) April 3, 2024 -
మా జాబ్స్ తీసేసి వాళ్లకు ఇస్తున్నారు.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డజన్ల కొద్దీ అతిపెద్ద అమెరికన్ క్లయింట్లు ఉన్న టీసీఎస్‌కు వ్యతిరేకంగా సుమారు 22 మంది అమెరికన్ ఉద్యోగులు యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తొలగింపునకు గురైన టీసీఎస్ మాజీ ఉద్యోగుల్లో యూఎస్‌లోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎంబీఏ, ఇతర ఉన్నత డిగ్రీలున్నవారూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ ప్రతినిధి కొట్టిపారేశారు. 'చట్టవిరుద్ధమైన వివక్ష'కు సంబంధించిన ఆరోపణలు' అర్హత లేనివి, తప్పుదారి పట్టించేవి' అని తెలిపారు. "యూఎస్‌లో సమాన అవకాశాలు కల్పించే సంస్థగా టీసీఎస్ బలమైన రికార్డును కలిగి ఉంది. దాని కార్యకలాపాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది" అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నా..నిబంధనల ప్రకారం ఉన్నవారికి మాత్రం వేతనాలు పెంచేపనిలో పడ్డాయి. మార్చితో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వేతనపెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనున్నట్లు తెలిసింది. టీసీఎస్ తన ఆఫ్‌సైట్ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం.. ఆన్సైట్ ఉద్యోగులకు 2-4 శాతం పెంచే యోచనలో ఉందని మీడియా కథనాల ద్వారా తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్ త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టీసీఎస్ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా, భారీ వేతనాలు తీసుకుంటున్న వారి ఖర్చులు, పదోన్నతుల అంశాన్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న ఉద్యోగులకు గతేడాదే టీసీఎస్ 12-15 శాతం వరకు సగటు ఇంక్రిమెంట్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రమోషన్లను అందించింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను మాత్రం తగ్గించుకుంది. -
ఆఫీస్‌కు రాకపోతే ప్రమోషన్ కట్.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెక్ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. తాజాగా డెల్ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్, రిమోట్ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్ రోల్లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది. -
ఉద్యోగులకు ఏమైంది..? కంపెనీ ఎందుకు మారడం లేదు..
ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 2-3 ఏళ్లు కుదురుగా ఒక కంపెనీలో పనిచేశాక సంస్థ మారడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు చాలాకారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొత్త కంపెనీ భారీగా వేతనం ఆఫర్ చేస్తుండడమే. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ పద్ధతి మారుతోంది. రెండేళ్ల క్రితం వరకైతే ఐటీ ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ ధోరణితో మార్పు కనిపిస్తోంది. గతంలో లాగా కంపెనీ మారినప్పుడు, వేతనాల్లో పెంపు భారీగా ఉండకపోవడంతో ఉద్యోగులు సంస్థలు మారడం లేదని తెలుస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రస్తుతం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు తగ్గడంతో నియామకాలు తగ్గిస్తున్నారు. కొన్ని విభాగాల్లో చూస్తే, కావాల్సిన నిపుణుల లభ్యతా తక్కువగానే ఉంటోంది. కృత్రిమ మేధ (ఏఐ), ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ నిపుణులకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. మరో వైపు, అమెరికాలాంటి దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత మొదలయ్యింది. జీతం పెరగకపోయినా అదే కంపెనీలో.. చాలాకాలంపాటు ఒకే కంపెనీలో పనిచేస్తే వేతనం పెద్దగా పెరగదు అని ఐటీ నిపుణులు భావిస్తుంటారు. అందుకే, తరచూ ఉద్యోగాలు మారేందుకు సిద్ధం అవుతారు. సంస్థలు మారినప్పుడల్లా 15-20 శాతం వేతనం అధికంగా వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడా పరిస్థితులు మారాయి. నియామకాలు అంతగా లేకపోవడంతో, ఉన్న కంపెనీలో కొనసాగేందుకే ప్రయత్నిస్తున్నారు. అధునాతన నైపుణ్యాలున్న వారికి మాత్రం ఈ బాధ లేదు. ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలున్న వారికి, సంప్రదాయ కోడింగ్‌లో మంచి పట్టు ఉన్న వారికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత..? ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇది 2019 స్థాయిలోనే ఉన్నాయని ఐటీ రంగ నిపుణులు వెల్లడించారు. 2020 తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగాల సృష్టి జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇవి నెమ్మదించాయి. ముఖ్యంగా ఫ్రెషర్ల(తాజా ఉత్తీర్ణుల) నియామకంపై ప్రభావం కనిపిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని అనుకుంటున్నారు. కృత్రిమ మేధ(ఏఐ) అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఇది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది మినహా, ఉన్న ఉద్యోగాలను తగ్గించే స్థాయికి చేరుకోలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే.. మారుతున్న ప్రాజెక్ట్‌లు, టెక్నాలజీ కారణంగా పాత ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏటా కొత్తగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. వీరు ఇప్పటికే కొత్త తరం సాంకేతికతలను నేర్చుకుంటున్నారు. దీంతో పాత వారికి వీరి నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు, తొందరగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు. -
మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే..
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోందని పలు సర్వేల ద్వారా తెలుస్తుంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి రావచ్చని అంచనా. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం, స్టాఫ్ట్వేర్లు అయితే ఏఐకి సూచనలు ఇవ్వడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే ఉన్న ఉద్యోగాలపై ప్రభావం చూపుతూ కొత్త అవకాశాలకు దారితీస్తోంది. అందులో ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ కింది ఉద్యోగాలకు గిరాకీ ఏర్పడనుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్ స్థూలంగా చెప్పాలంటే.. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏంటో గుర్తించడం. దీనికి స్థిరమైన భాషాజ్ఞానం అవసరం. ఇదేమంత సులభమైన పని కాదు. ఏ లాంగ్వేజ్ ఇన్పుట్కు ఏఐ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఇంజినీర్లు భాష లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేస్తారు. వివిధ రకాలైన ప్రాంప్ట్‌కు ఎలా స్పందించాలనే విషయమై ఏఐకు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాన్ని ప్రోగ్రామింగ్, ఇన్‌స్ట్రక్టింగ్, టీచింగ్‌ల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఇందుకోసం వీరు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ), నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ (ఎన్ఎల్యూ) అనే టెక్నాలజీలను వినియోగిస్తారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు అనలిటిక్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ ట్రెయినర్ జనరేటివ్ ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ ట్రెయినర్లకు గిరాకీ ఏర్పడుతోంది. యూజర్ల అవసరాలు ఏంటో కచ్చితంగా తెలుసుకుని అందుకు తగ్గట్లు ఏఐకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఏఐను వినియోగిస్తున్నపుడు ఎలాంటి ప్రతిస్పందనలు వస్తున్నాయో తెలుసుకుని అందుకు తగ్గుట్లు కోడ్రాసి దాని సామర్థ్యం పెంచేలా కృషి చేస్తారు. కస్టమర్ సర్వీస్, ఏఐ డెవలప్మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌ల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తారు. ఏఐ ఆడిటర్ ఏఐ అప్లికేషన్ల పెరుగుదలతో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం చాలా కీలకంగా మారింది. ఏఐ ఆడిటర్లు అవుట్‌పుట్‌ను ఆసక్తికరంగా, ఉపయోగకరంగా మార్చేలా చూస్తారు. అయితే ఇందుకోసం కొన్ని చట్ట పరమైన వ్యవహారాలపై అవగాహన ఉండాలి. ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్ ఏఐ పరిధి పెరుగుతున్నపుడు నైతిక సమస్యలు రావొచ్చు. వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఏఐకి కొన్ని విలువలు జోడించేలా ఎథిక్స్ ఎక్స్పర్ట్ పనిచేయాల్సి ఉంటుంది. ఏఐకి నైతిక మార్గదర్శకాలు ఇవ్వడం, గోప్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండేలా కోడ్ చేస్తారు. పైన తెలిపిన కొన్ని విభాగాల్లోని ఉద్యోగాలకుతోడు మానవ మెదడు చేసేచాలా పనులను ఏఐ ఎప్పటికీ చేయలేదు. ఒకవేళ చేసినా అంత కచ్చితత్వంతో చేయలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటి వివరాలు కొన్నింటిని కింద తెలుసుకుందాం. సృజనాత్మకత అత్యంత తెలివైన కంప్యూటర్ కూడా మైమరపించే చిత్రాలను గీయలేకపోవచ్చు, వీనులవిందైన సంగీతాన్ని సృష్టించలేకపోవచ్చు! కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్లా కొత్త ఆలోచనలు సృష్టించలేదు, తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. ఊహకు అందని సృజనాత్మకతతో కొత్త అడుగులు వేయడం కేవలం మనుషులకే సాధ్యం. ఇది విద్య, వినోద, వ్యాపార రంగాల్లో ఎక్కడైనా ఏ రూపంలోనైనా అభ్యర్థులను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. అందుకే సృజనాత్మకతతో కూడిన రంగాలను ఏఐ ఏమీ చేయలేకపోవచ్చు. సృజనలో ఊహాశక్తి, సందర్భానికి తగిన విధంగా స్పందించడం, పరిస్థితిని చూసి స్ఫూర్తి పొందడం భాగం.. ఇవన్నీ మనుషులు చేసినట్టుగా సాఫ్ట్వేర్లు చేయలేవు. ఇటువంటి స్కిల్స్ అవసరమైన ప్రతి చోటా అభ్యర్థుల అవసరం కచ్చితంగా ఉంటుంది. దీన్ని అలవరుచుకోవడం, ప్రతిదీ కొత్తగా ఆలోచించడానికి, చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఏఐతో పోటీలో నెగ్గుకురావొచ్చు. నిర్ణయాత్మకశక్తి ఒక రోబోను ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉంచి, నిర్ణయం తీసుకోమంటే అది ఏం చేయగలుగుతుంది? ఎటువంటి కెరియర్ అయినా సరే నిర్ణయాలు తీసుకునే శక్తి అవసరమయ్యే పోస్టుల్లో మనుషులే ఉండగలరు. సమస్యలను పరిష్కరించడం, సంప్రదింపులు చేసే నేర్పు తదితర నైపుణ్యాలు ఇలాంటి చోట్ల అవసరం అవుతాయి. ‘సిచ్యువేషన్ జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్’ అభ్యర్థులకు ఉండాల్సిన స్కిల్స్‌లో ముఖ్యమైనవి. ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏఐ తెలివైనదే.. కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (ఈఐ) దానికి సులభం కాదు, కేవలం మనుషులకే సాధ్యం. ఎదుటివారి ఆలోచనలను, భావోద్వేగాలను, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం.. అందుకు తగిన విధంగా ప్రవర్తించడం.. అవసరాన్ని బట్టి ఆదరణ, అభిమానం చూపడం.. ఇవన్నీ దానికి రావు. నిజానికి స్థాయీ భేదం లేకుండా ఏ ఉద్యోగాలకైనా ఇది ఎంతో కొంత అవసరం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బృందాల్లో పనిచేసినప్పుడు, లేదా వాటిని నడిపిస్తున్నప్పుడు ఈఐ తప్పక ఉండాలి. అందుకే దీన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు దృష్టి పెట్టాలి. వీటితోపాటు డిజిటల్ లిటరసీ, డేటా లిటరసీ, డిజిటల్ థ్రెట్ అవేర్నెస్, క్రిటికల్ థింకింగ్.. వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. -
ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’
కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాలకు ఏఐ ఎసరుపెడుతుందని, మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. ఏఐ ప్రపంచంలో గొప్ప అవకాశాలతోపాటు అనిశ్చితులూ మన కోసం ఎదురుచూస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో కొలువుల కోతపై ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే భయాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఏఐ టూల్స్‌తో ఐటీ పరిశ్రమలో సిబ్బంది అవసరాలను 70 శాతం తగ్గించవచ్చని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్‌నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందో చర్చించారు. ఈ సందర్భంగా ఆటోమేషన్తో మాస్ లేఆఫ్స్ తప్పదని ఆయన హెచ్చరించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బదులు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. చాట్‌జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి ఏఐ టూల్స్ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్‌తో సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల మధ్య హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఏఐ టూల్స్ కారణంగా కంపెనీల హైరింగ్ అవసరాలు 70 శాతం తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతులబు ఐటీ ఉద్యోగులు చేపట్టే కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, ట్రబుల్ టికెట్స్ రెస్పాండింగ్ స్కిల్స్‌ను ఏఐ చేపడుతుందని చెప్పారు. ఆపై ఈ నైపుణ్యాలన్నీ వాడుకలో లేనివిగా మారతాయని, ఫలితంగా పెద్దసంఖ్యలో లేఆఫ్స్ చూస్తామని నాయర్ హెచ్చరించారు. అయితే ఏఐకి సూచనలు ఇవ్వాలంటే ఉద్యోగులు అవసరం. కాబట్టి ఆ దిశగా వారికి నైపుణ్యాలు నేర్పాలని తెలిపారు. భారత ఐటీ కంపెనీలకు ఏఐ అపార అవకాశాలు కల్పిస్తుందని వివరించారు. -
ఏఐ వచ్చా.. వెంటనే ఉద్యోగం.. జీతం ఎంతంటే..
ఏఐ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధమవ్వాలి. అదే జరిగితే మన దేశం ఏఐ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని ఉద్యోగస్థులు బయపడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక కొంత ఊరట కలిగిస్తుంది. ఏఐతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో పుష్కలంగా కొలువులు సంపాదించవచ్చని ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతంతో జాబ్ ఆఫర్ చేస్తున్నాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు జాబ్ ఆఫర్లలో 2024 ఫిబ్రవరి నెలలో 20 శాతం కంటే ఎక్కువ పెరుగుదలే ఉందని తేలింది. నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్, స్టాక్ ఏఐ సైంటిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 100 శాతం, గత ఫిబ్రవరితో పోల్చుకుంటే 44 శాతం వేతనాలు పెరిగాయి. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మెట్రో నగరాలతోపాటు నాన్ మెట్రో నగరాల్లో ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న కొత్త ప్రతిభకు డిమాండ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఏఐ విభాగాల్లో రానున్న రోజుల్లో అధికమొత్తంలో కొలువులు రాబోతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ ఫిబ్రవరి 2024లో రాయ్‌పుర్ లాంటి మెట్రోయేతర నగరాల్లో గతేడాది 14 శాతం వృద్ధితో కొత్త ఉద్యోగాలు సృష్టించగా.. సూరత్, జోధ్‌పుర్, గాంధీనగర్‌లు వరుసగా 12శాతం, 10 శాతం, 8 శాతం వృద్ధిని సాధించాయి. 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్ పీరియెన్స్ ఉన్న సీనియర్ నిపుణులు గరిష్ట జాబ్ ఆఫర్లను పొందారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారిలో జాబ్ ఆఫర్లు 23శాతం వృద్ధి చెందినట్లు తెలిసింది. -
కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యుటివ్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 2022లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని పరిచయం చేసినప్పటి నుండి జనరేటివ్ ఏఐ (generative AI) పట్ల ఆసక్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారి దైనందిన జీవితంలో వారికి సహాయపడుతుందని కొంతమంది భావిస్తుండగా, ఇది మానవ ఉద్యోగాలను తీసివేస్తుందని మరొక వర్గం అంటోంది. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కఠోర విషయం చెప్పారు. జెనరేటివ్ ఏఐ.. సంస్థల్లో హెడ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఈ మార్పు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా జరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్‌సీ అన్నారు. కంపెనీలు ఉత్పాదక ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించినందున అవి మరింత సమర్థవంతంగా మారతాయని, సాంప్రదాయిక ఉద్యోగాల కోసం వారికి ఎక్కువ మంది అవసరం ఉండదని ఆయన వివరించారు. రాయిటర్స్‌కి మరో ఇంటర్వ్యూలోనూ ఈ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇదే విషయాన్నే వెల్లడించారు. తమ కంపెనీ "ఏఐ ఫస్ట్" గా మారుతోందని చెప్పారు. "మొదట్లో ఇన్ఫోసిస్ డిజిటల్ ఫస్ట్ కాదు. దీనికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు డిజిటల్‌కు ఎలా అలవాటు పడ్డామో అలాగే ఏఐకి కూడా మెరుగ్గా అలవాటు పడుతున్నాం. ఏఐ ఫస్ట్ అవుతున్నామని భావిస్తున్నాం" అని ఆయన పేర్కన్నారు. -
ఐటీ కారిడార్‌లో మారుతున్న ట్రెండ్..
వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని ఐటీ కారిడార్లు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తుండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలలుగా ఐటీ కారిడార్‌లో క్రమంగా కార్యకలాపాలు గాడిన పడ్డాయి. హాస్టళ్లలో గదులు నిండుతున్నాయి. మాల్స్ సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు, హోటళ్లు, ట్రావెల్స్, డ్రైవర్ల జీవన ప్రయాణం గాడిలో పడింది. ఏమిటీ హైబ్రిడ్ మోడల్? ఐటీ కంపెనీల్లో అన్ని విభాగాల ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మిగతా రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ విధానానికి హైబ్రిడ్ మోడల్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. చిన్న కంపెనీల్లో ఉద్యోగులు వంద శాతం కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ భవనాలు 65 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. బహుళజాతి కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తేసే ఆలోచన చేయడం లేదు. అలాగని ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి చేయడం లేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం వంద శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి సందేశాలు పంపించాయి. అత్యధిక ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను పాటించేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ కంపెనీల్లో ఇలా.. ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ నెలలో 11 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. ప్రయోజనాలివే.. ఉద్యోగులకు కొంతకాలంపాటు హైబ్రిడ్ వర్క్‌కు అనుమతించడం ద్వారా కంపెనీలు మౌలిక సదుపాయాల ఖర్చులను గణనీయంగా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ పని వాతావరణం కారణంగా ఐటీ కంపెనీలు తమ మౌలిక సదుపాయాల ఖర్చుల్లో కనీసం 50% ఆదా చేసుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆసక్తిమేరకు పనిచేస్తే ఆఫీస్‌లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా సమర్థంగా పనిచేస్తారు. అయితే కావాల్సిందల్లా వారిలో ఆసక్తిని రేకిత్తించడమే. అందుకు కంపెనీ యాజమాన్యాలు, టీమ్ నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. హైబ్రిడ్ వర్క్‌లో తక్కువ ముందే ఆఫీస్‌కు వస్తారు కాబట్టి ఫోకస్‌గా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు సృజనాత్మకతతో విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. టీమ్‌లోని సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. దాంతో క్రాస్-కల్చరల్ వాతావరణం పెంపొందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! మూన్‌లైటింగ్‌కు చెక్.. హైబ్రిడ్ మోడల్లో భాగంగా ప్రధానంగా పనిచేస్తున్న కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలకు చెందిన రహస్య పని ఒప్పందాలు(మూన్‌లైటింగ్ ) ఇకపై సాగవు. దాంతో కంపెనీల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొందరు ఉద్యోగులు రహస్యంగా రెండో ఉద్యోగం (మూన్ లైటింగ్) కూడా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ఉద్యోగుల నైతికత మీద ఆధారపడి ఉంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
‘పెద్ద సంఖ్యలో’.. ఐటీ ఉద్యోగులకు క్యాప్‌జెమినీ చల్లని కబురు!
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. దేశీయ వ్యాపారంలో వృద్ధిని అంచనా వేస్తూ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో "పెద్ద సంఖ్యలో" ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. బిజినెస్ వార్త సంస్థ మింట్‌తో జరిగిన సంభాషణలో క్యాప్‌జెమినీ చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్ నిషీత్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమలోని పోటీ కంపెనీలకు అనుగుణంగా తమ కంపెనీ హెడ్‌కౌంట్ పెరుగుతుందని తెలిపారు. ఇది ఐటీ సెక్టార్లో సవాలుగా ఉన్న 2024 ఆర్థిక సంవత్సరం తర్వాత సానుకూల మార్పును సూచిస్తుంది. క్యాప్‌జెమినీకి 2024 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ ప్రకారం 253.9 బిలియన్ డాలర్లు సంచిత రాబడితో 2024 ఆర్థిక సంవత్సరం ముగియగలదని అంచనా వేస్తున్న భారత ఐటీ రంగం.. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా కాలంగా ఎదుర్కొంటున్న వ్యయ కట్టడి పరిస్థితి నుంచి పుంజుకునేలా కనిపిస్తోంది. మింట్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల్లో 49,936 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. మూడవ త్రైమాసిక ఫలితాలను అనుసరించి దేశీయ ఐటీ మేజర్లు వివిధ పరిశ్రమలలోని క్లయింట్ల సెంటిమెంట్‌కు అనుగుణంగా వ్యయం విషయంగా విచక్షణతో వ్యవహరిస్తున్నాయి. -
‘ఎడారిలో ఒయాసిస్సు’ లా, ఐటీ ఉద్యోగులకు టీసీఎస్ బంపరాఫర్!
ఆర్ధిక మాద్యం, ప్రాజెక్ట్ ల కొరత, చాపకింద నీరులా అన్నీ రంగాల్లో మనుషుల స్థానాన్ని కృతిమమేధతో భర్తీ చేయడం వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో టెక్నాలజీ సంస్థలు కొత్త ఉద్యోగాల నియామకాల్ని తగ్గించాయి. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ హైరింగ్‌పై కీలక ప్రకటన చేసింది. టీసీఎస్ నియామకాల్ని తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆ సంస్థ సీఈఓ కే.కృత్తివాసన్ స్పందించారు.మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఉద్యోగుల నియమాకం ఉంటుందని తెలిపారు. సంస్థ పనితీరు బాగుంది. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఉంది. సంస్థకు వచ్చే ప్రాజెక్ట్‌ల పరంగా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం. వాస్తవానికి, మా నియామక ప్రణాళికలను తగ్గించడానికి మాకు ఎటువంటి ప్రణాళిక లేదు. చెప్పినట్లుగానే నియామకాన్ని కొనసాగిస్తాము అని సీఈఓ స్పష్టం చేశారు. జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి పలు దేశాల్లో ఐటీ మార్కెట్లో ఒడిదడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపి.. ఇచ్చిన జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నారని నివేదికల మధ్య టీసీఎస్ ఈ ప్రకటన వచ్చింది. నాస్కామ్ నివేదిక ప్రకారం.. 2023-24లో పరిశ్రమ కేవలం 60వేల కొత్త ఉద్యోగా అవకాశాలు కల్పించాయని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.43 మిలియన్లకు చేరుకుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM)గత వారం తెలిపింది. ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే ఇక వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంపై కృతివాసన్ స్పందించారు. ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులు కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కానీ ఇంటి నుంచి, లేదంటే వారానికి మూడు రోజులు ఆఫీస్ కు రావడం వల్ల వ్యక్తిగతంగా ఉద్యోగులకు, సంస్థలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను నమ్ముతున్నాను. ఒక సంస్థగా మేం ఉద్యోగులకు సహాకారం, స్నేహానికి విలువ ఇస్తాం. ఇదంతా ఆన్లైన్ లేదంటే జూమ్ కాల్ ద్వారా సాధ్యం కాదు. సీనియర్ల ఎలా పనిచేస్తున్నారో ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి ఏం తెలుస్తోంది? అని ప్రశ్నించారు. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోం కంటే ఆఫీస్ కి వచ్చి పనిచేయడమే సరైన మార్గమని విశ్వసిస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు. -
గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?
ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. అందుకు భిన్నంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగార్థులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది. గూగుల్‌లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఇటీవల బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ ‘ప్రధాన టెక్ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది. "జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్టెక్ శంతను రూజ్ తెలిపారు. గతేడాది కంటే తక్కువే.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది. -
ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ!
2024లోనూ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో.. డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ 'ఫుల్క్రమ్ డిజిటల్' (Fulcrum Digital) మాత్రం కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుభవార్త చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ డొమైన్లలో 700 మందిని నియమించుకోవాలని యోచిస్తోందని ఫుల్క్రమ్ డిజిటల్ కంపెనీ ఛైర్మన్ 'రాజేష్ సిన్హా' తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ ఆసక్తి చూపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా, డేటా సైన్టిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వంటి టెక్నాలజీలలో నైపుణ్యం కలిగిన వారిని కూడా సంస్థ ఈ ఏడాది నియమించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూయార్క్‌కు చెందిన ఫుల్క్రమ్ డిజిటల్ సాఫ్ట్వేర్ కార్యాలయాలు లాటిన్ అమెరికా, యూరప్, ఇండియాలలో కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కొత్త టెక్నాలజీ అవసరం.. రోజు రోజుకి కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు కూడా తప్పకుండా కొత్త టెక్నాలజీలలో నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలుగుతారో.. అప్పుడే సంస్థల్లో మనగలుగుతారు. లేకుంటే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీలలో నైపుణ్యం లేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల గత నెలలో ఏకంగా 32వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగి తన నైపుణ్యం పెంచుకోవాలి. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లోని వర్కర్లపైనా లేఆఫ్‌ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్‌వేర్ టీమ్‌లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్‌లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
భారీగా తగ్గిపోయిన నియామకాలు.. ఐటీ రంగం ప్రభావంతోనే!
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) 2023 డిసెంబర్ నెలలో భారీగా తగ్గిపోయాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం మేర తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వెల్లడైంది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, హెల్త్‌కేర్ రంగాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘‘2023 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ నెలలో కార్యాలయ ఉద్యోగ నియామకాలు 2 శాతం పెరిగాయి. ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఇందుకు అనుకూలించాయి. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ 16 శాతం తగ్గిపోవడానికి ఐటీ రంగమే ఎక్కువ ప్రభావం చూపించింది. ఐటీలో నియామకాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ కాలమే వేచి చూడాల్సి రావచ్చు’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ డిసెంబర్ నెల గణాంకాల ప్రకారం.. బీపీవో రంగంలో (వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) నియామకాలు 17 శాతం తగ్గాయి. విద్యా రంగంలో 11 శాతం, రిటైల్‌లో 11 శాతం, హెల్త్‌కేర్‌లో 10 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు ఏకంగా 21 శాతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబర్‌తో పోల్చి చూసినప్పుడు ఐటీ నియామకాలు 4 శాతం తగ్గాయి. డేటా సైంటిస్ట్లకు డిమాండ్.. ఐటీలో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ.. ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఫ్లాట్‌గా (పెరగకుండా/తగ్గకుండా) ఉన్నాయి. నౌకరీ డాట్ కామ్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త జాబ్ పోస్టింగ్‌లు, నియామకాల ధోరణులు, ఉద్యోగాలకు సంబంధించిన శోధనల సమాచారాన్ని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 4 శాతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో ఆతిథ్య రంగ నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. 16 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అధిక డిమాండ్ నెలకొంది. ఫార్మా రంగంలోనూ 2 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, వదోదర, ముంబైలో ఫార్మా నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 17 శాతం డౌన్ డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో నియామకాలు 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరులో అయితే 23 శాతం చొప్పున తగ్గాయి. పుణెలో 15 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. -
టీసీఎస్ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’
ఉద్యోగుల విషయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 వేల మంది ఉద్యోగుల్ని రీలొకేట్ చేసిందంటూ ఐటీ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ ఆరోపించింది. తాజాగా, వారిలో చెప్పిన మాట వినలేదన్న కారణంతో 900 మంది ఉద్యోగుల జీతాల్ని నిలిపివేసిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం టెక్ కంపెనీల్లో చర్చాంశనీయంగా మారింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపు నిస్తున్నాయి. 2 వేల మంది బదిలీ అయితే, గత ఏడాది నవంబర్‌లో టీసీఎస్ 2వేల మంది టెక్కీలకు వర్క్ ఫ్రమ్ హోంను రద్దు చేసింది. ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 2 వేల మంది ఉద్యోగుల్ని ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసింది. ఇందుకోసం 15 రోజులు గడువు విధించింది. గడువు ముగిసే లోపు ఉద్యోగులు బదిలి చేసిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశంపై టీసీఎస్ ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. ఐటీ ఉద్యోగుల్ని కాపాడండి ఈ తరుణంలో నైట్స్ తాజాగా టీసీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహరాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఉద్యోగుల రీలొకేట్ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ టీసీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, ఆ సంస్థ అనైతిక పద్దతుల నుంచి ఐటీ ఉద్యోగుల్ని కాపాడాలని కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 900 మంది ఉద్యోగుల జీతాల నిలిపివేత ఈ నేపథ్యంలో ఉద్యోగుల పట్ల టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు బదిలీ నోటీసులు పంపిన కొద్ది నెలలకే తమ కంపెనీ విధానాలకు అనుగుణంగా లేరంటూ 900 మందికి పైగా జీతాలు చెల్లించకుండా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై టీసీఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జీతాల్ని నిలిపి వేసి “రీలొకేషన్‌ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల జీతాలను టీసీఎస్ అనైతికంగా నిలిపివేసింది. బలవంతపు బదిలీలను అంగీకరించమని లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్న టీసీఎస్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని నైట్స్ తీవ్రంగా ఖండిస్తుంది. రీలొకేషన్ వల్ల ఉద్యోగులకు కలిగి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అంతరాయం, ఒత్తిడి, ఆందోళనలన్నింటినీ కంపెనీ విస్మరిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది. నా జీతం 6వేలే మరోవైపు ఓ జాతీయ మీడియా సంస్థ బాధిత ఉద్యోగుల్లోని కొందరితో గూగుల్‌మీట్‌లో మాట్లాడింది. ‘‘మమ్మల్ని రీలొకేట్ చేసింది కానీ ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కంపెనీ పోర్టల్ అల్టిమాటిక్స్లో టైమ్ షీట్‌ను అప్డేట్ చేయలేదనే కారణంతో కొంతమంది ఉద్యోగులకు డిసెంబర్ నెలకు కేవలం రూ. 6వేలు మాత్రమే చెల్లించింది’’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. మాట వినలేదని బాధిత ఉద్యోగులలో ఓ ఉద్యోగికి టీసీఎస్ ఓ మెయిల్ పంపింది. అందులో ఇలా ఉంది.. “ఈ ఈమెయిల్ మిమ్మల్ని టీసీఎస్ ముంబై బ్రాంచ్ రీలొకేషన్‌కు సంబంధించింది. 14 రోజుల్లోపు సంబంధిత బ్రాంచ్‌కు సమాచారం అందించి.. ఈ కాపీలో ఉన్న వివరాల్ని మీరు పూర్తి చేసి మెయిల్‌కు రిప్లయి ఇవ్వండి’’ అని సారాంశం. ఈ మెయిల్ వచ్చిన కొద్దిరోజులకు మరో మెయిల్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు బదిలీ చేసిన బ్రాంచ్‌కి రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని గుర్తించాం. కంపెనీ నిర్ణయాన్ని పాటించనుందుకు మీ జీతాన్ని తక్షణమే నిలిపి వేస్తున్నాం అని మెయిల్లో తెలిపింది. చేతిలో ప్రాజెక్టేలేదు.. “ఆర్ధిక సమస్యల కారణంగా మా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 3-4 నెలలు బెంచ్‌లో ఉన్నాం. ఆ సమయంలో, నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా వేరే ప్రాంతానికి వెళ్లమని సంస్థ ఆదేశించింది. బెంచ్‌లో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏం లాభం’’ అని మరో ఉద్యోగి ప్రశ్నించాడు. -
కొత్త ఏడాదిలోనూ భారీ లేఆఫ్‌లు! కలవరపెడుతున్న లేటెస్ట్ సర్వే
Layoffs in 2024: లక్షలాది తొలగింపులతో ఈ ఏడాదంతా అష్టకష్టాలు పడిన ఉద్యోగులు కొత్త సంవత్సరంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నూతన ఏడాదిలో పరిస్థితులన్నీ చక్కబడతాయని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులను కలపెట్టేలా ఓ లేటెస్ట్ సర్వే వెలువడింది. దీని ప్రకారం.. 2024లో భారీ తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’ ఈ సర్వే నిర్వహించింది. ఈ నెలలో 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ తాజా సమాచారాన్ని ప్రకటించించింది. ఈ సర్వేలో పాల్గొన్న 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి. అలాగే సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. కారణాలివే.. ఎందుకు లేఆఫ్‌లు చేపడుతున్నారని అడిగినప్పుడు, సగం కంపెనీలు మాంద్యం అంచనా ఒక కారణమని చెప్పాయి. కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో నాలుగు తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి. ఏఐ యాడ్ టెక్కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల వారీగా.. కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయని చెబుతున్నప్పటికీ అన్ని కంపెనీల్లో లేఆఫ్‌లు ఉంటాయని కాదు. చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా, పెద్ద కంపెనీలలో తేడాలున్నాయి. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం, పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని సూచించగా, చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లేఆఫ్‌లు ఉంటాయని ఆ కంపెనీల లీడర్లు వెల్లడించారు. ఈ కంపెనీల్లోనే అత్యధికం పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్‌ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు చెబుతున్నాయి. -
39 లక్షల జాబ్స్.. ఉద్యోగార్థులకు పండగే!
కొత్త సంవత్సరంలో జాబ్స్ కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు పండగ లాంటి వార్త ఇది. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో 39 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. స్థూల ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ 2024 ప్రథమార్థంలో భారతదేశంలో 3.9 మిలియన్ల ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని సాస్(SaaS), ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ బెటర్‌ప్లేస్ (BetterPlace) తమ సంవత్సరాంతపు నివేదికలో పేర్కొంది. ఈ పరిశ్రమల నుంచే అత్యధికం ఒక మిలియన్ డేటా పాయింట్లను విశ్లేషించిన బెటర్‌ప్లేస్ నివేదిక.. మొత్తం డిమాండ్‌లో 50 శాతం లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ-కామర్స్, ఐఎఫ్ఎం, ఐటీ పరిశ్రమలు వరుసగా 27 శాతం, 13.7 శాతంతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుంచి 0.87 శాతం, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(QSR) నుంచి 1.96 శాతం డిమాండ్ కొనసాగుతుందని నివేదిక విశ్లేషించింది. ఇదీ చదవండి: అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు! -
ఐటీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? కొత్త ఉద్యోగాలపై కీలక రిపోర్ట్!
కొత్త ఏడాదిలో ఐటీ రంగంలో నియామకాలు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల మంది ఫ్రెషర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అంచనా నెలకొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఫ్రెషర్ నియమించుకోగా.. ఆ సంఖ్య మరింత తగ్గిపోవడం జాబ్ మార్కెట్లో ఆందోళన కనపిస్తుంది. ప్రస్తుత జాబ్ మార్కెట్లో 1.5 మిలియన్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా అభ్యర్ధుల్లో స్కిల్స్ లేని కారణంగా నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగం మినహాయిస్తే ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరిగనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 40శాతం మందిలో స్కిల్స్ టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. ప్రాజెక్ట్‌కు కావాల్సిన అన్నీ అర్హతలు కేవలం 45 శాతం మంది దగ్గర ఉండటం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ), కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ, రిటైల్ కన్స్యూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎనర్జీ వంటి నాన్-టెక్ సెక్టార్లతో గణనీయంగా నియామకాలు పెరగే అవకాశం ఉండగా.. వాటిల్లో అధిక శాతం ఫ్రెషర్లనే ఎంపిక చేసుకోనున్నాయి. సీనియర్లు, ఫ్రెషర్స్ అయినా.. ఈ స్కిల్ ఉంటే ఈ సందర్భంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభ్యర్ధులు ఆయా టెక్నాలజీలలో నిష్ణాతులైతే చాలు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో టెక్నికల్ నైపుణ్యం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి హార్డ్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్, సమస్యకు పరిష్కారం, టీమ్‌వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాఫ్ట్ స్కిల్స్ ఉన్న సీనియర్లు, ఫ్రెషర్స్ కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్స్లున్నాయా? టీమ్‌లీజ్ డిజిటల్సైతం అభ్యర్ధులు జాబ్ సంపాదించుకునేందుకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలనే అంశంపై కొన్ని సలహాలు ఇచ్చింది. కంపెనీలకు తగ్గట్లు కావాల్సిన స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందాలని సూచించింది. వాటిల్లో ప్రధానంగా ఆర్ సర్టిఫికేషన్‌తో కూడిన డేటా సైన్స్, ఎస్‌క్యూఎల్, సర్టిఫికేషన్ ట్రైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, సైబర్‌సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే బ్లాక్‌చెయిన్ వెబ్ డిజైన్ సర్టిఫికేషన్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ తో పాటు కావాల్సిన అన్నీ అర్హతలు ఉంటే కోరుకున్న ఉద్యోగం మీదేనని టీమ్ లీజ్ తెలిపింది. -
ఐటీ జాబ్ వదిలేసి హాయిగా లెహంగాలు అమ్ముకోండి !
ప్రస్తుతం ప్రపంచంలో పెళ్లి అనేది కాస్ట్లీ వ్యవహారం. పెళ్లి పందిరి మొదలు, విందు భోజనాలు, పెళ్లి దుస్తులు దాకా అన్నీ ఖరీదైనవీ. ఇక ఫోటోలు,వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు వీటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కలకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఒక ఎత్తయితే, ఫోటోలు ఇంతకు మున్నెడులేని విధంగా ఎవరికీ తీసిపోని విధంగా దుస్తులు ధరించడం ఒక ఎత్తు. ఇందులో పెళ్లి కుమార్తెలు ఫ్యాషన్ లెహంగాలు, డిజైనరీ గౌన్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాజాగా దీనికి సంబంధించి ఒక వాదన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే లెహంగాలు అమ్ముకోవడం మేలు అంటూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో అమిత్ జగ్లాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు, ఢిల్లీలోని పాపులర్ షాపింగ్ సెంటర్ చాందినీ చౌక్‌లో రెండే రెండు గంటలు ఉన్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు లక్ష రూపాయల విలువ చేసే లెహంగాలు కూడా అలా హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయి. ఇలా ఎగరేసుకుపోతున్నారంతే.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి, లెహంగాలు అమ్మడంపైనే దృష్టి పెట్టండి అంటూ ఒక సలహా ఇచ్చిపడేశాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ సార్ కొంతమంది అంటే.. ఈ పోలిక అస్సలు బాగాలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే లెహంగాస్ అమ్మడం చాలా కష్టం అని ఒకరు,. ఉద్యోగాలు వల్ల రెగ్యులర్‌గా జీతం వస్తుంది.. కానీ వ్యాపారంలో ఆదాయం సీజనల్‌గా వస్తుంది, 100 రెట్లు మూలధనం కావాలి అంటూ స్పందించారు. అయితే లెహంగాలు విక్రయించడం అంటే అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఏదైనా పరిశ్రమలో వృద్ధి చెందాలంటే, వృత్తి ఏదైనా హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. లెహంగా సేల్స్ అయినా. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయినా అంటూ ఒకరు స్పందించారు. అసలు"లెహంగా అమ్మే ప్రయత్నం చేశారా అమిత్?" ఇందుకోసం ఎలాంటి లక్షణాలు కావాలో కూడా మీకు తెలుసా? అసలు కామెంట్లు పాస్ చాలా ఈజీ. కానీ కష్టపడితే తెలుస్తుంది అని ఒకరు రిప్లై ఇచ్చారు. మొత్తంగా ఈ ట్వీట్ పది లక్షల వ్యూస్‌ను, సుమారు 7వేల కామెంట్లను సాధించింది. Been in Chandni chowk only 2 hours. One advice: Leave your software job and just sell lehngas. I am at a loss of words. Lehngas north of 1 lakh rupees flying off the counters. — Amit Jaglan (@iamjaglan) December 2, 2023 -
టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే..
కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, అమెరికాలో ఫెడ్ వడ్డీరేట్లు పెంచడం.. వంటి వాటితో అంతర్జాతీయ సంస్థలు వాటి సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొత్త ఫీచర్లపై చేసే ఖర్చు తగ్గిస్తున్నాయి. దాంతో ఐటీ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. ఆ రంగంలో చదువు పూర్తి చేసుకున్న యువతకు, వారికి వివిధ కంపెనీల్లో ఉంటున్న ఖాళీలకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. కొన్ని కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దేశంలోని అనేక టెక్ కంపెనీలకు ప్రస్తుతం ఆదాయాలు తగ్గటంతో ఖర్చులు తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీలో పూర్తి సమయం ఉద్యోగులకు బదులు ఎక్కువ మంది అప్రెంటీస్లను నియమించుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్రెంటీస్ స్కిల్ ట్రెండ్స్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. ఐటీ/ ఐటీఈఎస్ కంపెనీలు ఫుల్‌టైమ్ ఉద్యోగుల బదులుగా అప్రెంటిస్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. అప్రెంటిస్ ఉద్యోగుల సంఖ్య వార్షికంగా 250 శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఐటీ/ ఐటీఈఎస్ పరిశ్రమల్లోని దాదాపు 79 శాతం కంపెనీల మేనేజ్మెంట్ రాబోయే రోజుల్లో అప్రెంటిస్‌ల సంఖ్య పెంచనుందని అంచనా. అప్పుడే చదువు పూర్తై ఉద్యోగ వేటలో పడిన ప్రతిభావంతులైన ఉద్యోగార్థులకు అవకాశం కల్పించాలని కంపెనీలు భావిస్తున్నాయి. వారు ప్రారంభంలో కొంత తక్కువ జీతానికి పనిచేస్తారు. ఎలాగూ శిక్షణ ఇస్తారు కాబట్టి కొంత ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనిపిస్తే ఎక్కువ సేపు పనిచేసేలా ప్రోత్సహిస్తారు. గత సంవత్సర కాలంలో ఈ ట్రెండ్ మెట్రో, టైర్-2 నగరాల్లో ఈ నియామకాలు గణనీయంగా పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీలు అప్రెంటిస్ పూర్తైన వారిలో 75 శాతం మందిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా మార్చాయి. 2023లో కోయంబత్తూర్, హైదరాబాద్, పుణె వంటి నగరాలు అప్రెంటిస్ నియామకానికి మార్గం సుగమం చేశాయి. టైర్-2 నగరంగా ఉన్న కోయంబత్తూర్ అంతటా అప్రెంటిస్‌షిప్ విధానం అధికం అవుతోంది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మెట్రో నగరాలు అప్రెంటిస్ నియామకంలో దూకుడు పెంచాయి. రాష్ట్రాల పరంగా గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్మెంట్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం.. ప్రస్తుతం అప్రెంటిస్‌లుగా ఉన్న 9 లక్షల మందికి పైగా యువత 23-26 ఏళ్ల మధ్య వయసు వారే. వీరికి రూ.11 వేలు నుంచి రూ.75 వేల వరకు చెల్లిస్తున్నారు. విద్యార్హతలను బట్టి ఇతర రంగాల్లో చెల్లించే స్టైపెండ్‌లో మార్పులు ఉన్నాయి. -
ఈ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం వచ్చినట్లే.. మార్కెట్లో డిమాండ్ ఉన్న జాబ్స్ ఇవే!
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉంటున్నప్పటికీ కొన్ని విభాగాల్లో నిపుణులకు మాత్రం డిమాండ్ మెరుగ్గానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్), ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్, ఆడ్మినిస్ట్రే షన్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ నెలకొన్నట్లు బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది. ‘ఈమధ్య కాలంలో తొలిసారిగా పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీల్లో సిబ్బంది సంఖ్య, గైడెన్స్ తగ్గింది. ఇది, రాబోయే రోజుల్లో ఆచి తూచి అడుగులు వేయాలని పరిశ్రమ సమిష్టిగా నిర్ణయించుకున్నట్లు సూచిస్తోంది. మళ్లీ పరిస్థితి మెరుగుపడే వరకు ఒకట్రెండు త్రైమాసికాల పాటు ఈ అనిశ్చితి కొనసాగుతుందని భావిస్తున్నాం‘ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ చెప్పారు. నైపుణ్యాలను పెంచుకుంటే బోలెడు అవకాశాలు.. కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ విధానాలను మార్చుకుంటున్నాయని, వచ్చే రెండేళ్లలో కృత్రిమ మేథ (ఏఐ)పై ఇన్వెస్ట్ చేయాలని 85 శాతం పైగా భారతీయ సంస్థలు భావిస్తున్నాయని విజయ్ శివరామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఇన్వెస్ట్ చేసే వారికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందుతోందని, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో దేశీ ఐటీ రంగానికి మరిన్ని కొత్త సాంకేతికతలు తోడయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. క్వెస్ ఐటీ స్టాఫింగ్ తమ కార్యకలాపాల్లో భాగంగా గమనించిన డిమాండ్, సరఫరా గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఈఆర్పీ, ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్, డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అనే 5 నైపుణ్యాలకు .. నియామకాలకు సంబంధించిన మొత్తం డిమాండ్‌లో 65 శాతం వాటా ఉంది. వీటితో పాటు జెన్ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్, ఆటోమోటివ్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ స్పెషలైజేషన్ మొదలైన నైపుణ్యాలు ఉన్న వారికి కూడా డిమాండ్ నెలకొంది. టెక్నాలజీ హబ్‌గా పేరొందిన బెంగళూరును దాటి ఐటీ రంగం ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. వర్ధమాన టెక్ హబ్‌లైన హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబై, చెన్నై, ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) కూడా గణనీయంగా ఎదుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో టెక్నాలజీ సంబంధ పరిశ్రమలు వృద్ధి చెందుతుండటం, దేశ విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. -
IT Jobs: కంపెనీ మారుతున్నారా? హైక్ ఎంతంటే..
చదువు అయిపోయిన వెంటనే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అనే ధోరణి చాలామందిలో ఉంది. కొవిడ్ వల్ల ఐటీ నిపుణులకు ఒక్కసారిగా పెరిగిన గిరాకీ, వారికి లభిస్తున్న అధిక వేతనాలు ఎంతోమందికి కలల ప్రపంచాన్ని చూపించాయి. తర్వాత కొత్త ప్రాజెక్టులు తగ్గడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగి, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ‘ఐటీ రంగం’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్త భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాల వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలు అంకురాల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలు తీసుకుంటున్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. అందులో భాగంగా ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఐటీ రంగం అంతటా కాస్ట్‌కటింగ్ సమస్యే ఉంది. దాంతో కొత్తగా చేర్చుకునే వారికి మునుపటిలా భారీగా జీతాలు పెంచి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి లేదు. కంపెనీ మారాలనుకునే వారి పాత జీతంపై కేవలం 18-22శాతం పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వారికి జీతాల పెంపు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. మునుపటి కంపెనీలోని జీతంతో పోలిస్తే కేవలం 18-22% పెంపుతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అయితే గతంలో అభ్యర్థులు కనిష్ఠంగా 40%, గరిష్ఠంగా 100-120% వరకు వేతనం పెంచాలనే డిమాండ్ చేసేవారని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుతం ఉద్యోగస్థాయిని ఆ డిమాండ్ 35-40 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ఉదాహరణకు 2022లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షలు వేతనం ఉండేది. ఈ సంవత్సరం సగటున 8%-16% తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది. -
‘70 గంటల పని’ వివాదంపై జిందాల్ ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. భారత యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలని ఆయన అనడంతో ఐటీ ఉద్యోగులతో సహా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన మాటలను సమర్థిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యువత విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఐదు రోజులపాటే పని చేయాలనే సంస్కృతి అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజూ 14-16 గంటలకు పైగా పని చేస్తారని, తానూ రోజూ 10-12 గంటలు విధుల్లో ఉంటానని తెలిపారు. A 5 day week culture is not what a rapidly developing nation of our size needs. Our PM @narendramodi ji works over 14-16 hours everyday. My father used to work 12-14 hours, 7 days a week. I work 10-12 hours everyday. We have to find passion in our work and in Nation Building. — Sajjan Jindal (@sajjanjindal) October 27, 2023 -
ఐటీ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? ఈ 6 నెలలూ అంతే!
ఐటీ ఉద్యోగార్థులకు గత కొన్ని నెలలుగా గడ్డుకాలమే నడుస్తోంది. రానున్న ఆరు నెలలు మరింత గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని మందగించాయి. ప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత తక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. (టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) క్లయింట్లు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ విధుల్లోకి తీసుకోవాలని, ప్రస్తుతం బెంచ్‌లో ఉన్నవారిని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో చాలా ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఇప్పటికే తమ వద్ద ఎక్కువమందితో కూడిన ఫ్రెషర్ బెంచ్ ఉందని ఇన్ఫోసిస్ చెబుతోంది. "ప్రస్తుతం మేము ఇంకా క్యాంపస్‌లకు వెళ్లడం లేదు" అని కంపెనీ క్యూ2 ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నిలంజన్ రాయ్ అన్నారు. గత ఏడాది కంపెనీ దాదాపు 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. విప్రో తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తామని చెబుతూ ఫ్రెషర్ల నియామకాలపై చేతులెత్తేసింది. అయితే స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫినో 2024 ఆర్థిక సంవత్సరం ఔట్లుక్ హెడ్‌కౌంట్‌లో 2023 ఆర్థికేడాది ముగింపు కంటే 2.4 శాతం నికర వార్షిక వృద్ధి ఉందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెడ్‌కౌంట్ సుమారు 2 లక్షలు పెరుగుతుందని అభిప్రాయపడింది. 2023 మార్చిలో 66 లక్షలు ఉన్న ఐటీ సెక్టార్ హెడ్‌కౌంట్ రానున్న మార్చి నాటికి 68 లక్షల మార్క్ కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఈ సంవత్సరం ఐటీ రంగం గణనీయమైన మార్పునకు గురైంది. ఇది ఎంట్రీ-లెవల్ స్థానాలకు డిమాండ్‌లో సుమారుగా 25-30 శాతం క్షీణించిందని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్: 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కొత్త కాంట్రాక్టులు 67 శాతం జంప్‌చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇతర విశేషాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్ సుందరరాజన్ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక
White collar tech jobs take backseat: వైట్ కాలర్ జాబ్అంటే ముందుగా గుర్తొచ్చేది టెక్ ఉద్యోగమే. అయితే టెక్ ఉద్యోగాలకు సంబంధించిన సంచలన నివేదిక ఒకటి ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. జాబ్ మార్కెట్లో ఐటీ రంగానికి ఎదురు గాలి తప్పడం లేదు. ప్రస్తుత టెక్ రంగాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వెట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి భారతీయ జాబ్ మార్కెట్లు 2,835 స్కోర్‌ను నమోదు చేశాయి, ఇది గత నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2023కి సంబంధించిన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశంలో ఉపాధి ధోరణి నెలవారీగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ వార్షిక ప్రాతిపదికన ఇంకా బలహీన ధోరణే కనిపిస్తొంది. గత ఏడాదితో పోలిస్తే 8.6 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే అనేక రంగాలు వృద్ధిని కనబరిచడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ , అండ్ ట్రావెల్ రంగం 22 శాతం వృద్ధిని సాధించి స్టార్ పెర్ఫార్మర్గా అవతరించింది. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగం వెలవెలబోయింది. కష్టాల్లో ఐటీరంగం ప్రపంచ ప్రకంపనల మధ్య ఐటీ రంగం కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, అయినప్పటికీ, బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్, IT, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ IT ఆపరేషన్స్ మేనేజర్ లాంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ఐటీ-కేంద్రీకృత నగరాల్లో సెప్టెంబర్ 2023లో కొత్త జాబ్ ఆఫర్లు భారీగా తగ్గాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేపనిలో వేలాది మందిని తొలగించాయి. మెటా, అమెజాన్ సంస్థల తాజాగా మరో రౌండ్ కోతల వార్తలు ప్రపంచవ్యాప్తంగా టెకీలను ఆందోళనలో పడేస్తున్నాయి. హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో 22 శాతం వృద్ధితో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఈ సీజన్లో చేసుకునే కుటుంబాలు ,ఒంటరి ప్రయాణీకు టూర్లు ఈ వృద్ధికి దోహదపడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ మేనేజర్ , గెస్ట్ సర్వీసెస్ రోల్స్ వంటి ఉద్యోగాలు డిమాండ్ నేపథ్యంలో ముంబై ఈ రంగంలో ఉద్యోగ ఆఫర్లలో ముందుంది. BFSI ,ఆరోగ్య సంరక్షణ రంగాలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్ , హెల్త్‌కేర్ సెక్టార్ కూడా కొంత పురోగతి సాధించాయి. ప్రతి ఒక్కటి సెప్టెంబర్ 2023లో సంవత్సరానికి 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BFSI రంగంలో, అహ్మదాబాద్, చండీగఢ్ , జైపూర్ వంటి నగరాలు బ్రాంచ్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, BFSIలోని బ్యాంకింగ్ సబ్ సెగ్మెంట్ ఇదే కాలంలో 40 శాతం వృద్ధిని సాధించింది. హెల్త్‌కేర్ సెక్టార్లో, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్/ఇన్ఫర్మేటిక్స్ మేనేజర్ వంటి స్థానాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ సెక్టార్లో హైరింగ్ ఊపందుకోవడంలో అహ్మదాబాద్, కోల్‌కతా ముందున్నాయి. ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు కూడా సానుకూల ఉపాధి ధోరణులకు దోహదపడ్డాయి, గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో రెండూ 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BPO/ITES , FMCG రంగాలలో సవాళ్లు: మరోవైపు BPO/ITES, FMCG రంగాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో వరుసగా 25 శాతం మరియు 23 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. నాన్-మెట్రోలు షైన్ ఉద్యోగాల కల్పలనో మెట్రోలతు పోలిస్తే నాన్‌మెట్రో నగరాలుల మెరుగ్గా ఉండటం విశేషం. 2023, సెప్టెంబరులో ఉద్యోగాల కల్పనలో నాన్-మెట్రో నగరాలు మెట్రోలను అధిగమించాయి. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలు అదే నెలతో పోలిస్తే నియామకంలో వరుసగా 4 శాతం, 3, 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం. వడోదర BPO/ITES,యు కన్స్ట్రక్షన్/ఇంజనీరింగ్ సెక్టార్ హైరింగ్‌లో రాణించింది. మరోవైపు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సోమవారం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం, 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న నిరుద్యోగిత రేటు దేశంలో జులై 2022-జూన్ 2023 మధ్యకాలంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 3.2 శాతంగా నమోదైంది. -
ఐటీ హబ్‌గా విశాఖ
సాక్షి, అమరావతి: రానున్న కాలంలో విశాఖ నగరం ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారనుంది. ఈ రంగంలో కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి అది అవకాశాల గని కానుంది. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఒక్క విశాఖపట్నంలోనే ఐదులక్షలకు పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని పల్సస్ గ్రూపు తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించడంతో ఐటీ హబ్‌గా విశాఖ వేగంగా ఎదుగుతోందని పల్సస్ గ్రూపు సీఈఓ శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, అమెజాన్, అదానీ డేటాసెంటర్ వంటివి రావడంతో పాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, పారిశ్రామిక రంగంలో నాలుగో తరం టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు ఇక్కడ ఏర్పాటుకావడంతో అంతులేని ఉపాధి అవకాశాల నిధిగా విశాఖ ఎదుగుతోందన్నారు. ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా ఎంపిక కావడంతో ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీ ఆధారిత సేవల్లో విశాఖపట్ననికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మానవ వనరులను ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా మూడు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకుంటుంటే అందులో ఒక్క విశాఖ చుట్టుపక్కల నుంచే 1.5 లక్షల మంది వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశాఖకు ఇది కలిసొచ్చే అతిపెద్ద అంశమని ఆ నివేదికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కొలువుల పండగ.. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు రానుండగా అందులో ఒక్క విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు పల్సస్ గ్రూపు అంచనా వేసింది. ఇందులో ఒక్క ఆర్టీఫిన్ యల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే విశాఖలో 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం విశాఖలోని ఐటీ రంగం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే హెల్త్‌కేర్, ఫార్మా, మెరైన్ ఇండస్ట్రీస్, పర్యాటకం, రక్షణ, విద్య వంటి రంగాలు లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సంఖ్య ఐదేళ్లలో ఐదు లక్షలకు చేరుతుందని శ్రీనుబాబు వివరించారు. -
టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా టెక్నాలజీ కంపెనీల్లో నియామకాలు మందగించాయి. దీంతో టెక్ ఉద్యోగార్థులు జాబ్‌లు దొరక్క సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే అధ్యయనం ఒకటి వెలువడింది. ఇక రానున్నవి మంచిరోజులే అని ఆ అధ్యయనం చెబుతోంది. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సీల్’ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీలు టెక్నాలజీ, ఇన్నోవేషన్-లీడ్ ఇనిషియేటివ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక డిజిటల్ మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ డిజైన్, ఇంజినీరింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి ఉద్యోగులను గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు నియమించుకుంటున్నాయని ‘సీల్’ అధ్యయనం పేర్కొంది. సాఫ్ట్వేర్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని వివరించింది. 96 కంపెనీల నుంచి ఇన్పుట్స్ గతేడాది ప్రారంభమైన లేదా విస్తరించిన 96 కంపెనీల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇవి ఇప్పటికే గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు కలిగి 57,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు. ఈ సెంటర్లలో ఏడాదిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. క్లౌడ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లకు కూడా డిమాండ్ పెరిగిందని పేర్కొంది. గత సంవత్సరంలో, ఆటో రంగంలో కంపెనీలు గణనీయంగా గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లును ఏర్పాటు చేశాయని ‘సీల్’ హెచ్ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 42 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీలో 8 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేసేవే.. అన్ని జీసీసీ ఉద్యోగ అవకాశాలలో దాదాపు 51 శాతం ఆఫీస్ నుంచి పని చేసేవే. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పరంగా ఐటీ రంగంతో పోల్చితే ఇది తక్కువే. ఐటీ రంగంలో 77 శాతం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో నియామకాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కంది. -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు!
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఆఫర్ లెటర్లు తీసుకొని జాయినింగ్ తేదీల కోసం పడిగాపులు కాస్తున్న ఫ్రెషర్స్‌కు ఐటీ కంపెనీలు భారీ షాకిస్తున్నాయి. జులై1, 2023 నుంచి జూన్ 30, 2024 మధ్య కాలానికి ఫ్రెషర్స్ నియమకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీంతో ఐటీ రంగంలో నియమకాలు, ఫ్రెషర్స్ జాయినింగ్ తేదీలపై మరింత సందిగ్ధత నెలకొంది. కోవిడ్-19 సమయంలో అన్నీ రంగాలు కుదేలవుతుంటే ఒక్క ఐటీ రంగం భారీ లాభాల్ని గడించింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే.. టెక్కీలు మాత్రం రోజుకి రెండు, మూడు జాబులు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. ఒకనొక సమయంలో అంటే 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలంలో టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో,హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా,యాక్సెంచర్‌తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్స్‌ను నియమించుకున్నాయి. ముఖ్యంగా, ఆయా టెక్నాలజీ కంపెనీలు 2022- 2023 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్ధులకు ఆఫర్ లెటర్లను అందించాయి. ఏడాది క్రితం వారికి ఆఫర్ లెటర్లను అందించినా జాయినింగ్ డేట్ ఎప్పడనేది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ప్రతి రెండు-మూడు నెలలకు కంపెనీల్లో చేరే తేదీలను పొడిగిస్తున్నాయి. మరికొందరు తమ ఆఫర్ లెటర్ల గడువు ముగియడంతో అదనంగా శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరు వారి ఆఫర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో జాబ్ మార్కెట్లో ఫ్రెషర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం.. గత రెండు బ్యాచ్‌లలో 20,000-25,000 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు పొందారు. కానీ సంస్థలు ప్రాజెక్ట్‌లలో తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయి. బిజినెస్ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ ప్రశ్నిస్తోంది. తాజాగా, టీమ్ లీజ్ నివేదిక సైతం రానున్న రోజుల్లో ఫ్రెషర్ల నియామకం భారీగా తగ్గిపోతుందని తన నివేదికలో హైలెట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్స్ చేరే తేదీలు, నియమాకాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
పెట్టుబడులు ఆకర్షించేలా వసతుల కల్పన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాలతోపాటు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా చేపట్టిన మౌలిక వసతుల కల్పన ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనం కోసం మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చింది. శనివారం వారు టీ–హబ్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సదుపాయాల కారణంగానే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ వరుసగా రెండేళ్లు దాటేసిందన్నారు. ఐటీ ఎగుమతులతోపాటు ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామన్నారు. టీఎస్–బీ పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై ఒక్కరోజే 7 జీవోలను జారీ చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాయన్నారు. అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుందని అంటున్నారని చెప్పారు. మహారాష్ట్రతో అనుబంధం వీడనిది విద్యార్థిగా పుణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చరిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ, మహారాష్ట్ర మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ముంబై తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి: మహారాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ గత పదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని మహారాష్ట్ర ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి తమకు గుర్తుందని, పాలకులకు సరైన విజన్ ఉంటే అభివృద్ధి చెందుతుందనడానికి హైదరాబాద్ నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. -
దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!
IT jobs data: దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా మారింది. నియామకాలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ నియామయాల పరిస్థితిని ప్రముఖ జాబ్ పోర్టల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్ బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 6 శాతం తగ్గాయి. జాబ్ పోర్టల్ నౌకరీ (Naukri) డేటా ప్రకారం.. 2023 ఆగస్టులో 2,666 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,828 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. కాగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (Naukri JobSpeak Index) ప్రకారం ఈ ఏడాది జులైలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోలిస్తే ఈ ఆగస్టులో నియామకాలు 4 శాతం పెరిగాయి. భారీగా తగ్గిన కొత్త జాబ్‌లు ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. ఐటీతో పాటు, బీమా, ఆటో, హెల్త్‌కేర్,బీపీఓ వంటి రంగాలు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కల్పనలో వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించినట్లుగా నివేదిక పేర్కొంది. జాబ్ మార్కెట్లో టెక్ రంగం ఇప్పటికీ కష్టపడుతుండగా, నాన్-టెక్ సెక్టార్లో మాత్రం నియామకాలు పెరిగాయి. నివేదిక ప్రకారం ఆయిల్&గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో కొత్త ఉద్యోగాలలో అత్యధిక వృద్ధి కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్మెంట్ వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరిగింది. -
ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే..
డిజిటల్ పరివర్తన వేగవంతంగా జరుగుతున్న ప్రస్తుత యుగంలో సంచలనంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ, డేటా సైన్స్ పట్ల దృక్ఫథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది టెక్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించందన్న ఆందోళనల నేపథ్యంలో పూర్తిగా ఆటోమేషన్‌కు ఆస్కారం లేని కొన్ని కెరియర్ మార్గాలు ఉన్నాయి. మానవ అంతర్దృష్టి, సృజనాత్మక సమస్య-పరిష్కారం, భావోద్వేగ మేధస్సుతో ముడిపడిన కొన్ని జాబ్‌లు ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్య కాలంలో కీలకంగా ఉంటాయి. లెర్న్బే వ్యవస్థాపకుడు, సీఈవో కృష్ణ కుమార్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు లేని తొమ్మిది రకాల ఐటీ జాబ్‌ల గురించి తెలియజేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. డేటా సైంటిస్టులు డేటా సైన్స్ అనేది డేటా క్లీనింగ్, ప్రీ-ప్రాసెసింగ్ వంటి అనేక అంశాలను ఏఐ ఆటోమేట్ చేసిన ఒక ఫీల్డ్. అయినప్పటికీ, దాని ప్రధాన భాగంలో డేటా సైన్స్‌కు ప్రోగ్రామ్ చేయలేని మానవ అంతర్ దృష్టి, చాతుర్యం అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు కేవలం అంకెలు, సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. కానీ డేటా సైంటిస్టులు తమ మేధస్సుతో అర్థవంతవంతమైన ఫలితాలను సాధించగలరు. ఏఐ ఎథిసిస్ట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏఐ ఎథిక్స్ నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ నిపుణులు ఏఐ సిస్టమ్‌ల ఎథిక్స్ అమలుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, వినియోగదారు గోప్యతను రక్షించే విధంగా ఉండేలా చూస్తూరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం నుంచి ఉత్పన్నమయ్యే రిస్కులు, సామాజిక చిక్కులను అంచనా వేస్తారు. ఈ పని చేసేవారికి సామాజిక నిబంధనలు, నైతికత, మానవ హక్కుల గురించి లోతైన అవగాహన అవసరం. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అసాధారణ నెట్వర్క్ ప్రవర్తన లేదా పొటెన్షియల్ థ్రెట్స్‌ను గుర్తించడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. అయినప్పటికీ, సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. వ్యూహరచన చేయడం, ఏఐ గుర్తించిన అంశాలను సమీక్షించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న థ్రెట్స్‌ను గుర్తించి సృజనాత్మకంగా స్పందించడం వీరి ముఖ్యమైన విధులు. మానవ మనస్తత్వం సూక్ష్మ నైపుణ్యాలు, సైబర్ నేరస్థుల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులను వీరు చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు కోడ్ రాయడం, డీబగ్గింగ్, టెస్టింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విలువైన సాధనంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, వినూత్న సాఫ్ట్వేర్ రూపకల్పన, వినియోగదారు అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య-పరిష్కారంలో సృజనాత్మకత వంటివి మానవులకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన లక్షణాలు. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో నైతిక పరిగణనలు, మానవ ప్రమేయం ఇప్పటికీ అవసరం. యూఎక్స్ డిజైనర్లు యూజర్ ఎక్స్పీరియన్స్ (UX) డిజైనర్లు సహజమైన, యూజర్లను ఆకర్షించేలా ఇంటర్‌ఫేస్‌లను రూపొందిస్తారు. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మానవ మనస్తత్వం, సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకోవాలి. టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి కొన్ని అంశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేయగలిగినప్పటికీ సంతృప్తికరమైన యూజర్ ఎక్స్పీరియన్స్ రూపొందించడంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత వంటివి యూఎక్స్ డిజైనర్లు మాత్రమే చేయగలరు. డెవాప్స్ ఇంజినీర్లు డెవలప్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, డెవలప్మెంట్, ఆపరేషన్స్ టీమ్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధానంగా డెవాప్స్ (DevOps) ఇంజనీర్లు చేసే పని. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్‌సైకిల్‌లోని భాగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేట్ చేయగలదు. కానీ కమ్యూనికేషన్, సహకారం, నిర్ణయం తీసుకోవడానికి మానవ అవసరం కీలకం. ఏఐ/ ఎంఎల్ రీసెర్చర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) రీసెర్చర్లు ఏఐ డెవలప్మెంట్లో ముందంజలో ఉంటారు. మోడల్ ఆప్టిమైజేషన్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలిగినప్పటికీ, ఏఐ, ఎంఎల్ పురోగతిని నడిపించే ప్రాథమిక పరిశోధనకు మానవ ఉత్సుకత, చాతుర్యం, క్రిటికల్ థింకింగ్ అవసరం. మానవ రీసెర్చర్లా ప్రశ్నించడం, ఊహించడం, ఆవిష్కరణలు వంటివి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు ప్రాజెక్ట్ ట్రాకింగ్, రిస్క్ మేనేజ్మెంట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్ల పాత్ర కీలకం. టీమ్ కోఆర్డినేషన్, సమస్యలను పరిష్కరించడం, తమ అనుభవం, అంతర్ దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. డేటా స్టోరీటెల్లర్స్ డేటా స్టోరీటెల్లర్లు సంక్లిష్ట డేటాను ఆకర్షణీయమైన కథనంలోకి మార్చే నిపుణులు. డేటాను అర్థమయ్యేలా ప్రదర్శించడానికి వీక్షకుల గురించి లోతైన అవగాహన, సందర్భ భావం, సృజనాత్మకత అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాను హ్యాండిల్ చేయగలదు కానీ మనుషులను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పలేదు. ఇదీ చదవండి: Millennials: చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్ -
ఆ విషయంలో దిగ్గజ కంపెనీలకు దీటుగా చిన్న సంస్థలు.. అదేమిటంటే?
ఎక్కువ వేతనాలు ఇచ్చే విభాగం ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది.. 'ఐటీ' ఫీల్డ్. అయితే గత కొంతకాలంగా ఐటీ సంస్థల ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు హైక్ చేయకపోగా.. మరి కొన్ని కంపనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా దిగ్గజ కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సీఈఓల కంటే కూడా చిన్న కంపెనీల సీఈఓలకు ఎక్కువ శాలరీలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ 'సందీప్ కల్రా' వేతనం ఏడాదికి రూ. 61.7 కోట్లు, కాగా.. ఎంఫాసిస్ (Mphasis) సీఈఓ జీతం రూ. 59.2 కోట్లు కావడం విశేషం. పెద్ద కంపెనీల జాబితాలో విప్రో సీఈఓ మాత్రమే రూ. 82.4 కోట్లు జీతం తీసుకుంటూ అధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా మొదటిస్థానంలో నిలిచాడు. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మినహా నిఫ్టీ కంపెనీలను మించిన వేతనాలు అందుకుంటున్న సీఈఓలలో కోఫోర్ట్ సీఈఓ సుధీర్ సింగ్ ఉన్నారు. ఇక టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వేతనం రూ. 30 కోట్లు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చాలామంది వేతనాలు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్‌లు మాత్రం సేఫ్!
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో లేఆఫ్‌ల కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా టెక్ రంగానికి 2022 సంవత్సరం చాలా కఠినమైనదిగా నిలిచింది. సామూహిక తొలగింపులు లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చాయి. ఈ రంగంలో పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. పలు నివేదికల ప్రకారం, 2023లో ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక మందగమనంతో పాటు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విజృంభణ టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న వారి కష్టాలను మరింతగా పెంచింది. దీంతో ఫ్రెషర్లు తమ కెరీర్ ఎంపికలపై పునరాలోచనలో పడి ఇతర రంగాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షల జీతాల కంటే కూడా ఉద్యోగ భద్రతనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. మరోవైపు కంపెనీలు సైతం మారుతున్న టెక్నాలజీ డిమాండ్‌కు అనుగుణంగానే నియామకాలు చేపడుతున్నాయి. డిమాండ్, భద్రత ఉన్న ఐటీ జాబ్‌లు ఇవే.. బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ ప్రకారం.. ఐటీ మేనేజర్లు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌లు, వెబ్ డెవలపర్లు, డేటా అడ్మినిస్ట్రేటర్ వంటి జాబ్‌లు 2023లో సాంకేతిక రంగంలో అత్యధిక ఉద్యోగ భద్రతను అందించగలవు. వీటికి డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. లేఆఫ్ లేని ఉద్యోగాలు బిజినెస్ పబ్లికేషన్ మింట్ నివేదిక ప్రకారం.. లీగల్, స్ట్రాటజీ సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు లేఆఫ్‌ల వల్ల ప్రభావితం కాలేదు. అందువల్ల ఐటీలో కెరీర్‌ని ప్లాన్ చేసుకునేవారు వీటిని కూడా నమ్మకమైన ఎంపికలుగా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేఆఫ్‌ల ప్రమాదం ఉన్నవి పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లేఆఫ్‌ల ప్రమాదం ఎక్కువగా ఉన్న జాబ్‌లు కొన్ని ఉన్నాయి. కస్టమర్ స్పెషలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, బేసిక్ కోడర్లు, డేటా సైంటిస్టులు, రిక్రూటర్లకు డిమాండ్ వేగంగా పడిపోతున్నట్లు ఇటీవలి కొన్ని నివేదికలు, మార్కెట్ ట్రెండ్లు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. -
గూగుల్ జాబ్ అంత ఈజీ కాదు గురూ.. రెజ్యూమ్ ఇలా ఉంటే మాత్రం..
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఈ సంస్థలో పని చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. గూగుల్ జాబ్ కోసం ఏటా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే గూగుల్‌లో జాబ్ కొట్టడం చాలా కష్టమని భావిస్తుంటారు. గూగుల్ జాబ్ కోసం తీవ్రమైన పోటీతో పాటు నియామక ప్రక్రియ కూడా అంత ఆషామాషి కాదు. జాబ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల రెజ్యూమ్‌లోని ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కొన్ని కిటుకులను తెలియజేశారు. ఈ రెండు తప్పులు చేయొద్దు.. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. నోలన్ చర్చ్ 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులను తెలియజేశారు. కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటిది సూటిగా లేని సమాచారం. అంటే మీ సామర్థ్యం, నైపుణ్యాల గురించి అర్థం కాకుండా పేరాలు పేరాలు రాయడం. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.వ ఇదీ చదవండి ➤ Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన.. ఇక రెండవది స్పష్టత లేకపోవడం. అంటే మీరు మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీరు మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే, ఆఫీస్‌లో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని ఇది సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి చాట్‌జీపీటీ, గ్రామర్లీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవచ్చని చర్చ్ సూచించారు. కాగా వ్యయ నివారణలో భాగంగా గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా, తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. -
గుడ్ న్యూస్: 15,000 ఉద్యోగాలు.. ప్రారంభమైన సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ నిర్మాణం
జర్మనీకి చెందిన మల్టీనేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ శాప్ (SAP) ల్యాబ్స్ బెంగళూరులో రెండో క్యాంపస్ నిర్మాణాన్ని తాజాగా ప్రారంభించింది. 15,000 మంది ఉద్యోగులు పని చేసేందుకు సరిపోయేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ‘శాప్ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్ ల్యాబ్స్‌కు అతిపెద్ద ఆర్అండ్డీ హబ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్అండ్డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్ కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ట్విటర్ క్రాష్: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది! -
ఈ ఐటీ కంపెనీ సూపర్! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్ నుంచే..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఐటీ సంస్థ ఇన్ఫోగెయిన్ తమ మార్కెట్‌ను పెంచుకునే దిశగా డిజిటైజేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా సిబ్బందిని తీసుకోనుంది. అలాగే సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఇన్ఫోగెయిన్ ప్రెసిడెంట్ దయాపత్ర నెవాతియా ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగుల తీసివేతలేమీ ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా రిక్రూట్ చేసుకునే వారిలో 800 మంది భారత్‌లోనే ఉండబోతున్నారని నెవాతియా వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కంపెనీకి 6,000 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 5,000 మంది భారత్‌లో పని చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ముందున్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 2023 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (బ్యాంకింగ్) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని, 2022 మార్చి నెలలో ఉన్న 3188తో పోలిస్తే 45 శాతం మేర వృద్ధి చెందినట్టు పేర్కొంది. నాన్ మెట్రో పట్టణాలు ఉపాధి అవకాశాల వృద్ధికి తోడ్పడినట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ మినహా దేశంలో నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నూతన ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా ఈ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది. మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే 5 శాతం పెరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. నాన్ టెక్నాలజీ రంగాలు నూతన ఉపాధి కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్టు, మొత్తం మీద కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 108 శాతం వృద్ధి (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) చెందాయి. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగంగా కొత్త ఉద్యోగాలు లభించాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 45 శాతం ఎక్కువగా వచ్చాయి. పట్టణాల వారీగా బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం కనిపించింది. అహ్మదాబాద్ పట్టణంలో 149 శాతం వృద్ధి కనిపిస్తే, వదోదరలో 72 శాతం, కోల్‌కతాలో 49 శాతం కొత్త ఉపాధి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చాయి. బహుళజాతి బీఎఫ్ఎస్ఐ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఈ నివేదిక వివరించింది. ఐటీ రంగంలో క్షీణత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 17 శాతం తగ్గాయి. మెషిన్‌లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర నూతన ఉద్యోగాలు మార్చి నెలలో (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు) అందుబాటులోకి వచ్చాయి. రిటైల్, విద్య, బీపీవో రంగాల్లో 4–2 శాతం మేర నియామకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా క్షీణత మెట్రో పట్టణాల పరంగా చూస్తే ముంబైలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2% చొప్పున నియామకాలు తగ్గాయి. -
Tech layoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: అమెరికాలోని బడా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలతో భారత ఐటీ సంస్థలకు గణనీయంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని హిటాచీ గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ గ్లోబల్‌లాజిక్ ప్రెసిడెంట్ నితేష్ బంగా అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో అమెరికా నుంచి భారత సంస్థలకు బోలెడంత పని బదిలీ కావచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సంస్థ భారత్‌లో ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడుతోందని, ఏటా సిబ్బంది సంఖ్యను 25 నుంచి 35 శాతం మేర పెంచుకోవాలని భావిస్తోందని బంగా పేర్కొన్నారు. ‘గూగుల్, ట్విటర్ లేదా ఫేస్బుక్ లేదా ఇతరత్రా అమెరికాలోని ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తున్నాయంటే, అవి పనులను నిలిపివేయాలని అనుకుంటున్నట్లుగా భావించరాదు. ఆయా కంపెనీలు ఇప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించాల్సే ఉంటుంది. అందుకోసం నిపుణుల అవసరమూ ఉంటుంది. కాబట్టి అమెరికా నుంచి బోలెడంత పని భారత్‌కు రావచ్చు. (ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) అయితే, ఆయా సంస్థలు తమ ఖర్చుల విషయంలో బేరీజు వేసుకుని, తగు నిర్ణయం తీసుకుంటాయి‘ అని ఆయన తెలిపారు. తాము ప్రతి నెలా 1,000 మంది వరకూ రిక్రూట్ చేసుకుంటామని, వీరిలో 50 శాతం మంది భారత్‌లో ఉంటారని బంగా చెప్పారు. ఏటా ఈ సంఖ్య 25-35 శాతం మేర పెరుగుతోందన్నారు. గ్లోబల్‌లాజిక్ ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల్లో 2-3 ఏళ్ల అనుభవమున్న ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుని, తమ కార్యకలాపాలకు అవసరమైన విధంగా వారికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 15,000 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా గ్లోబల్‌లాజిక్‌కు ఉన్న సిబ్బందిలో సగం. (EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!) -
గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తూ వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించినట్లు సీఎన్‌బీసీ కథనం పేర్కొంది. ప్రమోషన్లు కొందరికే... ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. కంపెనీలో మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం.. ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. -
Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!
టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా తొలగించిన వారిలో కింది స్థాయి ఉద్యోగి నుంచి మేనేజర్ స్థాయి వరకు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. ఇటీవల తొలగింపునకు గురైన ఓ ఉద్యోగిని తన ఆవేదనను లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఆకృతి వాలియా.. గూగుల్ క్లౌడ్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈ మధ్యనే ఆమె సంస్థలో ఐదో వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్స్‌లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయారు. తాను ఇంకో పది నిమిషాల్లో మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా తన కంప్యూటర్లో ‘యాక్సిస్ డినైడ్’ అని కనిపించడంతో ఆమె నిర్ఘాంతపోయారు. మొదట్లో నమ్మలేకపోయిన ఆమె తర్వాత విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గూగుల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో ఉద్యోగం తన కలలన్నింటినీ సాకారం చేసిందని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కంపెనీ తనకు సహాయపడిందని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ ఉంది కార్! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9) అయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవడాన్ని తన ఆరేళ్ల కూతురుకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దీని బయట పడి ముందుకు వెళ్లగలను. అయితే ప్రస్తుతం అమ్మా నువ్వు ఎందుకు వర్క్ చేయడం లేదని నా చిన్నారి పాప అడిగితే వివరించడం చాలా నాకు చాలా కష్టతరమైనది’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. -
ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..? ఐటీ కంపెనీ ఫ్రెషర్ల ఆవేదన
ఐటీ కంపెనీ ఎంఫసిస్ తమను ఆన్‌బోర్డింగ్ చేయించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆ సంస్థ ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు ఫ్రెషర్లు ట్విటర్ వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి తాము అందుకున్న అంగీకార పత్రాల గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో తమను ఉద్యోగంలోకి తీసుకుంటారో లేదో అని భయాందోళన చెందుతున్నారు. తాను కంపెనీ నుంచి 2021 అక్టోబర్‌లో అంగీకార పత్రం అందుకున్నానని, అప్పటి నుంచి జాయినింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నానని నితిన్‌రాకేష్ అనే అభ్యర్థి తెలియజేశారు. కంపెనీ నుంచి అంగీకార పత్రం అందుకున్నప్పుడు తాను కూడా ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగి కాబోతున్నానని ఎంతో సంతోషించానని, కానీ తనను ఆన్‌బోర్డ్ చేయకుండా ఎంఫసిస్ కంపెనీ నిరాశకు గురిచేస్తోందని వాపోయాడు. ఇప్పటికైనా ఆన్‌బోర్డ్ చేయాలని వేడుకుంటున్నాడు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) తౌహీద్ అనే మరో అభ్యర్థి.. తనుకు 2022 జూన్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారని, 2023 మార్చికి దాని గడువు ముగిసిపోతుందని, ఆన్‌బోర్డింగ్‌పై సమాచారం ఇవ్వాలని అభ్యర్థించారు. నిక్కీ అనే అభ్యర్థి అయితే తాను 16 నెలలుగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నాని, ఈ కంపెనీలో చేరాలనే ఉద్దేశంతో ఇతర కంపెనీల వచ్చిన ఆఫర్లను కూడా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) -
యూఎస్‌లో జాబ్ చేస్తున్నవారికి ఊరట! టెన్షన్ వద్దు.. ‘లేఆఫ్స్’ తాత్కాలికమే!
అమెరికా టెక్ ఉద్యోగులకు ఈ మూడేళ్లు గడ్డుకాలమే. 2023 అయితే పీడకల లాంటిది. లేఆఫ్స్‌ను ట్రాక్ చేస్తున్న ‘ట్రూఅప్’ వెబ్సైట్ గణాంకాల ప్రకారం.. కేవలం 40 రోజుల వ్యవధిలో (ఫిబ్రవరి 9 వరకు) 1,26,879 మందిని.. 2022లో 2,41,176 మందిని తొలగించారు. అయితే.. తొలగిస్తున్న కంపెనీల్లో అతికొద్ది కంపెనీలు మాత్రమే రిక్రూట్మెంట్ల మీద ‘ఫ్రీజింగ్’ విధించాయి. భారీ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, యూనికార్న్‌ల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 3 నాటికి 1,69,676 జాబ్ ఓపెనింగ్స్ ఉండటం గమనార్హం. లేఆఫ్స్‌లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో కొందరికి మళ్లీ వేగంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అయితే, అంతకుముందు కంపెనీతో పోలిస్తే జీతంలో వ్యత్యాసం, ఎక్కువ గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమెరికా టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల్లో చాలామంది ‘హెచ్1బి’ వీసా మీద ఉంటారు. ఉద్యోగంపోతే.. 60 రోజుల్లోగా మరో ఉద్యోగం సంపాదించని పక్షంలో అమెరికాను వదిలి తిరిగి మాతృదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. టెక్ కంపెనీల్లో ఉద్యోగంపోతే ఆందోళన చెందకుండా మరో ఉద్యోగానికి ప్రయత్నించాలని.. చాలా టెక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు సూచిస్తున్నారు. అటు లేఆఫ్స్.. ఇటు ఓపెనింగ్స్.. గత మూడేళ్లలో టాప్–20 లేఆఫ్స్‌లో లక్ష మందిని తొలగించారు. అందులో టాప్–1 లేఆఫ్ గూగుల్‌ది. ఈ సంస్థ 12 వేల మందిని ఒకేసారి తొలగించింది. కానీ, అదే రోజు దాదాపు 1,000 జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించింది. భారీ టెక్ కంపెనీల్లో రెండుమూడు మినహా మిగతా కంపెనీలదీ అదేబాట. భారతీయ టెకీలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అవసరమైతే కొత్త స్కిల్స్‌ను వేగంగా నేర్చుకునే సామర్థ్యం మన టెకీల సొంతం. యూఎస్‌లో భారీగా ఉద్యోగావకాశాలు టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ప్రకటిస్తుంటే.. మిగతా రంగాల్లో భారీ సంఖ్యలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. యూఎస్ఏ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 1.10 కోట్ల ఉద్యోగాలు భర్తీకి ఎదురుచూస్తున్నాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఏడుశాతం అధికంగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అమెరికాలో ప్రతి నిరుద్యోగికి 1.9 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని.. జనవరిలో వివిధ రంగాల్లో 5.17 లక్షల ఖాళీలు భర్తీ అయ్యాయని బీఎల్ఎస్ పేర్కొంది. టెక్ కంపెనీల్లో ఓపెనింగ్స్ గతంలో పోలిస్తే తగ్గాయని, పూర్తిగా నిలిచిపోలేదని వెల్లడించింది. మళ్లీ స్టార్టప్ రోజులకు.. మరోవైపు.. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు మిగిలిన సిబ్బందికి పంపిస్తున్న అంతర్గత కమ్యూనికేషన్లలో.. ‘మనం ఇంకాస్త ఎక్కువ కష్టపడి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. స్టార్టప్ రోజుల్లో మాదిరిగా పనిచేస్తే విజయం మన సొంతమవుతుంది’ అని యాజమాన్యాలు ఉద్భోదిస్తున్నాయి. అమెరికా భారీ టెక్ కంపెనీలు ఇలా భావించడం నూతన పోకడే. ఉద్యోగాలు కోల్పోయిన టెకీల పయనం ఎటు? ఇక ఉద్యోగాలు కోల్పోయిన టెకీల పయనం మీద ‘వోక్స్ మీడియా’లో టెక్నాలజీ బిజినెస్ వ్యవహారాలు కవర్ చేస్తున్న రాణి మొల్ల ఆసక్తికర కథనం రాశారు. అందులోని అంశాలు ఏమిటంటే.. ► హెచ్1బీ వీసాల మీద ఉన్న భారతీయ టెకీలు సాధారణంగా మరో ఉద్యోగం కోసం వెతుకుతారు. టెక్ కంపెనీల్లో దొరక్కపోతే.. అమెరికా నుంచి మాతృదేశానికి వెళ్లిపోకుండా, ఇతర రంగాల్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తున్నారు. ► టెక్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలు, భారీ పెర్క్‌ల మైమరపు నుంచి టెకీలు వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో భారీగా లాభాలు ఆర్జించిన టెక్ కంపెనీలు.. ఇప్పుడు పొదుపు చర్యల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉద్యోగాల తొలగింపువల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది. కానీ, అంతకంటే ఎక్కువ నష్టం కంపెనీలకే ఉంటుంది. ఉద్యోగాల తొలగింపుల్లో ‘టాలెంట్’ను కూడా కంపెనీలు కోల్పోతున్నాయనే విషయాన్ని గుర్తించడంలేదు. ఇంకొంత కాలానికైనా గుర్తిస్తాయి. ► ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. తమ ప్రతిభతో వ్యాపారాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. ఆ ప్రయత్నాలు ఫలిస్తే, వారికి మంచి రోజులు వచ్చినట్లే. ► అలాగే, ఒకవైపు లేఆఫ్స్ ప్రకటిస్తున్న గూగుల్, ఆపిల్ లాంటి భారీ కంపెనీలు వరుసగా 25 నెలలుగా జాబ్ ఓపెనింగ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయని ‘ది కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్’ (కంప్ టీఐఏ) ప్రకటించింది. ► టెక్ కంపెనీలు తొలగిస్తున్నది కేవలం టెక్ ఉద్యోగాలు మాత్రమే కాదు. హెచ్ఆర్, సేల్స్, ఫైనాన్స్ విభాగాల ఉద్యోగాలూ ఉన్నాయి. వాళ్లకు నాన్–టెక్ కంపెనీల్లోనూ ఉద్యోగాలుంటాయి. గూగుల్ కాలిఫోర్నియా కార్యాలయం నుంచి తొలగించిన ఉద్యోగుల్లో అన్ని విభాగాల వారున్నారు. అందులో 30 మంది మసాజ్ థెరపిస్టులూ ఉన్నారు. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? -
బాగా చదువుకోమని యువతకు నేనే చెప్పా
సాక్షి, కోవూరు: ఆనాడు యువత బాగా చదువుకోవాలని తానే చెప్పానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, ఐటీని తానే తెచ్చానని అన్నారు. ‘ఐటీ ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పాను. దానికనుగుణంగానే ఐటీ ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి..’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు తలచారని, ఆయన త్యాగ ఫలితంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ను సాధించామని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి మృతి బాధాకరమన్నారు. రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లను రౌడీలుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. చదవండి: (సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ) -
ఐటీ జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? విద్యార్ధుల కోసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ కెరీర్ ఔత్సాహికులకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ఎడ్టెక్ సంస్థ బైట్‌ఎక్స్‌ఎల్ .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం 90 పైచిలుకు కాలేజీలతో టై–అప్లు ఉన్నాయని, ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కరుణ్ తాడేపల్లి తెలిపారు. అలాగే 163 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లు ఉండగా.. వచ్చే 6–9 నెలల్లో 350 వరకు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆదాయాన్ని 4 రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్తగా నిర్మించిన కార్యాలయంలోకి కార్యకలాపాలు మార్చిన సందర్భంగా విలేకరులకు చెప్పారు. ఇప్పటివరకూ ఏడు రాష్ట్రాల్లో 1,20,000 మంది విద్యార్థులకు క్లౌడ్, ఏఐ, ఎంఎల్ వంటి కొత్త టెక్నాలజీలపై తమ లెర్నింగ్ ప్లాట్‌ఫాం, ఎక్సలరేట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణనిచ్చినట్లు కరుణ్ వివరించారు. కరోనా తర్వాత దాదాపు అందరూ కాలేజీలు, ఆఫీసుల బాటపట్టిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎడ్టెక్ కంపెనీలపై కొంత ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, కొత్త పరిస్థితులకు అనుగుణంగా వినూత్న సర్వీసులు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు కరుణ్ చెప్పారు. -
సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా విధానంలో సమూల మార్పులకు జేఎన్టీయూహెచ్ శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ కోర్సులకు ధీటుగా సాంప్రదాయ బ్రాంచిలకు అదనపు హంగులు అద్దుతోంది. క్రెడిట్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ కోర్సులకు రూపకల్పన చేసింది. నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ విద్య కోసం కొన్నేళ్ళుగా చేస్తున్న కసరత్తు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చిందని జేఎన్టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక కంప్యూటర్ కోర్సుల వెంటే పడక్కర్లేదని స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ చేసినా బహుళజాతి కంపెనీల్లో సులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. అమల్లోకి ఆర్–22 ప్రతి నాలుగేళ్ళకోసారి ఇంజనీరింగ్ విద్య స్వరూప స్వభావాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలనే అంశంపై 250 మంది నిపుణులతో అధ్యయనం చేశాం. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, అన్ని సబ్జెక్టులకు చెందిన నిష్ణాతులూ ఉన్నారు. వీరి సలహాల ఆధారంగా రూపొందించిందే ఆర్–22 రెగ్యులేషన్. ఇది యూజీసీ, అఖిలభారత సాంకేతిక విద్య నిబంధనలకు లోబడే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే క్రెడిట్స్ ఏ దేశంలోనైనా చెల్లే విధంగా ఇది ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అనుసరిస్తాయి. అన్ని బ్రాంచ్‌లకు అదనంగా కంప్యూటర్ కోర్సులు ఇంజనీరింగ్‌లో సీఎస్సీ ఓ క్రేజ్‌గా మారింది. కానీ ఇప్పుడు దానికోసం అంతగా పోటీ పడాల్సిన పనిలేదు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ కోర్సులు చేయవచ్చు. ప్రధాన బ్రాంచినే చదువుతూ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటాసైన్స్ (పైథాన్ లాంగ్వేజ్‌తో), క్లౌడ్ డెవలప్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఇండ్రస్టియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటర్నెట్ థింక్స్ వంటి కోర్సులను అదనంగా చేసేందుకు జేఎన్టీయూహెచ్ వీలు కల్పిస్తుంది. ఒక్కో సబ్జెక్టులోనూ మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి మూడు క్రెడిట్స్ ఉంటాయి. ఈ కోర్సులను 70 శాతం ఆన్లైన్లో, 30 శాతం ప్రత్యక్ష బోధన ద్వారా నేర్చుకోవచ్చు. రోజుకు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లో 48 గంటల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌కు 160 క్రెడిట్స్ వస్తాయి. అదనపు కోర్సులు చేయడం వల్ల మరో 26 క్రెడిట్స్ వస్తాయి. ఏ బ్రాంచి విద్యార్థి అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేందుకు ఈ క్రెడిట్స్ సరిపోతాయి. అంతర్జాతీయంగా కూడా ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థుల ఉపాధికి ఢోకా ఉండదు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చేర్చుకుని తమకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు చాలా సంస్థలు నైపుణ్యం వారినే చేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసేసరికే కంప్యూటర్ నాలెడ్జి ఉండటం ఉపకరిస్తుంది. ఎగ్జిట్ విధానం.. డ్యూయల్ డిగ్రీ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే పట్టా చేతికొచ్చే పాత విధానం ఇక ఉండదు. రెండేళ్ళు చదివినా డిప్లొమా ఇంజనీరింగ్‌గా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే డిప్లొమాతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఇది సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే అంతకు ముందు ఇచి్చన డిప్లొమా సర్టిఫికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మధ్యలో మానేసే వారికి ఒకరకంగా ఇది వరమే. రెండేళ్ళ వరకు క్రెడిట్స్‌ను కూడా లెక్కగడతారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ విధానం కూడా అందుబాటులోకి వచి్చంది. జేఎన్టీయూహెచ్ పరిధిలో బీబీఏ అనలిటికల్‌ను ఆన్లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలి్పస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే దీన్ని చేయవచ్చు. ఇక ఇంజనీరింగ్ మధ్యలోనే స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు.. వీలైనప్పుడు (8 ఏళ్ళలోపు) మళ్ళీ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపు తేవడమే ఈ మార్పుల లక్ష్యం. -
టెక్ మహీంద్రా గుడ్ న్యూస్: రానున్న ఐదేళ్లలో భారీగా ఐటీ ఉద్యోగాలు
ముంబై: దేశంలోని ఐదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా గుజరాత్‌లోని ఐటీ ఉద్యోగాలపై శుభవార్త అందించింది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో 3,000 మందిని నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది.(విమానంలో అనుకోని అతిధి, బెంబేలెత్తిన ప్రయాణీకులు) ఐటీ(IT ఎనేబుల్డ్ సర్వీసెస్) పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది.అత్యాధునిక డిజిటల్ ఇంజినీరింగ్ సేవలను అందించేందుకు గుజరాత్ ప్రభుత్వంతో (ఎంఓయూ)పై సంతకం చేశామని టెక్ఎం ప్రకటించింది.అత్యాధునిక డిజిటల్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి ఈ డీల్ ఉపయోగ పడుతుందన్నారు. గుజరాత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నామని, వచ్చే ఐదేళ్లలో 3,000 మందికి పైగా నిపుణులను నియమించుకోనున్నామని కంపెనీ తెలిపింది. మారుతున్న ఇంజినీరింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం కంపెనీకి వీలు కల్పిస్తుందని కంపెనీ సీఎండీ సీపీ గుర్నాని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఈజీ బిజినెస్‌కు అందిస్తున్న ప్రోత్సాహంపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్: కోటి ఉద్యోగాలున్నాయ్!
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందన్న ఆందోళనల మధ్య తాజా రిపోర్టు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు,ఐటీ నిపుణులకు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా వార్, అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో టీమ్ లీజ్ నివేదిక వారికి భారీ ఊరటనిస్తోంది. ఐటీ, బీపీఎం(బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయని "డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్"లో పేర్కొంది. మూడు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనతో దేశీయ ఐటీ, బీపీఎం ఉద్యోగాలు 2023లో 7 శాతం వృద్ది నమోదుకానుందని సోమవారంతెలిపింది. అంతేకాదు మొత్తంమీద భారతదేశ ఐటీ ఉద్యోగాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 మిలియన్ల నుండి 10 మిలియన్లకు (కోటి) పెరగనుందని అంచనావేసింది. ఇండియాలో ఐటీ,బీపీఎం పరిశ్రమల వృద్ధి కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో సుమారు 3.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది, అలాగే దేశ జీడీపీలో 8 శాతానికి పైగా తోడ్పడుతోందని టీమ్ లీజ్ తెలిపింది. గ్లోబల్ అవుట్సోర్సింగ్ మార్కెట్లో 55 శాతం వాటాను సొంతం చేసుకుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ వెల్లడించారు. తాజా రిపోర్టు ప్రకారం 2022 చివరి నాటికి డిజిటల్ నైపుణ్యాల డిమాండ్ 8.4 శాతం పుంజుకోనుంది. హెడ్‌కౌంట్ 5.1 మిలియన్ల నుంచి 5.45 మిలియన్లకు పెరుగుతుందని టీమ్‌లీజ్ తన ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్‌లో పేర్కొంది. అలాగే ఈ ఇండస్ట్రీలో అట్రిషన్ తదుపరి త్రైమాసికాల్లో కూడా అత్యధికంగానే ఉంటుంది, 2023లో కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు కనీసం 49 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే లింగ సమానత్వం మెరుగుపడుతోంది. ప్రస్తుతం 20 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి 25 శాతానికి పెరగబోతోందని తెలిపింది. పెట్టుబడులు, కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఇన్స్టాలింగ్తో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 21 శాతం పెరుగుతుందని అంచనా. ఐటీ సేవల కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC), ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు ఈ ట్రెండ్‌లో 70 శాతానికి పైగా దోహదపడుతున్నాయని నివేదించింది. 2023లో టాప్-10 ఐటీ కంపెనీలు డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించి చిన్న నగరాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయట. మార్కెటింగ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిమాండ్ వరుసగా 5 -7 శాతం, 4-6 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు ఉద్యోగాలు వెతుక్కోవడానికి ఐటీ మేధావులు నగరాలకు వెళ్లాల్సిన రోజులు పోయాయని పేర్కొంది. ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర నగరాల్లో లభిస్తున్న తరుణంలో కంపెనీలే ఉద్యోగాలను వారి వద్దకే తీసుకువెళుతున్నాయని సునీల్ వెల్లడించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఊపందుకున్నప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 33 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు.. ఇందులో 35 శాతం గ్రాడ్యుయేట్లు టాప్ 500 నగరాల నుంచే వస్తున్నారని టీమ్ లీజ్ నివేదించింది. -
వేలకోట్ల బిజినెస్: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు!
మనదేశానికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి. వేలకోట్ల బిజినెస్ మార్కెట్‌తో అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని నాస్కామ్ - ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారతీయ టెక్ కంపెనీల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాస్కామ్ - ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రకారం..2017 నుంచి భారత్‌కు చెందిన టెక్ కంపెనీలు 22శాతం వృద్దితో అమెరికన్లకు ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. అలా నాటి నుంచి యావరేజ్ శాలరీ ఒక్కొక్కరికి 1,06,360 డాలర్లను చెల్లిస్తూ 2లక్షల మందికి పైగా అమెరికన్లతో పలు ప్రాజెక్ట్‌లపై పనిచేయించుకుంటున్నాయి. "మన దేశానికి చెందిన టెక్ సంస్థలు అమెరికన్ ఉద్యోగులతో పాటు కొత్త కొత్త టెక్నాలజీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తద్వారా పరిశ్రమలు, క్లయింట్ల కోసం అత్యాధునిక ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తున్నాయని" నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అన్నారు. అమెరికాలోనే ఎక్కువ వరల్డ్ వైడ్‌గా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో డిమాండ్ - సప్లయ్ ఎక్కువగా ఉంటుందని ఘోష్ తెలిపారు. వాటి ఆధారంగా ఈ డిజిటల్ వరల్డ్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ..సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అందుకు కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ఫార్చ్యూన్ - 500 కంపెనీస్‌లో సుమారు 75శాతం ఇండియన్ కంపెనీలు అమెరికా ప్రధాన కేంద్రంగా ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాయి. అమెరికన్ ఎకానమీకి వెన్నుదన్నుగా కరోనాతో పాటు ఇతర సంక్షోభాల నుంచి గట్టెక్కేలా అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా భారత్ కంపెనీలు నిలుస్తున్నాయి. అలా 2021 అమెరికాకు చెందిన 20 రాష్ట్రాలలో 1.6 మిలియన్ మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించడంతో పాటు 396 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపాయి. తద్వారా 198 బిలియన్ డాలర్ల నిధుల్ని అందించి అమెరికా ఎకానమీకి పరోక్షంగా సహకరిస్తున్నాయి. స్వామి కార్యం స్వకార్యం స్వామి కార్యం స్వకార్యం అన్న చందంగా భారత్ టెక్ కంపెనీలు అమెరికాలో పెట్టబడులతో లాభాల్ని అర్జిస్తున్నాయి. అదే సమయంలో అమెరికన్ల వృద్ది కోసం పాటు పడుతున్నాయి. అంతేకాదు ప్రజెంట్ జనరేషన్ తో పాటు నెక్ట్స్ జనరేషన్లో ఈజీగా జాబ్స్ పొందేలా ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ భారత్ టెక్ కంపెనీలు భారీగా నిధుల్ని ఖర్చు చేస్తున్నాయని నాస్కామ్ నివేదిక హైలెట్ చేసింది. స్టెమ్‌లో రాణించేలా నాస్కామ్ నివేదికలో పేర్కొన్నట్లుగా..ఇండియన్ టెక్ కంపెనీలు అమెరికాలో 180 యూనివర్సీలు, కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీలతో పాటు ఇతర ఎడ్యుకేషన్‌కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్(స్టెమ్) వ్యవస్థను బలోపేతం చేసేలా 1.1 బిలియన్ డాలర్ల నిధుల్ని ఖర్చు చేశాయి. దీంతో పాటు స్కూల్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు, అకడమిక్, కార్యాచరణ, ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేటివ్ సవాళ్లను పరిష్కరించడంలో నిష్ణాతులయ్యేలా డిజైన్ చేసిన కే-12 అనే కార్యక్రమం కోసం 3 మిలియన్లకు పైగా ఖర్చు చేశాయి. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2.9 మిలియన్ల మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందారు. అదనంగా, 2,55,000 మంది ప్రస్తుత ఉద్యోగులు ఈ రంగం ద్వారా నైపుణ్యం పొందారు అవకాశాల గని అమెరికాలో వచ్చే దశాబ్దంలో ఇతర వృత్తుల కంటే స్టెమ్ వృత్తుల డిమాండ్ 1.5 రెట్లు వేగంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం యూఎస్‌లో ఐటీ రంగం 70శాతం వృద్ది నమోదు చేస్తుంటే..2030 నాటికి స్టెమ్ విభాగంలో ఉపాధి అవకాశాలు 51 శాతంగా ఉండనున్నాయి. అమెరికాలో అలా భారత్‌లో ఇలా అమెరికాలో టెక్నాలజీ రంగంలో విసృత అవకాశాలతో పాటు ఉద్యోగాల రూప కల్పన జరుగుతుంది. కానీ భారత్‌లో టెక్ కంపెనీల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశీయంగా హెచ్‌సీఎల్ సంస్థ జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 6వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అట్రిషన్ రేట్ ఆ సంస్థను కుదిపేస్తుంది. టీసీఎస్ సైతం జూన్, 2022 త్రైమాసికంలో 14,136 మంది ఉద్యోగుల్ని హయర్ చేసుకుంది. జూన్, 2022 త్రైమాసికంలో ఐటీ విభాగంలో అట్రిషన్ రేటు 19.7 శాతంగా ఉంది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 17.4 శాతంతో పోలిస్తే ఎక్కువ అని టీసీఎస్ తెలిపింది. -
డెలివరీ బాయ్‌లను చులకనగా చూస్తున్నారా!
కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్నారు పెద్దలు. కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాల్ని అలవోకగా సాధించవచ్చని నిరూపించాడు ఓ డెలివరీ బాయ్. ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించాలనే కలలు కన్నాడు. ఆ కలల్ని సాకరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. కానీ ఆర్ధిక ఇబ్బందులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలన్న ఆ యువకుడి కలల్ని చిన్నాభిన్నం చేశాయి. అయినా సరే ఓ వైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. మరో వైపు తాను అనుకున్న గోల్‌ను రీచ్ అయ్యేందుకు శ్రమించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడి రియల్ లైఫ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్ అంటే సమాజంలో ఓ చిన్నచూపుండేది. ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటుంటారని, కస్టమర్లతో మిస్ బిహేవ్ చేస్తుంటారానే అపవాదు ఉండేది. ‘మేమూ మనుషులమే..మమ్మల్ని చులకనగా చూడొద్దని వేడుకుంటున్న వారు..ప్రతిభలో తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. కరోనా లాంటి ఆపత్కాల సమయాల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి కస్టమర్లకు కావాల్సిన నిత్యవసర సరుకుల్ని అందించారు. ఓవైపు కుంటుంబం బాధ్యతల్ని మోస్తూనే మరోవైపు ఉన్నతావకాశల కోసం ప్రయత్నించే వారేందరో ఉన్నారు. అలాంటి డెలివరీ బాయ్స్‌లో ఇప్పటికే ఎంతో మంది ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు. తాజాగా ఆ కోవకే చెందుతాడు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన డెలివరీ బాయ్ షేక్ అబ్దుల్ సతార్. ఒకప్పుడు డెలివరీ బాయ్ అయిన షేక్ అబ్దుల్ సతార్ ఇప్పుడు ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం సంపాదించాడు. సతార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో సతార్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో తన రియల్ లైఫ్ స్టోరీని నెటిజన్లతో పంచుకున్నాడు. “నేను కలలు కనే డెలివరీ బాయ్‌ని. వీలైనంత త్వరగా ఆర్థికంగా ఎదగాలని అనుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న కాంట్రాక్ట్ కార్మికుడు. కాబట్టి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో అందుకే ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని డెలివరీ బాయ్ ఉద్యోగం చేసేవాడిని. ఈ పని చేసేందుకు మొదట్లో నేను చాలా సిగ్గుపడేవాడిని. కానీ డెలివరీ బాయ్ అనుభవం నాకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడింది." అని సతార్ తన లింక్డ్ ఇన్ లో తెలిపాడు. ఒకరోజు, కోడింగ్ నేర్చుకోమని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు. అందుకు కావాల్సిన కోర్స్‌లో జాయిన్ అవ్వమని, కోర్స్ వివరాలందించాడు. అతను చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. నేను అతని సూచనను సీరియస్‌గా తీసుకున్నా. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోడింగ్ నేర్చుకోవడం. సాయంత్రం 6గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు డెలివరీలు అందించేవాడిని . వాటి ద్వారా సంపాదించిన డబ్బుతో పాకెట్ మనీగానూ, కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగించాను. అదే సమయంలో కోడింగ్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాను. త్వరలో నేను సొంతంగా వెబ్ అప్లికేషన్లను తయారు చేయబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం సతార్ గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ పరిస్థితులే..డెలివరీ బాయ్ పనిచేసేలా దోహదం చేస్తాయి. డెలివరీ బాయ్స్‌ను చులకనగా చూడొద్దని.. అనుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేధించే సత్తా తమలో ఉందంటూ తోటి డెలివరీ బాయ్స్ ధీమాగా చెబుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోండి!
సుదీర్ఘకాలం తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెప్పి తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. అదే సమయంలో ఐటీ కంపెనీలను అట్రిషన్ రేటుతో పాటు, గ్రేట్ రిజిగ్నేషన్ వంటి అంశాలు కలవరానికి గురి చేస్తున్నాయి. అందుకే కొత్త వర్క్ పాలసీల అమలుతోపాటు, భారీ ప్యాకేజీలిచ్చేందుకు సైతం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ సంస్థ అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. కీలక రంగాలను కోలుకోలేని దెబ్బ తీసింది. కానీ కరోనా మహమ్మారిని తట్టుకొని నిలబడింది ఒక్క ఐటీ రంగం మాత్రమే. కరోనా వ్యాప్తిని ప్రారంభంలోనే గుర్తించిన ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలు బాటు కల్పించాయి. దీంతో కంపెనీలకు ఖర్చు తగ్గి.. అటు ఉత్పత్తి పెరిగింది. కానీ ఇప్పుడు కరోనా తగ్గి.. ఎక్కువ శాతం కంపెనీలన్నీ ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. కానీ అట్రిషన్, గ్రేట్ రిజిగ్నేషన్ సమస్యలు ఐటీ కంపెనీలను పట్టి పీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిల్యాండ్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ 'యాక్షన్ స్టెప్' ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త వర్క్ కల్చర్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు మనకు తెలిసి వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను ఆయా సంస్థలు అమలు చేస్తుండగా.. యాక్షన్ స్టెప్ 'హైట్రస్ట్ మోడల్' వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వర్క్ మోడల్ ద్వారా ఉద్యోగులు సంవత్సరంలో ఎన్ని సెలవులు కావాలంటే అన్ని తీసుకోవచ్చని' ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ మేహ్యూ అన్నారు. ఈ వర్క్ కల్చర్‌లో ఉద్యోగులు అవసరమైన సెలవులు తీసుకోవచ్చని, మళ్లీ ఆఫీస్‌కు తిరిగి రావొచ్చని స్టీవ్ తెలిపారు. ఈ కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చిన ప్రారంభంలో ఉద్యోగులు .. మేం 3 నెలలు సెలవులు తీసుకోవచ్చా? ఆఫీస్‌కు సెలవు పెడితే శాలరీ వస్తుందా? ఇలా ఎన్నో అనుమానాల్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. వారి అనుమానాల్ని నివృత్తి చేయడంతో సంస్థపై ఉద్యోగుల్లో నమ్మకం పెరిగిందని వెల్లడించారు. మినిమం నాలుగు వారాలు యాక్షన్ స్టెప్ అపరిమిత సెలవులను అందిస్తున్నప్పటికీ, ఆ సంస్థ ఉద్యోగులను కనీసం నాలుగు వారాల సెలవులు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. సెలవులు తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గుతుందని, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు ఈ కంపెనీకి వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని కల్పించగా... ప్రతి సంస్థ ఈ తరహా వర్క్ మోడల్‌ను అమలు చేయాలని, ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మేహ్యూ పేర్కొన్నారు. చదవండి👉దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంత క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన డిజైన్‌ను ఆయన ఆవిష్కరించారు. గూగుల్‌కు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ కానుంది. 30,000 మందికిపైగా ఉద్యోగులు ఇక్కడ పనిచేయడానికి వీలుగా భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలాన్ని సంస్థ 2019లో కొనుగోలు చేసింది. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని 2015లో కేటీఆర్ సందర్శించారు. సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఆ సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే హైదరాబాద్‌లో గూగుల్ 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా ! వెనుకబడిన యువతకు గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ స్కాలర్షిప్లను ఆఫర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉపకార వేతనాలు అందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్‌తో కలిసి గూగుల్ పనిచేయనుంది. ఐటీ సపోర్ట్, ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగాల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఉంటుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు వివిధ సంస్థలతో అనుసంధానిస్తారు. అలాగే వి–హబ్‌తో కలిసి విమెన్‌విల్ కార్యక్రమాన్ని సైతం గూగుల్ చేపట్టనుంది. మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తారు. విద్యార్థులకు డిజిటల్ విద్య చేరువయ్యేందుకు ప్రభుత్వ పాఠశాలలతో కలిసి గూగుల్ పని చేయనుంది. చదవండి👉జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు! -
జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు!
ముంబై: కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోవడం.. సానుకూల ఆర్థిక కార్యకలాపాలు, ఎగుమతులకు డిమాండ్ వెరసి వ్యాపార వృద్ధి అవకాశాల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఐటీ తో పాటు ఇతర రంగాల్లో కంపెనీలు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) తాము ఉద్యోగులను నియమించుకోనున్నట్టు 54% కంపెనీలు తెలిపాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలి స్తే 4% అధికమని టీమ్‌లీజ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఏప్రిల్–జూన్ కాలానికి ‘టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీలు రెండంకెల వృద్ధి ని అంచనా వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ధోరణిలో ఉన్నాయి. 21 రంగాలకు చెందిన 796 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇందు లో 16 రంగాల్లోని కంపెనీలు నియామకాలకు అను కూలంగా ఉన్నాయి. ఐటీలో 95%, విద్యా సేవల్లో 86%, ఈకామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 81%, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో 78% కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలతో ఉన్నాయి. అగ్రికల్చరల్, ఆగ్రోకెమికల్స్, బీపీవో/ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో నియామకాల ధోరణి బలహీనంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. కాప్‌జెమినీలో 60 వేల ఉద్యోగాలు..!
ముంబై: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ కాప్జెమినీ గత ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది భారత్‌లో 60వేల మందిని కొత్తగా నియమించుకొనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సరికొత్త నియామకాలతో తమ సంస్థ విలువ మరింత పెరుగుతందని కంపెనీ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్'కి డిమాండ్ పెరగడంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నియామకాల్లో అనుభవం ఉన్న వారితోపాటు ఫ్రెషర్లు కూడా ఉండనున్నారని కంపెనీ పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అశ్విన్ యార్డి మీడియాకు వెల్లడించారు. కాప్జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులే కావడం విశేషం. 5జీ, క్వాంటం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై సంస్థ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. ఎరిక్సన్ భాగస్వామ్యంతో కాప్జెమినీ గత ఏడాది భారతదేశంలో 5జీ ల్యాబ్ ప్రారంభించింది అని అశ్విన్ అన్నారు. భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోని క్లయింట్లకు 5జీ రంగ సేవలు అందించేందుకు భారతీయ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్వాంటం, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లో సేవలందించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నది. కొత్త తరం టెక్నాలజీ నైపుణ్యాలు భారతదేశంలో చాలా ఉన్నాయి అని యార్డీ తెలిపారు. అదేవిధంగా, కాప్జెమినీ క్లౌడ్ & ఏఐ కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ముంబయిలోని ఆఫీస్‌లో భారీగా స్థలం ఉంది. ఇది కాప్జెమినీకి భారత్‌లోనే ఉన్ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్. దీనికి తోడు మిగిలిన చోట్ల కంపెనీకి ఉన్న సెంటర్లను కూడా పెంచుతుండటంతో కొత్త ఉద్యోగుల పోస్టింగ్‌లు ఇస్తున్నామని కంపెనీ సీఈవో అశ్విన్ పేర్కొన్నారు. (చదవండి: అదిరిపోయిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. ధరెంతో తెలుసా?) -
ఐటీ బాట పట్టిన హైదరాబాద్: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: ముత్యాల నగరం (సిటీ ఆఫ్ పెరల్స్) ఐటీ బాట పట్టింది. మహానగరంలో గత ఏడేళ్లుగా ఐటీ, అనుంబంధ రంగ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నగరం నలుచెరుగులా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కంకణం కట్టుకోవడంతో వందలాదిగా నూతన కంపెనీలు..వేలాది కొలువులు సిటీజన్లకు వరంగా మారాయి. తాజాగా కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ పార్క్‌తోపాటు.. ఇటీవలే జెన్‌పాక్ సంస్థ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని విస్తరించిన విషయం విదితమే. ఈ సంస్థ రాకతో కేవలం ఉప్పల్ ప్రాంతంలోనే ఏకంగా 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానుండడం విశేషం. నగర ఐటీ సెక్టార్లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల కొలువులకు అదనంగా రాబోయే రోజుల్లో మరో లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని ఆశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. వేగంగా విస్తరణ.. ► నార్త్ హైదరాబాద్ కింద పరిగణించే కండ్లకోయ పరిధిలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ► ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ► వెస్ట్ హైదరాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు నూతన ఐటీ పాలసీ దోహదం చేస్తుందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ► నార్త్‌సిటీ పరిధిలో మంచి యూనివర్సిటీలు, సమీపంలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు,అర్భన్పార్క్లు ఉండడం ఈప్రాంతంలో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంది. అగ్రశ్రేణి కంపెనీలకు కేరాఫ్.. ► ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. ► అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న, పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.28 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. హై..హై..ఐటీ.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నూతన కంపెనీల వెల్లువ తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఏటా రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల మార్కును దాటుతాయని ఐటీ వర్గాలు లెక్కలు వేస్తుండడం విశేషం. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..!
Indian IT Services to hire about 450,000 people in H2FY22 UnearthInsight: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! వచ్చే ఏడాది ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర మొదలుకానుంది. కోవిడ్-19 ఉదృత్తి తగ్గడంతో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల అట్రిషన్ రేట్ కూడా అధికంగానే ఉంది. దీంతో వారి స్థానంలో సుమారు 1.75 లక్షల ఉద్యోగాలను ఐటీ కంపెనీలు భర్తీ చేయనున్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోని టాప్-30 కంపెనీలు ఇప్పటికే 2.5 లక్షల ఫ్రెషర్స్‌కు అవకాశాలను కల్పించినట్లు అన్ఎర్త్ ఇన్సైట్ పేర్కొంది. వీటిలో ఫ్రెషర్లను నియమించిన టాప్ కంపెనీలలో టీసీఎస్ 77వేలు, ఇన్ఫోసిస్ 45వేలు, కాగ్నిజెంట్ 45వేలు,హెచ్‌సీఎల్ టెక్ 22వేల ఉద్యోగాలను కల్పించాయి. భారత టెక్ కంపెనీలు ముఖ్యంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ప్రోగ్రామ్‌పై దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది. చదవండి: ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అట్రిషన్ రేట్ కూడా ఎక్కువే...! FY22లో అట్రిషన్ రేట్ 17-19 శాతంగా ఉండగా..అది వచ్చే FY23లో 16-18 శాతం ఉంటుందని అన్ఎర్త్ ఇన్సైట్ అభిప్రాయపడింది. కాగా ఐటీ కంపెనీలు వీరి స్ధానాల్లో కొత్త నియాకాలను భర్తీ చేసే అవకాశం లేకపోలేదని తన నివేదికలో పేర్కొంది. క్లౌడ్ సర్వీసులకే అధిక ప్రాధాన్యం..! పలు దిగ్గజ ఐటీ కంపెనీలు క్లౌడ్ సర్వీస్‌లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 2030 నాటికి క్లౌడ్ ఆధారిత సర్వీసుల విలువ ఏకంగా 80-100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అన్ఎర్త్ ఇన్సైట్ వెల్లడించింది. క్లౌడ్ ఇండస్ట్రీ, సెక్యూరిటీలో చాలా బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేసిన యాక్సెంచర్ వంటి కంపెనీలు భవిష్యత్తులో క్లౌడ్ ఆధారిత సేవలకు నాయకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని కూడా ప్రాథమికంగా డిజిటల్, క్లౌడ్ సేవలపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) బిజినెస్ యూనిట్ కోసం ఏకంగా పదివేల నియామకాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వ్యాక్సినేషన్ మస్ట్! నో చెప్తున్న ఉద్యోగులు.. వర్క్‌ఫ్రమ్‌హోం పొడగింపునకు డిమాండ్! -
డిగ్రీ ఉంటే చాలు.. ఐటీ కొలువు!
ఐటీ ఉద్యోగాలు.. బీఈ/బీటెక్ అభ్యర్థులకే పరిమితమని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో ఐటీ సంస్థలు నాన్ టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. శిక్షణను అందించి మరీ ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ సంస్థలు.. ఫ్రెషర్స్ కోసం ఈ ఏడాది భారీగా నియామకాలు చేపడుతున్నాయి. నైపుణ్యాలుంటే.. ఏదైనా డిగ్రీతోనే.. ఐటీ కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రముఖ ఐటీ సంస్థలు చేపడుతున్న నియామక విధానాలు, అర్హతలపై ప్రత్యేక కథనం... టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ దేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు మరికొద్ది రోజుల్లోనే డిగ్రీ పట్టాలతో బయటకు రానున్నారు. వీరికోసం ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి.. టీసీఎస్‌లోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అర్హతలు బీసీఏ, బీఎస్సీ, ఒకేషనల్ స్టడీస్(సీఎస్ అండ్ ఐటీ) కోర్సులను 2020, 2021ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు 2022లో సంబంధిత డిగ్రీ కోర్సులను పూర్తిచేసుకునే వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఇంటర్, బీఎస్సీ/బీసీఏ/ఓకేషనల్ కోర్సుల్లో కనీసం 50శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే అకడమిక్‌గా మొత్తమ్మీద రెండేళ్లకు మించి గ్యాప్ ఉండరాదు. ఎంపిక విధానం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఏఆర్, వీఆర్లపై నిపుణులతో టీసీఎస్ ప్రత్యేక శిక్షణను అందిస్తుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియామకం ఖరారు చేస్తారు. కొలువులో చేరిన వారు తమ విధులను నిర్వర్తిస్తూనే చదువుకునే అవకాశం కూడా ఉంది. విధానం టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించే పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ–26 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ–24 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు ఎదురవుతాయి. న్యూమరికల్ ఎబిలిటీ ఈ విభాగం నుంచి అడిగే 26 ప్రశ్నలకు 40 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, నంబర్ సిస్టమ్/ఎల్సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, పర్సంటేజెస్, అలిగేషన్ అండ్ మిక్సర్, ప్రాబబిలిటీ, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాలెండర్ అండ్ క్లాక్, ప్రోగ్రెషన్స్, ఈక్వేషన్స్, షేప్స్ అండ్ పెరిమీటర్, డెసిమల్ ఫ్రాక్షన్, డివిజిబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. వెర్బల్ ఎబిలిటీ ఈ విభాగం నుంచి అడిగే 24 ప్రశ్నలను 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పాటింగ్ ద ఎర్రర్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్, చేంజ్ ఆఫ్ వాయిస్, వెర్బల్ అనాలజీస్, సినోనిమ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోసెట్ టెస్ట్, వన్వర్డ్ సబ్సిట్యూట్స్, సెలక్టింగ్ వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కరెక్షన్, కంప్లీటింగ్ స్టేట్మెంట్స్, పేరాగ్రాఫ్ ఫార్మేషన్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, చేంజ్ ఆఫ్ స్పీచ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ ఎబిలిటీ ఈ విభాగం నుంచి అడిగే 30 ప్రశ్నలకు 50 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇందులో స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, డైరెక్షన్ సెన్స్, సిరీస్, విజువల్/స్పేషియల్ రీజనింగ్, ఫిగరల్ అండ్ ఫ్యాక్చువల్ అనాలసిస్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, లాజికల్ వెన్ డయాగ్రమ్ బేస్డ్ డీఐ, స్టేట్మెంట్ బేస్డ్ లాజికల్ కొశ్చన్స్, డెసిషన్ మేకింగ్, కొశ్చన్ ఆన్ వర్డ్ ప్యాటర్న్, లెటర్ సిరీస్ సంబంధ అంశాలను నుంచి ప్రశ్నలుంటాయి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021 ► వెబ్సైట్: ww.tcs.com హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ మరో ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిగ్రీ అభ్యర్థులు ఐటీ రంగంలో కెరీర్ సొంతం చేసుకునేందుకు వీలుగా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఐటీలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్స్‌ను పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ ఐటీ ఇంజనీర్స్‌గా తీర్చిద్దేందుకు ‘హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్’ పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌ను కంపెనీ అనుబంధ విభాగమైన హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫింగ్ సర్వీసెస్(హెచ్‌సీఎల్ టీఎస్ఎస్) ద్వారా అందించనున్నారు. అర్హతలు ► బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎమ్మెస్సీ(ఐటీ)/బీఎస్సీ(ఐటీ, కంప్యూటర్ సైన్స్/బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్(సీఎస్/ఐటీ/సాఫ్ట్వేర్ డెవలప్మెంట్)/బీసీఏ అభ్యర్థులు హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ► ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 65 శాతానికిపైగా మార్కులు సాధించాలి. ► 2018, 2019, 2020, 2021ల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక విధానం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఆన్లైన్ అప్టిట్యూడ్ టెస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చే స్తారు. శిక్షణ ఎంపికైన అభ్యర్థులందరికీ ఆరు నెలలపాటు శిక్షణ అందిస్తారు. మూడు నెలలు వర్చువల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్(ఇంటి నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు), మరో మూడు నెలలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది. టెక్నికల్, ప్రాక్టికల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ శిక్షణకు రూ1.5 లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్‌లోన్ సాయం అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు రూ.2.75 లక్షల వార్షిక వేతనంతో హెచ్‌సీఎల్‌లో కొలువు లభిస్తుంది. ► వెబ్సైట్: https://hclfirstcareers.com విప్రో.. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విప్రో సంస్థ కూడా తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022 ద్వారా.. బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. 2022లో డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకునే అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతోపాటు బీసీఏ, బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల అభ్యర్థులు అర్హులు. గ్రాడ్యుయేషన్ స్థాయిలో తప్పనిసరిగా కోర్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. విద్యాభ్యాసం అంతా రెగ్యులర్, ఫుల్‌టైమ్ విధానంలో చదివి ఉండాలి. ఎంపిక విధానం ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్(వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్), రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు బిజినెస్ డిస్కషన్ రౌండ్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. స్టయిపెండ్ ఎంపికైన అభ్యర్థులకు మొదటి నాలుగేళ్ల పాటు నెలకు రూ.15000 నుంచి రూ.23000 వరకు స్టయిపెండ్‌గా చెల్లిస్తారు. ఆ∙తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా నియమించి.. ప్రతిభ ఆధారంగా రూ.6లక్షల వార్షిక వేతనం అందిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► వెబ్సైట్: https://careers.wipro.com/wilp -
ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసీస్ గుడ్‌న్యూస్!
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా నియామక ప్రక్రియ చేపట్టాయి. బెంగళూరు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది. అంతే స్థాయిలో అట్రిషన్ స్థాయి(ఉద్యోగుల వలస రేటు) పెరిగింది. ఇంతకు ముందు లక్ష్యం 35,000తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకొనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. "మార్కెట్ పట్టు సాధించడం కోసం మేము మా కళాశాల గ్రాడ్యుయేట్ల నియామక ప్రక్రియ కింద 45,000కు నియమించుకొనున్నాం" అని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు అన్నారు. జూన్ త్రైమాసికం చివరిలో ఇన్ఫోసీస్ 35,000 కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. "డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడం, పరిశ్రమలో అట్రిషన్ రేటు పెరగడం వల్ల సవాళ్లు ఎదురు అవుతున్నాయి" అని సీఓఓ ప్రవీణ్ రావు ఇంతకు ముందు చెప్పారు. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరిలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల అట్రిషన్ రేటు గత ఏడాది 12.8%తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది 20.1% వద్ద ఉంది. సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి ఇన్ఫోసిస్‌లో 2,79,617 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.(చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) -
హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్
సాక్షి, హైదరాబాద్: హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొలువుల కల్పనలో ఐటీ రంగం అగ్రభాగాన నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన మహానగరం ఏటా ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, నైపుణ్యం గల పట్టభద్రులకు నూతన కొలువులు సృష్టించడంలో ముందున్నట్లు.. టీంలీజ్ సంస్థ పలు మెట్రో నగరాలపై వివిధ రంగాలపై జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా ఐటీ, అనుంబంధరంగాల్లో సుమారు 31 శాతం ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేసింది. ► ఇక దేశంలో బల్క్‌డ్రగ్ క్యాపిటల్‌గా పేరొందిన మన నగరంలో రెండోస్థానంలో నిలిచిన ఫార్మారంగంలో సుమారు 25 శాతం కొలువుల సృష్టి జరుగుతోందట. ► ఇక మూడోస్థానంలో ఉన్న టెలీ కమ్యూనికేషన్స్రంగంలో 23 శాతం, తయారీ రంగం 21 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. బల్క్‌డ్రగ్ రంగంలోనూ... మహానగరాన్ని ఆనుకొని సుమారు వెయ్యికి పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలున్నాయి. ఇక్కడి నుంచి దేశ,విదేశాలకు ప్రాణాధార ఔషధాలు, వ్యాక్సీన్లు ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రంగం ఆర్జిస్తోంది. నూతన ఔషధాలపై పరిశోధన, కొత్త మందుల సృష్టి,ఎగుమతుల విషయంలో ఖండాతరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పేరు మార్మోగుతూనే ఉంది. ఈ రంగంలోనూ ఏటా సుమారు 25 శాతం నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని తాజా అధ్యయనం అంచనా వేయడం విశేషం. ప్రధానంగా సైన్స్ గ్రాడ్యుయేట్లతోపాటు పది,ఇంటర్ చదివిన వారికి హెల్పర్లు,నైపుణ్య కార్మికులకు ఈ రంగం భారీగా ఉపాధి కల్పిస్తుండడం విశేషం. నూతన పాలసీతో జోష్ రాష్ట్ర సర్కారు ఐటీ, హార్డ్‌వేర్ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ రాకతో ఈ రంగాలు జెట్స్పీడ్తో దూసుకుపోనున్నాయి. రాబోయే ఐదేళ్లలో నూతనంగా మరో నాలుగు లక్షల కొలువుల సృష్టితో పాటు.. ఏటా ఐటీ ఎగుమతులు మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలున్నట్లు ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తుండడం విశేషం. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2021–26 మధ్య కాలానికి ప్రకటించిన నూతన పాలసీతో ఐటీ భూమ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.25 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు వెల్లువలా సిటీకి తరలివస్తున్న విషయం విదితమే. (చదవండి: ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు) -
నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం
న్యూఢిల్లీ:నియామక కార్యకలాపాలు స్థిరమైన రికవరీలో ఉన్నాయని లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 65 శాతం అధికంగా నమోదయ్యాయని వివరించింది. ‘2021 ఏప్రిల్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి నుంచి రికవరీ ప్రారంభమైంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది మే చివరినాటికి 35 శాతం, జూన్ 42, జూలై చివరినాటికి 65 శాతం నియామకాలు అధికమయ్యాయి. ఒక సంవత్సరం స్తంభింపజేసిన తర్వాత ఐటీ, తయారీ, హార్డ్‌వేర్ వంటి పెద్ద రంగాలు నియామకాలను పెంచడం ప్రారంభించాయి. నియామకాలు క్రమంగా అధికం అవుతూనే ఉంటాయని అంచనా. ఉద్యోగాలు చేసేవారిలో కొత్తగా ప్రవేశించే వ్యక్తుల కంటే.. జాబ్ మారుతున్నవారే అధికం. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం కొనసాగుతున్నందున కొత్త, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలలో అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు మారే వ్యక్తులలో భారీ తగ్గుదల ఏర్పడింది. చదవండి: మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు! -
కోవిడ్ ముందస్తు స్థాయికి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్, ఇంజనీర్ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్ మార్కెట్‌ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. టెక్ జాబ్స్ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్ రంగంలో తిరిగి డిమాం డ్ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రాధాన్యతలలో మార్పు.. కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్కీపర్స్, కేర్‌టేకర్స్, క్లీనర్స్ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్ కేర్, చైల్డ్ కేర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్ 8, కస్టమర్ రిలేషన్స్ 7, అడ్మిన్ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్ పునర్ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్ వివరించింది. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
15న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్చ్సేంజ్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ని ప్రారంభించాలని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణిని ఆదేశించారు. ఇకపై ప్రతి జిల్లాలో నెలకు రెండుసార్లు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాలను వైఎస్సార్ కడప జిల్లా నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ అమలుపై మంత్రి గురువారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. స్కిల్ కాలేజీల పనుల పురోగతికి అవసరమైన నిధుల సమీకరణలో వేగంగా చర్యలు తీసుకోవాలని, బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్తో ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్‌ని అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో స్కిల్ కాలేజీ భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు లక్ష్యం వచ్చే మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. విశాఖలో ఐకానిక్ టవర్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలిచ్చారు. -
నిరుద్యోగులకు ఐటీ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్..!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని క్యాంపస్‌ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. గత ఏడాది 40,000 మందిని నియమించుకున్న కంపెనీ తాజాగా మరింత మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో నైపుణ్యాలకు కొదవలేదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నైపుణ్యాలతో కూడిన మానవ వనరులు భారత్‌లో ఉన్నట్లు టీసీఎస్ సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షలు వల్ల ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగదు అని ఆయన అన్నారు. గత ఏడాది మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరు అయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా, గత ఏడాది అమెరికన్ క్యాంపస్‌ల నుంచి 2,000 మంది ఫ్రెషర్స్ నియమించికున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో ప్రతిభకు కొరత లేదని, భారత్‌లో టెకీల వేతనాలు హేతుబద్ధంగా ఉన్నాయని, అందుకే దేశీ ట్యాలెంట్‌పై గ్లోబల్ కంపెనీలు దృష్టిసారించాయని ఎన్జీ సుబ్రమణ్యం తెలిపారు. భారతీయల ప్రతిభ "అసాధారణమైనది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 20,409 నిమయించుకున్నట్లు తెలిపింది. దీంతో దేశంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగుల కలిగిన అతిపెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించింది. -
టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంతో ఐటీ నిపుణులకు అవకాశాలు మెండుగా వచ్చి పడుతున్నాయని ఐటీ పరిశ్రమ వాదిస్తోంది. ఆటోమేషన్‌వల్ల ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం ఏర్పడుతోందన్న తాజా వాదనపై స్పందించిన ఐటీ పరిశ్రమ బాడీ నాస్కామ్ ప్రస్తుతం ఐటీ పప్రొఫెషనల్స్కు భారీ డిమాండ్ కనిపిస్తోందని గురువారం పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని టాప్-5 ఐటీ సంస్థలు 2021-22లో 96వేలమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం నాటికి భారతీయ సాఫ్ట్వేర్ సంస్థలు 30 లక్షల ఉద్యోగాలను తొలగించబోతున్నాయని, తద్వారా సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించిన తర్వాత నాస్కామ్ ప్రకటన రావడం గమనార్హం. దేశీయ ఐటీ రంగంలో 2021-22 సంవత్సరంలో నియామకాలు పుంజుకోనున్నాయని నాస్కామ వాదించింది.ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందన్న బీఓఏ వ్యాఖ్యలపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు, పాత్రల స్వభావం మారనుందని, ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. నిపుణులకు, ప్రతిభావంతులకు డిమాండ్ బాగుందని, 2021 ఏడాదిలో 1,38,000 ఉద్యోగులను చేర్చుకుందని నాస్కామ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. టాప్-5 సంస్థలే సుమారు 96 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నాయని పేర్కొంది. దీంతోపాటు 2 లక్షల 50వేల మందికి పైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తోందని, అలాగే 40 వేలమందిని డిజిటల్ ప్రతిభావంతులను నియమించిందని తెలిపింది. దేశంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) రంగంలో1.4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని నాస్కామ్ తెలిపింది. ఆటోమేషన్‌లో కీలకమైన ఐటీ-బీపీఎంలో మార్చి 2021నాటికి ఐటీ-బీపీఎంలోరంగంలో మొత్తం 4.5 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని పేర్కొంది. గత 3 సంవత్సరాల్లో ఆటోమేషన్, ఆర్‌పిఎ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) బీపీఎం రంగంలో ఉద్యోగాల సృష్టికి దారితీసిందని అసోసియేషన్ వివరించింది. చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం Edible oil: వినియోగదారులకు భారీ ఊరట -
ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ గండం!
ముంబై: వివిధ రంగాల్లో.. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతున్న నేపథ్యంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ..భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. 2022 నాటికి ఏకంగా 30 లక్షల మందికి ఉద్వాసన పలకనున్నాయి. జీతభత్యాలకు సంబంధించి కంపెనీలు ఏటా 100 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకునేందుకు ఇది తోడ్పడనుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 90 లక్షల మంది తక్కువ స్థాయి నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోనూ, బీపీవో ఉద్యోగాల్లోనూ పనిచేస్తున్నారు. ఈ విభాగంలోనే ఉద్యోగుల తీసివేత ఉండనుంది. 90 లక్షల ఉద్యోగాల్లో సుమారు 30 శాతం .. అంటే 30 లక్షల కొలువులకు కత్తెర పడనుంది. ప్రధానంగా రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) ప్రభావమే ఇందుకు కారణం. ఆర్పీఏ కారణంగా సుమారు 7 లక్షల ఉద్యోగాలకు, ఐటీ కంపెనీలు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం తదితర అంశాల మూలంగా మిగతా వాటికి కోత పడనుంది. ఆర్పీఏ వల్ల అమెరికాలో అత్యధికంగా దాదాపు 10 లక్షల కొలువులకు ముప్పు ఉంది. దేశీయంగా ఉద్యోగులపై వ్యయాలు వార్షికంగా సగటున 25,000 డాలర్లుగాను, అమెరికాలోని వారిపై వ్యయాలు 50,000 డాలర్లుగా లెక్కిస్తే.. ఉద్యోగాల్లో కోతలతో కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మేర వార్షిక జీతభత్యాలు, సంబంధిత వ్యయాలు ఆదా చేసుకోనున్నాయి. టీసీఎస్, ఇన్ఫీ.. అన్నీ.. ‘‘ఆర్పీఏ అమలు ద్వారా తక్కువ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించి సుమారు 30 లక్షల కొలువుల్లో కోత పెట్టాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్‌తో పాటు ఇతర సంస్థలు యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల వాటికి 100 బిలియన్ డాలర్ల మేర జీతభత్యాలు, ఇతర వ్యయాలు తగ్గుతాయి. ఆర్పీఏని విజయవంతంగా అమలు చేయగలిగితే ఐటీ కంపెనీలకు 10 బిలియన్ డాలర్ల దాకా, అలాగే కొత్త సాఫ్ట్వేర్లతో మరో 5 బిలియన్ డాలర్ల దాకా లాభించే అవకాశం ఉంది. మనుషులతో పోలిస్తే రోబోలు రోజంతా 24 గంటలూ పనిచేస్తాయి కాబట్టి కంపెనీలకు గణనీయంగా ఆదా అవుతుంది’’ అని నివేదిక పేర్కొంది. భౌతిక రోబోలు కాకుండా సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపంలో ఉండేదాన్ని ఆర్పీఏగా వ్యవహరిస్తారు. దీన్ని రోజువారీగా భారీ స్థాయిలో చేసే పనుల్లో ఉపయోగిస్తారు. దేశీ ఐటీకి ఆఫ్‌షోరింగ్ ఊతం.. అనేక సంవత్సరాలుగా విదేశీ సంస్థలు తమ ఐటీ అవసరాల కోసం భారత టెక్నాలజీ కంపెనీల వైపు చూస్తుండటంతో (ఆఫ్‌షోరింగ్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. 1998లో స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 1 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 7 శాతానికి చేరింది. ఆర్థిక వ్యవస్థకు అత్యంత వ్యూహాత్మకంగా ఎదిగింది. అయితే, గతంలో తమ కార్యకలాపాలను ఆఫ్‌షోర్ చేసిన చాలా మటుకు దేశాలు తమ స్వదేశాల్లో ఉద్యోగాల కల్పనపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి. నివేదిక ప్రకారం.. సంపన్న దేశాలు కూడా విదేశాలకు అవుట్సోర్స్ చేసిన ఐటీ ఉద్యోగాలను స్వదేశానికి తరలించడం లేదా స్థానిక ఐటీ ఉద్యోగులను ఉపయోగించుకోవడం లేదా ఆర్పీఏ వంటి విధానాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా తమ డిజిటల్ సరఫరా వ్యవస్థను, దేశీయ టెక్నాలజీ ఇన్ఫ్రా రంగాన్ని భవిష్యత్‌లో సురక్షితంగా ఉంచుకోవాలని అవి భావిస్తున్నాయి. భారీ స్థాయిలో ఆటోమేషన్ అయినప్పటికీ.. జర్మనీ (26శాతం), చైనా (7శాతం), భారత్ (5శాతం), కొరియా, బ్రెజిల్, థాయ్‌ల్యాండ్, మలేషియా, రష్యా వంటి పెద్ద దేశాల్లో కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. అయితే, దీనికి విరుద్ధంగా దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వచ్చే 15 ఏళ్ల పాటు కార్మికుల లభ్యత అధిక స్థాయిలో ఉంటుందని పేర్కొంది. చదవండి: నెలకు లక్షల ఆర్డర్లు, 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈకామర్స్ సంస్థ -
ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామకం!
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు టిసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్విట్జర్లాండ్ కు చెందిన క్రెడిట్ సూయిస్ వచ్చి చేరింది. అంతర్జాతీయ బ్యాంక్ సేవలకు టెక్నాలజీ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి క్రెడిట్ సూయిస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఐటీ నిపుణులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఇండియాలో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రచించినట్లు స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఎపీఐ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబందించిన డెవలపర్లు, ఇంజనీర్లను ఎంచుకొనున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో 2 వేల మంది ఐటి ఉద్యోగులను బ్యాంక్ నియమించుకున్నట్లు పేర్కొంది. క్రెడిట్ సూయిస్ లక్ష్యం భారతదేశంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభావంతుల అంతర్గత సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఐటి సిబ్బందిలో భారతీయులు ఇప్పుడు దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉన్నారు. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? -
IT Companies: ఉద్యోగాల జాతర.. 3 లక్షల జాబ్స్
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ చేపట్టేందుకు కంపెనీలు సిద్ధమవు తున్నాయి. కరోనా ప్రభావం ఉన్నా కూడా మానవ వనరుల అవసరం ఉన్న నేపథ్యంలో రిక్రూట్ చేసుకు నేందుకు సన్నద్ధం అవుతు న్నాయి. దీంతో ఈసారి ఐటీ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌లోనూ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టిన కంపెనీలు.. ఈసారి కూడా నియామకాలు చేపట్టనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ కింద విద్యార్థులను తీసుకుంటుండగా, మరికొన్ని కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రారంభిం చాయి. కంపెనీల్లో వర్క్‌ఫ్రం హోం కొనసాగుతున్నందున ప్రాజెక్టులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావట్లేదు. ప్రత్యక్ష బోధన ఆగిపోవడం, లాక్డౌన్ వంటి కారణాలతో రిక్రూట్ మెంట్‌కు అవసరమైన నైపుణ్యా లను విద్యార్థులు పెంపొం దించుకోవట్లేదు. దీంతో విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉంది. గతేడాది ఇదే జరిగిందని ఐటీ నిపు ణులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో (జూన్) క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను కంపెనీలు వేగవంతం చేయను న్నాయి. ప్రధాన కంపెనీలు దేశంలో1.1 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందు కొస్తున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం 1.1 లక్షల ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఒక మిగతా కంపెనీలు, గతేడాది భర్తీకాని ఉద్యోగాలు కలుపుకొని మొత్తంగా దేశంలో ఈసారి 3 లక్షల వరకు ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీసీఎస్‌లోనే 40 వేల ఉద్యోగాలు.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు టీఎస్ఎస్ చర్యలు చేపట్టినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది టీసీఎస్‌లో 40 వేలు, ఇన్ఫోసిస్ 25 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. డీఎక్స్ టెక్నాలజీ, మైండ్‌ట్రీ వంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశముంది. గతేడాది అన్ని కంపెనీలు 2.1 లక్షలు ఉద్యోగాలను కల్పించాలని భావించినా.. సరైన నైపుణ్యాలు కలిగిన 1.2 లక్షల మందినే తీసుకున్నారు. 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ప్రధానమైన 5 కంపెనీలు కాకుండా మిగతా కంపెనీల్లో మరో లక్షకు పైగా, గతేడాది మిగిలిపోయిన ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో లభించే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్‌లో ఇప్పటికే ప్రారంభం ఇన్ఫోసిస్ కంపెనీ తన సర్వీసెస్, ప్రోడక్ట్ డివిజన్లకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ఏటా నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇన్ఫీటీక్యూ, హ్యాక్విత్ ఇన్ఫీ అనే డ్రైవ్ నిర్వహించింది. మిగతా కంపెనీలు అదే బాటలో వెళ్లనున్నాయి. గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఇన్ఫీ టీక్యూను సర్వీసెస్ కోసం, హ్యాక్విత్ఇన్ఫీ అనే రెండు ఓపెన్ కాంపిటీషన్స్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇన్ఫీటీక్యూను సర్వీసెస్‌కు, హ్యాక్విత్ ఇన్ఫీలో ప్రోడక్ట్ డివిజన్లకు చేపట్టింది. వాటికి దేశంలో 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కొరత కారణంగా 60 శాతం మందినే తీసుకున్నట్లు తెలిసింది. అందులో 3 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. క్యాప్ జెమినీ తమ అనుబంధ కాలేజీల్లో 30 వేల నియామకాలకు జూన్, జూలైలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టింది. అయితే అందులో 45 శాతం మందే నైపుణ్యాలు కలిగిన వారు నియమితులయ్యారు. టీసీఎస్ గత ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎన్‌క్యూటీ, డిజిటల్ అనే రెండు ఓపెన్ కాంపిటీషన్ డ్రైవ్‌లను నిర్వహించింది. విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం తదితర కంపెనీలు నియామకాలను చేపట్టాయి. గతేడాది హైదరాబాద్ ఐటీ జోన్ నుంచి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కంపెనీల్లో 45 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 25 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలకు దూరమైన 40 శాతం మంది.. కరోనా సెకండ్ వేవ్ ధాటికి కాలేజీలు మూతపడ్డాయి. ఫ్యాకల్టీ, విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం వల్ల ఆన్లైన్ తరగతులు బారిన పడుతుండటం వల్ల ఆన్లైన్ తరగతులు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మెజారిటీ విద్యార్థులు చదువులకు దూరమై వేరే వ్యాపకాలతో సమయం వృథా చేసుకుంటున్నారు. గతేడాది కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉండదని అంతా ప్రిపరేషన్‌ను గాలికి వదిలేశారు. కానీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు ముందుకొచ్చాయి. అయితే విద్యార్థులంతా లాక్‌డౌన్‌తో గ్రామాలకు వెళ్లడం, క్యాంపస్ రిక్రూట్మెంట్కు సిద్ధం కాలేకపోయారు. దీంతో కంపెనీలు అవసరమైన వారిలో 60 శాతం మందినే నియమించుకున్నాయి. దీంతో 40 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలను పొందలేకపోయారు. ఆన్లైన్ ప్రిపరేషన్ విత్ సర్టిఫికేషన్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈసారి కూడా విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. దీంతో కంపెనీలు కోరుకునే సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు లభిస్తారా లేదా అన్న ప్రశ్న కంపెనీల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చాయి. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ప్రస్తు్తత పరిస్థితులు ఆటంకం కాకుండా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా మారకుండా కంపెనీలే తమ వెబ్సైట్ల ద్వారా ‘ఆన్లైన్ ప్రిపరేషన్ విత్ సర్టిఫికేషన్’ప్రారంభించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. సమయం వృథా చేసుకోవద్దు.. క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం విద్యార్థులు ప్రిపేర్ కావాల్సిన సమయం వచ్చింది. ఈ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ప్రిపరేషన్లో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంగణ నియామకాలు అకడమిక్ అంశాలకు సంబంధం లేదు. ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఆప్టిట్యూడ్, వెర్బల్, సి, డీఎస్, జావా లేదా పైతాన్ వంటి వాటిపై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కోడింగ్ ప్రాక్టీసు మొదలు పెట్టాలి. అడ్వాన్స్ డీఎస్ ప్రాక్టీస్ చేయాలి. అల్గారిథమ్స్‌పై పట్టు సాధించాలి. ఈజీ నుంచి మొదలుకొని మోడరేట్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్ సామర్థ్యం పెరిగిన తర్వాత హ్యాకర్ ర్యాంక్ వంటి కోడింగ్ ప్లాట్ఫారం, హాకథాన్స్‌లో పాల్గొనాలి. కోడింగ్ చేయగలమనే నమ్మకం వచ్చినప్పుడు ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి. లింక్డ్ఇన్లో ఆన్లైన్ ఇంటర్న్‌షిప్‌లు చాలా ఉంటాయి. దఇంటర్న్షిప్ చేశారంటే ఉద్యోగానికి సులభంగా ఎంపిక కావొచ్చు. – కాంచనపల్లి వెంకట్, ఫౌండర్ సీఈవో, సన్‌టెక్ కార్ప్ సొల్యుషన్స్ ప్రాంగణ నియామకాల శిక్షణ సంస్థ -
పెరిగిన డిజిటలైజేషన్‌తో విస్తరించిన మార్కెట్
సాక్షి, అమరావతి: ఐటీ ఉద్యోగార్థులకు తీపి కబురు. కరోనా వైరస్ వ్యాప్తితో అగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కూడా ఈ ఏడాది దేశంలో ఐటీ ఉద్యోగాల జాతర జరగనుంది. 2021–22లో భారీసంఖ్యలో కొత్త ఉద్యోగుల నియామకానికి దేశంలో ఐటీ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ ఏజెన్సీ ‘లింక్డిన్’ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా పరిస్థితులతో దేశంలో డిజిటలైజేషన్ మరింతగా పెరగనుండటంతో పెరగనున్న మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే 2020–21 కంటే 2021–22లో 45 శాతం ఎక్కువగా కొత్త ఉద్యోగుల నియామకానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. లింక్డిన్ తాజా నివేదికలోని ప్రధాన అంశాలు.. రానున్న రెండేళ్ల మార్కెట్‌ను అంచనా వేసి.. కరోనా నేపథ్యంలో డిజిటలైజేషన్, ఆన్లైన్ కార్యకలాపాలు అమాంతంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్, డిజిటలైజేషన్ ప్లాట్‌ఫామ్స్‌కు మార్కెట్ విస్తరిస్తోంది. ఈ పరిస్థితి నిపుణులైన మానవ వనరులు ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు సానుకూలాంశంగా మారింది. దాంతో రానున్న రెండేళ్లలో మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి ఆ మేరకు అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దీంతో దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాలు భారీగా లభించనున్నాయి. ► 2020–21లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్‌తో ఐటీ కంపెనీలకు మారెŠక్ట్లో కొత్త అవకాశాలు లభించాయి. దీంతో 2020 నవంబర్ నుంచి ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగ నియామకాలను వేగవంతం చేశాయి. ‘వర్క్ ఫ్రం హోమ్’విధానంలోనే పనిచేసేందుకు కొత్త ఉద్యోగులను నియమించాయి. ► ఇక రానున్న ఏడాదిలో దేశంలో డిజిటలైజేషన్ మరింతగా పెరగనుంది. దాంతో కొత్త ఉద్యోగాల కల్పన కూడా అదే రీతిలో పెరుగుతుంది. 2020–21 కంటే ఈ 2021–22లో 45 శాతం ఎక్కువగా కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. ► ప్రధానమైన నాలుగు ఐటీ కంపెనీలే కొత్తగా లక్షమంది ఉద్యోగుల నియామకానికి సన్నద్ధమవడం విశేషం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో సంస్థలే దాదాపు లక్షమంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ► టీసీఎస్ కొత్తగా 40 వేలమంది ఉద్యోగులను నియమించనుంది. ఇన్ఫోసిస్ 26 వేలమందిని, హెచ్‌సీఎల్ 12 వేలమందిని కొత్తగా తీసుకోవాలని నిర్ణయించాయి. విప్రో దాదాపు 20 వేలమంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. గత ఏడాది విప్రో 9 వేలమందినే నియమించగా ఈసారి ఏకంగా 20 వేలమంది వరకు తీసుకోవాలని భావిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ► ఇక దేశంలో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా అదే రీతిలో కొత్త ఉద్యోగుల నియామకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరో లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. యువతకు ఇదే అవకాశం ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి డిజిటలైజేషన్ విస్తరిస్తోంది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు ఇది అనివార్య పరిస్థితి. దీంతో కొత్త ప్లాట్‌ఫామ్స్‌కు అవకాశాలు పెరిగాయి. ఈ మార్కెట్‌ను దక్కించుకునేందుకు ఐటీ కంపెనీలు ముందస్తుగా సిద్ధమవుతాయి. తద్వారా భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పరిస్థితిని యువత సద్వినియోగంచేసుకోవాలి. అందుకోసం ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. – పీవీజీడీ ప్రసాదరెడ్డి, వీసీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
హిజ్రాలకు ఐటీ కంపెనీల్లో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: హిజ్రా కమ్యూనిటీలో జరుగుతున్న నేరాలను నియంత్రించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో వారికి పోలీసుల నుంచి చేయూతనందించే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ‘ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్’ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు. దీనిద్వారా ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తుండడం విశేషం. ఎవరెవరు ఉంటారంటే... గచ్చిబౌలి ఠాణాలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌లో ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్సీఎస్సీ నియమించిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (హిజ్రా)తో పాటు పోలీసు విభాగం నుంచి ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. వీరు హిజ్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరించి ఏదైనా ఆపదలో ఉంటే మార్గదర్శనం చేస్తారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం కోసం పోలీసులను ఎలా సంప్రదించాలనే దానిపై సూచనలు చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేసి వారి వద్దకు చేరుకొని సంరక్షించేలా చూస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ..పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తికమకపడతారు. ఒకవేళ వెళ్లినా ఆ ఫిర్యాదును పట్టించుకోరనే ఉన్న అపోహను తొలగించేలా ఈ హెల్ప్‌డెస్క్ పనిచేయనుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్సీఎస్సీ చేయూతతో ‘హెల్ప్‌డెస్క్’ పనిచేయనుంది. ఇప్పటికే హిజ్రాలకు ఉద్యోగాలిచ్చేందుకు రెండు ఐటీ కంపెనీలు ముందుకువచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఏ సమస్యలంటే... కొందరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచిస్తున్నారు. వాహనాలు ఆపి మరీ బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు. షాపుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో కొందరు నకిలీ హిజ్రాలు సైతం ఉంటున్నారు. కొందరు వ్యభిచార వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. ఆయా సందర్భాల్లో గొడవలు జరిగి నేరాలు పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చదవండి: ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా? -
ఐటీ జాబ్స్: టాప్ 2లో మన హైదరాబాద్
ముంబై: డిజిటలైజేషన్, ఆటోమేషన్ కారణంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్ స్థాయిలో మంచి వృద్ధి నమోదయింది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1,925 జాబ్స్ హైరింగ్స్ జరగగా.. గత నెలలో 2,356 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, మార్కెట్ సాధారణ స్థితికి చేరుకోవటంతో కోవిడ్–19 తర్వాత తొలిసారిగా మెజారిటీ పరిశ్రమలలో నియామక కార్యకలాపాలలో సానుకూల థృక్పదాన్ని సాధించాయని నివేదక వెల్లడించింది. నగరాల వారీగా చూస్తే.. దేశంలోని ఆరు మెట్రో నగరాలు, ప్రధాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జాబ్స్ హైరింగ్‌లో సానుకూల వాతావరణ నెలకొంది. గత నెలలో 31 శాతం నియామక వృద్ధితో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. 28 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పుణేలో 24 శాతంగా ఉన్నాయి. వడోదరలో 20 హైరింగ్స్ ధోరణి కనిపించింది. -
హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్: ఇంటర్‌తోనే ఐటీ కొలువు
ఇంటర్ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. కానీ, ఉన్నత విద్య కూడా కొనసాగించాలనుకుంటున్నారా ?! మీలాంటి విద్యార్థులకు సరితూగే కొలువుల కోర్సే.. హెచ్‌సీఎల్ అందిస్తున్న టెక్బీ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. ఇందులో చేరితే అనుభవంతోపాటు కొలువూ సొంతమవుతుంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పట్టా అందుకునే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా టెక్బీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ తదితరాల గురించి పూర్తి సమాచారం.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్లు, ఇంటర్ విద్యార్థులకు ఉపయో గపడేలా పలు ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. తాజాగా హెచ్‌సీఎల్ ఐటీ ఇంజనీర్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్‌సీఎల్ టెక్బీ.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఫుల్‌టైమ్ జాబ్ చేయాలనుకొనే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్. హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ లెవల్ కొలువుల భర్తీకి అవసరమైన నైపుణ్యాలపై అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే అభ్యర్థులు బిట్స్–పిలానీ, సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్బీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులైన తర్వాత రూ.2లక్షల–2.20 లక్షల వార్షిక వేతనం అందుతుంది. అర్హత ► 2019, 2020లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే 2021లో ఇంటర్ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ► అభ్యర్థి ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ను చదివుండాలి. ఫీజు ► ప్రోగ్రామ్ ఫీజు ట్యాక్స్‌లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. ► అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు. ► విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. ► శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు∙పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85–90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు. శిక్షణ ► హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్.. అభ్యర్థులను హెచ్‌సీఎల్ ప్రాజెక్ట్స్‌పై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది. ► ఫౌండేషన్ ట్రైనింగ్‌లో భాగంగా.. ప్రొఫెషనల్ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్‌ను బోధిస్తారు. ► అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్లైన్ అసెస్మెంట్లు, అసైన్మెంట్స్, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ ఉంటాయి. అభ్యర్థులు టెక్నాలజీ సర్వీసెస్‌కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్ పొందవచ్చు. ఉద్యోగ వివరాలు ► శిక్షణను పూర్తి చేసకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు. ► ఆఫర్ అందుకున్నవారు దేశంలోని హెచ్‌సీఎల్ క్యాంపస్‌ల్లో అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్, డిజైన్ ఇంజనీర్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ► హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి. ► బెనిఫిట్ బాక్స్ ప్రోగ్రామ్ కింద డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్‌ను అందుకోవచ్చు. ఉన్నత విద్య ► కెరీర్ రూపకల్పనలో విద్యది కీలకపాత్ర. దీన్ని గుర్తించిన హెచ్‌సీఎల్.. బిట్స్ పిలానీ, సస్త్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో టెక్బీ స్కాలర్స్‌కు ప్రత్యేక ఉన్నత విద్యా ప్రోగ్రామ్స్‌ను ఆఫర్చేస్తోంది. బిట్స్, పిలానీ ► బిట్స్ పిలానీ సహకారంతో ఎంప్లాయిబిలిటీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ప్రోగ్రామ్‌ను హెచ్‌సీఎల్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కోర్సులకు సంబంధించిన తరగతులను హెచ్‌సీఎల్ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ఫీజులో కొంత మొత్తాన్ని హెచ్‌సీఎల్ భరిస్తుంది. ఈ బీఎస్సీ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే... ఇదే ఇన్స్టిట్యూట్లో ఎమ్మెస్సీ/ఎంటెక్ కోర్సుల్లో చేరే వీలుంది. ► హెచ్‌సీఎల్ టెక్ బీ అభ్యర్థులు తంజావూర్‌లోని సస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో మూడేళ్ల బీసీఏలో చేరొచ్చు. ఈ కోర్సు పూర్తయ్యాక బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ప్రవేశం పొందే వీలుంది. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.hcltechbee.com -
విజయవాడ హెచ్‌సీఎల్‌లో వెయ్యి ఐటీ ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: విజయవాడ క్యాంపస్(గన్నవరం)లో పనిచేసేందుకు గానూ వెయ్యి మంది ఉద్యోగుల ఎంపిక కోసం వచ్చే నెల 12, 13 తేదీల్లో నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. ‘హెచ్‌సీఎల్ న్యూ విస్టాస్’ కార్యక్రమం కింద వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ నియామక ప్రక్రియకు ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌తో పాటు 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు కూడా అర్హులేనని చెప్పారు. విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఉన్న హెచ్‌సీఎల్ క్యాంపస్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ 1,500 మంది ఐటీ ఉద్యోగులున్నారని చెప్పారు. నాలుగేళ్లలో ఈ సంఖ్యను 5 వేలకు చేర్చాలన్నది తమ లక్ష్యమని వివరించారు. అనుభవజ్ఞులకు జావా, చిప్ డిజైనింగ్, డాట్నెట్ తదితర అంశాలపై టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 11లోగా https://www.hcltech.com/ careers/vijayawadaలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ అర్హతతో ఐటీ ఉద్యోగాల కోసం ‘టెక్ బి’ ఇంటర్మీడియెట్ అర్హతతో ఐటీ కెరీర్‌ను ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్ అవకాశం కల్పిస్తోందని శ్రీమతి శివశంకర్ తెలిపారు. ఇందుకోసం ‘టెక్ బి’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నవారితో పాటు గత రెండేళ్లలో ఇంటర్ పాస్ అయిన వారు దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ‘హెచ్‌సీఎల్ టెక్ బి’ కార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏడాది పాటు ‘టెక్ బి’ శిక్షణ ఇచ్చి.. హెచ్‌సీఎల్‌లో ఉద్యోగమిస్తామని చెప్పారు. వీరు బిట్స్ పిలాని, శాస్త్ర యూనివర్సిటీల ద్వారా ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా సహకరిస్తామన్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీ ఐటీ ఉద్యోగులు.. తమ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసేందుకుగానూ విజయవాడ క్యాంపస్ ద్వారా ‘కమ్ బ్యాక్ హోమ్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అలాగే ఏపీ ప్రభుత్వ సహకారంతో విజయవాడ క్యాంపస్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. -
ఐటీ జాబ్స్‌కు అదే జోష్!
సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్‌తో దేశంలోని అన్ని పరిశ్రమలల్లో ఉద్యోగుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో మాత్రం జోష్ తగ్గలేదు. బెంగళూరు, పుణే వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక భరోసా అందిందని జాబ్ ఫ్లాట్‌ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్వర్క్ తెలిపింది. నవంబర్ నెలలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్, సాఫ్ట్వేర్ డెవలపర్, టెస్టర్, కన్సల్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని పేర్కొంది. కరోనా వైరస్‌తో అన్ని వ్యాపారాలకు డిజిటల్లోకి మారుతుండటం, సాంకేతిక వినియోగం పెరగడం వంటివి ఐటీ రంగం, ఉద్యోగుల వృద్ధికి కారణమని తెలిపింది. 2020 నాటికి దేశీయ ఐటీ రంగంలో 43.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. నవంబర్‌లో 50 శాతానికి పైగా కొత్త ఉద్యోగ నియామకాలు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి వచ్చాయి. ఐటీ రంగంలో ఏటా రూ.25 లక్షల ఎక్కువ వేతనం పొందుతున్న నగరాల్లో బెంగళూరు, పుణేలున్నాయని స్కైకీ కో–ఫౌండర్ కరుంజిత్ కుమార్ ధీర్ తెలిపారు.