Madya pradesh
-
‘మహా’ విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం
ఉప్పల్/మల్లాపూర్: మహా కుంభమేళా ప్రయాణం హైదరాబాద్‌కు చెందిన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగుప్రయాణంలో ఉన్న ఆ ఇంటి పెద్దల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చింది. మహా కుంభమేళా నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది స్నేహితులు ఈనెల 8న నాచారం కార్తికేయ నగర్ నుంచి మ్యాక్సీ క్యాబ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ఈ వాహనంలో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా వారివారి కుటుంబాలను పోషించే వారే కావడం గమనార్హం. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దర్శనాలను పూర్తి చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయం తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రక్కు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సిహోరా పోలీసుస్టేషన్ పరిధిలోని మోహ్లా–బార్గీ గ్రామాల మధ్య వీరి మ్యాక్సీ క్యాబ్ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తుండగా.. ఓ వంతెనపై ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ బలంగా వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... తీవ్రగాయాలపాలైన శ్రీరాం బాలకిషన్ (62), నవీన్‌చారి జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని కార్తికేయ నగర్, శ్రీరాంనగర్, చైతన్యపురిలో విషాదఛాయలు అలముకొన్నాయి. కుంభమేళాకు వెళ్లిన వీరంతా ప్రాణ స్నేహితులని, మంచిచెడులను పంచుకుంటూ కలివిడిగా ఉంటుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారని, మరణంలోనూ వీరి స్నేహబంధం వీడలేదని అంటున్నారు. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమ్మా... నాన్నకు ఏమైంది? ప్రమాదమృతుల్లో ఒకరైన శశికాంత్ కుమార్తె శ్రీ మూడో జన్మదిన వేడుకల్ని సోమవారం ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ దృశ్యాలను భార్య కళ్యాణి వీడియో కాల్ ద్వారా శశికాంత్‌కు చూపించారు. మంగళవారం పిడుగులాంటి వార్త రావడంతో కళ్యాణి సహా కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది చూసిన శ్రీ అమాయకంగా అమ్మా... నాన్నకు ఏమైందంటూ ప్రశి్నస్తుండగా... ఏం చెప్పాలో అర్థం కాక విలపించడంతో అందరూ కంటతడిపెట్టారు. వస్తానని చెప్పాడు.. కానీ.. నా భర్త రాజు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి వస్తున్నా అంటూ నాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. నేను ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా బతికాలి. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోయాడో తెలియడం లేదు. - రాజు భార్య మహేశ్వరి మృతులు: 1. సూరకంటి మల్లారెడ్డి (64), నాచారం కార్తికేయనగర్ కాలనీ అధ్యక్షుడు. స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నారు. 2. రాంపల్లి రవి కుమార్ (56) కార్తికేయనగర్ తిరుమల రెసిడెన్సీ వాసి. స్థానికంగా తిరుమల మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. 3. బోరంపేట సంతోష్ (47), కార్తికేయ నగర్ సాయిలీలా రెసిడెన్సీ నివాసి. 4. కల్కూరి రాజు (38), నాచారం శ్రీరాంనగర్ కాలనీ, వాహనం డ్రైవర్. 5. సోమవారం శశికాంత్ (38), నాచారం రాఘవేంద్రానగర్ వాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి. 6. టి.వెంకట ప్రసాద్ (55) తార్నాక గోకుల్ నగర్ వాసి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి. 7. గోల్కొండ ఆనంద్ కుమార్ (47) దిల్‌సుఖ్‌నగర్‌లోని వివేకానందనగర్ వాసి -
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే.. -
అడవిలో ఇన్నోవా కారు.. గోల్డ్ బిస్కెట్స్, కరెన్సీ నోట్లు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 40 కోట్ల విలువైన బంగారం, 10 కోట్ల నగదు దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం దొరికిన కారును గ్వాలియర్‌కు చెందిన చేతన్ గౌర్‌కు చెందినది గుర్తించారు.వివరాల ప్రకారం..భోపాల్ శివారులోని మెండోరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ, ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు.అనంతరం.. ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో బంగారం, రూ.10కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌర్‌కు చెందినదిగా గుర్తించారు. చేతన్ గౌర్.. ఆర్టీవో ఆఫీసులో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఈ బంగారం, నగదు ఎవరిదనే విషయమై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ— ANI (@ANI) December 20, 2024అయితే, అక్రమ ఆస్తుల కేసుల్లో భోపాల్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్ శర్మ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన ఇళ్లపై అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా నగదు, కిలోన్నర బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన 10 లాకర్లు, 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వివరాల పత్రాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా భోపాల్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వ్యక్తులే టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. -
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ!
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ! -
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు.. హెడ్మాస్టర్ను కాల్చి చంపాడు!
ఛతర్పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్‌ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్లో చోటుచేసుకుంది. ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ ఆగమ్ జైన్ చెప్పారు. -
వీడియో: కేంద్రమంత్రి సింధియాకు తప్పిన ప్రమాదం.. పోలీసులకు గాయాలు!
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తృటిలో ప్రమాదం తప్పింది. తేనెటీగల దాడి నుంచి సింధియాను భదత్రా సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న పోలీసులు, పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనకు బయలుదేరారు. అక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు శివపురిలోని సరస్సు సెయిలింగ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యంత్రానికి పంతులు పూజలు చేసే క్రమంలో అగర్బత్తిని వెలిగించారు. దీంతో, పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సింధియా కష్టం మీద కాపాడారు. సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, పార్టీ మద్దతుదారులు, పోలీసులపై తేనేటీగలు దాడి చేశాయి. అనంతరం, గాయపడిని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #WATCH | Swarm Of Bees Attack Minister Jyotiraditya Scindia In Shivpuri, Several Injured#MadhyaPradesh #MPNews #Jyotiradityascindia pic.twitter.com/Ls23wLa1GU— Free Press Madhya Pradesh (@FreePressMP) November 30, 2024 -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ట్రైనీ విమానం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రెండు సీట్లున్న సెస్నా 152 విమానం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కూలిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలిలో ఉన్న విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా కూలిపోయినట్లు గుణ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ దిలీప్ రాజోరియా వెల్లడించారు. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. గాయపడిన పైలట్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే టెస్టింగ్, నిర్వహణ కోసం కొన్ని రోజుల క్రితం పలు విమానాలు ఇక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. విమానం కూలిపోవటంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.#MadhyaPradesh Two pilots injured as trainer aircraft crashes in MP's Guna: Two pilots on board suffered injuries; the plane arrived a few days back for testing and maintenance https://t.co/7StFTBL0bV pic.twitter.com/4rM6CiFFq3— Global Voters (@global_voters) August 11, 2024 -
విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్ జిల్లాలోని షాపూర్ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. Madhya Pradesh | 9 children died after being buried under the debris of a wall in Sagar. Some children are injured, and they are under treatment. All the debris has been removed from the site of the incident: Deepak Arya, Collector, Sagar(Source - DIPR) pic.twitter.com/saKV2RKADv— ANI (@ANI) August 4, 2024దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
ఈ వీడియోని చూసి ‘ముఖ్యమంత్రి గారు సిగ్గుతో తలదించుకోండి’
తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలల్ని బ్రతికుండగానే నడుం లోతు పూడ్చిపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం (ఎంపీ) రీవా జిల్లాలో దారుణం జరిగింది. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ అధికార తృణముల్ కాంగ్రెస్ బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.Aayi NDA ki yeh sarkar Laayi mahilaon pe teen guna atyaacharAtrocities against women have become an epidemic under BJP-backed lawlessness.In MP's Rewa, two women were nearly buried alive for opposing road construction. CM @DrMohanYadav51 should hang his head in shame! pic.twitter.com/9vqsmgCwjr— All India Trinamool Congress (@AITCofficial) July 22, 2024 బీజేపీ పాలిత రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోయింది. తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చి పెట్టారు. ఈ వీడియో చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలదించుకోండి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.మరోవైపు మహిళలపై జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు రీవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మంగవా పోలీస్ స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు. బాధితులు మమతా పాండే,ఆశా పాండేలు అధికారులు రోడ్డు వేయడాన్ని వ్యతిరేకించారని, దీంతో ఆగ్రహానికి గురైన ట్రక్ డ్రైవర్ పాక్షికంగా ఎర్రటి మట్టితో పూడ్చాడని ఏఎస్పీ వివేక్ లాల్ తెలిపారు.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ‘రీవా జిల్లాలో మహిళలపై జరిగిన దాడి నా దృష్టికి వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశించాం. మహిళలపై దాడి కుటుంబకలహాలే కారణం. అందులో ఓ నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు’అని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
హార్ట్ బ్రేకింగ్ వీడియో: బ్రతికుండగానే మహిళలను మట్టిలో పూడ్చేయత్నం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదరు మహిళలను రక్షించారు. అయితే, ఈ ఘటనకు భూవివాదమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రేవా జిల్లాలోని హినౌతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కులో మట్టిని తీసుకువచ్చి ఇద్దరు మహిళను పూడ్చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే, మన్‌గావా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు నిరసనలకు దిగారు. The result of 20 years of misgovernance by BJP is that goons have flourished in every district. This viral video is from village Mangava in Rewa district of Madhya Pradesh, in which women were forced to commit murder by some goons. And an attempt was made to take his life.… pic.twitter.com/2oF1KnhwI7— Bhopal Congress (@Bhopalinc) July 21, 2024 ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము తీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నేలపై బైఠాయించిన ఇద్దరు మహిళలను పట్టించుకోని ట్రక్కు డ్రైవర్.. అందులోని మట్టిని వారిపై పారపోశాడు. అప్పటికే వాళ్ల నడుము వరకు మట్టి పూడుకుపోయింది. దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను భోపాల్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
భోజ్‌శాల కాంప్లెక్స్: ప్రభుత్వం చేతికి ఏఎస్ఐ రిపోర్టు
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తోంది.మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది. -
బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి
భోపాల్: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీ పార్టీలో చేరారు. కాగా, రోహిత్ ఆర్య అనేక కేసుల్లో తీర్పులను వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.వివరాల ప్రకారం.. రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా, పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జస్టిస్ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులు వివాదాస్పదం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.అలాగే, 2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది. -
‘శివరాజ్ సింగ్ భారీ గెలుపుతో.. ఢిల్లీ మొత్తం తలవంచింది’
భోపాల్: లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి, కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌పై గెలుపుతో ఢిల్లీ మొత్తం తలవంచిందని కార్తికేయ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం బుధ్నీ అసెంబ్లీ స్థానంలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి వచ్చాను. అయతే మన నేత(శివరాజ్ సింగ్ చౌహన్) ఒక ముఖ్యమంత్రిగా చాలా పాపులర్. అయిన ఇప్పుడు సీఎం కాకున్నా మరింత పాపుల్ అయ్యారు. మన నేత భారీ విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మొత్తం ప్రస్తుతం మన నేత ముందు తలవంచంది. ఢిల్లీ మొత్తానికి ఆయనేంటో తెలుసు. అదేవిధంగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఇస్తుంది. ఒక్క ఢిల్లీనే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన్ను గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నేతల జాబితాలో శివరాజ్‌సింగ్ ఒకరుగా నిలుస్తారు’అని తండ్రిపై ప్రశంసలు కురిపించారు.లోక్‌సభ ఎన్నికల విదిశ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ 8.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర కేబినెట్లో చోటుదక్కించుకొని వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక.. తన తండ్రిపై కార్తికేయ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కార్తికేయ సింగ్ వ్యాఖ్యలతో ఢిల్లీకి అసమ్మతి భయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.‘కేంద్ర మంత్రి కుమారుడు (యువరాజు) కార్తికేయ ఢిల్లీ భయంతో ఉందని ఉంటున్నారు. ఇది 100 శాతం నిజం. ఎందుకంటే దేశం భయంతో ఉన్న ఓ నియంతను నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో వ్యక్తం అవుతున్న అసమ్మతి స్వరం. రెబెల్ అవుతున్న పెద్ద నేతలు. సంకీర్ణ ప్రభుత్వ సమన్వయం. ప్రభుత్వానికి మద్దతు తగ్గటం వల్ల భయంతో అధికార పీఠం కదులుతోంది’అని జితూ పట్వారీ అన్నారు. మరోవైపు.. శివరాజ్ సింగ్ కేంద్రమంత్రి కావటంతో బుధ్నీ అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. -
అత్తను దారుణంగా చంపిన కోడలికి మరణ శిక్ష
భోపాల్: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు నరికి నరికి చంపింది. ఈ కేసు విచారించిన రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్ చేతిలో అత్త సరోజ్కోల్ హత్యకు గురైంది. అత్త సరోజ్కోల్ హత్యకు మామ వాల్మీకికోల్ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్‌ను కోర్టు విడుదల చేసింది. -
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..!
ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతోనే ఆమె లైఫ్ టర్న్ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..ఆమె పేరు ప్రియాల్ యాదవ్. ఇండోర్‌కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్‌లో దారుణంగా ఫెయిల్ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.అందుకే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(ఎంపీపీఎస్సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్‌ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి.. తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్ నియమితురాలయ్యింది. తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూనే ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్. ప్రస్తుతం ఆమె ఇండోర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్‌ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్‌కి మారుపేరుగా నిలిచింది. అందరి చేత శెభాష్ ప్రియాల్ అని అనిపించుకుంది. (చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!) -
జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్‌ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్‌కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత) -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలోని ఇండోర్-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. #NewsWithR #MadhyaPradesh: Eight people killed and one injured in road accident.According to Additional Superintendent of Police (ASP) Rupesh Kumar Dwivedi, a jeep collided with an unidentified vehicle near Ghatabillod on the Indore-Ahmedabad National Highway.@MPPoliceDeptt pic.twitter.com/x994AFzsiq— Ravi Rana (@RaviRRana) May 16, 2024 ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని కేంద్రమంత్రి, ‘గుణ’ బీజేపీ ఎంపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా విర్శించారు. సైద్ధాంతికంగానూ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటోందని ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కొంతమందికి టికెట్లు ఇచ్చినా నామినేషన్ల తరువాత ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీతో ఉండాలని ఎవరూ అనుకోవడమూ లేదు’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీలో నేతలకు సముచిత గౌరవ మర్యాదలు ఉండవు అని కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవడం మేలని అన్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శిలను తిప్పికొడుతూ అది ఏ పార్టీతోనూ సాధ్యం కాని విషయమని అన్నారు.కాంగ్రెస్‌పార్టీలో చాలాకాలం కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన 15 నెలలకు సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. -
మహిళపై కస్సుమన్న కేంద్రమంత్రి భార్య.. వెల్లువెత్తిన విమర్శలు
సమస్య చెబుతున్న గ్రామీణ మహిళపై కస్సుమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శినీ రాజే సింధియా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామీణ మహిళ పట్ల ఆమె ప్రవర్తినపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌లోని గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రియదర్శిని తన భర్త విజయం కోసం కుమారుడితో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి వెళ్లగా అక్కడ కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను లేవనెత్తారు. దీంతో ఆమె సమస్యలను రాసి తమకివ్వలని చెప్పారు. ఇంతలో ఓ మహిళ “నువ్వే రాసుకో” అంది. అది విన్న ప్రయదర్శిని రాజే ఆగ్రహానికి గురై, "మీరు రాసి నాకు ఇవ్వండి, మీ పని చేయడం నా పని కాదు" అంటూ చిరాకుపడ్డారు.ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు ప్రయదర్శిని సింధియాను ఆశ్రయించారు. గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు. ఈ సమయంలో, ఒక మహిళ, "మేడమ్, మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది, కానీ అందులో నీరు లేదు" అంటూ తెలియజేసింది. -
ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. అతడి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులగా పనిచేస్తున్నారు. అతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అత్యంత సాదాసీదాగా జీవితం గడుపుతాడు. ప్రజల సేవ పరమావధిగా భావించే మహోన్నత వ్యక్తి ప్రోఫెసర్ అలోక్ సాగర్. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే.. అలోక్ సాగర్ ఐఐటీ ఢిల్లీ గ్య్రాడ్యేయేట్, ఎన్నో మాస్టర్స్ డిట్రీలు చేసిన వ్యక్తి. పైగా యూఎస్ఏలోని టెక్సాస్‌లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ కూడా చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన కొన్నాళ్లు ఐఐటీ ఢిల్లీలో మాజీ ప్రోఫెసర్‌గా పనిచేశారు అలోక్ సాగర్. అంతేగాదు ఐఐటీ ఢిల్లీలో ప్రోఫెసర్‌గా పాఠాలు బోధిస్తున్నప్పుడూ అలోక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాడు. ఏమయ్యిందో ఏమో సడెన్‌గా ప్రోఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అలోక్ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి నివశించడం ప్రారంభించారు. ఆ గ్రామంలో సరైన రోడ్డు సదుపాయాలు, కరెంట్ సౌకర్యం వంటివి ఏమీలేవు. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల మాండలికాన్ని నేర్చుకున్నారు. వారి జీవన విధానాన్ని స్వీకరించారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముతారు అలోక్. అందుకోసమే ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అంతేగాదు ప్రొఫెసర్ అలోక్ పేరుమీద ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటన్నింటి త్యజించి గిరిజనుల కోసం పాటు పడ్డారు. ఆయన తల్లి మిరాండా హౌస్ డిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ తండ్రి ఇండియన్ రెవెన్నయూ సర్వీస్ అధికారి, తమ్ముడు ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్యావంతుడు అయ్యి ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరింటిలో జీవించడం, కేవలం మూడు కుర్తాలతో ఉండటం అంత ఈజీ కాదు. చాలామంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటూరు గానీ ఇలా వారి జీవన విధానం స్వీకరించి మరీ సంక్షేమం కోసం పాటుపడరు. కానీ అలోక్ అలా కాదు గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పాటుపడ్డారు. అంతేగాదు ఆ గ్రామంలో పయనించేందుకు కూడా ఓ సాదారణ సైకిల్‌నే వినియోగిస్తారు. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50 వేలకు పైగా చెట్లను నాటారు. దీంతోపాటు గ్రామాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీట్లరు సైకిల్‌పై ప్రయాణించి మరీ ఇస్తారు. ఆయన చాలామంది డిగ్రీలు చేసి స్టేటస్ చూపించుకోవడం, ఆస్తులు సంపాదించే పనిలోనే ఉన్నారు. సమాజ సేవ కోసం తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదని ఆశోక్ బాధగా అన్నారు. ఇక ఆయాన దాదాపు 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు. ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు, గ్రామాధికారులు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడేమోనన్న భయంతో ఈ ఊరి వదిలి వెళ్లిపోమనడంతో..ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. తన వివరాలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయాయి. ఈ విషయం వార్తల్లో హైలెట్ అయ్యింది కూడా. చివరికి ఆయన చెప్పిందంతా నిజమేనని తేలింది. ఐఐటీ ప్రొఫెసర్ స్థాయి అయ్యి ఉండి కూడా కించెత్తు నామోషి లేకుండా ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజనుల కోసం పాటుపడటం వారితో కలిసి జీవించడం నిజంగా గ్రేట్ కదూ. ఇలా మరెవ్వరూ చేయరేమో.!గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన 'శ్రీమంతడు' ప్రొఫెసర్ అలోక్ సాగర్..! One of the most inspirational man one will ever come across. Prof Alok Sagar ji is an IIT Delhi graduate, masters & Phd from Houston & an ex IIT professor. However, these esteemed credentials held no meaning for him, as he discovered his true calling in one of the most remote… pic.twitter.com/OiRknPcjc7 — VVS Laxman (@VVSLaxman281) April 12, 2024 (చదవండి: ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.) -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!
సాధారణంగా అంబాసిడర్‌గా సిని సెలబ్రెటీలు లేదా స్పోర్ట్స్ స్టార్లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్‌గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏంటీ అంటే.. అమ్మమ్మ స్పూర్తితోనే.. ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్‌లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారు తమకుండే మౌఖిక సంప్రదాయాల ద్వారా తమ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలా ప్రొత్సహిస్తారు. ఇక లహరీ మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందింది. ఆమె తన బామ్మ మాటలతో స్ఫూర్తిపొందింది. కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. లమరీ 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉండటం విశేషం. స్కూల్ ముఖమే చూడకపోయినా.. ఇక లహరీబాయి ఇల్లు మిల్లెట్స్‌తో అలంకరించినట్లుగా ఇంటిపైకప్పుడు వేలాడుతుంటాయి. అస్సలు పాఠశాల ముఖమే చూడని గిరిజన మహిళ ఈ విత్తనాల గొప్పతనం గురిచి తెలసుకుని వాటిని సంరక్షించాలని భావించడం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇక ఈ మిల్లెట్‌ల్లో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంలో తోడ్పడుతుంది. ఏకంగా 150 రకాలకు పైనే.. ఇక లహరీబాయి ప్రస్తుత వయసు 27 ఏళ్లు. ఆమె 1ఆ ఏళ్ల నుంచి ఈ మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు దాదాపు 150 రకాలకుపైనే మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150కిపైగా ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉండటం విశేషం. ఐతే చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి. విత్తనాల సేకరణ కోసం.. ఇక ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. మరి కొందరు మాత్రం ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెబుతున్న లహరీబాయిని చూస్తే నిజంగా వాటి ప్రాముఖ్యతను అందురు గుర్తించేలా, బావితరాలకు అందిచాలనే లక్ష్యం కనిపిస్తుంది ఆ ఆసక్తి ఆమెను అంబాసిడర్‌గా.. లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణ పట్ల ఆమె కనబరుస్తున్న ఆసక్తిన, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్ గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్నిమిల్లెట్‌సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయన్న ఉద్దేశ్యంతో సెలబ్రెటీలను కూడా కాదని, ఆ గిరిజ యువతిని అంబాసిడర్‌గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పట్ల సరైన అవగాహన నిబద్ధతతో కృషి చేస్తే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరుతెచ్చుకోవచ్చని ఈ గిరిజన యువతి ప్రూవ్ చేసింది కదూ..! (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
ఎన్నికల యుద్ధానికి సై.. ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది?
సార్వత్రిక ఎన్నికల భేరి మోగింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా.. నేనా?.. విజయమా.. పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 400 సీట్ల లక్ష్యంతో పర్యటిస్తున్నారు. మరో వైపు ఇండియా కూటమి కూడా తనదైన రీతిలో ప్రచారం సాగిస్తోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కథనంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ బలంగా ఉంది.. కీలక నేతలు ఎవరనే వివరంగా వివరంగా తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా.. 'మమతా బెనర్జీ, అధీర్ రంజాన్ చౌదరి, సువెందు అధికారి' కీలక నేతలుగా ఉన్నారు. కాగా 2019లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 22 టీఎంసీ, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ సొంతం చేసుకున్నారు. ఇక జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందనుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు సందేశ్‌ఖాలీ దురాగతాలపై కూడా విమర్శలు జోరందుకున్నాయి. సీఏఏ అమలుపై టీఎంసీ ప్రభుత్వం వ్యతిరేకతను చూపుతోంది. ఈ తరుణంలో జరగనున్న 294 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్‌సింగ్ చౌహన్, మోహన్ యాదవ్, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకనేతలుగా ఉన్నారు. 2019లో బీజేపీ 28, కాంగ్రెస్ 1 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వ వాదం, కుల సమీకరణ, నిరుద్యోగం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్న తరుణంలో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుంది. కాగా ఫలితాలు వెల్లడైన తరువాత మధ్యప్రదేశ్ ఏ పార్టీ హస్తగతం చేసుకోనుందనే విషయం తెలియాల్సి ఉంది. ఝార్ఖండ్ 14 లోక్‌సభ స్థానాలకు, 81 అసెంబ్లీ స్థానాలకు ఝార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 2019లో ఎన్డీఏ 12 స్థానాల్లో యూపీఏ 2 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు, నగదు అక్రమ చలామణి కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ వంటి విషయాలు కీలకమైన అంశాలుగా చెలరేగుతున్నాయి. ఒడిశా బిజూ జనతాదళ్ (బీజద), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న ఒడిశాలో ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. నవీన్ పట్నాయక్ఎం మన్మోహన్ సామల్ కీలక నేతలుగా ఉన్న ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజద 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1 స్థానాలను సొంతం చేసుకున్నాయి. అస్సాం 2019లో ఎన్డీఏ 9, కాంగ్రెస్ 3, ఇతరులు 2 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న అస్సాం రాష్ట్రంలో ఈ సారి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. 126 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హిమంత బిశ్వశర్మ, బద్రుద్దీన్ అజ్మల్, భూపేన్ కుమార్ బోరా కీలక నేతలుగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ 90 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలియాల్సిన విషయం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది. విష్ణుదేవ్ సాయ్, రమణ్ సింగ్, భూపేశ్ బఘేల్ కీలక నేతలుగా ఛత్తీస్‌గఢ్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్‌సభ స్థానాలను 2019లో బీజేపీ హస్తగతం చేసుకుంది. అయితే ఈ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరనున్నాయి. పెమా ఖండూ, నబమ్ తుకి కీలక నేతలుగా రాష్ట్రంలో సరిహద్దు ప్రాంత అభివృద్ధి మాత్రమే కాకుండా.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మణిపూర్ ఎన్డీఏ అధికార పక్షంగా ఉన్న మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019లో బీజేపీ1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్. బీరేన్ సింగ్, ఇబోబి సింగ్ కీలక నేతలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ, శాంతి భద్రతల సమస్యలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలుగా బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మేఘాలయ నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో.. అస్సాం సరిహద్దు, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ కెలక నేతలుగా కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా కీలక నేతలుగా ఉన్నారు. 60 స్థానాలకు అసెంబ్లీ జరగాల్సి ఉంది. అయితే 2019లో ఇక్కడున్న రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్, NPP చెరొకటి సొంతం చేసుకున్నాయి. త్రిపుర బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలను భాజపా హస్తగతం చేసుకుంది. ఇక్కడ బీజేపీ, సీపీఎం ప్రధాన పార్టీలుగా.. మాణిక్ సాహా, మాణిక్ సర్కార్ కీలక నేతలుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధరల పెరుగుదల ప్రధాన సమస్యగా ఉంది. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మిజోరం మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఉన్న ఒక్క లోక్‌సభ స్థానం సొంతం చేసుకోగా.. అధికార పక్షంలో ZPM ఉంది. ఇక్కడ 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన నేతలుగా లాల్ దుహోమా, జోరథంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేఖత, హిందూ క్రిస్టియన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నాగాలాండ్ యునైటెడ్ డెమొక్రాటిక్ అలయెన్స్ కూటమి అధికారంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలో 'నెప్యూ రియో' కీలక నేతగా ఉన్నారు. బీజేపీ, నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీలు ప్రధానంగా ఉన్న ఈ రాష్ట్రంలో నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏట నాగాలాండ్ రాష్ట్రంలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. సిక్కిం 32 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్‌సభ స్థానం ఉన్న సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), బీజేపీ కూటమి అధికార పక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రేమ్‌సింగ్ తమాంగ్, పవన్ కుమార్ చామ్లింగ్ కీలక నేతలుగా ఉన్నారు. సిక్కిం 1 లోక్‌సభ స్థానాన్ని 2019లో SKM సొంతం చేసుకుంది. ఈ ఏట ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. భారతీయ పౌరులు తప్పకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలి. మందుకు, విందుకు, కరెన్సీ నోటుకు నీ ఓటును అమ్ముకుంటే.. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. కులానికో.. మతానికో కాకుండా సమర్ధుడైన నాయకున్ని ఎన్నుకుంటే సమర్థవంతమైన పాలన సాగుతుంది. మేలుకో.. తెలుసుకుని మసలుకో. -
ఆ వెల్లుల్లికి జీఐ ట్యాగ్!
మధ్యప్రదేశ్‌లోని రియావాన్ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ లభించింది. రియాన్ వెల్లులి జీఐ నమోదు కోసం చెన్నైలోని రైతు ఉత్పత్తుల సంస్థ(ఎఫ్‌పీఓ) రియావాన్ ఫార్మ్ ఫ్రెష్ ప్రొడ్యూసర్ కంపెనీ జనవరి 2022 నుంచి ప్రారంభించింది. ఉద్యానవన శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పరిపాలన సహకారంతో మార్చి 2న రియాన్ వెల్లుల్లి ఈ జిఐ ట్యాగ్‌ని పొందింది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పాండే, వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థనలు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఆ వెల్లుల్లి ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్‌ని పొందగలిగింది. ఈ వెల్లుల్లి ప్రత్యేకత.. ఈ వెల్లుల్లి ప్రతి రెమ్మ లవంగంతో సరిపడ ఘాటు ఉంటుంది. దీనిలో అధిక నూనె ఉంటుంది. ఈ వెల్లుల్లిని రియావాన్ సిల్వర్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. దేశంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన వెల్లుల్లి ఇది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఇతర వెల్లుల్లిపాయల కంటే మంచి సువాసనతో కూడిన ఘాటు ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులు దశాబ్దాలుగా ఈ వెల్లుల్లిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తుండటం విశేషం. పొరగు ప్రాంతా వారు ఇక్కడ రైతుల నుంచి రియావాన్ వెల్లుల్లి విత్తనాలను పట్టుకెళ్తుంటారు. నాణ్యతకు, అధిక దిగుబడికి పెట్టింది పేరు ఈ వెల్లుల్లి (చదవండి: మొక్కలతో భారత్ మాత అని రాసి గిన్నిస్ రికార్డు!) -
‘నిరుద్యోగంలో భారత్ పాక్‌ను మించిపోయింది’.. రాహుల్ గాంధీ విమర్శలు
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల చిరువ్యాపారులు కుదేలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఓ సభలో మాట్లాడారు. ‘ఈ రోజులో గత 40 ఏళ్లలో లేని అత్యంత భారీ నిరుద్యోగం దేశంలో ఉంది. పాకిస్తాన్లో ఉన్న నిరుద్యోగం కంటే రెండింతలు అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భూటాన్ దేశాలో కంటే ఎక్కువ నిరుద్యోగం భారత్‌లో ఉంది. దానికి గల కారణం ప్రధాని మోదీ అమలు చేసిన విధానాలు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులు కుదేలయ్యారు’ అని రాహుల్‌గాంధీ మడిపడ్డారు. అంతకు ముందు మరో సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. గతంలో చేపట్టిన యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. అయితే మిగతా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్ఘడ్, గుజరాత్ ఎందుకు వెళ్లలేదని ప్రజలు తనను ప్రశ్నించారని తెలిపారు. అందుకే మరో యాత్ర చేపట్టానని.. ఇది న్యాయ కోసం చేసే యాత్ర అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేసించిన ఇవాళ ఉదయం ఆయన ఎక్స్ సర్వీస్‌మెన్, అగ్నీవీర్లతో మాట్లాడారు. ఈ రోజు రాహుల్ గాంధీ బిహార్‌లో జరిగే ‘ఇండియా కూటమి’ ర్యాలీ సందర్భంగా తన యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి సోమవారం ప్రారంభమై మధ్యప్రదేశ్‌లో పలు జిల్లాకుండా కొనసాగనుంది. రైల్వే పాలసీలు ధనికుల కోసమే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైల్వే పాలసీలపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రైల్వే పాలసీలన్నీ కేవలం ధనికుల కోసమే తీసుకువచ్చారని మండిపడ్డారు. ‘ప్రతి ఏడాది 10 శాతం రైల్వే చార్జీలు పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడి చేస్తోంది. క్యాన్సలేషన్ చార్జీలు పెంచుతోంది. ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు పెంచింది. ఉన్నత వర్గానికి చెందిన రైలు పేరుతో ప్రజలను దోపిడి చేస్తోంది. పేదలు కనీసం ఆ రైలులో కాలుపెట్టలేని పరిస్థితి ఉంది. ... రైళ్లలో ఏసీ కోచ్‌లు సంఖ్య పెంచి.. జనరల్ కోచ్‌లు సంఖ్య తగ్గించారు. జనరల్ కోచ్‌ల తగ్గింపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ కోచ్‌ల తయారీ కంటే మూడు రెట్లు ఎక్కవ ఏసీ కోచ్‌లు తయారు చేస్తున్నారు. రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టడం ఆపేయటం మూలంగా రైల్వేలో జరిగే కుట్రలు తెలియటం లేదు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ ట్విటర్లో మండిపడ్డారు. -
క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉన్న హార్దా ప్రాంతంలోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పక్కనే ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Madhya Pradesh, India. Fire department vehicles present on the spot. There is a possibility of many people being trapped in the factory. #Explosion #Blast #MadhyaPradesh #Harda #BREAKING #Fire #India #Breakingnews pic.twitter.com/VoCJkSEl9F — Mangli Mundhan (@KRISHAN95411687) February 6, 2024 -
మాజీ సీఎం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన బీజేపీ.. పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాష్ట్ర సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపీక చేసిన విషయం తెలిసిందే. మరోసారి సీఎం పదవి దక్కుతుందని ఆశించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వేదికలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. శుక్రవారం బీజేపీ నేత శివరాజ్ సింగ్ పూణెలోని ఎంఐటీ ప్రభుత్వ పాఠశాలలో ప్రసంగించారు. తాను ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా పిలువబడుతున్నా, కానీ తిరస్కరణ సీఎం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిక కాలం పని చేసిన నేతపై ప్రజలు కొంత అసహం వ్యక్తం చేస్తారని తెలిపారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసి.. ప్రస్తుతం పదవిలో లేకున్నా ప్రజలు తన పట్ల ప్రేమను చూపుతున్నారని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ‘మామా’ అని ప్రేమగా పిలుస్తున్నారని అన్నారు. ప్రజల ప్రేమే తనకు అసలైన ఆస్తి అని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో లేనంత మాత్రానా తాను క్రీయాశీలక రాజకీయాల్లో లేనట్టు కాదని తెలిపారు. పదవులకు ఆశపడి తాను రాజకీయాల్లో ఉండటం లేదని.. ప్రజలకు సేవ చేయటమే తనకు మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. తాను అహంకారపూరితంగా మాట్లాడనని.. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. కానీ తనకోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని అన్నారు. నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపిస్తారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఫలితాలు విడుదలైన అనంతరం కూడా శివరాజ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర బీజేపీ నేతల వలే తాను పదవుల కోసం ఢిల్లీకి వెళ్లనని అన్నారు. తాను ఇప్పటి వరకు పదవుల కోసం ఢిల్లీకి వెళ్లలేదని చెప్పారు. పదువుల కోసం ఢిల్లీ వెళ్లటం కంటే ప్రజల కోసం మరణించడానికైనా తాను సిద్ధపడతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: మావోయిస్ట్ కీలక నేత బెంగాల్లో అరెస్ట్ -
కునో నేషనల్ పార్క్‌లో సందడి.. మూడు చీతాలకు జన్మనిచ్చిన ‘ఆశా’
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా నుంచి తీసుకోచ్చిన ‘ఆశా’ అనే చీతా తాజాగా మూడు చీతా పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘కునో నేషనల్ పార్క్‌లో ‘ఆశా’ చీతా.. మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన విషయం పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ‘ఆశా’ను ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రజెక్టులో చీతాల సంరక్షణకు కృషి చేస్తున్న కునో నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు’ అని భూపేందర్ యాదవ్ తెలిపారు. దశాబ్దాల క్రితం ఇండియాలో అంతరిచిన పోయిన చీతాలను తిరిగి అభివృద్ధి చేయాలన్నలక్ష్యంతో 17 సెప్టెంబర్ 2022న ప్రాజెక్టు చీతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా పుట్టిన మూడు చీతా పిల్లతో కలిపి మొత్తం చీతాల సంఖ్య 18కి చేరింది. అయితే నమీబియా నుంచి తీసుకువచ్చిన ‘సాశా’ అనే ఆడ చీతా 2023 మార్చి 27న మరణించిన విషయం తెలిసిందే. ‘ప్రాజెక్టు చీతా’ భాగంగా మొత్తం 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. Purrs in the wild! Thrilled to share that Kuno National Park has welcomed three new members. The cubs have been born to Namibian Cheetah Aasha. This is a roaring success for Project Cheetah, envisioned by PM Shri @narendramodi ji to restore ecological balance. My big congrats… pic.twitter.com/c1fXvVJN4C — Bhupender Yadav (@byadavbjp) January 3, 2024 చదవండి: ప్చ్.. మన బాహుబలికి అంత బలం లేదట! అందుకే ఇలా.. -
మీతోనే ఉంటానంటూ శివరాజ్ సింగ్ భావోద్వేగం
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు పదవిని పొందడానికి వేచి చూస్తూ ఉంటాం..మళ్లీ వెంటనే పదవి చేపట్టడానికి తిరస్కరణకు గురవుతామని ఒకింత భావోద్వేగంతో అన్నారు. మంగళవారం తన సొంద నియోజకవర్గం బధ్నిలో నిర్వహించిన ఓ సభలో శివరాజ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. తాను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ముఖ్యంగా తన సోదరీమణుల కోసం ఎప్పడూ అండగా ఉంటానని భావోద్వేగంతో అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని. ఇక్కడే జీవిస్తూ.. ఇక్కడే చనిపోతానని శివరాజ్ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మహిళలంతా ‘అన్నా’.. మమ్మల్ని విడిచి.. మీరు ఎక్కడికీ వెళొద్దని పెద్దగా అరుస్తూ కోరారు. కొత్త ప్రభుత్వం అన్ని పథకాలను ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. అయితే కొన్ని పదవుల కోసం వేచి ఉంటామని.. తర్వత మళ్లీ వాటికి తిరస్కరించబడతామని తెలిపారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ మరోసారి బీజేపీ అధిస్టానం మరో అవకాశం ఇస్తుందని పార్టీలో చర్చ జరిగింది. అయితే ముందు నుంచి ఊహించినట్లుగానే బీజేపీ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు బీజేపీ 163 స్థానాలు గెలుచుకొన్న విషయం తెలిసిందే. చదవండి: Forex Violation Case: అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు -
ఆశించడం కంటే చనిపోవడం మేలు: మాజీ సీఎం శివరాజ్ సింగ్
భోపాల్: సీఎం పదవి నుంచి దిగిపోయినవేళ మధ్యప్రదేశ్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం బాధ్యతలు చేపట్టనుండగా, మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి తనకు ఏదో ఒక పదవి కావాలని అధిష్టానాన్ని కోరుకోవడం కంటే చనిపోవడం మేలని పేర్కొన్నారు. అలా తాను అడగలేనని చెప్పారు. తన ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త సీఎం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంలో ఆయనకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మహిళా కార్యకర్తలు కొందరు కంటనీరు పెట్టుకోవడం, శివరాజ్‌సింగ్ భావోద్వేగానికి గురైనట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 📌 Women Supporters get Emotional while meeting Outgoing Madhya Pradesh CM Shivraj Singh Chouhan. #TNI #Insight #PiN #Politics #MadhyaPradesh #Women #ShivrajSinghChouhan pic.twitter.com/8KDwHOwnHw — The News Insight (TNI) (@TNITweet) December 12, 2023 బీజేపీ అనూహ్య నిర్ణయం.. మరోవైపు.. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపారు. One tight slap to Congress handles pic.twitter.com/gj6myS7mM8 — Rishi Bagree (@rishibagree) December 12, 2023 కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్(58) పేరును బీజేపీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. భోపాల్‌లో బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన పార్టీ లెజిస్లేటివ్ భేటీ అనంతరం ఈ ప్రకటన చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు మోహన్ యాదవ్. మోహన్ యాదవ్.. 25 మార్చి 1965లో ఉజ్జయినిలో జన్మించారు. 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018లో మళ్లీ అదే అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. ఇక.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్ర సింగ్ తోమర్‌ను ప్రకటించారు. Ujjain South MLA Mohan Yadav selected as new Madhya Pradesh CM Read @ANI Story | https://t.co/aPwTVeXzrn#MadhyaPradesh #CM #MohanYadav #MPCM pic.twitter.com/41hzzqKPO3 — ANI Digital (@ani_digital) December 11, 2023 సీఎం రేసులో పలువురి పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం.. చివరకు అనూహ్యంగా ఆరెస్సెస్ మద్దతు ఉన్న, బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో 163 సీట్లు కైవసం చేసుకుని.. వరుసగా ఐదో సారి అధికారం చేజిక్కించుకుంది కమలం పార్టీ. అయితే పది రోజుల తర్జన భర్జనల తర్వాత చివరకు మోహన్ యాదవ్‌ను సీఎంగా ప్రకటించింది. #WATCH | Bhopal: Family members of BJP leader Mohan Yadav express happiness after he was elected as the new Chief Minister of Madhya Pradesh. pic.twitter.com/Fk86hPfbP0 — ANI (@ANI) December 11, 2023 -
Disturbing Video: ‘తీవ్రంగా ఖండిస్తున్నా.. కఠినశిక్ష విధిస్తాం’
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనాగరిక ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దారుణమైన ఘటన వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటి మందు కూర్చొని ఉండగా .. అతని వద్దకు రెండు చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. Dear CM @ChouhanShivraj sir @MPPoliceDeptt @JM_Scindia ji -- This is a revolting & barbaric video involving cruelty by a man on a puppy that has shocked collective conscience Incident took place in Guna. Sacred texts say dogs have souls of God. 🙏💔pic.twitter.com/RCJ2CM7sO3 — Rohan Dua (@rohanduaT02) December 9, 2023 దీంతో అతను ఓ కుక్క పిల్లను పట్టుకొని విచక్షణరహితంగా నేలకు విసిరికొట్టాడు. అక్కడికి ఆగకుండా ఆ కుక్క పిల్లను కాలుతో నలిపేశాడు. ఈ దారుణ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఈ అనాగరికమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిపై జరిమానా విధించాలని సీఎం చౌహాన్‌ను ఎక్స్( ట్విటర్) ద్వారా కోరారు. Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64 — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 10, 2023 దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ‘అనాగరిక ఘటన తీవ్రంగా కలిచివేసిది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొంటారు’అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. -
బీజేపీకి ఓటేసినందుకు దాడి.. భద్రతకు సీఎం భరోసా
భోపాల్: బీజేపీకి ఓటేసినందుకు బావ వరుస అయ్యే వ్యక్తి తనపై దాడి చేశాడని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్‌లోని అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన సమీనా బీ అనే మహిళ డిసెంబ్ 4న బీజేపీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా గమనించిన జావేద్ ఖాన్ బీజేపీకి ఎందుకు ఓటు వేశావంటూ వేధించటం మొదలుపెట్టాడు. దుర్భషలాడిన తన బావ జావేద్‌ను ఆమె ప్రశ్నించగా.. అతడు ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆపై బీజేపీ మద్దతుగా నిలిస్తే ఊరుకోనని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇచ్చిన ఫిర్యాదుతో సెహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే ఆమె జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీన్ సింగ్‌ను కూడా కలిసి తనపై దాడి చేసిన జావేద్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలిసిన సీఎం శీవరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. ఆమె తన పిల్లలతో సీఎం చౌహాన్ కలిసి.. తాను బీజేపీ ఓటు వేసినందుకు తన బావ జావేద్ దాడి చేసినట్లు తెలిపారు. జావేద్ నుంచి తమకు భద్రత కల్పించాలని ఆమె సీఎంను కోరారు. సీఎంను కలిసిన అనంతరం సమీనా బీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించాలని సీఎం కోరినట్లు తెలిపారు. దానికి సీఎం చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. తన పిల్లల పూర్తి భద్రతకు హామీ ఇచ్చారని తెలిపారు. ఓటు ఎవరికి వేయాలనేది తన హక్కు అని చెప్పారు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించిందని అన్నారు. సీఎం శివరాజ్సంగ్ చౌహాన్.. ఎప్పుడూ తప్పు చేయరని, అందుకు ఆయన పార్టీ అయిన బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాల్లో భారీ విజయం సాధిందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. -
ఎంపీసీసీ చీఫ్ పదవికి కమల్‌నాథ్ రాజీనామా?
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. దీంతో మధ్యప్రదేశ్‌లో ఓటమికి బాధ్యతవహిస్తూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఖాళీగా మారిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మరో నేతకు అప్పగించనున్నట్లు హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమల్‌నాథ్ మంగళవారం.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఇతర సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. వారి భేటీ అనంతరం రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఢిల్లీ హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
కాంగ్రెస్ ఓటమికి వారే కారణం.. అక్కడ స్వేచ్ఛ ఇవ్వలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. కాంగ్రెస్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ... కేవలం తెలంగాణలోనే విజయం సాధించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన సునీల్ అక్కడ కాంగ్రెస్‌ను విజయతీరాలకు తీసుకెళ్లడంలో విఫలమాయ్యారు. అయితే దానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహకర్త పనిచేసినా.. ఆయా రాష్ట్రాల అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, కమల్నాథన్లు సహకరించనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌లో పలు చోట్ల సర్వేలు చేసి కొంత మంది అభ్యుర్థుల మార్పును సూచించినా అశోక్ గహ్లోత్ అంగీకరించలేదంట. అదీకాక నరేష్ అరోరా ఎన్నికల వ్యూహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సహరించినట్లుగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్‌గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేశారు. గతంలో బీజేపీకి కూడా సునీల్ పలు ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారంలో సేవలందించారు. ఉత్తరప్రదేశ్, గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఆయాన వ్యూహకర్తగా సేవలందించారు. కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. అయితే.. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం సునీల్‌కు.. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. -
BJP Win: బీజేపీ బిగ్ విన్.. రెండు రాష్ట్రాల్లో జయకేతనం
భోపాల్/జైపూర్: నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉండగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాజస్థాన్‌లో ప్రతీ ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే అనవాయితీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే అనవాయితీని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు చెక్ పెట్టి బీజేపీకి పట్టం కట్టారు ఓటర్లు. అయితే, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్లాన్ బెడిసికొట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా ప్రభావం చూపించలేకపోయింది. స్థానిక కాంగ్రెస్ నేతల్లో విభేదాలు కూడా హస్తం పార్టీ ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక, రాజస్థాన్‌లోకి గెహ్లాట్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను బీజేపీ బలంగా ముందుకు తీసుకెళ్లింది. ఇక, ప్రధాని మోదీ సహా బీజేపీ జాతీయ నేతలు కూడా రాజస్థాన్‌లో గట్టిగానే ప్రచారం చేశారు. #WATCH | #RajasthanElection2023 | The beating of drums and dancing by BJP workers continue outside the party office in Jaipur as official EC trends show the party leading on 98 of the 199 seats so far. pic.twitter.com/WYYaU8cATQ — ANI (@ANI) December 3, 2023 ‘మహిళలపై నేరాలు’ ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ఆరోపించారు. గణాంకాలు ఇవీ.. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం.. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17 శాతం పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2 శాతం తగ్గడం గమనార్హం. #WATCH | On the anniversary of the 1984 Bhopal Gas tragedy, Madhya Pradesh CM SS Chouhan says, "Such a tragedy should never get repeated. To make sure of this, there should be a balance between development and the environment. I pay my tributes to the victims of this tragedy." pic.twitter.com/NjGJ39iN6x — ANI (@ANI) December 3, 2023 ఇక, మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ దళిత యువతిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం మరోసారి బీజేపీకి అనుకూలంగానే ఓట్లు వేయడం విశేషం. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల మధ్య విభేదాలు కూడా హస్తం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. -
MP Election Results 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ గెలుపు
Live Updates.. 160 సీట్లలో బీజేపీ విజయం, మరో 3 చోట్ల ఆధిక్యం 63 చోట్ల కాంగ్రెస్ విజయం, 2 స్థానాల్లో ముందంజ 163 స్థానాల్లో బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో 155 సీట్లలో బీజేపీ విజయం, మరో 12 చోట్ల ముందంజ 61 చోట్ల కాంగ్రెస్ విజయం, 5 స్థానాల్లో ముందంజ ఒక సీటు గెలిచిన భారత్ ఆదివాసీ పార్టీ 152 స్థానాల్లో బీజేపీ విజయం మధ్యప్రదేశ్‌లో 152 సీట్లలో గెలుపొందిన బీజేపీ, మరో 12 చోట్ల ఆధిక్యం 56 చోట్ల కాంగ్రెస్ విజయం, 9 స్థానాల్లో ముందంజ ఒక చోట భారత్ ఆదివాసీ పార్టీ గెలుపు మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ 122 స్థానాలలో బీజేపీ విజయం. మరో 42 చోట్ల ఆధిక్యం 36 చోట్ల కాంగ్రెస్ గెలుపు. 29 నియోజకవర్గాల్లో ముందంజ. 60 దాటిన బీజేపీ విజయాలు ఇప్పటివరకూ 61 స్థానాల్లో బీజేపీ గెలుపు. 105 స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యం. 15 చోట్ల కాంగ్రెస్ విజయం, 48 స్థానాల్లో ముందంజ. ► మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. #WATCH | A clash broke out between BJP and Congress workers in Madhya Pradesh's Shajapur; police used lathi charge to disperse them. More details awaited. pic.twitter.com/lXBEtzumme — ANI (@ANI) December 3, 2023 మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు బీజేపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. 159 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. 62 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. భారతీయ ఆదివాసీ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. బీజేపీ తొలి విజయం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నేపానగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపు. మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు. ► మధ్యప్రదేశ్‌లో భారీలో లీడింగ్‌లో ఉన్న బీజేపీ. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. కేంద్రమంత్రి ఆశ్విణి వైష్ణవ్, పార్టీ నేతలతో సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan and Union Minister and BJP leader Ashwini Vaishnaw exchange sweets as the party leads in #MadhyaPradeshElection2023 pic.twitter.com/H2zbIatcn5 — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 164 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 63 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 2 స్థానాల్లో లీడింగ్ ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌లో దూసుకుపోంది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్తో కలిసి బీజేపీ నేతలు నరేంద్రసింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సిందియా ఇతర పార్టీ నేతలు.. సీఎం చౌహాన్ నివాసంలో కౌంటింగ్ తీరును పరిశీలిస్తున్నారు. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan along with party leaders Narendra Singh Tomar and Jyotiraditya Scindia observes election results as the counting of votes continues, in Bhopal As per ECI, the BJP is leading on 153 seats in MP. pic.twitter.com/frlpg9rpdv — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు బీజేపీ 158 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 69 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 2 స్థానంలో లీడింగ్ ► బీజేపీకి భారీ విజయం లభిస్తుందని నమ్మకం: అశ్విని వైష్ణవ్ బీజేపీకి భారీ విజయం లభించిందని, దానిపై తాము నమ్మకంగా ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించారని పేర్కొన్నారు. #WATCH | Madhya Pradesh: Union Minister and BJP leader Ashwini Vaishnaw says, "BJP has got a big victory and we were confident about it...Modi ji MP ke mann mein hain aur Modi ji ke mann mein MP hai..." pic.twitter.com/uR44egMD7V — ANI (@ANI) December 3, 2023 ► ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుంది: సీఎం శివరాజ్ మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్ ఉన్నట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన ప్రజల హృదయాలను కదిలించారని, దాని ఫలితం ఇదేనని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి, మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పథకాలు కూడా ప్రజల హృదయాలను హత్తుకున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఒక కుటుంబంగా మారిందని, ప్రజలు తమపై ఉన్న ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుందని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. అది ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. #WATCH | #MadhyaPradeshElections2023 | Incumbent CM Shivraj Singh Chouhan says, "Modi ji MP ke mann mein hain aur Modi ji ke mann mein MP hai. He held public rallies here and appealed to the people and that touched people's hearts. These trends are a result of that. Double-engine… pic.twitter.com/MHOUthgsR — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 150 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 64 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 1 స్థానంలో లీడింగ్ ► మధ్యప్రదేశ్ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్: వీడి శర్మ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి మోదీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్తల కృషితో ప్రతి బూత్‌లో 51% ఓటింగ్ తీర్మానాన్ని నెరవేరుస్తున్నందుకు తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను చూసి ప్రజలు ప్రధాని మోదీని ఆశీర్వదించారని తెలిపారు. #WATCH | #MadhyaPradeshElections2023 | As BJP crosses the halfway mark and leads on 133 seats in the state as per official EC trends, Madhya Pradesh BJP president VD Sharma says, "We had said 'Madhya Pradesh ke mann mein Modi aur Modi ke mann mein Madhya Pradesh' - people blessed… pic.twitter.com/EWl9zYkijP — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 148 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 60 స్థానాల్లో లీడింగ్ బీఎస్పీ 1 స్థానంలో ముందంజ. ► ఇలాంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కాకూడదు: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కావొద్దని సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి విషాదం పునరావృతం కావొద్దని, దానిని నిర్ధారించడానికి, అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు. బాధితులకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన తెలిపారు. #WATCH | On the anniversary of the 1984 Bhopal Gas tragedy, Madhya Pradesh CM SS Chouhan says, "Such a tragedy should never get repeated. To make sure of this, there should be a balance between development and the environment. I pay my tributes to the victims of this tragedy." pic.twitter.com/NjGJ39iN6x — ANI (@ANI) December 3, 2023 ► బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుంది: నరోత్తమ్ మిశ్రా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి, దతియా సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. #WATCH | #MadhyaPradeshElections2023 | State Home Minister and BJP candidate from Datia, Narottam Mishra says, "BJP will win 125-150 seats. Not only in Madhya Pradesh but the BJP will also form government in Rajasthan and Chhattisgarh..." pic.twitter.com/wzmOtoxTYc — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 133 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్ 52 స్థానాల్లో లీడింగ్. ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ కొనసాతున్న క్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా భోపాల్‌లోని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజ. #WATCH | Madhya Pradesh | Union Minister and BJP leader Jyotiraditya Scindia arrives at the residence of incumbent Chief Minister Shivraj Singh Chouhan, in Bhopal. As per the latest official EC trends, BJP is leading on 73 seats and Congress on 28 in the state. pic.twitter.com/q9beNm7ybh — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం: ప్రహ్లాద్ సింగ్ పటేల్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని కేంద్రమంత్రి, నర్సింగపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గతం కంటే ఈసారి మెరుగ్గా పనిచేస్తామని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వస్తున్న ట్రెండ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. #WATCH | Union Minister and BJP candidate from Narsinghpur says, "I have always said that in Madhya Pradesh, the BJP will come to power with a huge mandate... I had already said that we would perform better in the elections in five states than last time. The trends that are… pic.twitter.com/tr0oy3kRp7 — ANI (@ANI) December 3, 2023 ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజ. In initial trends, BJP leading on 73 seats, Congress on 28 seats in Madhya Pradesh pic.twitter.com/ESwsSQqkwy — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కమల్ నాథన్ భోపాల్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమై కౌంటింగ్ ట్రెండ్‌ను పరిశీలిస్తున్నారు. ►బీజేపీ 37 స్థానాల్లో లీడింగ్. ► కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజ. #WATCH | Madhya Pradesh Congress president Kamal Nath and other leaders of the party gather at the state party office in Bhopal. As per the latest official EC trends, BJP is leading on 37 seats and the Congress on 7 seats in the state. pic.twitter.com/MNGpStJQcN — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడ్ మధ్యప్రదేశ్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటి వరకు బీజేపీ.. 13 కాంగ్రెస్.. 2 #WATCH | Counting of votes underway for #MadhyaPradeshElections2023. Visuals from a counting centre in Chhatarpur. As per the latest official EC trends, BJP is leading on 13 and Congress on 2 seats here. pic.twitter.com/cWxKEWo6eF — ANI (@ANI) December 3, 2023 ► పోస్టల్ బ్యాలెట్లో సాగర్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. షాజాపూర్‌లో బీజేపీ 5,645 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో కాంగ్రెస్‌కు 4,392 ఓట్లు వచ్చాయి. శివపురిలో బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్ 2,322 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దామోలోని జబేరా అసెంబ్లీ స్థానం నుంచి ధర్మేంద్ర సింగ్ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్లో ధర్మేంద్ర సింగ్‌కు 4,272 ఓట్లు, ప్రతాప్ సింగ్‌కు 2,425 ఓట్లు, వినోద్ రాయ్‌కు 1,431 ఓట్లు వచ్చాయి. జైత్‌పూర్‌లోని షాదోల్ నుంచి కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలీరాజ్‌పూర్‌లో బీజేపీ 2,200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. జోబాట్‌లో కాంగ్రెస్ 1,100 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఖర్గోన్లో బీజేపీ అభ్యర్థి బాలకృష్ణ పటీదార్ ఆధిక్యంలో ఉన్నారు. భగవాన్పురా కాంగ్రెస్‌కు చెందిన కేదార్ డాబర్ ముందంజలో ఉన్నారు. కస్రవాడలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సచిన్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. షాదోల్ జిల్లా జైసింగ్ నగర్లో బీజేపీ ముందంజలో ఉంది. సాంచిలోని రైసన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. భోజ్‌పూర్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఉదయపురాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సిల్వానీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ► జబల్పూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన నివాసంలో.. విజయం సాధించాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు. ► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్స్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఇక్కడ 216 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 126 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► జబల్పూర్ జిల్లాలోని పటాన్ స్థానంలో బీజేపీ 2811 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నార్త్ సెంట్రల్ అసెంబ్లీలో బీజేపీ 3311 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బార్గీలోనూ బీజేపీ ముందంజలో ఉంది. చింద్వారాలో బీజేపీకి చెందిన మోనికా బట్టీ అమరవారా ముందంజలో ఉన్నారు. చౌరాయ్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. సౌసర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. చింద్వారాలో కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ముందంజలో ఉన్నారు. పాంధుర్ణంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బుర్హాన్పూర్లో బీజేపీ అభ్యర్థి అర్చన చిట్నీస్ తొలి రౌండ్లో ముందంజలో ఉన్నారు. ఖర్గోన్ జిల్లాలోని కస్రావాడ్ నుంచి బీజేపీ 821 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నర్సింగపూర్‌లో తొలి రౌండ్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ఒక బూత్‌లో 47 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► తొలి ట్రెండ్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 208 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► సెహోర్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. సెహోర్ అసెంబ్లీలో బీజేపీ 163 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అష్టాలో కాంగ్రెస్ 341 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బుద్నీలో సీఎం శివరాజ్ ముందంజలో ఉన్నారు. ఇచ్ఛావర్‌లో తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ► గ్వాలియర్‌లోని దబ్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే వెనుకంజలో ఉన్నారు. గ్వాలియర్ రూరల్ స్థానంలో బీజేపీకి చెందిన భరత్ సింగ్ కుష్వాహ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాహిబ్ సింగ్ గుర్జార్ ముందంజలో ఉన్నారు. గ్వాలియర్-ఈస్ట్ స్థానంలో బీజేపీకి చెందిన మాయా సింగ్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ సతీష్ సికార్వార్ ముందంజలో ఉన్నారు. పన్నాలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో ఉంది. పొవాయ్ స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. షాదోల్‌లోని బియోహరి స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. బర్వానీలోని సెంద్వా స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ► మధ్యప్రదేశ్‌లో బీజేపీ సంచలనం సృష్టిస్తొంది. 137 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుణ జిల్లా రఘోఘర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జైవర్ధన్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా ప్రజానీకం తమ వెంటే ఉన్నారని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఎన్ని సీట్లు వస్తాయనేది నేనేమి చెప్పాలేను. మేమైతే విజయంపై నమ్మకంగా ఉన్నామన్నారు. ► మధ్యప్రదేశ్‌లో 113 సీట్ల తొలి ట్రెండ్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గ్వాలియర్‌లో పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ► మధ్యప్రదేశ్‌లో తొలుత 42 సీట్ల ట్రెండ్ వెలువడింది. బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాతియాకు చెందిన నరోత్తమ్ మిశ్రా ప్రారంభ ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు. ► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్ మొదలైంది. ఈ ధోరణి కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా మొరెనా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తెరిచారు. రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ►కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ముందు నుంచి నేను ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీజేపీ గెలిచే అవకాశమే లేదు. #WATCH | Counting of votes | Bhopal, Madhya Pradesh: Senior Congress leader Digvijaya Singh says, "...I had said this earlier and I say it today as well - 130 plus. We are getting 130 seats, rest is to be seen." On incumbent CM Shivraj Singh Chouhan, he says, "Not only is his… pic.twitter.com/y1NhF5f36R — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. Counting of votes for Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana Assembly elections begins. pic.twitter.com/Raj87zBuaI — ANI (@ANI) December 3, 2023 ►కౌంటింగ్ వేళ కాంగ్రెస్ నేతల హంగామా.. #WATCH | Music, dance and celebrations outside the Congress headquarters in Delhi, ahead of the counting of votes for the four-state elections. pic.twitter.com/ex9OmkBwFQ — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. Counting of votes in 4 States today Congress leader PC Sharma in Bhopal says, "The party will win 135-175 seats in Madhya Pradesh." pic.twitter.com/ObENIXU1x3 — ANI (@ANI) December 3, 2023 #WATCH | Bhopal, Madhya Pradesh: On counting of votes, BJP candidate Rameshwar Sharma says, "There will be a shower of blessings & BJP government will be formed...What has Congress given to the people in its 62 years of politics?..." pic.twitter.com/9Q6VjqY7um — ANI (@ANI) December 3, 2023 #WATCH Bhopal, Madhya Pradesh: On counting of votes, BJP leader Arvind Singh Bhadoria says, "With the blessings of the public, the BJP government is going to be formed in Madhya Pradesh under the leadership of Shivraj Singh. If there was anyone who stood in the interests of the… pic.twitter.com/03LqAO9ftk — ANI (@ANI) December 3, 2023 ►మధ్యప్రదేశ్‌లో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. ►2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116 -
Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం!
భోపాల్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట కాబోయే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శుభాకాంక్షలు అంటూ పోస్టరు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లో 230 శాసనసభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. కాగా గురువారం విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఎగ్జిట్‌పోల్స్‌తో సంబంధం లేకుండా ఎవరికివారే తమ పార్టీలు గెలుస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రకటన చేస్తున్నారు. తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్.. తనకు రాష్ట్ర ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉందని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. A poster congratulating Kamal Nath and portraying him as the next Chief Minister of Madhya Pradesh has been put up by a Congress worker outside the Congress office in Bhopal. pic.twitter.com/pX41zyoZgg — ANI (@ANI) December 2, 2023 -
గెలుపు కోసం పూజలు చేస్తున్న అభ్యర్థులు..ఏకంగా రెండు నెలల నుంచి..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ఎన్నికలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇవాళ(గురువారం) తెలంగాణలో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే రాజకీయనాయకులు ఎన్నికల్లో గెలుపుకోసం, అధికారం కోసం రకరకాల పూజలు హోమాలు చేస్తంటారనేది సాధరణ విషయమే. కానీ ఇటీవలేఓ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మధ్యప్రదేశ్‌లోని కొందరూ రాజకీయ నాయకులకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పండిట్ బతుక్ ఆచార్య అనే సిద్ధాంతి, అతడి సహచరులు పోలింగ్ ముగిసిన మూడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల కోసం గత రెండు నెలలుగా రహస్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా నాయకులంతా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీచేస్తున్నారని అన్నారు. దాదాపు 18 మంది అభ్యర్థుల కోసం తమ శిష్యులు గత రెండు నెలలుగా రహస్య పూజలు పారాయణాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని తమ శిష్యులంతా ఆయా అభ్యర్థుల విజయం కోసం శ్రద్ధగా మంత్రలు పఠిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం పూజలు, ప్రార్థనలు చేయడం అనేవి భారత రాజకీయ నాయకులు ప్రబలంగా ఉన్న సంప్రదాయం, నమ్మకమూ కూడా. కాగా, గత నెలలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తమ పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రజలతో మమేకమై వారికి మేలు చేసే పనులపై దృష్టి సారిస్తే..కొందరూ రాజకీయ నాయకులు గెలుపు కోసం తాంత్రిక పూజలు చేసే పనుల్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అది నిజం అనేలా ఈ ఆసక్తికర ఘటన తెర పైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం! అధికారులే తెరిచారని..) -
మధ్యప్రదేశ్‌లో అక్కడ మళ్లీ పోలింగ్!
మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భింద్‌లోని కిషుపురాలో పోలింగ్ కేంద్రం నెంబర్ 71 బూత్‌లో కొందరు అధికారులు ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ్ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్‌లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్ వర్కర్ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్ 17వ తేదిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి) -
కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్-బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఇక, తాజాగా బీజేపీ మంత్రి గోపాల్ భార్గవపై కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. తన మద్దతుదారుల వాహనాలపై దాడి చేసి వారిని చంపే ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత పలు చోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని గఢకోట్ల వద్ద కాంగ్రెస్ మద్దతుదారులపై శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్ మాట్లాడుతూ..‘బీజేపీ మంత్రి గోపాల్ భార్గవ, ఆయన కుమారుడు అభిషేక్ భార్గవ కలిసి కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడ్డారు. నాపై, నా మద్దతుదారులపై దాడులకు వారు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్లతో దాడులు చేశారు. కాల్పులకు తెగబడ్డారు. బీజేపీ నేతల దాడుల్లో నేను చనిపోయినా, గాయపడినా వారిద్దరే బాధ్యులు’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ మద్దతుదారులు దాడులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. BIG BREAKING: #MPElections2023 📍Madhya Pradesh Narendra Modi says "Beti Bachao" But today, goons, gangsters of BJP minister Gopal Bhargava attacked, open fired, threatened Rehli Congress candidate Jyoti Patel. Sources says, Gopal Bhargava's son Abhishek Bhargava is present… pic.twitter.com/8GIH9s5Slq — Liz/Barsha (@debunk_misinfos) November 18, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతల వాహనాలపై రాళ్ల దాడులు జరగడంతో హస్తం పార్టీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లోకేష్ సిన్హా స్పందించారు. రెండు పార్టీల నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
‘స్మార్ట్’ పోలింగ్ స్టేషన్ ప్రత్యేకతలేమిటంటే?
ఇండోర్: ఓటర్లు క్యూలో నిలబడే అవసరం లేకుండానే ఓటేయొచ్చు.., అక్కడే సిరా గుర్తున్న వేలు చూపుతూ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెమెరా ద్వారా సెల్ఫీ తీసుకోవచ్చు..! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలింగ్ బూత్ ప్రత్యేకతలివీ. నంద నగర్ నియోజకవర్గంలోని ‘మా కనకేశ్వరి దేవి’గవర్నమెంట్ కాలేజీ బూత్‌లో ఈ ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ‘ఓటర్ల క్యూ పెద్దగా అవసరం లేకుండా చేసేందుకు ఆన్లైన్ టోకెన్ విధానాన్ని తీసుకొచ్చాం. పోలింగ్ బూత్‌కు వచ్చిన వెంటనే ఓటర్లకు టోకెన్లు అందజేశాం. దీంతో, తమ వంతు వచ్చే వరకు వారు పోలింగ్ బూత్ వద్దే కూర్చోవచ్చు’అని రాష్ట్ర ప్రభుత్వ ఇండోర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్‌కు చెందిన అసిస్టెంట్ ప్లానర్ రుపాల్ చోప్రా పీటీఐకి చెప్పారు. ‘పోలింగ్ స్టేషన్ ఆవరణలోనే ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేశాం. ఓటేసిన వారు ఆ పాయింట్ వద్ద నిలబడి ఇంక్ గుర్తున్న వేలిని చూపితే చాలు వెంటనే కెమెరా క్లిక్‌మనిపిస్తుంది’అని ఆమె వివరించారు. ‘అక్కడే ఉన్న స్క్రీన్‌పై బార్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఓటర్ తన ఫోన్‌తో స్కాన్ చేస్తే ఫొటో వెంటనే మొబైల్‌లోకి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలోకి సైతం షేర్ అవుతుంది’అని రుపాలి పేర్కొన్నారు. -
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్
Updates.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్ ►మధ్యప్రదేశ్‌లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు ►ఛత్తీస్‌గఢ్‌లో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఇలా.. ►ఛతీస్‌గఢ్‌లో 38.22 శాతం. ►మధ్యప్రదేశ్‌లో 45.40 శాతం. 38.22% voter turnout recorded till 1 pm in the second phase of voting in Chhattisgarh and 45.40% in Madhya Pradesh. pic.twitter.com/FIR1pFdvp0 — ANI (@ANI) November 17, 2023 ► కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. #WATCH | Gwalior, Madhya Pradesh: After casting his vote, Union Minister and BJP candidate Narendra Singh Tomar says, "There is a wave of BJP in Madhya Pradesh, the atmosphere is in favour of BJP and people are liking the schemes and development works of the Central Government… pic.twitter.com/n4qrvo4JIu — ANI (@ANI) November 17, 2023 ►ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అంబికాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌మోహినీ దేవి బాలిక కళాశాలలో ఓటు వేశారు. #WATCH | Ambikapur: Chhattisgarh Deputy CM and Congress candidate from Ambikapur, TS Singh Deo casts his vote at a polling booth in Rajmohini Devi Girls College. pic.twitter.com/TV2awQRSOS — ANI (@ANI) November 17, 2023 ►ఓటు వేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్. ►ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒకరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి యువత ముందుకు రావాలన్నారు. #WATCH | Chhattisgarh Elections | Governor Biswabhusan Harichandan cast his vote at a polling booth in Raipur. pic.twitter.com/aPgQNttHMO — ANI (@ANI) November 17, 2023 ►ఓటు వేసిన మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ 163 నంబర్ బూత్‌లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Former Lok Sabha Speaker Sumitra Mahajan casts her vote at polling booth number 163 in Indore.#MadhyaPradeshElection2023 pic.twitter.com/eqgWsUSrrS — ANI (@ANI) November 17, 2023 ►ఓటు వేసిన మాజీ సీఎం ఉమా భారతి. ఆమె స్వగ్రామం దుండా ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Madhya Pradesh Elections | Former Chief Minister and senior BJP leader Uma Bharti cast her vote at her native place Dunda, Tikamgarh today. pic.twitter.com/vsxHvj1a58 — ANI (@ANI) November 17, 2023 ►మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ►ఉదయం 9 గంటల వరకు 11.13 శాతం ఓటింగ్ నమోదైంది. ► దిమాని అసెంబ్లీ సెగ్మెంట్‌ళోని రెండు పోలింగ్ బూత్‌లపై రాళ్ల దాడి, ఒకరికి గాయాలు. ► కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్, ఇతర బీజేపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►సీఎం శివరాజ్ సింగ్ ప్రత్యేక పూజలు ►మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ పోలింగ్ సందర్బంగా ప్రత్యేక పూజలు. సెహోర్‌లో నర్మదా ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH | Madhya Pradesh Elections | MP CM Shivraj Singh Chouhan offers prayers at Narmada Ghat in Sehore. pic.twitter.com/iA6A4Dm00C — ANI (@ANI) November 17, 2023 ఓటు వేసిన కమల్‌నాథ్ ►మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి కమల్‌నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ►వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. #WATCH | Madhya Pradesh Elections | State Congress president and party's candidate from Chhindwara, Kamal Nath casts his vote at a polling booth here. pic.twitter.com/L7nAyC2NCR — ANI (@ANI) November 17, 2023 ►ఇండోర్-1 బీజేపీ అభ్యర్థి కైలాశ్ విజయ్‌వర్గీయ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. #WATCH | Madhya Pradesh Elections | BJP candidate from Indore-1, Kailash Vijayvargiya and his wife Asha Vijayvargiya cast their vote at a polling booth in Indore. pic.twitter.com/Mzzz3u6V4J — ANI (@ANI) November 17, 2023 ►కాంగ్రెస్ అభ్యర్థి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలుస్తుంది. నాకు ప్రజల మీద నమ్మకముంది. బీజేపీ శివరాజ్‌సింగ్‌లా మేము ఇన్ని సీట్లలో గెలుస్తాము అని చెప్పను. ఎన్ని స్థానాల్లో గెలుపు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో పోలీసులు, వ్యవస్థ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరికొన్ని గంటలు మాత్రమే వారు ఇలా చేయగలరు. తర్వాత అంతా మారిపోతుంది. వారు డబ్బులు, లిక్కర్ పంచుతున్నట్టు నిన్ని నాకు కొన్ని కాల్స్, వీడియోలు వచ్చాయి. #WATCH | Madhya Pradesh Elections | State Congress president and party's candidate from Chhindwara, Kamal Nath says, "I have faith in the entire state that they will side with the truth. I trust the public, the voters. I am not Shivraj Singh that I will say that we will win these… pic.twitter.com/HtzQ2Ql0OR — ANI (@ANI) November 17, 2023 ►ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి.. ►ఓటు వేసేందుకు ఉదయాన్నే వచ్చిన ఓటర్లు.. #WATCH | Madhya Pradesh Elections | People queue up outside polling stations as they await their turn to cast a vote. Visuals from a polling station in Bhopal. pic.twitter.com/S2dOe5m390 — ANI (@ANI) November 17, 2023 #WATCH | Madhya Pradesh Elections | An elderly voter shows her inked finger after casting her vote at a polling booth in Gwalior. pic.twitter.com/ZnSA5RHDxp — ANI (@ANI) November 17, 2023 ►కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ప్రహ్లద్ పటేల్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100 శాతం పోలింగ్ నమోదు కావాలి ఇది నా విజ్ఞప్తి. ఐదోసారి రాష్ట్రంలో బీజేపీ గెలవబోతుంది. మాకు ఫుల్ మెజార్టీ వస్తుంది. #WATCH | Madhya Pradesh Assembly elections | Union Minister and BJP candidate from Narshinghpur, Prahlad Patel says, "...I urge all the people of Madhya Pradesh to touch the goal of 100% voting...I request them to vote together for development...We will come to power for the… pic.twitter.com/yb18qehBZe — ANI (@ANI) November 17, 2023 ►ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిగిలిన 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మీరు వేసే ఒక్క ఓటు.. రాష్ట్రంలో రైతులు, యూత్, మహిళల భవిష్యత్త్‌కు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఓటు వేయండి. ఛత్తీస్‌గఢ్ బంగారు భవిష్యత్త్ కోసం ఓటు వేయండి. #WATCH | | Chhattisgarh Elections 2023 | CM Bhupesh Baghel says, "Today polling will happen for the remaining 70 seats...Your one vote will decide the future of youth, farmers, women...Please move out of your homes to vote...Vote for the betterment of Chhattisgarh." pic.twitter.com/Fgw59Q439x — ANI (@ANI) November 17, 2023 ►మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం. Voting begins for the Madhya Pradesh Assembly elections, 230 assembly seats in the fray. pic.twitter.com/To0rATZpNV — ANI (@ANI) November 17, 2023 ►ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. #WATCH | Madhya Pradesh Elections 2023 | Preparation, mock poll underway as voting for #MadhyaPradeshElections2023 will begin at 7am today in the Sausar assembly constituency of Chhindwara district. pic.twitter.com/JBmEIJY29r — ANI (@ANI) November 17, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లకు గాను రెండో, తుది దశలో భాగంగా 70 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. #WATCH | Madhya Pradesh Elections 2023 | District Election Officer, Ashish Singh says, "Bhopal has a total of 2049 polling booths. We have checked all the facilities at the polling booth...Around 17,000 workers were trained by us. Security arrangements are tight in all the… pic.twitter.com/bDy17B5gdW — ANI (@ANI) November 17, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి దశలో 20 నక్సల్స్ ప్రాబల్య స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్‌లో.. మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కుప్పకూలింది. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ రెండింటితో పాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా మరోసారి గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రెండో దశలో... రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ ఐదేళ్లలో సీఎం భూపేశ్ బఘెల్ పలు ప్రజాకర్షక పథకాలతో రైతులతో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వచ్చారు. అనంరం ఉప ఎన్నికల విజయాలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి. -
'పొట్టివాడే కానీ..' సింథియాపై ప్రియాంక గాంధీ ఫైర్
భోపాల్: బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింథియాను ద్రోహిగా పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిట్లు చెప్పిన ప్రియాంక గాంధీ.. పొట్టిగానే ఉంటాడు కానీ.. అహంకారం మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 'ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మహారాజ్ అని పిలవాలి. లేకపోతే ఆయన పెద్దగా స్పందించరు. మన సమస్యలు పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు. కానీ గ్వాలియర్, చంబా ప్రజలకు మాత్రం సింథియా ద్రోహం చేశారు.' అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సింథియా కూడా కాంగ్రెస్‌పై ఇటీవల తీవ్రంగా ఆరోపణలు చేశారు. మహిళలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పతనమైందని అన్నారు. 2018లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సీఎం సీటు విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. కమల్‌నాథ్‌కు సీఎం పదవి ఇవ్వడంలో సింథియాను ఒప్పించింది అధిష్ఠానం. కానీ కొన్ని నెలల్లోనే సింథియా అసంతృప్తితో బీజేపీ గూటికి చేరారు. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. ఈ క్రమంలో నేడే ప్రచారానికి తెరపడింది. ఇదీ చదవండి: Madhya Pradesh Election: ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు! -
పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..
రోగుల ప్రాణాలు కాపాడే వైద్యుడైన మృత్యువుకి బలవ్వాల్సిందే. ఒక్కొసారి మృత్యువు ఎలా వస్తుందో తెలియదు. చూస్తుండగానే కబళించేసి తన పని చేసుకుని వెళ్లిపోతుంది. తేరుకునేలోపే కథ అయిపోతుంది అదే కథ జీవితం!. అసలేం జరిగిందంటే..ఓవైద్యుడు పేషెంట్‌కి చికిత్స చేస్తూ కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది. 38 ఏళ్ల దిలీప్ కుమార్ కుష్వాహా తన క్లినిక్ రోగికి చికిత్స అందిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ వైద్యడు రోగిని తనిఖీ చేస్తుండగా ఛాతి నొప్పితో విలవిలలాడుతు కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ వైద్యుడు షాహదోల్ జిల్లాలో కేస్వాహి గ్రామంలో తన క్లినిక్ నడుపుతూనే సామాజిక సేవలో చొరవ చూపేవాడని పలువురు చెబుతున్నారు. రోగులకు ఉచిత వైద్య అందించడమేగాక ఉచితంగా మందులు కూడా ఇచ్చేవాడని సన్నిహితులు తెలిపారు. పేషెంట్ల ట్రాన్స్పోర్ట్ చార్జీలు సైతం అతనే చెల్లించేవాడని అంటున్నారు. ఈ రోజుల్లో ఇలా ప్రజలకు ఇలాంటి మెరుగైన సేవలందించే వ్యక్తే మృత్యువు కబళించడం అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. (చదవండి: వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్! మొత్తం కంటినే మార్పిడి..) -
పార్టీలన్నింటికీ... నవంబర్ పరీక్ష...!
ఐదు రాష్ట్రాలు. వాటిలో నాలుగు కీలక రాష్ట్రాలు. మొత్తం 16 కోట్ల పై చిలుకు ఓటర్లు. దాదాపు 650 పై చిలుకు అసెంబ్లీ స్థానాలు. ఎంతోమంది వెటరన్ నాయకులకు కీలక పరీక్ష. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముంగిట మోదీ సారథ్యంలోని బీజేపీకి, దాని ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో పుట్టుకొచ్చిన విపక్ష ఇండియా కూటమి సత్తాకూ అగ్నిపరీక్ష! ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఇలా ఎన్నో రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటి ఫలితాలపైనా సర్వత్రా అంతే ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే నవంబర్ కీలకంగా మారనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయనున్నాయి. అందుకే వీటి ఫలితాలను తమకు అనువుగా మార్చుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని ఏమీ లేదు. ఉదాహరణకు 2018లో ఇలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మూడింట్లోనూ కాంగ్రెస్సే నెగ్గింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది కేవలం మూడంటే మూడు! ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కచ్చితంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు మూడ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు... కాంగ్రెస్: కర్ణాటకలో మాదిరిగా రాష్ట్రాలవారీగా సామాజిక, ఆర్థిక, సంక్షేమ పథకాల ప్రకటన... ఓబీసీలను బీజేపీకి దూరం చేసేందుకు జాతీయ స్థాయిలో కులగణనకు డిమాండ్ స్థానికాంశాలకు ప్రాధాన్యం. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికల్లో వీలైనంత వరకు స్థానిక ముఖ్య నేతలకు నిర్ణయాధికారం. బీజేపీ: నరేంద్ర మోదీ ఛరిష్మాను ఓట్లుగా మార్చుకునేలా ప్రచారం... కేంద్ర మంత్రులతో పాటు పేరున్న సీనియర్ ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు జీ20 సదస్సు ఘనవిజయం, మహిళా బిల్లు, ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు వంటి ప్రచారాలు ఈ సీనియర్లకు పెను పరీక్ష తాజా అసెంబ్లీ ఎన్నికలు ఎంతోమంది వెటరన్ నాయకుల భవితవ్యాన్ని తేల్చేయనున్నాయి. బీజేపీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్తాన్‌లో వసుంధర రాజె, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే తెలంగాణలో భారాస అధినేత కేసీఆర్, మిజోరంలో సీఎం జోరాంతంగా ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పుట్టుకొచ్చిన ఇండియా కూటమికి ఈ ఎన్నికలు తొలి అగ్నిపరీక్ష కానున్నాయి. 2018లో 5 రాష్ట్రాల్లో పార్టీలవారీ ప్రదర్శన పార్టీ స్థానాలు ఓట్ల శాతం కాంగ్రెస్ 306 45 బీజేపీ 199 29 ఇతరులు 174 26 అంకెల్లో ఎన్నికలు... అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంల్లో మొత్తం లోక్‌సభ స్థానాలు 83 మొత్తం అసెంబ్లీ స్థానాలు 679 మొత్తం ఓటర్లు 16.1 కోట్లు మహిళా ఓటర్లు 7.8 కోట్లు తొలిసారి ఓటర్లు 62 లక్షలు ఇదీ చదవండి: చీలిక దిశగా జేడీ(ఎస్)? -
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్‌మీట్..
సాక్షి, ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది. వివరాల ప్రకారం.. నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. #Election2023 Election dates for Mizoram, Chhattisgarh,Madhya Pradesh, Rajasthan & Telangana to be announced today at 12 noon by Election Commission of India. pic.twitter.com/YTOrIPlLo4 — Aishwarya Paliwal (@AishPaliwal) October 9, 2023 ఇక, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. -
సీఎం శివరాజ్‌సింగ్ భావోద్వేగం.. బీజేపీని గెలిపిస్తారా? అంటూ..
భోపాల్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రచారంలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిండోరిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ప్రజలను కోరారు. తాను మంచి ప్రభుత్వాన్నే నడుపుతున్నానా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా? ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీనే విజయం సాధించాలని ఆశిస్తున్నారా?. ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగాలని కోరుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక, సీఎం శివరాజ్‌సింగ్ అడిగిన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. అనంతరం పోటీ చేసేందుకు తాము ప్రజల అనుమతి తీసుకుంటామని సీఎం విలేకరులతో తెలిపారు. అంతకుముందు కూడా.. కొన్ని సమావేశాల్లో సీఎం చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. సొంత నియోజకవర్గం బుధ్నిలో తనను ఎన్నికల్లో పోటీ చేయమంటారా అని ప్రజలను అడిగిన విషయం తెలిసిందే. మరోవైపు.. మధ్యప్రదేశ్ పర్యటనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ధార్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎంపై శివరాజ్ సింగ్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ.. సీఎం గురించి మాట్లాడేందుకు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. సీఎం పేరు ప్రస్తావించకుండానే ఓట్లు అడుగుతున్నారని అన్నారు. దీని బట్టి వచ్చే ఎన్నికల్లో సీఎం ఓటమి చవిచూడడం ఖాయమని ప్రియాంక ఎద్దేవా చేశారు. -
నల్ల పసుపు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు చెక్ పెడుతుందంటే..
పసుపు, వాటి దుంపలు మనం చూశాం. అది ఎన్ని ఔషధ గుణాలు కలిగిందో కూడా తెలుసు. కానీ నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా! అది కూడా మనం వాడే పసుపుకు ఎంతో విభిన్నంగా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. నల్ల పసుపును సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య, మధ్యప్రదేశ్‌లో పండిస్తారు. నల్ల పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. మణిపూర్, మరికొన్ని రాష్ట్రాల్లోని గిరిజన తెగల్లో ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. నల్లపసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో క్యాన్సర్ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. నల్ల పసుపు మీ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.వివిధ ఆరోగ్య సమస్యలు ఉపశమనానికి ఎంతో దోహదం చేసే పసుపు క్యాన్సర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని గత పరిశోధనలు చెప్పాయి. అయితే తాజాగా జీర్ణాశయ క్యాన్సర్‌ని నయం చేసే శక్తి పసుపు ఉన్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులుజీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు. సాధారణంగా పసుపు నల్ల మిరియాలు కలిపిన వేడి పాలను తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది అనేది అనాదిగా మనందరికీ తెలిసిన చిట్కా. భారతదేశంలో వేల ఏళ్ళుగా ఈ చిట్కాను అనుసరిస్తున్నారు. నల్ల పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు నల్ల పసుపులోని రైజోమ్ చేదు రుచిని కలిగి ఉంటుంది. దీన్ని ల్యూకోడెర్మా (మెలనిన్పిగ్మెంటేషన్కోల్పోవడం) మరియు పైల్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ పసుపు మిశ్రమం బెణుకులు, గాయాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. గిరిజన స్త్రీలు రుతు క్రమ రుగ్మతలకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని సాంప్రదాయకంగా గిరిజన ప్రజలు జ్వరం, వాంతులు, విరేచనాలు, కణితులు, లైంగిక వ్యాధులు, మంట మొదలైనవాటి చికిత్సకు ఉపయోగిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆది తెగవారు నల్ల పసుపు రైజోమ్‌ను యాంటీ డయేరియాటిక్గా ఉపయోగిస్తున్నారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లాకు చెందిన ఖమ్మం తెగవారు నల్ల పసుపు దుంప తాజాపేస్ట్ను తేలు, పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నల్ల పసుపు బెండులను తరచుగా న్యుమోనియా, దగ్గు మరియు పిల్లలలో జలుబు కోసం కూడా చికిత్సకు ఉపయోగిస్తారు. రైజోమ్లు ల్యూకోడెర్మా, మూర్ఛ,క్యాన్సర్ మరియు హెచ్ఐవి / వ్యతిరేకంగా పని చేస్తాయి. మైగ్రేన్ నుంచి ఉపశమననాకి ఉపయోగిస్తారు. అస్సాంలో తాజా రైజో మ్రసాన్ని ఆవాల నూనెతో కలిపి పశువుల విరేచనాల చికిత్సకు ఉపయోగిస్తార (చదవండి: ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?) -
హైస్పీడ్‌లో రయ్‌మని చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 25 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఈ క్రమంలో అతి వేగంతో ఉన్న బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెరువులోకి దూసుకెళ్లింది. ఇక, ఈ ఘటనను బస్సు వెనకాలే ఉన్న ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు తెలిపారు. అయితే, బస్సు చెరువులో పడిపోయిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. దీంతో, ప్రాణ నష్టం తప్పింది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WATCH - On Cam: Bus carrying passengers falls into river in Khargone, several injured.#Accident #Khargone pic.twitter.com/QbzQC3yFUu — TIMES NOW (@TimesNow) September 29, 2023 -
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా
ఢిల్లీ: ప్రతీకార రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లపై తనకు ఎలాంటి పగ లేదని చెప్పారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తినని ఆయన అన్నారు. 2018లో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కమల్‌నాథ్‌ను సీఎంగా ప్రకటించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సింథియా చెప్పారు. సీఎం రేసులో తాను ఎప్పుడూ లేనని స్పష్టం చేశారు. పైగా కమల్‌నాథ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తాను కూడా మద్ధతు తెలిపినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దోపిడీ పాలన జరిగిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అన్ని వాగ్దానాలను మరిచిపోయారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్‌నాథ్‌ను అధిష్ఠానం సీఎంగా నిర్ణయించింది. 2020లో జ్యోతిరాదిత్య సింథియా 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లా ఆడగలను.. భవిష్యత్పైనే తనకు దృష్టి ఉంటుందని సింథియా అన్నారు. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లాగా తాను ఆడగలనని అన్నారు. ఒకవేళ తాను అలా ఆడకపోయి ఉంటే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయేది కాదని అన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపులో ఉండే అర్హత సంస్కృతిపై సింథియా మండిపడ్డారు. బీజేపీలో కష్టపడ్డవారికే ఫలితం ఉంటుందని, కాంగ్రెస్‌లో అలా కాదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
రూ. 1500 కోట్ల పెట్టుబడి.. ఐటీసీ ఆలోచన ఏంటంటే?
సెహోర్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ & స్థిరమైన ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు 'ఐటిసి' తాజాగా వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం వల్ల.. రాష్ట్రంలో వ్యవసాయ, తయారీ రంగాలకు మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శివరాజ్ సింగ్ చౌహాన్' ఈ ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. బడియాఖేడిలోని రెండు కర్మాగారాలకు భూమి పూజ జరిగింది. ఇక్కడ దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి జరగబోతోంది, దీని వల్ల దాదాపు 5000 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. మనం పండించే ప్రతిదానికి ఇక్కడే సరైన ధర లభించేలా.. మన పిల్లలకు ఇక్కడే ఉపాధి కల్పించేలా చేయడమే లక్ష్యమని కూడా శివరాజ్ తెలిపారు. వ్యవసాయానికి పరిమితులున్నాయి, కావున శాశ్వత ఉద్యోగావకాశాలు లభించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. దీని కోసం పెట్టుబడులను తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. ఇదీ చదవండి: చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా.. ఐటీసీ కంపెనికి చెందిన ఫుడ్ ప్లాంట్ ఆటా బ్రాండ్ ఆశీర్వాద్.. సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఇప్పీ నూడిల్స్ కోసం ఉత్పత్తులు తయారు చేస్తోంది. అంతే కాకుండా స్థిరమైన ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా ఉంటుందని, ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్యాకేజింగ్, ఫుడ్ అండ్ డ్రింకింగ్ రంగం వంటి రంగాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా ITC ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్స్ అండ్ అగర్బత్తీల కోసం సహ తయారీ యూనిట్లతో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. आज बड़ियाखेड़ी में दो फैक्ट्रियों का भूमिपूजन हुआ है। लगभग ₹1500 करोड़ का निवेश यहाँ होने वाला है, जिससे हमारे 5 हजार बच्चों को रोजगार मिल सकेगा। pic.twitter.com/zOKMTvrTTI — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 3, 2023 -
మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్
భోపాల్: ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్‌ను నిషేధించబోమని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదేసమయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. భజరంగ్ దళ్‌లో కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. నేను కూడా హిందువునే. హిందువుగానే ఉంటాను. నేను హిందు మతాన్ని అనుసరిస్తూనే సనాతన ధర్మాన్ని పాటిస్తానని తెలిపారు. భారతదేశం అన్ని మతాలకు చెందుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడమే కావాలి అంటూ కామెంట్స్ చేశారు. 'MP में बनी कांग्रेस सरकार तो नहीं लगेगा बजरंग दल पर बैन' ◆ बजरंग दल को लेकर दिग्विजय सिंह का बड़ा बयान#BajrangDal | #DigvijayaSingh | @digvijaya_28 pic.twitter.com/VEm9N6E3Sm — News24 (@news24tvchannel) August 16, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని వాగ్దానం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ! -
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్!
సాక్షి, ఢిల్లీ: దేశంలో ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇక, గెలుపు గుర్రాల కోసం కమలదళం అన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. వివరాల ప్రకారం.. బీజేపీ నేతలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. దీంతో, ఎన్నికల బరిలో కమలం పార్టీ నుంచి ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులు ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లలో అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో వారి తర్వాతే లిస్ట్.. మరోవైపు.. తెలంగాణలో కూడా బీజేపీ స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. కాగా, ఈరోజు జరిగే సమావేశంలో మాత్రం తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులపై పార్టీ హైకమాండ్ ఇంకా దృష్టిసారించలేదని సమాచారం. ఇక, ఇటీవలే తెలంగాణలో బీజేపీ చీఫ్‌ను పార్టీ అధిష్టానం మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ఎంపికయ్యారు. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బీజేపీ లిస్ట్‌ను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం హైకమాండ్ ఫోకస్‌పెట్టినట్టు సమాచారం. మిజోరంతో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఐదు రాష్ట్రాలు మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఈసారి విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మిజోరంలో ఈ నెల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ ఎంఎన్ఎఫ్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. కూటమిలో విభేదాలను ఎత్తిచూపుతూ మణిపూర్‌లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ విమర్శించింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా హోరాహోరీ పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు -
పరీక్షలని పండగ చేసుకోండి! దెబ్బకు ఎగ్జామ్ ఫోబియా పరార్
పరీక్షలు వస్తున్నాయంటే పట్టాలపై పరుగులు తీయాల్సిన రైళ్లు మన గుండెల్లో పరుగెత్తిన రోజులు ఇప్పటికీ గుర్తుంటాయి. తరాలు మారినా పరీక్షల సమయంలో ఒత్తిడి, భయం మారలేదు. పరీక్షల మాట ఎలా ఉన్నా పండగ అంటే బోలెడు సంతోషం వస్తుంది. అందుకే ‘పరీక్షలను పండగ చేసుకోండి. సంతోషం మీ దగ్గర ఉంటే సక్సెస్ మీ దగ్గర ఉన్నట్లే’ అంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన అధర్వ, ప్రణయ్ అనే ఇద్దరు మిత్రులు... ఎంతోమంది విద్యార్థుల్లాగే అధర్వ, ప్రణయ్‌లకు పరీక్షలకు రెండు,మూడు రోజుల ముందు హడావిడిగా పుస్తకాలు పట్టుకోవడం అలవాటు. లాస్ట్–మినిట్ రివిజన్ వల్ల గందరగోళానికి గురైన రోజులు ఎన్నో ఉన్నాయి. కట్ చేస్తే.... ఇంజనీరింగ్ చదవడం కోసం ప్రణయ్ ముంబై, అధర్వ చెన్నై వెళ్లారు. ఎవరి దారులు వారివి అయిపోయాయి. చాలారోజుల తరువాత కలుసుకున్నప్పుడు వారి మధ్య ‘ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్’ అనే బరువైన ప్రస్తావన వచ్చింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ధైర్యం ఇవ్వడానికి, ఉత్సాహం అందించడానికి తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘పఢ్‌లే’ (చదువు కో) అనే యూట్యూబ్ చానల్, వెబ్సైట్. స్టూడెంట్స్‌కు ఉచితంగా అందుబాటులో ఉండే తమ చానల్, వెబ్సైట్లు ఎడ్యుకేషనల్ మెటీరియల్‌కు స్టోర్హౌజ్గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్స్, లెక్చర్స్, స్టడీ టిప్స్...ఇలా ఎన్నో అంశాలకు ఈ ‘పఢ్‌లే’ వేదికగా మారింది. ప్రకటనలు, డొనేషన్లు తమకు ప్రధాన ఆదాయ వనరు. ‘ఎన్నో రంగాలలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చినా విద్యావ్యవస్థలో మాత్రం రావడం లేదు. బోధన అనేది యాంత్రికం అయితే విద్యార్థులకు అయోమయమే మిగులుతుంది. అది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. పరీక్షలు అంటే స్టూడెంట్స్ భయపడే రోజులు కాదు, సంతోషంతో గంతులు వేసే రోజులు రావాలి’ అంటాడు అధర్వ. ఎంత జటిలమైన విషయాన్ని అయినా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కొందరు ఆ దారుల గురించి కనీసం ఆలోచించరు. కొందరు ఆ దారుల గురించి వెదుకుతారు. ఈ కోవకు చెందిన వారే అధర్వ, ప్రణయ్‌లు. ‘కాన్సెప్ట్‌లను అర్థం చేయించాలంటే విద్యార్థులకు కంఫర్ట్‌గా ఉన్న భాషలో చెప్పాలి. ఇంటర్నెట్లో ప్రతి సబ్జెక్ట్ మీద ఎంతో కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే స్టూడెంట్స్ చేతితో రాసుకున్న నోట్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు’ అంటాడు ప్రణయ్. 8,9,10 తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇద్దరు మిత్రులు కాన్సెప్ట్‌లకు సంబంధించిన నోట్స్ రాసుకున్నారు. వాటిని స్కానింగ్ చేసి తమ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. దీంతో పాటు ఫన్నీ వీడియోలతో, మీమ్స్‌తో జటిలమైన కాన్సెప్ట్‌లను అర్థం చేయించడం మొదలుపెట్టారు. ఈ ఫార్మట్ సూపర్ సక్సెస్ అయింది, ‘పదవ తరగతి చదివే మా అబ్బాయి ఆదిత్య చదువులో వెనకబడ్డాడు. నేను అతడికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫీస్ పనుల వల్ల అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఆదిత్య తరచుగా ప ఢ్లే చానల్ చూసేవాడు. అక్కడ ఎన్నో నేర్చుకున్నాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు’ అంటున్నాడు ఇండోర్‌కు చెందిన కుమార్ అనే పేరెంట్.‘ఇక చదవడం నా వల్ల కాదు’ అనుకున్న సమయంలో మీ యూట్యూబ్ చానల్ చూశాను. నేను జటిలం అనుకున్న ఏన్నో విషయాలు చాలా సులభంగా అర్థమయ్యాయి. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది’ అని ఈ ఇద్దరు మిత్రులను కలిసి చెప్పిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ‘పఢ్‌లే’గా మొదలైన తమ యూట్యూబ్ చానల్ ఇప్పుడు ‘జస్ట్ పఢ్‌లే’గా మారింది. 1.5 మిలియన్ల సబ్స్క్రైబర్స్తో దూసుకువెళుతోంది. (చదవండి: ఎవ్వరైనా అంతరిక్షంలో చనిపోతే శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు) -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని కుక్కలా అరవమని ఆదేశిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ గుంపు బాధితుని చుట్టూ చేరి క్షమాపణలు కోరమని చెబుతూ కుక్కలా అరవమని డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తు చేసి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. 50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంత మంది యువకులు ఓ వ్యక్తిని వేధిస్తున్నారు. 'కుక్కలా నటించు..క్షమాపణలు చెప్పు' అంటూ అతని చుట్టూ చేరి అరుస్తున్నారు. గుంపులో ఓ వ్యక్తి బాధితున్ని బిగ్గరగా పట్టుకుని ఉన్నాడు. 'సాహిల్ నా తండ్రి, సాహిల్ నా అన్నయ్య లాంటివాడు' అంటూ బాధితుడు అరుస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి..' ఆ వీడియోను చూశాను. ఇలాంటి స్వభావాన్ని ఖండిస్తున్నాం. దర్యాప్తు చేయాలని కమిషనర్‌ను ఆదేశించాం. దోషులకు కఠిన శిక్షలు విధిస్తాం' అని అన్నారు. సాహిల్, అతని గ్యాంగ్ తమ వ్యక్తికి డ్రగ్స్, మాంసం అలవాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మతం మారాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. బాధితుడు తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసేలా సాహిల్ గ్యాంగ్ ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, వీడియో వైరల్ అయ్యాక కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై పోలీసు స్టేషన్ ముందు బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఇదీ చదవండి:పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు -
పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్‌కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒకతాటిపైకి రావాలని వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్‌గా బిగ్ ఆఫర్ ఇచ్చింది. వివరాల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆప్ జాతీయ ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని ఓకే అంటే తాము రెడీ ఉన్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తే దేశం నియంతృత్వంలోకి వెళుతుందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్ధలను ఉసిగొల్పి విపక్ష నేతలను జైళ్లలో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఆప్ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నదని ఆరోపించారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆప్ ఐడియాలు, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలేంటి..? -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
భోపాల్: ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగలింది. బీజేపీ నేత సినిమా రేంజ్లో 400 కార్ల క్వానాయ్‌తో బయలుదేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొన్ని నెల్లలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత కాంగ్రెస్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నేత జైజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు సింగ్. గురువారం ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల సందర్భంగా 400 కార్ల కాన్వాయ్‌తో దాదాపు 300 కిలోమీటర్లు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక, ఆయనను మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైజ్నాథ్ సింగ్ తన బలప్రదర్శన చేశారు. శివ్‌పురి జిల్లా నుంచి 400 వందల కార్లతో 300 కిలోమీటర్ల దూరం ఉన్న భోపాల్‌కు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కార్లకు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. ఈ ర్యాలీలో భాగంగా మార్గ మధ్యలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. 15 మంది జిల్లా స్థాయి నేతలు, ఇతర కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాకు చెందిన బైజ్నాథ్ అక్కడ పేరున్న నేత. ఆయనకు గ్రౌండ్ లెవల్ నుంచి ప్రజల మద్దతు ఉంది. కాగా, అంతకుముందు 2020లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేసి బీజేపీలోకి వెళ్లడంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బైజ్నాథ్ సింగ్ కూడా సింధియా వెంటనే బీజేపీలో చేరారు. అనంతరం, బీజేపీలో ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇక, బైజ్నాథ్ సింగ్ కార్ల ర్యాలీపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇలా సైరన్ల వాడటమేంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలకు అసౌకర్యం కల్పించేలా సైరన్లు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ నేతల మనస్తత్వమని మండిపడింది. Madhya Pradesh: BJP leader Baijnath Singh heads to rejoin Congress in 400-car convoy.pic.twitter.com/a7cofthV0R — Annu Kaushik (@AnnuKaushik253) June 15, 2023 ఇది కూడా చదవండి: బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ.. -
Video: డిన్నర్‌కు వెళ్లిన జంటపై దాడి.. అడ్డుకున్న వారిపై..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న యువతియువకుడిని అడ్డుకున్న కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో యువతి వారిని ఎంత వారించినా.. దుండగులు రెచ్చిపోయారు. ఆ జంటను రక్షించిన ఇద్దరిని ఆగంతకులు కత్తితో పొడిచారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లో యువతి, యువకుడు విందు కోసం హోటల్‌కు వచ్చారు. వారు డిన్నర్ చేసిన అనంతరం.. హోటల్ నుంచి బయటకు రాగానే వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. స్కూటీ మీద ఉన్న వారిద్దరిని ఓ గుంపు వెంబడించి వారిని చుట్టుముట్టింది. ఇంతలో కొందరు.. అతడితో ఎందుకు కలిసి తిరుగుతున్నావని ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ జంటను రక్షించేందుకు అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. దీంతో, మరింత రెచ్చిపోయిన దుండగుటు.. వారిద్దరినీ కత్తితో పొడిచారు. అయితే, దుండగుల దాడి అనంతరం డీసీపీ రాజేష్ రఘువంశీ మాట్లాడుతూ.. ఆమె తన పేరెంట్స్ అనుమతితోనే(వారికి సమాచారం ఇచ్చిన తర్వాతే) ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని చెప్పింది. వారిని అడ్డుకున్న దుండగులపై సదరు యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుంపులో నుంచి ఎవరో కత్తితో పొడిచారు. దీంతో, వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. In Indore, MP MusIim mobs beat a couple because the girl was a MusIim & the boy was a Hindu. It's becoming a new normal! Imagine the amount of national-international outrage if any Hindu group starts doing this with M boy & H girl couples.. pic.twitter.com/Is0nis1QbJ — Mr Sinha (@MrSinha_) May 26, 2023 ఇది కూడా చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్ -
కునో నేషనల్ పార్క్: చీతా కూన మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల క్రితం జన్మించిన చీతా కూన మంగళవారం చనిపోయిందని అటవీ శాఖ తెలిపింది. దీంతో, ఆఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చిన వాటితో కలిపి రెండు నెలల కాలంలో మృతి చెందిన చీతాల సంఖ్య నాలుగుకు చేరింది. నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన ‘జ్వాల’కు మార్చిలో నాలుగు కూనలు పుట్టాయి. మంగళవారం తల్లితోపాటు మూడు కూనలు అటవీ ప్రాంతంలో తిరుగాడుతుండగా, నాలుగో కూన మాత్రం కదలకుండా ఉంది. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొద్ది సేపటికే చనిపోయింది’ అని అటవీ శాఖ వివరించింది. ఈ కూన పుట్టినప్పటి నుంచి బలహీనంగానే ఉందని తెలిపింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మూడు గత రెండు నెలల్లో చనిపోవడం తెలిసిందే. ఇది కూడా చదవండి: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు.. -
కర్ణాటక రిజల్ట్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కీలక నిర్ణయం!
ఢిల్లీ: ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీకి ఎత్తులకు చెక్ పెడుతూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కీలక నేతలతో ఈనెల 24వ తేదీన సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, మధ్యప్రదేశ్‌లో అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరారు. దీంతో, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనసాగుతోంది. మరోసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. రాజస్థాన్‌లో కూడా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పిగా మారింది. ఇక, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పాదయాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించారు. ఇది కూడా చదవండి: రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్ అకౌంట్ ఉండాలా? -
భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..
ఓ వ్యక్తి తన భార్య కోసం తన కన్న కొడుకునే చంపేందుకు యత్నించాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ షాకింగ్ గటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు ప్రతీక్ ఉన్నాడు. ఐతే అతని మూడోవ భార్య ఈ చిన్నారి విషయమై అతనిపై కోపంతో పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. తనకు ఈ చిన్నారి అంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడమే గాక అతన్ని కడతేర్చడం లేదా ఎక్కడికైన పంపిస్తేనే తాను తిరిగి వస్తానని చెప్పాంది. దీంతో విసిపోయిన శశిపాల్ ఈ చిన్నారి లేకపోతేనే తన జీవితం హాయిగా ఉంటుందని భావించి..సదరు చిన్నారిని చంపేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ప్రతీక్ తన తాతయ్య, నానమ్మలతో పడుకునేవాడు. ఐతే తన తండ్రి కూలర్ వద్ద పడుకుందామని చెప్పడంతో.. నాన్నతో హాయిగా కూలర్ దగ్గర పడుకోవచ్చిని ఎంతో ఎగ్జాయిట్‌మెంట్‌తో వెళ్లాడు. అయితే ఆ కర్కశ తండ్రి ఆ చిన్నారి నిద్రపోయిన తర్వాత టీవీ వాల్యూమ్ బాగా పెంచి..ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా తన మూడో భార్యకు తెలిపేలా వీడియో తీసి మరీ పంపించాడు. ఐతే ఆమె అతడి వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేయడంతో ఆమె ఆ వీడియోని చూడలేకపోయింది. ఆ తర్వాత శశిపాల్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శశిపాల్ని అతని మూడో భార్య పాయల్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శశిపాల్ మొబైల్లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో లభించిందని పోలీసుల తెలిపారు. కానీ అతడి భార్య పాయల్ మాత్రం ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తానెప్పుడూ తన కుమారుడిని చంపమని తన భర్తకు చెప్పలేదని వాపోయింది. శశిపాల తల్లిదండ్రులు తన తండ్రితో పడుకోవడానికి ఎంతో ఆనందంగా ప్రతీక్ వెళ్లాడని, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి) -
ఆమె నెల జీతం 30వేలు.. 7 లగ్జరీ కార్లు, 30 లక్షల టీవీ ఇంకా..
భోపాల్: హేమా మీనా.. ఈమె ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు జీతం రూ. 30వేలు. కానీ, మీనా ఆస్తులు చిట్టా చూసి అధికారులు షాకయ్యారు. 7 లగ్జరీ కార్లు, రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీ, విలాసవంతమైన భవనాన్ని అధికారులు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించగా ఆమె ఆస్తుల వివరాలు చూసి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఇంజినీర్‌గా హేమా మీనా పనిచేస్తోంది. కాగా, ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు గుర్తించిన లోకాయుక్త అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో భోపాల్‌లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అంతేకాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన హేమా మీనా నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. ఆమె జీతంతో పోలిస్తే ఆస్తుల విలువ 232 శాతం ఎక్కువ. సోదాల సందర్బంగా 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్లు, ఇతర విలువైన వస్తువులు కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: బెంగాల్, తమిళనాడు సర్కార్‌కు బిగ్ షాక్ -
మరో చీతా కన్నుమూత! జతకట్టే సమయంలో గాయపడటంతో..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో దక్ష అనే మరో ఆడ చీతా కన్నుమూసింది. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ అన్నారు. తాము ఆ ఆడ చీతాకు అవసరమైన అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణాలు విడిచిందని తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఎన్‌క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరువై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్ 2022లో వేర్వేరు బ్యాచ్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడిన ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..) -
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సాముహిక వివాహ పథకం వివాదాస్పదంగా మారింది. ఆ పథకంలో భాగంలో మధ్యప్రదేశ్‌లోని గడ్సరాయ్ ప్రాంతంలో శనివారం 219 మందికి సాముహిక వివాహాలు నిర్వహించారు. ఐతే అందులో ఐదుగురు యువతులు గర్భవతులు అని తెలియడంతో వారిని సాముహిక వివాహాలకు అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ వివాదానికి తెరలేపింది. అయినా పెళ్లి చేసుకోడానికి వచ్చిన యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం ఏమిటని కాంగ్రెస్ పశ్నించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 200 మంది యువతులకు ప్రెగన్సీ టెస్ట్‌లు నిర్వహించారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ వార్త నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి నుంచే వినాలనుకుంటున్నాం. ఈ వార్త నిజమైతే సామాజికంగా వెనుకబడిని యువతులను ఘెరంగా అవమానించడమే అవుతుంది. ముఖ్యమంత్రి దృష్టిలో పేద, గిరిజన వర్గాల ఆడబిడ్డలకు పరువు లేదా అని నిలదీశారు. శివరాజ్ ప్రభుత్వంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ అగ్రస్తానంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం గర్భ నిర్ధారణ పరీక్షకు సంబంధించింది కాదని ఇది మొత్తం స్త్రీ జాతి పట్ల దురుద్దేశంలో కూడిన వైఖరి అని మండిపడుతూ ట్వీట్ చేశారు. అయితే డిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సాధారణంగా వయస్సు ధృవీకరణ, సికిల్ సెల్ అనీమియా వంటి శారీరక దృఢత్వాన్ని నిర్థారించే పరీక్షలు నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయిని తెలిపారు. అందులో కొందరు యువతులకు పీరియడ్ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతోనే వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తాము కేవలం పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తామని చెప్పారు. అయితే ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా యువతలను పథకంలో మినహాయించే నిర్ణయం మాత్రం సామాజికి న్యాయ శాఖ తీసుకుంటుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి వివాహ యోజన పథకం / నికా యోజన ఏప్రిల్ 2006లో ప్రారంభమైంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా రూ. 56,000/- నగదును అందిస్తోంది. (చదవండి: భార్య అరెస్టు అవుతుందనే భయంతో అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా?) -
లోకల్ ట్రైన్లో అగ్ని ప్రమాదం.. బోగీలకు మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రెండు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. రత్లామ్ పట్టణంలో ఆదివారం ఉదయం రత్లామ్-అంబేద్కర్ నగర్ డెమూ మార్గంలో వెళ్తున్న ఓ లోకల్ ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రత్లామ్ స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రీతమ్ నగర్ స్టేషన్‌కు ట్రైన్ చేరుకోగానే ఆ రైల్లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన రైలు లోకో పైలెట్లు, స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పి వేశారని పశ్చిమ రైల్వే రత్లాం డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ఖేమ్రాజ్ మీనా తెలిపారు. అయితే, రైలు జనరేటర్ కార్లో ముందుగా మంటలు చెలరేగాయని, ఆ తర్వాత బోగీ అంతటికి విస్తరించాయని అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేయడంతో పెను ముప్పు తప్పిందని, మంటలు ప్రయాణికుల బోగీలకు వ్యాపించకుండా ఆగిపోయాయని అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా, లోకల్ రైలులోని ప్రయాణీకులను అంబేద్కర్ నగర్ స్టేషన్‌కు మరో రైలులో చేర్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Madhya Pradesh: Fire broke out in the generator car of Ratlam-Dr Ambedkar Nagar Demu train at Pritam Nagar station in Ratlam earlier this morning. The fire was later extinguished. No injuries or casualties reported. pic.twitter.com/hrT3GRGhby — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 23, 2023 -
136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధి..పోలీసులకు అప్పగించిన కూలీ
ఒక దినసరి కూలీ 136 ఏళ్ల బ్రిటీస్ కాలం నిధిని పోలీసులకు అప్పగించాడు ఓ కార్మికుడు. అయితే అతను తన స్థలం నుంచి చెప్పకుండా పట్టుకెళ్లాడని ఆరోపించింది ఆ భూ యజమాని. విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లితే మరో విషయం బయటపడింది. ఈ ఘటన మధ్యప్రధేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ దినసరి కూలీ కి ఓ ఇంటి కింద 136 ఏళ్ల నాటి బ్రిటీష్ కాలం నిధిని కనుగొన్నాడు. ఆ కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హలీ అహిర్వార్లోని దామోహ్ జిల్లాలోని ఇంటి తవ్వకంలో ఈ నిధిని గుర్తించాడు. అందులో సుమారు 240 వెండి నాణేలను కనుగొన్నాడు. వాటి విలు సుమారు రూ. 1.92 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆ కూలీ తొలుత తన ఇంటికి తీసుకెళ్లి.. చివరికి బాగా ఆలోచించి పోలీసులకు అప్పగించేశాడు. ఐతే ఆ స్థలం యజమానురాలు మీనాక్షి ఉపాధ్యాయ్ మాత్రం ఆ నిధిని తన స్థలంలోనే బయటపడిందని, ఆ కూలి తనకు చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు చేసింది. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపి వేయించారు. పురావస్తు శాఖకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నాణేలను అప్పగించారు. అంతేగాదు ఆ స్థలంలో తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ..అక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు గుర్తించింది. అక్కడ ఇంకా తవ్వకాలు జరిపి నిశితంగా దర్యాప్తు చేస్తే.. విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, ఎవరైనా పురాతన వస్తువు లేదా నిధిని కనుగొన్న వ్యక్తి దానిని 24 గంటలలోపు భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ లేదా అధీకృత అధికారికి నివేదించాలి. అలా చేయనట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్‌గేమ్': న్యాయశాఖ మంత్రి) -
పోలీస్టేషన్‌కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..
చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్‌కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. (చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత) -
లైసెన్స్ ఇచ్చి నల్లమందు సాగు చేయిస్తుంటే..చిలుకలు దొంగలిస్తున్నాయ్!
ప్రతి ఏడాది అక్కడ పెద్ద మొత్తంలో నల్లమందును సాగు చేస్తారు. అయితే రైతుల ఉత్పత్తిని అంతా చిలుకలు దొంగలించేస్తున్నాయ్. దీంతో రైతులు దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి ఏడాది చిలుకలు పెద్ద మొత్తంలో ఈ నల్లమందును ఎత్తుకుపోతున్నట్లు తెలిపారు రైతులు. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్, నీముచ్, రత్లాం జిల్లాలో నల్లమందు సాగు చేస్తారు. అందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సాగుకు లైసెన్సులు ఇస్తుంది. ఈ పంటను పర్యవేక్షించే బాధ్యతలన్నింటిని బ్యూరో తీసుకుంటుంది. నల్లమందు పంటను జనవరి, మార్చి మధ్యలో సాగు చేస్తారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే కూరగాయాల మార్కెట్లలో కూడా విక్రయిస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ప్రజలు వాటి విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అంతేగాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రైతుల నుంచి నల్లమందును కొనుగోలు చేస్తుంది. ఈ నల్లమందును ఉపయోగించి కొన్ని గుండె, రక్తం, నిద్రకు సంబంధించిన మందుల తయారీలో వినయోగిస్తారు. ఇటీవల ఈ చిలుకల దాడి కారణంగా నల్లమందు సాగులో రైతులు ఎక్కువుగా నష్టపోతున్నారు. ఈ విషయంలో పోలీసుల సైతం ఏం చేయలేమని చెప్పడంతో ప్లాస్టిక్ వలలను అమర్చడం ప్రారంభించారు. దీంతో ఆ చిలకలు కూడా నల్లమందు కాయలను అందించుకోవడం సాధ్యం కాక నిలబడి ఉన్న పంటకు నష్టం చేయడం ప్రారంభించాయి. (చదవండి: ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..) -
విషాదం.. నదిలో మొసలి దాడిలో భక్తులు మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నది దాటుతున్న భక్తులపై నీటిలో ఉన్న మొసలి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది భక్తులు రాజస్థాన్‌లోని కైలా దేవీ ఆలయానికి వెళ్లి మొక్కలు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో శివపురి జిల్లాలోని చిలవాడ్ గ్రామంలో ఉన్న చంబల్ నది వద్దకు చేరుకున్నారు. అయితే, వారు అక్కడికి వెళ్లిన సమయానికి నది దాటేందుకు వంతెన, పడవ అందుబాటులో లేకపోవడంతో వారు చంబల్ నదిని దాటేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారంతా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నదిలోకి దిగి గట్టు దాటేందుకు ముందుకు సాగారు. ఇంతలో అక్కడే నాచులో నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దీంతో, వారంతా భయంతో నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సయమంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న వారు మొసలి దాడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్.. ఎనిమిది మందిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీసింది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, వారిలో మొసలి ఎంత మందిని పొట్టనపెట్టుకుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతయ్యారు. -
మార్క్స్ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్‌పై స్టూడెంట్ దాడిలో..
భోపాల్: కొన్ని సందర్భాల్లో మనిషి తీసుకునే నిర్ణయాల కారణంగా జీవితమే నాశనం అవతుంది. ఇలాంటి సమయాల్లో ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీఫార్మసీ విద్యార్థి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు. ఆవేశంలో ప్రినిపాల్‌ను చంపేశాడు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బీఫార్మసీ కాలేజీలో అశ్‌తోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే, తన చదువు పూర్తవడంతో శ్రీవాస్తవ.. ఈనెల 20వ తేదీన కాలేజీకి వెళ్లాడు. ఈ క్రమంలో తన మార్కుల మెమోను ఇవ్వాలని కోరాడు. దీంతో, సెవెంత్ సెమిస్టర్ ఫెయిలైన కారణంగా మెమో ఇవ్వడం కుదరదని ప్రిన్సిపాల్ విముక్త శర్మ సమాధానం ఇచ్చారు. ఆమె రిప్లైతో ఆగ్రహానికి లోనైన శ్రీవాస్తవ.. తనకు మార్కుల షీట్ ఇవ్వడంలో కాలేజీ యాజమాన్యం అక్రమంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాడు. ఇక, ఈ వ్యవహారంపై ఆవేశంలో శ్రీవాస్తవ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్‌తో నిప్పంటించాడు. ఈ ఘటనలో విముక్త శర్మ శరీరం 80 శాతం కాలిపోయింది. దీంతో, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించి శనివారం ఆమె.. ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాద ఘటన జరిగిన రోజునే నిందితుడు శ్రీవాస్తవను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ వికాస్ రథయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే యాత్ర చేస్తున్న మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ యాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి బ్రజేంద్ర సింగ్ అసెంబ్లీ నియోజకవర్గం మంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్రకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దురద పెట్టించే పౌడర్‌ను చల్లాడు. దీంతో ఆ మంత్రికి విపరీతమైన దురద రావడంతో.. నడిరోడ్డుపైనే కుర్తా విప్పే పరిస్థితికి దారితీసింది. ఆ దురదకు తాళలేక మంత్రి నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుక్కున్నారు. అందుకు సంబంధించిన వీడియోని కొందరూ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మాజీ సర్పంచ్ వికాస్ యాత్ర అవసరమా అని బ్రిజేంద్ర సింగ్‌ని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేగాదు వీడియోలో..ఈ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. మేము కాంగ్రెస్ చెడ్డదనుకున్నాం, కానీ మీరు అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. మాకు మంచి రహదారులను ఇవ్వండి లేకపోతే మీకు ఓటు వేయం అని ఆ వ్యక్తి ఎమ్మెల్యే ముఖం మీదే అంటున్నట్లు వినిపిస్తుంది. దీనికి మంత్రి కూడా ఓటు వేయకండి అదీ మీ హక్కు అని అతనికి బుదులిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఇలానే రెండు రోజుల క్రితమే ఖండ్వా జిల్లాలోని ఒక గ్రామం గుండా వెళ్తుండగా మరో వికాస్ రథ్ రోడ్డుపై ఇరుక్కుపోయింది. ఇదిలా ఉండగా, ఈ వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. अशोकनगर, मध्य प्रदेश जनसंपर्क पर निकले मंत्री को लगाया #खुजली पाउडर। यात्रा रोक, नहाना पड़ा। PHE मंत्री / भाजपा नेता बृजेंद्र सिंह यादव को जनसंपर्क के दौरान किसी ने लगाया खुजली पाउडर। खुजा खुजा कर हुआ था बुरा हाल ! pic.twitter.com/w5GZtCWmyy — काश/if Kakvi (@KashifKakvi) February 9, 2023 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
నా కూతురి పెళ్లిని కోటి రూపాయలతో నిర్వహించండి అంటూ..ఓ తండ్రి..
మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారి సూసైడ్ నోట్ తీవ్ర కలకలం రేపింది. అతను చనిపోవడానికి ముందు ఓ వీడియో తీసుకున్నాడు. అందులో నా కూతురు పెళ్లిని దాదాపు ఒక కోటి రూపాయాలు ఖర్చుపెట్టి నిర్వహించండి అని చెప్పడం అందర్నీ కంటతడిపెట్టించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సంజయ్ సేథ్ అనే ప్రముఖ వ్యాపారి తన భార్య మీనుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని కిషోర్‌గంజ్ అనే ప్రాంతంలో నివస్తున్నాడు. ఏమోందో ఏమో! తన భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సంజయ్ సేథ్. ఈ ఘటన జరిగినప్పుడూ ఆ గదిలో వారిద్దరే ఉన్నారు. ఆ కాల్పుల శబ్దం విని కుటుంబసభ్యులు వచ్చి చూడగా..అతడి భార్య మృతి చెందగా, సంజయ్ కొన ఊపిరితో కొట్టుకుంటూ కనిపించాడు. ఐతే అతను కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సంజయ్ ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా తీశాడు. అందులో సంజయ్ ఏడుస్తూ తాను కొందరికి అప్పు ఇచ్చాను వారు తిరిగి చెల్లించలేదని చెప్పాడు. దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఆమె పెళ్లిని సుమారు రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టి జరిపించండి. నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. అలాగే లాకర్లో సుమారు రూ. 29 లక్షలు ఉందని, తన కూతురికి చాలా నగలు ఉన్నాయని చెప్పాడు. పిల్లలు నన్ను క్షమించండి. నా భార్య, నేను బతకలేక వెళ్లిపోతున్నాం అని కన్నీటిపర్యంతమయ్యాడు. చివర్లో తాను బాగేశ్వర్ ధామ్ భక్తుడునని, గురూజీ నన్ను క్షమించండి మరో జన్మ లభిస్తే కచ్చితంగా మీకు మంచి భక్తుడిగా ఉంటానని వాపోయాడు. అలాగే సంఘటనా స్థలం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..ఈ ఘటన చాలా బాధకరం. ఇది గృహ వివాదానికి సంబంధించినదిగా గుర్తించాం. ఈ సంఘటనలో బయట వ్యక్తి ప్రమేయం లేదని ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరే ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..) -
ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య!
బీజేపీకి చెందిన మాజీ కార్పోరేటర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే, తమ కుమారుడికి అరుదైన వ్యాధి వచ్చిన కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తండ్రి, బీజేపీ నేత సంజీవ్ మిశ్రా తెలిపారు. తమ మృతికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాకు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సంజీవ్ మిశ్రా(45)కు భార్య నీలం(42), ఇదర్దు కుమారులు అన్మోల్(13), సార్థక్(7) ఉన్నారు. అయితే, గత కొద్ది రోజలుగా సంజీవ్ కొడుకు.. అరుదైన కండరాల వ్యాధి(muscular dystrophy)తో బాధపడుతున్నాడు. దీంతో, తన కుమారుడి ఆరోగ్యాన్ని మెరుగయ్యేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఎన్ని ఆసుపత్రుల తిరిగినా అతడిని నయం కాకపోవడంతో సంజీవ్ మిశ్రా మనస్థాపానికి లోనయ్యారు. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి కారణంగా దంపతులు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో తమ కుమారులిద్దరికీ విషం తాగించారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కూడా పాయిజన్ సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, పిల్లలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. సంజీవ్ మిశ్రా, నీలం మాత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే, వీరి ఆత్మహత్యకు ముందు సంజీవ్ మిశ్రా ట్విట్టర్ వేదికగా.. శత్రువుల పిల్లలను కూడా దేవుడు ఈ వ్యాధి నుంచి తప్పించాలి. నేను నా పిల్లలను రక్షించలేను.. అందుకే ఇకపై జీవించాలని అనుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక, వీరి ఆత్మహత్యలపై స్థానిక బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. మస్కిల్ డిస్ట్రోఫీ అంటే.. వారసత్వ (జన్యు) వ్యాధుల కారణంగా కండరాలు బలహీన పడటాన్ని కండరాల డిస్ట్రోఫీ సూచిస్తుంది. ఈ పరిస్థితిని ఒక రకమైన మయోపతి, అస్థిపంజర కండరాల వ్యాధిగా పేర్కొంటారు. ఈ వ్యాధి కారణంగా, కండరాలు కుంచించుకుపోతాయి, బలహీనపడతాయి. కండరాల బలహీనత కారణంగా నడవడం, రోజువారీ కార్యకలాపాలు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ వ్యాధి గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది అరుదైన వ్యాధి. దీని కారణంగా వీల్ చైర్ కూడా పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. కండరాల బలహీనత రకాలు.. కండరాల డిస్ట్రోఫీలో 30కి పైగా రూపాలు ఉన్నాయి. - డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD): ఈ పరిస్థితి 2 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలు, అమ్మాయిల్లో కనిపిస్తుంది. వీరు పరుగెత్తడం, నడవడం లేదా దూకడం వంటి కష్టంగా చేస్తారు. వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది పిల్లల గుండె, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. DMD అనేది కండరాల బలహీనతకు చెందిన అత్యంత సాధారణ రూపం. ఇది ఉత్తర అమెరికా, ఐరోపాలోని 1,00,000 మంది పిల్లలలో దాదాపు ఆరుగురిని ప్రభావితం చేస్తుంది. - బెకర్ మస్కులర్ డిస్ట్రోఫీ (BMD): BMD రెండవ అత్యంత సాధారణ కండరాల బలహీనత. BMD లక్షణాలు 5-60 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా కనిపిస్తాయి, కానీ, సాధారణంగా యుక్తవయస్సులో వస్తాయి. పురుషులకు BMD వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి తొంటి, తొడ, భుజాల కండరాలను, చివరికి గుండెను ప్రభావితం చేస్తుంది. - ఫేసియోస్కాపులోహ్యూమెరల్ మస్కులర్ డిస్ట్రోఫీ (FSHD): FSHD అనేది మూడవ అత్యంత సాధారణ కండరాల బలహీనత. ఈ వ్యాధి ముఖం, భుజం బ్లేడ్లు, పై చేతులపై కండరాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు 20 సంవత్సరాల కంటే ముందే కనిపిస్తాయి. పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత (CMD): CMD పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత. శిశువు బలహీనమైన కండరాలు, వంగిన వెన్నెముక, కీళ్ళు చాలా గట్టిగా లేదా వదులుగా ఉండవచ్చు. CMD ఉన్న పిల్లలకు అభ్యాస వైకల్యాలు, మూర్ఛలు, దృష్టి సమస్యలు ఉండవచ్చు. -
1971 యుద్ధంలో సేవలు.. రెండు రూపాయల డాక్టర్‌కు పద్మశ్రీ.. ఆయన ఎవరంటే?
దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. కాగా, పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే డాక్టర్ ఎమ్సీ దావర్. మధ్యప్రదేశ్‌కు చెందిన దావర్(77)ను స్థానికులు 20 రూపాయల డాక్టర్ అని కూడా పిలుస్తారు. దావర్.. అతని వద్దకు వచ్చిన పేషంట్స్‌కు కేవలం రూ.20 మాత్రమే ఫీజు తీసుకుని వారికి వైద్యం అందిస్తుంటారు. అందుకే దావర్‌కు 20 రూపాయల డాక్టర్ అనే పేరు వచ్చింది. దావర్ వివరాలు ఇవే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎమ్సీ దావర్ పద్మశ్రీ దక్కించుకున్నారున. అయితే, డాక్టర్ దావర్ జనవరి 16, 1946న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారత్‌లోకి వచ్చారు. 1967లో దావర్ జబల్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో దావర్ సుమారు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. ఆ తర్వాత 1972 నుండి జబల్పూర్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పేషంట్స్ వద్ద నుంచి కేవలం రూ.2 మాత్రమే తీసుకుని వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం తన ఫీజును రూ.20కి పెంచి అందరికీ వైద్యం అందిస్తున్నారు. కాగా, పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా దావర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావర్ మీడియాతో మాట్లాడుతూ..‘కష్టపడితే కొన్నిసార్లు ఆలస్యమైనా ఫలితం మాత్రం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈ అవార్డును అందుకున్నాను. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. అందుకే పేషంట్స్ వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం లేదు. విజయం ప్రాథమిక మంత్రం ఏంటంటే.. ఓపికగా పనిచేస్తే కచ్చితంగా విజయం దక్కుతుంది. అలాగే గౌరవం కూడా అందుతుంది’ అని కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో దావర్ కుమారుడు రిషి కూడా తన తండ్రికి పద్మ పురస్కారం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా పరపతి ఉంటేనే అవార్డులు ఇస్తారని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ, ప్రభుత్వం మా లాంటి వారిని కూడా గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వారిని గుర్తించి సత్కరిస్తున్న తీరు చాలా మంచి విషయం. మా నాన్నకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఇది మాకు, మా కుటుంబానికి, మా నగరానికి చాలా గర్వకారణమని దావర్ కోడలు సుచిత అన్నారు. -
మంచి రహదారులే అతివేగానికి కారణం!
రోడ్డు ప్రమాదాల గురించి మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిగా రోడ్లు ఉంటే హై స్పీడ్‌కి దారితీస్తుందని, అందువల్లే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది డ్రైవర్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఈప్రమాదల్లో వారి తప్పు కూడా ప్రధానంగా ఉందని చెప్పుకొచ్చారు. తన నియోజక వర్గంలో రహదారులు బాగా ఉన్నాయి. అందువల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. అదీగాక రహదారులు బాగా ఉంగే రయ్‌మని స్పీడ్‌గా వెళ్లిపోతారని అన్నారు. ఈ మేరకు నారాయణ పటేల్‌ని విలేకరులు అధ్వాన్నమైన రోడ్లు కారణంగా తక్కువ ప్రమాదాలు జరుగుతాయా? అని ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఒక్క ఖండ్వా జిల్లాలోనే ఈ ఏడాది నాలగు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 2017లో తన అమెరికా పర్యటనలో యూఎస్ రోడ్లు కంటే మధ్యప్రదేశ్ రోడ్లే బాగున్నాయని అన్నారు. ఆ తర్వాత 2018లో జరిగిన బహిరంగ సభలో కూడా ఇలానే పునరుద్ఘాటించడం విశేషం. (చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. అందుకే ఆమె నోరుమెదపరు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..) -
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ ధ్వంసం..ఏకంగా 60 డైనమైట్లతో ..
సాక్షి, ఇండోర్: మధ్యప్రదేశ్ అధికారులు సాగర్ నగర్లో ఉన్న బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ర గుప్తా అక్రమ హోటల్ని కూల్చేసింది. చంద్ర గుప్తా అతని కుటుంబ సభ్యులపై డిసెంబర్ 22న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్‌యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు. అయితే దర్యాప్తులో చంద్ర గుప్తా పేరిట ఉన్న హోటల్ అక్రమంగా కట్టిందని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇండోర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ జైరామ్ ప్యాలస్‌ని సుమారు 60 డైనమైట్లను ఉపయోగించి కూల్చేసినట్లు సమాచారం. సెకండ్ల వ్యవధిలో నేలమట్టం అయ్యింది ఆ హోటల్. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సాగర్‌జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివశించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్ ఆర్య ప్రకటించారు. హత్యకు గురైన జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. కిరణ్ యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో ఓడించడం గమనార్హం. #WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar "There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8 — ANI (@ANI) January 4, 2023 (చదవండి: గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్ కేసులో జైలు శిక్ష.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా) -
ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటరీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. హిందూ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు ఉందని, అది వారి గౌరవానికి సంబంధించినదని అన్నారు. అలాగే తమను తాము రక్షించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నందున ఇంట్లో పదునైనా కత్తులు పెట్టుకోవాంటూ పిలుపునిచ్చారు. లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారని అందులో ప్రేమ మాత్రం ఉండదని అన్నారు. ఈ మేరకు ప్రగ్యా ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణిచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని లేదంటే ప్రేమకు నిజమైన నిర్వచనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. బాలికలకు సరైన విలువలు నేర్పండి. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావిస్తూ... స్వీయ రక్షణ కోసం ఇంట్లోని కత్తులనైనా పదును పెట్టుకోవాలన్నారు. ఇంట్లో ఆయుధాలైనా ఉంచుకోండి లేదా కూరగాయాల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్థిత వస్తుందో తెలియదు కాబట్టి దాడి చేసినప్పుడు వారికి తగిన రీతిలో రిప్లై ఇవ్వడం మన హక్కు అని చెప్పారు. అలాగే మీ పిల్లలను మిషనరీ సంస్థల్లో చదివించకండి అలా చేస్తే తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పంపుతారు, స్వార్థపరులుగా మారిపోతారంటూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పిల్లలకు ధర్మం గురించి, శాస్త్రల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. తద్వారా పిల్లలు మన సంస్కృతి, విలువలు గురించి తెలుసుకుంటారని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. (చదవండి: నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..) -
బీజేపీ మహిళా నేతల మధ్య కోల్డ్‌వార్.. వేదికపైనే డిష్యుం డిష్యుం..
బీజేపీ మహిళా నేతలు అందరూ చూస్తుండగానే స్టేజీపై ఒకరొనొకరు చేయిచేసుకున్నారు. స్టేజ్‌పై కూర్చునే సీట్ల వ్యవహారంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీకామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని తలైయా ఫీల్డ్ గ్రౌండ్లో జరిగిన 25వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం కోసం బీజేపీ నేతలు వచ్చారు. ఈ సందర్బంగా నేతలంతా స్టేజ్‌పై కూర్చున్నారు. అనంతరం.. బీజేపీ మహిళా నేతలు చంద్రప్రభ తివారీ, నీలం చౌబే మధ్య సీట్ల విషయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వీరి మధ్య ఉన్న విభేదాలు అందరి ముందే బహిర్గతమయ్యాయి. చంద్రప్రభ తివారీ వేదికపై సీటు కోసం వెతుకుతున్నప్పుడు నీలం చౌబే ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టింది. అనంతరం, వీరిద్దూ మాటల వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత ఒకరినొకరు సభావేదికపైనే తోసుకున్నారు. ఇంతలో అక్కడున్న మిగతా నేతలు కల్పించుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో వేదికపై రాష్ట్ర మంత్రులు కమల్ పటేల్, బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఎమ్మెల్యే సంజయ్ పాఠక్, ఇతర నేతలు కూడా ఉన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్చల్.. నడిరోడ్డుపై డ్రెస్ విప్పేసి..
తాగిన మైకంలో ఓ పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. పీకాల దాకా మద్యం సేవించి నడిరోడ్డుపై పట్టపగలే హల్చల్ చేశాడు. తాను రోడ్డుపై ఉన్న విషయం కూడా తెలియని స్థితిలో షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి.. చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని పోలీసు స్టేషన్లో సుశీల్ మాండవి అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, సుశీల్‌కు మద్యం సేవించే అలవాటు ఉండటంతో ఇప్పటికే పలుమార్లు ఫుల్‌గా మందుకొట్టి పోలీసుల అధికారుల దృష్టిలో పడటంతో వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుశీల్ శుక్రవారం సాయంత్రం ఫుల్‌గా మద్యం సేవించి నడిరోడ్డుమీద హల్చల్ చేశాడు. తాగిన మైకంలో రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ.. ఒంటిపై ఉన్న పోలీస్ యూనిఫాం తీసేశాడు. షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి, చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. ఈ విషయంలో చుట్టుపక్కల వాళ్లు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. మద్యం మత్తులో వారితోనే వాగ్వాదానికి దిగాడు. కాగా, అక్కడున్న వారు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో సుశీల్‌పై చర్యలకు దిగారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సుశీల్ మద్యం తాగి వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కాగా, అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. -
చదివింది ఎనిమిదో తరగతి..డజను మంది మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజను మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వికాస్ గౌతమ్ అనే మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ నివాసి వికాస్ యాదవ్ అనే పేరుతో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ట్విట్టర్లలో ఐడీ క్రియేట్ చేశాడు. ఆఖరికి ప్రోఫైల్ పోటో కూడా ఒక గవర్నమెంట్ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోను పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక మహిళ వైద్యురాలు ఆన్లైన్లో అతడితో ఒక రోజు చాటింగ్ చేసింది. ఆ తర్వాత అతడిపై నమ్మకం ఏర్పడటంతో తన వివరాలన్ని చెప్పింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకుని ఏకంగా రూ. 25 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. దీన్ని గమనించిన సదరు మహిళా డాక్టర్ ఆ వ్యక్తిని ఫ్రాడ్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఐతే ఆ వ్యక్తి తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పడంతో రాజకీయనాయకుల అండదండ ఉండి ఉంటుందని భావించి తొలుత వెనక్కు తగ్గింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికాస్ గౌతమ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను విచారణలో డజను మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు తేలింది. అతను ఎనిమిదో తరగతి మాత్రమే చదివాడని, ఆ తర్వాత అతను ఇండస్ట్రీయల్ కోర్సు కూడా పూర్తి చేసినట్లు పోలీసులుల తెలిపారు. నిందితుడు వికాస్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో కూడా పనిచేసేవాడని తెలిపారు. అది సివిల్ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థులను చూసి ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడని చెప్పారు. పోలీసులు వికాస్ నేర చరిత్రను తిరగదోడారు. అతడు గతంలో ఉత్తప్రదేశ్, గాల్వియర్లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే..హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు) -
మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, లవ్ ఎఫైర్లు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ విలువలను మంటగొలిపి మహిళలు, పురుషుల అన్న సంబంధం లేకుండా ఇరువురు చేస్తున్న పనులు యావత్తు కుటుంబం తలెత్తుకోలేని స్థితిని ఎదుర్కొంటోంది. అచ్చం అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని రాట్లం గ్రామంలో 30 ఏళ్ల మహిళ భర్త, అత్తమామాలతో కలిసి ఉంటుంది. ఐతే ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించి అతనితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేయమని పిలిచినప్పటికీ ఆమె రానని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఆమె భర్త అత్తమామలు ఆ గ్రామంలో ఉండలేక ఆ ఇంటికి తాళం వేసి మరో ఊరు వెళ్లిపోయారు. ఐతే సదరు మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్త ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆ ఇంటికే మకాం మార్చి అక్కడే ఉంటోంది. ఈ విషయం ఇరుగుపొరుగు వారి సాయంతో తెలుసుకున్న ఆమె భర్త అత్తమామలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో ఆ మహిళ ఇంటి వద్దకు వచ్చి ఆమెను చెట్టుకు కట్టి.. ఘోరంగా కర్రలతో దాడి చేశారు ఆమె భర్త, అత్తమామలు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. సమయానికి పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలికి రావడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం సదురు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సదరు మహిళ భర్త, అత్తమాహాలు, మరో ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్..) -
గుడిలో ప్రార్థన చేస్తూ...అకస్మాత్తుగా మృతి: వీడియో వైరల్
మధ్యప్రదేశ్: ఒక భక్తుడు గుడిలో ప్రార్థన చేస్తూ... అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...గురువారం రాజేష్ మెహనీ అనే సాయి భక్తుడు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ అలా ఉండిపోయాడు. ఎంతకీ అతను చలనం లేకుండా అలా సుమారు 15 నిమిషాల వరకు ఉండిపోయాడు.దీంతో అనుమానం వచ్చి అక్కడే ఉన్న కొందరూ అతను వద్దకు వచ్చి తట్టగా అతడు అచేతనం పడి ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్న మరికొందరూ భక్తులు సదరు వ్యక్తిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. మృతుడు రాజేష్ ఒక మెడికల్ స్టోర్‌ని నడుపుతున్నాడని, ప్రతి గురువారం సాయి దేవాలయానికి వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో నెట్టింట తెగ వైరల్ వుతుంది. అతను ఆ వీడియోలో ప్రదిక్షిణ చేసి సాయి బాబ విగ్రవద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తూ అలా అచేతనంగా ఉండిపోయినట్లు కనిపిస్తుంది. रहस्यमय मौत... कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU — Narendra Singh (@NarendraNeer007) December 4, 2022 (చదవండి: అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు) -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడని సస్పెండ్ చేశారు..!
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ బార్వానీ జిల్లాలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్రకు హాజరైనందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్ కన్నోజే సస్పన్షన్‌కి గురయ్యాడు. ఆయన కనాస్యలోని రాష్ట్ర గిరిజన వ్యవహార విభాగంలో ఒక ప్రాథమిక పాఠశాల్లోని ఉపాధ్యాయుడు. అతను యాత్రలో పాల్గొన్న ఒకరోజు తర్వాత ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారంటూ అధికారులు సస్పెండ్ చేశారు. అతని సస్పెన్షన్ ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గిరిజన వ్యవహారాల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రఘవన్షి మాట్లాడుతూ...కన్నోజే ముఖ్యమైన పని కోసం సెలవు కోరారు. కానీ అతను రాజకీయ కార్యక్రమానికి హాజరై సోషల్‌మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడు. ఆయన నవంబర్ 24న ఒక రాజకీయ పార్టీ భారత్ జోడో యాత్రకు హాజరై ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారు. అదువల్లేఈ వేటు విధించినట్లు తెలిపారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా డిపార్ట్మెంట్ చైర్పర్సన్ కెకె మిశ్రా ట్విట్టర్ వేదికగా....శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రభుత్వం ఉద్యోగులను రాష్ట్ర స్వయం సేవక్ సంఘం(ఆర్ఎస్ఎస్) శాఖలలో మాత్రమే పాల్గొనడానికి అనుమతించిందని ఎద్దేవా చేశారు. రాజేష్ కన్నోజ్ అనే గిరిజనుడు ఆ యాత్రలో పాల్గొని రాహుల్‌కి విల్లు, బాణం బహుమతిగా ఇచ్చినందుకే ఆయనపై వేటు వేశారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర ఈ ఆదివారం రాజస్తాన్‌లోకి ప్రవేశించనుంది. (చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ!) -
డ్రైవర్ కు గుండెపోటు.. ఆగిఉన్న వాహనాలపై దూసుకెళ్లిన బస్సు
-
వీడియో: నన్నెవరూ ఆపలేరు.. ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు
ఆసుపత్రిలో ఐసీయూ అనగానే అందరికీ.. విషమంగా ఉన్న పేషంట్స్‌కు మాత్రమే చికిత్స అందించే ప్లేస్ అని తెలుసు కదా. అయితే, ఒక్కోసారి ఐసీయూలోకి పేషంట్‌ను చూసేందుకే ఇతరులను ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించరు. ఇలాంటి క్రమంలో ఐసీయూలోకి ఏకంగా ఓ ఆవు ప్రవేశించి చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో ఉన్న ఓ ఆసుపత్రిలోని ఐసీయూలోకి ఆవు ప్రవేశించింది. అనంతరం.. ఆవు కొద్దిసేపు ఐసీయూ, ఆసుపత్రిలో చక్కర్లు కొట్టింది. అక్కడే తిరుగుతూ ఆసుపత్రి ఆవరణలోని చెత్త డబ్బాలో అన్న మెడికల్ వ్యర్థాలను తిన్నది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆసుపత్రి యాజమాన్యంపై పేషంట్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఐసీయూలోకి ఆవు ప్రవేశించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే, పాత కోవిడ్ వార్డులోకి ఆవు వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనలో అజాగ్రత్తగా వ్యవహరించిన ఆసుపత్రి ఇన్చార్జ్, గార్డును సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. WATCH: #BNNIndia Reports On Friday, a cow was seen roaming freely and eating medical waste from the hospital's garbage cans in the intensive care unit (ICU) of a hospital in Madhya Pradesh's Rajgarh district. pic.twitter.com/15ktUQprhj — Gurbaksh Singh Chahal (@gchahal) November 19, 2022 -
ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ..
షాక్‌కి గురిచేసిన ఢిల్లీలోని ప్రియురాలి హత్యోదంతం మరువక మునుపే ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇద్దరితో సాగించిన వివాహేతర బంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకెళ్తే...పాట్నాకు చెందిన వ్యాపారి అభిజిత్ ఒక మహిళను చంపి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద కలకలం రేపింది. అతను మంచంపై ఉన్న పడి ఉన్న స్తీని దుప్పటి కప్పి గొంతు కోసి చంపుతూ...' ద్రోహం చెయ్యద్దు' అని వీడియోలో ఉన్నాదిలా అరుస్తున్నట్లు కనిపించింది. తన పేరు అభిజిత్ అని తన వ్యాపార భాగస్వామి జితేంద్ర కూమర్ అని వీడియోలో పేర్కొన్నాడు. ఆ బాధితురాలు తమ ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఆమెను చంపమని జితేంద్రనే చెప్పినట్లు నిందితుడు వీడియోలో తెలిపాడు. బాధితురాలు తన భాగస్వామి నుంచి సుమారు రూ. 12 లక్షలు అప్పుగా తీసుకుని పారిపోయినట్లు.. ఆమెను జితేంద్ర ఆదేశాల మేరకే హత్య చేసినట్లు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర, అతని సహాయకుడు సుమిత్ పటేల్‌ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అభిజిత్ జితేంద్ర ఇంట్లోనే నెలరోజులుగా ఉన్నట్లు సీసీఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అభిజిత్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి తీవ్రం గాలిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ శివేష్ బఘేల్ చెప్పారు. The man confessed to the crime in the video and complained about the woman's infidelity.#Jabalpur #CrimeNews https://t.co/sidufv9jCb — IndiaToday (@IndiaToday) November 16, 2022 (చదవండి: భర్త తిరిగి వచ్చేసరికే షాక్...భార్య, పిల్లలు..) -
వీడియో: అర్ధరాత్రి దుప్పట్లో దూరిన నాగుపాము.. తెల్లారి లేచేసరికి..
సాధారణంగా మనం సడెన్‌గా పామును చూడగానే ఒక్కసారిగా షాకై.. భయంతో దూరంగా పరుగుతీస్తాము. ఈ క్రమంలో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా మన దుప్పట్లోనే ఉంటే.. ఇకేంముంది దాదాపు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అనుకుంటారు కదా. పాపం ఓ యువకుడికి ఇలాంటి ఘటనే ఎదురైంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సిరోజం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి వేళ తన రూమ్‌లోకి వెళ్లి నిద్రపోవడానికి రెడీ అయ్యాడు. కింద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. ఇంతలో ఓ నాగుపాము.. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. అతడి దుప్పట్లో దూరిపోయింది. కానీ, అతడిని మాత్రం కాటు వేయలేదు. అలా రాత్రంతా దుప్పట్లోనే ఉండిపోయింది. తీరా.. మరుసటి రోజు ఉదయం సదరు యువకుడికి మెలకువ వచ్చింది. బుసలు కొడుతున్న శబ్దం వినిపించడంతో ఎంటబ్బా అని నిద్రలోనే ఒక్కసారిగా అటువైపు తిరిగిచూశాడు. పడగవిప్పిన నాగుపాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. సడెన్ షాక్ నుంచి వెంటనే తేరుకుని పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో, అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ దుప్పట్లో దూరిన నాగుపామును పట్టేశాడు. -
చీతా ప్రాజెక్టు: లక్ష్యం ఫలించనుందా?.. త్వరలో మరో...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన 72వ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకు వచ్చిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ గాల్వియర్ కునో నేషన్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడూ అందులోని ఒక చీతా ప్రెగ్నెంట్ అయి ఉండోచ్చని చీతా కన్జర్వేషన్ ఫండ్(సీసీఎఫ్)కి చెందిన డాక్టర్ లారీ మార్కర్ అనుమానం వ్యక్తం చేశారు. ఐతే తాను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేను గానీ, తాము మాత్రం ఈ చీతాలు వచ్చినప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఒక వేళ త్వరలో ఒక చిన్న చీతా కూన వచ్చినట్లయితే అది మనకు నమీబియా నుంచి లభించిన మరో అద్భుతమైన గిఫ్ట్ అనే చెప్పాలి. ఒక వేళ ఆశా అనే పేరు గల ఈ చీతా గనుక ప్రగ్నెంట్ అయితే అదే తొలి చిట్టి చీతా అవుతుందని అన్నారు. అంతేగాదు ఆ చీతాకు(ఆశా) కాస్త స్పేస్ ఇచ్చేలా ఎవరూ దాని వైపుకు రాకుండా చూడాలి, పైగా ఒక బోన్లో చాలా జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. (చదవండి: కునా పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..) -
విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని..
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్.. బుద్దిలేకుండా ప్రవర్తించాడు. ఓ విద్యార్ధిని అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేలపై పడుకోబెట్టి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. కాగా, ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, రేవాలోని ఖజుమా కాలాలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థిపై ఉపాధ్యాయుడు సందీప్ భారతి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. ఈ క్రమంలో విద్యార్థి.. టీచర్ దెబ్బలకు తాకలేక విలవిల్లాడిపోయాడు. ఒకానొక సమయంలో ఎదురుతిరిగే ప్రయత్నం కూడా చేశాడు. అయితే, కొట్టడం ఆపివేసిన కాసేపటికి విద్యార్థి కింద నుంచిపైకి లేవడంతో అతడి దుస్తులకు బురద అంటుకోవడం వీడియోలో చూడవచ్చు. ఇక, విద్యార్థి లేచి ముందుకు వెళ్తున్న క్రమంలో టీచర్ మరోసారి అతడిని చితకబాదాడు. మెడపట్టుకుని ముందకు నెట్టివేశాడు. ఇదంతా చూస్తున్న మిగతా టీచర్లు, విద్యార్థులు మాత్రం టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకపోవడం గమనార్హం. కాగా, ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాత టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. MP: दरिंदा शिक्षक की बेरहमी से छात्र की पिटाई का वीडियो वायरल, रीवा जिले के गुढ़ तहसील क्षेत्र अंतर्गत खजुहा हायर सेकेंडरी विद्यालय का मामला, विद्यालय में कक्षा 8 में अध्ययनरत है छात्र। @KashifKakvi @IG_Rewa @SP_Rewa @CMMadhyaPradesh @KavitaPandeyINC @theobclive @obcricha pic.twitter.com/oWKTbpnrjX — ओबीसी महासभा मध्यप्रदेश (@OBC_MP) September 29, 2022 -
అదృష్టమంటే మీదే సామీ.. రాత్రికి రాత్రే రైతులు కోటీశ్వరులయ్యారు!
అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో ఎవరిని వరిస్తుందో చెప్పులేము. దశ తిరిగితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు.. అలాగే బిక్షగాడు కూడా అయ్యే అవకాశమూ లేకపోలేదు. తాజాగా ఓ రైతు ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని బ్రిజ్‌పుర్‌కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు ఆరుగురు స్నేహితులతో కలిసి కొంత కాలం క్రితం.. లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. అనంతరం, వజ్రాల వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. వజ్రాన్ని ఎలాగైనా సాధించాలన్న సంకల్పంతో ముందుకుసాగాడు. ఈ క్రమంలో గురువారం వారికి గనిలో విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. ఎంతో ఆనందపడిన రాజేంద్ర గుప్త దాన్ని వెంటనే వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు. వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో, వారి ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. ఇలా రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. Madhya Pradesh News: पन्ना में एक साथ चार लोगों को अलग-अलग खदानों में मिले बेशकीमती हीरे#siamond #mpnews #pannanewshttps://t.co/2QnRAKyMeZ pic.twitter.com/HuPYudd62j — NaiDunia (@Nai_Dunia) September 22, 2022 -
మోదీకి ఇంతకు మించి గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు!
న్యూఢిల్లీ: మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఎనిమిది చిరుతలు నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ... మోదీకి తాము ఇంతకు మించి గొప్ప బహుమతి ఇవ్వలేమని అన్నారు. అతిపెద్ద వన్యప్రాణులను జంబో జెట్ ద్వారా తరలించడం అనేది చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. దీని వల్ల కునో పాల్పూర్ ప్రాంతం పర్యాటకంగా వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. భారత్ గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్ చీతా అనే ఖండాంతర ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్‌కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్ ఖండాంతర భారీ వైల్డ్ మాంసాహార ట్రాన్స్ లోకేషన్ ప్రాజెక్ట్ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ చిరుతలు భారత్‌లోని ఓపెన్ ఫారెస్ట్ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్ సీక్వెస్ట్రేషన్, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వస్తున్న 8 చిరుతలు మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడ నుంచి కునో నేషనల్ పార్క్‌కి హెలికాప్టర్లో తరలిస్తారు.ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి. (చదవండి: మోదీ పుట్టిన రోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?) డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్‌లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే.. -
వారంతా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్స్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్, స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షబానా అజ్మీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే వీరంతా మాట్లాడేందుకు ముందుకు వస్తారు. మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగినా వీరికి పట్టదు. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్‌ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్‌లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు. అలాగే, వీరంతా తమ చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ.. దీన్ని నాగరికత, సెక్యులర్ అని అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ విమర్శించారు. అదే సమయంలో వీరిని అవార్డ్ వాప్సీ గ్యాంగ్ అని కూడా అన్నారు. शबाना आजमी, नसीरुद्दीन शाह जैसे लोग टुकड़े-टुकड़े गैंग के स्लीपर सेल के एजेंट है जो सिर्फ भाजपा शासित राज्यों में हुई घटनाओं पर ही हल्ला मचाते हैं, जबकि कांग्रेस शासित राजस्थान और झारखंड जैसे राज्यों में हो रही घटनाओं पर मौन रहते हैं। अब ऐसे लोगों की कलई खुल चुकी हैं। pic.twitter.com/fPpaTLKbzx — Dr Narottam Mishra (@drnarottammisra) September 2, 2022 -
బీజేపీ సంచలన నిర్ణయం.. సీనియర్ నేతకు బిగ్ షాక్!
బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాషాయ నేతపై వేటు వేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ కార్యక్రమంలో బీజేపీ నేత ప్రీతం సింగ్ లోధీ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు మతం పేరుతో ప్రజలను మోసగించి, వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల డబ్బు, వనరులతో బ్రాహ్మణులు సంపద కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. మహిళల పట్ల కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన ప్రవీణ్ మిశ్రా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ అధిష్టానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రీతం సింగ్ లోధీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. అతడిపై వేటు వేసింది. బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మాజీ సీఎం ఉమాభారతికి అత్యంత సన్నిహితుడైన ప్రీతం సింగ్ లోధీ..శివ్‌పూరి జిల్లా పిచ్చోర్ స్థానం నుంచి 2013,2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. #MadhyaPradesh: Insult of #Brahmins by #BJP leader Pritam Singh Lodhi in Shivpuri. #Trending #Viralvideo #India pic.twitter.com/VelePtoYHl — IndiaObservers (@IndiaObservers) August 19, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
హత్య కేసుని ఛేదించడం కోసం బాబా సాయం కోరిన పోలీసులు: వీడియో వైరల్
అధికార హోదాలో ఉన్న పోలీసులే ఓ హత్య కేసు చేధించడం కోసం బాబాని సాయం కోరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు బమిత పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ శర్మ ఒక మైనర్ హత్య కేసు విషయమై బాబా పండోఖర్ సర్కార్ సాయం తీసుకోవడవం పెద్ద కలకలం రేపింది. అందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు సూపరిండెంట్ సచిన్ శర్మ సదరు అసిస్టెంట్ సీఐ అనిల్ శర్మని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో పంకజ్ శర్మని నియమించారు. అసలేం జరిగిందంటే....జులై 28న ఓటపూర్వ గ్రామంలో బావి నుంచి 17 ఏళ్ల బాలిక మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాలిక బంధువులు తమ గ్రామస్తులైన రవి అహిర్వార్, గుడ్డా అలియాస్ రాకేష్, అమన్ అహిర్వార్లు ఈ హత్య చేశారని ఆరోపిస్తూ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత తగిన సాక్షాధారాలు లేవంటూ పోలీసులు వారిని వదిలేశారు. అకస్మాత్తుగా కొద్ది రోజుల తర్వాత పోలీసులు విచారణలో ఆ బాలిక మేనమామ తిరత్ అహిర్వారే ఈ హత్య చేసినట్లు చెప్పారు. తన మేనకోడలు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఈ హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాలిక బంధువులు ఒక్కసారిగా నిర్ఢాంతపోయారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు విషయమై బాబాను సాయం కోరిన వీడియో లీక్ అవ్వడంతో వివాదస్పదమైంది. అంతేకాదు వీడియోలో బాబా.. నిందితుడు మజ్గువాన్ ప్రాంతానికి చెందినవాడని, అతనే ఈ కేసులో కీలక నేరస్తుడని చెప్పడం విశేషం. దీంతో అధికారులు ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా తదుపరి విచారణ బాధ్యతలను సబ్ డివిజనల్ పోలీసు అధికారి మన్మోహన్ సింగ్ బఘెల్‌కు అప్పగించారు. In a bid to identify the suspect in the death of a 17-year-old girl,ASI Anil Sharma from Chhatarpur reached out to Pandokhar Sarkar, he could be heard saying he has called out the names of a few people the name he missed will lead them to the suspect @ndtv @ndtvindia pic.twitter.com/u2RrpaLuYG — Anurag Dwary (@Anurag_Dwary) August 19, 2022 (చదవండి: బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం -
అప్పటికే రెండు పెళ్లిలు.. మరో మహిళతో ఎఫైర్.. లవర్ కోసం ఆమె..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. క్షణ కాలం సుఖాల కోసం కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఓ ప్రియుడి కోసం ప్రియురాలు.. ఎవరూ చేయని పనిచేసింది. తన లవర్ రెండో భార్యను హత్య చేసి కటకటాల్లోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దేవాస్ జిల్లాకు చెందిన బబ్లూకి 14 సంవత్సరాల కిందటే నీలం అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, బబ్లూ.. తన మొదటి భార్యకు తెలియకుండా ఈ ఏడాది మే నెలలో రాణి అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన నీలం.. అతడిని నిలదీసింది. పెళ్లి విషయం తెలిసి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఓ రోజు బంగారం కొనేందుకు బబ్లూ.. జ్యుయలరీ షాపునకు వెళ్లాడు. ఈ క్రమంలో రీతూ గౌర్తో పరిచయం ఏర్పడింది. అయితే, రీతూ గౌర్‌కు వివాహమై ఓ పాప కూడా ఉంది. ఇక, వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధాన్ని దారి తీసింది. ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెళ్లేవాడు. కాగా, ఓరోజు తన రెండో భార్యతో ఉన్న సమస్యలను రీతూకు చెప్పాడు. తన పోరు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. లవర్ ఆవేదనను అర్థం చేసుకున్న రీత్.. తనను ఓదార్చింది. అనంతరం, ఇద్దరూ కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. రీత్.. రాణిని చంపేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది. మరో మహిళతో కలిసి జాకెట్ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లి.. గొంతు నులిమి హత్య చేసింది. ప్లాన్‌లో భాగంగా బబ్లూ ఏమైందో తెలియనట్టు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం, పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులు.. బబ్లూను గట్టిగా ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో, ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: క్లబ్లో యువతులతో అనుచిత ప్రవర్తన.. తాకరాని చోట టచ్ చేసి.. -
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు.. హాస్టల్లో అమ్మాయిలపై పైశాచికత్వం!
Seniors ragging.. కాలేజ్ డేస్ అనగానే చాలా మందికి హ్యాపీడేస్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసే సీన్స్ నవ్వుతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అలాగే, కొందరు విద్యార్థులు తాము కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ర్యాగింగ్‌ను గుర్తు చేసుకుని కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం భయంతో వణికిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ మెడికల్‌లో చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన సీనియర్స్.. జూనియర్ల పట్ల వికృత చర్యలకు దిగారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. హాస్టల్లో జూనియర్లను తమ రూమ్స్‌లోకి పిలిపించుకుని ఓవర్‌గా బిహేవ్ చేశారు. దిండ్లతో శృంగారం చేయాలని వారిని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరికొకరు కొట్టుకోవాలని బెదిరించారు. దీంతో, సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదులో ర్యాగింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూజీసీ.. రంగంలోకి దిగి విచారణ జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురిచేసిన సీనియర్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి యూజీసీ ఆదేశించింది. దీంతో, పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 కింద సీనియర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ‘Have sex with pillows, abuse girls’: Freshers allege ragging in Indore's MGM Medical College#indorenews #MadhyaPradesh #CollageRagging #nvbcnews pic.twitter.com/fRiQUIX2gP — NVBC News (@NewsNvbc) July 30, 2022 ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్.. వీడియో వైరల్ -
టీకా కలకలం: ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్.. ఆ తర్వాత..
Vaccinated 30 Students With One Syringe.. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు స్థాయిలో 200కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్ అతడిపై దాడి చేసినంత పనిచేశారు. Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX — Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022 ఈ విషయం.. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జితేంద్ర.. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లఘించారని తెలిపారు. అందుకే జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందిస్తూ.. జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో.. -
టైం కోసం వేచి చూశాడు.. ఫ్రెండ్ ఇంట్లోలేడని తెలిసి ఆమెపై..
పెళ్లి చేసుకుని భార్యకు అండగా ఉండాల్సిన భర్తే.. ఆమె పాలిట కీచకుడయ్యాడు. భర్త స్నేహితుడు.. ఆమెపై అత్యాచారం చేసినా.. అదేదీ పట్టించుకోకుండా ఆమెకు విడాకుల ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ హిందూ మహిళ(28)కు మరో వర్గానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం.. సదరు మహిళ తన భర్త వర్గంలోకి మారింది. కాగా, మొదట్లో కొద్ది రోజుల బాగానే సాగిన వివాహ బంధంలో అడ్డంకులు ఎదురయ్యాయి. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీరోజు ఏదో ఒక విషయంలో వారి మధ్య తగువు జరుగుతూనే ఉంది. అయితే, వీరి సమస్యను తీర్చేందుకు భర్త స్నేహితుడు.. హసీబ్ సిద్ధిఖీ రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తరచూ వారి ఇంటికి వస్తూ బాధితురాలిపై కన్నేసిన సిద్ధిఖీ దారుణానికి ఒడిగట్టాడు. ఓరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆమె గోడు వినిపించుకోని భర్త.. ఆమె పాలిట దుర్మార్గంగా ప్రవర్తించాడు. స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఇంట్లో నుంచి ఆమె పంపించేశాడు. దీంతో బాధితురాలు ఇండోర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: దేశ సరిహద్దుల్లో అమ్మాయిల మృతదేహాల కలకలం.. ఎలా చనిపోయారు? -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వరదల్లో బస్సు.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో, సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. గ్రామాలు, నగరాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహన ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, షాజాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం 24 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్డు మీద వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోవడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG — Siraj Noorani (@sirajnoorani) July 23, 2022 ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ ట్రాక్టర్ సాయంతో బస్సును వరదలో నుంచి బయటకు తీశారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. పిల్లలందరూ క్షేమంగా బయటపడటంతో వారి పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. #MadhyaPradesh | School Bus With Over 2 Dozen Children Stuck In Drain Amid Heavy Rain, Pulled Out https://t.co/PTKiaw2fSF pic.twitter.com/56dWF8bFPq — NDTV (@ndtv) July 23, 2022 ఇది కూడా చదవండి: చేపకు వేలంలో రూ. 3 లక్షలు.. స్పెషల్ తెలిస్తే షాక్ అవుతారు -
విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ నేత కన్నుమూత
Congress Leader Harinarayan Gupta.. కాంగ్రెస్ నేత గుండెపోటు కారణంగా అకాల మరణం పొందాడు. ఎన్నికల్లో ఓటమిని భరించలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్‌లు, 298 నగర్ పరిషత్‌లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా, జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే, వీటి ఫలితాలు ఆదివారం వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. గుప్తాకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా బరిలో నిలిచారు. కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై గెలుపొందారు. ఈ క్రమంలో తన ఓటమి వార్త విన్న హరినారాయణ్ ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అములుకున్నారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సింగ్రౌలీలో విజయం సాధించింది. ఇక, బుర్హాన్పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్‌లలో అధికార బీజేపీ విజయం సాధించింది. #Congress candidate Harinarayan Gupta, contesting in municipal council polls for #Rewa district in #MadhyaPradesh, died of heart attack after his election loss.https://t.co/DHTh5JMwqh — IndiaToday (@IndiaToday) July 17, 2022 ఇది కూడా చదవండి: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
కలిచివేసే ఘటన: తమ్ముడి మృతదేహాంతో ఎనిమిదేళ్ల చిన్నారి...
పేదవాళ్ల కోసం ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఇంకా చాలా చోట్ల వారు దారుణమైన నిస్సహాయ స్థితిలోనే ఉంటున్నారు. కనీసం సాటి మనుషులుగా వారికి సాయం చేసేవాళ్లు కూడా ముందుకు రాకపోవడం అత్యంత బాధకరం. కన్న బిడ్డ చనిపోయిన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేని దుస్థితిలో చాలామంది పేదవాళ్లు ఉన్నారు. గత్యంతరం లేని స్థితిలో వారిని అనాథ శవాలుగా వదిలి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలు. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లో అంబాహ్‌లోని బద్ ఫ్రా గ్రామ నివాసి పూజారామ్ జాతవ్ తన రెండేళ్ల రాజా అనే కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఐతే ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం భోపాల్‌లోని మోరెనా జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో పూజారామ్ స్థానిక ఆస్పత్రి ఇచ్చిన అంబులెన్స్ సాయంతో తన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆ చిన్నారి రక్తహీనత, అసిటిస్‌తో బాధపడుతూ చికిత్స సమయంలోనే మరణించాడు. దీంతో పూజరామ్ జాతవ్ తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని వేడుకున్నాడు. ఆస్పత్రిలో వాహనం లేదని బయట వాహనం మాట్లాడుకుని వెళ్లమంటూ ఉచిత సలహ ఇచ్చి పంపేశారు. దీంతో చేసేదేమీ లేక తన పెద్ద కొడుకు గుల్షన్ ఒడిలో తన కొడుకు మృతదేహాన్ని ఉంచి వాహనం తీసుకువస్తాని చెప్పి వారిని మోరీనా నెహ్రూ పార్క్ వద్ద ఉంచి వెళ్లాడు. ఐతే పూజారామ్‌కి ఎంత ప్రయత్నించిన ఏ వాహనం దొరకలేదు. దీంతో అతను తన పెద్ద కుమారుడు గుల్షన్‌ని చనిపోయిన రాజాని అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. పాపం ఆ చిన్నారి చనిపోయిన తన తమ్ముడు తలను ఒళ్లో పెట్టుకుని తండ్రి కోసం నిరీక్షిస్తున్నాడు. ఒక పక్క ఈగలు వాలుతూ ఉంటే వాటిని కొడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు ఆ చిన్నారి. ఐతే స్థానిక జనం అధికారులుకు సమాచారం ఇవ్వడంతో...పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ అసలు విషయం తెలుసుకని పూజారామ్‌కి సదరు స్థానిక ఆస్పత్రి నుంచే అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించారు. (చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా 21 ఏళ్ల అమ్మాయి!
21-year-old Ujjain Girl: మధ్యప్రదేశ్‌లోని చింతామన్ జవాసియా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిని ఓడించి 487 ఓట్ల ఆధిక్యంతో గెలిచిని అతి పిన్న వయస్కురాలిగా ఉజ్జయినికి చెందిన 21 ఏళ్ల అమ్మయిగా లతికా దాగర్ రికార్డు సృష్టించారు. లతికా మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. అంతేకాదు ఆమె మేనిఫెస్టోలో తాగునీరు, డ్రైన్, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తానని, ఇళ్లు లేని కుటుంబాలకు గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందంటూ పలు రకాలు హామీలు ఇచ్చి మరీ గెలుపొందారు. అంతేకాదు మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్‌లోని అతి పిన్న వయస్కురాలైన మహిళా సర్పంచ్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ రికార్డును యాదృచ్ఛికంగా తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
మాజీ మంత్రి కొడుకు హల్చల్.. కారులో మందు తాగుతూ రోడ్డుపై..
మద్యం మత్తులో కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై హల్చల్ చేశాడు. మద్యం మత్తులోనే ఓ వ్యాపారి కారును ఢీకొని అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో బెదిరించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాజాపూర్‌కు చెందని కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడ కొడుకు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. తన ఎస్వీయూ(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొట్టాడు. దినేస్ అహుజా అతడి అనుచరులతో కలిసి భోపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, భాదితులు దినేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు. బాధితులు తాము పోలీస్ స్టేషన్‌కు వెళతాము. నష్ట పరిహారం ఇవ్వాలని కోరడంతో వారు రోహితప్ మరింత రెచ్చిపోయాడు. మరోసారి దినేష్ కారును ఢీకొట్టాడు. దీంతో దినేష్, అతడి అనుచరులు.. రోహితప్ను బయటకు దిగాలని కోరడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్టు తెలిపారుకాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు అష్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Former minister and senior @INCIndia leader Hukum Singh Karada's heavily drunk son Rohitap who was driving an SUV hit the car of a businessman When asked him to come to the local police, Karada again dashed the car with his SUV @ndtv @ndtvindia pic.twitter.com/quzQf5sh1P — Anurag Dwary (@Anurag_Dwary) May 23, 2022 ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి -
‘లవ్ యూ’ అంటూ దగ్గరయ్యాడు.. శారీరకంగా ఒక్కటయ్యాక..
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల అధికారి అలోక్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అశోకనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిహల్ ఖాన్(30) అనే వ్యక్తి ఆసుపత్రిని రన్ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు(28) ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్ ఖాన్‌లో క్లోజ్‌నెస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. నిహల్ ఖాన్ తనను మోసం చేశాడని గుర్తించింది. అనంతరం అతడిని ఎందుకిలా చేశావని నిలదీయగా.. మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని నిహల్ చెప్పడంతో ఖంగుతింది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిహాల్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం ఆరోపణలపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో -
భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్.. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్ అథ్లెటిక్స్ కోచ్ బీకే ధవన్ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. అనంతరం కాంస్య పతకం సాధించాడు. Madhya Pradesh | Para-athlete Sachin Sahu sells ice cream in Rewa to make ends meet "Despite lack of facilities, I won a bronze medal in 400m race in 20th National Para-Athletics Championship. I appeal to the government to support me to play further," he said pic.twitter.com/bH53zzwdcf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2022 -
యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..
ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 15 ஆண்டுகள் 3 பெண்களுடன் லிவிங் டுகெதர்.. 6 குழந்தைகள் முன்னிலையில் நடைபெற்ற திருமணம்..! #MadhyaPradesh | #Alirajpur | #LiveInRelationship pic.twitter.com/lUVxNdwkuX — Polimer News (@polimernews) May 3, 2022 ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss — Free Press Journal (@fpjindia) May 2, 2022 -
క్షణికావేశంలో తప్పు చేసిన భార్య.. భర్త ఏం చేశాడంటే..?
దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం. గొడవలున్నా సర్దుకుపోయి జీవించాలని పెద్దలు చెబుతుంటారు. కాగా, క్షణికావేశంలో భార్య చేసిన చిన్న తప్పు వివాహ బంధాన్ని నాశనం చేసింది. ఆమెను జీవితాంతం బాధపడేలా చేసి.. చివరకు విడాకులకు దారి తీసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన దంపతులు పదేళ్లకుపైగా విదేశంలో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా వారు నివసిస్తున్న దేశంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు తిరిగి స్వదేశానికి రావాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భర్త.. ఓ వ్యాపారం ప్రారంభించగా.. భార్య ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. అయితే, వారు భోపాల్‌కు రావడం భార్యకు ఎంతమాత్రం ఇష్టం లేకపోవడంతో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవ పడుతుండగా ఆవేశంతో రగిలిపోయిన భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా షాకైన భర్త.. తేరుకొని దీన్ని అవమానంగా ఫీలయ్యాడు. అనంతరం ఆమెతో విడిపోయేందుకు సిద్ధపడి విడాకులకు దరఖాస్తు చేశాడు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించడానికి ప్రయత్నించారు. కౌన్సిలింగ్ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. భర్త మాత్రం జరిగిన ఘటనను అవమానంగా భావించి.. ఆమెతో జీవించలేనని తెగెసిచెప్పాడు. విడాకులు కావాలని పట్టుబట్టాడు. అనంతరం భర్తను భార్య ఎంత బ్రతిమిలాడిన అతను మససు మాత్రం మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక కోర్టు వారికి విడాకులు మంజూరుచేసింది. ఇది కూడా చదవండి: వివాహమైన మూడు నెలలకే దారుణం -
దడపుట్టిస్తున్న ‘పార్థీ గ్యాంగ్’.. సీమలో దొంగతనాలతో హల్చల్
పార్థీ గ్యాంగ్... చోరీల్లో ఆరితేరిన ముఠా. చోరీ చేయడంలోనూ...పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ దిట్టలు. చోరీ సమయంలో అడ్డొస్తే అంతమొందించేందుకూ వెనుకాడని క్రూరులు. ఈ కరుడు గట్టిన దొంగల పేరు చెబితే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. ఈ గ్యాంగ్ ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పార్థీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే సామాన్యులకు హడల్. వీరి కన్ను పడితే ఎలాంటి భద్రత ఉన్నా ఇళ్లయినా లూఠీ కావాల్సిందే. చోరీలు ఈ గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడంలోనూ వీరు ఆరితేరిపోయారు. దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కినా ఇసుమంతైనా సమాచారం ఇవ్వరు. చోరీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ గ్యాంగ్ కదలికలు రాయలసీమలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. తాజాగా గుంతకల్లు దగ్గర జరిగిన రైలు దోపిడీలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్‌లోని పాసే పార్థీ తెగకు చెందిన వారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థానికంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద గుడారాలు వేసుకుంటారు. అదును చూసి చోరీలకు తెగబడతారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలపైనే వీరి కన్ను. వ్యాపారుల అవతారమెత్తి రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారు. ఈ నెల 20న పార్థీ గ్యాంగ్ సభ్యుడితో పాటు అరెస్టయిన మరో ఇద్దరు దొంగలు అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో పూసలు, దుప్పట్లు, గృహాలంకరణకు వినియోగించే మట్టి బొమ్మలు అమ్మే వ్యాపారుల్లా పార్థీ గ్యాంగ్ సభ్యులు అవతారమెత్తుతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడతారు. అడ్డొస్తే ప్రాణాలను సైతం తీస్తారు. ఇంత క్రూపమైన పార్థీ గ్యాంగ్‌కు ఓ మహిళ డాన్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలో పార్థీ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ముఠా సభ్యులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఈ పార్థీ గ్యాంగ్ ఎక్కడ చోరీలకు పాల్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా వారి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటుంది. సెల్ఫోన్లను సైతం నేర ప్రాంతానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ గ్యాంగ్‌లు ఎక్కడ దోపిడీకి పాల్పడినా వారి గ్రామాలకు చేరుకోకమునుపే పోలీసులు పట్టుకోవాలి. లేదంటే దోచుకున్న సొత్తులో పైసా కూడా రికవరీ చేయలేరు. కారణం దోచుకున్న సొమ్మలో 30 శాతం ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పెద్దలకు ఇస్తారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు వీరికి బాసటగా నిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దొంగలు, అనుమానితులు, తీవ్ర నేరాల్లో పాలుపంచుకున్న వారి వివరాలను పోలీసులు అప్పట్లో చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు తీసి ఉంచారు. ఈ ఆధారాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అనంతపురంలో పట్టుబడ్డ పార్థీ గ్యాంగ్ సభ్యుడు కూడా పాత పోలీసులు సేకరించిన చేతి వేలిముద్రల ఆధారంగానే దొరికాడు. వేలిముద్రలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చాం. అనుమానితుల చేతి వేలిముద్రలు మొబైల్లో తీసుకుని, ఇంటిగ్రేట్ చేసిన వాటితో సరిపోల్చుతాం. పార్థీ గ్యాంగ్‌లు వేసవిలో ఎక్కువగా తిరుగుతుంటాయి. రైళ్లలో దోపిడీలు కూడా చేస్తుంటాయి. వీటిపైనా నిఘా ఉంచాం. లాక్ చేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారమందిస్తే నిఘా పెడతాం. ఇప్పటికే రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలనూ అప్రమత్తం చేశారు. – ఎం.రవికృష్ణ, డీఐజీ, అనంతపురం రేంజ్ -
దారుణం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లి..
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలను లైంగికంగా వేధించడం, దాడులు చేయడం వంటివి మాత్రం ఆగడం లేదు. తాజాగా మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి చేత అశ్లీల నృత్యాలు చేయాలని బలవంతం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జబల్‌పుర్‌కు చెందిన సన్నీ సొంధియా, నిధీ సొంధియా దంపతులు, దర్భంగాకు చెందిన పింటూ కుమార్ ఠాకుర్‌లతో కూడిన ముఠా ఉద్యోగాల పేరుతో మహిళలను వేధింపులకు గురిచేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలు, యువతులను నమ్మించి వారిని వివిధ ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తూ.. పెళ్లి వేడుకల్లో వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించేవారు. ఇదిలా ఉండగా.. ఉద్యోగాల పేరుతో కొందరు మహిళలను ఈనెల 11వ తేదీన ఈ ముఠా జబల్పూర్కు తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీహార్ పోలీసుల సాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మోతీహరీ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నలుగురు మహిళలను రక్షించారు. -
ఎమ్మెల్యే కుమారుల వీరంగం.. ఎఫ్ఐఆర్ నమోదు
ఎమ్మెల్యే కొడుకులు వీరంగం సృష్టించారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్నారనే నెపంతో అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షియోపూర్‌లోని బుధేరా ఫారెస్ట్ రేంజ్లో అటవీ శాఖ అధికారులపై విజయ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ కుమారులు దాడి చేశారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకున్నందుకే వారు దాడి చేశారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే కుమారులు ధనరాజ్, దీనదయాళ్.. అక్రమ మైనింగ్, అడవి నుంచి ఇసుక, రాళ్ల అక్రమ రవాణా, అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారని ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకోవడంతో దాడి జరిగింది. అయితే, బుధేరా ఫారెస్ట్ రేంజ్‌లోని పిప్రాని ఫారెస్ట్ పోస్ట్‌లో తన వాహనాలను అడ్డుకున్నందుకు ధనరాజ్ అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అతని పక్కనే ఉన్న సోదరుడు దీనదయాళ్ సహనం కోల్పోయి వారి సహచరులతో కలిసి ఫారెస్ట్ గార్డులు రామ్రాజ్ సింగ్, రిషబ్ శర్మ, డ్రైవర్ హసన్ ఖాన్‌లను తిడుతూ వారిపై దాడి చేశారు. ఈ విషయం వారు అటవీశాఖ సీనియర్ అధికారులకు తెలపడంతో వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు షియోపూర్ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రామ్ తిలక్ మాల్వియా తెలిపారు. BJP MLA'S SONS BEAT FOREST OFFICIALS In #MadhyaPradesh, a #BJP MLA's sons beat up forest workers on duty. In a video, Vijaypur Assembly's MLA #SitaramAdivasi's both sons can be seen beating forest officials on duty.@govindtimes reports. pic.twitter.com/o33tGNj4Sm — Mirror Now (@MirrorNow) April 23, 2022 ఇది కూడా చదవండి: లక్కీ ఫెలో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు -
బైక్‌పై లవర్‌తో సోదరి షికారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అన్న
భోపాల్: తన సోదరి.. లవర్‌తో బైక్ మీద వెళ్తోందని ఆమె అన్న గమనించాడు. దీంతో వారిని రోడ్డుపై ఆపే ప్రయత్నం చేశాడు. కానీ, వారు బైక్ స్పీడ్ పెంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం పట్టలేక దారుణనికి ఒడిగట్టాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో ఫాలో చేసి హైస్పీడ్‌లో ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అయోధ్యనగర్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తన సోదరి.. లవర్‌తో బైక్‌పై వెళ్తోందన్న కోపంతో ఆమె సోదరుడు అజీం మస్సూరీ వారిని వెంబడించాడు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ మినీ ట్రక్కుతో వెంబడించి.. బలంగా ఢీకొట్టాడు. అలాగే బైకును, వారిద్దరినీ 10 మీటర్ల దూరం ట్రక్కుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం దిగి.. తన సోదరి సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అజీం మన్సూరీని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. #WATCH | Bhopal: A couple in their twenties from different communities were injured after the girl’s cousin allegedly chased, hit their scooter and assaulted them while they were trying to elope in Ayodhya Nagar on Monday afternoon. pic.twitter.com/hFgg3kOfVC — TOI Bhopal (@TOIBhopalNews) April 20, 2022 ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్ -
తండ్రి ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించలేదని..
తండ్రి ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించలేదన్న కోపంతో ఓ కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కూలీ పనులు చేసుకునే ఆ తండ్రికి.. కుటుంబానికి సరైన తిండి పెట్టడమే కష్టంగా మారింది. ఈ తరుణంలో.. ఫోన్ విలాసానికి అలవాటు పడ్డ ఆ కొడుకు డేటా ప్యాక్ వేయించమని తండ్రిని కోరాడు. అందుకు తండ్రి ఒప్పుకోకపోవడంతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో గేమ్‌లకు అలవాటు పడ్డ ఆ కుర్రాడు.. తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాడని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలని సిటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ శర్మ సూచిస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. బలవన్మరణం మహా పాపం. పైగా అది సమస్యలకు పరిష్కారం కాదు. జీవితం అంటే.. మనం బతికి నలుగురిని బతికించేదిలా ఉండాలి. అందుకే ఆత్మహత్య ఆలోచనలు వస్తే.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మోదీ, అమిత్ షా ఇలాఖాలో దాడులు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్బంగా చోటుచేసుకున్న ఘర్షణలపై రౌత్.. ‘సామ్నా’ పత్రిక వేదికగా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలను ఎండగట్టారు. కాగా, దేశంలో మతకల్లోలాలను రేకెత్తించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహమని సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో జరుగుతున్న పరిణామాలను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడని ఎద్దేవా చేశారు. పండుగ సందర్భంగా చెలరేగిన హింస శ్రీరాముడి ఆలోచనకే వ్యతిరేకమని అన్నారు. రామ మందిర ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో కత్తులు దూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మతకల్లోలాలను రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగానే కొన్నేళ్ల క్రితం శ్రీరామ నవమి వేడుకలు సంస్కృతికి వారధిగా ఉండేవని, ఇప్పుడు మత విద్వేషాలకు రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని విమర్శించారు. ఇలాంటి పనులు శ్రీరాముడి ఆలోచనలకే విరుద్ధమని తెలిపారు. ‘అసలు శ్రీరామనవమి రోజు ఎందుకు హింస జరిగింది? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత ఇలాఖా అయిన గుజరాత్లో శ్రీరామ నవమి యాత్రపై ముస్లింలు దాడి చేస్తారని ఎవరైనా నమ్ముతారా?’ అంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నవమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఇది మంచి సంకేతం కాదని రౌత్ పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని రౌత్ ఆరోపించారు. -
ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్
భోపాల్: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్పూర్ జిల్లాలోని రసల్చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె బైక్‌ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్ రూట్లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాంగ్రూట్లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్ డెలివరీ బాయ్‌కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు. -
పోలీసుల అరాచకం.. జర్నలిస్టును అర్ధనగ్నంగా..
భోపాల్: జర్నలిస్టు సహా మరికొంత మందిని పోలీసు స్టేషన్లో అర్ధ నగ్నంగా నిలుచోబెట్టిన ఫొటో వైరల్ మారింది. ఓ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాడనే నెపంతో పోలీసులు వారిని చితకబాది, బట్టలు విప్పించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సిధి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా, అతని కుమారుడు గురుదత్ శుక్లాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారనే నెపంతో నీరజ్ కుందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌కు నిరసనగా, బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నిరసనలకు దిగారు. ఈ నిరసనను కవర్ చేసేందుకు స్థాసని జర్నలిస్టు, యూ ట్యూబర్ కనిష్క తివారీ తన కెమెరామెన్తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిరసనకారులతో సహా జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్లో వారిని కొట్టి, దుర్భాషలాడారని, అర్ధ నగ్నంగా నిలుచోబెట్టారని తివారీ చెప్పారు. పోలీసులు తమను ఏప్రిల్ 2న రాత్రి 8 గంటలకు అదుపులోకి తీసుకొని ఏప్రిల్ 3 సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారని తివారీ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఎమ్మెల్యేపై ఎందుకు కథనాలు రాస్తున్నారని ప్రశ్నించారని తెలిపాడు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు ఇచా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. పోలీసు స్టేషన్ వ్యవహారం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కాస్తా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన సీఎం.. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. -
కూతురిపైనే పలు మార్లు అత్యాచారం.. మాట వినలేదని ఆమె శరీరాన్ని..
భోపాల్: ఎన్ని చట్టలు తెచ్చినా దేశంలో యువతులు, మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని కుటుంబ సభ్యులే మృగాలుగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వావి వరసలు మరచిన ఓ తండ్రి క్రూర మృగంలా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖండ్వా జిల్లాలోని సాక్తాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి(14) తన తండ్రి త్రిలోక్‌చంద్(55)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తన కూతురిపైనే కన్నేసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురునే బెదిరింపులకు గురిచేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఇటీవల ప్రతిఘటించడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన త్రిలోక్‌చంద్ ఆమెపై దాడి చేశాడు. ఆమెను కత్తితో నరికి.. శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టేశాడు. అనంతరం తన బంధువు సాయంతో గోనె సంచిని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న అజ్మన్ నదిలో పారేశాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు వ్యక్తలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేశ్ పెండ్రో తెలిపారు. -
అర్ధరాత్రి అమానుషం.. కొడుకును చంపేస్తామని బెదిరించి తల్లిపై..
భోపాల్: దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోయి మరీ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మానవత్వం మరచి ఆమె మూడేళ్ల కుమారుడి ఎదుటే ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ(24)పై లైంగిక దాడి చేశారు. బాధితురాలు తన మూడేళ్ల కొడుకుతో కలిసి వెళ్తుండగా దుండగులు ఆ బాలుడికి గన్‌తో చంపేస్తామని బెదిరించి.. తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకోగా.. బాధితురాలు శనివారం మోహగావ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను విక్రమ్, కృష్ణ శర్మగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారి కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఏడాదిగా వివాహేతర సంబంధం.. పిక్నిక్ పేరుతో ఆమెను అక్కడికి పిలిచి..
భోపాల్: సమాజంలో యువతులు, మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు నమ్మించి మహిళలను లొంగదీసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో ఓ మహిళను వంచించి చివరకు ఆమెకు విషం తాగించి.. బాధితురాలు చావుకు ముగ్గురు కారణమయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ(28)తో షాదబ్ ఉస్మాన్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వారి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. కాగా, పిక్నిక్ పేరుతో ఆమెను.. నిందితుడు షాదోల్ జిల్లాలోని క్షీర్సాగర్ తీసుకెళ్లాడు. అక్కడికి ఉస్మాన్ స్నేహితులు రాజేష్ సింగ్, సోనూ జార్జ్ సైతం వచ్చారు. ఈ క్రమంలో వారు ఫుల్‌గా మద్యం సేవించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బలవంతంగా ఆమెకు విషం తాగించారు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె చనిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదికలో ఆమెపై లైంగిక దాడి చేసి, విష ప్రయోగం జరిగినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు. -
హోలీ వేళ విషాదం.. మద్యం మత్తు ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తుండగా..
భోపాల్: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజలందరూ ఎంతో ఆనందంతో వేడుకలను జరుపుకున్నారు. కాగా హోలీ వేడుకల్లో అపశృతి జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను తానే కత్తితో పొడుచుకుని మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లో గోపాల్ సోలంకీ(38) అనే వ్యక్తి హోలీ వేళ తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సోలంకీ ఓ కత్తిని చేతిలో పట్టుకుని డ్యాన్స్ ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ స్టెప్పులేశాడు. ఈ క్రమంలో చేతిలో కత్తి ఉన్న విషయాన్ని మరిచిపోయి తన ఛాతిని నాలుగు సార్లు పొడుచుకుంటూ డ్యాన్స్ చేశాడు. తాగిన మైకంలో కత్తి ఘాటును ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇంతలో రక్తం విపరీతంగా కారుతుండటం పక్కనే ఉన్న ఓ మహిళ గమనించి ఆందోళనకు గురైంది. దీంతో సోలంకీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండె భాగం నుంచి రక్తం ఎక్కువగా కారిపోవడంతో అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పండుగ వేళ గోపాల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.. వైన్ షాపుపై రాళ్లతో దాడి.. వీడియో వైరల్
భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోలో హల్ చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మద్యం నిషేధించాలని అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేసింది. జనవరి 15వ తేదీ నాటికి రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. లేని పక్షంలో రోడ్ల మీదకు వచ్చి నిరసలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో మద్యంపై నిషేధం విధించకపోవడంతో ఆమె రంగంలోకి దిగింది. అన్న మాట నిలుబెట్టుకుంది. భోపాల్‌లోని ఓ వైన్ షాపుపై రాళ్లతో ఆమె దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటం గమనార్హం. బీజేపీ ప్రభుత్వంపైనే ఇలా నిరసనకు దిగి మరోసారి ఆమె ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Senior #BJP leader #UmaBharti in action at a #Liquor vend in #Bhopal, she has been batting for #LiquorBan in the state. What is called LAW & ORDER? Is this the way to protest?#MadhyaPradesh pic.twitter.com/hvHLCjmtOr — Safa 🇮🇳 (@safaperaje) March 13, 2022 అయితే, ఉమా భారతి ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. అంతకు ముందు భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చేదీ మేమే, వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా మేమే.. వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారు. రాజకీయాలకు వారిని మేము వాడుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. -
జాతరలో ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూ.. వీడియో వైరల్
భోపాల్: దేశంలో మహిళలపై లైంగిక దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. కొందరు ఆకతాయిలు కావాలనే యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ పోకిరి గ్యాంగ్ మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా హింసించారు. వారు చేసేది చాలదన్నట్టుగా కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీస్తూ రాక్షసానందం పొందారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలిరాజ్పూర్ జిల్లా సోండ్వా తెహసీల్‌లోని వాల్పూర్ గ్రామంలో హోలీకి ముందర అలిరాజ్పూర్, ఝాబువా, దర్, బర్వాని, సహా పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గిరిజనుల జాతర భగోరియా జరుగుతుంది. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతంలో ఈ జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జాతర ప్రారంభమైంది. కాగా, జాతరలో మార్చి 11వ తేదీన ఓ అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన ఓ గ్యాంగ్.. రోడ్డుపై అరుచుకుంటూ నానా బీభత్సం సృష్టిస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు గిరిజన అమ్మాయిలు భయంతో చాటుగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ పోకిరి ఒక అమ్మాయి వైపు పరుగెత్తి తన వైపు లాక్కున్నాడు. లైంగికంగా వేధించాడు. ⚡️Distressing Video A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF — Ahmer Khan (@ahmermkhan) March 13, 2022 అంతటితో ఆగకుంగా ఆ గ్యాంగ్‌లో మరో వ్యక్తి రెండో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వారి పట్ల దురుసుగా ప్రవర్తించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులను చూస్తూ జాతరలో ఉన్న వారు ఆపడానికి ప్రయత్నించకపోగా.. తమ ఫోన్లతో వీడియోలు తీశారు. అనంతరం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంలో వీడియో కాస్తా వైరల్ మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన తమ దృష్టికి రాలేదని అలిరాజ్పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ, ఈ వీడియో తీసిన గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. -
ఒకటి తర్వాత మరొకటి.. వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు..
సాక్షి,హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతడి విచారణలో కేతన్‌తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగాధిపతి ఇ.విజయ్‌కుమార్‌కు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సోమవారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. ► విజయవాడకు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. చాదర్‌ఘాట్ పరిధిలో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. ► కేతన్ సింగ్‌తో పాటు విజయ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్న ఇతగాడు ఈ పని మొదలెట్టాడు. డ్రాప్ఔట్స్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ► వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్‌లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్ డేట్స్‌తో డిగ్రీలు రూపొందిస్తున్న వాళ్లు వర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ► సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై దాడి చేసింది. వీరన్నతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేయడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులైన కంభపు సాయి గౌతమ్ (కొత్తపేట), చిన్రెడ్డి రితీష్ రెడ్డి (వనస్థలిపురం), బచ్చు వెంకట సాయి సుమ రోహిత్ (ఫతేనగర్), మున్నా వెల్‌ఫ్రెడ్ (వికారాబాద్), కోసిమెత్తి సూర్యతేజ (మాదాపూర్), తుమ్మల సాయితేజ (బాచుపల్లి) పట్టుబడ్డారు. ► నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లు, స్టాంపులు తదితరాలను తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే అరెస్టు అయిన కేతన్‌ను పీటీ వారెంట్‌పై ఈ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పరారీలో ఉన్న విజయ్‌కుమార్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు అవే చివరి ఎన్నికలు.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
భోపాల్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో 2023 ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. దిగ్విజయ్ సింగ్ శనివారం రత్లాం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అది జరగని పక్షంలో 2023 ఎన్నికలే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చివరి ఎలక్షన్స్ కావచ్చు అంటూ వారిని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు నిజాయితీగా లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. వారి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అలాంటి వారికి కార్యకర్తలు మద్దతివ్వరూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
వృద్ధురాలి కాళ్లుపట్టుకుని మంత్రి క్షమాపణ! ఏం జరిగిందంటే..
కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మకు ఓ మంత్రి క్షమాపణలు చేప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో రోడ్డుపై రద్దీ పెరుగుతున్న కారణంగా స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెట్‌ను అధికారులు మరోచోటుకి తరలించబోయారు. ప్రస్తుత మార్కెట్‌ను పరిశీలించడానకి అక్కడికి రాష్ట్ర ఇంధన వనరులశాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ వచ్చారు. మంత్రిని చూసిన బాబినా బాయ్ అనే కూరగాయలు అమ్ముకునే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఉపాధి కలిగించే మార్కెట్‌ను మరో చోటుకు తరలించడంపై ఆమె కన్నీరు పెట్టుకుంది. అయితే ఆమెను శాంతింపజేయడానకి మంత్రి.. రోడ్డు, మార్కెట్ పరిస్థితిని వివరించాడు. అంతటితో ఆగకుండా కూరగాయలు అమ్ముకునే వారికి కలిగిస్తున్న అసౌకర్యానికిగాను ఆమె కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగారు. మార్కెట్ తరలింపు వల్ల ఇబ్బంది పెడుతున్నామని.. ఆమె చేతులు పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలికి మంత్రి క్షమాపణ చేప్పి.. తన గొప్ప మనసు చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు డిమాండ్!
Kidnapped child in greed of 15 lakhs మధ్యప్రదేశ్: శివపురిలోని భావఖేడి గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.15 లక్షల కోసం చిన్నారిని ఇద్దరు కిడ్నాప్ చేశారని, మూడో నేరస్థుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వార్తను నేరగాళ్లకు చేరవేస్తున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు రామ్జీలాల్ యాదవ్ తన మేనల్లుడు నరేంద్ర యాదవ్ కుమారుడు హరిఓమ్ (6) డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయాడని భావ్‌ఖేడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెతికినా జాడకనిపించలేదని, సాయంత్రం 4 గంటల 26 నిముషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. చిన్నారి తమ వద్దనే ఉన్నాడని, రూ. 15 లక్షలు సిద్ధం చేసుకోమని, ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే బిడ్డ దక్కడని చెప్పి కిడ్నాపర్లు కాల్ డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసు బృందం రంగంలోకి దిగింది. భయాందోళనలకు గురైన నేరస్థులు చిన్నారిని గ్రామంలో రహదారిపై విడిచిపెట్టారు. అనంతరం పోలీసులు చిన్నారిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 15 లక్షల రూపాయల డబ్బు కోసం రెండు నెలల క్రితమే ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్నారి కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. కాగా పోలీసులు ముగ్గురు నేరగాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ?
Most unsafe hospital భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో గత ఐదేళ్లలో సగటున దాదాపు 37 మంది శిశువులు మృతిచెందారు. దేశంలోని మొత్తం శిశు మరణాలలో 13 శాతం మరణాలు ఈ హాస్పిటల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఎన్సీయూ యూనిట్లో ఈ ఏడాది (2020- 21) దాదాపు 5,00,996 నవజాత శిశువులను చేర్చుకోగా, వారిలో 68,301 మంది మరణించారు. 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. ఈ యూనిట్లో చేరిన చాలా మంది శిశువులు క్రిటికల్ కండీషన్లో ఉన్నారు. డిసెంబర్ 21న (మంగళవారం) రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుడు జితు పట్వారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి ఈ డేటాను అందించారు. నెలలు నిండని శిశువులు కూడా హమీడియా ఆసుపత్రిలో చేరారని ఆరోగ్య మంత్రి తెలియజేశారు. ఐతే ఈ శిశువుల ఆరోగ్య భద్రతపై మంత్రి వ్యాఖ్యానించలేదు. అత్యంత ప్రమాదకర ఆసుపత్రి ఈ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది మధ్యప్రదేశ్‌లోనే హమీడియా హాస్పిటల్ అత్యంత ప్రమాదకర ఆసుపత్రి అని పట్వారీ పేర్కొన్నాడు. ఇది ఆందోళన కలిగించే విషయమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని పట్వారీ పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా 2018 శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్ ముందంజలో ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రతి వెయ్యి శిశుజననాలకుగాను 48 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో భవనాలు కూలిపోవడం, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల వంటివాటివల్లకూడా వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌లో భోపాల్‌లోని కమ్లా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన 40 మంది నవజాత శిశువుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తర్వాత 48 గంటల్లో మరో పది మంది మరణించారు. చదవండి: Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ! -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్‌లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్‌ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
మట్టిలో నుంచి పసిబిడ్డ ఏడుపు.. తవ్వి చూస్తే..!!
భోపాల్: మూడు రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో! ఐతే విధి చిన్నచూపు చూసినా మృత్యువును జయించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ పసికూన. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో బతికున్న మూడురోజున పసిబిడ్డను నది ఒడ్డున మట్టిలో పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. గురువారం సాయంత్రం ఝంగర్చక్ గ్రామ సమీప పొలాల్లో పనులు చేసుకునే కొందరు గ్రామస్థులకు పసిబిడ్డ ఏడుపు వినిపించిన ప్రదేశానికి వెళ్లారు. కొంతసమయానికి బిడ్డ ఏడుపు మట్టికింద నుంచి రావడాన్ని గమనించి, మట్టిని జాగ్రత్తగా తొలగించించారు. అనంతరం కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కేవలం రోజుల వయసున్న నవజాత శిశువును ఒక సంచిలో చుట్టి బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. దీంతో వారు బిడ్డను రక్షించి ముంగావలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై సెక్షన్ 317 కింద కేసు ఫైల్చేసి నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సతీష్ గార్గ్ మీడియాకు వెల్లడించారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
ఓరి నీ ప్రేమ ‘తాజ్‌మహల్’ కాను!
తాజ్ మహల్.. దేశంలోనే ఓ అద్భుతమైన కట్టడం! మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు! ఒరిజనల్ తామ్మహల్ కట్టాడా? అని ఆశ్చర్యపోకండి. అచ్చం తాజ్‌మహల్ రేంజ్ ఆకృతిలో ఓ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే అనే ఓ విద్యావేత్త తన భార్య మంజుషా చౌక్సేకు గిఫ్ట్‌గా అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని నిర్మించాడు. ఇందులో నాలుగు బెడ్ రూంలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈ జంట ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్ అందానికి ముగ్దులైన ఈ జంట.. దాని ఆర్కిటెక్షర్‌ను, నిర్మాణ విషయాలను అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే ముందుగా ఆనంద్ ప్రకాష్ చౌక్సే.. తన ఇంటిని సుమారు 80 ఫీట్ల ఎత్తులో నిర్మించాలని భావించారు. కానీ, 80 ఫీట్ల ఎత్తులో ఇంటిని కట్టడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో తక్కువ ఎత్తులో ఉన్నా తాజ్‌మహల్‌లో ఆకృతిలో తన ఇంటిని కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అద్భుతమైన ఇంటిని నిర్మించడానికి ఇంజనీర్లకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని 3D ఇమేజ్ పద్దతిలో రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటిని నిర్మించిన ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే స్పందిస్తూ.. ‘మొత్తం 90 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉండగా.. ప్రధానమైన తాజ్‌మహల్ ఆకృతి 60 స్క్వేర్ మీటర్ల పరిధిలో విస్తరించింది. డోమ్ 29 ఫీట్ల ఎత్తులో ఉండగా.. రెండు బెడ్ రూంలతో రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇంటిలో వంటగది, లైబ్రరీ, ధ్యానంరూంలు కూడా ఉన్నాయి. అయితే ఇంటిని నిర్మించే ముందు ఆగ్రా తాజ్‌మహల్‌ను సందర్శించాను’ అని తెలిపారు. -
ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్ మష్రూమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్ రూబికండస్. ఇది స్టిన్క్హాన్ కుటుంబానికి చెందిన ఫంగస్. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత పెనిస్ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్‌తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దసరా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఓ కారు జనాలపైకి దూసుకేళ్లింది. ఈ ఘటన శనివారం భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారకుడైన కారు డ్రైవర్‌ను పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కారును రివర్స్ తీసే క్రమంలో వేగం అదుపు తప్పి జనంపైకి దూసికేళ్లింది. ఈ ఘటనలో గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీ మాట్లాడుతూ.. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశామని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #WATCH Two people were injured after a car rammed into people during Durga idol immersion procession in Bhopal's Bajaria police station area yesterday. Police said the car driver will be nabbed.#MadhyaPradesh pic.twitter.com/rEOBSbrkGW — ANI (@ANI) October 17, 2021 -
కూతురు ప్రియుడితో కనిపించడంతో రోడ్డుపైనే..
యువతీయువకులు సాధారణంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించరు. కానీ, తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం తెలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారుతాయి. అటువంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలో ఓ తండ్రికి తన కుమార్తె మరో యువకునితో కనిపించింది. దీంతో కోపం తట్టుకోలేని ఆ తండ్రి రోడ్డు మీద బహిరంగా ఇద్దరిని పట్టుకొని ప్యాంట్‌కు ఉన్న బెల్టు తీసి చావబాదాడు. తన కుమార్తె ఆ యువకునితో తిరుగుతూ తప్పుడుగా ప్రవర్తిస్తోందని భావించాడా తండ్రి. అందుకే ఆగ్రహం తట్టుకోలేక ఇద్దరిపై దాడి చేశాడు. ఈ ఘటనను అక్కడ ఉన్న స్థానికులు వీడియోలో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. యువతి తండ్రిపై యువకుడు స్థానిక తిమర్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన దర్యాపు చేస్తున్నామని తెలిపారు. -
Viral: కబడ్డీ ఆడిన బీజేపీ మహిళా ఎంపీ
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సరదాగా కబడ్డీ ఆడారు. ఆమె కబడ్డీ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం ఆమె భోపాల్‌లోని ఓ కాళీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె యువతుల కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీని మహిళా క్రీడాకారులు కబడ్డీ ఆడాల్సిందిగా కోరారు. దీంతో ఆమె కొర్టులోకి అడుగుపెట్టి కబడ్డీ ఆడారు. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చారు. 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. कल गरबा आज भोपाल सांसद @SadhviPragya_MP आज मां काली के दर्शन के लिए पहुंचीं,वहां ग्राउंड में मौजूद खिलाड़ियों के अनुरोध पर महिला खिलाड़ियों के साथ कबड्डी खेली।😊 pic.twitter.com/X1wWOg55aW — Anurag Dwary (@Anurag_Dwary) October 13, 2021 -
Let's have a race: సీఎం చౌహాన్‌కు కమల్‌నాథ్ చాలెంజ్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ (74)ఆరోగ్యంపై పదేపదే కామెంట్లు చేస్తున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(62)కు కమల్‌నాథ్ ఓ చాలెంజ్ విసిరారు. ‘నా ఆరోగ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. కమల్‌నాథ్ అనారోగ్యంతో ఉన్నారు, వృద్ధుడయ్యాడని చౌహాన్ అంటున్నారు. మీకు నేను చాలెంజ్ విసురుతున్నాను. ఇద్దరం కలసి పరుగుపందెంలో పాల్గొందాం. చదవండి: రైతుల ఆందోళనలో ఘర్షణ.. 8 మంది మృతి నాకు న్యూమోనియా ఉంది. అది తప్ప మిగిలిన రిపోర్టులు అన్ని సాధారణంగానే ఉన్నాయి. న్యూమోనియా ఉన్నందునే పోస్ట్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. కాంగ్రెస్ పార్టీతో ఉన్న బాధ్యతల రీత్యా ఢిల్లీలో ఉన్నాను తప్ప ఆరోగ్యం గురించి కాదు’ అని పేర్కొన్నారు. కమల్ అనారోగ్యంతో ఉన్నారని చౌహాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
15 ఏళ్ల నుంచి తవ్వకాలు.. విలువైన వజ్రం లభ్యం
భోపాల్: రత్నాలు కోసం తవ్వకాలు జరుపుతున్న నలుగురు మైనింగ్ కార్మికులకు వజ్రం లభ్యమైంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో గత కొన్నేళ్లుగా రత్నాల కోసం పలు ప్రాంతాల్లో గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే హీరాపూర్ తపారియన్ ప్రాంతంలో రతన్ లాల్ ప్రజాపతి లీజుకు తీసుకున్న భూమిలో 8.22 క్యారెట్స్ వజ్రం దొరికినట్లు పన్నా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. అదే విధంగా లభ్యమైన వజ్రాన్ని, మరికొన్ని రత్నాలను ఈ నెలలో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వజ్రం వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ పన్నులు మినహాయించిన తర్వాత సదరు గనులు లీజ్‌కు తీసుకున్నవారికి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి సెప్టెంబర్ 21 లభ్యమైన వజ్రం, కొన్ని రత్నాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. తాజాగా లభ్యమైన వజ్రానికి సుమారు రూ. 40 లక్షలు వేలం పలుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ‘గత 15 ఏళ్ల నుంచి పలు గనుల్లో తవ్వకాలు జరుపుతున్నామని కానీ, ఎక్కడా వజ్రాలు లభ్యం కాలేదు. అయితే హిరాపూర్‌లో ఆరు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో తమకు వజ్రం లభ్యమైంది’ అని మైనింగ్ కార్మికల్లో ఒకరైన రాఘువీర్ ప్రజాపతి తెలిపారు. గని భాగస్వాములతో కలిసి వేలంలో వచ్చిన డబ్బును తమ పిల్లల చదువులకు ఉపయోగిస్తామని తెలిపారు. చదవండి: రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు -
Viral: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి
భోపాల్: తమ కూతురిని ప్రేమించిన యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు తల్లిదండ్రులు. కొంతమంది దాడికి దిగి సదరు యువకుల ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడతారు. అయితే తాజాగా ఓ యువకుడిపై అతని ప్రేయసి తండ్రి, అన్న నడిరోడ్డుపై విచక్షణారహితంగా సుత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ భావ్సర్(22) అనే యువకుడు మక్సి నగరంలోని ఓ యువతి ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి రావల్సిందిగా కోరగా.. వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. చదవండి: కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం అయితే వారు ఇంటికి వచ్చిన తర్వాత యువతి కుటుంబసభ్యులు పుష్పక్‌పై తీవ్రమైన కోపంతో రగిలిపోయారు. ఆదివారం పుష్పక్ కటింగ్ షాప్‌లో కటింగ్ చేసుకుంటున్న సమయంలో యువతి తండ్రి, అన్న ఒక్కసారిగా షాప్ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చారు. అనంతరం అత్యంత రద్ధీగా ఉండే మక్సీ వీధిలో వెంబడించి మరీ సుత్తి, ఇనుప రాడ్‌తో విచాక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో పుష్పక్ కాలు, చేతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు.. యువతి తండ్రి, అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A 22-year-old man was brutally beaten up in Shajapur The woman's father and brother, allegedly angry over the affair, on Sunday confronted the man while he was out in the market and allegedly started beating him up with hammer-shaped rod. pic.twitter.com/GTrQ9JvMKp — Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2021 చదవండి: మాజీ ఎంపీ మనవడి హత్య -
ప్రతి అక్కా, చెల్లెలి రక్షణ బాధ్యతంతా నాదే..
ఇండోర్: సాధారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు రంగంలో పురుషులే అధికంగా కనిపిస్తారు. అయితే మారుతున్న సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ దూసుకేళ్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే చాలా పనులను మహిళలు చేసి చూపుతున్నారు. వాహనాలు నడపటంలో కూడా మేము సైతం అంటున్నారు. తాజాగా రితూ నర్వాల్ అనే మహిళ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళా బస్ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. అత్యంత రద్దీగా ఉండే బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్టీఎస్) కారిడార్‌లో గురువారం ఆమె తన మొదటి ట్రిప్‌ను రాజీవ్ గాంధీ స్క్వేర్ నుంచి నిరంజన్పూర్ స్క్వేర్ వరకు బస్ నడిపి ప్రయాణికులను తీసుకువచ్చింది. బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణించాలని ప్రోత్సహిస్తూ అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్ లిమిటెడ్( ఏఐసీటీఎల్) కొత్తగా ‘పింక్ బస్’ సేవలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఇద్దరు మహిళలకు బస్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్వాల్ గురువారం ట్రయల్ రన్లో తొలిసారి బస్‌ను సురక్షితంగా నడిపారు. ఏఐసీటీఎల్ ఇన్ఛార్జ్ సందీప్ సోని మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసిన ఇద్దరు మహిళ డైవర్లు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారని తెలిపారు. అన్ని పింక్ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే ఉంటారని పేర్కొన్నారు. పింక్ బస్సులు కేవలం మహిళల కోసం కేటాయించామని, ఇప్పటికే మహిళా కండక్టర్లు ఉన్నారని మరి కొంతమంది మహిళా కండక్టర్ల, డ్రైవర్లను నియమిస్తామని చెప్పారు. అయితే బీఆర్టీఎస్ కారిడార్‌లో రోడ్డు చాలా క్లిష్టంగా ఉంటుందని, అందుకే మహిళా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. నా కల నిజమైంది ‘నేను ఎప్పటికైనా హెవీ మోటర్ వెహికల్ డ్రైవర్ కావాలకున్నా. బస్ లేదా ట్రక్ ఏదైనా నడపాలని కల కన్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను 28ఏళ్ల వయస్సులో.. 2015లో ఓ స్కూల్ బస్ నడపడంతో డ్రైవింగ్ మొదలుపెట్టాను’ అని నర్వాల్ తెలిపారు. బస్సులోని ప్రతీ అక్కా, చెల్లెలి రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. సొంత వాహనంతో డ్రైవింగ్ నేర్చుకున్నా మరో మహిళా డ్రైవర్ అర్చనా కాటేరా గతంలో మూడేళ్లు ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు డ్రైవర్‌గా పనిచేశారు. ‘నా సొంత వాహనంతో డ్రైవింగ్ నేర్చుకున్నా. మూడే నెలల డ్రైవింగ్ శిక్షణ తర్వాత ఫైవ్ స్టార్ హోటల్‌కు డ్రైవర్‌గా మూడేళ్లపాటు పనిచేశాను. తర్వాత మరో హోటల్‌కి మారాను. కోవిడ్-19 కారణంగా కుటుంబం కోసం ఆ ఉద్యోగం మానేశాను. ప్రస్తుతం నేను పింక్ డ్రైవర్‌గా నియమించబడ్డాను’ అని అర్చనా పేర్కొంది. -
అత్తతో సెల్‌ఫోన్ గొడవ.. క్షణికావేశంతో పిల్లలను బావిలో తోసి..
ఛత్తర్పూర్: అత్త, కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తూనే ఉంటాయి. ఆ గొడవలను పరిష్కరించుకొని మళ్లీ కలిపోతుంటారు. కానీ, అత్త మీద కోపంతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి, తను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను పశువులు మేపడానికి తన వెంట తీసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ బావిలో తన ఇద్దరు పిల్లలను తోసేసింది. అనంతరం తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి బావిలో పడిన ఇద్దరు చిన్నారుల్లో 10 ఏళ్ల బాలిక మృతి చెందగా.. మరో చిన్నారి బావి లోపలి అంచుల్లో ఉన్న బండ రాళ్ల మధ్యలో ఇరుక్కొవటంతో బ్రతికి బయటపడింది. కొన్ని రోజులుగా అత్త, కోడళ్ల మధ్య మొబైల్ ఫోన్‌కు సంబంధించి గొడవ జరుగుతుందని, శనివారం ఆ మహిళ అత్త తన నుంచి మొబైల్ ఫోన్ తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్లో దాచాడు! -
ఆరుగురు పాక్ వలసదారులకు భారత పౌరసత్వం
భోపాల్: పాకిస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కి వచ్చిన ఆరుగురు పాక్ శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని అందించింది. వీరు మధ్యప్రదేశ్‌లో దశాబ్దాల కాలంగా జీవిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద భారత్ పౌరసత్వం కల్పించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్ర మాట్లాడుతూ.. ఈ ఆరుగురు వలస బాధితులు మతపరమైన హింసకు గురై భారత్‌లో బతకడానికి వచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం వారి భారత పౌరసత్వ పత్రాలను అధికారికంగా అందించినట్లు మంత్రి నరోత్తం మిశ్ర తెలిపారు. పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్ భోపాల్ నివాసితులు కాగా, అర్జున్‌దాస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్య బాయి మాండ్‌సౌర్‌కు చెందినవారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు భారత దేశ పౌరసత్వం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. 31 ఏళ్లుగా తాను అటు పాకిస్తాన్, ఇటు భారత్‌కు చెందిన వాడని కాదనే భావన ఉండేది. కానీ, ప్రస్తుతం తాను భారతీయుడనని గర్వంగా ఉన్నట్లు అర్జున్‌దాస్ మంచందాని మీడియాతో తెలిపాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వీరు 1988-2005 సమయంలో భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వారికి పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం అందిచామని అధికారులు తెలిపారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్షీ, క్రైస్తవ వలసదారులకు భారత్ పౌరసత్వం కల్పించనుంది. అయితే 2014 సంవత్సరం కంటే ముందే భారత్‌కు వచ్చివారికి మాత్రమే దేశ పౌరసత్వం కల్పించనుంది. -
స్కూలు ఫీజులు పెంచారని చెబితే.. వెళ్లి చావండన్న మంత్రి
భోపాల్: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తమ గోడును వెళ్లబోసుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే నోరు పారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్‌లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పాలక్ మహాసంఘ్ అనే బ్యానర్ కింద ఓ యూనియన్‌గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్‌ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు. కరోనా కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో సదరు మంత్రి స్పందన చూసి పేరెంట్స్ కమిటీ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పేరెంట్స్ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈయనేం మంత్రిరా బాబు..! బాధను చెప్పుకుందామని వెళితే మాపైనే ఫైరయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు. బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించకపోవడం గమనార్హం.