message
-
నా కోసం ఆ దేవుడే నిన్ను పంపాడు: షోయబ్ మాలిక్‌పై భార్య పోస్ట్ (ఫొటోలు)
-
భారత్‌లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?
భారత్‌లోని ఐఫోన్ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) మెసేజింగ్‌ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్‌సీఎస్‌ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్సీఎస్ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్‌పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్సీఎస్ కోసం క్యారియర్ నెట్ వర్క్‌లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్‌కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్సీఎస్ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సీఎస్) మెసేజింగ్ సాంప్రదాయ ఎస్ఎంఎస్లతో పోలిస్తే వినియోగదారు అనుభవాన్ని పెంచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు, జిఫ్‌ల వంటి ఫైళ్లను ఆర్సీఎస్ మెసేజింగ్ అందిస్తుంది. వాట్సాప్, ఐమెసేజ్ వంటి చాట్ యాప్స్ మాదిరిగానే అవతలి వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు రియల్‌టైమ్‌లో చూడవచ్చు. ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ సందేశాలను వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా పంపవచ్చు. ఇది ఎస్ఎంఎస్ ఛార్జీలను ఆదా చేస్తుంది. సాధారణ సందేశాలను 160 అక్షరాలకు పరిమితం చేసే ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా, ఆర్సీఎస్ మరింత వివరణాత్మక సందేశాలకు అనుమతిస్తుంది. -
ఉమెన్స్ డే స్పెషల్.. తల్లి, చెల్లితో సాయిపల్లవి (ఫోటోలు)
-
Ramadan: ప్రధాని మోదీ రంజాన్ సందేశం
రంజాన్ మాసం ఈరోజు(ఆదివారం) నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పవిత్ర రంజాన్ మాసం మన సమాజంలో శాంతి సామరస్యాలను తీసుకురావాలని’ ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఈ పవిత్ర మాసం.. కృతజ్ఞత, భక్తిప్రపత్తులను సూచిస్తుంది. కరుణ, దయ, సేవలకున్న విలువలను మనకు గుర్తు చేస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. As the blessed month of Ramzan begins, may it bring peace and harmony in our society. This sacred month epitomises reflection, gratitude and devotion, also reminding us of the values of compassion, kindness and service. Ramzan Mubarak!— Narendra Modi (@narendramodi) March 2, 2025ఇస్లాంలో రంజాన్(Ramadan) మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటూ భగవంతుడిని ఆరాధిస్తారు. ఇస్లాంలోని ఐదు స్తంభాలలో రంజాన్‌ను ఒకటిగా పరిగణిస్తారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరణ కూడా ఈ నెలలో ఒక రోజు రాత్రి వేళ జరిగిందని చెబుతారు. రంజాన్ ముగిసిన తర్వాత, ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు ఈ నెలను ఆరాధన మాసంగా భావిస్తారు. ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం -
Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి ఇక్కడ కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలో పలువురు బాబాలు, స్వామీజీలు కుంభమేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు. వీరిలో కొందరి వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటివారిలో ఒకరే అనాజ్వాలీ బాబా.బాబా అమర్జీత్ ‘అనాజ్వాలీ బాబా’('Anajwali Baba')గా పేరొందారు. ఈయనను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్ బాబా తన తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ, అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.హఠ యోగి అమర్జీత్ బాబా మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి, పచ్చదనం(Greenery) ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి ఒక మార్గమన్నారు. అటవీ నిర్మూలన అనేది పర్యావరణానికి హాని కలిగిస్తున్నదన్నారు. చెట్లను నరికివేయడం కారణంగా మన పర్యావరణానికి జరుగుతున్న చేటును గుర్తించి, తాను తన తలపై పంటలను పండిస్తూ, అందరికీ పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయాలని అనుకున్నానని అమర్జీత్ బాబా తెలిపారు.తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పచ్చదనాన్ని పెంచిపోషించేలా ప్రోత్సహిస్తానని, తన తలపై ఉన్న పంటలకు క్రమం తప్పకుండా నీటిని చిలకరిస్తూ వాటిని పోషిస్తానని తెలిపారు. బాబా మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కిలా ఘాట్ సమీపంలో ఈ ధాన్యం బాబా ఉంటున్నారు. ఇతనిని చూసేందుకు జనం క్యూ(Queue) కడుతున్నారు. బాబా తన తలపై పంటలను ఎలా పండిస్తున్నాడో చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: బీహార్ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు -
ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ కీలక సందేశం
కీవ్:కొత్త ఏడాది సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. రాజధాని కీవ్ నుంచి ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా తమ దేశంపై కొనసాగుతున్న రష్యా దురాక్రమణను అడ్డుకుని తీరుతామన్నారు.‘శాంతి మాకు బహుమతిగా రాదని తెలుసు. అన్ని వనరులున్న రష్యాను అడ్డుకుని శాంతిని సాధించేందుకు ఈ ఏడాది గట్టిగా పోరాడతాం.అమెరికాకు కొత్తగా రానున్న అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు అన్ని విధాలా అండగా ఉంటారని ఆశిస్తున్నా. పుతిన్ దురాక్రమణను ఆయన ఆపుతారనడంలో నాకెలాంటి సందేహం లేదు’అని జెలెన్స్కీ అన్నారు.కాగా, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 2023తో పోలిస్తే 2024లో ఉక్రెయిన్ ఏడు రెట్ల భూభాగాన్ని నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్‌కు సహకారం తగ్గొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు సహకరిస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఈసారి బంగ్లాదేశ్ బ్యాగ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తనదైన శైలిలో బ్యాగులతో సందేశానిచ్చే ప్రయ త్నం కొనసాగిస్తున్నారు. పాలస్తీనా అని ముద్రించి ఉన్న బ్యాగుతో సోమవారం ఆమె పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులకు అండగా ఉంటాం(వియ్ స్టాండ్ విత్ ది హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఆఫ్ బంగ్లాదేశ్) అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులపై అత్యా చారా లను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ ఆవరణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతోపాటు ప్రియాంక కూడా ఈ బ్యాగ్‌ను ధరించి పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు జరగాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సోమవారం లోక్‌సభలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు, వారం క్రితం ఆమె మరో బ్యాగుతో పార్లమెంట్ వద్ద కనిపించారు. ఆ బ్యాగుపై ప్రధాని మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీలు కలిసున్న చిత్రంతోపాటు ‘మోదీ అదానీ భాయీభాయీ’అని ముద్రించి ఉంది. प्रियंका के आने से विपक्ष में, कांग्रेस में एक जोश तो आया है, अंततः कोई तो बांग्लादेश के अल्पसंख्यकों के हितों की बात कर रहा है #PriyankaGandhi pic.twitter.com/awMqbrEVbe— Pooja Tiwari (@Irony_Pooja) December 17, 2024 -
ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్‌లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..బల్క్ మెసేజ్‌లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
దావాలకు దొరక్కుండా.. ఉద్యోగులకు గూగుల్ సీక్రెట్ మెమో!
ప్రపంచ సమాచారాన్నంతా నిల్వ చేసే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. తమ అంతర్గత కమ్యూనికేషన్లపై మాత్రం చాలా ఏళ్లుగా జాగ్రత్త పడుతూ వస్తోంది. పోటీ చట్టాల దావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లన్నీ ఉద్యోగులచేత తుడిచేయించేదని ఓ నివేదిక పేర్కొంది.న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2008లో అప్పటి ప్రత్యర్థి యాహూతో ప్రకటనల ఒప్పందంపై విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి గూగుల్ అటువంటి రహస్య వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ మేరకు అప్పట్లో ఉద్యోగులకు రహస్య మెమోను పంపింది."ఉద్యోగులు ఊహాగానాలు, వ్యంగ్యానికి దూరంగా ఉండాలి. హాట్ టాపిక్ల గురించి మెసేజ్‌లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అని గూగుల్ ఉద్యోగులకు సూచించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్ఇందుకోసం గూగుల్ టెక్నాలజీని కూడా సర్దుబాటు చేసుకున్నట్లు టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కంపెనీ ఇన్స్టంట్ మెసేజింగ్ సాధనంలో సెట్టింగ్‌ను "ఆఫ్ ది రికార్డ్‌కి మార్చింది. దీంతో ఆ మెసేజ్‌లు మరుసటి రోజుకంతా వాటంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి. గతేడాది గూగుల్ ఎదుర్కొన్న మూడు పోటీ చట్టాల ఉల్లంఘన విచారణల్లో లభ్యమైన వందలాది పత్రాలు, సాక్షుల వాంగ్మూలను పరిశీలిస్తే గూగుల్ అవలంభించిన తీరు తెలుస్తుందని నివేదిక పేర్కొంది. -
హిందువులను విస్మరించారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారిద్దరూ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై హింసను తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అనాగరికమైన చర్యగా పేర్కొన్నారు. ట్రంప్ తన దీపావళి సందేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హిందూ అమెరికన్లకు రక్షణ కలి్పస్తామని ప్రతిజ్ఞ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై అరాచక మూకల దాడులను, వారి ఆస్తులను దోచుకుంటున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండించారు. ఎక్స్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. తాను అధ్యక్షునిగా ఉంటే ఇలా ఎప్పటికీ జరిగేది కాదన్నారు. ఇజ్రాయెల్ మొదలుకుని ఉక్రెయిన్ మీదుగా అమెరికా దక్షిణ సరిహద్దు దాకా బైడెన్, హారిస్ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ ధ్వజమెత్తారు. మునుపటి కంటే మెరుగైన అమెరికాను తీర్చిదిద్దుతా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్ -
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్‌బాట్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్‌బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్‌పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్యోగినికి మెసేజ్.. మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సమయం ఉదయం. ఇంటి నుంచి ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగినికి యాక్సిడెంట్ అయ్యింది. అనంతరం తీవ్ర గాయాల పాలైన ఉద్యోగిని.. రోడ్డు ప్రమాదంలో తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలుపుతూ కారు ఫొటో తీసి తన మేనేజర్‌కి మెసేజ్ చేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆ మెసేజ్లోని సారాశం. ఇలాంటి సందర్భాలతో సాధారణంగా మేనేజర్లు ఎలాంటి సమాధానం ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంస్థ మేనేజర్ ఇచ్చిన రిప్లయిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఉద్యోగి,మేనేజర్ సంబంధిత వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.కిరా అనే యూజర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఉద్యోగిని కారు ప్రమాదానికి గురైందని తన మేనేజర్‌కు మెసేజ్ చేసింది. తాను డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదం ఫొటోల్ని జత చేసింది.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 అయితే అనూహ్యంగా కంపెనీ మేనేజర్ సదరు ఉద్యోగిని యోగక్షేమాలు అడగడానికి బదులు.. మీరు ఆఫీస్‌కు ఎప్పుడు వస్తారో సమాచారం ఇవ్వండి అంటూ బదులిచ్చారు. ఆ మేస్జ్కి ఉద్యోగిని రిప్లయి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికుడైన మేనేజర్ మరుసటి రోజు మరోసారి మెసేజ్ పంపాడు. అందులో మీరు నా మెసేజ్‌కు రిప్లయి ఎందుకు ఇవ్వలేదో నేను అర్ధం చేసుకోగలను. కానీ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణం మినహా ఇతర ఘటనలు జరిగి ఉంటే సంస్థ మీపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు సదరు మేనేజర్.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు మేనేజర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగే మా మేనేజర్ వ్యవహరిస్తే..నేను వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. ఈ తరహా ఉన్న మేనేజర్లు మనల్ని బయపెడుతున్నారు. జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా? అని మరో నెటిజన్ రిప్లయి ఇచ్చాడు. -
కర్వా చౌత్ వేళ.. భర్త వీపుపై భార్య అమూల్య సందేశం
హల్ద్వానీ: కర్వా చౌత్ వ్రతాన్ని ఉత్తరాది మహిళలు ఆదివారం(అక్టోబర్ 20)న అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇంటింటా కర్వాచౌత్ సందడి కనిపించింది. అయితే హల్ద్వానీ నగరంలో ఈ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆకర్షించింది. ఒక మహిళ తన భర్త వీపుపై గోరింటతో ‘వైద్య కళాశాల ఆస్తి’ అని రాశారు. దీని వెనుక ఆమె ఉద్దేశమేమిటనే విషయానికొస్తే..హల్ద్వానీలోని కుంతీపురం హిమ్మత్‌పూర్ తల్లా నివాసి గీతా మిశ్రా శరీర దాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే కర్వాచౌత్ సందర్భంగా తన భర్త వీపుపై మెహెందీతో ‘మెడికల్ కాలేజీ ఆస్తి’ అని రాసి, తమ సందేశాన్ని అందరికీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణానంతరం శరీరాన్ని ఏదైనా ఉపయోగకరమైన పనులుకు వినియోగించాలన్నారు. హల్ద్వానీ వైద్య కళాశాలకు మృత శరీరాన్ని అప్పగిస్తే, వైద్య విద్యార్థులు ప్రయోగాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇంతేకాదు.. మరణించ తరువాత కూడా మన శరీరం సదుపయోగం అవుతుందని పేర్కొన్నారు. గీతా మిశ్రా భర్త డాక్టర్ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ 2013లోనే తమ కుటుంబ సభ్యులంతా దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారన్నారు. ఇలాగే తాము నేత్రదానం, అవయవదానం మొదలైనవాటిపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దిశగా ఆలోచించేవారు మరిన్ని వివరాల కోసం వారికి సమీపంలోగల మెడికల్ కాలేజీలను సంప్రదించాలని మిశ్రా సూచించారు. ఇది కూడా చదవండి: ‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు -
ట్యాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్‌కు వివాహిత
శంషాబాద్: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్‌కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది. ఆన్లైన్ పేమెంట్‌తో.. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్‌లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్‌కు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్ మార్నింగ్ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్‌తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్ 16న హైదరాబాద్ నుంచి లండన్ రప్పించుకున్నాడు. ఏం జరిగింది..? లండన్ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకుంది. తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్‌కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిoది. చివరకు కాల్ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్పల్లి పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రాక్ చేయగా చివరకు ఫోన్ లొకేషన్ రాజేంద్రనగర్‌లో చూపింది.శంషాబాద్ టు గోవా.. పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్‌కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్ లోకేషన్ షేర్ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు బస్సు టికెట్‌ను వాట్సాప్ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్ బ్లాక్మెయిల్ చేయడంతోనే తాను హైదరాబాద్‌కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు. మరోవైపు తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్‌ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని యువతకు హీరో జూ. ఎన్టీఆర్ పిలుపు
-
‘చవితి’ సందేశాలు తొలగించిన ప్రిన్సిపాల్ అరెస్ట్
కోటా: రాజస్థాన్‌లోని కోటాలో గల ఒక పాఠశాలలో వాట్సాప్ గ్రూప్‌లోని వినాయక చవితి సందేశాలను తొలగించిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు చుక్కలు చూపించారు. మత సామరస్యానికి ప్రిన్సిపాల్ విఘాతం కలిగిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళితే కోటా జిల్లాలోని లాటూరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాట్సాప్‌లో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూప్‌లో వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలను పంపుతున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ మెసేజ్‌లను డిలీట్ చేస్తూ వచ్చాడు. దీనికి ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను ఎందుకిలా చేస్తున్నారంటూ నిలదీశారు.విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు వివాదం జరుగుతున్న పాఠశాలకు వచ్చారు. ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. తరువాత ప్రిన్సిపాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సోషల్ మీడియాలో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు బాపవార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఉత్తమ్‌సింగ్ తెలిపారు. భరత్ అనే వ్యక్తి ఈ వాట్సాప్ గ్రూప్‌లో గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపాడు. పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపాల్ దానిని తొలగించారు. ఇలాంటి సందేశాలను అతను తొలగిస్తూ వచ్చాడు. కాగా పోలీసులు ప్రిన్సిపాల్‌పై బీఎన్ఎస్సెక్షన్ 196 (మత సామరస్యానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసుకుని, అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. -
సెల్లో సొల్లు ముచ్చట్లు !
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ వినియోగం అనేది నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఎక్కడున్నా ఇతరులతో మనం ఎప్పుడూ ‘హలో’దూరంలోనే ఉండొచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్లలో ఇప్పుడు సొల్లు ముచ్చట్లు ఎక్కువయ్యాయి. మనకు అవసరం లేని విషయాలు చెప్పి విసిగించే వారు ఎక్కువవుతున్నారు. బిజినెస్ ప్రమోషన్లు, ఆర్థికపరమైన ఆఫర్లు, అంశాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరిట ప్రతి నిత్యం ఏదో ఒక అపరిచిత నంబర్ నుంచి మన మొబైల్ ఫోన్‌కు ఫోన్‌కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు రావడం పరిపాటిగా మారింది. మొబైల్ వినియోగదారుల చెవిలో మోతగా మారిన ఈ పెస్కీ (ఇబ్బందికరమైన) కాల్స్‌తో మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లోకస్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.మొత్తం 18,173 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా వీరిలో 95 శాతం మంది ఈ తరహా ఫోన్‌కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. రోజుకు సరాసరిన 3 కాల్స్ పైనే వచి్చనట్టు సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది వెల్లడించారు. డీఎన్డీ (డు నాట్ డిస్ట్రబ్–అనవసర ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు రావొద్దు అని పెట్టుకునే ఆప్షన్) వాడుతున్న వారికి ఈ స్పామ్ కాల్స్ బెడద తప్పడం లేదు. మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారిన ఈ తరహా ఫోన్‌కాల్స్‌కు సంబంధించి మొబైల్ వినియోగదారులు లోకల్ సర్కిల్స్ సర్వేలో పంచుకున్న అంశాలు ఇలా.. గత ఆరు నెలల్లో మరింత పెరిగిన బెడద ఇలాంటి అనవసర, వ్యాపార ప్రమోషన్లకు సంబంధించిన ఫోన్‌కాల్స్ బెడద మొబైల్ వినియోగదారులు గత ఆరు నెలల్లో మరింత పెరిగినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆరు నెలల కిందట 90 శాతం నుంచి 95 శాతానికి ఇది పెరిగినట్టు తెలిపింది. ఆరు నెలల కిందట రోజుకు పదికిపైగా స్పామ్‌కాల్స్ వచ్చే వారి సంఖ్య 3 శాతం ఉండగా.. ఇది ఆరు నెలల్లో 23 శాతానికి పెరిగినట్టు సర్వే పేర్కొంది. అయితే, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ స్పామ్‌కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ట్రాయ్ (టెలీకమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చర్యలకు ఉపక్రమించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. -
సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా కంపెనీలు మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ వ్యావహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు. ఈ మోసాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!అయాచిత స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ట్రాయ్ గత కొద్ది కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్‌లను లేదా కాల్ బ్యాక్ నంబర్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆయా విభాగాల్లోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్ గ్రహీతల వరకు అన్నింటినీ ట్రేస్ (గుర్తించడానికి) చేయడానికి నవంబర్ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్ చైన్ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. -
క్లిక్ చేయొద్దు.. బ్లాక్ చేయండి
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడు తప్పక వాడే మొబైల్ యాప్ వాట్సాప్. ఇప్పుడు ఈ యాప్‌ను వేదికగా చేసుకుని సైబర్‌నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ వాట్సాప్‌లకు కొన్ని సందేశాలు పంపుతున్నారు. అందులోని లింక్‌పై క్లిక్ చేసి, తాము చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తిని రూ.5.4 కోట్లు మోసగించిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇటీవలే అరెస్టు చేశారు. అయితే, పెట్టుబడుల పేరిట వాట్సాప్‌లో వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. షేర్‌మార్కెట్ పెట్టుబడులతోపాటు ఇతర యాప్‌లకు సంబంధించి వచ్చే లింక్‌లపైనా క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.అనుమానాస్పద మెసేజ్‌లు వాట్సాప్‌కు వస్తే వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేయాలని తెలిపారు. సైబర్‌నేరగాళ్ల నుంచి తరచూ ఈ తరహా మెసేజ్‌లు వస్తుంటే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టికి ఆ నంబర్లు తీసుకురావాలని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ నంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, సైబర్ నేరగాళ్ల చేతిలో మరికొందరు మోసపోకుండా కాపాడవచ్చని వారు వెల్లడించారు. -
Kc Venugopal: ప్రభుత్వం నా ఫోన్‌ను హ్యాక్ చేసింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌ను శనివారం షేర్ చేశారు. ‘మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం’అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది’అని పేర్కొన్నారు. -
భారత్‌తో స్నేహం కావాలి: పాకిస్తాన్
పొరుగుదేశం పాకిస్తాన్ తాజాగా భారత్‌తో స్నేహం కోసం పరితపిస్తోంది. నిరంతర శతృత్వాన్ని నమ్మబోమంటూ మిత్రత్వానికి స్వాగతం పలుకుతోంది. స్వయంగా పాక్ ఉపప్రధాని తాము భారత్‌తో హృదయపూర్వక స్నేహాన్ని కోరుకుంటున్నామని అనడం ఇందుకు తార్కాణంగా నిలిచింది.పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా భారత్‌కు స్నేహ సందేశాన్ని పంపారు. తమ దేశం నిరంతర శత్రుత్వాన్ని నమ్మబోదని ఆయన అన్నారు. భారత్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇస్లామాబాద్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యతనివ్వాలని దార్ కోరారు. ఇస్లామాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఎస్ఎస్ఐ)లో జరిగిన సెమినార్లో పీఎంఎల్-ఎన్ నేత, ఉపప్రధాని ఇషాక్ దార్ ప్రసంగించారు. పాకిస్తాన్ ఎప్పుడూ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. అయితే భారత్‌తో పాక్ సంబంధాలు చరిత్రలో అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, జమ్ముకశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని దార్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటున్నదన్నారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న అన్ని దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలను కొనసాగించడానికి పాకిస్తాన్ కృషి చేస్తుందని దార్ పేర్కొన్నారు. -
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’
వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. -
తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
-
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
-
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
మెట్రోలో కేజ్రీవాల్‌కు బెదిరింపు మెసేజ్ రాసిన బ్యాంకర్ అరెస్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మెట్రోలో బెదిరింపు సందేశాలు రాసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని పేరు అంకిత్ గోయల్. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దానిలో నిందితుడు బెదిరింపు సందేశం రాస్తూ కనిపించాడు. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు బరేలీ వాసి అని, ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को सरेआम दी जा रही जान से मारने की धमकी ‼️PMO, BJP और नरेंद्र मोदी के इशारे पर राजीव चौक, पटेल नगर मेट्रो स्टेशन पर लिखी गई धमकी।अरविंद केजरीवाल जी को कुछ भी होता है तो इसके लिए सीधे तौर पर बीजेपी और नरेंद्र मोदी ज़िम्मेदार होंगे। pic.twitter.com/vbbybDFSfJ— AAP (@AamAadmiParty) May 20, 2024 నిందితుడు అంకిత్ గోయల్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అతను మానసికంగా బాగానే ఉన్నాడని, గతంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీలలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో కేజ్రీవాల్‌పై నిందితుడు ఆంగ్లంలో సందేశం రాశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాతలకు బీజేపీనే కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #WATCH | Police arrest accused Ankit Goyal, 33 for writing death-threatening graffiti against Delhi CM Arvind Kejriwal at a metro station. The Metro Unit of Delhi Police had registered an FIR and was investigating the matter: Delhi Police (CCTV visuals confirmed by Police) pic.twitter.com/p0Z8D1h16c— ANI (@ANI) May 22, 2024 -
డార్లింగ్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
-
అస్సలు బాధపడకండి..! వ్యాపారవేత్త రాధిక గుప్తా సలహా!
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టి, అనేక రకాల అవహేళనలను ఎదుర్కొంది. డెలివరీ సమయంలో చిన్న సమస్య కారణంగా రాధిక మెడ కొద్దిగా వంగింది. అంతేకాకుండా ఒక కంటిలో లోపం ఏర్పడింది. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. (పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత) పెన్సిల్వేనియాలో కంప్యూటర్సైన్స్లో పట్టభద్రురాలైన రాధిక ఉద్యోగం కోసం ప్రయత్నించగా దాదాపు 7 సార్లు రిజెక్ట్ అయిందనీ, దీంతో ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన కూడా వచ్చిందని స్వయంగా రాధిక ఒకసారి చెప్పారు. దీంతో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్త, స్నేహితులతో కలిసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించింది. కొనేళ్లకు ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు, ఆమె భర్త నలిన్ మోనిజ్. వీరికి 2022లోఒక కుమారుడుపుట్టాడు. View this post on Instagram A post shared by Radhika Gupta (@iamradhikagupta) షార్క్ ట్యాంక్ ఇండియా-3లో న్యాయనిర్ణేతగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు. అంట్రప్రెన్యూర్స్ ఎకోప్రెన్యూర్స్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఉండటమేకాదు అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది.. అరటి, పైనాపిల్, జనపనార ఆకులు, కాండంతో డెనిమ్స్, టీ షర్టులు చీరలు రూపొందించే సంస్థలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండే మోటివేషన్ అంటూఇన్స్టాలో ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్బంగా తన తల్లి ఇచ్చిన విలువైన సలహాను ఆమె పంచుకున్నారు. తన చేతుల్లో తన బిడ్డను పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె ఉద్యోగినులుగా పనిలో తలమునకలై పిల్లల గురించి, మీ గురించి పట్టించు కోలేకపోతున్నామని బాధపడుతున్నారా.. దీన్ని గుర్తుంచుకోండి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాతృత్వ బాధ్యతలతో పాటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టతరమైందే కానీ..దేనికీ బాధపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, కరియర్‌ను కొనసాగించా లన్నారు. ‘‘ఏ తల్లీ చెడ్డ తల్లి కాదని అమ్మ చెప్పింది. పదవారు, ధనవంతులు, విద్యావంతులు, చదువుకోనివారు, పని చేసేవారు, పని చేయకనివారు.. ఇలా ఎవరైనా అమ్మ అమ్మే.. ప్రతీ తల్లి తన బిడ్డకు మంచి చేయాలనే కోరుకుంటుంది’’ రాధిక గుప్తా అలాగే అటు తల్లి, ఇటు వ్యాపారవేత్తగా ఉంటూనే, రియాలిటీ షోలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నదీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తాను ఎక్కడికి వెళ్లినా, ప్రెపెస కాన్ఫరెన్స్‌లలో కూడా కుమారుడు తనతో పాటు ఉంటాడని, షార్క్ ట్యాంక్సెట్లలో ఎక్కువ సమయం ఉంటాడని కూడా వెల్లడించా రామె. మాతృత్వం మహిళల సవాళ్లను స్వీకరించే సామర్థ్యానికి అడ్డుకోకూడదని తాను భావిస్తానన్నారు. మహిళలకు పెళ్లి, పిల్లలు తరువాత కరియర్లో బ్రేక్ వస్తుంది. ప్రసూతి సెలవు తరువాత మళ్లీ ఉద్యోగంలోకి రావడం అనేది మానసికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే. పసిబిడ్డల్ని వదిలి వెళుతున్నామనే బాధ ఒకవైపు, ఉద్యోగంలో రాణించాలనే ఒక పట్టుదల ఒకవైపు వారిని స్థిరంగా ఉండనీయవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది తల్లులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. చదివి వినిపించిన భార్య
ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్' లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తరువాత ఒక సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని ఆయన భార్య మాజీ ఐఆర్ఎస్ అధికారి 'సునీతా కేజ్రీవాల్' చదివి వినిపించారు. ఈ సందేశంలో సమాజం కోసం పని చేయడం ఆపకండి, కొనసాగించండి. బీజేపీకి చెందిన వారిని కూడా ద్వేషించవచవద్దని సూచించారు. భారతదేశంలో మాత్రమే కాకుండా వెలుపల కూడా దేశాన్ని బలహీనపరిచే శక్తులు ఉన్నాయి. నేను త్వరగా జైలు నుంచి బయటకు వచ్చి, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన మహిళా లభ్డిదారులకు నెలకు 1,000 రూపాయలు గౌరవ వేతనం అందించే పథకానికి సంబంధించి ఒక హామీ ఇచ్చాను. దాన్ని తప్పకుండా నెరవేరుస్తానని సందేశంలో వెల్లడించారు. ప్రతి క్షణం దేశానికి సేవ చేయడానికి నా జీవితం అంకితం. నా ప్రతి రక్తపు చుక్కను దేశ సేవకోసం అంకితం చేస్తానని కేజ్రీవాల్ సందేశంలో పేర్కొన్నట్లు.. సునీతా కేజ్రీవాల్ ప్రస్తావించారు. తాను పోరాటాల కోసమే పుట్టానని, భవిష్యత్తులో కూడా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, గొప్ప దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు అంతర్గత, బాహ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీటిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. देशवासियों के लिए जेल से अरविंद केजरीवाल का संदेश। https://t.co/Q9K6JjSjke — Arvind Kejriwal (@ArvindKejriwal) March 23, 2024 -
కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ‘వికసిత్ భారత్’ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్‌కు వికసిత్ భారత్ మెసెజ్‌లు పంపడం తక్షణమే పేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇకనుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల సందేశాలు పౌరుల ఫోన్లకు వస్తుండటంతో అనేక ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్‌కు ముందుగానే మెసెజ్‌లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్వర్క్ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడుతల్లో పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. చదవండి: డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన -
యువతిపై అత్యాచారం
దొడ్డబళ్లాపురం: యువతిపై అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న నిందితుడిని నెలమంగల పట్టణ పోలీసులు అరెస్టు చేసారు. నెలమంగల పట్టణంలో నివసిస్తున్న యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇంట్లో జొరబడ్డ నిందితుడు అత్యాచారం చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీదర్‌కు చెందిన శివకుమార్ (25)ను అరెస్టు చేసారు. 2018లో ఉడుపిలో జరిగిన విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో బాధిత యువతికి (అప్పుడు యువతి మైనర్ బాలిక) నిందితుడితో పరిచయం ఏర్పడింది. యువతి తల్లి వద్ద మొబైల్ నంబర్ తీసుకున్న శివకుమార్ తరచూ యువతికి కాల్ చేస్తూ మెసేజ్‌లు పంపించేవాడు. ఈక్రమంలో 2018లో ఇంట్లో యువతి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న శివకుమార్ ఇంట్లో జొరబడి అత్యాచారం జరిపాడు. అత్యాచారం చేస్తూ ఫోటోలు తీసుకుని యువతిని బ్లాక్ ెుయిల్ చేస్తూ రూ.85 వేలు వరకూ డబ్బులు వసూలు చేసాడు. అయితే పదేపదే డబ్బులు అడుగుతుండడంతో యువతి తల్లితండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరు చిక్కపేటలో శివకుమార్‌ను అరెస్టు చేసారు. -
Annual Army Day Parade 2024: మన దేశ బలానికి వారే ఆధారం: వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ: జనవరి 15వ తేదీన ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. సైనికులకు హ్యాట్సాఫ్ చెబుతూ ఓ వీడియో సందేశాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సైనికుల త్యాగం, ధైర్యానికి దేశం గర్విస్తోంది. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో వారి అంకితభావం ఎనలేనిది. మన దేశ బలానికి వారే ఆధారం అంటూ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారాయన. On Army Day, we honour the extraordinary courage, unwavering commitment and sacrifices of our Army personnel. Their relentless dedication in protecting our nation and upholding our sovereignty is a testament to their bravery. They are pillars of strength and resilience. pic.twitter.com/jD6FbM1Gkr — Narendra Modi (@narendramodi) January 15, 2024 -
కోర్టుకు బ్లాక్ డ్రెస్‌లో రావా బేబీ.. వెలుగులోకి సుఖేష్ మెసేజ్‌లు
ఢిల్లీ:రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాక్వెలిన్‌కు సుఖేష్ పంపించిన మెసేజ్‌లు కీలకంగా మారాయి. కోర్టులో విచారణ సందర్భంగా జాక్వెలిన్‌ను బ్లాక్ డ్రెస్‌లో కనిపించాలని జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. జాక్వెలిన్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. 2023 జూన్ 30న జాక్వెలిన్‌కు సుఖేష్ మెసేజ్ చేశాడు.'బేబీ వచ్చే 6వ తేదీ కోర్టులో విచారణ ఉంటుంది. హాజరైతే దయచేసి నల్ల కుర్తా ధరించు. తద్వారా నా మెసేజ్‌లన్నీ చూస్తున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటా. మిస్సింగ్ యూ.. ఐ లవ్ యూ బేబీ గర్ల్. నువ్వు ఎప్పటికీ నా దానివే' అని సుఖేష్ రాసుకొచ్చాడు. 'తాజా ట్రోల్‌లతో కలత చెందుతున్నావని నాకు తెలుసు. కానీ బాధపడకు. ఇవేవీ పెద్దవి కావు. నువ్వు నా యువరాణివి. సూపర్ స్టార్ అవుతావు.' అని పేర్కొన్న సుఖేష్.. జాక్వెలిన్ బ్లాక్ డ్రెస్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మెసేజ్ చేశాడు. 'బేబీ, కోర్టులో విచారణ సందర్భంగా బ్లాక్ డ్రెస్ ధరించకపోవడం చాలా బాధ కలిగించింది. ఏమి ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు. ఏ విధంగానైనా సహాయం చేస్తానంటే నీకు తోడుగా ఉంటా. నీకు అవసరాలను ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నా.' అని సుఖేష్ మెసేజ్ చేశాడు. అంతేకాకుండా దర్శకుడు, సంగీత రచయిత లవ్ రంజన్ ఒక సినిమా కోసం జాక్వెలిన్‌ను కలుస్తారని పేర్కొన్నాడు. కాగా.. ఈ కేసులో ఫెర్నాండెజ్ పాత్ర ఉందని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశాడు. దీంతో సుఖేష్‌పై ఫెర్నాండేజ్ తిరగబడ్డారు. సుఖేష్ బెదిరింపుల నుండి రక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సుకేష్ చంద్రశేఖర్ లక్షిత దాడిలో తాను అమాయకురాలినని, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
చెఫ్ కాదు టెక్ జీనియస్!
కిషన్‌ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్ ఇన్వెంటర్, ఇంజనీర్ చార్లెస్ కెటరింగ్ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్ అంటే చదువును మరీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్ కెటరింగ్. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్ చదువును సీరియస్‌గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్ బగారియా. 26 సంవత్సరాల కిషన్ బగారియా సృష్టించిన ఆల్–ఇన్–వన్ యాప్ ‘టెక్స్.కామ్’ను అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఆటోమేటిక్ ఇంక్’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్ కాదు టెక్ జీనియస్ అస్సాంలోని దిబ్రుగఢ్‌లో ఎనిమిది, అగ్రసేన్ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్ చదివాడు కిషన్. ఇంటర్నెట్ అతడి ప్రపంచంగా ఉండేది. రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు చూసినా కంప్యూటర్లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్‌లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్‌ను అడిగాడు. ‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. మరో సందర్భంలో... ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’ అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్లో చదువు చెప్పిన టీచర్ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు! ‘డీల్ ఫైనలైజ్ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్. ‘మరి నెక్ట్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్.కామ్‌పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్ కంటిన్యూ అవుతుంది’ కిషన్ రూపొందించిన ‘ఆల్–ఇన్–వన్’ యాప్ ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్... మొదలైన యాప్‌లను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్ కమ్యూనికేషన్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ ఇది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించగా.. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రబృందాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. ఆ ఒక్క డైలాగ్‌తో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ ట్వీట్‌కు అనసూయ రిప్ కూడా ఇచ్చింది. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ చిత్రంలో ఒక్క డైలాగ్‌తో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఒక్క వారంలోనే మెసేజ్ అందరికీ చేరేలా చేశారు. మీడియా ద్వారా అయితే దాదాపు 10 ఏళ్లు పట్టేది. మాస్ మసాల సినిమాలో ఇలాంటి గొప్ప అంశాన్ని పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్లే ఇది సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బాలయ్య పక్కన శ్రీలీల చూడటం అద్భుతంగా అనిపించింది.' అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ట్వీట్‌కు అనసూయం సైతం స్పందించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రిప్లై ఇచ్చింది. The good touch-bad touch scene in #BhagavantKesari will achieve in a week what other mediums will take 10 years. Thank you for bringing this topic to mass masala cinema @AnilRavipudi garu and NBK garu🙌🏽🙌🏽 Communicated in such a simple and yet highly effective manner like only NBK… — Rahul Ravindran (@23_rahulr) October 23, 2023 -
అత్తింట్లో చిత్రహింసలు: మేళతాళాలతో కుమార్తెకు తండ్రి ఘన స్వాగతం
మేళ తాళాలతో ఘనంగా పెళ్లిచేసి కూతురిని బ్యాండ్-బాజా-బారాత్‌తో సాగనంపడం మన అందరమూ చూసి ఉంటాం కానీ పెళ్లయిన కూతురిని అదే ఆనందంతో శాశ్వతంగా ఇంటికి తిరిగి తీసుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజంగా జరిగింది. అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. మూడు ముళ్లూ పడిన తరువాత చచ్చిన బతికినా మెట్టినింట్లోనే మన సమాజంలో ఎక్కువ మంది ఆడ పిల్లలని వేధించే మాటలివి. ఏ కష్టం వచ్చినా.. కాంప్రమైజ్ అయ్యి బతకాల్సిందే. తరాలు మారుతున్నా అమ్మాయిల జీవితాల్ని శాసిస్తున్న ఇలాంటి కట్టుబాట్లను తోసి రాజన్నారొక తండ్రి. తండ్రి అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా ప్రవర్తించి ఈ ప్రపంచంలోని అమ్మాయిలందరి మనసు దోచుకున్నారు. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కుమార్తె సాక్షి గుప్తాకు గతేడాది ఏప్రిల్‌లో సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా పెళ్లి జరిపించారు. భర్తతో నిండు నూరేళ్లు హాయిగా జీవించమంటూ ఆశీర్వదించి అత్తారింటి సాగనంపారు. అయితే వేయి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్తకు ఇంతకుముందే పెళ్లి అయింది. ఒకసారి కాదు, రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి తర్వాత కూడా సాక్షితో కలిసి సవ్యంగా జీవించలేదు. అయినా సర్దుకు పోదాం అనుకుంది. అతడే మార తాడులే అనుకుని బంధం కొనసాగించాలని సాక్షి నిర్ణయించుకుంది. దీనికి తోడు అత్తింటి వేధింపులు కూడా ఎక్కువ కావడంతో, తల్లిదండ్రులతో తన గోడును వెళ్ల బోసుకుంది. కూతురి కష్టాలు చూసిన తండ్రి చలించిపోయాడు. సాక్షికి అండగాఉండాలనే నిర్ణయం తీసుకోవడంమాత్రమేకాదు. భాజాభజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తన కుమార్తెను తిరిగి పుట్టింటికి స్వాగతం పలికారు తండ్రి. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలోషేర్ చేశారు. ఆడపిల్లలు చాలా విలువైన వాళ్లు.. వాళ్లను గౌరవించాలి..అంటూ సమాజానికి మంచి సందేశ మిచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. -
హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!
ఇజ్రాయెల్-హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్నిమిగులుస్తోంది. హృదయాల్నిమెలిపెట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని మరణం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇజ్రాయెలీ వార్తా సంస్థ Ynet ప్రకారం చావు బతుకులమధ్య అత్యంత దయనీయ పరిస్తితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం వైరల్ అవుతోంది. హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. అయినా ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్‌లో తలదాచుకుని అక్కడినుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. ‘‘నా మీద కాల్పులు జరిగాయి. మీ గురించి చాలా బాధపడుతున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది’’ అంటూ మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత మరో అప్డేట్ను కూడా ఇచ్చింది. తనకు సమీపంలోనే ఉగ్రవాది ఉన్నాడనీ, ఏ క్షణాన్నైనా తనను కాల్చేయొచ్చనే అందోళన వ్యక్తం చేసింది. ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తోంది, మానవ ప్రాణనష్టం జరిగినట్లు కనిపిస్తోందంటూ అక్కడి పరిస్థితిని వివరించింది. అలాగే ప్రస్తుతం తాను గోలానీ బ్రిగేడ్‌కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాననీ. ఇక్కడ తమకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవని కూడా ఆ మెసేజ్‌లో ఆమె పేర్కొంది. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన బ్రెజిలై మెడికల్ సెంటర్లో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇక లేదని అధికారుల వివరాల బట్టి తెలుస్తోంది. అఫులాలో పుట్టి పెరిగింది బోని. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరింది. ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్న బోనీ తిరిగి రావాలని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది. కాగా హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఐదు రోజుల క్రితం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి 2.3 మిలియన్ల జనాభాఉన్న గాజా స్ట్రిప్‌లోని పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నాటికి 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఎంత మంది పౌరులు ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోగాజా నగరంలో ఆహార కొరత నెలకొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి వచ్చే రోగులతో నిండిపోయింది. ఒకవైపు ఆక్సిజన్‌తో సహా ఇతర అత్యవసర మందుల నిల్వలు క్షీణిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రోగులను కాపాడేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. -
ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్‌మీకూ వచ్చిందా?
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్‌ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్‌తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్‌తోపాటు మెసేజ్‌లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్‌లు కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వచ్చాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్‌లు వచ్చాయి. -
జీ20 సమ్మిట్: ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' పేరు
ఢిల్లీ:దేశం పేరుమార్పుపై ప్రస్తుతం రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీ20 వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై దేశం పేరును భారత్ అనే పేర్కొన్నారు. దీంతో దేశం పేరును మారుస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. జీ20 డిన్నర్ మీటింగ్‌కి ఆహ్వానాలు పంపిన క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన జీ20 బుక్‌లెట్‌లోనూ భారత్, మధర్ ఆఫ్ డెమోక్రసీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే దేశం అధికారిక పేరు భారత్ అని బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు. రాష్ట్రపతికి పంపిన ఆహ్వాన బుక్‌లెట్‌లో భారత్ అని పేర్కొనడంతో దేశం పేరు మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 18-23 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందున.. దేశం పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టనున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సందించాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇండియా కూటమి మండిపడింది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. ఇండియా కూటమిని దేశ వ్యతిరేకుల కూటమిగా అభివర్ణించింది. ఇండియా పేరు వలసవాద స్వభావాన్ని సూచిస్తోందని, భారత్ పేరు సరైనదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే.. -
ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
ఢిల్లీ: భారత్- ఇండియా పేరు మార్పు వివాదానికి దూరంగా ఉండాలని మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జీ20తో సహా పలు అంశాలపై జరిపిన చర్చలో ప్రధాని మోదీ.. ఈ మేరకు కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చారు. దేశం పేరు మార్పు అంశంపై ఎలాంటి కామెంట్ చేయకూడదని చెప్పారట. గత రెండు రోజులుగా పేరుమార్పుపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతుండగా.. ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జమిలీ ఎన్నికలు, ఇండియా-భారత్ పేరు మార్పు, ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా ప్రతిపక్షాలు భావించాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను పేర్కొనాలని కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను పేర్కొంటూ వాటిపై చర్చలు జరపాలని కోరారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ.. సమావేశాల ముందు అజెండాను తెలపడం సాంప్రదాయానికి విరుద్ధమని చెప్పారు. సభకు అన్ని పార్టీలకు ఆహ్వానం ఉంటుంది. ప్రజల సమస్యలను అక్కడే చర్చించుకోవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జీ20 డిన్నర్ మీటింగ్‌కి పంపిన ఆహ్వాన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంతో విపక్షాలు ఒక్కసారిగా విమర్శలను ఎక్కుపెట్టాయి. సాంప్రదాయం ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటామని, దేశం పేరును మార్చబోతున్నారని ఆరోపణలు ప్రారంభం అయ్యాయి. దేశంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
మస్క్ కూతురు అలా మెసేజ్ చేసిందా! తండ్రికి తెలియకూడదని..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తన భార్యా జస్టిస్‌కి 2008లో విడాకులిచ్చిన విషయం అందరికి తెలుసు. అప్పటికే వారికి 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్' అనే ఇద్దరు కుమారులుండేవారు. విడిపోయిన తరువాత అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది. నిజానికి అమ్మాయిగా మారిన తరువాత ఆ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ అలెగ్జాండర్ తన అత్తకు గతంలోనే మెసేజ్ చేసింది. అయితే అది ఆ తరువాత చాలా రోజులకు ఈ విషయం బయటపడినట్లు సమాచారం. దీనిని ఎలాన్ మస్క్ జీవిత చరిత్రలో వాల్టర్ ఐజాక్సన్ వెల్లడించాడు. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! అలెగ్జాండర్ తన తండ్రి మీద కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మస్క్ ప్రవర్తన ట్రాన్స్జెండర్లకు వ్యతిరేకంగా ఉంటుందని ఇలా చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ధనవంతులంతా చెడ్డవాళ్ళని ఆ అమ్మాయి బలంగా విశ్వసిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికి కూడా తన తండ్రిని (మస్క్) కలుసుకోవడానికి అంగీకరించలేదు. ఇది ఎలాన్ మస్క్‌ని ఎంతగానో బాధించిందని చెబుతాడు. -
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. దాని వల్ల ఉపయోగం ఏంటంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో అప్డేట్తో ముందుకు వచ్చింది. ఇప్పటికే చాట్ లాక్, స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా చాట్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. వీబీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ యూజర్లు చాట్చేసే సమయంలో గతంలో చేసిన చాట్లను వెతికేందుకు, చదవని మెసేజ్‌లను చదివేందుకు కాంటాక్ట్స్, బిజినెస్ కాంటాక్ట్స్‌ను సులభంగా గుర్తించ వచ్చు. ఇందుకోసం చాట్పేజ్పై భాగంలో సెర్చ్ బార్‌ను తీసుకొని రానుంది. కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే నివేదిక ప్రకారం.. కొత్త డిజైన్ స్క్రీన్‌షాట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. స్క్రీన్‌షాట్‌లో యాప్ పై భాగంలో బార్ తెలుపు రంగులో కనిపిస్తుంది. అయితే యాప్ పేరుతో సహా ఇతర ఆప్షన్లు గ్రీన్ కలర్లో ఉంటాయి. నావిగేషన్ బార్ సైతం దిగువ భాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, వాట్సాప్ ఈ కొత్త డిజైన్.. గూగుల్ డిజైన్3 మార్గదర్శకాలకు అనుగుణంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. -
మద్యం మత్తులో మేనేజర్‌కు మెసేజ్.. ‘ఏందిరా ఇది’ అంటున్న నెటిజన్లు!
మత్తులో మునిగినోడు నిజమే మాట్లాడతాడని, అన్నీ నిజాలే చెబుతాడని చాలా మంది అంటుంటారు. అలా మద్యం మత్తులో అన్నీ నిజాలే మాట్లాడేసి, ఆనక చిక్కుల్లో పడినవారు చాలామందే ఉంటారు. ఇదే బాపతుకు చెందిన ఒక మందుబాబు తన మేనేజర్‌తో చాట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆ మేనేజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం మత్తులో మునిగిన ఆ జూనియర్ తన బాస్‌కు అర్థరాత్రి 2:30కి మెసేజ్ చేసి, దానిలో.. ‘బాస్ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్నందకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు. ఈ పోస్టుకు క్యాప్షన్ రాసిన బాస్.. ఎక్స్ నుంచి మద్యం మత్తులో మెసేజ్‌లు రావడం సహజం. కానీ ఇటువంటి మెసేజ్‌లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ వైరల్ అయిన నేపధ్యంలో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏందిరా ఇది’ అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఒక యూజర్..‘మీరు చాలా అదృష్టవంతులు. మీ జూనియర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు’ అని రాయగా మరొకరు మీరు చాలా మంచి మేనేజరై ఉంటారు. లేకుంటే ఇలాంటి మెసేజ్‌లు మీకు రావు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు! Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl — Siddhant (@siddhantmin) August 4, 2023 -
ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా
మనం ఇప్పుడూ ఏ వ్యవహారమైన ఫోన్ల ద్వారా లేదా మెసేజ్‌ల ద్వారా చక్కబెట్టేస్తున్నాం. దీంతో పని సులువుగా అవ్వడమే గాక టైం కూడా కలిసిస్తోంది. సాధారణంగా మెసేజ్‌లలో మన భావాలను వ్యక్తపరిచేలా.. ఎమోజీలు ఉపయోగించడం అనేది పరిపాటే. అలానే ఓ రైతు కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆ ఎమోజీని ఉపయోగించాడు. దీంతో ఆ రైతుకి కోర్టు ఏకంగా రూ. 50 లక్షల జరిమాన విధించింది. అసలేం జరిగిందంటే..కెనడాలోని క్రిస్ అచ్టర్ అనే రైతు ఓ కొనుగోలుదారుతో ఫోన్లో.. మెసేజ్‌లతో సంప్రదింపులు చేశాడు. అతను సుమారు 86 టన్నుల అవిసె గింజలు కొనగోలు చేస్తానని, కేజి రూ 1048/- చొప్పున చేసి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. అందుకు సదరు రైతు అంగీకరించడమే గాక నవంబర్ కల్లా డెలివరి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారయ్యినట్లే కదా అని అడగగా.. ధృవీకరిస్తున్నట్లుగా రైతు ఈ థంబ్స్ అప్ ఎమోజీని పంపాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు ఒప్పందం ఖరారయ్యిందని భావించాడు. తీరా చూస్తే..అనుకున్న సమయానికి రైతు అవిసె గింజలు పంపిణీ చేయలేదు. దీంతో కొనగోలుదారుడు రైతుని ప్రశ్నించగా..తాను కాంట్రాక్ట్ తీసుకుంటున్నా అని ధృవీకరించానేగాని డెలివరీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని వాదించాడు. దీంతో కోర్టుని ఆశ్రయించారు ఇద్దరూ..కొనగోలుదారుడు ఒప్పందాన్ని నెరవేర్చలేదని మెసేజ్‌ల స్క్రీన్ షాట్ ఆదారాలను కోర్టుకి సమర్పించాడు. కాంట్రాక్ట్‌ను అందుకుంటున్నట్లుగా ఆ గుర్తుని పంపిచానని చెప్పాడు. ఐతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు నిరూపించేలా ఏ ఆధారాన్ని సమర్పించలేకపోయాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమోదాన్ని సూచించడానికి 'థంబ్స్ అప్ ఎమోజి'ని సాధారణంగా ఉపయోగిస్తారని పేర్కొంది. అలాగే ''డిక్షనరీ.కమ్" అందించిన ఎమోజీ నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తూ..డిజిటల్ కమ్యూనికేషన్లో ఒప్పందం ఆమోదం లేదా ప్రోత్సాహాన్ని వ్యక్తికరించడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తామని స్పష్టం చేసింది. దేన్నైనా ఒప్పందం చేసుకున్నారు అని నిర్థారించడానికి సంతకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇది సర్వసాధారణంగా జరిగే సాంప్రదాయపద్ధతి. అదే ఎమోజీలు ఉపయోగించడం అనేది ఆధునిక పద్ధతి అని కోర్టు వెల్లడించింది. ఇక్కడ థంబ్స్ అప్ ఎమోజీ సాంప్రదాయేతరమైనది అయినప్పటికీ ఆ వ్యక్తి అంగీకరించాడు అనడానికి అతని మొబైల్ నెంబర్ ద్వారా చేసిన మెసేజ్‌లే ఆధారమని స్పష్టం చేసింది. అందువల తమ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే గాక అంగీకరించలేదని వాదించినందుకు గానూ రైతుకి ఏకంగా రూ. 50,88,893/-లు జరిమానా విధించింది. (చదవండి: యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్నికూడా కలగజేస్తుందా!) -
34 ఏళ్లుగా సముద్రంలో తేలాడిన ఆ బాటిల్... ఆమె చేతికి చిక్కడంతో...
కెనడాకు చెందిన ఒక మహిళకు 34 సంవత్సరాల క్రితం నాటి ఒక బాటిల్ సముద్రపు ఒడ్డున దొరికింది. ఆ బాటిల్లోని ఒక కాగితంలో ఒక మెసేజ్ ఉంది. దానిని చదివిన ఆ మహిళ తెగ ఆశ్చర్యపోయింది. ఆ మెసేజ్ ఆధారంగా ఆ మహిళ ఆ బాటిల్ యజమాని కోసం వెదికింది. అప్పుడు ఆమెకు ఒక విషయం తెలియడంతో నిలువునా వణికిపోయింది. పురాతన కాలం నాటి వస్తువు ఏదైనా దొరికితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా లభ్యమైతే ఇక అప్పుడు కలిగే ఆసక్తికి హద్దులు ఉండవు. కెనడాకు చెందిన ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. షెల్టెర్ అనే మహిళకు సముద్రపు బీచ్‌ను శుభ్రం చేస్తుండగా ఒక వస్తువు దొరికింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 34 ఏళ్లుగా నీటిపై తేలుతున్న బాటిల్ ఆ మహిళ ఒక బాటిల్ ఫొటోను, ఒక మెసేజ్‌ను షేర్ చేసింది. ఆ మెసేస్‌పై 1989, మే 29 తేదీ ఉంది. అంటే ఆ బాటిల్ 34 ఏళ్ల క్రితం నీటిలో పడవేశారు. అది ఇన్నేళ్లుగా నీటిలో కొన్ని వేల మైళ్లు దూరం వరకూ తేలుతూవస్తోంది. షెల్టెర్ ఆ పోస్టులో ఇలా రాసింది.. ‘నాకు ఎప్పటికై నా ఏదైనా పురాతన వస్తువు దొరుకుతుందని తరచూ అనిపించేంది. ఇప్పుడు అది దొరికింది’ అని పేర్కొంది. బాటిల్లో ఏం మెసేజ్ ఉంది? నిజానికి అ బాటిల్లో ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడిన ఎటువంటి మెజేస్ లేదు. అయినా దీనిలో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తుంది. దానిలో కొన్ని ఏళ్ల క్రితం నాడు రాసిన మెసేజ్ ..‘ఇది ఒక సన్నీ డే, గాలి వీయడం లేదు’ అని ఉంది. ఎవరో వినోదం కోసం ఈ మెసేజ్ రాసి, దానిని బాటిల్లో ఉంచి, నీటిలో పడవేశారు. ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి ఈ బాటిల్ లభ్యమవుతుందని వారు భావించివుంటారు. బాటిల్ యజమాని ఎవరంటే.. షెల్టెర్ తన ఫేస్బుక్ పోస్టులో ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. దానిలో ఆమె తనకు ఈ బాటిల్ యజమాని చిరునామా తెలిసిందని పేర్కొంది. న్యూఫౌండ్ల్యాండ్కి చెందిన గిల్బర్ట్ హేమలిన్ 1989 మే 29న ఈ బాటిల్‌ను తాను ప్రయాణిస్తున్న బోటు నుంచి సముద్రంలోకి విసిరేశారు. దీనిని పోర్ట్ ఓ చోక్స్కు 10 మైళ్ల దూరంలో నీటిలో విసిరివేశారు. ఆ బాటిల్వెనుక భాగంలో ఒక చిరునామా ఉంది. ఆ ప్రాంతం సెయింట్ ఆగస్టాన్ నది, క్యూబెక్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లిన షెల్టెర్ ఆ బాటిల్ యజమానిని కలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అతను రెండేళ్ల క్రితమే మృతి చెందారని షెల్టెర్కు తెలిసింది. దీంతో ఆమె అతని కుమారునికి ఫోనులో విషయమంతా చెప్పింది. త్వరలోనే ఈ బాటిల్ పంపిస్తానని అతనికి తెలిపింది. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు -
‘ఒక తాలీకి మరొకటి ఉచితం’.. ప్రలోభానికిలోనైన మహిళ ఎలా మోసపోయిందంటే...
ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకోసం మోసగాళ్లు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఘరానా మోసం చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రముఖ రెస్టారెంట్‌కు చెందిన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంతలోనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గత ఏడాది నవంబరు 27న చోటు చేసుకోగా, దీనిపై చాలా ఆలస్యంగా ఈ ఏడాది మే 2న సైబర్ సెల్‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలి పేరు సవితా శర్మ(40)ఆమె ఒక బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన రిపోర్గులో...తనకు గత ఏడాది తన స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చిందని, తరువాత ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక లింకు పంపిందని తెలిపారు. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక పుడ్‌కు సంబంధించిన ఒక ఆఫర్ తనకు అందిందన్నారు. వారు ఇచ్చిన ఫోను నంబరుకు కాల్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయలేదన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత తనకు మరో నంబరు నుంచి ఫోను వచ్చిందన్నారు. ఈ కాల్ చేసిన వ్యక్తి తాము సాగర్ రత్న రెస్టారెంట్ నుంచి ఫోను చేస్తున్నామని ఒక తాలీ(భోజనం) బుక్ చేసుకుంటే మరొక తాలీ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అయితే ఇందుకు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతూ, దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఆ వ్యక్తి తెలియజేశాడని తెలిపారు. వెంటనే ఆ మహిళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీడ్ చేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికి ఆమెకు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. రెండు సెకెన్ల తరువాత రూ. 50 వేలు డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చింది. వెంటనే తాను మోసపోయానని గ్రహించి, తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించానని బాధితురాలు తెలిపింది. కాగా బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వారు సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధులను సంప్రదించగా, తమకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా ఇటువంటి ఆన్లైన్ వ్యవహారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్..
స్మార్ట్ ఫోన్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎస్సెమ్మెస్ రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన లేని యూజర్లకు ఈ రక్షణ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ట్రూకాలర్ అంచనా ప్రకారం 100 మిలియన్లకుపైగా యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారు గత మూడు నెలల్లో కనీసం ఒక మోసపూరిత ఎస్సెమ్మెస్ అందుకున్నారు. ఈ మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు ప్రధానంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్లు, కేవైసీ సంబంధిత, లోన్లు, ఛారిటీ, లాటరీ వంటి అంశాలకు సంబంధించినవి వస్తున్నాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ట్రూకాలర్ ప్రవేశపెట్టిన ఈ ఎస్సెమ్మెస్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఫోన్లకు వచ్చే మోసపూరిత సందేశాలను తెలివిగా గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ట్రూకాలర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్ వచ్చినప్పుడు కొత్త ఫీచర్ ఆధారంగా ట్రూకాలర్ యాప్ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్ పొరపాటున ఆ ఫ్రాడ్ మెసేజ్‌ను ఓపెన్ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్ డిసేబుల్ చేస్తుంది. అయితే ఆ మెసేజ్ సురక్షితమే అని యూజర్ స్పష్టంగా గుర్తించినట్లయితే మాత్రమే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ -
మెసేజ్ లింక్స్‌తో జాగ్రత్త..!
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పూర్ణిమ(పేరుమార్చడమైనది) ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చుపెడుతుంది. రాత్రి పడుకునే ముందు సోషల్‌మీడియా అకౌంట్స్‌తో పాటు, మెయిల్‌కి వచ్చిన నోటిఫికేషన్స్ చూడటం అలవాటు. వాటిలో తన ఆఫీసు నుంచి, స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లై చేసింది. అదే సమయంలో మరో మెసేజ్ వచ్చింది. గోల్డ్స్కీమ్కి సంబంధించిన సమాచారం అది. ఆసక్తిగా అనిపించడంతో దానిని ఓపెన్ చేసింది. ఆ స్కీమ్‌లో చేరితే తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు. అది, పేరున్న కంపెనీ వెబ్సైట్ నుంచి వచ్చింది. లిమిటెడ్ టైమ్‌లో వచ్చిన ఆఫర్ అది. మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని, అప్లికేషన్లో తన వివరాలను పొందుపరిచి, సెండ్ చేసింది. మిగతావి ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అని ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది. ఉదయం పనిచేసుకుంటూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. వచ్చిన బ్యాంక్ మెసేజ్‌లు చూసి షాక్ అయ్యింది. యాభై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ అది. నిన్నరాత్రి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. స్కీమ్‌లో చేరినట్టుగా వివరాలు ఇచ్చింది కానీ, బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదు తను. తన డబ్బు మరెలా పోయినట్టు? మెయిల్ ఐడీలో ఉన్న కస్టమర్ కేర్‌కి మెసేజ్ చేసింది. ఫోన్ చేసింది. కానీ, ఎలాంటి సమాచారమూ లేదు. పూర్ణిమ మాదిరే చాలామంది మెసేజ్‌లు లేదా మెయిల్స్‌కు వచ్చిన ఆకర్షణీయమైన పథకాలతో ఉన్న లింక్స్‌ను ఓపెన్ చేయడం, వాటి ద్వారా మోసాలకు గురికావడం అతి సాధారణంగా జరుగుతున్నాయి. దీనికి కారణం అధికారిక కంపెనీల నుంచి వచ్చినట్టుగా మెసేజ్ లింక్స్ ఉండటం ప్రధాన కారణం. ఈ రోజుల్లో స్పూఫింగ్ అనేది మన భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. ఈ రకమైన దాడుల గురించి తెలుసుకోవడం, వాటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందరం సిద్ధపడాల్సిన సమయం ఇది. పేరున్న కంపెనీల పేరుతో అధికారిక వెబ్సైట్లనుంచి వచ్చినట్టు మెసేజ్‌లు మెయిల్స్‌కు వస్తుంటాయి. అయితే, వాటిలో ఏవి కరెక్ట్ అనేది పెద్ద సంశయం. ఇలాగే, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీ, లాగిన్ ద్వారా మోసగాళ్లు మన సమాచారాన్ని బయటపెట్టేలా చూస్తుంటారు. లాటరీ వచ్చింది, డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ వివరాలు ఇవ్వమని అడగడం, ఓటీపీ చెప్పమని కోరడం, బ్యాంక్ లేదా ఏదైనా ఇతర సంస్థ నుండి ఫోన్ కాల్స్ చేస్తుంటారు. ఈ కాల్స్ ద్వారా బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని మనం బయటపెట్టేలా మోసం చేసే అవకాశం ఉంది. మనలో నమ్మకాన్ని కలిగించడానికి సులువైన, ఆకర్షణీయమైన పద్ధతులను మోసగాళ్లు ఎంచుకుంటారు కాబట్టి, మనమే జాగ్రత్త వహించాలి. ఇ–మెయిల్ ద్వారా.. ఫేక్ మెయిల్ ఐడీతో మన ఇన్‌బాక్స్‌లో ఓ మెసేజ్ వస్తుంది. అది వేరొకరి నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఫిషింగ్ దాడులలో ఉపయోగించబడుతుంది, ఇక్కడ దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్ లోడ్ చేయడానికి, మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ♦ పంపినవారి ఇ–మెయిల్ చిరునామా అనుమానాస్పదంగా ఉండచ్చు. ఉదాహరణకు.. మనకు వచ్చిన ఫేక్ మెయిల్ ఐడీలో లెక్కకు మించి, అక్షర దోషాలు లేదా వింత భాష ఉండచ్చు. గమనించాలి. ♦మోసపూరిత ఇ–మెయిల్లు ఎలా ఉంటాయంటే.. తరచుగా క్రెడిట్ కార్డ్ నంబర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేదా పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు కోరుతుంటాయి. ♦ ఇ–మెయిల్లోని అనుమానాస్పద లింక్‌లు చట్టబద్ధమైన వెబ్సైట్లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కి దారితీయవచ్చు. లేదా అవి అసాధారణమైన అక్షరాలను కలిగి ఉండవచ్చు. లేదా వేరే వెబ్‌సైట్‌కి దారి మళ్లించవచ్చు. ఫోన్ ద్వారా దాడులు ♦ ఫోన్ ద్వారా దాడులకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. వీరు వినియోగదారుడిని రకరకాల ఆకర్షణీయ పథకాల ద్వారా అతని వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ♦ మీ ఫోన్‌కి బయటి దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి. ♦ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కాల్స్ వచ్చినా, పగలు లేదా రాత్రి అసాధారణ సమయాల్లో మీకు కాల్స్ వచ్చినా, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦మీరు గుర్తించని కంపెనీలు లేదా వ్యక్తుల నుండి అయాచిత కాల్స్‌ను స్వీకరిస్తే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ♦కాలర్ ఐడీ స్పూఫింగ్ తరచూ క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా సామాజిక భద్రతా నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం కోసం రిక్వెస్ట్‌లు ఉంటాయి. ♦ఫోన్ కాల్లో అవతలి వారి మాటల్లో ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా, కాల్ సమయంలో అసాధారణ శబ్దాలు లేదా అంతరాయాలు ఉంటే, అది కాలర్ ఐడీ స్పూఫింగ్‌కు సంకేతం కావచ్చు. ఇలా సురక్షితం... ♦ అపరిచిత ఇ–మెయిల్లు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ♦ బ్రౌజర్ అడ్రస్ బార్లో లాక్ గుర్తు ఉండదు. అడ్రస్ బార్‌పై అక్షరాల్లో చిన్న చిన్న తేడాలు ఉంటా యి. ఈ చిన్న అక్షరాలను కూడా గమనించాలి. ♦యుఆర్ఎల్ అక్షరాలు సరిగా ఉన్నా డిజైన్లలో కూడా తేడాలు ఉంటాయి. గమనించాలి. ♦బ్యాంక్, డిజిటల్ రెండు రకాల కార్యకలాపాలకు రెండు కారకాల ఫోన్ ప్రమాణీకరణను ప్రారంభించడం శ్రేయస్కరం. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
రైడ్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం..స్పందించిన కంపెనీ
ఇటీవల ఆన్లైన్లో కారు లేదా బైక్ బుక్ చేసుకుని హాయిగా ఎక్కడికైనా సులభంగా ప్రయాణించేస్తున్నాం. అందులోకి ర్యాపిడో వచ్చాక మరింత ప్రయాణం సులభమైంది. సింగిల్‌గా వెళ్లాలంటే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే చాటు తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రయాణించవచ్చు. ఐతే ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఆన్లైన్లో బైక్ బుక్‌చేసుకుంటే..ఆ ర్యాపిడో డ్రైవర్ నుంచి మహిళ ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ మేరకు ఆమె తనకు ఆ డ్రైవర్‌కు మధ్య సాగిన వాట్సాప్ మెసేజ్‌ల సందేశాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్టిట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..హసన్పరీ అనే మహిళ బైక్ రైడ్‌ని బుక్ చేసుకుంటే..డ్రైవర్ పికప్ చేసుకుని రైడ్ పూర్తి అయిన తర్వాత ఆ వ్యక్తి మహిళకు పంపిన మెసేజ్‌లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఆ సందేశంలో తాను ఆమె వాయిస్, ఫ్రోఫైల్ ఫోటో చూశాకే పికప్ చేసుకోవడానికి వచ్చానని లేదంటే అసలు పికప్ చేసుకోవడానికి వచ్చే వాడని కాదని చెప్పాడు. దీంతో ఆ ర్యాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తనకు మండిపడుతూ వెంటనే సదరు కంపెనీకి ఆ వాట్సాప్ సందేశాలను పంపించి మరీ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ర్యాపిడో కేర్ సదరు మహిళకు క్షమాపణలు చెప్పడమే గాక సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అతను తన వృత్తి ధర్మాన్ని పాటించడంలో సరైన విధానం లేకపోవడంతోనే అలా ప్రవర్తిచాడని అని వివరణ ఇచ్చుకుంది. అలాగే ఆ మహిళను తాను బుక్‌చేసుకున్న రైడ్ ఐడిని రిజష్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మెసేజ్ చేయండి తక్షణమై సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చింది. ఐతే నెటిజన్లు మాత్రం ఆమె ధైర్యంగా సదరు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినందుకు మెచ్చుకోవడమే గాక ఈ రోజుల్లో ర్యాషిడో డ్రైవర్లు కూడా సేఫ్ కాదంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ట్వీట్ చేశారు. shared my location with a captain at @rapidobikeapp and this is what i get???? FUCK YOUR APP FUCK YOUR MEN FUCK MEN pic.twitter.com/EHLqd7lpt5 — husnpari (@behurababe) March 12, 2023 (చదవండి: ప్లాస్టిక్ బ్యాగ్‌లో చిధ్రమైన స్థితిలో తల్లి మృతదేహం..కూతురు అరెస్టు) -
నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం ముగిస్తున్నా అంటూ భార్యకు మెసేజ్
సాక్షి, అన్నానగర్: కళ్లకురిచ్చి జిల్లా త్యాగతురుగం సమీపంలోని మెల్విలి గ్రామానికి చెందిన ఆంథోని రాజ (33) చిన్న సేలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. కళ్లకురిచ్చి పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య శీల పౌరిమేరి, ఆరేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. శనివారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. శీలపౌరిమేరి బయటకు వెళ్లింది. ఆంథోని రాజ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య ఇంటిలో లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన భార్యకు నీ జీవితం చూసుకో.. నేను నా జీవితాన్ని ముగించుకుంటున్నాను అని మెసేజ్ పంపాడు. ఇది చూసి శీలపౌరిమేరి ఇంటికి వచ్చి చూడగా తలుపు గెడియపెట్టి ఉంది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా ఆంథోని రాజ ఉరి వేసుకుని మృతి చెందాడు. కళ్లకురిచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం) -
ఫోన్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేసిన బ్యాంక్ మేనేజర్.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
సాక్షి, వరంగల్: ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ సీనియర్ బ్యాంక్ అధికారే సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసి మోసపోయారు. తన ఖాతా నుంచి రూ.2,24,967 పోగొట్టుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పరకాల ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సకల్ దేవ్‌సింగ్ ఫోన్‌కు ఈ నెల 23న రాత్రి ఓ వ్యక్తి (89878 61993) నుంచి ‘ఎస్బీఐ అకౌంట్ డీయాక్టివేటెడ్..ప్లీజ్ క్లిక్ అన్‌ద లింక్ అండ్ అప్డేట్ పాన్‌కార్డు నంబర్ ఇమీడియట్లీ’అనే మెసేజ్ వచ్చింది. తెల్లవారుజామున దాన్ని చూసుకున్న దేవ్‌సింగ్ ఆ మెసేజ్‌పై రెండుసార్లు క్లిక్ చేశారు. రెండుసార్లు క్లిక్ చేయడంతో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయింది. పాస్వర్డ్ ఎంటర్ చేయమనడంతో చేశారు. ఆ తర్వాత మరో కొత్త నంబర్ 74318 29447 నుంచి ఫోన్ వచ్చింది. తాము పంపిన మెసేజ్‌పై క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలని, పాన్‌కార్డు అప్డేట్ చేయమని అతను చెప్పడంతో.. తాను బస్‌లో ఉండడం వల్ల సాధ్యం కావడం లేదని, బ్యాంక్‌కు వెళ్లి ప్రయత్నిస్తానని దేవ్‌సింగ్ సమాధానం ఇచ్చారు. దీంతో వాట్సాప్‌కు మరో కొత్త నంబర్ 79087 54873 నుంచి మెస్సెజ్ వచ్చింది. ఆ మెసేజ్ లింక్‌పై ఆయన రెండు సార్లు క్లిక్ చేశారు. దీంతో క్షణాల్లో బ్యాంక్ అధికారి ఖాతాలో ఉన్న నగదు అంతా మాయమైంది. మొదటిసారి రూ.99,990, రెండోసారి రూ.99,990, మూడోసారి రూ.24,987 డెబిట్ అయ్యాయి. మొత్తం రూ.2,24,967 ఖాతా నుంచి పోగొట్టుకున్న దేవ్‌సింగ్ మోసాన్ని గ్రహించి పరకాల పోలీసులను ఆశ్రయించారు. చదవండి: కేవలం లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గాలం.. మూడు రోజుల్లో రూ.1.22 కోట్లు స్వాహా..! -
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్‌కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్‌ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్‌లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్‌కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్‌మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్‌మన్ కు ఉంటుంది. అంబుడ్స్‌మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్‌కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్‌లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్‌లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్! అదేంటంటే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. త్వరలో మరో ఆసక్తికర ఫీచర్‌ను తీసుకురానుంది. చాట్, గ్రూప్ చాట్లలో యూజర్లు మెసేజ్‌లను పిన్ చేసుకునే వెసులుబాటును కల్పించనుందని వాబేటాఇన్ఫో(WABetaInfo) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో రానున్న అప్డేట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో ఉపయోగం ఇదే.. వాట్సాప్ చాట్, గ్రూప్చాట్లలో యూజర్లు చేసుకునే మెసేజ్‌లలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. వాటిని టాప్‌లో పెట్టుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత చాట్‌లో ఉన్న ఇద్దరూ లేదా గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఈ కొత్త అప్డేట్ చేసుకుని ఉంటే పిన్ చేసిన మెసేజ్‌లు అందరికీ టాప్‌లో కనిపిస్తాయి. ఒకవేళ అవతల వ్యక్తి పాత వర్షన్‌ను వినియోగిస్తన్నట్లయితే కొత్త వర్షన్‌ను అప్డేట్ చేసుకోమని యాప్ సూచిస్తుంది. వాట్సాప్ ఇప్పటికే కాలింగ్ షార్ట్‌కట్ క్రియేట్ చేసుకునే ఫీచర్‌ను తీసుకురావడంపైనా పనిచేస్తోందని వాబీటాఇన్ఫో నివేదిక ఇదివరకే తెలియజేసింది. ఇలా సరికొత్త ఫీచర్లు వస్తుండటంతో ఈ మెసేజింగ్ యాప్‌కు యూజర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో, 200 కోట్ల మందికిపైగా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. -
బంగారు భారతాన్ని నిర్మిద్దాం.. రాహుల్ తెలంగాణ సందేశం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: 133 రోజుల క్రితం కన్యాకుమారిలో ప్రారంభమైన ‘భారత్‌జోడో యాత్ర’కు కొనసాగింపుగా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో జరగనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల కోసం దేశ ప్రజలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని పంపారు. ఈ సందేశాన్ని తెలుగులోనికి అనువదించిన టీపీసీసీ ఆ సందేశంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలతో కూడిన చార్జిషీట్‌ను నాలుగు పేజీల కరపత్రంలో పొందుపరిచింది. ప్రతి భారతీయుడు కలలు కనే సమాజాన్ని, వాటిని నెరవేర్చుకునేందుకు సమాన అవకాశాలున్న సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుదామని, బంగారు భారతాన్ని నిర్మిద్దామని రాహుల్‌గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందేశం పొందుపరిచిన కరపత్రాన్ని హాథ్ సే హాథ్ జోడో యాత్రల సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గడపకూ కాంగ్రెస్ శ్రేణులు అందజేయనున్నాయి. ఈ మేరకు యాత్రల ప్రచార సామగ్రిని గాంధీభవన్ నుంచి క్షేత్రస్థాయికి పంపే ఏర్పాట్లలో గాంధీభవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు ఫిబ్రవరి ఆరో తేదీన భద్రాచలంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజున లక్షమందితో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు సోనియా, ప్రియాంకా గాంధీల్లో ఒకరిని ఆహ్వానించేందుకు ఇప్పటికే ఏఐసీసీకి లేఖ రాసింది. సబ్కే సాత్ విశ్వాస్ ఘాత్ దేశంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానా లన్నింటినీ విస్మరించిందని, బీజేపీ భ్రష్ట్ జుమ్లా పార్టీ అని హాథ్ సే హాథ్ జోడో చార్జిషీట్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కుచ్‌కాసాత్ ఖుద్‌కా వికాస్, సిర్ఫ్ ప్రచార్ ఔర్ పరివార్ వాద్, సబ్‌కేసాత్ విశ్వాస్ ఘాత్, కుచ్కా సాథ్ ఖుద్‌కా వికాస్, సబ్కేసాథ్ విశ్వాస్ ఘాత్ లాంటి నినాదాలను ఈ చార్జిషీట్లో పొందుపరిచారు. మోదీ ప్రతిష్టను పెంచేందుకు బీజేపీ రూ.10వేల కోట్లను ఖర్చు చేసిందని, రూ.5వేల కోట్లకు ఆ పార్టీ పడగలెత్తిందని, ఎలాంటి పారదర్శకత లేకుండానే 90% ఎన్ని కల బాండ్లు బీజేపీకి దక్కాయన్నారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ -
మేము బాధపడుతుంటే..భారత్ లాభపడుతోంది: ఉక్రెయిన్ మంత్రి ఫైర్
రష్యా సాగిస్తున్న దురాకమ్రణ యుద్ధంలో ఉక్రెయిన్లు ప్రతిరోజు చనిపోతుంటే..మీకు అది వరమైందంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా భారత్‌పై విరుచుకుపడ్డారు. మా కారణంగానే మీకు రష్యా చమురును చౌకగా కొనుగోలు చేసే అవకాశం వచ్చిందంటూ మండిపడ్డారు. ఇది నైతికంగా భారత్‌కి తగనిది అని నొక్కి చెప్పారు. మా బాధల కారణంగా మీరు ప్రయోజనం పొందినట్లయితే మాకు మరింత సాయం చేయడం మంచిది అని కులేబా చురకలంటించారు. మరోవైపు ఇటీవలే ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఏడాదిలో కేవలం ఫిబ్రవరి, నవంబర్ నెలల మధ్య యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యా నుంచి అత్యధిక స్థాయిలో శిలాజ ఇధనాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా ఈయూ కూడా అదే పనిచేస్తోందని ఆవేదన చెందారు. భారత్ చౌకైన చమురు లభించడం వెనకాల బాధలనుభవిస్తున్న ఉక్రెయిన్లను చూడండి అని భారత్‌ని అభ్యర్థించారు. భారత్ రష్యాతో వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తూనే..యుద్ధం విషయంలో రష్యా తీరుని ఖండించింది కానీ ఐక్యరాజ్యసమితిలో మాస్కోకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మాత్రం దూరంగా ఉందన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇది యుద్ధం చేసేందుకు సమయం కాదు అని ఉక్రెయిన్‌కి మద్దతుగా ప్రోత్సాహకరమైన సందేశాలు ఇచ్చారు. అలాగే మోదీ తన స్వరంతో దేన్నైనా మార్చగలరన్నారు. అందువల్ల యుద్ధం ముగించడంలో ఢిల్లీ కూడా తన వంతు ప్రయత్నం చేయాలని, ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ప్రస్తుతం సమష్టి కృషి చేయడం ముఖ్యం, అందువల్ల భారత్ ముందుగా ప్రయత్నించకపోతే ఏది కాదని డిమెట్రో కులేబా వ్యాఖ్యానించారు. అలాగే ఈ శీతకాలంలో సైతం కీవ్ తన సైనిక దాడిని ఆపదని చెప్పారు. తాము ఒక్క రోజు కూడా ఆగమని, ఎందుకంటే తాము తీసుకునే ప్రతి విరామంలో రష్యా ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల్లో వారి రక్షణ రేఖలను బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తుందన్నారు. అదీగాక గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలను, ప్రత్యేకించి విద్యుత్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు దిగిందని చెప్పారు. (చదవండి: బహిరంగంగా విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన) -
‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి..
సాక్షి, సిరిసిల్ల: ‘సారీ అన్నయ్య.. మిస్ యూ’ అంటూ మెసేజ్ చేసి తంగళ్లపల్లి మండలం చింతలఠాణాకు చెందిన గొడుగు దినేశ్(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొడుగు అంజయ్య భార్య 15 ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు వెంకటేశ్, గణేశ్, దినేశ్‌లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకొడుకు వెంకటేశ్ వివాహం కాగా.. చిన్న కొడుకు దినేశ్‌కు మేనమామ కూతురితో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయిని దినేశ్ నిరాకరించారు. దీంతో దినేశ్, గణేశ్‌లకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి అంజయ్య సంబంధాలు చూస్తున్నాడు. మేనమామ కూతురికి శనివారం మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తాను నిరాకరించిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం.. తనకు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన దినేశ్ శనివారం మధ్యాహ్నం మేకలు కాసేందుకు గ్రామ శివారులోని కొడిషల్‌గుట్టకు వెళ్లాడు. అక్కడి నుంచి తన పెద్దన్న వెంకటేశ్‌కు ఫోన్‌చేసి తనకు బతకాలని లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంకటేశ్ తన తండ్రి అంజయ్యకు సమాచారం ఇవ్వగా శనివారం నుంచి దినేశ్ కోసం గాలించారు. ఆదివారం తెల్లవారుజామున కొడిషల్‌గుట్ట ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి అంజయ్య ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....
స్కాట్లాండ్లోని ఒక ఇంటి ఆవరణలో ప్లంబర్ పీటర్ అలెన్ తవ్వుతున్నాడు. ఆ ఇంటికి సంబంధించిన నీళ్ల పంపుల కోసం నేలను తవ్వుతుండగా...ఒక పురాత గాజు బాటిల్ కనిపించింది. దీంతో అతను ఆశ్చర్యపోయి తన యజమాని ఎలిద్ స్టింప్సన్ వద్దకు తీసుకువచ్చాడు. ఆమె కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ...స్కూల్‌కి వెళ్లిన తన పిల్లలు తిరిగి వచ్చే వరకు ఈ బాటిల్ ఓపెన్ చేయకూడదని గట్టిగా అనుకుంది. ఈలోగా స్కూల్నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. వారికి జరిగిన విషయమంతా చెప్పింది ఎలిద్. ఐతే వారు ఏదైన నిధేమో అనుకున్నారు గానీ ఆ బాటిల్లోని చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ బాటిల్లోని లేఖను ఓపెన్ చేయాలని తెగా ఆతృత పడ్డారు. అది విక్టోరియా కాలం నాటి పురాతన లేఖ. ఐతే ఆ బాటిల్ ఓపెన్ కాకపోవడంతో పగలుగొట్టి మరీ ఆ లేఖ తీసి అందులో ఏముందో చూశారు. అందులో జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీవ్ అనే ఇద్దరు మగ కార్మికులు సంతకాలు కనిపించాయి. ఈ బాటిల్లోని విస్కీ తాము తాగలేదని, అక్టోబర్ 6, 1887 అని రాసి ఉంది. సదరు యజమాని ఆ బాటిల్ ముక్కలను సైతం భద్రపరిచింది. ఐతే నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ ఆ లేఖను జాగ్రత్తగా భద్రపర్చమని చెప్పింది. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు) -
మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా!: నళిని శ్రీహరన్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళిని తోపాటు మరో ఐదుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ గాందీ హత్య కేసులో దోషులలో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ...."ఆ దారుణం గురించి ఆలోచిస్తూ చాలా ఏళ్లు గడిపాం. మమ్మల్ని క్షమించండి. ఆ ఆత్మహుతి దాడి ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఆ విషాదం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను." అని బాధితుల కుటుంబాలకు నళిని పశ్చాత్తాపంతో కూడిన సందేశం ఇచ్చింది. తాను తన భర్తతో కలిసి యూకే వెళ్లి స్థిరపడాలనుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబాన్ని కలుస్తారా అని మీడియా ప్రశ్నించగా...వారు కలుస్తారని అనుకోను, కలిసే సమయం అయిపోయిందని భావిస్తున్నాను అని నళిని అన్నారు. అయితే రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ తీర్పుని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అతడు అరెస్టు అయ్యే సమయానికి 19 ఏళ్లు కావడం, అదీగాక దోషులంతా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. (చదవండి: రాజీవ్ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?) -
తప్పనిసరైనందుకే తొలగింపులు..
న్యూఢిల్లీ: ప్రతికూల స్థూలఆర్థిక పరిణామాలను ఎదుర్కొని నిలబడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కొందరు ఉద్యోగులను తీసివేయక తప్పడం లేదని ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్ తమ సిబ్బందికి పంపిన సందేశంలో వివరణ ఇచ్చారు. కార్యకలాపాలను వేగంగా విస్తరించడంతో ఒకే రకం విధులను పలువురు ఉద్యోగులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని, అలాంటి డూప్లికేషన్‌ను తగ్గించుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందన్నారు. నిలకడగా వృద్ధి సాధించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే గ్రూప్ స్థాయిలో లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని పేర్కొన్నారు. ‘సంస్థ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎంతో భారమైన హృదయంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడంలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే క్షమించండి. కంపెనీని నిలకడైన వృద్ధి బాట పట్టించి మిమ్మల్ని తిరిగి తెచ్చుకోవడమే నా మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది‘ అని రవీంద్రన్ పేర్కొన్నారు. తొలగించే ఉద్యోగులకు మెరుగైన పరిహార ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ఇతర ఉద్యోగాన్వేషణలోనూ కంపెనీ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఆరు నెలల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ బైజూస్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో రవీంద్రన్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్‌ను క్లిక్ చేశారంటే అంతే..
హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్‌ను క్లిక్ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్‌ను బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో 5 జీ మొబైల్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్‌వర్క్‌ను అప్డేట్ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు. లింక్ ఓపెన్ చేయరాదు మొబైల్ 5 జీ నెట్‌వర్క్‌కు, బ్యాంక్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబరును 5 జీ నెట్వర్క్ కు అప్డేట్ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్ పంపించి క్లిక్ చేయమంటే స్పందించరాదు. చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో నమ్మితే అంతే సైబర్ వంచకులు ఎయిర్టెల్, జియోతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీల కాల్‌సెంటర్ల పేరుతో ఫోన్ చేస్తారు. సిమ్‌కార్డును 5 జీ కి అప్డేట్ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్‌ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్లు 5 జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. కానీ పాత మొబైల్స్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్ వంచకులు, 4 జీ మొబైల్స్‌ను 5జీ కి అప్డేట్ చేస్తామని కాల్స్ చేయడం మొదలైంది. వాట్సాప్ మెసేజ్, లింక్‌లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్‌ని 5జీ కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. -
వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘ఎడిట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వల్లో, పరధ్యానం వల్లో పంపిన మెసేజ్‌లో తప్పులు దొర్లుతుంటాయి. ఇకముందు నాలుక కర్చుకొని అయ్యో అనుకోనక్కర్లేదు. ఎడిట్ మెసేజ్ ఫీచర్‌తో పంపిన మెసేజ్‌లో తప్పును సరిద్దుకోవచ్చు. ఇప్పటికీ వాట్సాప్‌లో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో యూజర్స్ సెంట్ మెసేజ్‌లను డిలిట్ చేయవచ్చు. అయితే ‘ఎడిట్ మెసేజ్’తో పూర్తిగా డిలిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరం ఉన్న చోట ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (క్లిక్: అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్) -
ఔను! మోదీ చెప్పింది కరెక్ట్... ప్రశంసించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
Prime Minister Narendra Modi was right: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్ ఇమ్మాన్యయేల్ మాక్రాన్ ప్రశంసించారు. ఈ మేరకు మాక్రాన్ న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశంలో మోదీ సందేశాన్ని ప్రస్తావిస్తూ..ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ పుతిన్‌కి ఇచ్చిన సందేశం సరైనదని అన్నారు. ఔను! ఇది యుద్ధానికి సరైన సమయం కాదు అని మోదీ వ్యాఖ్యలను పునురుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి సరైన సమయం కాదని, మనమంతా సమిష్టిగా మన సార్వభౌమాధికారాలను కాపాడుకుంటూ సవాళ్లను ఎదర్కొనే సమయం అని పుతిన్‌కి మోదీ హితువు పలికారు. ఆ విషయాలను గురించే మాక్రాన్ మాట్లాడుతూ మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ పుతిన్‌తో ఉక్రెయిన్ యుద్ధం విషయమై ఇలా సంభాషించారు. ఆ సదస్సులో మోదీ పుతిన్‌తో ఇంకా ...."భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు సమస్యలు గురించి చాలా సార్లు మాట్లాడానంటూ గుర్తు చేశారు. ఆహారం, ఇంధన భద్రత, ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు కనుగొనాలి అన్నారు. అలాగే ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించడంలో మాకు సహాయం చేసినందుకు రష్యాకి, ఉక్రెయిన్‌కి ధన్యావాదాలు" అని మోదీ చెప్పారు. ఆ వ్యాఖ్యలకు పుతిన్ స్పందించి...ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ విధానం గురించి తమకు తెలుసునని, భారత్ ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని అన్నారు. సాధ్యమైనంతవరకు దీన్ని ముగించేయాలనే అనుకుంటున్నాం అని చెప్పారు. అంతేగాదు రష్యా భారత్‌ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, అవి మరింతగా కొనసాగుతాయని పుతిన్ అన్నారు. (చదవండి: రాణి పోయింది... రాజ కుటుంబ కలహాల పుల్‌స్టాప్‌కు ఇదే రైట్ టైం) -
మరణించిన వ్యక్తికి.. బూస్టర్ డోస్
బయ్యారం(వరంగల్): మరణించిన వ్యక్తికి బూస్టర్ డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు. కోవిడ్ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్ పీహెచ్సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్‌డోస్ వేసినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్లైన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పరిశీలించారు. అందులోనూ బూస్టర్‌డోస్ వేసినట్టు ఉంది. -
నీతో ఉండను నన్ను వెతకొద్దు.. వెతికితే చస్తా..!
సాక్షి, హయత్‌నగర్ (హైదరాబాద్): నన్ను వెతకకండి.. ఒకవేళ వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు ఫోన్లో మెసేజ్ పెట్టి ఓ వివాహిత అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌కు చెందిన తిరందాస్ ప్రసాద్‌కు ఆరేళ్ల క్రితం పూజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. చిన్న తగాదాల కారణంగా రెండు వారాల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల క్రితం భర్త ప్రసాద్ వెళ్లి రాజీ కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం నాగోల్‌లోని తన అత్త ఇంటికి వెళుతున్నానని చెప్పి పూజ తన పిల్లలను తీసుకుని వెళ్లింది. తర్వాత తాను నీతో ఉండను.. నన్ను వెతక వద్దు, వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తన మొబైల్ నుంచి భర్తకు వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు) -
‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం పై సీబీఐ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఈ తరుణంలో మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ రావడం విశేషం. ఈ మేరకు మనీష్ సిసోడియా తనకు బిజేపీ ఒక మంచి ఆఫర్ ఇస్తూ ఒక సందేశాన్ని పంపిందని తెలిపారు. "మీరు ఆప్‌ని వదిలేసి బీజేపీలోకి చేరండి సీబీఐ కేసులన్ని మూసేస్తాం" అని ఒక ట్వీట్ వచ్చిందని చెప్పారు. అంతేకాదు తనపై పెట్టిన కేసులన్ని తప్పడు కేసులుని గట్టిగా నొక్కి చెప్పడమే కాకుండా మీరేం చేయాలకుంటే అది చేసుకోండి అని సిసోడియా బీజేపీకి సవాలు విసిరారు. తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడునని అన్నారు. తన తల నరుక్కుంటానేమో కానీ అవినీతి కుట్రదారుల ముందు తలవంచనని తెగేసి చెప్పారు. ఒక పక్క దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో బాధపడుతుంటే రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టే పనులుకు పాల్పడుతోంది బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలో సీబీఐ దుర్వినియోగం అవుతోందంటూ విరుచుకుపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. ఢిల్లీ నాయకుడుని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. (చదవండి: Delhi Excise Policy Scam: కేజ్రీవాల్‌కు సంకెళ్లే) -
కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్.. తీరా ఓపెన్ చేసి చూస్తే..
సాక్షి, చెన్నై: విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరిట ఎస్ఎంఎస్లు పంపుతూ, ఫోన్ కాల్స్ చేస్తూ ఓ ముఠా కొత్తరకం మోసానికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కమిషనర్ శంకర్ జివాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారులకు ఇటీవల కాలంలో ఎస్ఎంఎస్ రూపంలో, ఫోన్ కాల్ రూపంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం సమాచారం వస్తోందని ఇందులో వివరించారు. వీటిలో గత నెల బిల్లులు అప్ డేట్ చేయలేదని, గడవు తేదీ ముగిసిన దృష్ట్యా, త్వరితగతిన చెల్లించాలని లేని పక్షంలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామన్న హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారంతో విద్యుత్ బోర్డు పేరిట లింక్‌లు పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింక్‌లు తెరవగానే, వినియోగ దారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు మాయం అవుతోందని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి విద్యుత్ బోర్డు ఎలాంటి ఎస్ఎంఎస్లు పంపించడం లేదని, ఫోన్ కాల్ చేయడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. చదవండి: ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై గొడవ.. స్నేహితుడితో కలిసి.. -
బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్
సాక్షి, నల్గొండ: దిండి మండల కేంద్రంలోని హైవే మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ జరుగుతోందని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య చిచ్చురేపింది. డిండిలోని హైవే డివైడర్‌పై దాదాపు 1.5 కిలో మీటర్ల దూరం ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్, రెండు జంక్షన్ల నిర్మాణానికి రోడ్డు రవాణా, హైవే రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోటా నుంచి రూ.85 లక్షలు మంజూరయ్యాయి. కాగా, బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ చేయడానికి డిండికి వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆచారి భూమి పూజకు రావడం ఏమిటని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నమ్మించి ఫోన్‌తో పరార్.. కట్ చేస్తే.. ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు’ పోలీసులతో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి శనివారం కార్యకర్తలను కలిసేందుకు డిండికి వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని టీఆర్ఎస్ నాయకులు రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆచారి గోబ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. టీఆర్ఎస్ నాయకుల నిరసనపై ముందస్తు సమాచారం ఉండడంతో డిండి ఎస్ఐ.సరేష్, కొండమల్లేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా? తెలంగాణలో నియంత పాలన తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు పాలనపై దృష్టి పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గూండాలుగా తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను, డిండి మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి వెళ్తున్న క్రమంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినందుకు కార్యకర్తలు స్వాగతం పలికేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగడం బాధాకరమన్నారు. కేవలం తాను పార్టీ కార్యకర్తలను కలవడానికి మాత్రమే డిండిలో కాసేపు ఆగానని, భూమిపూజకు రాలేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా నాయకుడు ఏటి.కృష్ణ, ఎంపీటీసీ ఏటి.రాధిక, సైదా, వెంకటయ్య, శ్రీను, జైపాల్, రాఘవ, అంజి,అజయ్, రమేష్ తదితరులున్నారు. -
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
సినిమా చూస్తే.. సింపుల్‌గా ప్రాణాలు పోతాయి అక్కడ ! నచ్చిన బట్టలు, హెయిర్ స్టైల్ చేసుకున్నా.. తీసి జైళ్లో పడేస్తారు. సరదాగా ఏదైనా పని చేస్తే.. బతుకంతా ఏ గనుల్లోనో, పల్లెటూరిలోనో వెట్టిచాకిరీకి అంకితం చేస్తారు. చివరికి సంబురాలు, ఏడుపులపై కూడా నిషేధాజ్ఞాలు. పాపం.. అక్కడి జనాలకు ఏం చేయాలన్నా ఆటంకాలే. అక్కడి చట్టాలు.. అవి తయారు చేసే నియంతాధ్యక్షుడు అలాంటోడు!. ప్రపంచమే ఆయన్ని చూసి ముక్కున వేలేసుకుంటుంది మరి. కిమ్ జోంగ్ ఉన్.. తమ దేశ అధ్యక్షుడి పేరు వింటే ఉత్తర కొరియా జనాలకు కంటి మీద కునుకు పట్టదు. ఏ పూట ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. అదే టైంలో సిసలైన ఆ నియంత కొత్త కొత్త నిర్ణయాలనూ ప్రపంచమూ ఆసక్తిగా గమనిస్తుంటుంది. కిమ్‌కు కోపం తెప్పించే పని ఎవరూ చేసినా వాళ్ల పని ఖతం. అలాంటిది ‘ఒక్కడు’ దాయాదిగడ్డపై కిమ్‌ను ఎగతాళి చేస్తూ పదేళ్లుగా కాలరేగరేసి మరీ బతికేస్తున్నాడు. కిమ్ మిన్ యోంగ్.. వయసు ముప్పై పదుల్లో ఉంటుంది! ఉండేది సియోల్(సౌత్ కొరియా) నగరంలో. బొద్దు రూపంతో నార్త్ కొరియా అధ్యక్షుడికి దూరం పోలికలే ఉంటాయనుకోండి. అయితే అనుకరణ మాత్రం అచ్చంగా ఉంటుంది. దీనికి తోడు కిమ్ హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా దించేస్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొరివితో తలగొరుకునే చేష్టలకు పాల్పడుతున్నాడతను. కిమ్ పదేళ్ల క్రితం అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ టైంలో కిమ్ మిన్ అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే స్టూడెంట్స్‌కి కౌన్సిలింగ్ ఇచ్చి బతికేవాడు కిమ్ మిన్. కానీ, కిమ్‌లా ఉన్నాడంటూ.. ఇమిటేట్ చేస్తున్నాడంటూ కొందరు కాంప్లిమెంట్ ఇవ్వంతో.. అప్పటి నుంచి నియంత నేతను అనుకరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు మొదలుపెట్టాడు. అవి అలాంటి ఇలాంటి వీడియోలు కావు. కిమ్ పరువు తీసిపడేసేలా ఉంటాయి అతను ఎంచుకునే కాన్సెప్ట్‌లు. మొదట్లో హ్యూమర్‌గా జనాలు వాటిని ఎంజాయ్ చేశారు. ‘డ్రాగన్ కిమ్’ అంటూ అతగాడికి బిరుదు కూడా ఇచ్చేశారు. అయితే రాను రాను అవి మరీ ఘోరంగా ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయట. తాజాగా ఓ ఇంటర్నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రాణ భయం గురించి చెప్పుకొచ్చాడు డ్రాగన్ కిమ్. ఆన్లైన్లో మిన్ యోంగ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. if you mock our Dear Leader, you will be in trouble, like, big trouble!ఇది ఇప్పుడు ఇంటర్నెట్లతో మిన్ యోంగ్ వస్తున్న సందేశాలు. అంతేకాదు అతని చావు ఊహించని రీతిలో ఉంటుందని బెదిరిస్తున్నారట. దీంతో ప్రాణభయంతో అతగాడు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు పోలీసులు నగరం విడిచి వెళ్లకుంటే రక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇతగాడి భద్రత అంశం హాట్ టాపిక్‌గా మారింది సౌత్ కొరియాలో. కొసమెరుపు.. 2019లో వియత్నాం వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లు భేటీ అయ్యారు. ఆ సమయంలో డ్రాగన్ కిమ్ కూడా అక్కడే ఉన్నాడు. అంతేకాదు వెకిలి వేషాలు వేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆరు రోజులు జైల్లో పెట్టారు. కిమ్ మిన్ మాత్రమే కాదు.. కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం వియత్నాం పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు -
‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’
సాక్షి,హయత్‌నగర్(హైదరాబాద్): ‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’ ..అంటూ ఓ విద్యార్థి తన తండ్రి ఫోన్‌కు మెసేజ్ పెట్టి కనిపించకుండాపోయాడు. హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బలిజగూడ నివాసి మహ్మద్ ఖాజా కుమారుడు రహమాన్ (17) హయత్‌నగర్ మదర్ డెయిరీ సమీపంలోని ఎక్సెల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన రహమాన్ మధ్యాహ్నం 12 గంటలకు కళాశాల నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన తండ్రికి మెసేజ్ పెట్టి కనిపించకుండాపోయాడు. తండ్రి నుంచి ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రహమాన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి:బీహార్ గ్యాంగ్: పక్కా ప్లాన్ చేసి రాత్రి ఆయితే.. -
ఫెయిలైనట్టు యువతికి తప్పుడు మెసేజ్.. అంతా అయిపోయిందంటూ..
సాధారణంగా పొరపాట్లు జరుగుతుండడం సహజం. అయితే ఆ పొరపాట్లు చిన్నవైనా, లేదా సరిదిద్దుకునేలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వాటి వల్ల ఓ నిండు ప్రాణం బలైన విషాద ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఓ యువతికి పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు పొరపాటున మెసేజ్ వచ్చింది. దీంతో ఆ బాధను భరించలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక మీడియా తెలపిన వివరాల ప్రకారం.. ఇంగ్లాండ్‌లో నార్త్ వేల్స్‌లోని ఏంగ్లెసేకు చెందిన మేరెడ్ ఫౌల్కీ అనే 21 ఏళ్ల అమ్మాయి కార్డిఫ్ యూనివర్సిటీలో రెండో సంవత్సరం ఫార్మాసూటికల్స్ చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసిన ఫౌల్కీకి కొన్ని రోజుల తరువాత యూనివర్సిటీ నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. అందులో.. తను సెకండ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని, ఈ కారణంగా మూడో సంవత్సరానికి వెళ్లేందుకు వీలు లేదని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఎంతో ఇష్టంగా ఆ కోర్సు చదువుతున్న ఫౌల్కీ ఆ బాధను తట్టుకోలేక బతకడం వ్యర్థంగా భావించింది. దీంతో ఆ ప్రాంతానికి సమీపంలోని బ్రిటానియా బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫౌల్కీ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అందులో ఆమె 62 శాతం మార్కులతో పాసైనట్లు తేలింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు తప్పుడు మెసేజ్ ఇచ్చిన యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించింది. చదవండి: Afghanistan: దేశంలో పరిస్థితి బాలేదు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి: తాలిబన్లు -
హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’
లండన్: ఇటీవల కాలంలో అందరూ ఉబర్, ఓలా, ఆన్లైన్ రైడ్ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. దీంతో మనకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగానూ మంచి వెసులబాటుగానూ ఉంటుంది. మంచి రద్దీ సమయంలో ఈ క్యాబ్‌ల సాయంతో త్వరితగతిన వెళ్లవచ్చు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) అయితే మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేయించుకుని పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే సదరు డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్‌తో మాట్లాడటం ఇష్టం లేకనో లేక మరో ఇతర కారణాలతోనో కేవలం మెసేజ్‌లను పెడతారు. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు. వివరాల్లోకెళ్లితే....లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్నఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఆ లెటర్లోని సందేశం ఏమిటంటే " నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు. మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి ఏయూఎక్స్ కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజు మీరు ఏం కావల్సిన బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు." అని ఉంది. దీంతో జెరెమీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తాను తన జీవిత కాలంలో ఎక్కిన ఉబెర్ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్ తనకు ప్రత్యేకం అని చెప్పాడు. ఈ మేరకు జెరెమీ ఈ ఉబర్ డ్రైవర్ సందేశంతోపాటు ఓనూర్ గ్రేట్ హిరో అంటూ ట్యాగ్లైన జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్ల ఈ సందేశం ఎంత హృదయపూర్వకంగా ఉందో అంటూ ఓనూర్ కష్టపడేతత్వాన్ని, మర్యాదపూర్వక స్వభావాన్ని ప్రశంసిస్తు ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) I have just entered the most wholesome Uber of my entire life. Big ups, Onur, absolute hero ❤️ pic.twitter.com/lID9Mn7pqF — Jeremy Abbott (@Funster_) October 21, 2021 -
అర్జంట్‌గా డబ్బు పంపమని మెసేజ్‌లు వస్తున్నాయా?
కుత్బుల్లాపూర్: ఫేస్బుక్ మెసెజ్‌తో ఓ వ్యకి నగదు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలోని హరిహర ఎవెన్యూలో నివసించే కళ్యాణ చక్రవర్తి క్యూపీఎస్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 10న అతని ఫేస్బుక్ అకౌంట్‌కు అర్జంట్‌గా రూ. 18వేల పంపాలని అతని కజిన్ పేరుపై మెసెజ్ వచ్చింది. దీంతో చక్రవర్తి గుగూల్‌పే చేశాడు. తరువాత కాసేపటికేరూ. 12వేలు పంపాల్సిందిగా మరో మెసెజ్ రావడంతో సదరు నగదును ట్రాన్స్ఫర్ చేశాడు. అయినా నగదు పంపాల్సిందిగా మెసెజ్‌లు వస్తుండటంతో అనుమానం వచ్చి తన కజిన్‌కు కాల్ చేయగా ఫేక్ మెసేజ్‌గా తేలింది. దీంతో మోసపోయిన బాధితుడు బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ధోని మెసేజ్‌పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్ వైరల్
సిమ్లా: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్లా పర్యటనలో ఉన్న ధోని తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సిమ్లాలో ధోని ఉన్న ఇళ్లు పూర్తిగా చెక్కతో తయారుచేశారు. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కతోనే నిర్మిస్తారు. అక్కడి వాతావారణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన ధోని ఫోటోలను షేర్ చేస్తూనే 'చెట్లు నాటండి.. అడవులు కాపాడండి' అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఈ మెసేజ్ ధోని అభిమానులను రెండుగా చీల్చింది. ఒక వర్గం ధోనిని పొగిడితే.. మరో వర్గం మాత్రం ధోని చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.. వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ధోని ఆ ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు'' అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎస్కే స్పందింస్తూ 'ప్లాంటింగ్ ద రైట్ థాట్స్' అంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే జట్టును ఎంఎస్ ధోని విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ను మరిపిస్తూ చెన్నై ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. కాగా ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్కే టీంతో కలవనున్నాడు. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. Planting the right thoughts! 💛 Thala 😍#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/rbZmSwGA2n — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) June 25, 2021 -
బీప్: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్ లెక్చరర్‌కు..
వాషింగ్టన్ : ప్రియుడికి పంపాల్సిన ప్రైవేట్ మెసెజ్‌ను పొరపాటున కాలేజ్ లెక్చరర్‌కు పంపిందో యువతి. కొద్ది సేపటి తర్వాత తన పొరపాటు తెలుసుకున్న ఆమె సిగ్గుతో తల దించుకుంది. సదరు లెక్చరర్‌కు క్షమాపణ చెప్పుకుంది. తన ఈ ఇబ్బందికర పరిస్థితిని పేరు వెల్లడించకుండా రెడ్డిట్ అనే సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. ‘‘ ప్రతీ మంగళవారం కాలేజీ ముగిసిన తర్వాత దగ్గరలోని బుక్ స్టోర్‌కు వెళ్లటం నాకు అలవాటు. గత కొద్దిరోజులనుంచి నేనక్కడ గూగుల్ ప్లేలో ఓ రొమాంటిక్ పుస్తకం చదువుతున్నాను. అన్ని రొమాంటిక్ పుస్తకాల కవర్ పేజీలాగే దాని కవర్ పేజీ కూడా షర్టులేని అబ్బాయి.. బికినీతో ఉన్న అమ్మాయితో ఉంది. నేను ఆ పుస్తకాన్ని చదువుతుండగా నా బాయ్ ఫ్రెండ్ చూశాడు. దాన్ని అప్పటికే చదవటం పూర్తి చేసిన అతడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఆ స్టోరీలో హీరో హీరోయిన్‌కు మధ్య జరిగే రొమాంటిక్ సీన్లో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌ను నేను గుర్తుపెట్టుకున్నాను. మరుసటి రోజు షాపింగ్‌కు వెళ్లిన నేను ఓ బుక్ స్టోర్‌లో.. ఆన్లైన్లో చదువుతున్న ఆ పుస్తకాన్ని చూశాను. ఆ వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని సెల్ఫీ దిగాను. నేను గుర్తుపెట్టుకున్న స్టోరీలోని రొమాంటిక్ సీన్లోని డైలాగ్‌ను జత చేసి.. సెల్ఫీ ఫొటోను నా బాయ్‌ఫ్రెండ్‌కు పంపాను. అయితే, ఇక్కడే ఓ పెద్ద పొరపాటు జరిగింది. నేను నా బాయ్ ఫ్రెండ్‌కు పంపాల్సిన మెసెజ్‌ను అదే పేరుతో ఉన్న నా సైకాలజీ లెక్చరర్‌కు పంపాను. దీంతో సిగ్గుతో చచ్చిపోయాను. ఆయన మాత్రం ఏమీ స్పందించలేదు. నేను ఆయనకు క్షమాపణ చెబుతూ మెసెజ్ పెట్టాను. మరుసటి రోజు సమాధానం ఇచ్చాడు. నాపై చాలా సీరియస్ అయ్యాడు. ఆ తర్వాతి నుంచి ఆయన మా క్లాసులోకి వస్తే ఇబ్బందిగా ఫీలవుతున్నాను’’ అని వివరించింది. చదవండి : Alzheimer: అల్జీమర్సా ..ఈ వీడియో చూస్తే.. -
నాకు బతకాలని లేదంటూ భార్య మెసేజ్.. అదృశ్యం
సాక్షి, ఖైరతాబాద్( హైదరాబాద్): ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పిన మహిళ తనకు బతకాలని లేదంటూ ఆమె భర్తకు మెసేజ్ చేసి అదృశ్యమైన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లిలో నివాసముండే రాజ్‌కుమార్ ఓ చర్చ్ పాస్టర్. గురువారం ఇతడి భార్య కిషోరి(66) ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాని చెప్పి వెళ్లింది. మధ్యాహ్నం తరువాత నాకు బతకాలని లేదంటూ ఫోన్ ద్వారా మెసేజ్ చేసింది. మెసేజ్ చేసిన కొంత సమయానికి సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమె భర్త మెసేజ్ చూసుకొని ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిందని, వెంటనే ఆటోలో వెళ్లిన డ్రైవర్‌ను విచారించగా సచివాలయం గేట్ నెం.1 వద్ద దింపినట్లు తెలుపడంతో భర్త గురువారం రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్ నాకే కావాలంటు మరొకరు -
ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..
సాక్షి, హైదరాబాద్: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నాగరపల్లి గ్రామానికి చెందిన అశోక్, రమాదేవి దంపతులు మియాపూర్ టీఎన్ నగర్లో నివాసం ఉంటున్నారు. అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సింధే సుదీప్‌కుమార్ (18) ఉన్నారు. సుదీప్ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఉండటంతో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ రోజూ అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఇదిలా ఉండగా, సుదీప్ బుధవారం రాత్రి హైటెక్ సిటీ హోటల్‌కు వెళ్దామని తన స్నేహితులను పట్టుపట్టగా, ఈ సమయంలో వద్దని వారించడంతో వారితో గొడపడ్డాడు. రాత్రి ఒంటి గంటకు స్నేహితులు అతడిని ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపు స్నేహితులతో ఫోన్లో చాట్ చేసిన సుదీప్ ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు తల్లి లేచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మైనర్‌పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. ) -
వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం
పారిస్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సందేశాలు చేరవేయడంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలంటే మనుషులు వందల మైళ్లు ప్రయాణం చేసి అక్కడకి వెళ్లి సమాచారం తెలిపేవారుల. కానీ ప్రస్తుత కాలంలో కూర్చున్న చోట నుంచే సెకన్ల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా మెసేజ్‌ని పంపగల్గుతున్నాం. ఈ మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇంకా రకరకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఓ వందేళ్ల క్రితం సందేశాలు పంపాలంటే పావురాలే ప్రధాన ఆధారంగా ఉండేవి. అప్పటికి పోస్టు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికి కీలక సమాచారాన్ని చేరవేయడం కోసం పావురాల మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే దాదాపు వందేళ్ల క్రితం అంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి పావురాయి సందేశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తూర్పు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జంట వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. వారికి ఓ చిన్న క్యాప్సిల్స్ కనిపించింది. వింతగా ఉండటంతో దాన్ని తెరిచి చూశారు. (చదవండి: పాకిస్తాన్ పావురం విడుదల) ఆశ్చర్యం.. అందులో ఓ చిన్న ఉత్తరం ఉంది. దాదాపు వందేళ్ల క్రితం ఓ ప్రష్యన్ సైనికుడు పావురం ద్వారా పంపిన సందేశం ఇది. కానీ దురదృష్టం కొద్ది అది తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయింది. ఇక తూర్పు ఫ్రాన్స్‌లోని ఓర్బీలోని లింగే మ్యూజియం క్యూరేటర్ డొమినిక్ జార్డి మాట్లాడుతూ.. ‘ఇది మొదటి ప్రపంచ యుద్ధ (1914-10)కాలానికి చెందిన సందేశం. ఇంగర్‌షీమ్‌లోని ఒక పదాతిదళ సైనికుడు తన ఉన్నతాధికారిని ఉద్దేశిస్తూ జర్మన్ భాషలో స్వయంగా తన చేతితో రాసిన ఉత్తరం ఇది. దీనిలో అతడు కీలకమైన సైనిక విన్యాసాల గురించి వివరించాడు’ అని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఫ్రాన్స్‌లో భాగమైన ఇంగర్‌షీమ్ ఒకప్పుడు జర్మనీలో భాగంగా ఉండేది. ఇక ఈ ఉత్తరం ఈ ఏడాది సెప్టెంబర్‌లో సదరు దంపతుల చేతికి చిక్కింది. వారు దీన్ని జార్డికి అందించారు. అతడు ఓ జర్మన్ స్నేహితుడి సాయంతో ఈ మెసేజ్‌ని డీకోడ్ చేశాడు. ఇక ఈ ఉత్తరాన్ని అపూర్వమైనదిగా పేర్కొన్న జార్డి దాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు. -
కరోనా: జియో, బీఎస్ఎన్ఎల్ సందేశం విన్నారా?
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు వ్యాపించిన కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని చెందిన నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలు కీలక ప్రచారాన్ని చేపట్టాయి. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కాల్ చేసిననపుడు ఒక అవగాహనా సందేశాన్ని ప్లే చేస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నివారణకు అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో ఈ సందేశం నిండి వుండటం విశేషం. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో వినియోగదారులకు ఫోన్ చేసినపుడు ఈ సందేశాన్ని వినియోగదారులు గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన అవగాహనా చర్యల్లో భాగంగా ప్రీ కాలర్ ట్యూన్ అవగాహనా సందేశం జియో, బీఎస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్లలో శనివారం ప్రారంభమైంది. దగ్గు శబ్దంతో సందేశం ప్రారంభమవుతుంది. "మీరు నవల కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. దగ్గినపుడు లేదా తుమ్ముతున్నప్పుడు మీ ముఖాన్ని చేతిరుమాలు అడ్డుపెట్టుకోండి. సబ్బుతో చేతులను నిరంతరం శుభ్రం చేసుకోండి" అనే సందేశం హిందీ, ఆంగ్లంలో ప్లే అవుతుంది. "ముఖం, కళ్ళు లేదా ముక్కును తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి కష్టంగా వుంటే వారినుంచి కనీసం ఒక మీటర్ దూరంలో వుండండి. అవసరమైతే, వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి" అనే సందేశాన్ని ఇస్తోంది. కాగా గత ఏడాది సెప్టెంబరులో చైనా వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి సోకింది. 3 వేలమంది మరణించారు. మన దేశంలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పటికే 33కి చేరింది. -
అద్భుతమైన క్యాచ్ అందుకున్న ధోని..
సాక్షి, న్యూఢిల్లీ: జీవరాశి మనగడకు జలమే ఆధారం.. నీరే ప్రాణధారం.. అది అమృత తుల్యం. విలువైన నీటిని తెలిసే కొందరు, తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చిన్నారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం, గోడల మీద పెయింటింగ్‌లు వేయడం ద్వారా ప్రచారం కల్పిస్తున్నాయి. అలా ప్రతి నీటి బొట్టు ప్రాముఖ్యతను ఆకర్షణీయంగా తెలియజేసేలా జోద్‌పుర్‌లోని గోడల మీద వేసినదే ఈ పెయింటింగ్. క్రికెట్లో వికెట్ కీపర్‌గా అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్న మహేంద్రసింగ్ ధోని.. కుళాయి నుంచి జారుతున్న నీటి బొట్టును ఒడిసిపట్టుకొనేందుకు డైవ్ చేస్తున్నట్లుగా వేసిన ఈ సృజనాత్మక చిత్రానికి ఆలస్యం కాకముందే ఒడిసిపట్టుకో.. అంటూ సందేశాన్ని జోడించారు. ఈ చిత్రాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. -
బ్యాంకులో ఓ రోజు
ఉదయం ఏడు గంటలు అవుతోంది. కనురెప్పలు తెరుచుకోవడం లేదు, ఇంకా కాసేపు నిద్ర పోతే బావుంటుంది అనిపించినా లేవక తప్పని పరిస్థితి. ఇంతలో సెల్‌ఫోన్‌కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం గుయ్‌మని వినిపించసాగింది. బద్ధకంగా మెసేజ్ చూశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. ఏజీయం నుండి సందేహానికి తావు లేని సందేశం. బడ్జెట్ నెగటివ్ నుండి పాజిటివ్‌కి రాక పోతే ఈ నెల ఆఖరులోగా బదిలీకి సిద్ధంగా ఉండమని. ఈ పది రోజుల్లోగా ఏ మాయో, మంత్రమో జరిగితే తప్ప అది అసాధ్యం. గబగబా బ్రష్ చేసి వచ్చేసరికి కాఫీ పట్టుకుని శ్రీమతి నిలబడివుంది. కప్పు అందుకున్నాడు. ‘రాత్రంతా నడుము నొప్పితో నిద్ర లేదండీ...ఈ రోజు అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే ఇక భరించలేను’ అంది. ‘సాయంకాలం అపాయింట్ మెంట్ తీసుకుంటాను’ చెప్పాడు. ‘తీసుకున్నాను, కానీ మీరు ఎన్నింటికి వస్తారో?’ ‘నేను డైరెక్ట్ గా క్లినిక్ కి వస్తాను’ చెప్పాడు. ఈ లోగా ఇంకో ఫోన్ కాల్. గబగబా మాట్లాడి బాత్రూం లోకి వెళ్ళాడు. ఓ కస్టమర్ తన హౌసింగ్ లోన్ ఎప్పటికి అవుతుందని అడిగాడు. స్నానం ముగించి వచ్చేసరికి మరో మెసేజ్.మొండి బకాయిల గురించి మీ మొండి వైఖరి మారకపోతే దండన తీవ్రంగా ఉంటుందని ఓ తీర్మానం. ఏం టిఫిన్ తిన్నాడో ఎలా తిన్నాడో తెలియదు, బయలుదేరిపోయాడు. బ్యాంకుకి వెళ్లి సిస్టమ్స్ ఆన్ చేసాడు. చక్రం గిర్రున తిరుగుతోంది... కనెక్టివిటీ ప్రాబ్లెమ్. ఫోన్ చేస్తే గంట కనీసం పడుతుందని శుభవార్త. కౌంటర్లలో సిబ్బంది హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘సర్, అర్జంట్ గా కాష్ కావాలి’ కస్టమర్ అభ్యర్ధన. కనెక్టివిటీ వచ్ఛేవరకు వేచి వుండమంటే ‘నా చెక్ ఉంచుకుని కాష్ ఇచ్చేయండి’ అంటూ కస్టమర్ విన్నపం మరియు సలహా. క్యాషియర్ కి చెబితే, ‘అదెలా అవుతుంది..అతని అకౌంట్లో బాలన్స్ వుందో లేదో... అంతగా అయితే మీరే ఇచ్చేయండి’ కనీసపు మొహమాటం కరువు. ఇవన్నీ రొటీన్లో మామూలే. ఈలోగా ఏటీఎంలో కాష్ లేదని, కనెక్టివిటీ వస్తేగాని కాష్ రాదని ప్రశ్న ప్లస్ జవాబు?! ఇంతలో లోన్ సెల్ నుండి డీవియేషన్ అప్రూవ్ అయితే గాని హౌసింగ్ లోన్ క్లియర్ కాదని, అర్జంట్ గా రమ్మనమని పిలుపు. సింగల్ బ్రాంచ్ బీఎంకి ఇదెలా సాధ్యం అవుతుందో ఎవరికి చెప్పినా అర్ధం కాదు, ప్రయోజనం లేదు. జోనల్ ఆఫీస్ నుండి కాల్. సీజీమ్ ఎల్లుండి వస్తున్నారు. ఇన్సూరెన్స్ మీ వంతు పది లక్షలు చేయాలి. (నేనేమైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ నా?!) ‘నేను సింగల్ బ్రాంచ్ బీ ఎం నండీ... పది కష్టం’ అంటే ‘మీరెంత కష్ట పడుతున్నారో అందరికీ తెలుసు... చిన్న బ్రాంచ్‌లలో ఏం పని ఉంటుంది, కనీసం ఇది అయినా చెయ్యండి’సెల్ ఫోన్ పక్కన పెట్టి తలెత్తి చూస్తే ఎదురుగా ఓ పెద్దాయన.\ ‘నా పెన్షన్ రాలేదు’ ‘లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా?’ ‘గుర్తు లేదు’ ‘ఉండండి... చూసి చెబుతా....సిస్టమ్స్ ఇంకా రాలేదు, కూర్చోండి’ ‘ఎంతసేపు ఉండాలి’ ‘గంట పడుతుందని అన్నారు...చెప్పలేము’ ఇంతలో ఫోన్ మ్రోగింది. అటునుండి సీఎం అడ్మిన్ ‘సిస్టమ్ సస్పెన్స్ లో నాలుగు ఎంట్రీలు అర్జెంట్‌గా రివర్స్ చెయ్యండి... అసలు ఉదయం రాగానే వాటిని చూసి ఈ పాటికి క్లియర్ చెయ్యాలి, మేము పనిగట్టుకుని చెబితే కానీ చేయరా..’ ‘ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లెమ్ సర్! ఇంకా రెస్టోర్ కాలేదు’ ‘రాగానే వెంటనే రివర్స్ చేసేయండి... నేను మళ్ళా రిమైండ్ చెయ్యను’ హుకుం జారీ అయ్యింది. ఇంతలో మెసెంజర్ వచ్చి ‘సర్ వచ్చింది’ చెప్పాడు. ‘ఎవరు?’ ‘అదే సర్...కంప్యూటర్లు... పని చేస్తున్నాయట’ హమ్మయ్య... సిస్టమ్స్ వచ్చేసాయి. హడావుడి ప్రారంభమయ్యింది. జనాల తోపులాట. గబగబా బీఓడీ చేసి, కాష్ తీయడానికి పరుగెత్తాడు. ‘సర్! మన సుబ్బరాజు అబ్బాయికి జలుబు చేసింది. ఈ రోజు సెలవు పెట్టాడు’ కాష్ ఇన్ఛార్జ్ చల్లగా కబురు చెప్పాడు. ‘సుబ్బరాజు కౌంటర్ కూడా చెయ్యాలి, గోల్డ్ లోన్‌కి ఇద్దరు రెడీగా వున్నారు. అది మీరు చూసుకోండి’ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు కాష్ ఇన్ఛార్జ్. చిరాకు, టెన్షన్ తో ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. ‘టీ చల్లరిపోతోంది..తాగండి’ అంది రమణమ్మ. కప్పు అందుకున్నాడు. జనాలు సీరియస్‌గా చూస్తున్నారు. ‘మా పని చేయకుండా నువ్వు టీ తాగుతూ కూర్చుంటావా?’ అని అందరిలోనూ ఒకటే ఫీలింగ్ సూటిగా బాణంలా తగులుతోంది. అబ్బ...పంచదార పానకం... ఎన్ని సార్లు చెప్పినా మరిచిపోయాను ఈ రోజుకి తాగేయండి’ అంటుంది. ఈ దెబ్బతో షుగర్ లెవెల్ నాలుగొందలు దాటి కిడ్నీలు డాం గ్యారెంటీ.పాసింగ్ ప్రారంభించాడు చకచకా. ఓ గంట ఏకధాటిగా అదే పని మీద ఉంటే కొంత జనాలు కదిలారు \మంగళ సూత్రాలు పట్టుకుని కట్టడానికి రెడీ అన్నట్టు ఓ పెద్దాయన ఎదురుగా కూర్చున్నాడు గోల్డ్ లోన్‌కి.‘వీటికి లోన్ ఇవ్వడం కుదరదు...ఆ నల్లపూసలు తీసేయాలి. ఆ సూత్రాల వెనక ఆ లక్క ఉండకూడదు’ చెప్పాడు.‘అయ్యా...ఎంత ఎమర్జెన్సీ కాకపోతే ఇలా మా ఆవిడ పుస్తెలు తెస్తాను... మీరు అదితీసేయండి ఇది ఉండకూడదు అంటే ఎలాగ చెప్పండి’‘రూల్స్ ఒప్పు కోవండీ...’ అంటూ ఓ పావుగంట సేపు వివరంగా చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం కాళ్ళలోకి వచ్చిందిఇంతలో లోకల్ హెడ్ ఆఫీస్ నుండి ...ట్రేడింగ్ అకౌంట్లో కొంత అమౌంట్ లీన్ లో ఉందనీ, అది లిఫ్ట్ చేయడం కుదరదని చెప్పినందుకు గాను కస్టమర్ అంబుడ్స్‌మెన్‌కు వెళ్తున్నాడని...దీనికి మీ సమాధానం ఏమిటని ఘాటుగా ఫోన్ వచ్చింది.ట్రేడింగ్ అకౌంట్ ఆపరేట్ చేసేది కస్టమర్, అతడు షేర్స్ కొనేటప్పుడు అవసరమైన అమౌంట్ లీన్లో పెట్టుకునేది అతడే...షేర్స్ అలాట్ కానప్పుడు ఆ లీన్ లిఫ్ట్ చేసేది కస్టమరే తప్ప బ్రాంచ్ మేనేజర్ కి ఎటువంటి ప్రమేయం ఉండదని వివరించేసరికి...‘అదంతా మాకు తెలియదు, కస్టమర్‌ని పిలిపించి అతనిచేత దగ్గరుండి లీన్ లిఫ్ట్ చేయించి ప్రాబ్లెమ్ లేకుండా చూసుకోండి’ అని ఫోన్ కట్ చేసేసారు.ఒక్కసారి నీరసంగా అనిపించి అలా సీట్లో వెనక్కి వాలి మంచి నీళ్ళు కోసం బాటిల్ అందుకుంటే అది ఖాళీ.బెల్ కొట్టాడు. రమణమ్మ వచ్చింది. బొటన వేలితో సైగ చేసాడు. బాటిల్ పట్టుకుని వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చింది.ఓ గుక్కెడు తాగుదామనే సరికి కేకలు వినిపించాయి.చెక్ క్లియరింగ్‌కి నాలుగు రోజులా? అరుస్తున్నాడు ఓ కస్టమర్ హాల్లో.మంచి నీళ్ళు తాగి కౌంటర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకుని ‘అయ్యా! మీరు చెక్ లక్ష్మి వారం సాయంకాలం డ్రాప్ బాక్స్ లో వేశారు. అది శుక్రవారం ఉదయం వెళ్ళింది. శనివారం నాన్ క్లియిరింగ్ డే, ఆదివారం సెలవు కనుక ఈ రోజు సోమవారం సాయంకాలానికి మీ అకౌంట్లో పడుతుంది’ అని వివరంగా చెప్పాడు.‘మరి,ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు గంటల్లో క్లియిరింగ్ అని బోర్డ్ పెట్టడం దేనికి?’ఏం సమాధానం చెబుతాడు?అదే సమయానికి ‘దొంగ నోటు’ అని కౌంటర్లో కాష్ ఇన్చార్జ్ చెప్పడం,‘అది నిన్న మీరే ఇచ్చారు’ అని కస్టమర్ దబాయించడం....ఆ వాదనకి అంతం ఆఖరికి పోలీస్ కంప్లయింట్ ఇస్తాననే వరకు వచ్చి అప్పటికి కాస్తా సద్దు మణిగింది.లంచ్ టైం అవ్వడంతో ఇంట్రవెల్ దొరికింది.ఈరోజు నడుం నొప్పి కారణంగా శ్రీమతి కేరెజీ కట్టలేదనే విషయం గుర్తొచ్చింది. రమణమ్మకు టిఫిన్ తెమ్మనమని చెప్పాడు.బాంక్ ఎదురుగా ఓ పాక హోటల్ నుండి రాళ్ల లాంటి రెండు గారెలు తెచ్చింది. ఒకటి తింటే చాలు ఆకలి చచ్చి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్‌కి బైపాస్ తప్పదేమో? సీనియర్ కొలీగ్ ఒకాయన గుర్తుకు వచ్చాడు. నలభై ఏళ్లకే పాపం....ఆలోచనలకు భంగం కలిగిస్తూ మెసెంజర్ వచ్చి,‘సర్, ఆక్వా కంపెనీ మూర్తి గారికి పది లక్షలు కాష్ అర్జంట్ గా కావాలిట’ అని చెప్పాడు.‘మన దగ్గర ఎంత ఉందో కనుక్కో’‘అంతా కలిపి నాలుగు మించదట, చెప్పారు’‘సరే పద..వస్తున్నా’ సగం తినగా మిగిలిన గారె వదిలి పెట్టి లేచాడు.సింగల్ బ్రాంచ్ లిమిట్ పది లక్షలు. ఈ రోజు ఇండెంట్ పెడితేరేపటికి గాని రాదు.మెయిన్ బ్రాంచ్‌కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే, చెక్ ఎటెస్టు చేసి కస్టమర్‌ని పంపిస్తే ఇస్తామన్నారు.అదే విషయం ఆ మూర్తిగారికి చెబితే, ‘మీరు తెప్పించలేరా?మేమే వెళ్ళాలా?’ అంటూ ఒకటే విసుగు ప్రకటించి ఆఖరికి వెళ్లారు.సాయంకాలం నాలుగు అవ్వడంతో పబ్లిక్ ట్రాన్జాక్షన్స్ క్లోజ్ చేసి తాను చేయాల్సిన తదితర పనులు చేయసాగాడు.కాష్ బాలన్స్ అవ్వగానే, ‘రండి సర్, సేఫ్ క్లోజ్ చేద్దామని పిలుపు.ఆ తరువాత గుడ్ నైట్.ఒక్కడే మిగిలిపోయాడు.సస్పెన్స్ ఎంట్రీలు రివర్స్ చెయ్యాలంటే స్టాఫ్ ఉండాలి. వాళ్లు ఫీడ్ చేసాక గాని తను ఆథరైస్ చెయ్యడం కుదరదు. ఏం సమాధానం ఎలా చెబుతాడు?సరిగ్గా అదే సమయానికి సీఎం అడ్మిన్ నుండి ఫోన్ వచ్చింది.‘ఇంకా రివర్స్ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టం సస్పెన్స్ జీరో చెయ్యకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు’ఐదు దాటింది...స్టాఫ్ వెళ్లిపోయారు...రేపు చేస్తాను...అని చెప్పటానికి కూడా గొంతు పెగలలేదు.తన మిత్రుడికి ఫోన్ చేశాడు.వాడు పక్క బ్రాంచి మేనేజర్. ‘ఒరేయ్...రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఉదయం నాకు అరగంట సేపు ఆపకుండా వాయించారు. మెమో ఇస్తామన్నారు’దేనికి?’ అడిగాడు.‘బ్రాంచికి బిజినెస్ లేదని? చుట్టూ ఉన్నవి పట్టా లేని భూములు. హౌసింగ్ లోన్లు ఎలా వస్తాయి? జనాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు. బంగారం మీద లోన్లు ఇమ్మంటారు. ఏరియాలో ఉద్యోగస్తులే లేరు. పెర్సనల్ లోన్ లిమ్మంటారు.బ్రాంచ్ షిఫ్ట్ చేద్దామంటే నన్నే షిఫ్ట్ చేస్తామన్నారు. పైగా నా వాక్ స్వతంత్రానికి మెమో అంటున్నారు. నిద్ర మాత్రలు మింగేద్దామని అనుకుంటుండగా నువ్వు ఫోన్ చేశావ్’‘అటువంటి ఆలోచనలు చెయ్యకురా...ఎట్టి పరిస్థితులలోనూ అలా చెయ్యకూడదు...ఒత్తిడికి చిత్తు కాకూడదు. ఆ ఒత్తిడిని పుత్తడిగా మార్చుకోవాలి’‘పుత్తడిగా మారితే అప్పుడు గోల్డ్‌లోన్ ఇవ్వొచ్చూ అంటావ్...సరి సరి’ఇంతలో సెల్ఫోన్లు గుయ్ మని శబ్దం చేశాయి.‘ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది’ అంటూ ఇద్దరూ ఫోన్ పెట్టేసారు.ఆదివారం ఉదయం పది గంటలకు మీటింగ్.ఈ వారాంతపు సెలవు గోవిందా ?ఇంతలో మరో కాల్ ...‘హలో’ అన్నాడు.‘నేనురా...గోపీని’ తన మిత్రుడు.‘ఏరా... ఏంటి సంగతి!’‘చాలా హాపీ రా....ఈ రోజే నేను నా ఉద్యోగానికి రాజీనామా సమర్పించాను’ఒక్క క్షణం గుండె లయ తప్పి కొట్టుకుంది.‘అదేంటిరా..అంత సడన్ గా ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావ్? ఇంకా పదేళ్లు సర్వీస్ ఉంది’‘పదేళ్లు ఈ టెన్షన్స్‌తో వుంటామో లేదో....వున్నా రోగాలతో, మందులతో బ్రతకాలి, ఎందుకొచ్చిన బ్రతుకని’గోపీ మాటలు నిజమే అనిపించాయి.ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబం గురించి గాని, పిల్లల గురించి గాని ఆలోచించడం అటు ఉంచితే కనీసం ఓ ఐదు నిముషాలు మాట్లాడటం కూడా జరగదు. ఇరవై నాలుగు గంటలూ బ్యాంకుతోనేఅయిపోతోంది.మిత్రులూ, బంధువులు సరేసరి పూర్తిగా మరిచిపోయారు.సోషల్ లైఫ్ అనేది లేకుండా పోయింది.ఇంతలో మరో ఫోన్ కాల్, ఓ రెండు మెసేజ్ లు వచ్చాయి. వాటికి తగు సమాధానాలు ఇచ్చి భార్యకు కు ఫోన్ చేసాడు.‘క్లినిక్ కి వస్తున్నాను’ చెప్పాడు.ఆవిడ చాలా ఆశ్చర్యంగా ‘నిజంగా’ అంది.వెంటనే చకచకా బయలుదేరిపోయాడు.డాక్టర్ చెక్ అప్, ఎక్స రే తీయడం, మందులు కొనుక్కొని బైటకు వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది. ఇప్పుడిక ఇంటికి వెళ్లి ఏం తింటామని మంచి హోటల్ కెళ్ళి చక్కని పదహారణాల తెలుగు భోజనం తిని,చివరలో గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయతో రెండు ముద్దలు తిన్నాక తృప్తిగా అనిపించింది.భర్త నిదానం చూసి ‘రేపు బాంక్ లేదా?’ అంది.సరిగ్గా అప్పుడే సెల్ ఫోన్ గుయ్ మంది.మెసేజ్ చూశాడు...బ్రాంచ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఉదయం ఏడు గంటలకు ఆడిటర్ వస్తున్నట్టుగా ఓ వార్త. ∙పక్కి శివప్రసాదరావు -
తేరా టైం ఆయేగా - కేంద్రమంత్రి హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, అలియా జంటగా నటించిన బాలీవుడ్ మూవీ గల్లీబాయ్ లోని అప్నా టైం ఆయేగా పాటను రైల్వే మంత్రి పియూష్ గోయల్ బాగా వాడేశారు. ఇదే సాంగ్ థీమ్ తో ‘తేరా టైం ఆయేగా’ అంటూ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక చేశారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైల్వే ప్రయాణికులను ఉద్దేశించి ‘తేరా టైం ఆయేగా అంటూ ఫన్ ట్రాక్‌తో రూపొందించిన సాంగ్ ఇపుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. దీన్ని స్వయంగా పీయూష్ గోయల్ తన ట్విటర్లో షేర్ చేశారు. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న అప్నా టైం పాట తరహాలో టికెట్ లేని ప్రయాణం నేరం అనే అవగాహనను ప్రయాణీకుల్లో కల్పించేందుకు ప్రయత్నించారు. దీంతో ‘తేరాం టైం’ రీమిక్స్ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో టీసీ టిక్కెట్లు తనిఖీ, టిక్కెట్లు లేని వారికి జరిమానా విధింపు, ప్రయాణికుల ఫొటోలతో కూడిన సాంగ్ ట్రాక్ మ్యూజిక్ వీడియోను పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘టికెట్ లేకుండా ప్రయాణం చేయకండి... యూటీఎస్ యాప్, ఏటీవీఎం మెషీన్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయండి’ అంటూ, దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో పాట పూర్తవుతుంది. Tera Time Aayega pic.twitter.com/3JI8SoPx3u — Piyush Goyal (@PiyushGoyal) February 18, 2019 -
పెళ్లయ్యాక ప్రేమ ఇలా ఉండొచ్చా?
ప్రేమ నుంచి పెళ్లి దాకా వెళ్లగలగడం అదృష్టమే. పెళ్లయ్యాక అదే ప్రేమను కోరుకుంటే మాత్రం ఆ అదృష్టం.. తిరగబడినట్లనిపిస్తుంది! ఈ స్టోరీలో భార్య.. భర్తనుంచి పెళ్లికి పూర్వపు ప్రేమను కోరుకుంది. అనుక్షణం ఆ ప్రేమ కోసం ఆరాటపడింది.. అలమటించింది.. చేజారిపోతాడేమోనని భయపడింది. చివరికి ఆ దాంపత్యం ఎలా సెట్‌రైట్ అయింది? బీప్ బీప్... సెల్ఫోన్లో మెసేజ్ బ్లింక్ అయ్యింది. ఆఫీసులో ఉన్నాడు అతను. తీసి చూశాడు. భార్య నుంచి.‘ఏం చేస్తున్నావు?’ మళ్లీ బీప్ బీప్ శబ్దం వచ్చింది. ‘తిన్నావా?’ మళ్లీ బీప్. ‘ఇవాళ ఆఫీసుకు వెళ్లేప్పుడు నా వైపు తిరిగి చూడలేదు నువ్వు’ మళ్లీ బీప్. ‘అసలు నేనంటే నీకు ప్రేముందా?’ మళ్లీ బీప్. ‘అలా అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు’ మళ్లీ బీప్. ‘ఇదంతా నా ఖర్మ’. అతడు నిస్పృహగా ఫోన్ పక్కన పెట్టేశాడు. ఆ రోజు ఆఫీసులో చేయాల్సిన పని అంతా గంగపాలు. సాయంత్రం భయం భయంగా ఇంటికి వెళ్లాడతను. తల్లిదండ్రులు అప్పటికే వృద్ధులు. ఇద్దరికీ 70 దాటాయి. ఆఫీసు నుంచి రాగానే వాళ్లను చూడాలి. లేదా వాళ్లు తనను చూడాలి. వాళ్ల దగ్గర పది నిమిషాలు కూచుంటే ఇరుపక్షాలకూ తృప్తి. కాని అదే జరిగితే? ‘హు.. అంతేలేండి ఇంటికొచ్చిన ఏ మగాడైనా భార్య ముఖం చూద్దామనుకుంటాడు. మీరు ఉన్నారు దండగముఖం వేసుకుని. ఏకంగా అమ్మా అయ్యల దగ్గరకు వెళ్లి వాళ్ల వీపు వెనుక దాక్కోవడమే’ ఆ తిట్లు ఎందుకు అని నేరుగా గదిలోకి వెళ్లాడు. వెళ్లి భార్యను చూసి దడుచుకున్నాడు. పొద్దున ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. తిన్నట్టు లేదు. స్నానం చేసినట్టు లేదు. అసలు గది నుంచి కదిలినట్టే లేదు. గుండెలు దడదడలాడాయి. అంటే బయటకు వచ్చి తల్లిదండ్రులకు భోజనం పెట్టిందా? అసలు వంట చేసిందా? కోపం నషాళానికి అంటింది. కాని వీలైనంత అనునయంగా ‘ఏమైంది?’ అని అడిగాడు. ‘నువ్వు నాతో ప్రేమగా లేవు’ ‘ఎందుకు అలా అంటావు. నీకు కావలసినవన్నీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు నీతోనే ఉంటాను’... ‘మరి ఆఫీసుకు వెళ్లాక ఒక్క మెసేజన్నా పెడుతున్నావా? ఒక్క కాల్ అన్నా చేస్తున్నావా?’ ‘అంటే పని చేయవద్దా?’ ‘చేయాలో వద్దో నీ ఇష్టం. కాని నాకు నీ ప్రేమ కావాలి. ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను ప్రేమిస్తూనే ఉండాలి’‘లేకుంటే?’ ‘నేను చచ్చిపోతాను. లేదా నిన్ను చంపేస్తాను’. ‘డాక్టర్... ఇదీ నా పరిస్థితి. ఇంటికి వెళ్లలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు పూర్తిగా భయపడిపోయారు. ఈ స్థాయి ప్రేమ నరకంగా ఉంది. దీనిని తట్టుకోలేక, ఇంటికి వెళ్లలేక, బయట ఉండలేక తాగుడుకు బానిస అయ్యాను. నా భార్యను మీరే ట్రీట్ చేయాలి’ అన్నాడు అతను.సైకియాట్రిస్ట్ తల పంకించి అతని వైపు చూశాడు. 37 ఏళ్లు ఉంటాయి.‘మీ పెళ్లయి ఎన్నేళ్లు?’‘ఒకటిన్నర సంవత్సరం’‘సరే... మీరు వెళ్లి ఆమెను పంపండి’ఆమె వచ్చింది. చూశాడు. చామనఛాయలో సన్నగా పలుచగా కళ్ల కింద నలుపుతో ఉంది. అప్రసన్నంగా ఉంది. 33 లేదా 34 ఏళ్లు ఉంటాయి.‘మనం కాసేపు మాట్లాడుకుందామా?’ అడిగాడు. తల ఊపింది.ఆమె పేరు రాధ. బాల్యం అనగానే ఆమెకు గుర్తుకు వచ్చేది కృష్ణుడి కోవెల. అక్కడకు తీసుకెళ్లే తండ్రి జ్ఞాపకం. ఐదేళ్ల వయసులో తండ్రి భుజం దిగేది కాదు. తండ్రి చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు. సైకిల్ మీద కూచోబెట్టి తిప్పేవాడు. ఎనిమిదేళ్లు వచ్చాయి. తండ్రి రావడం మానేశాడు. రోజూ గేటు దగ్గర నిలబడి చూసేది. వచ్చేవాడు కాదు. రాత్రి పూట ఉలిక్కిపడి లేచి చూసేది. ఉండేవాడు కాదు. వీపు మీద కూచోబెట్టి తిప్పిన తండ్రి... బంగారూ అని పిలిచే తండ్రి... ఎగరేసి పట్టుకునే తండ్రి... ఎలా వదిలేశాడు?తర్వాత తెలిసింది.అమ్మ ఆయనకు రెండో భార్య అట.మొదటి భార్య గోల చేసి గగ్గోలు పెట్టేసరికి రావడం మానేశాడట. వేరే ఊరు వెళ్లిపోయాడట.‘ఇలా చేస్తారా ఏ నాన్నైనా?’ చిన్న వయసులో నిస్సహాయత నుంచి కోపం వచ్చింది. నాన్న మీద కోపం మగాళ్ల మీద కోపంగా మారింది. అసలు ప్రతి విషయం మీద కోపంగా మారింది. వయసు వచ్చింది. కాని ఆ వయసు ఎవరి కోసం? ఏ మగాణ్ణి నమ్మాలని. వద్దు.. ఏ మగాణ్ణీ నమ్మొద్దు. వయసు పెరుగుతూ పోయింది. తల్లికి ఇది బెంగ. బాగా చదివించుకుని జాగ్రత్తగా పెంచుకుందని అనుకుంది కాని కూతురి మనసులో ఇలాంటి విపరీతం ఉందని తెలుసుకోలేదు.అలాంటి టైములో వేణు కనిపించాడు. ఇద్దరివీ వేరు వేరు ఆఫీసులే అయినా ఒకే బస్‌లో ప్రయాణించేవారు. రెండు మూడు నెలల పరిచయం తర్వాత ఒకసారి మాటల్లో ‘బంగారూ’ అని పిలిచాడు. అంతే. ఎక్కడో శిథిలాలలో ఉన్న తండ్రి జ్ఞాపకం సజీవంగా మేల్కొంది. ఇతను తన తండ్రి లాంటివాడే. అప్పటి తండ్రిలా అంతే ప్రేమ పంచేవాడా? అవును అనుకుంది. వేణులోని మంచితనాన్ని ప్రేమించింది. స్నేహితుణ్ణి ప్రేమించింది. తండ్రి స్పర్శను ప్రేమించింది. ఇంట్లో ముగ్గురు అక్కయ్యల పెళ్లి అయ్యేంత వరకు ఆగి వయసు మీదకు తెచ్చుకుని ఉన్న అతణ్ణి మరో ఆలోచన లేకుండా పెళ్లాడింది. అతడి కోసం పూర్తి ఇల్లాలిగా ఉండాలని ముందే ఉద్యోగం మానేసింది.పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలయ్యింది.అది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. లేదా తన మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో? దొరక్క దొరక్క దొరికాడు ఇష్టపడే మగవాడు. వాణ్ణి వదలకూడదు. అందుకే బంధించడం పెంచింది.ఎంత పెంచిందంటే అతడికి ఊపిరి సలపక చచ్చిపోయేంత.ఇద్దరినీ పిలిచి కూచోబెట్టాడు సైకియాట్రిస్ట్.ఆమె వైపు చూస్తూ అన్నాడు.‘ఏమ్మా... చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇన్లాండ్ కవర్ అంటించావా?’తల ఊపింది.‘ఇన్లాండ్ కవర్‌కు ఆల్రెడీ కొద్దిగా జిగురు పూత ఉంటుంది. మనం నాలుకతో కొంచెం తడి చేసి అంటిస్తే అంటుకుంటుంది. ఉత్తరం అందుకున్నవారు కొంచెం నైపుణ్యంతో విప్పితేచిరగకుండా విప్పుకుంటుంది. అవునా?’మళ్లీ తల ఊపింది.‘అలా కాదని కవర్ బాగా అంటుకోవాలని బంక రాసి చాలనట్టు జిగురు రాసి అదీ చాలనట్టు ఫెవికాల్ కూడా రాసి అంటిస్తే ఏమవుతుంది?’మౌనంగా చూసింది.‘కవర్ పాడవుతుంది. చిరుగుతుంది. పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. ప్రాక్టికల్ రిలేషన్ అంటారు. పెళ్లి ఒక ప్రాక్టికల్ రిలేషన్. మీ ఇద్దరి స్వేచ్ఛను మీరు గౌరవిస్తూ మీ అనుబంధాన్ని పెంచుకుంటూ సంసారం నడవడానికి అవసరమైన నియమాల్ని పాటిస్తూ ముందుకు సాగాలి. కాని నువ్వు అతని నుంచి అతి ప్రేమను ఆశించి జీవితం నాశనం చేసుకుంటున్నావు. నువ్వే కాదు.. ఈ పని కొందరు మగాళ్లు కూడా చేస్తారు. భార్య మీద ఓవర్ పొజెసివ్నెస్తో ఆమె జీవితం నరకం చేస్తారు. పరస్పరం నమ్మకం, గాఢమైన ప్రేమ ఉంటే సంవత్సరం దూరంగా ఉన్నా ఏమీ కాదు. ఆ నమ్మకం ఏర్పడకపోతే వీధి చివరకు వెళ్లి వచ్చేలోపల అనుమానం వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. కోరుకుంటున్నాడు. ఇక మారాల్సింది నువ్వే’ఆమె పలుచటి కన్నీటి తెర వచ్చింది.‘చూడమ్మా... దొరక్క దొరక్క దొరికింది చేజారిపోవాలన్న నియమం లేదు. ఆలస్యంగా పూచిన పువ్వుకు కూడా అంతే పరిమళం ఉంటుంది. సందేహాలు పెట్టుకోకు.భర్త కోసం జీవించడం మంచిదేకానీ అదే నీ జీవితం కాదు. నువ్వు కూడా ఉద్యోగం చేయి. నీ స్పేస్ నువ్వు తీసుకో. అలాగే భర్తను అతను కోరుకునే విధంగా అతని తల్లిదండ్రులను నీవారిగా భావిస్తే నీ అభద్రతపోతుంది. జీవితం సంతోషంగా ఉంటుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్.అతని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్‌వాజ్‌లో తాజా గులాబీలు ఉన్నాయి.వాటి తేలికపాటి సువాసన వారి జీవితంలో కూడా వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం ఆమెలో కనిపించింది. పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలయ్యింది. అది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. – ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
దివ్య దీపావళి : ఓ వైరల్ వీడియో
దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతోంది. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా, జగతిని జాగృతం చేసేలా జరుపుకునే వెలుగు దివ్వెల పండుగ దీపావళి. చెడుపై సాధించిన మంచి విజయానికి గుర్తుగావెలుగుల దివ్య దిపావళి. అయితే ఈ దీపావళి రోజు చిన్నా పెద్దా అందరినీ ఆలోచింప చేసే వీడియో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. మంచికీ, మానవతకు ప్రతీకగా నిలిచిన ఓ చిన్నోడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. తన పరిధిలో, బుజ్జి మెదడుకు పదును పెట్టి మరీ సాయం చేసిన వైనం ఆలోచింప చేస్తోంది. తన మంచి మనసుకు ఆధునిక టెక్నాలజీని జోడించిస్మార్ట్గా బిజినెస్ మంత్రను ప్రయోగించి సందేశంతోపాటు, సక్సెస్ సాధించడమే ఇందులోని రహస్యం. ఈ వివరాలు చెప్పేకన్నా.స్వయంగా వీడియోను చూసి ఆనందిస్తేనే బావుంటుంది. చిరుదీపమే అఖండ కాంతులకు నాంది, చిన్న అడుగే మార్పునకు పునాది అని స్ఫురించేలా హెచ్‌పీ ఇండియా ఈ డిజిటల్ వీడియోను రూపొందించింది. మూడు నిమిషాల నిడివి వున్న ఈ వీడియో స్థానిక కళాకారులు, వీధి వ్యాపారుల ఉత్పత్తులకు, చేతివృత్తులకు లభించాల్సిన ఆదరణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఓ మంచి సందేశంతోపాటు వ్యాపారం జమిలిగా ఇమిడి వున్న వీడియో ఆలోచింప చేసేదిగా ఉంది. ఉమ్మీద్ కా దియా (ఆశల దీపం) వీడియో పై స్పందిస్తూ హెచ్‌పీ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ నీలిమా బుర్రా : సమాజానికి మంచి సందేశాన్నివ్వడానికి దీపావళి పండుగ సరియైన సమయంగా భావించాం. చిన్న ప్రయత్నం ఇతరుల జీవితాల్లో ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందో టెక్నాలజీ ద్వారా చెప్పాలనుకున్నాం. ఈ దీపావళికి కనీసం ఒక వీధి వ్యాపారి జీవితమైనా ప్రకాశవంతంగా ఉండేలా మాతోపాటు, ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. -
‘సందేశాల’ గణపతి
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశ మండపమది. దాంట్లో చేతిలో ఘంటంతో రాస్తున్న భంగిమలో వినాయకుడి విగ్రహం ఉంది. భక్తుడు మండపంలోకొచ్చి అక్కడున్న గంటను మోగించగానే వినాయకుడు తల ఊపుతూ రాయడం మొదలు పెడతాడు.రాత పూర్తవగానే అక్కడున్న ప్రింటర్‌లోంచి ఒక కాగితం బయటకు వస్తుంది. దాంట్లో రోడ్డు భద్రత, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సందేశం ఒకటి ఉంటుంది. ఆ కాగితాన్నే గణపతి ప్రసాదంగా భక్తుడు ఇంటికి తీసుకెళ్లిపోతాడు... ఇది గోవాలోని ఫాంటైన్హాస్ దగ్గరున్న వారసత్వ ప్రాంతమైన ఫాంటే ఫోనిక్స్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రత్యేకత. సామాజిక సందేశాలను స్వయంగా రాసి ఇచ్చే ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. యువ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ ఈ యాంత్రిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించింది.ఊరికే వినాయకుడి విగ్రహాన్ని పెట్టే బదులు దాని ద్వారా ఏదైనా సామాజిక ప్రయోజనం సాధించాలని భావించాం. అందుకే ఈ యాంత్రిక గణపతిని నెలకొల్పాం. రహదారి భద్రత, పరిశుభ్రత, మహిళా సాధికారత, కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగాలకు సంబంధించిన సందేశాలు ఆయన రాసి భక్తులకు ఇస్తున్నారు. వాటిని భక్తులు ఎంతో భక్తితో ఇంటికి తీసుకెళుతున్నారు.’అంటూ తమ ఉద్దేశాన్ని వివరించారు యువ వ్యవస్థాపకుడు రఘువీర్ మహలే. ఈ విగ్రహాన్ని సుద్ద ముక్కలతో తయారు చేశారు. విగ్రహం తయారీకి నెలన్నర పట్టిందని,5వేల సుద్దముక్కలు వాడామని మహలే తెలిపారు. కరెంటు ఎక్కువ ఖర్చు కాకూడదన్న ఉద్దేశంతో గంట మోగినప్పుడే వినాయకుడి విగ్రహం కదిలేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. -
పత్రహరిత
నా ఫ్రెండ్ హన్మంతరావు మెసేజ్ చూసి దిమ్మతిరిగిపోయింది నాకు. ఏమైందో ముందు అర్ధం కాలేదు. కానీ ప్రాబ్లం ఎంతో సీరియస్ అని మెసేజ్ పూర్తిగా చదివాక అర్థమై కొంతసేపు అయోమయం అనిపించింది. ఆమధ్యే కదా తను ఎమ్మెస్సీ కంప్లీట్ చేసింది. ఇంతలోనే ఇలా ఎలా అయుంటుంది? ఎంత నాకు నేను ప్రశ్నించుకున్నా సమాధానం దొరకదని, నేరుగా వాడిని కలిస్తే తప్ప ఏదీ తేలదని అనిపించింది. అంత కష్టంలో ఉన్న వాడిని కలిసి ఓదార్చడం కనీస బాధ్యత అని నిర్ణయించుకున్నాను.రేపు హైదరాబాద్ వెళ్తున్నానని రెండుమూడు రోజులదాకా రానని నా సహచరికి చెప్పాను. తెల్లారి పట్నానికి బయల్దేరాను. మాకు పట్నం అని పిలవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మాది ఒకప్పటి ఖమ్మం జిల్లా. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ప్రాంతం. పేర్చినట్టుండే కొండలు, గుట్టల మధ్య మా ఊరుంటుంది. ఊరిని కాపాడుతున్నాయా అన్నట్టు గంభీరంగా నిలబడి నాలుగు దిక్కులూ జాగ్రత్తగా పహారా కాసే తాళ్లు. చుట్టూ రకరకాల పూలు, పళ్ళ తోటలు. నా అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందీ ఊరు. ఇక్కడికి ట్రాన్స్‌ఫరైన దగ్గర్నుంచీ నేను మరే ఊరికీ వెళ్ళలేదు. నా ఇన్ఫ్లుయన్స్ అంతా ఉపయోగించి ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకుంటాను. బహుశా నేను నా జీవితంలో చేసిన ఒకే ఒక్క అవినీతి పని ఇదే. మా ఊరు నుంచి హెడ్‌క్వార్టర్‌కు అక్కడి నుంచి పట్నం బస్ దొరికి వాడింటికి వెళ్ళేసరికి సాయంత్రమైంది. పోష్ ఏరియా. గేటెడ్ కమ్యునిటీలో మంచి అపార్ట్మెంట్. అందమైన ఫ్లాట్. అద్భుతమైన ఫర్నిచర్. మంచి పెయింటింగ్స్‌తో అలంకరించిన గోడలు. వాడి సంపాదన ఇల్లు కట్టడంలో అడుగడుగునా, అంగుళం అంగుళంలో వాడు తీసుకున్న శ్రద్ధలో ఉట్టిపడుతోంది. కుటుంబ సభ్యులందరికీ తలా ఓ గది. రూమ్స్ అన్నింటికీ గ్లాస్ డోర్స్. టీపాయ్లతో సహా అంతా గాజుమయం. నాకు చిన్నప్పుడు చదువుకున్న మయసభ గుర్తొచ్చింది. చాలా సేపు వాడేం మాట్లాడలేదు. తరువాత నేనే ‘‘ఎక్కడుంది తను’’ అని అడిగాను. ‘‘ఇంక ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకొచ్చేశాం. తన గదిలోనే ఉంది. మీ చెల్లెలు తనను కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అన్నాడు దుఃఖం తోడు వచ్చిన గొంతుతో. ‘‘చూద్దాం పద’’ అంటూ తన గదిలోకి వెళ్లాం.జిట్రేగుతో చేయించిన డబుల్‌కాట్ బెడ్‌మీద అచేతనంగా పడి ఉంది ఆద్య. చూస్తూనే ఉంది, కానీ ఆ చూపులో కాంతి లేదు. చూడ్డానికి బానే ఉంది కానీ ఎవరితోనూ మాటామంతీ లేదు. దాదాపు నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితట. మమ్మల్ని చూడగానే హన్మంతుగాడి భార్య లక్ష్మి కళ్ళంబడి నీళ్లు. కుర్చీలోంచి లేచి నుంచుంది– ‘‘మీకిష్టమయిన ఆద్య అన్నయ్యా! బొమ్మలా ఉంటుంది అనేవారు కదా అన్నయ్యా.. చివరికిలా బొమ్మలా అయిపోయింది.’’ అంటూ వెక్కిళ్లు పెట్టింది. ‘‘ఊర్కోమ్మా. అంతా సర్దుకుంటుంది’’ అంటూ ఆమెను నామ్కేవాస్తే ఓదార్చి, అలా సాధ్యం కాదేమోనని లోపల మనసు మొత్తుకుంటుంటే బయటికొచ్చేశాం.‘‘అసలేమయిందిరా..’’ బాధ నిండిన వాయిస్‌తో అడిగాను నేను. ఆద్యను అలా చూసిన షాక్‌లోనే ఉన్నాను.‘‘నాకూ అర్థం కాలేదురా. హాస్టల్ వార్డెన్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను. తీరా చూస్తే ఇలా ఉంది పరిస్థితి. ఎందుకిలా అయిందో తెలీడం లేదు. అక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను, లవ్ ఎఫైర్ లాంటిదేమన్నా ఉందేమోనని. కానీ అది కూడా కాదని తెలిసింది. ఇంకా ఏం జరిగిందో తెలీదు. మీ చెల్లెలేమో ఎవరైనా ఏదైనా చేశారేమోనండీ అంటుంది. నాకలాంటి నమ్మకాలు లేవు.’ అంటూ ఆగాడు కళ్ళు తుడుచుకుంటూ. ‘‘మరి ట్రీట్మెంట్?’’ అంటూ ఆగాను. ‘‘హైదరాబాద్‌లో అన్నిచోట్లా తిప్పాం. మంచి సైకియాట్రిస్ట్లందరికీ చూపించాం. చివరికి మా కజిన్ వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటే అక్కడకు కూడా తీసుకెళ్లాం. రెండు నెలలు ఉంచి ట్రీట్మెంట్ చేయించి వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇంక ఏం చేయాలో కూడా తెలీని పరిస్థితి. ఇక మీ చెల్లెలు చెప్పినట్లు బాబాలకు, మంత్రగాళ్ళకు చూపించడం ఒకటే మిగిలింది’’ అంటూ నిట్టూర్చాడు.‘‘అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోకురా. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం దారి తెలుసుకోగలగాలి అంతే..’’ అంటూ వాణ్ణి సముదాయించాను కానీ నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. అసలేం జరిగుంటుంది? అన్న ప్రశ్న నన్ను ఆ రాత్రంతా తొలిచేసింది.తెల్లారి లేచింతరువాత వాణ్ణి అడిగాను – ‘‘ఆద్య గురించి నాకింకా వివరంగా చెప్పరా..’’ అని.వాడు చెప్తూనే ఉన్నాడు గంట వరకూ. ‘‘అందరికంటే ముందుండాలని ఆద్య అని పేరు పెట్టుకున్నాంరా. నీకు తెలుసు కదా, తను చిన్నప్పటి నుంచి ఎంత యాక్టివో. చదువు మీద ఎంత శ్రద్ధో. ఏది చేసినా మనసు పెట్టి చేసేది. పైపైన చేసి అయిపోయిందనే మనస్తత్వం కాదు తనది. పూర్తిగా తెలుసుకుని చేసేది. అయితే నాకు తెలీని విషయం ఏంటంటే, ఆద్య ఆర్ట్ బాగా వేస్తుందని. ఎప్పుడూ నాకు చెప్పలేదు, తన పెయింటింగ్సేవి నాకు చూపించనూ లేదు. హాస్టల్ ఖాళీ చేసినప్పుడు దాదాపు యాభై అరవై పెయింటింగ్స్ దొరికాయి. చాలా ఆశ్చర్యమేసింది. అవన్నీ తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టాం. ఇప్పుడిక వాటితో పనేం ఉంది?’’ అన్నాడు హన్మంతు బాధగా. నాకు ఆద్య గీసిన బొమ్మలు చూడాలని అనిపించింది. హన్మంతుని అడిగాను చూపించమని. వాడు నాకేసి ఆశ్చర్యంగా చూసి ‘పద’ అన్నాడు. అక్కడ అల్మారా కనిపిస్తే డోర్ తీసి చూశాను. డైరీ కనిపించింది. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టోర్‌రూమ్‌లో నుంచి పెయింటింగ్స్ హాల్లోకి తీసుకొచ్చాం ఇద్దరం. నన్ను చూస్తుండమని చెప్పి వాడు లోపలికెళ్ళాడు. నేను ఒక్కొక్కటి తీసి చూశాను.పచ్చని ప్రకృతినంతా పెయింటింగ్స్‌గా మార్చేసింది ఆద్య. నాకు చాలా అపురూపంగా అనిపించాయి. దట్టమైన మబ్బులు, వాటి మధ్యలో చిక్కిన స్పష్టాస్పష్టమైన చంద్రుడు, రకరకాల పక్షులు, తుమ్మెదలు, రంగురంగు పూలు, తోటలు, పళ్ళు, పచ్చని చిలకలు వాలిన చెట్లు, చెట్లమీద నుంచి ఆకాశంలోకి ఎగరబోతున్న పక్షుల గుంపులు... ఇంకా నాకు బాగా నచ్చిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి అందులో. చిన్న సన్నజాజి పందిరి దానిమీద పిట్టగూడు, పక్కనే వాలిన పిట్టలు, మొక్కజొన్న తోటలు, కాల్వల్లో ఈత కొడుతున్న పిల్లలు, నాకొక విషయం అర్థం కాలేదు – సిటీలో పెరిగిన అమ్మాయికి ఇవన్నీ ఎలా పరిచయం?ఒక పెయింటింగ్ మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూస్తుండిపోయాను దానివైపు! ఆ తరువాత ఆద్య డైరీ తిరగేశాను. జూన్ 14. శుక్రవారం.‘వేసవి సెలవులొస్తే అంతా హైదరాబాద్‌కో, పక్కన ఉన్న ఏదో ఒక సిటీకో వెళ్ళిపోతారు. కానీ అదే సిటీవాళ్ళు పిల్లల్ని తీసుకుని పల్లెలకు వెళ్ళి అక్కడి వాతావరణాన్ని, పంటల్ని వాటి ప్రాముఖ్యతని ఎందుకు పరిచయం చెయ్యరు?’జూలై 20. ఆదివారం.‘అసలు ఈ సిటీలో నాకు ఊపిరాడ్డం లేదు. ఎటు చూసినా సిమెంట్, లేదంటే గ్లాస్..! ఎవరికి వారు వేసుకుంటున్న ఛేదించలేని పరదాలు..! ఓజోన్ పలచబడుతోంది. యూవీ రేస్‌ని రాకుండా ఆపగలిగేది ఒక్క ఓజోనే. ఊపిరితిత్తుల్లో పేరుకుంటున్న కాలుష్యం. ఇక్కడే కొన్నాళ్ళు ఉంటే బహుశా తెలియని రోగాలు కూడా అంటుకుంటాయేమో. అకిరో డ్రీమ్స్ ఎంత బాగా తీశాడు! అణుబాంబు పడ్డ దేశం మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ఎంత కష్టం! కాలుష్యం కూడా మనకు మనమే సృష్టించుకుంటున్న అణుబాంబు! దీని ఫలితం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇదెవడికీ పట్టదు.’ఆగస్టు 4. శనివారం.‘ఇంత పచ్చని ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. భవిష్యత్తరాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ఎక్కడ చూసినా అడవులని నాశనం చేస్తున్నారు. సిమెంట్ కట్టడాలతో నింపేస్తున్నారు. కాలుష్యంతో పాడు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో భూమి సర్వనాశనం అవుతోంది. యాసిడ్ రెయిన్స్. ఇదంతా మనిషి భూమికి చేస్తున్న రాచపుండు. ఇది నయమవాలంటే భూమికి ఆకుపచ్చని పసరు పూయాలి. అదే మందు. అది కేవలం అడవుల్ని సంరక్షిస్తేనే సాధ్యం! కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎంతసేపూ సంతానం సాఫ్ట్వేర్ ఉద్యోగులయ్యారా లేదా! దేశాంతరం వెళ్తున్నారా లేదా! అనే కానీ కనీసం ఇంట్లోనయినా రెండు మొక్కల్ని నాటుదాం అనుకునే వారెంతమంది? కొన్నాళ్లకి ఆక్సిజన్ సిలిండెర్లు కొనుక్కుని బతకాలి, వాటర్‌ని కొంటున్నట్లు.’ఆగస్టు 31. గురువారం. ‘విశ్వంలో జీవగ్రహం అంటే లివింగ్ ప్లానెట్ ఒక్క భూమే! దాన్ని కూడా నిర్జీవం చేస్తున్నాం. ఒక్క జీవం పుట్టుకకు ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందో తెలుసుకున్న మనిషి ఎందుకింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు? ఈ భూమి కాలుష్యం వల్ల నాశనమైతే మళ్ళీ ఒక జీవం పుట్టడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికి తెలుసు? అన్నీ తెలిసిన మనిషి ఎందుకింత దిగజారిపోయాడు? పనికిరాని డబ్బుని కూడబెట్టుకుంటున్న మనుషులకు భూమిని కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? భూమ్మీద ఇన్ని కోట్ల జీవరాశులుంటే కేవలం తన గురించి, తన వంశం గురించి మాత్రమే ఎందుకాలోచిస్తున్నారు? ప్రకృతిలో మనం భాగం అయినపుడు మరి మనల్ని మనమే కాదు, అన్ని జీవరాశుల్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత కదా? అందరూ గ్రీన్ కార్డు కలలే కంటే గ్రీన్ ప్లానెట్కలలు ఎవరు కనాలి?’ ఇలా సాగింది డైరీ! నిజానికి అది ఆద్య ఒక్కరి డైరీ కాదు. కాకూడదు. పట్నం బతుకుల సామూహిక డైరీ కావాలి కదా అనిపించింది.ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అస్పష్టంగా ఏవేవో ఆలోచనలు. నా మెదడు నాకేవో సంకేతాలివ్వసాగింది. చివరికి నేనో నిర్ణయానికి వచ్చాను. తెల్లారగానే హన్మంతుగాణ్ణి పిలిచి నా నిర్ణయం గురించి చెప్పాను. వాడు షాక్ అయ్యాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. నామీద వాడికి నమ్మకం కలగలేదు. వాడి ముఖంలో అది స్పష్టంగా కనిపించింది. వాడు లక్ష్మితో మాట్లాడి చెప్తానన్నాడు. సరేనన్నాను. ఇద్దరూ కలిసి చాలాసేపు చర్చించి, హాస్పిటల్స్‌తో విసిగిపోయి ఉండటంతో చివరికి ఓకే అన్నారు నా ప్రతిపాదనకు. నాకు సంతోషం వేసింది. ‘‘ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఎందుకు, ఏమిటి అని అడగొద్దు. మా ఊరికి ఆద్యను తీసుకెళదాం. రెండు లేదా మూడు నెలలు నా ప్రయత్నం నేను చేస్తాను. ఫలితం ఉంటే మన అదృష్టం’’ అన్నదే నా నిర్ణయం.పట్నం నుంచి బయల్దేరిన కారు మా ఊరిలో మా ఇంటిముందు ఆగింది. ముందు నేను దిగి వీధి గేటు తీసుకుని మొక్కల మధ్యలోంచి మా ఇంటి తలుపు తట్టాను. నా సహచరి వచ్చి తలుపు తీసింది. ఇంటి ముందు కారు ఆగి ఉండటంతో సందేహంగా ఆగిపోయింది. ‘‘మనింటికి గెస్ట్లొచ్చారు. ఇక్కడే రెండు మూడు నెలలు ఉంటారు.’’ అన్నాను. కారులోంచి దిగిన హన్మంతు, లక్ష్మిలను చూసి ఆనందంగా పలకరిస్తూ లక్ష్మిని ఆలింగనం చేసుకుంది నా సహచరి. దాదాపు శవంలా ఉన్న ఆద్యను చూసి కంటతడి పెట్టింది. ఆద్యను హాల్లో ఉన్న పక్క మీద పడుకోబెట్టాం అందరం కలిసి. అనుకున్న ప్రకారం వీల్‌చైర్, అంతకు ముందు ఆద్యకు డాక్టర్ రాసిన కొన్ని మందులు.. అన్నీ తీసుకుని వచ్చాం మా ఊరికి.పాలతనికి చెప్పాను, రోజూ ఎక్కువ పాలు తీసుకురమ్మని. ఉంటే జున్నుపాలు కూడా తెచ్చివ్వమ్మని. ఊర్లో ఉన్న బంతిపూల తోటకి, చెరుకు తోటకి, మామిడి తోటకి, ఇలా రోజుకో చోటుకి వెళుతున్నాం మేమంతా. ఆద్యను ఆ తోటల మధ్యలో ఆ పూల మధ్యలో వీల్‌చైర్‌లో తిప్పుతున్నాం. కనకాంబరాలు, లిల్లీలు, పొద్దుతిరుగుడు పూలు, ఎన్నో రకాల పూలు, తీగలు, మొక్కలు.. ఓహ్.. దేవలోకం అంటే ఇదేనేమో అన్నట్లుగా వాతావరణం.. ముందు హన్మంతు, వాడి భార్యలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకటి నీరసం కనిపించడంలేదు. ఉత్సాహం కనపడుతోంది ఇద్దరిలో. పెరట్లో కూరగాయలు కోయడం వాళ్లకు ఇష్టమైన వ్యాపకం అయింది. హన్మంతు భార్య, నా సహచరి కలిసి ఇంటిముందు ఉన్న పూలు కోసి మాలలు అల్లి పెట్టుకోవడం.. కబుర్లు చెప్పుకోడం.. యజ్ఞం చేస్తున్నంత ఏకాగ్రతతో మేము ఆద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకోరోజు ఒకో తోటలో తిప్పుతున్నాం. ఇరువైపులా చెట్లున్న కాలిబాటలో వీల్ చైర్‌ను తీసుకుని వెళ్తున్నాం. అలా అలా రెండు నెలలు గడిచిపోయాయి. మెల్లమెల్లగా హన్మంతు, లక్ష్మిల్లో ఈ ఆశ కూడా సన్నగిల్లింది. ఇక వెళ్ళిపోతాం అన్నారొకసారి. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. మరో నాలుగు రోజులు చూద్దామన్నాను. సరేనన్నారు.ఆ తర్వాత ఒక రోజు–బంతిపూల తోటలో స్వేచ్ఛగా తిరుగుతున్న సీతాకోక చిలుకతో పాటు ఆద్య చూపు కొద్దికొద్దిగా ఆకాశంలోకి ఎగిరింది. అంతే. మా ఆనందానికి హద్దులు లేవు. మా మనసులు అంబరాన్ని తాకాయి సంతోషంతో. మా ఆవిడ గడ్డితో నిండిన భూమే జానిమాజ్గా భావించి అక్కడే దువా చేసింది. చాలా చిన్న కదలికే. కానీ అదే బహుశా కొద్దిరోజుల్లో సీతాకోక చిలుక వేగం పుంజుకుంటుందని నాకు బలమైన ఆశ కలిగింది. ఇదెలా సాధ్యమయ్యిందని ఆరోజు అడిగారు, హన్మంతు, లక్ష్మి.నేను ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టాను–‘‘నాకు ఆద్య పెయింటింగ్స్ చూశాక, అందులోనూ నన్ను బాగా డిస్టర్బ్ చేసిన ఒక పెయింటింగ్ పరిశీలించాక ఆద్య వ్యాధి సగం అర్థమయినట్టు అనిపించింది. ఆ పెయింటింగ్‌లో – గాజు పలకల పంజరంలో ఒక సీతాకోక చిలుక పడి ఉంది. అది చనిపోయిందో, బతికి ఉందో చెప్పడం కష్టం. అర్థం కావడం లేదు. నిస్తేజంగా ఉంది. ఆ గాజు పలకల పంజరం చుట్టూ పచ్చదనం పరుచుకుని ఉంది. నన్ను బాగా కలవరపెట్టింది ఆ పెయింటింగ్. నాకెందుకో బెడ్ మీదున్న ఆద్య కళ్ళముందు మెదిలింది. తరువాత ఆద్య డైరీ చదివాను. ఒక్కో పేజీ తీస్తుంటే ఆద్య మనసు ఆవిష్కృతమవుతూ వచ్చింది. ఆమె ఆలోచనలు ఒక్కొక్కటిగా విశదమవుతూ వచ్చాయి.హన్మంతుతో జరిగిన చర్చల్లో చెప్పాడు, ఆద్య చాలాసార్లు ఊర్లకు పోదాం డాడీ అని అడిగిందని. కానీ ఊళ్ళో ఎవరూ లేకపోవడంతో తీసుకెళ్లలేకపోయాడని. కానీ ఆద్య సినిమాల్లో, కథల్లో చదివి ప్రకృతిపైన ప్రేమ పెంచుకుంది. ఆమె మిగతా పెయింటింగ్స్ చూసినప్పుడు కూడా నాకర్థమైంది ఇదే. అంటే ఆమెని ఆమె ప్రేమించింది. ప్రకృతిని ప్రేమించింది. తనని తాను ప్రకృతితో పోల్చుకున్నప్పుడు తానూ ఓ గాజుగదిలో బందీగా ఉన్నట్లు అనిపించి ఉంటుంది ఆమెకు. ఆ గాజు పలకల్ని బద్దలు కొట్టాలి. అప్పుడు సీతాకోక చిలుకకు ఆక్సిజన్ అందుతుంది. బటర్‌ఫ్లై బతుకుతుంది.ఎస్, ఆమె ‘నేచర్ మిíస్సింగ్ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అనిపించింది. మీరు ఇన్ని ప్రయోగాలు చేశారు కదా! నాకు ప్రకృతి వైద్యం చేసి చూద్దామనిపించింది. అంటే మనిషికి ప్రకృతిని పరిచయం చేయడం. నిజానికి ఇద్దరూ ఒకటే అనుకుంటాం, అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నామని ఆద్యని చూస్తే తెలిసింది. ఆమెకు ప్రకృతి వైద్యం చేస్తే కోలుకుంటుందేమోనని నా మనసులో ఏదో మూల ఆశ మొలకెత్తింది. ఈ విషయం చెబితే మీరు నవ్వుతారేమోననిపించింది. అందుకే మీకివేమీ చెప్పకుండా మిమ్మల్ని ఒప్పించి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చింది. మొత్తానికి నా ఆశ ఫలించింది!’’ అన్నాను సంతోషంగా.హన్మంతు లేచి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. చూస్తే ఏడుస్తున్నాడు వాడు – ‘‘నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదురా!’’ అన్నాడు గొంతు పెగుల్చుకొని. లక్ష్మి కూడా దగ్గరికొచ్చి నిలుచుంది. తన కళ్ళ నుండి కూడా కన్నీళ్లు కారిపోతున్నాయి! పగిలిపోయిన గాజుబొమ్మ ప్రాణం పోసుకున్న సంతోషంలో ఉన్నారిద్దరు. కొంతసేపటికి హన్మంతు అన్నాడు – ‘‘అరేయ్ యూసుఫ్! నాక్కూడా ఇక్కడొక ఇల్లు చూడరా! తరువాత చిన్నగా తోటలూ అవీ ప్లాన్ చేద్దాం’’. వాడి గొంతులో నిజాయితీతో కూడిన ఉద్వేగం. ట్రీట్మెంట్ చేసింది ఆద్యకా? హన్మంతుకా?! అన్న సందేహం కలిగింది నాకు. - షాజహానా -
‘ఆమె గొంతు వినగానే ఏడుపు ఆపుకోలేకపోయాను’
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంజయ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉందనే విషయం అందరికి తెలిసిందే. స్వయంగా సంజయ్ దత్తే ఈ విషయం గురించి చెప్పారు. మా అమ్మ చనిపోయిందని చెప్పి అమ్మాయిల దగ్గర సానుభూతి పొంది వారికి దగ్గరయ్యేవాడినని సంజయే స్వయంగా ఒప్పుకున్నారు. అయితే నిజ జీవితంలో మాత్రం తన తల్లి నర్గీస్ దత్ చనిపోయినప్పుడు సంజయ్‌కు కన్నీళ్లు రాలేదంట. అసలు ఆ సమయంలో అతనికి ఎటువంటి ఫీలింగ్ కలగలేదంట. కానీ ఆమె చివరి రోజుల్లో ఆస్పత్రిలో ఉండగా తన కోసం పంపించిన మెసేజ్‌ను విన్నప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు సంజయ్. ఈ విషయం గురించి సంజయ్ మా అమ్మ నర్గీస్ ఎన్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా కోసం ఒక సందేశాన్ని రికార్డు చేసి పంపించారు. దానిలో నా గురించి మా అమ్మ ‘సంజు అన్నింటి కంటే ముఖ్యమైనది వినయం. నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకో, దాన్ని కోల్పోకు. పెద్దలను గౌరవిస్తూ, ఒదిగి ఉండూ. అదే నిన్ను కాపాడుతుంది, అదే నీకు బలం’ అని తెలిపారు. ఆ సందేశం వినగానే నన్ను నేను నియంత్రించుకోలేక పోయాను. మా అమ్మ మరణించినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ మా అమ్మ మరణించిన తర్వాత ఆమె గొంతు విన్న నాకు ఏడుపు ఆగలేదు. అలా 4,5 గంటల పాటు ఏడుస్తునే ఉన్నాను అని తెలిపారు. నర్గీస్ మరణించిన తర్వాత సంజయ్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఆ వ్యసనం నుంచి బబయటపడేందుకు అమెరికాలోని రిహబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. ఆ సమయంలో సునీల్ దత్ ఈ టేప్‌లను సంజయ్ దగ్గరకు తీసుకువచ్చారు. ఆ టేప్‌లలో ఏముందో సునీల్ దత్‌కు కూడా తెలియదంటా. ఆయన వాటిని ప్రెస్ చేయగానే ఆ గదిలో ఒక్కసారిగా నర్గీస్ గొంతు ప్రతిధ్వనించిందంట. తల్లి గొంతు విన్న సంజయ్ తనను తాను నియంత్రించుకోలేక పోయారంటా. అన్నాళ్లు మనసులో గూడు కట్టుకుపోయిన బాధ ఒక్కసారిగా బయటకు వచ్చి అలా ఏడుస్తూనే ఉన్నారంటా. ఇదంతా నర్గీస్ చనిపోయిన మూడేళ్ల తర్వాత జరిగింది. సంజయ్ ఈ విషయం గురించి చెప్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నర్గీస్ 1981లో క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయారు. ఆమె మరణం తర్వాతే సంజయ్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. -
నీకేం కావాలో చెప్పు..!
తమిళ స్టార్ హీరో నటించిన ఓ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోని కొన్ని సన్నివేశాలివి. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హిట్‌గా నిలిచిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.... సత్యదేవ్ అప్పుడే ఆటో డ్రైవర్ వేషంలోకి మారిపోయి ప్యాంట్లో దోపుకున్న గన్ తీసి ఆటో హ్యాండిల్ పక్కన్నే పెట్టుకొని చుట్టూ గమనిస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అక్కడికొచ్చే ఒక వ్యక్తిని కాల్చి చంపాలి అతను. ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళుతున్నది సత్యదేవ్‌కి మెసేజ్ వస్తూనే ఉంది. ‘‘ఆటో స్టార్ట్ చెయ్యండి. నేను త్వరగా హాస్పిటల్‌కి వెళ్లాలి’’ అంటూ ఒకావిడ అప్పుడే ఆటో ఎక్కడం చూశాడు సత్యదేవ్. ‘‘సారీ మేడమ్! ఆటో రాదు.’’ అన్నాడు.‘‘నేను హాస్పిటల్‌కి వెళ్లాలి’’‘‘సారీ మేడమ్! మీరు వేరే ఆటో చూస్కోండి. నేనొక ముఖ్యమైన పనిమీద ఉన్నాను.’’ ‘‘ఇంతకంటే ముఖ్యమా? నాకేం అర్థం కావట్లేదు.’’ అంటూ విసుగ్గా ఆటో దిగిందామె. సత్యదేవ్ ఆటోలోంచి మెల్లిగా దిగుతున్న ఆమె కడుపుతో ఉందని గమనించగానే, ‘ఎలాగూ ఇంకాసేపట్లో ఒక చావుకి కారణం కాబోతున్నాను. ఫర్ ఎ చేంజ్, ఓ పుట్టుకకి హెల్ప్ చేద్దాం’ అనుకున్నాడు. ఆమెను మళ్లీ ఆటో ఎక్కించి హాస్పిటల్లో డ్రాప్ చేశాడు సత్యదేవ్. వీల్‌చైర్ మీద హాస్పిటల్ లోపలికి వెళుతూ, సత్యదేవ్‌కి కళ్లతోనే థ్యాంక్స్ చెబుతూ రెండు వంద నోట్లు అతడి చేతిలో పెట్టిందామె. సత్యదేవ్ తన చేతిలోని ఆ రెండు వంద నోట్లను చూస్కొని చిన్నగా నవ్వాడు. రెండు సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో సత్యదేవ్ చేతిలో చాలామంది చనిపోయారు. ఆయన పేరు కూడా అంతకంతకూ పెరిగిపోయింది. ఒకరోజు కోర్టులో ఆమెను చూశాడు సత్యదేవ్. చంకలో రెండేళ్ల పసిపిల్లను ఎత్తుకొని, అప్పుడే భర్తతో విడాకులు తీసుకొని బయటకొచ్చిందామె. సత్యదేవ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించాడు. ‘‘తెలుగు సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతుందనుకున్నా. నిజ జీవితంలో కూడానా!’’ నవ్వుతూ అందామె. అతనేమీ అర్థం కానట్టు చూశాడు. ‘‘ఆటో డ్రైవర్ నుంచి టాప్ పోలీస్ ఆఫీసర్.. రెండేళ్లలో.. వావ్!’’ అలాగే నవ్వుతూ అంది. ‘‘రియల్లీ?’’ కళ్లద్దాలు తీస్తూ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సత్యదేవ్. ‘‘ఐ యామ్ జోకింగ్. ఆ మర్నాడే హాస్పిటల్లో ఓ టీవీలో చూశాను. యూనిఫామ్‌లో ఉన్నారు.’’ చెప్పిందామె. సత్యదేవ్ నవ్వి, పాపను చూస్తూ, ‘‘వీరేనా వారు?’’ అన్నాడు.అవునన్నట్టు తలూపి, ‘‘నిషా! ఆ రోజు తను సేఫ్‌గా పుట్టడానికి మీరే కారణం. మిమ్మల్నెప్పటికీ మర్చిపోలేను...’’ అంటున్న ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ నిషాను తన చేతుల్లోకి తీసుకొని కాసేపు ఆడుకున్నాడు సత్యదేవ్. ‘‘మళ్లీ కలుద్దాం.’’ కాసేపటికి ఇద్దరూ ఈ మాట అనుకొని ఎవరి దారుల్లో వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆమె గురించి ఆలోచించాడు సత్యదేవ్. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్ అని తెలుసుకొని, ఆమె సిటీలో ఇస్తున్న ఒక షోకు వెళ్లాడు. షో అయిపోయాక కొద్దిసేపు ఎదురుచూసి మరీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లి మాట్లాడాడు – ‘‘కంగ్రాచ్యులేషన్స్! బ్యూటిఫుల్.చాలాఅందంగా డ్యాన్స్ చేశారని చెప్పొచ్చా?’’ ‘‘థ్యాంక్యూ.’’ ‘‘ట్రూలీ! ఐ ఎంజాయ్డ్ ఇట్. డ్యాన్స్ మీద నాకొక కొత్త ఇంటరెస్ట్ కలిగింది.’’ఆమె నవ్వింది. ‘‘సత్యదేవ్’’ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘‘తెలుసు. ఐ యామ్ హేమానిక’’ అంది. ‘‘తెలుసు.’’ అని కాసేపు హేమానికనే చూస్తూ నిలబడ్డాడు సత్యదేవ్. ‘‘యూ మస్ట్ బీ బిజీ. మళ్లీ కలుస్తాను..’’ అంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయాడు సత్యదేవ్. ఆ సాయంత్రమే ఆఫీస్‌లో హేమానిక నంబర్ సంపాదించి పెట్టమని ఫ్రెండ్‌ని రిక్వెస్ట్ చేశాడు. గంటలో నంబర్ వచ్చింది. ఫోన్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించాడు. చివరకు ‘‘హాయ్! నేను సత్యదేవ్. ఇది నా నంబర్. మీకొక హలో చెప్పాలనిపించింది.’’ అని మెసేజ్ చేశాడు.‘‘గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. టచ్‌లో ఉంటాను – హేమానిక’’ రిప్లై ఇచ్చింది. ఆ మెసేజ్ వాళ్లను కాల్‌కు, ఆ తర్వాత కాఫీకి తీసుకెళ్లింది. కాఫీలో ఇద్దరూ ముందు తమ గురించి చెప్పుకున్నారు. ఆ తర్వాత తరచూ కలవడం మొదలైంది. ఇష్టాలు పంచుకున్నారు. ఒకరినొకరు కలవకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. సహజీవనంలో ఉన్నారిప్పుడు. నిషా పెద్దదవుతూ వస్తోంది. సత్యదేవ్ వాళ్ల ప్రపంచంలోకి వచ్చినప్పుడు నిషాకి రెండేళ్లు. ఇప్పుడు తనకు ఆరేళ్లు. హేమానిక తన స్టూడెంట్స్‌కు డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్న ఒకరోజు, చాలారోజులుగా తన మనసులో దాచుకున్న విషయం చెప్పడానికి వచ్చాడు సత్యదేవ్. హేమానికకు మాట్లాడాలంటూ కళ్లతో సైగ చేసి చెప్పాడు. ఆమె స్టూడెంట్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ ఉండమని చెప్పి వచ్చి, సత్యదేవ్ ఎదురుగా నిలబడి, ఏంటన్నట్టు కనుబొమ్మలెగరేసింది. ‘‘పెళ్లి చేసుకుందామా? విల్ యూ మ్యారీ మీ?’’ అనడిగాడు సత్యదేవ్. ‘‘ఊరంతా అనుకుంటున్నారు కదూ!’’ చుట్టూ చూసి మెల్లిగా అంది హేమానిక.‘‘లుక్! ఐ లవ్యూ. నువ్వు నాకు కావాలి. నిన్ను పెళ్లి చేసుకోవాలి. అంతే!’’‘‘నిషా? ఎంతైనా తను ఇంకొకరి కూతురు.ఆలోచించండి.’’‘‘నన్నలా సందేహించకు హేమా! దయచేసి నన్ను వేరుచేసి మాట్లాడకు.’’‘‘సత్య ఐ యామ్ సారీ..’’‘‘నిషా నీ బిడ్డ. నువ్వు కన్న బిడ్డ. కాబట్టి నాకూ బిడ్డే. తనెప్పుడో నా కూతురైపోయింది...’’ సత్యదేవ్ తమ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నాడో అంతా చెప్తూ పోతున్నాడు. హేమానిక పెళ్లికి ఓకే చెప్పింది. అమ్మాయి నిషాను కూడా అడిగి తను కూడా ఓకే చెప్పాక పెళ్లికి సిద్ధమయ్యారు సత్యదేవ్, హేమానిక. కానీ సరిగ్గా ఆ పెళ్లిరోజే, సత్యదేవ్ మీద కోపంతో ఉన్న గ్యాంగ్ హేమానికను హత్య చేశారు. సత్యదేవ్‌కు కోపమొచ్చింది. కోపానికి మించిన బాధ తన్నుకొచ్చింది. అప్పుడు కూతురు నిషా ముఖం చూశాడు. అతనికి మొదటిసారి భయమేసింది. తను ఈ ఉద్యోగంలో ఉండటమే ఆ భయానికి కారణం. తన సమయాన్నంతా నిషా కోసమే కేటాయించాలనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చి, నిషానుఅడిగాడు – ‘‘నీకేం కావాలో చెప్పు!’’ అని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ తండ్రీ కూతుర్లిద్దరూ తమ ప్రపంచాన్ని మరచిపోయి కొత్త కొత్త ప్రపంచాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. -
చదివినా...తెలియదు
న్యూ ఢిల్లీ : ఉదయం లేవగానే మనలో చాలామంది చేసే పని వాట్సాప్‌లో స్నేహితులకు గుడ్‌మార్నింగ్ అంటూ సందేశాలు పంపడం. సందేశాలు పంపి ఊరుకుంటామా...లేదు అవతలివారు మన సందేశం చూశారా, లేదా అని గమనిస్తాం. చూసి కూడా బదులు ఇవ్వకపోతే బాధపడతాం, తిట్టుకుంటాం, మరీ కోపమోస్తే బ్లాక్ చేస్తాం. ఇదంతా జరగడానికి కారణం వాట్సాప్‌లో ఉన్న రీడ్ రెసిప్ట్ ఫిచర్. దీనివల్ల అవతలి వారు మన మెసేజ్ చదివారో, లేదో మనకు తెలుస్తుంది. మనం వాట్సాప్‌లో మెసేజ్ పంపినప్పుడు ఒకటే యాష్ కలర్ టిక్ మార్కు వస్తుంది. మనం పంపిన మెసేజ్ అవతలి వారి మొబైలకు చేరగానే రెండు యాష్ కలర్ టిక్ మార్కులు వస్తాయి. మెసేజ్ చదవగానే రెండు నీలంరంగు టిక్ మార్కులు వస్తాయి. దీని వల్లనే అవతలి వారికి మనం మెసేజ్ చదివామో, లేదో తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చిన ఓ కొత్త ఫీచర్‌తో మనం మెసేజ్ చదివినా అవతలి వారికి తెలియదు. ఎంటా ఫీచర్, ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారా...అది చాలా సులభం. దానికోసం మీ మొబైల్లో సెట్టింగ్స్ ఏం మార్చక్కరలేదు. చాలా సులభంగా దీనిని సెట్ చేసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు 1. మీకు వాట్సాప్‌లో మెసేజ్ రాగానే, ముందుగా నోటిఫికేషన్ పానెల్‌ను కిందికి స్ర్కోల్ చేసి, ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. 2. ఇప్పుడు మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్‌లు చదవండి. 3. చదవడం అయిపోయాక వాట్సాప్ విండోను క్లోస్ చేయండి. 4. వాట్సాప్‌ను పూర్తిగా క్లోస్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేయండి. చాలా సులభంగా ఉంది కదా... ఏరోప్లేన్ మోడ్ ఆన్‌లో ఉంటేనే ఇలా చేయడం కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ విండోను క్లోస్ చేయకుండా కేవలం బాక్ బటన్‌ను మాత్రమే ప్రెస్ చేస్తే మళ్లీ మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లగానే మీరు మెసేజ్ చదివినట్లు చూపించే బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. అందుకే వాట్సాప్ విండోను పూర్తిగా క్లోస్ చేయడం మరవకండి. -
132 ఏళ్ల ‘సీసా సందేశం’
2003లో విడుదలైన శివమణి సినిమాలో హీరోయిన్ అసిన్ సముద్రం మధ్యలో అపాయంలో ఉన్నప్పుడు కాగితంపై ఓ సందేశం రాసి, దానిని గాజు సీసాలో పెట్టి పడవలో నుంచే నీళ్లలోకి విసిరేస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ‘బాటిల్ సందేశం’ మరో హీరోయిన్ రక్షితకు బీచ్‌లో దొరికి కథకు కీలకంగా మారుతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో అలాంటి జిన్ ‘సీసా సందేశం’ లభించింది. అయితే ఇది ప్రేమ సందేశం మాత్రం కాదు. కాగితంపై వివరాలు రాసి జిన్ బాటిల్లో పెట్టి సముద్రంలోకి విసిరిన సందేశం ఇటీవల ఓ మహిళకు దొరికింది. సినిమాలోలాగా కాకుండా ఇది ఏకంగా 132 ఏళ్ల క్రితం నాటిది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత పాత ‘బాటిల్ సందేశం’ అయ్యింది. ఇంతకీ ఆ జిన్ సీసాలోని పేపర్లో ఏముంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.. పూర్వం ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జలాల ప్రవాహాలు, అలల వేగాన్ని లెక్కించి నౌకలు సులువుగా ప్రయాణం సాగించేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త సముద్ర మార్గాలను కనుక్కునేవారు. ఇందుకోసం వారు 69 ఏళ్లపాటు పరిశోధనలు చేశారు. ఇంతకీ జలాల ప్రవాహాన్ని లెక్కించడానికి వాళ్లు ఏం చేసే వారంటే.. బాటిళ్లలో తేదీతో సహా సందేశాలు రాసిపెట్టి పడవలు, ఓడల నుంచి సముద్రం మధ్యలోకి విసిరేవారు. ఆ తర్వాత ఈ బాటిళ్లు ఎవరికి దొరుకుతాయో వారు ఆ సీసాలో ఉన్న కాగితాన్ని హాంబర్గ్‌లోని జర్మనీ నౌకల విభాగానికి లేదా దగ్గర్లోని జర్మనీ రాయబార కార్యాలయానికి అందించాలి. ఆ బాటిల్ సముద్రంలో విసిరిన తర్వాత ఎన్నాళ్లకు తీరానికి వచ్చిందనేదాన్ని అంచనా వేసి సముద్ర జలాల వేగాన్ని, అలల దిశను కనుగొనేవారు. 19వ శతాబ్దంలో ఇలాంటి కొన్ని వేల సీసాలను సముద్రాల్లోకి విసరగా వాటిలో దాదాపు పది శాతం (660) సందేశాలు మాత్రమే తిరిగొచ్చాయి. చివరిగా 1934లో ఇలాంటి బాటిల్ డెన్మార్క్‌లో దొరికింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళకు అక్కడి బీచ్‌లో ‘సీసా సందేశం’ దొరికింది. జర్మనీకి చెందిన పౌలా నౌక నుంచి 1886 జూన్ 12వ తేదీన హిందూమహా సముద్రంలో ఫలానా అక్షాంశాలు, రేఖాంశాల ప్రదేశంలో ఈ బాటిల్‌ను నీళ్లలోకి విసిరేస్తున్నట్లు ఆ సందేశంలో రాసి ఉంది. -
వాట్సాప్ డిలీట్ మెసేజ్ సమయం పొడిగింపు
-
వేరే రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు వద్దు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సమాచారం లేకుండా వేరే రాష్ట్రాల్లో అకస్మాత్తుగా పర్యటిస్తుండటంపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పర్యటనల వల్ల సదరు సీఎంలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులందరికీ తెలియజేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ముందుగా సమాచారం ఇస్తే ఆతిథ్య సీఎంకు తగిన భద్రత కల్పించడం వీలవుతుందని తెలిపింది. సీఎంలకు జెడ్(22 మందితో), జెడ్ ప్లస్(55 మందితో) భద్రత కల్పిస్తారు. -
వాట్సాప్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు : యువతి అరెస్ట్
ఆదిలాబాద్: సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలో వ్యాఖ్యలు చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆదివాసీల నిరసనల్లో చెలరేగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని వనపర్తి జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన ముదావత్ సోను(22) ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిందని వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపారు. సెక్షన్ 66(ఏ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 ప్రకారం నేరమవుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని రాంనగర్ కాలనీకి చెందిన యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేశామని, మహిళా పోలీసు సిబ్బందితో కలిసి మహబూబ్‌నగర్ లోని ముర్లా కాలనీలో సోనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
గ్రహాంతరవాసుల అన్వేషణలో మరో ముందడుగు
లండన్: గ్రహాంతరవాసుల ఉనికిని గుర్తించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా మన పాలపుంతకు సమీపాన ఉన్న ఓ నక్షత్ర వ్యవస్థకు సందేశాన్ని (రేడియో మెసేజ్) పంపించారు. ఈ నక్షత్ర వ్యవస్థలోని జీజే 273 అనే నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో జీజే 273బీ అనే గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండటంతోపాటు నివాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయని మెస్సేజింగ్ ఎక్స్ట్రాటెర్రేస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాగ్లస్ వాకోచ్ చెప్పారు. ఈ గ్రహంపై గ్రహాంతరవాసుల ఉనికి గుర్తించేందుకుగాను సందేశాన్ని పంపినట్లు తెలిపారు. అంచనా ప్రకారం దాదాపు 25 సంవత్సరాలలోపు అక్కడి నుంచి ఏదో ఒక సమాచారం తమకు అందుతుందని అన్నారు. ఈ సందేశాన్ని మూడు రోజులపాటు కష్టపడి నార్వే నుంచి గత అక్టోబర్‌లో పంపినట్లు తెలిపారు. -
ఫ్యాన్స్‌కు యువీ స్పెషల్ మెసేజ్..
సాక్షి, హైదరాబాద్: టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ ప్రత్యేక సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చవద్దని, పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.‘ క్రాకర్స్ వద్దు.. కాలుష్యం లేని దీపావళిని జరుపుకుందాం.’అనే క్యాఫ్షన్‌తో ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో యూవీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. గతేడాది కాలుష్యంతో తను బాధపడిని విషయాన్ని గుర్తు చేశారు. ‘ ప్రతి ఒక్కరికీ హలో..నమస్కార్..నమస్తే..సలామ్.. ఈ దీపావళికి ఎవరూ క్రాకర్స్‌ను కాల్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. గతేడాది మనదేశంలో దీపావళి సందర్భంగా విపరీతమైన కాలుష్యం చోటుచేసుకుంది. దీంతో గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది కలిగింది. నేనైతే మా ఇంటి నుంచి కూడా బయటకు రాలేకపోయా. పటాకులు కాల్చుతూ పండుగ చేసుకోవడం ప్రకృతికి విరుద్దం, మనం, మన పిల్లలు, తల్లితండ్రులు, ప్రతి ఒక్కరు ఆనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. ఇది దీపాల పండుగ. కాబట్టి ప్రేమ, శాంతిలను పంచుతూ దీపాలతో సంబరాలు చేసుకుందాం. అలాగే అలయ్-బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొండి. స్వీట్లు తినండి. కార్డ్స్ ఆడండి. కానీ ఫైర్ క్రాకర్స్ మాత్రం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారు. ఇలా వారిని చూడటం మనకు సిగ్గుచేటు. ఈ పండుగకు కాలుష్యం నుంచి మన దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకొండి. దయచేసి క్రాకర్స్ జోలికి వెళ్లొద్దు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.’ అని యువీ వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దేశ రాజధాని న్యూఢిల్లీలో పటాకుల అమ్మకంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో యువరాజ్ కాలుష్యం నుంచి దేశాన్ని రక్షించాలని అభిమానులకు సూచించడం పట్ల ప్రకృతి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Say no to crackers, let’s celebrate a pollution free Diwali 🙏 #saynotocrackers #pollutionfree pic.twitter.com/l1sotpKizM — yuvraj singh (@YUVSTRONG12) 8 October 2017 -
మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదని విడాకులు..!
తైవాన్: భర్త కట్నం కోసం వేదిస్తున్నాడనో.. తాగి వచ్చి కోడుతున్నాడనో.. వివాహేతర సంబంధం పెట్టుకుని తనను సరిగా చూసుకోవడం లేదనో.. విడాకులు కోరే భార్యలను మనం చూస్తుంటాము. వీటన్నింటికీ భిన్నంగా ఓ మహిన తాను పంపిన ఫోన్ మెసేజ్‌కి రిప్లే ఇవ్వలేదని విడాకులు కోరింది. దీనికి కోర్టు స్పందించి విడాకులు మంజూరు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. తైవాన్‌కు చెందిన లిన్ అనే మహిళ తన భర్త ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లిన్ గత ఆరు నెలల నుంచి లైన్ అనే యాప్ ద్వారా ఆయనకు మెసేజ్‌లు పంపింది. అయితే వాటిని చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడంతో ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరు గత కొన్ని రోజులుగా మాట్లాడుకోవడం లేదు. ఇలా తన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడని లిన్ కోర్టులో ఆరోపించింది. లిన్ కోర్టులో మాట్లాడుతూ.. ఒకసారి తాను కారు ప్రమాదానికి గురైనపుడు ఆయనకు మెసేజ్ చేసినా చూసి కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరికీ సేవలు చేయాలని ఆర్డర్లు వేస్తాడని చెప్పింది. ఇదంతా విన్న న్యాయమూర్తి లిన్‌కు విడాకులు మంజూరు చేశారు. -
టాప్ ఐటీ బాస్‌లకు ముఖేశ్ అంబానీ సందేశం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత , బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాను తీసుకుంటున్న వేతనంలో ఎలాంటి మార్పులేకుండా ఈ ఏడాది కూడా నిర్ణయం తీసుకున్నారు. వరుసగా తొమ్మిదో సం.రం కూడా రూ.15 కోట్ల వార్షిక వేతనానికి పరిమితమయ్యారు. అలాగే ఇతర బోర్డు డైరెక్టర్లు పొందుతున్న స్టాక్ ఆప్షన్‌ను కూడా ఆయన తీసుకోవడం లేదు. మరోవైపు కంపెనీ లోని ఇతర అధికారుల వార్షిక ఇంక్రిమెంట్ పెంపును మాత్రం గణనీయంగా అమలు చేయడం విశేషం. 2008-09 నుండి రూ .15 కోట్లతో తన జీతం, ఇతర ఆదాయం కలిపి మొత్తం వార్షిక ఆదాయం దాదాపు 24 కోట్ల రూపాయలు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేతనం మొత్తం రూ. 38.75 కోట్లకు చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక నివేదిక ప్రకటనలో పేర్కొంది. 2009లో తన వార్షిక వేతనంపై అంబానీ స్వచ్ఛందంగా పరిమితి విధించుకున్నారు. పరిమితి గత తొమ్మిదేళ్లుగా ఇది అలాగే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2007-08 సంవత్సరానికిగాను రూ.44కోట్ల వార్షిక వేతనంతో అత్యధిక వేతనం తీసుకుంటున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ముఖేశ్ అంబానీ నిలిచారు. మరోవైపు ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ భారీగా పెరుగుతూ వుండటంపై ఇన్ఫీ ఫౌండర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంబానీ నిర్ణయం ఆకర్షణీయంగా నిలిచింది. ముఖ్యంగాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి వ్యాఖ్యల్ని నిపుణులు గుర్తు చేశారు. ఎంట్రీ లెవల్ అధికారులను తొలగించటానికి బదులుగా ముఖేష్ అంబానీ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా యువత ఉద్యోగాలను రక్షించుకోవాలంటే సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు తమ వేతనాల్లో కోత విధించుకోవాలని నారాయణ మూర్తి భావించిన సంగతి తెలిసిందే. -
ప్రియురాలి మెసేజ్‌తో ఆగిన పెళ్లి..!
-
ప్రియురాలి మెసేజ్‌తో ఆగిన పెళ్లి..!
వరంగల్: మరి కొద్దిసేపట్లో పెళ్లి జరగనుందనగా.. పెళ్లి కూతురుకు వచ్చిన ఓ మెసేజ్‌తో పెళ్లి అర్ధంతరంగా ఆగింది. పెళ్లి కుమారుడికి మరో యువతితో సంబంధం ఉందనే విషయం స్వయానే అతని ప్రియురాలే ఆమేకు మెసేజ్ చేసింది. దీంతో అప్రమత్తమైన వధువు పెళ్లి ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నగరంలోని రామన్నపేటకు చెందిన యువతికి కృష్ణాజిల్లాకు చెందిన పేట భరత్ శ్రీనివాస్‌తో పెళ్లి నిశ్ఛయమైంది. ఆదివారం తెల్లవారుజామున పెళ్లి ముహుర్తం ఖరారైంది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు ఖాజీపేటలోని శ్యామల గార్డెన్స్‌కు చేరుకున్నారు. అంతలో పెళ్లి కూతురు ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివిన అనంతరం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పింది. గతంలో ఓ అమ్మాయి జీవితంతో ఆడుకొని పెళ్లికి సిద్ధమైన పెళ్లి కొడుకును పోలీసులకు పట్టించింది. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. పేట భరత్ శ్రీనివాస్ విజయవాడలోని హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో రిలేషన్షిప్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సునిత అనే యువతితో ప్రేమ వ్యవహరం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సునిత పెళ్లి కూతురి ఫోన్ నంబర్ కనుక్కొని పూర్తి వివరాలతో ఆమెకు మెసేజ్ పంపడంతో పీఠల వరకు వచ్చిన పెళ్లి ఆగింది. -
ఉప ఎన్నికల సందేశం
మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రారంభించిన జైత్రయాత్రను బీజేపీ అప్రతిహ తంగా కొనసాగిస్తూనే ఉన్నదని గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు లభిస్తే కాంగ్రెస్‌కు మూడు... తృణమూల్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లకు ఒక్కోటి వచ్చాయి. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి బీజేపీ చాలా త్వరగానే కోలుకుని పకడ్బందీ ప్రణాళికతో అడుగులేస్తున్నదని ఆ తర్వాత మహారాష్ట్ర మొదలుకొని యూపీ వరకూ జరిగిన వరస ఎన్నికలు నిరూ పించాయి. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా తనకు మంచి భవిష్యత్తు ఉన్నదని ఆ పార్టీ రుజువుచేసుకుంది. సామాజిక మాధ్యమాలను సమర్ధవంతంగా ఉపయో గించుకోవడంలో అయితేనేమి, అవినీతి వ్యతిరేక ప్రచారంలో అయితేనేమి బీజేపీకి దీటుగా నిలబడి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొంతకాలంగా నిస్తేజమవుతున్న జాడలు కనబడుతూనే ఉన్నాయి. ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానే అయి చేస్తున్న పోరా టం ఆయనపై ఉన్న సానుకూలతను పెంచకపోగా నానాటికీ తగ్గిస్తున్నదని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి దాపురించిన ఘోర పరాజయం నిరూపించింది. కర్ణాటకలో కాంగ్రెస్ రెండు ఉప ఎన్నికల్లోనూ సాధించిన విజయం ఎన్నదగ్గది. అది నంజన్‌గూడ్‌లో 21,000 మెజారిటీతో, గుండ్లుపేట్‌లో 10,000 మెజారిటీతో నెగ్గింది. దాని ఓట్ల శాతం కూడా గతంతో పోలిస్తే పెరిగింది. కానీ ఆ విజయం తమ ఘనతేనని చెప్పుకునే స్థితి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి లేకుండాపోయింది. అవి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తిగత విజయాలు. ఆ రెండుచోట్లా మరో ప్రధాన పార్టీ జేడీ(ఎస్) అభ్యర్థుల్ని నిలపకపోవడం ప్రధానంగా కాంగ్రెస్‌కు కలిసొ చ్చింది. అంతేకాదు నంజన్గూడ్ కాంగ్రెస్ అభ్యర్థి కేశవమూర్తి ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందు జేడీ(ఎస్)నుంచి వచ్చి చేరారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న శ్రీనివాసప్రసాద్ మొన్నటివరకూ సిద్ధరామయ్య సర్కారులో రెవెన్యూ మంత్రిగా పనిచేసినవారే. కేబినెట్ నుంచి తనను తొలగించడంతో ఆగ్రహించిన శ్రీనివాసప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజే పీలో చేరారు. అందువల్లే అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. శ్రీనివాసప్రసాద్ చేరికతో అంతంతమాత్రంగా ఉన్న దక్షిణ కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకుం టుందని, అది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడి మళ్లీ సీఎం పీఠాన్ని తనకు దక్కిస్తుందని బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప భావించారు. కానీ ఆయన కల ఫలించలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ఎం కృష్ణ చేరిక కూడా బీజేపీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పు డెదురైన ఓటమితో యడ్యూరప్పకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సారథ్యం దక్కడం అనుమానమే. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఒక స్థానం కాంగ్రెస్ సొంత మైనా మెజారీటీ మాత్రం అతి స్వల్పం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం రాజస్థాన్‌లోని ఢోల్పూర్లో బీజేపీ గెలుపు కాంగ్రెస్‌కు నిరాశ కలిగించేదే. అక్కడ వసుంధర రాజే పాలనపై జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నదని, వచ్చే ఎన్నికల నాటికి అది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ కొండంత ఆశతో ఉంది. అక్కడి ఉప ఎన్నిక ఫలితం దానికి గండికొట్టింది. బెంగాల్లో జరిగిన ఉప ఎన్నిక బీజేపీని విజేతగా నిలబెట్టకపోయినా ఆ పార్టీని జనం తృణమూల్‌కు దీటైన పక్షంగా భావిస్తున్నారని తేల్చింది. అటు వామపక్షాలు, ఇటు కాంగ్రెస్ దీన్ని గమ నించుకుని ఉండాలి. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. సిక్కుల ఊచకోత కేసుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంపై విలేకరుల సమావేశంలో బూటు విసిరి సంచలనం సృష్టించిన పాత్రికేయుడు జర్నైల్‌సింగ్. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో జర్నైల్ దాదాపు 47 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించగా ఇప్పుడు ఆప్ మూడో స్థానానికి దిగజారి డిపాజిట్ కోల్పో యింది. రాజకీయాల్లో తాను అనుసరిస్తున్న బాణీ ప్రజలకు నచ్చడంలేదని ఈ ఫలి తంతో కేజ్రీవాల్‌కు అర్ధమై ఉండాలి. అయితే జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరిగిన తీరు ఆందోళన కలిగించేది. అక్కడ నిండా 7 శాతంమంది కూడా పోలింగ్‌లో పాల్గొన లేదు. పది శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు గతంలో లేక పోలేదుగానీ 30 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఇంత తక్కువగా పోలింగ్ జరగడం ఇదే ప్రథమం. 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్ నిర్వహిస్తే అందులో రెండంటే రెండు శాతంమంది ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. భద్రతా బలగాలకూ, నిరసన లకు దిగిన వేర్పాటువాదులకూ మధ్య బుడ్గామ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగడం, కొన్ని పోలింగ్ కేంద్రాలపైకి పెట్రోల్ బాంబులు విసరడం, భద్రతా బలగాల కాల్పుల్లో 8మంది మరణించడం ఈ ఉప ఎన్నికను రక్తసిక్తం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఒక వీడియోను గమనిస్తే ఆ ప్రాంతంలో విధి నిర్వ హణ భద్రతాబలగాలకు ఎంత సంక్లిష్టంగా మారిందో అర్ధమవుతుంది. జమ్మూ– కశ్మీర్ స్థితిగతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమీక్షించి అక్కడ అనుసరి స్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక గుర్తుచేసింది. ఎన్నికల్లో ప్రచారమే తప్ప అనంతరం ఎదురయ్యే వైఫల్యాల గురించి అయినా... దక్కే ఒకటో రెండో విజయాలపైన అయినా ఒక్కనాడూ చర్చించడం అలవాటులేని కాంగ్రెస్ ఎప్పటిలాగే ఈసారి కూడా జాడ, జవాబూ లేకుండా మిగిలిపోయింది. చిత్రమేమంటే 2014 సార్వత్రిక ఎన్నికలు దాన్ని విపక్షంలోకి నెడితే... అనంతరం జరుగుతున్న ఎన్నికలు దానికి ఆ స్థానం కూడా మిగలకుండా చేస్తున్నాయి. అయినా అధినేతల్లో చలనం లేదు. ఇలాంటి విపక్షం ఉన్నంతకాలం భవిష్యత్తుపై బీజేపీ బెంగపడాల్సిన అవసరం ఉండదు. -
జెన్... ఒక జీవనవిధానం!
సందేశం మంచి భోజనం చేస్తే ఎంత తృప్తి లభిస్తుందో ఒక మంచి కథ విన్నా, చదివినా అంతే ఆనందం, తృప్తి లభిస్తాయి. కథ చదవటమే కాకుండా దాని గురించిన విశ్లేషణ వల్ల కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అసలు కథలు అన్నమాట వినగానే పిల్లల దగ్గరనుంచి పెద్దల దాకా అందరికీ ఎంతో ఉత్సాహం వస్తుంది. మనకి తెలిసి ఎన్నో రకాల కథలున్నాయి. పంచతంత్ర కథలు– జంతువుల పాత్రలలో నీతిని బోధించే కథలుగా ప్రసిద్ధి పొందాయి. జాతక కథలు కూడా పంచతంత్ర కోవకే చెంది నీతిని అందిస్తాయి. ఇక హాస్యంతో నిండినవి తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్ బీర్బల్ కథలు. ఇవి పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఉల్లాసాన్నిస్తాయి. రామాయణ భాగవతాలు మొదలైన పురాణ గ్రంథాలు కూడా కథల రూపంగా వచ్చాయి. ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు వారి ఉపన్యాసాలలో సత్సంగాలలో మధ్యమధ్య సందర్భానుసారంగా ముల్లాకథలని ప్రస్తావిస్తూ ఉంటారు. మన దైనందిన జీవితంలో నిరాశానిస్పృహలు ఎదురైనప్పుడు కథలు చదవడం వల్ల కొత్త ఉత్సాహం తెచ్చుకోవచ్చు. కథలంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. కథ చెప్పేవారి నేర్పు, సామర్థ్యం మీద, వినేవారి ఉత్సాహాన్ని బట్టి అందులో ఆనందం పొందవచ్చు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే జెన్ కథలు కూడా చాలా పురాతనమైనవే. భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం, చైనాలో చెన్‌గా మారి 12వ శతాబ్దంలో జెన్గా పరిణతి చెందింది. భారతదేశంలోని బౌద్ధం చైనాలోని తావోయిజం కలిపి జెన్గా మారింది. బోధి«దర్ముడు ఈ జెన్ను చైనాకు తీసుకువెళ్లాడు. జెన్ గురించిన సమాచారం, విజ్ఞానం సుజుకి అనే వ్యక్తి అక్కడివారికి తన ప్రసంగాలతో ప్రాచుర్యాన్ని కల్పించాడు. జెన్ అంటే ఒక తత్వం కాదు, ఒక జీవన విధానం. జెన్ అంటే అప్రమత్తత. జెన్ అంటే ధ్యానం. నిశ్శబ్దంగా, కళ్లు మూసుకొని మౌనంగా బుద్ధిని కేంద్రీకరించి ధ్యానం చెయ్యడం ఒక విధమైన ప్రక్రియ. దీనివలన మన బుద్ధిని, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేసిన ఏకాగ్రత పెంచుకోవచ్చు. మనం చేసే ప్రతిపనినీ ధ్యానంగా మార్చుకోమని చెబుతుంది జెన్. నడిచినా, మాట్లాడినా, తిన్నా, నిద్రపోయినా ఏ పని చేస్తున్నా ఏకాగ్రతతో, ఎరుకతో చేస్తే ఆ పనిలోనూ ఉత్సాహం ఉంటుందని అంటుంది జెన్ సిద్ధాంతం. జర్మనీకి చెందిన ఓ మానసిక శాస్త్రవేత్త ఇలా చెప్పారు. ఎదుటివారి ప్రవర్తనలో పొరపాట్లు, లోపాలు చెప్పి వారిని సరిదిద్దటానికి ప్రయత్నిస్తే వారు తమ తప్పులు తెలుసుకోకపోగా తమని తాము సమర్థించుకోవడానికి యత్నిస్తారు. వారి ప్రవర్తన సరిదిద్దటానికి ప్రయత్నించినపుడు నేరుగా చెప్పక ఒక కథ రూపంలో చెప్పడం వల్ల వారి ప్రవర్తన అద్దంలో ప్రతిబింబంలాగా చేసుకుని చూసుకుని ఆత్మపరిశీలన చేసుకుని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది అని. ముఖ్యంగా జెన్ కథలు చదివిన ప్రతిసారి వాటిలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుంది. మన సమస్యలకి తగినట్లుగా మనం సమాధానాలు తీసుకోవచ్చు. ఎన్నిసార్లు చదివితే అంత ఉపయోగం. చదివిన ప్రతిసారి ఒక మానసిక ఊరట, కొత్తదనం కనిపిస్తుంది. కాబట్టి కథలు చెప్పడం, వినడం, కథలు చదవడం ఎంతో మంచి అలవాటు. -
కోహ్లీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ విత్ ఫోటో..
న్యూఢిల్లీ: వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమికుల రోజును లేట్‌గా నైనా లేటెస్ట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అవును..ఇప్పటివరకు ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్కకు వాలెంటైన్స్ డే మెసేజ్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆటతోపాటు తనకు అనుష్క కూడా ఎంత ఇంపార్టెంటో చెప్పకనే చెప్పాడు కోహ్లి. ఇద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీని తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అంతేకాదు.మనం ఫీల్ అయితే... ప్రతి రోజు వాలెంటైన్స్ డే నే ..నా ప్రతిరోజును నువ్వు అలా మార్చేశావ్.. అంటూ అనుష్కనుద్దేశించి కమెంట్ చేశాడు. దీంతో అటు అనుష్క మాత్రమే కాదు.. ఇటు కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.. లేట్ గా అయినా భలే కవరింగ్ ఇచ్చాడుగా.. ముద్దుగుమ్మకి అని అభిమానులు మురిసిపోతున్నారు. టీమ్ ఇండియా క్రేజీ కెప్టెన్ పోస్ట్ చేసిన ఈ ప్రేమ సందేశం క్షణాల్లో వైరల్ గా వ్యాఫించింది. లైక్స్, కామెంట్స్ కుప్పలు తెప్పలుగా రావడం విశేషం. ఇద్దరూ కలిసున్న ఫొటోను విరాట్ తొలిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతేడాది విడిపోయి మళ్లీ కలిసిన తర్వాత విరాట్ ఇంత ఓపెన్‌గా ఇద్దరి ఫొటోను పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. వరుస హోమ్ సిరీస్‌లతో బిజీబిజీగా గడుపుతున్న విరాట్‌కు వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకునే టైమ్ కూడా దక్కలేదు. అటు అనుష్క కూడా ఫిల్లౌరీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి.. కోహ్లీ మెసేజ్ పై అమ్మడుఎలా స్పందిస్తుందో చూడాలి. -
విశాఖలో విడుదలైన సందేశాత్మక వీడియో
-
తన గురించి వెతకొద్దని మెసెజ్ పెట్టి..
మలేసియా టౌన్ షిప్: తన గురించి వెతకొద్దని కుటుంబ సభ్యులకు ఎస్సెమ్మెస్ పంపించి గృహిణి అదృశ్యమైంది కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ మహేష్ గౌడ్ కథనం ప్రకారం... నిజాంపేట గ్రామంలోని మిలినియం హోమ్స్‌లో ఎస్.జందారావు, చందన ప్రతిమ దంపతులు (35) నివాసముంటున్నారు. జందారావు ప్రైవేట్ ఉద్యోగి కాగా, చందన ప్రతిమ గృహిణి. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం ప్రతిమ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో జందారావు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించడంతో పాటు బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన గురించి వెతక వద్దని చందన ప్రతిమ భర్తకు, సోదరుడికి సెల్ ద్వారా మెసేజ్ పంపించినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షాహిద్ కు మెసేజ్ చేసిన కరీనా
బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని భార్య మీరా రాజ్‌పుత్ శుక్రవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. బుజ్జాయి రాకతో షాహిద్ సంతోషంలో మునిగిపోయాడు. తొలిసారి తల్లిదండ్రులైన షాహిద్ దంపతులకు.. సన్నిహితులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి షాహిద్ గాళ్ ఫ్రెండ్ కరీనా కపూర్ కూడా వీరికి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. షాహిద్ తండ్రయ్యారన్న విషయం తెలిసిన వెంటనే షాహిద్‌కు అభినందనలు తెలుపుతూ కరీనా మెసేజ్ పంపించారట. ఒకప్పటి విఫల ప్రేమికులు.. వివాహానంతరం స్నేహితులుగా మారారు. కాగా మరికొన్ని నెలలలో కరీనా కూడా తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. బాలీవుడ్ టాప్ హీరో, కరీనా భర్త అయిన సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్లు 'రంగూన్' సినిమాలో కలిసి నటిస్తున్నారు. -
ప్రజల్లో జాతీయోద్యమ నేతల ఆశయాలను పాదుగొల్పాలి
వైఎస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ పాలన నుంచి దేశ విముక్తి కోసం పోరాడి స్వాతంత్య్రం సాధించిన జాతీయోద్యమ నేతల ఆశయాలు, వారి సిద్ధాంతాలు, విలువలను ప్రజల్లో పాదుగొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తుల అవిరళ కృషి, వారి అంకితభావ పోరాటాలతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. -
నంబర్ చెబితే.. గుల్లే!
బడా సంస్థల పేరుతో ఫేక్ మెసేజ్‌లు డబ్బులు కొల్లగొట్టాక మాయం ఆన్లైన్ మోసాలకు అమాయకుల బలి నగరానికి చెందిన సుబ్బారావు మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పెప్సీకోలా మోటార్స్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తీసిన లాటరీలో మీ మొబైల్ నంబర్‌కు డ్రా పలికిందని, రూ.3.5 కోట్లు గెలుచుకున్నారని.. దాని సారాంశం. ఆ సొమ్ము మీకు పంపించాలంటే మీ పేరు, మొబైల్ నంబరు, అడ్రస్, ఈ మెయిల్ ఐడీతో పాటు, బ్యాంకు అకౌంటు నంబరు తెలియజేయాలంటూ మరో ఎస్ఎంఎస్ వచ్చింది. దాంతో పాటు ఒక ఫోన్ నంబరు కూడా పంపించారు. సుబ్బారావు వెంటనే మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి స్పందిస్తూ.. ‘ఆ మొత్తం పంపించాలంటే ముందుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందు కోసం ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. చెక్కు మీ చిరునామాకు పంపిస్తాం’ అని చెప్పాడు. సుబ్బారావు ఆ మొత్తాన్ని వారు చెప్పిన అకౌంట్లో వేశారు.మళ్లీ మోసగాళ్ల నుంచి ఫోన్. పన్ను కట్టారు సరే.. మీ ఇండియా కరెన్సీగా మారాలంటే మరో రూ.2లక్షలు అవసరం ఉంటుంది. అర్జెంటుగా ఆ మొత్తాన్ని మరో అకౌంటు నంబరు పంపిస్తున్నాం. అందులో డిపాజిట్ చేయండి.. అని సారాంశం. అది కూడా డిపాజిట్ చేశాడు సుబ్బారావు. ఇలా దఫదఫాలుగా రూ.5 లక్షల మేర డిపాజిట్ చేశాడు మన సుబ్బారావు. ఒకసారి వాడిన ఫోన్ నంబరు మరోసారి వాడకుండా, ఒకసారి ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు మరోసారి ఇవ్వకుండా ఆన్లైన్ మోసగాళ్లు డబ్బులు కట్టించుకుపోయారు. సుబ్బారావుకు ఎట్టకేలకు అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించి తన దగ్గరున్న వివరాలతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు కేసు నమోదు చేసి, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చే శారు. ఇలాంటి సుబ్బారావులు మన మహా విశాఖ నగరంలో చాలా మంది ఉన్నారు. అత్యాశకు పోయి చాలా మంది జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. - అల్లిపురం నగరంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లక్కీ లాటరీలో కోట్లాది రూపాయలు దక్కించుకున్నారంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ మోసగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. ప్రజలను నమ్మించడం కోసం ఇందుకు బడా కంపెనీల పేర్లను వినియోగించుకుంటున్నా రు. కౌన్‌బనేగా కరోడ్‌పతి, ఎయిర్టెల్ లాట రీ, టాటా డొకొమో లాటరీ, ఐసీసీ కప్ లాటరీ, స్టార్ స్పోర్ట్సు లాటరీ, బీబీసీ, హీరో హోండా, షెవర్లట్ మోటార్స్ తదితర కంపెనీల పేర్లతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొడుతున్నారు. ప్రజలూ.. బహుపరాక్!: సైబర్ నేరగాళ్లు దేశ విదేశాల్లో ఉంటూ ఇక్కడి ప్రజల డబ్బులను కొల్లగొడుతున్నారు. మాకు కొంత డబ్బు వచ్చింది. ఇక్కడ తమకు బ్యాంకు ఖాతా లేదు. మీ అకౌంట్ నంబర్ ఇస్తే.. అందులో డబ్బులు జమ చేస్తామంటారు. ఆ తరువాత తాము చెప్పిన ఖాతాలో తిరిగి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా మీకు కమీషన్ ఇస్తామంటూ అమాయకుల నుంచి ఖాతా వివరాలు సేకరిస్తారు. మరో వైపు ఫేక్ మెసేజ్‌లతో నమ్మించి ఇలాంటి ఖాతాలో ఆ సొమ్మును జమ చేయిస్తారు. తరువాత ఆన్లైన్లో ఆ సొమ్మును లాగేస్తుంటారు. తీరా.. పోలీసులు దర్యాప్తులో ఇలా అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతుంటారు. అసలు నిందితులు మాత్రం తప్పించుకు తిరుగుతుండడం గమనార్హం. మూడేళ్లలో నమోదైన సైబర్ కేసులు నగరంలో మూడేళ్లలో నమోదైన సైబర్ నేరాల్లో 90 శాతం బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని మోసాలు చేసినవే. 2014లో 198 కేసులు నమోదు కాగా.. వాటిలో 30 కేసులు పిషింగ్ విషింగ్వే. 2015లో 267 కేసులో నమోదవ్వగా.. వాటిలో 128 కేసులు, 2016లో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు కాగా.. వాటిలో 85 కేసులు పిషింగ్ విషింగ్వి ఉన్నాయి. అవగాహన కల్పిస్తున్నాం ప్రస్తుతం సైబర్ నేరాల అధికంగా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాల రూపంలో ముద్రించి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. గుర్తు తెలియని ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దు. ఒక వేళ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దు. అలా ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అపరిచితుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్లతో అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ మెసేజ్‌లను మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి. పెద్ద మొత్తంలో డబ్బులు మీ మొబైల్ నంబర్ గెలుచుకుందంటూ పలు కంపెనీల పేర్లతో వచ్చే ఈ-మెయిల్స్‌ను నమ్మొద్దు. -ఎం.సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ విషింగ్.. పిషింగ్..! ఇటీవల వెలుగు చూస్తున్న విషింగ్, పిషింగ్ కాల్స్ గురించి అవగాహన అవసరం. అపరిచితులు విషింగ్ కాల్స్ ద్వారా ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం పిన్ నంబర్లు సేకరించి డ బ్బులు కాజేస్తారు. ఆన్లైన్లో ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. మీ ఏటీఎం కార్డు కాలవ్యవధి రేపటి నుంచి అయిపోతుంది. ఈ రోజు కొత్త నంబరు మార్పు చేసుకోండి. మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు చెప్పండి అంటూ మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు ద్వారా మీరు ఫోన్లో ఉంటుండగానే మీ అకౌంట్లోను, క్రెడిక్ కార్డులో ఎంత ఉంటే అంత డబ్బును డ్రా చేసుకోవటం, ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం చకాచకా జరిగిపోతుంటాయి. తీరా మీ సెల్‌ఫోన్‌కు మీ ఆర్డర్ బుక్ అయింది, మీ అకౌంట్ నుంచి ఇంత డబ్బులు డ్రా అయ్యాయి అని మెసేజ్ వస్తేగాని.. మోసపోయామని తెలుసుకోలేరు. ఇంతలో మీకు ఫోన్లో కాంటాక్ట్ చేసిన వ్యక్తి స్విచాఫ్ చేసేస్తాడు. ఆ తరువాత లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు. -
మా చెడ్డ ప్రేమ
ఒకప్పుడు ఇంట్లో అందరికీ ఒకే ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక ఫోను! అప్పుడు ఫోన్ మోగితే ఎవరు ఎత్తినా పర్లేదు. ఇప్పుడు ఫోన్ మోగితే ఎవరూ ఎత్తడానికీ వీల్లేదు. పెళ్లి ప్రమాణాల్లో...‘యు అండ్ మీ.. నథింగ్ ఇన్ బిట్వీన్’ - అంటే.. నువ్వు, నేను... మధ్యలో ఇంకేం లేదు అంటాం.. దాపరికాలు, అరమరికలు, రహస్యాలు ఉండవని! తస్సాదియ్యా.. మొగుడికి మేకు, పెళ్లానికి ఏకై... స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నమ్మకం నుంచి పుట్టాల్సిన ‘కన్సర్న్’ కాస్తా... అనుమానం నుండి పుట్టుకొస్తోంది! ఏమైనా... ఒకరి ఫోను ఇంకొకరు చూడ్డం మా చెడ్డ ప్రేమ! ఆలు మగలుగా ఒకరికొకరు తోడూ నీడగా ఉంటామని, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని, అరమరికలు లేకుండా కడదాకా కలిసే ఉంటామని పెళ్లినాడు ప్రమాణం చేయిస్తారు పురోహితులు. అంతవరకూ బాగానే ఉంది. భార్యాభర్తల మధ్యకి మూడోవ్యక్తి ఎవరైనా వస్తే..? అది వారి అన్యోన్య దాంపత్యఫలంగా పుట్టిన పిల్లలే తప్పించి మరొకరు కాకూడదు. అయితే ఇప్పుడు మొగుడూ పెళ్లాల మధ్యకు అనివార్యంగా మూడో శాల్తీ వస్తోంది. అది ఆడ కాదు, మగకాదు. అయినా సరే, వారి మధ్య చిచ్చురేపుతోంది. దాని మూలంగా కాపురాలు కూలిపోతున్నాయి. బంధాలు మాసిపోతున్నాయి. ఇంతకీ అదెవరో తెలుసా? ఫోనండీ! పోనీండీ, ఫోనేంటీ కాపురాలు కూల్చడమేంటీ అని కొట్టిపారేయొద్దు. తేలిగ్గా తీసిపారేయొద్దు. ఫోన్.... అదీ స్మార్ట్‌ఫోన్ సృష్టిస్తున్న కలతలు అన్నీ ఇన్నీ కావు. కాదేదీ కవిత్వానికనర్హం అని అన్నట్టు కాదేదీ కలతలకు అనర్హం... ప్రాణం లేని ఫోన్‌తో సహా అంటున్నాయి విశ్లేషణలు. ఎవరి ఫోన్ వారికే సొంతం అనే ధోరణి స్థిరపడింది. ఎంత భార్యాభర్తలైనా సరే ఒకరి ఫోన్లో కాంటాక్ట్స్‌ను, మెసేజ్‌లను మరొకరు ఓపెన్ చేయడం వంటివి సహించబోమనే పరిధులు బలపడ్డాయి. ఈ మధ్య బెంగుళూరులో సునీతా సింగ్ అనే అమ్మాయి... కూరగాయలు తరిగే చాకు తీసుకుని భర్తమీద వీర విహారం చేసింది. ఎందుకో తెలుసా? అతగాడు తన ఫోన్ తీసుకుని తనకొచ్చిన మెసేజీలను చాటుగా చదువుతున్నాడని. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా, వివరాల్లోకి వెళితే మాత్రం కర వమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఎవరినీ త ప్పు పట్టలేని పరిస్థితి..! మెకాఫీ అనే ఆన్లైన్ వ్యవహారాల భద్రత సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... 42 శాతం మంది తమ భార్య లేదా భర్త ఈమెయిల్ అకౌంట్‌ను చెక్ చేస్తుంటారని తెలిసింది. మిగిలిన వాళ్లు కనీసం నెలకు ఒకసారి అయినా అవతలి వారి ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్తుంటారట! స్వైప్ బూస్టర్, ఫ్లెక్సి స్పై, ఎమ్స్పై అనే యాప్‌ల సాయంతో జంటలు తమ భాగస్వామి అకౌంట్‌ను తెరిచి, అందులో ఏముందోనని వెతికే ప్రయత్నాలు చేస్తుంటారట. రిలేషన్షిప్లో ఉన్న జంటలలో ప్రతి ఐదుగురు పురుషులలో ఒకరు, ప్రతి ఐదుగురు స్త్రీలలో సగం మంది, తరచు తమ భాగస్వామి ఫోన్లను చెక్ చేస్తుండటమే పనిగా పెట్టుకుంటారని యూఎస్‌లో 13,132 జంటలపై సర్వే నిర్వహించిన అవాస్ట్ అనే మరో సంస్థ తెలిపింది. గూఢచారులలో కనీసం 25 శాతం మంది తమ ప్రియుడు లేదా ప్రియురాళ్ల కదలికలపై కన్నేసి ఉంచే పనికే తమ వృత్తిని అంకితం చేయవలసి వస్తోందని నివేదిక తెలిపింది. మరో 12 శాతం మంది తమ భాగస్వాములు చెప్పేది నిజమో అబద్ధమో నిర్ధారించుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారని కూడా ఆ సర్వేలో తెలిసింది. నమ్మకం లేదనేగా...?! ఫోన్ చెక్ చేయడం అపార్థాలకు దారితీస్తుంది... బాంధవ్యాన్ని దెబ్బతీస్తుంది అనేది నటుడు గౌతమ్ గులాటి అభిప్రాయం. ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడం, చేయకుండా ఉండటమనేది వారిలో ఒకరిపట్ల మరొకరికి ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి చిహ్నం. తన భర్త లేదా భార్య తప్పు చేయరు అనే నమ్మకం ఉంటే వారి ఫోన్ చెక్ చేయాలన్న ఆలోచనే ఉండదు. మీ భాగస్వామి ఫోన్‌ను రహస్యంగా చెక్ చేస్తున్నారంటే వారి మీద మీకు నమ్మకం లేదనే అర్థం. అనుమానం కొద్దీ కాకపోయినా ఒక్కోసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అవతలివారి ఫోన్ చెక్ చేసినా కూడా అది అపోహలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. పాస్వర్డ్స్ పంచుకోవడం ప్రేమకు ప్రతీకేమీ కాదు! ‘‘గూఢచర్యం చేయడం బాంధవ్యానికి హాని చేయకపోవచ్చు. మీ భాగస్వామి రహస్య ఫోన్ నంబర్లు లేదా మెయిల్ ఐడీల మీద కూడా ఓ కన్నేసినా, వారు మీకు ఎక్కడా దొరక్కపోవచ్చు. అయితే అలా చేసినందువల్ల మీకు ప్రత్యేకంగా ఒరిగే ప్రయోజనం, తృప్తి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మరోకోణం చూద్దాం... కొందరు తమ ఫేస్బుక్ లేదా వాట్సాప్ అకౌంట్లకు, ఫోన్లకు ఒకే పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఎంత జీవిత భాగస్వాములైనప్పటికీ, ఒకరి పాస్వర్డ్స్ మరొకరికి తెలిసేలా పెట్టుకున్నంత మాత్రాన వారి మధ్య పొరపచ్ఛాలు లేవనీ, రావనీ చెప్పలేం. దానికంటే కూడా టెక్నాలజీని మీ ప్రేమను పంచుకోవడానికి, పెంచుకోవడానికీ వాడుకోవడం బెటర్. అంతేకానీ, నిఘాలు, గూఢచర్యాల వల్ల ఒరిగేదేమీ లేద’’ంటారు ప్రీతీ షెనాయ్ అనే రచయిత్రి. పర్సనల్ స్పేస్ ఉండాలి మేము భార్యాభర్తలమే.. అయితే ఎవరి ఇండివిడ్యువాలిటీ వారిది. అంటున్నారు నటి షాజహాన్ పదామ్సీ. భార్యాభర్తలు ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి మరొకరు తలదూర్చనక్కరలేదు. ముఖ్యంగా ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పర్సనల్ స్పేస్ వారికి ఉండాలి. అప్పుడే వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. అసలు ఎవరి ఫోన్ వారికి ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఒకరి ఫోన్లోని కాల్‌డేటా, మెసేజ్‌లు చెక్ చేయాల్సిన పనేంటి? అన్నది పదామ్సీ వాదన. ఇదే అక్కడయితేనా..! యూఎస్, యూకేలలా కాదు...భారతీయులు తమకంటూ ఒక ప్రైవసీ ఉంటుందని ఇంకా పూర్తిగా గుర్తించలేదంటున్నారు అడిషినల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్. మన పరిధులు దాటి అవతలి వారి వ్యక్తిగత విషయాల్లో, ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం భారతీయులలో చాలా సాధారణం. అసలు తాము అవతలివారి పర్సనల్ స్పేస్‌లోకి అడుగుపెడుతున్నామన్న విషయం చాలామందికి తెలియదు కూడా! దీని మీద అవగాహన రావాలి. అవతలి వారి పర్సనల్ ఫైల్స్‌లోకి, పత్రాలలోకీ, ఫొటోగ్రాఫుల్లోకీ తలదూర్చడం వల్ల వారితో అనుబంధం పెరగకపోగా, బలహీనపడుతుంది. ఒక్కోసారి వారి బంధాలు పుటుక్కున తెగిపోతాయి కూడా! యూఎస్, యూకేలలో అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ప్రాధాన్యముంది. భార్యాభర్తలు, తల్లీకొడుకులు, తండ్రీకూతుళ్లు, తల్లీకూతుళ్లు, తండ్రీకొడుకులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఆప్తమిత్రులు, దగ్గర బంధువులు... ఇలా వారి మధ్యన ఉండే బంధం ఏమిటనేది పక్కన పెడితే, అలా వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా తప్పుగా భావిస్తారు. తమ వ్యక్తిగత విషయాలను కాపాడుకోవడం అక్కడి వాళ్లు హక్కుగా చూసుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం గురించి రాజ్యాంగపరమైన కట్టుబాటు ఏమీ లేకపోయినప్పటికీ, దానిని ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటున్నారు పింకీ ఆనంద్. ప్రైవసీ కోసం కాదు... అంతకన్నా ఎక్కువే! మీ భాగస్వామి ఫోన్ చెక్ చేయడం, ఫోన్లోకి తొంగిచూడటం మీ హక్కు కాదు, సరికాదు కూడా! అది తప్పొప్పులకూ, నమ్మకం, అపనమ్మకాలకూ సంబంధించిన సమస్య కూడా కాకపోవచ్చు. కానీ అది లేనిపోని అపార్థాలకు చోటిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను అంటున్నారు రాజకీయ వేత్త వాణీ త్రిపాఠి. సదుద్దేశ్యమే అయితే ఫరవాలేదు కానీ... అవతలి వారి ఫోన్ చెక్ చేయడమనేది ఏదైనా బలమైన కారణం ఉంటే తప్పించి, ఉబుసుపోక జరగకూడదు. అదీకూడా తమ భాగస్వామి ఫోన్‌ను సదుద్దేశ్యంతో చెక్ చేస్తే తప్పులేదు. కానీ తప్పులు ఎత్తి చూపడానికో, నిందలు వేయడానికో, అభాండాలు మోపడానికో అయితే మాత్రం చాలా అసంబద్ధంగా, హేయంగా ఉంటుంది. ఒకవేళ రహస్యాలు ఏమైనా ఉంటే అవి తమ ఇద్దరికీ తప్పించి, మూడోవ్యక్తికి తెలియకూడదనే ఉద్దేశ్యంతో అవతలి వారి కాల్ హిస్టరీనో, మెస్సేజులో, ఫొటోలో చెక్ చేసి, వాటిని ఎవరి కంటా పడకుండా దాచేయడం కోసం చూడటంలో తప్పులేదు. ఒకవేళ నాకే గనుక ఇటువంటి సంఘటన ఎదురయిందనుకోండి, నేను వీలయినంత నమ్రతగా, మర్యాదగా నా భాగస్వామికి ఆ విషయం చెప్పి, తన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను ఫోన్ చెక్ చేస్తాను అంటున్నారు రచయిత్రి ప్రాచీ గార్గ్. -
ఆకుపచ్చ నిరసన
భోపాల్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యవసాయాన్ని ప్రోత్సహించమని భారీ స్థాయిలో పంటను పండించి వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపిన ఘటన మధ్యప్రదేశ్ లోని పరద్ సింగా గ్రామంలో చోటు చేసుకుంది. అర్కిటెక్టులు, రైతులు కలిసి ఆకాశం నుండి చూస్తే 'డియర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీస్ గ్రో ఆన్ ఇండియా ' అని కనబడే విధంగా పంటను పండిచారు . 7,200 స్కేర్ ఫీట్ విస్థీర్ణంలో పండించిన ఈ పంట బహుశా దేశంలోనే అతి పెధ్ద పంటగా భావిస్తున్నారు.దీనికి మూడు నెలల సమయం పట్టింది . మోదీకి రైతులు ఒక లేఖను కూడా రాశారు . ఇందులో వారు సేంద్రీయ పంటను పండించడానికి పడుతున్న ఇబ్బందులను, విత్తనాలు, ఎరువులు అందక రైతులు ఎదుర్కొంటన్న సమస్యలను మోదీకి వివరించారు. యువత ఎందుకు వ్యయసాయం వైపు రావడంలేదో ఆలోచించాలని, ప్రాధమికరంగానికి చేయూతనందిచే చర్యలు తీసుకోవాలని అందులో వారు కోరారు. కళ కలం కన్నా శక్తి వంతమైందని,అందుకే ఇలా కళతో తమ నిరసనను ప్రధానికి తెలియజేశామని రైతు శ్వేతా భట్టద్ పేర్కొన్నారు. ఈనిరసన పంట చాలా మంది ని ఆకర్షిస్తుంది. -
గిన్నిస్ బుక్‌లో సీసా సందేశం
లండన్: ఏకంగా 108 ఏళ్లపాటు సముద్రంలో ప్రయాణించిన ఓ బాటిల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1906లో బ్రిటన్‌కు చెందిన మెరైన్ బయెలాజికల్ ఆసోసియేషన్ (ఎన్బీఏ) ప్రతినిధులు ఓ ఖాళీ సీసాలో ఉత్తరాన్ని ఉంచి సముద్రంలోకి విసిరివేశారు. అప్పటి నుంచి సముద్రంలో ప్రయాణించిన ఆ బాటిల్ 2015లో జర్మనీలోని అమురమ్ దీవుల్లో మరియన్నే వింక్లర్ అనే ఆవిడ కంటపడింది. బాటిల్‌ను తెరిచి చూసిన ఆమెకు అందులోని ఉత్తరంపై ఎన్బీఏ అడ్రస్‌కు తిరిగి పంపాలనే సూచన కనబడింది. దీంతో మరియాన్నే బాటిల్ దొరికిన ప్రదేశం తదితర వివరాల్ని నింపి ఎన్బీఏకు పంపించింది. ఈ ఉదంతాన్ని గిన్నిస్ ప్రతినిధులు గుర్తించి ‘బాటిల్లో అతి ఎక్కువ కాలం ప్రయాణించిన సందేశం’గా గుర్తింపునిచ్చారు. -
చనిపోతున్నానంటూ ఎస్పీకి వాట్సప్ మెసేజ్
అనంతపురం: ఓ వ్యాపారి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఎస్పీకి వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు. దీంతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీరే మెహన్ అనే వ్యక్తి పట్టుచీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల అతను వ్యాపారంలో నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి మోహన్.. ఎస్పీకి వాట్సప్ ద్వారా.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేశాడు. ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన కదిలిన పోలీసులు.. మోహన్‌ను కలుసుకొని ఆత్మహత్యకు పాల్పడొద్దంటూ కౌన్సిలింగ్ నిర్వహించారు. -
ఈ మెసేజ్ ప్రతి ఆడపిల్లకీ..!
ఫేస్బుక్లో మొదట ముఖాలు చూస్తారు. తర్వాత మెసేజ్‌లు పెడతారు. తర్వాత మెసేజ్‌నే సంభాషణగా మారుస్తారు. ఆ తర్వాత ఆ మెసేజ్‌నే వలగా.. విషపుకోరగా... కబళించే అగాధంగా మారుస్తారు. అన్ని మెసేజ్‌లు పెళ్లి కోసం కాదు... ప్రేమ కోసం కూడా కాదు... మరెందుకో తెలుసుకుంటే ఆ చైతన్యాన్ని ఒక మెసేజ్‌గా అందరికీ చేరవేస్తే ‘శ్రావ్య’లాంటి ఉదంతాలు మళ్లీ జరగవు. శ్రావ్య... ఆమె ఇష్టపడిన ప్రవీణ్‌చక్రవర్తి తనను ఇష్టంగా పిలిచే పేరు అది. ఈ తరం యువత జీవనశైలిలో భాగమైన ఫేస్బుక్లో ఆమెకూ అకౌంట్ ఉంది. అదిగో అక్కడే ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఆమెకు తారసపడ్డాడు కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి. అక్కడి నుంచి శ్రావ్య కథే మరిపోయింది. కువైట్‌లో ఉన్న అమ్మ, అన్న పంపిస్తున్న డబ్బుతో తన చదువేదో తాను చదువుకుంటున్న ఆమె ఇప్పుడు భార్య స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె నేపథ్యం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గొల్లల మామిడాడ శ్రావ్య సొంతూరు. దళిత ఆడబిడ్డ. ఆమెకు ఓ అన్న. ఎనిమిదేళ్ల కిందట అమ్మ, నాన్నకు మధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. ఉపాధి కోసం అన్న కువైట్ వెళ్లాడు. ఆరేళ్ల కిందట అమ్మ కూడా వెళ్లింది. అప్పటి నుంచి కాకినాడలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది శ్రావ్య. ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తోంది. ప్రవీణ్‌చక్రవర్తి వలలో... ఫేస్బుక్లో మామూలుగా ఇతర స్నేహితులతో చాటింగ్ చేసినట్టే గత ఏడాది మేలో తన ఫ్రెండ్లిస్ట్లో చేరిన ప్రవీణ్‌తోనూ చాటింగ్ చేసింది. కొంచెం చనువు ఏర్పడ్డాక శ్రావ్య ఫోన్ నంబర్ తెలుసుకొని ఒకరోజు ఆమెకు ఫోన్ చేశాడు. తాను ఓ మతబోధకుడినని, చాలామంది సమస్యలను పరిష్కరించానంటూ ఫోన్లో తన గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు. దాంతో శ్రావ్య ఆమె స్నేహితురాలి అనారోగ్యం గురించి చెప్పింది. ఆమె కోసం ఫోన్లోనే ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన స్పందించిన తీరు, అంతకుముందు ఆయన చెప్పిన మాటలను బట్టి శ్రావ్య ప్రవీణ్‌ను ఓ మంచి వ్యక్తిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. పగలు,రేయి తేడా లేకుండా ఫోన్ సంభాషణ కొనసాగింది. ఒకరోజు ఓ వ్యక్తితో శ్రావ్యకు ఐ ఫోన్ పంపాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నా ప్రేమకానుకగా ఆ ఫోన్ తీసుకో’ అని చెప్పాడు. కొంత బెరుకు, ఎంతో మొహమాటంతోనే ఫోన్ తీసుకుంది శ్రావ్య. ఇంకొన్నాళ్లకు ల్యాప్‌టాప్ పంపాడు. వద్దని వారిస్తే.. నీ చదువుకి ఉపయోగపడ్తుందనే ఇస్తున్నాను తీసుకో అన్నాడు. కాదనలేకపోయింది శ్రావ్య. ఇద్దరి మధ్య ప్రణయబంధం బలపడింది. సెప్టెంబర్ 6... ‘మన ప్రేమ విషయం మన పెద్దలకు చెప్పేద్దాం. ఎలా చెప్పాలో ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫలానా చోటకు రా’ అంటూ శ్రావ్యను పిలిపించాడు ప్రవీణ్. అదో హోటల్. తనదే అన్నాడు శ్రావ్యతో. ఆ హోటల్ పేరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రావ్యతో ‘మా కుటుంబ సభ్యులందరి పేర్లు కలిపి పెట్టా’నని వివరించాడు. ఈ హోటల్ ఒక్కటే కాదు, తనకో స్కూల్, స్వచ్ఛంద సంస్థా ఉన్నాయని, వాటికి బోలెడు ఫండ్స్ వస్తాయని చెప్పాడు. ఓ గదికి తీసుకెళ్లి అల్మరాలో ఉన్న డబ్బులు, నగలు చూపించాడు. ‘నా భార్యవు కాబోతున్న నీకే ఇవన్నీ’ అన్నాడు. అంతేకాదు హోటల్ మేనేజ్మెంట్ చేశావు కాబట్టి ఈ హోటల్ నిర్వహణ బాధ్యతా నీకే అప్పగిస్తా’ అంటూ ఆ హోటల్లోని 306 రూమ్‌కి తీసుకెళ్లాడు. చేతివేలికి ఉంగరం తొడిగాడు. తమ మత సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయినట్లే అన్నాడు. ఆ సందిగ్ధాశ్చర్యాల్లోనే ఉన్న శ్రావ్యను శారీరకంగా వశపర్చుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెతో ఓ భర్త ప్రవర్తించినట్టే ప్రవర్తించసాగాడు. ఆమె పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరిచి 85 వేల రూపాయలు డిపాజిట్ చేశాడు. హోండా యాక్టివా బండి కొనిపెట్టాడు. ఆయనకున్న ఖరీదైన కార్లన్నీ చూపించి.. భవిష్యత్‌లో అవసరం పడొచ్చు అని డ్రైవింగ్ నేర్పించాడు. ‘అంతా బాగుంది.. కానీ ఇంతకీ మన పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించింది శ్రావ్య. గత నవంబర్‌లో కలిసినప్పుడు నిలదీసింది.‘మీ అమ్మను వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడమను’ అన్నాడు. కువైట్ నుంచి తన తల్లిని పిలిపించింది శ్రావ్య. మొన్న డిసెంబర్లో తన వాళ్లను తీసుకొని ప్రవీణ్ వాళ్లింటికి వెళ్లి పెళ్లి విషయం మాట్లాడి వచ్చింది శ్రావ్య తల్లి. ఈ పెళ్లి కుదరదని ఓ టీచర్ ద్వారా కబురు పంపించాడు ప్రవీణ్. ఆ మాట విని షాక్ అయింది శ్రావ్య. ఈ కబురు పంపింది ప్రవీణేనా? విస్మయం చెందింది. నమ్మలేకపోయింది. కానీ నిజమే అని... నమ్మక తప్పదని నిరూపించింది ప్రవీణ్ ప్రవర్తన. అప్పటిదాకా అందంగా కనిపించిన ప్రపంచం ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది శ్రావ్యకు. నిద్రమాత్రలు మింగింది. శ్వాస ఆగిపోలేదు. చావు కూడా మోసం చేసిందని బాధపడింది. కానీ ఆడుతున్న ఊపిరి తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించమనే ధైర్యాన్నిచ్చింది ఆమెకు. ‘ప్రేమిస్తున్నానంటే మనసిచ్చా... కానీ నీ ఆస్తిపాస్తులను చూసి నీకు పడిపోలేదు. నన్ను ‘పెళ్లి చేసుకో... నా బతుకు నాకివ్వు’ అంటూ ప్రవీణ్ ఇంటి తలుపు తట్టింది. ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు తప్ప భార్యగా స్వీకరించలేదు. లాభం లేదని పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. అక్కడా వైద్యపరీక్షలు, శల్యపరీక్షలు అంటూ అవమానమే ఎదురైంది. వారం అయినా ఆ తతంగం ఆగలేదు. ఫేస్బుక్ ప్రేమ చక్రవర్తిపై ఈగ కూడా వాలలేదు. ఇదెక్కడి న్యాయమంటూ మీడియా ముందు మొరపెట్టుకుంది! తనలా మరెవ్వరూ మోసపోకూడదని పోరాటానికి సిద్ధమవుతోంది శ్రావ్య. - అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ప్రవీణ్‌ను వదిలేసి నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నారు నన్ను మోసం చేయడమే కాకుండా నాపై తిమ్మాపురం పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు కూడా పెట్టించాడు. ఈ విషయం వారం రోజుల క్రితం అతనిపై ఫిర్యాదు చేయడానికి కాకినాడ సర్పవరం పోలీసుస్టేషన్‌కు వెళ్తే తెలిసింది. నాకు అసహ్యం వేసింది. కానీ ఎవ్వరినైతే భర్తగా ఊహించుకొని సర్వస్వం అర్పించానో... ఎప్పటికీ అతనే నా భర్త. నన్ను ఎలా వశపరచుకున్నాడో ఈ 500 ఫేస్బుక్ మెసేజ్‌లు, వాట్సాప్‌లో పంపిన ఫొటోలు చూడండి (అవన్నీ ఒక బౌండ్ చేయించారు). వీటిని చూపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రవీణ్‌ను వదిలేసి... నన్ను ఇంటరాగేషన్ పేరుతో పోలీసుస్టేషన్‌కు తిప్పుతున్నారు. వారం రోజుల్లో ఏడుసార్లు వెళ్లాను. మళ్లీ రమ్మంటున్నారు (ఈ విషయం చెప్తున్నప్పుడే ఆమెకు సీఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది). ఏదిఏమైనా నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాను. - శ్రావ్య మేమంతా అండగా ఉంటాం... ఆమెకు ఎవ్వరూ లేరని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకుంటే పొరపాటు. ఇప్పటికే మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించాం. ఆమెను ప్రవీణ్ పెళ్లిచేసుకోవాలి. తర్వాత కూడా ఆమెకు ఎలాంటి హాని జరగకుండా మేము అండగా నిలబడతాం. ఆమె పోరాటానికి మద్దతు ఇస్తాం. - సరోజ కాకినాడ మాజీ మేయర్ -
ఆ సినిమాపై స్టార్ల ప్రశంసల జల్లు
చెన్నై: రొటీన్‌కి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన క్షణం సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అడవి శేష్ అద్భుత నటన, కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో విమర్శకుల అభిమానాన్ని చూరగొన్న ఈ సినిమాపై టాలీవుడ్ దర్శకులు, నటీనటులు సహా పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు రవితేజ, సుధీర్ బాబు, సందీప్ కిషన్, సుశాంత్ సహా నటి లక్ష్మి మంచు చిత్ర యూనిట్ ను అభినందనల్లో ముంచెత్తారు. అలాగే దర్శకులు వంశీ పైడిపల్లి, దాసరి మారుతి, సుజీత్ తదితరుల మన్ననలను సైతం క్షణం సినిమా దోచుకుంది. వీరంతా రవికాంత్, అడివి శేష్ కృషిని అభినందించారు. దీంతో అటు సినిమా భారీ విజయం, ఇటు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న అభినందనల వెల్లువతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. తనదైన ముద్రతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో శేష్ ఈ విజయంతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన హీరో అడివి శేష్, సినిమా సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పెట్టుబడి తమకు వచ్చిందని.. దీనిపై మొత్తం యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు. సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ పండితుల నుంచి వస్తున్న స్పందన తనకు ఆనందాన్నిస్తోందన్నారు. కాగా అక్కినేని నాగార్జున, మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. హాట్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సత్యం రాజేష్, రవి వర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అడవి శేష్‌కు జంటగా అదా శర్మ నటించింది. గత వారం రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో ఫర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. -
ఒక చోట మూడేళ్లే ఉద్యోగం: సీబీఈసీ
న్యూఢిల్లీ: కీలక, సున్నితమైన ఉద్యోగంలో ఏ అధికారి ఒకే ప్రాంతంలో మూడేళ్లకన్నా ఎక్కువ కాలం కొనసాగకూడదని ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో పటిష్ట నైతికత విలువలు, పారదర్శకత నెలకొల్పడానికి ఈ విధానాన్ని కొనసాగించాలని పరోక్ష పన్ను విభాగంలో అత్యున్నత స్థాయి అధికారులకు పంపిన ఒక వర్తమానంలో తెలిపింది. -
మేం అన్నివేళలా అందంగా ఉండం
లాస్ ఏంజెల్స్: టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ (40) అమ్మాయిలకు ఓ బ్రహ్మాండమైన సత్యం చెప్పింది. మెరిసే కళ్లతో, అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ యువతులకు ఆసక్తికరమైన సందేశాన్నిస్తోంది. వెండితెర మీద, అవార్డు ఫంక్షన్లలోను కళ్లు చెదిరే అందంతో అందరినీ ఆకట్టుకునే తమలాంటి సెలబ్రిటీలు.. ఎప్పుడూ అంత అందంగా ఉంటారన్న భ్రమలు పెట్టుకోవద్దని తెలిపింది. అవార్డు ఫంక్షన్లలోనూ, రెడ్ కార్పెట్ మీద అడుగులు వేసేటపుడు ఉన్న అందం.. అన్నివేళలా ఉండదని పేర్కొంది. వృత్తి నిర్వహణలో భాగంగా తాము అలా మెరవక తప్పదని, మిగతా సమయంలో అందరిలాగే సాధారణంగానే ఉంటామని, ఈ విషయాన్ని యువతులు గ్రహించాలని సూచించింది. ఈ విషయాన్ని ఈ తరం యువతులకు చెప్పడం చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నానంది. టైటానిక్ మూవీలో రోజ్గా అందరి మదిలో నిలిచిపోయిన ఈ భామ మరో విషయాన్నికూడా తన అభిమానులతో పంచుకుంది. తాను చిన్నపుడు చాలా బొద్దుగా ఉండేదాన్నిని, అందరూ తనను చూసి ఆట పట్టించేవారని తెలిపింది. హీరోయిన్ అయ్యే సమయానికి బరువు తగ్గించుకుని నాజూగ్గా తయారైనట్లు చెప్పింది. -
ప్రవక్త జీవితం, సందేశం శాంతి
కొత్త కోణం: అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉండగా, తెగల మధ్య చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని మహమ్మద్ ప్రవక్త యోచించారు. ప్రజలను ఐక్యం చేయాలని పరితపించారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి ప్రవక్త చేసిన కృషి విజయవంతమైంది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు ప్రపంచంలో శాంతిని నెలకొల్పిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఆయన శాంతి, ఐక్యతల సందేశం అందరికీ అనుసరణీయం. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజంలోని వివిధ సంఘర్షణల నుంచి అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొందరు ఆ సంక్షోభంలో పడికొట్టుకుపోతే, కొందరు ప్రవాహానికి ఎదురీది సమాజానికి నూతనో త్తేజాన్ని అందిస్తారు. సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. అలాంటి వారినే ఒకప్పుడు ప్రవక్తలన్నారు. సమాజ అంగీకారాన్ని పొందిన కొందరు ప్రవక్తల ప్రబోధాలే మతాలై ప్రపంచాన్ని నడిపిస్తుంటాయి. ప్రపంచంలో అత్యధిక భాగానికి వ్యాపించిన బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు అవి ఆవిర్భవించిన కాలాల్లో సామాజిక విప్లవాలుగా నిలిచాయి. సమాజ పురోగమనానికి, అభివృద్ధికి దోహదం చేశాయి. కాలంచెల్లిన బానిస సమాజపు పోకడలను కాలదన్ని వినూత్న ఆలోచనలకు అంకురార్పణ చేసిన ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజు నేడు. ప్రవక్త జన్మది నాన్నే మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటున్నాం. ఆయన జన్మించేనాటికి అరబ్బు ప్రపంచంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన బోధనలు ఆనాటి సామాజాన్ని మౌఢ్యం సుడిగుండం నుంచి గట్టెక్కించి, సామాజిక సంక్షోభాన్ని పరిష్కరించాయని విశదమవుతుంది. అంధకారంలో మెరిసిన కాంతి రేఖ మూడు వైపులా సముద్రం చుట్టివున్న ద్వీపకల్పం లాంటి అరబ్బు ప్రాంతం ఆనాడు చాలా తెగలకు ఆవాసంగా ఉండేది. మూడు ముఖ్య తెగలు కీలకమై నవిగా ఉండేవి. మొదటి ప్రవక్తగా భావించే ఇబ్రహీం బోధనలను కాదని, వారు వివిధ రకాల విగ్రహాలకు పూజలు చేసేవాళ్ళు. ఇస్లాం సందేశానికి మూలమైన ‘‘తౌహీద్’’ ఏకేశ్వరోపాసన, దేవుని ఏకత్వ భావనకు వారి మత విశ్వాసాలు విరుద్ధమైనవి. సూర్యచంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను, సన్యాసులను, నదులను, పర్వతాలను, మనుషుల్ని, చివరకు జంతువులను, రాళ్ళను, కొండలను, గుట్టలను వారు పూజించేవారు. ఈ బహు దైవారాధన తెగల మధ్య క్రమంగా నిరంతర సంఘర్షణలకు కారణమైంది. అంతర్గత యుద్ధాలతో అరబ్బు నేలపై రక్తం ఏరులై పారేది. ఫలితంగా రాజకీయ అస్థిరత నెలకొనడమే గాక, సామాజిక, ఆర్థిక జీవితం ఛిన్నాభిన్నమైంది. అనైక్యతతో, మౌఢ్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అరబ్బులు ఎవరికీ లొంగని స్వతంత్ర స్వభావులు. కఠోరమైన ఎడారి జీవితానికి తోడు, కర్తవ్య నిర్వహణ కోసం జీవితాన్ని ధారపోసే విశిష్ట స్వభావం వారిది. అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సమయంలోనే మక్కాలో క్రీ.శ. 571 ఏప్రిల్ 22న ప్రవక్త మహమ్మద్ జన్మించారు. సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఖురైష్ తెగకు చెందిన మహమ్మద్ ప్రవక్త చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, తాత ఒడిలో పెరిగారు. అరబ్బు సంప్రదాయాల ప్రకారం పట్టణాలలో పుట్టిన పిల్లలు కూడా బాల్యాన్ని పల్లెల్లో గడిపేవారు. మహమ్మద్ ప్రవక్త కూడా అలా పల్లెలో గొర్రెల కాపరిగా ఎదిగారు. ఆ తెగ నాయకత్వ స్థానానికి రావడానికి కష్టభరితమైన ఆ జీవితం ఆయనకు ఎంతో ఉపకరించింది. తాత మరణం తర్వాత, ఆయన పినతండ్రి దగ్గరికి చేరాడు. ప్రవక్త శాంతి ప్రస్థానానికి నాంది అరబ్బులలోని మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనైక్యత ఆయనను చిన్నతనం నుంచే కలవరపరిచాయి. ఖురైష్ తెగ సంప్రదాయాలను ఆయన ఆనాటి నుంచే వ్యతిరేకించారు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు. ఖురైష్, కైస్ తెగల మధ్య జరిగిన ఫిజార్ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త కూడా పాల్గొన్నారు. ఆ యుద్ధం ఆయనలో పెద్ద మార్పుని తీసుకొచ్చింది. యుద్ధం తదుపరి ఆయన పినతండ్రి జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ చొరవతో ఖురెష్ ప్రముఖులు ఐదు అంశాల తీర్మానాన్ని ఆమోదించారు. 1. ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పుతాము, 2. బాటసారుల కోసం రక్షణ సదుపాయాలు కలుగజేస్తాం, 3. నిరుపేదల అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తాం, 4. దుర్మార్గుల దౌర్జన్యానికి గురయ్యేవారికి రక్షణ కల్పిస్తాం, 5. దౌర్జన్యపరులకు మక్కాలో స్థానం లేకుండా చేస్తాం. ఈ తీర్మానాన్ని రూపొందించడంలో మహమ్మద్ ప్రవక్తకు కూడా భాగం ఉంది. ఆయన తమ తెగ ఆచారం ప్రకారం వర్తకాన్ని వృత్తిగా స్వీకరించారు. అందులో ఆయన కనబరిచిన నిజాయితీ, సచ్ఛీలత ఎందరినో ఆకర్షించాయి. ప్రజలు ఆయనను సాదిక్ (సత్యసంధుడు), అమీన్ (విశ్వసనీయుడు) అని పిలిచేవారు. వ్యాపారంలో భాగంగా ఆయన సిరియా, బస్రా, యెమెన్ దేశాల్లో చాలా సార్లు పర్యటించారు. ఆ సమయంలోనే శ్రీమంతురాలు, వ్యాపారవేత్తయిన హజ్రత్ ఖదీజా, మహమ్మద్ ప్రవక్త దీక్షాదక్షతలను తెలుసుకొని, తన వ్యాపార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆయన నిజాయితీని మెచ్చిన ఆమె, ఆయనకు భార్య కావడానికి సుముఖత వ్యక్తం చేశారు. అలా వారిరువురు జీవిత భాగస్వాములయ్యారు. సఫా పర్వతంపై నుంచి తొలి సందేశం అయితే మహమ్మద్ ప్రవక్త రోజురోజుకూ సత్యాన్వేషణపై దృష్టిని కేంద్రీకరించారు. అరబ్బు ప్రపంచంలో చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని యోచించారు. ఒంటరిగా నిత్యం తనలో తాను సంఘర్షించేవారు. బహు దేవతల ఆరాధనతో అనైక్యంగా ఉన్న ప్రజలందరినీ ఎలాగైనా ఐక్యం చేయాలని పరితపించేవారు. సంఘర్షణలు, యుద్ధాలు మాన్పించి, సమాజాన్ని శాంతి వైపు నడిపించాలని కలలుగనేవారు. ప్రజలనందరినీ ఏదైనా సందేశం వినిపించడానికో, హెచ్చరించడానికో చెట్టుమీదకు లేదా గుట్టమీదకు ఎక్కి అరవడం ఆ రోజుల్లో అలవాటుగా ఉండేది. ఒకరోజున మహమ్మద్ ప్రవక్త కూడా సఫా పర్వతంపై నుంచి అందర్నీ పిలిచి ‘‘కొండకు ఆవల ఒక పెద్ద సైన్యం నిలిచి ఉందని, అది మీపైకి దండెత్తడానికి సిద్ధంగా ఉందని నేనంటే నా మాటను నమ్ముతారా?’’ అని గట్టిగా అడిగారు. ‘‘నిస్సంకోచంగా నమ్ముతాం. మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాం’’ అని ప్రజలు జవాబిచ్చారు. అప్పుడు మళ్ళీ మహమ్మద్ ప్రవక్త ‘‘జనులారా! నేను మిమ్మల్ని విగ్రహారాధన చేయరాదని కోరుతున్నాను. ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించాలని అడుగుతున్నాను. మీరు ఇది కాదన్నారంటే భయంకరమైన శిక్షకు గురవుతారు’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్త తొలి సందేశం ఇదే. అయితే అది విన్న ఖురైష్ ప్రజల కోపం కట్టలు తెంచుకున్నది, కల్లోలం రేగింది. మహమ్మద్ ప్రవక్తపైకి కత్తులతో దూసుకువచ్చారు. హజ్రత్ అనే వ్యక్తి ప్రవక్తకు రక్షణగా నిలిచి ఆయన కోసం ప్రాణత్యాగం చేశారు. ఇస్లాం మార్గంలో మొట్ట మొదటి షహదత్ ఆయనే. ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రవక్త, ఆ తర్వాతా భౌతిక దాడులకు గురయ్యారు. అడుగడుగునా ఛీత్కారాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా క్రమంగా మహమ్మద్ ప్రవక్తను అనుసరించే ఇస్లామీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొట్టమొదట ఇస్లాంను స్వీకరించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జీవిత భాగస్వామి ఖదీజానే కావడం విశేషం. ఇస్లాం చరిత్ర గతిని మార్చిన మదీనా రాజ్యాంగం కానీ ప్రవక్తపై ఖురైష్ తెగ దాడులు తీవ్రమయ్యాయి. ఆయన అనుయాయులపైనా హింసాకాండ పెచ్చరిల్లింది. దీంతో మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి తన కార్యస్థలాన్ని మార్చాలని భావిస్తుండగా... మదీనా నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. మహమ్మద్ ప్రవక్తకు అండదండలందిస్తానని మదీనా నుంచి సమాచారం అందింది. ప్రవక్త తన మొదటి సందేశం వినిపించిన తర్వాత 11 ఏళ్లకు ఆరుగురు ప్రతినిధుల బృందం మక్కా వచ్చి ఆయనతో విస్తృతంగా చర్చలు జరిపింది. మరుసటి ఏడాది వచ్చిన 12 మంది ప్రతినిధులు ప్రవక్తతో జరిపిన చర్చలు, చేసిన ప్రతిజ్ఞ ‘అకాబా ప్రతిజ్ఞ’గా పేరు మోశాయి. ఆ తరువాత ప్రవక్త మదీనా పట్టణానికి చేరారు. మక్కాలోని ముస్లింలంతా ఆయనను అనుసరించి మదీనాకు వెళ్లారు. మదీనాలోని ఒకటి, రెండు మినహా అన్ని తెగలూ ప్రతి కుటుంబం నుంచి ఒక యువకుడిని ఇస్లాం సేవకు పంపాయి. దీంతో ఇస్లామియా ఉద్యమం కొత్త ఊపుతో ముందుకు సాగింది. మదీనాలో మహమ్మద్ ప్రవక్త తీసుకున్న రాజకీయ నిర్ణయం ఇస్లాం చరిత్ర గతినే మార్చివేసింది. మదీనాలోని యూదులకు, ముస్లింలకు మధ్య ఒక సామాజిక ఒప్పందాన్ని ఖరారు చేయడం వల్ల ఇస్లాం ఒక ప్రత్యేక దశలోకి అడుగుపెట్టింది. దీనినే ‘మదీనా కాన్స్టిట్యూషన్’ అంటారు. ప్రపంచంలోని తొలి లిఖిత పూర్వక రాజ్యాంగంగా కూడా పిలుస్తారు. ఈ ఒప్పందం ఇస్లాం రాజ్యానికి పునాదులు వేసింది. వ్యవస్థీకృత సమాజంలో దేవునికే సర్వసత్తాక అధికారం ఉంటుందని, దైవిక చట్టాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారని ఈ రాజ్యాంగం వ్యాఖ్యానించింది. మదీనాలోని స్థానిక అన్సార్లకు, మక్కా నుంచి వచ్చిన ముహజిర్లకు మధ్య సోదర సంబంధాలను నెలకొల్పడం ద్వారా ప్రవక్త నూతన సహోదర మానవ సంబంధాలకు పునాదిని వేశారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేయడానికి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం మతం విస్తరించింది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు భూభాగాన్ని నవ నాగరికతలోకి నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. అందుకే ఆయన చూపిన శాంతి, ఐక్యత నుంచి స్ఫూర్తినొందడం అందరికీ అనుసరణీయమే. నేడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా... వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య( మొబైల్: 97055 66213) -
వాట్సాప్...హ్యాట్సాప్
తిరువళ్లూరు: సాయం చేయడానికి ఎన్నో దారులు ఉన్నాయని నిరూపించాడు వేలూరు మెడికల్ కళాశాల విద్యార్థి రాహుల్జా(36). చెన్నైకు చెందిన రాహుల్జా, వేలూరులోని వీఐటీలో పీజీ చేస్తున్నాడు. వరదల ద్వారా చెన్నైలో ప్రజలు పడుతున్న అవస్థలను గుర్తించి తన వంత సాయం చేయాలని చెన్నైకు చేరుకున్నాడు. గురువారం రాత్రి వాట్సాఆప్లో మెసేజ్ పంపాడు. గర్భిణులు, డయాబెటిస్, అల్సర్ వ్యాధులు వున్న వారు తననూ సంప్రదించాలన్న సారాంశం గంటల్లో వ్యాపించింది. రాత్రంతా 900 ఫోన్‌కాల్స్ వచ్చాయి. వారికి సలహలు ఇచ్చాడు. దగ్గరిలోని వారికి తన స్నేహితుల ద్వారా మందులను పంపిణీ చేసాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం నాలుగు గంటల వరకు 18 మందికి ఉచిత ప్రసవ వైద్యం చేసాడు రాహుల్జా. ప్రజల దృష్టిలో వైద్యుడే కానీ.... గురువారం రాత్రి అంధకారంలో చిక్కుకుని సాయం పొందిన వారికి మాత్రం దేవుడే. డాక్టర్ కాదు.... అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్...కానీ డజను మంది ప్రాణాలను కాపాడాడు. చెన్నైకు చెందిన ఆదిత్యావెంకటేష్ (25). బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత ఆదివారం చెన్నైకు వచ్చిన అదిత్య వరదల్లో చిక్కుకున్నాడు. మూడవ అంతస్తులో వున్న ఆదిత్య తన ఇంటికి కింద నిలబడిన గర్భిణులను చూసి చలించిపోయాడు. కొందరికి వైద్యం అవసరం. మరి కొందరికీ వైద్యశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ డబ్బు అవసరం అని గుర్తించాడు. విదేశాల్లో వున్న తన మిత్రులకు మెసేజ్ పెట్టాడు. చెన్నైలోనీ అందుబాటులో వున్న వైద్యశాలలకు ఎక్కడికైనా వెళ్లండి. గర్భిణులకు అయ్యే ఖర్చును తామే భరిస్తాననీ మెసేజ్ పెట్టాడు. దాదాపు 30 మందికి వైద్యసాయం చేసాడు. ఆదిత్య డాక్టర్ కాదూ...కానీ 30 మందిని కాపాడాడు. -
పులి సందేశం
అక్షర తూణీరం చిరుతపులి వయసులో పదునుగా ఉంది. మాంచి కసి మీద ఉంది. కానీ దొరికిపోయింది. వందమంది కలసినా దాన్నలా నిస్సహాయంగా చేయలేరు. కానీ పులి, ‘ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చి నట్టు’ దొరికిపోయింది. పొలంలో నీళ్ల బిందె కనిపిస్తే, దప్పిక తీర్చుకుందామని అందులో తల పెట్టింది. ఆ బిందె పులి తలకి పట్టేసింది. ఆ క్షణం నుంచి పులి బతుకు పిల్లి బతుకు కంటే కనాకష్టమైంది. ఊరు ఊరంతా తల మునిగిన పులిని కోతిని చూసినట్టు చూసి వినోదించారు. పులి తెలివి తక్కువతనం వార్త అయింది. చానల్స్ పులిరాజు గడిపిన దుర్భరమైన ఘడియలను ప్రత్యక్షంగా చూపి, ప్రేక్షకులను వినోదింప చేశాయి. గొప్పవాడు చిక్కుల్లో పడితే చూసేవాడికి సంబరంగా ఉంటుంది. ఎటుపోయి ఎటొస్తుందనే భయంతో పైకి జాలి నటిస్తారంతే. ఇదొక చిత్రమైన సందర్భం. పులికి వేరే సమస్య లేదు. లోకం కనిపించడం లేదు. ఏమి జరిగిందో ఆ ప్రాణికి అర్థం కావడం లేదు. చీకటి తెలియని కళ్లకి చీకట్లు కమ్మాయి. దేన్నీ వాసన పట్టలేకపోతోంది. గాండ్రించడానికి కాదు కదా, మూలగడానికి కూడా నోరు లేవడం లేదు. చిరుతపులి మనసు, శరీరాన్ని నిస్సత్తువ ఆవరించింది. దిక్కుమాలిన చావు చస్తానేమోనని భయం పట్టుకుంది. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ‘‘అహో! నాకెట్టి దురవస్థ దాపురించినది. నేను భయపడు ప్రాణి ఈ నేలపై లేదు. నాకు భయపడని జీవి ఎక్కడా కనపడదు. దుర్గాదేవి వాహనాన్ని. భయమనేది నా ఒంటి చారల్లో గానీ చుక్కల్లో గానీ లేదు. అడవి జంతువులను వేటాడడం మాకు శైశవ క్రీడ. నరమాంసం మాకొక వేడుక. నా పేరు చాలు, సమస్త ప్రాణకోటికి వణుకు పుట్టిస్తుంది. ఆహా! నేడు లేవగానే ఏ గాడిద మొహము గాంచితినో? ఇట్లు నా మొహమును కోల్పోతిని’’ అంటూ పరిపరి విధాల వాపోయింది. పులి మనసు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది. చిన్నప్పుడు అమ్మ కుందేలు పిల్లల్ని గోరుముద్దలుగా తినిపిస్తూ చెప్పిన వంశ చరిత్రలు గుర్తొచ్చాయి. ఏడు తరాల నాటి ముత్తాత, తన దూడకు పాలిచ్చి వస్తానంటే పోయి రమ్మని ఆవును పంపాడట. దయార్ద్ర హృద యులున్న వంశమని అమ్మ చెప్పేది. తరువాత కాలం పాడైపోయింది. అయిదు తరాల క్రితం మా ముత్తాత బంగారు కడియాన్ని ఆశ పెడుతూ దారిన పోయే దానయ్యలను దగ్గరకు రప్పించుకునేవారు. ఏం చేస్తారు పాపం! వార్ధక్యం వల్ల కదల్లేని స్థితి. ఉపాయశాలురున్న వంశం నాది. పులి జాతిపై ఎవ్వరూ జాలి పడరు. పుర్రెతో సహా మా చర్మాలను పరుచుకుని తపస్సులో కూచునే స్వాములకు ధర్మమున్నదా? ఇలాంటి తలపోతలతో మరోసారి తలమునకలైంది పులి. జీవితం బుద్బుద ప్రాయమని మొదటిసారి నమ్మింది. చావు భయంలో దేవుడు గుర్తొచ్చాడు. ఈ చీకటి గుహలోంచి నన్ను బయట పడెయ్యండి. కావాలంటే శనివారాలు ఉపోషాలుంటా. సోమవారం పూర్తి శాకాహారిగా ఉండి పోతా. అడవిలో అంకాళమ్మకి, పోలేరమ్మకి కోరినన్ని జింకల్ని లేళ్లని బలిచ్చి జాతర్లు జరిపిస్తా. ఏనుగుల్ని దిగ తుడుస్తానంటూ మనసులోనే మొక్కింది. పులికి ఒక్కసారి దుఃఖం పెల్లుబికింది. భోరున ఏడ్చింది. పుట్టగానే కూడా ఏడ్చిన జ్ఞాపకం లేదు. అయినా ‘తల తప్పేళా’ ఊడి రాలేదు. అందరూ ఆఖరికి పిచ్చిక పిల్లతో సహా తనని చూసి నవ్వుకుంటున్నాయని దాని ఊహ. మనిషి అసాధ్యుడు. నా అజ్ఞానంతో తనొక జ్ఞానం సంపాయిస్తాడు. బిందెలో నెత్తురు పోసి అవలీలగా షికారీతో పులుల్ని తోకపట్టి ఆడిస్తాడు. నేనెంత వెర్రి పీనుగుని!? గంటలకొద్దీ సాగిన నిర్వేదం తర్వాత అటవీ శాఖవారు చిరుతపులికి విముక్తి కలిగించారు. ఇంతకీ పులి ఇచ్చిన సందేశమేమంటే- రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా పవర్లో ఉన్నవారు తెలిసీ తెలియకా ఎక్కడంటే అక్కడ తలదూర్చకూడదు. ఆచితూచి, మన తలకి పడుతుందా లేదా చూసుకుని దిగాలి. దీన్ని సాక్షాత్తు దుర్గామాత సందేశంగా బీజేపీ వారు భావించాలి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మరణం లేని సందేశం
మానవేతిహాసంలో మహాత్ముని స్థానం సర్వోత్కృ ష్టం, మహోన్నతం. మేమాయన్ని గురించి తీర్పు చెప్ప లేనంత అపరిచితులం. మాలో కొందరికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది. ప్రేమమయమైన, ప్రబల మైన ఆయన ఉన్నత వ్యక్తిత్వ ప్రభావం మాపై చాలా ఉంది. మా ప్రాణంలో ప్రాణంలా సంలీనమై ఉన్న ఆయన్ను మేమిపుడు ఘోరంగా పోగొట్టుకున్నాం. ఆయన లేని మా జీవితాలు దుర్భరం. మా మధ్య పెన వేసుకున్న గాఢానుబంధం కారణంగా ఆయన వ్యక్తి త్వాన్ని వాస్తవంగా వెలగట్టడం కష్టమే అవుతుంది. అం తటి సన్నిహిత సంబంధం లేని ఇతరులు ఆ వినయ శీలియైన శాంతిదూత అంతరంగంలో వెలిగే సజీవ అగ్నిజ్వాల విశేషాన్ని గమనించలేరు. అందుచేత ఆ రెండువర్గాలు ఆయన సమగ్ర వ్యక్తిత్వ నిరూపణలో సంపూర్ణ న్యాయం చేయలేవు. ఈనాటి సమస్యలు, సంఘర్షణలు ప్రధాన విషయాలైనప్పుడు భవిష్యత్తులో చరిత్రకారులకు అటువంటి మనోనేత్రం ప్రధానం అవు తుందేమో, నాకు తెలియదు. సమీప భవిష్యత్తులో మాదిరిగానే, భవిష్యత్తులో సయితం ఈ సమున్నత మూర్తి ఘనమైన మర్యాదామన్ననలను అందుకోగల డనటంలో నాకు లవలేశం అనుమానం లేదు. ఆయన ప్రవచించిన సందేశ మాధుర్యాన్ని ఈనాటి కంటే రేపటి తరమే అధికంగా ఆస్వాదిస్తుంది, ఆచరిస్తుంది. ఆ సం దేశం ప్రత్యేకించి ఒక దేశానికో, ఒక వర్గానికో సంబం ధించినది కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలకూ, మాన వాళి మొత్తానికీ ఈ సత్య సందేశం అన్వయిస్తుంది. బాపూజీ తన కాలంనాటి భారతదేశానికి సంబంధిం చిన కొన్ని అంశాలకు అన్వయించి సత్యాన్ని ఉద్ఘాటించి ఉండవచ్చు. కాలమాన పరిస్థితులననుసరించి మార్పు లు సహజం. నాటి ప్రత్యేక అంశాల ప్రాధాన్యం క్రమం గా తగ్గిపోవచ్చు. కానీ మహాత్ముని సందేశ సారం దేశ, కాలాతీతమై విరాజిల్లుతుంది. తత్ఫలితంగా మానవు డిని అర్థం చేసుకోవడంలో బాపూ సందేశం కీలకాంశ మవుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించే క్రమంలో ఆ సమయానికి అవసరమైన అనేక విషయాలను బాపూ బోధించారు. భయాన్నీ, ద్వేషాన్నీ పరిత్యజించ మన్నారు. సమైక్యత, సమత్వం, సౌభ్రాత్రం గురించీ, అణగారిన పేద జన సముద్ధరణ గురించీ, శ్రమకు ఉన్న గౌరవం, ఆత్మ ఔన్నత్యాలను గురించీ మనకు విశదీక రించారాయన. సత్యమే దైవమనీ, దైవమే సత్యమనీ పదే పదే ఉద్ఘోషించారు. నాయకుడైనవాడు ప్రజలను నడిపించేవాడే కాదు. కొందరు ఆధునికుల ఆలోచన ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి అతడు తలవంచి నడవవలసి ఉంటుంది. అలా వంచని వాడు నేత కాలేడు. మానవాభివృద్ధికి సరైన ప్రగతిపథంలో అనుచరగణాన్ని ఎక్కువ దూరం నడిపించలేడు. తన అభీష్టాన్ని అనుసరించి ఒంటరిగా క్రియాశీలి అయితే తాను నడిపించే అనుచరులకే తాను దూరంకాక తప్ప దు. తన సహచరులు కోరుకునే స్థాయికి తనను తాను దిగజార్చుకుంటే తన ఆదర్శాన్ని తానే ఒమ్ము చేసినట్టు. తాను నమ్మిన సత్యంతో సమాధానపడినట్లవుతుంది. ఆ విధంగా సత్యంతో రాజీపడడం ప్రారంభిస్తే ఇక వాటికి ముగింపు ఉండదు. సత్యపథం చేజారిపోతుం ది. అట్టి స్థితిలో అతడేం చేయాలి? అతడు సత్యాన్నో, సత్య పార్శ్వాన్నో గ్రహించడానికి పరిమితం కారాదు. తాను దర్శించిన సత్యకాంతిని ఇతరులు కూడా దర్శిం చేలాగ చేయగల నేతే విజేత. ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో సగటు ప్రజా నాయకుడైనవాడు పరిస్థితులకు అనుగుణంగా తనను తాను చక్కదిద్దుకుంటూ ఉండాలి. తులనాత్మకంగా తక్కువ చెడులో కాలుమోపాలి. అలా సరిపుచ్చుకోక తప్పదు. మహాత్మునిలో మహాద్భుత విషయం ఏమిటంటే, తాను నమ్మిన ఆదర్శాలనూ, భావించిన సత్యాన్నీ సం పూర్ణ రూపంలో ఆవాహనం చేశాడు. అసంఖ్యాక మానవ బిందు సమూహాన్ని సింధు రూపంగా పరివర్త నం గావించాడు. నిష్టాగరిష్టుడే గానీ, లొంగినవాడు మాత్రం కాదు. కాలానుగుణ అవసరానికి కనురెప్ప పాటు లేనివాడు. మార్పు చెందే పరిస్థితులకు అనుగు ణంగా తనను తాను మార్చుకున్నవాడు. తాత్కాలి కమైన ఈ మార్పులూ చేర్పులూ అప్రధానమైనవి. ప్రధానమైన సిద్ధాంతం వరకు ఏమాత్రం చెదరని, బెద రని వెండికొండ మహాత్మాగాంధీ. తాను చెడు అని భావించిన దానితో ఏనాడూ రాజీ పడలేదు. సమస్త భారతజాతిని సమున్నత శిఖారారోహణం గావించడం లో తాత్కాలికంగానైనా విజయం సాధించగలిగారు. చరిత్రలో అదొక మహాద్భుతమైన ఘనకార్యం. ఆ సాధించింది కొనసాగుతుందా? అది సాధించిన ఫలి తాలు కొనసాగుతాయనడంలో అనుమానం లేదు. కాని దాని శిక్షణలో కొంత ప్రతి చర్య ఉంటుంది. కొంత మంది కొన్ని పరిస్థితుల ప్రభావంతో తమ సహజ స్థితి నుంచి ఉచ్ఛస్థితికి చేరినప్పటికీ తిరిగి వెనుకటి స్థితి కంటే తక్కువ స్థితికి దిగజారిపోతారు. మనం ఈరోజు అటువంటి సంఘటననే చూస్తున్నాం. దుఃఖభాజన మైన గాంధీజీ హత్యోదంతంతోనే అట్టి ప్రతిస్పందన మనం చూశాం. గాంధీజీ తన జీవితకాలం మొత్తం ఏ ప్రమాణాలకూ, నైతిక విలువల పరిపోషణకూ అంకిత భావంతో కృషి సాగించాడో; ఆ ప్రమాణాలూ, విలు వలూ ఇలా పతనం కావడాన్ని మించిన విషాదం ఇంకే ముంటుంది? బహుశా ఇది తాత్కాలిక దశ కావచ్చు. ప్రజలు తిరిగి యథాపూర్వ సుస్థితిని చేరుతారు. భారత దేశ ఆత్మ గంభీరమైనది. బాపూ బోధించిన ప్రధాన సూత్రాలు మన జాతీయ జీవితాన్ని పునీతం చేస్తాయ నడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. (1950 దశకంలో డీజీ టెండూల్కర్ రాసిన ‘మహాత్మా’ పుస్తకానికి పండిట్ నెహ్రూ రాసిన పీఠికలోని కొన్ని భాగాలు. తెలుగుసేత: యెనిశెట్టి సాంబశివరావు మొబైల్: 77021 74606) -
గాడ్ నుంచి రెండో మెసేజ్?
ఆయన గాడ్ కాదు... మెసెంజర్ ఆఫ్ గాడ్. మొదటిచ్చిన సినిమా మెసేజ్‌కు ఆదరణ లభించడంతో, ఇప్పుడు రెండో మెసేజ్‌తో సిద్ధమయ్యాడు. గిరిజనుల అభివృద్ధి, మాంసాహారం తినడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘యంఎస్జి-2’. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ (యం.ఎస్.జి)కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆధ్యాత్మిక గురువు సంత్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ అక్టోబరు 1న రిలీజ్ కానుంది. ఇటీవలే ఇంగ్లీష్, హిందీ వెర్షన్స్ రిలీజయ్యాయి. దర్శక-నిర్మాత మాట్లాడుతూ, ‘‘మొదటి చిత్రం ‘యంయస్‌జి-1’ ఆదరణ పొందింది. ‘నా మెసేజ్‌ను ప్రజలు అంగీకరించారన్న అభిప్రాయంతో ఈసారి మరో మంచి సందేశంతో రెండో భాగం తీశా. ఇంగ్లిష్, హిందీల్లో ఈ సెకండ్ పార్ట్‌కి మొదటి భాగానికి మించిన స్పందన లభిస్తోంది. అందుకే తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
వాట్పాప్ సందేశమే ఆదుకుంటోంది..
షిమ్లా: జమ్ము కశ్మీర్ పర్వతాల్లో చిక్కుకున్న ఓ పర్వతాహకుడ్ని వాట్సాప్ సందేశం ఆదుకుంది. ఆపద నుంచి కాపాడబోతోంది. కార్గిల్ సమీపంలో జానస్కార్ లోని ఉమాసి పాస్ పరిసర ప్రాంతంలో చిక్కుకుపోయిన టెక్కర్ రిజుల్ గిల్ రక్షించేందుకు ప్రభుత్వం, సైన్యం పాటుపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ప్రాంతానికి చెందిన గిల్ అనే పర్వతారోహకుడు అనూహ్యంగా ఆపదలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అరుణ్ శర్మకి సమాచారం అందించాడు. దీంతో అరుణ్ దీన్ని వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా టెక్కర్ రిజుల్ గిల్ ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ రాజేష్ కన్వార్ తెలిపారు. తీవ్ర గాయాలపాలయ్యాడన్న సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యామని, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, సైన్యం సహాయంతో అతన్ని అక్కణ్నించి రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రెక్కర్ ను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్ కోసం కార్గిల్ అధికారులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందర్లోనే అతణ్ని వెనక్కి తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తన మిత్రుడు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికే నాలుగురోజులైందని, ఇక రెండు రోజులకు సరపడా ఆహారం మాత్రమే అతడి దగ్గర ఉందని గిల్ స్నేహితుడు అరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
మెస్సేజ్ వచ్చింది.. లారీ వదిలేయ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రవాణా శాఖ మంత్రి కనుసన్నల్లో కొందరు తెలుగు తమ్ముళ్లు జోరుగా అధికలోడుతో గ్రానైట్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీనికి ‘కేరాఫ్ టీఆర్ మినిస్టర్’ అని ఆర్టీఏ అధికారుల సెల్ఫోన్లకు మంత్రి అనుచరుల వాహనాల నంబర్ల మెసేజ్ రావటమే నిదర్శనం. ఆ మెసేజ్‌ను నెల్లూరు, ప్రకాశం జిల్లా ఉపరవాణా కమిషనర్ మొబైల్‌కు పంపినట్లు తెలిసింది. మెసేజ్‌తో అలర్ట్ అయిన డీటీసీ.. ఆలస్యం చేయకుండా కిందిస్థాయి అధికారుల సెల్ఫోన్లకు వాహనాల నంబర్ల మెసేజ్ ను పంపినట్లు తెలుస్తోంది. సాధారణంగా మామూళ్ల మత్తులో చూసీచూడకుండా వ్యవహరించే అధికారులు.. మంత్రి నుంచి మెసేజ్ వచ్చిందని ప్రచారం జరగటంతో మిన్నకుండిపోతున్నారు. ప్రకాశం, గుంటూరుతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల నుంచి చెన్నై, కృష్ణపట్నం, కర్ణాటక రాష్ట్రాలకు గ్రానైట్ రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి నిత్యం 300 వాహనాలకుపైగా నెల్లూరు మీదుగా వెళ్తున్నాయి. అయితే వాటిలో పరిమితికి మించి అధికలోడుతో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి నుంచి గ్రానైట్‌ను తరలించే తమ వాహనాలపై కేసులు రాయకుండా ఉండేం దుకు కొందరు తమ్ముళ్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావును ఆశ్రయించినట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో కొన్ని నంబర్లను రవాణా అధికారులకు ఫోనులో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. -
మొలక సందేశం
పెళ్లి పెటాకులై విడాకుల దాకా వచ్చినప్పుడు.. కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే విడిపోవాలా? నీవు ఇక నాకొద్దు, మనకిద్దరికీ ఇక చెల్లు.. అని సెలైంట్‌గా చెప్పలేరా? అలా చెప్పేందుకే ఈ ‘బ్రేకప్ బీన్స్’. ఓ బీన్స్ విత్తు ఉన్న చిన్న కప్పులో నీళ్లు పోస్తే చాలు.. నాలుగైదు రోజుల్లో అది మొలకెత్తుతుంది. విత్తనాల పలుకులపై ‘ఇట్స్ ఓవర్’.. ఇకపై ‘లెట్స్ బీ ఫ్రెండ్స్’ అన్న సందేశం అవతలివారికి చేరిపోతుంది! ఏడుపులు పెడబొబ్బల మధ్య విడిపోయే కంటే.. ఇలా కొత్తగా విడిపోవడం మేలంటూ అమెరికాకు చెందిన ‘డ్యూన్ క్రాఫ్ట్’ అనే కంపెనీ ఈ మ్యాజిక్ బీన్స్‌ను విక్రయిస్తోంది. విత్తనాలపై లేజర్ సాయంతో రాసిన ఈ అక్షరాలు అవి మొలకెత్తిన తర్వాత పలుకులపై కూడా కనిపిస్తాయి. ఐదు నుంచి పది రోజుల్లో మొలకెత్తే ఈ విత్తనాలను తోటలో నాటితే 20 అడుగుల వరకూ కూడా పెరుగుతాయట. ధరెంతంటే.. రెండు విత్తనాలు, కప్పు, మట్టితో కూడిన ఒక కిట్‌కు రూ. 300. -
అతడు చాయ్ అమ్మితేనేం...
బరంపూర్: లక్ష్యం లేనివాళ్ల విషయం పక్కన పెడితే.. లక్ష్యం ఉన్నవాళ్లు మాత్రం ఎక్కడ ఉన్నా మెరుస్తూనే ఉంటారు. వారి ఆలోచన మంచిదైతే ఏ విధంగానైనా జనాల్లోకి వెళుతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల వయసున్నరవి అనే వ్యక్తి టీలు అమ్ముకుని జీవిస్తున్నాడు. సమాజం పట్ల అతడికి కాస్తంత స్పృహ ఎక్కువ. పర్యావరణాన్నిఎలా రక్షించుకోవాలనే విషయంలో ఒక నెల రోజులపాటు మంచిమంచి సందేశాలను ఇవ్వడం, నీటి వనరుల వినియోగం విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది కూడా అంతా యువతకే. ఇప్పటికే బెంగాల్‌లోని పలు నగరాల్లో పర్యటించిన రవి.. ప్రస్తుతం ఒడిశాలోని కాళీకోట్ అటనామస్ కాలేజీ విద్యార్థులకు తన హితోపదేశం చెప్పాడు. త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నాడు. సైకిల్ ద్వారా అతడు రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. తక్కువ నిడివి ఉన్న ప్రాంతాలకు సైకిల్‌ను ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయొచ్చని కూడా రవి చెప్తున్నాడు. -
మరోసారి చూడాలి
మరోసారి చూడాలి, కౌగలించుకోవాలి, ముద్దాడాలి ఏమిటి రశికతతో కూడిన సినిమా డైలాగులు అంటారా? మీ కల అనిపించినా, ఇవి సినిమా డైలాగులు కాదు. ఓ ప్రముఖ నటి తన ప్రియుడికి పంపిన ప్రేమ సందేశం కాదు. ఇది ఓ సోషల్ నెట్వర్కు లవ్ మ్యాటర్. కొందరు హీరోయిన్లు ప్రేక్షకులను ఆకర్షించాలనో లేక ఇంకేదో ఆశించో కనీస సామాజిక బాధ్యతను మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. ఇటీవల నటి చార్మి పెళ్లికూతురు రూపంలో ఉన్న ఫొటోను ఇంటర్నెట్లో పోస్టు చేసి ఈ రోజు నాకు పెళ్లి అంటూ చాలామందిని అయోమయానికి గురి చేశారు. తాజాగా నటి ప్రియమణి తనకో లవర్ ఉన్నాడు, తను ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ నెట్లో పోస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆమె అంతటితో ఆగలేదు. ప్రియుడికి తన కోరికలను తెలిపే విధంగా ఒక మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. అవేమిటో తెలుసుకోవాలనుందా? మీ నుంచి మూడు విషయాలు కావాలి. మిమ్మల్ని మళ్లీ చూడాలి, గట్టిగా కౌగలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అంటూ తన రహస్య ప్రేమికుడికి సోషల్ నెట్వర్కు ప్రేమలేఖను రాసి కొందరి అసహ్యానికి గురయ్యారు. మరికొందరు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెసేజ్ పేరుతో ఎలాగైనా ప్రవర్తించవచ్చా అంటూ ప్రియమణి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రచారం కోసం ఇలాంటి చీప్ ట్రిక్కు పాల్పడడమా? అంటూ అసహ్యహించుకుంటున్నారు. సెలిబ్రెటీగా చలామణి అవుతున్న వారు సామాజిక బాధ్యతలు గుర్తెరగాలని హితవు పలుకుతున్నారు. వారికి ప్రియమణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
డీఎస్పీకి మెసేజ్ పెట్టి...ఎలుకల మందు తాగాడు
గోదావరిఖని: ప్రేమ వ్యవహారంలో తనకు న్యాయం చేయలేదంటూ ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చనిపోతున్నానంటూ డీఎస్పీకి ఫోన్లో మెసేజ్ పెట్టి మరీ ఎలుకల మందు తాగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గోదావరిఖనికి చెందిన ఎంసీఏ విద్యార్థి మేడిమెళ్ల ప్రసాద్ ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెను కాలేజీ మానిపించి ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా కట్టడి చేశారు. తన ప్రియురాలను గృహ నిర్బంధం చేశారని ప్రేమికుడు ప్రసాద్ గతంలో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని, తనకు న్యాయం జరగలేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని డీఎస్పీకి ఎస్ఎంఎస్ చేశాడు. దాంతో పోలీసులు వెంటనే స్పందించి... ప్రసాద్ నివాసానికి చేరుకుని... అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
శూన్యంలో ఏం నింపాలి??
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... ఇటీవల కాలంలో టీనేజ్ పిల్లల్లో దాదాపు అందరిదీ ఒకటే సమస్య... ఏకాగ్రత కుదరడం లేదని. తల్లిదండ్రులందరి ఫిర్యాదు ఒక్కటే.. మా పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టడం లేదని. ఈ వయసులో ఎందుకీ సమస్య ఎక్కువవుతోంది..? సుష్మ పట్టణంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం ఊరు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి పరిచయమై, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఊరు నుంచి వచ్చాక అతని నుంచి రోజూ మెసేజ్‌లు.. మొదట్లో స్పందించని సుష్మ మెల్ల మెల్లగా అతని మెసేజ్‌లకు తిరుగు సందేశం ఇవ్వడం మొదలుపెట్టింది. గంటలు గంటలు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తోంది. కొన్ని రోజులకు ఎలాగైందంటే పావు గంటలో అతని నుంచి తిరుగు మెసేజ్ రాకపోతే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తించేది. తల్లిదండ్రులు ఆ అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేశారు. ఊరు వెళ్లి కలిశారు. అతను చదువు మానేసి, ఏ పనీ లేకుండా ఊరికే రోజులు వెళ్లదీస్తున్నాడు. గట్టిగా మందలిస్తే ‘ఇక నుంచి మెసేజ్ చేయను, మాట్లాడను’ అని చెప్పాడు. సుష్మను హాస్టల్లో ఉంచారు. ఏడాది గడిచింది. మళ్లీ ఈ మధ్య ఆ అబ్బాయి నుంచి రోజూ మెసేజ్‌లు. ఫోన్లోనే కబుర్లు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సుష్మకు చదువు మీద పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయింది. టీచర్లు చెప్పే పాఠాలపై ఏకాగ్రత నిలపలేకపోతోంది. మెసేజ్‌లకు అట్రాక్ట్ అయిపోయి, చదువు నుంచి దూరం అయ్యింది. అవినాష్, వినీల దూరపు బంధువులు. ఇద్దరూ ఇంటర్మీడియట్ విద్యార్థులే! బంధువుల ఫంక్షన్లో కలిశారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇళ్లకు వచ్చాక ‘హాయ్ హాయ్’ మెసేజ్‌లు ఇచ్చుకోవడం మొదలైంది. పేరెంట్స్‌కి తెలియకుండా సాగే నిశ్శబ్ద సందేశాలు ఇరువైపులా పిల్లలిద్దరినీ చదువుకు దూరం చేశాయి. పెద్దలకు తెలిసి గొడవలయ్యాయి. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కున్నారు. సమస్య అప్పటికి సద్దుమణిగింది. మరుసటి ఏడాది ఓ పెళ్లిలో కలిశారు. మారిన నెంబర్లు మళ్లీ ఇచ్చుకున్నారు. మళ్లీ మామూలే! ఫోన్లలో మెసేజ్‌లు, కబుర్లు! పుస్తకాలు ముందు ఉన్నా ఏకాగ్రత కుదరడం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. మార్కులు తగ్గిపోయాయి. పాస్ అవుతారో లేదో.. అని భయం. భౌతిక శాస్త్రంలో ... ‘శూన్యం పూడ్చబడుతుంది’ అనే సిద్ధాంతం ఒకటుంది. పిల్లల మైండ్ఎప్పుడైతే లక్ష్యం వైపుగా ఉండదో అది శూన్యంలోనే ఉంటుంది. ఆ శూన్యం ఇటీవల రకరకాల ఆకర్షణలతో పూరింపబడుతోంది. వాటిలో ప్రధానమైనది టెక్నాలజీ! పాఠశాల స్థాయి నుంచే పిల్లల దగ్గర ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఎక్కువైంది. పిల్లలు తమ చుట్టూ ఉన్నవారితో కన్నా మెసేజ్‌లు, చాట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ వయసులో కలిగే రకరకాల అట్రాక్షన్లతో టెక్నాలజీ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారో, చదువు నుంచి ఎలా దూరం అవుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. సరైన దారిలో పెట్టగలగాలి. ఇవి గమనించండి... మారుతున్న కాలానికి, వచ్చి పడుతున్న టెక్నాలజీకి మనం అడ్డుపడలేం. అయితే, ఏ కారణం లేకుండా ఎవరూ పరధ్యానంగా ఉండరు అనే విషయాన్ని గుర్తించాలి. పిల్లలు ఒక వైపునకు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టే, మరో వైపునకు (చదువు)దూరం అవుతున్నారు అనేది గమనించాలి. {పతి మనిషి మైండ్‌లో ‘ఇద్, ఇగో, సూపర్ ఇగో’అని 3 దశలు ఉంటాయి. ‘ఇద్’ అనేది చిన్నపిల్లల మనస్తత్వం. తాత్కాలిక ఆనందాల కోసం పదే పదే మారాం చేస్తుంటుంది. తప్పు అని తెలిసినా ఆనందం కోసం వెంపర్లాడుతుంటుంది. ‘ఇగో’ అనేది దానిని పోలీస్‌లా హెచ్చరిస్తుంది. మంచీ చెడు రెండూ చెబుతుంది. ‘సూపర్ ఇగో’ జడ్జ్ చేస్తుంది. చేసే పని ‘ఎందుకు మంచిది కాదు’ అనేది తమ లోపలి స్వరం ఒకటి హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్వరం వినిపిస్తుందో పిల్లలు అప్పుడు తమను తామే నేరస్థులుగా భావించుకుంటారు. చదువు నుంచి దూరం అవుతారు. ఇవి సూచించండి... మనసుకు ‘వద్దు’ అని చెప్పద్దు: ఆకర్షణకు సంబంధించి ఎలాంటి ‘కోరికలు’ కలిగినా వెంటనే ‘వద్దు’ అని మనసుకు చెప్పకండి. ‘ఇప్పుడు కాదు’ అని వాయిదా వేస్తూ ఉండమనండి. వాయిదా సమయాన్ని బట్టి తీవ్రత తగ్గిపోతుంటుంది. ‘వద్దు’ అంటే పెరుగుతుంది. ఈ విషయాన్ని పిల్లలు గ్రహించేలా వివరించాలి. టైమ్ మిషన్‌లో ఎక్కండి: ఆకర్షణకు లోనవకుండా ఉండాలి, చదువు మీద ఏకాగ్రత కుదరాలి అంటే.. ‘టైమ్ మిషన్’లో ఎక్కమని చెప్పాలి. అంటే కళ్లు మూసుకొని 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో తమని తాము చూసుకోమని చెప్పాలి. మంచి ఇల్లు, కారు, హోదా.. ఇవన్నీ ఉండేలా తమ లోపలి స్వరం వారికే వినిపిస్తుంది. తమని తాము అలా చూసుకున్న తర్వాత దానికి 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నానా! అని వారే బేరీజు వేసుకుంటారు. టైమ్ మిషన్ ఎక్కినప్పుడు ఆటోమేటిగ్గా తాము పెద్దలకు తెలియకుండా చేస్తున్న పనుల పట్ల వారికి భయం వేస్తుంది. పెద్దల స్థానంలో ఉండమనండి: ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పక్కన నిల్చుని లిఫ్ట్‌లో పైకి వెళుతున్నాడు. అతనికి మరో వ్యక్తి తన పక్కన ఉన్నట్టే కనిపిస్తుంది. అదే కింద ఉన్నవారికి లిఫ్ట్‌లో ఉన్న ఆ వ్యక్తి పైకి వెళుతున్నట్టే కనిపిస్తుంది. పక్కన ఉన్న వ్యక్తి, కింద ఉన్న వ్యక్తి ఇద్దరూ చెప్పే సమాధానం సరైనదే! అయితే, ఎక్కడా రెండూ కరెక్ట్‌గా ఉండటం సాధ్యపడదు. పిల్లలు ఆకర్షణలో ఉన్నప్పుడు వారు చేస్తున్నది వారికి కరెక్టే అనిపిస్తుంది. అలాంటప్పుడు పెద్దలు తాము అమలుపరిచే శిక్షలు కరెక్టే అనుకుంటారు. కానీ, పిల్లల మదిలో ఉన్న అపోహలను పెద్దలను తొలగించే ప్రయత్నం చేయాలి. పిల్లలను తల్లిదండ్రుల(పెద్దల) స్థానంలో ఉండమనాలి. ‘నీ కూతురు/కొడుకు ఇలాగే చేస్తే నువ్వేం చేస్తావు?’ అని అడగాలి. సినిమాలలో వంద రకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెడితే అతనే హీరోగా చూపిస్తారు. అబ్బాయిలు అదే నిజం అనుకుంటున్నారు. అయితే, సినిమాలు నిజాలు కావు. కేవలం 3 గంటల వినోదానికి సంబంధించింది మాత్రమే అనేది వారు తెలుసుకోగలగాలి. అదే సినిమాలో హీరో ఒక బ్రిడ్జి మీద నుంచి ఇంకో బ్రిడ్జ్ మీదకు దూకడం వంటి అసాధ్యపు సీన్లు చేస్తుంటాడు. ప్రేమ అనే వ్యవహారానికి త్వరగా ఆకర్షితులయ్యే పిల్లలు అలాంటి సాహసాలు ఎందుకు చేయడం లేదు? ఇవెందుకు చేస్తున్నారు? అంటూ ఇలా వాస్తవాలను తెలియజేయాలి. టీనేజ్ పిల్లల్లో ఆకర్షణ అనేది సాధారణమైనదే అని ముందుగా పెద్దలు తెలుసుకోవాలి. అయితే, ఆ ఆకర్షణ పరిధులు దాటడం వల్లే సమస్యలు కాబట్టి, ఇదే విషయాన్నీ పిల్లలకు వివరించాలి. - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్ www.sudishacounselingcentre.org -
‘మతఘర్షణలు రెచ్చగొట్టే మెసేజ్‌లు ఇవ్వొద్దు’
సాక్షి, ముంబై: మత ఘర్షణలు, అల్లర్లకు ఊతమిచ్చే మెసేజ్‌లు పంపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా హెచ్చరించారు. అలాగే సదరు ఎస్ఎంఎస్లను, ఎమ్మెమ్మెస్లను ఇతరులకు ఫార్వర్డ్ చేసేవారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు లాల్బాగ్ ప్రాంతంలో ఈ నెల నాలుగో తేదీ రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలుచేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఘటన ముందస్తు పథకం ప్రకారమే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అల్లర్లు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌ల ద్వారా నగర మంతట వ్యాపించింది. దీన్ని బట్టి ఇదంతా ముందస్తు పథకం ప్రకారం జరిగిందని మారియా అనుమానాలు వ్యక్తం చేశారు. మత ఘర్షణలు సృష్టించి నగరంలో శాంతి, భద్రతలకు విఘాతం కల్గించాలని అసాంఘిక శక్తులు పథకం వేసినట్లు స్పష్టమవుతోందని మారియా అభిప్రాయపడ్డారు. ఆ రోజు స్థానిక ప్రజలు సంమయనం పాటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మతఘర్షణలు జరిగి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌లు ఎవరు, ఎవరికి పంపించారు...? వారు బల్క్‌లో ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారో ఆరా తీస్తున్నామన్నారు. కాగా, ఏదైనా ఘటన జరిగితే దాని పూర్తి వివరాలు తెలుసుకోకుండా అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే మెసెజ్‌లు ఇతరులకు పంపకూడదని మారియా సూచించారు. సదరు సమాచారాన్ని ముందు సమీప పోలీసు స్టేషన్‌కు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
లాటరీ పేరుతో నొక్కేశారు..!
6 కోట్ల లాటరీ తగిలిందని 35 లక్షలకు టోకరా బీటెక్ విద్యార్థిని మోసగించిన నైజీరియన్ల అరెస్ట్ +44, +92 నంబర్లతో వచ్చే మెసేజ్‌లు నమ్మొద్దు: డీసీపీ సాక్షి, హైదరాబాద్: ‘మీ సెల్ నంబర్.. లాటరీలో రూ. 6 కోట్లు గెలుచుకుంది’ అని ఓ విద్యార్థిని బురిడీ కొట్టించి.. అతని నుంచి రూ. 35 లక్షలు నొక్కేసిన నైజీరియా గ్యాంగ్ చివరికి కటకటాల పాలైంది. శనివారం సీసీఎస్ డీసీపీ పాలరాజు తన కార్యాలయంలో నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. నైజీరియాకు చెందిన పీటర్ ఆస్టిన్(29), ఎబోన్ ఫెలిక్స్ ఒమోనువా(26), స్టెఫీ ఎబోన్(24), డానియల్(26) విజిటింగ్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చారు. లాటరీ పేరుతో అమాయకులను బురిడి కొట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాసాబ్ ట్యాంక్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ వసీముద్దీన్ (22)కు ‘‘మీ సెల్‌నంబర్ లాటరీలో రూ. 6 కోట్లు గెలుచుకుంది’’ అని ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వసీముద్దీన్ రూ. 6 కోట్లు ఎలా వస్తాయి.. ఎప్పుడు పంపిస్తారని తిరిగి మెయిల్ పంపాడు. ముందుగా రిజిస్ట్రేషన్ చార్జీలు, ట్యాక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జీలు, హైకోర్టు సర్టిఫికెట్, ఫైనాన్స్ మినిస్ట్రీ ఎన్వోసీ, బాంబే హైకోర్టు అఫిడవిట్, ఆర్బీఐ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని వసీముద్దీన్ను వారు నమ్మించారు. దీంతో వారు చెప్పినట్లు 16 బ్యాంకు ఖాతాల్లో రూ.35 లక్షలు డబ్బులను వసీముద్దీన్ వేశాడు. కానీ, రూ.6 కోట్లు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వసీముద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నామని పాలరాజు చెప్పారు. లాటరీ గెలిచారని +44, +92 సిరీస్ నంబర్లతో వచ్చె ఎస్ఎంఎస్లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. -
ఇదేం.. సం‘దేశం’!
* పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు * వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాజాకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి మెసేజ్ రాక తుని : అధినేత మెప్పు కోసమో....ప్రజలను ఏమార్చేందుకో కానీ తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రుణ మాఫీ పథకం, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇలా ప్రభుత్వ పథకాలు కావాలంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాలని బలవంతం చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఏకంగా వైఎస్సార్ సీపీకి చెందిన తుని శాసన సభ్యులు దాడిశెట్టి రాజా టీడీపీ సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలంటూ టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి మెసేజ్ రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. టీఆర్-టీ-2850-68381 నంబర్‌తో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని డీఎం-టీడీపీఓఎఫ్సీ పేరిట ఎమ్మెల్యే రాజా ఫోన్‌కు శుక్రవారం మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’కి వివరించారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని ప్రచారం చేసుకోడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని పలువురు ముక్కున వేలేసుకున్నారు. -
వాహ్వ్..వాట్సప్
వాట్సప్... నేడు అత్యంత ఆదరణ కలిగిన యాప్.. ఇటీవల పుట్టుకొచ్చిన ఈ మొబైల్ యాప్ గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. మొబైల్లో టాక్‌టైమ్ లేకపోయినా కేవలం నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు.. ఈ యాప్ సహాయంతో ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు.. వీడియో చాట్ చేసుకోవచ్చు. గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఒకరి భావాలు ఒకరు పంచుకోవచ్చు.. అంటువంటి ఈ వాట్సప్‌కు నేటి యువత హ్యాట్సాప్ అంటున్నారు... ఇటీవల కాలంలో యువత నుంచి పెద్దల వరకు అందరూ వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. మీ ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకుని ఆపై ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. మెస్సేజ్‌లు పంపుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అనుక్షణం తామేమీ చేస్తున్నా సెల్ఫీ( సొంత ఫొటో) తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తున్నారు. అందుకు ఈ యాప్ ఎంతో అనువుగా ఉంటోంది. ప్రైవసీ కూడా ఉంటోంది. కేవలం ఫోన్ నంబర్ తెలిసి, ఈ యాప్‌లో రిజిస్టర్ అయిన వారికి మాత్రమే మన ఫొటోలు, సందేశాలు, వీడియోలు కనిపించే వీలుంటుంది. దీని ద్వారా కొంతమంది మిత్రులు కలిసి గ్రూపులు కట్టి తమ భావాలను పంచుకుంటున్నారు. ఇదే కాక ఇంకా అనేక యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హైక్, లైన్, వైబర్, చాట్ వంటిని వాటిల్లో ముఖ్యమైనవి. యువతకు ఎంతో ఉపయోగం... ఒకప్పుడు మెస్సేజ్ పంపాలంటే నెట్వర్క్ పరిధిలోని సెల్ నంబర్ నుంచి వేరే సెల్‌కు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. మెస్సెంజర్స్ ద్వారా సందేశాలు పంపడమే కాకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాట్సప్, వైబర్, లైన్, హైక్, చాట్ తదితర యాప్స్ ఉపయోగించుకోవచ్చు. చాటింగ్, షేరింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ తరహా యాప్స్ రోజుకొకటి పుట్టుకొస్తున్నా యువత మాత్రం వాట్సన్, వైబర్, ఫేస్బుక్ తదితర వాటిని మాత్రమే వినియోగిస్తున్నారు. ఫేస్బుక్ మెసెంజర్.... వాట్సప్, వైబర్‌ల తర్వాత ఎక్కువమందిని ఆకర్షిస్తున్న యాప్ ఫేస్బుక్ మెసెంజర్. ఫేస్బుక్ కు అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీని ద్వారా చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫొటోలు పంపుకోవచ్చు. గంటల తరబడి చాట్ చేసుకోవచ్చు. వైబర్... వైబర్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఎంత సేపైనా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఉపయోగకరంగా ఉంది : నేను సంవత్సర కాలంగా వాట్సప్‌ను వాడుతున్నాను. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఫొటోలను, మెసెజ్‌లను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం ఖర్చులేకుండా సందేశాలను పంపుకునే వీలుంది. - ఎం భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వైరా అందరూ వాడుతున్నారు : నేను ఆరు నెలలుగా వాట్సప్‌ను వాడుతున్నాను. నా స్నేహితులు ఎక్కువమంది వాట్సప్‌నే ఉపయోగిస్తున్నారు. అందువల్ల అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరి భావాలను షేర్ చేసుకుంటున్నాం. మెసేజ్ కానీ, ఫొటోకానీ షేర్ చేస్తే గ్రూప్‌లో అందరూ వాటిని చూసుకోవచ్చు. - ఎస్ సందీప్, బీటెక్ ఫైనలీయర్, ఖమ్మం ఖర్చు తగ్గింది : స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన హైక్, వాట్సప్, వైబర్, లైన్, చాట్, ఫేస్బుక్ మెసెంజర్లు బాగున్నాయి. వీటి ద్వారా మొబైల్ ఖర్చు తగ్గుతుంది. టాక్‌టైం లేకపోయినా ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు తక్కువ ఖర్చుతో మాట్లాడుకోవచ్చు. సందేశాలు పంపుకునేందుకు వీలుంది. - కిరణ్, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వైరా సమాచారం సులభంగా చేరవేయవచ్చు : ప్రస్తుతం సమాచార విప్లవం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. విధి నిర్వహణలో వాట్సప్, వైబర్ వంటి యాప్స్ ద్వారా సమాచారాన్ని చేరవేయడం అతి సులువుగా ఉంటుంది. కిడ్నాప్‌లు వంటివి జరిగినప్పుడు సమాచారం మొబైల్ ద్వారా షేర్ చేయాడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా వల్ల ఎంతో మేలు జరుగుతుంది. - భూక్యా రాంరెడ్డి, డీఎస్పీ, వైరా -
మొబైల్ మెయిల్‌లోనూ మర్యాద.. మర్యాదే!
మర్యాద... ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ముఖాముఖైనా... మెసేజ్, ఈమెయిళ్లయినా సరే.. కొంత పద్ధతి, కొన్ని మర్యాదలు పాటించాల్సిందే. కానీ టెక్నాలజీతోపాటే జీవితాల్లోనూ వేగం పెరిగింది. వీటితో షార్ట్కట్ల వాడకమూ పెరిగిపోయింది. అందుకే ఈ గాడ్జెట్స్‌తో మెయిళ్లు పంపేటప్పుడు అవి ఆఫీసువైనా, వ్యక్తిగతమైనవైనాసరే... కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు. వారు చెప్పే మొబైల్ ఈమెయిల్ ఎటికెట్లు ఎమిటంటే....? అమెరికాలో ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం మొబైల్ ఫోన్ల ద్వారా మెయిళ్లు పంపడం ఇటీవలి కాలంలో జోరెక్కింది. మొత్తం మెయిళ్లలో 63 శాతం ఈ కోవకు చెందినవేనని ఈ సర్వే తేల్చింది. బంధుమిత్రులతో సంప్రదింపులకే కాదు... ఆఫీసు పనులకు సంబంధించిన మెయిళ్లు కూడా వీటిద్వారానే జరిగిపోతున్నాయి. టైపింగ్ సమస్యలనండి లేదా మరో కారణం కానివ్వండి. గాడ్జెట్ల ద్వారా పంపే మెయిళ్లు డెస్క్‌టాప్‌ల ద్వారా పంపే వాటికంటే నాసిరకంగానే ఉంటాయన్నది నిష్టూర సత్యం. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకూ మేలు... 1. కొన్నింటికి డెస్క్‌టాప్ బెటర్... మీరు మెయిల్ పంపే సందర్భాన్ని బట్టి మొబైల్, డెస్క్‌టాప్‌లలో దేనిద్వారా పంపాలన్నది నిర్ణయించుకోండి. ఉదాహరణకు జాబ్ ఆఫర్ లేదా ఆఫీసు క్లయింట్ సవివరంగా పంపాల్సిన మెయిళ్లకు డెస్క్టాప్ను ఎంచుకోవడం మేలు. ఇంకోలా చెప్పాలంటే సమాచారం ఎక్కువ ఉంటే పీసీ మేలన్నమాట. ఒకవేళ ఏదైనా మెయిల్‌కు మొబైల్ ద్వారా రిపై ్ల ఇవ్వాల్సిన సందర్భం వస్తే... ప్రస్తుతానికి మెయిల్ చూశానని... వివరాలను మరో మెయిల్లో పంపుతానని చెప్పవచ్చు. 2. సూటిగా సుత్తి లేకుండా.... గాడ్జెట్‌లోని టచ్ కీబోర్డులతో టైపింగ్ ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. వీటిద్వారా పంపే మెయిళ్లలో తప్పులు దొర్లేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి మెయిల్లో ముందుగా కీలకమైన అంశాలను చెప్పి... వివరణలు ఉంటే తరువాత పంపండి. 3. విషయం.. సంబోధన/పలకరింపు ముఖ్యం... ఏ గాడ్జెట్ ద్వారా మెయిల్ పంపినా వాటిల్లో విషయం (సబ్జెక్ట్), సరైన సంబోధన/పలకరింపు (గ్రీటింగ్స్) కచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిల్ ఎందుకు పంపుతున్నామో సబ్జెక్ట్ లైన్లో రాయాలి. అలాగే అవతలి వ్యక్తిని తగురీతిలో సంబోధించాలి. మెయిల్ ప్రారంభంలో గ్రీటింగ్స్ చెప్పడం... చివరలో ముక్తాయింపు ఇవ్వడం తప్పనిసరి. 4. పెద్ద లింక్‌లు వద్దు... మనం పంపే మెయిళ్లలో పెద్దపెద్ద యూఆర్ఎల్లు ఉంటే వాటిని చిన్నవిగా చేసుకోవడం డెస్క్‌టాప్‌లలో ఈజీ. మొబైల్‌లలో మాత్రం చాలా కష్టం. కానీ భారీసైజు లింక్‌లను పంపడం అంత మంచిదికాదు కూడా.యూఆర్ఎల్లను కురచబార్చే బిట్.ఎల్వై వంటి అప్లికేషన్ల సాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. 5. పంపేముందు... స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ల ద్వారా మెయిళ్లు టైప్ చేసి పంపే ముందు ఒకసారి మెయిల్ మొత్తాన్ని సరిచూసుకోవడం ఎంతైనా అవసరం. టైప్ చేశామా... సెండ్ కొట్టామా అన్నట్టుగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఆటోకరెక్ట్ ఆప్షన్ ఉంటే మరీ జాగ్రత్త అవసరం. ఒక్కోసారి ఈ ఆప్షన్ కారణంగా పదాలు మారిపోయి దురర్థం వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాకుండా వీలైనంత వరకూ ఎస్ఎంఎస్లో ఉపయోగించే షార్ట్‌కట్ భాష మెయిళ్లలో లేకుండా చూసుకోవడం ముఖ్యం. - చివరగా... మొబైల్ ఫోన్/టాబ్లెట్ ద్వారా మెయిల్ పంపినట్లు వచ్చే సూచనలు మెయిల్లో లేకుండా చేసుకోవాలి. జీమెయిల్ ద్వారా వీటిని తొలగించడం సులువే. అలాగే బిజినెస్ మెయిళ్లలో మీ పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఉండేలా జాగ్రత్త పడండి. -
ప్రయాణికులకు మెరుగైన సదుపాయం
సిబ్బందికి సందేశం పంపిన రైల్వేశాఖ కొత్త మంత్రి సురేశ్ ప్రభు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు భద్రతతో కూడిన మెరుగైన రవాణా, వసతి సౌకర్యాల్ని కల్పించాల్సిన గురుతర బాధ్యత రైల్వే సిబ్బందిపై ఉందని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే చేదోడువాదోడుగా ఉందన్న విషయాన్ని గుర్తించి ప్రతిఒక్కరూ సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన అన్ని రైల్వే జోన్లకు సందేశాన్ని పంపారు. రైల్వేను సమూలంగా మార్చాలని భావిస్తే ముందుగా ప్రతి రైల్వేఉద్యోగి తనకుతాను మారాల్సి ఉంటుందని సూచించారు. మంత్రి పంపిన సందేశాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సిబ్బందికి పంపిణీ చేసి అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. -
వాట్సప్ టిక్కులను వదిలించుకోవడం ఎలా?
మీరు వాట్సప్ మెసెంజర్లో ఉన్నారా? అయితే వారం రోజులుగా మీరు పంపిన మెసేజీలను ఒకసారి చూడండి. వాటిపక్కనే నీలిరంగు టిక్కులు ఒకట్రెండు కనపడుతున్నాయా? అవేమిటో, ఎందుకో అర్థం కావడం లేదా? వాటినెలా తొలగించుకోవాలో తెలియడం లేదా? ఏం ఫర్వాలేదు. ఇంకో ఐదు నిమిషాల్లో అన్నీ అర్థమైపోతాయి. విషయమేమిటంటే... కొన్ని రోజుల క్రితం వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మెసేజీ పంపగానే ఒక టిక్, అవతలి వ్యక్తి ఆ మెసేజీని చూడగానే ఇంకో టిక్ పడేలా ఏర్పాట్లు చేసింది. మనం పంపే మెసేజీలు అవతలివారు చూశారా... లేదా? అన్నది చెక్ చేసుకునేందుకు... బాగానే ఉంటుంది ఈ ఫీచర్. కాకపోతే ఇది కొంతమందికి నచ్చింది.. ఇంకొంతమందికి నచ్చలేదు. తను పంపిన మెసేజీలు చూడటం లేదని సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడట. ఈ నేపథ్యంలో ఈ టిక్‌లను తొలగించుకోవడమెలా అన్న ప్రశ్న వచ్చింది. చాలా సింపుల్. కింద చూపినట్లు చేస్తే సరి... 1. అన్నింటి కంటే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డౌన్లోడ్ ఫ్రం అన్నోన్ సోర్సెస్’ అన్న ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి. 2. వాట్సప్ వెబ్‌సైట్‌కు వెళ్లి తాజా ఏపీకే ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. బదులుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్‌ను తాజాగా కొత్త వెర్షన్‌తో ఇన్స్టాల్ చేసుకున్నా సరిపోతుంది. 3. తాజాగా వాట్సప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత నేరుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. 4. అకౌంట్ ట్యాబ్‌లోకి వెళ్లి ప్రైవసీపై క్లిక్ చేయండి. 5. ఇక్కడ మీరు ‘రీడ్ రెసీప్ట్స్’ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డిసేబుల్ చేస్తే... ఆ తరువాత నుంచి మీకు నీలిరంగు టిక్‌లు కనిపించకుండా పోతాయి. -
నిగ్గు తేల్చే పరీక్ష
సందేశం హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది. గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు. వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు. ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు. - రెంటాల జయదేవ -
ఒక్క మెసేజ్‌తో.. సర్వ సమస్యలకు చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఒకే ఒక్క మెసేజ్ అన్ని సమస్యలకూ పరి ష్కారం చెబుతుందని ఆంధ్రా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభోద్ కె. మొల్రే స్పష్టం చేశారు. బ్యాంకు బరంపురం జోన్ పరిధిలోని 9 జిల్లాల్లో ఈ ఎస్సెమ్మెస్ సేవ అందుబాటులో ఉందన్నారు. ఈనెల 4న డీజీఎంగా విధులు చేపట్టిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ బ్యాంకు కార్యకలాపాలు, అందిస్తున్న సేవల గురించి వివిరంచారు. సమస్యలతో అప్సెట్ అయ్యారా? దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా 9666606060 నెంబర్‌కు ‘అప్సెట్’ అని మెసేజ్ పంపిస్తే క్షణాల్లో పరిష్కారం సూచిస్తామని డీజీఎం చెప్పారు. ఆన్లైన్, మొబైల్ బ్యాంకు కార్యకలాపాలతో పాటు 24 గంటల ఏటీఎం సేవలు కూడా త్వరలో అందుబాట్లోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చిచూస్తే తమ బ్యాంకు మాస్ బ్యాంకుగా వ్యవహరిస్తోందన్నారు. ‘0’నుంచి రూ.100 వరకు బ్యాంకు ఖాతాల్లో ఉండే అవకాశాన్ని కూడా ఖాతాదారులకు కల్పించామన్నారు. ఒడిశా జోన్‌లోని తొమ్మిది జిల్లాల్లో వేలాది బ్రాంచ్‌లో ఖాతాదారులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి కార్యాలయంలోనూ రిసెప్షన్ కౌంటర్‌తోపాటు బ్యాంకు ఖాతాల పై అవగాహన, పథకాలపై చైతన్యం కల్గిం చేందుకు సిబ్బంది అందుబాట్లో ఉంటున్నారన్నారు. రూ.4200 కోట్ల టర్నోవర్ లక్ష్యం ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కొందమాల్, కొరాపుట్, మల్కాన్‌గిరి, కలహండి, నవరంగపూర్ జిల్లాలతో పాటు బరంపురం జోన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా పై తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నా రు. తమ ఖాతాల్లో 50 శాతం వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించినవేనన్నారు. ప్రస్తుతం రూ.4200 కోట్ల టర్నోవ ర్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. రుణాల నిమిత్తం రూ.1476 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. 28 శాతం రుణాల ను చిన్న, మధ్య తరహా సంస్థలకు తక్కువ వడ్డీకే ఇస్తున్నామన్నారు. తమ పరిధిలో 2.40 కోట్ల మంది ఖాతాదారులున్నారన్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకే ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) అమలు చేస్తున్నామని, ఖాతాదారులకు తమ ఖాతా కు సంబంధించి చిరునామా సహా అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉం టుందన్నారు. ‘మనీ ల్యాండరింగ్’ అయ్యే అవకాశాల్ని పరిశీలించేందుకు ఇది దోహదపడుతుంద ని వివరించారు. ఆధార్ సీడింగ్ విషయమై తమకింకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మరిన్ని బ్రాంచీలు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం సహా ఒడిశాలోని ఐదు ప్రాంతాల్లో నవంబర్ నాటికి కొత్తశాఖలు ఏర్పాటుచేయనున్నట్టు ప్రబోధ్ తెలిపారు. అన్ని బ్రాంచీల్లోనూ వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని, చిటికెలో పని అయిపోయే విధంగా ఆన్లైన్ లావాదేవీలను విస్తృతం చేయనున్నట్టు చెప్పారు. కొన్ని చోట్ల ఏటీఎం సెంటర్ల సేవల్లో లోపం కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో అన్ని సెంటర్లను ప్రత్యేక సిబ్బంది తో తనిఖీలు చేయిస్తామన్నారు. ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డుల నియామ కం, సీసీ టీవీల ఏర్పాటు వంటి విషయా ల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నా రు. బ్యాంకుల్లో కాయిన్ డిస్పెన్సర్, చెక్ డ్రాపింగ్, అకౌంట్ ఓపెనింగ్, చిన్న మొత్తా ల్లో డిపాజిట్ వంటి వాటి కోసం అందుబా ట్లో ఉన్న సాంకేతిక నైపుణ్యంతో కొత్తకొత్త యంత్రాల్ని ఆమరుస్తున్నామన్నారు. బిల్డ ర్లు, ట్రేడర్లు, రైస్‌మిల్లర్లకు కొత్తగా రుణాలిచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రభోద్తోపాటు ఇక్కడి లీడ్‌బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి సహా మరికొం తమంది బ్యాంకు అధికారులు మాట్లాడారు. -
ఆన్లైన్ మోసం
భారీ గిఫ్టుల పేరిట మెసేజ్‌లు నిలువునా మునిగిపోతున్న వినియోగదారులు పరువుపోతుందని బయటపడని వైనం యలమంచిలి: సెల్ఫోన్లలో భారీ గిఫ్టుల సందేశాలు వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీల పేర్లతో సెల్‌ఫోన్లద్వారా మెసేజ్‌లు పంపిస్తూ వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొం దరు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు, పేరొందిన సంస్థల నుంచి మీకు రూ. కోటి గిప్టుగా వచ్చిందంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇటువంటి మోసాలపై పట్టణప్రాంతాల్లో వినియోగదారులకు అవగాహన ఉండడంతో పెద్దగా స్పందించడంలేదు. ఇప్పుడు మోసగాళ్ల దృష్టి గ్రామీణులపై పడింది. ఏదోలా సెల్‌ఫోన్ నంబర్లను సేకరిస్తున్న వీరు సంబంధిత వినియోగదారులకు మీకు రూ.కోటి గిప్టు వచ్చిందంటూ మెసేజ్ పంపిస్తున్నారు. దానికి స్పందిస్తున్న కొందరు ఫోన్లోనే మాట్లాడుతున్నారు. కంపెనీ గిఫ్టు పొందాలంటే ముం దుగా మీరు రూ. 20వేల నుంచి రూ.30వరకు తమ ఆన్లైన్ అకౌంట్లో జమచేయాలని నమ్మిస్తున్నారు. గిప్టు నగదును ట్యాక్స్ మినహాయించి చెక్ రూపంలో ఇస్తామని నమ్మబలుకుతున్నారు.ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లేడే వారితో ఇవన్నీ చెప్పిస్తున్నారు. నమ్మకం కలగడానికి ఆన్లైన్ అకౌంట్లో నగదును జమచేశాక ఆధార్ కార్డుతో రావాలని సూచిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో గిప్టు ఏవిధంగా ఇస్తున్నారని ఎవరైనా గట్టిగా నిల దీస్తే ఫోన్ కట్ చేస్తున్నారు. ఆన్లైన్ అకౌం ట్లో సొమ్ము జమచేశాక మోసపోయామని తెలుసుకున్న కొందరు లబోదిబో మంటున్నారు. ఇది మోసమని తెలిసిన కొందరు మెసేజ్‌లను పట్టించుకోవడంలేదు. మరి కొందరు మాత్రం ఆయా మెసేజ్‌ల గురించి సంబంధిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి అన్లైన్ అకౌంట్లలో సొమ్ము జమచేస్తూ మోసపోతున్నారు. -
కిట్‌క్యాట్ హవా మొదలైందా...?
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ శకం మొదలైందా... వారం రోజుల వ్యవధిలో మూడు నాలుగు స్మార్ట్ఫోన్లలో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ దర్శనమివ్వడాన్ని గమనిస్తే అవుననే చెప్పాలి.మరి.. ఈ తాజా ఓఎస్ తెచ్చే కొత్త ఫీచర్లేమిటి? వాటితో మనకు కలిగే ప్రయోజనాలేమిటి?చదవండి మరి... మొబైల్ఫోన్లను స్మార్ట్ఫోన్లుగా మార్చిన ఘనత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొట్టమొదటి వెర్షన్ కప్ కేక్ మొదలుకొని ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న జెల్లీబీన్ వరకూ కొత్తఫీచర్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. మొబైల్‌ఫోన్‌ను అరచేతి అద్భుతంగా మార్చేశాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ 4.4.2ను గత ఏడాది సెప్టెంబరులోనే ప్రకటించింది. డెవలపర్లు తమదైన మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ తరువాత కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకుని డిసెంబరు 2013 నాటికి పూర్తి రూపాన్ని సంతరించుకుంది. అయినప్పటికీ కొన్ని ఇతర కారణాల దృష్ట్యా అధికశాతం ఫోన్లలోకి చేరలేదు. ప్రస్తుతం 10 శాతం ఫోన్లకు మాత్రమే విస్తరించింది. జెల్లీబీన్‌తో నడుస్తున్న స్మార్ట్ఫోన్లు కొన్ని అప్‌గ్రేడ్‌కు అవకాశమివ్వడం... తాజా ఓఎస్‌తో కొత్తఫోన్లు రావడం కిట్‌క్యాట్ ప్రాబల్యం పెరుగుతోందనడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. మెరుగైన మెమరీ మేనేజ్మెంట్... స్మార్ట్ఫోన్లను ఎంచుకునే సమయంలో మనమందరం కచ్చితంగా గమనించే అంశం ర్యామ్. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ అంత మెరుగ్గా పనిచేస్తుందన్నది మనకున్న అంచనా. కిట్‌క్యాట్‌లో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే అతితక్కువ ర్యామ్‌తోనూ సమర్థంగా పనిచేసేందుకు వీలుగా దీంట్లో మెరుగైన మెమరీ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే కిట్‌క్యాట్ ఓఎస్ ఉంటే 512 ఎంబీ ర్యామ్‌తోనూ మల్టీటాస్కింగ్ సులువుగా చేసుకోవచ్చు. టచ్‌స్క్రీన్ స్పందనలను మరింత సమర్థంగా నిర్వహించడం, ముఖ్యమైన అప్లికేషన్ల మెమరీ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆండ్రాయిడ్ ఈ ఘనతను సాధించింది. గూగుల్‌తో మమేకం... ఆండ్రాయిడ్ అనేది గూగుల్ సిద్ధం చేసిన ఓఎస్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లనే గూగుల్‌కు సంబంధించిన సర్వీసులు అనేకం ఈ ఓఎస్‌లో కనిపిస్తాయి. కిట్‌క్యాట్‌లో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకే గూగూల్ వీటిల్లో ఒకటి. జెల్లీబీన్ తాజా వెర్షన్లు కొన్నింటిలో కనిపించిన ఈ ఫీచర్ మీ మాటనే ఆదేశంగా మారుస్తుంది. హోంస్క్రీన్పైనే ఉండే మైక్ ఐకాన్ ద్వారా గూగుల్ సెర్చింజిన్‌ను వాడుకోవచ్చు. లేదా టెక్ట్స్ మెసేజ్‌లు పంపవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరోచోటికి వెళ్లేందుకు డెరైక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ వంటి అప్లికేషన్లను లాంచ్ చేయవచ్చు కూడా. వీటితోపాటు గూగుల్ నౌ అప్లికేషన్లను ఇతర అప్లికేషన్లతో అనుసంధానించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏదైనా హోటల్ కోసం వెతుకుతున్నారనుకుందాం. గూగుల్ నౌలో ఈ పని మొదలుపెట్టగానే... మీకు దగ్గర్లో ఉన్న హోటళ్ల వివరాలు గూగుల్ మ్యాప్ అప్లికేషన్ సాయంతో కనిపిస్తాయి. మెసేజీలన్నీ హ్యాంగౌట్ లోనే... ఇప్పటివరకూ కేవలం ఎస్ఎంఎస్లకు మాత్రమే పరిమితమైన హ్యాంగౌట్ కిట్‌క్యాట్‌లో అన్ని రకాల మెసేజ్‌లను ఒకేచోట చూపుతుంది. హెచ్డీ వీడియో కాల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. యానిమేషన్ జీఐఎఫ్, లొకేషన్ల షేరింగ్‌కి కూడా హ్యాంగౌట్ ఉపయోగపడుతుంది. కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో కాలర్ ఐడీలోనూ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డిజైన్‌తోపాటు ఒక సెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో లిస్ట్ అయిన వ్యాపారాల తాలూకూ కాంటాక్ట్ సమాచారం కాలర్ ఐడీ ద్వారానే లభిస్తుంది. వైర్లెస్ ప్రింటింగ్‌కు ఆస్కారం... మొబైల్ఫోన్ల ద్వారా ఫొటోలు, డాక్యుమెంట్లను నేరుగా ప్రింట్ చేసేందుకు కిట్‌క్యాట్ అవకాశం కల్పిస్తోంది. గూగుల్ క్లౌడ్ ప్రింట్ అప్లికేషన ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాకపోతే వైఫై, బ్లూటూత్ ల ద్వారా జరిగే ఈ ప్రింటింగ్‌కు తగిన ప్రింటర్లు కూడా ఉండాలి. ప్రింటింగ్ సంగతి ఇలా ఉంటే కిట్‌క్యాట్ ద్వారా క్లౌడ్ స్టోరేజీ కూడా చాలా సులువుగా జరిగిపోతుంది. మీ ఫోన్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే గూగుల్ డ్రైవ్ సాయంతో నేరుగా క్లౌడ్ నుంచే డాక్యుమెంట్లను ఓపెన్ చేయవచ్చు. స్టోర్ చేయవచ్చు నన్నమాట. క్విక్ ఆఫీస్ వంటి అప్లికేషన్ల ద్వారా ఈ డాక్యు మెంట్స్‌ను ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకునే వీలుంటుంది. తద్వారా ఆఫీసు పనులను కూడా ఎప్పటి కప్పుడు చక్కబెట్టుకోవచ్చునన్నమాట. కిట్‌క్యాట్ ఓఎస్‌లో రెండు కాంపోజిట్ సెన్సర్లు అదనంగా చేరాయి. స్టెప్ కౌంటర్, స్టెప్ డిటెక్టర్ అనే ఈ రెండు సెన్సర్ల ద్వారా ప్రత్యేకమైన ఫిట్నెస్ అప్లికేషన్ల అవసరం లేకుండా పోతుందన్నమాట. -
లక్ష్యం పెట్టుకోండి... చేరుకోండి..!
ఇప్పటి యువతను చూస్తే ముచ్చటేస్తుంది. అద్భుతమైన శక్తిసామర్థ్యాలు వారి సొంతం. కొద్దిమంది అంటుంటారు-‘‘ఆయన చెబితేగానీ నాలోని శక్తి ఏమిటో నాకు తెలియలేదు’’ అని. ఎవరో వచ్చి మన శక్తి గుర్తించి, చెప్పే వరకు ఎందుకు నిరీక్షించాలి? ప్రతి మనిషిలో ఒక విమర్శకుడు ఉంటాడు. అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీలో శక్తి ఏమిటో, లోపాలు ఏమిటో చెబుతాడు. కలను నిజం చేసుకోవడమంత గొప్ప పని ఈ జీవితంలో మరొకటి లేదు. ఏ లక్ష్యం లేకుండా రోజులు దొర్లించడమనేది మనకు మనమే హాని చేసుకోవడం లాంటిది. మీ కంటూ ఒక లక్ష్యం లేనట్లయితే ఏర్పరుచుకోండి. ఉంటే కృషి చేయండి. లక్ష్యాన్ని చేరుకున్న రోజు ఒక్కసారి కళ్లు మూసుకొని మౌనంగా ఉండండి. తెరలు తెరలుగా ఆనందం మీ హృదయాన్ని తాకుతుంది. నిజానికి అది మాటల్లో చెప్పే అనుభూతి కాదు. అది మీ సొంతం కావాలంటే...ప్రయత్నించండి, గెలవండి! - షారుక్‌ఖాన్ -
వసూళ్లకు పది మార్గాలు!
=విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో పది పరీక్షల ఫీజు వసూలు = ప్రైవేటులోనే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అదే తీరు =అధికారులకు ఫిర్యాదుల వెల్లువ చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తరగతులు సరిగ్గా జరక్క విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే విద్యాసంస్థలు మా త్రం అవేమీ పట్టించుకోవడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి అధిక మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. 2014 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ ప రీక్షలు రాసేందుకు రెగ్యులర్ విద్యార్థులకు రూ.125 ఫీజుగా నిర్ణయించారు. అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి నాలుగైదు ఇంతలు ఎక్కువగా వసూలు చేస్తూ జేబులు నింపుకునే పనిలో పడ్డారు. రెం డ్రోజుల క్రితం జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్లు ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. 50కు పైగా పాఠశాలల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు అధికారులకు మేసేజ్‌లు వచ్చాయి. అధిక మొత్తంలో వసూలు చేసిన వాటిలో ప్రభుత్వ పాఠశాలలూ ఉండడం గమనార్హం. రూ.వెయ్యి వరకూ వసూలు పదో తరగతి ఫీజు 125 రూపాయలే. కొన్ని వి ద్యాసంస్థలు విద్యార్థుల నుంచి రూ.500, రూ. 600 వరకు వసూలు చేసినట్టు తల్లిదండ్రులు మేసేజ్‌ల ద్వారా ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. నాలుగైదు పాఠశాలల్లో అయితే వెయ్యి వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులందాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారో అని సదరు యా జమాన్యాన్ని అడుగుదామంటే, పరీక్షల సమయంలో హాల్‌టిక్కెట్ ఇవ్వరేమోననే భయంతో ఇవ్వాల్సి వచ్చిందని ఓ విద్యార్థి తండ్రి అధికారులతో వాపోయాడు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకసారి ఫెయిల్ అయి, పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులు డీఈవో ప్రతాప్ రెడ్డి దృష్టికి వెళ్లాయి. అధికారులకు ఇవ్వాలి .. ‘ఎక్కువ డబ్బులు తీసుకుంటోంది మా కోసం కాదు.. పరీక్షలు నిర్వహించే అధికారుల కోసం’ అంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లి దండ్రులను బోల్తాకొట్టిస్తున్నాయి. పరీక్షల సిబ్బంది నుంచి ఐసీఆర్ (ఇంటెలిజెంట్ క్యారక్టర్ రికగ్నేషన్) ఫారాలు తీసుకునేటప్పు డు, తర్వాత వారికి నామినల్ రోల్స్ సమర్పించేటప్పుడు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అనధికారికంగా కొంత మొత్తం ఇస్తారు. అందువల్లే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాయని పలువురు అంటున్నారు. అయితే అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఈ విషయంలో విద్యార్థులే చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు 21వ తేదీ వరకు సమయం ఉండడంతో విద్యాశాఖ అధికారులు వెంటనే మేల్కొనాల్సి ఉంది. కఠిన చర్యలు తీసుకుంటాం నిబంధనల ప్రకారమే పదో తరగతి విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయాలి. ఎక్కువగా వసూలు చేసే పాఠశాలల వివరాలు చెప్పాలని కోరగా, కొందరు తల్లిదండ్రులు స్పందించారు. వీటిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ఐసీఆర్ ఫారాలు తీసుకొనేప్పుడు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగినా నేరుగా ఫిర్యాదు చేయాలి, -ప్రతాప్‌రెడ్డి, డీఈవో