Redwood
-
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో తెలియదు. నిన్న రోజున బీకరిని.. రేపటి రోజున కోటీశ్వరుడిని చేస్తుంది. ఇదే సమయంలో కోటిశ్వరుడిని.. బీకరిని సైతం చేయగలదు. అలాగని, అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే.. అంతకన్నా బిగ్ మిస్టేక్ మరొకటి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీంతో, సోషల్ మీడియాలో ఆయన పేరు చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పుసాద్ తాలూకా ఖుర్షి గ్రామంలో కేశవ్ షిండే అనే రైతు ఉన్నాడు. తన ఐదుగురు కొడుకులతో కలిసి తమకు ఉన్న ఏడు ఎకరాల భూమి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అనుకోని ఓ ఘటన వీరి జీవితాన్ని మలుపు తిప్పింది.కాగా, కేశవ్ షిండే ఊరి మీదుగా వార్దా-నాందేడ్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేశవ్ షిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు. షిండే పొలంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ.. ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని సేకరించింది. ఈ క్రమంలో షిండే తెలియని కొత్త అంశం బయటకు వచ్చింది.కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది. కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు, ఇతర పంటలు ఉండేవి. నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడిగా ఉన్నా.. వారికి ఆ విషయం తెలియలేదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు.. కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి.. ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పారు. దీంతో షిండే ఫ్యామిలీ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేసింది. పొలంలో రైల్వే లైన్ వెళ్తుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది. అయితే తమ పొలంతో పాటుగా అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు, పంటకు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే, ఆయన కొడుకులు డిమాండ్ చేశారు. ఎర్రచందనం చెట్టు విలువ లెక్కగట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు. కానీ, అధికారులు ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో కేశవ్ షిండే కుటుంబం.. జిల్లా కలెక్టర్, అటవీ, రైల్వే, నీటి పారుదల శాఖల అధికారులను ఆశ్రయించారు. అయినప్పటికీ, ఎలాంటి పరిహారం అందకపోవటంతో 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేశారు.షిండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. కోటి రూపాయలను నాగ్‌పూర్ బెంచ్‌లో డిపాజిట్ చేయాలని.. ఇందులో నుంచి రూ.50 లక్షలు కేశవ్ షిండే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9న బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. దీంతో, ఈ కేసులో కేవలం ఏడాదిలోనే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు 100 ఏళ్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. (ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు) కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
అమెరికాలో కోర్టుకు వెళ్లిన బైజూస్.. ఎందుకంటే..
న్యూఢిల్లీ: 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) త్వరితగతిన చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలతో ఇన్వెస్ట్మెంట్ సంస్థ రెడ్వుడ్పై దేశీ ఎడ్టెక్ సంస్థ బైజూస్.. అమెరికాలోని న్యూయార్క్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీఎల్‌బీ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా రెడ్‌వుడ్ తమ రుణంలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేసి, తమపై బెదిరింపు వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రుణదాతగా రెడ్‌వుడ్ అనర్హమైనదిగా తాము పరిగణిస్తున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయ వివాదం తేలేంత వరకు టీఎల్బీకి సంబంధించిన ఎటువంటి చెల్లింపులు చేయరాదని నిర్ణయించుకున్నట్లు వివరించింది. వడ్డీ కింద సోమవారం నాడే 40 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ బైజూస్ చెల్లించలేదు. సాంకేతిక డిఫాల్టులు తదితర కారణాలతో రుణదాతలు అనవసర చర్యలకు దిగాయని.. తమ అమెరికా విభాగం బైజూస్ ఆల్ఫాను ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు కొత్త మేనేజ్మెంట్ను నియమించాయని బైజూస్ తెలిపింది. తాము టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరిపేందుకు, వారు తమ చర్యలను వెనక్కి తీసుకుంటే యథాప్రకారం చెల్లింపులను జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని వివరించింది. మరోవైపు, తప్పుడు విధానాలకు పాల్పడిందన్న ఆరోపణలతో బైజూస్ అమెరికన్ విభాగాలపై(బైజూస్ ఆల్ఫా, టాంజిబుల్ ప్లే) రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ, ఇన్వెస్టరు తిమోతి ఆర్ పోల్ దావా వేశారు. బైజూస్ ఆల్ఫా నుంచి 500 మిలియన్ డాలర్లను కంపెనీ దారి మళ్లించిందని ఆరోపించారు. -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రెడ్‌ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించే విధంగా హోర్డింగ్స్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం సేదతీరే..సఫారీ నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. పర్యాటకులకు అనుమతితో సఫారీకి వెళుతుంటారు. ఇందుకోసం గతంలో వాహనాలను కూడా అందుబాటులో ఉంచేది. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాలు, సోలార్ విద్యుత్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 లు ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఉండేందుకు వీలులేని పరిస్థితి. జంగిల్ సఫారీ వాహనం రూ.2 లక్షలతో మరమ్మతులు చేసి పర్యాటకుల తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రె డ్ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం.. నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5 లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాల ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న రాగామాకుల కుంట వద్ద మంగళవారం ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఆధికారులు అతన్ని అరెస్టు చేసి సుమారు రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రంలోని జమునామత్తూరుకు చెందిన స్వామినాథన్‌గా గుర్తించారు. కాగా ఎర్రచందనం కూలీలు తనిఖీ చేసే టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో అధికారులు రాళ్లదాడిని ప్రతిఘటించి కుంబింగ్ కొనసాగిస్తున్నారని సమాచారం. -
తమిళ కూలీ
పెద్ద రావి చెట్టు కింద ఆపి వుంచిన జీపుపైన ఎండుటాకులు రాలిపడ్తున్నాయి. మానుపై వాలిన పక్షులు శబ్దం చేస్తున్నాయి.గుంజన యేరుకు అవతల నల్లరాతికొండ వద్ద ఒక తమిళ కూలీ పట్టుబడ్డాడు.ఎర్రచందనం చెట్టు కొట్టడానికి వచ్చిన మిగిలిన కూలీలు పరారయ్యారు.‘చిక్కిన తమిళ కూలీ నుంచి చిన్న సంచిని, ఒక గొడ్డలిని స్వాధీనపర్చుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా గాలింపు చేస్తున్న బీటు ఆఫీసరుకి వీడు దొరికాడు.పట్టుకొచ్చి లోపలేశారు.ఎవరు మాట్లాడుతారు....వాడికి తెలుగు రాదు. వీళ్ళకు తమిళం రాదు. ఏదో విధంగా వాడి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. మధ్యాహ్నం నుంచి వార్త రాసుకోవడం కోసం విలేకర్లు అక్కడికక్కడే తచ్చాడుతున్నారు. వాళ్ళందరితో పాటు నేను కూడా!ఇంకో జీపు దుమ్ము రేపుకుంటూ ఆవరణలోకి వచ్చింది. మరో ఇద్దరు అధికార్లు దిగారు. చకచకా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లారు. వీస్తున్న గాలికి కొమ్మలు ఊగుతున్నాయి.కాసేపటి తర్వాత బయటికొచ్చిన బీటు ఆఫీసరు జీపులో వెనుక వైపు వున్న రెండు ఎర్రచందనం దుంగల్ని లోపలికి తీసుకురమ్మని చెప్పి కళ్ళద్దాలు సర్దుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. సిబ్బంది వాటిని మోసుకెళ్ళారు. వాతావరణం వేడిగా వుంది. మరోవైపు స్తబ్దత. పదేపదే టైం చూసుకుంటున్నారు చెట్టుపక్కన నిల్చున వాళ్ళు.సెల్ పట్టుకొని కాలక్షేపంలో ఇంకొందరు.ఆఫీసు కాంపౌండ్‌కు ఎడమ పక్కన వున్న పాతరేకుల షెడ్డులో టీ కొట్టు దగ్గరికి ఫారెస్ట్ ఆఫీసులో ప్రొటెక్షన్ వాచర్‌గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు వచ్చాడు.‘దొరికిన తమిళ కూలీ ఏమైనా చెప్పాడా...’ అడిగాను ఆత్రుతగా.‘ఆ...’ అని అతను ఊకొట్టాడు.‘ఏం పేరంటా?’‘శివలింగం’ ‘ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిందా..’ మళ్ళీ ప్రశ్న.‘వాడి దగ్గర చెన్నై సెంట్రల్ టూ కోడూరు వరకు వున్న జనరల్ రైల్వే టికెట్ దొరికింది’ ‘అయితే ఉదయాన్నే మెయిల్‌కు వచ్చి వుంటాడు’ అన్నాను నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ. ‘అట్నే వుంది!’ పొడిగా జవాబిస్తూ ఐదు టీలు ఆఫీసులోకి పంపించమని టీ కొట్టు వెంకట్రాముడికి చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు...అడిగాను మళ్ళీ...‘తనని ఇక్కడికి ఎవరు పిలిపించారో, అతడి వెనుక వున్న పెద్ద మనిషి పేరు ఏదైనా చెప్పాడా...’అసహనంగా చూశాడు నాగరాజు.‘కాసేపు ఆగితే ఎస్సైసారే...మిమ్మల్నందర్నిలోపలికి పిలిచి విషయాలన్నీ చెప్తాడు’ అంటూ చిరాగ్గా లోపలికి వెళ్లిపోయాడు.త్వరగా వార్త రాసి పంపితే నా పని అయిపోతుంది. డెస్క్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టాను.ఈమధ్య ఎర్రచందనం వార్తలకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా టాబ్లాయిడ్లో రెండవ పేజీలో ఇలాంటి వార్తలకే చోటు లభిస్తోంది.చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి, రేణిగుంట మీదుగా మామండూరు, బాలపల్లె పరిధిలో వున్న ఎర్రచందనం కోసం రైల్వేకోడూరులోకి దిగుతున్నారు తమిళ కూలీలు.మెయిల్ తెల్లవారుజామున మూడున్నరకు వస్తుంది.రైల్వేస్టేషన్లో దిగడం కొండదారెంబడి సాగిపోవడం ఎంతోకాలంగా సాగుతోంది.ఒక్కోసారి గుంపులు గుంపులుగా కూడా దిగుతుంటారని అక్కడుండేవారు చెప్తుంటారు.వీళ్ళందరూ ఎందుకిలా వస్తున్నారు...?బతకలేనితనం వారిని కూలీలుగా మారుస్తోంది.వీరి వెనుక వుండి నాటకం అంతా నడిపించే స్మగ్లర్లు ఎక్కడో విదేశాల్లో విలాసాలు అనుభవిస్తూ వుంటారు. కడపాత్రంతో గొడ్డలి చేతబట్టి భయంకరమైన అడవుల్లోకి ఎర్రచందనం కొట్టడానికి వస్తున్న కూలీల బతుకు దుర్భరం.క్షణక్షణం భయంభయంగా జీవించాలి. ఇంటికి తిరిగి క్షేమంగా చేరగలమో లేదో కూడా తెలియదు. తెగిస్తున్నారు. ఇట్నుంచి పదకొండు కిలోమీటర్లు ముందుకెళ్తే శేషాచలం అభయారణ్యంలో భాగమైన శ్రీవెంకటేశ్వర అభయారణ్యం మొదలవుతుంది. అటే ముందుకు సాగితే కుక్కలదొడ్డి అనే ప్రాంతం వస్తుంది. అక్కడి నుంచి పదికిలోమీటర్ల దూరంలో వున్న తుంబరతీర్థం చేరుకుంటే అడవిలోకి దారులు ఏర్పాటు చేయబడివున్నాయి.పచ్చటి ప్రకృతిలో ఎల్తైన ఎర్రచందనం చెట్ల దారుల్లో ప్రయాణం సాగిస్తే కోనలెన్నో పలుకరిస్తాయి.వలసకోన, చాకలి రేవు కోన, ముత్తరాచకోన, కాశికోన, తలకోనలు అడవిపాటను నేర్పుతాయి.గుంజనేరు దగ్గర ఏనుగుల మందలు సంచరిస్తుంటాయి. వాన కురిసేటప్పుడు యుద్ధారాల తీర్థం అందాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు.విష్ణుగుండం పొంగి పొర్లుతోంది.ఇంత ప్రకృతి విధ్వంసానికి గురవుతున్న నేటి దృశ్యం హృదయ విదారకరం.విలేకర్లను లోపలికి పిలిచారు.సెల్ లోపల రెండు చేతులూ, రెండు కాళ్ళూ తాడుతో కట్టివేయబడివున్న తమిళకూలీ శివలింగం కన్పిస్తున్నాడు. ముఖమంతా కమిలిపోయి వుంది.కింద పెదవి పగిలి నెత్తుటి చారలు చూపిస్తోంది.మాసిపోయి చినికిపోయి వున్న చొక్కా, ఎర్రటి దుమ్ము నిండి రంధ్రాలు పడివున్న ప్యాంటు, ఈదురుగాలికి కొట్టుకొచ్చి పడివున్న వాడిలాగా కన్పిస్తున్నాడు. భరించలేనంత వాసన వేస్తోంది.కళ్ళు లోతుకు పోయి వున్నాయి.దువ్వని జుట్టు దుమ్మును మోస్తోంది.ఎక్కడి పక్షి మరెక్కడికో వలస వచ్చి బంధించబడినట్లున్నాడు.పగుళ్ళుబారిన శరీర చర్మం. గారపట్టిన దంతాలు. నల్లటిదేహం.అడవిలో దొరికిన మృగాన్ని కటకటాల్లో బంధించినట్లు వాడున్నాడు.శివలింగంకు కట్టిన తాడు విప్పారు.వాడు లేవలేని స్థితిలో వున్నాడు.వాడి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న పాత పసుపురంగు సంచి. దానికి సుబ్రహ్మణ్యస్వామి చిత్రం ముద్రించి వుంది. అందులో ఒక సిల్వర్టిఫిన్ క్యారీ, నాలుగు గుట్కా ప్యాకెట్లు వున్నాయి.దానితో పాటే వాడు ఉపయోగించే గొడ్డలి.ఇవి స్వాధీనం చేసుకున్న వస్తువులు. వాడు కొడుతుండగా పట్టుకున్న రెండు ఎర్రచందనం దుంగలు.సిబ్బంది ప్రెస్‌కు ఇవ్వాల్సిన ఫొటో కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.శివలింగం బాధగా ప్రాధేయపూర్వకంగా దాహమేస్తున్నట్లు సైగ చేశాడు. అక్కడ మూలగా వున్న మట్టికుండలో వున్న నీళ్ళను కూడా లేచివెళ్లి తాగలేని స్థితి. ఎవరో గ్లాసుతో అందించారు.గడగడ తాగి వాడు ఊపిరి పీల్చుకున్నాడు.శివలింగం దగ్గర దొరికిన రైల్వేటికెట్ను చూపించాడు అటవీ అధికారి.చెన్నై సెంట్రల్ టూ కోడూరు అని అందులో రాసి వుంది.జనరల్ టికెట్.విలేకర్లు ఫొటో తీసుకున్నారు.‘వివరాలు చెప్పండి సార్! వార్త రాసుకోవాలి...’ పక్కనున్న మరో విలేకరి కొంత ఆసక్తిగా అడిగాడు.అటవీ అధికారి చిన్నగా నవ్వాడు.‘ముందు టీ తీస్కోండి. చల్లారిపోతుంది’ అంటూ బదులిచ్చాడు.మేమందరం తాగుతుంటే శివలింగం మావైపే చూస్తున్నాడు.‘అతడికి కూడా టీ ఇప్పించండి సార్’ ఎవరో వెనక నుంచి అన్నారు.ఇమ్మన్నట్లు అధికారి సైగ చేశాడు. అతడికీ టీ ఇచ్చారు.అధికారి చెప్పడం ప్రారంభించాడు.‘పట్టుబడిన తమిళకూలీ పేరు శివలింగం.తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా మురగంబాడి గ్రామానికి చెందినవాడు. ఇతడి వయసు ముప్ఫై సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి పెంపకంలో పెరిగాడు. పదో తరగతిలోనే చదువు మానేశాడు. ఇతడి భార్య పేరు మునియమ్మాళ్. ఇతడికి నాల్గవ తరగతి చదువుతున్న కూతురు వుంది. పేరు రేవతి’పై ఫ్యాను వేగంగా తిరుగుతోంది.టేబుల్‌పైన వున్న కాగితాలు గాలికి కదులుతున్నాయి.తాగడం పూర్తి కావడంతో కప్పును దూరంగా పెట్టాడు. మీసాలు సవరించుకున్నాడు అధికారి.‘ఎర్రచందనం చెట్టుకొట్టే పని ఎవరు ఇతనికి అప్పగించారు?’ మరొక ప్రశ్న వేశారు.‘అదే చెప్పబోతున్నాను’ అంటూ కళ్ళు ఎగరేశాడు అధికారి.‘శివలింగం వూర్లో వుండేటప్పుడు ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. ఇతడికి టింబర్ డిపోలో పనిచేసే మాణిక్యంతో పరిచయమైంది. అతడి పని ఏమిటంటే మన ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి కావలసిన మనుషులను సప్లై చేయడం.ఏజెంట్‌గా వ్యవహరిస్తాడు.ఇలాంటి ఏజెంట్లు అక్కడ చాలామంది వుంటారు. వారే కూలీలను స్మగ్మర్లకు సమకూర్చిపెడతారు. విదేశాల్లో వుండే స్మగ్లర్లకు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళూ, రాజకీయనాయకులూ సహకరిస్తుంటారు. వ్యవహారమంతా గొలుసు పద్ధతిలో సాగుతూ ఉంటుంది’అధికారి సెల్ ఫోన్ మోగింది.అతడి పై ఆఫీసర్ నుంచి వచ్చినట్లుంది.కోరిన వివరాలు సాయంత్రంలోగా పంపిస్తానని అంటున్నాడు.భాష అర్థం కాకపోయిన అధికారి చెప్పే మాటలన్ని తలొంచుకొని వింటున్నాడు శివలింగం.మాణిక్యం అనే పేరు వచ్చినప్పుడల్లా శివలింగం కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. ఆవేశంగా చూస్తున్నాయి.తన జీవితం జైలు పాలు కావడానికి అతడే కారణమని కావచ్చు ఏజెంటు మాటలు నమ్మి అడవిబాట పట్టి కష్టాలు పడుతున్న వైనం శివలింగాన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. మాణిక్యం కనిపిస్తే తనువెంటతెచ్చుకున్న గొడ్డలితోనే సమాధానం ఇచ్చేటట్లున్నాడు.గట్టిగా తాడుతో కట్టివేయడం వల్ల అతడి చేతులు వాతలు పడినట్లు చారలు కమిలిపోయి కన్పిస్తున్నాయి. బయట చెట్టుపైన పక్షుల శబ్దం ఆగిఆగి విన్పిస్తోంది.అధికారి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.‘అంతర్జాతీయ మార్కెట్టులో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లనే స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తమిళనాడులో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా కూలీలను సమకూర్చుకుంటున్నారు. వాటాలు తీసుకుంటున్నారు.’‘చూస్తున్నారు కదా...ఇక్కడ కూలీలను పట్టుకుంటున్నాం. మధ్యలో ఏజెంట్లను పట్టుకున్నాం. అక్కడ స్మగ్లర్లను వలేసి పట్టుకున్నాం. అయినా సమస్య ఇంకా ఉంటుంది’ తాగిన టీకప్పులన్నీ చెత్తబుట్టలోకి చేరాయి.‘ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు’ అన్నాడు అధికారి కుర్చీలో వెనక్కి వాలుతూ.శివలింగాన్ని ఎక్కడ పట్టుకున్నారు?‘గుంజన యేరుకు అవతల నల్లరాతి కొండ వద్ద’‘ఎప్పుడు?’‘నిన్న సాయంత్రం’‘ఒక్కడే దొరికాడా?’‘అవును. మిగిలిన అయిదుమంది పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నాంరైల్వేటికెట్ పైన తేదీ చూస్తే శివలింగం వచ్చి పదిరోజులు దాటుతోంది కదా!‘అయ్యి ఉండవచ్చు. మాకైతే నిన్న సాయంత్రమే పట్టుబడ్డాడు’నీళ్లుతాగి గ్లాసుకింద పెట్టాడు అధికారి.మీ కస్టడీలో ఎన్నిరోజుల నుంచి ఉన్నాడు?మరో ప్రశ్న వాలింది. జవాబు లేదు.ఫొటో కార్యక్రమం.శివలింగాన్ని మోకాళ్ళ పైన మధ్యలో నిల్చోబెట్టారు. చేతులు కట్టుకొని ఉన్నారు. అతడి వెనుక అటు నలుగురు ఇటు నలుగురు అటవీ సిబ్బంది నిల్చున్నారు.శివలింగం ముందు రెండు ఎర్రచందనం కొయ్యలు, గొడ్డలి అతడి పాతసంచి ఉంచారు.ఫొటోలు చకచకా తీసుకున్నారు.‘కాసేపు అతడితో మాట్లాడించండి సార్!’ అని అన్నాను అధికారితో.‘ఎందుకబ్బా!’ అన్నట్లు చూశాడు.‘అతను తమిళంలో మాట్లాడుతాడు...మీకు అర్థం అవుతుందా?’ అని సన్నగా నవ్వుతూ అన్నాడు అధికారి.శివలింగం విలేకర్ల ముందుకొచ్చాడు.‘ఎనక్కు కవలైయా ఇరుక్కు(నాకు బాధగా ఉంది)ఎన్ నలం సరి ఇల్లై(నా ఆరోగ్యం బాగుండడం లేదు)ఎన్ కై ఎలుంబు మరిన్దదు(నా చేతి ఎముక విరిగింది)వాన్ ది వర మాదిరి ఇరుక్కు(వాంతి వచ్చేలాగా ఉంది)అని అన్నాడు కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని.ఇంక చాలు వీడ్ని తీసుకెళ్ళి లోపలెయ్యండి అన్నట్లు అధికారి చూశాడు.శివలింగం ఏదో అడగాలనుకుంటున్నట్లు సంశయంగా చూస్తున్నాడు.‘ఈరోజు తారీఖు ఎంత సామీ?’ అని దుఃఖం నిండిన స్వరంతో అడిగాడు తమిళంలోనే.ఎవరో చెప్పారు జవాబు.‘ఈరోజు నా కూతురు పుట్టినరోజు’ అంటూ ఏడుస్తూ అక్కడికక్కడే కన్నీటి సంద్రమైనాడు. బయట పెద్దరావి చెట్టుపైన అంతవరకు శబ్దం చేస్తూ ఉన్న పక్షులు నిశ్శబ్దమయ్యాయి. చెట్టు కింద ఆపి ఉంచిన జీపుపైన ఎండుటాకులు రాలి పడ్తున్నాయి. -
12 ఎర్రచందనం దుంగల పట్టివేత
పొదలకూరు: జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ జీ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్, డక్కిలి, పొదలకూరు, వరికుంటపాడు ఎస్సైలు దాడులు నిర్వహించి శనివారం రూ. 11 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పొదలకూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏ శివరామకృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ వివరాలు వెల్లడించారు. శనివారం పొదలకూరు, డక్కిలి, వరికుంటపాడు ఎస్సైలు అల్లూరు జగత్సింగ్, మరిదినాయుడు, ముత్యాలరాజు ఏకకాలంలో రహదారుల్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో దుంగలు తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులను వాహనంతో ఢీకొట్టించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు తప్పించుకుని తమ వాహనాల్లో కారును వెంటాడి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. దుంగలతో పాటు కారు, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం సేలం, నెల్లూరు, రాపూరు మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. డక్కిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చలంచర్ల అక్కయ్య(గోనుపల్లి), బండి ఏడుకొండలు (నెల్లూరు నగరం, నవాబుపేట), వరికుంటపాడు పీఎస్ పరిధిలో గుంజి రత్నయ్య (గోనుపల్లి), పొదలకూరు పీఎస్ పరిధిలో సత్యరాజు (తమిళనాడు, సేలం జిల్లా), గిలకా నాగరాజు (గోనుపల్లి)లను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. స్మగ్లర్ల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.16 కోట్ల విలువైన 16.32 టన్నుల దుంగలను పట్టుకున్నట్టు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలియజేయాలనుకున్న వారు 93907 77727 పోలీస్ వాట్స్‌యాప్ నంబరుకు పెట్టవచ్చునన్నారు. ఎర్రచందనం కేసులో నిందితుడి అరెస్ట్ నెల్లూరు (క్రైమ్): ఎర్రచందనం కేసులో నిందితుడిని మూడోనగర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌లో నివాసముంటున్న విశ్రాంత పోలీసు ఉద్యోగి సుధాకర్ ఇంటిపై 2015 సెప్టెంబర్ 3న తిరుపతి, నెల్లూరు టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేశారు. అతని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 120 కేజీల 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆంతోని, జాని, భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితుడైన ప్రసాద్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం నిందితుడు ప్రసాద్ కాకుటూరులోని తన రెండో భార్య అంకమ్మ ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మూడో నగర ఇన్స్పెక్టర్ బి. పాపారావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
స్మగ్లర్ బాబు.. కటకటాల పాలు
కడప అర్బన్ : తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా, అనేకట్ తాలూకా బంగ్లామేడు గ్రామానికి చెందిన అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబు అలియాస్ మురుగేషన్ బాబు చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే. మొదట చందనం అక్రమ రవాణాకు పాల్పడుతుండేవాడు. ఆ తరువాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు సేతు మాధవన్, మణియప్పన్‌లకు ప్రధాన అనుచరుడిగా ఎదిగాడు. ఇతను ప్రస్తుతం వేలూరు సమీపంలోని కాట్పాడిలో నివాసముంటున్నాడు. ఇతని స్వగ్రామం బంగ్లామేడు గ్రామం చుట్టు పక్కల ప్రాంతాల అడవుల్లో (జావాది హిల్స్) తన అనుచరులతో కలిసి చందనం చెట్లు నరికి వాటిని దుంగలుగా తయారు చేసేవాడు. 1990 నుంచి చందనం (శ్యాండిల్ వుడ్) అక్రమరవాణా చేస్తూ డబ్బును సంపాదించాడు. 1992 నుంచి 2000 సంవత్సరం వరకు ఆరు కేసులను తమిళనాడు రాష్ట్రం అటవీ, పోలీసు అధికారులు నమోదు చేశారు. చందనం అక్రమ రవాణా తర్వాత 2010 నుంచి తమిళనాడుకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని అప్పటి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇతను తమ ప్రాంతంలోని చెట్లు నరికే కూలీలకు భారీగా డబ్బు ఆశ చూపి వారి సహకారంతో రాయలసీమ జిల్లాలలోని శేషాచలం, లంకమల్ల, నల్లమల, అటవీ ప్రాంతాల నుంచి వాహనాలలో ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి చేరవేసి అక్కడి అంతర్జాతీయ స్మగ్లర్లకు అందజేసేవాడు. ఇటీవల జిల్లాలో అరెస్టయిన సేతు మాధవన్, ఆర్కాట్ భాయ్‌ల విచారణలో అనేకట్ బాబు గుట్టు రట్టయింది. జిల్లాలో ఇతను 24 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2010 నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిసింది. అనేకట్ బాబుతో పాటు మరో నలుగురు అరెస్ట్ : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబుతో పాటు, చిత్తూరు జిల్లాకు చెందిన సుధాకర్, సత్య, హైదర్ ఆలీలు వృత్తి రీత్యా డ్రైవర్లుగా, అనేకట్ బాబుకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. అనేకట్ బాబు ఆదేశాల మేరకు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం, నల్లమల, లంకమల, పాలకొండలు అటవీ ప్రాంతాల్లోకి వాహనాల్లో చేరవేస్తూ ఉంటారు. వీరిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన షేక్ మున్నా ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతను సుధాకర్, సత్యలకు అనుచరుడిగా ఉంటూ వారు చెప్పిన మేరకు ఎర్రచందనం నరికే వారిని బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి తన ఆటోలో తీసుకెళ్లి మైదుకూరు, పోరుమామిళ్ల అటవీ ప్రాంతాల సమీపంలో వదిలేవాడు. వారికి బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను చేరవేసేవాడు. ఇతనిపై జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ నేతృత్వంలో పోలీసులు పక్కా వ్యూహంతో వీరిని అరెస్టు చేశారు. -
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
-
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
సాక్షి, కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆర్కాట్ భాయ్‌తోపాటు, మరో 10 మంది స్మగ్లర్లను జిల్లాలోని మూడు పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలు, కంటైనర్, రెండు లారీలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందన్నారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ వివరాలు వెల్లడించారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి పోలీస్స్టేషన్ల పరిధిలో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ భాయ్, వెడి శక్తివేలు, మురగరి రామన్‌లు, చిన్నకన్ నాగరాజు, విశ్వనాథన్, గోవిందరాజు సందీప్‌కుమార్; ఓబులవారిపల్లెకు చెందిన ఆదిశేఖర్‌రెడ్డి అలియాస్ మందారపు బాబు, వై.కోటకు చెందిన పాకాల చంద్రమౌళి, చెన్నంరాజుపోడుకు చెందిన గంగరాజు వెంకటరామరాజు, గుంటుమడుగు దశరథరాజు, తలారి సుబ్బారాయుడులను పట్టుకున్నామన్నారు. వీరంతా ఎర్రచందనం దుంగలను వాహనాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఆర్కాట్ భాయ్.. దుబాయ్‌కి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ సాజికి ప్రధాన అనుచరుడని, దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్టు తెలిసిందన్నారు. పట్టుకున్న 11 మందిలో ఏడుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అని పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు కనుమారి సాయినాథ్, ఎస్డీ శివశంకర్ నాయక్, ఎస్ఐలు భక్త వత్సలం, బి.హేమకుమార్, కొండారెడ్డి, వెంకటేశ్వర్లు, హాజివల్లి, డాక్టర్ నాయక్, బి.నాగమురళి, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత!
పోలీసుల ముప్పు ఉందని సంగీతకు భర్త లక్ష్మణ్ హెచ్చరిక పగలు పేయింగ్ గెస్ట్.. రాత్రులు పబ్ పబ్బుల్లో మన పోలీసులకు తప్పని చిందులు మూడుసార్లు విఫలం.. ఆపై విజయం చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ భర్త మార్కొండ లక్ష్మణ్ గత నెల బెయిలుపై విడుదలయ్యాడు. అప్పటికే అజ్ఞాతంలో ఉన్న సంగీతను లక్ష్మణ్ హెచ్చరించాడు. ఎక్కడపడితే అక్కడ తిరగొద్దని, ఓకేచోట ఎక్కువ రోజులు గడపొద్దని, చుట్టు పక్కల ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారో చూసుకోమని సంగీతకు ఫోన్లో సూచిం చాడు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న లక్ష్మణ్ తన స్నేహితుడి ద్వారా నెలకు సంగీతకు రూ.లక్ష నగదు అందజేస్తూ, ఆమె పోలీసుల దొరకకుండా ఎప్పటి కప్పుడు సలహాలు ఇస్తుండే వాడు. భర్త మాటల్లో కొన్నింటిని పాటించిన సంగీత ప్రధాన హెచ్చరికలను పెడచెవిన పెట్టింది.. పోలీసులకు చిక్కింది. మూడుసార్లు విఫలం సంగీతను పట్టుకోవడానికి చిత్తూ రు పోలీసులు దాదాపు ఏడాదిన్నకాలం గా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సంగీతను అరెస్టు చేయడానికి కోల్‌కతాకు వెళ్లిన పోలీసులకు ఆమె ఆచూకీ కనుక్కోవడానికే సరిపోయింది. మే 3వ తేదీన మరోమారు కోల్‌కతాకు వెళ్లిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలోని న్యాయస్థానంలో హాజరుపరచి చిత్తూరుకు తీసుకురావాలనుకున్నా ఆమె నటనతో పోలీసు ల వ్యూహం బెడిసికొట్టింది. ఇక మూడోసారి 2016 అక్టోబర్‌లో మరోమారు సంగీతను పట్టుకోవడానికి పోలీసులు కోల్‌కతా వెళ్లారు. నాలుగురోజుల పాటు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఈసారి సఫలం గతం నేర్పిన అనుభవాల రీత్యా ఈసారి సంగీత కోసం పోలీసులు వెతుకుతూ కోల్‌కతాకు వెళ్లినట్లు ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సంగీత పేయింగ్ గెస్ట్ (పీజీ)గా పలుచోట్ల నెలకు రూ.12 వేల అద్దె చెల్లించి సాధారణ మహిళగా ఉంటోం దని సమాచారం అందడంతో మార్చి 23న డీఎస్పీ, సీఐ, మహిళా ఎస్ఐతో పాటు ముగ్గురు సిబ్బంది కోల్‌కతాకు వెళ్లారు. అక్కడి కస్బా, రూబ్, సీఎన్ రాయ్ ప్రాంతాల్లో సంగీత తిరుగుతున్నట్లు సమాచారం అందినా 25 వరకు ఆచూకీ దొరకలేదు. నిరుత్సాహంతో ఉన్న పోలీసులకు ఓ సమాచారం అందింది. సోమవారం రూబ్ సెల్లార్‌లోని పబ్‌లో సంగీత ఉందని తెలిసింది. డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణ, ఎస్ఐ వాసంతి, మరో మహిళా కానిస్టే బుల్ జంటలుగా నటిస్తూ పబ్‌లోకి వెళ్లారు. అక్కడ సంగీతను చూశారు. నిర్ధారించుకోవడానికి కాలు కదుపుతూ చిందులేస్తూ దగ్గరకు వెళ్లి చూశారు. అవును.. అక్కడ సంగీత ఉందని నిర్ధారించుకున్నారు. అప్పటికే సమయం రాత్రి 2.30 గంటలు. అక్కడి నుంచి సంగీత నేరుగా సీఎన్ రాయ్ రోడ్డులోని పీజీ హాస్టల్ చేరుకుంది. పోలీసులు çసమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని నిఘా ఉంచారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంగీత మందులు తీసుకోవడానికి గది నుంచి బయటకొచ్చింది. ఒక్కసారిగా పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. మర్యాదగా తమతో రావాలన్నారు. వాంతులు వస్తున్నట్లు.. కళ్లు తిరుగుతున్నట్లు సంగీత నటించినా పోలీసులు లెక్క చేయలేదు. నిమిషాల వ్యవధిలో ఆమెను కస్బా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమ వద్ద ఉన్న అరెస్టు వారెంట్లను చూపించారు. ఆ వెంటనే కోల్‌కతా విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూరు రావడం.. అటు నుంచి చిత్తూరుకు తీసుకురావడం చకచకా జరిగిపోయింది. పోలీసు కస్టడీకి సంగీత చిత్తూరు జిల్లా జైలులో ఉన్న సంగీత చటర్జీని కస్టడీకి ఇస్తూ పాకాల న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీచేసింది. సంగీతను తమ కస్టడికిస్తే ఆమెను విచారించి పలువురు నిందితుల పేర్లను తెలుసుకోవచ్చునని చిత్తూరు పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పది రోజుల పాటు సంగీతను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు సంగీతను శుక్రవారం కస్టడీకి తీసుకునే అవకాశముంది. -
‘ఎర్ర’ వనంలోకి మహిళా డాన్లు
⇒రూ.కోట్లు కూడబెడుతున్న వైనం ⇒నిన్న సంగీత.. నేడు జ్యోతి ⇒ నివ్వెరపోతున్న పోలీసులు చిత్తూరు (అర్బన్): ఇప్పటి వరకు మగవాళ్లు మాత్ర మే చేస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి తాజాగా మహిళలు కూడా చేరారు. గతేడాది రంగుల లోకం సుందరి సంగీత చటర్జీని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా జ్యోతి అనే మహిళా డాన్‌ను అరెస్టు చేశారు. వెలగని జ్యోతి... తమిళనాడులోని వేలూరు నగరం అళగిరినగర్‌కు చెంది న ఎన్.జ్యోతి, ఆమె భర్త, ఇద్దరు కొడుకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ వ్యాపా రంలో జ్యోతి ప్రస్తావన తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి నాలుగో తరగతితోనే విద్యాభ్యాసాన్ని ముగించింది. భర్త నాగేంద్రన్ లారీ డ్రైవర్ కావడంతో ఇసుక లోడ్లు తీసుకెళుతూ ఎర్ర చం దనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ విష యం జ్యోతికి చెప్పడంతో అవకాశాన్ని వదులుకోవద్దని భర్తకు చెప్పి తానూ 2013 నుంచి స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంది. వీరప్పన్ కంచుకోటైన జవ్వాదిమలై గ్రామం నుంచి చెట్లను నరికే కూలీలను పిలిపించి శేషాచలం అడవుల్లోకి పంపి ఎర్రచందనం దుంగలు తరలించడమే పనిగా పెట్టుకుంది. ఇలా మూడేళ్ల కాలంలో జిల్లా నుంచి వంద టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జ్యోతి అరెస్టు కావడంతో ఆమె వెనుక ఉన్న బడా స్మగ్లర్లు రామ్‌నాథ్, రంగనాథ్, మాలూర్ బాషా కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. కనిపించని సంగీత మోడల్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సంగీత చటర్జి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. భర్త జైల్లో ఉండగా అంతర్జాతీయ ఎర్రచందనం సామ్రాజాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు హవాలా రూపంలో రూ.కోట్లు సమకూర్చి వంద టన్నుల ఎర్రచందనం దుంగలను జిల్లా నుంచి విదేశాలకు పంపినట్లు జిల్లా పోలీస్ రికార్డులకెక్కింది. ఆమె బ్యాంకు లాకర్లను బద్దలుకొట్టిన పోలీసులు కిలోల లెక్కన బంగారు, రూ.కోట్ల విలువ చేసే స్థిరాస్తులను సీజ్ చేశారు. కోల్‌కతాకు చెందిన సంగీతపై చిత్తూరులో అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తమ కళ్లుగప్పి తిరుగుతున్న సంగీతను పట్టుకోవడం ఇప్పట్లో సాధ్యపడే విషయం కాదని పోలీసులు పెదవి విరుస్తున్నారు. -
ఎర్రచందనం వేలం వివరాలు సమర్పించండి
ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎర్రచందనాన్ని విక్రయించేందుకు నిర్వహించిన వేలంలో చోటు చేసుకున్న అక్రమాలను అడ్డుకోవా లని దాఖలైన వాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఎర్రచం దనం వేలాన్ని ఎవరి పేరు మీద ఖరారు చేశారు.. వేలంలో ఎన్ని బిడ్లు దాఖలయ్యాయి? ఎన్ని బిడ్లను తిరస్కరించారు.. తదితర వివరాలను సమర్పించాలంటూ మంగళవా రం ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వేలంలో తక్కువ ధరలు కోట్ చేసిన వారికే ఎర్ర చందనం విక్రయిం చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోం దని, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న ఈ చర్యలను అడ్డుకుని ఎర్రచందనం ఎగుమతులను ఆపాల ని గుంటూరుకు చెందిన డి.బసవ శంకర్రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళ వారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
ఎర్రచందనం టెండర్లలో భారీ గోల్మాల్
⇒ సర్కార్ ఖజానాకు రూ.987 కోట్ల నష్టం ⇒ అడ్డదిడ్డంగా టెండర్లు.. కారు చౌకగా అమ్మకం ⇒ 2014లో టన్ను రూ.కోటి తొంభై లక్షలు కాగా ఇప్పుడు కేవలం 38 లక్షలకే విక్రయం ⇒ బిడ్ల ఆమోదంపై సర్వత్రా అనుమానాలు ⇒ గతేడాది డిసెంబర్ 29న వేలం జరగాల్సి ఉండగా 26నే బిడ్లకు ఆమోదం!! ⇒ ప్రభుత్వ పెద్దల అనధికారిక ఒప్పందాల వల్ల రాత్రికి రాత్రే ఖరారు? ⇒ కీలక నేతలకు భారీగా ‘ముట్టినట్లు’ సమాచారం సాక్షి, అమరావతి: ఎర్రచందనం టెండర్లలో భారీ గోల్మాల్ జరిగింది. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్రప్రభుత్వం కారు చౌకగా అమ్మేస్తోంది. దీనివల్ల ఖజానాకు రూ.987 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2014 నవంబర్‌లో విక్రయించిన ధరతో పోలిస్తే ప్రస్తుత విక్రయ ధర అతి తక్కువగా ఉండటం, దీనికితోడు ప్రభుత్వం ఆగమేఘాలపై విక్రయ బిడ్లను ఆమోదించడం పలు సందేహాలకు తావిస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరుకు రావడం లేదని, ఉత్పత్తి పడిపోయిందని పలు మాటలు చెప్పి వ్యాపారులు ధరలు పెంచి లాభాలు గడిస్తారు. బండ్ల మీద పండ్లు, షాపుల్లో కిరాణా సరుకులు అమ్మే చిరు వ్యాపారులు మొదలు వెండి, బంగారం విక్రయించే పెద్ద వ్యాపారుల వరకూ అంతా దీనిని పాటిస్తారు. ఇది మార్కెటింగ్ సూత్రం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటి మార్కెటింగ్ సూత్రాన్ని కూడా పాటించకుండా కారు చౌకగా ఎర్రచందనాన్ని విక్రయించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనం ఉండి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన ధర రాకపోతే టెండర్లను రద్దు చేయాల్సింది పోయి.. రాత్రికి రాత్రే విక్రయ బిడ్లను ఆమోదించడంపై అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఖజానాకు సుమారు రూ.వెయ్యి కోట్లు గండి కొట్టారంటే ఆ మేరకు కీలక నేతలకు లబ్ధి చేకూరితేనే కదా...’ అని అధికారులు చర్చించుకుంటున్నారు. ఆదాయానికి గండి ఇలా... ఎర్రచందనం విక్రయ టెండర్లలో ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానం వల్ల ఖజానాకు అక్షరాలా రూ.987 కోట్లకు పైగా గండి పడిందని ప్రభుత్వ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. 2014 నవంబర్‌లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం విక్రయించిన ధరలను ప్రామాణికంగా తీసుకుంటే జరిగిన నష్టమిదీ. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ధరలేమీ పడిపోలేదని, కీలక నేతలు చేసుకున్న అనధికారిక ఒప్పందాల్లో భాగంగానే బయ్యర్లు తక్కువ ధరకు బిడ్లు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే వాటిని ప్రభుత్వం ఆమోదించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. టన్ను ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనాన్ని 2014 నవంబర్‌లో జరిగిన టెండర్లలో కోటీ తొంభై అయిదు లక్షల రూపాయలకుపైగా రేటుతో విక్రయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రూ.38.56 లక్షలకే అమ్మేందుకు టెండర్లు ఆమోదించడం గమనార్హం. ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనాన్ని 2014లో ధర కంటే తక్కువకు విక్రయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.719 కోట్లకు పైగా గండి పడింది. అప్పట్లో నాలుగు టన్నులే.. ఇప్పుడు 372 ఇదిలాఉండగా, 2014 నవంబర్‌లో అత్యంత నాణ్యమైన ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను 4.691 టన్నుల మేర మాత్రమే విక్రయించగా.. ఇప్పుడు ఏకంగా 372.721టన్నుల విక్రయ బిడ్లను సర్కార్ ఆమోదించింది. అలాగే నాణ్యతలో ద్వితీయ శ్రేణికి చెందిన ‘బి’ గ్రేడ్ దుంగలను అప్పట్లో 166.186 టన్నులు విక్రయించగా.. తాజాగా 622.347 టన్నులకు సంబంధించిన బిడ్లను ఓకే చేసింది. అంటే 2014లో అమ్మిన దాని కంటే 75 శాతానికి పైగా ఎక్కువ పరిమాణంలో ‘ఎ’ గ్రేడ్ దుంగలను, మూడున్నర రెట్లకు పైగా ‘బి’ గ్రేడ్ దుంగలను ఇప్పుడు విక్రయించనుండటం గమనార్హం. బిడ్ల వివరాలు రాకముందే ఆమోదం!! గతేడాది డిసెంబర్లో జరిగిన ఎర్రచందనం టెండర్ల బిడ్ల వివరాలు కూడా రాకముందే చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆమోదించేసింది. ఈ విషయం స్పష్టంగా జీవోలోనే ఉండటం గమనార్హం. గతేడాది డిసెంబర్ 19, 21, 23, 27, 29 తేదీల్లో ఎర్రచందన విక్రయానికి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) విక్రయ ఏజెంటుగా ఈ– వేలం నిర్వహించింది. ఇందులో వివిధ సంస్థలు దాఖలు చేసిన హెచ్–1(అధిక రేట్ల) బిడ్లను గతేడాది డిసెంబర్ 26న ప్రభుత్వ ఆమోదం కోసం ఏపీఎఫ్డీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపించారు. రాష్ట్ర అటవీ దళాల అధిపతి డిసెంబర్ 28న ప్రభుత్వానికి పంపించారు. దీనిని ఆమోదించిన ప్రభుత్వం బిడ్ల ధరలను అంగీకరిస్తున్నట్లు జనవరి 4న జీవో జారీ చేసింది. అయితే డిసెంబర్ 29న జరిగిన ఈ–వేలంలో వచ్చిన బిడ్ల రేట్లను డిసెంబర్ 26నే ఏపీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్, అదే నెల 28న అటవీ దళాల అధిపతి ప్రభుత్వానికి ఎలా పంపుతారని అధికారులను ప్రశ్నించగా.. ‘‘అప్పటి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధిపతిగా నియమితులయ్యారు. ఆయన ఢిల్లీకి వెళ్లే హడావుడిలో ఉండగా ప్రభుత్వ పెద్దలు రాత్రికి రాత్రే ఆమోదింపజేసి జీవో జారీ చేయించినట్లున్నారు. దీనివల్లే సాంకేతిక తప్పిదం జరిగినట్లుంది..’’ అని వారు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
ఎర్రచందనం దేశ సరిహద్దులు ఎలా దాటుతోంది?
టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ప్రశ్న తిరుపతి మంగళం: మనదేశంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా అత్యం త విలువైన ఎర్రచందనం ఆంధ్ర రాష్ట్రం తో పాటు దేశ సరిద్దులు దాటి ఇతర దేశాలకు ఎలా వెళుతోందని టాస్క్‌ఫోర్స్ డీఐజీ మాగాంటి కాంతారావు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు లేకుం డా ఒక్క దుంగ కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం కపిలితీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీఐజీ విలేకరుల సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తాము కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నామన్నారు. తమకు ఎవరి సహకారం లభిం చకున్నా కేవలం 150మంది సిబ్బందితో ఎర్రచందన అక్రమ రవాణాను, బడా స్మగ్లర్ల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. శేషాచల అడవుల్లోకి తమిళనాడులోని జావాదీహిల్కు చెందిన కూలీలు రాకుం డా చాలావరకు కట్టడి చేశామన్నారు. అటవీ, టాస్క్‌ఫోర్స్ అధికారులపై ఎర్ర స్మగ్లర్లు దాడులకు పాల్పడాలంటే భయపడేలా చేశామన్నారు. అయితే ఎర్రచందనంతో పాటు అడవుల్లో అక్కడక్కడా ఉన్న శ్రీగంధం చెట్లపై కూడ ఎర్రస్మగ్లర్ల కన్ను పడిందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. డీఎస్పీలు శ్రీధర్‌రావు, హరినాథ్‌బాబు, మహేశ్వరరాజు పాల్గొన్నారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం వేకువజామున కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళకూలీలను అరెస్ట్‌చేయడంతో పాటు, 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం చీకటికోన సమీపంలో ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. -
లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!
• గుర్తించిన చిత్తూరు పోలీసులు • కళ్లు గప్పి తిరుగుతున్న స్మగ్లర్ • గాలింపు చర్యలు ముమ్మరం చిత్తూరు (అర్బన్): లక్ష్మణ్ - ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పరిచయం అవసరంలేని వ్యక్తి. సింపుల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు చెప్పాలంటే రూ.వంద కోట్ల ఆస్తి, జిల్లాలో 20కి పైగా కేసులు, చిత్తూరు నుంచి చైనా వరకు ఎర్రచందనం దుంగల్ని రాచమార్గంలో తీసుకెళ్లగలిగే వ్యక్తి. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో పీడీ యాక్టు కింద ఉన్నాడు. ఓ పెద్ద స్మగ్లర్‌కు చెక్ పెట్టగలిగామని సంబరపడుతున్న పోలీసులకు అతని తమ్ముడు రమేష్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. విదేశాలకూ విస్తరించిన ‘ఎర్ర’ నెట్వర్క్ ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ స్వస్థలం చెన్నై. ఇతన్ని రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన పోలీసులు తొలిసారిగా రెండుసార్లు పీడీ యాక్టు బనారుుంచి అతడిని కటకటాల్లోకి నెట్టగలిగారు. అయినా జైల్లో నుంచే లక్ష్మణ్ తన రెండో భార్య. ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్, మాజీ ఎరుుర్ హోస్టెస్ సంగీత ద్వారా హవాలా రూపంలో స్మగ్లర్లకు భారీగా నగదు పంపిస్తూ, ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న చిత్తూరు పోలీసులు సంగీతను కోల్‌కత్తాలో అరెస్టు చేయడం, భారీగా బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేయడం తెలిసిందే. అరుుతే, చిత్తూరులో పెండింగ్ కేసులు ఉన్నా న్యాయస్థానానికి హాజరుకాకుండా సంగీత తప్పించుకు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం రమేష్ అనే పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌కు స్వయాన తమ్ముడైన రమేష్ ఇప్పుడు ఎర్రచందనం రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. గత నెల 17న చిత్తూరు పోలీసులు కడపకు చెందిన అందాలరాముడు అనే స్మగ్లర్‌ను అరెస్టు చేశా రు. ఇతడిని విచారణ చేయగా లక్ష్మణ్ తమ్ముడు రమేష్‌తో కలిసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. చెన్నై కేంద్రంగా ’ఎర్ర’ వ్యాపారం లక్ష్మణ్‌కు ఇద్దరు తమ్ముళ్లు. కరుప్పన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. లక్ష్మణ్ జైలుకు వెళ్లిన తరువాత సంగీత ఆటలు సాగకపోవడంతో రమేష్ ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. జిల్లా నుంచి ఎర్రచందనం దుంగల్ని చెన్నై, బెంగళూరుకు చేర్చడం, కడప నుంచి కూడా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై కేంద్రంగా రమేష్ చేస్తున్న వ్యాపారాన్ని రట్టు చేసేందుకు చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక బృందం గాలిస్తోంది. రమేష్ పోలీ సులు త్వరలోనే పట్టుకోగలమనే పకడ్బందీ వ్యూహం తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు చేస్తే చెన్నైలో 80 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టనట్లే అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
పోలీసులపై ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న దుండగులను పట్టుకోవడానికి యత్నించిన పోలీసులపై దాడికి యత్నించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక రామన్నకుంట సమీపంలోని ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ జరగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపై స్మగ్లర్లు నాగరాజు, లక్ష్మయ్య, సుబ్బయ్య కత్తులతో దాడి చేశారు. ఈ దాడుల నుంచి తప్పించుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
14 మంది తమిళ కూలీలు అరెస్టు
వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని నక్కదోన అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులు 14 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ ఎం.వి.రామకృష్ణయ్య తెలిపిన వివరాలివీ.. ముందస్తు సమాచారం మేరకు బద్వేలు సీఐ రామాంజినాయక్ , రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డిలు అటవీ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి నక్కదోన అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. వారు పోలీసులను చూడగానే గట్టిగా కేకలు వేస్తూ పోలీసులపైకి రాళ్లు, గొడ్డళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటపడి 14 మందిని అరెస్టు చేయగా మరికొంతమంది పారిపోయారు. వారి వద్ద నుంచి 334 కేజీల బరువు గల 15 ఎర్రచందనం దుంగలు, 15 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా హరూన్, పాపిరెట్టపట్టి తాలూకాలకు చెందిన వారు. -
రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు పోలీసులు 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని బుధవారం తమిళనాడు రాష్ట్రం పొండూరులో స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు గురువారం ఏఆర్ గ్రౌండ్లో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ జయలక్ష్మీ విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఆగస్టు 19వ తేదీన చంద్రగిరి పరిధిలో రాంమోహన్, అతని అనుచరులు జగన్నాధం, బాలన్‌ను ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. . పోలీసుల దాడుల్లో ముగ్గరు మాత్రమే పట్టుబడ్డారని... మిగతా.. 13 మంది పరారైయ్యారని చెప్పారు. వీరిని విచారించగా పారిపోయిన వారిలో ప్రధాన స్మగ్లర్ కిరుబాకరాన్ అలియాస్ కిరుబా, అలియాస్ కిరుబాను తెలిసిందని చెప్పారు. వీరిని ఆగస్టు 23వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. కిరుబాకరన్ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పెరంబదూర్ తాలూకా పొండూరు గ్రామంలో ఆటోమేటిక్ కారిడార్‌లో ఓ గోడౌన్లో మరో స్మగ్లర్ అయిన సెల్వరాజ్ ఇతనికి సంబంధించిన దుంగలను దాచి ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ సమాచారం మేరకు బుధవారం గోడౌన్ పై దాడులు నిర్వహించి 2 కోట్ల రూపాయలు విలువ చేసే 395 దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని బరువు సుమారు 9,586 కేజీలు (9.5) టన్నులు ఉంటుందన్నారు. వీరి వద్ద నుండి ఎర్రచందనం దుంగలతో పాటు ఈచర్ లారీ, 2 వెయిట్ మిషన్లు, 2 రంపాలు స్వాధీనం చేసుకుని గోడౌన్‌ను సీజ్ చేశామన్నారు. 2014 జూలై నుంచి 1393 కేసులు నమోదు 2014 జూలై నుంచి ఇప్పటి వరకు 1393 కేసులను రాయలసీమలో నమోదు చేసినట్లు రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. ఇందులో 6,924 మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 3,221 మంది ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 3,703 మంది ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 22,108 ఎర్రచందనం దుంగలు, 1016 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
శేషాచలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్
శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ గురువారం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం కూలీలు ప్రవేశించారనే సమాచారంతో అటవీ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా పోలీసులను చూసిన ఎర్ర చందనం కూలీలు పరారయ్యారు. పరారైన కూలీలు 30 మందికి పైగా ఉంటారని అధికారులు తెలిపారు. పరారైన కూలీలు తమ వద్ద ఉన్న ఎర్ర చందనం దుంగలను వదిలేసి వెళ్లారని వివరించారు. వీటి విలువ మార్కెట్ లో రూ.30 లక్షలు ఉంటుందని వివరించారు. -
చెన్నై టు చైనా
కడప అర్బన్: ఎల్ఈడీ వ్యాపార ముసుగులో ఎర్ర చందనం అక్రమ రవాణాదారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న చైనాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కె.ఎ.దావూద్ జాగీర్ అలియాస్ జాకీర్(52) కటకటాలపాలయ్యాడు. దావూద్ జాగీర్తోపాటు అతని అన్న కుమారుడు ఫిరోజ్ దస్తగిరిని కడప జిల్లా పోలీసులు రాజంపేట–రాయచోటి రహదారిలోని ఆకేపాడు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. రాజంపేట పరిధిలోని ఆకేపాడుకు చెందిన జాకీర్ దావూద్ అంతర్జాతీయ స్మగ్లర్‌గా పేరుగాంచాడు. అతను మొదట్లో తమిళనాడు రాష్ట్రం చెన్నైకి వెళ్లి అక్కడున్న అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. తరువాత ఏకంగా చైనాకే మకాం మార్చాడు. ప్రస్తుతం చైన్నైలోని మన్నాడి పట్టణం సలై వినాయగర్ కోయిల్ స్ట్రీట్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. అతను వ్యాపారాల నిమిత్తం చైనా దేశం గ్వాన్డాంగ్ రాష్ట్రంలోని పెంగ్జియాంగ్ జిల్లా యాంగువాన్లోని వుయికంట్రీ గార్డెన్, శ్రీలంక రాజధాని కొలొంబోలోని డెమటగోడలో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏడో తరగతి వరకు విద్యనభ్యసించాడు. అతను 1997లో చెన్నై నగరం నుంచి చైనాకు వెళ్లి అక్కడ లైటింగ్ వ్యాపారాన్ని (ఎల్ఈడీ బల్బులు) ప్రారంభించాడు. చెన్నై నుంచి తరచూ చైనాకి వెళ్లి వస్తుండటంతో ఆ దేశానికి చెందిన లీయాన్ అనే యువతితో సాన్నిహిత్యం ఏర్పడి వివాహం చేసుకున్నాడు. ఇతని అన్న జాఫర్ దస్తగిర్ చైనాలో స్థిరపడ్డాడు. ఎల్ఈడీ బల్బుల వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో జాగీర్ చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కంపెనీలు, షోరూమ్‌లు, వ్యాపారవేత్తలను కలిసేవాడు. ఈ క్రమంలో చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన పలువురు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. చైనీస్ భాషపై పట్టు ఉండటంతో అక్కడి వ్యాపారులు దావూద్ జాగీర్ను మధ్యవర్తిగా(బ్రోకర్) ఏర్పాటు చేసుకున్నారు. తమిళం, ఇంగ్లిష్, చైనీస్, జర్మనీ, ఉర్దూ, హిందీ, బర్మిస్, జపనీస్ భాషలు మాట్లాడటంలో ఇతను దిట్ట. దీంతో ఆయా దేశాల్లో ఉన్న స్మగ్లర్లు చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించుటకు జాగీర్ సహకారం పొందేవారు. చెన్నై స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు: చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పూర్తిస్థాయి పరిజ్ఞానం సాధించడంతో చెన్నైకి చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెంచుకున్నాడు. వారు చూపే పెద్ద మొత్తాలకు ఆకర్షితుడై చెన్నైకి చెందిన ప్రధాన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లు సంతాన్మీరన్ అలియాస్ చందన్ మీరన్, సాహుల్ హమీద్, సాహుల్ భాయ్, కందస్వామి, పార్థీబన్ అలియాస్ పార్తిపన్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చైనా దేశానికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు ఆసియా దేశాలకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లకు మధ్య ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడ్డాడు. హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు రవాణా: చెన్నైకి చెందిన సాహు హమీద్‌తో సంబంధాలు ఏర్పరచుకుని 2000 సంవత్సరం నుంచి ఎర్ర చందనాన్ని కంటైనర్ల ద్వారా హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు తరలించి అక్కడి కొనుగోలుదారులకు జాగీర్ విక్రయించేవాడు. ఆ సొమ్మును ‘హవాలా’ ద్వారా సాహుల్ హమీద్‌కు చేరవేసేవాడు. అందుకు గాను కొనుగోలుదారులు, విక్రయదారుల నుంచి భారీగా కమీషన్ పొందేవారు. కొంతకాలం తర్వాత తమిళనాడు, ఆంధ్రా, ఢిల్లీ రాష్ట్రాల్లోనే స్మగ్లర్ల నుంచి నేరుగా ఎర్ర చందనం దుంగలను కొనుగోలు చేసి చైనాకు అక్రమంగా తరలించి నిరాటంకంగా వ్యాపారం సాగించేవాడు. జాగీర్ ఎర్ర చందనం అక్రమ రవాణాలో చైనాకు చెందిన చెన్చెంగై, చెన్ చెంగ్వు, సంతన్మీరన్, జాంగ్యాంగ్, వాంగ్ లీ ఫా, హాంకాంగ్‌కు చెందిన జిమ్మి, సింగపూర్‌కు చెందిన హనీఫ్, డేవిడ్, మయన్మార్‌కు చెందిన షణ్ముగమ్లతో సంబంధాలు ఏర్పరచుకుని వారికి ఎర్ర చందనం దుంగలను విక్రయించేవాడు. సీమలో 57 కేసులు అతనిపై కడప జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో ఒకటి, మొత్తం 57 ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. చైనా, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇతనికి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆయా దేశాల స్మగ్లర్లతో జాగీర్‌కు ఉన్న లావాదేవీలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఐజీ తెలిపారు. కొత్తగా సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్, 1967 నిబంధనల మేరకు జాగీర్ ఆస్తుల వివరాలను సేకరించి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ఎర్ర చందనం దుంగలను ఎగుమతి చేసి విదేశాల్లో విక్రయించినట్లు జాగీర్ పోలీసు విచారణలో అంగీకరించాడు. అన్న కుమారుడు సహకారం: చెన్నైలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఫిరోజ్ దస్తగిరి.. దావూద్ జాగీర్ అన్న కుమారుడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసిన ఎర్ర చందనం దుంగలను వాహనాలలో జాగీర్ చెప్పిన ప్రదేశాలకు చేరుస్తూ అక్రమ రవాణాకు సహకరించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని చిన్నాన్న జాగీర్ అక్రమ రవాణా వ్యాపారాలలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. -
కదులుతున్న ఎర్ర డంప్‌లు
- పుష్కర విధుల్లో జిల్లా పోలీసులు - ఇదే అదునుగా పేట్రేగుతున్న స్మగ్లర్లు - శేషాచలం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణా - బుధ, గురువారాల్లో 13 మంది స్మగ్లర్లు అరెస్ట్ - బడా స్మగ్లర్ శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు సాక్షి ప్రతినిధి. తిరుపతి శేషాచలంలోని ఎర్ర చందనం డంప్‌లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమిళనాడు నుంచి వస్తోన్న ఎర్ర స్మగ్లర్లు చాకచక్యంగా ఎర్రదుంగల తరలింపును ముమ్మరం చేశారు. జిల్లా పోలీసుల్లో 80 శాతం మంది కృష్ణా పుష్కర విధులకు హాజరవడం వీరికి కలిసొచ్చింది. ఇదే సరైన అదునుగా భావించిన స్మగ్లర్లు అడవుల్లో దాచిన ఎర్రచందనం దుంగల డంప్‌లను గుట్టూచప్పుడు కాకుండా బయటకు రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ రవాణా పెరిగినట్లు టాస్క్ఫోర్సు అధికారులు గుర్తించారు. బుధ, గురువారాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపి 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 58 ఎర్రచందనం దుంగలను (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలంలో ఇంకా 30 శాతం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇప్పటికే నరికిన చెట్ల తాలూకు దుంగల నిల్వలు పెద్ద ఎత్తున అడవుల్లో నిల్వ ఉన్నాయి. వీటిని బయటకు తరలించే విషయంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు స్మగ్లర్లు విస్తృతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడచిన రెండు నెలల్లో సుమారు 20 టన్నులకు పైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 25 మందికి పైబడి స్మగ్లర్లును అరెస్టు చేశారు. రెడ్‌శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 13 బృందాలు శేషాచలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వెలిగొండ, పాలకొండ, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల్లో వీరి కూంబింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన జిల్లాకు చెందిన 80 శాతం మంది పోలీసులు కృష్ణా పుష్కర విధులకు వెళ్లిపోయారు. దీంతో అన్ని మార్గాల్లోనూ పోలీసుల తనిఖీలు లేకుండా పోయాయి. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు రాత్రి వేళల్లో యథేచ్చగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. 13 మంది అరెస్టు ...పరారీలో ముగ్గురు ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఉగ్గరాల తిప్ప దగ్గర కూంబింగ్‌లో ఉన్న టాస్క్ఫోర్సు పోలీసులకు ఎర్ర చందనం దుంగలను రవాణా చేసే ముగ్గురు తమిళనాడు స్మగ్లర్లు దొరికారు. వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి 58 దుంగలు (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్సు డీఎస్సీ శ్రీధర్‌రావు విలేకరులకు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు జూపార్కు సమీపంలోని పెరుమాళ్లపల్లి అడవుల్లో అడవిలోకి ప్రవేశిస్తోన్న ఎర్ర స్మగ్లర్లపై టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ వాసు, నర్సింహయ్యల టీములు ఒక్కసారిగా దాడులు జరిపాయి. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో రేణిగుంటకు చెందిన కె. శివ, తిరుచ్చికి చెందిన లక్ష్మన్ సెంథిల్ కుమార్, రాసు షణ్ముగం, పిలెందిరన్ అంగముత్తు, క్రిష్టన్మూర్తి, రామర్ నాగరాజన్, నల్లిస్వామి పెరుమాళ్, నగరాజన్ సత్యవేల్, సంథానమ్ రవి, సంథానమ్ రాములు ఉన్నారని డీఎస్పీ శ్రీథర్రావు వివరించారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న పేరూరి శ్రీనివాసరెడ్డి, మునస్వామి, రామానాయుడులు పరారయ్యారు. అరెస్టయిన వారి నుంచి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ పేరూరి శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు. సహకరిస్తోన్న అగ్రికల్చర్ కాలేజీ వాచ్మెన్, రైల్వే ఉద్యోగిలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
ముగ్గురు తమిళ కూలీల అరెస్ట్
-58 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రైల్వేకోడూరు రూరల్ అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 58 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు తమిళ కూలీలను అరె స్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. బాలుపల్లె అటవీశాఖ పరిధిలో పుల్లగూరపెంట వద్ద సుమారు 50 మంది కూలీలు ఎర్రచందనం దుంగలతో టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి తారసపడ్డారని చెప్పారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కొందరు పారిపోగా తమిళనాడు రాష్ట్రం తిరువ ణ్ణామలై ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి, తిరుమలై, ధర్మపురికి చెందిన కుమార్‌లను పట్టుకున్నామన్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం రైల్వేకోడూరుకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నిందితులను పోలీసు స్టేషన్లో అప్పగించేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు వివిధ కేసుల దర్యాప్తు నిమిత్తమై బిజీగా ఉండటంతో నిందితులు, దుంగలతో సహా తిరుపతికి వెళ్లారు. తమిళ కూలీలపై తిరుపతిలో కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. -
సంగీతా చటర్జీకి 31వరకు గడువు
ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ ఈనెల 31వ తేదీలోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచింది. దీంతో.. తదుపరి విచారణకు చిత్తూరు కోర్టు నుంచి మినహాయించాలని సంగీత కోల్‌కతా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ సంగీత చిత్తూరు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని మన పోలీసులు ఇటీవల కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు విచారణకు హాజరుకాకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈనెలాఖరులోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. -
రూటు మార్చిన ఎర్ర కూలీలు
- కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు - ఇద్దరు కూలీల అరెస్టు భాకరాపేట(చిత్తూరు జిల్లా) శేషాచలం అడవుల్లోకి చొరబడిన ఎర్రకూలీలు టాస్క్‌ఫోర్స్, పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో పారిపోయారు. ఈ క్రమంలో ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఈ వివరాలను పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ గురువారం భాకరాపేట సీఐ కార్యాలయం ఆవరణలో విలేకరులకు వివరించారు. తమిళనాడు జువాదిహిల్స్కు చెందిన పలువురు శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నుంచి భాకరాపేట ఘాట్ రోడ్డు నుంచి పుట్టగడ్డ అటవీ ప్రాంతం వైపు కూంబింగ్ చేపట్టామన్నారు. రాళ్లు, గొడ్డళ్లతో దాడి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కూలీలను గుర్తించి పట్టుకునేందుకు ప్రయుత్నించామన్నారు. తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారని తెలిపారు. దీంతో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ దిలీప్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపామని వివరించారు. కూలీలు దుంగలను వదిలి అడవిలోకి పారిపోతుండగా జువాదిహిల్స్కు చెందిన సంపత్, స్వామినాథన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో 20 మంది ఉన్నారని పట్టుబడ్డ కూలీలు చెప్పారని పేర్కొన్నారు. వారి నుంచి 300 కేజీల 9 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షలు ఉంటుంది. గాయుపడ్డ కానిస్టేబుల్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. రూటు మార్చిన తమిళ కూలీలు తమిళ కూలీలు రైళ్లు, బస్సుల్లో వచ్చి పాకాల, నేండ్రగుంట, కొటాల రైల్వే స్టేషన్లలో దిగుతున్నారని, అలాగే చిత్తూరు నుంచి పులిచెర్ల వుండలం మంగళంపేట చేరుకుని భీమవరం అడవుల గుండా భాకరాపేట ఘాట్ రోడ్డు దాటి అడవిలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పుట్టగడ్డ అటవీ ప్రాంతానికి కూడా రోడ్డు దాటి అడవిలోకి జారుకున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అశోక్‌కుమార్, ఆర్ఎస్ఐ భాస్కర్, భాకరాపేట ఎస్ఐ చంద్రమోహన్, ఎఫ్ఎస్వో వెంకటసుబ్బయ్యు, ఎఫ్‌బీవో శ్రీరాములు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు. -
నెంబర్ 1 క్వాలిటీయే కావలె
బహిరంగ వేలంతో ఎర్రబంగారానికిపెరుగుతన్న డిమాండ్ చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో నుంచే రిమోట్ చేస్తున్న స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారే మేస్త్రీలు, కూలీలు అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న అత్యంత అరుదైన సహజసిద్ధ జీవ ఖనిజం ఎర్రచందనం. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే ఎర్రచందనానికి జిల్లా పెట్టింది పేరు. అందుకే స్మగ్లర్మ కన్ను ఎప్పటి నుంచో శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనంపై పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఎర్రచందనం బహిరంగ వేలాన్ని ప్రవేశ పెట్టడంతో నాణ్యమైన సరుకు కోసం ఎర్రదొంగలు దుంగల కోసం వేటను మరింత ముమ్మరం చేస్తున్నారు. భాకరాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనాన్ని బహిరంగ వేలం వేయుడంతో అంతర్జాతీయుంగా డిమాండ్ ఏర్పడింది. స్మగ్లర్లు ఇక్కడ పెరిగే ఎర్ర చందనం వృక్షాలను విపరీతంగా నరికివేస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. అడవికే వచ్చి నెంబర్ 1 క్వాలిటీ సరుకు తెచ్చే కూలీలకు స్మగ్లర్లు అధిక పారితోషికం ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదర్చుకుంటున్నారు. గత 20 ఏళ్ల క్రితం ఎర్రచందనం చె ట్లకు ఫారెస్టు శాఖ నెంబర్ ప్లేట్లు వేసింది. ప్రస్తుతం వాటినే కూలీలు నరకి వేస్తుండడంతో ఆ శాఖ ఏమీ చేయాలో దిక్కు తెలియని స్థితిలో ఉంది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచే రిమోట్ చిత్తూరు,కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఎర్రచందనం ఎక్కువగా ఉండడంతో ఈ జిల్లాలకు చెందిన స్మగ్లర్లు అక్కడే ఉంటూ కూలీలను రిమోట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. గతంలో కూలీలు చెట్లను 2 నుంచి 4 అడుగులు వరకు మొదుళ్లు వదలి నరికేవారు. ఇప్పుడు డివూండ్‌తో పాటు క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం వాటిపై కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అరికట్టడంలో విఫలం అరుుందనే చెప్పా లి. సాక్షాత్తు రాష్ట్ర వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడు సొంత జిల్లా వారే ఎర్రచందనం తరలించడంలో సిద ్ధహస్తులు. వీరిని వదలి తమిళనాడులో ఉండే కూలీలకు అవగాహన కల్పించడంపైనా వివుర్శలు వస్తున్నాయి. వేలం లో ఏ గ్రేడ్ ఎర్ర దుంగలు విలువ ఒక్కసారిగా అవూం తం టన్ను ధర రూ.1.40 కోట్లు పలకగా స్మగ్లర్లు టన్ను రూ.60 లక్షలకే సరఫరా చేస్తున్నా రు. దీంతో రాష్ట్రప్రభుత్వం పలు డిపోల్లో ఉన్న ఎర్రచందనం దుంగలకు డ్రెస్సింగ్ చేసి రేణిగుంట డిపోకు తరలించినట్లు సమాచారం . . అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాం అడవికి వెళ్లే వూర్గాల వద్దనే కాపు కాసి అడ్డుకుంటూ, నిరోధించేందుకు కృషి చేస్తున్నాం. గత రెండు నెలల్లోనే సువూరు 10 గ్రూపులను అడవిలోకి వెళ్లక వుుందే నిరోధించాం. అరుుతే పటిష్ట చర్యలు చేపట్టాం. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కూడా చాలా సీరియుస్‌గా ఉంది. - రఘునాథ్, భాకరాపేట ఫారెస్టు రేంజర్ -
అదిగో.. ఇదిగో
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న లేడీ డాన్ సంగీతా చటర్జీ పట్టుకోడానికి ఆపసోపాలు ఆమె అసోం వెళ్లిపోయినట్లు సమాచారం చిత్తూరు: కాకులు దూరని కారడవి కటికనహళ్లికి వెళ్లారు. 32 మంది ఎర్ర చందనం దొంగల్ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు 3 వేల మంది కూలీల్ని అరెస్టు చేశారు. దాదాపు 560 కేసులు నమోదు చేశారు. 58 మందిపై పీడీ యాక్ట్ పెట్టారు. 1,70 వేల కేజీల ఎర్రచందనాన్ని సీజ్‌చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి ఇన్ని చర్యలు చేపట్టిన పోలీసులకు లేడీ డాన్ సంగీతా చటర్జీ చుక్కలు చూపిస్తోంది. ఇదిగో వస్తా అంటూ ఎప్పటికప్పుడు పోలీసులను తప్పుదోవ పట్టిస్తోంది. దీంతో వారు ఎదురు చూపులతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. పోలీసులే ఒక నిందితురాలి కోసం వేచి చూస్తుండటం గమనార్హం. ఎర్ర చందనం లేడీ డాన్ సంగీతా చటర్జీపై కల్లూరు, నిండ్ర, యాదమరిలలో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో సంగీతను అరెస్ట్ చేయడానికి చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణల బృందం ఇప్పటి వరకు రెండు సార్లు కలకత్తాకు వెళ్లారు. పీటీ వారెంట్ వేయడంలో పోలీసులు విఫలం అవడంతో ఆమె రాష్ట్రానికి రావడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇంతలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఎలాగోలా చివరికి మేలో ఆమె బ్యాంక్ లాకర్‌ను తెరిచారు. అందులో ఉన్న 2కేజీల బంగారం, కేజీ వెండి, ఒక స్థలానికి చెందిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. గత శుక్రవారం బెయిలు గడువు ముగియడంతో సోమవారం చిత్తూరు కోర్టులో ఆమె హాజరవుతుందని పోలీసులు మీడియాకు లీకులు ఇచ్చారు. యథాప్రకారం శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు ఎదుట తప్పని సరిగా హాజరు కావాల్సి ఉందని తెలియడంతో ఆమె కోల్కత్తా నుంచి అసోంకు పారిపోయినట్లు తెలిసింది. కొపం ముంచుతున్న పోలీసుల అనైఖ్యత.. జిల్లా పోలీసులు చాలా వర్గాలుగా విడిపోయాయని తెలిసింది. దీంతో కేసుల పురోగతి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందాన తయారైంది. ఎర్రచందనం కేసుల్లో కొందరు బాగా సంపాదించారని పోలీసుల్లోని ఓ వర్గం ఆరోపించడంతో.. ఆ కేసుల్లో బాగా అనుభవం ఉన్న వారిని కాదని ఎలాంటి అనుభవం లేని బృందాన్ని కోల్‌కత్తాకు ఆ శాఖ పంపింది. ఈ బృందం పీటీ వారెంట్‌ను వేయడంలో కూడా విఫలం చెందడంతో ఇప్పటికీ సంగీతా చటర్జీని రాష్ట్రానికి తీసుకురావడంలో విఫలమయ్యారు. దీనికి తోడు కోల్‌కత్తాకు వెళ్లే బృందానికి సరిగా డబ్బుకూడా చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సంగీత నేపథ్యం.. సంగీతది కోల్కత్తా. ఆమె వృత్తి రీత్యా ఎయిర్‌హోస్టెస్. అనంతరం మోడల్‌గా స్థిరపడింది. ఇదే సమయంలో మణిపూర్‌కు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణన్‌కు ఆయన మొదటి భార్య ద్వారా సంగీత పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ద్వారా సంగీత లక్ష్మణన్‌ను రెండో వివాహం చేసుకుంది. ఆమెకు 3 ఫ్లాట్లు, కొన్ని ఇంటి స్థలాలు, ఉన్నట్లు గుర్తించారు. చట్టరీత్యా ముందుకెళ్తాం సోమవారం సంగీత చటర్జీను చిత్తూరు కోర్టులో హాజరుకావాలని కోల్‌కతా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆమె రాలేదు. ఎందుకు రాలేదు..? పైకోర్టు ఏవైనా ఉత్తర్వులు ఇచ్చిందా..? ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలు దిక్కరించారా..? లాంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఈమెపై తదుపరి చట్టరీత్యా ముందుకెళతాం. - ఎం.గిరిధర్‌రావు, డీఎస్పీ, చిత్తూరు. -
చెన్నైలో రూ.16కోట్ల ఎర్రచందనం పట్టివేత
-
రైల్వే కోడూరులో ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం వద్ద జరిగింది. ఓ వాహనంలో సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఎర్రచందనం స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్లు పరారీ అయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
శ్రీగంధంపై కన్నేశారు!
♦ శేషాచలం, నల్లమల్ల అడవులను టార్గెట్ చేస్తున్న స్మగ్లర్లు ♦ అడవి బాగా తెలిసిన వారి ద్వారా కదులుతున్న వైనం ♦ ఎర్రచందనంపైనే దృష్టిపెట్టిన పోలీసులు ♦ ఇదే అదునుగా ఎల్లలు దాటిస్తున్న అక్రమార్కులు ♦ చెట్లను నరికి చిన్నచిన్న మొద్దులుగా చేసి సూట్‌కేసుల్లో తరలిస్తున్నట్లు ప్రచారం ♦ రెండింటిపై దృష్టిపెట్టామన్న ఎస్పీ సాక్షి, కడప : అందరి దృష్టి ఎర్రచందనంపైనే... అటు పోలీసులు, ఇటు ఫారెస్టు అధికారులు ఎర్రచందనం ఎల్లలు దాటకుండా ఉండేందుకు ఎక్కడచూసినా చెక్‌పోస్టులు.. చెకప్‌లు... అడవిలో కూంబింగ్‌లు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది స్మగ్లర్లు రూట్మార్చారు. నిఘా బాగా పెరిగిన నేపథ్యంలో ఎర్రచందనాన్ని వదిలేసి శ్రీగంధం చెట్లపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. శేషాచలం, నల్లమల అడవుల్లో అరుదుగా లభించే శ్రీగంధాన్ని నరికి సరిహద్దులు దాటిస్తున్నారు. పైగా గంధపు చెట్లను నరికి చిన్నచిన్న మొద్దులుగా తయారు చేసి వాటిని సూట్‌కేసుల్లో భద్రపరిచి జాగ్రత్తగా అడవులు దాటిస్తున్నట్లు తెలియవచ్చింది. అలవాటైన కొంతమంది పోలీసు, ఫారెస్టు అధికారులకు మామూళ్లు సమర్పిస్తూ అదను చూసి అక్రమంగా తరలించుకుపోతున్నట్లు తెలుస్తోంది. అడవిపై పట్టున్న వారి ద్వారా సేకరణతమిళనాడు ప్రాంతంలో పేరుమోసిన స్మగ్లర్ వీరప్పన్ అనుచరులుగా ముద్రపడిన కొంతమంది అనుభవజ్ఞులైన వారి ద్వారా శ్రీగంధం చెట్ల నరికివేత జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఎర్రచందనం చెట్లతో పోలిస్తే నల్లమల, శేషాచలం అడవుల్లో శ్రీగంధం చెట్లు చాలా తక్కువ. అయితే రేటు మాత్రం చాలా ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీగంధమే మేలని భావించిన కొంతమంది స్మగ్లర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అరుదుగా శ్రీగంధం చెట్లు ఉండటంతో అడవిపై పట్టున్న వారు మాత్రమే చెట్లు ఎక్కడెక్కడ ఉండేది గుర్తు పట్టగలరు. వారి సహకారంతోనే అడవుల్లో రంగప్రవేశం చేస్తున్న కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. సూట్‌కేసుల్లో తరలింపు స్మగ్లర్లు తెలివిగా శ్రీగంధం చెట్లను నరికి చిన్నచిన్న మొద్దులుగా తయారు చేసి సూట్‌కేసుల్లో భద్రపరిచి తరలిస్తున్నారు. వాటిని రాయచోటి మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారని, మరోపక్క హైదరాబాద్, కేరళ, తమిళనాడు లాంటి ప్రాంతాలకు కూడా పంపిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే చిన్నచిన్న మొద్దులను బాక్సుల్లో పెట్టి ఓ ప్రైవేటు బస్సుల్లో లగేజీ కింద పెట్టి ఇక్కడి నుంచి పంపగా.....హైదరాబాద్‌లో సంబంధిత వ్యక్తులు వచ్చి హడావుడిగా తీసుకెళ్లారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్‌లో బస్సును తనిఖీ చేసే సమయానికే దుంగలను తరలించుకుపోవడంతో వ్యవహారం బట్టబయలు కాలేదు. అప్పటి నుంచి పోలీసులు ప్రైవేటు బస్సుల యజమానులకు జాగ్రత్తలు సూచించారు. ఏది ఏమైనా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ విలువైన దుంగల్ని తరలించుకుపోతున్నారు. ఏది తరలించినా వదలం : ఎస్పీ ప్రత్యేకంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్పష్టం చేశారు. ఎర్రచందనాన్ని, శ్రీ గంధంను తరలించే వారిని వదిలిపెట్టే సమస్యే లేదని తేల్చిచెప్పారు. పోలీసులపై కూడా ఆరోపణలు రాకుండా ఇక నుంచి రొటేషన్ పద్ధతిలో....జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు అందరినీ వినియోగించుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా చందనం అక్రమ రవాణా నివారణకు టాస్క్‌ఫోర్స్, లీగల్, కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మగ్లర్లను పట్టుకొచ్చేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంఘటనా ప్రాంతాన్ని పసిగట్టి ఎర్రస్మగ్లర్ల ఆట కట్టించేందుకు వ్యూహాలు రచించామని ఆయన వివరించారు. -
ఎర్రచందనంతో దొరికితే కఠిన చర్యలు
♦ బెయిల్ కూడా దొరకడం కష్టం ♦ ఎర్రచందనం కేసు విచారణకు ప్రత్యేక కోర్టులు ♦ సాక్షితో ఓఎస్డీ సత్య ఏసుబాబు సాక్షి,కడప: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ బి.సత్య ఏసుబాబు హెచ్చరించారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రత్యేకంగా 1967 చట్టంలో కొన్ని సవరణలు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బెయిల్ ఇచ్చేందుకు కూడా వీలు లేదని.. ఒకవేళ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైన పక్షంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు కానీ, బెయిల్ పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చట్టాన్ని కఠినతరం చేశారన్నారు. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశంతోపాటు ఎక్కువ శాతం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారికి శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అక్రమంగా తరలించినా, ఎర్రచందనం దుంగలు కొట్టివేస్తున్నా పదేళ్ల శిక్షతోపాటు రూ.10లక్షలు జరిమానా విధించేలా చట్టం వచ్చిందన్నారు. మొదటిసారి తరలిస్తూ దొరికితే 5ఏళ్ల శిక్షతోపాటు రూ.3లక్షల జరిమానా, రెండవ సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారని ఆయన వివరించారు. ఎవరైనా వాహనంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు యజమానిపై కూడా కేసు పెడతామని హెచ్చరించారు. -
ఎర్రచందనం దొంగల అరెస్ట్
ఆళ్లగడ్డ: ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు తమిళ కూలీలతో కలిసి నల్లమల అడవిలో నుంచి ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు గురువారం రాత్రి ఆళ్లగడ్డ సీఐ ఓబులేసు, ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రామయ్యలు ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు అటవీ సిబ్బందితో కలిసి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేశారు. అదే సమయంలో తెలుగు గంగ కాల్వ సమీపంలో కొందరు వ్యక్తులు అడవిలో నుంచి దుంగలను తెచ్చి ముళ్ల పొదల్లో దాచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే అక్కడే మాటేసిన పోలీసులు అహోబిలం గ్రామానికి చెందిన మోకు సంజీవ, ఓజీ తండాకు చెందిన మూడేశివనాయక్, బుక్కేవాసునాయక్, బాచేపల్లి తండాకు చెందిన మూడే శంకర్‌నాయక్, కోటకొండకు చెందిన షేక్షావలి, బజ్జరిరాజు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 దుంగలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఎర్రచందనం పేరుతో దగా
నిందితుల అరెస్ట్ కల్వకుర్తి రూరల్ : మండలంలోని కుర్మిద్ద గ్రామంలోని ఓ మామిడితోటలో ఉంచిన దుంగలు ఎర్ర చందనం కాదని, సండ్ర కలప దుంగలని ఎస్ఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. ఎర్రచందనం పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించి తమ చేతికి చిక్కారని చెప్పారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్ తాలూకా పెద్దకొత్తపల్లికి చెందిన నాయినంపల్లి భాస్కర్‌రెడ్డి, పర్వతాలు, ముల్లచింతలపల్లికి చెందిన చింతపల్లి భాస్కర్ కుర్మిద్ద గ్రామంలో తోటలో కలపను నిల్వ ఉంచారని చెప్పారు. పోలీసులు ఎర్రచందనం వ్యాపారుల పేరుతో వెళ్లి పర్వతాలును, రితీష్‌ను అదుపులోకి తీసుకోగా భాస్కర్‌రెడ్డి, భాస్కర్ పరారయ్యారని వెల్లడించారు. -
ఆ లాకర్లలో రూ.5 కోట్ల ఆస్తులు..!
► ‘ఎర్ర’ క్వీన్ సంగీత చటర్జీ కేసు ► కింది న్యాయస్థానం ఆదేశాలు రద్దు చేయండి ► కోల్‌కతా హైకోర్టులో చిత్తూరు పోలీసుల పిటిషన్ చిత్తూరు: ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్, కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ కేసును విచారి స్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవా లు తెలుస్తున్నాయి. గురువారం సంగీత, ఆమె భర్త లక్ష్మన్‌కు చెందిన కోల్‌కతాలోని యూకో బ్యాంకు జోధ్‌పూర్ పార్కు బ్రాంచ్‌లో రెండు లాకర్లను అక్కడి పోలీసుల సమక్షంలో తెరచిన చిత్తూరు పోలీసులు సుమారు 2.50 కిలోల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు పలు ఆస్తులను, సంబంధించిన పత్రాలను సైతం సీజ్ చేశారు. చిత్తూరు పోలీసులు సీజ్ చేసిన ఆభరణాలు, ఆస్తుల పత్రాల విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చిత్తూరులో సంగీ తపై నమోదైన కేసుల్లో ఇక్కడి కోర్టుకు హాజరుకాకుండా సంగీత రెండుమార్లు కోల్‌కతా సిటీ కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. తనకు ఆరోగ్యం బాగాలేదని అక్కడి కోర్టుకు చెప్పడంతో ఈనెల 20వ తేదీలోపు చిత్తూరు కోర్టుకు హాజరుకావాలని కోల్‌కతా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సంగీతను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని, కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని చిత్తూరు పోలీసులు శుక్రవారం కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తరువాత సంగీత విషయంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని చిత్తూరు పోలీసులు చెబుతున్నారు. -
సంగీత చటర్జీ బండారం బట్ట బయలు..!
లాకర్లలో రూ.కోట్ల విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు, పిస్టోలు? ‘ఎర్ర’డాన్‌ను చిత్తూరుకు తీసుకొచ్చే యత్నం కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్, మాజీ ఎయిర్ హో స్టెస్, మోడల్ కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. సంగీత, ఆమె భర్త లక్ష్మణ్‌కు చెందిన బ్యాంకు లాకర్లను గురువారం తెరిచారు. అందులో పలు కీలక పత్రాలు లభించాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. రెండున్నర కేజీల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఇప్పటికే రెండుసార్లు చిత్తూరు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న సంగీతను ఇక్కడికి తీసుకొచ్చేందుకు కోల్‌కతా హైకోర్టులో మధ్యంతర పిటిషన్ సైతం పోలీసులు దాఖలు చేశారు. లాకర్ బద్దలు.. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన స్మగ్లర్, రెండుసార్లు పీడీ యాక్టుపై జైలుకు వెళ్లిన నిందితుడు లక్ష్మణ్ రెండో భార్య సంగీతను గత నెల చిత్తూరు పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేసి తప్పనిసరి పరిస్థితితుల్లో అక్కడి కోర్టులో హాజరుపరచిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈమెపై యాదమరి, గుడిపాల, నగరి పోలీసు స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి. వీటిలో చిత్తూరు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న సంగీతను ఈసారి చిత్తూరుకు రప్పించేందుకు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌రావుతో పాటు ప్రత్యేక బృందాన్ని రెండు రోజుల క్రితం కోల్‌కతాకు పంపించారు. గత నెల సంగీతను అరెస్టుచేసిన సమయంలో ఆమె, లక్ష్మణ్‌కు చెందిన పలు బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీన్ని అక్కడి పోలీసుల సమక్షంలో తెరిచారు. ఇందు లో రూ.కోట్ల విలువచేసే ఆస్తుల పత్రా లు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటితోపాటు లాకర్లో పిస్టో లు కూడా లభించినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో సంగీతను చిత్తూరుకు తీసుకురానున్నట్టు సమాచారం. -
భూకబ్జాల నిరోధానికి పటిష్ట చర్యలు
హోం మంత్రి చినరాజప్ప టనకరికల్లు : ఎర్రచందనం, ఇసుక మాఫియా, భూకబ్జాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రూ.ఎనిమిది లక్షలో ఆధునికీకరించిన స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సోమవారం పునఃప్రారంభించారు. ముందుగా మొక్కలు నాటారు. శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. చినరాజప్ప మాట్లాడుతూ 27 నుంచి అన్ని శాఖలను నవ్యాంధ్ర రాజధానికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖను బలోపేతం చేసేందుకు నూతనంగా ఆరు వేల పోస్టుల మంజూరుకు కేబినేట్ ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తుని ఘటనను సీఐడీకి అప్పగించామన్నారు. అదనపు పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి ప్రత్యేక అవసరాల దృష్ట్యా అదనపు పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. ప్రజాసేవలో భాగంగా ప్రజల వద్దకు పోలీసింగ్‌ను అమలు చేస్తామన్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఆర్డీవో జి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
18 ఎర్రచందనం దుంగలు పట్టివేత
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్రచందనం దుంగలతోపాటు కూలీలు పట్టుబడ్డారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం ఉదయం సచ్చినోడుబండ సమీపంలో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారికి ఎదురైన ఎర్ర చందనం కూలీలు... దుంగలను వదిలేసి కాలికి బుద్ధిచెప్పారు. అయితే, పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరుగురు చంద్రగిరి మండలం రంగపేటవాసులుగా తేలింది. -
50 మంది ఎర్రచందనం కూలీలు పరారీ
ఎర్రచందనం దుంగలను నరికేందుకు వచ్చిన 50 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారయ్యారు. వీరంతా ఓ టూరిస్టు బస్సులో నకిలీ నంబర్‌ప్లేటు తగిలించుకుని వచ్చారు. కడప నగర శివారు కనుమలోపల్లి వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేయడానికి ప్రయత్నించిన విషయం తెలుసుకుని.. పారి పోయారు. బస్సులో ఉన్న గొడ్డళ్లు, కూరగాయలు, బియ్యం మూటలను అటవీశాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్ చేశారు. పరారై న కూలీల కోసం టాస్స్‌ఫోర్స్, స్పెషల్ పార్టీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
గుర్రంకొండలో ఎర్ర మూలాలు
► ఎర్రచందనం అక్రవు రవాణాకు గేట్‌వే ► ఇక్కడి నుంచే పెలైట్లు, డ్రైవర్లు గుర్రంకొండ: ఎర్రచందనం అక్రమ రవాణాకు గు ర్రంకొండ కేంద్రంగా మారుతోంది. ఇక్కడి నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అవసరమైన పెలైట్లు, వాహనాలకు డ్రైవర్లు వెళుతుండడాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిఘా పెట్టారు. గుర్రంకొండ కడప-జాతీయ రహదారి లో ఉంది. అంతేగాక చిత్తూరు, కడప జిల్లాలకు సరిహద్దుగాకూడా ఉంది. దీంతో పలువురు వ్యక్తు లు ఇక్కడ మకాంవేసి తవు కార్యకలాపాల్ని యుథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో టి.పసలవాండ్లపల్లె, చెర్లోపల్లె, ఎల్లుట్ల గ్రావూల్లో ఎర్రచందనం దుంగలను డంపింగ్ చేసేవారు. పోలీసులు దాడులుచేసి పలువూర్లు ఎర్రచందనం దుంగల్ని స్వా ధీనం చేసుకున్నారు. అదేవిధంగా బి.కొత్తకోట పోలీసులు ఇటీవల ఎల్లుట్ల పంచాయుతీలోని కల్లూరివాండ్లపల్లెకు చెందిన ఒక వ్యక్తిని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. సరిహద్దు గ్రామాల్లోని ఒకరిద్దరు నాయుకులపైనా కేసులు నమోదయ్యూయి. ఈ నేపథ్యంలో వుళ్లీ వుండలంలో ఎర్ర కార్యకలాపాలు జోరందుకుంటున్నారుు. ఓ వ్యక్తి గుర్రంకొండలో పలువురిని ఈ కార్యకలాపాల్లోకి దించుతున్నట్లు సవూచారం. వుుఖ్యంగా 22 నుంచి 28 ఏళ్లలోపు యుువకులు, డ్రైవర్లను వినియోగించుకుంటున్నట్టు తెలిసింది. వాహనాలకు వుుందు పైలట్లుగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లేందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. డ్రైవర్లకు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారు. సువూరు 25 వుంది వరకు ఈ పనుల్లో పాల్గొంటున్నట్టు విశ్వనీయ సమాచారం. కొంతవుంది రిటైర్డ్ పోలీసులు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఎర్రచందనం స్మగ్లర్లు అప్పుడప్పుడు బెంగళూరు, తిరుపతి, చెన్నై తదితర పట్టణాలకు తీసుకెళ్లి విందులు, విలాసాల్లో వుుంచెత్తుతున్నట్టు సమాచారం. వీరికి కొంతవుంది నాయుకులు తవు అండదండలు అందిస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కడప జిల్లాకు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్రంకొండ వుండలంలోని పలు గ్రావూల్లో దాడులు చేసి కొంతవుంది నాయుకుల్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లిన సంఘటనలు చోటుచేసుకున్నారుు. -
సంగీత చటర్జీ అరెస్టుకు ప్రత్యేక బృందం
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో అరెస్టయిన కోల్కత్తా మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీని చిత్తూరుకు తీసుకురావడంపై జిల్లా పోలీసులు దృష్టి సారించారు. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ రెండో భార్య సంగీతను గత శనివారం ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నించినా కుదర్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కోల్‌కతాలోని కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కోర్టు ఇంటీరియల్ బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలో ఈమెపై మూడు కేసులు ఉండడంతో కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంటు పెండింగ్‌లోనే ఉంది. కోల్‌కతా కోర్టు సంగీత కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ నెల 18వ తేదీలోపు ఆమె చిత్తూరు కోర్టులో హాజరుకావాల్సి ఉంది. లేనిపక్షంలో పోలీసులు సంగీతను అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకురానున్నారు. దేశ సంపదను సరిహద్దు దాటించి రూ.కోట్లు కొల్లగొట్టిన సంగీతను చిత్తూరు కోర్టులో హాజరుపరచాల్సిందేనని అధికారులను ఎస్పీ శ్రీనివాస్ ఆదేశించారు. అలాగే లక్ష్మన్ నుంచి కొనుగోలు చేసిన పిస్టల్, తప్పుడు గన్‌లెసైన్సు వ్యవహారాల్లో దర్యాప్తు ప్రారంభించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని, ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. హాట్ టాపిక్‌గా మారిన సంగీత చటర్జీ కేసులో పలువురు ఎర్రచందనం మాజీ స్మగ్లర్లు అరెస్టు కావడం ఖాయంగా కనిపిస్తోంది. -
17 మంది ఎర్రకూలీల అరెస్టు
► 19 ఎర్రదుంగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం ► పోలీసులపై తిరగబడ్డ ఎర్రకూలీలు తిరుపతి క్రైం: తిరుపతి- కరకంబాడీ రోడ్డులోని రెడ్డిభవనం వద్ద బుధవారం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడి చేసి 15 మంది ఎర్రకూలీలను అరెస్టు చేసినట్టు ఈస్టు డీఎస్పీ మురళీకృష్ణ, టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. వారు గురువారం అలిపిరి పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు కరకంబాడి రోడ్డులోని రెడ్డిభవనం సమీపంలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్టులో ఆంధ్ర, తమిళనాడుకు చెందిన 17 మంది కూలీలు, స్మగ్లర్లు 13 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా గుర్తించామన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా రంపాలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడిచేకి దిగారని పేర్కొన్నారు. అలిపి రి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చాకచక్యంగా వ్యవహరించి 15 మంది ఎర్రకూలీలను పట్టుకున్నారని, మరో ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని తెలిపా రు. వారు తిరుపతికి చెందినవారని, ఎర్రచందనం రవాణాకు పెలైట్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడిం చారు. అరెస్టు చేసిన వారిలో ఆది అనే వ్యక్తి మేస్త్రీగా ఉంటూ కూలీలను శేషాచలం అడవిలోకి పంపి అక్రమ రవాణా చేస్తున్నట్టు తేలిందన్నారు. దుంగలను రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడుకు చెందిన బడాస్మగ్లర్లకు పంపుతున్నారని వివరిం చారు. వారిని పోలీసులు అడ్డుకుంటే చంపేందుకు కూడా వెనుకాడరని పేర్కొన్నారు. నిందితుల నుంచి 13 ఎర్రచందనం దుంగలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చంద్రగిరిలో.. చంద్రగిరి : సుమారు రూ.5 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు డీఆర్వో విజయ్‌కుమార్ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి శేషాచలం అటవీ ప్రాంతం సచ్చినోడుబండ సమీపంలోని సన్నరాళ్ల గుట్ట వద్ద కూంబింగ్ చేపట్టామన్నారు. ఏడుగురు కూలీలు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తుండగా దాడి చేశామన్నారు. తమను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా రామిరెడ్డిపల్లికి చెందిన హరి, అయినార్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కూచువారిపలికి చెందిన ఎర్రక్క, ఆమె మనవడు నవీన్‌నాయుడు, రంగంపేట దుర్గాకాలనీకి చెందిన పోలా వెంకటేష్, మారయ్య, చిన్నవెంకటేష్ పారిపోయారని వివరించారు. ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నట్టు చెప్పారు. ఎర్రక్క విద్యానికేతన్ సమీపంలో దుకాణం ఏర్పాటు చేసుకుని స్మగ్లర్లకు సరుకులు పంపిణీ చేస్తోందని, ఆమె మనవడు నవీన్‌తో కలిసి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందిందని పేర్కొన్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
ఎర్రదందాలో పచ్చనేతలు
► ఇప్పటికే ఒకరిపై పీడీ యాక్టు నమోదు ► పరారీలో మరికొంత మంది అధికారపార్టీ కార్యకర్తలు ► స్మగ్లర్ల కోసం పోలీసుల వేట చంద్రగిరి : ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర చూ చెబుతుంటారు. ఆయన సొంత గ్రామమైన నారవారిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న రంగంపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో టీడీపీ నాయకులు రాఘవుల నాయుడు, మల్లెల చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. రాఘవుల నాయు డు ఎర్రచందనం అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జించి బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక అతనిపై లెక్కకు మించి ఎర్ర కేసులు ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేశారు. గత నెల 16న నాగయ్యగారిపల్లి టేకుప్లాంట్ వద్ద పోలీసులు జరిపిన దాడులలో రంగంపేటకు చెందినమరో టీడీపీ నాయకుడు మల్లెల చంద్రతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగంపేటకు చెందిన మార్కొండయ్య, శంకర్ యాదవ్, రంగంపేట హరిజనవాడకు చెందిన ఎర్ర య్య అలియాస్ ఎర్రోడు పారిపోయారు. ఐదు రోజుల క్రితం మార్కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఎర్రయ్య అలియాస్ ఎర్రోడు అప్పట్లో కాంగ్రెస్ తరఫున రంగంపేట సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. మరో స్మగ్లర్ శంకర్ యాద వ్ గతంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మరో స్మగ్లర్ మార్కొండయ్య సైతం రంగంపేటలో టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు లు చెబుతున్నారు. అధికార బలంతో ఎలాైగె నా ఎర్ర కేసుల నుంచి బయట పడాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ టీడీపీ నాయకుడి తో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. వీరే కాకుండా రంగంపేటలో మరికొంతమంది టీడీపీ నాయకులు ఎర్రచ ందనం అక్రమ రవాణా చేసి రూ.కోట్లు ఆర్జించిన ట్టు పలువురు బహిరంగా విమర్శిస్తున్నా రు. ఎర్రచందనం కేసుల్లో తమ పార్టీకి చెందిన వారే ఉండడంతో టీడీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా దుంగల అక్రమ రవాణాను అరికట్టాలంటే ముందుగా స్థానిక స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
తెలంగాణలో ఎర్రచందనం దుంగల డంప్ వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంట్లో ఎర్రచందనం దుంగలు నిల్వ ఉంచిన సమాచారంతో బుధవారం పోలీసులు వాటిని గుర్తించారు. సుమారు 20 నుంచి 30 దుంగల వరకు ఉన్నట్టు సమాచారం. అటవీ అధికారులు వచ్చి ధ్రువీకరించాల్సి ఉంది. -
సీఎం మెప్పుకోసమే..!
హంగామా చేస్తున్న అధికారులు నారావారి పల్లె చుట్టూ ఉన్నతాధికారుల చక్కర్లు అడవిబాట పేరుతో అడవిలో నిద్రిస్తున్న అధికారులు పచ్చనేతలే స్మగర్ల అవతారం ఎత్తడంతో సతమతమవుతున్న పోలీసు సిబ్బంది తిరుపతి:‘మా బంధువులు, మా పొలాల్లో ఎర్రచందనం డంపులు పెండుతుంటే మీరు ఏమి చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల విజయవాడలో చేసిన వ్యాఖ్యలతో అటవీశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్టు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం మెప్పుకోసం అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. నారావారిపల్లె పరిసర గ్రామాల్లో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్టు) ఎస్బీఎల్ మిశ్రా సీఎం సొంత గ్రామంలో పర్యటించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు లఘుచిత్ర ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే అడవిబాట వంటి కార్యక్రమాలు చేసి సీఎం దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం రంగం పేట పరిసర ప్రాంతాల్లో దుంగలు దొరుకుతున్నా, డంపులు ఉన్నట్లు తెలిసినా అధికారులు చర్యలు తీసుకొలేకపోయారు. ఇటీవల చంద్రగిరి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మల్లెల చంద్ర పోలీసులకు చిక్కారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో దేశం నేతలే కీలకపాత్ర పోషిస్తుండడంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకొలేకపోతున్నారు... విచ్చలవిడి కావడంతో.. సీఎం సొంత మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చల విడికావడంతో తాను ఇరుకున పడాల్సి వస్తుందేమోనని భావించి ముందు జాగ్రత్తగానే ‘మా బంధువుల పొలాల్లో దుంగల డంపులు ఉంటే మీరేం చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ప్రశ్నించి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకొంటున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా చేశారనే చర్చ జరుగుతోంది. నిజంగా ముఖ్యమంత్రి ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి సారించి ఉంటే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు జిల్లాలో కొంతమేర అడ్డుకట్ట వేసినా, సీఎం సొంత మండలం చంద్రగిరి, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజక వర్గం నుంచే ఎక్కువగా రవాణా అవుతున్నట్టు అటవీ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని సంబంధింత మంత్రి దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళితే ఆయన దాటవేసినట్లు చర్చ సాగుతోంది. -
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
► విలువ రూ.7.50 లక్షలు ► నలుగురు స్మగ్లర్లు అరెస్ట్ గూడూరు : ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 7.50 లక్షల విలువ చేసే 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఆంజనేయరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పక్క రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఎస్పీ ఆదేశాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వెంకటగిరి మండలం చెలికంపాడు పంచాయతీ వడ్డిపల్లి సమీపంలో ఓటుచేరు వద్ద వెంకటగిరి ఎస్సై, సీఐ, సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం గాంధీనగర్‌కు చెందిన ముదినేని విజయ్, అదే జిల్లా గంజరాజపురం గ్రామానికి చెందిన వెలుగు చిరంజీవి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్త్రి మండలానికి చెందిన జింకల శివకుమార్‌తో పాటు వెంకటగిరి మండలం త్రిపురాంతపల్లికి చెందిన గుండగాని మల్లికార్జున 10 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించి దుంగలతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఆంజనేయరెడ్డి, ట్రైనీ ఎస్సైలు రాజేష్, శ్రీనివాసరావు, సిబ్బంది నాగేశ్వరరావు, దేవదానం, వేణు, ఉమతో పాటు అటవీ శాఖాధికారులు వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, వెంకట్రావును అభినందించారు. వారికి రివార్డుల కోసం సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
నలుగురు 'ఎర్ర' స్మగ్లర్ల అరెస్ట్...
- రూ.44.5లక్షలు స్వాధీనం స్టోన్‌హౌస్ పేట (నెల్లూరు) నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను నెల్లూరు జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.55 లక్షల విలువైన ఎర్రచందనం, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విశాల్ గున్నె మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పేరం ప్రవీణ్, పొదిలి నాగరాజు, బూదూరు లోకేష్, ఎగ్గోని వెంకట కృష్ణారెడ్డితోపాటు మరో ఇద్దరు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సెంటర్ వద్ద వారిని పట్టుకున్నారు. వారి నుంచి 44.50 లక్షల నగదు, రూ.5.60 లక్షలు విలువ చేసే 23 ఎర్రచందనం దుంగలు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్ర చందనం తరలిస్తున్న ముఠా అరెస్ట్
బుక్కరాయసముద్రం : ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఏడుగురి ముఠాను గురువారం బుక్కరాయసముద్రం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ క్రిష్ణమోహన్, ఎస్ఐ విశ్వనాథ్‌చౌదరి తెలిపిన వివరాల మేరకు.... కడప జిల్లా మైదుకూరుకు చెందిన సాయిబోయిన నారాయణ, కడపజిల్లా ఎర్రగుంట్లకు చెందిన కుడుబు వెంకటేశ్వరరెడ్డి, కడప జిల్లా తిమ్మరాజుపల్లికి చెందిన బోయన వెంకటరమణ, కడపజిల్లా చుక్కాయపల్లికి చెందిన ఆవుల రవి, నార్పల మండలం వెంకటాంపల్లికి చెందిన శ్రీరాం తిరుపాల్‌రెడ్డి, శింగనమల మండలం పెరవళికి చెందిన తలారి రామక్రిష్ణ, బికేయస్ మండలం వెంకటాపురానికి చెందిన రామేశ్వరరెడ్డిలు ముఠాగా ఏర్పడి కడప జిల్లాలోని నందలూరు ఫారెస్ట్‌లో ఎర్ర చందనం చెట్లను కొట్టి దుంగలను నెల రోజుల క్రితం దాచి ఉంచారు. వాటిని కర్ణాటకకు తరలించి ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనుకుని ప్లాన్ వేసిన వీరు గురువారం బొలేరో వాహనంలో 10, ట్రాక్టర్లో 11 ఎర్ర చందనం దుంగలను వేసుకుని కడప జిల్లా సరిహద్దును దాటి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. అరుుతే ఆ సమయంలో బికేయస్ మండల కేంద్రంలోని నార్పల క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి బొలేరో, ట్రాక్టర్లు నిలిపి తనిఖీ చేయగా, ఎర్రచందనం దుంగలు బయటపడ్డారుు. దీంతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 21 ఎర్ర చందనం దుంగలు, ఒక బొలోరో, ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏడాది
శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏడాది ఇంకా పూర్తికాని సిట్ దర్యాప్తు 20 మంది ఎర్రకూలీలు బలైనా ఆగని ఎర్రదందా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పలుమార్లు గర్జించిన తుపాకులు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శేషాచలం ఎన్కౌంటర్ జరిగి నేటికి ఏడాదయ్యింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అడ్డుకున్న తమపై రాళ్లు, కత్తులతో దాడి చేశారనే కారణంతో.. తమిళనాడుకు చెందిన 20మంది కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే పౌరహక్కుల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, తమిళనాడు ప్రజలు ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆక్రోశించారు. మానవ హక్కుల కమిషన్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతూ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ద్వారా స్టే తెప్పించుకుని కేసును సిట్‌కు అప్పగించింది. భారీ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఏడాదికాలంలో జిల్లా నుంచి దాదాపు 40 టన్నుల మేరకు ఎర్రచందనం శేషాచలం సరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి తిరుపతి: సరిగ్గా ఏడాది క్రితం (2015 ఏప్రిల్ 7న) జిల్లాలోని శేషాచలం కొండలు పోలీసుల తుపాకుల మోతతో దద్దరిల్లాయి. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలోని శేషాచల అడవులు రక్తమోడాయి. పొట్టకూటికోసం తమిళనాడు నుంచి వచ్చిన ఎర్రకూలీలు 20 మందిలో సచ్చినోడి బండ వద్ద 11 మంది, చీకటీగలకోనలో 9 మంది ఎన్‌కౌంటర్‌కు బలయ్యారు. ఏడాది కాలంలో కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనపై ప్రభుత్వానికి ముందే తెలుసనీ, పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. ఎదురు కాల్పులు కాదు.. పోలీసుల ఏకపక్ష కాల్పులు అనే విమర్శలూ వచ్చాయి. జనారణ్యం నుంచి కూలీలను పోలీసులే పట్టుకెళ్లి బలి చేశారని.. ప్రజా సంఘాలు, పార్టీలు, మానవహక్కుల కమిషన్, హైకోర్టు సీరియస్ అయ్యింది. చివరకు సిట్‌తో దర్యాప్తుకు ఆదేశించింది. అయితే నివేదికను మాత్రం సిట్ బృందం ఇంకా సమర్పించలేదు. ఎన్‌కౌంటర్‌పై తీరని అనుమానాలెన్నో.. మృతుల్లో ఏడుగురిని ముందురోజు పుత్తూరు సమీపంలో బస్సులో ప్రయాణిస్తుడంగా అదుపులోకి తీసుకొని శేషచలం అడవిలోకి తెచ్చి కాల్చి చంపారంటూ పోలీసుల నుంచి తప్పించుకొన్న ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. దుంగలు మోస్తున్న వారు దాడులు ఎలా చేస్తారు? కాల్పులు జరుపుతున్నా పారిపోకుండా ఉంటారా? వందలాదిమంది కూలీలు పోలీసులపై దాడిచేస్తే ఒక కూలీని కూడా ఎందుకు పట్టుకోలేక పోయారు? అనే అశాలు మిస్టరీగా మిగిలిపోయాయి. ప్రజాసంఘాలు రంగంలోకి.. ఎన్కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతాన్ని పలు ప్రజాసంఘాలు, మానవహక్కుల కమిషన్ సభ్యులు సందర్శించారు. ఎన్కౌంటర్ అనే అనుమానంతో పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో రిట్ వేశారు. చనిపోయిన ఎర్రకూలీల మృతదేహాలను రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని కోరారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విన్నవించారు. 302 సెక్షన్ కింద పోలీసులపై కేసు నమోదుచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే బాధితులు ముందుకు వస్తే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన శశికుమార్ భార్య మునిఅమ్మాల్ ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుపై ఆగ్రహం... తమిళనాడుకు చెందిన అమాయక కూలీలను పొట్టన పెట్టుకున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనకారులు పలుచోట్ల బాబు దిష్టి బొమ్మలను, చిత్ర పటాలను దహనంచేశారు. దుకాణాలపై దాడులు చేశారు. ఏపీ బస్సులు తమిళనాడులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చురగిల్చారు. ఆగని దందా.. అసలు స్మగ్లర్లను వదలి అమాయక కూలీలను మట్టుపెట్టినా ఎర్ర దందా మాత్రం ఆగలేదు. సచ్చినోడి బండ, చీగటీగలకోన ప్రాంతంలో ఎన్కౌంటర్ తరువాత ఆరు, ఏడుసార్లు పోలీసులు కాల్పులు జరపడం ఎర్రకూలీలు పారిపోవడం దుంగలు దొరకడం నిత్యకృత్యంగా మారింది. కేసును నీరుగార్చేందుకు.. హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందనే నిర్ణయంతో ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసిన కేసును ప్రభుత్వం నీరుగార్చే యత్నం చేసింది. సిట్ దర్యాప్తు డీఐజీ రవిశంకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. 60 రోజుల్లో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. అయితే ఇప్పటికీ ఏడాది గడిచినా చార్జ్ షీట్ కూడా దాఖాలు చేయలేదు. దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే కేసుకు సంబంధించి పలువురు సాక్ష్యులను విచారించింది. దోషులపై చర్యలేవీ? సంఘటనకు బాధ్యులైన దోషులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. సిట్ దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. దోషులను పట్టుకోవడం బదులు వారిని కాపాడేందుకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కేసును నీరుగార్చే యత్నం చేస్తోంది. - క్రాంతి చైతన్య, పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు -
అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ అజయ్ అరెస్ట్
చిత్తూరు (అర్బన్) : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కేరళకు చెందిన అజయ్ (47)ను అరెస్ట్ చేసినట్టు ఓ ఎస్డీ రత్న తెలి పారు. ఆమె బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. శేషాచలం టూ దుబాయ్, హాంకాంగ్.. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలోని ఎడచే రి గ్రామానికి చెందిన అజయ్ పదో త రగతి ఫెయిల్ అయ్యాడు. 2004 వర కు ఇతను కేరళలోని పాలకాడ్లో ఉన్న శ్రీగంధం బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేశాడు. అక్కడ పనిచేసే మహిళల ద్వారా శ్రీగంధాన్ని తెప్పించి ఇతరులకు విక్రయిస్తూ కొంతమంది అనుచరులను తయారు చేసుకున్నా డు. అతను శేషాచలంలో కూలీలు, మే స్త్రీల ద్వారా ఎర్రచందనం దుంగల్ని తె ప్పించి చెన్నై, ముంబయి ద్వారా విదేశాలకు తరలించేవాడు. దుబాయ్‌లో ఉంటున్న సాహుల్‌భాయ్, హాంకాంగ్‌లోని సలీమ్‌కు కూడా ఎర్రచందనం ఎగుమతి చేశాడు. గత ఏడాది అరెస్టయిన చైనా స్మగ్లర్ ఛెయన్ ఫియాన్‌కు కూడా అజయ్ ఎర్రచందనం అందచేశాడు. ఇలా ఇప్పటి వరకు 200 టన్ను ల ఎర్రచందనాన్ని ఎగుమతి చేసిన అ జయ్ రూ.40 కోట్ల వరకు కూడ పెట్టాడు. గత ఏడాది చిత్తూరు పోలీసులు కేరళలో తనిఖీలు నిర్వహించి అతని అనుచరులు నాజర్, ఉమర్, లతీష్‌ను అరెస్టు చేశారు. ఏడాదిగా అజయ్‌పై నిఘా పెట్టారు. అజయ్‌పై 13 కేసులు.. అజయ్‌పై జిల్లాలోని తాలూకా, గుడిపాల, సదుం, మదనపల్లె, భాకరాపే ట, వెదురుకుప్పం, పుత్తూరు, నగరి, ఎస్ఆర్.పురం, కల్లూరు, విజయపురం పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా శ్రీగంధం స్మ గ్లింగ్ చేస్తూ కేరళ పోలీసులకు నాలుసా ర్లు చిక్కాడు. ఇతన్ని విచారించాల్సి ఉందని, ఇతనిచ్చే సమాచారంతో ప లువురుని అరెస్టు చేస్తామని ఓఎస్డీ పే ర్కొన్నారు. గుడిపాల ఎస్ఐ లక్ష్మీకాం త్, చి త్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు ఆదినారాయణ, చంద్రశేఖర్‌ను ఓఎస్డీ అభినందించారు. -
ఆగని ‘రెడ్’ స్మగ్లింగ్
► తమిళ కూలీలతో భారీగా ఎర్రచందనం చెట్ల నరికివేత ► సిద్దేశ్వరం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్ట లేకపోతోంది. అటవీ శాఖ అధికారులు, పోలీసుల కళ్లుకప్పి స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో తమిళ కూలీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని సిద్దేశ్వరం అడవుల్లో తమిళనాడుకు చెందిన 30 మంది కూలీలు అడవిలోకి ప్రవేశించి ఎర్రచందనం చెట్లు నరికివేస్తున్నట్లు మూడురోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేకదళాలు, అటవీ సిబ్బంది కలిసి ఆదివారం గాలింపు చర్యలు చేపట్టగా నలుగురు తమిళ కూలీలు చిక్కారు. మిగతా 26 మంది తప్పించుకున్నట్లు తెలిసింది. వీరిని పట్టుకునేందుకు బలగాలు అన్ని వైపులనుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే కూలీలు నరికివేసిన ఎర్రచందనం దుంగలను కనుక్కునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువచేసే దుంగలను నరికి దాచినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ దుంగలను ఎప్పటికప్పుడు బయటకు తరలించి ఉండవచ్చని ఓ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద సిద్దేశ్వరం అడవుల్లోని సుదూర ప్రాంతంలో ఉన్న లోయల్లోనే నాణ్యమైన చందనాన్ని కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు నిరంతరం తమ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సమస్య అటు అటవీ, ఇటు పోలీసు బలగాలకు సవాల్‌గా మారింది. ప్రపంచంలోకెల్లా నాణ్యమైన ఎర్రచందనం నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని వెలుగొండ అడవుల్లో ఉంది. దీనిని అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తూ అనేకమంది రూ.కోట్లకు పడగలెత్తారు. ఈ వ్యవహారంలో బడా నాయకులతో పాటు కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్న విషయం అందరికీ విదితమే. కడప జిల్లానుంచి ప్రవేశం.. సిద్దేశ్వరం అడవుల్లోని లోయల్లో ఉన్న ఎర్రచందనం దుంగలను నరికేందుకు తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కూలీలను స్మగ్లర్లు కడప జిల్లా బద్వేలు వైపునుంచి లోపలకు తీసుకెళుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న అదే వైపునుంచి 60 మంది తమిళ కూలీలు సిద్దేశ్వరం అడవుల్లోకి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న అటవీ, పోలీసు బలగాలు రంగప్రవేశం చేసి కూలీలు చెట్లు నరికే ప్రాంతానికి ప్రవేశించాయి. అప్పట్లో నలుగురు కూలీలు పట్టుబడ్డారు. 50 మందికి పైగా తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కూలీలు కొట్టిన ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఉదయగిరి మండలం కుర్రపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 దుంగలను, నలుగురు చెన్నై స్మగ్లర్లును పోలీసులు పట్టుకున్నారు. రూ.60 లక్షలు విలువచేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే నెలలోకూడా మరో 50 ఎర్రచందనం దుంగలను ప్రత్యేక పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా కనుక్కొన్నారు. స్మగ్లర్లు తప్పించుకున్నారు. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న ఎర్ర స్మగ్లర్లు అవకాశం దొరికినప్పుడల్లా స్మగ్లింగ్‌కు పాల్పడుతూనే ఉన్నారు. గతంలో స్మగ్లర్లు స్థానికులతో మాత్రమే ఎర్రచందనం చెట్లు నరికించి స్మగ్లింగ్ చేసేవారు. ఏడాది నుంచి స్థానికులు దీనికి దూరంగా ఉండటంతో తమిళనాడు నుంచి ఎక్కువ మొత్తం ఇచ్చి కూలీలను పిలిపించుకుంటున్నారు. అటవీ సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది సహకారం స్మగ్లర్లకు ఉండవచ్చని భావిస్తున్నారు. కూంబింగ్ కోసం అడవిలోకి ప్రత్యేక బలగాలు ప్రవేశించే అవకాశం ఉన్న సమయంలో ముందస్తుగానే స్మగ్లర్లకు సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కువమంది కూలీలు తప్పించుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్నేళ్లనుంచి ఇదే ప్రాంతంలో పాతుకుపోయిన అటవీ, పోలీసు సిబ్బంది సహకారం స్మగ్లర్లకు లభిస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా ఆశించిన ప్రయోజనాలు మాత్రం కనిపించడం లేదు. -
3 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
మూడు టన్నుల ఎర్ర చందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరు గ్రామం వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లారీలో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను గుర్తించిన అధికారులు డ్రైవర్ ను విచారించడానికి ప్రయత్నించగా..అతడి తో పాటు.. మరో 5 మంది పరారయ్యారు. లారీ సహా స్వాధీనం చేసుకున్న దుంగలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ మార్కెట్ లో రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఎర్రచందనం రక్షణకు చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి సూచన సాక్షి,తిరుమల: శేషాచలానికి తలమానికమైన ఎర్రచందనం అటవీ సంపదను ఆర్థిక, వాణిజ్య దృష్టితో చూడకుండా వాటి పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచిం చారు. శ్రీవారి దర్శనం కోసం ఆయన గురువారం రాత్రి తిరుమలకు వచ్చా రు. ఆయన మీడియాతో మాట్లాడారు. అంతరించిపోతున్న వృక్షాల్లో ఎర్రచందనం కూడా ఒకటని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించిందన్నారు. అలాంటి అరుదైన జాతిని భావితరాల కోసం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాంటి వృక్షాల ఎగుమతితో డబ్బులు సంపాదించుకోవాలని భావనతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సరికాదన్నారు. శేషాచలంలోని చెట్లను నరకుండా రాష్ర్ట ప్రభుత్వం మరింత సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీటి స్మగ్లింగ్‌కు పాల్పడే స్మగ్లర్లపై చట్టంలో మార్పులు చేసైనా మరింత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపి శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వీటి రక్షణ చర్యల కోసం శేషాచలంలో బీజేపీ తరపున పెద్ద ఎత్తున పాదయాత్రలు చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయన వెంట టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా ఉన్నారు. -
రూటు మార్చిన ఎర్ర స్మగ్లర్లు
► తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ► కర్ణాటక రాష్ట్రానికి తరలింపు ► అనంతపురం కేంద్రంగా రవాణా సాక్షి ప్రతినిధి తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండడంతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతపురం సరిహద్దు ప్రాంతాలు కదిరి, హిందూపురం, రాప్తాడు కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక ప్రాంతంలోని బాగేపల్లెలో లారీలో మొత్తం 95 దుంగలు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు జిల్లాలో 4, 5 రోజు లుగా ఎర్రచందనం దుంగల స్వాధీనం తగ్గింది. దీంతో టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు ఆరా తీశారు. దీని ప్రకారం అడవిలోకి వెళ్లిన స్మగ్లర్లు దుంగలను బయటకు తరలించకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో డంపులు ఏర్పాటు చేస్తున్నట్లు సమచారం. బాలుపల్లె, సానిపాయితోపాటు అనంతపురం జిల్లాలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో... తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల్లో నిఘా కట్టుదిట్టం చేయడంతో స్మగర్లు తాత్కాలికంగా తమిళనాడు వైపు ఎర్రచందనాన్ని తరలించడం ఆపివేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఎండలు కూడా మండిపోతుండడంతో అడవిలోకి వెళ్లడానికి కూలీలు జంకుతున్నట్లు అటవీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనంతపురం జిల్లాపై దృష్టి.... ఎర్ర స్మగ్లర్లు అనంతపురం జిల్లాలో డంపులు ఏర్పాటు చేస్తున్నారని పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఎర్ర స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఎర్ర చందనంపై అవగాహన కల్పించేందుకు డీఐజీ కాంతారావు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా త్వరలో కదిరి ప్రాంతంలో సదస్సు నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలోని హిందుపురం ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుని, కర్ణాటకకు ఎర్ర చందనం తరలించేందుకు సురక్షిత మార్గంగా స్మగ్లర్లు ఎంచుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. పట్టుగూళ్ల మాటున కర్ణాటకకు ఎర్రదుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు సైతం కనుగొన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఎర్ర రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. -
శేషాచలంలో లూటీ
తుంబురు తీర్థం మార్గంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత మోడులుగా మారిన ఎర్రచందనం వృక్షాలు తిరుమల: శేషాచలంలోని విలువైన ఎర్రచందనం లూటీ అయ్యింది. స్మగ్లర్ల ధన దాహానికి ఎర్రచందనం వృక్షాలు నేలకొరిగాయి. అటవీ సంపద ఎల్లలు దాటగా వృక్షాలు మోడులుగా మిగిలాయి. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలో 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని శేషాచల అడవుల్లో శ్రీవేంకటేశ్వర అభయారణ్యం ఉంది. తూర్పున రాజంపేట, పడమర తలకోన వరకు విస్తరించిన దట్టమైన అటవీ మార్గాల్లో విలువైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. తుంబరు తీర్థం మార్గంలో ఎర్రచందనం వృక్షాలు భారీగా విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు చెట్లతో కళకళలాడే ఈ ప్రాంతమంతా నేడు మోడులు కనిపిస్తున్నాయి. భారీ వృక్షాలను దుండగులు నరికేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఎల్లలు దాటించేశారు. ఏటేటా ఈ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు తరిగిపోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయినా రక్షణ చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. దుండగులు యథేచ్ఛగా అడవిలోకి చొరవడి విలువైన కలపను సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడవిలోనే దండగులు తిష్ట? తుంబురు తీర్థం మార్గంలోని ఎర్రచందనం చెట్లను నరికి తరలించిన తాజా గుర్తులు ఉన్నాయి. ఈ మార్గంలో దుండగులు తాపీగా కూర్చుని చెట్లను నరికి, దుంగలుగా మార్చి వదిలిని చెక్కలు ఉన్నాయి. అంటే అడవిలో దుండగులు పెద్ద ఎత్తున తిష్టవేసినట్టు తెలుస్తోంది. మామండూరు, రాజంపేట మార్గం నుంచి దుండగులు అడవిలోకి చొరబడుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకోకపోతే ఎర్రచందనం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
వలస నేత.. మారేనా రాత!
► కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా? ► ఎలా ఇస్తారని ఒక వర్గం వాదన ► పార్టీకి చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయం ► అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన ఒక్కటవుతున్న జిల్లా టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలోకి తాజాగా చేరిన నేతకు మంత్రి పదవి దక్కేందుకు రోజుకో కొత్త అడ్డంకి ఎదురవుతోంది. ఇన్ని రోజులుగా మంత్రి పదవి హామీ ఆయనకు ఇవ్వలేదంటున్న ఆ పార్టీ నేతలు.. తాజాగా ఆయనపై ఉన్న కేసులు అడ్డువచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉందని ఆరోపణలు చేసి, ఎమ్మెల్యే పదవికి కూడా అర్హుడు కాదని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు పిలిచి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరువు బజారునపడుతుందనే కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు. అంతేకాకుండా మంత్రి పదవి ఇస్తే అధికార పార్టీలో చేరితే చాలు అన్ని ఆరోపణలు మాఫీ అవుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి పంపినట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది అంతిమంగా పార్టీకి జిల్లాలో చెడ్డపేరు తెచ్చిపెడుతందనే చర్చకు తావిస్తోంది. ఇదే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. విమర్శించి.. అందలమెక్కించవచ్చా? వాస్తవానికి సదరు నేతను విమర్శిస్తూ అధికార పార్టీ నేతలు గతంలో అనేక ఆరోపణలు చేశారు. రౌడీషీటర్ అని.. ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడని ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నేతలకు ఏకంగా మంత్రి పదవి ఇస్తే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలమనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉంటే చెడ్డవాడు.. అధికారపార్టీలో చేరితే మంచివాడు అని మనమే సర్టిఫికెట్ ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఎమ్మెల్యేగానే ఉంచాలని కోరుతున్నారు. ఒక్కటవుతున్న నేతలు.. ఒకవైపు కేసుల వ్యవహారంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెబుతున్న నేతలు.. మరోవైపు ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతలు ఏకమవుతున్నారు. తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇవ్వద్దని ఏకంగా అధినేతను స్వయంగా కలిసి విన్నవించాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో ఏ ఒక్కరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వాదించనున్నట్టు తెలిసింది. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా జిల్లా రాజకీయాలను రోజుకో మలుపు తిప్పుతోంది. -
రూ.32లక్షల ఎర్ర చందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా ఎర్రావారి పాలెం మండలం ఉచ్చికాయల పెంట వద్ద రూ.32లక్షల విలువైన ఎర్ర చందనాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వాహనం లో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాల తనిఖీలో భాగంగా ఎర్ర చందనం పట్టుబడినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్ కు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కర్ణాటకలో ముగిసిన ఆపరేషన్ రెడ్
ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు రూ.3 కోట్ల విలువైన దుంగలు, వాహనాలు స్వాధీనం తప్పించుకున్న మరో ముఠా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి చిత్తూరు (అర్బన్): ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి గత వారం రోజులుగా చిత్తూరు పోలీసులు కర్ణాటకలో నిర్వహించిన ‘ఆపరేషన్రెడ్’ ముగిసింది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. చిత్తూరులోని పోలీసు మైదానంలో ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ బుధవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో స్మగర్ల నుంచి రూ.3 కోట్ల విలువైన 7 టన్నుల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. బయట పడింది ఇలా.. పది రోజుల క్రితం కల్లూరులో పోలీసు లు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఇన్నోవా వాహనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గౌస్‌బాషాను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కాలు కూడా విరిగింది. వాహనాన్ని వెంబడించిన పోలీసులు బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్, సయ్యద్ ముబారక్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో బెంగళూరు సమీపంలోని కటికనహళ్లి, గిడ్డప్పనహళ్లి ప్రాంతాల్లో చిత్తూరు ఓఎస్డీ రత్న ఆధ్వర్యంలో కర్ణాటక పోలీసుల సాయంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో పేరుమోసిన అంతరాష్ట్ర స్మగ్లర్ ఫసీ ఉద్దీన్‌కు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతను పరారయ్యాడు. కాగా కర్ణాటకకు చెందిన పలువురు పెద్ద మనుషులతో కలిసి ఫసీ గతంలో చిత్తూరు పోలీసులను ఆశ్రయించి తన ప్రాంతంలో ఎర్రచందనంపై కళాజాత, అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరడం విశేషం! పైకి పెద్దమనుషులుగా లోపల స్మగ్లర్లుగా చెలామణి అవుతున్న వైనాన్ని సైతం పోలీసులు కనిపెట్టారు. ఇక అదే ప్రాంతంలో జమీర్‌ఖాన్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పట్టుబడ్డ వారిలో జమీర్‌ఖాన్ (26) కటిహనహళ్లికి చెందిన వ్యక్తి. చూడటానికి బాలీవుడ్ సినిమాల్లో విలన్లా కనిపించే ఇతను అంతర్ రాష్ట్ర స్మగ్లర్. పదో తరగతి వరకు చదివి, మెడికల్ షాపులో పని చేస్తుండేవాడు. అయితే 2014 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ తమిళనాడుకు చెందిన శశి అనే వ్యక్తి ద్వారా కూలీలను రప్పించేవాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన అదిల్ షరీఫ్ (27), షేక్ ముబారక్ (26), తౌసీఉల్లా ఖాన్ (30), మహ్మద్ యూసఫ్ (27లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఒక్కొక్కరిపై 5 నుంచి 12 కేసులు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో ఫసీ గ్యాంగ్ కోసం, కూలీలు, మేస్త్రీలను సరఫరా చేసే తమిళనాడుకు చెందిన శని అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అభినందన ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అందరికీ ప్రశంసా పత్రాలను అందచేశారు. సమావేశంలో ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరిధర్, రామ్‌కుమార్, లక్ష్మీనాయుడు, శ్రీకాంత్, దేవదాసు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కర్ణాటకలో పట్టుబడ్డ ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లు
ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసి గోదాముల్లో నిల్వ చేసిన కర్ణాటకకు చెందిన ఐదుగురు స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలు, ఏడు టన్నుల బరువున్న 320 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను బుధవారం చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. కర్ణాటకలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గత వారం రోజులుగా బెంగళూరు సమీపంలోని కటికనహళ్లి, గిడ్డనహళ్లి ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో కర్ణాటకకు చెందిన జమీర్‌ఖాన్ (26), అదిల్ షరీఫ్ (27), షేక్ ముబారక్(26), తౌసీఉల్ల ఖాన్ (30), మహ్మద్ యూసఫ్ (27)అనే ఐదుగురు స్మగ్లర్లను అరెస్టుచేశారు. మరో స్మగ్లర్ ఫసీ నిర్వహిస్తున్న ఎర్రచందనం డంప్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు అతని గ్యాంగ్ పరారీలో ఉంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఎర్రచందనం విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. -
కండీషన్ తప్పుతోంది
తిరుపతి: పోలీసులకు పట్టబడ్డ తర్వాత కూడా ‘ఎర్ర’ స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేసి స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవేశించి స్మగ్లింగ్‌లో కొత్త దార్లు వెదుకుతున్నారు. ఇటీవల కాలంలో మహిళలను వాహనాల్లో ఉంచి ఫ్యామిలీ ప్రయాణం తరహాలో ఎర్ర దందా సాగిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోమవారం మామండూరు సమీపంలో ఖరీదైన హోండా కారులో దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడిచేశారు. కారుతో పాటు, మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఏడుగురు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతను తమిళనాడు విల్లుపురానికి చెందిన రాజా గుర్తించారు. గత సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన రాజా మూడు నెలలు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కండీషన్ బెయిలు పొందాడు. అతను నిర్ణీత సమయంలో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాలి. ఇతను సంతకం పెట్టేందుకు వచ్చి అటునుంచి అటే అడవికి వెళ్లిపోయి యథావిధిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారికి సులభంగా బెయిలు వచ్చేందుకు కొంతమంది స్థానిక న్యాయవాదులు సహాయపడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాజా తరహాలోనే వందలాది మంది కండీషన్ బెయిలుపై బయట ఉండి మళ్లీ ఎర్ర దందాలు పాల్గొంటున్నట్టు సమాచారం. అడవికి నిప్పు పెట్టి.. అడవి నరికి పెట్టిన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కళ్లుగప్పి తరలించేందుకు కూలీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నారని తెలిసింది. అడవికి నిప్పుపెట్టి అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పక్కదారి పట్టించి దుంగలు తరలిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. దీంతో నిఘా మరింత పెంచారు. మరోవైపు అడవికి నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని అటవీశాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
దర్జాగా తిరుగుతున్న ఎర్రస్మగ్లర్లు
కేసులున్నప్పటికీ కోర్టు కేసు నంబర్లకు నోచుకోని వైనం పోలీస్, అటవీశాఖల సమన్వయ లోపం చార్జ్షీట్ల నమోదులో తీవ్ర జాప్యం జిల్లావ్యాప్తంగా వందల కేసుల్లో ఇదే సమస్య ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఎర్రస్మగ్లర్లకు వరంగా మారింది. అటవీశాఖ నుంచి త్వరితగతిన ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ అందకపోవడం, పోలీసుల నుంచి సకాలంలో ఎఫ్ఐఆర్ రిమాండర్లు వెళ్లకపోవడంతో ఎర్రచందనం కేసులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఏళ్లు గడుస్తున్నా నిందితులు దర్జాగా తిరుగుతూ కోర్టులంటే ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కట్టిన ఎస్ఐలు రిటైరైనా, ఆ కేసుల్లో ఇంతవరకు కోర్టు నంబర్ కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.కోర్టు వాయిదాలను కూడా పట్టించుకోవడం లేదు. ఎర్రచందనం కేసుల్లో నిబంధనలిలా.. ఎర్రచందనం దుంగలతో పాటు వాటిని తరలించే వారిని పట్టుకున్నపుడు ప్రాపర్టీని సీజ్ చేసి నిందితులపై పోలీసులు కేసులు నమోదు చే స్తారు. అరెస్ట్ చూపే నాటికి అందుబాటులో ఉన్న నిందితులను రిమాండ్‌కు పంపుతూ మిగిలిన వారిని పరారీలో చూపుతారు. ఆపై అరెస్ట్ అయిన వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను అటవీశాఖకు అందించాల్సి ఉంది. వీరికి సంబంధిత డివిజన్ పరిధిలోని సబ్ డీఎఫ్‌వో స్థాయి అధికారి ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను జారీచేస్తారు. దీంతో కేసుకు సంబంధించి కోర్టులో సీసీ (కోర్ట్ కేస్) నంబర్ వచ్చి కేసుకు సంబంధించిన వాయిదాలు ప్రారంభమవుతాయి. ఐవో (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) విచారణతో ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంది. పోలీస్ కేసుల్లో సీజ్ అయిన అటవీశాఖకు అప్పగించిన వాహనాలు, ప్రాపర్టీపై విలువ కట్టి వారు వేలం తదితర ప్రక్రియలను నిర్వహిస్తారు. కానీ.. జరుగుతున్నదేమంటే.. ఉదాహరణకు పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఎర్రచందనం కేసులను అటవీశాఖకే అప్పగించేశారు. అయితే ఐపీసీ 379 సెక్షన్ ఉన్న కేసులను మాత్రం పోలీసులే చేపట్టాల్సి ఉంది. గత మూడేళ్లలో సుమారు 12కు పైగా ఎర్రచందనం కేసుల్లో 70 మందికి పైగా నిందితులను స్థానిక పోలీసులు అరెస్ట్‌చేశారు. అయితే కోర్టులో నంబర్ కాకపోవడంతో ఇంతవరకు వారికి వాయిదాలు మొదలు కాలేదు. మూడేళ్లకు ముందు బెయిలుపై వె ళ్లిన నిందితులు ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కని పరిస్థితి. ఇలా చేయడంతో నిందితులకు ఎంతోమేలు కాగా కేసులు కూడా వీగిపోయే పరిస్థితి ఉంది. ఈ సమస్య కేవలం ఒక పలమనేరులోనే కాదు. జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యల కేసులు ఇంతవరకు నెంబర్లకు నోచుకోక కోర్టు విచారణలు ఆలస్యమవుతున్నాయి. దీనంతటికీ కారణం పోలీసుల అలసత్వం, అటవీశాఖ నిర్లక్ష్యంగా తెలుస్తోంది. కుదరని పొంతన ఎర్రచందనం కేసుల్లో భారీ కేసులను మాత్రం పోలీసులు డీల్ చే స్తూ బలహీనమైన కేసులను తమకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని మొదటి నుంచి అటవీశాఖ మధనపడుతూనే ఉంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. సంబంధిత కేసులకు సంబంధించి పెద్ద కేసుల్లో నిందితుల నుంచి పోలీసులు ఎంతోకొంత గుంజుకుంటున్నారని, తమకొచ్చే కేసులు ఏ మాత్రం ప్రయోజనం లేని కేసులని అటవీ శాఖ భావిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే పోలీస్ కేసుల్లో నిందితులకు వెంటనే ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను అటవీశాఖ ఇవ్వడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలమనేరు సీఐ సురేంద్రరెడ్డిని వివరణ కోరగా తాము నిందితులను అరెస్ట్‌చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ కాపీలను అటవీశాఖకు పంపుతున్నామని అయితే వారినుంచే ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఇదే విషయమై ఎఫ్ఆర్వో శివన్నను వివరణ కోరగా పరారీలో ఉన్న నిందితులకు కూడా ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు ఇవ్వాలంటే కుదరదు కాబట్టే తాము ఆలస్యం చేయాల్సి వస్తోందన్నారు. పీటీ (ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్) వారెంట్లలోనూ తమకు ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిందేనన్నారు. -
కర్నాటకలో ‘ఆపరేషన్రెడ్’..!
ఎర్రచందనం నిల్వలపై ముప్పేట దాడి చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు కర్నాటకలోని ఎర్ర చందనం నిల్వలపై దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో కటిగనహళ్లికు చెందిన ఇర్ఫాన్‌ఖాన్ (22), సయ్యద్ ముబారక్ (22) అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఆరు టన్నుల ఎర్రచందనం దుంగలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి పోలీసులు కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బెంగళూరు సమీపంలోని గిడ్డప్పన్హళ్లిలోని ఫాసీ అనే వ్యక్తికి చెందిన గోదాములో 6 టన్నుల దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ప్రధాన స్మగర్లకు సహాయకులుగా ఉన్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
అంతా బెయిల్ రాజాలే..!
‘ఎర్ర’ స్మగ్లర్లకు టీటీడీ ఉద్యోగుల జామీను ! కాసులు కురిపిస్తున్న బెయిళ్లు యాదమరి, గుడిపాల, ఐరాల, తవణంపల్లె, జీడీ.నెల్లూరు వారే పావులు చిత్తూరులో నకిలీ శాలరీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న వైనం జామీను తీగ లాగితే కదులుతున్న బెయిళ్ల డొంక జిల్లాలో ఎర్రచందనం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా సరసన ఇప్పుడు బెయిల్ మాఫియా కూడా చేరింది. వివిధ కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలిన, తేలుతున్న వాస్తవాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో న్యాయస్థానాల కళ్లకే గంతలు కడుతూ బురిడీ కొట్టిస్తున్న వైనం చివరకు పోలీసుల శ్రమకు ఫలితం దక్కకుండా పోతోంది. చిత్తూరు (అర్బన్): బెయిల్స్కాం ఉదంతం జిల్లాలో పోలీసు, న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టించింది. పలమనేరు పోలీసులు ఓ జామీను తీగ లాగితే బెయిళ్ల డొంక కదిలింది. జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్‌పై తప్పించుకున్న వాళ్లు, వారికి సహకారం అందించిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఎర్రచందనం స్మగ్లర్లు, హత్య కేసుల్లో నిందితులుగా ఉంటూ బెయిల్‌పై వచ్చిన వారి వివరాల గుట్టును రట్టుచేసే పనిలో ఉన్న పోలీసులకు దర్యాప్తులో సరికొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుకుబడ్డ నిందితులకు శాలరీ సర్టిఫికెట్ ఇచ్చి జామీనుపై విడిపించినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే, జామీనుదారులను విచారణ చేస్తే అసలు తాము వారు శాలరీ సర్టిఫికెట్లే ఇవ్వలేదని తేలింది. ఆ ఐదు మండలాల్లోనే ఎక్కువ బెయిల్ స్కాంలో నిందితులైన చిత్తూరుకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి రూ.500 ఇచ్చి జామీను ఇచ్చేందుకు పావులుగా వాడుకుంటున్నట్టు తేలింది. వారి నుంచి పొలం పాసు పుస్తకాలు, ఇంటి ధరావత్తు (వాల్యుయేషన్ సర్టిఫికెట్) ధ్రువీకరణ పత్రాలను తీసుకుని జామీనులు ఇప్పిస్తున్నారు. వివిధ కేసుల్లో నిందితులు తమకేమాత్రం తెలియకున్నాజిల్లాలోని యాదమరి, గుడిపాల, ఐరాల, తవణంపల్లె, జీడీ.నెల్లూరు మండలాల్లో కొందరు జామీన్లు ఇస్తున్నట్టు గుర్తించారు. చివరకు దీనిని వారు జీవనోపాధిగా మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కొందరు న్యాయవాదులే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇవిగో సాక్ష్యాలు 2014లో ఐరాల పోలీసులు 23 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.. వీళ్లకు యాదమరి మండలంలోని పీసీ.కండ్రిగ హరిజనవాడకు చెందిన ఆరుగురు బెయిల్ కోసం జామీను ఇచ్చారు. ఒక్కో నిందితుడికి రూ.40 వేల విలువ చేసే ఇంటిని ధరావత్తు పత్రాన్ని న్యాయస్థానానికి అందచేశారు. ప్రస్తుతం నిందితులు న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో జామీను వేసిన వాళ్లు రూ.4.6 లక్షలు కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఇంటిని జప్తు చేసే అవకాశం లేకపోలేదు. గత ఏడాది తవణంపల్లె పోలీసులు తమిళనాడులోని తిరువణ్నామలైకు చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీళ్లకు టీడీడీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు తమ శాలరీ సర్టిఫికెట్లు ఇచ్చి జామీను ఇచ్చినట్లు పత్రాలు ఉండటంపై పోలీసులు అనుమానించారు. ధార్మిక సంస్థలో పనిచేసే వారికి స్మగ్లర్లతో ఉన్న లింకులేమిటని లోతుగా దర్యాప్తు చేస్తే ఆ జామీను వారివ్వలేదని, వారి పేరిట ఆ పత్రాలు సృష్టించి బెయిల్ పొందేలా చేశారని గుర్తించారు. చిత్తూరుకు చెందిన ఓ మధ్యవర్తి ఈ వ్యవహారంలో రాటు తేలాడని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ఓ హత్య కేసుకు సంబంధించి గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు చెందిన ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు చెందిన నిందితుడికి జామీను ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ లేకపోవడంతో జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు పొలాలను కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. 2005లో యాదమరిలో జరిగిన యూనియన్ బ్యాంకు దోపిడీలో 25 కిలోల బంగారం దోచుకున్న నిందితులకు గుడిపాలకు చెందిన వ్యక్తులు జామీను ఇవ్వడంతో అదే నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారు. అంతేకాకుండా కేరళలోని ఓ బ్యాంకును కొల్లగొట్టి 18 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. బెయిల్ మాఫియాకు చెక్ పెట్టాలంటే..? ఎర్రచందనం స్మగ్లింగ్, మరికొన్ని కేసుల్లో జామీనుదారులను న్యాయమూర్తులు నిశితంగా ప్రశ్నిస్తే చాలావరకు బెయిళ్లు పొందకుండా చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా బెయిళ్ల కోసం న్యాయస్థానాలను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో గంతలు కడుతున్న వారి భరతం కూడా పట్టవచ్చని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు గురువారం ఉదయం ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గాదెల అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు టీ జంక్షన్ ప్రాంతంలో సుమో ఒకటి అనుమానాస్పదంగా కనిపించింది. అందులో తనిఖీ చేయగా రూ.2 లక్షల విలువైన 8 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహనాన్ని, దుంగలను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
శ్రీకాళహస్తి రూరల్/చంద్రగిరి : శ్రీకాళహస్తి, చంద్రగిరి మండలాల్లో సోమవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శ్రీకాళహస్తి వుండలంలోని గొల్లపల్లి సమీపంలో 2014 లో అక్రవుంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తుం డగా దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ సుదర్శన్‌ప్రసాద్ తెలిపారు. ఆ సమయం లో స్మగ్లర్ బాబ్జి(24) తప్పించుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తిరుపతి సమీపంలోని అటోనగర్‌లో ఉండగా సోమవారం అరెస్ట్ చేశామని వివరించారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జడ్జి అతనికి రివూండ్ విధించారని చెప్పారు. అదేవిధంగా ముందుగా అందిన సమాచారం మేరకు మండలంలోని శ్రీనివాసం మంగాపురం సమీపంలోని నరశింగాపురం రైల్వేగేటు వద్ద కూంబింగ్ చేపట్టామని ఆర్ఎస్ వాసు తెలిపారు. ఈ క్రమంలో 15 మంది ఎర్రకూలీలు దుంగలను మోసుకొస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించామన్నారు. కూలీలు దుంగలను పడేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపారు. వారిలో తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వెల్లయన్ను అదుపులోకి తీసుకుని, 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అనంతపురం జిల్లా కదిరి శివారులో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఐదు ఎర్రచందనం దుంగలను, మూడు మోటార్‌సైకిళ్లు, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నారాయణ, అమరేందర్‌రెడ్డి, చిన్నయ్య, శంకరప్ప, వెంకటరమణ, కార్తీక్‌లను అరెస్ట్ చేసి అర్బన్ స్టేషన్‌కు తరలించారు. -
రూ.60 లక్షల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ అధికరులు జరుపుతున్న కూంబింగ్‌లో ఇప్పటివరకు రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రిగిరి మండలంలోని నాగయ్యగారి పల్లెలో మంగళవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా ఎర్ర చందనం తరలించడానికి ప్రయత్నిస్తున్న 11 మంది ‘ఎర్ర’ కూలీలను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు 2టాటా సుమోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. -
ఎర్ర కూలీలను అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా శేషా చలం అడవుల్లో పోలీసులు నిర్వహించిన కూబింగ్ లో ఎర్ర చందనం కూలీలు పట్టుబడ్డారు. పాల పల్లి వద్ద అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్ర చందనం కూలీలు ఎదురు పడ్డారు. పోలీసులను చూసి వీరు పారిపోగా.. నలుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన కూలీల వద్ద ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో విద్యార్థులు.. తమిళ హోంగార్డు
ఎర్రచందనం అక్రమ రవాణాలో పెలైట్లుగా వ్యవహరిస్తున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతుండగా, మరొకరు బీకాం విద్యార్థి. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ఓ హోంగార్డు కూడా అరెస్టయ్యాడు. అతను పోలీస్ దుస్తులు ధరించి ఎర్రచందనం తరలించే వాహనంలో ముందు కూర్చునే వాడు. అదేవిధంగా చిత్తూరు పోలీసులు గుడిపాల-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు చేస్తుండగా పోలీసు దుస్తులు ధరించి స్మగ్లింగ్‌లో పాల్గొనే ఇంకో వ్యక్తి కూడా దొరికాడు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా, చిత్తూరు లో సుమారు రూ.49 లక్షల విలువైన 76 ఎర్రచందనం దుంగలు, బొలేరో, లారీ, హుండయ్ కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే 19 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. తిరుపతి సిటీ: తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల రూ.34 లక్షల విలువైన 63 ఎర్రచందనం దుంగలు, హుండయ్ కారు, లారీని స్వాధీనం చేసుకుని, 19 మందిని అరెస్ట్ చేసినట్టు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి వై.యోగయ్య తెలిపారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుచానూరు చైతన్యపురం వద్ద హుండయ్ కారులో తరలిస్తున్న రూ.14 లక్షలు విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పది మంది కూలీలను అరెస్టు చేశామన్నా రు. వారిలో ముగ్గురు విద్యార్థులు, ఒక హోంగార్డు ఉన్నారని తెలిపారు. అలాగే ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం చెరువు వద్ద రూ.10 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. తిరుమల ఆలిండియా రేడియో స్టేషన్ వద్ద రూ.10 లక్షల విలువ చేసే 10 దుంగలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది కూలీలను అరెస్ట్ చేశామని చెప్పారు. రేణిగుంట వద్ద అదేవిధంగా రేణిగుంట సమీపంలోని ముళ్లపొదల్లో తనిఖీలు చేయగా లారీలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిం చామని పేర్కొన్నారు. దుండగులు పారిపోయారని, వాహనంతో పాటు 470 కేజీలున్న 20 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాహనం, ఎర్రచందనం దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో వేలూరు జిల్లాకు చెందిన సతీష్, కర్ణాటక కటికనహళ్లికి చెందిన తాజుద్దీన్ ప్రధాన స్మగ్లర్లుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని వివరించారు. నింది తుల్లో ఉన్న ముగ్గురు విద్యార్థులు పెలైట్లుగా వ్యవహరించారని తెలిపారు. తమిళనాడు వేలూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో హోంగార్డు రమేష్ పోలీసు డ్రస్‌లో టోల్గేట్ల వద్ద వాహనాలను పంపుతుండేవాడని పేర్కొన్నారు. అతని నుంచి ఐడీ కార్డుతో పాటు యూనిఫాం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూతలపట్టు మండలంలో.. చిత్తూరు(గిరింపేట): పూతలపట్టు మండలం బండపల్లి రైల్వే గేటు వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేంద్ర బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు పశ్చిమ శాఖ అటవీ రేంజ్ అధికారి నారాయణస్వామి తెలిపారు. దండగులు పారిపోయారని పేర్కొన్నారు. వాహనాన్ని, 433 కేజీలు గల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని చిత్తూరు పశ్చిమ రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ తనిఖీల్లో సుభాష్, రమేష్, హరికుమార్, హరిబాబు, సతీష్ పాల్గొన్నారు. -
5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లిలో బుధవారం ఉదయం అటవీ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. వాగేటికోన నుంచి వస్తున్న కంటైనర్‌ను గుర్తించారు. వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా.. అందులో ఉన్న డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కంటైనర్ తెరిచి చూసిన అధికారులకు భారీ ఎర్రచందనం దుంగలు దర్శనమిచ్చాయి. 6 టన్నుల బరువున్న 200 దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
రూ. 30 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధనీం చేసుకున్నారు. దుంగలతో పాటు వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీనివాస మాగాపురం వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన తనిఖీల్లో 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు లారీలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా లారీలో తీసుకొస్తున్న 26 దుంగలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు దుంగలను తరలిస్తున్న తమిళ కూలీతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. కోటి(లారీతో సహా) వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఆరుగురు ‘ఎర్ర’దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 42 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో బుధవారం చోటుచేసుకుంది. అటవీ ప్రాంత నుంచి ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గుర్తించిన పోలీసులు ఆటోను అడ్డుకొని ఆటోలో ఉన్న ముగ్గురినితో పాటు ఆటోకు ఎస్కార్ట్‌గా వచ్చిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడికి రిమాండ్
శ్రీకాళహస్తి : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడికి రిమాండ్ విధించారు. శ్రీకాళహస్తి అటవీ రేంజర్ అధికారి(ఎఫ్ఆర్వో) వెంకటసుబ్బయ్యు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరదయ్యుపాళెం వుండలానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సరస్వతవ్ము కువూరుడు కరుణాకర్నాయుుడు 2011 డిసెంబరులో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా బుచ్చినాయుడుకండ్రిగ పోలీసులు అరెస్టుచేసి కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిలు మంజూరు చేసి అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత ఆ కేసును అటవీశాఖ ఉన్నతాధికారులు అటవీ రేంజర్ అధికారి వెంకటసుబ్బయ్యుకు అప్పగించారు. కేసును విచారించి కరుణాకర నాయుడును సోమవారం అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి చైతన్య 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అతని నెల్లూరు జైలుకు తరలించారు. -
తెలుగు తమ్ముళ్ల ‘ఎర్ర’దందా
తిరుపతి : జిల్లాలో ఎర్ర స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చంద్రగిరి, కుప్పం, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలను కేంద్రాలుగా చేసుకుని స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం వందల టన్నుల ఎర్రబంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తూ జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులే కీలకం ఎర్రచందనం స్మగ్లింగ్‌లో టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రి ఇలాకాల్లోని ఆ పార్టీనేతలు కొందరు కూలీలను సమకూర్చుకుని ఎర్రబంగారాన్ని తరలించేపనిలో నిమగ్నమైనట్టు స్పష్టమవుతోంది. టాస్క్‌ఫార్స్ ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. మొదట్లో ఈ బృందం హడావిడి చేసినా ఆపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. లారీ దుంగలు పట్టుబడితే ఆ దుంగలనే రోజూ ఏదో ఒకచోట పట్టుబడినట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఎర్రస్మగ్లింగ్లో కీలకపాత్ర పోషిస్తున్న వారిని వదిలి వేరే రా ష్ట్రాలకెళ్లి కొంత మందిని తీసుకొచ్చి బడా స్మగ్లర్లంటూ ప్రచారం చేసుకోవడం రివాజుగా మారుతోంది. రూటు మార్చిన ఎర్ర దొంగలు. ప్రధాన స్మగర్లపైనే పోలీసులు దృష్టి సారించడంతో వారి కదలికలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. వారి స్థానంలో ఇంతకు మునుపు గ్రామాల్లో ఎర్రస్మగ్లర్లకు ఇన్ఫార్మర్లుగా, డ్రైవర్లుగా, కీలకపాత్ర పోషించిన యువకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఓ ప్రధాన స్మగ్లర్ స్థానంలో పది మంది ద్వితీయశ్రేణి స్మగర్లు పుట్టకొచ్చినట్లు చర్చ సాగుతోంది. పెద్ద మొద్దులను చిన్నచిన్న దుంగలుగా కట్‌చేసి బ్యాగుల్లో పార్సిల్చేసి ఖరీదైన కార్లలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు నిద్దరోవడం విమర్శలకు తావిస్తోంది -
65 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
- సువూరు రూ.50 లక్షలు విలువ - ఒకకూలీ అరెస్ట్ శ్రీకాళహస్తి రూరల్(చిత్తూరు జిల్లా) శ్రీకాళహస్తి వుండలంలోని అబ్బాబట్లపల్లిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కూలీని అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు.. ముందస్తు సమాచారం తో అబ్బాబట్లపల్లి సమీపంలోని ఓడు చెరువు వద్ద తనిఖీలు నిర్వహించామని.. చెరువులో దాచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయని అన్నారు. ఈ సందర్భంగా అక్కడే పొదల చాటున దాక్కున్న బత్తెయ్య(25) అనే కూలీని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఎర్రచందనం దుంగలను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందన్నారు. కూలీని విచారిస్తున్నామని, అతను ఇచ్చే సమాచారం మేరకు ఈ దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకుంటామని తెలిపారు. -
పోలీసులకు ఫోన్ చేసి దొరికిపోయారు
ఒకరికి ఫోన్ చేయబోయి మరొకరి చేసిన ఫోన్ కాల్ తో అసలుకే ఎసరొచ్చింది. ఎర్రచందనం దుంగలను విక్రయించే యత్నంలో... స్మగ్లర్లు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు వెళ్లింది. దీంతో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహారం గ్రామంలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంచారు. ఓ ఇంట్లో దాచి ఉంచిన దుంగలను స్మగ్లర్లు విక్రయించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే కొంత మంది కొనుగోలుదార్లకు ఫోన్ చేశారు. వీటిలో ఓ ఫోన్ కాల్ పొరపాటున పోలీసు అధికారులకు వెళ్లింది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పోలీసులు.. పథకం ప్రకారం స్మగ్లర్లకు ఎలాంటి అనుమానం రాకుండా అగ్రహారంపై దాడి చేశారు. అక్రమంగా దాచిన ఒక టన్ను బరువున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. -
33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు
తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు పట్టణంలో బుధవారం వేకువజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ లారీ ఎర్రచందనాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో లారీ ఓ షాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. బరితెగించిన స్మగ్లర్లు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆర్ఎస్ఐ వాసు కి గాయాలయ్యాయి. లారీ, 33 దుంగలను స్వాధీనం చేసుకోగా, 27 మంది కూలీలు పరారయ్యారు. వారి కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ బీట్ ఫారెస్ట్‌లో ఎర్ర చందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నిస్తున్న 11 మందిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో వాహనం, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెంచలయ్య, రాజు, రాఘవేంద్ర, విజయభాస్కర్, వరప్రసాద్, నారాయణరెడ్డి, నర్సింహులు, రాజశేఖరరెడ్డి, జనార్దన్, బాబు, నర్సింహులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
స్టేషన్ వెనకే డంప్ చేశారు
తిరుపతి పట్టణం శివారు ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్ సమీపంలో 53 ఎర్రచందనం దుంగలను అటవీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఓ లారీ, ఎస్కార్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ ఇంట్లో ఉంచిన దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
సిమెంట్ తయారీ కేంద్రంలో లారీలో అక్రమంగా నిల్వ ఉంచిన 19 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు లారీ సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సిమెంట్ మిశ్రమం తయారు చేసే కేంద్రంలో ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. లారీలోని పొట్టు బస్తాల మధ్య దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలు పోలీసులు కనుగొన్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటి విలువ అంచనా వేస్తున్నారు. -
చంటిబిడ్డ తల్లి ముసుగులో ఎర్రచందనం రవాణా
ఐదుగురు దొంగల అరెస్టు 8 ఎర్రచందనం దుంగల స్వాధీనం పెనుమూరు(చిత్తూరు జిల్లా): ఎర్రచందనం స్లగ్లర్లు రూటు మార్చారు. ఫ్యామిలీ టూరు, చంటిబిడ్డ తల్లితో ప్రయాణం సాగిస్తున్నట్టు చూపుతూ ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెనుమూరులో గురువారం తెల్లవారుజామున చంటిబిడ్డ తల్లి ముసుగులో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కంబతూకి గ్రామానికి చెందిన రామస్వామి కుమారులు ఆర్.అన్నామలై(40), ఆర్.గణేష్(30), కుంభపాడికి చెందిన వి.సుబ్రమణ్యం(29), ధర్మపురి జిల్లా ముత్తువాలూరుకు చెందిన ఆర్.గోపాలస్వామి(26), అతని భార్య జి.మంగమ్మ (23), కుమార్తె సగి(2) కలిసి ఎనిమిది ఎర్రచందనం దుంగలను తీసుకుని ఇండికారులో గురువారం తెల్లవారుజామున శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు బయలు దేరారు. పెనుమూరు చెక్‌పోస్టు వద్ద ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో అతివేగంగా వస్తున్న ఇండికా కారును ఆపారు. డ్రైవర్ పక్క సీటులో చిన్నబిడ్డను పెట్టుకొని మహిళ కూర్చొని ఉండడంతో పోలీసు సిబ్బంది కారును పంపే ప్రయత్నం చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావుకు అనుమానం రావడంతో కారును ఆపి తనిఖీ చేయడంతో ఎర్రచందనం దుంగలు బయట పడ్డాయి. కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆర్.అన్నామలై, ఆర్.గణేష్, వి.సుబ్రమణ్యం,ఆర్.గోపాలస్వామి, అతని భార్య జి.మంగమ్మను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. -
భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 109 ఎర్ర చందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమరు రూ. 1.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులో గురువారం వెలుగుచూసింది. తెల్లవారుజామున ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 109 దుంగలు గుర్తించారు. పోలీసులను గుర్తించిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీలో కూంబింగ్.. 100 మంది తమళి కూలీలు ఎర్ర చందనం దుంగులను నరకడానికి అడవిలోకి వెళ్లారనే సమాచారంతో.. పోలీసులు గురువారం ఉదయం నుంచి బాల్పల్లి అటవీ ప్రాంతంలో కూంబిగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 200 మంది పోలీసుల సాయంతో తిరుపతి కొండ లు, తలకోన, బాల్పల్లి ప్రాంతాల నుంచి పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి అడవిని జల్లెడపడుతున్నాడు. -
భారీ గా ఎర్రచందనం పట్టివేత
బుధవారం అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వివరాలివీ.. తిరుపతి రూరల్ మండలం మంగళంలోని రిక్షా కాలనీ, జూపార్క్ వద్ద అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారు రాళ్లతో దాడికి దిగగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పలాయనం చిత్తగించారు. ఆ ప్రదేశంలో గాలించగా రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఒక కూలీని పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
శేషాచలంలో కాల్పులు
ఒక కూలీ అరెస్టు, ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం తిరుపతి క్రైం: శేషాచలం అడవుల్లో బుధవారం రాత్రి మళ్లీ అలజడి రేగింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మంగళం పరిధిలోని రిక్షాకాలనీ వద్ద సుమారు 40మంది ఎర్రచందనం కూలీలు ఉన్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కూలీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడిస్తుండగా ఉన్నట్టుండి పోలీసులపై దాడికి యత్నించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దుండగులు పనిముట్లు, ఎర్రచందనం దుంగలను వదిలి పారిపోయారు. వారిని వెంబడించి ఒక కూలీని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో సుమారు ఏడు దుంగలు దొరికాయి. చీకటిగా ఉన్నందున సరిగా కనిపించడంలేదని, అక్కడ మరికొన్ని దుంగలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రాత్రంతా కూంబింగ్ కొనసాగించి పరారైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
రూ.3 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం అర్థరాత్రి అటవీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక టాటా ఇండికా కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో అధికారులు కారును వెంబడించారు. అయితే, పరమేశ్వర మంగళం వద్ద కారును స్మగ్లర్లు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కారు సహా అందులోని రూ.3 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజి అధికారి రెడ్డప్ప తెలిపారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పక్కా సమాచారం తో హర్యానాకు వెళ్లిన కడప టాస్క్ ఫోర్స్ బృందం.. సోమవారం ఉదయం అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను వలేసి పట్టుకుంది. వీరి నుంచి ఒకటిన్నర టన్నుల బరువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురిలో ముగ్గురు చైనీయులు ఉన్నట్టు సమాచారం. వీరిని కడపకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
34 ఎర్ర చందనం దుంగల పట్టివేత
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం సున్నపువారిపాలెం సమీపంలో 34 ఎర్రచందనం దుంగలను శనివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీటిని ఓ చోట డంప్ చేసి తరలించడానికి సిద్ధమవుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన నలుగురు చిత్తూరు జిల్లా వాసులు. -
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో బెజ్జూరువారిపల్లె వద్ద ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున వాహన తనిఖీల సందర్భంగా ఇన్నోవా వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న విషయం బయటపడింది. ఇన్నోవా వాహనంతోపాటు అందులోని పది ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్లాల్బాషా, ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పూజిత వెల్లడించారు. -
నల్లమల చుట్టూ భారీ కందకం
విలువైన ఎర్రచందనం వృక్ష సంపద ఉన్న నల్లమల అభయారణ్యం చుట్టూ భారీ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.కె.మిశ్రా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మిశ్రా... అరుదైన ఎర్రచందనం వృక్ష సంపదనును కాపాడటంలో భాగంగా ఈ కందకం తీస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను కలుపుతూ మొత్తం 1,200 కిలో మీటర్ల పొడవున ఇది ఉంటుందన్నారు. 3 మీటర్ల లోతున, 3 మీటర్ల వెడల్పులో ఈ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల అక్రమ రవాణాను అరికట్టవచ్చని, అడవిలో నుంచి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. భూగర్భ జలాలు కూడా పెరగటానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 900 ఊట కుంటల నిర్మాణం, 250 చెక్ డ్యాంలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
ఎర్ర స్మగ్లర్లపై పీడీ యాక్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయిన నలుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు నమోదు చేసి గురువారం కడప జైలుకు తరలించినట్టు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కర్ణాటకకు చెందిన ఎన్టీ. సతీష్‌కుమార్(45), చిత్తూరుకు చెందిన పటాస్ నిస్సార్ అహ్మద్ ఖాన్ (42), తిరువణ్నామలైకు చెందిన పి. రాజేంద్రన్ (34), తిరునన్వేలికి చెందిన మురుగన్ (42)పై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి కడప జైలుకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 53 మంది ఎర్రచందనం స్మగర్లపై పీడీ యాక్టులు పెట్టామన్నారు. పీడీ యాక్టు నమోదైనవారు మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. వారిపై రౌడీషీట్లు తెరుస్తామని వివరించారు. ఇప్పటికే 18 మంది స్మగ్లర్లపై రౌడీషీట్లు పెట్టామని వివరించారు. -
20 మంది కూలీల అరెస్ట్
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో సరిహద్దు ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 19 మంది తమిళనాడు కూలీలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కూలీ వెళుతుండగా కదిరినాయుడుపల్లి బీట్ పరిధిలో ఆటో ఆగింది. ఓ కూలీ మూత్రవిసర్జన కోసం కిందకు దిగగా అటవీ అధికారులను చూసి పరుగు అందుకున్నాడు. దీంతో 20 మంది కూలీలను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గంగిరెడ్డికి ఏం జరిగినా వారిదే బాధ్యత
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని అతని భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయించి జైల్లోనే అంతం చేయ్యాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కోర్టు నిర్ధారించిందని మాళవిక ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడనటంలో నిజంలేదని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటంతో స్వదేశానికి తిరిగిరాలేదని తెలిపారు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని హైదరాబాద్ తరలిస్తున్న సమయంలో అధికారులు రివాల్వర్‌తో బెదిరించారని అన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఏపీ పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతడు.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. -
ఎర్రచందనం పేరుతో ఘరానా మోసం
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తుమ్మ దుంగలనే ఎర్ర చందనంగా చూపి విక్రయిస్తున్నఓ ముఠాను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నం ధర్మసాగరం వద్ద కొందరు ఎర్రచందనం దుంగలంటూ తుమ్మ కలపను అమ్ముతున్నారని చిత్తూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నర్సీపట్నం పోలీసులు ఓ కలప డిపోపై దాడి చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా కాగా, ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లని పోలీసులు తెలిపారు. -
రూ. కోటి విలువైన ఎర్ర దుంగలు స్వాధీనం
తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా జామి మండలం వెల్లెపాడు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 50 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. కోటి పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ దుంగలను ఎవరు తరలిస్తున్నారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. -
పోలీసులకు చిక్కిన ఎర్ర స్మగ్లర్లు
కమల్‌కిషోర్, మీర్జా, షరీఫ్, స్వామి అరెస్టు ముగ్గురిపై జిల్లాలో 75 కేసులు చిత్తూరు (అర్బన్) :చిత్తూరు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రెడ్‌లో ముగ్గురు ప్రధాన అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. జిల్లాలోని బంగారుపాళ్యం, పీలేరు, చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో ఆదివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చిత్తూరు నగరానికి చెందిన కమల్‌కిషోర్, బెంగళూరుకు చెందిన మీర్జా, సఫ్దర్ షరీఫ్, అలాగే బంగారుపాళ్యానికి చెంది న మేస్త్రీ స్వామి పట్టుబడ్డారు. ఈ ముగ్గురిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 75 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి మూడు కార్లు, 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని ఓఎస్డీ రత్న తెలిపారు. నగరంలోని పోలీసు పెరెడ్ గ్రౌండ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, దేవదాసు, సీఐలు మహేశ్వర్, నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు. ఆరుగురు ఎర్ర స్మగ్లర్లపై ‘పీడీ’ నమోదుకు ప్రతిపాదనలు ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టయిన ఆరుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు కింద కేసులు నమోదు చేయడానికి జిల్లా పోలీసు శాఖ ప్రతిపాదనలు పంపింది. సోమవారం చిత్తూరు ఓఎస్డీ రత్న దీనిపై మాట్లాడుతూ ఆరుగురు స్మగ్లర్లపై పీడీ నమోదు చేయడానికి కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. ఈనెలాఖరులోపు అనుమతి వస్తుందని, అనంతరం స్మగ్లర్లను పీడీ యాక్టు కింద కడప, రాజమండ్రి జైలుకు తరలిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో పీడీ యాక్టు కింద 44 మందిని అరెస్టు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కమల్‌కిషోర్: ఇతన్ని కమల్ (32) అని కూడా పిలుస్తుంటారు. చిత్తూరు లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి టీఏ.పద్మనాభం కుమారుడు. ఎంబీఏ వరకు చదువుకున్న ఇతను పలు సాఫ్ట్వేర్ కంపెనీ ల్లో పనిచేశాడు. 2011 నుంచి ఎర్రచందనం రవాణా చేస్తున్నాడు. చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు వసంత్‌కుమార్, తుమ్మింద పాళ్యం గౌస్‌తో సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు వంద టన్నుల వరకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు సంపాదించాడు. బెంగళూరులో ఇతను, స్మగ్లర్ మీర్జా కలిసి ఓ పబ్‌ను నడుపుతున్నారు. మీర్జా: మీర్జాబేగ్, ఖాస్ (39) అనే పేర్లతో కూడా ఇతన్ని పిలుస్తారు. ఎర్రచందనం వ్యాపారంలో మోస్ట్‌వాంటెడ్ కింగ్ పిన్ మీర్జా. మూడో తరగతి వరకు చదువుకున్న మీర్జా గతంలో ద్విచక్ర వాహనాల వ్యాపారం చేసేవాడు. 2013 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 30 కేసులు ఉన్నాయి. జిల్లా నుంచి 30 టన్నుల వరకు ఎర్రచందనం రవాణా చేసి రూ.3 కోట్ల వరకు సంపాదించాడు. స్వామి: బంగారుపాళ్యంకు చెందిన పేరు స్వామి (32) 2009 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతను మేస్త్రీగా వ్యవహరిస్తున్నా డు. కమల్‌కిషోర్, మీర్జాను పట్టుకోవడానికి ఆపరేషన్ రెడ్‌లో ఉన్న సీఐలు బెంగళూరులోని ఓ ప్రాంతంలో భిక్షగాళ్లుగా గెటెప్ వేసుకున్నారు. మరో అధికారి పబ్‌లో సరదాగా అమ్మాయిలతో గడపడానికన్నట్లు పిల్ల జమిందార్ వేషం కట్టారు. ఇంకొకరు క్యాబ్ డ్రైవర్‌గా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి ఈ ముగ్గు రు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరికి త్వరలోనే ఎస్పీ చేతు లు మీదుగా రివార్డులు అందజేయనున్నట్టు ఓఎస్డీ రత్న తెలిపారు. షరీఫ్: బెంగళూరులోని భనశంకరి ప్రాంతానికి చెందిన సఫ్దర్ షరీఫ్ (29) రెండో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో స్పిరిట్ వ్యాపారం చేసేవాడు. 2013 నుంచి ఎర్రచంద నం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతనికి ఆంధ్రాతో పాటు కర్ణాటక, ముం బయి, ఢిల్లీకి చెందిన స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. ఇతను ఇప్పటి వరకు వంద టన్నుల ఎర్రచందనం దుంగలను మన జిల్లా నుంచి తెప్పిం చుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాడు. ఇతనిపై జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో 15 కేసులు న్నాయి. ఈ రెండేళ్ల కాలంలో స్మగ్లింగ్ ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడు. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎర్రచందనం దుంగల డంప్‌ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాలుపల్లి రేంజ్ అధికారులు నాదవరం - ఉప్పలపల్లి గ్రామ శివార్లలో ఉన్న డంప్‌ను శనివారం తెల్లవారుజామున గుర్తించారు. అక్కడ దాచి ఉంచిన 85 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్ర చందనం స్వాధీనం
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సోమవారం తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేసున్న పోలీసులకు ఓ వ్యాన్ లో రూ.2 కోట్ల విలువైన 110 ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులను చూసిన వ్యాన్ డ్రైవర్, కూలీలు పరారయ్యారు. పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. -
మృతదేహంతో నడిరోడ్డుపై ధర్నా
పోలీసుల చిత్ర హింసల వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ నెల్లూరు జిల్లా డక్కిలిలో ప్రధాన రహదారిపై మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఎర్రచందనం స్మగ్లర్ అయిన గానుగ శీనయ్య (40)ను పోలీసులు వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకోగా, నెల్లూరు సబ్ జైలులో శనివారం మృతి చెందాడు. అయితే, వారం రోజులుగా పోలీసులు చిత్ర హింసలు పెట్టడంతో శీనయ్య మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రజా సంఘాలతో కలసి తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు శీనయ్య మృతదేహంతో వెంకటగిరి-రాపూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా సమాచారంతో మర్రిపాడు ఎస్సై సోమయ్య ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని కుంటనెల్లపాడు సమీపంలో రోడ్డు పక్కన తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 30 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వాటికి సంబంధించి అక్కడే మాటువేసి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని, రెండు పల్సర్ బైక్‌లను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపారు. -
ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు
నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు వారిచ్చిన సమాచారంతో కర్ణాటకలో దాడులు రూ.కోటి విలువైన ఎర్ర దుంగల స్వాధీనం చిత్తూరు (అర్బన్) : జిల్లాలోని బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలోని ఆదివారం పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లరు పట్టుబడ్డా రు. వారిలో మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్(36), అన్నదమ్ములు ఎస్.అరుల్(25), ఎస్.శరవణ(22) ఉన్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిచ్చినసమాచారంతో చిత్తూరు పోలీ సులు కర్ణాటక రాష్ట్రంలో భారీగా ఎర్ర డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న ఈ మేరకు వివరాలు వెల్లడిం చారు. కర్ణాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ అలియాస్ మున్నాకు చెందిన మామిడి తోటలో సోదాలు నిర్వహించిన పోలీసులు 3 టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. అంజాద్ పారిపోయాడని, దుంగల విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు. నిందితుల వివరాలిలా.. మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు చేసిన పోలీసులు చిత్తూరు నగరంలోని జాన్స్ గార్డెన్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్‌ను అరెస్టు చేశారని ఓఎస్డీ తెలిపారు. డిగ్రీ వరకు చదువుకున్న ఇతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడన్నారు. పేరు మోసిన స్మగ్లర్ షరీఫ్‌కు ముఖ్య అనుచరుడని, ఆంధ్ర రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలువురు స్మగ్లర్లతో ఇతనికి పరిచయాలు ఉన్నాయని వెల్లడించారు. అల్తాఫ్‌పై ఇప్పటి వరకు జిల్లాలో ఆరు కేసులున్నాయి. ఇక బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉత్తస్‌గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన అన్నదమ్ములు ఎస్.అరుల్, ఎస్.శరవణలను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరూ జేసీబీ డ్రైవర్లుగా పని చేసేవారని, గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పెలైట్‌గా వ్యవహరిస్తున్నారని ఓఎస్డీ వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బంగారుపాళ్యం, మదనపల్లె పోలీసుల్ని ఓఎస్డీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
కర్నాటక రాష్ట్రంలో అక్రమంగా నిల్వ చేసిన రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో పాటు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆదివారం బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో కర్నాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ కు చెందిన మామిడి తోటలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల జాడ పసిగట్టిన అంజాద్ పారిపోయినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో చిత్తూరు నగరంలోని జాన్స్‌గార్డెన్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ (36), తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా ఉత్తస్‌గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన ఎస్.అరుల్ (25), ఎస్.శరవన (22)లు ఉన్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. మండల పరిధిలోని కళ్యాణి డ్యాం సమీపంలోని పెద్దగుండు వద్ద రెండున్నర టన్నుల ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు స్కార్పియో, స్విఫ్ట్, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 90 దుంగల విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనావేశారు. -
ఎర్రచందనం దొంగలు అరెస్ట్
మైదుకూరు మండలం నల్లమల ఫారెస్ట్‌లోని మద్దడుగుకనం వద్ద బుధవారం 12 మంది ఎర్రచందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.50 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా తమిళనాడుకు చెందినవారేనని అధికారులు తెలిపారు. -
18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం భానుపల్లి చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి అటవీ అధికారులు 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టాటా ఏస్ వాహనంలో 303 కిలోల బరువైన 18 దుంగలను తరలిస్తుండగా వెలుగు చూశాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీ రేంజ్ అధికారి పిచ్చయ్య శనివారం మీడియాకు తెలిపారు. -
రెండు కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
ఇద్దరి అరెస్ట్ పరారైన మరికొందరు కూలీలు చంద్రగిరి: శేషాచలం అటవీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం రెండు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్రాలబావి వద్ద సుమారు 80 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తూ అధికారులకు తారసపడ్డారు. కూలీలను నిలువరించేందుకు అధికారులు ప్రయత్నించారు. అధికారుల రాకను పసిగట్టిన కూలీలు దుంగలను అక్కడే పడేసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. వారిని వెంబడించి త మిళనాడు క్రిష్ణగిరి జిల్లా సెన్నూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్, భూపాలన్ అనే కూలీలను అదుపులోకి తీసుకున్నారు. కూలీలు పడేసి వెళ్లిన 64 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. సమాచారం అందుకున్న రాయలసీమ రేంజ్ ఐజీ వేణుగోపాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రచందనం దుంగలను ఎలా తరలించారన్న సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ భాస్కర్ నుంచి తెలుసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ ఎస్ఐలు భాస్కర్, వాసులను అభినందించారు. శేషాచలం అంతా నిఘా శేషాచలం అంతా నిఘా పెట్టామని రాయలసీమ రేంజ్ ఐజీ గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. నాలుగు నెలలు గా శేషాచలం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కాకుం డా ఎక్కడిక్కడ దుంగలను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. గత నాలుగు రోజులుగా కూంబింగ్‌ను ముమ్మరం చేసామని తెలిపారు. శేషాచలం చట్టూ మూడు మీటర్ల వెడల్పుతో కందకాలను త వ్వినా కూడా స్మగ్లర్లు వాటిని చా లా సులభంగా అధిగమించి ఎర్రచందనాన్ని తరలించేం దుకు సాహసిస్తున్నారని తెలిపారు. ఎర్రచందనాన్ని పరిరక్షించడానికి మరో 50 మందిని అదనంగా శేషాచలం అట వీ ప్రాంతంలోకి విధులు నిర్వహించడానికి నియమిస్తామ ని చెప్పారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ప్రస్తుతమున్న యస్‌యల్‌ఆర్ ఆయుధాలే కాకుండా పంప్ యాక్షన్ ఆయుధాలను ఇస్తామని ప్రకటించారు. కూంబిగ్ నేపధ్యంలో స్మగ్లర్లు అధికారులపై ప్రతిఘటిస్తే వారిపై తీసుకొనే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. కూలీలు ప్రవేశించే మార్గాల్లో గట్టి భద్రతను, సీసీ కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకముందు డెప్యూటీ కన్వజరేటర్ ఆఫ్ పారెస్ట్(డీసీఎఫ్) బియన్యన్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. తిరుపతి వెస్ట్ డిఎస్పీ శ్రీనివాసులు, చంద్రగిరి సీఐ శివప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐలు భాస్కర్, వాసు, డీఆర్వో నరశింహరావు, ఎఫ్‌బీవో కోదండం పాల్గొన్నారు. -
ఇద్దరు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
బంగారుపాళెం : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శంకర్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారుపాళెం మండలం మాధవనగర్ వద్ద ఆపకుండా వెళుతున్న టాటా ఎక్స్‌ఆన్ వాహనాన్ని ఎస్ఐలు ఉమామహేశ్వర్రావు, దిలీప్‌కుమార్, సిబ్బంది పట్టుకున్నారన్నారు. ఇద్దరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాహనంలో మూడు ఎర్రచందనం దుంగలు, రెండు ఇనుపరాడ్లు, రెండు కత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల్లో కృష్ణగిరికి చెందిన షణ్ముగం, గోవిందరాజులు ఉన్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్ శక్తివేల్, ప్రధాన స్మగ్లర్ మున్నాబాయ్ పరారైనట్లు చెప్పారు. నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు. -
వాటర్ ట్యాంకర్లో ఎర్రచందనం
తరలింపులో ‘ఎర్ర’ దొంగల కొత్త పంథా.. దాడిచేసి పట్టుకున్న పలమనేరు పోలీసులు రూ. 10 లక్షల విలుజేసే 12 దుంగలు, ట్రాక్టర్ సీజ్ ఒకరి అరెస్టు, మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు పలమనేరు: అక్రమార్జనకు అలవాటు పడిన ఎర్ర దొంగలు కొత్తకొత్త పంథాలు అనుసరిస్తున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓవైపు పోలీసులు పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ అక్రమార్కులు పోలీసు కళ్లు గప్పి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టురట్టు కాకుండా దుంగల్ని జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. తాజాగా ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్లో ఎర్ర చందనం దుంగలను అక్రమార్కులు బెంగళూరువైపునకు తరలిస్తూ పట్టుబడ్డమే నిదర్శనం. పలమనేరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ శంకర్ విలేకరులకు వెల్లడించిన మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు వైపునుంచి పలమనేరు మీదుగా ఓ నీటి టాక్టర్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్థానిక సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐలు చిన్నరెడ్డెప్ప, లోకేష్ ఐడీ పార్టీతో కలసి స్థానిక సిల్క్‌ఫామ్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కాపు కాశారు. ఏపీ 04 టీ 0420 నంబరున్న ట్రాక్టర్ వాటర్ ట్యాకర్‌ను పోలీసులను చూడగానే మరింత వేగంగా పోనిచ్చారు. దీంతో పోలీసులు వెంంబడించి పట్టుకున్నారు. బంగారుపాళ్యం మండలం గోవర్ధనగిరికి చెందిన శేఖర్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు పరారయ్యారు. వారు ఉదయ్‌కుమార్, త్యాగరాజులునాయుడుగా పోలీసుల విచారణలో తేలింది. ట్రాక్టర్‌తో పాటు ట్యాంకర్‌లోని 12 దుంగలను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితున్ని కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఐడీ పార్టీ సిబ్బంది దేవ, ఎల్లప్ప, జయకృష్ణ, పయని, ప్రకాష్‌ను ఆయన అభినందించారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. -
ఎర్రచందనం గోవిందా
శేషాచలం.. ఎర్ర దొంగలకు స్వర్గధామం భక్తుల ముసుగులో చొరబాటు ఫారెస్ట్ అధికారుల దృష్టి మళ్లించేందుకు అడవికి నిప్పు ఆగంతకుల చేష్టలకు గౌతమి వనం బుగ్గి తిరుమల : తిరుమల శేషాచల అడవి ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలకు స్వర్గధామంగా మారింది. భక్తుల ముసుగులో వస్తూ అడవిలోకి చొరబడుతున్నారు. ఫారెస్ట్ అధికారుల దృష్టి మళ్లించేందు కు అడవికి నిప్పుపెడుతూ దుండగులు తమ లక్ష్యాన్ని సాధించుకుంటున్నారు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వెళ్లే మార్గాలపై అటవీశాఖాధికారులతోపాటు టాస్క్ఫోర్సు సిబ్బంది ఎక్కువ నిఘా పెట్టారు. దీంతో స్మగ్లరు, కూలీలు తిరుమలను కేంద్రంగా ఎంచుకున్నారు. తమిళనాడులోని తిరుమన్నామలై, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి స్మగ్లర్లు, కూలీలుగా వచ్చే వారే ఎక్కువ గా ఉన్నారు. ఎవరికి అనుమానం రా కుండా భక్తుల అవతారం ఎత్తుతారు. పెరిగిన జుట్టు, మాసిన గడ్డం, లగేజీలతో భక్తుల రూపంలో తిరుమలకు చేరుతున్నారు. ఇక్కడ ఉచిత వసతి సముదాయాల్లో తలదాచుకుంటారు. ఉచిత నిత్యాన్న భోజన సముదాయంలో ఆకలి తీర్చుకుంటారు. రోజుల తరబడి తిష్టవేస్తారు. అదను చూసి అడవిలోకి చొరబాటు తిరుమలకు చేరుకున్న తర్వాత అడవిలోకి మకాం మారుస్తారు. ఆలయానికి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం మీదుగా కాకులకొండ, పారువేట మం డపం, పాపవినాశనం మార్గాల నుంచి మామండూరు వరకు ప్రయాణం సాగిస్తారు. మరికొందరు శిలాతోరణం, ధర్మగిరి వేద పాఠశాల, శ్రీవారి పాదాల మీదుగా రంగంపేట, భాకరాపేట, ఎర్రవారిపాళెం, తలకోన వరకు అడవి సందపను తలించేందుకు వెళతారు. మరికొందరు అలిపిరి మార్గం నుంచి గాలిగోపురం మీదుగా నడచి వస్తూ మార్గ మధ్యలో అవ్వాచ్చారి కోన లోయ నుంచి శేషతీర్థం, సీతమ్మతీర్థం మార్గాల్లోని ఎర్రచందనం కలపను సేకరిస్తారు. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లి నుంచి కలపను తరలిస్తారు. శ్రీవారి మెట్టు నడకదారి నుంచి అడవిలోకి వచ్చి ఛామాలారేంజ్లోని కలప నరికి తరలిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల దృష్టి మళ్లించేందుకు అడవికి నిప్పు చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలో సుమారు 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీవేంకటేశ్వర అభయారణ్యం ఉంది. ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచంద నం, శ్రీగంధం వృక్ష సంపద ఎక్కువగా ఉంది. ఈ సంపదను కొల్లగొట్టేందుకు దుండగులు బృందాలుగా ఏర్పడి అడవులను విభజించుకుంటారు. ప్రాంతా ల వారీగా ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం స్మగ్లర్లు, కూలీలు అడవికి నిప్పు పెడుతుంటారు. ఒక చోట భారీ స్థాయి లో నిప్పు పెట్టి అటవీశాఖాధికారులు, సిబ్బందిని దృష్టి మళ్లిస్తారు. మరో మార్గంలో ముందుగానే సిద్ధం చేసుకుని దాచిపెట్టిన కలపను ఎల్లలు దాటి స్తూ సొమ్ము చేసుకుంటారు. సోమవారం పాప వినాశనం మార్గంలోని గౌతమి వనంలో జరిగిన అగ్ని ప్రమా దం ఇలాంటిదేనని అటవీశాఖాధికారులు స్పష్టం చేశారు. -
అర్ధంతరంగా ముగిసిన ‘సిట్’ విచారణ
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై {పత్యేక బృందం దర్యాప్తు తమిళనాడులోనే సాక్షుల నుంచి వాంగ్మూలాల నమోదు యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)/పుత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సాక్షుల విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అర్ధంతరంగా ముగించింది. ఏప్రిల్ 7న శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్లో చనిపోయిన కేసు విచారణకు హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ‘సిట్’ 20 రోజులుగా సాక్షుల విచారణకు శ్రీకారం చుట్టింది. ఎన్కౌంటర్ బూటకమని సాక్షులుగా ఉంటున్న తమిళనాడుకు చెందిన కూలీలు బాలచందర్, శేఖర్, ఇలన్‌గోవన్ ఇప్పటికే హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వారిని వారి ప్రాంతాల్లోనే విచారించాలని జూన్ 29న సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఈనెల 15న సిట్ బృందం తమిళనాడులోని మధురై వెళ్లింది. అక్కడ పీపుల్స్ వాచ్ సంస్థ అధీనంలో ఉన్న సాక్షులకు నోటీసులు ఇచ్చి 20వ తేదీన తమిళనాడు, ఏపీ పోలీసుల పటిష్ట భద్రత మధ్య తిరుణ్ణామలైకి సాక్షులను పిలిపించి విచారించారు. మంగళవారం తెల్లవారుజామున వారిని తిరుపతికి తీసుకు రావడానికి ప్రయత్నించారు. పుత్తూరు పట్టణానికి వచ్చిన తరువాత సాక్షుల్లో ఒకరైన బాలచందర్ తాను తిరుపతికి రానని స్పష్టంచేశారు. ఏపీ పోలీసులంటే తనకు భయమనీ, తన కుటుంబ సభ్యులను అంతం చేసిన విధంగానే తనను ఏమైనా చేస్తారనే అనుమానం ఉందన్నారు. దీంతో అధికారులు పుత్తూరు బస్టాండులో ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈనెల 27న విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి బందోబస్తు మధ్య తమిళనాడు పంపారు. అనంతరం మిగిలిన ఇద్దరు సాక్షులను తిరుపతికి తీసుకొచ్చి మహిళా వర్సీటీలోని అతిథిగృహంలో విచారించారు. అనంతరం సిట్ అధికారి రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ సాక్షులు సహకరించనందున విచారణ అర్ధాంతరంగా ముగిసిందని తెలిపారు. వచ్చే నెల మూడో తేదీన హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు అందజేస్తామని చెప్పారు. -
ఇద్దరు ఎర్రదొంగలు కడప జైలుకు తరలింపు
చిత్తూరు (అర్బన్) : ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను ఆదివారం రాత్రి వైఎస్సార్ కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు రాజేంద్రన్ సెల్వరాజ్, కే.మణి పై ప్రివెంటివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదివా రం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వీరిని కలెక్టర్ ఆదేశాల మేరకు జైలుకు పంపారు. సెల్వరాజ్ : చెన్నైలోని ఆళ్వార్పెట్కు చెందిన సదాశివం రాజేంద్రన్ కుమారుడు సెల్వరాజ్ (52) అనే చెల్లా పదోతరగతి వరకు చదువుకున్నాడు. 1993 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో ఉన్నాడు. ఇతనికి చెన్నై లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ గోడౌన్‌ను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించేవాడు. ఇతనికి సౌదీఅరేబియా, బర్మా దేశాల్లోని అంతర్జాతీయ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. సెల్వరాజ్‌పై గతేడాది కూడా పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇతడు సుమారు 600 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేశాడు. ఇతనిపై జిల్లాలో 13 కేసులున్నాయి. ఇతని వార్షిక ఆదా యం దాదాపు రూ.50 కోట్లని అంచనా. మణి : తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా వెల్లూరుకు చెందిన కర్పన్న గౌండర్ కుమారుడు కే.మణి (50) ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. 2006 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమరవాణాలో పైలటింగ్ చేస్తూ స్మగ్లర్‌గా ఎదిగాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లోని స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నాయి. ఇప్పటివరకు 100 టన్నులు ఎర్రచందాన్ని అక్రమ రవాణా చేశాడు. జిల్లాలో ఇప్పటివరకు ఇతనపై ఎనిమిది కేసులున్నాయి. ఇతని నెల సరి ఆదాయం *20 లక్షలు. -
ఆపరేషన్ రెడ్‌లో మరిన్ని గ్యాంగ్‌లు
పాండిచ్చేరి శేఖర్ అరెస్ట్ పోలీసుల అదుపులో 8 మంది స్మగ్లర్లు? 50 మంది సహాయకుల కోసం వేట ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదుకు సిఫారసు చిత్తూరు(అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే రెండు గ్యాంగ్‌లను చిత్తూ రు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ రెడ్‌లో భాగంగా ఓఎస్డీ రత్న ఆధ్వర్యంలో పనిచేస్తున్న బృందం పలువురు స్మగ్లర్లను, వారికి సహాయకులుగా పనిచేసే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు మీదుగా పాండిచ్చేరికి అటు నుంచి సముద్రమార్గం ద్వారా బర్మాకు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే బడా స్మగ్లర్ శేఖర్‌ను గురువారం పూతలపట్టు పోలీసు స్టేషన్లో అరెస్టు చూపించారు. ఇతను ఇచ్చిన సమాచారంతో బెంగళూరు, చెన్నైకు చెందిన రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. వీరి నుంచి పలు వాహనాలతో పాటు రూ.20 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను మరో రెండు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై వేట సాగిస్తున్న పోలీసు యంత్రాంగం, ప్రస్తుతం సక్రమ రవాణాపై దృష్టి పెట్టింది. చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని పలు గోడౌన్లను పరిశీలించిన చిత్తూరు పోలీసులు ఎర్రచందనం నిల్వలు ఉన్న చోట అధికారిక ఉత్తర్వులను చూశారు. చిత్తూరుకు చెందిన తూర్పు అటవీ శాఖ నుంచి వేలం పాటలో కొన్ని దుంగలను కొనుగోలు చేసినట్లు కొందరి వద్ద ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. అయితే వేలం పాటలో తీసుకున్న ఎర్రచందనం దుంగలు బీ, సీ గ్రేడ్‌కు చెందినవి. వీటి ముసుగులో ఏ గ్రేడ్ దుంగలు ఏవైనా విదేశాలకు వెళుతున్నాయా అనే దిశగా ఓ సీఐ ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. ఆపరేషన్‌రెడ్‌లో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన బాడాశీను, గౌస్‌బాషా, మణి, రామకృష్ణ, ఉదయ భాస్కర్, గుట్ట బాబు, నిమ్మ మహేష్, ముక్కల నారాయణ, ఫియాన్, సౌందరరాజన్ గ్యాంగ్‌లకు సంబంధించి పలువురిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కో గ్యాంగ్‌లో కనీసం నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేయనున్నారు. బడా స్మగ్లర్లపై బయోడైవర్సీ యాక్టు 55 (1) కింద కేసులు నమోదు చేయాలని ఈడీ నుంచి ఆదేశాలు అందడంతో పోలీసు శాఖ ఈ దిశగా కూడా చిన్నపాటి మార్పులు చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటికే పీడీపై అరెస్టయి బెయిల్ తీసుకున్న కొందరు వ్యక్తులు బయట ప్రాంతాల నుంచి మళ్లీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిపై నిఘా ఉంచిన పోలీసులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వీరిపై మళ్లీ పీడీ యాక్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెక్టివ్ యాక్టు (పీడీ) నమోదు చేయడానికి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రానున్నాయి. -
ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత
-
ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత
అట్లూరు: ఎర్రచందనం దుంగలను తరలిస్తూ టీడీపీ మహిళా నేత ఒకరు పోలీసులకు పట్టుపడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు ఏకుల రాజేశ్వరి శుక్రవారం తన స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో బద్వేలువైపు బయల్దేరారు. ఓ మహిళ ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారమందడంతో అట్లూరు పోలీసులు అప్రమత్తమై.. కడప-బద్వేలు మార్గం మధ్యలో ఆమె వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో 16 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో ఆమెను అరెస్ట్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించి.. కేసు నమోదు చేశారు. తాను టీడీపీ నేతనని, కావాలంటే నిర్ధారించుకోండంటూ ఆమె టీడీపీ ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడించారు. ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టాలంటూ టీడీపీ ప్రముఖులనుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దిక్కుతోచని పోలీసులు ఆమె అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచారు. -
10 మంది ఎర్ర చందనం దొంగల అరెస్ట్
కర్నూలు: కర్నూలు మండలం పూలతోట గ్రామ శివారులోని తుంగభద్ర నది నీటి గుంతల్లో దాచి ఉంచిన 81 ఎర్ర చందనం దుంగలు, మారుతీ వాహనంలో ఉంచిన 153 సండ్ర, నారాప కొయ్యలను అటవీశాఖ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని, ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. -
‘చందన’ సీమకు చీకటి దారులు
సందర్భం అరణ్యకాండ -1 రాయలసీమ నేలల్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్ల అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం అక్కడే లభ్యమౌతోంది. అందుకే స్మగ్లర్లందరి కళ్లూ ఆ అరణ్యాలపైనే. ‘తమిళ కూలీ’లతో సీమ జైళ్లన్నీ నిండిపోతున్నా మన ‘బంగారం’ మటుమాయమైపోతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు... ఎర్రచందనం స్మగ్లింగ్ దారులు ఎన్నని? రాస్తే రామాయణం, చెబితే భారతం. సూట్‌కేసులు, వ్యాన్లు, లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు, పాల వ్యాన్లు, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలు.. ఏదైనా ఎర్రచందనాన్ని తరలించదగిందే. యూరియా మూటలు, పైపులు, మొక్కజొన్న బస్తాలు, పండ్ల పెట్టెలు, నిమ్మ అంట్లు, బొప్పాయి, చీనీ కాయలు, టెంకాయలు, మామిడి కాయలు, వరిపొట్టు, కరేపాకు, ఇనుప ఖనిజం, ఇసుక.... ఇలా ఎర్రచందనం ఎలా దొరకలేదు? ఎక్కడ పట్టుబడలేదు? ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపో తున్న వృక్ష సంపదగా గుర్తింపును పొందిన ఎర్రచంద నం కడప, చిత్తూరు జిల్లాల అడవులంతటా ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు అడవుల్లో ఐదు లక్షల హెక్టార్లలో కూడా అవి ఉన్నాయి. అటవీ శాఖ ఆ చెట్లను 10-20 ఏళ్లు, 20-30 ఏళ్లు, 30-40 ఏళ్లు వయసున్న మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. స్మగ్లర్ల దృష్టి ఎప్పుడూ 30-40 ఏళ్ల చెట్లపైనే. అటవీ శాఖ అధి కారులు శాటిలైట్ రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పరిశీలించగా చిత్తూరు జిల్లాలోని చామల అటవీ రేంజ్ పరిధిలో ఎక్కువగా ఆ చెట్లను నరికేసినట్టు తెలిసింది. కడప జిల్లాలో 3,14,590 హెక్టార్లలో ఎర్రచందనం చెట్లున్నాయి. డివిజన్ల వారీగా కడప డివిజన్లో 1,28, 644 హెక్టార్లు, ప్రొద్దుటూరులో 1,01,142 హెక్టార్లు, రాజంపేట డివిజన్లో 84,803 హెక్టార్లలో విస్తరించి ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి 11 కిలో మీటర్ల దూరంలోని శేషాచలం కొండల్లోని శ్రీ వెంకటే శ్వర అభయారణ్యం ప్రధానమైనది. కుక్కలదొడ్డి నుంచి 10 కిలో మీటర్ల దూరంలోని తుంబుర తీర్థం ద్వారా అడవిలోకి దారులున్నాయి. రైల్వే కోడూరు రేంజిలో పోట్రాలగుండం, కేసరి బండలు, వాననీళ్ల గుట్ట, చిన్నక లుజులు, పల్లెగుండాలు, కాశికోన, గాదెల, బాటగుం డం, చాకలిరేవుకోన, వలసకోన, ముత్తరాచకోన, దొంగ బండల ప్రాంతాలున్నాయి. అలాగే బాలపల్లె రేంజి పరి ధిలో యర్రడ్లమడుగు, సిద్ధలేరు, కంగుమడుగు, దేశెట్టి గుడాలు, గుంజనేరు, యుద్ధరాల తీర్థం, విష్ణుగుండం, సందలేరు, తలకోన ప్రాంతాల్లో నీటి కుంటలు ఉండ టం వల్ల ఎర్రచందనం కూలీలకు ఈ ప్రాంతాలు ఆవా సాలుగా మారుతున్నాయి. బాలపల్లె, రైల్వేకోడూరు, చిట్వేలి, రాజంపేట, సానిపాయ రేంజ్‌లు రాజంపేట డివిజనల్ అటవీ అధికారి (డీఎఫ్ఓ) పరిధిలో ఉన్నాయి. బాలపల్లి రేంజ్లో 30-40 ఏళ్లకు పైబడిన ఎర్రచందనం వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో స్మగ్లర్ల కన్ను ప్రస్తు తం దానిపైనే ప్రధానంగా ఉంది. అందుకే ఆ రేంజ్‌లోనే అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం వాహనాలు ఎక్కువగా పట్టుబడుతున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్ అటవీ ప్రాంతం 1,64,516 హెక్టార్లు. కాగా అందులో లంకమల అభయారణ్యం 20,050 హెక్టార్లలో, పెనుశిల నరసింహ అభయారణ్యం 7,844 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఆ రెండిట్లో కాక ఇంకా 68,440 హెక్టార్లలో 21,17,614 ఎర్రచందనం వృక్షాలున్నాయి. కోడూరు రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ తెల్లవారు జామున చెన్నై నుంచి వచ్చే రైల్లోంచి వందల్లో ‘తమిళ కూలీ’లు దిగుతుంటారు. తిండిగింజలు, సరుకులు, వం టపాత్రలు మోసుకుంటూ దిగినవారు దిగినట్టే వారు అడవుల్లోకి వెళ్లిపోవడం స్థానికులకు నిత్యం కనిపించే దృశ్యమే. 350 మంది వరకు ఎర్రచందనం కూలీలు రిమాండు ఖైదీలుగా ఉన్న కడప కేంద్ర కాగారారం కిక్కి రిసిపోయింది. వారిలో 90 శాతం మంది తమిళులే. గత ఏడాది జూలై 1న 356 మంది ‘ఎర్రచందనం కూలీ’ లను నిందితులుగా విచారించడానికి కోర్టులు సరిపోక తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో ‘బహిరంగ కోర్టు’ నిర్వహించాల్సి వచ్చింది. 2013 డిసెంబర్ 15న శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖాధికారులను (డేవిడ్, శ్రీధర్) కిరాతకంగా హత్య చేసిన ఆ కేసు సంచలనం సృష్టించింది. కూలీలు, విద్యార్థులు, యువకులు, నిరక్షరాస్యులు, మైనర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాయలసీమలోని జైళ్లన్నీ ‘తమిళ కూలీ’లతోనే నిండిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల అడవుల్లో సాధారణంగా ఒక్కో బీటు పరిధి 5-10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లోపే ఉంటుంది. కానీ కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్‌ల్లో ఒక్కో బీటు 25 నుంచి 75 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించి ఉంటోంది. ఒక అంచనా ప్రకారం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విస్తీర్ణం అధికంగా ఉన్న ఎనిమిది అటవీ డివిజన్ల పరి ధిలో అటవీశాఖ పట్టుకోగలిగిన వి 50 వేల దుంగలు మా త్రమే. అంత మొత్తం సరిహద్దులు దాటిపోయాయి. దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం దుం గలలో వేటిని ఏ రేంజిలో, ఏ సెక్షన్లో, ఏ బీటులో నరి కారో గుర్తించలేని స్థితి. అక్రమంగా రవాణా చేసే ఎర్ర చందనం ఎక్కడ దొరికినా వాటిని విక్రయించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కే దక్కేలా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నుంచి ఒక హామీని మాత్రం మన అధికారులు పొందగలిగారు. రాయల సీమ నేలల్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్లనే అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం ఇక్కడి అరణ్యాల్లో లభ్యమౌతోందని శాస్త్రవేత్తల అభిప్రాయం. (వ్యాసకర్త రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు) e-mail: gangadhar.vempalli@gmail.com -
ఎర్ర లింకు.. పచ్చ జంకు!
- అంతర్జాతీయ స్మగ్లర్ రమణ పట్టుబడడంతో టీడీపీ నేతల్లో వణుకు - రూ. 9 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం - నల్లమలలో విస్తృతంగా కూంబింగ్ సాక్షి, కడప/అర్బన్ : జిల్లాలోని ఒంటమిట్ట ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ పోలీసులకు పట్టుబడడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఈ స్మగ్లర్ వెంట కొందరు టీడీపీ నేతలు తిరుగుతూ సన్నిహిత సంబంధాలు నెరిపారన్న కోణంపై కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో ఏం జరుగుతుందోననే భయం మొదలైంది. స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుంటే ఎవరినైనా, ఎంతటివారినైనా వదలబోమని పోలీసు యంత్రాంగం గట్టిగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. వెంకట రమణకు బినామీలుగా చలామణి అవుతూ తిరుగుతున్న కొంతమంది ఇప్పటికే భయంతో రహస్య ప్రదేశాలకు ఠ మొదటిపేజీ తరువాయి వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం పోలీసులు భారీ మొత్తంలో ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనం పట్టుబడటం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. సుమారు 4 టన్నుల 570 కిలోల ‘ఏ’ గ్రేడ్ రకం ఎర్రచందనం దొరకడం జిల్లాలో సంచలనంగా మారింది. స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతోపాటు మేస్త్రి బొడ్డే శ్రీనివాసులు ఒంటిమిట్ట మండలంలోని పట్రపల్లెకు చెందిన వారు కాగా, చంద్రానాయక్, శ్రీనునాయక్, నాతుకూరి రమణ, అబ్బయ్యగారి సోమయ్యలు కూడా ఒంటిమిట్ట మండలం వారే. కాగా, అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతో సంబంధాలు కలిగి ఉన్న మరో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు బెంగళూరులోని ఫయాజ్, మరో స్మగ్లర్ శివశంకర్లను పట్టుకునేందుకు పోలీసులు వ్యూహం రచిస్తున్నారు. భక్తుల ముసుగులో ఎర్ర కూలీలు వైఎస్సార్ జిల్లా నుంచి బస్సులు, రైళ్లలో నిఘా పెంచడంతో కూలీలు ఇక్కడి నుంచి వెళ్లడం దాదాపు తగ్గిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, తాజాగా బొడ్డె వెంకట రమణ కేసులో కీలక అంశాలు బయటపడినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ స్పష్టం చేస్తున్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రాంతం నుంచి తిరుపతికి భక్తుల ముసుగులో ఎర్ర కూలీలు వస్తున్నారని, ఎవరు కూలీలో, ఎవరు భక్తులో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దానిని నిర్ధారించుకోవడం కొంత కష్టమవుతోందన్నారు. గొడ్డళ్లు, ఇతర సామగ్రిని అడవిలోనే వదిలి సామాన్య భక్తుల వలె రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిసిందన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని, అడవిలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎనిమిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న బొడ్డే అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ ఎనిమిదేళ్ల క్రితం నేర కార్యకలాపాలకు అలవాటుపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు దొరక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్నాడు. గతంలో ఆర్ఎస్ఐ శివారెడ్డిపైన దాడి చేసిన కేసులో నిందితుడు. ఇతనిపై 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 అటవీ శాఖకు చెందినవి కాగా, మరో మూడు పోలీసు శాఖకు చెందినవి. 2009, 2014లో పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లోని బడా స్మగ్లర్లతో సంబంధాలు నెరుపుతూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. కూలీలకు కేజీ ఎర్రచందనానికి రూ. 150, మేస్త్రికి రూ.200 చొప్పున చెల్లిస్తూ అక్రమ రవాణాకు బరితెగించాడు. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో, ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడంలో క ృషి చేసిన ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు ఉలసయ్య, రాజేంద్రప్రసాద్, బీవీ శివారెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఆ దుంగలు.. అటవీ శాఖవే
పరిశీలనలో వెల్లడి శాఖాపరమైన విచారణ జరుపుతామంటున్న డీఎఫ్‌వో నూజివీడు : పట్టణంలో బుధవారం స్వాధీనం చేసుకున్న 25 ఎర్రచందనం దుంగలు అటవీ శాఖవేనని తేలింది. అటవీ శాఖ అధికారులు గురువారం తమ కార్యాలయ ఆవరణలోని లారీలో ఉన్న దుంగలను కిందికి దింపి సరిచూడగా ఈ విషయం బయటపడింది. బాపులపాడు మండలం మల్లవల్లిలో 2012 జనవరి 24న పోలీసులు ఈ లారీని పట్టుకున్నారు. 11 టన్నుల బరువు కలిగిన 465 దుంగలను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోర్టులో కేసు నడుస్తున్నందున ఆ దుంగల లారీ ఇప్పటికీ నూజివీడు అటవీశాఖ కార్యాలయం ఆవరణలోనే ఉంది. అందులోని దుంగలను లెక్కించగా 440 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బుధవారం స్వాధీనం చేసుకున్న దుంగలపై ఉన్న నంబర్లను పరిశీలించగా అవన్నీ లారీలోనివేనని తేలింది. దీంతో అటవీశాఖ ఆధీనంలోని దుంగలే బయటకు వెళ్లినట్టు నిర్ధారణ అయింది. ఎఫ్ఆర్వో బి.శ్రీరామారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆరా! ఈ ఘటన వెనుక ఎవరి పాత్ర ఉన్నదనే అంశంపై అటవీశాఖ ఉన్నతాధి కారులు ఆరా తీస్తున్నారు. కార్యాలయానికి నైట్ వాచ్మెన్ లేకపోవడంతో ఈ ఘటనకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు. బయటివారు ఈ ఘటనకు పాల్పడ్డారా.. లేక ఇంటి దొంగలే చేసి ఉంటారా అనేది తేలాల్సి ఉంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నాం అటవీశాఖ ఆధీనంలో ఉన్న ఎర్రచందనం దుంగలు బయటకు వెళ్లిన ఉదంతంపై పోలీసు కేసు పెట్టనున్నట్లు డీఎఫ్‌వో ఎస్.రాజశేఖర్ తెలిపారు. శాఖాపరమైన విచారణ కూడా జరుపుతామని ఆయన చెప్పారు. తమ సిబ్బంది ప్రమేయముందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుంగలకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున న్యాయమూర్తి అనుమతి తీసుకుని తిరుపతిలోని డిపోకు తరలిస్తామని డీఎఫ్‌వో చెప్పారు. -
‘ఎర్ర’ ప్రకంపనలు
చెన్నై ముఠా నుంచి కీలక సమాచారం పోలీసుల కస్టడీలో వివరాలిచ్చిన స్మగ్లర్లు ఫోన్‌కాల్స్ జాబితా పరిశీలిస్తున్న పోలీసులు నగదు లావాదేవీలపై డీఆర్ఐతో దర్యాప్తు జిల్లాలో పలువురు అరెస్టుకు రంగం సిద్ధం చిత్తూరు(అర్బన్): ఆపరేషన్ రెడ్ లో భాగంగా చెన్నై-పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చిత్తూరు పోలీసు యం త్రాంగం పలు కీలక సమాచారాలు సేకరించింది. గత వారంలో జిల్లా పోలీసులునిర్వహించిన చెన్నై-పశ్చిమ బెంగాల్ ఆపరేషన్‌లో కింగ్‌పిన్ షణ్ముగంతోపాటు సౌందరరాజన్, శరవణన్‌లతో పాటు మొత్తం ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. అయితే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న శరవణన్, సౌందరరాజన్‌లను గత రెండు రోజులుగా పోలీసులు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో స్మగ్లర్లు పలు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెన్నై, బెంగాల్ ఇతర ఏ ప్రాంతంలోని స్మగ్లర్లు అయినా జిల్లాలోని కొందరు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటునే ఆయా ప్రాంతాలకు ఎర్రచందనం దుంగలు ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. ఈ దిశగా విచారణ చేపట్టన పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల ఫోన్‌కాల్స్ జాబితాను పరిశీలించారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు ఎర్ర స్మగ్లర్లకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో పట్టుబడ్డ షణ్ముగం, రవిలను సైతం కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నుంచి సానుకూలంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దర్నీ విచారిస్తే ఇందులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎర్రచందనం రవాణాకు వాహనాలు సమకూర్చింది ఎవరు, నగదు పంపిణీ ఎలా జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. మరోవైపు గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ ఏడుగురు నిందితులు జిల్లా నుంచి తరలించిన 700 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు సంబంధించి నగదు లావాదేవీలు ఎలా జరిగాయని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందు కోసం డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)తో సంప్రదించి వారు ఇచ్చే సమాచారంతో సంయుక్త దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని డీఆర్ఐ అధికారులతో చిత్తూరు పోలీసులు సంప్రదింపులు కూడా జరిపారు. పలువురి అరెస్టులకు సిద్ధం నిందితులు ఇచ్చిన సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడానికి పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్ట అయి బయట ఉన్న కొందరు స్మగ్లర్లకు ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై పలు ఆధారాలు చేతిలో ఉంచుకుని నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడానికి పోలీసులు వ్యూహ రచన చేస్తున్నారు. మరి ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా పనిచేస్తాయా... పోలీసుల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనే విషయాలు వేచి చూడాల్సి ఉంది. -
తీగలాగితే ‘డంప్’ కదిలింది
చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో జిల్లా పోలీసులు తొలిసారిగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆపరేషన్రెడ్లోని పోలీసు బృందాలు సాహసం చేసి మరీ రూ.30 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. చైనాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న దుంగలను పట్టుకుని సాహసం ప్రదర్శించారు. తీగ ఇలా లాగారు.. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని మూడు రోజుల క్రితం చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని విచారించగా పశ్చిమబెంగాల్లోని జయగామ్ వద్ద సౌందరాజన్ అనే వ్యక్తికి తాను ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. సౌందర్‌రాజన్ ఎత్తు, పోలికలు, ఇతర గుర్తులను చెప్పాడు. ఈ చిన్నపాటి ఆనవాళ్లతో పదిమందితో కూడిన పోలీసు బృం దాన్ని ఎస్పీ శ్రీనివాస్ పశ్చిమ బెంగాల్‌కు పంపారు. ఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జయగామ్ వద్దకు జిల్లా పోలీసు లు చేరుకున్నారు. ఇక్కడి నుంచి భూటాన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరమే. ఇక్కడ సౌందర్‌రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎర్రచందనం డంప్ ఉన్న ప్రాంతంలోకి పదిమంది పోలీసుల బృందం చేరుకుంది. ఇక్కడ ఓ గోడౌన్లో ఉంచిన 149 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సౌందర్‌రాజన్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు అడవుల్లోంచి వెళ్లాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 10 గంటలకు అడవుల్లో వెళుతున్న చిత్తూరుకు చెందిన మహిళా స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌రావు, సీఐ షాదిక్అలీ బృందాన్ని రెండు ఏనుగులు తరుముకున్నాయి. ఏనుగుల చూపు మరల్చి మన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సౌందర్రాజన్ది చెన్నై. ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరి పశ్చిమబెంగాల్లో స్థిరపడ్డాడు. ఇతన్ని విచారించగా చెన్నైలో మరో డంప్ ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. అనంతరం 28 మంది ఉన్న మరో బృందాన్ని ఎస్పీ శ్రీనివాస్ చెన్నైకు పంపారు. ఇక్కడ శరవణన్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సమీపంలోని ఆవడి వద్ద ఉన్న సిప్కాట్ ఇండస్ట్రీస్ వద్ద 167 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరవణన్‌కు సైతం అరెస్టు చేశారు. ఆలస్యమయితే అంతే.. పశ్చిమ బెంగాల్‌కు జిల్లా పోలీసులు కాస్త ఆలస్యంగా వెళ్లి ఉంటే ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు దేశ సరిహద్దు దాటించేసుంటారు. లారీల్లో ఈ సరుకును భూటాన్‌కు, అటు నుంచి చైనాకు తరలించడానికి స్మగ్లర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతలోపు జిల్లా పోలీసులు స్మగ్లర్‌తో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం సౌందర్‌రాజన్‌ను పశ్చిమ బెంగాల్‌లోని జయగామ్ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. దుంగలను సైతం జిల్లాకు తీసుకురావడానికి న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నారు. గురువారం తీసుకొచ్చే అవకాశం ఉంది. -
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పిటిషనర్‌కు హైకోర్టు సూచన ఇది మంచి కేసు.. చెడగొట్టకండి అంటూ వ్యాఖ్య తదుపరి విచారణ13వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ వ్యవహారంలో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని హైకోర్టు శుక్రవారం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇది మంచి కేసని, ఫిర్యా దు ఇవ్వకుండా దానిని చెడగొట్టవద్దని సూచించింది. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయని నేపథ్యంలో మీరే(పిటిషనర్) స్వయంగా అక్కడకు వెళ్లి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించారని తాము ప్రాథమిక నిర్ధారణకు వస్తే అప్పుడు జోక్యం చేసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. శేషాచలం ఎన్‌కౌం ట ర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం డీజీపీ ఓ సీల్డ్ కవర్లో తన నివేదికను కోర్టుకు పంపారు. దీనిని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం ముందుంచారు. కూలీల అసహజ మరణాలపై ఎఫ్ఐఆర్ నమోదు గురించి ఎటువంటి ప్రస్తావన లేదేమిటి? పోస్టుమార్టం చేశారా? అంటూ న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. ఆయన అధికారులతో మాట్లాడి చెబుతాననడంతో ఎన్హెచ్ఆర్సీ విచారణ ప్రారంభించిందా? లేదా..? భోజన విరామ సమయానికి ఈ వివరాలను మాకు చెప్పండంటూ ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 12.40 గంటలకు మళ్లీ విచారించింది. బాధ్యతల నుంచి తప్పించుకోలేరు ఏప్రిల్ 7న ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం వ్యవహారంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిందని శ్రీనివాస్ ధర్మాసనానికి నివేదించారు. దీనికి ధర్మాస నం స్పందిస్తూ, ఎన్హెచ్ఆర్సీ విచారణ ప్రారంభించింది కాబట్టి, ప్రస్తుతానికి ఈ కేసులో తాము చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ జోక్యం చేసుకుంటూ, మృతులపై పోలీ సులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు. అసహజ మరణాలపై ఎటువంటి కేసూ నమోదు చేయలేదన్నారు. ‘పోలీసులు తమ బాధ్యతల నుంచి తప్పిం చుకోలేరు. మీరే స్వయంగా అక్కడకు వెళ్లి సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయం డి. వారు స్పందించకుంటే స్థానిక కోర్టును ఆశ్రయించండి..’ అని సూచించింది. ‘అప్పటికీ ప్రయోజనం లేకపోతే అప్పుడు మా వద్దకు రండి. పోలీసులు వారి పరిధి దాటి వ్యవహరించారని భావిస్తే అప్పుడు మేం తగిన ఆదేశాలిస్తాం.’ అని హైకోర్టు వ్యాఖ్యానింది. -
చర్యలు తీస్కోండి
చెన్నై: ఎన్కౌంటర్ పేరిట ఏపీలో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను హతమార్చడంపై ఏఐఏడీఎంకే అధినేత జయలలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై ఆమె పలు సందేహాలు వ్యక్తం చేశారు. నిజానిజాల నిర్ధారణకు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. మీడియా, సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన అం శాలతోపాటు ఫొటోలు సందేహాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు తీసుకున్న చర్య సరైనదేనా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం ప్రకటించారు. -
ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలి
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం కూలీలను కాల్చి చంపడం, తెలంగాణలో ఉగ్రవాద కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న ఐదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ఇంతవరకు కీలకమైన ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్ చేయకపోగా 20 మంది కూలీలను మాత్రం కాల్చి చంపారన్నారు. ఈ స్మగ్లర్లకు సహాయపడడంలో అధికార పార్టీ నాయకులకు సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయన్నారు. అలాగే, సూర్యాపేటలో ఉగ్రవాదుల చేతుల్లో పోలీసులు హతమైనందున.. ప్రతీకార హత్యలుగానే ఐఎస్ఐ ఉగ్రవాదులను చంపినట్లు కనిపిస్తోందన్నారు. -
చిత్తూరులో ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు: ఎర్ర చందనం స్మగ్లర్లని చిత్తూరు జిల్లా పోలీసులు బుధవారం భారీ సంఖ్యలో అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ప్రధాన స్మగ్లర్లు కాగా 11 మంది వారి అనుచరులు, మరో 48 మంది కూలీలు ఉన్నారు. అరెస్టు చేసిన వారి నుంచి ఇన్నోవా, భారీ ట్రక్కు, స్విఫ్ట్ డిజైర్, స్విఫ్ట్, ఎస్టీమ్, ఏస్ వాహనాలతో పాటు రూ.2.50 లక్షల నగదు, 98 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్, ఓఎస్డీ రత్న వీటిని పరిశీలించారు. జిల్లాలోని చిత్తూరు, కల్లూరు, విజయపురం, పుత్తూరు, ఎస్ఆర్.పురం పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. తమిళనాడు నామక్కల్‌కు చెందిన బాలసుబ్రమణ్యం, కే.మణి, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన పీ.ఉమర్ అనే అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరి అనుచరులనూ అరెస్టు చేశారు. -
అంతం కాదు.. ఆరంభమే: బొజ్జల
హైదరాబాద్: ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో మంగళవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్ ఆరంభం మాత్రమేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోకి సోమవారం భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారన్న సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ చేపట్టిందన్నారు. కూంబింగ్ చేస్తోన్న బలగాలపై ఎర్రచందనం స్మగ్లర్లు విచక్షణారహితంగా దాడులు చేశారని.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని వివరించారు. ఆ కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయింది స్మగ్లర్లు కాదు తమిళనాడుకు చెందిన కూలీలే కదా అన్న ప్రశ్నకు బొజ్జల స్పందిస్తూ.. కూలీలకు అర్ధరాత్రి అడవిలో ఏం పనంటూ ఎదురుదాడికి దిగారు. కూలీలైతే అర్ధరాత్రి అడవిలో గడ్డికోసుకోవడానికి వెళ్లారా అంటూ ఎద్దేవా చేశారు. గతంలో పోలీసులు అరెస్టు చేసిన కూలీలనే ఎన్కౌంటర్లో చంపేశారన్న విమర్శలు వ్యక్తమవుతోండటాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా, రాజకీయ అండదండలున్నా వదిలి పెట్టబోమన్నారు. రాజకీయ నాయకులకు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు దొరికితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కూలీల కాల్చివేతపై నివేదిక ఇవ్వండి
హైదరాబాద్: చిత్తూరు జిల్లా, శేషాచల అడవుల్లో మంగళవారం జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్ పై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి. రాముడిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మృతదేహాలకు చట్ట ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలని, అనంతరం వాటిని భద్రపరచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మృతదేహాలను వారి సంబంధీకులకు అప్పగించే విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో వివరించాలని కోరింది. తమిళ కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన 20 మంది అమాయక కూలీలను పోలీసులు సమీపం నుంచి కాల్చి చంపారని, దీనిని సమర్ధించుకునేందుకు కూలీలను స్మగ్లర్లుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించేందుకే మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మృతదేహాలను సైతం మానవతాదృక్పథంతో గౌరవించాల్సి ఉందన్నారు. -
కేంద్రానికి తమిళనాడు ఫిర్యాదు
చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్ మంత్రులు, డీజీపీతో చంద్రబాబు భేటీ అనంతరం రాజ్‌నాథ్‌కు ఫోన్ చేసిన బాబు హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) మంగళవారం ‘‘ఎన్కౌంటర్’’లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను చంపేయటం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో నిరసనలు రగులుకోవటంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించడం.. తమిళనాడులో నిరసనలు వ్యక్తమవడంతో చంద్రబాబు హడావుడిగా అందుబాటులో ఉన్న మంత్రు లు దేవినేని ఉమామహేశ్వరావు, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడులతో సచివాలయంలో సమావేశమయ్యారు. తమిళనాడు నుంచి భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు శేషాచలం అడవుల్లోకి వస్తున్నారన్న పక్కా సమాచారంతోనే సోమవారం నుంచి టాస్క్‌ఫోర్స్ బలగాలను కూంబింగ్‌కు పంపామని.. మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ బలగాలపై దాడులకు దిగాయని.. పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని సీఎంకు డీజీపీ వివరించారు. కాల్పుల్లో గాయపడన వారందరికీ వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాల్పుల్లో చనిపోయిన స్మగ్లర్ల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ అనంతరం వారి కుటుంబాలకు అప్పగించాలని సీఎం ఆదేశించారని.. మృతుల ఫోటోలను విడుదల చేసి వారి సంబంధీకులకు వివరాలు తెలియజేయాలని సూచించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. -
గంజిబండ నుంచి చీకటీగలకోన దాకా..
తిరుమల/హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని శేషాచలంలో విలువైన ఎర్రచందనం సంపదను కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు తెగబడుతున్నారు. అడ్డువచ్చిన ఫారెస్ట్ అధికారులపై దాడులకు దిగుతున్నారు. దీంతో స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య భీకర పోరుకు నెలవుగా శేషాచలం అడవులు మారాయి. 2013లో స్మగ్లర్లు, కూలీలు శేషాచల అడవిలోని గంజిబండ వద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఇద్దరు అధికారులను దారుణంగా హతమార్చారు. ఇందుకు ప్రతిగా పోలీసులు తుపాకులకు పనిపెట్టారు. ఈ క్రమంలో శేషాచలంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఘటనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2013 డిసెంబర్ 15న తిరుమలకు 13 కిలోమీటర్ల దూరంలోని శేషాచల అడవిలోని గంజిబండ వద్ద సుమారు వందమంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో తిరుపతి వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగం తిరుమలశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్ శ్రీధర్(50), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్(49)ను రాళ్లతో మోది, కట్టెలతో కొట్టి అతిక్రూరంగా హతమార్చారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అధికారులు, సిబ్బంది గాయాలపాలయ్యారు. 2014, మే 28న శేషాచలం అడవుల్లో తిరుమల ఆలయానికి పడమర దిశలో పది కిలోమీటర్ల దూరంలోని తలకోన చామలరేంజ్కు మధ్యలో.. బొద్దిలేడు ప్రాంతంలోని గుడ్డెద్దుల బండ వద్ద స్మగ్లర్లు, టాస్క్ఫోర్సు ఎస్టీఎఫ్ దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ముగ్గురు కూలీలు మృతిచెందారు. అదేవిధంగా చామలరేంజ్ పరిధిలో భాకరాపేట సమీప ప్రాంతాల్లోనూ, మామండూరు రేంజ్ పరిధిలోని శెట్టిగుంట, ఓబులవారి పల్లిలో జరిగిన కూంబింగ్ ఎన్కౌంటర్ ఘటనల్లో మరో ఐదుగురు ఎర్రచందనం కూలీలు హతమయ్యారు. తాజాగా మంగళవారం వేకువజామున చీకటీగలకోన, సచ్చినోడిబండ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీలకు, పోలీసులకు భీకర పోరు జరిగింది. ఈ ఘటనల్లో 20 మంది కూలీలు మరణించారు. శేషాచలంలో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నిలిచింది. రాష్ట్రంలో పది నెలల కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలకు, పోలీసులకు మధ్య 15 సార్లు ఎదురుకాల్పుల జరిగాయి. తాజాగా జరిగిన 15వ ఎన్‌కౌంటరే అత్యంత భారీది. ఈ పదినెలల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 831 కేసులు నమోదు చేసిన అధికారులు.. స్మగ్లర్లు, కూలీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 5,237 మందిని అరెస్టు చేశారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లపై ఉక్కుపాదం
ఎన్కౌంటర్లో 20 మంది మృతిపై సమగ్ర దర్యాప్తు: చినరాజప్ప అమలాపురం: జాతీయ సంపద అయిన ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుపతి వద్ద శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స, అటవీ శాఖ అధికారులు ఉమ్మడిగా జరిపిన ఎన్కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. సమగ్ర దర్యాప్తులో ఈ విషయం బయటపడుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రచందనంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంవల్లే స్మగ్లర్లు చెలరేగిపోయారని అన్నారు. దీనివల్ల గంగిరెడ్డి వంటి గజ స్మగ్లర్ పుట్టుకువచ్చాడని చెప్పారు. ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు, స్మగ్లర్లను పూర్తిగా అణచివేసేందుకు ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటామని చెప్పారు. -
పొట్టకూటి కోసం ప్రాణాలు పణం
తమిళ గిరిజనుల దయనీయ పరిస్థితిని అవకాశంగా మలచుకుంటున్న స్మగ్లర్లు రోజుకు రూ.5 వేల కూలి, ప్యాకేజీలతో వల భారీ సంఖ్యలో శేషాచలంలోకి చొరబడుతున్న కూలీలు హైదరాబాద్: ఎర్రచందనం కూలీలపై తుపాకీని గురిపెట్టి భయపెట్టాలనుకుంటే.. స్మగ్లర్లు ధనాస్త్రాన్ని ఎక్కుపెడుతున్నారు. రోజుకు రూ.5 వేలు కూలీ ఇస్తామంటూ తమిళ కూలీలకు, గిరిజనులు, దళితులకు స్మగ్లర్లు వల వేస్తుంటే... కూటి కోసం వారు శేషాచలం అడవుల్లోకి వస్తున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లలో కన్నుమూస్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై, తిరునల్వేలి, సేలం, వేలూరు, తిరువళ్లూరు జిల్లాల్లోని పశ్చిమ కనుమల్లో అమాయక గిరిజనులకు అడవే జీవనాధారం. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ బడుగులు కష్టజీవులు. రోజంతా చెమటోడ్చితే రూ.100 కూలీ గిట్టుబాటయ్యేది కూడా అక్కడ అనుమానమే. ఎర్రచందనం స్మగ్లర్ల దృష్టి గిరిజనులపై పడేందుకు వారి దయనీయ పరిస్థితే కారణం. వారిని ఎర్రచందనం కూలీలుగా మార్చిన స్మగ్లర్లు ప్రత్యేక వాహనాల్లో శేషాచలం అడవులకు తెస్తున్నారు. అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను నరికించి దొడ్డిదారిన సరిహద్దులు దాటిస్తూరూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఏడాదిన్నర క్రితం శేషాచలం అడవుల్లో తనిఖీలకు వెళ్లిన ఇద్దరు అటవీ అధికారులపై తమిళ కూలీలు దాడి చేసి, చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత తొమ్మిది మంది తమిళ కూలీలను వివిధ ఎన్కౌంటర్లలో పోలీసులు కాల్చి చంపారు. ఇదే క్రమంలో తమిళ కూలీలను చైతన్యవంతం చేయడం ద్వారా ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావించింది. గిరిజన గ్రామాల్లో చైతన్య జాతాలు నిర్వహించడానికి పలు సందర్భాల్లో తమిళనాడుకు వెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఎర్రచందనం చెట్లు నరికివేసి, స్మగ్లర్లకు సహకరిస్తే కాల్చి వేస్తామన్న అంశాన్ని పోలీసులు ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మరోవైపు పోలీసుల వ్యూహానికి స్మగ్లర్లు ప్రతి వ్యూహాన్ని రచించారు. కూలీలకు పరిహారం ప్యాకేజీ ప్రకటించి ఆకట్టుకున్నారు. ఫలితంగా ఏడాది కాలంగా తమిళ కూలీలు భారీ ఎత్తున శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్నారు. పది నెలల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల పోలీసులు 1100 మందికిపైగా తమిళ కూలీలను అరెస్టు చేసి కోర్టుల్లో హాజరు పరిచారు. వీరంతా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. దీనిపై తమిళనాడుకు చెందిన ప్రజా సంఘాలు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పెద్ద సంఖ్యలో కూలీలు ఎలా వచ్చారు? తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నది అంతు చిక్కట్లేదు. ఇది పోలీసుల వైఫల్యమా? లేక కూలీలు వస్తున్న సంగతి గుర్తించి కూడా శేషాచలంలో అడుగుపెట్టే వరకు వేచి చూశారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కూలీలను స్మగ్లర్లు ఏఏ మార్గాల్లో, ఎలా శేషాచలంలోకి పంపుతున్నారనేది పోలీసులకు స్పష్టంగా తెలుసు. రైలులో రావాలంటే తమిళనాడులోని కాట్పాడు, రాష్ట్రంలోని రేణిగుంట, పాకాల చేరుకోవాలి. అక్కడ నుంచి బస్సు లేదా లారీలో కృష్ణగిరి, కుప్పం, పలమనేరు, చిత్తూరు, చినగొట్టికల్లు ప్రాంతాల మీదుగా శేషాచలం అడువుల్లోకి అడుగుపెట్టాలి. మరికొందరు తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు పడవల్లో వచ్చి అక్కడినుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, మామండూరు వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి శేషాచలం అడువుల్లో అడుగపెట్టాల్సి ఉంటుంది. చెక్‌పోస్టులు, పికెట్లు ఏం చేస్తున్నట్లు? స్మగ్లర్లు కూలీలను ఎప్పుడూ ఒక్కరొక్కరుగా తీసుకురారు. ఒకేసారి ఓ బృందాన్ని రప్పించడంతో వారంతా కలిసే ప్రయాణించాల్సి ఉంటుంది. తమిళనాడు నుంచి కూలీలు ఏ మార్గంలో ప్రయాణించినా ఒక అంతర్రాష్ట చెక్‌పోస్టుతో పాటు పలు జిల్లా చెక్‌పోస్టులు, పోలీసు పికెట్లు దాటాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో తిరుపతి ఉందన్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్నా.. పోలీసులు డేగ కంటి నిఘా వేసి ఉంచాలి. అలాంటి చర్యలు తీసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో కూలీలు రెండుమూడు రోజుల క్రితం రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారనేది అంతు చిక్కని అంశంగా మారింది. వారి చొరబాటును నిరోధించడంలో విఫలమైన నేపథ్యంలో.. కూలీలను ‘భయభ్రాంతులకు’ గురి చేసే లక్ష్యంతో అధికారులు అడుగులు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పర్మిట్లతో మోసం! ఎర్రచందనం చెట్ల నరికివేతకు ఏపీ ప్రభుత్వం తమకు అనుమతులు ఇచ్చిందని మభ్యపెట్టి కొందరు కూలీలను తీసుకెళ్లినట్లు తమిళనాడులోని బాధిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఎర్రచందనం పనులకు వెళితే అరెస్ట్ కావడమో, కేసుల్లో చిక్కుకోవడమో తప్పదని భయపడిన కూలీలు చాలావరకు అందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఏపీకి చెందిన కొందరు నేతలు ప్రభుత్వ అనుమతితోనే ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నట్లుగా చెబుతూ నకిలీ ఉత్తర్వులను కూలీలకు చూపుతున్నట్లు సమాచారం. వీరి మాటలు నమ్మి శేషాచ లంలో ప్రవేశించిన కూలీలు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వందలాది కూలీలను దింపడం వెనుక ఏపీలో రాజకీయ దందా ప్రధానపాత్ర పోషించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన చెవిరెడ్డి
చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ జరి గిన ప్రాంతాన్ని మంగళవారం క్షుణ్ణంగా పరిశీలించారు. కూలీల మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్కౌంటర్ జరిగినతీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. పరిస్థితి చూస్తుంటే కూలీలను తీసుకువచ్చి చంపి, ఎన్‌కౌం టర్గా చిత్రీకరించినట్టు అందరితోపాటు తనకూ అనుమా నం వస్తోందని చెప్పారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టే బడాస్మగ్లర్లు ఏ పార్టీ వారైనా, ఏ రాష్ట్రం వారైనా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటే, కూలీలు అటవీ ప్రాంతంలోకి వచ్చే పరిస్థితి ఉండదన్నారు. -
టాస్క్‌ఫోర్స్ ఉనికి కోసమే..!
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ‘ఎన్కౌంటర్’ ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టటంలో.. ‘బడా స్మగ్లర్ల’ ఆటకట్టించటంలో విఫలమవుతున్న పోలీసు యంత్రాంగం.. కూలీలపై ప్రతాపం చూపి, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసి, చెట్ల నరికివేతకు కూలీలుగా రాకుండా అడ్డుకోవాలని భావించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే.. తమ చేతికి చిక్కిన కూలీలను పట్టుకెళ్లి కాల్చిచంపి ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు సైతం పోలీసులే కూలీలను పట్టుకెళ్లి కాల్చిచంపారని ఆరోపిస్తున్నాయి. వామపక్ష నేతలు సైతం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమానాలకు బలమిస్తున్న బస్సు టికెట్లు? శ్రీవారిమెట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనుమానాలకు బలమిచ్చేలా బస్సు టికెట్లు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. వేలూరు నుంచి తిరుపతికి సోమవారం సాయంత్రం 7 గంటలకు వచ్చిన ఎర్రకూలీలు శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్టు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ టీం కూంబింగ్ వెళ్లిందని అధికారులు చెప్తున్నారు. అలా అయితే రాత్రికి రాత్రే ఎర్రచందనం దుంగలను నరికి ఎలా తీసుకురాగలరు? అనేది కూడా అనుమానాలను బలపరుస్తోంది. -
కూలీలను కాల్చేశారు
11 మంది సచ్చినోడి బండలో.. 9 మంది చీకటీగల కోనలో.. ఎర్రచందనం చెట్లు నరికేందుకు స్మగ్లర్లు తెచ్చిన 20 మంది కూలీలను కాల్చి చంపిన పోలీసులు శేషాచలం కొండల్లో తెల్లవారుజామున 2 చోట్ల భారీ ‘ఎన్కౌంటర్’ ► మృతులు తమిళనాడు కూలీలు కూంబింగ్ సందర్భంగా ఎన్కౌంటర్ జరిగింది: టాస్క్‌ఫోర్స్ ► రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగితే.. ఎదురు కాల్పులు జరిగాయన్న డీఐజీ ► కూలీలను పట్టుకొచ్చి కాల్చి చంపారంటూ ఆరోపణల వెల్లువ ► మృతుల పక్కన పడివున్న పెయింట్ మార్కుల ఎర్రదుంగలు ఎక్కడివి? ► మిగతా వారు దుంగలతోనే పారిపోయారా? ► {పజాసంఘాలు, హక్కుల వేదికలు, పార్టీల మండిపాటు ► ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు ► చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు రక్తమోడాయి. పొట్టకూటికోసం తమిళనాడు నుంచి వచ్చిన ఎర్రచందనం కూలీలు 20 మంది పోలీసుల తుపాకుల తూటాల బలయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో చేష్టలుడిగిన ప్రభుత్వం కూలీలపై ప్రతాపం చూపిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణలో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ 20 మంది కూలీలు చనిపోయారని పోలీసులు చెప్తున్నా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలింపు చేపడుతున్నాయి. జరిపిన ‘రెండు ఎన్కౌంటర్ల’లో ఒక్క కూలీని కూడా గాయాలతో కానీ ప్రాణాలతో కానీ పట్టుకోకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటనా ప్రాంతా ల్లో మృతదేహాలు పడివున్న తీరు, వారిపక్కన పేర్చినట్లు ఉన్న ఎర్రచందనం దుంగలు, ఆ దుంగలపై పోలీసులకు పట్టుబడిన దుంగలపై వేసే పెయింట్ గుర్తులు ఉండటం వంటి పరిస్థితులు ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కూలీలను పట్టుకెళ్లి అక్కడ కాల్చిచంపి.. ఎదురు కాల్పులని చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజా సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ పలు రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మానవహక్కుల సంఘాలు కూడా ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని నినదించాయి. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఘాటుగా లేఖరాశారు. తమిళనాడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఎన్కౌంటర్’ ఘటనపై ఆరా తీసింది. తిరుపతి: చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు పోలీసుల తుపాకుల మోతతో దద్దరిల్లాయి. చంద్రగిరి మండ లం శ్రీవారిమెట్టు సమీపంలోని రెండు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జరిగిన భారీ ‘ఎన్కౌంటర్’లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం.. ‘‘ఎర్రచందనం చెట్లు నరి కేందుకు స్మగ్లర్లు తీసుకొచ్చిన కూలీల కదలికలపై అటవీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సమాచారం అందింది. దీం తో.. ఒక్కో బృందంలో 12 మంది టాస్క్‌ఫోర్స్, ముగ్గురు అటవీ సిబ్బంది చొప్పున రెండు బృందాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ బృందాలకు ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో వంద మందికి పైగా కూలీలు తారసపడ్డారు. ఎర్రచందనం కూలీలు పోలీసు బృందాలపైకి రాళ్లు రువ్వారు. గొడ్డళ్లతో దాడులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు లొంగిపోవాలని కూలీలను హెచ్చరిం చారు. గాల్లోకి కాల్పులు జరిపారు. చివరకు ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ కూలీలు చనిపోయారు. సచ్చినోడి బండ ప్రాంతంలో 11 మంది, ఈతగుంట సమీపంలోని చీకటీగల కోనలో 9 మంది మృతిచెందారు. మిగతా కూలీలు శేషాచలం అడవిలోకి పారిపోయారు. కూలీలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది పోలీసులకు గాయాలయ్యాయి.’’ అడవుల్లోకి పారిపోయినవారి కోసం టాస్క్‌ఫోర్స్, పోలీసులు, అట వీ శాఖ ఆధ్యర్యంలో భారీగా సిబ్బందిని మోహరించి గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసుఅధికారులు తెలిపారు. కడప, తిరుపతి, రేణిగుంట, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గాయపడిన పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలంలో మూడు గొడ్డళ్లు, రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. మృతి చెందిన వారంతా తమిళనాడుకు చెందిన కూలీలే అని భావిస్తున్నారు. మృతదేహాలకు పంచనామా చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విచారణకు ఆదేశించారు. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలెన్నో? తిరుపతి: శేషాచల అడవుల్లో ఎర్ర కూలీలపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు నుంచి 6.5 కిలోమీటర్ల దూ రంలో ‘ఎన్కౌంటర్’ ప్రదేశాలున్నాయి. రెం డు ప్రదేశాలకు మధ్య దాదాపు కిలోమీటరు దూరం ఉంది. రెండు చోట్లా మృతదేహాలు పడివున్న తీరు, వారిపక్కన ఉన్న దుంగలను పరిశీలిస్తే.. ‘ఎన్కౌంటర్’పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు టాస్క్‌ఫోర్స్ బృం దాలకు.. రెండు ప్రాంతాల్లో.. ఒకే సమయం లో ఎర్రచందనం కూలీలు తారసపడ్డారని.. రెండు చోట్లా కూలీలు దాడికి దిగటంతో.. లొంగిపోవాలని హెచ్చరించి, గాలిలోకి కాల్పులు జరిపి, ఆపై ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెప్తున్నారు. కిలోమీటరు దూరంలోని రెండు ప్రదేశాల్లో ఒకేసారి ‘ఎదురు కాల్పులు’ జరగటం సందేహాస్పదమని పరిశీలకులు అంటున్నారు. వారు లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటంటే... ⇒ రెండుచోట్లా పోలీసు కాల్పుల్లో మృతి చెం దినవారి మృతదేహాలు.. కేవలం పది మీటర్ల విస్తీర్ణంలోపలే.. పక్కపక్కనే, చుట్టూ పేర్చినట్లుగా, గుంపుగా పడి కనిపిస్తున్నాయి. ఒక చోట 11, మరొక చోట 9 మృతదేహాలు పడివున్నాయి. ఎక్కువమందికి కడుపు, ఛాతీ, తల భాగాల్లో తూటా గాయాలు తగిలినట్లు కని పిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ఇలా గుం పుగా పక్కపక్కనే చనిపోవటం సాధ్యమా? ⇒ ఒక్కో కూలీ మృతదేహం పక్కనే ఒక్కో ఎర్రచందనం దుంగ ఉంది. కొందరు దానిపై చేయి వేసినట్లు, కాలు వేసినట్లు, దానిపై పడి ఉన్నట్లు ఉన్నారు. కానీ.. మృతదేహాల మధ్య కానీ.. ఒక్కో మృతదేహానికి, దానిపక్కనే పడివున్న దుంగకు కానీ పెద్దగా ఎడం లేదు. ఎర్రచందనం దుంగలు మోస్తున్న వారు.. మోస్తున్నట్లే కాల్పుల్లో చనిపోయారా? కూలీలు నిజంగా దుంగలు మోస్తూ టాస్క్‌ఫోర్సుపై దాడులకు దిగడం సాధ్యమేనా? ⇒ మృతదేహాల పక్కన ఉన్న దుంగలు పాతబడిన దుంగలని స్పష్టంగా తెలుస్తోంది. వాటిపై ఎర్ర రంగు పెయింట్ గుర్తుల ఆనవాళ్లు, ఆ గుర్తులను గీరి చెరిపివేసేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై దాడిలో అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్న దుంగలపై ఇలా పెయింట్‌తో గుర్తు వేసి పక్కనపెడతారు. కూలీలు అడవుల్లో నరికిన దుంగలను పట్టుకెళతారు కానీ.. వాటికి రంగులతో గుర్తులు వేసి పట్టుకెళ్లరు. దీనినిబట్టే.. పోలీసులు గతంలో తాము స్వాధీనం చేసుకుని పెయింట్ మా ర్కులు వేసిన దుంగలను తెచ్చి కూలీల మృతదేహాల వద్ద పడేసినట్లు స్పష్టమవటం లేదా? ⇒ వంద మంది కూలీలు దుంగలు మోస్తూ ఎదురుపడ్డారని టాస్క్ఫోర్సు అధికారులు చెప్తున్నారు. పోలీసుల ‘ఎన్కౌంటర్’లో 20 మంది చనిపోతే.. మిగతా వారంతా పారిపోయారని అంటున్నారు. కానీ.. చనిపోయిన కూలీల దగ్గర మాత్రమే ఎర్రచందనం దుంగలు పడి ఉన్నాయి. అంటే.. మిగతా 80 మంది కూలీలు ఎర్ర చందనం దుంగలను పడేయకుండా.. వాటిని మోసుకుంటూనే.. పోలీసులకు, వారి తూటాలకు చిక్కకుండా పారిపోయారా? -
నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ యాక్ట్
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన నలుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదయింది. ఈ మే రకు మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఓఎస్డీ రత్న వివరాలను వెల్లడించారు. అజాజ్షరీఫ్, నాగేం ద్రనాయక్, అబ్దుల్ ఖాదర్‌బాషా, ఇలియాజ్ ఖాన్‌ను పీడీ యాక్టు కింద వైఎస్సార్ కడప జిల్లాకు తరలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 35మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. వీరిలో 11 మంది బెయిల్‌పై వచ్చినప్పటికీ వీరిపై అనుమానిత కేసులు తెరిచి నిఘా ఉంచామన్నారు. జిల్లాలో దాదాపు 200మంది వరకు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడం ద్వారా ఎర్రచందనం రవాణాను కాస్త తగ్గించామన్నారు. ఈ సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, ఆదినారాయణ, నర్శింహులు, ఎస్ఐ వెంకటచిన్న తదితరులు పాల్గొన్నారు. అజాజ్ షరీఫ్: ఇతనికి అజ్జూ భాయ్, అన్వర్ షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతను బెంగళూరులోని కటిగనహళ్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్. వ్యవసాయం చేస్తూ విలాసవంతమైన జీవితం గడపడానికి ఐదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20 టన్నుల ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై ఇప్పటి వరకు 20 వరకు కేసులు ఉన్నాయి. బుక్కా నాగేంద్ర నాయక్: చిత్తూరు జిల్లా పీలేరులోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఇతడిని రాంజీ నాయక్ అని కూడా పిలుస్తారు. వృత్తి రీత్యా డ్రైవర్ అయినప్పటికీ ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించాడు. ఐదేళ్లుగా 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనిపై జిల్లాలో 23 కేసులు ఉన్నాయి. అబ్దుల్ ఖాదర్‌భాషా: చప్పాని, చప్పు అనే పేర్లతో కూడా పిలవబడే ఇతడు చిత్తూరు నగరంలోని వినాయకపురంలో కాపురం ఉంటున్నాడు. బీకామ్ వరకు చదువుకుని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేశాడు. మూడేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 33 కేసులు ఉన్నాయి. ఇలియాజ్ ఖాన్: బెంగళూరులోని అడగారకలహళ్లికి చెందిన ఇతడు రెండేళ్లుగా స్మగ్లింగ్ వృత్తిలో ఉన్నాడు. గత ఏడాది జిల్లాకు చెందిన పోలీసులు బెంగళూరులో దాడులు చేయగా, వారిపై దాడులకు సైతం తెగబడ్డాడు. ఇతనిపై 10 కేసులు ఉన్నాయి. -
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నెల్లూరు : ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం తేనుగుంట గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు..నెల్లూరు నుంచి చెన్నైకు విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి తేనుగుంట వద్ద ఒక స్కార్పియో, లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో 60 ఎర్రచందనం దుంగలను ఉన్నట్లు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (తడ) -
42 ఎర్రచందనం దుంగల పట్టివేత
గిద్దలూరు రూరల్: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్థానిక అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున బేస్తవారిపేట మండలం హనుమాయిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గిద్దలూరు రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఆర్ఓ షేక్ నజీర్‌బాషా తన సిబ్బందితో హనుమాయిపల్లె సమీపంలో తనిఖీలు నిర్వహించారు. రోడ్డుకు ఒక పక్క అటవీ ప్రాంతంలో అక్రమంగా దాచి ఉంచిన 42 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని గిద్దలూరు అటవీశాఖ కార్యాయానికి తరలిచారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. దాడుల్లో ఎఫ్ఎస్ఓ హరిప్రసాద్, ఎఫ్‌బీఓలు ఓ.రామయ్య, టిప్పుఖాన్, మురళీకృష్ణ, రామకృష్ణ, ఏబీఓ ఎన్.రోజారమణి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆపరేషన్ రెడ్‌లో 22 మంది అరెస్టు
వీరిలో ఐదుగురు బడా స్మగ్లర్లు రూ.10 లక్షల విలువైన దుంగలు స్వాధీనం ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి జిల్లా పోలీసు శాఖ ప్రారంభించి న ఆపరేషన్ రెడ్‌లో ఐదుగురు బడా స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరితోపాటు వారి అనుచరులుగా పనిచేస్తున్న మరో 17 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం చిత్తూరులోని జిల్లా పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆ వివరాలను వెల్లడిం చారు. నిందితుల నుంచి మూడు వాహనాలు, 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను రెండు రోజుల్లో గంగాధరనెల్లూరు, గుడిపాల, చిత్తూరుటూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కథనం మేరకు... గంగాధరనెల్లూరు పరిధిలో.. గంగాధరనెల్లూరు పోలీసుస్టేషన్ పరి ధిలో ఎనిమిది మంది ఎర్ర దొంగల్ని అరెస్టు చేశారు. వీరిలో పేరుమోసిన ఐదుగురు స్మగ్లర్లు ఉన్నారు. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యంకు చెందిన గౌస్ అనే అహ్మద్ (33) ఆపరేషన్‌రెడ్‌లో మోస్ట్‌వాంటెడ్ కింగ్‌పిన్. అలాగే 2011 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ బడా స్మగ్లర్లుగా పేరు మోసిన బాబు, రమేష్, వసంత్‌తో పరిచయాలు పెంచుకుని ఇప్పటి వరకు 200 టన్నుల ఎర్రచందనాన్ని ఎగుమతిచేశాడు. ఇతని వార్షిక ఆదాయం రూ.కోటి.ఇతనిపై జిల్లాలో 40 కేసులు ఉన్నాయి. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన కేఎస్.మధు అనే శ్రీనివాసులు నాయుడు (35) ఎర్రచందనంలో పెలైట్‌గా జీవితం ప్రారంభించి స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. ఇప్పటి వరకు 150 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశాడు. ఇతని నెలసరి ఆదాయం రూ.5 లక్షలు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి.చిత్తూరు లాలూగార్డెన్‌కు చెందిన లెఫ్ట్ మున్నా (33) కర్ణాటకకు చెందిన స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతనిపై 18 కేసులున్నాయి. లాలూగార్డెన్‌కు చెందిన మరోస్మగ్లర్ దాడి మున్నా(32) బడా స్మగ్లర్. ఇతనిపై జిల్లాలో 18 కేసులు ఉన్నాయి. నగరంలోని కట్టమంచికి చెందిన ఖాలిక్ అనే పిచాండి (29)పై 17 కేసులు ఉన్నాయి. ఈ ఐదుగురితో పాటు వీరికి పెలైట్, డ్రైవర్లుగా ఉన్న తిరువన్నామలైకు చెందిన మురుగేష్(35), తుమ్మిందపాళ్యంకు చెందిన మురళి (40), సి.బాబు (30)ను పోలీసులు అరెస్టు చేశారు. గుడిపాల పరిధిలో... గుడిపాల పోలీసు స్టేషన్ పరిధిలో నగరికి చెందిన నవాజ్ (28), తుమ్మిందపాళ్యంకు చెందిన ఖాదర్‌భాషా అనే సేదు (33), మురళి అలియాస్ గజేంద్ర (24), రాజేష్ (26), చిత్తూరు రామ్‌నగర్‌కు చెందిన అబ్దుల్లా మస్తాన్ (26), పొద్దుటూరుకు చెందిన ఎంవీ.సుబ్బారెడ్డి అలియాస్ రాఘవరెడ్డి (25), హోసూరుకు చెందిన శబరీష్ (25) శక్తి అనే శివాజీ (24)లను అరెస్టు చేశారు. టూటౌన్ పరిధిలో... చిత్తూరు నగరంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మనదపల్లెలోని బసినికొండకు చెందిన ఫయాజ్ బాషా అలియాస్ మక్బూల్‌బాషా (29), చిత్తూరులోని తుమ్మిందపాళ్యంకు చెందిన శరవణన్ అనే దూర్వాసులు (33), మురుగేశన్ (42), తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ఏలుమలై అనే గోవిందన్ (32), పూతలపట్టుకు చెందిన రాజమని అనే చిన్నబ్బ (32), రమేష్ అనే మణి (30)లను అరెస్టు చేశారు. -
కర్నూలులో ‘ఎర్ర’ డంప్ స్వాధీనం
జిల్లా వ్యాప్తంగా 19 మంది స్మగ్లర్ల అరెస్టు రూ.కోటి విలువైన దుంగలు, వాహనాలు సీజ్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా పోలీసులు జరిపిన దాడుల్లో 19 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 179 ఎర్రచందనం దుంగల్ని సైతం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. కర్నూలులో భారీ డంప్.. చిత్తూరు పశ్చిమ విభాగం సీఐ ఆదిరానాయణ తన ఎస్ఐలు, సిబ్బందితో కలిసి మూడు రోజుల క్రితం కాణిపాకం వద్ద ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతను చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన షామీర్‌బాషా (25)గా గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలం గోకవరం గ్రామంలో వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో 179 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. షామీర్బాషాను ఇప్పటికే అరెస్టు చేసి, రిమాండు పంపగా కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లును బుధవారం అరెస్టు చేసి, దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పీలేరు పరిధిలో.. పీలేరు సీఐ నరసింహులు మంగళవారం పీలేరు శివారు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో పీలేరుకు చెందిన నాగేంద్రనాయక్ (27) మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ ఉన్నాడు. ఇటుకల వ్యాపారం నుంచి ఎర్రచందనం డాన్‌గా ఎదిగాడు. నాగేంద్రనాయక్‌తో పాటు పీలేరు పరిసర ప్రాంతాలకు చెందిన చెంగల్‌రెడ్డి, వెంకటముని, తేజ, శంకర్, చెంగల్రాయుడు, రమణనాయక్, సురేంద్ర, రాజన్న, గోపినాయన్, సురేష్‌ను అరెస్టు చేశారు. వాయల్పాడు పరిధిలో.. వాయల్పాడు సీఐ శ్రీధర్ తన సిబ్బందితో మంగళవారం మండలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో వైఎస్సార్ జిల్లా పొద్దుటూరుకు చెందిన డీ.బాలచంద్ర (27), ఎం.అరుణ్‌కుమార్ (24), ఎం.నరేంద్రకుమార్ (25), బీ.ఆదినారాయణ (22), ఎం.సురేష్‌రెడ్డి (32), వేంపల్లెకు చెందిన రవికుమార్ (35)లను అరెస్టు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితుల నుంచి 217 ఎర్రచందనం దుంగలు, ఓ సుమో, మారుతి-800, ఐదు మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరిధర్, దేవదాసు, సీఐలు, ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు షాదిక్ అలీ, మహేశ్వర్ పాల్గొన్నారు. -
రూ.2 కోట్ల విలువైన ఎర్ర చందనం పట్టివేత
చిత్తూరు జిల్లా: చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఎర్ర చందనం విలువ రూ.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కొల్లగొడుతున్నారు!
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత! నదులను లూఠీ చేస్తున్న తెలుగుతమ్ముళ్లు రాత్రిళ్లు పొక్లెయిన్లతో తోడేస్తున్నారు బెంగుళూరు, చెన్నైలకు యథేచ్ఛగా ఎగుమతి రాళ్లు తేలి రోదిస్తున్న పాపాఘ్ని, పెన్నానదులు కడప: ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే’ తలంపు తెలుగు తమ్ముళ్లల్లో బలపడింది. అందుకు ప్రకృతి సంపదను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఒక్కరోజులో లక్షలు పోగుచేసుకునే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తొలుత ఎర్రచందనం దృష్టి సారించి సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా తీవ్రతరం కావడంతో, ఇసుక వైపు వారి దృష్టి మళ్లింది. నదుల్నీ కొల్లగొట్టుతున్నారు. పోటీలు పడి ఇసుక తోడేస్తుండడంతో పాపాఘ్ని, పెన్నా నదుల్లో రాళ్లు తేలియాయి. రాత్రి సమయంలో యంత్రాలతో ఇసుకను తరలిస్తున్న ఘటనలు జిల్లాలో విచ్చలవిడి అయ్యాయి. అధికారపార్టీ నేతల్లో కొందరికి ప్రస్తుతం ఇసుక అక్రమరవాణే అక్రమార్జన అయింది. పొద్దుగూటికి చేరగానే నదుల్లో వీరి విజృంభణ మొదలై పొద్దుపొడిచే సమయానికి ముగిస్తుంది. సమీప గ్రామాల్లో మిషన్లను, లారీలను అందుబాటులో ఉంచుకుని రాత్రి కాగానే నదుల్లోకి ప్రవేశించి ఇసుకను తోడేస్తున్నారు. స్థానికులకు తెలిసినా నిశ్చేష్ట్రులై చూస్తుండిపోవడం మినహా ఏమీచేయలేని స్థితి. అధికారులకు సమాచారం అందించినా పేర్లు తెలుస్తున్నాయని మిన్నకుండిపోతున్నారు. పాపాఘ్ని... పెన్నా లూఠీ.... జిల్లాలో పాపాఘ్ని, పెన్నా నదులు లూఠీ అవుతున్నాయి. తర్వాత స్థానాన్ని చెయ్యేరు నది ఆక్రమించింది. పాపాఘ్ని నదిలో వేంపల్లె నుంచి కమలాపురం వరకూ అంచెలంచెలుగా నదిలోని ఇసుకను తోడేస్తున్నారు. వేంపల్లె, తంగేడుపల్లె, నందిమండలం, పైడికాల్వ, కమలాపురం తదితర పల్లెల్లో ఇసుక అక్రమరవాణాను అలుపెరగకుండా చేస్తున్నారు. పైడికాల్వ సమీపంలో పాపాఘ్ని నదిలో విందు ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాలకు తెలుగుతమ్ముళ్లు రక్షణగా నిలుస్తున్నారు. నదిలో యంత్రాలతో లారీలకు ఇసుకను నింపడమే కాకుండా జిల్లా హద్దులు దాటేంతవరకూ ఎస్కార్టుగా తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంత తతంగం నిర్వహిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకున్నారు. అందుకు కారణం అధికారపార్టీ నేతల బెదిరింపులేనన్నది సుస్పష్టం. అలాగే పెన్నా నదిలో కొండాపురం నుంచి చెన్నూరు వరకూ ఆయా ప్రాంతాల్లోని అధికారపార్టీ నేతల అనుచరులు ఇసుక అక్రమ రవాణా అక్రమాధాయంగా ఎంచుకున్నారు. కొండాపురం, ప్రొద్దుటూరుల నుంచి నిత్యం బెంగుళూరుకు ఇసుక తరలివెళ్తోంది. తెలుగుతమ్ముళ్లు కాకుండా ఇతరులు నదిలోకి దిగితే వెంటనే అధికారులకు ఫోన్లు చేసి పట్టిస్తూ పోటీ లేకుండా చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదులకు మాత్రమే అధికారులు సైతం స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక టీం ఏర్పాటైనా.... ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆరు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్డీఓ పరిధిలో రెండు టీంలు పనిచేస్తున్నారుు. ఈ టీంలో రెవిన్యూ, ఫారెస్టు, మైనింగ్, పోలీసు శాఖలకు చెందిన సభ్యులు ఉంటారు. ఇసుక డంప్‌లు, ఇసుక అక్రమరవాణా అరికట్టడంలో వీరు విఫలం అవుతున్నారు. అందుకు కారణం ఈ టీంలు ఆర్డీఓల పర్యవేక్షణలో ఉండడమేనని తెలుస్తోంది. కలెక్టర్ కంట్రోల్లోనే స్పెషల్ టీంలు ఉంటే తప్ప అక్రమరవాణా నియంత్రించడం సాధ్యం కాదని తెలుస్తోంది. ‘ఎర’గా డంప్‌లు.... అధికారుల దాడులకు ఎరగా డంప్‌లను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అనువైన ప్రాంతానికి ఇసుకను చేర్చడం అధికారులకు చెప్పి సీజ్ చేయించడం, ఆపై దానిని వేలంలో దక్కించుకోవడం లాంటి ఎత్తుగడలను అధికారపార్టీ నేతలు కొన్ని ప్రాంతాలల్లో చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో దక్కించుకున్న ఇసుకకు యంత్రాంగంచే అనుమతి పొంది, ఆ అనుమతితో నదుల్లోని ఇసుకను తరలిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నందిమండలం, పెద్దచెప్పలి, పైడికాల్వ సమీపంలో పట్టుబడ్డ ఇసుక డంప్‌లు నిలుస్తున్నాయి. వాటిని సీజ్ చేయించడం, ఆ ఇసుకను తరలించేందుకు అనుమతి దక్కించుకోవడం, అక్రమంగా కొల్లగొట్టడం తంతు యధేచ్ఛగా నడుస్తోంది. ఇలాంటి వ్యవహారాలకు ఆర్డీఓ కార్యాలయాలే వేదికగా నిలుస్తుండడం విశేషం. పీడీ యాక్టు ప్రయోగిస్తేనే.... ఇసుక అక్రమరవాణా అరికట్టాలంటే పీడీ యాక్టు ప్రయోగిస్తే మినహా సాధ్యం కాదనేది నిర్వివాదాంశం. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ, కలెక్టర్ కేవీ రమణ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా స్పందిస్తున్నారు. -
మోస్ట్ వాంటెడ్ ఎర్రస్మగ్లర్ అరెస్ట్
జిల్లాలో ఇప్పటికే 23 కేసుల్లో నిందితుడు మరో నలుగురితో పాటు దుంగలు, వాహనాలు స్వాధీనం రేణిగుంట: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే 23 కేసుల్లో నిందితుడిగా ఉన్న చెన్నైకు చెందిన బడా స్మగ్లర్ సోమురవి (39)ని రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి ఆయిల్ ట్యాంకరు, ఓ కారు, బైక్‌లతో పాటు రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట అర్బన్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ నంజుండప్ప , అర్బన్ సీఐ బాలయ్య విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచారు. అర్బన్ సీఐ బాలయ్య మాట్లాడుతూ మండలంలోని ఆంజనేయపురం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించామన్నారు.హుందాయ్ కారులో ఐదు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి సమాచారంతో తుంబూరు తీర్థం క్రాస్ రోడ్డుకు ఉత్తరంగా అటవీ ప్రాంతంలో 9మంది ఒక ఆయిల్ ట్యాంకరుతో ఎర్ర చందనం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉండగా వారిని పట్టుకోడానికి ప్రయత్నం చేశామన్నారు. వారు పోలీసులపై గొడ్డళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. చాకచక్యంగా ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఆరుగురు పరారీ అయినట్లు చెప్పారు. అయిదుగురిలో కన్నయ్య(34),విజయకుమార్(33), సోము రవి(39),గణేష్(24), బాలసుబ్రమణ్యం(33)ను అరెస్టు చేశామన్నారు. వీరిలో సోమురవి పదేళ్లుగా జిల్లాలో 2012 -2014 మధ్య భాకరాపేట, వాయల్పాడు, చిత్తూరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి,నగరి, నిండ్ర, జీడీ నెల్లూరు, రొంపిచర్ల ప్రాంతాల్లో అనుచరులతో కలిసి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు. సోమురవి 23 కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడని చెప్పారు. ఇతనిపై పీడీ యాక్టు పెట్టేందుకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు రమేష్, చాకలి నాదముని, చెన్నైకి చెందిన వెంకటేష్, బాల, రామనాథన్, భాస్కరన్‌ను త్వరలో అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో ఎస్ఐ మధుసూదన్,రైటర్ ముద్దుయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఎర్ర’దొంగలపై ముప్పేట దాడి
ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు ప్రణాళిక తిరుపతి కేంద్రంగా ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఏర్పాటు నేడు కేంద్ర, సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమావేశం తిరుపతి: ఎర్రదొంగలపై ముప్పేట దాడితో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రణాళిక రచించింది. ఇప్పటికే పోలీసు-అటవీశాఖలు సంయుక్తంగా తిరుపతి కేంద్రంగా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విది తమే. కర్ణాటక, తమిళనాడు పోలీసులు, డీఆర్ఐ (డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్), పీఐటీ (పోర్ట్ ట్రస్ట్ అథారిటీ), కస్టమ్స్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఎర్రదొంగల ఆట కట్టించవచ్చునని నిఘా వర్గాలు తేల్చి చెప్పాయి. ఆ మేరకు తమిళనాడు, కర్ణాటక డీజీపీలు, డీఆర్ఐ, ఈడీ, పీఐటీ, కస్టమ్స్ విభాగాల అధికారులతో తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో గురువారం డీజీపీ జేవీ రాముడు సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని గుర్తించిన ప్రభుత్వం ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ను ఏర్పాటుచేసింది. 463 మంది సిబ్బంది ఏర్పాటయ్యే ఈ ప్రత్యేక దళం తిరుపతి కేంద్రంగా పనిచేస్తుందని ప్రకటించింది. ఒక్క ఆర్ఎస్ఏఎస్టీఎఫ్తో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని నిఘా వర్గాలు ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. సమన్వయంతోనే వేట.. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, పాలకొండ, వెలిగొండ అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను కర్ణాటక, తమిళనాడు మీదుగా నౌకాశ్రయాలకు చేర్చుతున్నారు. ప్రధానంగా చెన్నై, చిక్మంగళూరు, కృష్ణపట్నం నౌకాశ్రయాల ద్వారా ఎర్రచందనాన్ని ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. మయన్మార్, థాయ్‌లాండ్, మలేషియా, బ్యాంకాక్, చైనా తదితర దేశాల్లోని అంతర్జాతీయ స్మగ్లర్లు నౌకాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దేశం నుంచి ఎగుమతి చేసిన స్మగ్లర్లకు అంతర్జాతీయ స్మగ్లర్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పైకాన్ని జమ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా ద్రవ్యమార్పిడికి అడ్డుకట్ట వేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చెక్ పెట్టవచ్చునని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఈడీతో పలు సందర్భాల్లో చర్చలు జరిపారు. ఓడరేవుల్లో ఎర్రచందనం ఎగుమతికి అడ్డుకట్ట వేయాలంటే పీఐటీ, కస్టమ్స్ అధికారుల సహకారం తప్పనిసరని ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఈడీ, పీఐటీ, కస్టమ్స్, డీఆర్ఐ అధికారులతోనూ.. కర్ణాటక, తమిళనాడు డీజీపీలతోనూ సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశించారు. రెండు దశలుగా సమావేశం.. కేంద్రం హోంమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తిరుపతిలో తొలి సమన్వయ సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు. సమావేశానికి తమిళనాడు, కర్ణాటక డీజీపీలతోపాటూ కస్టమ్స్, పీఐటీ, డీఆర్ఐ, ఈడీ అధికారులు, 60 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ డీజీపీలతో సెంట్రల్ ఐబీ అధికారులు సమావేశమవుతారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు ఐబీ గుర్తించిన నేపథ్యంలో మూడు రాష్ట్రాల డీజీపీలతో సమావేశం నిర్వహిస్తుండటం గమనార్హం. -
ఎర్రచందనం స్వాధీనం ఆరుగురి అరెస్ట్
సుమో, రెండు బైక్‌లు స్వాధీనం బి.కొత్తకోట: ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా సుమోతో పాటు రెండు బైక్‌లను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు తీసుకుని వెళుతున్న ఆరుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని అమరనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా నంబూలపూలకుంట నుంచి వచ్చిన టాటాసుమోను తనిఖీ చేయగా మూడు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయన్నారు. ఘటనా స్థలం లో ఆరుగురు పట్టుబడగా, మరో ఆరుగురు పరారయ్యారని తెలిపారు. సుమోలోని 234 కిలోల మూడు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దుంగలు తరలిస్తున్న వారిలో మదనపల్లె పట్టణం బోయవీధికి చెందిన ఎంవీ.నాగరాజు(30), వైఎస్ఆర్జిల్లా రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీకి చెందిన కే.శ్రీనివాసులు (34), రెడ్డీస్కాలనీకి చెందిన పీ.రెడ్డికిషోర్(23), బి.కొత్తకోట మండలం బూదలవారిపల్లెకు చెందిన ఎం.వెంకటనరుసు (20), ఎన్.సురేష్(28) అమరనారాయణపురానికి చెందిన ఎస్.బషీర్(58)ను అరెస్ట్ చేశామని చెప్పారు. దుంగల విలువ రూ. 4. 68 లక్షలు, వాహనాల విలువ రూ.3 లక్షలుగా లెక్కించారు. ఈ కేసులో గుర్రంకొండ మండలం కలూరివారిపల్లెకు చెం దిన ఎస్.చంద్రశేఖరనాయుడు, ములకలచెరువు మండలం చింతరేవులపల్లెకు చెందిన కే.వెంకటేష్, తంబళ్లపల్లెకు చెందిన ఎం.చంద్రశేఖర్, కర్ణాటకలోని కటికహళ్లికి చెందిన సలీం పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టుకు హజరుపరిచినట్టు వివరించారు. బుచ్చినాయుడుకండ్రిగలో బుచ్చినాయుడుకండ్రిగ : బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఎర్రచందనం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఈశ్వరయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలను తనిఖీచేస్తుండగా 10 ఎర్రచందనం దుంగలు చెన్నైకు తరలిస్తున్న లారీ పట్టుబడిందని చెప్పారు. ఎర్రచందనం విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం తరలిస్తున్న చెన్నైకు చెందిన 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని తెలిపారు. -
‘ఎర్రచందనం’పై సంఘటిత పోరాటం
తిరుపతిలో జనవరి మొదటి వారంలో సదస్సు కర్ణాటక,తమిళనాడు ఉన్నతాధికారులు హాజరు అన్ని శాఖలూ ఒకే వేదికపైకి అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం ‘సాక్షి’తో చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా అంతర్రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులను ఒకే వేదికపైకి తెచ్చి సంఘటిత పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీసు, ఫారెస్టు ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. చారిత్రక, విలువైన ఎర్రచందనాన్ని కాపాడడమే లక్ష్యంగా సంఘటిత పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. చందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే మూడు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అందుకే కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల పోలీసు, ఫారెస్టు ఉన్నతాధికారులతో కలిసి చర్చించాల్సిన ఆవశ్యకతను గుర్తించామన్నారు. ఇదే విషయం డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని ఎస్పీ తెలిపారు. తక్షణమే తిరుపతిలో సదస్సు నిర్వహించాలని డీజీపీ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతి సదస్సులో మూడు రాష్ట్రాల డీజీపీలతో పాటు మూడు రాష్ట్రాలకు చెందిన పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు న్యాయశాఖకు సంబంధించిన ముఖ్యులు సైతం పాల్గొంటారన్నారు. మన రాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతాల పరిధిలోని ఆయా జిల్లాల ఎస్పీలు సైతం సదస్సులో పాల్గొంటారని ఆయన తెలిపారు. జనవరి మొదటివారంలోనే సదస్సు ఉంటుందన్నారు. సదస్సు అనంతరం చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు యూక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. తొలుత ఎర్రచందనం విలువ - అక్రమ రవాణా అరికట్టడడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఇప్పటికే వర్క్‌షాపులు,కళాజాతాలతో ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. సేఫ్ అండ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగరంలోని జ్యువెలరీ, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో పట్రోలింగ్ కూడా తొందరలోనే ప్రారంభిస్తామన్నారు. పట్రోలింగ్ కోసం బ్లూ, వైట్ రక్షక్ వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. సిగ్నల్స్‌కు సంబంధించి ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మొదట రోడ్లల్లో అడ్డంకిగా ఉన్న వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తామన్నారు.వివిధ వర్గాలు, యూనియన్లను ఇందులో భాగస్వాములు చేయనున్నట్లు చెప్పారు. ఖర్చుతో కూడుకున్న సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్పొరేషన్‌తోపాటు వ్యాపారవేత్తలు, ఎన్జీవోలు, ఎన్ఆర్ఐలను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. -
రెండు వాహనాలు సహా ఎర్రచందనం స్వాధీనం: ఆరుగురి అరెస్టు
వడమాలపేట : తిరుపతి రిజర్వు ఫారెస్టు నుంచి తమిళనాడుకు రెండు వాహనాల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా వడమాలపేట పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప శుక్రవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. వడమాలపేట సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద స్థానిక ఎస్ఐ ఈశ్వరయ్య సిబ్బందితో కలిసి గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి వైపు నుంచి వచ్చిన టవేరా, ఇన్నోవా వాహనాలను అనుమానంతో ఆపి తనిఖీ చే శారు. అందులో 27 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాహనాల్లో ప్రయూణిస్తున్న పొన్నుస్వామి, రాజ్‌కుమార్, అన్నామలై, పెరియస్వామి, ఇళయరాజ, విమల్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు తమిళనాడులోని వెల్లిపురం, ధర్మపురి జిల్లాల నుంచి వచ్చినట్లు తెలిపారు. తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో దుంగలను నరికి వాహనాల్లో చెన్నైకి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీటి విలువ 16లక్షల, 80వేల రూపాయలుగా అంచనావేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, వడమాలపేట ఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.కోటి విలువ గల ఎర్రచందనం స్వాధీనం
కడప అర్బన్: అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ, కడప ఇన్చార్జి డీఎఫ్ఓ నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ ఎస్ఎం హయాత్, రాయచోటి ఎఫ్ఆర్ఓ శ్రీరాములు తమ సిబ్బందితో కడప-రాజంపేట రహదారిలోని భాకరాపేట సమీపంలోగల హెచ్‌పీసీఎల్ వద్ద లారీతోసహా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనాన్ని తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భాకరాపేటకు చెందిన తుర్రా వెంకట సుబ్బయ్య, తుర్రా ప్రతాప్, తుర్రా శ్రీనివాసులు, తుర్రా ప్రభాకర్‌లు తరలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నామని డీఎఫ్ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిలో మూడు టన్నుల బరువున్న 94 ఎర్రచందనం దుంగలను, 10 టైర్ల లారీ (ఏపీ16 టీయూ 2722)ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పరారయ్యారన్నారు. ఎర్రచందనం దుంగల విలువ కోటి రూపాయలు, లారీ రూ.8 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న ఎఫ్ఆర్ఓలు హయాత్, శ్రీరాములు, ఎఫ్‌ఎస్‌ఓలు ఓబులేసు, చెండ్రాయుడు, ఎంబీఓలు శ్రీనివాసులు, సురేష్, కృష్ణ, ప్రొటెక్షన్ వాచర్లు, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అభినందించారు. 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం బద్వేలు అర్బన్: అక్రమంగా తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ ఇండికా వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బద్వేలు సీఐ వెంకటప్ప తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ21 ఏఆర్ 3978 నంబరుగల ఇండికా కారు అనుమానాస్పదంగా ఉండడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 8 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కారులో ఉన్న అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన పఠాన్ బాబా ఫకృద్దీన్ అలియాస్ బాబు, సింహాద్రిపురం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన రాంబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి బెంగళూరుకు చెందిన పేరుమోసిన స్మగ్లర్ అక్రమ్ అనుచరుడు తంబుకు దుంగలు చేరవేస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ నాగమురళి, ఎస్బి ఎస్ఐ రామాంజనేయులు, ఐడీపార్టీ కానిస్టేబుళ్లు నాగార్జున, శేఖర్‌బాబు, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
టైరు పంక్చరై దొరికిపోయిన ఎర్రదొంగలు
వాహనం సహా రూ.20 లక్షల విలువ గల దుంగలు స్వాధీనం పోలీసుల అదుపులో ఒకరు, మరో ఇద్దరు పరారీ చౌడేపల్లె: వాహనం టైరు పంక్చర్ కావడంతో ఎర్రచందనం దొంగలు దొరి కిపోయిన ఘటన మంగళవారం ఉదయం చౌడేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉదయం ఏపీ16జె4821 నంబర్ గల ఫోర్డ్ ఫియెట్ కారు సోమల నుంచి చౌడేపల్లె వైపునకు అతివేగం గా వస్తోంది. కడియాలకుంట సమీపంలో ముందు టైరు పంక్చర్ అయింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా మరింత వేగంగా చౌడేపల్లె బస్టాండు మీదుగా పుంగనూరు రోడ్డు వైపు వెళ్లాడు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ప్రయివేటు రైసు మిల్లు వద్ద కారు ఆపి ఆతృతగా టైరు మార్చుతుండడం తో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నాగార్జునరెడ్డి తన సిబ్బంది తో కలిసి అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు రాడ్లతో పోలీసులపై దాడికి ప్రయత్నించారు. అందులో ఒకరిని పోలీ సులు అదుపులోకి తీసుకోగా మిగిలి న ఇద్దరు పొలాల్లోకి పారిపోయా రు. కారులో తొమ్మిది దుంగలు బయటపడ్డాయి. దొరికిన వ్యక్తి వై ఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వాడిగా గుర్తించారు. ఇంటి దొంగల పనేనా.. పోలీసులకు దొరికిన ఎర్రచందనం దుంగలు డిపోలో నిల్వ చేసినవేన ని పోలీసులు అభిప్రాయపడుతున్నా రు. సాధారణంగా ఫారె్‌స్ట్, పోలీసులకు దుంగలు పట్టుబడితే కేసులో నమోదు చేసేందుకు దుంగల పొడ వు, బరువును పెయింట్‌తో నమో దు చేస్తారు. పోలీసులకు చిక్కిన తొమ్మిది దుంగలపైనా పెయింట్ తో వివరాలు ఉండడంతో డిపోలో నిల్వచేసిన దుంగలుగా అనుమానిస్తున్నారు. ఎస్ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్సు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్ర చందనం మనజాతి సంపద
జిల్లాలో 41 మంది స్మగ్లర్లపై పీడీయాక్టు 3,200 మంది ఎర్రకూలీల అరెస్ట్ జిల్లా వ్యాప్తంగా కళాజాతాలతో ప్రదర్శనలు డీఐజీ బాలకృష్ణ చేయీచేయి కలుపుదాం.. మనజాతి సంపద ఎర్రచందనాన్ని కాపాడుకుందాం.. అంటూ ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, డ్వాక్రా మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ‘కదులుదాం - ఎర్రచందనం కాపాడుదాం’ పేరుతో పీలేరులో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. .. పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి స్మగ్లింగ్‌ను సమూలంగా అణచివేయడమే తమ ప్రధాన లక్ష్యమని అనంతపురం డీఐజీ బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. జిల్లా నుంచి ఒక్క ఎర్రచందనం దుంగను కూడా అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 మంది ఎర్ర స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చేసి, రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించామ ని చెప్పారు. ఎర్రచందనంను తరలిం చడానికి సహకరిస్తున్న 3,200 మంది కూలీలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించా రు. అత్యంత ఖరీదైన ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవడంలో పోలీసులతో యువత, విద్యార్థులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎర్రచందనం ఆవశ్యకతను తెలియజేయడం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కళాజాత నిర్వహిస్తామన్నారు. కర్ణాటక, తమిళనాడు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్మగ్లర్ల మాయ మాటలకు మోసపోయి యువత ఆ ఉచ్చులో ఇరుక్కోరాదని పిలుపునిచ్చారు. చేయి చేయి కలుపుదాం : ఎస్పీ అత్యంత ఖరీదైన ఎర్రచందనం స్మగ్లిం గ్ను చేయి చేయి కలిపి అడ్డుకుందామ ని చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివా స్ అన్నారు. మంగళవారం పీలేరు ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగా వేర్‌హౌస్ గోడౌన్ ప్రాంగణంలో జిల్లా పోలీస్ శా ఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కదులుదాం - ఎర్రచందనం కాపాడుదాం’ బహిరంగ సభలో ఆయ న మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో ఎర్రచందనానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మన జాతి సంపదను కొందరు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకోవడం తగదని పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి విద్యార్థు లు ముందుకు రావాలన్నారు ఇప్పటికే ఆ రొచ్చు లో ఉన్న వారిలో మార్పు వచ్చినా రాకపోయినా కొత్తవారు అందులోకి దిగకుండా చూడాలన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టడంలో విద్యార్థులంతా గైడ్‌గా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఐజీలు బాలకృష్ణ, ఇక్బాల్, చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, మదనపల్లె సబ్ కలెక్టర్ కణ్ణన్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రత్న, మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు భారీర్యాలీ నిర్వహించారు.