Business
-
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
నేలపై కారు.. గాలిలోనూ షికారు!
చైనీస్ ఆటోమేకర్ ఎక్స్‌పెంగ్ అనుబంధ సంస్థ అయిన ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరుతో కొత్త మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించింది. రెండు మాడ్యూళ్లను కలిగిన ఈ కారును ఇటీవలి 15వ చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మదర్షిప్, ఎయిర్‌క్రాఫ్ట్ అనే రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. మదర్షిప్ పొడవు 5.5 మీటర్లు, ఎత్తు, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. విద్యుత్‌తో నడిచే ఈ కారు ఇది 1000 కిలోమీటర్లకుపైగా రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎయిర్‌క్రాఫ్ట్ ఆరు-రోటర్, డ్యూయల్-డక్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ , తేలికైన మన్నిక కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. ఎక్స్‌పెంగ్ ఈ ఫ్లయింగ్ కార్లను ఒక కొత్త ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఇది 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.China’s Xpeng just unveiled a modular flying car called the Land Aircraft Carrier. This vehicle combines a ground module—a fully functional EV—with an air module capable of vertical takeoff and flight. pic.twitter.com/ZpqW7CjSr5— Tansu Yegen (@TansuYegen) November 20, 2024 -
నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ప్రారంభం
దక్షిణాఫ్రికాకు సరికొత్త ఎస్యూవీ న్యూ నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభించింది. “ఒక కారు, ఒకే ప్రపంచం” విధానంతోపాటు భారత్‌ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఎగుమతులు చేపట్టింది.ఈ వాహనాలు చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ నుండి ఎగుమతి అవుతున్నాయి. సరికొత్త మాగ్నైట్ మోడల్‌ను దిగుమతి చేసుకున్న మొదటి అంతర్జాతీయ మార్కెట్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్‌లో లాంచ్ అయిన ఒక నెలలోనే, చెన్నై పోర్ట్ నుండి 2,700 యూనిట్లకు పైగా న్యూ మాగ్నైట్ వాహనాలు ఎగుమతయ్యాయి.కాగా 2020 డిసెంబర్లో మాగ్నైట్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది నిస్సాన్క “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవ విజయాన్ని చాటుతోంది. బోల్డ్ లుక్, మెరుగైన భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన న్యూ మాగ్నైట్ ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయింది. -
వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కేఫ్ సేవలను విస్తరిస్తున్నట్టు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్లలో 120కిపైగా కేఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్టు వివరించింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, పుణే నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించింది.అధిక నాణ్యత గల ఆహార తయారీ ప్రక్రియతో 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేశామని, అందుకే బలమైన కస్టమర్ స్పందనను చూస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రూయింగ్ నైపుణ్యాలను ఉపయోగించే కాఫీ మెషీన్లతో సహా కేఫ్‌ల కోసం అత్యాధునిక పరికరాలను నిశితంగా పరిశోధించి, తమ బృందం సేకరించిందని వివరించింది.ఇదీ చదవండి: జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలుచాయ్, కాఫీ, అల్పాహారం, పేస్ట్రీస్, స్నాక్స్ వంటి 148 రకాల ఉత్పత్తులను 10 నిముషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త నగరాలకు విస్తరించడం, ప్రతి నెలా 100కుపైగా కొత్త కేఫ్‌లను ప్రారంభిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,000 కోట్ల యాన్యువల్ రన్ రేట్ సాధిస్తామని జెప్టో సీఈవో ఆదిత్ పలీచా తెలిపారు. -
బంగారం హ్యాట్రిక్ మోత!
Gold Price Today: దేశంలో బంగారం ధరల పరుగు కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 20) పసిడి రేట్లు హ్యాట్రిక్ మోత మోగించాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పుత్తడి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 పెరిగి రూ.71,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.550 ఎగసి రూ.77,620 వద్దకు పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పుంజుకొన్నాయి.దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.71,300 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.550 ఎగిసి రూ.77,770 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానానిలకడగా వెండిSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒక డాలరుకే ఇల్లు.. ట్రంప్ నచ్చని వాళ్లు వచ్చేయండి!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండో పర్యాయం పదవీకాలాన్ని వచ్చే జనవరి 20న ప్రారంభించబోతున్నారు.అమెరికన్లు ఎన్నికల ఫలితాలపై మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నారు. ఈసారి ట్రంప్ పరిపాలన ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కొంత మందిలో ఉంది. చాలా మంది డెమొక్రాట్ మద్దతుదారులు ఇప్పుడిప్పుడే ఎన్నికల షాక్ నుండి బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఇటాలియన్ ద్వీపం సార్డినియాలోని ఒక గ్రామం జనాభాను పెంచుకోవడానికి వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది.వార్తా సంస్థ సీఎన్ఎన్ ప్రకారం.. యూఎస్ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన అమెరికన్లకు ఒక డాలర్‌కే గృహాలను అందిస్తోంది. గ్రామీణ ఇటలీలోని అనేక ఇతర ప్రదేశాల మాదిరిగానే ‘ఒల్లోలై’ గ్రామం కూడా తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కొంటోంది. పునరుద్ధరణ కోసం బయటి వ్యక్తులను ఆకర్షించడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ ధరకే విక్రయిస్తోంది.రాజకీయాలతో అలసిపోయారా?ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అమెరికన్ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకుని వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కొత్త పాలనతో ఆందోళన ఉన్నవారిని తమ గ్రామానికి ఆకర్షిస్తూ చౌకగా గృహాలను అందిస్తోంది. "మీరు ప్రపంచ రాజకీయాల వల్ల అలసిపోయారా? కొత్త అవకాశాలను పొందుతూ మరింత సమతుల్య జీవనశైలిని స్వీకరించాలని చూస్తున్నారా?" అంటూ వెబ్సైట్ అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు మేయర్ ఫ్రాన్సిస్కో కొలంబు సీఎన్ఎన్తో చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చేవారిని కూడా తాము వద్దనమని, అయితే అమెరికన్లకు ఫాస్ట్-ట్రాక్ విధానం ఉంటుందని పేర్కొన్నారు.క్రూయిజ్ కూడా..ఈ ఇటాలియన్ గ్రామంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న అమెరికన్లు ట్రంప్ కొత్త పాలన నుంచి దూరంగా వెళ్లేందుకు క్రూయిజ్ లైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో సర్వీస్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ట్రంప్ పాలన ముగిసే వరకు 140 దేశాలలో 425 పోర్టులు తిరిగి రావచ్చు. -
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్‌మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్‌లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్‌షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్‌లో సంయత్ సర్వీసెస్‌కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్.. ఇక వేగవంతమైన నెట్వర్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండోర్ నెట్‌వర్క్‌ను 20కిపైగా జిల్లాల్లో మెరుగుపర్చినట్టు తెలిపింది. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 3,450కిపైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది.తద్వారా కస్టమర్లకు మెరుగైన నెట్వర్క్ లభిస్తుందని తెలిపింది. రూ.691 కోట్లతో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 2.4 మెగాహెట్జ్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. 5,000లకుపైగా సైట్స్‌లో నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను 10 మెగాహెట్జ్ నుండి 20 మెగాహెట్జ్‌కి అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. తద్వారా వినియోగదార్లు వేగవంతమైన డేటాను అందుకోవచ్చని వివరించింది.ఇదీ చదవండి: మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా? -
స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు దాఖలయ్యాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) సబర్మతి ఏవియేషన్, జెట్ఎయిర్17 సంస్థలు వీటిని దాఖలు చేశాయి. సబర్మతి పిటీషన్‌పై స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్సీఎల్టీ.. 27 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌కు సంబంధించి అదనంగా మరిన్ని పత్రాలు సమర్పించాలని జెట్ఎయిర్17కి సూచించింది.ఐర్లాండ్‌కి చెందిన జెట్ఎయిర్17 .. విమాన ప్రయాణికుల రవాణాకు సంబంధించిన పరికరాలను లీజుకు అందిస్తుంది. తాము విల్మింగ్టన్ ట్రస్ట్ నుంచి విమానాలను లీజుకు తీసుకోగా, బాకీలు తీర్చాలని జెట్ఎయిర్17 కోరుతోందని స్పైస్‌జెట్ వాదించింది. విల్మింగ్టన్ ట్రస్ట్‌కి, జెట్ఎయిర్ 17కి మధ్య సంబంధంపై స్పష్టత లేదని పేర్కొంది.అయితే, స్పైస్‌జెట్ లీజును విల్మింగ్టన్ తమకు బదలాయించిందని, దానికి అనుగుణంగానే తాజాగా పిటీషన్ దాఖలు చేశామని జెట్ఎయిర్ 17 వివరించింది. స్పైస్‌జెట్‌పై ఇటీవల విల్లీస్ లీజ్, ఎయిర్‌క్యాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ తదితర సంస్థలు దివాలా పిటీషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో చాలా మటుకు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
విదేశాల్లోనూ పేటీఎం యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ప్రయాణించే తమ యూజర్లు .. యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును ఆర్థిక సేవల సంస్థ పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లోని నిర్దిష్ట ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది.షాపింగ్, డైనింగ్ సహా వివిధ అవసరాలకు చెల్లింపుల కోసం ఈ ఫీచరు ఉపయోగపడగలదని పేర్కొంది. రానున్న హాలిడే సీజన్లో తమ యూజర్లు మరింత సౌకర్యవంతంగా విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఇండిజీన్ కొత్త సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ సైన్సెస్ కమర్షియలైజేషన్ కంపెనీ ఇండిజీన్ తమ అంతర్జాతీయ డెలివరీ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించింది.నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సహాయం అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించగలదని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా తమకు 6 హబ్‌లు, 18 కార్యాలయాలు ఉన్నట్లు వివరించింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు కొరత
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) సంబంధించి కొత్త సరఫరా 25 శాతం తగ్గి 4.10 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. స్థూల లీజింగ్ సైతం 25 శాతం తగ్గి 2.79 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోనూ కొత్త కార్యాలయ వసతుల సరఫరా జూలై–సెప్టెంబర్ కాలంలో 4 శాతం మేర తగ్గి 12.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇదే కాలంలో ఏడు నగరాల పరిధిలో ప్రైమ్ వర్క్‌స్పేస్ (ప్రధాన ప్రాంతాల్లో) స్థూల లీజింగ్ 17 శాతం పెరిగి 18.61 మిలియన్ ఎస్ఎఫ్టీలకు చేరింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. నగరాల వారీ వివరాలు.. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా 33 శాతం పెరిగి 3.60 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ఇక్కడ లీజింగ్ 84 శాతం పెరిగి 6.63 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సరఫరా 360 శాతం అధికమై 2.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. స్థూల లీజింగ్ 17 శాతం వృద్ధితో 1.49 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో ఆఫీస్ వసతుల సరఫరా 26 శాతం తగ్గి 1.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 112 శాతం పెరిగి 2.33 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → ముంబైలో కొత్త సరఫరా 0.90 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. స్థూల లీజింగ్ 2 శాతం తగ్గి 2.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → చెన్నైలో తాజా ఆఫీసు వసతుల సరఫరా 58 శాతం తగ్గి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. లీజింగ్ పరంగా పెద్ద మార్పు లేకుండా 2.01 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → కోల్‌కతాలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ విభాగంలో సెప్టెంబర్ క్వార్టర్లో తాజా సరఫరా లేదు. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 45 శాతం తక్కువగా 0.11 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు ఆఫీస్ స్పేస్ డిమాండ్ కీలక చోదకాలుగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. వేగంగా వృద్ధి చెందుతున్న భాగ్యనగరం దేశ వ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. పరిపాలన, సామాజిక ఆర్థిక అంశాలు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల ఆధారంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. వివిధ వృద్ది అంశాల ఆధారంగా ఆరు ప్రధాన నగరాల పనితీరును నైట్‌ఫ్రాంక్ విశ్లేషించింది. ‘‘వీటిల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. బలమైన మౌలిక వసతుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడం, అల్ట్రా హెచ్ఎన్ఐలు(అధిక ధనవంతులు), హెచ్ఐఎన్ల జనాభా పెరుగుదల, చురుకైన విధానాలు సామాజిక ఆర్థిక పరపతిని పెంచుతున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. అద్భుతమైన నిపుణుల లభ్యత, వ్యాపార నిర్వహణకు ఉన్న అనుకూలతలతో బెంగళూరు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో నగరంగా నిలిచింది. ముంబై ఎప్పటి మాదిరే అన్ని అంశాల్లో స్థిరమైన పురోగతి చూపించింది. దేశ ఆర్థిక రాజధాని హోదాను కాపాడుకుంది. విడిగా చూస్తే గొప్ప మౌలిక వసతులు, పరిపాలన పరంగా ఢిల్లీ ఎన్సీఆర్కు టాప్ ర్యాంక్ దక్కింది. సామాజిక ఆర్థిక అంశాల పరంగా బెంగళూరు ముందంజలో ఉంది. రియల్ ఎస్టేట్ వృద్ధి పరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. -
రూఫ్‌టాప్ సౌరభం!
పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం!పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం! సోలార్ పవర్ ‘టాప్’లేపుతోంది! నివాసాల్లో సౌర విద్యుత్ వాడకం జోరందుకుంది. మోదీ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక ఫ్లాగ్íÙప్ పథకం పీఎం సూర్య ఘర్ యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో దాదాపు 4 లక్షలకు పైగా గృహ సోలార్ కనెక్షన్లు కొత్తగా జతయ్యాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం (ఇన్స్టాల్డ్ కెపాసిటీ) 1.8 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా అంచనా. ఈ ఏడాది మార్చి నాటికి నివాస రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం 3.2 జీడబ్ల్యూగా నమోదైంది. అంటే, దీంతో పోలిస్తే గడిచిన ఆరు నెలల కాలంలో 50 శాతం పైగా సామర్థ్యం ఎగబాకినట్లు పరిశ్రమ వర్గాల తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఇదంతా పీఎం సూర్య ఘర్ స్కీమ్ చలవేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంమీద చూస్తే, దేశంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం 2024 మార్చి నాటికి 11.9 జీడబ్ల్యూగా ఉంది. ఇందులో అత్యధికంగా సుమారు 60 శాతం వాటా వాణిజ్య, పారిశ్రామిక విభాగాలదే! సబ్సిడీ పెంపు.. తక్కువ వడ్డీకే రుణం.. ఇంటి డాబాలపై సౌర విద్యుత్ సిస్టమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు ఎప్పటి నుంచో ఉంది. ఖర్చు తడిసిమోపెడవుతుండటంతో ప్రజల నుండి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే, గ్రీన్ ఎనర్జీ పాలసీపై గట్టిగా దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం గృహాల్లో సోలార్ వెలుగులు పెంచేందుకు పీఎం సూర్య ఘర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా అధిక వ్యయ సమస్యకు చెక్ పెట్టేందుకు సోలార్ మాడ్యూల్స్‌పై సబ్సిడీని 40% నుంచి 60%కి పెంచింది. 7% వడ్డీకే రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. దీంతో రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గత కొన్ని నెలలుగా భారీగా పెరిగినట్లు జేఎంకే రీసెర్చ్, ఎనలిటిక్స్ తాజా నివేదికలో వెల్లడైంది. కాగా, ఈ జోరు ఇలాగే కొనసాగితే నివాస సౌర విద్యుత్ సామర్థ్య విస్తరణలో ఈ స్కీమ్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనేది నిపుణుల మాట!ఏటా 8–10 గిగావాట్లు..దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచడంలో భాగంగా 2027 నాటికి నివాస గృహాల రూఫ్‌టాప్ సోలార్ స్థాపిత సామర్థ్యాన్ని 30 గిగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే ఏటా 8–10 జీబ్ల్యూ వార్షిక సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు జతకావాల్సి ఉంటుంది. ‘మిగులు విద్యుత్‌ను తిరిగి విక్రయించడంతో సహా డిస్కమ్‌ల నుంచి అనుమతులను పొందడం విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. రుణ సదుపాయంతో పాటు ప్రజల్లో సౌర విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుపై అవగాహన పెంచేలా చర్యలు చేపడుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ వి. పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచడం, సోలార్ మాడ్యూల్స్‌పై వ్యయాలను తగ్గించడం, వినియోగదారుల్లో ఈ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించడం వంటి అంశాల నేపథ్యంలో రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘రాష్ట్ర నియంత్రణ సంస్థలు ఈ స్కీమ్ అమలుకు దన్నుగా నిలుస్తున్నాయి. గృహ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునే కస్టమర్లకు నెట్ మీటరింగ్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వీటి ఏర్పాటుకు రుణాలిచ్చే సంస్థలు అరకొరగానే ఉండేవి. ఇప్పుడు 25కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు రుణాలిస్తున్నా యి. దీంతో నివాసపరమైన రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ పుంజుకుంటోంది’ అని విక్రమ్ చెప్పారు. సవాళ్లున్నాయ్...గృహాల్లో సోలార్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మోదీ సర్కారు 2027 నాటికి కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.75,021 కోట్ల మొత్తాన్ని (ప్రభుత్వ వ్యయం) కేటాయించింది కూడా. భారత్ నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలన్న సంకల్పానికి సూర్య ఘర్ పథకం చేదోడుగా నిలుస్తుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. అయితే, ఇందుకు చాలా సవాళ్లు పొంచి ఉన్నాయని... ముఖ్యంగా దేశీయంగా నివాస రంగానికి దేశీయ సోలార్ మాడ్యూల్స్ లభ్యతను పెంచాల్సి ఉందంటున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశంలో ఫొటోవోల్టాయిక్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యం, డిమాండ్ మధ్య భారీ అంతరం ఉందని, ఈ మేరకు ప్లాంట్ల సామర్థ్యం భారీగా పెరగాల్సి ఉందనేది వారి అభిప్రాయం. చిన్న, మధ్య తరహా గృహ విద్యుత్ వినియోగదారులు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకునేలా మరింత ప్రోత్సహించాలని కూడా నిపుణుల సూచిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బాస్‌ను తిట్టడానికి.. ఓ కొత్త సర్వీస్
ఉద్యోగం చేసే చాలామంది కొన్ని సమస్యలను లేదా ఫిర్యాదులను ఆఫీసులో బాస్‌కు చెప్పుకోవాలంటే భయపడతారు. మరికొందరికి బాస్ మీద తిట్టేయాలన్నంత కోపంతో ఉంటారు. అలాంటి వారికోసం యునైటెడ్ స్టేట్స్‌లోని ఓసీడీఏ అనే సంస్థ స్కోల్డ్ అనే ప్రత్యేకమైన సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని స్టాండ్ అప్ కమెడియన్ అండ్ యాక్టర్ 'కాలిమార్ వైట్' ఈ ఏడాది ప్రారంభంలో ప్రారభించారు.ఫిర్యాదులను సరిదిద్ది.. మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సర్వీస్ ప్రారంభించినట్లు వైట్ పేర్కొన్నారు. ఈ సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ దీనిని పూర్తిగా ఏజంట్ల ద్వారా నిర్వహిస్తుంది.కంపెనీ ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. వారు నేరుగా ఆఫీసుకు వెళ్తారు. బాస్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా దానికి మొత్తం ఏజెంట్ బాధ్యత వహిస్తాడు. మొత్తానికి ఒక ఉద్యోగి ఆందోళనలను బాస్‌కు చేరవేస్తారు. కొన్నిసార్లు ఏజెంట్ వ్యక్తిగతంగా కనిపించకుండానే.. ఫోన్లో సంభాషణ చేస్తాడు.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో.. ఒక ఏజెంట్ ఉద్యోగి ఫిర్యాదు మీద ఆఫీసుకు వెళ్లి, వెంటనే బాస్ మీద విరుచుకుపడ్డాడు. నేను 17 సంవత్సరాలు పనిచేస్తున్నా.. అయినప్పటికీ నాకు పీటీఓ ఇవ్వలేదు. మీరు కొత్త ఉద్యోగులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. మొత్తం ఇన్వెంటరీ అస్తవ్యస్తంగా ఉంది. మోల్డింగ్ విభాగంలో ఫ్యాన్ లేదు అని అరుస్తూనే ఉన్నారు.ఇదీ చదవండి: ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..ఏజెంట్‌ను శాంతిచమని ఎంతమంది చెప్పినా.. అతని స్క్రిప్ట్ కొనసాగించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకులను ఆకర్శించింది. ఆ తరువాత దీనికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. వీడియోపై పలువురు నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. -
గోవాలో 'సారా అలీ ఖాన్' వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్
ఫిట్నెస్, ట్రావెలింగ్ పట్ల అమితాసక్తి చూపించే ప్రముఖ నటి.. 'సారా అలీ ఖాన్' మొదటి సారి గోవాలోని ఎయిర్‌బీఎన్‌బీలో స్పెషల్ వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్ను నిర్వహించనున్నారు. దీనికోసం సూర్యరశ్మి, పచ్చటి ప్రకృతి మధ్య ఒక సెటప్ సెట్ చేసుకున్నారు.సినిమా రంగంలో ఫిట్నెస్ పట్ల అమితమైన అభిరుచి కలిగిన సారా అలీ ఖాన్.. ఇప్పుడు ఆరోగ్యం, యోగా పట్ల తనకున్న అభిరుచిని వెల్లడిస్తుంది. అద్భుతమైన ప్రదేశంలో పచ్చని ప్రకృతి మధ్య సారాతో నలుగురు వ్యక్తులు యోగా చేసే అవకాశం పొందవచ్చు.ఇక్కడ సారా వ్యక్తిగత వెల్నెస్ ఆచారాలు, ఇతర ఆరోగ్య రహస్యాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. గోవాలో ఈ వెల్నెస్ మరియు యోగా రిట్రీట్ కోసం బుకింగ్‌లు నవంబర్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.గోవాలో ఎయిర్‌బిఎన్‌బిలో మాత్రమే జరిగే ఈ ప్రత్యేక వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్‌కు అతిథులను స్వాగతించడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇక్కడ ప్రకృతి అందాల నడుమ.. మనస్సు, శరీరం, ఆత్మను పోషించడంపై దృష్టి పెట్టవచ్చు. జీవితంలో మరచిపోలేని సాధారణ ఆనందాలను స్వీకరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని సారా అలీ ఖాన్ అన్నారు. View this post on Instagram A post shared by Viralbollywood (@viralbollywood) -
ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..
భారతదేశంలో విభిన్న రంగాల్లో (ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పాలన) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల జాబితాను నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్, ఆర్థిక రంగంలో బెంగళూరు, పాలన, మౌలిక సదుపాయాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నాయి.➤రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లకు, ఇతర స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా 11 శాతం పెరిగాయి.➤ఆర్థిక పరిస్థితుల పరంగా బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉంది. బెంగళూరులో వ్యాపార కార్యకలాపాలు అధికంగా జరుగుతాయి.➤భౌతిక మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ రెండో స్థానంలోనూ.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగి ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 68 లక్షల కంటే ఎక్కువే.➤ఇక చివరిగా పాలన విషయానికి వస్తే.. ఈ విభాగంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ వంటి ఢిల్లీ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, మెరుగైన పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. -
ఆర్బీఐ హెచ్చరిక: అలాంటివి నమ్మకండి
డీప్‌ఫేక్ వీడియోలు తెరమీదకు వచ్చిన సంఘటనలో గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ వీడియోపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెట్టుబడి పథకాలను ఆర్బీఐ తీసుకొస్తున్నట్లు, అలాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు వీడియోలో ఉండటం గమనార్హం. ఈ వీడియోలో ఏ మాత్రం నిజం లేదని, దీనిని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసారని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్ఆర్బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వదు, కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలను నిజమని నమ్మితే తప్పకుండా మోసపోతారు. డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు.. ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.RBI cautions public on deepfake videos of Top Management circulated over social media giving financial advicehttps://t.co/bH5yittrIu— ReserveBankOfIndia (@RBI) November 19, 2024 -
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కారు.. లక్ష మంది కొనేశారు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్‌యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..షియోమీ ఎస్‌యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్‌యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్‌యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.షియోమీ ఎస్‌యూ7షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO— Lei Jun (@leijun) November 18, 2024 -
అమ్మకానికి గూగుల్ క్రోమ్?.. త్వరలో తీర్పు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్‌పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.గూగుల్ క్రోమ్‌ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్‌ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్‌ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్‌ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్‌ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్‌లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్‌లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు.