Sakshi Special
-
విమానం బాత్రూంలో చిన్నారి..
విమానంలో నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తోందని ఇద్దరు ప్రబుద్ధులు ఓ చిన్నారిని ఏకంగా తమతో పాటుగా బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం పెట్టేశారు. ఏడుపు మానాక గానీ బయటికి తీసుకురాలేదు. చైనాలో గుయాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాతయ్య, నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయల్దేరినప్పటి నుంచీ ఆపకుండా ఏడుపందుకుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొళ్లెం పెట్టుకున్నారు. ఒకరు టాయ్‌లెట్ సీటుపై కూచుని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తీరిగ్గా వీడియో తీశారు. ఏడుపాపితే గానీ తాత, నానమ్మ దగ్గరికి తీసుకెళ్లేది లేదంటూ పాపను బెదిరించారు. చివరికి తను ఊరుకున్నాక కూడా, ఏడిస్తే మళ్లీ బాత్రూంలోకి తెచ్చి పడేస్తామంటూ బెదిరించారు. పైగా తమ ఘనకార్యాన్నంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళల బెదిరింపులు, పాప భయపడిపోయి తలుపు కేసి చేయి చాచడం వంటివి చూసి వాళ్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో వీడియోను డిలీట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 24న జరిగినట్టు సంబంధిత ఎయిర్‌లైన్స్ వివరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి ‘పాఠం చెప్పడానికి’ వృద్ధుల అనుమతితో వాళ్లిద్దరూ ఇలా చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పుకొచి్చంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్పింది. సదరు ప్రయాణికులను తమ సిబ్బంది కూడా మందలించారని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలన్న దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు ఈ ఉదంతం దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తూచ్ పదహారే..!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన బీజేపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తొలుత అధిష్టానం 44 మందితో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాపై జమ్మూలో కమలం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికే టిక్కెట్లు ఇచ్చారంటూ పార్టీ కార్యాయంలో ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచి్చంది. చివరికి ఆ జాబితాను రద్దు చేసి..16 మంది పేర్లతో మరో జాబితాను వెలువరించింది. రగడ రాజుకుందిలా..! పదేళ్ల తర్వాత జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధిష్టానం మొత్తం మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు దశలకు కలిపి మొత్తం 44 మంది పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే జమ్మూలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని, ఇతర పారీ్టల నుంచి వచి్చన ‘పారాచూట్’లకు టికెట్లు ఇచ్చారంటూ ఆందోళకు దిగారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను పక్కనబెట్టి, ఇటీవలే పారీ్టలోకి వచి్చన ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగదీశ్ భగత్ నిలదీశారు. అసంతృప్తులకు సమధానం చెప్పుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తన క్యాబిన్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్‌పై మాత్రమే దృష్టి సారించామని, ప్రతి కార్యకర్తతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని వివరించారు. తామంతా ఒక కుటుంబమని చెప్పారు.వెనక్కి తగ్గిన అధిష్టానం కార్యకర్తల ఆందోళన విషయంపై ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ విషయం చర్చించింది. తొలుత విడుదల చేసిన 44 మంది పేర్లను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. రెండు గంటల తర్వాత తొలి దశలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కొంకర్నాగ్ నుంచి చౌదరి రోషన్ హుస్సేన్ ఒకే ఒక్క పేరుతో మరో జాబితా విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మహిళా అభ్యర్థి షగున్ పరిహార్ పేరుంది. పరిహార్ సోదరులు బీజేపీలో కొనసాగుతున్నారు. షగున్ తండ్రి అజిత్ పరిహార్, అజిత్ సోదరుడు అనిల్ పరిహార్‌లను 2018లో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. తొలిదశ పోలింగ్ కోసం నామినేషన్లకు ఈనెల 27 ఆఖరు తేదీ. కశీ్మర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనుండటం తెలిసిందే. -
హరియాణాలో ఆప్ బలపరీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్తుత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిధ్దమైంది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న హరియాణాలో వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలవడం ద్వారా తన బలాన్ని పెంచుకునే ఎత్తులు వేస్తోంది. రాష్ట్రంలోని 90 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిధ్దమైన ఆప్ ఢిల్లీ, పంజాబ్‌ల సరిహద్దుల వెంట ఉన్న 27 నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పొత్తులకు దూరంగా.. ఒంటరి పోరాటం 2019 ఎన్నికల్లోనూ హరియణా అసెంబ్లీలో 46 స్థానాల్లో పోటీ పడిన ఆప్ కేవలం 0.48 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఆ పారీ్టకి చెందిన 35 మందికి పైగా అభ్యర్థులకు వెయ్యి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల అనంతరం మొదలైన రైతు ఉద్యమాల సమయంలో ఆప్ ఆ రాష్ట్రంలో పుంజుకునే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచి్చన హరియాణా రైతులకు అటు పంజాబ్‌లోని, ఇటు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సహకరించింది. ఆప్‌కు పెరిగిన బలాన్ని దృష్టిలో పెట్టుకునే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో పొత్తులు పెట్టుకుంది. హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ ఆప్ కురుక్షేత్ర నుంచి ఒక్క స్థానంలోనే పోటీ చేసింది. ఆప్ పార్టీ అభ్యర్థి సుశీల్ గుప్తా 29,021 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన నవీన్ జిందాల్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న ఆప్, రాష్ట్రంలోని పెహోవా, షహబాద్, కలయత్, గుహ్లా, అంబాలా, తోహానా, రతియా, నర్వానా, రానియా, కలన్వాలి, దబ్వాలీ, సోహ్నా, బల్లాబ్‌ఘర్, బహదూర్ఘర్తో వంటి సరిహద్దు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇక్కడ ఇప్పటికే ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ భార్య గురుప్రీత్ కౌర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టారు. తమ పార్టీ ప్రధాన హామీలైన ఉచిత విద్యుత్, యువతకు ఉపాధి, ప్రతి విద్యారి్థకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి సాయం అంశాలను వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన వెంటనే ఆప్ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. హరియాణాలో అక్టోబర్ ఒకటిన ఎన్నికలు జరుగనున్నాయి. -
వందేళ్ల తర్వాత వేలానికి
కొందరికి నాణేలు, ఇంకొందరికి పోస్టల్ స్టాంప్స్, మరికొందరికి కరెన్సీ. బాల్యంలో సేకరణ చాలామందికి ఓ అభిరుచి. అచ్చం ఇలాగే ఆ డానిష్ వాణిజ్యవేత్తకూ నాణేలంటే పిచ్చి. అందుకే పదీ, ఇరవై కాదు 20వేల నాణేలను సేకరించాడు. అత్యంత ఖరీదైన ఆ నాణేల నుంచి కొన్నింటిని వచ్చే నెలలో వేలం వేయనున్నారు. ఆ నాణేల ప్రత్యేకత ఏమిటి? వందేళ్ల తరువాతే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ విశేషాలు ఓసారి చూద్దాం.. డెన్మార్క్‌కు చెందిన లార్స్ఎమిల్ బ్రూన్ (ఎల్.ఇ.బ్రూన్) భూస్వాముల కొడుకు. అయితే కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని 20 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. మరి కొంత రుణం తెచ్చి వెన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అమ్మకాలు, ఎగుమతులతో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అతని మేనమామకు నాణేల సేకరణ ఇష్టం. అది కాస్తా బ్రూన్కు వారసత్వంగా వచి్చంది. చిన్నతనంలో 1859 నుంచే కరెన్సీని సేకరించడం ప్రారంభించారు. సంపన్నుడిగా ఎదిగాక.. అతని నాణేల సేకరణ కూడా సుసంపన్నమయ్యింది. దాదాపు 20వేల అత్యంత విలువైన నాణేలను సేకరించారు. 1885లో డానిష్ న్యూమిస్మాటిక్ (నాణేల సేకరణ, అధ్యయనం) సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1923లో బ్రూన్ మరణించారు. తన నాణేల సేకరణను వందేళ్లపాటు దాచి ఉంచేలా వీలునామా రాశారు. వింత వీలునామా.. ‘‘ఆరు దశాబ్దాలకు పైగా కూడబెట్టిన విస్తారమైన నాణేలు, నోట్లు, పతకాలు డెన్మార్క్ జాతీయ సేకరణ అత్యవసర రిజర్వ్‌లో ఉంచాలి. అంతా సవ్యంగా ఉంటే.. నా వారసులకు ప్రయోజనం కలిగేలా వందేళ్ల తరువాత వాటిని విక్రయించవచ్చు’’అని బ్రూన్ తన వీలునామాలో పేర్కొన్నారు. నిధిని ఇంతకాలం దాచడానికి ఓ కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విధ్వంసం చూసిన అతను.. తన రాయల్ డానిష్ కాయిన్ అండ్ మెడల్ కలెక్షన్ ఏదో ఒక రోజు బాంబు దాడి ఎదుర్కోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చని భావించారు. అందుకే వందేళ్ల తరువాత అని వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వందేళ్లు నాణేలను రహస్యంగా ఉంచారు. అవి ఎక్కడున్నాయో చాలా తక్కువ మందికి తెలుసు. గతేడాది ముగిసిన గడువు.. వందేళ్ల గడువు 2023తో ముగిసిపోయింది. బ్రూన్ వ్యక్తిగత 20,000 నాణేల సేకరణ నుంచి మొదటి సెట్ నాణేలు వచ్చే నెలలో వేలానికి రానున్నాయి. బ్రూన్ ఖజానా మొత్తం ఖాళీ కావాలంటే.. అనేక వేలాలు నిర్వహించాలి. వేలం మొత్తం పూర్తయితే ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నాణేల సేకరణ అవుతుందని అరుదైన నాణేల డీలర్, అమ్మకాలను నిర్వహించే వేలం సంస్థ స్టాక్స్ బోవర్స్ తెలిపింది. బ్రూన్ కలెక్షన్ 500 మిలియన్ డానిష్ క్రోనర్ లేదా సుమారు 72.5 మిలియన్ డాలర్లకు బీమా చేసినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి వచి్చ న ప్రపంచ నాణేలలో అత్యంత విలువైన సేకరణగా వేలం సంస్థ దీనిని అభివర్ణించింది. అత్యంత ఖరీదైన కింగ్ హాన్స్ నాణెం.. సెప్టెంబర్ 14 న జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన బంగారం, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్ బోవర్స్ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఇందులో స్టార్లాట్.. స్కాండినేవియా పురాతన బంగారు నాణేలలో ఒకటి. 1496 నాటి కింగ్ హాన్స్ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణెం. దీనిని 600,000 యూరోలు లేదా 672,510 డాలర్లకు విక్రయించవచ్చు. ఈ నాణేలను వివిధ గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్స్‌లో, స్టాక్స్ బోవర్స్ గ్యాలరీలలో ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్‌హాగన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వీడన్‌ను వీడి స్వదేశానికి
స్వీడన్.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్లో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ అంకుర్ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సామాజిక అనైక్యత... స్వీడన్లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. సాంస్కృతిక సవాళ్లు... స్వీడన్లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్ అపార్ట్మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. కొవిడ్ తర్వాత... కొవిడ్ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా చెబుతున్నారు.గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్ వెళ్లడం ఇదే తొలిసారి. – న్యూఢిల్లీ -
వన్స్‌మోర్... వరల్డ్ రికార్డు
సిలెసియా (పోలాండ్): క్రీడాకారులెవరైనా ఒకసారి ప్రపంచ రికార్డు సృష్టిస్తేనే ఎంతో గొప్ప ఘనతగా భావిస్తారు. రెండుసార్లు బద్దలు కొడితే అద్భుతం అనుకుంటారు... మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొలి్పతే అసాధారణం అనుకుంటారు... మరి 10 సార్లు ప్రపంచ రికార్డులను సవరించిన వారిని ఏమనాలి...! ప్రస్తుతానికి మోండో డుప్లాంటిస్ అని అనాల్సిందే. వరల్డ్ రికార్డులు తన చిరునామాగా మలుచుకొని... ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇంత సులువా అన్నట్లు స్వీడన్ పోల్‌వాల్టర్ మోండో డుప్లాంటిస్ చెలరేగిపోతున్నాడు. మూడు వారాల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లో తొమ్మిదోసారి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్... తాజాగా పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో 10వసారి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. తన రెండో ప్రయత్నంలో డుప్లాంటిస్ 6.26 మీటర్ల ఎత్తును దాటేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 6.25 మీటర్లతో తానే సృష్టించిన వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాంటిస్కు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు ఇదే మీట్లో నార్వేకు చెందిన జాకబ్ ఇంగెబ్రింగ్స్టెన్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇంగెబ్రింగ్స్టెన్ 7 నిమిషాల 17.55 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో 1996లో కెన్యా అథ్లెట్ డేనియల్ కోమెన్ (7 నిమిషాల 20.67 సెకన్లు) నెలకొలి్పన వరల్డ్ రికార్డు తెరమరుగైంది. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు జాకబ్‌కు కూడా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందించారు. -
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్‌లోనూ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్‌ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్‌ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్‌లో ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్‌లో బ్రిటన్‌తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్‌ప్రీత్ డిఫెండర్‌గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్‌ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి
. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరణతో... దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్లో నివసిస్తున్నారు. కశీ్మర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎల్జీదే పెత్తనం2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.2014 ఎన్నికల్లో ఏం జరిగింది? → 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్ నమోదైంది. → పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. → రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. → నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. → స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశ వీధిలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌దే హవా
దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్ ఎయిర్‌లైన్స్–ఎల్సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్ఎయిర్, ఇండిగో, ఈజీజెట్ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది. సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్ సరీ్వస్ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్ఎస్సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్ మార్కెట్లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. రయాన్ఎయిర్, ఈజీజెట్, విజ్ ఎయిర్ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్ఎస్సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్ సరీ్వస్ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్ చెకిన్లు, సీట్ అప్గ్రేడ్లు, ఎక్స్ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్ఎయిర్ గ్రూప్ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్‌కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్‌మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్‌కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్‌కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్‌పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్‌బగాన్, ఈస్ట్‌బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కోల్‌కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్‌కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్‌కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్‌తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్‌ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్‌కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్‌కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Haryana: ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ మధ్యలో లోకల్
అధికార బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్. వీటికి తోడు ఐఎన్ఎల్డీ, జేజేపీ, బీఎస్పీ. ఇలా నానా పార్టీలతో కిక్కిరిసిపోయిన హరియాణా రాజకీయ రంగస్థలంపై ఆసక్తికరమైన అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెర లేచింది. ఎన్ని పార్టీలున్నా రాష్ట్రంలో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటూ వస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాకే ఇచ్చింది. 2019లో రాష్ట్రంలో మొత్తం పదికి పది లోక్‌సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా ఈసారి వాటిలో సగానికి సగం ‘హస్త’గతమయ్యాయి. ఆ ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో కని్పస్తున్న కాంగ్రెస్‌ను నిలువరించడం కమలనాథులకు అగి్నపరీక్షే కానుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు రెండు ప్రధానపార్టీల్లో ఎవరి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది...కురుక్షేత్రయుద్ధం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది. 90 అసెంబ్లీ సీట్లకు గాను 40 స్థానాలతో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లున్న జేజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో ఓటరు తీర్పు స్పష్టంగానే ఉండనుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ‘‘బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అద్దంపట్టాయి. ఆ పార్టీకి ఓట్ల శాతం భారీగా తగ్గింది’’ అని వారంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), బీఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి పుట్టి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఆ పార్టీలు బాగా బలహీనపడ్డా వాటికి పడే ఓట్లు అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకం కానున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలతో పాటు స్వతంత్రులు కాంగ్రెస్ ఓటుబ్యాంకునే చీల్చి తమను ఒడ్డున పడేస్తారని బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. దానికి తోడు ఎప్పట్లాగే జాటేతర ఓట్లన్నీ తమకే పడతాయంటోంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో జాతీయాంశాలు, మోదీ ఫ్యాక్టర్ వంటివేవీ లేవు గనుక బీజేపీ ఓటు బ్యాంకుకు మరింత భారీగా గండి పడటం ఖాయమని చెబుతోంది. ముళ్లబాటలో బీజేపీ... 2014లో హరియాణాలో సొంతంగా అధికారం సాధించిన బీజేపీ, 2019లో జేజేపీ పొత్తుతో దాన్ని నిలుపుకుంది. ఈసారి మాత్రం ఆ పార్టీకి పరిస్థితి ముళ్లబాటనే తలపిస్తోంది. జాటేతర ఓట్లన్నీ గుండుగుత్తగా పడటం రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల వికాసానికి ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో మనోహర్‌లాల్ ఖట్టర్ రూపంలో జాటేతర నేతను బీజేపీ సీఎంను చేసింది. ఆయన తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగారు. రైతు ఆందోళనలు, గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న సవాలు నేపథ్యంలో గత మార్చిలో నాయబ్‌సింగ్ సైనీ రూపంలో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేసింది. ఈ ఎత్తుగడ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాకున్నా ఏకంగా 35 శాతమున్న ఓబీసీ ఓట్లను ఒడిసిపట్టే లక్ష్యంతో సైనీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. అగ్ర కులాల, పట్టణ ఓటర్లపై పట్టును నిలుపుకునేందుకూ బీజేపీ ప్రయతి్నస్తోంది. వారికి వరుసగా తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్‌లాల్ బదోలీ రూపంలో ఇప్పటికే అగ్రవర్ణ నేతను రాష్ట్ర పార్టీకి అధ్యక్షున్ని చేసింది. ప్రచార దూకుడూ పెంచనుంది.అడ్వాంటేజ్ కాంగ్రెస్, కానీ...! ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపీందర్ హుడా, ఆయన కుమారుడు దీపీందర్, పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్, సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మొత్తం 90 అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ కలియదిరుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భూపీందర్, సెల్జా వర్గాల కుమ్ములాటలు పార్టీని కలవరపెట్టే అంశం. ఈ ఇంటి పోరును ఏ మేరకు కట్టడి చేస్తుందన్న దానిపైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది రాజకీయ వర్గాల అంచనా.ప్రాంతీయ పార్టీలన్నీ కుదేలే... జేజేపీ, ఐఎన్ఎల్డీ రెండూ కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతూ వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 26 శాతమున్న జాట్లే వాటి ప్రధాన బలం. వారు ఇటీవల కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. రైతుల ఆందోళనలు తారస్థాయిలో ఉన్న వేళ బీజేపీకి కొమ్ముకాయడం జేజేపీకి భారీగా చేటు చేసింది. జాట్లు పూర్తిగా దూరమయ్యారు. జేజేపీ ఓటు బ్యాంకుకు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గండికొట్టింది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీదీ ఇదే పరిస్థితి. నేతల కీచులాటలు పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. బీఎస్పీతో గతంలో పెట్టుకున్న పొత్తు దారుణంగా వికటించిన అనుభవం మరింత భయపెడుతోంది. ఆప్ పరిస్థితీ అంతంతే... పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఊపులో హరియాణాలోనూ పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్న సంకేతాలు కని్పంచడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టి పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను దూరం పెట్టి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది!జేజేపీ... కకావికలైన కింగ్‌మేకర్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ). 2018 డిసెంబర్లో హరియాణా రాజకీయ యవనికపై పుట్టుకొచ్చిన కొత్త పార్టీ. చౌతాలా కుటుంబంలో కుమ్ములాటల ఫలితంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) నుంచి వేరుపడి దుష్యంత్ చౌతాలా ఏర్పాటు చేసుకున్న జేజేపీ 2019లో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగింది. 10 సీట్లే గెలిచినా హంగ్ ఏర్పడటంతో కింగ్‌మేకర్‌గా మారింది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి నానా ఎదురుదెబ్బలతో బాగా బలహీనపడింది. 2021 రైతు ఆందోళన సమయంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించకపోవడం జేజేపీకి చెప్పలేనంత చేటు చేసింది. అనంతరం రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల బరిలో దిగి బీజేపీకి పూర్తిగా దూరమైంది. దీనికి తోడు అసమ్మతి, ఫిరాయింపులతో దుష్యంత్ చౌతాలాకు తల బొప్పి కడుతోంది. గత ఏప్రిల్‌లో జేజేపీ రాష్ట్ర చీఫ్ నిషాన్‌సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే బీజేపీకి జైకొట్టారు. దుష్యంత్ తండ్రి అభయ్ చౌతాలాకు అత్యంత నమ్మకస్తునిగా మెలిగిన ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దాంతో ఇప్పుడు పార్టీలో దుష్యంత్, ఆయన తల్లి, మరో ఎమ్మెల్యే మాత్రం మిగిలారు. ఈ నేపథ్యంలో పునరై్వభవం దేవుడెరుగు, పార్టీ పుట్టి మునగకుండా చూసుకోవడమే దుష్యంత్‌కు పెను సవాలుగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొచి్చన జాట్, రైతు, దళిత ఓట్లు రాష్ట్రంలో నిర్ణాయక శక్తి అయిన జాట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. వారికి తోడు రైతు, దళిత ఓట్లు కూడా ఆ పార్టీకే భారీగా పడ్డాయి. 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 42 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించినట్టు ఓటింగ్ సరళి తేలి్చంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా చుట్టడం తెలిసిందే. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానికి 30 స్థానాలకు మించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!
ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్ జెడ్ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్ బాట పడుతూ ‘సోషల్’ కల్చర్‌తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.భారత కార్పొరేట్ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌కు గుర్తింపుగా బ్యాడ్జ్‌లు, పాయింట్లు, నోట్స్ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్ మూడు షేర్.. ఆరు లైక్‌లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్ ఇండియా ‘సిటిజన్ ఆఫ్ ‘యూ’నివర్స్’ పేరుతో ‘పాస్‌పోర్ట్’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేస్తున్నారు. ఆఫీస్ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్‌పోర్ట్’పై స్టాంప్ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సోనాలి దేసర్కార్ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఇండియా కూడా అప్లాజ్ పేరుతో అంతర్గత స్టోర్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్ఫోన్ల నుంచి ఈవెంట్ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.అంతా ‘సోషల్’మయం... ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్బోర్డ్లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్ డిజిటల్ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్ చెప్పారు. ఇక మెర్క్ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్ ఆధారిత అవార్డులు, స్పాట్ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్స్టేట్ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్‌లో రిడీమ్ చేసుకోవచ్చు.డిజిటల్ బ్యాడ్జ్‌లకు ప్రాచుర్యంఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్ బ్యాడ్జ్‌లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్‌లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్ సమర్థ సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్ కేపబిలిటీ ఎకోసిస్టమ్‌లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్‌లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్‌స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అభిప్రాయపడ్డారు. → ఎప్సిలాన్ ఇండియా కొత్తగా ‘పాస్‌పోర్ట్’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఆఫీస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ ఉద్యోగులకు ‘స్టాంప్’ పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!→ రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ‘అప్లాజ్’ పేరుతో అంతర్గత స్టోర్ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్ చేసుకొని ఇక్కడ హెడ్‌ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్‌ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్ బ్యాడ్జ్‌లు (బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.→ మెర్క్ ఇండియా, ఆల్స్టేట్ ఇండియా, థ్రైవ్ డిజిటల్లీడర్షిప్ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్‌కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్‌కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్‌కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్‌బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్‌కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్‌తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం కొత్తేమీ కాదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇవన్నీ నివాసాలు, కార్యాలయాలే. వాటిని తలదన్నేలా 3,000 అడుగుల (914.4 మీటర్లు) ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్టు స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం) కంపెనీ ప్రకటించింది. నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్‌ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి రెండో పొర నుంచి... రాళ్ల నమూనా!
బ్రిటన్ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయిన మ్యాంటల్ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు! భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే!! భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. అతి పెద్ద ముందడుగు భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తుండటం విశేషం. సేకరణ అంత ఈజీ కాదు...భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 2024 ఏప్రిల్ నుంచి జోయిడిస్ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్ లీసెన్‌బర్గ్ చెప్పారు. ‘‘ప్రవార శిలను పరిశీలించిన మీదట విలువైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలోని ఖనిజ మూలకాలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద సముద్ర జలంతో పలు రకాలుగా ప్రతి చర్య జరుపుతున్నట్టు తేలింది. ఫలితంగా సూక్ష్మజీవజాల ఉనికికి అతి కీలకమైన మీథేన్ వంటి నమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీలైనన్ని ఉష్ణోగ్రతల వద్ద వాటిని విశ్లేషించిన మీదట భూమిపై జీవావిర్భావం తాలూకు రహస్యాలెన్నో విడిపోయే అవకాశముంది’’ అని ఆయన వివరించారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Netherlands: విద్యుత్ విమానం వచ్చేస్తోంది...
ప్రపంచమంతటా విద్యుత్ వాహనాల హవా పెరిగిపోతోంది. అదే బాటలో త్వరలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 805 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్టు నెదర్లాండ్స్‌కు చెందిన ఎలిసియాన్ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. ఈ9ఎక్స్‌గా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెబుతోంది. ‘‘అప్పటికల్లా విద్యుత్ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుంది. కనుక మా విమానం ప్రయాణ రేంజ్, మోసుకెళ్లగలిగే ప్రయాణికుల సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతాయి’’ అని కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్ డైరెక్టర్ రేనార్డ్ డి వ్రైస్ వివరించారు. వీలైనంత తక్కువ బరువు, అదే సమయంలో పూర్తిస్థాయి భద్రత, గరిష్ట సామర్థ్యం ఉండేలా విమానాన్ని డిజైన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘ఈ9ఎక్స్ చూసేందుకు 1960ల నాటి జెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో 8 ప్రొపెల్లర్ ఇంజన్లు, బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ230లను కూడా తలదన్నేలా 42 మీటర్ల పొడవైన రెక్కలుంటాయి’’ అని తెలిపారు. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిందంటే దేశీయంగా తక్కువ దూరాలకు తమ విమానమే బెస్ట్ ఆప్షన్‌గా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘అంతేకాదు, వాయు, శబ్ద కాలుష్యం కారణంగా విమా నాల రాకపోకలపై ఆంక్షలున్న ద్వితీయశ్రేణి నగరాలకు మా విమానం వరప్రసాదమే కాగలదు. పైగా ప్రయాణ సమయంలో విమానం లోపల ఎలాంటి శబ్దాలూ విని్పంచవు. ఇది ప్రయాణికులకు చక్కని అనుభూతినిస్తుంది. ప్రస్తుత విమానాల్లో క్యాబిన్ లగేజీ పెద్ద సమస్య. మా విమానంలో క్యాబిన్ లగేజీ సామర్థ్యాన్ని బాగా పెంచడంపైనా డిజైనింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాం. అదనపు క్యాబిన్ లగేజ్ ప్రయాణికులకు బాగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది’’ అని చెబుతున్నారు.అరగంటలో చార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనం అనగానే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చార్జింగ్. విపరీత మైన పోటీ నెలకొని ఉండే దేశీయ వైమానిక రంగంలో విమానం ఎంత త్వరగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతుందన్నది చాలా కీలకం. ముఖ్యంగా చౌక విమానయాన సంస్థలకు ప్రయాణికుల ఆదరణను నిర్ణయించడంలో దీనిదే కీలక పాత్ర. ‘‘ఈ అంశంపైనా ఇప్పట్నుంచే దృష్టి సారించాం. అరగంటలోనే విమానం ఫుల్ చార్జింగ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని వ్రైస్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్‌ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాదాస్పద భూములపై... నిర్ణయాధికారం కలెక్టర్లకే
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్‌కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్‌గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్‌గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 9 లక్షల ఎకరాలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్‌లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలకాంశాలు → ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది. → కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది. → ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. → ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. → కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది. → బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. → తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వొచ్చు. → ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు. → వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో. – నేషనల్ డెస్క్, సాక్షి -
USA Presidential Elections 2024: అమెరికా ఎన్నికల్లోనూ డీప్‌ఫేక్
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఉపాధ్యక్షురాలు, సొంత పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విమర్శిస్తున్న వీడియో.. విమర్శకులను ఏకిపారేస్తూ, ఎల్జీబీటీక్యూలను తిట్టి పోస్తూ బైడెన్ ఫోన్ కాల్స్ రికార్డులు.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఫొటో..... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డీప్ ఫేక్ హల్చల్కు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక అమెరికాలో జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. దానికి తోడు ఏకపక్షంగా సాగేలా కని్పంచిన పోటీ కాస్తా బైడెన్ స్థానంలో హారిస్ రంగప్రవేశంతో హోరాహోరీగా మారింది. ఈ నేపథ్యంలో ఓటర్లను గందరగోళపరచడానికి, ఉద్రిక్తతలను రేకెత్తించడానికి ఏఐ మరింతగా దురి్వనియోగం కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024 జనవరిలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ గొంతును అనుకరిస్తూ న్యూహ్యాంప్‌షైర్ ప్రజలకు ఫేక్ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రైమరీల్లో పాల్గొంటే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోతారంటూ ఓటర్లను ఆయన హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆ ఫేక్ కాల్స్ సంచలనమే సృష్టించాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ– ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. అలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా సదరు కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా డీప్ ఫేక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. బైడెన్‌ను మూర్ఖుడన్న కమల కుబేరుడు మస్క్ ఎక్స్‌లో షేర్ చేసిన కమల డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బైడెన్ మూర్ఖుడని, దేశాన్ని నడపడం ఆయనకు తెలీదని కమల అన్నట్టు ఆ వీడియోలో ఉంది. ఒక్క స్మైలీ ఎమోజీని మినహాయిస్తే అది పేరడీ అనడానికి ఆ వీడియోలో ఎటువంటి సంకేతాలూ లేవు. ఇలాంటివాటి ప్రభావం తటస్థ ఓటర్లపై చాలా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. విమర్శకులను తిట్టినట్టుగా... బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుని తనకు బదులుగా హారిస్‌ను అభ్యరి్థత్వాన్ని సమరి్థంచే క్రమంలో తన విమర్శకులను విపరీతంగా తిట్టిపోయడమే గాక ఎల్జీబీటీక్యూలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, ఓ మానిప్యులేటెడ్ వీడియో పీబీఎస్ మీడియా సంస్థ లోగోతో సహా తెరపైకి వచి్చంది. దాంతో పీబీఎస్ టెలివిజన్ సంస్థ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అసలు వీడియోను తమ చానల్లో లైవ్ ప్రసారం చేసింది. అది నిజానికి జూలై 13న ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత రాజకీయ హింసను ఖండిస్తూ బైడెన్ మాట్లాడిన వీడియో. వీక్షకులను మోసగించేందుకు తమ లోగోను వాడుతూ డీప్ ఫేక్ వీడియో చేసినట్టు పీబీఎస్ తేలి్చంది. ట్రంప్ అరెస్టు! పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల రికార్డులను తారుమారు చేసిన కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చాక పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసినట్లు కొన్ని వారాల క్రితం ఒక ఫొటో వైరలైంది. అది కూడా డీప్ ఫేక్ బాపతేనని డిజిటల్ ఫోరెన్సిక్స్ నిపుణులు తేల్చారు. తప్పుడు ట్వీట్లతో.. వీటికి తోడు తప్పుడు ట్వీట్లను సృష్టించి ఓటింగ్‌నే తారుమారు చేసే ఏఐ చాట్‌బాట్ సామర్థ్యాన్ని సివ్ఏఐ సంస్థ సహ వ్యవస్థాపకుడు లుకాస్ హాన్సెన్ ప్రదర్శించారు. అందులో అలెన్, టెక్సాస్ ‘పోలింగ్ కేంద్రాలు పార్కింగ్ కోసం ఛార్జ్ చేస్తున్నాయి’ అంటూ ఏఐ టూల్‌కు సందేశమిచ్చారు. అంతే...! అలెన్ అధికారులు చాలా పోలింగ్ కేంద్రాల్లో గప్‌చుప్‌గా 25 డాలర్ల పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ సెకన్ల వ్యవధిలోనే లక్షల మందికి ట్వీట్లు చేరిపోయాయి. సమస్యేనంటున్న అమెరికన్లుఇలాంటి మోసపూరిత చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఆగ్రహం రగిల్చే ప్రమాదముందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఏఐ ఆధారిత అసత్యాలు ప్రభావితం చేస్తాయని 50 శాతానికి పైగా అమెరికన్లు భావిస్తున్నట్టు మీడియా గ్రూప్ ఆక్సియోస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మారి్నంగ్ కన్సల్ట్ గతేడాది చేసిన పోల్‌లో వెల్లడైంది. దీనిపై 200కి పైగా న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐ అసత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణం రంగంలోకి దిగాలంటూ టెక్ సీఈఓలకు ఏప్రిల్‌లో లేఖ రాశాయి. రాజకీయ ప్రకటనల్లో డీప్ ఫేక్స్ వాడకాన్ని నిషేధించాలని, వాస్తవిక ఎన్నికల కంటెంట్‌ను ప్రోత్సహించేలా అల్గారిథంను ఉపయోగించాలని కోరాయి. ఈ నేపథ్యంలో, ఏఐ కంటెంట్‌ను పక్కాగా లేబులింగ్ చేసే దిశగా కృషి చేస్తున్నట్టు టెక్ దిగ్గజాలు చెబుతున్నాయి. ఆటో టెక్నాలజీ లేదు ఏఐ ద్వారా సృష్టించే ఫేక్ వీడియో కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మధ్య తేడాను ఆటోమేటిక్‌గా గుర్తించే టెక్నాలజీ ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దాంతో ఏదైనా కంటెంట్‌పై ఫ్యాక్ట్ చెక్ చేసే లోపే అది వైరల్ అవుతోంది. అది ఫేక్ అని చివరికి తేలినా, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయనాడ్ విషాదానికి ఇదీ ఓ కారణమే..!
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తూంటారు.అంటే దేవుడి సొంత దేశం అని! మరి...దేవుడు తన సొంత దేశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు?వయనాడ్‌లో అంత విలయం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దేవుడు కాదు.. మనిషే!ఎందుకంటే జూలై 30న కురిసిన కుంభవృష్టి... పల్లెలకు పల్లెలు కొట్టుకుపోవడం...మానవ చర్యల ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావమే మరి!!దేవుడి ప్రస్తావన ఎలాగూ తీసుకొచ్చాం కాబట్టి.. కాసేపు రామరాజ్యంలోకి వెళదాం. అప్పట్లో నెలకు రెండు వానలు ఎంచక్కా కురిసేవని, ఏటా బంగారు పంటలు పండేవని.. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లే వారని పురాణ గాధలు చెబుతాయి. అయితే ఇప్పుడు రాముడు లేడు కానీ.. ప్రకృతిని చెరబడుతున్న రావణాసులు మాత్రం ఎందరో. అభివృద్ది పేరుతో ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడం, విద్యుత్తు, తదితరాల కోసం పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వినయోగం పుణ్యమా అని ఇప్పుడు వాతావరణ మార్పులు మనల్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లో కురిసిన కుంభవృష్టి... ఢిల్లీ, ముబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలను ముంచెత్తిన వరదలు అన్నీ ప్రకృతి ప్రకోపానికి మచ్చుతునకలే. మరో తాజా ఉదాహరణ వయనాడ్ విలయం!. ఇంతకీ జూలై 30 తేదీన వయనాడ్ ప్రాంతంలో ఏం జరిగింది? అప్పటివరకూ వర్షాభావాన్ని అనుభవిస్తున్న ఆ ప్రాంతం కేవలం ఒకే ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకు ఎక్కింది. మంచిదే కదా? అనుకునేరు. అతితక్కువ సమయంలో ఎక్కువ వానలు కురవడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మేఘాల నుంచి జారిపడే చినుకులను ఒడిసిపట్టేందుకు.. సురక్షితంగా సముద్రం వరకూ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు అంటే... నదులు, చెరువులు భూమ్మీద లేవు మరి! ఫలితంగానే ఆ విపరీతమైన కుంభవృష్టికి కొండ సైతం కుదేలైంది. మట్టి, బురద, రాళ్లు వేగంగా లోయ ప్రాంతంలోకి వచ్చేసి పల్లెలను మింగేశాయి.ఏటా నైరుతి రుతుపవనాల రాక కేరళతోనే మొదలవుతుంది మనకు తెలుసు. జూన్‌తో మొదలై సెప్టెంబరు వరకూ ఉండే నైరుతి రుతుపవన కాలంలో వయనాడ్ ప్రాంతంలో సగటు వర్షపాతం 2,464.7 మిల్లీమీటర్లు (మి.మి). అయితే గత ఏడాది రుతు పవనాల వైఫల్యం కారణంగా ఇక్కడ 55 శాతం తక్కువ వర్షం నమోదైంది. అంతేకాదు... 128 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులను కేరళ రాష్ట్రం మొత్తం ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలోనే ఉన్న వయనాడ్‌లో ఈ ఏడాది జూన్ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సుమారు సాధారణ వర్షపాతం (574.8 మి.మి) కంటే 42 శాతం తక్కువగా 244.4 మి.మి వర్షం మాత్రమే కురిసింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసినా అది సాధారణం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. జూలై 29న నమోదైన తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సగటు వర్షపాతమైన 32.9 మిల్లీమీటర్లలో నాలుగో వంతు కంటే కొంచెం ఎక్కువ. కానీ జూలై 30న పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. సాధారణ 23.9 మిల్లీమీటర్ల స్థానంలో ఏకంగా 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. వయనాడ్ ప్రాంతంలోని వియత్రిలోనైతే ఇది పది రెట్లు ఎక్కువ. అలాగే మనటోడిలో 200 మి.మిలు, అంబాలవయ్యల్లో 140 మి.మి. కుపాడిలో 122 మి.మి.ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అంటే.. నాలుగు నెలల్లో కురవాల్సిన వానలో ఒకే రోజు దాదాపుగా ఆరు నుంచి పది శాతం కురిసేసిందన్నమాట!. జూలై 10 నుంచి జూలై 30 వరకూ కురిసిన వాన కూడా సగటు వర్షపాతంలో 28 శాతం వరకూ ఉండటం గమనార్హం. కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం వేడెక్కుతోందని.. పరిస్థితిని అదుపు చేయకుంటే.. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయని శాస్త్రవేత్తలు ఏళ్లుగా చేస్తున్న హెచ్చరికలు నిజమేనని మరోసారి రుజువైనట్లు వయనాడ్ ఉదంతం స్పష్టం చేస్తోంది. -
దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు
భవిష్యత్తు మీద బంగారు కలలతో ఆశలకు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఉపాధి దొరికితే కొత్త ఉషోదయాలు చూస్తామనుకున్నారు. కానీం చివరకు తమది కాని యుద్ధంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున తలపడుతున్న భారత యువకుల విషాదమిది. ఎందుకిలా జరుగుతోంది? తమది కాని దేశంలో, తమకు సంబంధమే లేని యుద్ధంలో వారు ఎందుకిలా బలవుతున్నట్టు...? అతని పేరు రవి మౌన్. హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువకుడు. రష్యాలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పాడు. నమ్మిన కుటుంబం భూమి తెగనమ్మి మరీ ఏజెంట్‌కు రూ.11.5 లక్షలు ముట్టజెప్పింది. తీరా జనవరి 13న రష్యాకు వెళ్లాక ఏజెంట్ మోసగించినట్టు అర్థమైంది. ఇప్పుడతని ముందు రెండే ఆప్షన్లు. పదేళ్ల జైలు. లేదంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం. పదేళ్ల జైలు కంటే తనకిష్టం లేకున్నా యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రవి. ఈ విషయం కుటుంబానికి తెలియనివ్వలేదు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న భారత యువకుల వీడియోలో అతన్ని చూశాకే వారికి తెలిసింది. చివరగా మార్చిలో కుటుంబంతో మాట్లాడాడు. అప్పటినుంచి వారికతని సమాచారమే లేదు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చేందుకు రాత్రంతా గోతులు, కందకాలు తవ్వడమే పని! నాలుగు నెలల తర్వాత యుద్ధభూమిలో ప్రాణాలొదిలాడు. రవి సోదరునితో పాటు రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం దీన్ని ధ్రువీకరించింది. డ్రైవర్ ఉద్యోగం ఆశ చూపి యుద్ధానికి ఎలా బలి పెడతారన్న రవి కుటుంబం ప్రశ్నకు బదులిచ్చేదెవరు...? భారీ వేతనాలు ఎర చూపి... ఇది ఒక్క రవి కథే కాదు. ఎంతోమంది భారత యువకులకు భారీ వేతనంతో ఉద్యోగాలంటూ ఊరించి రష్యాకు తీసుకెళ్తున్నారు. చివరికిలా బలవంతంగా యుద్ధాన్ని నెత్తిన రుద్దుతున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య చాలామంది భారతీయులు ఇలా రష్యా సైన్యంలో చేరారు. వారిక్కూడా అక్కడికి వెళ్లేదాకా ఆ సంగతి తెలియదు! 2023 డిసెంబర్లో హర్‡్ష కుమార్ అనే యువకున్ని బెలారస్కని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ మధ్యలోనే వదిలేశాడు. రష్యా సైన్యానికి చిక్కడంతో యుద్ధంలో పాల్గొనాల్సి వచి్చంది. అమృత్‌సర్‌కు చెందిన తేజ్‌పాల్‌సింగ్ పరిస్థితీ అంతే. ఏజెంటుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ ఉద్యోగం కోసం రష్యా వెళ్లి చివరకు సైన్యంలో తేలాడు. చివరగా మార్చి 3న కుటుంబంతో మాట్లాడారు. జూన్‌లో మరణించాడు. పశి్చమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన ఉర్గెన్ తమాంగ్ క్రిమియా యుద్ధ ప్రాంతం నుంచి మార్చిలో వీడియో పంపాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, మంచి జీతం పేరిట ఏజెంట్ మోసగించాడని వాపోయాడు. 10 రోజులు నామమాత్ర ఆయుధ శిక్షణ ఇచ్చి బలవంతంగా వార్ జోన్లోకి నెట్టారని వెల్లడించాడు. తన యూనిట్‌లోని 15 మంది రష్యనేతర సైనికుల్లో 13 మంది ఎలా దుర్మరణం పాలయ్యారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఏపీ నుంచి కూడా పలువురు యువకులు ఈ వలలో చిక్కి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి చేరినట్టు చెబుతున్నారు. నేరం నిరుద్యోగానిదే... సంపాదనకు విదేశీ బాట, ప్రవాస భారతీయుని హోదా మన సమాజంలో గౌరవ చిహ్నాలు. గ్రామీణ నిరుద్యోగిత మరీ ఎక్కువ ఉన్న పంజాబ్, హరియాణా యువత కెనడా, యూరప్ దేశాలకు విపరీతంగా వెళ్తుంటారు. కానీ ఆ దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. రష్యన్ స్టాంప్ ఐరోపా దేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందనే ఆశతో పంజాబ్, హరియాణా యువకులు రష్యా బాట పడుతున్నారు. తీరా వెళ్లాక ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధంలో తేలుతున్నారు. రష్యా సైన్యంలో మనోళ్లు 40 మంది దాకా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. 8 మంది భారతీయుల మృతి: కేంద్రం విదేశీ యువతను రష్యా ఇలా ఉక్రెయిన్ యుద్ధానికి బలి పెడుతున్న నేపథ్యంలో తమ పౌరులు ఆ దేశాలకు వెళ్లకుండా పలు దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి. మన దేశంలో అలాంటి చర్యల ఊసే లేదు! కనీసం మోసగిస్తున్న ఏజెంట్లపైనా చర్యల్లేవు. సరికదాం, రష్యాలో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలనే ప్రకటనలతో కేంద్రం సరిపెడుతోంది! మన యువకులు ఉక్రెయిన్ యుద్ధంలో బలవుతున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి రష్యా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా చర్చించినా లాభం లేకపోయింది. మనోళ్లను స్వదేశానికి పంపేందుకు రష్యా అధికారులు ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ మరణించినట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తాజాగా గత గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘12 మంది భారతీయులు ఇప్పటికే రష్యా సైన్యాన్ని వీడినట్టు సమాచారముంది. మరో 63 మంది కూడా సైన్యం నుంచి త్వరగా విడుదల చేయాలని రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు’’ అని వెల్లడించారు. రష్యా సైన్యం తరఫున యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న భారతీయులను వెనక్కు పంపేలా ఆ దేశంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పారు.ఇలా మోసగిస్తున్నారు... నిరుపేద యువతను వారికే తెలియకుండా రష్యా సైన్యంలోకి పంపేందుకు ఏజెంట్లు ప్రధానంగా లక్షల్లో జీతం, మెరుగైన జీవితాన్ని ఎరగా చూపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో సీబీఐ చేసిన దాడుల్లో భారీ మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగు చూసింది. దాని సభ్యులను విచారించగా ఈ వివరాలు బయటికొచ్చాయి. → ఈ ‘రష్యాలో ఉపాధి’ ప్రచారానికి వారు ప్రధానంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. → ఒకసారి బాధితులు తమ వల్లో పడగానే స్థానిక ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. రంగుల కల చూపి ఒప్పిస్తారు.→ పలు సందర్భాల్లో ఉన్నత విద్యను కూడా ఎర వేస్తున్నారు. → రష్యాలో దిగీ దిగగానే స్థానిక ఏజెంట్లు వాళ్ల పాస్‌పోర్టులు లాగేసుకుంటారు. → ఆనక బలవంతంగా రష్యా సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తారు. ఇతని పేరు సయ్యద్ ఇలియాస్ హుసేనీ. కర్నాటకలోని కలబురిగి వాసి. వెనక ఉన్నది అతని మిత్రులు అబ్దుల్ నయీం, మహ్మద్ సమీర్ అహ్మద్. వీళ్లు, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన మొహమ్మద్ సూఫియాన్ దుబాయ్ విమానాశ్రయంలో పని చేసేవారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు చూశారు. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి నలుగురూ గత డిసెంబర్లో రష్యా వెళ్లారు. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుని ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు. అక్కడి నుంచి ఇలియాస్ తమ దుస్థితిని ఇలా గోప్యంగా వీడియో తీసి పంపాడు. ఇలియాస్ తండ్రి నవాజ్ అలీ హెడ్ కానిస్టేబుల్. తన కొడుకును, అతని స్నేహితులను ఎలాగైనా సురక్షితంగా తీసుకు రావాలంటూ అప్పటినుంచీ అతను ఎక్కని గడప లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇల్లు అమ్మితే పన్ను భారం!
సొంతిల్లు.. చాలా మందికి జీవితకాల కష్టార్జితం. అలాంటి సొంతింటిని అవసరార్థమై విక్రయించినప్పుడు వచి్చన లాభంపై పన్ను చెల్లించాలన్న విషయం ఎంత మందికి తెలుసు? మరీ ముఖ్యంగా ఇటీవలి బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదన ప్రకారమైతే.. ఈ పన్ను మరింత చెల్లించాల్సి రావచ్చు. దీర్ఘకాల మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించడం సానుకూల నిర్ణయమేగా అని అనుకోవచ్చు. కానీ, ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించారు. దీని కారణంగా నికరంగా చెల్లించాల్సిన పన్ను గణనీయంగా పెరగనుంది. అసలు ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగింపు ఎవరికి అనుకూలం? తాజా పన్ను ప్రతిపాదన ఎవరికి లాభం..? తమపై పడే భారం ఎంత..? నిపుణుల విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇప్పటి వరకు.. ప్రాపర్టీ (ఇల్లు లేదా ఇంటి స్థలం/గ్రామీణ వ్యవసాయ భూమి కాకుండా)ని క్యాపిటల్ అస్సెట్‌గా ఆదాయపన్ను చట్టం చెబుతోంది. కనుక ప్రాపర్టీ విక్రయం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత విక్రయించిన సందర్భాల్లో అది దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. వచ్చిన లాభంపై లోగడ (జూలై 23కు ముందు) 20% పన్ను అమ లు చేసేవారు. కరెన్సీ విలువను ఏటా కొంత శాతం చొప్పున ద్రవ్యోల్బణం హరిస్తుందని తెలుసు. ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రాపర్టీ కొనుగోలు ధరతో సర్దుబాటు చేసే వారు. దీన్నే ఇండెక్సేషన్ బెనిఫిట్‌గా చెబుతారు. ఉదాహరణకు 6% ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు రూ.100 విలువ ఏడాది తర్వాత రూ.94గా మారుతుంది. పేరుకు మన దగ్గర రూ.100 ఉంటుంది. కానీ, దాని అసలు విలువ రూ.94. ఇదే మాదిరి రూ.100 పెట్టి కొనుగోలు చేసిన ప్రాపరీ్ట.. అసలు కొనుగోలు ధర ఏడాది తర్వాత ఇండెక్సేషన్‌తో కలిపితే రూ.106గా మారుతుంది. పాత విధానంలో ప్రాపర్టీ అసలు కొనుగోలు ధర ఇండెక్సేషన్ ప్రయోజనంతో గణనీయంగా పెరిగేది. దీంతో నికరంగా చెల్లించే పన్ను తక్కువగా ఉండేది. ఆదాయపన్ను శాఖ ఏటా ద్రవ్యోల్బణం సర్దుబాటు ఆధారంగా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ (సీఐఐ/ద్రవ్యోల్బణ వ్యయ సూచీ)ను ఖరారు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా విడుదల చేస్తుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పుడు ప్రాపరీ్టకి ఈ ప్రయోజనాన్ని తొలగించారు. ఇది మెజారిటీ ఇంటి యజమానులకు నిజంగా మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ, నిపుణులు మాత్రం తాజా సవరణలతో పన్ను భారం పెరుగుతుందని గణాంకాల సహితంగా వివరిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే అది స్వల్పకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ మొత్తం తమ ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. వ్యవసాయ భూమి క్యాపిటల్ అస్సెట్ కాదు కనుక దీని విక్రయంపై మూలధన లాభాల పన్ను వర్తించదు. ఎవరికి ప్రయోజనం? జూలై 23 ముందు వరకు ఉన్న ఇండెక్సేషన్ ఆధారిత దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధానంతో అందరికీ ప్రయోజనం ఉండేది. కరెన్సీ విలువ క్షీణత ప్రభావం తీసివేసిన తర్వాత మిగిలిందే అసలైన లాభం కనుక, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు నూతన విధానంతో మెజారిటీ యజమానులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ద్రవ్యోల్బణం రేటుకు మించి ప్రాపర్టీ ధరలు గణనీయంగా పెరిగినప్పుడే నష్టం లేకుండా ఉంటుంది. కొనుగోలు నుంచి విక్రయించే మధ్యకాలంలో ధరల్లో పెద్దగా వృద్ధి పెద్దగా లేకపోతే నష్టమే. ఏటా ప్రాపర్టీ ధరలు 9 శాతంలోపే వృద్ధి చెందితే నష్టపోవాల్సి వస్తుంది. కనీసం 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగితేనే కొత్త విధానంతో లాభపడొచ్చు. 2013 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 36 పట్టణాల్లో ప్రాపర్టీ ధరలు సగటున 5.11 శాతం చొప్పునే పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ‘రెసిడెక్స్’ స్పష్టం చేస్తోంది. ఈ కాలంలో ఒక్క హైదరాబాద్‌లోనే ఇది 8.56 శాతం సీఏజీఆర్‌గా ఉంది. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ రాబడులు 12–16 శాతం (వార్షిక) మధ్య ఉంటున్నాయని, కనుక నూతన విధానం లాభదాయకమని ప్రభుత్వం అంటుంటే.. అన్ని ప్రాంతాల్లోనూ ఆ విధమైన ధరల వృద్ధి లేదంటూ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఆర్బీఐ హౌసింగ్ ప్రైజింగ్ ఇండెక్స్‌ను చూసినా ప్రముఖ పట్టణాల్లో గడిచిన దశాబ్ద కాలంలో ధరల వృద్ధి 1–9 శాతం మధ్యే ఉన్నట్టు తెలుస్తోంది.పన్ను తగ్గించుకునే మార్గం..? ఇంటి విక్రయంపై దీర్ఘకాల మూలధన లాభం వస్తే.. అంతేసి పన్ను చెల్లించడం వల్ల మిగిలేదేమీ లేదని భాపడక్కర్లేదు. పన్ను భారం తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందుకోసం మెరుగైన ఆప్షన్ తిరిగి ఇంటిని కొనుగోలు చేయడమే. ప్రాపర్టీ విక్రయం ద్వారా వచి్చన మూలధన లాభంతో రెండేళ్లలో తిరిగి ఇల్లు కొనుగోలు చేయాలి. ప్రాపర్టీ విక్రయించడానికి ముందు ఏడాది కాలంలో మరో ఇంటిని కొనుగోలు చేసినా కానీ, సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త ఇంటిని నిర్మించుకునేట్టు అయితే అందుకు మూడేళ్ల వ్యవధి ఉంటుంది. ఇలా మరో ఇంటిని కొనుగోలు చేసి పన్ను మినహాయింపు పొందిన వారు.. ఆ ప్రాపరీ్టని మూడేళ్లు నిండిన తర్వాతే విక్రయించాలి. లేదంటే గతంలో పొందిన పన్ను మినహాయింపును కోల్పోవాల్సి వస్తుంది. మూలధన లాభం రూ.2 కోట్లకు మించి ఉంటే, పన్ను మినహాయింపునకు కొత్త ఇల్లు ఒక్కటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మూలధన లాభం రూ.2 కోట్లలోపు ఉంటే రెండు ఇళ్లపై వెచి్చంచినా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక్కసారి ఈ ప్రయోజనం క్లెయిమ్ చేసుకుంటే, ఇక తర్వాత మరోసారి అవకాశం ఉండదు. సెక్షన్ 54 కింద గరిష్ట పన్ను మినహాయింపు ప్రయోజనం రూ.10 కోట్లు. ఇంతకుమించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటిని విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల మూలధన లాభం ఆర్జిస్తే.. తిరిగి మరో ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై రూ.10 కోట్లపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. విక్రయించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలులోపు ఇంటిని కొనుగోలు చేయలేకపోతే.. అప్పుడు ఆర్జించిన మూలధన లాభాల మొత్తాన్ని ఎంపిక చేసిన బ్యాంకు శాఖల్లో క్యాపిటల్ గెయిన్స్ స్కీమ్ అకౌంట్ (సీజీఏఎస్)లో డిపాజిట్ చేయాలి. లేదంటే లాభం మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను లేకుండా చూసుకోవచ్చు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ ఈ తరహా బాండ్లను జారీ చేస్తుంటాయి. వీటిపై కూపన్ రేటు 6 శాతంలోపే ఉంటుంది. వీటి కాల వ్యవధి ఐదేళ్లు. ఇంటిని విక్రయించిన తేదీ నుంచి ఆరు నెల్లలోపు ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నది నిబంధన. నష్టం వస్తే..? ప్రాపర్టీ విక్రయంపై నష్టం వస్తే ఏంటి పరిస్థితి..? ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇతర మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాపర్టీ విక్రయించిన సంవత్సరంలో ఇతర పెట్టుబడి సాధనాలపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాలు నమోదు చేయని వారు.. తదుపరి ఆరి్థక సంవత్సరానికి క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు.ప్రాపర్టీ కొనుగోలు ధర..? మెజారిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 48 కింద అసలు కొనుగోలు ధర, చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజి్రస్టేషన్ చార్జీలు, ఇంటి కొనుగోలుకు రుణం తీసుకుంటే అందుకు చేసిన వడ్డీ చెల్లింపులు (దీనిపై ఆదాయపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయకపోతోనే) అన్నింటినీ మూలధన లాభం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి రూ.50 లక్షల ప్రపారీ్టని కొనుగోలు చేశారు. దీనిపై రూ.3.5 లక్షలు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించారు. ఇందులో రూ.1.5 లక్షలను అదే ఆరి్థక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందారు. కొనుగోలుకు రుణం తీసుకోగా, దీనిపై మొత్తం మీద రూ.10 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించారు. ఇందులో రూ.4 లక్షల వడ్డీ చెల్లింపులపైనే సెక్షన్ 24(బీ) కింద పన్ను మినహాయింపు పొందారు. దీంతో అసలు రూ.50 లక్షలు, స్టాంప్ డ్యూటీలో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయని రూ.2 లక్షలు, గృహ రుణంపై వడ్డీ చెల్లింపుల్లో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయకుండా మిగిలిన రూ.6 లక్షలు కలిపితే మొత్తం రూ.58 లక్షలను ప్రాపర్టీ కొనుగోలు ధర కింద పరిగణనలోకి తీసుకుంటారు’’అని ఖైతాన్ లీగల్‌కు చెందిన జోరావాలా తెలిపారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం... → 2009లో ప్రాపర్టీని రూ.15లక్షలు పెట్టి కొన్నారని అనుకుందాం. ఏటా ధర 4% చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుత విక్రయ ధర రూ.27 లక్షలు అవుతుంది. కానీ, ఇండెక్సేషన్ సర్దుబాటుతో కొనుగోలు ధర రూ.36.79 లక్షలుగా మారుతుంది. అంటే 2009లో కొనుగోలుకు వెచి్చంచిన రూ.15 లక్షలకు ఏటా ఇండెక్సేషన్ ప్రభావాన్ని కలిపితే ఈ ధర వస్తుంది. దీంతో పోల్చితే విక్రయించిన ధర తక్కువ కనుక పాత విధానంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కానీ నూతన విధానంలో 2009 నాటి కొనుగోలు ధరనే ప్రామాణికం. దీంతో రూ.12 లక్షలు లాభం వచి్చనట్టు తేలుతుంది. దీనిపై 12.5% పన్ను కింద రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ప్రాపర్టీ ధర ద్రవ్యోల్బణం కంటే తక్కువగా పెరగడం వల్ల వాస్తవంగా ఈ కేసులో నష్టం వచి్చనట్టు అర్థం చేసుకోవాలి. అయినా కానీ, కొత్త విధానం పన్ను చెల్లించాల్సిందే.→ 2009లోనే రూ.15 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ప్రాపర్టీ ధర ఒకవేళ ఏటా 8% కాంపౌండెడ్ చొప్పున పెరిగితే ప్రస్తుత విక్రయ ధర రూ. 47.58 లక్షలు అవుతుంది. ఇండెక్సేషన్ తో సర్దుబాటు చేస్తే కొనుగోలు ధర రూ.36.79 లక్షలు అవుతుంది. దీంతో పాత విధానంలో నికర లాభం రూ.10.79 లక్షలు అవుతుంది. దీనిపై 20% మూలధన లాభం కింద రూ.2.16 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త విధానంలో ఇండెక్సేషన్ లేదు కనుక నికర లాభం రూ.32. 58 లక్షలు అవుతుంది. దీనిపై 12.5% పన్ను కింద రూ. 4.07 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → 2009లోనే రూ.15లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఇదే ప్రాపర్టీ ధర ఒకవేళ ఏటా 12 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరిగితే ప్రస్తుత విక్రయ ధర రూ.82.10 లక్షలు అవుతుంది. ఇండెక్సేషన్‌తో సర్దుబాటు చేసిన తర్వాత వాస్తవ కొనుగోలు ధర రూ.36.79 లక్షలుగా మారుతుంది. దీని ప్రకారం నికర లాభం రూ.45.31 లక్షలు అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను కింద 9.06 లక్షలు చెల్లించాలి. అదే ఇండెక్సేషన్ లేకుండా చూస్తే నికర మూలధన లాభం రూ.67.10 లక్షలు అవుతుంది. దీనిపై 12.5 శాతం పన్ను కింద రూ.8.39 లక్షలు చెల్లించాలి. కొత్త విధానం కారణంగా ఈ కేసులో రూ.67 వేలు ఆదా అవుతోంది. వివిధ పట్టణాల్లో ధరల వృద్ధి నిజానికి గడిచిన ఐదేళ్లలో ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 10 శాతంలోపే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మినహా ఇతర ప్రముఖ పట్టణాల్లో ధరల వృద్ధి 9 శాతంలోపే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం ప్రాపరీ్టలు కొనుగోలు చేసిన వారిపై కొత్త పన్ను విధానం కారణంగా ఎక్కువ ప్రభావం పడనుంది.2001 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేస్తే..? ఇంటిని 2001 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి వాస్తవ కొనుగోలు వ్యయాన్ని మూ లధన లాభాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు కొనుగోలు చేసిన వారికి ‘గ్రాండ్ ఫాదరింగ్’ ప్రొవిజన్ అమలవుతుంది. 2001 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసిన కేసుల్లో సహేతుక మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. మరి ఈ సహేతుక మార్కెట్ విలువ అన్న దానికి ఇంకా స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. మార్కెట్ విలువలకు, రిజి్రస్టేషన్ విలువలకు మధ్య గతంలో ఎంతో అంతరం ఉండేది. రిజి్రస్టేషన్ వ్యాల్యూనే పరిగణనలోకి తీసుకుంటే మరింత పన్ను భారం ఎదుర్కోవాల్సి రావచ్చు. నికర పన్ను పన్ను 14.95 %దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్నుకు అదనంగా 15 శాతం సర్‌చార్జ్, 4 శాతం సెస్సు కూడా కలిపితే మొత్తం రూ.14.95 శాతం పన్ను కింద చెల్లించాలన్నది గుర్తుంచుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే..? ప్రభుత్వం పన్ను నిబంధనలు మార్చిన నేపథ్యంలో.. పెట్టుబడుల దృష్ట్యా ఇల్లు, స్థలాలను కొనుగోలు చేసే వారు ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముఖ్యంగా తాము ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాంతంలో ధరలు ఏటా కనీసం 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడే ప్రయోజనం దక్కుతుంది. లేదంటే ఒకవైపు పన్ను భారం, మరోవైపు ద్రవ్యోల్బణ ప్రభావం కలిపి నికరంగా మిగిలేదేమీ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడో కొని ఉంటే పన్ను భారం 10–20 ఏళ్లకు ముందు కొనుగోలు చేసిన వారు తాజా పన్ను ప్రతిపాదనతో ఎక్కువ పన్ను భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటికి ప్రాపర్టీ ధరల్లో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడం వల్ల మూలధన లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక నాన్ మెట్రో పట్టణాల్లో, పల్లెల్లో ప్రాపర్టీ ధరల పెరుగుదల అంతగా లేదు. వీటిని విక్రయించినప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం పోను నికరంగా నష్టమే వస్తుంది. అయినా కానీ, నూతన విధానంలో వీరు పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పదేళ్లకు మించితే భారమే... ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడం వల్ల పదేళ్లకు పైగా ప్రాపరీ్టలను హోల్డ్ చేసిన వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల పదేళ్లకు మించిన ఆస్తులను విక్రయించే వారు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. – నిరంజన్ హిరనందాని, నరెడ్కో చైర్మన్ – సాక్షి, బిజినెస్ డెస్క్