Sakshi Special
-
Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్‌స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్‌తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్‌లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్‌లో థియేటర్ ఆర్టిస్ట్స్‌ని కలిసేవాడిని. అప్పుడే విజయ్‌ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్‌గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్‌తో చేశాం. నా వల్ల విజయ్‌కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్‌లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్‌లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్‌ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్‌కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్‌గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్‌గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్‌తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్‌గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్‌బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్‌ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్‌లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్‌తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్‌లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్‌లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్‌కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్‌ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్‌లో విజయ్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్‌ని ఫ్యామిలీ మేన్‌గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్‌మేన్’.మీ బాయ్స్‌కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్‌కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్‌కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్‌కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్‌తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్‌కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్‌లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్‌తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్‌లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russian President Vladimir Putin: అతని కోసం ఎందాకైనా...!
2024 ఆగస్టు 1. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే లాండైన విమానం నుంచి 8 మంది ప్రత్యేక భద్రత మధ్య బయటికి వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్ చేసుకునేందుకు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు ‘వీఐపీ’కి షేక్‌హాండ్ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2019 ఆగస్టు. జర్మనీ రాజధాని బెర్లిన్. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పార్కు. సైకిల్‌పై వస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. తన ముందు నడుస్తున్న మాజీ చెచెన్ రెబెల్ జెలీంఖాన్ ఖాన్గోష్విలిని టపీమని కాల్చేశాడు. చుట్టుపక్కల వాళ్లు షాక్ నుంచి తేరుకునే లోపే క్షణాల్లో మాయమైపోయాడు. సైకిల్‌ను పక్కనే ఉన్న నదిలో పారేశాడు. విగ్గు తీసి, నీట్‌గా షేవ్ చేసుకుని ఎవరూ గుర్తించలేనంతగా రూపం మార్చుకున్నాడు. విధి వక్రించి ప్రత్యక్ష సాక్షులు గుర్తించడంతో కాసేపటికే పట్టుబడి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. – నాడు జర్మనీలో జీవితఖైదుకు గురైందీ, నేడు మాస్కోలో పుతిన్ నుంచి ఘనస్వాగతం అందుకున్నదీ ఒక్కడే. అతనే... వదీం క్రషికోవ్. పేరుమోసిన రష్యా హిట్‌మ్యాన్. జెలీంఖాన్ ఒక్కడినే కాదు, రష్యాకు కంట్లో నలుసుగా మారిన వాళ్లెందరినో క్రషికోవ్ వెంటాడి వేటాడాడు. విదేశీ గడ్డపై ఇలాంటి అసైన్మెంట్లను సైలెంట్‌గా పూర్తి చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రష్యా గూఢచర్య సంస్థ ఎఫ్ఎస్బీలో చేరిన కొన్నాళ్లకే టాప్ రేటెడ్ హిట్‌మ్యాన్‌గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా పుతిన్‌కు అత్యంత ఇషు్టనిగా మారాడు. అందుకే అతన్ని విడిపించుకోవడాన్ని ఆయన సవాలుగా తీసుకున్నారు. జెలీంఖాన్ హత్యతో తనకు సంబంధమే లేదని విచారణ పొడవునా క్రషికోవ్ బుకాయించినా, అది అతని పనేనని పుతిన్ అధికారికంగానే అంగీకరించారు. క్రషికోవ్‌ను ‘గొప్ప దేశభక్తుని’గా అభివరి్ణంచారు. అతని కోసం సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికాతో చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మారి్పడికి కూడా అంగీకరించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మెరైన్ పౌల్ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్ కారా ముర్జా సహా 16 మందిని వదిలేశారు. బదులుగా అమెరికా, జర్మనీ, పశ్చిమ దేశాల నుంచి క్రషికోవ్తో పాటు 8 మంది రష్యన్లను విడిపించుకున్నారు. వారిలో మరో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లున్నారు. తద్వారా, విదేశాల్లో ఇలాంటి ఆపరేషన్లు చేసే క్రమంలో దొరికిపోయినా అధ్యక్షుడు తమను కాపాడి తీరతారని నిఘా విభాగం ఏజెంట్లకు ధీమా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆశించింది కూడా అదేనని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయనాడ్ విషాదం: ఈ తరహా విపత్తుల్ని ముందుగా గుర్తించలేమా? మానవ తప్పిదాలతోనే..
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు.. సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి. నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.తేడాలు ఇవే..ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.ముందస్తు సూచనలుకొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా చేస్తే..ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. -
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...!
గాజా నగరం. జనవరి మాసం. రాత్రి 10 గంటలు. ఎముకలు కొరికే చలి. ఇజ్రాయేల్ దాడులతో బాంబుల మోత మోగిపోతోంది. 34 ఏళ్ల ఆలా అల్ నిమర్. అప్పటికే నిండు గర్భిణి. నడిరోడ్డు మీద పురిటినొప్పులు పడుతోంది. నేపథ్యంలో దూరంగా బాంబుల మోతలు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి నెట్వర్క్ లేదు. ట్యాక్సీ కోసం వెళ్లిన భర్త అబ్దుల్లా ఇంకా తిరిగి రాలేదు. ‘ఎలాగైనా నేను ఆస్పత్రికి చేరుకున్నాకే ప్రసవించేలా చూడు తండ్రీ’ అన్న ఆలా వేడుకోళ్లు ఫలించలేదు. దాంతో నిస్సహాయురాలిగా రోడ్డు మీదే ప్రసవించింది. ట్యాక్సీ దొరక్క వెనక్కి పరుగెత్తుకొచ్చిన భర్త నెత్తుటి కూనను చేతుల్లోకి తీసుకున్నాడు. బొడ్డుతాడు కత్తిరించేందుకు కూడా ఏమీ లేదు. సోదరుడు తెచి్చన మెడికల్ కిట్‌లో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కత్తిరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎట్టకేలకు ఓ కారు దొరికినా పెట్రోల్ అయిపోవడంతో అదీ ఆగిపోయింది. భర్త, సోదరుడు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో దారి చూపుతుంటే పసికందును స్వెటర్లో చుట్టుకుని రక్తమోడుతూ గంటసేపు నడిచిందా పచ్చి బాలింత. దారంతా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూనే ఉన్నారంతా. ఎట్టకేలకు ఓ మినీ బస్సు వారిని ఆస్పత్రి చేర్చింది. అప్పటికీ విపరీతమైన ని్రస్తాణతో ఆలా కళ్లు మూతలు పడ్డాయి. తెల్లవారి గానీ స్పృహలోకి రాలేదు. వెంటనే బిడ్డ కోసం తడుముకుంది. పాపాయి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పాక గానీ కుదుట పడలేదు. యుద్ధం మొదలయ్యాక అదే ఆమెకు అత్యంత సంతోషాన్నిచి్చన ఉదయం. పది నెలలు.. పదకొండు దాడులు... ఇది ఒక ఘటన మాత్రమే. గత అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన నాటినుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. తల్లిదండ్రులను పోగొట్టు్టకుని అనాథలైన పిల్లలు. కళ్లముందే పిల్లలు మరణిస్తుంటే నిస్సహాయంగా చూసిన వృద్ధులు. తను ప్రసవించే నాటికన్నా యుద్ధం ఆగిపోవాలనిదేవుడుని వేడుకుంది ఆలా. అలా జరగకపోయినా నడి రోడ్డుపైనే ఈ లోకంలోకి వచి్చన తన చిన్నారి నిమాకు మాత్రం ఇప్పుడు ఆర్నెల్లు నిండాయి. నిమా ఆమెకు మూడో సంతానం. ముగ్గురు పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆలాను వెంటాడుతోంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక్క రొట్టె దొరకడమే గగనంగా ఉంది. పూటకు పావు రొట్టెతో సరిపుచ్చుకుని అర్ధాకలితోనే పడుకుంటున్నారు. యుద్ధం మొదలవగానే గాజాలోని జైటౌన్లో ఉన్న ఆలా ఇంటిపై తొలి దాడి జరిగింది. దాంతో బంధువుల ఇంటికి వెళ్లారు. అదీ బాంబు దాడులకు బలవడంతో పొరుగు వాళ్ల ఇళ్లకు. అలా ఈ పది నెలల్లో ఆలా కుటుంబం ఏకంగా పదకొండు బాంబుదాడులు తప్పించుకుంది. కాకపోతే అన్నిసార్లూ నిరాశ్రయమవుతూ వచి్చంది. ఆలా ఎనిమిది నెలల గర్భవతిగా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వారుంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆలా కుటుంబంతో పాటు 25 మంది దాకా ఇంట్లో ఉన్నారు. కేవలం దైవకృప వల్లే ఆ దాడి నుంచి బతికి బట్ట కట్టామని గుర్తు చేసుకున్నారామె. నెలకే మరో బాంబుదాడి ఆమె 26 ఏళ్ల సోదరుడిని పొట్టన పెట్టుకుంది. ‘చీకటి రోజుల్లో మాత్రం ఆశల గానాలు ఉండవా!? ఉంటాయి. కాకపోతే చీకటిరోజుల గురించే ఉంటాయి’ అన్నారో ఫ్రెంచ్ నాటకకర్త. ఇంతటి యుద్ధ మధ్యంలో, అంతులేని విషాదాల పరంపరలో ఆలా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్కటి.. చిన్నారి నిమా బోసినవ్వులు... 39,324 మంది మృతి... గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 39,324 మంది మరణించారు. 90,830 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 66 మంది మృతి చెందారు. 241 మంది గాయపడ్డారు. అక్టోబ రు 7న హమాస్ నేతృత్వంలోని దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించడం, అది యుద్ధానికి దారితీయడం తెలిసిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో వారి కలలు కల్లలేనా!?
ప్రణీత, జెఫ్రీన్, రోషన్ లాంటి పరిస్థితిని అమెరికాలో 2.50 లక్షల మంది ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది భారతీయు లే. వీరంతా చిన్నవయసులో తమ కుటుంబ సభ్యులతో కలిసి చట్టబద్ధంగానే అమెరికాకు చేరుకున్నారు. కానీ, అమెరికాలోనే శాశ్వతంగా ఉండే అవకాశం మాత్రం లేదు. వీసాలను మార్చుకోకపోతే 21 ఏళ్లు దాటగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. వీరిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తున్నారు. ఇలాంటి వారికి అమెరికాలో ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచాలని అధికార డెమొక్రటిక్ పార్టీ భా విస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ మాత్రం అంగీకరించడం లేదు. బయటకు పంపించాల్సిందేనని పట్టుబడుతోంది. సెనేట్‌లో రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎందుకీ సమస్య? లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి డిపెండెంట్‌గా అమెరికాకు వచ్చినవారు 21 ఏళ్ల వయసు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుంది. ఆ తర్వాత వీసా మార్చుకోకపోతే బయటకు వెళ్లిపోవాల్సిందే. తల్లిదండ్రులకు/ కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) లభిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. డిపెండెంట్లు కూడా అమెరికాలో నివసించేందుకు అవకాశం ఉంది. కానీ, గ్రీన్‌కార్డు లభించడానికి ఇప్పుడు 15 ఏళ్లకుపైగా సమయం పడుతోంది. ఈలోగా డిపెండెంట్లకు 21 ఏళ్ల వయసు దాటేస్తోంది. దాంతో వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది. ప్రతిభావంతులను వదులుకుంటారా? డిపెండెంట్లను బయటకు పంపించడాన్ని డెమొక్రటిక్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో జని్మంచకపోయినా ఇక్కడే పెరిగి, పెద్ద చదువులు చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్న ప్రతిభావంతులను వదులుకోవడం తెలివైన పని కాదని అంటున్నారు. దేశ అభివృద్ధికి వారి సేవలు అవసరమని చెబుతున్నారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను మరో దేశం కోసం ధారపోయడం ఏమిటని వాదిస్తున్నారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు అమెరికాలో నివసించే, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచే బైపారి్టషన్ అమెరికాస్ చి్రల్డన్స్ యాక్ట్ పెండింగ్‌లో ఉంది. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలోగా తమకు చట్టబద్ధమైన నివాస హోదా కలి్పంచాలని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కోరుతున్నారు. → ఇండియాలో జని్మంచిన ప్రణీత 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచి్చంది. క్లౌడ్ ఇంజనీరింగ్ చదివింది. శాశ్వత నివాస హోదా లేకపోవడంతో 15 ఏళ్లకుపైగా డిపెండెంట్‌గా నివసిస్తోంది. అమెరికాలో ఉండాలంటే తరచుగా వీసాలు మార్చుకోవాల్సి వస్తోంది.→ జెఫ్రీనా 2005లో ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి హెచ్4(డిపెండెంట్) వీసాపై అమెరికా వెళ్లింది. 2010లో ఆమె కుటుంబం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అదెప్పుడొస్తుందో తెలియదు. జెఫ్రీనాకు 21 ఏళ్లు దాటడంతో ఇండియాకు వెళ్లిపోవాలి.→ రోషన్ పదేళ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి హెచ్4 వీసాపై అమెరికా వచ్చాడు. 16 ఏళ్లు అక్కడే చదువుకున్నాడు. సెమీకండక్టర్ల తయారీ కంపెనీలో చేరాడు. అమెరికాను తన సొంత దేశంగానే ఇన్నాళ్లూ భావించాడు. కానీ, అక్కడి ప్రభుత్వం అతన్ని గత నెలల్లో ఇండియాకు బలవంతంగా తిరిగి పంపించివేసింది. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Union Budget 2024-25: బడ్జెట్ మథనంలో అమృతం చిలికేనా!
అమృతకాల బడ్జెట్‌గా మోదీ అభివర్ణిస్తున్న కేంద్ర బడ్జెట్–2024 అన్ని వర్గాల ఆశలపైనా నిజంగానే అమృతం చిలికిస్తుందా? పన్ను వాతలు, ఎడాపెడా కోతలతో ఖేదమే మిగులుస్తుందా? 2047కల్లా వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా పడుతున్న బలమైన పునాదిగా ప్రధాని చెప్పుకున్న ఈ బడ్జెట్లో మధ్యతరగతిని ఎంతో కొంత మురిపిస్తారా? ముఖ్యంగా ఐటీ మినహాయింపులు పెంచి వేతన జీవులకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తారా? కేవలం ప్రగతి పరుగులకే మరింత ఊపునిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో జవాబులు లభించనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్ నుంచి ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే... ఐటీ ఊరట.. ఈసారైనా...! ఆదాయ పన్ను చెల్లించే మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్లోనన్నా ఎంతో కొంత ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐటీ శ్లాబులను సవరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఓటాన్ అకౌంట్లో నిర్మల దీని జోలికి పోలేదు. నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని, వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పాత పన్ను విధానానికే మొగ్గుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులకు చోటు దక్కవచ్చని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. 80సీ తో పాటు స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. అది నెరవేరితే రియల్టీ పరిశ్రమకు కూడా మరింత ఊపు వస్తుంది. రియల్టీ డేటా సెంటర్లతో పాటు రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు (ఆర్ఈఐటీ)లకు పలు తాయిలాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే గాక ఉద్యోగావకాశాల సృష్టికి ఇదెంతో దోహదపడుతుందన్నది రియల్టీ పరిశ్రమ ముఖ్యుల అభిప్రాయం. రియల్టర్లకు నగదు అందుబాటును పెంచేందుకు ఆర్‌ఈఐటీలను ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్లుగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. ఈ రంగానికి జీఎస్టీ చట్టం కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించాలన్న ఆర్ఈఐటీ సంఘం డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందన్నదీ ఆసక్తికరమే. ఈవీలపై ఏం చేస్తారో...ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) జోరు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమకు మరింతగా ప్రోత్సాహకాలను అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈవీలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం తెస్తే బాగుంటుందన్న అభిప్రాయముంది. అన్నిరకాల ఈవీ వాహనాల తయారీ పూర్తిగా భారత్‌లోనే జరిగేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఆటో విడి భాగాలన్నింటిపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో పాటు పలు రకాలైన మినహాయింపులను ఆశిస్తున్నాయి. ఈవీ రంగంలో స్టార్టప్‌లకు దన్నుగా నిలిచే దిశగా చర్యలు ఉండవచ్చంటున్నారు. తుక్కు విధానాన్ని కూడా మరింతగా సరళీకరిస్తారేమో చూడాల్సి ఉంది. ఫార్మా కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో మరింత కీలకంగా మారిన ఫార్మా రంగానికి పలు ప్రోత్సాహకాలు నిర్మల బడ్జెట్లో చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పరిశోధన, ఇన్నొవేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చంటున్నారు. ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్న పలురకాల అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేయవచ్చని చెబుతున్నారు. కీలకమైన ఔఫధాల తయారీ తదితరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రకటనపై కూడా ఫార్మా దిగ్గజాలు ఆశలు పెట్టుకున్నాయి. ‘స్వదేశీ’ రక్షణ! అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, చైనా దూకుడు తదితర నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులను ఈసారి కూడా ఇతోధికంగా పెంచడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో రక్షణ సంబంధిత ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో ‘ఆత్మ నిర్భరత’కు మరింత పెద్దపీట వేసేలా మరిన్ని చర్యలు ఉండనున్నాయి. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊపునివ్వడమే గాక అపారమైన ఉపాధి అవకాశాలను కలి్పస్తుందని, అంతిమంగా ప్రజల జీవన నాణ్యతనూ పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నానని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం) ‘ఎక్స్’ ఖాతాలో ఒక లేఖను పోస్టు చేశారు. దేశ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. గత మూడున్నరేళ్లలో ఒక దేశంగా మనం గొప్ప ముందడుగు వేశామని అమెరికా ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటిదాకా సేవలందించడం అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదని, అధ్యక్షుడిగా మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని, తన నిర్ణయాన్ని పూర్తిగా తెలియజేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణమైన భాగస్వామి అని ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ బలపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించటానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌పై సొంత పార్టీ నాయకులు ఒత్తిడి పెంచారు. అందుకే ఆయ న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంచిన డిబేట్ సీఎన్ఎన్ ఛానల్ వేదికగా జూన్ 27న డొనాల్డ్ ట్రంప్– జో బైడెన్ల మధ్య తొలి అధ్యక్ష చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్ పదేపదే తడబడటం, మాటల కోసం తడుముకోవడం, మతిమరుపుతో పేలవ ప్రదర్శన కనబరిచారు. దాంతో 81 ఏళ్ల బైడెన్ మానసిక ఆరోగ్యంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సొంత డెమొక్రాటిక్ పార్టీలోనూ ఆయన సామర్థ్యంపై సందేహాలు తీవ్రమయ్యాయి. ట్రంప్‌ను బైడెన్ ఓడించలేడనే బలమైన అభిప్రాయం పారీ్టలో నెలకొంది. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ... బైడెన్‌తో మాట్లాడుతూ డెమొక్రాటిక్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే మేలని కుండబద్ధలు కొట్టారు. ప్రతినిధుల సభ, సెనేట్లలోనూ డెమొక్రాట్లకు అపజయాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలువురు డెమొక్రాటిక్ కీలక నాయకులతో ప్రైవేటు సంభాషణల్లో బైడెన్ వైదొలిగితేనే ట్రంప్‌ను ఓడించే అవకాశాలుంటాయని చెప్పారు. ఐదుగురు చట్టసభ సభ్యులు బైడెన్ వైదొలగాలని బాహటంగానే డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా డెమొక్రాటిక్ పారీ్టకి విరాళాలు ఇస్తున్న దాతలు.. బైడెన్ తప్పుకోవాలని షరతు పెడుతూ విరాళాలను నిలిపివేశారు. దాంతో నాన్సీ పెలోసీ రంగంలోకి దిగి తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. బైడెన్ శిబిరానికి వాస్తవాన్ని తెలియజెప్పారు. అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో కోవిడ్‌తో డెలావెర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడేంటి? ఓపెన్ కన్వెన్షన్.. కమలకు ఛాన్స్ బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో నవంబరు 5 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీపడవచ్చు) జరుగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన ప్రైమరీల్లో బైడెన్ తిరుగులేని మెజారిటీని కూడగట్టుకున్నారు. 4,000 పైచిలుకు డెలిగేట్లలో 3,900 మంది డెలిగేట్లను బైడెన్ గెల్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్‌లో వీరిందరూ బైడెన్‌కు బద్ధులై ఉండాలి. ఇప్పుడాయనే స్వయంగా రేసు నుంచి వైదొలిగారు కాబట్టి.. డెమొక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడొచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమొక్రాటిక్ పార్టీలోని ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచి్చన అభ్యరి్థకి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగు వేల పైచిలుకు డెలిగేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలిరౌండ్లో ఫలితం తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమొక్రాటిక్ నామినీ ఎన్నికయ్యేదాకా ఓటింగ్ కొనసాగుతుంది. ముమ్మర లాబీయింగ్, తెరవెనుక మంత్రాంగాలు జరగడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...
అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు. అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు కూడా. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు. ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది. నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కని్పంచడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్ఎస్ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది పెదవి విరిచారు కూడా... కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కని్పంచేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కని్పంచింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచి్చంది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్‌తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఆ భేటీతో... ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది. మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు. ‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.యోగి సంచలన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!
జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది. మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్‌రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! మంచి సమస్యే! ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి! అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. ‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తోంది. చదువు అందని ద్రాక్షే ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
India Wedding Industry: పెళ్లి.. యమా కాస్ట్లీ!
అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...! భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచి్చస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.చదువును మించి... భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచి్చస్తోంది!మన దేశంలో పెళ్లి ఖర్చు కుటుంబం ఖర్చు పేద రూ.3 లక్షలు దిగువ మధ్య తరగతి రూ.6 లక్షలు మధ్య తరగతి రూ.10–25 లక్షలు ఓ మాదిరి సంపన్నులు రూ.50 లక్షలు సంపన్నులు రూ.కోటి, ఆ పైన – సాక్షి, నేషనల్ డెస్క్ -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీసీసీల్లో హైరింగ్ జోరు
బడా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) తమ సొంత అవసరాల కోసం దేశీయంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు జోరుగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారిగా ఐటీ సేవల కంపెనీలను మించి వీటిలో హైరింగ్ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి క్యూ1లో 46 శాతం అధికంగా జీసీసీల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది బహుళజాతి సంస్థలు భారత్‌లో కొత్తగా జీసీసీలను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని విస్తరించడంపై అంతర్జాతీయ కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సరీ్వసుల విభాగంలో సిబ్బంది సంఖ్య నికరంగా 50,000 పైచిలుకు పెరగ్గా జీసీసీల్లో 60,000 పైచిలుకు స్థాయిలో వృద్ధి చెందిందని వివరించాయి. అంతే గాకుండా ఐటీ సరీ్వసుల కంపెనీలతో పోలిస్తే కేపబిలిటీ సెంటర్లలో వేతనాలు 30–40 శాతం అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉండగా.. వచ్చే ఏడాదినాటికి ఇది 1,900కి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. 70వేల పైచిలుకు నియామకాలు..పరిశ్రమ వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు) నియామకాలకు ఎంఎన్సీల జీసీసీల్లో డిమాండ్ 20–25 శాతం మేర పెరిగింది. బహుళజాతి సంస్థలు తక్కువ వ్యయాలతో అవసరాల మేరకు కార్యకలాపాలను విస్తరించుకునే వెసులుబాటుపై దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమనది విశ్లేషణ . ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో జీసీసీలు 70,000 వరకు గిగ్ వర్కర్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపారపరమైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఫుల్–టైమ్ ప్రాతిపదికన కన్నా ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలను బట్టి తక్కువ వ్యయాలతో ఎంతమందినైనా తీసుకోవడానికి అవకాశం ఉండటం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫుల్–టైమ్ ఉద్యోగులతో పోలిస్తే గిగ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా కంపెనీ సగటున 25–40 శాతం వరకు వ్యయాలను ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నాయి. తాత్కాలిక, ప్రాజెక్ట్–ఆధారిత థర్డ్ పార్టీ నియామకాల విధానంలో మానవ వనరుల విభాగంపరమైన వ్యయాలు, హైరింగ్..ఆన్‌బోర్డింగ్ వ్యయాలు, అడ్మిని్రస్టేషన్ వ్యయాలు, ఎప్పటికప్పుడు వేతనాల పెంపు మొదలైన భారాలను కంపెనీలు తగ్గించుకోవచ్చని వివరించాయి. కొన్ని వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మొత్తం జీసీసీ సిబ్బందిలో 8 శాతంగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య వచ్చే 12 నెలల్లో సుమారు 11.6 శాతానికి చేరనుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్‌ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్‌ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్‌ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్ఐసీ పెట్టుబడులపై లాభాల పంట
కొంతమేర పెట్టుబడుల విక్రయం ∙అయినప్పటికీ పెరిగిన విలువ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పలు దిగ్గజ కంపెనీలలో గల వాటాలను కొంతమేర విక్రయించింది. ఇందుకు స్టాక్ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరుగు తీస్తుండటం ప్రభావం చూపింది. అయినప్పటికీ గతేడాది ఎల్ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా 37 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! వివరాలు చూద్దాంస్టాక్ ఎక్సే్ఛంజీలకు దాఖలైన సమాచారం ప్రకారం ఎల్ఐసీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలలో అత్యధిక పెట్టుబడులను కలిగి ఉంది. ఈ బాటలో టాటా, అదానీ గ్రూప్‌లలోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. గత వారాంతానికల్లా దిగ్గజ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.39 లక్షల కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన విలువతో పోలిస్తే ఇది 37.5 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో పెట్టుబడులు 34 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో పెట్టుబడులను గతేడాది 6.37 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గించుకుంది. ఇదేకాలంలో టాటా గ్రూప్ కంపెనీలలో వాటా 4.22 శాతం నుంచి 4.05 శాతానికి నీరసించింది. వీటి విలువ రూ. 1.29 లక్షల కోట్లు. ఇక అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ వాటా 4.27 శాతం నుంచి 3.76 శాతానికి దిగివచి్చంది. వీటి విలువ 49 శాతం దూసుకెళ్లి రూ. 64,414 కోట్లను తాకింది. ఎన్ఎస్ఈలో బుధవారం ఎల్ఐసీ షేరు 1.5% బలపడి రూ. 1,048 వద్ద ముగిసింది. ఈ ధరలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 6.62 లక్షల కోట్లను అధిగమించింది.ప్రభుత్వం సైతం నిజానికి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. రూ. 1,050 సమీపంలో కదులుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. దీంతో ఎల్ఐసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంది. వీటిని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో సరికొత్త గరిష్టాన్ని అందుకుంటూ జోరు చూపుతున్నాయి. దీనికితోడు ఏడాది కాలంలో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు వేలంవెర్రిగా లాభాల పరుగు తీస్తున్నాయి. వెరసి ప్రభుత్వం వీటిలో కొంతమేర వాటాల విక్రయాన్ని చేపడితే.. సులభంగా బడ్జెట్ ప్రతిపాదిత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలసీ సరెండర్ చేస్తే.. ఇక ఊరట!
ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.సరెండర్ వేల్యూ? జీవిత బీమాలో సరెండర్ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి. ఇది అసమంజసమని భావించిన ఐఆర్డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ (జీఎస్వీ), స్పెషల్ సరెండర్ వ్యాల్యూ (ఎస్ఎస్వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లను కలపరు. అదే స్పెషల్ సరెండర్ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్ సరెండర్ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.ఎంతొస్తుంది..? పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ, స్పెషల్ సరెండర్ వేల్యూ, చెల్లింపుల సరెండర్ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీని సరెండర్ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్ అతడికి జమ అయింది. గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్‌లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్‌కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్ సరెండర్ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలు, సింగిల్ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్ సరెండర్ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది. ఎప్పటి నుంచి..? స్పెషల్ సరెండర్ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్ పాలసీలకే వర్తిస్తాయని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్డీఏఐ తీసుకొచి్చన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.ప్రత్యామ్నాయాలు... ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కాదు. ఆ పాలసీని పెయిడప్‌గా మార్చుకోవచ్చు. పెయిడప్‌గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్‌గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. మరో మార్గంగా పెయిడప్‌గా మార్చి, సమ్ అష్యూర్డ్ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్ సమ్ అష్యూర్డ్ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రయోజనాలునూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్ పెట్టడం కూడా సరెండర్ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పాలసీలు / టర్మ్ ప్లాన్లుఎండోమెంట్ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్) పాలసీదారు మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్ ప్లాన్‌తో సొంతం చేసుకోవచ్చు. -
IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న... భుగభుగలు
ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి.సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు! పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేలి్చంది. ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచి్చంది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్‌నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచి్చపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు20 ఏళ్లలో 450 క్యుబిక్ కి.మీ. మేరకు మాయంఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాం«దీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాం«దీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు! అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేíÙంచి ఈ మేరకు తేలి్చనట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’’ అని మిశ్రా వెల్లడించారు. ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘‘గ్లోబల్ వారి్మంగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్జీఆర్ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్‌ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్ఆఫ్(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్ 28నాటి అత్యల్ప ఓటింగ్ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. తొలి రౌండ్లో ఏం జరిగింది? మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పిడివాదుల్లో పొరపొచ్చాలు? అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు, అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్‌కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్లో పోటీపడి ఓడిన గలీబాఫ్కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్‌కే తన ఓటు అని ప్రకటించారు. మసూద్ గెలిస్తే? తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్‌ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.జలిలి గెలిస్తే? సయీద్ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్‌పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్