Chiranjeevi
-
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ
అల్లు vs మెగా అనేది ఏమవుతుందనేది ఎవరికీ తెలీదు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయమై ఇరువురు హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రీసెంట్గా 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ టైంలోనూ మెగా హీరోలు సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి టైంలో చిరంజీవి గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'పుష్ప 2' ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్.. 'అన్‌స్టాపబుల్ 4' షోలో పాల్గొన్నాడు. గతవారం తొలిపార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు (నవంబర్ 22) ఇంటర్వ్యూలో రెండో పార్ట్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో బన్నీ పిల్లలు అయాన్-అర్హ కూడా కాసేపు కనిపించారు. ఇక ఓ సందర్భంగా చిరంజీవి గురించి చర్చ రాగా.. అల్లు అర్జున్ డీటైల్డ్‌గా కొన్ని విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)'గత ఇరవై ఏళ్లుగా నాకు చిరంజీవితో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కానీ అంతకుముందు ఇరవై ఏళ్లు ఆయనతో నా బాండింగ్ ఎలా ఉందో ఎప్పుడూ చెప్పుకొనే సందర్భం రాలేదు. కాబట్టి ఇప్పుడు పంచుకుంటాను. ఓ మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్‌కి అభిమానిగా మారాను. నేను చిన్నగా ఉన్నప్పుటి నుంచి మామయ్య ప్రభావం నాపై చాలా ఉంది. ఎందుకంటే అప్పట్లో విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఆ టైంలో చిరంజీవి ఆయన పిల్లలతో పాటు నన్ను, శిరీష్‌ని కలిసి మొత్తం 10 మందికి పైగా పిల్లల్ని ఫారిన్ ట్రిప్‌కి తీసుకెళ్లేవారు. అప్పట్లో అది చాలా గొప్ప విషయం' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.ఇలా చిరంజీవి గురించి బన్నీ ఇంతలా చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి అభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది పక్కనబెడితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ) -
చిరంజీవి, షారూఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ నయనతార లేఖ
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా తన అభిమానులను పలకరించింది. అయితే, ఈ డాక్యుమెంటరీ చిత్రకరణలో తనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మూడు పేజీల లేఖను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు సాయం చేసిన తెలుగు,తమిళ్,మలయాళ,హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో పాటు నిర్మాణ సంస్థల పేర్లను తెలుపుతూ లేఖ రాశారు.నయనతార సౌత్ ఇండియా చిత్రసీమలో అగ్రనటి. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2022లో మామల్లపురంలో జరిగింది. ఈ సందర్భంలో నటి నయనతార వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహాన్ని కవర్ చేస్తూ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో ఆమె ఇంటర్వ్యూ, షూట్లో పాల్గొన్న దృశ్యాలు, ఆమె మేకప్‌తో సహా అనేక సన్నివేశాలు ఉన్నాయి.తన డాక్యుమెంటరీ నిర్మాణం కోసం నో హోల్డ్-బార్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నయన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో నటించాను. అవన్నీ నాకు ప్రత్యేకమే, నా కెరీర్లో చాలా ముఖ్యమైన భాగం అయ్యాయి. ఇందులో చాలా సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాల జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని అనుకున్నాను. అందుకోసం ఆయా చిత్రాల నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు వెంటనే ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి అభ్యంతరం చేయకుండా నాకు అన్హిండెర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వారందరినీ ఎప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను.' అని తెలిపింది.నయనతారకు సహకరించిన నిర్మాణ సంస్థల పేర్లతో పాటు నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది. బాలీవుడ్లో నటుడు షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ ఉంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు. తమ ఇంట్లో పెళ్లిలా వారందరూ పాల్గొనడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులను చిరంజీవితో పాటుగా అల్లు అర్జున్ ఆశీర్వదంచారు. దీంతో ఈ వివాహ వేడుక ఎవరిదై ఉంటుందని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడిదే ఈ వివాహ సందడి. తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో వారందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాబీ కుమారుడు రామకృష్ణ తేజ- సుజాతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అరవింద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, అల్లు శీరిష్ పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)త్వరలో 'పుష్ప 2' మూవీతో అల్లు అర్జున్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. 17వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే హైప్ బోలెడంత ఉంది. ట్రైలర్ రిలీజైన తర్వాత అది ఇంకాస్త పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ) -
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు
-
'అయితే ఏటంటావ్ ఇప్పుడు'.. అభిమానికి మెగాస్టార్ అదిరిపోయే రిప్లై!
చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో విలనిజంతో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమానిని మెగాస్టార్ ఆటపట్టించారు. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.చిరంజీవి వేదికపై మాట్లాతుండగా ఓ అభిమాని గట్టిగా అరిచాడు. మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు. దీనికి చిరు వెంటనే 'అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే.. మన హీరోలు కూడా అదే ఊరే.. కూసో కూసో రా కాసేపు' అంటూ వైజాగ్ యాసలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగాస్టార్. ఇది చూసిన నెటిజన్స్ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌లోనూ మీరు మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు.Chiranjeevi timing 😂😂🤣🤣😭😭Cinemalo aina Offline lo aina Boss @KChiruTweets timing ni kottevadu inka puttaledu 💥💥😂😂🫶🏻#ZEBRA #Chiranjeevi pic.twitter.com/khp7QZvSwq— Vamc Krishna (@lyf_a_zindagii) November 12, 2024 -
బిజినెస్‌మ్యాన్ బర్త్ డే పార్టీలో చిరు-మహేశ్-వెంకటేశ్ ఫుల్ చిల్ (ఫొటోలు)
-
‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుక..ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
అది మా తప్పు.. ప్రేక్షకులది కాదు: చిరంజీవి
‘‘నాలుగైదు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన ఇండస్ట్రీ ఓహో అన్నట్లు కాదు. చిన్న సినిమాలు కూడా ఆడాలి. చిన్న, పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కళకళలాడాలి అనుకునే మాలాంటి వాళ్లకి, నాకు ఒకరకమైన బెరుకు వచ్చింది. కరోనా తర్వాత ఏ సినిమాలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి? అని. కానీ, అవన్నీ కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదు అంటే అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు.. ప్రేక్షకుల తప్పు కానే కాదు’’ అని హీరో చిరంజీవి అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్ . ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. పద్మజ ఫిల్మ్స్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జీబ్రా’ మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘2024 ‘హను–మాన్’ సినిమాతో శుభారంభం అయింది. అది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి చిన్న సినిమాల పట్ల ప్రారంభమైన ఈ ఆదరణ నిæ పెద్ద సినిమాల స్థాయికి మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘టిల్లు స్క్వేర్, ఆయ్, మత్తు వదలరా 2’ ఇలా వరుసగా హిట్లు వచ్చాయి. మొన్న దీపావళికి వచ్చిన ‘అమరన్, క, లక్కీ భాస్కర్’ సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలో స్టార్లు లేరు.. పెద్ద డైరెక్టర్లు లేరు.. కోట్ల బడ్జెట్ లేదు. కానీ, కంటెంట్ ఉంది. అది సినిమాలకి ఆయువుపట్టు. కంటెంట్ బాగుండి, వినోదాన్ని అందించగలిగితే ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు.‘జీబ్రా’లో కూడా మంచి కంటెంట్, వినోదం, ఫ్యామిలీ అంశాలతో పాటు భావోద్వేగాలు.. అద్భుతమైన నటీనటులు ఉన్నారు. కచ్చితంగా ‘జీబ్రా’ సూపర్‌హిట్టు అవుతుంది.. అవ్వాలి.. అవుతుంది’’ అని చెప్పారు. సత్యదేవ్ మాట్లాడుతూ–‘‘కెరీర్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా లోగా ఉన్నప్పుడు చిరంజీవి అన్నయ్యగారు పిలిచి ‘గాడ్ ఫాదర్’లో విలన్‌గా అవకాశం ఇచ్చారు. నా జీవితంలో పెద్ద హై ఇచ్చిన సినిమా అది. నా కెరీర్లో ‘జీబ్రా’ చాలా పెద్ద సినిమా. ఈ సినిమాని అన్నయ్యకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వాల్తేరు వీరయ్య’ లో బాబీ చేసిన క్యారెక్టర్ని నేను చేయాల్సింది. కానీ, మిస్ అయ్యాను’’ అని తెలిపారు డాలీ ధనంజయ. ‘‘జీబ్రా’ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఈశ్వర్ కార్తీక్, ఎస్ఎన్ రెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మా చిత్రం కూడా చాలా మంచి కంటెంట్‌తో రూపొందింది’’ అని దినేష్ సుందరం, బాల సుందరం చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత వై.రవి శంకర్, డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా, కెమెరామేన్ సత్య పొన్మార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్, నటీమణులు అమృత అయ్యంగార్, జెన్నీఫర్ పిక్కినాటో, ఎడిటర్ అనిల్ క్రిష్, లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడారు. -
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, మహేశ్.. ఇది కదా కావాల్సింది!
ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, అఖిల్.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్స్ అంతా ఒకేచోటఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.సినిమా..సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్‌బాబు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.చదవండి: ఫైట్ యాక్షన్ సీక్వెన్స్.. సునీల్ శెట్టికి గాయాలు! -
చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: సినీహీరో చిరంజీవితో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన్ను కిషన్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. దీపావళి సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ‘ఎక్స్’ ద్వారా కిషన్‌రెడ్డి వెల్లడించారు.సినీపరిశ్రమతో పాటు సేవా కార్యక్రమాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రభావితం చేసిన చిరంజీవిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కిషన్‌రెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా నియమితుడైన బీఆర్ నాయుడిని కూడా కిషన్‌రెడ్డి కలిసి అభినందించినట్లు పార్టీ నాయకుల సమాచారం. -
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
మోహన్ బాబుపై చిరు కామెంట్స్
-
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
కాబోయే కోడలు అంటూ.. శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (ఫొటోలు)
-
నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి
‘‘సినీ పరిశ్రమను నా ఇల్లు అనుకుంటే... ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలప్పుడు (2007) వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే హ్యాపీ ఫీలై, ఎంత ధన్యుణ్ణి అనుకున్నా. కానీ... కొన్ని ప్రతికూల పరిస్థితులు... కొంతమంది హర్షించని ఆ సమయంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఈ టైమ్ క్యాప్సూ్యల్లో అవార్డు ఉంచి, నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అన్నాను.ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డు్డను పుచ్చుకున్న రోజున... అదీ అమితాబ్‌గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున... నా మిత్రుడు... నా సోదరుడు నాగ్ మనస్ఫూర్తిగా ఈ అవార్డుకు మీకు అర్హత ఉంది... తీసుకోండి అని అన్న రోజున ఇప్పుడు ఇంట గెలిచాను... రచ్చా గెలిచాను’’ అని హీరో చిరంజీవి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. లెజండరీ నటుడు ‘ఏఎన్నార్’ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా ‘ఏఎన్నార్ అవార్డు’ అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, పర్సనాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు... ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా సరే... ఏఎన్ఆర్ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్మెంట్ అని ఫీలయ్యాను. అందుకే నాగ్‌తో ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. అమితాబ్‌గారి మాటలు ఎనర్జీ ఇచ్చాయినాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను సత్కరించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, అమితాబ్ బచ్చన్‌గారు ‘చిరంజీవి ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అన్నారు. నా హిందీ ‘ప్రతిబంథ్’ సినిమా చూసి, అమితాబ్‌గారు ‘పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. డన్ ఏ గుడ్ జాబ్. ప్రయోజనాత్మక సినిమా’ అన్నారు. ఆ మాటలు ఎనర్జీ ఇచ్చాయి.నాన్న పొగడాలనుకున్నానుమా నాన్నగారికి నటనంటే చాలా ఇష్టం. కానీ నన్ను పొగిడేవారు కాదు... ఏంటమ్మా... నాన్నగారు ఏం అనరు.. మాట్లాడరు. బయట ఎంత గెలిచినా ఇంట గెలవమంటుంటారు కదా అనేవాడిని. ‘చాలా పొగుడుతారు... కానీ తల్లిదండ్రులు పిల్లలను పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’ అని మా అమ్మ అన్నారు. ఆ రోజు అనిపించింది... నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట. అలాగే రచ్చ కూడా గెలిచాను. మా అమ్మ ఏఎన్నార్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ ఏఎన్నార్‌గారి ఫ్యాన్స్‌లో సీనియర్ మోస్ట్ ఫ్యాన్ మా అమ్మ. ఆమె నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఏఎన్నార్‌గారి ‘రోజులు మారాయి’ సినిమా చూడాలనుకుంది. అమ్మ తన పుట్టింట్లో మొగల్తూరులో ఉండేది. నర్సాపూర్ దాటి పాలకొల్లు వెళ్లి, సినిమా చూడాలి. నాన్న జట్కా బండి ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్డు. మొగల్తూరు వైపు వెళుతున్న బస్సు ఈ బండికి ఎదురుగా వచ్చింది. దానికి దారి ఇచ్చే క్రమంలో జట్కా బండి పొలాల్లో దొర్లింది. బండిలో ఉన్న అందరూ కిందపడ్డారు. నాన్న కంగారుపడి, అమ్మతో ‘పద.. ఇంటికి వెళ్లిపోదాం’ అన్నా ‘సినిమా చూడాల్సిందే’ అని పట్టుబట్టి వెళ్లింది. ఆ తర్వాత రెండు నెలలకు నన్ను బయట పడేసింది. ఏఎన్ఆర్గారి మీద నాకు ఉన్న అభిమానం అమ్మ ద్వారా... ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో. చిరంజీవికి ఎముకలు లేవన్నారు ఏఎన్‌ఆర్‌గారు నాకు నాగేశ్వరరావుగారి సినిమాల్లో డ్యాన్సులంటే ఇష్టం. ఆయన పాటలకు నాకు తెలిసిన పద్ధతిలో డ్యాన్సులు వేసుకునేవాడిని. నాకు డ్యాన్సుల్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కినేనిగారు. అయితే ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూలో ‘నాకు ఎముకలు ఉన్నాయి... కానీ చిరంజీవికి లేవు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్యాన్సులు పరిచయం చేసింది నేనే. కానీ ఆ డ్యాన్సులకి స్పీడు పెంచింది, గ్రేసు పెంచింది చిరంజీవి’ అన్నారు. ‘ఇది గొప్ప గొప్ప అవార్డులతో సమానం’ అనిపించింది.అలాగే ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మహానుభావుడు ఏఎన్‌ఆర్‌గారు. ‘కాలేజీ బుల్లోడు’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌కి నన్ను పిలిస్తే వెళ్లాను. అందరూ ఒకటే కేరింతలు... కేకలు. ఆయన పక్కకి తిరిగి, ‘ఎవరి కోసం అవన్నీ అనుకున్నావ్...’ అంటే ‘మీ కోసం’ అన్నాను. ‘మాది అయిపోయింది. నీ కోసమే’ అంటూ, నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ప్రశంసించే గొప్ప మనసు చాలామందికి ఉండదు. ఆ తర్వాత ఆయనతో ‘మెకానిక్ అల్లుడు’ చేసే గొప్ప చాన్స్ వచ్చింది. ఆయన్ను చూస్తే నాకో ‘ఫాదర్లీ ఫీలింగ్’.నాగ్ నాకు డాక్టర్‌లాంటి వాడు ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఎక్సర్సైజుల విషయంలో, యంగ్‌గా ఉండటానికి చూపించే శ్రద్ధలో నాగ్ నాకెంతో ఇన్స్పిరేషన్. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్. ఇక దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్, బాలచందర్‌గార్లు... ఇలా గొప్ప గొప్పవారికి ఇచ్చిన ఏఎన్నార్ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఇచ్చిన అవార్డులా భావిస్తున్నాను’’ అన్నారు.ఏఎన్ఆర్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు: అమితాబ్ బచ్చన్ ‘‘ఇండియన్ సినిమాకు ఏఎన్నార్‌గారు చేసిన కాంట్రిబ్యూషన్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈ సందర్భంగా నా తండ్రి రాసిన ఓ హిందీ పద్యంలోని ఓ లైన్‌ను ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. ‘‘నా కుమారులైనంత మాత్రాన... నా కుమారులు నాకు వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో వారే కుమారులు’’ అని ఉంది. గొప్ప వ్యక్తి ఏఎన్నార్‌గారికి నిజమైన వారసులుగా, కుమారులుగా నాగార్జున ఆయన కుటుంబం నిరూపించుకుంది. నా ఫ్రెండ్ చిరంజీవికి ఈ అవార్డును అందించేందుకు నన్ను ఎంపిక చేసిన నాగ్‌కు థ్యాంక్స్.ఆ ఇద్దరూ ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా: నాగార్జున ‘‘ఏఎన్ఆర్... ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. ఏ లెజెండ్ లివ్స్ ఆన్. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్ అవార్డు ముఖ్యోద్దేశం. ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఇండియన్ సినిమాకు ఏబీ (అమితాబ్) సి (చిరంజీవి).. అమితాబచ్చన్‌గారు, మెగాస్టార్ చిరంజీవిగారు. చిరంజీవిగారికి అవార్డు ప్రదానం చేయడానికి అమితాబచ్చన్‌గారు రావడం ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అమితాబ్‌గారి సామాజిక బాధ్యతకు మేం సెల్యూట్చేస్తున్నాం. 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిగారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ చూడమని చెప్పారు. ఆ డాన్స్, గ్రేస్, కరిష్మా చూసి ఆయనలా డాన్స్ చేయగలనా అనిపించింది. చేయలేం... కెరీర్లో మరో దోవ వెతుక్కుంద్దామనుకుని బయటకు వచ్చాను. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నాన్నగారు అనేవారు. చిరంజీవిగారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. ఒకటే చెప్పగలను... ఈ ఇద్దరూ ‘ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ «థ్యాంక్స్. ‘ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్’. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ హిట్ పాటలను పలువురు గాయనీ గాయకులు ఆలపించారు. ఇక ఆస్కార్ విజేత కీరవాణిని ఈ వేదికపై నాగార్జున ప్రత్యేకంగా సన్మానించారు. -
మెగాస్టార్‌కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
యాభైఏళ్ల రాజీనామా
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’. అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. -
నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చాలు తెలుగు ప్రేక్షకులకు, కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే రేంజ్ వరకు వచ్చారు. ఎంత ఎదిగినా మూలాలు, జ్ఞాపకాల్ని మర్చిపోకూడదని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు చిరు కూడా అదే చేశారు. స్పెషల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చారు. నలుగురు హీరోల్లో ఒకడిగా చేసిన 'పునాదిరాళ్లు' తొలి సినిమా. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో హీరోగా ఎదిగారు. అద్భుతమైన, టాలీవుడ్ గుర్తుంచుకునే సినిమాలు చేశారు. అయితే చిరంజీవికి నటుడిగా తొలి అడుగు పడింది మాత్రం డిగ్రీ రోజుల్లోనే. రెండో ఏడాది చదువుతున్నప్పుడు 'రాజీనామా' అనే నాటకాన్ని వేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)ఈ నాటకానికి గానూ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజీగా అవార్డ్ వచ్చింది. ఇదంతా 1974-75 టైంలో జరిగింది. తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఫొటోని చిరంజీవి ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మారిపోయారో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. అనుకున్న ప్రకారమైతే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు తన మూవీని వాయిదా వేసుకున్నారు. వేసవిలో 'విశ్వంభర' చిత్రం థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం: నాగార్జున
దివంగత ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఇస్తున్న ‘ఏఎన్ఆర్’ అవార్డు వేడుకని ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘ఏఎన్ఆర్’ అవార్డుని హీరో చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున పేర్కొన్న విషయమూ తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం చిరంజీవిని కలిసిన నాగార్జున అవార్డు వేడుకకి రావాలంటూ ఆహ్వానించారు.‘‘మా నాన్న ఏఎన్ఆర్గారి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మైలురాయికి గుర్తుగా ఈ అవార్డు వేడుకకి అమితాబ్ బచ్చన్‌గారు, చిరంజీవిగారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరపురానిదిగా చేద్దాం’’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నాగార్జున. ఈ అవార్డు ప్రదానోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటివరకూ దేవానంద్, షబానా అజ్మీ, అంజలీ దేవి, వైజయంతీ మాల బాలి, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలు ‘ఏఎన్ఆర్’ అవార్డును అందుకున్నారు. -
చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం
ఈ నెల(అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు.