Kaushal
-
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్: మంచు మనోజ్
సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలిపారు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్ లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్" రూపొందించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన 'మెమోరీస్' చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ సినిమాగా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ... స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలని అన్నారు. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించారు. హీరో కౌశల్ మాట్లాడుతూ.., నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరికను తెలుపడంతో హీరోగా వస్తున్నాను. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని కౌశల్ తెలిపారు. -
Right Movie Pre Release Photos: కౌశల్ మండ ‘రైట్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
'ఇది కేవలం గేమ్.. దయచేసి ఎవరూ పర్సనల్‌గా తీసుకోవద్దు'..విన్నర్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ అభిమానులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అంతా బాగానే ఉన్నా.. అయితే ఈ షో ముగిసిన తర్వాత జరిగిన దాడులే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ వివాదంపై బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. బిగ్‌బాస్ షో కేవలం ఆట మాత్రమేనని అన్నారు. కౌశల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'బిగ్‌బాస్ షో కేవలం ఆట మాత్రమేనని.. వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈ షోలో ఒకరితో ఒకరు పోటీపడిన తర్వాత కూడా, కంటెస్టెంట్లు బయటకు వచ్చి మంచి స్నేహితులుగా ఉంటారు. గేమ్‌ను గెలవడానికి వ్యూహాలు ఉపయోగించాల్సి రావచ్చు. కానీ చివరికీ ఇది కేవలం గేమ్ మాత్రమే. ఎవరూ దీన్ని సీరియస్‌గా పరిగణించకూడదు. ఒక పోటీదారుడి అభిమానులు.. ఇతర పోటీదారులపై భౌతికపరమైన దాడి చేయడం నిరుత్సాహానికి గురిచేసింది. ఇటువంటి ప్రవర్తన ఈ షో ప్రదర్శనకు ప్రతికూలంగా మారుతుంది. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలను అందులో పాల్గొనకుండా చేసే ప్రమాదముంది. షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ వారి జీవితాలతో ముందుకు సాగనివ్వాలి. వీరు భావోద్వేగాలు కలిగిన నిజమైన వ్యక్తులు. కేవలం ఆటలోని పాత్రలు మాత్రమే కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆడియన్స్‌గా మనం వారి వ్యక్తిగత జీవితాలను గౌరవిద్దాం' అని రాసుకొచ్చారు. కౌశల్ సోషల్ మీడియాలో రాస్తూ..' మనుషులుగా మన చర్యలే మన ప్రవర్తనను తెలియజేస్తాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు.. ముఖ్యంగా మనం అభిమానించే వారితో మాట్లాడేప్పుడు దీన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా ప్రేమ, మద్దతును చూపించడం సహజమే. కానీ సరిహద్దులను ఎప్పుడూ దాటకూడదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది మన ప్రేమను చూపుతున్న వ్యక్తి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యక్తులు తమకు కుటుంబాలు ఉన్నాయనే వాస్తవాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. వారు కూడా మీరు చేసే పనుల ద్వారా ప్రభావితమవుతారు. ప్రొఫెషనల్ నటులుగా ఇండస్ట్రీలో ఎదగడానికి, వారి కుటుంబాల కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు. వారు అనుభవించే బాధ, ఒత్తిడిని అర్థం చేసుకోవడం, వారితో గౌరవంగా ఉండటం మాకు ఎంతో సహాయపడుతుంది. మనం మనుషుల్లా ప్రవర్తిద్దాం. మన పట్ల, మన కుటుంబాల పట్ల మనం కోరుకునే దయ, సానుభూతిని ఇతరులతోనూ చూపిద్దాం. ఈ చిల్లర పనుల వల్ల కలిగే బాధ నాకు తెలుసు. దయచేసి ఆపండి. వారి జీవితాలను సంతోషంగా జీవించనివ్వండి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Kaushal Manda (@kaushalmanda) -
కేంద్ర మంత్రి నివాసంలో యువకుడి అనుమానాస్పద మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి నివాసంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితితో మృతిచెందడం కలకలం రేపుతోంది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కుమార్ నివాసంలో తలకు బుల్లెట్ తగిలిన గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లక్నోలోని బెగారియా గ్రామంలో శుక్రవారం ఉదంయ 4 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారుడు వికాస్ పేరుతో రిజిస్ట్రర్ అయిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుడిని వినయ్ శ్రీవాస్తవగా పోలీసులు గుర్తించారు. అతడు మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడిగా తెలిసింది. అయితే ఆ ఇంటిని ప్రస్తుతం మంత్రి ఉపయోగించడం లేదు. అంతేగాక శ్రీ వాస్తవ మరణించిన సమయంలో మంత్రిగానీ, అతని కొడుకు గానీ ఆ ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరుకున్నారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురిని ప్రశ్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలను సేకరించాయి. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ ఇదిలా ఉండగా మృతుడి సోదరుడు మాత్రం తన అన్నయ్య మరణంలో కుట్ర దాగుందని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందా అని ప్రశ్నించగా.. ‘మంత్రి కొడుకు వికాస్ ఎక్కడికి వెళ్లినా తన గన్ను వెంట తీసుకెళ్లేవాడు. అతను కచ్చితంగా పిస్టల్ తీసుకెళ్లి ఉండాల్సింది.. ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికైనా వెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్లేవాడని ఖచ్చితంగా చెప్పగలను. నిన్న ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు.. ఇది పక్కా ప్లాన్.. మా అన్నయ్యను ఎందుకు, ఎవరు చంపారో తెలియాలి’ అని ప్రశ్నించాడు. మృతుడి సోదరుడి ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందించారు. వికాస్ గురువారం మధ్యాహ్నమే ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. ఇందుకు బోర్డింగ్ పాస్‌లు కూడా సాక్ష్యంగా చూపించారు. పిస్తోల్‌కు నేషనల్ లైసెన్స్ లేదని, అందుకే తన కొడుకు పిస్టల్ని తనతో తీసుకెళ్లలేదని చెప్పారు. జరిగింది విచారకరమని.. విషయం తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందని నిందితులను వదిలిపెట్టమని, దోషులెవరైనా శిక్షిస్తామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
ఆస్పత్రిలో తండ్రిని చూసి ఎమోషనల్ అయిన బిగ్ బాస్ కౌశల్
టీవీ నటుడు, మోడల్ అయినటువంటి కౌశల్ బిగ్‌బాస్ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా టైటిల్ సొంతం చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అవకాశాల విషయంలో పెద్ద మార్పు కనిపించలేదు. కొన్ని యాడ్ ఫిలిమ్స్ తీస్తూ బిజీగా ఉన్నారు. తాజాగ తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని ఓ వీడియోను కౌశల్ షేర్ చేశాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి పని చేసింది ఆమె మాత్రమే) తన తండ్రికి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేర్పించినట్లు కౌశల్ చెప్పారు. కానీ ఏ కారణం వల్ల ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని మాత్రం తెలుపలేదు. ఆయన తండ్రి సుందరయ్య బెడ్‌పై పడుకుని ఉన్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కౌశల్ షేర్ చేశాడు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుని ఉండి ఉంటారు.. కాబట్టి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అంతే ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉంటుందని వీడియోతో పాటు ఆయన చెప్పుకొచ్చాడు. కౌశల్ తండ్రి సుందరయ్య కూడా బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటించాడు. తన తండ్రి కోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని కూడా కౌశల్ నిర్మించారు. ఆయన కోసం ఒక ఇంటిని నిర్మించి ఇవ్వాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేదని అది ఇప్పుడు తీరందని గతంలో కౌశల్ చెప్పుకొచ్చాడు. అభిమానుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారని కౌశల్ తెలిపాడు. View this post on Instagram A post shared by Kaushal Manda (@kaushalmanda) -
Kaushal Shetty: పచ్చటి గూడుతో...
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన ప్రజల కోసం 27 సంవత్సరాల కౌశల్ శెట్టి ‘నోస్టోస్ హోమ్స్’ పేరుతో స్వచ్ఛందసంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. నిరాశ్రయుల కోసం ఈ సంస్థ తేలికపాటి, ఈజీ ట్రాన్స్‌పోర్టబుల్ షెల్టర్స్‌ను రూపొందించింది... ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అంటారు. ‘తత్వం’ మాట ఎలా ఉన్నా కౌశల్ షెట్టికి ‘కర్తవ్యం’ బోధపడింది. షెట్టిదీ కర్నాటకలోని ఉడిపికి సమీపంలోని మది అనే గ్రామం. పచ్చదనానికి ఈ గ్రామం పర్ఫెక్ట్ అడ్రస్. అలాంటి పచ్చటి ఊరు కాస్తా ఘటప్రభ నది పొంగి పొర్లడంతో అల్లకల్లోలం అయింది. అంతెత్తు చెట్లు నిలువునా కూలి పోయాయి. పొలాలు మునిగిపోయాయి. ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని ఊరు విడిచి తోచిన దిక్కుకు వెళ్లారు. షెట్టి కుటుంబం ముంబైకి వెళ్లింది. ముంబైకి వెళుతున్నప్పుడు షెట్టి మనసు బాధతో నలిగిపోయింది. దీనికి కారణం...ఎటు పోవాలో తెలియక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఊళ్లోనే ఉండిపోయిన ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధ తన నుంచి దూరం కాలేదు. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదుకునే రోజుల్లో మరోసారి తుఫాను బీభత్సాన్ని, బాధితులు, నిరాశ్రయుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూశాడు. ‘ఇలా బాధ పడుతూ కూర్చోవడం తప్ప నేను ఏం చేయలేనా!’ అనుకున్నాడు షెట్టి. ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత... తన స్నేహితుడు మాధవ్ దత్తో కలిసి ‘నోస్టోస్ హోమ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాంటి వారికి నిలువ నీడ కల్పించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం’ అంటున్నాడు షెట్టి. తమ సంస్థ ట్రాన్స్‌పోర్టబుల్ హోమ్స్ గురించి చెబుతూ... ‘పర్సనల్ డిగ్నిటీ, ప్రైవసీతో కూడిన హోమ్స్ ఇవి’ అంటాడు షెట్టి. ‘నోస్టోస్ హోమ్’ సంస్థ అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు ఆఫ్రిక దేశాలలోనూ సేవలు అందిస్తోంది. కౌశల్ చేపట్టే సేవాకార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘తక్కువ సమయంలోనే బాధితులకు సహాయం అందించి నిరాశ్రయులకు అండగా నిలబడింది కౌశల్ బృందం. నిపుణుల సహాయంతో సౌకర్యాలు సమకూర్చారు’ అంటున్నాడు హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ మలావి నేషనల్ డైరెక్టర్ కపీరా. ఇక షెట్టి భవిష్యత్ లక్ష్యం విషయానికి వస్తే... తన సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయాలనుకుంటున్నాడు. ‘నోస్టోస్ హోమ్’తో తొలి అడుగు వేసినప్పుడు ‘నిజంగా నేను చేయగలనా?’ అనే సందేహం షెట్టికి వచ్చేది. మంచి పని కోసం బయలు దేరినప్పుడు ఎన్నో ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి...అన్నట్లుగా షెట్టికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందించారు. కొన్ని అడుగులు పడిన తరువాత శెట్టికి తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోవడానికి కారణం అయింది. -
బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్, పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ కంటెస్టంట్‌తో స్టార్ మా బీబీ జోడి అనే డాన్స్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువుడు కంటెస్టెంట్స్ జోడిగా పెర్పామెన్స్ ఇస్తున్నారు. ఇందులో సహా కంటెస్టెంట్స్ జోడిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్ హౌజ్‌లో మాదిగా స్కోర్స్ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ వాడి ఎలిమేనేట్ అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్ అయిన తరుణ్ మాస్టర్, నటి రాధపై అసహనం వ్యక్తం చేశాడు బిగ్‌బాస్ విన్నర్, నటుడు కౌశల్ మండా. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ బీబీ జోడి షోలో పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ జోడి కట్టి తమ డాన్స్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అందులో చెప్పుకొదగ్గ జోడిల్లో రవికృష్ణ, భాను జోడి ఒకటి. చెప్పాలంటే బిబి జోడి టైటిల్ కొట్టే సత్తా వారిలో ఉంది. అయితే గతవారం జరిగిన ఎపిసోడ్లో రవి, భాను స్ట్రాటజీ వాడి షో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కో-కంటెస్టెంట్స్ అయిన వాసంతి-అర్జున్ కల్యాణ్ జోడి తమ డాన్స్‌తో జడ్జస్‌ను మెప్పించారు. వారి చేత వావ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇక సహ కంటెస్టెంట్స్ కూడా వారి డాన్స్‌ని మెచ్చకుంటూ స్కోర్స్ ఇచ్చారు. అయితే రవి-భాను మాత్రం ఒక్క మార్కే ఇచ్చి షాకిచ్చారు. ఇది నిజమా? ప్రాంక్‌గా అని జడ్జస్ అడుగగా.. ఇది తమ స్ట్రాటజీ అని సమాధానం ఇచ్చారు. నిజానికి వారి ప్రెర్ఫామెన్స్‌కి 10 మార్కులు ఇవ్వాలి, కానీ తాము సేవ్ అవ్వాలంటే వారికి ఒక్క మార్కు ఇచ్చామన్నారు. దీంతో జడ్జస్ కూడా తమ స్ట్రాటజీని వాడి వారికి అతి తక్కువ మార్కులు ఇచ్చారు. ఫలితంగా భాను-రవి ఎలిమేనేషన్ ఫేస్ చేసి షో నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై కౌశల్ మండా స్పందిస్తూ జడ్జస్‌పై తీరు తప్పుబడ్డాడు. ఈ మేరకు ఫేస్బుక్లో వివాదస్పద పోస్ట్ షేర్ చేశౠడు. ‘నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్లో పింక్ సీటు గెలుచుకున్న తీరు అద్భుతం. చదవండి: ఆ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా! బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అన్ని హక్కు ఉంది. కానీ న్యాయనిర్ణేతలకు లేదు. జడ్జస్ కేవలం కంటస్టెంట్స్ డాన్స్ మాత్రమే జడ్జ్ చేయాలి, వారి వ్యూహలను కాదు. బిగ్‌బాస్‌లో ఏ జోడి గెలిచిన అది రవి-భాను తర్వాతే అనేది నా అభిప్రాయం. నాకు అనిపించింది చెప్పాను. నిజాన్ని మనసులోనే దాచుకోలేను. క్షమించండి జడ్జస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కౌశల్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందర అతడిని తప్పుబడుతున్నారు. రవి భాను కేవలం ఒక్క మార్క్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే షోలో కౌశల్ కూడా కంటెస్టెంట్‌గా ఉండటం గమనార్హం. అభినయ శ్రీతో జోడి కట్టి తన డాన్స్‌తో మెప్పిస్తున్నాడు కౌశల్. -
తండ్రికి కొత్త ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
మాట తప్పని కౌశల్.. తండ్రికి ఊహించని సర్ప్రైజ్!
బిగ్‌బాస్ విన్నర్, నటుడు కౌశల్ మండా తన తండ్రికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. ఓ కొత్త ఫ్లాట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. తండ్రికి ఒక్కమాట కూడా చెప్పకుండా ఆ కొత్తింటికి ఆయన్ను తీసుకువచ్చి ఇదే నీ ఇల్లు డాడీ అంటూ సర్ప్రైజ్ చేశాడు. ఊహించని సర్ప్రైజ్తో కౌశల్ తండ్రి ఆనందాశ్చర్యంలో తేలిపోయాడు. కాగా 2021లో ఫాదర్స్ డే రోజు కౌశల్ తండ్రి నాకంటూ ఓ చిన్ని ఇల్లు కావాలి అని అడిగాడు. అప్పటినుంచి అదే మనసులో పెట్టుకున్న నటుడు ఎట్టకేలకు ఈ ఏడాది హైదరాబాద్‌లో ఆయనకు ఓ ఇల్లు కొనిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఫైనల్‌గా నా బాధ్యత తీరిపోయింది. నాన్న వైజాగ్‌లో ఇల్లు కావాలని అడిగాడు. కానీ నాన్న హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాను. 2023 ప్రారంభంలోనే ఇల్లు కొనేశాను. ఆయనకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంటూ గృహప్రవేశం వీడియోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'తండ్రి కల నెరవేర్చావు, గ్రేట్', 'మాట మీద నిలబడ్డావన్నా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
వాళ్లను చూస్తే నవ్వొస్తోంది, ఆ కంటెస్టెంటే బిగ్‌బాస్ విన్నర్: కౌశల్
వినోదానికి లేదు ఫుల్స్టాప్ అంటూ వచ్చింది బిగ్‌బాస్ నాన్‌స్టాప్. హౌస్‌లో 24 గంటలు ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండంటూ ప్రేక్షకులను ఊరించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించిన నోళ్లను 24/7 లైవ్ స్ట్రీమింగ్‌తో ఆశ్చర్యపరిచింది. అయితే రోజంతా షో చూడటం సాధ్యపడనివాళ్ల కోసం ప్రతిరోజు ఒక గంటపాటు ఎపిసోడ్ ప్రసారం చేస్తోంది. ఇప్పటికే షో ప్రారంభమై రెండు వారాలు పూర్తవగా ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు బిగ్‌బాస్ మాజీ విన్నర్ కౌశల్ మండా. 'బిగ్‌బాస్ షోలో ఎవరు గెలుస్తారన్నదానిపై నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. ఈసారి బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలుస్తుంది. కొన్ని ప్రోమోలు చూశాను. అందులో బిందుమాధవి యాటిట్యూడ్, ఆమె సామర్థ్యాలు ఆవిడే గెలుస్తాయని చెప్తున్నాయి. రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ తడబడటం చూస్తుంటే నవ్వొస్తోంది' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. మరి నిజంగానే కౌశల్ మండా జోస్యం నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి! చదవండి: నా ఫ్రెండ్‌ను నేనే చంపానంటున్నారు, అవును, నావల్లే: హీరోయిన్ -
బిగ్‌బాస్ ఫేం కౌశల్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన వెంకటేశ్
‘‘రైట్’ చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. ‘బిగ్‌బాస్ 2’ విన్నర్ కౌశల్ మండ, లీషా ఎక్లైర్స్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైట్’. మహంకాళి దివాకర్, లుకలాపు మధు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ మోషన్ పోస్టర్‌ను వెంకటేశ్ విడుదల చేశారు. కౌశల్ మాట్లాడుతూ–‘‘మలయాళ చిత్రం ‘మెమోరీస్’కు తెలుగు రీమేక్ ‘రైట్’. ‘బిగ్‌బాస్’ షోలో నన్ను ఆదరించినట్లే మా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘రైట్’ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ కూరాకుల -
ఆ సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్
టీవీ నటుడు, మోడల్ కౌశల్ బిగ్‌బాస్ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ ఎపిసోడ్‌తో కౌశల్ దశ తిరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫలితంగా బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా టైటిల్ సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ అవకాశాల విషయంలో పెద్ద మార్పు కనిపించలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సినిమా అవకాశాలపై మాట్లాడుతూ.. కొన్ని కథలు నచ్చకపోవడం వల్ల వదులుకున్నానని, మరికొన్ని రెమ్యునరేషన్ డిమాండ్ పరంగా ఆఫర్లు రావడం లేదన్నాడు. చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ ‘నేను 86 సినిమాల్లో నటించాను. కానీ అవి నాకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీనికి కారణంగా సినిమాలపై నేను పెద్దగా ఆసక్తి చూపకపోవడం. సినిమా చాన్స్ కావాలంటూ నేనేప్పుడు దర్శక-నిర్మాతలను అడగలేదు. వాళ్లే ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్తే చేశాను. కొంతమంది అవకాశాలు కావాలంటూ వాళ్ల వద్దకు తరచూ వెళ్లి అడుక్కుంటారు. కానీ నా స్టైల్ అది కాదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే నా స్టైల్, టాలెంట్ చూసి ఆఫర్లు వస్తే చేస్తాను కానీ, ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కొను. పైగా నేను చాలా బిజీ, సొంతంగా నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రతిరోజు షూట్స్, ఫ్యాషన్ షోస్, యాడ్స్ జరుగుతుంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: కాజల్ బాడీపై ట్రోల్స్.. స్పందించిన సమంత, లక్ష్మి మంచు ఇక ఓ సినిమా తన కెరీర్‌ను నాశనం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కౌశల్. ‘మా అమ్మకి క్యాన్సర్ బాధపడుతున్న సమయంలో డబ్బు అవసరం చాలా వచ్చింది. అప్పుడు మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. హాస్పటల్లో డబ్బులు కట్టడం కోసమే అప్పట్లో నేను ఒక సినిమాకి కమిట్ అయ్యాను. ఆ మూవీకి నా రెమ్యునరేషన్ రూ.50 వేలు ఇచ్చారు. కానీ ఆ సినిమా వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది. సమాజానికి ఒక సందేశంగా ఉంటుందని ఆ సినిమా చేశా. కానీ అది అడల్ట్ మూవీ కావడంతో.. కౌశల్ అడల్ట్ మూవీస్ చేస్తాడనే ముద్ర పడింది’ అన్నాడు. చదవండి: 60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు అదే సమయంలో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండేది. దానిపై అవగాహనలో భాగంగా ఈ సినిమా తీశాం. కానీ అందులోని నా పాత్ర నెగిటివ్ ఇంప్రెషన్ పడింది. ఆ విమర్శలు, ట్రోలింగ్ నుంచి బయటపడేందుకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత చక్రవాకం సీరియల్ చేశాక నాపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోయింది’ అన్నాడు. కౌశల్‌కు అంతగా చేదు అనభవాన్ని ఇచ్చిన ఆ అడల్ట్ మూవీపై పేరు స్వర్ణ. ఈ సినిమాలో రమ్య శ్రీ హీరోయిన్ కాగా.. షకీలా, రేష్మ ఇతర పాత్రల్లో నటించారు. రమ్య శ్రీ ఇంట్లో పనోడిగా చేరిన కౌశల్.. కోరిక తీర్చమంటూ ఆమె వెంటపడే నెగిటివ్ రోల్ చేశాడు. చివరికి ఈ సినిమాలో కౌశల్ కట్టుకున్న భార్య చేతిలో చనిపోతాడు. -
దీప్తి సునయన నా గురించి అలాంటి కామెంట్స్ చేసింది: కౌశల్
Kaushal Manda Comments On Deepthi Sunaina And Bigg Boss: టీవీ నటుడు, మోడల్ కౌశల్ బిగ్‌బాస్ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ ఎపిసోడ్‌తో కౌశల్ దశ తిరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫలితంగా బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా టైటిల్ సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ అవకాశాల విషయంలో పెద్ద మార్పు కనిపించలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఎవరూ చేయని విధంగా తన గెలుపు కోసం కష్టపడిన వారందరిని కలిసిశానని కౌశల్ పేర్కొన్నాడు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా నాకోసం నిలబడ్డారు. అందుకే అక్కడికి వెళ్లి మరీ నా కృతఙ్ఞత తెలుపుకున్నా. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొన్ని కథలు తనకు నచ్చకపోవడం వల్ల వదులుకుంటే, కొన్ని రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఆఫర్లు రాకపోవచ్చు. ఇక మిగిలిన వాళ్లతో పోలిస్తే నాకు తక్కువ రెమ్యునరేషనే ఇచ్చారు, నాకింత గుర్తింపు వస్తుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అసలు టీవీ నుంచి తీసుకున్న కంటెస్టెంట్లలో నేనే మొదటి వ్యక్తిని. నా తర్వాతి నుంచి ఇప్పుడు ప్రతీ సీజన్లో బుల్లితెర నుంచి తప్పకుండా తీసుకుంటున్నారు. వాళ్లందరికి ఇలా ఆఫర్స్ వస్తున్నాయంటే అది నా వల్లే అని చెప్పొచ్చు. బిగ్‌బాస్ షోలో నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్లిపోతానని చెప్పడంతో కౌశల్ అంటే ఏంటో నిరూపించాలనుకున్నా. కష్టపడి టైటిల్ గెలిచా' అని వివరించాడు. ప్రస్తుతం కౌశల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: మై లవ్ ఈజ్ గాన్, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్ -
‘అతడు ఆమె ప్రియుడు’ రివ్యూ
టైటిల్ : అతడు ఆమె ప్రియుడు నటీనటులు: సునీల్, బెనర్జీ, కౌషల్, భూషణ్, మహేశ్వరి, దియా, జెన్నీ తదితరులు... సంగీతం : ప్రద్యోతన్ కెమెరా-ఎడిటర్ : మీర్ నిర్మాణ సారథ్యం: అమర్, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్ విడుదల తేది: ఫిబ్రవరి4, 2022 ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలు ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. ఓ వైపు మాటల రచయితగా మరోవైపు వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ అనేక నవలలతో పాటు నాటికలు రాసారాయన. అగ్నిప్రవేశం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాల ద్వారా డైరెక్టర్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకున్న యండమూరి తాజాగా తన నవల “అతడు ఆమె ప్రియుడు” ద్వారా మళ్లీ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యండమూరి రచనా శైలి, దర్శకత్వంతో పాటు ఆకట్టుకునే టైటిల్ కావడంతో భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అతడు ఆమె ప్రియుడు’కథేంటంటే..? బెనర్జీ, సునీల్, కౌషల్ పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రళయం రాబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలి వాన మొదలౌతుంది. ఆ సమయంలో కౌషల్, సునీల్ బెనర్జీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. మరికొన్ని గంటల్లో యుగాంతం కాబోతోందని ఆ ఇంట్లో ఉన్న తమ ముగ్గురికే బతికే అవకాశం ఉందని చెబుతాడు. అయితే తమలో ఒకరు ప్రాణ త్యాగం చేసి వారి స్ధానంలో ఒక స్త్రీకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మానవజాతి అంతం కాకుండా ఉంటుందని బెనర్జీ చెబుతాడు. దాంతో కౌషల్, సునీల్ ఆలోచనలో పడతారు. అసలు ప్రకృతి విపత్తు రావడానికి కారణం ఏంటి? బెనర్జీకి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? సునీల్, కౌశల్ లో ఎవరు ప్రాణ త్యాగం చేస్తారు? ఆ ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీ ఎవరు? బెనర్జీ చెప్పినట్లు యుగాంతం అవుతుందా?అన్నదే సినిమా కథ. ఎవరెలా చేశారంటే? ప్రొఫెసర్ పాత్రలో బెనర్జీ నటన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రవర పాత్రలో సునీల్ నవ్వులు పూయించారు. ఓ వైపు ప్రళయం వస్తోందని తెలిసి భయపడుతూనే మరోవైపు కామెడీని పండించారు. స్త్రీమూర్తి ఔన్నత్యం గురించి కౌషల్ ఏకధాటిగా చెప్పిన డైలాగ్ సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ధారాళంగా ఆయన చెప్పిన డైలాగ్ కి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కౌషల్ ప్రతీకారం తీర్చుకునే పాత్రలో నటించిన భూషణ్ (ప్రముఖ నటుడు నాగభూషణం మనవడు) ద్విపాత్రాభినయంతో అలరించాడు. ఎలా ఉందంటే..? సినిమాలోని సంభాషణలు కొన్నిచోట్ల ఆలోపించే చేసేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసుని హత్తుకుంది. కథని రక్తి కట్టించేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయినప్పటికీ సీన్ బై సీన్ ప్రేక్షకుల్లో మరికొంత ఉత్కంఠ కలిగించేలా చూపించి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ప్రేమంటే సెక్స్, స్నేహమనే భావనలో ఉంటున్న యూత్ కి ఈ సినిమా ద్వారా రచయిత మంచి మెసేజ్ ఇచ్చాడని చెప్పవచ్చు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కరోనా, సెల్ఫీలు వద్దని సలహా!
కరోనా మహమ్మారి జనాలను పట్టిపీడిస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందనుకునేలోపే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిత్రపరిశ్రమలోనూ ఎంతోమంది ఈ వైరస్ బారిన పడగా తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కౌశల్, సరయులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) 'కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నాను. గత వారం రోజుల్లో నన్ను కలిసిన అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. గుంపులుగా గుమిగూడకండి. వ్యాక్సిన్ వేయించుకోండి, మాస్కులు ధరించండి. కరచాలనం, సెల్ఫీలు మానేయండి. నేను షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయకే ఈ పరిస్థితి తెచ్చుకున్నాను' అని రాసుకొచ్చాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్ సరయూ సైతం తనకు పాజిటివ్ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. View this post on Instagram A post shared by 7 Arts Sarayu (@7arts_sarayu) -
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
బిగ్‌బాస్ 5 విన్నర్? అమ్మాయిలకంత ఛాన్స్ లేదు: కౌశల్
Bigg Boss Telugu 5: కౌశల్ మండా.. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్ విన్నర్ ఈయన. బిగ్‌బాస్ షో తర్వాత అతడి రేంజే మారిపోతుందనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా వాతావరణం సైలెంట్ అయిపోయింది. చడీచప్పుడు లేకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం కౌశల్ అతడు ఆమె ప్రియుడు సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సునీల్ కథానాయకుడిగా కనిపించనున్నాడు. త్వరలో ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బిగ్‌బాస్ 5 పెద్దగా థ్రిల్ అనిపించడం లేదు. ప్రేక్షకులను మెప్పించగలిగేవారే టాప్ 5కు చేరుతారు. ఈసారైనా గర్ల్స్ గెలుస్తారనుకున్నాం.. కానీ అమ్మాయిలకంత స్కోప్ లేదు. తప్పకుండా అబ్బాయిలే ట్రోఫీ గెలుస్తారు' అని జోస్యం చెప్పాడు. బిగ్‌బాస్ షో తీరు చూస్తుంటే కౌశల్ చెప్పిందే నిజమయ్యేట్లు కనిపిస్తోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 11 మందే మిగిలారు. 8 మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో నటరాజ్ మాస్టర్, లోబో మినహా.. సరయు, ఉమాదేవి, లహరి, శ్వేత, హమీదా, ప్రియ.. ఇలా ఆరుగురు లేడీ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్‌లో సిరి, కాజల్, ప్రియాంక సింగ్, యానీ ఉన్నారు. వీరిలో పింకీ మానస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే కాజల్ స్ట్రాటజీ జపం చేస్తోంది. యానీ మాస్టర్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇక సిరి ఆడుతుంది కానీ షణ్ముఖ్, జెస్సీలతో మాత్రమే ఎక్కువగా ఉంటూ నెగెటివ్ పేరు సంపాదిస్తోంది. రానున్న వారాల్లో వీరిలో ఇద్దరు, ముగ్గురు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులున్నాయి. మిగిలిన ఒకరిద్దరు ఫినాలేకి వెళ్లినా గెలిచే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. కాబట్టి ఈసారి కూడా అమ్మాయిని బిగ్‌బాస్ విజేతగా చూడాలన్న ఎంతో మంది కల కలగానే మిగిలిపోనున్నట్లు కనిపిస్తోంది. -
అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్
ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో తొలి రోజే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగిటివిటి ఒకరూ బయటపెట్టడంతో రచ్చ రచ్చ జరిగింది. ఆదివారం బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్ కమ్యూనికేషన్ వల్ల హౌజ్‌మెట్స్ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువ మంది ఇంటి సభ్యులు జస్సీని నామినేట్ చేశారు. చదవండి: బిగ్‌బాస్ 5: నాగార్జున రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా! కాగా జస్సీ మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో హౌజ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా జస్సీ ఓ సందర్భంలో మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నామినేషన్ సమయంలో విశ్వకు, జస్సీకి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్లో జస్సీ బాధపడ్డాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా జస్సీని నామినేట్ చేస్తూ ‘చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్న’ అంటూ లిన చెప్పడంతో వెంటనే జస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. చదవండి: Bigg Boss 5 Telugu: వీడియోతో దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్ దీంతో అందరూ అతడి ఓదార్చడం జరిగింది. దీనిపై బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తోటి మోడల్‌గా జస్సీకి మద్దతుగా నిలిచాడు. అతడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేస్తూ.. ‘నా తర్వాత, సీజన్ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మొదటగా హౌజ్ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్ ది బెస్ట్’ అని సూచించాడు. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో కాజల్, హమీదా, జెస్సీ, రవి, మానస్, సరయూలు ఈ వీకెండ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లే సభ్యులుగా డేంజర్ జోన్లో ఉన్నారు. -
చాటింగ్.. డేటింగ్.. మీటింగ్!
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ టైటిల్ ఖరారైంది. ప్రముఖ నటుడు సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేశ్వరి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లు. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మొన్న చాటింగ్.. నిన్న డేటింగ్.. ఈ రోజు మీటింగ్.. రేపు..’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో మొదలైన తొలి సీన్‌కి దర్శకుడు అజయ్ కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘యండమూరిగారి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ సినిమా తర్వాత వెంటనే ఆయన డైరెక్షన్లోనే ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కూనం కృష్ణకుమారి, కూనం ఝాన్సీ సహ నిర్మాతలు. -
పీపుల్ స్టార్ అని పెట్టుకున్న కౌశల్.. నెటిజన్ల సెటైర్
kaushal Manda: కౌశల్ మండా.. ఈ పేరు తెలియని బిగ్‌బాస్ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా మామూలుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు రెండో సీజన్ విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. బిగ్‌బాస్ షో తర్వాత అతడికి బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయంటూ నెట్టింట రూమర్లు రౌండేశాయి కానీ అవేవీ నిజం కాలేదు. అయితే కొన్ని చిత్రాల్లో మాత్రం సపోర్టివ్ రోల్స్ అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అతడు హీరో ఆది 'బ్లాక్' సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఇంతవరకు హీరో రోల్ మాత్రం చేయలేదు. బిగ్‌బాస్ రెండో సీజన్ వచ్చి మూడేళ్లు దాటిపోయినా ఇంతవరకు కథానాయకుడిగా సినిమా చేయకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. అయితే తన అభిమానుల దిగులును పటాపంచలు చేస్తూ ఓ శుభవార్త చెప్పాడు కౌశల్. రైట్ సినిమాలో హీరోగా చేస్తున్నానంటూ పోస్టర్‌ను షేర్ చేశాడు. "గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ.. పీపుల్ స్టార్‌గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్‌స్క్రీన్ మీద హీరోగా చూడాలనుంది, ఆ అవకాశం మాకెప్పుడు వస్తుంది? అంటూ ప్రతిరోజూ అడిగే వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు మీ అందరిరోజుగా చేస్తూ నేను హీరోగా నటిస్తున్న రైట్ మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎప్పటిలాగే మీ ప్రేమ, అభిమానం నా మీద, మా మూవీ యూనిట్ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు" అంటూ పోస్ట్ పెట్టాడు. ఇన్నాళ్లకు నటుడు కౌశల్ హీరో అవుతుండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం పీపుల్ స్టారా? ఇదెప్పుడు పెట్టారు? ఈ మధ్య ఎవరికి వాళ్లే స్టార్ ట్యాగ్ తగిలించుకోవడం ప్యాషన్ అయిపోయింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
హల్చల్ : వెయిటింగ్ అంటోన్న బుట్టబొమ్మ..విలేజ్ లుక్‌లో శిల్పా
♦ ఏం జరిగినా ఒక కారణం ఉంటందున్న నేహా ♦దానికోసం వెయిటింగ్ అంటున్న బుట్టబొమ్మ ♦ వెడ్డింగ్ యానివర్సిరీ వేడుకల్లో అష్మిత ♦ కవ్విస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హారిక ♦ సాఫ్ట్ హార్ట్ ఉండాలంటున్న హీనా ఖాన్ ♦ గుర్రపు స్వారీలో కౌశల్ మండా ♦ బాధలో ఉన్న యాంకర్ రష్మీ..ఆన్సర్ ఇదేనట ♦ వర్కవుట్ గ్లో అంటోన్న నటి షెఫాలి ♦ విలేజ్ లుక్‌లో టీవీ నటి శిల్పా ♦ ఫన్ వీకెండ్ అంటోన్న అదితి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
షూటింగ్ ప్రారంభించిన కౌశల్.. పోమ్మా ఇకచాలు!
ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లో సడలింపులు ఇస్తున్నాయి. దీంతో పలు షూటింగులు తిరిగి పున: ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్, నటుడు కౌశల్ మండా తిరిగి షూటింగ్లో పాల్గొన్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సెకండ్ వేవ్ లాక్డౌన్ అనంతరం తొలిసారి షూటింగ్లో పాల్గొన్న కౌశల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ‘2 నెలల తర్వాత ఫస్ట్ డే షూటింగ్.. పోమ్మా కరోనా ఇకచాలు’ ఫన్నీ క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా మీద సెటైరికల్‌గా స్పందించిన కౌశల్ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. కాగా కౌశల్ ప్రస్తుతం ఆది సాయి కుమార్ సినిమాలో బ్లాక్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ఓ పవర్ పోలీస్ ఆఫీసర్‌గా కౌశల్ కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
ఇండియా చేరుకున్న కౌశల్ భార్య.. ' జై పారాసిటమాల్' అంటూ..
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన నటడు కౌశల్ మండా. అప్పటివరకు బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా గుర్తింపు పొందినా బిగ్‌బాస్‌తో ఎనలేని క్రేజ్ దక్కించుకున్నాడు. బిగ్‌బాస్ రెండో సీజన్లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు. ఇటీవల భార్య నీలిమ ఆరోగ్యంపై కౌశల్ చేసిన పోస్టులు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యూకేలో ఉద్యోగం చేస్తున్నానని, ఆ సమయంలో తాను కోవిడ బారినపడినట్లు నీలిమ పేర్కొంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తనకు సరైన ట్రీట్మెంట్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి వైద్య సిబ్బంది తనకు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని వివరించింది. దీంతో నీలిమ త్వరగా కోలుకోవాలంటూ కౌశల్ అభిమానులు సహా పలువరు నెటిజన్లు కోరుకున్నారు. తాజాగా నీలిమ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగిటివ్ రావడంతో ఆమె వెంటనే ఇండియాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కౌశల్ దృవీకరించారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్( NHS )నుంచి తనకు సర్టిఫికెట్ వచ్చింది. దీంతో నీలిమ భారత్‌కు చేరుకుంది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు..జై పారాసిటమాల్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి నీలిమ సైతం కృతఙ్ఞతలు తెలిపారు. ఇక కౌశల్ పోస్టుతో అతని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) చదవండి : బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? ఇండియాలో కన్నా ఇక్కడే దారుణం: కౌశల్ భార్య -
సరైన వైద్యం లేదు, పరిస్థితి దారుణం: కౌశల్ భార్య
కౌశల్ మండా.. బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. 'ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్ యూ, మిస్ యూ నీలిమ' అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టాడు. దీంతో కౌశల్ భార్యకు ఏమైందంటూ అభిమానులు కలవరపడ్డారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. "నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్ పాజిటివ్ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తే వారు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారు. పెద్దగా పట్టించుకోలేదు" "నిజానికి యూకేలో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందనుకున్నా, కానీ ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఎమర్జెన్సీ అనగానే ఇండియాలో త్వరగా అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తారు. కానీ ఇక్కడలా కాదు. ఈ విషయంలో నాకు చాలా భయమేసింది. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఆక్సిమీటర్‌తో నా పల్స్ చెక్ చేసుకుంటున్నాను. నేను త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను" అని నీలిమ చెప్పుకొచ్చింది. చదవండి: భార్యపై కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. అభిమానుల ఆందోళన Nikhil: తొమ్మిది సార్లు ప్రయత్నించినా విఫలం.. నిఖిల్ ఆసహనం -
భార్యపై కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. అభిమానుల ఆందోళన
Kaushal Manda: బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ మండా.. ‘బిగ్‌బాస్’షోతో మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. బిగ్‌బాస్ రెండో సీజన్లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాధించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులన్నీ వృథా చేస్తున్నట్లు తనపై ఆరోపణలు కూడా వచ్చాయి. కౌశల్ భార్య నీలిమపై కూడా ఆరోపణలు వ్యక్తం కాగా ఆ సమయంలో కౌశల్ మండా నీలిమ ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. తన భార్య ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని ఒక సందర్భంగా కౌశల్ చెప్పుకొచ్చాడు. తాజాగా కౌశల్ తన భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఏదో సాధించేందుకు బయల్దేరావు.. ఏదో ఒకటి చేసేందుకు నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో అది నువ్ సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. నువ్వు కన్న కలల కోసం పోరాడిరా.. లవ్యూ.. మిస్ యూ’ అంటూ కౌశల్ భార్యతో కలిసి ఉన్న వీడియోని పోస్ట్ చేశాడు. ఇది చూసి కౌశల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అన్నా.. వదినకు ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
కొత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ 2 విన్నర్ ఫొటోలు
-
కలల ఇంట్లోకి వెళ్లిన బిగ్‌బాస్ విన్నర్
బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా షోలోనే కాదు, షో ముగిశాక కూడా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకున్న సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించాడు. కాదు, కాదు, కౌశల్ ఆర్మీనే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది. కౌశల్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆయన అభిమానులు సంబరాలు కూడా జరుపుకున్నారు. ఇక బిగ్‌బాస్ అయ్యాక అతడికి బోలెడు సినిమా ఛాన్సులు వచ్చాయంటూ వార్తలు సైతం గుప్పుమన్నాయి కానీ చివరాఖరకు అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే అప్పుడప్పుడూ టీవీ షోలలో మాత్రం తళుక్కున మెరుస్తుంటాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కు ఊహించని బహుమతి) తాజాగా కౌశల్ తను కలలు గన్న కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ఇంటిని మించిన మంచిప్రదేశం మరేదీ ఉండదు" అంటూ సతీమణి నీలిమ, పిల్లలు నికుంజ్, లల్లితో కలిసి గృహ ప్రవేశం చేస్తున్న ఫొటోలను సైతం షేర్ చేశాడు. కొత్త ఏడాది కొత్తింట్లోకి వెళ్లిన కౌశల్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
ఈ ఇద్దరిలో ఒకరే బిగ్‌బాస్ విజేత: కౌశల్
పోటీదారులు ఎంతమంది ఉన్నా విజేత ఒక్కరే. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ కోసం ఎనిమది మంది పోరాడుతున్నారు. అభిజిత్, అఖిల్, హారిక, సోహైల్, మోనాల్, అరియానా, అవినాష్, లాస్య ఎవరికి వారే టైటిల్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు బలహీనతలను అధిగమించి, ఎమోషన్స్‌ను జయించి, బలాన్ని కూడదీసుకుని, టాస్కులను ఒంటిచేత్తో పూర్తి చేసి విజయాన్ని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. కానీ ఎంత కష్టపడ్డా వీరిలో ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాలే వరకు వెళ్తారు. అందులో ఒక్కరికే టైటిల్ సొంతమవుతుంది. అలా మరో మూడు వారాల్లో షోకు శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో ట్రోఫీని అందుకునే అవకాశం ఎవరికి పుష్కలంగా ఉందనే విషయాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంటు కౌశల్ మండా వెల్లడించాడు. కానీ హౌస్‌లో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందని చెప్పుకొచ్చాడు. ఆయన ఇంకా ఏమేం అన్నాడో అతడి మాటల్లోనే.. సీక్రెట్ రూమ్ అట్టర్ ఫ్లాప్.. అభిజిత్.. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఫిజికల్‌గా స్ట్రాంగ్ కాకపోవచ్చు. కానీ అతడు చెప్పే ప్రతీదీ జనాలకు అర్థమయ్యేట్టు చెప్తాడు. మా సీజన్లో తనీష్‌కు ఆ అలవాటు ఉంది. ఇతడు కచ్చితంగా టాప్ 2లో ఉంటాడు. సోహైల్.. మంచి ప్లేయర్. కోపమే అతడి బలం. అతడు కోపంలో మాట్లాడే మాటలు విని ఎంజాయ్ చేయొచ్చు. సోహైల్ కూడా పక్కా టాప్ 2లో ఉంటారు. అఖిల్.. మిగతావాళ్లతో పోలిస్తే బాగా ఆడతాడు. మొదట్లో మోనాల్‌తో ట్రాక్ నడిపాడు. కానీ సడన్‌గా ఆ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు. తర్వాత మళ్లీ గేమ్‌లోకి వచ్చాడు. అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడని అతనితో పాటు ఇంటిసభ్యులకు కూడా తెలుసు. అయితే ప్రతి సీజన్‌కు సీక్రెట్ రూమ్ వర్కవుట్ కాదు. పైగా అఖిల్ ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి టెంపర్ లూజ్ అయ్యాడు. అదే అతడికి మైనస్ అవుతోంది. (చదవండి: మొదటిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్) అవినాష్ కామెడీ తగ్గించేశాడు అవినాష్.. కామెడీ చేస్తున్నాడు, గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చిల్లర కామెడీ అన్నప్పటి నుంచి కామెడీ తగ్గించేశాడు. ఎత్తుకు పై ఎత్తుకు వేసుకుంటూ వెళ్తే టాప్ 5లోకి వెళ్తాడు. అరియానా.. అగ్రెసివ్. ఒకసారి పీక్స్‌కు వెళుతుంది మళ్లీ డ్రాపవుట్ అవుతుంది. అదే పీక్నెస్ మెయింటెన్ చేస్తే బాగుంటుంది. ఇక అవినాష్, అరియానా మధ్య బంధం బలంగా ఉంది. హారిక.. ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడుతుంది. అందరితో ఓపెన్ అవ్వట్లేదు. క్యూట్ అండ్ బబ్లీనెస్తోనే ఉండిపోతోంది. కానీ అక్కడ సమయం మించిపోతోంది. అయినా సరే తర్వాత చేద్దాం, తర్వాత ఆడదాం అనుకుంటే కుదరదు. ఇప్పటి నుంచే ఆడాల్సిందే. (చదవండి: అరియానా నాకు కాంపిటీషనే కాదు: లాస్య) లాస్య అసలు స్వరూపం చూపించాలి లాస్య.. గేర్ లేని కారును నడుపుతున్నట్లుగా ఆమె ఆట ఉంది. మొదటి నుంచి కూల్‌గా వెళ్తోంది. అందరూ ఆమె నవ్వునే చూశారు, కానీ కోపాన్ని కూడా చూడాలనుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు అసలు స్వరూపాన్ని చూపింస్తుందని కోరుకుందాం. మోనాల్.. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతోంది. అఖిల్‌తో రిలేషన్ నుంచి బయటకు వచ్చి గేమ్ మీద దృష్టి పెడితే బాగా ఆడగలదు. భాష రాకపోవడం వల్ల చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్పలేకపోతోంది. ఎమోషనల్‌గా కాకుండా అగ్రెసివ్‌గా ఆడితే బాగుంటుందని కౌశల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్ : నీకు పడిపోతా అవినాష్.. అరియానా) -
బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశల్
బుల్లితెర బాస్ బిగ్‌బాస్ నాల్గో సీజన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన ప్రయాణాన్ని చూస్తే విశేషాల కన్నా వింతలు, వివాదాలే ఎక్కువగా దర్శనమిస్తాయి. షో ప్రారంభమైన రెండు, మూడు వారాల తర్వాత రావాల్సిన వైల్డ్ కార్డులు మొదటి వారాంతం నుంచే హౌస్‌లో అడుగు పెట్టడం అందరినీ కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వచ్చిన ముగ్గురిలో ఇప్పటికే కుమార్, స్వాతి ఇంటి బాట కూడా పట్టారు. ఈ క్రమంలో సింగర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవి, కుమార్, దివి ఎలిమినేషన్లు అన్‌ఫెయిర్ అని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయాలను పక్కనపెడితే బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తుండగానే 50 రోజులు పూర్తయ్యాయి. (చదవండి: అఖిల్ ముందే అవినాష్‌కు మోనాల్ ముద్దు) ఈ సందర్భంగా రెండో సీజన్ విజేత కౌశల్ మండా తాజా సీజన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఈ సీజన్ కన్నా రెండో సీజనే బాగుందని చెప్పుకొచ్చాడు. ఈసారి అన్నీ పాత టాస్కులనే పెడుతున్నారని పెదవి విరిచాడు. కాస్త కొత్త టాస్కులు ప్రవేశపెట్టాలని బిగ్‌బాస్ టీమ్‌ను కోరుతున్నాడు. అలాగే గతంలోని కొన్ని లవ్ ట్రాకులను ఈ సీజన్‌కు కూడా అప్లై చేయాలని చూశారని ఇట్టే తెలుస్తోందన్నాడు. అఖిల్- మోనాల్- అభిజిత్ ట్రయాంగిల్ స్టోరీ విషయంలో అదే ప్రయోగం చేశారని, కానీ బెడిసికొట్టిందని తెలిపాడు. ఇక ఆవేశంతో ఊగిపోయే సోహైల్ తనను తాను చాలా మార్చుకున్నాడని, కొత్త సోహైల్ కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన అంచనా ప్రకారం అభిజిత్, నోయల్, లాస్య, అవినాష్‌తో పాటు అఖిల్ లేదా సోహైల్ టాప్ 5లో ఉండారని జోస్యం చెప్పాడు. ఈ సారి మహిళా విజేత ఉండకపోచ్చని అభిప్రాయపడ్డాడు. (చదవండి: నామినేషన్ అప్పుడు చూపిస్తా: అవినాష్) -
గంగవ్వ 10 వారాల పైనే ఉంటుంది
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ కంటెస్టెంట్ల ఎంపికపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ కూడా కంటెస్టెంట్ల ఎంపికపై పెదవి విరిచాడు. ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా పార్టిసిపెంట్ల ఎంపిక జరగలేదన్నాడు. అయితే కరోనా వైపరీత్యం కారణంగా కొద్ది నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో చాలామంది మళ్లీ ఉపాధి వెతుక్కుని డబ్బు సంపాదించుకునేందుకు పరుగులు తీస్తున్నారు.. అందు వల్ల బిగ్‌బాస్ షోకు రావడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చన్నాడు. (చదవండి: ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే: తమన్) లోపలికి వెళ్లిన కంటెస్టెంట్ల గురించి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేనని, కాకపోతే గంగవ్వను ఎంపిక చేయడం మాత్రం విశేషమని కౌశల్ వ్యాఖ్యానించాడు. నిజానికి ఆమె వయసు వచ్చేసరికి అందరం పని నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తాం, కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఓ సాధారణ పల్లెటూరు నుంచి ఓ బామ్మ బిగ్‌బాస్ షోలో పాల్గొనడం అసాధారణం అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నాడు. పల్లెల్లో బిగ్‌బాస్ చూసేవారి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చారని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం) "కేవలం ఫిజికల్ టాస్క్‌ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రెండో సీజన్లో గీతామాధురి ఫిజికల్ టాస్క్‌లో పెద్దగా కష్టపడకపోయినప్పటికీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ లెక్కన గంగవ్వ 10 వారాల కన్నా ఎక్కువే హౌస్‌లో ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి సూర్యకిరణ్ తనదే కరెక్ట్ అంటూ అతిగా ఆవేశపడుతున్నాడు. బహుశా.. ఇలా కోప్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తే టీవీలో ఎక్కువసేపు కనిపిస్తామని కొందరు కంటెస్టెంట్లు అనుకుంటున్నారేమో. కానీ అన్ని వేళలా అదే జరగదు. అలాగే కావాలని ఎవరినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక కంటెస్టెంట్లకు అప్పుడే ఫ్యాన్స్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. ఇవి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఓ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశల్ ఆర్మీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.." అని కౌశల్ చెప్పుకొచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్: నోరు విప్పిన దివి వైద్య) -
ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం
‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-2’తో కౌశల్ మందకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తన అటిట్యూడ్, గేమ్ ప్లానింగ్, ఇమేజ్‌తో ఆ సీజన్ మొత్తం రఫ్పాడించాడు. ఇక విజేతగా కౌశల్ పేరును ప్రకటించిన తర్వాత ఆయన అభిమానులు చేసిన కార్యక్రమాలు, కౌశల్ ఆర్మీ పేరిట చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నంత సేపు కౌశల్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి స్టార్ దర్శకుల సినిమాల్లో కౌశల్‌కు సినిమా అవకాశం లభించినట్లు అనేక వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశల్, అయన అభిమానులు ఊహించని విధంగా సీన్ రివర్సయింది. టాలీవుడ్లో ఎక్కడా కూడా అతడి ఊసే లేదు. దీంతో తన యాడ్ ఏజెన్సీకే పరిమితమయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత కౌశల్‌కు ఒక సినిమా అవకాశం లభించింది. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కౌశల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చాలా కీలకమైందిని తెలుస్తోంది. జీబీ క్రిష్ణ దర్వకత్వం వహిస్తున్న ఆది 16వ చిత్రంలో కౌశల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం కౌశల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, కెరీర్‌కు మరింత హెల్ప్ అవుతుందని కౌశల్‌తో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కౌశల్ నుంచి గాని చిత్రబృందం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కౌశల్‌కు సినిమా అవకాశం వార్త నిజమా కాదా అని తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి. చదవండి: సల్మాన్ పేరుతో మోసం! బాలయ్య కోసం భారీగా శత్రు గణం View this post on Instagram Here's the first look poster of mine from my upcoming movie........... Sending my heartfelt thanks to my director @krishna_kitti123 , producer @diwakargaru n my dear hero @aadipudipeddi for releasing my first look on my b'day.Thank you so much for this surprise gift & also thank you for all the support that i receive from you guys on the sets. So guys hope you all love the first look poster of mine. A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on May 13, 2020 at 7:33am PDT -
బీజేపీలో చేరిన బైరెడ్డి, కౌశల్
సాక్షి, న్యూడిల్లీ : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బైరెడ్డి కుమార్తె శబరి, కౌశల్ సతీమణి నీలిమ బీజేపీ చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వారిని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని తెలిపారు. దేశంలో పరిస్థితులు బాగుపడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థ రాజకీయాలు అవసరం అని అభిప్రాయపడ్డారు. అందుకోసమే తాను బీజేపీలో చేరారని వెల్లడించారు. త్వరలోనే కర్నూలులో బహరింగ సభ నిర్వహిస్తామని.. ఆ సభకు రావాల్సిందిగా జేపీ నడ్డాను కోరినట్టు చెప్పారు. కౌశల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు దేశం కోసం పనిచేస్తున్న తీరు ఆకట్టుకుందని తెలిపారు. వారి నాయకత్వంలో పనిచేయడం కోసం బీజేపీలో చేరినట్టు చెప్పారు. -
బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. పేరు ఘనం ఫలితం శూన్యం అన్న చందంగా తయారైంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కోసం బిగ్‌బాస్ యాజమాన్యం తీవ్ర కసరత్తులే చేస్తుంది. జనాల్లో కొద్దో గొప్పో పేరు సంపాదించుకున్న వారినే షోకు ఎంపిక చేసుకుంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో నియమనిబంధనలను అతిక్రమించకుండా, వందరోజులు హౌస్‌లోనే ఉండేలా బాండ్ రాయించుకుంటుంది. అయితే.. షో తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయని భావించిన కంటెస్టెంట్ల గంపెడాశలపై బిగ్‌బాస్ నీళ్లు చల్లుతుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. షో నిర్వహించే వారికి మంచి టీఆర్పీ రేటింగ్‌తో భారీగానే గిట్టుబాటు అవుతుంది.. కానీ అందులో పాల్గొన్నవారికి మాత్రం అంతకుమునుపు ఉన్న పేరు కూడా ఊడిపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆ హడావుడి ఏమైంది? అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తారలు.. బిగ్‌బాస్ షో తర్వాత చేతిలో ఏ ప్రాజెక్టు లేక ఈగలు తోలుకుంటున్నారు. జనాలు వారి పేర్లను కూడా మర్చిపోతున్నారంటే వారి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ 1 విజేతగా నిలిచిన శివబాలాజీ రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ కిరీటం గెలిచాడన్న మాటే గానీ అది అతని జీవితానికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. అంతకుముందు చకచకా సినిమాలు చేసుకుంటూ పోయిన శివబాలాజీ బిగ్‌బాస్ తర్వాత అడపాదడపా సినిమాల్లో మాత్రమే కనిపించాడు. అంతదాకా ఎందుకు? అందులో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు పత్తాలేకుండా పోయారు. ఏ ఒకరిద్దరికో తప్పితే ఎవరికీ పాపులారిటీ రాలేదు. ఇక రెండో సీజన్లో కౌశల్ ఆర్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించాలంటూ ఆర్మీల పేరిట ర్యాలీలు చేస్తూ నానాహడావుడి చేశారు. కప్పు కొట్టాక భవిష్యత్తు ఏంటి? బిగ్‌బాస్ షో తర్వాత కౌశల్ సినిమాల్లోకి రానున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ పరిస్థితి తలకిందులైంది. కేవలం టీవీ ఇంటర్వ్యూలకు, షాప్ ఓపెనింగ్లకు మాత్రమే అతను పరిమితమైపోయాడు. మెల్లిమెల్లిగా మీడియా కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. మొత్తానికి గత రెండు సీజన్ల విజేతలకు ప్రైజ్‌మనీ తప్పితే అంతకుమించి ఒరిగిందేమీ లేదు. బిగ్‌బాస్ షో తర్వాత వాళ్లిప్పుడు కనిపించకుండా పోయారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు టైటిల్ కోసం నువ్వా నేనా అని పోరాడుతున్న శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలిచినా.. తర్వాత వారి పరిస్థితి కూడా ఇంతేనా అని ప్రేక్షకులు పరిపరివిధాలా ఆలోచిస్తున్నారు. -
కౌశల్ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్ గెస్ట్!
బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మోస్ట్ పాపులర్ అయిన కంటెస్టెంట్ కౌశల్. తన ఆటతో అందరి అభిమానాన్ని సంపాదించుకుని విన్నర్‌గా నిలిచాడు. అయితే అంతవరకు మంచి పేరున్న కౌశల్.. బయటకు వచ్చాక చేసిన కొన్ని పనులతో నవ్వులపాలయ్యాడు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఓ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ పట్టా ఇస్తామన్నారంటూ ప్రచారం చేసుకునే సరికి అతనికి కొంత నెగెటివిటీ ఏర్పడింది. హౌస్‌లో ఉన్నంత సేపు ఎవ్వరితోనూ అంతగా కలవకుండా సొంతంగా గేమ్ ఆడిన కౌశల్.. బయటకు వచ్చాక కూడా తన హౌస్‌మేట్స్‌తో ఎక్కువ కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించలేదు. అయితే మిగతా కంటెస్టెంట్లు అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఎవరి పుట్టినరోజు వేడుకలు అయినా, పండగలు వచ్చినా కలిసి ఎంజాయ్ చేస్తారు. అయితే శుక్రవారం (సెప్టెంబర్ 20) నాడు కౌశల్ కూతురు లల్లీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు తనీష్, గీతా మాధురి, అమిత్, రోల్ రైడా, గణేష్ ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు చాలామంది హాజరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరంతా లల్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవ్వడం మరో ఎత్తు. ఈ సందర్భంగా సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
కౌశల్ ఆర్మీకి ప్రతీ రూపాయికి లెక్క ఉంది..
బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్‌కు.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన కౌశల్ ఆర్మీకి మధ్య వివాదం ముదురుతోంది. ఫౌండేషన్ డబ్బును కౌశల్ ఇష్టం వచ్చినట్టుగా వృధా చేస్తున్నాడంటూ ఆరోపిస్తు ఆర్మీ సభ్యులు ఎదురు తిరగటంతో కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించిన అన్ని వివరాలు జెన్యూన్‌గా ఉన్నాయి. ప్రతీ రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కాను. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞడుని. బిగ్‌బాస్ గేమ్‌ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. అలాంటిది నా మీద ఓ మీడియా సంస్థ (సాక్షి కాదు) నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. 20 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చిన మంచి అవకాశం బిగ్ బాస్ 2. సామాన్యుడైన కౌశల్ ఈ స్థాయికి రావటం ఇష్టం లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మీ తరపున చేసే ప్రతీ కార్యక్రమం రికార్డెడ్. అన్ని వివరాలు ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసం పనిచేస్తున్నా. నా పై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్ క్రైమ్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసాన’ని తెలిపారు. -
‘కౌశల్‌ను నమ్మొద్దు.. అతనొక మోసగాడు’
బిగ్‌బాస్ కౌశల్.. ఈ పేరు ఒకానొక టైమ్‌లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి యుద్దమే జరిగింది. సేవా కార్యక్రమాలు, 2కే రన్లు చేస్తూ.. కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్‌కు మద్దతుకు నిలిచారు. మొత్తానికి బిగ్‌బాస్2 సీజన్ విజేతగా కౌశల్ నిలిచాడు. అటు తరువాత కౌశల్ ఇంటర్వ్యూలు, సన్మాన సభలు, విదేశాల్లో కూడా సభలు నిర్వహించడం, డాక్టరేట్‌ను ప్రధానం చేయడంలాంటి వ్యవహారాలు హల్చల్ చేశాయి. దీంతో ఒక వర్గం కౌశల్‌పై కుట్ర చేసేందుకు రెడీ అవుతోందని కౌశల్ అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే రీసెంట్గా మళ్లీ ఇలాంటి ఆరోపణలే వైరల్ అయ్యాయి. కౌశల్‌ను నమ్మొద్దని, అతనొక మోసగాడంటూ, కౌశల్ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన వుండదని, అభిమానులతో డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటాడే తప్ప తన జేబులోంచి రూపాయి బయటకి తీయడని ఆరోపిస్తోస్తున్నారు. ఎక్కడికి అతడిని రమ్మన్నా కూడా అందులో తనకేంటి లాభమని చూసుకుంటాడని, ప్రతి చిన్న ఈవెంట్‌కి కూడా డబ్బులు ఆశిస్తున్నాడని కౌశల్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఈ ఆరోపణలపై కౌశల్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఇలా ప్రతీసారి తనపై ఆరోపణలు చేయడం అలవాటైందని, అయినా ప్రతీ దానికి సమాధానం చెప్పుకుంటూ పోవడం తనకేం అవసరం లేదని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇలా వచ్చే ప్రతీ దానిపై స్పందించేంత సమయం కూడా తనవద్ద లేదంటూ.. కావాలనే తనను కించపరచాలని ఇదంతా చేస్తున్నారని విమర్శించాడు. కాలమే వీటన్నంటికి సమాధానం చెబుతుందని, కొంత సమయం ఆగితే నిజాలు అవే బయటకు వస్తాయన్నాడు. -
ప్రేమమ్‌తో..అనుపమా
-
ఓటు వేస్తేనే రెట్టింపు ఆనందం: కౌశల్
హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా సంతృప్తి లభించడమే కాదు మనం ఓటు వేసిన నాయకుడు గెలిస్తే ఆ తృప్తి రెండింతలవుతుంది. మనం ఓటు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధి పనులు చేయకపోతే ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. పని చేస్తే ప్రశంసించేందుకు అవకాశం దక్కుతుంది. దేశ భవిష్యత్ గురించి మన భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన నాయకులను మనమే ఎన్నుకున్నామన్న తృప్తి మిగలాలి. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు లభిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓటు విషయంలో అందరూ ఒక్కటే. ప్రతి ఒక్కరూ లైన్లో నిలబడి తప్పనిసరిగా ఓటు వేయాలి. నేను ప్రతిసారీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకుంటాను.– కౌశల్, నటుడు, బిగ్‌బాస్– 2 విజేత -
ఫ్యాషన్ హొయలు
-
మనం సైతం ఆధ్వర్యంలో చేయూత
సాక్షి, సిటీబ్యూరో: సినీ రంగంలోని అవసరార్థుల కోసం ఏర్పడిన మనం సైతం సంస్థ ఆధ్వర్యంలో పలువురికి ఆర్ధిక సాయం అందించారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబర్ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలని, దీని కోసం తన వంతుగా ఒక యాప్ రూపొందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మాట్లాడుతూ ఇకపై మనం సైతం స్ఫూర్తితో కౌశల్ ఆర్మీ కూడా పనిచేస్తుందన్నారు. తన వంతుగా పాతిక వేల రూపాయలు విరాళం ప్రకటించారు. సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ.... మనం సైతం ద్వారా పేదల ఆరోగ్యం, విద్య, వృద్ధులకు సహాయపడుతుండడం అభినందనీయమన్నారు. తన వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ గత జనవరి నుంచి ఇప్పటికి 90 మంది పేదలకు ఆర్థిక సహాయం అందించామని, వివిధ ఆస్పత్రులను అభ్యర్థించి పేదలకు 43 లక్షల రూపాయల ఫీజులు తగ్గించామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడ్చి చాలా మందిని బాధ పెట్టా ..
గల్లీల్లో లొల్లిలొల్లి చేసే తెలుగు ర్యాపర్ రోల్‌రైడా, సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే అమిత్ తివారీ బిగ్‌బాస్ షోలో కలుసుకున్నారు. రూపంలో, స్వభావాల్లో వీరిద్దరికి అస్సలు సంబంధం లేదు. కానీ వీరి మధ్య బంధం అల్లుకోవడానికి అంత సమయమేం పట్టలేదు. షో తొలి రోజు రాత్రి రైడా మాటలు విన్న అమిత్ రోల్ అయిపోయాడు. అమిత్ వేసిన జోకులకు రైడా కనెక్ట్ అయిపోయాడు. పరిచయమే లేని వారిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ‘బిగ్‌బాస్’ లైఫ్‌టైమ్ ఫ్రెండ్‌ని ఇచ్చిందంటూ చెబుతున్న వీరిద్దరి ‘షో’ జర్నీ విశేషాలు వారి మాటల్లోనే... రోల్ రైడా .. షో ప్రిపరేషన్ ‘బిగ్‌బాస్’లో అవకాశం వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను. ప్రేక్షకులు మన వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేసే అధికారమిచ్చి ఆ షోలోకి వెళ్తాం. హౌస్‌లో ఎలాంటి సందర్భంలో అయినా మనం మనలాగా ఉండడం ముఖ్యం. రెండు మూడు వారాల్లో బయటకు వచ్చినా... పబ్లిక్‌లో మనం కనిపిస్తే గుసగుసలు పెట్టుకోకుండా, దగ్గరికొచ్చి ఒక సెల్ఫీ అడగాలి. ఇదే హౌస్‌మేట్స్‌కి చెప్పేవాణ్ణి. నేను బయటకు వచ్చాక అంతకుమించిన అభిమానం పొందుతున్నాను. ‘షో’ తర్వాత సర్ప్రైజ్ అభిమానం. ఈ షోకి ముందు నా వీడియోలు చూసిన వాళ్లు చాలా తక్కువ. షో తర్వాత తెలుగు రాష్ట్రాల వాళ్లే కాకుండా... ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లంతా నా వీడియోలు చూసి విషెస్ పంపిస్తుండ్రు. రోడ్ మీద కనిపిస్తే బండి ఆపేసి రోల్‌రైడా అని మాట్లాడుతున్నరు. ఏం మిస్సవుతున్నారు? పొద్దున్నే అమ్మ నిద్ర లేపుతుంది. అదేంటి పాట రావాలి కదా! నిద్రపోతే కుక్కలు మోరుగుతలేవ్? మాట్లాడుతున్నప్పుడు మైక్, ఏదీ చేయాలన్నా... ఇంకా బిగ్‌బాస్ చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నాను. చెప్పాలంటే ఇంకా బిగ్‌బాస్ హ్యాంగోవర్లోనే ఉన్నాను. బిగ్‌బాస్ వాయిస్ బాగా మిస్ అవుతున్నాను. గిల్టీ ఫీలింగ్ టెంట్ టాస్క్‌లో దీప్తికి దెబ్బ తగిలింది. అది తెలియకుండానే జరిగినప్పటికీ, నావల్లే తలిగిందని చాలా బాధ పడ్డాను. మళ్లీ నాకోసం గణేశ్ ఒక వీక్ మొత్తం ఫ్రూట్స్ తిన్నాడు. తట్టుకోలేకపోయాను. తర్వాత గణేశ్ కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పుడు గిల్టీ ఫీలింగ్ తగ్గింది. ఆ వారం ఎలిమినేట్ అయినా ఫర్వాలేదని అనుకున్నాను. రిగ్రెట్ కౌశల్ ఒక మాట అన్నప్పుడు ఎమోషనల్‌గా బస్ట్ అయ్యాను. కానీ అలా కాకుండా ఉండాల్సింది. ఏడ్చి చాలా మందిని బాధ పెట్టానని అనిపించింది. అసలు ఎందుకు అలా అయిందంటే... చెల్లి రావడం, అమిత్గాడు వెళ్లి పోవడంతో నాలో ఎమోషనల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఒంటరినైపోయాను. అప్పుడే కౌశల్ అలా అన్నారు. కెప్టెన్సీ వచ్చేది కాస్త పోయింది. ఇలా ఒక్కసారే చాలా ఫ్యాక్టర్స్, నేను ఎమోషనల్‌గా బ్రేక్‌డౌన్ కావడం, ఎగ్స్ సామ్రాట్‌కి ఇచ్చేయడం నా ఎలిమినేషన్‌కి కారణం కావచ్చు. ఎగ్స్ టాస్క్‌లో గెలిచే అవకాశం ఉంటే గివప్ చేసేవాడిని కాదు. నేను గెలవలేదని, ఇంకొకరు గెలవొద్దనే మెంటాలిటీ కాదు నాది. ‘హౌస్’లో మీ స్ట్రెంత్ బాండింగ్.. నేను ఒంటరిగా ఉండలేను. గొడవలున్నా ఇంటికి రాగనే మంచిగ పలకరిస్తే రిఫ్రెష్ అయిపోతం. అలా నాకు తోడున్నది అమిత్. చాలా మాట్లాడుకునేవాళ్లం. హౌస్‌లో అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటెయిన్ చేశాను. అందరినీ ఎంటర్టైన్ చేసేవాడిని. ఆ ఎమోషనల్ బాండ్తోనే ఆ ఇంట్లో నేను ఉండగలిగాను. నా క్యారెక్టర్ కూడా అదే. అది ప్రేక్షకులకు నచ్చిందనుకుంటాను. ఏం నేర్చుకున్నారు? హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ ఎంత ముఖ్యమో అర్థమైంది. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫోన్‌తోనే గడుపుతుంటాం. ఇంట్లో వాళ్లకి టైమ్ ఇవ్వం. ఇంటికి రాగానే మన గురించి అడిగే వాళ్ల విలువ అక్కడ తెలిసొచ్చింది. బయట కొట్లాడితే మాట్లాడుకోం. కానీ బిగ్‌బాస్‌లో గొడవ అయినవాళ్లతో కలిసి టాస్క్ చేయాల్సి ఉంటుంది. మెంటల్, ఫిజికల్, బిహేవియర్... ఇలా అన్నింటికీ బిగ్‌బాస్ ఓ పరీక్ష. బిగ్‌బాస్ జర్నీ మనల్ని మనం పరీక్షించుకునేందుకు ఒక అవకాశం. అది కొనుక్కుంటే వచ్చేది కాదు... లక్కుండాలి. ఇంతకముందు వరకు నాకు మొహమాటం, స్టాండ్ తీసుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు నా ఇంటెన్షన్ బయటకు చెబుతున్నాను. నచ్చని విషయాలు బయటకు చెప్పడంతో మనసు తేలికవుతుంది. అమిత్ .. ఫ్రెండ్షిప్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, సరదాగా ఉండాలి. నాది, రోల్రైడాది ఇదే మైండ్‌సెట్. వాడు అదే విషయం ఫస్ట్ డే చెప్తుంటే విని కనెక్ట్ అయ్యాను. తర్వాత వాడు ఏ జోక్ వేసినా నేను పడిపడి నవ్వేవాణ్ణి. నేను ఏ జోక్ వేసినా వాడికి బాగా నవ్వు వచ్చేది. వాడికి నాకు ఒకటే తేడా... వాడికి జుట్టుంది, నాకు లేదంతే (నవ్వుతూ). బిగ్‌బాస్ షో నాకు లైఫ్‌టైమ్ బ్రదర్‌ని ఇచ్చింది. ‘లఫంగ్ గిరిగిట్టా ఫిలిం మేకింగ్’ టాస్క్ చాలా ఎంజాయ్ చేశాను. రోలి జోక్స్ మరిచిపోలేను. ‘షో’ తర్వాత సర్ప్రైజ్ ఇంటికొచ్చాక నా వైఫ్ సోషల్ మీడియాలో వచ్చిన లవింగ్ మెసేజెస్ చూపించింది. అలాంటి అభిమానం కోసమే షోకి వెళ్లాను. ఆ మెసేజెస్ చూసి నేను విన్ అయ్యానని అనుకున్నాను. బిగ్‌బాస్‌కి ముందు పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు దగ్గరికి వచ్చి ఎవరూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. అది మారాలి... నేను మామూలుగా ఎలాంటి వాడినో తెలియాలని ఉండేది. ఈ షో ద్వారా నేనేంటో చాలా మందికి తెలిసింది. ఈ షో తర్వాత దిగినన్ని సెల్ఫీలు నా లైఫ్‌లో ఎప్పుడూ దిగలేదు. సెల్ఫీలు అడిగిన వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ (నవ్వుతూ). ‘హౌస్’లో మీ స్ట్రెంత్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. దాంతో హౌస్‌లో ఉండగలననే నమ్మకం ఉండేది. ఇంకా మా వైఫ్, ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి పంపించారు. మేం బాగా ఉంటామని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండగలిగాను. హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి కూడా నేను ఎలా ఉన్నానో... అలానే నచ్చాను. కాబట్టే అన్ని రోజులు హౌస్‌లో ఉండగలిగానని అనుకుంటున్నాను. షో ప్రిపరేషన్ లైఫ్‌లో ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ఉండేది. అదే ఆలోచనతో ఉన్నప్పుడు బిగ్‌బాస్ నుంచి కాల్ వచ్చింది. ఇంతకన్నా డిఫరెంట్‌గా చేయడానికి ఇంకా ఏం ఉంటుందని నా వైఫ్ ఎంకరేజ్ చేసింది. అంతకుమించి ప్రిపరేషన్ ఏమీ లేదు. ఏం మిస్సవుతున్నారు? అక్కడ ఒక సుప్రీం పవర్‌లా మమ్మల్ని గైడ్ చేసే బిగ్‌బాస్ వాయిస్‌ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా అక్కడి కెమెరాలను కూడా. ఇంట్లోవాళ్ల పేర్లు పెట్టి వాటితో మాట్లాడేవాడిని. రిగ్రెట్ నేను రిగ్రెట్ అయ్యే విషయాలేమీ లేవు. చెరుకు రసం టాస్క్ ఫిజికల్‌గా చాలా కష్టమనిపించింది. ఫ్రీజింగ్ టాస్క్ మెమరబుల్. ఇక వేరే ఏ విషయాలు నాకు ఎక్కువ గుర్తులేవు. దాదాపు 100 రోజులు హౌస్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం నేర్చుకున్నారు? నాకు ఫుడ్, నిద్ర, టీవీ అంటే చాలా ఇష్టం. 20 ఏళ్లుగా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా కంట్రోల్ చేసుకోవడం అలవాటైంది. నేను ఓవర్కం చేయగలిగాను. ‘సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేస్తడు. మరి ఇక్కడ కూడా కొట్లాటలు పెట్టుకుంటాడేమో’ అని అమిత్ తివారీ గురించి అనుకున్నాడు రోల్‌రైడా. ‘తలకు రంగు, చూడ్డానికి వింతగా ఉన్నాడు. ఈ ఇంట్లో ఎలా ఉంటాడో’ అని రోల్‌రైడా గురించి అనుకున్నాడు అమిత్ తివారీ. బిగ్‌బాస్ హౌస్ ఎంట్రీలో ఒకరినొకరు చూసి వీరు మనసులో అనుకున్న మాటలివీ... -
డబ్బులిచ్చి బిగ్‌బాస్ విజేత కాలేదు: కౌశల్
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్–2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ మండ అన్నారు. అంత కోటీశ్వరుడినే అయి ఉంటే తన తండ్రి బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేసే వారే కాదన్నారు. తన అభిమానుల ఓటింగ్ వల్లే విన్నర్ అయ్యానని తెలిపారు. కౌశల్ ఆర్మీని దుషించేవారిని మట్టికరిపిస్తానని హెచ్చరించారు. భెల్ (హెచ్‌పీవీపీ) మైదానంలో బుధవారం రాత్రి తన అభిమానులు నిర్వహించిన సభలో కౌశల్ పాల్గొన్నాడు. తొలుత తన తల్లి లలిత కుమారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. (బిగ్‌బాస్ విజేత కౌశల్) తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలో పుట్టి, విద్యాభ్యాసం అంతా టౌన్షిప్ క్వార్టర్స్‌లోనే కొనసాగించానని గుర్తుచేశారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు, ఆటలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుతెచ్చుకున్నారు. కళాకారుడిగా తన తండ్రి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని అందువల్లే సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఆ తరువాత ఫ్యాషన్‌పై మక్కువతోనే హైదరాబాదు వెళ్లిపోయినట్టు చెప్పారు. అనంతరం అనేక సంఘాలు, వివిధ పార్టీలు, అసోసియేషన్ సభ్యులు కౌశల్‌ను ఘనంగా సన్మానించారు. కౌశల్ ఆర్మీని విస్తరిస్తా.. పెదవాల్తేరు(విశాఖతూర్పు): కౌశల్ ఆర్మీని మరింత విస్తరిస్తానని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ పేర్కొన్నారు. ఆయన పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్ వెల్లడించారు. చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా.. బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్! -
సుచిత్రా సర్కిల్లో బిగ్‌బాస్ విజేత కౌశల్ సందడి
-
బిగ్‌బాస్–2 కౌశల్ మనోడే
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు బుల్లితెర నటుడు కౌశల్ మండ. ఈ షో ద్వారా ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన్ని అభిమానించే వాళ్లలో మహిళల శాతమే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. బిగ్‌బాస్–2 విజేతగా కౌశల్ నిలవడంతో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ కౌశల్ ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. ఆయన మన విశాఖ వాసే. గాజువాక ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఆయన తండ్రి మండ సుందరయ్య బీహెచ్‌పీవీ విశ్రాంత ఉద్యోగి. కౌశల్ గెలుపులో గాజువాక ప్రాంత వాసుల భాగస్వామం ఉంది. కౌశల్‌తో తమకున్న జ్ఞాపకాలను ఆయన బాల్య స్నేహితులు, కుటుంబ సన్నిహితులు ‘సాక్షి’తో పంచుకున్నారు. కౌశల్ తల్లిదండ్రులు లలిత కుమారి, సుందరయ్యలు గాజువాక ప్రాంతంలో నివసించేవారు. ఐదేళ్ల వయసులోనే కౌశల్ బెస్ట్ హెల్తీ బాయ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడని సుందరయ్య తెలిపారు. బీహెచ్‌పీవీ కళావేదికపై కౌశల్ ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. బీహెచ్‌పీవీ పాఠశాలలోనే 10వ తరగతి, గాజువాక ప్రాంతంలోని కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత మెటలర్జీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ దశలోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడని కౌశల్ తండ్రి తెలిపారు. 2000లో సినీ రంగ ప్రవేశం చేసిన కౌశల్ ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడని వివరించారు. ప్రముఖ హీరోల సరసన నటించాడని, మూడు సినిమాల్లో ప్రధాన భూమిక వహించాడని చెప్పారు. పలు సీరియళ్లలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, మోడలింగ్ రంగంలో విశేషంగా రాణించాడని సుందరయ్య వివరించారు. కౌశల్‌ను సన్మానించేందుకు టౌన్షిప్ ప్రాంత వాసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌశల్ ఎంతో మందికి ప్రేరణ కౌశల్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చిన్నతనం నుంచి నటనలో రాణించాడు. నాటక, బుల్లి తెర, వెండితెరలో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్–2 విజేతగా అవతరించడం ఆనందంగా ఉంది. కౌశల్ నాకు బాల్య మిత్రుడు. ఆయనతో గడిపిన క్షణలు ఇప్పటికీ గుర్తున్నాయి. – రాంజానే, షార్ట్‌ఫిల్మ్ మేకర్, భెల్ ఉద్యోగి మంచి స్నేహితుడు కౌశల్ మంచి స్నేహితుడు కౌశల్. స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తాడు. కౌశల్ నగరానికి వచ్చిన ప్రతిసారి తమను కలుస్తాడు. ఆ రోజు మాకు పండగే. ప్రతి క్షణాన్ని పండగలా జరుపుకుంటాం. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ అంటే కౌశల్‌కు ఎంతో ఇష్టం. – ప్రశాంత్, బాల్య స్నేహితుడు నటన వారి కుటుంబంలోనే ఉంది కౌశల్ తండ్రి సుందరయ్య బీహెచ్‌పీవీ ఉద్యోగిగా ఉన్న సమయంలో అసోసియేషన్ ఏర్పాటు చేసి నాటికలు వేసేవారు. కౌశల్ కూడా నటన రంగంలో రాణిస్తున్నాడు. అందివచ్చిన మంచి అవకాశాన్ని కౌశల్ సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పవచ్చు. కౌశల్ నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. – శ్యాం, స్నేహితుడు చెప్పలేనంత ఆనందంగా ఉంది బీహెచ్‌పీవీ టౌన్షిప్లో మా అందరితో కలసి మెలసి తిరిగిన కౌశల్ ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఎంతో ఆనందంగా ఉంది. కౌశల్ కోసం బిగ్‌బాస్ షో క్రమం తప్పకుండా చూశాను. చాలా మంది ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఆయన ఇక్కడకు విచ్చేస్తే ఘన స్వాగతం పలుకుతాం. – శ్రీదేవి, కౌశల్ కుటుంబ సన్నిహితురాలు -
అదే పెద్ద విక్టరీ అనుకుంటున్నా: దీప్తి
‘బిగ్‌బాస్ 2’లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్ని రోజులు ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాననే బాధ అనిపించిందా? కచ్చితంగా బాధగానే ఉంది. దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసే ‘బిగ్‌బాస్ 2’లో అడుగుపెట్టాను. మా అమ్మ, భర్త శ్రీకాంత్, కొడుకు సిద్ధార్థ్.. ఇలా మా కుటుంబ సభ్యులందరి సపోర్ట్‌తో బిగ్‌బాస్‌కి వెళ్లగలిగాను. జనరల్‌గా అమ్మాయిలకు పెళ్లయితే కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ, నాకు అలాంటివేం పెట్టలేదు. ఇంత మంచి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. నాకు బాధ అనిపించినప్పుడల్లా వారి మాటలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని గట్టిగా ఉన్నా. మా కుటుంబ సభ్యులను చూశాక కన్నీళ్లు ఆగలేదు. నాకే కాదు. బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరి పరిస్థితి ఇంతే. వందరోజుల్లో కనీసం నాపేరు 100 సార్లైనా తలచుకున్నావా? అని మా అబ్బాయి సిద్ధార్థ్ అడిగాడు.100కంటే ఎక్కువ సార్లు తలచుకున్నా. మీరెందుకు గెలవలేకపోయారు? ఏ ఆటలో అయినా విజేత అనేవాడు ఒక్కడే ఉంటాడు. షో నుంచి బయటికొచ్చాక చాలా మంది నన్ను కలిసి ‘విజేతగా మిమ్మల్ని కూడా మేము ఊహించుకున్నాం. కనీసం రన్నరప్లో అయినా ఉంటారనుకున్నాం’ అంటుంటే వారి మనసులను గెలుచుకున్నామనే హ్యాపీ ఉంది. ఆట ఆడటానికొచ్చినప్పుడు గెలిచినా.. ఓడినా, ఎలిమినేట్ అయినా స్పోర్టివ్‌గా ఉండాలనుకున్నా, ఉన్నాను. గెలవాలనే తాపత్రయం మా 17 మందిలో ఉండేది. కౌశల్ కూడా మాలో ఒక్కడే కదా? తను గెలిస్తే ఏంటి? సంతోషమే కదా? ‘బిగ్‌బాస్ 1’లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ‘బిగ్‌బాస్ 2’లో కౌశల్ గెలిచారు. రెండు సీజన్స్‌లోనూ అబ్బాయిలే గెలిచారు. అమ్మాయిలను అణిచేశారనే భావన ఏమైనా ఉందా? అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ‘బిగ్‌బాస్’ టాస్క్‌లు ఇచ్చేటప్పుడు అబ్బాయిలకు ఒకలా.. అమ్మాయిలకు మరోలా ఇవ్వలేదు కదా? అందరికీ ఒకే టాస్క్‌లు ఇచ్చారు. ఎవరైనా ఒక్కటే అని ప్రేక్షకులు కూడా ఆటని ఆటలా చూశారు. అందుకే కదా ఫైనల్ వరకూ వెళ్లా. విజేత ఎవరన్నది చివరకు ప్రేక్షకులే నిర్ణయించారు. కౌశల్ ఎందుకు గెలిచారనుకుంటున్నారు? గేమ్ పరంగా ఆయన ఫోకస్ ప్లస్ అయింది. ఆయన గెలవడానికి అన్ని కారణాలు కలిసొచ్చాయి. అన్ని వర్గాలు ఆయన విజయానికి హెల్ప్ అయ్యాయి. కౌశల్ గెలవడానికి పూర్తి అర్హత ఉందని మీ నమ్మకమా? ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్న 17 మందికి గెలిచే అర్హత ఉంది. అయితే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలించవు.. మరికొన్ని సార్లు అనుకూలిస్తాయి. ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్నందుకు ఏమైనా అసంతృప్తి ఉందా? లేదు. ప్రతి టాస్క్‌లో నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత ఇచ్చాను. అందరితో మంచి స్నేహం కుదిరింది. గీతామాధురి అక్కతో కలిసి ఒకటో రెండో షోలు చేశా. ఓ రోజు విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా మాట్లాడాను. గీత అక్కతో తప్ప షోలో పాల్గొన్నవారిలో ఎవరితోనూ కనీసం ముఖ పరిచయం కూడా లేదు. నేనూ, గణేశ్ ఇంచుమించు ఒక్కటే అని చెప్పొచ్చు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంతవరకూ వెళ్లి ఫైనల్ వరకూ నిలవడమే ఓ విక్టరీగా భావిస్తున్నా. -
ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 సీజన్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో మునిగిపోయాడు కౌశల్. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఫ్యాన్స్‌తో తన విన్నింగ్స్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తొలుత అతని కోసం బయటవేచి ఉన్న అభిమానులను చూసిన కౌశల్ ఉప్పొంగిపోయాడు. ఈ క్రమంలోనే కారుపైకి ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఇక్కడ కౌశల్‌ను ఫొటోలు తీయడానికి ఫ్యాన్స్ పోటీ పడగా, వారిని అలానే చూస్తూ ఉండిపోవడం అతని వంతైంది. ‘మాటల్లేవ్’అన్న ఫీలింగ్ మాత్రమే ఇక్కడ కౌశల్ ముఖంలో కనిపించింది. ఒకింత ఆనంద బాష్పాలతో మురిసిపోయాడు కౌశల్. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో భాగంగా టాప్ ఐదుగురు కంటెస్టెంట్లో ముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. బిగ్‌బాస్ విజేత కౌశల్ -
టైటిల్‌ను గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్‌తో కలిసి ఇలా..
-
బిగ్‌బాస్ విజేత కౌశల్
బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్ నిలిచాడు. తుది పోరుకు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తి, తనీష్, సామ్రాట్లు చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక ఓటింగ్‌తో కౌశల్ విజేతగా అవతరించాడు. కౌశల్ అందరికీ కంటే ఎక్కువ ఓట్లతో టాప్‌లో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కౌశల్ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఓవరాల్ కంటెస్టెంట్లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్ కే పడినట్లు తెలిసింది. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో టాప్ ఐదుగురు కంటెస్టెంట్లోముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. ఈ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నాడు కౌశల్. కౌశల్ ఓ సాధారణ మోడల్‌గా, సీరియల్స్ నటుడిగా బిగ్‌బాస్ హౌస్‌లోనికి అడుగుపెట్టాడు. కానీ.. అసాధారణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చే టాస్క్‌ల్లో కూడా కౌశల్ తనదైన ముద్ర వేశాడు. బిగ్‌బాస్ సుదీర్ఘ జర్నీలో ఆది నుంచి చివరి వరకూ ఒంటరి పోరాటం చేస్తూ.. బిగ్‌బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడనడంలోఎలాంటి అతిశయోక్తి లేదు. కౌశల్ పేరు దేశవిదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట గత వంద రోజులుగా పలుకుతూనే ఉంది. కౌశల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్ సంఘం కూడా ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశల్ ఆర్మీ 2కే రన్ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. కేవలం కౌశల్ ఆర్మీ అనేది సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే ఉన్న పెయిడ్ గ్రూపంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి ముందుగానే వెళ్లిపోయిన కొంతమంది కంటెస్టెంట్స్ ప్రచారం చేశారు. దీనికి కౌశల్ ఆర్మీ ధీటుగానే బదులిచ్చింది. కొంతమంది తాము కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. వాస్తవ ప్రపంచంలో ఉన్నామని నిరూపించడానికి ఈ ర్యాలీలను చేపట్టారు. బిగ్‌బాస్‌లో ఏకంగా 11సార్లు నామినేట్ అయి కూడా సేఫ్ జోన్‌లోనికి వెళ్లాడు. ప్రధానంగా తన పట్టుదల, ఎలాంటి పరిస్థితులకూ తగ్గని నైజం, నిజాయతీ, కష్టపడే తత్వం, ఎన్ని అవరోధాలు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యం.. ఇవన్నీ కౌశల్‌లో జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ బిగ్‌బాస్ సీజన్లో కౌశల్ పేరే ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. తొలుత సాధారణ వ్యక్తిలా మాత్రమే అభిమానులు చూసినా క్రమేపీ అతనిపై అభిమానం పెంచుకుంటూ వచ్చారు. ఇలా ఫ్యాన్స్ చూపిన అభిమానమే కౌశల్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. -
బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2కు మరి కొన్నిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. సోషల్ మీడియాలో అత్యంత హైప్ క్రియేట్ అయిన ఈ రియాల్టీ షో విన్నర్ ఎవరో ఈ రోజే తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్.. హౌస్మేట్స్ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ షోను తెగ ఎంజాయ్ చేశారు. తమే గేమ్ ఆడుతున్నట్లు ఇన్వాల్వ్ అయ్యారు. (చదవండి: కిరీటి ఇది మగతనమా?: నాని ఫైర్) ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్ ఎవరు.. రన్నర్ ఎవరనే చర్చ. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్ ఆర్మీ బిగ్‌బాస్ సెట్ ముందు హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్ సెట్ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్.. కౌశల్ అని అరుస్తూ హల్చల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్ షూట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశల్ ఆర్మీ సెట్ చుట్టూ అనేక పోస్టర్లు అంటించారు. భారీ బందోబస్తు మధ్య ఫైనల్ షూట్‌ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం. విన్నర్ కౌశల్.. మరోవైపు హౌస్‌లో తనదైన స్టైల్లో విభిన్నంగా గేమ్ ఆడిన కౌశలే బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది సెలబ్రిటీలు సైతం కౌశల్ విన్నర్ అయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి మాధవిలత తన ఫేస్బుక్లో కౌశల్ ఆర్మీ అభినందనలు.. కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్ చేశారు. ఆమెనే కాక చాల మంది కౌశల్ విన్నర్ అయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కౌశల్ ఆర్మీ అయితే విన్నర్ కౌశలే కానీ రన్నరప్ ఎవరనీ పోస్టులు పెడుతున్నాయి. ఫైనల్ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్‌కు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తీలు చేరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారు. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు) View this post on Instagram A post shared by Harika Innamuri (@harika_innamuri) on Sep 29, 2018 at 10:35am PDT Patience , hardworking , focused many of them inspired congratulations #Kaushal anna bb2 title ❤❤❤❤❤😎😎#kaushalbbt2sensation #KaushalArmy #Kaushal #BiggBossTelugu2 #KaushalBB2Winner #KaushalManda pic.twitter.com/5UGzyjRWXc — Abhi (@AbhiSai008) September 30, 2018 -
బిగ్‌బాస్: రోల్‌రైడా ప్యాకప్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ షో క్లైమాక్స్‌కు వచ్చేసింది. మిగిలింది ఈ ఒక్క వారమే. ఇప్పటికే సామ్రాట్ హౌస్మెట్స్ మద్దతుతో డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫైనల్‌కు వెళ్లే వారు ఎవరని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే అందరూ ఊహించినట్టే రోల్‌రైడా ఈ వారం హౌస్‌ను వీడాడు. ఇన్ని రోజులైనా హౌస్మేట్స్ ఇంటి రూల్స్ సరిగ్గా పాటించకపోవడంతో బిగ్‌బాస్ ఈ వారం అందరిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. నామినేట్ అయిన వారిలో సామ్రాట్, రోల్రైడాలకే ప్రేక్షకుల నుంచి తక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సామ్రాట్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో రోల్‌రైడా హౌస్‌ను వీడక తప్పలేదు. రైడా ఎలిమినేషన్‌కు కారణం.. నిజానికి రోల్‌రైడా తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. షో ఆరంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రైడా ఎంత సేపు హౌస్ మేట్స్ మద్దతు కోసమే ప్రయత్నించాడే తప్పా ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయాడు. ఎక్కువ సార్లు నామినేషన్‌కు రాకపోవడం కూడా రైడాకు ప్రతికూలం అయింది. ఇక ఫైనల్‌కు వెళ్లే సదవకాశాన్ని కూడా రైడా పొగట్టుకున్నాడు. ఎగ్స్ టాస్క్‌లో కౌశల్ మినహా రైడాకు ఎవరు మద్దతివ్వలేదు. దీంతో రైడా ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో సామ్రాట్ తంతే బూరేల బుట్టలో పడ్డట్లు ఫైనల్‌కు చేరాడు. నిజానికి సామ్రాట్ కేవలం రెండు సార్లు మాత్రమే నామినేషన్లోకి వచ్చాడు. అప్పుడు కూడా చాలా తక్కువ ఓటింగ్‌తోనే గట్టెక్కాడు. రోల్‌రైడా సామ్రాట్‌ను కూడా ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకుని ఉంటే అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కౌశల్‌తో గొడవ కూడా రోల్రైడాపై మరింత వ్యతిరేకతను పెంచింది. సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ గొడవ పెద్దదయ్యేందుకు మరింత ఆజ్యం పోశాడు. ఇది కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. పైగా గల్లీ పోరడు అని చెప్పుకునే రైడా ఆ గొడవ సందర్భంగా కౌశల్ కాళ్లు పట్టుకోవడం, ఏడ్వడం వారందరికి వెగటు పుట్టించింది. ఇదే అంశంపై శనివారం హోస్ట్నాని సైతం రైడాను మందలించాడు. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) బిగ్‌బాస్‌కు కింగ్ నాగార్జున.. నేటి ప్రోమోను చూస్తే బిగ్‌బాస్ సెట్లో దేవదాస్ యూనిట్ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ షో హోస్ట్ నాని, కింగ్ నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవదాస్’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా కింగ్ నాగర్జునతో పాటు హీరోయిన్స్ రష్మికా మండన్నా, ఆకాంక్షసింగ్లు బిగ్‌బాస్ సెట్లో సందడి చేశారు. చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు -
బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ హంగామా
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది. సెప్టెంబర్ 20వ తేదీన కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజును పురస్కరించుకుని.... బిగ్‌బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ బయట కౌశల్ మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. బుధవారం రాత్రి గం. 12ని.లకు మొదలైన ఈ క్రాకర్స్ వెలుగులు కొన్ని గంటల పాటు జిగేల్ మన్నాయి. లల్లీ పుట్టిన రోజు సందర్భంగా ఈ క్రాకర్స్‌ను కాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా కౌశల్ ఆర్మీ సభ్యుల్లోని కొందరు తెలిపారు. మరొకవైపు లల్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్, కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. over night crackers at @BiggBosstelugu2 sets by @Kaushal_Army wishing his daughter lally #hbdlittleprincesslally pic.twitter.com/02b2mLk3nF — samba (@samba21830145) 20 September 2018 కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్? -
కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్?
హైదరాబాద్: తెలుగు రాష్టాల్లో దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్‌బాస్-2. ఈ సీజన్ షోకు అత్యధిక ఆదరణ రావడానికి కారణమైన కంటెస్టెంట్‌ల్లో కౌశల్ ఒకడు. ఇక్కడ కౌశల్ గురించే షో చూస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కౌశల్ ఆర్మీ పేరుతో రెండు భారీ ర్యాలీలు నిర్వహించడం అతనికి షోలో ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఒక ర్యాలీ హైదరాబాద్ వేదికగా జరిగితే, మరొకటి విజయవాడ వేదికగా జరిగింది. ఈ రెండు ర్యాలీల్లో కౌశల్ అభిమానులు ఎక్కువగానే పాల్గొనే తమది ఫేక్ ఆర్మీ కాదని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే కౌశల్‌కు పడుతున్న ఓటింగ్ కూడా అత్యధికంగానే ఉంది. ప్రధానంగా కౌశల్ హౌస్‌లో కొనసాగాలనే ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంచితే, బిగ్‌బాస్ షో ఫైనల్ ఫేజ్‌కు చేరుకున్న తరుణంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వారం చివరి ఎలిమినేషన్ రౌండ్ కావడంతో ఎవరు బయటకు వెళతారు.. ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరు అనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కాగా, ఆఖరి ఎలిమినేషన్‌గా కౌశల్‌ను హౌస్ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఓటింగ్ సంగతి పక్కను పెట్టి, కౌశల్‌ను సాగనంపేందుకు నిర్వాహకులు స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతీవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లబోయేది లీక్‌ల ద్వారా ముందుగా తెలిసినట్లే, ఈ వారం ఇంటి నుంచి వెళ్లబోయే వ్యక్తి కౌశల్‌గా తెలుస్తోంది. ఒక స్క్రిప్ట్ ప్రకారమే కౌశల్‌ను వెళ్లగొట్టడానికి బిగ్‌బాస్ యాజమాన్యం ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసిందని, దానిలో భాగంగానే హౌస్‌లోని కంటెస్టెంట్లు మూకుమ్మడిగా కౌశల్‌పై ఎదురుదాడికి దిగి అతన్ని రెచ్చగొడుతున్నారని సోషల్ మీడియా వేదికగా టాక్ నడుస్తోంది. ఒకవేళ నిజంగానే కౌశల్‌కు ఓటింగ్ శాతం తక్కువ వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతే ఇబ్బంది ఉండదు.. కానీ కావాలనే అతన్ని బయటకు పంపే యత్నం కానీ, పంపడం కానీ జరిగితే మాత్రం బిగ్‌బాస్ షోకు ఉన్న ఆదరణ తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు కౌశల్ అభిమానులు. అదే సమయంలో బిగ్‌బాస్ షోపై ఉన్న విశ్వసనీయత కూడా సన్నగిల్లుతుందనేది కౌశల్ ఆర్మీ వాదనగా ఉంది. ‘ఇసుక’ టాస్క్‌లోనూ కౌశలే టార్గెట్.. ప్రతీవారం కనీసం ఒక టాస్క్‌ను నిర్వహించడం బిగ్‌బాస్ హౌస్‌లో ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ వారం కూడా టాస్క్‌ను నిర్వహించారు. అది ‘ఇసుక’ టాస్క్. ప్రస్తుతం ఉన్న ఆరుగురి కంటెస్టెంట్లకు కలిపి రేస్-1, రేస్-2గా ఈ టాస్క్ నిర్వహించారు. ఇందులో తలో ముగ్గురు రెండు భాగాలుగా విడిపోయి టాస్క్‌లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా కంటైనర్‌లో ఉన్న ఇసుకను కాపాడుకోవడమే ఆయా కంటెస్టంట్లు చేసే పని. అయితే ఈ టాస్క్ లో కూడా కౌశలే టార్గెట్ అయ్యాడు. కౌశల్‌ను గెలవకుండా చేయడంలో మిగతా కంటెస్టెంట్లు సక్సెస్ అయితే, రోల్ రైడాను, సామ్రాట్లు విజయం సాధించడంలో హౌస్ మేట్స్ సహకరించారు. ఈ ఇద్దరికీ ఇవ్వబడిన గుడ్లు టాస్క్‌లో విజయం సాధించే అభ్యర్థి ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అంటే రోల్ రైడా, సామ్రాట్‌లలో ఒకరు నేరుగా ఫైనల్‌కు వెళతారు. నా మీద కుక్కల్లాగ పడుతున్నారు.. ఈ టాస్క్ జరిగే క్రమంలో కౌశల్ నోరు జారాడు. హౌస్‌మేట్స్‌తో జరిగిన వాగ్వాదంలో కౌశల్ తన సహనాన్ని కోల్పోయాడు. అంతా కలిసి తనపై కుక్కల్లాగ పడుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. దాంతో ఆ వాగ్వాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఇక్కడ కౌశల్ తన అన్న మాటను డిఫెన్స్ చేసుకునే పనిలో పడ్డా, మొత్తంగా చూస్తే సదరు హౌస్మేట్స్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే సామ్రాట్ కూడా కౌశల్ అన్న అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘మమ్మల్ని కుక్కలు అంటావా’ అని సామ్రాట్ నిలదీయగా, దానికి మిగతా వారి నుంచి మద్దతు లభించడంతో కౌశల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. తాను ఎవర్నీ ప్రత్యేకించి కుక్కలు అనలేదని, కుక్కల్లాగా పడుతున్నారనే వ్యాఖ్యానించానని సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే, బిగ్‌బాస్ షోకు ఏదైనా జరగొచ్చు అనేది ఉప శీర్షిక. దానికి తగ్గట్టే ఈ వారం ఏమి జరుగుతుందనే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కౌశల్‌ను పంపేందుకు ముందుగానే స్కెచ్ సిద్ధం చేశారా.. లేక ఓటింగ్ ప్రకారమే ఒకరు బయటకు వెళతారా అనేది త్వరలో తేలనుంది. ఏం జరుగుతుందో చూద్దాం. చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ -
బిగ్‌బాస్ : అమిత్ కథ ముగిసింది
బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో రెండు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడనుంది. ఇంకా హౌస్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ వారం ఒకరి ఎలిమినేషన్‌తో ఇంకా ఆరుగురు సభ్యులు మిగిలారు. మరో వారంలో మరొకరు హౌస్‌ను వీడనున్నారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరనున్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటివరకు హౌస్‌లో పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ గత రెండు వారాలుగా బిగ్‌బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దానికి తోడు శనివారం నాని కౌశల్‌పై సీరియస్ అవ్వడం.. రెడ్ ఫిష్ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది. గత రెండు వారాలు బిగ్‌బాస్ నిర్ణయంతో గట్టెక్కిన అమిత్ ఈ సారి హౌస్‌ను వీడారు. ఈ వారం అమిత్‌తో పాటు ఎలిమినేషన్ జాబితాలో కౌశల్, దీప్తి, రోల్‌రైడా, గీతామాధురిలు ఉన్నా.. వారంత సేఫ్ అయ్యారు. షో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమిత్ సేఫ్ గేమే ఆడాడు. కంటెస్టెంట్స్‌తో ప్రేమగా ఉంటూ నామినేషన్ ప్రక్రియలోకి రాకుండా జాగ్రత్తపడ్డాడు. దీనికి తోడు హీరో కమల్‌హసన్ రెండు వారాలు నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం అమిత్‌కు కల్పించాడు. దీంతో గత రెండు వారాలుగా నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అమిత్‌కు తక్కువ ఓట్లే నమోదయ్యాయి. అందరూ అమితే హౌస్‌ను వీడుతాడని భావించారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ అతన్ని రెండు వారాలు సేవ్ చేశాడు. ఈ సారి మాత్రం అమిత్‌ను బిగ్‌బాస్ కాపాడలేకపోయాడు. అమిత్ ఎలిమినేషన్‌కు కారణం.. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్‌కు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాల్లో విలన్ అయినా హౌస్‌లో అతని ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉండేది. కొన్నిసార్లు అది కాస్త ఫన్నీగా ఉన్నా మరికొన్నిసార్లు చికాకు పుట్టించేది. ఈ విషయం హౌస్మేట్స్ కూడా చాలా సార్లు చెప్పారు. ఎప్పుడూ సీరియస్ డిస్కషన్ ఇన్వాల్వ్ కాకపోవడం.. ఓ విషయంపై స్టాండ్ తీసుకోని మాట్లాడకపోవడం.. ప్రతి దానికి అతిగా ప్రవర్తించడం జనాలకు చికాకు పుట్టించింది. ఇక కెమెరాల ముందు వచ్చిరాని తెలుగులో మాట్లాడటం నస పుట్టించేలా ఉండేది. ఈ విషయం హోస్ట్ నాని కూడా చెప్పి మందలించాడు. ఇవే అమిత్‌కు ప్రేక్షకుల నుంచి ఓట్లు తెప్పించలేకపోయాయి. టాస్క్‌ల్లో సరిగ్గా ఆడక.. వాటికి ఎవేవో కారణాలు చెబుతూ సమర్ధించుకోవడం కూడా జనాలకు నచ్చలేదు. -
బిగ్‌బాస్ : శ్యామలపై కౌశల్ ఆర్మీ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామలపై కౌశల్ ఆర్మీ తీవ్రంగా మండిపడుతోంది. దీనికి గల కారణం కౌశల్ బిగ్‌బాస్-2 విన్నర్ అవుతాడని చెప్పకపోవడమే. ఈ వారం ఎలిమినేట్ అయిన శ్యామలను టాప్ త్రీ కంటెస్టెంట్స్‌లో ఎవరుంటారని అనుకుంటున్నారని నాని అడగారు. శ్యామల సమాధానం చెబుతూ.. గీతామాధురి, తనీష్, రోల్ రైడా పేర్లను సూచించింది. ఆ ముగ్గురిలో కౌశల్ పేరును చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. శ్యామల సమాధానం కౌశల్ ఆర్మీకి ఏమాత్రం నచ్చలేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో శ్యామలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రీఎంట్రీ సమయంలో తాము ఓట్లు వేస్తేనే లోపలకి వెళ్లిన శ్యామల ఇప్పుడు కనీసం విన్నర్లలో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెబుతారా..? అంటూ శ్యామలపై మండిపడుతున్నారు. బిగ్‌బాస్ టీం స్క్రిప్ట్ ఇస్తే శ్యామల మాట్లాడిందని కొందరు, నాని చెప్పమంటేనే వారి పేర్లు చెప్పిందని మరికొందరు ఫేస్బుక్లో శ్యామలపై విరుచుపడ్డారు. ‘కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో మీకు బాగా తెలుసు. అయినప్పటికి కౌశల్ పేరు చెప్పలేదు. బిగ్‌బాస్-2 విన్నర్‌పై నీ గెస్సింగ్ తప్పు. నిన్న కౌశల్ ఆర్మీ చేసిన 2-కెరన్ చూసి అయినా నీ ఆలోచన మారాలి’, ‘బైబై మేడమ్. వచ్చే వారం మీ స్నేహితులను కూడా నీ దగ్గరకు పంపిస్తాం. కూర్చొని కబుర్లు చెప్పుకోండి’ అంటూ వ్యంగ్య కామెంట్లతో శ్యామలను విమర్శిస్తున్నారు. ఇది చదవండి బిగ్‌బాస్: శ్యామల ఔట్ బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ -
బిగ్‌బాస్: శ్యామల ఔట్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో మూడు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడునుంది. దీంతో ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరో అని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం శ్యామల ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నఅమిత్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. గతవారమే అమిత్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించగా బిగ్‌బాస్ నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్‌బాస్ కావాలనే నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారని, ఇదొక అన్‌ఫెయిర్ గేమ్ అని కొందరు సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ నిర్వాహకులు, హోస్ట్ నానిపై మండిపడ్డారు. దీనికి హోస్ట్ నాని ట్వీట్‌తో ప్రేక్షకులకు సమాధానం కూడా ఇచ్చాడు. (చదవండి:ట్రోల్స్‌పై స్పందించిన నాని) అలా బతికిపోయిన అమిత్ ఈ సారి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ మళ్లీ అతను సేవ్ అయిపోయాడు. రీఎంట్రీ ఇచ్చిన శ్యామల, నూతన్ నాయుడులా హౌస్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ ఎలిమినేషన్ విషయం కూడా ఎపిసోడ్‌కు ముందే(ఆదివారం ఉదయమే) తెలిసిపోయింది. బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ విషయంలో ఎంత జాగ్రత్తపడ్డా ఎలిమినేట్ అయ్యింది ఎవరో ముందే తెలిసిపోతోంది. శ్యామలకు, అమిత్‌కు ఓట్లలో స్వల్ప తేడా వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఓట్లపై ఎలాంటి చర్చలేకుండా శ్యామల ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాని ప్రకటించారు. ఈ ఆదివారం ఎపిసోడ్లో ‘సిల్లీఫెలోస్’ హీరోలు అల్లరి నరేశ్, సునీల్‌లు హౌస్‌లో సందడి చేశారు. హౌస్ మేట్స్‌తో రెండు గ్రూపులుగా విడిపోయి హోస్ట్ నాని ఇచ్చిన ఓ గేమ్ ఆడుతూ నవ్వులు పూయించారు. (చదవండి: బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) శ్యామల ఎలిమినేషన్ అందుకేనా? గతవారం కొంచెం తెలివిగా ప్రవర్తించి నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్న శ్యామలకు.. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా పోయింది. బిగ్‌బాస్ పోలీస్- కిల్లర్ టాస్క్‌లో గీతామాధురి సిక్రెట్ టాస్క్‌కు బలై నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన శ్యామలపై చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా బయటి వ్యవహారాలు ఇంట్లో చెప్పి.. నూతన్ నాయుడిని నామినేట్ చేసేలా చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే విషయాన్ని నాని కూడా గత శనివారం ప్రస్తావిస్తూ మందలించాడు. ఇది చాలా మంది ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఇక హౌస్‌ను దాదాపు తమ ఆదీనంలోకి తెచ్చుకున్న కౌశల్ ఆర్మీ ఆమెపై అగ్రహంగా ఉండటం.. కౌశల్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండటం ఆమె ఎలిమినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. రీఎంట్రీ అనంతరం ఆమె ప్రవర్తనలో తేడా రావడం కూడా కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. మొత్తానికి రీఎంట్రీతో హౌస్ అడుగుపెట్టిన శ్యామల ఫైనల్ లిస్ట్‌లో ఉండకుండానే వెనుదిరిగింది. వెళ్తూ వెళ్తూ బిగ్‌బాస్ ఇంటికి సేవకుడిగా ఉండాలనే బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై వేసింది. ఇక తన అంచనా ప్రకారం టాప్ రోల్‌రైడా, గీతా మాధురి, తనీశ్లని చెప్పింది. ఇది కౌశల్ ఆర్మీకి ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు. మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ
హైదరాబాద్: బిగ్‌బాస్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ. నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ అంకానికి కొన్ని ఎపిసోడ్లు మాత్రమే మిగిలి ఉండటంతో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు వాక్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ వాక్కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొన్ని రోజుల క్రితం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీలో పాల్గొనాలని అభిమానులు పిలుపునిచ్చింది. దీనికి ఊహించని మద్దతు లభించింది. సగటు ప్రేక్షకుడే కాదు.. బిగ్‌బాస్ కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్కు విశేషమైన మద్దతు దక్కడం ఇక్కడ విశేషం. ఇందుకోసం ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీ షర్ట్‌లను, పోస్టర్స్ విడుదల చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడం.. ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె వాక్కు స్థానిక అభిమానులు ఈ రేంజ్లో హాజరైతే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక కంటెస్టెంట్‌కి సపోర్ట్‌గా నిలుస్తూ.. బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె వాక్ నిర్వహిస్తున్నారు కౌశల్ అభిమానులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎపిసోడ్ ప్రారంభమైంది మొదలు ఆయనకు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్ట్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది.. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే.. కౌశల్ ప్రభావం బిగ్‌బాస్ షోలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాకిగా మారారు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు. బిగ్‌బాస్ అంటే కౌశల్.. కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్లో తోటి కంటెస్టెంట్స్ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్‌గా మారి టైటిల్ రేస్‌లో టాప్ 1 ప్లేస్‌లో ఉన్నారు కౌశల్. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. కౌశల్ ఎఫెక్ట్‌తో.. కిరీటి, భాను శ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్‌కి వెళ్లారంటే కౌశల్‌తో గొడవ పెట్టుకోవడమే ప్రధాన కారణం అని ఆయన ఫ్యాన్స్ భావన. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. -
బిగ్‌బాస్: పూజా ఔట్
సాక్షి, హైదరాబాద్: ఈ వారం కాస్త బోర్ కొట్టిన బిగ్‌బాస్.. వారంతంలో ప్రేక్షకులకు కావాల్సిన మజా ఇచ్చింది. తనీష్-కౌశల్ మధ్య జరిగిన గొడవ, శనివారం నాటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు హోస్ట్ నాని పీకిన క్లాసులు, ఆదివారం రాఖీ పండుగ స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా నాని హౌజ్‌లోకి వెళ్లడం ఇంట్రెస్టింగ్ అనిపించాయి. హౌజ్‌లోకి వెళ్లిన నాని వారితో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. కంటెస్టెంట్లకు స్పెషల్ ఐటమ్స్ దగ్గర ఉండి మరి వడ్డించి.. వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత హౌజ్‌లో ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాల్ని వారితో పంచుకున్నారు. ఎపిసోడ్ చివర్లో పూజా ఎలిమినేట్ అయిన విషయాన్ని నాని హౌజ్‌లోనే ప్రకటించారు. ఎలిమినేట్ అయిన పూజా బిగ్‌బాంబ్ గీతపై వేసింది. దీని ప్రకారం గీత ఈ శనివారం వరకు జైల్లోనే పడుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న కౌశల్, పూజా రాంచంద్రన్, తనీష్, దీప్తిల్లో ఎవరు ప్రొటెక్ట్జోన్లోకి వెళతారనే అంశంపై నాని శనివారం నాటి ఎపిసోడ్లో కాసింత ఆసక్తి క్రియేట్ చేశారు. కానీ ప్రతి ఎలిమినేషన్ సోషల్ మీడియా వేదికగా తెలుస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా పూజా ఎలిమినేట్ అయిన విషయం ముందుగానే తెలిసిపోయింది. అంతా అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రాంచంద్రన్ ఎలిమినేట్ అయ్యారు. లీకుల విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత కట్టడి చేసినా లాభంలేకపోయింది. దీంతో వారు కూడా చేసేదేమి లేక సైలెంట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన పూజా గతవారమే దీప్తి సునయనతో గట్టెక్కిన పుజాకు ఈ సారి నిష్క్రమణ తప్పలేదు. ఆమె నామినేట్ కాగానే ఈ సారి ఎలిమినేషన్ అయ్యేది పూజానే అని ప్రేక్షకులు అంచనా వేశారు. అయితే ఆమె ఎలిమినేషన్‌కు కారణం మాత్రం తెలుగు రాకపోవడం.. ఇక్కడి అమ్మాయి కాకపోవడం, తొలి వారంలో ఉన్నంత ఉత్సాహం కొనసాగించకపోవడమని అర్థం అవుతోంది. అంతేకాకుండా టాస్క్‌ల్లో ఆమె సహనం కోల్పోతూ అరవడం.. సంచాలకురాలిగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోవడం ప్రేక్షకులకు చికాకు పుట్టించాయి. దాదాపు బిగ్‌బాస్‌ను తమ ఆదీనంలోకి తీసుకున్న కౌశల్ ఆర్మీ.. దీప్తి సునయనను టార్గెట్ చేయడంతో పూజా తక్కువ ఓటింగ్‌తో గతవారం గట్టెక్కింది. (చదవండి: అనుకోని సంఘటన.. దీప్తికి షాక్!) #Biggbosstelugu2 #KaushalArmy #PoojaRamachandran back to 🏠 Source found it in twitter Randomly while searching Malli adakakandi source ani 😂😂😂 Once again pics leaked If not great photoshop by someone🙏🙏 pic.twitter.com/0Nl0eeTBkP — Pathan Usif (@Pathan4141) August 26, 2018 ఈ రియాల్టీ షో పూర్తికావడానికి ఇంకా కొంత సమయమే ఉండటంతో ఈ వారం డబుల్ ధమాకా ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. పూజాతో దీప్తి సైతం ఎలిమినేట్ అవుతుందని, అందుకే ఆమె కెప్టెన్సీ తొలిగించారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు. కేవం ఒక పూజా మాత్రమే ఎలిమినేట్ అయింది. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు) Follow us :- @biggboss_telugu_season_2 . . . . #biggboss2telugu #biggbosscontestant #biggboss11 #biggboss @kaushalmanda #biggbossofficial #biggbosshouse #biggbosstelugu2 #biggbosstelugu @kaushal_fan_army @kaushal_force @kaushal_fan_army_ #biggbossnews #biggboss2 #biggbosslivefeeds #biggbossjourney #biggbossupdates #biggbosstamil #biggbossseason2 #biggbossteluguvote #teluguactress #telugubiggboss #teluguhotactress #telugu #hotactress #deepthisunainaarmy #deepthisunainatroller #deepthi #sunaina #trolls A post shared by Biggboss season 2 telugu (@biggboss_season_2_telugu) on Aug 24, 2018 at 8:41pm PDT -
బిగ్‌బాస్ : అనుకోని సంఘటన.. దీప్తికి షాక్!
బిగ్‌బాస్ షో ఈ వారం మొత్తం మజా ఇవ్వకపోయినా.. శనివారం షోలో జరిగిన సంఘటనలు మాత్రం ప్రేక్షకులకు కావల్సినంత కిక్కునిచ్చేశాయి. ఎంతో ఆశపడి కెప్టెన్సీ బాధ్యతను చేపట్టిన దీప్తికి బిగ్‌బాస్ గట్టి షాకే ఇచ్చాడు. కౌశల్-తనీష్‌ల గొడవతో హౌస్ వేడెక్కిపోయింది. అమిత్ వేసే వేశాలను నాని ఎండగట్టేశాడు. హౌస్‌లో ఒంటరిగా ఏవేవో మాట్లాడుకుంటున్న వీడియోలు చూపించి గణేష్ గాలి మొత్తం తీసేశాడు నాని. ఇలా ఒకటేమిటి షో మొత్తం అదిరిపోయింది. అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం. హౌస్‌లో ఇన్ని రోజులుగా హెచ్చరిస్తున్నా... మైక్‌లు ధరించకుండా మాట్లాడటం, పగటి పూట నిద్ర పోవడం, కెప్టెనే స్వయంగా మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో విసుగు చెందిన బిగ్‌బాస్ దీప్తిని కెప్టెన్ బాధ్యత నుంచి తొలగించాడు. దీంతో హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. లేకలేక వచ్చిన కెప్టెన్ పదవిని ఇలా సంబరపడేలోపే పోగొట్టుకుంది దీప్తి. ఇక బిగ్‌బాస్ కెప్టెన్‌గా తొలగించినప్పటికీ.. తానే కెప్టెన్ అని తాను చెప్పిందే వింటానని ఇది తన అభిప్రాయమని తనీష్ చెప్పడం ప్రేక్షకులకు విడ్డూరంగా అనిపించింది. డైనింగ్ టేబుల్ వద్ద మొదలైన జగడం... బిగ్‌బాస్ ఇలా ఆదేశించిన తరవాత.. కౌశల్ తన వాదనను వినిపించాడు. అది మాటామాటా పెరిగి పెద్ద యుద్ధం లాంటిదే జరిగింది. టాపిక్ ఎక్కడికో వెళ్లి.. కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఎందుకు పడుకున్నావంటూ తనీష్‌ను ప్రశ్నించేసరికి.. అంతెత్తుకు లేచి కౌశల్‌పై మండిపడ్డాడు. గొడవ మొదలైందే.. గణేష్ నిద్రపోవడం, రోల్ రైడా, దీప్తి మైక్‌లు ధరించకపోవడం వల్ల అయితే వీరిద్దరు మాటల యుద్దానికి దిగగా.. మిగతా వారంతా వీరిద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించారు. బట్టబయలైన అమిత్ రంగు... మొదట్నుంచీ సేఫ్ గేమ్ ఆడుతూ.. ఎవరిని నొప్పించకుండా.. ఆడే అమిత్ ఈసారి దొరికిపోయాడు. కెప్టెన్సీ టాస్క్‌లో కౌశల్‌కు సపోర్ట్ చేసి.. కొద్దిసేపట్లోనే అదంతా పోగొట్టేసుకున్నాడంటూ నాని పాయింట్ అవుట్ చేశాడు. అయితే కౌశల్‌కు సపోర్ట్ చేసి.. మళ్లీ ఆ రాత్రే వాటి మీద జోక్‌లు వేసుకోవడంతో తాను చేసిన సపోర్ట్‌కు ఎలాంటి ఉపయోగం ఉండకుండాపోయిందని అమిత్‌కు సలహా ఇచ్చాడు. అయితే అమిత్ మాత్రం.. ఎప్పుడు మాట్లాడనంటూ బుకాయించాడు.. వీడియో చూపించడం ఎందుకులే.. మీరు ఒకరి దగ్గర ఏం మాట్లాడుతుంటారు.. మళ్లీ వేరొకరి దగ్గర ఆ మనిషి గురించి ఏం మాట్లాడుతుంటారో ఆ మనిషికి తెలియకపోవచ్చు.. కానీ మాకు తెలుస్తుందంటూ నాని కౌంటర్ వేశాడు. అలా మాటలు మార్చే వారినే జడ్జ్ చేస్తామంటూ అమిత్‌ను హెచ్చరించాడు. తనీష్‌ను హెచ్చరించిన నాని డైనింగ్ టేబుల్ వద్ద మొదలైన గొడవను మళ్లీ నాని లేవనెత్తాడు. కౌశల్, తనీష్‌లు తమ వాదనలు వినిపించారు. మళ్లీ అక్కడ కూడా వారి వ్యవహారం శృతిమించడంతో నాని హెచ్చరించాడు. తనకు లాజిక్ లేనప్పుడు, ఆన్సర్ చేయలేనప్పుడే.. అలా కోపంతో ఉవ్వెత్తున లేస్తాడంటూ తనీష్‌ను హెచ్చరించాడు. రూల్స్ బ్రేక్ చేస్తాం.. పనిష్మెంట్స్ వస్తే.. ఫేస్ చేస్తామనే యాటిట్యుడే కరెక్ట్ కాదంటూ.. తనీష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మాట్లాడాల్సిన వారు మాట్లాడకుండా.. అవసరం లేని వాళ్లు అనవసరంగా మాటల యుద్ధానికి దిగారంటూ.. అనవసరమైన చోట మాట్లాడకుండా ఉంటే మంచిదని కౌశల్‌కు సలహా ఇచ్చాడు. గీతకు నాని సలహా.. తాను గేమ్‌ను లైట్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోందని.. బిగ్‌బాస్ రూల్స్ అంటే లెక్కలేనితనం పెరిగిపోయిందంటూ గీతకు వార్నింగ్ ఇచ్చాడు. అది సరైన ప్రవర్తన కాదంటూ సలహా ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌తో అలా అన్నానని, కౌశల్నుంచి తప్పించుకోలేక.. అతను నన్ను ప్రభావితం చేస్తున్నట్టుగా అనిపిస్తోందని.. ఆయన ప్రతీసారి నా దగ్గరికి వచ్చి ఏదోటి చెప్పడంతో నాలో నెగెటివిటి పెరిగిపోతున్నట్టు అనిపిస్తోందంటూ... ఇలా తన కారణాలను చెప్పుకుంది. ఫోన్ కాల్.. ఆనందంతో కౌశల్ కంటతడి ప్రతీవారం ఒక కాలర్ హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతుండగా.. ఈసారి కౌశల్‌కు కాల్ వచ్చింది. కౌశల్‌కు ఫోన్ ఇవ్వగానే కాలర్ మాట్లాడటంతో కంటతడి పెట్టుకున్నాడు. కౌశల్ అన్నకు ఫోన్ ఇవ్వమని కాలర్ అడగడం.. కౌశల్ ఆశ్చర్య పడటం.. కౌశల్ ఆర్మీ గురించి వివరించడం.. భరోసా ఇవ్వడం..కౌశల్ ఒంటరి కాదు.. తనకు బయట ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పడం... నీ ఆట నువ్వు ఆడుకో.. మిగతాది ఆర్మీ చూసుకుంటుందని చెప్పడం.. బిగ్‌బాస్ విజేతగా నిలవాలని కోరుకోవడం.. తాను కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని బదులివ్వడం.. ఇలా ఆనందంతో కౌశల్ కళ్లు తడిశాయి. ఇక కాల్ కట్ అవడంతో.. బయట జరిగేదంతా చెప్పేశాడని.. చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పాడని అన్నాడు. ఒంటరి వాడని బాధపడకంటూ.. బయట ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో అర్థమైంది కదా అంటూ కౌశల్‌కు ధైర్యం చెప్పాడు. తనకు ఇన్ని సలహాలు ఇస్తూ.. ప్రోత్సహిస్తున్న నానికి కౌశల్ ధన్యవాదాలు తెలిపాడు. మైక్ తీసి పిచ్చిపిచ్చిగా మాట్లాడిన గణేష్ గణేష్ ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ.. తన ఆరోగ్యం కూడా చూసుకోలేని వాడు..బిగ్‌బాస్ టైటిల్ ఏం గెలుస్తాడంటూ గణేష్‌ను మందలించాడు. ఎప్పుడూ నిద్ర ఎందుకు పోతున్నావంటూ ప్రశ్నించంగా.. అలసిపోవడం వల్ల అప్పుడప్పుడు పడుకుంటున్నానని సమాధానమివ్వగా.. గణేష్ ఒంటరిగా ఉండి.. ఏదో తనలో తాను మాట్లాడుకోవడం.. మైక్ తీసేసి ఏదో తిట్టినట్టు మాట్లాడుకుంటున్న వీడియో ప్లే చేసేసరికి హౌస్‌లో నవ్వులు పూశాయి. జిమ్ ఏరియాలో మాట్లాడుతూ అలసిపోతున్నావా? అంటూ గణేష్‌ను మందలించాడు. తనను ట్రీట్ చేసే డాక్టర్ కూడా రావడానికి ఇష్టపడటం లేదంటూ.. తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదంటూ.. కేవలం కామన్ మ్యాన్అనే ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్నావని, ఇదే సెలబ్రిటీ అయితే ఈపాటికే ఇంట్లోంచి పంపించేసేవారని గణేష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక అసలైన ఎలిమినేషను మాత్రం సస్పెన్స్‌లో ఉంచేసిన నాని.. కనీసం ప్రొటెక్షన్ జోన్లో ఎవరున్నారనే విషయాన్ని కూడా ప్రకటించకుండా ఉత్కంఠరేగేలా చేశాడు నాని. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం పూజ, దీప్తిలు ఎలిమినేట్ అయినట్టు కనిపిస్తోంది. దీప్తికి తక్కువ ఓట్లు రావడంతో.. తనను ఎలిమినేట్ చేసే భాగంలోనే కెప్టెన్ బాధ్యతలనుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఒక్కరే ఎలిమినేట్ అయ్యారా? లేక ఇద్దరు ఎలిమినేట్ అయ్యారా?చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు కదా.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్. చదవండి.. బిగ్‌బాస్ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష -
బిగ్‌బాస్ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష
బిగ్‌బాస్ ఏదైనా జరుగొచ్చు. అంటే ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించరు. ఈవారం అంతా ప్రేక్షకులకు అసహనం కలిగించేలా షోను నడిపించారు నిర్వాహకులు. మళ్లీ ఆ ప(స)ని లేని పెళ్లి టాస్క్‌లో ఇచ్చిన సీక్రెట్స్ విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఈ వారం జరిగిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. బిగ్‌బాస్‌లో ఈ వారం ఓ బొమ్మల పెళ్లి జరిగింది. కాదు కాదు బిగ్‌బాస్ ఆదేశాల మేరకు హౌస్మేట్స్ జరిపించారు. మెహందీ, సంగీత్, పెళ్లి, శోభనం అంటూ ప్రేక్షకులకు చిర్రెత్తించేలా చేశారు హౌస్మేట్స్. ఏ ఒక్కరూ తగ్గకుండా అందరూ తమ అతితో నటించేశారు. ఈ వారం గీతా మాధురిపై పెరిగనంత వ్యతిరేకత మిగతా ఏ కంటెస్టెంట్‌పై పెరిగి ఉండకపోవచ్చు. వీరు చేసే ఈ అతిలో కాస్త ఉపశమనంగా హౌస్‌లో అనసూయ, నీవెవరో టీమ్ కనిపించి కనువిందు చేశారు. మెహింది కార్యక్రమానికి హాజరైన అనసూయ హౌస్మేట్స్ అందరికీ మెహిందిని పెట్టారు. ఒక్కొక్కరు తమకిష్టమైన పేర్లను చేతిపై వేయించుకున్నారు. అనసూయ ఉన్నంత సేపు హౌస్ కాస్త కలర్ఫుల్గా ఉంది. అటు తరువాత సంగీత్ కార్యక్రమం అంటూ హౌస్ మేట్స్ డ్యాన్సులతో చిందేశారు. గీతా మాధురిని ముద్దు పెట్టుకోవాలంటూ రోల్ రైడాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. సామ్రాట్ కూడా పనిలో పనిగా ముద్దు పెట్టేశాడు. ఇక దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా గీతపై నెటిజన్లలో వ్యతిరేకత తీవ్రస్థాయి కి చేరుకున్నట్టు కనిపిస్తోంది. సామ్రాట్, రోల్, తనీష్‌లో నందు కనిసిస్తున్నాడని చెప్పిన గీతపై నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. సందులో సడేమియా అన్నట్లు ఈ టాస్క్‌లో గణేష్ కూడా రెచ్చిపోయాడు. పెళ్లి పంతులు క్యారెక్టర్లో లీనమయ్యాడు. మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చేసి కంటెస్టెంట్లతోనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌తో మాట్లాడే తీరే మారిపోయింది. ఈ విషయంపై తనీష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కౌశల్, తనీష్ ఇద్దరు చర్చించుకున్నారు. గణేష్ డల్‌గా ఉండటం చూసి మిగతా కంటెస్టెంట్లు జాలి పడటం.. ఏం జరిగిందో అడగటం... తనీష్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడం ఇలా జరిగిపోయింది. ఈ పెళ్లి టాస్క్ ముగిసిన తరువాత నీవెవరో టీమ్ బిగ్‌బాస్‌లో ఆర్జేలుగా మారి అల్లరి చేశారు. గణేష్-అమిత్-దీప్తిలు చేసిన గుడ్డు టాస్క్, కౌశల్-గీత చేసిన టాస్క్‌లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ పాత్రలో కౌశల్, అతని ప్రేయసిగా గీత చేసిన ఫన్ బాగుంది. ఇక్కడ కూడా రోల్ తన ర్యాప్‌ను ప్రదర్శించేశాడు. రోల్ ర్యాప్‌లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ సంగతి తెలిసిందే. ఇక ఈ సారి కెప్టెన్ టాస్కులో భాగంగా.. కన్ఫెషన్ రూమ్‌లోకి ముందుగా వెళ్లిన ఇద్దరు సభ్యులను అర్హులని బిగ్‌బాస్ ప్రకటించారు. ఎప్పటినుంచో కెప్టెన్సీ పోటీదారుగా పాల్గొని వెనుదిరిగిన దీప్తి ఈ సారి కెప్టెన్ అవ్వాలని పట్టుదలగా ఉంది. దీప్తి మొదట వెళ్లి కూర్చోగా.. కౌశల్, పూజల మధ్య వాగ్వాదం జరిగింది. చివరగా పూజ లేచి వెళ్లిపోగా.. దీప్తి, కౌశల్ కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు. తమకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయాలని మిగతా హౌస్‌మేట్స్‌ను అడగడం మొదలెట్టారు. ప్రేక్షకులందరికి తెలిసిందే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారని.. కౌశల్‌కు అమిత్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఈ టాస్క్‌పై తనీష్ సహాయాన్ని కోరగా.. దీప్తికి తాను మాటిచ్చానని, తనకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అందరూ తననే సపోర్ట్ చేస్తే ఇక టాస్క్ ఎందుకు ఏకగ్రీవంగా ప్రకటించొచ్చుకదా అని కౌశల్ తనీష్‌తో చెప్పుకొచ్చాడు. తాను ముందు నుంచీ అదే చెబుతున్నానని, హౌస్‌లో అందరితో కలిసి ఉండటం ముఖ్యమని ఎన్నో సార్లు చెప్పానని కౌశల్‌తో తనీష్ అన్నాడు. కౌశల్‌కు బయట సపోర్ట్ ఉంది గానీ, ఇంటి లోపల ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఒక రకంగా ఇదే ప్రేక్షకుల్లో కౌశల్‌పై సానుభూతిని కలిగేలా చేసింది. అయినా ఇంటి సభ్యుల మద్దతు లేకుండా ఇంట్లో నెగ్గుకురావడం చాలా కష్టమే. ఇద్దరు కెప్టన్సీదారులకి మద్దతుగా.. హౌస్మేట్స్ తమ వస్తువులు, వాటి బరువుతో కెప్టెన్‌ను కొనుక్కోవాలని బిగ్‌బాస్ తెలిపాడు. కౌశల్‌కు సపోర్ట్‌గా ఎవరూ ఏ వస్తువును వేయలేదు. ఈ విషయంలో కౌశల్‌కు మద్దతుగా అమిత్ ఒంటరిపోరాటం చేశాడు. చివరికి ఈ టాస్క్‌లో దీప్తి గెలిచింది. బిగ్‌బాస్‌లో తన చిరకాల కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా కనిపించింది. అనూహ్యంగా నూతన్ నాయుడు మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. నూతన్ ఎంట్రీతో ముందు సంబరపడినా.. మళ్లీ అతనిపై చర్చ జరిగింది. గత వారం ఎలిమినేషన్లో లేడు, ఈ వారం నామినేషన్లో లేడు అంటూ ఏవెవో లెక్కలు వేసేసి మిగతా వారికి వివరిస్తున్నాడు తనీష్. ఈ వారం కష్టపడిందంతా వృథానేనా అంటూ తనీష్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈవారం షో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పటి వరకు షో ఎలా జరిగినా.. ఎలిమినేషన్లో మాత్రం ఈ సారి దీప్తి వెళ్లిపోతుందని అనుకున్నా.. కెప్టెన్‌గా మారడంతో ఈ సారి పూజ వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. అయినా ఈ సస్పెన్స్ కూడా ఎక్కువసేపు ఉండదు కదా.. ఎందుకంటే శనివారం రాత్రికల్లా ఎవరూ ఎలిమినేట్ కానున్నారో లీకుల ద్వారా బయటకు వస్తుంది. మరి చూద్దాం.. ఎవరు బయటకు వెళ్లనున్నారో.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్.. ఏదైనా జరుగొచ్చు!. -
బిగ్‌బాస్ : సునయన ఎలిమినేషన్ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-2 మరింత రసవత్తరంగా మారింది. గతవారం కాస్త చప్పగా సాగిన ఈ రియాల్టీ షో మళ్లీ వేడెక్కింది. బాగ్‌బాస్ సూపర్ టాస్క్‌తో గేమ్‌ను రక్తికట్టించాడు. భావోద్వేగాలతో సాగే ఈ గేమ్‌ను ఆ దిశగా నడిపించాడు. ఇంటి సభ్యుల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను బయటకు తీశాడు. ఇలా మంగళవారం ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులను రెండు జట్లుగా వీడదీసిన బిగ్‌బాస్.. టెలికాలర్స్ Vs పబ్లిక్ కాలర్స్ అనే టాస్క్‌ను ఇచ్చాడు. బిగ్‌బాస్ టెలికాలర్స్ జట్టులో కౌశల్, సామ్రాట్, నూతన నాయుడు, అమిత్, శ్యామల, దీప్తిలు ఉండగా.. గీతా మాధురి, తనీశ్, దీప్తీ సునయన, గణేశ్, రోల్‌రైడా, పూజా రాంచంద్రన్‌లు పబ్లిక్ కాలర్స్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్ టెలికాలర్స్‌ను విసుగెత్తించి కాల్ కట్ చేసేలే చేస్తే పబ్లిక్ కాలర్స్‌కు ఓ పాయింట్ లభిస్తోంది. దీనికోసం వారు ఏదైనా మాట్లడొచ్చు. ముగ్గురు టెలికాలర్స్ షిఫ్ట్ బజర్ మోగేంత వరకు ఏమైనా అక్కడి నుంచి లేవకూడదు. ఈ బజర్ మోగేలోపు పబ్లిక్ కాలర్స్ షిప్ట్‌లో ఉన్న ముగ్గురికి కాల్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ కౌశలే టార్గెట్.. ఈ టాస్క్‌లో ఎప్పటిలానే మళ్లీ కౌశలే టార్గెట్ అయ్యాడు. ఇంటి సభ్యులు మరోసారి సూటి పోటి మాటలతో దాడి చేశారు. ఎంత పర్సనల్‌గా దాడి చేసినా కౌశల్ మాత్రం అదే రితీలో బదులిచ్చాడు. ఇప్పటి వరకు కొంత స్నేహంగా ఉన్న గీతా-కౌశల్‌ల మధ్య ఉన్న మనస్పర్థలు ఈ టాస్క్ ద్వారా బయటపడ్డాయి. తొలుత కాల్ చేసిన గీతా మాధురి ఈ వారం నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. అతన్ని విసిగించసాగింది. అబద్దాలు ఆడుతున్నావని, గేమ్ కోసం ఏమైనా చేస్తావా? అని ఘాటుగా ప్రశ్నించింది. ఇక టాస్క్‌కు ముందు కొంత ఎమోషన్ అయిన గీతా ఇంటి సభ్యుల అందరి దగ్గరకు వచ్చి టాస్క్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసింది. తీరా ఆమె కౌశల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తనీశ్ Vs శ్యామల సెకండ్ కాల్ చేసిన తనీశ్ సైతం శ్యామలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె రీఎంట్రీని సహించని అతను పలుసంధర్భాల్లో ఆవిషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిదే. గత టాస్క్‌లో దీప్తి సునయన వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశాడు. ఎలిమినేషన్‌కు గురించి ఆమెకు ఆగ్రహం తెప్పించేలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె ఓపికగా సమాధానం చెప్పింది. దీంతో తనీష్ ఏం చేయలేక ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత రోల్‌రైడా సేఫ్‌గా స్మార్ట్ గేమ్ ఆడాడు. ఎవరిని మాటలతో నొప్పించకూడదనుకున్న రైడా.. సామ్రాట్‌కు కాల్ చేసి కౌశలా? అని అడిగాడు. దానికి రైడా ఫోన్ పెట్టేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి సామ్రాట్‌ను బోల్తా కొట్టించాడు. ఇది గ్రహించని సామ్రాట్ ఫోన్ పెట్టేసి పప్పులో కాలేసాడు. దీంతో పబ్లిక్ కాలర్స్‌కు ఓ పాయింట్ లభించింది. కౌశల్.. జనాలు తూ.. దీప్తి సునయన సైతం మళ్లీ కౌశల్‌కే కాల్ చేసింది. షో ఆరంభం నుంచే అతనంటే గిట్టని సునయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. కౌశల్ ఫోన్ ఎత్తగానే అసభ్య పదజాలంతో మొదలు పెట్టింది. దీనికి స్టన్ అయిన కౌశల్ తేరుకోని అదే రీతిలో బదులిచ్చాడు. ఒక దశలో వీరి సంభాషణ హద్దులు దాటింది. ముఖ్యంగా సునయన కౌశల్‌ను కించపరిచేలా మాట్లాడుతూ అతని సహనాన్ని పరీక్షించింది. ‘అసలు నువ్వు హౌస్‌లోకి ఎందుకొచ్చావ్.. షోను 24 గంటలు జనాలు చూస్తే తూ అంటారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె మాటలకు దగ్గట్టే జవాబిచ్చాడు. పాటలు పాడమని, స్టోరీలు చెప్పమని విసగించడంతో కౌశల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. ఓ దశలో హద్దులు దాటి ప్రవర్తించాడు. బయటి వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ ఆమె మాటల దాడికి కౌంటర్ ఇచ్చాడు. స్టోరీలు చెప్పమంటే హౌస్‌లో ఆమె ప్రేమాయణం చెప్పాడు. పాట పాడమంటే ఆమెకు సంబంధించే పాడాడు. దీంతో సునయన కన్నీటి పర్యంతమైంది. దాదాపు కొన్ని గంటల పాటు సునయన విసిగించింది. కనీసం వాష్ రూం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీం సభ్యుల సాయంతో కౌశల్ అక్కడే కానిచ్చాడు. ఇక గణేశ్ కూడా కౌశల్‌నే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సునయనపై ట్రోలింగ్.. సునయన మాటలు, కౌశల్‌తో వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఆమెను టార్గెట్ చేసింది. దాదాపు బిగ్‌బాస్ హౌస్‌ను తమ ఆదీనంలో తీసుకున్న కౌశల్ ఆర్మీ.. ప్రతివారం ఒకరిని టార్గెట్ చేస్తూ బయటకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కౌశల్ పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరీటీ, భానుశ్రీ, తేజస్వీ, బాబుగోగినేనిలు బయటకు వెళ్లేలా చేశారు. ఇన్ని రోజులు నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్న దీప్తి సునయన ఈ వారం నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎన్నో రోజులుగా చూస్తున్న వారు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఈ సారి సునయన నిష్క్రమణ దారితీయనున్నాయా? అంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే అది బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు! చదవండి: అసలు ఎలిమినేషన్ మజా ఈ వారమే! -
బిగ్‌బాస్ : అనుకున్నదే నిజమైంది.. నందిని ఔట్!
అనూహ్య పరిణామాలతో బిగ్‌బాస్ అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల ఫ్యాన్స్ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్‌బాస్ షో మొత్తం వన్ సైడ్గేమ్లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అయ్యాయి. వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. వీరు ఆడిందే ఆటా పాడిందే పాట అనే స్థాయికి వచ్చేశారు. ఇదివరకే ఈ విషయం ఎన్నో సార్లు బహిర్గతం అయింది. కిరీటీ, భాను, తేజస్వీలను ఎలిమినేట్ అయ్యేలా చేసింది వీరే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి హడావిడే కనిపిస్తోంది. గత రెండు వారాల ఎపిసోడ్స్‌లో చాలానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాబు గోగినేని, గీతా మాధురి, కౌశల్, నందిని, దీప్తి వీరందరి మధ్య జరిగిన గొడవలతో ప్రేక్షకులకు కావలిసినంత మజా దొరికేసింది. ఈ గొడవలపై గత వారం నాని వీరికి క్లాస్ కూడా పీకేశాడు. ఇదంతా గతం. కానీ శనివారం నాటి ఎపిసోడ్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. హౌజ్‌మేట్స్‌లో ప్రత్యేకంగా ఉండే కౌశల్.. నిన్న నాని చేతికి అడ్డంగా దొరికిపోయాడు. టాస్క్‌లో భాగంగా కౌశల్, నందిని మధ్య జరిగిన సంభాషణను మళ్లీ ప్లే చేశాడు. దీంతో కౌశల్ తెల్లబోయాడు. అప్పటి వరకు తనకు తాను సమర్దించుకుంటూ చెప్పిన మాటలకు.. వీడియోలో చూపించిన దానికి భిన్నంగా ఉండటంతో కౌశల్ మాటమార్చేశాడు. ఇలా కౌశల్ అడ్డంగా దొరికేసరికి.. నాని కాస్త మందలించాడు. తనకు బయట చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని, చాలా సపోర్ట్ చేస్తున్నారని, అలా గేమ్ ప్లే చేసి.. ఫ్లిప్ అవుతూ ఉంటే.. బయట ఫ్యాన్స్ కూడా ఫ్లిఫ్ అవుతారంటూ కౌశల్‌ను హెచ్చరించాడు. కౌశల్ నిజాలే మాట్లాడుతాడని, ధైర్యంగా ఏదైనా చెప్పగలడని, తన వ్యక్తిత్వానికి సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే షో దశాదిశను నిర్ణయించేది కౌశల్ ఫాలోవర్సే అనేంత వరకు వచ్చింది. ఎలిమినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లను తిరిగి ఇంటిలోకి పంపించే అవకాశం వస్తే.. యాక్టివ్‌గా ఉండే తేజస్వీ, ఎందరినో ఆకట్టుకున్న భాను శ్రీలు కాకుండా రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడును ఇంటిలోకి తిరిగి పంపారు. ఎందుకంటే భాను, తేజస్వీలు తరుచూ గొడవ పడుతుంటారు. కౌశల్ అంటేనే గిట్టదన్నట్టుగా వ్యవహరించేవారు. దీంతో కౌశల్ ఫాలోవర్స్.. ఆయనతో సన్నిహితంగా ఉండే నూతన్ నాయుడిని ఇంట్లోకి పంపించారు. ఎలాంటి ఫాలోయింగ్ లేని నూతన్ ఎలా రీఎంట్రీ ఇచ్చాడని ఇంటి సభ్యులు కూడా మాట్లాడుకోవడం మనం చూశాం. కానీ వారికి తెలీదు కదా.. బయట ఒక ఆర్మీ ఉందని. సో.. ఇక ఆదివారం ఉదయం నుంచే నందిని ఎలిమినేట్ కాబోతోంది అని ప్రచారం సాగింది. ఈ మధ్య నందిని డబుల్ గేమ్‌ప్లే చేస్తోందని, కావాలనే కౌశల్‌ను టార్గెట్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివిటీ ఎక్కువైంది. తనీష్‌తో క్లోజ్ అవడం.. వారిద్దరు కలిసి చేసే ఎక్సాట్రాలు.. నాని కూడా ఈ విషయంపై తరచూ అడగడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నందినిపై పెరుగుతోన్న నెగెటివిటీ కూడా ఎలిమినేషన్‌కు కారణమైంది. ఎలిమినేట్ అయిన నందినికి.. హౌజ్‌లోని ఓ ఇద్దరితో మాట్లాడడానికి నాని అవకాశమిచ్చాడు. గీతా మాధురి, దీప్తిలతో తను మాట్లాడిన అనంతరం.. బిగ్ బాంబ్ వేయాల్సిన సమయం వచ్చిందంటూ.. గార్డెన్ ఏరియాలో రాబోయే వారంపాటు ఓ మసాజ్ పార్లర్ ఉంటుందని.. హౌజ్ మేట్స్ అందరికీ హెడ్ మసాజ్ చేస్తూ.. ఇంట్లో ఉండే సమస్యల గురించి మాట్లాడలని ఇదే ఈ వారం బిగ్‌బాంబ్ అంటూ నాని పేల్చేశాడు. ఇక ఈ బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై నందిని వేసింది. సోమవారం జరిగే షోలో.. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ అయింది. మరి తొమ్మిదో వారం బిగ్‌బాస్ కార్యక్రమంలో ఏం జరుగనుందో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.. చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు! ఎందుకంటే...ఇది బిగ్‌బాస్. -
బిగ్‌బాస్: మళ్లీ కౌశల్ Vs నందినీ
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన రియాల్టీ షో. హౌస్‌లో గత వారం జరిగిన పరిణామాలతో ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే వారి ఆసక్తిని అందుకోవడంలో బిగ్‌బాస్ టీం దారుణంగా విఫలమవుతోంది. ఎన్నో అంచనాలతో టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా నిరాశజనకంగా సాగింది. ఒక టాస్క్‌ను రెండు సార్లు చేయించడం బిగ్‌బాస్ వైఫల్యానికి నిదర్శనం. హౌస్ మేట్స్‌కు పైరేట్స్ Vs సర్వైవర్స్ .. అనే ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించిన బిగ్‌బాస్ ఒక జట్టు సర్వైవర్స్‌గా.. మరో జట్టు పైరేట్స్‌గా వ్యవహరించాలని సూచించాడు. సర్వైవర్స్ గార్డెన్లో ఏర్పాటు చేసిన చెక్కబల్లలపై ఉండాలని, వారిని పైరేట్స్ కిందికి దింపాలని ఆదేశించాడు. సర్వైవర్స్ ఒక్కసారి బల్లను ఎక్కితే ఏ అవసరానికి దిగవద్దని తెలిపాడు. ఇలా ఇరుజట్లు తమ రోల్స్ మార్చుకోవాలని, ఏ జట్టు తక్కువ సమయంలో దింపుతారో ఆ జట్టు ఈ టాస్క్ విజేత అని పేర్కొన్నాడు. అయితే తొలుత సర్వైర్స్గా గీతామాధురి, దీప్తి సునయన, రోల్‌రైడా, పూజా రామచంద్రన్, దీప్తి, సామ్రాట్లుండగా.. పైరేట్స్‌గా కౌశల్, నందనీ, తనీష్, బాబుగోగినేని, గణేశ్, అమిత్లున్నారు. తొలుత పైరేట్స్ ఆమాంతం చెక్కబల్లలను ఎత్తి సర్వైర్స్‌ను కిందికి దింపేశారు. ఈ సమయంలో నందినీ, కౌశల్.. దీప్తి బల్లను ఎత్తే ప్రయత్నంలో ఆమె కాలు నలిగిపోయింది.. ఆ బాధను తట్టుకోలేక దీప్తి ఏడ్చేసింది. దీంతో కౌశల్-నందినీల మధ్య గొడవ జరిగింది. నీవల్లనే అంటే నీవల్లే అనే ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ బల్లలను ఎత్తి వేయవద్దని, టాస్క్ మళ్లీ కొనసాగించాలని తనీష్‌కు సూచించాడు. మళ్లీ ప్రారంభమైన టాస్క్ తాళ్లతో, ఆయిల్స్ సాయంతో సర్వైర్స్‌ను పైరేట్స్ దింపేశారు. ఈ టాస్క్‌లో పూజా రామచంద్రన్ ఆకట్టుకుంది. పైరేట్స్ సహనానికే పరీక్షగా నిలిచింది. ఎదోలా తాళ్ల సాయంతో ఆమెను కష్టంగా దించేశారు. అయితే ఈ టాస్క్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. చాలా బోరింగ్‌గా ఉందని ఇవేమి టాస్క్‌లంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌పై మండి పడుతున్నారు. కౌశల్‌పై టిష్యూ.. టాస్క్ పూర్తి అయిన అనంతరం దీప్తికి మరోసారి క్షమాపణలు చెప్పింది నందినీ. అంతా నీవల్లే జరిగిందంటూ.. పక్కనే ఉన్న కౌశల్‌ను నిందిస్తూ టిష్యూ పేపర్ విసిరేసింది. దీనికి కౌశల్ గట్టిగానే బదులిచ్చాడు. ‘నేను నీలా చేస్తే తట్టుకోలేవని’ వార్నింగ్ ఇచ్చాడు. అయితే జోవియల్‌గా చేసిన పని అని బాధపెట్టాలని కాదని నందినీ చెప్పింది.దీంతో ఆ గొడవ అక్కడితో ముగిసింది. అయితే నందినీ ఈ పని జోవియల్‌గా చేసినట్లు అనిపించలేదు. గతంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. బెస్ట్ ఫొటో తనీష్.. రీక్రియేషన్ టాస్క్‌లో కంటెస్టెంట్స్ ఫొటోలను బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌కు మరోసారి చూపించాడు. ఈ టాస్క్‌లో తనీష్‌ది బెస్ట్ పిక్‌గా ఎంపికచేసి కేకును పంపించాడు. కంటెస్టెంట్స్ అంతా సరదాగా నవ్వుకుంటూ కేకును ఆస్వాదించారు. ఇక టాస్క్‌లో రోల్స్ మార్చుకోనున్న కంటెస్టెంట్స్.. తమ వ్యూహాలను అప్పుడే మొదలు పెట్టారు. కొబ్బరి నూనే, తాళ్లు దొరక్కుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఎలిమినేటై ప్రేక్షకుల మద్దతుతో మరో అవకాశం దక్కించుకున్న నూతన్ నాయుడు, శ్యామలను ఇంకా హౌస్‌లోకి పంపివ్వలేదు. ఇది కూడా ప్రేక్షకులకు బిగ్‌బాస్‌పై ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం ఈ రోజైనా వారు హౌస్‌లోకి వస్తారో లేదో చూడాలి మరి! చదవండి: బిగ్‌బాస్: నిష్క్రమించేది ఆ ఇద్దరేనా? -
బిగ్‌బాస్ : కౌశల్‌పై మరో కుట్ర జరుగుతోందా...?
సాక్షి, హైదరాబాద్ : భావోద్వేగాలతో ఆడే ఓ ఆట బిగ్‌బాస్ రియాల్టీ షో.. అయితే గురువారం ఎపిసోడ్లో ఆ ఆటను బిగ్‌బాస్ మరింత రక్తికట్టించాడు. ఎంతలా అంటే ఆటలో కూడా వ్యక్తిగత దూషణలకు దిగేంత. మరో వ్యక్తిపై నిందలు మోపెంత. ‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. టాస్క్‌లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. తొలి నుంచి కౌశల్ అంటే గిట్టని తేజస్వీ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ‘వాడి బుద్ధే అంతా’ అంటూ విరుచుకుపడింది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న గీతామాధురి వెంటనే స్పందిస్తూ.. ‘ఆ ఆరోపణలు అవాస్తవం.. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయకండి’ అంటూ సొంత టీమ్ సభ్యులైన భాను, తేజస్వీలను హెచ్చరించింది. దీంతో కౌశల్ ఊపిరి పీల్చుకున్నాడు. కిరీటి చేసిన తప్పే భాను.. ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితమై.. కౌశల్‌పై కొంచెం ఓవర్‌గా రియాక్టై కిరీటి దామరాజు చేతులు కాల్చుకున్నాడు. నిజానికి కౌశల్‌పై అప్పటివరకు ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ ఒక్క సంఘటన కిరీటిని విలన్ చేయగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఎంతలా అంటే సోషల్ మీడియాలో ప్రేక్షకులే కౌశల్ ఆర్మీ అనే ఓ ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసేంతా. ఈ ఘటననంతరమే ప్రేక్షకులు తేజస్వీ Vs కౌశల్‌గా విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అదే తప్పును భానుశ్రీ కూడా చేసిందని అభిప్రాయడుతున్నారు ప్రేక్షకులు. వాస్తవానికి హౌస్‌లో నిర్మాహమోటంగా మాట్లాడే వ్యక్తి అంటే అది భానునే. హోస్ట్ నాని సైతం ఈ విషయాన్ని తెలిపాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్లో ఉండటంతో ఆమె ఎదో ఒకటి చేసి.. ప్రేక్షకులను ఆకర్షించాలనే ప్రయత్నం చేసింది. దీనికి ఇతర కంటెస్టెంట్లు సైతం సహకరించారు. తొలుత ఓ ఎమోషన్ డ్రామా ప్లే చేసి దీప్తి సునయన, తనీష్‌లను ఫూల్స్ చేసింది. దీంతో వారు చాలా హర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన ఎపిసోడ్లో ప్రేక్షకుల సానుభూతి పొందాలనే కౌశల్‌పై భాను తీవ్ర ఆరోపణలు చేసిందని, కానీ ఆమె ప్రయత్నం విఫలమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క ఘటన.. భానుపై ఉన్న అభిమానాన్ని తుడిచివేసిందని కొందరు ఘాటుగానే కామెంట్ చేయగా.. ఆటకోసం ఒకరిపై బట్టకాల్చేయడం ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. ఈ సారి భాను ఎలిమినేషన్ పక్కా అని జోస్యం చెబుతున్నారు. తేజస్వీపై నెటిజన్ల ఫైర్! ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేక.. ఇతరులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. ముఖ్యంగా కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్న తేజస్వీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను చూడలేకపోతున్నామని, దయచేసి ఎలిమినేట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ తేజస్వీనిని వెనుకెసుకొచ్చేవాళ్లు కూడా ఉన్నారు. తను ఎమోషన్‌ను అదుపుచేసుకోలేనని తేజస్వీయే ఒప్పుకుంది. అయితే ఆమె హౌస్ మేట్స్‌ను ప్రభావితం చేస్తోందన్నది మాత్రం వాస్తవం. గత వారం ఎలిమినేషన్లో దీప్తిని నామినేట్ చేసేలా బాబు గోగినేనినే ఆమె ప్రభావితం చేసింది. ఈ విషయంలో ఆయన నాని ముందు అడ్డంగా బుక్కయ్యాడు. ఇక తొలి వారంలో ఓ గ్రూప్‌ను మెయిటెన్ చేసి.. నానితో చివాట్లు కూడా తిన్నది. అయితే ఈమె ప్రభావంతోనే తనీష్, సామ్రాట్, కిరీటిలు కౌశల్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ సందర్భంలో తనీష్, బాబు గోగినేనితో మాట్లాడుతూ.. తేజస్వీ తన మాటలతో అందరిని ప్రభావితం చేస్తుందని తెలిపాడు. అయితే తేజస్వీకి కౌశల్‌తో పాటు గీతా మాధురి అంటే కూడా గిట్టదనే విషయం సుస్పష్టం. అయితే వీరద్దరిపైకి తనీష్‌ను ఉసిగోల్పింది కూడా తేజునేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ‘మంచి-చెడు’ టాస్క్‌లో ఈ విషయం స్పష్టమైందని వివరణ ఇస్తున్నారు. ఈ టాస్క్‌లో చెడు టీమే విజయం సాధించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్‌లో వరెస్ట్ పర్ఫార్మర్ ఒకరిని సూచించి.. వారిని జైలుకు తరలించాలని కెప్టెన్ కౌశల్‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనికి కౌశల్ భాను పేరు సూచిస్తూ.. కొన్ని విషయాల్లో ఆమె ప్రవర్తన నచ్చలేదని పేర్కొన్నాడు. -
బిగ్‌బాస్ : ఆ కార్డే కౌశల్ కొంప ముంచుతుందా?
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు.. అన్నట్లుగానే హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఏదేదో జరుగుతోంది. మొత్తానికి అభిమానులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే అందుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గాసిప్స్.. తేజస్వీ-సామ్రాట్, తనీష్-దీప్తి సునయనాల వ్యవహారం.. హౌస్‌లో హాట్ టాపిక్ అయింది. ఇదే అదునుగా భావించిన బిగ్‌బాస్ సైతం అమిత్, తనీష్‌లకు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీనికి తనీష్.. అమిత్ సాయంతో తనకు దీప్తిసునయనాల మధ్య ఉన్న వ్యవహారంపైనే ఓ కథ అల్లి రక్తికట్టించాడు. అయితే వీరిదంతా కట్టుకథా అని సింగర్ గీతా మాధురి కొట్టిపారేసింది. అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ వారం ఎలిమినేషన్ మరోసారి చర్చనీయాంశమైంది. తనీష్, సామ్రాట్, అమిత్, భానుశ్రీ, కెప్టెన్ రోల్‌రైడాలు మినహా అందరూ ఈ సారి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ ఇద్దరిద్దరిని పిలిచి ఏకాభిప్రాయంగా హౌస్ మేట్స్ పేర్లను నామినేట్ చేయమన్నాడు. వారు మాత్రం ఏకాభిప్రాయంతో కాకుండా తలా ఓ ఆప్షన్ ఎంచుకున్నారు. ఇలా అందరూ తలా ఒక పేరు చెప్పారు. ఎక్కువ మంది కౌశల్, తేజస్వీల పేర్లు నామినేట్ చేయగా.. ఆ తర్వాత కామన్ మ్యాన్ గణేశ్ పేరు చెప్పారు. కౌశల్ స్వార్ధపరుడని, తేజస్వీ గేమ్ మొత్తాన్ని నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందంటూ సభ్యులు మండిపడ్డారు. ఇక ఎలిమినేషన్ స్టార్ గణేశ్‌కు టాస్క్‌లు ఆడేంత సత్తా లేదని తేల్చిపారేశారు. పాపం గణేశ్ ప్రతీసారి నామినేట్ అవుతూనే ఉన్నాడు. అయితే గతంలో కాకుండా బిగ్‌బాస్ ఈ సారి నామినేట్ అయిన అందరిని ఎలిమినేషన్ జాబితాలో చేర్చాడు. దీంతో కౌశల్, తేజస్వీ, గీతామాధురి, బాబుగోగినేని, దీప్తి, శ్యామల, గణేశ్, నందిని రాయ్‌లు ఈ సారి ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. బిగ్‌బాస్ ఆఫర్.. కౌశల్‌కు ఎఫెక్ట్ తొలి ఎపిసోడ్‌లోనే కౌశల్ బిగ్‌బాస్ నుంచి లక్కీగా ఓ ఆఫర్ అందుకున్నాడు. అదే జైలు కార్డ్.. హౌస్‌లోని రూల్స్ బ్రేక్ చేస్తే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు శిక్షగా వారిని జైలులో వేస్తాడు. అయితే ఆ జైలు నుంచి విడిపించే సదుపాయాన్ని బిగ్‌బాస్ ఆ కార్డు ద్వారా కౌశల్‌కు కల్పించాడు. తొలి రోజే సామన్యులైన సంజనా, నూతన నాయుడులకు ఈ శిక్ష పడింది. అయితే ఓ అమ్మాయి జైలులో ఉన్న కూడా కార్డు ఉపయోగించలేదని హౌస్ మేట్స్ అంతా కౌశల్‌కు వ్యతిరేకమయ్యారు. ఇక అప్పటి నుంచి కొంతమంది అతన్నే టార్గెట్ కూడా చేశారు. ఈ వ్యవహారంలో కిరీటీ దామరాజు బలైన విషయం తెలిసిందే. నిజానికి కిరీటీ కౌశల్ పట్ల అలా ప్రవర్తించకుంటే కౌశల్ ఎప్పుడో వెళ్లి పోయేవాడు. ఆ ఒక్క ఘటనతో కౌశల్ హీరో కాగా.. కిరీటీ విలనై హౌస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అంతేకాకుండా కౌశల్‌పై ప్రేక్షకులకు విపరీతమైన సానుభూతి వచ్చింది. దీంతో అతను ఎలిమినేషన్ నుంచి తప్పించుకోగా కామన్ మ్యాన్ నూతన నాయుడు బలయ్యాడు. ఈ విషయాన్ని హోస్ట్ నాని సైతం బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటూ వివరణ కూడా ఇచ్చాడు. ఈ ఘటన అనంతరం కౌశల్ అందరి హౌస్ మేట్స్‌తో దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఓ టాస్క్‌లో కెప్టెన్‌గా అదరగొట్టాడు కూడా. అయితే మరోసారి అతన్ని ఆ జైలు కార్డే స్వార్ధపరుడిని చేసింది. ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని బాబు గోగినేని, మైక్ సరిగ్గా ధరించడం లేదని తనీష్‌ను బిగ్‌బాస్ కెప్టెన్ రోల్‌రైడా ద్వారా జైలుకు పంపించాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కార్డు ఉపయోగించడం లేదంటూ అతనిపై హౌస్ మేట్స్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా తేజస్వీ, సామ్రాట్, తనీష్, దీప్తీ సునయనా, గణేశ్, అమిత్‌లు అతనిపై పీకల దాకా కోపం తెచ్చుకుంటున్నారు. నిజానికి కౌశల్ బాబుగోగినేని, తనీష్‌లను కార్డు ఉపయోగించాలా అని అడిగినట్లు, వద్దని కూడా తాము చెప్పినట్లు వారే తెలిపారు. ఒక అమ్మాయి, అబ్బాయి జైలుకు వెళ్లినప్పుడు ఉపయోగిస్తే ఆ కార్డుకు విలువ ఉంటుందని కౌశల్ అభిప్రాయపడుతున్నాడు. అయితే సంజనా విషయంలో ఉపయోగించకపోవడంతో కౌశల్ మాటలను హౌస్ మేట్స్ నమ్మడం లేదు. ఇక నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించవద్దని బిగ్‌బాస్ హెచ్చరించినా పట్టించుకోని గీతా మాధురి అదే విషయంపై పదే పదే హౌస్ మేట్స్ వద్ద ప్రస్తావించింది. దీనికి బిగ్‌బాస్ ఆమెను జైలులో వేస్తూ శిక్ష విధించాడు. గీతా మాధురిని సైతం కౌశల్ కార్డు ఉపయోగించాలా అని అడగగా.. ఆమె తిరస్కరించినట్లు లేటేస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తెలుస్తోంది. ఆ కార్డు వాడేస్తే అయిపోతదిగా బ్రదర్ అని కౌశల్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ లక్కీ ఆఫరే కౌశల్ కొంపముంచుతోంది. కనీసం ఎలిమినేట్ అయ్యే లోపు అన్నా అతను ఈ విషయాన్ని గ్రహిస్తాడో లేదో మరీ చూడాల్సిందే. -
కౌశల్ బౌలింగ్ సందేహాస్పదం!
కొలంబో: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన నివేదికను లంక మేనేజ్మెంట్కు అందజేశారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కౌశల్ బౌలింగ్ శైలిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐసీసీ నిబంధనలకు లోబడి అతను బౌలింగ్ చేయడం లేదు. కాబట్టి 14 రోజుల్లో అతని శైలిని సరి చేసుకోవాలి. అయితే పరీక్ష ఫలితాలు వచ్చే వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయొచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. బౌలింగ్ శైలిని సరిదిద్దుకోవడానికి కౌశల్ త్వరలోనే చెన్నైకి రానున్నాడు. -
ఆత్మపరిశీలన అవసరం
అనిల్ కుంబ్లే టెస్టు క్రికెట్లో మజా అంటే ఇలాగే ఉంటుంది. ఈ ఫార్మాట్లో చివరి బంతి పడేవరకు ఏ మ్యాచ్ కూడా పూర్తి అయినట్టు కాదు. పదే పదే మేం ఈ విషయాన్ని చెబుతూనే ఉంటాం. చాలా కఠినంగానే అయినా భారత జట్టు శనివారం ఈ విషయాన్ని తెలుసుకుంది. తొలి టెస్టు జరిగిన మూడున్నర రోజుల్లో రెండున్నర రోజులు భారత్‌దే ఆధిపత్యమైనా చివరగా నవ్వింది మాత్రం శ్రీలంక జట్టే. నా ఉద్దేశం ప్రకారం ఈ ఓటమికి కారణం బ్యాట్స్‌మెనే. వారికి తుదికంటా క్రీజులో నిలబడదామన్న ఆలోచన లోపించింది. నిజానికి ఆ ముందు రోజు లంక బ్యాట్స్‌మన్ చండీమల్ ఆట నుంచి వీరు నేర్చుకున్నది శూన్యం. కొన్ని నిర్ణయాలు భారత ఆటగాళ్లకు వ్యతిరేకంగా రావచ్చేమో కానీ లంక ముందు వారు నిలబడలేకపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనను ఆశావహ దృక్పథంతో అధిగమించాల్సి ఉంటుంది. అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. బ్యాట్స్‌మెన్ అతిజాగ్రత్తకు పోయి కొంప ముంచగా లంక స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. వాస్తవానికి స్పిన్నర్ కౌశల్‌కు ఇది తొలి సీజన్. తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆకట్టుకుంది లేదు. ఇక హెరాత్ అసలు ఫామ్‌లో లేడు. అయితే వీరిద్దరిని ఒక్క భారత బ్యాట్స్‌మన్ కూడా సమర్థంగా ఎదుర్కొన్నది లేదు. అసలు వీరికి ఓ వ్యూహమన్నది లేకుండా పోయింది. ధావన్, కోహ్లి చెరో సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌కు దిగారు. ఇక్కడ వీరు చేయాల్సింది ఎడమచేతి బ్యాట్స్‌మన్ ధావన్.. హెరాత్ లెఫార్మ్ స్పిన్‌ను, కుడి చేతి బ్యాట్స్‌మన్ కోహ్లి.. కౌశల్‌ను ఆడుకోవాల్సింది. అయితే ఇలా జరుగలేదు. సహజంగానే విజయం శ్రీలంకను వరించింది. ఈ పరాజయంతో భారత ఆటగాళ్లు ఇక ఎంతోకాలం స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోలేరేమోననే విమర్శలు వస్తాయని నాకు తెలుసు. బహుశా జట్టు ఇప్పుడు ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఇదే మంచి సమయమేమో. అసలు జట్టు కూర్పులో స్పిన్నర్లను అద్భుతంగా ఆడగల బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసుకుని వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో పరధ్యానం పనికి రాదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో లంక బౌలింగ్ చేసిన విధానం, వారు అందుకున్న క్యాచ్‌ల కారణంగా ఈ విజయానికి అర్హులే. ముఖ్యంగా గాలేలో చివరి టెస్టు ఆడిన సంగక్కరకు ఇది మర్చిపోలేని అనుభూతి.