vijayashanthi
-
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది. -
34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె చేసిన పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. 1990లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతీ ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేసింది. దీని తర్వాత పలు సినిమాల్లో ఇదే తరహా రోల్స్ చేసినప్పటికీ అవేవి అంత పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వైజయంతీ ఐపీఎస్ రోల్లో విజయశాంతి కనిపించబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని కల్యాణ్ రామ్ కొత్త మూవీలో చేస్తున్నారు. ఇందులోనూ వైజయంతీ ఐపీఎస్ అనే పాత్ర చేస్తున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో తీస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విజయశాంతి పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.విజయశాంతి వయసు పెరిగినట్లు కాస్త కనిపిస్తున్నప్పటికీ.. డైనమిక్ లుక్ మాత్రం బాగుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. మరి విజయశాంతికి రీఎంట్రీలో ఈ పోలీస్ పాత్ర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
టైటిల్ దాచి కొత్త సినిమా ఆప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
సరిలేరు నీకెవ్వరు తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి మరోసారి తెరపై కనిపించలేదు. ఆ సినిమా తర్వాత పలువురు దర్శకులు తమ సినిమాల్లో నటించమని కోరినా..విజయశాంతి ఒప్పుకోలేదు. అంతేకాదు మళ్లీ తెరపై కనించబోదనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఈ సీనియర్ నటి మరోసారి తెరపై తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేడు ఎన్టీఆర్ జయంతి(మే 28). ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ తన కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ ఓ చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. టైటిల్‌తో పాటు కల్యాణ్ రామ్ గెటప్‌ని రివీల్ చేయకుండా ఈ గ్లింప్స్‌ని కట్ చేశారు. అయితే ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అనే క్యాప్షన్ ఇచ్చి ఇదొక మాస్ యాక్షన్ సినిమా అని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలన్‌గా సోహైల్ ఖాన్ నటించగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్‌కు తల్లిగా నటించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. -
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన విజయశాంతి?
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పెయిర్లో చిరంజీవి-విజయశాంతి జంట ఒకటి. స్వయంకృషి, అత్తకు యముడు అమ్మయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్.. ఇలా దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. పలు సినిమాల్లోనూ పోటాపోటిగా అన్నట్లుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు(1994). ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హిట్ పెయిర్‌కి మళ్లీ కలిసి నటించే అవకాశం రాలేదు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో.. ఇండస్ట్రీకే గ్యాప్ ఇచ్చారు. చాలా ఏళ్లవరకు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు.ఇద్దరి పార్టీలు వేరు వేరు కావడంతో అభిప్రాయ భేదాలు ఏర్పడి.. ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్టేజ్‌పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి నడిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’లో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతుందని ఆ వార్త సారాంశం. జస్ట్ రూమరేనా?విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీమ్ సంప్రదించిన మాట వాస్తమేనట. కానీ రాములమ్మ మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్‌కి జోడిగా నటించిన తాను.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పిందట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొదని.. అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట. విజయశాంతి నటించడం కష్టమేవిజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ఆమెకు కూడా నటించాలనే ఇంట్రెస్ట్ లేదు. పాత్ర నచ్చడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. అదే సమయంలో మళ్లీ తాను తిరిగి సినిమాల్లో నటించనని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పొలిటికల్‌గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జోస్యం తెల్వని సిలుక పీకే పై విజయశాంతి ఫైర్
-
విజయశాంతికి ధన్యవాదాలు
-
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై విజయశాంతి కామెంట్స్
-
వరల్డ్ కప్ ఫైనల్లో ఆ విధానం ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది: విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్‌లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్‌ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్‌లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా.. ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు… pic.twitter.com/Z7it3d7oKc — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023 -
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విజయశాంతి
-
బండి సంజయ్ మార్పుతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థమైందన్నారు. కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి. వారు తెర ముందు విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించవద్దని తాము కోరినట్లు తెలిపారు. అయితే బండి సంజయ్‌ను మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. కేసీఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్‌ను మార్చేసిందని విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి, కేసు ఏమైందని ప్రశ్నించారు, సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానన్న విజయశాంతి.. ఏళ్లు గడచినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మేడిగడ్డ కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆధారాలు ఉండి కూడా కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాలేదన్నారు. చదవండి: కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా హరీష్‌రావుకు ఉందా?: ఈటల -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
-
బీజేపీకి రాజీనామా !..కాంగ్రెస్ లోకి విజయశాంతి..?
-
కాంగ్రెస్‌లోకి విజయశాంతి!.. ముహూర్తం ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వివరాల ప్రకారం.. బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె.. హస్తం పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఇక, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. కాంగ్రెస్ తలపెట్టిన కుత్బుల్లాపూర్ సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి రాములమ్మ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. పలు సమయాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభిమానం కూడా చూపించిన విషయం తెలిసిందే. -
25 ఏళ్లకు చేరుకున్న విజయశాంతి రాజకీయ ప్రస్థానం
-
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్‌గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్‌లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానం.. ఆమె జీవితంలో మలుపు తిప్పిన సినిమా
తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించి అనేక విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించి వారికి ఏ మాత్రం తాను తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందారు. తన సినిమాలకు స్టార్స్ అక్కర్లేదని నిరూపించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ విజయశాంతి. సినిమా రంగంలో ఎన్నో విజయాలను అందుకున్న విజయశాంతో ఈ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సరిగ్గా 45 సంవత్సరాలు పూర్తి అయింది. అంతేకాకుండా 1983 అక్టోబర్ 15న తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేటి భారతం చిత్రం విడుదలయి నేటికి 40 ఏళ్లు పూర్తి అయింది. ఇలా ఈరోజు ఆమెకు మరెంతో ప్రత్యేకం. ఇదే విషయాన్ని విజయశాంతి తన సోషల్ మీడియాలో తెలిపారు. ఏడేళ్లకే బాలనటిగా ఎంట్రీ జూన్ 24, 1966న వరంగల్‌లో జన్మించి, మద్రాసులో పెరిగింది విజయశాంతి. తన పిన్నిగారు అయిన విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుంచి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు సమాచారం ఉంది. కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఆమె నటించింది. ఈ చిత్రానికి దర్శకురాలు విజయనిర్మల. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితం విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది. వాటిలో చెప్పుకోతగినవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో ఎన్టీయార్, ఏయెన్నార్‌ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా చెప్పుకోతగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన 'నేటి భారతం'. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో మరో తార ఉద్భవించింది 1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం విజయశాంతి తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో విజయశాంతి జీవించిందని చెప్పవచ్చు. దీంతో నేటి భారతం సినిమా ఘన విజయానికి విజయశాంతి ప్రధాన కారణమైంది . అలా అప్పటికే తెలుగు తెరపై జయసుధ, జయప్రద,శ్రీదేవి, మాధవి వంటి వారు అప్పటికే తెలుగు పరిశ్రమలో పాతుకుపోయారు. వారందరినీ సవాలు చేస్తూ విజయశాంతి రూపంలో మరో తార వెండితెరపై ఉద్భవించింది. అక్కడి నుంచి ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా గెలుచుకుంది. రెండుపడవల ప్రయాణం ఆ తరువాత రెండేళ్లపాటు రెండుపడవల ప్రయాణంలా సాగింది విజయశాంతి సినీ పయనం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుంచి పది వరకూ అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయింది. అప్పట్లో ఆమె తరువాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారుండేవారు. జయశాంతి విశ్వరూపం 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పీ.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ తన సొంత ప్రొడక్షన్ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ జాతీయ నటి అవార్డులను సంపాదించిపెట్టింది. ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరి పార వేసే ఐ.పీ.ఎస్. అధికారిణి వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్క్ కు వెరవకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయి. ఒక్క సారిగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్‌లోకి ఆమె ఇమేజ్ చేరింది. మొదటి సారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్ స్టార్ అనే బిరుదుతో సంబోధించసాగాయి. ఏడాది పాటు ఒక్క సినిమా కూడా లేదు 1993 లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. ఏడాది పాటు విజయశాంతి సినిమా అనేది థియేటర్లలో కనిపించలేదు. అలా అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది 'ఒసేయ్ రాములమ్మా'. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమయిన హిట్లర్, అన్నమయ్య, తొలిప్రేమ, ప్రేమించుకుందాం.. రా వంటి చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి పెట్టింది. అప్పటికి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నా బాక్సాఫీసు వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటిగా నంది అవార్డును ఆమెకి అందించింది. అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలవడం ప్రారంభించారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే, 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్. కె. అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది. ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. తర్వాత కొన్ని సినిమాలు తీసిన అవి అంతగా మెప్పించలేదు. అలా సుమారు 13 ఏళ్లు బ్రేక్ తీసుకుని మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి అయినా నేటికి ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విజయశాంతి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ► ఆమె 1987లో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను ఎన్టీఆర్ పెద్దల్లుడు.. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు. దగ్గుబాటి పురందరేశ్వరి భర్త తరుపు నుంచి కూడా ఆయనకు బంధుత్వం ఉంది. ► చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్‌తో 7 చిత్రాలలో నటించించారు. ► తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేరు. ► కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ► విజయశాంతి నాలుగు నంది పురస్కారాలను దక్కించుకున్నారు. ►1987లో ఆమె చిరంజీవితో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడినాయి. ► హీరోలతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు. ఆ కాలంలో అదే టాప్. ► ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ► 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందారు. ► విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. ► తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి.. అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో చేరారు. ► ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు ► విజయశాంతిని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ► 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీలో చేరి.. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనను అభిమానం, గౌరవమని అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అంటూ మండిపడ్డారు రాములమ్మ. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా అంటూ చురకలు అంటించారు. ఎంఐఎం, బీఆరెస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని… pic.twitter.com/TdySxpX4dJ — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 17, 2023 ఇదే సమయంలో ‘అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా? అని నిలదీశారు. ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి, ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా? అని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం’ అని ఆమె కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: వచ్చే నెలలో తెలంగాణకు ప్రధాని మోదీ? -
ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు మరోసారి అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల సానుభూతి ప్రకటించారు విజయశాంతి. ఒక ఆడబిడ్డకు కష్టం రావొద్దు. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటాను అంటూ పేర్కొన్నారామె. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత పేర్కొనడాన్ని విజయశాంతి తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు.. ఆ ఆవశ్యకత కూడా లేదు అంటూ వివరణ ఇచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనే భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు అని పేర్కొన్నారామె. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు... ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే...… pic.twitter.com/osR7evW3M5 — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 14, 2023 గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు.. బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్‌గా మారడం.. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడం.. ఆ వెంటనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఏడాది కాలంగా.. ఏదో టీవీ సీరియల్లాగా సాగుతోందని.. ఇవి ఈడీ నోటీసులు కావు మోదీ నోటీసులు అని, కేవలం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంతోనే మరోసారి రాజకీయం కోసం నోటీసులు పంపారంటూ కవిత స్పందించారు. తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటీసుల వ్యవహారంపై పూర్తిస్థాయి స్పందన తెలియజేస్తానని ఆమె అన్నారు. వాస్తవం కాదు: పిళ్లై లాయర్లు ఇదిలా ఉంటే.. మరోవైపు తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై తన న్యాయవాదుల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించడం గమనార్హం. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం న్యాయమూర్తి ఎదుట ఇవ్వలేదని, తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని, సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పిళ్లై తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. -
విజయశాంతి కుటుంబం గురించి మీకు తెలియని నిజాలు..!
-
తన కోరికను బయటపెట్టిన విజయశాంతి..!
-
టాలీవుడ్ హీరోల గురించి విజయశాంతి ఏమన్నారంటే..!
-
టాలీవుడ్ హీరోల గురించి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
-
విజయశాంతి నిజ జీవిత కథ బయటపెట్టింది
-
కేసీఆర్ Vs రాములమ్మ.. తెలంగాణలో పొలిటికల్ వార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి తాను రెడీగా ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల అంశాన్ని పక్కనపెట్టి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని విజయశాంతి సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని సంకేతాలిస్తూ ట్వీట్ చేశారు. ఆ అవకాశం తనకే కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజయశాంతి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక, ట్విట్టర్ వేదికగా విజయశాంతి.. కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం... ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్… pic.twitter.com/2TplIvgykR — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 23, 2023 ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇది కూడా చదవండి: కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ -
కమలంలో ఆగని లుకలుకలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్త స్వరాలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సభలో వేదికపై కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ట్వీట్ల ద్వారా స్పందించిన వైఖరిపై పార్టీలో చర్చ జరుగుతోంది. తన విషయంలో వ్యవహరించినట్టుగా కాకుండా కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీకి వెళ్లి లేనిపోని ఫిర్యాదులు, రిపోర్టులు ఇవ్వొద్దని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొనడంపై బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ఒరవడి శుక్రవారం అర్ధ్థరాత్రి దాకా సాగిన రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీ సమావేశంలోనూ కొనసాగినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణకు కిరణ్‌కు సంబంధమేమిటి? తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమానికి ఎలా పిలుస్తారని విజయశాంతి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర నేతలను హెచ్చరించి, ఆమె తన నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. అలా ఎలా సంజయ్? కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో బండి సంజయ్ మాట్లాడిన తీరు బాగా లేదని రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బండి వ్యాఖ్యలు పార్టీకేడర్‌ను గందరగోళంలో పడేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఏవైనా ఇలాంటి అభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలే తప్ప, బహిరంగంగా మాట్లాడడం ఏమిటని సంజయ్ తీరును తప్పు పట్టినట్లు సమాచారం. ఈ మేరకు కోర్ కమిటీ మీటింగ్‌లో వారు సంజయ్‌కి క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. గతం నుంచే బండి సంజయ్, ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావుల మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ సమావేశంలోనూ అది బయట పడినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఉద్యమ కార్యాచరణ... శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా సాగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, హామీల అమల్లో వైఫల్యంపై ప్రధానంగా కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు. తొలిసారిగా కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కోర్ కమిటీ భేటీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. అలాగే ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియ జేసేలా చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. బీజేపీ మాత్రమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించగల దనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. -
కిరణ్ కుమార్ రెడ్డిపై విజయశాంతి ఘాటు విమర్శలు
-
తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పార్టీ నేతల మధ్య లుకలుకలు బయట పడ్డాయి. కిషన్‌రెడ్డి బాధ్య తల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించడాన్ని, ఆయన సభలో పాల్గొనడాన్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆయనను ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించబోమని, ఏమి చేసుకుంటారో చేసుకోండన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎలా పిలుస్తారని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, తదితరులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఉద్యమ సమయంలో తనపై కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని పిలవడంపై విజయశాంతి నిలదీసినట్టు తెలిసింది. ఇదే తరహాలో రాజ్‌గోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సభలో పాల్గొన్న విజయశాంతి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత ఆమె ఒక ట్వీట్ చేశారు. ‘కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానంటూ పాత్రికేయ మిత్రులు నన్ను అడుగుతున్నారు. కానీ అది సరి కాదు. కిషన్‌రెడ్డిని అభినందించి, శుభాశీ స్సులు తెలియజేసిన తర్వాతే వచ్చాను. అయితే నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని ప్రయత్నించిన వారు ఉన్నచోట ఉండటం నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల ముందుగా వెళ్లవలసి వచ్చింది. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే వెల్లిపోవాల్సి వచ్చింది..’ అని వివరణ ఇచ్చారు. నేతల వ్యాఖ్యల కలకలం కిషన్‌రెడ్డి బీజేపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతల ప్రసంగాలు దుమా రం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారని ఆయన అనడం పార్టీ నేతల మధ్య చర్చకు దారితీసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను విజయశాంతి వ్యతిరేకించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై విజయశాంతి ట్వీట్
-
బీజేపీలో మరో ట్విస్ట్.. రాజాసింగ్‌పై విజయశాంతి సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అయితే, బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ గారి సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నరు. అయితే, బండి సంజయ్ గారితో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నము. అలాగే జరుగుతుందని నమ్ముతున్నం. pic.twitter.com/OeqbAj4hJL — VIJAYASHANTHI (@vijayashanthi_m) June 29, 2023 కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందని వివరించారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్ -
'ఏమో ఏమో' సాంగ్‌ని రిలీజ్ చేసిన విజయశాంతి
యోగేశ్వర్,అతిథి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఏమో ఏమో సాంగ్‌ని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ మాట్లాడుతూ..తను రాసిన పాటను విజయశాంతి చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మార్చి 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతందన్నారు. -
రానా నాయుడు వెబ్ సిరీస్ పై విజయశాంతి ఆగ్రహం
-
ఉద్యమాల వరకు తెచ్చుకోకండి: వెబ్‌సిరీస్‌పై విజయశాంతి ఫైర్
థియేటర్లో రిలీజయ్యే సినిమాలకు సెన్సార్ తప్పనిసరి. అసభ్యత, హింస మితిమీరకుండా సెన్సార్ అడ్డుకుంటుంది. కానీ ఓటీటీకి ఎలాంటి పరిమితులు లేవు. ఎటువంటి కంటెంట్ అయినా వాడేస్తోంది. అందులో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లకు షరతులు విధించే సెన్సార్ లేకపోవడంతో అసభ్యమైన సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇటీవల వెంకటేశ్, రానా సైతం ఇలాంటి కంటెంట్‌కే ఓటేస్తూ రానా నాయుడు సిరీస్ చేసిన విషయం తెలిసిందే! ఈ సిరీస్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి విజయశాంతి 'ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ఓటీటీ సిరీస్ గురించి..' అంటూ రానా నాయుడు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా కఠినమైన సెన్సార్ విధానం ఉండి తీరాలి. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సిరీస్‌ను నటులు, నిర్మాతలు వెంటనే ఓటీటీ నుంచి తొలగించాలని కోరుతున్నా. భవిష్యత్తులో కూడా ఓటీటీ ప్రసారాలలో ప్రజల నుంచి ప్రత్యేకంగా మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నా. ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది విజయశాంతి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ 'మీరు చెప్పింది అక్షరాలా నిజం మేడమ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. శనివారం ఆమె సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. తప్పు చేయకుంటే భయమెందుకు అంటూ విజయశాంతి ప్రశ్నించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. చదవండి: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి -
తప్పు చేయకుంటే భయం ఎందుకు?
-
జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్?
ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రేంజ్లో ఎన్టీఆర్ 30 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ప్రస్తుతం తారక్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర్తసుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం కోసం కొరటాల భారీ తారాగణంతో ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతి కథానాయకుడిగా విలక్షణ నటుడు జగపతిబాబును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం అలాగే ఇందులో పవర్ఫుల్ మహిళా పాత్ర ఉందట. దానికి కోసం అలనాటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఆమెను కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సుదీర్ఘ విరామం అనంతరం ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లే చేశానని, ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదన్నారు. మళ్లీ అలాంటి పాత్ర వస్తే చేస్తానని చెప్పిన విజయశాంతి ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ మరి విజయశాంతి ఎన్టీఆర్ సినిమాకు ఒకే చెప్తుందా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ హీరోయిన్ సమంతల పేర్లు వినిపంచగా వీరు ఈ ప్రాజెక్ట్ చేయట్లేదనేది స్పష్టమైంది. మరి కొరటాల చివరకు హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. -
‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు
‘ఈ టీచర్ చాలా స్ట్రిక్ట్’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్ అంటే విజయశాంతే. ‘లేడీస్ టైలర్’లో రాజేంద్ర ప్రసాద్ వంటి అల్లరి స్టూడెంట్‌ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్ పాత్రకు గ్లామర్ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్‌పీస్ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి. శిశువుకు అమ్మ తొలి టీచర్. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్ వచ్చింది. ‘గ్లామర్’ సినిమా కమర్షియల్ సినిమా వచ్చాక ‘టీచర్’ పాత్రలో హీరోయిన్ను గ్లామరస్‌గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు. అయితే అప్పుడప్పుడు మంచి టీచర్ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్‌గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది. నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చి హిట్ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్‌గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది. కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్‌పీస్ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్‌లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్‌గా నటించింది. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్‌గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్ ప్రేమమ్ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్’లో కలర్స్ స్వాతి, ‘హ్యాపీ డేస్’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్’లో టీచర్‌గా నటించే పెద్ద క్రేజ్ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. -
విజయశాంతి బహిరంగంగా అసంతృప్తి.. తెర వెనుక ఎవరైనా ఉన్నారా?
రాములమ్మకు కోపమొచ్చింది. బీజేపీలో విజయశాంతి సెకండ్ ఇనింగ్స్ సాఫీగా సాగడం లేదా ? బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడం వెనక కారణాలేంటీ ? తెర వెనుక ఎవరైనా ఉన్నారా ? అసలు విజయశాంతి ఆగ్రహానికి కారణమేంటి ? విజయశాంతి...ఫైర్ బ్రాండ్... మెదక్ మాజీ ఎంపీగా తెలంగాణ ఉద్యమకారురాలిగా సుపరిచితులు. గతంలో బీజేపీ అగ్రనేత అద్వానీకి దగ్గరగా ఉండి రథయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కనే ఉన్నారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆమెనే సారథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీలో చేరిన తర్వాత... ఆ స్థాయిలో ఆమెకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె మనోవేదనకు గురవుతున్నారట. ఇటీవల బీజేపీలో చేరుతున్న ముఖ్య నేతల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీ వేదికపై విజయశాంతిని మాట్లాడించలేకపోతున్నారు. ఇదే ఆమె మనసు నొప్పించడానికి కారణమైనట్లు తెలుస్తోంది. బీజేపీ సమావేశాల్లో ఒకరిద్దరినే మాట్లాడించే ఆనవాయితీ ఉంది. వేదికపై ఎంత మంది ఉన్నా... ప్రోటోకాల్ ప్రకారం సందర్భోచితంగా మాట్లాడిస్తున్నారు. బండి సంజయ్ అదే ఫార్మూలా ఫాలో అవుతున్నారు. తాజాగా సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు. సమావేశంలో మాట్లాడించే అవకాశం ఇవ్వకపోవడంతో విజయశాంతి ఒక్కసారిగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాత్ర లేకుండా చేస్తే పాతరేస్తానని హెచ్చరికలు చేశారు. రాములమ్మ ఇంతగా రియాక్ట్ కావడం వెనక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పార్టీలో ఓ వర్గం నేతలు అనుమానిస్తున్నారు. విజయశాంతి భుజంపై గన్ను పెట్టి .. మాటల తూటాలు పేల్చుతున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పటికే అధిష్టానం పెద్దలకు చేరింది. దీంతో, ఈ వివాదాన్ని సర్దుమణుస్తారా ? లేక బహిరంగ వ్యాఖ్యలు చేసిన విజయశాంతిని వివరణ కోరుతారా ? అన్నది చూడాలి. -
చెన్నైలో శశికళను కలిసిన విజయశాంతి, కారణమేంటీ?
నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడిన సంఘటన దేశవవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటనపై ఓ కమిషన్ వేయగా.. దీనికి విజయశాంతి సారథ్యం వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న విజయశాంతి తంజావూరులోని బాలిక తల్లిదండ్రులను కలిశారు. అనంతరం చెన్నై వెళ్లి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను కలిశారు. శశికళ ఇంటికి వెళ్లి కాసేపు ఆమెతో భేటీ అయ్యారు. విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. శశికళతో మర్యాదపూర్వకంగా సమావేశం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి గుర్తు చేసుకున్నారు. విజయశాంతి కలవడంపై శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా విజయశాంతి, శశికళను కలవడం ప్రస్తుతం హట్‌టాపిక్ మారింది. ఓ నటిగా జయలలితని గుర్తు చేసుకుంటూ శశికళని కలిశారా? లేదా పార్టీ పరంగా కలిశారా? అనేది తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. -
మాట తప్పిన మీరు మెడలు ఇరుస్తరా?: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాటతప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు ఇరుస్తడా?. ఈ మాటలు హుజూరాబాద్ కొచ్చి ఎందుకు మాట్లాడలె?. మీ తీరుకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్రు’అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఎద్దేవాచేశారు. వట్టి మాటలు కట్టిపెట్టి మొదట పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ తగ్గించాలని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూంల హామీల మాదిరిగా దళితబంధు పేరిట కేసీఆర్ దగా చేస్తారని, ఆయన మెడలు వంచి పథకాలను అమలు చేయించడానికే బీజేపీ ఉద్యమిస్తోందని ఆమె పేర్కొన్నారు. -
అసదుద్దీన్ ఒవైసీ విమర్శలపై విజయశాంతి ఫైర్
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఇస్లాం వ్యతిరేకత లేదని, భయం లేకుండా ఉండాలని ముస్లింలను ఉద్దేశించి ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని తప్పుబడుతూ ఒవైసీ నిన్న ట్వీట్లు చేశాడు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. ‘‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే... రామ అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోంది. దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు... ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం. sounding synonymous to the claims that flares up religious hatred. It would be no surprise if the tolerant statements of Mohan Bhagavath ji sound criminal for a person like mr Asaduddin who is horribly habituated to delight upon hearing... — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారని... ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అసదుద్దీన్ గారి దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ గారికి.. భగవత్ గారి అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుంది. Why Mr. Asaduddin maintained complacence when Akbar said that if the police close their eyes and refrain themselves from their duties, he would definitely witness the end of Hindus. — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 అయితే భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది'' అని విజయశాంతి వరుస ట్వీట్లలో ఒవైసీని నిలదీశారు. -
సీఎంకు కరోనా సోకితే యశోదాకు ఎందుకు వెళ్లారు : విజయశాంతి
-
కేసీఆర్ హామీలు పిట్టలదొర కబుర్లే: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కారు అస్తవ్యస్త పరిపాలనా తీరు దేశవ్యాప్తంగా చులకన చేసే స్థితికి దిగజారిపోయిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. ఆమె బుధవారం ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై పాలనపై విమర్శలు గుప్పించారు. ‘సీఎం కేసీఆర్ దొరగారు ఉద్యమకాలంలోను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్లే తప్ప చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తేలిపోయింది. కేసీఆర్ దొరవారి హామీతో సన్న వడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కని పరిస్థితుల్లో ఆ రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చింది. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారు, అన్నదాతలు తమ పంటలకు మంట పెట్టుకున్నారు. మీరిచ్చిన ఉద్యోగాల హామీని నమ్ముకున్న పలువులు అమాయక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు’ అని విజయశాంతి మండిపడ్డారు. చదవండి: టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది ‘వివిధ ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో సైతం కేసీఆర్ సర్కారు విఫలమైంది. మొత్తంగా చూస్తే, అటు ఉద్యమ కాలంతో పాటు పాలనా పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కేసీఆర్ చెబుతూ వచ్చిన ‘మా నీళ్లు మాకు... మా ఉద్యోగాలు మాకు’ అనే నినాదం, ఆయన (కేసీఆర్) అధికారానికి వచ్చినా సాకారం కాని దారుణ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఇక భూసంస్కరణలంటూ కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోంది. ఇవిగాక డబుల్ బెడ్రూములు, దళితులకు మూడెకరాలు, తాజాగా వరదసాయం, మీ నేతల కబ్జాలు, అవినీతి... ఇలా చెప్పుకుంటూ పోతే టీఆరెస్ వైఫల్యాల వరుసక్రమానికి ఆకాశమే హద్దు. మీరిచ్చే హామీలన్నీ ఓట్ల కోసం వేసే గాలాలేనని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మీరు వారి మధ్యకెళ్లినప్పుడల్లా దుబ్బాక, జీహెచ్ఎంసీలను గుర్తు చేస్తూనే ఉంటారు’ అని విజయశాంతి ధ్వజమెత్తారు. -
రానున్నది బీజేపీ సర్కారే : మాజీ ఎంపీ విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, ఇక అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె మొదటిసారిగా గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చా రు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలసి ఆమె మీడియా తో మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల శవాల పై కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే ఆయనను ఇన్ని రోజులుగా భరిస్తున్నారని, ఇకపై భరించే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను తరిమికొడతారని జోస్యం చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌లో పదవుల పంచాయతీ ఇంకా నడుస్తోందన్నారు. కేసీఆర్ పెద్ద క్రిమినల్ అని, తనకంటే పెద్ద నటుడన్నారు. తాను గతంలో ఎంపీ అయ్యాక, టీఆర్ఎస్ పార్టీలో ఎదుగుతున్నాననే భయంతో కాంగ్రెస్‌కు వెళ్లిపోతున్నట్లు కేసీఆరే ప్రచారం చేయించారన్నారు. ఓయూకు వెళితే తన మనుషులతో అనరాని మాటలు అనిపించారని, తనను చెప్పలేని మాటలతో తిట్టించారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేశారన్నారు. కేసీఆర్‌కంటే ముందే 1998 నుంచి తాను తెలంగాణ అంశంపై పోరాడానని తెలిపారు. గతంలో బీజేపీలో ఉండి తెలంగాణ కోసం పోరాడానని, తప్పని పరిస్థితిలో బీజేపీని వీడానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ సాధనకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఆ తరువాత కేసీఆర్ వచ్చారన్నారు. తాను దూకుడుగా పోతుంటే దురుద్దేశంతో కేసీఆర్ తమ పార్టీలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేశారని, తెలంగాణ కోసం చివరికి ఒప్పుకున్నానని తెలిపారు. -
కాంగ్రెస్‌కు కేసీఆర్ స్లో పాయిజన్ ఎక్కించారు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును గద్దె దింపేది తామేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘1998లో బీజేపీలో చేరాను. కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశాను. అప్పుడు నా పార్టీనీ టీఆర్ఎస్లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్ఎస్ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను. కేసీఆర్ కుట్రతోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని రాములమ్మ చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది. కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన స్లో పాయిజన్ ఎక్కించారు. కాంగ్రెస్ పోరాడలేని స్థితికి చేరుకుంది. ఏడాది కిందటే బీజేపీలో చేరాలని అనుకున్నా.కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా. తెలంగాణ ప్రజలు బాగు పడడమే నాకు కావాలి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ‘తెలంగాణలో దూకుడు పెంచండి’) -
సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్:రాములమ్మ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం పార్టీతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు విజయశాంతి విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ఎంఐఎం నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే దానిని కట్టడి చెయ్యకపోగా వారి దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. (గ్రేటర్ పోరు: మాటల యుద్ధం.. వివాదాస్పదం) ‘ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు.. క్షమించదు’ అని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ ఇటీవల ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. -
సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకని మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. గ్రెటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమర్ మంగళవారం మాట్లాడుతూ.. తాము గెలిస్తే పాతబస్తీలోని పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సంజయ్ వ్యాఖ్యలపై విజయశాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాములమ్మ గుడ్ బై సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకని, రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎంకు భయమెందుకని సూటిగా ప్రశ్నించారు. దానికి బదులు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇక సంజయ్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. బీజేపీకి దమ్ముంటే భారత్ సరిహద్దుల్లో తిష్టవేసిన చైనా సైన్యంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు. అదే విధంగా ఎంపీ సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పచ్చని హైదరాబద్‌ను పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ఓట్ల, సీట్ల కోసం బీజేపీ ఎంపీ పూర్తిగా మతితప్పి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాములమ్మ గుడ్ బై
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. అనంతరం ఢిల్లీలో పలువురు పార్టీ, కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాల ద్వారా సోమవారం సమచారం అందింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విజయశాంతి ప్రచారం చేయనున్నారు. రెండు దశాబ్ధాల అనంతరంసొంత గూటికి దుబ్బాక ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఆమె సహచరులతో సమాలోచనలు జరిపి.. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం భారీ ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా విజయశాంతికి బీజేపీలో చేరిన అనంతరం కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కాగా సుమారు రెండు దశాబ్ధాల అనంతరం మరోసారి సొంత గూటికి చేరుకుంటున్నారు. బీజేపీ ద్వారానే ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్నటిగా ఖ్యాతిగడించిన విజయశాంతి.. 2000లో తన రాజకీయ అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించి.. టీఆర్ఎస్ నుంచి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమ నేపథ్యం, స్టార్‌నటి కావడంతో విజయశాంతి చేరిక తమకు కలిసొస్తుందని హస్తం నేతలు భావించారు. టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం.. ఈ క్రమంలోనే 2014లో మెదక్ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఏఐసీసీ కార్యదర్శి పదవి కావాలని అడిగిన తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నేతల ముందు పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉంటుంది. -
దుబ్బాక ఫలితాలపై రాములమ్మ స్పందన
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారని అన్నారు. దుబ్బాక ఫలితాలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. (చదవండి : విజయం చారిత్రాత్మకం: రఘునందన్ ) ‘ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆర్ఎస్ అంటోంది. అయితే, ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టీఆర్ఎస్కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని... బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి.... ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి... ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి. ఏది ఏమైనా దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజపు రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు’ అని విజయశాంతి అన్నారు. (చదవండి : దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్) -
హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. హరీశ్‌రావు మాటలు వింటుంటే.. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత, కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లు పెట్టి ఓట్లను లెక్కిస్తారేమో అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా హరీశ్‌రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్బుక్లో ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీశ్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. -
రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?
సాక్షి, హైదరాబాద్ : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, పట్టభద్రుల కోటాలో రెండుస్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసిపోగా.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దుబ్బాకలో దుమ్మురేపుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా.. మొదటిసారి గెలుపొందాలని బీజేపీ, పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యహరచన చేస్తున్నాయి. దీంతో దుబ్బాక పోరు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బరిలోకి దింపి నియోజవర్గాన్ని చుట్టుముట్టాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్‌రావు అన్నీ తానై చూసుకుంటుండగా.. బీజేపీ అభ్యర్థి రాఘునందన్‌రావుతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. (ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు చావోరేవో!) దుబ్బాకకు దూరంగా రాములమ్మ.. మరోవైపు గత వైభవం కోసం పోరాడుతన్న కాంగ్రెస్ పార్టీ సైతం తానేం తక్కువకాదన్నట్టూ రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం దుబ్బాకలో దింపింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే స్థానికంగా కీలకనేతైన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కంటికి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న రాములమ్మ కీలకమైన పోరులో పార్టీకి దూరంగా ఉండటం వెనుక కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్నటిగా ఖ్యాతిగఢించిన విజయశాంతి.. 2000లో తన రాజకీయ అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించి.. టీఆర్ఎస్ నుంచి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమ నేపథ్యం, స్టార్‌నటి కావడంతో విజయశాంతి చేరిక తమకు కలిసొస్తుందని హస్తం నేతలు భావించారు. స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం.. ఈ క్రమంలోనే 2014లో మెదక్ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఏఐసీసీ కార్యదర్శి పదవి కావాలని అడిగిన తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నేతల ముందు పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకాల మరణం, ఉప ఎన్నికల సంభవించడం అన్నీ చకచక జరిగిపోయాయి. తీవ్ర మనస్థాపం.. అయితే ఉప ఎన్నికల బరిలో సొంత జిల్లా నేతైన విజయశాంతి బరిలో నిలపాలని రాష్ట్ర పార్టీ తొలుత నిర్ణయించింది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు, బరిలో నిలవడం ఖాయమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనికి స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడంతో రాములమ్మ వెనక్కి తగ్గకతప్పలేదు. రెండు వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన నేతను ఉప ఎన్నికల్లో నిలిపితే అధికార టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధింస్తుందనే అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద స్థానిక నేతలంతా బలంగా వినిపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయశాంతి పోటీ నుంచి తప్పుకుని కనీసం దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ప్రచారానికి సైతం దూరంగా ఉంటున్నారు. టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పట్లో ఎన్నికల లేనందున విజయశాంతి ఇక పూర్తిగా రాజకీయలకు దూరంగా ఉంటారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని సమాచారం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ మూవీ అనంతరం ఆమెకు టాలీవుడ్లో వరస అవకాశాలు వస్తున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రాములమ్మ సిద్ధమయ్యారని, ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని తెలంగాణ రాజకీయ వర్గల్లో చర్చసాగుతోంది. ఈ వార్తలకు విజయశాంతి ఏ విధంగా చెక్పెడతారనేది వేచి చూడాలి. -
సుశాంత్ కేసు: రాములమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి ఆసక్తికరమైర రీతిలో స్పందించారు. సినీ పరిశ్రమలకు చెందిన ఎంతోమంది నటీమణులు అనుమానాస్పద రీతిలో మరణించారని వారి మరణంపై ఏనాడైనా సరైన దర్యాప్తు చేశారా అని ప్రశ్నించారు. మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశామని పేర్కొన్నారు. దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. (కీలక విషయాలు వెల్లడించిన సుశాంత్ సోదరి) ఈ మేరకు ఆమె ఫేస్బుక్ వ్యక్తిగత ఖాతా నుంచి విజయశాంతి ఓ పోస్ట్ చేశారు. ‘సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ... మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు... దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. (డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్) అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా... వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి.’ అని విజయశాంతి పేర్కొన్నారు. -
లేడీ సూపర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్: రేర్ పిక్స్
-
చిరంజీవి చిత్రంలో విజయశాంతి?
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కాంబినేషన్లో టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. దాదాపు 20 సినిమాలతో హిట్ పెయిర్‌గా వీరిద్దరికి మంచి పేరు ఉంది. అయితే తొలుత విజయశాంతి, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాక వీరిద్దరు కలిసి మరోసారి తెరపై కనిపించలేదు. అయితే ఫిలింనగర్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం.. చిరంజీవి చిత్రంలో విజయశాంతి కనిపించనున్నారట. దీంతో సుదీర్ఘ గ్యాప్ తర్వాత వీరిద్దరు ఒకే తెరపై కనువిందు చేయనున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!) మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. (‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం) మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. చిరు సూచించిన సూచనలకు తగ్గట్టు సుజీత్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మెగాస్టార్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మలయాళ చిత్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హీరో ఎలివేషన్ సీన్స్ సూపర్బ్‌గా ఉంటాయి. ఆదే జోరులో తెలుగులోనూ హీరో ఎలివేషన్ సీన్స్ ఉండేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నారని టాక్ ఆఫ్ ది టౌన్. -
ఒవైసీకి కేసీఆర్ శాపం పెడతారా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శాపం గురించి ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీ ఒవైసీకి తెలియకపోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. కేసీఆర్ పెట్టిన శాపం గురించి తెలియకే గాంధీ ఆస్పత్రిపై ఒవైసీ విమర్శలు చేసివుంటారని పేర్కొన్నారు. కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫేస్బుక్లో వ్యంగ్యంగా స్పందించారు. ‘కరోనా మహమ్మారిపై పోరులో అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సీఎం కేసీఆర్ ఇటీవల విలేకరుల సమావేశంలో కోరారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన మీడియా యజమానికి కరోనా వైరస్ సోకాలని శాపం పెట్టారు. వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్.. మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్‌కు ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. బహుశా కేసీఆర్ పెట్టిన శాపం గురించి ఓవైసీకి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్, తాము ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ ధీమాగా ఉండి ఉండొచ్చు. లేదా తమకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్‌కు కేసీఆర్ శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే విషయాన్ని వేచి చూడాలి’ అంటూ విజయశాంతి ఫేస్బుక్లో రాసుకొచ్చారు. ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి -
‘ఆ సమయం వస్తుందో లేదో తెలియదు’
దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. రాజకీయాల్లో బీజిగా ఉన్న విజయశాంతి.. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయశాంతి మరిన్ని చిత్రాల్లో నటిస్తారా? లేక రాజకీయాలపైనే ఫోకస్ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీంతో తన భవిష్యతు కార్యచరణపై విజయశాంతి స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, అనిల్ రావిపూడిలతోపాటు తనను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించే సమయం వస్తుందో, లేదో తెలియదని.. ఇప్పటికి ఇక సెలవని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణమని వెల్లడించారు. ‘సరిలేరు మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానానికి కుళ్లుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి సెలవు’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. కాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాత్ర నచ్చడంతోనే తాను నటించేందుకు అంగీకరించానని విజయశాంతి పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
లేడీ అమితాబ్ ‘కిక్’ మాములుగా లేదుగా..
దాదాపు పదమూడేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్ భారతిగా అభిమానులను అలరించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా విజయశాంతి చేసిన ఓ ఫీట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్లో షేర్ చేశారు. ఆమె బ్రహ్మాజికి కిక్ ఇస్తున్న.. స్లో మోషన్ వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. దానిని మాస్టర్ కిక్ అని పేర్కొన్నారు. అలాగే అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై బ్రహ్మాజీ స్పందిస్తూ ‘కిక్ ఎవరికీ’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్ పోస్ట్‌పై నెటిజన్లు ‘వావ్ సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. After 13 years..... What a come back @vijayashanthi_m madam.... MASTER KICK 💥💥💥💥💥🤗🤗🤗🤗 భోగి శుభాకాంక్షలు pic.twitter.com/6X9qXLzclR — Anil Ravipudi (@AnilRavipudi) January 14, 2020 చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు -
‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’
మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఉపందుకున్నాయి. డిసెంబర్లో ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధిం రెండో సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు ఈ లిరికల్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. కుటుంబానికి మేజర్ అజయ్ కృష్ణ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాడో తెలిపేలా ఈ సాంగ్‌ను రూపొందించినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్‌కు జంటగా రష్మికా మందన్నా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. విజయ్‌శాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పెదవి విప్పేందుకు 72 గంటలా?
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యోదంతం జరిగిన 72 గంటల తర్వాత సీఎం కేసీఆర్ పెదవి విప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి దారుణ ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధుల పేరుతో జాప్యం చేయకుండా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారో సీఎం చెప్పలేదని ధ్వజమెత్తారు. అసలు విషయాల గురించి మాట్లాడకుండా కేవలం కంటితుడుపు చర్యగా ఓ ప్రకటన జారీచేసి తప్పించుకున్నారని విమర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ పేరుతో మొక్కుబడిగా ఒక ప్రకటన జారీ చేసి దొరగారు చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: సురవరం సాక్షి, హైదరాబాద్: దిశ హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దిశ కుటుంబానికి బంధువు (తన తల్లి వైపు చుట్టరికం)గానే కాకుండా ఈ పాశవిక హత్యపై ఆగ్రహంతో ఉన్న కోట్లాది మంది ప్రజల్లో ఒకడిగా ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సోమవారం దిశ తల్లిదండ్రులను పరామర్శించిన సురవరం.. దిశ పోలీసులకు ఫోన్ చేయడానికి బదులు తన చెల్లెలికి ఫోన్ చేసిందంటూ ఆమెపైనే నెపం మోపే ప్రయత్నం.. వ్యవస్థలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదంటూ తాత్సారం చేసిన పోలీసులను వెంటనే సర్వీస్ నుంచి తొలగిస్తే మరే పోలీసు ఇలాంటి చర్యలకు పాల్పడరని స్పష్టంచేశారు. పోలీసులకు పెద్ద పెద్ద భవనాలను నిర్మించడానికి బదులు సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పెట్రోలింగ్ టీంలను అలర్ట్ట్ చేసేందుకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. -
ప్రతిపక్షం లేకుండా చేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆర్టీసీ యూనియన్లు, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ హైకోర్టులో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ చేస్తున్న వాదనలు విడ్డూరంగా ఉన్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి విలువలకు తిలోదకాలిచ్చారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర ప్రతిపక్షాలు చేయడం లేదని, ఆయన పక్కన ఉన్న వారే చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలంతా తమ పార్టీలో చేరుతారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారని, అందుకే బీజేపీ పేరు చెప్పలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని కోర్టుకు తన ఆందోళన తెలియజేసి ఉంటారని ఆ ప్రకటనలో ఎద్దేవా చేశారు. -
‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్ లుక్ ఇదే
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో విజయశాంతి భారతి పాత్రలో చాలా డీసెంట్ అండ్ క్లాస్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే మరో యాంగిల్లో తన చూపుతోనే విలన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పవర్ ఫుల్ పాత్ర పోషిస్తుందా లేక క్లాస్‌గా కనిపించనుందా అనేది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం విజయశాంతి ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తమ అభిమాన నటి ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్‌స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక విజయశాంతి ఫస్ట్ లుక్‌పై హీరో రానా స్పందించాడు. ‘తెరపై ఆమెను చూడటం అద్భుతంగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ ఒదిగిపోయారని, సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతికి డబుల్ ధమాకా అని చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్‌తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. Introducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru 😊 Can't-Wait for Sankranthi 2020 🤩 Wishing you all a Very Happy Diwali 💥@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvR — Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019 -
ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్‌కు చెడ్డపేరు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లి వారం దాటిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కారణంగా సీఎం కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీíసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: చాడ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యను కార్మికులు పడుతున్న మానసిక వేదనకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు. పోరాడి సాధించాలి: విజయశాంతి సాక్షి,హైదరాబాద్: ప్రాణత్యాగం చేసి సీఎం కేసీఆర్ మనసు మార్చే ప్రయత్నం కంటే పోరాడి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. పోరాటాల ద్వారానే కేసీఆర్ దొర నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలన్నారు. ప్రాణత్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్యని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్యలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దని, కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మరణం బాధాకరం: కొప్పుల సాక్షి, జగిత్యాల: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మరణం బాధాకరమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం విచారం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొందరు యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులు బలవుతున్నారన్నారు. -
‘విక్రమ్’ జాడను కనుక్కోవచ్చేమో గానీ..: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : గత బడ్జెట్ లెక్కలు తేలకముందే.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త బడ్జెట్ పేరుతో గారడీకి సిద్ధమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ.. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమోనని ఎద్దేవా చేశారు. 2019-20 సంవత్సరానికి గానూ రూ. 1, 46,492.3 కోట్లతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్‌పై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతేడాది కూడా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులతో టీఆర్ఎస్ సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. అయినప్పటికీ అక్షరాస్యతలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగులో ఉందని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని విమర్శించారు. ‘విష జ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం..ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో.. కేసీఆర్ పేద రోగుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ అర్థమైంది. రైతులకు యూరియా అందించే విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గత బడ్జెట్లో పెద్దపీట వేశామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం... ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు’ అని ప్రభుత్వ తీరును విజయశాంతి ఎండగట్టారు. గతంలో కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ‘కేసీఆర్ లెక్కా- పద్దుల విషయం ఏమోగానీ... గత బడ్జెట్లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి’ అని విజయశాంతి పేర్కొన్నారు. -
‘ప్రజా సమస్యలను ఎందుకు పట్టించుకోరు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఓ పక్క విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే.. టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు ఓనర్ ఎవరని నాయకులు వాదించుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన విజయశాంతి.. గులాబీ జెండా ఓనర్ ఎవరనే కొట్లాటలో పడి నేతలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రాజకీయాల్లోనూ పాలనాపరంగా అందరి కంటే తనకు ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్.. ప్రజల సమస్యల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చేర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపి తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయని ఆమె తెలిపారు. అందుకే జ్వరాలతో జనం ఆస్పత్రుల్లో బారులు తీరుతున్నా, ఆరోగ్య శాఖ మంత్రి దీనిని పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయని తెలిసినా కుడా గురువారం జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించిన వైద్యశాఖ మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లోనే జీహెచ్ఎంసీ, మున్సిపల్ వ్యవస్థ నడుస్తోందన్నారు. ఓ వైపు ఇంత దారుణం జరుగుతున్నా మాజీ మంత్రి హరీశ్‌రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి ముఖ్యమంత్రి అవ్వాలని మెక్కులు చెల్లిస్తూ.. చాప కింద నీరులాగా పావులు కదుపుతున్నారని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ సాధిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు. -
13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..
ప్రముఖ నటి విజయశాంతి.. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హీరో మహేశ్‌బాబు ఇంట్రోను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్నారంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఇట్స్ మేకప్ టైమ్ ఫర్ విజయశాంతి గారు’ అంటూ అనిల్ పేర్కొన్నాడు. ఈ 13 ఏళ్లలో ఆమె ఏ మాత్రం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి, అదే డైనమిజమ్ అంటూ.. విజయశాంతి రీ ఎంట్రీకి స్వాగతం తెలిపాడు. మహేష్ బాబు కూడా విజయశాంతికి స్వాగతం తెలుపుతూ ట్వీట్ చేశాడు. అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ‘వెల్కమ్ మేడమ్’ అంటూ అనిల్ పోస్ట్‌ను రీట్వీట్ చేశాడు. ఒకప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానులను అలరించిన విజయశాంతి గత కొన్నేళ్లుగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. దృక్పథం మారదు.. అనిల్ రావిపూడి, మహేష్ ట్వీట్లపై స్పందించిన విజయశాంతి.. వారి స్వాగతాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. ‘దృక్పథం అనేది మనిషి గొప్పతనాన్ని తెలుపుతుంది. వాతావరణం అనేది మారచ్చు కానీ.. దృక్పథం మారదు’అని పేర్కొన్నారు. -
విజయశాంతి విమర్శలకు నో కామెంట్...
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి స్పందించారు. విజయశాంతి తనపై చేసిన విమర్శలకు తాను కౌంటర్ ఇవ్వబోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మల్యే జగ్గారెడ్డి బుధవారమిక్కడ విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘విజయశాంతికి పీసీసీ చీఫ్ కావాలనే కోరిక ఉందమో. ఆమె సినిమా స్టార్‌గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయశాంతి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమే. ఆమె సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం. పార్టీ కోసం మరింత సమయం వెచ్చిస్తే విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు...ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలి. పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలి. అప్పుడే పీసీసీకి కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుంది. పదవుల కోసం, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్‌లో పుష్కలంగా ఉన్నారు. ఈ అంశంపై త్వరలో పార్టీ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. పార్టీ కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారనేది వాస్తవం. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఎదుగదలకే పని చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన పనిచేయలేదు. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి ఫాయిదా లేదన్నది సరికాదు. పార్టీ క్యాడర్లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారు. సీనియర్లు అంతా పీసీసీకి సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీకి మనుగడ. ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్ వైఫల్యం కాదు. సొంత ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు. ఉత్తమ్, కుంతియ అమ్ముడుపోయారనేది సరికాదు. వాళ్లను ఎవరు కొనలేరు. ఇక పార్టీలో కోవర్టులు ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతా.’ అని అన్నారు. -
‘ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు’
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మా త అంబేడ్కర్ జయంతి సందర్భంలో ఆ మహానేతను అవమానించేలా వ్యవహరించిన టీఆర్ ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని టీఆర్ఎస్, అనేక సందర్భాల్లో వారిని కించపరుస్తూనే వచ్చిందని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘ఓటమి భయంతోనే చంద్రబాబు నాటకాలు’ సాక్షి, హైదరాబాద్: దేశంలో మోదీ ప్రభంజనం జీర్ణించుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు ఈవీఎంల పేరుతో తెరలేపారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే ఆయన నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 2014లో ఈవీఎంలు బాగున్నాయని, ఇప్పుడేమో వద్దంటూ చంద్రబాబు అండ్ కంపెనీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చంద్ర బాబుతోపాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని పేర్కొన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు నిజమైతే బీజేపీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం ఎందుకు పోగొట్టుకుంటుందని పొంగులేటి ప్రశ్నించారు. -
‘ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏదీ పనిచేయదని ఒక నియంతం రాజ్యం నడుస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగా నిర్మాత, ప్రపంచ మేధావి డా.బి.ఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చెడు జరుగుతుందని అన్నారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసి చెత్త డంపింగ్ యార్డ్‌లో పడేసినా.. సమాజంలో స్పందన రాకపోతే ఇంత నిస్తేజంగా ఉంటే రాజ్యం ఎలా నడుస్తుందని నిలదీశారు. 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పాడని గుర్తు చేశారు. చైనా, జపాన్ లాంటి దేశాలు తిరిగి నమూనాలు చూశారు కానీ మూడేళ్లైనా ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయని దద్దమ్మలు పేదలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. ఇంత నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులు చేస్తున్న ఈ పాలకులకు అంబేద్కర్ జయంతిని చేసే అర్హత లేదని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులకు ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని హామి మోసం చేశాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితుడుని సీఎల్పీ నేతగా చేస్తే భరించలేక రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సందర్భాలలో రకరకాలుగా వారిని కించపరుస్తూనే వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంలో ఆ మహానాయకుడిని అవమానించి, విగ్రహానికి ఇంత దుర్గతి పట్టించిన ఈ ప్రభుత్వానికి రాజ్యాంగబద్దమైన అధికారంలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదన్నారు. -
‘నెలకు ఆరు వేలా.. ఏడాదికి నాలుగు వేలా?’
సాక్షి, సంగారెడ్డి : రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ప్రతి పేదవానికి నెలకు ఆరు వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, రాహుల్ ఇచ్చే ఆరు వేలు తీసుకుందామా? లేక కేసీఆర్ ఏడాదికోసారి ఇచ్చే నాలుగు వేలు తీసుకుందామా అని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రజలను ప్రశ్నించారు. సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో విజయశాంతి మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానన్నారు. అది ఏ పార్టీలో అన్నది ముఖ్యం కాదన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టరని అన్నారు. ఇవి ఎంతో ముఖ్యమైన ఎన్నికలనీ.. న్యాయానికి, అన్యాయానికీ మధ్య జరగుతున్న ఎన్నికలని అన్నారు. మోదీ అన్యాయం వైపు ఉంటే రాహుల్‌న్యాయం వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ను ఖతం చేయాలనుకుంటున్న కేసీఆర్, మోదీల కుట్రలను పటాపంచలు చేస్తామని హెచ్చరించారు. రాహుల్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని.. కానీ, మోదీ మాటివ్వడం తప్పా అమలు చేయరని విమర్శించారు. -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: విజయశాంతి
రామచంద్రాపురం (పటాన్చెరు): కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మెదక్ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతూ ఆమె రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారం చెలాయించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో కేసీఆర్ ప్రజలకు వివరించాలని కోరారు. మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో తాను చేసిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేయాలని కోరారు. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అంద రిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ విషయం రాహుల్‌కి బాగా తెలుసు’
సాక్షి, హైదరాబాద్ : తీవ్రవాదం వల్ల కలిగే నష్టం గురించి బీజేపీ చెప్తే వినాల్సిన దుస్థితిలో రాహుల్ గాంధీ లేరని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదిని జీ అన్నందుకు రాహుల్ గాంధీ ఏదో పెద్ద నేరం చేసినట్లు బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. తీవ్రవాదం వల్ల కలిగే నష్టం గురించి రాహుల్ గాంధీకి బీజేపీ చెప్పాల్సిన పని లేదన్నారు. ఎందుకంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరూ తీవ్రవాదుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తు చేశారు. కాబట్టి తీవ్రవాదం వల్ల కలిగే బాధ రాహుల్ గాంధీకే బాగా తెలుసని విజయశాంతి అన్నారు. అంతేకాక తన తండ్రి రాజీవ్ గాంధీని అమానుషంగా హత్య చేసిన ఎల్టీటీఈ సభ్యులకు విధించిన మరణ శిక్షను కూడా రద్దు చేయమని చెప్పి రాహుల్ మానవతావాదాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. కానీ బీజేపీ నేతలు దీన్ని కూడా తప్పుగా ప్రచారం చేస్తారని ఆరోపించారు. ఉరిశిక్షను రద్దు చేయమని చెప్పినందువల్ల బీజేపీ నాయకులు రేపు రాహుల్ గాంధీ.. ఎల్టీటీఈ తీవ్ర వాదులతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్‌ని విమర్శించడానికి కారణం దొరక్క బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుండటం శోచనీయమాన్నారు. -
మోదీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార తార విజయశాంతి ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ టెర్రరిస్టులా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను రక్షించాల్సింది పోయి భయపెడుతున్నారని ఆరోపించారు. రానున్న లోకసభ ఎన్నికలు కాంగ్రెస్-బీజేపీకి మధ్య జరిగే యుద్ధమంటూ విజయశాంతి అభివర్ణించారు. మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ దమ్ముంటే అరెస్టు చేయ్.. మోదీకి సవాల్! ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, అయితే మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. మోదీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని దేశ ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు.. జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మోదీని గద్దె దింపాలని విజయశాంతి పిలుపునిచ్చారు. కాగా ఇదే సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. మోదీ, కేసీఆర్ కుమ్మకైయ్యారని విజయశాంతి ఆరోపించారు. -
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ప్రలోభాలు’
సాక్షి, హైదరాబాద్: ఈవీ ఎంలను అడ్డం పెట్టుకుని, అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు ప్రజా తీర్పును సైతం అవహేళన చేస్తూ ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టే పనిలో పడిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే రీతిలో ఆపరేషన్ ఆకర్‡్ష పేరుతో టీఆర్ఎస్ అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ వెనువెంటనే వేటు వేశారని, అయితే కాంగ్రెస్, టీడీపీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి వివాదాలకు తావివ్వని రీతిలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. -
మెజారిటీ సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్.. రాష్ట్రంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, కో–చైర్మన్ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్, మోదీ మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రచార కమిటీ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, ఆకుల రాజేందర్, బెల్లయ్య నాయక్, చామల కిరణ్ రెడ్డి, నేరెళ్ల శారద, కోటూరి మానవతారాయ్, అనిల్ తదితరులతో కలిసి డీకే అరుణ నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. కుట్రలు, కుతంత్రాలు చేసి, కోట్ల రూపాయలు ధారపోసి గెలిచిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీపై ఇక్కడి ప్రజల్లో కోపం ఉన్న మాట వాస్తవమేనని విజయశాంతి అన్నారు. ఆ కోపాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకున్నామని, అయితే ప్రజల్లో ఇంకా టీడీపీపై కోపం ఉందన్నవిషయాన్ని అసెంబ్లీ ఫలితాలు వెల్లడించాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, కనీసం మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఫామ్‌హౌజ్‌లో యాగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రజలు గెలిపించింది పాలించడానికా.. యాగాలు చేయడానికా?’అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతాయని, మోదీ, రాహుల్‌ల మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలిచి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ నెలలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని విజయశాంతి వెల్లడించారు. కోచైర్మన్ డీకేఅరుణ మాట్లాడుతూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకున్నామని, అయితే, టీఆర్ఎస్ ధనబలంతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో 16 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి మళ్లీ కాంగ్రెస్‌కు పట్టంగట్టాలని ఓటర్లకు అరుణ విజ్ఞప్తి చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచినా ఫలితం లేదని.. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ కేసీఆర్ సాధించలేదని ఆమె విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఈవీఎంల వినియోగంపై అనుమానాలున్నప్పుడు.. బ్యాలెట్ వినియోగించడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్‌సభకు తాను పోటీచేయాలా వద్దా అన్నది అధిష్టానం నిర్ణయమని అరుణ స్పష్టం చేశారు. -
మమతపై కేంద్ర వైఖరి పట్ల కేసీఆర్ స్పందనేది?
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీపై కేంద్ర వైఖరి పట్ల సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ ప్రతిపాదనను సమర్థించిన మమతా బెనర్జీ 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మమతకు మద్దతుగా, కేంద్ర వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ ఎందు కు మాట్లాడటం లేదు?’అని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పరిధిలోకి ఈ అంశం రాదా? లేక కొన్ని విషయాలను చూసి, చూడనట్లు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో భాగమా? అని ఎద్దేవా చేశారు. -
బీజేపీ రుణం తీర్చుకునేందుకు ఆరాటం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు చేసిన రోజు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు తెరవెనుక సహకరించిన బీజేపీ రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాగా ఆరాట పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ తెరచాటు ప్రయత్నాలు చేసి, మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాగనంపి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు దేశంలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ తరుణంలో యూపీఏ బలపడకుండా అడ్డుకునేందుకే మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్‌లతో మంతనాల పేరుతో కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వేసుకున్న బీజేపీ ముసుగు త్వరలో తొలగిపోయి నిజస్వరూపం బయటపడటం ఖాయమని తెలిపారు. -
‘కాంగ్రెస్ సీటు ఇచ్చినా.. నేనే పోటీ చేయడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు కేటాయించడంలేదని వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ కోరినప్పటికీ తానే పోటీ చేయడం లేదన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార బాధ్యతలు ఉండడం వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తానని వాఖ్యానించారు. -
కూలిన కాంగ్రెస్ వేదిక నాయకులకు తప్పిన ప్రమాదం
-
కూలిన స్టేజీ.. కాంగ్రెస్ నాయకులకు తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభావేదికపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేయడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో కార్యకర్తలు ఉత్సాహంతో విజయశాంతికి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని ముందుకు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రమాద సమయంలో సభా వేదికపై విజయశాంతితోపాటూ, కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మరికొందరు నేతలు ఉన్నారు. షెడ్యుల్‌లో భాగంగా కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ బహిరంగ సభ ముగించుకొని అచ్చంపేటలో సభకు హాజరయ్యారు. ప్రమాదం తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రచార రథంపై నిలబడి కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి హెలీక్యాప్టర్‌లో వెళ్లిపోయారు. -
బుజ్జగింపులు షురూ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గతంలో రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఇతర ముఖ్య పదవుల్లో పనిచేసి ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న వారిని మళ్లీ పార్టీ లో క్రియాశీలం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమితులయిన ముగ్గురు కార్యదర్శులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు మంగళవారం మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాగే వారం క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముగ్గురు కార్యదర్శులు కలిసినట్టు తెలుస్తోంది. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతితో కూడా బోసురాజు నేడో, రేపో సమావేశమవుతారని సమాచారం. ఆ రెండు జిల్లాల నేతలకేనా ప్రాధాన్యం? బోసురాజుతో భేటీ సందర్భంగా మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తన అసంతృప్తికి గల కారణాలను వివరించారు. పార్టీలో కేవలం రెండు జిల్లాల నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, మిగిలిన నేతలను కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలే సర్వం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి నేతలను అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారతారనే ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని, తాను అసంతృప్తితో ఉన్నానని తెలిసి కూడా ఏ ఒక్క నాయకుడూ తనతో మాట్లాడలేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 డివిజన్లలో తాను విస్తృతంగా పర్యటించానన్నారు. తన అసంతృప్తి వెనుక ఉన్న కారణాలను పట్టించుకునే ప్రయత్నం టీపీసీసీ నేతలు చేయలేదని ముఖేశ్ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బోసురాజు ముఖేశ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు అన్ని పరిస్థితులు తెలుసునని, అన్ని విషయాలను రాహుల్‌కు చెప్పానని, పార్టీలోనే కొనసాగాలని పేర్కొన్నారు. రాహుల్ రాష్ట్ర పర్యటనలో ఆయనతో మాట్లాడిస్తానని హామీ ఇస్తానని చెప్పినట్టు ముఖేశ్ సన్నిహితుల ద్వారా తెలిసింది. మరోవైపు వారం రోజుల క్రితం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ముగ్గురు కార్యదర్శులు దాదాపు 2 గంటలు సమావేశమయ్యారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పార్టీ పట్ల తనకున్న అసంతృప్తిని వారి ముందు రాజనర్సింహ కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. సముద్రం లాంటి పార్టీలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయని, అన్నింటిని పరిష్కరించుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేద్దామని కార్యదర్శులు దామోదరకు సూచించినట్టు తెలిసింది. స్థానిక నేతలను వదిలి.. నియోజకవర్గాల పరిధిలో నేతల మధ్య సమన్వయం కోసమే నియమించిన కార్యదర్శులపైనే రాహుల్ నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను టీపీసీసీ నేతలకు కాకుండా కార్యదర్శులకే అప్పగించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న నేతల జాబితాను తయారు చేసుకున్నట్టు సమాచారం. ఈ జాబితా ప్రకారం క్రమంగా ఒక్కో నేతను కలిసి రాహుల్ పర్యటన నాటికి పార్టీలో అందరినీ క్రియాశీలం చేయాలనే కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ పర్యటన అనంతరం రాష్ట్ర పార్టీలో అసంతృప్తులు లేకుండా చేయాలనే ధ్యేయంతోనే కార్యదర్శులు ముందుకెళ్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లోనే ఉన్నా: ముఖేశ్‌గౌడ్ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో సమావేశం అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఇల్లు గాంధీభవన్‌కు కూతవేటు దూరంలో ఉందని, తాను ఇంట్లో ఉన్నా గాంధీభవన్‌లో ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. బోసురాజు ఇచ్చిన సలహాలను స్వీకరించానని చెప్పారు. బోసురాజు మాట్లాడుతూ ముఖేశ్‌తో అన్ని విషయాలు చర్చించినట్టు చెప్పారు. -
చిరంజీవి వల్లే ఏం కాలేదు.. పవన్ ఏం చేస్తాడు?
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు పవన్‌కళ్యాణ్ అవసరం కోసం రాజకీయాలు చేస్తుండవచ్చునని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఎం.విజయశాంతి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విజయశాంతి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన అన్న (చిరంజీవి) వల్లే ఏమీ కాలేదని, తమ్ముడు ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారని, పవన్ మాటలు వారు నమ్మబోరని అన్నారు. కోదండరాం, మందకృష్ణ వంటి వారికి సమస్యలపై పోరాడే హక్కుందని.. కోదండరాంను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పితే ప్రజలనూ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని ఇత్తడి తెలంగాణ చేస్తున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం మినహా రాష్ట్రంలో ఎవరి కుటుంబమూ బంగారుమయం కాలేదని దుయ్యబట్టారు. ఉద్యమంలోని కేసీఆర్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వేర్వేరు అని వ్యాఖ్యానించారు. తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. వ్యక్తిగత పనుల వల్ల కొంతకాలం మౌనంగా ఉన్నానని, ఇక నుంచి పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేయాలని రాహుల్‌గాంధీ సూచిస్తున్నారని చెప్పారు.