waqar younis
-
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్‌లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్‌గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా ఘజన్‌ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్‌లో అఫ్గాన్‌తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్‌ఫన్.. షకీబ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024 -
PAK VS AUS: భారీ రికార్డుపై కన్నేసిన షాహీన్ అఫ్రిది
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో అఫ్రిది మరో 12 వికెట్లు తీస్తే.. పాకిస్తాన్ ఆల్‌టైమ్ గేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొడతాడు. వకార్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో 48 వికెట్లు ఉన్నాయి. ఆసీస్‌పై వకార్ ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. షాహీన్ కూడా ఓ సారి ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ఇవాళ తొలి వన్డే ఆడింది. ఈ పర్యటనలో పాక్ మరో రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో షాహీన్ మరో 12 వికెట్లు పడగొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ పర్యటనలోనే షాహీన్ వకార్ యూనిస్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.షాహీన్ ఆల్‌రౌండ్ షోమెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో షాహీన్ అఫ్రిది ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ బ్యాట్‌తో, బంతితో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది.నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన రబాడ.. దెబ్బకు ప్రపంచ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా రబాడ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో రబాడ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సఫారీ పేస్ గుర్రం కేవలం 11,187 బంతుల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది. యూనిస్ 12,602 బంతుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో వకార్ ఆల్‌టైమ్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌ల పరంగా అయితే రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో రబాడ నాలుగో స్ధానంలో ఉన్నాడు.మూడో సఫారీ పేసర్గాఅదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సౌతాఫ్రికా బౌలర్‌గా రబాడ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో డేల్ స్టెయిన్(439) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు వీరేకగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 11817 బంతులువకార్ యూనిస్ (పాకిస్థాన్) – 12602 బంతులుడేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 12605 బంతులుఅలాన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) – 13672 బంతులుటెస్టుల్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..డేల్ స్టెయిన్ – 93 మ్యాచ్‌ల్లో 439 వికెట్లుషాన్ పొలాక్ – 108 మ్యాచ్‌ల్లో 421 వికెట్లుమఖాయ ఎంతిని – 101 మ్యాచ్‌ల్లో 390 వికెట్లుఅలెన్ డొనాల్డ్ – 72 మ్యాచ్‌ల్లో 330 వికెట్లుమోర్నీ మోర్కెల్ – 86 మ్యాచ్‌ల్లో 309 వికెట్లుకగిసో రబాడ – 65 మ్యాచ్‌ల్లో 301* వికెట్లు -
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
'అతడు పాక్ క్రికెట్‌ను నాశనం చేస్తాడు.. సెలెక్టర్లు సిగ్గుపడాలి'
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ అన్ని విధాల సన్నద్దమవుతోంది. రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్‌లను జట్టు నుంచి పీసీబీ విడుదల చేసింది. వీరిద్దరూ బంగ్లాదేశ్ 'ఎ'తో ప్రారంభమయ్యే రెండవ నాలుగు రోజుల మ్యాచ్‌లో పాకిస్తాన్ షాహీన్స్ తరపున ఆడాలని పీసీబీ ఆదేశించింది. అయితే ప్రధాన జట్టుకు ఎంపికైనప్పటకి తొలి టెస్టుకు ముందు గులామ్, ఆహ్మద్‌ను విడుదల చేయడాన్ని ఆ దేశ మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ చేరాడు. పీసీబీ సలహాదారు వకార్ యూనిస్, పాక్ సెలక్షన్ కమిటీపై అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ క్రికెట్లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారా? బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు ముందు జట్టు నుంచి అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను వకార్ యూనిస్ అండ్ సెలక్షన్ కమిటీ తప్పించింది. వకార్ యూనిస్ పాక్ క్రికెట్‌ను నాశనం చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అబ్రార్, కమ్రాన్ గులామ్‌లను జట్టు నుండి తప్పించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ సిగ్గుపడాలి. అబ్రార్, కమ్రాన్ గులామ్‌లను జట్టు నుండి తొలగించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ నిజంగా సిగ్గుపడాలి. తనను తాను పెద్ద లెజెండ్‌గా చెప్పుకుంటున్న వకార్ యూనిస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ ఇద్దరు క్రికెటర్లను ఎందుకు జట్టు నుంచి రిలీజ్ చేశారని ఎక్స్‌లో వకార్ యూనిస్ మండిపడ్డాడు. -
'పాక్ విజయం సాధించాల్సింది.. కానీ భారత్ మాత్రం అద్బుతం'
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా రెండో విజయాన్ని తమ భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయర్క్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్ సేన.. బౌలింగ్‌లో మాత్రం విజృభించింది. 120 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసిన భారత బౌలర్లు తమ జట్టుకు అద్భుమైన విజయాన్ని అందించారు. ఈ క్రమంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా అన్ని విభాగాల్లో బ్యాలెన్స్‌గా ఉందని వకార్ యూనిస్ కొనియాడాడు."ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌లో విఫలమకావడంతో పాకిస్తాన్ ఈజీగా విజయం సాధిస్తుందని నేను భావించాను. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చూసి పాక్ ముందు 140 నుంచి 150 పరుగుల స్కోర్ ఉంచుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఆఖరిలో వరుసగా వికెట్లు కోల్పోవడం అనుకున్న టార్గెట్‌కు చేరుకోలేకపోయింది. అయితే భారత జట్టు మాత్రం అన్ని విభాగాల్లో బ్యాలెన్స్‌గా ఉంది. ఒకవేళ బ్యాటర్లు విఫలమైతే బౌలర్లు యాక్షన్‌లోకి వస్తారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. వారి ఫీల్డింగ్ కూడా అత్యుత్తమంగా ఉంటుంది. అందుకే భారత్ సూపర్ టీమ్‌గా కన్పిస్తోంది. పాక్‌కు ఆరంభం వచ్చినప్పటికి సద్వినియోగం చేసుకోలేకపోయారు. మిడిలార్డర్ బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయారని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వకార్ పేర్కొన్నాడు. -
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పాక్ దిగ్గజ పేసర్లు వసీం అక్రం, వకార్ యూనిస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఇద్దరితో పాటు సలీమ్ మాలిక్ పైనా ఆరోపణలు రావడంతో దీనిపై జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అక్రమ్, వకార్ల పేర్లు ఉన్నాయి. తాజాగా రమీజ్ రాజా ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ ఫిక్సింగ్ కేసులో చాలా మంది ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 2010లో మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్ 2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ అయ్యాక వీళ్లెవరినీ సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయంపై రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు. ''నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా తప్పించుకోకూడదు'' అని అన్నాడు. . చదవండి: లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి -
జట్టులో కీలక సభ్యుడు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
India Vs Pakistan: ‘‘గత కొంత కాలంగా అతడి ఆటతీరును ఒక్కసారి గమనిస్తే.. ఐపీఎల్-2022 సందర్భంగా తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జట్టును విజయవంతంగా ముందుకు నడిపాడు. టైటిల్ గెలిచాడు. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఒత్తిడిని అధిగమించిన తీరు అమోఘం. ముఖ్యంగా ఫినిషర్‌గా బాధ్యతను నెరవేర్చిన తీరు అద్భుతం’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. మానసికంగా దృఢంగా ఉండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో పాండ్యా నిరూపించాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2021 తర్వాత పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సాధించే క్రమంలో చాలా కాలం భారత జట్టుకు దూరమైన అతడు.. ఐపీఎల్-2022తో తొలిసారిగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే జట్టును విజేతగా నిలిపాడు. పునరాగమనంలో అదరగొట్టి ఈ క్రమంలో టీమిండియాలో పునరాగమనం చేసి భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి పలు సిరీస్‌లు గెలిచాడు. ఇక ఆసియాకప్-2022లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో.. ప్రపంచకప్-2022లో దాయాదితో పోరులో విరాట్ కోహ్లితో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తదుపరి కెప్టెన్ అతడే ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన విధానాన్ని పాకిస్తాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ స్ఫూర్తిదాయకం అని కొనియాడాడు. ఇక వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ముందు తను ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ట్రోఫీ గెలిచాడు. ఇప్పుడు జట్టులో తను కీలక సభ్యుడు మాత్రమే కాదు.. కెప్టెన్‌కు సలహాలు ఇవ్వగల స్థాయిలో ఉన్నాడు. జట్టు జయాపజయాలపై తన ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తను టీమిండియా తదుపరి కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు. అసలైన పోరులో కీలక పాత్ర ఆసియాకప్-2022లో పాక్‌తో తొలి మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన హార్దిక్ పాండ్యా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత 17 బంతుల్లోనే 33 పరుగులతో అజేయంగా నిలిచి ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2022 ఆరంభ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన హార్దిక్.. 37 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లికి సహకరిస్తూ అతడితో కలిసి జట్టును గెలిపించాడు. చదవండి: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా.. -
'ఆఫ్రిదికి అంత సీన్ లేదు.. దమ్ముంటే గెలిచి చూపించండి'
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా ఆసియాకప్-2022కు దూరమైన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తం విషయం పక్కన పెడితే భారత్‌తో మ్యాచ్‌కు ఆఫ్రిది దూరం కావడం పాక్‌కు గట్టి ఎదరుదెబ్బ అనే చేప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆసియా కప్ నుంచి ఆఫ్రిది తప్పుకోవడంతో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఊపిరి పీల్చుకోనున్నారని యూనిస్ అభిప్రాయడ్డాడు. కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించడంలో షాహీన్ షా కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపి షాహీన్ దెబ్బ కొట్టాడు. ఆ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన గాను ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. షహీన్ దూరం కావడం భారత బ్యాటర్లకు బిగ్ రిలీఫ్ "షహీన్ గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరం కావడం భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు పెద్ద ఉపశమనం. అతడు ఆసియా కప్‌లో భాగం కాకపోవడం పాక్‌కు గట్టి ఎదురు దెబ్బ. అతడు త్వరగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరుతాడని ఆశిస్తున్నా" అంటూ యూనిస్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చేసిన యూనిస్‌ను భారత అభిమానులు ట్విటర్లో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. "ఆఫ్రిదికి అంత సీన్ లేదు, ముందు ఆసియాకప్‌లో గెలిచి చూపించండి" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. కాగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా తలపడనుంది. ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ ఆసియా కప్‌కు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ ఉస్మాన్ ఖదీర్ Shaheen’s injury Big relief for the Indian top order batsmen. Sad we won’t be seeing him in #AsiaCup2022 Get fit soon Champ @iShaheenAfridi pic.twitter.com/Fosph7yVHs — Waqar Younis (@waqyounis99) August 20, 2022 చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే? -
'వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు పేసర్లే నా ఆదర్శం'
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన మాలిక్.. ఏకంగా భారత జట్టులో చోటు కొట్టేశాడు. ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టీ20లో మాలిక్ భారత తరపున అరేంగట్రం చేయనున్నాడు. కాగా ఐపీఎల్లో దుమ్ము రేపిన ఈ స్పీడ్ స్టార్‌పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్‌ను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసించాడు. ఉమ్రాన్ పేస్ చూస్తుంటే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకొస్తున్నాడంటూ చెప్పాడు. అయితే తాజగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్‌ను ఇదే విషయం ప్రశ్నించగా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఎప్పడూ వకార్ యూనిస్‌ను అనుసరించలేదని, భారత పేస్ దిగ్గజాలు జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ షమీ,భువనేశ్వర్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకున్నాని మాలిక్ తెలిపాడు. "నేను వకార్ యూనిస్ బౌలింగ్‌ను ఎప్పడూ ఫాలో కాలేదు. నాకంటూ ఓ బౌలింగ్ స్టైల్ ఉంది. టీమిండియా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ భాయ్ నేను క్రికెట్లో ఎక్కువగా ఆరాదించే బౌలర్లు. నా కెరీర్ ఆరంభం నుంచే ఈ ముగ్గరి దిగ్గజాలని అనుసరిస్తూ ఉన్నాను. దేశం తరపున ఆడటం నాకు గర్వంగా ఉంది. నా దేశం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో నాకు అవకాశం లభించింది. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఒంటి చేత్తో గెలిపించి భారత్‌కు అందించడమే నా లక్ష్యం" అని ఉమ్రాన్ మాలిక్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA T20: టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా నెట్ బౌలర్‌గా ఢిల్లీ యువ ఆటగాడు..! -
'ఉమ్రాన్ మాలిక్‌కు పెద్ద అభిమానిని.. మదిలోకి పాక్ దిగ్గజ బౌలర్'
ఎస్ఆర్హెచ్ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022 సీజన్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150 కిమీ వేగంతో సంధించే ఉమ్రాన్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని(157.8 కిమీ) సంధించి రికార్డు సృష్టించాడు. ఇక బౌలింగ్‌లో దుమ్మురేపిన ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు కొల్లగొట్టాడు. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/25తో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. కాగా ఈ సీజన్లో తన ప్రదర్శనకు గానూ ఉమ్రాన్ మాలిక్ ''ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్'' అవార్డును కైవసం చేసుకున్నాడు. అతని బౌలింగ్‌కు ఫిదా అయిన మాజీ క్రికెటర్లు త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొనడమే తరువాయి.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికవ్వడం విశేషం.తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ ఉమ్రాన్ మాలిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఉమ్రాన్ మాలిక్‌కు పెద్ద అభిమానిని. అతని బౌలింగ్‌లో ఉండే వేగం ప్రత్యర్థి బ్యాటర్లను తగలెట్టేస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉమ్రాన్‌లో స్పష్టంగా ఉన్నాయి. కచ్చితమైన వేగం.. బులెట్ వేగంతో వచ్చే బంతులు.. ఇవన్నీ కలిపి ఉమ్రాన్ గురించి ఆలోచిస్తుంటే నాకు పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకు వస్తున్నాడు. వకార్ యూనిస్ కూడా ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. గంటకు 150 కిమీవేగంతో బంతులు సందిస్తూ వికెట్లు తీసేవాడు. అందుకే అంత గొప్ప ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. ఉమ్రాన్ కూడా ఏదో ఒకరోజు ఆ స్థాయికి చేరుకుంటాడని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. కొత్త క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన షాహిద్ అఫ్రిది
Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పాడు. మెగా స్టార్ లీగ్ (ఎమ్ఎస్ఎల్) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. ఈ లీగ్‌లో పాకిస్థాన్ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, చలన చిత్ర, సంగీత రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నాడు. పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్ వేదికగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 37 బంతుల్లోనే వన్డే సెంచరీ సాధించడం ద్వారా అఫ్రిది తొలిసారి వార్తల్లోకెక్కాడు. చదవండి: ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20 ఖలీఫా..! -
Misbah-ul-Haq: బలిపశువుల కోసం వెతకడమే పని.. పైపై మెరుగులు చాలవు..
Misbah-ul-Haq questions Pakistan selectors on T20 World Cup squad: ‘‘అవసరమైన విషయాలపై మనం దృష్టి పెట్టం. మూలాల నుంచి అభివృద్ధి చేయాల్సిన సత్యాన్ని గుర్తించం. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా.. జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు ఆశిస్తాం. అనుకున్న ఫలితాలు రాకపోతే... బలిపశువుల కోసం వెదుకుతాం. మనకు ఓపిక ఉండదు. ప్రణాళిక అంతకంటే ఉండదు. కానీ... ఆశించిన ఫలితాలు మాత్రం రావాలి’’ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్సా ఉల్ హక్ పాక్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు. అదే విధంగా ఆటను ఎలా అభివృద్ధి చేయాలన్న విషయం కంటే కూడా... పైపై మెరుగులు దిద్దేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. పాక్ హెడ్ కోచ్ మిస్బా, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు వీరిద్దరు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారిగా పాక్ జట్టు గురించి మీడియాతో మాట్లాడిన మిస్బా... పీసీబీ తీరును ఎండగట్టాడు. ‘‘దురదృష్టవశాత్తూ... బలిపశువుల కోసం వెతకడం పాకిస్తాన్ క్రికెట్లో ఓ ఆనవాయితీగా మారింది. ఒక మ్యాచ్ లేదంటే, సిరీస్ ఓడిపోయిన అనంతరం.. తమను తాము కాపాడుకునేందుకు కొంతమంది ఇలా చేస్తారు. ఇది ఇలాగే కొనసాగితే మన తలరాత అస్సలు మారదు. పైపై మెరుగులతో ఎక్కువ రోజులు నెట్టుకురాలేము. కోచ్‌లను, ఆటగాళ్లను మార్చినంతం మాత్రాన... సమస్య పరిష్కారం కాదు. మూలాల నుంచే ప్రక్షాళన జరగాలి’’ అని చురకలు అంటించాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి మిస్బా స్పందిస్తూ... ‘‘అసలేం జరుగుతోంది? తొలుత కొంతమంది ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తారు. ఆ తర్వాత 10 రోజులకే యూటర్న్ తీసుకుంటారు. తొలుత డ్రాప్ చేసిన ఆటగాళ్లను మళ్లీ జట్టుకలోకి తీసుకుంటారు. ఇదంతా ఏంటి?’’ అని ప్రశ్నించాడు. కాగా 15 మంది సభ్యులు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో జట్టును ప్రకటించిన పీసీబీ.. ఆ తర్వాత మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. అనంతరం సొహైబ్ మక్సూద్ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానంలో వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌కు అవకాశం ఇచ్చింది. చదవండి: T20 World Cup Ind vs Pak: ఎల్లప్పుడూ మనదే విజయం.. ఈసారి కూడా! -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా
ఇస్లామాబాద్: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్ కోచ్ మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్ ప్రపంచకప్ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేయడం పాక్ క్రికెట్లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి తప్పుకోవడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లకు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో 15 మంది సభ్యుల పాక్ బృందాన్ని పీసీబీ ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. కాగా, ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల సమరం అక్టోబర్ 24న జరగనున్న సంగతి తెలిసిందే. పాక్ టీ20 ప్రపంచకప్ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..? -
‘కోచ్‌లుగా ఉండి ఏంచేస్తున్నారు’
కరాచీ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సోహైల్ ... మిస్బా నేతృత్వంలోని కోచింగ్ టీంను తనదైన శైలిలో విమర్శించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాక్ జట్టు నిరాశజనక ప్రదర్శనపై కోచ్‌లు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమీర్ సోహైల్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. 'పాక్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమవుతుంటే.. కోచ్‌లు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప వారికి ఎటువంటి సూచనలు చేయడం లేదు. మిస్బా నేతృత్వంలోని కోచింగ్ టీమ్ ఏం చేస్తుంది.. వారిని ఎందుకు కోచ్‌లుగా నియమించారు.. సరదాగా ఇంగ్లండ్ చూడడానికి వచ్చారా.. లేక పాక్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వచ్చారా.. ఎంజాయ్ చేయడానికి వచ్చాం అనుకుంటే మాత్రం కోచ్‌లందరూ కలిసి వరల్డ్ టూర్‌కు వెళ్లండి..మీరు కోచ్‌లుగా పనిచేయడం వ్యర్థం 'అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా పాక్ జట్టుకు మిస్బా ఉల్ హక్ ప్రధాన కోచ్‌గా కొనసాగడంతో పాటు పాక్ జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక పాక్ బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్, ఫీల్డింగ్ కోచ్‌గా గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న పాకిస్తాన్ 0-1 తేడాతో వెనుకపడి ఉంది. రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా.. కీలకమైన మూడో టెస్టులోనూ నిరాశపరుస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 8వికెట్ల నష్టానికి 583 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 273 పరుగులకే చాప చుట్టేసి పాలోవన్ ఆడుతోంది. ఇప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. చదవండి : (ఇది నా 13 ఏళ్ల కష్టం) (‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్ చేజార్చుకున్నాం’) -
పాకిస్తాన్ చేసింది ముమ్మాటికీ తప్పే: వకార్
కరాచీ: గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి చెందడానికి టాస్ మొదలుకొని అనేక తప్పులు చేయడమే కారణమని ఆ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ చేయకపోవడం ఆ జట్టు చేసిన అతి పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డాడు. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే ఆదిలోనే వికెట్లు సాధించి ఒత్తిడిలోకి నెట్టవచ్చని పాక్ ఆశించిందని అది కొంపముంచిందన్నాడు. భారత క్రికెట్ జట్టులో మంచి ఓపెనర్లు ఉన్నారన్న సంగతిని ఆ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ మరచిపోయినట్లు ఉన్నాడని ఎద్దేవా చేశాడు. అనాలోచిత నిర్ణయాలతోనే పాక్ భారీ మూల్యం చెల్లించుకుందని వకార్ విమర్శించాడు. (సుశాంత్‌ను కలుస్తానని మాటిచ్చా..) ‘టాస్ దగ్గర్నుంచీ పాకిస్తాన్ తప్పుచేయడం ఆరంభించింది. టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ ఇవ్వడం అంటే చాలా పెద్ద పొరపాటు. భారత్ బ్యాటింగ్‌కు దిగింది మొదలు చివరి వరకూ పరుగుల వరద పారించింది. పాకిస్తాన్ బౌలర్లకు పిచ్ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. భారత్‌ను ఆపడం పాక్ బౌలర్లకు కష్టంగా మారిపోయింది. అదే పాక్ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని భారత్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది’ అని వకార్ తెలిపాడు. ఆనాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ శర్మ(140), కేఎల్ రాహుల్(57), విరాట్ కోహ్లి(77)లు రాణించడంతో భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఛేజింగ్‌లో విఫలమైంది. ఫకార్ జమాన్(62), బాబర్ అజామ్(48)లు మాత్రమే రాణించడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కల్గించిన ఆ మ్యాచ్‌కు పాకిస్తాన్ 40 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓటమి పాలైంది. (శ్రీశాంత్.. నీ కోసమే వెయిటింగ్) -
మాటల యుద్ధానికి ముగింపు పలకండి
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌లు సోషల్ మీడియాలో మాటల యుద్దానికి ముగింపు పలకాలని ఆయన కోరారు. భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగాలని ఆకాంక్షించారు. తాజాగా ఓ ఆన్లైన్ చాట్ షోలో పాల్గొన్న యూనిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చాలా కాలంగా వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవేళ వారి మధ్య మాటల యుద్దం శాంతించకపోతే.. ప్రపంచంలో ఏదో ఒకచోట కూర్చొని మాట్లాడుకోవాలని నేను వారికి సలహా ఇస్తున్నాను’అని తెలిపారు. అలాగే, భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని యూనిస్ అన్నారు. క్రికెట్ అభిమానులు నిరాశ చెందకుండా ఉండటం కోసం పాకిస్తాన్, ఇండియాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అది ఎక్కడ జరుగుతుందో తెలియదన్నారు. కాగా, భారత్, పాక్‌ల మధ్య 2013 జనవరి తర్వాత నుంచి ద్వైపాక్షిక సీరిస్ జరగని సంగతి తెలిసిందే. ఇక, గంభీర్, ఆఫ్రిదిల మధ్య ఎప్పుడూ ఏదో అంశంపై సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పీవోకేకు సంబంధించి ఆఫ్రిది చేసిన వివాదస్పద వ్యాఖ్యలను గంభీర్ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తనదైన శైలిలో వ్యంగ్యాస్రాలు సంధించారు. -
పోర్న్ వీడియోలకు లైక్స్.. వకార్ కీలక నిర్ణయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ హ్యాకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురైనట్లు పేర్కొంటూ ఓ వీడియోను వకార్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్బంగా ఈ మాజీ పేసర్ మాట్లాడుతూ.. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురయ్యాయని, హ్యాక్ అయిన సమయంలో తన అకౌంట్ నుంచి ఏదైనా పోస్ట్ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇక జీవితంలో సోషల్ మీడియా జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. వకర్ యూనిస్ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు పలు పోర్న్ వీడియోలు, ఫోటోలకు లైక్ కొట్టారు. అంతేకాకుండా పలు అసభ్యకరమైన పోస్టులను షేర్ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వకార్ తన టెక్నికల్ టీం సహాయంతో అన్ని అకౌంట్లను తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇక ఈ పేస్ బౌలర్ హ్యాక్‌కు గురవ్వడం ఇదే తొలి సారి కాదు గతంలో కూడా మూడునాలుగు సార్లు ఇలాగే ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో అసహనానికి లోనైన వకార్ ఇక జీవితంలో సోషల్ మీడియా జోలికి వెళ్లనని స్పష్టం చేశాడు. ఇన్ని రోజులు తనను ఫాలో అయిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా తన నిర్ణయంతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండంటూ వకార్ పేర్కొన్నాడు. చదవండి: అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్ pic.twitter.com/cl8iZFykVC — Waqar Younis (@waqyounis99) May 29, 2020 -
అదొక చెత్త ప్రతిపాదన: వకార్ యూనిస్
కరాచీ: బాల్ ట్యాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలనే యోచనలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ధ్వజమెత్తాడు. ఇదొక అర్థంలేని ప్రతిపాదనగా వకార్ అభివర్ణించాడు. ఈ తరహా ప్రతిపాదననతో క్రికెట్‌ను ఎక్కడికి తీసుకెళదామని ఐసీసీ అనుకుంటుంలో తెలియడం లేదంటూ విమర్శించాడు. బంతిపై లాలాజలం(సలైవా)ను పదే పదే రుద్దడం మనకు సుపరిచితం. కాగా, కరోనా వైరస్ కారణంగా సలైవాను బంతిపై రుద్దడాన్ని ఆపేయాలని ఐసీసీ చూస్తోంది. అదే సమయంలో బంతిని పాలిష్ చేసేందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. దీనిలో భాగంగా బంతిని వేరే రకంగా ట్యాంపర్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చూస్తోంది. దీనిపై వకార్ యూనిస్ విమర్శలు గుప్పించాడు. ‘ ఒక ఫాస్ట్ బౌలర్‌గా నేను ఇందుకు వ్యతిరేకం. బంతిపై ఉమ్మిని రుద్దడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇది ఒక అలవాటుగా వస్తోంది. బంతిని ఒకరి దగ్గర్నుంచి ఒకరికి మార్చుకుంటూ బౌలర్ చేతికి ఇచ్చే క్రమంలో సలైవాను రుద్దడం ఆనవాయితీగా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా అంపైర్ల సమక్షంలో వేరు పద్ధతిలో ట్యాంపరింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ చర్చ అనేది ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. ఇది కచ్చితంగా తప్పే. లాక్డౌన్లో ఉన్న ప్రజలకు ఈ ప్రతిపాదన చిరాకు తెప్పిస్తోంది. ఇది అనాలోచిత నిర్ణయం. సలైవా ప్లేస్‌లో కృత్రిమ పద్ధతిలో కొత్త పద్ధతిని తీసుకురావడం అనేక అనుమానాలకు తెరతీస్తుంది’ అని వకార్ పేర్కొన్నాడు.(నాకు సచిన్ వార్నింగ్ ఇచ్చాడు..: గంగూలీ) టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్ చితక్కొడతారు. తమ కెరీర్ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్ పేసర్ కమిన్స్ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్ ఉదంతంలో స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్లీన్, ప్యాంట్ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది.(‘బాల్ టాంపరింగ్ చేసుకోవచ్చు’) -
‘భారత్, పాకిస్తాన్ లేకుంటే దానికి అర్థమే లేదు’
కరాచీ: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే మ్యాచ్‌కు గంట నుంచే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఇక స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే, ప్రస్తుతం ఆ కిక్కు, మజా క్రికెట్ అభిమానులకు దూరమైంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ లేకపోవడంపై పాకిస్తాన్ మాజీ పేసర్, ప్రస్తుత బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (చదవండి: క్రికెటర్ హేల్స్‌కు కరోనా?) ‘ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వేషపూరిత వాతావరణం నెలకొని ఉందని నాకు తెలుసు. అయితే, దానిని క్రికెట్‌కు ఆపాదించరాదు. ఈ విషయంలో ఐసీసీ కాస్త చొరవ తీసుకొని ఇరు దేశాల మధ్య టెస్టు చాంపియన్‌షిప్‌లో ఒక సిరీస్ జరిగేలా షెడ్యూల్ రూపొందించాల్సింది. అధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసే భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ లేకుండా టెస్టు చాంపియన్‌షిప్‌కు అర్థమే లేదు’అని వకార్ వ్యాఖ్యానించాడు. చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మన జట్టు 1-0తో సొంతం చేసుకుంది. 2008 ముంబై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పటిలా ప్రస్తుతం భారత జట్టుకు పేసర్ల కొదువలేదని వకార్ అన్నాడు. 140 కి.మీ వేగంతో బంతులేసే నాణ్యమైన పేసర్లను భారత్ తయారు చేస్తుందని పేర్కొన్నాడు. ‘ఒకప్పుడు భారత్ బౌలింగ్ ఇంత పటిష్టంగా లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ ఫమీ, ఇషాంత్ శర్మతో కూడిన వారి బౌలింగ్ లైనస్ ఎంతటి పటిష్ట బ్యాటింగ్‌నైనా కూల్చగలదు. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉండటానికి గల కారణాల్లో బౌలింగ్ కూడా ఒకటి’అని వకార్ భారత్ బౌలింగ్‌ను ప్రశంసించాడు. (చదవండి: టి20 ప్రపంచ కప్ నిర్వహణపై ఆసీస్ దృష్టి) -
‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ టోర్నీలో లీగ్ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించడాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే తమ దేశ ఆటగాళ్ల తీరు, ప్రదర్శనపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పాక్ మాజీ సారథి వకార్ యూనిస్ పలువురు సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూనే మరోవైపు బోర్డు నిర్ణయాలపై నిప్పులు చెరిగాడు. కొందరు సీనియర్ ఆటగాళ్లు వారి స్వార్థం కోసం ఇంకా క్రికెట్ ఆడుతున్నారని విమర్శించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బోర్డు ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావటం లేదని మండిపడ్డాడు. ‘ప్రపంచకప్‌లో పాక్ ఓటమికి ప్రధాన కారణం మెరుగైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం. ఫిట్నెస్, ఫామ్, ఇతర విషయాల్లో రాజీ పడటం సెలక్టర్లు చేసే పెద్ద పొరపాటు. తాజాగా ప్రపంచకప్‌కు పాక్ జట్టు ఎంపికే గందరగోళంగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడాలనే కోరికతో కొందరు సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలు చేసి జట్టులో చోటు దక్కించుకున్నారు. వాళ్లను వాళ్లు మోసం చేసుకోవడమే కాదు పాక్ క్రికెట్ జట్టును నాశనం చేశారు. ఇప్పటివరకు మీరు ఆడింది చాలు వెళ్లిపోతే మంచిది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఓడిపోయిన ప్రతీసారి పాక్ క్రికెట్ బోర్డు ఒకే ఫార్ములాను పాటిస్తుంది. కోచింగ్ బృందాన్ని, సెలక్టర్లను మార్చుతుంది. అంతేకానీ దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకరావడం, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలనే కనీస ఆలోచన చేయదు. బోర్డు ఆలోచన మారనంత వరకు.. ప్రపంచకప్‌లో పాక్ ప్రదర్శన మారదు. అవసరమనుకుంటే సీనియర్ ఆటగాళ్ల సూచనలను తీసుకుని పాక్ క్రికెట్‌ను బతికించండి’అంటూ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. -
భారత్ ఓటమి.. పాకిస్థాన్‌కు మంటెందుకు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ తొలి పరాజయాన్ని చవిచూడటం.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో దాయాది పాకిస్థాన్ చిరాకు పడుతోంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. పాక్ ఆటగాళ్లు మాత్రం ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమికి వక్రభాష్యాలు చెబుతున్నారు. టీమిండియాకు క్రీడానీతి లేదంటూ పరోక్షంగా వేలెత్తి చూపుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. తాజా మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించడంతో సర్ఫరాజ్ అహ్మద్ సేన సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అదే ఇంగ్లండ్‌ను భారత్ ఓడించి ఉంటే.. పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉండేవి. కానీ, ఇంగ్లండ్ గెలువడంతో ఇప్పుడు ఆ జట్టు బంగ్లాదేశ్‌పై గెలుపొందినా.. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే.. పాక్ సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ బంగ్లా చేతిలో పాక్ ఓడిపోతే.. ఇంగ్లండ్‌కు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పాక్, భారత్ మీద బంగ్లా గెలుపొంది.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే.. బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరే అవకాశముంటుంది. ఈ సమీకరణాలు ఎలా ఉన్నా నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో భారత్ చివర్లో తడబడి.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 306 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా క్రీడానీతిని చాటడంలో దారుణంగా విఫలమైందంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ వకార్ యూనిస్ ట్విటర్లో విమర్శించారు. ‘నువ్వు ఎవరన్నది కాదు.. ఏం చేశావన్నదే నీ జీవితాన్ని నిర్వచిస్తుంది. పాక్ సెమీస్‌కు వెళ్లినా.. వెళ్లకపోయినా నాకేమీ బాధ లేదు కానీ, ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఇద్దరు చాంపియన్ల క్రీడానీతిని పరీక్షించగా.. వాళ్లు దారుణంగా విఫలమయ్యారు’ అంటూ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. -
‘ఆ ఫైనల్ ఫలితాన్ని రిపీట్ చేద్దాం’
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌లో చాంపియన్ ట్రోఫీ ఫలితాన్ని రిపీట్ చేయాలని పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ సూచించాడు. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం జరగనుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సందర్భంగా వకార్ యూనిస్ మీడియాతో మాట్లాడాడు. పాక్ ఈ మెగా టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఏ ప్లస్ ప్రదర్శన చేయాలన్నాడు. ముఖ్యంగా ఆరంభంలో వికెట్లు చేజార్చుకోకూడదని పేర్కొన్నాడు. వికెట్లు చేజార్చుకుంటే భారీ స్కోర్ సాధించలేమని.. ఇక ఛేదనలో అయితే జట్టుపై మరింత ప్రభావం చూపుతుందని తెలిపాడు. మాలిక్ ఎందుకు? టీమిండియాతో మ్యాచ్‌కు ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని వకర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఐదో బౌలర్ ముఖ్యంగా స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు హఫీజ్, మాలిక్‌లు స్పిన్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయారన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రాయ్, రూట్ వికెట్లను తీసని షాదాబ్ ఖాన్‌ను టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌కు తీసుకోవాలన్నాడు. అవసరమైతే మాలిక్‌ను పక్కకు పెట్టాలన్నాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న మాలిక్ జట్టులో ఎందుకు అని వకార్ ప్రశ్నించాడు. -
‘కోహ్లి.. కోహ్లియే కానీ రోహిత్ కెప్టెన్సీ సూపర్’
ఇస్లామాబాద్ : ఆసియాకప్‌లో విజయం సాధించిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గైర్హాజరీతో సారథ్య బాథ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లే. అతని విషయంలో చాలెంజ్ చేయలేరు. కానీ అతను లేకుండా భారత జట్టు ఆసియాకప్‌లో అదరగొట్టింది. విరాట్ మూడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఆసియాకప్‌లో రోహిత్ అద్బుతంగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. మైదానంలో అతను చాలా ప్రశాంతంగా కనిపించాడు. అతని కెప్టెన్సీ రోజు రోజుకు మెరుగైంది. ఐపీఎల్లో కూడా అతని కెప్టెన్సీ చూశాను. ఆటగాళ్ల సొంత నిర్ణయాలను అనుమతిస్తాడు. వారికనుగుణంగా ఆడే స్వేచ్ఛను ఇస్తాడు. రోహిత్ ఓ అద్బుత కెప్టెన్.’ అని యూనిస్ కొనియాడాడు. (చదవండి: కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడా?) ఆసియాకప్ విజయంలో భారత ఓపెనర్ల కీలకపాత్ర పోషించారన్నాడు. ‘భారత్ నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన జట్టు. ఈ జట్టులో వరల్డ్ క్లాస్ ఓపెనర్స్ ఉన్నారు. రోహిత్, ధావన్‌లు ప్రతిసారి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థులకు కష్టంగా ఉంటుంది. భారత్ విజయాల పట్ల నేనేం ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే భారత్ ఓ పెద్ద దేశం. ఆదేశంలో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రతి ప్రాంతానికి క్రికెట్ విస్తరించింది. భారత పేస్ బౌలర్లు సంపన్న కుటుంబాల నుంచి రాలేదు. వారంతా పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారికి ఐపీఎల్ మంచి అవకాశాలను ఇచ్చింది. భారత్‌లో క్రికెట్ వేదికలు చాలా మార్పును తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా ఐపీఎల్ ఎంతో మంది యువఆటగాళ్లను పరిచయం చేసింది.’ అని తెలిపాడు. ఇక యూనిస్ అంతర్జాతీయ క్రికెట్లో 789 వికెట్లు పడగొట్టాడు. (చదవండి: కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి) -
గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నారు: వకార్
దుబాయ్: ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురై చిత్తు కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. ఇక్కడ టీమిండియా ఒత్తిడిలోకి వెళుతుందని అనుకుంటే, పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం తనకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందన్నాడు. ‘ టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్‌లను పాకిస్తాన్ కోల్పోయింది. గత కొంతకాలంగా యూఏఈ అనేది పాకిస్తాన్‌కు సొంత వేదికగా ఉంది. అదే సమయంలో దుబాయ్‌లో విపరీతమైన వేడి వాతావరణం మధ్య భారత్ ఎక్కువగా మ్యాచ్‌లు కూడా ఆడలేదు. సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత్‌కు ఇక్కడకు వచ్చింది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు రోజు హాంకాంగ్‌పై భారత్ చెమటోడ్చి గెలిచింది. ఇవన్నీ పాక్‌కు అనుకూలంగా మారతాయని అనుకున్నా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొత్తంగా తమ జట్టే చిత్తుగా ఓడిపోయింది. ఎటువంటి పోరాటం చేయకుండానే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక గోల్డెన్ చాన్స్‌ను పాకిస్తాన్ కోల్పోయింది. నా వరకూ అయితే భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య చివరిగా జరిగిన రసవత్తరమైన మ్యాచ్ ఏదైనా ఉందంటే, అది 2011లో మొహాలీలో జరిగిన వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచే’ అని వకార్ తెలిపాడు. -
చీటింగ్ అవసరం లేదు: వకార్
లాహోర్: రివర్స్ స్వింగ్ చేయడానికి ప్రధానంగా బంతి ఆకారాన్ని మార్చడంపైనే పేస్ బౌలర్లు ఆధారపడుతున్నారనే ఆరోపణలపై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ స్పందించాడు. అసలు రివర్స్ స్వింగ్ చేయడానికి చీటింగ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ‘ఈ రోజుల్లో ప్రతీ ఒక్క పేసర్ రివర్వ్ స్వింగ్ చేయడానికి యత్నిస్తున్నారు. వికెట్లు తీయడానికి రివర్స్ స్వింగ్ అనేది మంచి అస్త్రం. అయితే బంతిని రివర్స్ స్వింగ్ చేయాలంటే బంతి ఆకారాన్ని దెబ్బతీసి మోసం చేయాల్సిన అవసరమైతే లేదు' అని వకార్ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో బంతిని ట్యాంపరింగ్ చేసిన వివాదంలో చిక్కుకున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్‌లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంతి ఆకారం మార్చడానికి రివర్స్ స్వింగ్ చేయాలనే తపనే కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వకార్ పైవిధంగా స్పందించాడు.మరొకవైపు వేర్వేరు దేశాల్లో భిన్నమైన బంతుల్ని వాడటాన్ని కూడా వకార్ ప్రశ్నించాడు. అసలు ఎందుకు ఇలా బంతుల్ని వాడాల్సి వస్తుందంటూ నిలదీశాడు. బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి డ్యూక్ బాల్‌తో పాటు ఎస్జీ బాల్ అనువైనదిగా వకార్ తెలిపాడు. -
శ్రీదేవి మృతి పట్ల పాక్ క్రికెటర్ల విచారం
సాక్షి, హైదరాబాద్ : శ్రీదేవి అకాల మరణం పట్ల పాకిస్తాన్ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. ఆమె అకాల మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసిందని పాక్ మాజీ క్రికెటర్లు వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌లు ట్విటర్లో పేర్కొన్నారు. ‘శ్రీదేవి మరణవార్తతో షాక్‌కు గురయ్యాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్తూర్తిగా ప్రార్ధిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’ అని మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ ట్వీట్ చేశారు. ‘శ్రీదేవి మరణ వార్త విని దిగులు చెందా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు. We are deeply saddened by the news of Sridevi’s passing. Our thoughts and prayers are with the family #RIP — waqar younis (@waqyounis99) 25 February 2018 Saddened by her sudden demise! RIP #Sridevi — Shoaib Akhtar (@shoaib100mph) 25 February 2018 -
‘బ్యాటింగ్ రికార్డులన్నీ తిరగరాస్తాడు’
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రాబోయే కాలంలో అన్ని బ్యాటింగ్ రికార్డులను తిరగరాస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు.‘ ప్రస్తుత తరంలో కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇలాగే ఫిట్నెస్ కాపాడకుంటూ.. ఆటను ఆస్వాదిస్తూ.. నైపుణ్య స్థాయిని పెంచుకుంటే ఇది సాధ్యమవుతుందని’ కోహ్లికి సలహా ఇచ్చాడు. గతేడాది ఆయన పాక్ కోచ్ పదవికి రాజీమానా చేసిన విషయం తెలిసిందే. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుతూ.. అప్పటికీ ఇప్పటికీ ఆటలో చాలా మార్పులొచ్చాయన్నారు. ప్రస్తుతం తరంలో విరాట్ కోహ్లీకి అత్యధిక రేటింగ్ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాల్లో సచిన్ అత్యుత్తమమని తెలిపాడు. ‘నేను సచిన్‌తో ఎక్కువ క్రికెట్ ఆడాను. అతడు మా జట్టుపైనే అరంగేట్రం చేశాడు. చాలా ఏళ్లుగా ఆయన ప్రొఫెషనల్‌గా ఎదగడం చూశాను. ఆయనలా నిబద్ధతతో ఉన్న ఆటగాడిని ఇప్పటి వరకు చూడలేదు. నేను బౌలింగ్ వేసిన వారిలో సచిన్ అత్యుత్తమం. అతడికి బౌలింగ్ వేయడం ఓ సవాల్‌గా ఉండేది. లారా మాత్రం సహజ సిద్ధ క్రికెటర్. తనదైన రోజున చెలరేగేవాడు’ అని యూనిస్ చెప్పుకొచ్చాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు క్రమశిక్షణకు పెద్దపీట వేశానని ఎంత ప్రతిభ ఉన్నా సరే క్రమశిక్షణ లేకపోతే వృథా అని పేర్కొన్నాడు. -
‘భారత్-పాక్ మ్యాచ్ లేకుంటే టెస్టు చాంపియన్ షిప్ దండుగ’
లాహోర్: భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు లేకుండా టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించడం శుద్ద దండుగ అని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ వకార్ యునీస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐసీసీ 9 దేశాలతో టెస్టు చాంపియన్ షిప్, 13 దేశాల వన్డే లీగ్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వకార్ ఓ చానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ టెస్టు చాంపియన్ షిప్ మంచి ఆలోచనే. కానీ పాక్, భారత్‌తో క్రికెట్ ఆడటం లేదు. దీంతో టెస్టు చాంపియన్ షిప్‌కు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఒకవేళ ఈ టెస్టు చాంపియన్ షిప్లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరిగితే.. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఈ రెండు దేశాలు ఒక్కసారికూడా తలపడకుండా టాప్-1,2 ర్యాంకు సాధిస్తే ఇది చాంపియన్ షిప్ అని ఎలా పిలుస్తామని’ వకార్ వ్యాఖ్యానించారు. పాక్‌లో ఆడటానికి భారత్‌కు ఇబ్బందిగా ఉంటే దుబాయ్ వేదికగా ఆడండి. దుబాయ్ పాక్ హోం గ్రౌండ్ లాంటిదేనని వకార్ భారత్‌కు సూచించారు. అక్కడ కాకుంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఎక్కడైనా భారత్‌తో ఆడటానికి పాక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండేళ్లపాటు జరిగే టెస్టు చాంపియన్ షిప్లో 9 దేశాలు పాల్గొంటాయని, ఒక్కో దేశం ఆరు సిరీస్‌లు ఆడుతుందని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 3 సిరీస్‌లు స్వదేశంలో మిగిలిన 3 సిరీస్‌లు విదేశాల్లో ఆడాలని తెలిపింది. అయితే భారత్-పాక్ మధ్య సిరీస్‌లు ఎలా కొనసాగుతాయనే విషయంలో ఐసీసీ స్పష్టతను ఇవ్వలేకపోయింది. -
వకార్.. ఇప్పుడేమంటావ్!
బ్రిస్టల్:మహిళల వన్డే క్రికెట్లో 50 ఓవర్లు అనవసరం. దాన్ని 30 ఓవర్లకు తగ్గిస్తే బాగుటుంది. మహిళా క్రికెట్లో మజా ఉండాలంటే తక్కువ ఓవర్లే కరెక్ట్. తక్కువ ఓవర్లు ఉంటే బౌలర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారు. టెన్నిస్ లో పురుషులకు ఐదు సెట్లు ఉంటే మహిళలకు మూడు సెట్లే ఉంటాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని మహిళల వన్డే ఓవర్లను 30 కి తగ్గించండి'అని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ల వకార్ యూనిస్ చేసిన విన్నపం ఇది. అయితే దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనడిచింది. వకార్ వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లను అవమాన పరిచేవిధంగా ఉన్నాయంటూ విమర్శలు చెలరేగాయి. దానికి మహిళా క్రికెటర్లే తమ బ్యాటింగ్ తో సమాధానం చెప్పడం మరోసారి వకార్ వార్తల్లోకి వచ్చాడు. బుధవారం ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ ఆద్యంతం దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 373 పరుగులు చేస్తే, ఆపై దక్షిణాఫ్రికా 50 ఓవర్లపాటు ఆడి 9 వికెట్లకు 305 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్వుమెన్లలో బీమౌంట్(148;145 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్), సారా టేలర్(147;104 బంతుల్లో 24 ఫోర్లు)లు సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో వోల్వర్ద్త్(67;103 బంతుల్లో 9 ఫోర్లు), లిజెల్లీ లీ(72; 77 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సైతం దాటికి ఆడారు. దాంతో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతను రేపింది. మరి వకార్.. ఇప్పుడేమంటావ్ అంటూ మహిళా క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. వన్డే క్రికెట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఐదు వందలకు పైగా పరుగులు సరిపోవా అంటూ నిలదీస్తున్నారు. అసలు వకార్ కు ఎన్నిపరుగులైతే వినోదాన్ని ఇస్తాయో చెప్పాలంటూ మండిపడుతున్నారు. -
పొలార్డ్‌ను తీసేయండి: వకార్
షార్జా: పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమి ప్రధాన కారణమైన ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డను తదుపరి మ్యాచ్ ల్లో నుంచి తీసేయడమే సరైన చర్యని దిగ్గజ ఆటగాడు వకార్ యూసన్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో విండీస్ విజయానికి ఓవర్ కు 12 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజ్ లో ఉన్న పొలార్డ్ అత్యంత ఉదాసీనతను ప్రదర్శించి ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడన్నాడు. కనీసం గెలుపు కోసం ప్రయత్నించని పొలార్డ్ ను చివరి వన్డే నుంచి తొలగించాలని విండీస్ కు సూచించాడు. టీ 20లో పొలార్డ్ ఇలా ఆడటం ఎప్పుడూ చూడలేదు. కీలకమైన వన్డేలో పొలార్డ్ చాలా అలసత్వం ప్రదర్శించి జట్టు నైతికతను దెబ్బతీశాడు. అతను క్రీజ్ లో ఉండి కొట్టింది కేవలం ఒక ఫోర్ మాత్రమే. ఇది ఉదాసీనత కాకపోతే ఏంటి. ప్రస్తుతం అతనికి బ్రేక్ అవరసం. నేను అనుకుంటున్నట్లే విండీస్ సెలక్షన్ కమిటీ కూడా భావిస్తుందని అనుకుంటున్నా' అని వకార్ యూనస్ తెలిపాడు. -
'ఆ క్రికెటర్‌ను తొలగించండి'
కరాచీ:ఇటీవల భారత్‌లో జరిగిన వరల్డ్ టీ 20 కప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ చీఫ్ కోచ్ వకార్ యూనిస్ తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. వరల్డ్ టీ 20 అనంతరం పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన వకార్.. తనకు అవకాశం దొరికినా ఆటగాళ్లపై మండిపడుతున్నాడు. మరోసారి పాకిస్తాన్ క్రికెటర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమర్ అక్మల్లను టార్గెట్ చేస్తూ వకార్ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా ఆఫ్రిది పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే పాకిస్తాన్ జట్టు వరుసగా ఓటములు చవిచూసిందన్నాడు. వరల్డ్ టీ 20నే కాదు.. అంతకుముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆసియా కప్‌లలో కూడా పాకిస్తాన్ పేలవ ప్రదర్శనకు ఆఫ్రిదినే ప్రధాన కారణమన్నాడు. మరో పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ ను జట్టు నుంచి తొలగించాలని వకార్ డిమాండ్ చేశాడు. గతంలో శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా ఫిట్ నెస్ నిరూపించుకోవడానికి హాజరు కావాల్సిందిగా అక్మల్ ను మాజీ చీఫ్ సెలక్టర్ హారూన్ రషీద్ కోరినా అతను ఆ మాటను పెడచెవిన పెట్టి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్నాడు. ఆ సమయంలో పీసీబీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కరీబియన్ లీగ్ లో ఆడటానికి అక్మల్ వెళ్లిపోయి తమను అవమానపరిచిన సంగతిని అక్రమ్ ప్రస్తావించాడు. అటువంటి ఆటగాడ్ని జట్టులో ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించకూడదంటూ ధ్వజమెత్తాడు. ఇలా తమ ప్రవర్తన కారణంగా ఎంతో టాలెంట్ ఉండికూడా ఆండ్రూ సైమండ్స్, కెవిన్ పీటర్సన్లు జట్టులో స్థానం కోల్పోయిన సంగతిని అక్రమ్ గుర్తు చేశాడు. -
వకార్ పై మండిపడ్డ రజాక్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గా పని చేసి ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన వకార్ యూనిస్‌పై ఆ దేశ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మండిపడ్డాడు. వకార్ వల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు తీరని నష్టం జరిగిందంటూ రజాక్ విమర్శించాడు. వకార్ అతని వైఫల్యాన్ని పక్కకు పెట్టి ఇతరుల్ని తప్పుబడుతున్నాడన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని నిలదీశాడు. పాకిస్తాన్ క్రికెట్లో రహస్యమేమీ లేదు. సీనియర్ ఆటగాళ్లకు వకార్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. దాంతో పాటు ఆటగాళ్లని కూడా సమాన దృష్టితో కూడా చూసేవాడు కాదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్గించే పని ఎప్పుడూ చేయలేదు. ఇందుకు నేనే సాక్ష్యం. దానికి అతనిలో ఉన్న అభద్రతా భావమే ప్రధాన కారణం. పదే పదే తప్పులు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ అట్టడుగు స్థాయికి వెళ్లడానికి వకార్ కారణమమయ్యాడు 'అని రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ సలహాదారులుగా యూనస్ ఖాన్, మిస్బాబుల్ హక్‌లను నియమించడం పట్ల కూడా రజాక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఏడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ క్రికెట్ కు జరిగిన అన్యాయానికి వారు ఏ విధమైన సలహా ఇస్తారని ప్రశ్నించాడు. కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు కూడా దేశ క్రికెట్ ను దిగజార్చాడానికి పరోక్షంగా కారణమయ్యారని రజాక్ ధ్వజమెత్తాడు. -
కోచ్ పదవికి వకార్ గుడ్ బై
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వకార్ యూనస్ ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా విషయాన్ని సోమవారం మీడియా ముందు వెల్లడించాడు. ' పాకిస్తాన్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా. నేను చాలా నిబద్దతతో గత 19 నెలలుగా పాకిస్తాన్ కోచ్‌గా పని చేశా. వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కారణంగా చూపుతూ నన్ను బలిపశువును చేసేందుకు బోర్డు యత్నిస్తోంది. నేను పాకిస్తాన్ క్రికెట్ కు చేసిన సేవను తక్కువగా చూపే ప్రయత్నం చేయొద్దు. మాజీ క్రికెటర్లకు ఇదే నా విన్నపం' అంటూ ఒకింత బాధగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 2015 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఘోర ప్రదర్శనపై అప్పట్లోనే పీసీబీకి కొన్ని ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేసినా దానిని అమలు చేయడంలో బోర్డు విఫలమైందని వకార్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఆ నివేదికపై పీసీబీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం కూడా తాను తీవ్రంగా నిరాశచెందడానికి ప్రధాన కారణమన్నాడు. -
'ఆ రకంగా తప్పుకుంటే నన్ను విలన్‌ను చేస్తారు'
కరాచీ: . వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనకు, తన కోచ్ పదవికి ఎటువంటి సంబంధం లేదని వకార్ యూనస్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తాను స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి బయటకు రావాలనుకోవడం లేదన్నాడు. ఒకవేళ తాను ఇలా ముందుగానే వైదొలిగితే అందరి దృష్టిలో విలన్ అవడం ఖాయమన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి తనకు ఎటువంటి సమస్యలూ లేనప్పుడు ఎందుకు బయటకు రావాలని ప్రశ్నించాడు. ' పాకిస్తాన్ జట్టు వరుస ఓటములకు నేను ఎంతమాత్రం బాధ్యుణ్ని కాను. పాక్ జట్టుకు నేను చేయాల్సింది చేశాను. నేను కోచింగ్ జాబ్ కోసం పీసీబీ అభ్యర్ధించలేదు. కేవలం అప్లై చేసిన తరువాతే ఈ పదవి చేపట్టా. ఒకవేళ నన్ను బోర్డు కోచ్ వైదొలగాలని కోరితే, ముందుగా వారు రాత పూర్వకంగా నాకు తెలియజేయాలి. అసలు బోర్డు నుంచి అటువంటిది లేనప్పుడు ఎలా తప్పుకుంటా. ఆ రకంగా ముందుగానే తప్పుకుంటే నన్ను విలన్‌ను చేస్తారు. అది నాకిష్టం లేదు' అని వకార్ పేర్కొన్నాడు. -
ఆ క్రికెటర్ గాయాన్ని దాచిపెట్టాడు!
ఆఫ్రిది సీరియస్‌గా తీసుకోలేదు దుమారం రేపుతున్న వకార్ నివేదిక కరాచీ: ఆసియా కప్‌లోగానీ, టీ20 వరల్డ్ కప్‌లోగానీ పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సీరియస్‌గా ఆడలేదని ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్ ఆరోపించాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్ తనకు మోకాలి గాయమైనా.. ఆ విషయాన్ని దాచిపెట్టి టోర్నమెంటులో ఆడాడని వెల్లడించాడు. ఈ మేరకు వకార్ యూనిస్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన నివేదిక లీక్ అవ్వడం దుమారం రేపుతున్నది. తన నివేదికలోని కీలక అంశాలు లీకవ్వడంపై వకార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి లెజండరీ బౌలర్ అయిన వకార్ యూనిస్‌కు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి సయోధ్య లేదు. 2011లో కోచ్‌గా వకార్ మొదటి పర్యాయంలోనే ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తాజాగా బుధవారం లీకైన నివేదికలో వకార్ విస్మయం కలిగించే విషయాలు వెల్లడించాడు. ఆఫ్రిది సీరియస్‌గా కనిపించలేదని, ఆసియాకప్, వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శనపై అతను ఏమాత్రం శ్రద్ధ చూపలేదని పేర్కొన్నాడు. ఆఫ్రిది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ సెషన్లకు, జట్టు సమావేశాలకు డుమ్మా కొట్టాడని తెలిపాడు. ఇక సీనియర్ ఆటగాడు హఫీజ్ తనకు గాయముందనే విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్కు చెప్పలేదని, ఆ గాయం తిరగదోడడంతో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లతో కీలక మ్యాచులకు ముందు అతను జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది జట్టుపై ప్రభావం చూపిందని వకార్ వెల్లడించాడు. అయితే తాను అధికారికంగా ఇచ్చిన నివేదికలోని వివరాలు వెల్లడవ్వడంపై వకార్ యూనిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నివేదిక లీక్ కావడానికి కారణమెవరో గుర్తించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని అతను కోరాడు. -
వకార్ బహిరంగ క్షమాపణ; సీనియర్ల ఫైర్
కరాచీ: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయానికి బాధ్యత వహిస్తూ కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పడంపై మాజీ కెప్టెన్లు భిన్నంగా స్పందించారు. క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్ లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు. బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్ ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు. జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ ను భారత జూనియర్ టీమ్ కు కోచ్ గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్ కు వకార్ ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. -
నేను ఇంటికి వెళ్లడానికి సిద్ధం: వకార్
లాహోర్:వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ వకార్ యూనస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి నివేదిక సమర్పించిన వకార్.. జట్టు ప్రదర్శనపై క్షమాపణలు తెలియజేశారు. అనంతరం పాకిస్తాన్ మీడియాతో మాట్లాడిన వకార్.. అసలు తమ జట్టులో లోపాలు ఎక్కడున్నాయన్న దానిపై చర్చించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు. దీనికి ఏ ఒక్కర్నో నిందించడం సరికాదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ జట్టులోని అంతర్గత లోపాలపై క్షణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వకార్ అన్నాడు. 'వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన చాలా బాధించింది. జట్టు ప్రదర్శనపై సుదీర్ఘంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నేను పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళతా. పాకిస్తాన్ జట్టులో ఎటువంటి రాజకీయాలు, గ్రూప్ లు లేవు. కేవలం మాది పేలవ ప్రదర్శన మాత్రమే. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా దేశవాళీ క్రికెట్ కూడా చాలా బలహీనంగా ఉంది. మా దేశంలో ఎక్కువ క్రికెట్ ఆడకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. నా భవిష్యత్తును క్రికెట్ తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది స్టార్స్ గేమ్ అయితే కాదు' అని వకార్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. -
'టీమిండియా వీక్ నెస్ గురించి పట్టించుకోం'
కోల్ కతా: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను ఉపఖండంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుందని పాక్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ తెలిపాడు. శుక్రవారం అతడు విలేకరులతో మాట్లాడుతూ... గత మ్యాచుల్లో తమ జట్టుపై ఎక్కువ ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు ఇండియా టీమ్ పై ప్రెషర్ అధికంగా ఉందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఎక్కువయిందని వివరించాడు. కోల్ కతాలో తమకు మైదానంలోనూ, మైదానం వెలుపల మద్దతు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు బలాలపై దృష్టి పెడుతున్నామని, టీమిండియా బలహీనతల గురించి ఆలోచించడం లేదని వకార్ యూనిస్ తెలిపాడు. రేపు(శనివారం) ఈడెన్ గార్డెన్ జరిగే మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. -
ఆఫ్రిదిపై పాక్‌లో రచ్చ... రచ్చ...
కెప్టెన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు కోల్‌కతా: మైదానంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఏమో కానీ ఆ జట్టు చుట్టూ నిరంతరం వివాదాలు వెన్నంటే ఉంటాయి కాబోలు.. మొన్నటి వరకు భద్రతా కారణాలు చూపి టి20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఆడుతుందా.. లేదా? అనే అనుమానం ఉన్నా ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. తీరా పాక్ జట్టు భారత్‌లో అడుగుపెట్టిందో లేదో ఆఫ్రిది రూపంలో మరో రచ్చ మొదలైంది. యథాలాపంగా అన్నాడో.. మరేంటో కానీ తమ జట్టుకు పాక్‌కన్నా భారత్‌లోనే అభిమానం ఎక్కువ అన్న ఈ సీనియర్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో అతడిని దోషిగా మార్చాయి. ‘ఇతర దేశాలకన్నా భారత్‌లో ఆడడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. భారత్‌లో నాకు ఆదరణ ఎక్కువ. అసలు మా జట్టుకు పాక్లోకన్నా భారత్‌లోనే ఎక్కువ అభిమానం లభిస్తుంది’ అని గత ఆదివారం ఆఫ్రిది అన్నాడు. దీంతో భారత్‌ను బద్ద శత్రువుగా భావించే అక్కడి అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. భారత్‌కు వెళ్లింది ఆ దేశాన్ని పొగడడానికా.. మ్యాచ్‌లు ఆడడానికా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ‘మన దేశ క్రికెట్‌కు భారత్ చేసిన సేవ ఏమిటని పొగుడుతున్నావ్.. నీవు సిగ్గుపడాల్సిన విషయమిది’ అని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ విరుచుకుపడ్డారు. ఇక ఆఫ్రిది తన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రజల మనోభావాలను గాయపరిచాడంటూ అతడికి ఓ లాయర్ లీగల్ నోటీసులు కూడా పంపాడు. పాజిటివ్‌గా తీసుకోవాలి: ఆఫ్రిది తన కామెంట్స్‌తో అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టడంతో పాక్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలను అంతా పాజిటివ్‌గా తీసుకోవాలని సూచించాడు. ఇక్కడి అభిమానులను గౌరవించే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని చెప్పాడు. ‘నేను ఇప్పుడు ఇక్కడ కేవలం పాక్ జట్టు కెప్టెన్ మాత్రమే కాను. మొత్తం పాక్ ప్రజల ప్రతినిధిని. నా వ్యాఖ్యలను పాజిటివ్ దృష్టితో చూస్తే సరైనవే అనిపిస్తుంది. విలేకరి అడిగిన ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చాను. ఇక్కడ ఆడే మ్యాచ్‌లను మేం బాగా ఆస్వాదిస్తాం. అదే చెప్పాను. ఇక్కడ క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. ఇమ్రాన్, వసీం, వఖార్, ఇంజమామ్లను అడిగినా ఇక్కడి ఆదరణ గురించి చెబుతారు. పాక్ అభిమానులను అవమానపరిచే ఉద్దేశం లేదు. నాకు గుర్తింపునిచ్చింది పాకిస్తానే’ అని ఆఫ్రిది స్పష్టం చేశాడు. మరోవైపు అతడి వ్యాఖ్యలకు పాక్ కోచ్ వఖార్ యూనిస్ మద్దతు పలికాడు. అందులో ఎలాంటి తప్పు లేదని తేల్చాడు. దృష్టంతా ఆట మీద నిలపాలని తమ ఆటగాళ్లకు హితవు పలికారు. ప్రాక్టీస్‌కు గైర్హాజరు మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు ఆఫ్రిది గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అయితే జ్వరం కారణంగానే తను తప్పుకున్నాడని కోచ్ వఖార్ యూనిస్ తెలిపారు. ‘వివాదం కారణంగా తను గైర్హాజరు కాలేదు. ఉదయం నుంచి కాస్త నలతగా ఉన్నాడు. అందుకే విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని చెప్పాం’ అని వఖార్ అన్నారు. -
'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు'
కోల్ కతా: షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ అన్నాడు. భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దీనిపై మాజీ కెప్టెన్ మియాందాద్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డాడు. కాగా, టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడిస్తామని వకార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బాగా ఆడుతోందని, ఆ జట్టును ఆషామాషిగా తీసుకోబోమని చెప్పాడు. ఆఫ్రిదికి ఒంట్లో బాలేకపోవడంతో ఈరోజు ప్రాక్టీస్ చేయలేదని వెల్లడించాడు. రేపటి మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. -
నా క్రికెట్ కోచింగ్ కాంట్రాక్ట్ కంటే..
లాహోర్: తన కోచింగ్ కాంట్రాక్ కంటే త్వరలో జరుగనున్న ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలే ప్రస్తుత లక్ష్యాలని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనస్ స్పష్టం చేశాడు. వచ్చే మే నెలతో వకార్ కోచింగ్ కాంట్రాక్ట్ ముగిసిపోతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు అతను స్పందించాడు. ప్రస్తుతం తన కోచింగ్ పదవి కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎటువంటి దృష్టి నిలపలేదన్నాడు. మరికొద్ది రోజుల్లో ఆసియాకప్, వరల్డ్ టీ 20 జరుగనుండటంతో అది తనకు అసలు సిసలైన సవాల్ అని పేర్కొన్నాడు. ఇంకా మూడు, నాలుగు నెలలు కాంట్రాక్ట్ ఉండటంతో ఇప్పుడే భవిష్య కార్యాచరణ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఏ జట్టు కోచ్‌కైనా ఆ పదవి అనేది చాలా క్లిష్టమైనదన్నాడు. కొన్నిసార్లు మంచి ఫలితాలు ఉత్సాహపరిస్తే, మరికొన్ని సందర్భాల్లో జట్టు ఓటమి నిరాశపరుస్తుందన్నాడు. ఈ తరహా ఛాలెంజ్‌లకు ఎప్పుడైతే సిద్ధమయ్యానో.. అప్పట్నుంచే వాటిని ఎంజాయ్ చేయడం ప్రారంభించానని తెలిపాడు. కోచింగ్ కాంట్రాక్ట్ పై దృష్టి నిలిపై సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. రాబోవు ఈ రెండు ప్రధాన టోర్నీల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని వకార్ పేర్కొన్నాడు. -
ఆ ఇద్దరి పైనే ఎందుకంత వివక్ష?
కరాచీ: జట్టు నుంచి కొన్నేళ్లపాటు ఉద్వాసనకు గురై పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు సంపాదించిన మహమ్మద్ ఆమీర్ తరహాలోనే మరో ఇద్దరికి రెండో అవకాశం కల్పించాలని ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆమీర్‌కు ఇచ్చినట్లుగానే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన బాట్స్మన్ సల్మాన్ బట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌లకు జట్టులో చోటు కల్పించాలన్నాడు. ఐదేళ్ల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే బట్ సెంచరీ చేశాడని, ఆసిఫ్ రెండు వికెట్లు తీశాడని.. అయినప్పటికీ ఆ ఇద్దరిపైనే ఎందుకంత వివక్ష అని వ్యాఖ్యానించాడు. దేశవాలీ క్రికెట్లో బట్, ఆసిఫ్ రాణిస్తున్నారని, వారు ఫిట్నెస్ మెరుగ్గానే ఉందని యూనిస్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే రకమైన తప్పు చేసి, ఒకే రకమైన శిక్షకు గురయ్యారు. అటువంటిది, ఇప్పుడు ఒకరికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం భావ్యం కాదన్నాడు. బట్, ఆమీర్, ఆసిఫ్ లను ఒకే విధంగా ట్రీట్ చేయాలని గత కొన్ని రోజుల నుంచి పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, పాక్ టీ20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలకు వకార్ యూనిస్ సూచించాడు. ఆమీర్ విషయం, బట్, ఆసిఫ్ వ్యవహారాన్ని ఓకే తీరున చూడలేమని షాహిద్ ఇటీవలే ప్రకటించాడు. కానీ, ఆఫ్రిది ఏం ఆలోచిస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదన్నాడు. బట్, ఆసిఫ్ లను జట్టులోకి ఎందుకు తీసుకోరని యూనిస్ ప్రశ్నించాడు. వారు తప్పుచేసినందుకు ఐదేళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరం చేసి శిక్షించారు. ఇప్పుడు వారిని జట్టులోకి తీసుకోవాలని, వారికి స్థానం కల్పిస్తే పాక్ టీమ్‌కు మంచి జరుగుతందని యూనిస్ పేర్కొన్నాడు. -
'మా క్రికెటర్లు ఫిక్సింగ్ కు పాల్పడలేదు'
దుబాయ్:నాలుగు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో మ్యాచ్ ఫిక్సింగ్ చోటు చేసుకుందన్న ఆరోపణల్ని పాకిస్థాన్ చీఫ్ కోచ్ వకార్ యూనస్ ఖండించాడు. తమ క్రికెటర్లు ఎటువంటి ఫిక్సింగ్ కు పాల్పడ లేదంటూ వకార్ పేర్కొన్నాడు. ఆటలో గెలుపు -ఓటములు అనేవి సహజంగానే జరుగుతూ ఉంటాయని.. ఒక వన్డేలో పరాజయం చెందినంత మాత్రాన ఫిక్సింగ్ జరిగినట్లు కాదన్నాడు. తమ ఆటగాళ్ల ఆట తీరుపై చాలా సంతృప్తిగా ఉన్నామని వకార్ తాజాగా తెలిపాడు. బ్రిటీష్ పత్రిక డైలీ మెయిల్ మూడో వన్డేలో ఫిక్సింగ్ జరిగినట్లు ఓ కథనాన్ని ప్రచురించింది. ముగ్గురు పాక్ ఆటగాళ్లు చాలా సింపుల్ గా రనౌట్లు కావడమే అందుకు ఉదాహరణకు పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు కూడా చేసినట్లు పేర్కొంది. అంతకుముందు ఆ మ్యాచ్ కు సంబంధించి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా కొన్ని ట్వీట్లను కూడా సంధించాడు. షార్జాలో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడంలో చోటు చేసుకున్న పరిణామాల్ని వాన్ తన ట్వీట్లలో ప్రస్తావించాడు. పాక్ చెందిన ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు అయిన తీరును ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ విధంగా రనౌట్లు కావడం పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదంటూ ఫిక్సింగ్ వివాదాన్ని రేపాడు. కాగా, వాన్ తమపై అనుమానం వ్యక్తం చేయడాన్ని షహర్యార్ ఖాన్ తప్పుబట్టారు. అది కచ్చితంగా తప్పుడు స్టేట్ మెంట్ అని, వాన్ వ్యవహారాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. దీంతో ఉలిక్కిపడిన వాన్ ఆ ట్వీట్లను తొలగించాడు. -
'మా క్రికెట్ టీమ్ లో చాలా సమస్యలున్నాయి'
కరాచీ: తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను పాకిస్థాన్ కోల్పోవడం పట్ల ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు కోల్పోయి సిరీస్ ను చేజార్చుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నాడు. గత కొంతకాలం నుంచి పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై విమర్శకుల చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించక తప్పదన్నాడు. 'మా జట్టులో చాలా సమస్యలున్నాయి. అయితే టీమ్ ను విజయాల బాట పట్టించడానికి సమయం పడుతుంది. జరగబోయే దాని గురించి నిరీక్షిద్దాం' అని వకార్ తెలిపాడు. ప్రస్తుతం కొత్త ఆటగాళ్లతో సరికొత్తగా తీర్చిదిద్దడానికి యత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. 16 ఏళ్ల తరువాత పాకిస్థాన్ జట్టు బంగ్లాపై సిరీస్ ను కోల్పోవడం ఇదే ప్రథమం. -
మాజీలపై మండిపడ్డ వకార్ యూనస్
కరాచీ: గర్వి, ద్వేష పూరిత స్వభావం కలవాడు అంటూ మాజీ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ మండిపడ్డాడు. తనకు గర్వము, ద్వేషము ఉంటే ఇంత స్థాయికి వచ్చే వాడిని కాదంటూ తాజాగా కౌంటర్ ఇచ్చాడు. సోమవారం ఒక స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటూర్యూలో వకార్ ఘాటుగా స్పందించాడు. దేశానికి సేవచేసి, ఒక స్టార్ గా ఎదిగిన తనను మాజీ ఆటగాళ్లు, విమర్శకులు టార్గెట్ చేయడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించాడు. ఆటగాళ్లు తమ శైలిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వకార్ హెచ్చరించిన నేపథ్యంలో అతనిపై తాజాగా పలు విమర్శలు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగానే స్పందించిన వకార్.. తాను ఎవరికీ తలొగ్గే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశాడు. ఒకవేళ మనం ఒకసారి వెనక్కు తగ్గితే అందులో ఎదుగుదల అసాధ్యమంటూ పాకిస్థాన్ క్రికెట్ ను పరోక్షంగా హెచ్చరించాడు. 'నాకు జట్టులోని ఆటగాళ్లు అందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఎవరిపైనా రాగ ద్వేషాలు అనేవి నాలో లేవు. నేను ఎప్పుడూ ఏ ఆటగాడి క్రికెట్ జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదు'అంటూ వకార్ స్పష్టం చేశాడు. 2011 లో టీమిండియాతో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫెనల్ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ ను ఎందుకు తప్పించాల్సి వచ్చింది?అనే దానిపై కూడా వకార్ దీటుగా బదులిచ్చాడు. ఆ సమయంలో అక్తర్ కంటే వహాబ్ రియాజ్, ఉమర్ గుల్ తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లు రాణిస్తున్న కారణంగా వారిని ఎంపిక చేయాల్సి వచ్చిందన్నాడు. ఆ మ్యాచ్ లో రియాజ్ ఐదు వికెట్లు తీసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడన్నాడు. షోయబ్ అక్తర్ తన శరీరాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుని మరిన్ని వికెట్లు తీసి ఉంటే జట్టులో అతని స్థానం ఉండేందంటూ వకార్ తెలిపాడు. -
'క్రికెటర్లూ..ముందు మీ శైలి మార్చుకోండి'
కరాచీ: తరుచు వివాదాల నడుమ పయనిస్తూ పేలవమైన ఆటను ప్రదర్శిస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లకు ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ కొన్ని సూచనలు చేశాడు. తొలుత పరాజయాల నుంచి బయటపడాలంటే క్రికెటర్లు తమ శైలిని తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఒకవేళ అలా కాకుంటే జట్టుకు తీవ్ర నష్టం వాటిల్లితుందని తెలిపాడు. 'నేను ఒక విషయంగా స్పష్టంగా చెబుతున్నా. పాక్ క్రికెటర్లు వారి శైలిని సరైన మార్గంలో పెట్టడానికి యత్నించాలి. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.జట్టులో స్థానం కోల్పోయి ప్రమాదం కూడా ఉంది' అని వకార్ హెచ్చరించాడు. దీనిపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఒక నివేదిక అందజేశానని.. వాటిని బోర్డు పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 18 కోట్ల ప్రజల ఆశలను బ్రతికించాలంటే క్రికెటర్లు జాగ్రత్తగా ఆడటం మంచిదన్నాడు. దేశానికి సెలెక్ట్ అయ్యే ముందు క్రికెటర్ల నడవడిక చాలా ముఖ్యమైన అంశమని వకార్ పేర్కొన్నాడు. -
'పాకిస్థాన్ క్రికెట్ చచ్చిపోతుంది'
సిడ్నీ: పాకిస్థాన్ లో క్రికెట్ ఉనికి ప్రమాదంలో పడిందని పాకిస్థాన్ కోచ్ వకార్ యూనిస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి టీమ్ లు తమ దేశంతో ఆడకుంటే పాకకిస్థాన్ లో క్రికెట్ చచ్చిపోయే ప్రమాదముందని వాపోయాడు. 2009 నుంచి పాకిస్థాన్ లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. అదే ఏడాది మార్చిలో పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుపై లాహోర్ లో తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అని వకార్ పేర్కొన్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాక్ క్రికెట్ ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరాడు. -
ఒక్క బాల్ ఆడకపోయినా.. సచిన్ పరుగుల సునామీ
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. 2003 జరిగిన ప్రపంచ కప్ లో సచిన్ సృష్టించిన బ్యాటింగ్ సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ ప్రపంచ కప్ లో వ్యక్తిగతంగా 673 పరుగులు చేయడం అప్పట్లో ఓ రికార్డుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ప్రపంచ కప్ లో నెట్ ప్రాక్టీస్ లో ఒక్క బంతిని కూడా ఆడకపోయినా.. ఆరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్ వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ ల బంతులను సునాయాసంగా బౌండరీకి తరలించారని ద్రావిడ్ తెలిపారు. కీలక టోర్నమెంట్ లో రాణించాలని తామందరం నెట్స్ ప్రాక్టీస్ లో చెమటోడ్చినా.. సచిన్ మాత్రం ప్రాక్టీస్ కు దూరంగా ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ద్రావిడ్ తెలిపాడు. అయితే ఎందుకు నెట్ ప్రాక్టీస్ చేయడం లేదని తాము అడుగగా.. నేను బాగానే ఆడుతా అనే నమ్మకం ఉంది. ప్రాక్టీస్ చేయడం అనవసరం అనిపిస్తోంది. పరుగులు ఎప్పుడైనా సాధించగల నమ్మకం నాలో ఉంది అని సచిన్ అన్నాడని ద్రావిడ్ తెలిపారు. ప్రపంచంలో గొప్ప ఆటగాడైనా సచిన్ ఆట చూసే భాగ్యం తమకు కలిగిందనే ఫీలింగ్ అందరిలోనూ కలిగిందని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌గా వకార్ యూనిస్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌గా మాజీ కెప్టెన్ వకార్ యూనిస్‌ను ఎంపిక చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. గతంలో వకార్ 2010-11లో పాక్ కోచ్‌గా పని చేశారు. ఈసారి రెండేళ్ల కాలానికి వకార్‌ను ఎంపిక చేశారు. అక్టోబరులో యూఏఈలో ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. వన్డే ప్రపంచకప్‌కు జట్టును పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని వకార్ చెప్పారు. -
పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా వకార్
కరాచి: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నెలాఖర్లో వకార్ బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు, రెండేళ్లపాటు అతడు ఈ బాధ్యతల్ని నిర్వర్తించే విధంగా ఒప్పందం కుదిరినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజమ్ సేథి ప్రకటించారు. వకార్తోపాటు చీఫ్ సెలక్టర్ కమ్ మేనేజర్‌గా మొయిన్ఖాన్ను నియమించినట్లు తెలిపారు. గతంలోనూ (2010- 2011లో) పాక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన వకార్.. అప్పట్లో వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బ్యాటింగ్ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్ జింబాబ్వే మాజీ ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్.. పాక్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యే అవకాశాలున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్కు ఈ బాధ్యతలు అప్పగించేందుకు పీసీబీ ప్రయత్నించినా.. అతడు తన వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నందున అంగీకరించలేదని తెలుస్తోంది.