business news
-
దావాలకు దొరక్కుండా.. ఉద్యోగులకు గూగుల్ సీక్రెట్ మెమో!
ప్రపంచ సమాచారాన్నంతా నిల్వ చేసే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. తమ అంతర్గత కమ్యూనికేషన్లపై మాత్రం చాలా ఏళ్లుగా జాగ్రత్త పడుతూ వస్తోంది. పోటీ చట్టాల దావాలకు ఏమాత్రం అవకాశం లేకుండా తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లన్నీ ఉద్యోగులచేత తుడిచేయించేదని ఓ నివేదిక పేర్కొంది.న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2008లో అప్పటి ప్రత్యర్థి యాహూతో ప్రకటనల ఒప్పందంపై విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి గూగుల్ అటువంటి రహస్య వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ మేరకు అప్పట్లో ఉద్యోగులకు రహస్య మెమోను పంపింది."ఉద్యోగులు ఊహాగానాలు, వ్యంగ్యానికి దూరంగా ఉండాలి. హాట్ టాపిక్ల గురించి మెసేజ్‌లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి" అని గూగుల్ ఉద్యోగులకు సూచించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్ఇందుకోసం గూగుల్ టెక్నాలజీని కూడా సర్దుబాటు చేసుకున్నట్లు టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కంపెనీ ఇన్స్టంట్ మెసేజింగ్ సాధనంలో సెట్టింగ్‌ను "ఆఫ్ ది రికార్డ్‌కి మార్చింది. దీంతో ఆ మెసేజ్‌లు మరుసటి రోజుకంతా వాటంతట అవే తుడిచిపెట్టుకుపోతాయి. గతేడాది గూగుల్ ఎదుర్కొన్న మూడు పోటీ చట్టాల ఉల్లంఘన విచారణల్లో లభ్యమైన వందలాది పత్రాలు, సాక్షుల వాంగ్మూలను పరిశీలిస్తే గూగుల్ అవలంభించిన తీరు తెలుస్తుందని నివేదిక పేర్కొంది. -
డేటా సెంటర్ మార్కెట్లో బెంగళూరు కంపెనీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో ఉన్న బెంగళూరు కంపెనీ ఆర్ఎంజడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డేటా సెంటర్ ఆపరేటర్ కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్‌తో సమాన వాటాగా సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్ఎంజడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ద్వారా భారత డేటా సెంటర్ మార్కెట్లో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్ఎంజడ్ వెల్లడించింది.ఈ నిధులతో తొలుత నవీ ముంబై, చెన్నైలోని అంబత్తూర్లో ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తారు. భవిష్యత్తులో అదనంగా మూడవ కేంద్రాన్ని జోడిస్తారు. అన్ని దశలు పూర్తి అయితే డేటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. యూరప్, జపాన్‌తోపాటు భారత్‌లో కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ 25 ఏళ్లుగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమై ఉంది. -
దడ పుట్టిస్తున్న పసిడి పెరుగుదల
Gold Price Today: దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనుగోలుదారులకు దడ పుట్టిస్తోంది. నాలుగు రోజులుగా పసిడి ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. తాజాగా గురువారం (నవంబర్ 21) కూడా పసిడి రేట్లు ఎగశాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.71,450 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.330 ఎగసి రూ.77,950 వద్దకు పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.ఇక ఢిల్లీలోనూ పసిడి ధరల పెరుగుదల కొనసాగింది. నేడు ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ.78 వేలు దాటింది. 22 క్యారెట్ల బంగారం రూ.300 పెరిగి రూ.71,600 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.330 ఎగిసి రూ.78,100 లను తాకింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాకాగా వెండి ధరలు (Silver Price Today) నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దక్షిణ భారత్‌కు ఐదు కొత్త కార్గో విమాన సర్వీసులు
హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రవాణా సేవల కంపెనీ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ (ఫెడెక్స్) దక్షిణ భారత్ ప్రాంతాలకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానత కల్పించేందుకు కొత్తగా ఐదు కార్గో విమాన సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి కీలక దిగుమతులకు ఈ విస్తరణ వీలు కల్పిస్తుందని, యూరప్, యూఎస్ఏకి ఎగుమతుల వృద్ధికి సాయపడుతుందని కంపెనీ తెలిపింది.అలాగే, లాజిస్టిక్స్, సరఫరా చైన్‌కు అనుకూలిస్తుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో దక్షిణ భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని పేర్కొంది. ‘‘దేశ వృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ కంపెనీలకు కేంద్రంగా ఉంటోంది. నూతన ఫ్లయిట్ సేవలు ఈ ప్రాంత డిమాండ్‌ను తీర్చేందుకు ఫెడెక్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’అని ఫెడెక్స్ సీఈవో, సీఎఫ్‌వో రిచర్డ్ వి.స్మిత్ ప్రకటించారు. -
రూ. 213 కోట్లు జరిమానా.. అప్పీలుకు మెటా
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
కొత్తగా 20.58 లక్షల మందికి ఈఎస్ఐ
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే ఈఎస్ఐ పరిధిలోకి సెప్టెంబర్‌లో కొత్తగా 20.58 లక్షల మంది చేరారు. 2023 సెప్టెంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 18.88 లక్షలుగా ఉంది. అంటే 9 శాతం మందికి అదనంగా ఉపాధి లభించినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.230 కొత్త సంస్థలు ఈఎస్ఐ పథకం పరిధిలో సెప్టెంబర్‌లో కొత్తగా 230 సంస్థలు నమోదు చేసుకున్నాయి. ఇక 20.58 లక్షల కొత్త సభ్యుల్లో 49 శాతం మేర 25 ఏళ్లలోపు వయసువారే ఉన్నారు. మహిళా సభ్యులు 3.91 లక్షల మంది కాగా, అలాగే 64 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్తగా చేరారు. -
వచ్చేస్తున్నాయి.. జెప్టో కేఫ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కేఫ్ సేవలను విస్తరిస్తున్నట్టు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్లలో 120కిపైగా కేఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్టు వివరించింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, పుణే నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించింది.అధిక నాణ్యత గల ఆహార తయారీ ప్రక్రియతో 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేశామని, అందుకే బలమైన కస్టమర్ స్పందనను చూస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రూయింగ్ నైపుణ్యాలను ఉపయోగించే కాఫీ మెషీన్లతో సహా కేఫ్‌ల కోసం అత్యాధునిక పరికరాలను నిశితంగా పరిశోధించి, తమ బృందం సేకరించిందని వివరించింది.ఇదీ చదవండి: జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలుచాయ్, కాఫీ, అల్పాహారం, పేస్ట్రీస్, స్నాక్స్ వంటి 148 రకాల ఉత్పత్తులను 10 నిముషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని తెలిపింది. కొత్త నగరాలకు విస్తరించడం, ప్రతి నెలా 100కుపైగా కొత్త కేఫ్‌లను ప్రారంభిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,000 కోట్ల యాన్యువల్ రన్ రేట్ సాధిస్తామని జెప్టో సీఈవో ఆదిత్ పలీచా తెలిపారు. -
బంగారం హ్యాట్రిక్ మోత!
Gold Price Today: దేశంలో బంగారం ధరల పరుగు కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 20) పసిడి రేట్లు హ్యాట్రిక్ మోత మోగించాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పుత్తడి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 పెరిగి రూ.71,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.550 ఎగసి రూ.77,620 వద్దకు పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పుంజుకొన్నాయి.దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.71,300 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.550 ఎగిసి రూ.77,770 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానానిలకడగా వెండిSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్‌మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్‌లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్‌షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్‌లో సంయత్ సర్వీసెస్‌కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు దాఖలయ్యాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) సబర్మతి ఏవియేషన్, జెట్ఎయిర్17 సంస్థలు వీటిని దాఖలు చేశాయి. సబర్మతి పిటీషన్‌పై స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్సీఎల్టీ.. 27 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌కు సంబంధించి అదనంగా మరిన్ని పత్రాలు సమర్పించాలని జెట్ఎయిర్17కి సూచించింది.ఐర్లాండ్‌కి చెందిన జెట్ఎయిర్17 .. విమాన ప్రయాణికుల రవాణాకు సంబంధించిన పరికరాలను లీజుకు అందిస్తుంది. తాము విల్మింగ్టన్ ట్రస్ట్ నుంచి విమానాలను లీజుకు తీసుకోగా, బాకీలు తీర్చాలని జెట్ఎయిర్17 కోరుతోందని స్పైస్‌జెట్ వాదించింది. విల్మింగ్టన్ ట్రస్ట్‌కి, జెట్ఎయిర్ 17కి మధ్య సంబంధంపై స్పష్టత లేదని పేర్కొంది.అయితే, స్పైస్‌జెట్ లీజును విల్మింగ్టన్ తమకు బదలాయించిందని, దానికి అనుగుణంగానే తాజాగా పిటీషన్ దాఖలు చేశామని జెట్ఎయిర్ 17 వివరించింది. స్పైస్‌జెట్‌పై ఇటీవల విల్లీస్ లీజ్, ఎయిర్‌క్యాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ తదితర సంస్థలు దివాలా పిటీషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో చాలా మటుకు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
ప్రపంచంలోని గ్రేటెస్ట్ సూపర్ కార్లు ఇవే (ఫోటోలు)
-
పసిడి ప్రియులకు చేదువార్త...! మళ్లీ రేటెక్కిన బంగారం..
-
మళ్లీ రేటెక్కిన బంగారం
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ రేటెక్కాయి. సోమవారం (నవంబర్ 18) పసిడి రేట్లు సుమారుగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం తిరిగి రూ.70 వేల మార్కును దాటింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పుత్తడి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇక్కడ చూద్దాం..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.600 పెరిగి రూ.69,950 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.660 ఎగసి రూ. 76,310 వద్దకు హెచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.600 పెరిగి రూ.70,100 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.660 ఎగిసి రూ.76,460 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్‌హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్‌టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్‌ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్‌లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్‌లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్‌హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
దూసుకెళ్లే రేసుగుర్రం.. రాకెట్ వన్ బైక్ (ఫోటోలు)
-
రాజధానిలో ఇళ్ల ధరలు రెట్టింపు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతమైన గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ (ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం) పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లోని ఇళ్ల ధరలు సగటున రెట్టింపైనట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2019 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో నోయిడాలో అత్యధికంగా చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర 152 శాతం మేర పెరిగి రూ.5,910 నుంచి రూ.14,946కు చేరింది.ఘజియాబాద్‌లో 139 శాతం పెరిగి రూ.3,691 నుంచి రూ.8,823కు చేరింది. గురుగ్రామ్‌లో ఎస్ఎఫ్టీ ధర రూ.19,535కు చేరింది. 2019లో ఉన్న రూ.8,299తో పోల్చి చూస్తే 135 శాతం పెరిగింది. గ్రేటర్ నోయిడాలో చదరపు అడుగు ధర 121 శాతం పెరిగి రూ.8,601గా ఉంది. 2019లో ఇక్కడ చదరపు అడుగు రేటు రూ.3,900గా ఉంది. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
వంట నూనెల దిగుమతులు తగ్గాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) తెలిపింది.ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. 2022–23 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్ తెలిపింది. విభాగాల వారీగా ఇలా.. ముడి పామాయిల్ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్బీడీ పామోలిన్ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది. -
ఆడి కొత్త కారు.. బుకింగ్‌లు ప్రారంభం
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. -
పండుగలో 42,88,248 వాహనాలు కొనేశారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది 42 రోజులపాటు సాగిన ఫెస్టివ్ పీరియడ్‌లో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 11.76 శాతం వృద్ధితో 42,88,248 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది పండుగల సీజన్లో కస్టమర్లకు చేరిన వాహనాల సంఖ్య 38,37,040 యూనిట్లు.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. ఒడిశాలో తుఫాను, దక్షిణాదిన అకాల వర్షాలతో పరిశ్రమ అంచనాలను చేరుకోలేకపోయింది. అన్నీ అనుకూలిస్తే పండుగల సీజన్లో పరిశ్రమ 45 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని భావించింది. కాగా, ఈ ఏడాది పండుగల సీజన్లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లు నమోదయ్యాయి. బలమైన గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు 14 శాతం దూసుకెళ్లి 33,11,325 యూనిట్లను తాకాయి.వాణిజ్య వాహనాల రిటైల్ సేల్స్ 1 శాతం పెరిగి 1,28,738 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 7 శాతం అధికమై 1,59,960 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2 శాతం క్షీణించి 85,216 యూనిట్లకు పడిపోయాయి’ అని ఫెడరేషన్ వివరించింది. క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒకటిన్నర నెలలు మిగిలి ఉన్నందున 2024 స్టాక్‌ను విక్రయించడంపై దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను ఎఫ్ఏడీఏ కోరింది. -
సకల సౌకర్యాలున్న గుండ్రని ఇల్లు (ఫొటోలు)
-
చిన్న ఐటీ కంపెనీ.. భారీ లాభాలు
సాంకేతిక శిక్షణ, ఐటీ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ఈ ఏడాది(2024–25) తొలి ఆరు నెలల్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. చిన్న సంస్థల కోసం ఏర్పాటైన ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన కంపెనీ నికర లాభం ఏప్రిల్–సెప్టెంబర్‌లో 36 శాతం జంప్‌చేసి రూ. 11 కోట్లకు చేరింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం ఎగసి రూ. 92 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. నిర్వహణ లాభం(ఇబిటా) 53% జంప్‌చేసి రూ. 15 కోట్లను దాటింది."ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా భారత్‌లో డిమాండ్ మందగించడం, సిబ్బంది వ్యయం పెరగడం వంటి ఇబ్బందులు పడ్డాం. అయితే మా సామర్థ్యాలు, భౌగోళికాలు, సౌకర్యాలపై సకాలంలో పెట్టుబడి పెట్టగలిగినందున అటువంటి అనిశ్చితులను ఎదుర్కొనేందుకు బలమైన పునాదిని ఏర్పాటు చేశాం" అని విన్సిస్ చైర్మన్, ఎండీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. -
బంగారం Vs బిట్‌కాయిన్.. ఏది బెస్ట్..?