Case filed
-
గౌతమ్ అదానీపై సంచలన ఆరోపణలు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.అదానీ కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. కేసు నుంచి అదానీ తప్పించుకోలేరని, వాళ్ల దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునేందుకు అక్కడున్నది మోదీ ప్రభుత్వం కాదని చురకలేశారు. దీనిపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు.అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికా అధికారుల అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ యూనిట్లు 600 మిలియన్ డాలర్ల బాండ్‌ను రద్దు చేశాయి. అలాగే అమెరికన్ డాలర్‌పై జారీ చేసిన అన్ని బాండ్లను వెనక్కితీసుకున్నట్లు తెలిసింది.ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. అదానీ సంపద 69.8 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో 22వ అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ స్టాక్‌లలో సుమారు 150 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. Adanis indictment in the US is for 5 counts massive bribery & fraud; & relies on irrefutable electronic evidence. It seeks forfeiture of their properties.Adani forgot that US is not ruled by Modi where he could rely upon a pliant ED, SEBI& CBI to get away with anything.#Modani pic.twitter.com/G0VWQyTIUW— Prashant Bhushan (@pbhushan1) November 21, 2024 -
పోలీస్ విచారణకు హాజరుకాని రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. లెక్క ప్రకారం ఈరోజు (నవంబర్ 19) విచారణకు హాజరు కావాలి. అయితే తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు. విచారణకు సహకరిస్తానని, కాకపోతే నాలుగైదు రోజుల తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. అయితే వర్మ నిజంగానే షూటింగ్ బిజీలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటానని సీఐ అన్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఇకపోతే సోమవారం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. (ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు
ప్రముఖ నటుడు పోసానిపై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ఈయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇందులో పేర్కొన్నారు. పోసాని వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు)బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపైన కూడా టీడీపీ నేత కేసు పెట్టాడు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీసులు.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు) -
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు
సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవలే పార్టీ కార్యకర్త వరద భాస్కర్‌ను పోలీసులు కొట్టారనే ఆరోపణపై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మరో పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగుతూ.. పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై జరిగిన దాడి విషయమై ఈ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దీని పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ)ఇంతకీ ఏమైంది?ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న శ్యామ్ అనే స్టూడెంట్ ఇతడిని ర్యాగింగ్ చేసేవాడు. ఈ గొడవ కాస్త ముదిరి.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడు. ఇందులో భాగంగా ఆవేశానికి లోనైన శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరికేశాడు.తన కొడుకుపై జరిగిన దాడి గురించి తెలిసిన ఆర్పీ పట్నాయక్.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదలా ఉండగా ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడిగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆ మధ్య నటుడు, దర్శకుడిగానూ పలు చిత్రాలు తీశారు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ) -
యువతిని మోసం చేసిన కేసు.. స్పందించిన హర్షసాయి
యువతిని మోసం చేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలతో తనని బెదిరిస్తున్నాడని ఓ యువతి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఇది జరిగినప్పటి నుంచి హర్షసాయి అందుబాటులో లేడు. ఇతడితో పాటు తండ్రి రాధాకృష్ణ గురించి పోలీసులు వెతుకున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై హర్షసాయి స్పందించాడు. ఇన్ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకొస్తాయి. మా లాయర్ తానికొండ చిరంజీవి ఈ విషయమై త్వరలో మీ ముందుకు వస్తారు' అని ఇన్ స్టా స్టోరీలో హర్షసాయి రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)వైజాగ్‌కి హర్షసాయి.. పేదోళ్లకు డబ్బులు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంటాడు. అయితే ఈ కుర్రాడికి ఇన్నేసి లక్షల రూపాయలు ఎక్కడనుంచి వస్తున్నాయనేది పెద్ క్వశ్చన్ మార్క్. ఇది కాదన్నట్లు బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే ఈ విషయమై విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనబెడితే సొంతంగా కథ రాసుకుని 'మెగా' అనే సినిమాని గతేడాది లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న అమ్మాయే.. ఇప్పుడు హర్షసాయిపై కేసు పెట్టింది. తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ కేసు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ) -
యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇతడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. అలానే కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఇతడి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేరు.చాలామంది డబ్బులు, వస్తువులు పంచుతూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పెట్టే హర్షసాయికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడిని అభిమానించే వాళ్లు బోలెడు మంది. అలాంటిది ఇతడిపై ఇప్పుడు ఓ యువతి కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన ఈమె సినిమా అవకాశాల కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొంది. ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలో హర్షసాయి కలిశారు. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా నమ్మబలికి అత్యాచారం కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!)యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందే వీళ్లిద్దరి హీరోహీరోయిన్లుగా గతేడాది సెప్టెంబరులో ఓ సినిమా మొదలైంది. ఆ తర్వాత ఏకంగా రూ.2 కోట్లు వరకు ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈమెని మోసం చేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులని ఆశ్రయించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హర్షసాయి, అతడి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మరో ట్విస్ట్అయితే ఈ కేసులో కీలక ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. తనని హీరోగా పెట్టి తీసే 'మెగా' సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి ఇంతలా తెగించాడట. ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. కాపీ రైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్షసాయి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలని సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి) -
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.పేదలకు డబ్బు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే చాలా పాపులర్ అయ్యాడు. అయితే బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడని కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయి బండారం కాస్త బట్టబయలైంది. -
తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ
రీసెంట్గా దళపతి విజయ్ 'ద గోట్' మూవీతో వచ్చాడు. ఇందులో కీలక పాత్రలో నటించిన పార్వతి నాయర్‌పై ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. పార్వతి, మరో నిర్మాత సహా మొత్తంగా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగింది?2022 అక్టోబరు 20న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పార్వతి నాయర్ నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తన దగ్గర పనిచేసే సుభాష్ చంద్రబోస్.. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లక్షన్నర ఖరీదైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ దొంగతనం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిగా ఈమెపై సుభాష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పార్వతి నాయర్.. తనని కొట్టి, మానసిక క్షోభకు గురిచేసిందని, తిరిగి దొంగతనం కేసు పెట్టిందని చెప్పాడు.(ఇదీ చదవండి: భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్)ఇప్పుడేం జరిగింది?అప్పుడు సుభాష్.. తేనాంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తాజాగా సైదాపేట కోర్టులో కేసు వేశాడు. ఆమెతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తనని ఇబ్బంది పెట్టారని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయాడు. ఈ కేసు పరిశీలించిన స్థానిక కోర్ట్.. చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించింది.ఈ క్రమంలోనే నటి పార్వతి నాయర్, నిర్మాత కొడప్పాడి రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిపై తేనాంపేట పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దుబాయిలో పుట్టి పెరిగిన పార్వతి నాయర్.. మలయాళ సినిమాలతో నటి అయింది. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో చేయనప్పటికీ ఎంతవాడు గానీ, ఉత్తమ విలన్, ద గోట్ చిత్రాలతో అలరించింది.(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్) -
తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కాస్త పురోగతి. ఇప్పటికే కేసు వివరాలని సేకరించిన పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ని తీసుకుని, ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే రెండు వారాల క్రితమే ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. కానీ మూడు రోజుల క్రితం బాధిత మహిళ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. అప్పటినుంచి జానీ మాస్టర్ జాడ మాత్రం తెలియట్లేదు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ)ఈ కేసు ఏంటి?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి)ఫిల్మ్ ఛాంబర్ స్పందనఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ గట్టిగా బిగుస్తోంది.జానీ మాస్టర్ ఎక్కడ?అయితే తనపై పోలీసు కేసు నమోదైన దగ్గర నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులని సంప్రదించారు. జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చి, ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేయడం గ్యారంటీ!(ఇదీ చదవండి: జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసింది: బాధితురాలు) -
జానీ మాస్టర్ భార్య దాడి చేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్, అతని భార్య ఇద్దరూ కలిసి ఒకరోజు తన ఇంటికి వచ్చి బలవంతంగా తలుపులు తెరవడంతో పాటు లోపలికి వచ్చి తనతో మతం ప్రస్తావన తీసుకొచ్చారని, నానా రకాలుగా ప్రశ్నించారని, ఈ క్రమంలో జానీ మాస్టర్ భార్య పలుమార్లు తనపై శారీరక దాడికి పాల్పడిందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) చేసిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న నార్సింగి పీఎస్‌లో ఐపీసీ 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో మొదలుపెట్టి.. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఢీ–12 డ్యాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది. అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు.దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తన కోరిక తీర్చనన్నందుకు జుట్టు పట్టుకొని ఆమె తలను వ్యానిటీ వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆగంతకుడి బెదిరింపులు.. అనుమానాస్పద పార్శిల్ వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా ప నిచేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్ర మలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసు కుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని, షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. 28న ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్శిల్ వేలాడదీసి ఉంది. అందులో ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ .. బట్ బీ కేర్ ఫుల్..’అని రాసి ఉందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
మణికొండ: సినిమాల్లో నృత్య దర్శకునిగా పనిచేస్తూ పాపులర్ అయిన జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతని సహాయకురాలు (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లలో పాల్గొన్నప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలుమార్లు వేధింపులకు గురి చేశాడని వివిధ ఆధారాలతో ఆమె ఆదివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితురాలు ఉండేది నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కావటంతో రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 1371/2024 ప్రకారం సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 323(2) గాయపర్చడం వంటి సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.ఇదిలా ఉండగా జానీ మాస్టర్‌కు గతంలోను నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోచేరి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేసు తమ స్టేషన్‌కు వచ్చిందని, విచారణ చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి తెలిపారు. మరో పక్క సఖీ బృందం బాధితురాలి వద్ద రహస్య ప్రదేశంలో వివరాలు సేకరించింది. బాధితుల గోప్యతను కాపాడాలి‘ఓ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత వ్యక్తుల తాలూకు ముసుగు లేని ఫొటోలను, వీడియోలను ఉపయోగించవద్దని, ఒకవేళ ఇప్పటికే ఉపయోగించినట్లయితే వెంటనే తీసివేయాలని కోరుతున్నాం’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఓ నోట్‌ని విడుదల చేసింది. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్థిస్తున్నాం.. అంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి తరఫున గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ ఆ నోట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో స్పందించిన జనసేనపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశంసాక్షి, అమరావతి: మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు జనసేన కార్యాలయం పార్టీ ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్ పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించడమైనది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది..’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనితో పాటే ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది. (ఇదీ చదవండి: కౌగిలించుకోవడం కోసం 17సార్లు రీ షూట్.. మాలీవుడ్ 'తెర' వెనుక అగ్లీ స్టోరీస్)అందరి ముందు అసభ్యంగా శరీరభాగాలను తాకేవాడని, పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్ తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని దానిపై రాసి ఉందని బాధితురాలు పేర్కొంది. తనకు అవకాశాలు లేకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీనిపై నార్సింగి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.ఇదే కాదు గతంలోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. అంతకు ముందు కాలేజీకి వెళ్లి ఓ యువతిని కొట్టిన కేసులో 2019లో కోర్టు ఇతడికి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు. ఇలా వరస వివాదాలతో జానీ మాస్టర్ హాట్ టాపిక్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. హైదరాబాద్‌లోని రాయ్‌దుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని పోలీసులు అక్కడికి బదిలీ చేశారు.ఏం జరిగింది?మధ్యప్రదేశ్‌కి చెందిన 21 ఏళ్ల మహిళ.. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా గత ఆరు నెలలుగా పనిచేస్తోంది. అయితే ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఇంతకు ముందు కూడాఈ ఏడాది జూన్‌లోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015లో ఓ కాలేజీలో జరిగిన గొడవ విషయమై ఇలా తీర్పిచ్చింది. ఇలా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు.జనసేన నాయకుడుకొరియోగ్రాఫర్గా అందరికీ తెలిసిన జానీ మాస్టర్.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్. కొన్నాళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసారు. కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో సీఎం, ప్రధాని అవుతారని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు తనపై నమోదైన కేసు విషయంలో ఏం చెబుతాడో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
సాక్షి,హైదరాబాద్:శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితమే ఒక కేసు నమోదవగా ఆ కేసులో గాంధీ ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు.కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఇవి కాస్తా హద్దు మీరి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద గాంధీ దాడి చేసే దాకా వెళ్లింది. ఈ దాడిపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో హరీశ్‌రావు సహా ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు. ఇదీ చదవండి.. ఎమర్జెన్సీ కన్నా దారుణం: హరీశ్‌రావు -
‘హైడ్రా’ పేరిట వసూళ్లు..! వ్యక్తిపై కేసు నమోదు
సాక్షి,సంగారెడ్డి: అమీన్పూర్లో హైడ్రా పేరిట బిల్డర్ల వద్ద నుంచి వసూళ్లకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలిస్స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం ఉందని, ఆయనతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ వాట్స్అప్ కాల్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. మీ జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. బిల్డర్ల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై థర్డ్‌డిగ్రీ.! షాద్‌నగర్ పోలీసులపై కేసు
సాక్షి,షాద్‌నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఇటీవల ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. షాద్‌నగర్ పీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) రామ్‌రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై ఎఫ్ఐఆర్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల షాద్‌నగర్ పోలీసులు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. -
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మన్యంలో మోసగాడిగా.. పచ్చ నేత! యథేచ్ఛగా మేత!!
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్ఐఆర్:47/2019) కేసు నమోదైంది.2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్ -
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
‘‘చంపేస్తాం’’.. మహిళా జడ్జికి బెదిరింపు లేఖ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఇదీ చదవండి.. అతనికి 35, ఆమెకు 42