chemotherapy
-
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్‌గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శిరోజాలు దానం చేయండి
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం...ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది.అయితే భువనేశ్వర్‌కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం ‘శిరోజాల దానం’. ‘మీరు దానం చేసే శిరోజాల పేద కేన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది’ అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది. కేన్సర్‌తో పోరాడి గెలవ డానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేన్సర్ చికిత్స సమయంలో కిమోథెరపీ వల్ల జుట్టు రాలిపో తుంది. ఆ సమయంలో శిరోముండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చేవరకూ విగ్గులు ధరిస్తారు. కాని పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. ‘శిరోజాల దానం ఇవాళ్టి అవసరం’ అంటుందామె. సామాజిక సేవ ఒడిశ్సాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 32 ఏళ్ల హరిప్రియ నాయక్ సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. ‘ఒకసారి నేను కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన పేదస్త్రీలను చూశాను. వారు ఇంటినుంచి బయటకు రావడానికే సిగ్గుపడుతున్నారు. కేన్సర్‌తో పో రాడే సమయంలో మానసికంగా, శారీరకంగా గట్టిగా ఉండాలి. మానసికంగా కుచించుకుపో తే కష్టం. స్త్రీలు జుట్టును ఇష్టపడతారు. వారికి సరైన విగ్గు ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం వస్తుందని పనిలోకి దిగాను’ అంటుంది హరిప్రియ నాయక్. ఆమె 2021లో ‘మిషన్ స్మైల్ ఫర్ ది కేన్సర్ ఫైటర్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని శిరోజాల సేకరణ కోసం మొదలుపెట్టింది. శిరోజాల దానం కోసం ప్రచారం కొనసాగించింది. 9 మంది సాయం ఒకరికి మేలు ‘సింథటిక్ విగ్గులు త్వరగా పాడవుతాయి. వాటివల్ల చర్మ సంబంధ ఇబ్బందులు వస్తాయి. అదే సహజమైన జుట్టుతో చేసిన విగ్గులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం ఎవరైనా సరే శిరోజాలు ఇవ్వొచ్చు. కాని 12 అంగుళాల కంటే ఎక్కువ పోడవు ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. 9 మంది ఇచ్చిన జుట్టుతో ఒక్క విగ్గు తయారవుతుంది. మా ప్రచారం ఒడిస్సాలో మాత్రమే కాదు జార్ఖండ్‌లో కూడా కొనసాగుతోంది. ఒక ఆరేళ్ల పాప మాకు శిరోజాలు ఇవ్వడం ఒక రికార్డు’ అంటుంది హరిప్రియ నాయక్. హెయిర్ డొనేషన్ ఒడిశా ‘హెయిర్ డొనేషన్ ఒడిశా’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది హరిప్రియ నాయక్. వాలెంటీర్లు పని చేసేవారిని ఆహ్వానిస్తుంది. ఇప్పటికి 150 మంది వాలెంటీర్లు ఆమెతోపాటు పని చేస్తున్నారు. శిరోజాలు దానం చేసే వారి నుంచి వాటిని సేకరించి హైదరాబాదులోని ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్’ సంస్థకు పంపుతారు. అది ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇస్తుంది. వాటిని కేన్సర్ ఫైటర్స్‌కు అందజేస్తారు.‘నా జుట్టు తగినంత పెరిగిన ప్రతిసారీ నేను దానం చేస్తుంటాను. మీరు కూడా చేయండి. ఇది కూడా పుణ్యకార్యమే’ అంటుంది హరిప్రియ నాయక్. -
బాధంతా నీ ఒక్కదానిదే కాదమ్మా..నేనూ నీతోనే : కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కేన్సర్ పేషెంట్ల చికిత్స చాలా క్లిష్టం. ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక ఎత్తు అయితే, కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్‌ను భరించడం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే మామూలు వారు ఈ ఆలోచన భరించడమే కష్టం. కానీ కేన్సర్ సోకిన వారు కచ్చితంగా ఫేస్ చేయాలి. అనేక శారీరక బాధలను భరించాలి. ధైర్యంగా నిలడాల్సిందే. ముఖ్యంగా ఎంత పెద్ద జుట్టు అయినా, కుచ్చులుగా కుచ్చులుగా ఊడిపోతోంది. బోడిగుండు అయిపోతుంది. వీటి అన్నింటినీ తట్టుకోని బైటపడాలంటే చాలా మానసిక స్థయిర్యం కావాలి. ఈ మొత్తం ప్రక్రియలో చికిత్సం అందించే వైద్యులు, నర్సులుతో, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు అందించే సపోర్ట్ చాలా కీలకం. దీనికి సంబంధించిన ఒకటి ట్విటర్లో ఒకటి నెటిజన్ల కంట తడి పెట్టిస్తోంది. (సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!) ముఖ్యంగా కీమోథెరపీ తరువాత జుట్టు ఊడిపోతున్న క్రమంలో చాలామంది రోగులు ముందుగానే తమ హెడ్ షేవ్ చేసుకుంటా ఉంటారు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడి తల్లి తన జుట్టును మొత్తం తీసివేయించుకనేందుకు పార్లర్‌కు వెళ్లింది. అంతా సిద్దమైన తరువాత ఆమె కుమార్తె వచ్చి అనూహ్యంగా హెయిర్‌కటింగ్ టూల్‌ను తీసుకొని తన జుట్టును కట్ చేసుకుటుంది. దీన్ని గమనించిన తల్లి కన్నీంటి పర్యంతమవుతుంది. ‘‘నేను నీతోనే.. అమ్మా... నువ్వు ఒంటరివి కాదు’’ అన్నట్టు తల్లిని హత్తుకుంటుంది. ట్విటర్లో షేర్ అయిన ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. (అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది) “Mom, you don’t have to go through this alone”🥺❤️ pic.twitter.com/fsdTasZAWt — non aesthetic things (@PicturesFoIder) March 29, 2024 -
కేట్ మిడిల్టన్కు క్యాన్సర్
లండన్: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ (42) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. పొత్తికడుపు ఆపరేషన్ తర్వాత జనవరి నుంచి మీడియా ముందుకు రాని మిడిల్డన్ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికార్లు చేస్తుండటం తెలిసిందే. క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కేట్ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ఏప్రిల్ దాకా విధులకు దూరంగా ఉండనున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడటం తెలిసిందే. -
Kate Middleton: నేను కేన్సర్‌తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్‌నాథ్ చెప్పుకొచ్చారు. -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
కీమోథెరపీ ఇక సేఫ్
సాక్షి, హైదరాబాద్: కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడం..వ్యాధికణాలకు మాత్రమే మందు అందించేలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. కేన్సర్ సోకిందంటే మరణం తప్పదనేది ఒకప్పటిమాట. కానీ ఇప్పుడు జీవితాన్ని మరింతగా పొడిగించేందుకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో కీమోథెరపీ కూడా ఒకటి. అయితే ప్రత్యేక రసాయనాలతో అందించే ఈ చికిత్సలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర కణాలు కూడా నాశనమయ్యేవి. రోగనిరోధక శక్తి తగ్గి వెంట్రుకలు రాలిపోవడం, ఒళ్లంతా దద్దుర్లు, నోట్లో పుండ్లు లాంటి దుష్ప్రభావాలు అనేకం ఉండేవి. ఒకవేళ వీటన్నింటిని తట్టుకున్నా, కీమో రసాయనాల నుంచి తప్పించుకున్న కొన్ని కణాలతో మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంతోపాటు, ఇచ్చే మందు నేరుగా కేన్సర్ కణాలకు మాత్రమే చేరేలా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. నానో కణాలు తయారు చేసి..పేటెంట్ పొంది.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగపు అధ్యాపకుడు కొండపి ఆనంద్ తన పరిశోధనల ద్వారా నానో కణాలను తయారు చేశారు. అంతేకాకుండా తయారీ పద్ధతిని కూడా ఆవిష్కరించారు. పేటెంట్ హక్కులు కూడా పొందారు. ప్రస్తుతం ఇలా... కేన్సర్ చికిత్సలో భాగంగా కీమో రసాయనా లతో పాటు కణాలకు అవసరమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను కలిపి అందిస్తున్నారు. కానీ దీంతో ఫలితాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ సేంద్రియ పదార్థాలకు ఏది కేన్సర్ కణమో, ఏది సాధారణమైందో తెలియదు. అందువల్ల ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించేందుకు మాత్రమే ఈ సేంద్రియ పదార్థాలు ఉపయోగపడతాయి. రెండూ కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే... కీమో రసాయనాలు, సేంద్రియ పదార్థాలు రెండింటినీ కలిపి కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే చాలా లాభాలుంటాయని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ గుర్తించారు. ఈ పని సాధించే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. కేన్సర్ కణాలకు చక్కెరలన్నా, ఇనుము అన్నా చాలా ఇష్టమని చాలాకాలంగా తెలుసు. ఈ కారణంగానే ఏమో కేన్సర్ కణాల్లో ఈ రెండు పదార్థాలను ఒడిసిపట్టుకోగల రిసెప్టర్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విషయాలను అనుకూలంగా మార్చుకొని కేన్సర్‌పై పట్టు సాధించేందుకు కొండపి ఆనంద్ నేతృత్వంలో డాక్టర్ సొనాలి ఖన్రా, డాక్టర్ ఎస్ఎల్.బాలకృష్ణ, డాక్టర్ జగదీశ్ సేనాపతి, డాక్టర్ చుఖూ ముజ్, డాక్టర్ నేహాతోమర్, అంతం సోనీలతో కూడిన శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. పాలలోఉండే లాక్టోఫెర్రిన్, రక్తంలోని ప్రొటీన్లతో వీరి పరిశోధనలు సాగాయి. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను, కీమో రసాయనాన్ని నానోస్థాయి అపోట్రాన్స్‌ఫెరిన్ ప్రొటీన్‌లోకి చేర్చడంలో విజయం సాధించారు. నోటితోనూ వేసుకోవచ్చు... కీమోథెరపీకి నరాల్లోకి ఎక్కించే పద్ధతి ఒక్కటే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన లాక్టోఫెర్రిన్, అపోట్రాన్స్ఫెరిన్లతో తయారైన నానోస్థాయి కణాలను మాత్రం నేరుగా నోటిద్వారా కూడా అందించవచ్చని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన ప్రొటీన్లన్నీ సహజసిద్ధమైనవి కాబట్టి ఆరోగ్యకరమైన కణాలకు హాని జరగదని చెప్పారు. ఈ నానోస్థాయి కణాలు కేన్సర్ కణాల్లోని రిసెప్టర్లకు అతుక్కుపోవడం వల్ల అపోట్రాన్స్‌ఫెరిన్ విడిపోయి అందులోని కీమో రసాయనం బయటపడుతుందని, కేన్సర్ కణాన్ని నాశనం చేస్తుందని వివరించారు. సాధారణ కణాల్లో అపోట్రాన్స్‌ఫెరిన్, లాక్టోఫెర్రిన్లు ఉంటాయి కాబట్టి ప్రమాదమేమీ ఉండదన్నారు. ఈ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి 2017లో తాము భారతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ నెల 20వ తేదీన లభించిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని ముందుకొస్తే అతితక్కువ దుష్ప్రభావాలు ఉండే కీమోథెరపీకి నాంది పలకవచ్చని చెప్పారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ జన్యుచికిత్సలకూ ఉపయోగపడుతుందన్నారు. -
శభాష్ స్మృతి
ఒడిశా: కేన్సర్ రోగుల కోసం తన పొడవైన జట్టును దానంచేసి కొరాపుట్‌కు చెందిన యువతి ఔదార్యాన్ని చాటుకుంది. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన స్మృతి సుధా సాహు భువనేశ్వర్‌లో ఉన్నత విద్యను అభ్యనిస్తూ, సివిల్స్ కోసం శిక్షణ పొందుతోంది. ఇటీవల కేన్సర్ పీడిత మహిళల సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కేన్సర్ మహిళా రోగులకు కీమోథెరఫీ నిర్వహించిన తర్వాత జట్టు ఊడిపోతుంది. దీంతో వారికి విగ్గు అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి మహిళల కోసం సోప్వ అనే స్వచ్ఛంద సంస్థ మహిళల నుంచి జట్టును విరాళంగా సేకరిస్తుంది. దీంతో వెంటనే కేన్సర్ పేషెంట్లకు కనీస తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్మృతి ఆ సంస్థను సంప్రదించింది. సన్నిహితులు, సహచర విద్యార్థుల సమక్షంలో తన జట్టును విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒడిశాలో సుమారు 50 వేల మంది కేన్సర్ బాధితులు ఉన్నారన్నారు. చికిత్స సమయంలో జుట్టు రాలిపోతే మానసికంగా వేదనకు గురవుతారని పేర్కొన్నారు. అలాంటి వారికి జట్టు ఇవ్వడం వలన వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన నిర్ణయం తల్లిదండ్రులకు చెబితే సగం జుట్టు కంటే, పూర్తిగా ఇవ్వాలని సూచించి మద్దతు తెలిపారని ఆనందం వ్యక్తం చేసింది. -
9 సార్లు కీమోథెరపీ..అంతలోనే మరో రొమ్ముకి కూడా కేన్సర్: హంసా నందిని
‘‘కేన్సర్ అని నిర్ధారణ అయ్యాక గతం తాలూకు భయాలు, అయోమయాలు, ఒత్తిడి... అన్నీ మళ్లీ నన్ను చుట్టుముట్టినట్లు అనిపించింది. పలుమార్లు వైద్య పరీక్షలు, పలు స్కానింగ్స్ చేయించుకుని, శస్త్ర చికిత్స పూర్తయ్యాక ఇక ఏ భయం లేదు అనుకుంటున్న సమయంలో మరో రొమ్ముకి కూడా కేన్సర్ సోకే ప్రమాదం ఉందని నిర్ధారణ అయింది. మళ్లీ పోరాటం ఆరంభం’’ అని హంసా నందిని చెప్పా రు. 2020లో ఆమెకు గ్రేడ్ 3 ‘కార్సినోమా’ (రొమ్ము కేన్సర్) నిర్ధారణ అయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హంసా నందిని ఆ సంగతులు పంచుకున్నారు. ‘‘18 ఏళ్ల క్రితం మా అమ్మగారికి బ్రెస్ట్ కేన్సర్ అని నిర్ధారణ అయింది. దురదృష్టం కొద్దీ ఆ పో రాటంలో ఆమె ఓడిపోయారు. ఇక నాకు కేన్సర్ నిర్ధారణ అయ్యాక 9 సార్లు కీమోథెరపీ జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితి ముగిసిందనుకున్నాను. కానీ ఆ ఆనందం కొన్నాళ్లే. ఎందుకంటే ‘బీఆర్సీఏ1’ (వంశపారంపర్య రొమ్ము కేన్సర్) అని, జీవితంలో మరో రొమ్ముకి కూడా 70 శాతం కేన్సర్ సోకే ప్రమాదం ఉందని తేలింది. దాంతో పలు శస్త్ర చికిత్సలు, మరో ఏడు సార్లు కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఇది ఎంతో సవాల్‌తో కూడుకున్నది. అందుకే ‘చిరునవ్వుతో పోరాడాలి. మళ్లీ స్క్రీన్ మీద (నటించాలి) కనబడాలి. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా మన జీవితం గురించి చెప్పా లి’ అని నాకు నేనుగా వాగ్దానం చేసుకున్నాను. నేను జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ముందుగా రోగ నిర్ధారణ కావడం, మంచి డాక్టర్లు, నా ఫ్యామిలీ, నా పాజిటివ్ మైండ్ కారణం. గత నవంబర్‌లో షూటింగ్ సెట్లోకి కూడా అడుగుపెట్టాను. ఎప్పటికప్పుడు అందరూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. నేను సజీవంగా ఉన్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను. కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు నాకు నేనుగా ఓప్రామిస్ చేసుకున్నాను. ‘ప్రతి నిమిషాన్ని ఇదే చివరి నిమిషం అనుకుని బతకాలన్నది’ ఆప్రామిస్. ఈ సందర్భంగా మా అమ్మగారి పేరు మీద ‘యామినీ కేన్సర్ ఫౌండేషన్’ని ఆరంభించాలనుకుంటున్న విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నాను. -
పొడవాటి జుట్టు పోయిందని బోరున విలపించిన మహిళ.. వీడియో వైరల్..
మహిళలకు ఒత్తైన, పొడవాటి జుట్టంటే అమితమైన ఇష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శిరోజాలను సంరక్షించుకుంటారు. అప్పుడప్పుడు జుట్టు కాస్త ఎక్కువ జుట్టు ఊడిపోతేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది అందమైన జుట్టును మొత్తం క్షణాల్లో షేవ్ చేస్తే ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి.. ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఆమె అందమైన జట్టును భర్తే దగ్గరుండి ట్రిమ్మర్‌తో షేవ్ చేశాడు. క్షణాల్లో ఆమె జుట్టుమొత్తం మాయమైంది. పొడవాటి జట్టు పోయి తల బోడిగుండులా మారడంతో ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది. ఆమెను భర్త తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. దీంతో చలించిపోయిన భర్త.. భార్య జుట్టు పోయిందని బాధపడటం చూసి తన జుట్టును కూడా ట్రిమ్మర్‌తో క్లీన్ షేవ్ చేసుకున్నాడు. ఆమె వద్దని చెబుతున్నా వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. Empathy …👏👏👏pic.twitter.com/Ul8iAi64Jo — Harsh Goenka (@hvgoenka) March 2, 2023 అయితే ఈమె జుట్టును భర్తే షేవ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ఆమె క్యాన్సర్ బారినపడటంతో కీమో థెరపీ చికిత్స కోసం జుట్టును మొత్తం తీసేయాల్సి వచ్చింది. దీంతో భర్తే స్వయంగా ఈ పని చేశాడు. వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఈ అందమైన వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. నెటిజన్లు చలించిపోయారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉందంటూ కొనియాడారు. క్యాన్సర్‌పై పోరాటంలో భార్యకు తోడుగా ఉంటున్న భర్తను అభినందించారు. చదవండి: 48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. -
దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం..
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కీమోథెరపీ చికిత్సకు స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పీలేను పాలియేటివ్ కేర్‌కు తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా గతేడాది అతని పెద్ద పేగు నుంచి కణతిని తొలగించారు. అప్పటినుంచి పీలే క్రమం తప్పకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. కాగా ఇటీవలే పీలే ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబసభ్యులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేర్చారు. శరీరం పై వాపులు రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. పీలే కూతురు స్పందించారు. చికిత్స కోసమే తన తండ్రి పీలేను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదని, భయపడాల్సింది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే ఇలా కీమోథెరపీకి స్పందించడం లేదని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పీలే వయసు 82ఏళ్లు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచారు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డ్. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. పీలే.. మూడు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు FIFA WC: నరాలు తెగే ఉత్కంఠ.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా -
క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు..
వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవితకాలాన్ని పొడిగించుకోగలిగిన మనిషి క్యాన్సర్‌కు ఆన్సర్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. క్యాన్సర్ అనగానే ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. క్యాన్సర్‌పై అవగాహన కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి... ► క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాలు ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. ► క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. ► క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్–బి వ్యాక్సిన్ ద్వారా 50% – 60% కాలేయ క్యాన్సర్లను నివారించవచ్చు. ► క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా వీలైనంతవరకు క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ► క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... రక్తసంబంధీకుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ► క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొందరు కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని? ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం దాన్ని ఏ దశలో కనుక్కున్నాం, ఆ క్యాన్సర్ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేక సోకిన ప్రాంతానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, చికిత్సప్రక్రియలూ ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. ► క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. ► క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) పరిశోధకులు కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే వైద్యకేంద్రంలోని అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉందంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
క్యాన్సర్ బారిన పడిన హీరోయిన్.. ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్
సినీ పరిశ్రమలో ఈమధ్యకాలంలో ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ తాను క్యాన్సర్ బారిన పడినట్లు చెప్పింది. బాలీవుడ్ నటి రోజాలిన్ ఖాన్ తనకు క్యాన్సర్ ఉందని వెల్లడిస్తూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్యాన్సర్.. నా జీవితంలో ఇదొక అధ్యాయం. ప్రతి ఎదురుదెబ్బ నన్ను బలంగా మారుస్తుంది. నాకోసం ప్రార్థించే వ్యక్తులు చాలామందే ఉన్నారు. నాకు అంతా మంచే జరుగుతుందనుకుంటున్నా. ఇప్పుడు మెడనొప్పి, బ్యాక్ పెయిన్ తప్పించి ఏం లేదు. జిమ్‌లో వర్కవుట్స్ కారణంగా నొప్పి అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తూ ప్రారంభదశలోనే దీన్ని గుర్తించగలిగాం. డియర్ బ్రాండ్స్.. ప్రతినెల 2వ వారం షూట్‌కి అందుబాటులో ఉంటాను. రాబోయే 7నెలల పాటు ప్రతినెలా కీమోథెరపీ చేయించుకోవాలి. ప్రతి సెషన్ తర్వాత వారం రోజుల పాటు రెస్ట్ అవసరం.కాబట్టి 2వ వారంలో నేను మీకు అందుబాటులో ఉంటాను. త్వరలో బట్టతల మోడల్‌తో పనిచేయాలంటే మీకు ధైర్యం కావాలి. ప్రస్తుతానికైతే లైవ్‌లోకి వస్తాను అంటూ రోజ్లిన్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు మీరు త్వరలోనే కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రోజాలిన్ 2012లో ‘దమా చౌక్డీ’ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా సత్తా చాటింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండేది. క్యాన్సర్ బారిన పడినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పలు బ్రాండ్స్‌కి మోడల్‌గా వ్యవహరిస్తుంది. View this post on Instagram A post shared by Rozlyn Khan (@rozlynkhan) -
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్‌కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్‌సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
ఎముకల క్యాన్సర్లు... ఒక అవగాహన
మన శరీరానికి ఒక ఆకృతినీ, ఎత్తునీ, బరువునూ నిర్ణయించేది మన ఎముకలే. అంతేకాదు... మన శరీరంలోని కీలకమైన అవయవాలను... అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను వివిధ ఆకారాల్లో ఉండే ఎముకలు రక్షిస్తూ ఉంటాయి. ఎముకల ఉపరితలం గట్టిగా ఉండి లోపల స్పాంజ్‌లా ఉంటుంది. ఎముక లోపలి గుజ్జును బోన్‌మ్యారో అంటారు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి బోన్‌మ్యారో నుంచి జరుగుతుంది. వయసుపైబడే కొద్దీ మరీ ముఖ్యంగా మహిళల్లో ఎముకలు మరింత పలచగా, పెళుసుగా మారి తేలిగ్గా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలా జరగడాన్ని ‘ఆస్టియో పోరోసిస్’ అంటారు. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. చిన్నప్పట్నుంచి శరీరానికి ఎండ తగలనిస్తూ, క్యాల్షియం లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడితే మంచిది. ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఎముకలకు సంబంధించి బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ వంటి సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. చాలామందిలో బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఒకదానికి మరొకటిగా పొరబడటమూ జరుగుతుంది. ఎముకల మీద గడ్డ వచ్చే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అది క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డ అయినా, కాకపోయినా ఎముక మీద గడ్డ ఏర్పడితే ఫ్రాక్చర్స్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండటం, జ్వరం, రాత్రి చెమటలు పోయడం, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముకలు విరగడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గడ్డ తొలిదశలో చాలా చిన్నగా కనిపించడం వల్ల ఎక్స్‌రే పరీక్షతో నిర్ధారణ సరిగా జరగకపోవచ్చు. అందుకనే లక్షణాలు కనిపించినప్పుడు సమస్యను సరిగా నిర్ధారణ చేయడానికి సీటీ, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ కాని గడ్డ అయితే గుండ్రంగా, మెల్లగా పెరుగుతుంది. క్యాన్సర్ కణితి అయితే ఖచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతుంది. కణితి కొంచెం పెద్దగా ఉంటే ఎక్స్‌రేలోనూ, చిన్నగా ఉంటే ఎమ్మారై, సీటీ స్కాన్లలో బయటపడుతుంది. గడ్డ ఏరకమైనదో నిర్ధారణ చేయడానికి బయాప్సీ చేస్తారు. బోన్ క్యాన్సర్ గడ్డలలో ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా, కాండ్రో సార్కోమా, ఫైబ్రో సార్కోమా, కార్డోమా అనే రకాలుంటాయి. వయసు మీద ఆధారపడి ఈ గడ్డలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా చిన్నవయసువారిలో ఎక్కువగా కనిపిస్తే, కాండ్రో సార్కోమా మధ్యవయసు వారిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. బోన్క్యాన్సర్స్ చాలావరకు సెకండరీగానే ఉంటాయి. శరీరంలో మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్... ఎముకలకు వ్యాప్తి చెందడం (మెటాస్టాసిస్) ఎక్కువగా చూస్తుంటాం. ఎముకలోనే క్యాన్సర్ ముందుగా రావడం కొంతవరకు అరుదుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి లంగ్, ప్రోస్టేట్... ఇలా మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్ ఎముక మీద గడ్డలాగా ముందుగా బయటపడవచ్చు. అన్ని క్యాన్సర్లలో లాగానే సర్జరీ, రేడియో, కీమో థెరపీల ప్రాధాన్యత ఎముక క్యాన్సర్లలోనూ ఉంటుంది. క్యాన్సర్ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తీసివేసినప్పుడు, చిన్నగా ఉంటే సిమెంటింగ్, గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులతో సరిచేస్తారు. ఎముక తీయవలసిన ప్రదేశం ఎక్కువగా ఉంటే బోన్ బ్యాంక్ నుంచి ఎముకను సేకరించి, వాడటం లేదా మెటల్ ఇంప్లాంట్స్ వాడటం జరుగుతుంది. క్యాన్సర్ కణితి పెద్దగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేసి, తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్స్‌కు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహేబిలిటేషన్ వంటి ప్రక్రియల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎముకల క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే సెకండరీ బోన్ క్యాన్సర్స్ ఎక్కువ కాబట్టి మిగతా క్యాన్సర్లను ముందుగా గుర్తించి, చికిత్స తీసుకోగలిగితే ఈ క్యాన్సర్‌ను నివారించినట్లవుతుంది. క్యాన్సర్ వచ్చిన ఎముకలను గట్టిపరచడానికి బిస్పాస్ఫోనేట్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లకు మిగతా క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఎముకలకు పాకే గుణం ఉంటుంది. బోన్ క్యాన్సర్‌కు గురైనప్పుడు శరీరంలో క్యాల్షియం లెవెల్స్ కూడా పెరగవచ్చు. క్యాన్సర్ కణితి వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడటం వల్ల కాళ్లలో లేదా చేతులలో బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి. శరీరంలో ఎక్కడైనా మార్పు కనిపించినా, లక్షణాల్లో మార్పులు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకుని క్యాన్సర్ కణాన్ని తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, డాక్టర్ నిర్దేశించిన కాల వ్యవధి ప్రకారం సర్జరీ తర్వాత లేదా సర్జరీకి ముందు లేదా సర్జరీ లేకుండానే అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవాలి. అంతేకాదు... శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ వస్తే పక్కనుండే ఎముకలకు పాకే అవకాశం ఉన్నందున, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా ఐదేళ్ల వరకు చెకప్స్ చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. డా. సి.హెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ Ph: 98480 11421 -
Cancer: ట్యాబ్లెట్ల రూపంలోనూ కీమోథెరపీ! ఈ విషయాలు తెలుసా?
సాధారణంగా కీమోథెరపీ అనగానే క్యాన్సర్‌ను తుదముట్టించే మందుల్ని రక్తనాళం ద్వారా ఎక్కించడమే తెలుసు. కానీ ఇటీవల కీమోథెరపీని నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్/క్యాప్సూల్స్ రూపంలోనూ ఇస్తున్నారు. ప్రధానంగా కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లలో ఇలా జరుగుతోంది. ఓరల్‌గా కీమో ఇచ్చే ముందు ఓ పరీక్ష... నోటిద్వారా కీమోథెరపీ ఇవ్వడానికి ముందు ఓ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే... బాధితుల్లో చికిత్స ప్రారంభించడానికి ముందుగా వారిలోని జన్యుకణ పరిణామం ఏవిధంగా కొనసాగుతోందో తెలుసుకోవడం అవసరమవుతుంది. ఇందుకోసం ముందుగా ‘ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (ఈజీఎఫ్ఆర్) మ్యుటేషన్’ అనే పరీక్ష అవసరం. ఆరోగ్యవంతమైన కణంలో కణాల పెరుగుదల, విభజనకు ఈజీఎఫ్ఆర్ అనే అంశం తోడ్పడుతుంది. సరిగ్గా అదే అంశం కూడా... క్యాన్సర్ కణాల పెరుగుదల, విభజనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. దాంతో క్యాన్సర్ కణాలు సైతం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. తర్వాత ఆ కణాలన్నీ ఒకేచోట కుప్పబడినట్లు పెరగడంతో ట్యూమర్లలా ఏర్పడతాయి. పరీక్ష తర్వాత నోటి మందుల రూపంలో కీమో... ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (ఈజీఎఫ్ఆర్) పరీక్ష ఫలితాలను బట్టి... అనువైన బాధితులకు టాబ్లెట్ల రూపంలోనే కీమోథెరపీని అందించవచ్చు. ఇవి కూడా కీమో అంత ప్రభావ పూర్వకంగానే పనిచేస్తాయి. పైగా దీనివల్ల దుష్ఫలితాలు (సైడ్ఎఫెక్ట్స్) కూడా తక్కువే. సెలైన్లా ఇంట్రావీనస్గా మందు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి... ఈ ట్యాబ్లెట్లను బాధితులు నేరుగా ఇంటికే తీసుకెళ్లి వాడవచ్చు. కాబట్టి గతంలోలా ఇప్పుడు కీమోపట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. అయితే మెరుగైనదే మనుగడ సాగిస్తుంది (సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్) అన్నది అన్నిట్లో లాగే క్యాన్సర్ కూడా జరుగుతుంది. అంటే క్యాన్సర్ కూడా తనను తాను మరింత మెరుగైనదిగా తయారు చేసుకుంటుంది. అందుకే మందులను వాడుతున్నకొద్దీ అది వాటిని తప్పించుకునేట్లుగా రూపొందడం ప్రారంభించింది. అందుకే ఈ మందుల్లోనూ మరింత సమర్థమైన వాటిని రూపొందించడం ప్రారంభమైంది. పలితంగా రెండో విడత మందుల్లో డేకోటనిమ్, అఫాటినిబ్ వంటి మందులను తయారు చేశారు. అటు పిమ్మట అందులోనూ ఇంకా సమర్థమైన ఒసోమెరిటోనిబ్ వంటివి రూపొందాయి. అప్పటికి అదే అత్యంత ఆధునికమైనది. అయితే... ఇంకా ‘ఓరల్ టార్గెట్ థెరపీ’ పేరిట మరిన్ని కొత్త కొన్ని మందులు (ఉదాహరణకు సెరిటినిబ్, లోర్లాని వంటివి) ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు... ఊపిరితిత్తుల ఆల్క్రాస్ వంటి అరుదైన జన్యుమార్పులను కూడా ఈ ఓరల్ టార్గెట్ థెరపీ మందులు సమర్థంగా నియంత్రించగలవు. ఊపిరితిత్తుల్లోనే కాకుండా బ్లడ్ క్యాన్సర్ మొదలుకొని బ్రెస్ట్ క్యాన్సర్ వరకు పదుల సంఖ్యలో హానికరమైన జన్యువులను నిరోధించేందుకు ఇప్పుడు వందలాది మందులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. -
‘కీమో’నుంచి కోలుకున్నా.. క్యాన్సర్ ట్రీట్మెంట్పై నటి రియాక్షన్
Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment: ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందిని ఇటీవలె క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోస్ట్‌ను షేర్ చేసింది. 16సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు మరింత బలంగా తిరిగొస్తారు. గెట్ వెల్ సూన్ అంటూ పేర్కొన్నారు. కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో గుర్తింపు పొందింది. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
తనలా బాధపడుతున్న బాలుడి కోసం రూ 61 లక్షలు సమకూర్చాడు...ఐతే అతను చనిపోయాడు!
మనమే బాధలో ఉంటే అవతలివాళ్లకి సాయం చేయాలన్న ఆలోచనే రాదు. చాలామంది తమకే ఇంత పెద్ద కష్టం అంటూ దేవుడిని లేక విధిని తిడుతూ ఊసూరుమంటూ కూర్చుండిపోతారు. కానీ ఈ యువకుడు అందుకు భిన్నం. తాను ఒక క్యాన్సర్ పేషంట్ అయ్యి మరో క్యాన్సర్ పేషంట్ బతకాలని తపించాడు. అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని రైస్ లాంగ్‌ఫోర్డ్ అనే యువకుడు ప్రతిభావంతుడైన అథ్లెట్. అయితే ఒక రోజు తన స్నేహితులతో కలసి చేసిన స్ప్రింట్ రేస్‌లో రైస్ కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడే రైస్ ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతని కుడి కాలు తుంటిలో కంతిని గుర్తించిన వైద్యులు తొలగించే నిమిత్తం మొత్తం కాలుని తీసేశారు. దీంతో రైస్ జీవితాంతం కర్రల సాయంతోనే నడిచే పరిస్థితి ఎదురైంది. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రైస్ క్యాన్సర్‌ని జయించి బయటపడ్డాడని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. రైస్‌కి శస్త్రచికిత్స జరిగిన కాలు మళ్లీ వాపు రావడం మొదలైంది. మళ్లీ క్యాన్సర్ తర శరీరంలో మరింతగా విజృభించడం మొదలైందని రైస్ గ్రహించాడు. ఈ క్రమంలో రైస్ జాకబ్ జోన్స్ అనే ఆరేళ కుర్రవాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆ బాలుడికి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు రైస్ వ్యక్తిగతంగా సుమారు ఒక లక్ష రూపాయలు పొదుపు చేసి ఆ బాలుడి కుటుంబసభ్యులకు అందజేశాడు. అయితే ఇది అతని చికిత్సకు ఏ మాత్ర సరిపోదని భావించి ఆన్లైన్లో క్రౌడ్ ఫండింగ్ ఓపెన్‌చేసి ఆ బాలుడి కోసం దాదాపు రూ.61 లక్షలు సేకరించాడు. ఈ మేరకు రైస్ తన తల్లి కేథరిన్‌తో ...జాకబ్ ఆరేళ్ల తన జీవితంలో న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. అతను ఈ క్యాన్సర్‌ని జయించి త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నా" అని తరుచుగా చెప్పేవాడు. అంతేకాదు రైస్ సేకరించిన ఈ 61 లక్షలు డబ్బుని జాకబ్ కుటుంబ సభ్యులకు అందించిన తదుపరి అతను మరణించాడు. దీంతో జాకబ్ కుటుంబ సభ్యలు మాట్లాడుతూ..."రైస్ తానున్న పరిస్థితిని పక్కనపెట్టి జాకబ్ పట్ల అతను కనబర్చిన ప్రేమ, తెగువ, ధైర్యం నమశక్యంకానివి. రైస్ కారణంగానే జాకబ్ ఈ క్యాన్సర్‌తో పోరాడి కొత్త భవిష్యతును పొందగలిగే సువర్ణావకాశం కలిగింది" అని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్) -
కీమోతో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువ కదా.. తీసుకోవాలా వద్దా?
మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. దేహంలో కొన్ని ప్రాంతాల్లో వచ్చే క్యాన్సర్ సర్జరీ ద్వారా తొలగించడానికి అంత అనువుగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కీమోలో ఇచ్చే రసాయనాల ద్వారా వాటిని నాశనం చేయ?డానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో 100పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకేమందునే వాడవచ్చు కూడా. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతి లో కీమోలో ఇస్తుంటారు. ఈ రకరకాల మందులన్నీ వాటి ఉమ్మడి ప్రభావంతో క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని తుదముట్టిస్తాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు దానికి లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కీమోథెరపీలో కాంబినేషన్స్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. ఆ రోగిలో ఉన్న క్యాన్సర్ రకాన్ని, అతడి కండిషన్‌ను బట్టి ఏయే మందులు ఎంతెంత మోతాదులో, ఎంతకాలంపాటు ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందుల రూపకల్పన జరిగింది. అందువల్ల ప్రతి మందు వేర్వేరుగా పనిచేస్తుంటుందని గుర్తుంచుకోవాలి. ఇక కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో వల్ల పేషెంట్ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ సైడ్ఎఫెక్ట్స్ వల్ల ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌లో భాగంగా... వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం) వంటివి కలగవచ్చు. రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయితే... ఇటీవల సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే కీమోథెరపీ మందులనూ రూపొందిస్తున్నారు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు... డాక్టర్ సూచించినప్పుడు అపోహలు తొలగించుకుని, కీమో తీసుకోవడమే మంచిది. -
హంసానందిని ఫొటోషూట్ వైరల్, 'ఫస్ట్ లవ్ కోసం బలంగా తిరిగొస్తా'
ఫొటోలు భావాలు చెబుతాయా? అంటే కొన్ని ఫొటోలు చెబుతాయి. అందుకు తాజా ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్న హంసా నందిని ఫొటో. ఇటీవల హంస చేయించుకున్న ఫొటోషూట్ ఇది. మామూలుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవాళ్లు, సినిమాలో గెటప్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవాలనుకునేవాళ్లు.. ఇలా రకరకాల కారణాలతో ఫొటోషూట్ చేయిస్తారు. అయితే హంసా నందిని తాజా ఫొటోషూట్‌కి ఇవేవీ కారణాలు కావని ఊహించే ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు రొమ్ము కేన్సర్‌కి సంబంధించిన చికిత్స జరుగుతోంది. తాను కేన్సర్ బారిన పడిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో హంస సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫొటోషూట్ చేయించుకున్నారు. గుండుతో ఉన్న ఈ ఫొటోలో హంస ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టయిలిస్ట్‌గా చేసిన అమీ పటేల్ అంటున్నారు. ‘మీరు (హంసా నందిని) చాలా అందంగా కనబడుతున్నారు. మీ ఫొటో ‘బలం, నమ్మకం, అందాన్ని’ ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు కేన్సర్‌తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా, మరింత అందంగా బయటికొస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం’ అని అమీ పటేల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత డిసెంబరు నాటికే తొమ్మిది విడతల కీమోథెరపీ పూర్తయిందని, ఇంకా ఏడుసార్లు చేయించుకోవాలనీ హంస పేర్కొన్నారు. యాక్టింగ్ అనేది నా ఫస్ట్ లవ్... ఇంకా చాలా బలంగా, మెరుగ్గా తిరిగి వస్తానని కూడా అన్నారు. ఆమె నమ్మకం నిజమవుతుందని ఈ ఫొటో స్పష్టం చేస్తోంది కదూ. -
అపెండిక్స్‌కు క్యాన్సర్ వస్తుందా!
మన చిన్న పేగులూ, పెద్దపేగు కలిసే జంక్షన్లో అపెండిక్స్ అనే చిన్న తోక లాంటిది ఉంటుంది. అన్ని అవయవాల మాదిరిగానే దీనికీ క్యాన్సర్ సోకుతుంది. అయితే ఇది చాలా అరుదు. ఇలాంటి క్యాన్సర్ వచ్చినవారితో పాటు మరికొన్ని గడ్డల వల్ల పొట్టకుహరంలో మ్యూసిన్ అనే స్రావాలు స్రవిస్తాయి. ఈ కండిషన్‌ను ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అన్ని క్యాన్సర్లలాగే ఇది కూడా కడుపు లేదా దాని పరిసరాల్లో ఉండే ఇతర ప్రాంతాలకూ, అవయవాలకూ విస్తరిస్తుంది. సీటీ స్కాన్ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. దాంతో వ్యాధి నిర్ధారణ చాలా ఆలస్యమవుతుంది. దాంతో అపెండిక్స్ క్యాన్సర్ రోగుల్లో చాలామంది మృతువు బారిన పడుతుంటారు. త్వరగా గుర్తిస్తే అన్ని క్యాన్సర్లలాగే దీనికీ చికిత్స చేయవచ్చు. చికిత్స ఒకింత కష్టమే అయినప్పటికీ... ప్రస్తుతం దీనికి ‘హైపెక్’ అనే అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది. హైపర్ థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అనే ప్రక్రియకు సంక్షిప్తరూపమే ఈ ‘హైపెక్’. ఇందులో ఉదరభాగంలోని పెరిటోనియమ్ (ఒక పొరలాంటి తొడుగు)ను మొత్తం తొలగించి, ఓ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్) వద్ద కీమోథెరపీ మందునంతా ఆ భాగంలో సమంగా విస్తరించేలా చేస్తారు. ఇలా 60 నుంచి 90 నిమిషాల పాటు చేయడం ద్వారా ఈ సూడో మిక్సోమా పెరిటోనీ తిరగబెట్టడాన్ని చాలాకాలం పాటు వాయిదా వేయవచ్చు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
క్యాన్సర్.. ఫాలో అప్ల ప్రాధాన్యమెంత? ఇదిగో ఇంత!
Importance Of Follow-Up Care: క్యాన్సర్ అన్న పదం వింటేనే ఎంతో ఆందోళన. అయితే.. త్వరగా వ్యాధి నిర్ధారణ జరిగి.. రకాన్ని బట్టి చికిత్స రేడియోథెరపీనా, కీమోథెరపీనా లేక శస్త్రచికిత్సా అన్నది నిర్ణయించాక, ఆ తర్వాత ఫాలో అప్లన్నీ సరిగ్గా జరుగుతుంటే దాన్ని తేలిగ్గానే అదుపు చేయవచ్చు. క్యాన్సర్ చికిత్సలో ఫాలోఅప్‌ల ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం. క్యాన్సర్‌కు ఇదమిత్థంగా ఇలాగే అంటూ నిర్దిష్ట చికిత్స ఇవ్వడం సాధ్యం కాదు. క్యాన్సర్ రకంతో పాటు మరెన్నో అంశాలు చికిత్స జరగాల్సిన తీరును నిర్ణయిస్తాయి. ఫాలో అప్ అంటే డాక్టర్లు నిర్ణయించిన సమయాల్లో తర్వాత్తర్వాతి చికిత్సలకు హాజరుకావడంగా చెప్పవచ్చు. అవి... ప్రధాన చికిత్స తర్వాత... నిర్ణీత వ్యవ«ధుల్లో అంచెలంచెల్లో జరుగుతుంటాయి. ఇవి కేవలం ప్రధానంగా చికిత్స విషయంలోనే కాదు... బాధితుడికి మానసికంగా, సామాజికంగా... వ్యాధి ముదరకుండా చూడటం ద్వారా ఆర్థికంగా కూడా సాంత్వన ఇస్తాయి. చదవండి: ఆర్థరైటిస్ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వద్దు! ఈ ఫాలో అప్‌లో రక్తపరీక్షల వంటివి మాత్రమే కాకుండా... దేహంలో వచ్చే ఇతరత్రా మార్పులను పసిగట్టడానికి రకరకాల పరీక్షలు అవసరమవుతూ ఉంటాయి. సాధారణంగా మిగతా వ్యాధుల చికిత్సలతో పోలిస్తే ఇవి చాలాకాలం పాటు అలా కొనసాగుతూ ఉండటమనే అంశం కూడా రోగి మానసిక స్థైర్యానికి పరీక్ష పెడుతుంటుంది. అందుకే క్యాన్సర్ బాధితులకు మానసిక బలం కూడా చాలా అవసరమని అందరూ గుర్తించాలి. ఫాలో అప్ ప్లాన్ ఎలా ఉంటుందంటే.. క్యాన్సర్ రోగులందరికీ చికిత్స ఒకేలా ఉండనట్లే... ఫాలో అప్లు కూడా నిర్ణీతంగా ఉండవు. అవి చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. బాధితుడికి ఉన్న క్యాన్సర్ రకం, అతడికి ఇచ్చే చికిత్స (రేడియోథెరపీయా / కీమోథెరపీనా / శస్త్రచికిత్సా?... మొ.) రోగి సాధారణ ఆరోగ్యం /చికిత్స ఇచ్చాక అతడిక పరిస్థితులు మొదలైనవి. అందరి విషయంలో ఒకేలా ఉండకపోయినా.. ఫాలో అప్లలోనూ కొన్ని సాధారణ సామ్యతలు కనిపిస్తాయి. ఉదాహరణకు... చికిత్స పూర్తయిన మొదట్లో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో మొదటిసారీ, ఆ తరువాత ప్రతీ 3 – 4 నెలలకు ఒకసారి చొప్పున ఆంకాలజిస్టులను కలవాల్సి రావచ్చు. ఆ తర్వాత ప్రతి మూడు లేదా నాలుగు నెలలకోసారి చొప్పున కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెరుగుదలను బట్టి ప్రతి ఏడాదికోసారి లేదా రెండుసార్లు ఉండవచ్చు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా.. చికిత్స తర్వాత ఉద్భవించే ప్రశ్నలు... ప్రధాన చికిత్స తర్వాత ఫాలో అప్ల సమయంలో రోగిలో వచ్చే కొన్ని సందేహాలివి... ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ డాక్టర్‌ను తప్పక అడిగి తెలుసుకోవాలి. ► పూర్తిగా కోలుకోడానికి ఎంత సమయం పట్టవచ్చు? ►ఎలాంటి లక్షణాలూ లేదా చిహ్నాలు కనిపిస్తే డాక్టర్‌ను వెంటనే కలవాలి? ►చికిత్స తర్వాత తరచూ చేయించాల్సిన ప్రధాన పరీక్షలేమిటి? అవెంత తరచుగా చేయించాలి? ►ప్రధాన చికిత్స తర్వాత దీర్ఘకాలంలో కనిపించే సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి? ►మళ్లీ తిరగబెట్టడానికి అవకాశం ఉందా? అయితే... అవకాశం ఎంత? ►ఏయే డాక్యుమెంట్లు / ఏయే పరీక్షల ఫలితాల రిపోర్టులు జాగ్రత్తగా ఉంచాలి? ►మళ్లీ మునపటిలాంటి ఆరోగ్యం పొందడం సాధ్యమా? పొందాలంటే ఏం చేయాలి? ►గ్రూప్హెల్ప్ పొందడానికి తమలాంటి వాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? ఫాలో అప్ సమయంలో డాక్టర్‌తో చెప్పాల్సినవి... ఫాలో అప్ సమయంలో డాక్టర్‌ను కలిశాక బాధితుడు తమ సమస్యలన్నీ ఏమీ దాచకుండా... పూర్తిగా పారదర్శకంగా డాక్టర్‌తో మాట్లాడాలి. కేవలం లక్షణాల గురించే కాదు... శారీరక, మానసిక బాధలు, వ్యాధి సంబంధిత కష్టాలు, ఉద్వేగాలు... ఇవన్నీ దాచకుండా చెప్పాలి. అంతకు ముందు కనిపించని కొత్త లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా వివరించాలి. అయితే అవన్నీ క్యాన్సర్‌కు సంబంధించినవేనా అనే ఆందోళన ముందే వద్దు. అవి క్యాన్సర్వి కాకపోవచ్చు కూడా. ఎందుకంటే కొందరిలో చికిత్సకు సంబంధించిన కొన్ని అంశాలు/ప్రభావాలు చికిత్స పూర్తయిన చాలా కాలం తర్వాత బయటకు కనిపించవచ్చు. అందుకే అవి క్యాన్సర్ సంబంధించినవా / సంబంధించనివా, లేదా అన్న సంశయానికి తావివ్వకుండా అన్నీ చెబితే... రోగి చాలా ఆందోళన పడేది అసలు సమస్యే కాదనే విధంగా దూదిపింజలా ఎగిరిపోవచ్చు. డాక్టర్‌కు ఇంకా చెప్పాల్సినవి... ►బాధితుడికి రోజువారీ ఎదురయ్యే సమస్యలు... ఉదాహరణకు తన ఆకలి, అలసట, మూత్రసంబంధిత అంశాలు, లైంగికంగా ఎదురయ్యే సమస్యలూ, సందేహాలు, ఏకాగ్రత కుదురుతుందా, జ్ఞాపకశక్తిలో మార్పులేమైనా వచ్చాయా, నిద్రకు సంబంధించినవి, బరువు పెరుగుతున్నారా/తగ్గుతున్నారా... లాంటివి. ►ఇతరత్రా సమస్యలకు సంబంధించి వాడుతున్న మందులు / మార్పు చేసిన మందులు, మూలికలూ, ఔషధమొక్కలకు సంబంధించినవి (హెర్బ్స్) ఏమైనా వాడారా? ►కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీలో) వచ్చిన మార్పులు ►భావేద్వేగాల విషయంలో వచ్చిన మార్పులు / వ్యాకులత / కుంగుబాటు వంటి మానసిక బాధల గురించి అడగాలి. ►ఇవన్నీ అడుగుతూ... జీవనశైలి విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో, చెడు వ్యసనాలకు పూర్తిగా దూరం గా ఉంటే... మిగతా అందరిలాగే క్యాన్సర్ బాధితులు కూడా పూర్తి ఆరోగ్యంతో, దాదాపు సాధారణ వ్యక్తుల ఆయుఃప్రమాణాలకు తగ్గకుండా జీవించవచ్చు. -డాక్టర్ అజయ్ చాణక్య వల్లభనేని,కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ -
అయ్యో తరుణ్.. మూడేళ్లకే ఇంత కష్టమా..
బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన తరుణ్ అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆటపాటలతో అల్లరి చేయాల్సిన వాడు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. పుట్టిన మూడేళ్లకే ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడ్డాడు. నవ్వుల తరుణ్ ప్రసవం జరిగింది మొదలు స్రవంతికి ఆమె కొడుకే ప్రాణంగా బతుకుతోంది. బిడ్డను వదిలి క్షణం కూడా ఉండలేకపోయేది. నిరంతరం పిల్లాడితే గడిపేయడంతో బాబుకి ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు చిరాకు పడుతున్నాడనే విషయాలను వెంటనే గుర్తించేది. అతడి బోసి నవ్వులు చూసి మురిసిపోయేది. ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా భర్త తెచ్చే సంపాదన అంతంత మాత్రమే. అయితే స్రవంతి ముద్దుల కొడుకు తరుణ్ అల్లరితో ఆ ఇంట్లో సుఖశాంతులకు లోటు లేకుండా పోయింది. క్యాన్సర్ ఎప్పుడు యాక్టివ్‌గా అల్లరి చేసే తరుణ్ కొంత కాలంగా నీరసంగా ఉండటం స్రవంతి గమనించింది. తరచి చూస్తే ఒళ్లు వేడిగా ఉంటున్నట్టు గుర్తించింది. వెంటనే తరుణ్‌ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ నీరసం ఇంకా ఎక్కువైంది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్తే రకరకాల పరీక్షలు చేశారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తుండటంతో వ్యాధి నిర్థారణ కోసం హైదరాబాద్ వెళ్లాలంటూ సూచించారు. రూ. 20 లక్షలు కావాలి తరుణ్‌కి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం విన్న స్రవంతికి గుండె ఆగినంత పనైంది. తన ముద్దుల కొడుక్కి ప్రాణాంతకమైన మైలోమియా లుకేమియా క్యాన్సర్ ఉన్నట్టుగా వైద్యులు తేల్చి చెప్పారు. వెంటనే కీమోథెరపీ చేయకపోతే బిడ్డ మృత్యువుకు చేరువ అవుతాడంటూ హెచ్చరించారు. సాధ్యమైనంత త్వరగా వైద్య చికిత్స కోసం రూ.20లక్షలు సర్థుబాటు చేసుకోవాలంటూ సూచించారు. సాయం చేద్దాం రండి రెక్కాడితే గానీ డొక్కాడని స్రవంతి కుటుంబానికి రూ.20 లక్షలు సర్థుబాటు చేయడం కలలో కూడా జరగని పని. అలా అని బిడ్డ మృత్యు ఓడికి చేరుతుంటే చూస్తూ ఊరుకోలేక పోతుంది. కళ్లలో నీళ్లు ఇంకేలా ఏడుస్తూనే ఉంది. చివరకు బిడ్డ వైద్య చికిత్స కోసం ఫండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మూడేళ్ల తరుణ్ ఈ లోకంలో అందాలను చూడాలంటే అతనికి భవష్యత్తును అందివ్వాలంటే మనమంతా తలా ఓ చేయి వేయాల్సిన అవసరం ఏర్పడింది. సాయం చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి