construction
-
రోడ్ల ‘రూల్’ మారిపోయింది
సాక్షి, అమరావతి: రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఇకపై కూటమి నేతల అనుంగులకే దక్కనున్నాయి. ఇందుకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ప్లానే వేశారు. తమ అస్మదీయ, బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు అర్హత నిబంధనలను సడలించారు. తమ వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా, ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడకుండా అడ్డుకుని మరీ కాంట్రాక్టులు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా బిడ్లు దాఖలు చేసేందుకు అర్హతగా పరిగణించే కాల పరిమితి (బ్లాక్పీరియడ్)ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ ఆర్ అండ్ బి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపించడం గమనార్హం. ఇప్పటివరకు గత ఐదేళ్లలో కాంట్రాక్టు సంస్థలు చేసిన పనుల విలువను అర్హతగా పరిగణించేవారు. ఇక నుంచి గత పదేళ్లలో చేసిన నిర్మాణ పనులను పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా ప్రస్తుతం అర్హత లేని కాంట్రాక్టు సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు ప్రభుత్వ పెద్దలు మార్గం సుగమం చేశారు. ఈ పదేళ్ల బ్లాక్ పీరియడ్ సడలింపు 2026–27 వరకు వర్తిస్తుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే రానున్న మూడేళ్లలో చేపట్టే రోడ్ల నిర్మాణ టెండర్లలోనూ వారి ఇష్టానుసారం కాంట్రాక్టులు కట్టబెడతారన్న విషయం స్పష్టమైంది. పీపీపీ రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే..! రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై టోల్ భారం వేస్తూ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో త్వరలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం రూ.4 వేల కోట్లతో రాష్ట్ర ప్రధాన, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటి దశగా రూ.698 కోట్లతో 3,931 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కన్సల్టెన్సీలను ఆహ్వానించింది కూడా. ఈ కాంట్రాక్టులను ప్రభుత్వ పెద్దలు సన్నిహితులకు కట్టబెట్టేందుకే అర్హత నిబంధనలను సడలించినట్టు స్పష్టమవుతోంది. అందుకే కన్సల్టెన్సీల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారమే కాంట్రాక్టు సంస్థల అర్హత నిబంధనలను కూడా సడలించింది. రోడ్ల నిర్మాణాన్ని అస్మదీయ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టి, ఆ సంస్థలు వాహనదారుల నుంచి ఐదేళ్ల పాటు టోల్ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం పక్కాగా కథ నడుపుతోందని ఆర్ అండ్ బి వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
నిర్మాణ రంగం కుప్పకూలింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు. -
దళారులెవరు బాబూ.. తమ్ముళ్లేగా?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
ఢిల్లీలో నిర్మాణ పనులపై నిషేధం..ఎందుకంటే
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు(గ్రాప్) రెండో దశకు చేరుకున్నాయి. మంగళవారం(అక్టోబర్22) ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీలో నిర్మాణరంగ పనులు,డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలు చేయనున్నారు. ఢిల్లీలో తాజాగా వాయు నాణ్యత 301-400 పాయింట్ల మధ్య పడిపోవడంతో గ్రాప్ రెండో దశ చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. గ్రాప్-2లో భాగంగా రోడ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై దుమ్ము లేవకుండా నీళ్లు చళ్లనున్నారు. కాగా, ఢిల్లీ కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్సే కారణమని సీఎం అతిషి ఇప్పటికే ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా,ఉత్తరప్రదేశ్‌లు ఢిల్లీని కాలుష్యమయంగా మారుస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఆమ్ఆద్మీపార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ మాత్రం కాలుష్యం కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇదీ చదవండి: కిలో ఉల్లికి రూ.35.. ఎక్కడంటే -
How India Borrows 2024: ఆన్లైన్ రుణం.. యస్ బాస్
హైదరాబాద్: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. యాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్ సర్వే ‘హౌ ఇండియా బారోస్’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్ క్రెడిట్ ఇండియా విడుదల చేసింది. వేటి కోసం రుణాలు.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్‌లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది. ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది. వాట్సాప్, చాట్‌బాట్ పాత్ర 27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్‌బాట్ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్ జెడ్‌లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్ సేవల కోసం చాట్బాట్లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్ ఫైనాన్స్ (డిజిటల్ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్ షాపింగ్ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్ బుకింగ్ యాప్‌లు మేక్మైట్రిప్, క్లియర్‌ట్రిప్, 23 శాతం ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ సేవలను వినియోగించుకుంటున్నారు.పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్‌కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్‌లో 69 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్‌కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్ జెడ్‌లో 65 శాతం మంది, జెన్ ఎక్స్‌లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్లైన్లో షాపింగ్ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్డౌన్లతో 2021లో ఆన్లైన్ షాపింగ్ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 64 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 71 శాతంగా ఉంది. -
నల్లగొండ బైపాస్ నిర్మాణానికి రూ.516 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ సెక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారి 565లో 14 కి.మీ పొడవైన నాలుగు లేన్ల నల్లగొండ పట్టణ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.516 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ‘ఎక్స్’వేదికగా ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా నకిరేకల్ – నాగార్జునసాగర్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని, రహదారి భద్రత కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 200.06 కి.మీ మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సీఆర్ఐఎఫ్ సేతు బంధన్ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు–నల్లపాడు రైల్వే సెక్షన్లో నాలుగు లేన్ల శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి గాను రూ.98 కోట్ల విడుదలకు కూడా ఆమోదం తెలిపినట్లు గడ్కరీ వివరించారు. -
మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో విషాదం చోట చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో శనివారం ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.Five Labourers Killed in Construction Site Collapse in Gujarat's Mehsana District #Mehsana #Gujarat #ConstructionCollapseMishap @INCGujarat @AAPGujarat https://t.co/UBMZgVKjXQ— Vibes of India (@vibesofindia_) October 12, 2024క్రెడిట్స్: Vibes of India ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్‌సిన్హ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశాం. ముగ్గురికిపైగా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
ఫార్మ్ హౌస్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి
సాక్షి, అమరావతి: ప్రైవేట్‌పై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిరీ్వర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో కళాశాలల నిర్మాణం ఆపివేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీఎంస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ వైద్య కళాశాలల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కర్నూలు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదన్నారు.నిజానికి ఈ విద్యాసంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించి ఉంటే కాలేజీకి 150 చొప్పున ఈ ఏడాది 750 సీట్లు అందుబాటులోకొచ్చేవి. ప్రైవేట్‌పై ప్రేమతో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతి ఇచి్చంది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం మూడో వంతే అందుబాటులోకొచ్చాయి. పులివెందులలో 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచి్చంది. ఇక ఉచిత వైద్యం ఊసుండదు ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్న లక్ష్యంతో రూ. 8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి, ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే లక్ష్యం. కాగా, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యా, వైద్యానికి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. పీపీపీ విధానంలో ప్రైవేట్ అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళితే ఉచిత వైద్యం ఊసే ఉండదని, పీపీపీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. బాబు హయాంలో ప్రైవేట్‌కు పచ్చజెండా గతంలో 1994 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం 2014–19 విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా వాటిలో చంద్రబాబు పాలనలో ఏర్పాటైనవి ఒక్కటీ లేదు. ప్రస్తుతం 18 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా 12 కళాశాలలకు చంద్రబాబు పాలనలోనే అనుమతులు లభించాయి. గతంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగినా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు బాబు కృషి చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ అనుకూల పరిస్థితులున్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో 17 కొత్త కాలేజీలు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదింటిని గతేడాది ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ పీపీపీ మోడల్ పేరిట కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. -
సాక్షి కార్టూన్ : 26-08-2024
-
ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.7,266 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన మేరకే కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు 2023 డిసెంబర్లోనే ప్రతిపాదనలు పంపింది. కీలకమైన విజయవాడ తూర్పు బైపాస్తోసహా పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2024–25 వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన ప్రాజెక్టులు ఇవీ..⇒ కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వరకు నాలుగు లేన్ల విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి రూ.2,716 కోట్లు. ⇒ వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు⇒అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు⇒ విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.669కోట్లు⇒ చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం వద్ద విడిచిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రూ.325కోట్లు⇒ గన్నవరం సమీపంలోని గుండుగొలను ‘గామన్ జంక్షన్’ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.150కోట్లు⇒ జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు -
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!
ఇంటి నిర్మాణం అనేది సుదీర్ఘ ప్రక్రియ. శ్రామిక శక్తితో కూడుకున్నది. చాలా మంది కార్మికులు నెలలు, సంవత్సరాల తరబడి పనిచేస్తే కానీ నిర్మాణం పూర్తవ్వదు. కానీ టెక్నాలజీ సాయంతో ఇంటి నిర్మాణం రోజుల్లోనే పూర్తవుతోంది.అన్నింటా ప్రవేశిస్తున్న రోబిటిక్ టెక్నాలజీ భవన నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. 105 అడుగుల (32 మీటర్లు) టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన రోబోటిక్ ట్రక్ ఆస్ట్రేలియా నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. హాడ్రియన్ ఎక్స్ గా పిలిచే ఈ ట్రక్కును రోబోటిక్స్ కంపెనీ ఎఫ్ బీఆర్ అభివృద్ధి చేసింది. ఆ యంత్రం రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇంటిని పూర్తి చేయగలదు. గత సంవత్సరం ఇది యూఎస్ఏ ఫార్మాట్లో గంటకు 500 ఇటుకలను పేర్చి తన పనితీరు ఏంటో చూపించింది.ఇటుకలతో కూడిన ప్యాలెట్ లను లోడ్ చేశాక ఈ రోబోటిక్ వెహికల్/కన్ స్ట్రక్షన్ ఆర్మ్ తన పనిని మొదలు పెడుతుంది. ప్యాలెట్ నుంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది. ఇక్కడ క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఇది సిమెంట్ లాగా పనిచేస్తుంది. మిశ్రమం అంటిన ఒక్కొక్క ఇటుకను రోబో ఆర్మ్ చక్కగా పేరుస్తూ నిర్మాణం పూర్తి చేస్తుంది. అధిక పొడవు కారణంగా మూడు అంతస్తుల ఎత్తుతో సైతం ఇది నిర్మాణాలను చేపడుతుంది.అమెరికాలో అతిపెద్ద కాంక్రీట్ బ్లాక్ సరఫరాదారుల్లో ఒకటైన సీఆర్‌హెచ్ పీఎల్సీ అనుబంధ సంస్థ ఎఫ్బీఆర్, సీఆర్‌హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్‌ను ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ బిల్డర్ తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లోని ఒక ఫెసిలిటీలో సైట్ అంగీకార పరీక్షను మొదట పూర్తి చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే, ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ ఐదు నుంచి 10 ఏక-అంతస్తుల గృహాలను నిర్మిస్తుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ‘చిల్లర రాజకీయాలు’ సహజమే!
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఏపీలో తెలుగుదేశం తీరు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన రుషికొండపై గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలపై వివాదం రేపుతున్న వైనం అల్ప బుద్ధిని చాటుతోంది తప్ప ఇంకొకటి కాదని చెప్పాలి. విశాఖపట్నానికి శిఖరాయమానమైన, బ్రహ్మండమైన భవంతులను నిర్మాణం అయినందుకు సంతోషించవలసిందిపోయి, ఈ రకంగా బురదచల్లడం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు. అత్యంత నాణ్యమైన రీతిలో చక్కని భవంతిని నిర్మించడం కూడా తప్పేనని తెలుగుదేశం చెబుతోంది.రుషికొండపై నిర్మితమైన ఈ ప్రాజెక్టు, అక్కడ ఉన్న పార్కు ప్రదేశం తదితర విశేషాలను టీవీలలో చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ముఖ్యమైన అతిధులు అక్కడకు వస్తే, వారు ఆ భవనాలలో బస చేస్తే ఎంతో గొప్ప పేరు వస్తుంది. ఎదురుగా సముద్రతీరం. కొండమీద సురక్షితమైన ప్రదేశంలో భవనాల నిర్మాణం వల్ల దేశం అంతటిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. విశాఖలో టూరిజం అభివృద్దికి కూడా ఇది మరింత దోహదపడుతుంది. ఇదే తరహాలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక భారీ భవనం నిర్మించి ఉంటే, అబ్బో ఎంత గొప్పగానో ప్రచారం చేసి ఉండేది. వారు అలా చేయలేకపోయారు కాబట్టి ప్రజలలోకి తప్పుడు సంకేతం తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ బురద చల్లుడు కార్యక్రమం జరిగింది. ఈ భవనం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సంబంధించిందేమో అనే అనుమానం కలిగేలా ప్రచారం చేశారు. నిజానికి అది టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం. అక్కడ దానిని టూరిజం ప్రాజెక్టుగా వాడుకుంటారా? లేక ముఖ్యమంత్రి బసకు వాడుకుంటారా? అనేది ప్రభుత్వం ఇష్టం. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినప్పుడు రుషికొండపై బస చేస్తే ఏపీకి ఎంతో గౌరవం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఆ భవనాలను దేనికి వినియోగించుకుంటారో చెప్పాలి కదా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించింది కనుక తాము ఆ భవనాలను వాడబోమని అంటారా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ అక్కడ తాత్కాలిక భవనాలను నిర్మించలేదు. శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగపడేలా నిర్మించారు.అదే అమరావతి రాజధాని ప్రాంతంలో 2014-2019 మధ్యచంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనాలను నిర్మించి ఎన్ని వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందన్న అంశం గురించి టీడీపీ నేతలు మాట్లాడే పరిస్థితి లేదు. సచివాలాయం, శాసనసభ భవనాలన్నిటిని తాత్కాలిక ప్రాతిపదికనే వందల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ భవనాల నిర్మాణంలోకానీ, ఇతరత్రా కానీ రెండువేల కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీటీడీ ప్రకటించింది. దానిపై టీడీపీ నేతలు వివరణ ఇస్తే బాగుంటుంది. అధికారం వచ్చింది కనుక అన్నీ తూచ్ అని చెప్పవచ్చు. కేంద్రంలో తమ కూటమి పవర్ లో ఉంది కనుక అన్నిటినీ తప్పించుకోవచ్చు. కానీ చరిత్ర ఎప్పటికి కనుమరుగు కాదు కదా!దీని సంగతి పక్కనబెడితే ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పలు గ్రాఫిక్స్ ను ప్రచారంలోకి తెచ్చింది. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం ఎలా జరుగుతుంది? శాసనసభ ఏ రూపంలో ఉంటుంది? సచివాలయం ఎన్ని అంతస్తుల టవర్ లో ఉంటుంది?మొదలైన వాటిపై తెలుగుదేశం మీడియాలో ఎన్నో కథనాలు వచ్చేవి. అవి చూస్తే ఇంత అధ్బుతంగా ఇక్కడ భవనాలు నిర్మించబోతున్నారా అనే చందంగా ప్రచారం జరిగేది. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన డిజైనింగ్ నిపుణులతో ప్లానింగ్ చేశామని చెప్పేవారు. అసెంబ్లీ భవనం ఒకసారి ఇడ్లీ పాత్ర షేప్ లో ఉంటుందని, మరోసారి ఇంకో రకంగా ఉంటుందని రకరకాల డిజైన్ లను ప్రచారంలోకి తెచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేసేవారు. వాటన్నిటిని ఏమని అంటారు. అవన్ని చంద్రబాబు నాయుడు సొంత భవనాలు కాదు కదా! రాజధాని కోసం ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టినవే కదా! అప్పుడేమని ప్రచారం చేశారు! చంద్రబాబు కాబట్టి అంత విజన్ తో మంచి డిజైన్లతో భారీ భవనాలను నిర్మిస్తున్నారని కదా చెప్పింది. అదే తరహాలో విశాఖలో మంచి ఆకృతితో కొన్ని భవనాలు నిర్మిస్తే టీడీపీ నేతలకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటో తెలియదు. అందులో అవకతవకలు జరిగాయని వారు చెప్పడం లేదు. భారీ వ్యయంతో నిర్మాణాలు జరిగాయని అంటున్నారు. విశాఖకు అది ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది వారు చూడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు మంచి పేరు రావడం ఇష్టం లేదు కనుక వారు అదేదో కనిపెట్టినట్లు అక్కడ గదులు అలా ఉన్నాయి.. హాల్ అలా ఉంది.. ఇలా ఉంది.. అంటూ విమర్శలు చేశారు.ఇంతకీ ఆ భవనాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వాడుకునేది మాత్రం చెప్పలేదు. రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న సమయంలో దానికి అడ్డు తగలడానికి టీడీపీకానీ, ఆ పార్టీ మీడియా కానీ చేయని ప్రయత్నం లేదు. అయినా రాష్ట్రానికి ప్రయోజనం, విశాఖకు మకుటంలా ఉంటుందని పట్టుదలతో ఆ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లోని సచివాలయంలో తన చాంబర్ ను ఎన్ని కోట్లతో అభివృద్ది చేశారో చెప్పగలరా! దానిని మూడునాళ్ల ముచ్చటగా ఎందుకు మార్చారో వివరించగలరా! అదొక్కటే కాదు. వందల కోట్ల విలువైన హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఎందుకు పాడుపెట్టారో తెలపగలరా?. అప్పట్లో జూబ్లిహిల్స్ లో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నందున వేరే ఇంటిలో ఉండడానికి ఎంత వ్యయం చేశారు. పార్క్ హయతోలో తన కుటుంబం కోసం తీసుకున్న సూట్ ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయింది. దీనిపై అప్పటి బీజేపీ నేత, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఏమని ఆరోపించింది గుర్తు చేసుకోగలరా? ముప్పై కోట్ల ఇందుకు వ్యయం చేశారని ఆయన అనేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ రుషికొండ భవంతి విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి బదులుగా వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియాలో టీడీపీ వారిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చారు కనుక మరింత బాధ్యతతో వ్యవహరించి పేరు తెచ్చుకుంటే మంచిది.తెలంగాణలో గత ప్రభుత్వ నేత కేసీఆర్ సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పించేవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవే సచివాలయ భవనాలను వాడుకుంటున్నారు. ఆ సదుపాయాలను వారు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నిర్మించిన ప్రగతి భవన్ పై కూడా అప్పట్లో చాలా వ్యతిరేక ప్రచారం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లని, అదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని ప్రజాభవన్ గా మార్చామన్నారు. అంతే తప్ప నిజంగానే బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లు ఉన్నాయో, లేదో ఇంతవరకు ప్రజలకు వివరించలేదు.ఆ రోజుల్లో కేసీఆర్ కు మద్దతు ఇచ్చిన ఈనాడు తెలంగాణ సచివాలయం అంత గొప్పగా ఉంది.. ఇంత గొప్పగా ఉంది అంటూ సచిత్ర కథనాలను ఇచ్చింది. విశాఖ భవనాలపై మాత్రం టీడీపీ మీడియా విషం చిమ్ముతోంది. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి పూనుకొన్నప్పుడు విపక్షాలు విమర్శలు చేశాయి. చివరికి కోర్టుకు కూడా వెళ్లాయి. కానీ ఆ భవనాన్ని భారీ ఖర్చుతో మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తర్వాత విమర్శలు ఆగిపోయాయి. రాజకీయాలలో ఇలాంటివి కామన్ గానే జరుగుతుంటాయి.అమరావతి రాజధానికోసం మూడు దశలలో లక్ష కోట్ల వ్యయం చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. తొలిదశలోనే నలభైఎనిమిదివేల కోట్లు పెడతామని అంటున్నారు. అంత వ్యయం ఓకే చోట పెట్టడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఊరుకునే పరిస్థితి లేదు. అదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ అని విమర్శలు వచ్చేవి. అలాంటి చోట్ల లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న తెలుగుదేశం నేతలు, విశాఖపట్నం నగరానికి మరింత ఘనత తెచ్చేలా భవనాలు నిర్మిస్తే దుమారం లేవదీస్తున్నారు. ఇదేకాదు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ ఫర్నీచర్ పై కూడా వివాదం చేయడం పద్ధతిగా లేదు. అంతా కలిపి ప్రభుత్వం మారి వారం రోజులు కాలేదు.. అప్పుడే ఫర్నీచర్ అందచేయలేదని వీరు ఆరోపించారు.గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని అసెంబ్లీ పర్నీచర్ ను తన కుమారుడి షాప్ లో పెట్టుకుంటే తప్పు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఫర్నిచర్ కు ఎంత బిల్లు అవుతుందో చెబితే చెల్లిస్తామని లేఖ రాస్తే తప్పట. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ నిరంతరం పనిచేయడానికి పూనుకుంటున్నట్లుగా ఉంది. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టం కనుక ఏదో ఒక చిల్లర వివాదం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ నేతలు ఇలాంటివి చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అందుకే కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని చెప్పాల్సి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పోలవరం.. దాచేస్తే దాగని నిజాలు
-
‘ప్రమాద సొరంగం’ వెలుపల ఆలయ నిర్మాణం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందం బౌఖ్‌నాగ్ దేవతను వేడుకున్నారట.గత ఏడాది నవంబర్‌లో సిల్క్యారా టన్నెల్లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్‌నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్‌లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
ముంపు ప్రాంతానికి రక్షణ కవచం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి, రివర్‌ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ముంపు సమస్య నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్‌నగర్, భూపేష్ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్‌కాలనీ, రామలింగేశ్వర్‌నగర్ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని తలంచారు. తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. ముంపు సమస్యకు పరిష్కారం ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవారు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్ వాల్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇన్చార్జి వరద ప్రాంతాలకు రక్ష కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్‌నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్ డిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
నవంబరు నాటికి రామ్‌లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్‌లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్‌లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రెండేళ్ల క్రితమే ఉత్తర రింగుకు సంబంధించి కసరత్తు ప్రారంభించి అలైన్‌మెంటు ఖరారు చేసినా, ఇప్పటివరకు టెండర్ల దశకు రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కదలిక వచ్చింది. 162 కి.మీ. నిడివి ఉండే ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం చెల్లింపు ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసేందుకు అంతా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఉత్తర భాగానికి సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 4 వరసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అవసరం ఉందని కేంద్రం తేల్చింది. ఈ భాగంలో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సొంతంగా భరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈ పీసీ) పద్ధతిలో టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థను గుర్తించాలని నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఏర్పాటు చేసే టోల్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మరో టెండరు పిలిచి కాంట్రాక్టు సంస్థను గుర్తించనుంది. కేంద్రమే టోల్ రుసుమును వసూలు చేసుకుంటుంది. బీఓటీ కాకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్! దక్షిణ భాగానికి వచ్చే సరికి ఈపీసీ టెండరింగ్‌కు వెళ్లొద్దని ప్రాథమికంగా నిర్ణయించింది. దాదాపు 180 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగాన్ని నిర్మించే ప్రాంతంలో ఉండే పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే దక్షిణ భాగం పరిధిలో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో అసలు దక్షిణ భాగానికి నాలుగు వరసల రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరకు రింగురోడ్డులా ఉండాలంటే రెండు భాగాలూ ఒకే తరహాలో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అయితే ఈపీసీ పద్ధతిలో కాకుండా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో దక్షిణ భాగానికి టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పద్ధతిలో.. నిర్మాణ సంస్థ సొంత నిధులతో రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధారిత కాలం ఆ రోడ్డుపై టోల్‌ను వసూలు చేసుకోవటం ద్వారా ఆ ఖర్చును రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పని తలకెత్తుకునేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితి నెలకొంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో టెండర్లు పిలవాలని భావి స్తోంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40% మొత్తాన్ని పది వాయిదాల్లో చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. వచ్చే జూన్, జూలైలలో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంటుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. -
ఎల్ అండ్ టీ ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్ అండ్ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్ ర్యాఫ్ట్ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్ అంటే భూగర్భంలోని కాంక్రీట్ నిర్మాణాలను ‘ఎక్స్‌రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన సెకెంట్ పైల్స్ లోపాలు? వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్ పైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్ పైల్స్‌ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ కసరత్తు చేసింది. జీపీఆర్ టెస్ట్‌ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్ ఓవర్సీస్కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు. 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్ డ్యామ్‌తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్ అండ్ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది. -
అయోధ్యలో మరో 13 నూతన ఆలయాలు
అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు. -
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.