Cotton price
-
బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదు: కేటీఆర్
-
పత్తి రైతుకు తేమ దెబ్బ
సాక్షి ప్రతినిధి, వరంగల్: పత్తి రైతులకు ఈసారి కూడా గిట్టుబాటు కాదు కదా కనీస మద్దతు ధర (ఎమ్మెస్సీ) కూడా దక్కేటట్లు లేదు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి తీసే దశలో వర్షాలు, తద్వారా నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ 15 నుంచి 18 శాతంగా నమోదవుతోంది. దీన్ని సాకుగా తీసుకుని వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. తేమ పేరిట భారీగా ధరలు తగ్గించడంపై వరంగల్, ఆదిలాబాద్ మార్కెట్లలో రైతులు ఆందోళనకు దిగారు. 2024–25 సంవత్సరంలో పత్తి ఎమ్మెస్సీ క్వింటాల్‌కు రూ.7,521 అని కేంద్రం ప్రకటించింది. 8–12 మధ్య తేమను పరిగణనలోకి తీసుకుని కొత్త పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ ఎంత ఎక్కువ ఉంటే అంత ధరలో కోత విధించడం, రైతులు పెద్దయెత్తున ఆందోళనలకు దిగడంతో పత్తి కొనుగోళ్ల ప్రారంభం దశలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 15 నుంచి 18 శాతం తేమను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ కాటన్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసింది. ఆదిలోనే కష్టాలు ఈ వానాకాలంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగతా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, ఎకరానికి 8 క్వింటాళ్ల చొప్పున 35,00,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు కొనుగోళ్లు చేసేందుకు సీసీఐ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ బ్రాంచిల పరిధిలోని 30 జిల్లాల్లో 115 సెంట్లరను ప్రతిపాదించింది. ఇప్పుడిప్పుడే పత్తి తీసే పనులు ముమ్మరం కాగా, మార్కెట్లోకి కొత్త పత్తి వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు తేమను సాకుగా చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకు తూట్లు పత్తిలో ఉన్న తేమ, రంగును బట్టి వ్యాపారులు ధరను నిర్ణయించాల్సి ఉంది. తేమశాతం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేసేందుకు దళారులు ఆసక్తి చూపిస్తున్నారు. 8 శాతం కన్నా ఎక్కువగా ఉన్న ఒక్కో శాతానికి కిలో ధర చొప్పున కోత విధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 18–25 శాతం వరకు నమోదవుతోంది. ఆ స్థాయిలో ఉన్న పంటకు క్వింటాల్‌కు రూ.5,500 వేల నుంచి రూ.6,300 మధ్య మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.15–18 శాతంగా సవరించాలి తేమ శాతం 15–18గా సవరించాలని కోరుతూ కేంద్రమంత్రికి లేఖ రాశాం. ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు పత్తి రైతులకు మద్దతు ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. రాష్ట్ర పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 15–18 శాతం తేమతో ఎమ్మెస్పీకి కొనుగోలు చేయాల్సిందిగా సీసీఐని కేంద్రం ఆదేశించాలి. – బొమ్మినేని రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ కాటన్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
పత్తి రేటుకు విపత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి ధరల విపత్తు వచ్చింది. సీజన్ మొదట్లోనే, మార్కెట్లోకి పత్తి రావడం మొదలవుతుండగానే రేటు తగ్గిపోయింది. వ్యాపారులు, దళారులు ధరలు బాగా తగ్గించేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 అయితే.. సోమవారం వరంగల్ మార్కెట్లో కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. 6,950 వరకు మాత్రమే పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనూ రూ.5,500 నుంచి గరిష్టంగా రూ.7,000కు మించి చెల్లించలేదు. దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు వారాల క్రితం క్వింటాల్‌కు రూ. 8,250 వరకు ధర చెల్లించినా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లోకి పత్తి రాక పెరిగితే.. ధరలను ఇంకెంత తగ్గిస్తారోనని వాపోతున్నారు. మార్కెట్‌కు పత్తి రాక ప్రారంభమైనా ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. వ్యాపారులు, దళారులు రేటు తగ్గించేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం పత్తి ధరలు రూ. 10–15 వేల వరకు పలికాయని.. ఇప్పుడు దారుణంగా పడిపోయాయని అంటున్నాయి. పత్తి విస్తీర్ణంలో రాష్ట్రం మూడో స్థానం వానాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైంది. మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 98.47 లక్షల ఎకరాల్లో.. రెండో స్థానంలో ఉన్న గుజరాత్లో 56.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. తెలంగాణ 43.76 లక్షల ఎకరాల సాగుతో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల మెట్రిక్ టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేశాయి. నిజానికి ఖరీఫ్ సీజన్ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. విత్తనాలు వేసినా, వర్షాల్లేక రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. చేన్లు నీట మునిగి.. పూత, కాయ నేలరాలాయి. కొమ్మలు నీటిలో నాని, తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. అంతేకాదు.. ఈసారి పత్తి విత్తనాల ధరలు, ఎరువులు, డీజిల్, ఇతర ఖర్చులు పెరిగి.. పెట్టుబడి తడిసిమోపెడైంది. ఇలాంటి సమయంలో పత్తి ధరలు తగ్గించేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తేమ 8 శాతం, ఆలోపు ఉంటే పూర్తి మద్దతు ధర లభిస్తుంది. 9 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉంటే.. శాతాన్ని బట్టి అదే తరహాలో ధర తగ్గుతూ వస్తుంది. కానీ నాణ్యత బాగున్నా వ్యాపారులు, దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రంగు మారిన పత్తికి కూడా కనీస మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు... ఈ నెలాఖరు నుంచి మార్కెట్లోకి పెద్ద ఎత్తున పత్తి రానుంది. ఈ ఏడాది 351 పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. కానీ ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలేవీ ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా పెట్టి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తుంది. మిల్లులు ఆ పత్తిని జిన్నింగ్ చేసి సీసీఐకు అప్పగించాల్సి ఉంటుంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి టెండర్లు ఇటీవలే పూర్తయినా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రారంభం కాలేదు. పైగా ఏటా వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేశాక.. సీసీఐ వచ్చి ప్రైవేట్ వ్యాపారుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిందని.. అందులో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల అవసరం.. వ్యాపారుల సాకులు.. రైతులు చేన్లలో మూడు దశల్లో పత్తిని తీస్తారు. అందులో మొదటి, రెండోసారి ఎక్కువ పత్తి వస్తుంది. రైతులు ఇందులో మొదట ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తంగా విక్రయిస్తారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు, ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు, దళారులు పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తేమ శాతం అధికంగా ఉందని, ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పంట నాణ్యత కోల్పోయిందని సాకులు చెప్తున్నారు. పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులతో పత్తికి మార్కెట్ తగ్గిందని.. టెక్స్టైల్ మిల్లులు మూతపడ్డాయని చెబుతూ తక్కువ రేటు చెల్లిస్తున్నారు. చాలాచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభమూ కారణమే! మన దేశంలో పండే పత్తి అధికంగా బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, టర్కీ, పాకిస్తాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో అల్లకల్లోలంతో ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనితో పత్తికి డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నాయని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ గుజరాత్ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కంటే అధిక రేట్లకు పత్తి కొనుగోళ్లు జరుగుతుండటం, తెలంగాణలో తగ్గిపోవడం ఏమిటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్న మేరకు.. గుజరాత్లో ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ.8,257 పలుకుతోంది. వచ్చే నెలలో రూ.8,321 వరకు, డిసెంబర్ నెలలో రూ.8,260 వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గుజరాత్లో వస్త్ర పరిశ్రమలు, మిల్లులు, వ్యాపారులు ఎక్కువగా ఉండటం వల్ల.. కొనుగోళ్లు ఎక్కువగా ఉండి, పత్తి ఎక్కువ రేటు పలుకుతోందనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌పై ఫోకస్ పెట్టి.. ఇతర రాష్ట్రాల రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కనీస ధర కూడా ఇవ్వడం లేదు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. కానీ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7,000కు మించి ధర పెట్టడం లేదు. అంతేకాదు నాణ్యత పేరిట మరింతగా తగ్గిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మద్దతు ధర లభిస్తుంది. అందుకోసమే ఎదురుచూస్తున్నాం. – బానోత్ రామా, బీసురాజుపల్లి తండా, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా -
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్‌కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
రోడ్డెక్కిన పత్తిరైతులు
ఆసిఫాబాద్ అర్బన్: పత్తికి గిట్టుబాటుధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమురంభీం జిల్లా రైతులు రోడ్డెక్కారు. జిల్లా రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లోని అంబేడ్కర్ చౌక్ వద్ద హైదరాబాద్–నాగ్‌పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. విత్తనాలు, ఎరువులు, కూలిరేట్లు పెరగడంతో పెట్టుబడి రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్‌కు రూ.15 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు వచ్చి రైతులకు మద్దతు పలికారు. అనంతరం కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హామీ ఇచ్చారు. -
పత్తి @ రూ.9,150..
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవ సాయ పత్తి మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో సోమవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి రూ.9,150 పలికింది. మార్కెట్‌కు 115 వాహనాల్లో 997 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.9,150, మోడల్ ధర రూ.9,000, కనిష్ట ధర రూ.8,000 పలికింది. గన్నీ సంచుల్లో 60 మంది రైతులు 107 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.8,800, మోడల్ ధర రూ.8,500, కనిష్ట ధర రూ.6,000తో ఖరీదు చేశారు. -
పత్తి ధర అదుర్స్
గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ధర దూకుడు ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ–నామ్ కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటా రూ.9,040 పలకగా.. తాజాగా అదే వేగం కొనసాగుతోంది. శనివారం జరిగిన కొనుగోళ్లలోనూ క్వింటా గరిష్టంగా రూ.9,055 పలికింది. 13 మంది రైతులు 31.32 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా ఈ ధర పలికింది. కనిష్టంగా రూ.8,771 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. సీజన్ ఆరంభం నుంచి ఈ–నామ్ ద్వారా ఇప్పటివరకు 77 మంది రైతులు 170.72 క్వింటాళ్ల పత్తిని విక్రయించారని ఆయన పేర్కొన్నారు. -
తెల్ల బంగారం భళా
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ఈ సీజన్లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ – నామ్ కొనుగోళ్లలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,040 పలికింది. ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. ఇందులో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రైతు కనకయ్యకు చెందిన రెండు క్వింటాళ్ల పత్తిని లక్ష్మీ ట్రేడర్స్ క్వింటాకు అత్యధికంగా రూ.9,040 ధరను కోట్ చేసి కొనుగోలు చేసింది. అత్యల్పంగా రూ.8,750 పలికింది. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కార్యదర్శి జాన్‌వెస్లీలు ధ్రువీకరించారు. -
పత్తి ధర పెరిగినా తగ్గిన కొనుగోళ్లు
సాక్షి, ఆదిలాబాద్: పత్తి ధర క్వింటాల్‌కు మార్కెట్లో రూ.8.300 పలికింది. నాణ్యమైన పత్తికి కేంద్ర మద్దతు ధర రూ.6,380 ఉండగా, ప్రస్తుత మద్దతు ధర మించి లభిస్తోంది. వానాకాలం పంట దిగుబడి కొనుగోళ్లను ఆదిలాబాద్ మార్కె ట్లో శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న, మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఇ.మల్లేశం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అజ్మీర రాజు సమక్షంలో కొనుగోళ్లు ప్రారంభించారు. ఉదయం వేలం నిర్వహించగా, వ్యాపారులు రూ.7,800 నుంచి మొదలు పెట్టారు. క్రమంగా పెరుగుతూ రూ.8,300 వరకు ధర పలికింది. మొదటి రోజు కేవలం 242 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. తేమ శాతం అధికంగా రావడంతో వ్యాపారులు 8 శాతం దాటిన తర్వాత ప్రతి అదనపు శాతానికి రూ.82 కోత విధించారు. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పత్తిలో సహజంగానే 20 శాతానికి పైగా తేమ వస్తుందని రైతులు వాపోతున్నారు. కాగా గతేడాది పత్తికి రూ.10వేల వరకు మార్కెట్లో ధర లభించింది. ఈసారి కూడా అంతకుమించి లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. -
పత్తి ధర ఆల్‌టైమ్ రికార్డ్: 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, వరంగల్ రూరల్, స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర రూ.14 వేలు పలికింది. మార్కెట్‌కు ఒకే రోజు 1,500 బస్తాలు, 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా.. రూ.14 వేలు పలికి ఆల్‌టైం రికార్డుగా నమోదైంది. పత్తి క్వింటాల్‌కు రూ.14 వేలు ఇస్తామని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు, ఈధరతో ఎంతో సంతోషంగా ఉన్నానని రైతు హర్షం వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా పత్తి ధర రూ.13,500 పలికింది. కనిష్టంగా రూ.10,500 ధర పలికింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు 4 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు తీసుకురాగా.. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బివి రాహుల్ మాట్లాడుతూ.. పత్తి పంట సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమై మే నెలలో కొనుగోళ్లకు చివరి నెల అని తెలిపారు.. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ కారణంగా పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుందని అన్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచిన రైతులు అధిక డిమాండ్‌ను ఉపయోగించుకుని తమ పంటను విక్రయించాలని సూచించారు. -
పత్తి బంగారం.. క్వింటాకు రూ.9,100.. ఏ మార్కెట్లో అంటే?
సాక్షి, ఖమ్మం వ్యవసాయం/మద్నూర్(జుక్కల్): ఖమ్మం, మద్నూరు మార్కెట్లలో గురువారం పత్తికి రికార్డు ధర పలికింది. ఖమ్మం వ్యవ సాయ మార్కెట్లో మంగళ, బుధవారాల్లో క్వింటా రూ.9 వేలుగా పలికిన ధర గురువారం రూ.9,100గా నమోదైంది. మోడల్ ధర రూ.9 వేలు, కనిష్ట ధర రూ.8వేలుగా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో పత్తి క్వింటాకు రూ.9,050 ధర లభించింది. చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు -
పత్తి ధర పైపైకి.. క్వింటాలుకు రూ.8,421
గజ్వేల్: రాష్ట్రంలో పత్తికి మంచి ధర లభిస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.8,421 పలికింది. ఈ–నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ద్వారా 109 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా.. ఇందులో గరిష్టంగా రూ.8,421, మోడల్ ధరగా రూ.8,263, కనిష్టంగా రూ.8,200 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ తెలిపారు. అతివృష్టి కారణంగా దిగుబడులు పడిపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతులకు ఈ పరిణామం కొంత ఊరటనిస్తోందని వారు అన్నారు. -
రికార్డు ధర: గజ్వేల్‌లో రూ.8,261 జమ్మికుంటలో రూ.8,150
జమ్మికుంట/ఆదిలాబాద్ టౌన్/ ఖమ్మం వ్యవసాయం/సిద్దిపేట: తెల్ల బంగారం ధరలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.2 వేలకుపైబడి ధర పలుకుతోంది. మంగళవారం గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,261 ధర లభించింది. ఇంకా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ.8,150, ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,020, వరంగల్ ఏనుమాముల మార్కెట్లో రూ.7,960, జనగామ మార్కెట్లో రూ.7,900, ఖమ్మంలో రూ.7,800 ధరకు వ్యాపారులు కొను గోలుచేశారు. దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గినందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కాగా, మంగళవారం పై ప్రధాన మార్కెట్లకు పెద్దసంఖ్యలో వాహనాల్లో పత్తి వచ్చింది. అన్నిచోట్లా మోడల్ ధర క్వింటాకు రూ.8 వేలకుపైగా, కనిష్టంగా రూ.7,900 చొప్పున వ్యాపారులు రైతులకు చెల్లించారు. (చదవండి: Anthrax At Warangal: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!) -
పత్తి ధర పడిపోతుందా?
- ధరల పరిస్థితిపై అధికార యంత్రాంగం ఆందోళన - సాగు అధికమైతే ధరలు పడిపోయే ప్రమాదముందన్న నిపుణులు - ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాగయిన వివిధ పంటలు (ఎకరాల్లో) 10.10 కోట్లు - ఇందులో పత్తి సాగు(ఎకరాల్లో) 1.79 కోట్లు - రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైన పత్తి (ఎకరాల్లో) 30 లక్షలు - 2016–17లో దేశవ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) 1.69 కోట్లు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతులంతా పత్తి బాట పట్టారు. గతేడాది పత్తి పంటకు మార్కెట్లో మంచి ధర పలకడంతో ఇప్పుడు రైతులు తెల్ల బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది కంది, మిర్చి వంటి పంటల ధరలు పతనం కావడంతో పత్తి పంటే మేలన్న భావన రైతుల్లో నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.10కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ అన్నదాతలంతా మూకుమ్మడిగా పత్తి వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగు కాగా, అందులో 30.85 లక్షల ఎకరాల్లో పత్తి వేయడం విస్మయానికి గురి చేస్తోంది. అధిక సాగుతో ధర పతనంపై ఆందోళన... అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలని గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో రైతులు సోయా, పప్పుధాన్యాలు సాగు చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తారుమారైంది. గత ఏడాది పత్తికి మార్కెట్లో రెట్టింపు స్థాయిలో ధర పలకడంతో రైతులు, అధికారులు కంగుతిన్నారు. దానికి తోడు సోయా, కంది, పెసర పంటల ధరలు మార్కెట్లో పతనమయ్యాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా... 2015–16లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ప్రభుత్వం పత్తిని నిరుత్సాహపరచడంతో 2016–17లో 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. పరిస్థితి తిరగబడడంతో ప్రభుత్వం గతేడాది వద్దన్న పంటలనే ఈసారి ప్రోత్సహిస్తోంది. ఇదిలా ఉండగా పత్తి విషయంలో ఇప్పుడు 2015–16 నాటి పరిస్థితి పునరావృతమవుతుందా అన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. అప్పట్లో పత్తి పెద్ద ఎత్తున సాగైంది. దీంతో ధర రూ.3,700 వరకు పడిపో యింది. కనీస మద్దతు ధర గరిష్టంగా క్వింటాలుకు రూ. 4,050 నిర్ణయించగా, వ్యాపారులు రూ. 3,600కు మించి కొ నుగోలు చేయలేదు. సీసీఐ కూడా చేతులెత్తేసింది. ఇలా ఒక ఏడాది సాగు పెరిగితే ధర పడిపోవడం, మరో ఏడాది సాగు తగ్గితే దాని ధర పెరగడంతో ఈ సారీ అలా జరుగుతుం దేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా అదనపు పత్తి... అంతర్జాతీయంగా పత్తి అధికంగా ఉత్పత్తి అవుతోంది. చైనా, అమెరికా దేశాల్లో ఉత్పత్తి అధికంగా ఉంది. మన దేశం నుంచి చైనా గతంలో పత్తి దిగుమతి చేసుకునేది కానీ క్రమంగా నిలిపివేసింది. అమెరికాలో ఎక్కువగా నాన్ కాటన్ బట్టలవైపే మొగ్గుచూపుతుండడతో అక్కడా ఇతర దేశాలకే ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశంలో పత్తిసాగు రైతులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అప్రమత్తమైన రాష్ట్రం పత్తి సాగు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈసారి అధికంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఇటీవల కేంద్రానికి విన్నవించారు. పత్తి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ఈసారి ధరలు తగ్గే ప్రమాదముందని రైతు సంఘం జాతీయ నేత సారంపల్లి మల్లారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు నర్సింహారెడ్డి అభిప్రాయపడుతున్నారు. పడిపోతున్న పప్పుధాన్యాల సాగు... రైతులు పెద్ద ఎత్తున పత్తి వైపే మరలిపోతుండటంతో పప్పు ధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 7.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈసారి కేవలం 4.82 లక్షల ఎకరాలకే వాటి సాగు పరిమితమైంది. -
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై నివేదిక
వస్త్ర నిల్వలు, నూలు ధరలపై జౌళిశాఖ అధికారుల ఆరా సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై చేనేత జౌళిశాఖ నివేదిక సిద్ధం చేసింది. వస్త్రపరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ‘నేతన్న బతికి ‘బట్ట’కట్టేదెలా?’శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో మం గళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన చేనేత, జౌళిశాఖ అధికారులు.. సిరిసిల్లలో పేరుకు పోయిన పాలిస్టర్ వస్త్రం నిల్వలు, నూలు ధరల పెరుగుదలపై మంగళవారం క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. అమ్ముడుపోని వస్త్రంతో నేత కార్మికులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతర్జాతీయ మార్కెట్లో నూలు ధరలు పెరగడంతో నేతన్నలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అందరూ పాలిస్టర్ వస్త్రాన్నే ఉత్పత్తి చేయడంతో మార్కెట్లో ధర లేదని నిర్ధారించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా సూచిస్తూ.. చేనేత, జౌళిశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ ద్వారా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌కు నివేదిక పంపుతున్నట్టు జౌళిశాఖ ఏడీ వి.అశోక్‌రావు మంగళవారం రాత్రి తెలిపారు. పాలిస్టర్ వస్త్రోత్పత్తి రంగం పెరిగిన నూలు ధరలతో ఇబ్బందుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. -
తగ్గిన పత్తి ధర: రైతుల ఆందోళన
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో మంగళవారం పత్తి కొనుగోలు ధర గణనీయంగా తగ్గింది. ఫలితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. నెంబర్ వన్ పత్తి ధర వేలం పాటలో క్వింటాలుకు 4,750 రూపాయలు పలికింది. నిన్నటి దాకా ఎక్కువ ఉన్న ధర నేడు తగ్గిపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. -
భారీగా తగ్గిన పత్తి ధర
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయమార్కెట్‌లో మొన్నటి వరకు అత్యధికంగా పలికిన పత్తి ధర సోమవారం ఉదయం భారీగా తగ్గింది. శుక్రవారం వరకు క్వింటాలుకు రూ. 5,372 పలికిన ధర రూ.4,960 కు పడిపోయింది. ఈ పరిణామంతో రైతులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్ ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటుండగా పత్తి ఎక్కువ మొత్తంలో రావటంతో వ్యాపారులే కుమ్మక్కయి రేటు తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో మొదటి సారిగా సోమవారం భారీ మొత్తంలో మార్కెట్‌కు పత్తి చేరుకుంది. దాదాపు 2000 మంది రైతులు సుమారు 8 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చినట్లు అంచనా. పత్తిని తరలించుకు వచ్చిన దాదాపు 300 వాహనాలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి జాతీయ స్థాయిలో ఆన్లైన్ విధానంలో పత్తిని కొనుగోలు చేసే ఇనాం విధానాన్ని అమలు చేస్తున్నట్లు శుక్రవారం అధికారులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే, జమ్మికుంట మార్కెట్లో మాత్రం ఈ ఛాయలేవీ కానరాలేదు. అధికారులు కిమ్మనక ఉండగా వ్యాపారులు, దళారులే కుమ్మక్కయి కొనుగోళ్లు జరుపుతున్నారు. -
జమ్మికుంటలో పత్తికి అత్యధిక ధర
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తికి అత్యధిక ధర పలికింది. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన పత్తిని వ్యాపారులు క్వింటాలు రూ.5,340 చొప్పున అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఏ సీజన్లోనూ పలకలేదని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలోనే ఇది అత్యధికమని వెల్లడించారు. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన సుమారు వెయ్యి మంది రైతులు 3,500 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు. -
లెక్క తప్పిన మక్క!
- క్వింటాలుకు ఉన్నట్టుండి రూ.400 తగ్గుదల - కుమ్మక్కై రైతుల్ని ముంచుతున్న వ్యాపారులు - ఏనుమాముల మార్కెట్లో ఆందోళనకు దిగిన రైతులు - నిజామాబాద్‌లో మార్కెట్ కార్యాలయం ముట్టడి సాక్షి, వరంగల్: మార్కెట్ మాయాజాలం రైతులను మళ్లీ ముంచేస్తోంది. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర గగనంగా మారింది. కష్టపడి పండించిన పంట చేతికి రాగానే ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. వ్యాపారులంతా కుమ్మక్కై ధరలు నిర్ణయించి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన మార్కెటింగ్ అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు కన్నెత్తి కూడా చూడడం లేదు. కష్టపడి పండించిన పంటకు క్వింటాలుకు ఒక్కసారిగా రూ.400 మేర ధర తగ్గడంతో కడుపు మండిన రైతన్నలు ఆందోళనలకు దిగుతున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర కోసం సోమవారం ఆందోళన చేశారు. ఎక్కువ పంట రాగానే ఒక్కటయ్యారు ఖరీఫ్ వ్యవసాయ మార్కెట్ సీజన్ ఏటా అక్టోబర్ 1న మొదలై మరుసటి ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 2016-17 ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.1,365 కనీస మద్దతు ధరను ఖరారు చేసింది. సెప్టెంబర్ ఆఖరు వరకు మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,901 చొప్పున గరిష్ట ధర పలికింది. వారం క్రితం వరకు కూడా క్వింటాల్‌కు రూ.1,850 వరకు పలికిన మక్క ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులకు తప్పుడు సమాచారం ప్రతిరోజు ఉదయం మార్కెట్ అధికారులు పంటల వారీగా ధరలు ఖరారు చేసి ఉన్నతా దికారులకు నివేదిస్తారు. వరంగల్ మార్కెట్ అధికారులు సోమవారం ఉదయం మొక్కజొన్న గరిష్టధర రూ.1,445, కనిష్ట ధర రూ.1,060గా పేర్కొన్నారు. కానీ సాయంత్రానికి గరిష్ట ధర రూ.1,445, కనిష్ట ధర రూ.1,375గా పేర్కొన్నారు. ఉదయం ఖరారైన కనిష్ట ధర విషయాన్ని ప్రభుత్వానికి, మార్కెటింగ్ ఉన్నతాధికారులకు తెలియకూడదనే ఉద్దేశంతోనే వరంగల్ మార్కెట్ అధికారులు ధరలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. అధికారుల ప్రకటనలు ఒకేరోజు రెండు రకాలుగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. నిజామాబాద్ కార్యాలయం ముట్టడి పంటలకు గిట్టుబాట ధర కల్పించడం లేదం టూ 500 మంది రైతులు సోమవారం నిజామాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సెక్రటరీని నిలదీశారు. కమిటీ ఆఫీసు ముందూ ధర్నా చేశారు. జమ్మికుంటలో పెరుగుతున్న పత్తి ధర కాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర పెరుగుతోంది. సోమవారం క్వింటాల్ లూజ్ పత్తికి గరిష్టంగా రూ.5,200, కనిష్టంగా రూ.5 వేలు పలికింది. -
రికార్డుస్థాయిలో పలికిన పత్తిధర
కరీంనగర్ జిల్లా జమ్మికుంట్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర క్వింటాలుకు రిఆకర్డుస్థాయిలో రూ.6,470 పలికింది. దాంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట దిగుబడి తగ్గినందువల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ధర పలికిందని వారంటున్నారు. -
రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ బుధవారం క్వింటాల్ పత్తిగరిష్టంగా రూ.6,021 పలికింది. జమ్మికుంట మార్కెట్లో పలికిన ధర ఈ సీజన్లో రాష్ట్ర స్థాయిలోనే రికార్డుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లకు, గింజలకు ఉహించని విధంగా డిమాండ్ పలుకుతుండడంతో వ్యాపారులు పోటీ పడి పత్తికి ధరలు చెల్లిస్తున్నారు.. ఇదే మార్కెట్లో 2013 సీజన్లో పత్తి ధర రూ.6,000-6,800 వరకు పలికింది. వరంగల్‌లో రూ. 6వేలకు చేరువలో..: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాలు పత్తి రూ.5,915 ధర పలికి ంది. మూడేళ్లలో ఇదే రికార్డు ధర. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ అనే రైతు చాలాకాలం పత్తి నిల్వ చేసి, ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉండడంతో 250 బస్తాల పత్తిని మమత ట్రేడర్స్ వారి వద్దకు అమ్మకానికి తెచ్చాడు. మొదటి వేలం పాటలోనే జమ్మికుంటకు చెందిన నర్సింహ ఇండస్ట్రీస్ వ్యాపారి రూ.5,915 అత్యధిక ధరతో కొనుగోలు చేశాడు. -
పత్తి రైతుల ఆందోళన
జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌యార్డులో మంగళవారం పత్తిరైతులు ఆందోళనకు దిగారు. పత్తి ధర రోజు రోజుకూ తగ్గిస్తున్నందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పత్తి ధర వెంటనే పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి ధర మరింత తగ్గిస్తే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. -
రైతుల ఆందోళన, కంప్యూటర్లు ధ్వంసం
వరంగల్: వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం మార్కెట్ లో పత్తి ధర అకస్మాత్తుగా పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహంతో యార్డులోని కంప్యూటర్ లను ధ్వంసం చేశారు. ఈ- మర్కెట్ లోని సీక్రెట్ టెండర్ల వల్లే అన్యాయం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కుమ్మక్కుతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళనతో వ్యవసాయ మార్కెట్ భారీగా పోలీసులు మోహరించారు. -
కష్ట జీవికి కంట నీరు
సత్తెనపల్లి: మార్కెట్లో పత్తి ధర కష్ట జీవికి కంట నీరు తెప్పిస్తోంది. గత ఏడాది క్వింటా రూ. 5వేల నుంచి రూ. 6వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ. 2900 నుంచి రూ. 3,200 వరకు మాత్రమే ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపించింది. పల్నాడు ప్రాంతంలో కొంత మేర ఆశాజనకంగా ఉన్నా డెల్టాలో రైతులు నష్టపోయారు. ఉన్నట్లు ఉండి పంట ఎర్రబారి తెగుళ్లు సోకడంతో పూత,పిందె రాలిపోయాయి. దిగుబడులు తగ్గడంతోపాటు మార్కెట్లో పత్తి ధరలు చూసి రైతు ఆవేదన చెందుతున్నాడు. పెట్టుబడికి దిగుబడికి తప్పిన లంకె.. పత్తి తీత ఆరంభంలో క్వింటా ధర రూ. 3500 నుంచి రూ. 4300 వరకు పలికింది. క్రమేణా ధర తగ్గింది. గత ఏడాది ఎకరం పత్తి సాగుకు పెట్టుబడి రూ. 15వేలకు మించలేదు. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరగడంతో రూ. 30వేలుఅయిందంటున్నారు. కౌలు రైతు అయితే మరో 10 నుంచి రూ. 15వేలు అదనం. ప్రస్తుతం ఎకరాకు సగటున ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర ప్రకారం రూ. 15 వేలు వస్తాయి. పెట్టుబడి రూ. 30వేలు, కౌలు రూ. 15వేలు కలిపితే, మరో రూ. 30వేలు రైతే బాకీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చేసిన అప్పులు తీరే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. 27 నాటికి జిల్లాలో 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.... జిల్లాలో పత్తి రైతుల పరిస్థితిని ఆలకించిన జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శ్రీధర్ సోమవారం సాయంత్రం మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలో 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ మాచర్ల, పిడుగురాళ్ళ, నడికు డి, ఫిరంగిపురంలో మాత్రమే ప్రారంభించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈనెల 27నాటికి మిగిలిన ఏడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశిం చారు. శాసనసభ్యులను ప్రారంభోత్సవాలకు ఆహ్వానించి గుంటూరు, తాడికొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదనందిపాడు, సత్తెనపల్లి, క్రోసూరు మార్కెట్‌యార్డుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. మంగళవారం రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు పత్తి బోరాలను తీసుకొచ్చారు. ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి నేను ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ. 32వేలు పెట్టుబడి పెట్టా. ఇప్పటి వరకు ఐదు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. గ్రామాల్లో రూ. 3 వేలకు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. సీసీఐ కేంద్రంలో ఆంక్షలు విధించకుండా గిట్టుబాటు ధర కల్పించాలి. మద్దతు ధర రూ.4,050లుగా, నాణ్యత తగ్గితే రూ. 3800లుగా సీసీఐ కేంద్రంలో నిర్ణయించారు. దీన్ని సవరించి కనీసం క్వింటా రూ. 5,500 నుంచి రూ. 6వేల వరకు కొనుగోలు చేస్తే రైతు కష్టాలు కొంత మేర తీరతాయి. - కుంచాల వెంకయ్య, రైతు, భీమవరం -
అన్నీ ఉన్నా.. ఆదరణ కరువు
గీసుకొండ : మండలంలోని ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న పత్తి మిల్లుల్లో జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారానికి ప్రోత్సాహం కరువైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న ఇక్కడి పత్తి మిల్లులు అనేక సమస్యలకు నిలయంగా మారాయి. పత్తి బేళ్ల ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. రాష్ట్రంలో ఏడాదికి 50 లక్షల బేళ్ల వరకు ఉత్పత్తి అవుతుండగా జిల్లాలో 9లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతున్నాయంటే ఇక్కడి మిల్లుల ప్రాధాన్యం గురించి అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో 16 కాటన్ టెక్నాలజీ మిషన్(టీఎంసీ) మిల్లులు ఉండగా, 60 వరకు టీఎంసీ కాని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు, 40 వరకు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. నేలచూపులు చూస్తున్న పత్తిధర ప్రస్తుత సీజన్లో క్యాండీ(356)ప్రెస్సింగ్ చేసిన పత్తి బేళ్ల ధర రూ. 33,500 పలుకుతోంది. ముడి పత్తి మార్కెట్ ధర ఆధారంగా బేలుకు రూ. 34,500 ఉండాలి. ఈ లెక్కన ప్రతీ బేలుపై వ్యాపారులకు రూ. వెయ్యి వరకు నష్టం వస్తోందని అంటున్నారు. స్థానిక మిల్లుల్లో తయారైన పత్తి బేళ్లను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, సేలం, మధురై తదితర ప్రాంతాల్లోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిరోజు సీజన్లో జిల్లాలో ఆరువేల పత్తి బేళ్లు తయారవుతున్నాయి. ఏడాదికి 9లక్షల బేళ్లకుపైగా ఉత్పత్తి అవుతున్నాయి. ముడిపత్తి నుంచి జిన్నింగ్ చేసిన గింజల ధర క్వింటాలుకు రూ.1450గా ఉంది. కొన్ని రోజుల క్రితం ఇది రూ. 1700 పలికింది.బేళ్లు, గింజల ధర రోజు రోజుకు పడిపోతుండడం వ్యాపారులను కలవరపరుస్తోంది. కరెంటు కోతల సమస్య... పత్లి మిల్లులకు తొలుత మూడు రోజుల పాటు పవర్‌హాలిడే విధించారు. దీంతో సరిగ్గా సీజన్ సమయంలోనే మిల్లులు సరిగా నడవకుండా అయిపోయింది. ఇటీవల కోతను ఒక రోజుకు పరిమితం చేశారు. బుధవారం పవర్‌హాలిడే అమలవుతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏడు ర కాల ఉత్పత్తులకు కరెంటు కోతలను మినహాయించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో అలా కాకుండా కోతలను విధిస్తుండడాన్ని పత్తి మిల్లుల వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు కూడా పవర్‌హాలిడేను ఎత్తివేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల ఊసేలేదు దేశంలో పత్తిబేళ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మూడోస్థానంలో ఉన్నా ఇక్కడి పత్తి మిల్లులకు, వ్యాపారం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. గుజరాత్, మహారాష్ట్రలో మిల్లులను నెలకొల్పడానికి తీసుకునే రుణాలపై ఏడుశాతం వడ్డీపై రాయితీ ఇస్తున్నారు. కరెంటు ప్రతీ యూనిట్ ధరపై సబ్సిడీ, ఉచితంగా రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఇస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. మరికొన్ని సమస్యలు ఇలా.. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని అతర్గత రోడ్లు చాలా ఏళ్లక్రితం నిర్మించినవి. వాటి మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి విషయంలో పారిశ్రామికశాఖ పట్టించుకోవడం లేదు. వ్యాపారులే సొంతంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించి ఏర్పాటు చేసుకోవడం మినహా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు లేవు. తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో నగర కార్పొరేషన్ నుంచి తమకు తాగునీరు అందించేలా చూడాలని స్థానిక మిల్లుల యజమానులు, కార్మికులు కోరతున్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి జిల్లాలో పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలు, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పత్తి ఉప ఉత్పత్తులపై సెస్ ఎత్తివేయాలి. పవర్ హాలిడేను కూడా ఎత్తివేసి సబ్సిడీపై మిల్లులకు కరెంటివ్వాలి. ఈ విషయమై ఇప్పటికే మంత్రి హరీష్‌రావుతో పాటు కేంద్రమంత్రులను కలిశాం. ప్రభుత్వం కొత్తగా రూపొందించే పారిశ్రామిక విధానంలో పత్తి మిల్లుల వ్యాపారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. స్పిన్నింగ్, సాల్వెంట్ మిల్లులను ఏర్పాటు చేయాలి. - వీరారావు, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు